AP Cabinet Sub Committee Report On CBN TDP Leaders Insider Trading - Sakshi
Sakshi News home page

ఏపీ ‘రాజధాని దొంగల’పై సంచలన నివేదిక.. బినామీలు, జీవోలు, కేటాయింపులు..

Published Wed, May 3 2023 1:36 PM | Last Updated on Wed, May 3 2023 2:41 PM

AP Cabinet Sub Committee Report On CBN TDP leaders insider trading - Sakshi

సాక్షి, గుంటూరు: అమరావతి రాజధాని నిర్మాణం పేరిట జరిగిన భూ కుంభకోణంపై సమగ్ర నివేదికను ఏపీ మంత్రి వర్గ ఉప సంఘం రూపొందించింది. అయితే..  రాజధాని ప్రకటనకు ముందస్తు సమాచారంతో భూముల కోనుగోళ్లు జరిగాయని, క్యాపిటల్ సిటీ, రీజియన్ లో భూముల కొనుగోళ్లు  అదీ బినామీ పేర్లతో టీడీపీ నేతలు కొనుగోళ్లు చేపట్టినట్టు నివేదికలో వెల్లడైంది. రాజధాని దొంగలపై కేబినెట్‌ సబ్‌ కమిటీ రూపొందించిన ఆ నివేదికలో సంచలన విషయాలు వెల్లడి కాగా.. ఈ నివేదిక సాక్షి చేతికి దొరికింది. 

టీడీపీ నేతలు, బినామీలకు మేలు చేసేలా రాజధాని సరిహద్దుల నిర్ణయం జరిగింది. అలాగే.. లంక, పోరంబోకు,ప్రభుత్వ భూముల రికార్డుల్లో భారీ అక్రమాల గుర్తించింది కేబినెట్‌ సబ్‌ కమిటీ. లేండ్ పూలింగ్ స్కీమ్ కోసం రికార్డులు తారుమారు చేసినట్టు నిర్ధారణ కావడంతో పాటు భూ కేటాయింపుల్లోనూ భారీ అక్రమాలకు పాల్పడింది అప్పటి చంద్రబాబు ప్రభుత్వం. 1977 అసైన్డ్ భూముల చట్టంతో పాటు 1989 ఎస్సీ, ఎస్టీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించారని నిర్ధారణ అయ్యింది. 

ఇన్ సైడర్ ట్రేడింగ్‌పై పక్కా ఆధారాలు
బినామీలు, నేతల భూములకు మేలు చేసేలా రాజధాని ఏర్పాటుకై చంద్రబాబు హయాంలోని ప్రభుత్వం తీవ్ర కృషి చేసింది. ఇందుకోసం తెల్లరేషన్‌కార్డు ఉన్నవాళ్లను బినామీలుగా ఉపయోగించుకున్నారు టీడీపీ నేతలు. 2014 జూన్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు భూముల కొనుగోళ్లు జరగ్గా.. 4 వేల 70 ఎకరాల భూములను ఇన్ సైడర్ ట్రేడింగ్ లో కొనుగోళ్లు చేశారు వాళ్లు. 

టీడీపీ నేతలు, ప్రముఖులు
రాజధాని భూ కుంభకోణం నివేదికలో అసలు దొంగత పేర్లను సైతం మంత్రివర్గ ఉప సంఘం పేర్కొంది. ఇందులో ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్‌ సన్నిహితుడు వేమూరు రవికుమార్ ప్రసాద్,  మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీఎస్‌ ఆంజనేయులు, చంద్రబాబు గెస్ట్ హౌస్ యజమాని లింగమనేని రమేష్,  టీడీపీ ఎమ్మెల్యే  పయ్యావుల కేశవ్,  లంకా దినకర్, దూళిపాళ్ల నరేంద్ర, కంభంపాటి రామ్మోహన్ రావు,  పుట్టా మహేష్ యాదవ్ పేర్లను నివేదికలో పేర్కొంది ఉప సంఘం. 

నారా లోకేష్ బినామీ వ్యవహారం.. 
నారా లోకేష్‌ బినామీ భూముల వ్యవహారాన్ని మంత్రివర్గ ఉప సంఘం బయటపెట్టింది. వేమూరి రవి కుమార్ కుటుంబం పేరుతో భారీగా భూముల కొనుగోళ్లు జరిగినట్లు గుర్తించింది. సుమారు 62.77 ఎకరాల భూములు కొనుగోలు చేసినట్టు తేలింది. 

👉 అలాగే.. భార్యా, బంధువుల పేర్లతో భూములు కొనుగోలు చేశాడు చంద్రబాబు గెస్ట్ హౌస్ యజమాని లింగమనేని రమేష్. 

👉 ఇక మాజీ మంత్రి నారాయణ బినామీ దందాను నివేదిక బయటపెట్టింది. సన్నిహితులు ఆవుల మునిశేఖర్, రాపూరు సాంబశివరావు, పొట్టూరి ప్రమీల, కొత్తపు వరుణ కుమార్ పేర్లతో 55. 27 ఎకరాలు భూముల్ని మాజీ మంత్రి నారాయణ కొనుగోలు చేశారు. 

👉 బినామీ పేర్లతో 68.6 ఎకరాల భూమి కొనుగోలు చేశారు.. మాజీ ఎమ్మెల్యే కొమ్మాల పాటి శ్రీధర్. 

👉 ఇక గుమ్మడి సురేష్ పేరుతో 38.84 ఎకరాల భూమి కొన్నాడు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. 

👉 మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు మైత్రీ ఇన్ ఫ్రా పేరుతో 40 ఎకరాలు కొనుగోలు చేసినట్లు బట్టబయలైంది. 

👉 పేర్లు, రికార్డులు, ఆధారాలతో సహా నివేదిక సమర్పించింది మంత్రి వర్గ ఉప సంఘం

ఆ జీవో టీడీపీ నేతల కోసమే.. 
టీడీపీ నేతల కోసం సిఆర్డీయే పరిధి మార్చేసింది చంద్రబాబు హయాంలోని టీడీపీ ప్రభుత్వం. ఇప్పుడు సంక్షేమ పథకాలకు, జీవోలకు అడ్డుపుడుతున్న ఇదే పచ్చ నేతల కోసం.. అప్పట్లో జీవో జారీ చేసింది బాబు సర్కార్‌.  

👉 సీఆర్డీయే పరిధిలో 524.545 ఎకరాల భూముల కోసం సరిహద్దులు మార్పు చేసింది. అలాగే నటుడు.. ఎమ్మెల్యే బాలకృష్ణ వియ్యంకుడి సంస్థ వీబీసీ కెమికల్స్ కు భూముల కేటాయింపు చేసింది. జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో 498 ఎకరాల కేటాయించి.. భూములు కేటాయించాక సిఆర్డీయే పరిధి మారుస్తూ జీవో జారీ చేసింది. 

👉 ఇక.. సత్తెనపల్లి మండలంలో దూళిపాళ్లలో కోడెల శివప్రసాద్‌(దివంగత మాజీ స్పీకర్‌)కు భూములు ఉన్నాయి. మొవ్వ మండలం పెద ముట్టేవి, చిన ముట్టేవిలో లింగమనేనికి భూములు ఉన్నాయి. భూముల్ని కేటాయించాక పరిధి మారుస్తూ 207 జీవో విడుదల చేసింది టీడీపీ ప్రభుత్వం. ఇక కొనకంచిలో యలమంచిలి శివలింగ ప్రసాద్ భూముల కోసం సీ ఆర్డీయే సరిహద్దుల్లో మార్పులు చేసింది. 

సంస్థల కేటాయింపుల్లోనూ.. 

వివిధ సంస్థలకు కేటాయించిన భూముల్లోనూ అక్రమాలను గుర్తించింది ఏపీ కేబినెట్‌ సబ్‌ కమిటీ. ఆ వివరాలను నివేదికలో పొందుపరిచింది. ఐదు ప్రైవేట్‌ సంస్థలకు 850 ఎకరాల భూమిని అక్రమంగా కేటాయించినట్లు తేలింది. అలాగే.. సింగపూర్ తో ఒప్పందంలోనూ లోపాలను గుర్తించిన మంత్రివర్గ ఉప సంఘం.. మొత్తంగా టీడీపీ హయాంలో జరిగిన భూ దందాను, అక్రమాలను సమగ్రమైన నివేదిక ద్వారా ప్రభుత్వానికి సమర్పించింది. 

ఇదీ చదవండి: చంద్రబాబు హయాం అవినీతిపై సిట్‌ దర్యాప్తునకు సుప్రీం గ్రీన్‌ సిగ్నల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement