iswaran
-
అమరావతి పార్టనర్.. ఈశ్వరన్‌కు జైలు శిక్ష
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి పేరిట జరిగిన భూ దోపిడీలో కీలక పాత్రధారిగా వ్యవహరించిన సింగపూర్ మాజీ మంత్రి ఎస్.ఈశ్వరన్ స్వదేశంలో అవినీతికి పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో ఏడాది జైలు శిక్ష విధిస్తూ అక్కడి న్యాయస్థానం గురువారం తీర్పునిచ్చింది. రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఫార్ములా వన్ రేసింగ్ కాంట్రాక్టులో ఈశ్వరన్ అక్రమాలకు తెగబడినట్లు సింగపూర్ అవినీతి నిరోధక విభాగం ‘కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో’ (సీపీఐబీ) విచారణలో నిగ్గు తేలింది. ఈశ్వరన్ అవినీతికి పాల్పడినట్టు న్యాయ విచారణలో కూడా నిర్ధారణ కావడంతో ఏడాది జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తాజాగా తీర్పునిచ్చింది. జూనియర్ అధికారి నుంచి మంత్రిగా.. 2008లో సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖలో జూనియర్ ఆఫీసర్‌గా ఉన్న ఈశ్వరన్ అనతి కాలంలో ఉన్నత స్థానానికి ఎగబాకారు. మొదట పరిశ్రమల శాఖ మంత్రిగా, అనంతరం రవాణా శాఖ మంత్రిగా కీలక పదవులు పొందారు. ఫార్ములా వన్ కార్ రేసింగ్ ముసుగులో సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ నిర్వాహకుడు ఓంగ్ బెంగ్ సంగ్ నుంచి ఈశ్వరన్ భారీగా ముడుపులు తీసుకున్నట్లు అవినీతి నిరోధక విభాగం నిగ్గు తేల్చింది. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ – సింగపూర్ పర్యాటక విభాగాల మధ్య కాంట్రాక్టు రూపంలో ఆయన ముడుపులు తీసుకున్నారు. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ రేసింగ్, ఫుట్‌బాల్ మ్యాచ్‌లు, మ్యూజికల్ షోస్, బ్రిటన్‌లో హ్యారీ పోటర్ షోలకు భారీ సంఖ్యలో టికెట్లు యథేచ్ఛగా విక్రయించారని వెల్లడైంది. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ నిర్వాహకుడు ఓంగ్ బెంగ్ సంగ్‌తోపాటు ఈశ్వరన్‌ను గత ఏడాది జూలై 12న సీపీఐబీ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో పదవికి రాజీనామా చేసిన ఈశ్వరన్ అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. సీపీఐబీ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఈశ్వరన్ అవినీతిని నిగ్గు తేలుస్తూ 27 అభియోగాలతో చార్జ్ïÙట్లు దాఖలు చేసింది. మంత్రి హోదాలో భారీ ముడుపులు తీసుకున్నట్లు 24 అభియోగాలు, అవినీతికి కేంద్ర బిందువుగా ఉన్నట్లు రెండు అభియోగాలు, న్యాయ విచారణకు అడ్డంకులు కల్పించినట్లు ఒక అభియోగం నమోదైంది. బాబు భూ దోపిడీలో పార్టనర్ 2014–19 మధ్య టీడీపీ హయాంలో చంద్రబాబు బృందం రాజధాని పేరిట యథేచ్ఛగా సాగించిన భూ దోపిడీలో ఈశ్వరన్ ప్రధాన భూమిక పోషించారు. ఏపీ రాజధాని నిర్మాణం కోసం ఏకంగా సింగపూర్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని భ్రమింపజేశారు. అమరావతి మాస్టర్ ప్లాన్‌లో అత్యంత కీలకమైన స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్ట్‌ను చంద్రబాబు, ఈశ్వరన్ ద్వయం కుట్రపూరితంగా తెరపైకి తెచ్చింది. ఒప్పందం సమయంలో సింగపూర్‌కు చెందిన ప్రైవేట్ కంపెనీ అసెందాస్–సిన్బ్రిడ్జ్–సెంబ్ కార్ప్ కన్సార్షియంను తెరపైకి తెచ్చారు. స్విస్ చాలెంజ్ విధానం ముసుగులో ఇతర సంస్థలేవీ పోటీ పడకుండా ఏకపక్షంగా 2017 మే 2న కట్టబెట్టేశారు. దీనికి నాటి చంద్రబాబు కేబినెట్ రాజముద్ర వేసింది. ఆ ఒప్పంద పత్రాలపై ఈశ్వరన్ సంతకాలు చేశారు. అప్పుడు ఆయన సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. ఏకంగా సింగపూర్ ప్రభుత్వంతోనే ఒప్పందం చేసుకున్నట్టు చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా హడావిడి చేసింది. స్టార్టప్ ఏరియా వాటాల కేటాయింపులోనూ చంద్రబాబు గోల్మాల్ చేశారు. స్టార్టప్ ఏరియా అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.5,721.9 కోట్లు వెచ్చించే రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం 42 శాతం వాటా కల్పించారు. రూ.306.4 కోట్లు మాత్రమే వెచ్చించే అసెందాస్–సిన్బ్రిడ్జ్–సెంబ్ కార్ప్ కన్సార్షియానికి ఏకంగా 58 శాతం వాటా కట్టబెట్టేశారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌గా అభివృద్ధి చేసే స్టార్టప్ ఏరియా స్థూల టర్నోవర్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి మొదట విడతలో 5 శాతం, రెండో విడతలో 7.5 శాతం, మూడో విడతలో 12 శాతం వాటా మాత్రమే కేటాయించారు. స్టార్టప్ ఏరియా టర్నోవర్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి సగటున కేవలం 8.7 శాతం వాటా దక్కనుండగా అసెందాస్–సిన్బ్రిడ్జ్–సెంబ్ కార్ప్ కన్సార్షియానికి మాత్రం 91.3 శాతం వాటా దక్కుతుందన్నది స్పష్టమైంది. ఆ కన్సార్షియం ముసుగులో చంద్రబాబు బినామీ పెట్టుబడులు పెట్టారు. అందుకు ఈశ్వరన్ సహకరించారు. తద్వారా స్టార్టప్ ఏరియాలో రూ.లక్షల కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని చంద్రబాబు పథకం వేశారు. స్టార్టప్ ఏరియాను ఆనుకుని ఉన్న 1,400 ఎకరాల అసైన్డ్ భూములను చంద్రబాబు బృందం బినామీ పేర్లతో కొల్లగొట్టింది. ప్రతిపాదిత ఇన్నర్‌రింగ్ రోడ్డును ఆనుకుని భారీగా భూములు కొనుగోలు చేసింది. సింగపూర్‌లో చంద్రబాబు బినామీల పేరిట ఉన్న స్టార్ హోటళ్లు, ఇతర రియల్ ఎస్టేట్ పెట్టుబడులలోనూ ఈశ్వరన్ కీలక పాత్ర పోషించినట్లు అధికారిక, పారిశ్రామిక వర్గాలు చెబుతుండటం గమనార్హం. -
అమరావతి కలిపింది ఇద్దరినీ..
సాక్షి, అమరావతి : ప్రపంచంలో అవినీతి రహిత దేశాల్లో సింగపూర్‌ది ఐదో స్థానం.. అలాంటి దేశానికి మంత్రిగా ఉండి భారీ అవినీతికి బరితెగించి సింగపూర్ ప్రతిష్టకు మాయని మచ్చ తీసుకొచి్చన అమాత్యుడు ఈశ్వరన్.. అతనికి మన అమరావతి రింగ్ మాస్టర్ బినామీ బాబు జతకలిశారు. ఇంకేముంది రాజధాని పేరుతో ప్రజలకు గ్రాఫిక్స్ చూపించి అందినంత దోచేశారు. తోడుదొంగలు ఇద్దరూ కలిసి అమరావతిలో స్టార్టప్ ఏరియా అంటూ ఏకంగా 1,400 ఎకరాలను కొల్లగొట్టేందుకు పన్నాగం పన్నారు. పాపం పండి ఇద్దరి బాగోతం బట్టబయలైంది. స్కిల్ స్కామ్ కేసులో ‘రాజధాని ఫైల్స్’ సూత్రధారి చంద్రబాబు, సింగపూర్‌లో అవినీతి అభియోగాలతో ఈశ్వరన్ అరెస్టయ్యారు. వీరిద్దరి అవినీతి లింకులు కలిసింది మాత్రం అమరావతిలోనే.. అవినీతి ‘ఆట’లో ఈశ్వరన్ వాటా.. సింగపూర్‌లో భారీ ఎత్తున అవినీతికి బరితెగించిన ఆ దేశ మంత్రి ఈశ్వరన్ ఆట కట్టింది. ఫార్ములా వన్ రేసింగ్ కాంట్రాక్టులో ఈశ్వరన్ అక్రమాలకు పాల్పడ్డారని సింగపూర్ అవినీతి నిరోధక విభాగం కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో’(సీపీఐబీ) నిగ్గు తేలి్చంది. ఈ కేసులో నేరం రుజువైతే కనీసం ఏడేళ్లు శిక్ష పడవచ్చు. సింగపూర్‌కు ఫార్ములా వన్ కార్ రేసింగ్ ముసుగులో ఆయన ముడుపులు స్వీకరించారని ఆ దేశ అవినీతి నిరోధక విభాగం నిగ్గు తేలి్చంది. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్, సింగపూర్ పర్యాటక విభాగం మధ్య కాంట్రాక్టు రూపంలో ఆయన ముడుపులు తీసుకున్నారు. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ రేసింగ్, ఫుట్‌బాల్ మ్యాచ్‌లు, మ్యూజికల్ షోస్, బ్రిటన్‌లో హ్యారీపోటర్ షోలకు భారీ సంఖ్యలో టికెట్లు యథేచ్ఛగా విక్రయించారని వెల్లడైంది. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ నిర్వాహకుడు ఓంగ్ బెంగ్ సంగ్‌తోపాటు ఈశ్వరన్‌ను గతేడాది జూలై 12న సీపీఐబీ అధికారులు అరెస్ట్ చేశారు. అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. సీపీఐబీ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఈశ్వరన్ అవినీతిని నిగ్గు తేలుస్తూ 27 అభియోగాలతో చార్జ్షిట్లు దాఖలు చేసింది. మంత్రి హోదాలో భారీ ముడుపులు తీసుకున్నట్లు 24 అభియోగాలు, అవినీతికి కేంద్ర బిందువుగా ఉన్నారని రెండు అభియోగాలు, న్యాయ విచారణకు అడ్డంకులు కల్పించారని ఒకటి ఉంది. చంద్రబాబు ‘స్కిల్’తో కటకటాలకు ఈశ్వరన్ తోడు దొంగ చంద్రబాబు స్కిల్ స్కామ్‌లో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 52 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన రూ.5 వేల కోట్ల మేర అసైన్డ్ భూముల కుంభకోణం, రూ.2 వేల కోట్ల మేర ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసు, రూ.10 వేల కోట్ల ఇసుక కుంభకోణం, రూ.6,500 కోట్ల మద్యం కుంభకోణం, ఫైబర్ నెట్ కుంభకోణం కేసుల్లో కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నారు. సెక్షన్ 17 ఏ ప్రకారం తన అరెస్ట్ అక్రమమన్న చంద్రబాబు వాదనను సుప్రీంకోర్టు పట్టించుకోలేదు. ఆయనపై కేసు కొట్టివేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. రూ.66 వేల కోట్ల దోపిడీకి స్కెచ్ స్టార్టప్ ఏరియా 20 ఏళ్ల పాటు సింగపూర్ కన్సార్షియం ఆ«దీనంలో ఉంటుందని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ పర్యవేక్షణకు నియమించిన మేనేజ్మెంట్ కమిటీలో చంద్రబాబు కుటుంబసభ్యులు, బినామీలే ఉండేలా జాగ్రత్తపడ్డారు. ఏమైనా న్యాయ వివాదాలుంటే లండన్ కోర్టును ఆశ్రయించాలన్నారు. స్టార్టప్ ఏరియాలో ఎకరా కనీస ధర రూ.4 కోట్లుగా తేల్చారు. స్టార్టప్ ఏరియా అభివృద్ధి తరువాత అంతర్జాతీయ సంస్థలకు ఎకరా రూ.25 కోట్ల చొప్పున విక్రయించవచ్చని అంచనా వేశారు. 20 ఏళ్లలో ఎకరా విలువ రూ.50 కోట్లకు చేరుతుందని చంద్రబాబే వ్యాఖ్యానించారు. ఆ ప్రకారం ...సింగపూర్ కన్సార్షియం గుప్పిట్లో 1,320 ఎకరాలు (1,070 + 250) ఉంటాయి. ఆ 1,320 ఎకరాలను రూ.50 కోట్ల చొప్పున విక్రయిస్తే రూ.66 వేల కోట్లు ఆర్జించే అవకాశముంది. బాబుతో కలిసి అభాసుపాలు కృష్ణా నదీ తీరాన స్టార్టప్ కేంద్రం అంటూ రూ.66 వేల కోట్ల పన్నాగాన్ని చంద్రబాబు, ఈశ్వరన్ రక్తి కట్టించారు. అమరావతి ప్రాంతంలో అతి పెద్ద వాణిజ్య కేంద్రంగా 1,691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేయాలని బాబు ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ ప్రభుత్వ ఖర్చుతో మౌలిక సదుపాయాలు కలి్పంచి వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చేశాక దానిని బినామీల పేరిట హస్తగతం చేసుకోవాలని కుట్ర పన్నారు. ఇందులో సింగపూర్‌కు చెందిన అసెండాస్ కంపెనీని తెరపైకి తెచ్చారు. సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందమని నమ్మించి, తనకు సన్నిహితుడైన అప్పటి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఓ ప్రైవేటు కంపెనీ అసెండాస్ను తెరపైకి తెచ్చారు. స్విస్ చాలెంజ్ విధానంలో ప్రాజెక్టుల ఖరారును గతంలో సుప్రీంకోర్టు తప్పుపట్టినా.. స్టార్టప్ ఏరియా ప్రాజెక్ట్‌ను తన బినామీ కంపెనీకి కట్టబెట్టేందుకే స్విస్ చాలెంజ్ విధానాన్ని చంద్రబాబు అనుసరించారు. గ్లోబల్ టెండర్లు లేకుండానే ఏకపక్షంగా ప్రాజెక్టును సింగపూర్ కన్సార్షియానికి అప్పగించారు. ఆ 1,691 ఎకరాల్లోని 371 ఎకరాల్లో ప్రభుత్వం రూ.5,500 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. సింగపూర్ కన్సార్షియం అసెండాస్‌కు ప్రభుత్వం 250 ఎకరాలను ఉచితంగా ఇస్తుంది. మిగిలిన 1,070 ఎకరాలను ప్లాట్లుగా విభజించి వేలం ద్వారా విక్రయిస్తారు. ఎకరా కనీస ధర రూ.4 కోట్లుగా నిర్ణయించారు. 1,070 ఎకరాల విలువ రూ.4,280 కోట్లుగా లెక్కతేల్చారు. నిధులు సమకూర్చే రాష్ట్ర ప్రభుత్వానికి అందులో 42 శాతం వాటా, కేవలం పర్యవేక్షించే సింగపూర్ కంపెనీకి 58 శాతం వాటా దక్కేలా ఒప్పందం చేసుకున్నారు. -
చంద్రబాబు ఫ్రెండ్ ఈశ్వరన్‌పై మొత్తం 35 కేసులు
సింగపూర్ సిటీ: భారత సంతతికి చెందిన సింగపూర్ మాజీ మంత్రి, చంద్రబాబు సన్నిహితుడిగా పేరున్న ఎస్.ఈశ్వరన్ (61)పై కొత్తగా ఎనిమిది అవినీతి కేసులు దాఖలయ్యాయి. దీంతో.. జనవరిలో మోపిన 27 అభియోగాలతో కలుపుకొని మొత్తం 35 కేసుల్ని ఈశ్వరన్ ఎదుర్కొంటున్నారు. కోర్టు అనుమతితో ఆస్ట్రేలియాకు వెళ్లివచ్చిన వారం రోజులకే ఈశ్వరన్‌పై కొత్త ఆరోపణలు దాఖలు కావడం గమనార్హం. లుమ్ కోక్ సంగ్ అనే బిల్డర్ నుంచి ఖరీదైన విస్కీ సీసాలు, గోల్ఫ్ సాధనాలు, సైకిల్‌ను లంచంగా తీసుకున్నట్లు ఈశ్వరన్‌పై తాజా ఆరోపణలు వచ్చాయి. ఆయన గతంలో అంగ్ బెంగ్ సెంగ్ అనే మరో బిల్డర్ నుంచి ఖరీదైన బహుమతులు పొందినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలన్నింటిలో తాను నిర్దోషినని ఈశ్వరన్ వాదిస్తున్నారు. ఇదీ చదవండి: బాబు తోడుదొంగ ఈశ్వరన్ ఔట్ ఇదీ చదవండి: ఎట్టకేలకు సుబ్రమణియం ఈశ్వరన్ రాజీనామా -
దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నారు.. చివరకు
'అమరావతి రాజదాని నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వం ముందుకు వచ్చింది.. ఇదంతా తనకు అంతర్జాతీయగా ఉన్న పలుకుబడివల్లే .."అని 2014-2019 మధ్య ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు పదే, పదే చెప్పుకున్న మాటలు. ఆయనకు మాటలకు తగినట్లే సింగపూర్ దేశ మంత్రిగా ఉన్న ఈశ్వరన్ తరచు అమరావతి రావడం, చంద్రబాబుతో ముచ్చట్లు పెట్టుకోవడం, ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ ను ఆరంభించడానికి ఒప్పందం చేసుకోవడం గమనించిన పలువురు నిజంగానే ఏపీ మీద, ఎపి రాజధాని మీద అభిమానంతోనే సింగపూర్ మంత్రి తరచు వస్తున్నారేమోలే అని అనుకునేవారు. కాని అప్పట్లోనే నిశితంగా పరిశీలన చేసే కొందరు మాత్రం ఇందులో ఏదో మోసం ఉందని అనేవారు. వారి మాటలను తోసిపుచ్చుతూ వారిని అమరావతి యజ్ఞాన్ని పాడుచేసే రాక్షసులు మాదిరి అని చంద్రబాబు, టీడీపీ నేతలు విమర్శిస్తుండేవారు. ఈశ్వరన్ లాగానే బిడిశెట్టి అనే మిత్రుడు కూడా చంద్రబాబుకు ఉన్నారు. ✍️ ఆయనకు కూడా ఏదో మెడికల్ హబ్ పెడతారని చెప్పి అమరావతిలో వంద ఎకరాల భూమిని తక్కువ ధరకు చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది. విశేషం ఏమిటంటే చంద్రబాబు మిత్రులు ఇద్దరూ అవినీతి , హవాలా కేసులలో చిక్కుకోవడం. ఈశ్వరన్ అవినీతి కేసులో చిక్కి సింగపూర్ లో అరెస్టు అవడం తదుపరి మంత్రి పదవిని కోల్పోవడం జరిగింది. బిడి శెట్టిని దుబాయి జైలులో అక్కడి ప్రభుత్వం పెట్టింది. మరో ఆసక్తికరపరిణామం ఏమిటంటే ఏపీలో చంద్రబాబు నాయుడు కూడా స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్, రాజదాని కేసులు మొదలైనవాటిలో ఇరుకున్నారు. స్కిల్ స్కామ్ కేసులో అరెస్టు అయి 53 రోజులు జైలులో ఉండాల్సి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ముగ్గురు మిత్రులు అవినీతి ఊబిలో ఉన్నారన్నమాట. సింగపూర్ లో ఈశ్వరన్ పై మొత్తం 27 అభియోగాలు వచ్చాయి. ✍️చంద్రబాబుకు సన్నిహితులైన ఈశ్వరన్ ,బిడి శెట్టి వంటివారు అరెస్టు అవడంంతో తెలుగుదేశం పార్టీకి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. వీరి అరెస్టుపై చంద్రబాబు స్పందించలేదు. కనీసం ఈశ్వరన్ కు సానుభూతి కూడా తెలపలేదు. అదే వైసిపికి సంబంధించినవారికి తెలిసినవారెవరైనా ఇతర దేశాలలో కేసులలో చిక్కితే ఇదే చంద్రబాబు కొండెక్కి అరిచేవారు. గతంలో ముఖ్యమంత్రి జగన్ కేసులలో కొందరు అధికారులను పెడితే అదంతా జగన్ తో సంబంధాల వల్లే అని ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు తన మిత్రుల అరెస్టుపై కిక్కురుమనలేకపోతున్నారు. ఈశ్వరన్, శెట్టిల పై వచ్చిన అవినీతి కేసుల గురించి ఈనాడు,ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలు కుక్కిన పేల మాదిరి నోరు మెదపలేదు. సింగపూర్ దేశ ప్రభుత్వం వారు మాస్టర్ ప్లాన్ ఉచితంగా ఇస్తున్నారని కూడా అప్పట్లో చంద్రబాబు ప్రచారం చేశారు. ✍️తీరా చూస్తే అది అసత్యమని ఆ తర్వాత తేలింది. సింగపూర్ కు చెందిన కొన్ని ప్రైవేటు కంపెనీలతో కన్సార్టియమ్ ఏర్పాటు చేసి ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ తయారు చేయాలని సంకల్పించారు. మామూలుగా అయితే దానిని తప్పు పట్టనక్కర్లేదు. కాని అవేదో సింగపూర్ దేశ ప్రభుత్వ కంపెనీలే వచ్చి ఈ వెంచర్ ను ఆరంభిస్తున్నట్లు చంద్రబాబు చెబుతుండేవారు. దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు బాకాలు ఊదుతుండేవి. తీరా చూస్తే అవి ప్రైవేటు కంపెనీలని తదుపరి వెల్లడైంది. సింగపూర్ ప్రభుత్వంతో ఆ సందర్భంలో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం అందరిని విస్తుపరచింది. సింగపూర్ కంపెనీలు 300 కోట్ల రూపాయలను పెట్టుబడి పెడితే, ఏపీ ప్రభుత్వం సుమారు 5600 కోట్ల రూపాయల మేర వ్యయం చేసి ఆ వెంచర్ కు అవసరమైన మౌలిక వసతులు కల్పించడానికి అంగీకరించింది. ✍️ కంపెనీతో ఏదైనా తేడా వస్తే లండన్ కోర్టులో తేల్చుకోవాలన్న కండిషన్ పెట్టారు. స్విస్ చాలెంజ్ పద్దతిన ఈ వెంచర్ కు భూమి కేటాయించినట్లు అప్పట్లో ప్రకటించారు. దీనిపై అప్పట్లో హైకోర్టు తప్పుపడితే, మళ్లీ చట్టాన్ని మార్చి మరీ తాము అనుకున్న స్కీమును చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసింది. విశేషం ఏమిటంటే 300 కోట్లు పెట్టుబడి పెట్టే సింగపూర్ కంపెనీకి 56 శాతం వాటా ఇచ్చి, ఏపీ ప్రభుత్వం మాత్రం మైనర్ వాటాదారుగా ఒప్పుకోవడం. ఈ వ్యవహారంపై ఎందరు అభ్యంతరం చెప్పినా చంద్రబాబు వినిపించుకోలేదు. ఏకంగా 1600 ఎకరాల భూమిని ఇందుకోసం కేటాయించారు. ✍️నిజానికి ఇలాంటి స్కీములు అమలు చేయడానికి ముందుగా వాస్తవ పరిస్థితిని సర్వే చేసి డిమాడ్ నిర్ణయించుకుంటారు. అవేవి లేకుండా రియల్ ఎస్టేట్ వెంచర్ ఏర్పాటు చేయడం అంటే, చుట్టుపక్కల ఉన్న తమ భూముల విలువలను పెంచుకోవడానికే అన్నది బహిరంగ రహస్యం. ఈ వివాదాస్పద నిర్ణయం పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చే టైమ్ కి చంద్రబాబు ప్రభుత్వం ఓటమిపాలైంది. కొత్తగా వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని విషయాలను పరిశీలించడంతో ,తమ లొసుగులు బయటపడుతున్నాయని భావించిన సింగపూర్ కంపెనీల కన్సార్షియం తమ ఒప్పందాన్ని రద్దు చేసుకుని వెళ్లిపోతామని ప్రభుత్వానికి తెలియచేసింది.దాంతో ఆ కధ ముగిసింది. చంద్రబాబు,ఈశ్వరన్ కలిసి చేపట్టిన రియల్ ఎస్టేట్ వెంచర్ భాగోతం అంతా బట్టబయలైంది. ఆ తర్వాత కాలంలో ఈశ్వరన్ పై అవినీతి కేసులు వచ్చాయి. ✍️సింగపూర్ దేశం ఇలాంటి అవినీతి వ్యవహారాలను అసలు అంగీకరించదు.అందువల్లే ఆయనను పదవినుంచి తప్పించడమే కాకుండా ఆ కేసుల విచారణకుఆదేశాలు ఇచ్చారు. ఈ నేపధ్యంలో చంద్రబాబుకు సింగపూర్ లో కూడా బినామీ లావాదేవీలు ఉన్నాయని, వాటికి ఈశ్వరన్ సహకారం ఉండి ఉంటుందని, అందువల్లే ఆయనకు ఏపీలో లాభం చేకూర్చే యత్నం చేశారని వివిధ రాజకీయ పక్షాలు ఆరోపిస్తుంటాయి. ఈశ్వరన్ కు సంబంధించిన అన్ని లావాదేవీలను పరిశీలిస్తే ఇలాంటి స్కామ్ లు ఏవైనా ఉంటే బయటపడవచ్చన్న భావన కూడా ఉంది. అమరావతి రాజధానిని ప్రైవేటు రియల్ ఎస్టేట్ వెంచర్ గా చంద్రబాబు మార్చారనడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం ఉండదు. ✍️ అవసరం లేకపోయినా 34 వేల ఎకరాల భూమి సేకరించడం, వారికి ఏటా సుమారు 250 కోట్ల రూపాయల కౌలు చెల్లించవలసి రావడం, వారికి అభివృద్ది చేసిన ప్లాట్లు ఇవ్వడానికి లక్ష కోట్ల రూపాయల వ్యయం చేయాల్సి ఉండడం ..ఇవన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. దాని ఫలితంగానే అమరావతి ప్రాంతంతో సహా రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అయితే కొద్ది రోజుల క్రితం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు భోగి మంటలు వేసుకుని, మళ్లీ అమరావతిలోనే లక్షల కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించారు. తద్వారా ఏపీ వ్యాప్తంగా ఉన్న ఇతర ప్రాంతాల ప్రజలకు నష్టం చేయబోతున్నట్లు చెప్పకనే చెప్పారు. ✍️రాష్ట్ర ప్రజల సొత్తు అంతటిని ఒక్క అమరావతిలోనే ఖర్చు చేస్తామని చంద్రబాబు, పవన్ లు చెబితే మళ్లీ ఇతర ప్రాంతాలలో వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ అమరావతి రాజధాని విషయంలో తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి కుల రాజధాని అని, ఇక్కడ శ్రీకాకుళం ప్రాంతం నుంచి వచ్చినవారెవరైనా నివసించే పరిస్థితి ఉందా అని అడిగేవారు.కాని ఆశ్చర్యంగా ఏ రకమైన ఒప్పందం కుదిరిందో తెలియదు కాని చంద్రబాబు తో ఆయన కూడా మిలాఖత్ అయిపోయారు. ✍️ఇన్ సైడ్ ట్రేడింగ్ ,అస్సైన్డ్ భూముల స్కామ్ మొదలైనవి ఉండనే ఉన్నాయి. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ కు అమరావతి అవినీతితో కూడా ఏమైనా సంబంధం ఉందా? చంద్రబాబుకు, ఆయనకు మద్య ఉన్న లావాదేవీలు ఏమిటి? అన్నవాటిపై విచారణ జరగలేదు. మొత్తం మీద అమరావతి అంటే అదొక అవినీతి కేంద్రం అన్న భావన ఏర్పడిన నేపధ్యంలో ఈశ్వరన్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అలాగే శెట్టి గోల్ మాల్ వెల్లడైంది. వీటిపై చంద్రబాబు వివరణ ఇచ్చి, ఆ తర్వాత అమరావతి గురించి మాట్లాడితే జనం అప్పుడు ఆయన చెప్పిన మాటలలోని విశ్వసనీయత గురించి ఆలోచిస్తారు. లేకుంటే కచ్చితంగా ఈ అవినీతి ఊబిలో చంద్రబాబు బృందానికి కూడా ఏదో లింక్ ఉందని అనుమానిస్తారు. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
బాబు తోడుదొంగ ఈశ్వరన్ ఔట్
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి పేరిట మాజీ సీఎం చంద్రబాబు సాగించిన భూ దోపిడీలో కీలక పాత్రధారిగా వ్యవహరించిన సింగపూర్ మాజీ మంత్రి ఎస్.ఈశ్వరన్ కథ ముగిసింది. రవాణా శాఖ మంత్రి పదవితోపాటు ఎంపీ సభ్యత్వానికి, సింగపూర్ అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీ(పీఏపీ) ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేసి ఇంటిదారి పట్టారు. ఆయన ఈ నెల 12న రాజీనామా చేసిన విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. ఇక దర్యాప్తు ప్రక్రియ ముగిసి నేరాలు రుజువు కావడమే తరువాయి ఆయన జైలు పక్షిగా మారనున్నట్లు స్పష్టమైంది. సింగపూర్ ఫార్ములా వన్ రేసింగ్ కాంట్రాక్టులో ఈశ్వరన్ అక్రమాలకు తెగబడి ఏకంగా 2.98 లక్షల అమెరికన్ డాలర్ల మేర భారీ అవినీతికి పాల్పడినట్టు సింగపూర్ అవినీతి నిరోధక విభాగం ‘కరెప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో’ (సీపీఐబీ) నిగ్గు తేల్చింది. ఈ కేసులో నేరం రుజువైతే ఆయనకు కనీసం ఏడేళ్లు కఠిన కారాగార శిక్ష పడే అవకాశాలున్నట్లు నిపుణులు తెలిపారు. ఈశ్వరన్ వ్యవహారం టీడీపీలో గుబులు పుట్టిస్తోంది. స్కిల్ స్కామ్ కేసులో అరెస్టై 52 రోజులు రిమాండ్ ఖైదీగా గడిపి బెయిల్‌పై విడుదలైన చంద్రబాబు తాజా పరిణామాలతో ఆందోళన చెందుతున్నట్లు స్పష్టమవుతోంది. అరెస్ట్.. బెయిల్.. రాజీనామా 2008లో సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖలో జూనియర్ ఆఫీసర్‌గా ఉన్న ఈశ్వరన్ అనతి కాలంలో ఉన్నత స్థానానికి చేరుకున్నారు. మొదట పరిశ్రమల శాఖ మంత్రిగా, అనంతరం రవాణా శాఖ మంత్రిగా కీలక పదవులు పొందారు. సింగపూర్‌కు ఫార్ములా వన్ కార్ రేసింగ్ ముసుగులో ఆయన ముడుపులు స్వీకరించడం సంచలనంగా మారింది. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ నిర్వాహకుడు ఓంగ్ బెంగ్ సంగ్ నుంచి వివిధ రూపాల్లో 2.98 లక్షల అమెరికన్ డాలర్లను ముడుపులుగా తీసుకున్నట్లు అవినీతి నిరోధక విభాగం నిగ్గు తేలి్చంది. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ – సింగపూర్ పర్యాటక విభాగం మధ్య కాంట్రాక్టు రూపంలో ఆయన ముడుపులు తీసుకున్నారు. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ రేసింగ్, ఫుట్‌బాల్ మ్యాచ్‌లు, మ్యూజికల్ షోస్, బ్రిటన్‌లో హ్యారీ పోటర్ షోలకు భారీ సంఖ్యలో టికెట్లు యథేచ్ఛగా విక్రయించారని వెల్లడైంది. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ నిర్వాహకుడు ఓంగ్ బెంగ్ సంగ్‌తోపాటు ఈశ్వరన్‌ను గతేడాది జూలై 12న సీపీఐబీ అధికారులు అరెస్ట్ చేశారు. అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా చేయడంతో సింగపూర్ ప్రధానమంత్రి లీ హ్సీన్ లూంగ్ తాత్కాలిక రవాణా శాఖ మంత్రిగా మరొకరికి బాధ్యతలు అప్పగించారు. అనంతరం ఈశ్వరన్ బెయిల్‌పై విడుదలయ్యారు. సీపీఐబీ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఈశ్వరన్ అవినీతిని నిగ్గు తేలుస్తూ 27 అభియోగాలతో తాజాగా చార్జ్షీట్లు దాఖలు చేసింది. వాటిలో ఆయన మంత్రి హోదాలో భారీ ముడుపులు తీసుకున్నట్టు 24 అభియోగాలు, అవినీతికి కేంద్ర బిందువుగా ఉన్నారని రెండు అభియోగాలు, న్యాయ విచారణకు అడ్డంకులు కల్పించారని ఒక అభియోగం ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. నేరం రుజువైతే ఈశ్వరన్‌కు లక్ష డాలర్ల జరిమానాతోపాటు కనీసం ఏడేళ్ల జైలు శిక్ష పడుతుందని సింగపూర్ న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. భూ దోపిడీలో పార్టనర్ చంద్రబాబుతో కలసి అమరావతి భూదోపిడీలో ఈశ్వరన్ ప్రధాన భూమిక పోషించారు. ఎంతగా అంటే రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ ప్రభుత్వం టీడీపీ సర్కారుతో ఒప్పందం చేసుకుందని భ్రమింపజేశారు. అమరావతి మాస్టర్ ప్లాన్‌లో అత్యంత కీలకమైన స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్ట్‌ను చంద్రబాబు, ఈశ్వరన్ ద్వయం కుట్రపూరితంగా తెరపైకి తెచ్చింది. ఒప్పందం సమయంలో సింగపూర్‌కు చెందిన ప్రైవేట్ కంపెనీ అసెందాస్–సిన్బ్రిడ్జ్–సెంబ్ కార్ప్ కన్సార్షియంను తెరపైకి తెచ్చారు. స్విస్ చాలెంజ్ విధానం ముసుగులో ఇతర సంస్థలేవీ పోటీ పడకుండా ఏకపక్షంగా 2017 మే 2న కట్టబెట్టేశారు. దీనికి చంద్రబాబు కేబినెట్ రాజముద్ర వేసింది. ఆ ఒప్పంద పత్రాలపై ఈశ్వరన్ సంతకాలు చేశారు. అప్పుడు ఆయన సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. ఏకంగా సింగపూర్ ప్రభుత్వంతోనే ఒప్పందం చేసుకున్నట్టు చంద్రబాబు భ్రమింపజేశారు. స్టార్టప్ ఏరియా వాటాల కేటాయింపులోనూ చంద్రబాబు గోల్మాల్ చేశారు. స్టార్టప్ ఏరియా అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.5,721.9 కోట్లు వెచ్చించే రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం 42 శాతం వాటా కల్పించారు. రూ.306.4 కోట్లు మాత్రమే వెచ్చించే అసెందాస్–సిన్బ్రిడ్జ్–సెంబ్ కార్ప్ కన్సార్షియానికి ఏకంగా 58 శాతం వాటా కట్టబెట్టేశారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌గా అభివృద్ధి చేసే స్టార్టప్ ఏరియా స్థూల టర్నోవర్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి మొదట విడతలో 5 శాతం, రెండో విడతలో 7.5 శాతం, మూడో విడతలో 12 శాతం వాటా మాత్రమే కేటాయించారు. స్టార్టప్ ఏరియా టర్నోవర్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి సగటున కేవలం 8.7 శాతం వాటా దక్కనుండగా అసెందాస్–సిన్బ్రిడ్జ్–సెంబ్ కార్ప్ కన్సార్షియానికి మాత్రం 91.3 శాతం వాటా దక్కుతుందన్నది స్పష్టమైంది. ఆ కన్సార్షియం ముసుగులో చంద్రబాబు బినామీ పెట్టుబడులు పెట్టారు. అందుకు ఈశ్వరన్ సహకరించారు. తద్వారా స్టార్టప్ ఏరియాలో రూ.లక్షల కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని చంద్రబాబు పథకం వేశారు. స్టార్టప్ ఏరియాను ఆనుకుని ఉన్న 1,400 ఎకరాల అసైన్డ్ భూములను చంద్రబాబు ముఠా బినామీ పేర్లతో కొల్లగొట్టింది. మరోవైపు ప్రతిపాదిత ఇన్నర్‌రింగ్ రోడ్డును ఆనుకుని భారీగా భూములు కొనుగోలు చేసింది. సింగపూర్‌లో చంద్రబాబు బినామీల పేరిట ఉన్న స్టార్ హోటళ్లు, ఇతర రియల్ ఎస్టేట్ పెట్టుబడులలోనూ ఈశ్వరన్ కీలకపాత్ర పోషించినట్లు అధికారిక, పారిశ్రామికవర్గాలు చెబుతుండటం గమనార్హం. చంద్రబాబుదీ అదే పరిస్థితి.. సింగపూర్‌లో ఈశ్వరన్ పరిస్థితినే చంద్రబాబు దాదాపుగా ఎదుర్కొంటున్నారు. స్కిల్ స్కామ్‌లో అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 52 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతరం చంద్రబాబు బెయిల్‌పై విడుదల అయ్యారు. రూ.5 వేల కోట్ల మేర అసైన్డ్ భూముల కుంభకోణం, రూ.2 వేల కోట్ల మేర ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం, రూ.10 వేల కోట్ల ఇసుక కుంభకోణం, రూ.6,500 కోట్ల మద్యం కుంభకోణం, ఫైబర్ నెట్ కుంభకోణం కేసుల్లో కూడా చంద్రబాబు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అవి విచారణ దశలో ఉన్నాయి. సెక్షన్ 17 ఏ ప్రకారం తన అరెస్ట్ అక్రమమన్న చంద్రబాబు వాదనను సుప్రీంకోర్టు పట్టించుకోలేదు. ఆయనపై కేసు కొట్టివేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. -
బాబుకు బిగ్ షాక్..అవినీతి కేసులో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఔట్
-
ఇంటిదొంగ – ఈశ్వరన్!
సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తొలగింపు, అరెస్ట్ వార్తలు మన దగ్గర కూడా చాలా ఆసక్తిని రేకెత్తించాయి. ఇందుకు మూడు కారణాలున్నాయి. ప్రభుత్వ వ్యవహారాల్లో అవినీతి అత్యల్పంగా కనిపించే సింగపూర్‌లో అవినీతి ఆరోపణలపై ఒక మంత్రి అరెస్ట్ కావడం మొదటి కారణం. రెండవది ఈశ్వరన్ భారతీయ సంతతికి చెందినవాడు కావడం. మూడో కారణం మరీ ముఖ్యమైనది. ఆయన మన చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు కావడం. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన గ్లోబల్æ రియల్ ఎస్టేట్ వెంచర్ అమరావతిలో ఈశ్వరన్ కూడా భాగస్వామి. అమరావతి కోర్ ఏరియాలో 1691 ఎకరాల భూమిని రాజధాని స్టార్టప్ ఏరియాగా డెవలప్ చేసే కాంట్రాక్టును సింగపూర్ కన్సార్టియానికి చంద్రబాబు అప్పగించారు. ఈ ఒప్పందం కోసం ఈశ్వరన్, ఆయన సింగపూర్ టీమ్ పలుమార్లు విజయవాడకు వచ్చారు. చంద్రబాబు, లోకేశ్‌లు కూడా సింగపూర్‌లో పర్యటించారు. చివరికి 2017లో ఒప్పందం కుదిరింది. ఇది సింగపూర్ ప్రభుత్వ సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకుంటున్న ఒప్పందంగా బిల్డప్ ఇచ్చారు. సింగపూర్ మంత్రిగా ఉన్న ఈశ్వరన్ స్వయంగా ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో నాటకం రక్తికట్టింది. ఆయనతోపాటు పాల్గొన్న సింగపూర్ ‘అధికారులు’ కూడా ఆ తర్వాత తమ అవతారాలను మార్చడం వింతగొలిపే విషయం. అసెండస్ – సింగ్ బ్రిడ్జ్, సెంబ్ కార్ఫ్ అనే ప్రైవేట్ కంపెనీల కన్సార్టియంతో ఒప్పందం కుదిరింది. ఇవి ప్రభుత్వ కంపెనీలేనని బాబు సర్కార్ బుకాయించింది. సింగపూర్‌లో చాలా కంపెనీల్లో ప్రభుత్వ సంస్థల వాటా అంతో ఇంతో ఉంటుంది. సెంబ్ కార్ప్‌లో కూడా టుమాసెక్ హోల్డింగ్స్ లిమిటెడ్ అనే ప్రభుత్వ సంస్థ పెట్టుబడి ఉన్నది. కానీ మెజారిటీ వాటా ప్రైవేట్‌దే! ఈ టుమాసెక్ హోల్డింగ్స్ లిమిటెడ్‌కు ఒక మూడేళ్లపాటు ఈశ్వరన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. సెంబ్‌కార్ప్‌లో టుమాసెక్ పెట్టుబడి వెనుక ఆయన పలుకుబడి ఉపయోగపడి ఉండవచ్చు. సెంబ్‌కార్ప్‌పై ఆయనకు ప్రత్యేక ఆసక్తి కూడా ఉండవచ్చు. సింగపూర్ కన్సార్టియంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని చూసి ఆరోజుల్లోనే పలువురు ముక్కున వేలేసుకున్నారు. సింగపూర్ కన్సార్టియం, కేపిటల్ సిటీ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ కలిసి అమరావతి డెవలప్మెంట్ పార్టనర్ (ఏడీపీ) ఏర్పాటయింది. ఈ సంస్థకు ప్రభుత్వం 1691 ఎకరాల భూమిని అప్పగించింది. కనీస ధర ఎకరాకు రూ.4 కోట్లుగా నిర్ణయించింది. అంటే ఈ మొత్తం భూమి కనీస విలువ 6,764 కోట్లు. ఇంత విలువ చేసే భూమిని ఏడీపీకి ప్రభుత్వం ఉచితంగానే ఇచ్చింది. ఇందులో 250 ఎకరాల భూమిని సింగపూర్ కంపెనీలకు ఉచితంగా కేటాయించింది. ఆ భూమిని అభివృద్ధి చేసుకుని వారే అమ్మేసుకోవచ్చు. ఈ మొత్తం భూమిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం 5500 కోట్ల రూపాయలను ఖర్చు చేయడానికి బాబు సర్కార్ అంగీకరించింది. అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ (ఏడీపీ)తో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉండే సిటీ డెవలప్మెంట్ మేనేజింగ్ కమిటీ (సీసీడీఎంసీ) తన వాటా కింద 221 కోట్లు పెట్టుబడిగా పెడుతుంది. భూమి విలువతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఖర్చు 12,485 కోట్లు. ఇందులో సింగపూర్ కన్సార్టియం పెట్టే ఖర్చు ఒక్క రూపాయి కూడా లేదు. భూమిని అభివృద్ధి చేసి ప్లాట్లుగా వేసి విక్రయించడానికి ఇంకో 3,137 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఇందులో 306 కోట్ల ఖర్చును సింగపూర్ కన్సార్టియం భరిస్తుంది. మొత్తం పెట్టుబడిలో కన్సార్టియం ఖర్చుపెట్టేది సుమారు రెండు శాతం! కానీ వ్యాపారంలో దాని వాటా 58 శాతం. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ సీసీడీఎంసీ వాటా 42 శాతం మాత్రమే. సొమ్మొకడిది సోకొకడిది అనే సామెతకు ఈ ఒప్పందం సరైన ఉదాహణ. ఇది కాకుండా మరో 250 ఎకరాల భూమి కన్సార్టియంకు ఉచితంగా దక్కుతుంది. అభివృద్ధి చేసిన ప్లాట్లను అమ్మి వ్యాపారం చేసే బాధ్యత అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ (ఏడీపీ)ది కాదు. ఇందుకోసం మరో మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అమరావతి మేనేజిమెంట్ సర్వీసెస్ పేరుతో విజయవాడ అడ్రస్‌తో ఆర్వోసీలో రిజిస్టరయింది. దీని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా బెంజిమిన్ యాప్ నియుక్తులయ్యారు. స్టార్టప్ ఏరియా ఒప్పందం కోసం జరిగిన చర్చల్లో యాప్ సింగపూర్ ప్రభుత్వ అధికారి హోదాలో పాల్గొన్నారు. చివరికి విజయవాడలో రిజిస్టరయిన కంపెనీకి ఈవోగా అవతారం మారింది. అమరావతి కుంభకోణంలో ఇటువంటి వింతలు ఇంకెన్నో బయటపడాల్సి ఉన్నది. చంద్రబాబు – ఈశ్వరన్‌ల మధ్య పెనవేసుకున్న బంధం ఈనాటిది కాదు. సుమారు రెండు దశాబ్దాల చరిత్ర ఉందని చెబుతారు. సింగపూర్‌లో చంద్రబాబుకు స్టార్ హోటళ్లు ఉన్నాయనే ప్రచారం ఎప్పటినుంచో ఉన్నది. ఈశ్వరన్ పదవీచ్యుతి, అరెస్ట్ వెనుక కూడా ఓ హోటల్ కనెక్షన్ ఉన్నది. ఆంగ్ బెంగ్ సెంగ్ అనే వ్యక్తి హోటల్ ప్రాపర్టీస్ లిమిటెడ్ అనే సంస్థ వ్యవస్థాపకుడు. మేనేజింగ్ డైరెక్టర్. అవినీతి, అక్రమ వ్యవహారాల ఆరోపణపై ఆంగ్‌ను సీపీఐబీ (కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో) అరెస్ట్ చేసింది. అతడిని విచారిస్తున్న నేపథ్యంలోనే ఈశ్వరన్ తీగ దర్యాప్తు సంస్థకు దొరికింది. ఆంగ్ బెంగ్ సెంగ్ కంపెనీ ఆధ్వర్యంలో యాభైకి పైగా నక్షత్ర హోటళ్లు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నాయట. ఇవన్నీ ఆంగ్ సొంతం కావు. వివిధ దేశాల రాజకీయ ప్రముఖులు, సంపన్నుల సొమ్ముతో భారీ హోటళ్లు నిర్మించి వాటిని తాను లీజుకు తీసుకుని నడుపుతుంటాడు. మన దగ్గర ప్రచారంలో ఉన్నట్టు చంద్రబాబుకు స్టార్ హోటళ్లు ఉన్నాయా? ఉంటే అవి సింగపూర్‌లోనే ఉన్నాయా? లేక సింగపూర్ కంపెనీ ఆధ్వర్యంలో ఇంకెక్కడైనా ఉన్నాయా అనే అంశంపై కచ్చితమైన సమాచారం లేదు. కానీ చంద్రబాఋకు ఈశ్వరన్‌తో ఉన్న బంధం, ఈశ్వరన్‌కు హోటల్ ప్రాపర్టీస్ అధిపతి ఆంగ్‌తో అనుమానాస్పద కనెక్షన్‌ను బట్టి చూస్తే చంద్రబాబు హోటళ్ల ప్రచారానికి బలం చేకూరుతున్నది. ఆంగ్ బెంగ్ సెంగ్‌పై వచ్చిన ఆరోపణలేమిటి? వాటితో ఈశ్వరన్‌కు ఉన్న సంబంధమేమిటి? అసలు ఈశ్వరన్‌ను పట్టడానికే ఆంగ్‌ను ఎరగా వేశారా? ఈశ్వరన్‌పై జరగనున్న దర్యాప్తు ఎక్కడికి వెళ్తుంది? ఆ దర్యాప్తుకు అమరావతి తీగ తగులుతుందా లేదా? తగిలితే చంద్రబాబు భవిష్యత్తేమిటి? వగైరా ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరకవచ్చు. సింగపూర్ దర్యాప్తులో అమరావతి కోణం తగిలినా తగలకపోయినా, ఈ ప్రాజెక్టులో లక్షల కోట్లు ఆర్జించాలనుకున్న చంద్రబాబు కల మాత్రం కరిగిపోయినట్టే భావించాలి. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో జగన్ సర్కార్‌ను ఎదుర్కోవడానికి చంద్రబాబు దగ్గర పనికొచ్చే అస్త్రాలేమీ లేవు. అమరావతినీ, రాజధానినీ ఒక మిడిల్‌క్లాస్ సెంటిమెంట్‌గా మార్చి రంగంలో నిలబడేందుకు బాబు దళం ఆపసోపాలు పడుతున్నది. సింగపూర్ దర్యాప్తులో అమరావతి తీగ తగిలితే, అంతర్జాతీయ స్థాయిలో వివాదాస్పదమైతే సెంటిమెంట్ పప్పులుడకవు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షం పరిస్థితి దయనీయంగా తయారైంది. ఎదురుదెబ్బలు వరసగా తగులుతున్నాయి. అధికార వైసీపీ కులమతాలకు అతీతంగా పేద, మధ్యతరగతి వర్గాల్లో గణనీయంగా బలపడింది. ఇటీవల జరిగిన రెండు మూడు సర్వేలు ఈ విషయాన్ని నిర్ధారించాయి. వైసీపీ ఓటింగ్ బలం 51 నుంచి 55 శాతం వరకు ఉంటుందని ఆ సర్వేలు ప్రకటించాయి. నిజానికి సర్వేలు కూడా అవసరం లేదు. పేదలు – పెత్తందార్ల ప్రయోజనాల నడుమ విభజన రేఖ ఏర్పడింది. ప్రతిపక్షం పేదల వ్యతిరేక వైఖరిని బహిరంగంగానే తీసుకుంటున్నది. ప్రజలకు అత్యంత ఉపయోగకరంగా మారిన వలంటీర్ వ్యవస్థను, గ్రామ సచివాలయాలను రద్దు చేయాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తున్నది. పేద పిల్లలకు ఇంగ్లిషు మీడియంలో పాఠాలు చెప్పొద్దని అభాసుపాలైంది. ప్రాణాంతకమైన మద్యం ధరలు తగ్గించాలని కోరుతున్నది. పేదలకు ఇళ్లు కట్టించడంపై కోర్టులకెక్కుతున్నది. దశాబ్దాల తర్వాత వ్యవసాయ కూలీలకు భూపంపిణీ చేయతలపెడితే హర్షించలేకపోతున్నది. ఆరోగ్య విప్లవంపై అవాకులు పేలుతున్నది. ఈ తరహా ఆత్మహత్యాసదృశ వైఖరితో ప్రతిపక్షం తనను తాను హననం చేసుకుంటున్నది. ముప్పాతిక శాతం ప్రజల హృదయాల నుంచి వెలివేతకు గురవుతున్నది. మరోపక్క తెలుగుదేశం పార్టీకీ, చంద్రబాబుకూ గురుతుల్యునిగా, రక్షకునిగా నిలబడుతున్న రామోజీ పాపభాండం బద్దలైంది. ‘మార్గదర్శి’ పేరుతో చేసిన చట్టవిరుద్ధ నిర్వాకం మెడకు చుట్టుకుంటున్నది. ముదివయసు విచక్షణను కోల్పోయింది. అడ్డగోలు రాతలతో యెల్లో మీడియా విశ్వసనీయతను జారవిడుచుకున్నది. రెండు వారాలకే వారాహి యాత్ర రోత పుట్టించింది. నటుడి మనోధృతిపై జనంలో శంక మొదలైంది. ఒక ప్రయోగం నిష్ఫలమైంది. ఇప్పుడు బాబు కూటమికి ఎటుచూస్తే అటు చీకటి. పటు నిరాశ. అన్నీ దుశ్శకునములే! కొసరుగా ఇప్పుడీ సింగపూర్ పీడకల!! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
బాబు అవినీతి పార్టనర్ ఔట్
-
అవినీతి కేసు పీకల్లోతులో చంద్రబాబు సింగపూర్ పార్టనర్ ఈశ్వరన్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చంద్రబాబును నమ్ముకున్న ఏ ఒక్కరూ సక్రమమైన దారిలో నడిచినట్టు చరిత్రలో లేదు. అమరావతిని బాహుబలి సినిమాలో మాదిరిగా రూపొందిస్తానంటూ సింగపూర్ బృందాన్ని విజయవాడలో దింపి.. ఠక్కుఠమార విద్యలన్నీ ప్రదర్శించిన బాబు డొల్లతనం ఇప్పుడు పూర్తి సాక్ష్యాధారాలతో బయటపడుతోంది. చంద్రబాబుతో కలిసి అమరావతిని ఏదో చేస్తామని చెప్పిన సింగపూర్ బృంద నాయకుడు ఈశ్వరన్ ఇప్పుడు కీలక నేరాల్లో చిక్కుకుని పదవికి దూరమయ్యారు. ఇక్కడి సిబిఐని మేనేజ్ చేసుకుని కేసుల నుంచి బయటపడ్డ చంద్రబాబు.. ఇప్పుడు సింగపూర్ లో CBIకి సమానమై CPIB ని ఈశ్వరన్ కోసం ఏ రకంగా ప్రభావితం చేస్తాడో చూడాలి. బాబు పార్ట్ నర్ ఈశ్వరన్ అసలు రూపం ఇది ఈశ్వరన్ సింగపూర్ దేశంలో రవాణాశాఖ మంత్రిగా పని చేస్తున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల దేశానికి భారీగా నష్టం వాటిల్లినట్టు గుర్తించారు. అయితే ఈ కేసు తీవ్రత ఏంటీ? ఈశ్వరన్ తీసుకున్న నిర్ణయాలేంటీ? దేశానికి ఏ రకంగా నష్టం జరిగింది? అన్న వివరాలను అక్కడి దర్యాప్తు సంస్థ అధికారికంగా వెల్లడించలేదు. ఇది ఒక హైప్రొఫైల్ కేసు అని, అత్యంత కీలక అంశాలతో ముడిపడి ఉన్న విషయమని సింగపూర్ వర్గాల సమాచారం. అందుకే ఈశ్వరన్ ను విచారించేందుకు అక్కడి దర్యాప్తు సంస్థ కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (CPIB) ప్రధానిని అనుమతి అడగ్గానే ఆయన స్పందించారు. ఈశ్వరన్ ను అధికారికంగా విచారిస్తామంటూ డైరెక్టర్ డెనిస్ టాంగ్ ప్రధాని లీ అనుమతిని కోరారు. ఈ నేపధ్యంలో తాను జూలై 6న సీపీఐబీ డైరెక్టర్‌కి సమ్మతి తెలిపానని, ఆ తర్వాత అధికారిక విచారణ జూలై 11న ప్రారంభమైందని ప్రధాన మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. విచారణ పూర్తయ్యే వరకు విధులకు దూరంగా ఉండాలని మంత్రి ఈశ్వరన్‌ను ఆదేశించినట్లు ప్రధాని లీ తెలిపారు. On 5 July, Director CPIB briefed me on a case and sought my concurrence to open a formal investigation. Minister S Iswaran is assisting with investigations and will take a leave of absence. SMS Chee Hong Tat will be Acting Minister for Transport. – LHL https://t.co/0ut4SRoTfG — leehsienloong (@leehsienloong) July 12, 2023 ఎవరీ ఈశ్వరన్ అమరావతి విషయంలో ఎన్నో కొత్త విషయాలను తెరమీదికి తెచ్చారు చంద్రబాబు. అందులో ముఖ్యమైంది రైతుల భూమిని సేకరించి అభివృద్ధి చేసి మళ్లీ ఇస్తానని. ఇందులో భాగంగా సింగపూర్ ప్రభుత్వంతో ఓ ఒప్పందం చేసుకున్నట్టు ప్రకటించారు. మే 17, 2017న సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సమక్షంలో స్టార్టప్ ఏరియా అభివృద్ధిపై నాటి చంద్రబాబు ప్రభుత్వం అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతి స్టార్టప్ ఏరియాకు మందడం గ్రామంలో శంకుస్థాపన కార్యక్రమం జరిపి MOUలో భాగంగా సింగపూర్ కంపెనీలకు 1691 ఎకరాలను ప్రభుత్వం అప్పగించింది. అమరావతి భూములను అభివృద్ధి చేసినందుకు సింగపూర్ ప్రభుత్వానికి 58% వాటా, ఏపీ ప్రభుత్వానికి 42% వాటా ఉంటుందని బాబు చెప్పారు. ఈ సింగపూర్ కన్సార్టియానికి మంత్రి ఈశ్వరన్ నేతృత్వం వహిస్తున్నట్టు ప్రకటించారు. ఇంకేముంది విడతల వారీగా సింగపూర్ బృందాలు విజయవాడ రావడం, ప్రతీ నెలా సమావేశాలు పెట్టడం.. అదిగో ఇదిగో అంటూ రకరకాల ఊహాచిత్రాలను విడుదల చేయడం జరిగింది. అయిదేళ్లలో చంద్రబాబు గానీ, ఈశ్వరన్ నేతృత్వంలోని సింగపూర్ కన్సార్టియం గానీ చేసిందేమీ లేదు. "Director of the Corrupt Practices Investigation Bureau (CPIB) briefed me on a case CPIB had uncovered... This would involve interviewing Minister S Iswaran, among others... I have instructed Minister Iswaran to take leave of absence until these investi... https://t.co/KkMSp0rhB2 — The Independent Singapore (@IndependentSG) July 12, 2023 2019లో ఏం తేలింది? 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఘోర పరాజయం పాలయ్యారు. అదే సమయంలో 151 స్థానాల్లో ఘన విజయం సాధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అమరావతి ఒప్పందం గురించి పరిశీలించగా.. అసలు ఈశ్వరన్ నేతృత్వంలోని సింగపూర్ కన్సార్టియానికి సింగపూర్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తేలింది. సింగపూర్ లోని కొన్ని సంస్థలు కలిసిందే కన్సార్టియం తప్ప చంద్రబాబు అప్పటివరకు చెప్పినట్టు సింగపూర్ ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని తేలింది. (చదవండి : కన్సార్టియం పేరిట బాబు అక్రమాలు ఇవి) ‘పక్షపాతం లేకుండా దర్యాప్తు’ ఒక మంత్రిగా ఉన్న ఈశ్వరన్ మీద ఆరోపణలు రావడంతో అక్కడి దర్యాప్తు సంస్థ సీబీఐబీ ఒక ప్రకటన విడుదల చేసింది. వాస్తవాలను వెలికితీయడానికి, సత్యాన్ని నిరూపించడానికి, చట్టబద్ధమైన పాలనను సమర్థించడానికి, దృఢ సంకల్పంతో ఈ కేసును దర్యాప్తు చేస్తామని పేర్కొంది. CBIP చేపట్టే అన్ని కేసులను పక్షపాతం లేకుండా దర్యాప్తు చేస్తుందని, అవినీతి కార్యకలాపాలకు పాల్పడే పార్టీలపై చర్య తీసుకోవడానికి వెనుకాడదని ఆ ప్రకటనలో పేర్కొంది. మరో వైపు ఈశ్వరన్‌తో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతరులను కూడా సీపీఐబీ విచారిస్తుందని ప్రధాన మంత్రి లీ సియన్ లూంగ్ ఒక ప్రకటనలో తెలిపారు. బ్యూరో బయటపెట్టిన ఒక కేసుకు సంబంధించి ఇటీవల సీబీఐబీ డైరెక్టర్ తనకు సమాచారం అందించారని ప్రధాని లీ చెప్పారు. Singapore PM asks country's Transport Min Iswaran to go on leave after he was linked in the corruption case. Why should TN CM not follow this in Fmr Liq Min #SenthilBalaji's case? pic.twitter.com/ZtfAFfWyCP — Soma Sundaram 🇮🇳 (@isomasundaram72) July 12, 2023 ఈశ్వరన్ రాజకీయ జీవితం.. మంత్రి ఈశ్వరన్ రాజకీయ జీవితం 1997లో వెస్ట్ కోస్ట్ GRCకి పార్లమెంటు సభ్యునిగా మొదటిసారి ఎన్నికైనప్పటి నుండి ప్రారంభమయ్యింది. 26 సంవత్సరాలుగా ఆయన రాజకీయాల్లో కొనసాగుతున్నారు. 2006లో క్యాబినెట్లోకి ప్రవేశించకముందు అనేక ప్రభుత్వ పార్లమెంటరీ కమిటీలలో సభ్యనిగా కొనసాగారు. సెప్టెంబర్ 2004 నుండి జూన్ 2006 వరకు పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించారు. మే 2021 నుండి రవాణా మంత్రిగా ఉన్నారు. మే 2018 నుండి వాణిజ్య సంబంధాల ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. మంత్రి ఈశ్వరన్ కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖలలో మంత్రి పదవులను కూడా నిర్వహించారు. మే 2011 నుండి సెప్టెంబర్ 2015 వరకు ప్రధాన మంత్రి కార్యాలయంలో మంత్రిగా కూడా ఉన్నారు. రాజకీయాలలో ప్రవేశించక ముందు ఈశ్వరన్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖతో పాటు టెమాసెక్ హోల్డింగ్స్‌తో సహా పలు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో పనిచేశారు. ఈశ్వరన్ ను పక్కకు తప్పించడంతో ఆయన బాధ్యతలను సింగపూర్ సీనియర్ మంత్రి చీ హాంగ్ టాట్ పర్యవేక్షిస్తారని ప్రధాని తెలిపారు. Singapore PM asks country's Transport Min Iswaran to go on leave after he was linked in the corruption case. Why should TN CM not follow this in Fmr Liq Min #SenthilBalaji's case? pic.twitter.com/ZtfAFfWyCP — Soma Sundaram 🇮🇳 (@isomasundaram72) July 12, 2023 ఇది కూడా చదవండి: ‘శరీరాన్ని ఛిద్రం చేసిన బుల్లెట్లు.. రక్తమోడుతున్న చీరతో’.. -
17,275 ఎకరాల్లో నివాస సముదాయాలు
-
17,275 ఎకరాల్లో నివాస సముదాయాలు
♦ ఆరు జోన్లుగా వాణిజ్య ప్రాంతం ♦ నేడు రాజధాని మాస్టర్‌ప్లాన్ నోటిఫికేషన్ జారీ! సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని అమరావతి నగరాన్ని నిర్మించే మొత్తం భూమిలో అత్యధికంగా 23 శాతాన్ని నివాస సముదాయాలుగా ఏర్పాటు చేయనున్నారు. రాజధాని మాస్టర్‌ప్లాన్‌లో ఈ మేరకు ప్రతిపాదించారు. 14 శాతం భూమిని మౌలిక సదుపాయాలు, 19 శాతాన్ని పార్కులు, ఖాళీ స్థలాలకు, ఆరుశాతాన్ని ప్రస్తుతమున్న గ్రామాలకు, రెండు శాతాన్ని మిశ్రమ వినియోగానికి, పదిశాతం భూముల్ని వాణిజ్య అవసరాలకు, ఆరుశాతాన్ని కాలుష్యంలేని పరిశ్రమలకు, పదిశాతాన్ని జలవనరులకు, తొమ్మిదిశాతం భూమిని పౌర అవసరాల(సివిక్ ఎమినిటీస్)కు వినియోగించాలని భూమి వినియోగ ప్రణాళికలో పేర్కొన్నారు. ఈ లెక్కప్రకారం 17,275 ఎకరాల్లో నివాస భవనాలు, సముదాయాలు నిర్మించనున్నారు. 8,462 ఎకరాల్లో వాణిజ్యప్రాంతం, పరిశ్రమలు నెలకొల్పాలని, 4,875 ఎకరాల్లో పౌర అవసరాలు(సివిక్ ఎమినిటీస్), 15,975 ఎకరాల్లో పార్కులు, ఖాళీ స్థలాలకు కేటాయించారు. సింగపూర్ ఇచ్చిన మాస్టర్‌ప్లాన్‌కు మెరుగులు దిద్ది సీఆర్డీఏ నోటిఫికేషన్ జారీ చేయడానికి సిద్ధమైంది. శుక్రవారమే ఇవ్వాలనుకున్నప్పటికీ సీఎం మార్పులు సూచించడంతో శనివారం నోటిఫికేషన్ విడుదలకు సీఆర్డీఏ సన్నద్ధమవుతోంది.నెలరోజులపాటు ప్రజలనుంచి అభిప్రాయాల్ని సేకరించి మార్పులుంటే చేర్చి తుది మాస్టర్‌ప్లాన్‌ను ఆమోదించనుంది. సింగపూర్ ప్రభుత్వసంస్థ సుర్బానా రాజధాని రీజియన్‌కు కాన్సెప్ట్ ప్లాన్, రాజధాని నగరానికి మాస్టర్‌ప్లాన్, తొలుత అభివృద్ధి చేసేప్రాంతానికి సీడ్ ప్లాన్‌ను ప్రభుత్వానికి సమర్పించడం తెలిసిందే. చివరిగా సీడ్ మాస్టర్‌ప్లాన్‌ను జూలైలో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రభుత్వానికి అందించారు. వీటిలో కీలకమైన రాజధాని నగరం,సీడ్ ప్లాన్‌లో లోపాలుండడంతో సరిచేసేందుకు సీఆర్డీఏ కసరత్తు చేసింది. చైనాకు చెందిన జీఐఐసీ సంస్థనూ భాగస్వామ్యం చేసి మార్పులు చేసింది.ఈ ప్లాన్‌కోసం రాజధాని ప్రాంతీయులు ఎదురుచూస్తున్నారు. మాస్టర్‌ప్లాన్‌లోని ఇతర ముఖ్యాంశాలివీ.. ► నివాసప్రాంతాన్ని ఆర్-1, ఆర్-2, ఆర్-3, ఆర్-4 సెక్టార్లుగా విభజించారు. ఆర్-1లో ప్రస్తుతమున్న గ్రామ కంఠాలు, ఆర్-2లో సాధారణ ప్రజలకు జీ+7 భవనాలు, ఆర్-3లో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకోసం జీ+15 భవనాలు, ఆర్-4లో విల్లాలు, పెద్ద భవంతులు నిర్మించాలని పేర్కొంది. ► వాణిజ్య ప్రాంతాల్ని ఆరుజోన్లుగా విభజించి బహుళ ప్రయోజన పరిశ్రమలకోసం పీ-1, సాధారణ పరిశ్రమలకు పీ-2, పీ-3 జోన్లు, పీ-4లో టౌన్ సెంటర్ జోన్, పీ-5లో రీజినల్ సెంటర్ జోన్, పీ-6లో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ► మణిపాల్ ఆస్పత్రి వెనుకనుంచి సీతానగరం, ఉండవల్లి మీదుగా బోరుపాలెం వరకూ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ హైవేను ప్రతిపాదిం చారు.పీడబ్ల్యూడీ వర్క్‌షాపు, గణపతి సచ్చిదానంద ఆశ్రమం ఎదురు, రాయపూడి మీదుగా బోరుపాలెం వరకూ ఈ హైవేను నిర్మిస్తారు. ► వెంకటపాలెం, రాయపూడి, తుళ్లూరు ప్రాంతాలను కలుపుతూ రాజధాని నగరంలో రెండు రైలుమార్గాల్ని డిజైన్‌లో చూపించారు. ► వెంకటపాలెం, నీరుకొండ, పెద్దమద్దూరు వద్ద రిజర్వాయర్లను ప్రతిపాదించారు. నీరుకొండ రిజర్వాయర్ నుంచి అమరావతి ప్రభుత్వ భవన సముదాయానికి నీటిని సరఫరా చేయాలని సూచించారు. ► ఉండవల్లి నుంచి కృష్ణాయపాలెం వరకూ గ్రీన్‌బెల్ట్ ఏర్పాటుకానుంది. ► ఉండవల్లి గుహల నుంచి ప్రకాశం బ్యారేజీ వరకూ ఉద్యానవనాలు, అమరావతి టౌన్షిప్, నిడమర్రు, అనంతవరం, బోరుపాలెం వద్ద పారిశ్రామికవాడలు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్లాన్‌కు మరికొన్ని మార్పులు చేసి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. -
మంత్రి ఈశ్వరన్‌తో చంద్రబాబు భేటీ