Israeli
-
గాజా పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 10 మంది మృతి
-
గాజాపై దాడులు... 22 మంది దుర్మరణం
డెయిర్ అల్–బలాహ్: గాజాలోని పాలస్తీనియన్లు కనీసం తాగునీరు కూడా దొరకని దుర్భర పరిస్థితుల్లో అల్లాడుతున్నా ఇజ్రాయెల్ ఆర్మీ దాడులను యథేచ్ఛగా సాగిస్తోంది. శనివారం రాత్రి మొదలైన వైమానిక దాడులు ఆదివారం కూడా కొనసాగాయి. ఈ దాడుల్లో ఐదుగురు చిన్నారులు సహా 22 మంది మృత్యువాతపడ్డారు. గాజా నగరంలోని శరణార్థులు తలదాచుకుంటున్న పాఠశాలపై జరిగిన దాడిలో ముగ్గురు చిన్నారులు సహా 8 మంది చనిపోయారు. అయితే, అక్కడ హమాస్ మిలిటెంట్లున్నారని ఇజ్రాయెల్ మిలటరీ పేర్కొంది. డెయిర్ అల్–బలాహ్ నగరంలోని ఓ ఇంటిపై శనివారం రాత్రి జరిగిన మరో దాడిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు సహా ఎనిమిదిమంది మృతి చెందారని పాలస్తీనా ఆరోగ్య విభాగం తెలిపింది. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో మరో ఆరుగురు చనిపోయినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇలా ఉండగా, గాజాలో స్వల్ప సంఖ్యలో ఉన్న క్రైస్తవులు క్రిస్మస్ ముందస్తు వేడుకలు జరిపేందుకు ఆ ప్రాంతంలోకి ఆదివారం కార్డినల్ పియెర్బటిస్టా పిజ్జబల్లాను ఇజ్రాయెల్ ఆర్మీ అనుమతించింది. వేడుకలు జరుగుతుండగా ఆ ప్రాంతంపై ఇజ్రాయెల్ ఆర్మీ డ్రోన్లతో పహారా కాసింది. ఇజ్రాయెల్ ఆంక్షల వల్ల బిషప్ గాజాలోకి వెళ్లలేకపోయినట్లు పోప్ ఫ్రాన్సిస్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. -
సిరియాపై ఇజ్రాయెల్ భీకర దాడులు
-
ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా భీకర దాడి
బీరూట్: లెబనాన్‌కు చెందిన హెజ్బొల్లా మిలిటెంట్లు మరోసారి భీకర దాడులకు దిగారు. ఆదివారం ఇజ్రాయెల్ భూభాగంపై 250 రాకెట్లు, ఇతర డ్రోన్లు ప్రయోగించారు. గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై విరుచుకుపడుతుండడంతో ప్రతీకార చర్యగా మిలిటెంట్లు రాకెట్లతో దాడి దిగారు. ఈ దాడుల్లో కనీసం ఏడుగురు ఇజ్రాయెల్ పౌరులు గాయపడ్డారు. మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్ ఆర్మీ సెంటర్‌పై దాడికి పాల్పడింది. నైరుతి కోస్తా తీర రహదారిపై టైర్, నఖౌరా మధ్య ఈ దాడి జరిగినట్లు లెబనాన్ సైన్యం వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడిలో ఒక సైనికుడు మృతిచెందాడని, 18 మంది గాయపడ్డారని తెలియజేసింది. -
‘ఇరాన్లో అడ్డగోలుగా అణుస్థావరాలు.. దాడులు చేయాల్సిందే!’
ఇరాన్లో గతంలో కంటే అధికంగా అణుస్థావరాలు బయటపడ్డాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ మేరకు కొత్తగా నియమించబడిన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘‘ఇరాన్లో గతంలో కంటే ఎక్కువ అణు స్థావరాలు వెలుగు చూశాయి. ఆ దేశంపై దాడులు చేయాల్సి ఉంది. ఇజ్రాయెల్ అస్థిత్వానికి కలిగే ముప్పును తొలగించడం, అడ్డుకోవడానికి ఇదో అవకాశంగా భావిస్తున్నాం.ఇక.. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయాలని భావిస్తున్నట్లు ఇజ్రాయెల్ ఏళ్లుగా ఆరోపణలు చేస్తోంది. అయితే ఆ ఆరోపణలను ఇరాన్ ఖండింస్తూ వస్తున్న విషయం తెలిసిందే.2018లో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా.. ఇరాన్ అణుసామర్థ్య ఆశయాలను పరిమితం చేసేందుకు 2015 అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. ఇక.. ప్రస్తుతం అమెరికా మళ్లీ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇక.. టెహ్రాన్ వద్ద యురేనియంను 60 శాతం వరకు ఉండగా.. 30 శాతం తక్కువ అణు ఆయుధాల గ్రేడ్ ఉంది.In my first meeting today with the @IDF General Staff Forum, I emphasized: Iran is more exposed than ever to strikes on its nuclear facilities. We have the opportunity to achieve our most important goal – to thwart and eliminate the existential threat to the State of Israel. pic.twitter.com/HX4Z6IO8iQ— ישראל כ”ץ Israel Katz (@Israel_katz) November 11, 2024 ఇజ్రాయెల్, ఇరాన్ చెసుకుంటున్న క్షిపణి దాడుల కారణం మధ్యప్రాచ్యంలో ఆందోళనలు కలిగిస్తున్నాయి. మరోవైపు.. ఇప్పటికే ఈ దాడిలో ఇరాన్ రెండుసార్లు ఇజ్రాయెల్ భూభాగంపై నేరుగా మిసైల్స్ దాడికి దిగిన విషయం తెలిసిందే. దీంతో ఇజ్రాయెల్.. ఇరాన్‌పై ప్రతీకార దాడులు చేసింది. ఇటీవల అక్టోబర్ 26న ఇరాన్ సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు చేసింది. అదీ కాక.. గత నెలలో జరిగిన దాడికి ప్రతిస్పందించవద్దని ఇరాన్‌ను ఇజ్రాయెల్ హెచ్చరించింది. -
ఇజ్రాయెల్ సైన్యం చెరలో గాజా ఆస్పత్రి సిబ్బంది
కైరో: గాజాపై ఇజ్రాయెల్ సైన్యం నిరంతర దాడులకు తెగబడుతోంది. అయితే తాజాగా మరో పరిణామం చోటుచేసుకుంది. ఉత్తర గాజాలోని ఆస్పత్రి సముదాయం నుంచి ఇజ్రాయెల్ దళాలు వెనక్కి తగ్గాయి. అయితే ఈ ఆస్పత్రిని టార్గెట్ చేసి, దాడికి పాల్పడిన ఇజ్రాయెల్ సైనికులు ఇక్కడి వైద్య సిబ్బందిని, కొంతమంది రోగులను తమ అదుపులోకి తీసుకున్నారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.ఉత్తర గాజాలోని బీట్ లాహియాలో అనేక ఇళ్లపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 30 మంది మృతిచెందారని పాలస్తీనా అధికారిక వార్తా సంస్థ వాఫా తెలిపింది. మరోవైపు గాజా స్ట్రిప్‌లోని బీట్ లాహియా ప్రాంతంలోని ఒక భవనంలో ఉన్న హమాస్ మిలిటెంట్లపై ఆయుధాలను ఉపయోగించి, దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ దాడిలో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు.గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రసారం చేసిన ఫుటేజీలో ఇజ్రాయెల్ దళాలు అక్కడి నుంచి ఉపసంహరించుకున్న దృశ్యాలతో పాటు అనేక భవనాలు దెబ్బతిన్న దృశ్యాలు ప్రసారమయ్యాయి. 70 మంది సభ్యుల ఆస్పత్రి బృందంలో 44 మందిని సైన్యం అదుపులోకి తీసుకుంది. అయితే ఆస్పత్రి డైరెక్టర్‌తో సహా 14 మందిని విడుదల చేసినట్లు సైన్యం తెలిపింది. కాగా ఆసుపత్రి నివేదికపై వ్యాఖ్యానించడానికి ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి నిరాకరించారు. ఇది కూడా చదవండి: ట్రంప్, వాన్స్ లక్ష్యంగాచైనా సైబర్ దాడి -
కమాండర్లే చేతులెత్తేస్తే.. ట్రైనీ సైనికులు సిన్వార్‌ను మట్టుబెట్టారు
ఇజ్రాయెల్ దళాలు హమాస్ మాస్టర్‌మైండ్ యహ్యా సిన్వర్‌ను హతమార్చాయి. అయితే సిన్వర్ తర్వాత హమాస్‌కు ఎవరు సారథ్యం వహిస్తారు? అనే చర్చకు దారి తీసింది. ఈ తరుణంలో సిన్వర్‌ను మట్టుబెట్టిన ఇజ్రాయెల్ ఆర్మీ గురించి ఆసక్తికర విషయంలో వెలుగులోకి వచ్చింది.గతేడాది పాలస్తీనియన్ గ్రూప్ హమాస్ ఇజ్రాయెల్‌పై మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో దాదాపు 1,200 మంది పౌరులు మరణించారు. 200 మందికి పైగా ప్రజలు కూడా బందీలుగా ఉన్నారు. ఈ దాడి ఇజ్రాయెల్ చరిత్రలో ఈ దాడి అత్యంత ఘోరమైనదని ఇజ్రాయెల్ ప్రభుత్వం పేర్కొంది. నాటి నుంచి ఇజ్రాయెల్.. హమాస్ అగ్రనేత యహ్యా సిన్వర్ కోసం అన్వేషిస్తుంది.సంవత్సర కాలంగా ఇజ్రాయెల్ ఆర్మీ, ఇతర నిఘూ వర్గాలు సిన్వార్ జాడ కనిపెట్టలేకపోయాయి. అయితే గురువారం ఇజ్రాయెల్‌కు చెందిన ట్రైనీ సైనికులు దక్షిణ గాజాలో ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. ఈ గాలింపు చర్యల్లో ఓ భవంతిలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో ట్రైనీ సైనిక సిబ్బంది డ్రోన్‌తో దాడులు జరిపారు. అనంతరం అక్కడికి వెళ్లి చూడగా.. ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిలో సిన్వార్ సైతం ఉన్నారు. ఏడాది కాలంలో ఆర్మీలో ఆరితేరిన సైనికులు సాధించలేని విజయాన్ని ట్రైనీ సైనికులు సాధించడంపై ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రశంసల వర్షం కురిపించింది. -
హమాస్ కు చావు దెబ్బ.. హమాస్ చీఫ్ సిన్వర్ హతం
-
ఇజ్రాయెల్ నగరంపై హెజ్బొల్లా వైమానిక దాడులు
గాజా యుద్ధానికి సోమవారంతో ఏడాది పూర్తవుతున్న వేళ.. ఇజ్రాయెల్ దాడుల్ని కొనసాగిస్తుంది. ప్రతీకారంతో హెజ్బొల్లా.. ఇజ్రాయెల్ ప్రధాన నగరాలే లక్ష్యంగా వైమానిక దాడుల్ని మరింత ముమ్మరం చేసింది. ఆదివారం ఇజ్రాయెల్ లెబనాన్‌లోని కమతియే పట్టణంపై వైమానిక దాడులు జరిపింది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు సహామొత్తం ఆరుగురు మరణించినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.ప్రతీకారంగా, హెజ్బొల్లా సోమవారం ఉదయం ఇజ్రాయెల్‌లోని హైఫా నగరంపై వైమానిక దాడులతో విరుచుకు పడింది. ఫలితంగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. హెజ్బొల్లా హైఫా నగరంలో దక్షిణంగా ఉన్న సైనిక స్థావరాలే లక్ష్యంగా ఫాది 1 మిసైల్స్‌తో బీభత్సం సృష్టించింది.మిసైల్ దాడులతో స్థానికంగా ఉన్న భవనాలు, ఇతర సముదాయాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. గాయపడ్డ క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. -
ఇజ్రాయెల్ దాడిలో 105 మంది మృతి
బీరూట్ : లెబనాన్ తీవ్రవాద గ్రూప్ హెజ్బొల్లాను కూకటి వేళ్లతో పెకిలించి వేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ వడివడిగా అడుగులు వేస్తోంది భూతల,వైమానిక దాడులతో బీభత్సం సృష్టిస్తోంది. తాజాగా, లెబనాన్ రాజధాని బీరూట్‌లో తొలిసారి జనావాసాల్లో హెజ్బొల్లా స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. ఆదివారం జరిపిన దాడుల్లో సుమారు 105 మంది మరణించారు. 359 మందికిపైగా గాయపడ్డారు.లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రధాన దక్షిణ నగరం సిడాన్ సమీపంలో ఘోరమైన వైమానిక దాడులు జరిగాయని తెలిపారు. తూర్పు, దక్షిణ, బీరుట్ చుట్టుపక్కల ప్రాంతాలలో డజన్ల కొద్దీ మంది మరణించారని చెప్పారు. సోమవారం బీరుట్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో నలుగురు వ్యక్తులు మరణించారు.రెండు వారాల క్రితం ఇజ్రాయెల్..హెజ్బొల్లా సభ్యులపై దాడుల ముమ్మరం చేసిన నాటి నుండి 1,000 మందికి పైగా మరణించారని, 6,000 మంది గాయపడ్డారని లెబనాన్ పేర్కొంది.రాయిటర్స్ ప్రకారం, బీరుట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిగిన ప్రాంతంలో హెజ్బొల్లా సంస్థ అధినేత హసన్ నస్రల్లాను మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్.. 20 మంది హెజ్బొల్లా అగ్రనేతల్ని హత మార్చింది. వారిలో నస్రల్లా,నబిల్ కౌక్‌తో పాటు ఇతర నేతలు ఉన్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ఐడీఎఫ్ ప్రకటించింది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు లెబనాన్‌పై దాడిని కొనసాగించాలని ఆదేశించారు. హెజ్బొల్లాపై చేస్తున్న దాడుల కారణంగా సామాన్యులు నష్టపోకూడదని, వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కోరారు. -
బంకర్ బాంబు దాడిలో... నస్రల్లా మృతి
బీరూట్: లెబనాన్ ఉగ్ర సంస్థ హెజ్బొల్లాకు కోలుకోలేని దెబ్బ తగిలింది. శుక్రవారం ఇజ్రాయెల్ జరిపిన భారీ వైమానిక దాడుల్లో సంస్థ చీఫ్ షేక్ హసన్ నస్రల్లా (64)తో పాటు పలువురు అగ్ర శ్రేణి కమాండర్లు మృతి చెందారు. హెజ్బొల్లా కూడా దీన్ని ధ్రువీకరించింది. ‘నస్రాల్లా తన తోటి అమరవీరులను చేరుకున్నారు’ అంటూ శనివారం ప్రకటన విడుదల చేసింది. ‘పాలస్తీనాకు మద్దతుగా శత్రువుపై పవిత్రయుద్ధం కొనసాగుతుంది’ అని ప్రతిజ్ఞ చేసింది. నస్రల్లాయే ప్రధాన లక్ష్యంగా లెబనాన్ రాజధాని బీరూట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దళం శుక్రవారం భారీ బాంబు దాడులకు దిగి హెజ్బొల్లా ప్రధాన కార్యాలయాన్ని నేలమట్టం చేయడం తెలిసిందే. నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 80కి పైగా బాంబులతో విరుచుకుపడింది. ఆ క్రమంలో ఏకంగా 2,200 కిలోల బంకర్ బస్టర్ బాంబులను కూడా ప్రయోగించింది. దాడిలో నస్రల్లాతో పాటు ఆయన కూతురు జైనబ్, òహెజ్బొల్లా సదరన్ కమాండర్ అలీ కరీ్కతో పాటు పలువురు కమాండర్లు మృతి చెందినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. నస్రల్లాతో పాటు తమ సీనియర్ సైనిక కమాండర్ అబ్బాస్ నిల్ఫోరుషన్ (58) కూడా దాడుల్లో మృతి చెందినట్టు ఇరాన్ వెల్లడించింది. ‘‘నస్రల్లా కదలికలను కొన్నేళ్లుగా అత్యంత సన్నిహితంగా ట్రాక్ చేస్తూ వస్తున్నాం. అతనితో పాటు హెజ్బొల్లా అగ్ర నేతలంతా బంకర్లో సమావేశమైనట్టు అందిన కచి్చతమైన సమాచారం మేరకు లక్షిత దాడులకు దిగాం’’ అని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ నదావ్ షొషానీ వివరించారు. ‘‘నస్రల్లాను మట్టుపెట్టాం. పలు రకాలైన నిఘా సమాచారం ఆధారంగా నిర్ధారణ కూడా చేసుకున్నాం’’ అని ప్రకటించారు. ‘‘అంతేకాదు, గత వారం రోజులుగా చేస్తున్న దాడుల్లో హెజ్‌బొల్లా్ల సాయుధ సంపత్తిని భారీగా నష్టపరిచాం. దాన్ని పూర్తిగా నాశనం చేసేదాకా దాడులు చేస్తాం’’ అని తెలిపారు. శుక్రవారం నాటి దాడిలో వాడిన బాంబులు తదితరాలపై మాట్లాడేందుకు నిరాకరించారు. ‘‘హెజ్బొల్లా ప్రతీకార దాడులకు దిగుతుందని తెలుసు. మేం సర్వసన్నద్ధంగా ఉన్నాం’’ అని ప్రకటించారు.హెజ్బొల్లాకు ఇరాన్, ఇరాక్ దన్నుహెజ్బొల్లాకు పూర్తిగా అండగా నిలుస్తామంటూ ఇరాన్, ఇరాక్ ప్రకటించాయి. అత్యంత శక్తిమంతమైన ఇరాన్ పార్లమెంటరీ కమిటీ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ శనివారం అత్యవసరంగా సమావేశమైంది. ఇజ్రాయెల్ దాడులకు గట్టిగా జవాబివ్వాల్సిందేనని ముక్త కంఠంతో తీర్మానించింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం తమ సైనిక కమాండర్ మృతికి ప్రతీకారం తీర్చుకునే హక్కుందని ఇరాన్ న్యాయవ్యవస్థ డిప్యూటీ చీఫ్‌రెజా పూర్ ఖగాన్ అన్నారు. ముస్లిం ప్రపంచమంతా పాలస్తీనా, హెజ్బొల్లాలకు దన్నుగా నిలవాలంటూ ఇరాక్ కూడా పిలుపునిచి్చంది. దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. ఇరాక్ ప్రధాని మొహహ్మద్ సియా అల్ సుడానీ ఇరాన్, హెజ్బొల్లాతోనే అధికారంలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగడం ఖాయమంటున్నారు. మరోవైపు, నస్రల్లా మృతితో అంతా అయిపోయినట్టు కాదని ఇజ్రాయెల్ సైన్యాధిపతి లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలేవీ అన్నారు. హెజ్బొల్లాపై దాడులు మరింత తీవ్రంగా కొనసాగుతాయని ప్రకటించారు. ఇజ్రాయెల్ ఇప్పటికే అదనపు బలగాలను సమీకరించుకుంటోంది! భూతల దాడులను ఎదుర్కొనేందుకు రెండు బ్రిగేడ్లను ఉత్తర ప్రాంతానికి పంపింది. దేశవ్యాప్తంగా ఉన్న రిజర్వు బెటాలియన్లను కూడా రంగంలోకి దిగాల్సిందిగా ఆదేశించింది. దాంతో లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య ఇప్పటికే తారస్థాయికి చేరిన ఘర్షణలు పూర్తిస్థాయి యుద్ధంగా మారవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హెజ్బొల్లా దాడుల వల్ల లెబనాన్ సరిహద్దుల్లో 60 వేల మందికి పైగా తమ ప్రజలు నిర్వాసితులయ్యారని ఇజ్రాయెల్ మండిపడుతోంది. దాడులకు పూర్తిగా స్వస్తి చెప్పేదాకా తగ్గేదే లేదంటోంది. ఇజ్రాయెల్ తాజా దాడుల దెబ్బకు లెబనాన్‌లో గత వారం రోజుల్లోనే ఏకంగా 2 లక్షల మందికి పైగా నిర్వాసితులయ్యారని ఐరాస చెబుతోంది.కోలుకోలేని దెబ్బ!మూడు దశాబ్దాలకు పైగా హెజ్బొల్లాను నడిపిస్తున్న నస్రల్లా మృతి ఆ సంస్థకు కోలుకోలేని దెబ్బే. హెజ్బొల్లాపై తలపెట్టిన తాజా దాడిలో ఇజ్రాయెల్‌కు ఇది అతి పెద్ద విజయంగా భావిస్తున్నారు. హెజ్బొల్లా హెడ్డాఫీస్‌తో పాటు ఆరు అపార్ట్మెంట్లను నేలమట్టం చేసిన శుక్రవారం నాటి దాడుల్లో మృతులు ఆరుకు, క్షతగాత్రుల సంఖ్య 91కి పెరిగినట్టు లెబనాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. రెండు వారాల క్రితమే లెబనాన్ అంతటా పేజర్లు పేలి పదుల సంఖ్యలో చనిపోగా వేలాది మంది తీవ్రంగా గాయపడటం తెలిసిందే. దాన్నుంచి తేరుకోకముందే వాకీటాకీలు మొదలుకుని పలు ఎలక్ట్రానిక్ పరికరాలు పేలి మరింత నష్టం చేశాయి. ఇదంతా ఇజ్రాయెల్ పనేనని, మృతులు, క్షతగాత్రుల్లో అత్యధికులు హెజ్బొల్లా మిలిటెంట్లేనని వార్తలొచ్చాయి. -
పాలస్తీనా మా సొంతం
న్యూయార్క్: గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ చేపట్టిన సైనిక దాడులను పాలస్తీనా అథారిటీ చీఫ్ మహ్మూద్ అబ్బాస్ తీవ్రంగా ఖండించారు. పాలస్తీనా మా సొంతం. పాలస్తీనా నుంచి వెళ్లిపోవాల్సిన వారు ఎవరూ అంటే ఆక్రమణదారులు మాత్రమే’ అని ఆయన అన్నారు. గురువారం అబ్బాస్ ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు. ఆయన స్టేడియం వైపు వెళ్తుండగా కరతాళధ్వనులు, చప్పట్లు హాలంతా మారుమోగాయి. అర్థంకాని కేకలు వినిపించాయి. పోడియం వద్దకు చేరుకున్న అబ్బాస్..మేం వదిలి వెళ్లం. మేం వదిలి వెళ్లం. మేం వదిలి వెళ్లం..అంటూ ప్రసంగం మొదలుపెట్టారు.గాజాను, అక్కడి ప్రజలను అంతం చేసేందుకు ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న నరమేధాన్ని ఆపాలంటూ ప్రపంచ నేతలకు ఆయన విజ్ఞప్తి చేశారు. గాజాను నివాసయోగ్యం కాకుండా చేస్తోంది. యుద్ధానంతరం ఏర్పడే గాజాను మేమే పాలిస్తాం. పాలస్తీనా మా మాతృ భూమి. మా తండ్రులు, తాతలది. అది ఎప్పటికీ మాదే. వెళ్లిపోవాల్సింది ఎవరైనా ఉంటే వారు ఆక్రమిత వడ్డీవ్యాపారులు మాత్రమే’అని వ్యాఖ్యానించారు. -
న్యూస్ చదువుతుండగా లెబనాన్ జర్నలిస్ట్‌పై ఇజ్రాయెల్ మిస్సైల్ దాడి
బీరూట్ : లెబనాన్ దేశంలో హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడి చేస్తోంది. ఈ దాడితో రెండ్రోజుల వ్యవధిలో సుమారు 550 మందికి పైగా మరణించారని, 1,800 మందికిపైగా గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది.ఈ తరుణంలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేక కథనాల్ని ప్రసారం చేస్తున్నారనే నెపంతో లెబనాన్ టీవీ ఛానెల్ లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం రాకెట్ దాడి చేసింది.ఆ దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లెబనాన్‌లో ఇజ్రాయెల్ - హిజ్బుల్లా దళాల మధ్య వైమానిక దాడులపై మిరయా ఇంటర్నేషనల్ నెట్వర్క్ టీవీ ఛానల్ న్యూస్ రూమ్‌లో లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. లైవ్ టెలికాస్ట్‌పై అప్పటికే సమాచారం అందుకున్న ఇజ్రాయెల్ ఆర్మీ.. న్యూస్ రూమ్‌లో న్యూస్ ప్రసారం చేస్తున్న మిరయా ఇంటర్నేషనల్ నెట్వర్క్ టీవీ ఛానల్ ఎడిటర్–ఇన్–చీఫ్ జర్నలిస్ట్ ఫాది బౌడియాపై రాకెట్ దాడి చేసింది. ఫాది బౌడియా ఇంటర్వ్యూ చేస్తుండగా ఆయన వెనుక నుంచి రాకెట్ దూసుకొచ్చింది. ఈ దాడిలో బౌడియాకు తీవ్ర గాయాలయ్యాయి. ఫుటేజీలో, బౌడియా పేలుడు తీవ్రతతో అరుస్తూ.. హాహాకారాలు వ్యక్తం చేస్తూ ప్రాణ భయంతో భీతిల్లిపోయారు. ఏమి జరుగుతుందో తెలియక భయాందోళన చెందారు. పేలుడు కారణంగా అతనికి గాయాలైనట్లు నివేదికలు ధృవీకరించాయి.A video shows journalist Fadi Boudiya being thrown off balance while he was live on air in Lebanon. Boudiya is the editor-in-chief of Miraya International Network and has reportedly been injured in the attack.Video Credit: @eye.on.palestine#thecurrent #lebanon pic.twitter.com/YdHQNoyxk9— The Current (@TheCurrentPK) September 24, 2024చదవండి : హిబ్జుల్లా కమాండర్ హతం -
లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు (ఫొటోలు)
-
హిజ్బుల్లాపై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడి
హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేసింది. సోమవారం ఒక్కరోజే 300 లకుపైగా లక్ష్యాలపై విరుచుకుపడింది. ఈ వైమానిక దాడుల్లో 182 మంది మృతి చెందినట్లు లెబనాన్ ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరో 700 మందికి గాయాలైనట్లు పేర్కొంది.ఈ రోజు ఉదయం నుండి దక్షిణ పట్టణాలు, గ్రామాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడుల్లో 182 మంది మరణించారు. వారిలో పిల్లలు, మహిళలు,మెడికల్ సిబ్బంది ఎక్కువ మంది ఉన్నట్లు లెబనాన్ ఆరోగ్యశాఖ ప్రతినిధులు ప్రకటించారు. ఈ దాడులపై ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి స్పందించారు. లెబనాన్‌లోని సామాన్య ప్రజలు హిజ్బుల్లాకు అనుసంధానంగా ఉన్న ప్రదేశాల నుంచి దూరంగా వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని దాడులు జరుగుతాయని హెచ్చరించారు. అంతేకాదు తమ సైన్యం లెబనాన్ అంతటా విస్తరించిన హిజ్బుల్లా ఖచ్చితమైన స్థావరాల్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతుందని హగారి స్పష్టం చేశారు. లెబనాన్ పౌరులు భద్రత దృష్ట్యా వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. చదవండి : పడవలో కుళ్లిన 10 మృతదేహాలు -
వెస్ట్‌బ్యాంక్–జోర్డాన్ సరిహద్దుల్లో కాల్పులు ముగ్గురు ఇజ్రాయెలీలు మృతి
అల్లెన్బీ క్రాసింగ్: వెస్ట్‌బ్యాంక్–జోర్డాన్ సరిహద్దుల్లోని అల్లెన్ బీ క్రాసింగ్ వద్ద ఆదివారం జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు ఇజ్రాయెలీలు చనిపోయారు. జోర్డాన్ వైపు నుంచి ట్రక్‌లో క్రాసింగ్ వద్దకు చేరుకున్న సాయుధులు భద్రతా బలగాల వైపు కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ఇజ్రాయెలీ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. బలగాల ఎదురుకాల్పుల్లో ఆగంతకుడు చనిపోయాడని ఆర్మీ తెలిపింది. ఘటనపై జోర్డాన్ దర్యాప్తు చేపట్టింది. జోర్డాన్ నదిపై ఈ మార్గాన్ని ఎక్కువగా పాలస్తీనియన్లు, విదేశీ టూరిస్టులు, సరుకు రవాణాకు వినియోగిస్తుంటారు. తాజా ఘటన నేపథ్యంలో ఈ క్రాసింగ్‌ను అధికారులు మూసివేశారు. అమెరికా, పశ్చిమదేశాలకు అనుకూలంగా పేరున్న జోర్డాన్ 1994లో ఇజ్రాయెల్‌లో శాంతి ఒప్పందం చేసుకుంది. -
నెతన్యాహుపై హమాస్ సంచలన ఆరోపణలు
గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం ఇజ్రాయెల్ ఆర్మీ చేసిన వైమానిక దాడుల్లో 29 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు.. గాజాలో ఉద్రిక్తతలు తగ్గించటంతో పాటు, కాల్పుల విరమణ ఒప్పందం ప్రయత్నాల కోసం అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకన్ ఇజ్రాయెల్‌కు వెళ్లారు.ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం.. అమెరికా, ఈజిప్ట్, ఖతార్ దేశాల మధ్యవర్తిత్వంతో దోహాలో రెండు రోజుల చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ చర్చల్లో ఇజ్రాయెల్ అధికారులు కాల్పుల విరమణపై కొంత సానుకూలంగా వ్యవహరించినట్లు తెలిపారు. మరోవైపు.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కొత్త షరతులు విధించారని గాజా నుంచి పూర్తిగా బలగాల ఉపసంహరణను తిరస్కరించారని హమాస్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘మధ్యవర్తుల ప్రయత్నాలను, ఒప్పందాన్ని అడ్డుకోవాలని ప్రధాని నెతన్యాహు చూస్తున్నారు. గాజాలో బంధీల జీవితాలకు పూర్తి బాధ్యత ఆయనదే’ అని హమాస్ ఆరోపించింది.ఇక.. ఇప్పటివరకు ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 40 వేల మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు. 2.3 మిలియన్ ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. భీకరమైన ఇజ్రాయెల్ దాడులతో గాజాలో ఆహార ఇబ్బందులు, పోలీయో వంటి వ్యాధలు ప్రబలుతున్నాయని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. -
Israel-Hamas war: రక్తమోడుతున్న గాజా
డెయిర్ అల్ బలాహ్: ఇజ్రాయెల్ సైన్యం యథేచ్ఛగా జరుపుతున్న దాడులతో గాజా ప్రాంతం రక్తమోడుతోంది. శనివారం ఉదయం జవైదా పట్టణంలోని ఓ నివాసంతోపాటు పక్కనే ఉన్న శరణార్థులు తలదాచుకున్న భవనంపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన దాడిలో సమీ జవాద్ అల్ ఎజ్లా, అతడి కుటుంబంలోని 18 మంది మృత్యువాతపగా, మరో వ్యక్తి గాయపడ్డారు. మృతులను సమీ ఇద్దరు భార్యలు, 2 నుంచి 22 ఏళ్ల వయస్సున్న 11 మంది సంతానం, వారి అమ్మమ్మ, మరో ముగ్గురు బంధువులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఇజ్రాయెల్ నుంచి గాజాలోకి చేపలు, మాంసం తరలించే ప్రక్రియకు సమీ సమన్వకర్తగా వ్యవహరించేవాడని, చాలా మంచి వ్యక్తని చెప్పారు. ఘటన సమయంలో రెండు భవనాల్లో కలిపి 40 మంది వరకు ఉన్నట్లు వివరించారు. ఇలా ఉండగా, సెంట్రల్ గాజాలోని మఘాజీ శరణార్థి శిబిరం చుట్టుపక్కల ప్రాంతాలను ఖాళీ చేయాల్సిందిగా ఇజ్రాయెల్ ఆర్మీ శనివారం పాలస్తీనియన్లను హెచ్చరించింది. ఆ ప్రాంతం వైపు నుంచే తమ భూభాగం మీదికి మిలిటెంట్లు రాకెట్లు ప్రయోగిస్తున్నారని పేర్కొంది. -
హమాస్‌కు ఎదురు దెబ్బ.. ఇజ్రాయెల్ మెరుపు దాడిలో
హమాస్‌కు ఎదురు దెబ్బ తగిలింది. మంగళవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో హమాస్‌కు చీఫ్ ఇస్మాయిల్ హనియే సోదరితో సహా అతని 10 మంది కుటుంబ సభ్యులు మరణించారని గాజా మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఉత్తర గాజా స్ట్రిప్‌లోని అల్ షాతీ శరణార్థి శిబిరంలోని హనియే నివాసంపై దాడి జరిగిందని హమాస్ పాలిత ప్రాంతం పౌర రక్షణ ప్రతినిధి మహమూద్ బసల్ తెలిపారు. శిథిలాల కింద అనేక మృతదేహాలు ఇంకా ఉన్నాయని, అయితే వాటిని వెలికితీసేందుకు అవసరమైన పరికరాలు తమ వద్ద లేవని ఆయన అన్నారు. సివిల్ డిఫెన్స్ సిబ్బంది మృతదేహాలను సమీపంలోని గాజా సిటీలోని అల్ అహ్లీ ఆసుపత్రికి తరలించారు.దాడిలో చాలామంది గాయపడినట్లు నివేదించారు.కాగా,గాజాలో ఈద్ వేడుకల నుండి తిరిగి వస్తున్న వారిపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే పిల్లలు, మనవళ్లతో సహా 14 మంది చనిపోయారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడి.. 25 మంది మృతి
ఇజ్రాయెల్ దళాలు గాజాలో నిరంతరం దాడులకు తెగబడుతూనే ఉన్నాయి తాజాగా గాజాకు దక్షిణ నగరమైన రఫాలోని పాలస్తీనియన్ల శరణార్థి శిబిరాలపై దాడికి దిగాయి. ఈ దాడిలో 25 మంది పాలస్తీనియన్లు మృత్యువాతపడ్డారు. 50 మంది గాయపడ్డారు.ఈ సందర్భంగా అల్-అహ్లీ హాస్పిటల్ ఆర్థోపెడిక్ హెడ్ ఫడేల్ నయీమ్ మాట్లాడుతూ 30 మృతదేహాలను ఇక్కడికి తీసుకువచ్చారని, గాజా నగరానికి ఇది క్రూరమైన రోజు అని వ్యాఖ్యానించారు. రఫాలోని సివిల్ డిఫెన్స్ ప్రతినిధి అహ్మద్ రద్వాన్ తెలిపిన వివరాల ప్రకారం తీర ప్రాంతంలోని రెండు ప్రదేశాలల్లో బాంబు దాడుల అనంతరం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన, గాయపడిన వారి వివరాలు తెలియజేసింది.మీడియాకు అందిన వివరాల ప్రకారం మువాసి పరిధిలో ఇజ్రాయెల్ బాంబు దాడి చేసింది. పాలస్తీనియన్లకు ఇక్కడ రక్షణ శిబిరాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ బలగాలు రెండుసార్లు దాడులకు తెగబడ్డాయని బాధితులు తెలిపారు. మరోవైపు తమ దేశ పౌరుల మరణాలకు ఉగ్రవాదులే కారణమని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఉగ్రవాదులు జనం మధ్య తిరుగాడుతున్నారని, అందుకే ఈ దాడుల్లో పౌరులు కూడా మరణిస్తున్నారని ఇజ్రాయెల్ చెబుతోంది. కాగా సెంట్రల్ గాజాలో జరిగిన పోరులో ఇద్దరు సైనికులు కూడా మరణించారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అదే సమయంలో ముగ్గురు ఇజ్రాయెల్ సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. -
గాజాలో భారీ పేలుడు.. 8 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి
ఇజ్రాయెల్, హమాస్ మధ్య గాజాలో యుద్ధం కొనసాగుతోంది. దక్షిణ గాజాలో చోటు చోసుకున్న పేలుడులో 8 మంది ఇజ్రాయెల్ సైనికులు మరణించినట్లు అధికారులు శనివారం వెల్లడించారు. దక్షిణ గాజాలోని రఫా నగరానికి సమీపంలో ఇజ్రాయెల్ సైనికులు ప్రయాణిస్తున్న నేమర్ వాహనం పేలటంతో ఈ ఘటన జరిగినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.ఈ పేలుడు భారిగా సంభవించడంతో వాహనం పూర్తిగా దగ్ధం అయిదని, అదే విధంగా మృత దేహాలను గుర్తించటంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఇజ్రాయెల్ సైనిక అధికారులు తెలిపారు. ఈ పేలుడు ఎవరు జరిపారనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. అయితే ఆ ప్రాంతంలో హమాస్ మిలిటెంట్లు పేలుడు పరికరం అమర్చా? లేదా యాంటీ ట్యాంక్ మిసైల్‌ను నేరుగా ప్రయోగించారా? అని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి డేనియల్ హగారి అనుమానం వ్యక్తం చేస్తున్నారు.❗🇵🇸⚔️🇮🇱 - An explosion in Rafah in southern Gaza killed eight Israeli soldiers in a Namer armored combat engineering vehicle, raising the Israel Defense Forces (IDF) death toll to 307 in the ground offensive against Hamas and operations throughout from the Gaza border. The… pic.twitter.com/5e1tiV6Hgb— 🔥🗞The Informant (@theinformant_x) June 15, 2024 శనివారం జరిగిన పేలుడులో 8మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందటం భారీ నష్టమని తెలిపారు. ఇక.. ఇప్పటివరకు 306 మంది ఇజాయెల్ సైనికులు మృతి చెందారని అన్నారు. మృతి చెందిన సైనికులకు ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నివాళులు అర్పించారు. సైనికుల భారీ నష్టంతో తన హృదయం ముక్కలైందని అన్నారు. అస్థిరమైన పరిస్థితులు నెలకొన్నా.. భారీ నష్టం జరిగినా యుద్ధ లక్ష్యాలకు కట్టుబడి ఉంటామని ఆయన తెలిపారు. -
ఇజ్రాయెల్ హీరో? ఎవరీ అర్నాన్ జమోరా
హమాస్ చెరలో బంధీలుగా ఉన్న నలుగురు ఇజ్రాయెల్ పౌరులు సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఈ కఠినమైన ఆపరేషన్‌ను విజయవంతం చేసేందుకు ఐడీఎఫ్ కమాండర్ అర్నాన్ జమోరా ప్రాణాల్ని ఫణంగా పెట్టారు. హమాస్ మెరుపు దాడుల నుంచి విరోచిత పోరాటం చేసి ప్రాణాలొదిన అర్నాన్ జమెరాను ఇజ్రాయెల్ ప్రభుత్వంతో పాటు ఆ దేశ పౌరులు హీరోగా కీర్తిస్తున్నారు. శనివారం హమాస్ చెరలో బందీలుగా ఉన్న నావో అర్గమణి, అల్మోగ్ మీర్ జాన్, ఆండ్రీ కోజ్లోవ్, ష్లోమి జివ్‌లను ఇజ్రాయెల్ నేషనల్ కౌంటర్ టెర్రరిజం యూనిట్ (యమమ్)కమాండర్, టాటికల్ ఆపరేటర్ అర్నాన్ జమోరా నుసిరత్‌లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టి వారిని రక్షించారు. ఈ తరుణంలో ప్రత్యర్ధుల దాడిలో కమాండర్ అర్నాన్ జమెరా ప్రాణాలొదారు. తాజాగా, ఆయన మరణంపై ఇజ్రాయెల్ మరణంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ విచారం వ్యక్తం చేసింది.Behind every rescue mission, are Israeli men and women who risk their lives. We are devastated to share that Chief Inspector Arnon Zamora, commander and tactical operator in the Yamam (National Police Counter-Terrorism Unit), who was critically wounded in the operation to… pic.twitter.com/4P3qRre7Ia— Israel Foreign Ministry (@IsraelMFA) June 8, 2024బాధకలిగించిందిప్రతి రెస్క్యూ ఆపరేషన్‌లో ఇజ్రాయెల్ సైనికులు తమ ప్రాణాల్ని ఫణంగా పెడుతున్నారు. హమాస్ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరుల్ని రక్షించే క్రమంలో తీవ్రంగా గాయపడిన యమమ్ (నేషనల్ పోలీస్ కౌంటర్-టెర్రరిజం యూనిట్)లో కమాండర్,టాక్టికల్ ఆపరేటర్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆర్నాన్ జమోరా ప్రాణాలొదలడం బాధకలిగించిందని ఇజ్రాయెల్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్వీట్లో పేర్కొంది.అర్నాన్ జమోరా ఎవరు?ఇజ్రాయెల్ మీడియా సంస్థ హారెట్జ్ ప్రకారం..ఇజ్రాయెల్ నగరం స్డెరోట్ సమీపంలో జమోరా స్డే డేవిడ్ గ్రామానికి చెందిన వారు. ఆయనకు భార్య మిచాల్ ఇద్దరు పిల్లలు, అతని తల్లిదండ్రులు రూవెన్ రూతీలతో కలిసి ఉంటున్నారు.ఇక జమెరా గతేడాది అక్టోబర్ 7 న యాద్ మొర్దెచాయ్ ప్రాంతంలో అనేక మంది హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ జామెరా ధైర్య సహాసాల్ని గుర్తు చేసుకున్నారు. గాజాలో హమాస్ చేతిలో ఉన్న 4 మంది బందీలను రక్షించడానికి సాహసోపేతమైన ఆపరేషన్‌కు నాయకత్వం వహించిన అర్నాన్ జమోరా మృతిపై విచారం వ్యక్తం చేశారు. -
Israel-Hamas war: వెళ్లిపోవాల్సిందే...రఫా ప్రజలకు మరోసారి ఇజ్రాయెల్ అల్టిమేటమ్
రఫా(గాజా స్ట్రిప్): గాజా దక్షిణాన ఉన్న చిట్టచివరి పెద్ద పట్టణం రఫాలో లక్షలాది మంది జనం ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోవాల్సిన పరిస్థితి దాపురించింది. రఫాను ఖాళీచేసి వెళ్లాలని జనాలకు ఇజ్రాయెల్ సైనికబలగాలు మరోసారి ఆదేశించాయి. ఉత్తర దిశ నుంచి మొదలెట్టి దక్షిణం దిశగా భూతల దాడులతో ఆక్రమణలు, దాడులను ఇజ్రాయెల్ సైన్యం కొనసాగిస్తోంది. అమెరికా, ఇతర మిత్రదేశాలు దూకుడు తగ్గించాలని మొత్తుకుంటున్నా ఇజ్రాయెల్ తన దాడులను ఆపట్లేదు. హమాస్ సాయుధుల ప్రతిదాడులతో శనివారం రఫా శివారుప్రాంతాలు భీకర రణక్షేత్రాలుగా మారిపోయాయి. రఫా తూర్పున మూడింట ఒక వంతు భూభాగంలో జనాలను ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ ఇప్పటికే ఖాళీచేయించింది. రఫా మొత్తాన్ని ఖాళీచేయించే దుస్సాహసానికి దిగితే మానవతా సాయం చాలా కష్టమవుతుందని, అమాయక పౌరుల మరణాలు మరింత పెరుగుతాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తంచేసింది. -
21 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి
జెరూసలేం: గాజాలో ఇజ్రాయెల్ రక్షణ దళా(ఐడీఎఫ్)నికి తొలిసారి ఎదురుదెబ్బ తగిలింది. ఒకే ఘటనలో 27 మంది సైనికులు మృతి చెందారు. అక్టోబర్ 7వ తేదీన హమాస్‌పై యుద్ధం మొదలయ్యాక ఇంతమంది సైనికులు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారి. యుద్ధం నిలిపేసి, బందీలను విడుదలయ్యేలా చూడాలంటూ నెతన్యాహు ప్రభుత్వంపై ఒత్తిళ్లు పెరుగుతున్న సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటనను ఇజ్రాయెల్‌కు ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఈ పరిణామంపై ప్రధాని నెతన్యాహు స్పందిస్తూ.. పూర్తి స్థాయి విజయం సిద్ధించే దాకా యుద్ధం కొనసాగుతుందని ప్రకటించారు. -
సిరియా, ఇరాక్‌పై ఇరాన్ క్షిపణి దాడులు
టెహ్రరాన్: సిరియా, ఇరాక్ ప్రాంతాలపై ఇరాన్ దాడులకు తెగబడింది. సిరియా, ఇరాక్ ఆధీనంలోని స్వయంప్రతిపత్తి కలిగిన కుర్దిస్థాన్ ప్రాంతంలో ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు జరిపింది. ఇజ్రాయెల్ గూఢచార బృందాల సమావేశంపై దాడి జరిపినట్లు ఇరాన్ పేర్కొంది. ఈ దాడుల్లో ఉగ్రవాదుల ప్రధాన కార్యాలయం ధ్వంసమైనట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ గ్రూప్స్ తెలిపింది. ఇందులో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించాయి. మరో ఆరుగురు తీవ్ర గాయాలపాలైనట్లు పేర్కొన్నాయి. మరణించిన పలువురు పౌరుల్లో ప్రముఖ వ్యాపారవేత్త పెష్రా డిజాయీ కూడా ఉన్నారని కుర్దిస్థాన్ డెమోక్రటిక్ పార్టీ తెలిపింది. బాలిస్టిక్ క్షిపణులతో సిరియాలోని పలు ప్రాంతాలపై కూడా ఇరాన్ దాడులు చేసింది. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్స్ కమాండర్లకు చెందిన స్థలాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. ఇరాన్‌లోని కెర్మాన్, రాస్క్లలో ఇటీవల ఉగ్రవాదులు దాడులు జరిపి పలువురు ఇరాన్ దేశస్థులను హతమార్చారు. ఆ దాడులకు ప్రతిస్పందనగా సిరియాపై ఇరాన్ క్షిపణులతో రెచ్చిపోయింది. సిరియాకు చెందిన అలెప్పో గ్రామీణ ప్రాంతాల్లో పేలుళ్లు వినిపించాయి. మధ్యధరా సముద్రం వైపు నుంచి 4 క్షిపణులు వచ్చినట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వార్ మానిటర్ తెలిపింది. సిరియా, ఇరాక్ ఆధీనంలోని కుర్దిస్థాన్ ప్రాంతంలో ఇజ్రాయెల్ గూఢచారి బృందాలు కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఇరాన్ ఆరోపిస్తోంది. గాజాపై ఇజ్రాయెల్ దాడులను నిరసిస్తున్న ఇరాన్ ఈ మేరకు దాడులు జరిపింది. ఇదీ చదవండి: పుతిన్, మోదీ కీలక చర్చలు.. రష్యాకు విషెస్ చెప్పిన ప్రధాని