అమరావతి: రాజధాని అంశంలో చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ ద్వారా విరుచుకుపడ్డారు. ఇన్ సైడర్ ట్రేడింగులో భూములు చౌకగా కొట్టేసిన ఎలుకలన్నీ కలుగుల్లో నుంచి బయటికొస్తున్నాయంటూ ధ్వజమెత్తారు. పరువు నష్టం దావా వేస్తామని, దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండని సవాళ్లు విసురుతున్నారని ఆయన ట్వీట్ చేశారు. సీఐడీ లేదా సీబీఐతో దర్యాప్తు జరిపించమని లేఖలు రాయండి మీరు నిప్పులో తుప్పులో తేలుతుంది అంటూ సవాలు విసిరారు.
చదవండి: అందుకే ప్రజలు మిమ్మల్ని తరిమికొట్టారు
'విక్రమార్కుడు- భేతాళ కథల్లోని భేతాళుడితో పోల్చదగ్గ వ్యక్తి చంద్రబాబు. రకరకాల మ్యానిప్యులేషన్లతో తప్పించుకుంటూ వస్తున్నాడు. చేసిన తప్పుల నుంచి శాశ్వతంగా ఎవరూ బయట పడలేరని త్వరలోనే ఆయనకు అర్థమవుతుంది. కుతంత్రాలతో ప్రజలను రెచ్చగొట్టి తను రక్షణ పొందాలని చూస్తుంటాడు' అని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. గతంలో కూడా 'ఎలక్షన్ల ముందు కూడా ఇలాగే దుష్ప్రచారం చేశారు. వైఎస్ జగన్ సీఎం అయితే భూములు లాక్కుంటారని, ఇళ్లలోంచి వెళ్లగొడతారని, రౌడీరాజ్యం వస్తుందని భయానక దృశ్యాలు చూపించారు. ప్రజలు మిమ్మల్నే అధికారం నుంచి విసిరి కొట్టి బుద్ధి చెప్పారు. అయినా అవే గోబెల్స్ ప్రచారాలు చేస్తున్నారంటూ' మండిపడ్డారు.
మరో ట్వీట్‌లో.. 'తీసేసిన తహశీల్దారులంతా పళ్లు పటపట కొరుకుతున్నారు. విషం కక్కడంలో పోటీలు పడుతున్నారు. వైఎస్ జగన్ గారి నివాసం మీ హయాంలోనే పూర్తయింది. అనుమతి లేకపోతే అప్పుడు నోళ్లెందుకు పెగల్లేదు అంటూ విమర్శించారు. లింగమనేని గెస్ట్ హౌజులా నదిని పూడ్చి కట్టింది కాదు కదా. తోక కనిపించకున్నా అదిగో పులి అనే బ్యాచ్ తయారైందంటూ' మరో ట్వీట్‌లో విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment