ప్రముఖ స్వీడిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో షాకింగ్ నిర్ణయాన్ని తీసుకుంది. మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, మెర్సిడెస్ బెంజ్, ఆడి, సిట్రోయెన్, టాటా మోటార్స్ వంటి కంపెనీలు వాహనాల ధరలను వచ్చే ఏడాది జనవరి 1 నుంచి పెంచుతున్నుట్లు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వాటి బాటలోనే ప్రముఖ స్వీడిష్ ఆటోమొబైల్ దిగ్గజం వోల్వో ఆయా కార్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.
భారీగా పెరగనున్న ధరలు..!
పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులను అధిగమించడానికి భారత్‌లో వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఎంపిక చేసిన కారు మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు వోల్వో ప్రకటించింది. సుమారు ఆయా కారు మోడళ్లపై సుమారు రూ. 1 లక్ష నుంచి రూ. 3 లక్షల మధ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ధరల పెంపు కారణం అదే..!
గత కొన్ని సంవత్సరాలుగా అస్థిరమైన ఫారెక్స్ పరిస్థితులు, గ్లోబల్ సప్లై చైయిన్‌లో అంతరాయం, కోవిడ్-19 ప్రేరిత పరిమితులు, ద్రవ్యోల్బణాల కారణంగా ఇన్‌పుట్‌ల ఖర్చులు పెరగడంతో ఆయా కార్ల ధరల పెంపు అనివార్యమని వోల్వో ఒక ప్రకటనలో వెల్లడించింది.
కొత్త రేట్స్ ఇలా ఉంటాయి...?
వోల్వో కార్ ఇండియా సవరించిన ధరల ప్రకారం.... కంపెనీ పోర్ట్‌ఫోలియోలోని ఎస్‌యూవీ ఎక్స్‌సీ40 టీ4 ఆర్ వేరియంట్ ధర రూ. 2 లక్షలకు పైగా పెరగనుంది.దీంతో ఈ కారు రూ. 43.25 లక్షలకు లభించనుంది. దాంతో పాటుగా వోల్వో ఎక్స్‌సీ60 బీ5 ఇన్‌స్క్రిప్షన్ ఎస్‌యూవీ ధర రూ. 1.6 లక్షలు పెరిగి రూ. 63.5 లక్షలుగా ఉండనుంది.
అదే విధంగా వోల్వో సెడాన్ పోర్ట్‌ఫోలియోలోని వోల్వో సెడాన్ ఎస్90 ధర సుమారు రూ. 3 లక్షలు పెరిగి, రూ. 64.9 లక్షలకు చేరనుంది. కంపెనీలోని టాప్-ఎండ్ ఎస్‌యూవీ ఎక్స్‌సీ90 ధర సుమారు రూ. 1 లక్ష పెరిగి, సుమారు రూ. 90.9 లక్షలకు లభించనుంది.
చదవండి: హ్యుందాయ్ సంచలన నిర్ణయం..! ఇకపై ఆ కార్లకు స్వస్తి..!
Comments
Please login to add a commentAdd a comment