Volodymyr Zelenskyy
-
ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడి
కీవ్: ఉక్రెయిన్ సైనిక మౌలిక వసతులను ధ్వంసం చేయడమే లక్ష్యంగా రష్యా శుక్రవారం 93 క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులతో దాడికి తెగబడింది. ఏకంగా 200 డ్రోన్లతో దాడి చేసింది. గత మూడేళ్లలో రష్యా ఒకే రోజులో చేసిన అతిపెద్ద దాడుల్లో ఇది కూడా ఒకటని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. రష్యా నుంచి దూసుకొచ్చిన వాటిల్లో 11క్రూయిజ్ క్షిపణులుసహా 81 మిస్సైళ్లను పశి్చమదేశాలు అందించిన ఎఫ్–16 యద్ధవిమానాల సాయంతో నేలమట్టంచేశామని ఆయన చెప్పారు. ‘‘ పెనుదాడులతో ఉక్రేనియన్లను భయపెడుతున్న రష్యాకు, పుతిన్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం ఐక్యంగా నిలబడాల్సిన తరుణమిది. పెద్ద ప్రతిఘటన, భారీ ఎదురుదాడితో రష్యా ఉగ్రచర్యలను అడ్డుకుందాం’’ అని జెలెన్స్కీ తన టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా చెప్పారు. ఉక్రెయిన్ రక్షణ పారిశ్రామికవాడల్లో ఇంధన, శక్తి వనరులు, మౌలిక వసతులను ధ్వంసంచేయడమే లక్ష్యంగా తమ సైన్యం దాడులు చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. తమ బొగ్గు విద్యుత్ ఉత్పత్తికేంద్రాలకు భారీ నష్టం వాటిల్లిందని ఉక్రెయిన్‌లోని అతిపెద్ద ప్రైవేట్ విద్యుత్ సంస్థ డీటెక్ తెలిపింది. ఉక్రెయిన్‌లో ఆయుధాలు, మందుగుండు సామగ్రి తయారీని నిలువరించడమే లక్ష్యంగా ఇంధన వ్యవస్థలపైనే రష్యా తరచూ దాడులుచేస్తుండటం తెల్సిందే. నవంబర్ 28న చేసిన ఇలాంటి దాడిలో 200 మిస్సైళ్లు, డ్రోన్లను ప్రయోగించింది. నాటి నష్టం కారణంగా 10 లక్షల కుటుంబాలు అంధకారంలో ఉండిపోయాయి. -
ఉక్రెయిన్‌లో తక్షణమే శాంతి నెలకొనాలి
వాషింగ్టన్: రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం తక్షణమే ఆగిపోవాలని అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. నాటో నుంచి అమెరికా వైదొలిగే అంశాన్ని పరిశీలిస్తున్నామని కూడా ఆయన వెల్లడించారు. పారిస్‌లో శనివారం ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ వేర్వేరుగా సమావేశమయ్యారు. అనంతరం ట్రంప్ తన సొంత ట్రూత్ సోషల్‌లో.. ‘రష్యాతో వెయ్యి రోజులకు పైగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతూ ఉక్రెయిన్ ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నా’ అంటూ వ్యాఖ్యానించారు. ‘అవసరమే లేని యుద్ధంలో రష్యా, ఉక్రెయిన్లు రెండూ వేలాదిగా సైనికులను పోగొట్టుకున్నాయి. అందుకే చర్చలు ప్రారంభించి, వెంటనే కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలి. ఎన్నో ప్రాణాలు అనవసరంగా బలయ్యాయి. ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. యుద్ధానికి ముగింపు పలకాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కోరుతున్నా’ అని ఆయన పేర్కొన్నారు. ట్రంప్‌తో సమావేశం నిర్మాణాత్మకంగా జరిగిందని అంతకుముందు జెలెన్స్కీ పేర్కొన్నారు. ‘శాంతి ఒప్పందంతో మాకు న్యాయం జరగాలి. రష్యా, పుతిన్, ఇతర దురాక్రమణదారులు ఇలాంటి యుద్ధాలకు దిగే అవకాశం మళ్లీ ఇవ్వరాదు’అని స్పష్టం చేశారు. ఈ యుద్ధంలో తాము 43 వేల మంది సైనికులను కోల్పోయామని, మరో 3.70 లక్షల మంది క్షతగాత్రులయ్యారని జెలెన్స్కీ చెప్పారు. ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమేనని రష్యా ట్రంప్ ప్రకటనపై ఈ మేరకు స్పందించడం గమనార్హం. అయితే, అధ్యక్షుడిగా పుతిన్ ఉన్నంతకాలం రష్యాతో చర్చల ప్రసక్తే లేదని గతంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన ప్రకటనను గుర్తు చేసింది.నాటో నుంచి బయటికొస్తాంనాటో నుంచి అమెరికా బయటికి వచ్చే విషయం ఇప్పటికీ తమ పరిశీలనలో ఉందని, అది సాధ్యమేనని ట్రంప్ ఎన్బీసీ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘నాటోలో అమెరికా బలగాలుండాలంటే బదులుగా యూరప్, కెనడా ప్రభుత్వాలు అందుకయ్యే వ్యయం భరించాలి. అప్పుడే వాళ్లు మమ్మల్ని సమభావంతో చూస్తున్నట్లు లెక్క. అలాగైతేనే మేం నాటోలో కొనసాగుతాం’ అని ఆయన స్పష్టం చేశారు. యూరప్, కెనడాలకు తామెందుకు భద్రత కల్పించాలంటూ అమెరికా అధ్యక్షుడిగా ఉండగా గతంలోనే ఆయన ప్రశ్నించడం తెల్సిందే. -
ఉక్రెయిన్‌కు ట్రంప్ పరిష్కారం?
లెబనాన్‌లో కాల్పుల విరమణ జరిపించి, గాజాలోనూ ఆ ప్రయత్నం చేయగలనన్న అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఉక్రెయిన్ యుద్ధం గురించి మాత్రం ఎటువంటి ప్రస్తావన చేయకపోవటం గమనించదగ్గది. పైగా, కొత్త అధ్యక్షుడు ట్రంప్ జనవరి 20న బాధ్యతలు స్వీకరించి ఆ విషయమై తన శాంతి ప్రయత్నాలు ఆరంభించేలోగా, రష్యాతో చర్చలలో ఉక్రెయిన్ బేరసారాల బలాన్ని వీలైనంత పెంచే పనిలో ఉన్నారు. తాను గెలిచినట్లయితే రష్యా– ఉక్రెయిన్ యుద్ధ సమస్యను ఇరవై నాలుగు గంటలలో పరిష్కరించగలనని ఎన్నికల ప్రచార సమయలో ప్రకటించిన ట్రంప్ శాంతి పథకమేమిటో అంచనా వేయటం అవసరం. మరి ఆయన గెలిచి మరొక యాభై రోజులలోనే పదవిని స్వీకరించనుండగా ఈ విషయమై ఏదైనా ఆలోచిస్తున్నట్లా?రష్యా–ఉక్రెయిన్ యుద్ధ పరిష్కారానికి ఎన్నికల సమయంలో ట్రంప్ ఎటువంటి పథకాన్ని సూచించలేదంటూ చాలా వ్యాఖ్యానాలు వచ్చాయి. అయితే, ఆయన దాని గురించి ఆలోచించటమే కాదు, రష్యా – ఉక్రెయిన్ సమస్యపై తన ప్రతినిధిగా రిటైర్డ్ లెఫ్ట్‌నెంట్ జనరల్ కీత్ కెల్లోగ్ను 28వ తేదీన నియమించారు కూడా. జనరల్ కెల్లోగ్తో పాటు, ట్రంప్ ఇప్పటికే చేసిన వ్యాఖ్యలను, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో తన వ్యవహరణను గమనించి నట్లయితే, సమస్యకు ట్రంప్ ప్రభుత్వం సూచించే పరిష్కారమేమిటో కొంత అవగతమవుతుంది. ట్రంప్ మాటలను ఇప్పటికే చూశాం గనుక, కొత్తగా రంగంలోకి వస్తున్న జనరల్ కెల్లోగ్ వైఖరిని గమనిద్దాం. ఆయన ట్రంప్ మొదటి పాలనా కాలంలో జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు. ఉక్రెయిన్ సమస్యపై కొంతకాలం క్రితమే తన ఆలోచనలను వివరిస్తూ ఒక పత్రాన్ని ప్రకటించారు. ఇతరత్రా టెలివిజన్ చర్చ వంటి వాటిలో పాల్గొన్నారు.ముందు కాల్పుల విరమణకెల్లోగ్ ప్రకారం, ముందుగా రష్యా, ఉక్రెయిన్లు కాల్పుల విరమణ పాటించాలి. ఉభయుల సేనలు ఆ విరమణ రోజుకు ఎక్కడ ఉంటాయో అక్కడ ఆగిపోవాలి. తర్వాత చర్చలు మొదలు కావాలి. దీనంతటికీ ఉక్రెయిన్ అంగీకరించకపోయినట్లయితే వారికి సహాయం నిలిపివేయాలి. రష్యా కాదన్న పక్షంలో ఉక్రెయిన్‌కు సహాయం కొనసాగించాలి. పోతే, రాజీ కోసం ఉక్రెయిన్ కొంత భూభాగాన్ని రష్యాకు వదలుకోవలసి రావచ్చు. అదేవిధంగా, నాటోలో సభ్యత్వ విషయం నిరవధికంగా వాయిదా పడుతుంది. ట్రంప్ ఈ మాటలు ఇంత నిర్దిష్టంగా చెప్పలేదుగానీ, ఉక్రెయిన్‌కు సహాయంపై నియంత్రణలు, వారు తమ భూభాగాన్ని కొంత వదులు కోవలసి రావటం గురించిన ప్రస్తావనలు స్పష్టంగానే చేశారు. అవి యూరప్ అంతటా కలవరం సృష్టించాయి. ట్రంప్ వైఖరిని మార్చేందుకు జెలెన్స్కీ చేసిన ప్రయత్నాలు నెరవేరలేదు.ఇదే పథకం అమలుకు ట్రంప్ ప్రయత్నించినట్లయితే పరిస్థితి ఏ విధంగా ఉండవచ్చు? భూభాగం వదులుకునేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు అంగీకరిస్తారా? ఒకవేళ అంగీకరిస్తే ఏ మేరకు అనే కీలకమైన ప్రశ్నను అట్లుంచితే, మొదట కాల్పుల విరమణకు, సేనలను యథాతథ స్థితిలో నిలిపివేయటానికి సమ్మతించటంలో ఎవరికీ సమస్య ఉండకపోవచ్చు. ట్రంప్ ప్రభుత్వ ఆధ్వర్యంలో చర్చలకు సిద్ధమని జెలెన్స్కీతో పాటు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పటికే ప్రకటించారు. చర్చల సందర్భంగా జనరల్ కెల్లోగ్ ప్రతిపాదనలు ఏ దశలో ముందుకు వచ్చేదీ చెప్పలేము గానీ, మొదట మాత్రం రష్యా, ఉక్రెయిన్ దేని షరతులు అది విధిస్తుంది. ఆ షరతులేమిటో మనకు ఇప్పటికే తెలుసు. 2014 నుంచి తమ ఆక్రమణలో గల క్రిమియాను ఉక్రెయిన్ తిరిగి కోరకపోవటం, ఉక్రెయిన్ తూర్పున రష్యన్ జాతీయులు ఆధిక్యతలో గల డోన్బాస్ ప్రాంతాన్ని తమకు వదలటం, నాటోలో చేరకుండా తటస్థంగా ఉండటమన్నవి రష్యా షరతులు. నాటో సభ్యత్వం సంగతి ఎట్లున్నా తమ భూభాగాలన్నింటిని తమకు తిరిగి అప్పగించటం, తమ రక్షణకు పూర్తి హామీలు లభించటం ఉక్రెయిన్ షరతులు.భూభాగాలను వదులుకోవాల్సిందే!నల్ల సముద్రంలోని క్రిమియా తమ అధీనంలో లేనట్లయితే రష్యా సముద్ర వాణిజ్యం శీతాకాలం పొడవునా స్తంభించి పోతుంది. కనుక ఆ ప్రాంతాన్ని 2014లో ఆక్రమించిన రష్యా, దానిని వదలుకునేందుకు ససేమిరా అంగీకరించదు. ఈ వాస్తవ స్థితిని అప్పటినుంచే గ్రహించిన ఉక్రెయిన్, అమెరికా శిబిరాలు బయటకు కాకున్నా అంతర్గతంగా రాజీ పడిపోయాయి. పోతే, డోన్బాస్ ప్రాంతంలోని రష్యన్లను ఉక్రెయిన్ రకరకాలుగా వేధించటం ఎప్పటినుంచో ఉంది గనుకనే ఆ భూభాగాలను రష్యాలో విలీనం చేసుకుని తీరగలమని పుతిన్ ప్రకటించారు. ప్రస్తుత యుద్ధ కాలంలో అందులో అధిక భాగాన్ని ఆక్రమించారు కూడా. మరొకవైపున కనిపించే ఆసక్తికరమైన అంశాలు మూడున్నాయి. తమ ప్రభుత్వ వైఖరి ఏమైనప్పటికీ రష్యాతో శాంతి కోసం కొంత భూభాగం వదులు కోవచ్చుననే ఉక్రెయిన్ ప్రజల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఒకవైపు ఉక్రెయిన్‌కు యుద్ధంలో మద్దతిస్తూనే యూరోపియన్ దేశాలు కూడా ఇదే మాట పరోక్షంగా సూచిస్తున్నాయి. యుద్ధానికి నిరవధికంగా సహాయం చేసేందుకు అవి పైకి అవునన్నా వాస్తవంలో సిద్ధంగా లేవు. ఇదంతా పరిగణించినప్పుడు, ఉక్రెయిన్ ఈ రాజీకి సిద్ధపడవలసి ఉంటుందనిపిస్తుంది. అయితే, ఎంత భూభాగమన్నది ప్రశ్న.ఒకసారి యుద్ధం ముగిసినట్లయితే రష్యా నుంచి ముప్పు అన్నదే ఉండదు గనుక, ఉక్రెయిన్‌కు తను కోరుతున్న ప్రకారం రక్షణలు కల్పించటం సమస్య కాకపోవచ్చు. అయితే, నాటో సభ్యత్వ ప్రశ్న చిక్కుల మారిది. సభ్యత్వం కావాలన్నది ఉక్రెయిన్ కోరిక. రష్యా నుంచి ఎప్పటికైనా ఉక్రెయిన్‌కే గాక తక్కిన యూరప్‌కు సైతం ప్రమాదం ఉండవచ్చునని, కనుక ఉక్రెయిన్‌కు సభ్యత్వమిస్తూ నాటోను మరింత శక్తిమంతం చేసుకోవాలన్నది యూరోపియన్ యూనియన్ కోరిక. నిజానికి అది అమెరికాకు మొదటినుంచీ ఉన్న వ్యూహం. ఒకప్పటి సోవియెట్ యూనియన్‌తో పాటు వారి నాయకత్వాన ఉండిన వార్సా సైనిక కూటమి 1991లోనే రద్దయినా, రష్యాను దిగ్బంధంలోనే ఉంచేందుకు అమెరికన్లు తమ సైనిక కూటమి నాటోను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే 1991 తర్వాత మరొక 12 యూరోపియన్ దేశాలను నాటోలో చేర్చుకుని రష్యా సరిహద్దుల వైపు విస్తరించారు. ఆ సరిహద్దుల వెంటగల చివరి దేశం ఉక్రెయిన్ కావటం వల్లనే రష్యా తన భద్రత పట్ల ఇంత ఆందోళన చెందుతూ ప్రస్తుత యుద్ధానికి సమకట్టింది. వార్సా కూటమి రద్దయిన దరిమిలా నాటోను విస్తరించబోమంటూ ఇచ్చిన హామీని అమెరికా ఉల్లంఘిస్తూ ఇదంతా చేయటమన్నది వారి ఆగ్రహానికి కారణం.నాటో సభ్యత్వం ఉండదా?ఉక్రెయిన్ నాటో సభ్యత్వ విషయం నిరవధికంగా వాయిదా పడగలదని జనరల్ కెల్లోగ్ అంటున్నారు గానీ, అసలు ఉండబోదని, రష్యా కోరుకున్నట్లు ఉక్రెయిన్ తటస్థంగా ఉండగలదని మాత్రం అనటం లేదు. చర్చల సమయలో రష్యా ఈ షరతును తీసుకురాగలదు. అందుకు ట్రంప్, తద్వారా యూరోపియన్ యూనియన్ అంగీకరించినట్లయితే తప్ప, ఈ నిర్దిష్ట సమస్యపై రాజీ సాధ్యం కాదు. పోతే, ప్రస్తుత యుద్ధం ప్రపంచ యుద్ధానికి, అణుయుద్ధానికి దారితీయవచ్చుననే ఊహాగానాలు కొద్ది కాలం పాటు సాగి ఆందోళనలు సృష్టించాయి. పరిణామాలను గమనించినపుడు అటువంటి అవకాశాలు లేవని అర్థ్థమైంది. రష్యాపైకి దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగానికి అమెరికా, ఫ్రాన్స్, ఇంగ్లండ్ అనుమతించటంగానీ, అందుకు ప్రతిగా రష్యా మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించటం గానీ, కర్స్క్ ప్రాంతంలోకి చొచ్చుకు వచ్చిన ఉక్రెయిన్ సేనల నిర్మూలనకు ఉత్తర కొరియా సేనలను రష్యా మోహరించటం గానీ, చర్చల సమయానికి తమది పైచేయిగా ఉండాలనే చివరిదశ ప్రయత్నాలు తప్ప మరొకటికాదు. ఇటువంటి వ్యూహాలు ఏ యుద్ధంలోనైనా సాధారణం. ఇదే వ్యూహానికి అనుగుణంగా, చర్చల కాలం వరకు యుద్ధం మరింత తీవ్రరూపం తీసుకున్నా ఆశ్చర్యపడనక్కర లేదు. టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఉక్రెయిన్‌కు బైడెన్ భారీ ఆఫర్.. ట్రంప్ సమర్థిస్తారా?
వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర పోరు జరుగుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రష్యా దాడుల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఉక్రెయిన్‌కు అమెరికా ఆర్థికంగా బాసటగా నిలిచేందుకు అడుగులు వేస్తోంది. ఉక్రెయిన్‌కు ఇచ్చిన 4.7 బిలియన్ డాలర్లను (రూ.3.96 లక్షల కోట్లు) మాఫీ చేయడానికి బైడెన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలుస్తోంది.ఉక్రెయిన్-రష్యా మధ్య దాదాపు రెండున్నరేళ్లుగా యుద్ధం కొనసాగుతోంది. రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్‌లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. వేల సంఖ్యలో ఉక్రెయిన్‌వాసులు దేశం విడిచివెళ్లారు. రష్యా దాడులు ప్రారంభమైన నాటి నుంచి ఉక్రెయిన్‌కు అగ్ర రాజ్యం అమెరికా అండగా నిలిచింది. బైడెస్ ప్రభుత్వం జెలెన్ స్కీకి ఆర్థికంగా, ఆయుధాల విషయంలోనూ సాయం అందజేసింది.ఇక, తాజాగా అధ్యక్షుడు బైడెన్.. ఉక్రెయిన్ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్‌కు అందజేసిన 4.7 బిలియన్ డాలర్లను (రూ.3.96 లక్షల కోట్లు) మాఫీ చేయడానికి బైడెన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపిన అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ వెల్లడించారు. బైడెన్ తన పదవి నుంచి దిగేపోయే ముందే రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌కు తాము చేయాల్సినంత సాయం చేసి వెళ్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్థిక సాయం అందించే దిశగా బైడెన్ ప్లాన్ చేస్తున్నారు. అయితే, బైడెన్ నిర్ణయం పట్ల డొనాల్డ్ ట్రంప్ ఎలా స్పందిస్తారనే ఉత్కంఠ నెలకొంది. The Biden Administration has moved to forgive $4.7 billion of US 🇺🇸 loans provided to Ukraine 🇺🇦 says State Department Spokesperson Matthew MillerThese loans were approved as part of a $60.8 billion package for Ukraine this April. Great news for Ukraine this week from US pic.twitter.com/hbob3Ixvji— Ukraine Battle Map (@ukraine_map) November 20, 2024 -
ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం?
రష్యాపై యూఎస్ తయారీ దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులతో ఉక్రెయిన్ దాడులు. తీవ్రస్థాయిలో మండిపడుతున్న రష్యా. దీన్ని అమెరికాతో కలిసి చేసిన సంయుక్త దాడిగానే పరిగణిస్తామని ప్రకటన. అణు దాడితో దీటుగా బదులిచ్చేందుకు వీలుగా రష్యా అణు విధానాన్ని సవరిస్తూ అధ్యక్షుడు పుతిన్ నిర్ణయం. ‘ఏ క్షణాన్నయినా అణు యుద్ధం ముంచుకు రావచ్చు, జాగ్రత్తగా ఉండండి’ అంటూ ప్రజలకు యూరప్ దేశాల ‘వార్ గైడ్‌లైన్స్’. సోమవారం ఒక్క రోజే శరవేగంగా జరిగిన తీవ్ర ఆందోళనకర పరిణామాలివి! ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి తెర తీసి సరిగ్గా 1,000 రోజులు పూర్తయిన నాడే చోటుచేసుకున్న ఈ తీవ్ర పరిణామాలు గుబులు రేపుతున్నాయి. ఇప్పటికే నాల్కలు చాస్తున్న యుద్ధ జ్వాలలు మరింతగా విస్తరించి మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయా అన్న ఆందోళనలు సర్వత్రా తలెత్తుతున్నాయి.అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ విజయంతో ఉక్రెయిన్ యుద్ధానికి తెర పడుతుందని, పశ్చిమాసియా కల్లోలమూ కాస్త అదుపులోకి వస్తుందని భావిస్తున్న తరుణంలో అంతర్జాతీయంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పదవి నుంచి దిగిపోయే ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఇందుకు బీజం పడింది. అమెరికా అందజేసిన దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యాలో సుదూర లక్ష్యాలపై దాడుల నిమిత్తం వాడేందుకు ఉక్రెయిన్‌కు ఆయన అనుమతివ్వడం ఒక్కసారిగా ఉద్రిక్తతలను రాజేసింది. దీన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న ఉక్రెయిన్ మంగళవారమే రష్యాపై యూఎస్ దీర్ఘశ్రేణి ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టం (ఏటీఏసీఎంస్) బాలిస్టిక్ క్షిపణులను ఎడాపెడా ప్రయోగించింది. రష్యాలోని బ్రయాన్స్క్ ప్రాంతమే లక్ష్యంగా దాడులకు దిగింది. ఈ క్షిపణులను ఉక్రెయిన్ యుద్ధంలో వాడటం ఇదే తొలిసారి. అలాంటి చర్యలకు దిగితే తీవ్రస్థాయి ప్రతిస్పందన తప్పదని ఇప్పటికే హెచ్చరించిన రష్యా ఈ పరిణామంపై భగ్గుమంది. తమ భూభాగాలపైకి కనీసం ఆరు అమెరికా తయారీ ఏటీఏసీఎంఎస్ క్షిపణులు వచ్చి పడ్డాయని ధ్రువీకరించింది. వాటిలో ఐదింటిని కూల్చేయడంతో పాటు ఆరో దాన్నీ ధ్వంసం చేసినట్టు ప్రకటించింది. ఉక్రెయిన్‌పై రష్యా అణు దాడులు! తాజా పరిణామాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ మండిపడుతున్నారు. మంగళవారం ఆయన రక్షణ తదితర శాఖల అత్యున్నత స్థాయి అధికారులతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్ క్షిపణి దాడులను అమెరికాతో కలిసి చేసిన సంయుక్త దాడిగానే పరిగణించాలని నిర్ణయించారు. అందుకు వీలు కలి్పంచేలా దేశ అణు విధానానికి సవరణ కూడా చేశారు! దాని ప్రకారం సంప్రదాయ ఆయుధాలతో రష్యాపై జరిగే దాడికి ఏ అణ్వాయుధ దేశమైనా మద్దతిస్తే దాన్ని ఆ రెండు దేశాల సంయుక్త దాడిగానే పరిగణిస్తారు. సదరు దేశాలపై అణు దాడులకు దిగుతారా అన్నదానిపై సవరణలో స్పష్టత ఇవ్వలేదు. కాకపోతే రష్యాపై భారీ స్థాయి వైమానిక, బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణి దాడులు జరిగితే అణ్వాయుధాలతో బదులిచ్చేందుకు అది వీలు కలి్పస్తుండటం విశేషం! అంతేగాక మిత్ర దేశమైన బెలారస్‌పై దుందుడుకు చర్యలకు దిగినా అణ్వాయుధాలతో బదులు చెప్పేందుకు తాజా సవరణ అనుమతించనుంది! ఉక్రెయిన్‌కు మరింత సాయం చేయకుండా యూరప్ దేశాలను నియంత్రించడంతో పాటు అవసరమైతే దానిపై అణ్వాయుధ ప్రయోగానికి, అమెరికాపై సైనిక చర్యకు కూడా దిగడం పుతిన్ తాజా నిర్ణయాల ఉద్దేశమని భావిస్తున్నారు. అమెరికా దీర్ఘశ్రేణి క్షిపణులతో ఉక్రెయిన్ చేసిన తాజా దాడులకు బదులుగానే అణు విధాన సవరణ జరిగిందా అన్న ప్రశ్నకు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ నేరుగా బదులివ్వలేదు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా అణు విధానాన్ని అప్డేట్ చేయాల్సిందిగా పుతిన్ ఆదేశించారంటూ నర్మగర్భంగా స్పందించారు. ఇటీవలి కాలంలో రష్యా అణు విధానానికి పుతిన్ సవరణ చేయడం ఇది రెండోసారి. రష్యాకు దన్నుగా ఉత్తర కొరియా సైన్యం కూడా ఉక్రెయిన్‌పై యుద్ధంలో పాల్గొంటుండటం తెలిసిందే. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు అమెరికా ఇప్పటికే ప్రకటించింది. దీర్ఘశ్రేణి క్షిపణుల వాడకానికి అనుమతి దాని పర్యవసానమేనంటున్నారు. ఈ నేపథ్యంలో యుద్ధ జ్వాలలు త్వరలో కొరియా ద్వీపకల్పం దాకా విస్తరించినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బైడెన్ మతిలేని విధానాలతో ట్రంప్ పగ్గాలు చేపట్టే నాటికే ప్రపంచాన్ని పెనుయుద్ధం ముంగిట నిలిపేలా ఉన్నారని ఆయన కుమారుడు జూనియర్ ట్రంప్ మండిపడటం తెలిసిందే.నిత్యావసరాలు నిల్వ చేసుకోండితాజా పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా కన్పిస్తుండటంతో యూరప్ దేశాలు భీతిల్లుతున్నాయి. అలాంటి పరిస్థితే తలెత్తితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటూ స్వీడన్, ఫిన్లండ్, నార్వే, డెన్మార్క్ తదితర నాటో సభ్య దేశాలు తమ పౌరులను హెచ్చరించడం విశేషం. ‘‘ఏ క్షణంలోనైనా అణు యుద్ధం ముంచుకు రావచ్చు. సిద్ధంగా ఉండండి’’ అంటూ స్వీడన్ ఏకంగా ఇంటింటికీ కరపత్రాలే పంచుతోంది. ‘సంక్షోభమో, యుద్ధమో వస్తే...’ అనే శీర్షికతో కూడిన 52 లక్షల కరపత్రాలను సోమవారం నుంచి వారం పాటు పంచనుంది! అది నిజానికి 32 పేజీలతో కూడిన డాక్యుమెంట్. ‘‘మనపై ఎవరైనా దాడికి తెగబడితే దేశ స్వాతంత్య్ర పరిరక్షణకు అందరమూ ఒక్కటవుదాం’’ అని అందులో పౌరులకు స్వీడన్ ప్రభుత్వం పిలుపునిచ్చింది. దాంతోపాటు, ‘‘పిల్లల డైపర్లు, బేబీ ఫుడ్, దీర్ఘకాలం నిల్వ ఉండే ఆహార పదార్థాలు, మంచినీరు తదితరాలన్నింటినీ వీలైనంతగా సేకరించి పెట్టుకోండి’’ అని సూచించింది. అంతేగాక బాంబు దాడులు జరిగితే వాటిబారి నుంచి ఎలా తప్పించుకోవాలి, గాయపడితే రక్తస్రావాన్ని నిరోధించేందుకు, ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు ఏం చేయాలి, యుద్ధ బీభత్సం చూసి భీతిల్లే చిన్నారులను ఎలా సముదాయించాలి వంటి వివరాలెన్నో పొందుపరిచింది.‘‘పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత స్వీడన్ ఇలాంటి చర్యకు దిగడం ఇది ఐదోసారి. నార్వే కూడా ఇలాంటి ‘యుద్ధ’ జాగ్రత్తలతో ప్రజలకు ఎమర్జెన్సీ పాంప్లెంట్లు పంచుతోంది. ‘పూర్తిస్థాయి యుద్ధంతో పాటు ఏవైనా అనుకోని పరిస్థితులు ఎదురైతే వారం దాకా ఇల్లు కదలకుండా గడిపేందుకు సిద్ధపడండి’ అంటూ అప్రమత్తం చేస్తోంది. డెన్మార్క్ కూడా కనీసం మూడు రోజులకు పైగా సరిపడా సరుకులు, మంచినీరు, ఔషధాలు తదితరాలు నిల్వ ఉంచుకోవాలంటూ తన పౌరులందరికీ ఇప్పటికే ఈ–మెయిళ్లు పంపింది! ఫిన్లండ్ కూడా అదే బాట పట్టింది. ‘రష్యా–ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉండండి. నిత్యావసరాలను వీలైనంతగా సేకరించి పెట్టుకోండి’ అంటూ తన పౌరులకు ఆన్లైన్ బ్రోషర్లు పంపింది.అపారంగా అణ్వాయుధాలు రష్యా వద్ద వేలాదిగా అణ్వాయుధాలు పోగు పడి ఉన్నాయి. ప్రపంచంలోకెల్లా అత్యధిక సంఖ్యలో అణు వార్హెడ్లున్న దేశం రష్యానే. 1994లో సోవియట్ నుంచి విడిపోయేనాటికి ఉక్రెయిన్ వద్ద కూడా భారీగానే అణ్వాయుధాలుండేవి. ఆ జాబితాలో ప్రపంచంలో మూడో అతి పెద్ద దేశంగా ఉక్రెయిన్ ఉండేది. కానీ రష్యాతో ఒప్పందంలో భాగంగా తన అణ్వాయుధాలన్నింటినీ నాశనం చేసింది. కాకపోతే అమెరికాతో పాటు అణు సంపత్తి ఉన్న పలు దేశాలు ఉక్రెయిన్‌కు దన్నుగా ఉన్నాయి.క్షిపణులే మాట్లాడతాయి భారీ క్షిపణి దాడులకు మాకు అనుమతి లభించిందంటూ మీడియా ఏదేదో చెబుతోంది. కానీ దాడులు జరిగేది మాటలతో కాదు. వాటిని ముందుగా చెప్పి చేయరు. ఇక మా తరఫున క్షిపణులే మాట్లాడతాయి. – ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉక్రెయిన్‌పైకి దూసుకొచ్చిన 100 డ్రోన్లు
కీవ్: రష్యా శనివారం అర్ధరాత్రి నుంచి తమ భూభాగంపైకి 96 డ్రోన్లు, ఒక గైడెడ్ ఎయిర్ మిస్సైల్‌ను ప్రయోగించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. క్షిపణితోపాటు 66 డ్రోన్లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ ఆర్మీ ప్రకటించింది. వేర్వేరు ప్రాంతాలపైకి దూసుకెళ్లిన మరో 27 డ్రోన్లను పనిచేయకుండా జామ్ చేశామని తెలిపింది. ఒక డ్రోన్ బెలారస్ గగనతలంలోకి వెళ్లిందని వివరించింది. ఈ దాడులతో తమకెలాంటి నష్టం వాటిల్లలేదని పేర్కొంది. వారం రోజుల వ్యవధిలో రష్యా కనీసం 900 గైడెడ్ ఏరియల్ బాంబులు, 500 డ్రోన్లు, మరో 30 క్షిపణులను ఉక్రెయిన్‌పైకి ప్రయోగించిందని జెలెన్ స్కీ వివరించారు. తమకు తక్షణమే లాంగ్ రేంజ్ మిస్సైళ్లను ప్రయోగించేందుకు అనుమతివ్వాలని అమెరికా, పశ్చిమ దేశాలను ఆయన కోరారు. డ్రోన్లు, మిస్సైళ్ల తయారీలో కీలకమైన పరికరాలు రష్యాకు అందకుండా ఆంక్షలను మరింత ప్రభావవంతంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.కాగా, ఉక్రెయిన్ తమ మూడు రీజియన్లపైకి ప్రయోగించిన 19 డ్రోన్లను ధ్వంసం చేసినట్లు రష్యా ఆర్మీ ప్రకటించింది. బెల్గొరోడ్ రీజియన్ ఒక వ్యక్తి గాయాలతో చనిపోయాడని పేర్కొంది. -
రష్యాపైకి ఉక్రెయిన్ 100 డ్రోన్లు
కీవ్: ఉక్రెయిన్ శనివారం రాత్రి తమ పశ్చిమ ప్రాంతంపైకి 100కు పైగా డ్రోన్లను ప్రయోగించిందని రష్యా తెలిపింది.గగనతల రక్షణ వ్యవస్థలు వీటిని కూల్చేశాయని ప్రకటించింది. మొత్తం ఏడు ప్రాంతాల్లోకి 110 డ్రోన్లు చొచ్చుకురాగా, సరిహద్దుల్లోని ఒక్క కస్క్పైకే ఏకంగా 43 డ్రోన్లను పంపిందని రష్యా ఆర్మీ ప్రకటించింది. నిజ్నీ నొవ్గొరోడ్లోని పేలుడు పదార్థాల కర్మాగారానికి సమీపంలోకి వచ్చిన డ్రోన్‌ను గాల్లోనే ధ్వంసం చేశామని వివరించింది. ఈ ఘటనలో నలుగురు సైనికులు గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఇలా ఉండగా, శనివారం సాయంత్రం ఉక్రెయిన్‌లోని క్రివ్యి రిహ్‌లో రష్యా రెండు బాలిస్టిక్ క్షిపణులతో జరిపిన దాడిలో 17 మంది గాయపడ్డారని యంత్రాంగం తెలిపింది. పలు నివాసాలు, వ్యాపార సంస్థలకు నష్టం వాటిల్లిందని వెల్లడించింది. కాగా, వారం రోజుల వ్యవధిలో రష్యా 800 గైడెడ్ ఏరియల్ బాంబులు, 500కు పైగా డ్రోన్లతో దాడులు చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు. నిత్యం తమ నగరాలు, పట్టణాలపై రష్యా దాడులు జరుపుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు. -
Russia-Ukraine war: లండన్, పారిస్, రోమ్, బెర్లిన్..!
లండన్: ఒక వైపు రష్యా సేనల ఆక్రమణ పర్వం కొనసాగుతుండటం, మరో వైపు వచ్చే నెలలో అమెరికాలో జరిగే ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే మద్దతు దూర మవుతుందనే భయాల నడుమ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ యూరప్ దేశాల్లో సుడి గాలి పర్యటన చేపట్టారు. 48 గంటల వ్యవధి లోనే లండన్, పారిస్, రోమ్, బెర్లిన్లను చు ట్టేశారు. తన వద్ద ఉన్న ‘విక్టరీ ప్లాన్’పై బ్రిట న్ ప్రధాని స్టార్మర్ సహా ఆయా దేశాధినే తలకు వివరించారు. మిత్ర దేశాల నుంచి అందే దీర్ఘ శ్రేణి క్షిపణులతో రష్యాలోని సు దూరంలో ఉండే మిలటరీ లక్ష్యాలకు నష్టం కలిగించడం.. తద్వారా యుద్ధానికి ముగింపు పలికేలా రష్యాను ఇరుకునపెట్టడం జెలెన్స్కీ ‘విక్టరీ ప్లాన్’లక్ష్యం. అయితే, బ్రిటన్ మాత్రమే తన వద్ద ఉన్న స్టార్మ్ షాడో దీర్ఘ శ్రేణి క్షిపణులను అందజేయడానికి సంసిద్ధత తెలిపింది. అమెరికా, జర్మనీ సహా ఇతర మి త్ర దేశాలు మాత్రం లాంగ్ రేంజ్ మిస్సైళ్లను ఉక్రెయిన్‌కు ఇవ్వడమంటే రష్యాతో ముఖా ముఖి యుద్ధానికి దిగడమనే అభిప్రాయంతో వెనుకంజ వేస్తున్నాయి. కేవలం ఒకే ఒక్క ఆయుధంతో యుద్ధంలో గెలుపును సొంతం చేసుకోవడం ఇప్పటివరకు జరగలేదని కూడా బ్రిటన్ అధికారులు అంటున్నారు. దీర్ఘ శ్రేణి క్షిపణులను ఉక్రెయిన్‌కు సమకూర్చడంపై చర్చించామని నాటో చీఫ్ మార్క్ రుట్ వెల్లడించారు. అయితే, అంతిమ నిర్ణయాన్ని ఆయా సభ్యదేశాలకే వదిలివేశామన్నారు. దీంతోపాటు, శనివారం బెర్లిన్‌లో జరగాల్సిన ఉక్రెయిన్ మిత్రదేశాల సమావేశం వాయిదా పడింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వదేశంలో మిల్టన్ తుపాను ప్రభావం తీవ్రంగా ఉండటంతో ఈ సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. -
శాంతి పునరుద్దరణకు భారత్ మద్దతు.. జెలెన్స్కీకి మోదీ హామీ
నూయార్క్: మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా సోమవారం న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి 79వ సర్వసభ్య సమావేశంలో భాగంగా ‘ప్రపంచ భవితపై శిఖరాగ్ర సదస్సు’లో ప్రధాని ప్రసంగించారు. అయితే దానికంటే ముందు ప్రధాని మోదీ.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు అంశాలపై ద్వైప్వాక్షిక చర్చలు జరిపినట్లు స్వయంగా మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో నెలకొన్ని యుద్ధ వివాదాన్ని త్వరగా పరిష్కరించేందుకు, ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని పునరుద్దరించడానికి భారత్ మద్దతుగా ఉంటుందని మోదీ తెలిపారు.‘‘న్యూయార్క్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో భేటీ అయ్యాను. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు గత నెలలో నా ఉక్రెయిన్ పర్యటన ఫలితాలను అమలు చేయడానికి మేము కట్టుబడి ఉన్నాం. ఉక్రెయిన్ నెలకొన్న యుద్ధ వివాదాన్ని త్వరగా పరిష్కరించేందుకు, అక్కడ శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి భారత్ మద్దతు ఉంటుందని తెలిపాను’అని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు.Met President @ZelenskyyUa in New York. We are committed to implementing the outcomes of my visit to Ukraine last month to strengthen bilateral relations. Reiterated India’s support for early resolution of the conflict in Ukraine and restoration of peace and stability. pic.twitter.com/YRGelX1Gl5— Narendra Modi (@narendramodi) September 23, 2024 #WATCH | Prime Minister Narendra Modi departs for Delhi after the conclusion of his 3-day visit to USADuring his three-day visit, he attended the QUAD Leaders' Summit and the Summit of the Future (SOTF) at the United Nations in New York. Along with that, he held some key… pic.twitter.com/XpLlq9rEgS— ANI (@ANI) September 24, 2024ఢిల్లీకి బయలుదేరిన మోదీ..మూడు రోజుల అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకొని ప్రధాని మోదీఢిల్లీ బయలుదేరారు. ఈ విషయాన్న భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్ వేదికగా తెలిపారు. ‘‘అమెరికాలో విజయవంతమైన మూడు రోజులు పర్యటన ముగించుకున్న అనంతరం ప్రధాని మోదీ న్యూఢిల్లీకి బయలుదేరారు’ అని పేర్కొన్నారు. PM @narendramodi emplanes for New Delhi after concluding a successful and substantial visit to the USA. pic.twitter.com/FPd0Mo7UHE— Randhir Jaiswal (@MEAIndia) September 24, 2024చదవండి: యుద్ధక్షేత్రం పరిష్కారం కాదు -
పుతిన్ ఆకస్మిక చర్చల ప్రతిపాదన
ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమనీ, అందుకు ఇండియా, చైనా, బ్రెజిల్ మధ్యవర్తిత్వం వహించాలనీ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ నెల 5న చేసిన ఆకస్మిక ప్రతిపాదన ఆసక్తిని కలిగించింది. చర్చలకు ఆయన సుముఖతను చూపటం ఇది మొదటిసారి కాదు. యుద్ధం రెండున్నరేళ్ల క్రితం మొదలు కాగా చర్చల ప్రస్తావనలు గతేడాదిగా వస్తూనే ఉన్నాయి. కొన్నిసార్లు స్వయంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, యూరోపియన్ దేశాల అధినేతలు, వివిధ అంత ర్జాతీయ సంస్థల బాధ్యులు ఈ మాట అంటూనే ఉన్నారు. కానీ కొన్ని కీలకమైన షరతులను పుతిన్ మొదటి నుంచీ పెడుతున్నారు. వీటిని జెలెన్స్కీ అంతే బలంగా తిరస్కరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చర్చలంటూ జరిగినా, అవి ఎలా ముందుకు సాగేదీ ఎవరూ చెప్పలేరు.జెలెన్స్కీ గత జూన్‌లో స్విట్జర్లాండ్‌లో తొంభైకి పైగా దేశాలతో శాంతి సదస్సు నిర్వ హించారు. కానీ ఆ సదస్సుకు ఆయన రష్యాను ఆహ్వానించలేదు. ఆ కారణంగా చైనా వెళ్లలేదు. అంతలోనే ఆయన, త్వరలో మరొక సదస్సు జరపగలమనీ, దానికి రష్యాను ఆహ్వానించగలమనీ ప్రకటించారు. ఆ సదస్సుకు హాజరయ్యేటట్లు రష్యాను ఒప్పించవలసిందిగా కోరేందుకు తన విదేశాంగ మంత్రి దిమిత్రి కునేబాను చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ వద్దకు రాయబారం పంపారు. ఉక్రెయిన్ ప్రతి పాదనలు ఏమిటో చూసి అపుడు స్పందించగలమన్నది రష్యా జవాబు.ఇవన్నీ జూన్, జూలై పరిణామాలు. అటువంటిది ఇపుడు పుతిన్ ఆకస్మికంగా చర్చల ప్రతిపాదన చేయటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇది ఆకస్మికం, ఆశ్చర్యకరంగా తోచటానికి మరికొన్ని కారణాలు న్నాయి. జూన్, జూలై పరిణామాల తర్వాత, కొంత వెనుకముందులుగా చర్చలు ప్రారంభం కావచ్చునని పలువురు భావిస్తుండగా, ఆ తర్వాత కొద్ది వారాలకే ఉక్రెయిన్ సైన్యం తమకూ, రష్యాకూ మధ్యగల ఉత్తర సరిహద్దు నుంచి రష్యాకు చెందిన కర్స్క్ ప్రాంతంపై వేలాది సైన్యంతో మెరుపుదాడి చేసి తగినంత భూభాగాన్ని తన అధీనంలోకి తెచ్చుకుంది. ఇది మరొక ఆశ్చర్యకర పరిణామం. ఎందుకంటే, యుద్ధం జరుగుతున్నది తూర్పు ప్రాంతాలలో. అక్కడ రష్యాది పూర్తి పై చేయిగా ఉండి రోజురోజుకూ ముందుకు చొచ్చుకొస్తున్నారు. ప్రస్తుతం పోక్రొవ్స్‌క్ అనే అతి కీలకమైన కూడలి పట్టణం వద్ద యుద్ధం కేంద్రీకృతమై ఉంది. ఆ పట్టణాన్ని కోల్పోతే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతమంతా ప్రమాదంలో పడుతుంది. స్వయంగా ఉక్రె యిన్ సైన్యం చెప్తున్న దానిని బట్టి ఆ కేంద్రం కొద్ది రోజులలోనే రష్యా చేజిక్కవచ్చు. అటువంటి విపత్కర స్థితిలో పోక్రొవ్స్క్కు అదనపు బలాలను పంపి రక్షించుకునేందుకు బదులు కర్స్క్పై దాడి ఎందుకు అన్న సందేహాలు తలెత్తాయి.ఆ చర్చను కొద్దిసేపు వాయిదా వేసి ప్రస్తుతానికి వస్తే, చర్చల మాట రెండు వైపుల నుంచీ కొత్త కాదు. కానీ, అందుకు ఇండియా, చైనా, బ్రెజిల్ మధ్యవర్తిత్వం వహించాలనటం కొత్తమాట. ఇక్కడ ఒక స్పష్టీకరణ అవసరం. వ్లాడివాస్టోక్లో జరుగుతున్న ఈస్టర్న్ ఎకనమిక్ ఫోరం సదస్సు సందర్భంగా ఈ మాట వచ్చింది. ఒక విలేఖరి ప్రశ్నకు సమాధానంగా పుతిన్ ఈ మాట అన్నట్లు వార్తలలో కనిపించింది గానీ, అది నిజం కాదని ఆ వీడియోను చూసినపుడు అర్థమవుతుంది. పుతిన్ ఒక లిఖిత ప్రకటనను చదవటం అందులో కనిపిస్తుంది. అనగా, ముందే ఆలోచించి చెప్పిన మాట అది. వార్తలలో వెలువడిన దానిని బట్టి రష్యా అధ్యక్షుడు అన్నది, చర్చలకు తాము సిద్ధం. అందుకు ఇండియా, చైనా, బ్రెజిల్ మధ్య వర్తిత్వం వహించాలి. వారీ పని చేయగలరు. యుద్ధంతో ముడిపడి ఉన్న అన్ని సమస్యలను వారు పరిష్కరించగలరనే విశ్వాసం ఉంది. ఈ అంశంపై తాను వారితో నిరంతరం సంప్రదిస్తున్నాను. జెలెన్స్కీ, బైడెన్ ఇరువురితో మోదీ మాట్లాడగలరు. అంతర్జాతీయ సంబంధాలలో కీలక పాత్ర వహించేందుకు మోదీకి ఇది మంచి అవకాశం అన్నది పుతిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వ్యాఖ్య. యథా తథంగా ఈ మాటలు ముఖ్యమైనవే. పుతిన్ మరికొన్ని ముఖ్యమైన మాటలన్నారు. వీడియోలో వినిపించిన ఆ మాటలు ఎందువల్లనో వార్తలలో కనిపించలేదు. అవి, ఉక్రెయిన్‌తో చర్చలకు షరతుల వంటివి. అవి ఈ విధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ పాలనలో గల డొనెటెస్క్, లుహాన్స్క్, ఖేర్సాన్, జపోరిజిజియా అనే నాలుగు తూర్పు ప్రాంతాలను రష్యాకు వదలి వేస్తున్నట్లు ప్రకటించాలి. (ఇప్పటికే రష్యా అధీనంలో గల క్రిమియా గురించి ఆయన ప్రస్తావించలేదు గానీ, ఆ విషయమై రాజీకి, చర్చలకు అవకాశం లేదని గతంలోనే అన్నారు.) ‘నాటో’లో చేరబోమని కూడా ఉక్రెయిన్ ప్రకటించాలి. ఆ నాలుగు ప్రాంతాల నుంచి సైన్యాన్ని పూర్తిగా ఉపసంహరించాలి. ఇవి జరిగితే ‘అదే నిమిషంలో’ యుద్ధాన్ని విరమించి చర్చలను ప్రకటిస్తాము.అనగా ఇవి చర్చలకు షరతులన్నమాట. ఈ షరతులను పుతిన్ మొదటినుంచీ పెడుతున్నారు. ఆ విషయంలో రాజీ లేదంటున్నారు. వీటిని జెలెన్స్కీ తమ వైపు నుంచి అంతే బలంగా తిరస్కరిస్తున్నారు. పైగా, రష్యా 2014లో ఆక్రమించిన క్రిమియాను తిరిగి ఇవ్వవలసిందేనంటున్నారు. ఇదే మాట ఇటీవల కూడా పునశ్చరించారు. పైన పేర్కొన్న నాలుగు ప్రాంతాలలో గణనీయమైన భాగాన్ని ప్రస్తుత యుద్ధంలో రష్యా ఆక్రమించుకోగా, అక్కడి నుంచి ఖాళీ చేయాలంటున్నారు. నాటో సభ్యత్వం తమ హక్కని వాదిస్తున్నారు. అనగా, ఇవన్నీ చర్చలకు పుతిన్, జెలెన్స్కీల షరతులన్నమాట. తమ సార్వ భౌమత్వం, భౌగోళిక సమగ్రతల పరిరక్షణకు అవసరమని జెలెన్స్కీ చెబుతున్నారు. నాటో కూటమి విస్తరణ నుంచి ఆత్మరక్షణకూ, ఆ నాలుగు ప్రాంతాలలో మెజారిటీలో గల రష్యన్ భాషీయులపై చిరకాలంగా సాగుతున్న ఉక్రెయిన్ వేధింపులు, తరచూ ప్రాణ హననం నుంచి వారిని రక్షించుకునేందుకు ఇది తప్పనిసరి అని రష్యా వాదిస్తున్నది. ఈ షరతులలోని సహేతుకతలలోకి వెళితే రెండు వైపులా న్యాయం కనిపిస్తుంది. ఉక్రెయిన్ భౌగోళిక సమగ్రతకు రక్షణ ఉండవలసిందే. అదే విధంగా, అమెరికన్ నాటో కూటమి క్రమంగా రష్యా సరిహద్దుల వైపు విస్తరిస్తూ, ఉక్రెయిన్ను నాటోలో చేర్చు కొనజూస్తూ, రష్యా అస్తిత్వానికే ముప్పు తలపెడుతున్నపుడు, వారు ఆత్మరక్షణ కోసం ప్రయత్నించరాదని అనలేము. అట్లాగే, పై నాలుగు ప్రాంతాలలోని రష్యన్ భాషీయులపై మొదటినుంచీ తీవ్రమైన వేధింపు మాట నిజమైనందున, వారికి రక్షణ అవసరం.ఈ విధమైన పరిస్థితులు, షరతుల మధ్య ఇండియా, చైనా, బ్రెజిల్‌లు రాజీ మార్గం కనుగొనటం ఎంత మాత్రం తేలిక కాదు. ఉభయ పక్షాలు ఈ షరతులు విధించటం, వాటిని వారు పరస్పరం తిరస్కరించటం ఇప్పటికే పలుమార్లు జరిగాయి. నాటో ద్వారా ప్రపంచాధిపత్యం అనే లక్ష్యం గల అమెరికా, ఆ కూటమిలో చేరరాదని ఒకవేళ ఉక్రెయిన్ నిర్ణయించుకున్నా అందుకు సమ్మతించే అవకాశం కనిపించదు. ఆ విధంగా మధ్యవర్తుల బాధ్యత మరింత క్లిష్టతర మవుతుంది. అదట్లుంచి భారత్, చైనా, బ్రెజిల్ ప్రముఖ దేశాలు కావటమే గాక రష్యాతో పాటు బ్రిక్స్ కూటమిలో భాగస్వాములు. తన ఆధిపత్యానికి నష్టమని భావించే అమెరికా ఆ కూటమిని భంగ పరిచేందుకు మొదటినుంచి ప్రయత్నిస్తున్నది. ఈ పరిస్థితులన్నింటి మధ్య, ఒకవేళ అసలు ఈ ముగ్గురి మధ్యవర్తిత్వమంటూ సాకారమైనా, అది ఏ విధంగా ముందుకు సాగేదీ ఎవరూ చెప్పలేరు. ఇంతకూ ఈ ప్రతిపాదనకు జెలెన్స్కీ స్పందన ఏమిటో తెలియదు... ఆయన ఇండియా, చైనాల పాత్రను ఇప్పటికే కోరి ఉన్నప్పటికీ.తిరిగి యుద్ధం విషయానికి వస్తే, కర్స్క్పై ఉక్రెయిన్ దాడిలోని ఉద్దేశం రష్యన్ సైన్యాన్ని పోక్రొవ్స్‌క్ నుంచి అటు మళ్లించేట్లు చేయటమని సైనిక నిపుణులు ఊహాగానాలు చేశారు. కానీ రష్యన్ వ్యూహకర్తలు ఆ పని చేయక పోక్రొవ్స్క్ను, ఇతర తూర్పు ప్రాంతా లను ఆక్రమించే పని సాగిస్తున్నారు. ఆ విధంగా కర్స్క్ వ్యూహం విఫలమైందని ఇపుడు ఉక్రెయిన్ సైన్యాధికారులే అంగీకరిస్తున్నారు. ఉక్రెయిన్ కొత్త సైన్యాధిపతి జనరల్ అలెగ్జాండర్ సిరిస్కియీ కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ, కర్స్క్ వైపు నుంచి కూడా తమపై దాడికి రష్యా ఆలోచించటంతో దానిని నిరోధించేందుకు తామే ముందు దాడి చేశామన్నారు గానీ అది నిజమని తోచదు. అటువైపు రష్యన్ యుద్ధ సన్నాహాలు అసలు లేనే లేవు. పుతిన్ ప్రతిపాదనకు రాగల రోజులలో జెలెన్స్కీ స్పందనలు వచ్చినపుడు గానీ ఈ విషయమై కొంత స్పష్టత రాదు.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
రష్యా యుద్ధం ఆగాలంటే అదొక్కటే మార్గం: జెలెన్ స్కీ
కీవ్: ఉక్రెయిన్-రష్యా మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. రష్యాపై ఉక్రెయిన్ సైన్యం దాడులను తీవ్రతరం చేసింది. ఇదే సమయంలో రష్యా బలగాలు కూడా ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్క్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో రష్యా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటే మాత్రం వారి దాడులను ఆపగలిగే అవకాశముందని చెప్పుకొచ్చారు.ఇక, తాజాగా ఓ వీడియోలో జెలెన్ స్కీ మాట్లాడుతూ.. రష్యాపై దాడులను తీవ్రతరం చేసి ఆస్తులను ధ్వంసం చేసినప్పుడు మాత్రమే వారు వెనక్కి తగ్గుతారు. అప్పుడు యుద్ధానికి ముగింపు పలికేందుకు రష్యా ముందుకు వచ్చే అవకాశం ఉందన్నారు. రష్యా భూభాగంలో సైనిక లక్ష్యాలను ధ్వంసం చేయడానికి ఉక్రెయిన్ సైన్యానికి అనుమతించాలని అమెరికాను కోరారు. రష్యాలో సుదూర క్షిపణులు ప్రయోగించడానికి తమకు అనుమతి ఇవ్వాలన్నారు. ఈ విషయమై తమ భాగస్వామ్య దేశాలతో చర్చిస్తున్నామని, వారిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇదే సమయంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడులను కూడా ప్రస్తావించారు. ఈనెల 30వ తేదీన ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన దాడిలో ఆరుగురు పౌరులు మరణించారు. 97 మంది గాయపడ్డారని చెప్పారు. Il discorso del Presidente d’Ucraina Volodymyr Zelenskyy. pic.twitter.com/5UzBII0WdS— Ukr Embassy to Italy (@UKRinIT) September 1, 2024 ఇదిలా ఉండగా.. ఆగస్టు 30-31 తేదీల్లో ఉక్రెయిన్ రక్షణ మంత్రి రుస్టెమ్ ఉమరోవ్ వాషింగ్టన్లో అమెరికా అధికారులు, నిపుణులతో సమావేశమయ్యారు. రష్యాతో పోరులో ఉక్రెయిన్‌కు కావాల్సిన ఆయుధాలు గురించి చర్చించారు. ఈ నేపథ్యంలోనే జెలెన్ స్కీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరోవైపు.. ఉక్రెయిన్ సైన్యం రష్యా భూభాగంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈక్రమంలో రష్యాలోని కుర్స్క్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. -
Volodymyr Zelenskyy: భారత్‌లో సదస్సు నిర్వహించండి
న్యూఢిల్లీ: రష్యాతో యుద్ధం ముగించడమే లక్ష్యంగా భారత్‌లో ప్రపంచదేశాల సదస్సును నిర్వహించాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమియర్ జెలెన్స్కీ కోరారు. ఈనెల 23న మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించినపుడు జెలెన్స్కీ ఈ ప్రతిపాదనను ఆయన ముందుంచారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు (నవంబరు 5) ముందే రెండో ప్రపంచ దేశాధినేతల సదస్సు జరగాలని జెలెన్స్కీ కోరుకుంటున్నారు. గ్లోబల్ సౌత్ (దక్షిణార్దగోళ) దేశాల మద్దతును కూడగట్టాలని జూన్‌లో స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన తొలి సదస్సులో ఉక్రెయిన్ యతి్నంచింది. అంతర్జాతీయంగా గుర్తించిన సరిహద్దుల మేరకు ఉక్రెయిన్ సార్వ¿ౌమత్వానికి తమ మద్దతు ఉంటుందని మోదీ 23న సంకేతాలిచ్చారు. అయితే ఉక్రెయిన్ కోరినట్లుగా సదస్సు నిర్వహించడానికి భారత్ ఇంకా సమ్మతించలేదు. రష్యా– ఉక్రెయిన్ యుద్ధ విమరణ కోసం శాంతి ప్రక్రియలో నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని మోదీ సంకేతాలిచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. గ్లోబల్ సౌత్ దేశాల్లో.. ముఖ్యంగా భారత్‌లో రెండో అంతర్జాతీయ సదస్సు జరగాలని ఉక్రెయిన్ కోరుకుంటోందని జెలెన్స్కీ అధికార ప్రతినిధి తెలిపారు. శాంతి సాధన కోసం జెలెన్స్కీ 10 అంశాల ఫార్ములాను రూపొందించారు. ఉక్రెయిన్ భూభాగంలోని ఆక్రమిత ప్రాంతాలన్నింటి నుంచీ రష్యా వైదొలగాలని, ముఖాముఖి చర్చలకు ముందు ప్రపంచదేశాలు రష్యాను దూరంగా పెట్టాలని జెలెన్స్కీ కోరుతున్నారు. శాంతిచర్చల వేదికపై రష్యా ఉన్నపుడే.. ఏ ప్రయత్నమైనా ముందుకు సాగుతుందని గ్లోబల్ సౌత్ దేశాలు అంటున్నాయి. స్విట్జర్లాండ్‌లో జూన్ 15–16 తేదీల్లో జరిగిన చర్చలకు 100 పైగా దేశాలు హాజరైనప్పటికీ.. ఉక్రెయిన్ ప్రపంచ మద్దతును కూడగట్టడంలో పూర్తిగా సఫలీకృతం కాలేకపోయింది. చైనా గైర్హాజరు కాగా, భారత్, ఇండోనేíÙయా, దక్షిణాఫ్రికాలు తుది ప్రకటనపై సంతకం చేసేందుకు నిరాకరించాయి. -
శాంతియత్నాలు ఆపొద్దు!
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం పరిసమాప్తికి భిన్న మార్గాల్లో జరుగుతున్న ప్రయత్నాలు కాస్తా ఆ రెండు పక్షాల మొండి వైఖరులతో స్తంభించినట్టే కనబడుతోంది. రష్యాపై మరిన్ని దాడులు జరిపితే అది చర్చలకు సిద్ధపడుతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భావిస్తుండగా... దాన్ని పూర్తిగా లొంగ దీసుకునే వరకూ యుద్ధం ఆపే ప్రసక్తి లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికార ప్రతినిధి తాజాగా తేల్చిచెప్పారు. యుద్ధం మొదలయ్యాక రెండు దేశాలతోనూ ఐక్యరాజ్యసమితితోపాటు భిన్న సంస్థలూ, దేశాలూ చర్చలు సాగిస్తూనే ఉన్నాయి. కానీ ఎవరికి వారు అంతిమ విజయం తమదేనన్న భ్రమల్లో బతుకున్నంత కాలం సమస్య తెగదు. అలాగని ఏదో మేరకు సమస్యలు పరిష్కారమవుతున్నాయన్నది వాస్తవం. ఉదాహరణకు హోరాహోరీ సమరం సాగుతున్నప్పుడు రెండేళ్ల క్రితం ఉక్రెయిన్ నుంచి ఆహారధాన్యాలు, ఎరువులు, పొద్దుతిరుగుడు నూనె ఉత్పత్తుల ఎగుమతులు నిలిచి పోగా ఐక్యరాజ్యసమితి చొరవ తీసుకుని రష్యా, ఉక్రెయిన్లతో మాట్లాడి సమస్యను పరిష్కరించింది. అప్పటికి యుద్ధం మొదలై ఆర్నెల్లు దాటింది. ఫలితంగా నిరుడు జూలై నాటికి దాదాపు మూడు న్నర కోట్ల టన్నుల ఆహారధాన్యాలు ఎగుమతయ్యాయి. ప్రపంచానికి ఆహార సంక్షోభం తప్పింది. ఇటీవలే ఈ రెండు దేశాల మధ్యా యుద్ధ ఖైదీల మార్పిడి కూడా జరిగింది. ఇరువైపులా చెరో 115 మంది సైనికులకూ చెర తప్పింది. తెర వెనక తుర్కియే సంక్షోభ నివారణకు ప్రయత్నిస్తుండగా ప్రధాని మోదీ అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ సందర్శించి ఇరు దేశాల అధినేతలతోనూ మాట్లాడారు. వచ్చే నెలలో ఐక్యరాజ్యసమితి సమావేశాలకు వెళ్లినప్పుడు ఆయన మరోసారి జెలెన్స్కీని కలవ బోతున్నారు. అలాగే అక్టోబర్‌లో బ్రిక్స్ సమావేశాల కోసం రష్యా వెళ్లబోతున్నారు. మోదీ ఉక్రెయిన్ వెళ్లినందుకు పుతిన్ కినుక వహించినట్టే, అంతక్రితం రష్యా వెళ్లినందుకు జెలెన్స్కీ నిష్ఠూరాలాడారు. ఇప్పటికైతే ఉక్రెయిన్ ఒకవైపు నువ్వా నేనా అన్నట్టు రష్యాతో తలపడుతున్నా... డ్రోన్లతో, బాంబులతో నిత్యం దాడులు చేస్తున్నా చర్చల ప్రస్తావన తరచు తీసుకొస్తోంది. రష్యా చర్చలకు వచ్చి తీరుతుందని జెలెన్స్కీ ఇటీవల అన్నారు. అయితే ఇదంతా ఊహలపై నిర్మించుకున్న అంచనా. నిరంతర దాడులతో రష్యాకు గత్యంతరం లేని స్థితి కల్పిస్తే... ఆ దేశం చర్చలకు మొగ్గుచూపుతుందన్నది ఈ అంచనా సారాంశం. నిజానికి నాటో దేశాలు నిరంతరం సరఫరా చేస్తున్న మారణా యుధాలతో, యుద్ధ విమానాలతో ఉక్రెయిన్ దాదాపు మూడేళ్లుగా తలపడుతూనే ఉంది. పర్యవనసానంగా గతంలో కోల్పోయిన కొన్ని నగరాలను అది స్వాధీనం చేసుకుంది కూడా! కానీ రష్యా ప్రతిదాడులతో అవి ఎన్నాళ్లుంటాయో, ఎప్పుడు జారుకుంటాయో తెలియని స్థితి ఉంది. అత్యుత్సాహంతో ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఆయుధాలను, ఎఫ్–16 యుద్ధ విమానాలను తరలించిన అమెరికా నెలలు గడుస్తున్నా వాటి వినియోగానికి ఇంతవరకూ అనుమతినివ్వనే లేదు. ఉదాహరణకు ఉపరితలం నుంచి ప్రయోగించే సైనిక వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థ (ఏటీఏసీఎం) 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని అవలీలగా ఛేదిస్తుంది. బ్రిటన్–ఫ్రాన్స్ సంయుక్తంగా రూపొందించిన స్టార్మ్ షాడో 250 కిలోమీటర్ల దూరంలోని దేన్నయినా ధ్వంసం చేస్తుంది. ఈ రకం క్షిపణుల్ని గగనతలం నుంచి ప్రయోగిస్తారు. మరోపక్క జర్మనీ తయారీ టారస్ క్షిపణి కూడా ఇటువంటిదే. పైగా ఇది అమెరికా తయారీ క్షిపణిని మించి శక్తిమంతమైంది. 500 కిలోమీటర్లకు మించిన దూరంలోని లక్ష్యాన్ని గురిచూసి కొడుతుంది. ఇవన్నీ ఇంచుమించు ఏడాదిగా ఉక్రెయిన్ సైనిక స్థావరాల్లో పడివున్నాయి. ఎందుకైనా మంచిదని కాబోలు అమెరికా తన ఎఫ్–16లను నేరుగా ఉక్రెయిన్‌కు ఇవ్వకుండా నెదర్లాండ్స్, డెన్మార్క్‌లకు పంపి వారి ద్వారా సరఫరా చేసింది. వీటి వినియోగానికి ఉక్రెయిన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని బ్రిటన్, ఫ్రాన్స్ పట్టుబడుతుండగా అమెరికాతోపాటు జర్మనీ కూడా ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అదే జరిగితే యుద్ధ తీవ్రత మరింత పెరిగి, రష్యా ఎంతకైనా తెగించే పరిస్థితి ఏర్పడొచ్చునని అమెరికా, జర్మనీ ఆందోళన పడుతున్నాయి. తన భూభాగంలోకి చొచ్చుకొచ్చి ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేస్తున్నా రష్యా నిర్లిప్తంగా ఉండిపోతుండగా ఈ అనవసర భయాలేమిటన్నది బ్రిటన్, ఫ్రాన్స్‌ల వాదన. కానీ ఒకసారంటూ ఎఫ్16లు వచ్చి పడితే, అత్యాధునిక క్షిపణులు విధ్వంసం సృష్టిస్తే రష్యా ఇలాగే ఉంటుందనుకోవద్దని పెంటగాన్ హెచ్చరిస్తోంది. తప్పనిసరైతే ఉక్రెయిన్ సరిహద్దుల ఆవల ఉన్న రష్యా స్థావరాలను లక్ష్యంగా చేసుకోమంటున్నది. ఈమధ్య క్రిమియాపై దాడికి అనుమతించింది. కానీ కూటమి మధ్య ఏకాభిప్రాయం కుదిరితే తప్ప రష్యా నగరాల జోలికి పోవద్దని చెబుతోంది. అంతగా భయపడితే అసలు ఇలాంటి ఆయుధాలు, యుద్ధ విమానాలు తరలించటం దేనికి? అవేమైనా ఎగ్జిబిషన్‌కు పనికొచ్చే వస్తువులా? వాటిని చూసి రష్యా ‘పాహిమాం’ అంటూ పాదాక్రాంతమవుతుందని అమెరికా నిజంగానే భావించిందా? యుద్ధం ఏళ్లతరబడి నిరంతరం కొనసాగుతుంటే ఎప్పుడో ఒకప్పుడు పరిస్థితి చేజారే ప్రమాదం ఉంటుంది. కనుక అమెరికా, పాశ్చాత్య దేశాలు వివేకంతో మెలగాలి. యుద్ధ విరమణకు సకల యత్నాలూ చేయాలి. దాడులతో ఒత్తిడి తెస్తే రష్యా దారికొస్తుందనుకుంటున్న ఉక్రెయిన్‌కు తత్వం బోధపడాలంటే ముందు అమెరికా సక్రమంగా ఆలోచించటం నేర్చుకోవాలి. ఉక్రెయిన్–రష్యా ఘర్షణ, గాజాలో ఇజ్రాయెల్ ఊచకోతలు ఆగనంతవరకూ ప్రపంచం సంక్షోభం అంచున ఉన్నట్టే లెక్క. అందుకే ప్రపంచ దేశాలు అప్రమత్తం కావాలి. శాంతి నెలకొల్పడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. -
100 క్షిపణులు.. 100డ్రోన్లు..!
కీవ్: రష్యా మరోసారి పేట్రేగిపోయింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఏకంగా 100 వందకు పైగా వివిధ రకాల క్షిపణులు, మరో 100 షహీద్ డ్రోన్లతో ఉక్రెయిన్‌పై దాడి చేసింది. ‘రష్యా మా కీలకమైన పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దుర్మార్గపూరితంగా దాడు లకు తెగబడింది. ఖార్కివ్, కీవ్ మొద లుకొని ఒడెసా, పశ్చిమ ప్రాంతాల వరకు జరిగిన దాడుల్లో భారీగా నష్టం వాటిల్లింది’అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ఈ దాడుల్లో కనీసం ఐదుగురు చనిపోగా, 13 మంది పౌరులు గాయప డ్డారని చెప్పారు. తమ భూభాగంపై రష్యా పాల్పడిన అతిపెద్ద దాడుల్లో ఇదొకటని జెలెన్స్కీ పేర్కొన్నారు. రష్యా సైన్యం ప్రయోగించిన డ్రోన్లు, క్రూయి జ్ మిస్సైళ్లు, హైపర్సోనిక్ బాలిస్టిక్ కింజాల్ క్షిపణులు మొత్తం 15 రీజియన్లలో..అంటే దాదాపు దేశంలోని సగం ప్రాంతాల్లో బీభ త్సం సృష్టించినట్లు ఉక్రెయిన్ ప్రధాని డెనిస్ ష్మిహాల్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ ప్రభుత్వ రంగ విద్యుత్ గ్రిడ్ ఆపరేటర్.. ఉక్రెనెర్గో.. దెబ్బతిన్న మౌలిక వ్యవస్థను గాడినపెట్టేందుకు అత్యవసర విద్యుత్ కోతలను ప్రకటించింది. ప్రైవేట్ విద్యుత్ సంస్థ డీటీఈకే కూడా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు తమ సిబ్బంది 24 గంటలూ పనిచేస్తున్నారని తెలిపింది. రాజధాని లోని విద్యుత్, నీటి సరఫరా వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు కీవ్ మేయర్ తెలిపారు. కీవ్‌పైకి దూసు కొచ్చిన 15 క్షిపణులు, మరో 15 డ్రోన్లను రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయన్నారు. కాగా, ఉక్రెయిన్ సైనిక–పారిశ్రామిక సముదాల నిర్వహణకు ఎంతో కీలకమైన విద్యుత్ వ్యవస్థలను తమ దీర్ఘశ్రేణి క్షిపణులు, డ్రోన్లు ఛిన్నాభిన్నం చేశాయని, లక్ష్యాలను అవి గురి తప్పకుండా ఛేదించాయని రష్యా ఆర్మీ ప్రకటించింది.22 డ్రోన్లను కూల్చివేశాం: రష్యాసరటోవ్, యరోస్లావ్ల్ ప్రాంతాలపైకి ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం ఉక్రెయిన్ ప్రయోగించిన 22 డ్రోన్లను ధ్వంసం చేసినట్లు రష్యా ఆర్మీ ప్రకటించింది. ఈ ఘటనల్లో పలు నివాస భవనాలు దెబ్బతినగా, నలుగురు గాయపడ్డారని తెలిపింది. కస్క్ రీజియన్‌లో ఉక్రెయిన్ బలగాలు మరింతగా ముందుకు సాగకుండా అడ్డుకున్నట్లు తెలిపింది. అదేవిధంగా, ఉక్రెయిన్ బలగాలు, ఆయుధ సామగ్రి రవాణాకు కేంద్రంగా ఉన్న పొక్రొవ్స్క్కు అతి సమీపంలోకి రష్యా బలగాలు చేరుకుంటున్నట్లు సమాచారం. Currently, across the country, efforts are underway to eliminate the consequences of the Russian strike. This was one of the largest attacks – a combined strike, involving over a hundred missiles of various types and around a hundred “Shaheds.” Like most Russian strikes before,… pic.twitter.com/0qNTGR98rR— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) August 26, 2024 -
ట్రంప్ గెలిస్తే ఉక్రెయిన్‌కు లాభమా?: జెలెన్ స్కీ ఆసక్తికర కామెంట్
కీవ్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపుపై ఉక్రెయిన్‌కు లాభమా? అనే ప్రశ్నకు వోలోడియర్ జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధ సమయంలో తాను ట్రంప్‌తో మాట్లాడినట్టు జెలెన్ స్కీ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో నవంబర్‌లో ఎన్నికల తర్వాత చూడాలి అని అన్నారు.కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తారా? అనే ప్రశ్నపై జెలెన్ స్కీ స్పందించారు. అనంతరం, జెలెన్ స్కీ మాట్లాడుతూ.. అమెరికాలో నవంబర్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల తర్వాత దీనిపై ఆలోచిస్తాం. అయితే, ఎన్నికల సందర్భంగా ఉక్రెయిన్‌కు సంబంధించి ట్రంప్ టీమ్ నుంచి నాకు ఎలాంటి హామీ ఇవ్వలేదు.కానీ, ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తున్న యుద్ధ సమయంలో ట్రంప్ బృందంతో నేను ఫోన్లో మాట్లాడాను. ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నాము. ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వాలని ఆ సమయంలో కోరాము. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌కు తమ మద్దతు ఉంటుందనే సందేశం ఇచ్చారు. యుద్ధాన్ని ఆపడానికి మరియు ఉక్రెయిన్ స్వతంత్రంగా, యూరోపియన్ దేశంగా ఉండటానికి ప్రయత్నిస్తామని అన్నారని చెప్పుకొచ్చారు. అయితే, ట్రంప్ టీమ్ మాత్రమే ఇలా చెప్పిందని గుర్తు చేశారు.మరోవైపు.. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో మాట్లాడిన జెలెన్ స్కీ తెలిపారు. ఈ సందర్బంగా ఉక్రెయిన్‌కు నూతనంగా మిలటరీ సాయం అందిస్తామని జో బైడెన్ భరోసా ఇచ్చారని అన్నారు. ఇదే సమయంలో ఉక్రెయిన్‌కు నూతన సైనిక సహాయ ప్యాకేజీని ప్రకటిస్తున్నందుకు గర్విస్తున్నా అంటూ బైడెన్ ప్రకటించడం విశేషం. ఆ సాయం విలువ రూ.వెయ్యి కోట్లు ఉంటుందని తెలిపిన పెంటగాన్ వెల్లడించింది. -
యుద్ధం–ప్రేమ..ఫ్యామిలీ లైఫ్
ఉక్రెయిన్‌పై రష్యా భీకర యుద్ధం, వెనక్కి తగ్గని దేశాధ్యక్షుడు జెలెన్స్కీ, భారత ప్రధాని నరేంద్రమోదీ ఉక్రెయిన్ చారిత్రక పర్యటన... ఇవి మాత్రమే మనకు కనిపించే దృశ్యాలు. యుద్ధ ప్రభావం దేశంపై సరే, కుటుంబంపై ఎలా ఉంటుంది? వైవాహిక జీవితంపై ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలకు తాజా ఇంటర్వ్యూలో సమాధానం చెప్పింది ఉక్రెయిన్ ప్రథమ మహిళ, జెలెన్స్కీ భార్య ఒలెనా...భర్త క్షేమంగా ఉండాలని ఏ భార్య అయినా కోరుకుంటుంది. భర్తను ఏ రోజు మృత్యువు కాటేస్తుందో అనే భయం మాత్రం భార్యకు క్షణ క్షణం నరకాన్ని చూపిస్తుంది. అలాంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొని తట్టుకొని గట్టిగా నిలబడించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భార్య ఒలెనా. ఉక్రెయిన్ భూభాగంలో గత రెండున్నర సంవత్సరాల యుద్ధ విషాదాలలో, జీవన్మరణ సమయాలలో వారి వివాహ బంధం పేకమేడలా కుప్పకూలి ΄ోవాల్సిన పరిస్థితి.‘ఈ యుద్ధం మీ వివాహబంధంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిందా?’ అని అడిగిన ప్రశ్నకు ఒలెనా జెలెన్స్కీ చెప్పిన సమాధానం...‘రెండు దశాబ్దాల మా వివాహ బంధం గతంతో ΄ోలిస్తే మరింత దృఢమైంది. ఒకరికి ఒకరు అండగా నిలబడ్డాం’ అన్నది.‘యుద్ధప్రభావం కుటుంబ జీవితంపై ఉంటుందా?’ అని అడిగిన ప్రశ్నకు ‘కచ్చితంగా ఉంటుంది’ అని చెప్పింది ఒలెనా.యుద్ధ ఉద్రిక్తతల వల్ల గతంలో మాదిరిగా వారు తీరిగ్గా మాట్లాడుకునే రోజులు ΄ోయాయి. తన కుమార్తె ఒలెంక్సాండ్రా, కుమారుడు కైరీలోతో ΄ాటు ఒలెనా తన భర్తకు దూరంగా ఉండాల్సి వచ్చింది.‘ఈ విషయంలో ఎలాంటి అసంతృప్తీ లేదు. మేము ఒకరినొకరం బాగా అర్థం చేసుకున్నాం. భార్యాభర్తల మధ్య ప్రేమ ఒక్కటే సరి΄ోదు. విశ్వాసం ముఖ్యం. నేను నా భర్త నిజాయితీని విశ్వసించక΄ోతే అ΄ారమైన ప్రేమ పంచినప్పటికీ అది వృథా అవుతుంది’ అంటుంది ఒలెనా.‘యుద్ధంలో మునిగితేలుతున్న దేశంలో ఏ వ్యక్తి అయినా సాధారణ జీవితం గడపలేరు. నిరంతరం మానసిక ఒత్తిడి అనేది సాధారణం’ అంటుంది.గత నెలలో కీవ్ శివార్లలోని పిల్లల ఆసుపత్రిపై రష్యా క్షిపణి దాడిలో ఇద్దరు పిల్లలు మరణించారు. ఎంతోమంది గాయపడ్డారు. తన సొంత పిల్లలపైనే దాడి జరిగినట్లు తల్లడిల్లి ΄ోయింది ఒలెనా.‘యుద్ధం వల్ల ప్రతి ఒక్కరూ అలిసి΄ోతారు. మిణుకు మిణుకుమనే ఆశ ఉజ్వలంగా వెలగాలనుకుంటారు. అయితే దీనికి ఎంతో సాహసం, అంతకుమించిన ఆత్మవిశ్వాసం కావాలి. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఏ ఒక్కరినీ వదిలిపెట్టకుండా రాక్షసంగా దాడులు జరుగుతున్నాయి. ఇలా జరుగుతుందేమిటి? అని నా భర్త ముందు ఎప్పుడూ కళ్లనీళ్లు పెట్టుకోలేదు. న్యాయం జయిస్తుంది అన్నట్లే మాట్లాడాను’ గతాన్ని గుర్తు చేసుకుంటూ అంటుంది ఒలెనా.ఒలెనాకు తన దేశ పౌరుల ధైర్యసాహసాల గురించి కథలు కథలుగా చెప్పడం అంటే ఇష్టం.ధైర్యం మంచిదేగానీ అన్నిసార్లూ కాక΄ోవచ్చు. ప్రమాదపు ఊబిలో దించవచ్చు. తిరుగులేని ధైర్యంతో ముందుకు వెళ్లిన జెలెన్స్కీపై ఎన్నోసార్లు హత్యాప్రయత్నాలు జరిగాయి. ఆ సమయంలో ఒలెనా మానసిక పరిస్థితి మాటలకందనిది. అయినా సరే, ప్రతికూల ఆలోచనలపై దృష్టి పెట్టేది కాదు. ‘అంతా మంచే జరుగుతుంది. ఆయన క్షేమంగా ఉండాలి’ అని ఒకటికి పదిసార్లు అనుకునేది.‘నిర్మొహమాటంగా చె΄్పాలంటే నా భర్త ధైర్యసాహసాలను చూసి నేను గర్విస్తున్నాను’ అంటుంది ఒలెనా.యుద్ధ విధ్వంసాన్ని కళ్లారా చూసిన ఒలెనా... ‘యుద్ధంలో మనం అత్యంత విలువైన వాటిని కోల్పోతాం’ అంటుంది.అయితే ఆమె కోల్పోనిది మాత్రం ధైర్యం. తన కుటుంబానికే కాదు దేశ ప్రథమ మహిళగా తనకు ఆ ధైర్యం ఎంతో ముఖ్యం. -
శాంతి, సుస్థిరతకు చర్చలే మార్గం
కీవ్/న్యూఢిల్లీ: ఉక్రెయిన్–రష్యా మధ్య సంఘర్షణకు సాధ్యమైనంత త్వరగా తెరదించాలని, ఇందుకోసం రెండు దేశాలు చర్చించుకోవాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ఆయన పోలండ్ నుంచి ట్రైన్ ఫోర్స్ వన్ రైలులో బయలుదేరి, 10 గంటలపాటు సుదీర్ఘ ప్రయాణం సాగించి, శుక్రవారం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు చేరుకున్నారు. మోదీకి ఉక్రెయిన్ ప్రభుత్వ అధికారులు, భారతీయులు ఘన స్వాగతం పలికారు. కీవ్‌లో ఆయన బస చేసిన హయత్ హోటల్ వద్దకు పెద్ద సంఖ్యలో భారతీయులు తరలివచ్చారు. వారికి మోదీ అభివాదం చేశారు. 1991 తర్వాత ఉక్రెయిన్‌లో భారత ప్రధాని పర్యటించడం ఇదే మొదటిసారి. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర.. రష్యాపై ఉక్రెయిన్ ఎదురుదాడి ఉధృతమవుతున్న నేపథ్యంలో భారత ప్రధానమంత్రి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కీవ్‌లో అడుగుపెట్టిన తర్వాత మోదీ నేషనల్ మ్యూజియం ఆఫ్ హిస్టరీ వద్దనున్న ‘మల్టీమీడియా మారీ్టరాలజిస్టు ఎక్స్పోజిషన్’ను సందర్శించారు. యుద్ధంలో మరణించిన ఉక్రెయిన్ చిన్నారుల స్మారకార్థం ఈ కట్టడాన్ని నిర్మించారు. ఇక్కడ ప్రధాని మోదీ ఓ బొమ్మను ఉంచి, అమరులైన బాలలకు నివాళులరి్పంచారు. చేతులు జోడించి నమస్కరించారు. వారిని తలచుకొని చలించిపోయారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని మోదీ ఆలింగనం చేసుకున్నారు. కరచాలనం చేశారు. యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్‌కు మద్దతు ప్రకటిస్తూ జెలెన్స్కీ భుజంపై మోదీ ఆతీ్మయంగా చెయ్యి వేశారు. అనంతరం కీవ్ సిటీలోని ఒయాసిస్ ఆఫ్ పీస్ పార్కులో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మోదీ ఘనంగా నివాళులరి్పంచారు. శాంతి, సామరస్యంతో వర్ధిల్లే సమాజ నిర్మాణానికి మహాత్ముడు బోధించిన శాంతి సందేశం ఎల్లవేళలా అనుసరణీయమని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. గాం«దీజీ చూపిన ఆదర్శ మార్గం ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభాలకు చక్కటి పరిష్కార మార్గం అవుతుందన్నారు. కీవ్‌లో స్కూల్ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్‌లో హిందీ భాష నేర్చుకుంటున్న ఉక్రెయిన్ విద్యార్థులతో మోదీ ముచ్చటించారు. ఆచరణాత్మక సంప్రదింపులు జరగాలి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మోదీ సమావేశమయ్యారు. భారత్–ఉక్రెయిన్ మధ్య సంబంధాలు, ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. వాణిజ్యం, ఆర్థికం, రక్షణ, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నారు. భారత్–ఉక్రెయిన్ మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు కూడా జరిగాయి. ఉక్రెయిన్–రష్యా మధ్య సంఘర్షణ అంతం కావాలని, ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరత నెలకొనాలని ప్రధానమంత్రి మోదీ ఆకాంక్షించారు. సంఘర్షణకు సాధ్యమైనంత త్వరగా ముగింపు పలికేలా ఒక పరిష్కార మార్గాన్ని కనుక్కోవడానికి ఉక్రెయిన్, రష్యా పరస్పరం చర్చించుకోవాలని కోరారు. శాంతి, సుస్థిరత కోసం రెండు దేశాల మధ్య ఆచరణాత్మక సంప్రదింపులు జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. జెలెన్స్కీతో జరిగిన చర్చలో మోదీ ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ వెల్లడించారు. ఉక్రెయిన్‌లో శాంతియుత పరిస్థితుల పునరుద్ధరణకు అన్ని రకాలుగా సాయం అందిస్తామని మోదీ హామీ ఇచి్చనట్లు తెలిపారు. మోదీ–జెలెన్స్కీ మధ్య నిర్మాణాత్మక, సమగ్ర చర్చ జరిగిందన్నారు. ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితులు, ఆహార, ఇంధన భద్రత కొరవడడంపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఉక్రెయిన్–రష్యా మధ్య చర్చలు ప్రారంభించి, ముందుకు తీసుకెళ్లడానికి అందుబాటులో ఉన్న ప్రభావవంతమైన మార్గాలపై మోదీ, జెలెన్స్కీ చర్చించుకున్నారని వివరించారు. ఆ రెండు దేశాలు కలిసి కూర్చొని చర్చించుకొని, సంఘర్షణకు పరిష్కారం కనిపెట్టాలన్నదే భారతదేశ అభిమతమని జైశంకర్ స్పష్టంచేశారు. మోదీ చేపట్టిన ఉక్రెయిన్ పర్యటనను ఒక ల్యాండ్‌మార్క్‌గా ఆయన అభివర్ణించారు. నాలుగు భీష్మ్ క్యూబ్స్ బహూకరణ ప్రధాని మోదీ ఉక్రెయిన్ ప్రభుత్వానికి నాలుగు భీష్మ్ (భారత్ హెల్త్ ఇనీíÙయేటివ్ ఫర్ సహయోగ్ హిత, మైత్రి) క్యూబ్స్‌ను బహూకరించారు. అన్ని ర కాల గాయాలకు చికిత్స అందించేందుకు అవసర మైన ఔషధాలు, పరికరాలు, వస్తువులు ఈ క్యూబ్స్ లో ఉన్నాయి. అంతేకాదు పరిమితంగా విద్యుత్, ఆ క్సిజన్‌ను ఉత్పత్తిచేసే పరికరాలు సైతం ఉన్నాయి. భారత్ మద్దతు మాకు కీలకం: జెలెన్స్కీ తమ దేశ జాతీయ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు భారత్ మద్దతు ఇస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. భారత్ మద్దతును తాము అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నామని చెప్పారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అనంతరం జెలెన్స్కీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఈ రోజు ఒక కొత్త చరిత్ర నమోదైందని పేర్కొన్నారు. భారత్‌లో పర్యటించాలని జెలెన్స్కీని మోదీ ఆహ్వానించారు.జెలెన్స్కీ అప్పుడేమన్నారంటే... ఉక్రెయిన్ పర్యటనలో అధ్యక్షుడు జెలెన్స్కీని ప్రధాని మోదీ ఆతీ్మయంగా ఆలింగనం చేసుకోవడం, భుజంపై చెయ్యి వేయడం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్శించింది. దీనిపై పలు వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. నరేంద్ర మోదీ ఈ ఏడాది జూలై 9వ తేదీన రష్యాలో పర్యటించారు. రష్యా అధినేత పుతిన్‌తో సమావేశమై, చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ ఆత్మీయ కలయికపై అప్పట్లో జెలెన్స్కీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శాంతి ప్రయత్నాలకు ఇదొక ఎదురుదెబ్బ అని ఆక్షేపించారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ ప్రపంచంలో అత్యంత క్రూరమైన రక్తపిపాసి, నేరగాడు అయిన పుతిన్‌ను ఆలింగనం చేసుకున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టుచేశారు. జెలెన్స్కీ అప్పట్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చాయి. నాలుగు ఒప్పందాలపై భారత్, ఉక్రెయిన్ సంతకాలు మోదీ–జెలెన్స్కీ చర్చల తర్వాత నాలుగు కీలక ఒప్పందాలపై భారత్, ఉక్రెయిన్ శుక్రవారం సంతకాలు చేశాయి. వ్యవసాయం, ఆహార పరిశ్రమ, ఔషధాలు, సాంస్కృతికం–మానవతా సాయం విషయంలో రెండు దేశాలు పరస్పరం సహకరించుకోనున్నాయి. సోషల్ మీడియాలో విశేష స్పందన మోదీ, జెలెన్స్కీ భేటీకి సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది. ఈ సమావేశం గురించి నెటిజన్లు విస్తృతంగా చర్చించుకున్నారు. తమ అభిప్రాయాలు పంచుకున్నారు. మోదీతో కలిసి ఉన్న ఫొటోలను జెలెన్స్కీ తన ఇన్‌స్టా్రగామ్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ పోస్టుకు గంటల వ్యవధిలోనే 10 లక్షలకుపైగా లైక్‌లు వచ్చాయి. భారత్–ఉక్రెయిన్ అనుబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ఈ సమావేశం చాలా కీలకమని జెలెన్స్కీ ఉద్ఘాటించారు. -
తటస్థం కాదు, భారత్ ఎప్పుడూ శాంతి వైపే: జెలెన్స్కీతో మోదీ
కీవ్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారత ఎప్పుడూ తటస్థంగా లేదని, తాము ఎల్లప్పుడూ శాంతి వైపే ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. చర్చలు, సంభాషణలు ద్వారానే వివాదాలను పరిష్కరించే ప్రయత్నాలకు భారత్ సమర్ధిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీతో కలిసి మీడియా సమావేశంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉక్రెయిన్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీతో మోదీ భేటీ అయ్యారు. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం పరిష్కార మార్గాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించడానికి రష్యాతో చర్చలకు కూర్చోవాలని జెలెన్స్కీని మోదీ కోరారు. ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి స్నేహితుడిగా వ్యవహరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.స్నేహితుడిగా సాయం చేసేందుకు సిద్దం: మోదీ‘చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే యుద్దానికి పరిష్కారానికి మార్గం కనుగొనవచ్చు. మనం సమయాన్ని వృధా చేయకుండా ఆ దిశలో పయనించాలి. ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి ఇరుపక్షాలు కలిసి కూర్చోని చర్చించాలి. శాంతిని నెలకొల్పేదిశగా జరిగే ఎలాంటి ప్రయత్నాల్లోనైనా క్రియాశీలక పాత్ర పోషించేందుకు భారత్ సిద్ధంగా ఉందని నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ విషయంలో ఒక స్నేహితుడిగా నేను మీకు ఏం చేయాల్సి వచ్చినా అందుకు సిద్ధంగా ఉన్నాననే భరోసా ఇవ్వాలనుకుంటున్నాను’ అని మోదీ పేర్కొన్నారు.జెలెన్స్కీ భుజంపై చేతులు వేసిఅంతకముందు రాజధాని కీవ్‌లోని అమరుల స్మారక ప్రాంతానికి చేరుకున్న మోదీకి స్వాగతం పలికిన అధ్యక్షుడు జెలెన్స్కీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం రష్యా దాడిలో మరణించిన చిన్నారులకు మోదీ నివాళి అర్పించారు. అక్కడికి వెళ్లే సమయంలో జెలెన్స్కీ భుజంపై చేతులు వేసిన మోదీ ఆత్మియంగా పలకరిస్తూ ముందుకు సాగారు. ఉక్రెయిన్ ఎదుర్కొన్న అతిపెద్ద సంక్షోభాల ఆనవాళ్లకు సంబంధించి అక్కడి మ్యూజియంలో ఏర్పాటుచేసిన ప్రదర్శనను ఇద్దరు నేతలు వీక్షించారు..గాంధీ విగ్రహానికి నివాళికీవ్లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి మోదీ నివాళి అర్పించారు. బాపూజీ ఆశయాలు విశ్వవ్యాప్తమన్న ఆయన.. కోట్లాది మందికి స్ఫూర్తిదాయకమని చెప్పారు. మానవాళికి మహాత్ముడు చూపించిన బాటలో నడుద్దామని పిలుపునిచ్చారు. -
ఉక్రెయిన్‌లో మోదీ పర్యటన..
కీవ్: భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఉక్రెయిన్ పర్యటనలో ఉన్నారు. రష్యా సేనల దాడిలో దెబ్బతిన్న ఉక్రెయిన్‌లో మోదీ పర్యటించడం ఇదే మొదటిసారి. ఇక, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ ఏ పక్షం వహించదని.. కేవలం శాంతికి మాత్రం వారధిగా పని చేస్తుందనే సందేశం ఇచ్చేందుకు ప్రధాని ఈ పర్యటనను చేపట్టినట్టు తెలిపారు.కాగా, ప్రధాని మోదీ.. పోలండ్‌లో గురువారం పర్యటన ముగించుకుని రైలు మార్గంలో ఉక్రెయిన్‌కు బయల్దేరారు. ఆయన దాదాపు 10 గంటలు ప్రయాణించి కీవ్‌కు చేరుకున్నారు. రైల్వేస్టేషన్ నుంచి ఆయన కాన్వాయ్ బయల్దేరి బస చేయనున్న ప్రదేశానికి వెళ్లింది. కీవ్‌లోని భారత సంతతి ప్రజలు రైల్వే స్టేషన్ వద్ద మోదీకి భారత జాతీయ జెండాలతో స్వాగతం పలికారు. ఉక్రెయిన్‌లోని ఇస్కాన్ బృంద సభ్యులు కూడా దీనికి హాజరయ్యారు. ఇక, ఆయన పర్యటనలోని కార్యక్రమాల వివరాలు భద్రతా కారణాల వల్ల గోప్యంగా ఉంచారు.प्रधानमंत्री नरेंद्र मोदी जब कीव रेलवे स्टेशन पर उतरे तो उनका स्वागत इस तरीक़े से किया गया#modi pic.twitter.com/QbTZm5wDxd— swati saini (@swati8saini) August 23, 2024ఇదిలా ఉండగా.. దాదాపు ఏడు గంటలపాటు జరగనున్న ఈ పర్యటనలో భాగంగా నేడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మోదీ భేటీ కానున్నారు. స్థానిక ఏవీ ఫొమిన్ బొటానికల్ గార్డెన్‌లోని మహాత్మాగాంధీ కాంస్య విగ్రహానికి ప్రధాని నివాళి అర్పించనున్నారు. ఇక, 1991లో సోవియట్ నుంచి విడిపోయి ఉక్రెయిన్ ఏర్పడిన తర్వాత భారత ప్రధాని ఆ దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి. కాగా, ఇటీవల ఇటలీ వేదికగా జరిగిన జీ7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా మోదీ, జెలెన్స్కీ భేటీ అయిన విషయం తెలిసిందే.As Narendra Modi arrives in the war-torn region, all eyes are on him, with many hoping he could facilitate negotiations between the conflicting sides. His unique position and influence may make him a pivotal figure in addressing this challenging situation.#PMModi… pic.twitter.com/e5VuPGyfcX— The UnderLine (@TheUnderLineIN) August 23, 2024 -
23న ఉక్రెయిన్‌కు మోదీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 23న ఉక్రెయిన్‌కు వెళ్లనున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఆ దేశాధ్యక్షుడు వొలోదిమియర్ జెలెన్స్కీతో చర్చలు జరుపుతారు. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడిన తర్వాత 30 ఏళ్లలో భారత ప్రధాని ఉక్రెయిన్‌కు వెళ్లడం ఇదే తొలిసారి.రైలులో కీవ్‌కు ఉక్రెయిన్ కంటే ముందు మోదీ పోలండ్‌కు వెళతారు. ఈనెల 21, 22 మోదీ పోలండ్‌లో పర్యటిస్తారు. పోలండ్ సరిహద్దుల్లో గల ఒక స్టేషన్ నుంచి రైలులో ప్రయాణించి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు చేరుకుంటారు. ఇది దాదాపు 10 గంటల ప్రయాణం. తిరుగు ప్రయాణంలోనూ మోదీ రైలు ద్వారానే పోలండ్‌కు వస్తారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సహా పలువురు నేతలు ఉక్రెయిన్ పర్యటనకు రైలు మార్గాన్నే ఎంచుకోవడం విశేషం. -
Russia-Ukraine war: సుద్జా ఉక్రెయిన్ స్వాదీనం
కీవ్: రష్యా పట్టణం సుద్జాను పూర్తిగా స్వాదీనం చేసుకున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గురువారం ప్రకటించారు. సుద్జా జనాభా ఐదు వేలుంటుంది. చిన్నదే అయినా సుద్జా సరిహద్దులో రష్యాకు పాలనాకేంద్రంగా ఉంది. పశి్చమ సైబీరియా గ్యాస్ నిక్షేపాల నుంచి సుద్జా మీదుగానే ఉక్రెయిన్‌కు పైపుల ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతుంది. యూరోప్‌కు రష్యా గ్యాస్ ఎగుమతుల్లో మూడు శాతం సుద్జా మీదుగానే వెళతాయి. అక్కడ ఉక్రెయిన్ మిలటరీ కమాండర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు జెలెన్స్కీ వెల్లడించారు. కస్్కలో వెయ్యి చదరపు కిలోమీటర్ల ప్రాంతం తమ నియంత్రణలో ఉందని, 74 జనావాసాలు, వందలకొద్ది రష్యా యుద్ధఖైదీలు తమ ఆధీనంలో ఉన్నారని ఉక్రెయిన్ బుధవారం ప్రకటించింది. 100 మంది రష్యా సైనికులను బందీలుగా పట్టుకున్నామని ఉక్రెయిన్ చెబుతోంది. -
అవును, రష్యాపై దాడి చేశాం: జెలెన్స్కీ
కీవ్: రష్యాలోని సరిహద్దు ప్రాంతం కస్క్‌లో ఉక్రెయిన్ ఆకస్మిక సైనిక దాడులు చేసినట్టు అధ్యక్షుడు జెలెన్స్కీ నిర్ధారించారు. తమ సైన్యం పోరాటాన్ని రష్యా భూభాగంలోకి తీసుకెళ్లిందన్నారు. కస్క్‌లో తమ దళాలు ముందుకు దూసుకెళుతున్నాయని చెప్పారు. ఈ యుద్ధంతో రష్యా గడ్డపై ఉక్రెయిన్ చేసిన అతిపెద్ద దాడి ఇది.దాడిలో బాలుడు సహా ముగ్గురు మృతిఆదివారం రాత్రి కీవ్‌పై రష్యా డ్రోన్, క్షిపణి దాడుల్లో ఓ నాలుగేళ్ల బాలుడు, మరో ఇద్దరు మరణించారు. 53 డ్రోన్లను కూల్చేసినట్టు ఉక్రెయిన్ వెల్లడించింది. ఈ దాడిలో రష్యా వాడిన క్షిపణులు ఉత్తరకొరియావని జెలెన్స్కీ అన్నారు. -
రాజీ మార్గంలో జెలెన్స్కీ
షరతులన్నింటికీ రష్యా అంగీకరిస్తే తప్ప చర్చల ప్రసక్తి లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వాదిస్తూ వచ్చారు. స్విట్జర్లాండ్ శాంతి సమావేశాలకు రష్యాను ఆహ్వానించలేదు. అలాంటిది రష్యాతో చర్చలు అవసరం కావచ్చునని అన్నారు. అంతేనా? నవంబరులో నిర్వహించనున్న శాంతి శిఖరాగ్ర సమావేశానికి ప్రతినిధులను పంపవలసిందిగా రష్యాను కోరారు. ఆ రాయబారం కోసమే తన విదేశాంగ మంత్రిని చైనా పంపారు. ఇంతకూ జెలెన్స్కీ ఎందుకు చర్చలంటున్నారు? యుద్ధంలో రష్యాది పైచేయి అవుతోంది. ఉక్రెయిన్ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తోంది. పాశ్చాత్య దేశాలు పైకి ఏమన్నా, అంతర్గతంగా విముఖత పెరుగుతోంది. ఈ తరహా సహాయాలకు వ్యతిరేకి అయిన ట్రంప్ అధికారానికి రావచ్చుననే అంచనాలు మరో కారణం.ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమీర్ జెలెన్స్కీ రష్యాతో రాజీ మార్గం వైపు మళ్లుతున్నారనే మాట ఆశ్చర్యంగా తోస్తుంది. రెండున్నరేళ్లు రాజీలేని యుద్ధం చేసిన ఆయన నిజంగానే ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల 20న తమ దేశ ప్రజలను ఉద్దేశించి, రష్యాతో చర్చలు అవసరమని సూచించటం. తాను వచ్చే నవంబరులో నిర్వహించనున్న శాంతి శిఖరాగ్ర సమావేశానికి ప్రతినిధులను పంపవలసిందిగా రష్యాను కోరటం. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ఈ నెల 24 నుంచి నాలుగు రోజుల పర్యటన కోసం చైనా వెళ్లి, వారి విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశమై, చర్చల కోసం రష్యాను ఒప్పించవలసిందిగా కోరటం.తమ షరతులన్నింటికి రష్యా అంగీకరిస్తే తప్ప చర్చల ప్రసక్తి లేదని జెలెన్స్కీ వాదిస్తూ వచ్చారు. షరతులు తాము విధిస్తాముగానీ, రష్యా ఎటువంటి షరతులు పెట్టరాదన్నారు. యుద్ధం మొదలైన కొత్తలో ఒకసారి జరిగిన చర్చలు రెండు వైపుల నుంచి ఇటువంటి వైఖరులు వల్లనే విఫలమయ్యాయి. ఆ తర్వాత రష్యాపై దౌత్య పరమైన ఒత్తిళ్ల కోసం ఉక్రెయిన్ అనేక ప్రయత్నాయి చేసింది. అమె రికా, యూరోపియన్ యూనియన్ల ద్వారా అనేక ఆర్థిక ఆంక్షలు విధింపజేశారు. యుద్ధానికి అమెరికా కూటమి ఆయుధ సరఫరాలు, ఆర్థిక సహాయాలు సరేసరి. జూన్ 15–16 తేదీలలో వాషింగ్టన్లో జరిగిన నాటో కూటమి 75 సంవత్సరాల ఉత్సవాలలో ఉక్రెయిన్‌కు తిరుగు లేని మద్దతు ప్రకటించింది. జెలెన్స్కీని అతిథిగా ఆహ్వానించి ప్రసంగింపజేసింది. ఆ తర్వాత జూలై 9న స్విట్జర్లాండ్‌లో జెలెన్స్కీ సుమారు 90 దేశాలతో శాంతి సమావేశాలు నిర్వహించి అక్కడ కూడా రాజీ లేకుండా మాట్లాడారు. అటువంటిది కేవలం 10 రోజులు గడిచేసరికి, రష్యాతో చర్చలు అవసరం కావచ్చునని అన్నారు. మరొక విశేషం ఏమంటే, తను స్వయంగా నిర్వహించిన స్విట్జర్లాండ్ శాంతి సమావేశాలకు రష్యాను అసలు ఆహ్వానించలేదు. ఆ విషయమై ప్రశ్నించిన వారిని అందువల్ల ఉపయోగమేమిటని ఎదురు ప్రశ్నించారు. సరిగా ఆ రోజులలో రష్యా పర్యటనకు వెళ్లి భారత ప్రధాని మోదీని, ఒక రక్త పిపాసిని ఆలింగనం చేసుకున్నారంటూ తీవ్రంగా ఆక్షేపించారు. మోదీని ఢిల్లీలోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ కూడా విమర్శించారు. తీరా జరిగిందేమిటి? రష్యాను ఆహ్వానించకపోవటం వల్ల ప్రయోజనం ఉండదంటూ చైనా కూడా పాల్గొనలేదు. పాల్గొన్న దేశాలలో ముఖ్యమైనవి అనేకం ఉమ్మడి ప్రకటనపై సంతకాలు చేయలేదు. ఆ విధంగా అ సమావేశం ఒక నిష్ఫలయత్నంగా మిగిలింది.ఇంత జరిగినాక ఇంతలోనే జెలెన్స్కీ రష్యాతో చర్చలని అంటూ, రష్యాను ఈసారి చర్చలకు రావలసిందిగా మౌఖికంగా అహ్వానిస్తు న్నారు. ఆ పని రానున్న రోజులలో లిఖిత పూర్వకంగా చేయగలరని భావించవచ్చు. అయితే, అందుకు మొదటి అడుగు నవంబర్ విస్తృత సమావేశాలలో రష్యా పాల్గొనటం అయితే, అంతా సజావుగా సాగిన పక్షంలో ఇరువురి మధ్య ముఖాముఖి చర్చలు రెండవ అడుగు అవుతాయి. ఈ రెండింటికి సన్నాహక ప్రయత్నాల సమయంలో ఇరువురూ ఏవైనా షరతులు ముందస్తుగానే పెడతారా? షరతులుఉంటే ఏమిటవి? అనేవన్నీ చిక్కుముడులు. ఈ రాజీ ప్రయత్నాల పట్ల అమెరికా కూటమి వైఖరి ఏమి కావచ్చుననేది అంతకన్న కీలకమైన ప్రశ్న. ఎందుకంటే, రష్యాను ఏ విధంగానైనా లొంగతీయాలన్నది ఉక్రెయిన్ యుద్ధంలోని అమెరికా పరమోద్దేశం. అందుకే నాటోను రష్యా సరిహద్దులకు విస్తరిస్తున్నందున, రాజీ మార్గాన్ని వారు సమ్మతి స్తారా అనే విషయమై చాలామందికి సందే హాలుంటాయి.ఇదిట్లుండగా, రష్యాతో చర్చలు అవసరమంటూ జెలెన్స్కీ చేసిన ప్రసంగానికి గానీ, ఆయన విదేశాంగమంత్రి కులేబా చైనా వెళ్లి వాంగ్ యీతో ప్రతిపాదించినడానికి గానీ, ఈ వ్యాసం రాసే సమయానికి రష్యా నుంచి ఇంకా ఎటువంటి స్పందనా లేదు. చైనా నుంచి కూడా! వారినుంచి రాగల రోజులలో కనిపించే స్పందనలను బట్టి, మును ముందు ఏమి జరగవచ్చుననే దానిపై కొంత సూచన లభిస్తుంది. చైనా వెళ్లిన కులేబా ఇంతకూ అన్నదేమిటి? వాంగ్‌తో సమావేశం తర్వాత మాట్లాడుతూ, ‘‘నిజాయితీగా, సమస్య పరిష్కారానికి దోహదంగా వ్యవహరించే ఉద్దేశం రష్యాకు ఉన్నట్లయితే చర్చలకు తాము సిద్ధమ’’న్నారు. రష్యా నుంచి అటువంటి సంసిద్ధత ఇంతవరకు కన్పించలేదని కూడా అన్నారు.ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత, సమస్య పరిష్కారానికి ప్రయత్నించవలసిందిగా జెలెన్స్కీ ఒకటిరెండుసార్లు చైనాను బహిరంగంగా కోరారు. కానీ ఆయన విదేశాంగ మంత్రి స్వయంగా వెళ్లటం ఇది మొదటిసారి. చైనా స్వయంగా చొరవ తీసుకుని 12 సూత్రాల పథకం ఒకటి నిరుడు ప్రతిపాదించింది. అది ఉభయులు ఎట్లా యుద్ధ విరమణ చేసి చర్చలు ఆరంభించాలనే దానిపైనే తప్ప, అసలు సమస్య పరిష్కారం గురించి కాదు. తమ భూభాగాల నుంచి రష్యా ఉపసంహరించుకోవాలనే మాట అందులో లేదంటూ ఉక్రెయిన్ అందుకు తిరస్కరించింది. పరిష్కార చర్చలు ఉభయుల మధ్య జరగాలి తప్ప బయటి జోక్యం ఉండరాదన్నది చైనా వైఖరి. చర్చలకు తామెప్పుడూ కాదనలేదని, కాని కొన్ని షరతులు తప్పవన్నది రష్యా వాదన. నిజానికి రష్యా, ఉక్రెయిన్ రెండు వైపుల నుంచి మొదటి నుంచి కొన్ని గట్టి షరతులే ఉన్నాయి. అమెరికా, నాటోలు తమను చుట్టు ముట్టేందుకు నాటోను విస్తరిస్తూ, ఉక్రెయిన్ను రెచ్చగొడుతున్నాయనీ, అ దేశాన్ని నాటోలో చేర్చుకొనజూస్తున్నాయనీ, కనుక తమ అత్మరక్షణ కోసం ఉక్రెయిన్ను నాటోకు బయట ఉంచాలన్నది రష్యా మొదటి షరతు. తమ నౌకలు చలికాలంలో ప్రయాణించేందుకు వీలయ్యే ఏకైక సముద్ర మార్గం బ్లాక్ సీ అయినందున ఆ మార్గం భద్రంగా ఉండేందుకు అక్కడి క్రిమియా ద్వీపం తమ అధీనంలో ఉండాలనేది రెండవ షరతు.ఉక్రెయిన్ తూర్పున రష్యా సరిహద్దులో గల డొనెటెస్క్, లూహానస్క్, ఖేర్సాన్, జపోరిజిజియా ప్రాంతాలలో రష్యన్ భాషా సంస్కృతుల వారు పెద్ద మెజారిటీ అయినందున తీవ్ర వివక్షలను ఎదుర్కొంటున్నారని, కనుక ఇప్పటికే పాక్షికంగా తమ ఆక్రమణలో గల ఈ ప్రాంతాలను పూర్తిగా తమకు బదిలీ చేయాలన్నది మూడవ షరతు. ఉక్రెయిన్ వీటన్నింటిని తిరస్కరించటమేగాక, తమ ఆక్రమిత ప్రాంతాలన్నీ తమ స్వాధీనం చేయాలనీ, తాము నాటోలో కూడా చేరగలమనీ షరతులు పెడుతున్నది. రెండు వైపుల నుంచి ఇవన్నీ చాలా చిక్కు షరతులే. ఇంతకూ జెలెన్స్కీ ఇప్పుడు అకస్మాత్తుగా చర్చలు, రాజీలంటూ మాట్లాడటం ఎందువల్ల? క్లుప్తంగా చెప్పాలంటే, యుద్ధంలో రష్యాది పైచేయి అవుతున్నది. పాశ్చాత్య దేశాలు ఎన్ని ఆయుధాలు, ఎంత ఆధునికమైనవి సరఫరా చేసినా చాలటం లేదు. అందులోనూ ఒక పరిమితిని మించితే అది నేరుగా రష్యాతో యుద్ధంగా మారవచ్చునని అమెరికా సందేహిస్తున్నది. ఉక్రెయిన్ ఆర్థిక పరిస్థితులు బాగా క్షీణించటమే గాక, సైనికులు పెద్దఎత్తున చనిపోతూ కొత్త రిక్రూట్మెంట్లు తగ్గుతున్నాయి. ఉక్రెయిన్‌కు అంతులేని సహాయాలు, అయినా ఉపయోగం లేకపోవడంతో అమెరికా సహా పాశ్చాత్య దేశాలు పైకి ఏమన్నా, అంతర్గతంగా విముఖత పెరుగుతున్నది. ఈ తరహా యుద్ధాలకు, సహాయాలకు బహిరంగ వ్యతిరేకి అయిన ట్రంప్ ఈసారి అధికారానికి రావచ్చుననే అంచనాలు కొత్త భయాలను కలిగిస్తు న్నాయి. ప్రపంచ దేశాలలో మద్దతు తగ్గుతున్నది. స్వయంగా జెలెన్స్కీ పట్ల అక్కడి సైన్యంలో, ప్రజలలో నిరసనలు పెరుగు తున్నాయి. ఈ పరిణామాలన్నింటి ఒత్తిడి వల్లనే, ఇక చర్చలు మినహా మార్గం లేదని ఆయన భావిస్తుంటే ఆశ్చర్యమక్కరలేదు. - వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు- టంకశాల అశోక్ -
రష్యా పర్యటనలో మోదీ, పుతిన్ ఆలింగనం.. స్పందించిన జెలెన్స్కీ
న్యూఢిల్లీ: భారత్, రష్యాల మైత్రీ బంధాన్ని మరింత బలంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రధాని మోదీ రెండ్రోజుల నిమిత్తం రష్యాలో పర్యటిస్తున్నారు. 22వ ఇండో–రష్యా శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు మోదీ సోమవారం రష్యా చేరుకున్నారు. మంగళవారం ఉదయం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని మోదీ అల్పాహారం అనంతరం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ధ్వైపాక్షిక సంబంధాలపై విస్తృతస్థాయి చర్చలు జరిపారు.తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ స్పందించారు. మోదీ పర్యటన, పుతిన్‌ను ఆలింగనం చేసుకోవడంపై తాను తీవ్ర నిరాశకు గురయ్యానని తెలిపారు. ఇది శాంతి ప్రయత్నాలలకు పెద్ద దెబ్బగా భావించారు.రష్యా క్షిపణుల దాడికి గురైన పిల్లల ఆసుపత్రికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. ‘ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య నేత(మోదీ) మాస్కోలో ప్రపంచంలోని అత్యంత రక్తపాత నేరస్థుడిని కౌగిలించుకోవడం చాలా నిరాశకు గురి చేసింది. ఇది శాంతి ప్రయత్నాలకు ఓ వినాశకరమైన దెబ్బ’. అని పేర్కొన్నారు.లోక్‌సభ ఎన్నికల తర్వాత తమ దేశంలో పర్యటించాల్సిందిగా ప్రధాని మోదీని జెలెన్స్కీ ఆహ్వానించారు. అటు రష్యా అధ్యక్షుడు పుతిన్ సైతం మోదీని ఆహ్వానించారు. ఈ ఏడాది మార్చిలో రష్యా అధ్యక్షుడిగా పుతిన్ తిరిగి ఎన్నికైన తర్వాత ప్రధాని ఇరువురు నేతలతో మాట్లాడారు.మోదీ, పుతిన్ మధ్య.. ఉక్రెయిన్ను రష్యా దురాక్రమించిన అంశం, రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా భారతీయులను రిక్రూట్ చేసుకుని ఉక్రెయిన్ యుద్ధక్షేత్రాలకు తరలించిన ఉదంతాలు చర్చకు వచ్చింది. తమ ఆర్మీలో పనిచేస్తున్న భారతీయుల్ని స్వదేశానికి పంపించేలా పుతిన్ అంగీకరిస్తున్నట్లు జాతీయ, అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. దీంతో రష్యా సైన్యంలోని భారతీయులకు విముక్తి లభించినట్లైంది.కాగా 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక మోదీ రష్యాకు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. చివరిసారి 2022 సెప్టెంబర్‌లో ఉజ్బెకిస్థాన్‌లో షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సు సందర్భంగా అధ్యక్షుడు పుతిన్‌ను కలిశారు. ఆ సమయంలో ‘ఇది యుద్ధ యుగం కాదు’ అని పుతిన్‌తో అన్నారు. చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే వివాదానికి పరిష్కారం కనుగొనగలమని నొక్కి చెప్పారు. -
జీ-7 మద్దతు: ఉక్రెయిన్-రష్యా యుద్ధం! మళ్లీ బీభత్సమేనా!
ఇటలీలోని అపులియాలో నిర్వహించిన జీ-7 దేశాల సమ్మిట్ రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచింది. అదేవిధంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ సైతం జీ-7 సమ్మిట్‌లో పలు దేశాధినేతలతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో పశ్చాత్య దేశాల మద్దతు కారణంగా ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం మరింత చెలరేగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.మరోవైపు.. ఫ్రాన్స్ బలగాలు ఉక్రెయిన్ యుద్ధం భూమిలో దిగనున్నాయి. యూకే 300 కిలోమీటర్ల రేంజ్ ఉండే స్టార్మ్ షాడో క్షిపణులు అందజేయనుంది. రష్యాను టార్గెట్ చేయడానికి పలు అధునాత రాకెట్లు, మిసైల్స్‌ను అమెరికా ఉక్రెయిన్‌కు సరఫరా చేయనుంది. జీ-7 దేశాల సమ్మిట్ ద్వారా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జెలెన్స్కీ పాశ్చాత్య దేశాల మద్దతు మరింత కూడగట్టుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా భారీ ఆర్థిక, సైనిక సాయాన్ని ఉక్రెయిన్‌కు అందించేందుకు ఆమోదం తెలిపింది. దీంతో రష్యా ఆధీనంలో ఉన్న క్రిమియాలోని స్థావరాలపై ఉక్రెయిన్ టార్గెట్ చేయనున్నట్లు తెలుస్తోంది.జీ-7 దేశాల సమ్మిట్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భారత ప్రధాని మోదీతో కూడా భేటీ అయ్యారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం గురించి జెలెన్స్కీ మోదీకి వివరించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. పాశ్చాత్యదేశాలు ఉక్రెయిన్‌కు సహకరించాడాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఖండించిన విషయం తెలిసిందే. అదే విధంగా రష్యా సార్వభౌమత్వానికి ముప్పు వస్తే.. అణ్వాయుధాలు వినియోగించడాకి కూడా వెనకడబోమని గతంలోనే ఆయన హెచ్చరించారు. చదవండి: జీ-7లో ప్రధాని మోదీ.. ఉక్రెయిన్‌కు రష్యా ఆఫర్.. ఏంటంటే?