ఏపీలో చంద్రబాబు.. సింగపూర్‌లో ఈశ్వరన్ అమరావతి భూదోపిడీలో ఈ ఇద్దరూ భాగస్వాములు
స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్ట్... మరో 5 కేసుల్లో చార్జిషీట్లు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో
52 రోజులు రిమాండ్ ఖైదీగా..
సింగపూర్‌లో అవినీతి కేసులో అడ్డంగా దొరికిన ఈశ్వరన్
27 తీవ్ర అభియోగాలతో ఈశ్వరన్‌పై చార్జ్‌షిట్లు
సాక్షి, అమరావతి : ప్రపంచంలో అవినీతి రహిత దేశాల్లో సింగపూర్‌ది ఐదో స్థానం.. అలాంటి దేశానికి మంత్రిగా ఉండి భారీ అవినీతికి బరితెగించి సింగపూర్ ప్రతిష్టకు మాయని మచ్చ తీసుకొచి్చన అమాత్యుడు ఈశ్వరన్.. అతనికి మన అమరావతి రింగ్ మాస్టర్ బినామీ బాబు జతకలిశారు. ఇంకేముంది రాజధాని పేరుతో ప్రజలకు గ్రాఫిక్స్ చూపించి అందినంత దోచేశారు.
తోడుదొంగలు ఇద్దరూ కలిసి అమరావతిలో స్టార్టప్ ఏరియా అంటూ ఏకంగా 1,400 ఎకరాలను కొల్లగొట్టేందుకు పన్నాగం పన్నారు. పాపం పండి ఇద్దరి బాగోతం బట్టబయలైంది. స్కిల్ స్కామ్ కేసులో ‘రాజధాని ఫైల్స్’ సూత్రధారి చంద్రబాబు, సింగపూర్‌లో అవినీతి అభియోగాలతో ఈశ్వరన్ అరెస్టయ్యారు. వీరిద్దరి అవినీతి లింకులు కలిసింది మాత్రం అమరావతిలోనే..
అవినీతి ‘ఆట’లో ఈశ్వరన్ వాటా..
సింగపూర్‌లో భారీ ఎత్తున అవినీతికి బరితెగించిన ఆ దేశ మంత్రి ఈశ్వరన్ ఆట కట్టింది. ఫార్ములా వన్ రేసింగ్ కాంట్రాక్టులో ఈశ్వరన్ అక్రమాలకు పాల్పడ్డారని సింగపూర్ అవినీతి నిరోధక విభాగం కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో’(సీపీఐబీ) నిగ్గు తేలి్చంది. ఈ కేసులో నేరం రుజువైతే కనీసం ఏడేళ్లు శిక్ష పడవచ్చు. సింగపూర్‌కు ఫార్ములా వన్ కార్ రేసింగ్ ముసుగులో ఆయన ముడుపులు స్వీకరించారని ఆ దేశ అవినీతి నిరోధక విభాగం నిగ్గు తేలి్చంది. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్, సింగపూర్ పర్యాటక విభాగం మధ్య కాంట్రాక్టు రూపంలో ఆయన ముడుపులు తీసుకున్నారు.
సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ రేసింగ్, ఫుట్‌బాల్ మ్యాచ్‌లు, మ్యూజికల్ షోస్, బ్రిటన్‌లో హ్యారీపోటర్ షోలకు భారీ సంఖ్యలో టికెట్లు యథేచ్ఛగా విక్రయించారని వెల్లడైంది. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ నిర్వాహకుడు ఓంగ్ బెంగ్ సంగ్‌తోపాటు ఈశ్వరన్‌ను గతేడాది జూలై 12న సీపీఐబీ అధికారులు అరెస్ట్ చేశారు. అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. సీపీఐబీ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఈశ్వరన్ అవినీతిని నిగ్గు తేలుస్తూ 27 అభియోగాలతో చార్జ్‌షిట్లు దాఖలు చేసింది. మంత్రి హోదాలో భారీ ముడుపులు తీసుకున్నట్లు 24 అభియోగాలు, అవినీతికి కేంద్ర బిందువుగా ఉన్నారని రెండు అభియోగాలు, న్యాయ విచారణకు అడ్డంకులు కల్పించారని ఒకటి ఉంది.
చంద్రబాబు ‘స్కిల్’తో కటకటాలకు
ఈశ్వరన్ తోడు దొంగ చంద్రబాబు స్కిల్ స్కామ్‌లో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 52 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన రూ.5 వేల కోట్ల మేర అసైన్డ్ భూముల కుంభకోణం, రూ.2 వేల కోట్ల మేర ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్‌మెంట్ మార్పు కేసు, రూ.10 వేల కోట్ల ఇసుక కుంభకోణం, రూ.6,500 కోట్ల మద్యం కుంభకోణం, ఫైబర్ నెట్ కుంభకోణం కేసుల్లో కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నారు. సెక్షన్ 17 ఏ ప్రకారం తన అరెస్ట్ అక్రమమన్న చంద్రబాబు వాదనను సుప్రీంకోర్టు పట్టించుకోలేదు. ఆయనపై కేసు కొట్టివేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది.
రూ.66 వేల కోట్ల దోపిడీకి స్కెచ్
స్టార్టప్ ఏరియా 20 ఏళ్ల పాటు సింగపూర్ కన్సార్షియం ఆ«దీనంలో ఉంటుందని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ పర్యవేక్షణకు నియమించిన మేనేజ్‌మెంట్ కమిటీలో చంద్రబాబు కుటుంబసభ్యులు, బినామీలే ఉండేలా జాగ్రత్తపడ్డారు. ఏమైనా న్యాయ వివాదాలుంటే లండన్ కోర్టును ఆశ్రయించాలన్నారు. స్టార్టప్ ఏరియాలో ఎకరా కనీస ధర రూ.4 కోట్లుగా తేల్చారు. స్టార్టప్ ఏరియా అభివృద్ధి తరువాత అంతర్జాతీయ సంస్థలకు ఎకరా రూ.25 కోట్ల చొప్పున విక్రయించవచ్చని అంచనా వేశారు. 20 ఏళ్లలో ఎకరా విలువ రూ.50 కోట్లకు చేరుతుందని చంద్రబాబే వ్యాఖ్యానించారు. ఆ ప్రకారం ...సింగపూర్ కన్సార్షియం గుప్పిట్లో 1,320 ఎకరాలు (1,070 + 250) ఉంటాయి. ఆ 1,320 ఎకరాలను రూ.50 కోట్ల చొప్పున విక్రయిస్తే రూ.66 వేల కోట్లు ఆర్జించే అవకాశముంది.
బాబుతో కలిసి అభాసుపాలు
కృష్ణా నదీ తీరాన స్టార్టప్ కేంద్రం అంటూ రూ.66 వేల కోట్ల పన్నాగాన్ని చంద్రబాబు, ఈశ్వరన్ రక్తి కట్టించారు. అమరావతి ప్రాంతంలో అతి పెద్ద వాణిజ్య కేంద్రంగా 1,691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేయాలని బాబు ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ ప్రభుత్వ ఖర్చుతో మౌలిక సదుపాయాలు కలి్పంచి వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చేశాక దానిని బినామీల పేరిట హస్తగతం చేసుకోవాలని కుట్ర పన్నారు. ఇందులో సింగపూర్‌కు చెందిన అసెండాస్ కంపెనీని తెరపైకి తెచ్చారు. సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందమని నమ్మించి, తనకు సన్నిహితుడైన అప్పటి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఓ ప్రైవేటు కంపెనీ అసెండాస్‌ను తెరపైకి తెచ్చారు.
స్విస్ చాలెంజ్ విధానంలో ప్రాజెక్టుల ఖరారును గతంలో సుప్రీంకోర్టు తప్పుపట్టినా.. స్టార్టప్ ఏరియా ప్రాజెక్ట్‌ను తన బినామీ కంపెనీకి కట్టబెట్టేందుకే స్విస్ చాలెంజ్ విధానాన్ని చంద్రబాబు అనుసరించారు. గ్లోబల్ టెండర్లు లేకుండానే ఏకపక్షంగా ప్రాజెక్టును సింగపూర్ కన్సార్షియానికి అప్పగించారు. ఆ 1,691 ఎకరాల్లోని 371 ఎకరాల్లో ప్రభుత్వం రూ.5,500 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది.
సింగపూర్ కన్సార్షియం అసెండాస్‌కు ప్రభుత్వం 250 ఎకరాలను ఉచితంగా ఇస్తుంది. మిగిలిన 1,070 ఎకరాలను ప్లాట్లుగా విభజించి వేలం ద్వారా విక్రయిస్తారు. ఎకరా కనీస ధర రూ.4 కోట్లుగా నిర్ణయించారు. 1,070 ఎకరాల విలువ రూ.4,280 కోట్లుగా లెక్కతేల్చారు. నిధులు సమకూర్చే రాష్ట్ర ప్రభుత్వానికి అందులో 42 శాతం వాటా, కేవలం పర్యవేక్షించే సింగపూర్ కంపెనీకి 58 శాతం వాటా దక్కేలా ఒప్పందం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment