Amaravati Lands
-
వైఎస్ జగన్ ఎదుట కన్నీరు పెట్టుకున్న వృద్ధ మహిళా రైతు
సాక్షి, తాడేపల్లి: రాజధాని కోసం రాయపూడిలో తన భూమిని అక్రమంగా లాక్కున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఎదుట అమరావతి వృద్ధ మహిళా రైతు శేషగిరమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ శేషగిరమ్మ గురువారం వైఎస్ జగన్‌ను కలిశారు.రాజధాని కోసం రాయపూడిలో తన భూమిని అక్రమంగా లాక్కున్నారని, నష్టపరిహారం ఇవ్వకుండా తనను మోసం చేశారని వాపోయారు. తనకు న్యాయం చేయాలని రెవెన్యూ, సీఆర్డీఏ అధికారుల చుట్టూ తిరిగినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదన్నారు. ఈ సందర్భంగా శేషగిరమ్మకు వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. ఆమెకు న్యాయం జరిగే వరకూ వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో శేషగిరమ్మ కుటుంబ సభ్యులు బ్రహ్మేంద్ర కుమార్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
అమరావతిపై లోక్‌సభలో ఎంపీ ధర్మేంద్ర కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరం విశాఖ ఉంది.. విశాఖ రాజధానిగా అభివృద్ధి చేస్తే సహజంగా ఉండేదని లోక్‌సభలో సమాజ్‌వాదీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ అన్నారు. ల్యాండ్ పూలింగ్, నిధుల సమస్య వచ్చేదేకాదు. ల్యాండ్ పూలింగ్ పెద్దలకే లాభం.. రైతులకు ఏం వస్తుందంటూ ధర్మేంద్ర ప్రశ్నించారు. అమరావతి కోసం భారీ ఎత్తున రైతుల నుంచి భూములు తీసుకున్నారు. రైతులకు ఇప్పటివరకు పరిహారం ఎందుకివ్వలేదు? అంటూ ఆయన నిలదీశారు.ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న ధరేంద్ర.. బిహార్‌ను మోసం చేసినట్టు ఏపీని మోసం చేయకండి అంటూ వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా ఇస్తే నిధుల కోసం కేంద్రం ముందు సాగిలపడక్కర్లేదంటూ వ్యాఖ్యానించారు.ఇప్పుడు ఈ అంశాని ఎందుకు ప్రస్తావించడం లేదు: ఎంపీ అర్వింద్ఉద్ధవ్ సేన ఎంపీ అర్వింద్‌సావంత్ మాట్లాడుతూ.. ఏపీ విభజన సమయంలో టీడీపీ ఐదేళ్లు ప్రత్యేక హోదా కోరింది. అప్పుడు శివసేన, టీడీపీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. అప్పుడు ఐదేళ్లు హోదా కావాలని పదేపదే అడిగారు. ఇప్పుడు ఈ అంశాని ఎందుకు ప్రస్తావించడం లేదు’’ అంటూ ఆయన ప్రశ్నించారు. -
కిలోమీటర్ కు 170 కోట్లా..కొంచమైనా సిగ్గుందా బాబు
-
గోల్డ్ బిస్కెట్లతో కడుతున్నావా? బాబుపై జగన్ సెటైర్లే సెటైర్లు
-
దేశంలోనే అతిపెద్ద స్కాంకు, కరప్షన్ కు బాబు క్యాపిటల్
-
స్కామ్‌లు రాజధాని అమరావతి..చంద్రబాబు కష్టపడి సాధించిన ఘనత
-
బాబు అమరావతి అవినీతి చిట్టా.. విస్తుపోయే షాకింగ్ నిజాలను బయటపెట్టిన జగన్
-
ఫస్ట్ 50వేల ఎకరాలకే దిక్కు లేదు.. 3 మరో 50 వేల ఎకరాలు బాబు టార్గెట్ 2 లక్షల కోట్లు..
-
ఇదేమన్నా తొక్కుడు బిళ్ళ అనుకున్నావా.. అమరావతి రైతులతో ఆటలా..
-
బాబు సర్కారు డైవర్షన్ డ్రామా!
సాక్షి, అమరావతి: రాజధానిలో రైతుల సమస్యలు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. వాటి నుంచి తప్పించుకునేందుకు మరోసారి సరికొత్త డ్రామాకు తెరలేపింది. ఎన్నెన్నో సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కుతంత్రానికి పాల్పడుతోంది. గతంలో ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక దాదాపు రెండేళ్ల తర్వాత రాజధానికి చట్టబద్ధత అంశం గుర్తుకొచ్చినట్లు నటిస్తోంది. ప్రజా సమస్యలన్నింటినీ పక్కదారి పట్టించేలా అమరావతికి చట్టబద్ధత పేరుతో చట్టవిరుద్ధ తీర్మానం చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు, మేధావులు ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పు పడుతున్నారు. శాసన మండలిని హాజరు పరచకుండా అసెంబ్లీలో మాత్రమే తీర్మానం చేయడాన్ని ఇందుకు నిదర్శనంగా ఎత్తి చూపుతున్నారు. ‘రాజధాని పేరుతో సాగుతున్న అవినీతిపై చర్చ జరగాలి.. ఇప్పటిదాకా ఎలా దోచుకున్నారో, ఎలా దోచుకోబోతున్నారో చర్చ జరగాలి.. ఏ రైతుకు ఎక్కడ ఏ ప్లాటు ఇచ్చారో చర్చ జరగాలి.. ఇప్పటికీ ప్లాట్లు ఇవ్వకుండా మోసం చేయడంపై చర్చ జరగాలి.. సమస్యల పరిష్కారం కోసం రాజధాని రైతులు సీఆర్డీఏ చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండటంపై చర్చ జరగాలి.. ఏడేళ్లు మీరే అధికారంలో ఉన్నా భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఇవ్వక పోవడంపై చర్చ జరగాలి.. రెండవ, మూడవ విడత భూ సేకరణ యత్నాలపై చర్చ జరగాలి.. రాజధాని పేరుతో ఎంత అప్పు చేశారో.. భవిష్యత్తులో ఇంకా ఎంత అప్పు తెస్తారో చర్చ జరగాలి.. ఆ అప్పుల్లోంచి ఎంత దోచుకున్నారో.. దోచుకోబోతున్నారో కూడా చర్చ జరగాలి.. సూపర్ సిక్స్ హామీలపై, కాంట్రాక్టుల్లో కమీషన్లపైనా చర్చ జరగాలి.. రైతులు, విద్యార్థి, ఉద్యోగ వర్గాల సమస్యలపై చర్చ జరగాలి’ అని ప్రజలు, మేధావులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇన్ని సమస్యలను గాలికొదిలేసి ఒక్క జగన్‌ను తిట్టడానికే అసెంబ్లీ సమావేశమా? అని నిలదీస్తున్నారు. అన్ని రంగాల్లోనూ ప్రభుత్వం తన వైఫల్యం నుంచి తప్పించుకునేందుకే ఈ ఎత్తుగడ అంటూ మండిపడుతున్నారు. ఇది చట్ట ధిక్కరణేఅమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ చంద్రబాబు ప్రభుత్వం చేసిన తీర్మానం చట్టాన్ని ధిక్కరిస్తున్నట్లుగా ఉందని రాజ్యాంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒకవైపు చట్టాలు, రాజ్యాంగం గురించి గొప్పగా చెబుతూనే వాటికి తిలోదకాలు ఇచ్చేలా తీర్మానం చేయడాన్ని ఎత్తి చూపుతున్నారు. రాష్ట్ర శాసన వ్యవస్థలో శాసనసభ, శాసన మండలి భాగంగా ఉంటే, కేవలం శాసనసభలో మాత్రమే ఈ తీర్మానం ఎలా చేస్తారనే ప్రశ్నకు ప్రభుత్వం వైపు నుంచి సమాధానం కరువైంది. సాధారణంగా ఈ రెండు సభలు ఎప్పుడూ సమాంతరంగా జరుగుతాయి. ప్రత్యేక సెషన్ పేరుతో కేవలం అసెంబ్లీని మాత్రమే నిర్వహించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని నిపుణులు చెబుతున్నారు. ఒక సభలో మెజారిటీ ఉండి, రెండవ సభలో లేనప్పుడు.. రెండవ సభను కావాలనే హాజరు పరచకపోవడం చట్టసభల సమగ్రతను దెబ్బ తీయడమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా ఒక అంశానికి పూర్తి స్థాయి చట్టబద్ధత రావాలంటే.. అది బిల్లు రూపంలో ఉభయ సభల ఆమోదం పొందాల్సి ఉంటుంది. తీర్మానం అయినా ఉభయ సభలు చేస్తేనే దానికి నైతికత ఉంటుంది. కేవలం ఒక సభ మాత్రమే తీర్మానం చేస్తే, అది ఆ సభలోని అధికార పార్టీ రాజకీయ తీర్మానంగానే మిగిలి పోతుందనే వాదన వినిపిస్తోంది. చంద్రబాబు ఇప్పుడు అమరావతి చట్టబద్ధత కోసం అంటూ చేసిన తీర్మానం రాజకీయ తీర్మానంగానే మిగిలిపోయింది. శాసన మండలిని బైపాస్ చేస్తూ చేసిన ఈ తీర్మానం ఒక రాజకీయ గిమ్మిక్కే తప్ప అందరి ఆమోదంతో చేసింది ఎలా అవుతుందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.అమరావతి కుంభకోణాలు బయట పడతాయని భయం రాజధాని అమరావతి ముసుగులో జరుగుతున్న వేల కోట్ల రూపాయల అవినీతిని వైఎస్సార్సీపీ సభ్యులు ప్రశ్నిస్తారనే భయంతోనే చంద్రబాబు శనివారం కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించలేదని స్పష్టమవుతోంది. రాజధాని ముసుగులో 2014–19లోనే ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి, వేల ఎకరాల భూములను తను, తన బినామీల గుప్పిట్లో పెట్టుకున్నారు. కాంట్రాక్టుల ముసుగులో అప్పట్లోనే వేల కోట్ల రూపాయలు దండుకున్నారు. ఇప్పుడు ఆ భూములకు రేట్లు పెరిగేలా హంగామా చేయడం, నిర్మాణాల పేరుతో రెట్టింపు అంచనాలతో భారీగా కమీషన్లు తీసుకోవడం, ఇందుకోసం భారీగా అప్పులు తెస్తున్న ఉదంతాలన్నీ చర్చకు వస్తాయనే కౌన్సిల్ సమావేశం జరపకుండా కేవలం అసెంబ్లీ సమావేశం మాత్రమే పెట్టి తీర్మానం చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్‌పై బురదజల్లడానికి పోటాపోటీ ఈ తీర్మానంపై శాసనసభలో జరిగిన చర్చ ఆద్యంతం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యంగానే సాగింది. ఆయనపై బురదజల్లి లబ్ధి పొందడానికి చంద్రబాబు, లోకేశ్ ప్రయత్నించగా.. వారిని బుట్టలో వేసుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు పోటీ పడి జగన్‌పై తిట్ల వర్షం కురిపించారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మరీ బరితెగించి జగన్‌పై నోరు పారేసుకోవడం చూసి అధికార పార్టీ నాయకులే ఆశ్చర్యపోయారు. 2019 ఎన్నికల్లో జగన్‌కు ఓట్లేసి ప్రజలు తప్పు చేశారంటూ ప్రజాభిప్రాయాన్ని సైతం గౌరవించకుండా వారినీ ఆడిపోసుకోవడం చూస్తే అధికార గర్వం అచ్చెన్నాయుడి తలకు ఏ స్థాయిలో ఎక్కిందో అర్థమవుతోందని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాసనసభలో ఆయన ఇంత అడ్డగోలు భాష మాట్లాడడం వెనుక మంత్రి పదవిని రక్షించుకునే ఆరాటం ఉందని టీడీపీ నేతలే చెప్పుకుంటున్నారు. ఆయన మంత్రి పదవి ఊడిపోయేలా ఉండడంతో ఎలాగైనా లోకేశ్‌ను ప్రసన్నం చేసుకునేందుకు జగన్‌పై చెలరేగిపోయినట్లు ఎమ్మెల్యేలు చర్చించుకోవడం గమనార్హం. తిన్నింటి వాసాలు లెక్కపెట్టామన్న వసంత, యార్లగడ్డవంగలపూడి అనిత, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, రెడ్డప్పగారి మాధవిరెడ్డి తదితరులు జగన్‌ను తిట్టడానికి పోటీ పడ్డారు. వసంత కృష్ణప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావులు తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు తమ ప్రసంగాల ద్వారా చాటారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉంటూనే చంద్రబాబుకు మద్దతుగా వాదన వినిపించామని నిస్సిగ్గుగా వారిద్దరూ సభలో చెప్పుకోవడం విశేషం. అప్పట్లో తాను అమెరికా వెళ్లినప్పుడు కూడా అమరావతిని స్వాగతిస్తూ పచ్చ పత్రికకు ప్రకటన ఇచ్చినట్లు యార్లగడ్డ సభలో చూపించారు. సభలో ఆద్యంతం చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్, ఇతర నేతలంతా వైఎస్ జగన్ అమరావతికి వ్యతిరేకం అన్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. వాస్తవానికి ఆయన ఎప్పుడూ అమరావతిని వ్యతిరేకించలేదన్న విషయాన్ని దాచిపెట్టి, కేవలం ఆయనపై అభాండాలు మోపుతూ.. విమర్శలు, ఆరోపణలు చేస్తూ ఒకరి భుజాలు ఒకరు తడుముకుని బల్లలు చరుచుకున్నారు. స్పీకర్ స్థానంలో తటస్థంగా ఉండాల్సిన చింతకాయల అయ్యన్న పాత్రుడు రాజకీయ ప్రసంగం చేసి సభ ఔన్నత్యాన్ని మరోసారి దెబ్బతీశారు. ఆ 11 మంది ఈసారి కూడా సభకు రాలేదని వైఎస్సార్సీపీపై రాజకీయ విమర్శ చేశారు. పనిలో పనిగా చంద్రబాబును పొగుడుతూ స్వామి భక్తిని చాటుకున్నారు.రాజధాని రైతులను మాయ చేసేందుకే..తమ భూములు తీసుకుని 12 ఏళ్లు దాటినా, ఇంత వరకు ప్లాట్లు ఇవ్వకుండా కార్పొరేట్ కంపెనీలకు మాత్రం వందల ఎకరాలు కట్టబెడుతుండడంపై రాజధాని రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో తీసుకున్న భూముల సంగతి ఇంకా తేల్చకుండానే ఇప్పుడు రెండవ విడత భూ సమీకరణ చేస్తుండడం, మూడవ విడతకు సిద్ధమవుతుండడంపై రాజధాని ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. గ్రామ సభల్లో రైతుల నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అధికారులు నీళ్లు నములుతున్నారు. ఈ నేపథ్యంలో రాజధానికి చట్టబద్ధత అంటూ రాజధాని రైతులను మాయ చేసేందుకు ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేసిందని ఉన్నత స్థాయి ఉద్యోగ వర్గాల సమాచారం. మరోవైపు ఎన్నికల్లో సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన హామీలు అమలు చేయక పోవడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉద్యోగుల్లోనూ అంతకంతకూ ఆందోళన పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో వారిని మభ్య పెట్టేందుకు, వారి దృష్టి మళ్లించేందుకు చట్టబద్ధ తీర్మానం పేరుతో చంద్రబాబు హడావుడి చేస్తున్నారని ఇట్టే తెలుస్తోంది. -
అమరావతి పేరుతో అడ్డగోలుగా దోచుకుంటున్నావ్ .. KK రాజు సంచలన రియాక్షన్
-
అమరావతిలో భారీ అగ్నిప్రమాదం
-
శాశ్వత భవనాల నిర్మాణం పేరుతో నారా వారి భారీ స్కాం..?
-
సమస్యలు పరిష్కరించాలంటూ రాజధాని రైతుల ధర్నా
తాడికొండ: రాజధానిలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రైతులు, రైతు కూలీలు సోమవారం తుళ్లూరు మండలం రాయపూడిలో ధర్నా చేశారు. సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ భార్గవ తేజకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజధాని రైతులకు, పేదలకు ఇచ్చే వార్షిక కౌలు, పెన్షన్లను మరో పదేళ్ల పాటు పొడిగించాలని, పేదలకు ఇచ్చే పెన్షన్‌ను రూ.10 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో వచ్చే సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరారు. ధర్నాలో సీఐటీయూ, రాజధాని అభివృద్ధి వేదిక నేతలు వై.నేతాజీ, ఎం.రవి, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. -
‘అమరావతి పేరుతో వ్యాపారం చేస్తున్నారు’
గుంటూరు: రాజధాని అమరావతి పేరుతో వ్యాపారం చేస్తున్నారని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ధ్వజమెత్తారు. సంవత్సరానికి మూడు పంటలు పండే భూములను చంద్రబాబు తీసుకున్నాడని, అలా చేయవద్దని ఆయనకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు. రైతుల నుంచి అడ్డగోలుగా భూములు లాక్కున్నారని మండిపడ్డారు. నా సలహాలు, సూచనలను చంద్రబాబు ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు. మొత్తం వ్యవసాయ భూములను కాంక్రీట్ తో నింపేశారు. భూములు ఇచ్చిన రైతుల ప్రయోజనాలను కాపడాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. భూసేకరణ సమయంలో ఇచ్చిన హామీలకు దిక్కు ఎవరు. అమరావతి రాజధానిని కూడా పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేస్తారా?, అమరావతి రాజధాని పేరుతో వ్యాపారం చేస్తున్నారు. రైతుల నుండి అడ్డగోలుగా భూములు లాక్కున్నారు.రెండో విడత భూ సేకరణకు రైతులు సిద్ధంగా లేరు’ అంటూ విమర్శించారు. -
భూ దాహం తీరనిది!
సాక్షి, అమరావతి: ఇప్పటికే 53,748 ఎకరాల్లో (217.23 చదరపు కిలోమీటర్లు) రాజధాని నిర్మాణ పనులను చేపట్టిన ప్రభుత్వం.. రెండో దశలో 50 గ్రామాల పరిధిలో 1,75,347.43 ఎకరాల్లో (709.57 చదరపు కిలోమీటర్లు) రాజధానిని విస్తరించడానికి ‘మాస్టర్ ప్లాన్’ రూపకల్పనకు ఫిబ్రవరి 16న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్లో బిడ్ల దాఖలు గడువు బుధవారంతో ముగియనుంది. అదే రోజున సాంకేతిక, గురువారం ఆర్థిక బిడ్‌ను తెరిచి అర్హత సాధించే కన్సల్టెన్సీకి మాస్టర్ ప్లాన్ తయారీ బాధ్యతలు అప్పగించనుంది. తొలి దశ, రెండో దశ కలుపుకుంటే మొత్తం 926.8 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నిర్మించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించినట్లు స్పష్టమవుతోంది. ఇటీవల బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట 53 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణానికి వందేళ్ల సమయం పట్టొచ్చునని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఈ లెక్కన 1.75 లక్షల ఎకరాల్లో రాజధాని విస్తరణకు ఇంకెన్ని వందల ఏళ్లు పడుతుందని సామాజిక, ఆర్థిక వేత్తలు, సిటీ ప్లానర్లు నిలదీస్తున్నారు. దేశంలో మహా నగరాలైన గ్రేటర్ హైదరాబాద్ 650 కి.మీ, గ్రేటర్ చెన్నై 438, బృహత్ బెంగళూరు 741, గ్రేటర్ ముంబై విస్తరించింది 603.4 చదరపు కిలోమీటర్లలోనే ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఆ మహా నగరాలను ఎవరూ నిర్మించలేదని, వాటంతట అవే మహా నగరాలుగా అభివృద్ధి చెందాయని స్పష్టం చేస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే అంతర్జాతీయ, జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అధిక వడ్డీలకు రూ.47,438 కోట్లు అప్పు తెచ్చారని.. నగర నిర్మాణం పూర్తయ్యే సరికి రూ.లక్షల కోట్ల అప్పు తేవాల్సి ఉంటుందని.. ఇది రాష్ట్రాన్ని పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలోకి నెడుతుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా అమరావతి రాజధాని 2,29,095.43 ఎకరాల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. 11 ఏళ్లుగా ప్రాథమిక దశను దాటని రాజధాని ⇒ రాజధానిపై ముందే వందిమాగధులు, బినామీలకు లీకులు ఇచ్చి, ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి రైతుల నుంచి కారుచౌకగా భూములు కాజేసిన తర్వాత 2015లో గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో 29 గ్రామాల పరిధిలో రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అప్పట్లో 53,748 ఎకరాల్లో (217.23 చదరపు కిలోమీటర్లు) రాజధాని నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. ⇒ ఇందులో ప్రభుత్వ, అటవీ భూమి పోనూ 34,390 ఎకరాలను రైతుల నుంచి భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) ద్వారా సమీకరించింది. పల్లపు ప్రాంతం.. కొండవీటి వాగు, పాలవాగు వరద ప్రభావిత ప్రాంతమైన ఆ భూమిలో రాజధాని నిర్మించడానికి కనీస మౌలిక సదుపాయాల కల్పనకే ఎకరానికి రూ.2 కోట్లు చొప్పున రూ.లక్ష కోట్లు అవసరం అవుతుందంటూ అప్పట్లో కేంద్రానికి సీఎం చంద్రబాబు డీపీఆర్ సమర్పించారు. ⇒ కానీ.. 11 ఏళ్లవుతున్నా ఇప్పటికీ రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వలేదు. 2014–19 మధ్య రాజధాని నిర్మాణానికి రూ.5,500 కోట్లు వ్యయం చేసినా, శాశ్వత నిర్మాణం ఒక్కటంటే ఒక్కటీ కట్టలేదు. తాత్కాలిక నిర్మాణాల ముసుగులో కాంట్రాక్టర్లతో కలిసి భారీ ఎత్తున దోచుకున్నారని.. షాపూర్జీ పల్లోంజీ నుంచి సీఎం వ్యక్తిగత కార్యదర్శి కమీషన్లు తీసుకుని, ఐటీ శాఖకు పట్టుబడటాన్ని బట్టి చూస్తే రాజధాని నిర్మాణంపై చంద్రబాబు సర్కార్‌కు అప్పట్లో ఎంత చిత్తశుద్ధి ఉందన్నది స్పష్టమవుతోందని ఆర్థిక నిపుణులు ఎత్తిచూపుతున్నారు. ⇒ 2024 జూన్ 12న మళ్లీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. అధికారంలోకి వచ్చి ఇప్పటికే 21 నెలలు పూర్తయింది. రాజధాని నిర్మాణ పనుల కోసం రూ.47,387 కోట్లు అప్పు తెచ్చి.. సుమారు రూ.60 వేల కోట్ల అంచనాతో పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారు. కానీ.. పనుల పురోగతిని పరిశీలిస్తే నిర్దేశించిన లక్ష్యం మేరకు పనులు సాగడం లేదని అధికార వర్గాలే చెబుతున్నాయి. తొలి విడత సమీకరణ కింద భూములు ఇచ్చిన రైతులకు పదేళ్లలో అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని, ఆ పదేళ్లు కౌలు చెల్లిస్తామని సీఆర్డీఏ చట్టం ద్వారా హామీ ఇచ్చారు. కానీ.. ఆ మేరకు హామీ అమలు చేయలేదు. దాంతో రైతులకు కౌలు చెల్లింపును మరో ఐదేళ్లు పొడిగించారు.పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలోకి రాష్ట్రం ⇒ రాజధానికి ఇప్పటికే సమీకరించిన 53,748 ఎకరాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికే ఎకరానికి సగటున రూ.2 కోట్ల చొప్పున రూ.లక్ష కోట్లు అవసరమని 2016–18 మధ్య కేంద్రానికి ప్రభుత్వం డీపీఆర్‌లు పంపింది. గతేడాది ఏప్రిల్ 16న రాజధాని తొలి దశ నిర్మాణానికే రూ.77,249 కోట్లు అవసరమని 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు.⇒ ప్రస్తుత ధరల ప్రకారం 1.75 లక్షల ఎకరాల్లో రాజధానిని విస్తరించాలంటే మౌలిక సదుపాయాల కల్పనకే రూ.3.50 లక్షల కోట్లు అవసరం. ఇటీవల బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట 53 వేల ఎకరాల్లో రాజధాని అభివృద్ధికి వందేళ్ల సమయం పడుతుందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో తొలి దశ రాజధాని నిర్మాణం పూర్తయ్యే సరికి వ్యయం రూ.లక్షల కోట్లకు చేరుతుందని అధికార వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ⇒ ఈ లెక్కన రాజధానిని 1.75 లక్షల ఎకరాలకు విస్తరించే పనులు పూర్తి కావాలంటే ఇంకెన్ని వందల ఏళ్లు పడతాయి? ఇంకెన్ని రూ.లక్షల కోట్లు వ్యయం అవుతుంది? ఇంకెన్ని రూ.లక్షల కోట్ల అప్పు తేవాలని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని రాజధాని నిర్మాణం పేరుతో తెచ్చే అప్పులతో పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.తొలి విడతకు మూడింతలు.. ⇒ రాజధాని 29 గ్రామాలకే పరిమితమైతే చిన్న మున్సిపాలిటీగా మిగిలి పోతుందని, భూముల ధరలు పెరగాలంటే ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని.. అందుకోసం రెండో విడత భూ సమీకరణ తప్పదని సీఎం చంద్రబాబు తెగేసి చెప్పారు. అందులో భాగంగా పల్నాడు జిల్లా అమరావతి మండలంలో నాలుగు గ్రామాలు, గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో మూడు గ్రామాలు.. వెరసి ఏడు గ్రామాల్లో 20,494 ఎకరాల్లో (82.9 చదరపు కిలోమీటర్లు) భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ⇒ వాటితోపాటు గుంటూరు జిల్లాలో గుంటూరు, మంగళగిరి, మేడికొండూరు, పెదకాకాని, తాడికొండ మండలాలు, పల్నాడు జిల్లాలో అమరావతి, యడ్లపాడు, పెదకూరపాడు మండలాల్లోని 43 గ్రామాల్లో 1,54,853.43 ఎకరాలకు (626.67 చదరపు కిలోమీటర్లు) రాజధాని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 50 గ్రామాల్లో 709.57 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ⇒ ఇందులో ఏడు గ్రామాల్లోని 20,494 ఎకరాలను తొలుత భూ సమీకరణ చేసి.. ఆ తర్వాత అవసరమైనప్పుడు మిగతా భూమిని విడతల వారీగా సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగా రాజధానిని ఆనుకుని ఉత్తరాన కృష్ణా నది నుంచి దక్షిణాన అవుటర్ రింగ్ రోడ్డు వరకు.. తూర్పున చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి వరకు ఉన్న ప్రాంతంలో రాజధాని విస్తరణకు మాస్టర్ ప్లాన్ తయారీకి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ⇒ మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు 6 నెలలు గడువుగా నిర్దేశించింది. తొలుత భూ సమీకరణ చేస్తున్న ఏడు గ్రామాల్లో వివరణాత్మక ప్రణాళిక.. ఆ తర్వాత మిగిలిన 43 గ్రామాల్లో రాజధాని విస్తరణకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని నిర్దేశించింది. రహదారులు, వరద నీటి నియంత్రణ, మురుగు నీటి వ్యవస్థ, విద్యుత్ సౌకర్యం వంటి మౌలిక సదుపాయాల కల్పన.. ఆ పనులకు జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తీసుకోవడం.. భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు కేటాయించగా సీఆర్డీఏకు మిగిలే భూమిని విక్రయించడం, దీర్ఘకాలిక లీజు, జాయింట్ డెవలప్మెంట్ వంటి నమునాల ద్వారా ఆర్థిక వనరుల సమీకరణ వంటి మార్గాలను అన్వేషిస్తూ మాస్టర్ ప్లాన్ రూపొందించాలని నిర్దేశించింది. -
ఫేజ్ 1 అట్టర్ ఫ్లాప్ మరోసారి అమ్మకానికి అమరావతి
-
రాజధాని రైతుల ప్లాట్ల కేటాయింపు లాటరీలో గందరగోళం
సాక్షి, గుంటూరు: రాయపూడి సీఆర్డీఏ కార్యాలయంలో రాజధాని రైతుల ప్లాట్ల కేటాయింపు లాటరీలో గందరగోళం నెలకొంది. రాజధాని రైతుల ప్లాట్ల కేటాయింపు లాటరీలో గందరగోళం నెలకొంది. గతంలో సీఆర్డీఏ కేటాయించిన అభ్యంతరకరమైన ప్లాట్లపై అధికారులు మళ్లీ లాటరీ నిర్వహించారు. ఈ లాటరీలో ఈసారి కూడా తమకు వీధి శూల ప్లాట్లు వచ్చాయంటూ రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు.రాజధానికి భూములు ఇచ్చి ప్లాట్ కోసం మీ చుట్టూ 11 ఏళ్ల నుంచి తిరుగుతున్నామని రైతులు మండిపడుతున్నారు. తాము కేటాయించిన ప్లాట్లే తీసుకోవాలని.. ఇష్టం ఉంటే తీసుకోండి.. లేకపోతే లేదని చెబుతున్నారంటూ సీఆర్డీఏ అధికారుల తీరుపై రైతులు అసహనం వ్యక్తం చేశారు. రైతుల ఆగ్రహంతో ప్లాట్ల లాటరీ నిలిచిపోయింది. -
Guntur : కోట్ల భూమికి.. 30 లక్షలా? చెత్త ప్యాకేజీ..
-
అంతుచిక్కని పజిల్... అమరావతి!
అమరావతి... ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పెద్ద పజిల్. రాష్ట్రం భవిష్యత్తు మొత్తం దీంతోనే ముడిపడిందని కూటమి పెద్దలు చెబుతున్నా... దాన్నో రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చడం వల్లనే ప్రస్తుత సంక్షోభం నెలకొందని అందరూ అనుకుంటున్నారు. కేవలం 29 గ్రామాల్లో లక్షల కోట్లు గుమ్మరిస్తున్నామని చెబుతున్నా అక్కడి రైతులు మాత్రం అసంతృప్తితో రగిలిపోతున్నారు. సమస్య ఎంత తీవ్రంగా మారిందంటే.. తమ ఆవేదన వ్యక్తం చేస్తూ గుండెపోటుతో మరణించేంత! దురదృష్టవశాత్తూ ఈ అసంతృప్తులు, మరణాలు కూటమి నేతల మనసుల్లో ఏమాత్రం కదలిక, మార్పు తీసుకు రాలేకపోయాయి. ఉన్న ఇళ్లు కూల్చకుండానే అభివృద్ధి చేస్తామని మన్నటివరకూ ఊదరగొట్టిన చంద్రబాబు, మంత్రి నారాయణల గొంతులిప్పుడు మూగబోయాయి ఎందుకు? సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ అని.. ఇప్పుడు వేల కోట్ల అప్పులెందుకు చేస్తున్నారు? ఉన్నది చాలదన్నట్లు మరో 44 వేల ఎకరాల భూమి పూలింగ్ కోసం ఎందుకు పాకులాడుతున్నట్లు? రాష్ట్ర ప్రజల మనసుల్లోని సమాధానం లేని ప్రశ్నలివి. కొద్ది రోజుల క్రితం మందడం గ్రామసభలో రామారావు అనే రైతు రాజధాని కోసం తానిచ్చిన రెండెకరాల భూమికి బదులుగా వాగులో ఫ్లాట్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తూ అక్కడే గుండెపోటుకు గురై మరణించడం తీవ్ర కలకలం రేపింది. రామారావు బంధువులు, కొందరు స్థానికులు ‘‘మళ్లీ ఎవరిని చంపడానికి వచ్చారు’’ అంటూ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే శ్రావణకుమార్లను ప్రశ్నించిన తీరు రాజధాని ప్రాంతంలో రైతుల ఆగ్రహానికి దర్పణం పడుతుంది. రామారావుది ప్రభుత్వ హత్యే అని సీపీఐ నేత కె.నారాయణ విమర్శించారు. గతంలో విపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడ ఎవరు ఎలా మరణించినా, అమరావతి ఉద్యమంలోనే మృతి చెందారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడమే కాకుండా, వారి కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన చంద్రబాబు సి.ఎమ్. అయ్యాక రామారావు ఇంటికి వెళ్లలేదు. ఫోన్లో పరామర్శించారని ఎల్లో మీడియా తెలిపింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు కూడా రామరావుది సహజ మరణంగా చూపించడానికి తాపత్రయపడ్డాయి. రామారావు అంత గట్టిగా మంత్రిని ప్రశ్నిస్తే ఆయన కూల్‌గా మాట్లాడి కుప్పకూలారని ఒక పత్రిక హెడింగ్ పెట్టింది. ప్లాట్ల కేటాయింపులో జరుగుతున్న అన్యాయం రామారావు ఒక్కరి సమస్య కాదు. వేలాదిమంది ఇతర రైతుల బాధ. చిన్నకారు, సన్నకారు రైతులకు ఎదురవుతున్న సంక్షోభం. కీలకమైన ప్రదేశాలలో ఉన్న తమ పొలాలను ప్రభుత్వానికి ఇస్తే, తమకు చెరువులలో, వాగులలో ప్లాట్లు ఇస్తున్నారేమిటని ప్రశ్నిస్తున్నారు. అలాగే పలుకుబడిని బట్టి తూర్పు ఫేసింగ్ ప్లాట్లు కేటాయిస్తున్నారని మరి కొందరు వాపోతున్నారు. సీడ్ యాక్సిస్ రోడ్డు చెంత తమకు ఎందుకు ప్లాట్లు ఇవ్వరని వారు ప్రశ్నిస్తున్నారు. కాగా ఆసక్తికరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగు రోడ్ల మధ్యలో ప్లాట్ ఎలా కొనుగోలు చేయగలిగారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రశ్నించడం విశేషం. ఇక ఆయా గ్రామాల వారికి కొత్త టెన్షన్ పట్టుకుంది. భూ సమీకరణ సమయంలో గ్రామాలకు ఎలాంటి హానీ జరగదని చంద్రబాబు హామీ ఇచ్చారు. కాని ప్రస్తుతం రోడ్ల నిర్మాణంతో గ్రామాలు ఛిద్రమవుతున్నాయని ఒక జర్నలిస్టు తన పరిశీలన వ్యాసంలో తెలిపారు. అబ్బరాజుపాలెం, దొండడపాడు, పిచ్చుకలపాలెం, రాయపూడి, నేలపాడు, శాఖమూరు, తుళ్లూరు తదితర 11 గ్రామాలలో తక్షణం ప్రభావితం అవుతుండగా, మొత్తం 20 గ్రామాలలో ఇళ్లు, భవనాలు పోతాయని అనధికార సమాచారంగా ఉందని ఆ కథనంలో తెలిపారు. ఒక్క మందడంలోనే 147 ఇళ్లను తొలగించవలసి వస్తోందట. చంద్రబాబు ఎప్పటికప్పుడు తన తక్షణ అవసరాల కోసం ఏదో ఒక హామీ ఇచ్చేయడం, ఆ తర్వాత దానికి విరుద్ధంగా వ్యవహరించడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఇళ్లు కోల్పోయే వారికి ప్రత్యామ్నాయ స్థలాలు ఇస్తారన్న గ్యారంటీ లేదట. బాధితులు కోరిన విధంగా ఖరీదైన ప్రాంతాలలో స్థలాలు ఇవ్వలేమని సీఆర్డీయే అధికారులు చెబుతున్నారట. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ తదితర ఆర్థిక సంస్థల నుంచి వేల కోట్ల అప్పు తెస్తున్న ప్రభుత్వం వాటిని దుబారా చేయడం కూడా విమర్శలకు దారి తీస్తోంది. పూలింగ్ లే అవుట్ కింద రాజధాని జోన్ 8లో ఎకరా అభివృద్దికి ఏకంగా రెండు కోట్లు ఖర్చు పెట్టబోతున్నారట. ఇంత వ్యయం దేశంలో ఇంకెక్కడైనా జరుగుతుందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అమరావతి ట్రంక్ రోడ్ల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం ఆమోదించిన మొత్తం ఖర్చు రూ.7794 కోట్లుగా ఉండడంపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. వరద నీటిని ఎత్తిపోయడానికి ఏ రాజధానిలోనూ వరదనీటి ఎత్తిపోతకు ప్రత్యేక లిఫ్ట్‌లు లేవని ప్రముఖ నిపుణుడు రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. హైదరాబాద్ వంటి చోట్ల కూడా భూమి కొనుగోలు చేసి నిర్మాణాలు చేసినా చదరపు అడుగుకు రూ.నాలుగైదు వేలు కాదని, అమరావతిలో మాత్రం రూ.తొమ్మిది, పది వేలు అవడానికి కారణం ఏమిటన్నది మరికొందరి ప్రశ్న. చంద్రబాబు అండ్ కో రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నా రియల్ ఎస్టేట్ పెద్దగా లేకపోవడం అక్కడివారిలో నిరాశకు దారి తీస్తోంది. గతంలో అమరావతికి మద్దతుగా మాట్లాడిన వడ్డే శోభనాద్రీశ్వర రావు, పరకాల ప్రభాకర్ వంటి కొందరు ప్రముఖులు రాజధాని స్థల ఎంపికను తప్పుపడుతున్నారు. అంతేకాక, ప్రస్తుతం ఉన్న 53 వేల ఎకరాల భూమి చాలదని, మరో నలభైవేల ఎకరాలు తీసుకోవడానికి ప్రభుత్వం పూనుకోవడాన్ని ఆక్షేపిస్తున్నారు. రెండో దశ పూలింగ్‌కు సహకరించవద్దని వడ్డే శోభనాద్రీశ్వరరావు రైతులకు పిలుపునిచ్చారు కూడా. అయినా ప్రభుత్వం రెండో దశ పూలింగ్ కు నోటిఫికేషన్ ఇచ్చింది. తొలిదశ రైతులకు ఇచ్చిన హామీలను ఏ మేరకు నెరవేర్చారని, తమకు ఏ గ్యారంటీలు ఇస్తారని రెండో దశ గ్రామాల రైతులు ప్రశ్నిస్తున్నారు..ఈ పరిణామాలతో ఒకప్పుడు చంద్రబాబుకు గట్టి మద్దతుదారులుగా ఉన్న రైతులలో సైతం ఇప్పుడు ఏమి జరుగుతోందో తెలియక ఇదంతా ఒక పజిల్‌గా మారిందని వాపోతున్నారు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
KSR Comments: అమరావతి పెద్ద స్కామ్.!
-
YS జగన్ ప్రశ్నిస్తే తప్పా: Sajjala
-
రెండో విడత భూసేకరణపై వైఎస్.జగన్ ఆగ్రహం
-
బాబును నిలదీసిన అమరావతి రైతులు
-
రాజధానిలో రెండో దశ భూ సమీకరణ.. వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి, తాడేపల్లి: అమరావతి రాజధానిలో రెండో దశ భూ సమీకరణపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి దశలో తీసుకున్న భూమినే అభివృద్ది చేయకుండా మళ్లీ రెండో దశ ఎందుకని వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు చేస్తున్నది పిచ్చి పని అంటూ మండిపడ్డారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు వైఖరిని తప్పు పట్టారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్..‘రాజధాని పేరుతో తొలి విడతలో 50 వేల ఎకరాలు తీసుకున్నారు. ఆ భూమి అభివృద్దికే లక్ష కోట్లు అవసరమని చంద్రబాబు చెప్పారు. అది కూడా కేవలం రోడ్లు, కరెంటు, డ్రైనేజీ, నీరు లాంటి మౌళిక సదుపాయాలకే ఖర్చు చేశారు. ఆ లక్ష కోట్లు ఎప్పుడు వస్తాయో? ఎలా వస్తాయో తెలియదు. అప్పట్లో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు.చంద్రబాబు చర్యలతో భూములు ఇచ్చిన రైతులు బోరుమంటున్నారు. వారికి ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఇంకా రెండో దశ పేరుతో భూములు ఎందుకు తీసుకుంటున్నారు?. మరో 50 వేల ఎకరాలు తీసుకుని ఏం చేస్తారు?. ఈ లక్ష ఎకరాల్లో మౌళిక సదుపాయాల కల్పనకే రూ.2 లక్షల కోట్లు అవసరం అవుతాయి. ఈ డబ్బంతా ఎక్కడ నుంచి తెస్తారు?. తాను, తన బినామీలు దోచుకోవటానికే చంద్రబాబు భూములు సేకరిస్తున్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: క్రిడెట్ చోరికి బాబు పడరాని పాట్లు: వైఎస్ జగన్ -
భూములిస్తే మూడేళ్లలో అభివృద్ధి చేస్తామన్నారు: పూర్ణచంద్రరావు
-
అమరావతి రైతులకు మరో బిగ్ షాక్ మరో 16 వేల ఎకరాలు..
-
Amaravathi: అభివృద్ధి లేదు కానీ.. భూములు ఇవ్వాలా.. ఏకిపారేసిన రైతులు..
-
అంతర్జాతీయ రాజధాని అంటూనే అవినీతికి కేరాఫ్ గా మార్చేశారా ?
-
ఇంజనీరింగ్ నిపుణులే షాక్ అయ్యేలా అమరావతిలో భారీ దోపిడీ
-
రియల్ ఎస్టేట్ చరిత్రలో లేదు... ఒక ఎకరం వెంచర్ కు 2వేల కోట్లు..
-
Nagarjuna Yadav: రియల్ ఎస్టేట్లకు బంపర్ ఆఫర్ ప్రభుత్వమే భూములు దొంగతనం
-
అమరావతి భూముల వెనుక లక్షల కోట్ల కుంభకోణం.. ఎంక్వయిరీ వేస్తే బొక్కలోకే!
-
ఏపీ రాజధానిలో అన్నదాత గుండె ఆగింది... ప్రభుత్వం ఒత్తిడి వల్ల గుండెపోటుతో కుప్పకూలిన రైతు దొండపాటి రామారావు
-
అమరావతి రైతుల్ని మళ్లీ మోసం చేస్తున్న బాబు సర్కార్
సాక్షి, గుంటూరు: రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని వైఎస్సార్సీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త బాల వజ్రబాబు (డైమండ్ బాబు) మండిపడ్డారు. ఆ ఆవేదనతోనే రైతు దొండపాటి రామారావు గుండెపోటుకు గురై చనిపోయారన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు ప్రత్యామ్నాయంగా చెరువులు, వాగుల్లో ప్లాట్లు కేటాయించడంపై డైమండ్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎన్-8 రోడ్డు నిర్మాణానికి ఇచ్చిన భూమికి ప్రత్యామ్నాయంగా తనకు చెరువులో ప్లాట్ కేటాయించడాన్ని తట్టుకోలేకపోయిన రైతు రామారావు, మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ ముందు తన గోడు వెళ్లబోసుకున్నా ఫలితం దక్కలేదన్నారు. ఆ ఆవేదనలో ప్రాణాలు కోల్పోయాడని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రైతులకు ప్రభుత్వం చేస్తున్న మోసంపై ప్రశ్నిస్తే... అభివృద్ధిని అడ్డుకుంటున్నారని వైయస్సార్సీపీపై నిందలు వేయడాన్ని తప్పుపట్టారు. రైతులకు మద్దతుగా వారి తరపున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే..రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం..రాజధాని కోసం ప్రభుత్వానికి పొలం ఇస్తే.. అందుకు బదులుగా ఇంత ఎత్తు మునిగిపోయే చోట ప్లాట్ ఇచ్చారని రైతు రామారావు మీతో చెప్పుకున్నాడు. అయినా అతని ఆవేదన ప్రభుత్వానికి కనిపించడం లేదు. మా ఇల్లు అభివృద్ది కోసమని తీసుకుని ఎక్కడో ఫ్లాట్ ఇస్తే హైదరాబాద్ తరహాలో దొంగలు వచ్చి మా పీకలు కోసే పరిస్ధితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం రైతుల్ని ఎలా దగా చేస్తోందో ఇదే నిదర్శనం. వారికి ప్రభుత్వం చెప్పిందొకటి, చేస్తుంది వేరొకటి అన్న విషయం ఇక్కడ స్పష్టమవుతోంది.రైతులకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మా పై ప్రచారం చేస్తున్నారు. రైతుల నుంచి పట్టా భూములు తీసుకుని చెరువు భూముల్లో ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. రైతులకు చెరువుల్లో ప్లాట్లు ఇస్తే రేపు చట్టబద్దంగా చెల్లుతుందా ?, రైతు మీ మీద నమ్మకంతో తమ భూములిస్తే ప్లాట్లు చెరువుల్లో ఇస్తారా ? దొండపాటు, పిచ్చుకలపాలెంలో చెరువుల్లో రైతులకు ప్లాట్లు ఇచ్చారు. ఇవాళ రైతులు మనోవేదనతో బాధలో ఉన్నారు. తీవ్ర మనోవేదనలో అమరావతి రైతులు28 వేల మంది రైతులు వాళ్ల పొలాలు ఇస్తే అందులో ఎకరం ఉన్న రైతులు 19,970 మంది ఉన్నారు. ఎకరం నుంచి 2 ఎకరాలు ఉన్న వాళ్లు 4,214 మంది, రెండు నుంచి ఐదు ఎకరాలు ఉన్న వాళ్లు 3,200 మంది, 5 నుంచి 10 ఎకరాలు ఉన్న రైతులు 829 మంది ఉన్నారు. ఈ లెక్కన ఎకరం, రెండెకరాలు ఉన్న 23 -25 వేల మంది రైతులు మీ అభివృద్ధి మాటలు నమ్మి పొలాలు ఇస్తే వాళ్లకు 29 గ్రామాల్లో చెరువులు, వాగులు పూడ్చేసి అక్కడ ప్లాట్లు ఇస్తున్నారు. రేపు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం చెరువుల్లో ఇచ్చిన ప్లాట్లకు బ్యాంకులు రుణాలు ఇస్తాయా?, ఈ బాధలన్నీ వాళ్లకూ తెలుసు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఇవాళ చనిపోయిన రైతు దొండపాటి రామారావు మరణం.రైతులకు అండగా వైఎస్సార్సీపీ పోరాటంచెరువుల్లో రైతులకు ప్లాట్లు ఇచ్చిన మాట నిజం కాదా?, చెరువును పూడ్చిన చోట ప్లాట్ ఇస్తున్నామని రైతులకు చెప్పారా ?.అది మోసం కాదా ?. రైతులతో చేసుకున్న ఒప్పందం మేరకు ప్లాట్లు ఇచ్చారా ?. ఇప్పటికైనా బ్యాంకు రుణాలకు పనికొచ్చే పట్టా భూములు ఇవ్వాలి, వారితో చేసుకున్న ఒప్పందం మేరకు ప్లాట్లు ఇచ్చిన తర్వాతే అభివృద్ధి పేరుతో ప్రభుత్వం ముందుకు రావాలి. చెరువుల్లోనే ప్లాట్లు ఇస్తాం, ఉంటే ఉండండి, పోతే పోవాలని అంటే ఆ రైతుల తరపున వైఎస్సార్సీపీ కచ్చితంగా పోరాటం చేస్తుంది. రైతులకు అండగా ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికైనా రైతులు ఇచ్చిన పొలాలపై శ్వేతపత్రం విడుదల చేయడంతో పాటు వారికి న్యాయం చేయాలని డైమండ్ బాబు డిమాండ్ చేశారు. -
మంత్రి నారాయణే ముంచేశాడు.. ప్రాణాలొదిలిన రైతు
సాక్షి, గుంటూరు: చంద్రబాబు సర్కార్.. రైతుల పాలిట శాపంగా మారింది. ఏపీ రాజధాని అమరావతి రైతు గుండెకోతను మిగిల్చింది. మందడం గ్రామసభలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. మంత్రి నారాయణ ఎదుటే తన ఆవేదనను వెళ్లగక్కిన రైతు రామారావు.. తమను నారాయణే ముంచేశాడంటూ వాపోయారు. తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ.. కుప్పకూలిన రైతు.. మంత్రి నారాయణ చెప్పడం వల్లే వాగులో ప్లాట్లు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.‘‘ఇళ్లు తీసుకుంటానంటే తీసుకోండి. మాకు ఎక్కడ ఇస్తారంటే సీడ్ యాక్సెస్ రోడ్డులో ప్లాట్లు ఇవ్వండి. అమరావతికి మా పొలాలు ఇచ్చాం. సింగపూర్ వాళ్లకు ఇచ్చినదాంట్లోంచి మాకు 2 ఎకరాలు వాగులో ప్లాట్లు ఇచ్చారు. నారాయణ ఆర్డర్ అన్నారు. నారాయణ ఇవ్వమంటేనేగా వాళ్లు ఇచ్చింది..?. ఇంత లోతు నీళ్లు పడ్డాయి’’ అంటూ రైతు ఆవేదన చెందారు.అందరికీ సీడ్ యాక్సెస్ రోడ్లోనే స్థలాలు ఇవ్వాలన్న రైతు.. ముక్కలు ముక్కలుగా ప్లాట్లు ఇస్తే తమ గొంతు కోసినట్లు అవుతుందన్నారు. ఎమ్మెల్యే సర్ధి చెప్పబోయినా తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పి.. ఆ రైతు కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలిస్తుండగా రైతు రామారావు మృతిచెందారు. -
రాజధానిలో రెండో విడత భూసమీకరణ
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణం కోసం రెండో విడతలో 20,494.87 ఎకరాల భూసమీకరణకు రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) కమిషనర్‌కు ప్రభుత్వం అనుమతిచ్చింది. పల్నాడు జిల్లా అమరావతి మండలంలో నాలుగు గ్రామాలు, గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో మూడు గ్రామాల్లో 16,562.56 ఎకరాలు పట్టా, 104.01 ఎకరాల అసైన్డ్ భూమి కలిపి మొత్తం 16,666.57 ఎకరాలను రైతుల నుంచి సమీకరించనుంది. మంత్రుల బృందం(జీవోఎం) 21వ సమావేశం మినిట్స్ ప్రకారం ఆ భూములను ఏపీ సీఆర్డీఏ చట్టం సెక్షన్–55(2) ప్రకారం రైతుల నుంచి సమీకరించేందుకు సీఆర్డీఏ కమిషనర్‌కు అనుమతి ఇస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈ మేరకు పట్టా, అసైన్డ్ భూమి 16,666.57 ఎకరాలతోపాటు 3,828.30 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా సీఆర్డీఏ కమిషనర్ సమీకరించనున్నారు. అంటే.. రెండో విడత భూసమీకరణలో మొత్తం 20,494.87 ఎకరాల భూమిని సీఆర్డీఏ సమీకరించనుంది. రాజధానిలో రెండో విడత భూసమీకరణకు జూన్ 24న రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. తొలుత గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని 11 గ్రామాల్లో 44,676.44 ఎకరాలను సమీకరించేందుకు సిద్ధమైంది. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అప్పట్లో వెనక్కి తగ్గింది.తొలుత ఏడు గ్రామాల పరిధిలో 20,494.87 ఎకరాల సమీకరణకు గత నెల 28న మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రెండో విడత భూసమీకరణ కింద భూములు ఇచ్చే రైతులకు జూలై 1న జారీ చేసిన ల్యాండ్ పూలింగ్ స్కీం–2025 మార్గదర్శకాల ప్రకారం ప్రయోజనం చేకూర్చుతామని ప్రభుత్వం పేర్కొంది. భూసమీకరణ ఇలా...ప్రస్తుతం పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురంలో పట్టాభూమి 1,965 ఎకరాలు, ప్రభుత్వ భూమి 1,395.48 ఎకరాలు, పెదమద్దూరులో పట్టా భూమి 1,018 ఎకరాలు, ప్రభుత్వ భూమి 127 ఎకరాలు, యండ్రాయిలో పట్టా భూమి 1,879 ఎకరాలు, అసైన్డ్ భూమి 46 ఎకరాలు, ప్రభుత్వ భూమి 241 ఎకరాలు, కర్లపూడి లేమల్లెలో పట్టా భూమి 2,603 ఎకరాలు, అసైన్డ్ భూమి 51 ఎకరాలు, ప్రభుత్వ భూమి 290.75 ఎకరాలను సమీకరిస్తారు.అదేవిధంగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వడ్డమానులో పట్టా భూమి 1,763.29 ఎకరాలు, అసైన్డ్ భూమి 4.72, ప్రభుత్వ భూమి 168.86, హరిశ్చంద్రాపురంలో పట్టా భూమి 1,448.09 ఎకరాలు, అసైన్డ్ భూమి 2.29 ఎకరాలు, ప్రభుత్వ భూమి 977.87 ఎకరాలు, పెదపరిమిలో పట్టా భూమి 5,886.18 ఎకరాలు, ప్రభుత్వ భూములు 627.34 ఎకరాలను సమీకరిస్తారు. -
రాజకీయాల్లో చంద్రబాబు వింత పోకడ: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: దేశంలో తప్పుడు రాజకీయాలు చేయటంలో చంద్రబాబు దిట్ట.. ఎప్పటికప్పుడు వింత పోకడలతో దిగజారుడు రాజకీయాలు చేస్తారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని దుయ్యబట్టారు. మంగళవారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లటం గతంలో చూశాం. ఇప్పుడు డబ్బు ఇచ్చి పదవులు కొనుక్కునే పరిస్థితి తెచ్చారు’’ అంటూ మండిపడ్డారు.‘‘డబ్బులు ఇచ్చి రాజీనామా చేయిస్తారు. తర్వాత ఆ డబ్బులు ఇచ్చిన వారికి పదవులు ఇస్తారు. పదవులు కొనుక్కునే వారిని కూడా చంద్రబాబే చూస్తారు. ముందే బేరం మాట్లాడి అడ్వాన్స్ ఇచ్చి రాజీనామాను చేయిస్తారు. ఎన్టీఆర్ హయాం నుండి ఇలాంటి కుట్ర రాజకీయాలు చేయటం చంద్రబాబు కు అలవాటే. ప్రజాస్వామ్యం, చట్టం, విలువులు అనేవీ పట్టించుకోని వ్యక్తి చంద్రబాబు. ఇలాంటి నాయకులు వస్తారని రాజ్యాంగం రాసేటపుడు అంబేద్కర్ కూడా ఊహించి ఉండరు’’ అంటూ పేర్ని నాని చురకలు అంటించారు.‘‘వైద్యం చేయించుకోకపోతే చచ్చిపోతాడని బెయిల్ తెచ్చుకున్న చంద్రబాబు ఇప్పటికీ ఆస్పత్రి కి వెళ్లలేదు. అధికారులను బెదిరించి తన మీద ఉన్న కేసులను మూయించేసుకుంటున్నారు. బెయిల్ ఉత్తర్వులను కూడా ఉల్లంఘించారు. అధికారాన్నిఅడ్డం పెట్టుకుని కేసులు మాఫీ చేయించుకుంటున్నారు. అమరావతిని చంద్రబాబు చంపేశారు. అసలైన కుట్ర దారు చంద్రబాబేనని రాజధాని రైతులే అంటున్నారు. అమరావతికి ఏ పరిశ్రమా రావటం లేదు. పెద్ద పెద్ద పరిశ్రమలన్నీ వైజాగ్ వెళ్తుంటే ఇక అమరావతిలో భూములకు రేట్లు ఎలా వస్తాయి?..హైవే నిర్మాణం చేస్తూ జగన్ రైతులకు మేలు చేశారు. ప్రధాన రోడ్డుకు పక్కనే చంద్రబాబు ఎలా ఇల్లు కట్టుకోగలిగారు?. రైతులకు ప్లాట్లు ఇవ్వకుండా మళ్ళీ రెండు విడత భూసమీకరణ ఎలా చేస్తారని రైతులే ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చింది కేవలం కేవలం దోచుకోవటానికి, తమ మీద ఉన్న కేసులను మాఫీ చేసుకోవటానికే. దోచుకున్న సొమ్మంతా దుబాయ్‌లో దాచుకుంటున్నారు. దొంగ సర్టిఫికేట్ తెచ్చుకున్నంత మాత్రాన చంద్రబాబు పునీతుడు కాదు. కచ్చితంగా చంద్రబాబు మీద ప్రకృతి తిరగపడుతుంది. అప్పుడు ఇవే కోర్టులు చంద్రబాబును జైలుకు పంపుతాయి..గోదావరి జిల్లాలో కొబ్బరి చెట్ల చనిపోవటంపై శాస్త్రవేత్తలతో పరిశోధన చేయించాలి. రైతులతో పాటు కొబ్బరి చెట్లకు కూడా ఊపిరి పోయాలి. ప్రజల అవసరాలు తీర్చటం చేతకాకే పవన్ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. లోకేష్ విమానాలు ఎలా తిరుగుతున్నారు. రూ.50 కోట్ల విలువైన భూమిని ఎకరా 99 పైసలకే తీసుకున్న వారు పెడుతున్నారా?. లోకేష్ బినామీలు ఖర్చు పెడుతున్నారా?. ఎవరు డబ్బు ఖర్చు చేస్తే విమానాల్లో తిరుగుతున్నారో లోకేష్ చెప్పాలి. చంద్రబాబు బినామీ పేరుతో హెలికాఫ్టర్ కొన్నారు. మరి లోకేష్ వాడుతున్న విమానాలకు డబ్బు ఎవరు కడుతున్నారు?. వారానికి రూ.20 లక్షల ఖర్చు ఎవరు చేస్తున్నారో చెప్పే దమ్ముందా?చంద్రబాబు అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకున్నారు. దీనిపై నేనే స్వయంగా ఆర్టీఐ ద్వారా అడిగి రెండేళ్లయినా ఎందుకు ఇవ్వటం లేదు?. పవన్ కళ్యాణ్ సినిమా మ్యాట్నీకే ఎవరూ వెళ్లటం లేదు. నిర్మాతలు రోడ్డున పడ్డారు. ఇప్పటివరకు జీఎస్టీ కూడా నిర్మాతలు చెల్లించలేదు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు దుర్మార్గపు విషపు ప్రచారాలను జనం నమ్మారు. ఇప్పుడు వారి మోసాన్ని జనం గ్రహించారు. తగిన సమయంలో తగిన గుణపాఠం నేర్పుతారు’’ అని పేర్ని నాని అన్నారు. -
అమరావతికి రెండో విడత భూ సమీకరణ
సాక్షి, విజయవాడ: అమరావతికి రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏడు గ్రామాల్లో భూ సమీకరణకు నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రభుత్వ భూములు కాకుండా 16,666 ఎకరాల భూ సమీకరణకు నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం.. భూ సమీకరణ బాధ్యత సీఆర్డీఏ(CRDA) కమిషనర్‌కు అప్పగించింది. అమరావతి మండలంలోని 4 గ్రామాల్లో, తుళ్లూరు మండలంలోని 3 గ్రామాల్లో భూ సమీకరణ చేయనుంది.రాజధాని అమరావతి నిర్మాణానికి ఇప్పటికే 53,748 ఎకరాలు సమీకరించిన సీఎం చంద్రబాబుకు భూ దాహం తీరడం లేదు. అమరావతి మండలంలోని 4, తుళ్లూరు మండలంలోని 3 గ్రామాల్లో భూ సమీకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. కాగా, గత జూన్ 24న మంత్రివర్గంలో మలి విడత భూ సమీకరణకు ఆమోద ముద్ర వేయించారు. రాజధాని మలి విడత భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జూలై 1న ల్యాండ్ పూలింగ్ స్కీం (భూ సమీకరణ పథకం)–2025 విధి విధానాలు జారీ చేశారు.మరోవైపు, మొదటి విడత సమీకరణ కింద పదేళ్ల క్రితం భూములు ఇచ్చిన తమకు అప్పట్లో ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు చేయలేదని.. అభివృద్ధి చేసిన నివాస(రెసిడెన్షియల్), వాణిజ్య (కమర్షియల్) ప్లాట్లు ఇవ్వలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అవినీతి పునాదులపై అమరావతి
‘‘అమరావతిలో 25 బ్యాంకులను ప్రారంభిస్తున్నారు. బాగానే ఉన్నది కానీ... వాటిని ఉపయోగించుకోవడానికి అంతమంది అక్కడున్నారా?’’ ఈ అపశకునం పలికిన వ్యక్తి ప్రతిపక్షి కాదు. అధికార పక్షానికి పరమభక్తుడు. చంద్రబాబుకు నిత్యం స్తోత్ర పారాయణం చేసే ఎల్లో మీడియా వంశీకుడు. నిజమే కదా, ఎవరున్నారక్కడ? 29 గ్రామాల్లో 33 వేల ఎకరాల భూములిచ్చి జీవనాధారం కోల్పోయి, ప్రభుత్వం ఇస్తానన్న ప్లాట్ల కోసం ఎదురుచూస్తున్న త్యాగరాజుల కుటుంబాలు తప్ప! సర్కారిచ్చే ప్లాట్లు అమ్ముకుంటే గదా వారికి బ్యాంకులతో పని. ఆ భూము లపై ఆధారపడి పొట్టబోసుకున్న వ్యవసాయ కూలీ కుటుంబాలు ఇప్పుడు ఎక్కడున్నాయో? భూసేకరణ ఫలితంగా సుమారు లక్ష కుటుంబాలు భుక్తిని కోల్పోయిన ఇచ్చోటనే నిన్న (శుక్రవారం) అమరావతి ఆర్థిక నగరానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు.ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు ముఖ్య భాగస్వామి కావటం మూలాన ఆయనకు ఆనందం కలిగించే విధంగానే కేంద్ర మంత్రి మాట్లాడారు. హైదరాబాదులో ఆయన స్థాపించిన ఆర్థిక నగరం ఎంతో అభివృద్ధి చెందిందనీ, ఇది కూడా అలాగే అభివృద్ధి సాధించాలనీ ఆమె ఆకాంక్షించారు. హైదరా బాదులో ‘ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్’కి 2004 నవంబర్‌లో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత దాని ఉజ్జ్వల ప్రస్థానం ప్రారంభమైంది. ‘క్రెడిట్ చౌర్యం’ అనేది బాబు బలహీనత. ఆ బలహీనతలో భాగంగా ఐటీ విప్లవం దగ్గర నుంచి హైదరాబాద్ నిర్మాణం దాకా అనేక చరిత్రాత్మక ఘట్టాలు ఆయన ఖాతాలో చేరిపోతుంటాయి. అసలైన సమాచారం కంటే నకిలీ సమాచారమే ఎక్కువగా అందుబాటులో ఉన్నందువల్ల కేంద్ర మంత్రి కూడా పొరపాటు పడి ఉండవచ్చు. బౌద్ధ తాత్వికుడు, రసాయన శాస్త్ర పితామహుడైన ఆచార్య నాగార్జునుని పేరును కూడా నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఈ ప్రాంతం వాడైన నాగార్జునుని గురించి టిబెట్ విద్యార్థులకు కూడా తెలుసన్న సంగతిని తాను అక్కడికి వెళ్లినప్పుడు గమనించానని ఆమె చెప్పారు. దేవతల రాజధానయిన అమరావతిని అల నుంచి ఇలకు దించిన అపర భగీరథుడి గురించి కూడా ప్రపంచ ప్రజలకు తెలుసని ఆమె చెప్పకపోవడం గొప్ప ఉపశమనాన్ని కలిగించింది. ఎందుకంటే గతంలో ‘స్కిల్ కుంభకోణం’ కేసులో చంద్రబాబు అరెస్టయి నప్పుడు 55 దేశాల్లోని ప్రజలు వీధుల్లోకి వచ్చి హాహాకారాలు చేశారని ఎల్లో మీడియా ప్రచారంలో పెట్టిన సంగతి తెలిసిందే. ఆ ప్రచారం ప్రభావం అంతో ఇంతో ఉంటుందేమోననే అను మానం సహజం.అట్టి దేవతల రాజధాని అమరావతికి ఇప్పుడున్న 54 వేల ఎకరాలు సరిపోవని, అర్జెంటుగా ఇంకో 20 వేల పైచిలుకు ఎకరాల భూముల సమీకరణకు సర్కార్ సైరన్ మోగించింది. ఇంతటితో ఆగదట! ఇంకో పాతిక వేల ఎకరాల కోసం మూడో రౌండ్ సమీకరణ కూడా సిద్ధంగా ఉన్నదని విశ్వసనీయ సమా చారం. ఏతావతా రాజధాని పేరుతో లక్ష ఎకరాల సారవంత మైన పంట భూమికి సర్కార్ టెండర్ పెట్టింది. ఇప్పుడీ లక్ష ఎకరాల్లో నివసించడానికి లక్షల సంఖ్యలో నర నారీ జనసందోహం ఎక్కడ నుంచి వెల్లువెత్తి రావాలి? ప్రభుత్వ కార్యాల యాల్లో పనిచేసే వారు లేదా ప్రైవేటు కంపెనీలు వస్తే వాటిలో పని చేసేవారు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకునే పరిస్థితులు ఉంటాయా? రియల్ ఎస్టేట్ మోడల్లో కార్పొరేట్ రాజధాని నిర్మాణాన్ని ప్రారంభించిన తర్వాత అద్దెలు గాని, అమ్మకాలు గాని మధ్యతరగతి సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంటాయా? పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజల పిల్లలు చదువు కోవడానికి ఎన్ని పాఠశాలలు, ఎన్ని కళాశాలలు పెట్టబో తున్నారు? ప్రైవేట్ విద్యాసంస్థలకు భూ పందేరాలు చేయడం తప్ప, ప్రభుత్వ విద్యాసంస్థలను ఇప్పటివరకు ఎందుకు ప్రకటించలేదు? వగైరా ప్రశ్నలు సహజంగానే పుట్టుకొస్తాయి. విజయ వాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి వంటి అన్ని వసతు లున్న పట్టణ ప్రాంతాలు చేరువలో ఉండగా అమరావతిలోనే ప్రజలు నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఎంతకాలం పడు తుందో చెప్పడం కష్టం. నాలుగొందల ముప్పయ్యేళ్ల్ల కిందట గోల్కొండ రాజైన ఖులీ కుతుబ్‌షా హైదరాబాద్ నగర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంగా దైవాన్ని ప్రార్థిస్తూ ‘‘సముద్రాన్ని చేప లతో నింపినట్టు ఈ నగరం కూడా ప్రజలతో నిండి ఉండేట్టు ఆశీర్వదించమ’’ని అర్థించాడు. తాను మహారాజు గనుక ఆదే శాలు జారీ చేసినంత మాత్రాన ప్రజలు నివసించబోరనీ, సరైన ఉపాధి, నివాసయోగ్య పరిస్థితులు ఏర్పడితేనే నగరం అభివృద్ధి చెందుతుందనీ గ్రహింపు ఉన్నవాడు కనుకే అటువంటి పరిస్థితు లను కల్పించాలని అల్లాను అభ్యర్థించాడు. అప్పటికే గోల్కొండ అంతర్జాతీయ వజ్రాల వ్యాపారానికి కేంద్రమైనప్పటికీ దైవంపైనే ఖులీ భారం వేశాడు. ఏ నగరం అభివృద్ధి చెందాలన్నా అటువంటి నివాసయోగ్య పరిస్థితులు, ఉపాధి అవకాశాలు ముఖ్యం.గాంధీనగర్‌ను గుజరాత్ రాజధానిగా నిర్మించి 50 ఏళ్లు దాటినా అది ఇప్పటికీ అహ్మదాబాద్ నీడలోంచి బయటకు రాలేదు. మహానగరంగా మారలేదు. భువనేశ్వర్ ఇప్పటికీ కటక్ కొంగు పట్టుకునే నడుస్తున్నది. నయా రాయ్‌పూర్ కథ కూడా అంతే! మలేసియా రాజధానిగా ప్రణాళికాబద్ధంగా నిర్మించిన ‘పుత్రజయ’ ఇప్పటికీ కౌలాలంపూర్‌కు అనుబంధ నగరమే. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ‘గ్రోత్ ఇంజన్’ వంటి నగరాన్ని అభివృద్ధి చేయాలనుకోవడం వేరు, అది రాజధాని నగరమే కావాలను కోవడం వేరని నిపుణులు చెబుతున్నారు. ‘గ్రోత్ ఇంజన్’గా అభి వృద్ధి చెందడానికి మానవ సంకల్పంతో పాటు కొన్ని సహజమైన అనుకూలతలు కూడా ఆ నగరానికి ఒనగూడి ఉండాలి. అటువంటి అనుకూలతలు అమరావతితో పోల్చితే విశాఖపట్నానికి దండిగా ఉన్నాయనే అభిప్రాయం ఉన్నది. విశాఖను ‘గ్రోత్ఇంజన్’గా మార్చుకొని, అమరావతిని పాలనా రాజధానిగా కొనసాగించాలంటే లక్ష ఎకరాల భూమి, లక్షల కోట్ల రూపా యల అప్పు అవసరం లేదు.ఒక రాష్ట్రానికి గాని, దేశానికి గాని అభివృద్ధి ప్రణాళికలను రచించే ముందు ఆ ప్రాంత బలాబలాలను గమనంలోకి తీసు కుంటారు. ఆ లెక్కన ఆంధ్రప్రదేశ్‌కున్న సహజ బలాల్లో మూడు ముఖ్యమైనవి – ఒకటి సముద్రతీరం, రెండు వ్యవసాయ రంగ మయితే, మూడోది బహుళ పట్టణ వ్యవస్థ. దేశంలోని మరే రాష్ట్రంలో లేని విధంగా 15 ప్రగతిశీలమైన పట్టణాలు ఏపీలో ఉన్నాయి. అభివృద్ధిని వికేంద్రీకరించి, దృష్టి పెడితే విశాఖ, విజయవాడ, గుంటూరు నగరాలకుతోడు మరో 10 పట్టణాలు ఒక్కోటి పది లక్షల జనాభాకు ఉపాధినీ, ఆశ్రయాన్నీ ఇవ్వ గలవు. అమరావతి కోసం ఇప్పుడు సేకరించిన భూమే రాజ ధాని అవసరాలకు సమృద్ధిగా సరిపోతుంది. మరింత భూసేక రణ, మరింత రుణ సేకరణ వంటి వృథా ప్రయాసలు తప్పు తాయి. పట్టణీకరణ నిపుణులు చెబుతున్న మాటలివి. ప్రతి పక్షాల విమర్శలు కావు.రాజధాని అప్పులు కాకుండా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల కోట్ల పైచిలుకు అప్పులు చేసింది. రాజధాని కోసం 40 వేల కోట్లు చేశారు. మొదటి దశలోని 53 వేల ఎకరాలను దృష్టిలో పెట్టుకొని రాజధానికి 77 వేల కోట్లు కావాలని చంద్ర బాబు స్వయంగా అన్నారు. ఇప్పుడిది లక్ష ఎకరాలకు మారింది. ఇంకెంత కావాలి? కేవలం రహదారులు, ఇతర మౌలిక వసతుల కల్పనకే ఎకరాకు రెండు కోట్ల చొప్పున లక్ష ఎకరాలకు రెండు లక్షల కోట్లు అవసరమవుతాయని నిర్మాణ రంగం నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ భవనాల నిర్మాణాలు, ఇతర అవస రాల కోసం ఇంకో లక్ష కోట్లు. మొత్తం మూడు లక్షల కోట్ల అప్పును ఎక్కడ తెస్తారు? దానిని ఎవరి నెత్తిన రుద్దుతారు? రాజధానితో సంబంధం లేకుండా ఏడాదిన్నరలోనే రెండు లక్షల కోట్లు దాటిన మిగతా అప్పు ఐదేళ్లలో ఎంత కావాలి? ఈ భార మంతా ఎవరు మోయాలి? ప్రజలే కదా! అమరావతిని రాజ ధానిగా కొనసాగిస్తూనే, సింగిల్ గ్రోత్ ఇంజన్ మోడల్ (విశాఖ), మల్టిపుల్ గ్రోత్ ఇంజన్ల మోడల్ (డజన్ నగరాలు) వంటి ప్రత్యామ్నాయాలు ఉండగా, లక్ష ఎకరాలు, మూడు లక్షల కోట్లు, పర్యావరణ సమస్యలు వంటి ఎన్నో రిస్కులతో కూడిన బాటలోనే పయనించాలని ఎందుకు ఉబలాటపడుతున్నారో కనిపెట్టడం కష్టసాధ్యం కాదు.నదులు ఉప్పొంగి నగరాలను ముంచెత్తిన వార్తలు విన్నాము. కానీ నగరంలోంచి నీళ్లను నదిలోకి ఎత్తిపోసే విడ్డూ రాన్ని మనం కేవలం అమరావతిలోనే చూస్తున్నామని ఒక నిపు ణుడు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నదులకైనా, వాగులువంకలకైనా వాటి సహజ ప్రవాహ గతి వాటికి ఉంటుంది. కృత్రి మంగా దారి మళ్లింపు ప్రయత్నాలు ఎన్ని చేసినా ప్రకృతి ఉగ్రరూపం దాల్చినప్పుడు వాటి సహజ మార్గాలను వెతుక్కుంటూ, బీభత్సాన్ని సృష్టిస్తాయి. ఇటువంటి ఉదాహరణలు ఎన్నో చూస్తున్నాము. కొండవీటి వాగు కృష్ణలో కలిసే సహజ మార్గంలో మహానగర నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. దాని వరద నీటి ఎత్తిపోత అనే రిస్కును తలకెత్తుకోవడానికి కారణం నిధుల ఎత్తిపోత అనే మహద్భాగ్య అవకాశమేనని వస్తున్న విమర్శలను కాదనగలరా? రాజధాని నగరంలో నిర్మాణాలకు చదరపు అడుగుకు తొమ్మిది వేల నుంచి పదివేల దాకా ఖర్చు చేస్తున్నారు. ఎంత వైభవోపేతంగా కట్టినా నాలుగున్నర వేలు దాటదని నిర్మాణరంగంవాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఆరు వరుసల జాతీయ రహదారులను నిర్మించడానికి ‘నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా’ కిలోమీటర్‌కు 25 కోట్లు ఖర్చు పెడుతున్నదట! మన అమరావతిలో దాన్ని 53 కోట్లుగా డిసైడ్ చేశారు. ఇటువంటి అవినీతి వ్యవహారాల మీద ‘సాక్షి’ మీడియాలో సవివరంగా కథ నాలు వచ్చినా, నిపుణులు ఎందరో సోషల్ మీడియా వేదికపై గొంతు విప్పినా ప్రభుత్వం నుంచి మాత్రం స్పందన లేదు. అంటే, అందులో ఖండించడానికి ఏమీ లేదని అర్థం చేసుకోవాలి. ఈ లెక్కన ప్రభుత్వం అప్పులు తెచ్చి రాజధాని కోసం మూడు లక్షల కోట్లు ఖర్చుపెడితే అందులో సగభాగం కైంకర్యాలకే సరిపోతుందన్నమాట! బలమైన ఆధా రాలు, అనుమానాలతో వస్తున్న ఈ విమర్శకు ప్రభుత్వం ముఖం చాటేస్తున్నది కనుకనే పెద్ద ఎత్తున అవినీతి జరుగు తున్నదని జనం నమ్ముతున్నారు.పాలక కూటమి కార్యకర్తలు, ఛోటానేతలు కూడా రాజధాని అవినీతిని నమ్ముతున్నారు. అందువల్లనే క్షేత్రస్థాయిలో వారు చెలరేగిపోతున్నారు. ‘‘మంత్రిగారి కొడుక్కి నీ మీద మనసైంది. రా వచ్చెయ్’’మంటూ ఒంటరి మహిళలకు మంత్రిగార్ల పీఏలు బరితెగించి బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. ఛోటామోటా నాయ కులు నిరుపేద హాస్టల్ బాలికలను నిర్జన ప్రదేశాలకు లాక్కెళ్తు న్నారు. ‘‘నీ ఉద్యోగం మాకు కావాలి, నువ్వు రాజీనామా చేసెయ్’’ అంటూ బలహీనవర్గాల చిరు మహిళా ఉద్యోగులను జుట్టు పట్టి ఈడ్చుకుంటూ కీచక పర్వాలను సృష్టిస్తున్నారు. ఇసుక మాఫియా, రేషన్ బియ్యం మాఫియా, పేకాట మాఫియా చెలరేగిపోతున్నాయంటూ ఒక పోలీస్ హోమ్ గార్డ్ నిస్సహాయ ఆవేదనతో ఎస్పీకి పంపిన సెల్ఫీ వీడియో సంచలనంగా మారింది. విధి నిర్వహణ కోసం అక్రమార్కుల ఆచూకీ తీస్తే లాఠీలతో తొక్కి చంపుతామన్నారట! తన పై అధికారులు కూడా ఈ మాఫియా ముఠాలకు భయపడుతున్నారని ఆ హోంగార్డు ఆవేదన వెలిబుచ్చారు. ఇది రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి.ఇక సాధారణ పరిపాలనను చాప చుట్టేశారు. ‘ఓన్లీ అమరా వతి’! ఇదే సర్కారు వారి తిరుమంత్రం! గిట్టుబాటు ధరల్లేక, రవాణా ఖర్చులు కూడా రాని దుఃస్థితిలో పంట పొలాలను దున్నేస్తున్న రైతుల కన్నీటి గాథలు అన్ని ప్రాంతాల్లోనూ వినిపి స్తున్నాయి. ధాన్యం సేకరణ మాట అటుంచి దాచుకునేందుకు గోనె సంచుల్ని కూడా అందివ్వలేని జుగుప్సాకరమైన పరిస్థి తుల్లో ప్రభుత్వ యంత్రాంగం ఉన్నది. మార్కెట్లో ఏ పంటకూ మద్దతు ధర దక్కని దారుణమైన పరిస్థితి ఏర్పడింది. ఒక్కవ్యవసాయ రంగమే కాదు, అన్ని రంగాల్లోనూ ప్రభుత్వయంత్రాంగం నిస్తేజంగా మారింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జన జీవితం గాలిలో దీపం. కోనసీమ కొబ్బరికి తెలంగాణ వాళ్లు దిష్టి పెట్టారని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారట! ఇక ఆ రైతాంగం ఆయనకు సమస్యల గురించి ఏం చెప్పుకుంటారు? ఇప్పుడు తమ పాలనా వైఫల్యాలపై ముఖ్యమంత్రి ఏం చెబు తారో? న్యూయార్క్, లండన్ నగరాలు మన అమరావతికి దిష్టి పెట్టాయని ఆయన అనకుండా ఉండుగాక!వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
Ambati: రాజధాని పేరిట భారీ కుట్ర మరో 20 వేల ఎకరాలు స్వాహా!
-
చంద్రబాబు డైరెక్షన్లో అమరావతి మెగా సీరియల్
సాక్షి, తాడేపల్లి: అమరావతిని అడ్డంపెట్టుకుని చంద్రబాబు దోచుకుంటున్నారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అమరావతికి అసలైన విలన్ చంద్రబాబే. అడ్డగోలుగా భూదోపిడీ చేస్తూ వేల కోట్లు వెనుకేసుకుంటున్నారు. అమరావతి రైతులు పునరాలోచన చేసుకునే పరిస్థితిలో పడ్డారు. చంద్రబాబును నమ్మి పదేళ్ల క్రితమే భూములు ఇస్తే ఇంకా కావాలంట. ప్రపంచస్థాయి రాజధానిని నిర్మిస్తున్నామని అప్పట్లో చంద్రబాబు ప్రగల్భాలు పలికారు’’ అంటూ దుయ్యబట్టారు.‘‘ఇప్పటికే 54 వేల ఎకరాలను సేకరించారు. ఇప్పుడు రెండో విడతలో మరో 16,666 ఎకరాలను రైతుల నుండి సమీకరిస్తారట. మూడో విడతలో మరో 25 వేల ఎకరాలు తీసుకుంటారట. తొలి విడతలో తీసుకున్న భూములకే ఇప్పటికీ పూర్తిగా రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వలేదు. రైతులు అడిగితే అధికారులు అవమానపరుస్తున్నారు. భూములు తీసుకునేటప్పుడు త్యాగధనులు అన్నారు. ఇప్పుడేమో రైతులంటే పనికిమాలిన వాళ్లు అన్నట్టుగా చూస్తున్నారు..భూములు ఇచ్చిన రైతులు ఎంతో బాధపడుతున్నారు. అమరావతిని అడ్డంపెట్టుకుని చంద్రబాబు దోచుకుంటున్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే భూముల ధరలు తగ్గాయి. 18 నెలల్లో రాజధాని ప్రాంతంలో తట్టెడు మట్టి ఎత్తలేదు. ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు అప్పులు తీసుకొస్తున్నారు. అమరావతి కోసం ఇన్నీ తీసుకొచ్చి రూ.3 వేల కోట్లకే టెండర్లు పిలిచారు. చంద్రబాబు నిజ స్వరూపం రాష్ట్ర ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమౌతోంది’’ అని అంబటి పేర్కొన్నారు.‘‘రాజధానిని పూర్తి చేయకుండా సీరియల్ కథలా నడపాలన్నది చంద్రబాబు ప్లాన్. అమరావతిలో ఒక్క శాశ్వత భవనం లేదు. అమరావతిలో చంద్రబాబు నిర్మించిన భవనాలన్నీ తాత్కాలికమే. పార్లమెంట్‌కు రూ.970 కోట్లు ఖర్చు చేశారు. తెలంగాణ సచివాలయానికి రూ.500 కోట్లు ఖర్చు చేశారు. కానీ తాత్కాలిక అసెంబ్లీకే చంద్రబాబు రూ.700 కోట్లు ఖర్చు చేశారు’’ అంటూ అంబటి రాంబాబు నిలదీశారు.‘‘చంద్రబాబు అధికారంలోకి వస్తే భూముల ధరలు విపరీతంగా పెరుగుతాయని అప్పట్లో ప్రచారం చేశారు. ఇప్పుడు అత్యంత దారుణంగా రియల్ ఎస్టేట్ పడిపోయింది. రాజధానిలో ఇప్పటికీ ఒక్క తట్ట మట్టి కూడా వేయలేదు. కానీ రూ.3 వేల కోట్ల అడ్వాన్సులు ఇచ్చారు. వాటిలో కమీషన్లు కొట్టేశారు. రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ స్కీం అని చంద్రబాబు జనాన్ని మోసం చేశారు. ఇప్పుడు ప్రపంచమంతా తిరిగి రాజధాని కోసం అప్పులు చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రేట్లు పెంచి కాంట్రాక్టర్లకు అప్పగించారు..దాని వెనుక పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నట్టు రైతులు కూడా గుర్తించారు. అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలకే వేల కోట్లు ఖర్చు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్కో అడుగుకు రూ.11 వేలు ఖర్చు చేశారు. దేశ పార్లమెంటు భవనానికి రూ.970 కోట్లు ఖర్చు చేస్తే, చంద్రబాబు తాత్కాలిక భవనాలకే రూ.750 కోట్లు ఖర్చు చేశారు. రాజధాని పల్లపు ప్రాంతంలో ఉండటం వలన ముంపునకు గురవుతోంది. రాజధాని నీరు నదిలోకి ఎత్తి పోయటం అమరావతిలోనే చూస్తున్నాం. రైతులకు న్యాయం చేయకుండా భూములు లాక్కోవటం సరికాదు’’ అని అంబటి రాంబాబు హితవు పలికారు.‘‘డిప్యూటీ సీఎంకి సరైన సెక్యూరిటీ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అపరిచిత వ్యక్తి వచ్చాడంటూ ఫిర్యాదులు ఇవ్వటం సిగ్గుచేటు. పవన్ కళ్యాణ్ ప్రచారం కోసం కామెడీ చేస్తున్నారు. సీరియస్ రాజకీయాల్లో పవన్ వెరైటీ కామెడీ చేస్తున్నారు. తన అభిమాని తనకోసం వచ్చినా పవన్ భయపడుతున్నారు. ఒక డీఎస్పీని అవినీతి పరుడని పవన్ అంటే చంద్రబాబు ఆ డీఎస్పీకి అవార్డులు ఇచ్చారు. ఇదీ ప్రభుత్వంలో పవన్ పరిస్థితి’’ అంటూ అంబటి చురకలు అంటించారు. -
పరిశ్రమల పేరుతో భూ దోపిడీ
-
చంద్రబాబుకు షాకిచ్చిన అమరావతి రైతులు
సాక్షి,అమరావతి: సీఎం చంద్రబాబుతో పాటు కూటమి ప్రభుత్వానికి అమరావతి రైతులు షాకిచ్చారు. తమను ప్రభుత్వం పట్టించుకోకపోతే పోరాటం చేపడతామని అల్టిమేటం జారీ చేశారు. ఇందులో భాగంగా అమరావతి రైతులు నాలుగు డిమాండ్లను చంద్రబాబు ప్రభుత్వం ముందు ఉంచారు. వాటిని నెరవేర్చని పక్షంలో పోరాటం దిశగా అడుగులు వేస్తూ తమ భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని హెచ్చారు. ఈ మేరకు ఆదివారం (అక్టోబర్12) అమరావతి రైతులు గుంటూరులో సమావేశయ్యారు. ఈ సమావేశంలో రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం సీఆర్డీఏ కార్యాలయ ప్రారంభానికి భూమి ఇచ్చిన రైతులను కూడా ఆహ్వానించ లేదని మండిపడ్డారు. సీఆర్డీఏలో అవినీతి పెరిగిపోందన్న అమరావతి రైతులు.. 15నెలలు గడుస్తున్న రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోలేదని వాపోయారు.తమ సమస్యల్ని పరిష్కరించాలని సీఆర్డీఏ మున్సిపల్ శాఖ మంత్రి వద్ద మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందన్నారు. అందుకే తమ డిమాండ్లను నెరవేర్చకపోతే పోరాటం తప్పదని అమరావతి రైతులు చంద్రబాబు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. 👉ఇదీ చదవండి: ఎవరి అక్షయపాత్ర అమరావతి? -
బాబును నమ్మి... రెంటికీ చెడుతున్న అమరావతి రైతులు
అమరావతి రాజధాని రైతుల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి చందమైపోయింది. కూటమి అధికారంలోకి వస్తే భూముల విలువలు ఆకాశాన్నంటి లాభపడవచ్చు అనుకున్న వారి ఆశలు కళ్లముందే కరిగిపోతున్నాయి. గోరుచుట్టుపై రోకటిపోటు చందంగా ఇప్పుడు కొత్తగా భూ సమీకరణ, బలవంతపు సేకరణ ప్రతిపాదనలు వస్తూండటంతో రైతులకు దిక్కుతోచడం లేదు. రైతుల నుంచి సేకరించింది, ప్రభుత్వం దగ్గర ఉన్న భూమి కలిపి 53 వేల ఎకరాల వరకూ ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు మరిన్ని భూములు కావాల్సిందేనని భీష్మించారు. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తొలి దశలో స్వచ్చందంగా భూములివ్వని వారిపై 2013 భూసేకరణ చట్టాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది ప్రభుత్వం. ఇలా సుమారు 3500 ఎకరాలు తీసుకోబోతున్నారట. తద్వారా తొలిదశ అసలు లక్ష్యమైన 38 వేల ఎకరాలు సేకరించినట్లు అవుతుందని ప్రభుత్వం ఇప్పుడు చెబుతోంది. రెండో దశ భూ సమీకరణపై చర్చ జరగలేదని చెబుతూ, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు, ఎన్టీఆర్ విగ్రహం, రోప్ వే, రివర్ ఫ్రంట్, స్పోర్ట్స్ సిటీ వంటి వాటికి ప్రత్యేక కంపెనీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. దీనర్థం... రెండో దశకు సుమారు 44 వేల ఎకరాలు తీసుకోబోతున్నామని తెలివిగా చెప్పడమే. ఇది రైతులకు అర్థం కాదన్నది వారి ఉద్దేశం. మొత్తమ్మీద ఈ వ్యవహారమంతా అమరావతి రైతులను సంక్షోభంలోకి నెట్టేదే. రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములిస్తున్నారని, బలవంతపు సేకరణ అస్సలు ఉండదని చంద్రబాబు ప్రభుత్వం గతంలో నమ్మబలికింది. కొంతమంది స్వచ్ఛందంగా ఇస్తే చాలామందికి ఇష్టం లేకపోయినా ప్రభుత్వ ఒత్తిడితో వదలుకోవడానికి సిద్దపడ్డారు. ఇంకొందరు ప్రభుత్వాన్ని ఎదిరించారు. బెదిరింపులకు లొంగకుండా సేద్యం చేసుకుంటున్నారు. ఇలాంటి వారిని బెదిరించేందుకు పంటలను దగ్దం చేశారన్న ఆరోపణలూ అప్పట్లో వచ్చాయి. వైఎస్ జగన్ సీఎంగా ఉండగా.. చంద్రబాబు, మరికొందరు నేతలు అమరావతి రైతులను తీవ్రంగా రెచ్చగొట్టారు. వాస్తవానికి జగన్ వాస్తవిక దృక్పథంతో ఆలోచించి అమరావతితోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెయాలని సంకల్పించారు. కానీ ఈ విషయంపై అప్పటి ప్రతిపక్షం రకరకాలుగా దుష్ప్రచారం చేయించింది. ఉద్యమం పేరుతో హడావుడి చేయించారు. ఆ తరువాత 2024 ఎన్నికల్లో చంద్రబాబు గెలిచిన తరువాత తమకు లాభం చేకూరుతుందని, రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్, మంచినీరు తదితర సదుపాయాలతో ప్లాట్లు వచ్చేస్తాయని అమరావతి రైతులు భావించారు. కానీ.. జరిగింది వేరు. చేతిలో ఉన్న భూమిని అభివృద్ధి చేయకపోగా అదనపు భూముల కోసం ఎత్తులేస్తున్నారు. పైగా తొలిదశలో భూములిచ్చిన కొందరు రైతులకు.. పూలింగ్‌కు ఇవ్వని వారి భూమిలో ప్లాట్లు కేటాయించారట. ఆ భూములను ఇప్పుడు బలవంతంగా సేకరించి ప్లాట్లు ఇస్తారట. ఇది ఏ ధర్మం? ఇంకో సంగతి చెప్పాలి. ఇక్కడ ఎకరా రూ.నాలుగు కోట్ల వరకు అమ్ముడుపోతోందని, చంద్రబాబు నాయుడు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పలు మార్లు చెప్పారు. ఆ ప్రకారం వీరికి 2013 చట్టం కింద మూడు రెట్లు ఎక్కువ ధర ఇస్తారా? అలా కాకుండా రిజిస్ట్రేషన్ విలువ మాత్రమే పరిహారంగా ఇచ్చే యత్నం చేస్తే రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. మరో వైపు అప్పట్లో పూలింగ్‌కు భూములు ఇవ్వని 3500 ఎకరాల రైతులకు ఎంత పరిహారం దక్కుతుందో తెలియదు. ప్లాట్ల కేటాయింపు కేవలం పేపర్లపైనే ఉండడం వల్ల భూములు అమ్ముడుపోవడం లేదని రైతులు చెబుతున్నారు.ఇక రెండో దశ భూ పూలింగ్‌కు భూములివ్వడం చాలామందికి ఇష్టం లేదు. పెదపరిమి వంటి గ్రామాలలో కొందరు టముకు వేసి మరీ పూలింగ్‌కు భూములు ఇవ్వవద్దని చెబుతున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగానూ తొలిదశ రైతులకు న్యాయం చేయకుండా తమ వద్దకు ఎలా వస్తారని చాలామంది ప్రశ్నించారు. అయినప్పటికీ ప్రభుత్వం వెనుకాడడం లేదు. కాకపోతే ఒకసారి భూమి తీసుకోవడం లేదని చెబుతారు. ఇంకోసారి ఆ భూములు ఇవ్వకపోతే, ఈ ప్రాంతం ఒక మున్సిపాల్టీగా మిగిలిపోతుందని బెదిరిస్తున్నారు. రైతుల నిరసనలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు కొత్త వ్యూహం అమలు చేస్తోంది. రెండో దశ భూ సమీకరణపై మంత్రివర్గ సమావేశంలో చర్చించలేదని ఎల్లోమీడియాలో ప్రచారం చేయించారు. కాని అదే సమావేశంలో ఒక ప్రత్యేక కంపెనీని ఏర్పాటుకు తీర్మానించారు. ఆ కంపెనీ విమానాశ్రయం, ఎన్టీఆర్ విగ్రహం, స్పోర్ట్స్ సిటీ వంటివి చేపడుతుందని చెబుతున్నారు. పైగా వీటి నిర్మాణ పనులు నేరుగా కాంట్రాక్టర్లకే భూములు కేటాయించి అప్పగిస్తారట. ఆ కాంట్రాక్టర్లు భూములు తనఖా పెట్టి అప్పులు తీసుకుని వాటిని కడితే యూజర్ ఫీజుల రూపంలో ప్రజలు చెల్లించుకోవాల్సి వస్తుంది. ఒకవేళ నష్టమొస్తే వయబిలిటి గ్యాప్ ఫండింగ్ పేరుతో ప్రభుత్వం మళ్లీ ప్రజాధనాన్ని ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తుంది. ఈ ప్రత్యేక కంపెనీకి భూములు గతంలో ప్రతిపాదించిన ప్రకారం రెండో దశ గ్రామాల నుంచే రావాలి. ఆ రకంగా 44 వేల ఎకరాల భూమి తీసుకుంటారని నేరుగా కాకుండా ప్రాజెక్టుల మిష పెడుతున్నారన్నమాట. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం వాస్తవ పరిస్థితికి అనుగుణంగా నిర్ణయాలు చేసి, రైతులకు న్యాయం చేయకపోతే అమరావతిలోనే తీవ్ర నిరసన ఎదుర్కోక తప్పదు. కొందరు రైతులు ప్రభుత్వం తమను ఏ రకంగా వేధిస్తుందో ఇప్పటికే ఏడీబీ, ప్రపంచ బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం గమనార్హం.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఆ లీజు వెనుక అసలు రహస్యం ఏంటి బాబూ?: వడ్డే శోభనాద్రీశ్వరరావు
సాక్షి, విజయవాడ: ఏపీ ప్రభుత్వం బలవంతపు భూ సమీకరణలకు వ్యతిరేకంగా ఆంధ్ర ఉద్యమాల ఐక్య వేదిక పోరాటానికి సిద్ధమవుతోంది. ఈ నెల 8న శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. అక్టోబర్ 28న విజయవాడలో సభతో ఆంధ్ర ఉద్యమాల ఐక్య వేదిక పాదయాత్ర ముగియనుంది. ఏపీలో రోజురోజుకీ రైతాంగం భూమి ప్రశ్నార్థకంగా మారుతోందని చంద్రబాబుపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు.తమ భూమి ఉంటుందో ఊడుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారని.. చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం కొత్త జమీందారులను సృష్టిస్తోందంటూ శోభనాద్రీశ్వరరావు దుయ్యబట్టారు. లక్షలాది ఎకరాలు నయా జమీందారులకు కట్టబెడుతున్నారు. విజయవాడలో ఆర్టీసీ స్థలం లూలుకి అప్పగించారు. రూ. 600 కోట్ల విలువైన భూమిని 99 ఏళ్లు లీజుకు ఇవ్వడం వెనుక చిదంబర రహస్యం ఏంటి?. లూలు మీద నీకు ఎందుకంత ప్రేమ చంద్రబాబు? వందల కోట్ల ఖరీదైన భూములు ఎలా కట్టబెడతారు’’ అంటూ వడ్డే శోభనాద్రీశ్వరరావు నిలదీశారు.‘‘ఏపీలో జరుగుతున్న భూదోపిడీపై ప్రజల్లో చైతన్యం చేస్తాం. ఆంధ్రా ఉద్యమాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పాదయాత్ర చేపడుతున్నామని మహాదేవ్ అన్నారు. అక్టోబర్ 8న ఉద్ధానంలోని వెన్నెలవలస, మందస నుంచి ప్రారంభం ప్రారంభం కానుందని.. ప్రతీ చోటా హ్యూమన్ రైట్స్‌కు ప్రజల ద్వారా పిటిషన్లు పంపిస్తామని ఆయన పేర్కొన్నారు. చివరిగా విజయవాడలో 28న బహిరంగ సభ నిర్వహిస్తామని.. ఈ సభ ద్వారా ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక ఇస్తామని మహాదేవ్ వెల్లడించారు. -
రైతుల భూములు బెదిరించి లాక్కుంటున్నారు రాజధానికి లక్ష కోట్లు..?
-
అప్పు చేసి అమరావతికి పప్పన్నమా?
ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి చుట్టూ ఒక రోడ్డు వేసేందుకు పాతిక వేల కోట్లు ఖర్చు అవుతుందట. ఇంత మొత్తం పెట్టేందుకు కేంద్రం, రాష్ట్రం కూడా సిద్ధమేనట. ఈ భారీ ఖర్చుకు తోడు.. రాజధాని ప్రాంతాన్ని వరదనీరు ముంచేయకుండా ఉండేందుకు రెండు ఎత్తిపోతల పథకాలు. వీటి కోసం రూ.ఆరు వేల కోట్ల ఖర్చు! ఇంతింత ఖర్చు పెట్టేందుకు సిద్ధమంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద సామాన్యులకు చౌకగా వైద్యం అందించేందుకు పనికొచ్చే వైద్యకళాశాలల నిర్మాణానికి మాత్రం పైసా లేకపోవడం విచిత్రమే! డబ్బుల్లేకే వైద్య కళాశాలలను పీపీపీ మోడల్లో ప్రైవేటు వారికి అప్పగిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది పాపం!అమరావతిలో 34 వేల ఎకరాల రైతుల భూమి, ఇరవై వేల ఎకరాల ప్రభుత్వ భూమిలో అంతర్జాతీయ స్థాయి రాజధాని ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014లో తెగ చెప్పేవారు.. ఇప్పుడేమో ఆ భూమి మున్సిపాల్టీ స్థాయిది అంటున్నారు. అంతర్జాతీయ నగరం కావాలంటే ఇంకో 44 వేల ఎకరాలైనా కావాలంటున్నారు. ఈ రెండు విషయాలను వింటే ఏమనిపిస్తుంది? ఏపీలోని టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎటు తీసుకెళుతోందన్న అనుమానం వస్తుంది.రియల్ ఎస్టేట్ వారి ప్రయోజనాల కోసం, ప్రైవేటు పెట్టుదారుల లాభాల కోసమే ఈ ప్రభుత్వం పని చేస్తోందని, పేదలను విస్మరించిందన్న విమర్శలకు ఆస్కారం ఇస్తోంది. ప్రజల సొమ్ముకు ధర్మకర్తగా ఉండాల్సిన ప్రభుత్వం ఇలా అణ, కాణీలకు ప్రైవేటు వారికి కట్టబెడుతూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోంది. ప్రైవేటు సంస్థలు సొంత డబ్బు పెట్టుబడి పెట్టి ,ప్రభుత్వం నుంచి రాయితీలు పొందితే ఫర్వాలేదు. అలా కాకుండా ఉత్తిపుణ్యానికి ప్రభుత్వ ఆస్తులు పొందడమే కాకుండా, రాయితీలు కూడా అనుభవిస్తే ప్రజలలో తీవ్రమైన అసహనం వ్యక్తం అవుతుంది.విశాఖపట్నంలో రిషికొండపై కేవలం రూ.450 కోట్ల వ్యయంతో గతంలో ఉన్నవాటి స్థానంలో ఏడు కొత్త భవనాలను నిర్మిస్తే వృథా ఖర్చు, పర్యావరణానికి విఘాతమని విమర్శించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు మూడు పంటలు పండే భూములను రాజధాని పేరిట తీసేసుకున్నప్పుడు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. అమరావతి ప్రాంతం రాజధాని నిర్మాణానికి అనువైంది కాదని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ విస్పష్టంగా చెప్పినా పట్టించుకోలేదు. స్వభావరీత్యా అక్కడి భూమి భారీ భవనాల నిర్మాణానికి అనువు కాదని నిపుణులు కూడా చెబుతున్నారు. కానీ... చంద్రబాబు ప్రభుత్వం తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న చందంగా ముందుకు సాగుతోంది.పరిపాలన కేంద్రమైన రాజధాని కోసం అన్ని వేల ఎకరాల భూమి అవసరం లేదని అప్పట్లోనే చాలామంది చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం వినిపించుకోలేదు సరికదా విమర్శకులపై ఆగ్రహం వ్యక్తం చేసేది. పోనీ.. అప్పట్లో తీసుకున్న ముప్ఫైవేల పైచిలుకు భూముల్లో నిర్మాణాలు పూర్తి చేసిన రైతులకు ఇస్తామన్న భూమి ఇచ్చారా? ఊహూ లేదు. అలా చేసి ఇప్పుడు అదనపు భూమి కోసం అడిగితే రైతుల నుంచి అభ్యంతరాలు పెద్దగా వచ్చేవి కావేమో. ఒకపక్క అప్పుడప్పుడూ భూములు బలవంతంగా తీసుకోమని చెబుతూనే ఇంకోపక్క దానికి భిన్నంగా వ్యవహరించడం ప్రభుత్వానికి అలవాటైపోయింది.తమ భూమిని ఒక రియల్ ఎస్టేట్, హోటల్ యాజమాన్యం బలవంతంగా తీసుకుందని ఇద్దరు చిన్నకారు రైతులు తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవగా భూములిచ్చేయమని సలహాలు పారేస్తున్నట్లు తెలుస్తోంది. సీఆర్డీయే కూడా భూములను బలవంతంగా లాక్కొనేందుకు సిద్ధమవుతోంది రైతులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని వారు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రతినిధులకు కూడా స్పష్టం చేశారు. ఇక దీనిపై విష ప్రచారం ఆరంభిస్తారు. అమరావతి దేవతల రాజధాని అని, రాక్షసులు కొందరు దానిని చెడగొట్టాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి మొదలు అందరూ విమర్శించడం ఆరంభిస్తారు.రైతుల పాట్ల మాటేమిటి అని ఎవరూ ప్రశ్నించకూడదు. లక్షల కోట్లు వ్యయం చేసి ప్రభుత్వం ఒక నగరాన్ని నిర్మించడం ఎలా సాధ్యమని చాలామందిలో అనుమానం ఉన్నా ఎవరికి వారు ఏమోలే అని సరిపెట్టుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం కొత్త, కొత్త ప్రతిపాదనలలోకి వెళుతుండడంతో గతంలో భూములు ఇచ్చిన వారిలో సందేహాలు, భయం మొదలయ్యాయి. దానికితోడు ఇప్పుడు ఇది చిన్న మున్సిపాల్టీ అవుతుందని సీఎం స్వయంగా అనడం మరింత నిశ్చేష్టులను చేస్తోంది.మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ అన్నట్లు ప్రభుత్వం రాజధానికి అవసరమైన నిర్మాణాలు చేస్తుందా? లేక ఒక నగరం నిర్మిస్తుందా? ఏది ఆచరణాత్మకం? మరో నేత సజ్జల రామకృష్ణారెడ్డి తాము అమరావతికి వ్యతిరేకం కాదని, వచ్చేసారి అధికారంలోకి వస్తే జగన్ ఇక్కడనుంచే పాలన చేస్తారని స్పష్టం చేశారు. అయితే లక్షల కోట్ల వ్యయం ఒకే చోట చేయడం కన్నా, అవసరమైన రాజధాని భవనాలు నిర్మించి, ఆ తర్వాత అభివృద్ది ఎప్పటికప్పుడు చేసుకుంటూ పోవాలన్నది తమ పార్టీ అభిప్రాయమని అన్నారు. సజ్జల ప్రకటనను కూడా వక్రికరిస్తూ ఎల్లో మీడియా పిచ్చి రాతలు రాసింది. అది వేరే విషయం. సజ్జలకాని, బుగ్గన కాని చెప్పినట్లు ఒకే చోట లక్షల కోట్లు వ్యయం చేస్తే మిగిలిన రాష్ట్ర ప్రజల మాటేమిటి?ఆ ప్రాంతంలో అభివృద్ది సంగేతేమిటి? విశాఖలోని ప్రభుత్వ భూములను 99 పైసలకే కట్టబెడుతూ అమరావతిలో మాత్రం కోట్ల రూపాయల ధరలు చెబితే పరిశ్రమలు ఎలా ఇక్కడకు వస్తాయి? అన్నది కూడా చర్చ అవుతుంది. అనంతపురంలో జరిగిన సభలో అమరావతి రాజధానికి లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఇందుకోసం అప్పులు కూడా తీసుకు వస్తున్నామని ధైర్యంగా ముఖ్యమంత్రి ఎందుకు చెప్పలేకపోయారు? ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఆరువేల కోట్లు ప్రభుత్వం వద్ద లేకపోతే, అమరావతి రాజధానికి మాత్రం ఇన్నివేల కోట్లు ఎక్కడినుంచి వస్తున్నాయి.రాష్ట్రానికి వచ్చిన మెడికల్ సీట్లను వదులుకోవడం ఏపాటి తెలివైన పని. సభలు,ఉచిత ఉపన్యాసాలు ఇతర ప్రాంతాలకి, లక్షల కోట్ల ఖర్చు మాత్రం అమరావతికి అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తే ప్రాంతీయ అసమానతలు ఏర్పడవా? ఆ తరహా చర్చ జరగడం ఏపీకి మంచిదా? పోనీ ఇక్కడి రైతులకు న్యాయం జరుగుతోందా అంటే అదీ కనిపించడం లేదు. వారు ప్రభుత్వానికి అప్పులిచ్చే ప్రపంచ బ్యాంక్ వంటివాటికి ఫిర్యాదు చేస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు.కేవలం బెదిరింపులు, పోలీసుల ద్వారా భయపెట్టి వేల ఎకరాలను సమీకరించుకోవాలనుకోవడం విపరిణామాలకు దారి తీయవచ్చు.వీటన్నిటిని గమనించి సమతుల్యతతో కూడిన సమిశ్ర అభివృద్ధి వైపు కూటమి ప్రభుత్వం ఆలోచించకపోతే ఏపీ భవిష్యత్తు మరింత ప్రమాదంలో పడుతుందని హెచ్చరించవలసి ఉంటుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రాష్ట్రంలో భారీ భూదోపిడీ.. కర్త, కర్మ, క్రియ చంద్రబాబే
సాక్షి,తాడేపల్లి: కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో యధేచ్చగా కొనసాగుతున్న భూదోపిడీపై మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊరూపేరు లేని ఉర్సాలాంటి కంపెనీలకు విలువైన భూములు ఎందుకు ఇస్తున్నారు’ అని ప్రశ్నించారు. సోమవారం (ఆగస్టు18) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడారు.రాష్ట్రంలో యధేచ్చగా భూదోపిడీ జరుగుతోంది. అడ్డూ అదుపు లేకుండా తమకు కావాల్సిన వారికి వేల ఎకరాలను కట్టబెడుతున్నారు. ఊరూపేరు లేని ఉర్సాలాంటి కంపెనీలకు విలువైన భూములు ఎందుకు ఇస్తున్నారు?. వేల ఎకరాల భూములను ఏ ఉద్దేశంతో 99 పైసలకు విక్రయిస్తున్నారు?. అడ్రెస్ లేని కంపెనీలకు వేల ఎకరాలు ఎందుకు కట్టబెడుతున్నారు?భూములు ఇచ్చే ముందు ఆ కంపెనీల ట్రాక్ రికార్డును కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు?. ఖరీదైన భూములను కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతోంది. స్విట్జర్లాండ్ కంపెనీలకే భూములు ఇవ్వటం వెనుక దురుద్దేశం ఉంది. ఆ కంపెనీలకు ఇచ్చే భూముల వలన రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా?. అధికార పార్టీ నేతల బినామీలకే భూములను ఇస్తున్నారు.గ్లోబల్ సిస్టంలో భూములు ఇవ్వకుండా స్విట్జర్లాండ్ కంపెనీలకే భూములు ఇవ్వటం వెనుక దురుద్దేశం ఉంది. రాష్ట్రంలో విద్యుత్ కొనుగోళ్ళ వెనుక భారీ కుట్ర, అవినీతి జరుగుతోంది. మా హయాంలో రూ.2.49 పైసలకు కరెంటు కొంటే గగ్గోలు పెట్టారు. ఇప్పుడు రూ.4.59 పైసలకు ఎలా కొంటున్నారు? మహిళా ప్రొఫెసర్ని వేధించిన టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. -
ఆంధ్రప్రదేశ్‌లో కారుచౌకగా భూముల విక్రయాలు.. ఎంత భూమైనా 99 పైసలకే.. ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్..
-
మునిగిన రాజధాని అమరావతి
-
KSR Comment: అమరావతి పేరుతో రైతులను నట్టేట ముంచిన భూబకాసురులు
-
బాబుకు టెన్షన్!.. అమరావతి పుంజుకునేది ఇంకెన్నడు?
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ కోసం రైతులకు ఇస్తున్న ప్యాకేజీ బాగుందా? లేక పంజాబ్‌లో ఇటీవల ప్రకటించింది మెరుగ్గా ఉందా?. అమరావతి రైతులు ఈ విషయంపై కొంత విశ్లేషణ చేసుకోవడం మేలు. పంజాబ్ ప్రభుత్వం గృహ నిర్మాణం, పారిశ్రామిక రంగం కోసం ఇటీవలే 21 ప్రాంతాల్లో సుమారు 65 వేల ఎకరాలు సేకరించేందుకు సిద్ధమైంది. పరిహారం కోసం ముందుగా ఒక ప్యాకేజీ ప్రకటించింది కానీ విపక్షాలు, రైతులు తీవ్రంగా వ్యతిరేకించడంతో సవరించాల్సి వచ్చింది.కొత్త ప్యాకేజీతో పూర్తిగా సంతృప్తి చెందకపోయినా కొన్నిచోట్ల మాత్రం రైతులు స్వచ్ఛందంగా భూమి ఇచ్చేందుకు ముందుకు వస్తున్నట్లు పంజాబ్ మీడియా కథనాలు చెబుతున్నాయి. వాణిజ్య అవసరాల కోసం ఇస్తే ఎకరా భూమికి 800 గజాల ప్లాట్ కేటాయించారు. పారిశ్రామిక అవసరాల కోసం ఇస్తే వెయ్యి గజాల పారిశ్రామిక ఫ్లాట్, 300 గజాల నివాస ప్రాంతం, వంద గజాల వాణిజ్య ప్లాట్ ఇస్తామని పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. ఎకరాకు రూ.30 వేల కౌలు ముందు ప్రకటించారు. వ్యతిరేకతతో దీన్ని రూ.50 వేలకు పెంచారు. సేకరించిన భూమి అభివృద్ధి మొదలుపెట్టిన తరువాత రైతులకు ఎకరాకు రూ.లక్ష చొప్పున చెల్లించాలని నిర్ణయించింది. భూమి అభివృద్దిలో ఆలస్యం జరిగితే కౌలు మొత్తాన్ని ఏడాదికి పది శాతం చొప్పున పెంచుతారు. సేకరించిన భూమి సెంట్లలో మాత్రమే ఉన్నా వారికి కూడా వాణిజ్య ప్లాట్లు ఇస్తారు. ప్రభుత్వం ఇచ్చే లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఆధారంగా బ్యాంకుల నుంచి రుణాలు పొందడానికి అవకాశం కల్పిస్తున్నారు.అమరావతిలో చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన ల్యాండ్ పూలింగ్ ప్యాకేజీని పంజాబ్‌తో పోల్చి చూస్తే ఎన్నో లోటుపాట్లు కనిపిస్తాయి. ముఖ్యంగా భూమి అభివృద్ధి మొదలుపెట్టిన తరువాత కౌలు మొత్తం రూ.లక్ష చెల్లించే అంశం ఉన్నట్లు లేదు. ప్రభుత్వం ఆ స్థలంలో అభివృద్ధి చేపట్టేలోగా క్రయ విక్రయాలు జరుపుకోవచ్చని పంజాబ్ ప్రభుత్వం తెలిపింది. అలాగే ఆ భూములలో పట్టణాభివృద్ధి పనులు ఆరంభం అయ్యే వరకు రైతులు వ్యవసాయం కొనసాగించుకోవచ్చు. ఏపీలో అసలు అభివృద్ది పనులు ఆరంభం కాకముందే వేల ఎకరాలలో గట్లను తొలగించి, రైతులు పంటలు వేసుకునే అవకాశం లేకుండా చేశారు. దాంతో అవి పిచ్చి చెట్లతో నిండిపోయాయి. ఇప్పుడు ఆ కంప కొట్టడానికి ఏపీ ప్రభుత్వం కోట్లు వెచ్చిస్తోంది.మరోవైపు రైతులు స్వచ్చందంగా ఇస్తేనే భూమి తీసుకుంటామని, బలవంతంగా సమీకరించబోమని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ చెప్పడం విశేషం. అయినప్పటికీ అక్కడి విపక్షం రైతుల భూములు దోచుకుంటున్నారని, ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు ఇవ్వలేకపోతున్న ప్రభుత్వం ఈ స్కీమును ఎలా అమలు చేస్తుందని ప్రశ్నించాయి. ప్రతి మహిళకు నెలకు రూ.వెయ్యి చొప్పున ఇస్తామని చేసిన హామీ మాటేమిటని ప్రశ్నించాయి. విపక్షాల ప్రచారాన్ని భగవంత్ సింగ్ మాన్ కొట్టిపారేసి, రైతులకు మేలైన ప్యాకేజీ ప్రకటించామని చెబుతున్నారు. ఈ రకంగా ఆలోచిస్తే ఏపీలో ఇప్పటికే 13 నెలల్లోనే సుమారు రూ.1.80 లక్షల కోట్ల అప్పులు చేసిన ప్రభుత్వం ఖజానా ఖాళీగా ఉందని తరచూ ప్రకటిస్తోంది. సూపర్ సిక్స్‌లో ఒకటి అర హామీలు మాత్రమే అమలు చేసింది. అమలు చేయని వాటిలో ఆడబిడ్డ నిధి కూడా ఉంది. అయినా ఏపీ ప్రభుత్వం అదనంగా మరో 44 వేల ఎకరాల భూమి సేకరణకు సిద్ధమైంది. ఈ విషయంలో ఇక వెనక్కు తగ్గేదే లేదని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇటీవలే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.పోలీసులు, మీడియాను అడ్డం పెట్టుకుని, అమరావతి సెంటిమెంట్‌ను ప్రయోగించి విపక్ష గొంతు నొక్కి అయినా తాను అనుకున్న విధంగా లక్ష ఎకరాల భూమిని తన అధీనంలోకి తీసుకోవాలని చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి సర్కార్ చేస్తున్న ప్రయత్నాలు ఎంత మేర సఫలమవుతాయన్నది చర్చనీయాంశంగా ఉంది. పంజాబ్ రైతుల మాదిరి మరింత గట్టిగా నిలబడితే అమరావతి ప్రాంత రైతులకు కాని, కొత్తగా భూములు తీసుకోబోతున్న గ్రామాల రైతులకు కానీ ప్రయోజనం ఉండవచ్చు. ప్రభుత్వం సకాలంలో భూమిని అభివృద్ధి చేసి వారికి ప్లాట్లు ఇస్తే, వాటికి మంచి ధర పలికితేనే రైతులకు, లేదా భూమి సొంతదారులకు ఉపయోగం ఉండవచ్చు. కానీ, ఏపీలో అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఆశించిన రీతిలో లేకపోవడం కొంత నిరుత్సాహం కలిగిస్తుంది. ఒకప్పుడు ప్రభుత్వం సృష్టించిన విపరీతమైన హైప్ వల్ల భూముల రేట్లు భారీగా పెరిగాయి. కానీ ఆచరణలో ప్రభుత్వం భూమిని అభివృద్ది చేయలేకపోవడం, ఓవరాల్‌గా ఆర్థిక వ్యవస్థ దేశవ్యాప్తంగా కొంత మందగించడం మొదలైన కారణాలు రియల్ ఎస్టేట్‌ను ప్రభావితం చేశాయి. దాంతో అమరావతి గ్రామాలలో కొనుగోలు, అమ్మకపు లావాదేవీలు తగ్గుముఖం పట్టాయన్న అభిప్రాయం ఉంది. ధరలు కూడా గతంలో ఉన్న స్థాయిలో లేవని చెబుతున్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మీడియా బలంతో ప్రతి విషయాన్ని తనకు అనుకూలంగా మలచుకుని ఏదో జరిగిపోతోందన్న భ్రమ కల్పిస్తుంటారు. కొన్నిసార్లు ఆ వ్యూహం సక్సెస్ అయినా, ఎక్కువ సార్లు విఫలమవుతుంటుంది. అప్పుడు దానిని వదలిపెట్టి కొత్తదేదో చేపడుతుంటారు. అమరావతి రాజధాని విషయంలో కూడా అలాగే జరుగుతున్నట్లు అనిపిస్తుంది. తొలుత అమరావతి రాజధాని నిర్ణయాన్ని రకరకాలుగా ప్రచారం చేయడంతో కొన్ని ప్రాంతాల వారు ముఖ్యంగా నూజివీడు పరిసర ప్రాంతాలలో భూములు కొన్నవారు అప్పట్లో తీవ్రంగా నష్టపోయారు. కానీ, అంతర్గత సమాచారం ఆధారంగా ప్రస్తుతం రాజధానిగా పరిగణిస్తున్న గ్రామాలలో టీడీపీ నేతలు పలువురు భూములు కొని లాభపడ్డారని చెబుతారు. కానీ, అది కూడా తాత్కాలికమే అయింది. రైతుల వద్ద కాస్త అధిక ధరకు కొనుగోలు చేసి, అంతకన్నా ఎక్కువకు అమ్ముకున్న వారు లాభపడ్డారు. కానీ, ఇంకా బాగా లాభాలు వస్తాయన్న భావనతో ఉన్నవారు మాత్రం కొంతమేర నష్టాల పాలయ్యారు.2024లో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత భూముల ధరలు పెరుగుతాయని టీడీపీ వర్గాలు ప్రచారం చేశాయి. ఎన్నికలలో కూడా ఆ పాయింట్ ఆధారంగా లబ్ది పొందే యత్నం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ పరిస్థితి కనిపించడం లేదని చెబుతున్నారు. భూముల రేట్లు కృత్రిమంగా పెంచడం కోసం టీడీపీ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసినా జనం పెద్దగా విశ్వసిస్తున్నట్లు కనబడడం లేదు. దానికి తోడు ప్రభుత్వం మరో 44వేల ఎకరాల భూమి సేకరించబోతుందన్న ప్రకటన రావడంతో మొత్తం అప్సెట్ అయ్యారు. ప్రభుత్వం ముందు రైతుల నుంచి తీసుకున్న 33 వేల ఎకరాలతోపాటు, ప్రభుత్వ భూములు 20 వేల ఎకరాలు అభివృద్ది చేసిన తర్వాత తమ భూములు తీసుకోవాలి కాని, అదేమీ చేయకుండా భూ సమీకరణకు వస్తే అంగీకరించబోమని రైతులు ఖరాఖండిగా చెబుతున్నారు.రైతు నేత, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు వంటి వారు సైతం చంద్రబాబు ప్రభుత్వ విధానాలను తీవ్రంగా తప్పుపడుతూ రైతులు భూములు ఇవ్వవద్దని ప్రచారం చేస్తున్నారు. గతంలో తీసుకున్న భూములకు రైతులకు ఇవ్వవలసిన ప్లాట్లు కాగితాల మీదే ఉన్నాయి తప్ప ఎవరికి అందలేదు. ఎకరాకు 1200 గజాలు ఇస్తామని ప్రభుత్వం తెలిపే డాక్యుమెంట్ల ఆధారంగా బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదట. నెల రోజుల నుంచి రియల్ ఎస్టేట్ రంగం మరీ కుదేలైందని వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం తెలిపిన దాని ప్రకారం రైతులకు ఇచ్చిన ప్లాట్లను అన్ని సదుపాయాలతో అభివృద్ది చేయాలి. ఆ పని ఇంతవరకు మొదలే కాలేదు. రైతులు ఎక్కడ భూమి ఇస్తారో, అక్కడే ప్లాట్లు కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఆ పని చేయకుండా ఒక గ్రామంలో ఒక సంస్థకు భూమి కేటాయించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సంస్థ అక్కడ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టడానికి వీలు లేకుండా రైతులు అడ్డుకున్నారట.మరోవైపు చంద్రబాబు నాయుడు నిత్యం ఏదో ఒక కార్యక్రమం పెట్టి క్వాంటమ్ వ్యాలీ అని, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అని, ఆదాని క్రీడా నగరమని, ఔటర్ రింగ్ రోడ్డు, ఆ రోడ్డు చుట్టూ హైటెక్ సిటీ అని విస్తారంగా ప్రచారం చేస్తున్నారు. ఎల్లో మీడియా ఆ వార్తలను పతాక శీర్షికలుగా వండి వారుస్తోంది. ఇదంతా ఎప్పటికి అవుతుందో తెలియని స్థితిలో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాజధాని నిర్మాణం పేరుతో రూ.31 వేల కోట్ల అప్పు చేసిన ప్రభుత్వం టెండర్లు మాత్రం రూ.ఏభై వేల కోట్లకు పైగానే పిలిచిందట. ఈ నిర్మాణాలన్నీ పూర్తి కావడానికి మూడు, నాలుగేళ్లు పట్టవచ్చని ప్రభుత్వమే చెబుతోంది. ప్రభుత్వ భవనాల నిర్మాణం వల్ల రియల్ ఎస్టేట్ ఎంతమేర పుంజుకుంటుందో చెప్పలేం. వ్యాపార, పారిశ్రామిక రంగంలో కొత్త సంస్థలు వస్తే కొంత అభివృద్ది ఉండవచ్చు. కాని ప్రస్తుత పరిస్థితి అంత అనువుగా లేదు.ఎంతో అభివృద్ది చెందిన హైదరాబాద్ నగరంలోనే రియల్ ఎస్టేట్ రంగం ఆశించిన రీతిలో సాగడం లేదన్నది సర్వత్రా ఉన్న అభిప్రాయం. ఇంకో మాట చెప్పాలి. విశాఖ వంటి నగరంలో పెద్ద కంపెనీలకు 99 పైసలకే ఎకరా భూములు కట్టబెడుతున్న ప్రభుత్వం అమరావతిలో మాత్రం కొన్ని సంస్థలకు ఎకరా రూ.నాలుగు కోట్లకు చెల్లించాలని అంటోంది. ప్రపంచ బ్యాంకుకు ఇచ్చిన నివేదికలో ఎకరా ఇరవై కోట్లకు పైగానే అమ్ముడు పోతుందని తెలిపారట. భూముల అమ్మకం ద్వారా అప్పులు తీర్చుతామని చెబితే అదెప్పుడు ఆరంభం అవుతుందని ప్రపంచ బ్యాంక్ అడిగితే ప్రభుత్వం సమాధానమిచ్చేందుకు మల్లగుల్లాలు పడుతోంది.అమరావతి ద్వారా సంపద సృష్టి ఎప్పటి నుంచి మొదలు అవుతుందని ఒక విలేకరి చంద్రబాబును అడిగితే అది నిరంతర ప్రక్రియ అని, మూడేళ్లలో సెట్ అవుతుందని, ఆ తర్వాత దాని ప్రభావం ఉంటుందని జవాబు ఇచ్చారు. ఒకప్పుడు ఇది సెల్ఫ్ ఫైనాన్స్డ్ నగరం అని చంద్రబాబు ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు వేల కోట్ల అప్పులు చేయాల్సి వస్తోంది. అయినా రియల్ ఎస్టేట్ రంగం ప్రభుత్వం కోరుకున్న రీతిలో సాగడం లేదు. ఈ వ్యాపారం సంగతి ఎలా ఉన్నా, ప్రభుత్వం రైతులకు మేలు చేయదలిస్తే పంజాబ్‌లో మాదిరి ప్యాకేజీని, ప్రత్యేకించి కౌలు మొత్తాన్ని పెంచితే కొంతవరకు మంచిదేమో ఆలోచించాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
AP: 'రియల్' ఢమాల్!
రాజధాని నిర్మాణం పేరుతో 11 ఏళ్ల కిందట తీసుకున్న భూములకు సంబంధించిన రైతులకు ఇప్పటికీ ఇచ్చిన ప్లాట్లు కాగితాలపైనే ఉన్నాయి. ఎకరం పొలం తీసుకుని చేతిలో పెట్టిన 1,200 గజాలు కాగితాలకు కనీసం బ్యాంకర్లు కూడా రుణాలు ఇవ్వడం లేదు. ఈ పరిస్థితుల్లో మూలిగే నక్కపై తాడిపండు పడినట్లుగా మరో 45 వేల ఎకరాలు రాజధాని నిర్మాణం కోసం సేకరిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆయా ప్రాంతాల రైతులకు ఇది మింగుడు పడటం లేదు. ఈ ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్రంగా పడింది. కొత్తగా కొనేవారు లేక భూ లావాదేవీలు స్తంభించిపోయాయి. సాక్షి ప్రతినిధి, గుంటూరు, తాడికొండ, పెదకాకాని: రాజధాని ప్రాంతానికి చెందిన వెంకటేశ్వరరావు తనకున్న రెండెకరాల పొలంలో వ్యవసాయం చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే భూముల ధరలు రూ. కోట్లకు పడగలెత్తుతాయని ఆశ, ఆరాటంతో ఓటు వేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అందులో ఎకరం అమ్ముకొని సొమ్ము చేసుకొని వేరే ప్రాంతంలో భూమి కొనుగోలు చేద్దామని ఆశతో బేరం పెట్టారు. ఎకరం అమాంతంగా రూ.3 కోట్ల నుంచి రూ. 4 కోట్ల వరకు అడుగుతుండటంతో అమ్మో అప్పుడే అమ్మితే ఎలా అని రోజుకో రకంగా పెరుగుతున్న రియల్ ఎస్టేట్ రంగాన్ని చూస్తూ మురిసిపోతూ కాలం వెళ్లబుచ్చారు. ఇప్పుడు పరిస్థితి పూర్తి విరుద్ధంగా మారింది. ఇక మరో రైతు ప్రభుదాసు తమవారు తరాలుగా కష్టపడి సంపాదించి ఇచ్చిన అర ఎకరం పొలం విక్రయిద్దామని బేరం పెట్టారు. రూ.3 కోట్లకు 1/3వ వంతు నగదు తీసుకొని 3 నెలల తరువాత రిజిస్ట్రేషన్ చేసుకుందామని అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ డబ్బుతో మరో ప్రాంతానికి వెళ్లి ఎకరం రూ.35 లక్షల చొప్పున కొనుగోలు చేసి, అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇలా ఎందరో రైతులు రాజధాని ప్రాంతంలో తమ భూములను అమ్మకాలు, కొనుగోళ్ల సందడితో మురిసిపోయారు. కూటమి ప్రభుత్వం ఉన్నట్టుండి రెండు నెలల క్రితం అదనపు భూ సమీకరణ చేపట్టనున్నట్లు ప్రకటించింది. దీంతో రైతుల గుండెల్లో బాంబు పడినట్టైంది. ఒక్కసారిగా నిస్తేజం రెండో విడత భూ సమీకరణ పేరుతో అమరావతి, తుళ్ళూరు మండలాల్లో గ్రామ సభలు నిర్వహించిన ప్రభుత్వం తొలుత 45 వేల ఎకరాలను సమీకరణ చేస్తున్నట్లు ప్రకటించింది. తదనంతరం సభలను విస్తరించి తాడికొండ మండలంలో కూడా చేపట్టడంతో రైతులు మండిపడ్డారు. ఉన్నట్టుండి విరుచుకుపడటంతో ప్రభుత్వం ఓ అడుగు వెనక్కేసింది. కానీ నిన్న మొన్నటి వరకు రూ. కోట్లలో పలికిన భూముల ధరలు మాత్రం ఆకాశం నుంచి కుప్పకూలిన చందంగా ఒక్కసారిగా పడిపోయాయి.అమ్ముకొని సొమ్ము చేసుకున్న రైతుల ఆనందం అంతా ఇంతా కానప్పటికీ అగ్రిమెంట్ల రూపంలో ఉన్న రైతులు, అప్పుల పాలై అమ్ముకుందామని ఎదురు చూస్తున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎప్పుడూ సందడిగా ఉండే రియల్ ఎస్టేట్ ఆఫీసులు వెలవెలబోతున్నాయి. అదే తరహాలో పెదకాకాని రిజి్రస్టార్ కార్యాలయంలో కూడా రిజి్రస్టేషన్ల సంఖ్య తగ్గిపోయింది. సొంత పార్టీ నేతల తిరుగుబాటు నిన్న మొన్నటి వరకు బ్రహ్మాండమైన రాజధాని నిర్మించి ప్రపంచంలోనే గొప్పగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారంటూ ప్రగల్బాలు పలికిన సొంత పార్టీ నేతలే నేడు తిట్ల దండకం అందుకుంటున్నారు. బాబును నమ్మితే నట్టేట ముంచారని, నమ్ముకున్నవాడిని మోసం చేయడం అంటే ఇదేనని వాపోతున్నారు. చెప్పిన మాటకు కట్టుబడి ఉన్న భూముల్లో రాజధాని నిర్మిస్తే సరేసరి.. లేదంటే మరో ఉద్యమం తప్పదన్నారు. ఇప్పటికే భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు సైతం ఇవ్వలేదు, ఇచ్చిన వారికి ప్లాట్లు భౌతికంగా ఎక్కడున్నాయో కూడా తెలియదు. ఇంకా రిజి్రస్టేషన్ల ప్రక్రియ పూర్తి కాలేదు. అభివృద్ధి చేసి 10 సంవత్సరాల్లో ప్లాట్లు తిరిగిస్తానన్న బాబు విదేశీ పర్యటనలు, అదనపు భూ సమీకరణ పేరుతో రైతులను పట్టించుకోవడం లేదు. ఇప్పటికే ఏడాదిన్నర పూర్తయింది. రాజధానిలో ఏవేవో కడతానని చెప్పడం మినహా పునాదులను సైతం అడుగు కూడా పైకి లేపిన దాఖలాలే లేవు. అప్పు కూడా పుట్టక అవస్థలుఅదనపు భూ సమీకరణ ఊసు లేనప్పుడు రాజధాని ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ప్రాంతాన్ని బట్టి గజం రూ.40 వేలు నుంచి రూ.80 వేలు పలికిన భూముల ధరలు ఇప్పుడు కొనేందుకు వ్యాపారులు, ప్రజలు ఆసక్తి చూపడం లేదు. ఆ భూమిని కనీసం బ్యాంకులో అయినా తనఖా పెట్టుకొని అప్పు తీసుకుందామా అంటే అధికారులు ఒప్పుకోవడం లేదు. దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో తుళ్ళూరు రాజధాని ఉంటే పెదకాకాని మండల శివారులో ఉన్న మంగళగిరి రూరల్ మండలం కాజ, తాడికొండ మండలంలోని కంతేరు గ్రామం వరకూ భూములు సేకరిస్తారని కూటమి ప్రభుత్వం ప్రకటించడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కనీసం తమ అవసరానికి కూడా విక్రయించలేక పోతున్నామని, ఎక్కడా అప్పు కూడా పుట్టడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వ్యాపార ధోరణి విడనాడి స్పష్టమైన విధానం ప్రకటించాలని వారు కోరుతున్నారు.కొనేవారు రావడం లేదుభూములు కొనుగోలు చేసే వారు రావడం లేదు. ప్రభుత్వం మళ్లీ భూ సమీకరణ ప్రకటన చేసినప్పటి నుంచి వ్యాపారాలు సాగడం లేదు. పదేళ్లుగా ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. గతంలో ప్లాట్లు, పొలాలు కొనుగోలు చేసేందుకు వచ్చే వారికి చుట్టు పక్కల ప్రాంతాల్లో చూపించేవారం. అందుకు ప్రతిఫలంగా వారు కమీషన్ ఇచ్చేవారు. కొనేవారు ఇప్పుడు రాకపోవడంతో వ్యాపారాలు నిలిచిపోయాయి. – షేక్ మస్తాన్, రియల్ ఎస్టేట్ వ్యాపారి, పెదకాకానిస్థిరాస్తి రంగం కుదేలుకూటమి ప్రభుత్వం రాజధాని పేరుతో మళ్లీ భూములు సమీకరిస్తుండటంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైంది. అమ్మేవారు సిద్ధంగా ఉన్నప్పటికీ కొనేవారు లేకపోవడంతో వ్యాపారం ఆగిపోయింది. నెల రోజులకు ముందు చేసుకున్న అగ్రిమెంట్లు మాత్రమే రిజ్రస్టేషన్లు అవుతున్నాయి. ఈ నెలలో ఒక్క బేరం కూడా జరగలేదు. భూములు కావాలని వచ్చేవారు తగ్గిపోయారు. ప్రభుత్వం భూ సమీకరణపై స్పష్టత ఇవ్వాలి. – పాటిబండ్ల సంగీతరావు, రియల్ ఎస్టేట్ వ్యాపారి, పెదకాకాని -
‘1,500 ఎకరాల్లో అమరావతి రైల్వేస్టేషన్ నిర్మాణమా?’
సాక్షి, అమరావతి: అమరావతిలో రైల్వేస్టేషన్‌ను భారతదేశంలోనే అతి గొప్ప రైల్వేస్టేషన్‌గా 1,500 ఎకరాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని రైతు నేత, వ్యవసాయ శాఖ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు. ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు ఆయన మాట్లాడుతూ 1,500 ఎకరాల్లో రైల్వే స్టేషనా? ఎక్కడైనా చూశామా? అని ప్రశ్నించారు. ‘అత్యంత పురాతనమైన చెన్నై రైల్వేస్టేషన్ ఎంత విస్తీర్ణంలో ఉందో తెలుసా?.. కేవలం 13 ఎకరాలు, అదే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఎంత విస్తీర్ణంలో ఉందో తెలుసా?.. 16 ఎకరాలు, బెజవాడ రైల్వేస్టేషన్ విస్తీర్ణం ఎంతో తెలుసా?.. కేవలం 8 ఎకరాల్లో ఉంది. అసలు 1,500 ఎకరాల్లో రైల్వే స్టేషన్ నిర్మిస్తామని చెబుతుంటే వీళ్లను ఏమనాలని వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రశ్నించారు. అదే మాట ఎవరైనా మామూలోడు మాట్లాడితే.. ఇలాంటి మాటలు మాట్లాడిన వాడ్ని చెప్పుతీసి కొట్టాలని అంటాం. కానీ బాధ్యత కలిగిన మంత్రి మాట్లాడినప్పుడు మనం ఏమనగలం? అది పిచ్చివాడు మాట్లాడినట్టుగా అనుకోవాలే తప్ప అంతకు మించి వేరే భాష ఏం మాట్లాడగలం’ అని ఆయన వ్యాఖ్యానించారు. -
ప్రభుత్వమే కామందుగా మారితే ఎలా?
‘రైతన్నలారా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని పేరుతో మళ్లీ భూ సేకరణకు దిగుతోంది. మీకు నష్టం ఖాయం. అందువల్ల ఎవరూ ప్రభుత్వానికి భూములివ్వొద్దు’ పెదపరిమి గ్రామంలో ఒక వ్యక్తి సైకిల్‌పై తిరుగుతూ మైక్ పెట్టుకుని మరీ చేస్తున్న ప్రకటన. రెడ్‌బుక్ పాలన కాబట్టి ఇలాంటి వారిపై టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగి ఉండాల్సింది. కానీ.. అలాంటిదేమీ జరగలేదు. పైగా అందరూ ఆసక్తిగా వింటున్నారు. తొలివిడత భూసేకరణలో భాగమైన రైతులకు ఇచ్చిన హామీలేవీ నెరవేరకపోవడం వారి మెదళ్లల్లో కదులుతోందేమో!.రాజధాని అమరావతి పేరుతో ఇప్పటికే 33 వేల ఎకరాల భూమి సేకరించిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ ఇంకో 36 వేల ఎకరాలు కావాలంటూ రంగంలోకి దిగింది. ఇది కాస్తా చాలా గ్రామాల్లో తీవ్ర అలజడికి కారణమైంది. తొలి విడతలో సేకరించిన భూమిలో 20 వేల ఎకరాల్లో ఎలాంటి కార్యకలాపాలూ చేపట్టకపోవడం మళ్లీ భూమి కావాలని అనడం చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ప్రభుత్వం కూడా రైతుల ఆందోళనలు, అనుమానాలను తీర్చే ప్రయత్నమేదీ చేయడం లేదు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు వంటి వారు కూడా భూములిస్తే రైతులకు నష్టమేనని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు.కానీ, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం నలభై వేల ఎకరాలు తీసుకున్నా ప్రభుత్వానికి మిగిలేది పదివేల ఎకరాలేనని, ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్ల వంటి వాటికి సరిపోగా కొంత భూమిని మాత్రమే అమ్ముకోగలమని చెబుతోంది. విజయవాడ సమీపంలో ఇప్పటికే ఒక విమానాశ్రయం ఉండగా కొత్తగా ఇంకోదాని అవసరమేంటి? కొత్తగా సేకరించే భూముల్లో 2500 ఎకరాలు అదానీ సంస్థకు కట్టబెట్టేందుకూ ప్రయత్నాలు సాగుతున్నట్లుగా తెలుస్తోంది.నాడా దొరికిందని గుర్రాన్ని కొంటారా?ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. భూములివ్వమని రైతులు సైకిళ్లపై ప్రచారం చేస్తూంటే ప్రభుత్వం మాత్రం అబ్బే అలాంటిదేమీ లేదు.. అందరూ ఒప్పుకున్నట్టుగా ప్రచారం చేస్తోంది. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి. కామాంధులకు భూదాహం ఎక్కువంటారు. కానీ, ప్రభుత్వమే భూదాహంతో వ్యవహరిస్తే, కామాంధులాగా మారితే ఏం చేయాలి!. ప్రజావసరాల కోసం ప్రభుత్వం భూమి తీసుకోవడం తప్పుకాదు. కానీ, ఆ అవసరాలు ఎంత అన్నదానిపై స్పష్టత ఉండాలి. అలా కాకుండా ప్రభుత్వాధినేతల ఇష్టాలకు తగ్గట్టుగా భూములు సమీకరించి భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు అయిపోతుందని, కోట్ల రూపాయల లాభం వస్తుందని మభ్యపెడితేనే ప్రమాదం. నిజానికి ప్రభుత్వం తనకు అవసరమైన భూములను మంచి ధరకు రైతుల నుంచి ఖరీదు చేసి భవనాలు నిర్మించుకున్నా లక్షల కోట్ల వ్యయం కాదు.హైదరాబాద్ ఆయా రాజధానులకు ప్రభుత్వాలు ఎంత భూమి సేకరించారన్నది పరిశీలిస్తే ఏపీ ప్రభుత్వం భూదాహం ఎంతన్నది స్పష్టమవుతుంది. వేల ఎకరాల భూమి సేకరించి ఏకమొత్తంగా లక్షల కోట్లు వ్యయం చేసి మౌలిక సదుపాయాలు కల్పించడం వల్ల ప్రభుత్వానికి కలిసొచ్చేదేమీ ఉండదు. రాజధానిగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందే క్రమంలో ప్రైవేటు సంస్థలే ఈ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకుంటాయి. హైదరాబాద్ వంటి మహా నగరాల్లో ఎనెన్నో గేటెడ్ కమ్యూనిటీలు సొంతంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడం లేదు? అలా కాకుండా అన్నీ తామే చేస్తామంటే ఎలా? ఎప్పటికి కావాలి?.ప్రపంచ బ్యాంక్ షరతు..అభివృద్ధి చేసిన ప్లాట్లను రైతులకు ఎప్పుడిస్తారో ఇప్పటికీ స్పష్టత లేదు. వేల కోట్ల వ్యయమయ్యే మౌలిక సదుపాయాల వృద్ధి ఎప్పటికయ్యేనో తెలియదు. గిరాకీ వస్తే మంచిదేకానీ.. ప్రభుత్వమిచ్చే ప్లాట్లతో రైతులకు పెద్దగా ప్రయోజనం కలగకపోతే? అప్పుడు వారు ఎంత నష్టపోతారో తలచుకుంటేనే బాధ కలుగుతుంది!. ఈ నేపధ్యంలోనే ఒక సాధారణ రైతు.. మైక్ పట్టుకుని భూములు ఇవ్వవద్దని ప్రచారం చేస్తున్నారు. రెడ్‌బుక్ అరాచకం ఈ రైతుపైనా జరుగుతుందేమో తెలియదు. ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకున్న రూ.15వేల కోట్ల రుణానికి సంబంధించి పెట్టిన షరతులలో భూముల అమ్మకం కూడా ఒకటి ఉందట. దాని ప్రకారం భూములు ఎప్పటి నుంచి అమ్ముతారని ఆ బ్యాంకు అడుగుతోందని కథనాలు వచ్చాయి. సుమారు వెయ్యి ఎకరాల భూమి ఎకరాకు రూ.25 నుంచి రూ.30 కోట్ల లెక్కన అమ్ముకోవచ్చునని అధికారులు ప్రపంచబ్యాంకుకు తెలిపారట. ఇదసలు సాధ్యమయ్యేదేనా?. ఈ ధరకు కొనగలిగే సంస్థలెన్ని? ఇదే వాస్తవమైతే ఈపాటికి వందల ఎకరాలు అమ్మి ఉండాలి కదా!. ప్రజలను మభ్య పెట్టినట్లు ప్రపంచ బ్యాంకును కూడా మాయ చేయాలని అనుకుంటున్నారా?.మరో విషయం ఏమిటంటే ప్రభుత్వం ఇచ్చే కౌలు రూ.30వేలు మాత్రమే ఉండడాన్ని రైతులు తప్పుపడుతున్నారు. కొత్తగా భూములు సమీకరించే చోట గ్రామస్తులు కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఎన్నికల ప్రణాళికలో చెప్పినట్టుగా ‘అన్నదాత సుఖీభవ’ కింద రైతులకు రూ.20 వేలు చెల్లిస్తే, ప్రధానమంత్రి కిసన్ యోజన కింద ఇంకో రూ.ఆరు వేలు వస్తాయని వీరంటున్నారు. అంటే.. భూములు తమ వద్దే ఉన్నా రూ.26 వేలు వస్తూండగా.. ప్రభుత్వానికి ఇస్తే వచ్చేది రూ.30 వేలు మాత్రమేనని వివరిస్తున్నారు. కేవలం రూ.4 వేల అదనపు ప్రయోజనం కోసం భూమిపై తమ హక్కులను ఎందుకు కోల్పోవాలని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే భూములు ఇచ్చిన రైతులు, కొనుగోలుదారులు.. బాగా నష్టపోయారు. అందువల్లే ఆయా గ్రామసభలలో రైతులు టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్‌ను, అధికారులను నిలదీస్తున్నారట. కొన్ని చోట్ల వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. అయినా రైతుల ఆమోదం దొరికినట్లు అధికారులు రాసేసుకుంటున్నారట. భూములు లాక్కుని తమకు బిచ్చగాళ్లగా చేయవద్దని కొందరు మొర పెట్టుకుంటున్నారు.గతంలో సంప్రదాయేతర ఇంధన వనరుల కోసం అదానీకి భూములు కేటాయిస్తే.. ఏపీని రాసిచ్చేస్తున్నారని నోరు పారేసుకున్న టీడీపీ మీడియా ఇప్పుడు అదానీ స్పోర్ట్స్ సిటీ గురించి మాత్రం పల్లెత్తు మాట అనడం లేదు. పైగా ఆయా సంస్థలకు ఎంత మొత్తానికి భూములు కేటాయిస్తున్నది కూడా గోప్యంగా ఉంచుతున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రైవేటు సంస్థలు ఎకరాకు రూ.20 కోట్లకుపైగా వెచ్చించడానికి సిద్దపడకపోతే ఏం చేస్తారో తెలియదు. అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లు నాలుగింటికి రెండున్నర ఎకరాల చొప్పున ఇస్తారట.అంతర్జాతీయ స్థాయిలో నిజంగా ఆ సెంటర్లు ఏర్పాటైతే ఈ స్థలం సరిపోతుందా? ప్రస్తుతం భూదాహంతో తహతహలాడిపోతున్న ప్రభుత్వ పెద్దలు లేచింది లేడికి ప్రయాణం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రాజధాని ప్రాంతమంటే తమ సొంత జాగీరన్నట్లుగా భావిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. వేల కోట్ల అప్పులు సమీకరించిన ప్రభుత్వ నేతలకు ఇప్పుడు సలహాలు ఇచ్చినా వినే పరిస్థితిలో లేరన్న అభిప్రాయం ఉంది. అమరావతి ప్రజలకు, ముఖ్యంగా రైతులకు న్యాయం జరగాలని కోరుకోవడం తప్ప ఏమి చేయగలం! కొసమెరుపు ఏమిటంటే ఈ అదనపు భూమి సమీకరణపై మంత్రివర్గంలో తర్జనభర్జనపడి నిర్ణయం వాయిదా వేయడం!.-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
భూసేకరణపై కూటమిలో వణుకు.. చంద్రబాబు రుసరుసలు!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి మలి విడత భూ సమీకరణపై తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఏం చేయాలనేదానిపై బుధవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో తర్జనభర్జనలు పడినట్లు తెలిసింది. వాస్తవానికి ఈ భేటీలోనే.. మలి విడత కింద 20 వేల ఎకరాలకు పైగా సమీకరణకు ఆమోదం తెలపాల్సి ఉంది. దీనికి కార్యరంగం సిద్ధమైంది. మున్సిపల్ మంత్రి నారాయణ సైతం భూ సమీకరణకు రైతులు సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు.అయితే, రాజధాని రైతుల్లోనే ఆందోళన రావడం, తొలి విడత సమీకరణ చేసిన గ్రామాల్లో ఇంకా ఎలాంటి సౌకర్యాలు కలి్పంచకుండా, భూములిచ్చిన రైతులకు ప్లాట్లు తిరిగివ్వకుండా రెండో విడత సమీకరణ ఏమిటనే వాదన మొదలైంది. మలి విడత సమీకరణ ద్వారా రియల్ ఎస్టేట్ కోసమే చంద్రబాబు రాజధాని కడుతున్నారని ప్రస్ఫుటం అవుతోందని ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతుండటంతో ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు తెలిసింది. అందుకే భూ సమీకరణకు ఆమోదం తెలపకుండా.. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి, అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాగా, రాజధాని మలి విడత భూ సమీకరణపై మంత్రుల కమిటీ రైతులతో మరింత సమగ్రంగా చర్చించడంతో పాటు ఎందుకు ఈ సమీకరణ చేస్తున్నదీ వివరించిన తరువాత ప్రతిపాదనలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచార శాఖ మంత్రి కె.పార్థసారథి మంత్రివర్గ సమావేశం అనంతరం చెప్పారు.దీంతోనే మలి విడత భూ సమీకరణపై ప్రభుత్వం పునరాలోచనలో పడిందని తేలిపోయింది. ఇదంతాచూస్తే.. రాజధాని భూ సమీకరణలో ముందుకెళ్లాలని నిర్ణయించినా ప్రజా వ్యతిరేకత దృష్ట్యా చంద్రబాబు పునరాలోచనలో పడినట్లు సమాచారం. అలాగే ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కరేడులో సోలార్ ప్రాజెక్టు కోసం 8 వేల ఎకరాలను తీసుకోవడంపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. ఈ అంశంపై ప్రభుత్వంపై విమర్శలు ఎక్కువయ్యాయని, మనం తప్పు చేస్తున్నట్లు స్పష్టమైందని, ప్రజలు దీనిపైనే మాట్లాడుకుంటున్నారని మంత్రులు అన్నట్లు సమాచారం.దేనిపైనా సరిగా స్పందించడం లేదు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనకు భారీగా ప్రజలు తరలిరావడంతో చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అన్ని ఆంక్షలు పెట్టినా అంతమంది ఎలా వచ్చారంటూ మంత్రులపై కోపం చూపించినట్లు తెలిసింది. మంత్రులు సరిగా పనిచేయడంలేదని, దేనిపైనా సరిగా స్పందించడం లేదని మండిపడ్డారని సమాచారం. తోతాపూరి మామిడి కొనుగోలులో సంబంధిత శాఖల మంత్రులు బాధ్యతగా వ్యవహరించలేదని, ఇలాగైతే మంత్రులను మార్చేస్తానని కూడా హెచ్చరించినట్లు సమాచారం.పనిచేయనివారి స్థానంలో కొత్త వారిని పెడతానని అన్నట్లు తెలిసింది. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి విషయంలోనూ మంత్రులు చురుగ్గా వ్యవహరించలేదని, ఈ వ్యవహారంపై విచారణ జరిపిస్తామని చెప్పారు. ఏడాదిలో ఎన్నో అద్భుతాలు చేసినా మంత్రులు ప్రజలకు చెప్పలేకపోతున్నారని, ప్రజలను మేనేజ్ చేయలేని వారికి పదవులు ఎందుకని అన్నట్లు తెలిసింది. వైఎస్ జగన్‌ను నిలువరించడంలో మంత్రులు విఫలం అవుతున్నారని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇండోసోల్ భూముల విషయంలో వైఎస్ జగన్ వైఖరిపై మంత్రులు ఎవరూ సరిగా స్పందించలేదని అందువల్లే కూటమి ప్రభుత్వం తప్పు చేసినట్లు జనంలోకి వెళ్లిందని అన్నట్లు సమాచారం. వైఎస్ జగన్ పర్యటనలు, వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతున్న అంశాలను వివాదాస్పదం, డైవర్షన్ చేయడంపై దృష్టిపెట్టాలని పరోక్షంగా సూచనలు చేసినట్లు తెలిసింది. -
రాజధాని విస్తరణకు భూములు ఇచ్చే ప్రసక్తే లేదంటున్న రైతులు
-
అమ్మకానికి అమరావతి.. సర్కారు వారి పాట ఎకరా 30 కోట్లు..!
-
చంద్రబాబుకు ఊహించని షాకిచ్చిన అమరావతి రైతులు
సాక్షి,గుంటూరు: అమరావతి విస్తరణ కోసం మరో 45 వేల ఎకరాల భూ సమీకరణ చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి రైతులు షాకిచ్చారు. రాజధాని విస్తరణకు తమ భూముల్ని ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు.అమరావతి రాజధాని విస్తరణ కోసం కూటమి ప్రభుత్వం మరో భారీ కుట్రకు తెరతీసింది. రాజధానికి సమీపంలోని 11 గ్రామాల్లో వేలాది ఎకరాల భూ సమీకరణకు సిద్ధమైంది. ఇందుకోసం నిర్వహిస్తోంది. ఈ క్రమంలో గురువారం తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో తాడికొండ మండలం బేజాత్ పురంలో జరిగిన గ్రామ సభ రసాభాసగా మారింది. రైతుల నుంచి భూముల్ని సేకరించేందుకు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ఇతర అధికారులు గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో రాజధాని విస్తరణకు తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని పలువురు రైతులు తేల్చి చెప్పారు. గత చంద్రబాబులో రాజధానికి భూములు ఇచ్చిన వారికి ఏం న్యాయం చేశారంటూ అధికారులను నిలదీశారు. తమ భూముల జోలికి రావొద్దని హెచ్చరించారు.అయితే, అమరావతి విస్తరణ కోసం భూమి ఇవ్వమని రైతులు అధికారులకు చెప్తుండగా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నాయకులకు రైతులకు మధ్య వాగ్వాదానికి దారి తీసింది.ల్యాండ్ పూలింగ్కురాజధాని అమరావతిలో మరోసారి భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్)కు టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఈమేరకు ల్యాండ్ పూలింగ్ స్కీం 2025 విధి విధానాలను జారీ చేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ల్యాండ్ పూలింగ్ స్కీం 2025 కింద రాజధానికి సమీపంలో ఉన్న 11 గ్రామాల్లో సుమారు 44,676.64 ఎకరాలను సమీకరిస్తుంది. ఇప్పటికే రాజధాని కోసం 2015లో తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి మండలాల పరిధిలోని 29 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్(భూ సమీకరణ) ద్వారా 29,442 మంది రైతుల నుంచి 34,823.12 ఎకరాలు సమీకరించిన విషయం తెలిసిందే.రాజధాని భూముల్ని అమ్మేందుకు కుట్రమరో 18,924.88 ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములు కలిపి మొత్తం 53,748 ఎకరాల్లో (217చదరపు కిలోమీటర్లు) రాజధాని నిర్మాణం చేపట్టనున్నట్లు గతంలో పేర్కొంది. మౌలిక సదుపాయాల కల్పన, రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వగా ప్రభుత్వానికి 8,250 ఎకరాల భూమి మిగులుందని.. దాన్ని విక్రయించగా వచ్చే ఆదాయంతోనే రాజధానిని నిర్మించుకోవచ్చని.. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అమరావతి అంటూ సీఎం చంద్రబాబు, పురపాలక శాఖ మంత్రి నారాయణ 2015 నుంచి పదే పదే చెబుతూ వచ్చారు.మండిపడుతున్న అమరావతి రైతులుఇప్పుడు స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే రాజధానిలో భూముల విలువ పెరుగుతుందని.. కానీ ఆ ప్రాజెక్టులు రావాలంటే ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిపోర్టు, స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని వారు చెబుతున్నారు. వాటి కోసం పది వేల ఎకరాలు అవసరమని, అంత భూమి ప్రభుత్వానికి అందుబాటులోకి రావాలంటే 44,676.64 ఎకరాలు సమీకరించాలని అంటున్నారు. 2015లో భూములిచ్చిన తమకే ఇంతవరకూ అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వకుండా మళ్లీ భూ సమీకరణకు ప్రభుత్వం సిద్ధం కావడంపై రైతులు మండిపడుతున్నారు. -
CPI Narayana: ముందు తీసుకున్న భూములకు న్యాయం చేయండి..
-
అమరావతిలో మరోసారి భారీ ఎత్తున భూ సమీకరణ.. కేబినెట్ గ్రీన్ సిగ్నల్
సాక్షి,విజయవాడ: అమరావతి కోసం కూటమి ప్రభుత్వ మళ్ళీ భూ సమీకరణ చేపట్టేందుకు సిద్ధమైంది. భూ సమీకరణ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే అమరావతి కోసం 54 వేల ఎకరాల భూముల సేకరణ చేపట్టిన కూటమి ప్రభుత్వం.. తాజాగా మరోసారి పెద్ద ఎత్తున భూ సమీకరణకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
చంద్రబాబు అలా మాట్లాడటం సిగ్గుచేటు: వడ్డే శోభనాద్రీశ్వరరావు
సాక్షి, విజయవాడ: పరిశ్రమలకు భూములివ్వాలనే తాపత్రయం తప్ప చంద్రబాబుకు రైతుల గురించి ఆలోచన లేదంటూ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంపద సృష్టించేదంతా పారిశ్రామికవేత్తలేనంటూ చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటు అని దుయ్యబట్టారు.‘‘పక్కనున్న తెలంగాణలో సన్న ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు క్వింటాకు మద్దతు ధరకంటే అదనంగా 800 రూపాయలు బోనస్ ఇస్తున్నాయి. కానీ ఏపీలో మాత్రం ఏ పంటకు కూడా మద్దతు ధర దొరకడం లేదు. పరిశ్రమలకు మేం వ్యతిరేకం కాదు...పరిశ్రమలు రావాలి. యువతకు ఉద్యోగాలు కావాలి. ఇప్పటికైనా చంద్రబాబు రైతుల గురించి ఆలోచన చేయాలి. ఏపీలో 50 శాతం పైన భూమి కౌలు రైతులు సాగుచేస్తున్నారు. కౌలు రైతులకు రైతు బంధు పథకం అమలు చేయాలి’’ అని వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్ చేశారు. -
బిల్డప్ బాబాయ్ బడాయి!
అమరావతిలో నాలుగు వేల ఎకరాలు అమ్మితే రూ.80 వేల కోట్లు వస్తాయట! ఎల్లో మీడియాలో బిల్డప్ బాబాయి రాసిన ఒక కథనం చెబుతోంది. రాజధాని పేరుతో లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలా ప్లాన్ చేశారన్నమాట! ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. విశాఖపట్నంలో టీసీఎస్‌కు కేవలం 99 పైసలకే భూములు కేటాయించిన ప్రభుత్వం అమరావతిలో మాత్రం ఆయా సంస్థలకు ఎకరా రూ.20 కోట్లకు విక్రయించాలని నిర్ణయించిందట.ఇలా సంపాదించిన మొత్తాన్ని అమరావతిలో వివిధ ప్రాజెక్టులకు, రుణాల చెల్లింపులకూ ఉపయోగిస్తారని ఈ మీడియా చెబుతోంది.ఎవరైనా నమ్మగలరా? గోబెల్స్ మాదిరి ఒకటికి, పదిసార్లు ప్రచారం చేస్తే జనం నమ్మక చస్తారా అన్నదే వీరి ధీమా కావచ్చు. గతంలో జగన్ ప్రభుత్వంపై ఇష్టారీతిలో అబద్దాలు రాసిన ఎల్లో మీడియా, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కొమ్ముకాస్తూ అసత్యాలు ప్రచారం చేస్తోంది. ఇక్కడ ఒక కిలకమైన విషయం ఉంది. మూడేళ్లలో రాజధానికి సంబంధించిన కొన్ని భవనాలను పూర్తి చేస్తామని చంద్రబాబు చెబుతున్నా, ప్రపంచ బ్యాంక్, ఇతర ఆర్థిక సంస్థలు మంజూరు చేసిన రూ.31 వేల కోట్లు మూడేళ్లలో ఇవ్వడం లేదు. దశల వారీగా ఐదారేళ్లలో ఇస్తాయని ఎల్లో మీడియానే తెలిపింది. అందుకనే బ్యాంకర్లతో కూడా చర్చలు జరిపి మరో రూ.40 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ సంగతి బయటకు వస్తే మరింత అల్లరి అవుతుందని భయపడి, డైవర్ట్ చేయడానికి భూములు అమ్మడం ద్వారా రూ.80 వేల కోట్ల రూపాయలు వస్తాయని ప్రచారం ఆరంభించారు. హైదరాబాద్ లోనే ఏవో కొన్ని ప్రదేశాలలో తప్ప ఎకరా ఇరవై కోట్ల ధర పలకడం లేదు. గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ లో ఎకరా వంద కోట్లకు వేలంలో పోయిందని చెప్పినా, ఆ రకంగా కొనుగోలు చేసిన సంస్థలు ఆ డబ్బు చెల్లించలేదు. ఇటీవలీ కాలంలో ఆర్థిక మాంద్యం ఏర్పడిన పరిస్థితిలో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బాగా దెబ్బతింది. అమరావతిలో పలు రకాలుగా గిమ్మిక్కులు చేస్తున్నా భూముల విలువలు ఆశించిన రీతిలో పెరగడం లేదు. చంద్రబాబు సొంతంగా ఇల్లు కట్టుకుంటున్నట్లు చెప్పినా, చివరికి ప్రధాని మోడీని తీసుకువచ్చి అమరావతి పనుల పునః ప్రారంభం అంటూ హడావుడి చేసినా పరిస్థితిలో పెద్దగా మార్పు రావడం లేదు. దాంతో ఇప్పుడు ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని అప్పులన్నీ భూముల అమ్మకం ద్వారా తీరిపోతాయని చెబుతూ కొత్త డ్రామాకు తెరదీశారు. ఏ సంస్థ ఎకరా రూ.ఇరవై కోట్లకు కొనుగోలు చేయడానికి సిద్దం అవుతుంది? రియల్ ఎస్టేట్ సంస్థలు సైతం ఈ ధరకు ఎందుకు కొనుగోలు చేస్తాయి? అమరావతిలో సమీకరించిన 33 వేల ఎకరాల భూమి, ప్రభుత్వ భూమి మరో ఇరవై వేల ఎకరాలు కలిపి అభివృద్ది చేసిన తర్వాత పదివేల ఎకరాల భూమి ప్రభుత్వానికి మిగులుతుందని తొలుత చెప్పారు. ఆ తర్వాత దానిని ఎనిమిదివేల ఎకరాలు అన్నారు. తదుపరి రెండువేల ఎకరాలే మిగులుతుందని చెప్పారు. ఇప్పుడు నాలుగువేల ఎకరాలు మిగులుతుందని అంటున్నారు. వీటిలో దేనిని నమ్మాలి? ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఉన్న 53 వేల ఎకరాల భూమి చాలదు కనుక మరో 44 వేల ఎకరాలు సమీకరిస్తామని చెప్పారు. ఐదు వేల ఎకరాలలో కొత్త విమానాశ్రయం నిర్మిస్తామని, అది కట్టకపోతే ఈ భూములు అన్ని వృథా అయిపోతాయని, కేవలం మున్సిపాల్టీగా మిగిలిపోతుందని చంద్రబాబే బెదిరించారు. గతంలో 53 వేల ఎకరాలు సరిపోతుందని అన్నారు కదా అంటే దానికి జవాబు ఇవ్వరు. కేవలం ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఏవో కట్టు కధలు చెప్పడం ద్వారా జనాన్ని మభ్య పెట్టే దిశలోనే సర్కార్ అడుగులు వేస్తోంది. మరో విశేషం ఉంది. రెండో దశలో ఎంత భూమి మిగులుతుందో తెలియదు కాని, అప్పుడు అమ్మే భూమిని రియల్ ఎస్టేట్ సంస్థలకు 60ః40 రిష్పత్తిలో భూములు ఇస్తారట. వారు అభివృద్ది చేసిన గృహాలు ,విల్లాలు, వాణిజ్య ప్లాట్ల రూపంలో ప్రభుత్వానికి ఆస్తులు సమకూరతాయట.ఇదంతా గాలిలో మేడలు కట్టినట్లే అనిపిస్తుంది. కీలకమైన అంశం ఏమిటంటే చంద్రబాబు మూడేళ్లలో ఐకానిక్ టవర్లతో సహా ఆయా భవనాల నిర్మాణం చేస్తామని చెప్పినా, దశల వారీగా వచ్చే నిధులతో పనులు పూర్తి కావని ఎల్లో మీడియానే స్పష్టం చేసింది. అందుకే బ్యాంకుల ద్వారా రూ.40 వేల కోట్లు సమీకరించాలని రాజధాని అభివృద్ది సంస్థ తలపెడుతోందట.దీంతో అమరావతి అప్పు రూ.70 వేల కోట్లు అవుతుంది. మంత్రి నారాయణ లక్ష కోట్ల రూపాయల విలువైన పనులు చేపడుతున్నట్లు ప్రకటించారు. వాటన్నిటిని పూర్తి చేయడానికి ఇంకో 30 వేల కోట్లు అవసరం అవుతాయి. కాలం గడిచే కొద్ది నిర్మాణ వ్యయం పెరుగుతుంది. ఐదేళ్ల క్రితం నిర్ణయించిన రేట్లకన్నా డబుల్ రేట్లను కాంట్రాక్టర్ లకు చెల్లించి భవనాలను చేపడుతున్న సంగతి తెలిసిందే. అలాంటప్పుడు మూడేళ్లకు ఈ పనులు పూర్తి కాకపోతే సహజంగానే ఇంకా రేట్లు పెరుగుతాయి. ఆ మొత్తం ఎంత అవుతుందో ఇప్పుడే చెప్పలేం. లక్షల కోట్ల రుణాలు తెచ్చి పనులు చేపడితే ఏపీ ప్రజలపై పడే అప్పు భారం తడిసి మోపెడవుతుంది. ముందుగా లక్షల కోట్లు వ్యయం చేసి ఈ మొత్తం భూమికి ప్రాధమిక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నిజంగానే భూమి ప్రభుత్వానికి ఏదైనా మిగిలితే దానిని ఎకరా రూ.20 కోట్లకు అమ్మాలి. దానిని ఆ ధరకు కొనడానికి ఎన్ని సంస్థలు ముందుకు వస్తాయన్నది చెప్పలేం. ఒకవేళ ఆ ధరకు కొనడానికి ఎక్కువమంది సిద్దపడకపోతే పరిస్థితి ఏమిటన్నది కూడా ప్రభుత్వం ఆలోచించాలి కదా? అదేమీ లేకుండా చేతిలో మీడియా ఉంది కదా అని ఇలాంటి కల్పిత కధలు సృష్టించి ప్రజల జీవితాలతో ఆడుకోవడం సరైనదేనా? అసలు ప్రభుత్వం తనకు అవసరమైన కొద్దిపాటి భవనాలను నిర్మించుకొని, మిగిలిన భూమిని రైతులకే వదలివేసి ఉంటే,వారే రియల్ ఎస్టేట్ వారికో, లేక ఇతరులతో అమ్ముకుంటారు కదా? ఈ పని అంతా ప్రభుత్వం ఎందుకు భుజాన వేసుకుంటోంది? కేవలం తమ వర్గంవారి ఆస్తుల విలువలు పెంచడానికే ఈ తంటాలు అన్న విమర్శకు ఎందుకు ఆస్కారం ఇస్తున్నారు? గతంలో కూడా అభూత కల్పనలు, అర్ధ సత్యాలు రాసి ప్రజలను ఏమార్చే యత్నం చేశారు. ప్రపంచ స్థాయి రాజధాని అంటూ దేశ,దేశాలు తిరిగి వచ్చారు.అసలు ప్రపంచ రాజధాని అవసరం ఏమిటి?ఒక రాష్ట్ర ప్రభుత్వంతో అయ్యేపనేనా?భవిష్యత్తులో ఈ ప్లాన్ లన్నీ తలకిందులైతే ఎపి ప్రజలు ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోరా? అలాంటి వాటిని పరిగణనలోకి తీసుకుని, అన్ని రక్షణ చర్యలు చేపట్టిన తర్వాత పెద్ద రాజధాని కట్టుకుంటారా? మహా నగరాన్ని నిర్మించుకుంటారా? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారా? అన్నది మీ ఇష్టం.అలా కాకుంటే ఏదో రకంగా తన సొంత కీర్తి కోసం నగర నిర్మాణం చేపట్టి ఏపీ ప్రజలను నట్టేట ముంచారన్న అపకీర్తిని చంద్రబాబు మూట కట్టుకోవల్సి ఉంటుంది. ఎల్లో మీడియా ఇచ్చే దిక్కుమాలిన సలహాలు విని చంద్రబాబు మునుగుతారా? లేక వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తారా? అన్నది ఆయన ఇష్టం.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
హవ్వ.. ఇంకో 44 వేల ఎకరాలా?
పిచ్చి ముదిరిందంటే.. తలకు రోకలి చుట్టమన్నాడట వెనుకటికి ఎవడో. అలా ఉంది ఏపీ ప్రభుత్వం పరిస్థితి ఇప్పుడు. రాజధాని పేరుతో ఇప్పటికే 33 వేల ఏకరాల భూమి సేకరించిన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా ఇంకో 44676 ఎకరాలు సేకరించాలని నిర్ణయించడం ఆందోళన కలిగిస్తోంది. రైతులపై మాత్రమే కాదు.. ఈ నిర్ణయం రాష్ట్ర ప్రజలందరిపై పిడుగుపాటే. ఇప్పటికే సేకరించిన భూమిలో ఒక్క భవనాన్ని కూడా పూర్తి చేయలేదు. అన్నీ తాత్కాలిక నిర్మాణాలే. అయినాసరే.. ఇంకో 44 వేల పైచిలుకు ఎకరాలు సేకరించాలన్న నిర్ణయం ఏ రకంగా చూసినా సహేతుకం కాదు.ఈ నిర్ణయానికి వైఎస్సార్ కాంగ్రెస్ మినహా మిగిలిన పార్టీలన్నీ తమ జేబు పార్టీలే అన్న ధీమాతో టీడీపీ ఈ ప్రతిపాదన చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రశ్నిస్తానని రాజకీయ పార్టీ పెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ పని ఎప్పుడో మానేశారు. పురంధేశ్వరి వంటి స్థానిక బీజేపీ నేతలు సరేసరి. ఎన్టీయే వ్యతిరేకినని జాతీయ స్థాయిలో చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీలో పరోక్ష మద్దతుదారుగా మారిపోయింది.ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ముఖ్యమంత్రి చంద్రబాబు సలహాలు, సూచనల మేరకే పార్టీని నడుపుతున్నారన్నది కాంగ్రెస్ వాదుల భావన. వామపక్ష పార్టీ సీపీఐ పైపైకి టీడీపీని విమర్శిస్తున్నట్లు కనిపిస్తున్నా, మానసికంగా చంద్రబాబుకే దగ్గరగా ఉన్న విమర్శ ఉంది. ఒక్క సీపీఎం మాత్రం కాస్తో, కూస్తో స్వతంత్రంగా ఉండే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఇంత అడ్డగోలుగా నిర్ణయాలు చేయగలుగుతున్నారు. అమరావతి పేరుతో గత టర్మ్‌లో చంద్రబాబు నాయుడు 33 వేల ఎకరాలు సమీకరిస్తున్నప్పుడు కొంతమంది రైతులు స్వచ్ఛందంగానే ఇచ్చినా చాలా మంది తీవ్రంగా వ్యతిరేకించారు. భూ సేకరణను వ్యతిరేకించిన కొన్ని గ్రామాల వారికి పవన్ కళ్యాణ్ అప్పట్లో మద్దతిచ్చారు, చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు కూడా. కానీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామయ్యాక ఆయన పన్నెత్తిన పాపన పోలేదు. పిఠాపురంలో శాంతిభద్రతల సమస్యపై తీవ్రంగా స్పందించిన తర్వాత ఏమైందో కాని, చంద్రబాబును పొగడడమే లక్ష్యంగా పెట్టుకుని పవన్ కళ్యాణ్ తన ఉప ముఖ్యమంత్రి పదవిని ఎంజాయ్ చేయడానికి అలవాటు పడ్డారు. ప్రభుత్వంలో జరిగే అవకతవకలు ఎత్తి చూపకుండా ఉండేందుకు ఏమైనా డీల్ కుదిరిందేమో!విశాఖతోసహా ఏపీ మొత్తమ్మీద రియల్ ఎస్టేట్ పెద్దగా పుంజుకుంది లేదు. అమరావతిలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడం లేదన్న ఆందోళన ఇప్పటికే అక్కడి రైతులలో ఉంది. కృత్రిమంగానైనా పెంచేందుకు వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి మరీ ఖర్చుపెట్టేందుకు ప్రయత్నించినా ఫలితం పెద్దగా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో అదనంగా మరింత భూమి సేకరిస్తే డిమాండ్ భారీగా పడిపోతుంది.అమరావతి గ్రామాలలో విమానాశ్రయం ఏర్పాటైతే భూముల విలువ పెరుగుతాయంటూ చంద్రబాబు తాజాగా కొత్త పాట అందుకున్నారు. భూ సమీకరణ ద్వారా మూడు పంటలు పండే పచ్చటి పొలాలను ప్రభుత్వం బీళ్లుగా మార్చింది. తెలంగాణలో 400 ఎకరాల ప్రభుత్వ భూమి అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తేనే పర్యావరణవేత్తలు, వివిధ రాజకీయ పక్షాలు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశాయి. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రధాని మోడీ సైతం కాంగ్రెస్‌పై విమర్శల వర్షం కురిపించారు. అలాంటిది అమరావతిలో లక్ష ఎకరాల భూమిని అనవసరంగా తీసుకుంటున్న తీరుపై మాత్రం ఎవరూ కిమ్మనడం లేదు.చంద్రబాబు తన ఇంటి కోసం ఐదు ఎకరాలు కొనుగోలు చేసి, శంకుస్థాపన చేసిన విషయంలో కూడా మతలబు ఉండవచ్చన్న భావన ఉంది. రియల్ ఎస్టేట్ పెరగడానికి వీలుగా ఆయన ఈ ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో టీడీపీ కూటమి ఓటమి పాలైతే, చంద్రబాబు కాని, ఆయన కుటుంబం కాని అమరావతిలోనే నివసిస్తుందా? ఎందుకంటే చంద్రబాబు లోకేశ్‌లు పేరుకు అక్కడ నివసిస్తున్నా, కుటుంబ సభ్యులు.. వారాంతాల్లో ఆయన కూడా హైదరాబాద్‌కు వచ్చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ది కూడా అదే తీరు. చిత్రమేమిటంటే చంద్రబాబు అమరావతిలో గజం రూ.60 వేలకుపైగా ఉందని ప్రచారం చేస్తున్నా, ఆయన కుటుంబం మాత్రం ఐదెకరాల భూమిని గజం రూ.7500లకే కొనుగోలు చేసిందట. రిజిస్ట్రేషన్ అయితే గజం రూ.ఐదు వేలకే చేశారు.మరి చంద్రబాబు ప్రచారం చేసిన విధంగా రియల్ ఎస్టేట్ విలువలు లేవా? లేక చంద్రబాబు నిర్దిష్ట మొత్తం కాకుండా మిగిలిన దానిని భూ యజమానులకు బ్లాక్‌లో నగదు రూపంలో అందించారా అన్నది చర్చనీయాంశం. ఏభైవేల మంది పేదలకు గత ప్రభుత్వం సెంటు భూమి చొప్పున ఇస్తే, దానిని వెనక్కి లాక్కుంటున్న కూటమి ప్రభుత్వం, ధనవంతులకు మాత్రం ఎకరాలలో ఇళ్లు కట్టుకునే వెసులుబాటు కల్పిస్తోందన్న మాట. రైతుల గుండెలు గుభేలు మనేలా ప్రభుత్వం అదనపు భూమి సమీకరణకు సిద్దమవుతున్న తరుణంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా మాత్రం చంద్రబాబు సర్కారుకు వంత పాడుతూ కథనాలు ఇస్తోంది. ఈనాడు మీడియా ఎంత దారుణమైన కథనాన్ని ఇచ్చిందంటే రైతుల విజ్ఞప్తి మేరకే అదనంగా మరో 44 వేల ఎకరాల భూమి తీసుకోవాలని తలపెట్టారట.మంత్రి నారాయణను కలిసి వారు ఈ మేరకు కోరారట. మెడకాయ మీద తలకాయ ఉన్నవారెవరైనా ఈనాడు పిచ్చి రాతలను నమ్ముతారా? ప్రస్తుతం ఉన్న రాజధాని భూమిలో ప్రభుత్వానికి మిగిలేది రెండువేల ఎకరాలేనట.అది చాలదట. గతంలో పదివేల ఎకరాల భూమి మిగులుతుందన్నారు. ఇప్పుడు దానిని రెండువేలకు తగ్గించారు. అనేక సంస్థలు ఇక్కడ భూమి కావాలంటున్నాయట. నిజంగా ఇవన్ని జరిగి ఉంటే ఈ ఎల్లో మీడియా ఏ స్థాయిలో ఈపాటికి ఊదరగొట్టేవి! ఎవరిని మోసం చేయడానికి ఈ రాతలు? గతంలో చంద్రబాబు, ఎల్లో మీడియా ఏమని ప్రచారం చేశాయి? అమరావతికి అసలు ప్రభుత్వం డబ్బు రూపాయి ఖర్చు చేయనక్కర్లేదని, దానికి అదే సంపాదించుకుంటుందని కదా? కాని ఇప్పుడేమీ చేస్తున్నారు. బడ్జెట్లో రూ. ఆరు వేల కోట్లు కేటాయించారు. మరో రూ.ముప్పై వేల కోట్లు అప్పులు తీసుకు వస్తున్నారు. డబ్బై ఏడువేల కోట్లు అవసరం అవుతాయని చంద్రబాబు ఆర్థిక సంఘానికి తెలిపారు. కాని ఒక్క ఎకరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి సుమారు రూ.రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనా. ఆ రకంగా చూస్తే ఎన్ని లక్షల కోట్లు కావాలో లెక్క వేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు నుంచి వసూలు చేసే పన్నులతో చేపట్టవలసిన ఈ అభివృద్ది పనులను ప్రభుత్వమే చేపడుతోందన్నమాట. ఇది ప్రైవేటు వ్యక్తులకే ప్రయోజనం తప్ప, ప్రభుత్వానికి కాదు. అప్పులు మాత్రం రాష్ట్రం అంతా ప్రజలు భరించాలి.సదుపాయాలు మాత్రం కొద్దిమంది ప్రైవేటు ఆసాములు పొందుతారన్నమాట. అందుకే ఇది రైతులపైనే కాదు.. ఏపీ ప్రజలపైనే పిడుగుపాటుగా పరిగణించాలనిపిస్తుంది. ఇంత చేసినా ప్రభుత్వం అమ్ముకోవడానికి భూమి సరిపోదట. అందుకే మళ్లీ భూమి తీసుకుంటారట. అంటే ఇంతకాలం అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేసినట్లు వీరు ఒప్పుకుంటారా? అమరావతిలో మరో విమానాశ్రయానికి నాలుగైదువేల ఎకరాలు సేకరిస్తారట. ప్రస్తుతం 30, 40 కిలోమీటర్ల దూరంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. అక్కడ విస్తరణకు కూడా భూమి తీసుకుంది. వారిలో పలువురికి అమరావతి గ్రామాలలో ప్లాట్లు ఇచ్చారు. ఇంతా చేసి ఆ విమానాశ్రయం కాదని మరోకటి కడతారట. ఉన్న ఎయిర్ పోర్టును వృథాగా పెట్టి కొత్తది కడతారట.ఇప్పటికే పచ్చటి పొలాలను బీడు పెట్టి, రైతులకు కౌలు రూపంలో ఏటా వందల కోట్లు చెల్లించవలసి వస్తోంది. మళ్లీ అదే ప్రకారం భూముల సేకరణ చేస్తే రైతులు ఎంతవరకు సిద్దపడతారాన్నది అనుమానమే. ఒకవేళ రైతులు తమ భూములు ఇవ్వబోమని అంటే చంద్రబాబు వద్ద ఎటూ తన కుమారుడు లోకేశ్ రెడ్ బుక్ ఉంటుంది. పోలీసులను ప్రయోగించి రైతులను వేధించవచ్చు. కిందటిసారి కూడా అలాగే చేశారు. అయితే ముందుగా తమకు అనుకూలంగా ఉన్న గ్రామాలలో భూములు సమీకరిస్తారట. ఆ తర్వాత మిగిలిన గ్రామాలపై పడతారట. రాజధాని పేరుతో తమ భూములకు ఎసరు పెట్టలేదులే అనుకున్న రైతులకు ఇది షాకింగ్ వార్తే అని చెప్పాలి. ఈ పరిస్థితిని వారు ఎలా ఎదుర్కుంటారో చూడాల్సిందే.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
చంద్రబాబు ప్రభుత్వ భూ దాహం.. మరో 44,676 ఎకరాలు!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పెద్దల భూ దాహం తీరడం లేదు. రైతులు కాళ్లావేళ్లా పడుతున్నా హృదయం కరగడం లేదు! ఇప్పటికే రాజధాని పేరుతో అమరావతిలో ఏకంగా 53 వేలకుపైగా ఎకరాలను తీసుకోగా ఇప్పుడు మరో 44 వేల ఎకరాలకుపైగా భూమిని హస్తగతం చేసుకునేందుకు టీడీపీ కూటమి సర్కారు సన్నాహాలు చేస్తోంది. వెరసి దాదాపు లక్ష ఎకరాలను అమరావతి నిర్మాణం కోసం వినియోగించనున్నట్లు స్పష్టమవుతోంది. నాలుగు మండలాల పరిధిలో... రాజధాని పేరుతో ఏటా మూడు వాణిజ్య పంటలు పండే ఎంతో సారవంతమైన భూములను రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ ద్వారా గతంలోనే 34,568 ఎకరాలను టీడీపీ సర్కారు తీసుకుంది. ఇది కాకుండా ప్రభుత్వ భూములతో కలిపి మొత్తం 53,749 ఎకరాలను రాజధాని కోసం ఇప్పటికే సమీకరించారు. అయితే ఇది ఇంకా సరిపోదంటూ రాజధాని విస్తరణ పేరుతో మరో 44,676 ఎకరాలను సమీకరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం తాజాగా కసరత్తు ప్రారంభించింది. తుళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాల్లోని పలు గ్రామాల పరిధిలో వేల ఎకరాలను సమీకరించే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. ‘రియల్’ వ్యాపారిలా మారిపోయి... రాష్ట్ర విభజన అనంతరం అధికారం చేపట్టిన చంద్రబాబు ల్యాండ్ పూలింగ్ పేరుతో రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి వేల ఎకరాలను తీసుకుని ఐదేళ్ల పాటు తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టు పేరుతో కాలక్షేపం చేశారు. తమ నుంచి బలవంతంగా భూములు తీసుకోవద్దని పేద రైతులు వేడుకున్నా కనికరించలేదు. మూడు వాణిజ్య పంటలు పండే ప్రాంతంలో రాజధాని కోసం వేల ఎకరాలు తీసుకోవడాన్ని పర్యావరణ వేత్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. రైతులు ఇచి్చన భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ హ్యాపీ నెస్ట్, తాత్కాలిక భవనాలంటూ కాలం గడిపారు. వరద ముప్పు తప్పించే పనులు చేపట్టాలన్న ప్రపంచబ్యాంకు రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయకపోగా విస్తరణ అవసరాల పేరుతో మరో 44,676 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ లేదా నెగోíÙయేటెడ్ సెటిల్మెంట్స్ లేదా భూసేకరణ చట్టం ద్వారా సమీకరించాలని టీడీపీ కూటమి సర్కారు భావిస్తోంది. భవిష్యత్తు అవసరాల పేరుతో మూడు పంటలు పండే సారవంతమైన వేలాది ఎకరాలను స్వా«దీనం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, స్టేడియాలు, ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, రైల్వే లైన్లు పేరుతో రాజధాని విస్తరణ అంటూ వేలాది ఎకరాలపై కన్నేసింది. అసలు రాజధాని నిర్మాణమే ప్రారంభం కాకపోగా భవిష్యత్ విస్తరణ పేరుతో మళ్లీ వేల ఎకరాలను రైతుల నుంచి తీసుకునే యత్నాలపై అధికార వర్గాలు విస్తుపోతున్నాయి. ఇప్పటికే రాజధాని ప్రాంతానికి వరద ముప్పు పొంచి ఉందని, దాని నుంచి అమరావతిని కాపాడేందుకు ప్రాజెక్టులు చేపట్టాలని ప్రపంచ బ్యాంకు, ఏడీబీ షరతు విధించాయి. రాజధాని నిర్మాణ ప్రాంతంలో వరద ముప్పు తగ్గించేందుకు 1,995 ఎకరాల్లో రూ.2,750 కోట్లతో పనులు చేపట్టాల్సిందిగా ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. అలాంటి చోట రాజధాని విస్తరణ పేరుతో 44,676 ఎకరాలను సమీకరించడం అంటే ఏకంగా లక్ష ఎకరాలను రైతుల నుంచి లాక్కోవటమేననే అభిప్రాయం అధికార వర్గాల్లో బలంగా వ్యక్తం అవుతోంది. రాజధాని ప్రాంతంలో సారవంతమైన తమ భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. తమ జీవనోపాధి దెబ్బ తింటుందని, మూడు పంటలు పండే భూములను లాక్కోవడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం భూ దాహం తీరడం లేదు. -
అమరావతి కోసం మరో భారీ భూ సమీకరణ
సాక్షి, గుంటూరు: అమరావతి కోసం మరో భారీ భూ సమీకరణకు చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది. 44,676 ఎకరాలను సీఆర్డీఏ సమీకరించనుంది. మూడు పంటలు పండే భూముల్ని ప్రభుత్వం మళ్ళీ సమీకరించనుంది. ఇప్పటికే 54 వేల ఎకరాలు సమీకరించిన చంద్రబాబు ప్రభుత్వం.. 54 వేల ఎకరాల్లో ఒక్క శాశ్వత భవనం నిర్మించలేదు.గత ఆ భూములు ఉంటుండగానే మళ్లీ 44,676 ఎకరాలు భూముల సమీకరణకు సిద్ధమైంది. తుళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాల్లో కొత్తగా భూ సమీకరణ చేయనుంది. 11 గ్రామాల్లో 44,676 ఎకరాలు భూములను ప్రభుత్వం సమీకరించనుంది.కాగా, రాజధాని ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి రైతుల నుంచి తక్కువ ధరలకే ప్రభుత్వ పెద్దలు భూములు కాజేసిన సంగతి తెలిసిందే. ఆశ్రిత పక్షపాతం.. అవినీతి.. అధికార దుర్వినియోగం.. వెరసి అమరావతిని చంద్రబాబు అక్రమాల పుట్టగా మార్చేశారు. అడ్డగోలు నిర్ణయాలతో అమరావతిని భ్రష్టు పట్టించారు. రాజధాని ఇక్కడా.. అక్కడా అంటూ లీకులిచ్చి స్కాములకు బీజం వేశారు.రాజధాని ఎంపిక నుంచి భూముల కొనుగోళ్లు, భూ సమీకరణ(ల్యాండ్ పూలింగ్), ప్రైవేట్ సంస్థలకు కేటాయింపు, సింగపూర్ కంపెనీలతో ఒప్పందాలు, ఎస్సీ ఎస్టీలకు చెందిన అసైన్డ్ భూముల వ్యవహారం వరకు ఏది తవ్వినా టన్నుల కొద్దీ అవినీతి పుట్ట బద్దలైంది. అమరావతిని అక్రమాల అడ్డాగా మార్చేసిన తీరు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. -
రేవంత్ విషయంలో ఒక న్యాయం.. చంద్రబాబుకు మరొకటా?
హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టు స్పందించిన తీరు అత్యంత ఆసక్తికరంగా ఉంది. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతుండగానే సుప్రీంకోర్టు ధర్మాసనం చెట్ల నరికివేత విషయంలో ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నాలుగు వందల ఎకరాల్లో పచ్చదనంపై గొడ్డలివేటు పడుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న పర్యావరణ వేత్తలు, కేంద్ర ప్రభుత్వం, న్యాయ వ్యవస్థలు ఏపీలో సుమారు 33 వేల ఎకరాలలో ఏటా మూడేసి పంటలు పండే పచ్చటి భూములను బీడులుగా మార్చి పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నా స్పందించకపోవడం ఆశ్చర్యంగానే ఉంది.దేశ ప్రధానితోపాటు, న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థానాలలో పని చేసిన వారిలో కొందరు కూడా అమరావతి పేరుతో సాగుతున్న పర్యావరణ విధ్వంసానికి సహకరించే విధంగా వ్యవహరించారన్న విమర్శలు వచ్చాయి. రాష్ట్రాన్ని బట్టి, నేతలను బట్టి, పార్టీలను బట్టి వ్యవస్థలు స్పందిస్తున్నాయా అన్న సందేహం రావడానికి ఇలాంటి ఘట్టాలు ఆస్కారం ఇస్తుంటాయి. కంచ గచ్చిబౌలి భూముల మీద స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనమే, పార్టీ ఫిరాయింపుల కేసు విచారణ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై కూడా అసంతృప్తి తెలిపింది. ఈ రెండు ఉదంతాలకు సంబంధం ఉందో, లేదో తెలియదు. అయితే, రేవంత్ చేసిన తప్పిదం వల్ల దాని ప్రభావం న్యాయ వ్యవస్థపై పడి ఉండవచ్చా అన్నది కొందరి డౌటు. ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఈ స్థాయిలో ఇలాంటి కేసులు తనంతట తానే తీసుకున్నట్లు కనిపించలేదు. అన్ని కేసుల్లోనూ కింది కోర్టుల్లో విచారణ జరుగుతుండగా ఇలా స్పందిస్తుందా? అన్నది కొందరి ప్రశ్న.తెలంగాణ ప్రభుత్వం తొందరపాటు, సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్ధుల నిరసనలు, బీజేపీ, బీఆర్ఎస్ల విమర్శల హోరు, కేంద్ర ప్రభుత్వం జోక్యం, తెలంగాణ హైకోర్టులో వ్యాజ్యంపై విచారణ, స్వయంగా సుప్రీంకోర్టు రంగంలోకి రావడం వంటి పరిణామాలను విశ్లేషించుకుంటే అన్ని వ్యవస్థలలో ఉన్న మంచితోపాటు లోపాలు కూడా కనిపిస్తాయని చెప్పాలి. కంచ గచ్చిబౌలిలోని ఈ 400 ఎకరాల భూమి తెలంగాణ ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు గత ఏడాది తీర్పు ఇచ్చింది. దాంతో రేవంత్ సర్కార్‌కు కొత్త ఆలోచనలు వచ్చాయి. ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుని అమ్మడమో, లేక లీజు పద్దతిపై ఆయా సంస్థలకు కేటాయించడమో, ఇతర అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడమో చేయాలని తలపెట్టి ఆ దిశగా పావులు కదిపింది.అయితే, ఇక్కడే రేవంత్ అనుభవరాహిత్యం వల్ల దెబ్బతిన్నారు. నిజంగానే ఆయన అక్కడ అభివృద్ది చేయాలన్న లక్ష్యంతో ఉంటే వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉండాలి. దానికి ముందు ఈ భూమిని అధీనంలోకి తీసుకోవడం వల్ల వచ్చే సమస్యలను పసికట్టి ఉండాలి. అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో భాగమా? కాదా? ఎవరికి భూములపై హక్కులు ఉన్నాయన్న దానిపై న్యాయపరంగా అభిప్రాయం తీసుకుని ఉండాల్సింది. ఆ తర్వాత తదుపరి చర్యలకు వెళ్లి ఉంటే ఎలా ఉండేదో గాని, అలా కాకుండా, వేగంగా సెలవు దినాలలో పెద్ద సంఖ్యలో జేసీబీలను పంపించి చెట్లు కొట్టి, నేల చదును చేయించడంతో వివాదానికి అవకాశం ఇచ్చినట్లయింది. ఈ భూముల అమ్మకం ద్వారా కనీసం రూ.20 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. కొందరైతే ఇంకా ఎక్కువే వస్తుందని అంటారు. దీంతో ప్రభుత్వ కష్టాలు తీరుతాయని ఆశించి ఉండవచ్చు. సుమారు రెండు దశాబ్దాల పాటు కోర్టులలో ప్రభుత్వమే ఈ భూమిపై పోరాడింది కనుక తమవే అన్న అభిప్రాయం వచ్చినప్పటికీ భవిష్యత్ పరిణామాలపై ఒక అంచనాకు రావడంలో విఫలమైందని అనిపిస్తుంది.1975లో రాష్ట్ర ప్రభుత్వమే 2300 ఎకరాలు కేటాయించినా, సెంట్రల్ యూనివర్శిటీకి అధికారికంగా రిజిస్ట్రేషన్ చేయలేదు. అయినా వారు వాడుకున్న భూమి పోను మిగిలినది ప్రభుత్వ అధీనంలోనే ఉందట. 2003లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఈ భూమిని ‘ఐఎమ్జీ భారత’ అకాడమి అనే ప్రైవేటు సంస్థకు కేటాయించింది. ఆ సంస్థకు భూమిని బదలాయించే నిమిత్తం 2004 ఫిబ్రవరిలో జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం 534 ఎకరాల భూమిని సెంట్రల్ యూనివర్శిటీ నుంచి బదలాయించారు. ఈ మేరకు రికార్డులు ఉన్నాయని మీడియా కథనం. అందులో యూనివర్శిటీ రిజిస్ట్రార్ సంతకం కూడా ఉండడం గమనార్హం. విశేషం ఏమిటంటే చంద్రబాబు ఆపద్ధర్మ సీఎం హోదాలో ఈ భూమిని ఇలా బదలాయించినా ఎవరూ పెద్దగా స్పందించలేదు. ఏ న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు రాలేదు. పైగా ఈ భూమిలో 400 ఎకరాలు పొందిన ప్రైవేటు సంస్థ రెండు దశాబ్దాలుగా ఆ భూమి తనదే అంటూ కోర్టులలో వ్యాజ్యాలు సాగించినా ఏ వ్యవస్థ సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించదు.ఇక, 2006లో ఆనాటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఈ భూమి విషయాన్ని పరిశీలించి ఇది ప్రైవేటు వ్యక్తులకు లాభం చేసేందుకే చంద్రబాబు సర్కార్ కేటాయించిందని అభిప్రాయపడి దానిని రద్దు చేసింది. అయినా కోర్టులో అది ప్రభుత్వ భూమి అని ఇంతకాలం పోరాడాల్సి వచ్చింది. ఒక వేళ చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన భూమిలో ఐఎంజీ సంస్థ ఏవైనా నిర్మాణాలు చేపట్టి ఉంటే ఏమై ఉండేది అన్న ప్రశ్నకు జవాబు దొరకదు. అప్పుడు కూడా ఈ భూమిలో చెట్లు ఉన్నాయి కదా!. అలాంటి ఖాళీ భూమిలోనే కదా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది. అప్పుడు పర్యావరణ సమస్యలు రావా? ఇక్కడ రేవంత్ సర్కార్ కరెక్ట్ గా చేసిందా? లేదా? అన్నది చర్చ కాదు. కానీ, పరిణామాలన్నిటిని విశ్లేషించినప్పుడు ఇలాంటి సందేహాలు వస్తాయి కదా!. సుప్రీంకోర్టు ఈ భూమి ప్రభుత్వానిదే అని తేల్చిన తర్వాత ఈ భూమిని అభివృద్ది చేయడం కోసం మౌలిక వసతుల కల్పన సంస్థకు అప్పగించింది. ఈ పనులు చేయడం కోసం ఇదే భూమిని తాకట్టు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సంస్థ ద్వారా పదివేల కోట్ల అప్పు కూడా తీసుకుందట. మార్కెట్లో బాండ్లు, వివిధ బ్యాంకులు, ఆర్ధిక సంస్థల ద్వారా ఈ రుణాలు సేకరించి, వడ్డీ కట్టడం కూడా ఆరంభమైందని కథనం.ఈ భూమిని యూనివర్శిటీకే ఇవ్వాలని, అక్కడ ప్రహరి గోడ కట్టించడం వల్లే వృక్షాలు పెరిగాయని చెబుతూ విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగడం, తదుపరి విపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ ఎంటర్ అవ్వడంతో అది పెద్ద దుమారంగా మారింది. ఈలోగా కేంద్రం కూడా స్పందించి ఈ భూమిపై నివేదికను కోరింది. తెలంగాణ హైకోర్టు కూడా విచారణ చేపట్టి నోటీసులు జారీ చేసింది. ఇంతలో సుమోటోగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని నివేదిక తెప్పించుకుని చెట్లు కొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పనులు ఆపాలని ఆదేశించింది. దీంతో విద్యార్దులు తామే గెలిచామని సంబరాలు చేసుకుంటే, రేవంత్ సర్కార్‌కు పెద్ద షాక్ తగిలినట్లయింది. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీనిపై ఇప్పుడు మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు రేవంత్ ప్రకటించారు. కాగా అక్కడ పర్యావరణ అనుకూల పార్కు ఏర్పాటు చేస్తామని, యూనివర్శిటీ కూడా అదే భూమిలో ఉంది కనుక దానిని ఫ్యూచర్ సిటీకి తరలిస్తామని కొత్త కండీషన్ పెట్టడం విశేషం. కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్ ద్వారా కల్పిత వీడియోలు సృష్టించారని తెలంగాణ సర్కార్ ఇప్పుడు వాపోతున్నా పెద్దగా ఫలితం ఉంటుందా అన్నది సందేహం.కాగా, ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు రావని రేవంత్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై కూడా సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. సీఎంకు సంయమనం పాటించడం తెలియదా అని ప్రశ్నించింది. రేవంత్ ఈ వ్యాఖ్యలు చేసిన రోజునే ఆయన అనవసర వివాదంలో చిక్కుకున్నారని అనుభవజ్ఞులు అభిప్రాయపడ్డారు. న్యాయ వ్యవస్థను సవాల్ చేసేలా ఆయన మాట్లాడడం వారికి ఎలా నచ్చుతుంది. గతంలో ఫిరాయింపులపై కోర్టులు గట్టి చర్యలు తీసుకోలేదన్నది ఆయన అభిప్రాయం కావచ్చు. అయినప్పటికీ శాసనసభలో అలా మాట్లాడి దెబ్బతిన్నారు. ఆ క్రమంలో ఇప్పుడు కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం గందరగోళంగా మారింది. విశేషం ఏమిటంటే యూనివర్శిటీకి చెందిన భూములలో కొంత భాగం ఆక్రమణలకు గురైందని చెబుతున్నారు. తన అధీనంలో ఉన్న భూములను ఏం చేయాలన్నది నిజానికి ప్రభుత్వ అభీష్టం ప్రకారం జరగాలి. అయితే స్థానిక ప్రజలు పర్యావరణ వేత్తలు, యూనివర్శిటీ విద్యార్ధులు చేస్తున్న డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం నిర్ణయాలు చేసి ఉండవచ్చు. అవేవి జరగలేదు. దానిని సహజంగానే విపక్షాలు తమకు అనుకూలంగా మలచుకుంటాయి.ప్రభుత్వ ఆస్తులు, భూములు అమ్మడం కొత్త కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్నవారు ప్రభుత్వరంగ సంస్థలను నష్టాల కారణం చూపి అమ్ముతున్నారు. తెలంగాణలో గత కేసీఆర్ ప్రభుత్వం కూడా పలు చోట్ల భూములను అమ్మి వేల కోట్ల ఆదాయం పొందింది. ఇప్పుడేమో బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ తాము అధికారంలోకి వస్తే ఈ భూములను యూనివర్శిటీకి అప్పగిస్తామని చెబుతున్నారు. ఒకప్పుడు రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ సర్కార్ భూముల అమ్మకాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇప్పుడు ఆయన అదే బాటలో ఉన్నారు. ఇదంతా ఒక గేమ్‌గా మారింది. ప్రతిపక్షంలో ఉంటే ఒకరకం, అధికారంలోకి వస్తే మరో రకంగా వ్యవహరిస్తున్నారు.ఇక ఏపీ సంగతి కూడా చూస్తే ఆశ్చర్యంగానే ఉంటుంది. కృష్ణానది పక్కన 33 వేల ఎకరాల మూడు పంటలు పండే భూమిని సేకరించి రాజధాని కడుతున్నారు. అది పర్యావరణానికి నష్టమని పలువురు చెప్పినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. అక్కడ భూమి స్వభావ రీత్యా మామూలు వ్యయం కన్నా ఒకటిన్నర రెట్ల అధికంగా నిర్మాణ ఖర్చు అవుతుందట. రిషికొండపై జగన్ ప్రభుత్వం మంచి భవనాలు నిర్మిస్తే, ప్యాలెస్‌లని ప్రచారం చేసిన తెలుగుదేశం, జనసేన నేతలు ఇప్పుడు అమరావతిలో అంతకన్నా పెద్ద ప్యాలెస్‌లు నిర్మించాలని తలపెట్టారు. వాటికి మాత్రం ఐకాన్ భవనాలని, అదని, ఇదని బిల్డప్ ఇస్తున్నారు. చంద్రబాబు స్వయంగా కృష్ణా నది తీరాన నదీ చెంత సీఆర్‌జెడ్ నిబంధనలతో నిమిత్తం లేకుండా ఒక భవనంలో నిర్మిస్తున్నా ఏ వ్యవస్థ ఆయన జోలికి వెళ్లలేకపోయింది.రిషికొండపై అంతా కలిపి 400 కోట్లతో భవనాలు నిర్మిస్తే తప్పట. అదే అమరావతిలో ఏభై వేల కోట్ల అప్పులు తెచ్చి మరీ ప్యాలెస్‌లు నిర్మిస్తే రైటట. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యవస్థలే లేవా?. రాజధాని కోసం ఎంత భూమి అవసరమో అంత తీసుకోవచ్చు. అలా కాకుండా మహానగరం నిర్మిస్తామంటూ శివరామకృష్ణన్ నివేదికకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఇలా చేస్తుంటే ఏమనాలి?. తెలంగాణకు ఒక న్యాయం, ఏపీకి ఒక న్యాయం ఉంటుందా?. ఇదంతా మన ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థతో సహా వివిధ వ్యవస్థలలో ఉన్న లోపమా?.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సిండికేటు లూటీ!
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి రైతుల నుంచి తక్కువ ధరలకు భూములు కాజేసిన ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు తమకు సన్నిహితులైన కాంట్రాక్టర్లతో సిండికేట్‌ను ఏర్పాటు చేసి రాజధాని నిర్మాణ పనులను అధిక ధరలకు కట్టబెడుతున్నారు. మొన్న.. రూ.10,696.79 కోట్ల వ్యయంతో 37 ప్యాకేజీల కింద రాజధాని ముంపు నివారణ, రహదారుల నిర్మాణంలో మిగిలిన పనులకు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏడీసీఎల్) నిర్వహించిన టెండర్లలో సిండికేట్ బాగోతం బట్టబయలైంది. నేడు.. రూ.16,463.83 కోట్ల వ్యయంతో 22 ప్యాకేజీల కింద భూసమీకరణ ద్వారా భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఇచ్చేందుకు లేఅవుట్ల అభివృద్ధి.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్స్.. మంత్రులు, జడ్జిలు, ఐఏఎస్ అధికారులకు బంగ్లాల నిర్మాణ పనులకు సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) ఖరారు చేసిన టెండర్లలోనూ ప్రభుత్వ పెద్దల లాలూఛీ బాగోతం మరోసారి బట్టబయలైంది. ఏడీసీఎల్, సీఆర్డీఏ రెండు కలిసి రూ. రూ.27,160.62 కోట్ల కాంట్రాక్టు విలువతో 59 ప్యాకేజీల కింద పనులకు టెండర్లు పిలిచాయి. ఈ పనులను రూ.28,209.62 కోట్లకు సిండికేట్‌లోని ఎనిమిది కాంట్రాక్టు సంస్థలకు ప్రభుత్వ పెద్దలు పంచి పెట్టారు. కాంట్రాక్టు విలువ కంటే సగటున 3.94 నుంచి 4.34 శాతం అధిక ధరలకు కట్టబెట్టడం ద్వారా ఖజానాపై రూ.1,049 కోట్లు భారం మోపారు. అదే రివర్స్ టెండరింగ్ విధానం అమల్లో ఉండి ఉంటే కాంట్రాక్టర్ల మధ్య పోటీ పెరిగి కనీసం 8 శాతం తక్కువ ధరకే పనులు చేయడానికి ముందుకొచ్చేవారని.. దీనివల్ల ఖజానాకు రూ.2,500 కోట్ల నుంచి రూ.3 వేల కోట్ల మేర ఆదా అయ్యేదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సిండ్ఙికేటు’ రాజ్యం..!రాజధాని నిర్మాణ పనులకు టెండర్లు పిలవక ముందే సన్నిహిత కాంట్రాక్టు సంస్థలతో ప్రభుత్వ పెద్దలు చర్చలు జరిపారు. ఆ కాంట్రాక్టర్లతో సిండికేట్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 2014–19 మధ్య షాపూర్జీ పల్లోంజీ కాంట్రాక్టు సంస్థ నుంచి ముఖ్యనేత తరఫున కమీషన్లు వసూలు చేసి ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సాక్ష్యాధారాలతో పట్టుబడిన అధికారే ఇప్పుడూ ప్రభుత్వ పెద్దల తరఫున సిండికేట్ కాంట్రాక్టర్లతో చక్రం తిప్పుతున్నారు. సిండికేట్‌లోని కాంట్రాక్టర్ల ప్రతిపాదన మేరకే వారికి అధికంగా పనులు కట్టబెట్టేందుకు వీలుగా బిడ్ కెపాసిటీని 2 ఎన్ఎన్–బీ నుంచి 3 ఏఎన్–బీకి పెంచుతూ ఫిబ్రవరి 10న ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయించారు. అంతకు ముందే అంచనాలను ఇష్టారాజ్యంగా పెంచుకోవడానికి, సిండికేట్ కాంట్రాక్టర్లకే పనులు దక్కేలా నిబంధనలతో టెండర్ జారీ చేయడానికి వీలుగా జ్యుడీషియల్ ప్రివ్యూ విధానాన్ని కూడా రద్దు చేశారు. కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరలకు కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్డానికి వీలుగా రివర్స్ టెండరింగ్ విధానానికి కూడా మంగళం పాడారు. తమ అక్రమాలకు అడ్డొచ్చే వ్యవస్థలు.. విధానాలను అన్నింటినీ రద్దు చేశాకే రాజధాని నిర్మాణ పనులకు టెండర్లు పిలిచారు.పూలింగ్ లేఅవుట్ల అభివృద్ధికి రూ.14,887.64 కోట్లు..భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) పథకం కింద రాజధానికి రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారు. ఆ పథకం కింద రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలి. అందుకు రహదారులు, విద్యుత్, తాగునీటి సౌకర్యం వంటి కనీస సదుపాయాలు కల్పించడం ద్వారా లేఅవుట్లను అభివృద్ధి చేయాలి. రాజధానికి భూసమీకరణ కింద భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఇవ్వడానికే 17 వేల ఎకరాలు భూమి అవసరం. ఇందులో లేఅవుట్ల అభివృద్ధి పనులకు 18 ప్యాకేజీల కింద సీఆర్డీఏ టెండర్లు పిలిచింది. ఈ పనులన్నింటినీ కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరకే సిండికేట్ కాంట్రాక్టర్లకు అప్పగించారు. రూ.14,887.64 కోట్లకు ఆ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారు. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ తదితర పన్నుల రూపంలో కాంట్రాక్టర్లకు అదనంగా ఇస్తామని సీఆర్డీఏ చెప్పిన మొత్తాన్ని కూడా కలిపితే ఈ పనుల వ్యయం రూ.17 వేల కోట్లకు చేరుతుంది. అంటే ఎకరం భూమిలో లేఅవుట్ అభివృద్ధి చేయడానికే సగటున రూ.కోటి చొప్పున వ్యయం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలే చెబుతున్నాయి. వాస్తవానికి అత్యాధునిక సదుపాయాలతో లేఅవుట్‌ను అభివృద్ధి చేయడానికి ఎకరానికి రూ.50 లక్షలకు మించి వ్యయం కాదని స్పష్టం చేస్తున్నారు. ఇక సీఆర్డీఏ ద్వారా ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దిగుతూ చేపట్టిన హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్స్.. మంత్రులు, జడ్జీలకు బంగ్లాలు.. ఐఏఎస్‌లకు బంగ్లాల నిర్మాణ పనులను నాలుగు ప్యాకేజీల కింద కాంట్రాక్టర్లకు అప్పగించారు.– ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితుడైన కృష్ణారెడ్డికి చెందిన మేఘా సంస్థకు ల్యాండ్ పూలింగ్ స్కీం కింద లే అవుట్లు అభివృద్ధి చేసేందుకు సంబంధించిన ఐదు ప్యాకేజీల పనులను కట్టబెట్టారు. ఈ పనుల విలువ రూ.5,608.7 కోట్లు.– ఈనాడు కిరణ్ సోదరుడి వియ్యంకుడు రాయల రఘుకు చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్‌కు ల్యాండ్ పూలింగ్ స్కీం కింద లేఅవుట్ల అభివృద్ధికి సంబంధించి నాలుగు పనులను ప్రభుత్వ పెద్దలు అప్పగించారు. ఈ పనుల విలువ రూ.2,813.66 కోట్లు.– బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే బలుసు శ్రీనివాసరావు సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఆయనకు చెందిన బీఎస్సార్ ఇన్ఫ్రాకు ల్యాండ్ పూలింగ్ స్కీం కింద లేఅవుట్లకు సంబంధించి ఎనిమిది ప్యాకేజీల పనులను అప్పగించారు. వీటి విలువ రూ.3,945.47 కోట్లు.– ప్రభుత్వ పెద్దలతో అత్యంత సన్నిహితంగా వ్యవహరించే ఏవీ రంగరాజు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న ఎన్సీసీ సంస్థకు హ్యాపీ నెస్ట్‌తోపాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్స్ నిర్మాణం, ఓ ల్యాండ్ పూలింగ్ లేఅవుట్ పని అప్పగించారు. వీటి విలువ రూ.3,438.21 కోట్లు.– మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ఆయన తరఫున ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసిన కనకమేడల వరప్రసాద్‌కు చెందిన కేఎమ్వీ ప్రాజెక్ట్స్‌కు ఐఏఎస్ అధికారుల బంగ్లాల నిర్మాణ పనులు కట్టబెట్టారు.– సీఎం చంద్రబాబుతో ఆది నుంచి సన్నిహితంగా వ్యవహరిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థకు ల్యాండ్ పూలింగ్ స్కీం కింద లేఅవుట్ అభివృద్ధి చేసే ఒక ప్యాకేజీ పనిని అప్పగించారు.ఎనిమిది సంస్థలకే పనులన్నీ..రాజధాని అమరావతిలో వరద మళ్లింపు, రహదారుల అభివృద్ధి పనులను 37 ప్యాకేజీల కింద చేపట్టేందుకు రూ.15,095.02 కోట్లతో ఏడీసీఎల్‌కు ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. ఇక ల్యాండ్ పూలింగ్ స్కీం కింద లేఅవుట్ల అభివృద్ధి, హ్యాపీనెస్ట్, మంత్రులు, జడ్జిలు, ఐఏఎస్ అధికారుల బంగ్లాలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్స్ నిర్మాణ పనులను 22 ప్యాకేజీల కింద చేపట్టడానికి రూ.22,607.11 కోట్లతో సీఆర్డీఏకు ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. ఈ రెండూ మొత్తం 59 ప్యాకేజీల కింద పనులకు టెండర్లు పిలిచాయి. వాటన్నింటినీ సిండికేట్‌లోని ఎనిమిది సంస్థలే దక్కించుకున్నాయి. ఎన్సీసీ సంస్థ రూ.6,124.08 కోట్లు, బీఎస్సార్ ఇన్ఫ్రా రూ.6,216.47 కోట్లు, ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ రూ.6,031.79 కోట్లు, మేఘా రూ.7,022.38 కోట్లు, ఎమ్వీఆర్ ఇన్ఫ్రా (నారా లోకేష్ తోడల్లుడు విశాఖ ఎంపీ భరత్ సన్నిహితుడికి చెందిన సంస్థ)కు రూ.796.04 కోట్లు, సీఎం చంద్రబాబుకు సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే కృష్ణయ్యకు చెందిన బీఎస్పీసీఎల్‌కు రూ.779.82 కోట్లు, ఎల్ అండ్ టీ సంస్థకు రూ.809.88 కోట్లు, కేఎమ్వీ ప్రాజెక్ట్స్‌కు రూ.429.23 కోట్ల విలువైన పనులను కట్టబెట్టబెట్టారు.నీకింత.. నాకింత..సీఆర్డీఏ, ఏడీసీఎల్ 59 ప్యాకేజీల కింద పనులకు పిలిచిన టెండర్లను ప్రభుత్వం ఆమోదించింది. ఆ పనులను రూ.28,209.62 కోట్లకు ఎనిమిది కాంట్రాక్టు సంస్థలకు ప్రభుత్వ పెద్దలు పంచి పెట్టారు. ఆ పనులను అప్పగిస్తూ సీఆర్డీఏ, ఏడీసీఎల్ వాటితో ఒప్పందం చేసుకున్న వెంటనే కాంట్రాక్టు విలువలో పది శాతం అంటే రూ.2,820.96 కోట్లను ఆ సంస్థలకు మొబిలైజేషన్ అడ్వాన్సుగా ముట్టజెబుతాయి. అందులో 8 శాతం అంటే.. రూ.2,256 కోట్లను ప్రభుత్వ పెద్దలు తొలి విడత కమీషన్లుగా రాబట్టుకోనున్నారు. ఇందుకోసమే గత ప్రభుత్వం రద్దు చేసిన మొబిలైజేషన్ అడ్వాన్సుల విధానాన్ని పునరుద్ధరించారనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. సిండికేట్ కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు వసూలు చేసే బాధ్యతను గతంలో ఆదాయపు పన్ను శాఖకు చిక్కిన అధికారికే ప్రభుత్వ పెద్దలు అప్పగించినట్లు చర్చ సాగుతోంది. -
‘అమరావతిలో వేల ఎకరాల్ని అమ్ముతాం.. అప్పులు తీరుస్తాం’: నారాయణ
సాక్షి,విజయవాడ : అమరావతి భూములపై ఏపీ పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ (Ponguru Narayana) కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు ప్రభుత్వం రైతుల నుంచి వేల ఎకరాల భూముల్ని సేకరించింది. వాటిలో నాలుగువేల ఎకరాలు అమ్మేయనున్నట్లు తెలిపారు.భూములు ధర పెరిగాక రైతుల నుండి సేకరించిన భూముల్లో 4 వేల ఎకరాలు అమ్ముతాం. రైతులకు అభివృద్ధి చేసిన తర్వాత ప్లాట్ లను తిరిగి ఇస్తాం. రైతులు భూములు అమ్మిన డబ్బులతో అప్పులు తీరుస్తాం’ అని వ్యాఖ్యానించారు. -
‘అసైన్డ్’ దోపిడీకి రాజముద్ర!. అమరావతిలో పేదల భూములు కాజేసిన పచ్చ ముఠాలకు ‘రిటర్నబుల్ ప్లాట్లు. సీఆర్డీఏకు చంద్రబాబు సర్కారు ఆదేశం
-
అమరావతికి కేంద్రం ఇచ్చేది గ్రాంట్ కాదు అప్పే
-
బాబూ.. అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు అవసరమా?: వడ్డే శోభనాద్రీశ్వరరావు
సాక్షి, విజయవాడ: ఏపీలో అసెంబ్లీకి ప్రస్తుతం ఉన్న బిల్డింగ్ సరిపోదా?.. మళ్లీ ఐకానిక్ అసెంబ్లీ అవసరమా చంద్రబాబు అని ప్రశ్నించారు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు. అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు వేయాల్సిన అవసరం ఏముంది?. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు లేకపోవడం మనం సిగ్గుపడాల్సిన విషయం అని ఘాటు కామెంట్స్ చేశారు.మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. 2014-19లో చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయలేదు. చంద్రబాబు తన మనసులోని కొన్ని అంశాలకే ప్రాధాన్యత ఇచ్చారు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల ఆలోచనలకు అనుగుణంగా మార్పులేమీ రాలేదు. చంద్రబాబు చెప్పిన పారిశ్రామిక అభివృద్ధి జరగాలంటే ప్రత్యేక హోదా ఉండాల్సిందే. చంద్రబాబు, పవన్.. ప్రధాని మోదీపై ఒత్తిడి తెచ్చి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావాలి.ఔటర్ రింగ్ రోడ్డు కారణంగా హైదరాబాద్ డెవలప్ కాలేదు.. ఐటీ వల్ల హైదరాబాద్ అభివృద్ధి చెందలేదు. అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు వేయాల్సిన అవసరం ఏముంది?. మేం నెత్తీ నోరూ మొత్తుకున్నా వినకుండా 33 వేల ఎకరాలు రైతుల నుంచి తీసుకున్నారు. 33వేల ఎకరాలు తీసుకుని ఏం లాభం.. అక్కడ ముళ్ల చెట్లు పెరిగాయి. ఇప్పుడు లక్షలు ఖర్చు చేసి ఆ పొలాల్లోని చెట్లను తొలగిస్తున్నారు. అలాగే, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు లేకపోవడం మనం సిగ్గుపడాల్సిన విషయం. చంద్రబాబు తక్షణమే ప్రకాశం, అనంతపురం జిల్లాల్లోని ఐరన్ ఓర్ గనులను విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేటాయించాలి. ముందు రాష్ట్రం చేయాల్సిన పని చేస్తే.. అప్పుడు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావచ్చు.విజయవాడ-విశాఖ మధ్య మెట్రో రైల్ వేస్తానని హడావుడి చేశాడు.. కానీ జరిగిందేమీ లేదు. అమెరికాలో కూడా లేని హైపర్ లూప్ రైలును తెస్తానని ప్రకటించడం చూస్తే నవ్వొస్తోంది. చెన్నై-బెంగుళూరు-హైదరాబాద్-అమరావతిని కలిపి బుల్లెట్ రైలు వేయాలంటున్నాడు. నాది కాకపోతే ఢిల్లీ దాకా దొర్లాలనీ వెనకటికి ఎవడో చెప్పినట్లుంది చంద్రబాబు ఆలోచన. చంద్రబాబు ఇలాంటి అనవరమైన ఆలోచనలను మానుకోవాలని కోరుతున్నాను. ఐకానిక్ హైకోర్టు బిల్డింగ్ కట్టాలన్న ఆలోచన విరమించుకోండి. అలాగే, అసెంబ్లీకి ప్రస్తుతం ఉన్న బిల్డింగ్ సరిపోదా.. మళ్లీ ఐకానిక్ అసెంబ్లీ అవసరమా?. ఐకానిక్ భవనాలకు బదులు భూములిచ్చిన రైతులకు న్యాయం చేయండి. ఉచిత ఇసుక అన్నావ్.. ప్రయోజనం ఎవరికి చేకూరుతుందో మీకూ రిపోర్టులు వస్తున్నాయ్ ఒక్కసారి పరిశీలించండి. అవినీతి చేస్తే ఎన్టీఆర్ మంత్రులను కూడా సహించలేదు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటే రెండోసారి తప్పులు జరగవు’ అంటూ కామెంట్స్ చేశారు. -
చంద్రబాబు గేమ్.. అమరావతి నుంచి పేదలు ఔట్
సాక్షి, అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు పొలిటికల్ గేమ్‌లో అమరావతిలోని పేదలకు ఎదురుదెబ్బ తగిలింది. రాజధానిలో ఆర్-5 జోన్ నుంచి ఇళ్లు పొందిన పేదలను పంపేయాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులకు వేరే ప్రాంతాల్లో స్థలం ఇస్తామన్నారు.కాగా, చంద్రబాబు పెత్తందారీ పాలనలో పేదలకు మరోసారి చేదు అనుభవమే ఎదురైంది. అమరావతి నుంచి పేదలు వెళ్లిపోవాలని చంద్రబాబు హుకుం జారీ చేశారు. రాజధానిలో ఆర్-5 జోన్ నుండి ఇళ్లు పొందిన పేదలను పంపేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. సోమవారం జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు ఈ విషయాన్ని వెల్లడించారు. వారికి వేరే స్థలాలు ఇవ్వాలని సూచించారు.ఈ సందర్భంగా చంద్రబాబు.. ఆర్-5 జోన్‌లోని లబ్ధిదారులకు వాళ్ల ప్రాంతాల్లోనే స్థలాలు ఇస్తాం. లబ్ధిదారుల కోసం భూమిని సేకరించాలి. లేదంటే భూసేకరణ చేయాలి. లేకుంటే టిడ్కో ఇళ్లు అయినా ఇస్తాం అని చెప్పుకొచ్చారు. ఇక, అమరావతి భూములపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తుండగానే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక, ఇదే సమయంలో అమరావతి రోడ్లను ప్రైవేటు కంపెనీలకు అప్పగించాలని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అమరావతి రోడ్లన్నీ పీపీపీ మోడల్లో చేపట్టాలి. పీపీపీ పద్దతిలో రోడ్లను ప్రైవేటు కంపెనీలకు అప్పగించే అంశాన్ని పరిశీలించాలి. ప్రైవేటుకు ఇస్తే రోడ్ల నిర్వహణ వారే చేస్తారు. గుంతలు ఏర్పడితే వారే పూడుస్తారు. అమరావతిలో ప్రత్యేకంగా పీపీపీ విభాగం ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు. -
మళ్లీ సింగపూర్ కంపెనీలకే అమరావతి!
సాక్షి, విజయవాడ: అమరావతిని మళ్లీ సింగపూర్ కంపెనీలకే కూటమి ప్రభుత్వం కట్టబెట్టింది. అమరావతి విషయంలో సీఆర్డీఏ తొలి సమావేశంలోనే చంద్రబాబు ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. సింగపూర్‌తో మళ్లీ చర్చిస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం స్విస్ ఛాలెంజ్‌లో సింగపూర్ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. అసెండాస్, సింగ్ బ్రిడ్జ్, సెంబ్ కార్బ్ కంపెనీలను మళ్లీ తేవాలని తాజాగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అవినీతి మోడల్‌గా గతంలో సింగపూర్ ఒప్పందంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. అవినీతి కేసుల్లో జైలుకి వెళ్లిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఒప్పందం చేసుకున్నారు. .. ఈశ్వరన్ దోపిడీపై ఆయన్ను సింగపూర్ ప్రభుత్వం జైలుకి పంపింది. భూమి, నిధులు మనవి లాభాలు సింగపూర్ కంపెనీలవి అన్నట్లు ఉండేది. ఇదే సింగపూర్ సీడ్ క్యాపిటల్ ఒప్పందం సీక్రెట్. 58 శాతం వాటా సింగపూర్ కంపెనీలదే ఉంది. 1691 ఎకరాలను మళ్లీ సింగపూర్ కంపెనీలకే అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీడ్ క్యాపిటల్ డెవలపర్‌గా మళ్లీ సింగపూర్ కంపెనీలనే తేవాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. .. స్విస్ ఛాలెంజ్ పేరుతో గ్లోబల్ టెండర్లు లేకుండానే ప్రభుత్వం కట్టబెట్టింది. స్విస్ ఛాలెంజ్ ఎంపికపై గతంలోనే మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తప్పుపట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, ఏపీ ఐడీఐ చట్టానికి విరుద్ధమని ఐవైఆర్ అభ్యంతరం తెలిపారు. రూ. 66 వేల కోట్ల దోపిడీ మోడల్ అంటూ గతంలోనే ఆరోపణలు చేశారు. అదే సింగపూర్ మోడల్‌కి మళ్లీ సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
బాబు భూ దోపిడీ ఖజానా!
సాక్షి, అమరావతి: ‘‘ఏ’’ అంటే.. అమరావతి అని వక్కాణిస్తున్న సీఎం చంద్రబాబు.. రాజధాని ముసుగులో తన అవినీతి, అరాచకాలకు కేంద్రంగా చేసుకున్నారు! బరితెగించి తాను పాల్పడిన అవినీతికి అక్షయపాత్రలా మార్చారు! నాటి తెల్ల దొరలే తెల్లబోయేలా వ్యవహరించారు! బ్రిటిష్ పాలకుల సామ్రాజ్యవాద దోపిడీని మరిపిస్తూ టీడీపీ పెద్దలు సాగించిన భూ దోపిడీకి నిలువెత్తు సాక్ష్యం అమరావతి... బడుగులు, పేదలకు స్థానం లేకుండా చంద్రబాబు సృష్టించుకున్న నయా జమిందారీ వ్యవస్థకు నిదర్శనం అమరావతి! పచ్చ రాబందులు గుప్పిట పట్టిన రూ.లక్షల కోట్ల విలువైన భూ ఖజానా అమరావతి! దేశ చరిత్రలోనే అతిపెద్ద భూ దోపిడీకి మౌనసాక్షి అమరావతి!! ఈ భూ బాగోతాలు, తన నిర్వాకాలను కప్పిపుచ్చి మభ్యపెట్టేందుకే తాజాగా అమరావతిపై శ్వేతపత్రం అంటూ మరో డ్రామాకు చంద్రబాబు తెర తీశారు.మోయలేని భారం మోపుతూ...రాజధానిగా అమరావతి ఎంపిక చేసిన ప్రాంతం ఇటు విజయవాడ కాదు.. అటు గుంటూరూ కాదు. మూడు పంటలు పండే సారవంతమైన పంట పొలాల్లో నిర్మాణ వ్యయం తడిసి మోపెడవుతుందని చంద్రబాబు అండ్ కో కట్టిన లెక్కలే చెబుతున్నాయి. ఒక్క ఎకరాలో కనీస మౌలిక వసతుల కల్పనకు (బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) రూ.2 కోట్లు వ్యయం అవుతుందని, మొత్తం రాజధాని ప్రాంతం అభివృద్ధి చేయడానికి రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చువుతుందని అప్పట్లోనే అంచనా వేశారు. ఏటా ఆ వ్యయం పెరగడమే కానీ తగ్గదు. విభజన అనంతరం రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత భారీగా నిధులు ఖర్చు చేయడం సాధ్యమయ్యే పని కాదని నిపుణులు చేసిన హెచ్చరికలను చంద్రబాబు పట్టించుకోలేదు. తాజాగా భారీగా నిధులు అవసరమంటూనే.. వివరాలు సేకరిస్తామని చెబుతున్నారు. అధికార పగ్గాలు చేపట్టిన మూడు వారాల్లోనే రూ.7 వేల కోట్లు అప్పు చేసిన టీడీపీ ప్రభుత్వం.. సంపదను ఎలా సృష్టించి రాజధాని నిర్మాణం చేస్తుందనే ప్రశ్నకు జవాబు లేదు.భూములు లాక్కుని గాలి మేడలు..!అమరావతి వేదికగా చంద్రబాబు సాగించిన భూ దందాను అప్పట్లోనే నిపుణుల నుంచి సామాన్యుల వరకూ అందరూ తీవ్రంగా వ్యతిరేకించారు. అమరావతి ప్రాంతం రాజధాని నిర్మాణానికి అనువైనది కాదని శివరామకృష్ణన్ కమిటీ స్పష్టం చేసింది. ఏడాదికి మూడు పంటలు పండే భూములను నాశనం చేయవద్దని పర్యావరణవేత్తలు అభ్యంతరం చెప్పారు. జీవనాధారమైన తమ భూములను కొల్లగొట్టవద్దని బడుగు, బలహీనవర్గాలు, పేద రైతులు వేడుకున్నారు. వారి విన్నపాలను బేఖాతర్ చేస్తూ చంద్రబాబు భారీ భూదోపిడీకి తెరతీశారు. అసైన్డ్ భూములను బినామీల ద్వారా హస్తగతం చేసుకుని పరిహారం ప్రకటించుకున్నారు. 2014–19 మధ్య రాజధాని పేరిట అమరావతి ముసుగులో చంద్రబాబు బృందం చేయని దురాగతం లేదు. అదిగో రాజధాని.. అల్లదిగో అమరావతి..! అంటూ అరచేతిలో వైకుంఠం చూపించారు. అంతకుముందు పక్కా పన్నాగంతో రాజధాని అక్కడ.. ఇక్కడ అంటూ పలు ప్రాంతాల పేర్లను తెరపైకి తెచ్చి సామాన్యులను బురిడీ కొట్టించారు. మరోవైపు ముందస్తుగా తాము భూముల కొనుగోలు చేసిన అమరావతిలో బినామీ మాఫియాను వ్యవస్థీకృతం చేశారు. అంతర్జాతీయ స్థాయి రాజధాని.. ఆకాశ హరŠామ్యల నగరం అంటూ గాలిలో మేడలు కట్టి రైతుల కాళ్ల కిందున్న భూమిని కాజేశారు.పచ్చ దండు దురాక్రమణ..దేశంలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే అతి పెద్ద భూ దోపిడీకి చంద్రబాబు బరి తెగించారు. రాజధాని ప్రచారంతో మాయాజాలం... భూసమీకరణ ముసుగులో దోపిడీ... అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు, లంక భూముల స్వాహా... ఇన్నర్ రింగ్ రోడ్డులో అవినీతి మలుపులు... అస్మదీయులకు యథేచ్ఛగా భూ పందేరాలు... ఇలా ఒకటేమిటి ఎన్ని రకాలుగా భూదోపిడీకి పాల్పడవచ్చో అన్ని విద్యలూ ప్రయోగించారు. అమరావతిపై చంద్రబాబు ‘పచ్చ దండు’ దండయ్రాత చేసి రూ.లక్షల కోట్ల విలువైన భూముల దురాక్రమణకు పాల్పడింది. చంద్రబాబుతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, నాటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రులు, టీడీపీ నేతలు, వారి బినామీలు అమరావతి భూములపై వాలిపోయారు. చంద్రబాబు, లోకేశ్‌తోపాటు నారాయణ, సుజనా చౌదరి, ప్రత్తిపాటి పుల్లారావు, మాగుంట మురళీమోహన్, కొమ్మాలపాటి శ్రీధర్, కోడెల శివప్రసాద్ కుమారుడు శివరామకృష్ణ, ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్, బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్పీ రామారావు.. ఇలా పచ్చ దండు అంతా అమరావతిలో భూములను కొల్లగొట్టింది. అన్యాయంగా, ఏకపక్షంగా విభజనకు గురై కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఆదిలోనే హంసపాదులా అభివృద్ధికి గండి కొట్టారు. తాత్కాలిక రాజధాని భవనాల పేరుతో కనికట్టు చేశారు.మభ్యపుచ్చే యత్నాలు..నాడు ఐదేళ్లలో భూముల దోపిడీకి పాల్పడటం మినహా టీడీపీ పెద్దలు రాజధాని కట్టిందీ లేదు.. అభివృద్ధి చేసిందీ లేదు. చంద్రబాబు బృందం సాగించిన భూ దోపిడీ ఇప్పటికే సీఐడీ దర్యాప్తులో పూర్తి ఆధారాలతోసహా బట్టబయలైంది. సీఐడీ న్యాయస్థానాల్లో చార్జిషీట్లు కూడా దాఖలు చేసింది. ఇక న్యాయ విచారణ ప్రక్రియ కొనసాగితే చంద్రబాబుకు యావజ్జీవ ఖైదు ఖాయమని న్యాయ నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ అధికారంలోకి రాగానే చంద్రబాబు సరికొత్త కుట్రలకు పన్నాగం పన్నుతున్నారు. అమరావతిలో తన భూ బాగోతాన్ని కప్పిపుచ్చేందుకు శ్వేతపత్రం పేరుతో డ్రామాకు తెరతీశారు. రాజధాని నిర్మాణానికి తాను ఏం చేస్తానో చెప్పకుండా ఊకదంపుడు ఉపన్యాసంతో ఊదరగొట్టారు. రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు. కానీ అమరావతి పేరిట చంద్రబాబు యథేచ్ఛగా సాగించిన దోపిడీ దాచేస్తే దాగేది కాదు. ఇప్పటికే పూర్తి ఆధారాలతో సహా చార్జిషీట్ల రూపంలో నిక్షిప్తమైందన్నది నిఖార్సైన నిజం. -
అమరావతి కలిపింది ఇద్దరినీ..
సాక్షి, అమరావతి : ప్రపంచంలో అవినీతి రహిత దేశాల్లో సింగపూర్‌ది ఐదో స్థానం.. అలాంటి దేశానికి మంత్రిగా ఉండి భారీ అవినీతికి బరితెగించి సింగపూర్ ప్రతిష్టకు మాయని మచ్చ తీసుకొచి్చన అమాత్యుడు ఈశ్వరన్.. అతనికి మన అమరావతి రింగ్ మాస్టర్ బినామీ బాబు జతకలిశారు. ఇంకేముంది రాజధాని పేరుతో ప్రజలకు గ్రాఫిక్స్ చూపించి అందినంత దోచేశారు. తోడుదొంగలు ఇద్దరూ కలిసి అమరావతిలో స్టార్టప్ ఏరియా అంటూ ఏకంగా 1,400 ఎకరాలను కొల్లగొట్టేందుకు పన్నాగం పన్నారు. పాపం పండి ఇద్దరి బాగోతం బట్టబయలైంది. స్కిల్ స్కామ్ కేసులో ‘రాజధాని ఫైల్స్’ సూత్రధారి చంద్రబాబు, సింగపూర్‌లో అవినీతి అభియోగాలతో ఈశ్వరన్ అరెస్టయ్యారు. వీరిద్దరి అవినీతి లింకులు కలిసింది మాత్రం అమరావతిలోనే.. అవినీతి ‘ఆట’లో ఈశ్వరన్ వాటా.. సింగపూర్‌లో భారీ ఎత్తున అవినీతికి బరితెగించిన ఆ దేశ మంత్రి ఈశ్వరన్ ఆట కట్టింది. ఫార్ములా వన్ రేసింగ్ కాంట్రాక్టులో ఈశ్వరన్ అక్రమాలకు పాల్పడ్డారని సింగపూర్ అవినీతి నిరోధక విభాగం కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో’(సీపీఐబీ) నిగ్గు తేలి్చంది. ఈ కేసులో నేరం రుజువైతే కనీసం ఏడేళ్లు శిక్ష పడవచ్చు. సింగపూర్‌కు ఫార్ములా వన్ కార్ రేసింగ్ ముసుగులో ఆయన ముడుపులు స్వీకరించారని ఆ దేశ అవినీతి నిరోధక విభాగం నిగ్గు తేలి్చంది. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్, సింగపూర్ పర్యాటక విభాగం మధ్య కాంట్రాక్టు రూపంలో ఆయన ముడుపులు తీసుకున్నారు. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ రేసింగ్, ఫుట్‌బాల్ మ్యాచ్‌లు, మ్యూజికల్ షోస్, బ్రిటన్‌లో హ్యారీపోటర్ షోలకు భారీ సంఖ్యలో టికెట్లు యథేచ్ఛగా విక్రయించారని వెల్లడైంది. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ నిర్వాహకుడు ఓంగ్ బెంగ్ సంగ్‌తోపాటు ఈశ్వరన్‌ను గతేడాది జూలై 12న సీపీఐబీ అధికారులు అరెస్ట్ చేశారు. అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. సీపీఐబీ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఈశ్వరన్ అవినీతిని నిగ్గు తేలుస్తూ 27 అభియోగాలతో చార్జ్షిట్లు దాఖలు చేసింది. మంత్రి హోదాలో భారీ ముడుపులు తీసుకున్నట్లు 24 అభియోగాలు, అవినీతికి కేంద్ర బిందువుగా ఉన్నారని రెండు అభియోగాలు, న్యాయ విచారణకు అడ్డంకులు కల్పించారని ఒకటి ఉంది. చంద్రబాబు ‘స్కిల్’తో కటకటాలకు ఈశ్వరన్ తోడు దొంగ చంద్రబాబు స్కిల్ స్కామ్‌లో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 52 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన రూ.5 వేల కోట్ల మేర అసైన్డ్ భూముల కుంభకోణం, రూ.2 వేల కోట్ల మేర ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసు, రూ.10 వేల కోట్ల ఇసుక కుంభకోణం, రూ.6,500 కోట్ల మద్యం కుంభకోణం, ఫైబర్ నెట్ కుంభకోణం కేసుల్లో కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నారు. సెక్షన్ 17 ఏ ప్రకారం తన అరెస్ట్ అక్రమమన్న చంద్రబాబు వాదనను సుప్రీంకోర్టు పట్టించుకోలేదు. ఆయనపై కేసు కొట్టివేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. రూ.66 వేల కోట్ల దోపిడీకి స్కెచ్ స్టార్టప్ ఏరియా 20 ఏళ్ల పాటు సింగపూర్ కన్సార్షియం ఆ«దీనంలో ఉంటుందని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ పర్యవేక్షణకు నియమించిన మేనేజ్మెంట్ కమిటీలో చంద్రబాబు కుటుంబసభ్యులు, బినామీలే ఉండేలా జాగ్రత్తపడ్డారు. ఏమైనా న్యాయ వివాదాలుంటే లండన్ కోర్టును ఆశ్రయించాలన్నారు. స్టార్టప్ ఏరియాలో ఎకరా కనీస ధర రూ.4 కోట్లుగా తేల్చారు. స్టార్టప్ ఏరియా అభివృద్ధి తరువాత అంతర్జాతీయ సంస్థలకు ఎకరా రూ.25 కోట్ల చొప్పున విక్రయించవచ్చని అంచనా వేశారు. 20 ఏళ్లలో ఎకరా విలువ రూ.50 కోట్లకు చేరుతుందని చంద్రబాబే వ్యాఖ్యానించారు. ఆ ప్రకారం ...సింగపూర్ కన్సార్షియం గుప్పిట్లో 1,320 ఎకరాలు (1,070 + 250) ఉంటాయి. ఆ 1,320 ఎకరాలను రూ.50 కోట్ల చొప్పున విక్రయిస్తే రూ.66 వేల కోట్లు ఆర్జించే అవకాశముంది. బాబుతో కలిసి అభాసుపాలు కృష్ణా నదీ తీరాన స్టార్టప్ కేంద్రం అంటూ రూ.66 వేల కోట్ల పన్నాగాన్ని చంద్రబాబు, ఈశ్వరన్ రక్తి కట్టించారు. అమరావతి ప్రాంతంలో అతి పెద్ద వాణిజ్య కేంద్రంగా 1,691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేయాలని బాబు ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ ప్రభుత్వ ఖర్చుతో మౌలిక సదుపాయాలు కలి్పంచి వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చేశాక దానిని బినామీల పేరిట హస్తగతం చేసుకోవాలని కుట్ర పన్నారు. ఇందులో సింగపూర్‌కు చెందిన అసెండాస్ కంపెనీని తెరపైకి తెచ్చారు. సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందమని నమ్మించి, తనకు సన్నిహితుడైన అప్పటి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఓ ప్రైవేటు కంపెనీ అసెండాస్ను తెరపైకి తెచ్చారు. స్విస్ చాలెంజ్ విధానంలో ప్రాజెక్టుల ఖరారును గతంలో సుప్రీంకోర్టు తప్పుపట్టినా.. స్టార్టప్ ఏరియా ప్రాజెక్ట్‌ను తన బినామీ కంపెనీకి కట్టబెట్టేందుకే స్విస్ చాలెంజ్ విధానాన్ని చంద్రబాబు అనుసరించారు. గ్లోబల్ టెండర్లు లేకుండానే ఏకపక్షంగా ప్రాజెక్టును సింగపూర్ కన్సార్షియానికి అప్పగించారు. ఆ 1,691 ఎకరాల్లోని 371 ఎకరాల్లో ప్రభుత్వం రూ.5,500 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. సింగపూర్ కన్సార్షియం అసెండాస్‌కు ప్రభుత్వం 250 ఎకరాలను ఉచితంగా ఇస్తుంది. మిగిలిన 1,070 ఎకరాలను ప్లాట్లుగా విభజించి వేలం ద్వారా విక్రయిస్తారు. ఎకరా కనీస ధర రూ.4 కోట్లుగా నిర్ణయించారు. 1,070 ఎకరాల విలువ రూ.4,280 కోట్లుగా లెక్కతేల్చారు. నిధులు సమకూర్చే రాష్ట్ర ప్రభుత్వానికి అందులో 42 శాతం వాటా, కేవలం పర్యవేక్షించే సింగపూర్ కంపెనీకి 58 శాతం వాటా దక్కేలా ఒప్పందం చేసుకున్నారు. -
మనవాళ్ల కోసం ఎకరాకు పదివేలు.. రాజధాని ప్రాంతంలో సేకరణ
‘‘మనకు ఇదే ఆఖరి అవకాశం.... ఇప్పుడు తప్పితే మరెప్పుడూ రాలేం.. ఈసారి మనం ప్రాణాలకు తెగించి పోరాడాలి.. అవసరమైతే చందాలు ఇవ్వాలి.. విరాళాలు ఇవ్వాలి.. భోజనాలు పెట్టాలి.. ఆస్తులైనా అమ్మాలి... మనవాళ్లను మన పార్టీని మనం కాపాడుకోవాలి.. లేదంటే మన పార్టీతో బాటు మన పెద్దరికాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి.’’ ఇదీ అమరావతి ప్రాంతంలో భూములున్న రైతులు.. చంద్రబాబు సామాజికవర్గం మోతుబరుల్లోని అభిప్రాయం. అమరావతి ప్రాంతంలో భూములు ఇచ్చినవాళ్లు.. అమరావతి కారణంగా భూముల ధరలు పెరిగి అమాంతం కోటీశ్వరులు అయినవాళ్లు.. వ్యాపారాలు చేసి పోగేసిన వాళ్లు.. వీళ్లంతా ఎక్కువమంది టీడీపీ సానుభూతిపరులుగా ఉన్నారు. గతంలో రాజధాని పేరిట బాగా లబ్ధిపొందిన ఈ వర్గం వారు 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడంతో హతాశులయ్యారు. ఇక కొందరైతే భారీగా భూముల ధరలు పెరుగుతాయని అప్పులు తెచ్చిమరీ భూములుకొన్నవాళ్ళు ఆ మేరకు ధరలు పెరగకపోవడం... రాజధాని కుంభకోణాలు బయటపడడంతో ఆ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోవడం... కోర్టు కేసుల్లో కొన్ని భూములు చిక్కుకోవడంతో తమ కలలు కల్లలయ్యాయని కలవరపడ్డారు. ఆ నష్టాన్ని పూరించుకోవాలని, మళ్ళీ రాజధాని పేరిట లబ్ధిపొందాలని సర్వదా ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ ఐదేళ్లు గడిచాక అసెంబ్లీ ఎన్నికలకు సమయం వచ్చింది. దీంతో ఇప్పుడు వాళ్లంతా ఏకమయ్యారు. ఈ ప్రాంతంలో ఎకరా భూమి ఉన్నవాళ్లు కనీసం రూ. 10 వేలు టీడీపీకి విరాళం ఇవ్వాలని .. ఆ మేరకు ఎంత ఎక్కువ భూమి ఉంటె అంత మొత్తంలో డబ్బులు జమచేసి టీడీపీకి విరాళంగా ఇవ్వాలని, టీడీపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని తీర్మానించారు. ఈమేరకు గ్రామాలూ.. వార్డులు.. మండలాలవారీగా చంద్రబాబు సామాజికవర్గం ప్రజలు.. వ్యాపారులు రైతులు కూడా ఎకరానికి కనీసం పదివేలు ఖచ్చితంగా ఇవ్వాలన్న నిబంధన విధించి ఆ మేరకు పని చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే గ్రామ.. మండలాల వారీగా కమిటీలు వేసి వసూళ్లు చేపడుతున్నారు. అందరం ఐక్యంగా ఉండాలని, ఈసారి వైయస్సార్ కాంగ్రెస్ గెలిస్తే తెలుగుదేశానికి పుట్టగతులు ఉండవని, అందుకే ఖచ్చితంగా టీడీపీని గెలిపించుకునే బాధ్యత తామే తీసుకోవాలని తీర్మానించారు. ఈ క్రమంలో వారి వారి స్థాయిని బట్టి చందాలు రెడీ చేస్తున్నారు. ఇక ఇక్కడ భూములు కొనేసి ప్రవాసాంధ్రులు , అమెరికాలోని తానా(TANA) సంఘం సభ్యులు... వారి బంధుమిత్రులు సైతం ఈ బాధ్యతల్లో యాక్టివ్ గా పాల్గొనేలా చూస్తున్నారు. విదేశాల్లోని యువత, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు.. సాఫ్ట్ వేర్, ఇతర వృత్తుల్లోని వాళ్ళను సైతం ఈ చందాల కార్యక్రమంలో చేర్చుకుని టీడీపీ కోసం అందరం పని చేయాల్సిన అవసరాన్ని వాళ్లకు పదేపదే చెబుతున్నారు. ///సిమ్మాదిరప్పన్న /// -
సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ కరపత్రాలను ప్రజలకు అందజేసిన వెల్లంపల్లి
-
రాజధాని ‘ఫెయిల్స్’.. బాబు ‘భ్రమరావతి’
ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు ఎవరినీ ఉద్దేశించినవి కావు... అని చెబుతున్నట్లే రియాలిటీకి ఏ మాత్రం సంబంధం లేకుండా వచ్చిన రాజధాని ఫైల్స్‌ను చంద్రబాబు భుజానికి ఎత్తుకుంటున్నాడు. కనీసం అమరావతికి దగ్గర్లో ఉన్న గుంటూరు థియేటర్స్‌కు కూడా ప్రేక్షకులు పోవడం లేదు. సినిమా రన్ కాగానే ఎంతమంది ఉన్నారో చూస్తే పట్టుమని పదిమంది కూడా థియేటర్లో కనిపించడం లేదు. ఈ సినిమా తెలుగుదేశం తమ్ముళ్లకే కాదు కనీసం అమరావతి రైతులకు కూడా కనెక్ట్ కాలేదని దీంతోనే తేలిపోతుంది. అందుకే చంద్రబాబు నాయుడు తాజాగా ఈ ఫెయిల్స్ సినిమా చూడండి. అందులో మన హరికథలు బాగా చెప్పామంటూ డైరెక్ట్‌గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ♦అమరావతి భూముల ఇష్యూలో నిత్యం పచ్చ మీడియాలో వచ్చే కథనాలే ఒక చోటుకు చేర్చి ప్రజల మీదికి ఈ సినిమాను వదిలాడు చంద్రబాబు. వాస్తవాలను మరచి అసత్యాలు, అబద్దాలను చేర్చి వెండితెర సాక్షిగా సరికొత్త విషప్రయోగాన్ని చంద్రబాబు ప్రయోగించాడు. అమరావతి రైతులు నష్టపోయిందే చంద్రబాబు వల్ల.. ఆ విషయాన్ని దాచి అమరావతిలోని తన పెత్తందార్లతో ఉద్యమాన్ని నడిపించాడు. అమరావతి ప్రాంతంలో చంద్రబాబు, ఆయన బ్యాచ్ పెద్ద ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిందని, రాజధాని ప్రకటన సమాచారం ముందే తెలుసుకుని భూములు కొనుగోలు చేసి అక్రమాలకు తెగించారని రాష్ట్రం అంతటా తెలుసు. మరీ ఈ ఫెయిల్స్ సినిమాలో ఇవి ఎందుకు కనిపించలేదు చంద్రబాబు..? ఒకసారి ఆ జ్ఞానం లేని డైరెక్టర్ గారిని అడగాల్సింది. అసలు భూముల పేరుతో అమరావతిలో కుట్రలకు, దారుణాలకు తెర లేపింది చంద్రబాబు కాదా..? ఎల్లో మీడియాలో రోజూ వచ్చే కథనాలే నిజం అనేలా ఇలా మళ్లీ సినిమా పేరుతో ప్రజలపై రుద్దడం ఎందుకు. ♦ వాస్తవానికి ఈ సినిమా చుట్టూ రైతుల భూముల గురించే ఉంది. కానీ రాజధాని నిర్మాణ వైఫల్యంపై ఎందుకు ఫోకస్ చేయలేదు. అలా చేస్తే అది చంద్రబాబుకూ వ్యతిరేకం అవుతుంది కాబట్టి.. చంద్రబాబు 5 ఏళ్ల పాటు గ్రాఫిక్స్‌లతో కాలం గడిపి అమరావతిలో తనకు సంబంధించిన వారికే భూములు కట్టబెట్టి తన చూట్టూ ఇన్నర్ రింగ్‌రోడ్డు మాదిరి ఒక కోటరీనే ఏర్పరుచుకున్నాడు. ఇవన్నీ తెలుసుకున్న జనాలు ఆయన్ను ఓడగొట్టడంతో ఆ కోట కాస్త బద్దలైంది. అప్పటి నుంచి అమరావతి భూములపై ఎల్లో మీడియా చెప్పే కథలే ఈ రాజధాని ‘ఫెయిల్స్’లో అతుకులబొంతలా ఉన్నాయి. ♦ అమరావతి ప్రాంతంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల నుంచి అసైన్డ్ భూములను బినామీల ద్వారా కొల్లగొట్టింది టీడీపీ పెద్దలే అన్న విషయం ఈ ఫెయిల్స్ సినిమా డైరెక్టర్‌కు గుర్తుకు రాలేదేమో... చంద్రబాబుతో మొదలు పెడితే లోకేశ్,నారాయణ , గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు ఇలా చాంతాడంత లిస్ట్ ఉంది. అమరావతి ప్రకటనకు ముందు వీళ్లకు అక్కడ భూములు ఉన్నాయా..? ఉన్నాయని ఒక్కరైతుతో అయిన చెప్పించగలరా..? అమరావతి పేద రైతుల ఆశలపై నీళ్లు చల్లింది చంద్రబాబు అని అక్కడున్న వారందరికీ తెలుసు. అమరావతి పేద రైతులను చంద్రబాబు మంచి చేసి ఉంటే అదే ప్రాంతంలో నారా లోకేష్ ఎందుకు దారుణంగా ఓడిపోతాడు.. మళ్లీ ఈసారి ఎక్కడ పోటీ చేస్తాడో ఆయనకే క్లారిటీ లేదు. వీళ్ల మోసాల గురించి ప్రతి అమరావతి పేద రైతుకు తెలుసు.. అందుకే వారి వెంట పెత్తందార్లు మాత్రమే ఉద్యమం పేరుతో నడిచారు. ఇవన్నీ ఈ రాజధాని ఫెయిల్స్ సినిమాలో ఎందుకు లేవో చెప్పగలరా..? ♦టీడీపీ సర్కార్ అధికారంలోకి రాగానే చంద్రబాబు ఇచ్చిన లీకుల మేరకు ఆయన, ఆయన బినామీలు, మంత్రుల బినామీల ద్వారా రాజధాని ప్రాంతంలో భారీ ఎత్తున భూముల్ని తక్కువ ధరకు కాజేశారు. జూన్ 1, 2014 నుంచి డిసెంబర్ 31, 2014 మధ్య జరిగిన రిజిస్ట్రేషన్లు పరిశీలించాక.. ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా 4,069.94 ఎకరాలను కొల్లగొట్టారు. ఇదంతా ఎలా జరిగిందో సినిమాలో చూపించాల్సింది. ♦ మాజీ మంత్రి నారాయణ.. తన వద్ద పనిచేసే అవుల మునిశంకర్, రాపూరు సాంబశివరావు, పొత్తూరి ప్రమీల, కోతపు వరుణ్‌కుమార్‌ల పేర్లతో 55.27 ఎకరాల భూమిని కొన్నారు. నాటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తన బినామీ గుమ్మడి సురేష్ పేరిట 38.84 ఎకరాల భూమి.., అప్పటి టీడీపీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ తన బినామీ సంస్థ అభినందన హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట 68.6 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌కు సన్నిహితుడైన వేమూరు రవికుమార్ ప్రసాద్ ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, గోష్పాద గ్రీన్ ఫీల్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ ట్రెండ్స్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ పేరిట 62.77 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. భూసమీకరణ ద్వారా రైతుల నుంచి తీసుకున్న భూముల కేటాయింపులోనూ టీడీపీ సర్కార్ అక్రమాలకు పాల్పడింది. రాజధాని ప్రాంతంలో 850 ఎకరాల భూములను సన్నిహితుల సంస్థలకు చంద్రబాబు ధారాదత్తం చేసినట్లు లెక్కలున్నాయి. ఇవన్నీ మచ్చుకు మాత్రమే. ♦ రాజాధాని ఫైల్స్‌లో శివరామకృష్ణ కమిటీతో పాటు కాగ్ ప్రస్తావనే లేదు.. కానీ వారికి నచ్చిన నారాయణ కమిటీ రిపోర్ట్‌ను మాత్రం కళ్లకు కట్టినట్లు చూపించాడు డైరెక్టర్.. అసలు అమరావతి గురించి శివరామకృష్ణ కమిటీ కీలకమైన అంశాలను తెరపైకి తీసుకొచ్చింది. వాటిని పట్టించుకోకుండా బాబుగారి ఇన్నర్ గేమ్‌ను వెండితెరపై చూపించే ప్రయత్నం చేసి బొక్కబోర్లా పడ్డాడు డైరెక్టర్. ♦రాజధాని అమరావతి రాష్ట్రంపై అంతులేని భారీ ఆర్థిక భారాన్ని మోపుతుందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక హెచ్చరించింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తక్షణంతో పాటు భవిష్యత్తులోనూ మోయలేని ఆర్థిక భారాన్ని కలిగిస్తుందని స్పష్టం చేసింది. ఇప్పుడే కాదు.. భవిష్యత్తులోనూ గుదిబండే అని కాగ్ హెచ్చరించింది. అంతేకాకుండా అమరావతిలో పేదలు, రైతులకు కౌలు చెల్లింపుల్లోనూ అక్రమాల జరిగాయని గుర్తించింది. అంతేకాకుండా అమరావతి విషయంలో శివరామకృష్ణ కమిటీ కీలంకంగా వ్యవహరించింది. ఏపీలో ఏకైక అతిపెద్ద రాజధాని ఏర్పాటు సరైంది కాదని శివరామకృష్ణ కమిటీ తేల్చింది. ప్రభుత్వ వ్యవస్థలను ఒకేచోట కాకుండా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని సూచించింది. రాష్ట్రంలో రాజధానిని, అధికార వ్యవస్థలను వికేంద్రీకరించాలని తెలిపింది. విజయవాడ-గుంటూరు, విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర, శ్రీకాళహస్తి-నడికుడి, రాయలసీమ ప్రాంతాల మధ్య ప్రభుత్వ వ్యవస్థలను వికేంద్రీకరించాలని కోరింది. రాజధానిని రెండు పట్టణాల మధ్య పూర్తిగా కేంద్రీకరిస్తే రాష్ట్రంలో ఇతర ప్రాంతాల అభివృద్ధి అవకాశాలు దెబ్బతింటాయని హెచ్చరించింది. ఇవన్నీ సినిమాలో చూపించకుండా నారాయణ కమిటీ గురించి మాత్రమే చెబితే ఎలా డైరెక్టర్ అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ♦ అమరావతి గ్రామాలలో అసైన్డ్ భూముల కుంభకోణం జరిగిందన్నది పచ్చి నిజం. ఈ విషయం చిన్నపిల్లవాడికి కూడా తెలుసు. ఇంతటి దారుణమైన పాపానికి ఒడిగట్టిన చంద్రబాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంతటి సూపర్ హిట్ భాగాన్ని సినిమా కథలో ఎందుకు చెప్పలేదు. చంద్రబాబు హయాంలో దళితుల నుంచి అసైన్డ్ భూములను వారికి కొంత ధర చెల్లించో, భయపెట్టో, లేక రకరకాల సందేహాలు రేపి దళితేతరులు స్వాధీనం చేసుకున్నారన్నది నిఖార్సైన వాస్తవం. 2015 ప్రారంభం నుంచి రాజధాని నిర్మాణం పేరుతో భూసమీకరణ ప్రారంభించారు. అప్పుడు పట్టా భూములకే పరిమితం అయ్యారు. కానీ 2016 ఫిబ్రవరిలో అసైన్డ్ భూములను కూడా తీసుకుంటామని జీఓ 41 తెచ్చారు. ♦ఈ మధ్యకాలంలోనే పలువురు టీడీపీ నేతలు, ఇతర వ్యక్తులు ఈ భూములను 95 శాతం వరకు కొనుగోలు చేశారు. వారికి ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నది నిజం కాదా..? సినిమాలో ఇవన్నీ ఎందుకు లేవు. ఇలా అమరావతి భూముల విషయంలో చంద్రబాబు అండ్ బ్యాచ్ చేసిన మోసాల గురించి చెప్పుకుంటూ పోతే 100 అసలైన రాజధాని ఫైల్స్ సినిమాలు తీయవచ్చు అనేది నిజం. సినిమా పేరుతో అసలు నిజాలు దాచి వదిలితే నమ్మే రోజులు పోయాయని ఈ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి తెలిసినట్లు లేదు. అందుకే ఇప్పుడు ఆ సినిమాను నెటిజన్లు ట్రోల్ చేస్తూ నవ్వుకుంటున్నారు. డైరెక్టర్ భానుతో పాటు చంద్రబాబుకు వీటికి సమాధానం చెప్పగలరా? ►అసలు రాజధాని ఎక్కడ పెట్టమని కేంద్రం చెప్పింది? ►ప్రభుత్వ భూములు ప్రకాశం జిల్లాలో ఉన్నాయని చెప్పినా.. బాబు ఎందుకు వినలేదు? ►కృష్ణా నది తీరం పంటలకు అనువైన భూమి, రాజధాని కట్టడం వల్ల కాంక్రీట్ జంగిల్‌గా మారుతుందని చెప్పినా పెడచెవిన ఎందుకు పెట్టారు? ►కృష్ణా నదిని ఆక్రమించి కట్టిన కరకట్ట ఇంట్లో బాబు ఎందుకు ఉంటున్నాడు? ►క్విడ్ ప్రో కోలా ఎక్కడ రాజధాని వస్తుందో ముందే తన పార్టీ నేతలకు చెప్పించి భూములు ఎలా కొనిపించాడు? ►పొలాలు ఇవ్వని రైతుల పంటలు తగులబెట్టిందెవరు? ►ఇంత చేస్తే బాహుబలి సినిమాలోలా గ్రాఫిక్స్ భ్రమరావతిని ఎందుకు చూపించారు? ►ఇంకెన్నాళ్లు రాజధాని పేరు చెప్పి మోసం చేస్తారు? -
దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నారు.. చివరకు
'అమరావతి రాజదాని నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వం ముందుకు వచ్చింది.. ఇదంతా తనకు అంతర్జాతీయగా ఉన్న పలుకుబడివల్లే .."అని 2014-2019 మధ్య ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు పదే, పదే చెప్పుకున్న మాటలు. ఆయనకు మాటలకు తగినట్లే సింగపూర్ దేశ మంత్రిగా ఉన్న ఈశ్వరన్ తరచు అమరావతి రావడం, చంద్రబాబుతో ముచ్చట్లు పెట్టుకోవడం, ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ ను ఆరంభించడానికి ఒప్పందం చేసుకోవడం గమనించిన పలువురు నిజంగానే ఏపీ మీద, ఎపి రాజధాని మీద అభిమానంతోనే సింగపూర్ మంత్రి తరచు వస్తున్నారేమోలే అని అనుకునేవారు. కాని అప్పట్లోనే నిశితంగా పరిశీలన చేసే కొందరు మాత్రం ఇందులో ఏదో మోసం ఉందని అనేవారు. వారి మాటలను తోసిపుచ్చుతూ వారిని అమరావతి యజ్ఞాన్ని పాడుచేసే రాక్షసులు మాదిరి అని చంద్రబాబు, టీడీపీ నేతలు విమర్శిస్తుండేవారు. ఈశ్వరన్ లాగానే బిడిశెట్టి అనే మిత్రుడు కూడా చంద్రబాబుకు ఉన్నారు. ✍️ ఆయనకు కూడా ఏదో మెడికల్ హబ్ పెడతారని చెప్పి అమరావతిలో వంద ఎకరాల భూమిని తక్కువ ధరకు చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది. విశేషం ఏమిటంటే చంద్రబాబు మిత్రులు ఇద్దరూ అవినీతి , హవాలా కేసులలో చిక్కుకోవడం. ఈశ్వరన్ అవినీతి కేసులో చిక్కి సింగపూర్ లో అరెస్టు అవడం తదుపరి మంత్రి పదవిని కోల్పోవడం జరిగింది. బిడి శెట్టిని దుబాయి జైలులో అక్కడి ప్రభుత్వం పెట్టింది. మరో ఆసక్తికరపరిణామం ఏమిటంటే ఏపీలో చంద్రబాబు నాయుడు కూడా స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్, రాజదాని కేసులు మొదలైనవాటిలో ఇరుకున్నారు. స్కిల్ స్కామ్ కేసులో అరెస్టు అయి 53 రోజులు జైలులో ఉండాల్సి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ముగ్గురు మిత్రులు అవినీతి ఊబిలో ఉన్నారన్నమాట. సింగపూర్ లో ఈశ్వరన్ పై మొత్తం 27 అభియోగాలు వచ్చాయి. ✍️చంద్రబాబుకు సన్నిహితులైన ఈశ్వరన్ ,బిడి శెట్టి వంటివారు అరెస్టు అవడంంతో తెలుగుదేశం పార్టీకి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. వీరి అరెస్టుపై చంద్రబాబు స్పందించలేదు. కనీసం ఈశ్వరన్ కు సానుభూతి కూడా తెలపలేదు. అదే వైసిపికి సంబంధించినవారికి తెలిసినవారెవరైనా ఇతర దేశాలలో కేసులలో చిక్కితే ఇదే చంద్రబాబు కొండెక్కి అరిచేవారు. గతంలో ముఖ్యమంత్రి జగన్ కేసులలో కొందరు అధికారులను పెడితే అదంతా జగన్ తో సంబంధాల వల్లే అని ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు తన మిత్రుల అరెస్టుపై కిక్కురుమనలేకపోతున్నారు. ఈశ్వరన్, శెట్టిల పై వచ్చిన అవినీతి కేసుల గురించి ఈనాడు,ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలు కుక్కిన పేల మాదిరి నోరు మెదపలేదు. సింగపూర్ దేశ ప్రభుత్వం వారు మాస్టర్ ప్లాన్ ఉచితంగా ఇస్తున్నారని కూడా అప్పట్లో చంద్రబాబు ప్రచారం చేశారు. ✍️తీరా చూస్తే అది అసత్యమని ఆ తర్వాత తేలింది. సింగపూర్ కు చెందిన కొన్ని ప్రైవేటు కంపెనీలతో కన్సార్టియమ్ ఏర్పాటు చేసి ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ తయారు చేయాలని సంకల్పించారు. మామూలుగా అయితే దానిని తప్పు పట్టనక్కర్లేదు. కాని అవేదో సింగపూర్ దేశ ప్రభుత్వ కంపెనీలే వచ్చి ఈ వెంచర్ ను ఆరంభిస్తున్నట్లు చంద్రబాబు చెబుతుండేవారు. దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు బాకాలు ఊదుతుండేవి. తీరా చూస్తే అవి ప్రైవేటు కంపెనీలని తదుపరి వెల్లడైంది. సింగపూర్ ప్రభుత్వంతో ఆ సందర్భంలో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం అందరిని విస్తుపరచింది. సింగపూర్ కంపెనీలు 300 కోట్ల రూపాయలను పెట్టుబడి పెడితే, ఏపీ ప్రభుత్వం సుమారు 5600 కోట్ల రూపాయల మేర వ్యయం చేసి ఆ వెంచర్ కు అవసరమైన మౌలిక వసతులు కల్పించడానికి అంగీకరించింది. ✍️ కంపెనీతో ఏదైనా తేడా వస్తే లండన్ కోర్టులో తేల్చుకోవాలన్న కండిషన్ పెట్టారు. స్విస్ చాలెంజ్ పద్దతిన ఈ వెంచర్ కు భూమి కేటాయించినట్లు అప్పట్లో ప్రకటించారు. దీనిపై అప్పట్లో హైకోర్టు తప్పుపడితే, మళ్లీ చట్టాన్ని మార్చి మరీ తాము అనుకున్న స్కీమును చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసింది. విశేషం ఏమిటంటే 300 కోట్లు పెట్టుబడి పెట్టే సింగపూర్ కంపెనీకి 56 శాతం వాటా ఇచ్చి, ఏపీ ప్రభుత్వం మాత్రం మైనర్ వాటాదారుగా ఒప్పుకోవడం. ఈ వ్యవహారంపై ఎందరు అభ్యంతరం చెప్పినా చంద్రబాబు వినిపించుకోలేదు. ఏకంగా 1600 ఎకరాల భూమిని ఇందుకోసం కేటాయించారు. ✍️నిజానికి ఇలాంటి స్కీములు అమలు చేయడానికి ముందుగా వాస్తవ పరిస్థితిని సర్వే చేసి డిమాడ్ నిర్ణయించుకుంటారు. అవేవి లేకుండా రియల్ ఎస్టేట్ వెంచర్ ఏర్పాటు చేయడం అంటే, చుట్టుపక్కల ఉన్న తమ భూముల విలువలను పెంచుకోవడానికే అన్నది బహిరంగ రహస్యం. ఈ వివాదాస్పద నిర్ణయం పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చే టైమ్ కి చంద్రబాబు ప్రభుత్వం ఓటమిపాలైంది. కొత్తగా వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని విషయాలను పరిశీలించడంతో ,తమ లొసుగులు బయటపడుతున్నాయని భావించిన సింగపూర్ కంపెనీల కన్సార్షియం తమ ఒప్పందాన్ని రద్దు చేసుకుని వెళ్లిపోతామని ప్రభుత్వానికి తెలియచేసింది.దాంతో ఆ కధ ముగిసింది. చంద్రబాబు,ఈశ్వరన్ కలిసి చేపట్టిన రియల్ ఎస్టేట్ వెంచర్ భాగోతం అంతా బట్టబయలైంది. ఆ తర్వాత కాలంలో ఈశ్వరన్ పై అవినీతి కేసులు వచ్చాయి. ✍️సింగపూర్ దేశం ఇలాంటి అవినీతి వ్యవహారాలను అసలు అంగీకరించదు.అందువల్లే ఆయనను పదవినుంచి తప్పించడమే కాకుండా ఆ కేసుల విచారణకుఆదేశాలు ఇచ్చారు. ఈ నేపధ్యంలో చంద్రబాబుకు సింగపూర్ లో కూడా బినామీ లావాదేవీలు ఉన్నాయని, వాటికి ఈశ్వరన్ సహకారం ఉండి ఉంటుందని, అందువల్లే ఆయనకు ఏపీలో లాభం చేకూర్చే యత్నం చేశారని వివిధ రాజకీయ పక్షాలు ఆరోపిస్తుంటాయి. ఈశ్వరన్ కు సంబంధించిన అన్ని లావాదేవీలను పరిశీలిస్తే ఇలాంటి స్కామ్ లు ఏవైనా ఉంటే బయటపడవచ్చన్న భావన కూడా ఉంది. అమరావతి రాజధానిని ప్రైవేటు రియల్ ఎస్టేట్ వెంచర్ గా చంద్రబాబు మార్చారనడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం ఉండదు. ✍️ అవసరం లేకపోయినా 34 వేల ఎకరాల భూమి సేకరించడం, వారికి ఏటా సుమారు 250 కోట్ల రూపాయల కౌలు చెల్లించవలసి రావడం, వారికి అభివృద్ది చేసిన ప్లాట్లు ఇవ్వడానికి లక్ష కోట్ల రూపాయల వ్యయం చేయాల్సి ఉండడం ..ఇవన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. దాని ఫలితంగానే అమరావతి ప్రాంతంతో సహా రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అయితే కొద్ది రోజుల క్రితం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు భోగి మంటలు వేసుకుని, మళ్లీ అమరావతిలోనే లక్షల కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించారు. తద్వారా ఏపీ వ్యాప్తంగా ఉన్న ఇతర ప్రాంతాల ప్రజలకు నష్టం చేయబోతున్నట్లు చెప్పకనే చెప్పారు. ✍️రాష్ట్ర ప్రజల సొత్తు అంతటిని ఒక్క అమరావతిలోనే ఖర్చు చేస్తామని చంద్రబాబు, పవన్ లు చెబితే మళ్లీ ఇతర ప్రాంతాలలో వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ అమరావతి రాజధాని విషయంలో తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి కుల రాజధాని అని, ఇక్కడ శ్రీకాకుళం ప్రాంతం నుంచి వచ్చినవారెవరైనా నివసించే పరిస్థితి ఉందా అని అడిగేవారు.కాని ఆశ్చర్యంగా ఏ రకమైన ఒప్పందం కుదిరిందో తెలియదు కాని చంద్రబాబు తో ఆయన కూడా మిలాఖత్ అయిపోయారు. ✍️ఇన్ సైడ్ ట్రేడింగ్ ,అస్సైన్డ్ భూముల స్కామ్ మొదలైనవి ఉండనే ఉన్నాయి. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ కు అమరావతి అవినీతితో కూడా ఏమైనా సంబంధం ఉందా? చంద్రబాబుకు, ఆయనకు మద్య ఉన్న లావాదేవీలు ఏమిటి? అన్నవాటిపై విచారణ జరగలేదు. మొత్తం మీద అమరావతి అంటే అదొక అవినీతి కేంద్రం అన్న భావన ఏర్పడిన నేపధ్యంలో ఈశ్వరన్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అలాగే శెట్టి గోల్ మాల్ వెల్లడైంది. వీటిపై చంద్రబాబు వివరణ ఇచ్చి, ఆ తర్వాత అమరావతి గురించి మాట్లాడితే జనం అప్పుడు ఆయన చెప్పిన మాటలలోని విశ్వసనీయత గురించి ఆలోచిస్తారు. లేకుంటే కచ్చితంగా ఈ అవినీతి ఊబిలో చంద్రబాబు బృందానికి కూడా ఏదో లింక్ ఉందని అనుమానిస్తారు. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
అక్రమాల పుట్ట ‘అమరావతి’
సాక్షి, అమరావతి: ఆశ్రిత పక్షపాతం.. అవినీతి.. అధికార దుర్వినియోగం.. వెరసి అమరావతిని మాజీ సీఎం చంద్రబాబు అక్రమాల పుట్టగా మార్చేశారు. అడ్డగోలు నిర్ణయాలతో అమరావతిని భ్రష్టు పట్టించారు. రాజధాని ఇక్కడా.. అక్కడా అంటూ లీకులిచ్చి స్కాములకు బీజం వేశారు. రాజధాని ఎంపిక నుంచి భూముల కొనుగోళ్లు, భూ సమీకరణ(ల్యాండ్ పూలింగ్), ప్రైవేట్ సంస్థలకు కేటాయింపు, సింగపూర్ కంపెనీలతో ఒప్పందాలు, ఎస్సీ ఎస్టీలకు చెందిన అసైన్డ్ భూముల వ్యవహారం వరకు ఏది తవ్వినా టన్నుల కొద్దీ అవినీతి పుట్ట బద్ధలవుతోంది. అధికార రహస్యాలను బయటకు వెల్లడించనని, రాగద్వేషాలకు అతీతంగా పాలన సాగిస్తానని, తన, పర బేధం చూడనని చేసిన ప్రమాణాన్ని (ఓత్ ఆఫ్ సీక్రసీ) ఉల్లంఘించి అమరావతిని అక్రమాల అడ్డాగా మార్చేసిన తీరు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడంతో ప్రజలు నివ్వెరపోతున్నారు. అమరావతిలో జరిగిన అసైన్డ్ భూముల స్కామ్ తాజాగా సీఐడీ దర్యాప్తులో బట్టబయలవడం, ఇన్సైడర్ ట్రేడింగ్ నుంచి భూముల కేటాయింపుల వరకు చోటు చేసుకున్న అక్రమాలు చర్చనీయాంశంగా మారాయి. మంత్రివర్గ ఉపసంఘం నుంచి సీఐడీ, ఈడీ, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వరకు ఏ నివేదికను పరిశీలించినా అమరావతి అక్రమాల పుట్ట అని, చంద్రబాబు పర్యవేక్షణలోనే ఇవన్నీ జరిగాయని నిగ్గు తేలుతోంది. రాజధాని ముసుగులో సాగిన ఇన్సైడర్ ట్రేడింగ్ లబ్ధిదారులు గత సర్కారు పెద్దలు, మాజీ మంత్రులు, టీడీపీ నేతలే అన్నది జగమెరిగిన సత్యం. ఈ జాబితాలో మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ సన్నిహితుడు వేమూరు రవికుమార్ ప్రసాద్, మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, పయ్యావుల కేశవ్, ధూళిపాళ నరేంద్ర, చంద్రబాబు కరకట్ట నివాసం యజమాని లింగమనేని రమేష్, లంకా దినకర్, కంభంపాటి రామ్మోహన్రావు, పుట్టా మహేష్ యాదవ్ తదితరులున్నారు. అమరావతి భూ కుంభకోణాన్ని మంత్రివర్గ ఉపసంఘం తవ్వి తీయడం తెలిసిందే. ఉపసంఘం నివేదికతో రంగంలోకి సీఐడీ మంత్రివర్గ ఉపసంఘం సమగ్ర నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ వ్యవహారంపై సీఐడీ విచారణకు ఆదేశించింది. రాజధాని పేరుతో లీకులు ఇచ్చి కారుచౌకగా భూములు కొట్టేసి ఆ తర్వాత ల్యాండ్ ఫూలింగ్‌తో ఆర్థికంగా లబ్ధి పొందిన అక్రమార్కుల జాబితాను సీఐడీ రూపొందించింది. రాజధాని ప్రకటనపై ముందస్తు సమాచారంతో క్యాపిటల్ సిటీ, క్యాపిటల్ రీజియన్‌లో తక్కువ ధరకు భూముల కొనుగోళ్లు జరిపినట్లు నిర్ధారించింది. బినామీ పేర్లతో టీడీపీ నేతలు కొనుగోళ్లు చేసినట్లు నివేదికలో పేర్కొంది. రూ.కోట్లు విలువైన భూములను పేద వర్గాలు (797 మంది తెల్లకార్డుదారులు) కొనుగోలు చేయడం వెనుక బినామీలు టీడీపీ నాయకులేనని నిగ్గు తేల్చింది. నిజమైన పేదలే అయితే వారికి అన్ని కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి? ఒకవేళ డబ్బున్న వారైతే తెల్లకార్డులు ఎలా పొందారు? అనే కోణంలో విచారించిన సీఐడీ అధికారులు ఆదాయ పన్ను శాఖ, రెవెన్యూ యంత్రాంగం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)లకు నివేదికలు అందించడంతో ఆయా విభాగాలు తమదైన రీతిలో విచారణ సాగించాయి. అక్రమాల చిట్టా... చంద్రబాబు తనయుడు నారా లోకేష్ బినామీ వేమూరి రవికుమార్ కుటుంబం పేరుతో 62.77 ఎకరాల భూములు కొనుగోలు చేసినట్టు నిర్ధారించారు. లింగమనేని రమేష్ తన భార్య, బంధువుల పేర్లతో భూములు కొన్నారు. మాజీ మంత్రి నారాయణ తన సన్నిహితులు ఆవుల మునిశేఖర్, రాపూరు సాంబశివరావు, పొట్టూరి ప్రమీల, కొత్తపు వరుణకుమార్ పేర్లతో 55.27 ఎకరాలు కొనుగోలు చేశారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ బినామీ పేర్లతో 68.6 ఎకరాలు, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తన బినామీ గుమ్మడి సురేష్ పేరుతో 37.84 ఎకరాలు, మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు మైత్రీ ఇన్ఫ్రా పేరుతో 40 ఎకరాలు కొనుగోలు చేసినట్లు నిర్థారణ అయ్యింది. బినామీలకు భారీ లబ్ధి చేకూర్చేలా.. టీడీపీ నేతలు, వారి బినామీలకు మేలు చేసేలా చంద్రబాబు సర్కారు రాజధాని సరిహద్దులను కూడా మార్పు చేసినట్లు సీఐడీ దర్యాప్తులో నిర్ధారణ అయ్యింది. లంక, పోరంబోకు, ప్రభుత్వ భూముల రికార్డుల్లో భారీ అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కోసం రికార్డులు తారుమారు చేసినట్టు నిర్ధారించింది. భూ కేటాయింపుల్లోనూ చంద్రబాబు ప్రభుత్వం భారీ అక్రమాలకు పాల్పడ్డట్లు తేల్చారు. 1977 అసైన్డ్ భూముల చట్టాన్ని, 1989 ఎస్సీ, ఎస్టీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించారని నిర్ధారించారు. బినామీలు, నేతల భూములకు ప్రయోజనం చేకూర్చేలా రాజధానిని ఏర్పాటు చేశారని తేటతెల్లమైంది. 2014 జూన్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు భూముల కొనుగోళ్లు జరిపినట్లు తేలింది. 4,070 ఎకరాల భూములను ఇన్సైడర్ ట్రేడింగ్‌లో కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఎదుర్కోలేక అడ్డుకునే ప్రయత్నాలు అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ నుంచి తాజాగా సీఐడీ నమోదు చేసిన అసైన్డ్ భూ కుంభకోణం వరకు దర్యాప్తును ఎదుర్కొనేందుకు చంద్రబాబు అండ్‌కోకు ధైర్యం లేదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వ్యవస్థల ద్వారా దర్యాప్తును అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌లో టీడీపీ పెద్దలతోపాటు వారికి మద్దతుగా నిలిచిన ప్రముఖుల గుట్టు రట్టు కావడంతో సీఐడీ, ఏసీబీ, సిట్ దర్యాప్తులను గతేడాది అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. చదవండి: పేదలను బెదిరించారు..‘అసైన్డ్’ కాజేశారు -
అమరావతి అసైన్డ్ భూముల కేసులో కొత్త ట్విస్ట్
-
ప్రభుత్వ భూములూ మింగేశారు!
సాక్షి, అమరావతి: మాజీ సీఎం చంద్రబాబు అమరావతిలో సాగించిన భూదోపిడీలో తవ్వుతున్న కొద్దీ కొత్త అక్రమాలు గుట్టలు గుట్టలుగా బయట పడుతున్నాయి. అసైన్డ్ భూములే కాకుండా ప్రభుత్వ భూములనూ వదల్లేదు. చంద్రబాబు, పి.నారాయణ, లోకేశ్ త్రయం బినామీల పేరిట కొల్లగొట్టిన భూముల జాబితా చాంతాడులా సాగుతోంది. అసైన్డ్ రైతులకు ఎలాంటి పరిహారం ఇవ్వకుండానే వారి భూములను రాజధాని కోసం టీడీపీ సర్కారు తీసుకుంటుందని బెదిరించి రూ.3,370 కోట్ల విలువైన 617 ఎకరాలను కొల్లగొట్టిన కుంభకోణాన్ని ‘సాక్షి’ ఇప్పటికే బట్టబయలు చేయడం తెలిసిందే. అయితే అసైన్డ్ రైతులే కాకుండా అమరావతిలోని ప్రభుత్వ భూములను సైతం తమ బినామీల పేరిట నమోదు చేసి చంద్రబాబు బృందం భూదోపిడీకి పాల్పడటం ‘సాక్షి’ పరిశోధనలో వెలుగులోకి వచ్చింది. ఏకంగా 328 ఎకరాల ప్రభుత్వ భూమిని 522 మంది బినామీల పేరిట హస్తగతం చేసుకున్నారు. అనంతరం భూ సమీకరణ ప్యాకేజీ కింద రూ.760.25 కోట్లను కాజేశారు. చంద్రబాబు, నారాయణ, లోకేశ్ అసైన్డ్ భూ దోపిడీలో ఆ అవినీతి పర్వం ఇదిగో ఇలా ఉంది.... రెండు కేటగిరీలుగా వర్గీకరించి.. రాజధాని పేరుతో అమరావతి పరిధిలో సర్వే చేయించిన చంద్రబాబు, నారాయణ దృష్టి ఆ ప్రాంతంలోని ప్రభుత్వ భూములపై పడింది. అసైన్డ్ భూములను 1 నుంచి 4 కేటగిరీల కింద విభజించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను బెదిరించి తీసుకోగా ఎవరి ఆధీనంలోనూ లేని ప్రభుత్వ భూములను దక్కించుకునేందుకు మరో పన్నాగం పన్నారు. ఆ ప్రభుత్వ భూములన్నీ గుర్తు తెలియని రైతుల ఆధీనంలో ఉన్నట్లు రికార్డుల్లో చూపించారు. వాటిని అసైన్డ్ భూముల జాబితాలో 5, 6 కేటగిరీల కింద పేర్కొన్నారు. అన్యాక్రాంతమైనప్పటికీ అభ్యంతరాలు లేని భూములను కేటగిరీ 5 కింద, అన్యాక్రాంతమై అభ్యంతరాలున్న భూములను కేటగిరీ 6 కింద చూపిస్తూ జీవో 41 జారీ చేశారు. ఆ భూములకు భూసమీకరణ ప్యాకేజీని ప్రకటించారు. కేటగిరీ 5 కింద భూములకు 500 చ.గజాల నివాస స్థలం, 100 చ.గజాల వాణిజ్య స్థలాన్ని ప్యాకేజీగా పేర్కొన్నారు. కేటగిరీ 6 కింద భూములకు 260 చ.గజాల నివాస స్థలాన్ని ప్యాకేజీగా ఇస్తామని ప్రకటించారు. అంతేకాదు ఎకరా కంటే తక్కువ ఉన్న భూములకు కూడా కనీసం ఎకరా ప్యాకేజీ వర్తిస్తుందని జీవోలో పేర్కొన్నారు. 328 ఎకరాలు... రూ.760.25 కోట్ల ప్యాకేజీ అనంతరం అసలు కథను తెరపైకి తెచ్చారు. అమరావతి పరిధిలో కేటగిరీ 5 కింద 237.60 ఎకరాలను గుర్తించారు. ఆ భూములన్నీ 295 మంది ఆధీనంలో ఉన్నట్టుగా చూపించారు. ఇక కేటగిరీ 6 కింద 90.52 ఎకరాలను చూపించారు. ఆ భూములు 227 మంది స్వాధీనంలో ఉన్నట్టుగా కనికట్టు చేశారు. వాస్తవానికి ఆ రెండు కేటగిరీల భూములు ఎవరి ఆధీనంలోనూ లేవు. కానీ ఆ భూములు 522 మంది తమ బినామీల ఆధీనంలో ఉన్నట్టుగా చూపించి భూసమీకరణ ప్యాకేజీని కొల్లగొట్టారు. అమరావతిలో ప్యాకేజీ ప్రకటించే నాటికి నివాస స్థలం చ.గజం రూ.30 వేలు, వాణిజ్య స్థలం చ.గజం రూ.50 వేలు చొప్పున మార్కెట్ ధర పలికింది. అమరావతి నిర్మాణం పూర్తయితే మార్కెట్ ధర మరింత పెరుగుతుంది. అప్పటి ధరనే తీసుకుంటే కేటగిరీ 5 కింద ఒక్కొక్కరికీ రూ.1.50 కోట్ల విలువైన నివాస స్థలం, రూ.50 లక్షలు విలువైన వాణిజ్య స్థలం వెరసి రూ.2 కోట్లు చొప్పున ప్యాకేజీ దక్కింది. ఆ ప్రకారం కేటగిరీ 5 కింద ఉన్న 295 మంది రూ.590 కోట్ల విలువైన స్థలాలను పొందారు. కేటగిరీ 6 కింద ఒక్కొక్కరికీ రూ.75 లక్షలు విలువైన నివాస స్థలం ఇచ్చారు. ఆ ప్రకారం 227 మందికి రూ.170.25 కోట్ల విలువైన స్థలాలు దక్కాయి. మొత్తం మీద కేటగిరీ 5, 6లలో రైతులుగా చూపించిన తమ బినామీలు 522 మంది ముసుగులో చంద్రబాబు, నారాయణ రూ.760.25 కోట్ల విలువైన స్థలాలను కొల్లగొట్టినట్లు స్పష్టమైంది. ఆ గ్రామాల్లో ఒక్కరూ లేరు అమరావతి భూదోపిడీపై దర్యాప్తు జరుపుతున్న సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దర్యాప్తులో అసైన్డ్ భూకుంభకోణం ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ కార్యాలయాల్లో ఉన్న భూముల రికార్డులు, సీఆర్డీయే భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించిన రైతుల జాబితాలను సిట్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కేటగిరీ 5, 6లలో చూపించిన 522 మంది రైతుల్లో ఒక్కరు కూడా అమరావతి గ్రామాల్లోనే లేకపోవడం విస్మయం కలిగిస్తోంది. అంటే ప్రభుత్వ భూములను ఆక్రమించిన రైతులెవరూ లేరు. భూసమీకరణ ప్యాకేజీ కింద రాజధానిలో అత్యంత విలువైన స్థలాలను కాజేసేందుకే చంద్రబాబు ముఠా ఈ పన్నాగానికి పాల్పడిందన్నది ఆధారాలతోసహా నిర్ధారణ అయ్యింది. -
చంద్రబాబును జైల్లో విచారణ చేసేందుకు కోర్టు అనుమతి..!
-
చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్న CID
-
చంద్రబాబు ప్లాన్ అట్టర్‌ప్లాప్.. ఆంధ్రజ్యోతి ఎంత పనిచేసింది!
ఇది అందరూ తెలుసుకోవలసిన విషయం. ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ మధ్య ఒక ప్రచారం చేశారు. తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్‌లో ఒక ఎకరా అమ్మితే ఏపీలో వంద ఎకరాలు కొనవచ్చని. అంతలా తెలంగాణలో రేట్లు పెరిగిపోయాయని, ఏపీలో ధరలు దెబ్బతిన్నాయన్నది ఆయన చెప్పిన మాట. ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఆయన ఈ అవకాశాన్ని వాడుకున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఆయనకు మద్దతు ఇచ్చే ఆంధ్రజ్యోతి దిన పత్రిక హైదరాబాద్‌లో హెచ్ఎండీఏ వేలంపాటలో విపరీతమైన రేట్లను కొందరు పెట్టడంపై ఒక కథనాన్ని ఇస్తూ అదంతా రియల్ ఎస్టేట్ మాఫియా పని అని, నిజానికి రేట్లు పెరిగినట్లు చూపి తమ భూముల విలువ పెంచుకునే కుట్ర అని వెల్లడించింది. అంతేకాక, గజం లక్ష రూపాయలకో, లేక ఎకరా వంద కోట్లకో పాట పాడినవారు చాలా మంది అసలు ఆ తర్వాత డబ్బులే చెల్లించడం లేదని తెలిపింది. కేవలం ఒక లక్ష రూపాయల డిపాజిట్ కట్టి ఈ తంతు సాగిస్తున్నారని తెలియచేసింది. తెలంగాణ ప్రాంతంలో ఈ కథనాన్ని ఇచ్చిన ఆ పత్రిక ఏపీలో మాత్రం ఇవ్వకుండా జాగ్రత్తపడింది. బాబు బూమ్ మాయ.. ఇక్కడ మాత్రం చంద్రబాబు చెప్పిన విషయానికి మాత్రం ప్రాధాన్యం ఇచ్చారు. దీనిని బట్టి ఒకటి అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ మాఫియాలకు అనుకూలంగా ఉంటారని అనుకోవచ్చు కదా!. ఎందుకంటే అమరావతి రాజధాని గ్రామాల్లో అచ్చంగా ఇలాగే రియల్ ఎస్టేట్ కృత్రిమ బూమ్ కోసం చంద్రబాబు కృషి చేశారని అప్పట్లో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ రోజుల్లో రాజధాని గ్రామాలలో తెల్లవారేసరికి భూముల విలువ ఐదు నుంచి పది రెట్లు పెరిగిపోయాయి. అబ్బో అదంతా చంద్రబాబు ఘనతే అని ఆయనకు మద్దతు ఇచ్చే పత్రికలు, టీవీలు ఊదరగొట్టాయి. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై ఆంధ్రజ్యోతి రాసిన ఈ కథనం చూస్తే కారణం ఏమైనా కానీ.. కొంత వాస్తవమే ఉన్నట్లు అనిపిస్తుంది. మేడిపల్లి అనే చోట జరిగిన హెచ్ఎండీఏ వేలంపాటలో నారాయణమూర్తి అనే వ్యక్తి గజం యాభై వేలకు ప్లాట్ కొన్నారట. ఆ తర్వాత ఆయన హెచ్ఎండీఏ ఆఫీస్‌కు వెళ్లి తన పక్క ప్లాట్ల వారి గురించి ఆరా తీశారట. అప్పుడు అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయారట. తనతో పాటు ఆయా ప్లాట్లను వేలంలో అధిక ధరకు కొనుగోలు చేసినవారిలో ఎనభై శాతం అసలు డబ్బు చెల్లించలేదట. లక్ష రూపాయల డిపాజిట్ కూడా వదలుకోవడానికి సిద్దపడటంలో రహస్యం వారి ఆ చుట్టుపక్కల ఉన్న ఆస్తుల విలువను పెంచుకోవడానికి ప్రయత్నిస్తుండటమేనట. రియల్ ఎస్టేట్ ట్రిక్స్.. ఫ్రీలాంచ్ ఆఫర్ల పేరుతో తమ విల్లాలు, అపార్టుమెంట్లను అమ్ముకోవడానికి అత్యాశతో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వేలం మాఫియాగా మారారని ఆ పత్రిక రాసింది. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న నిషేధాన్ని తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత సుమారు లక్ష ఎకరాల భూమి అందుబాటులోకి వచ్చింది. దాంతో ఓవరాల్‌గా రియల్ ఎస్టేట్ రంగం సబ్దుగా మారిందని, ఆ నేపథ్యంలోనే ఇలాంటి ట్రిక్కులను ప్లే చేస్తున్నారని మీడియా రాసింది. ఇంకో విశేషం ఏమిటంటే తెలంగాణలో 2023 మొదటి నాలుగు నెలల్లో గత ఏడాది కన్నా రిజిస్ట్రేషన్లు తగ్గాయట. ఆదాయం కూడా 150 కోట్లు తక్కువగా ఉందని లెక్కలు చెబుతున్నాయి. ఈ రియల్ మాఫియాకు ప్రభుత్వ సహకారం కూడా ఉందని ఈ పత్రిక ఆరోపించింది. మార్కెట్ దెబ్బతిందన్న భావన కలగకుండా ఉండడానికి ప్రభుత్వం అలా చేస్తోందని రాశారు. మోకిలా అనేచోట హెచ్ఎండీఏ వేసిన ప్లాట్ల వేలంలో కూడా ఇలాగే స్కామ్ జరిగిందని మీడియా చెబుతోంది. ఒకే సంస్థకు చెందిన పదిహేను మంది అక్కడ గజం 35వేల రూపాయల వరకు వెళ్లవచ్చని అనుకుంటే అరవైఐదు వేల నుంచి లక్ష రూపాయలవరకు పెట్టారట. తీరా చూస్తే ఆ సంస్థకు ఆ పక్కనే 350 ఎకరాల భూమి ఉందట. హైదరాబాద్‌లో ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కాస్త మందగించిందని, అంతర్జాతీయంగా ఉన్న ఆర్ధిక సంక్షోభం కొంత కారణమని, ఐటి రంగంలో ఉన్న ఒడిదుడుకులు తోడవుతున్నాయని.. ఇలా రకరకాల రీజన్స్ చెబుతూ కొంతకాలం క్రితం ఒక టీవీ చానల్ కూడా కథనాన్ని ఇచ్చింది. టీడీపీ మాఫియా పని.. ఇదే టైమ్‌లో చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో ఏ పరిణామం జరిగినా అదంతా తన ఘనతేనని చెప్పుకుంటారు. నిజానికి ఆయన ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం సీఎంగా ఉన్నారు. అప్పటికి, ఇప్పటికి ఎంతో తేడా వచ్చింది. ఆయన టైమ్‌లో మాదాపూర్ వరకు పూర్తి స్థాయిలో రోడ్డు కూడా లేదు. వైఎస్సార్ వచ్చాక దానిని పెద్ద ఎత్తున విస్తరించారు. ఆ విషయాలు పక్కనబెడితే చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని గ్రామాలలో కూడా ఇలాంటి మాఫియా వారినే ప్రోత్సహించారన్న అభిప్రాయం కలగదా?. వెలగపూడి చుట్టుపక్కల రాజధాని అని ప్రకటించేలోపే ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగి తక్కువ ధరకు కొందరు టీడీపీ నేతలు భూములు కొన్నారని ఆరోపణ వచ్చింది. తదుపరి ఆ భూములను అధిక ధరలకు అమ్ముకుని కొందరు లాభ పడ్డారు. పది, పదిహేను లక్షల రూపాయల చొప్పున ఎకరా భూమి అమ్ముడు పోయిన పరిస్థితి నుంచి ఏకంగా ఎకరా ఎనభై లక్షల నుంచి కోటి రూపాయలకు అమరావతి గ్రామాలలో వెళ్లింది. ఆనాటి మంత్రి నారాయణ, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే పలుమార్లు ఎకరం నాలుగు కోట్ల వరకు పలుకుతోందని, అదంతా తమ ఘనత అని చెప్పుకునేవారు. అసలు రాజధానికి సంబంధించిన భవనాలే రాకముందే అంతంత ధర ఎలా వచ్చింది. ఆ చుట్టుపక్కలే, చంద్రబాబుకు సంబంధించిన హెరిటేజ్ కంపెనీ భూములు కొనడం, నారాయణ తన బినామీల పేరుతో భూములు కొనడం ఏమిటి?. అమరావతితో రియల్ దందా.. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అచ్చంగా మాఫియాలా మారారన్న విమర్శలు అప్పట్లో కూడా వచ్చాయి కదా?. చంద్రబాబు ప్రభుత్వం కొన్ని ప్రైవేటు సంస్థలకు చాలా తక్కువ ధరకు భూముల ఇచ్చి, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు మాత్రం ఎకరా నాలుగు కోట్ల రూపాయల ధర పెట్టడంలోని హేతుబద్దత ఏమిటన్న ప్రశ్నలుకూడా వచ్చాయి. అమరావతి గ్రామాలలో మాత్రమే రియల్ ఎస్టేట్ రేట్లు పెరగడానికి అప్పట్లో మిగిలిన ప్రాంతాన్ని గ్రీన్ జోన్‌గా ప్రకటించడం జరిగిందని చెబుతారు. దానివల్ల చాలా రాజధానియేతర గ్రామాలలో పొలాలు అమ్ముకోవడమే కష్టం అయ్యేది. ధరలు కూడా పడిపోయాయి. అయినా ఇప్పటికీ చంద్రబాబు అమరావతి మోడల్ గురించే ప్రచారం చేస్తుంటారు. లక్షల కోట్లు వ్యయం చేస్తేకానీ.. తయారు కాని అమరావతిని సంపద సృష్టించే నగరంగా ప్రచారం చేసుకుంటారు. ఏది ఏమైనా హైదరాబాద్‌లో అయినా, అమరావతి గ్రామాలలో అయినా కృత్రిమంగా విలువలు పెంచుకోవడంలో ఉన్న మతలబు ఇది అని తెలిసిన తర్వాత అంతా ముక్కున వేలేసుకోవలసిందే. అలాంటివాటిని తన ఘనతగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు గురించి ఏమనుకోవాలి?. కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్. -
సీఎం జగన్ గురించి ఎమోషనల్ అయిన లబ్దిదారురాలు
-
ఆ రోజులు పోయాయి.. ఇక మీ ఆటలు సాగవు
-
1400 ఎకరాల్లో... 47 వేల మందికి ఇళ్ల నిర్మాణాలు..!
-
ఈ నెల 24న అమరావతిలో పేదల ఇళ్ళకి శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్
-
అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలపై హైకోర్టులో విచారణ
-
కరకట్ట సాక్షిగా క్విడ్ ప్రో కో
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణం కచ్చితంగా క్విడ్ ప్రో కోనే అన్నది స్పష్టమైంది. దీనికి కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే అన్నది తేటతెల్లమైంది. లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్‌లో భూములు దక్కాయని తేలిపోయింది. సీడ్ క్యాపిటల్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారులో ఏ–3 లింగమనేని రమేశ్ కుటుంబానికి నిబంధనలకు విరుద్ధంగా ప్రయోజనం చేకూర్చినందుకే వారిద్దరికీ ఆ ఆస్తులు దక్కాయనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని న్యాయస్థానం పేర్కొంది. క్విడ్‌ప్రోకో అభియోగాలను కొట్టివేసేందుకు ఎలాంటి ఆధారాలు లేవని విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం స్పష్టం చేసింది. చంద్రబాబు కరకట్ట నివాసం, నారాయణకు అమరావతిలో ఉన్న ప్లాట్లు, కౌలు, బ్యాంకులో ఉన్న నిధుల అటాచ్‌మెంట్‌కు అనుమతినిస్తూ తాజాగా ఇచ్చిన ఉత్తర్వులలో న్యాయస్థానం కీలక అంశాలను వెల్లడించింది. ఈ కుంభకోణంలో చంద్రబాబు, నారాయణ అంతా తామై నడిపిన వ్యవహారంపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. అంతా ఏ–1 చంద్రబాబే అమరావతి మాస్టర్‌ప్లాన్, ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ అంతా నాటి సీఎం, ఈ కేసులో ఏ–1 చంద్రబాబు కనుసన్నల్లోనే సాగింది. అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన సమయంలో సీఆర్డీయే ఎక్స్ అఫీషియో చైర్మన్‌గా వ్యవహరించిన చంద్రబాబుకు మాస్టర్‌ప్లాన్ గురించి మొత్తం ముందే తెలుసని న్యాయస్థానం స్పష్టం చేసింది. మాస్టర్‌ప్లాన్‌పై తుది నిర్ణయం తీసుకుంది చంద్రబాబే అని పేర్కొంది. అంతేకాదు రాజధాని ఎంపిక, ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారు ప్రక్రియలో ఆయనకు పూర్తి భాగస్వామ్యం ఉందని తేల్చి చెప్పింది. అలైన్మెంట్ మూడుసార్లు మార్పు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్‌ప్రోకోకు పాల్పడటంపై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. టీడీపీ ప్రభుత్వంలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మూడుసార్లు మార్చారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని స్పష్టంచేసింది. 2015 జూలై 22, 2017 ఏప్రిల్ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్‌రింగ్ అలైన్మెంట్లో మార్పులు చేశారని న్యాయస్థానం వెల్లడించింది. ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి టీడీపీ ప్రభుత్వం ప్రయోజనం కల్పించిందన్నది నిర్ధారణ అయ్యింది. ఈ కేసులో ఏ–3గా ఉన్న లింగమనేని రమేశ్ కుటుంబానికి ఇన్నర్‌రింగ్ రోడ్డు తుది అలైన్‌మెంట్‌ను ఆనుకునే 168.45 ఎకరాలు ఉన్నాయని న్యాయస్థానం పేర్కొంది. ఇన్నర్ రింగ్ రోడ్డును నిర్మించారా లేదా అన్నదానితో దీనికి సంబంధం లేదని న్యాయస్థానం స్పష్టంగా వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. లేని ఇన్నర్‌రింగ్ రోడ్డుపై కేసులు పెట్టడం ఏమిటంటూ టీడీపీ నేతలు ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు యత్నిస్తున్నారు. అయితే ఇన్నర్‌రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేదని, లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలోనే అలైన్‌మెంట్‌ను ఖరారు చేసినట్లు న్యాయస్థానం వ్యాఖ్యల ద్వారా తేటతెల్లమైంది. టీడీపీ 2019లో మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే అదే అలైన్మెంట్ ప్రకారం ఇన్నర్‌రింగ్ రోడ్డును నిర్మించి లింగమనేని కుటుంబానికి భారీగా లబ్ధి కలిగించేదన్నది స్పష్టం. కరకట్ట కట్టడం.. క్విడ్‌ప్రోకో కిందే చంద్రబాబు ఉంటున్న కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మించారని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఏ–3గా ఉన్న లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్‌దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఆ నివాసంలో ఏడేళ్లుగా నివసిస్తున్న విషయాన్ని ప్రస్తావించింది. సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు నివసిస్తున్నారు. ఆ నివాసం గురించి ప్రభుత్వంతో లింగమనేని అధికారికంగా ఎలాంటి వ్యవహారాలు నెరపలేదని న్యాయస్థానం వెల్లడించడం గమనార్హం. అంటే ఆ నివాసాన్ని లింగమనేని రమేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వలేదన్నది స్పష్టం. కరకట్ట నివాసాన్ని లింగమనేని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారంటూ టీడీపీ చేస్తున్న వాదన పూర్తిగా అవాస్తవం అని దీంతో తేలిపోయింది. ఆ నివాసాన్ని లింగమనేని రమేశ్ చంద్రబాబుకు వ్యక్తిగతంగానే ఇచ్చారు. రాజధాని మాస్టర్‌ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లలో కుంభకోణం ద్వారా భారీగా ప్రయోజనం కల్పించినందున క్విడ్ ప్రోకోలో భాగంగానే కరకట్ట నివాసాన్ని చంద్రబాబుకు ఇచ్చినట్టు స్పష్టమవుతోంది. హెరిటేజ్ భూముల లావాదేవీలు గోప్యం లింగమనేని కుటుంబం నుంచి హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేస్తున్నట్టు చూపిస్తున్న భూముల బాగోతం కూడా బట్టబయలైంది. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థకు లింగమనేని కుటుంబం భూములు అమ్మినట్టు ఎలాంటి లావాదేవీలను చూపించలేదని న్యాయస్థానం పేర్కొంది. రాజధాని ప్రాంతంలో లింగమనేని కుటుంబం నుంచి హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేసిన భూములకు సంబంధించి లావాదేవీలను చంద్రబాబు వెల్లడించలేదని వ్యాఖ్యానించింది. లోకేశ్‌దీ కీలక పాత్రే... క్విడ్ ప్రోకో కింద అమరావతిలో లింగమనేని కుటుంబం భూములను హెరిటేజ్‌కు బదలాయించడంలో నారా లోకేశ్ కీలక పాత్ర పోషించారన్నది బట్టబయలైంది. లింగమనేని కుటుంబం నుంచి భూములు తీసుకునేందుకు హెరిటేజ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో తీర్మానించారు. హెరిటేజ్ డైరెక్టర్‌గా లోకేశ్ ఆ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మంత్రిగా ఉంటూ చంద్రబాబుతో కరకట్ట నివాసంలోనే నివసించారు. అంటే లింగమనేని కుటుంబానికి భారీగా ప్రయోజనం కల్పించి క్విడ్ ప్రోకో కింద హెరిటేజ్ భూములు దక్కించుకోవడంలో, కరకట్ట నివాసాన్ని సొంతం చేసుకోవడంలోనూ లోకేశ్ క్రియాశీల పాత్ర పోషించారన్నది స్పష్టమైంది. కథ నడిపిన ఏ–2 నారాయణ అమరావతి మాస్టర్‌ప్లాన్, ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుల ద్వారా నారాయణ కుటుంబం నిబంధనలకు విరుద్ధంగా ప్రయోజనం పొందినట్లు స్పష్టమైంది. మాస్టర్‌ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుల వ్యవహారాలన్నీ నారాయణకు పూర్తిగా తెలుసని, అంతా ఆయన ఆధ్వర్యంలోనే సాగిందని న్యాయస్థానం వెల్లడించింది. నారాయణ కుటుంబ సభ్యులు, సమీప బంధువులు సీడ్ క్యాపిటల్‌లో భూములు కొనుగోలు చేశారనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని తెలిపింది. వారు తన కుటుంబ సభ్యులు, బంధువులు అనే విషయాన్ని నారాయణ గోప్యంగా ఉంచారని వ్యాఖ్యానించడం గమనార్హం. తద్వారా సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో కొనుగోలు చేసిన భూములు సీఆర్డీయేకే భూసమీకరణ కింద ఇచ్చి 75,888 చ.గజాల ప్లాట్లు పొందారని తెలిపింది. ఆ భూములపై కౌలు కింద రూ.1.92కోట్లు కూడా పొందారని పేర్కొంది. అంతా క్విడ్ ప్రోకోనే.. అమరావతి మాస్టర్‌ప్లాన్, ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పుల ద్వారా చంద్రబాబు, నారాయణ లింగమనేని రమేశ్‌తో క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డారనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసులో క్విడ్‌ప్రోకోకు పాల్పడలేదంటూ లింగమనేని రమేశ్ చేసిన వాదనను తోసిపుచ్చింది. ఈ కేసును కొట్టి వేయాలన్న ఆయన వాదనను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కరకట్ట నివాసం, సీడ్ క్యాపిటల్‌లో నారాయణ కుటుంబ సభ్యులకు కేటాయించిన 75,888 చ.గజాల ప్లాట్లు, కౌలు మొత్తంగా పొందిన రూ.1.92 కోట్లను అటాచ్ చేసేందుకు అనుమతినిచ్చింది. -
ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ
-
అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ (ఫొటోలు)
-
మోసాల నారా చంద్రబాబును మాత్రం నమ్మొద్దు: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: పేద లబ్ధిదారులకు అందించబోయే ఇళ్ల పట్టాలు.. మహిళల పేరు మీదే ఉండబోతున్నాయని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. అయితే పేదలకు మంచి జరగకుండా అడ్డుకున్న చంద్రబాబునాయుడు అండ్ కోపై వెంకటపాలెం బహిరంగ సభ వేదికపై మండిపడ్డారు సీఎం జగన్. ఏపీలో అక్కచెల్లెమ్మల చేతుల్లో రూ. 2 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల సంపద ఉంచాం. ఇళ్ల స్థలాలతో పాటు 5 వేల టిడ్కో ఇళ్లు పంపిణీ చేస్తున్నాం. సీఆర్డీఏ ప్రాంతంలోనే నాలుగు వందల కోట్ల ప్రభుత్వ వ్యయంతో ఐదు వేల ఇళ్లను నిర్మిస్తున్నాం. రూపాయికే అన్ని హక్కులతో టిడ్కో ఇళ్లు అందజేస్తున్నాం. గత ప్రభుత్వ పాలకులు ఎప్పుడైనా ఇలాంటి మంచి ఆలోచన చేశారా? అని సీఎం జగన్ సభా వేదిక నుంచి నిలదీశారు. నరకాసురుడినైనా నమ్మొచ్చుగానీ.. సీఎం చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని.. దొంగల ముఠా పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కుట్రలు చేసి అడ్డుకునే యత్నం చేసింది. చంద్రబాబు హయాంలో పేదలకు సెంటు భూమి ఇవ్వలేదు. ఇళ్ల స్థలాల విషయంలోనూ మోసమే చేశారు. 2014 నుంచి 2019 వరకు ఒక్క పట్టా కూడా ఇవ్వలేదు. తన హయాంలో చంద్రబాబు అన్ని వర్గాలనూ మోసం చేశారు. ఎన్నికలు రాగానే మళ్లీ మోసపూరిత హామీలు ఇస్తారు. మళ్లీ మోసపూరిత ప్రేమ చూపడానికి బాబు సిద్ధమవుతున్నారు. గజ దొంగల ముఠా ఏకమవుతోంది. ఐదేళ్ల చంద్రబాబు పాలనంతా దోచుకో.. పంచుకో.. తినుకో మాత్రమే. గతంలో చంద్రబాబు 600 హామీలతో మేనిఫెస్టో విడుదల చేసి, అందర్నీ మోసం చేశాడు. ఎన్నికలకు దగ్గరపడే కొద్దీ.. మళ్లీ ఒక మేనిఫెస్టో అంటాడు. సామాజిక వర్గాలు మీద మోసపూరిత ప్రేమ చూపిస్తాడు. వారికోసమే మేనిఫెస్టో అని చంద్రబాబు అంటాడు. మోసం చేసేవాడ్ని ఎప్పుడూ కూడా నమ్మకండి. నరకాసురుడినైనా నమ్మొచ్చు కాని, నారా చంద్రబాబునాయుడ్ని మాత్రం నమ్మకూడదు అంటూ ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ పిలుపు ఇచ్చారు. మంచి చేసే ప్రభుత్వం ఇది కోవిడ్ కష్టకాలంలోనూ ఎక్కడా రాజీపడలేదు. అక్కచెల్లెమ్మల కుటుంబాల కోసం పని చేశా. కోవిడ్ సమయంలోనూ 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. నవరత్నాల్లోని ప్రతీ హామీని అమలు చేశాం. మ్యానిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించాం. ఇచ్చిన 98 శాతం హామీలను అమలు చేశాం. ఈ నాలుగేళ్లలో అవినీతి, వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందించాం. డీబీటీ ద్వారా నేరుగా రూ. 2.11 లక్షల కోట్లు అందజేశాం. నాన్ డీబీటీతో మొత్తం రూ. 3 లక్షల కోట్లు అందించాం. ఇంత మంచి జరుగుతుంటే.. గజ దొంగల ముఠా చూడలేకపోతోంది. చంద్రబాబు, ఈనాడు, ఏబీఎన్, టీవీ5.. వీళ్లకు తోడు దత్తపుత్రుడు గజదొంగల ముఠా ఏకమవుతోంది. పేదలకు మంచి చేయాలనే ఆలోచన వీళ్లకు లేదు. ఈ నాలుగేళ్ల మీ బిడ్డ పరిపాలనలో ఒక్క రూపాయి అవినీతి, వివక్ష లేదు. మా అక్క చెల్ల్మెల కుటుంబాల ఖాతాల్లోకి రూ.2.11లక్షల కోట్లు జమచేశాం. అప్పుల వృద్ధిరేటు చూస్తే… గత ప్రభుత్వం కన్నా.. తక్కవే. మరి చంద్రబాబు హయాంలో ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు జరగలేదు?. ఎందుకంటే.. వారికి మంచి చేసే ఉద్దేశం లేదు కాబట్టి. ఆ దొంగల ముఠా దృష్టిలో అధికారంలోకి రావడం అంటే.. దోచుకోవడానికి, పంచుకోవడానికి, తినుకోవడానికి మాత్రమే. దారుణాలను వాళ్లు రాయరు, చూపరు, ప్రశ్నిస్తామన్న వాళ్లు ప్రశ్నించరు. ఇదీ చంద్రబాబు హయాంలో మాయ. ఈరోజు కులాల మధ్య యుద్ధం జరగడంలేదు, జరుగుతున్నది క్లాస్ వార్. ఒకవైపు పేదవాడు ఉంటే.. మరోవైపే పేదవాళ్లకు మంచి జరగకూడదని కోరుకుంటూ పెత్తందార్లు యుద్ధం చేస్తున్నారు. పేదవాడికి ఇళ్లస్థలాలు ఇస్తామంటే కోర్టుల వరకూ వెళ్లి యుద్ధం చేస్తారు. సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని వాదనలు చేశారు. జగన్ మాదిరిగా పాలన చేస్తే.. రాష్ట్రం శ్రీలంక పోతుందని ఎల్లోమీడియాలో రాస్తారు.. చూపుతారు. పేదల బ్రతులకు మారాలని పరితపిస్తున్న ప్రభుత్వం మనది అని సీఎం జగన్ ఉద్ఘాటించారు. ఇదీ చదవండి: ఇది పేదల విజయం.. ఇక సామాజిక అమరావతి: సీఎం జగన్ -
ఇది పేదల విజయం.. ఇక సామాజిక అమరావతి: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ‘‘దేశ చరిత్రలోనే ఈ కార్యక్రమానికి ఓ ప్రత్యేకత ఉంది. పేదలకు ఇళ్ల పట్టాలు వద్దని కోర్టులకెక్కి అడ్డుకున్నారు. పేదల కోసం సుప్రీంకోర్టులో ప్రభుత్వమే న్యాయపోరాటం చేసింది. ఇది పేదల విజయం’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభివర్ణించారు. శుక్రవారం అమరావతి పేదల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా.. వెంకటపాలెం బహిరంగ సభ నుంచి సీఎం జగన్ ప్రసంగించారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కుట్రలు చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. పేదల కోసం న్యాయ పోరాటం చేశాం. విజయం సాధించాం. ఇప్పుడు రూ. ఏడు లక్షల నుంచి 10 లక్షల విలువ చేసే ఇంటి స్థలం.. అక్కచెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. అమరావతి ఇక మీద సామాజిక అమరావతి అవుతుంది. మన అందరి అమరావతి అవుతుందని గర్వంగా చెప్పగలుగుతున్నా అని ప్రసంగించారాయన. 👉 ఇవి ఇళ్ల పట్టాలే కాదు.. సామాజిక, న్యాయ పత్రాలు కూడా. సామాజిక అమరావతే.. మనందరి అమరావతి. 50, 793 మంది పేదలకు ఇళ్ల స్థలాలు అందజేస్తున్నాం. సీఆర్డీఏ పరిధిలో 1,402.58 ఎకరాల్లో మొత్తం 25 లేఅవుట్లలో ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. వారం పాటు ఇళ్ల పట్టాల పండు కార్యక్రమం ఉంటుందని, ఇళ్లు కట్టడానికి బీజం కూడా ఈ వారంలోనే పడుతుందని అని సీఎం జగన్ ప్రకటించారు. 👉 దివంగత మహానేత వైఎస్సార్ జయంతి సందర్భంగా.. జులై 8వ తేదీన ఇళ్లు కట్టించే కార్యక్రమం చేపడతామని సీఎం జగన్ ప్రకటించారు. ఇప్పటికే లే అవుట్లలో మౌలిక సదుపాయాలు పూర్తయ్యాయని, జులై 8వ తేదీ లోగా జియో ట్యాగింగ్ పూర్తి చేస్తామని తెలిపారాయన. 👉 ఇళ్ల నిర్మాణాలకు మూడు ఆప్షన్లు ఉంటాయని సీఎం జగన్ వెల్లడించారు. సొంతంగా ఇళ్లు కట్టుకుంటే.. రూ. లక్షా 80 వేలు బ్యాంకు ఖాతాల్లో వేస్తాం. రెండో ఆప్షన్లో నిర్మాణ కూలీ మొత్తాన్ని జమ చేస్తాం. ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఉచితంగా ప్రభుత్వమే అందిస్తుంది. స్టీల్, సిమెంట్, డోర్ ఫ్రేమ్‌లు సబ్సిడీపై అందిస్తాం. మెటీరియల్ నాణ్యత విషయంలో రాజీ పడేది లేదు అని సీఎం జగన్ ప్రకటించారు. -
ఇళ్ల పట్టాల పంపిణీ.. పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)
-
చంద్రబాబు, ఎల్లో మీడియాకు మా తడాఖా ఏంటో చూపిస్తాం..
-
CM YS Jagan:పెత్తందారుల కుట్రలు చేధించి మరీ..
తాము మాత్రమే బాగుండాలనేది పెత్తందారుల తత్వం.. అందుకే న్యాయపరమైన అడ్డంకులు సృష్టించారు కోర్టులో కేసులు వేయించి.. పట్టాల పంపిణీ ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేశారు పైగా అమరావతిలో పేదలకు స్థానంలేదని తక్కువచేసి మాట్లాడారు.. పేదలకు ఇళ్లిస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని వక్రభాష్యాలు చెప్పారు.. చివరకు.. ప్రభుత్వం ఇస్తున్న సెంటు స్థలాలను సమాధులని కూడా అవహేళన చేశారు. యెల్లో మీడియా సైతం ఆ కుటిల యత్నాలకు వంతపాడింది.. కానీ, ఇలాంటి ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ప్రేలాపనలు చేసినా.. జగనన్న పట్టించుకోలేదు. విపత్కర పరిస్థితుల్లోనూ ఆ అంశంపైనే దృష్టి పెట్టారు. పేద అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలన్నది ఆయన అభిమతం. నిలువ నీడలేని వారికి సొంత గూడు ఇవ్వాలన్నదే ఆయన ఉద్దేశం. ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఇవ్వాలన్నది జగనన్న లక్ష్యం. పేద కుటుంబాల భవిష్యత్తు బాగుండాలన్న కృతనిశ్చయంతో అడ్డంకులన్నీ అధిగమించారు. ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రతిపక్ష పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా సీఎం జగన్ ఆగిపోలేదు. పేద కుటుంబాల ముఖాల్లో సంతోషం చూడాలనే ధృడ సంకల్పంతో ముందుకు సాగారు. ఫలితంగా.. అమరావతిలో 50,793 మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు పంపిణీ జరగనుంది. తుళ్లూరు(గుంటూరు) మండలం వెంకట పాలెంలో ఏర్పాటుచేసిన వేదిక నుంచి ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఈ పట్టాలను అందజేయనున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. తద్వారా సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. అదే సమయంలో పేద లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు పంపిణీ చేయనున్నారాయన. విశేషం ఏంటంటే.. గత టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిన ఇళ్లకు సైతం మౌలిస వసతులను అందించింది జగనన్న సర్కార్. మొత్తంగా.. నిడమర్రు, మందడం, అనంతవరం, దొండపాడు, ఐనవోలు, పెనుమాక, తుళ్లూరు, నవులూరులో అన్ని వసతులతో రూ.443.71 కోట్లతో నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్లను కూడా సీఎం జగన్ నేడు పంపిణీ చేయనున్నారు. పక్షపాత రహితంగా పంపిణీలు చేపడుతున్న ఏపీ ప్రభుత్వం.. ఏమైనా ఇబ్బందులుంటే 1902 టోల్‌ఫ్రీ నంబర్లో సంప్రదించవచ్చని లబ్ధిదారులకు సూచిస్తోంది కూడా. ఈ నిజాయితీ, నీతివంతమైన పాలనను ఏపీ ప్రజానీకం మెచ్చుకుంటోంది. అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీని హర్షిస్తూ.. ప్రజలు స్వచ్ఛందంగా భారీ ర్యాలీలు చేపట్టారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఇవ్వాలన్నది జగనన్న లక్ష్యం.. అందులో భాగంగా నేడు అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్న సీఎం శ్రీ వైయస్ జగన్. #YSRJaganannaIllaPattalu#YSRJaganannaColonies#CheppadanteIsthadanthe #CMYSJagan #APDC pic.twitter.com/JG00Yh2C63 — AP Digital Corporation (@apdigitalcorp) May 26, 2023 -
చంద్రబాబు ‘సమాధి’ వ్యాఖ్యలపై సీఎం జగన్ ఆవేదన
సాక్షి, కృష్ణా: దేవుడి యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకున్నట్లు.. పేదల ఇళ్ల పంపిణీని అడ్డుకునే యత్నం చేశారని చంద్రబాబు నాయుడు తీరుపై సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. పేదలకు పంచబోయే భూమిని సమాధులతో పోలుస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి మానవత్వం లేని, వికృత ఆలోచనలను ఉన్న వ్యక్తులకు మద్దతు ఇస్తారా? అంటూ సోమవారం మచిలీపట్నం బహిరంగ సభ ద్వారా ఏపీ ప్రజలను ఉద్దేశించి పిలుపు ఇచ్చారాయన. కొన్ని లక్షల కుటుంబాలకు స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు అయినా ఇళ్లు లేదు. పేదవాడు పేదవాడిగా మిగిలిపోకూడదనేది మా ప్రభుత్వ ఆకాంక్ష. అందుకే అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని రెండేళ్ల కిందట నిర్ణయించాం. కానీ, చంద్రబాబు అండ్ దొంగల ముఠా దానిని అడ్డుకునే యత్నం చేసింది. అయినా అన్ని సమస్యలు, కోర్టు కేసులు అధిగమించి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నామని తెలిపారు. పేదలకు ఏనాడూ సెంటు భూమి కూడా ఇవ్వని చంద్రబాబు నాయుడుకు.. వాళ్ల కష్టాలు ఎలా తెలుస్తాయని సీఎం జగన్ అన్నారు. అమరావతిలో 50 వేలమంది పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేశామని, ఈ నెల 26వ తేదీన స్థలాల పంపిణీ ఉంటుందని మచిలీపట్నం బహిరంగ సభలో ఆయన ప్రకటించారు. పేదలు పాచిపనులే చేయాలంట.. చంద్రబాబు.. గతంలో ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? అని అన్నాడు. బీసీల తోకలు కత్తిరించాలని అన్నాడు. కోడలు మగ పిల్లాడిని కంటే అత్త వద్దంటుందా అని అన్నాడు. మూడు రాజధానులు వద్దు అంటూ అన్ని ప్రాంతాల అభివృద్ధినే అడ్డుకున్నాడు. మూడు ప్రాంతాలమీదే దాడిచేశాడు. పేదలంటే చంద్రబాబుకు చులకన. బాబు కోరుకున్న అమరావతి ఎలాంటిదంటే.. అందులో పేదలు కేవలం పాచిపనులు చేయాలంట. రోజూవారీ పనులు చేసే కార్మికులుగా మాత్రమే ఉండాలట. వాళ్లెవరికీ అక్కడ ఇళ్లు ఉండకూడదట. అమరావతిలో వీళ్ల పొద్దుటే ఎంటర్ కావాలంట, పనులు చేసి తిరిగి వెనక్కి పోవాలంట. ఇంతకన్నా సామాజిక అన్యాయం ఎక్కడైనా ఉందా? ఇలాంటి దారుణమైన మనస్తత్వం ఉన్న రాక్షసులతో యుద్ధం చేస్తున్నామ’ని పేర్కొన్నారాయన. వారి వికృతఆలోచనలకు మద్దతు ఇవ్వగలమా? అని ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రశ్నించారు. ► టీడీపీకి గజదొంగల ముఠా తోడైంది. ఆ ముఠాకు దోచుకోవడం, పంచుకోవడం, దాచుకోవడం తప్ప ఏదీ తెలియదు. ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5 వీళ్లందరికీ తోడు ఓ దత్తపుత్రుడు.. వీళ్లందరూ ఈ మహాయజ్ఞానికి అడ్డుపడుతూ వచ్చారు. అమరావతిలో ప్రభుత్వ డబ్బుతో గేటెట్ కమ్యూనిటీ కట్టుకోవాలనుకున్నారు. బినామీల పేరుతో భూములుగడించి లక్షల కోట్లు దోచుకోవాలని ప్రయత్నించారు. పేదల ఇళ్లను దారుణంగా అడ్డుకుంటున ద్రోహి చంద్రబాబు. వీళ్లెవరూ పేదల వద్దకు వచ్చి మంచి చేశాం ఓట్లేయండిన అడిగే దమ్ములేదు. ► చంద్రబాబు పేదవాడికి సెంటు భూమి కూడా పంచలేదు. పేదలకు ఈ ప్రభుత్వం ఇళ్లస్థలాలు ఇస్తుంటే.. రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు కేసులు వేయించాడు. అమరావతిలో పేదలకు ఇళ్లస్థలాలు ఇస్తే.. సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని సాక్షాత్తూ కోర్టులో కేసులు వేయించాడు. రూపం మార్చుకున్న అంటరాని తనానికి, నయా పెత్తందార్ల భావజాలానికి ప్రతీక ఈ చంద్రబాబు. ఇవన్నీ చేసిన చంద్రబాబు.. విశాఖ పట్నంలో అన్నమాలు బాధను కలిగిస్తున్నాయి. అమరావతి పరిధిలో ప్రతి పేదవాడికి 1.1 సెంటు భూమి ఇచ్చి, ఇల్లుకూడా ఉచితంగా కట్టించి ఇస్తే.. యాభైవేల మందికి కలలు సొంతం చేస్తుంటే.. దాన్ని ఈ గొప్ప పవిత్ర స్థలాన్ని చంద్రబాబు స్మశానంతో పోల్చాడు. పేదలకు తాను అధికారంలో ఉన్నప్పుడు ఒక్క సెంటు స్థలం ఇవ్వలేదు. కానీ మనం ఇస్తే.. వాటిని సమాధులతో పోలుస్తున్నాడు అని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ► ఈ ప్రభుత్వంలో లంచాలు, వివక్షకు తావు లేకుండా పథకాలు అందుతున్నాయి. డీబీటీ ద్వారా రూ. 2.10 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారులకు అందించాం. నాన్ డీబీటీ ద్వారా రూ. 3 లక్షల కోట్లు లబ్ధిదారులకు అందించాం అని ప్రకటించారాయన. మంచి చేసిన చరిత్ర చంద్రబాబుకు లేదు. ఫలానా మంచి పని చేశామని చెప్పుకోలేని పరిస్థితి వాళ్లది. వాళ్ల ఆలోచనలన్నీ.. కుళ్లు, కుతంత్రాలతో కూడుకున్నవే. అందుకే మంచి చేసిన మీ బిడ్డను(సీఎం జగన్ తనను తాను ఉద్దేశిస్తూ..) ఎన్నికల్లో గెలవడమే కష్టమంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం.. ప్రజల ప్రభుత్వం. పేదల తలరాతలను మార్చాలని నిర్ణయించామని, ఆ ఆలోచనలకు అండగా నిలబడమని కోరుతున్నాం. మీ బిడ్డ ప్రజలనే నమ్మకున్నాడు. మీకు మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా నిలవండి అంటూ మచిలీపట్నం వేదిక ద్వారా ఏపీ ప్రజలను కోరారాయన. ఇదీ చదవండి: బందరుకు చంద్రబాబు చేసిన ద్రోహం ఎలాంటిదంటే.. -
పేదలపై పచ్చి విషం కక్కుతున్న బాబు అండ్ కో
-
అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
-
పవన్ కల్యాణ్ ఆరోపణలు అర్ధరహితం: సజ్జల
సాక్షి, గుంటూరు: అమరావతిలో పేదల భూముల ఆర్5 జోన్ వివాదంతో సుప్రీం కోర్టుకు వెళ్లడం దారుణమైన విషయమని, అయినా కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలో పార్టీ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్5 జోన్‌పై వివాదం తేవటం దారుణం. టీడీపీ శక్తులు పాతకాలపు అభిప్రాయాలతో కోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు కోర్టుకు వెళ్లటం మరీ బరితెగించిన విషయం. ప్రభుత్వం చేతికి వచ్చిన భూమిని ఎలా వినియోగించాలో ప్రభుత్వనే నిర్ణయం తీసుకుంటుంది. అసలు కోట్లు ఖర్చు పెట్టి పెద్దపెద్ద లాయర్లను పెట్టుకుని కోర్టులకు వెళ్లటం ఏంటి?. నిజంగా వాళ్లంతా రైతులా?. రియల్ ఎస్టేట్ వ్యాపారులే అలా చేయగలరు అంటూ సజ్జల వ్యాఖ్యానించారు. మా స్వర్గంలో మేమే ఉండాలి అనే అభిప్రాయంలో టీడీపీ ఉంది. పేదలు కూడా సొంత ఇళ్లతో ఆత్మగౌరవం కల్పించటానికి మేము ప్రయత్నిస్తున్నాం. కానీ, రైతుల పొట్ట కొట్టి వేల కోట్లు దండుకోవాలని వారు చూస్తున్నారు. అసలు ఏ ముఖం పెట్టుకుని పేదల దగ్గర రేపు ఓట్లు అడుగుతారు వాళ్లు. టీడీపీ నేతల లక్షల కోట్ల బిజినెస్ మీద దెబ్బ తగిలింది. రాజకీయ నేతలుగా కాదు కదా.. కనీసం మనుషులుగా కూడా టీడీపీ వారికి అర్హతలేదు. వాళ్ల నిజ స్వరూపం ఇప్పుడు మళ్ళీ బట్టబయలు అయింది. పేదలను మేము పట్టించుకునేదిలేదనేలాగ ఉంది వాళ్ల వ్యవహారం. రాష్ట్రంలో తొలిసారిగా కొత్తగా గ్రామాలనే క్రియేట్ చేస్తున్నాం. అందరికీ ఒకచోట స్థలాలు ఇస్తే ఓర్చుకోలేక పోతున్నారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా వితండవాదం చేస్తున్నారు. టీవీలో చర్చకు మాత్రమే పనికొచ్చేలా వారు మాట్లాడుతున్నారని అన్నారాయన. పవన్ కల్యాణ్ ఆరోపణలు అర్ధరహితం సీఎం జగన్ తెచ్చిన పథకాలు ఎవరికి ఉపయోగ పడ్డాయో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తెలుసుకోవాలని సజ్జల హితవు పలికారు. పవన్ చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని అన్నారాయన. కరోనా కష్టాలు వచ్చినా కూడా తాను చేయాలనుకున్న సంక్షేమాన్ని పేదల చెంతకు జగన్ తెచ్చారని గుర్తుచేశారాయన. మరోవైపు కమ్యూనిస్టులు కూడా వారి సిద్దాంతం ఏంటో తెలుసుకోవాలన్నారు సజ్జల. విద్యారంగం మీద ఎంత పెట్టుబడి పెడుతున్నామో తెలుసా?. ఇదంతా పేదలకు ఎంతగా ఉపయోగమో తెలుసుకోవాలి. జీవో నెంబర్ 01 అనేది ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే.. చంద్రబాబు తల ఎక్కడో పెట్టుకోవాలి. కందుకూరు, గుంటూరులో ప్రజల్ని చంపారు. జీవో కాదు.. దీనిమీద ఈసారి చట్టం తెస్తాం. ప్రజలను పరిరక్షించడమే ప్రభుత్వ లక్ష్యం అని సజ్జల ఉద్ఘాటించారు. చంద్రబాబును ప్రజలు ఏనాడో రాజకీయంగా చెత్తబుట్టలో పడేశారన్న సజ్జల.. రానున్న రోజుల్లో చంద్రబాబు ఇంకా దారుణాలకు పాల్పడతారని, కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొచ్చు : సుప్రీం గ్రీన్ సిగ్నల్
సాక్షి, ఢిల్లీ: అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపులకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్5 జోన్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొచ్చని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే హక్కు ప్రభుత్వానికి ఉందని బుధవారం తీర్పు వెలువరించింది. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ కె ఎం. జోసెఫ్ , జస్టిస్ అరవింద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది. ఆర్5 జోన్లో పట్టాల పంపిణీపై సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. 👉 ఈ క్రమంలో.. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే హక్కు ప్రభుత్వానికి ఉందని బెంచ్ తీర్పు సందర్భంగా పేర్కొంది. చట్టం ప్రకారమే ఐదు శాతం ఈడబ్ల్యూఎస్‌కు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అయితే కేసు తుది ఉత్తర్వులకు లోబడే ఇళ్ల పట్టాలపై హక్కులుంటాయని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. 👉 విచారణ సమయంలో.. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ‘‘34వేల ఎకరాలలో 900 ఎకరాలు మాత్రమే పేదలకు కేటాయించాం. పది మంది రైతులు మాత్రమే ఇక్కడికి వచ్చారు. సి ఆర్ డి ఎ చట్టం లోని సెక్షన్.53.1డి ప్రకారం పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఈ పిటిషన్ కు విచారణ అర్హత లేదు అని వాదించారు. అలాగే.. ఆర్ - 5 జోన్ లో పట్టాలు ఇవ్వడాన్ని ఆపడానికి వారికి ఏ అధికారం ఉందని అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన.. ఈ - సిటీ కి ఇబ్బంది ఎలా కలుగుతుందని వాదించారు. 👉 మరోవైపు సీఆర్డీఏ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. మాస్టర్ ప్లాన్ లో ఎలాంటి మార్పులు లేవని, చట్టం ప్రకారమే 5 శాతం ఈ డబ్లు ఎస్ కు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ప్రజా ప్రయోజనాల కోసమే ప్రభుత్వమే భూ సేకరణ జరుగుతుందని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ఏపీ ‘రాజధాని దొంగల’పై సంచలన నివేదిక -
అమరావతి భూములు.. సింగపూర్‌లో సంతర్పణ!
సాక్షి, అమరావతి: సింగపూర్ కంపెనీల ముసుగు తొలిగిపోవడంతో అమరావతి కేంద్రంగా సాగిన భూదందా విస్మయపరుస్తోంది. చంద్రబాబు సింగపూర్ పర్యటనలు.. ప్రైవేట్ కంపెనీలతో ఎంవోయూలు.. స్విస్ ఛాలెంజ్ ఒప్పందాల వెనుక తీగను లాగుతుంటే కరకట్ట ఇంట్లో అవినీతి డొంక కదులుతోంది. అమరావతి మాస్టర్‌ప్లాన్, సీడ్ క్యాపిటల్ పాన్ ఫైళ్లను తిరగేస్తుంటే బినామీల పేరుతో చంద్రబాబు, నారాయణ కొల్లగొట్టిన భూముల దస్త్రాలు బయటపడుతున్నాయి. సీఐడీకి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణతో భూ దోపిడీ మొత్తం బయటపడుతోంది. కమిటీలో సింగపూర్ కంపెనీ ప్రతినిధి 2014 జూన్‌లో అధికారం చేపట్టగానే రాజధాని పేరిట చంద్రబాబు భారీ భూదోపిడీకి పన్నాగాన్ని రూపొందించారు. 2015 జూలైలో రాజధాని సలహా కమిటీని నియమించి పొంగూరు నారాయణ, సుజనా చౌదరి, గల్లా జయదేవ్‌తోపాటు సింగపూర్ కంపెనీ ప్రతినిధికి స్థానం కల్పించడం గమనార్హం. అంతర్జాతీయ కాంపిటీటివ్ బిడ్డింగ్‌కు వెళ్తున్నందున విదేశీ కంపెనీ ప్రతినిధిని సభ్యుడిగా నియమించడంపై అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అభ్యంతరం తెలిపినా చంద్రబాబు పట్టించుకోలేదు. సింగపూర్ కంపెనీకి రాజధాని ప్రాంత ఎంపిక బాధ్యతను అప్పగించడం ద్వారా భారీ భూదోపిడీకి అప్పుడే పథకం వేశారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించిన ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎనేబిలింగ్ యాక్ట్‌ను కూడా టీడీపీ సర్కారు ఉల్లంఘించింది. ఓపెన్ కాంపిటీషన్ ద్వారా డెవలపర్‌ను ఎంపిక చేయాలన్న నిబంధనను చంద్రబాబు ఖాతరు చేయలేదు. కేంద్రం అనుమతి లేదు.. టెండర్లూ లేవు 2014 నవంబరులో చంద్రబాబు సింగపూర్ పర్యటనలోనే భూదోపిడీకి స్కెచ్ వేశారు. ఆ వెంటనే డిసెంబరులో రాజధాని మాస్టర్‌ప్లాన్ రూపొందించేందుకు సింగపూర్ కంపెనీతో చంద్రబాబు ప్రభుత్వం ఏకపక్షంగా ఎంవోయూ కుదుర్చుకుంది. విదేశీ కంపెనీతో చేసుకునే ఒప్పందాలకు కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం. అయితే కేంద్రం అనుమతి లేకుండానే ఎంవోయూ కుదుర్చుకోవడం గమనార్హం. ఏకంగా సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటున్నట్లు అప్పటి సీఎం చంద్రబాబు బుకాయిస్తూ వచ్చారు. తద్వారా ఇతర కంపెనీలు పోటీకి రాకుండా నిరోధించారు. కానీ సంబంధిత శాఖల నోట్ ఫైల్స్‌లో ఎక్కడా సింగపూర్ ప్రభుత్వం అనే ప్రస్తావనే లేదు. చివరికి చంద్రబాబు ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది సింగపూర్ ప్రభుత్వంతో కాకుండా ఓ ప్రైవేట్ కంపెనీతో కావడం గమనార్హం. ఇక రాజధాని ప్రాంతంలో అత్యంత కీలకమైన సీడ్ క్యాపిటల్ ఎంపిక కోసం ప్రత్యేకంగా మాస్టర్ ప్లానర్‌ను చంద్రబాబు ప్రభుత్వం ఏకపక్షంగా ఎంపిక చేసింది. అందుకోసం కనీసం టెండర్ల ప్రక్రియ కూడా చేపట్టలేదు. సింగపూర్‌కే చెందిన కంపెనీలను మాస్టర్ డెవలపర్‌గా ఎంపిక చేయాలని ఎంవోయూలో స్పష్టం చేశారు. రాజధాని మాస్టర్ ప్లాన్ రూపొందించే కంపెనీ, సీడ్ క్యాపిటల్ మాస్టర్ డెవలపర్ ఎవరన్నది చంద్రబాబు ముందుగానే నిర్ణయించేశారు. 2015 జనవరిలోనే అమరావతి మ్యాపులు.. రాజధానిలో కీలకమైన సీడ్ క్యాపిటల్ ప్రాంతం ఎంపికలో చంద్రబాబు తన పన్నాగాన్ని అమలులోకి తెచ్చారు. విజయవాడ–గుంటూరు–తెనాలి– మంగళగిరి(వీజీటీఎం) పరిధిలోని జోనింగ్ మ్యాపులన్నీ 2015 జనవరిలోనే సింగపూర్ మాస్టర్ డెవలపర్‌కు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ ప్రభుత్వం అప్పగించేసింది. ఆ మ్యాపుల్లో పేర్కొన్న ప్రాంతాల్లోనే రాజధాని, సీడ్ క్యాపిటల్‌ను ఎంపిక చేయాలని చంద్రబాబు ప్రభుత్వం స్పష్టం చేసింది. కృష్ణా నదికి అభిముఖంగా ఉద్దండరాయునిపాలెం, తాళ్లాయపాలెం, లింగాయపాలెం గ్రామాల పరిధిలో సీడ్ క్యాపిటల్‌ను ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. అంటే రాజధాని, సీడ్ క్యాపిటల్ ఏ మండలాలు, గ్రామాల పరిధిలో రానున్నాయో చంద్రబాబు, నారాయణ, వారి బినామీలకు ముందుగానే తెలుసన్నది స్పష్టమైంది. అనంతరం సింగపూర్ కంపెనీ సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్‌ను 2015 జూలైలో ప్రభుత్వానికి సమర్పించి కథ ముగించింది. పచ్చ ముఠా గుప్పిట్లో సీడ్ క్యాపిటల్ 2015 జనవరిలోనే సీడ్ క్యాపిటల్ ఎక్కడ రానుందో తెలిసిన చంద్రబాబు, నారాయణ తమ బినామీలను రంగంలోకి దింపారు. ఆ ప్రాంతంలో అతి తక్కువ ధరకు భూములను భారీగా కొనుగోలు చేశారు. సీఐడీ దర్యాప్తులో ఈ బినామీ లావాదేవీలు వెలుగులోకి వస్తున్నాయి. నారాయణ తన బినామీలు, బంధువుల పేరిట 65.50 ఎకరాలు కొనుగోలు చేసినట్లు సీఐడీ విచారణలో వెల్లడైంది. నారాయణ భార్య రమాదేవి, అల్లుడు డైరెక్టర్లుగా ఏర్పాటైన ఎన్‌స్పైరా కంపెనీ నుంచి నిధులను తమ బంధువులు, బినామీల ఖాతాల్లోకి మళ్లించారు. రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరును బినామీగా పెట్టుకుని కూడా నారాయణ సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారు. ఆ విధంగా కొనుగోలు చేసిన 65.50 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ కింద సీఆర్డీఏకు ఇచ్చారు. అందుకు ప్రతిగా ల్యాండ్ పూలింగ్ ప్యాకేజీ కింద సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో అత్యంత విలువైన 75,888 చదరపు గజాల స్థలాలు పొందారు. పూలింగ్ ప్యాకేజీ కింద ఏటా సీఆర్డీఏ ఇప్పటివరకు చెల్లించిన రూ.1.92 కోట్ల కౌలు మొత్తం ఎన్‌స్పైరా ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇదే రీతిలో చంద్రబాబు బినామీలు, సన్నిహితులు సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో భారీగా భూములు గుప్పిట పట్టారు. దీనిపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. త్వరలో మరిన్ని బినామీ లావాదేవీలు బహిర్గతం కానున్నాయి. స్విస్ ఛాలెంజ్ ముసుగులో 1,691 ఎకరాల దోపిడీ తమ దోపిడీకి మార్గం సుగమం చేసేలా రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పన చట్టానికి చంద్రబాబు ప్రభుత్వం ఇష్టానుసారం సవరణలు చేసింది. ఓపెన్ కాంపిటీషన్ విధానాన్ని పక్కనపెట్టేసి స్విస్ చాలెంజ్ విధానంలో సీడ్ క్యాపిటల్ డెవలప్మెంట్ ఒప్పందం చేసుకుంది. కౌంటర్ చాలెంజ్‌కు ఇతర కంపెనీలకు అవకాశం లేకుండా చేసి సింగపూర్ కంపెనికి స్విస్ ఛాలెంజ్ కింద ఏకపక్షంగా కట్టబెట్టేసింది. సీడ్ క్యాపిటల్ అంచనా వ్యయం రూ.3,137 కోట్లు కాగా నీతి ఆయోగ్ మార్గదర్శకాల ప్రకారం అందులో 25 శాతం అంటే రూ.784 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలకు బిడ్డింగ్ అర్హత ఉంటుంది. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కనీసం రూ.2 వేల కోట్ల టర్నోవర్ ఉండటాన్ని అర్హతగా నిర్ణయించడం గమనార్హం. తద్వారా ఇతర కంపెనీలు ఏవీ పోటీకి రాకుండా కట్టడి చేసింది. ఇక సీడ్ క్యాపిటల్ కింద 1,691 ఎకరాల్లో నిర్మాణాలను సింగపూర్ కంపెనీకి కాంట్రాక్టు అప్పగించారు. కానీ అందులో సింగపూర్ కంపెనీ నిర్మించేది కేవలం 8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోని భవనం మాత్రమే. అంటే మిగిలిన భూమి అంతా సింగపూర్ కంపెనీకే అప్పగించేశారు. ఆ ప్రకారం ఆ భూమిని ప్లాట్లు వేసుకుని అమ్ముకునే హక్కు కల్పించారు. సింగపూర్ కంపెనీ ముసుగులో చంద్రబాబు, ఆయన బినామీలు భూములను కాజేసేందుకే ఈ పథకం వేశారు. ‘ఇన్నర్’ మెలికలు గత సర్కారు పెద్దల ఆదేశాలతో ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్లో కీలక మార్పులు జరిగాయి. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని కుటుంబానికి కంతేరు, కాజాలో ఉన్న భూములను ఆనుకుని ఇన్నర్‌రింగ్ రోడ్డు నిర్మించేలా అలైన్మెంట్ రూపొందించారు. సింగపూర్‌కు చెందిన సుర్బాన జ్యురాంగ్ కన్సల్టెన్సీ ద్వారా రూపొందించిన అమరావతి మాస్టర్‌ప్లాన్‌లోనే ప్రతిపాదిత ఇన్నర్‌రింగ్ రోడ్ డిజైన్‌ను చంద్రబాబు ప్రభుత్వం ముందుగానే చేర్చింది. అంటే అప్పటికే ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్మెంట్ ఎలా ఉండాలన్నది నిర్ధారణ అయిపోయింది. సీఆర్డీఏ ద్వారా తాము ఖరారు చేసిన అలైన్‌మెంట్‌నే ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ద్వారా తెరపైకి తెచ్చి ఆమోదించారు. కంతేరు, కాజాలో లింగమనేని కుటుంబానికి 355 ఎకరాలున్నాయి. ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను ఆనుకుని హెరిటేజ్ ఫుడ్స్‌కు ఒకచోట 9 ఎకరాలు, మరో చోట నాలుగు ఎకరాలు ఉండటం గమనార్హం. పాపాల్లో పవన్‌కూ భాగం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కూడా ఈ ఇన్నర్‌రింగ్ రోడ్డు అవినీతి పాపంలో చంద్రబాబు వాటా కల్పించారు. కాజా వద్ద ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌కు సమీపంలో పవన్‌కల్యాణ్‌కు 2.4 ఎకరాలున్నాయి. లింగమనేని కుటుంబం నుంచి ఆ భూములను ప్రభుత్వ ధర ప్రకారం ఎకరా రూ.8 లక్షలు చొప్పున కొనుగోలు చేసినట్లు చూపించారు. ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయింపు కల్పించిన భూమినే పవన్ కల్యాణ్‌కు ఇవ్వడం గమనార్హం. అమాంతం పెరిగిన విలువ ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారుకు ముందు లింగమనేని కుటుంబం ఆ ప్రాంతంలో ఎకరా భూమి రూ.8 లక్షల రిజిస్టర్ విలువ చొప్పున విక్రయించింది. మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.50 లక్షలు ఉంది. అంటే ఆ భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్లు. ఇక ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారు తరువాత ఎకరం రూ.36 లక్షల రిజిస్టర్ విలువ చొప్పున విక్రయించింది. మార్కెట్ ధర ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. అంటే 355 ఎకరాల విలువ మార్కెట్ ధర ప్రకారం అమాంతంగా రూ.887.50 కోట్లకు పెరిగింది. అమరావతి పూర్తయితే సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో ఎకరా విలువ రూ.4 కోట్లకు చేరుతుందని నాడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే ప్రకటించారు. ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. అంటే అమరావతి నిర్మాణం పూర్తయితే ఆ 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా. ఆ ప్రకారం మార్కెట్ ధరను బట్టి హెరిటేజ్ ఫుడ్స్ 9 ఎకరాల విలువ రూ.4.50 కోట్ల నుంచి రూ.22.50 కోట్లకు పెరిగింది. అమరావతి నిర్మాణం పూర్తయితే రూ.54 కోట్లకు చేరుతుందని తేలింది. హెరిటేజ్ ఫుడ్స్ ఒప్పందం చేసుకున్న మరో నాలుగు ఎకరాల విలువ కూడా రూ.24 కోట్లకు చేరుతుంది. ఇది కూడా చదవండి: బాబు చెప్తే ఎవరికి విడాకులు ఇవ్వమన్నా ఇస్తాడు.. పవన్ గాలి తీసేసిన సీఎం జగన్ -
కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు బాబు.. మొన్నటివరకు విర్రవీగారు.. ఇప్పుడేమైంది..
ఇంతకాలం తెలుగుదేశం నేతలు, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ఈనాడు, జ్యోతి, టీవీ 5 వంటి మీడియా సంస్థలు ఏమని అంటుండేవి? ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి వెంట్రుక కూడా పీకలేరని, వారేమిటి? స్వయంగా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లు కూడా ఏం పీకుతారు? అంటూ రెచ్చిపోయి మాట్లాడుతుంటారు. పైగా ఎదురు డబాయించడం. వాళ్లను బ్యాన్ చేస్తా! వీళ్లను బ్యాన్ చేస్తా? నేను గెలిచాక పోలీసుల సంగతి చూస్తా! జగన్‌కు ట్రీట్మెంట్ ఇస్తా అంటూ ఇష్టారీతిన బెదిరించడం చంద్రబాబుకు అలవాటైంది. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబే అంతలా మాట్లాడుతుంటే, అధికారంలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిస్సహాయంగా చూస్తూ ఉంటారా? ఈ సరికే అనేక కేసులలో చంద్రబాబు అండ్ కో ఏ రకంగా నిందితులో జగన్ అసెంబ్లీలోనే తెలియచెప్పారు. అప్పట్లో చంద్రబాబుకు న్యాయ వ్యవస్థలో ఉన్న బలం ఆధారంగా కేసులు ముందుకు వెళ్లకుండా నెగ్గుకు రాగలిగారు. కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు కదా! అప్పుడప్పుడు ఆయనకు కూడా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆయన పై వచ్చిన అవినీతి అభియోగాల మీద విచారణకు వేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయినా తమను ఏమీ పీకలేరని టీడీపీ నేతలు సవాల్ చేస్తూ వచ్చారు. అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పుడు ఆ అవినీతి ఆరోపణల నిగ్గు తేల్చడానికి నడుం బిగించింది. రాజధాని భూములలో క్విడ్ ప్రోకో జరిగిందని చెబుతున్న కేసులో ఆస్తుల జప్తునకు సిఐడీకి అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో టీడీపీ నేతలు గగ్గోలు పెట్టడం ఆరంభించారు. అమ్మో! ఇంకేముంది ఇదంతా రాజకీయ వేధింపే అంటూ ప్రచారం ఆరంభించారు. వారికి మద్దతు ఇచ్చే పత్రిక ఒకటి జగన్ టీడీపీ నేతలను వేటాడమన్నారని ఏకంగా కథనాన్ని రాసింది. మరో టీడీపీ పత్రిక చంద్రబాబు అద్దెకు ఉంటున్న ఇల్లును జప్తు చేశారని పేర్కొంది. అదేదో చంద్రబాబుకు సంబంధం లేని భవంతి అని జనం అనుకోవాలన్నది వారి తాపత్రయం కావచ్చు. అసలు ప్రభుత్వం చేసిన అభియోగం ఏమిటి? రియల్ ఎస్టేట్ వ్యాపారి లింగమనేని రమేష్‌కు ప్రభుత్వపరంగా లాభం చేసి, ప్రతిఫలంగా చంద్రబాబు ఆయనకు చెందిన ఇంటిని పొందారన్నది ఆరోపణ. దీనినే క్విడ్ ప్రోకో అంటారు. గతంలో ఒక వ్యక్తిగా జగన్ పరిశ్రమలు పెడితే, వాటిలో ఎవరైనా పెట్టుబడులు పెడితేనే చంద్రబాబు బ్యాచ్ క్విడ్ ప్రోకో అంటూ ఆరోపించేది. దానికి సోనియాగాంధీ కూడా తోడై అక్రమ కేసులు పెట్టి ఆయనను నెలల తరబడి జైలులో ఉంచారు. మరి చంద్రబాబు ఏకంగా కొందరికి అనుచిత లబ్ది చేకూర్చి ఒక భవంతిని తీసుకుంటే ఏమనాలి? బహుమతి అని వినసొంపైన పేరు పెట్టినా, దానినే లంచం అని కూడా అంటారు కదా! ఈ ఇంటికి సంబంధించి చంద్రబాబు ఎన్నిసార్లు ఎన్నిరకాలుగా మాట్లాడారు? ఒకసారి ఇది ప్రభుత్వ భవనం అని, పూలింగ్ లో వచ్చిందని, తను సీఎంను కనుక అందులో ఉంటున్నానని అన్నారు. ఈ ఒక్క భవనాన్ని మాత్రమే ఉంచుతామని, మిగిలిన నదీతీర భవనాలను తొలగించి టూరిజం అభివృద్ది చేస్తామని కూడా ఆయన చెప్పారు. ఆయన పదవీకాలంలో ఆ పనిచేయలేదు. నిజానికి అసలు ఆయన ఉంటున్న కట్టడమే అక్రమ నిర్మాణం. నదీ తీర ప్రాంత నిబంధనలను ఉల్లంఘించిన కట్టడం. గతంలో ఒకసారి పెద్ద ఎత్తున వరదలు వస్తే అప్పటి టీడీపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నదిలో పడవలో తిరుగుతూ ఈ అక్రమ కట్టడాలన్నిటిని తమ ప్రభుత్వం కూల్చి వేస్తుందని చెప్పారు. ఈ కట్టడాల వల్ల నది ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతోందని చెప్పారు. కానీ ఆ తర్వాత కాలంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబే అందులో నివాసానికి దిగేసరికి ఎక్కడివారక్కడ నోరు మూసుకోవలసి వచ్చింది. హైదరాబాద్‌లో ఓటుకు నోటు కేసులో నుంచి బయటపడడానికి రాత్రికి, రాత్రే చంద్రబాబు విజయవాడకు వెళ్లిపోయిన తర్వాత జరిగిన పరిణామం ఇది. పర్యావరణవేత్లలు చెప్పినా, అధికారులు చెప్పినా, అదే అక్రమ కట్టడంలో ఉండడానికి చంద్రబాబు ఇష్టపడ్డారు. అప్పట్లోనే చంద్రబాబు ఈ ఇంటిని తీసేసుకున్నారని ప్రచారం జరిగేది. ఇంటి యజమాని లింగమనేని రమేష్ కూడా తాను ప్రభుత్వానికి ఇచ్చేశానని ప్రకటించారు. అది చంద్రబాబు క్విడ్ ప్రోకో కింద బహుమతిగా పొందారని, కోట్ల రూపాయల విలువైన ఆ భవంతిని ఆయన అలా పొందడం చట్ట విరుద్దమని సీఐడీ కేసు పెట్టి , భవనాన్ని జప్తు చేసింది. లింగమనేని రమేష్‌కు చంద్రబాబు ఏ రకంగా ఉపయోగపడ్డారు? ముందస్తు సమాచారం ద్వారా రమేష్‌కు ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సహకరించారని, అమరావతి రాజధాని గ్రామాల చుట్టూరా రింగ్ రోడ్డు ప్లాన్ వేసినప్పుడు రమేష్ భూములు ప్రభుత్వ భూ సమీకరణలో పోకుండా అలైన్ మెంట్ లో మార్పులు చేశారని సీఐడీ ఆరోపణ. చంద్రబాబుకు కుటంబానికి చెందిన హెరిటేజ్ కంపెనీకి చెందిన భూమి పోకుండా, రింగ్ రోడ్డు పక్కనే తమ భూమి ఉండేలా ప్లాన్ మార్చుకున్నారన్నది మరో అభియోగం. హెరిటేజ్ సంస్థ కూడా ముందస్తుగానే కంతేరు ప్రాంతంలో 14 ఎకరాల మేర కొనుగోలు చేసింది. అది అప్పట్లోనే వివాదాస్పదం అయింది. చంద్రబాబు అద్దెకు ఉంటున్నందునే ఆ ఇల్లు ను జప్తు చేశారన్నట్లుగా టీడీపీ మీడియా చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. ఉత్త పుణ్యానికి చంద్రబాబు ఆ ఇంటిని పొందారన్నది ఆరోపణ. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అది ప్రభుత్వ భవనమని చెప్పిన చంద్రబాబు ప్రతిపక్షంలోకి వచ్చాక అది ప్రైవేటు బిల్డింగ్ అని అసెంబ్లీలో చెప్పడం విశేషం. ప్రభుత్వ భవనం అయితే దానిని ప్రభుత్వానికి స్వాధీనం చేయవలసి ఉంటుంది. లేదా ప్రతిపక్ష నేత హోదాలో దానిలో ఉంటున్నానని చెప్పవచ్చు. అలాకాకుండా మళ్లీ లింగమనేనికి ఎలా వెళుతుంది? ఒకవేళ నిజంగానే లింగమనేని నుంచి అద్దెకు తీసుకుని ఉంటే, సంబందిత అద్దె లావాదేవీలు ఎందుకు చూపించలేదు? ఈ ప్రశ్నలకు చంద్రబాబు ఇంతవరకు జవాబు ఇవ్వలేదు. మాజీ మంత్రి పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం దొరకడం లేదు. ఆయన తరపున కొందరు టీడీపీ నేతలు మాత్రం యథా ప్రకారం ఇదంతా కక్ష అని విమర్శిస్తూ మాట్లాడారు. నారాయణ సమీప బంధువులు లేదా ఆయన విద్యా సంస్థలలో పనిచేసే సిబ్బంది పేరుతో ముందుగానే భూములు కొనుగోలు చేయించి, ఆ తర్వాత అధిక లాభం పొందాలని నారాయణ ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే ఆయనకు సంబంధించినవారిని సీఐడీ విచారించింది. వారు తమ సాక్ష్యాలలో ఆ భూములు నారాయణవేనని వెల్లడించారట. తాజాగా ఈ లావాదేవీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు రెండున్నర ఎకరాల వాటా ఉందని వార్త వచ్చింది. చంద్రబాబు, పవన్ లు ఇద్దరికి లింగమనేని సన్నిహితుడు కావడం విశేషం. చంద్రబాబు ప్రభుత్వం మార్పు చేసిన అలైన్ మెంట్ కనుక అమలు అయి ఉంటే వేల కోట్ల రూపాయల లబ్ది వీరికి అక్రమంగా జరిగి ఉండేదని సీఐడీ అంచనా వేసింది. ఈ సందర్భంలో ఒక ఉదాహరణ చెప్పాలి. హైదరాబాద్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి గాను భూ సేకరణ జరిగింది. ఆ టైమ్ లో తెలుగుదేశం నేతలు పలు ఆరోపణలు చేస్తుండేవారు. ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ తో పాటు కొందరు టీడీపీ నేతలకు చెందిన భూముల గుండా రింగ్ రోడ్డు వెళ్లిందని, తద్వారా వారికి నష్టం వాటిల్లేలా చేశారని ఈనాడు మీడియా కథనాలు ఇచ్చేది. అలాగే రామోజీరావుకు చెందిన కొంత భూమి కూడా పోయిందని అంటారు. దాంతో ఆయన ఆగ్రహానికి లోనై అవుటర్ రింగ్ రోడ్డులో గద్దలు అంటూ చెలరేగిపోయి బోలెడు స్టోరీలు ఇచ్చేవారు. అయినా ఆనాటి ప్రభుత్వం వాటిని ఎదుర్కొని అధికారుల సమావేశం ఏర్పాటు చేసి, అన్ని రాజకీయ పక్షాలను ఆహ్వానించి వారి సందేహాలను నివృత్తి చేసే యత్నం చేసింది. అప్పట్లో అన్ని స్టోరీలు రాసిన ఈనాడు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన ఇన్ సైడ్ ట్రేడింగ్ ,అలైన్ మెంట్ మార్పు, అస్సైన్డ్ భూముల కుంభకోణం వంటివాటికి మద్దతు ఇచ్చేలా వార్తలు ఇస్తుండడం విశేషం. ఇక ఈ కేసు ఏమవుతుందన్నది ఆసక్తికరం. ఎసీబీ న్యాయమూర్తికి ఈ జప్తు సమాచారం ఇచ్చి ఆయన అనుమతి పొంది ముందుకు వెళ్లవలసి ఉంటుంది. అయితే ప్రభుత్వం పెట్టిన 1944 నాటి చట్టం ప్రయోగిస్తారా అని టీడీపీ మీడియా వాపోతోంది. అందులో ఉన్న సెక్షన్ 3 వర్తించదని, కేసు నిలబడదని వాదిస్తోంది. చట్టం ఎప్పటిదైనా అది రద్దు కానంతవరకు అమలు అవుతుంది. మన దేశంలో ఉన్న క్రిమినల్ చట్టాలలో అత్యధికం స్వాతంత్రం రావడానికి పూర్వం నాటివేనన్న సంగతి మర్చిపోరాదు. చంద్రబాబు, లింగమేనేని, నారాయణలపై ఆరోపణలు చేస్తున్నా, అసలు రాజధానే నిర్మాణం కానప్పుడు, రింగ్ రోడ్డే లేనప్పుడు అవినీతి ఎలా అవుతుందని టీడీపీ మీడియా ప్రశ్నించింది. గత ప్రభుత్వం రూపొందించిన దాని ప్రకారం అమలు చేస్తే చంద్రబాబు తదితరులు లాభపడేవారా? కారా? అన్నది ఇక్కడ ప్రశ్న. దొంగతనం జరిగినా, సొత్తు ఏమీ దక్కలేదుగా అంటే చోరీ నేరం కాకుండా పోతుందా? అన్నది ఇక్కడ ప్రశ్న. కోర్టులో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందన్నది ఆసక్తికరమైన విషయమే. జాతీయ స్థాయిలో సంచలనం రేపిన 2 జీ స్పెక్ట్రం , బొగ్గు గనుల స్కామ్ లలో కూడా ఊహజనిత నష్టాల ఆధారంగానే సీబీఐవారు కేసులు పెట్టారన్న సంగతి గుర్తుంచుకోవాలి. రాజధాని భూముల క్విడ్ ప్రోకో కేసులోనే కాకుండా అస్సైన్డ్ భూముల వ్యవహారంలో కూడా టీడీపీ నేతలు చిక్కుకునే అవకాశం ఉంటుంది. మొత్తం మీద చంద్రబాబు తో సహా టీడీపీ నేతల మూలాలను వైసీపీ ప్రభుత్వం పీకడం మొదలుపెట్టినట్లేనా! తెలుగుదేశం నేతలు ఇంతకాలం ఏం పీకుతారంటూ వేస్తున్న ప్రశ్న జవాబు లభిస్తున్నట్లేనా! -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ చదవండి: మలుపు తిప్పిన ముఠా! బాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్‌కూ వాటా -
టీడీపీ రైతులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ
న్యూఢిల్లీ: అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాల కేసుపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఆర్-5 జోన్ కేసులో హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ కేసును రాజధాని కేసు విచారణ చేస్తున్న బెంచ్‌కు బదిలీ చేయాలని పేర్కొంది. ఆర్-5 జోన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టీడీపీ రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. చదవండి: చంద్రబాబు బరితెగింపుకి నిదర్శనం ‘కరకట్ట నివాసం’: సజ్జల -
ఇచ్చిపుచ్చుకున్నారు.. చంద్రబాబు క్విడ్ ప్రో కో గుట్టురట్టు
సాక్షి, అమరావతి: కృష్ణా నది కరకట్టపై చంద్రబాబు నివాసం.. అమరావతిలో చంద్రబాబు క్విడ్ ప్రోకో కు ఓ మచ్చు తునకని నిగ్గు తేలింది. అమరావతిలోని సీడ్ క్యాపిటల్‌లో నారాయణ బినామీల పేరిట ఉన్న 75,888 చదరపు గజాల స్థలాలు టీడీపీ భూబాగోతానికి నిదర్శనమని నిర్ధారణ అయ్యింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో టీడీపీ పెద్దల అవినీతి బట్టబయలైంది. అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పనలోనే చంద్రబాబు, నారాయణ, లింగమనేని, వారి బంధువులు, బినామీలు భారీ భూ దోపిడీకి బరితెగించారని ఆధారాలతో సహా వెల్లడైంది. చంద్రబాబు అండ్ గ్యాంగ్ అమరావతిలోని అవినీతి సామ్రాజ్యాన్ని సీఐడీకి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) బట్టబయలు చేసింది. దాంతో టీడీపీ ప్రభుత్వంలో అమరావతి కేంద్ర బిందువుగా ఏ–1 నారా చంద్రబాబు, ఏ–2 పొంగూరు నారాయణ యథేచ్ఛగా సాగించిన భారీ భూ దోపిడీపై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. అమరావతిలో చంద్రబాబు ప్రభుత్వం పాల్పడిన అక్రమాలు, అవినీతిపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను నియమించడం సరైనదేనని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దాంతో తన అవినీతి బట్టబయలు కాకుండా చంద్రబాబు కొన్నేళ్లుగా అడ్డుకుంటున్న కుట్రలకు తెరపడింది. ఈ నేపథ్యంలో రాజధాని ల్యాండ్ పూలింగ్, సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లలో పచ్చ ముఠా అక్రమాలపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. బాబు, నారాయణవి అక్రమ ఆస్తులే అక్రమ మార్గంలో సంపాదించిన ఆస్తులను అటాచ్ చేసేందుకు ప్రభుత్వానికి అధికారం కల్పిస్తున్న క్రిమినల్ లా ఆర్డినెన్స్ ప్రకారం అనుమతించాలని సీఐడీ కోరింది. ఈ మేరకు అవినీతి నిరోధక చట్టం–1988 ప్రకారం లింగమనేని కుటుంబం క్విడ్ ప్రో కో కింద చంద్రబాబుకు ఇచ్చిన కరకట్ట నివాసం.. సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో నారాయణ బినామీల పేరిట పొందిన 75,888 చదరపు గజాల స్థలాలను అటాచ్ చేసేందుకు సీఐడీకి అనుమతిస్తూ హోమ్ శాఖ రెండు వేర్వేరు జీవోలు జారీ చేసింది. దాంతో సీఐడీ ఆ విషయాన్ని ఏసీబీ న్యాయస్థానానికి నివేదించి, ఆ ఆస్తులను అటాచ్ చేసేందుకు ఉపక్రమించనుంది. తదుపరి దశల్లో మరిన్ని కఠిన చర్యలు చేపట్టేందుకు సన్నాహాలు వేగవంతం చేస్తోంది. భారీ అవినీతికే ‘మాస్టర్ ప్లాన్’ అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పనలోనే ఏ–1 చంద్రబాబు, ఏ–2 నారాయణ భారీ అవినీతికి పునాది వేశారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే అప్పటి టీడీపీ ప్రభుత్వం, సింగపూర్‌కు చెందిన ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రైజస్‌తో ఒప్పందం చేసుకుంది. అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు కన్సల్టెన్సీ ఎంపిక కోసం కనీసం టెండర్ల ప్రక్రియ కూడా చేపట్టకుండా సింగపూర్ కంపెనీకి నామినేషన్ పద్ధతిలో అడ్డగోలుగా అప్పగించేశారు. దాంతో చంద్రబాబు, నారాయణ కనుసన్నల్లోనే మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ కంపెనీ రూపొందించింది. లింగమనేని రమేశ్, లింగమనేని రాజశేఖర్, హెరిటేజ్ ఫుడ్స్, చంద్రబాబు బినామీలకు చెందిన భూములు ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి రాకుండా.. వారి భూముల వెలుపలి నుంచే ల్యాండ్ పూలింగ్ చేసేలా మాస్టర్ ప్లాన్‌ను ఖరారు చేశారు. అందుకు ప్రతిగా చంద్రబాబు కుటుంబానికి లింగమనేని కుటుంబం భారీగా ప్రతిఫలాన్ని ముట్టజెప్పింది. క్విడ్ ప్రోకో కిందే కరకట్ట నివాసం చంద్రబాబు, లింగమనేని క్విడ్ ప్రో కో కింద పరస్పరం భారీగా అవినీతికి పాల్పడినట్టు సిట్ నిర్ధారించింది. లింగమనేని కుటుంబ సభ్యుల భూములు ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి రాకుండా చేసినందుకు చంద్రబాబుకు భారీగా ముట్టజెప్పారు. ఇన్నర్‌రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న భూములను హెరిటేజ్ ఫుడ్స్‌కు ‘అమ్మినట్టు’ ఇవ్వడంతో సరిపెట్టలేదు. లింగమనేని కృష్ణానది కరకట్ట మీద ఉన్న నివాసాన్ని కూడా చంద్రబాబుకు ఇవ్వడం గమనార్హం. పక్కా క్విడ్ ప్రో కోలో భాగంగానే కరకట్ట నివాసం చంద్రబాబుకు ఉచితంగా ఇచ్చేశారని సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. కరకట్ట నివాసంపై బాబు కట్టుకథలు కరకట్ట నివాసంపై న్యాయస్థానాన్ని, ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు జీతంతోపాటు హౌస్ రెంట్ అలవెన్స్ (ఇంటి అద్దె అలవెన్స్) కూడా తీసుకున్నారు. అంటే ప్రజాధనం నుంచి సీఎంగా ఇంటి అద్దె అలవెన్స్ తీసుకున్నారు. కానీ చంద్రబాబు 2017 నుంచి తాను ఉంటున్న కరకట్ట నివాసానికి అద్దెను లింగమనేని కుటుంబానికి చెల్లించినట్టు ఎక్కడా బ్యాంకు లావాదేవీలు లేవు. చంద్రబాబు నుంచి తీసుకున్న అద్దెకు లింగమనేని ఎక్కడా జీఎస్టీ చెల్లించనే లేదు. అంటే ఇంటి అద్దె అలవెన్స్‌ను ప్రజాధనం నుంచి తీసుకుంటున్న చంద్రబాబు.. తాను నివసిస్తున్న ఇంటికి మాత్రం అద్దె చెల్లించడమే లేదన్నది నిర్ధారణ అయ్యింది. క్విడ్ ప్రో కోలో భాగంగా ఆ నివాసం చంద్రబాబుకు లింగమనేని ఇచ్చారు కాబట్టే అద్దె చెల్లించలేదు. దేశ భక్తితో ఇచ్చారట! కరకట్ట నివాసంపై న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు లింగమనేని కూడా యత్నించారు. తాను దేశభక్తితోనే కరకట్ట నివాసాన్ని అప్పటి ప్రభుత్వం వాడుకునేందుకు ఉచితంగా ఇచ్చానని లింగమనేని రమేశ్ న్యాయస్థానానికి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. మరి ఉచితంగా ఇచ్చిన ఇంటికి చంద్రబాబు ప్రజాధనం నుంచి ఇంటి అద్దె అలవెన్స్‌ను ఎలా తీసుకున్నారన్న ప్రశ్నకు సమాధానమే లేదు. దేశభక్తితో ఉచితంగా ఇస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి గానీ చంద్రబాబుకు వ్యక్తిగతంగా ఇవ్వడం ఏమిటి? ప్రభుత్వానికే ఉచితంగా ఇచ్చి ఉంటే.. చంద్రబాబు సీఎం పదవి నుంచి దిగిపోగానే ఆ ఇంటిని ఖాళీ చేయాలి. ఆ ఇంటిని ప్రభుత్వానికి అప్పగించాలి. ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగిన తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయాన్ని ఖాళీ చేయాలి. ఆ నివాసం ప్రభుత్వానికి చెందుతుంది. కానీ 2019లో సీఎం పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా చంద్రబాబు అదే కరకట్ట నివాసంలో ఉంటున్నారు. అంటే లింగమనేని దేశ భక్తితో ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చారన్నది అవాస్తవం. క్విడ్ ప్రో కోలో భాగంగానే ఆయన చంద్రబాబుకు ఇచ్చారన్నది దీనినిబట్టి కూడా నిర్ధారణ అయ్యింది. లింగమనేని నుంచి హెరిటేజ్ ఫుడ్స్‌కు భూమి 2014లో లింగమనేని కుటుంబ సభ్యుల నుంచి హెరిటేజ్ ఫుడ్స్ 4 ఎకరాలను ‘కొనుగోలు చేసినట్టు’ చూపించడం గమనార్హం. అమరావతి ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి రాకుండా ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూమినే హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేసింది. ఆ పేరుతో ఆ భూమిని హెరిటేజ్ ఫుడ్స్‌కు బదలాయించారు. ఆ మేరకు అప్పట్లోనే నారా లోకేశ్ డైరెక్టర్‌గా ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో తీర్మానం చేశారు. అనంతరం ఎమ్మెల్సీగా ఎన్నికై, మంత్రి కూడా అయిన లోకేశ్ అదే లింగమేని కుటుంబం ఇచ్చిన కరకట్ట మీద నివాసంలోనే నివసించారు. సీడ్ క్యాపిటల్‌లో వేళ్లూనుకున్న అవినీతి ► అమరావతిలో అత్యంత ప్రధానమైన సీడ్ క్యాపిటల్‌లో కూడా ఏ–1 చంద్రబాబు, ఏ–2 నారాయణ భారీగా భూ అక్రమాలకు పాల్పడ్డారు. ఎందుకంటే శాసనసభ, సచివాలయం మొదలైన ప్రధాన విభాగాలన్నీ కూడా సీడ్ క్యాపిటల్ పరిధిలోనే నిర్మించాలని నిర్ణయించారు. ► ఆ ప్రాంతంలో భూముల ధరలు భారీగా పెరుగుతాయి కాబట్టి, సీడ్ క్యాపిటల్‌లో పూర్తిగా తమ వాటా భూములే ఉండేట్టుగా చంద్రబాబు, నారాయణ పన్నాగం పన్నారు. సింగపూర్ కంపెనీ సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్‌ను ప్రభుత్వానికి 2015 జూలైలోనే సమర్పించింది. కానీ ఆ ప్లాన్‌ను బహిర్గతం చేయకుండా, ఆమోదించకుండా మూడు నెలలపాటు కాల యాపన చేశారు. ► ఆ సమయంలోనే నారాయణ తమ బినామీలు, బంధువులైన పొత్తూరి ప్రమీల, రాపూరి సాంబశివరావు, ఆవుల ముని శంకర్, వరుణ్ కుమార్ కొత్తప్ప పేరున సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో 65.50 ఎకరాలు కొనుగోలు చేశారు. అందుకోసం నారాయణ భార్య రమాదేవి, అల్లుడు డైరెక్టర్లుగా ఏర్పాటు చేసిన ఎన్‌స్పైరా కంపెనీ నుంచి నిధులను తమ బంధువులు, బినామీల ఖాతాల్లోకి మళ్లించారు. వారి పేరున సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారు. ► రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరును బినామీగా పెట్టుకుని కూడా నారాయణ సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారు. నారాయణ కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల నుంచి రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ బాం్యకు ఖాతాకు నిధులు బదిలీ చేశారు. ఆ నిధులతో ఆ కంపెనీ ఉద్యోగుల పేరున భూములు కొనుగోలు చేశారు. ► కేసు దర్యాప్తులో భాగంగా ఆ ఉద్యోగులను సిట్ అధికారులు ప్రశ్నించగా తాము నారాయణ బినామీలుగానే భూములు కొనుగోలు చేశామని వాంగ్మూలం ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇలా నారాయణ తమ బంధువులు, బినామీల పేరిట సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో కొనుగోలు చేసిన 65.50 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ కింద సీఆర్డీఏకు ఇచ్చారు. ► అందుకు ప్రతిగా ల్యాండ్ పూలింగ్ ప్యాకేజీ కింద సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో అత్యంత విలువైన 75,888 చదరపు గజాల స్థలాలు పొందారు. వాటిలో 7,620 చదరపు గజాలు, 8,880 చదరపు గజాలు, 6,550 చదరపు గజాలు, 25 వేల చదరపు గజాల స్థలాలు కూడా ఉన్నాయి. అవి నేరుగా సీడ్ యాక్సెస్ రోడ్డుకు అనుసంధానించి ఉండటం గమనార్హం. ► భవిష్యత్‌లో స్టార్ హోటళ్లు, షాపింగ్ మాల్స్, ఇతర భారీ వాణిజ్య సముదాయాల నిర్మాణానికి అనుకూలమైన విలువైన స్థలాలను పొందారన్నది స్పష్టమవుతోంది. పూలింగ్ ప్యాకేజీ కింద ఏటా సీఆర్డీఏ ఇప్పటి వరకు చెల్లించిన రూ.1.92 కోట్ల కౌలు మొత్తం ఎన్‌స్పైరా ఖాతాల్లో జమ చేస్తున్నారు. అంటే ఆ భూములు కొనుగోలు చేసి సీఆర్డీఏకే ఇచ్చినట్టు పేర్కొన్న పొత్తూరి ప్రమీల, రా>పూరి సాంబశివరావు, ఆవుల ముని శంకర్, వరుణ్ కుమార్ కొత్తప్ప పూర్తిగా నారాయణ బినామీలేనన్నది నిర్ధారణ అయ్యింది. వారి భూముల వద్దే ఇన్నర్ రింగ్ రోడ్డు అమరావతిలో 75 మీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను రూపొందించడంలో చంద్రబాబు, నారాయణ యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డారు. వారి భూములను ఆనుకునే ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించేలా అలైన్‌మెంట్‌ను రూపొందించారు. లింగమనేని కుటుంబం, హెరిటేజ్ ఫుడ్స్, నారాయణ విద్యా సంస్థల సమీపం నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించేలా చంద్రబాబు, నారాయణ ప్రత్యేకంగా పర్యవేక్షించారు. తమ భూముల నుంచి కాకుండా సామాన్య రైతుల భూముల నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించేలా అలైన్‌మెంట్‌ను ఖరారు చేయడం గమనార్హం. అందుకోసం ముందుగానే ఆ భూముల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఇళ్ల నిర్మాణాలకు కూడా అనుమతి ఇవ్వకుండా సీఆర్డీయే నిలుపుదల చేసింది. అంటే కన్సల్టెన్సీ సంస్థ అలైన్‌మెంట్‌ను రూపొందించకముందే చంద్రబాబు, నారాయణ ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలా నిర్మించాలో నిర్ణయించేశారు. అప్పటికే నిర్ణయించిన అలైన్‌మెంట్‌ను ఖరారు చేసేందుకే ఓ కన్సల్టెన్సీని నియమించి కనికట్టు చేశారు. చదవండి: దిగజారుడు పాత్రికేయానికి మరో మచ్చుతునక వాస్తవానికి విజయవాడలోని కామినేని ఆస్పత్రి వద్ద ఉన్న తాడిగడప– ఎనికేపాడు మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించాలని కన్సల్టెన్సీ సంస్థ ఎస్టీయూపీ అలైన్‌మెంట్‌ను రూపొందించింది. అలా నిర్మిస్తే నారాయణ విద్యా సంస్థలతోపాటు హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని భూముల మీదుగా రోడ్డును నిర్మించాల్సి వస్తుంది. దీనిపై అప్పటి సీఆర్డీయే వైస్ చైర్మన్‌గా ఉన్న నారాయణ సీఆర్డీయే సమావేశంలోనే అధికారులపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. తాడిగడపకు 3 కి.మీ. దూరంగా తూర్పు వైపు నుంచి పెనమలూరు– నిడమానూరు మీదుగా ఇన్నర్‌రింగ్ రోడ్డు నిర్మించేలా అలైన్‌మెంట్‌ను మార్పించారు. -
పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే టీడీపీకి అభ్యంతరం ఏంటి?
సాక్షి, తాడేపల్లి: అమరావతిలో చంద్రబాబు తనవారికే ప్రయోజనం చేకూర్చారని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అసైన్డ్ రైతుల పట్ల చంద్రబాబు దారుణంగా ప్రవర్తించారన్నారు. ‘‘అమరావతిలో పేదలు ఉండడానికి వీలు లేదని కోర్టుకు వెళ్లారు.. అమరావతిలో అందరూ ఉండాలని సీఎం జగన్ కోరుకుంటున్నారు. నిన్న కోర్టు తన తీర్పుతో చంద్రబాబు కళ్లు తెరిపించింది. చంద్రబాబు ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలి. పేదల పక్షాన సీఎం జగన్ పోరాటం చేస్తున్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే టీడీపీకి అభ్యంతరం ఏంటి?. పేదలంటే తెలుగుదేశానికి ఎందుకంత కడుపుమంట. తెలుగుదేశం మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక్కవర్గానికైనా న్యాయం చేశారా?’’ అంటూ ఎంపీ సురేష్ ప్రశ్నించారు. ‘‘జీవో45ని సమర్థిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల సంతోషిస్తున్నాం. అమరావతిలో 50వేల పైచిలుకు ప్లాట్లు ఇచ్చేలా జగన్ నిర్ణయానికి అడ్డుపడ్డారు. టీడీపీ నేతల చెంప చెల్లుమనిపించేలా తీర్పు వచ్చింది. చంద్రబాబు అసైన్డ్ భూముల్ని స్మశానల పక్క, వాగులో, వంకల్లో ఇచ్చారు. చంద్రబాబు అంబేద్కర్ విగ్రహాన్ని సైతం వరదల్లో మునిగిపోయే ప్రాంతంలో పెట్టాలని చూశారు. సీఎం జగన్ మాత్రం విజయవాడ నడిబొడ్డున పెట్టారు. సీఎం జగన్‌కి కావాల్సింది ప్రజా రాజధాని.. రియల్ ఎస్టేట్ రాజధాని కాదు’’ అని నందిగం సురేష్ అన్నారు. చదవండి: ఓటమిలో టీడీపీ రికార్డు.. 50 నియోజకవర్గాల్లో హ్యాట్రిక్ పరాజయం! ‘‘అమరావతిలో పేదలు, దళితులు, బీసీలు ఉంటే మురికి కూపంగా మారుతుందని అభివృద్ధి జరగదంటూ కోర్టుకు వెళ్లారు. కోర్టు తీర్పుతోనైనా చంద్రబాబు మారాలి. పేదల పట్ల ఇంత వివక్ష సరికాదు. రాష్ట్రంలోని పేదలపాలిట దరిద్రం చంద్రబాబు. ఆయనను రాష్ట్రంలోని పేదలంతా తరిమికొడతారు. టీడీపీ వస్తే అమరావతి నుండి పేదలను బయటకు పంపిస్తామని అచ్చెన్నాయుడు మాట్లాడటం సరికాదు. టీడీపీలోని దళితనేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలి’’ అని ఆయన హితవు పలికారు. చంద్రబాబుకు, జగన్‌కు నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. రాష్ట్రం మొత్తం బాగుండాలని జగన్ అనుకుంటే, తన సామాజిక వర్గం మాత్రమే బాగుండాలని చంద్రబాబు అనుకుంటున్నారు. దేవుడే ప్రత్యక్షమై మారమని చెప్పినా చంద్రబాబు మారడు. అణగారిన జాతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలందరి తరపున సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. గుంటూరు, విజయవాడలోని కొన్ని ప్రాంతాల ప్రజలకు అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇచ్చాం’’ అని ఎంపీ సురేష్ పేర్కొన్నారు. చదవండి: చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలే: మంత్రి కాకాణి -
చంద్రబాబు అండ్ కో కి సుప్రీం షాక్
-
సీట్ కు అమరావతి కేసు..పచ్చ నేతల గుండెలో గుబులు
-
అవినీతి మొత్తం బయటకు తీస్తాం.. అరెస్టులు కూడా జరుగుతాయి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: అమరావతి పేరుతో భారీ అవినీతి జరిగిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. జరిగిన అవినీతి మొత్తం బయటకు తీస్తామని తెలిపారు. సిట్ దర్యాప్తుతో మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పారు. కచ్చితంగా అరెస్టులు కూడా జరుగుతాయని అన్నారు. సుప్రీంకోర్టులోఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ విజయం దక్కిందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. విధానపరమైన నిర్ణయాలతో రాష్ట్రానికి నష్టం కలిగిస్తే తప్పేనని పేర్కొన్నారు. గతంలో జరిగిన తప్పులను తప్పకుండా సమీక్ష చేయాల్సిందేనని తెలిపారు. రాష్ట్ర సంపదకు నష్టం కలిగించే కుట్రలను బయటకు తీస్తామన్నారు. టీడీపీ హయాంలో తప్పు చేయకపోతే వారికి భయమెందుకని ప్రశ్నించారు. చదవండి: సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి భారీ ఊరట స్కిల్ డెవలప్మెంట్ స్కాంలోనూ చంద్రబాబు హస్తం ఉందని సజ్జల పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ స్కాంకు రాజధాని పేరు పెట్టారని.. అమరావతి పేరు చెప్పి దోచుకోవాలనుకున్నారని మండిపడ్డారు. అరచేతిలో స్వర్గం చూపించి రైతులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాత్కాలిక నిర్మాణాల్లోనూ అవినీతికి పాల్పడ్డరన్నారు. టీడీపీ హయాంలో దేశంలోనే అతిపెద్ద భూ కంభకోణం జరిగిందన్నారు. నిజనిజాలను బయటకు తీసేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రాజధాని పేరుతో చంద్రాబాబు ముఠా దోచుకున్నారని సజ్జల దుయ్యబట్టారు. తప్పు చేయకపోతే స్టే కోసం కోర్టులకు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ సహా చంద్రబాబు ముఠాకు ఎందుకంత భయమని అన్నారు. టీడీపీ హయాంలో అక్రమాలపై సిట్ ఏర్పాటు జరిగిందని, సిట్ దర్యాప్తుపై స్టే తెచ్చుకుంటే అందులో ఏదో మతలబు ఉన్నట్లేనని అన్నారు. టీడీపీ నేతల్లో ఒకవైపు భయం, మరోవైపు అహంకారం కనిపిస్తోందన్నారు. సిట్ ఏర్పాటు కక్ష సాధింపు కానే కాదని స్పష్టం చేశారు. చదవండి: ‘రాజధాని దొంగల’పై సంచలన నివేదిక -
‘రాజధాని దొంగల’పై సంచలన నివేదిక
సాక్షి, గుంటూరు: అమరావతి రాజధాని నిర్మాణం పేరిట జరిగిన భూ కుంభకోణంపై సమగ్ర నివేదికను ఏపీ మంత్రి వర్గ ఉప సంఘం రూపొందించింది. అయితే.. రాజధాని ప్రకటనకు ముందస్తు సమాచారంతో భూముల కోనుగోళ్లు జరిగాయని, క్యాపిటల్ సిటీ, రీజియన్ లో భూముల కొనుగోళ్లు అదీ బినామీ పేర్లతో టీడీపీ నేతలు కొనుగోళ్లు చేపట్టినట్టు నివేదికలో వెల్లడైంది. రాజధాని దొంగలపై కేబినెట్ సబ్ కమిటీ రూపొందించిన ఆ నివేదికలో సంచలన విషయాలు వెల్లడి కాగా.. ఈ నివేదిక సాక్షి చేతికి దొరికింది. టీడీపీ నేతలు, బినామీలకు మేలు చేసేలా రాజధాని సరిహద్దుల నిర్ణయం జరిగింది. అలాగే.. లంక, పోరంబోకు,ప్రభుత్వ భూముల రికార్డుల్లో భారీ అక్రమాల గుర్తించింది కేబినెట్ సబ్ కమిటీ. లేండ్ పూలింగ్ స్కీమ్ కోసం రికార్డులు తారుమారు చేసినట్టు నిర్ధారణ కావడంతో పాటు భూ కేటాయింపుల్లోనూ భారీ అక్రమాలకు పాల్పడింది అప్పటి చంద్రబాబు ప్రభుత్వం. 1977 అసైన్డ్ భూముల చట్టంతో పాటు 1989 ఎస్సీ, ఎస్టీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించారని నిర్ధారణ అయ్యింది. ఇన్ సైడర్ ట్రేడింగ్‌పై పక్కా ఆధారాలు బినామీలు, నేతల భూములకు మేలు చేసేలా రాజధాని ఏర్పాటుకై చంద్రబాబు హయాంలోని ప్రభుత్వం తీవ్ర కృషి చేసింది. ఇందుకోసం తెల్లరేషన్‌కార్డు ఉన్నవాళ్లను బినామీలుగా ఉపయోగించుకున్నారు టీడీపీ నేతలు. 2014 జూన్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు భూముల కొనుగోళ్లు జరగ్గా.. 4 వేల 70 ఎకరాల భూములను ఇన్ సైడర్ ట్రేడింగ్ లో కొనుగోళ్లు చేశారు వాళ్లు. టీడీపీ నేతలు, ప్రముఖులు రాజధాని భూ కుంభకోణం నివేదికలో అసలు దొంగత పేర్లను సైతం మంత్రివర్గ ఉప సంఘం పేర్కొంది. ఇందులో ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ సన్నిహితుడు వేమూరు రవికుమార్ ప్రసాద్, మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీఎస్ ఆంజనేయులు, చంద్రబాబు గెస్ట్ హౌస్ యజమాని లింగమనేని రమేష్, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, లంకా దినకర్, దూళిపాళ్ల నరేంద్ర, కంభంపాటి రామ్మోహన్ రావు, పుట్టా మహేష్ యాదవ్ పేర్లను నివేదికలో పేర్కొంది ఉప సంఘం. నారా లోకేష్ బినామీ వ్యవహారం.. నారా లోకేష్ బినామీ భూముల వ్యవహారాన్ని మంత్రివర్గ ఉప సంఘం బయటపెట్టింది. వేమూరి రవి కుమార్ కుటుంబం పేరుతో భారీగా భూముల కొనుగోళ్లు జరిగినట్లు గుర్తించింది. సుమారు 62.77 ఎకరాల భూములు కొనుగోలు చేసినట్టు తేలింది. 👉 అలాగే.. భార్యా, బంధువుల పేర్లతో భూములు కొనుగోలు చేశాడు చంద్రబాబు గెస్ట్ హౌస్ యజమాని లింగమనేని రమేష్. 👉 ఇక మాజీ మంత్రి నారాయణ బినామీ దందాను నివేదిక బయటపెట్టింది. సన్నిహితులు ఆవుల మునిశేఖర్, రాపూరు సాంబశివరావు, పొట్టూరి ప్రమీల, కొత్తపు వరుణ కుమార్ పేర్లతో 55. 27 ఎకరాలు భూముల్ని మాజీ మంత్రి నారాయణ కొనుగోలు చేశారు. 👉 బినామీ పేర్లతో 68.6 ఎకరాల భూమి కొనుగోలు చేశారు.. మాజీ ఎమ్మెల్యే కొమ్మాల పాటి శ్రీధర్. 👉 ఇక గుమ్మడి సురేష్ పేరుతో 38.84 ఎకరాల భూమి కొన్నాడు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. 👉 మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు మైత్రీ ఇన్ ఫ్రా పేరుతో 40 ఎకరాలు కొనుగోలు చేసినట్లు బట్టబయలైంది. 👉 పేర్లు, రికార్డులు, ఆధారాలతో సహా నివేదిక సమర్పించింది మంత్రి వర్గ ఉప సంఘం ఆ జీవో టీడీపీ నేతల కోసమే.. టీడీపీ నేతల కోసం సిఆర్డీయే పరిధి మార్చేసింది చంద్రబాబు హయాంలోని టీడీపీ ప్రభుత్వం. ఇప్పుడు సంక్షేమ పథకాలకు, జీవోలకు అడ్డుపుడుతున్న ఇదే పచ్చ నేతల కోసం.. అప్పట్లో జీవో జారీ చేసింది బాబు సర్కార్. 👉 సీఆర్డీయే పరిధిలో 524.545 ఎకరాల భూముల కోసం సరిహద్దులు మార్పు చేసింది. అలాగే నటుడు.. ఎమ్మెల్యే బాలకృష్ణ వియ్యంకుడి సంస్థ వీబీసీ కెమికల్స్ కు భూముల కేటాయింపు చేసింది. జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో 498 ఎకరాల కేటాయించి.. భూములు కేటాయించాక సిఆర్డీయే పరిధి మారుస్తూ జీవో జారీ చేసింది. 👉 ఇక.. సత్తెనపల్లి మండలంలో దూళిపాళ్లలో కోడెల శివప్రసాద్(దివంగత మాజీ స్పీకర్)కు భూములు ఉన్నాయి. మొవ్వ మండలం పెద ముట్టేవి, చిన ముట్టేవిలో లింగమనేనికి భూములు ఉన్నాయి. భూముల్ని కేటాయించాక పరిధి మారుస్తూ 207 జీవో విడుదల చేసింది టీడీపీ ప్రభుత్వం. ఇక కొనకంచిలో యలమంచిలి శివలింగ ప్రసాద్ భూముల కోసం సీ ఆర్డీయే సరిహద్దుల్లో మార్పులు చేసింది. సంస్థల కేటాయింపుల్లోనూ.. వివిధ సంస్థలకు కేటాయించిన భూముల్లోనూ అక్రమాలను గుర్తించింది ఏపీ కేబినెట్ సబ్ కమిటీ. ఆ వివరాలను నివేదికలో పొందుపరిచింది. ఐదు ప్రైవేట్ సంస్థలకు 850 ఎకరాల భూమిని అక్రమంగా కేటాయించినట్లు తేలింది. అలాగే.. సింగపూర్ తో ఒప్పందంలోనూ లోపాలను గుర్తించిన మంత్రివర్గ ఉప సంఘం.. మొత్తంగా టీడీపీ హయాంలో జరిగిన భూ దందాను, అక్రమాలను సమగ్రమైన నివేదిక ద్వారా ప్రభుత్వానికి సమర్పించింది. ఇదీ చదవండి: చంద్రబాబు హయాం అవినీతిపై సిట్ దర్యాప్తునకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ -
అమరావతి పేదల ఇళ్ల స్థలాల కేసులో సుప్రీం సానుకూలత
సాక్షి, ఢిల్లీ: గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పేదలకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. అమరావతిలో పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలన్న సీఎం జగన్ సంకల్పాన్ని అడ్డుకునే టీడీపీ యత్నానికి కోర్టులో బ్రేకు పడింది. ఈ కేసులో సుప్రీం కోర్టు సానుకూలత ప్రదర్శించింది. ‘మీ 35 సెంట్ల భూమి నుంచి పేదలకు స్థలం ఇస్తున్నారా?. 75 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే మీకు వచ్చే నష్టం ఏంటి?’ అంటూ పిటిషనర్‌పై సుప్రీం కోర్టు సీరియస్ అయినట్లు సమాచారం. అలాగే.. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై స్టే ఇవ్వాలన్న పిటిషన్‌ను విచారణకు నిరాకరించింది సుప్రీం. ఈ విషయంలో హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు స్పష్టం చేసింది. దీంతో చేసేది లేక పిటిషన్‌ను ఉపసంహరించుకున్నాడు టీడీపీ సానుభూతిపరుడు శివ. అమరావతి రాజధాని ప్రాంతాల్లో వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నది సీఎం వైఎస్ జగన్ సంకల్పం. ఈ ప్రయత్నాలను టీడీపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. అమరావతిలో పేదలకు స్థానం లేదని కోర్టుల ద్వారా అడ్డుపడే ప్రయత్నం చేశారు. పేదలకు ఇళ్ల స్థలాల ఇవ్వాలన్న జీవో పై స్టే ఇవ్వాలని అడిగారు. మీకు ప్లాట్లు ఇస్తున్నప్పుడు దీన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు అని సుప్రీం కోర్టు అడిగింది. పిటిషన్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. పేదలకు సెంట్ భూమి ఇస్తే ఎందుకు కడుపు మంట. సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, గత్యంతరం లేక పిటిషన్ విత్ డ్రా చేసుకున్నారు. సీఆర్డీఏ చట్టం ప్రకారం పేదలకు 5శాతం ఇళ్ల స్థలాలు ప్రభుత్వం ఇస్తుంది అని అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి తెలిపారు. చట్టం ప్రకారం పేదలకు అయిదు శాతం ఇవ్వాల్సిందే. కానీ గత ప్రభుత్వం దీన్ని విస్మరించింది. అయితే వైఎస్ జగన్ ప్రభుత్వం జీవో 45 ద్వారా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించింది. మాస్టర్ ప్లాన్ సవరణ చేసి ఆర్-5 జోన్ ఏర్పాటు చేశారు. సీఆర్డీఏ చట్టం ప్రకారమే వీటిని ఇచ్చారు అని ఏపీ ప్రభుత్వ స్పెషల్ జీపీ కాసా జగన్మోహన్ రెడ్డి తెలిపారు. అమరావతి కేసులో మంచి నిర్ణయం జరిగింది. పేదలకు ఇళ్ల ఇవ్వకుండా చేసిన ప్రయత్నాలు నెరవేరలేదు. వైఎస్ జగన్ పేదల కోసం తీసుకున్న నిర్ణయాలు సఫలపవుతయి అని అడ్వకేట్ జానకీ రామయ్య పేర్కొన్నారు. -
రాజధాని అందరిదీ.. అందులో అందరూ ఉండాలి: ఏపీ హైకోర్టు
అమరావతి: అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు కల్పించేందుకు ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల కలెక్టర్లకు భూమిని బదిలీ చేసేందుకు సీఆర్డీఏ కమిషనర్ కు అనుమతులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 45ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై మంగళవారం సీజే జస్టిస్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మంతోజు గంగారావులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలోనే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది. ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా.. రాజధాని అందరిదీ అని, అందులో అందరూ ఉండాలని వ్యాఖ్యానించారు. అదే సమయంలో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు. కౌంటర్‌ను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నా ప్రధాన న్యాయమూర్తి.. తదుపరిఇ విచారణను ఈనెల 19వ తేదీకి వాయిదా వేశారు. కాగా, సీఆర్డీఏ చట్ట నిబంధనల ప్రకారం రాజధాని ప్రాంతంలో పేదలకు నివాసాలు కల్పించేందుకు 1,134 ఎకరాల భూమిని ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు బదిలీ చేసేందుకు సీఆర్డీఏ కమిషనర్‌కు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 31న జారీ చేసిన జీవో 45ను సవాల్ చేస్తూ అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. -
పేదలకిచ్చే స్థలాలపై అమరావతి రైతుల పిటిషన్లు
సాక్షి, అమరావతి: సీఆర్డీఏ చట్ట నిబంధనల ప్రకారం రాజధాని ప్రాంతంలో పేదలకు నివాసాలు కల్పించేందుకు 1,134 ఎకరాల భూమిని ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు బదిలీ చేసేందుకు సీఆర్డీఏ కమిషనర్‌కు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 31న జారీ చేసిన జీవో 45ను సవాల్ చేస్తూ అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. లంచ్‌మోషన్ రూపంలో అత్యవసరంగా దాఖలైన ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్ విచారణ జరిపారు. విచారణ సందర్భంగా ఇదే అంశానికి సంబంధించిన వ్యాజ్యాలను ఇప్పటికే ప్రధాన న్యాయమూర్తి (సీజే) నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోందని, మంగళవారం విచారణకు అదనపు ఏజీ అందుబాటులో ఉంటారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. అదనపు ఏజీ కార్యాలయం సైతం త్రిసభ్య ధర్మాసనం ముందు ఇదే అంశానికి సంబంధించిన వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నందున, తాజా వ్యాజ్యాలను కూడా త్రిసభ్య ధర్మాసనమే విచారించడం సబబుగా ఉంటుందంటూ అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కార్యాలయం రాతపూర్వకంగా కోర్టు ముందు మెమో దాఖలు చేసింది. తాజా వ్యాజ్యాలను ఇప్పటికే త్రిసభ్య ధర్మాసనం ముందున్న వ్యాజ్యాలతో జత చేయాలని అదనపు ఏజీ ఆ మెమోలో కోర్టును కోరారు. ద్విసభ్య ధర్మాసనం విచారణకు ఆదేశాలిచ్చిన సీజే అటు ఏజీ వాదనలను, ఇటు ఏఏజీ మెమోను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ రాయ్ సైతం ఈ వ్యాజ్యాలను త్రిసభ్య ధర్మాసనమే విచారించడం మేలని అభిప్రాయపడ్డారు. అయితే, తమ వ్యాజ్యాలపై అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని అమరావతి రైతుల తరఫు న్యాయవాదులు కోరడంతో.. ఈ వ్యాజ్యాలు మంగళవారం విచారణకు వచ్చే విషయంలో తగిన నిర్ణయం తీసుకునేందుకు కేసు ఫైళ్లను (సీజే) ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ రిజిస్ట్రీని ఆదేశించారు. దీంతో రిజిస్ట్రీ ఈ వ్యాజ్యాలను సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్‌మిశ్రా ముందుంచింది. వీటిని పరిశీలించిన సీజే మంగళవారం ద్విసభ్య ధర్మాసనం విచారణకు వేయాలని ఉత్తర్వులిచ్చారు. దీంతో ఈ వ్యాజ్యాలపై మంగళవారం సీజే జస్టిస్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మంతోజు గంగారావులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది. -
‘టీడీపీ, కొన్ని దుష్టశక్తులు మూడు రాజధానులను అడ్డుకుంటున్నాయి’
సాక్షి, అమరావతి: ‘మాకు ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదు. చంద్రబాబుకు ఎన్నికలు కావాలి. ఎన్నికలు వస్తే ఏదో అయిపోతానని ఆయన కలలు కంటున్నాడు. ఏమీ కాడు. ఇప్పుడు కొంతైనా ఆశతో బతుకుతున్నాyý ు. ఎన్నికల తర్వాత అదీ ఉండదు. వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్నన్ని సీట్లు కూడా ఆ పార్టీకి రావు. వాపును చూసి బలుపనుకుంటున్నాడు. ఎన్నికలయ్యాక చంద్రబాబు తుస్సుమంటాడు’ అని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పాలన, అధికార వికేంద్రీకరణ ద్వారానే రాష్ట్రం అభివృద్ధి సాధించగలుగుతుందన్నది తమ పార్టీ విధానమని చెప్పారు. తమ పార్టీ తొలి నుంచీ మూడు రాజధానులకే కట్టుబడి ఉందని, ఎప్పుడైనా తమది అదే నినాదమని స్పష్టం చేశారు. రేపటి నుంచే మూడు రాజధానులు అమల్లోకి రావాలన్నది తన డిమాండ్ అని, ఆ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అభ్యర్థిస్తున్నానని తెలిపారు. శనివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని న్యాయ పరమైన చిక్కుల వల్ల విశాఖ నుంచి పాలన ఆలస్యమవుతోందన్నారు. టీడీపీ, కొన్ని దుష్ట శక్తులే మూడు రాజధానుల ప్రయత్నాలను అడ్డుకుంటున్నాయని.. తుదకు న్యాయం, నిజమే గెలుస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో మూడు రాజధానుల నినాదం వినిపిస్తామని చెప్పారు. కర్నూలు న్యాయ రాజధానిపై విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. తాము చట్టం, రాజ్యాంగం ప్రకారమే ముందుకు వెళ్తామన్నారు. మంత్రి బొత్స ఇంకా ఏమన్నారంటే.. మా ప్రభుత్వంపై పెరిగిన నమ్మకం అమరావతిలో ఉద్యమ స్ఫూర్తి అంటే ఏంటి? టెంట్లు వేసుకుని రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడమా? అక్కడ ఒకరిద్దరు రైతులు తప్ప మిగతా వారంతా చంద్రబాబు బినామీలు. బీజేపీ నేత సత్యకుమార్‌పై దాడి మాకేం అవసరం? మా పార్టీపై రాజకీయంగా బురదజల్లే ప్రయత్నాలవి. అమరావతిలో రాజధాని నిర్మాణం పేరిట రూ.లక్షల కోట్ల ప్రజాధనాన్ని, జాతి సంపదను గోతుల్లో పోయమంటే ఎలా? అమరావతిలో పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తామంటే అభ్యంతరం ఎందుకు? పేదలు, సామాన్యులు అక్కడ ఉండకూడదనడం ఎంత వరకు సబబు? దేశ చరిత్రలో ఎక్కడా లేనంతగా క్యాలెండర్ ప్రకారం సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. మా ప్రభుత్వంపై ప్రజలకు మరింత నమ్మకం, భరోసా పెరిగింది. వారి ఆర్థిక పరిస్థితులు బాగు పడుతున్నాయి. ఇలాంటప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న ఆతృత మా పార్టీకి ఎందుకు ఉంటుంది? ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటమికి నేనే బాధ్యత వహిస్తున్నా. ఓటమిపై పరిశీలన చేసుకొని, లోటుపాట్లుంటే సరి చేసుకుంటాం. దశాబ్దాలుగా మార్గదర్శి అక్రమాలకు పాల్పడుతోంది. ఇన్నాళ్లూ దాని యాజమాన్యం తప్పించుకుంది. ప్రస్తుతం మరిన్ని అక్రమాలు బయటకు వస్తున్నాయి. ఇక తప్పించుకోవడం సాధ్యం కాదు. -
తెలియదు.. గుర్తు లేదు.. మర్చిపోయా: సీఐడీ విచారణలో నారాయణ తీరు
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వం హయాంలో జరిగిన అమరావతి భూముల కుంభకోణం కేసులో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణ సీఐడీ విచారణకు ఏమాత్రం సహకరించలేదని తెలిసింది. అసైన్డ్ భూములు, బినామీ పేర్లతో భూములు కొనుగోలు, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ రూపొందించడంలో అక్రమాలపై సీఐడీ అధికారులు ఎంత గుచ్చి గుచ్చి అడిగినా నారాయణ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వలేదని సమాచారం. తెలియదు.. గుర్తు లేదు.. మర్చిపోయా అనే రీతిలో నారాయణ వ్యవహరించారని తెలిసింది. ఈ మేరకు సీఐడీ అధికారులు నారాయణ, ఆయన భార్య పి.రమాదేవి, నారాయణ విద్యా సంస్థల ఆర్థిక వ్యవహారాల కోసం ఏర్పాటు చేసిన ఎన్ స్పైరా సంస్థలో కీలక స్థానంలో ఉన్న పొత్తూరి ప్రమీల అనే ఉద్యోగిని హైదరాబాద్‌లో సోమవారం వేర్వేరుగా విచారించారు. నారాయణ విద్యా సంస్థలు, ఎన్ స్పైరా సంస్థల బ్యాంకు ఖాతాల నుంచి రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంకు ఖాతాలకు నిధుల బదలాయింపుపై సీఐడీ అధికారులు నారాయణను ప్రశ్నించారు. ఇక ఆ నిధులతో బినామీల పేరిట అమరావతిలో అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన రికార్డులు చూపిస్తూ పలు ప్రశ్నలు వేశారని తెలుస్తోంది. అలాగే నారాయణ బినామీల పేరిట కొనుగోలు చేసిన భూముల సమీపంలోనే స్టార్టప్ సిటీ వచ్చేలా సీఆర్డీఏ అమరావతి మాస్టర్ ప్లాన్ రూపొందించిన ఉదంతంపైన కూడా వివరాలు అడిగారు. ఆ సమయంలో మునిసిపల్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ మాస్టర్ ప్లాన్‌ను ప్రభావితం చేశారని అభియోగాలు ఉన్నాయి. అలాగే నారాయణ విద్యా సంస్థలు, చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్, వారి సన్నిహితుడు లింగమనేని కుటుంబానికి చెందిన సంస్థల భూముల విలువ అమాంతం పెరిగేలా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చేలా నారాయణ అధికార దుర్వినియోగానికి పాల్పడటంపై కూడా సీఐడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. కానీ నారాయణ ఒక్క ప్రశ్నకు కూడా సూటిగా సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. సీఐడీ విచారణకు ఏమాత్రం సహకరించకూడదని ఆయన ముందుగానే ఓ నిర్ధారణకు వచ్చినట్టుగా వ్యవహరించారని సమాచారం. అలాగే నారాయణ భార్య రమాదేవి, పొత్తూరి ప్రమీల కూడా విచారణకు ఏమాత్రం సహకరించ లేదు. నారాయణ కుమార్తెను ఇంటి వద్దే విచారించండి అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ డిజైన్ల ముసుగులో సాగిన భూ దోపిడీపై నమోదు చేసిన కేసులో విచారణ నిమిత్తం తమ ముందు హాజరు కావాలంటూ సీఐడీ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ నారాయణ కుమార్తె సింధూర, ఆమె భర్త పునీత్, అతడి సోదరుడు వరుణ్ కుమార్, రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ అంజనీ కుమార్ బాబీలు హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి సోమవారం విచారణ జరిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి, సింధూరను ఆమె ఇంటి వద్దే ఈ నెల 20న విచారించాలని సీఐడీని ఆదేశించారు. అలాగే అదే రోజున సీఐడీ ముందు హాజరు కావాలని పునీత్, వరుణ్‌లకు సైతం ఆదేశాలు జారీ చేశారు. ఇక అంజనీ కుమార్‌ను అదే రోజున న్యాయవాది సమక్షంలో విచారించాలని సీఐడీకి సూచించారు. -
అమరావతి భూముల కుంభకోణం: నారాయణను ప్రశ్నించిన సీఐడీ
సాక్షి, హైదరాబాద్: అమరావతి రాజధాని భూముల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను సీఐడీ అధికారులు విచారించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని నారాయణ నివాసానికి చేరుకున్న అధికారులు.. ఆయనను ప్రశ్నించారు. నారాయణ సతీమణి, ఉద్యోగి ప్రమీల, రామకృష్ణ హౌసింగ్ యజమానిని కూడా సీఐడీ అధికారులు ప్రశ్నించారు. కూకట్పల్లి లోధా అపార్ట్మెంట్లో మాదాపూర్ ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో ఏపీ సీఐడీ అధాకారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. నారాయణ సంస్థల నుంచి రామకృష్ట సంస్థలోకి నిధుల మళ్లించినట్లు అధికారులు గతంలోనే గుర్తించారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి పలు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. అధికారుల దర్యాప్తులో బినామీల పేర్లపై అమరావతిలో అసైన్డ్ భూముల కోనుగోలు చేసినట్లు తేలింది. ఈ దందాలో నారాయణ అప్పటి మంత్రులు, వారి బినామీలు ఎస్సీ, ఎస్టీ, బీసీల నుంచి అక్రమంగా అసైన్డ్ భూముల కొనుగులు చేసినట్లు గుర్తించారు. ల్యాండ్ పూలింగ్ కింద ఎలాంటి ప్యాకేజీ ఇవ్వకుండా ఈ భూముల కొనుగోలు జరిగాయని, టీడీపీ ప్రభుత్వంలో అధికారులపై ఒత్తిడి తెచ్చి మందడం, వెలగపూడి రాయపూడి, ఉద్దండరాయునిపాలెం గ్రామాల్లో అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు చేసినట్లు బయటపడింది. 150 ఎకరాల అసైన్డ్ భూముల అక్రమ కొనుగోలుపై దర్యాప్తు 150 ఎకరాల అసైన్డ్ భూముల అక్రమ కొనుగోలుపై సీఐడీ దర్యాప్తు చేపట్టింది. రాజధాని పరిసరాల్లో 65. 50 సెంట్ల భూమి నారాయణ కొనుగోలు చేశారు. ఆవుల ముని శంకర్ పేరు మీ 4.2 కోట్ల విలువగల భూమి నారాయణ కొనుగోలు చేశారు. 2017 జూన్, జూలై, ఆగస్టులలో భూములు నారాయణ కొనుగోలు చేశారు. వీటితో పాటు పొట్టూరి ప్రమీల పేరు మీద, రావూరి సాంబశివరావు పేరు మీద భూములు కొనుగోలు చేశారు. ఈ భూముల కొనుగోలు సందర్భంగా ముగ్గురి అకౌంట్లలోకి భారీగా నిధులు మళ్లించారు. దీనిలో భాగంగా గతంలో నారాయణ కుమార్తెలు శరాని, సింధూర ఇళ్లలో సైతం సీఐడీ సోదాలు నిర్వహించింది. ఈ మేరకు బ్యాంకు లావాదేవీలు, మణి కూటింగ్ పోన్ కాల్స్ రికార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. తమవారికి లాభం చేకూరేలా అలైన్మెంట్ డిజైన్లు నారాయణ మార్చారు. నారాయణ ఎడ్యుకేషన్ సొపైటీ, నారాయణ లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్, రామనారాయణ ట్రస్టు ద్వారా 17. 5 కోట్ల నిధులు మళ్లించారు. రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సైతం భారీగా నిధుల మళ్లించి, ఆ నిధులను అసైన్డ్ భూమి రైతులకు చెల్లించారు. చదవండి: సాత్విక్ కేసు: రోజు స్టడీ అవర్‌లో జరిగింది ఇదే.. పోలీసుల రిపోర్ట్ -
అమరావతి భూముల దర్యాప్తులో సీఐడీ చేతికి కీలక ఆధారాలు
సాక్షి, హైదరాబాద్: అమరావతి భూముల దర్యాప్తులో సీఐడీ చేతికి కీలక ఆధారాలు లభించాయి. హైదరాబాద్‌లోని నారాయణ కూమార్తెలు, బంధువుల ఇళ్లల్లో జరిపిన సోదాల్లో ఆడియో క్లిప్ లభించింది. నారాయణ, ఆయన కుమార్తె మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. ఇందులో మనీ రూటింగ్ ఎలా చేయాలో కుమార్తెకు నారాయణ వివరించినట్లు సమాచారం. దీని ప్రకారమే మనీ రూటింగ్... తద్వారా అమరావతిలో భూములు కొనుగోలు జరిగినట్లు ఆడియో క్లిప్ ద్వారా తెలుస్తోంది. కాగా, మాజీ మంత్రి నారాయణ కుటుంబ సభ్యుల నివాసాల్లో రెండో రోజు ఏపీ సీఐడీ అధికారుల సోదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ గచ్చిబౌలిలోని మీనాక్షి బాంబుస్, కొండాపూర్‌లోని కోళ్ల లగ్జరియా విల్లాస్లోని నారాయణ, ఆయన కుమార్తెల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు అధికారులు. అమరావతి భూముల కొనుగోళ్లకు సంబంధించి సీఐడీ నమోదు చేసిన కేసుల దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరుగుతున్నాయి. -
నారాయణ సంస్థలపై సీఐడీ దాడులు.. సంచలన విషయాలు వెలుగులోకి!
ఆంద్రప్రదేశ్ మాజీ మంత్రి, ప్రముఖవిద్యా సంస్థల అధినేత పి.నారాయణకు చెందిన సంస్థలపై సీఐడీ అధికారులు చేసిన దాడులలో సంచలన విషయాలే వెలుగులోకి వచ్చినట్లు కనిపిస్తుంది. నిజానికి ఎప్పుడో వీరు కనిపెట్టి ఉండాల్సింది. అయినా న్యాయపరమైన చిక్కులు, తెలుగుదేశం పార్టీకి ఉన్న మేనేజ్ మెంట్ స్కిల్స్ నేపథ్యంలో సీఐడీ స్లో గా వెళుతోందనినుకోవాలి. చాలా కాలం క్రితమే రాజధాని భూముల కుంభకోణంపై కేసులు నమోదు అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై కూడా కేసు పెట్టినా, దానిని ముందుకు తీసుకువెళ్లడానికి పోలీసులు వెనుకాముందాడుతున్నారని చెప్పాలి. ఆయనకు కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు. తాజాగా నారాయణకు చెందిన ఎన్స్పైర్ అనే సంస్థలో పోలీసులు సోదాలు జరపగా, ఆయన నడుపుతున్న షెల్ కంపెనీల బాగోతం కూడా బయటపడిందట. రెండు కంపెనీల పేరుతో సుమారు వెయ్యి కోట్ల రూపాయలు ఎన్ స్పైర్లో పెట్టారట. అక్కడ నుంచి ఆ డబ్బు నారాయణ బంధువుకు చెందిన రామకృష్ణ హౌసింగ్‌కు బదలాయించారు. ఇదంతా అస్సైన్డ్ భూముల కొనుగోలులో వెచ్చించారట.. ఇదంతా బ్లాక్ మనీగా భావిస్తున్నారు. అస్సైన్డ్ భూముల క్రయవిక్రయాలు చెల్లవు. ఆ పాయింట్ ఆధారంగా నారాయణ బినామీలు పెద్ద ఎత్తున బలహీనవర్గాలను భయపెట్టి ఉండాలి. ఆ తర్వాత తాము ఇంత మొత్తం ఇస్తామని చెప్పి వారికి ఆశ కల్పించి ఆ భూములను పొందారన్నది సమాచారం. తదుపరి ఆ భూముల కొనుగోలుకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఉత్తర్వులు తెచ్చారు. తద్వారా అస్సైన్డ్ భూములు వారు స్వాధీనం చేసుకోగలిగారు. దీనిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కేసు విచారణ చేపట్టిన సిఐడికి పలు సంచలన విషయాలు తెలిశాయి. ఇందులో పెద్ద ఎత్తున నల్లధనం వెచ్చించారని కనుగొన్నారు. నిజానికి అమరావతి రాజధానిని రియల్ ఎస్టేట్ వెంచర్ మోడల్ లోనే ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం ముందుకు తీసుకు వెళ్లింది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఎకరా పది లక్షల రూపాయల నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు ఉండేది. పచ్చటి పొలాలు ఉన్న భూములు. ఏడాదికి మూడు పంటలు పండుతాయి. అలాంటి భూములలో రాజధాని పెట్టవద్దని కేంద్రం నియమించిన శివరామకృష్ణ కమిటి స్పష్టంగా సూచించినా, చంద్రబాబు పట్టించుకోలేదు. పైగా భూ సమీకరణ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరదీశారు. అందులో భాగంగా ప్రభుత్వ భూమి ఇరవై ఏకరాలతో పాటు ప్రైవేటు భూములు ముప్పై మూడు వేల ఎకరాలు సమీకరించారు. అందుకు ప్రతిఫలంగా సంబంధిత రైతులకు వారి అర్హతను బట్టి ఎకరాకు యాభై వేల రూపాయల కౌలు, 1450 గజాల వరకు స్థలం కేటాయింపు వంటివి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఒప్పందం ఆధారంగా అనేక మంది రైతులు తమకు వచ్చే ప్లాట్లను ముందుగానే అమ్ముకున్నారు. కొంతమంది తమ పొలాలను అమ్ముకోగా, రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాటిని కొనుగోలు చేసి వారు ప్లాట్లు పొందడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం రోడ్లు,డ్రైనేజీ, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలను ప్రభుత్వం సమకూర్చవలసి ఉంటుంది. ఇందుకోసం లక్షల కోట్ల రూపాయలను వ్యయం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగినది కాదు. స్థోమతకు మించిన పని . రాజధాని కి సంబందించిన కార్యాలయాలు అది కూడా అసెంబ్లీ, సచివాలయం వంటివి తాత్కాలిక ప్రాతిపదికన నిర్మించారు. ఇదిలా ఉండగా, రాజదాని గ్రామాలలో భూముల విలువలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇన్ సైడ్ ట్రేడింగ్ తో పలువురు టిడిపి నేతలు ఈ భూములను ముందుగానే కొనుగోలు చేసి లాభాలు పొందడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా వీరిలో అత్యధికులు నల్లధనాన్నే ఎక్కువగా వెచ్చించారు. ఒక పక్క ఎకరా భూమి కోటి రూపాయల నుంచి నాలుగు కోట్ల రూపాయలకు పెరిగిందని ఘనంగా చంద్రబాబు, మంత్రి నారాయణ వంటివారు చెబుతుండేవారు. అంటే దాని అర్దం ఏమిటి? ఒకపక్క రాజధాని గ్రామాలలో భూముల రిజిస్ట్రేషన్ విలువ గజం ఐదువేల రూపాయలు కాగా, మార్కెట్ విలువ మాత్రం నలభై,ఏభై వేలకు ఉండేది. దాంతో సుమారు ముప్పైవేల నుంచి ముప్పై ఐదు వేల మేర బ్లాక్ మనీని చెల్లించి భూములు కొన్నారన్నమాట. పైగా భూములు అమ్మిన రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదాయపన్ను మినహాయింపు ఇవ్వడానికి వీలుగా కేంద్రాన్ని ఒప్పించారు. ఈ మొత్తం ప్రాసెస్ కొన్ని వేల కోట్ల నల్లధనం చలామణి అయిందని అంచనా. ఆ విషయాలు అన్నీ అప్పుడే అందరికి తెలుసు. చంద్రబాబు అప్పట్లో మోదీ ప్రభుత్వం నియమించిన నల్లధనం వ్యతిరేక కమిటీకి ఆధ్వర్యం కూడా వహించారు. చిత్రం ఏమిటంటే అమరావతిలో మొత్తం నల్లధనం వ్యాపారాన్ని ఆయనే ప్రోత్సహించారు. ఇప్పుడు సిఐడి విచారణలలో ఆధార సహితంగా బయటకు వస్తున్నాయి. ఒక్క నారాయణకు చెందిన షెల్ కంపెనీలే ఈ అస్సైన్డ్ భూములలో వెయ్యి కోట్ల నల్లధనం ఖర్చు చేసిందని అంచనా. ఈ లెక్కన మొత్తం జరిగిన లావాదేవీలలో ఎన్నివేల కోట్ల నల్లధనం చలామణి అయి ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇంతలో ప్రభుత్వం మారడంతో మొత్తం కధ అడ్డం తిరిగింది. వైసిపి ప్రభుత్వం అమరావతి భూ సమీకరణలో , ఇన్ సైడ్ ట్రేడింగ్ లో పెద్ద స్కామ్ లు జరిగాయని కేసులు పెట్టడం, టిడిపి నేతలు కోర్టు నుంచి రక్షణ పొందడం జరిగింది. గత మూడేళ్లుగా ఇక్కడ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టిన టీడీపీ నేతలకు ఇది జీర్ణించుకోలేని విషయంగానే ఉంది. దానికి తోడు ఈ నల్లధనం వ్యవహారం ముందుకు వస్తే అది ఎటువైపు దారితీస్తుందన్న భయం వారిలో ఉంది. దానికి తగ్గట్లే నారాయణ సంస్థల బినామీ బాగోతాన్ని సిఐడి కనుగొంది. ఈ కేసు ముందుకు వెళుతుందా? లేక యధాప్రకారం కోర్టు నుంచి స్టేలు తెచ్చుకుంటారా అన్నది చూడాల్సిందే. - హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్ -
‘అసైన్డ్’ ప్లాట్లు అమ్ముతాం! అమరావతిలో పచ్చ గ్యాంగ్ నయా దందా
సాక్షి, అమరావతి: ‘ప్లాట్లు అమ్ముతాం బాబూ.. అమరావతిలో ప్లాట్లు అమ్ముతాం.. కొంత తక్కువ ధరకే ఇస్తాం.. మంచి అవకాశం.. త్వరగా వచ్చి కొనుగోలు చేయండి.’ ఇదీ అమరావతి పరిరక్షణ సమితిలో కీలకంగా వ్యవహరిస్తున్న కొందరు నేతల తాజా నినాదం. ఇందులో విశేషం ఏముందీ అంటారా.. అక్కడే ఉంది అసలు గుట్టు. అమరావతి కోసం ల్యాండ్ పూలింగ్ కింద ప్రభుత్వం సమీకరించిన భూముల్లో వారికి సంబంధించిన భూమి ఒక్క సెంటు కూడా లేదు. కానీ ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చినట్టుగా కనికట్టు చేసి ప్లాట్లు పొందారు. ఈ బండారం సీఐడీ దర్యాప్తుతో బట్టబయలు అవుతుండటంతో గుట్టు చప్పుడు కాకుండా ఆ ప్లాట్లు విక్రయించి సొమ్ము చేసుకునే యత్నాల్లో నిమగ్నమయ్యారు. అమరావతిలో మరో కొత్త భూదందాకు తెరతీశారు. ఇదీ ఉద్యమ నేత తీరు.. ఆయన అమరావతి పరిరక్షణ సమితి ఉద్యమనేత. టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు కనుసన్నల్లో అమరావతి ఉద్యమాన్ని నడుపుతున్నారు. అమరావతిలో ఆయనకున్న 20 ప్లాట్లను ఒక్కొక్కటిగా అమ్మకానికి పెడుతున్నారు. ల్యాండ్ పూలింగ్ కింద ప్రభుత్వానికి భూములు ఇచ్చిన రైతుల జాబితాలో ఆయన పేరే లేదు. కానీ అసైన్డ్ రైతుల పేరిట అక్రమంగా ఆయనకు గత ప్రభుత్వం 20 ప్లాట్లు కేటాయించింది. రిజిస్టర్ సేల్ డీడ్ కింద వాటిని ఆయన పేరిట రిజస్టర్ చేశారు. అవన్నీ తుళ్లూరు మండలం మందడం పరిధిలోనివే కావడం గమనార్హం. సర్వే నంబర్లు 199, 133, 131, 242, 236, 321, 308, 307, 268, 295, 408, 296, 413, 465తో ఉన్న ఆ ప్లాట్లను ఆయన విక్రయించేందుకు యత్నిస్తుండటం అమరావతిలో చర్చనీయాంశంగా మారింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆ భూములన్నీ పలువురి రైతుల పేరిట ఉన్నాయి. కానీ సీఆర్డీయే రికార్డుల్లో మాత్రం అమరావతి పరిరక్షణ సమితి నేత పేరిట నమోదు కావడం గమనార్హం. ఆ భూముల కొనుగోలుకు ఆసక్తి కనబరిచిన కొందరు సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని సంప్రదించడంతో అసలు విషయం వెలుగుచూసింది. వెంకటపాలెంలో సర్వే నంబరు 295/10, 296/5, మందడంలో సర్వే నంబరు 454/3సీ, కురగల్లులో సర్వే నంబరు 500/1లో ఉన్న ప్లాట్లు కూడా విక్రయించేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. 964 ఎకరాల అసైన్డ్ భూములు కొల్లగొట్టారు అమరావతి పరిధిలోని 29 గ్రామాలతో కూడిన కోర్ క్యాపిటల్ ప్రాంతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో టీడీపీ పెద్దలు అసైన్డ్ భూములను కొల్లగొట్టారు. సీఐడీ దర్యాప్తులో ఈ బండారం మొత్తం బయటపడింది. అమరావతిలో 2014 వరకు అసైన్డ్ భూములు ఎవరి పేరుతో ఉన్నాయి? 2016లో భూ సమీకరణ కింద అసైన్డ్ భూములిచ్చినట్లు సీఆర్డీఏ రికార్డుల్లో పేర్కొన్న పేర్లు ఏమిటన్నది పరిశీలించినప్పుడు టీడీపీ భూ బాగోతం గుట్టు రట్టయింది. రెవెన్యూ రికార్డుల్లో అసైన్డ్ భూముల హక్కుదారుల జాబితాలో ఉన్న రైతుల పేర్లకు, సీఆర్డీఏకు భూములిచ్చిన వారుగా పేర్కొన్న జాబితాలోని పేర్లకు ఎక్కడా పొంతనే లేదు. బడుగు, బలహీన వర్గాల రైతుల స్థానంలో టీడీపీ పెద్దల బినామీలు, సన్నిహితుల పేర్లు కనిపించాయి. ఇలా 29 గ్రామాల పరిధిలో 964.88 ఎకరాలకు సంబంధించి భూ హక్కుదారుల పేర్లను గల్లంతు చేశారు. వాటిలో బడుగు, బలహీన వర్గాలకు కేటాయించిన అసైన్డ్ భూములు 636.75 ఎకరాలున్నాయి. వాటిలో అత్యధిక భాగం టీడీపీ పెద్దలు తమ బినామీల పేరిట కొల్లగొట్టారు. అనంతరం ఆ భూములను ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చినట్టుగా చూపించి ప్లాట్లు తీసుకున్నారు. బినామీలుగా ఉన్నందుకు కొందరు అనుయాయులకు కూడా కొన్ని ప్లాట్లు కేటాయించారు. వారిలో టీడీపీ మంత్రుల వ్యక్తిగత సహాయకులు, అమరావతి ప్రాంతంలో ఆ పార్టీ కార్యకర్తలు మొదలైన వారు ఉన్నారు. ప్రస్తుతం వారే అక్రమంగా పొందిన అసైన్డ్ ప్లాట్లను విక్రయించేందుకు యత్నిస్తున్నారు. ఆ ప్లాట్లను ఎలా విక్రయిస్తారన్నది తాడేపల్లి, మంగళగిరిలో హాట్ టాపిక్‌గా మారింది. సీఐడీ దర్యాప్తుతో బెంబేలు అమరావతి అక్రమాలపై సీఐడీ దరా>్యప్తుతో అసైన్డ్ దొంగలు కలవరపడుతున్నారు. మొత్తం వ్యవహారం నిగ్గు తేలితే తాము అక్రమంగా పొందిన ప్లాట్ల కేటాయింపును రద్దు చేస్తారని వారు ఆందోళన చెందుతున్నారు. దాంతో ఆ ప్లాట్లను గుట్టుచప్పుడు కాకుండా విక్రయించేందుకు యత్నిస్తున్నారు. ప్రధానంగా టీడీపీ నిర్వహిస్తున్న అమరావతి పరిరక్షణ సమితి ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నవారే తమ ప్లాట్లను విక్రయించేందుకు యత్నిస్తుండటం గమనార్హం. భూ సమీకరణ కింద భూములు ఇచ్చిన రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి, వారు మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని న్యాయస్థానం చెప్పింది. దాంతో బోగస్ అమరావతి రైతు ఉద్యమ నేతలకు ఝలక్ ఇచ్చినట్లయింది. గుర్తింపు కార్డులు లేకపోవడంతో పాదయాత్ర నిలిపివేశారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయన్నది స్పష్టత లేదు. దాంతో తాము అక్రమంగా పొందిన ప్లాట్లను గుట్టుచప్పుడు కాకుండా విక్రయించేసి సొమ్ము చేసుకోవాలని భావిస్తున్నారు. భూమి చూపించకుండానే కేవలం సేల్ డీడ్ పత్రాలను చూపించి ప్లాట్ల విక్రయాల దందాకు తెరతీశారు. తుళ్లూరు, మందడం, ఉద్దండరాయునిపాలెం, కురగల్లు, పెనుమాక, నవులూరు తదితర గ్రామాల్లో అక్రమంగా పొందిన అసైన్డ్ ప్లాట్లను విక్రయించేందుకు లావాదేవీలు జోరందుకున్నాయి. -
రాజధాని భూములను ఇతర అవసరాలకు వాడకూడదు
సాక్షి, అమరావతి: రాజధాని కోసం ఇచ్చిన భూములను ఆ ప్రయోజనం కోసం కాకుండా, ఇతర అవసరాలకు ఉపయోగించడం చట్ట విరుద్ధమని అమరావతి రైతుల తరఫు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు బుధవారం హైకోర్టుకు నివేదించారు. రాజధాని నిర్మాణం కోసం ఉపయోగించాల్సిన భూములను ఇతరులకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించడం మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధమని అన్నారు. సీఆర్డీఏ చట్ట సవరణ ద్వారా రాజధానిలో రాజధానేతరులకు ఇళ్ల స్థలాలు కేటాయించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును కోరారు. మధ్యంతర ఉత్తర్వుల జారీ వ్యవహారంలో రైతుల తరఫు న్యాయవాదుల వాదనలు ముగియడంతో ప్రభుత్వం, సీఆర్డీఏ వాదనల నిమిత్తం హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి కూడా ఇళ్ల స్థలాలు మంజూరుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను సవాలు చేస్తూ అమరావతి రైతు సంఘాలు వేర్వేరుగా వేసిన పిటిషన్లు, ఇళ్ల స్థలాలు కేటాయించకుండా యథాతథస్థితి కొనసాగించేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ వేసిన అనుబంధ పిటిషన్లపై జస్టిస్ దుర్గాప్రసాదరావు ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున బి.ఆదినారాయణరావు, కారుమంచి ఇంద్రనీల్ వాదనలు వినిపించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటే తగిన పరిహారం చెల్లించి భూ సేకరణ ద్వారా కేటాయించాలే తప్ప, రాజధాని కోసం తామిచ్చిన భూముల్లో స్థలాలు ఇవ్వడానికి వీల్లేదని అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ద్వారా రాజధాని నగరాన్ని మురికివాడగా మార్చకూడదన్నదే తమ వాదనని తెలిపారు. -
తెలీదు.. గుర్తు లేదు: సీఐడీ విచారణలో ఇదే ‘నారాయణ’ మంత్రం
సాక్షి, అమరావతి/హైదరాబాద్: టీడీపీ హయాంలో అమరావతిలో భూ కుంభకోణాల కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత పి.నారాయణను సీఐడీ అధికారులు హైదరాబాద్‌లో శుక్రవారం విచారించారు. అమరావతిలో ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారులో టీడీపీ ప్రభుత్వ పెద్దలు భారీ కుంభకోణానికి పాల్పడ్డారని సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా నారాయణలతో పాటు మొత్తం 14 మందిపై కొన్ని నెలల క్రితం సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో నారాయణను ఆయన నివాసంలో విచారించేలా న్యాయస్థానం ఇటీవల అనుమతిచ్చింది. దాంతో సీఐడీ అధికారుల బృందం హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలోని ఆయన నివాసంలో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించింది. కాగా, సీఐడీ విచారణకు నారాయణ ఏమాత్రం సహకరించలేదని సమాచారం. సీఐడీ అధికారులు ఏం అడిగినా ‘తెలియదు.. గుర్తు లేదు’ అంటూ సమాధానం దాటవేసేందుకు యత్నించారని తెలిసింది. ఈ కేసులో నారాయణను మరికొన్నిసార్లు విచారించాలని సీఐడీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో నారాయణకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని సీఐడీ అధికారులు దాఖలు చేసిన పిటీషన్ న్యాయస్థానంలో విచారణలో ఉంది. ఇటూ అటూ బాబు బినామీలే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతిలో టీడీపీ పెద్దలు యథేచ్ఛగా సాగించిన భూ దోపిడీలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కూడా ప్రధానమైంది. అప్పటి సీఎం చంద్రబాబు, పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ.. అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ డిజైన్ల ముసుగులో భారీగా భూ దోపిడీకి పాల్పడ్డారన్నది సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. ఇన్నర్ రింగ్ రోడ్డు డిజైన్‌ను ముందుగానే మాస్టర్ ప్లాన్‌లో చేర్చిన విషయాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం గోప్యంగా ఉంచింది. ఆ రోడ్డు అలైన్‌మెంట్‌ను డిజైన్ చేసేందుకు ఎస్టీయూపీ అనే కన్సల్టెన్సీని నియమించినట్టు కథ నడిపించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలా నిర్మించనున్నారో ముందుగానే తెలిసిన చంద్రబాబు, నారాయణలు తమ కుటుంబ సంస్థలు హెరిటేజ్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్‌లతోపాటు తమ బినామీ లింగమనేని రమేష్ సంస్థల పేరిట భారీగా భూములు కొన్నారు. ముందుగానే ఖరారు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్డు డ్రాఫ్ట్ ప్లాన్‌ను చంద్రబాబు నేతృత్వంలో నిర్వహించిన సమీక్షలో ఆమోదించారు. ప్రభుత్వ రహస్యాలను కాపాడుతామని చేసిన పదవీ స్వీకార ప్రమాణానికి విరుద్ధంగా వ్యవహరించి, వారి బినామీలకు అక్రమంగా భారీ ప్రయోజనం కలిగించారు. దాంతో సామాన్యులు తీవ్రంగా నష్టపోయారు. సీఐడీ అధికారులు మంగళగిరి, పెదకాకాని, తాడికొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లను పరిశీలించగా ఈ విషయం స్పష్టమైంది. సీఆర్డీఏ ఫైళ్లు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్ల వివరాలు, ఇతర ఆధారాలను సీఐడీ విభాగం సేకరించి కేసు నమోదు చేసింది. ఇదీ చదవండి: Jagananna Gorumudda: ‘గోరుముద్ద’లో కొత్త రుచులు -
ప్రభుత్వ అధికారాలపై విచారిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వం మారిన తర్వాత ఏర్పడిన నూతన ప్రభుత్వం గత సర్కారు నిర్ణయాలపై దర్యాప్తు చేసే అంశంపై లోతుగా విచారిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. అమరావతి భూముల విషయంలో గత ప్రభుత్వ నిర్ణయాలపై దర్యాప్తు చేయడానికి సిట్ ఏర్పాటుచేసే అధికారం తర్వాత వచ్చిన ప్రభుత్వానికి గవర్నమెంట్‌కు లేదన్న ఏపీ హైకోర్టు ఆదేశాలు సవాల్‌చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. \ అసలు ఇది సీబీఐకి రిఫర్ చేయాల్సిన అంశమని తెలిపారు. అమరావతి భూములపై పలు నోటిఫికేషన్లు ఇచ్చామని, సిట్ ఏర్పాటుచేశామని, పోలీసు నోటీసులు కూడా ఇచ్చామని, అయినా హైకోర్టు మూడు డాక్యుమెంట్లు విస్మరించి సిట్ దర్యాప్తు నిలిపివేసిందన్నారు. రాజకీయ కక్షలు ఉన్నప్పటికీ వాస్తవాలు తెలుసుకోవడానికి దర్యాప్తు చేయడం సమంజసమేనని జగన్నాథరావు కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చిన విషయాన్ని సింఘ్వి ఉటంకించారు. రాష్ట్రంలో కేబినెట్ సబ్ కమిటీ లోతుగా పరిశీలించి కొన్ని సిఫార్సులు చేసిందని ఆ మేరకే సిట్ ఏర్పాటైందన్నారు. కానీ, సిట్ దర్యాప్తునకు దురుద్దేశాలు ఆపాదిస్తూ హైకోర్టు దర్యాప్తు నిలిపివేసిందన్నారు. ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి దర్యాప్తు ఆదేశాలిచ్చే అధికారం ఎందుకు ఉండదని ప్రశ్నించారు. ఒకవేళ రాష్ట్ర దర్యాప్తు సంస్థలపై హైకోర్టుకు అనుమానముంటే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించొచ్చుగా అని తెలిపారు. కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులనే హైకోర్టు తప్పు పట్టిందని, హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చి విచారణ కొనసాగించేలా ఆదేశాలివ్వాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. ఈ సమయంలో గత ప్రభుత్వ నిర్ణయాలపై సక్సెసర్ గవర్నమెంట్ దర్యాప్తు అనేది లార్జర్ ఇంట్రెస్ట్ అని ధర్మాసనం వ్యాఖ్యానించి బుధవారం విచారణ చేపడతామని పేర్కొంది. జాబితాలో టాప్ ఆఫ్ ద బోర్డుగా ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అంతమంది వాదనలు వినడం మా ప్రాక్టీసు కాదు.. అనంతరం.. కొన్ని డాక్యుమెంట్లు సమర్పిస్తామని ప్రతివాది వర్ల రామయ్య తరఫు న్యాయవాది తెలిపారు. ఈ సమయంలో.. ఇది క్వశ్చన్ ఆఫ్ లాకు సంబంధించిన అంశమని, వాస్తవాలు కనిపెట్టే అథారిటీ కాదని, తామేమీ సీబీఐ కానీ, సిట్ కానీ కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆ తర్వాత.. ఆలపాటి రాజేంద్రప్రసాద్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తాను హైకోర్టులో ఒరిజినల్ రిట్ పిటిషనర్‌నని చెప్పారు. దీంతో.. ఎవరో ఒక న్యాయవాది వాదనలే వింటామని ధర్మాసనం స్పష్టంచేసింది. పది మంది ప్రతివాదులు ఉంటే పది మంది న్యాయవాదుల వాదనలు వినడం తమ ప్రాక్టీస్ కాదని పేర్కొంది. ప్రతివాదుల తరఫున ఎవరు వాదిస్తారో నిర్ణయించుకోవాలని సూచించింది. నవంబరు 16న తిరిగి విచారిస్తామంటూ ధర్మాసనం తెలిపింది. -
అమరావతి అసైన్డ్ భూముల కేసులో సాక్షులకు టీడీపీ బెదిరింపులు
సాక్షి, అమరావతి: ఇంటి గుట్టు రట్టు లంకకు చేటు తెచ్చిందని ఆనాడు రావణుడు నేలకొరుగుతూ వాపోయాడు. అమరావతి భూదందా గుట్టు రట్టవడం టీడీపీకి చేటు అంటూ ఇప్పుడు చంద్రబాబు చుర్రుబుర్రులాడుతున్నారు. అమరావతిలో రూ.4,000 కోట్ల అసైన్డ్ భూములు కొల్లగొట్టిన దందా బట్టబయలు కావడంతో సీఐడీ కేసులు నమోదు చేసింది. టీడీపీ నేతలు ఆ భూములు ఎలా కొల్లగొట్టారో కొందరు సాక్షులు సీఐడీకి వివరంగా చెప్పడంతో చంద్రబాబు గొంతులో వెలక్కాయ పడినట్లయింది. టీడీపీ నేతలు నిబంధనలకు విరుద్ధంగా ఈ కేసులో సాక్షుల వాంగ్మూలం కాపీలు దక్కించుకోవడమే కాకుండా .. వాటి ఆధారంగా సాక్షులను బెదిరిస్తున్నారు. చంద్రబాబు, నారాయణ ఒత్తిడితోనే అసైన్డ్ జీవో అమరావతిలో అసైన్డ్ భూములు కొల్లగొట్టిన పచ్చ గద్దల కుట్ర కేసు దర్యాప్తులో భాగంగా సీఐడీ అధికారులు పలువురు ఉన్నతాధికారులు, ఇతర కీలక వ్యక్తులను విచారించారు. టీడీపీ ప్రభుత్వ పెద్దలు, వారి బినామీలు అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను భయభ్రాంతులకు గురి చేసి అసైన్డ్ భూములు కొల్లగొట్టిన వైనంపై ప్రధానంగా దృష్టిసారించారు. టీడీపీ ప్రభుత్వ పెద్దలు ఏకంగా 964 ఎకరాలను అసైన్డ్ భూముల చట్టానికి విరుద్ధంగా హస్తగతం చేసుకున్నారు. ఆ తరువాత అసైన్డ్ భూములకు కూడా భూసమీకరణ కింద ప్యాకేజీ ప్రకటిస్తూ చంద్రబాబు ప్రభుత్వం 2016 ఫిబ్రవరి 17న జీవో 41 జారీ చేసింది. దాంతో ఏకంగా రూ. 4 వేల కోట్ల విలువైన 964 ఎకరాలు చంద్రబాబు బినామీలు, అస్మదీయుల గుప్పిట్లోకి చేరాయి. అసైన్డ్ భూములకు ప్యాకేజీ ప్రకటిస్తూ జీవో ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని ఆనాటి ఉన్నతాధికారులు ఎంతగా చెప్పినా, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ ససేమిరా అన్నారు. వారిద్దరి ఒత్తిడితోనే ఉన్నతాధికారులు జీవో 41 జారీ చేశారు. ఇదే విషయాన్ని ఆ ఉన్నతాధికారులు, ఇతర కీలక వ్యక్తులు సీఐడీ దర్యాప్తులో వెల్లడించారు. ఈ మేరకు సెక్షన్ 164 కింద వాంగ్మూలాలు కూడా ఇచ్చారు. దాంతో చంద్రబాబు సాగించిన భూదందా అధికారికంగా బట్టబయలైంది. ఈ కేసు విచారణ న్యాయస్థానంలో కొనసాగుతోంది. టీడీపీ చేతిలో వాంగ్మూలం కాపీలు.. సాక్షులపై ఒత్తిళ్లు రోజురోజుకు వ్యవహారం ప్రతికూలంగా మారుతుండటంతో అసైన్డ్ భూముల కేసును నీరుగార్చేందుకు చంద్రబాబు అండ్ కో తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఈ కేసులో సాక్షులను లక్ష్యంగా చేసుకున్నారు. సీఐడీకి సాక్షులు సెక్షన్ 164 కింద ఇచ్చిన వాంగ్మూలం ప్రతులను నిబంధనలకు విరుద్ధంగా సంపాదించారు. వీటిలో సాక్షులు వెల్లడించిన వాస్తవాలతో చంద్రబాబు బ్యాచ్‌కు ముచ్చెమటలు పడుతున్నాయి. దాంతో సాక్షులపై ఒత్తిళ్లు, పరోక్ష బెదిరింపులకు పాల్పడుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ‘మనం మనం’ ఒకటి కదా అంటూ బతిమాలుతూనే, బెదిరింపులకూ పాల్పడుతున్నట్లు సమాచారం. తమ వర్గాల ద్వారా వేర్వేరు మార్గాల్లో ఒత్తిళ్లు తీవ్రతరం చేశారు. దాంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాము ఇచ్చిన వాంగ్మూలం కాపీలు టీడీపీ చేతుల్లోకి పోవడంతో అసైన్డ్ భూముల కేసులో కీలక సాక్షులు ఆందోళన చెందుతున్నారు. అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ ఎంతకైనా తెగిస్తుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అందుకే ఈ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకురావాలని భావిస్తున్నట్టు సమాచారం. చదవండి: మూడేళ్లుగా ఏపీ నంబర్ వన్.. ఇదీ మన ఘనత -
అమరావతిలో అందరికీ ఆవాసం
సాక్షి, అమరావతి: సామాన్యులకూ ఇకపై అమరావతి ప్రాంతంలో ఇల్లు కట్టుకుని స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం చట్ట ప్రకారం కల్పించింది. అక్కడ బయటి వారు నివసించకుండా న్యాయ వివాదాలతో అడ్డుకుంటున్న విపక్షాల కుట్రలను ఛేదిస్తూ మంగళగిరి, తుళ్లూరు మండలాల్లోని 5 గ్రామాల్లో 900.97 ఎకరాలను ఆర్–5 జోన్‌గా చట్ట ప్రకారం ఏర్పాటు చేసింది. ఆర్థికంగా వెనుకబడ్డ ప్రజలంతా ఎలాంటి ఆంక్షలు లేకుండా గృహాలను నిర్మించుకునేందుకు అవకాశం కల్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చట్టం చేసింది. ఈ మేరకు కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, మందడం, ఇనవోలు గ్రామాలను కొత్త జోన్ పరిధిలోకి తెచ్చింది. 2020లోనే ఈ ప్రాంతంలో సామాన్యులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం కాగా విపక్షాలు న్యాయ వివాదాలు సృష్టించాయి. చట్ట ప్రకారమే 5 శాతం సీఆర్డీఏ చట్టం 2014 సెక్షన్–53 (డి) ప్రకారం మొత్తం విస్తీర్ణంలో ఐదు శాతం భూమిని ల్యాండ్ పూలింగ్ కింద పేదల నివాసాలకు కేటాయించవచ్చు. అందుకోసం స్థానిక సంస్థలు లేదా ప్రత్యేకాధికారుల అనుమతితో మాస్టర్ ప్లాన్ లేదా జోనల్ డెవలప్మెంట్ ప్లాన్‌కు తగినట్లుగా మార్పులు చేయవచ్చు. ఆ ప్రకారమే ఆర్–5 జోన్ ఏర్పాటు కానుంది. దీనిపై అభ్యంతరాల స్వీకరణకు 15 రోజులు గడువిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. పరిశ్రమలు, వ్యాపార సముదాయాలు, కాలుష్య రహిత కార్యకలాపాలు లాంటి వాటిని పది అంతర్గత జోన్లుగా పేర్కొంది. ఆయా ప్రాంతాల్లో పాటించే నిబంధనలను గెజిట్‌లో పొందుపరిచింది. పేదలకు మేలు జరిగితే సహించని ‘ఈనాడు’ నిరుపేదలు, ఆర్థికంగా వెనుబడినవారికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 35 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలను అందచేసింది. సొంతిల్లు లేనివారు ఉండరాదనే ఉద్దేశంతో అన్ని నియోజకవర్గాలు, పట్టణాలు, పంచాయితీల్లో సైతం ల్యాండ్ పూలింగ్ విధానాన్ని తెచ్చింది. ఆయా ప్రాంతాల్లో సొంతిల్లు లేనివారు దరఖాస్తు చేసుకుంటే ఎప్పుడైనా నిబంధనల మేరకు స్థలం కేటాయించేలా ఉత్తర్వులిచ్చింది. ఇదే విధానాన్ని అమరావతి ప్రాంతంలోనూ అనుసరించనుంది. శాసన రాజధానిలో సామాన్యులు సైతం కాలు మోపేలా అవకాశం కల్పిస్తుంటే సహించలేని ‘ఈనాడు’ విషం కక్కుతోంది. సీఎం జగన్ పేదల పక్షపాతి పేదలు నివసించలేని రాజధాని అందరి రాజధాని ఎలా అవుతుంది? రాజధాని గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ సీఆర్డీఏ చట్టానికి సవరణ చేయడం అభినందనీయం. అన్ని వర్గాలకు చోటు కల్పించినప్పుడే అది అందరి రాజధాని అవుతుంది. ముఖ్యమంత్రి జగన్ ఎల్లప్పుడూ పేదల పక్షాన ఉంటానని మరోసారి నిరూపించారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలను అడ్డుకుంటే అది మూర్ఖత్వమే. – రేటూరి కిషోర్, సీనియర్ న్యాయవాది (మంగళగిరి) సామాజిక న్యాయం అంటే ఇదీ.. రాజధాని అంటే అన్ని వర్గాల ప్రజలు నివసించేదిలా ఉండాలి. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలిస్తే సామాజిక సమతుల్యత దెబ్బ తింటుందని అనడం ఒక్క వర్గం ప్రజలపై వివక్ష చూపడమే అవుతుంది. సీఎం జగన్ ప్రభుత్వం అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ చట్ట సవరణ చేయడం గొప్ప పరిణామం. సామాజిక న్యాయం అంటే ఇదీ. – మునగాల మల్లేశ్వరరావు, రాజకీయ నేత, మంగళగిరి అన్ని వర్గాలుండాలి ప్రజా రాజధాని అంటే అన్ని వర్గాల ప్రజలుండాలి. కోటీశ్వరుడి నుంచి కూటి కోసం తిప్పలు పడే వారి వరకు అందరికీ చోటివ్వాలి. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతాలో అన్ని వర్గాల ప్రజలున్నారు. అమరావతిలో మాత్రం పేదలు వద్దని టీడీపీ నేతలు అనడం అన్యాయమే. ఆర్–5 జోన్ ఏర్పాటు మంచి నిర్ణయం. – వై.జయరాజు, న్యాయవాది (కర్నూలు) గొప్ప విషయం.. అమరావతి ప్రాంతంలో బయటివారు నివాసాలు ఏర్పాటు చేసుకోరాదని టీడీపీ కోర్టుల్లో కేసులు పెట్టింది. రాష్ట్రంలో ప్రజలు ఎక్కడైనా స్వేచ్ఛగా స్థలం కొని ఇల్లు కట్టుకునేలా జగనన్న ప్రభుత్వం అవకాశం కల్పించింది. సీఎం జగన్ గొప్ప పని చేశారు. ప్రతిపక్షం కోర్టులకు వెళ్లడం సిగ్గుచేటు. – రామాంజనేయులు, డీసీసీబీ డైరెక్టర్, బ్రహ్మసముద్రం సముచిత నిర్ణయం పేదల కోసం సీఆర్డీఏ చట్టాన్ని సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నాం. ప్రాంతం ఏదైనా అన్నిచోట్లా అందరికీ జీవించే హక్కు ఉంటుంది. ఆర్థిక స్తోమతను బట్టి ఫలానా వ్యక్తులు మాత్రమే ఉండాలనడం సరికాదు. రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షాన ఆలోచించి సముచిత నిర్ణయం తీసుకుంది. – ఏలూరి సుబ్రహ్మణ్యం, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, కాకినాడ పేదల పక్షపాతి అర్హులైన పేదలకు అమరావతి ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కేటాయించడం సరైన నిర్ణయం. దీన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ కోర్టులకెక్కి అడ్డుకుంది. పేదలకు న్యాయం చేకూర్చాలనే దృఢసంకల్పంతో ముఖ్యమంత్రి జగన్ ముందడుగు వేశారు. పేదల పక్షపాతిగా మరోసారి రుజువు చేసుకున్నారు. – కాపు రామచంద్రారెడ్డి, ప్రభుత్వ విప్(రాయదుర్గం) హర్షిస్తున్నాం.. అమరావతిని ఒక సామాజిక వర్గానికే పరిమితం చేస్తూ టీడీపీ సర్కారు సీఆర్డీఏ చట్టంలో పలు నిబంధనలు పెట్టి స్వార్ధపూరితంగా వ్యవహరించింది. సీఎం జగన్ 900.97 ఎకరాలను పేదల నివాసానికి కేటాయించడం హర్షించదగ్గ విషయం. పేద ప్రజలకు మేలు చేసే అమరావతిలో మరిన్ని సంస్కరణలు తేవాలి. – చింతా కృష్ణయ్య, సీనియర్ న్యాయవాది, ధర్మవరం తప్పిదాన్ని సరిదిద్దారు.. రాజధాని ప్రాంతంలో పేదలకు చోటు కల్పించకుండా కులవాదులు అంతా ఏకమయ్యారు. పేదలకు స్థలాలిస్తే సామాజిక అసమతుల్యత ఏర్పడుతుందని కోర్టుల్లో కేసులు వేశారు. చారిత్రక తప్పిదాన్ని సీఎం జగన్ సరిచేశారు. పేదలు, బడుగులకు 900 ఎకరాలు కేటాయించడం గొప్ప విషయం. అసమానతలు లేని సమాజ నిర్మాణానికి ఇది దారి తీస్తుంది. – మాదిగాని గురునాథం, సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు (విజయవాడ) (తుళ్లూరులో ముడు రాజధానుల శిబిరం నిర్వాహక నాయకులు) సామాజిక సమత్యులత సాకారం అమరావతిలో టీడీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే సీఎం జగన్ పేదలకు 900 ఎకరాలకుపైగా కేటాయించటం సంతోషకరం. ఇకపై పేదలు, మధ్య తరగతి, సామాన్య వర్గాలు సైతం అమరావతి మా రాజధాని అనే చెప్పుకునేలా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుంది. సామాజిక సమతుల్యత స్పష్టంగా కనిపిస్తోంది. –– పోలూరి వెంకటరెడ్డి, బార్ అసోసియేషన్, మాజీ అధ్యక్షుడు అణగారిన వర్గాలకు పెద్దపీట.. అణగారిన వర్గాలకు పెద్దపీట వేసేలా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సాహసోపేతం. టీడీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం, దోపిడీ కోసమే వేలాది ఎకరాలను లాక్కున్నారు. కనీసం సాగు భూమిని వదిలివేయాలన్న ఆలోచన కూడా లేకుండా భూ దాహంతో వ్యవహరించారు. రాజధాని అంటే సంపన్న వర్గాలకే కాకుండా అణగారిన వర్గాలకు కూడా చోటు కల్పించాలి. ––– చెన్నంశెట్టి చక్రపాణి (విశ్రాంత ఎస్పీ, న్యాయవాది) -
గన్ షాట్ : ఫేక్ యాత్రకు బ్రేక్
-
రైతుల ముసుగులో నకిలీలు
-
అమరావతి అసైన్డ్ అక్రమాలు.. పచ్చ గద్దల కొత్త చిట్టా
వడ్డాది శ్రీనివాస్ ఊరందరిదీ ఒక దారైతే, ఉలిపికట్టెది మరోదారన్న సామెత చంద్రబాబుకు, ఆయన పచ్చ గ్యాంగ్‌కు అతికినట్లు సరిపోతుంది. ఏమీ లేని అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలని వారు మాత్రమే డిమాండ్ చేస్తుండగా.. యావత్ రాష్ట్ర ప్రజలంతా అన్ని ప్రాంతాల అభివృద్ధిని కాంక్షిస్తూ మూడు రాజధానులకు జై కొడుతున్నారు. న్యాయమైన వీరందరి ఘోషను ఏమాత్రం వినిపించుకోని బాబు అండ్ కో ఎందుకు ఇంతగా ఒక్క అమరావతి కోసమే పట్టుపట్టిందంటే వాస్తవాలు విస్తుగొలుపుతున్నాయి. భూ సమీకరణకు అవతల కారుచౌకగా కొట్టేసిన భూములను కాపాడుకునేందుకే ఈ తాపత్రయమని స్పష్టమవుతోంది. ఆ భూములను బంగారు బాతుగా మార్చుకునే అవకాశం చేజారిపోతోందన్న భయం వారిని బెంబేలెత్తిస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అసైన్డ్ భూములను ఎల్లో గ్యాంగ్ కాజేసే నాటికే ఆ ప్రాంతంలో ఎకరం రూ.కోటి పలుకుతోంది. ప్రభుత్వం లాక్కుంటే ఏమీ ఇవ్వదనే ఆందోళనతో అసైన్డ్ రైతులు తమ భూములను చంద్రబాబు బినామీలకు విక్రయించారు. ఆ తర్వాత వాటిని టీడీపీ నేతలే ఇచ్చినట్లు సీఆర్డీఏ రికార్డుల్లో నమోదైంది. ప్రభుత్వ పోరంబోకు భూములను కూడా టీడీపీ నేతలే భూ సమీకరణ కింద ఇచ్చినట్టు రికార్డుల్లో పొందుపరిచారు. ఈ కుట్ర అంతా 2014 జూన్ నుంచి 2015 డిసెంబర్‌లోగా పూర్తి చేశారు. ఆ తర్వాత తాపీగా అసైన్డ్ భూములకు కూడా పరిహారం చెల్లిస్తామంటూ 2016 ఫిబ్రవరి 17న గత సర్కారు జీవో 41 జారీ చేసింది. ఇలా టీడీపీ పెద్దలు ఏకంగా 964 ఎకరాలకుపైగా అసైన్డ్ భూములను హస్తగతం చేసుకున్నారు. నాటి సీఎం చంద్రబాబు అధికారికంగా వెల్లడించిన ప్రకారమే అభివృద్ధి చేసిన తర్వాత అమరావతిలో భూముల విలువ ఎకరా కనీసం రూ.4 కోట్లు. అంటే వారు సొంతం చేసుకున్న అసైన్డ్ భూముల విలువ ఏకంగా రూ.4 వేల కోట్లు! అప్పటికే రాజధాని ఎక్కడ వస్తుందో వారికి ముందే తెలుసు కాబట్టి చంద్రబాబు, టీడీపీ నేతలు అమరావతిలో భూ సమీకరణ పరిధికి అవతల వేలాది ఎకరాలను బినామీల పేరిట కొనుగోలు చేశారు. వాటి విలువ కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది. అసైన్డ్ భూముల దోపిడీ వాటికి అదనం. అమరావతిలో టీడీపీ నేతలు కొల్లగొట్టిన అసైన్డ్ భూములు (మార్క్ చేసినవి) 964 ఎకరాల అసైన్డ్ భూములు కొల్లగొట్టారు అమరావతి పరిధిలోని 29 గ్రామాలతో కూడిన ప్రాంతాన్ని కోర్ క్యాపిటల్‌గా చంద్రబాబు సర్కారు మాస్టర్ ప్లాన్‌లో ప్రకటించింది. అదే ప్రాంతంలో ఎల్లో గ్యాంగ్ అసైన్డ్ భూములను కాజేసింది. 2014 వరకు అసైన్డ్ భూములు ఎవరి పేరుతో ఉన్నాయి? 2016లో భూ సమీకరణ కింద అసైన్డ్ భూములిచ్చినట్లు సీఆర్డీఏ రికార్డుల్లో పేర్కొన్న పేర్లు ఏమిటి? అనే విషయంపై అధికారుల దర్యాప్తులో బండారం మొత్తం బయట పడింది. రెవెన్యూ రికార్డుల్లో అసైన్డ్ భూముల హక్కుదారుల జాబితాలో ఉన్న రైతుల పేర్లకు, సీఆర్డీఏకు భూములిచ్చిన వారుగా పేర్కొన్న జాబితాలోని పేర్లకు ఎక్కడా పొంతనే లేదు. ఆ స్థానంలో టీడీపీ పెద్దల బినామీలు, సన్నిహితుల పేర్లు కనిపించాయి. ఇలా 29 గ్రామాల పరిధిలో 964.88 ఎకరాలకు సంబంధించి భూ హక్కుదారుల పేర్లను గల్లంతు చేశారు. అందులో 20 గ్రామాల పరిధిలో బడుగు, బలహీన వర్గాలకు కేటాయించిన అసైన్డ్ భూములు 636.75 ఎకరాలున్నాయి. ఇక ప్రభుత్వ పోరంబోకు భూములను కూడా వదల్లేదు. ఏకంగా 328.13 ఎకరాల ప్రభుత్వ భూములను టీడీపీ పెద్దలు తమ బినామీల ఆధీనంలో ఉన్నట్లుగా రికార్డులు తారుమారు చేశారు. 2014 నాటి రెవెన్యూ రికార్డుల్లో సర్వే నంబర్లతో సహా ఉన్న వివరాలకు, భూ సమీకరణ కింద తీసుకున్నట్లు సీఆర్డీఏ రికార్డుల్లో ఉన్న వివరాలు సరిపోలడం లేదు. ఆ భూములన్నీ అసైన్డ్ జాబితాలోని 3, 4 కేటగిరీల కిందకు వస్తాయి. వెరసి టీడీపీ పెద్దలు ఏకంగా 964.88 ఎకరాల అసైన్డ్ భూములను కాజేశారు. ఇదిగో.. దందా ఇలా.. ►అమరావతి పరిధిలోని వెంకటపాలెం రెవెన్యూ సర్వే నంబరు 295/10తో ఉన్న 1.02 ఎకరాల అసైన్డ్ భూమి రికార్డుల ప్రకారం గొర్రెముత్తు కాంతారావు అనే రైతు పేరిట 2015 వరకు ఉంది. కానీ ఆ భూమిని భూ సమీకరణ కింద ఇచ్చినట్లుగా సీఆర్డీఏ రికార్డుల్లో బడే ఆంజనేయులు పేరుతో ఉంది. అందుకు ప్రతిగా రాజధానిని అభివృద్ధి చేసిన తర్వాత ఎకరాకు 800 గజాల కమర్షియల్ స్థలం, 200 గజాల నివాస స్థలాన్ని బడే ఆంజనేయులుకు ఇస్తామని సీఆర్డీఏ ఒప్పందం చేసుకుంది. అసైన్డ్ భూమి హక్కుదారు కాంతారావు కాగా, సీఆర్డీఏ ఒప్పందం చేసుకుంది మాత్రం బడే ఆంజనేయులతో కావడం గమనార్హం. ►అమరావతిలోని మందడంలో ‘454/3సీ’ సర్వే నంబరుతో 1.50 ఎకరాల అసైన్డ్ భూమి పిల్లి వెంకయ్య అనే రైతుకు అసైన్ చేసినట్లు రెవెన్యూ రికార్డుల్లో ఉంది. అదే భూమిని గుమ్మడి సురేశ్ భూ సమీకరణ కింద ఇచ్చినట్లు సీఆర్డీఏ రికార్డుల్లో నమోదైంది. ఎకరాకు 800 గజాల కమర్షియల్ స్థలం, 200 గజాల నివాస స్థలం గుమ్మడి సురేశ్‌కు ఇస్తామని సీఆర్డీఏ ఒప్పందం చేసుకుంది. అసైన్డ్ భూమి హక్కుదారు వెంకయ్య కాగా, సీఆర్డీఏ నుంచి అభివృద్ధి చేసిన భూమిని పొందేది గుమ్మడి సురేశ్. సీఆర్డీఏ రికార్డుల్లో ఇలాంటి చిత్రాలెన్నో కనిపిస్తాయి. వీరంతా పాత్రధారులు కాగా, అసలు సూత్రధారులు టీడీపీ పెద్దలే. ►వెంకటపాలెంలో సర్వే నంబరు 296/5తో ఉన్న 0.94 ఎకరాల అసైన్డ్ భూమి అన్నూరి హేమలత అనే రైతు పేరిట రెవెన్యూ రికార్డుల్లో ఉంది. కానీ ఆ భూమిని భూ సమీకరణ కింద కొట్టి కృష్ణ దొరబాబు ఇచ్చినట్లు సీఆర్డీఏ రికార్డుల్లో నమోదు చేశారు. ►కురగల్లు సర్వే నంబరు 500/1తో ఉన్న 0.72 ఎకరాలు కత్తిపోగు కోటేశ్వరరావు పేరిట రెవెన్యూ రికార్డుల్లో ఉంది. ఈ భూమిని శీలం శ్రీను అనే వ్యక్తి ఇచ్చినట్లు సీఆర్డీఏ రికార్డుల్లో ఉంది. ఇదే గ్రామంలో సర్వే నెం 501/1తో ఉన్న 0.80 ఎకరాల అసైన్డ్ భూమి బుల్ల కోటమ్మ పేరిట రెవెన్యూ రికార్డుల్లో ఉండగా, గడిపర్తి శ్రీను సీఆర్డీఏకు ఇచ్చినట్లు నమోదైంది. పాదయాత్ర అసలు గుట్టు ఇదే.. అమరావతిలో బినామీల పేరిట అసైన్డ్ భూములను కాజేసిన టీడీపీ నేతలు భూ సమీకరణ పరిధికి అవతల కూడా వేలాది ఎకరాలు కొనుగోలు చేశారు. వాటిలో చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ కంపెనీ, ఆయన సన్నిహితుడు లింగమనేని రమేశ్, బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్ కుటుంబం, పి.నారాయణ, పరిటాల సునీతలతోపాటు టీడీపీ హయాంలో మంత్రులు, ఆ పార్టీ ప్రజాప్రతినిధులకు చెందిన వేలాది ఎకరాలున్నాయి. ఆ భారీ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం కోసమే మూడు రాజధానుల విధానాన్ని చంద్రబాబు అండ్ కో వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతూ రైతుల ముసుగులో పెత్తందారులు, రియల్ ఎస్టేట్ సిండికేట్ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ, సీఆర్డీఏ రికార్డుల సాక్షిగా బట్టబయలైంది. ఓ బ్రాహ్మణుడు పాల కోసం మేకను కొనుక్కొని వెళ్తుంటే దారిలో ముగ్గురు దొంగలు ఒకరి తర్వాత ఒకరు అటకాయించి అది మేక కాదు.. కుక్క అని నమ్మబలుకుతారు. ముగ్గురూ అదే మాట చెప్పడంతో ఆయన తన వెంట ఉన్నది కుక్కేనని భ్రమించి మేకను వదిలేసి వెళ్లిపోతాడు. ఇదే అదనుగా కాచుకున్న ఆ ముగ్గురు దొంగలు మేకను అపహరిస్తారు. ఈ కథ దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. సరిగ్గా అదే రీతిలో గత ప్రభుత్వ హయాంలో పచ్చ దొంగలు అమరావతిపై గద్దల్లా పడ్డారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన రైతులను భయాందోళనలకు గురిచేసి.. అసైన్డ్ భూములు, ప్రభుత్వ పోరంబోకు భూములను కాజేశారు. అసైన్డ్ భూములకు ఎలాంటి పరిహారం రాదంటూ రెవెన్యూ, సీఆర్డీఏ అధికారుల ద్వారా బెదిరించి కారుచౌకగా కొట్టేశారు. ఆ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతి జపం చేస్తున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిని అడ్డుకుంటూ మూడు రాజధానులపై విషం చిమ్ముతున్నారు. -
అమరావతి పాదయాత్రకు బ్రేక్
-
బిగ్ క్వశ్చన్ : ఇప్పటికైనా పాదయాత్రలో ఓవర్ యాక్షన్ తగ్గిస్తారా ..?
-
KSR కామెంట్ : అమరావతి దారుణాలను ఏనాడూ రాయని ఎల్లో మీడియా
-
అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు చట్టసవరణకు గవర్నర్ ఆమోదం
-
అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు చట్టసవరణకు గవర్నర్ ఆమోదం
సాక్షి, అమరావతి: అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుకు ఉద్ధేశించిన చట్టసవరణలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. అర్హులైన పేదలకు అమరావతిలో ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు చట్ట సవరణ చేశారు. సీఆర్డీఏ, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్, ఆర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్ట సవరణలకు ఆమోదం తెలుపుతూ గవర్నర్ గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. పాలకవర్గంతోపాటు ప్రత్యేక అధికారి కూడా నిర్ణయం తీసుకునేలా సీఆర్డీఏ చట్ట సవరణ చేశారు. మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేసేందుకు అవకాశం కల్పిస్తూ గవర్నర్ నోటిఫికేషన్ ఇచ్చారు. రాజధాని ప్రాంతంలోని వారికే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేలా ఈ చట్ట సవరణ చేశారు. చదవండి: ఆ భూములపై రైతులకు అన్ని హక్కులు కల్పిస్తున్నాం: సీఎం జగన్ -
బిగ్ క్వశ్చన్ : చంద్రబాబు డైరెక్షన్ ... పవన్ కళ్యాణ్ యాక్షన్
-
జగనన్న ప్రగతి రథసారథి.. చంద్రబాబు రియల్టర్ల వారధి
సాక్షి, తణుకు: ప.గో.జిల్లా తణుకు నియోజకవర్గంలోకి ప్రవేశించిన అమరావతి రైతుల పాదయాత్రకు నిరసన సెగ తగిలింది. తణుకు నియోజకవర్గ వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. గో బ్యాక్ గో బ్యాక్ ఫేక్ యాత్రికులారా అంటూ వివిధ నినాదాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అమరావతి పేరుతో టీడీపీ, చంద్రబాబు అండ్ కో చేస్తున్న కుతంత్రాలపై ఫ్లెక్సీలతో నిరసన వ్యక్తం చేశారు. తణుకు నియోజకవర్గంలోని పోస్టర్లలో నినాదాలు ఇలా ఉన్నాయి.. ► రియల్ ఎస్టేట్ వద్దు.. ఆంధ్రాస్టేట్ ముద్దు ► జగన్ ది స్టేట్ గురించి ఆలోచన.. చంద్రబాబుది రియల్ ఎస్టేట్ గురించి ఆలోచన ► జగన్ కోరుకొనేది అందరి అభివృద్ధి.. చంద్రబాబు కోరుకునేది అస్మదీయుల అభివృద్ధి ► జగన్ ది సమైక్యవాదం.. చంద్రబాబుది భ్రమరావతి నినాదం ► జగన్ ది అభివృద్ధి మంత్రం.. చంద్రబాబు ది రాజకీయ కుతంత్రం ► రాష్ట్రం కోసం జగన్ ఆరాటం.. 29 గ్రామాల కోసం బాబు నకిలీ పోరాటం ► మూడు రాజధానులకు ప్రజా ఆమోదం.. చంద్రబాబు అండ్ కో రియల్టర్లకు ఖేదం ► జగనన్న ప్రగతి రథసారథి.. చంద్రబాబు రియల్టర్ల వారధి ► చంద్రబాబు పార్టీ షేక్ పాదయాత్ర ఫేక్ ► అన్ని ప్రాంతాల అభివృద్ధి జగనన్న ఆకాంక్ష.. అయిన వారు బాగు కోసమే వికేంద్రీకరణకు బాబు వివక్ష ► వికేంద్రీకరణ ముద్దు.. ప్రాంతాల మధ్య వివక్ష వద్దు ► హైదరాబాద్ ప్రయోగం అన్యుల పాలు.. అమరావతి ప్రయోగం చంద్రబాబు అండ్ కోకే మేలు -
అమరావతి రైతుల పాదయాత్రకు నిరసన సెగ
-
పాలకొల్లులో అమరావతి రైతుల పాదయాత్రకు నిరసన సెగ
-
పొలిటికల్ కారిడార్ : అమరావతి పాదయాత్రలో పాల్గొనేవారికి రోజుకు రెండు వేలు
-
అమరావతి రైతుల పేరుతో జరిగే యాత్రను నిలిపివేస్తే మంచిది : మంత్రి గుడివాడ అమర్నాథ్
-
బిగ్ క్వశ్చన్ : గో బ్యాక్ భ్రమరావతి పేరుతో ఫ్లెక్సీలు
-
పొలిటికల్ కారిడార్ : ఉత్తరాంధ్ర నేతలకు చంద్రబాబు బెదిరింపులు
-
ఏ ఒక్క వర్గానికో మేలు చేసే ప్రభుత్వం మాది కాదు : బొత్స సత్యనారాయణ
-
అభివృద్ధి అంతా ఒకేచోట ఉండిపోతేనే ఉద్యమాలు : చెల్లుబోయిన
-
KSR కామెంట్ : ఉత్తరాంధ్రలో వ్యక్తమవుతున్న వ్యతిరేకత
-
తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు: మంత్రి బొత్స
సాక్షి, విజయవాడ: పాదయాత్ర ముసుగులో టీడీపీ చేస్తోంది రియల్ ఎస్టేట్ యాత్ర అని ప్రజలు గ్రహించాలని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన బొత్స.. ‘విశాఖ వచ్చి రాజధాని వద్దు అంటే ఆ ప్రాంత ప్రజలు ఎందుకు ఒప్పుకుంటారు. పాదయాత్రను రైతుల ముసుగులో టీడీపీ చేస్తోంది. అది రియల్ ఎస్టేట్ యాత్ర అని తెలుసుకోవాలి. లాండ్ పూలింగ్‌లో భూములు ఇవ్వడం ఇది మొదటిసారి కాదు కదా? పోలవరంకు ఇస్తే త్యాగం చేసినట్లు. అమరావతిలో భూములు ఇచ్చిన వారికి మంచి పరిహారం ఇచ్చాం. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి మా ప్రభుత్వం విధానం. రైతులకు ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం ముందుకెళ్తాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత లెక్కలు తీస్తే ఉత్తరాంధ్ర బాగా వెనుకబడి ఉంది. ఐదు లక్షల కోట్లు మట్టిలో పోసి తగలెయ్యాలా? 10 వేల కోట్లతో విశాఖ అభివృద్ధి చెందతుంది. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్రకు అనేక ప్రాజెక్టులు తెచ్చాను.’ అని స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఇదీ చదవండి: సీఎం జగన్ స్పీచ్ ముందు ఆ నిరసనలకు విలువే లేకుండా పోయింది -
తగ్గిన సీఆర్డీఏ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ధరలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీ సీఆర్డీఏ) ఎన్టీఆర్ , గుంటూరు జిల్లాల పరిధిలోని నాలుగు టౌన్షిప్ లలో ఉన్న ప్లాట్ల రిజిస్ట్రేషన్ ధరలను భారీగా తగ్గించింది. గతంలో నిర్ణయించిన ధరలు అధికంగా ఉండడంతో కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో అధికారులు ఆ ప్లాట్లకు అమ్మకపు ధర, అభివృద్ధి చార్జీలను వేర్వేరుగా విభజించారు. అందులో అమ్మకపు ధరకే రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించేలా మార్పు చేశారు. ప్లాట్ ధరలో నికర ధర 60 శాతంగా, అభివృద్ధి చార్జీలు 40 శాతంగా నిర్ణయించారు. ప్లాట్ నికర ధర 60 శాతానికి రిజిస్ట్రేషన్ ఫీజు ఎంతయితే అంత చెల్లిస్తే సరిపోతుంది. గతంలో ప్లాట్ ధర మొత్తానికి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి వచ్చేది. ఇది కొనుగోలుదారులకు భారంగా ఉండేది. దీంతో ఈ మార్పు చేశారు. పైగా, నికర ధరను ప్లాట్ పొందిన మూడు రోజుల్లో పది శాతం మాత్రమే చెల్లించాలి. మిగిలిన నికర ధర, అభివృద్ధి చార్జీలను ఏడాదిలో నాలుగు వాయిదాలుగా చెల్లించే అవకాశం కూడా కల్పించింది. కొనుగోలుదారులు ఒప్పందం కుదిరిన 5 నెలల లోపు మొత్తం ప్లాట్ ధరను ఒకేసారి చెల్లిస్తే అదనంగా 5 శాతం రాయితీ కూడా సీఆర్డీఏ ప్రకటించింది. వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకుని రిజిస్ట్రేషన్ విధానంలో మార్పులు చేసినట్లు సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ తెలిపారు. నగరం మధ్యలో, అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఉన్న ఈ ప్లాట్లను ఇప్పుడు సామాన్యులు సైతం కొనేలా మార్పులు చేశామని, సులభమైన వాయిదా పద్ధతుల్లో నగదు చెల్లించేందుకు కూడా అవకాశం కల్పించినట్టు చెప్పారు. ఫోన్ ఓటీపీ ద్వారా ప్లాట్ల కొనుగోలుకు పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు. విజయవాడ పాయకాపురం టౌన్షిప్, ఇబ్రహీంపట్నం ట్రక్ టెర్మినల్, తాడేపల్లి–మంగళగిరి కార్పొరేషన్ పరిధిలోని అమరావతి టౌన్షిప్, తెనాలి చెంచుపేటలో నివాస, వాణిజ్య అవసరాలకు అనుగుణంగా మొత్తం 424 ప్లాట్లు ఉన్నాయి. ప్లాట్లు, ధరల వివరాలు సోమవారం నుంచి ఆన్లైన్లో ఉంటాయని, ఆసక్తి గలవారు https:// konugolu.ap.gov.in,, లేదా https://crda.ap.gov.in వెబ్సైట్లో అక్టోబర్ 10వ తేదీలోగా వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ ఫీజు 10 శాతం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ సూచించారు. ప్లాట్లకు అక్టోబర్ 13న ఈ–వేలం నిర్వహిస్తామన్నారు. ఇతర వివరాలకు 0866–2527124 నంబర్లో సంప్రదించవచ్చని చెప్పారు. ఈ ప్లాట్ల అమ్మకం ద్వారా వచ్చే మొత్తాన్ని అమరావతి ప్రాంతంలో మౌలిక వసతుల అభివృద్ధికి వెచ్చిస్తామని తెలిపారు. -
కోట్ల ఖర్చుతో పాదయాత్ర చేసేది రైతులేనా?
రాజధాని భూ కుంభకోణాలపై ఏపీ ప్రభుత్వం మళ్లీ దృష్టి సారించినట్లుగా ఉంది. ఒక వైపు రాజధాని అమరావతి రైతుల పేరుతో పాదయాత్ర, మరో వైపు అమరావతి లో అస్సైన్డ్ భూముల లావాదేవీల స్కామ్ లో అరెస్టులతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. అమరావతి గ్రామాలలోనే అన్ని సంస్థలు, అన్ని వ్యవస్థలు ఏర్పాటు చేయాలని, తద్వారా తమ ఆస్తుల విలువ మరిన్ని కోట్లు పలకాలని కోరుకుంటున్నవారు పాదయాత్ర చేపట్టడం విశేషమే. గతంలో ఎప్పుడైనా ఎవరైనా సమస్యలలో ఉన్నవారు ఆందోళనలకు దిగుతుండేవారు. కానీ ప్రస్తుతం ఏపీలో మాత్రం కోటీశ్వరులైన వారు, తమ భూముల విలువ మరిన్ని కోట్లు పలికేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వారు కోట్లు ఖర్చు చేసి పాదయాత్ర చేయగలుగుతున్నారు. నిజంగానే భూములు రాజధానికి ఇవ్వడం త్యాగమైతే, వారు కోట్లు ఖర్చు చేసి పాదయాత్రలు చేయగలరా? బౌన్సర్లను పెట్టుకుని నడవగలరా? తమకు ఆది, బెంజ్ వంటి కారులు ఉంటే ఏమిటని డిబేట్లలో ఏ మాత్రం భేషజం లేకుండా మాట్లాడగలరా? ప్రభుత్వం ఏటా ఈ రైతులకు ఎకరా ఏభై వేల రూపాయల చొప్పున కౌలు చేల్లిస్తోంది. వారికి కాణి ఖర్చు లేదు. రిస్కు లేదు. పొలం వెళ్లకుండానే కౌలు పొందుతున్నారు. అంతవరకు అభ్యంతరం లేదు. కాకపోతే వారు రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకు అనుగుణంగా డిమాండ్లు పెట్టి ఉద్యమం చేస్తున్నామని చెప్పడం, వారిది మహోద్యమమని, ఈనాడు, తదితర టీడీపీ మీడియా సంస్థలు ప్రచారం చేయడం , తెలుగుదేశం, బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, జనసేన వంటి పార్టీలు వారికి మద్దతు ఇవ్వడం అంతా తమాషాగా ఉంది. దేశం అంతటా బీజేపీ, కాంగ్రెస్‌లు తీవ్ర వైరుధ్యంతో ఉన్నా, ఏపీలో మాత్రం ఈ విషయంలో అలయ్ భలయ్ నడుపుతున్నాయి. బీజేపీ పొడ అంటేనే గిట్టదని చెప్పే వామపక్షాలవారు ఏపీలో మాత్రం వారితో కలిసి చేతులెత్తుతున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ముప్పైనాలుగు వేల ఎకరాలు సమీకరిస్తున్నప్పుడు ఈ విపక్షాలన్నీ తీవ్రంగా విమర్శించేవి. ఇన్ని వేల ఎకరాల భూమి ఎందుకు అని ప్రశ్నించేవి. అస్సైన్డ్ భూములను కొందరు నేతలు, దళారులు దోచేస్తున్నారని చెప్పేవి. రాజధాని అంతా స్కామ్ గా మార్చారని అనేవారు. చివరికి ప్రధాని మోడీ అంతటి ఆయన వచ్చి పోలవరం, అమరావతిలను చంద్రబాబు ఎటిమ్ లాగా చేసుకున్నారని ఆరోపించారు. కాని చిత్రంగా ఇప్పుడు వీరంతా తెలుగుదేశం పార్టీ వాదనను బలపరుస్తూ, పాదయాత్రకు సంఘీభావం చెబుతున్నారు. అమరావతిలో శాసన రాజధాని ఉంటుందని ప్రభుత్వం చెబుతున్నా ససేమిరా అంటున్నారు. అసలు మొత్తం రాజధాని అంతా వెళ్లిపోతున్నట్లుగా వీరు ప్రచారం చేస్తున్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని, రాయలసీమలో సెక్రటేరియట్, సి.ఎమ్. ఆఫీస్ పెట్టాలని..ఇలా వివిధ డిమాండ్ లు చేసిన బీజేపీ ఇప్పుడు నాలుక మడతేసింది. సీపీఐ రామకృష్ణ అనంతపురం లో 2018లో ఒక సభలో మాట్లాడుతూ , అన్నిటిని అమరావతిలోనే ఏర్పాటు చేస్తే మరి మిగిలిన ప్రాంతం సంగతేమిటని ప్రశ్నించారు. వెనుకబడిన ప్రాంతాలను పట్టించుకోరా అని నిలదీశారు. కాని అదే రామకృష్ణ, తమ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణతో కలిసి చంద్రబాబు విధానాలకు మద్దతు ఇస్తూ పాదయాత్రకు సంఘీభావం చెబుతున్నారు. విభజన సమయంలో ఏపీ సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి, ప్రత్యేక హోదా గురించి ఎన్నడూ మాట్లాడని ఆమె తగుదునమ్మా అంటూ బయల్దేరి పాదయాత్రకు మద్దతు పలికారు. కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేషే స్వయంగా అమరావతి జేఏసీ నేత ఒకరితో అమరావతి కమ్మరావతిగా మారిందని అంటే వీరెవ్వరూ దానికి సమాధానం చెప్పలేకపోయారు. తెలుగుదేశం పార్టీ పన్నిన వ్యూహంలో వీరంతా చిక్కుకున్నారో, లేక టీడీపీ వెంట వెళితే ఏమైనా ఉపయోగం ఉంటుందని అనుకున్నారో తెలియదు కాని, వారు కూడా రాజధానిపై తమ అభిప్రాయాలను మార్చుకున్నారు. అభిప్రాయాలను చిత్తశుద్దితో మార్చుకుంటే తప్పు కాదు. కాని దానికి వివరణ ఇవ్వగలగాలి. శివరామకృష్ణన్ కమిటీ అమరావతి ప్రాంతంలో రాజధాని ఎందుకు వద్దన్న విషయాన్ని విస్మరించి వీరంతా కోట్ల వ్యయంతో సాగుతున్న పాదయాత్రను సపోర్టు చేస్తున్నారు. నిజంగానే రాజధాని రైతులకు ఏవైనా నష్టం జరుగుతుంటే కచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి. అలాగే అక్కడ ఏ అభివృద్ది చేస్తారని ఎవరైనా ప్రశ్నిస్తే,అందుకు సమాదానం ఇవ్వాలి. కాని ఈ ఆందోళనకారులు కాని, ఈ రాజకీయ పక్షాలు కాని ఆ విషయం మాట్లాడడం లేదు. కేవలం ఏక వ్యాఖ్య డిమాండ్‌తో కధ నడుపుతున్నాయి. ఒకరకంగా ఇది ప్రభుత్వానికి అనుకూలంశంగా భావించాలి. అమరావతి గ్రామాల అభివృద్దికి సంబంధించి ప్రణాళికపై ముందుకు వెళ్లవలసిన పని లేకుండా విపక్షాలు చేస్తున్నాయి. అంతేకాదు. ఒకవేళ ప్రభుత్వం ఏదైనా అబివృద్ది పని చేపట్టినా, అందుకు నిధుల సమీకరణకు ప్లాన్ చేసినా, వెంటనే కోర్టుకు వెళ్లి స్టేలు తీసుకువస్తున్నారు. తాము తమ పరపతిని బాగా వాడుకోగలుగుతున్నామని, టీడీపీ కాని రైతుల ముసుగులో ఉన్న ఆందోళనకారులు కాని భావిస్తే అది వారి తెలివితక్కువతనం అవుతుంది. వీరు అబివృద్ది పనులను అడ్డుకునే కొద్ది ప్రభుత్వానికి ఆ మేరకు బాధ్యత తగ్గుతుందన్న సంగతి వీరు మర్చిపోతున్నారు. ఇక రాజధానిలో జరిగిన స్కామ్‌ల గురించి విపక్షాలు మాట్లాడకపోవడం కూడా గమనించదగిన అంశమే. సుమారు 1100 ఎకరాలు అస్సైన్డ్ భూమిని అప్పనంగా కాజేశారన్న అభియోగాలపై సిఐడి విచారణ చేసి పలువురిని అరెస్టు చేసింది. మాజీ మంత్రి పి.నారాయణ పై కూడా కేసు నమోదు చేసింది. వారికి నిర్ణీత నిబంధన కింద నోటీసులు ఇచ్చి కేసు దర్యాప్తు చేయాలని కోర్టు సూచించింది. సిఐడి కాని, మరే దర్యాప్తు సంస్థ అయినా, కోర్టులలో కేసుల పరిస్థితిని కూడా గమనంలోకి తీసుకుని ఇలాంటి విషయాలలో ముందుకు వెళ్లాలి.ఇది వేరే విషయం. ప్రస్తుతం బీజేపీలో ముఖ్యనేతగా ఉన్న మాజీ ఛీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు కొన్నేళ్ల క్రితం ఇది ఎవరి రాజధాని ?అని ప్రశ్నిస్తూ ఒక పుస్తకం రాశారు. అమరావతి పేరుతో 29 గ్రామాలలో ఆనాటి ప్రభుత్వం చేసిన దారుణాలనండి, సృష్టించిన వివాదాలన్నిటిని ఆయన అందులో పేర్కొన్నారు. ఆ పుస్తక ఆవిష్కరణ సభలో సీపీఎం నేత మధు మాట్లాడుతూ తాము రాజధాని ప్రాంతంలో పర్యటించామని, అస్సైన్డ్ భూముల కుంభకోణం అంతా, ఇంతాకాదని, దళితులకు తీవ్రమైన అన్యాయం జరిగిందని వాపోయారు. అలాంటివారు మరి ఇప్పుడు ప్రభుత్వం ఆ స్కామ్ లపై చర్య తీసుకుంటుంటే ఎంతవరకు మద్దతు ఇస్తున్నారో తెలియదు. తెలుగుదేశం పార్టీ కూడా ఈ స్కామ్ లపై పెద్దగా స్పందించకుండా జాగ్రత్తపడుతున్నట్లుగా ఉంది. ఇన్ సైడ్ ట్రేడింగ్ జరగలేదని వాదించే టీడీపీ కోర్టుల నుంచి ఆ విషయంలో రక్షణ పొందడంలో సఫలం అయింది. కాని అదే సమయంలో దళితుల భూములను టీడీపీ నేతలు, దళారులు అక్రమంగా లేదా భయపెట్టి కారు చౌకగా కొనుగోలు చేసిన స్కామ్ లపై నోరు మెదపడం లేదు. పాదయాత్రలో పాల్గొంటున్న రైతులు కాని, వారికి సంఘీబావం చెబుతున్న ఆయా రాజకీయ పక్షాల నేతలు కాని దళితుల భూముల గురించి మాట్లాడకపోవడం వైఫల్యం కిందకు రాదా? అమరావతి అంటేనే స్కామ్ అన్న అభిప్రాయాన్ని వారు ఇంతవరకు పూర్వపక్షం చేయలేకపోయారు. రైతుల పాదయాత్ర రోజునే ప్రభుత్వం ఈ స్కామ్ లను బయటపెట్డడం వ్యూహ త్మకమే కావచ్చు.కాని కేవలం స్కాముల కేసుల నుంచి తప్పించుకోవడానికి, అమరావతి పేరుతో రాజకీయ ప్రయోజనం పొందడానికి తెలుగుదేశం పార్టీ యత్నిస్తున్నప్పుడు వైసిపి ప్రభుత్వం ఈ మాత్రం ప్రతి వ్యూహం అమలు చేయలేదా? -కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు


