మంటల్లో కాలి బూడిదైన రూ.63 లక్షల ఎలక్ట్రిక్ కారు - వీడియో వైరల్ | Rs 63 Lakh Volvo C40 Electric Car Catches Fire | Sakshi
Sakshi News home page

మంటల్లో కాలి బూడిదైన రూ.63 లక్షల ఎలక్ట్రిక్ కారు - వీడియో వైరల్

Published Tue, Jan 30 2024 12:16 PM | Last Updated on Tue, Jan 30 2024 12:57 PM

Rs 63 Lakh Volvo C40 Electric Car Catches Fire - Sakshi

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్వీడన్ కార్ల తయారీ సంస్థ 'వోల్వో' (Volvo)కు చెందిన రూ. 63 లక్షల ఎలక్ట్రిక్ కారు మంటల్లో చిక్కుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో వంటివి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

మంటల్లో కాలుతున్న కారు వోల్వో సీ40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అని తెలుస్తోంది. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగినట్లు సమాచారం. రాయ్‌పూర్‌కు చెందిన కారు ఓనర్ సౌరభ్ రాథోడ్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఎన్‌హెచ్ 53 హైవేలో ప్రయాణిస్తుండగా కారులో మంటలు చెలరేగాయి.

కారులో మంటలు ప్రారంభమైన వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే కారు దిగి బయటకు వచ్చారు. ఆ తరువాత కొంత సేపటికి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి కారు మొత్తం కాలి బూడిదైపోయింది. దీనికి సంబంధించిన చిత్రాలు టెస్లా క్లబ్ ఇండియా ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు.

ఈ ఘటనపై వోల్వో సంస్థ అధికారులు ఇంకా స్పందించలేదు. కారులో మంటలు చెలరేగడానికి కారణం ఏంటనేది కూడా తెలియాల్సి ఉంది. కాబట్టి వోల్వో సీ40 ఎలక్ట్రిక్ కారు మంటల్లో కాలిపోవడానికి గల కారణాలు ఖచ్చితంగా చెప్పలేము. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే వోల్వో కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కార్లు మంటల్లో కాలిపోవడం ఇదే మొదటిసారి. కాలిపోవడానికి గల కారణాలకు కంపెనీ తప్పకుండా వెల్లడించగలదని ఆశిస్తున్నాము.

గతంలో మంటల్లో కాలిన ఎలక్ట్రిక్ వాహనాలు
భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లు మంటల్లో కాలిపోవడం ఇదే మొదటి సారి కాదు. గతంలో దేశీయ దిగ్గజం టాటా మోటార్ కంపెనీకి చెందిన నెక్సాన్ ఈవీలో కూడా మంటలు చెలరేగి కాలిపోయింది.

ఇదీ చదవండి: అమెరికన్ యూనివర్సిటీ అద్భుత సృష్టి - ఐదు నిమిషాల్లో చార్జ్ అయ్యే బ్యాటరీ!

ఎలక్ట్రిక్ స్కూటర్ల విషయానికి వస్తే.. మంటలకు ఆహుతైన ఎలక్ట్రిక్ స్కూటర్లు కోకోల్లలుగానే ఉన్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో జరిగిన షార్ట్ సర్క్యూట్‌లు, అధిక ఛార్జింగ్ వంటి సమస్యల కారణంగా మంటలు చెలరేగిన సందర్భాలు ఎక్కువ. ఈ ప్రమాదాలు 2022లో చాలా వెలుగులోకి వచ్చాయి. ఆ తరువాత కొంత తక్కు ముఖం పట్టినప్పటికీ.. అక్కడక్కడా ఒక్కో సంఘటన అప్పుడప్పుడూ వెలుగులోకి వస్తూనే ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement