Volvo Cars
-
బెంగళూరు యాక్సిడెంట్.. అసలేం జరిగింది?
బెంగళూరు రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మైనర్లతో సహా ఆరుగురు దుర్మరణం పాలవడంతో రహదారి భద్రత మరోసారి చర్చనీయాంశంగా మారింది. రోడ్ టెర్రర్‌పై భయాందోళన వ్యక్తం చేస్తూ నెటిజనులు ఆన్లైన్ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. యాక్సిడెంట్లకు గల కారణాలను ఏకరువు పెడుతున్నారు. బెంగళూరు– తుమకూరు ఎన్‌హెచ్ మార్గంలోని తిప్పగొండనహళ్లి వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. బెంగళూరు నుంచి మహారాష్ట్రకు వెళుతున్న ఓ కుటుంబం ఊహించని రీతిలో అంతమవడం తీవ్రంగా కలిచివేసింది. మృతులను బెంగళూరులోని ఐఏఎస్‌టీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కంపెనీ యజమాని చంద్రం యోగప్ప (48), ఆయన భార్య గౌరాబాయి(42), వారి పిల్లలు దీక్ష (12), ఆర్య (6), బంధువులు జాన్ (16), విజయలక్ష్మి (36)గా గుర్తించారు.అసలేం జరిగింది?బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఔట్లో నివాసం ఉంటున్న చంద్రం యోగప్ప తన సొంతూరిలో క్రిస్మస్ వేడుకలు జరుపుకునేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వోల్వో కారులో మహారాష్ట్రలోని విజయపురకు బయలుదేరారు. హైవేపై వెళుతుండగా నెలమంగళ వద్ద భారీ కంటైనర్ లారీ హఠాత్తుగా వీరి కారుపై పడిపోయింది. ప్రమాదం ధాటికి కారులోని వారు కారులోనే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు వెంటనే స్పందించి క్రేన్ సహాయంతో కంటైనర్‌ను తొలగించినా ఫలితం లేకపోయింది. కంటైనర్ లారీ డ్రైవర్ ఆరిఫ్ నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు.ముందు వెళ్తున్న కారు సడన్‌గా బ్రేక్ వేయడమే ప్రమాదానికి కారణమని కంటైనర్ లారీ డ్రైవర్ ఆరిఫ్ మీడియాతో చెప్పాడు. తన ముందున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో దాన్ని ఢీకొట్టకుండా తప్పించుకునే క్రమంలో నియంత్రణ కోల్పోవడంతో కంటైనర్ డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న కారుపై పడిందని వివరించాడు. అయితే ఈ ప్రమాదంలో ఆరిఫ్‌కు కాలిరిగింది. అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత అతడిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రమాదం దృశ్యాలు సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి. విచారణలో భాగంగా పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కాగా, కంటైనర్ లారీలో 26 టన్నుల అల్యూమినియం స్తంభాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.సోషల్ మీడియాలో చర్చబెంగళూరు రోడ్డు ప్రమాదంపై సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చకు దారి తీసింది. మనం ప్రయాణించే వాహనం ఎంత సురక్షితమైనప్పటికీ ఇలాంటి ప్రమాదాల నుంచి తప్పించలేవని చాలా మంది అభిపప్రాయపడ్డారు. సురక్షితమైన రోడ్లు, సుశిక్షితుడైన డ్రైవర్, రక్షణ ప్రమాణాలు కలిగిన వాహనం.. ఈ మూడింటితో ప్రమాదాలు నివారించవచ్చని ‘డ్రైవ్ స్మార్ట్’ పేర్కొంది. దీనిపై పలువురు నెటిజనులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. చెత్త రోడ్లు, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, ఓవర్‌లోడ్ కారణంగా ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయని పలువురు పేర్కొన్నారు. కంటైనర్లు, లారీల్లో ఓవర్‌లోడ్ తీసుకెళ్లకుండా ప్రభుత్వం నియంత్రించాలని సూచించారు.చదవండి: తప్పతాగి ఫుట్‌పాత్‌పైకి ఎక్కించి.. పుణేలో ఘోరంఊహించని విధంగా మరణం.. ‘ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా వోల్వో XC90 ప్రసిద్ధి చెందింది. 2002లో మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి యూకేలో ఒక్క ప్రాణాంతక ప్రమాదానికి గురికాలేదు. అలాంటి సురక్షితమైన కారులో ప్రయాణిస్తూ ఓ కుటుంబం ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. కంటైనర్ ట్రక్ అదుపు తప్పి, డివైడర్‌ను దాటి కారుపై పడి యజమానితో పాటు అతడి కుటుంబ సభ్యులను బలితీసుకోవడాన్ని ఎవరూ ఊహించరు. ఎంత మంచి ప్రమాణాలు కలిగిన కారు అయిన ఇంత భారీ బరువు మీద పడితే కచ్చితంగా నలిగిపోతుంది. సురక్షితంగా ప్రయాణించేందుకు మనం అన్ని ఏర్పాట్లు చేసుకున్నా కూడా ఎవరూ ఊహించని విధంగా మరణం మన దరికి చేరడం విషాదమ’ని స్కిన్ డాక్టర్ ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.చదవండి: చంద్రం కుటుంబానికి కన్నీటి వీడ్కోలుప్రతిగంటకు 19 మంది బలి‘మీరు సురక్షితమైన కార్లను తయారు చేయవచ్చు, కానీ భారతదేశం అత్యంత అసురక్షిత రహదారులను నిర్మిస్తుంది. జాతీయ రహదారులు గందరగోళంగా ఉంటాయి. కొన్ని వందల రూపాయలు ఖర్చు చేస్తే చాలు డ్రైవింగ్ లైసెన్స్‌లు వచ్చేస్తాయి. నిర్లక్ష్య డ్రైవింగ్, చెత్త రోడ్ల కారణంగా మనదేశంలో ప్రతిగంటకు 19 మంది బలైపోతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే భారతీయ రహదారులు దేశ భవిష్యత్తును చంపేస్తున్నాయ’ని మరో నెటిజన్ పేర్కొన్నారు. -
మంటల్లో కాలి బూడిదైన రూ.63 లక్షల ఎలక్ట్రిక్ కారు - వీడియో వైరల్
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్వీడన్ కార్ల తయారీ సంస్థ 'వోల్వో' (Volvo)కు చెందిన రూ. 63 లక్షల ఎలక్ట్రిక్ కారు మంటల్లో చిక్కుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో వంటివి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మంటల్లో కాలుతున్న కారు వోల్వో సీ40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ అని తెలుస్తోంది. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగినట్లు సమాచారం. రాయ్‌పూర్‌కు చెందిన కారు ఓనర్ సౌరభ్ రాథోడ్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఎన్‌హెచ్ 53 హైవేలో ప్రయాణిస్తుండగా కారులో మంటలు చెలరేగాయి. కారులో మంటలు ప్రారంభమైన వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే కారు దిగి బయటకు వచ్చారు. ఆ తరువాత కొంత సేపటికి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి కారు మొత్తం కాలి బూడిదైపోయింది. దీనికి సంబంధించిన చిత్రాలు టెస్లా క్లబ్ ఇండియా ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. ఈ ఘటనపై వోల్వో సంస్థ అధికారులు ఇంకా స్పందించలేదు. కారులో మంటలు చెలరేగడానికి కారణం ఏంటనేది కూడా తెలియాల్సి ఉంది. కాబట్టి వోల్వో సీ40 ఎలక్ట్రిక్ కారు మంటల్లో కాలిపోవడానికి గల కారణాలు ఖచ్చితంగా చెప్పలేము. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే వోల్వో కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కార్లు మంటల్లో కాలిపోవడం ఇదే మొదటిసారి. కాలిపోవడానికి గల కారణాలకు కంపెనీ తప్పకుండా వెల్లడించగలదని ఆశిస్తున్నాము. గతంలో మంటల్లో కాలిన ఎలక్ట్రిక్ వాహనాలు భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లు మంటల్లో కాలిపోవడం ఇదే మొదటి సారి కాదు. గతంలో దేశీయ దిగ్గజం టాటా మోటార్ కంపెనీకి చెందిన నెక్సాన్ ఈవీలో కూడా మంటలు చెలరేగి కాలిపోయింది. ఇదీ చదవండి: అమెరికన్ యూనివర్సిటీ అద్భుత సృష్టి - ఐదు నిమిషాల్లో చార్జ్ అయ్యే బ్యాటరీ! ఎలక్ట్రిక్ స్కూటర్ల విషయానికి వస్తే.. మంటలకు ఆహుతైన ఎలక్ట్రిక్ స్కూటర్లు కోకోల్లలుగానే ఉన్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లలో జరిగిన షార్ట్ సర్క్యూట్లు, అధిక ఛార్జింగ్ వంటి సమస్యల కారణంగా మంటలు చెలరేగిన సందర్భాలు ఎక్కువ. ఈ ప్రమాదాలు 2022లో చాలా వెలుగులోకి వచ్చాయి. ఆ తరువాత కొంత తక్కు ముఖం పట్టినప్పటికీ.. అక్కడక్కడా ఒక్కో సంఘటన అప్పుడప్పుడూ వెలుగులోకి వస్తూనే ఉంది. LG Pouch NMC cells strike again? Sadly a case of Volvo C40 Recharge getting caught on fire on NH53 has come up. From video fire is starting from the bottom. Volvo sells 78kWh pack in India which uses LG Pouch NMC cells. Hope @volvocarsin @volvocars investigates this soon. pic.twitter.com/FRnL60Cdnw — Tesla Club India® (@TeslaClubIN) January 28, 2024 -
మనకు ఎడాదికొక ఎలక్ట్రిక్ కారు.. వోల్వో ప్రామిస్!
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న వోల్వో కార్స్ భారత్‌లో ఏటా ఒక ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది. భారత్‌లో 2025 నాటికి పూర్తి ఎలక్ట్రిక్ కార్ల కంపెనీగా అవతరించనున్నట్టు వెల్లడించింది. అంతర్జాతీయంగా ఈ లక్ష్యాన్ని 2030 నాటికి చేరుకోనున్నట్టు తెలిపింది. వోల్వో ఇండియా సి–40 బీఈవీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని 2023 అక్టోబర్–డిసెంబర్లో విడుదల చేస్తోంది. తమ కంపెనీకి మూడేళ్లలో అంతర్జాతీయంగా సగం మోడళ్లు ఈవీలు ఉంటాయని వోల్వో కార్స్ కమర్షియల్ ఆపరేషన్స్ హెడ్ నిక్ కానర్ తెలిపారు. సి–40 బీఈవీ మోడల్‌కు ఇతర మార్కెట్లలో అధిక డిమాండ్ ఉందన్నారు. భారత్‌లోనూ అటువంటి డిమాండ్‌ను ఆశిస్తున్నట్టు చెప్పారు. 2022లో కంపెనీ దేశంలో అన్ని మోడళ్లు కలిపి 1,800 యూనిట్లు విక్రయించింది. 2018లో నమోదైన 2,600 యూనిట్లను మించి ఈ ఏడాది అమ్మకాలు ఉంటాయని భావిస్తోంది. (ఇదీ చదవండి: జోరు మీదున్న ఫోన్‌పే... రూ.828 కోట్లు!) -
షాకిచ్చిన వోల్వో: ఆ మోడల్ కార్లు కొనాలంటే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో కార్ ఇండియా మూడు మోడళ్ల ధరలను పెంచుతోంది. వీటిలో ఎక్స్‌సీ90, ఎక్స్‌సీ60, ఎక్స్‌సీ40 ఉన్నాయి. మోడల్‌నుబట్టి ధర 1.8 శాతం అధికం కానుంది. (Bisleri Success Story 1969-2022: అపుడు 4 లక్షలు, ఇపుడు వేల కోట్లు, ‘బిస్లరీ’ పేరు ఎలా వచ్చింది?) సవరించిన ధరలు నవంబర్ 25 నుంచి అమలులోకి రానున్నాయని కంపెనీ గురువారం తెలిపింది. ఎస్90 పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్, ఎక్స్‌సీ40 పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం పెరగడం తాజా నిర్ణయానికి కారణమని వెల్లడించింది. (షాకింగ్: గూగుల్ పే, పోన్‌పేలాంటి యాప్స్‌లో ఇక ఆ లావాదేవీలకు చెక్?) ఇదీ చదవండి: ఓటీటీలకు షాక్: సీవోఏఐ కొత్త ప్రతిపాదన -
ఒకసారి చార్జింగ్‌తో 400 కిలోమీటర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న వోల్వో కార్ ఇండియా తాజాగా ప్యూర్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఎక్స్‌సీ40 రీచార్జ్‌ను ప్రవేశపెట్టింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.55.9 లక్షలు. ఆన్లైన్లో మాత్రమే ఈ కారును బుక్ చేయాల్సి ఉంటుంది. భారత్‌లో అసెంబుల్ అయిన తొలి లగ్జరీ ఎలక్ట్రిక్ కారు ఇదేనని కంపెనీ ప్రకటించింది. ఒకసారి చార్జింగ్ చేస్తే 400 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని వెల్లడించింది. 78 కిలోవాట్ అవర్ సామర్థ్యం గల 500 కిలోల లిథియం అయాన్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. బ్యాటరీపై ఎనమిదేళ్ల వారంటీ ఉంది. టాప్ స్పీడ్ గంటకు 180 కిలోమీటర్లు. 4.9 సెకన్లలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 6 ఎయిర్‌బ్యాగ్స్, ఆల్ వీల్ డ్రైవ్, హార్మన్ కార్డన్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, క్రాస్ ట్రాఫిక్ అలర్ట్‌తో బ్లైండ్ స్పాట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, పైలట్ అసిస్ట్, కొలీషన్ మిటిగేషన్ సపోర్ట్ వంటి హంగులు ఉన్నాయి బుకింగ్ కోసం రూ.50,000 చెల్లించాల్సి ఉంటుంది. డెలివరీలు అక్టోబర్ నుంచి మొదలవుతాయి. -
లగ్జరీ కార్ల సంస్థ వోల్వో షాకింగ్ నిర్ణయం..!
ప్రముఖ స్వీడిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో షాకింగ్ నిర్ణయాన్ని తీసుకుంది. మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, మెర్సిడెస్ బెంజ్, ఆడి, సిట్రోయెన్, టాటా మోటార్స్ వంటి కంపెనీలు వాహనాల ధరలను వచ్చే ఏడాది జనవరి 1 నుంచి పెంచుతున్నుట్లు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వాటి బాటలోనే ప్రముఖ స్వీడిష్ ఆటోమొబైల్ దిగ్గజం వోల్వో ఆయా కార్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. భారీగా పెరగనున్న ధరలు..! పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులను అధిగమించడానికి భారత్‌లో వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఎంపిక చేసిన కారు మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు వోల్వో ప్రకటించింది. సుమారు ఆయా కారు మోడళ్లపై సుమారు రూ. 1 లక్ష నుంచి రూ. 3 లక్షల మధ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ధరల పెంపు కారణం అదే..! గత కొన్ని సంవత్సరాలుగా అస్థిరమైన ఫారెక్స్ పరిస్థితులు, గ్లోబల్ సప్లై చైయిన్‌లో అంతరాయం, కోవిడ్-19 ప్రేరిత పరిమితులు, ద్రవ్యోల్బణాల కారణంగా ఇన్పుట్ల ఖర్చులు పెరగడంతో ఆయా కార్ల ధరల పెంపు అనివార్యమని వోల్వో ఒక ప్రకటనలో వెల్లడించింది. కొత్త రేట్స్ ఇలా ఉంటాయి...? వోల్వో కార్ ఇండియా సవరించిన ధరల ప్రకారం.... కంపెనీ పోర్ట్‌ఫోలియోలోని ఎస్యూవీ ఎక్స్‌సీ40 టీ4 ఆర్ వేరియంట్ ధర రూ. 2 లక్షలకు పైగా పెరగనుంది.దీంతో ఈ కారు రూ. 43.25 లక్షలకు లభించనుంది. దాంతో పాటుగా వోల్వో ఎక్స్‌సీ60 బీ5 ఇన్స్క్రిప్షన్ ఎస్యూవీ ధర రూ. 1.6 లక్షలు పెరిగి రూ. 63.5 లక్షలుగా ఉండనుంది. అదే విధంగా వోల్వో సెడాన్ పోర్ట్‌ఫోలియోలోని వోల్వో సెడాన్ ఎస్90 ధర సుమారు రూ. 3 లక్షలు పెరిగి, రూ. 64.9 లక్షలకు చేరనుంది. కంపెనీలోని టాప్-ఎండ్ ఎస్యూవీ ఎక్స్‌సీ90 ధర సుమారు రూ. 1 లక్ష పెరిగి, సుమారు రూ. 90.9 లక్షలకు లభించనుంది. చదవండి: హ్యుందాయ్ సంచలన నిర్ణయం..! ఇకపై ఆ కార్లకు స్వస్తి..! -
ఈవీ ప్రియులకు పండగే.. 2022లో రాబోతున్న టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
దేశంలో రోజు రోజుకి పెట్రోల్ ధరలు పెరిగిపోతున్న తరుణంలో వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లవైపు మొగ్గు చూపుతున్నారు. ప్రజల ఆసక్తిని గమనించిన కంపెనీలు వారికి తగ్గట్టు సరికొత్త ఎలక్ట్రిక్ వాహన ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొని వస్తున్నాయి. ఇప్పటికే దేశంలో అనేక రకాల ఎలక్ట్రిక్ కార్లు రోడ్డు మీద చక్కర్లు కొడుతున్నప్పటికి, వచ్చే ఏడాది 2022లో దిగ్గజ కంపెనీలు కూడా తమ ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసేందుకు సిద్దం అవుతున్నాయి. 2022లో ఎలక్ట్రిక్ కారు తయారీ కంపెనీలు తీసుకొనిరాబోతున్న కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ ప్రముఖ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ టెస్లా కంపెనీకి పోటీ ఇచ్చేందుకు ఈక్యూఎస్ అనే ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకొని రాబోతుంది. మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 450+ కారు ఎడ్మండ్స్ చేసిన రియల్ వరల్డ్ రేంజ్ టెస్టులో 422 మైళ్ల దూరం ప్రయాణించింది. టెస్లా ఉత్తమ మోడల్ కంటే దాదాపు 20 మైళ్ళు ఎక్కువ దూరం ప్రయాణించింది అన్నామట. మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 450+ కారును ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 770 కిమీ వెళ్లనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ కారు ధర $102,310 (రూ.76,07,899) లుగా ఉంది. ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కారు 0-100 కిలోమీటర్ల వేగాన్ని 5.9 సెకన్లలో అందుకుంటుంది.ఈ కారుకు ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ వద్ద 10-80 శాతం చేరుకోవడానికి 30 నిమిషాలు మాత్రమే పడుతుంది. దీనిలో 107.8 kWh బ్యాటరీ సామర్ధ్యం గల ఇంజిన్ ఉంది. ఇది 2022 మొదటి త్రైమాసికంలో వచ్చే అవకాశం ఉంది. (చదవండి: ఒమిక్రాన్ భయాలతో భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..!) టెస్లా మోడల్ 3 & మోడల్ వై ఎలక్ట్రిక్ కారు ప్రియులు అందరూ ఈ ఏడాదిలో టెస్లా కారు విడుదల అవుతుందని అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. టెస్లా మోడల్ 3 సింగిల్, డ్యూయల్ మోటార్ సెటప్‌లతో ఉంటుంది. టెస్లా మోడల్ 3 బేస్ వేరియంట్ పూర్తి ఛార్జీపై 423 కిలోమీటర్లు పరుగులు తీస్తుంది. ఈ కారు 6 సెకన్లలోపు 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుతుంటుంది. అయితే, ఈ ఎలక్ట్రిక్ కారు టాప్ వేరియంట్ ఒకే పూర్తి ఛార్జీతో 568 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. ఈ వేరియంట్ కేవలం 3 సెకన్లలో 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. దీని ధర సుమారు రూ. 60 - 80 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. మోడల్ వై అనేది ఏడు సీట్ల వాహనం. అమెరికాలో దీని ధర 54,000 డాలర్ల(సుమారు 40 లక్షల రూపాయల) పై మాటే. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 326 కిమీ వరకు వెళ్లగలదు. దీని గరిష్ట వేగం గంటకు 135 కిలోమీటర్లు. ఇది 4.8 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ రెండు కూడా ఈ రెండవ త్రైమాసికంలో వచ్చే అవకాశం ఉంది. (చదవండి: క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు అలర్ట్..!) వోల్వో XC40 రీఛార్జ్ వోల్వో మొట్ట మొదటి ఆల్-ఎలక్ట్రిక్ వాహనం ఇదే. రాబోయే వోల్వో ఎక్స్‌సి 40 రీఛార్జ్ డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్స్ ద్వారా వస్తుంది. ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ 408 బిహెచ్పి, 660 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుందని, ఇది కేవలం 4.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ స్ప్రింట్ చేయడానికి అనుమతిస్తుంది. ఎక్స్‌సి 40 రీఛార్జ్ ఒకే ఛార్జీపై 418 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. వోల్వో ఎక్స్‌సి 40 రీఛార్జ్ భారత మార్కెట్లో ధృవీకరించబడిన సరికొత్త ఆల్-ఎలక్ట్రిక్ ప్రీమియం ఎస్యూవీ ఆఫర్. దీని ధర సుమారు రూ.50 లక్షలుగా ఉండే అవకాశం ఉంది. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో ఈ కారును లాంచ్ చేసే అవకాశం ఉంది. ఆడి క్యూ4 ఈ-ట్రాన్ జర్మనీకి చెందిన దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ఆడి.. క్యూ4 ఈ-ట్రాన్ అనే ఎలక్ట్రిక్ కారును 2022లో మార్కెట్లోకి తీసుకురాబోతోంది. దీజెనీవాలో జరుగుతున్న మోటార్ షోలో కంపెనీ ఈ కారు కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. క్యూ4 ఇ-ట్రాన్ ఒక 4 డోర్ ఎస్యూవీ. ఇందులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. మాగ్జిమమ్ ఔట్పుట్ 302 బీహెచ్పీ. ఇందులో క్వాట్రో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉంటుంది. ఈ కారు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని 6.3 సెకన్లలో అందుకుంటుంది. కారును ఒకసారి చార్జ్ చేస్తే 450 కిలోమీటర్లు వెళ్లొచ్చు. గరిష్ట వేగం గంటకు 180 కిలోమీటర్లు. ఈ కారు ధర సుమారు రూ.75 లక్షలు ఉండవచ్చు. హ్యుందాయ్ అయోనిక్ 5 ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ వచ్చే ఏడాది అయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసేందుకు సిద్దం అవుతుంది. ఈ కారును కేవలం 5 నిమిషాల ఛార్జ్ చేస్తే దాదాపు 100 కిలో మీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంది. అయోనిక్ 5 కార్లు ప్రధానంగా 390 హెచ్‌పీ అవుట్ పుట్తో.. ఆల్ వీల్ డ్రైవ్ కార్ల రూపంలో చెలామణీలోకి వచ్చే అవకాశం ఉంది. 5 సెకన్లలో సున్నా నుంచి 100 కేఎంపీహెచ్ స్పీడును అందుకొనున్నాయి. పలు రిపోర్టుల ప్రకారం అయోనిక్ 5 కారును ఫుల్ ఛార్జ్ చేస్తే 450 కిలో మీటర్లు వరకు వెళ్లనుంది. దీని ధర సుమారు రూ- 25-30 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. మినీ కూపర్ ఎస్ఈ జర్మన్ లగ్జరీ కారు బ్రాండ్ బీఎమ్డబ్ల్యూకి చెందిన ప్రీమియం స్మాల్ కార్ బ్రాండ్ మినీ కూపర్, భారత మార్కెట్ కోసం ప్లాన్ చేసిన ఎలక్ట్రిక్ కార్లు అప్పుడే పూర్తిగా అమ్ముడైనట్లు కంపెనీ ప్రకటించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ మినీ కూపర్ ఎస్ఈ 32.6కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ చేత పని చేస్తుంది.ఈ కారు 181 బిహెచ్పీ పవర్, 270ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్ 7.3 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 150 కి.మీ. డబ్ల్యుఎల్ టీపీ ప్రకారం.. కూపర్ ఎస్ఈను ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే 270 కిలోమీటర్ల వెళ్లగలదు అని కంపెనీ తెలిపింది. ఈ కారు ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడిడిఆర్ఎల్ ఓవల్ హెడ్ ల్యాంప్, షడ్భుజి ఆకారంలో ఉండే గ్రిల్, కాంట్రాస్ట్ కలర్ ఓఆర్ విఎమ్ లతో వస్తుంది. ఈ కారు లోపల 8.8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, ఫుల్ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండనుంది. కస్టమర్లు మినీ కూపర్ ఎస్ఈ ఎలక్ట్రిక్ కారుని 11కెడబ్ల్యు(2.5 గంటలు) లేదా 50కెడబ్ల్యు ఛార్జర్ తో ఛార్జ్ చేయవచ్చు. ఇది బ్యాటరీని 35 నిమిషాల్లో 0-80 శాతం నుంచి ఛార్జ్ చేస్తుంది. ఈ కారు ధర సుమారు రూ.50 లక్షలు ఉండే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జనవరిలో దీనిని లాంచ్ చేసే అవకాశం ఉంది. (చదవండి: 2021 రౌండప్: అత్యంత చెత్త కంపెనీ ఏదంటే..) -
ఓల్వో కార్ల పేరుతో మోసాలు.. కటకటాల్లోకి సాకేత్ తల్వార్
సాక్షి, హైదరాబాద్: ఖరీదైన ఓల్వో కార్లు కొంటామంటూ నకిలీ పత్రాలు సమర్పించి వివిధ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్ని వరుసపెట్టి మోసాలు చేస్తున్న తల్వార్ గ్రూప్ డైరెక్టర్ సాకేత్ తల్వార్ ఎట్టకేలకు పట్టుబడ్డారు. కొన్నాళ్లుగా అజ్ఞాతంలో ఉన్న ఇతడి ఆచూకీని గోవాలో కనిపెట్టిన నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు అరెస్టు చేశారు. ఇతడితో పాటు ఇతడి కంపెనీపై మొత్తం ఎనిమిది కేసులు ఉన్నాయని, కెనరా బ్యాంకు ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో అరెస్టు చేశామని సోమవారం సీసీఎస్ సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి వెల్లడించారు. నగరంలోని ఎస్‌ఏయూవీఈ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అభిసుబ్రమణ్యం, జ్యోతి గుత్తా, డి.శ్రీచరణ్, పి.శ్రీనివాస్ గౌతమ్ డైరెక్టర్లు. ఓల్వో కంపెనీకి చెందిన ఎక్స్ సి 90 కారు కొనడానికి రూ.95 లక్షల రుణం కోసం సుల్తాన్‌బజార్‌లోని కెనరా బ్యాంకు బ్రాంచ్‌లో 2018లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ రుణం మంజూరు చేసిన ఆ బ్యాంకు టోలీచౌకిలోని తల్వార్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో చెక్కును జారీ చేసి, దరఖాస్తుదారులకు సదరు కారు ఇవ్వాలని సూచించింది. ఎస్‌ఏయూవీఈ సంస్థకు ఆ కారు డెలివరీ చేసినట్లు.. తమకు మొత్తం ర. 95 లక్షలు ముట్టినట్లు నకిలీ పత్రాలు సృష్టింన తల్వార్ కార్స్ బ్యాంకునకు వాటిని సమర్పింంది. రుణం పొందిన ఎస్‌ఏయూవీఈ సంస్థ నెలసరి వాయిదాలు చెల్లించలేదు. దీంతో అధికారులు సదరు ఓల్వో కారు వివరాలను ఆర్టీఏ విభాగం నుంచి సేకరించడానికి ప్రయత్నించారు. తమ వద్ద అలాంటి కారు రిజిస్టర్ కాలేదంట వారి నుంచి సమాధానం వచ్చింది. దీంతో తల్వార్ కార్స్‌తో పాటు ఎస్‌ఏయూవీఈ సంస్థ కుమ్మక్కై పథకం ప్రకారం తమను మోసం చేసినట్లు కెనరా బ్యాంకు అధికారులు గుర్తించారు. దీనిపై సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో సాకేత్ తల్వార్‌తో పాటు ఎస్‌ఏయూవీఈ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అభిసుబ్రమణ్యం, జ్యోతి గుత్తా, డి.శ్రీచరణ్, పి.శ్రీనివాస్ గౌతమ్‌లపై కేసు నమోదైంది. ఈ తరహాలోనే బంజారాహిల్స్ కేంద్రంగా పని చేసే రెబెల్ మోటార్ సైకిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో, తల్వార్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఐడీబీఐ బ్యాంక్ అనుబంధ సంస్థను మోసం చేసిన వ్యవహారం పైనా సీసీఎస్‌లో మరో కేసు నమోదై ఉంది. 2018లో చోటు చేసుకున్న ఈ రెండు సందర్భాల్లోనూ నిందితు లు ఓల్వో కారు ఖరీదు పేరుతో నకిలీ పత్రాలు సమరి్పంచి రుణం తీసుకుని మోసం చేయడం గమనార్హం. సీసీఎస్‌లో నమోదైన రెండు కేసులతో పాటు బంజారాహిల్స్ ఠాణాలో మూడు, పంజగుట్ట, జూబ్లీహిల్స్, మియాపూర్‌లలో ఒక్కోటి చొప్పున కేసులు నమోదై ఉన్నాయి. దీంతో సాకేత్ తల్వార్ కొన్నాళ్లుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కెనరా బ్యాంకు ఫిర్యాదు మేరకు సీసీఎస్‌లో నమోదైన కేసును దర్యాప్తు చేసిన టీమ్–10 ఎస్సై కె.రామకృష్ణ గోవాలోని ఆరంబోల్ బీచ్‌లో ఉన్న మావి విల్లాలో అతడి ఆచూకీ కనిపెట్టారు. అతడిని అరెస్టు చేసి నగరానికి తీసుకువచ్చారు. -
ఖరీదైన కారు కొన్న టీవీ నటి
ముంబై: హిందీ బుల్లితెర నటి, ‘నాగిన్’ 4 ఫేం నియా శర్మ ఖరీదైన కారును కొన్నారు. రూ. 87.90 లక్షలు(ఎక్స్- షోరూం) వెచ్చించి వోల్వో ఎక్స్‌సీ90 డీ5 ఇన్స్క్రిప్షన్ ఎస్యూవీ కొత్త మోడల్‌ను సొంతం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆమె.. ‘‘సంతోషాన్ని కొనుక్కోలేం. కానీ కార్లు కొనుక్కోవచ్చు. వాటితో ఆనందం కూడా’’ అంటూ హర్షం వ్యక్తం చేశారు. దీంతో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ఏక్ హజారోం మే మేరీ బహన్ హై, జమాయి రాజా, నాగిన్ వంటి హిందీ హిట్ సీరియళ్లతో నియా శర్మ తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. బోల్డ్ నటిగా పేరొందిన ఆమె.. ప్రముఖ రియాలిటీ షో ‘ఖత్రోంకీ ఖిలాడీ: మేడిన్ ఇండియా’ విజేతగా కూడా నిలిచారు. (చదవండి: ఖరీదైన కారు కొన్న శివజ్యోతి) ఈ అడ్వెంచరస్ షోలో.. నీటితో నింపి లాక్ చేసిన పేటికలో గడపడం.. బాంబులను దాటుకుంటూ ముందుకు సాగడం.. బురదలో ఈత కొట్టడం, కొండచిలువలను తప్పించుకుంటూ, పైకి ఎగబాకుతూ, గ్లాసు పగులకొట్టి నెక్లెస్‌ను తీసుకురావడం వంటి టాస్కులను నియా శర్మ సమర్థవంతంగా పూర్తి చేశారు. ఎలక్ట్రిక్ షాకులకు గురిచేసినా తట్టుకుని నిలబడి టైటిల్‌ను సొంతం చేసుకుని ధీశాలిగా ప్రశంసలు అందుకున్నారు. ఇక ఎంతో సురక్షితమైనవిగా భావించే వోల్వో కంపెనీ వాహనాలపై సెలబ్రిటీలు ఎక్కువ మక్కువ ప్రదర్శిస్తారన్న సంగతి తెలిసిందే. బీ-టౌన్‌లోని చాలా మంది ప్రముఖుల దగ్గర భిన్నరకాల వోల్వో ఎస్‌యూవీలు ఉన్నాయి. కాగా చాలా ఏళ్లుగా ఎక్స్‌సీ90 మోడల్ వోల్వో కార్లను భారత్‌లో విక్రయిస్తున్న కార్ల సంస్థ, 2017లో బెంగళూరులో లోకల్ అసెంబ్లీ యూనిట్‌ను ప్రారంభించింది. నియా శర్మ కొనుగోలు చేసిన కారు డీజిల్ వర్షన్.(చదవండి: ట్రోఫీని సొంతం చేసుకున్న నియా శర్మ) View this post on Instagram A post shared by Nia Sharma (@niasharma90) -
వోల్వో ఎక్స్‌సీ40లో రెండు కొత్త వేరియంట్స్
న్యూఢిల్లీ: స్వీడన్‌కి చెందిన కార్ల తయారీ దిగ్గజం వోల్వో కార్స్ తాజాగా ఎక్స్‌సీ40 కాంపాక్ట్ ఎస్‌యూవీలో మరో రెండు కొత్త వేరియంట్స్‌కు బుకింగ్స్ ప్రారంభించింది. ఇందులో ఎక్స్‌సీ40 డీ4 మొమెంటమ్ రేటు రూ. 39.9 లక్షలుగాను, డీ4 ఇన్స్క్రిప్షన్ వేరియంట్ ధర రూ.43.9 లక్షలుగాను (ఎక్స్ షోరూం) ఉంటుందని వోల్వో కార్స్ ఇండియా ఎండీ చార్లెస్ ఫ్రంప్ తెలిపారు. ఈ నెలాఖరు నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయని చెప్పారాయన. మరోవైపు, ఆర్–డిజైన్ వేరియంట్ రేటును రూ. 42.9 లక్షలకు పెంచినట్లు ఆయన తెలిపారు. జూలై 4న ప్రారంభ ఆఫర్ కింద దీన్ని రూ. 39.9 లక్షలకు అందించినట్లు, ఇప్పటిదాకా 200 యూనిట్లకు ఆర్డర్లు వచ్చినట్లు ఫ్రంప్ వివరించారు. -
వోల్వో కార్స్ నుంచి న్యూ ఎక్స్‌సి 60
కొరుక్కుపేట: లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం వోల్వో కార్స్ కంపెనీ సరికొత్త టెక్నాలజీతో కూడిన న్యూ ఎక్స్‌సి 60 కారును మార్కెట్లోకి విడుదల చేసింది. సౌకర్యవంతంగాను, సేఫ్టీ ఫ్యూచర్లతో, అద్భుతమైన డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో రూపుదిద్దుకున్న న్యూ ఎక్స్‌సి 60ని చెన్నై మార్కెట్లో అందుబాటులోకి తెచ్చినట్లు వోల్వో ఆటో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ చార్లెస్ ఫ్రాంప్ తెలిపారు. చెన్నైలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన ఎక్స్ సి 60 వోల్వో కారును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీని ధర రూ.55.9 లక్షలుగా నిర్ణయించామన్నారు. పవర్ ప్లస్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కలిగిన రోబస్ట్ డీజిల్ ఇంజిన్‌ను పొందుపరిచామని తెలిపారు. భారతీయ రహదారులపై అత్యంత వేగంగా ఈ కారు దూసుకుపోతోందన్నారు. -
ఓల్వో ‘ఎక్స్‌సీ 60’.. కొత్త వేరియంట్
న్యూఢిల్లీ: స్వీడన్ లగ్జరీ కార్ కంపెనీ, ఓల్వో కార్స్ భారత్‌లో ఎస్యూవీ ఎక్స్‌సీ60లో కొత్త వేరియంట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త వేరియంట్ ధర రూ.55.9 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ ఏడాది 2,000 కార్లు విక్రయించాలని ఈ కంపెనీ యోచిస్తోంది. గత ఏడాది అమ్మకాలతో పోల్చితే ఇది 25 శాతం అధికం. అధికంగా అమ్ముడయ్యే మోడల్... ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ కారును తయారు చేశామని ఓల్వో ఆటో ఇండియా ఎండీ, చార్లెస్ ఫ్రంప్ తెలిపారు. ఈ కారు వినియోగదారులను ఆకట్టుకోగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే కాకుండా, భారత్‌లో కూడా అత్యధికంగా అమ్ముడయ్యే తమ మోడల్ ఇదేనని వివరించారు. తమ మొత్తం భారత అమ్మకాల్లో ఈ కారు వాటా మూడోవంతని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 19గా ఉన్న తమ డీలర్ల సంఖ్యను రెండేళ్లలో రెట్టింపు చేయనున్నామని వివరించారు. ఈ కారు...మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ, ఆడి క్యూ5, బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్3, జాగ్వార్ ఎఫ్–పేస్లకు గట్టిపోటీనివ్వగలదని అంచనా. కారు ప్రత్యేకతలు.. ఈ కారును 2.0 లీటర్ డీ5 డీజిల్ ఇంజిన్‌తో రూపొందించామని చార్లెస్ తెలిపారు. ఐదుగురు సౌకర్యవంతంగా ప్రయాణించగలిగే ఈ కారులో యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఎయిర్ సస్పెన్షన్, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఫ్రంట్ సీట్ వెంటిలేషన్, మసాజ్, ఫోర్–కార్నర్ ఎయిర్ సస్పెన్షన్, 8 గేర్లు ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్, బౌవర్స్ అండ్ విల్కిన్స్ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ప్రత్యేక ఫీచర్లున్నాయని తెలిపారు. పాదచారులను, సైక్లిస్ట్‌లను గుర్తించేలా అత్యంత ఆధునికమైన భద్రత ఫీచర్లతో, స్టీర్ అసిస్ట్ ఫంక్షనాలిటీతో కూడిన సేఫ్టీ ఫీచర్స్‌తో ఈ కారును రూపొందించామని చార్లెస్ వివరించారు. -
మార్కెట్లోకి వోల్వో ఎస్60 పోల్‌స్టార్ సెడాన్
► ధర రూ.52.5 లక్షలు ► 4.7 సెకన్లలోనే 0–100 కిమీ. వేగం ► గరిష్ట వేగం గంటకు 250 కి.మీ కోయంబత్తూర్: స్వీడన్‌కు చెందిన వోల్వో కార్స్ కంపెనీ... వోల్వో ఎస్60 పోల్‌స్టార్ సెడాన్‌ను భారత మార్కెట్లోకి తెచ్చింది. ఈ కారు పరిచయ ధర రూ.52.5 లక్షలు(ఎక్స్ షోరూమ్, ముంబై) అని వోల్వో ఆటో ఇండియా తెలిపింది. 0–100 కిమీ. వేగాన్ని 4.7 సెకన్లలోనే అందుకునే ఈ కారు గరిష్ట వేగం గంటకు 250కిమీ.అని వోల్వో ఆటో ఇండియా ఎండీ టామ్ వాన్ బాన్స్‌డార్ఫ్ పేర్కొన్నారు. భారత్‌లో అందిస్తున్న వోల్వో కార్లలో అత్యంత వేగంగా ప్రయాణించే కారు ఇదే. 2–లీటర్, ట్విన్ చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో దీన్ని రూపొందించామని వివరించారు. ఎస్60 పోల్స్టార్తో లగ్జరీ సెగ్మెంట్లో పూర్తి స్థాయి రేంజ్లో కార్లను అందిస్తున్నామన్నారు. ఇది మెర్సిడెస్ సి43 ఏఎంజీ, సీఎల్ఏ45 ఏఎంజీ, ఆడి ఎస్5 కార్లకు గట్టిపోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. రెండంకెల వృద్ధి లక్ష్యం..: గత ఏడాది 1,600 కార్లు విక్రయించామని టామ్ వాన్ పేర్కొన్నారు. ఈ ఏడాది 2,000 కార్లు విక్రయించాలని, అమ్మకాల్లో రెండంకెల వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. పోల్‌స్టార్ ఒక మోటార్‌స్పోర్ట్ టీమ్‌గా 1996లో ఏర్పాటైంది. దీనిని వోల్వో కార్స్ కంపెనీ 2015లో కొనుగోలు చేసింది. ఆ తర్వాత పెర్ఫామెన్స్ బ్రాండ్‌గా పోల్‌స్టార్‌ను వోల్వో కార్స్ మార్చివేసింది.