'ప్లీజ్ నన్ను చంపకండి..' హమాస్ దళాల బందీలో యువతి | Israeli Woman Plea To Hamas Militants Group Who Kidnapped Her, Shocking Video Went Viral - Sakshi
Sakshi News home page

'ప్లీజ్ నన్ను చంపకండి..' హమాస్ దళాల బందీలో యువతి

Published Sun, Oct 8 2023 6:55 PM | Last Updated on Mon, Oct 9 2023 12:47 PM

Israeli Woman Plea To Hamas Group Who Kidnapped Her - Sakshi

ఇజ్రాయెల్‌-పాలస్తీనా యుద్ధంలో హమాస్ మిలిటెంట్ల అమానయ చేష్టలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఇజ్రాయెల్‌లో నిర్వహిస్తున్న పీస్‌ఫెస్టివల్‌పై హమాస్ ఉగ్రవాదులు.. అరమణి(25) అనే యువతిని ఎత్తుకెళ్లారు. ఆమెను మిలిటెంట్లు బైక్‌పై బలవంతంగా ఎక్కించుకుని వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బైక్‌పై తీసుకెళ్తున్న క్రమంలో మిలిటెంట్లను వేడుకుంటోంది అరమణి. ప్లీజ్ నన్ను చంపకండి.. దయచేసి వదలిపెట్టండి అంటూ ఏడుస్తోంది. ఆమె బాయ్‌ఫ్రెండ్‌ నాథన్‌ను కూడా హమాస్ దళాలు బంధించి తీసుకెళ్లారు. ఈ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో ఇప్పటికే ఓ అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయెల్ వీధుల్లో హమాస్ మిలిటెంట్లు ఓ మహిళా మృతదేహాన్ని నగ్నంగా ఊరేగిస్తున్న ఆందోళనకరమైన దృశ్యాలు బయటకొచ్చాయి. అయితే.. ఈ వీడియోలో కనిపిస్తున్నది జర్మనీ పౌరురాలైన తన సోదరి అని ఓ మహిళ ధృవీకరించింది.

ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య తీవ్ర యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాలస్తీనాకు చెందిన హమాస్‌ మిలిటెంట్లు శనివారం గాజా స్ట్రిప్‌ నుంచి ఇజ్రాయెల్‌పైకి వేలాది రాకెట్లు ప్రయోగించారు. ఆ వెంటనే గాజా గుండా భూ, వాయు, సముద్ర మార్గాల్లో పెద్ద సంఖ్యలో చొరబడ్డారు. పండుగ వేళ ఆదమరచిన ఇజ్రాయెలీలపైకి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఎక్కడ పడితే అక్కడ కాల్పులకు, విధ్వంసానికి దిగారు.

ఇదీ చదవండి: హమాస్ ఉగ్రవాదుల ఆకృత్యాలు.. మహిళను నగ్నంగా ఊరేగించి..


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement