inside trading
-
మస్క్ రూ.24వేలకోట్లు తిరిగి ఇచ్చేయాలి.. పిటిషన్ దాఖలు
టెస్లా వ్యవస్థాపకులు ఎలొన్‌మస్క్ ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా సంపాదించిన దాదాపు 3 బిలియన్ డాలర్లను(సుమారు రూ.24వేలకోట్లు) తిరిగి వాటాదారులకు ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలైంది. మైకేల్ పెర్రీ అనే టెస్లా షేర్ హోల్డర్ ఈమేరకు అమెరికాలోని డెలావేర్ ఛాన్సరీ కోర్టులో పిటిషన్ వేశారు.అందులోని వివరాల ప్రకారం.. 2022లో టెస్లా కార్లకు భారీగానే డిమాండ్ ఉంది. కానీ నవంబర్ నెలలో కంపెనీ అంచనాల కంటే అమ్మకాలు తగ్గిపోయాయి. జనవరి 2023లో వెలువడిన నాలుగో త్రైమాసిక ఫలితాలకంటే ముందే మస్క్ చాకచక్యంగా షేర్లు విక్రయించి లాభాలు పొందారు. కంపెనీ సేల్స్ సహా ఇతర విషయాలు తెలుసుకునేందుకు మస్క్‌కు యాక్సెస్ ఉంటుంది. అందుకే ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా ఫలితాల ముందే షేర్లు విక్రయించారు. 2022లో మస్క్మొత్తం 7.5 బిలియన్ డాలర్లు(సుమారు రూ.62వేలకోట్లు) విలువ చేసే షేర్లను అమ్మారు. నవంబర్-డిసెంబర్లో ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా మస్క్ 3 బిలియన్ డాలర్లు(రూ.24వేలకోట్లు) లాభం పొందారు.టెస్లా సీఈఓ పదవిలో ఉన్న ఎలొన్‌మస్క్ నిబంధనలకు విరుద్ధంగా సంపాదించిన లాభాలను వెంటనే వాటాదారులకు తిరిగిచ్చేలా ఆదేశించాలని మైకేల్ పెర్రీ కోర్టును కోరారు. మస్క్ షేర్లను విక్రయించేలా టెస్లా డైరెక్టర్లు కూడా కార్పొరేట్ నియమాలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. అయితే ఈ విషయంపై రాయిటర్స్ టెస్లాను వివరణ కోరగా ఎలాంటి స్పందన రాలేదని మీడియా కథనాల ద్వారా తెలిసింది.ఇదీ చదవండి: తగ్గిన చమురు ధరలు.. ఒపెక్‌ప్లస్ కూటమి ప్రభావంఇన్సైడ్ ట్రేడింగ్ అంటే..కంపెనీలో పనిచేస్తున్నవారికి రియల్‌టైమ్‌లో సంస్థ ఉత్పత్తులకు డిమాండ్ ఎలా ఉంది..ఉత్పత్తి ఎలా జరుగుతుంది..రాబోయే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి.. భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి అనే అంశాలపై అవగాహన ఉంటుంది. దాన్ని అసరాగా చేసుకుని అప్పటికే తమకు కంపెనీలో ఉన్న పెట్టుబడులపై నిర్ణయం తీసుకుని అక్రమంగా లాభాలు పొందుతారు. -
‘రాజధాని దొంగల’పై సంచలన నివేదిక
సాక్షి, గుంటూరు: అమరావతి రాజధాని నిర్మాణం పేరిట జరిగిన భూ కుంభకోణంపై సమగ్ర నివేదికను ఏపీ మంత్రి వర్గ ఉప సంఘం రూపొందించింది. అయితే.. రాజధాని ప్రకటనకు ముందస్తు సమాచారంతో భూముల కోనుగోళ్లు జరిగాయని, క్యాపిటల్ సిటీ, రీజియన్ లో భూముల కొనుగోళ్లు అదీ బినామీ పేర్లతో టీడీపీ నేతలు కొనుగోళ్లు చేపట్టినట్టు నివేదికలో వెల్లడైంది. రాజధాని దొంగలపై కేబినెట్ సబ్ కమిటీ రూపొందించిన ఆ నివేదికలో సంచలన విషయాలు వెల్లడి కాగా.. ఈ నివేదిక సాక్షి చేతికి దొరికింది. టీడీపీ నేతలు, బినామీలకు మేలు చేసేలా రాజధాని సరిహద్దుల నిర్ణయం జరిగింది. అలాగే.. లంక, పోరంబోకు,ప్రభుత్వ భూముల రికార్డుల్లో భారీ అక్రమాల గుర్తించింది కేబినెట్ సబ్ కమిటీ. లేండ్ పూలింగ్ స్కీమ్ కోసం రికార్డులు తారుమారు చేసినట్టు నిర్ధారణ కావడంతో పాటు భూ కేటాయింపుల్లోనూ భారీ అక్రమాలకు పాల్పడింది అప్పటి చంద్రబాబు ప్రభుత్వం. 1977 అసైన్డ్ భూముల చట్టంతో పాటు 1989 ఎస్సీ, ఎస్టీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించారని నిర్ధారణ అయ్యింది. ఇన్ సైడర్ ట్రేడింగ్‌పై పక్కా ఆధారాలు బినామీలు, నేతల భూములకు మేలు చేసేలా రాజధాని ఏర్పాటుకై చంద్రబాబు హయాంలోని ప్రభుత్వం తీవ్ర కృషి చేసింది. ఇందుకోసం తెల్లరేషన్‌కార్డు ఉన్నవాళ్లను బినామీలుగా ఉపయోగించుకున్నారు టీడీపీ నేతలు. 2014 జూన్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు భూముల కొనుగోళ్లు జరగ్గా.. 4 వేల 70 ఎకరాల భూములను ఇన్ సైడర్ ట్రేడింగ్ లో కొనుగోళ్లు చేశారు వాళ్లు. టీడీపీ నేతలు, ప్రముఖులు రాజధాని భూ కుంభకోణం నివేదికలో అసలు దొంగత పేర్లను సైతం మంత్రివర్గ ఉప సంఘం పేర్కొంది. ఇందులో ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ సన్నిహితుడు వేమూరు రవికుమార్ ప్రసాద్, మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీఎస్ ఆంజనేయులు, చంద్రబాబు గెస్ట్ హౌస్ యజమాని లింగమనేని రమేష్, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, లంకా దినకర్, దూళిపాళ్ల నరేంద్ర, కంభంపాటి రామ్మోహన్ రావు, పుట్టా మహేష్ యాదవ్ పేర్లను నివేదికలో పేర్కొంది ఉప సంఘం. నారా లోకేష్ బినామీ వ్యవహారం.. నారా లోకేష్ బినామీ భూముల వ్యవహారాన్ని మంత్రివర్గ ఉప సంఘం బయటపెట్టింది. వేమూరి రవి కుమార్ కుటుంబం పేరుతో భారీగా భూముల కొనుగోళ్లు జరిగినట్లు గుర్తించింది. సుమారు 62.77 ఎకరాల భూములు కొనుగోలు చేసినట్టు తేలింది. 👉 అలాగే.. భార్యా, బంధువుల పేర్లతో భూములు కొనుగోలు చేశాడు చంద్రబాబు గెస్ట్ హౌస్ యజమాని లింగమనేని రమేష్. 👉 ఇక మాజీ మంత్రి నారాయణ బినామీ దందాను నివేదిక బయటపెట్టింది. సన్నిహితులు ఆవుల మునిశేఖర్, రాపూరు సాంబశివరావు, పొట్టూరి ప్రమీల, కొత్తపు వరుణ కుమార్ పేర్లతో 55. 27 ఎకరాలు భూముల్ని మాజీ మంత్రి నారాయణ కొనుగోలు చేశారు. 👉 బినామీ పేర్లతో 68.6 ఎకరాల భూమి కొనుగోలు చేశారు.. మాజీ ఎమ్మెల్యే కొమ్మాల పాటి శ్రీధర్. 👉 ఇక గుమ్మడి సురేష్ పేరుతో 38.84 ఎకరాల భూమి కొన్నాడు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. 👉 మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు మైత్రీ ఇన్ ఫ్రా పేరుతో 40 ఎకరాలు కొనుగోలు చేసినట్లు బట్టబయలైంది. 👉 పేర్లు, రికార్డులు, ఆధారాలతో సహా నివేదిక సమర్పించింది మంత్రి వర్గ ఉప సంఘం ఆ జీవో టీడీపీ నేతల కోసమే.. టీడీపీ నేతల కోసం సిఆర్డీయే పరిధి మార్చేసింది చంద్రబాబు హయాంలోని టీడీపీ ప్రభుత్వం. ఇప్పుడు సంక్షేమ పథకాలకు, జీవోలకు అడ్డుపుడుతున్న ఇదే పచ్చ నేతల కోసం.. అప్పట్లో జీవో జారీ చేసింది బాబు సర్కార్. 👉 సీఆర్డీయే పరిధిలో 524.545 ఎకరాల భూముల కోసం సరిహద్దులు మార్పు చేసింది. అలాగే నటుడు.. ఎమ్మెల్యే బాలకృష్ణ వియ్యంకుడి సంస్థ వీబీసీ కెమికల్స్ కు భూముల కేటాయింపు చేసింది. జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో 498 ఎకరాల కేటాయించి.. భూములు కేటాయించాక సిఆర్డీయే పరిధి మారుస్తూ జీవో జారీ చేసింది. 👉 ఇక.. సత్తెనపల్లి మండలంలో దూళిపాళ్లలో కోడెల శివప్రసాద్(దివంగత మాజీ స్పీకర్)కు భూములు ఉన్నాయి. మొవ్వ మండలం పెద ముట్టేవి, చిన ముట్టేవిలో లింగమనేనికి భూములు ఉన్నాయి. భూముల్ని కేటాయించాక పరిధి మారుస్తూ 207 జీవో విడుదల చేసింది టీడీపీ ప్రభుత్వం. ఇక కొనకంచిలో యలమంచిలి శివలింగ ప్రసాద్ భూముల కోసం సీ ఆర్డీయే సరిహద్దుల్లో మార్పులు చేసింది. సంస్థల కేటాయింపుల్లోనూ.. వివిధ సంస్థలకు కేటాయించిన భూముల్లోనూ అక్రమాలను గుర్తించింది ఏపీ కేబినెట్ సబ్ కమిటీ. ఆ వివరాలను నివేదికలో పొందుపరిచింది. ఐదు ప్రైవేట్ సంస్థలకు 850 ఎకరాల భూమిని అక్రమంగా కేటాయించినట్లు తేలింది. అలాగే.. సింగపూర్ తో ఒప్పందంలోనూ లోపాలను గుర్తించిన మంత్రివర్గ ఉప సంఘం.. మొత్తంగా టీడీపీ హయాంలో జరిగిన భూ దందాను, అక్రమాలను సమగ్రమైన నివేదిక ద్వారా ప్రభుత్వానికి సమర్పించింది. ఇదీ చదవండి: చంద్రబాబు హయాం అవినీతిపై సిట్ దర్యాప్తునకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ -
దేవినేని ఉమా సోదరుడు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి : టీడీపీ ప్రభుత్వం హయాంలో చోటుచేసుకున్న అవినీతిపై టీడీపీ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోదరుడు దేవినేని చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని పేరుతో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడట్టు తేటతెల్లమవుతోందని అన్నారు. టీడీపీ నేతల అవినీతిపై విచారణ జరిపితే ప్రముఖుల బండారం బయటపడుతుందని పేర్కొన్నారు. శనివారం విజయవాడలో ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. మాజీమంత్రి దేవినేని ఉమా అండదండలతో చాలామంది అక్రమాలకు పాల్పడ్డారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కృష్ణా జిల్లా కంచికచర్ల మాజీ మార్కెటింగ్ చైర్మన్ లక్ష్మీనారాయణ సామాన్య రైతు కుటుబానికి చెందిన వారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో పెద్ద ఎత్తున అవినీతి సొమ్ము కూడగట్టారు. రాజధాని ప్రాంతంలో బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేసి ఇన్సైడర్ ట్రేడింగ్‌కి పాల్పడ్డారు. సీఐడీ సోదాల్లో దొరికింది చాలా తక్కువ. వారి అవినీతిపై మరింత లోతుల్లోకెళ్లి విచారణ జరిపితే చాలా అక్రమాలు బయటపడతాయి. లక్ష్మీనారాయణ కొడుకు సీతారామరాజు రియల్ ఎస్టేట్ కంపెనీలో సోదాలు చేస్తే మొత్తం వ్యవహారం బయటపడుతుంది. ఇన్సైడర్ ట్రేడింగ్‌లో లక్ష్మీనారాయణ వెనక ఉన్న ప్రముఖ నేతల బండారం కూడా బహిర్గతం అవుతుంది. మాజీమంత్రి దేవినేని ఉమా అండదండలతో కంచికచర్లలో చాలామంది అక్రమాలకు పాల్పడ్డారు. సహకార బ్యాంకు రుణాల గోల్‌మాల్‌లో కూడా దేవినేని ఉమా అండదండలు ఉన్నాయి’ అని అన్నారు. -
‘టీడీపీ నేతలు దళితుల భూములను లాక్కున్నారు’
సాక్షి, అమరావతి: దళితుల భూములను మభ్యపెట్టి, భయపెట్టి మరీ టీడీపీ నేతలు లాక్కున్నారని పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రాజధానిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ దొంగల ముసుగులు తొలగుతున్నాయని తెలిపారు. టీడిపీకి చెందిన నేతలు నారాయణ, పత్తిపాటి పుల్లారావులపై సీఐడీ నమోదు చేసిన కేసులే అందుకు ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. తాజాగా దళిత మహిళ బుజ్జమ్మ ఫిర్యాదుతో మాజీ మంత్రుల భూ భాగోతం బయపడిందని ఆయన మండిపడ్డారు. బుజ్జమ్మ లాంటి బాధిత దళితులు రాజధాని ప్రాంతంలో చాలామంది ఉన్నారని అనిల్ కుమార్ తెలిపారు. చదవండి: ఇన్సైడర్ ట్రేడింగ్: పత్తిపాటి, నారాయణపై కేసులు సీఐడీ పూర్తి స్థాయిలో విచారణ చేసి.. ఇన్సైడర్ ట్రేడింగ్ కలుగులో ఉన్న టీడీపీ నేతల బండారాన్నీ బయటపెట్టాలి పేర్కొన్నారు. పేదల పేరుతో భూములు కొనుగోలు చేసిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. బినామీల పేర్లతో కొనుగోలు చేసిన భూములను కాపాడుకునేందు పరిపాలన వికేంద్రీకరణను టీడీపీ అడ్డుకుంటుందని అనిల్ కుమార్ మండిపడ్డారు. టీడీపీ నేతలు మండలి చైర్మన్‌పై ఒత్తిడి చేసి అప్రజాస్వామిక నిర్ణయం తీసుకొనేలా చేశారని అనిల్ కుమార్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. చదవండి: ఇన్సైడర్ ట్రేడింగ్‌పై సమగ్ర విచారణ -
'ఆ ఎలుకలన్నీ ఒక్కొక్కటి బయటకొస్తున్నాయి'
అమరావతి: రాజధాని అంశంలో చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ ద్వారా విరుచుకుపడ్డారు. ఇన్ సైడర్ ట్రేడింగులో భూములు చౌకగా కొట్టేసిన ఎలుకలన్నీ కలుగుల్లో నుంచి బయటికొస్తున్నాయంటూ ధ్వజమెత్తారు. పరువు నష్టం దావా వేస్తామని, దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండని సవాళ్లు విసురుతున్నారని ఆయన ట్వీట్ చేశారు. సీఐడీ లేదా సీబీఐతో దర్యాప్తు జరిపించమని లేఖలు రాయండి మీరు నిప్పులో తుప్పులో తేలుతుంది అంటూ సవాలు విసిరారు. చదవండి: అందుకే ప్రజలు మిమ్మల్ని తరిమికొట్టారు 'విక్రమార్కుడు- భేతాళ కథల్లోని భేతాళుడితో పోల్చదగ్గ వ్యక్తి చంద్రబాబు. రకరకాల మ్యానిప్యులేషన్లతో తప్పించుకుంటూ వస్తున్నాడు. చేసిన తప్పుల నుంచి శాశ్వతంగా ఎవరూ బయట పడలేరని త్వరలోనే ఆయనకు అర్థమవుతుంది. కుతంత్రాలతో ప్రజలను రెచ్చగొట్టి తను రక్షణ పొందాలని చూస్తుంటాడు' అని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. గతంలో కూడా 'ఎలక్షన్ల ముందు కూడా ఇలాగే దుష్ప్రచారం చేశారు. వైఎస్ జగన్ సీఎం అయితే భూములు లాక్కుంటారని, ఇళ్లలోంచి వెళ్లగొడతారని, రౌడీరాజ్యం వస్తుందని భయానక దృశ్యాలు చూపించారు. ప్రజలు మిమ్మల్నే అధికారం నుంచి విసిరి కొట్టి బుద్ధి చెప్పారు. అయినా అవే గోబెల్స్ ప్రచారాలు చేస్తున్నారంటూ' మండిపడ్డారు. మరో ట్వీట్లో.. 'తీసేసిన తహశీల్దారులంతా పళ్లు పటపట కొరుకుతున్నారు. విషం కక్కడంలో పోటీలు పడుతున్నారు. వైఎస్ జగన్ గారి నివాసం మీ హయాంలోనే పూర్తయింది. అనుమతి లేకపోతే అప్పుడు నోళ్లెందుకు పెగల్లేదు అంటూ విమర్శించారు. లింగమనేని గెస్ట్ హౌజులా నదిని పూడ్చి కట్టింది కాదు కదా. తోక కనిపించకున్నా అదిగో పులి అనే బ్యాచ్ తయారైందంటూ' మరో ట్వీట్లో విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. -
ఇన్సైడర్ ట్రేడింగ్‌లో టీడీపీ నేతలు
-
సీఎం జగన్ ప్రకటనపై వక్రభాష్యం
-
నిమ్మకాయల చినరాజప్ప ఇన్ సైడర్ ట్రేడింగ్
-
గుడ్లురిమే గురివింద నీతి
సమకాలీనం ముఖ్యమంత్రి అంటున్నట్టు, ఇంకో మాటలో చెప్పాలంటే గద్దిస్తున్నట్టు భూసమీకరణంతా జరిగిన తర్వాత ఇన్సైడర్ ట్రేడింగ్ లాంటిది జరిగిందని ఎవరూ అనట్లేదు. మతలబంతా ముందు జరగడమే! వారిది నికార్సయిన భూవ్యాపారమే అయితే... ఏ విజయనగరం లోనో, ఏలూరులోనో, నూజివీడులోనో ఎందుక్కొనలేదు? అక్కడే, కోర్ క్యాపిటల్ లోనే ఎందుక్కొన్నారు? ఈ ప్రశ్నలకు జవాబెందుకు లేదు? ఇన్ని జరిగినా వేటిపైనా విచారణ అవసరం లేదని, విమర్శించే వారే సాక్ష్యాధారాలతో నిరూపించాలంటున్నారు ఏలినవారు. రాజకీయాల్లో విమర్శలూ, ప్రతి విమర్శలూ కొత్తకాదు. విపక్షం- పాలకపక్షంగా స్థానం మారగానే వైఖరులు మారడం, విధానాలు తిరగబడటం, నీతిసూత్రాలు అమాంతం రూపాంతరం చెందడం సరికొత్త సం‘గతి’! ఇన్నాళ్లూ అవినీతి అని తామే దుమ్మెత్తిపోసిందాన్ని ఇప్పుడు నీతంటూ ఏకంగా నెత్తికెత్తుకోవడం, ఎదుటి వాళ్లు చేసింది తప్పై, అదే తాను చేసినపుడు ఒప్పవడం... ఇదీ, తాజా వైచిత్రి! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... ఏలిన వారు ఎన్నికల హామీల్ని తుంగలో తొక్కడం నుంచి రాజధాని భూదురాక్రమణ దాకా, నిస్సిగ్గు పార్టీ ఫిరాయింపు పర్వాల నుంచి జాతి యావత్తూ చూసేలా, మీడియాను బెదిరించే వరకు సాగుతున్న ప్రజాస్వామ్య పరాభవాల అంకం అసెంబ్లీ వేదికకు చేరింది. సభ సజావుగా నడిచే బాధ్యత భుజాలమీద మోయాల్సిన సభనాయకుడు ముఖ్యమంత్రే, ‘మేం చెప్పినట్టు జరిగితే తప్ప.. సభను నడువనిచ్చేది లేద’ని హుంకరించడం విస్మయం కలిగిస్తోంది. సభా న్యాయం పాటించాల్సిన సభాపతి ప్రతిపక్ష హక్కుల రక్షణకు రాకపోగా, విపక్షమిలా ప్రవర్తిస్తే, భూదందాలపై సీబీఐ విచారణే జరిగితే....పెట్టు బడులు రావనే ప్రభుత్వ భావనను పలికించడం మరింత విస్మయం కలిగిం చింది. ‘‘విపక్షంగా మేముండి ఆరోపించినపుడు పాలకపక్షం దర్యాప్తునకు ఆదేశించి, అవినీతి జరగలేదని నిరూపించుకోవాలి. మేమే పాలక పక్షంగా ఉన్నపుడైతే ప్రతిపక్షమే ‘ఇదుగో అవినీతి ఇలా జరిగింది’ అని మాకు సంతృప్తి కలిగేంత వరకు నిరూపించాలి, నిరూపించలేకపోతే క్షమాపణ చెప్పి సభ నుంచి విపక్షమే నిష్ర్కమించాలి!’’ ఇదీ మా నయానీతి!! అంటూ పాలక పక్షీయులు జబ్బలు చరుచుకుంటున్నారు. విసుగెత్తిన విపక్షం ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసిచ్చిందంటే, సంఖ్యా బలాల హెచ్చుతగ్గులే కాదు ఇంటా-బయటా పాలకపక్షం-ప్రభుత్వం వ్యవహార శైలినీ చూడాలి. గోప్యతా ప్రమాణమూ గాలికి! భారత రాజ్యాంగం, మూడో షెడ్యూల్లో నిర్దేశించిన విధంగా ప్రభుత్వ బాధ్యత చేపట్టేవారు గోప్యత ప్రమాణం (ఓత్ ఆఫ్ సీక్రసీ) చేస్తారు. ఒకసారి కాదు, ముఖ్యమంత్రిగా మూడుమార్లు అలా ప్రమాణం చేసిన చంద్రబాబు తన ఎన్నికల హామీలకు పట్టించిన గతే ప్రమాణానికీ పట్టించారు. ‘‘నారా చంద్రబాబునాయుడు అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని... నా కర్తవ్యా లను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంగానీ పక్షపాతం గానీ, రాగద్వేషాలు గానీ లేకుండా రాజ్యాంగాన్నీ, శాసనాల్నీ అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని... రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్నీ నా కర్తవ్యాల్ని సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప, ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగాగానీ ఏ వ్యక్తికీ లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడిం చనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’’ అని పెద్ద సభలో, ప్రజల సమక్షంలో చెప్పారు. కానీ ఏం చేశారు? రాజధాని సాక్షిగా సమస్త ప్రజానీకం కళ్లకు కడుతోంది. ప్రభుత్వంలో భాగమై, నిర్ణయాలకు చేరువగా ఉండటాన్ని సానుకూలంగా మలచుకొని పెద్ద ఎత్తున ప్రజా వంచనకు దిగారు. చైనా, జపాన్, సింగపూర్ ప్రభుత్వాల్ని తెరపైన చూపి, అక్కడి ప్రయివేటు సంస్థలతో లోపాయకారి సంప్రదింపులతో ప్రపంచంలో ఎక్కడా లేనంత పెద్ద రియల్ ఎస్టేట్ దందాగా రాజధాని వ్యవహారాన్ని సాగించడం ఒక ఎత్తు. రాజధానిని ఏ నిర్దిష్ట ప్రాంతంలో నిర్మిస్తారు అన్న అధికారిక సమా చారాన్ని పరిమితంగా కొందరు మంత్రులు, ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండే వ్యవహారకర్తలు, రియల్టర్లకు మాత్రమే తెలిపి చేసిన ఘోరం మరో ఎత్తు! వారు ఆ ప్రాంతంలో చౌకగా భూములు కొనుగోలు చేసేలా, రకరకాల పద్ధతుల్లో రైతులు, సామాన్యుల భూముల్ని వారు స్వాధీనపరచుకునేలా వ్యవహారం నడిపారు. 2005లో సమాచార హక్కు చట్టం వచ్చిన దరిమిలా... పారదర్శకత నూతన విధానమైనపుడు ఇంకా ఈ గోప్యతా ప్రమాణమేంటి? ఇందులో అర్థం లేదు, ఇది తప్పుడు సంకేతాలిస్తుంది కనుక దీన్ని తొలగించాలనే వాదన పెరిగింది. సమాచారం అందరితో పంచు కుంటానని ప్రమాణం చేసేలా రాజ్యాంగం మూడో షెడ్యూల్‌ని సవరిం చాలనే డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. కానీ, అధికారంలో ఉండే కొందరైనా, అలా ప్రభుత్వంలో భాగం కాని మెజారిటీ సామాన్యులైనా... ఉభయులూ సమానావకాశాలు కలిగి ఉండాలనే ఉద్దేశంతో గోప్యతా ప్రమా ణాన్ని కొనసాగించడానికే కేంద్ర ప్రభుత్వం, నిపుణులూ ప్రాధాన్యత నిచ్చారు. ఇంతకీ జరిగిన దారుణమేంటి? ‘కొంటే తప్పేంటి?’ అన్న పాలకుల ప్రశ్నలో పొగరున్నంతగా న్యాయం లేదు. లోగడ చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనా కాలంలో అప్పటి రాజధాని హైదరా బాద్ ‘హైటెక్ సిటీ’ ప్రాంత అభివృద్ధి క్రమంలో ప్రయోగించిన స్వార్థపు నమూనానే ఇప్పుడు అమలు పరిచారు. హైటెక్‌సిటీ అభివృద్ధి చేసే విష యాన్ని తగినంత ముందుగా తమ వారికే చెందిన జయభేరి వంటి సంస్థలకు లీకులిచ్చారు. ఆపై అధికారికంగా అభివృద్ధి జోన్ ప్రకటించి, తాము సమీక రించుకున్న భూముల విలువ ఇబ్బడి ముబ్బడిగా పెరిగేటట్టు చేసుకొని కోట్లకు పడగలెత్తారు. ఈ స్వార్థ నమూనానే రాజధానిలో పదునెక్కించి మరీ అమలు పరిచారు. అక్కడికీ ఇక్కడికీ ఇంకో ప్రధాన తేడా ఉంది. నూజివీడు వైపు రాజధాని వస్తోందని ముందు ప్రచారం చేసి, అక్కడ పలువురు రియల్టర్లు, సామాన్యులు భూములు కొనుక్కునేలా, మంగళగిరి-తుళ్ళూరు తదితర ప్రాంతాల్లోని వారు రాజధాని రావట్లేదనే నిరాశతో చౌకగా తమ భూముల్ని అమ్ముకునేలా ఎత్తుగడ వేశారు. కాదు, రాజధాని తుళ్లూరు చుట్టుపక్కలే వస్తుందన్న కచ్చితమైన రహస్య సమాచారం ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి బంధువులు, రాబందులు మాత్రం అక్కడే భూములు కొనుక్కొని, లాక్కొని, నయానో భయానో వశపరచుకొని రైతులు, సామా న్యుల పచ్చని పంటపొలాల్లో తమ దగాను యథేచ్ఛగా విస్తరించారు. ఇది రెండింతల మోసం! ‘‘భూములు కొంటే తప్పేంటి? డబ్బులున్నాయి వ్యాపా రం చేసుకుంటున్నారు. మంత్రులైతే వ్యాపారాలు చేసుకోవద్దా?’’అని నిస్సం కోచంగా ముఖ్యమంత్రే ప్రశ్నిస్తున్నారు. ‘అక్కడే రాజధాని వస్తుందన్న కచ్చి తమైన ముందస్తు సమాచారంతో, నిర్ణయం వెల్లడించడానికి పూర్వం, ప్రభుత్వంలో ఉన్నవారు అలా సామాన్య ప్రజల భూముల్ని తక్కువ ధరలకు కొని ఖరీదైన ఆస్తులుగా సొమ్ము చేసుకోవడం తప్పు’ అని ప్రతిపక్షం విమర్శిస్తే, ‘... మేం అలాగే చేస్తాం, ఏ విచారణా జరపం, ఏం చేసుకుంటారో చేసుకోండి’ అని దబాయిస్తున్నారు. దర్యాప్తు అంటేనే జడుసుకుంటున్నారు. సీబీఐ పేరు ప్రస్తావించిన ప్రతిసారీ ముఖ్యమంత్రి రుసరుసలాడుతున్నారు. ఎందుకు? ఇన్సైడర్ ట్రేడింగ్ కన్నా నీచంగా... ‘ఇందులో ఇన్సైడర్ ట్రేడింగ్ ఎక్కడుంది? మేం 34 వేల ఎకరాల భూసమీకరణ చేశాం, ఇప్పుడా భూమి మాతోనే ఉంది, ఇంకెక్కడి ఇన్సైడర్ ట్రేడింగ్?’ అని సభావేదికగా ముఖ్యమంత్రి అమాయకత్వం నటిస్తున్నారు. ‘అసలు ఇన్సైడ్ (నిజానికి ఇన్సైడర్) ట్రేడింగ్ అంటే తెలుసా మీకు? తెలియకుండానే మాట్లాడేస్తున్నారు...’ అని ఎదురుదాడి చేస్తున్నారు. ఒక సంస్థకు సంబంధించిన లోపలి వ్యక్తిగా గోప్య సమాచారం తెలిసుండి, దాన్ని తన స్వప్రయోజనాలకు వాడుకుంటూ స్టాక్ ఎక్స్చేంజ్లో వ్యాపారం చేసే అక్రమ ప్రక్రియకే ఇన్సైడర్ ట్రేడింగ్ అని నిర్వచనం. ఇదే జరిగిందిక్కడ. ముఖ్యమంత్రి అంటున్నట్టు, ఇంకో మాటలో చెప్పాలంటే గద్దిస్తున్నట్టు భూసమీకరణంతా జరిగిన తర్వాత ఇన్సైడర్ ట్రేడింగ్ లాంటిది జరిగిందని ఎవరూ అనట్లేదు. మతలబంతా ముందు జరగడమే! వారిది నికార్సయిన భూవ్యాపారమే అయితే... ఏ విజయనగరంలోనో, ఏలూరులోనో, నూజివీడులోనో ఎందుక్కొనలేదు? అక్కడే, కోర్ క్యాపిట ల్లోనే ఎందుక్కొన్నారు? ఈ ప్రశ్నలకు జవాబెందుకు లేదు? ఉప్పందిన తమ అనుచరగణం పేదల అసైన్మెంట్ భూముల్నీ మాయమాటలతో స్వాధీన పరచుకున్న తర్వాత కదా సదరు చట్టాన్ని ఈ సర్కారు పెద్దలు మార్చాలని యత్నిస్తున్నది! ఇప్పటికీ స్పష్టత లేకుండా ఆ చట్టాన్ని అయోమ యంలోకి నెట్టింది సర్కార్ కాదా? ఇన్ని జరిగినా వేటిపైనా విచారణ అవసరం లేదని, విమర్శించే వారే సాక్ష్యాధారాలతో నిరూపించాలంటు న్నారు ఏలినవారు. బెదిరింపు, భయపెట్టడాలే ప్రధానాస్త్రాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా బెదిరించి వ్యవస్థల్ని, వ్యక్తుల్ని లొంగ దీసుకోవాలనేది ముఖ్యమంత్రి ఎత్తుగడగా కనిపిస్తోంది. ఇది ఆయన నైజం కూడానేమో! ఇందుకు అవసరమయితే పచ్చి అబద్ధాల్ని ఒకటికి రెండుమార్లు వల్లెవేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. రాజధాని భూదందాలపై పత్రికల్లో, ముఖ్యంగా సాక్షిలో వచ్చిన కథనాలతో కంపించిపోయినట్టు ఆయన మాటలు, వ్యక్తీకరణని బట్టి స్పష్టమౌతోంది. ‘ముందు మీ పై కేసులు పెట్టాలి, ఎలా రాస్తారు? ఏది పడితే అది రాయడమేనా? మీ పైన కేసులు పెడితే అప్పుడు భయముంటుంది!’ అని భయపెట్టడమే తమ లక్ష్యమన్నట్టు విలేకరుల భేటీలో మాట్లాడారు. తప్పిదాలు జరక్కుండా చూడటం కన్నా, వాటిని రాయకుండా జాగ్రత్తపడాలనే తపనే కొట్టొచ్చినట్టు కనిపించింది. అసెంబ్లీ వేదికగానూ అదే బెదిరింపు. ‘సాక్షి’ పత్రికపై మునికాళ్లపై లేస్తున్నారు. ‘సాక్షి’ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ అటాచ్మెంట్లో ఉంది, కనుక ఇది ప్రజా ఆస్తే అని ఒకమారు, ప్రభుత్వ ఆస్తి అని మరోమారు, జప్తు అయిందని ఒకమారు, అవుతోందని మరోమారు.... ఇలా ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి తప్పుడు మాటలు చెబుతూ తన మానసిక స్థితిని వెల్లడిం చారు. ప్రజాస్వామ్యయుతంగా ఉండటమే కాదు, ఉన్నట్టు కనబడాలనేది స్ఫూర్తి అయితే, ప్రజాస్వామ్యయుతంగా ఉండం, ఉన్నట్టు కనబడాల్సిన అవసరం మాకు అంతకన్నా లేదన్నట్టు వ్యవహరిస్తోందీ ప్రభుత్వం. సభా వేదిక నుంచి ముఖ్యమంత్రే చెప్పినట్టు, ‘‘గతకాలపు చర్యలే వర్తమానంలో మన ప్రస్తుత పరిస్థితి అయినపుడు, వర్తమానంలో మన వ్యవహారాలే మన భవిష్యత్తుకు భూమిక అవుతాయి!’’ దిలీప్ రెడ్డి ఈమెయిల్: dileepreddy@sakshi.com