ఇజ్రాయల్ మాజీ ప్రధాని నఫ్తాలి బెన్నెట్... రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. జెలెన్‌స్కీని పుతిన్ కచ్చితంగా చంపడంటూ తనకు హామీ కూడా ఇచ్చాడని నమ్మకుంగా చెబుతున్నారు బెన్నెట్. గతవారం ఇజ్రాయిల్ మాజీ ప్రధాని బెన్నెట్ మాస్కో పర్యటనలో నేరుగా పుతిన్‌నే మీరు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని చంపేందుకు ప్లాన్ చేస్తున్నారా? అని ప్రశ్నించారు. దీనికి పుతిన్ బదులిస్తూ..తాను చంపాలనుకోవడం లేదని కరాకండీగా చెప్పినట్లు బెన్నెట్ చెబుతున్నాడు.
ఈ విషయమై తాను పుతిన్‌ని గట్టిగా నిలదీశానని ఆయన కచ్చితంగా జెలెన్‌స్కీని చంపాలనుకోవడం లేదు, ఇది పక్కా అని బెన్నెట్ నమ్మకంగా చెప్పారు. ఈ విషయాన్ని బెన్నెట్ జెలెన్‌స్కీకి చెప్పారు కూడా. అంతేగాదు నాటోలో చేరేందుకు యత్నించమని మాట ఇస్తే తక్షణమే పుతిన్ యుద్ధాన్ని విరమించుకుంటాడని జెలన్‌స్కీకి హితవు చెప్పారు. వాస్తవానికి బెన్నెట్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని విరమింపచేసే ప్రయత్నంలో భాగంగా పలుమార్లు మధ్యవర్తిత్వం చేసేందుకు యత్నించారు. అందులో భాగంగానే బెన్నెట్ పుతిన్‌తో తాను మాట్లాడానంటూ ఈ వ్యాఖ్యలు చేశారు
దీనికి ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా స్పందిస్తూ... రష్యా మాటలను ఉక్రెయిన్ ఎన్నటికీ విశ్వసించదన్నారు. రష్యా నిరవధిక దాడులతో మగ్గిపోతున్న ఉక్రెయిన్ ఆ దేశ అధ్యక్షుడి మాటలను నమ్మదనడంలో ఆశ్చర్యం లేదన్నారు. పుతిన్ ఒక అబద్ధాలకోరు, ఒక పక్క చేయను అని మాట ఇస్తూనే దారుణాలకు తెగబడుతుంటాడని మండిపడ్డారు. కాగా రష్యా గతేడాది ఉక్రెయిన్‌పై దురాక్రమణ యుద్ధానికి దిగింది.
అది నిరాటంకంగా సాగుతూనే ఉంది గానీ ఆగే సూచనలు కనిపించడం లేదు. ఈ యుద్ధంలో వేలాది మంది ఉక్రెయిన్ బలగాలు నేలకొరిగారు, లక్షలాదిమంది ఉక్రెయిన్‌లు నిరాశ్రయులయ్యారు. అయినా సరే ఉక్రెయిన్ ఏ మాత్రం వెనుక్కు తగ్గకుండా ఊహించని రీతిలో ప్రతి ఘటన చేసింది. దీంతో రష్యా క్షిపణి దాడులతో బాంబుల వర్షం కురిపించి శిథిలాల దిబ్బగా మార్చేసింది. రోజురోజుకి యుద్ధం తీవ్రతరమవుతుందే గానీ ముగియడం అనేది అడియాశగానే మిగులుతోంది.
(చదవండి: టర్కీ, సిరియా భారీ భూకంపం.. గాఢనిద్రలోనే సమాధి.. పెరుగుతున్న మృతుల సంఖ్య)
Comments
Please login to add a commentAdd a comment