కీవ్: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ దళాలతో ధీటుగా పోరాడలేక ఉత్తర కొరియా సైనికులు తమ దేశానికి వెనుదిరుగుతున్నట్టు ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు. కిమ్ దళాలు దాదాపు ఉక్రెయిన్ నుంచి వెళ్లిపోయినట్టు తెలిపారు. ఈ క్రమంలో తాము పైచేయి సాధించినట్టు చెప్పుకొచ్చారు.
తాజాగా ఉక్రెయిన్‌కు చెందిన స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్ ప్రతినిధి ఒలెక్సాండర్ కిండ్రాటెంకో మాట్లాడుతూ.. ‘గత మూడు వారాలుగా మాతో యుద్ధంలో పాల్గొన్న ఉత్తర కొరియా సైనికులకు సంబంధించి ఎలాంటి కార్యకలాపాలను గుర్తించలేదు. మా సైనికుల చేతిలో ఓడిపోయి భారీ నష్టాలు చవిచూడటంతో వారు వెనుదిరిగినట్లు విశ్వసిస్తున్నాం. నార్త్ కొరియాకు చెందిన సైనికులు ఎక్కడా కనిపించడం లేదు’ అంటూ కామెంట్స్ చేశారు.
ఇక.. ఉక్రెయిన్‌తో జరుగుతోన్న యుద్ధంలో రష్యాకు మద్దతుగా ఉత్తరకొరియా సైన్యం పోరాడుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 10 వేల మంది కిమ్ సైనికులు సాయపడుతున్నారు. ప్రత్యేక శిక్షణ అనంతరం వీరిని కదన రంగంలో దింపినప్పటికీ.. మాస్కో, కొరియన్ సైనికుల మధ్య భాష సమస్య కారణంగా సమన్వయం లోపించింది. ఈక్రమంలోనే కిమ్ సైనికులు తమ దళాల చేతిలో మృతి చెందుతున్నారని కీవ్ ప్రకటించింది.
మరోవైపు.. ఉక్రెయిన్ అధికారుల వ్యాఖ్యలపై రష్యా ప్రతినిధి దిమిత్రి పెస్కొవ్ ఘాటు స్పందించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఉక్రెయిన్ అధికారులు చెప్పిన వ్యాఖ్యల్లో నిజం లేదు. దీనిలో భిన్నమైన వాదనలు ఉన్నాయి. ప్రతిసారీ వ్యాఖ్యానించలేం అంటూ కొట్టిపారేశారు.
ఇదిలా ఉండగా.. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ చేసిన తర్వాత ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ముగింపు పలుకుతానని చెప్పారు. అనంతరం.. యుద్ధం నిలిపేసేందుకు ఇరు దేశాధ్యక్షులు శాంతి చర్చలకు ముందుకు రావాలని కోరారు. ఇదే సమయంలో ఈ చర్చలకు వచ్చేందుకు రష్యా నిరాకరిస్తే వారిపై ఆంక్షలు విధిస్తానని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పుతిన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తికరంగా మారింది.
North Korea sent troops to aid Russia in its war against Ukraine. But after months of severe losses, they have been taken off the front line. pic.twitter.com/l92MDNiW48
— ☻Joanna (@joanna952544) January 31, 2025
Comments
Please login to add a commentAdd a comment