volvo
-
2030 నుంచి అన్నీ ఈవీ కార్లే..!
లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో 2030 తర్వాత భారత్‌లో పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలనే విక్రయిస్తామని ప్రకటించింది. భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతోందని కంపెనీ ఆసియా పసిఫిక్ హెడ్ మార్టిన్ పెర్సన్ తెలిపారు. 2025లో ఈసీ30 అనే ఈవీ మోడల్‌ను ఆవిష్కరిస్తామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘వోల్వో కార్స్ 2030 తర్వాత భారత్‌లో కేవలం ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే లాంచ్ చేస్తుంది. పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాల విక్రయాన్ని ఆలోపే నిలిపేస్తాం. ఈవీ కార్ల మార్కెట్ దేశంలో వేగంగా విస్తరిస్తోంది. ఇంధనంతో నడిచే ఇంటర్నల్ కంబర్షన్ ఇంజిన్ కార్లతో ఎలక్ట్రిక్ వాహనాలు పోటీ పడుతున్నాయి. దాంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కంపెనీ ఈవీలు 25 శాతం అమ్మకాలను నమోదు చేస్తున్నాయి. మార్కెట్లోకి మరిన్ని మోడళ్లు వస్తే కొత్త కస్టమర్లు కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. 2025లో ఈసీ30 అనే ఈవీ మోడల్‌ను భారత్‌లో ఆవిష్కరిస్తాం. దానికి సంబంధించిన విషయాలను త్వరలో ప్రకటిస్తాం. తర్వాత అదే సిరీస్‌లో టాప్ఎండ్ మోడల్ ఈసీ90ను తీసుకొస్తాం. ప్రస్తుతం భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జపాన్, కొరియా దేశాల మాదిరిగానే దాదాపు 2 శాతానికే పరిమితమయ్యాయి’ అని తెలిపారు.ఇదీ చదవండి: ‘48 వేలమంది విద్యార్థులకు శిక్షణ ఇస్తాం..’భారత్‌లో మరింత వృద్ధి చెందడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో పరిశీలిస్తున్నామని కంపెనీ వర్గాలు తెలిపాయి. దాదాపు ప్రపంచంలోని అన్ని ప్రముఖ కంపెనీలు భారత్ ఈవీ పరిశ్రమలో ప్రవేశించాయని చెప్పాయి. ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం ప్రకటించిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ పథకాన్ని కంపెనీ అధ్యయనం చేస్తున్నట్లు సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. -
మంటల్లో కాలి బూడిదైన రూ.63 లక్షల ఎలక్ట్రిక్ కారు - వీడియో వైరల్
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్వీడన్ కార్ల తయారీ సంస్థ 'వోల్వో' (Volvo)కు చెందిన రూ. 63 లక్షల ఎలక్ట్రిక్ కారు మంటల్లో చిక్కుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో వంటివి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మంటల్లో కాలుతున్న కారు వోల్వో సీ40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ అని తెలుస్తోంది. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగినట్లు సమాచారం. రాయ్‌పూర్‌కు చెందిన కారు ఓనర్ సౌరభ్ రాథోడ్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఎన్‌హెచ్ 53 హైవేలో ప్రయాణిస్తుండగా కారులో మంటలు చెలరేగాయి. కారులో మంటలు ప్రారంభమైన వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే కారు దిగి బయటకు వచ్చారు. ఆ తరువాత కొంత సేపటికి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి కారు మొత్తం కాలి బూడిదైపోయింది. దీనికి సంబంధించిన చిత్రాలు టెస్లా క్లబ్ ఇండియా ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. ఈ ఘటనపై వోల్వో సంస్థ అధికారులు ఇంకా స్పందించలేదు. కారులో మంటలు చెలరేగడానికి కారణం ఏంటనేది కూడా తెలియాల్సి ఉంది. కాబట్టి వోల్వో సీ40 ఎలక్ట్రిక్ కారు మంటల్లో కాలిపోవడానికి గల కారణాలు ఖచ్చితంగా చెప్పలేము. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే వోల్వో కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కార్లు మంటల్లో కాలిపోవడం ఇదే మొదటిసారి. కాలిపోవడానికి గల కారణాలకు కంపెనీ తప్పకుండా వెల్లడించగలదని ఆశిస్తున్నాము. గతంలో మంటల్లో కాలిన ఎలక్ట్రిక్ వాహనాలు భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లు మంటల్లో కాలిపోవడం ఇదే మొదటి సారి కాదు. గతంలో దేశీయ దిగ్గజం టాటా మోటార్ కంపెనీకి చెందిన నెక్సాన్ ఈవీలో కూడా మంటలు చెలరేగి కాలిపోయింది. ఇదీ చదవండి: అమెరికన్ యూనివర్సిటీ అద్భుత సృష్టి - ఐదు నిమిషాల్లో చార్జ్ అయ్యే బ్యాటరీ! ఎలక్ట్రిక్ స్కూటర్ల విషయానికి వస్తే.. మంటలకు ఆహుతైన ఎలక్ట్రిక్ స్కూటర్లు కోకోల్లలుగానే ఉన్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లలో జరిగిన షార్ట్ సర్క్యూట్లు, అధిక ఛార్జింగ్ వంటి సమస్యల కారణంగా మంటలు చెలరేగిన సందర్భాలు ఎక్కువ. ఈ ప్రమాదాలు 2022లో చాలా వెలుగులోకి వచ్చాయి. ఆ తరువాత కొంత తక్కు ముఖం పట్టినప్పటికీ.. అక్కడక్కడా ఒక్కో సంఘటన అప్పుడప్పుడూ వెలుగులోకి వస్తూనే ఉంది. LG Pouch NMC cells strike again? Sadly a case of Volvo C40 Recharge getting caught on fire on NH53 has come up. From video fire is starting from the bottom. Volvo sells 78kWh pack in India which uses LG Pouch NMC cells. Hope @volvocarsin @volvocars investigates this soon. pic.twitter.com/FRnL60Cdnw — Tesla Club India® (@TeslaClubIN) January 28, 2024 -
వోల్వో కార్ ప్రియులకు షాక్.. జనవరి నుంచి ప్రైస్ హైక్
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్వీడిష్ కార్ల తయారీ సంస్థ 'వోల్వో' (Volvo) 2024 ప్రారంభం (జనవరి) నుంచి తమ బ్రాండ్ వాహనాల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. జనవరి 1 నుంచి రెండు శాతం ధరలను పెంచనున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు మాత్రమే కాకుండా.. అస్థిర విదేశీ మారకపు రేట్లు కారణంగా ధరలను పెంచడం జరిగిందని కంపెనీ తెలిపింది. ధరల పెరుగుల ప్రకటించిన కంపెనీలలో వోల్వో మాత్రమే కాకుండా మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ కార్ల తయారీ సంస్థలు.. టాటా మోటార్స్, మహీంద్రా వంటి దేశీయ సంస్థలు ఉన్నాయి. వోల్వో కంపెనీ ఇప్పటికే భారతీయ మార్కెట్లో సీ40 రీఛార్జ్, XC40, XC40 రీఛార్జ్ వంటి ఎలక్ట్రిక్ కార్లను అందిస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని కొత్త కార్లను దేశీయ విఫణిలో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. కంపెనీ విడుదల చేస్తున్న కార్లు మంచి డిజైన్, ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా అద్భుతమైన పర్ఫామెన్స్ కలిగి ఉండటం వల్ల ఎక్కువమంది వాహన ప్రియులు ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. ఇదీ చదవండి: మహమ్మారిలా వ్యాపిస్తున్న డీప్ ఫేక్.. మొన్న రతన్ టాటా.. నేడు నారాయణ మూర్తి ధరల పెరుగుదల గురించి వోల్వో కార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ 'జ్యోతి మల్హోత్రా' మాట్లాడుతూ.. అభివృద్ధి చెందుతున్న మార్కెట్ డైనమిక్స్, పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులకు భరించడానికి ధరలను సర్దుబాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. -
వోల్వో కార్ల పరుగు
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న వోల్వో కార్ ఇండియా 2023 జనవరి–సెపె్టంబర్ మధ్య రిటైల్‌లో 1,751 యూనిట్లను విక్రయించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 40 శాతం అధికం అని కంపెనీ శుక్రవారం ప్రకటించింది. ఎక్స్‌సీ60 మోడల్ ఈ వృద్ధిని నడిపించిందని వెల్లడించింది. మొత్తం అమ్మకాల్లో ఈ మోడల్ వాటా ఏకంగా 35 శాతం ఉందని వివరించింది. దేశీయంగా అసెంబుల్ అవుతున్న పూర్తి ఎలక్ట్రిక్ కారు ఎక్స్‌సీ40 రిచార్జ్ మోడల్లో 419 యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయని వోల్వో ప్రకటించింది. ఎక్స్‌సీ40 రిచార్జ్ వాటా 24 శాతం ఉందని తెలిపింది. సంస్థ మొత్తం విక్రయాల్లో ఎలక్ట్రిక్ కార్ల నుంచి 27 శాతం సమకూరుతోంది. ఈ విజయం కస్టమర్ల విశ్వాసాన్ని, భారత మార్కెట్‌కు ప్రీమియం, స్థిర వాహనాలను అందించడంలో కంపెనీ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని వోల్వో కార్ ఇండియా ఎండీ జ్యోతి మల్హోత్రా ఈ సందర్భంగా తెలిపారు. కంపెనీకి భారత్‌లో 25 డీలర్షిప్ కేంద్రాలు ఉన్నాయి. -
ఒకసారి చార్జింగ్‌తో 530 కిలోమీటర్లు ప్రయాణం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న స్వీడన్ సంస్థ వోల్వో తాజాగా భారత మార్కెట్లో పూర్తి ఎలక్ట్రిక్ ఎస్యూవీ సీ40 రీచార్జ్ ఆవిష్కరించింది. ఒకసారి చార్జింగ్‌తో 530 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. ట్విన్ మోటార్స్, 408 హెచ్‌పీ పవర్‌తో 78 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచారు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 4.8 సెకన్లలో చేరుకుంటుంది. 27 నిమిషాల్లో 80 శాతం చార్జింగ్ పూర్తి అవుతుంది. కారుకు కావాల్సిన విడిభాగాలను భారత్‌కు దిగుమతి చేసుకుని బెంగళూరు ప్లాంటులో అసెంబుల్ చేస్తారు. సెప్టెంబర్ నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయి. ఎలక్ట్రిక్ విభాగంలో భారత్‌లో సంస్థకు ఇది రెండవ మోడల్. ఇప్పటికే ఇక్కడి విపణిలో పూర్తి ఎలక్ట్రిక్ ఎక్స్‌సీ40 రీచార్జ్ కారును గతేడాది ప్రవేశపెట్టింది. అంతర్జాతీయంగా 2030 నాటికి పూర్తి ఎలక్ట్రిక్ కార్ కంపెనీగా అవతరించాలన్నది వోల్వో లక్ష్యం. భారత్‌లో 2025 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్ణయించింది. (అపుడు పాల ప్యాకెట్ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!) ఈవీలదే కీలక పాత్ర.. వోల్వో 2022లో దేశవ్యాప్తంగా సుమారు 1,800 యూనిట్లను విక్రయించింది. ఇప్పటి వరకు కంపెనీ నుంచి గరిష్టంగా 2018లో 2,600 కార్లు రోడ్డెక్కాయి. ఏటా ఇక్కడి మార్కెట్లో ఒక ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టాలని సంస్థ నిర్ణయించింది. ఈ ఏడాది భారత్‌లో రికార్డు స్థాయిలో అమ్మకాలు సాధించే ప్రయత్నంలో ఎలక్ట్రిక్ కార్లు కీలక పాత్ర పోషిస్తాయని వోల్వో కార్ ఇండియా ఎండీ జ్యోతి మల్హోత్రా తెలిపారు. ‘2023 చాలా ఆశాజనకంగా ప్రారంభమైంది. (MRF బెలూన్లు అమ్మి, కటిక నేలపై నిద్రించి: వేల కోట్ల ఎంఆర్ఎఫ్ సక్సెస్ జర్నీ) గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే 2023లో మరింత మెరుగ్గా రాణిస్తామని నమ్ముతున్నాం. మహమ్మారి కారణంగా మార్కెట్ కొంచెం నెమ్మదిగా ఉంది. అలాగే సరఫరా సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఈ సమస్య ఇప్పటికీ ఉంది. గరిష్ట స్థాయి అమ్మకాలను సాధించిన 2018 స్థాయికి ఈ ఏడాది చేరుకుంటాం. మొత్తం విక్రయాల్లో ఈవీల వాటా 27 శాతం ఉంది’ అని వివరించారు. కంపెనీ భారత్‌లో ఎక్స్‌సీ90, ఎక్స్‌సీ60, ఎక్స్‌సీ40 ఎస్‌యూవీలు, ఎస్90 సెడాన్‌ను సైతం విక్రయిస్తోంది. Here’s a look at the born electric SUV, Volvo C40 Recharge. India Spec: ⚡️408hp & 660Nm ⚡️Range: upto 530 WLTP ⚡️Twin motors with AWD ⚡️0-100 kmph: 4.7 sec ⚡️150kW DC: 10-80% in 27 min ⚡️Rear boot: 413 litres ⚡️Frunk: 30 litres#volvo #volvoev #volvoindia #c40recharge #ev pic.twitter.com/PcyeVfvUlw — Express Drives (@ExpressDrives) June 14, 2023 -
ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కారు కావాలా - ఇక్కడ చూడండి (ఫోటోలు)
-
వోల్వో అభిమానులకుషాకిచ్చిందిగా!
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ వోల్వో కార్ ఇండియా మైల్డ్ హైబ్రిడ్ మోడళ్లపై 2 శాతం వరకు ధర పెంచింది. ఫలితంగా మోడల్ని బట్టి 50వేల రూపాయల నుంచి 2 లక్షల దాకా భారం పడనుంది. ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీ సవరించిన నేపథ్యంలో పెరిగిన ముడిసరుకు వ్యయానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ప్రకటించింది. దీని ప్రకారం ఎక్స్‌సీ40, ఎక్స్‌సీ60, ఎస్90,ఎక్స్‌సీ90 వేరియంట్ల ధరలు అధికం కానున్నాయి. బెంగళూరు ప్లాంటులో ఈ మోడళ్లను కంపెనీ అసెంబుల్ చేస్తోంది. (ఇదీ చదవండి: ఆన్లైన్ షాపింగ్:లడ్డూ కావాలా నాయనా..కస్టమర్‌కి దిమ్మ తిరిగిందంతే!) ఇటీవలి బడ్జెట్లో ప్రకటించిన విధంగా కస్టమ్స్ డ్యూటీలో మార్పుల ఫలితంగా తమ పెట్రోల్ మైల్డ్-హైబ్రిడ్ మోడళ్ల ఇన్పుట్ ఖర్చులు పెరిగిన ఫలితంగా హైబ్రిడ్ల ధరలు స్వల్పంగా పెరిగాయని వోల్వో మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతి మల్హోత్రా అన్నారు. యూనియన్ బడ్జెట్ 2023 ప్రకారం, సెమీ-నాక్డ్ డౌన్ (SKD) రూపంలో దిగుమతి చేసుకున్న వాహనాలపై కస్టమ్స్ సుంకం 30 శాతం నుండి 35 శాతానికి పెరిగింది. అయితే, అంతకుముందు విధించిన 3శాతం సాంఘిక సంక్షేమ సర్‌చార్జి (SWS) రద్దు అయింది. -
2025 నాటికల్లా భారత్‌లో పూర్తి విద్యుత్‌కార్లు: వోల్వో
-
ఈవీ జోరుకు భారత్ రెడీ.. ప్లాంటు యోచనలో వోల్వో!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 2018 జనవరిలో అమ్ముడైన ఎలక్ట్రిక్ కార్ల సంఖ్య ఎంతో తెలుసా. జస్ట్ 25 మాత్రమే. ఒక నెలలో 1,000 యూనిట్ల విక్రయాలు నమోదు కావడానికి పరిశ్రమ 2021 మార్చి వరకు వేచి చూడాల్సి వచ్చింది. అటువంటి విపణిలో గతేడాది రోడ్డెక్కిన 38,000 ఎలక్ట్రిక్ కార్లను చూస్తుంటే కంపెనీలకు కొత్త ఆశలు పుట్టుకొస్తున్నాయి. మూడవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా అవతరించిన భారత్‌లో వేగం అందుకోవడం ఆలస్యమైనా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పుంజుకుందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. ఈవీల తయారీ కోసం భారత్‌లో గ్లోబల్ ప్లాంటు ఏర్పాటు చేయాలని స్వీడన్ దిగ్గజ సంస్థ వోల్వో యోచించడం చూస్తుంటే రానున్న రోజుల్లో ఇక్కడి పరిశ్రమ నూతన శిఖరాలను తాకడం ఖాయంగా కనిపిస్తోంది. భారత్‌లో ఏటా ఒక ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టనున్నట్టు ఓల్వో ప్రకటించింది. దేశంలో 2025 నాటికి పూర్తి ఎలక్ట్రిక్ కార్ల కంపెనీగా అవతరించాలన్నది ఈ సంస్థ లక్ష్యం. 2030 నాటికి 1 కోటి.. దేశీయ ఈవీ మార్కెట్ 2022–2030 మధ్య 49 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదు చేస్తుందని 2023 ఎకనమిక్ సర్వే అంచనా వేసింది. 2030 నాటికి ఏటా 1 కోటి యూనిట్ల స్థాయికి భారత్ చేరుతుందని జోస్యం చెబుతోంది. మరోవైపు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జమ్ము కశ్మీర్‌లోని సలాల్ హైమన ప్రాంతంలో 59 లక్షల టన్నుల లిథియం నిక్షేపాలను కనుగొన్నట్టు గనుల మంత్రిత్వ శాఖ నివేదించింది. లిథియం నిల్వలు చాలా అరుదు. ఈ వనరులతో బ్యాటరీల దిగుమతులపై ఆధారపడడం గణనీయంగా తగ్గుతుంది. అలాగే ఈ నిల్వల కారణంగా ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు భారత్ కీలకం కానుంది. ఈవీ అమ్మకాలు పెరిగేందుకూ దోహదం చేయనుంది. 2030లో ఎలక్ట్రిక్ కార్లు 3,76,000 యూనిట్లు అమ్ముడవుతాయన్న అంచనాలు ఉన్నాయి. వరుస కట్టిన కంపెనీలు.. భారత ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమలో 80 శాతం వాటాతో టాటా మోటార్స్ దూసుకెళుతోంది. మహీంద్రా అండ్ మహీంద్రా ఎక్స్‌యూవీ400 మోడల్‌ను ఆవిష్కరించడంతో మార్కెట్ ఒక్కసారిగా హీటెక్కింది. హ్యుండై, కియా మోటార్స్ మోడల్స్ అధిక ధరల్లో ఉన్నాయి. అయితే మారుతీ సుజుకీ 2025 నాటికి ఎంట్రీ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ప్యాసింజర్ కార్ల విభాగంలో అగ్రశేణి సంస్థ అయిన మారుతీ సుజుకీ ఎలక్ట్రిక్ కార్ల విపణిలోకి రంగ ప్రవేశం చేస్తే పోటీ మరింత తీవ్రతరం కానుంది. సిట్రియోన్ ఈసీ3, ఎంజీ ఎయిర్ ఈవీ, బీవైడీ సీల్, టాటా ఆల్ట్రోజ్ ఈవీ, టాటా పంచ్ ఈవీ, వోల్వో సీ40 రీచార్జ్ ఈ ఏడాది ఇక్కడి రోడ్లపై పరుగు తీయనున్నాయి. దీర్ఘకాలిక లక్ష్యంతో చార్జింగ్ మౌలిక వసతులనుబట్టి ఆచితూచి మోడళ్లను విడుదల చేస్తామని కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి. (ఇదీచదవండి: బ్యాలన్స్‌షీట్ పటిష్టంగా ఉంది.. ఇన్వెస్టర్లకు అదానీ గ్రూప్ భరోసా) -
మనకు ఎడాదికొక ఎలక్ట్రిక్ కారు.. వోల్వో ప్రామిస్!
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న వోల్వో కార్స్ భారత్‌లో ఏటా ఒక ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది. భారత్‌లో 2025 నాటికి పూర్తి ఎలక్ట్రిక్ కార్ల కంపెనీగా అవతరించనున్నట్టు వెల్లడించింది. అంతర్జాతీయంగా ఈ లక్ష్యాన్ని 2030 నాటికి చేరుకోనున్నట్టు తెలిపింది. వోల్వో ఇండియా సి–40 బీఈవీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని 2023 అక్టోబర్–డిసెంబర్లో విడుదల చేస్తోంది. తమ కంపెనీకి మూడేళ్లలో అంతర్జాతీయంగా సగం మోడళ్లు ఈవీలు ఉంటాయని వోల్వో కార్స్ కమర్షియల్ ఆపరేషన్స్ హెడ్ నిక్ కానర్ తెలిపారు. సి–40 బీఈవీ మోడల్‌కు ఇతర మార్కెట్లలో అధిక డిమాండ్ ఉందన్నారు. భారత్‌లోనూ అటువంటి డిమాండ్‌ను ఆశిస్తున్నట్టు చెప్పారు. 2022లో కంపెనీ దేశంలో అన్ని మోడళ్లు కలిపి 1,800 యూనిట్లు విక్రయించింది. 2018లో నమోదైన 2,600 యూనిట్లను మించి ఈ ఏడాది అమ్మకాలు ఉంటాయని భావిస్తోంది. (ఇదీ చదవండి: జోరు మీదున్న ఫోన్‌పే... రూ.828 కోట్లు!) -
అన్ని మోడళ్ల కార్లను మార్చేస్తున్న వోల్వో.. కారణం ఇదే!
లగ్జరీ కార్ల తయారీలో ఉన్న స్వీడన్ కంపెనీ వోల్వో 2030 నాటికి భారత మార్కెట్లో పూర్తిగా ఎలక్ట్రిక్ మోడళ్లనే ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలో దేశీయ మార్కెట్లో లభిస్తున్న అన్ని మోడళ్లను మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్‌కు మార్చింది. ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో వోల్వో ఖాతాలో ప్రస్తుతం భారత్‌లో ఎస్యూవీ ఎక్స్‌సీ40 రిచార్జ్ కొలువుదీరింది. వచ్చే ఏడాది మధ్య కాలంలో పూర్తి ఎలక్ట్రిక్ మోడల్ మరొకటి రానుంది. కాగా, 2023 శ్రేణి మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఎక్స్‌సీ40 ఎస్యూవీ, ఎస్90 సెడాన్, మిడ్ సైజ్ ఎస్యూవీ ఎక్స్‌సీ60, ఎస్యూవీ ఎక్స్‌సీ90 కార్లను కంపెనీ బుధవారం ఆవిష్కరించింది. కొత్త ఫీచర్లను జోడించి వీటికి రూపకల్పన చేసినట్టు వోల్వో కార్ ఇండియా ఎండీ మల్హోత్రా తెలిపారు. చదవండి: కొన్ని గంటల్లో ఈ బ్యాంక్ షట్ డౌన్: అంతకుముందే సొమ్ము తీసుకోండి! -
వోల్వో-ఐషర్ కొత్త ఇంటర్ సిటీ బస్సులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాణిజ్య వాహనాల తయారీలో ఉన్న వోల్వో ఐషర్ కమర్షియల్ వెహికిల్స్ కొత్త శ్రేణిని ప్రవేశపెట్టింది. తదుపరితరం ఇంటర్సిటీ బస్‌లను శుక్రవారమిక్కడ ప్రదర్శించింది. వీటిలో వోల్వో నుంచి 15, 13.5 మీటర్ల కోచ్‌లు, ఐషర్ నుంచి 13.5 మీటర్ల కోచ్ ఉన్నాయి. బస్ మార్కెట్ తిరిగి పుంజుకుందని, త్వరలోనే కోవిడ్ ముందస్తు స్థాయికి చేరుకుంటుందని వోల్వో ఐషర్ కమర్షియల్ వెహికిల్స్ ఎండీ, సీఈవో వినోద్ అగర్వాల్ మీడియాకు తెలిపారు. సుదూర ప్రయాణాల విషయంలో ఈ వాహనాలు పరిశ్రమలో నూతన ప్రమాణాలను సృష్టిస్తాయని అన్నారు. -
వోల్వో లగ్జరీ ఎలక్ట్రిక్ కారు లాంచ్, సూపర్ లగ్జరీ ఎస్‌యూవీలకు పోటీ!
సాక్షి,ముంబై: వోల్వో ఎట్టకేలకు తన తొలి ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. XC40 రీఛార్జ్ ఎస్‌యూవీని మంగళవారం భారత మార్కెట్లో తీసుకొచ్చింది. దీని ధరను రూ. 55.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంచింది. పెట్రోల్‌వెహికల్ ఎక్స్‌సి 40తో పోలిస్తే రూ 1.40 లక్షలు ఎక్కువ. బెంగళూరు సమీపంలోని హోస్కోట్లోని వోల్వో యూనిట్లో, స్థానికంగా అసెంబ్లింగ్ చేసిన ఇండియా తొలి లగ్జరి ఎలక్ట్రిక్ కారు అని కంపెనీ తెలిపింది. ఇది వోల్వో వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ఆసక్తి గలకొనుగోలుదారులు రూ. 50వేలు చెల్లించి రేపటి(జూలై27)నుంచి బుకింగ్ చేసుకోవచ్చు. ఎక్స్‌సీ40 రీఛార్జ్ 11kW వాల్-బాక్స్ ఛార్జర్‌తో వస్తుంది.కారుపై మూడేళ్ల వారంటీతోపాటు, బ్యాటరీపై ఎనిమిదేళ్ల వారంటీ అందిస్తోంది. వోల్వో XC40 రీఛార్జ్ 150kW DC ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యం గల 78kWh బ్యాటరీని ఈ కారులో అందించింది. 33 నిమిషాల్లో కారులో 10 నుండి 80 శాతం వరకు, 50kW ఫాస్ట్ ఛార్జర్‌తో సుమారు 2.5 గంటల్లో 100 శాతం ఛార్జ్ అవుతుందని వోల్వో తెలిపింది. 418km పరిధితో, ఎక్స్‌సీ40 రీఛార్జ్ ఇండియాలో హై-స్పెక్ "ట్విన్" వెర్షన్లో అందుబాటులో ఉంది, ఇందులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి. ఒక్కో యాక్సిల్‌పై ఒకటి 408hp , 660Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.పెట్రోల్‌తో నడిచే XC40 కంటే దాదాపు రెండు రెట్లు శక్తివంతమైందనీ, లగ్జరీ ఆడి ఇ-ట్రాన్ 55 క్వాట్రో పోలి ఉందని భావిస్తున్నారు. 55.90 లక్షల ధరతో, XC40 రీఛార్జ్ ఒకవైపు మినీ కూపర్ ఎస్ఈ, BMW i4 , Kia EV6 వంటి లగ్జరీ ఈ-కార్లకు గట్టిపోటి ఇస్తుందని అంచనా. -
లగ్జరీ కారు కొన్న రాజమౌళి.. ధర ఎంతంటే..
దర్శకధీరుడు రాజమౌళి కొత్త కారును కొనుగోలు చేశారు. ఆర్ఆర్ఆర్తో మరోసారి పాన్ ఇండియా సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న రాజమౌళి తాజాగా ఖరీదైన వోల్వో ఎక్స్‌సి40 కారు కొన్నారు. ఈ సందర్భంగా వోల్వో కార్స్ ఇండియా ప్రతినిధి రాజమౌళికి కారు తాళాలను అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలను వోల్వో కార్స్ ఇండియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా రాజమౌళి కొనుగోలు చేసిన ఫ్యూజన్ రెడ్ కలర్లో ఉన్న ఈ కారు ధర సుమారు రూ. 44.50 లక్షలు. పనోరమిక్ సన్‌రూఫ్, వైర్లెస్ ఛార్జింగ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ లాంటి ఎన్నో ముఖ్యమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న రాజమౌళి త్వరలోనే మహేశ్ బాబుతో సినిమా చేయనున్నారు. View this post on Instagram A post shared by Volvo Car India (@volvocarsin) -
ఒకే సారి రూ. 3 లక్షల వరకు పెంపు..ఈ కంపెనీ కార్లు మరింత ప్రియం..!
న్యూఢిల్లీ: ముడి వస్తువుల వ్యయాలు పెరిగిపోతున్న నేపథ్యంలో తమ వాహనాల రేట్లను పెంచుతున్నట్లు లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం వోల్వో కార్స్ ఇండియా వెల్లడించింది. రేట్లను రూ. 1 లక్ష నుంచి రూ. 3 లక్షల శ్రేణిలో పెంచినట్లు, ఇది తక్షణమే అమల్లోకి వచ్చినట్లు సంస్థ తెలిపింది. అయితే, ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీ వరకు బుక్ చేసుకున్న వారికి పాత రేట్లే వర్తింపచేస్తామని, ఆ తర్వాత బుకింగ్స్‌కు కొత్త రేట్లు వర్తిస్తాయని వివరించింది. తాజా మార్పులతో ఎక్స్‌సీ40 వంటి మోడల్స్ రేటు 3 శాతం పెరిగి రూ. 44.5 లక్షలకు, ఎక్స్‌సీ60 ధర 4 శాతం పెరిగి రూ. 65.9 లక్షలకు, ఎక్స్‌సీ90 రేటు 3 శాతం పెరిగి రూ. 93.9 లక్షలకు (అన్నీ ఎక్స్–షోరూం) చేరింది. ఈ ఏడాది తొలినాళ్లలోనే వోల్వో కార్ల రేట్లు పెంచింది. అయితే, అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థలు దెబ్బతినడం, రవాణా వ్యయాలు .. ముడి వస్తువుల రేట్లు పెరుగుతుండటం వంటి అంశాల కారణంగా మళ్లీ ధరల పెంపు తప్పలేదని సంస్థ పేర్కొంది. చదవండి: అనుకున్నట్లే జరిగింది..కొనుగోలుదారులకు భారీ షాకిచ్చిన మారుతీ సుజుకీ..! -
భారత్‌పై వోల్వో ఫోకస్.. దేశంలో తొలిసారిగా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్లు, ట్రక్కుల తయారీలో ఉన్న స్వీడన్ సంస్థ వోల్వో గ్రూప్ భారత్‌లో పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) కార్యకలాపాలను విస్తరించనున్నట్టు ప్రకటించింది. ఇందులో భాగంగా వెహికల్ టెక్‌ల్యాబ్ ఏర్పాటుకు శంఖుస్థాపన చేసింది. ల్యాబ్‌లో వర్చువల్ రియాలిటీ, హ్యూమన్ బాడీ మోషన్ ట్రాకింగ్ ఆధారిత సిమ్యులేటెడ్ వర్క్‌షాప్ ఏర్పాటు చేస్తారు. అంతర్జాతీయంగా ఉన్న వోల్వో ఇంజనీర్లు ఈ వేదికపైకి వచ్చి వాహనాల అభివృద్ధిలో వర్చువల్‌గా పాలుపంచుకుంటారు. వాహనాల అభివృద్ది సమయం గణనీయంగా తగ్గుతుందని కంపెనీ తెలిపింది. దేశీయ వాహన తయారీ రంగంలో ఇటువంటి ల్యాబ్ స్థాపించడం ఇదే తొలిసారి. బెంగళూరులో సంస్థకు ఆర్అండ్డీ కేంద్రం ఉంది. స్వీడన్ వెలుపల అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రంగా భారత్ అవతరించిందని వోల్వో తెలిపింది. 2024 నాటికి కర్బన ఉద్గారాలను సున్నా స్థాయికి తీసుకురావడం లక్ష్యమని వెల్లడించింది. ఆటోమేషన్, ఎలక్ట్రోమొబిలిటీ, కనెక్టివిటీ విభాగాల్లో అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను, కొత్త వ్యాపార నమూనాలను అవలంబించే పనిలో ఉన్నట్టు వివరించింది. -
పార్క్ చేస్తే చాలు..కారు ఇట్టే ఛార్జింగ్ అవుతుంది..!
పని మీదమీరోషాపింగ్ మాల్‌కు వెళ్లారు. పార్కింగ్‌లో మీ ఎలక్ట్రిక్ కారు పెట్టేసి మాల్ లోపలికి వెళ్లారు. షాపింగ్ చేసుకుని వచ్చేసరికి కారు ఫుల్‌గా చార్జయిందనుకోండి. అది కూడా ఎలాంటి వైర్ కనెక్షన్ లేకుండా. భళే ఉంటుంది కదా! అచ్చం ఇలాంటి వైర్లెస్ చార్జింగ్ కార్లపైనే వోల్వో కార్ల సంస్థ ప్రయోగాలు చేస్తోంది. కొత్త కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. అసలు పార్కింగ్ ప్లేస్‌లో పెడితే కార్లు ఎలా చార్జింగ్ అవుతాయి, దాని వెనకుండే మెకానిజం ఏంటి, వైర్లెస్ చార్జింగ్‌తో ఉపయోగాలేంటి... తెలుసుకుందామా.. కారు ఎలా చార్జ్ అవుతుంది? ► కారును చార్జ్ చేసేందుకు చార్జింగ్ స్టేషన్లలో ఏర్పాటు చేసిన చార్జింగ్ ప్యాడ్ (బ్లూ చతురస్త్రం)పై పార్క్ చేయాలి. ఆ చార్జింగ్ ప్యాడ్ నుంచి కారుకు విద్యుత్ శక్తి అందుతుంటుంది. ఆ శక్తిని గ్రహించి బ్యాటరీని చార్జ్ చేయడానికి కారు భాగంలో ముందు టైర్ల దగ్గర రిసీవర్ ఉంటుంది. కారులో ఉండే 360 డిగ్రీ కెమెరాతో డ్రైవర్ కారు రిసీవర్‌ను సరిగ్గా చార్జింగ్ ప్యాడ్‌పైకి తీసుకురావొచ్చు. స్వీడన్‌లోని గోథెన్బర్గ్ సిటీలో గత మూడేళ్లుగా ఈ వైర్లెస్ చార్జింగ్ ప్రయోగాలను వోల్వో చేస్తోంది. ఇందుకోసం వోల్వో ఎక్స్‌సీ40 ఎస్యూవీ ఎలక్ట్రిక్ ట్యాక్సీలను వాడుతోంది. ► వోల్వో వైర్లెస్ చార్జింగ్ శక్తి దాదాపు 40 కిలోవాట్లు. అంటే 11 కిలోవాట్ల ఏసీ వైర్డ్ చార్జర్‌తో పోలిస్తే 4 రెట్లు వేగంగా కారు చార్జ్ అవుతుంది. అలాగే 50 కిలోవాట్ల డీసీ వైర్డ్ చార్జర్‌తో ఎంత వేగంగానైతే కారు చార్జ్ అవుతుందో అంతే వేగంతో వైర్‌లెస్‌తో చార్జ్ చేయొచ్చు. రోజుకు 12 గంటలు, ఏడాదికి లక్ష కిలోమీటర్లు తిరిగినా వాహనం మన్నికగా ఉంటుంది. వైర్లెస్, ఎలక్ట్రిక్ కాబట్టి పర్యావరణ హితం కూడా. పైగా కేబుల్‌తో చార్జ్ చేసే అవసరం ఉండదు. వైర్లెస్ చార్జింగ్‌తో ఉపయోగాలేంటి? ప్రస్తుతం చార్జింగే పెద్ద సమస్య పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే మార్కెట్లోకి ఎన్ని కొత్త వాహనాలు వస్తున్నా ప్రధాన సమస్య చార్జింగే. ఎక్కడంటే అక్కడ చార్జింగ్ పెట్టుకునే సౌకర్యం లేకపోవడం వీటికి మైనస్. ఈ సమస్య వల్లే వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు వెనుకడుగు వేస్తున్నారు. వోల్వో లాంటి కార్ల సంస్థల కొత్త చార్జింగ్ టెక్నాలజీలతో ఇలాంటి మైనస్లకు చెక్ పడుతుందేమో చూడాలి. చదవండి: ఉక్రెయిన్‌పై బాంబుల మోత..! రష్యా దాడులను చెక్ పెట్టేందుకు గూగుల్ భారీ స్కెచ్..! -
ప్రపంచవ్యాప్తంగా 4,60,000 కార్లను రీకాల్ చేసిన వోల్వో
ప్రముఖ ఆటో మొబైల్ తయారీ సంస్థ వోల్వో ప్రపంచవ్యాప్తంగా 4,60,000కు పైగా కార్లను రీకాల్ చేసింది. ఎయిర్ బ్యాగ్స్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో కార్లను రీకాల్ చేసినట్లు వోల్వో తెలిపింది. స్వీడిష్ కార్ల తయారీ సంస్థ ప్రతినిధి యు.ఎస్. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ తో మాట్లాడుతూ.. ఎయిర్ బ్యాగ్స్‌లో చిన్న సాంకేతిక సమస్య వల్ల వాహన చోదకుడీకి, ప్రయాణికులకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రీకాల్ చేసినట్లు తెలిపారు. ఎన్ హెచ్ టిఎస్ఏకు సమర్పించిన సేఫ్టీ రీకాల్ నివేదికలో వోల్వో ఈ పరిస్థితికి సంబంధించి పూర్తిగా వివరించింది. అయితే, దీని ఫలితంగా మరణం సంభవించిందని తెలిపింది. ఈ లోపం టకాటా ఎయిర్ బ్యాగ్ ఇన్ ఫ్లేటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 మిలియన్ల భాగాలు రీకాల్ చేశారు. ఇలా వోల్వో మాత్రమే రీకాల్ చేయలేదు, అనేక ఇతర కంపెనీలు కూడా వాటి వాహనాలను చాలా సార్లు వాటి వాహనాలను రీకాల్ చేశాయి.(చదవండి: చిత్ర పరిశ్రమలో సరికొత్త శకానికి నాంది పలికిన హాలీవుడ్..!) -
క్రాష్ టెస్ట్: వోల్వో సంచలన నిర్ణయం
సాక్షి,న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోల్వో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 10 కార్లను 30 మీటర్ల ఎత్తునుంచి పడవేసి మరీ క్రాష్ టెస్ట్ నిర్వహించింది. అత్యున్నత ప్రమాణాలను సృష్టించే ప్రయత్నాల్లో భాగంగా తొలిసారి పలు మోడళ్ల కొత్త కార్లను క్రేన్ల సాయంతో 30 మీటర్ల ఎత్తునుంచి కిందికి తోసివేసింది. తద్వారా ప్రమాదాల్లో కారులోపల ఉన్నవారి పరిస్థితిని అంచనా వేయడం, రక్షణ చర్యల్లో రెస్క్యూ సిబ్బందికి సూచనలు సలహాలు ఇవ్వనుంది. సాధారణంగా 20ఏళ్ల నాటి కార్లపై చేసే ప్రయోగాలను కొత్త కార్లతో చేయడం విశేషం. ఘోర ప్రమాదాల్లో లోపల ఉన్నవారి పరిస్థితి విషమంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో హైడ్రాలిక్ రెస్క్యూ టూల్స్ ఉపయోగించి వారిని వెలికి తీసి, వీలైనంత త్వరగా ఆసుపత్రికి తరలించడంలాంటి అంశాలను పరిశీలించింది. తద్వారా వారి ప్రాణాలను రక్షించే సామర్థ్యాలను మరింత అభివృద్ధి చేయడానికి వీలు కల్పిస్తుందని కంపెనీ భావిస్తోంది. రక్షణ సిబ్బంది నిరంతరం అప్డేట్ కావడం, కొత్త ఎక్స్ట్రికేషన్ టెక్నిక్లను అభివృద్ధి, సమీక్ష కీలకమని సంస్థ భావిస్తోంది. తీవ్రమైన ప్రమాదాల తర్వాత ప్రజలను వెలికితీసే కొత్త పద్ధతులను అవలంబించేలా అత్యవసర రక్షణ సిబ్బంది సహాయం చేయాలనుకుంటున్నాం. ఇందుకు సాధారణ క్రాష్ పరీక్షలు సరిపోవు. అందుకే కొంచెం విపరీతంగా ఆలోచించాల్సి వచ్చిందని వోల్వో తెలిపింది. అతివేగంతో కార్లు ప్రమాదానికి గురి కావడం, ఈ ఘోర ప్రమాదాల్లో కార్లు దెబ్బతినడం, కార్లలో ఇరుక్కుపోయిన వారిని రక్షించడం తదితర కీలక అంశాలపై నివేదికను రూపొందించడంతో పాటు, ఈ ఇంటెన్సివ్ అనాలిసిస్ రిపోర్టును సహాయక బృందాలకు ఉచితంగా అందిస్తుంది. రెస్క్యూ ప్రొవైడర్ల అభ్యర్థన మేరకు ఈ క్రాష్ టెస్ట్ చేసినట్టు వోల్వో వెల్లడించింది. ఫలితాల నుండి నేర్చుకోవడానికి, ప్రయాణీకుల ప్రాణాలను రక్షించే సామర్థ్యాలను అదనంగా అభివృద్ధి చేయడానికి ఇది వీలు కల్పిస్తుందని తెలిపింది. We wanted to help our Emergency Services develop new methods of extracting people after severe accidents, but our regular crash tests weren't enough. So, we had to think of something a little more extreme.... #ForEveryonesSafety pic.twitter.com/fMGF1A4HtU — Volvo Car UK (@VolvoCarUK) November 13, 2020 -
తల్వార్ వోల్వో షోరూం ఎండీ అరెస్ట్
బంజారాహిల్స్: కారుకు రుణం పేరిట ఫైనాన్స్ కంపెనీ నుంచి డబ్బులు తీసుకొని కారు డెలివరీ చేయకుండా పథకం ప్రకారం మోసగించిన ఘటనలో బంజారాహిల్స్ రోడ్ నంబర్–12లోని తల్వార్ వోల్వో షోరూం ఎండీ సాకేత్ తల్వార్‌ను బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నెక్లెస్ రోడ్ బుద్ధ భవన్ వెనక ఉన్న విజయ్‌కాంత్ ఫైనాన్స్ మేనేజర్ గులాం అబ్రార్‌ను జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 86లోని ఫేజ్–2లో నివసించే అబ్దుల్ యాకుబ్ గత ఏడాది జూన్ 27న కొత్త వోల్వో కారు కొనుగోలు చేయాలనుకుంటున్నానని రుణం కావాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. అన్ని పత్రాలను పరిశీలించిన ఫైనాన్స్ కంపెనీ అబ్దుల్ యాకుబ్‌కు రూ.70 లక్షలు రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. ఆ మేరకు రూ.67.23 లక్షలు ఆర్టీజీఎస్ ద్వారా తల్వార్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతాకు జమచేసి మొదటి ఈఎంఐ కింద రూ.2.76 లక్షలు ఇచ్చింది. అబ్దుల్ యాకుబ్ ఈ కారును ఇవ్వడంలో సాకేత్ తల్వార్ తీవ్ర జాప్యం చేశారు. ఇదేంటని ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ గులాం అబ్రార్ అలీ నాలుగైదుసార్లు కలిసి సాకేత్ తల్వార్‌ను ప్రశ్నించారు. తమ మేనేజర్ సొహైల్‌ను కలవాలంటూ ఒకసారి, ఇంకా మంజూరు కాలేదని మరోసారి సాకేత్ తప్పించుకోసాగాడు. ఇటీవల కారు కోసం ఆరా తీయగా తమ పేరు మీద కారు కేటాయించారని, దాన్ని మరొకరికి సాకేత్ విక్రయించారని తేలడంతో షాక్‌కు గురయ్యారు. మరింత ఆరా తీయగా ఇప్పటికే సాకేత్ తల్వార్ వంద మంది వరకు ఇలా కార్ల ముసుగులో మోసగించినట్లు తేలింది. తాను మోసపోయానని తెలుసుకున్న ఫైనాన్స్ సంస్థ మేనేజర్ గత నెల 2న పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అప్పటి నుంచి నిందితుడు తప్పించుకు తిరుగుతున్నాడు. గట్టి నిఘా వేసిన పోలీసులు కొండాపూర్‌లోని బొటానికా విల్లాస్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సాకేత్‌తో చేతులు కలిపి మోసానికి పాల్పడ్డ అబ్దుల్ యాకుబ్, ఎంఏ సొహైల్లపై కూడా పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. వీరి కోసం గాలిస్తున్నారు. -
వోల్వో ‘ఎక్స్‌సీ40 టీ4’ ఎస్యూవీ
న్యూఢిల్లీ: స్వీడన్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘వోల్వో’ తాజాగా తన కొత్త ఎంట్రీ లెవెల్ ఎస్యూవీ ‘ఎక్స్‌సీ40 టీ4 ఆర్–డిజైన్’ని భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. భారత్ స్టేజ్ (బీఎస్)–6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఈ కారు ధర రూ. 39.9 లక్షలు. కంపెనీకి చెందిన కాంపాక్ట్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ (సీఎంఏ) ఆధారంగా రూపొందిన ఈ ఎస్‌యూవీలో 2–లీటర్ ఇంజిన్ అమర్చింది. ఈ సందర్భంగా కంపెనీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ చార్లెస్ ఫ్రంప్ మాట్లాడుతూ.. ‘ఎంట్రీ లెవెల్ ఎస్‌యూవీలో విడుదలైన తొలి పెట్రోల్ ఇంజిన్ కారు ఇది’ అని చెప్పారు. 8–స్పీడ్ గేర్‌బాక్స్, ఫ్రంట్ వీల్ డ్రైవ్ పవర్ట్రైన్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లేతో పనిచేసే 9–అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉన్నట్లు కంపెనీ వివరించింది -
వోల్వో ఎక్స్‌సీ–90@ రూ.1.42 కోట్లు
ముంబై: స్వీడన్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘వోల్వో’ తాజాగా తన ఆల్ట్రా–లగ్జరీ హైబ్రీడ్ కారును భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ‘ఎక్స్‌సీ–90’ పేరుతో విడుదలైన ఈ త్రీ–సీటర్ కారు ధర రూ. 1.42 కోట్లుగా ప్రకటించింది. వచ్చే ఏడాదికాలంలో కేవలం 15 కార్లను మాత్రమే ఇక్కడి మార్కెట్లో విక్రయించనున్నట్లు వోల్వో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ చార్లెస్ ఫ్రంప్ వెల్లడించారు. ఎంపికచేసిన కస్టమర్లకు మాత్రమే ఈకారును విక్రయిస్తున్నప్పటికీ.. కంపెనీకి ఇది గేమ్ ఛేంజర్‌గా మారనుందని ధీమా వ్యక్తంచేశారు. -
ద్వితీయార్ధం దాకా ఇంతే!
ముంబై, సాక్షి బిజినెస్ బ్యూరో: గతేడాది ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త యాక్సిల్ లోడ్ నిబంధనలు హెవీ, మీడియమ్ కమర్షియల్ వెహికల్ మార్కెట్‌ను కుంగదీశాయని, వీటి ప్రతికూల ప్రభావం ఈ సంవత్సరం రెండో అర్ధభాగం వరకు కొనసాగవచ్చని మహీంద్రా అండ్ మహీంద్రా ట్రక్ అండ్ బస్ సీఈఓ వినోద్ సహాయ్ చెప్పారు. ఈ నిబంధనల వల్ల మీడియం, హెవీ కమర్షియల్ వెహికల్ అమ్మకాలు దాదాపు 25 శాతం క్షీణించాయన్నారు. నిబంధనల ప్రభావం తమపై కూడా పడిందని, అందుకే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ క్యూ3లో వ్యాపారం దాదాపు 30– 40 శాతం మేర కుంచించుకుపోయిందని చెప్పారు. ‘‘క్రమంగా ఈ నెగిటివ్ ప్రభావం నుంచి మార్కెట్ కోలుకుంటోంది. క్యూ4 నాటికి విక్రయాల్లో వృద్ధి తరుగుదల పది శాతానికి పరిమితం కావచ్చు. కొత్త నిబంధనలతో పాత ట్రక్కు యజమానులకు ఊరట లభించింది. దీంతో కొత్త వాహనాల కొనుగోళ్లు గణనీయంగా పడ్డాయి’’ అని వివరించారు. కొత్త యాక్సిల్ లోడు నిబంధనల ప్రభావం ఈ ఏడాది ద్వితీయర్ధానికి పూర్తిగా తొలగిపోతే తిరిగి ట్రక్ మార్కెట్ వృద్ధి బాట పట్టవచ్చని అంచనా వేశారు. బీఎస్6 నిబంధనలు అమల్లోకి వస్తే ట్రక్ ధరలు రూ.లక్ష నుంచి 3 లక్షల వరకు పెరగవచ్చని చెప్పారు. ఐసీవీ విభాగంపై ప్రత్యేక ఫోకస్: పవన్ గోయింకా ఐసీవీ (ఇంటర్మీడియరీ కమర్షియల్ వెహికల్స్) విభాగం ఏటా 15–17 శాతం చక్రీయ వృద్ధి సాధిస్తోందని ఎంఅండ్ఎం ఎండీ పవన్ గోయింకా చెప్పారు. ఆటో కంపెనీలు హెచ్‌సీవీ (హెవీ కమర్షియల్ వెహికల్స్) వచ్చిన తరుగుదలను తట్టుకునేందుకు ఐసీవీ, ఎల్సీవీ మార్కెట్‌పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నాయని, అందుకే తామూ ఈ విభాగంలో ప్రవేశించామని తెలిపారు. ఈ విభాగంలో టాప్3 కంపెనీలతో (టాటామోటర్స్, అశోక్ లేలాండ్, వోల్వో ఐషర్) పోటీ పడేలా ఫ్యూరియో ట్రక్ మోడల్‌ను డిజైన్ చేశామన్నారు. ‘‘దీనిపై రూ.600 కోట్లు వెచ్చించాం. ఐసీవీ విభాగంలో సింగిల్ ట్రక్ ఓనర్స్ ఎక్కువమంది ఉంటారు. వీరిని దృష్టిలో పెట్టుకుని ఈ మోడల్‌ను తెచ్చాం. ప్యూరియోను గతేడాదే ఆవిష్కరించినా, ఆరు నెలలపాటు అన్ని రకాలుగా సమీక్షించామని, ఎటువంటి లోపాలు లేవని నిర్ధారించుకొని మార్కెట్లోకి విడుదల చేశాం’’ అన్నారు. -
‘రెక్కలు’ తొడిగిన స్వప్నం..
ట్రాఫిక్ జాంలో చిక్కుకున్నప్పుడు అదే కారులో ఆకాశంలోకి ఎగురుకుంటూ ఆఫీసుకు వెళ్లిపోతే ఎంత బాగుంటుంది.. ఇప్పటివరకూ ఇది కలే.. మరికొన్ని రోజుల్లో నిజమవనుంది. ఎందుకంటే.. టెర్రాఫ్యూజియా అనే కంపెనీ తయారుచేసిన ‘ట్రాన్సిషన్’ అనే ఈ ఎగిరే కారుకు సంబంధించిన తొలిదశ విక్రయాలు అక్టోబర్‌లో మొదలవనున్నాయి. ఈ కారు ఒక నిమిషం వ్యవధిలో ఇలా రెక్కలు విప్పుకుని విమానంలా మారిపోతుంది. రెండు సీట్ల హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కారు బరువు 590 కిలోలు. అత్యధిక వేగం గంటకు 160 కిలోమీటర్లు, 10 వేల అడుగుల ఎత్తు వరకూ ఎగరగలదు. అయితే దీన్ని నడపడానికి మనకు డ్రైవింగ్ లైసెన్సుతోపాటు పైలెట్ లైసెన్సు కూడా ఉండాలి. ఈ టెర్రాఫ్యూజియా ‘వోల్వో’కు చెందిన స్టార్టప్ కంపెనీ అట.. కార్ల డెలివరీ వచ్చే ఏడాదిలో ఉంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ధర రూ. 3 కోట్ల వరకూ ఉండొచ్చని చెబుతున్నారు. -
విడుదలైన నిమిషాల్లోనే..
లిమిటెడ్ ఎడిషన్‌గా లాంచ్ అయిన వోల్వో సరికొత్త సెడాన్ కారు నిమిషాల్లో హాట్ కేకుల్లా అమ్ముడు పోయింది. ఈ కార్ల బుకింగ్ ప్రారంభమైన 39 నిమిషాల్లోనే మొత్తం యూనిట్లు అమ్ముడయ్యాయట. లిమిటెడ్‌గా తీసుకొచ్చిన మొత్తం 20 యూనిట్లు ప్రీ బుకింగ్‌లో బుక్ అయ్యాయనీ, అమెరికాలో ఈ రికార్డు విక్రయాలు నమోదయ్యాయని కంపెనీ ప్రకటించింది. దీని ధర రూ. 45.04 లక్షలు(ఆన్ రోడ్, న్యూఢిల్లీ) . స్వీడన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ ఉత్పత్తుల సంస్థ వోల్వో ఇటీవల ఎస్60 మోడల్లో ప్రత్యేక ఎడిషన్ కారును విడుదల చేసిన సంగతి తెలిసిందే . అయితే అమెరికా మార్కెట్లోకి తీసుకొచ్చిన ఈ కారు ను వోల్వో యాప్ ద్వారా శుక్రవారం విక్రయాలను ప్రారంభించారు. కారు ధర, లిమిటెడ్ ఎడిషన్‌ను ప్రకటించిన తర్వాత 39 నిమిషాల్లోనే కార్లన్నీ బుక్ అయిపోయాయని వోల్వో తెలిపింది. 2019లో ఈ కారును కస్టమర్లకు డెలివరీ చేయనున్నట్లు పేర్కొంది. పోలెస్టార్ ఇంజనీర్డ్ వెర్షన్ ఎస్ 60 సెడాన్ వోల్వో యాప్ ద్వారా అందుబాటులో ఉంటుందని తెలిపింది. 415బీహెచ్ పవర్, 669ఎన్ఎం టార్క్, ఓహిలిన్స్ సస్పెన్షన్, బ్రెంబో బ్రేక్స్, తదితర అధునాతన ఫీచర్స్ ఈ సెడాన్ సొంతం.