వైఎస్‌ జగన్‌ ఎదుట కన్నీరు పెట్టుకున్న వృద్ధ మహిళా రైతు | Farmer Seshagiramma Appeals To YS Jagan Over Alleged Land Grab In Rayapudi, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ ఎదుట కన్నీరు పెట్టుకున్న వృద్ధ మహిళా రైతు

Apr 2 2026 5:14 PM | Updated on Apr 2 2026 6:37 PM

Farmer Seshagiramma Appeals to Jagan Over Alleged Land Grab in Rayapudi

సాక్షి, తాడేపల్లి: రాజధాని కోసం రాయపూడిలో తన భూమిని అక్రమంగా లాక్కున్నారని  వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఎదుట అమరావతి వృద్ధ మహిళా రైతు శేషగిరమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ శేషగిరమ్మ గురువారం వైఎస్‌ జగన్‌ను కలిశారు.

రాజధాని కోసం రాయపూడిలో తన భూమిని అక్రమంగా లాక్కున్నారని, నష్టపరిహారం ఇవ్వకుండా తనను మోసం చేశారని వాపోయారు. తనకు న్యాయం చేయాలని రెవెన్యూ, సీఆర్డీఏ అధికారుల చుట్టూ తిరిగినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదన్నారు. ఈ సందర్భంగా శేషగిరమ్మకు వైఎస్‌ జగన్‌ ధైర్యం చెప్పారు. ఆమెకు న్యాయం జరిగే వరకూ వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వైఎస్‌ జగన్‌ను కలిసిన వారిలో శేషగిరమ్మ కుటుంబ సభ్యులు బ్రహ్మేంద్ర కుమార్‌, శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.  

అమరావతి వృద్ధ మహిళా రైతు శేషగిరమ్మకు YS జగన్ భరోసా

Advertisement
 
Advertisement
Advertisement