రాజధాని అమరావతి నగరాన్ని నిర్మించే మొత్తం భూమిలో అత్యధికంగా 23 శాతాన్ని నివాస సముదాయాలుగా ఏర్పాటు చేయనున్నారు. రాజధాని మాస్టర్‌ప్లాన్‌లో ఈ మేరకు ప్రతిపాదించారు. 14 శాతం భూమిని మౌలిక సదుపాయాలు, 19 శాతాన్ని పార్కులు, ఖాళీ స్థలాలకు, ఆరుశాతాన్ని ప్రస్తుతమున్న గ్రామాలకు, రెండు శాతాన్ని మిశ్రమ వినియోగానికి, పదిశాతం భూముల్ని వాణిజ్య అవసరాలకు, ఆరుశాతాన్ని కాలుష్యంలేని పరిశ్రమలకు, పదిశాతాన్ని జలవనరులకు, తొమ్మిదిశాతం భూమిని పౌర అవసరాల(సివిక్ ఎమినిటీస్)కు వినియోగించాలని భూమి వినియోగ ప్రణాళికలో పేర్కొన్నారు.