capital Amravati
-
AP: రాజధానిలో 900.97 ఎకరాల్లో పేదలకు ఇళ్లు
సాక్షి, అమరావతి: అమరావతి రాజధాని ప్రాంతంలో ఆర్థికంగా వెనుకబడిన పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలో 900.97 ఎకరాలను గృహ అవసరాలకు అనుగుణంగా వినియోగించేలా సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్‌లోని జోన్లలో మార్పులు చేసింది. చదవండి: ఎగుమతుల హబ్‌గా ఏపీ.. ఈ మేరకు శుక్రవారం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న అఫర్టబుల్, ఈడబ్ల్యూఎస్ హౌసింగ్ జోన్‌తోపాటు రెసిడెన్షియల్ జోన్ నిబంధనల్లో మార్పులు చేస్తూ కొత్త జోన్‌ను తీసుకురానుంది. దీనిపై నవంబర్ 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించనున్నట్లు తెలిపింది. -
‘అసైన్డ్ స్కామ్’పై సీఐడీ దూకుడు
సాక్షి, అమరావతి: టీడీపీ అక్రమాలకు రాజధానిగా మారిన అమరావతిలో అసైన్డ్ భూస్కామ్‌పై నేర పరిశోధన విభాగం (సీఐడీ) మరింత దూకుడు పెంచింది. ఇప్పటికే పలు కేసులను నమోదు చేసిన సీఐడీ భిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నేరుగా రైతులను కలిసి వారి వాంగ్మూలం నమోదు చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో శనివారం సీఐడీ అధికారులు ఐదు బృందాలుగా ఏర్పడి రైతుల నుంచి సమాచారాన్ని సేకరించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మల్కాపురం గ్రామానికి చెందిన 50 మంది అసైన్డ్ భూములు రైతులను మందడం గ్రామానికి పిలిచిన సీఐడీ ప్రత్యేక బృందాలు అన్ని కోణాల్లో వారిని విచారించాయి. రెండు రోజుల క్రితం తాళ్లాయపాలెం, రాయపూడి గ్రామాల రైతులను తుళ్లూరు తహసీల్దార్ కార్యాలయంలో సీఐడీ విచారించిన సంగతి తెలిసిందే. భయపెట్టి భూములు గుంజుకున్నారు.. తాజాగా సీఐడీ బృందాల విచారణలో రైతులు తమకు జరిగిన అన్యాయాన్ని అధికారులు ముందు ఏకరువు పెట్టారని తెలుస్తోంది. టీడీపీ నేతలు తమను భయపెట్టి అయినకాడికి తమ భూములను గుంజుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసైన్డ్ భూములకు ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వదంటూ ఆందోళనకు గురిచేసి.. అతి తక్కువ ధరకే తమ భూములను అమ్ముకునేలా చేశారని రైతులు వాపోయారు. ఇలా తమ భూములను కొల్లగొట్టిన టీడీపీ నేతలు వాటిని కోట్ల రూపాయలకు అమ్ముకుని.. తమను నిలువెల్లా మోసం చేశారని కన్నీటిపర్యంతమయ్యారు. అంతేకాకుండా భూములను అమ్మడానికి ఇష్టపడని రైతులను అనేక విధాలుగా బెదిరించి, భయపెట్టారని సీఐడీ ముందు గోడు వెళ్లబోసుకున్నారు. బినామీల పేర్లతో అమ్మలేదనే అక్కసుతో.. మల్కాపురంలో ఉద్ధంరాయునిపాలెం సొసైటీకి చెందిన ఆరుగురు రైతులను సీఐడీ విచారించింది. తాము భూములు పూలింగ్‌కు ఇస్తామన్నా తీసుకోకుండా ఇబ్బందులకు గురిచేశారని రైతులు తెలిపారు. ఈ అంశంపై అప్పటి కలెక్టర్‌తోపాటు, సీఆర్డీఏ అధికారులు, ఎస్సీ కమిషన్ చైర్మన్, నాటి సీఎం చంద్రబాబును సైతం కలిసి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. దీంతో కోర్టుకు వెళ్లి తమ భూములను పూలింగ్‌కు తీసుకోవాలని కోరగా, కలెక్టర్‌ను కలవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు. దీంతో కలెక్టర్‌ను కలిసినా ఆయన ఉద్దేశపూర్వకంగా మాట దాటవేయడంతో తాము పూలింగ్‌కు ఇవ్వలేకపోయామన్నారు. బినామీ పేర్లతో అమ్మలేదనే అక్కసుతోనే తమ భూములను పూలింగ్‌కు తీసుకోలేదని రైతులు విమర్శించారు. తమ పేర్ల మీద భూములు ఉన్నా.. వాటిని ప్రభుత్వ భూములుగా మార్చి ఇతరుల పేర్లపై నమోదు చేయాలని ప్రయత్నించారని ఆరోపించారు. ఇందుకు సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకున్న ఆధారాలే నిదర్శనమన్నారు. కోర్టును ఆశ్రయించడంతో తిరిగి రికార్డుల్లో ప్రభుత్వ భూములనే పేర్లు తొలగించి తమ పేర్లను నమోదు చేశారని వివరించారు. అక్రమంగా భూములు సొంతం చేసుకునేందుకు ప్రయత్నించి సాధ్యపడకపోవడంతో రికార్డుల ట్యాంపరింగ్‌కు యత్నించారని రైతులు వాపోయారు. రైతులతోపాటు స్థానికులు కూడా దీనిపై సీఐడీ అధికారులకు పలు ఫిర్యాదులు చేశారు. తప్పించుకోవడానికి టీడీపీ నేతల ప్రయత్నాలు.. కాగా, అసైన్డ్ భూముల కుంభకోణంలో బలమైన ఆధారాలు కనిపిస్తుండటంతో దాని నుంచి తప్పించుకోవడానికి టీడీపీ నేతలు వ్యూహాలు పన్నుతున్నారు. ఈ క్రమంలో తమకు అనుకూలంగా ఉండే కొందరిని తెర మీదకు తెచ్చారు. రైతుల పేరుతో వారిని సీఐడీ, రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) అధికారుల దగ్గరకు పంపించి అసైన్డ్ భూములను తాము ఇష్టపూర్వకంగానే ఇచ్చామని, గత టీడీపీ ప్రభుత్వం తమను ఆదుకుందని చెప్పే ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం. అసైన్డ్ భూముల కుంభకోణంపై సీఐడీ మరింత లోతుగా దర్యాప్తు చేస్తే టీడీపీ ప్రభుత్వ పాపాలు బట్టబయలవుతాయని అమరావతి ప్రాంతానికి చెందిన దగా పడ్డా దళిత రైతులు చెబుతున్నారు. -
సీఎంగా చంద్రబాబుది అధికార దుర్వినియోగమే
సాక్షి, అమరావతి: చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. స్వీయ, స్వపక్ష ప్రయోజనాలకే ఆయన పెద్దపీట వేశారని వివరించారు. చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరులు, టీడీపీ ఎమ్మెల్యేలు రాజధానిగా అమరావతి ఖరారు కాకముందే ఆ చుట్టుపక్కల పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారన్నారు. చంద్రబాబు సతీమణికి చెందిన హెరిటేజ్ పేరు మీద కూడా భూముల కొనుగోళ్లు జరిగాయన్నారు. అప్పటి మంత్రి నారా లోకేశ్ తన బినామీల పేరు మీద భూములు కొన్నారని తెలిపారు. దీనిపై విచారణను న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు మంగళవారానికి వాయిదా వేశారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. (చదవండి: తనఖా రుణం.. తన ప్రచారానికి) ►అంతకుముందు ఏజీ శ్రీరామ్ టీడీపీ ప్రభుత్వ హయాంలో అక్రమాలను కోర్టు దృష్టికి తెచ్చారు. ►లింగమనేని రమేశ్ అమరావతి ప్రాంతంలో 160 ఎకరాలు కొన్నారని, ఆయన ఇంట్లోనే సీఎంగా చంద్రబాబు ఉన్నారని నివేదించారు. ►మంత్రివర్గ ఉపసంఘం ఆధారాలతో సహా వారి అక్రమాలను తేల్చడంతో దర్యాప్తు నిమిత్తం సిట్‌ను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ►మంత్రివర్గ ఉపసంఘం, సిట్లను ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలు చేసే అర్హత టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌లకు లేదన్నారు. ►వర్ల పార్టీ ప్రయోజనాల కోసమే పిటిషన్ దాఖలు చేశానని స్వయంగా తన అఫిడవిట్లో పేర్కొన్నారని తెలిపారు. ►భూకుంభకోణంపై కేంద్రానికి అన్ని ఆధారాలు పంపి సీబీఐ దర్యాప్తు కోరామన్నారు. ►ఈ వ్యాజ్యాల్లో కేంద్రాన్ని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని ప్రతివాదులుగా చేర్చాలని అనుబంధ పిటిషన్ దాఖలు చేశామన్నారు. ►అయితే అనుబంధ పిటిషన్ న్యాయమూర్తి ముందు లేకపోవడంతో తదుపరి విచారణను వాయిదా వేశారు. (చదవండి: స్కామ్‌లపై కేసులు వద్దంటే ఏంటర్థం?) -
‘వారంతా చంద్రబాబు బినామీలే’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుల రాజకీయాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మండిపడ్డారు. ఆదివారం ఆయన కడపలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘అమరావతిలో రైతుల ఉద్యమమే లేదు. అక్కడ ఉన్నది అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులే. వారంతా చంద్రబాబు కోసం పనిచేస్తున్న ఆయన బినామీలే. అమరావతిలో చంద్రబాబు డ్రామానే నడుస్తోంది. అదంతా కృత్రిమ ఉద్యమమే. చంద్రబాబు మతి స్థిమితం కోల్పోయినట్లు కనిపిస్తోందని’’ ఆయన దుయ్యబట్టారు. (చదవండి: రాష్ట్రాన్ని అథోగతి పాల్జేసిన చంద్రబాబు) రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తి చేసుకుందన్నారు. 30 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు, ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నది ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకోవాలన్న తలంపుతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. ‘‘వ్యవస్థలను మ్యానేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట. ఐదేళ్లలో ఒక్క నిరుపేదకు కూడా గత టీడీపీ ప్రభుత్వం ఇల్లు ఇచ్చిన సందర్భం లేదు. తన ఫోన్ ట్యాపింగ్ చేశారని ప్రధానికి చంద్రబాబు ఫిర్యాదు చేయడం సిగ్గుచేటని’’ అంజాద్ బాషా మండిపడ్డారు. -
రాజధాని అక్రమాలపై కేబినెట్ సబ్ కమిటీ నివేదిక
-
అమరావతికి పంచాయతీ ఎన్నికలే!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతాన్ని టీడీపీ హయాంలో మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్‌గా ప్రకటించకపోవడంతో.. ఆ 29 గ్రామాల్లో ఈ సారి పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాల పరిధిని రాజధాని నగరంగా ఏర్పాటు చేస్తామని 2014లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత గ్రామ పంచాయతీలుగా ఉన్న ఆ 29 గ్రామాలను పట్టణ ప్రాంతంగానో, నగర ప్రాంతంగానో ప్రకటించడానికి ప్రభుత్వం తరఫున చిన్న ప్రయత్నం కూడా జరగలేదు. గ్రామ పంచాయతీని పట్టణ లేదా నగర ప్రాంతంగా అధికారికంగా గుర్తించాలంటే గరిష్టంగా మూడు నాలుగు నెలలకు మించి సమయం పట్టదు. అయితే నాలుగేళ్ల కాలంలో ఆ గ్రామాలన్నింటిని కలిపి నగర ప్రాంతంగా ప్రకటించే ప్రక్రియను పూర్తిగా విస్మరించారు. పట్టణ లేదా నగర ప్రాంతంగా మార్చేందుకు సంబంధిత ప్రాంత పరిధిలోని ప్రజాప్రతినిధి ద్వారా లేదా జిల్లా కలెక్టరు స్వయంగా ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాలి. తర్వాత నగర ప్రాంతంగా మార్చేందుకు అంగీకారం తీసుకునేందుకు 29 గ్రామ పంచాయతీల్లో వేర్వేరుగా తీర్మానాల ద్వారా ఆమోదం తెలపాలి. ఈ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉంటే తర్వాత ఆ ప్రాంతాన్ని పంచాయతీరాజ్ శాఖ తమ పరిధి నుంచి డీ నోటిఫై చేస్తుంది. మున్సిపల్ శాఖ పట్టణ ప్రాంతంగా గుర్తిస్తూ నోటిఫై చేయాలి. ఆ ప్రక్రియను గత టీడీపీ ప్రభుత్వం చేపట్టలేదు. గ్రామ సర్పంచుల పదవీ కాలం 2018 ఆగస్టులోనే ముగిసింది. -
'ఆ ఎలుకలన్నీ ఒక్కొక్కటి బయటకొస్తున్నాయి'
అమరావతి: రాజధాని అంశంలో చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ ద్వారా విరుచుకుపడ్డారు. ఇన్ సైడర్ ట్రేడింగులో భూములు చౌకగా కొట్టేసిన ఎలుకలన్నీ కలుగుల్లో నుంచి బయటికొస్తున్నాయంటూ ధ్వజమెత్తారు. పరువు నష్టం దావా వేస్తామని, దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండని సవాళ్లు విసురుతున్నారని ఆయన ట్వీట్ చేశారు. సీఐడీ లేదా సీబీఐతో దర్యాప్తు జరిపించమని లేఖలు రాయండి మీరు నిప్పులో తుప్పులో తేలుతుంది అంటూ సవాలు విసిరారు. చదవండి: అందుకే ప్రజలు మిమ్మల్ని తరిమికొట్టారు 'విక్రమార్కుడు- భేతాళ కథల్లోని భేతాళుడితో పోల్చదగ్గ వ్యక్తి చంద్రబాబు. రకరకాల మ్యానిప్యులేషన్లతో తప్పించుకుంటూ వస్తున్నాడు. చేసిన తప్పుల నుంచి శాశ్వతంగా ఎవరూ బయట పడలేరని త్వరలోనే ఆయనకు అర్థమవుతుంది. కుతంత్రాలతో ప్రజలను రెచ్చగొట్టి తను రక్షణ పొందాలని చూస్తుంటాడు' అని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. గతంలో కూడా 'ఎలక్షన్ల ముందు కూడా ఇలాగే దుష్ప్రచారం చేశారు. వైఎస్ జగన్ సీఎం అయితే భూములు లాక్కుంటారని, ఇళ్లలోంచి వెళ్లగొడతారని, రౌడీరాజ్యం వస్తుందని భయానక దృశ్యాలు చూపించారు. ప్రజలు మిమ్మల్నే అధికారం నుంచి విసిరి కొట్టి బుద్ధి చెప్పారు. అయినా అవే గోబెల్స్ ప్రచారాలు చేస్తున్నారంటూ' మండిపడ్డారు. మరో ట్వీట్లో.. 'తీసేసిన తహశీల్దారులంతా పళ్లు పటపట కొరుకుతున్నారు. విషం కక్కడంలో పోటీలు పడుతున్నారు. వైఎస్ జగన్ గారి నివాసం మీ హయాంలోనే పూర్తయింది. అనుమతి లేకపోతే అప్పుడు నోళ్లెందుకు పెగల్లేదు అంటూ విమర్శించారు. లింగమనేని గెస్ట్ హౌజులా నదిని పూడ్చి కట్టింది కాదు కదా. తోక కనిపించకున్నా అదిగో పులి అనే బ్యాచ్ తయారైందంటూ' మరో ట్వీట్లో విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. -
సీఎం విశాఖలో కూర్చుని పాలన చేస్తారా!?
సాక్షి, అమరావతి : రాజధానిని ఎవరైనా మూడు ప్రాంతాల్లో పెడతారా అని ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రశ్నించారు. సీఎం అమరావతిలో ఉంటారా, విశాఖలో ఉంటారా, ఇడుపులపాయలో ఉంటారా అని అడిగారు. అసెంబ్లీ నుంచి తమ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినందుకు నిరసనగా మంగళవారం సాయంత్రం ఉండవల్లిలోని తన నివాసం పక్కనున్న ప్రజావేదిక వద్ద ఎమ్మెల్యేలతో కలిసి ఆయన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు వేర్వేరు ప్రాంతాల్లో ఉంటే అనేక ఇబ్బందులు వస్తాయన్నారు. నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వకముందే రాజధానిపై సభలో ప్రకటించడం సరికాదన్నారు. ఏకపక్ష నిర్ణయాలు, తప్పుడు విధానాలవల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని, రాష్ట్రాన్ని తుగ్లక్ మాదిరి పరిపాలిస్తున్నారని ఆయన విమర్శించారు. అమరావతిలో కావాలనే ఒక సామాజికవర్గంపై బురద జల్లుతున్నారన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు విశాఖలో భూములు కొన్నారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. జగన్ ఎప్పుడేం చేస్తారో తెలియడంలేదని చంద్రబాబు అన్నారు. బినామీల పేరుతో భూములు కొనే ఖర్మ తమ పార్టీ నేతలకు లేదన్నారు. హెరిటేజ్ భూములు కొన్న ప్రాంతం రాజధానిలో లేదని తెలిపారు. సంపద కేంద్రంగా అమరావతికి రూపకల్పన చేశాం అంతకుముందు.. అసెంబ్లీలో రాజధాని అంశంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో చంద్రబాబు మాట్లాడుతూ.. రాజధాని అమరావతిని సంపద సృష్టించే కేంద్ర స్థానంగా రూపకల్పన చేశామని చెప్పారు. 13 జిల్లాలకు మధ్యలో ఉన్నందునే రాజధానిగా అమరావతిని ఎంపిక చేశామన్నారు. ఈ ప్రాంతానికి వరద ముప్పులేదని, గతంలో ఎప్పుడూ ముంపునకు గురికాలేదని గ్రీన్ ట్రిబ్యూనల్‌తోపాటు సుప్రీంకోర్టు కూడా చెప్పిందని గుర్తుచేశారు. రాజధానిగా అమరావతే ఉండాలని చెప్పండి కాగా, మూడు రాజధానులపై అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ ప్రకటనతో చంద్రబాబు ఉలిక్కిపడి ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో ఉండవల్లిలోని తన నివాసంలో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ అంశంపై ఎలా స్పందించాలి, ఎలాంటి వ్యూహం అనుసరించాలనే దానిపై మల్లగుల్లాలు పడ్డారు. చివరికి రాజధానిగా అమరావతే ఉండాలనేది టీడీపీ విధానమని.. ఇదే అందరూ చెప్పాలని చంద్రబాబు నేతలకు సూచించారు. త్వరలో ఢిల్లీ వెళ్లి రాజధాని విషయాన్ని ప్రధాని, ఇతర కేంద్ర పెద్దలతో మాట్లాడాలని.. రైతులను ఢిల్లీ తీసుకెళ్లి వినతిపత్రాలు ఇప్పించాలని సమావేశంలో నిర్ణయించారు. -
రాజధాని పనులంతే!
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో ఏ పనులు చేపట్టినా రాత్రికి రాత్రే భారీ వ్యయంతో కూడుకున్నవిగా మారిపోతున్నాయి. అంతర్జాతీయ స్థాయి పేరు చెబుతూ ప్రభుత్వ పెద్దలు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ విభాగాల అభ్యంతరాలు బుట్టదాఖలవు తున్నాయి. ‘ముఖ్య’నేత ఎంపిక చేసిన కాంట్రాక్టు సంస్థలకే పనులు దక్కేలా టెండర్ల వ్యవహారాలను సీఆర్డీఏ నిర్వహిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరద నియంత్రణ పనులంటూ.. రాజధాని అమరావతి ప్రాంతంలో శాఖమూరు, నీరుకొండ రిజర్వాయర్ల నిర్మాణంతోపాటు కొండవీటివాగు, పాలెంవాగు విస్తరణ, పూడికతీత పనులను ప్రపంచబ్యాంకు రుణంతో చేపట్టేందుకు టెండర్లను ఆహ్వానించారు. అయితే అసలు ఇంతవరకు ఈ రుణం ఇంకా మంజూరు కాకున్నా వెంటనే వరద నియంత్రణ పనులను చేపట్టకుంటే రాజధాని మునిగిపోయే ప్రమాదం ఉందని సీఆర్డీఏ పేర్కొంది. 0.03 టీఎంసీల సామర్ధ్యం కలిగిన శాఖమూరు రిజర్వాయర్ నిర్మాణానికి రూ.69.70 కోట్ల వ్యయం అవుతుందని తొలుత అంచనా వేశారు. అనంతరం కొండవీటివాగు, పాలెంవాగులను 36.55 కిలోమీటర్ల మేర విస్తరించడంతోపాటు పూడికతీత పనులను చేర్చారు. ఈ పనులను అదనంగా చేర్చినా కిలోమీటర్‌కు రూ.కోటి చొప్పున రూ.36 కోట్లు లేదా రూ.37 కోట్లు అదనంగా వ్యయం అవుతుంది. అంటే మొత్తం వ్యయం సుమారు రూ.107 కోట్లకు మించదు. అయితే 2017–18 ఎస్ఎస్ఆర్ మేరకు రూ.272.23 కోట్లతో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్అంచనాలను రూపొందించడం గమనార్హం. డీఈఏ, ఆర్థికశాఖ అభ్యంతరాలు తుంగలోకి.. శాఖమూరు రిజర్వాయర్, కొండవీటివాగు, పాలెంవాగుల విస్తరణ, పూడికతీత పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసిన తరువాత టెండర్లను ఆహ్వానించారు. రూ.299.61 కోట్లకు సంయుక్తంగా టెండర్లు దాఖలు చేసిన హెచ్ఇఎస్ ఇన్ఫ్రా–ఎంవిఆర్ ఇన్ఫ్రా సంస్థలే ఎల్–1గా నిలిచాయి. అంటే అంతర్గత అంచనా వ్యయంపై 10.06 శాతం ఎక్సెస్‌కు టెండర్లను దాఖలు చేశాయి. ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ (ఈపీసీ) విధానంలో టెండర్లను ఆహ్వానించినందున అంతర్గత అంచనా కన్నా 5 శాతం ఎక్కువకు దాఖలైతే ఆ టెండర్లను రద్దు చేయాలి. అయితే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ టెండర్లను రద్దు చేయకుండా వీటిని ఖరారు చేసేందుకు సాకులు వెతికింది. ఈ నేపథ్యంలో విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో సామర్లకోట–రాజానగరం వరకు నాలుగు లేన్ల రహదారి విస్తరణ పనులకు 32 శాతం ఎక్సెస్‌కు టెండర్లను ఖరారు చేశారనే వాదనను తెరపైకి తెచ్చింది. విదేశీ ఆర్థిక సాయంతో చేపట్టే ప్రాజెక్టులకు ఐదు శాతం కన్నా ఎక్సెస్‌కు ఇవ్వకూడదనే నిబంధన వర్తించదని పేర్కొంది. దీనిపై కేంద్ర ఎకనమిక్ ఎఫైర్స్(డీఈఏ) విభాగాన్ని సంప్రదించిన రాష్ట్ర ఆర్థిక శాఖ విదేశీ సాయంతో చేపట్టే ప్రాజెక్టులకు కూడా ఐదు శాతం కన్నా ఎక్సెస్‌కు టెండర్లను ఖరారు చేయకూడదని స్పష్టం చేసింది. అయినా సరే టెండర్లను రద్దు చేయకుండా ఈ పనులను 10.06 శాతానికి ఖరారు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలపడం గమనార్హం. నీరుకొండలోనూ నిబంధనలకు నీళ్లు... రాజధానిలో వరద నియంత్రణలో భాగంగా 0.43 టీఎంసీల సామర్ధ్యంతో నీరుకొండ రిజర్వాయర్ నిర్మాణ పనులకు తొలుత అంచనా వ్యయం రూ.98.12 కోట్లుగా నిర్ధారించారు. అయితే కరకట్టల విస్తరణ పేరుతో ఈ పనుల అంతర్గత అంచనా వ్యయాన్ని రూ.366.97 కోట్లుగా నిర్ధారించి టెండర్లను ఆహ్వానించారు. ఎన్సీసీ–ఆర్వీఆర్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ పనులకు రూ.399.99 కోట్లకు టెండర్ దాఖలు చేసి ఎల్–1గా నిలిచాయి. నిబంధనలకు విరుద్ధంగా 9 శాతం ఎక్సెస్‌కు టెండర్ దాఖలు చేసినందున వీటిని రద్దు చేయాల్సి ఉండగా వరద నియంత్రణ పనులను త్వరగా చేపట్టాలనే నెపంతో ఆర్థికశాఖ, డీఈఏ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ ఈ పనులను ఎక్సెస్‌కు ఎన్సీసీ–ఆర్వీఆర్‌లకు అప్పగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ పనులను ఎన్సీసీ సక్రమంగా చేయడం లేదని ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేర్కొనడం గమనార్హం. -
రాజధాని భూములు తాకట్టు!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూసమీకరణ పేరిట రైతుల నుంచి లాక్కున్న వేలాది ఎకరాల భూములను తాకట్టు పెట్టి, బ్యాంకుల నుంచి భారీగా అప్పులు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని భూములను తాకట్టు పెట్టి, అప్పులు తీసుకునే అధికారాలను సీఆర్డీఏ కమిషనర్‌కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సీఆర్డీఏ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ శుక్రవారం జీవో 27 జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే భూములను తాకట్టు పెట్టే అధికారం సీఆర్డీఏ కమిషనర్‌కు సంక్రమించింది. అలాగే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులైన రహదారులు, మంచినీటి సరఫరా, సీవరేజ్, పార్కులు, ఇతర ప్రాజెక్టులకు అవసరమైన భూములను కాంట్రాక్టు సంస్థలకు కేటాయించే అధికారాన్ని కూడా సీఆర్డీఏ కమిషనర్‌కు ఈ జీవో ద్వారా ప్రభుత్వం కట్టబెట్టింది. అప్పులు తెచ్చుకోవాలంటున్న ముఖ్యమంత్రి రాజధాని భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టడంతోపాటు సెక్యూరిటీగా పెట్టి సీఆర్డీఏ అప్పులు చేయనుంది. ఈ విధంగా భూములను తాకట్టు పెట్టి, రూ.వేల కోట్ల అప్పులు చేయాలని నిర్ణయించడంపై అధికార వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వంలో ఏ రంగం, ఏ శాఖలో చూసినా అప్పు అనే పదం తప్ప మరొకటి వినిపించడం లేదని, ఆస్తులను తాకట్టు పెట్టేసి బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకోవాలని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సూచిస్తున్నారని, దీంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిపోతోందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణంగా ఆర్థిక శాఖ అనుమతితోనే ప్రభుత్వ శాఖలు అప్పులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. కానీ, ఇప్పుడు ఏకంగా గంపగుత్తగా ఆ అధికారాన్ని సీఆర్డీఏకు అప్పగించడం సరైంది కాదని అధికార వర్గాలు చెబుతున్నాయి. సీఆర్డీఏ సమావేశాలకు ముఖ్యమంత్రి అధ్యక్షత వహిస్తున్నారని, సొంతంగా నిర్ణయాలు తీసేసుకుని సంబంధిత శాఖలు, ఆర్థిక శాఖకు పంపిస్తున్నారని, ఇలా చేయడం బిజినెస్ రూల్స్‌కు విరుద్ధమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు బ్యాంకుల నుంచి సీఆర్డీఏ రూ.10,000 కోట్ల అప్పులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది. అయితే, ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చినప్పటికీ ఆస్తులను చూపించకపోతే అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో రైతుల నుంచి తీసుకున్న వేలాది ఎకరాల భూములను తాకట్టు పెట్టి లేదా సెక్యూరిటీగా చూపించి అప్పులు చేయాలని సీఆర్డీఏ నిర్ణయించింది. ఇప్పటికే సీఆర్డీఏ బాండ్ల పేరుతో రూ.2,000 కోట్ల అప్పులు చేసింది. ఇప్పుడు మరో రూ.10,000 కోట్ల అప్పులు తెచ్చుకునేందుకు సన్నద్ధమైంది. -
నచ్చితే ఒక రేటు.. లేకపోతే మరో రేటు
సాక్షి, అమరావతి: అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో అనే రీతిలో ప్రభుత్వం రాజధాని అమరావతిలో భూముల కేటాయింపును ఇష్టారాజ్యంగా చేస్తోంది. తమకు కావాల్సినవారికి సేవా సంస్థల పేరుతో కారుచౌకగా భూములు కట్టబెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రం కోట్ల రూపాయల రేటు కడుతోంది. బడా కార్పొరేట్ సంస్థలకు సైతం వందల ఎకరాలను అతి తక్కువ ధరకే ఇస్తోంది. ఇప్పటివరకూ చేసిన భూకేటాయింపులన్నీ ఇదే తరహాలో ఉండటం గమనార్హం. సీఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి ఎకరం రూ.25 లక్షలకే భూమిని ఇవ్వగా, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీకి ఎకరం రూ.4 కోట్లు చొప్పున నిర్ణయించింది. కార్పొరేట్ సంస్థలకు తక్కువ రేటుకు భూములు ఇచ్చి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 1,500 ఎకరాలు కేటాయింపు ఇప్పటివరకూ 115కిపైగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు 1,500 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం ఒక్కోదానికి ఒక్కో రేటు చొప్పున వసూలు చేసింది. 1,500 ఎకరాల్లో 600 ఎకరాలను ఎస్ఆర్ఎం, విట్, అమృత వంటి కార్పొరేట్ విద్యా సంస్థలకు ఎకరం రూ.50 లక్షల చొప్పున అతి తక్కువ ధరకే కట్టబెట్టేసింది. మరో 250 ఎకరాలను బీఆర్ఎస్ మెడ్‌సిటీ, ఇండో – యూకే హెల్త్ ఇన్స్టిట్యూట్కి ఇదే రేటుకు ఇచ్చింది. కార్పొరేట్ కంపెనీ ఎల్ అండ్ టీకి కూడా ఎకరం కేవలం రూ.1.5 లక్షల చొప్పున, ఏటా ఐదు శాతం పెంచేలా 30 ఏళ్ల లీజుకి ఆ సంస్థకు ఐదెకరాల భూమిని అప్పగించింది. తక్కువ ధరకు భూమిని ఇవ్వడమే కాకుండా ఆయా సంస్థలకు అవసరమైన రోడ్లు, నీరు వంటి సౌకర్యాలను కూడా సీఆర్డీఏ (క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ) సొంత ఖర్చులతో సమకూర్చిపెట్టింది. రాష్ట్రంలో 38 క్రీడా సంఘాలు అమరావతిలో స్థలం కావాలని దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోని ప్రభుత్వ పెద్దలు గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీకి మాత్రం ఎకరం రూ.10 లక్షల చొప్పున 12 ఎకరాలు కేటాయించారు. సేవా సంస్థల పేరుతో.. ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కి ఎకరం రూ.25 లక్షల చొప్పున, బ్రహ్మకుమారీస్, గ్జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్కు ఎకరం కేవలం రూ.10 లక్షల చొప్పున భూములు ఇచ్చారు. ప్రభుత్వ సంస్థలకు అదిరిపోయే ధర అదే సమయంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ), ఎల్ఐసీ, ఎస్బీఐ, ఆంధ్రా బ్యాంక్, నాబార్డ్, న్యూ ఇండియా ఎస్యూరెన్స్ కంపెనీ, హెచ్‌పీసీఎల్, సిండికేట్ బ్యాంక్, ఐవోసీఎల్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఎకరం రూ.4 కోట్లు చొప్పున వసూలు చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ఇండియన్ నేవీ, బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్), డిపార్ట్మెంట్స్ ఆఫ్ పోస్ట్సŠ, కాగ్ వంటి ప్రతిష్టాత్మక ప్రభుత్వ సంస్థలకు సైతం ఎకరం కోటి రూపాయలు వసూలు చేసి మరీ భూములు కేటాయించారు. కార్పొరేట్ సంస్థలు, తమ అనుయాయులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా కారుచౌకగా వందల ఎకరాలు ఇచ్చిన ప్రభుత్వ పెద్దలు దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమైన ఆర్బీఐకు 11 ఎకరాలు ఇవ్వడానికి సవాలక్ష నిబంధనలు విధించారు. దీంతో కేంద్ర సంస్థలు రాజధానిలో తమ ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. భూములు కేటాయింపులో స్వప్రయోజనాలు చూసుకుని తక్కువ ధరకు వందల ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం ఎస్ఆర్ఎం, విట్, బీఆర్ఎస్ మెడ్‌సిటీ వంటి సంస్థలకు శాశ్వతంగా భూములు బదలాయించగా ఆర్బీఐ, సీపీడబ్లు్యడీ, ఏపీహెచ్ఆర్డీ వంటి ప్రభుత్వ సంస్థలకు మాత్రం లీజుకిచ్చింది. ప్రైవేటు సంస్థలకు నేరుగా ఇలా భూములివ్వకూడదని, వేలం ద్వారా కేటాయింపు జరపాలని ఆర్థిక శాఖ, సీఆర్డీఏ సూచించినా ప్రభుత్వ పెద్దలు ఖాతరు చేయడం లేదు. కార్పొరేట్ కంపెనీలపై అమిత ప్రేమ కనబరుస్తూ రైతుల నుంచి సేకరించిన భూములను వాటికి తక్కువ రేటుకు కట్టబెడుతుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. -
‘సీమకు మళ్లీ అన్యాయమే జరిగింది’
సాక్షి, హైదరాబాద్ : కరువుతో అల్లాడుతున్న రాయలసీమను నిర్లక్ష్యం చేస్తున్నారని సీమ నేతలు గళమెత్తారు. నీటి పంపకాల విషయంలో రాయలసీమకు అన్యాయం జరిగిందని నిరసిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాజీమంత్రి మైసూరారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శివరామకృష్ణ, మదన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. విభజనతో ఎక్కువగా నష్టపోయింది రాయలసీమనేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ రాజధాని, హైకోర్టు రెండూ ఒకే ప్రాంతంలో నిర్మించి సీమకు మరోమారు అన్యాయం చేశారని మైసూరారెడ్డి మండిపడ్డారు. పట్టిసీమతో రాయలసీమకు నీళ్లిస్తున్నామన్న మాటలో నిజం లేదన్నారు. సీమకు కేటాయిస్తామన్న నీటికి చట్టబద్ధత కల్పించాలని అన్నారు. హైకోర్టును సీమలో ఏర్పాటు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. -
ఐడియా ప్లీజ్?
రెండు రోజుల క్రితం అమరావతి ప్రాంతం నించి ఓ మధ్యరకం నేత ఫోన్ చేశాడు. ‘ఏమన్నా కొత్త ఆలోచనలుంటే చెప్పండి. అసలేమీ తట్టడం లేదు’ అంటే నాకేమీ అర్థం కాలేదు. అదే చెప్పాను. ‘ఏముందండీ, మొన్నటిదాకా మమ్మల్ని గెలిపించడం చారిత్రక అవసరమని అన్ని సభల్లో చెప్పాం. భయపెట్టాం, బతి మాలాం. ఔనా కాదా తమ్ముళ్లూ అని సందేహం తీర్చుకున్నాం. పెద్దగా స్పందనల్లేవు. ఎక్కడా పట్టు దొరకడం లేదు. మా నాయకుడికి కాస్త పట్టు చిక్కితే చాలు, దున్ని వదుల్తాడు’ అన్నాడాయన ఫోన్లో. మీరొకసారి రాకూడదూ, ఎదురుపడి మాట్లాడుకుందాం అన్నాను. ఆయన నవ్వి, మీరు పునాదులు కదిలిస్తున్నారు. చంద్రబాబు అంటే టెక్నాలజీ. అట్లాగే తిరగేసినా టెక్నాలజీ అంటే ఆయనే. విషయాలు మాట్లాడుకోవడానికి గుమ్మా ల్లోకి వెళ్లడమా... ఆయనకి తెలిస్తే ఇంకేమైనా ఉందా?’ అన్నాడు. ఆ తర్వాత చెప్పండని ముందుకు తోలాడు. ‘ఇప్పుడు మోదీ అనాదిగా చేసిన, చేస్తున్న పలు మోసాల్ని తనదైన తీరులో బయటపెడుతున్నారు కదా, అవేమీ పండడం లేదా’ అని అడిగాను. అబ్బే! ఏ మాత్రం అంతు పట్టడం లేదండీ. మొసలి మొహం చూసి దాని ఎక్స్ప్రెషన్స్ చెప్పడం చాలా కష్టమండీ. మనకి పి.వి. కూర్మావతారం టైపండి. లోపలి సంగతి అంతుపట్టదండీ. తర్వాత మన్మోహన్ సింగ్ నవ్వుతున్నారో గంభీర ముద్రలో ఉన్నారో లేక మాట్లాడుతున్నారో అంతుబట్టకుండా పదేళ్ల పాటు దేశాన్ని పాలించారు. ఇదిగో తరువాత మోదీ గద్దెక్కారు. అసలు మా నాయకుడే పర మముదురు. అరటి చెట్టుకి ఆరు గెలలేయిస్తానని రైతుల్ని నమ్మించగలడు. మరి ఆయనే మోదీని పసిగట్టలేకపోయాడు’ అంటూ ఫోన్లోనే గాఢంగా నిట్టూర్చాడు. కాసేపు మౌనంగా ఉండిపోయాడు. ‘ఏం ఈసారి మీకేవన్నా డౌటా’ అని అడి గాను. ఆయన నవ్వి ‘భలేవారే, మాకు కింద టిసారే డౌటు. ఎట్టాగో బయటపడ్డాం. నాలుగేళ్లు టైముంది కదా అనుకున్నాం. సీజన్ ఇట్టే తిరిగొ చ్చింది. ఓ చిత్రం గమనించారా. మనం పవర్లో ఉంటే కాలచక్రం యమ స్పీడుగా తిరుగుతుంది. మనం అపోజీషన్లో ఉంటే చక్రం ఎంతకీ కదిలి చావదు’ అని పెద్దగా నవ్వాడు. ఇంతకీ ఏమన్నా చెబుతారా అని సూటిగా అడిగాడు. విశాఖ రైల్వే జోను, కడప ఉక్కు ఉన్నాయి కదా అన్నాను. ప్చ్... అవి చాలవులెండి. మనకి పట్టు దొరకాల. కనీసం పోలవరం సగంపైగానన్నా తేల్తుందను కుంటే అదీ తేల్లేదు. విశ్వవిఖ్యాత క్యాపిటల్ ఎండ మావి అని తేలిపోయింది. దాని కోసం లక్ష ఎక రాల మాగాణి భూమిని ఎడారి చేసి పెట్టారు. కల లుగన్న విద్యాలయాలు రానే లేదు. నా మాట లకేంగానీ, మీరు కాస్త యోచన చెయ్యండి’ అంటూ ఫోన్ పెట్టేశాడు. కాసేపటికి తేరుకున్నాను. ప్రతివాళ్లూ ఎన్ని కలెప్పుడు వచ్చినా సిద్ధమేనని పై మాటలు మాట్లాడుకున్నారుగానీ అంత వీజీగా నెగ్గలేమని అందరికీ తెలుసు. ఓట్లు సొంత పంటలు తక్కు వగానే ఉంటాయి. అందరూ కొనుగోళ్లమీదే ఆధా రపడాలి. డబ్బులు దండిగా ఉన్నా, వాటిని చెలా మణీలోకి తెచ్చి జనంమీదికి వదలడం కూడా ఈసారి పెద్ద సమస్యే. ఇప్పటికి అయిదు బల మైన శక్తులు కనిపిస్తున్నాయి. తీరా ముఖస్తానికి వచ్చేసరికి పంచ పాండవులు మంచముకోళ్లవలె మూడై.. చివరకు ఎన్నిగా మిగుల్తాయో ఎవరెవరు కలిసిపోతారో తెలియదు. చంద్రబాబు నిరుద్యోగ యువతకి నెలనెలా ఓ వెయ్యి భృతి ఇచ్చే పాత వాగ్దానానికి పదును పెడుతున్నారు. అది ఓ కొలిక్కి వచ్చేసరికి పెట్రోలు ధర వంద అవు తుంది. ఇలాంటివేవీ చంద్రబాబుని పంటగడికి చేర్పించలేవు. మైకులు పగిలేట్టు మోదీని తిడితే టీడీపీకి లబ్ధి వనగూరుతుందా? జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వీస్తున్న పవనాలను ఛేదించగలరా? పవన్‌కల్యాణ్‌తో పొంచివున్న ప్రమాదాన్ని నివారించుకోగలరా? ఆలోచించాలి. ఏదైనా ఐడియా తడితే అమరావతికి ఫోన్ చెయ్యాలి. ఇదే నా దీక్ష! శ్రీరమణ -
అమరావతిలో నివసిస్తే మరో 20 ఏళ్ల ఆయుష్షు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో నివసిస్తే జీవిత కాలం 20 ఏళ్లు పెరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఏ నగరంలోనూ లేనివిధంగా ఇక్కడ జలం, పచ్చదనం ఉన్నాయన్నారు . ‘అమరావతి డీప్ డైవ్’ పేరుతో విజయవాడలోని ఓ హోటల్లో సీఆర్డీఏ రెండు రోజుల పాటు నిర్వహించిన సదస్సు ముగింపు సభలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ప్రపంచ శ్రేణి నగరం కాదు, ప్రపంచంలో అత్యుత్తమ రాజధాని నగరం నిర్మాణం చేయడమే తన లక్ష్యమన్నారు. గోదావరి జలాలతో సస్యశ్యామలం గోదావరి వరద జలాలను సమర్థవంతంగా వినియోగించుకుంటే రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయవచ్చునని చంద్ర బాబు అన్నారు. శుక్రవారం సచివాలయంలో గోదావరి– పెన్నా నదుల అనుసంధానంపై ‘వ్యాప్కోస్’ ప్రతి నిధులతో సమావేశం నిర్వహించారు. దీని ద్వారా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలకు తాగు, సాగునీటి ఇబ్బందులను అధిగమించడంతో పాటుగా పారిశ్రామిక అవసరాలకు నీటిని సరఫరా చేయవచ్చునని సీఎం చెప్పారు. అనుసంధానానికి రూ.80 వేల కోట్ల వ్యయమవుతుందన్నారు. కాగా, చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలసి మాల్దీవులు వెళ్లనున్నారు. ఈ నెల 17 నుంచి 22 వరకు వారు విహారయాత్ర నిమిత్తం మాల్దీవుల్లో పర్యటిస్తారు. -
కుంగిన భవనం.. వెలగపూడిలో కలకలం
సచివాలయానికి కూతవేటు దూరంలో నేలలోకి దిగబడిన మూడంతస్తుల భవనం సాక్షి, విజయవాడ బ్యూరో: వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణ ప్రాంతానికి కూతవేటు దూరంలో నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల భవనం కుంగిపోవడం కలకలం రేపింది. మందడంలో ఆదినేని గోపిరాజు అనే వ్యక్తి గతంలో నిర్మించిన భవనం(గ్రౌండ్ ఫ్లోర్)పై ఇటీవల కొత్తగా రెండు అంతస్తుల నిర్మాణం చేపట్టారు. భవన నిర్మాణం పూర్తయ్యే దశలో పది రోజుల నుంచి భూమిలోకి కుంగిపోతున్న విషయాన్ని గమనించారు. ఆ భవనం రెండు అడుగులు మేర నేలలోకి దిగబడిపోయింది. ప్రమాదాన్ని గుర్తించిన భవన యజమాని నష్ట నివారణ చర్యలు చేపట్టారు. చెన్నై నుంచి జె అండ్ జె కంపెనీకి చెందిన నిపుణులను రప్పించారు. ప్రత్యేకంగా తీసుకొచ్చిన సామాగ్రితో టెక్నాలజీ ఉపయోగించి ఆ భవనాన్ని జాకీలతో పైకిలేపారు. ఈ ప్రాంతంలో నేల స్వభావం మెతకగా ఉండటం వల్లే ఇలా జరిగిందని స్థానికులు చెబుతున్నారు. బహుళ అంతస్తులకు పనికొచ్చేనా? రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఎంపిక చేసిన ప్రాంతంలో నేల స్వభావం మెతక అనే విషయం గత సర్వేల్లో తేలింది. ఇక్కడి నేల బహుళ అంతస్తులకు పనికిరాదని అప్పట్లోనే సర్వే సంస్థలు నిర్ధారించాయి. తాజాగా తాత్కాలిక సచివాలయం నిర్మిస్తున్న వెలగపూడి ప్రాంతానికి అర కిలోమీటరు దూరంలోనే మూడు అంతస్తుల భవనం కుంగిపోవడం తీవ్ర చర్చకు తావిచ్చింది. -
భవనాలు.. పచ్చిక బయళ్లు
♦ రాజ్పథ్లా రాజధాని పరిపాలన భవనాల డిజైన్ ♦ అమరావతి ఐకానిక్ నిర్మాణాల్లో అసెంబ్లీకే ప్రథమ ప్రాధాన్యం సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని అమరావతి పరిపాలనా భవన సముదాయాన్ని ఢిల్లీలోని రాజ్‌పథ్ నమూనాలో నిర్మించేందుకు జపాన్‌కు చెందిన ఫుమిహికో మకి అసోసియేట్స్ డిజైన్ రూపొందించింది. రాజ్‌పథ్‌లో రోడ్డుకిరువైపులా పెద్ద పెద్ద లాన్లు, చెట్లు విస్తరించి ఉంటాయి. అదే తరహాలో ఇక్కడ కొంచెం మార్చి రెండు వైపులా భవనాలు నిర్మించి మధ్యలో పొడవునా లాన్లు, పార్కులు, స్థూపాలు నెలకొల్పుతున్నారు. ఏ భవనం నుంచి బయటకు వచ్చినా అక్కడ విశాలైన పార్కులు, కాలువలు, టవర్లుండేలా చూడడం ద్వారా సందర్శకులను ఆకట్టుకునే ఏర్పాట్లు చేయనున్నారు. తుళ్లూరు వైపున పాలవాగు వద్ద ప్రవేశ మార్గం ఏర్పాటు చేసి మధ్యలో పలు కాలువలు, చెరువులతో ఆహ్లాదవాతావరణాన్ని కల్పించి చివరికి కృష్ణానదీ తీరం వరకూ దాన్ని విస్తరించారు. భవన సముదాయంలో నిర్మాణ నిబంధనలన్నీ సెంట్రల్ ఢిల్లీలో అమలయ్యే అర్బన్ డిజైన్ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం 900 ఎకరాల్లో 30 శాతం విస్తీర్ణాన్ని పూర్తిగా పచ్చదనానికి కేటాయించనున్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రికి ప్రత్యేక రూమ్ భవన సముదాయంలో ఐకానిక్ నిర్మాణాలుగా అసెంబ్లీ (లెజిస్లేచర్), హైకోర్టు భవనాలను ఎంపిక చేసినా ఆ రెండింటిలోనూ లెజిస్లేచర్ భవనానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నారు. రాజధానిలో అద్భుత కట్టడంగా దీన్ని మలిచేందుకు అనువుగా డిజైన్ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం ముందే పోటీలో పాల్గొన్న ఆర్కిటెక్ట్‌లకు సూచించింది. ఎంపికైన మకి అసోసియేట్స్ ప్రతిపాదించిన డిజైన్‌లో ఈ భవనాలే ఆకర్షణలుగా ఉన్నాయి. వీలైతే వీటిని పాలరాతితో తాజ్‌మహల్ తరహాలో నిర్మించే యోచన ఉన్నట్లు సమాచారం. భవనాల పైకప్పులన్నీ సోలార్ ప్యానల్స్‌తో నిండి ఉండేలా డిజైన్ ఉండడంతో పాలరాతిని ఎలా బయటకు చూపించాలనే దానిపై ఆర్కిటెక్ట్‌లు అధ్యయనం చేస్తున్నారు. ఎంపికైన డిజైన్ ప్రకారం లెజిస్లేచర్ భవనాలు నాలుగు బ్లాకుల్లో ఉంటాయి. ప్రస్తుతం 175 మంది ఎమ్మెల్యేలున్నా భవిష్యత్తులో 225.. అంతకంటె సంఖ్య పెరిగినా సరిపోయేలా అసెంబ్లీ హాల్‌ను పెద్దగా ఏర్పాటుచేస్తారు. అసెంబ్లీలో సీఎం వెయిటింగ్ హాల్, ముఖ్యమంత్రి సూటు ప్రత్యేకంగా ఉంటాయి.అక్కడినుంచి అసెంబ్లీలో జరిగే చర్చను చూసే ఏర్పాటు ఉంటుంది.మరో బ్లాకులో శాసనమండలి సభ్యుల కోసం కౌన్సిల్ హాలు దాని కంటే చిన్నగా ఉంటుంది. ఇక్కడా సీఎం సూటు, వెయిటింగ్ హాలు ఉంటాయి. అసెంబ్లీ, కౌన్సిల్ భవనాలు రెండింటినీ పెద్ద, చిన్న జంట భవనాలుగా ప్రతిపాదించారు. ఈ భవనాల్లోకి నేరుగా సూర్యకాంతి పడేలా డిజైన్ చేశారు. స్పీకర్‌కు ప్రత్యేక ఏర్పాట్లు.. : అసెంబ్లీలో స్పీకర్, కౌన్సిల్లో చైర్మన్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు ప్రతిపాదించారు. మూడో బ్లాకులో అసెంబ్లీ, కౌన్సిల్ సభ్యులకు సంయుక్తంగా నిర్వహించే సమావేశాల కోసం పెద్ద సెంట్రల్ హాలుతో భవనాన్ని నిర్మించనున్నారు. నాలుగో బ్లాకులో లెజిస్లేచర్‌కు చెందిన లైబ్రరీని నెలకొల్పుతారు. అసెంబ్లీకి ప్రత్యేకంగా పరిపాలనా భవనం, కౌన్సిల్‌కు పరిపాలనా భవనాలు వాటి పక్కనే నిర్మిస్తారు. ఈ ప్రాంతంలో వేడి ఎక్కువగా ఉండడంతో దాన్ని తగ్గించేం దుకు వీలైనంత గ్రీనరీ, కాలువలను చుట్టూ ఏర్పాటుచేస్తున్నారు. లెజిస్లేచర్ భవనాల్లో 654 కార్లు, 400 ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసుకునే వీలుంటుంది.లెజిస్లేచర్ భవనాల్లోకి వచ్చేందుకు సీంకు ప్రత్యేక మార్గం ఉంటుంది. అసెంబ్లీ నుంచి కౌన్సిల్, సచివాలయానికి వెళ్లేందుకు దగ్గరి మార్గాలుంటాయి. మంత్రులు, పాలనా సిబ్బంది, మీడియా-సందర్శకుల కోసం విడివిడిగా ప్రవేశమార్గాలు ఉంటాయి. -
17,275 ఎకరాల్లో నివాస సముదాయాలు
-
17,275 ఎకరాల్లో నివాస సముదాయాలు
♦ ఆరు జోన్లుగా వాణిజ్య ప్రాంతం ♦ నేడు రాజధాని మాస్టర్‌ప్లాన్ నోటిఫికేషన్ జారీ! సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని అమరావతి నగరాన్ని నిర్మించే మొత్తం భూమిలో అత్యధికంగా 23 శాతాన్ని నివాస సముదాయాలుగా ఏర్పాటు చేయనున్నారు. రాజధాని మాస్టర్‌ప్లాన్‌లో ఈ మేరకు ప్రతిపాదించారు. 14 శాతం భూమిని మౌలిక సదుపాయాలు, 19 శాతాన్ని పార్కులు, ఖాళీ స్థలాలకు, ఆరుశాతాన్ని ప్రస్తుతమున్న గ్రామాలకు, రెండు శాతాన్ని మిశ్రమ వినియోగానికి, పదిశాతం భూముల్ని వాణిజ్య అవసరాలకు, ఆరుశాతాన్ని కాలుష్యంలేని పరిశ్రమలకు, పదిశాతాన్ని జలవనరులకు, తొమ్మిదిశాతం భూమిని పౌర అవసరాల(సివిక్ ఎమినిటీస్)కు వినియోగించాలని భూమి వినియోగ ప్రణాళికలో పేర్కొన్నారు. ఈ లెక్కప్రకారం 17,275 ఎకరాల్లో నివాస భవనాలు, సముదాయాలు నిర్మించనున్నారు. 8,462 ఎకరాల్లో వాణిజ్యప్రాంతం, పరిశ్రమలు నెలకొల్పాలని, 4,875 ఎకరాల్లో పౌర అవసరాలు(సివిక్ ఎమినిటీస్), 15,975 ఎకరాల్లో పార్కులు, ఖాళీ స్థలాలకు కేటాయించారు. సింగపూర్ ఇచ్చిన మాస్టర్‌ప్లాన్‌కు మెరుగులు దిద్ది సీఆర్డీఏ నోటిఫికేషన్ జారీ చేయడానికి సిద్ధమైంది. శుక్రవారమే ఇవ్వాలనుకున్నప్పటికీ సీఎం మార్పులు సూచించడంతో శనివారం నోటిఫికేషన్ విడుదలకు సీఆర్డీఏ సన్నద్ధమవుతోంది.నెలరోజులపాటు ప్రజలనుంచి అభిప్రాయాల్ని సేకరించి మార్పులుంటే చేర్చి తుది మాస్టర్‌ప్లాన్‌ను ఆమోదించనుంది. సింగపూర్ ప్రభుత్వసంస్థ సుర్బానా రాజధాని రీజియన్‌కు కాన్సెప్ట్ ప్లాన్, రాజధాని నగరానికి మాస్టర్‌ప్లాన్, తొలుత అభివృద్ధి చేసేప్రాంతానికి సీడ్ ప్లాన్‌ను ప్రభుత్వానికి సమర్పించడం తెలిసిందే. చివరిగా సీడ్ మాస్టర్‌ప్లాన్‌ను జూలైలో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రభుత్వానికి అందించారు. వీటిలో కీలకమైన రాజధాని నగరం,సీడ్ ప్లాన్‌లో లోపాలుండడంతో సరిచేసేందుకు సీఆర్డీఏ కసరత్తు చేసింది. చైనాకు చెందిన జీఐఐసీ సంస్థనూ భాగస్వామ్యం చేసి మార్పులు చేసింది.ఈ ప్లాన్‌కోసం రాజధాని ప్రాంతీయులు ఎదురుచూస్తున్నారు. మాస్టర్‌ప్లాన్‌లోని ఇతర ముఖ్యాంశాలివీ.. ► నివాసప్రాంతాన్ని ఆర్-1, ఆర్-2, ఆర్-3, ఆర్-4 సెక్టార్లుగా విభజించారు. ఆర్-1లో ప్రస్తుతమున్న గ్రామ కంఠాలు, ఆర్-2లో సాధారణ ప్రజలకు జీ+7 భవనాలు, ఆర్-3లో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకోసం జీ+15 భవనాలు, ఆర్-4లో విల్లాలు, పెద్ద భవంతులు నిర్మించాలని పేర్కొంది. ► వాణిజ్య ప్రాంతాల్ని ఆరుజోన్లుగా విభజించి బహుళ ప్రయోజన పరిశ్రమలకోసం పీ-1, సాధారణ పరిశ్రమలకు పీ-2, పీ-3 జోన్లు, పీ-4లో టౌన్ సెంటర్ జోన్, పీ-5లో రీజినల్ సెంటర్ జోన్, పీ-6లో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ► మణిపాల్ ఆస్పత్రి వెనుకనుంచి సీతానగరం, ఉండవల్లి మీదుగా బోరుపాలెం వరకూ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ హైవేను ప్రతిపాదిం చారు.పీడబ్ల్యూడీ వర్క్‌షాపు, గణపతి సచ్చిదానంద ఆశ్రమం ఎదురు, రాయపూడి మీదుగా బోరుపాలెం వరకూ ఈ హైవేను నిర్మిస్తారు. ► వెంకటపాలెం, రాయపూడి, తుళ్లూరు ప్రాంతాలను కలుపుతూ రాజధాని నగరంలో రెండు రైలుమార్గాల్ని డిజైన్‌లో చూపించారు. ► వెంకటపాలెం, నీరుకొండ, పెద్దమద్దూరు వద్ద రిజర్వాయర్లను ప్రతిపాదించారు. నీరుకొండ రిజర్వాయర్ నుంచి అమరావతి ప్రభుత్వ భవన సముదాయానికి నీటిని సరఫరా చేయాలని సూచించారు. ► ఉండవల్లి నుంచి కృష్ణాయపాలెం వరకూ గ్రీన్‌బెల్ట్ ఏర్పాటుకానుంది. ► ఉండవల్లి గుహల నుంచి ప్రకాశం బ్యారేజీ వరకూ ఉద్యానవనాలు, అమరావతి టౌన్షిప్, నిడమర్రు, అనంతవరం, బోరుపాలెం వద్ద పారిశ్రామికవాడలు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్లాన్‌కు మరికొన్ని మార్పులు చేసి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. -
శంకుస్థాపనకు ఖర్చెంత?
ఆంధ్రప్రదేశ్ బ్యూరో, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని హంగూ ఆర్భాటాలతో నిర్వహిస్తుండడంపై ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. తాము కోరిన వివరణకు సాధ్యమైనంత త్వరగా స్పందించాలని సూచించింది. ఈ నెల 22న అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని రూ.వందల కోట్ల ఖర్చుతో నిర్వహించనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై పీఎంఓ దృష్టి సారించింది. ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల వినియోగం, ప్రచారానికి పెద్ద ఎత్తున ఖర్చు చేస్తుండటంపై సమగ్ర సమాచారం పంపాలని ఏపీ ప్రభుత్వాన్ని పీఎంఓ కోరినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఒకవైపు లోటు బడ్జెట్లో ఉన్నామంటూనే మరోవైపు రూ.కోట్లు ఖర్చు చే యడాన్ని కూడా పీఎంఓ ప్రస్తావించినట్లు తెలిసింది. శంకుస్థాపనకు ఎంత ఖర్చు చేస్తున్నారో చెప్పాలని పేర్కొన్నట్లు సమాచారం. రాష్ట్ర సర్కారు తీరుపై పీఎంఓ అసంతృప్తి రాజధాని నిర్మాణంలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు ఉద్దేశించిన ఈ-బ్రిక్స్ పోర్టల్‌ను ముందుగా ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిం దో వివరణ ఇవ్వాలని పీఎంఓ పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాలు ధ్రువీకరించాయి. సింగపూర్, జపాన్ ప్రధానులను ప్రొటోకాల్ కు విరుద్ధంగా ఆహ్వానించడంపై కూడా పీఎంఓ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. భూమిపూజ పూర్తయినా ఆర్భాటం రాష్ర్ట రాజధాని నిర్మాణ భూమి పూజ, శంకుస్థాపనకు మధ్య తేడా ఏమిటో వివరించాలని పీఎంఓ ఏపీ సీఎం కార్యాలయాన్ని కోరింది. జూన్ 6న సీఎం గుంటూరు జిల్లా మందడం గ్రామ సమీపంలో రాజధాని నిర్మాణానికి భూ మి పూజ చేశారు. దీని తరువాత నిర్మాణ పను లను ప్రారంభిస్తారు. భూమిపూజ రోజునే ము ఖ్యులను ఆహ్వానిస్తారు. పనుల ప్రారం భం రోజున ఎలాంటి ఆర్భాటాలు ఉండవు. భూమిపూజ చేసిన నాలుగున్నర నెలల తరువాత సీఎం శంకుస్థాపన పేరుతో హడావిడి చేస్తున్నారు. దీంతో పీఎంవో రెండింటికి మధ్య ఉన్న తేడా వివరించాలని కోరినట్లు తెలిసింది. -
అమరావతికి పర్యాటక శోభ
విజయవాడ: అమరావతి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకోనుంది. నూతన రాజధానికి అమరావతి పేరు పెట్టిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా గ్రామాన్ని అభివృద్ధి చేయనున్నారు. బౌద్ధుల పుణ్యక్షేత్రంగా పేరున్నా, ప్రాచీన అమరేశ్వరాలయం ఉన్నా ఇప్పటివరకూ గ్రామం అభివృద్ధి చెందలేదు. బౌద్ధమత చరిత్ర, అమరేశ్వరాలయం ప్రాశస్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇటీవల కేంద్ర ప్రభుత్వం దీనికి పర్యాటక ప్రాధాన్యత కల్పించింది. అందులో భాగంగా రెండు కేంద్ర ప్రభుత్వ పథకాలకు అమరావతిని ఎంపిక చేసింది. వీటి ద్వారా సుమారు రూ.70 కోట్లను గ్రామాభివృద్ధికి వినియోగించనున్నారు. హ్రిదయ్ (హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ అగ్మెంటేషన్ యోజన) పథకం కింద దేశంలోని 12 హెరిటేజ్ నగరాల్లో ఒకటిగా కేంద్రం అమరావతిని కొద్దిరోజుల క్రితం ఎంపిక చేసింది. గ్రామ ప్రాచీనతను కాపాడేందుకు, మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు ఈ పథకం కింద కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రూ.22.26 కోట్లు కేటాయించింది. కేంద్ర పర్యాటక శాఖ అమలు చేస్తున్న ప్రసాద్ (పిలిగ్రిమేజ్ రిజువెనేషన్ అండ్ స్ప్రిట్యువల్ అగ్మెంటేషన్ డ్రైవ్) పథకానికీ అమరావతి ఎంపికైంది. దీని కింద రూ.47 కోట్లు మంజూరయ్యే అవకాశం ఉంది. హ్రిదయ్’ నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఇందుకు ప్రతిపాదనలు రూపొందించింది. గ్రామంలోని పర్యాటక ప్రదేశాలైన అమరేశ్వరాలయం నుంచి ధ్యాన బుద్ధ ప్రాజెక్టుల వరకు సులభంగా వెళ్లేందుకు కరకట్టను విస్తరించి రోడ్డు వేసేందుకు ప్రతిపాదించారు. భూగర్భ డ్రైనేజీ, విద్యుత్ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు, ప్రధాన రోడ్ల విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. బుద్ధిస్టు మ్యూజియం, ధ్యానబుద్ధ ప్రాజెక్టు, మహాచైత్యం (స్థూపం) ప్రాంతాన్ని ఆకర్షణీయంగా మార్చడానికి, బౌద్ధారామాలు, కాటేజీలు నిర్మించేందుకు డిజైన్లు సిద్ధం చేశారు. ఏపీ టూరిజం శాఖ కాటేజీలు, పార్కులు ఏర్పాటుచేసే యోచనలో ఉంది. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా అమరావతి రూపురేఖల్ని మార్చడమే లక్ష్యంగా ప్రయత్నాలు ఊపందుకున్నాయి.