breaking news
Chandrababu Naidu government
-
ఉద్యోగుల కష్టాలు తీరతాయి అనుకున్నాం.. మమ్మల్ని నట్టేట ముంచారు
-
విత్తనం నుంచి బీమా వరకు అన్నింటా సమస్యలే... ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ఆందోళనలో అన్నదాతలు
-
రాజధానిలో గూండారాజ్
ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేశారు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వమనేది ఉందా అని అనుమానమొచ్చే రీతిలో నడిరోడ్డుపై అధికార పార్టీ గూండాలు చెలరేగిపోయారు. పోలీసుల సాక్షిగా రాళ్లు, కర్రలతో రెచ్చిపోయారు. కార్లు ధ్వంసం చేశారు. నాయకులను హత్యచేయాలన్నంత కసితో బరితెగించి వీరంగం సృష్టించారు. రాజధాని ప్రాంతంలో మట్టి, ఇసుక తెగమెక్కి మదమెక్కిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పై నుంచి అందుకున్న ఆదేశాలతో ఈ దుర్మార్గాన్ని ఒక పథకం ప్రకారం సాగించారు. తమకు జరుగుతున్న అన్యాయాలను అడ్డుకోవాలని, తమ కష్టాలను ప్రత్యక్షంగా చూడాలని రాజధాని గ్రామమైన పెనుమాక రైతులు చేసిన విజ్ఞప్తి మేరకు అక్కడకు వెళుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ నాయకులపై ఉండవల్లి సెంటర్లో జరిగిన ఈ హత్యాయత్నాన్ని చూసి రాష్ట్రమంతా ఉలిక్కిపడింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అరాచకపాలనకు ఇదొక మచ్చుతునక మాత్రమే... సాక్షి ప్రతినిధి, గుంటూరు/తాడేపల్లి రూరల్: తెలుగుదేశం నేతల గూండాగిరి పరాకాష్టకు చేరింది. రెడ్‌బుక్ రాజ్యాంగం నడుపుతున్న మంత్రి లోకేశ్ నియోజకవర్గంలోనే వైఎస్సార్సీపీ నేతలపై దాడికి తెగబడ్డారు. వైఎస్సార్సీపీ నేతలపై రాళ్లు, కర్రలు, కోడిగుడ్లతో దాడి చేయడంతో రాజధాని ముఖ ద్వారమైన ఉండవల్లిలో శనివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగుదేశం కార్యకర్తలు ముందు నుంచే దాడికి సిద్ధమైనా, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం, తన పీఏ సత్యనారాయణ ద్వారా లోకేశ్ ఈ మొత్తం దాడిని పర్యవేక్షించడం చర్చనీయాంశంగా మారింది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రాజధానిలో పంట పొలాలు పూలింగ్‌కు ఇవ్వని రైతులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. దీంతో ఆ ప్రాంత రైతులు ఇటీవల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి వారి గోడు వెళ్లబోసుకున్నారు. అనంతరం వైఎస్ జగన్.. ఈ ప్రాంత రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకు, న్యాయ సహాయం అందించేందుకు రాజధాని (సీఆర్డీఏ) రైతుల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేశారు. రైతుల ఆహ్వానం మేరకు ఈ కమిటీ సభ్యులతో కలిసి వైఎస్సార్సీపీ నేతలు శనివారం ఉదయం పెనుమాకలో పర్యటించాలని నిర్ణయించారు. ఈ మేరకు ముందుగానే సమాచారం ఇచ్చారు. దీంతో మంత్రి లోకేశ్ ఆదేశాల మేరకు ఈ కమిటీని అడ్డుకోవాలని టీడీపీ గూండాలు పక్కా స్కెచ్ వేశారు. ఈ క్రమంలో రాజధాని రైతుల ముసుగులో మంత్రి నారా లోకేశ్ టీమ్‌లోని ఓ వ్యక్తి.. రాజధానిలో అక్రమ మైనింగ్ నిర్వహించే మట్టి మాఫియాతో పాటు, కొంత మంది టీడీపీ కార్యకర్తలతో తాడేపల్లి మండల అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఉండవల్లి సెంటర్ నాలుగు రోడ్ల కూడలికి చేరుకున్నారు. వైఎస్సార్సీపీ గో బ్యాక్ అంటూ ఆ పార్టీ నాయకులను కులం పేరుతో దూషిస్తూ ధర్నాకు దిగారు. ఈలోగా పెనుమాకలో పూలింగ్‌కు ఇవ్వని పంట పొలాలను నీట ముంచుతున్న రిజర్వాయర్ పనులను పరిశీలించి, రైతులను పరామర్శించేందుకు మూడు కార్లలో రాజధాని పరిరక్షణ కమిటీ సభ్యులు బయలుదేరారు. ఇదే సమయంలో రోడ్డుపై బైఠాయించిన సుమారు వంద మంది టీడీపీ మూక వారిని అడ్డుకుంది. ముందస్తు ప్రణాళికతో వారు కోడిగుడ్లు, రాళ్లు, కర్రలు తీసుకువచ్చినా అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసులు పట్టించుకోలేదు. రాళ్లు విసురుతున్న టీడీపీ గూండా రాయపూడి కిరణ్ రైతుల ఆహ్వానం మేరకు.. రైతుల ఆహ్వానం మేరకు రాజధాని రైతుల పరిరక్షణ కమిటీ సభ్యులు మాజీ మంత్రి పేర్ని నాని, అంబటి రాంబాబు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్.. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల సమన్వయకర్తలు దొంతిరెడ్డి వేమారెడ్డి, వనమా బాల వజ్రబాబు ఉండవల్లి సెంటర్ సమీపానికి చేరుకున్నారు. ట్రాఫిక్ నిలిచి పోవడంతో ధర్నా జరుగుతున్న ప్రాంతానికి 500 మీటర్ల దూరంలో ఉన్నారు. అక్కడికి వెళ్లడానికి వీల్లేదని పోలీసులు చెబుతుండగానే, ధర్నా చేస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్ ప్రయాణిస్తున్న కారుపై చేతులతో బాదారు. పోలీసులు వారిని ఏమాత్రం వారించలేదు. దీంతో కొంత మంది టీడీపీ కార్యకర్తలు నోటికి వచ్చినట్లు అరుణ్‌కుమార్, పేర్ని నాని, అంబటి రాంబాబును కులం పేరుతో దూషిస్తూ, ఇంట్లో మహిళలను కూడా తిడుతూ అంబటి రాంబాబు దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొంత మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో మమ్మల్నే అడ్డుకుంటారా అంటూ వెనుక ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్, పార్టీ నేత ఉమామహేశ్వరరెడ్డి కార్లపై రాళ్లు రువ్వారు. దీంతో అద్దాలు పగిలిపోయి అక్కడే ఉన్న కానిస్టేబుల్‌కు తగలడంతో అతను సొమ్మసిల్లి పడిపోయాడు. అయినప్పటికీ టీడీపీ కార్యకర్తలు ఆగకుండా రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెఎస్సార్సీపీ నేతలపైకి రాయి విసురుతున్న టీడీపీ నేత పెంచలయ్య రాళ్లు, కోడిగుడ్లు విసురుతూ దాడి పోలీసులు పేర్ని నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి తదితరులను వెనక్కు నెట్టుకుంటూ వెళ్లారు. అయినా సరే టీడీపీ రౌడీలు ఆగకుండా మరోసారి రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. ఈ క్రమంలో అంబటి, దేవినేని అవినాష్ మాట్లాడే యత్నం చేయగా టీడీపీ మూకలు దాడికి యత్నించాయి. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్రతిఘటించడంతో టీడీపీ గూండాలు వెనక్కు తగ్గారు. ఆ తర్వాత పోలీసులను ముందు పెట్టుకుని టీడీపీ రౌడీలు వైఎస్సార్సీపీ నేతలను తోసుకుంటూ ముందుకు వెళ్లారు. సుమారు రెండు గంటల పాటు ఈ తతంగం సాగింది. చివరకు ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని భావించిన వైఎస్సార్సీపీ నాయకులు అక్కడి నుంచి బయలు దేరారు. ఈ క్రమంలో వెనుక ఉన్న తాడికొండ, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్తలను టీడీపీ గూండాలు ముట్టడించి దాడిచేసే యత్నం చేశారు. ఒకానొక సమయంలో వైఎస్సార్సీపీ నేతల అరెస్టుకు పోలీసులు యత్నిస్తుండగా.. టీడీపీ గూండాలు దాడికి ముందుకు దూసుకొచ్చారు.టీడీపీ గూండా కిరణ్ రాళ్ల దాడిలో తీవ్రంగా గాయపడిన పోలీస్ ఇది మంత్రి లోకేశ్ డైరెక్షన్లో ప్రభుత్వ దాడి⇒ పేర్ని నాని ప్రయాణిస్తున్న కారుపై మంగళగిరి నియోజకవర్గ టీఎన్టీయూసీ నాయకుడు, మట్టి మాఫియా సూత్రధారి రాయపూడి కిరణ్, దొప్పలపూడి జ్యోతిబసు రాళ్లు విసిరి హత్యాప్రయత్నం చేశారు. అనంతరం టీడీపీ నాయకులు కోడిగుడ్లు తీసుకొచ్చి అమాయక మహిళల చేతికి ఇచ్చి వారిచేత వీరికార్లపై విసిరేయించారు. మహానాడుకు చెందిన పల్లెపు హరి అనే రౌడీషీటర్ కారుపైకి ఎక్కి రాళ్లతో దాడి చేసేందుకు ప్రయత్నం చేశాడు. అతని పక్కనే ఎస్ఐ ఉన్నా, కనీసం అతన్ని వారించే ప్రయత్నం చేయలేదు. ⇒ ఉండవల్లిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మట్టి మాఫియా, రౌడీషీటర్లు రెచ్చిపోయి దాడి చేసిన ఘటన వెనుక మంత్రి లోకేశ్ పాత్ర ఉందని వైఎస్సార్సీపీ నాయకులు మండిపడ్డారు. రాజధాని ముసుగులో కార్యకర్తలకు దోచిపెట్టేందుకు మట్టి మాఫియాను ప్రోత్సహిస్తూ.. ఆ విషయం బయట పడకూడదనే రౌడీషీటర్లను ప్రోత్సహించి రాళ్ల దాడి చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నాయకుల కారుపై రాళ్లతో దాడి చేస్తున్న మట్టి మాఫియా నేత నాగరాజు ⇒ వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ నాయకులు దాడి చేస్తారని ఒక రోజు ముందే తాడేపల్లి సీఐ వీరేంద్రబాబుకు సమాచారం ఉన్నా, ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకుండా, తూతూ మంత్రంగా పది మంది సిబ్బందిని ఏర్పాటు చేసి, తమపై దాడికి ప్రోత్సహించారని ధ్వజమెత్తారు. ఈ ఘటన వెనుక మంత్రి లోకేశ్ పాత్ర ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వం చేయించిన దాడే అని, ఈ దాడిని ముఖ్యమంత్రి సభాముఖంగా సమర్థించడమే కాకుండా రైతులు దాడి చేస్తే తప్పేంటనే ధోరణిలో మాట్లాడటం దారుణం అన్నారు. ⇒ ఇది పక్కా ప్రణాళిక ప్రకారం చేసిన దాడేనని స్పష్టం అవుతోందని చెప్పారు. నిరసన పేరుతో అడ్డుకోవడానికి వచ్చిన వారి వద్ద రాళ్లు, కర్రలు, కోడిగుడ్లు ఉన్నా పోలీసులు అడ్డుకోకపోవడం చూస్తుంటే ఇది ప్రభుత్వ స్పాన్సర్డ్ దాడిగానే కనపడుతోందని చెప్పారు. లోకేశ్ డైరెక్షన్లో భాగంగా ఆయన ముఖ్య అనుచరుడు సత్యనారాయణ స్వయంగా అక్కడే ఉండి ఈ దాడిని పర్యవేక్షించారని ఆరోపించారు.దాడికి టీడీపీ గూండాలను పురికొల్పుతున్న లోకేశ్ అనుచరుడు ముమ్మిడి సత్యనారాయణ ⇒ కాగా, టీడీపీ నేతల రాళ్ల దాడిలో చిత్తూరు జిల్లా స్పెషల్ పార్టీకి చెందిన కానిస్టేబుల్ టి.చిన్న తంబి తీవ్రంగా గాయపడ్డాడు. అయితే దాడి చేసిన వారిపై కేసు పెట్టాల్సిందిపోయి.. తాడేపల్లి సీఐ వీరేంద్ర వైఎస్సార్సీపీ నాయకులపై కేసు నమోదు చేశారు. టీడీపీ నేతల ఇచ్చిన ఫిర్యాదులను పూర్తిగా మార్చి రాయించి మరీ తాడేపల్లి సీఐ స్వామిభక్తి ప్రదర్శించారు. ⇒ టీడీపీ మూకలు విరిసిన కోడిగుడ్లు అక్కడున్న అమాయక ప్రయాణికులపైనా పడటంతో వారు స్వల్పంగా గాయపడ్డారు. ఇది పద్దతి కాదని సర్దిచెప్పబోయిన వారిని టీడీపీ రౌడీలు బెదిరింపులకు గురిచేశారు. ⇒ టీడీపీ గూండాల దాడికి సంబంధించి వైఎస్సార్సీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు అంకంరెడ్డి నారాయణమూర్తి శనివారం తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
మారవా చంద్రబాబు... నీకు ఇదే మా లాస్ట్ వార్నింగ్.. మళ్లీ రిపీట్ అయితే..!
-
ఆ రాళ్ళూ మాపై పడి ఉంటే... చంద్రబాబు, లోకేష్ లపై అంబటి ఫైర్
-
ప్రజలకు చిప్ప..? బినామీలకు కాసుల కుప్ప.. ప్రైవేట్ రాజ్యం
-
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సర్కార్ ‘అప్పుల క్యాలెండర్’ విడుదల... నెలకు 7 వేల 266 కోట్ల రూపాయల చొప్పున అప్పు చేయబోతున్న ప్రభుత్వం
-
బాబు సర్కార్ అప్పుల క్యాలెండర్
సాక్షి, అమరావతి: రానున్న మూడు నెలలకు సంబంధించి మంగళవారం చేసే అప్పుల క్యాలెండర్‌ను చంద్రబాబు సర్కారు విడుదల చేసింది. సూపర్ సిక్స్ హామీల అమలు క్యాలెండర్ లేదు గానీ అప్పుల క్యాలెండర్లో సర్కారు దూసుకుపోతోంది. ప్రతీ ఆర్థిక ఏడాది క్రమం తప్పకుండా అప్పుల క్యాలెండర్‌ను కూటమి ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా 2026–27 రెండో త్రైమాసికం (జూలై నుంచి సెప్టెంబర్ వరకు) బడ్జెట్ అప్పుల క్యాలెండర్‌ను విడుదల చేసింది. రెండో త్రైమాసికంలో రూ.21,800 కోట్లు బడ్జెట్ అప్పు చేయనుంది. అంటే నెలకు రూ.7,266.66 కోట్లు చొప్పున అప్పు చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఆర్బీఐకి ఇండెంట్ పెట్టింది. ఈమేరకు జూలై నుంచి సెప్టెంబర్ వరకు చంద్రబాబు సర్కారు బడ్జెట్ అప్పుల క్యాలెండర్‌ను ఆర్బీఐ విడుదల చేసింది.ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో రూ.29,663 కోట్లు బడ్జెట్ అప్పు చేసింది. ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తున్నా ప్రజలకిచ్చిన ప్రధాన హామీలనైనా అమలు చేయడం లేదు. తాజాగా వచ్చే మంగళవారం చంద్రబాబు సర్కారు రూ.2,600 కోట్లు అప్పు చేయనుంది. ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఆర్బీఐ ఈ మొత్తాన్ని సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఈ మేరకు శుక్రవారం ఆర్బీఐ నోటిఫై చేసింది. -
అమ్మకానికి రాష్ట్రం.. ప్రభుత్వ ఆస్తి.. ‘ప్రైవేట్’ పార్టీ!
సాక్షి, అమరావతి: మొన్న ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలు..! నిన్న ఫిషింగ్ హార్బర్లు, ఆర్టీసీ ఆస్తులు అప్పనంగా ప్రైవేట్‌పరం..! ఖరీదైన ప్రభుత్వ భూములు రియల్ ఎస్టేట్ సంస్థలకు, బంధు గణానికి పందేరం..! నేడు కొత్త పోర్టుల వంతు..! కొత్తగా సంపద సృష్టించకపోగా మాజీ సీఎం వైఎస్ జగన్ కృషితో ప్రభుత్వ రంగంలో సాకారమైన విలువైన ఆస్తులన్నింటినీ చంద్రబాబు సర్కారు ప్రైవేట్‌పరం చేసేస్తూ సన్నిహితులకు దోచిపెడుతోంది. ప్రజల సంపదకు ధర్మకర్తగా ఉండాల్సిన ప్రభుత్వమే పప్పుబెల్లాలకు ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టేస్తోంది. గత ప్రభుత్వం నిర్మించిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో 30 ఎకరాలను సాగర్ డిఫెన్స్‌కు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన చంద్రబాబు సర్కారు కన్ను తాజాగా మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులపై పడింది. గత రెండేళ్లుగా పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని పట్టించుకోకుండా ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన రామాయపట్నం, మచిలీపట్నం పోర్టుల పరిధిని తగ్గించడమే కాకుండా వీటి నిర్వహణ, విస్తరణ పనులను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు పచ్చజెండా ఊపింది. వైఎస్సార్సీపీ హయాంలో పోర్టులు, హార్బర్లు, ఆస్పత్రులు, గ్రామ, వార్డు సచివాలయాల రూపంలో రూ.వేల కోట్ల విలువైన శాశ్వత ఆస్తులు ప్రభుత్వ రంగంలో సమకూరితే చంద్రబాబు సర్కారు ప్రైవేటీకరణ పేరిట తన అనుయాయులకు పంచిపెడుతోంది. రామాయపట్నం హరీ..! మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.4,929.39 కోట్లతో చేపట్టి దాదాపు 95 శాతం మేర పూర్తి చేసిన రామాయపట్నం పోర్టును చంద్రబాబు సర్కారు ప్రైవేటీకరణ చేస్తోంది. పోర్టు పరిధిని 51 కి.మీ. నుంచి ఏకంగా 15 కి.మీ.కి తగ్గించడమే కాకుండా పోర్టు నిర్వహణ ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు టెండర్లకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2021లో రామాయపట్నం పోర్టు పనులను వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రారంభించగా 2024 నాటికి దాదాపుగా పూర్తయ్యాయి. మల్టీ ప్రోడక్ట్ కార్గో నాలుగో బెర్తు పనులు కూడా పూర్తయి ప్రారంభించాల్సిన తరుణంలో ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోయింది. అనంతరం అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లు గడిచినా గంప ఇసుక కూడా ఎత్తలేదు. ఇప్పుడు ప్రైవేట్ రంగంలో నిర్వహణ కోసం టెండర్లు పిలవడంపై వ్యాపార, అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఇదేనా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజనెస్ అంటే? అనే చర్చ జరుగుతోంది. దాదాపుగా పూర్తయిన ప్రాజెక్టును అప్పనంగా ప్రైవేట్‌కు కట్టబెట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 1,053 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంత అభివృద్ధే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.26,501 కోట్లతో చేపట్టిన మూడు పోర్టులు, 10 షిషింగ్ హార్బర్ల పనులను చంద్రబాబు సర్కారు నిలిపివేసింది. గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయిన ప్రాజెక్టులను అందుబాటులోకి తేకపోగా ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతోంది. ప్రైవేటుకు తీరప్రాంతం.. తూర్పు తీర ప్రాంతానికి ముఖద్వారంగా విలసిల్లే ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తినుకో.. దోచుకో.. పంచుకో విధానంలో ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన వారికి కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో మచిలీపట్నం పోర్టు పరిధిని 64 కిలోమీటర్ల నుంచి 15 కిలో మీటర్లకు తగ్గించేయడమే కాకుండా ఇప్పటికే పోర్టు సమీపంలో షిప్ బిల్డింగ్ యూనిట్ ఏర్పాటు కోసం బిడ్లను ఆహ్వానించింది. కాకినాడలో ఏపీ మారిటైమ్ బోర్డుకు చెందిన 45 ఎకరాలను 30 ఏళ్ల దీర్ఘకాలిక లీజుపై ‘సేఫ్ వన్ ఇండియా ఎస్పీ కాంపాక్ట్ ప్రైవేట్ లిమిటెడ్’కు ఇచ్చేందుకు మంత్రిమండలి ఆమోదించింది. అంతేకాకుండా ఏపీ మారిటైమ్ బోర్డు ల్యాండ్ అలాంట్మెంట్ గైడ్‌లైన్స్ 2026 పేరుతో వాటర్ ఫ్రంట్ ఏరియా, తీరం, ఉప్పు సాగు భూములను కావాల్సిన వారికి కేటాయించనున్నారు. మత్స్యకారులకు దగా.. కొత్తగా ఒక ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కూడా చేపట్టకపోగా నిర్మాణంలో ఉన్నవాటిని నిలిపివేసి, టెండర్ల విలువను భారీగా పెంచేసి చంద్రబాబు సర్కారు మత్స్యకారులకు ద్రోహం చేస్తోంది. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం తొలిదశలో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు ప్రారంభించి.. రెండో దశలో బుడగట్లపాలెం, కొత్తపట్నం, పూడిమడక, బియ్యపు తిప్ప, ఓడరేవుల వద్ద ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు ఇచ్చి టెండర్లు పిలిచింది. రెండేళ్లుగా ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తకుండా, ఓడరేవు లాంటి ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులను ఆపేయడమే కాకుండా బుడగట్లపాలెం, కొత్తపట్నం, పూడిమడక హార్బర్ల నిర్మాణ విలువను భారీగా పెంచేస్తూ చంద్రబాబు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం ఈ మూడు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ వ్యయాన్ని రూ.1,150.22 కోట్లుగా నిర్ణయిస్తే ఇప్పుడు ఈ విలువను రూ.436.41 కోట్లు పెంచేసి ఏకంగా రూ.1,586.63 కోట్లకు చేర్చడం గమనార్హం. బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బరు నిర్మాణ వ్యయం రూ.365.81 కోట్ల నుంచి రూ.444.75 కోట్లకు పెంచగా.. కొత్తపట్నం హార్బర్ నిర్మాణ వ్యయాన్ని రూ.392.41 కోట్ల నుంచి రూ.441.88 కోట్లకు పెంచుతూ పరిపాలనా అనుమతులు జారీ చేసింది. పూడిమడక హార్బర్‌ను ప్రభుత్వం నిర్మించకుండా పీపీపీ విధానంలో చేపట్టాలని నిర్ణయించింది. అంతేకాదు.. ఈ హార్బర్ నిర్మాణ వ్యయాన్ని రూ.392 కోట్ల నుంచి ఏకంగా రూ.700 కోట్లకు పెంచేయడం హార్బర్ల పేరుతో చంద్రబాబు సర్కారు చేస్తున్న నిలువు దోపిడీకి నిదర్శనం. మరోవైపు రూ.417.55 కోట్లతో గత ప్రభుత్వ హయంలో పనులు ప్రారంభించిన ప్రకాశం జిల్లా ఓడరేవు హార్బర్ నిర్మాణ పనులు 25 శాతం లోపే ఉన్నాయంటూ 2024 సెపె్టంబర్ 27 టెండర్లను రద్దు చేసి పనులను అర్థంతరంగా నిలిపివేసింది.బాబు సర్కార్ ప్రైవేట్ పందేరం ఇలా..!ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలకు ఉరి.. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఒకేసారి ప్రభుత్వ రంగంలో 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నెలకొల్పే వైద్య కళాశాలల్లో మెరుగైన నిర్వహణ కోసం సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఈ సీట్లకు ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కంటే తక్కువ ఫీజులను ఖరారు చేసింది. ఎన్నికల ముందు టీడీపీ దీనిపై పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసింది. తాము అధికారం చేపట్టిన వంద రోజుల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తామని లోకేశ్ ప్రకటించారు. ఇప్పుడు ఆ విధానం రద్దు చేయకపోగా, ఏకంగా కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతోంది. ఇప్పటికే పది కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌కు కట్టబెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.కోట్ల విలువ చేసే ఈ కళాశాలల భూములను ఎకరం రూ.వందకే లీజుకు ఇవ్వడంతో పాటు కళాశాలలు, బోధనాస్పత్రిపై ఏకంగా 66 ఏళ్ల పాటు సర్వ హక్కులు కల్పిస్తోంది. ప్రభుత్వ రంగంలో ఉచితంగా అందాల్సిన వైద్య సేవలకు ఫీజులు వసూలు చేసే అధికారాన్ని కల్పించి అప్పనంగా ప్రభుత్వాస్పత్రులను ప్రైవేట్ పరం చేస్తోంది.‘ప్రైవేట్’ దారిలో ఆర్టీసీ..ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీని సైతం ప్రైవేట్ చేతుల్లో పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. ఈ–బస్సులను ప్రైవేట్ సంస్థల ద్వారానే నిర్వహించాలనే విధానం ముసుగులో ఈ కుతంత్రానికి తెర తీసింది. ఆర్టీసీయే స్వయంగా ఈ–బస్సులు నిర్వహించాలన్న ఉద్యోగ సంఘాల డిమాండ్‌ను బేఖాతర్ చేస్తోంది. ఆర్టీసీకి ప్రస్తుతం 11 వేల బస్సులు ఉన్నాయి. వాటిలో 8 వేలు ఆర్టీసీకి చెందినవి కాగా 3 వేల బస్సులను అద్దె విధానంలో నిర్వహిస్తున్నారు. ఆ మొత్తం బస్సుల స్థానంలో 2029 నాటికి 9 వేల ఈ–బస్సులను ప్రైవేటు సంస్థల ద్వారా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన 2 వేల బస్సుల స్థానంలో కూడా ప్రైవేటు ఈ–బస్సులను 2031 నాటికి ప్రవేశపెట్టాలన్నది లక్ష్యం. అంటే 2031 నాటికి మొత్తం ఆర్టీసీని ప్రైవేటుపరం చేయనున్నారు. అందుకే కొత్తగా డీజిల్ బస్సుల కొనుగోలును నిలిపివేసింది. సగటున రెండు రోజులకు ఒక బస్సు చొప్పున సర్వీసుల నుంచి తొలగిస్తోంది. మరోవైపు ఆర్టీసీ బస్ డిపోలు, బస్ స్టేషన్లను పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతోంది. ఇప్పటికే రూ.6,600 కోట్ల విలువైన 12 ఆర్టీసీ డిపోలను ఈ–బస్సులను నిర్వహించే ప్రైవేటు సంస్థలకు లీజు ప్రాతిపదికన ధారాదత్తం చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాల్లో ఉన్న ఆర్టీసీ బస్ స్టేషన్లను ఖాళీ చేయించి షాపింగ్ మాల్స్, ఇతర వాణిజ్య సముదాయాలు నిర్మించేందుకు పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టాలని నిర్ణయించింది.టూరిజం పేరిట లూటీ!పర్యాటక శాఖకు చెందిన సుమారు రూ.10 వేల కోట్ల విలువైన ఏపీ టీడీసీ హోటళ్లను ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద ప్రభుత్వం ఏకంగా 33 ఏళ్ల పాటు ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇస్తోంది. పర్యాటకాభివృద్ధి పేరుతో ప్రభుత్వానికి చెందిన 3,913.96 ఎకరాల విలువైన భూములను అప్పనంగా కట్టబెట్టేందుకు ప్రణాళిక సిద్ధమైంది.రాష్ట్రవ్యాప్తంగా సెంటు భూమిని కూడా వదలకుండా ప్రైవేటు పరం చేసేందుకు ‘ల్యాండ్ బ్యాంకు’ రూపొందించింది. జిల్లాల వారీగా ఏ ప్రాంతంలో పర్యాటకాభివృద్ధి సంస్థకు చెందిన ఎంత భూమి ఉందనే వివరాలను సర్వే నంబర్లతో సహా వెబ్సైట్లో పెట్టింది. 2024–29 పర్యాటక విధానం, పర్యాటక భూ పంపిణీ విధానాన్ని అనుసరించి ఎటువంటి టెండర్లు, బిడ్డింగ్ లేకుండానే ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తోంది. విశాఖలోని రుషికొండ, ఆనందపురం, మధురవాడ, కాపులుప్పాడ, యండాడ లాంటి ఖరీదైన ప్రాంతాల్లో భూములను పందేరం చేసింది. రాయలసీమలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గండికోటలో 1,200 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేందుకు తహతహలాడుతోంది. ఓర్వకల్లు రాక్ గార్డెన్ సమీపంలో 200 ఎకరాలు, ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో 550.59 ఎకరాల భూమిని (ఒక్క ఆత్మకూరులోనే 210.4 ఎకరాలు) భూమిని దోచిపెడుతోంది. జల వనరుల ప్రాజెక్టుల సమీపంలోని భూములతోపాటు లంక భూములను సైతం వదిలి పెట్టడం లేదు. పట్టిసీమ, పురుషోత్తపట్నం, తిరుపతిలోని కల్యాణి డ్యామ్, రామాయపట్నం పోర్టు ప్రాంతాల్లోని ఖరీదైన భూముల దోపిడీయే లక్ష్యంగా కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. విజయవాడలో 230 ఎకరాల భవానీ ద్వీపాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతోంది. కూటమి పార్టీల నాయకులు, ముఖ్యనేత బంధువులకు యథేచ్ఛగా విలువైన ప్రభుత్వ భూములను పంచిపెడుతోంది. -
అంబటి కేసులో ఇద్దరు CIలకు నోటీసులు.. రెచ్చిపోతున్న ఖాకీలు
-
తాడిపత్రి లో నీకు దమ్ముంటే.. బాబుకు వార్నింగ్..
-
ఆంధ్రప్రదేశ్‌లో యూరియా కోసం సీజన్లో రైతన్నల అగచాట్లు. యాప్‌లో ఓటీపీలు రాక.. వేలిముద్రలు మ్యాచ్ కాక తిప్పలు
-
అక్కచెల్లెమ్మలకు మరో మోసం
సాక్షి, అమరావతి: స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలకు వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ–జనసేన సర్కార్ తుంగలో తొక్కి.. అక్కచెల్లెమ్మకు మరో మోసం చేసిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌హెచ్‌జీలకు రుణాలు ఇవ్వడం అత్యంత కీలకమని, మహిళలకు రుణాలు ఇస్తే.. స్వయం ఉపాధి, చిన్న చిన్న వ్యాపారాలు, ఉత్పాదక రంగాల్లో పెట్టుబడులు పెరిగి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. రుణాలు తగ్గించడం, వడ్డీ రాయితీ ఇవ్వక పోవడం వల్ల పెట్టుబడులు తగ్గాయని, ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వ పన్ను ఆదాయం తగ్గడమే అందుకు నిదర్శనమని ఎత్తిచూపారు. ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ–జనసేన కూటమి ఇచ్చిన హామీలు.. వడ్డీ లేని రుణాలకు బడ్జెట్లో కేటాయించినా నిధులు ఇవ్వకపోవడం.. మహిళలకు ఇచ్చే రుణాలు తగ్గిపోతుండటాన్ని సాక్ష్యాధారాలతో ఎత్తిచూపుతూ.. ఎస్ఎల్బీసీ, బడ్జెట్ ప్రతులు, ఎన్నికల మేనిఫెస్టోను జత చేస్తూ గురువా రం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ఇది ఆర్థిక సంక్షోభాన్ని తెలియజేస్తోంది ‘‘స్వయం సహాయక సంఘాలకు(ఎస్‌హెచ్‌జీ) రుణాలు ఇవ్వడం అత్యంత కీలకం. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు జీవనాడి వంటిది. మహిళలకు ఇచ్చే రుణాలు పెరిగితే ఉత్పాదకత పెట్టుబడులు పెరుగుతాయి. ఇది ఎస్‌హెచ్‌జీల ఆదాయాన్ని పెంచే సామర్థ్యాన్ని బలోపేతం చేసి, వాటి ఆర్థిక సుస్థిరతకు దోహద పడుతుంది. మహిళలకు ఇచ్చే రుణాలు తగ్గిపోతే పెట్టుబడులు తగ్గి.. తద్వారా ఆదాయాలు తగ్గి.. ఫలితంగా వినియోగం కూడా తగ్గడాన్ని సూచిస్తుంది. ఇది ఆర్థిక సంక్షోభాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ పన్ను రాబడి వృద్ధి 3.22 శాతం తగ్గిపోవడం ఆర్థిక సంక్షోభానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఎస్‌హెచ్‌జీలకు రుణాల వృద్ధిని ప్రోత్సహించడానికి ఆ రుణాలపై వడ్డీ రాయితీ ఇవ్వడం అత్యంత కీలకం. 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కేవలం వడ్డీ రాయితీ ద్వారానే ప్రభుత్వం ఎస్‌హెచ్‌జీ మహిళలకు రూ.4,969 కోట్లు ప్రత్యక్ష మద్దతు అందించింది. అంతేకాకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘ఆసరా’, ‘చేయూత’ వంటి కార్యక్రమాల ద్వారా ఎస్‌హెచ్‌జీ మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా వారికి అపారమైన మద్దతును అందించింది. ఎస్‌హెచ్‌జీ మహిళలకు వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.పది లక్షలకు పెంచుతామని టీడీపీ–జనసేన మేనిఫెస్టోలో హామీ ఇచ్చాయి. చంద్రబాబు పాలనలో గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలకు సున్నా వడ్డీ కింద ఏటా రూ.100 కోట్లు కేటాయించినట్లు బడ్జెట్లో చెప్పినా, తుదకు ఇచ్చింది సున్నానే , పట్టణ ప్రాంత స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ కింద ఈ రెండేళ్లలో ఏమీ ఇవ్వని చంద్రబాబు సర్కారు ఎగ్గొట్టిన వడ్డీ రాయితీ రూ.6,000 కోట్లు ఎప్పటిలాగే అధికారం చేపట్టిన తర్వాత, టీడీపీ కూటమి ఇచ్చిన హామీని విస్మరించి అక్కచెల్లెమ్మలను మోసం చేసింది. పెంచిన రుణ పరిమితిపై వడ్డీ రాయితీ ఇవ్వడం పక్కనపెడితే.. ప్రస్తుతం ఉన్న వడ్డీ రాయితీ కార్యక్రమానికి కూడా ఎలాంటి నిధులు విడుదల చేయకుండా దాన్ని నిర్వీర్యం చేశారు. 2024–25లో వడ్డీ రాయితీ కింద విడుదల చేసిన మొత్తం ‘సున్నా’. 2025–26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించినా, విడుదల చేసింది మాత్రం ‘సున్నా’. 2026–27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో మళ్లీ రూ.100 కోట్లు కేటాయించినా, ఇప్పటికి విడుదల చేసింది ‘సున్నా’నే. ప్రతి స్వయం సహాయక బృందానికి రూ.6,00,000 అప్పు ఉందని భావించినా.. టీడీపీ హామీకి అనుగుణంగా వడ్డీ రాయితీ మొత్తం రూ.3,000 కోట్లు అవుతుంది. అంటే.. టీడీపీ కూటమి ప్రభుత్వం ఎస్‌హెచ్‌జీ మహిళలకు వడ్డీ రాయితీ కింద ఎగ్గొట్టిన మొత్తం రూ..6,000 కోట్లు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల 2019–24 మధ్య ఎస్‌హెచ్‌జీలకు రుణ వృద్ధి గణనీయంగా పెరిగింది. కానీ.. ప్రస్తుత ప్రభుత్వం మద్దతు ఇవ్వక పోవడం వల్ల రుణ వృద్ధి తగ్గిపోతోంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఎస్‌హెచ్‌జీలకు రూ.49,626 కోట్ల రుణాలు ఇస్తే.. అవి 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.41,623 కోట్లకు తగ్గాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.41,105 కోట్లకు పడిపోయాయి. 2020లో వైఎస్ జగన్ ప్రభుత్వంలో రూ.16,505 కోట్ల నుంచి 2024లో ప్రభుత్వం దిగిపోయేనాటికి రూ.49,626 కోట్లకు పెరిగిన స్వయం సహాయక సంఘాల రుణాలు.. ఈ రెండేళ్ల చంద్రబాబు పాలనలో రూ.41,105 కోట్లకు తగ్గిన రుణాలు -
‘అమరావతి’లో ఆగని దందా!
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణ పనుల టెండర్లలో సిండికేట్ల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. టెండరు నోటిఫికేషన్‌కు ముందే సిండికేటులో ఎక్కువ కమీషన్ ఇచ్చేందుకు ముందుకొచ్చిన కాంట్రాక్టు సంస్థకు వాటిని పంచేసి.. ఆ తర్వాత నోటిఫికేషన్ జారీచేసి.. అధిక ధరకు ఆ సంస్థకే అప్పగించేలా ముఖ్యనేత చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు ఆది నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఐదు ప్యాకేజీల పనులను కాంట్రాక్టు సంస్థలకు అప్పగిస్తూ గురువారం ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు వాటికి బలం చేకూరుస్తున్నాయని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టంచేస్తున్నారు. సిండికేట్‌లోని ఎన్సీసీకి మూడు ప్యాకేజీలు.. ఎమ్వీఆర్ ఇన్ఫ్రాకు రెండు ప్యాకేజీల పనులు కట్టబెట్టారు. ఈ ఐదు ప్యాకేజీల పనులు అధిక ధరకు కట్టబెట్టడంవల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.34.70 కోట్ల భారంపడింది. అదే జ్యుడీషియల్ ప్రివ్యూ.. రివర్స్ టెండరింగ్ విధానంలో టెండర్లు నిర్వహించి ఉంటే కాంట్రాక్టు విలువ కంటే కనీసం 4.5 శాతం తక్కువ ధరలకే పనులు చేయడానికి సంస్థలు ముందుకొచ్చేవని.. దీనివల్ల ఖజానాకు రూ.70 కోట్ల మేర ఆదా అయ్యేవని చెబుతున్నారు.అన్ని పనులూ అధిక ధరకు కోట్..రాజధానికి భూసమీకరణ కింద భూములు ఇచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన నివాస, వాణిజ్య ప్లాట్లు ఇచ్చేందుకు ఉండవల్లి ల్యాండ్ పూలింగ్ స్కీం లేఅవుట్ అభివృద్ధి పనులకు రూ.409.78 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి ఏడీసీఎల్ (అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) టెండర్ నోటిఫికేషన్ జారీచేసింది. ఈ పనులకు కాంట్రాక్టు విలువ కంటే 4.07 శాతం అధిక ధరకు అంటే రూ.426.46 కోట్లకు కోట్‌చేసిన ఎన్సీసీ సంస్థ ఎల్–1గా నిలిచింది. ఆ సంస్థకు వాటిని అప్పగించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. దీనివల్ల ఖజానాపై రూ.16.68 కోట్ల భారం పడింది. వాటితోపాటు పన్నుల రూపంలో రూ.86.08 కోట్లను రీయింబర్స్ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. అంటే.. ఆ పనుల కాంట్రాక్టు విలువ రూ.512.54 కోట్లు. అలాగే.. – పిచ్చుకలపాలెంలో జ్యుడీషియల్ అకాడమీ భవనాల నిర్మాణ పనులకు రూ.125.49 కోట్ల కాంట్రాక్టు విలువతో ఏజీఐసీఎల్ (అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్) టెండర్లు పిలిచింది. కాంట్రాక్టు విలువ కంటే 3.89 శాతం అధిక ధరకు అంటే రూ.130.38 కోట్లకు కోట్ చేసిన ఎన్సీసీ సంస్థకు ఆ పనులు అప్పగించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. దీనివల్ల ఖజానాపై రూ.4.89 కోట్ల భారం పడింది. – కరకట్ట పటిష్టీకరణతోపాటు కరకట్టపై ఈ–1 రోడ్డు నిర్మాణ పనులకు మూడు ప్యాకేజీల కింద ఏడీసీఎల్ టెండర్లు పిలిచింది. కరకట్టను బలోపేతం చేయడం, దానిపై ఈ–1 రోడ్డును 0.3 కిమీ నుంచి 2.48 కిమీ వరకూ నిర్మించే పనులకు రూ.105.78 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి టెండర్లు ఆహ్వానించింది. ఇందులో 4.02 శాతం అధిక ధరకు అంటే రూ.110.03 కోట్లకు కోట్ చేసిన ఎమ్వీఆర్ ఇన్ఫ్రాకు వాటిని అప్పగించింది. దీనివల్ల ఖజానాపై రూ.4.25 కోట్లు భారం పడింది. – అంతేకాక..2.48 కి.మీ నుంచి 4.990 కి.మీ వరకూ రోడ్డు నిర్మించే పనులకు రూ.103.50 కోట్ల కాంట్రాక్టు విలువతో నిర్వహించిన టెండర్లలో 4.72 శాతం అధిక ధరకు అంటే రూ.108.38 కోట్లకు కోట్ చేసిన ఎన్సీసీ సంస్థకు వాటిని అప్పగించింది. దీనివల్ల కూడా ఖజానాపై రూ.5.12 కోట్ల భారం పడింది. – ఇక 4.99 కి.మీ నుంచి 7.20 కి.మీ వరకూ రోడ్డు నిర్మించే పనులకు రూ.104.09 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి, నిర్వహించిన టెండర్లలో 4.04 శాతం (108.09 కోట్లు) అధిక ధరకు కోట్ చేసిన ఎమ్వీఆర్ ఇన్ఫ్రాకు వాటిని కట్టబెట్టింది. దీనివల్ల ఖజానాపై రూ.4 కోట్లు భారం పడింది.నీకింత.. నాకింత..ఇలా మొత్తమ్మీద ఐదు ప్యాకేజీల్లో రూ.751.3 కోట్ల విలువైన మూడు ప్యాకేజీల పనులను ఎన్సీసీకి.. 218.12 కోట్ల విలువైన రెండు ప్యాకేజీలను ఎమ్వీఆర్ ఇన్ఫ్రాకు కట్టబెట్టింది. ఈ ఐదు ప్యాకేజీల విలువ రూ.969.42 కోట్లు. ఇందులో పది శాతం మొబిలైజేషన్ అడ్వాన్సుగా కాంట్రాక్టర్లకు ముట్టజెప్పి.. నీకింత నాకింత అంటూ ముఖ్యనేత పంచుకోనున్నారనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. -
‘యాప్’.. యాతన
ఓటీపీ.. ‘దైవాధీనం’! మా గ్రామంలో దాదాపు 120 ఎకరాలకు పైగా దేవదాయ భూమిని 40 ఏళ్లుగా 150 మంది రైతులు సాగు చేస్తున్నారు. చాలా మందికి కౌలు కార్డులు లేవు. యూరియా కోసం వెళితే ఓటీపీ ఎవరి పేరిట వస్తుందో చెప్పలేకపోతున్నారు. ఆర్‌ఎస్‌కేకు వెళ్తే రెండ్రోజులు ఆగండి.. మాట్లాడి చెబుతాం అంటున్నారు. –కలారి రామారావు, పెదకల్లేపల్లి, మోపిదేవి మండలం, కృష్ణా జిల్లా సాక్షి, అమరావతి: వర్షాలు వచ్చేశాయ్.. సీజన్ మొదలైంది.. ఏరువాక వచ్చేస్తోంది.. కానీ దుక్కి దున్నాల్సిన రైతన్న దిక్కు తోచక దిక్కులు చూస్తున్నాడు. అదునులో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించి ఏరువాక సాగేలా రైతన్నకు భరోసా కల్పించాల్సిన సర్కారు కాడి వదిలేసింది. ఎరువుల సరఫరా, వినియోగాన్ని నియంత్రించే లక్ష్యంతో చంద్రబాబు సర్కారు తెచ్చిన ‘యాప్’తో వ్యవసాయదారులు నానా అగచాట్లు పడుతున్నారు. యాప్ ద్వారా ఎరువుల సరఫరాను నిలిపివేయాలని అన్నదాతలు ఆందోళనలకు దిగుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి వ్యయ ప్రయాసలు లేకుండా గ్రామంలోనే ఎరువులు, నాణ్యమైన విత్తనాలతోపాటు సాగు ఉత్పాదకాలను అందించి ఆదుకున్నారని రైతన్నలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఉచిత పంటల బీమాకు దూరమై.. ఇన్పుట్ సబ్సిడీ అందక.. ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కక అల్లాడుతుంటే.. చంద్రబాబు సర్కారు ఎరువుల పంపిణీ బాధ్యతను సైతం గాలికొదిలేసి యాప్‌ల పేరుతో తమను యాతనకు గురి చేస్తోందని మండిపడుతున్నారు. సర్వర్ డౌన్.. యాప్ హ్యాంగ్ ఎరువుల పంపిణీని డిజిటలైజ్ చేసేందుకు జాతీయ సమీకృత ఎరువుల నిర్వహణ మాడ్యూల్ (ఐఎఫ్ఎఫ్ఎం) యాప్ ద్వారా కాకినాడ, కృష్ణా జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఎరువుల పంపిణీని చేపట్టగా.. మిగిలిన 26 జిల్లాల్లో ఏపీ వ్యవసాయ ఇన్పుట్స్ నిర్వహణ వ్యవస్థ (ఏఐఎంఎస్) యాప్ ద్వారా ఈ నెల 8 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎరువుల పంపిణీకి శ్రీకారం చుట్టింది. యాప్‌ల వినియోగంపై నూటికి 90 శాతం మంది రైతన్నలకు అవగాహన లేకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రారంభించి 3 వారాలు గడుస్తున్నా యాప్‌లో సాంకేతిక, పరిపాలనా సమస్యలు వేధిస్తూనే ఉన్నాయి. రైతుల మొబైల్ నెట్వర్క్ అంతంత మాత్రంగా ఉండగా ఆర్ఎస్కేల్లో (రైతు సేవా కేంద్రాలు) సర్వర్ డౌన్/యాప్ హ్యాంగ్ సమస్యలతో రేపు రండి.. మాపు రండి అంటూ పంపేస్తున్నారు. యాప్‌లో రైతు వివరాలు, ఈ–క్రాప్, వెబ్‌ల్యాండ్, ఆధార్, మొబైల్ నంబర్ అనుసంధానం కాకపోవడం, సకాలంలో ఓటీపీలు రాక, వేలిముద్రలు మ్యాచ్కాక తరచూ ఓటీపీలు, వేలిముద్రలు విఫలమవడం, బిల్లింగ్ ఆలస్యమవడం లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. మొబైల్ ఓటీపీ, ఎంపిన్, ఫొటో, జియో ట్యాగింగ్, ఫీల్డ్ వెరిఫికేషన్ లాంటి దశలు రైతులకు ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. సొంత భూమి ఉన్న రైతులకు రికార్డుల్లో చిన్న పొరపాటు ఉన్నా ఎరువుల కొనుగోలు ఆగిపోతోంది. ఫలితంగా కట్ట యూరియా కోసం రోజుల తరబడి తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు. కౌలు రైతుల పాట్లు వర్ణనాతీతం యాప్ ద్వారా ఎరువులు పొందేందుకు కౌలు రైతులు పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. సీసీఆర్సీ కార్డు, ఈక్రాప్ లింక్ కాకపోవడం, సరైన సాగు వివరాలు నమోదు కాకపోవడం, భూ యజమాని అనుమతి లేకపోవడం, రికార్డుల్లో భూ యజమాని పేరు సరిగ్గా లేకపోవడం, మ్యుటేషన్ కాకపోవడం, భూ రికార్డులలో మ్యాపింగ్ కాకపోవడం లాంటి సమస్యలు కౌలు రైతులను వేధిస్తున్నాయి. ఓటీపీలు భూ యజమానుల ఫోన్‌కు వస్తుండటం, వారు అందుబాటులో లేకపోవడం, ఓటీపీ అప్‌లోడ్‌కు కేవలం 30 సెకన్లు మాత్రమే సమయం ఉండడం పెద్ద సమస్యగా మారింది. దీంతో 2–3 సార్లు ఓటీపీ జనరేట్ అవుతున్నా సకాలంలో అప్లోడ్ చేయలేకపోవడంతో చివరికి బుకింగ్ రద్దై మళ్లీ మొదటి నుంచి రైతు వివరాలు నమోదు చేయాల్సి వస్తోంది. మరోవైపు రైతులు ఎంచుకున్న డీలర్ పాయింట్ల వద్ద భౌతికంగా ఎరువులు ఉన్నా యాప్‌లో స్టాక్ అప్డేట్ కాకపోవడంతో ‘నో స్టాక్’ అని బుకింగ్ సమయంలో వస్తోంది. మొబైల్ నెట్వర్క్ పెద్దగా లేని ఏజెన్సీ, కొండ ప్రాంతాలు, మారుమూల గ్రామాల్లో యాప్ ద్వారా ఎరువుల పంపిణీ కత్తిమీద సాములా తయారైంది. సర్వర్ డౌన్ అయింది.. తరువాత రండి అంటూ తిప్పి పంపేస్తున్నారు. దేవదాయ, అటవీ, వక్ఫ్, అసైన్డ్, సొసైటీ లంక భూములు సాగుచేసే రైతులైతే బుకింగ్ కోసం అల్లాడుతున్నారు. ఎవరి పేరిట ఓటీపీ జనరేట్ అవుతోందో అధికారులు కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఎమ్మార్పీకి మించి అమ్మకాలు కొంతమంది డీలర్లు అధికారులతో కుమ్మక్కై దొడ్డిదారిన యూరియా బస్తా రూ.350 నుంచి రూ.500, డీఏపీ రూ.1,800 నుంచి రూ.2 వేల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా లావేరు, జీ.సిగడం మండలాల్లో పలువురు డీలర్లు గురువారం రోజు ఎమ్మార్పీకి మించి విక్రయాలు జరపడమే కాదు.. రసీదులు అడిగితే రైతులపైనే ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న ఘటనలు చోటు చేసుకున్నాయి. నెల్లూరు జిల్లా కొడమూరు మండలం రాజుపాలెంలో సుమారు 50 మంది రైతులు స్థానిక ఆర్‌ఎస్‌కేకు వెళ్తే సర్వర్ డౌన్ అనే సాకుతో తిప్పి పంపేశారు. తంటాలు పడి ఎరువులు బుక్ చేసుకున్నా మాగాణి, మెట్ట ప్రాంతాలు, పంట రకాలతో సంబంధం లేకుండా ఎకరాకు యూరియా, డీఏపీ రెండు బస్తాలకు మించి ఇవ్వడం లేదు. ఏ పంటకు, ఏ దశలో, ఏ ఎరువు ఎంత మోతాదులో అవసరమవుతుందో పంటల వారీగా అంచనా వివరాలను యాప్‌లో పొందుపరిచారు. అంతకు మించి ఒక్క బస్తా కూడా అదనంగా సరఫరా చేయబోమని ప్రభుత్వం చెబుతోంది. నాట్లు వేసిన 15–20 రోజుల్లో యూరియా అవసరం. కానీ అదునుకు యూరియా దొరకని పరిస్థితి నెలకొందని రైతులు చెబుతున్నారు. సీజన్ ఆరంభంలోనే ఈ దురవస్థ ఏమిటని వాపోతున్నారు. కాంప్లెక్స్ ఎరువుల మోత.. రైతన్నలకు వాత కాంప్లెక్స్ ఎరువుల ధరలు రైతులకు పెనుభారంగా మారుతున్నాయి. 2023–24 సీజన్‌తో పోలిస్తే బస్తాపై రూ.750కి పైగా పెరిగాయి. సూక్ష్మసేద్యంలో వినియోగించే డ్రిప్ ఎరువుల ధరలు గతేడాది 25–50 శాతం మేర పెరిగాయి. ముడిసరుకుల ధరలు పెరిగాయన్న సాకుతో ఈ ఏడాది మరోసారి కాంప్లెక్స్ ఎరువుల ధరలను కంపెనీలు పెంచేశాయి. దీనివల్ల సీజన్లో కనీసం రూ.700 కోట్లకు పైగా రైతులపై అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు.నాడు.. ఇంటికే ఎరువులువైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2019–24 మధ్య రైతన్నలకు వ్యయప్రయాసలు లేకుండా ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలోనే ఎరువులు సరఫరా చేసింది. దేశంలో మరెక్కడా లేనివిధంగా ఆర్బీకేల ద్వారా ఎరువుల అమ్మకాలను ప్రోత్సహించే లక్ష్యంతో 10,611 ఆర్బీకేలకు లైసెన్సులు జారీ చేసింది. పంపిణీలో జాప్యాన్ని నివారించేందుకు కంపెనీల నుంచే నేరుగా ఆర్బీకేలకు సరఫరా చేసేలా ఏర్పాట్లు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా 34.11 లక్షల మంది రైతులకు 13.75 లక్షల టన్నుల ఎరువులను గ్రామం పొలిమేర దాటాల్సిన అవసరం లేకుండా ఇంటి ముంగిటికే సరఫరా చేసింది. ఫలితంగా లోడింగ్, అన్లోడింగ్, రవాణా చార్జీల రూపంలో ప్రతి రైతుకు బస్తాకు రూ.20–30 చొప్పున ఆదా అయ్యింది. ఇలా ఐదేళ్లలో అన్నదాతలకు మొత్తం రూ.వంద కోట్లకుపైగా ఆదా జరిగింది. అన్నిటికి మించి క్యూలైన్లలో నిల్చోవాల్సిన అగత్యం తప్పింది. బ్లాక్ మార్కెట్ బెడద లేకుండా పోయింది. అలాంటిది టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక పొలం పనులు వదిలేసి మండల కేంద్రాలకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇప్పుడు యాప్‌ల పేరుతో వారిని ముప్పుతిప్పలు పెడుతోంది. తీవ్ర సంక్షోభంలోకి నెడుతోంది కంపెనీలు, డీలర్ల స్థాయిలో జరిగే ఎరువుల బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టకుండా రైతులు, కౌలు రైతులను ప్రభుత్వం సంక్షోభంలోకి నెడుతోంది. ఎరువులు దొరకడం లేదని కౌలు రైతులు సాగు చేయడం మానేస్తే లక్షలాది ఎకరాలు బీడు వారతాయి. యాప్ విధానం వల్ల అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి రాబోతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం పునఃసమీక్షించి భూమి సాగు చేసే వారికి డిమాండ్ మేరకు ఎరువులు సరఫరా చేయాలి. – ఎంవీఎస్ నాగిరెడ్డి, ఏపీ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ తుంగభద్ర డ్యాం నూతన గేట్ల ప్రారంభోత్సవంకేంద్ర జలశక్తి మంత్రి పాటిల్సహా ముఖ్యమంత్రుల హాజరుసాక్షి, బళ్లారి: తుంగభద్ర డ్యామ్‌కు నూతనంగా అమర్చిన 33 గేట్ల ప్రారంభోత్సవం గురువారం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్సహా తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం సమీపంలోని మునీరాబాద్‌లో జరిగిన సభలో కేంద్ర మంత్రి పాటిల్ మాట్లాడుతూ పేరుకుపోయిన పూడికను తొలగిస్తే డ్యామ్‌లో 30 శాతం నీటి నిలువ పెరుగుతుందని తెలిపారు. పూడిక తొలగింపునకు సాంకేతిక సహకారాన్ని కేంద్రం అందిస్తుందని పేర్కొన్న ఆయన, ఇక తదుపరి బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదేనని అన్నారు. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తుంగభద్ర నదీ జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి అంగీకరించడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. నదుల అనుసంధానం జరగాలన్న కేంద్రం సంకల్పానికి ఇది మరింత బలం చేకూరుస్తుందన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో నదుల అనుసంధానం విజయవంతం అవుతుందన్న విశ్వాసం ఉందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తుంగభద్ర డ్యాం గేట్లను పునరుద్ధరించడం లక్షలాది మంది రైతుల కన్నీరు తుడిచే గొప్ప పరిష్కారంగా అభివర్ణించారు. ఇది మూడు తరాల సమస్యకు పరిష్కారమని అన్నారు. మూడు రాష్ట్రాల రాష్ట్ర రైతుల హితం కోసం తుంగభద్ర డ్యామ్‌లో నీటిని కాపాడుకునేందుకు గట్టి చర్యలు తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆంధ్రప్రదేశ్ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పరస్పరం పొగడ్తల వర్షం!! చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో ఒకరిపై మరొకరు పొగడ్తల వర్షం కురిపించుకోవడం వారిద్దరి మధ్య గురుశిష్యుల బంధాన్ని మరోసారి బయటపెట్టింది. ‘రేవంత్ రెడ్డి నా శిష్యుడు. డ్యాషింగ్, డైనమిక్ సీఎం. అన్ని విషయాలపై తరచూ చర్చించుకుంటాం. తెలంగాణ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు. నీటి ప్రాజెక్టుల విషయంలో ఆయన చూపుతున్న చొరవ ప్రశంసనీయం. రాష్ట్రాభివృద్ధి విషయంలో రాజీ పడరు. చురుకైన నాయకుడు’ అని చంద్రబాబు పొగిడితే, ‘చంద్రబాబు నాయుడు రాజకీయంగా నాకు గురువు. పాలనలో ఆయన అనుభవం, దేశానికి ఆదర్శం. సాంకేతిక పరిపాలనలో చంద్రబాబు మార్పులు తెచ్చారు. ఆయన దూరదృష్టి దేశానికి ఆదర్శం. రాజకీయ జీవితంలో చంద్రబాబు నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నా’ అని రేవంత్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు, డీకేలు కూడా ఒకరికొకరు పొగడ్తలతో ముంచెత్తుకున్నారు. -
మహిళలకు చంద్రబాబు మోసంపై YS జగన్ ఆగ్రహం
-
రాబోయే రెండేళ్లు దద్దరిల్లిపోద్ది.. గుర్తుపెట్టుకో చంద్రబాబు
-
దుమారం రేపుతున్న పవన్ కామెంట్స్.. తిరగబడుతున్న ప్రజలు!
-
బాంబు పేల్చిన CAG..! అప్పుల్లో ఏపీ నెం.1
-
ప్రభుత్వ హత్య.. పెద్దలను కాపాడే కుట్ర... కాపు యువకుడు సాయికృష్ణ హత్య కేసులో కీలక పరిణామాలు... కీలక అంశాలు లేకుండానే ‘సిట్’ రిమాండ్ నివేదిక
-
"నీ వయసేంటి..? నీ మాటలేంటి..?" నీకు రోజులు దగ్గరపడ్డాయి!
-
సాయి కృష్ణ లాకప్ డెత్ అసలు నిజాలివే..!
-
‘అసైన్డ్’పై ఎమ్మెల్యేలదే పెత్తనం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అసైన్డ్ భూములను కొల్లగొట్టడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ప్రభుత్వం కొత్త దుకాణానికి తెరతీసింది. ఇప్పటికే నియోజకవర్గాలు, మండలాల నేతలకు ఇసుక, మట్టి, మద్యం ద్వారా అడ్డగోలుగా దోచుకునేందుకు దారులు చూపిన ప్రభుత్వం.. తాజాగా అసైన్డ్ భూములను సైతం పందేరం చేయడానికి సరికొత్త ఎత్తుగడ వేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం జిల్లా ఇన్చార్జి మంత్రి అధ్యక్షతన గల అసైన్డ్ కమిటీలను రద్దు చేసి, నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల అధ్యక్షతన అసైన్డ్ కమిటీల ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి అసైన్డ్ కమిటీలకు ఎమ్మెల్యేలను అధ్యక్షులుగా ఉంచేలా కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లు సమాచార శాఖ మంత్రి పార్థసారథి మీడియాకు తెలిపారు. నియోజకవర్గాల వారీగా అసైన్డ్ భూములే లేకుండా మొత్తం భూములను తమ అనుచరులు, అనుయాయులకు కట్టబెట్టేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఎమ్మెల్యేలే ఇష్టానుసారంగా వారికి నచ్చిన వారికి అసైన్డ్ భూములను కేటాయిస్తారు తప్ప.. అర్హులనే పదానికి తావుండదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అలాగే గత వైఎస్సార్సీపీ సర్కారు.. ప్రభుత్వ రంగంలో నిర్మాణం చేపట్టిన మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల పరిధి కుదింపు ద్వారా ప్రైవేట్‌కు ధారాదత్తం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. దీంతో ఈ 2 పోర్టుల్లో మిగతా దశల విస్తరణకు బాబు ప్రభుత్వం దారులను మూసేసింది. చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం పోర్టు పరిధిని 64 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్లకు, ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టు పరిధిని 51 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్లకు కుదిస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్లో సవరణలకు ఆమోదం లభించిందని మంత్రి పార్థసార«థి మీడియాకు వెల్లడించారు. ఇతరత్రా కేబినెట్ నిర్ణయాలు...⇒ రామాయపట్నం పోర్టు అభివృద్ధి, నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను డీబీఎఫ్ఒటీ (డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్) ప్రాతిపదికన అప్పగించేందుకు పోర్ట్ ఆపరేటర్ నియామకం కోసం ఆర్ఎఫ్పీ జారీ చేయడానికి, బిడ్డర్లను ఆకర్షించేందుకు వీలుగా ఆర్ఎఫ్పీలో నిబంధనల్లో మార్పులకు ఆమోదం. ⇒ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని షెడ్యూల్ 9, 10లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలలోని రెగ్యులర్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుండి 62 సంవత్సరాలకు పెంచేందుకు ఆమోదం. దీనిని 2022 జనవరి 1 నుంచి పాత తేదీతో వర్తింపజేస్తూ, అప్పటి నుండి విశ్రాంతి పొందిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకునేలా సరీ్వస్ రూల్స్ సవరించడానికి ఆమోదం. ⇒ 2004 సెప్టెంబర్ 1 కంటే ముందే నియామక నోటిఫికేషన్ విడుదలై..అదే తేదీన లేదా ఆ తర్వాత ప్రభుత్వ సేవలో చేరిన అర్హులైన ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సీపీఎస్ నుంచి పాత పెన్షన్ విధానంలోకి మారేందుకు ఒకేసారి అవకాశం కల్పించేందుకు ఆమోదం. ఈ నిర్ణయంతో జీవో 653 పరిధిలోని సుమారు 10,715 మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారి కుటుంబాలకు పదవీ విరమణ అనంతరం పాత పెన్షన్ విధానం వర్తింపు. కేబినెట్ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ⇒ రాష్ట్రంలోని అంతర్జాతీయ, దేశీయ విమానాశ్రయాల్లో ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పించేలా, తిరుపతి విమానాశ్రయం మినహా మిగిలిన అన్ని విమానాశ్రయాలలో అత్యాధునిక బార్లు, రిటైల్ మద్యం దుకాణాలను ఏర్పాటు చేయడానికి సంబంధించిన నూతన విధాన మార్గదర్శకాల ముసాయిదా ఆమోదం. ⇒ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల (స్థాపన, నియంత్రణ) చట్టం 2016లో సవరణలకు ఆమోదం. టీడీపీ ఆఫీస్‌కు రెండు ఎకరాలు ⇒ పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గొల్లలకోడేరులో టీడీపీ కార్యాలయం కోసం 2.002 ఎకరాలు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడికి తొలుత 66 ఏళ్లు.. ఆపై 99 ఏళ్లకు పొడిగించేలా లీజుకు ఆమోదం. ⇒ రాష్ట్రంలో సాంకేతిక ఆధారిత రిజిస్ట్రేషన్ సేవలను అందించేందుకు అల్లూరి సీతారామరాజు, పొలవరం జిల్లాలు మినహా అన్ని జిల్లాల ప్రధాన కార్యాలయాల్లో పబ్లిక్–ప్రైవేట్ పార్ట్నర్íÙప్ (పీపీపీ) విధానంలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రం స్థాపించి, నిర్వహించడానికి ఆమోదం. వీటిని సబ్–రిజిస్ట్రార్ కార్యాలయాలుగా ప్రకటిస్తూ విధులు నిర్వహించేందుకు ఆమోదం. ‘గీతం’లో 45 మీటర్ల ఎత్తు వరకు భవన నిర్మాణానికి అనుమతి⇒ విశాఖ రిషికొండలోని గీతం విద్యా సంస్థలో 45 మీటర్ల ఎత్తు వరకు భవన నిర్మాణం చేపట్టేందుకు తాత్కాలిక ఫైర్ ఎన్వోసీ మంజూరుకు ఆమోదం. ⇒ ఎస్ఐపీబీ, సీఆర్డీఏలో తీసుకున్న నిర్ణయాలకు, పలు సంస్థలకు భూముల కేటాయింపు, రాయితీలు ఇచ్చేందుకు ఆమోదం. ⇒ డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్, ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, నెట్వర్క్ ఆసుపత్రుల మధ్య ప్రతిపాదించిన బిల్ డిస్కౌంటింగ్ విధానానికి సంబంధించి 8 శాతం వడ్డీ భారాన్ని సంబంధిత నెట్వర్క్ ఆసుపత్రులే భరించే నిబంధనతో ఆమోదం. పవన్‌పై విమర్శలు చేస్తే స్పందించండిమంత్రులకు సీఎం డైరెక్షన్సాక్షి, అమరావతి: ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై ఎవరైనా విమర్శలు చేస్తే వాటిపై స్పందించి కౌంటర్ ఇవ్వాలని మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. మంగళవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం పలు కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మంత్రులతో మాట్లాడుతూ పలు సూచనలు చేసినట్టు సమాచారం. కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్‌పై కాపు సామాజికవర్గం నేతలు, వైఎస్సార్సీపీ నేతలు చేస్తున్న విమర్శలను సీఎం వద్ద ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. పవన్‌పై విమర్శలు వస్తే మంత్రులంతా స్పందించాల్సిందేనని, మౌనంగా ఉంటే సరికాదని, ఎప్పటికప్పుడు కౌంటర్ ఇవ్వాలని సీఎం ఆదేశించినట్టు సమాచారం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను వివాదాల్లోకి లాగేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, అలాంటి సందర్భాల్లో కూటమి ఐక్యతను చాటే విధంగా మంత్రులంతా సమన్వయంతో స్పందించాలని సూచించారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ క్రిమినల్స్‌ను వెనకేసుకొస్తూ రాజకీయం చేస్తోందన్నారు. వైసీపీ నేతలు కుల మీటింగ్‌లు పెడుతూ కులాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలను తిప్పికొట్టాలని మంత్రులకు సూచించినట్టు తెల్సింది. జొన్నగిరి గ్రామాన్ని ‘స్వర్ణ గ్రామం’గా నామకరణం చేయాలని సీఎం ప్రతిపాదించినట్టు సమాచారం. జూలై 3న కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం చంద్రబాబు మంత్రుల వద్ద ప్రస్తావించారు. -
అమృత్ 2.0 పనుల్లో చంద్రబాబు నిలువు దోపిడీ
-
మీరిద్దరూ గుండు కొట్టించుకోండి..! లేదంటే ఆవు మూత్రాన్ని నేనే మీ మొఖాన...
-
వక్ఫ్ భూములపై పంజా
సాక్షి, అమరావతి: ముస్లిం సమాజం మేలు కోసం దాతలు ఇచ్చిన రూ.వందల కోట్ల విలువైన వక్ఫ్ భూములను అధికారికంగా కొల్లగొట్టేందుకు చంద్రబాబు సర్కారు అడ్డూ అదుపులేకుండా అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటోందని ముస్లిం సమాజం ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. వక్ఫ్‌బోర్డును రబ్బర్ స్టాంప్‌గా మార్చేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలకు భూముల కేటాయింపునకు ఆమోదముద్ర వేసేలా వక్ఫ్‌బోర్డ్ సమావేశాల్లో ఒత్తిడి తెస్తూ ఇష్టంవచ్చినట్లు వ్యవహరిస్తోందని ముస్లిం ప్రతినిధులు విమర్శిస్తున్నారు.నంద్యాల జిల్లాలో వక్ఫ్ భూములను పోలీస్ హెడ్ క్వార్టర్స్, ఆర్మ్డ్ రిజర్వ్ కార్యాలయాల కోసం కేటాయించే విషయాన్ని మంగళవారం నిర్వహిస్తున్న ఏపీ వక్ఫ్‌బోర్డు సమావేశం అజెండా అంశాల్లో చేర్చడం ముస్లిం సమాజంలో తాజాగా తీవ్ర చర్చనీయాంశమైంది. నంద్యాల జిల్లాలోని చాబోలు గ్రామంలో సర్వే నెంబర్ 313/1లోని 19.14 ఎకరాల వక్ఫ్‌భూమిని జిల్లా ఎస్పీ కార్యాలయం, పోలీస్ హెడ్ క్వార్టర్స్, ఆర్మ్డ్ హెడ్ క్వార్టర్స్ కోసం కేటాయించాలని జిల్లా కలెక్టర్ ప్రతిపాదించారు. దీన్ని వక్ఫ్‌బోర్డు చైర్మన్, అధికారులు పరిశీలించి 11వ అంశంగా అజెండాలో చేర్చారు. అదే జిల్లాలోని పాణ్యం మండలం కౌలుర్ గ్రామంలోని సర్వే నెంబర్ 128/2లో పది సెంట్ల భూమిని కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం కోసం అప్పగించేలా అజెండాలోని 12వ అంశంగా చేర్చారు. దీనిపై వక్ఫ్‌బోర్డు సభ్యులు చర్చించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ముస్లిం సమాజం గమనిస్తోంది. అడిగేవారే లేరనుకునే ధోరణి రాష్ట్రంలో ఎక్కడైనా ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి ప్రభుత్వ భూములను సహజంగా వినియోగించుకోవాల్సి ఉంటుంది. లేదంటే ప్రభుత్వమే భూ సేకరణ చేసి ఆయా ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి వినియోగించడం జరుగుతుంది. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఇందుకు సంబంధించి ముస్లిం సమాజానికి చెందిన వక్ఫ్ భూములపై కన్నేసింది. పైగా ఆయా వ్యవహారాల్లో అధికార పార్టీ నాయకుల జోక్యం కూడా పెచ్చుమీరింది. రాష్ట్రంలో అనేక వక్ఫ్ భూములను ఏపీఐఐసీ తదితర సంస్థలకు కట్టబెట్టేందుకు, ప్రైవేట్ వ్యక్తులకు లీజులకు అప్పగించేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తంమీద వక్ఫ్‌బోర్డ్ భూముల విషయంలో అటు ప్రభుత్వ పెద్దలు ఇటు అధికార పార్టీ నేతలు తమను అడిగేవారే లేరన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇష్టారాజ్యంలో కొన్ని అంశాలు..⇒ చిత్తూరులోని ఇఫ్తేదార్ అలీ ఖాన్ షహీద్ దర్గా వక్ఫ్‌కు చెందిన 6.31 ఎకరాల భూమికి సంబంధించి వక్ఫ్ ట్రిబ్యునల్‌తో పాటు హైకోర్టులోనూ కేసులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, ఆ భూమిని నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించేందుకు ప్రతిపాదనలు పంపడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనికితోడు సదరు దర్గా భూములను ఆక్రమణదారుల నుంచి రక్షించేందుకు చర్యలు చేపట్టిన వక్ఫ్‌బోర్డు ఇన్స్పెక్టర్ గౌస్ మొహిద్దిన్‌పై అక్రమ కేసు నమోదు చేయించడం వెనుక చిత్తూరు జిల్లా టీడీపీ కీలక నేత ప్రమేయం ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాల్సిన చోట వక్ఫ్ ఆస్తులను కాపాడే అధికారులను ఇబ్బందులకు గురిచేయడం అధికార పార్టీ ఆగడాలకు పరాకాష్ట. ⇒ తాడిగడప ఖాజీ సర్వీస్ ఇనామ్ వక్ఫ్ భూములు 25.59 ఎకరాల విషయంలో హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించిన వేలం పాట ప్రక్రియను పూర్తి చేసి ఆ భూములను స్వా«దీనం చేసుకోవడంలో అధికారులు విఫలమయ్యారు. ఫలితంగా అధికార పార్టీ నేతల అండదండలతో ఆ భూములను ఆక్రమణదారులే సాగు చేస్తున్నారు. దానిపై ముస్లిం నేతలు పలుమార్లు ఫిర్యాదులు చేసినా ప్రభుత్వ యంత్రాంగానికి చీమకుట్టినట్టు అయినా అనిపించలేదు. దీని వెనుక రాజకీయ, ఆర్థిక ఒత్తిళ్లే కారణమనే విమర్శలు రేగుతున్నాయి. అధికారులు స్పందించకపోవడం వల్లే ఆ భూముల్లో అక్రమ సాగు, పంట కోతలు జరిగాయని తాజాగా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్–ఆడిటర్ నివేదిక తేల్చిచెప్పింది. ⇒ కర్నూలు జిల్లా కల్లూరు రోజా దర్గా వక్ఫ్ భూములు 19.65 ఎకరాలకు సంబంధించిన వ్యవహారంలో వక్ఫ్ భూముల మార్పిడి, బదిలీ చట్ట విరుద్ధమని గతేడాది ఆగçస్టు 4న లీగల్ ఒపీనియన్ స్పష్టంగా పేర్కొంది. అయినా ఇందుకు అనుగుణంగా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగాయనే విమర్శలున్నాయి. ⇒ విజయనగరం నగరంలోని గెజిటెడ్ ముస్లిం శ్మశాన వాటిక భూమిని అక్రమంగా సబ్ డివిజన్ చేసి.. ప్రైవేట్ ఆస్తిగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.వక్ఫ్ ఆస్తులకు పెనుముప్పు రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వమే వాటిని పలు శాఖలకు, బడాబాబులకు అప్పగించే ప్రయత్నాలు చేయడం దారుణం. చంద్రబాబు వైఖరి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్ ఆస్తులకు పెనుముప్పు వాటిల్లింది. వక్ఫ్‌భూముల అన్యాక్రాంతానికి వక్ఫ్‌బోర్డు నుంచి అధికారుల వరకు వేగంగా చర్యలు తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఆయా వ్యవహారాలపై అధికారికంగా ఆడిట్ జరపాలి. అక్రమాలపై స్వతంత్ర సంస్థతో విచారణ నిర్వహించి వాస్తవాలను ముస్లిం సమాజానికి వెల్లడించాలి. వక్ఫ్ ఆస్తులను కాపాడాల్సినవారే అవినీతికి పాల్పడితే, చట్టం తన పని చేయాల్సిందే. – షేక్ నాగుల్ మీరా, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు -
రూ.100 కోట్ల రిటైర్డ్ ఉద్యోగి భూమి కబ్జా
సాక్షి టాస్క్‌ఫోర్స్: చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల భూములకు రక్షణ కరువైంది. కోట్ల విలువ చేసే భూములను తప్పుడు పత్రాలతో కబ్జా చేసి పాగావేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లాలోనే ఈ తరహా భూ కబ్జాలు పెరిగిపోవడం గమనార్హం. కూటమినేతల భూదందాలు చూసి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో భూముల రేట్లు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో అదే స్థాయిలో అధికార పార్టీ నేతల ఆగడాలూ పెరిగిపోతున్నాయి. తిరుపతి రూరల్ మండలం అవిలాల పంచాయతీ పరిధిలో రూ.100కోట్ల విలువైన భూమిని తప్పుడు పత్రాలు, రెవెన్యూ రికార్డుల మార్పులతో కబ్జా చేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు.ఆ కబ్జా వెనుక చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, అధికారుల పాత్ర ఉందని చెబుతున్నారు. రవాణా శాఖలో ఉద్యోగ విరమణ తర్వాత వచ్చిన సొమ్ముతో ఆ భూమిని కొనుగోలు చేశానని, ఇప్పుడు దానిని ఎస్ఎన్ఎల్ డెవలపర్స్ సంస్థకు అమ్మేసినట్టు ఆన్లైన్ చేసుకున్నారని వృద్ధ దంపతులు ఆరోపించారు. బాధితుల వివరాల మేరకు... పీలేరులోని ఎర్రమిట్టకు చెందిన రిటైర్డ్ ఆర్టీవో ద్వారకానాథ్ రెడ్డి కుటుంబం 2002–03లో తిరుపతి మండలం అవిలాల పరిధిలోని సర్వే నంబర్ 476/1లో 3 ఎకరాల 17 సెంట్ల భూమిని కొనుగోలు చేశారు. ఆ భూమి తన భార్య వనజ పేరుతో ఆన్లైన్ అయ్యిందని, ఈసీతోపాటు ప్రభుత్వ రికార్డుల్లో కూడా తమ పేర్లు ఉన్నాయని ద్వారకానాథరెడ్డి పేర్కొన్నారు.అయితే చంద్రబాబు ప్రభుత్వం ఆ భూమిని నిషేధిత జాబితాలో చేర్చి వివాదం సృష్టించిందని... అనంతరం తాము కొనుగోలు చేసిన భూమి చెల్లదంటూ గత ఏడాది ఆగస్టు 25న తిరుపతి రూరల్ తహసీల్దార్ నోటీసులు ఇచ్చారని తెలిపారు. 1986 నాటి సేల్‌డీడ్‌ను రద్దు చేస్తున్నట్లు తహసీల్దార్ నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. అయితే ఆ మరుసటి రోజే ఇతరుల పేరుతో జీపీఏ, రిజిస్ట్రేషన్లు జరగడానికి అవకాశం కల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు భూమిపై గేటెడ్ కమ్యూనిటీ, ఎస్ఎన్ఎల్ డెవలపర్స్ పేరుతో ప్లాట్లు వేసి విక్రయాలకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని, జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ అనుచరుల పాత్ర ఉందని ఆరోపించారు.నాని అనుచరుడు అశోక్‌రెడ్డి పేరిట జీపీ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరుడు అశోక్ రెడ్డి పేరుతో జీపీ చేశారని, గత ఏడాది ఆగస్టు 26న కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన దోనేపూడి విష్ణు శివ నాగప్రసాద్ పేరుతో 35 మంది చేత ఆధార్‌కార్డు, పాన్‌కార్డ్, ఇతర తనిఖీలు చేయకుండానే తిరుపతి రూరల్ సబ్ రిజిస్ట్రార్ విజయ్‌కుమార్ రిజిస్ట్రేషన్ పూర్తి చేశారని బాధితురాలు వనజ ఆరోపిస్తున్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తూ, ఆర్డీవో కోర్టులో అప్పీలుకు వెళ్లామని, స్టే ఆర్డర్ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.అలాగే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి అక్కడి అధికారులను ప్రశ్నించగా పెద్ద వాళ్లు ఒత్తిడి చేయడం వల్లే రిజిస్ట్రేషన్ చేశామంటూ తప్పించుకుంటున్నారని చెబుతున్నారు. వృద్ధ వయసులో ఉన్న తమ భూమిపై ఎమ్మెల్యే, మంత్రి కన్నేసి కబ్జా చేస్తే తాము ఎవరికి చెప్పుకోవాలో తెలియక తిరుపతి 10వ అదనపు కోర్టులో న్యాయపోరాటం చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు తుడా అనుమతులకు ఫైళ్లను పంపించగా అక్కడి అధికారులు అన్ని రకాల దస్త్రాలను అందజేయాలని కోరడంతోపాటు కోర్టులో కేసు నడుస్తున్నందున అనుమతులు ఇవ్వలేమని టౌన్‌ప్లానింగ్ అధికారులు అడ్డు చెప్పారని బాధితులు తెలిపారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని కబంద హస్తాల నుంచి తమ భూమిని కాపాడాలని వనజ కోరుతున్నారు.పట్టా భూములకూ రక్షణ కరువైందిరిటైర్మెంట్ డబ్బులతో 2002 – 03 మధ్య కొనుగోలు చేసిన భూమిని మంత్రి అనగాని, ఎమ్మెల్యే నాని అనుచరులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ప్రభుత్వ భూములకే కాకుండా పట్టా భూములకు కూడా రక్షణ కరువైంది. 1986 నుంచి ఉన్న రిజిస్ట్రేషన్‌ను నిషేధిత భూముల జాబితాలో ఉందంటూ లిటిగేషన్ సృష్టించారు. మేము కొనుగోలు చేసినప్పటికే 20కు పైగా రిజిస్ట్రేషన్లు జరిగితే నిషేధిత జాబితాలోకి ఎలా చేరుతుంది. వెబ్‌ల్యాండ్‌లో మా పేరు తొలగించి మంత్రి అనుచరులు పేరును చేర్పించుకున్నారు. రూ.100 కోట్ల విలువైన భూమిని ఇప్పుడు డెవలపర్స్ పేరిట ఆన్లైన్ చేసేశారు. తహసీల్దార్‌ను అడిగితే కోర్టులో చూసుకోమని చెబుతున్నారు. – ద్వారకానాథ్‌రెడ్డి, రిటైర్డ్ ఆర్టీవో, పీలేరుఅక్రమార్కులపై చర్యలు తీసుకోవాలితిరుపతి రూరల్ మండలం అవిలాల రెవెన్యూ గ్రామంలో రూ.100 కోట్లకు పైగా విలువైన భూములను లక్ష్యంగా చేసుకుని భారీ భూదందా సాగుతోందని తిరుపతి రూరల్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు విడుదల మాధవరెడ్డి ఆరోపించారు. ఆ మేరకు సోమవారం తిరుపతి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తూ అక్రమాలకు పాల్పడిన వారిపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవిలాల రెవెన్యూ గ్రామం సర్వే నంబర్ 476/1లో భూమిపై హక్కులు లేని వ్యక్తులు తప్పుడు పత్రాలు, నకిలీ ఆధారాలతో రిజిస్ట్రేషన్లు సృష్టించి చేతులు మారుస్తున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు.ఈ భూవ్యవహారంపై ఇప్పటికే పలు మీడియా సంస్థలు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్లను ప్రస్తావిస్తూ కథనాలు ప్రసారం చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి విచారణ గానీ, చర్యలు గానీ లేకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. తిరుపతికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ భూమి ప్రస్తుతం వంద కోట్ల రూపాయలకు పైగా విలువ చేస్తుండటంతో భూ మాఫియా కన్ను పడిందని ఆరోపించారు. ‘మూడు రోజుల్లో భూ దోపిడీపై చర్యలు ప్రారంభించకపోతే తహసీల్దార్ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయం, కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు, భారీ ప్రజా ఆందోళనలు చేపట్టి ప్రభుత్వ భూములను దోచుకున్న వారిని ప్రజల ముందు నిలబెడతామని ఎంపీపీ మాధవరెడ్డి హెచ్చరించారు. -
ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం
సాక్షి, అమరావతి: ఈ–బస్సుల ముసుగులో ఏపీఎస్ ఆర్టీసీని ప్రైవేటీకరించాలన్న చంద్రబాబు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమైంది. మంగళవారం నుంచి ధర్నాలు చేపట్టబోతోంది. ఉద్యోగ సంఘాల జేఏసీ ఇప్పటికే తమ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది. ఈ–బస్సులను ఆర్టీసీయే నిర్వహించాలని, ఖాళీగా ఉన్న 10 వేల పోస్టులను భర్తీ చేయాలని, కొత్త బస్సులు కొనుగోలు తదితర డిమాండ్లతో రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఆర్టీసీ ఎండీ బాలసుబ్రమణ్యంకు వినతిపత్రాలు సమర్పించింది. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతోంది. మంగళ, బుధవారాల్లో అన్ని ఆర్టీసీ డిపోలు, యూనిట్లలో ధర్నాలు నిర్వహించనుంది. -
ఎంటీఎస్ ఉపాధ్యాయులపై సర్కారు కక్ష సాధింపు
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కార్ డీఎస్సీ 1998, 2008 కింద మినిమం టైమ్ స్కేల్‌పై (ఎంటీఎస్) పనిచేస్తున్న ఉపాధ్యాయులపై ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోంది. ఉద్యోగాలకు అర్హులై, దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఉపాధ్యాయ కొలువులోకి అడుగుపెట్టిన వారిని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతోంది. జీవోలకు విరుద్ధంగా బదిలీల పేరుతో కౌన్సెలింగ్ చేపట్టి ఇష్టారీతిన తలోదిక్కుకు విసిరేస్తూ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తోంది. వాస్తవానికి 1998, 2008 డీఎస్సీకి చెందిన దాదాపు 4,900 మందికిపైగా అర్హులకు దశాబ్దాల తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో న్యాయం జరిగింది.వీరిని మినిమం టైమ్ స్కేల్ కింద పరిగణిస్తూ ఉపాధ్యాయులుగా నియమించింది.వారికి సొంత మండలాలు, సమీప ప్రాంతాల్లోనే పోస్టింగులు ఇచ్చింది. వారి జీవన ప్రమాణాలను, కుటుంబం, వయసు, ఆరోగ్య కారణాలరీత్యా మానవతా దృక్పథంతో ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతలో చంద్రబాబు అధికారంలోకి రావడంతో మినిమం టైమ్ స్కేల్‌తో రెగ్యులర్ ఉపాధ్యాయులతో పాటు పనిచేస్తున్న వారిని బదిలీల పేరుతో వందల కిలోమీటర్ల దూరానికి, కొండలు, అటవీ ప్రాంతాల్లోకి విసిరేసింది. కేవలం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్యోగాలు కల్పించారనే దుర్బుద్ధితో కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులను లక్ష్యంగా చేసుకుని పాశవిక చర్యలకు పాల్పడుతోంది. కౌన్సెలింగ్‌కు వ్యతిరేకంగా ధర్నా 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి 1998, 2008 డీఎస్సీ ఉపాధ్యాయులకు సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించింది. దీనికి వ్యతిరేకంగా ఎక్కడికక్కడ ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేసి, ధర్నాలకు దిగడంతో చాలాచోట్ల ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రభుత్వం 4,900 మంది టీచర్లకు సమీప ప్రాంతాల్లోని ఖాళీలను బ్లాక్ చేసి సుదూర ప్రాంతాలు, మారుమూల ప్రదేశాలు, కొండలు, అటవీ కేంద్రాల్లో మాత్రమే పోస్టులను చూపించి బలవంతంగా నెట్టేందుకు కుయుక్తులు పన్నుతోంది. దీనికి ఉపాధ్యాయ సంఘాల్లోని కొందరు టీడీపీ అనుకూల వ్యక్తులు సైతం వంతపాడుతూ పోస్టులను బ్లాక్ చేయిస్తుండటం విస్తుగొలుపుతోంది.గత ప్రభుత్వంలో జారీ చేసిన జీవో–27ను తుంగలో తొక్కడం గమనార్హం. రెగ్యులర్ టీచర్లతో సమానంగా ఏకోపాధ్యాయులుగా, ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న వారికి రాజకీయ కోణంలో చూస్తుండటం ప్రభుత్వ దుర్నీతికి అద్దం పడుతోంది. దీనిపై 1998, 2008 డీఎస్సీ ఉపాధ్యాయులు రెండేళ్లుగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా కనికరం చూపించడంలేదు. పైగా సదరు ఉపాధ్యాయుల సర్వీసును 62 ఏళ్లకు పెంపుపైనా నోరు మెదపడంలేదు. హెచ్ఆర్ఏ, డీఏ, ఇతర ఆర్థిక లబ్ధికి దూరంగా 11 నెలలు మాత్రమే జీతం తీసుకుంటూ పనిచేస్తున్న వారిపై కనికరాన్ని ప్రదర్శించకుండా కక్ష సాధింపులకు పాల్పడుతోంది. -
రాష్ట్రంలో రాక్షస పాలన
నెల్లూరు (వేదాయపాళెం): కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తోందని, ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపులకు పాల్పడుతోందని మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, డీఎస్సీలో జరిగిన అవకతవకలను, ఎత్తిచూపుతున్నారనే ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ నెల్లూరు సిటీ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డికి చెందిన కృష్ణచైతన్య విద్యా సంస్థల్లో దాడులు చేయడంపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో 18 మంది శాసన మండలి సభ్యులు, వైఎస్సార్సీపీ నేతలు చంద్రశేఖరరెడ్డికి సంఘీభావంగా నెల్లూరుకు తరలివచ్చారు. నెల్లూరు నగరంలోని వీఆర్సీ సెంటర్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద సర్కారు దమన నీతిని ఎండగట్టారు. చిల్డ్రన్స్‌పార్కు రోడ్డులోని చంద్రశేఖర్‌రెడ్డి నివాసానికి చేరుకున్న ఎమ్మెల్సీలు అక్కడి నుంచి ర్యాలీగా వీఆర్సీ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఇటువంటి నిరంకుశ, నియంతృత్వ పోకడలు మంచివి కాదన్నారు. డీఎస్సీ నియామకాల్లో అవినీతి, అక్రమాలను తగిన సాక్ష్యాధారాలతో ఎత్తిచూపినందుకు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డికి చెందిన విద్యాసంస్థలపై అర్ధరాత్రి దాడులు నిర్వహించారని విమర్శించారు.ఈ జిల్లాలో నారాయణ విద్యాసంస్థలు, హాస్టళ్లు వందల సంఖ్యలో ఉన్నాయని, వాటిపై దాడులు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, ఎంవీ రామచంద్రారెడ్డి, కల్పలతరెడ్డి, కేఆర్జే భరత్, ఇషాక్‌బాషా, పి.రామసుబ్బారెడ్డి, మంగమ్మ, రమేష్ యాదవ్, డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, మేరిగ మురళీధర్, తూమాటి మాధవరావు, ఎండీ రుహుల్లా, కవురు శ్రీనివాస్, వెంకటరవీంద్రనాథ్, బొమ్మి ఇజ్రాయిల్, కె హరిబాబు, నెల్లూరు జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, రాష్ట మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత, సిటీ నియోజకవర్గ ఇన్చార్జి చంద్రశేఖర్‌రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డి పాల్గొన్నారు. -
‘గంపగుత్త’గా దోచేశారు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2019–24 మధ్య జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ అమలుతోపాటు మొబిలైజేషన్ అడ్వాన్సు విధానం రద్దు లాంటి విప్లవాత్మక సంస్కరణలతో టెండర్ల వ్యవస్థకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం జీవంపోసి పారదర్శకతకు పెద్దపీట వేస్తే.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని రద్దుచేసి టెండర్ల వ్యవస్థను 2014–19 తరహాలో నీరుగార్చిందనేందుకు స్థానిక సంస్థల్లో తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం, నిర్వహణ పనులే మరో నిదర్శనం.కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో ఇంటింటికీ రక్షిత తాగునీటిని సరఫరా చేయడం.. మురుగునీటిని శుద్ధిచేసి మళ్లీ వినియోగించుకోవడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకాన్ని ప్రారంభించింది. ఈ పనులకు కేంద్రం 50 శాతం నిధులు ఇస్తుండగా మిగతా 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం, ఆయా కార్పొరేషన్, మున్సిపాల్టీ, నగర పంచాయతీలు వాటాగా ఇవ్వాలి.ఇలా రాష్ట్రంలో 103 మున్సిపాల్టీ, కార్పొరేషన్, నగర పంచాయతీల్లో అమృత్ 2.0 కింద ఇంటింటికీ తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణ పనులకు 2023–24లో కేంద్రానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. వాటిని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆమోదించి నిధుల విడుదలకు అంగీకరించింది. ఆ పనులకు 2023–24లోనే టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. అనంతరం రెండు నెలలకే 2024 సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. తొలుత ‘ఛామ్’ పాట..చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమృత్ 2.0 కింద వైఎస్సార్సీపీ హయాంలో చేపట్టిన పనుల టెండర్లను రద్దుచేసింది. ఆ పథకానికి రాష్ట్ర వాటాగా నిధులు ఇచ్చేందుకు ఆర్థిక పరిస్థితి సహకరించదనే సాకుతో 77 కార్పొరేషన్, మున్సిపాల్టీ, నగర పంచాయతీలను తొమ్మిది ప్యాకేజీలుగా విభజించి ఛామ్ (కన్ససెనైర్ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) విధానంలో గతేడాది జూన్‌లో వేర్వేరుగా టెండరు నోటిఫికేషన్లు జారీ చేసింది.రాష్ట్ర ప్రభుత్వం, కార్పొరేషన్, మున్సిపాల్టీ, నగర పంచాయతీ వాటా నిధులను కాంట్రాక్టరే చెల్లించి పనులు చేపడితే.. వాటిని హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో వడ్డీతో కలిపి పదేళ్లలో చెల్లించేలా గత జూన్‌లో టెండర్లు పిలిచింది. కానీ, కాంట్రాక్టర్ల నుంచి స్పందన లేకపోవడంతో వాటిని రద్దు చేసింది. ఎన్నడూలేని రీతిలో గంపగుత్తగా..అనంతరం.. అమృత్ 2.0 కింద చేపట్టిన పనుల అంచనా వ్యయాలను భారీగా పెంచేశారని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. 103 కార్పొరేషన్, మున్సిపాల్టీ, నగర పంచాయతీలను 9 ప్యాకేజీలుగా విభజించి.. టెండరు నోటిఫికేషన్‌కు ముందే ముఖ్యనేత సన్నిహితుడు ఒకరు బడా కాంట్రాక్టు సంస్థలతో బేరసారాలాడారు. కమీషన్ల లెక్కతేల్చాకే.. ఆ కాంట్రాక్టు సంస్థలకే టెండరులో బిడ్లు దాఖలు చేసే అర్హత ఉండేలా నిబంధనలు రూపొందించి గతేడాది నవంబర్– డిసెంబర్లలో వేర్వేరుగా టెండర్ నోటిఫికేషన్లు జారీ చేయించారు. అడిగినంత కమిషన్ ఇచ్చిన కాంట్రాక్టు సంస్థకే అధిక ధరకు పనులు కట్టబెట్టేశారు. ⇒ నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో 24 కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం, నిర్వహణ పనులకు రూ.1,048.29 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి టెండర్ నోటిఫికేషన్ జారీచేశారు. ఇందులో బిడ్ దాఖలు చేయాలంటే మార్చి 31, 2025 నాటికి గత పదేళ్లలో అంటే 2014–15 నుంచి 2024–25 వరకూ ఏదైనా ఒక సంవత్సరం రూ.262.07 కోట్ల వ్యయంతో ఇలాంటి పనులనే పూర్తిచేసి ఉండాలనే నిబంధన పెట్టారు. ఈ టెండర్లో 3.77 శాతం అధిక ధర అంటే రూ.1087.81 కోట్లకు కోట్ ఎల్–1గా నిలిచిన మేఘాకు ఆ పనులను అప్పగించేశారు. ⇒ కొండపల్లి, వైఎస్సార్ తాడిగడప, దాచేపల్లి, విజయవాడ, జగ్గయ్యపేట, మచిలీపట్నం, గుడివాడ, పెడన, నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, పిడుగురాళ్ల, గురజాల, మాచర్ల, గుంటూరు, మంగళగిరి–తాడేపల్లి, తెనాలి, పొన్నూరు, చీరాల, బాపట్ల, రేపల్లె, ఉయ్యూరు, తిరువూరు, సత్తెనపల్లి, అద్దంకి.. మొత్తం 26 కార్పొరేషన్, మున్సిపాల్టీ, నగర పంచాయతీల్లో తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం–నిర్వహణ పనులకు రూ.1,038.34 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. 3.80 శాతం అధిక ధరకు అంటే రూ.1,077.79 కోట్లకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన మేఘాకు ఆ పనులను అప్పగించారు.⇒ వైఎస్సార్ కడప జిల్లాలో కడప కార్పొరేషన్, బద్వేలు, మైదుకూరు, జమ్మలమడుగు మున్సిపాల్టీలు, యర్రగుంట్ల నగర పంచాయతీలో తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం, వాటి నిర్వహణ పనులకు రూ.648.90 కోట్ల అంచనా వ్యయంతో టెండరు నోటిఫికేషన్ జారీచేశారు. 3.85 శాతం అధిక ధరకు అంటే రూ.673.82 కోట్లకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన జేడబ్ల్యూఐఎల్ ఇన్ఫ్రా లిమిటెడ్‌కు ఆ పనులు అప్పగించారు. ⇒ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏడు కార్పొరేషన్, మున్సిపాల్టీ, నగర పంచాయతీల పనులకు రూ.563.08 కోట్ల కాంట్రాక్టు విలువతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. 3.96 శాతం అధిక ధర అంటే రూ.585.33 కోట్లకు కోట్ చేసిన ఎన్సీసీ సంస్థకు ఆ పనులు అప్పగించారు.⇒ అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో 11 కార్పొరేషన్, మున్సిపాల్టీ, నగర పంచాయతీల్లో పనులకు రూ.426.56 కోట్లు కాంట్రాక్టు విలువగా నిర్ణయించిన టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. 3.91 శాతం అధిక ధరకు అంటే రూ.443.24 కోట్లకు కోట్ చేసిన ఎల్–1గా నిలచిన జేడబ్ల్యూఐఎల్ ఇన్ఫ్రా లిమిటెడ్‌కు ఆ పనులను అప్పగించారు.⇒ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో 11 కార్పొరేషన్, మున్సిపాల్టీ, నగర పంచాయతీల్లో పనులకు రూ.405.09 కోట్లు కాంట్రాక్టు విలువగా నిర్ణయించి టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. 3.90 శాతం అధిక ధరకు అంటే రూ.420.88 కోట్లకు కోట్ చేసిన ఎల్–1గా నిలిచిన సివెట్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఆ పనులను అప్పగించారు. ⇒ తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో నాలుగు కార్పొరేషన్, మున్సిపాల్టీ, నగర పంచాయతీల్లో పనులకు రూ.399.50 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. 3.61 శాతం అధిక ధరకు అంటే రూ.413.89 కోట్లకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన సుధాకర ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు వాటిని అప్పగించారు. ⇒ కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఐదు కార్పొరేషన్, మున్సిపాల్టీ, నగర పంచాయతీల్లో పనులకు రూ.398.14 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. 3.93 శాతం అధిక ధరలకు అంటే రూ.413.79 కోట్లకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన జేడబ్ల్యూఐఎల్ ఇన్ఫ్రా లిమిటెడ్ సంస్థకు వాటిని అప్పగించారు. ⇒ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల్లో 10 కార్పొరేషన్, మున్సిపాల్టీ, నగర పంచాయతీల్లో పనులకు రూ.381.41 కోట్ల కాంట్రాక్టు విలువతో టెండరు నోటిఫికేషన్ జారీ చేశారు. 3.97 శాతం అధిక ధరకు అంటే రూ.396.52 కోట్లకు కోట్ చేసిన ఎన్సీసీకి వాటిని అప్పగించారు.రూ.551.30 కోట్ల మేర పంచుకు తిన్న వైనం..అంచనా వ్యయం పెంచేయడం.. అస్మదీయ కాంట్రాక్టరుకే పనులు దక్కేలా నిబంధనలతో టెండరు నోటిఫికేషన్ జారీచేయడం.. కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరలకు పనులు కట్టబెట్టడం.. ఒప్పంద విలువలో పది శాతం మొబిలైజేషన్ అడ్వాన్సుగా ముట్టజెప్పడం.. అందులో ఎనిమిది శాతం ప్రభుత్వ పెద్దలు తిరిగి వసూలు చేసుకోవడం రివాజుగా మారిపోయింది. ఇదే పద్ధతిని అమృత్ 2.0 టెండర్లలోనూ అనుసరించారని ఇంజనీరింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ పనుల్లో రూ.551.30 కోట్లను మొబిలైజేషన్ అడ్వాన్సుగా ముట్టజెప్పి కాంట్రాక్టర్లు, ముఖ్య నేతలతో కలిసి పంచుకు తిన్నారనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. చిన్న కాంట్రాక్టర్లకు ఇచ్చి ఉంటే..ఇలా గంపగుత్తగా కాకుండా ఒక్కో కార్పొరేషన్, మున్సిపాల్టీ, నగర పంచాయతీకి వేర్వేరుగా టెండర్లు నిర్వహించి ఉంటే.. చిన్నచిన్న కాంట్రాక్టర్లు పెద్దఎత్తున పోటీపడి బిడ్లు దాఖలు చేసే అవకాశం ఉండేదని.. దానివల్ల కాంట్రాక్టు విలువ కంటే సగటున 4.5 నుంచి 5 శాతం తక్కువ ధరలకు పనులు అప్పగించే అవకాశం ఉండేదని.. అలాగే ఖజానాకు రూ.450 కోట్లకు పైగా ఆదా అయ్యేదని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. పనులు కూడా నిర్దేశిత గడువు రెండేళ్లలోగా పూర్తయ్యే అవకాశం ఉండేదని.. వాటి నిర్వహణ కూడా సవ్యంగా ఉండేదని స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు బడా కాంట్రాక్టర్లు పనులు దక్కించుకున్నా.. వాటిని మళ్లీ సబ్ కాంట్రాక్టు కింద ఆయా ప్రాంతాల్లోని చిన్నచిన్న కాంట్రాక్టర్లకే అప్పగించారని చెబుతున్నారు.అంతా సిండికేట్.. సగటున 3.9% అధిక ధరకు..తొమ్మిది ప్యాకేజీలకు నిర్వహించిన టెండర్ల ప్రక్రియ.. కాంట్రాక్టు సంస్థలు కోట్ చేసిన ధరలు చూస్తే.. రాజధాని నిర్మాణ పనుల తరహాలోనే అమృత్ 2.0 పనుల్లోనూ కాంట్రాక్టర్లను ప్రభుత్వ పెద్దలే సిండికేట్ అయ్యేలా చేశారన్నది స్పష్టమవుతోందని నిపుణులు చెబుతున్నారు. ఎల్–1గా నిలిచిన కాంట్రాక్టు సంస్థలు వరుసగా 3.97, 3.96, 3.93, 3.91, 3.90, 3.85, 3.80, 3.77 కోట్ చేయడమే అందుకు నిదర్శనం. ఒక్కో ప్యాకేజీలో సగటున 3.9 శాతం అధిక ధరకు కోట్‌చేస్తూ బిడ్లు దాఖలు చేసి పనులు దక్కించుకోవడం గమనార్హం. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.203.76 కోట్ల భారం పడింది. ఇక జీఎస్టీ, న్యాక్, సీనరేజీ వంటి పన్నుల రూపంలో కాంట్రాక్టర్లకు అదనంగా చెల్లిస్తామని టెండరు నిబంధనల్లో పేర్కొన్నారు. వీటిని బట్టిచూస్తే ఈ పనుల కాంట్రాక్టు విలువ రూ.6,500 కోట్లకుపైగా దాటుతుందని అంచనా వేస్తున్నారు. -
లాకప్‌డెత్ సాక్షిగా హైడ్రామా..!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: సంచలనం సృష్టిస్తున్న సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సరికొత్త డ్రామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం చంద్రబాబు ఒకవైపు బాధితులను పరామర్శించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వగా మరోవైపు పోలీసు బాస్‌ను కాపాడేందుకు పథక రచన చేసినట్లు తెలుస్తోంది. సాక్ష్యాలు, ఆధారాలు ధ్వంసమయ్యాక 40 రోజుల తరువాత తాపీగా సిట్ ఏర్పాటు పేరుతో చేతులు దులుపుకొంటోంది. ఈ ఘటనను సీఐ నాగరాజుకు ఆపాదించి తూతూమంత్రంగా దర్యాప్తు ముగించే యత్నం చేస్తున్నారు. ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ప్రతిష్ట మంటగలిసి పోవడంతో దీన్ని కప్పిపుచ్చేందుకు సర్కారు పడరాని పాట్లు పడుతోంది. సాయికృష్ణ ఉదంతంపై కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై అన్ని వర్గాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ‘ఎవరో కులం వాడు క్రిమినల్ పనులు చేస్తే నేను బాధ్యత వహించాలా? ఎంపీలు, ఎమ్మెల్యేలు నోరు విప్పరా..?’ అంటూ సాయికృష్ణ మిస్సింగ్‌పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో సాయికృష్ణ కుటుంబం జనసేన తరపున పని చేయలేదా? అని పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. టెక్నాలజీ ఏమైంది? తొలుత తాము సాయికృష్ణను తీసుకురాలేదని బుకాయించినా తరువాత విధిలేని పరిస్థితుల్లో టాస్‌్కఫోర్స్, కృష్ణలంక పోలీసులు కలిసి వెళ్లి మార్కాపురం నుంచి మే 9న సాయికృష్ణను విజయవాడకు తెచ్చామని ఒప్పుకోక తప్పలేదు. ఈ విషయాన్ని ఇప్పటికే విచారణాధికారి ఎదుట వెల్లడించినట్లు సమాచారం. ప్రభుత్వ పెద్దలకు, పోలీసు బాస్‌కు ముందుగానే దీనిపై సమాచారం ఉందని పోలీస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తెచ్చామని, శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని, 70 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. ప్రత్యేకించి విజయవాడ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం వాడటంలో దిట్టలు అని, నగరంలో అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ఎన్నో కేసులు చేధించామని ప్రకటించే ఉన్నతాధికారులు సాయికృష్ణ ఆచూకీపై నోరు మెదపకపోవడం సందేహాలకు దారి తీస్తోంది. దీన్నిబట్టి ఈ వ్యవహారం అంతా ప్రభుత్వ పెద్దలు, పోలీసు బాస్ కనుసన్నల్లోనే జరిగినట్లు స్పష్టమవుతోందని పరిశీలకులు పేర్కొంటున్నారు. కరుడు గట్టిన నేరస్తుల నుంచి సమాచారాన్ని రాబట్టే పోలీసులు సాయికృష్ణ అదృశ్యంపై వివరాలను సేకరించడం పెద్ద కష్టమేమి కాదని వ్యాఖ్యానిస్తున్నారు. కానిస్టేబుళ్లను విచారిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నా ఆ దిశగా దృష్టి సారించకపోవటాన్ని ప్రశ్నిస్తున్నారు. ల్యాండ్ డీల్ వ్యవహారమేనా..! సాయికృష్ణను మార్కాపురం నుంచి తెచ్చి రోజుల తరబడి థర్డ్ డిగ్రీ ప్రయోగించాల్సిన అవసరం ఏముందనే కీలక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక భూ వివాదం దీనికి కారణమని.. ఎంపీ, పోలీసుబాస్ పెద్ద మొత్తంలో డీల్ కుదుర్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్రాంతి కుమార్ ఆత్మహత్య... సీఐ నాగరాజు వేధింపులు తట్టుకోలేక చనిపోతున్నట్లు దళిత యువకుడు క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియోలో వెల్లడించినా ఇంతవరకు దీనిపై పోలీసులు విచారణ చేపట్టలేదు. క్రాంతి కుమార్ ఆత్మహత్యకు కారకుడైన సీఐ నాగరాజుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఎందుకు కేసు నమోదు చేయలేదని దళిత సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. సీఐ ఇంటి వద్ద హైడ్రామా.. తనపై కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు సీఐ నాగరాజు ఇంటి వద్ద హైడ్రామా నడుపుతున్నారు. సీఐపై చర్యలు తీసుకోవద్దంటూ కొందరు యువకులు, మహిళలను పోగు చేసి ఆదివారం ఆందోళన చేయించారు. కొందరు పోలీసులు నాగరాజు ఇంటికి చేరుకుని విచారణ పేరుతో మంతనాలు సాగించారు. ఇక సాయంత్రం ధర్నా చౌక్ ప్రాంతం వద్ద సీఐకు అనుకూలంగా ధర్నా చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరిగినా పోలీస్ బాసులు వారించడంతో చివరి నిమిషంలో వెనక్కి తగ్గడం గమనార్హం. ఇవన్నీ కేసును పక్క దారి పట్టించేందుకు చేస్తున్న కుట్రలేనని విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. -
కాపులకు బాబు ద్రోహం..!
సాక్షి, అమలాపురం/రామచంద్రపురం: రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయని.. కాపుల సంక్షేమాన్ని చంద్రబాబు సర్కారు గాలికి వదిలేసిందని వైఎస్సార్సీపీ కాపు నేతలు, కాపు సామాజిక వర్గ ప్రతినిధులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాపులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని.. కాపులకు ఇవ్వాల్సిన నిధులను బకాయిలతో సహా చెల్లించాలని.. కాపు కార్పొరేషన్‌కు చంద్రబాబు బకాయి పెట్టిన రూ.9,000 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాపు కార్పొరేషన్‌కు రూ.3 వేల కోట్లు ఇస్తామని హామీలిచ్చిన చంద్రబాబు రెండేళ్లలో మూడు రూపాయిలు కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ‘కాపు నేస్తం’ సహా ఎన్నో పథకాలను ఇచ్చారని.. ఇళ్ల స్థలాలు, అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా కాపు మహిళలు, విద్యార్థులకు మేలు జరిగిందని.. కొత్తవి ఇవ్వకపోగా ఉన్న పథకాలను కూడా చంద్రబాబు తీసేస్తామంటే ఊరుకోబోమని స్పష్టం చేశారు. చంద్రబాబుకు ఎన్నికలప్పుడే కాపులు గుర్తుకొస్తారా? అని మండిపడ్డారు. కాపు యువకుడు సాయికృష్ణ రౌడీ అయితే అతడి కుటుంబాన్ని చంద్రబాబు ఎందుకు కలిశారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. ఆదివారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలోని వెంకటాయపాలెంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కాపు ముఖ్య నేతల ఆత్మీయ కలయిక సమావేశం జరిగింది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో రాష్ట్రంలో టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక కాపులపై జరుగుతున్న దాడులు, అణచివేత చర్యలు, సంక్షేమ పథకాల నిలిపివేతతో కాపులకు జరుగుతున్న అన్యాయాలపై సుదీర్ఘంగా చర్చించారు. ‘కూటమి ప్రభుత్వంలో కాపులకు గౌరవం దక్కడం లేదు.. కాపు కులంలో ఉన్నవారంతా రౌడీలా? అధికార పార్టీ నేతలు ఎంతోమంది అరాచకాలు చేస్తుంటే పవన్‌కు కనపడటం లేదా? సాయికృష్ణ కేసులో పోలీసులను సస్పెండ్ చేయడంతో సరిపెడతారా? అయినా కేసులు ఉంటే మనుషులను చంపేస్తారా? అధికారం ఉందని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కుదరదు..’ అని హెచ్చరించారు. డిప్యూటీ సీఎం పవన్ నోటికి, భాషకు.. హద్దు, ఆనకట్ట లేకుండా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. ఎన్నికల సమయంలో ఇదే పవన్ కళ్యాణ్ కులం చూపించి ఓట్లు అడగలేదా? ఇప్పుడు అదే కులంలో ఓ మనిషిని చంపేస్తే ప్రశ్నించాల్సిన బాధ్యత ఆయనకు లేదా? అని నిలదీశారు. ఈ ప్రభుత్వం, పోలీసుల బాధితులకు అండగా ఉంటామని ప్రకటించారు. చంద్రబాబు సర్కారు అరాచకాలను కలసికట్టుగా ఎదుర్కొంటామని.. కాపు, బలిజ, ఒంటరి, తెలగ, తూర్పు కాపుల్లో ఎవరికి ఏ అన్యాయం జరిగినా తామున్నామనే ధైర్యం కల్పిస్తామని చెప్పారు. ఇది మరే కులాలకూ వ్యతిరేకం కాదని, కాపులతో పాటు మిగిలిన కులాలను కూడా కూడగట్టి వెళ్తామని, కాపులతో ఉంటే తమకు ఓ భరోసా ఉందనే నమ్మకాన్ని వారిలో కలిగిస్తామని తెలిపారు. వైఎస్సార్సీపీ హయాంలో అమలు చేసిన నవరత్న పథకాలతో కాపు సామాజిక వర్గానికి అత్యధికంగా మేలు జరిగిందని సమావేశంలో చర్చ జరిగింది. ముఖ్యంగా కాపు మహిళలు, విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరిందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన, విదేశీ విద్య పథకం ద్వారా కాపు విద్యార్థులకు మేలు జరిగిందని.. కాపు నేస్తం కింద ఏటా రూ.15 వేలు ఇచ్చి కాపు మహిళల అభ్యున్నతికి మాజీ సీఎం వైఎస్ జగన్ చేయూత అందించారని గుర్తు చేశారు. కాపు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడంతోపాటు రూ.వేల కోట్ల నిధులిచ్చి కాపులకు ఆసరాగా నిలిచారని పేర్కొన్నారు. సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, తోట నరసింహం, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా, పేర్ని నాని, ఎమ్మెల్సీ విక్రాంత్, మాజీ ఎంపీ వంగా గీత, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, రెడ్డి శాంతి, జ్యోతుల చంటిబాబు, కరణం ధర్మశ్రీ, రౌతు సూర్యప్రకాశరావు, జి.శ్రీనివాస్ నాయుడు, దూలం నాగేశ్వరరావు, వివిధ నియోజకవర్గాల పార్టీ కో ఆర్డినేటర్లు దవులూరి దొరబాబు, చిన్న, మల్లి వెంకట్రాజు, పేర్ని కిట్టు, సింహాద్రి రమేష్, అంబటి మురళి, జె.గురునాథరావు, చిన్న శీను, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రామారావు, జక్కంపూడి విజయలక్ష్మి, కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ అడపా శేషు తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ ఆ వివరాలను మీడియాకు తెలియచేశారు. సమావేశంలో చేసిన తీర్మానాలను మాజీ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు.మీడియా సమావేశంలో మాట్లాడుతున్న బొత్స సత్యనారాయణ. పక్కన కాపు ముఖ్య నాయకులు ఎవరికి అన్యాయం జరిగినా అండగా ఉంటాం‘రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ కాపు సామాజిక వర్గానికి చెందిన ఎవరికి అన్యాయం జరిగినా అండగా ఉంటాం. నష్టపోయిన వారింటికి వెళ్తాం. అక్కడే కూర్చుంటాం. వారికి ధైర్యాన్ని, మనోస్థైర్యాన్ని కల్పిస్తాం. ఆర్థికంగా చేయూతనిస్తాం. కూటమి ప్రభుత్వం ఎటువంటి ఆపద కల్పించినా కలసికట్టుగా ఎదుర్కొంటాం..’ అని కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు, కాపు ప్రజాప్రతినిధులు ప్రకటించారు. ఎనిమిది మంది మాజీ మంత్రులతో పాటు ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్సార్సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు, రాష్ట్ర, జిల్లా అనుబంధ కమిటీల ప్రతినిధులు ఈ సదస్సులో తమ గళాన్ని వినిపించారు. ‘నా కుమారుడి శవాన్ని ఇవ్వకున్నా.. కనీసం బూడిదైనా ఇవ్వాలి..’ అంటూ కాపు యువకుడు సాయికృష్ణ కన్నతల్లి కన్నీళ్లతో వేడుకుంటున్న హృదయ విదారక ఘటనలు కూటమి పాలనలోనే కనిపిస్తున్నాయని మండిపడ్డారు.ఎన్నికల్లో కులం చూపించి ఓట్లేయమనలేదా?: బొత్సరానున్న రోజుల్లో తిరుపతి, విశాఖపట్నంలో కూడా ప్రాంతీయ సమావేశాలు నిర్వహిస్తామని బొత్స సత్యన్నారాయణ తెలిపారు. అవసరమైతే ప్రతి జిల్లాలోనూ, అన్ని ప్రాంతాల్లోనూ సమావేశాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. విజయవాడలో కాపు యువకుడు గాదె సాయికృష్ణను చంపి శవం కూడా కనిపించకుండా ఏవిధంగా మాయం చేశారో చూశామన్నారు. దీనిపై సిట్ వేయడాన్ని ఆయన తప్పుబట్టారు. సిట్‌పై తమకు నమ్మకం లేదన్నారు. ‘క్రిమినల్ కేసులుంటే చంపేస్తారా? అలాగని చట్టంలో, రాజ్యాంగంలో ఉందా? అలా అయితే కమిషన్ ఎందుకు వేశారు?’ అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా కాపులకున్న అంగబలం, ఆర్థిక బలంతో అవసరమైతే సాయికృష్ణ కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. వైఎస్సార్సీపీ నాయకులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రౌడీలతో పోల్చడంపై బొత్స తీవ్రంగా మండిపడ్డారు. అధికారం ఉందని నోటికొచ్చినట్టు మాట్లాడకూడదని హితవు పలికారు. ‘ఎన్నికల సమయంలో ఇదే పవన్ కళ్యాణ్ కులం చూపించి ఓట్లు వేయమంటారా? ఇప్పుడు అదే కులంలో మనిషిని చంపేస్తే ఆయనకు అడగాల్సిన బాధ్యత లేదా?’ అని ప్రశ్నించారు. ‘కాపులకు న్యాయం జరుగుతుందని రెండేళ్లు ఎదురు చూశాం. అయినా అన్యాయమే జరిగింది’ అని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ హయాంలో కాపు నేస్తం సహా ఎన్నో పథకాలను ఇచ్చారని, ఇప్పుడు గతంలో ఉన్న పథకాలను సైతం తీసేస్తామంటే ఒప్పుకోబోమన్నారు.ఇవీ తీర్మానాలు..⇒ రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయి. బాబు సర్కారు అరాచకాలను ఖండిస్తున్నాం. సాయికృష్ణను పోలీసులే చంపేశారు. క్రాంతికుమార్ ఆత్మహత్యకు కూడా పోలీసులే కారణం. వీరి మరణాలపై సీబీఐతో విచారణ చేయాలి.⇒ కాపు, బలిజ, ఒంటరి, మున్నూరు కాపులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలి.⇒ కాపులపై దాడులను అరికట్టి భరోసా కల్పించేందుకు మూడు ప్రాంతాల్లో కమిటీల ఏర్పాటుకు నిర్ణయం.⇒ కాపు కార్పొరేషన్ నిధులు వెంటనే విడుదల చేయాలి.⇒ మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యంతో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి.⇒ వైఎస్సార్సీపీ హయాంలో కాపు నేస్తం పథకం కింద మహిళలకు రూ.2 వేల కోట్ల సాయం అందించారు. ఈ ప్రభుత్వం మహిళలకు రూ.9 వేల కోట్ల బాకీలు చెల్లించాలి.రూ.3,000 కోట్లన్నారు.. రూ.3 కూడా ఇవ్వలేదుకాపుల సంక్షేమానికి వైఎస్సార్ సీపీ కంటే అధికంగా కట్టుబడి ఉంటామని, రూ.3 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కనీసం రూ.3 కూడా కేటాయించలేదని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఆదివారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వెంకటాయపాలెంలో కాపునేతల ఆత్మీయ సమావేశానికి పేర్ని నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు 100 మంది గన్మెన్లను ఇచ్చి ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రభుత్వ సొమ్ముతో ఫ్లైట్లు సమకూర్చితే కాపులకు న్యాయం జరిగినట్లా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న కాపుల్లో అత్యధికులు చిరు వ్యాపారాలు, ఉద్యోగాలు, కూలీ పనులు చేసుకుంటూ జీవితాలు గడుపుతున్నారన్నారు. వారి జీవితాలు చదువు ద్వారా మాత్రమే మారతాయని, కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఎగ్గొట్టి వారందరికీ అన్యాయం చేస్తోందన్నారు. చంద్రబాబుకు ఊడిగం చేస్తూ, ఆయనకు అనుకూలంగా నోటికి హద్దు లేకుండా మాట్లాడే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవడం అనవసరమనే స్థాయి కల్పించుకున్నారని వ్యాఖ్యానించారు. రౌడీలను ప్రోత్సహిస్తారా..? అంటూ పవన్ కళ్యాణ్ ఒక రకం నాటకం ఆడితే.. పరామర్శ పేరుతో సీఎం చంద్రబాబు మరో నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. ఈ దాగుడు మూతలు, డ్రామాలను కాపులతో పాటు రాష్ట్ర ప్రజలంద రూ గమనిస్తూనే ఉన్నారన్నారు. తమను రెడ్డి కాపులుగా సంబోధిస్తున్న పవన్ కళ్యాణ్.. కమ్మ కాపు అవుతాడా? అని ప్రశ్నించారు. కాపులు కాపులేనని, కులం కార్డు వాడుతూ చంద్రబాబుకు ఊడిగం చేయడాన్ని సహించబోరని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వంలో వేధింపులకు గురవుతున్న కాపులతో పాటు తమ గొంతు వినిపించలేని ఇతర కులాలకు కూడా అండగా ఉండాలని, అందుకోసం టాస్క్‌ఫోర్స్‌లు, క్రౌడ్ ఫండింగ్‌తో ఆదుకోవాలని సమావేశంలో తీర్మానం చేసినట్లు నాని వివరించారు.అలాగైతే కులాల వారీగా కార్పొరేషన్లు ఎందుకు?: తోట త్రిమూర్తులుకాపు సామాజిక వర్గాన్ని సంఘటితం చేసేందుకు ఈ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చెప్పారు. ఇది మరే కులానికీ వ్యతిరేకం కాదని, అందరూ కలసి ఉండాలని, అభివృద్ధి చెందాలనే కోరుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో కుల జాడ్యం పోవాలంటూ కొంతమంది మాట్లాడుతున్నారని, అయితే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు లాంటి పదవులన్నీ కులాల వారీగానే కేటాయిస్తున్నారని గుర్తు చేశారు. కులాలు అవసరం లేదన్నప్పుడు.. కులాల వారీగా కార్పొరేషన్లు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నించారు.‘కాపు నేస్తం’.. వైఎస్ జగన్నవరత్నాల పథకాలతో కాపులకు రూ.39,317.80 కోట్ల సాయంకాపు కార్పొరేషన్‌కు టీడీపీ హయాంలో పెట్టిన బకాయిలు సైతం చెల్లించింది జగనేచంద్రబాబు మాదిరిగా తాను మాయమాటలతో మభ్యపెట్టలేనని ముందునుంచీ చెప్పిన వైఎస్ జగన్ 2019–2024 మధ్య ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో నిజమైన కాపు నేస్తంగా నిలిచారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ నవరత్నాలతోపాటు ప్రత్యేకంగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాపుల సంక్షేమానికి బాటలు వేశారు. కాపు నేస్తం, చేయూత, ఆసరా, అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, వాహనమిత్ర లాంటి అనేక సంక్షేమ పథకాల ద్వారా కాపులకు తోడ్పాటు అందించి వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేశారు. పార్టీ, ప్రాంతం లాంటివి చూడకుండా, దళారుల ప్రమేయం లేకుండా కాపులకు నవరత్నాల (డీబీటీ, నాన్ డీబీటీ) పథకాల ద్వారా రూ.39,317.80 కోట్లను అందించి వైఎస్ జగన్ రికార్డు సృష్టించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం కాపు కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు, 307 మంది విద్యార్థులకు రూ.20.97 కోట్లు, నైపుణ్య శిక్షణకు రూ.8.83 కోట్లు ఇవ్వకుండా బకాయి పెట్టగా.. వైఎస్ జగన్ వాటిని చెల్లించడమే కాకుండా కాపుల సంక్షేమానికి ఇతోధికంగా నిధులు విడుదల చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం 5 కాపు భవనాలకు రూ.వంద కోట్లు నిధులు విడుదల చేయడమే కాకుండా 4 కాపు భవనాలు ప్రారంభించింది. -
దూరవిద్యను దూరంచేద్దాం.. ఆర్థికంగా దెబ్బతీద్దాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని విద్యా వ్యవస్థకు తలమానికంగా, మార్గదర్శిగా ఉన్నత విలువలతో నడయాడిన ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని (ఏయూ) చాపకింద నీరులా ప్రభుత్వం కబళించే కుటిల తంత్రం పన్నుతోందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కూటమి నేతల కుట్రలు, వర్సిటీ పాలకుల అసమర్థత కలసి వందేళ్ల చరిత్ర కలిగిన మహోన్నత విద్యా నిలయం వైభవాన్ని కోల్పోతోందని వర్సిటీ వర్గాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఇందులో భాగంగా ఏయూ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న దూరవిద్య (సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్–సీడీఓఈ) కేంద్రాన్ని తొలుత కూకటి వేళ్లతో సహా పెకలించి ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోందని ఆ వర్గాలు విమర్శిస్తున్నాయి. విశాఖ సాగర తీరంలోని ముఖ్యనేత బంధువుకు చెందిన ఓ బడా కార్పొరేట్ సంస్థకు ఆర్థికంగా మేలు చేకూర్చేందుకు ప్రభుత్వం ఏయూను బలిపశువును చేస్తోందన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. ఇందులో భాగంగా ఏయూ దూరవిద్య విభాగంలో ఒక్కొక్కటిగా విభాగాలను తొలగిస్తున్నారని, కొన్ని కోర్సులకు మంగళం పాడేస్తున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయా వర్గాల సమాచారం ప్రకారం ఏయూ దూరవిద్య కుంటుపడటానికి చేస్తున్న కుతంత్రాలను పరిశీలిస్తే.. అసమర్థ వైస్ చాన్సలర్, దూరవిద్య డైరెక్టర్ జాతీయ విద్యా సంస్థల నుంచి తీసుకొచ్చిన వ్యక్తిని వీసీగా పెట్టుకుని దూరవిద్యను నాశనం చేసేందుకు ప్రభుత్వం పాచికలు వేస్తోంది. సదరు వీసీ అసమర్థ చేష్టలతో దూరవిద్య భ్రష్టు పట్టింది. ఇక యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో (డెబ్) నిబంధనలకు అనుగుణంగా హ్యుమనిటీస్ కోర్సుల బ్యాక్‌గ్రౌండ్ కలిగిన వ్యక్తులను దూరవిద్య కేంద్రం డైరెక్టర్లుగా నియమించాలని, అయితే ఏయూలో మాత్రం ఒక ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ (కెమికల్ ఇంజనీరింగ్)కు రెండోసారి కూడా డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించడం దారుణమని వర్సిటీ వర్గాలు భగ్గుమంటున్నాయి.పైగా సదరు వ్యక్తికి దూరవిద్య డైరెక్టర్‌తో పాటు డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్‌గా.. రెండు పోస్టులు కట్టబెట్టడంలో మతలబు ఏమిటని నిలదీస్తున్నాయి. కేవలం దూర విద్యను దివాళా తీయించేందుకే సదరు వ్యక్తిని తీసుకొచ్చి డైరెక్టర్‌గా కూర్చోబెట్టారని.. ఫలితంగా పాలకుల ఆదేశాలతో దూరవిద్య విభాగాలను విధ్వంసం చేస్తున్నట్టు మండిపడుతున్నాయి. పైగా సదరు ప్రొఫెసర్ తన పేరుతో దూరవిద్యలో ఒకలా సంతకాలు చేస్తూ, అడ్మిషన్ డైరెక్టర్‌గా మరోలా సంతకం చేస్తున్నట్టు వినికిడి. ఇలా ఒక వ్యక్తి ఒకే వర్సిటీలో రెండు పోస్టుల్లో కొనసాగుతూ రెండు వేర్వేరు రకాలుగా సంతకాలు చేస్తుండటంపైనా విమర్శలున్నాయి. దూరవిద్య కుదేలవడానికి సదరు డైరెక్టర్ చేయాల్సిందంతా చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తమవుతోంది. పరీక్ష కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏయూ దూరవిద్య పరీక్షల నిర్వహణలో గతేడాది అపఖ్యాతి మూటగట్టుకుంది. పరీక్ష కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ తీవ్ర చర్చనీయాంశమైంది. పైగా ప్రశ్నాపత్రాల రూపకల్పనలో బయటి వ్యక్తుల ప్రమేయాన్ని జొప్పించడంతో పాటు సకాలంలో పరీక్షా కేంద్రాలకు ప్రశ్నాపత్రాలు పంపడంలో విఫలమైంది. చివరికి పరీక్ష ప్రారంభానికి ముందు వాట్సాప్, ఈ–మెయిల్ ద్వారా పంపించి వాటిని ప్రింట్లు తీసి విద్యార్థులకు పంపిణీ చేసిన దుస్థితిలో పరీక్షలు నిర్వహించింది. ఇక దూరవిద్యలో ప్రత్యేకంగా ఉండే ప్రశ్నాపత్రాల తయారు చేసే కాని్ఫడెన్షియల్ సెక్షన్‌ను తొలగించి రెగ్యులర్ వర్సిటీ విభాగంలో కలిపేశారు. ఎగ్జామినేషన్ సెంటర్లతో నేరుగా సంప్రదింపులు చేసి ముడుపులు చెల్లిస్తే ప్రాక్టికల్స్ చేయకపోయినా మార్కులు వేసేస్తున్న దుస్థితికి శ్రీకారం చుట్టారు. వార్షికంగా ఒకటే నోటిఫికేషన్ ఏటా రెండు సార్లు అడ్మిషన్ల నోటిఫికేషన్లు (అకడమిక్, క్యాలెండర్ ఇయర్) ఇవ్వాల్సి ఉండగా ఒక్కసారి మాత్రమే ఇవ్వడంతో ఏకంగా రూ.40 కోట్లకుపైగా వర్సిటీ ఖజానాకు గండిపడింది. పైగా ఆన్లైన్లో కోర్సులు నిర్వర్తించే ప్రైవేటు ఏజెన్సీలతో కుమ్మకై వర్సిటీ ఖజానాను దెబ్బతీయడంతో పాటు పేద విద్యార్థులతో వేల రూపాయల ఫీజులు కట్టేలా పరోక్ష చర్యలు తీసుకుంది. ఆన్లైన్ కోర్సుల ఫీజులు సాధారణ దూరవిద్య కోర్సు కంటే రెట్టింపు ఉండటం గమనార్హం. మరోవైపు అర్ధశతాబ్దం నుంచి కొనసాగిన స్టడీ సెంటర్స్ (సపోర్టు సెంటర్లు) లను మూసివేశారు. ఫలితంగా పరీక్ష నిర్వహణ గాడితప్పింది. ఆర్థిక విభాగాన్ని లేపేశారు సాధారణంగా బిల్లుల మంజూరులో ఆయా సబ్జెక్టు విభాగానికి చెందిన కో–ఆర్డినేటర్లు స్రూ్కటినీ చేసిన తర్వాత అసిస్టెంట్ రిజిస్ట్రార్(ఏఆర్), డిప్యూటీ రిజి్రస్టార్(డీఆర్) ధ్రువీకరిస్తే చివరికి డైరెక్టర్ బిల్లులను క్లియర్ చేస్తూ సంతకం పెడతారు. అయితే, అకౌంట్స్ విభాగాన్ని లేపేసి డైరెక్టర్ దూరవిద్య ఏఆర్, డీఆర్‌లతో కలిసి స్క్రూటినీని గాలికొదిలేసి విచ్చలవిడిగా సంతకాలు చేసి కోట్లాది రూపాయిల బిల్లులను ఇచ్చేస్తూ కమిషన్లు దండుకుంటున్నట్టు వర్సిటీలోనే బహిరంగంగా వినిపిస్తోంది. పైగా సదరు ఏఆర్, డీఆర్‌లను క్రమశిక్షణ చర్యల్లో భాగంగా దూరవిద్యకు పంపిస్తే ఇక్కడ డైరెక్టర్‌తో కలిసి ఖజానాకు గండికొడుతున్నట్టు సమాచారం. జీరో ఫ్యాకల్టీ కుతంత్రాలు ప్రత్యక్ష తరగతుల ద్వారానే కాకుండా దూరవిద్యలోనూ కోట్లాది మందికి వారి సామర్థ్యాలకు తగ్గట్టుగా డిగ్రీలు అందించి సమాజంలో ఉన్నత విద్యా వంతులుగా, దేశ సేవకులుగా వారిని ఏయూ తీర్చిదిద్దింది. సాంప్రదాయ విద్యతో సమానంగా మన్ననలు పొందుతోంది. యూజీసీ, డెబ్ నిబంధనలను అనుసరిస్తూ ఫ్యాకలీ్ట, విభాగాల నిర్వహణతోనే అనుమతులు తెచ్చుకుంటుంది. కానీ, కూటమి పాలకులు ఏయూను దెబ్బతీసేందుకు దూరవిద్యలో యూజీ, డెబ్ నిబంధనలకు విరుద్ధంగా డైరెక్టర్ వ్యవహరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.ఫ్యాకల్టీ లేకుంటే దూరవిద్య నిర్వహణకు డెబ్ అనుమతించదు. దానికి తగ్గట్టు స్టడీ సెంటర్లు కూడా కొనసాగించాలి. కనీసం విద్యార్థికి 10–20 రోజులైనా తరగతులు నిర్వహించాలి. ఇలాంటి నిబంధనలను గాలికొదిలేసిన డైరెక్టర్ ఫ్యాకల్టీ అందర్నీ వివిధ డిపార్ట్మెంట్లకు పంపించేయడంతో దూరవిద్యను జీరో ఫ్యాకల్టీ చేసి.. పూర్తిగా మూసివేసేలా పథకం పన్నినట్టు వర్సిటీ కోడైకూస్తోంది. అందుకే ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన వర్సిటీ పోస్టుల నోటిఫికేషన్లో దూరవిద్యలో ఒక్క పోస్టు కూడా లేకపోవడం నిదర్శనం. ఇలా నిబంధనలను అనుసరించకుండా దూరవిద్యను కొనసాగిస్తే ఎవరైనా డెబ్‌కు, యూజీసీకి ఫిర్యాదు చేస్తే అనుమతులు రద్దు చేస్తారని, ఇదే కూటమి ప్రభుత్వం కోరుకుంటోందని వర్సిటీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
అన్నదాతలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు దారుణలు: వైఎస్ జగన్
-
జై భీమ్... జై సంవిధాన్!
ఏప్రిల్ ఏడో తేదీన దేశంలోని అన్ని దినపత్రికల్లో ఒక వార్త చాలా ప్రముఖంగా రిపోర్టయింది. చిరువ్యాపారులైన తండ్రీ కొడుకులిద్దరినీ కస్టడీలో చిత్రహింసలు పెట్టి వారి చావుకు కారణమైన తొమ్మిదిమంది తమిళనాడు పోలీసులకు మధురై హైకోర్టు బెంచ్ ఉరిశిక్ష విధించింది. మొదట ఈ కేసుపై రాష్ట్ర స్థాయి పోలీసు విచారణకు ఆదేశించారు. దానివలన ఫలితం ఉండదని భావించిన మద్రాసు హైకోర్టు స్వయంగా జోక్యం చేసుకొని సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడంతో నిజాలు బయట కొచ్చాయి. ఉరిశిక్ష వార్త విన్న తర్వాత లాఠీ ప్రభువుల ఉత్సాహా నికి కొంతకాలమైనా కళ్లెం పడుతుందని ఎవరైనా భావిస్తారు.ఉన్నతస్థాయుల్లో పుష్కలంగా పలుకుబడి, అండదండలు ఉన్న అధికారులకు మాత్రం ఏ వార్తలు విన్నా ఎటువంటి భయాలూ ఉండవని తేలిపోవడానికి ఎంతోకాలం పట్టలేదు. ఉరిశిక్షల వార్త వెలువడిన ఒక్క నెలరోజుల నుంచి మరో నెల గడిచేలోగా ఆంధ్రప్రదేశ్‌లో ఖాకీ తాండవానికి సంబంధించి నాలుగు విషాద ఉదంతాలు వెలుగుచూశాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించుకున్న ‘పొలిటికల్ గవర్నెన్స్’ను గుర్తుచేసు కోవడం ఇక్కడ అసందర్భం కాకపోవచ్చు. అదేవిధంగా ఎన్నికలకు ముందే లోకేశ్‌బాబు రచించి, అధికారంలోకి రాగానే అమల్లోకి తెచ్చిన రెడ్‌బుక్ దిశానిర్దేశం గురించి గుర్తుచేయడం కూడా అసంగతమేమీ కాదు. పొలిటికల్ గవర్నెన్స్‌కూ, రెడ్‌బుక్ సందేశవ్యాప్తికీ పోలీసుల ‘ఆఫ్ ద రికార్డు’ సేవలు అవసరమైనప్పుడు, ఉభయ కుశలోపరిగా పోలీసు అధికారులు చిక్కుల్లో పడ్డప్పుడు ఉన్నతస్థాయి సహకారం ఉంటుందని భావించడం సహజం. కూటమి గద్దెనెక్కిన కొద్దిరోజుల్లోనే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వినుకొండ పట్టణంలో రషీద్ అనే వైసీపీ కార్యకర్తను పబ్లిగ్గా నడిరోడ్డు మీద పరిగెత్తిస్తూ కత్తులతో పొడిచి చంపారు. నో పోలీస్! అదే ఉమ్మడి జిల్లాలోని తెనాలి పట్టణంలో కొద్ది నెలల తర్వాత దళిత, మైనారిటీ యువకులను నడివీధిలో పడుకోబెట్టి సమస్త ప్రజల సమక్షంలో పోలీసులు వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. నో యాక్షన్!! థర్డ్ డిగ్రీ హింసను సుప్రీంకోర్టు నిషేధించింది. కానీ పొలిటికల్ గవర్నెన్స్ వ్యవస్థలో పరస్పర సహకారం వర్ధిల్లుతున్న వేళ న్యాయస్థానాల విధి నిషేధాలను ఎవరు ఖాతరు చేస్తారు?ఈ దేశంలోని ప్రతి పౌరునికీ జీవించే హక్కునూ, వ్యక్తిగత స్వేచ్ఛనూ, ఆత్మగౌరవంతో కూడిన జీవనయాన హక్కునూ భారత రాజ్యాంగంలో 21వ అధికరణం ప్రసాదించింది. చట్టపర మైన విధివిధానాల ద్వారా తప్ప మరేరకంగా ఈ హక్కులో జోక్యం చేసుకునే వీలు లేదని స్పష్టం చేసింది. అయినా పెరిగిపోతున్న పోలీసుల అతి ప్రవర్తన, కస్టోడియల్ మరణాల పట్ల ఉన్నత న్యాయస్థానాలు పలుమార్లు ఆందోళన వ్యక్తం చేస్తూ పలు మార్గదర్శకాలను విడుదల చేశాయి. ఒక వ్యక్తి పోలీసు స్టేషన్ మెట్లెక్కినంతనే అతని ప్రాథమిక హక్కులు మాయమై పోవని న్యాయమూర్తులు అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు. లాకప్ హింస ద్వారా వ్యక్తి జీవించే హక్కును, వ్యక్తిగత గౌర వాన్ని ధ్వంసం చేసే హక్కును లాగేసుకోవడమంటే, అనుల్లంఘనీయమైనవిగా భారత రాజ్యాంగం నిర్వచించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే అవుతుంది. కంచె చేను మేయడ మవుతుంది. రాజ్యాంగ ద్రోహమే అవుతుంది.రాజ్యాంగ వ్యవస్థను కూలదోసే లక్ష్యంతో పనిచేసే నక్స లైట్లు రాజ్యాంగ ద్రోహానికి పాల్పడుతున్నారని నిర్ణయించి రాజ్యవ్యవస్థ వారిని ఎన్కౌంటర్ హత్యలు చేసింది. మరి రాజ్య వ్యవస్థలో అంతర్భాగంగా ఉన్నవారే రాజ్యాంగానికి ద్రోహం తలపెడితే? ఇదిగో ఇలాంటివారే మరింత ప్రమాదకారులని న్యాయశాస్త్ర కోవిదులు వ్యాఖ్యానిస్తున్నారు. తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ చంద్రు అడ్వకేట్‌గా ఉన్నకాలంలో ఈ సూత్రం మీదనే వాదించి ఒక నిస్సహాయ పేద గిరిజనుడి లాకప్ మృతికి ప్రభుత్వాన్ని బాధ్యురాలిగా నిలబెట్ట గలిగారు. సూర్య నటించిన ‘జై భీమ్’ సినిమా ఇతివృత్తం కూడా ఈ యథార్థ ఘటనే. చంద్రు వాదనల ఫలితంగా మృతుడి భార్యకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించడమే కాకుండా, నింది తులకు శిక్షపడేలా చేయగలిగింది.మే 8 నుంచి జూన్ 16 వరకు ఏపీలో జరిగిన నాలుగు పోలీస్ సంబంధిత విషాదాల తర్వాత ప్రభుత్వ పెద్దల స్పందన గానీ, ఉన్నతాధికారుల కార్యాచరణగానీ సందేహాస్పదంగానే కనిపిస్తున్నది. ఒక కేసుకు సంబంధించి విచారణ పేరుతో మార్కాపురంలో పొట్టపోసుకుంటున్న సాయికృష్ణ అనే యువకు డిని విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈనెల 8న అరెస్టు చేసి విజయవాడలోని కృష్ణలంక పోలీసులకు అప్పగించినట్టు ఇప్పటి వరకు అందుతున్న వార్తలను బట్టి తెలుస్తున్నది. కుమారుడిని స్టేషన్లో పెట్టి హింసిస్తున్నారనే సమాచారంతో సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి నెలరోజులపాటు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు. తన కుమారుడిని కనీసం చూపెట్టాలని కోరినా సీఐ నాగరాజు లక్ష్యపెట్టలేదు. పైగా, ‘మీవాడిని చంపేశాం, వెళ్లి ఫోటోకు దండ వేసుకో పో’ అని కూడా సీఐ అన్నారని విజయలక్ష్మి మీడియా ఎదుటే వాపోయారు. సిటీ పోలీస్ కమిషనర్ దగ్గరకీ, డీజీపీ దగ్గరికీ వెళ్లి బతిమాలుకున్నా న్యాయం జరగలేదని ఆమె కన్నీరు పెట్టుకున్నారు.హైకోర్టులో విజయలక్ష్మి హెబియస్ కార్పస్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఈనెల 29వ తేదీ లోగా సాయికృష్ణను న్యాయస్థానం ఎదుట హాజరుపరచాలని ఆదేశించింది. ఈలోగా ‘సాక్షి’ పత్రికలో వచ్చిన వార్తలు, ఫొటోలు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. దీనిపై కొందరు వైసీపీ నాయకులతోపాటు మరికొందరు సామాజిక ఉద్యమ కారులు సాయికృష్ణ ఉదంతంపై గళం విప్పడం ప్రారంభించారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రులు గానీ, పోలీసు ఉన్నతాధికారులుగానీ ఈ అంశంపై మాట్లాడేందుకు సాహసించలేదు. రాజమండ్రి ఎస్పీ ఆధ్వర్యంలో ఒక విచారణ సంఘాన్ని వేసి చేతులు దులుపుకొన్నారు.రెండు రోజుల క్రితం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సాయికృష్ణ ఇంటికి వెళ్లి అతని తల్లిని పరామర్శించి, ఉదంతంపై సీబీఐ ఎంక్వయిరీకి డిమాండ్ చేశారు. ఆ తర్వాత ప్రభుత్వంలో కొంత కదలిక వచ్చింది. విజయలక్ష్మి గతంలో మొరపెట్టుకున్నా స్పందించని కమిషనర్ వెంటనే ఆమె కుటుంబ సభ్యులను పిలి పించుకొని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారట! ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా విజయలక్ష్మిని, ఆమె సోదరులను తన నివా సానికి రప్పించి న్యాయం చేస్తామని చెప్పారట! నిందితులను శిక్షిస్తామని కూడా హామీ ఇచ్చారట! సీఐ నాగరాజును సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అతనిపై హత్య కేసు నమోదు చేసి విజయవాడ కమిషనరేట్ పరిధిలోని ఓ ఏసీపీని దర్యాప్తు అధికారిగా నియమించారు.ఇక్కడే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాయికృష్ణ హత్య జరిగిందని పోలీసులు భావిస్తున్నట్టయితే దానికి సీఐ ఒక్కడే బాధ్యుడవుతాడా? కిందివారికిగానీ, పైస్థాయి వారికిగానీ ఎవ రికీ తెలియకుండానే నాగరాజు హత్య చేసి శవాన్ని మాయం చేశాడా? సాయికృష్ణను అరెస్టు చేసి తీసుకొచ్చిన టాస్క్‌ఫోర్స్ విజయవాడ కమిషనర్ పరిధిలో పనిచేస్తున్నది. కృష్ణలంక సీఐ నాగరాజు కూడా ఆయన పరిధిలోనే పని చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లలో రోజువారీ రొటీన్ ప్రకారం డైలీ సిచువేషన్ రిపోర్టు (డీఎస్ఆర్)ను కమిషనర్ కార్యాలయానికి (గ్రామీణ జిల్లాల్లో అయితే ఎస్పీ ఆఫీసుకు) స్టేషన్ హౌస్ ఆఫీసర్ పంపిస్తారు.అందులో ఆరోజు అరెస్టు చేసి తీసుకొచ్చిన వివరాలు కూడా ఉంటాయి. పైగా రోజుకు రెండుసార్లు కమిషనర్‌తో స్టేషన్ అధి కారులకు టెలీకాన్ఫరెన్స్ కూడా ఉంటుంది. ఇందులో కమిషన ర్తో పాటు డీసీపీలు, ఏసీపీలు, సీఐలందరూ పాల్గొంటారు. ఆరోజు ఇరిగిన వ్యవహారాలన్నీ అందులో చర్చకు వస్తాయి. ఇటువంటి పకడ్బందీ ఏర్పాట్లు ఉన్నప్పుడు పైస్థాయి అధికారులకు సాయికృష్ణ లాకప్ వ్యవహారం తెలియకుండా ఎలా ఉంటుంది? అతను లాకప్‌లో చనిపోతే ఆ విషయం కూడా పైస్థాయి అధికారులకు ఎలా తెలియకుండాపోతుంది? ఓ దళిత యువకుడు క్రాంతికుమార్ కూడా మే 21న ఆత్మహత్య చేసు కున్నారు. ‘సీఐ నాగరాజు వేధింపులను తట్టుకోలేకపోతున్నాను. మళ్లీ పోలీస్ స్టేషన్‌కు రమ్మని పిలుస్తున్నారు. మాదిగ కులంలో పుట్టడమే నేను చేసిన పాపమా’ అని ప్రశ్నిస్తూ లైవ్‌లో ఆత్మ హత్య చేసుకున్న వీడియో ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నది. సాయికృష్ణ మృతి, క్రాంతి కుమార్ ఆత్మహత్య దాదాపు ఒక వారం రోజుల వ్యవధిలోనే జరిగి ఉంటాయి. పైస్థాయి తోడ్పా టుపై ఎంత భరోసా లేకపోతే ఆ సీఐ ఇంత విచ్చలవిడిగా వ్యవ హరిస్తాడు? ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో పోలీసు శాఖ పరిధిలోనే విచారణ జరిపితే న్యాయం జరిగే అవకాశం లేదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.నగర పోలీస్ కమిషనర్‌కు సీఐ నాగరాజు వ్యవహారం తెలిసే ఉంటుందనీ, లేకపోతే శవాన్ని మాయం చేయడంగానీ, ఇంతకాలం విషయాన్ని దాచిపెట్టడంగానీ సాధ్యం కాదనేది సహజంగా ఎవరికైనా కలిగే అభిప్రాయం. ఈ నేపథ్యంలో సాయికృష్ణ ఉదంతంపై, నాగరాజు నిర్వాకాలపై సీబీఐ విచారణ జరిగితేనే న్యాయం జరిగే అవకాశముంటుంది. లేకపోతే శవం దొరకలేదు కాబట్టి, లాకప్‌లో చంపారనేందుకు ఎవరూ సాక్ష్యం చెప్పలేదు కాబట్టి కేసును హుష్‌కాకి చేయరని చెప్పలేము. సాయికృష్ణ, క్రాంతికుమార్ ఉదంతాలే కాదు, తెనాలిలో తిరుపతమ్మ అనే మహిళ తాను చేయని నేరాన్ని ఒప్పుకోవాలని పోలీసులు వేధించడం వల్ల గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నది. మే 25న ఈ ఘటన జరిగింది. జూన్ 16న విజయనగరం జిల్లాలో కూడా మరో మహిళ అదే కారణాలతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నది.చేయని నేరాలని అంగీకరించాలని బలహీన వర్గాలను వేధించడం యథేచ్ఛగా జరిగిపోతున్నది. పొలిటికల్ గవర్నెన్స్ కారణంగా ఈ ధోరణి మరింత పెచ్చరిల్లిపోతున్నది. పవర్ చేతిలో ఉన్నప్పుడు బాధిత కుటుంబాల సభ్యులను నయానో భయానో లొంగదీసుకోవడం అధికారులకూ, నేతలకూ పెద్ద కష్టం కాకపోవచ్చు. తమకు న్యాయం జరిగిందని బాధితుల నోటితో చెప్పించినా ఆశ్చర్యపడిపోవలసిన అవసరం లేదు. కానీ రాజ్యాంగ విలువల్ని ధ్వంసం చేసే ఈ దుర్మార్గాన్ని అంతం చేయాలంటే ప్రతి లాకప్ డెత్ కథను, ప్రతి పోలీసు వేధింపు ఉదంతాన్ని జై భీమ్ కథ లాగా ముగించవలసిన అవసర మున్నది. రాజ్య వ్యవస్థను బాధ్యురాలిగా నిలబెట్టవలసిన అవసరం పౌర సమాజం మీద ఉన్నది. అప్పుడే రాజ్యాంగబద్ధ పరిపాలన సాధ్యమవుతుంది. అందుకు తొలిమెట్టుగా విజయ వాడ ఘటనలపై సీబీఐ దర్యాప్తు జరిగేలా ఉద్యమించాలి. జై భీమ్, జై సంవిధాన్!!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఫీజు కడితేనే సర్టిఫికెట్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్యా వ్యవస్థను చంద్రబాబు సర్కార్ దివాలా తీయిస్తోంది. పేదింటి విద్యార్థులకు ఉచిత విద్యను దూరం చేస్తూ పైశాచిక పాలన సాగిస్తోంది. రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కొండలా పేరుకుపోయినా, చీమకుట్టినట్టుగా కూడా లేకుండా దగాకోరుతనం ప్రవర్తిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థుల మెడపై కత్తి పెట్టి ఫీజులు వసూలు చేస్తుంటే కళ్లప్పగించి చోద్యం చూస్తోంది. ఫీజు బకాయిలు చెల్లిస్తే తప్ప, సర్టిఫికెట్లు ఇచ్చేది లేదని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు తెగేసి చెబుతున్నాయి. మరోవైపు ప్రభుత్వ సంస్థలుగా సేవలందిస్తున్న విశ్వవిద్యాలయాలు సైతం మరో అడుగు ముందుకేసి ఫీజు బకాయిలకు సంబంధించి వంద రూపాయల బాండ్ పేపర్లపై బలవంతంగా సంతకాలు తీసుకోవడం విస్తుగొలుపుతోంది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాబూలి వ్యాపారి కంటే ఘోరంగా ఏపీలోని విద్యా సంస్థలు పేదింటి విద్యార్థులను ఫీజుల కోసం పీడిస్తుండటం దిగజారిన విద్యా దుస్థితికి అద్దం పడుతోంది. వాస్తవానికి పాత బకాయిలతో పాటు 2026–27 విద్యా సంవత్సరంలో చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, హాస్టల్ మెయింటెనెన్స్ చార్జీల కింద రూ.10,300 కోట్లు ఖర్చు చేయాలి. కానీ, బడ్జెట్లో మాత్రం రూ.2,766 కోట్లు మాత్రమే చూపించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేసింది. ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పటిదాక ఇచ్చింది రూ.2,800 కోట్లు మాత్రమే. ఫలితంగా ఇంకా రూ.6,400 కోట్లు బకాయి ఉంది. దీనిని గమనించిన విద్యా, ఆరి్థక వేత్తలు నెమ్మదిగా ఏపీలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ సంపూర్ణంగా ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోందని విమర్శిస్తున్నారు. ఫీజులు విద్యార్థులే కట్టాలంటూ వంద రూపాయల స్టాంప్ పేపర్‌పై సంతకాలు తీసుకున్న ఆర్జీయూకేటీ రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు కట్టాల్సిందే 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించింది. అంతకు ముందు మహానేత వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో పేదింటి విద్యార్థుల భవిష్యత్తుకు జీవం పోశారు. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చాక ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని గాలికి వదిలేసింది. ఫలితంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు సైతం ప్రభుత్వంపై నమ్మకం లేదని, అసలు ఫీజు డబ్బులు విడుదల చేసే పరిస్థితి లేదని అభిప్రాయానికి వచ్చాయి. దీంతో విద్యార్థుల నుంచి బలవంతంగా ఫీజు వసూళ్లకు పాల్పడుతున్నాయి. ముఖ్యంగా మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో ఫీజుల పీడింపులు, వేధింపులు పెచ్చుమీరాయి. ఈనెల 27న స్నాతకోత్సవం అని ప్రకటించిన వర్సిటీ యాజమాన్యం.. ఇంజనీరింగ్ పట్టా పొందాలంటే ఫీజు బకాయిలు మొత్తం ఒకేసారి కట్టాలని షరతు విధించడం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. 2024, 2025లో కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు డిగ్రీ ప్రదానం చేయాలంటే రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు పెండింగ్ ఫీజులను కట్టాల్సిందేనని హుకుం జారీ చేసింది. లేదంటే ఫీజు బకాయి ఉన్నట్లు వంద రూపాయిల బాండ్ పేపర్లపై బలవంతంగా సంతకాలు తీసుకుంటోంది. ఈ వ్యవహారం భారీగా దుమారం రేపుతోంది. ఇలా నాలుగు బ్యాచుల్లో 16 వేల మందికిపైగా విద్యార్థుల జీవితాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు ఉద్యోగాలు, ఉన్నత చదువుల కోసం సర్టిఫికెట్లు అవసరమైతే అప్పులు చేసి రూ.లక్షల్లో ఫీజులు చెల్లించడం ఆర్జీయూకేటీలో పరిపాటిగా మారింది. ఫీజులు విద్యార్థులే కట్టాలంటూ వంద రూపాయల స్టాంప్ పేపర్‌పై సంతకాలు తీసుకున్న ఆర్జీయూకేటీ 97 శాతానికిపైగా పేదింటి విద్యార్థులే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేదింటి విద్యార్థులు ఉన్నత స్థాయి సాంకేతిక విద్యను అందుకోవాలని మహానేత వైఎస్సార్ ఉమ్మడి ఏపీలో ఆర్జీయూకేటీ కింద ట్రిపుల్ ఐటీలను ప్రవేశపెట్టారు. 10వ తరగతి తర్వాత నేరుగా ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్‌ను అభ్యసించేలా ప్రత్యేక వ్యవస్థను తీసుకొచ్చారు. రెండు సంవత్సరాల ప్రీ–యూనివర్సిటీ కోర్సు(పీయూసీ), 4 సంవత్సరాల ఇంజనీరింగ్ డిగ్రీగా బోధన సాగిస్తున్నారు. ఇక్కడ విద్యార్థులకు ప్రభుత్వ ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు రెసిడెన్షియల్ క్యాంపస్‌లలో చదువు నేర్పించేలా మహోన్నత ఆశయంతో ఆర్జీయూకేటీని స్థాపించారు. ఇందులో ఏటా 40 వేలకు పైగా దరఖాస్తులు వస్తే 4040 మందికి సీట్లు లభిస్తాయి. వీరిలో 97 శాతంపైగా ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రతిభావంతులైనా పేదింటి విద్యార్థులే ఉంటారు. ప్రభుత్వ.. ప్రైవేటు తేడా లేదు! విద్యార్థులను ఫీజుల కోసం పీడించే గుణంలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు తేడా ఉన్నట్లు కనిపించట్లేదు. ప్రైవేటు విద్యా సంస్థలు విద్యను వ్యాపార ధోరణిలో చూస్తూ కళాశాలలను నడిపిస్తున్నాయి. అయితే రెండేళ్లుగా ఫీజు బకాయిల దెబ్బకు తీవ్ర అప్పులు, అప్పులకు వడ్డీల భారంతో కుదేలయ్యాయి. కనీసం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక రోజువారీ కళాశాల నిర్వహణకు చేతిలో చిల్లిగవ్వ లేకుండా అప్పులపై నెట్టుకొస్తున్నాయి. గత్యంతరం లేని స్థితిలో విద్యార్థుల నుంచి బలవంతంగా వసూళ్లకు పాల్పడుతున్నాయి. ఇక 19 ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లోనూ ఇదే తీరు కనిపిస్తుండటం విచారకరం. విద్యార్థి చివరి ఏడాది చదువు ముగించుకుని సర్టిఫికెట్లతో బయటకు వెళ్లాలంటే ఫీజు బకాయిలు మొత్తం కట్టాల్సిన దుస్థితి దాపురించింది. ఇక్కడ డిగ్రీ, ఇంజనీరింగ్ నుంచి పీజీ కోర్సులకు వెళ్లే వారికి గడిచిన రెండేళ్లుగా సర్టిఫికెట్లు ఇవ్వక పోవడంతో ఉన్నత విద్యా మండలికి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కౌన్సెలింగ్‌ను సైతం వాయిదా వేసిన పరిస్థితులున్నాయి. మూడో ఏడాది హామీ గాలికే! చంద్రబాబు ప్రభుత్వం 2024 ఎన్నికల్లో ప్రైవేటు కళాశాలల్లో పీజీ చేసే విద్యార్థులకు సైతం ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తామని హామీ ఇచ్చింది. తీరా, అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా మూడోసారి మోసం చేసింది. త్వరలో పీజీ కౌన్సెలింగ్ చేపట్టనుండగా, ప్రైవేటులో ఫీజు రీయింబర్స్మెంట్ అమలుపై మాత్రం నోరు మెదపట్లేదు. ప్రభుత్వ వర్సిటీలను బలోపేతం చేసే దిశగా వాటిల్లో పీజీ విద్యకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు బీరాలు పలికి ప్రైవేటు విద్యా సంస్థల్లోనూ పీజీకి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తీరా చూస్తే.. ప్రైవేటు మాట దేవుడెరుగు.. ప్రభుత్వ వర్సిటీల్లోనే ఫీజులు కట్టకుంటే చదువుకునే పరిస్థితి లేకుండా పోయింది. ప్రభుత్వ వర్సిటీల నిధులు దారి మళ్లింపు!చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని భ్రష్టు పట్టించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో కరోనాను ఎదురించి సమర్థవంతంగా ఐదేళ్లు పథకాన్ని కొనసాగిస్తే.. చంద్రబాబు పాలనలో ఫీజుల పేరుతో విద్యార్థుల గొంతు నులిమేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో అత్యంత పారదర్శకంగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు జమ చేసే విధానానికి స్వస్తి పలికి కళాశాలల ఖాతాల్లో నేరుగా వేస్తామని నమ్మబలికి ప్రైవేటు యాజమాన్యాలను సర్వం ముంచేశారు. పైగా షెడ్యూల్ ప్రకారం ప్రతి త్రైమాసికానికి నిధుల చెల్లింపులను అడ్డుకుని ఏడాదికి రెండుసార్లు చెల్లింపులు చేస్తామని హామీ ఇచ్చి ఎగ్గొట్టారు. ప్రభుత్వ ఖజానాలో నిధులు లేకపోవడంతో ప్రభుత్వ వర్సిటీలు, ఉన్నత విద్యా మండలి నుంచి దాదాపు రూ.1,200 కోట్లు నిధులు దారి మళ్లించి వాటితో ప్రైవేటు యాజమాన్యాలకు అరకొరగా విదిల్చారు. అదే, ప్రభుత్వ వర్సిటీల్లోనూ విద్యార్థులను ఫీజుల కోసం ఒత్తిడి చేస్తుండటం గమనార్హం. మరోవైపు ఉన్నత విద్యా మండలి ఖజానా నుంచి రూ.10 కోట్ల వరకు ప్రభుత్వం వాడేసుకోవడం గమనార్హం. ఇందులో ముఖ్యంగా చిన్నబాబు ఆ్రస్టేలియా పర్యటన సందర్భంగా ఏకంగా రూ.3.60 కోట్లు ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డుకు దారి మళ్లించేశారు. విద్యకు అరకొర బడ్జెట్..ఉన్నత విద్యను నిర్వీర్యం చేస్తూ చంద్రబాబు సర్కార్ అరకొర బడ్జెట్‌తో ఆరి్థకంగా ముంచేస్తోంది. ప్రతి విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.2,800 కోట్లు, హాస్టల్ మెయింటెనెన్స్ ఖర్చులు కింద రూ.1,100 కోట్లు కలిపి రూ.3,900 కోట్లు వెచ్చించాలి. కానీ, 2025–26 బడ్జెట్లో కేవలం రూ.2,600 కోట్లు, 2026–27లో రూ.2,766 కోట్లు మాత్రమే కేటాయింపులు చూపించింది. ఈ ఏడాది భారీగా పేరుకుపోయిన బకాయిలను తీర్చడానికి బడ్జెట్ కేటాయింపులను పెంచాల్సి ఉండగా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. మరోవైపు వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో జగనన్న విద్యా దీవెన కింద రూ.12,609.68 కోట్లు క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికానికి చెల్లించడంతో పాటు పాత చంద్రబాబు ప్రభుత్వంలోని రూ.1,778 కోట్లు బకాయిలను తీర్చింది. జగనన్న వసతి దీవెన కింద రూ.4,275.76 కోట్లు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో వేసింది. ఇలా మొత్తం ఐదేళ్లలో ఉచిత ఉన్నత విద్యపై రూ.18,663.44 కోట్లు ఖర్చు చేసింది. కానీ, ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిన ఫీజు బకాయిల చెల్లింపులను సైతం చంద్రబాబు సర్కార్ విడుదల చేయడంలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటం గమనార్హం. -
హలో ఇండియా.. ఆంధ్రప్రదేశ్‌లో భీతావహ పాలన
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో చట్టబద్ధ పాలన స్థానంలో భీతావహ పాలన నడుస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఇప్పుడు తాము అత్యంత భయపడేది పోలీసులకేనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ రెడ్‌బుక్ పాలన సృష్టిస్తున్న భీతావహ ఘటనలను దేశం దృష్టికి తీసుకొస్తూ శనివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు.గాదె సాయికృష్ణ లాకప్‌లో అదృశ్యం, కనుమరుగు, రహస్యంగా దహనం.. పోలీసుల వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ బలవన్మరణానికి పాల్పడిన క్రాంతికుమార్ సెల్ఫీ వీడియో, శ్రీకాకుళం జిల్లాలో పోలీసుల వేధింపుల వల్ల ప్రాణాలు తీసుకున్న కళావతి, కర్నూలు జిల్లాలో విచారణ పేరుతో పోలీసుల చిత్రహింసల కారణంగా దళిత మహిళ గంగమ్మ మరణించిందనే ఆరోపణలు, ఆమె మృతదేహాన్ని రహస్యంగా ఖననం చేశారని కుటుంబ సభ్యులు చెబుతూ న్యాయ విచారణ కోరడాన్ని ఆ పోస్టులో వైఎస్ జగన్ ప్రస్తావించారు. ‘ఏపీలో పోలీసులు భారత రాజ్యాంగం ప్రకారమా పని చేస్తున్నారా? లేక చంద్రబాబు రెడ్‌బుక్ ప్రకారం పని చేస్తున్నారా?’ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని దేశం దృష్టికి తీసుకొస్తూ వైఎస్ జగన్ చేసిన పోస్టు సంచలం సృష్టిస్తోంది. వైఎస్ జగన్ ఏమని పోస్టు చేశారంటే.. హలో ఇండియా! చట్టబద్ధ పాలన స్థానంలో భీతావహ పాలన నడుస్తోందిఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఇప్పుడు అత్యంత భయపడేది పోలీసులకేనా? గాదె సాయికృష్ణ లాకప్ డెత్ (కస్టోడియల్ డెత్), అతని మృతదేహాన్ని పోలీసులు రహస్యంగా దహనం చేశారన్న ఆరోపణలు.. పోలీసుల వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ బలవన్మరణానికి పాల్పడిన క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియో.. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న ఇలాంటి ఘటనలు కేవలం విషాద ఘటనలు మాత్రమే కావు. ఇవన్నీ చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రెడ్‌బుక్ పాలన’ పెంచి పోషిస్తున్న ప్రమాదకర సంస్కృతికి ఫలితాలు. ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు భారత రాజ్యాంగం ప్రకారం పని చేస్తున్నారా? లేక చంద్రబాబు రెడ్‌బుక్ ప్రకారం పని చేస్తున్నారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. న్యాయం స్థానంలో భయం, చట్టపాలన స్థానంలో అధికార దుర్వినియోగం పోలీసు వ్యవస్థకు నిర్వచనంగా మారుతోంది.ఇంత భయంకరమైన పరిస్థితి ఎప్పుడైనా చూశామా?రెడ్‌బుక్ రాజ్యాంగం ప్రకారం పాలిస్తామని ప్రకటించిన నాడే వైఎస్సార్సీపీ ఒక హెచ్చరిక చేసింది. రాజకీయ కక్ష సాధింపుల కోసం పోలీసు వ్యవస్థను ఉపయోగిస్తే.. పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారని, వ్యవస్థలు కలుషితమవుతాయని.. రాజ్యాంగ పరిరక్షణ, చట్టాలు, నిబంధనలను మీరి, వాటికి అతీతంగా వ్యవహరించే పరిస్థితి వస్తుందని వైఎస్సార్సీపీ హెచ్చరించింది. ఆ హెచ్చరిక ఈ రోజు చేదు నిజంగా మారింది. రెడ్‌బుక్ రాజ్యాంగ పాలనలో మొదట రాజకీయ ప్రత్యర్థులు లక్ష్యంగా మారారు.తర్వాత సోషల్ మీడియా కార్యకర్తలు.. ఆ తర్వాత జర్నలిస్టులు, మేధావులు లక్ష్యంగా మారారు. రాజకీయ వేధింపులతో ప్రారంభమైన ఈ ధోరణి.. ఇప్పుడు అదుపు తప్పిన పోలీసింగ్‌గా మారింది. దీనివల్ల సాధారణ ప్రజలు కూడా పోలీసుల వేధింపులకు, బెదిరింపులకు, అధికార దుర్వినియోగానికి బాధితులుగా మారుతున్నారు. సాయికృష్ణ ఘటన ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేసింది. తన కుమారుడి ఆచూకీ కోసం, కనీసం అతని అస్థికలైనా తనకు అప్పగించాలని ఒక తల్లి ఈ రోజు అధికారులను వేడుకుంటోంది. రాష్ట్ర చరిత్రలో ఇంత భయంకరమైన పరిస్థితి ఎప్పుడైనా చూశామా? క్రాంతికుమార్ ఘటన కూడా అంతే ఆందోళనకరం. ఆత్మహత్యకు పాల్పడే ముందు అతను పోలీసులు వేధిస్తున్నారని బహిరంగంగా ఆరోపిస్తూ, సంబంధిత అధికారుల పేర్లు కూడా ప్రస్తావించాడు.తునిలో తిరుపతమ్మ పోలీసుల వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసిన అనంతరం ఆత్మహత్య చేసుకుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కళావతి పోలీసుల వేధింపుల కారణంగా ప్రాణాలు తీసుకుంది. కర్నూలు జిల్లాలో దళిత మహిళ గంగమ్మ విచారణ పేరుతో జరిగిన పోలీసు చిత్రహింసల కారణంగా మరణించిందని ఆరోపణలు వచ్చాయి. ఆమె మృతదేహాన్ని రహస్యంగా ఖననం చేశారని కుటుంబ సభ్యులు చెబుతూ న్యాయ విచారణ కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నప్పుడు అవి యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కావు.. వ్యవస్థలో లోతుగా పాతుకుపోయిన ఒక ప్రమాదకర ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి.సీఎం, హోం మంత్రి, డీజీపీ వైఖరే కారణంఅదే సమయంలో పోలీసుల దాష్టీకాలు సాధారణం అయిపోయాయి. కోడి కోశారన్న, మేక కోశారన్న చిన్న చిన్న ఆరోపణలకే ప్రతిపక్ష కార్యకర్తలను వీధుల్లో ఊరేగించి అవమానిస్తున్నారు. మోరల్ పోలీసింగ్ పేరుతో కొందరు అధికారులు కోర్టులు, న్యాయమూర్తులు, జడ్జిలు పాత్రలన్నీ తామే పోషిస్తున్నారు. మరోవైపు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదులు చేస్తే వాటిని పట్టించుకోవడం లేదు. కేసులు నమోదు చేయడం లేదు. ఈ బరితెగించిన ద్వంద్వ వైఖరి, పోలీసు శాఖపై ప్రజల విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బ తీసింది.ఈ పరిస్థితికి రాష్ట్ర డీజీపీ, హోంమంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన కారణం. దిగజారిన ఈ పరిస్థితుల వల్ల ఉత్పన్నమవుతున్న పర్యవసానాల బాధ్యతల నుంచి వారు తప్పించుకోలేరు. ఆంధ్రప్రదేశ్‌కు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రకారం పాలన కావాలి గానీ.. రెడ్‌బుక్ పాలన కాదు. పోలీసులు ఉన్నది ప్రజల హక్కులను పరిరక్షించడానికి, చట్టాన్ని అమలు చేయడానికి, న్యాయం అందించడానికే గానీ రాజకీయ కక్ష సాధించే పనిముట్లుగా మారడానికి కాదు. న్యాయం కనుమరుగై భయం రాజ్యమేలితే.. చట్టం స్థానంలో అధికార దుర్వినియోగం నడిస్తే.. చివరకు ప్రజాస్వామ్యమే బలవుతుంది’ అని పేర్కొన్నారు. -
మాట్లాడితే లోపల వేసి చంపేస్తాం..! గ్యాంగ్ కు గ్యాంగ్ స్టర్..
-
సాయి కృష్ణ తల్లి చంద్రబాబును కలవడంపై.. రాజేశ్వర్ రెడ్డి షాకింగ్ నిజాలు.
-
CBI ఎంక్వైరీకి రెడీనా హోమ్ మినిస్టర్ గారు
-
సీబీఐ దర్యాప్తు జరగాలి
సాక్షి, అమరావతి: విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్‌డెత్‌కు గురైన గిగ్ వర్కర్ సాయికృష్ణ కేసులో సీబీఐ దర్యాప్తు జరగాలని, అందుకు బాధ్యులైన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కేసులో విజయవాడ కమిషనర్‌తో పాటు, రాష్ట్ర డీజీపీకి కూడా ప్రమేయం ఉందన్నారు. కేవలం కంటి తుడుపుగా సీఐని సస్పెండ్ చేశారని, విజయవాడ సీపీ, డీజీపీతో సహా బాధ్యులందరిపై మర్డర్ కేసు పెట్టి శిక్షించాలని తేల్చి చెప్పారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్‌డెత్‌కు గురైన గాదె సాయికృష్ణ తల్లి, కుటుంబ సభ్యులను గురువారం ఆయన పరామర్శించారు. కృష్ణలంకలో ఉంటున్న వారి ఇంటికి వెళ్లి జరిగిన దారుణం గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన అక్కడే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే..గాదె సాయికృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రతి ఒక్కరూ ఆలోచించాలివిజయవాడ నడిబొడ్డున, అంటే రాష్ట్రానికి రాజధాని ప్రాంతం. ఇక్కడి నుంచి కూతవేటు దూరంలోనే ముఖ్యమంత్రి నివాసం. ఇక్కడి నుంచి కూతవేటు దూరంలోనే డీజీపీ కార్యాలయం. విజయవాడలోనే కమిషనరేట్ కూడా ఉంది. ఇక్కడే ఏసీపీ పరిధి. ఇదే పరిధిలోనే కృష్ణలంక పోలీసు స్టేషన్ ఉంది. ఇదే పోలీసు స్టేషన్ పరిధిలోనే ఈ తల్లి (జగన్ పక్కనే ఉన్న సాయికృష్ణ తల్లి) ఎంత దారుణంగా ఈ ఘటన జరిగిందో చెబుతూ రోదిస్తున్న దృశ్యం కనిపిస్తోంది. ప్రతి ఒక్కరినీ ఒకటే ఆలోచన చేయమని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు దగ్గరుండి ప్రోత్సహిస్తున్న కొంత మంది పోలీసులు, వీరు చేసే పనుల వల్ల ఈ రాష్ట్రంలో ఏదైనా అన్యాయం జరిగితే పోలీసు స్టేషన్‌కు వెళ్లడానికి భయపడే పరిస్ధితి నెలకొంది. అలా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతోంది. అందరూ కూడబలుక్కుని ఒకరినొకరు ఎలా వెనకేసుకు వస్తున్నారో చెప్పడానికి ఇదే నిదర్శనం. ‘పోలీసులు చెబుతున్నట్లు నా కొడుకు దోపిడీలు, దొంగతనాలు చేసి కోట్లు గడిస్తే, ఒక గిగ్ వర్కర్‌గా ఎందుకు పని చేస్తాడు బాబూ..’ అని ఆ తల్లి తన గోడు వెళ్లబోసుకుంది. ఆ కుటుంబం పరిస్థితి అంత దారుణంగా ఉంది.‘నీ కొడుకు ఫొటోకు దండ వేసుకో’ అన్న పోలీసులు ఆ రోజు (మే 9) నుంచే సాయికృష్ణ తల్లి పోలీసుస్టేషన్ చుట్టూ తిరిగితే, ‘నీ కొడుకు ఫొటోకు దండ వేసుకో..’ అంటూ ఈ తల్లిని సీఐ హేళనగా మాట్లాడారు. ఆ రోజు నుంచి ప్రతి రోజూ ఆ స్టేషన్లో జరుగుతున్న విషయాల మీద మిగతా వాళ్లు సమాచారం ఇస్తుంటే, తన కుమారుడిని పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారని ఆ తల్లికి అర్థమైంది. దీంతో ప్రతి రోజూ అదే పోలీసు స్టేషన్‌కు వెళ్లి నా కొడుకును నాకు చూపించమని బాధ పడిన పరిస్థితులు మన కళ్లెదుటే కనిపిస్తున్నాయి. ఈ ఘటన మీద ఈ తల్లితో పాటు చిన్నమ్మ అయిన లాయర్ డీజీపీ ఆఫీసుకు వెళ్లి రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఏమైంది? చివరికి చెత్త బుట్టలోకి వెళ్లింది. డీజీపీ ఫిర్యాదును సీపీకి పంపించడం, సీపీ యాక్షన్ తీసుకోకుండా మిగతా వాళ్లను పిలిపించి బేరం పెట్టించే కార్యక్రమం చేశారు.హైకోర్టును ఆశ్రయించాక ఒప్పుకున్నారుతన కుమారుడికి ఏదో జరిగిందని ఆ తల్లికి అర్థమై.. తన కొడుకు కనిపించడం లేదు, వీళ్లు ఏదో చేశారని జూన్ 2న హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది. అప్పుడు కోర్టు జోక్యం చేసుకోవడంతో పాటు, మన లాంటి వాళ్లంతా ఆ తల్లికి అండగా నిలబడితే గత్యంతరం లేక ఈ రోజు సీఐపై చర్యలు తీసుకున్నారు. చంపేశాడనే కదా సీఐని సస్పెండ్ చేసింది! అంటే ఒకే పోలీసు స్టేషన్లోనే, ఆ సీఐని కాపాడుతూ ఏసీపీ, ఏసీపీని కాపాడుతూ కమిషనర్, కమిషనర్‌ను కాపాడుతూ డీజీపీ.. ఇలా అందరికీ తెలిసి ఆ స్టేషన్లో జరిగింది ఒక హత్య మాత్రమే కాదు. పోలీసు స్టేషన్లలో ఇలా కొడుతూ ఒకరి చావుకు కారణమైతే, ఇంకొకరు ఆత్మహత్య చేసుకుంటూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. నేను ఒకటే చెబుతున్నా. సస్పెన్షన్ అంటే ఏంటి? టెంపరరీగా ఒక పోలీసు అధికారిని డ్యూటీ నుంచి తప్పించడం. అంటే.. గోళ్లు పీకి, చిత్ర హింసలు చేసి హత్య చేస్తే ఆ వ్యక్తిని తాత్కాలికంగా విధుల నుంచి తప్పించారు. ఇదా చేయాల్సింది? అది కూడా ఇంత పెద్ద ఇష్యూ జరిగి బయటికి వస్తే ఆ సస్పెన్షన్ చేశారు. ఇది బయటికి రాకపోయుంటే ఆ ఆలోచన కూడా వచ్చేది కాదు.కృష్ణలంకలో జనానికి అభివాదం చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి తప్పు చేస్తే కోర్టు శిక్షిస్తుంది కదా..ఇంత పెద్ద హేయమైన కార్యక్రమం జరిగిందంటే..ఆ సీఐని, బాధ్యుడైన కమిషనర్‌ను, డీజీపీని మర్డర్ కేసు పెట్టి ఛార్జ్ చేయాల్సింది పోయి కేవలం సీఐని సస్పెన్షన్ మాత్రమే చేశారు. అంటే అందరూ పకడ్బందీగా, కలిసికట్టుగా నేరం చేసి.. తూతూ మంత్రంగా, కంటితుడుపు చర్యగా, టెంపరరీగా ఓ అధికారిని తప్పించారు. ఇదా మనం ఈ రాష్ట్రంలో చూడాల్సింది? ఆ పిల్లాడి వయసు 23 ఏళ్లు. అంటే వీళ్లంతా చిన్న పిల్లలే. తెలిసో తెలియకో తప్పు చేసి ఉండొచ్చు. కోర్టు ఈ పిల్లాడిని ప్రొడ్యూస్ చేయమని సమన్ జారీ చేసింది. పోలీసులు చేయాల్సింది ఏంటి? ఆ పిల్లాడిని కోర్టుకు సబ్మిట్ చేయాలి. ఆ పిల్లాడు తప్పు చేశాడా, లేదా అన్నది విచారణ చేసి కోర్టు నిర్ధారిస్తుంది. ఆ తర్వాత తప్పు జరిగిందని తేలితే కోర్టు శిక్ష వేస్తుంది. కానీ ఇక్కడ కోర్టు పాత్ర లేదు. వీళ్లే తమ చేతుల్లోకి తీసుకుని ఏకంగా ఇద్దరు పిల్లలు ఒకే నెలలో చనిపోవడానికి కారణమయ్యారు.సీఐ మాత్రమే బాధ్యుడు కాదుసీఐ, ఏసీపీ, కమిషనర్ దగ్గరి నుంచి డీజీపీ దాకా ఇలాంటి వ్యక్తులకు ముఖ్యమంత్రి దగ్గరుండి కంటి తుడుపు చర్యలు చేపట్టి, కేవలం సస్పెన్షన్‌తో సరిపెడితే వీటికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది? ఫుల్ స్టాప్ పడాలంటే దీని మీద సీబీఐ దర్యాప్తు జరగాలి. ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనేది బయటికి రావాలి. ఆ పోలీసుల మీద యాక్షన్ తీసుకోవడంలో ఎందుకు డిలే జరిగింది? సస్పెన్షన్ మాత్రమే చేసి టెంపరరీగా సీఐని ఉద్యోగం నుంచి పక్కన బెట్టారంటే ఇదంతా ఒక పద్ధతి ప్రకారం చేసినట్లు స్పష్టమవుతోంది. ఈ క్రైమ్‌లో సీఐ ఒక్కడే కాదు.. ఏసీపీ, సీపీ, డీజీపీ ఇన్వాల్స్ అయి ఉన్నారు. అందుకే సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్నాం. న్యాయ పోరాటంలో ఈ తల్లికి, చనిపోయిన మరో పిల్లాడి కుటుంబానికి వైఎస్సాసీపీ సంపూర్ణంగా అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం.మే నెలలోనే రెండు ఘటనలుమే నెలలో సాయికృష్ణది ఓ ఘటన అయితే, క్రాంతికుమార్ అనే మరో యువకుడిది ఆత్మహత్య ఘటన. పలానా పోలీసు స్టేషన్ పరిధిలో పలానా సీఐ రోజూ నన్ను కొడుతున్నాడు.. నేను తట్టుకోలేకపోతున్నాను.. నా చావుకు కారణం ఆ సీఐ.. అని మరణ వాంగ్మూలం ఇస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు. (కృష్ణలంక సీఐ వేధిస్తున్నాడని, తన చావుకు సీఐ కారణమని మరణ వాంగ్మూలం ఇస్తూ క్రాంతికుమార్ విడుదల చేసిన సెల్ఫీ వీడియోను మీడియా ఎదుట జగన్ ప్రదర్శించారు).సీబీఐ దర్యాప్తు జరగాల్సిందేమే 9వ తేదీ నుంచి రెండు మర్డర్ ఘటనలు జరిగితే ఇప్పుడు జూన్‌లో బయటికి వచ్చిన తర్వాత కంటి తుడుపు చర్యగా అరెస్టులు కూడా చేయకుండా సస్పెన్షన్లు చేస్తున్నారు. ఏ విధంగా వీళ్లంతా నేరాన్ని బయటికి రాకుండా చేస్తున్నారో అర్థం అవుతోంది. ఈ తల్లి దగ్గరకు పంచాయతీలు చేసి, సర్దుబాట్లు చేసుకునేందుకు బేరసారాలు చేస్తూ.. తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన ఇన్ఛార్జ్లు వచ్చి మాట్లాడుతున్నారంటే రాష్ట్రంలో ఎలాంటి దారుణమైన పరిస్ధితులు ఉన్నాయో గమనించాలి. కమిషనర్, డీజీపీ వంటి వంటి వ్యక్తులు పూర్తిగా ఇన్వాల్స్ అయ్యి.. నేరం చేయించారని కనిపిస్తున్నా, ఓ ఎస్పీ స్థాయి అధికారికి వీళ్లు దర్యాప్తు చేయడానికి బాధ్యత అప్పగించారట! అంటే వీళ్లు లా అండ్ ఆర్డర్‌తో, ప్రజల ప్రాణాలతో ఏ విధంగా చెలగాటం ఆడుతున్నారనే దానికి ఇది ఇంకొక నిదర్శనం. అందుకే సీఐ మొదలు ఏసీపీ, కమిషనర్, డీజీపీ, హోంమంత్రి, ముఖ్యమంత్రి వరకూ అందరూ నిర్లక్ష్యపు వైఖరితో ఉన్నారు కాబట్టి సీబీఐ దర్యాప్తు జరగాల్సిందే. దోషులు ఎవరో తెలిసి కూడా ఎలా కాపాడుతున్నారు.. ఎందుకు ఇలాంటి లాకప్ డెత్‌లు జరుగుతున్నాయో తెలియాలంటే సీబీఐ విచారించాల్సిందే అని డిమాండ్ చేస్తున్నాం’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. -
ఏపీలో చాలా దారుణమైన పరిస్థితులు: వైఎస్ జగన్
తాడేపల్లి: రాష్ట్రంలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. రంపచోడవరం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో గురువారం వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ... ఇప్పటికే రెండేళ్లు అయిపోయిందని, చంద్రబాబు విధ్వంసకర పాలనపై ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతోందని తెలిపారు. ‘‘వైఎస్ జగన్ పాలనతో ప్రజలు పోల్చిచూస్తూ చర్చించుకుంటున్నారు. ఐదేళ్ల పాలనలో ఎప్పుడూ లేని విధంగా మంచి పాలన ఇవ్వగలిగామని గర్వంగా చెప్పగలం.మేనిఫెస్టోకు విలువలేని రోజులను చూశాం. ఎన్నికలు అయిన తర్వాత చెత్తబుట్టలో పడేసేవాళ్లు. అలాంటి మేనిఫోస్టోకు విలువను తీసుకు వచ్చాం. 99శాతం హామీలను అమలు చేసిన ఏకైక పార్టీ వైఎస్సార్సీపీనే. క్యాలెండర్ పెట్టుకుని మరీ మనం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. పరిపాలనలో అనేక మార్పులు తీసుకువచ్చాం’’ అని చెప్పారు. మనం రాకముందు ఎలా ఉండేవి? గత వైఎస్సార్సీపీ పాలనను వైఎస్ జగన్ గుర్తుచేశారు. ‘‘మనం రాకముందు స్కూళ్లు, ఆసుపత్రులు ఎలా ఉండేవి? మన పరిపాలనలో ఎలా మార్పులు చేశామో ప్రజలు చూశారు. రైతులను ఎలా ఆదుకున్నామో కూడా మీరు చూశారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు, పథకాలు అందలేని పరిస్థితిని మనం చూశాం. ఏ పనికావాలన్నా లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితులు చూశాం. వాటన్నింటినీకూడా మనం మార్చాం. విద్య, వ్యవసాయం, వైద్య రంగాల్లో గొప్ప గొప్ప మార్పులు తీసుకు వచ్చాం. గిరిజన ప్రాంతాల్లో గొప్ప అభివృద్ధి చేశాం. 3 లక్షలకు పైగా ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు గిరిజన కుటుంబాలకు ఇచ్చాం. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తెస్తే పాడేరులో, పార్వతీపురంలో, ఏజెన్సీ ప్రాంతానికి ముఖద్వారమైన నర్సీపట్నంలో మూడు తెచ్చాం. కురుపాలంలో ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీ, సాలూరులో ట్రైబల్ యూనివర్శిటీ తెచ్చాం. ఇది కేవలం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది. ఐటీడీఏ పరిధుల్లో 5 మల్టీస్పెషాల్టీఆస్పత్రులు తెచ్చాం. మన ప్రభుత్వంలో వేగంగా పనులు జరిగాయి. ఒక తపన, తాపత్రయంతో ఈ పనులు చేశాం. ప్రజల జీవితాల్లో మార్పులు రావాలని చూశాం. నా మరణం తర్వాత కూడా ప్రతి ఇంట్లో నా ఫొటో ఉండాలని పనిచేశాం. ఈ రెండేళ్ల పాలనలో చంద్రబాబు పాలనలో అన్నీ విధ్వంసమే. జగన్ ఇచ్చేవేకావు.. జగన్‌కన్నా ఎక్కువ ఇస్తామన్నారు. ప్రతి ఇంటికీ బాండ్లు పంచారు. ఏ కుటుంబానికి ఎంత వస్తుందోనని లెక్కలువేసి మరీ చెప్పారు. ఎన్నికలు అయిన తర్వాత మోసం చేశారు’’ అని చెప్పారు.చంద్రబాబు పాలనకు త్వరలోనే ముగింపుమరో ఏడాదిన్నరలో తన పాదయాత్ర కూడా ప్రారంభమవుతుందని వైఎస్ జగన్ అన్నారు. ‘‘చంద్రబాబు దుర్మార్గమైన పాలనకు త్వరలోనే ముగింపు పడుతుంది. రాష్ట్రంలో అన్యాయమైన పాలన చూస్తున్నాం. ప్రశ్నించే వారిపై దొంగకేసులు పెడుతున్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగం వెర్రితలలు వేస్తోంది. చీకటి కొంతకాలమే ఉంటుంది, వెలుగురాకతప్పదు. ప్రజల తరఫున పార్టీ నాయకులు గట్టిగా నిలబడాలి. బాధితులకు అండగా నిలవాలి. పార్టీ నాయకులు ఈ బాధ్యతను విస్మరించవద్దు. జగన్ 2.Oలో కార్యకర్తలను బాగా చూసుకుంటాను. ప్రతి సంక్షేమ కార్యక్రమం కార్యకర్తల చేతులమీదుగా ప్రజలకు అందుతుంది. పేదవాడికి మీరంతా తోడుగా ఉండాలి. పేదవాడికి మాత్రం తోడుగా ఉండాలనే మిమ్మల్ని కోరుతున్నాను.చంద్రబాబు పాలనలో మొదటి ఏడాది అమ్మ ఒడి ఎగరగొట్టారు. రెండో ఏడాది కొంతమందికి రూ.9వేలు, రూ.10వేలు, రూ.13వేలు చొప్పున ఇచ్చారు. పీఎంకిసాన్ కాక రైతులకు అన్నదాత సుఖీభవ కింద రెండేళ్లలో రూ.4౦ వేలు ఇవ్వాలి. రెండేళ్లకు కలిపి ఇచ్చింది రూ.14వేలు. బాకీ రూ.26 వేలు. ఆరు గ్యాస్ సిలెండర్లు ఇవ్వాలి. రెండు ఇచ్చామంటున్నారు, అదికూడా అందరికీ అందలేదు’’ అని అన్నారు. కాగా, పోలవరం ముంపు ప్రాంతాల్లో పరిహారం చెల్లింపుల్లో వివక్ష కొనసాగుతోందని సమావేశంలో ప్రస్తావించగా, దీనిపై పార్టీ తరపున పోరాడుతామని వైఎస్ జగన్ చెప్పారు. నిర్వాసితులు తమ పార్టీలో చేరితేనే, పరిహారం ఇస్తామని చెబుతున్నారని, ఇది ఏ మాత్రం సరికాదని స్పష్టం చేశారు. వీటన్నింటిపై పోరాటం కొనసాగిస్తామని, అయినా న్యాయం జరగకపోతే, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేద్దామని వివరించారు. -
తాగు.. ఊగు... ఇదే బాబు గారి గ్రేట్ విజన్!
-
రైతులకు ఎప్పుడూ కష్టాలే..అధికారంలో ఉన్న బాబు వేస్ట్
-
రూ.50 లక్షలు ఇప్పిస్తా, రాజీ చేసుకుందామంటూ 'జనసేన' బెదిరింపు
నా బిడ్డ ఉంటే చూపించండి.. లేదంటే బూడిదైనా ఇవ్వండి..! సీఐ నాగరాజు నా కుమారుడిని చంపేస్తా అని హెచ్చరించాడు. ఫొటో చేయించి దండేసుకో అన్నాడు. చివరకు కనిపించకుండా చేశాడు. నా కుమారుడిని కొట్టి పోలీస్‌స్టేషన్ బాత్రూమ్లో పడేశారు. స్టేషన్లో చంపేసి, ఇద్దరు పోలీసులు బైక్‌పై శవాన్ని తీసుకెళ్లి దహనం చేశారు’ అంటూ సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంది.లబ్బీపేట/కృష్ణలంక (విజయవాడ తూర్పు): ‘నా బిడ్డ ఉంటే చూపించండి.. లేదంటే బూడిదైనా ఇవ్వండి..!’ అంటూ విజయవాడ కృష్ణలంకకు చెందిన యువకుడు సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి ఆక్రోశించారు. తమ బిడ్డను తీసుకొచ్చి చంపేస్తే..రూ.50 లక్షలు ఇప్పిస్తా, రాజీ చేసుకుందామంటూ జనసేన తూర్పు ఇన్‌ఛార్జి అమ్మిశెట్టి వాసు బెదిరిస్తున్నారని కంటతడి పెట్టారు. ‘మేం జనసేనకు చెందిన వాళ్లమే.. అన్యాయం జరిగితే ప్రశ్నిస్తానన్న పవన్ ఈ విషయంలో స్పందించాలి..’ అని సాయికృష్ణ చిన మేనమామ ముళ్లపూడి నవరంగ్ కోరారు. బుధవారం విజయవాడలో వారు మీడియాతో మాట్లాడారు. పోలీసులైతే... చంపి తగలబెడతారా? సీఐ నాగరాజు తన కుమారుడిని చంపేస్తా అని హెచ్చరించాడని, ఫొటో చేయించి దండేసుకో అన్నాడని, చివరకు కనిపించకుండా చేశాడంటూ సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంది. ‘నా బిడ్డకోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లా.. అక్కడ కుర్రాళ్లను కొడుతుంటే తట్టుకోలేకపోయా. నా కుమారుడిని చూపించమంటే చూపించలేదు. నా కుమారుడిని కొట్టి బాత్రూమ్లో పడేశారు. ఆ తర్వాత ఎదురుగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలిసింది. పోలీస్ స్టేషన్లో చంపేసి.. ఇద్దరు పోలీసులు బైక్‌పై శవాన్ని తీసుకెళ్లి దహనం చేశారు. పిల్లోడిని చంపి దహనం చేసి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. సీఐకి ఎవడు ఇచ్చాడు అధికారం చంపేయమని? పోలీసులు అయినంత మాత్రాన చంపి తగలబెడతారా? నాకు మద్దతుగా నిలిచిన వారిపై నిందలు వేస్తున్నారు. నా కుమారుడికి రాజకీయాలు అంటగట్టొద్దు. న్యాయం చేయమని కోరుతున్నాం’ అని విజయలక్ష్మి విలపించారు.మాఫియా, గంజాయి డాన్ అయితే రూ.350కి పని చేస్తాడా? పోలీసులు అన్ని కేసులు ఉన్నాయి.. ఇన్ని కేసులు ఉన్నాయని చెబుతున్నారు. మరి అలాంటి వాడిపై పీడీ యాక్ట్ ఎందుకు పెట్టలేదు? ఫోటోల్లో గొడ్డలి పెట్టి ట్రోల్ చేస్తున్నారు. కోర్టు వాయిదాకి వచ్చి కనిపిస్తే కొడతారని భయపడి మార్కాపురం వెళ్లి జొమాటోలో పనిచేస్తూ రోజుకు రూ.350 ఆదాయంతో బతికాడు. అంత పెద్ద మాఫియా డాన్, గంజాయి డాన్ అయితే రూ.350కి పని చేస్తాడా? గంజాయి ఫాల్స్ కేసులు పెట్టారు. ఆ కేసులు ఏవీ నిరూపణ కాలేదు. మా పిల్లోడిని మాకు అప్పగించాలి. చనిపోతే బాడీ అయినా ఇవ్వండి. పోలీసులు అంబేడ్కర్ విగ్రహం వద్దకి వచ్చి కేసులు ఉన్నాయని నిరూపించాలి. – ముళ్లపూడి నాగేశ్వరరావు, సాయికృష్ణ మేనమామరెండు కేసులే ఉన్నాయి: కనకదుర్గ, అడ్వొకేట్ సాయికృష్ణపై రెండు కేసులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. ఆ రెండు కేసుల్లో వాయిదాలకు హాజరు కాలేదని తీసుకొచ్చి కొట్టారు. బందర్ రోడ్డులో కూర్చుంటా. పోలీసులు వచ్చి ఎన్ని కేసులు ఉన్నాయో నిరూపించాలి. సాయికృష్ణకు రాజకీయాలతో సంబంధం లేదు. ప్రశ్నిస్తానన్న పవన్ ఎందుకు మాట్లాడటం లేదు? ప్రశ్నిస్తా అని చెప్పే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? అనేక కేసుల్లో ఆందోళనలు చేశారు. మా అబ్బాయి విషయంలో ఏం చేస్తారు? మేమంతా జనసేనలో ఉంటూ పవన్ కళ్యాణ్, లోకేశ్ కోసం పని చేశాం. పవన్ కళ్యాణ్ స్పందించి న్యాయం చేయాలి. సాయికృష్ణను స్టేషన్‌కు తీసుకొచ్చి చంపేస్తే డీజీపీ అడగరా..? కేసు సెటిల్ చేసుకుందామని, రూ.50 లక్షలు ఇప్పిస్తామని జనసేన నేత అమ్మిశెట్టి వాసు బెదిరించినా మేం ఒప్పుకోలేదు. మేం పోలీసులకు వ్యతిరేకం కాదు.. నాగరాజు చేసిన అన్యాయంపై పోరాటం చేస్తున్నాం. ఈ కేసుతో సంబంధం ఉన్న సీఐతో పాటు అశోక్, బాబూరావు, సుబ్రహ్మణ్యం, మురళీకృష్ణ, మరికొంతమంది స్టేషన్లో ఉన్న వాళ్లను సస్పెండ్ చేయాలి. కేసులు ఉన్నాయని ఇష్టారాజ్యంగా తీసుకొచ్చి కొట్టి చంపేస్తారా? మావాడు రౌడీ అంటున్నారు. మీరు చేసిందేమిటి? మీరు హంతకులు కాదా? సామాన్యులకు న్యాయం జరగదా? అన్యాయం జరిగిందని మాకు అండగా నిలుస్తున్న వారికి పారీ్టలను అంటగడతారా? మాకు పారీ్టలు లేవు.. కులం లేదు. మాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదు. మాకు న్యాయం చేయండి. విజయవాడలో వందల మంది రౌడీ షీటర్లు ఉన్నారు. కానీ మావాడినే తీసుకొచ్చి చంపేశారు. మేం రాజకీయాలు చేసే వాళ్లం కాదు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్, లోకేష్, హోం మంత్రి అనిత స్పందించాలి. మేం పనిచేసిన పార్టీ వాళ్లు మా కోసం ఏమీ చేయలేదు. కానీ ప్రతిపక్ష పార్టీ నాయకులు మాకు అండగా నిలుస్తూ, న్యాయం కోసం పోరాడుతున్నారు. – ముళ్లపూడి నవరంగ్, సాయికృష్ణ మేనమామ -
చీకటి ఎల్లకాలమూ ఉండదు!
అబద్ధాన్ని బిగ్గరగా, పదేపదే చెబితే, అదే నిజమని ప్రజలు నమ్ముతారనే జోసెఫ్ గోబెల్స్ (హిట్లర్ అనుచరుడు) సిద్ధాంతం మీద నమ్మకం ఉన్న వ్యక్తి చంద్రబాబు. ప్రజలకు ఏదీ గుర్తుండదని ఆయన నమ్మకం. అందుకే రెండేళ్లుగా ఆంధ్ర ప్రదేశ్‌కు గ్రహణం పట్టినా, పండు వెన్నెల కురుస్తోంది, సంబరాలు చేసుకోమంటు న్నాడు. కానీ జనం జగన్ పాలనను గుర్తు చేసుకుంటున్నారు. సంక్షేమమే ఆయన అజెండా, విశ్వసనీయత వైసీపీ జెండా. దీనికి నిదర్శనం ఆయన చేసిన అభివృద్ధి. సంఖ్య లెప్పుడూ అబద్ధం చెప్పవు. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా రెండు రెళ్లు నాలుగే. ఆయన హయాంలో నేరుగా నగదు లబ్ధి పొందినవారి సంఖ్య 8,70,06,898. 2 లక్షల 73 వేల 756 కోట్ల రూపాయల నగదు నేరుగా అకౌంట్లలోకి చేరింది. నాన్ డీబీటీ ద్వారా 1,84,604 కోట్ల రూపాయిలు అందింది. మొత్తం ఐదేళ్లలో ప్రజలకు అందిన లబ్ధి 4 లక్షల 58 వేల 360 కోట్లు.అంకెలు చెప్పే నిజాలుమరి చంద్రబాబు సూపర్ బుస్సు హామీల గురించి మాట్లాడు కుందాం. ఎన్నికల ప్రచారంలో బాబు ష్యూరిటీ – భవిష్యత్‌కు గ్యారెంటీ అని బాండ్లు కూడా ఇచ్చారు. జూన్ 2024 నుంచి ప్రారంభం అన్నారు. 2026 కూడా వచ్చింది. ఇచ్చారా? చంద్ర బాబులో ఒక గజిని, అపరిచితుడు ఉంటారు. చంద్రబాబు కంటే గారడీ మనిషి మేలు. కనీసం గాల్లోంచి పావురమైనా తీస్తాడు. అదే బాబు అయితే పావురాన్ని ఊహించుకోమంటారు. బాబు సూపర్ ట్రిక్స్ గురించి చెప్పాలంటే: 1. ఆడబిడ్డ నిధి– ఆడపడుచుల్ని ఆదరించి గౌరవించడం తెలుగువారి సంస్కృతి. ఈ పథకానికి అతీగతీ లేదు. రెండేళ్లకు గానూ, ఆడబిడ్డలు ఒక్కొక్కరికి 36 వేలు బాకీ. 2. నిరుద్యోగ భృతి– నిరుద్యోగులకు నిండా మోసం. ఒక్కొక్క రికీ రూ.72 వేలు బాకీ. 3. యాభై ఏళ్లకే పెన్షన్– బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు ఎన్నేళ్లు ఎదురు చూసినా టెన్షనే.4. తల్లికి వందనం– ఫస్ట్ ఇయర్ మోసం. సెకండ్ ఇయర్ 20 లక్షల మంది కోత. 5. ఉచిత బస్సు– ఐదు సర్వీసులకే పరిమితం. 6. దీపం– ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, సగం పథకం గ్యాసే. 7. అన్నదాత సుఖీభవ – రైతుకు దుఃఖీభవ అయ్యింది. ఇచ్చింది రూ. 14 వేలు. బాకీ రూ. 26 వేలు.రెండేళ్లలో అన్ని రంగాలను నాశనం చేశారు. విద్యా వ్యవస్థను బాగు చేశామని ఆ శాఖ మంత్రి నారా లోకేశ్ చెబుతున్నారు. తండ్రికి తగ్గ తనయుడు. జగన్ హయాంలో ‘నాడు–నేడు’ కింద వేల స్కూళ్లు బాగుపడ్డాయి. పనులు పూర్తయ్యే స్థితిలో ఉన్న 22 వేల స్కూళ్లను గాలికి వదిలేశారు. ‘తల్లికి వందనం’ కింద రూ. 13 వేల కోట్లకు పైగా ఇవ్వాల్సి ఉండగా ఇచ్చింది రూ. 8,389 కోట్లు. విద్యా దీవెన, వసతి దీవెనలను నిర్వీర్యం చేశారు. ‘గోరుముద్ద’ను ఘోరం చేసి పిల్లల్ని ఆస్పత్రులపాలు చే శారు. విద్యను వ్యాపారంగా మార్చిన వాళ్లని మంత్రులుగా పెట్టుకున్న తర్వాత ప్రభుత్వ స్కూళ్లు బతుకుతాయా? రెండేళ్లలో వైద్యం రోగగ్రస్థమైంది. ఆరోగ్యశ్రీకి రూ. 3,746 కోట్ల బకాయి పెట్టి పేద ప్రజల్ని అన్యాయం చేశారు. ఆరోగ్య ఆసరా పథకాన్ని రద్దు చేశారు. జగన్ హయాంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు చేస్తే, అందులో 11 కాలేజీలను ప్రైవేట్‌కు అమ్మేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 562 మందులు లభ్యమైతే, ఇప్పుడు ఒక్క మందు బిళ్ల కూడా దొరకని స్థితి. పల్లె ప్రజల కోసం ‘ఫ్యామిలీ డాక్టర్’ను ప్రవేశ పెడితే అది అందకుండా చేశారు. ఒక జాతి బలంగా ఉండాలంటే విద్య, వైద్యం పటిష్ఠంగా ఉండాలి. కానీ కూటమి ప్రభుత్వం ఆ రెండింటినీ ప్రైవేట్‌కు అమ్మేస్తోంది. ఏ వర్గం బాగుపడిందని!ఎన్టీఆర్ మహానటుడు. ఆయనకి తెలియకుండానే మహా నటుణ్ణి అల్లుడిగా తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ తెరమీద నటిస్తే, చంద్ర బాబు ఎడతెరపి లేకుండా నటిస్తారు. దీనికి ఉదాహరణ వ్యవ సాయం దండగ అని ఒకప్పుడు చెప్పిన బాబు, ఎన్నికలకు ముందు రైతన్నలపై అంతులేని ప్రేమ కురిపించారు. కేంద్రంతో సంబంధం లేకుండా 20 వేలు ఇస్తానని, రెండేళ్లకు 26 వేలు నామం పెట్టారు. ఉచిత బీమా పథకం పోయింది. 1,100 కోట్లు ఇన్ ఫుట్ సబ్సిడీ పాయె. రైతు భరోసా కేంద్రాలు నాశనం. యూరియా కోసం రెతులు కొట్టుకున్నారు. పొగాకు, పత్తి, అరటి, మామిడి ఇలా ప్రతి రైతూ రోడ్డెక్కారు. ఎక్కడ చూసినా దళారులే. ఈ–క్రాప్ వ్యవస్థ నిర్వీర్యం. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 393 మంది రైతులు, 2,472 మంది రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్నారు. మహిళలకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు. ‘ఆసరా’, ‘చేయూత’, ‘కాపు నేస్తం’, ‘ఈబీసీ నేస్తం’ పథకాలు నిలిపివేశారు. ‘దిశ’ కార్యక్రమాన్ని రద్దు చేశారు. పేదలకు ఇచ్చే ‘వైఎస్సార్ పెళ్లి కానుక’ ఆగిపోయింది. ఐదేళ్లలో జగన్ 31.19 లక్షల ఇళ్ల పట్టాలు అక్కచెల్లెమ్మలకు ఇచ్చారు. యువకులకు జాబ్ క్యాలెండర్ గాలికి పోయింది. డీఎస్సీలో అవకతవకలు జరిగాయి. వాలంటీర్లు మునిగిపోయారు. రేషన్ వాహనాల రద్దుతో 18 వేల మంది రోడ్డున పడ్డారు. చివరికి ఉద్యోగుల్ని కూడా మోసం చేశారు. ఒక రూపాయి ఐఆర్ కూడా ఇవ్వలేదు. ఐదు డీఏలు పెండింగ్. జీపీఎస్, ఓపీఎస్ ఔట్. పీఆర్సీ అడ్రస్ లేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 35 వేల కోట్లు బాకీ. కూటమి ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క వర్గం ప్రశాంతంగా లేదు. ప్రశ్నిస్తే అరెస్ట్‌లు చేస్తారు. రెడ్‌బుక్ అంటారు. వైఎస్సార్సీపీ నాయకులు, జర్నలిస్టులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరూ మినహాయింపు కాదు. దళితులకు రక్షణ లేదు. మహిళలు, చిన్నారు లకు రక్షణ లేదు. అయినా తమ ప్రభుత్వం అద్భుతాలు చేసిందని చెప్పుకుంటున్నారు. జనం రెండేళ్లు సంబరాలు చేసుకోవాలని అంటున్నారు.ఏం సాధించారని!జగన్ మళ్లీ వస్తారని వాళ్లకు తెలుసు. అందుకే భయం. జగన్నామ స్మరణ. జనాన్ని తప్పుదారి పట్టించడానికి మా పార్టీని గొడ్డలి పార్టీగా పిలుస్తున్నారు. గొడ్డలి ముద్రతో జనంలో భయం పుట్టించాలని వాళ్ళ ప్రయత్నం. వేళ్లు కుళ్లి పోయిన తెలుగుదేశం పార్టీ వృక్షాన్ని కూల్చాలంటే గొడ్డలి చాలా అవసరం. గొడ్డలి అంటే వాళ్ళకు భయం. కానీ చెడుని కూల్చే ఆయుధం మాకు. రెండేళ్లలో మీరు సాధించిన అభివృద్ధి 3.48 లక్షల కోట్ల అప్పు. ఇక మీ ఎమ్మెల్యేలు సరిహద్దులు నిర్ణయించి కప్పం వసూళ్లు చేస్తు న్నారు. కాంట్రాక్ట్ పనుల కోసం కొట్టుకుంటున్నారు. లిక్కర్ సిండి కేట్ నడిపిస్తున్నారు. చివరికి చికెన్ షాపుల వద్ద కూడా వసూళ్లు చేస్తున్నారు. సంపద సృష్టిస్తానని చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. తీరా చూస్తే రాష్ట్రానికి సంపదే లేకుండా చేశారు. పిల్లల్ని కనండి, వాళ్లే మన సంపద అని చిట్కాలు చెబుతున్నారు. టీడీపీ అంటే ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీ లేదా తెలివిగా దోచుకునే పార్టీ. చీకటి ఎల్లకాలం ఉండదు. తమసోమా జ్యోతిర్గమయ.భూమన కరుణాకర రెడ్డివ్యాసకర్త తిరుపతి మాజీ శాసనసభ్యులు -
వీడియో లైవ్ లో ప్లే చేసి... బాబు, లోకేష్ ను ఇచ్చిపడేసిన నాగార్జున యాదవ్
-
చంద్రబాబు సర్కార్‌కు వైఎస్ జగన్ అల్టిమేటం
సాక్షి,తాడేపల్లి : చంద్రబాబు సర్కార్‌కు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అల్టిమేటం జారీ చేశారు. పెంచిన ఆక్వా ఫీడ్ ధరల్ని ఈ నెలాఖరులోగా తగ్గించాలని.. లేకుంటే జులై 1, లేదా 2న ఆక్వా రైతుల తరుఫున పోరాటం చేస్తామన్నారు. తాను కూడా ఆక్వా రైతులకు మద్దతుగా వెళ్తానని హెచ్చరించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో ఇవాళ(మంగళవారం) వైఎస్ జగన్‌తో ఆక్వా రైతులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కూటమి సర్కార్ పాలనతో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వైఎస్ జగన్‌కు వివరించారు. అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు, ఆక్వా రైతులు దారుణమైన స్థితిలో ఉన్నారని.. రైతులు, ఆక్వా రైతులు సంతోషంగా ఉండాలనే ఉద్దేశ్యంతో తమ హయాంలో మంచి ఆలోచనలు చేశామన్నారు. ‘‘రైతులు చేయిపట్టుకుని నడిపించే వ్యవస్థలో భాగంగా ఆర్బీకేలను అందుబాటులోకి తీసుకొని వచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా రూ.10వేలకుపైగా ఆర్బీకేలను తీసుకొచ్చాం. రాష్ట్రంలో వ్యాప్తంగా 10వేలకుపైగా ఆర్బీకేలు తీసుకు వచ్చాం. ఆక్వా రైతులకు తోడుగా 35 ఆక్వా ఇంటిగ్రేటెడ్ ల్యాబులు, 782 ఆర్బీకేల్లో ఫిషరీస్ అసిస్టెంట్లను పెట్టాం. అప్సడా చట్టాన్ని సైతం తెచ్చాం. ముఖ్యమంత్రేనే అప్సడా ఛైర్మన్‌గా చేశాం. రైతులకు నష్టం రాకుండా సిండికేట్‌కు స్థానం లేకుండా చేశాం. రూపాయిన్నరకే యూనిట్ కరెంటును సబ్సిడీపై ఇచ్చాం. మన ప్రభుత్వమే ఇవ్వగలిగిందని గర్వంగా చెప్తున్నా. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఆక్వా రైతులకు రూ.1.50కే యూనిట్ విద్యుత్ సరఫరా చేశాం. అలా 57 నెలల్లో రూ.3,306 కోట్లు విద్యుత్ సబ్సిడీ కింద చెల్లించాం. 2014-19 మధ్య చంద్రబాబు యూనిట్‌కు రూ.3.82లు వసూలు చేసేవాడు.మనం పాదయాత్రలో ఉనప్పుడు చివరి ఆరునెలల్లో యూనిట్‌కు రూ.2లకు ఇస్తానని ఒక జీవో విడుదల చేశాడు. కాని అక్కడ కూడా చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు. చివరకు చంద్రబాబు కట్టాల్సిన బకాయిలు రూ.340 కోట్లు కూడా మనమే కట్టాం. చిత్తశుద్ధితో మనం చేసిన కార్యక్రమాల వల్ల ఆక్వా రంగం నిలదొక్కుతుంది.చంద్రబాబు హయాంలో 2018–19లో 38 లక్షల టన్నులు ఉన్న రొయ్య, మత్స్య ఉత్పత్తులు 2022–23 నాటికి ఏకంగా 51 లక్షల టన్నులకు పెరిగింది. 2021-22,2022-23లో రెండుసార్లు బెస్ట్ మెరైన్ అవార్డులు వచ్చాయి. ఫీడ్ కంపెనీలు రేట్లు పెంచితే, మూడు సార్లు ఉప సంహరించుకునేలా చేశాం.చంద్రబాబు హయాంలో 2018–19లో రూ.13,855 కోట్ల విలువైన 2.61 లక్షల టన్నుల ఆక్వా ఎగుమతులు జరిగితే.. 2022–23లో రూ.19.847 కోట్ల విలువైన 3.28 లక్షల టన్నుల ఆక్వా ఎగుమతులు జరిగాయి. మన ప్రభుత్వ చిత్తశుద్దికి ఇదే నిదర్శనం. ఫిషరీస్ యూనివర్శిటీ ద్వారా ఆక్వాసాగుకు నిపుణులను తయారుచేసేలా ఏర్పాటు చేశాం. క్లాసులు కూడా మొదలు పెట్టించాం. చంద్రబాబు మిగిలిన పనులు చేయకుండా విడిచిపెట్టారు. ఆక్వా ఫీడ్, సీడ్, ప్రాససింగ్ యూనిట్లు అన్నీ చంద్రబాబు సానుభూతిపరులవే. సిండికేటై పంట చేతికి అందేనాటికి రేట్లు తగ్గించేస్తున్నారు.ఫిబ్రవరిలో ఫీడ్ రేట్లు కిలో రూ.4 పెంచారు. జూన్‌లో మరో రూ.10, రూ.12 పెంచారు. ఈ ప్రభుత్వానికి కచ్చితంగా బుద్ధిచెప్పాల్సిందేనని’’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. -
ఫేస్ బుక్ అకౌంట్ బ్లాక్ చేసింది వాళ్లే ఇదిగో ప్రూఫ్స్ ...?
-
నన్ను ఒకాయన ఇంకా నువ్వు జైలుకు పోలేదా అని అనగానే..?
-
పెన్షన్ దారులకు బిగ్ షాక్ ఇచ్చిన చంద్రబాబు..!
-
లోకేష్ ను ప్రశ్నిస్తే మధ్యలో రెచ్చిపోతున్న అనితమ్మ
-
అన్నదాత.. ‘ఆత్మ’ఘోష!
(పంపాన వరప్రసాదరావు, అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి సాక్షి ప్రతినిధి): రెండేళ్ల ‘కాల కూటమి’ పాలనలో అన్నదాతలు అ«ధోగతి పాలయ్యారు! నష్టాల సాగులో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నారు. సాగు భారమై... బతుకు బరువై సంక్షోభంలో కూరుకుపోయారు. ఏ పంటకూ మద్దతు ధర దక్కపోవడం.. చంద్రబాబు సర్కారు చేస్తున్న మోసాలకు బలైపోతున్నారు. కొనేవారు లేక.. అమ్ముకునే దారిలేక.. పెట్టుబడి ఖర్చులు దక్కక.. అప్పులు తీర్చలేక రైతన్నల బతుకు దుర్భరంగా తయారైంది. దేశానికి అన్నంపెట్టే రైతులు భార్య పిల్లలకు పట్టెడన్నం పెట్టలేక పురుగు మందులను ఆశ్రయిస్తున్నారు. ఇంతటి విపత్తులో ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. పగ్గాలు చేపట్టిన తొలి రోజు నుంచే కాడిపారేయడంతో ఆసరా లేక, భరోసా కరువై అన్నదాతలు విగత జీవులుగా మారుతున్నారు. ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తుండటంతో రైతు ఆత్మహత్యల వార్త లేని రోజు లేదనే చెప్పాలి. ఉత్తరాంధ్ర మొదలు రాయలసీమ వరకూ ఏ పల్లెకు వెళ్లినా ఇదే దుస్థితి. ఏ రైతును కదిపినా కన్నీటి గాధలే. విత్తు నుంచి విక్రయం వరకు గతంలో ఐదేళ్ల పాటు గ్రామ స్థాయిలో చేయిపట్టి నడిపించిన తోడు కరువైందంటూ విలపిస్తున్నారు. మేమున్నామంటూ తమకు భరోసా ఇచ్చే నాధుడు లేకుండా పోయారంటూ వాపోతున్నారు. రెండేళ్ల చంద్రబాబు సర్కారు పాలనలో రైతుల వెతలపై అనంతపురం, కర్నూలు జిల్లాల్లో దాదాపు ఏడు నియోజకవర్గాల్లో సుమారు 30కిపైగా పల్లెల్లో ‘సాక్షి ప్రతినిధి’ బృందం రెండు రోజుల పాటు క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించింది. అన్నదాతలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కళావిహీనంగా సీమ పల్లెలు.. రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో రైతులు, రైతు కూలీల ఆత్మహత్యలు చోటు చేసుకున్న రాయలసీమ జిల్లాల్లో రైతన్నల పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉంది. ఉద్యాన హబ్‌లో ఉద్యాన పంటలకు గిట్టుబాటు ధర దక్కని దుస్థితి నెలకొంది. సీమలో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే ఉల్లి మొదలు టమాటా, బత్తాయి (చీని), మామిడి, బొప్పాయి, అరటి, పత్తి, జొన్న, మొక్కజొన్న, వేరుశనగ, పప్పుశనగ.. ఇలా ఏ పంట పండించే రైతు పరిస్థితి చూసినా దయనీయంగా ఉంది.సాగుభారమై బతుకు తెరువు కోసం పొరుగు రాష్ట్రాలకు వలస పోతుండడంతో సీమ పల్లెలు కళావిహీనంగా దర్శనమిస్తున్నాయి. సీజన్‌కు ముందే పెట్టుబడి సాయం లేదు.. అదునుకు విత్తనం లేదు.. కట్ట యూరియాకు దిక్కులేదు.. కరువు కాటకాలు, వైపరీత్యాల బారిన పడి పంటలు దెబ్బ తింటే పైసా పరిహారం లేదు... ఉచిత పంటల బీమాకు మంగళం పాడేశారు.. ఏ పంటకూ మద్దతు ధర లేక, కొనేవారు లేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ రైతన్నలు మండిపడుతున్నారు. ఏ పంట చూసినా కన్నీళ్లే..మామిడి, బత్తాయి, అరటి, ఉల్లి, వేరుశనగ, కూరగాయలు లాంటివి రాయలసీమలో ప్రధాన పంటలు. వేరుశనగలో 90 శాతం.. పత్తి, సజ్జ లాంటి పంటలు సగానికిపైగా సీమ జిల్లాల్లోనే సాగవుతుండగా.. జొన్న, మొక్కజొన్న సైతం 40 శాతానికిపైగా సీమ జిల్లాల్లోనే సాగు చేస్తున్నారు. రెండేళ్లుగా ఏ ఒక్క పంటకూ మద్దతు ధర దక్కక రైతులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఎగుమతి రకమైన జీ–9 అరటితో పాటు తోతాపురి మామిడి, బత్తాయి, ఉల్లి, పత్తి, పుచ్చకాయ, కర్భూజ, బొప్పాయి లాంటి పండ్లను సాగు చేసే రైతులు గిట్టుబాటు ధరలు లేక రోడ్డు ఎక్కి ఆందోళనకు దిగడం సర్కారు నిర్వాకాలకు నిదర్శనం.పత్తి మద్దతు ధర రూ.8110 కాగా మార్కెట్లో రూ.5 వేలకు మించి కొనలేదు. మొక్కజొన్న మద్దతు ధర రూ.2,400 కాగా మార్కెట్లో రూ.1,400–1,600 మించి ఇవ్వడం లేదు. అరటి రైతులైతే ఖరీఫ్‌లో రూపాయికి తెగనమ్ముకోగా రబీలో రూ.5కు మించి దక్కలేదు. సజ్జ మద్దతు ధర రూ.2,750 కాగా మార్కెట్లో రూ.1,800–1,900 మధ్య అమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించింది.తోతాపురి మామిడికి కిలో రూ.4–6కు మించి దక్కలేదు. చివరికి బత్తాయికి కూడా ఖరీఫ్‌లో కిలో రూ.6మించి లభించలేదు. ఉల్లి, టమాటా రైతుల పరిస్థితి మరీ దారుణం. కిలో రూపాయి.. అర్ధ రూపాయి పలకడంతో చేసేదిలేక వేలాది టన్నులు రోడ్లపైనే పారబోసిన ఘటనలు కోకొల్లలు. రెండేళ్లుగా కర్భూజ, పుచ్చకాయ పంటకు ధర లేదు. చివరికి పూలకు కూడా రేటు లేకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. అన్నదాతకు సున్నం.. పీఎం కిసాన్తో సంబంధం లేకుండా అన్నదాతా సుఖీభవ పథకం కింద ప్రతీ రైతుకు ఇస్తామన్న రూ.20 వేల పెట్టుబడి సాయాన్ని చంద్రబాబు సర్కారు తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టింది. రెండో ఏడాది ఏడు లక్షల మందికి కోతపెట్టి 46.85 లక్షల మంది భూ యజమానులకు అరకొరగా రూ.14 వేల చొప్పున రూ.6,560.18 కోట్లతో సరిపెట్టారు. రెండేళ్లలో భూ యజమానులకే రూ.14,873.28 కోట్లు ఎగ్గొట్టారు. ఇక కౌలు రైతులకైతే రెండేళ్లూ పెట్టుబడి సాయానికి ఎగనామం పెట్టారు. దాదాపు 16 లక్షలమంది కౌలు రైతులుండగా ఏడాదికి రూ.20 వేల చొప్పున రెండేళ్లలో రూ.6,400 కోట్లను చంద్రబాబు ఎగ్గొట్టారు. పెట్టుబడి కోసం రైతులు సీజన్లో పడరాని పాట్లు పడ్డారు. రూ.3–5 వడ్డీలకు అప్పుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.బలవన్మరణాలు..సాగు కలిసి రాకపోవడంతో అప్పుల పాలైన అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోకపోవడంతో రైతు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వర్షాభావం, వరదలు, తుపాన్లు.. ఒక్కొక్కటిగా వైపరీత్యాలు విరుచుకుపడటంతో దిక్కు తోచని స్థితిలో ఉన్న రైతన్నల పాలిట చంద్రబాబు సర్కారు అవలంబిస్తున్న విధానాలు మృత్యుపాశాలుగా మారాయి.టమాటా నుంచి పొగాకు వరకు పంట ఉత్పత్తులను కొనే నాథుడు లేక, అప్పులు తీర్చే దారిలేక 2024–25లో 150 మందికి పైగా అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడగా.. ఇక 2025–26లో 393 మంది రైతులు ఆత్మహత్యలకు ఒడిగట్టినట్లు పోలీస్ శాఖ అధికారికంగా ప్రకటించింది. వీరిలో అత్యధికులు సీమ జిల్లాలకు చెందిన వారే కావడం గమనార్హం. ఇప్పటి వరకు ఏ ఒక్కరికి ప్రభుత్వం పైసా పరిహారం ఇచి్చన పాపాన పోలేదు.చేయిపట్టి నడిపించిన ఆర్బీకేలు నిర్వీర్యంవిత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అన్ని విధాలా గ్రామ స్థాయిలో అండగా నిలిచిన రైతు భరోసా కేంద్రాలు కూటమి పాలనలో నిరీ్వర్యమైపోయాయి. 10,778 ఆర్బీకేలు కాస్తా రేషనలైజేషన్ పేరిట 8451 క్లస్టర్లుగా కుదించారు. నాణ్యమైన సాగు ఉత్పాదకాలు అందించే సంకల్పంతో గత ప్రభుత్వం నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌ల్లో సగానికి పైగా మూతపడగా మిగిలినవి అలంకారప్రాయంగా తయారయ్యాయి. సిబ్బందిని సర్వేలు, ఇతర అవసరాలకు వినియోగిస్తుండడంతో ఆర్బీకేలకు వెళ్తే పలుకరించే నాధుడే కరువయ్యారు.అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన భవనాలను ఇతర అవసరాలకు కేటాయిస్తున్నారు. నాన్ సబ్సిడీ విత్తన పంపిణీని నిలిపి వేశారు. సబ్సిడీ విత్తనాల పంపిణీలో అడ్డగోలుగా కోత పెట్టారు. అధికార పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఎరువులను పక్కదారి పట్టిస్తుండడంతో రైతులకు యూరియా, డీఏపీ దొరకని పరిస్థితి నెలకొంది. రెండేళ్లుగా కట్ట యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నామని వాపోతున్నారు.మరోవైపు కాంప్లెక్స్ ఎరువుల ధరలు రెండేళ్లలో 50–70 శాతం మేర పెరిగిపోవడంతో సాగు భారం మారింది. మత్స్యకార, పశుసంవర్ధక శాఖలకు చెందిన సాగు ఉత్పాదకాల సరఫరాకు మంగళం పాడేశారు. వరుస వైపరీత్యాలు, కరువు సాయం కలిపి దాదాపు 7 లక్షల మంది రైతులకు చంద్రబాబు సర్కారు దాదాపు రూ.1,100 కోట్లకు పైగా పంట నష్టపరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) ఇప్పటి వరకు చెల్లించిన పాపాన పోలేదు.అటకెక్కిన ఉచిత పంటల బీమా రైతులపై ఒక్క పైసా భారం పడకుండా ఐదేళ్ల పాటు రైతులకు అండగా నిలిచిన డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి కూటమి ప్రభుత్వం వచీ్చరాగానే మంగళం పాడేసింది. ఎన్నికల కోడ్ కారణంగా ఆగిన 2023–24 సీజన్‌కు సంబంధించిన ప్రీమియం బకాయిలు రూ.930 కోట్లు చెల్లించకుండా చంద్రబాబు సర్కారు రూ.1,385 కోట్ల పంటల బీమా పరిహారాన్ని అందకుండా చేసింది. ఖరీఫ్ 2024 సీజన్ వరకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత పంటల బీమా పథకం కొనసాగగా.. రబీ–2024–25 సీజన్ నుంచి చంద్రబాబు సర్కారు స్వచ్ఛంద నమోదు పద్ధతి తెచ్చింది.2024–25 వ్యవసాయ సీజన్‌తో పాటు ఖరీఫ్–2025–26 సీజన్లో ప్రభుత్వం చెల్లించాల్సిన బీమా ప్రీమియం బకాయిలు రూ.1,095.11 కోట్లు ఎగ్గొట్టడంతో కంపెనీలు ఏపీని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాయి. రబీ –2025–26 సీజన్లో కనీసం బీమా పోర్టల్ కూడా తెరవలేదు. ఫలితంగా ఒక్క రైతు కూడా స్వచ్ఛందంగా బీమా చేయించుకోలేకపోయారు. ఇక రూ.500 కోట్ల మేర సున్నా వడ్డీ రాయితీని రెండేళ్లుగా చెల్లించకుండా చంద్రబాబు సర్కారు ఎగనామం పెట్టింది. మద్దతు ధర కోసం ఆందోళనలు.. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) కల్పించడంలో చంద్రబాబు సర్కార్ ఘోరంగా విఫలమైంది. ధరల స్థిరీకరణ నిధి కింద పైసా ఇచి్చన పాపాన పోలేదు. ఉల్లి, టమాటా, కందులు, మినుము, పెసలు, శనగ, వేరుశనగ, పసుపు, జొన్న, సజ్జ, మొక్కజొన్న, పొగాకు, కోకో, మామిడి.. ఇలా ఏ పంట చూసినా మద్దతు ధర దక్కని పరిస్థితి. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం 2024–25 సీజన్లో 75 కేజీల ధాన్యం బస్తాకు రూ.1,725 దక్కాల్సి ఉండగా ఏ ఒక్క రైతుకు రూ.1,150–1,450కి మించి దక్కలేదు.2025–26లో 75 కేజీల బస్తాకు రూ.1,777 దక్కాల్సి ఉండగా రూ.1,250 నుంచి రూ.1,500 మధ్య దక్కింది. మద్దతు ధర కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం, మామిడి, జొన్న, మొక్కజొన్న, పొగాకు రైతులు రోడ్డెక్కి ధర్నాలు, ఆందోళనలకు దిగారు. 2023–24లో క్వింటా రూ.27 వేలకు పైగా పలికిన మిర్చి రైతుకు గతేడాది రూ.6–8 వేలకు మించి దక్కలేదు. మొక్కజొన్న ఎమ్మెస్పీ క్వింటాకు రూ.2,400 అయితే రైతులకు దక్కింది కేవలం రూ.1,400 నుంచి రూ.1,600 మధ్యే. టమాటా, ఉల్లి రైతుల పరిస్థితి రెండేళ్లుగా దారుణంగా ఉంది. పైసా సాయం అందలేదు.. గత ఖరీఫ్‌లో 10 ఎకరాల్లో శనగ, మినుము, నాటుపొగాకు సాగు చేశా. దాదాపు రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టా. పత్తి తెగుళ్ల బారిన పడింది. నాటు పొగాకు కొనేవారు లేకుండా పోయారు. శనగ, మినుము పంటలు వర్షాలకు దెబ్బతిన్నాయి. అధికారులు రాసుకుని వెళ్లారే గానీ పైసా సాయం అందలేదు. – సుద్దాల సుబ్బరాయుడు, కొనకుంట్ల, నంద్యాల జిల్లారూ.60 లక్షలు నష్టపోయా.. 4 ఎకరాల్లో దానిమ్మ, మరో 4.5 ఎకరాల్లో అరటి సాగు చేశా. ఎకరాకు రూ.3 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టా. ముంపునీటి బారిన పడి గతేడాది అరటి పంట దెబ్బతింటే.. ఈ ఏడాది బాక్టీరియల్ బ్లైట్ తెగులు బారిన పడి దానిమ్మ పూర్తిగా నాశనమైంది. మరో 15–20 రోజుల్లో పంట కోతకొచ్చే దశలో అకాల వర్షాలు, వడగండ్లతో తెగులు సోకింది.చెట్టుకు 28 కేజీలకు తక్కువ కాకుండా ఎకరాకు 10 టన్నులకు పైగా దిగుబడి వస్తుందని ఆశించా. బెంగళూరు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. టన్ను రూ.1.50 లక్షల వరకు పలుకుతోంది. ఆ లెక్కన రూ.60 లక్షల వరకు నష్టపోయా. ఇది వాణిజ్య పంట కాబట్టి మీకు పరిహారం రాదని అధికారులు చెబుతున్నారు. వైఎస్ జగన్ హయాంలో ఉద్యాన పంటలన్నింటికి ఉచితంగా బీమా పరిహారం ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వంలో పైసా సాయం లేదు. – ధర్మవరపు రవిశేఖర్‌రెడ్డి, కందుకూరు, అనంతపురం జిల్లాపరిస్థితి దారుణంగా ఉంది.. ఐదెకరాల్లో మొక్క జొన్న, వేరుశనగ వేశా. మొక్కజొన్నకు ఎకరాకు రూ.లక్ష, వేరుశనగకు రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టా. మొక్కజొన్న 125 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మద్దతు ధర రూ.2,400 కాగా మార్కెట్లో రూ.1,500కి మించి ధర రాలేదు. క్వింటాకు రూ.900 చొప్పున దాదాపు రూ.1.13 లక్షల మేర నష్టపోయా. వేరుశనగ అకాల వర్షాల బారిన పడి ఎందుకు పనికి రాకుండా పోయింది. రూ.8 లక్షలు అప్పు మిగిలింది. వైఎస్ జగన్ హయాంలో పైసా కట్టించుకోకుండా రూ.లక్షన్నరకు పైగా పంటల బీమా పరిహారం ఇచ్చారు. సీజన్ ముగియకుండానే పంట నష్టపరిహారం ఇచ్చేవారు. నేడు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. – మన్నెపూల శివశంకర్, మద్దాలపురం, అనంతపురం జిల్లాపాడి రైతులకు దగా.. మాకు మూడు ఆవులున్నాయి. రోజుకు నాలుగైదు లీటర్ల పాలు ఇస్తాయి. మా గ్రామంలో లీటర్ గేదె పాలకు రూ.40, ఆవుపాలకు రూ.20 మించి ఇవ్వడం లేదు. అదేమిటని అడిగితే వెన్న శాతం లేదంటారు. గత ప్రభుత్వ హయాంలో మంచి రేటు వచ్చేది. అమూల్ కేంద్రాల్లో పాలు పోసేవాళ్లం. లీటర్ గేదె పాలకు రూ.80, ఆవుపాలకు రూ.50కిపైగా ఇచ్చేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఇలా అయితే పాడి రైతులు బతికేదెలాగో అర్ధం కావడం లేదు. – ఎం.జానకమ్మ, మద్దాలపురం, అనంతపురం జిల్లాపరిహారం లేదు.. వితంతు పింఛనూ ఇవ్వరు.. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చిన్న ముష్ఠూరు గ్రామానికి చెందిన రాగులపాడు సురేష్ (35) తనకున్న 1.5 ఎకరాల సొంత భూమితోపాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకొని గత ఖరీఫ్‌లో మొక్కజొన్న, శనగ సాగుచేశాడు. పెట్టుబడి కోసం నాలుగు తులాలు బంగారు ఆభరణాలు బ్యాంకులో కుదవ పెట్టాడు. తీరా పంట చేతికొచ్చే సరికి మద్దతు ధరలేక పెట్టుబడి కూడా రాలేదు.అప్పులు రూ.5 లక్షలకు చేరుకోవడంతో ఒత్తిళ్లు భరించలేక మార్చిలో ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముగ్గురు బిడ్డలను పోషించుకునేందుకు కూలి పనులకు వెళ్తున్నట్లు సురేష్ భార్య సునీత కన్నీటిపర్యంతమైంది. తన భర్తకు పరిహారం ఇవ్వలేమని ప్రభుత్వం చెబుతోందని, కనీసం వితంతు పింఛన్ అయినా ఇప్పించండి బాబూ అంటూ కాళ్లా వేళ్లా పడినా పట్టించుకోవడంలేదంటూ వాపోయింది. పిల్లలతో కలిసి కూలి పనులకు పోతున్నా.. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలం చెరుకులపాడు మజర కోసనా పల్లె గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు కురువ రామచంద్రుడు (45)కి సొంతంగా 2.5 ఎకరాలు, మరో 2 ఎకరాల డీ పట్టా భూమి ఉంది. రెండు బోర్లు వేసినా చుక్కనీరు పడలేదు. దాదాపు రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టి ఉల్లి, పొగాకు సాగు చేసినా పంటలు కొనేవారు లేక తీవ్రంగా నష్టపోయాడు.ప్రభుత్వం నుంచి పైసా సాయం అందలేదు. అప్పులు కాస్తా వడ్డీలతో రూ.12 లక్షలకు చేరుకున్నాయి. అప్పులోళ్ల వేధింపులు తాళలేక ఉల్లి, తెగులు నివారణకు తెచ్చిన పురుగుల మందు తాగి గతేడాది సెప్టెంబర్ 14న ఆత్మహత్యకు ఒడిగట్టడంతో రామచంద్రుడి కుటుంబం దిక్కుతోచక అల్లాడుతోంది. ఇద్దరు కుమార్తెలను పోషించుకునేందుకు కూలి పనులకు పోతున్నానంటూ రామచంద్రుడు భార్య లక్ష్మీ వాపోయింది. తనకు భర్తకు కౌలు కార్డు లేదనే సాకుతో పరిహారం రాదు పొమ్మంటున్నారని.. అప్పులోళ్లు భూమిని లాగేసుకున్నారని.. ఎలా బతకాలో తెలియడం లేదంటూ కన్నీటి పర్యంతమైంది.భూములు అమ్ముకుంటున్న అన్నదాతలు ఈ ఫొటోలో కనిపిస్తున్న వారంతా అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం దోసులుడికి గ్రామానికి చెందిన రైతులు. గ్రామంలో 2,500 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఉల్లి, శనగ, వేరుశనగ, బంతి, చామంతి సాగు చేస్తారు. రెండేళ్లుగా వ్యవసాయం కలిసి రాకపోవడంతో గ్రామంలో 90 శాతం మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. అప్పులు తీర్చేదారిలేక కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకున్న భూములను తెగనమ్ముకుంటున్నారు. అప్పులోళ్ల వేధింపులు తాళలేక ఇప్పటికే 500 ఎకరాలకు పైగా అమ్ముకున్నామంటూ వాపోతున్నారు.వేరుశనగకు దూరమైన పల్లెలు.. ఈ ఫొటోలో ఉన్నవారంతా అనంతపురం జిల్లా గార్లెదిన్న మండలం కోటంక గ్రామానికి చెందిన రైతులు. గ్రామంలో దాదాపు 3 వేల ఎకరాల సాగు భూమి ఉండగా 95 శాతం మంది రైతులు వేరుశనగ సాగు చేస్తుంటారు. రెండేళ్లుగా చీడపీడలతో దిగుబడులు తగ్గిపోవడం.. పెట్టుబడులు పెరిగిపోవడంతో పాటు ఏ ఒక్క సీజన్లోనూ మద్దతు ధర దక్కక పోవడంతో ప్రతీ ఒక్కరూ రూ.లక్షల్లో అప్పుల పాలయ్యారు. దీంతో వేరుశనగ సాగుకు గ్రామం పూర్తిగా దూరమైంది. ప్రత్యామ్నాయ పంటలు సైతం కలసి రావడం లేదు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో ఉచిత పంటల బీమా కింద ఒక్క అనంతపురం, కర్నూలు జిల్లాలకే రూ.1,000 కోట్లకు పైగా పరిహారం దక్కింది. దాదాపు ప్రతీ రైతు రూ.లక్ష నుంచి రూ.నాలుగైదు లక్షల వరకు పరిహారం అందుకున్నారు. కానీ రెండేళ్లుగా తమ పరిస్థితి దారుణంగా ఉందంటూ గ్రామానికి చెందిన రైతు టి.నారాయణ ‘సాక్షి’ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. -
టీడీపీ ఎమ్మెల్యేల గూండాగిరీ
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి ఏలూరు/అనంతపురం టౌన్: వాళ్లు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు.. పేరుకు ఎమ్మెల్యేలైనా రౌడీలను మించి చెలరేగిపోతున్నారు. అరాచకాలు, అకృత్యాలతో బరితెగిస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలు, దాడులతో రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని తమకు అడ్డుచెప్పే వారే లేరంటూ పేట్రేగిపోతున్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు రాష్ట్రంలో ఏ జిల్లా చూసినా టీడీపీ ఎమ్మెల్యేల దౌర్జన్యకాండలే తాండవమాడుతున్నాయి. అర్ధరాత్రి జేసీబీలతో సొంత పార్టీకి చెందిన న్యాయవాది ఇంటిపై దండయాత్రకు దిగిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చట్టాన్నీ, పోలీసు యంత్రాంగాన్నీ ఖాతరు చేయలేదు. తన అక్రమాలు, అవినీతిని ప్రశ్నిస్తున్నాడని న్యాయవాది ఇంటిపై దాడికి యత్నించారు. ‘‘వాడో.. నేనో ఉండాలి’ అంటూ బీభత్సం సృష్టించారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కూడా అరాచకాలతో రెచ్చిపోతున్నారు. ఆయన నుంచి తనకు ప్రాణహాని ఉందని సొంత పార్టీ నేత సెల్ఫీ వీడియో విడుదల చేయడం ప్రసాద్ అకృత్యాలకు అద్దంపడుతోంది. ఓ ఎన్ఆర్ఐ కష్టార్జితంతో కట్టుకున్న రూ.60 కోట్ల మాల్‌ను చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కబ్జా చేశారు. తననెవరు అడ్డుకునేది అన్నట్టు పేట్రేగిపోతున్నారు. ఇవే కాదు.. జిల్లా ఎస్పీ కార్యాలయాన్నే 10 గంటలు ముట్టడించిన నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్‌బాబు, అర్ధరాత్రి వీడియో కాల్స్‌తో కేజీబీవీ మహిళా ప్రిన్సిపాల్‌ను వేధించిన ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, సొంత పార్టీ మహిళా కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి కారణమైన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్, అటవీ శాఖాధికారులను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డిల తీరు రాక్షసకాండను తలపిస్తున్నాయి.. ఇవన్నీ రాష్ట్రంలో చంద్రబాబు పాలన ఎంత దుర్మార్గంగా ఉందో చెప్పడానికి మచ్చుతునకలు.అరాచకానికి కేరాఫ్ అడ్రస్ చింతమనేని అరాచకాలు, అడ్డగోలు తనానికి మారుపేరైన ఏలూరు జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోమారు రెచ్చిపోయారు. ఆదివారం అర్ధరాత్రి ఏలూరు నగరంలో రచ్చరచ్చ చేశారు. సొంత పార్టీకి చెందిన ప్రముఖ న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాసబాబు నివాసాన్ని కూలగొట్టడానికి ఏకంగా పొక్లెయిన్లు, వందల మంది అనుచరులతో దండయాత్రగా వెళ్లారు. ఆయన ఇల్లు కూల్చివేస్తానని నానా బీభత్సం చేశారు. అడ్డుకున్న పోలీసులనూ పక్కకు నెట్టేసి దుర్భాషలాడారు. వాడో, నేనో ఉండాలంటూ హల్చల్ చేశారు. ఇంత చేసినా ఎమ్మెల్యేను పోలీసులు రాచ మర్యాదలతో ఇంటికి పంపించారు. బాధితుడైన శ్రీనివాస్, ఆయన కుమారుడిని మాత్రం అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చివరికి టీడీపీ అరాచకవాది చింతమనేనికే వత్తాసు పలికింది. బాధితుడైన న్యాయవాది శ్రీనివాస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. చింతమనేని ఇలా చేయడం కొత్త కాదు. కొద్దిరోజుల క్రితం సాక్షి ఏలూరు కార్యాలయంపై దాడి చేశారు. ఆ తర్వాత కార్యాలయానికి తన అనుచరులతో కలిసి నిప్పు పెట్టించారు. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి ఇంటిపై దాడికి ప్రయత్నించారు. ఆయన వ్యవసాయ తోటలో అరాచకం సృష్టించారు. 2014–19 మధ్య ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్న ముసునూరు మహిళా తహశీల్దార్ వనజాక్షిపై విచక్షణారహితంగా దాడికి దిగారు. అధికారులపై దాడి చేయడం, ప్రజలపై నోరుపారేసుకోవడం, దుర్భాషలాడడం ఆయనకు నిత్యకృత్యం. ఇసుక, మట్టి దోపిడీ, కోడి పందేలతో దెందులూరు నియోజకవర్గాన్ని చింతమనేని ప్రభాకర్ రౌడీరాజ్యంగా మార్చివేశారు.అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్నారనే..!బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఎమ్మెల్యే చింతమనేని మా ఇంటి ముందుకు వచ్చి వందలాది మందితో మాపై దాడి చేయడానికి యత్నించి, ఇల్లు కూల్చడానికి తెగబడ్డారు. అందరినీ దుర్భాషలాడారు. పోలీసులు చింతమనేనిని వదిలివేసి, ఏ తప్పూ చేయని నా భర్తను, కుమారుడిని అర్ధరాత్రి పూట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇదేమి అన్యాయం? నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను వెలుగులోకి తీసుకువస్తున్నారనే నా భర్తపై కక్షగట్టారు. ఇదేనా చంద్రబాబు సుపరిపాలన? – ఈడ్పుగంటి పద్మజ, న్యాయవాది, చింతమనేని బాధితుడి సతీమణికబ్జాల ప్రత్తిపాటి చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కబ్జాలకు, అరాచకాలకూ అంతేలేదు. చిలకలూరిపేటలోని ఎన్ఆర్ఐ రావి మురళీమోహన్‌కు చెందిన రూ.60 కోట్ల విలువైన సాయి కార్తీక్ సిటీ సెంటర్‌ను ప్రత్తిపాటి ఆక్రమించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గత ఏడాది ఆగస్టు 5న తన మాల్‌ను ఎమ్మెల్యే అనుచరులు అక్రమంగా ఆక్రమించుకున్నారని ఎన్ఆర్ఐ మురళీమోహన్ వెల్లడించారు. రెండు థియేటర్లు, రెండు ఫంక్షన్ హాళ్ళు, వాణిజ్య ప్రాంతాలు ఉన్న ఈ కాంప్లెక్స్‌లో ఎవరినీ ప్రవేశించనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిలకలూరిపేట పోలీస్ స్టేషన్లోనూ బాధితుడు ఫిర్యాదు చేశారు. అయినా ఎవరూ పట్టించుకోలేదని, బాధితుడు కోర్టుకు వెళ్లారు. ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చినా ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోలేదు. చంద్రబాబు, లోకేశ్‌కి ఫిర్యాదు చేసినా కబ్జా చేసిన పుల్లారావుకే వత్తాసు పలుకుతుండడం గమనార్హం.సొంత పార్టీ నేతలనూ వదలని దగ్గుపాటి అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సొంతపార్టీ నేతలనూ వదలడం లేదు. ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందని టీడీపీ మైనార్టీ నేత మహబూబ్ బాషా సెల్ఫీ వీడియో విడుదల చేయడమే దీనికి నిదర్శనం. తనకు ఏమి జరిగినా ఎమ్మెల్యేదే బాధ్యత అని ఆ వీడియోలో బాధితుడు స్పష్టం చేశారు. మైనార్టీలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని అడగడమే తన తప్పులా ఎమ్మెల్యే వ్యవహరించారని వివరించారు. ‘‘నాకు ఎవరూ ఉచితంగా ఓటు వేయలేదని, నేనెందుకు ఇంటి పట్టాలు ఇవ్వాలి’’ అంటూ దగ్గుపాటి ఫోన్లో బెదిరించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి పట్టాలు అడిగితే చంపేస్తారా అని ప్రశ్నించారు. పదేళ్లుగా పార్టీకి పనిచేస్తున్నానని, ఎన్నికల్లో రూ.కోట్లు ఖర్చుపెట్టానని వివరించారు. ఎమ్మెల్యే అరాచకాలపై పార్టీ పెద్దలకు చెప్పినా స్పందన లేదని వివరించారు. అనంతపురం టీడీపీలో మైనార్టీలకు జరుగుతున్న అన్యాయాలపై మంగళవారం ఆర్ట్స్ కళాశాల ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం ఎదుట దీక్ష చేపడుతున్నట్లు మహబుబ్‌బాషా తెలిపారు. ఎమ్మెల్యే దగ్గుపాటిపై గతంలోనూ తీవ్ర ఆరోపణలు వచ్చాయి. మద్యం షాపుల వద్దకు నేరుగా తన మనుషులను పంపడం, కమీషన్ల కోసం ఇష్టానుసారం వ్యవహరించడం ఆయనకు అలవాటుగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ సినిమాను తన నియోజకవర్గంలో విడుదల కాకుండా అడ్డుకునేందుకు థియేటర్ యజమానులను బెదిరించారు.ఎస్పీనే బెదిరించిన ఎమ్మెల్యే అరవిందబాబునరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు కొద్దిరోజుల క్రితం పోలీసులపైనే చెలరేగిపోయారు. పల్నాడు ఎస్పీ కార్యాలయంలో దాదాపు 10 గంటల పాటు బైఠాయించి అధికారులకే సవాల్ విసిరారు. తాను సూచించిన వ్యక్తికి లీగల్ అడ్వైజర్ పోస్టు ఇవ్వాలని ఏకంగా ఎస్పీనే బెదిరించారు. ఎస్పీ బయటకు వెళ్లిపోవడంతో ఆయన చాంబర్లోనే తలుపులు వేసుకుని కూర్చోవడంతో పోలీసులు తలుపులు బద్దలుకొట్టి ఎమ్మెల్యేను బయటకు తీసుకు రావాల్సి వచ్చింది. గతంలోనూ అరవిందబాబు తాను చెప్పిన వారికి కాంట్రాక్టు పోస్టులు ఇవ్వాలని ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో హంగామా సృష్టించారు.ఎమ్మెల్యే నసీర్ వేధింపులకు మహిళా కార్యకర్త ఆత్మహత్యాయత్నం గుంటూరు ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వేధింపులు తట్టుకోలేక ఒక టీడీపీ మహిళా కార్యకర్త ఆయన కార్యాలయం ఎదుటే ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. ఇందుకు సంబంధించి ఒక వీడియో బయటకు రావడంతో ఆ కుటుంబాన్ని ఎమ్మెల్యే వెంటాడి వేధించారు. తన పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. అయినా చంద్రబాబు సర్కారు పట్టించుకోలేదు. కేజీబీవీ ప్రిన్సిపాల్‌కు కూన రవికుమార్ వేధింపులు ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని కేజీబీవీ మహిళా ప్రిన్సిపాల్ బయటపెట్టడం కొద్ది నెలల క్రితం చర్చనీయాంశమైంది. అర్ధరాత్రి వేళ అడ్మిషన్ల పేరిట మీటింగ్‌కు రమ్మని ఫోన్ కాల్స్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయినా ప్రభుత్వం ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.అటవీ శాఖ ఉద్యోగులనే కిడ్నాప్ చేసిన ఎమ్మెల్యే బుడ్డా శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి గత ఏడాది చెక్‌పోస్టు వద్ద తన కారును ఆపారని ఏకంగా అటవీ శాఖ ఉద్యోగులనే కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేశారు. తన కారులోనే వారిని తీసుకెళ్లి దాడి చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. పలు సందర్భాల్లో నియోజకవర్గంలో ఆయన గొడవలు సృష్టించారు. తనకు తెలియకుండా ఎంపీ రావడాన్ని వ్యతిరేకిస్తూ కార్యకర్తలతో దాడులు చేయించారు. ఇవే కాదు.. అనేక నియోజకవర్గాల్లో అధికార కూటమి ఎమ్మెల్యేలు తాము సర్వాధికారులమనే రీతిలో వ్యవహరిస్తున్నారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం, దౌర్జన్యంగా అరెస్టు చేయించడం, దాడులు చేయడం ప్రతిచోటా జరుగుతూనే ఉంది. చంద్రబాబు కూడా వారికే వత్తాసు పలుకుతున్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్నారు. -
AP BJP చీఫ్ లేఖ.. ఏమని ఉంది అంటే..!
-
ఇది భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి... వైఎస్సార్సీపీ అధికారిక ఫేస్బుక్ పేజీని అందుబాటులో లేకుండా చేయడం హేయం... చంద్రబాబు ప్రభుత్వ దుశ్చర్యపై వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
-
ఇది భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధికారిక ఫేస్బుక్ పేజీని అందుబాటులో లేకుండా చేసిన చంద్రబాబు ప్రభుత్వ దుశ్చర్యపై ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వైఎస్సార్సీపీపై మాత్రమే జరిగిన దాడి కాదని.. ప్రజాస్వామ్యం, భావ ప్రకటనా స్వేచ్ఛపై జరిగిన దాడి అని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య ప్రయోజనాల దృష్ట్యా రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేందుకు తక్షణమే వైఎస్సార్సీపీ అధికారిక ఫేస్బుక్ పేజీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేదంటే న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. సేవ్ డెమొక్రసీ, సేవ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ హ్యాష్ ట్యాగ్‌తో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, పీఎంవో, కేంద్ర ప్రసార, సమాచార శాఖ, మెటా, ఫేస్‌బుక్‌ను ట్యాగ్ చేస్తూ ఆదివారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ⇒ ‘చంద్రబాబు ప్రభుత్వం ప్రజల, ప్రతిపక్షాల గొంతులను నులిమేయడం కొనసాగిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో మా అధికారిక ఇన్‌స్ట్రాగామ్ హ్యాండిల్‌ను తొలగించింది. ఇప్పుడు దేశంలో వైఎస్సార్సీపీ అధికారిక ఫేస్బుక్ పేజీని అందుబాటులో లేకుండా చేశారు. ⇒ ఇది కేవలం వైఎస్సార్సీపీపై దాడి మాత్రమే కాదు.. ప్రజాస్వామ్య విలువలు, భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి. మేము కేవలం వాస్తవాలను వెల్లడిస్తాం. ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి, అవకతవకలను సాక్ష్యాధారాలతో బయట పెడతాం. ప్రజా సమస్యలపై జనం గొంతుకను వినిపిస్తాం. దీంతో ప్రతిపక్ష పార్టీ అధికారిక హ్యాండిళ్లను.. తద్వారా నిజం మాట్లాడే ప్రతిపక్ష గొంతులను నొక్కేయడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం ఒక ప్రమాదకరమైన సంప్రదాయాన్ని నెలకొల్పుతోంది. ఇది అత్యంత అప్రజాస్వామికం. ⇒ రాజధాని అమరావతి నిర్మాణ పనులకు సంబంధించిన అధిక వ్యయాలు, డీఎస్సీ నియామక ప్రక్రియలో అవకతవకలు, టీటీడీ నెయ్యి టెండర్లలో అక్రమాలు, విచ్చలవిడిగా పెరిగిపోయిన అవినీతిని సరైన ఆధారాలతో బట్టబయలు చేస్తున్న వారిపై.. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం నుంచి.. ఆ విమర్శనాత్మక సమాచారాన్ని ఆన్లైన్లో ప్రజలు చూడకుండా నిరోధించడం వరకు ఒక ఆందోళనకరమైన ధోరణి కనిపిస్తోంది. ⇒ ఈ అన్యాయమైన చర్యలపై మేము న్యాయ పోరాటం చేస్తాం. ఈ దుశ్చర్యలను చట్టపరంగా.. రాజ్యాంగ పరమైన మార్గాల ద్వారా సవాల్ చేస్తాం. బెదిరింపులు, సెన్సార్íÙప్, సంస్థల దురి్వనియోగం వంటివేవీ ప్రజల గొంతును అణచి వేయలేవు. అధికారంలో ఉన్న వారిని జవాబుదారీగా నిలబెట్టడంలో.. వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ అనే ప్రాథమిక హక్కును పరిరక్షించడంలో మా నిబద్ధత కొనసాగుతుంది. ⇒ ప్రజాస్వామ్య ప్రయోజనాల దృష్ట్యా రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేందుకు మా అధికారిక ఫేస్బుక్ పేజీని తక్షణమే పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే న్యాయ పోరాటం చేస్తాం’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
కొత్త పింఛన్ కాకమ్మ కథే!
సాక్షి, అమరావతి: ‘‘ప్రస్తుతం కొత్త పింఛన్ల దరఖాస్తు స్వీకరణకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ఆదేశాలు వెలువడలేదు. ప్రభుత్వం నుంచి అధికారిక మార్గదర్శకాలు వెలువడిన వెంటనే ప్రజలకు తెలియచేయబడును’’ కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి గ్రామ, వార్డు సచివాలయాలకు ఫోన్లు చేసి విచారిస్తున్న వారికి ఉద్యోగులు తెలియజేస్తున్న సందేశమిది. ఎక్కువ మందికి ఇదే సమాచారం చెప్పాల్సి వస్తుండడంతో ఈ సందేశాన్ని పలువురు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు తమ వాట్సాప్ స్టేటస్ మెసేజ్లుగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో రెండేళ్ల క్రితం చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కొత్తగా ఒక్క పింఛన్ కూడా మంజూరు కాలేదు. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన ఆన్లైన్ పోర్టల్ సైతం నిలిచిపోయింది. అయితే, నెలన్నర నుంచి అధికార టీడీపీ అనుకూల మీడియాలో ‘వితంతువులకు పింఛను భరోసా – జూన్ నుంచి కొత్త వారికి– కూటమి ప్రభుత్వం మూడో వసంతంలోకి అడుగిడే వేళ మంజూరు’ అంటూ ప్రత్యేక కథనాలు ప్రచురితమయ్యాయి. ఇదే అంశంపై మంత్రి అచ్చెన్నాయుడు సహా కొందరు మంత్రులు ప్రకటన చేసినట్టు కథనాలు వచ్చాయి. ఇవి చూసి రెండేళ్లగా కొత్త పింఛన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎదురుచూస్తున్న లక్షలాది మంది అర్హులైన అవ్వాతాతలు, వితంతువులు దరఖాస్తు చేసుకోవడానికి రోజూ సచివాలయాలకు వచ్చి పోతున్నారు. అయితే సచివాలయ ఉద్యోగుల సందేశాలను బట్టి ఇదంతా ఉత్తుత్తి ప్రచారమేనని తేలిపోయింది. కూటమి ప్రభుత్వం మభ్యపుచ్చే పథకాలలో ఇది కూడా భాగమేనని స్పష్టమయ్యింది. అధికార పార్టీ ఎమ్మెల్యేల ఆదేశాలతో ఉత్తుత్తి దరఖాస్తుల డ్రామా.. స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేల మౌఖిక సూచనలతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో కొత్త పింఛన్ల పేరిట ఉత్తుత్తి దరఖాస్తుల డ్రామా మొదలైంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ పీఏల ద్వారా వాళ్ల పరిధిలోని గ్రామ వార్డు సచివాలయాలకు ఫోన్లు చేసి కొత్త పింఛన్ల కోసమంటూ ఎవరు వచ్చినా వాళ్లకు ‘ప్రభుత్వం ఇప్పుడు కొత్తవి ఇవ్వడం లేద’ని చెప్పకుండా వాళ్లిచ్చే కాగితాలు తీసుకోవాలంటూ మౌఖిక ఆదేశాలిచ్చారు. దీంతో.. ఉమ్మడి పశ్చిమ గోదావరి సహా పలు జిల్లాల్లో పింఛన్ల కోసమని సచివాలయాలకు వచ్చే వారి నుంచి దరఖాస్తులను తీసుకొని సిబ్బంది వాటన్నింటినీ పక్కన పడేశారు. ‘ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇస్తుందంట..’ అన్న ఉత్తుత్తి ప్రచారాన్నే నమ్మి మే నెలలో ఏలూరు జిల్లా ఉంగటూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని భీమడోలు మండలం పూళ్ల గ్రామ పంచాయతీ పరిధిలోని ఎంఎంపురం సచివాలయంలో 44 మంది పింఛను ఫారాలు ఇచ్చి వెళ్లారు. అందులో 16 మంది అవ్వాతాతల పింఛన్ కోసమైతే, మరో 28 మంది వితంతు, దివ్యాంగుల పింఛన్ల కోసం. మరోవైపు.. అదే పూళ్ల గ్రామ పంచాయతీలోనే పూళ్ల – 1 సచివాలయంలో మరో 30 మంది ఇలాంటి పింఛన్ ఫారాలు ఇచ్చి వెళ్లారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు అసెంబ్లీ నియోజకవర్గం దువ్వ గ్రామ పంచాయతీ పరిధిలోనూ ఇదే పరిస్థితి. దువ్వ –1 సచివాలయంలో కూడా 29 మంది కొత్త పింఛన్ల కోసం ఫారాలు ఇవ్వగా, దువ్వ రెండో సచివాలయంలో మరో 20 మంది కొత్త పింఛన్ల ఫారాలు ఇచ్చి వెళ్లారు. ఆరు నెలలకొకసారి ఇలాంటి మభ్య పెట్టే ప్రకటనలతోనే.. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ల పూర్తవుతున్న సందర్భంగా ఈ జూన్ 12 నుంచి కొత్త పింఛన్లు అంటూ ప్రచారం చేశారు. గత ఏడాది డిసెంబరు నెలలో జరిగిన కలెక్టర్ల సదస్సులోనూ జిల్లాకు రెండు వందల కొత్త పింఛన్లను మంజూరు చేయనున్నట్టు అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు, కేన్సర్ రోగులు, వికలాంగులకు ప్రాధాన్యత ఇచ్చి జిల్లాకు రెండు వందల చొప్పున ఆయా జిల్లాల ఇన్చార్జి మంత్రుల ఆధ్వర్యంలో కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నటు ప్రకటించింది. కానీ, దానికి సంబంధించి ఇప్పటిదాక అధికారిక ఉత్తర్వులైతే వెలువడలేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో వృద్ధాప్య పింఛను కనీస అర్హత వయస్సు 60 ఏళ్లు కాగా గత ఎన్నికల సమయంలో కూటమి పార్టీల మేనిఫెస్టోలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కొత్తగా 50 ఏళ్లకే మంజూరు చేయనున్నట్టు హామీ ఇచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరే ఆగిపోయింది. 2024 జూన్ నుంచి రాష్ట్రంలో అర్హులు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే ఆన్లైన్ పోర్టల్‌ను ప్రభుత్వం పూర్తిగా మూతపెట్టేసింది. రెండేళ్లలో పింఛన్ల సంఖ్య ఆరు లక్షలపైనే తగ్గుదల.. చంద్రబాబు ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇవ్వకపోవడం ఒక ఎత్తయితే.. ఇచ్చే పింఛన్ల సంఖ్య కూడ గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నాటి సంఖ్యతో పోల్చితే ఆరు లక్షలకు పైబడి తగ్గిపోయాయి. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో దేశంలో మరే రాష్ట్రంలో లేనట్టుగా అత్యధికంగా 66,34,742 మంది లబ్దిదారులు పింఛను పొందారు. తర్వాత కాలంలో పెన్షన్ల సంఖ్య సాధారణంగా పెరగాలి. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంఖ్య క్రమంగా తగ్గిపోతూ వచ్చింది. ఈ నెల 1, 2 తేదీల్లో పూర్తయిన పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం డబ్బులు పంపిణీ చేసిన లబ్దిదారుల సంఖ్య 60,19,920 మాత్రమే. అంటే గత ప్రభుత్వంలో పెన్షన్లు పొందిన లబ్ధిదారుల సంఖ్య కన్నా ప్రస్తుతం దాదాపు 6.14 లక్షల వరకు తగ్గిపోయాయి. అదే వైఎస్జగన్ ప్రభుత్వ హయాంలో (2019–24 మధ్య ఆ ఐదేళ్ల కాలంలో) అప్పటి ప్రభుత్వం 29.51 లక్షల కొత్త పింఛన్లు మంజూరు చేసినట్టు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారికంగా ప్రకటించింది. దివ్యాంగుల మెడపై కత్తి... పింఛన్లలో మరిన్ని కోతలు పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం దారులు వెతుకుతోంది. పింఛన్లు తీసుకుంటున్న దివ్యాంగుల్లో పెద్ద సంఖ్యలో అనర్హులు ఉన్నారంటూ ప్రచారం చేస్తుండడంతో ఎవరి పింఛన్ ఆపేస్తారోనని వారిలో భయాందోళనలు నెలకొన్నాయి. పింఛన్లు పొందుతున్న దాదాపు 8 లక్షల మంది దివ్యాంగులకు ఇప్పుడు కొత్తగా అర్హత నిర్ధారణ కోసమంటూ డాక్టర్ల ద్వారా రీ వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టారు. దివ్యాంగులు, మెడికల్ పింఛన్లు తీసుకునే 8 లక్షల మందికీ రీ వెరిఫికేషన్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ గ్రామాల్లో టీడీపీ సానుభూతిపరులు అనుకునే వారికి ఇప్పటి దాక పరీక్షల నోటీసులు ఇవ్వలేదు. అలా రెండు లక్షల మందిని ఈ పరీక్షల నుంచి మినహాయించి మిగిలిన ఆరు లక్షల మంది దివ్యాంగులకు మాత్రమే ఈ రీ వెరిఫికేషన్ పరీక్షలు చేపట్టడం గమనార్హం. -
పేరుకే పాలనా సౌలభ్యం.. అంతా వసూళ్ల పర్వం!
సాక్షి, అమరావతి: బాబు పాలనలో ప్రభుత్వ శాఖల్లో అవినీతికి అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఉద్యోగులు, అధికారుల బదిలీల్లోనూ అవినీతి కంపు కొడుతోంది. ఈ పరంపరలో వైద్య, ఆరోగ్య శాఖలోని ఔషధ నియంత్రణ విభాగంలో బదిలీల పేరిట భారీ దందాకు తెరలేపారు. సాధారణ బదిలీలపై నిషేధం ఉన్న సమయంలో కూడా పరిపాలన సౌలభ్యం ముసుగు తొడిగి ఏకంగా 30 మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లు(డీఐ), ఏడుగురు అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ)లకు స్థాన చలనం కల్పించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఒకే స్థానంలో మూడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న అధికారులను బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రాంతాన్ని బట్టి రేటు మూడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న అధికారులను బదిలీ చేయడానికి రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ గత వారమే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డీఐల్లో 70 శాతం మందిని, ఏడీల్లో సగం మంది బదిలీ చేసేలా రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. ఫార్మా కార్యకలాపాలు ఎక్కువగా ఉండే ఉమ్మడి విశాఖ, తూర్పు గోదావరి, నెల్లూరు, గుంటూరు అదే విధంగా హోల్‌సేల్, రిటైల్ షాపులు అధికంగా ఉండే ప్రాంతాలను పలు కేటగిరీలుగా విభజించి వసూళ్ల దందా నడిచిందని ఆ విభాగంలో చర్చనడుస్తోంది.స్థానాన్ని బట్టి ఒక్కో డీఐ నుంచి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు, ఏడీ నుంచి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల మేర చేతులు మారేలా డీల్స్ నడిచాయని ఔషధ నియంత్రణ విభాగం వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇదిలా ఉండగా కీలక ఉన్నతాధికారి ఆకస్మిక బదిలీతో కోరుకున్న చోట పోస్టింగ్ దక్కుతుందా లేదోనని ఇప్పటికే డీల్స్ కుదుర్చుకున్న డీఐలు, ఏడీలు ఆందోళనకు గురవుతున్నట్టు తెలుస్తోంది. అడ్డగోలు నిర్ణయాలు మరోవైపు కొద్ది నెలలుగా ఈ విభాగంలో అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్నట్టు విమర్శలున్నాయి. ఏసీబీకి పట్టుబడిన ఒకరికి నిబంధనలకు విరుద్ధంగా వర్క్ ఆర్డర్ ఇచ్చారు. నిబంధనల ప్రకారం ఏసీబీకి పట్టుబడిన ప్రభుత్వ ఉద్యోగులకు తిరిగి పోస్టింగ్ ఇవ్వాలంటే విజిలెన్స్ కమిషన్ అనుమతి తీసుకోవాలి. అయితే ఈ ప్రక్రియ ఏమీ లేకుండానే నేరుగా ఓ అధికారికి పోస్టింగ్ ఇచ్చారు. దీనిపై ఏసీబీ అధికారులు సైతం విస్మయం వ్యక్తం చేసినట్టు సమాచారం. మరోవైపు అవినీతి ఆరోపణలపై సస్పెండ్ అయిన డీఐను అనతికాలంలోనే కీలక స్థానంలో వర్క్ ఆర్డర్‌పై నియమించారు. ఇలా వర్క్ఆర్డర్ల రూపంలోనూ పెద్ద మొత్తంలో చేతులు మారినట్టు ప్రచారం సాగుతోంది. -
తల్లికి ఎగనామం.. బిడ్డలకు పంగనామం.. చేతులెత్తేసిన చంద్రబాబు
-
అంతన్నాడు ఇంతన్నాడే చంద్రబాబు.. బాబు పై అద్భుతమైన పాటపాడిన మహిళలు
-
బాబోయ్ అంత పెట్టలేమండీ బయటపడ్డ సంచలన ఆడియో
-
చంద్రబాబుపై కొత్త పాట
-
చంద్రబాబు పేరుతో వీడియో కాల్ AI టెక్నాలజీతో కేటుగాళ్ల మోసం
-
మెగా.. దగా.. బాబుకి హెరిటేజ్ వెన్నతో పెట్టిన విద్య
-
ఆర్టీసీపై పీపీపీ పిడుగు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)పై ప్రై‘వేటు’కు చంద్రబాబు కూటమి ప్రభుత్వం మరింత పదును పెడుతోంది. దాదాపు 50 వేల మంది ఉద్యోగులతో ప్రధాన పబ్లిక్ రంగ సంస్థగా ఉన్న ఆర్టీసీని ప్రైవేటీకరించే కుట్రలో ఒక్కో అంకాన్ని వేగవంతం చేస్తోంది. అందుకోసం ఆర్టీసీ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తూ ఆర్టీసీని దివాలా తీయించేందుకు సిద్ధపడుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో అత్యంత విలువైన ఆర్టీసీ బస్ స్టేషన్ల భూములను అస్మదీయ సంస్థలకు కట్టబెట్టేందుకు సన్నాహాలు వేగవంతం చేసింది. ఆర్టీసీకి సొంత బస్సులు లేకుండా చేసి, సొంత ఆస్తులను అన్యాక్రాంతం చేసి.. అనంతరం ఆర్టీసీ గొంతు నొక్కాలన్న కుతంత్రానికి ప్రభుత్వం బరితెగిస్తోంది. రాష్ట్రంలో అత్యంత విలువైన ప్రాంతాల్లో ఉన్న ఆర్టీసీ బస్ స్టేషన్లు, బస్ డిపోలే ఆర్టీసీకి ప్రాణాధారం. ఆ ఆయువుపట్టుపై చంద్రబాబు ప్రభుత్వం దెబ్బ కొడుతోంది. ఇప్పటికే ఇ–బస్సుల విధానం ముసుగులో రూ.6,600 కోట్ల విలువైన 12 ఆర్టీసీ డిపోల భూములను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిన ప్రభుత్వం.. ఆ కుతంత్రంలో రెండో అంకానికి తెరతీసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రధాన ఆర్టీసీ బస్ స్టేషన్ల భూములను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే కార్యాచరణకు ఉపక్రమించింది. పబ్లిక్ –ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) ముసుగులో అందుకు సిద్ధపడింది. ప్రభుత్వ పెద్దల అత్యంత ముఖ్యులకే బినామీ పేర్లతో, బినామీ సంస్థల ముసుగులో కట్టబెట్టేందుకు ఇప్పటికే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. అందుకోసం మొదటి దశలో విశాఖపట్నంలోని మద్దెలపాలెం, విజయవాడ ఆటోనగర్, తిరుపతి, గుంటూరు, కడప, ఒంగోలు, అనంతపురం, కర్నూలు, రాజమండ్రి, ఏలూరు బస్ స్టేషన్లను గుర్తించింది.రూ.వేల కోట్ల భూములను కారు చౌకగా కట్టబెట్టే కుట్ర ⇒ అత్యంత విలువైన ఆర్టీసీ బస్ స్టేషన్లను పీపీపీ విధానంలో కారు చౌకగా తమ అస్మదీయులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్ర పన్నారు. ఏకంగా 99 ఏళ్ల లీజు రూపంలో కట్టబెట్టాలని ఎత్తుగడ వేశారు. విశాఖపట్నంలోని మద్దిలపాలెం ఆర్టీసీ బస్ స్టేషన్ 12 ఎకరాల్లో విస్తరించి ఉంది. అత్యంత విలువైన ఆ ప్రాంతంలో మార్కెట్ ధర ఎకరం రూ.200 కోట్ల పైమాటే. ఆ ప్రకారం ఆ 12 ఎకరాల మార్కెట్ విలువ రూ.2,400 కోట్లు పలుకుతుంది. కానీ ఆ బస్ స్టేషన్‌ను పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థ అభివృద్ధి చేసేందుకు రూ.500 కోట్ల పెట్టుబడి పెడుతుందని డీపీఆర్‌ను ప్రతిపాదించడం గమనార్హం. అంటే రూ.500 కోట్ల పెట్టుబడి పెడతామనే ఓ ప్రైవేటు సంస్థకు రూ.2,400 కోట్ల విలువైన భూములు ధారాదత్తం చేసేందుకు ప్రభుత్వం తెగబడుతోందన్నది స్పష్టమవుతోంది. ⇒ అదే రీతిలో ఇతర బస్ స్టేషన్లను పీపీపీ విధానంలో కట్టబెట్టేందుకు ప్రైవేటు సంస్థల పెట్టుబడి కోసం డీపీఆర్‌ను అడ్డగోలుగా రూపొందించడం గమనార్హం. తిరుపతి బస్ స్టేషన్‌కు రూ.300 కోట్లు, విజయవాడ ఆటోనగర్ బస్ స్టేషన్‌కు రూ.150 కోట్లు, గుంటూరు బస్ స్టేషన్‌కు రూ.60 కోట్లు పెట్టుబడి పెడతారనే పేరుతో తమ అస్మదీయ సంస్థలకు ధారాదత్తం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. విజయవాడలోని ఆటోనగర్ బస్టాండ్ ⇒ కర్నూలు, అనంతపురం, కడప, ఒంగోలు, ఏలూరు, రాజమహేంద్రవరం బస్ స్టేషన్ల భూములను కూడా ప్రైవేటుపరం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కేవలం నామమాత్రపు లీజుతో ఈ భూములను ధారదత్తం చేసేందుకు ప్రతిపాదనలు ఖరారు చేయాలని ప్రభుత్వ పెద్దలు ఆర్టీసీ ఉన్నతాధికారులకు మౌఖికంగా ఆదేశించినట్టు తెలుస్తోంది. ⇒ మొత్తం మీద దాదాపు రూ.5 వేల కోట్ల విలువైన భూములను కారుచౌకగా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోందని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ ఆందోళనలను బేఖాతరు చేస్తూ ప్రభుత్వం బరితెగిస్తోందని మండిపడుతున్నాయి. -
ఇంత క్రూర పరిహాసమా స్వామీ!
తిరుపతి సమీపాన నిన్న కూటమి సర్కార్ రెండేళ్ల పండుగ సభ జరిగింది. ఆ సభలో చెప్పుకోవడానికి విశేషాలు చాలానే ఉన్నాయట! సభా ప్రాంగణంలో లోకేశ్‌బాబు కలియతిరిగారట. మంత్రులూ, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ముచ్చటించారట! ఆంధ్రజ్యోతి రాసింది. మూడో క్లాస్ చదువుతున్న అనిత్‌రాజ్ అనే బాలుడు ‘డిప్యూటీ సీఎంతో ఫోటో దిగాలని ఉంద’ని ఓ ప్లకార్డు పట్టుకొని వేదిక సమీపంలో నిలబడ్డాడట! అది చూసిన పవన్ కల్యాణ్ వేదికపైకి అనిత్రాజ్ను పిలిపించుకున్నారట! ఈనాడు రాసింది.వేదిక పైకి వచ్చిన అనిత్‌రాజ్ పవన్‌ను బాబాయ్ అని, చంద్రబాబును తాతయ్యా అని పిలిచాడట! లోకేశ్‌బాబును ఏమని పిలిచాడో ఈనాడు రాయలేదు. బహుశా ఆయన కలవ లేదేమో! తాతయ్యా అన్న బాలుని పిలుపుతో చంద్రబాబు ఉత్సాహం పొందినట్టున్నారు. యువత కలలను సాకారం చేసే బాధ్యత తమదేనని ఓ ట్వీట్ రువ్వారు. ఇది కూడా ఈనాడే రాసింది. మూడో క్లాసు చదివే అనిత్రాజ్కు ఎనిమిదేళ్లుంటా యేమో! ఆ సభలో తాతయ్య ప్రసంగం వినిఉండకపోవచ్చు. విన్నా అర్థం చేసుకునే వయసు కాదు.డియర్ అనిత్‌రాజ్, ఆ తాతయ్య మాటల్లో కొసరుగా విసిరిన ఓ అవశేషంలో ఎంత నమ్మకద్రోహం దాగి ఉన్నదో నీకు బోధపడకపోవచ్చు. నీకంటే పదేళ్లు పెద్దవాళ్లయిన పెద్దక్కల దగ్గర్నుంచి, అమ్మ వయసు అత్తలూ, పెద్దమ్మలూ, పిన్నమ్మల వయసువాళ్లకూ, యాభై తొమ్మిదేళ్ల లోపు వుండే అమ్మమ్మలూ, నానమ్మలకూ వేదికపైనున్న తాతయ్య తీరని ద్రోహం చేశారు. దీన్నే నయవంచన అని కూడా అంటారు. ఆ వయసువాళ్ల ఆత్మీయ మహిళలందరికీ వెన్నుపోటు పొడిచిన తాతయ్య మీ కలలను నెరవేరుస్తారంటే నమ్మశక్యమేనా?అన్నిటికంటే పెద్ద విశేషమేమిటంటే ఈ సభకు ‘నమ్మకం’ అనే పేరు పెట్టుకున్నారు. ‘రెండేళ్లలో ప్రజల నమ్మకాన్ని నిల బెట్టుకున్నాం, అదే కూటమి ప్రభుత్వ విజయం’ అనే మకుటంతో మీడియాలో అడ్వరై్టజ్మెంట్లను హోరెత్తించారు. ఆ సభ వేదికపై నుంచి మాట్లాడుతూనే ‘ఆడబిడ్డ నిధి’ పథకానికి ఆర్థిక సమస్యలున్నాయనీ, పీ–4 పథకంతో వారికి సహాయం చేస్తా మనీ ముఖ్యమంత్రి సన్నాయి నొక్కులు నొక్కారు. సూపర్ సిక్స్ పథకాలకు కూటమి మేనిఫెస్టోలో అత్యంత ప్రాధాన్యతనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రధానమైన ఈ ఆరు హామీలను నెరవేర్చడా నికి ఆర్థికపరమైన ఇబ్బందులేమీ ఉండవని ఎన్నికల సభల్లో చంద్రబాబు పలుమార్లు ప్రకటించారు.2024 జూన్ నుంచే ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలుచేస్తా మని కూటమి వాగ్దానం చేసింది. రెండేళ్లు గడిచిపోయాయి. తల్లికి వందనం పథకానికి కూడా మొదటి సంవత్సరం ఎగ నామం పెట్టి, రెండో సంవత్సరం అమలు చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకొని రెండేళ్లు ఆలస్యంగానైనా ‘ఆడబిడ్డ నిధి’ని అమలుచేస్తారేమోనని కోటీ ఎనభై లక్షలమంది మహిళలు ఎదురు చూస్తున్నారు. వారి ఆశలపై చంద్రబాబు తిరుమలేశుని సాక్షిగా చల్లనీళ్లు చల్లారు. ఏపీలో ఓటుహక్కు ఉన్న మహిళలు రెండు కోట్ల ఏడు లక్షలమంది. వీరిలో అరవై, అంతకుమించిన వయసున్నవారు 12 శాతం వరకు ఉంటారని సెన్సస్ లెక్కలు చెబుతున్నాయి. వారిని మినహాయించి సుమారు ఒక కోటి ఎనభై లక్షలమంది మహిళలకు కూటమి సర్కార్ ఇప్పటికే ఒక్కొ క్కరికి ఏటా 18 వేలు చొప్పున రెండేళ్ల నిధులు బకాయి పడింది. ఇప్పుడు మొత్తానికే పథకాన్ని ఎత్తేస్తున్నట్టు ప్రకటించారు.పీ–4 పథకంతో ఆదుకుంటామనేది పచ్చి బూటకం. అసలీ పథకమే పౌరుల ఆత్మగౌరవాన్ని అంగట్లో పెట్టే అమానవీయ స్వభావం గలది. తమకు దిక్కు దివాణం లేదని పేద కుటుంబాలు దరఖాస్తు చేసుకోవాలట! దయగలిగిన ధనవంతులు కొన్ని కుటుంబాలను దత్తత తీసుకొని వారికి సహాయం చేయా లట! ఇది అయ్యే పనేనా? పేదరికం నుంచి ప్రజలను విముక్తం చేయడం ప్రభుత్వాల బాధ్యత. నాణ్యమైన విద్యను వారికి అందజేయడం ద్వారా, అభ్యున్నతికి చేరుకునే అవకాశాలు కల్పించడం ద్వారా వారి జీవితాల్లో మార్పు చేయాలి. వనరుల్లో వారికి తగినంత వాటా కల్పించాలి. ఇది రాజ్యాంగబద్ధమైన ఆదేశం. అలాకాకుండా ధనవంతుల దొడ్లో పేదవాళ్లను కట్టేయ డమనేది బానిస వ్యవస్థ లక్షణం.అయినా పీ–4 విధి విధానాలకు, ‘ఆడబిడ్డ నిధి’ పథకానికి సారూప్యత ఎక్కడున్నది! మహిళల కోసం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన ‘చేయూత’, ‘ఆసరా’ పథకాలకు దీటుగా ప్రకటించిన పథకం ‘ఆడబిడ్డ నిధి’. ఈవిధంగా ఎన్నిక లకు ముందు నమ్మబలికి ఇప్పుడీ పథకాన్ని పూర్తిగా అటకెక్కించారు. మహిళల ఆత్మగౌరవానికీ, సాధికారతకూ పెద్దపీట వేస్తూ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన ప్రతిష్ఠాత్మకమైన ‘అమ్మవొడి’ పథకానికి బదులుగా ‘తల్లికి వందనం’ పేరుతో కూటమి ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది.పేద కుటుంబాల పిల్లలు కూడా నాణ్యమైన విద్యను అభ్యసించాలని అభిలషిస్తూ ప్రభుత్వ పాఠశాలల స్థాయినీ, బోధనా పద్ధతులనూ అనూహ్యమైన స్థాయిలో ప్రైవేట్ స్కూళ్లను తలదన్నేలా మెరుగుపరిచింది జగన్ సర్కార్. జగన్ మోహన్‌రెడ్డి స్వయంగా పరిశీలించి విద్యార్థులందరికీ మంచి స్కూల్ బ్యాగ్‌లు, బూట్లు, బెల్ట్, శ్రేష్ఠమైన పౌష్ఠికాహారాన్ని ఎంపిక చేసిన సంగతి పాఠకులకు విదితమే. డిజిటల్ బోర్డులు, ట్యాబ్లూ ప్రభుత్వ బడుల్లో ప్రవేశించాయి. శిథిలమైన బడి భవనాలు, విరిగిపోయిన బల్లలు, అసహ్యకరమైన పరిస్థితుల్లో ఉండే సింగిల్ వాష్రూముల ముందట లైన్లో నిలబడే పిల్లలు, అసలు వాష్రూములే లేక బడి మానేసే ఆడపిల్లలు, తాగడానికి మురికి నీళ్లే గతి అనే పరిస్థితులను మార్చి కార్పొరేట్ స్కూళ్ల స్థాయిలో వాష్‌రూమ్‌లూ, శుభ్రమైన తాగునీరూ అందేలా జగన్ ఏర్పాట్లు చేశారు.ఒకపక్క ఇంత నాణ్యమైన విద్యకు మౌలిక వసతులను ఏర్పాటు చేస్తూనే ఇంగ్లీషు మీడియం బోధననూ, సీబీఎస్ఈ సిలబస్‌నూ పేద బిడ్డలకు పూర్తి ఉచితంగానే అందుబాటులోకి తెచ్చారు. దాంతోపాటు ఎట్టి పరిస్థితుల్లో డ్రాపవుట్లు ఉండకుండా బిడ్డలను బడికి పంపేలా తల్లిని ప్రోత్సహించడం కోసం జగన్మోహన్రెడ్డి ‘అమ్మవొడి’ పథకాన్ని ప్రవేశపెట్టారు. నాణ్యమైన విద్య ద్వారా ఉన్నతమైన సమాజాన్ని నిర్మించాలనే ఒక సమగ్ర వ్యూహంలో ‘నాడు–నేడు’ ‘అమ్మవొడి’ అనేవి రెండు అవిభాజ్యమైన అంశాలు. ఈ వ్యూహంలో అమ్మది కేంద్ర స్థానం.‘అమ్మవొడి’ పథకం నేపథ్యంలో ఉన్న ఉన్నతమైన తాత్విక భూమిక ‘తల్లికి వందనం’ పథకానికి లేదు. అటువంటి ఉన్నత లక్ష్యమే ఉన్నట్లయితే ‘నాడు–నేడు’ పథకం కొనసాగి ఉండేది. ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్, సబ్జెక్ట్ టీచర్ మోడల్ కొనసాగి ఉండేవి. ఇప్పుడివేమీ లేవు. ప్రభుత్వ బడులకు మళ్లీ పూర్వపు రోజులు వచ్చాయి. దాదాపు పది లక్షలమంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ల బాట పట్టినట్టు సమాచారం. ప్రభుత్వం ఈ లెక్కలను ఉద్దేశపూర్వకంగానే తొక్కిపెడుతున్నది. ఎంత మంది విద్యార్థులు చదువు మానేశారో లెక్కల్లేవు. జగన్ ప్రభుత్వం ప్రతి విద్యార్థిని పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన ట్రాకింగ్ సిస్టమ్ ఇప్పుడు లేదు. ప్రభుత్వ బడుల పునరుజ్జీవనం, పేద పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్య లభించాలనే ఉద్దేశంతో ‘అమ్మవొడి’ని జగన్ తీర్చిదిద్దారు. కేవలం ఎన్నికల్లో తనకు సహకరించే కార్పొరేట్ స్కూళ్ల లాబీకి కాసుల వర్షం కురిపించేలా తల్లికి వందనం పథకాన్ని కూటమి డిజైన్ చేసింది. ఇదీ తేడా!లక్ష్యం ఇంత హేయమైనది కనుకనే నీకు పదిహేను, నీకు పదిహేను ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేలంటూ చౌకబారు ప్రచారాన్ని కూటమి చేసింది. పోనీ ముందుగా చెప్పినట్టు పిల్లలందరికీ ఈ పథకం వర్తిస్తున్నదా? జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి ప్రభుత్వం, ప్రైవేట్ స్కూళ్లలో 80 లక్షలకు పైగా విద్యార్థులుండేవారు. తల్లికి వందనం పథకానికి మాత్రం 67 లక్షల మందినే అర్హులుగా తేల్చారు. విద్యాహక్కు చట్టం కింద ప్రైవేట్ బడుల్లో చేరినవారిలో లక్షమందిని లబ్ధి దారుల జాబితా నుంచి తొలగించారు. కేంద్ర స్కాలర్షిప్ను పొందుతున్న మరో లక్షమందిని తొలగించారు. ఆధార్ సరిగా లేదనీ, అడ్రస్ సరిగా లేదనీ మూడు లక్షలమందికి మొండిచేయి చూపారు. పంచ పాండవులు – మంచం కోళ్ల సామెతలా సాగు తున్న ఈ పథకం చివరకు ఎక్కడ ఆగుతుందో చూడాలి.అధికార యంత్రాంగంలో, రాజకీయ నేతలలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని ప్రతిపక్షం కాదు... అధికార పక్షానికి అనుకూలంగా ఉండేవారే విమర్శిస్తున్నారు. అమరావతి ప్రయోగం డిజాస్టర్‌గా మిగలబోతున్నదనీ, పోలవరం పనులు పరమ నాసిరకంగా జరుగుతున్నాయనీ నిపుణులు ఆరోపిస్తు న్నారు. డీఎస్సీ పరీక్షలో సాక్షాత్తూ ప్రభుత్వ ముఖ్యులే అవినీతికీ, ఆశ్రిత పక్షపాతానికీ తెరలేపి లక్షలాది మంది యువకుల కల లను కల్లలు చేశారు. వ్యవస్థల విశ్వసనీయత పట్ల యువతరంలో నమ్మకం సన్నగిల్లుతున్నది. పేదలు, మధ్యతరగతి ప్రజల పాలిట అపర సంజీవనిలాంటి ఆరోగ్యశ్రీ పథకానికి మరణ శాసనం అమలు చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఫార్సుగా మార్చారు. వృద్ధుల సంఖ్య పెరుగుతున్నదనీ, ముగ్గురు నలు గురు పిల్లల్ని కనాలనీ బోధిస్తున్న చంద్రబాబు సామాజిక పెన్షన్లలో మాత్రం వృద్ధుల సంఖ్యను తగ్గిస్తున్నారు. ఏ రంగం చూసినా ఏమున్నది గర్వకారణం, ప్రభుత్వాంగాలన్నీ అవినీతి రోగగ్రస్థం అన్నట్టుగా పరిస్థితులు తయారయ్యాయి. ఓట్లకోసం ప్రజల అరచేతుల్లోకి వైకుంఠం సినిమాను ప్రొజెక్ట్ చేసి ఇప్పుడు వారందరికీ సామూహికంగా వెన్నుపోటు పొడిచిన తర్వాత నమ్మకాన్ని నిలబెట్టుకున్నామంటూ సభ పెట్టడం న్యాయమా? సమాజం మీద ఇంత క్రూరమైన పరిహాసమేమిటి స్వామీ!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
తిరుపతి సభ సాక్షిగా చేతులెత్తేసిన బాబు
-
ఆడబిడ్డ నిధి పథకం ఎత్తేసిన సీఎం చంద్రబాబు
-
ఆళ్లగడ్డలో ఉప్పొంగిన జనహోరు.. బాబుపై గంగుల బ్రిజేంద్ర రెడ్డి సెటైర్లు
-
ఏపీలో చంద్రబాబు దగా పాలనపై ప్రజా ఉద్యమం... ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ ర్యాలీల్లో ఉప్పొంగిన జనహోరు
-
ఆ 600 కోట్ల భూమి ఎవరికీ ఇచ్చారు? భూమన ప్రశ్నల వర్షం
-
లోకేష్ ఆల్ ఇండియా మోసగాడు, పవన్ ఆంధ్రా మోసగాడు..
-
సిగుండాలి... ఏం పీకారని విజయోత్సవ సభ
-
ఏపీ మొత్తం దద్దరిల్లేలా YSRCP గర్జన..!
-
ఏపీ వ్యాప్తంగా YSRCP భారీగా ర్యాలీలు
-
దేవుడి భూములు రక్షించే దిక్కు లేదు..!
సాక్షి, అమరావతి : దేవుడి భూముల ఆక్రమణల కట్టడిని చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేసింది. దేవాలయాల భూముల ఆక్రమణలు, ఇతర వివాదాలు పరిష్కరించే దేవదాయశాఖ ట్రిబ్యునల్‌కు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాదిన్నరగా చైర్మన్‌ను కూడా నియమించలేదు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నియమితులైన ట్రిబ్యునల్ చైర్మన్ పదవీ కాలం ముగియక ముందే చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే 2024 అక్టోబరులో ఆ పదవికి రాజీనామా చేశారు. రిటైర్డు జిల్లా జడ్జి స్థాయికి తక్కువ కాని వ్యక్తులే దేవదాయ శాఖ ట్రిబ్యునల్ చైర్మన్‌గా కొనసాగుతారు. అయినప్పటికీ, అప్పట్లో ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి కారణంగానే ఆయన పదవీ కాలం ముగియక ముందే రాజీనామా చేశారన్న ఆరోపణలు వచ్చాయి. రాష్ట్ర దేవదాయ శాఖ పరిధిలోని వివిధ ఆలయాలు, సత్రాలు, మఠాల పేరిట మొత్తం 4.67 లక్షల ఎకరాల దేవుడి భూములు ఉండగా... ప్రభుత్వ గణాంకాల ప్రకారమే అందులోని 87 వేలకు పైగా ఎకరాల భూమి ఆక్రమణదారుల చెరలో ఉంది. దేవదాయ శాఖ భూ వివాదాలకు సంబంధించి అధికారులు ఆక్రమణల తొలగింపునకు చిన్న చర్య తీసుకోవాలన్నా ట్రిబ్యునల్ ఆదేశాలతోనే ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఏ భూ వివాదానికి సంబంధించైనా ముందు ట్రిబ్యునల్ గడప తొక్కకుండా నేరుగా హైకోర్టులో కేసులు ఫైల్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. ఒకవైపు వేల ఎకరాల దేవుడి భూములను ఆక్రమణదారులు కబ్జా చేస్తుండగా.. ప్రభుత్వం ఆక్రమణల కట్టడికి ఆదేశాలు జారీ చేసే ట్రిబ్యునల్ చైర్మన్ స్థానం భర్తీ చేయకుండా మీనమేషాలు లెక్కిస్తూ ఉండడంపై దేవదాయ శాఖ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రభుత్వమే ఆక్రమణదారులకు కొమ్ముకాస్తోందన్న ఆరోపణలున్నాయి. నాలుగు వేల కేసులు పెండింగ్‌లోనే.. దేవదాయ శాఖ ట్రిబ్యునల్‌లో సుమారు 4 వేల కేసుల విచారణ పెండింగ్‌లో ఉన్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ట్రిబ్యునల్‌లో దేవుడి భూముల వివాదాలతోపాటు ఆలయాలకు సంబంధించి వంశపారంపర్య ధర్మకర్తల వివాదాలకు సంబంధించిన కేసులు నమోదవ్వగా.. అందులో 95 శాతం కేసులు భూ వివాదాలకు సంబంధించినవే ఉంటాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ట్రిబ్యునల్‌లో సిబ్బందీ కొరతే.. దేవదాయ శాఖ ట్రిబ్యునల్‌లో సిబ్బంది సంఖ్య చాలా తక్కువగా ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఉమ్మడి ఏపీలోని దేవదాయ శాఖ ట్రిబ్యునల్‌ను విభజన సమయంలో రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా విడదీశారు. తెలంగాణ దేవదాయ శాఖ ట్రిబ్యునల్‌లో కేవలం 1000 కేసులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, ఆ రాష్ట్ర ట్రిబ్యునల్‌లో మొత్తం 24 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ ట్రిబ్యునల్‌లో నాలుగు రెట్లు ఎక్కువగా నాలుగు వేలకు పైగా పెండింగ్ కేసులు ఉన్నప్పటికీ కేవలం 12 మంది సిబ్బందే పనిచేస్తున్నారని దేవదాయ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.వారిలోనూ ఏడుగురు అవుట్సోర్సింగ్ ఉద్యోగులే కావడం గమనార్హం. రాష్ట్ర పరిస్థితులు నేపథ్యంలో వివిధ ప్రాంత కక్షిదారుల సౌకర్యం కోసం ప్రతీ నెలలో కనీసం ఒక్క రోజు చొప్పునైనా విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతిలో ప్రాంతీయ కోర్టులను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్‌లో 14 మంది అదనపు సిబ్బందిని అవుట్ సోర్సింగ్ విధానంలో నియామకానికి అవకాశం కల్పించాలని ప్రతిపాదనలు పంపినప్పటికీ, చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. రాష్ట్రంలో దేవుడి భూముల పరిస్థితి ఇదీ మఠాలు : 135 దేవదాయ శాఖ పరిధిలో గుళ్ల సంఖ్య : 26,970 ఆయా ఆలయాలు, గుళ్లు పేరిట ఉన్న దేవదాయ శాఖ భూములు : 4,67,283.28 ఎకరాలు దేవదాయశాఖ అధికారులు లీజుకిచ్చిన భూములు : 1,60,767 ఎకరాలు వివిధ సర్వీసుదారుల ఆదీనంలో ఉన్న భూములు : 1,21,596.04 ఎకరాలు వ్యవసాయానికి పనికి రాని కొండలు, బంజరు భూములు : 85,200 ఎకరాలు గుళ్లు, ఆ చుట్ట పక్కల భూములు : 4355.29 ఎకరాలు ఆక్రమణలలో ఉన్న భూములు : 87,167 ఎకరాలు వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు భూ సేకరణ జరిగి, అందుకు నిధులు విడుదల కాని భూములు : 8,196.63 ఎకరాలు -
ఏపీ విత్తన క్షేత్రాల భూములపై సర్కార్ కన్ను
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని భూములను అతి చవగ్గా కార్పొరేట్లకు కట్టబెడుతున్న చంద్రబాబు సర్కారు కన్ను ఇప్పుడు వ్యవసాయ విత్తన క్షేత్రాల భూములపై కన్నుపడింది. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు మండలం మహదేవమంగళం గ్రామంలో సుమారు 436 ఎకరాల్లో బహుళ విత్తనోత్పత్తి క్షేత్రం (సీడ్ మల్టీప్లికేషన్ ఫామ్) ఉంది. ఇక్కడ వరి, వేరుశనగ, జొన్న విత్తనాలను ఉత్పత్తి చేస్తుంటారు.ఈ వ్యవసాయ క్షేత్రానికి చెందిన 46.69 ఎకరాల భూమిని సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం కేటాయిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ ఫామ్‌లో పెద్ద ఎత్తున మట్టి దోపిడీ జరుగుతోంది. జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నేతలు ఎలాంటి అనుమతుల్లేకుండా ఫామ్‌లోని మట్టిని తవ్వి దొడ్డిదారిన అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. -
తొలిరోజే తడ‘బడి’!
సాక్షి, అమరావతి: కానరాని స్టూడెంట్ కిట్లు.. ఊసేలేని ‘తల్లికి వందనం’ దుస్థితి నడుమ శుక్రవారం విద్యా సంవత్సరం 2026–27 ప్రారంభం అవుతోంది. శుక్రవారం పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు కనీస అవసరాలను సైతం సమకూర్చలేని దయనీయ పరిస్థితులను చంద్రబాబు సర్కారు కల్పించింది. స్కూళ్లు తెరిచిన మొదటి రోజే స్టూడెంట్ కిట్లు హామీని అటకెక్కించింది. కనీసం అందరికీ పుస్తకాలైనా అందించకుండా సర్దుకోమంటోంది. రాష్ట్రంలో మొత్తం 62 వేల పాఠశాలలు ఉండగా ప్రభుత్వ యాజమాన్యంలో 45 వేల ప్రభుత్వ పాఠశాలలున్నాయి. 2025–26 విద్యా సంవత్సరంలో 1 నుంచి 10వ తరగతి వరకు 32 లక్షల మంది విద్యార్థులుండగా అదే అంచనాతో ఈ ఏడాది పుస్తకాల ముద్రణ చేపట్టారు. అయితే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థిమిత్ర కిట్ల పంపిణీ సాధ్యం కాదని ఇటీవల ప్రకటించి ప్రభుత్వం చేతులెత్తేసింది. గతేడాది కిట్లలో విద్యార్థులకు సరిపోని బూట్లు, బెల్టులు, మిగిలిన యూనిఫారం క్లాత్‌ను కొన్ని మండలాల్లో సర్దుబాటు చేశారు. తొలిరోజే ఇస్తామని గొప్పలు చెప్పి... జూన్ 12న బడులు తెరిచిన మొదటిరోజే విద్యార్థులకు కిట్లను అందిస్తామని గతంలో గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు తమవల్ల కాదని ప్రకటించింది. గ్యాస్ కొరత, క్రూడ్ ఆయిల్ సంక్షోభం, ఫైబర్ లాంటి ముడి పదార్థాల కొరతను సాకుగా చెబుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ‘జగనన్న విద్యా కానుక’ పేరును మార్చేసి మొదటి ఏడాది (2024 జూన్) వైఎస్ జగన్ ప్రభుత్వంలో కొనుగోలు చేసిన కిట్లను ఇచ్చింది. 2025 వచ్చేసరికి ప్రభుత్వం బకాయి బిల్లులు చెల్లిస్తేనే కిట్లు ఇస్తామని కాంట్రాక్టర్లు తేల్చి చెప్పారు. దాంతో అధికారులు తమ సొంత హామీతో కిట్లు తీసుకొచ్చి ఆగస్టు తర్వాత పంపిణీ చేశారు. ప్రభుత్వం నిధుల చెల్లింపులో ఆలస్యం చేయడంతో ఈ ఏడాది కిట్ల కొనుగోలుకు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదు. తమకు రెండేళ్లకు సంబంధించి రూ.1372 కోట్ల బకాయిల మొత్తం చెల్లించకుండా బిడ్డింగ్‌లో పాల్గొనలేమని ఆయా కంపెనీలు తేల్చి చెప్పాయి. ఇక 2026–27 విద్యా సంవత్సరంలో 35 లక్షల మంది విద్యార్థులకు పుస్తకాలు సరఫరా చేయాలని అంచనాలు రూపొందించారు. ముద్రణ సమయంలో సర్కారు పిల్లిమొగ్గలు వేయడంతో పాటు ఇంటర్ పాఠ్యపుస్తకాల పీడీఎఫ్ లీకేజీ స్కామ్‌కు కారణమైన ప్రైవేటు ముద్రణ సంస్థ వీజీఎస్‌కు భారీగా కాంట్రాక్టు కట్టబెట్టారు. సకాలంలో ప్రింటింగ్ పూర్తి చేయకపోవడంతో ఇప్పటికీ చాలా మండలాలకు పుస్తకాలు చేరలేదు. గతేడాది మిగిలిపోయినవే దిక్కు.. – సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాల్లో 1,40,012 యూనిఫారాలు అవసరమైతే 20,618 మాత్రమే అందించారు. కుప్పం, శాంతిపురం మండలాలకు సరఫరా చేశారు. షూలు, బ్యాగులు లేవు. 80 వేల మందికి నోటు పుస్తకాలు ఇవ్వాల్సి ఉండగా 70 వేల మందికి మాత్రమే వచ్చాయి. పాఠ్యపుస్తకాలు సైతం 10 శాతం పెండింగ్. వర్క్‌బుక్స్ ఒక్కటీ రాలేదు. – విజయనగరం జిల్లాలో 27 మండలాలు ఉండగా ఆరు మండలాలకు పాత యూనిఫారం ఇచ్చారు. పుస్తకాలు 11 మండలాలకు పుస్తకాలు రాలేదు. పాత బూట్లు కొన్ని మండలాలకు సర్దుబాటు చేశారు. – ఎన్టీఆర్ జిల్లాలో కేవలం పాఠ్యపుస్తకాలు మాత్రమే స్కూళ్లకు చేరాయి. – కర్నూలు జిల్లాలోని 26 మండలాల్లో పాఠ్యపుస్తకాలు, వర్క్ బుక్స్ మాత్రమే వచ్చాయి. యూనిఫామ్ 4 మండలాలకు, నోట్ బుక్స్ 9 మండలాలకు, పిక్టోరియల్ డిక్షనరీలు 8 మండలాలకు మాత్రమే వచ్చాయి. – పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని టైటిల్స్ కలిపి 4.80 లక్షల పుస్తకాలు అవసరముంటే 4 లక్షలు మాత్రమే అందించారు, వర్కుబుక్స్ మాత్రం అందలేదు. బ్యాగులు, బెల్టులు, బూట్లు లేనేలేవు. – కాకినాడ జిల్లాలో ఉన్న 20 మండలాలకు యూనిఫారం లేదు, 1.20 లక్షల మంది విద్యార్థులకు బూట్లు ఆర్డర్ పెట్టగా, 25 వేల మందికి 8 మండలాల్లో పాక్షికంగా సరఫరా చేశారు. బెల్టులు కూడా 10 శాతం సరఫరా చేశారు. జగన్ ప్రభుత్వంలో చదువులకు భరోసా.. వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 43 లక్షల మంది విద్యార్థులకు ఏటా స్కూళ్లు తెరిచిన మొదటి రోజే టంచన్‌గా పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలతో పాటు విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. ప్రతి విద్యార్థికి ఉచితంగా బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలు (ఇంగ్లిష్–తెలుగు) నోట్ బుక్స్, వర్క్ బుక్స్, కుట్టు కూలితో 3 జతల యూనిఫామ్ క్లాత్, జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతో పాటు ఆరో తరగతి విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ ఇంగ్లి‹Ù–తెలుగు డిక్షనరీ, ఒకటో తరగతి పిల్లలకు పిక్టోరియల్ డిక్షనరీతో కూడిన కిట్‌ను మొదటి రోజే విద్యార్థుల చేతికందేది. తల్లికి వందనం ద్వారా తల్లుల ఖాతాల్లో నిధులు జమచేసి పిల్లల చదువులకు పూర్తి అండగా నిలిచారు. ‘‘ఇప్పుడున్న సంక్షేమ పథకాలు ఏ ఒక్కటీ ఆపేది లేదు.. అన్నీ కొనసాగిస్తాం. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ రూ.15 వేలు చొప్పున ఇస్తాం’ అని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది తల్లికి వందనం పూర్తిగా ఎగరగొట్టారు. -
దగా డీఎస్సీ.. మెగా స్కామ్
ప్రశ్నాపత్రం తయారీ, పరీక్షల నిర్వహణ.. రెండు బాధ్యతలు కూడా ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌కే అప్పగించారు. స్కామ్‌కు ఇక్కడే మొట్టమొదటిగా బీజం పడింది. ఎంతో రహస్యంగా జరగాల్సిన ప్రశ్నాపత్రం తయారీ, అప్లోడ్ బాధ్యతలను అవుట్సోర్సింగ్ ఉద్యోగుల చేతుల్లో పెట్టకూడదు. ఈ విషయం తెలిసి కూడా.. అవసరమైతే నేరాన్ని వారిపై నెట్టి వేయవచ్చనే ముందస్తు వ్యూహంతోనే, గోప్యంగా జరగాల్సిన ప్రక్రియను అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల చేతుల్లో పెట్టారు.కీలక బాధ్యతను అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇవ్వడం.. అతడికి టాప్ ర్యాంక్ వచ్చిన తర్వాత పోస్టు ఇవ్వకపోవడం... అతడి వివరాలను మాయం చేయడం..! ఇవన్నీ గోల్మాల్ కాక మరేంటి? దీనం తటికి అర్థం పేపర్ లీక్ అయిందని మీరు అంగీకరించినట్లే కదా? ఈ లీక్ ఇంకా ఎంత లోతుల్లోకి వెళ్లింది? ఎంత మందికి లీక్ అయిన పేపర్ చేరింది? దీన్ని పొందిన వాళ్లు ఎంతమంది పరీక్షలు రాశారు? వీటన్నింటికీ సమాధానం రావాల్సి ఉంది.గతంలో డీఎస్సీ ఎప్పుడు నిర్వహించినా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ప్రక్రియ జరిగేది. ప్రస్తుత డీఎస్సీలో కలెక్టరేట్లు డమ్మీ అయ్యాయి. అక్కడ మెరిట్ లిస్టులు లేవు.. మార్కులు, ర్యాంకులు, కటాఫ్‌లు ప్రదర్శించలేదు.. పబ్లిక్‌గా డిస్ప్లేలు పెట్టలేదు. ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే మెసేజ్‌లు పంపించే కొత్త పద్ధతి తీసుకు వచ్చారు. అసలు పారదర్శకత అనేది ఎక్కడ ఉంది?ఒక పోస్టుకు ఒకరు చొప్పున 1 : 1 పద్ధతిలో కాల్ లెటర్లు పంపారు. దీని ప్రకారం సర్టిఫికెట్లు అన్నీ సక్రమంగా ఉన్నట్లు తేలితే అభ్యర్థికి ఉద్యోగం వచ్చినట్టే. ఇలా వెరిఫికేషన్‌కు పిలిచి సర్టిఫికెట్లు అన్నీ సక్రమంగా ఉన్నాయని రుజువైనా ఉద్యోగం ఇవ్వలేదు. పైగా వారిని రిజెక్ట్ లిస్ట్‌లో కూడా చూపలేదు. దీనిపై ప్రశ్నిస్తే ‘సర్దుబాటు’ అంటున్నారు. ఎవరి కోసం ఈ ‘సర్దుబాటు?’ అంటే సమాధానం లేదు.పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉన్న వ్యక్తి.. అవే పరీక్షల్లో టాప్ ర్యాంకులు దక్కించుకోవడం అతి పెద్ద స్కామ్‌కు ప్రత్యక్ష సాక్ష్యం కాదా? ఇది లీక్ కాదా? ఈ లీక్ ఇంకా ఎక్కడి వరకూ వెళ్లిందో? దీనిపై సీబీఐ విచారణ వద్దా? ఆ వ్యక్తి (నవీన్) నిజంగానే మెరిట్‌తో ర్యాంక్ సాధించి ఉంటే ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? దీని అర్థం.. తప్పు జరిగిందనేగా?ఈ రాష్ట్రంలో.. చంద్రబాబే పోలీసు.. ఆయనే లాయరు..! ఆయనే ఆదేశాలు ఇస్తారు.. ఆయనే పర్యవేక్షిస్తారు..! అధికారంలో ఉన్నది ఆయనే. పైగా ఆయన కుమారుడే విద్యా శాఖ మంత్రి. ఇక నిజాలు ఎలా బయటకు వస్తాయి? న్యాయం ఎలా జరుగుతుంది? విచారణ నిజాయితీగా జరిగే అవకాశాలు ఎక్కడ ఉన్నాయి? నిష్పక్షపాతంగా విచారణ జరిగి నిజాలు వెలుగు చూడాలంటే థర్డ్ పార్టీ విచారణ జరగాలి. అందుకే సీబీఐతో విచారణకు డిమాండ్ చేస్తున్నాం..చంద్రబాబు రాజకీయ జీవితం.. గత రెండేళ్ల పాలన.. సూపర్ సిక్స్‌లు.. మేనిఫెస్టో హామీలు.. టీచర్ పోస్టుల భర్తీ.. ఇలా దేన్ని చూసినా మోసం, దగా, స్కామ్‌లే కనిపిస్తాయి...!– వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి సంతకం పెట్టిన ‘మెగా డీఎస్సీ 2025’.. మోసం, దగా, స్కామ్‌గా మారిందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్ష్యాధారాలతో ఎండగట్టారు. డీఎస్సీ నిర్వహణకు సంబంధించి ప్రతి దశలోనూ అవకతవకలే కనిపిస్తున్నాయని, లక్షల మంది అభ్యర్థులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తూ స్కామ్‌కు పాల్పడ్డారని, ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బ తీశారని.. ఇంత ఘోరంగా నియామక ప్రక్రియ రాష్ట్ర చరిత్రలో ఎన్నడైనా జరిగిందా? అంటూ నిప్పులు చెరిగారు. డీఎస్సీ ప్రక్రియలో తప్పులను ఎత్తి చూపుతుంటే చంద్రబాబుకు నరాలు తెగిపోయేంత బీపీ వస్తోందని ధ్వజమెత్తారు. మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా అనేది పెద్ద స్కామ్.. అసలు పరీక్షే లేకుండా ఉద్యోగాలు ఇవ్వడం ఏమిటి? కేవలం పార్టిసిపేట్ చేస్తే చాలంటారా? ఆ సర్టిఫికెట్లు ఇచ్చేదీ మీరే.. ధ్రువీకరించేది కూడా మీరే..! అని మండిపడ్డారు. కొత్తగా జీవో నంబర్ 4, జీవో 47 ఎందుకు ఇచ్చారు..? మీ పని పూర్తయ్యాక మళ్లీ ఆ జీవోలు ఎందుకు మార్చారు? మెరిట్ లిస్టులు ఎందుకు డిస్ప్లే చేయలేదు? అని సూటిగా ప్రశ్నించారు. మెగా డీఎస్సీ స్కామ్‌పై సీబీఐతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ‘చంద్రబాబు ప్రభుత్వం మెగా డీఎస్సీ కింద చేపట్టిన 16 వేల టీచర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను గమనిస్తే ఎంతో మంది అభ్యర్థులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. ప్రభుత్వం చేసిన గోల్‌మాల్‌తో ఎంతోమంది కన్నీళ్లు పెడుతున్నారు. ప్రభుత్వం అంటే ఓ భరోసా. అలాంటిది ఆ భరోసా పోయిన పరిస్థితుల్లో మన జెన్‌జీ పిల్లలు కొట్టుమిట్టాడుతున్నారు. ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బ తీశారు..’ అని చంద్రబాబు సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మెగా డీఎస్సీలో అవకతవకలను వైఎస్ జగన్ బట్టబయలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీశారు..డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా చేపట్టే టీచర్ ఉద్యోగాల భర్తీలో కొన్ని లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతుంటారు. అంత కీలకమైన డీఎస్సీ పరీక్షలను చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన విధానం తీవ్ర విస్మయానికి గురి చేస్తోంది. లక్షల మంది అభ్యర్థులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తూ స్కామ్‌కు పాల్పడ్డారు. ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీశారు. ఇంత ఘోరంగా నియామక ప్రక్రియ రాష్ట్ర చరిత్రలో ఎన్నడైనా జరిగిందా? సాక్షాత్తూ చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ విద్యాశాఖ మంత్రిగా ఉంటూ ఇద్దరూ కలిసి ఎంతో దారుణానికి ఒడిగట్టారు. అబద్ధం.. మోసం.. వెన్నుపోటు.. దగా.. స్కామ్‌కు చొక్కా, ఫ్యాంట్ తగిలిస్తే చంద్రబాబే కనిపిస్తారు. ఆయన రాజకీయ జీవితం, గత రెండేళ్ల పాలన, సూపర్ సిక్స్‌లు, మేనిఫెస్టో ద్వారా ఇచ్చిన హామీలు, టీచర్ పోస్టుల భర్తీ.. ఇలా దేన్ని చూసినా మోసం, దగా, స్కామ్‌లే కనిపిస్తాయి. అధికారం చేపట్టగానే చంద్రబాబు ఐదు సంతకాలు చేశారు. అందులో మెగా డీఎస్సీ అనేది తొలి సంతకం. వాస్తవానికి మెగా డీఎస్సీలోని 6,100 పోస్టులు గతంలో మేం ఇచ్చిన నోటిఫికేషన్లోనివే. మేమిచ్చిన ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేసి నియామక ప్రక్రియను ఆలస్యం చేశారు. ఆ 6,100 పోస్టులతో కలిపి 16 వేల పోస్టులకు చంద్రబాబు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియలో లీకులు, అక్రమాలు, స్కామ్‌లు, అవకతవకలు చూస్తున్నాం. పేపర్ లీక్ దాచేందుకు చెవిలో పూలు..!కీలక బాధ్యతను అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇవ్వడం.. అతడికి టాప్ ర్యాంక్ వచ్చిన తర్వాత పోస్టు ఇవ్వకపోవడం... అతడి వివరాలను మాయం చేయడం..! ఇవన్నీ గోల్మాల్ కాక మరేంటి? దీనంతటికి అర్థం పేపర్ లీక్ అయిందని మీరు అంగీకరించినట్లే కదా? ఈ లీక్ ఇంకా ఎంత లోతుల్లోకి వెళ్లింది? ఎంత మందికి లీక్ అయిన పేపర్ చేరింది? దీన్ని పొందిన వాళ్లు ఎంతమంది పరీక్షలు రాశారు? వీటన్నింటికీ సమాధానం రావాల్సి ఉంది. అభ్యర్థులు లేవనెత్తుతున్న ప్రశ్నలకు చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్న కారణాలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ‘ఫస్ట్ ర్యాంకు సాధించిన వ్యక్తి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రాలేదు. కాబట్టే పోస్టు ఇవ్వలేదు..’ అని సమర్థించుకుంటున్నారు. మెరిట్ లిస్టులో పేరు తీసేసి, అభ్యర్థి డేటాను మాయం చేసి, కాల్‌లెటర్ ఇవ్వనప్పుడు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఎలా వస్తాడు? మీరు చెప్పేవి కాకమ్మ కబుర్లు కావా? ఆ వ్యక్తి (నవీన్) కోర్టులో వేసిన అఫిడవిట్ చూస్తే మీ కాకమ్మ కబుర్లన్నీ బయటపడతాయి. పేపర్ లీక్‌లు దాచిపెట్టడానికి చెవిలో పూలు పెడుతూ నానా తంటాలు పడుతున్నారు. అవన్నీ తేలాలంటే సీబీఐతో విచారణ చేపట్టాలి..పేపర్ తయారీలో ఎవరెవరు ఉన్నారు? డిజిటల్ యాక్సెస్ ఎవరెవరి చేతుల్లో ఉంది? ఎంతమందికి లీక్ వెళ్లింది? ఎంత ముడుపులు చేతులు మారాయి? ఇవన్నీ తేలాలి. అందుకే సీబీఐ విచారణ కావాలని డిమాండ్ చేస్తున్నాం. దీనికి కారణం.. ఈ రాష్ట్రంలో చంద్రబాబే పోలీసు, ఆయనే లాయరు, ఆయనే ఆదేశాలు ఇస్తారు. ఆయనే పర్యవేక్షిస్తారు. అధికారంలో ఉన్నది ఆయనే. పైగా ఆయన కుమారుడే విద్యా శాఖ మంత్రి. ఇక నిజాలు ఎలా బయటకు వస్తాయి? న్యాయం ఎలా జరుగుతుంది? మరి విచారణ నిజాయితీగా జరిగే అవకాశాలు ఎక్కడ ఉన్నాయి? నిష్పక్షపాతంగా విచారణ జరిగి నిజాలు వెలుగు చూడాలంటే «థర్డ్ పార్టీ విచారణ జరగాలి. అప్పుడే రాష్ట్రంలో వ్యవస్థల మీద ఎవరికైనా నమ్మకం కలుగుతుంది.స్కామ్‌ల కంపు కనిపించడం లేదా? ఉద్యోగాలకు సంబంధించి ఏ పోటీ పరీక్ష ఫలితాలనైనా తీసుకోండి. ముఖ్యంగా పబ్లిక్ సర్వీస్ పరీక్షలను పరిశీలిస్తే పారదర్శకంగా మెరిట్ జాబితాలు ప్రకటిస్తారు. యూపీఎస్సీ సహా ఎక్కడైనా సరే అదే విధానం అవలంభిస్తారు. కానీ చంద్రబాబు డీఎస్సీ దీనికి పూర్తిగా విరుద్ధంగా సాగింది. గతంలో డీఎస్సీ ఎప్పుడు నిర్వహించినా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ప్రక్రియ జరిగేది. ప్రస్తుత డీఎస్సీలో కలెక్టరేట్లు డమ్మీ అయ్యాయి. అక్కడ మెరిట్ లిస్టులు లేవు.. మార్కులు, ర్యాంకులు, కటాఫ్‌లు ప్రదర్శించలేదు.. పబ్లిక్‌గా డిస్ప్లేలు పెట్టలేదు. ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే మెసేజ్‌లు పంపించే కొత్త పద్ధతి తీసుకు వచ్చారు. అసలు పారదర్శకత అనేది ఎక్కడ ఉంది? ఇందులో స్కామ్‌ల కంపు కనిపించడం లేదా? ఆన్లైన్ పేరిట మొత్తం ప్రక్రియను దాదాపుగా కేంద్రీకృతం చేశారు. ఇలా ఎందుకు చేశారు? దీనికి కారణం.. మీ ఉద్దేశాలు వేరే కాబట్టే కదా! సమస్యలు ఎదుర్కొన్న అభ్యర్థులు కలెక్టరేట్‌కు వెళితే పైకి వెళ్లండని సమాధానం చెప్పారు. అష్టకష్టాలు పడి వాళ్లు వస్తే.. మాకు సంబంధం లేదు.. కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లమని చెప్పారు. ఇలా ఎంతో మంది అభ్యర్థులు అవస్థలు పడ్డారు. పారదర్శకంగా జాబితాలు ప్రకటించకుండా అభ్యర్థులను ఎంపిక చేసి వారికి మెసేజ్‌లు పంపారు. ఎవరికి మేలు చేయడానికి ఈ సర్దుబాటు?ఒక పోస్టుకు ఒకరు చొప్పున 1 : 1 పద్ధతిలో కాల్ లెటర్లు పంపారు. దీని ప్రకారం సర్టిఫికెట్లు అన్నీ సక్రమంగా ఉన్నట్లు తేలితే అభ్యర్థికి ఉద్యోగం వచ్చినట్టే. డీఎస్సీ నిబంధనలు కూడా అవే చెబుతున్నాయి. అన్ని నిబంధనలు, జీవోలను పరిగణనలోకి తీసుకుని డీఎస్సీ కమిటీ మెరిట్, రోస్టర్‌ను సిద్ధం చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుందని రూల్ నంబర్ 20 చెబుతోంది. ఈ నిబంధనను పరిగణనలోకి తీసుకుని కాల్ లెటర్ పంపి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టారు. అంటే.. అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చాయి? వారు ఓపెన్‌లోకి వస్తారా? లేక రిజర్వేషన్‌లోకి వస్తారా? వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్.. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఉమెన్, స్పోర్ట్స్, ఎక్స్‌సర్వీస్ మెన్ ఇలా వివిధ కేటగిరీల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ముందుగానే మీకు తెలుసు. అందుకే 1 : 1 పద్ధతిలో పిలిచారు. కానీ ఇలా వెరిఫికేషన్‌కు పిలిచి సర్టిఫికెట్లు అన్నీ సక్రమంగా ఉన్నాయని రుజువైన వారికి ఉద్యోగం ఇవ్వలేదు. పైగా వారిని రిజెక్ట్ లిస్ట్‌లో కూడా చూపలేదు. దాని అర్థం ఏమిటి? ఎవరి కోసం వీరికి అన్యాయం చేశారు? ఇది దగా, మోసం, దోపిడీ, స్కామ్ కాదా? ఇప్పుడేమో కాల్‌లెటర్ జారీ చేస్తే ఉద్యోగం వచ్చినట్లు కాదని అంటున్నారు. మరి 1:1 పద్ధతికి అర్థమేమిటి? మీరు పిలిచింది 1:5 లేదా 1:3 అయితే మీరు చెప్పిన వాదన కరెక్టు. 1:1 పద్ధతిలో పిలిచి అన్నీ సక్రమంగా ఉన్నా కూడా సర్దుబాట్లు చేశారంటే ఎవరి కోసం చేశారు?ముందస్తు వ్యూహంతోనే గోప్యతకు తూట్లు..ఏ పరీక్షకైనా ప్రశ్నాపత్రం తయారీ, ప్రశ్నలు అప్లోడ్ చేయడం, డిజిటల్ నిర్వహణ.. ఇవన్నీ కూడా అత్యంత గోప్యంగా (కాన్ఫిడెన్షియల్) జరగాలి. కానీ ఈ ప్రభుత్వంలో గోప్యతకు పూర్తిగా తూట్లు పొడిచారు. డీఎస్సీ ప్రశ్నాపత్రాలను స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్, ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ) రూపొందిస్తుంది. పరీక్ష నిర్వహణ బాధ్యతను డీఎస్సీ కన్వీనర్ చూస్తారు. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో డీఎస్సీ కన్వీనర్‌ను పక్కన పెట్టేశారు. ప్రశ్నాపత్రం తయారీ, పరీక్షల నిర్వహణ.. రెండు బాధ్యతలు కూడా ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌కే అప్పగించారు. స్కామ్‌కు ఇక్కడే మొట్టమొదటిగా బీజం పడింది. ఎంతో రహస్యంగా జరగాల్సిన ప్రశ్నాపత్రం తయారీ, అప్లోడ్ చేసే బాధ్యతలను అవుట్సోర్స్ ఉద్యోగుల చేతుల్లో పెట్టకూడదు. ఈ విషయం తెలిసి కూడా.. అవసరమైతే నేరాన్ని వారిపై నెట్టి వేయవచ్చనే ముందస్తు వ్యూహంతోనే, గోప్యంగా జరగాల్సిన ప్రక్రియను అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల చేతుల్లో పెట్టారు. ఇందులో పనిచేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్.. కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్‌లో ఫస్ట్ ర్యాంకర్‌గా నిలిచాడు. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) తెలుగు పరీక్షలో కూడా జోన్–2లో ఆరో ర్యాంక్ సాధించాడు. పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉన్న వ్యక్తి అవే పరీక్షల్లో టాప్ ర్యాంకులు దక్కించుకోవడం అతి పెద్ద స్కామ్‌కు ప్రత్యక్ష సాక్ష్యం కాదా? ఇది లీక్ కాదా? ఈ లీక్ ఇంకా ఎక్కడి వరకూ వెళ్లిందో..! దీనిపై సీబీఐ విచారణ వద్దా? ఆ వ్యక్తి (నవీన్) నిజంగానే మెరిట్‌తో ర్యాంక్ సాధించి ఉంటే ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? ఇది ఇంకొక మిస్టరీ. దీని అర్థం తప్పు జరిగిందనేగా? మరోవైపు అతడి లాగిన్ ఐడీ కనిపించకుండా, డేటాను ఎందుకు మాయం చేశారు? మెరిట్ లిస్టు నుంచి పేరు ఎందుకు తొలగించారు? కాల్ లెటర్ ఎందుకు పంపలేదు? -
నీ కొడుకు చేసిన పనికి నువ్వు బలి అవ్వడం ఖాయం..!
-
చెవులో పువ్వులు.. కాకమ్మ కథలు, ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావయ్యా చంద్రబాబు...
-
జగన్ వస్తున్నాడంటేనే టెన్షన్.. బాబు ప్లాన్.. కూటమి నేతలు అలర్ట్
-
ఆరోగ్యం ఎలా ఉందన్నా..?
సాక్షి, విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ఉద్యోగులు, కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. వారిని ఓదార్చి భరోసా కల్పించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యసేవల గురించి ఆరా తీశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి న్యాయం జరిగేలా చూస్తామని ధైర్యం చెప్పారు. ఒక్కొక్కరినీ పేరు పేరునా పలుకరిస్తూ.. ఆరోగ్యం ఎలా ఉంది? వైద్య సేవలు ఎలా అందుతున్నాయి? ప్రమాదం ఎలా జరిగింది? అని ఆరా తీశారు. అధైర్యపడొద్దని.. అండగా ఉంటామని హామీనిచ్చారు. విశాఖ రామ్‌నగర్‌లోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెదగంట్యాడ సీతానగరానికి చెందిన గోకివాడ సూరిబాబు (కాంట్రాక్ట్ వర్కర్), అగనంపూడి లక్కరాజుపాలేనికి చెందిన కార్మికుడు పి.శ్రీనివాసరావు(చార్జిమెన్)ను పరామర్శించారు. కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో రావూరి మల్లికార్జునరావు (సీనియర్ టెక్నీషియన్), గుడివాడ అర్జున అప్పారావు(చార్జిమెన్), ఒడిశాకు చెందిన సత్యానంద్ బాలువాను వైఎస్ జగన్ బుధవారం పరామర్శించారు. ఒక్కొక్కరి బెడ్ వద్దకు వెళ్లి.. బాధితుల చేతులు పట్టుకుని ‘నేనున్నాను... అధైర్యపడకండి‘ అంటూ కొండంత ధైర్యాన్ని, భరోసాను ఇచ్చారు. వైఎస్ జగన్‌ను చూడగానే ఆస్పత్రి వద్ద కార్మికుల కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. ఇంటి పెద్ద దిక్కు ఆసుపత్రి పాలు కావడంతో తాము రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. వారి బాధను ఆసాంతం విన్న జగన్ ప్రతి ఒక్కరినీ ఓదారుస్తూ అండగా ఉంటానని మాట ఇచ్చారు.సెవెన్ హిల్స్ ఆస్పత్రి వద్ద..వైఎస్ జగన్: గోకివాడ సూరిబాబు అన్నకు వైద్యం సరిగ్గా అందుతుందా..?కార్మికుడు గోకివాడ సూరిబాబు బావమరిది శ్రీనివాస్: ఏమీ చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు. చాలా భయంగా ఉందన్నా మాకు.. దేవుడి మీదే భారం వేశాం. వైఎస్ జగన్: అధైర్య పడొద్దు శ్రీనివాస్ అన్నా.. దేవుడి దయతో సూరిబాబు అన్నకు నయం అవుతుంది. శ్రీనివాస్: మీ రాకతో మాకు కాసింత ధైర్యం కలిగింది అన్నా..!వైఎస్ జగన్: ప్రభుత్వం ఆర్థిక సాయం ఇచ్చేలా ఒత్తిడి తెస్తా. ఒకవేళ ఈ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించకపోతే మన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే అందిస్తా. (యాజమాన్యం నుంచి నష్టపరిహారం ఏ రకంగా అందజేస్తామన్నది సమగ్రంగా వారికి తెలియజేయాలని అక్కడే ఉన్న స్టీల్ ప్లాంట్ హెచ్ఆర్ మేనేజర్ అనిల్ కుమార్‌కు వైఎస్ జగన్ సూచించారు)కిమ్స్ ఐకాన్ ఆస్పత్రి వద్ద...వైఎస్ జగన్: ‘‘ఆరోగ్యం ఎలా ఉంది..? వైద్యం బాగా అందుతుందా..? ప్రమాదం జరిగినప్పటి నుంచి వైద్యసేవలు సక్రమంగా అందుతున్నాయా అన్నా..?’’రావూరి మల్లికార్జునరావు: అందుతున్నాయి అన్నా..!వైఎస్ జగన్: స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం ఎలా జరిగింది..? మల్లికార్జునరావు: నేను స్టీల్ ప్లాంట్ ఎస్సెమ్మెస్ విభాగంలో సీనియర్ టెక్నీషియన్‌గా పనిచేసున్నా. ఎస్సెమ్మెస్ విభాగంలో లాడెల్ నుంచి ఉక్కు లిక్విడ్ బ్లాస్ట్ అయి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆ ఉక్కు ద్రవం పడిన చోటకు నేను కాసింత దూరంలో ఉండడంతో ప్రాణపాయం నుంచి తప్పించుకున్నాను అన్నా..!వైఎస్ జగన్: మీకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందే వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తా.. ఇవ్వని పక్షంలో మన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే ఆర్థిక సహాయం అందిస్తా. ధైర్యంగా ఉండు మల్లికార్జున అన్నా.. నీకేమి భయం లేదు.. నీకు అండగా మీ జగనన్న ఉన్నాడు..! (మల్లికార్జున అన్న పూర్తిగా కోలుకునేంత వరకూ మెరుగైన వైద్యం అందించాలని అక్కడున్న వైద్యులు గోపాల్రాజుకు వైఎస్ జగన్ సూచించారు) వైఎస్ జగన్: ఆరోగ్యం ఎలా ఉంది..? వైద్య సేవలందుతున్నాయా..? క్షతగాత్రుడు గుడివాడ అర్జున అప్పారావు: అందుతున్నాయి అన్నా..వైఎస్ జగన్: స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం ఎలా జరిగింది..? అర్జున: నేను చార్జిమెన్గా పనిచేస్తున్నా. ఎస్సెమ్మెస్ విభాగంలో జరిగిన ప్రమాదంతో భయపడ్డాం. లాడెల్ నుంచి ఉక్కు లిక్విడ్ బ్లాస్ట్ అయి ద్రవం కింద పడినప్పుడు దూరంగా ఉండడంతో ప్రాణపాయం నుంచి తప్పించుకున్నా. అది టీ తాగే సమయం కావడంతో ప్రమాదం తీవ్రత తగ్గింది. లేదంటే పెరిగేది.వైఎస్ జగన్: ధైర్యంగా ఉండు అన్నా..! నీకు అండగా వైఎస్సార్సీపీ ఉంటుంది. మీ జగనన్న ఉంటాడు. పూర్తిగా నయం అయ్యేవరకూ ఆసుపత్రిలో వైద్యం అందుతుంది. ఎటువంటి ఆందోళన వద్దు.. మీకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందే వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తా.. ఇవ్వని పక్షంలో మన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన నెలరోజుల్లోనే ఆర్థిక సహాయం అందిస్తా. -
రూ.కోటి పరిహారం ఇవ్వాల్సిందే : వైఎస్ జగన్
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం నుంచి రూ.11,440 కోట్ల ప్యాకేజీని సాధించామని చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రులు గొప్పగా చెప్పుకున్నారు. ఈ ప్యాకేజీని ఉద్యోగుల వీఆర్ఎస్ అమలు కోసం ఉపయోగించారు. జీఎస్టీ బకాయిల చెల్లింపు, బ్యాంకు రుణాలు తీర్చడం కోసం వాడారు. అంతే తప్ప స్టీల్ ప్లాంటు నిర్వహణ కోసం గానీ.. ఉద్యోగుల బాగోగుల కోసం గానీ... ప్లాంట్‌లో భద్రతా ప్రమాణాల పెంపు కోసం గానీ ఉపయోగించలేదు.– వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో మరణించిన ప్రతి ఒక్కరి కుటుంబానికి కోటి రూపాయల చొప్పున నష్ట పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు కూడా ఇచ్చి మానవత్వం చూపాలని సీఎం చంద్రబాబుకు సూచించారు. ఒకవేళ చంద్రబాబు నష్టపరిహారాన్ని ఇవ్వకుంటే... దేవుడి దయతో మళ్లీ తమ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే బాధిత కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్ట పరిహారాన్ని అందజేస్తామని ప్రకటించారు. ఈ ప్రమాదంలో కార్మికుల వైపు నుంచి ఎటువంటి తప్పు లేదని.. ఇటువంటి సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలని హితవు పలికారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కార్మికులతో పాటు బాధిత కుటుంబాలను వైఎస్ జగన్ బుధవారం పరామర్శించారు. తాడేపల్లి నుంచి నేరుగా విశాఖ చేరుకున్న వైఎస్ జగన్ తొలుత సెవెన్ హిల్స్ ఆస్పత్రి వద్దకు వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ హయాంలో ఎల్జీ పాలిమర్స్‌లో దుర్ఘటన జరిగిన వెంటనే నాడు సీఎంగా ఉన్న తాను స్వయంగా వచ్చి దేశ చరిత్రలోనూ ఎన్నడూ లేని విధంగా బాధిత కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం అందజేయడంతో పాటు కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించామని గుర్తు చేశారు. అదేవిధంగా ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. బాధిత కుటుంబాలకు వారి హక్కుగా వచ్చే మొత్తాన్ని.. ఈ ప్రభుత్వం ఏదో అదనంగా ఇస్తున్నట్లు ప్రకటించడం ధర్మమేనా? అని నిలదీశారు. బాధిత కుటుంబాలను పరామర్శిస్తామంటూ వచ్చిన లోకేశ్ మాట్లాడిన మాటలు వింటుంటే ఇటువంటి మనుషులు కూడా ఉంటారా? అని అనిపించిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించవద్దని కేంద్రాన్ని గట్టిగా కోరుతూ వైఎస్సార్ సీపీ హయాంలో రెండుసార్లు లేఖలు రాయడంతో పాటు ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కూడా కేంద్రానికి పంపామని గుర్తు చేశారు. తమ పోరాటం వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిచిపోయిందన్నారు. ఇప్పుడు కూడా అదే తరహాలో స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను పరామర్శించిన తర్వాత మీడియాతో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే...మీడియాతో మాట్లాడుతున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మానవత్వం ఉంటే మంచి చేయండి...విశాఖ స్టీల్ ప్లాంట్ స్టీల్ మెల్టింగ్ వర్క్‌షాప్‌లో జరిగిన ప్రమాదంలో ఇప్పటికే 9 మంది చనిపోయారు. వేర్వేరు ఆస్పత్రుల్లో మరో ఐదుగురు చికిత్స పొందుతున్నారు. వారిలో ఒకరి పరిస్థితి చాలా విషమంగా ఉంది. దాదాపు 95 శాతం కాలిన గాయాలతో ఇంకా ఒక అన్న చికిత్స పొందుతున్నారు. ఇలాంటి తరుణంలో మాట్లాడాల్సి వస్తోంది. ఇవాళ కొన్ని ప్రశ్నలు సూటిగా అడుగుతున్నా. మానవత్వం ఏ మాత్రం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి మంచి చేయండి. స్టీల్ ప్లాంట్‌లో కార్మికులు ఎలా బతుకుతున్నారు? వారి పరిస్థితి ఎలా ఉంది? అనేది అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. 2024 వరకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కార్మికులు ఎలా ఉన్నారు? ఇప్పుడు వారి పరిస్థితి టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఎలా ఉంది? అన్నది బేరీజు వేసుకోవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదం అత్యంత బాధాకరం. ఈ ఘటనలో ఉద్యోగులు, కార్మికుల తప్పిదం ఏమాత్రం లేదు. లిక్విడ్ మెటల్ పొంగి బ్లాస్ట్ అయింది. అలా ఎందుకు జరిగిందంటే.. మిక్స్ సరిగ్గా చేయకపోవడం, రా మెటీరియల్ సరిగ్గా కలపకపోవడం, రా మెటీరియల్‌లో నాణ్యత లోపించడం కారణం. ఈ ప్రమాదంలో ఎక్కడా ఉద్యోగుల తప్పిదం లేదు. ఇలాంటి ఘటనల్లో మానవత్వం చూపించాల్సిన చోట... రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు స్పందిస్తున్న తీరు మానవీయంగా లేదు. ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. కిమ్స్ హాస్పిటల్ వద్ద ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్ రెండేళ్లల్లో 10 వేల మందికి పైగా తొలగింపు..మా ప్రభుత్వ హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌లో రెగ్యులర్, కాంట్రాక్ట్ ఉద్యోగులు కలిపి 28 వేల మంది పని చేయగా... ఈ రెండేళ్లలో ఏకంగా 10,500 మందికి పైగా ఉద్యోగులను తొలగించారు. 6,500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగించారు. వీఆర్ఎస్ ప్రకటించి బలవంతంగా 1,800 మందిపై ఒత్తిడి తెచ్చి తప్పించారు. మరో 2,500 మంది పదవీ విరమణ చేశారు. దీంతో ఈ రోజు సంస్థలో కేవలం 16 వేల మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. ఈ 16 వేల మంది ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది. దేశంలోనే మొదటిసారి...విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఇప్పుడు ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది. వారికి నాలుగున్నర నెలల జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. దేశంలో ఎక్కడా జరగని విధంగా తొలిసారిగా ఉద్యోగస్తుల జీతాలను ప్రొడక్షన్‌తో లింక్ పెట్టారు. అంటే ఉత్పత్తి ఆ స్థాయిలో ఉంటేనే జీతాలు... లేకపోతే లేదు అన్న నిబంధన ఈ రెండేళ్లల్లోనే వి«ధించారు. దేశంలో ఎక్కడా, ఏ సంస్థలో ఇలాంటి విధానం లేదు. ఉద్యోగుల క్వార్టర్లకు (నివాస గృహాలు) వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో యూనిట్ విద్యుత్తుకు కేవలం 50 పైసలు మాత్రమే వసూలు చేసేవారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత రెండేళ్లల్లో కరెంటు బిల్లు యూనిట్‌కు ఏకంగా రూ.8.50కి పెంచారు. ఆ విధంగా వారిపై ఒత్తిడి తెచ్చి క్వార్టర్లు ఖాళీ చేయించే కుట్ర చేశారు. ఉద్యోగులకు ఈ రెండేళ్లలో ఇప్పటి వరకు.. నో బోనస్... నో మెడికల్ ఫెసిలిటీస్... నో హెచ్ఆర్ఏ... నో ఎల్టీసీ... నో లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్... నో ఇన్సెంటివ్స్...! ఈ మాదిరిగా ఉద్యోగులు దారుణ పరిస్థితుల్లో పని చేస్తున్నారు.ఆ ప్యాకేజీ.. వీఆర్ఎస్, జీఎస్టీ బకాయిల కోసమే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం నుంచి రూ.11,440 కోట్ల ప్యాకేజీని సాధించామని చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రులు గొప్పగా చెప్పుకున్నారు. ఈ ప్యాకేజీని కేవలం ఉద్యోగులకు వీఆర్ఎస్ అమలు కోసం ఉపయోగించారు. అదేవిధంగా జీఎస్టీ బకాయిల చెల్లింపు, బ్యాంకు రుణాలు తీర్చడం కోసం వాడారు. అంతే తప్ప స్టీల్ ప్లాంటు నిర్వహణ కోసం గానీ.. ఉద్యోగుల బాగోగుల కోసం గానీ... ప్లాంట్‌లో భద్రతా ప్రమాణాల పెంపు కోసం గానీ ఉపయోగించలేదు. ఏడాదైనా ఉద్యోగం ఇవ్వలేదు..బాధితుల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం మానవీయంగా లేదు. నా పక్కనే.. భాగ్యశ్రీ అనే బాధితురాలు ఉంది. ఆమె తండ్రి పేరు పెంటయ్య. 14 నెలల క్రితం ఇక్కడే, ఇదే సంస్థలో ఈ మాదిరిగానే ప్రమాదం జరిగి పెంటయ్యన్న చనిపోయాడు. పెంటయ్యన్న ఎంప్లాయి నెంబరు 124185. ఆయన పర్మినెంట్ ఉద్యోగి. ఎస్ఎంఎస్–2లో మాస్టర్ టెక్నీషియన్‌గా (ఐడీ కార్డు చూపించారు) పని చేసేవారు. 2025 ఏప్రిల్ 1న ప్రమాదంలో ఆయన చనిపోయాడు. ఆయనకు కుమార్తె భాగ్యశ్రీతోపాటు ఇద్దరు కుమారులు నవీన్, ప్రసాద్ ఉన్నారు. వారి తండ్రి చనిపోయినప్పుడు పిల్లలు ఇద్దరికి నెలలోనే ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కానీ ఆ ఉద్యోగాలు ఇవ్వలేదు సరికదా చివరకు పరిహారం కూడా చెల్లించలేదు. ఇంకా దారుణంగా.. ఆ ఫైల్ పోయిందని అంటున్నారు. ఇంత నిర్దయగా ప్రభుత్వాలు వ్యవహరించడం ధర్మమేనా? అని అడుగుతున్నా. విశాఖపట్నంలోని కిమ్స్ హాస్పిటల్ వద్ద ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్ మీరిచ్చేదేమిటి... ‘బోడి’!ప్రమాద బాధితులకు పరిహారం విషయంలో చంద్రబాబు సుపుత్రుడు లోకేశ్ మాటలు చూస్తుంటే ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? అనిపించింది. ప్రమాదంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు మొత్తం రూ.1.72 కోట్లు ఇస్తామని ఆయన చెబుతున్నాడు. ఇది ఉద్యోగులకు హక్కుగా రావాల్సిందే కదా...! అదనంగా నీవు ఏమిస్తున్నావని అడుగుతున్నా! ఉద్యోగులకు రావాల్సిన గ్రూప్ ఇన్సూరెన్‌న్స్, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, రిస్క్ ఇన్సూరెన్స్... అన్నీ కలిపి రూ.1.45 కోట్లు వస్తాయి. మరోవైపు సంస్థ తన వంతుగా రూ.25 లక్షలు ఇస్తుంది. ఇంకా ప్రధాని సహాయనిధి నుంచి రూ.2 లక్షల చొప్పున వస్తుంది. ఇవన్నీ కలిపి రూ.1.72 కోట్లు అవుతున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సున్నా. మరి నువ్విచ్చేది ఏంది ‘బోడి’ అని అడుగుతున్నా. ఇది ధర్మమేనా? న్యాయమేనా?మా ప్రభుత్వం వచ్చాక నెల రోజుల్లోనే..ఇకనైనా ఈ ప్రభుత్వం మానవత్వం చూపి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నాం. ఒకవేళ చంద్రబాబు ప్రభుత్వం కనుక ఇప్పుడు ఆ సహాయం చేయకపోతే.. బాధ పడకండి. కొంచెం ఓపిక పట్టండి. మా ప్రభుత్వం ఏర్పడగానే నెలలోపు ఆ సహాయం చేస్తాం. కోటి రూపాయలు చొప్పున పరిహారం ప్రతీ బాధిత కుటుంబానికి అందజేస్తాం. మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామ్, ఎంపీలు గొల్ల బాబూరావు, తనూజారాణి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, ధర్మాన కృష్ణదాస్, పుష్ప శ్రీవాణి, మాజీ మంత్రులు అమర్నాథ్, పేర్ని నాని, బాలరాజు, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, తలశిల రఘురాం, కుంభా రవిబాబు, పాలవలస విక్రాంత్, విశాఖ, విజయనగరం, అనకాపల్లి జిల్లాల పార్టీ అధ్యక్షులు కేకే రాజు, చిన్న శ్రీను, బొడ్డేటి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్, తిప్పల నాగిరెడ్డి, గణేష్, కంబాల జోగులు, అదీప్‌రాజ్, కరణం ధర్మశ్రీ, జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, సమన్వయకర్తలు దేవన్‌రెడ్డి, మొల్లి అప్పారావు, మలసాల భరత్‌కుమార్, చింతాడ రవికుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపింది మేమే...అప్పట్లో ఇదే ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రస్తావన వస్తే మా ప్రభుత్వం గట్టిగా ఆపింది. ఆ మేరకు 2021 ఫిబ్రవరి 6న ప్రధానికి ఒక లేఖ రాశాం. ఏ రకంగా చేసి ఈ ప్లాంట్‌ను నిలబెట్టాలో అందులో చాలా వివరంగా ప్రస్తావించాం. అనంతరం నెల రోజుల తర్వాత 2021 మార్చి 9న మరో లేఖ (లేఖ ప్రతులను మీడియాకు చూపించారు) రాశాం. అలా మొత్తం రెండు లేఖలు రాశాం. ఆ తర్వాత 2021 మే నెలలో ఏకంగా అసెంబ్లీలో తీర్మానం (అసెంబ్లీ తీర్మానం మినిట్స్ కాపీని ప్రదర్శించారు) కూడా చేశాం. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించడం అన్యాయమని చెప్పాం. ఏ విధంగా మార్పుచేర్పులు చేస్తే స్టీలు ప్లాంట్‌ను గొప్పగా నిలబెట్టవచ్చో వివరిస్తూ సలహాలు కూడా ఇచ్చాం. ఈ మేరకు అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి అన్ని వివరాలతో కేంద్రానికి పంపాం. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని, ప్రైవేటు చేతుల్లో మేనేజ్మెంట్ను పెట్టాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గట్టిగా కోరాం. ఏ చర్యలు తీసుకుంటే స్టీల్ ప్లాంట్ లాభాల బాట పడుతుందనే విషయాన్ని కూడా పేర్కొంటూ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేశాం. అలా సంస్థను, ఉద్యోగులను కాపాడగలిగాం. అంతేకాకుండా 2022 నవంబరు 12న ప్రధాని విశాఖ వచ్చినప్పుడు జరిగిన సభలో.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని ఆ సభలోనే ప్రధానిని కోరాం. మా పార్టీ అంత గట్టిగా నిలబడింది కాబట్టి, ఉద్యోగులకు తోడుగా నిలబడింది కాబట్టే సంస్థ ప్రైవేటీకరణ జరగలేదు.దేశంలో ఎక్కడా లేని విధంగా ఆదుకున్నాం..గతంలో ఇదే విశాఖలో ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీక్ వల్ల 14 మంది చనిపోతే మా ప్రభుత్వం చాలా వేగంగా స్పందించింది. కోటి రూపాయల చొప్పున పరిహారం ప్రకటించడమే కాకుండా, నేనే స్వయంగా ఇక్కడకు వచ్చి చనిపోయిన వారి కుటుంబాలకు కోటి చొప్పున ఇచ్చాం. గతంలో దేశంలో ఎక్కడా అలా జరగలేదు. ఆ కుటుంబాలకు తోడుగా నిలబడ్డాం. ఆ కుటుంబాల్లో పిల్లలకు ఉద్యోగాలు వచ్చేలా చూశాం. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం తీరు చాలా దారుణంగా ఉంది. కార్మికులకు హక్కుగా రావాల్సినవే వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయం చేయాలి. నాడు మా ప్రభుత్వంలో కార్మికులకు కోటి రూపాయలు ఇచ్చి ఎలా అండగా నిలబడ్డామో... అదే మాదిరిగా ప్రతీ ఉద్యోగికి మేం చేసి చూపించిన తరహాలోనే మీరూ చేయాలని అడుగుతున్నాం. వారికి హక్కుగా వచ్చే రూ.1.72 కోట్లతో పాటు అదనంగా మరో కోటి రూపాయలు ఇవ్వాలి. వారి కుటుంబ సభ్యులకు వెంటనే ఉద్యోగాలు కూడా ఇవ్వాలని కోరుతున్నాం. నా పక్కనే ఉన్న పెంటయ్యన్న కుటుంబాన్ని కూడా అదే మాదిరిగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమికి చెబుతున్నాం. సంస్థ ప్రైవేటీకరణ వద్దంటూ మా మాదిరిగానే అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపి మీ చిత్తశుద్ధి చూపాలని డిమాండ్ చేస్తున్నాం. -
అమరావతిలో మరోసారి బయటపడ్డ బాబు కోట్ల దోపిడీ..
-
తండ్రి , కొడుకులు అవినీతిలో PHD చేశారు..!
-
ఇంత దరిద్రపు పాలనను .. ఎప్పుడు చూడలేదు..!
-
నారాసుర గొడ్డలిపోటు... చంద్రబాబు వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి ఫైర్
-
శవాలతో బాబు బేరాలు.. కోటి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి
-
విశాఖ ఉక్కు విషాదం.. తప్పు ఎవరిది?
విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన తాజా విషాదంపై మరోసారి హై లెవల్ కమిటీని ప్రభుత్వం నియమించింది. అయితే ప్రతి ప్రమాదం తర్వాత విచారణలు, కమిటీలు, నివేదికలతో హడావిడి చేయడం.. కొంతకాలానికి అంతా మరచిపోవడం పరిపాటిగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వరుసగా ప్రమాదాలు పునరావృతమవుతుంటే అసలు బాధ్యులెవరు? తప్పంతా యాజమాన్యానిదేనా? లేక పర్యవేక్షణ బాధ్యత ఉన్న ప్రభుత్వాలకు అసలేం సంబంధం లేదా?? అనే ప్రశ్నలు మరోసారి తెరపైకి వచ్చాయి.విశాఖ ఉక్కు కర్మాగారంలో.. ద్రవ ఉక్కు ప్రమాదంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండటం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయితే ఈ ఘటనతో మరోసారి ఒక కీలక ప్రశ్న తెరపైకి వచ్చింది. ప్రతి ప్రమాదం తర్వాత యాజమాన్యాన్ని తప్పుబట్టడం, విచారణ కమిటీలు వేయడం, పరిహారాలు ప్రకటించడం జరుగుతోంది. కానీ వరుసగా ప్రమాదాలు ఎందుకు పునరావృతమవుతున్నాయి? అసలు బాధ్యత ఎవరిపై ఉంది?..విశాఖ ఉక్కు కర్మాగారం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో ఉత్పత్తి, నిర్వహణ, భద్రతా ప్రమాణాల అమలు, యంత్రాల సంరక్షణ, సిబ్బంది నియామకాల బాధ్యత ప్రధానంగా యాజమాన్యానిదే. ఇది కాదనలేని విషయం. కానీ, కార్మిక సంఘాలు చాలా కాలంగా ఒకే విషయాన్ని చెబుతున్నాయి. అనుభవజ్ఞులైన శాశ్వత ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గిపోయిందని, వారి స్థానంలో కాంట్రాక్టు సిబ్బందిపై ఆధారపడటం పెరిగిందని. దీంతో భద్రతా ప్రమాణాల అమలుపై ప్రభావం పడుతోందని హెచ్చరిస్తున్నాయి.ఒకప్పుడు 18 వేల మందికి పైగా శాశ్వత ఉద్యోగులు ఉన్న ప్లాంట్‌లో ఇప్పుడు వారి సంఖ్య సగానికి పడిపోయింది. ఉత్పత్తి లక్ష్యాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఉన్న ఉద్యోగులపై పనిభారం పెరిగిందని, నిర్వహణ వ్యవస్థపై ఒత్తిడి అధికమైందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. పరిశ్రమల్లో భద్రత అనేది కేవలం యంత్రాల మీద ఆధారపడదు. అనుభవం ఉన్న సిబ్బంది, నిరంతర పర్యవేక్షణ, శిక్షణ, క్రమబద్ధమైన నిర్వహణ కూడా అంతే కీలకం. అయితే ఇక్కడితో కథ ముగియదు. తాజా ప్రమాదం తర్వాత.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మొత్తం బాధ్యతను యాజమాన్యంపైనే నెట్టేసి పక్కకు తప్పుకోవాలని చూస్తోందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. స్టీల్‌ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కావడం వాస్తవమే. కానీ రాష్ట్రంలో పనిచేస్తున్న అతిపెద్ద పారిశ్రామిక సంస్థల్లో ఒకటైన విశాఖ ఉక్కులో పదేపదే ప్రమాదాలు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా బాధ్యత నుంచి తప్పించుకోగలదా? అనే ప్రశ్న కార్మిక వర్గాలు, పరిశ్రమల నిపుణుల నుంచి వస్తోంది.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా కూటమి నాయకులు పవన్ కల్యాణ్ లాంటి వాళ్లు విశాఖ ఉక్కు పరిరక్షణపై పలుమార్లు మాట్లాడారు. కానీ ప్లాంట్‌లో భద్రతా ప్రమాణాలు, సిబ్బంది కొరత, యంత్రాల నిర్వహణ, ప్రమాదాల నివారణ చర్యలపై అదే స్థాయిలో పర్యవేక్షణ జరిగిందా? ఫ్యాక్టరీల శాఖ, కార్మిక శాఖ నిర్వహించిన తనిఖీల్లో ఏమి బయటపడింది? గత ప్రమాదాల తర్వాత ఇచ్చిన సూచనల అమలు ఎక్కడిదాకా వచ్చింది? అనే ప్రశ్నలకు ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని విమర్శకులు అంటున్నారు.ప్రమాదం జరిగిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వ సంస్థ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పక్కకు తప్పుకోవచ్చా? అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఫ్యాక్టరీల భద్రతను పర్యవేక్షించే ఫ్యాక్టరీ ఇన్స్పెక్టరేట్, కార్మిక శాఖ, జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే పనిచేస్తాయి. ప్రమాదాలకు దారితీసే లోపాలను గుర్తించడం, భద్రతా తనిఖీలు నిర్వహించడం, హెచ్చరికలు జారీ చేయడం వంటి బాధ్యతలు కూడా వాటిపైనే ఉంటాయి.ముఖ్యంగా గత పదిహేనేళ్లలో స్టీల్‌ప్లాంట్‌లో వరుస ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 2012లో జరిగిన ఘోర పేలుడులో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కూడా పలు ఘటనలు నమోదయ్యాయి. ఇన్ని ప్రమాదాలు జరిగినా భద్రతా వ్యవస్థలపై స్వతంత్ర సమీక్షలు జరిగాయా? గత విచారణల సిఫారసులు అమలయ్యాయా? వాటిని ఎవరు పర్యవేక్షించారు? అనే ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానాలు కనిపించడం లేదు.ఇక మరో కోణం ప్రైవేటీకరణ వివాదం. విశాఖ ఉక్కును కాపాడతామని, ప్రైవేటీకరణను అడ్డుకుంటామని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చాయి. కానీ వాస్తవంగా ప్లాంట్ భవిష్యత్తు, ఆర్థిక పరిస్థితి, సిబ్బంది బలోపేతం, ఆధునీకరణ వంటి అంశాల్లో ఎంత మేర పురోగతి సాధించారన్న ప్రశ్నలు ఇప్పుడు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. ఉక్కు కర్మాగారం గురించి రాజకీయంగా పెద్ద ప్రకటనలు చేసినవారు, కార్మిక భద్రతపై అదే స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారా? అనే ప్రశ్న కూడా కార్మిక వర్గాల నుంచి వినిపిస్తోంది.అందుకే ఈ ప్రమాదాన్ని కేవలం ఒక సాంకేతిక లోపంగా చూడటం సరిపోదని పరిశ్రమల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది యాజమాన్య నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం, సిబ్బంది విధానాలు, ప్రభుత్వాల నిరంతర పర్యవేక్షణ వైఫల్యం వంటి అనేక అంశాల కలయికగా చూడాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.ఈ విషాదానికి బాధ్యులపై చర్యలు తీసుకోవడం అవసరమే. కానీ అంతకంటే ముఖ్యమైనది గత ప్రమాదాల మాదిరిగానే ఈ ఘటన కూడా మరో ఫైల్‌గా మిగిలిపోకుండా చూడటం. స్వతంత్ర విచారణ, భద్రతా ప్రమాణాల సమగ్ర ఆడిట్, సిబ్బంది కొరతపై సమీక్ష, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతలపై స్పష్టమైన జవాబుదారీతనం తీసుకొస్తేనే భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుంది. లేకపోతే ప్రతి కొన్నేళ్లకోసారి ప్రాణాలు కోల్పోయేది కార్మికులే.. సంతాప ప్రకటనలు విడుదల చేసేది వ్యవస్థే. -
బాబు మీటింగ్ అట్టర్ ప్లాప్ తిట్టుకుంటూ వెళ్లిపోయిన జనం
-
నోటికొచ్చినట్టు వాగడం.. బాబు తప్పులు కవర్ చేయడం నీకు అలవాటు
-
చంద్రబాబుపై రాచమల్లు శివ ప్రసాద్ మాస్ ర్యాగింగ్
-
ప్రభుత్వ సంక్షేమం బంద్ ఉద్యోగులపై పనిభారం
-
నీ కొడుకుని సీఎం చేయడానికి రాషాన్ని అమ్మేస్తావా..!?
-
నా ఇంటిపై దాడి చేసిన వాడిని ఒక్కడినైనా అరెస్ట్ చేశారా..! ఛీ.. మీరు పోలీసులా..?
-
జగన్ ను కలిసిన రైతులపై ఎల్లో మీడియా ట్రోలింగ్
-
మహిళలను కించపరిచిన వ్యక్తికి రాజ్యసభ సీటు..!
-
విష ప్రచారం చేయడం దుర్మార్గం.. మేం రైతులం కాదా?... సీడ్ యాక్సెస్ రోడ్డుపై ఉండవల్లి రైతుల ఆందోళన
-
రాజకీయ కుట్రతోనే నాపై దుష్ప్రచారం
సాక్షి, అమరావతి: కనీస ఆధారాలు లేకుండా తనపై దు్రష్పచారం చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న టీడీపీ అనుకూల ఎల్లో మీడియాపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని వైఎస్సార్సీపీ రాజకీయ సహాయకుడు (పీఏ) కె.నాగేశ్వర్‌రెడ్డి (కేఎన్ఆర్) ప్రకటించారు. ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్తానని, చట్టపరంగా చర్యలు తీసుకుంటానని ఆదివారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తనకు సంబంధంలేని మద్యం విధానంపై ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోందని విమర్శించారు. ఆ ప్రకటనలో కేఎన్ఆర్ ప్రధానంగా పేర్కొన్న అంశాలు ఇవీ.. ⇒ ఎల్లో మీడియా నాపై వ్యక్తిత్వ హనానికి పాల్పడుతోంది. నేను సీనియర్ జర్నలిస్ట్‌ను. 2003లోనే ఒక ప్రముఖ వార్తా పత్రికలో ఎడిషన్ ఇన్ఛార్జిగా పనిచేశా. 20 ఏళ్ల కిందటే సొంతంగా వ్యాపారాలు మొదలు పెట్టి అప్పటి నుంచి ఆదాయపు పన్ను రిటరŠన్స్ దాఖలు చేస్తున్నా. ఆదాయపు పన్ను చెల్లిస్తున్నా. వ్యాపారాల కోసం బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నా. నాకు ఏమాత్రం సంబంధంలేని అంశాలను ఆపాదిస్తూ విష ప్రచారం చేస్తున్నారు. నా బంధువులు, స్నేహితుల ఆస్తులు కూడా నావే అనడం ఎంతవరకు న్యాయం? అలా అయితే వ్యాపారాలు చేసే ప్రతి ఒక్కరినీ అలాగే చూడాల్సి వస్తుంది. రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, బి.ఆర్.నాయుడు తదితరులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సన్నిహితులే. మరి వారి ఆస్తులన్నీ కూడా చంద్రబాబువే అవుతాయా? ⇒ విశాఖపట్నంలో ఏపీ హౌసింగ్ బోర్డుకు చెందిన భూముల విషయాన్ని వక్రీకరిస్తూ నాపై దు్రష్పచారం చేస్తున్నారు. హౌసింగ్ బోర్డుకు చెందిన 97.50 ఎకరాలను అభివృద్ధి చేసేందుకు రెండు దశాబ్దాల క్రితం ఏపీ ప్రభుత్వం, సింగపూర్‌కు చెందిన మత్సడో ఇండస్ట్రీస్ మధ్య ఒప్పందం కుదిరింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే ఆ ఒప్పందం చేసుకున్నారు. అదంతా చట్టబద్ధ వ్యవహారమే. దాంతో నాకే మాత్రం సంబంధం లేదు. ప్రస్తుతం ఆ మొత్తం ప్రక్రియను వక్రీకరిస్తూ ఎల్లో మీడియా నాపై దుష్ప్రచారం చేస్తోంది. ⇒ ఎల్లో మీడియా ప్రస్తావించిన రమణారెడ్డి సింగపూర్వాసి. ఆయన మత్సడో కంపెనీలో వాటాదారు కూడా కాదు. కానీ ఆయనకు, నాకు మధ్య ఏదో వ్యాపార లావాదేవీలు ఉన్నాయని అవాస్తవ ప్రచారం చేస్తున్నారు. ఆయన 2003లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే ఏపీలో వ్యాపారాలు ప్రారంభించారు. విశాఖపట్నంలోనే నాలుగు ప్రాజెక్టులు చేపట్టారు. చంద్రబాబుకు సింగపూర్‌లో మంత్రులు, వ్యాపారవేత్తలను పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన చంద్రబాబుకే సన్నిహితుడు. సింగపూర్‌కు చెందిన జురాంగ్ కంపెనీని అమరావతికి తీసుకురావడంలో రమణారెడ్డే సహకరించారని కూటమి ప్రభుత్వమే చెబుతోంది. మరి ఆయన నాకు బినామీ ఎలా అవుతారు...? ఆయన నా బినామీగా ఎల్లో మీడియా ఎలా దు్రష్పచారం చేస్తుంది? ⇒ విజయవాడలో ఎవరో రియల్టర్‌ను నేను బెదిరించినట్లు ఎల్లో మీడియా కట్టుకథలు అల్లుతోంది. నేను గన్ పెట్టి మరీ బెదిరించానని విష ప్రచారం చేయడం విడ్డూరంగా ఉంది. నాపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. కానీ ఎల్లో మీడియా మాత్రం దుష్ప్రచారం చేస్తుండటం విడ్డూరంగా ఉంది. రాజకీయ కుట్రతో ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడతాం. న్యాయపరంగా కఠిన చర్యలు తీసుకుంటా. ఆ ప్రాపర్టీకి, కేఎన్నార్‌కు సంబంధమే లేదు ⇒ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఆర్బిట్రేషన్‌కు వక్రీకరణలు చేస్తారా? ⇒ ప్రతి అంశానికి డాక్యుమెంట్లు ఉన్నా.. బినామీ ముద్ర వేయడం, విష ప్రచారం చట్టరీత్యా నేరం విశాఖపట్నం హౌసింగ్ బోర్డుకు చెందిన 97.5౦ ఎకరాల అభివృద్ధి చేయడానికి దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, సింగపూర్‌కు చెందిన మత్సడో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు మధ్య ఒప్పందం కుదిరింది. ఈ కంపెనీలో అనేక కంపెనీలు, వ్యక్తులు దాదాపు రూ.650 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇవన్నీ చట్టబద్ధంగా నడిచిన ప్రక్రియ. కానీ పనులు ఎంతకూ ప్రారంభం కాకపోవడంతో పెట్టుబడిదారులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో మత్సడో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కి, అందులో పెట్టుబడులు పెట్టిన వారికి మధ్య ఉన్న వివాదాన్ని సెటిల్ చేసుకున్నారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో చట్టబద్ధంగా దీనిపై ఆర్బిట్రేషన్ ప్రక్రియ జరిగింది. మత్సడో కంపెనీ తన వద్ద పెట్టిన పెట్టుబడుల మేరకు భూములను అప్పగించింది. ఆ కంపెనీలో దాదాపు 13 పార్టీలు పెట్టుబడులు పెడితే.. ఒక్కో పార్టీలో మళ్లీ వేర్వేరు కంపెనీలు, వ్యక్తులు ఉన్నారు. ఇందులో 13వ పార్టీలో ఒక కంపెనీతోపాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ ముగ్గురిలో కేఎన్నార్ బావమరిది రాంగోపాల్‌రెడ్డి కూడా ఉన్నారు. ఈ ముగ్గురూ కలసి పెట్టిన పెట్టుబడికి గాను వివాద పరిష్కారంలో భాగంగా 2.5 ఎకరాలను మత్సడో వారికి దఖలు పరిచింది. ఈ వ్యవహారం అంతా చట్టపరంగా జరిగింది. ప్రతి అంశానికి డాక్యుమెంట్లు ఉన్నా కూడా దీనికి బినామీ ముద్ర వేయడం, విష ప్రచారం చేయడం చట్టరీత్యా నేరం. ఈనాడు, ఆంధ్రజ్యోతి కథనాల్లో ప్రస్తావించిన సింగపూర్ వాసి రమణారెడ్డితో మత్సడోకు, దాంట్లో పెట్టుబడి పెట్టున వారికి ఎలాంటి సంబంధం లేదు. అతను వాటాదారు కూడా కాదు. ఎలాంటి క్రయ విక్రయాలు కూడా జరపలేదు. రమణారెడ్డి, కేఎన్నార్ మధ్య బినామీ వ్యవహారం నడిచినట్టుగా తప్పుడు ప్రచారం చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ ప్రాపర్టీకి, కేఎన్నార్‌కు సంబంధమే లేదు. విష కథనాలు ఆపకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. తప్పుడు ప్రచారాలు చేసినందుకు కోర్టుకు ఈడుస్తాం. – పి.శ్రేయస్‌రెడ్డి, న్యాయవాది -
విష ప్రచారం దుర్మార్గం.. మేం రైతులం కాదా
తాడేపల్లి రూరల్: రాజధాని ముఖ ద్వారమైన ఉండవల్లి రైతులపై సీడ్ యాక్సెస్ రోడ్డు విషయంలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని, తామంతా నిజమైన రైతులమేనని ఆదివారం వారు తమ పట్టాదారు పాస్ పుస్తకాలు చేత పట్టుకుని సీడ్ యాక్సెస్ రోడ్డుపై ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ శ్రేణులు దుష్ప్రచారం చేస్తున్న విధంగా తాము దోషులం, దుండగులం కాదని నినదించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. రాజధాని ముఖ ద్వారమైన ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో పంట పొలాలకు రాజధాని ప్రకటించకముందే కోట్ల రూపాయల విలువ ఉందని చెప్పారు. తుళ్లూరులో రూ.5 లక్షలు ఉంటే ఉండవల్లిలో అప్పట్లోనే ఎకరం రూ.కోట్లు పలికిందని తెలిపారు. ‘అక్కడ 2 ఎకరాల నుండి 10 ఎకరాలున్న రైతులు ఎక్కువ మంది ఉంటే, ఈ ప్రాంతంలో 10 సెంట్ల నుంచి 25 సెంట్ల వరకు ఉన్న రైతులు ఎక్కువగా ఉన్నారు. వారికి కౌలు సంవత్సరానికి రూ.లక్షల్లో వస్తుంది. మాకు వేలల్లో కూడా రాదు. ఆ కౌలుతో మేము ఎలా బతకాలి? రాజధాని ప్రకటించినప్పటి నుంచి మేము ఆందోళన చేస్తూనే ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి వచ్చినప్పటి నుంచి రాజధానిలో నివాసముండే కొంత మంది టీడీపీ నాయకులు మాపై దుష్ప్రచారం చేయిస్తున్నారు. టీడీపీ సెంట్రల్ కార్యాలయం నుంచే ఈ కుట్ర అమలవుతోంది. ఫలితంగా 150 పైచిలుకు యూట్యూబ్ చానల్స్‌లో మాలో ప్రతి ఒక్కరి గురించి వేర్వేరుగా మాటల్లో చెప్పడానికి వీలులేని విధంగా విష ప్రచారం చేస్తున్నారు. కులం పేరుతో దూషిస్తున్నారు. ఇలా దుర్మార్గంగా దుష్ప్రచారం చేయడం చాలా బాధేస్తోంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు ఇంకా ఏమన్నారంటే.. దుష్ప్రచారం చేయడం సరికాదుఉండవల్లిలో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మించడానికి 99 శాతం మంది రైతులు కులాలు, మతాలతో సంబంధం లేకుండా భూములను అందజేశాం. 20–25 సెంట్లు ఉన్న రైతులకు ఇదే జీవనాధారం కాబట్టి లాండ్ పూలింగ్ నుంచి, ఇతర అంశాల నుంచి మినహాయించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. దీన్ని వేరేవిధంగా స్క్రోలింగ్ చేయడం, ప్రచారం చేయడం సబబు కాదు. తుళ్లూరులో 2015కు ముందు ఎకరం రూ.5 లక్షలు ఉంటే, ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో రూ.4 కోట్లు ఉండేది. 2014కు ముందు ఉండవల్లి, పెనుమాకలో ఎకరం భూమి అమ్మి తుళ్లూరులో 10–20 ఎకరాలు కొనొచ్చు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ అన్నయ్య, సినీ హీరో చిరంజీవి 2010కి ముందు ఇక్కడ ఎంతకు పొలం కొన్నారో విచారించండి. అప్పుడు మేము అడిగేది న్యాయమా.. కాదా.. అని మీకే తెలుస్తుంది. కిరణ్ కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉండవల్లి గుహల ముందు టౌన్ ప్లానింగ్ అభివృద్ధికి 400 ఎకరాల పొలం తీసుకునేందుకు యత్నించారు. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంతి నారా చంద్రబాబునాయుడును హైదరాబాద్ వెళ్లి కలసి మా సమస్య విన్నవించుకున్నాం. నాలుగు పంటలు పండే భూములు ఎలా తీసుకుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పక్షాన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఇక్కడ 20–25 సెంట్ల పొలాల్లో రెండు మూడు పంటలను ఒకేసారి పండిస్తున్నాం. తుళ్లూరు.. ఆ చుట్టు పక్కల వర్షం పడితేనే పంటలు పండుతాయి. వారికి ఆ భూములు ఇవ్వడం వల్ల ఎటువంటి నష్టం లేదు. మాకు మా కుటుంబాలకు ఈ భూములే జీవనాధారం. మా భూములను మాకు వదిలేయండి..మేము అభివృద్ధికి అడ్డంటూ టీడీపీ నాయకులు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. మా సమస్యలను విన్నవించుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి నారా లోకేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్కు ప్రయత్నించినా ఇవ్వలేదు. మా భూములను రక్షించుకునేందుకు రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీల నేతలను కలిశాము. ఇందులో భాగంగానే వైఎస్ జగన్‌ను కలసి మా గోడు వెళ్లబోసుకున్నాం. ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మానుకోండి. మా భూములను మాకు వదిలేయండి. భూ సమీకరణ/భూ సేకరణ నుంచి ఉండవల్లిని మినహాయించండి. లేదంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తాం’ అని రైతులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నేతలు ఈశ్వర్‌రెడ్డి, ఈశ్వరరావు, ఉండవల్లి అశ్వనికుమార్, భాస్కరరావు, మున్నంగి శ్రీధర్‌రెడ్డి, గుంటక నరేష్‌రెడ్డి, చందు చిన్న బసవయ్య, గోపాలం ప్రభాకరరావు, అశోక్‌రెడ్డి, గుర్రాల శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ కళ్లం సంజీవరెడ్డి, ఈశ్వరయ్య, తెన్నేరు కోటేశ్వరరావు, తెన్నేరు నాగభూషణం, సందు సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
పైరవీల ‘రాజ్యం’!.. టీడీపీ, జనసేనలో రాజుకున్న సెగలు
సాక్షి, అమరావతి: రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక వ్యవహారం అటు టీడీపీ ఇటు జనసేనలో కాక రేపుతోంది. చంద్రబాబు తమను నమ్మించి మోసం చేశారని పలువురు టీడీపీ సీనియర్ నేతలు రగిలిపోతుండగా.. జనసేనలో పైరవీకారులు, ఆఖరి నిమిషంలో పార్టీలో చేరే నేతలకు మాత్రమే పదవులు దక్కుతాయని మరోసారి తేటతెల్లమైందని, ఇలాగైతే పార్టీ ఎలా బలపడుతుందని ఆ పార్టీ నేతల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. గత ఎన్నికల సమయంలో అత్యధిక చోట్ల ఆఖరి నిమిషంలో జనసేనలో చేరిన టీడీపీ నేతలకే సీట్లు దక్కాయని, ఇప్పుడు కూడా అదే ధోరణి కొనసాగుతోందని స్పష్టం చేస్తున్నారు. లాబీయిస్టు సానా సతీష్, కార్పొరేట్ విద్యాసంస్థల అధిపతి భాష్యం రామకృష్ణ, స్పీకర్ అయ్యన్నపాత్రుడి కుమారుడు విజయ్‌కి పదవుల పందేరంపై టీడీపీలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు తమను నమ్మించి మోసం చేశారని పలువురు సీనియర్ నేతలు రగిలిపోతున్నారు. టీడీపీ రాయలసీమ కోఆర్డినేటర్, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త శ్రీనివాసులరెడ్డి చంద్రబాబు వైఖరిని బహిరంగంగానే తప్పుబడుతూ ఆదివారం ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. 13 ఏళ్ల పాటు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ కోసం పని చేసినా రాజ్యసభ హామీని నెరవేర్చకుండా చంద్రబాబు తనకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. ఇక వర్ల రామయ్యకు అవకాశం ఇవ్వకపోవడంతో టీడీపీలో దళిత సామాజికవర్గం అసహనం వ్యక్తం చేస్తోంది. ప్రతిసారీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సమయంలో వర్ల రామయ్య పేరును తెరపైకి తేవడం చివరకు సామాజిక సమీకరణాల పేరుతో పక్కనపెట్టి అవమానించడం చంద్రబాబుకు ఆనవాయితీగా మారిందని మండిపడుతున్నారు. దళితులంటే చంద్రబాబుకు చిన్నచూపు అనే విషయం మరోసారి రుజువైందని పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. అహర్నిశలు పార్టీ కోసం పని చేస్తున్నా గుర్తింపు లేకపోగా పదవుల విషయంలో తన పట్ల అవమానకరంగా వ్యవహరిస్తున్నారని రామయ్య సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. యనమల గుర్రు.. కంభంపాటి కస్సు..! సీనియర్ నేత యనమల రామకృష్ణుడి బాధ వర్ణనాతీతమని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. పెద్దల సభకు పంపాలని పదేపదే ప్రాథేయపడినా చంద్రబాబు పట్టించుకోకపోవడంపై యనమల తీవ్రంగా కలత చెందుతున్నట్లు చెబుతున్నారు. ఏ క్షణమైనా ఆయన తన అసంతృప్తిని వెళ్లగక్కే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. నారా లోకేష్ తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ధన బలం ఉన్న వారిని పార్టీ నేతలుగా చిత్రీకరించి ఉన్నత పదవులు కట్టబెట్టడం ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నట్లు చెబుతున్నారు. మరో సీనియర్ నేత కంభంపాటి రామ్మోహనరావు సైతం తనను అవమానించారని ఆవేదనతో రగిలిపోతున్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిని అయినప్పటికీ పదవుల విషయంలో వంచించారని ఆయన వాపోతున్నట్లు టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది. ఇక గల్లా జయదేవ్, టీడీ జనార్థన్, ఎంఏ షరీఫ్ తదితర నేతలు సైతం తమకు అన్యాయం చేశారని నైరాశ్యంలో కూరుకుపోయారు. ఒక్క మహిళా కనపడలేదా? మూడు స్థానాల్లో టీడీపీ ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాజ్యసభ సీటు ఇచ్చేందుకు చంద్రబాబుకు ఒక్క మహిళ కూడా కనిపించలేదా? అని మహిళా లోకం నిలదీస్తోంది. మహిళల కోసమే టీడీపీ ఉందని మహానాడులో తీర్మానాలు చేసి తీరా రాజ్యసభ సీటు ఇవ్వకుండా చంద్రబాబు మరోసారి తన నైజం బయటపెట్టుకున్నారని మహిళా నేతలు మండిపడుతున్నారు. కార్పొరేట్ వైపే మొగ్గు.. తన కుమారుడి కోటరీలో కీలక వ్యక్తిగా ఉన్న సానా సతీష్‌కి మరోసారి రాజ్యసభ పదవి ఇవ్వడం ద్వారా తాను లాబీయిస్టుల వైపే మొగ్గు చూపుతానని చంద్రబాబు తేల్చి చెప్పినట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. సతీష్ వివాదాస్పద వ్యక్తి అని, అతడితో కలిసి తిరిగితే జనం ఏమనుకుంటారని ఎల్లో మీడియాకు చెందిన ఏబీఎన్ రాధాకృష్ణ తన తొలి పలుకులో ప్రశ్నించారు. టీడీపీలో సీనియర్లంతా వ్యతిరేకించినా సతీష్‌కు పార్టీ ఉపాధ్యక్ష పదవి ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు రెండోసారి ఆయన రాజ్యసభకు పంపుతుండటాన్ని బట్టి తమ బంధం ఎంత బలమైందో రుజువు చేశారు. భాష్యం రామకృష్ణ కంటే సీనియర్లు టీడీపీలో చాలామంది ఉన్నా ఆయనకే అవకాశం ఇవ్వడం ద్వారా కార్పొరేట్ శక్తులంటే తనకు మక్కువని చంద్రబాబు తేల్చేశారు. ఇక స్పీకర్ అయ్యన్నపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్ దురహంకారి కావడంతో పార్టీలో ఆయన పట్ల పూర్తి ఆమోదం లేదు. అందుకే పార్టీ సోషల్ మీడియా విభాగం బాధ్యతల నుంచి చాలాకాలం క్రితమే ఆయన్ను తప్పించారు. అయితే లోకేష్‌కి సన్నిహితుడు కావడం, ధన బలం ఆధికంగా ఉండడంతో ఆయన్ను రాజ్యసభకు ఎంపిక చేశారు. ఒక కుటుంబంలో ఒక్కరికే పదవి అని తరచూ చెబుతూ తండ్రికి స్పీకర్ పదవి, కుమారుడికి రాజ్యసభ సీటు ఎలా ఇస్తారని టీడీపీలో ఆశావహులు ప్రశ్నిస్తున్నారు. నాలుగింటిలో రెండు సొంత వర్గానికే.. కూటమి తరఫున నాలుగు రాజ్యసభ స్థానాలు భర్తీ అవుతుండగా రెండు సొంత సామాజిక వర్గానికి చెందిన వారికే ఇవ్వడం ద్వారా తన ప్రాధాన్యతను చంద్రబాబు మరోసారి చాటుకున్నారనే అభిప్రాయం సామాన్య ప్రజానీకంలోనూ వినిపిస్తోంది. జనసేన తరఫున సీటు పొందిన లింగమనేని, టీడీపీ తరఫున సీటు దక్కించుకున్న భాష్యం రామకృష్ణ.. వీరిద్దరూ చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారే కావడం, ఆయనకు సన్నిహితులనే విషయం తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు హోరెత్తుతున్నాయి. విజయ్ సత్తా చూశాకైనా మారకుంటే ఎలా? జనసేన అంటే టీడీపీకి బీ టీమ్ అని ఇప్పటికే సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతుండగా పార్టీకి దక్కిన రాజ్యసభ సీటును సైతం చంద్రబాబు సన్నిహితుడిగా ముద్రపడిన వ్యక్తికే కేటాయించడం పట్ల జన సైనికుల్లో తీవ్ర నిరుత్సాహం వ్యక్తమవుతోంది. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలకు కట్టుబడి పనిచేసిన వారిని పక్కనపెట్టి ఓ బడా వ్యాపారవేత్తను పెద్దల సభకు పంపడం వెనుక అంతర్యమేమిటని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. ఉత్తరాంధ్ర, కోస్తాలో పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన నేతల్లో ఎవరికైనా ఆ పదవి ఇచ్చి ఉంటే జనసేన క్యాడర్ చురుగ్గా వ్యవహరించే అవకాశం ఉండేదనే చర్చ జరుగుతోంది. ‘కష్టపడేవారికి గుర్తింపు లేకుండా.. పైరవీలు, ఆర్థిక అండదండలు ఉన్నవారికే పదవులు కట్టబెడితే క్షేత్రస్థాయిలో పార్టీ కోసం ఎవరు పనిచేస్తారు? ఇలాగైతే జనసేన బలపడేదెలా?’ అంటూ పార్టీ సీనియర్ నేతలు బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో రెండేళ్లలోనే అధికారంలోకి రాగలిగిన సీఎం విజయ్ ఎక్కువగా కొత్త వ్యక్తులకే అవకాశం కల్పించారని.. దళపతి సత్తా, ఆ పార్టీ సాధించిన చరిత్రాత్మక విజయం చూసిన తర్వాత కూడా పవన్‌కళ్యాణ్ మారకపోతే ఎలా? అని జనసేన సైనికులు ప్రశ్నిస్తున్నారు. -
కూటమి సర్కార్‌పై ఉద్యమానికి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు
సాక్షి,విజయవాడ: కూటమి ప్రభుత్వంపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలో ఏపీ జేఏసీ అమరావతి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 28 జిల్లాల ఏపీ జేఏసీ అమరావతి సభ్యులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులు విసిగిపోయారు. ఉద్యమానికి సిద్ధమవుతున్నాం. 13 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశాం. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కావు. కలిసొచ్చే సంఘాలతో కలిసి ఉద్యమం చేస్తాం. ఉద్యమ కార్యాచరణకు అందరూ కలిసిరావాలి అని అన్నారు.అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్పినా, ఇప్పటివరకు ఆ విషయంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. ‘ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి భారమెలా అవుతారు?. రెవెన్యూ ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారు.ఆర్టీసీ ప్రైవేటీకరణపై రేపు రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుందని చెప్పారు. -
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే TDP ఘోర ఓటమి ఖాయం..
-
ఆక్వా ‘వెల’వెల
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీ కూటమి పాలకుల దోపిడీకి ఇప్పటికే అన్ని రంగాలు కుప్పకూలిపోగా, తాజాగా ఆక్వా రంగమూ సంక్షోభంలో కూరుకుపోతోంది. నాసిరకం సీడ్, ఫీడ్ ధరల పెంపుతో కుదేలవుతోంది. ఆక్వా ఉత్పత్తుల అమ్మకాల నుంచి ఎగుమతుల వరకు అడుగడుగునా నష్టాలు వాటిల్లడంతో నిండా మునుగుతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. పరిస్థితులు ఇలానే ఉంటే సాగు చేయలేమని తెగేసి చెబుతున్నారు. వచ్చే సీజన్లో క్రాప్ హాలిడే ప్రకటించే యోచనలో ఉన్నారు. దీనికి చంద్రబాబు సర్కారు వైఫల్యమే కారణంగా కనిపిస్తోంది. ముడి సరుకుల ధరలు పెరుగుదల చంద్రబాబు పాలనలో ముడి సరుకుల ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది ఐదునెలల కాలలంలోనే రొయ్య ఫీడ్‌లో వినియోగించే ఫిష్ మీల్, సోయాబీన్, వేరుశనగ కేకు, ఫిష్ ఆయిల్, విటమిన్ ఫ్రీ మిక్స్, మినరల్ ఫ్రీ తదితర మెటీరియల్ ధరలు దాదాపు 50 నుంచి 70 శాతం పెరిగాయి. జనవరిలో ఫిష్ మీల్ కేజీ రూ.155 ఉంటే మే నెలలో కేజీ రూ.260కు పెరిగింది. ఐదు నెలల వ్యవధిలో ఫార్ములా కాస్ట్ దాదాపు రూ.17 పెరగడంతో ఫీడ్ యాజమాన్యాలు ధరలు పెంచాల్సి వచ్చిందని సమాచారం. టన్నుపై రూ.4 వేల నుంచి రూ.పదివేల వరకు ధరలు పెంచారు. రొయ్యల ధరలు పతనం ఇదిలా ఉంటే బాబు సర్కారు నిర్వాకం వల్ల రొయ్యల ధరలు భారీగా పతనమయ్యాయి. వ్యాపారులు సిండికేట్‌గా మారడంతో రొయ్య రైతులు దోపిడీకి గురవుతున్నారు. ఒక పక్క నాసిరకం సీడ్‌తోపాటు మరో పక్క పెరిగిన ఫీడ్ ధరలతో తల్లడిల్లుతున్న రైతులు చంద్రబాబు ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో మండిపోతున్నారు. ఆక్వా సాగులో ఒక టన్ను రొయ్యలు ఉత్పత్తి చేయాలంటే రైతులు 90 రోజులు రొయ్య పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అందులో సీడ్ కెమికల్స్, ఏరియేటర్స్, కరెంట్ బిల్లులు, జనరేటర్, ఫీడింగ్ కూలీలు తదితర పరికరాల కొనుగోళ్లు, లీజులతో కలిపి దాదాపు రెండెకరాల చెరువుకు రూ.2.60 లక్షల వరకు ఖర్చు చేయాలి. ప్రస్తుతం ఉన్న రొయ్యల ధరలతో సరిచూసుకుంటే ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు నష్టం వాటిల్లుతోంది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కేంద్రం దిగుమతి సుంకాలు తగ్గిస్తే.. రాష్ట్రం దోపిడీ ఆక్వా ఫీడ్ తయారీలో వినియోగించే ముడిసరుకుల దిగుమతికి గతంలో సుంకాలు 30 శాతం ఉండగా, తాజాగా వాటిని ఐదు శాతానికి కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అనధికారికంగా ఫీడ్ ఫ్యాక్టరీల్లో తయారయ్యే ఉత్పత్తిలో వాటాలు దండుకోవడంతో యాజమాన్యాలు అనివార్యంగా ధరలు పెంచేశాయి. అందుకే అప్సడా అనుమతి లేకుండా గత ఫిబ్రవరిలో ఫీడ్ ఫ్యాక్టరీలు ధరలు పెంచినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండిపోయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల వ్యతిరేకతతో యాజమాన్యాలపై ఒత్తిడి అనూహ్యంగా పెరిగిన ఫీడ్ ధరల నేపథ్యంలో ఆక్వా రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో సర్కారు జంకింది. ఫీడ్ ధరలు తగ్గించాలని వ్యాపారులను ప్రాధేయపడుతోంది. పెరిగిన రా మెటీరియల్ ధరలు, ప్రభుత్వ పెద్దల దోపిడీతో తప్పని పరిస్థితుల్లో ధరలు పెంచిన వ్యాపారులు ప్రభుత్వ విన్నపాన్ని తోసిపుచ్చారు. ధరలు తగ్గించలేమని తెగేసిచెప్పారు. అయినా ప్రభుత్వం ఒత్తిడి తెసేన్త ఫ్యాక్టరీలు నాసిరకం ఫీడ్‌ను మార్కెట్లోకి తెచ్చే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఇప్పటికే నాసిరకం సీడ్‌తో సతమతమవుతున్న రైతులు ఫీడ్ కూడా నాణ్యత లేకపోతే తీవ్రంగా నష్టపోయే ఆస్కారం ఉంది. సాగుకు విముఖత ఇదిలా ఉంటే బాబు పాలనలో వెంటాడుతున్న నష్టాలతో రైతులు ఆక్వా సాగు అంటేనే విముఖత చూపిస్తున్నారు. ఈ కారణంగానే గత రెండేళ్లలో 50 శాతం సాగు విస్తీర్ణం తగ్గిపోయినట్టు సమాచారం. ఈ ఏడాది ఫీడ్ ధరలు తీవ్రంగా పెరిగి, రొయ్యల ధరలు పతనమైన నేపథ్యంలో వచ్చే సీజన్లో సాగుకు విరామం ప్రకటించే యోచనలో రైతులు ఉన్నారు. సర్కారు ఆదుకోకుంటే క్రాప్ హాలిడేనే శరణ్యమని తెగేసి చెబుతున్నట్టు తెలుస్తోంది. రాయితీలతోనే మనుగడ ఆక్వా రంగం మనుగడ సాగించాలంటే.. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఫీడ్ ఫ్యాక్టరీలను చేస్తున్న దోపిడీకి కళ్లెం వేయడంతోపాటు రా మెటీరియల్‌పై రాయితీలు, ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీలు ఇవ్వడం, ఆక్వా ఉత్పత్తులకు గిట్టుబాటు ధర, మార్కెట్ సౌకర్యం కల్పించడం వంటి తక్షణ చర్యలు చేపట్టాలి. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీలు ఇస్తామని వాగ్దానం చేసింది. యూనిట్ విద్యుత్ రూపాయిన్నరకే ఇస్తామని నమ్మబలికి ఇప్పుడు విస్మరించింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తక్షణం తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
చంద్రబాబు ప్రభుత్వ వేధింపులు భరించలేకే ఆత్మహత్యలు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం పెట్టే టార్చర్ భరించలేక కర్నూలు జిల్లాలో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి శనివారం ఓ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హుస్సేన్ అనే సచివాలయ ఉద్యోగి సర్జరీ అయింది... సెన్సస్ డ్యూటీ వల్ల తిరగలేక బాధ పడుతున్నా... మళ్లీ ఇంటింటికీ తిరిగి పని చేయలేను అని ఎంత వేడుకున్నా వినకుండా బీఎల్వో డ్యూటీ వేయడంతో తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు.‘‘చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులపై ఎంత తీవ్ర ఒత్తిడి ఉందో ఈ సంఘటన రుజువు చేస్తోంది. టెలీ, వీడియో కాన్ఫరెన్సుల గోలకు తోడు సర్వేలు, ప్రజాప్రతినిధుల ఒత్తిడిని తట్టుకోలేక ఉద్యోగులు క్షోభకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. గత నెల రోజుల వ్యవధిలో సచివాలయ ఉద్యోగులు నలుగురు ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కూటమి ప్రభు త్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వంద మందికి పైగా సచివాలయ ఉద్యోగులు పని ఒత్తిడి వల్ల మరణించారు’ అని పేర్కొన్నారు. హామీలేమయ్యాయి చంద్రబాబూ..? ‘ఈ సందర్భంగా ప్రభుత్వ పెద్దలను ఒకటే అడగదల్చుకున్నా. అయ్యా! ఉద్యోగులంతా ఎగబడి మీకు ఓటు వేసింది మీ చేతిలో ఇలా బలి అవడానికా? మీరు పెట్టే ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడా నికా..? ఆత్మహత్యలు చేసుకోవడానికా మీకు అధికారం ఇచ్చింది? ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉద్యోగులకు 9 హామీలు ఇచ్చింది. అందులో మొదటిది ఉద్యోగులకు అనుకూలమైన పని వాతావరణం కల్పిస్తాం, ఉద్యోగుల గౌరవం పెంపొందిస్తామన్నారు.ఇదేనా ఉద్యోగులకు మీరు కల్పించే అనుకూలమైన పని వాతావరణం! ఉద్యోగులకు గుండెపోటు తెప్పించడమేనా అనుకూల పని వాతావరణం అంటే? ఆర్థికపరమైన హామీలు ఎలాగూ అమలు చేయలేదు. కనీసం ఇలాంటి హామీలను కూడా పట్టించుకోకపోవడం బాధాకరం. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగులను ఒత్తిడికి గురి చేసే చర్యలు ఆపాలి’ అని డిమాండ్ చేశారు. ‘కష్టాలు ఎల్లకాలం ఉండవు. చీకటి తర్వాత వెలుగు వస్తుంది. మనకు మంచి రోజులు వస్తాయి. సచివాలయ ఉద్యోగులెవరూ ఆత్మస్థైర్యం కోల్పోవద్దు’ అని విజ్ఞప్తి చేశారు. -
డీఎస్సీతో డీలా.. కోఎంప్ట్ గోల.. యూటర్నే శరణ్యం
సాక్షి, అమరావతి: విద్యా వ్యవస్థకు సంబంధించిన వరుస వివాదాలు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. ఇటీవల నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించగా, పరీక్షల నిర్వహణలో, మూల్యాంకనంలో పారదర్శకత, భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు నిరసనలకు దిగుతూ పరీక్షా వ్యవస్థలో సంస్కరణలకు డిమాండ్ చేశాయి. ఇదే సమయంలో సీబీఎస్ఈ ఆన్లైన్ మూల్యాంకన ప్రక్రియలో అవకతవకలు చోటుచేసుకున్నాయని పెద్ద ఎత్తున వచ్చిన ఆరోపణలు విద్యా రంగాన్ని ఓ కుదుపు కుదిపాయి. ఈ అంశం పలు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఏకంగా 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వివాదాలకు కారణమైన కోఎంప్ట్ సంస్థ పనితీరుపై దేశ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, ఆ సంస్థకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలిటెక్నిక్ సమాధానపత్రాల ఆన్లైన్ మూల్యాంకన కాంట్రాక్టును అప్పగించడం మరింత వివాదానికి దారితీసింది. మూల్యాంకనంలో పొరపాట్లు, సాంకేతిక లోపాలు, విద్యార్థుల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలపై అధ్యాపక సంఘాలు, విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మరోవైపు డీఎస్సీలో అక్రమాలు బట్టబయలు కావడంతో రాష్ట్రం అట్టుడుకుతోంది. ఒక్క ప్రశ్నకు కూడా ప్రభుత్వం నుంచి నేరుగా సమాధానం రావడం లేదు. ఫ్యాక్ట్‌చెక్ పేరుతో ఇస్తున్న సమాచారంలో డొల్లతనాన్ని అభ్యర్థులు ఎత్తి చూపుతున్నారు. ప్రభుత్వం తరఫున ఉన్నతాధికారులు కౌంటర్ ఇవ్వలేక తడబడుతున్నారు. బాధితులు నేరుగా రోడ్డెక్కి చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గాన్ని కడిగి పారేస్తున్నారు. స్పోర్ట్స్ డీఎస్సీ పోస్టులను సంతలో సరుకులా రేటు కట్టి అమ్ముకున్నారని దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పేట దాడి పెరగడంతో పాటు పారదర్శకతపై సందేహాలు వ్యక్తమవుతుండటంతో ప్రభుత్వం చివరకు తన నిర్ణయాన్ని పునఃసమీక్షించింది. ఫలితంగా పాలిటెక్నిక్ సమాధానపత్రాల మూల్యాంకనాన్ని ఆన్లైన్ విధానంలో కాకుండా సంప్రదాయ ఆఫ్‌లైన్ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించింది. తప్పుల మీద తప్పులు చేస్తున్న సర్కారు రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలోని విద్యాశాఖ తప్పుల మీద తప్పులు చేస్తుండడంతో పాలిటెక్నిక్‌లో వార్షిక పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల మూల్యాంకనాన్ని గందరగోళంగా మార్చేసింది. వారానికో విధానం అమలు చేస్తూ భారీగా నిధులు ఖర్చు చేస్తూ ఫలితాల ప్రకటనపై పిల్లిమొగ్గలు వేస్తోంది. ఈ ఏడాది కొత్తగా వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో ‘‘ఆన్ స్క్రీన్ మార్కింగ్ డిజిటల్ వాల్యూయేషన్’’ (ఓఎస్ఎం) ప్రక్రియను ప్రభుత్వం అమలు చేయాలనుకుంది. ఒక్కో ఎగ్జామినర్ 24 గంటల సమయంలో ఎన్ని జవాబు పత్రాలైనా మూల్యాంకనం చేసుకునేలా అధికారులు అవకాశం ఇచ్చారు. ఓఎస్ఎం విధానంలో తప్పులు జరుగుతున్నాయని మే 18న ‘ఇదేం టెక్నిక్ మహాశయా?’ పేరుతో ‘సాక్షి’ దినపత్రిక వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసింది. దీంతో ఓఎస్ఎం ఎంతో ఉత్తమ విధానమంటూ వివరణ ఇచ్చిన అధికారులు.. సాంకేతికంగా పరిజ్ఞానం అందించిన ‘కోఎంప్్ట’ సంస్థను వెనుకేసుకొచ్చారు. ఆ తర్వాత విమర్శలు వెల్లువెత్తడంతో ఇప్పుడు ఉన్నఫళంగా ఆన్లైన్ మార్కుల విధానాన్ని పక్కనబెట్టి ‘తూచ్.. ఇది పైలట్’ మాత్రమేనని మాట మార్చడం గమనార్హం. అంతేగాక మళ్లీ మాన్యువల్‌గా మూల్యాంకనం చేయాలని, అదీ.. ఒకే ఒక్క వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించడం చూస్తుంటే విద్యార్థుల జీవితాలు ఏ దరికి చేరతాయోనని ఆందోళన వ్యక్తమవుతోంది. కోఎంప్ట్ ఇన్ఫ్రాకు రూ.కోట్లు చెల్లింపు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఎస్బీటీఈటీ) 2025–26 విద్యా సంవత్సరంలో వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం కోసం ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఆన్‌స్క్రీన్ మార్కింగ్ డిజిటల్ వ్యాల్యూయేషన్ (ఓఎస్ఎం) సాంకేతిక పరిజ్ఞానాన్ని కోఎంప్ట్ సంస్థ నుంచి తీసుకున్నారు. ఇదే సంస్థ సీబీఎస్ఈ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం కూడా నిర్వహించి బొక్కబోర్లా పడింది. ఈ సంస్థపై అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా ఉన్నత విద్యాశాఖలో సాంకేతిక విద్యాశాఖ విలీన సమయంలో ‘కోఎంప్ట్’ సంస్థకు రూ.కోట్ల కాంట్రాక్టును కట్టబెట్టారు. ఈ ఏడాది మొత్తం 7.05 లక్షల స్క్రిప్టుల మూల్యాంకన ప్రక్రియను ఓఎస్ఎం విధానంలో చేపట్టారు. ఒక్కో స్క్రిప్టు మూల్యాంకనం చేసేందుకు రూ.18 చొప్పున ఎగ్జామినర్లకు చెల్లించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఒక్కొక్కరు రోజుకు 40 నుంచి 45 పేపర్లు మాత్రమే మూల్యాంకనం చేయాల్సి ఉండగా, 100కు పైగా స్క్రిప్టులు చేయించారు. ఇందుకోసం ఇప్పటికే రూ.1.50 కోట్లు ఖర్చు చేశారు. ఈ విధానంలో విద్యార్థులకు నష్టం జరుగుతోందని ‘సాక్షి’ ఆధారాలతో సహా వెలుగులోకి తేవడంతో ఉత్తమ విధానంపై బురద జల్లుతున్నారని ఖండించారు.తాజాగా మాన్యువల్ మూల్యాంకనంపాలిటెక్నిక్ వార్షిక పరీక్షల ఫలితాలను జూన్ మొదటి వారంలో విడుదల చేయాలని ఆన్లైన్ విధానంలో మూల్యాంకనం పూర్తి చేశారు. అయితే, ఇప్పుడు ఆ మార్కులను పక్కనబెట్టి, మాన్యువల్ విధానంలో మూల్యాంకనం చేయాలని, అదీ వారం రోజుల్లోనే మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానంపై తీవ్ర విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా 7 లక్షల మందికి పైగా విద్యార్థుల భవిష్యత్‌ను ఫణంగా పెట్టి, ఇప్పుడు ఆ మార్కులు చెల్లవని, మాన్యువల్ మార్కులనే పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత పరిస్థితిపై ఎస్బీటీఈటీ కార్యదర్శిని వివరణ కోరగా సమాధానం దాటవేయడం గమనార్హం. -
సారం లేని సారా కథలు
‘ఈనాడు’ మీడియా అధిపతి వియ్యంకుల వారికి మరోసారి తాజాగా చంద్రబాబు ప్రభుత్వం భారీ నజరానాను సమర్పించిందట! వారి కాంట్రాక్టు సంస్థ పోలవరం ఎడమ కాలువ పనుల్లో రెండు ప్యాకేజీలను చేపట్టింది. కేవలం ఇరవై నెలల కింద ఖరారు చేసిన వాటి అంచనా వ్యయాన్ని 126 శాతం పెంచుతూ ఈ శుక్రవారం నాడు ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను ‘సాక్షి’ బయటపెట్టింది. అదేరోజు ఉషోదయాన ‘ఈనాడు’ మొదటి పేజీలో వడ్డించిన ఒక వార్త గమనించదగ్గది. మద్యం కేసులో త్వరలోనే జగన్‌కు ఈడీ నోటీసులిస్తుందట! విషయం లేకుండా గాలిని పోగేసి కట్టిన ఈ కక్షపూరిత కేసుపై ‘ఈనాడు’ సహా యెల్లో మీడియా వాహినంతా కూడబలుక్కొని ఏడాదిన్నర కాలంలో సృష్టించిన కాల్పనిక సాహిత్యాన్ని టన్నుల లెక్కల్లో గణించవలసి ఉంటుందేమో!చంద్రబాబుకు అవసరమైన పద్ధతిలో సమాచార ఉపచారాలు చేయడం యెల్లో మీడియా పని. బదులుగా ఆ మీడియా అధిపతులకు కోరుకున్న ఉపకారాలు చేసిపెట్టడం బాబు సర్కార్ బాధ్యత. ఈ సహకార ధోరణి మూడు దశాబ్దాలుగా నిరాటంకంగా సాగుతున్నది. మద్యం కేసు పేరుతో యెల్లో మీడియా నిర్వహించిన వ్యాసంగాన్ని కాకమ్మ కథలని పిలవాలో, చిలకమ్మ పలుకులని నుడవాలో అర్థం కాని పరిస్థితి. అయితే, రాసినదాన్నే పలుమార్లు మార్చి మార్చి రాయగలిగే వారి రచనా చమత్కృతికీ, జబ్బ పుష్టికీ పాఠకులు అచ్చెరువొందడం ఖాయం. వాటిని చదివిన విభ్రమావస్థలో ఏది కుంభకోణమో, ఏది అసలు కోణమో పాఠకులు తేల్చుకోలేరనే కనికట్టు విశ్వాసం వారికి ఉండవచ్చు. కానీ, ఇంగితజ్ఞానం అనేదాన్ని రాసేవాడు విడిచేసినా చదివేవాడు కోల్పోడనే ఎరుకలేకపోవడం వారి బలహీనత.పత్రికా రంగంలో తనకు పోటీగా తయారైన ‘ఉదయం’ను దెబ్బతీయడానికి ‘ఈనాడు’ మద్యనిషేధ ఉద్యమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఏబీకే ప్రసాద్ ఆధ్వర్యంలో దాసరి నారాయణరావు ప్రారంభించిన ‘ఉదయం’ సంచలన వార్తలకు కేంద్ర బిందువుగా మారింది. ఆర్థిక నిర్వహణ భారం కావడంతో దాన్ని లిక్కర్ వ్యాపారస్తుడైన మాగుంట సుబ్బిరామిరెడ్డికి అప్పగించారు. లిక్కర్ వ్యాపారాన్ని నిషేధిస్తే ‘ఉదయం’ పునాదులు దెబ్బతింటాయన్న లక్ష్యంతోనే ‘ఈనాడు’ మద్యనిషేధ ఉద్యమాన్ని ప్రారంభించిందనే విమర్శలు ఆ రోజుల్లోనే వినిపించాయి. ఆ తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ తానిచ్చిన హామీ మేరకు మద్యనిషేధాన్ని అమలు చేశారు. నాడు ‘ఈనాడు’ సహకారంతో వెన్నుపోటు వ్యూహం ద్వారా అధికారం చేపట్టిన చంద్రబాబు సర్కార్‌కు మద్యనిషేధం ఇబ్బందిగా మారింది. వెంటనే ‘ఈనాడు’ రంగంలోకి దిగి ఒక సంపాదకీయాన్ని రాసిపారేసింది. ప్రజలు చైతన్యవంతులై వారంతట వారు తాగడం మానేస్తే తప్ప మద్యనిషేధాన్ని అమలు చేయడం అసాధ్యమని అందులో తేల్చేశారు. బోధివృక్ష ఛాయలో సంపాదకీయాన్ని చదివిన చంద్రబాబు తక్షణం కర్తవ్యోన్ముఖుడై మద్య నిషేధాన్ని ఎత్తిపారేశారు.ఆనాడు మొదలైన బాబు – యెల్లో మీడియా బంధం మరింత బలపడింది. ఆనాటి వెన్నుపోటు వ్యూహాలు, లిక్కర్ కథల ట్విస్టులూ నేటికీ కొనసాగుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. రాష్ట్ర విభజన తర్వాత కూడా అధికారంలో ఉన్న నేతను బట్టి యెల్లో మీడియా లిక్కర్ కథల్లోని ట్విస్టులను మనం స్పష్టంగా చూడవచ్చు. 2014–19 మధ్యకాలంలో అధికారంలో ఉన్న చంద్రబాబు మద్యం పాలసీపై ప్రతిపక్ష వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది. తెలుగుదేశం పార్టీ నాయకులతో ఏర్పాటుచేసిన మద్యం సిండికేట్‌కు లబ్ధి చేకూరేవిధంగా ప్రభుత్వం వ్యవహరించిందనీ, ఫలితంగా 20 వేల కోట్లకు పైగా సిండికేట్ దండుకున్నదనీ ఆరోపణలు చేసింది. అంతటితో ఆగకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత సీఐడీ విచారణకు ఆదేశించింది. సీఐడీ దర్యాప్తులో వైసీపీ ఆరోపణలు చాలావరకు నిర్ధారణ అయ్యాయి. దర్యాప్తుల సంగతి పక్కనపెట్టి కామన్సెన్స్ను ఉపయోగించి ఆలోచించినా కూడా జరిగిన అవినీతికి స్పష్టమైన సాక్ష్యాలు కనిపిస్తాయి.అంతకుముందు ఆరు డిస్టిలరీలు ఉంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా మరో 14 డిస్టిలరీలకు అనుమతి ఇచ్చారు. తమకు అనుమతులిచ్చి వ్యాపారాన్నిచ్చిన వారి పట్లనే సంస్థలు కృతజ్ఞతతో ఉంటాయి తప్ప ఇవ్వనివాళ్ల పట్ల ఎందుకుంటాయి? ఉమ్మడి రాష్ట్రంలో 2012 నుంచి బార్ల మీద వాటి వ్యాపారాన్ని బట్టి ప్రివిలేజ్ ఫీజును వసూలు చేస్తున్నారు. విభజన తర్వాత ఏపీకి ఈ ప్రివిలేజ్ ఫీజు ద్వారా ఏటా 1,300 కోట్ల ఆదాయం సమకూరేది. 2015లో చంద్రబాబు సర్కార్ ఈ ఫీజును తొలగించింది. అది కూడా కేబినెట్లో పెట్టకుండా, ఆర్థిక శాఖ అనుమతి కోరకుండా చీకటి జీవోల ద్వారా తీసుకున్న నిర్ణయం. అంటే తాము చేస్తున్న పని తప్పని తెలిసి కూడా సర్కార్ పెద్దలు ఈ ఫీజును రద్దు చేశారు. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. ఆ మేరకు ప్రైవేట్ వ్యాపారులకు నాలుగేళ్లలో ఐదు వేల కోట్లకు పైగా లబ్ధి జరిగింది. ఈ వ్యవహారంలో పాలకులు అవినీతికి పాల్పడేందుకు నూటికి నూరు శాతం అవకాశాలున్నాయి. అందువల్లనే కాగ్ ఆధ్వర్యంలో పనిచేసే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ తన అభ్యంతరాన్ని నమోదు చేశారని సమాచారం. స్పష్టమైన ఆధారం కనుకనే సీఐడీ కేసు నమోదు చేసింది.3,400 లైసెన్స్డ్ లిక్కర్ షాపులకు అనుబంధంగా పర్మిట్ రూమ్‌లు ఏర్పాటయ్యాయి. చేతులు తడపకుండానే ఇంతటి భారీ వెసులుబాటు సాధ్యం అవుతుందా? ప్రతి షాపు పరిధిలో అదనంగా పది నుంచి పదిహేను వరకు బెల్టు షాపులు ఏర్పాటయ్యాయి. రాష్ట్రం మొత్తంగా 43 వేల బెల్టు షాపులు అవతరించాయి. ఒక్కో బెల్టు షాపును ప్రాంతాన్ని బట్టి మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు పాడుకున్నారన్నది బహిరంగ రహస్యం. అందుకుగాను ఒక్కో బెల్ట్ షాపులో ప్రతి క్వార్టర్ మీద అదనంగా 20 రూపాయలకు పైగా వసూలు చేశారు. విచ్చలవిడిగా మద్యాన్ని ప్రవహింపజేసి ఎమ్ఆర్పీ మీద అదనపు దోపిడీతో జనాన్ని పీడించిన ఈ విధానంలో తెలుగుదేశం పార్టీ సిండికేట్ ముఠాలు 20 వేల కోట్లకు పైగా దిగమింగాయని వైసీపీ ఆరోపించింది.జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధానంలో మార్పు చేశారు. విచ్చలవిడి మద్యం ప్రవాహానికి కళ్లెం వేసే మద్య నియంత్రణను ప్రవేశపెట్టారు. కొత్తగా జగన్ ప్రభుత్వం ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. అధిక లాభాపేక్షతో విచ్చలవిడి అమ్మకాలకూ, కల్తీ మద్యం ప్రవాహాలకు పాల్పడకుండా ప్రైవేట్ వ్యాపారాన్ని పూర్తిగా తొలగించారు. ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించింది. అమ్మకం వేళలను కూడా రాత్రి 9 గంటల వరకే పరిమితం చేశారు. అంతకుముందు మాదిరిగా రౌండ్ ద క్లాక్ మద్యం లభ్యమయ్యే పరిస్థితి లేదు. షాపుల సంఖ్యను కూడా 3 వేలకు పరిమితం చేశారు. అనుబంధంగా పర్మిట్ రూమ్‌లకు అవకాశం ఇవ్వలేదు. బెల్ట్ షాపుల ఊసే లేకుండా చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం ప్రవేశించకుండా ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, చెన్నయ్, బెంగళూరుల నుంచి కార్లలో ఒక బాటిల్ అర బాటిల్ తెచ్చుకున్నా సరే లాగిపారేసే దాకా ఈ పోలీసుల ఓవర్ యాక్షన్ వెళ్లింది. ఫలితంగా కొన్ని వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమైనా సరే మద్య నియంత్రణను జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలుచేసింది.ఇప్పుడు లాజికల్‌గా ఆలోచిస్తే జగన్ సర్కార్ మద్యం విధానంలో అవినీతి జరిగే అవకాశం ఎక్కడున్నది? కొత్తగా ఒక్క డిస్టిలరీకీ అనుమతి ఇవ్వలేదు. నియంత్రణ చర్యల వల్ల మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. వ్యాపారం తగ్గిపోయిందన్న ఆనందంతో డిస్టలరీలు లంచాలిస్తాయా? విచ్చలవిడిగా షాపులకూ, పర్మిట్ రూమ్లకూ, బెల్ట్ షాపులకూ అనుమతిలిచ్చిన ప్రైవేట్ వ్యాపార విధానంలో లంచాలు వస్తాయా? నియంత్రిత ప్రభుత్వ వ్యాపారంలో లంచాలు వస్తాయా? చంద్రబాబు గత ప్రభుత్వం కొత్తగా 14 డిస్టిలరీలకు అనుమతినివ్వడమే కాదు, మద్యం బేసిక్ రేట్లను పెంచి మరీ వాటికి లబ్ధి జరిగేలా చూసింది. బేసిక్ రేటును పెంచకుండా తమ లాభాలకు కళ్లెం వేసినందుకు డిస్టిలరీలు జగన్ సర్కార్‌కు లంచాలు ముట్టజెప్పాయని అనుకోవాలా? ఇక్కడే యెల్లో మీడియా క్రియేటివిటీ విశృంఖల విహారం చేయడం మొదలుపెట్టింది. తెలుగుదేశం పార్టీ హెడ్‌క్వార్టర్‌లో తయారైన స్క్రిప్టునే దర్యాప్తు కోసం నియమించిన సిట్ లీక్ చేస్తుంది, యెల్లో మీడియా అచ్చేస్తున్నదని వైసీపీ ఆరోపణలు చేస్తున్నది. ఈ ఆరోపణలను విశ్వసించకుండా ఉండేందుకు తగిన కారణం కనిపించడం లేదు. ఎంపిక చేసుకున్న కొన్ని బ్రాండ్లను ప్రమోట్ చేసినందువల్లనే వేలకోట్ల ధనం చేతులు మారిందని ‘సిట్’ పలుకుతున్నది. యెల్లో మీడియా కోరస్ పాడుతున్నది. జగన్ సర్కార్ జమానాలో వచ్చిన కొత్త డిస్టిలరీ లేదు. కొత్త మద్యం బ్రాండ్ కూడా లేదు. అన్నీ కూడా చంద్రబాబు సర్కార్ వారసత్వమే. బాబు పాత జమానాలో 20 డిస్టిలరీలు వుంటే అందులో కేవలం ఐదు డిస్టలరీలకే బేవరేజెస్ కార్పొరేషన్ 50 శాతానికి పైగా ఆర్డర్లు ఇచ్చిందని సీఐడీ దర్యాప్తులో తేటతెల్లమైంది. ఎంపిక చేసుకున్న కొన్ని సంస్థలకే ఆర్డర్లు ఇవ్వడం వల్ల జగన్ హయాంలో వేల కోట్లు చేతులు మారాయన్న కథనం నిజమైతే చంద్రబాబు హయాంలో కూడా అంతకంటే ఎక్కువ మొత్తమే కైంకర్యం అయి వుండాలి కదా! యెల్లో మీడియాకు ఈ లాజిక్‌తో పనేముంది?డిస్టిలరీలకు మద్యం ఆర్డర్లు ఇచ్చే బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిని సిట్ వాళ్లు బెదిరించి, హింసించి తాము కోరుకున్న వారి పేర్లు చెప్పించి, ఆ పేర్లన్నింటినీ అభియోగపత్రంలోకి ఎక్కించారన్న విమర్శలు వినబడుతున్నాయి. సీఎమ్‌ఓలో కార్యదర్శిగా పనిచేసిన ధనంజయరెడ్డి, సీఎమ్‌కు ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్‌రెడ్డి, అంతర్జాతీయ దిగ్గజ సిమెంట్ సంస్థలో డైరెక్టర్‌గా ఉన్న బాలాజీ గోవిందప్ప, ఐటీ సలహాదారుగా ఉన్న రాజ్ కేసిరెడ్డి, ఆయన బంధువు అనివాశ్రెడ్డి, లోక్‌సభలో వైసీపీ నేత మిథున్‌రెడ్డి, వైసీపీ నాయకుడైన చెవిరెడ్డి భాస్కరరెడ్డి, జగన్ పీఏ నాగేశ్వరరెడ్డి వగైరా సుమారు యాభై మంది మరే పని లేకుండా మద్యం వ్యాపారంలో మునిగితేలారని సిట్ నమ్మమంటున్నది.ఈ కథా సరిత్సాగరంలో ఇంకా చాలా పిట్టకథలున్నాయి. ఛార్జిషీట్లో పేర్కొన్నవారు, పేర్కొనని మరికొందరి పేర్ల మీద, వారి బినామీల పేర్ల మీద ఒక్కొక్కరికి వందల కోట్ల ఆస్తులున్నాయట! అంతేకాకుండా, కొన్ని వందల కోట్లతో దుబాయ్‌లో, ఆఫ్రికాలో వ్యాపారాలు జరుగుతున్నాయట! మరికొన్ని వందల కోట్లో, వేల కోట్లో వైసీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి తరలించారట! అసలు అవినీతికే అవకాశం లేని విధానంలో ఇన్ని వేల కోట్లు ఎలా ప్రవహిస్తాయి? ఇంగిత జ్ఞానం అనేది ఉంటే ఈ ఎంగిలి కథలను విశ్వసిస్తుందా? ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా పాలనలో చేతులెత్తేసి ప్రత్యర్థి వంక వేలెత్తి చూపితే జనం విశ్వసిస్తారా? అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంలో, చెప్పుకోవడానికి సాధించిన విజయాలు లేకనే కూటమి సర్కార్ విషప్రచారపు జోరును పెంచిందని అనుకోవలసి వస్తున్నది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
జగన్ క్రెడిట్ కొట్టేయడానికి సిగ్గులేదా.. నీ విజనరీకి బూజుపట్టిందా..!
-
ప్రాజెక్ట్‌లు లీక్, ఈనాడు కిరణ్ వియ్యంకుడుకి పోలవరం టెండర్
-
మనోడే.. ఇచ్చేద్దాం. ‘ఈనాడు’ కిరణ్ వియ్యంకుడు రాయల రఘుకు చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్్సకు పోలవరం పనులు
-
చంద్రబాబు 20కోట్ల భారీ స్కాం, బయటపెట్టిన అంబేటి రాంబాబు
-
విచ్చలవిడిగా చంద్రబాబు ప్రభుత్వం.. ఉత్త ప్రచారానికే 40 కోట్లు
-
రెచ్చిపోతున్న పచ్చ నేతలు, టీడీపీపై జనసేన ఎంపీ ఫైర్
-
గోవా తరహాలో AP బీచ్‌ల్లో మద్యం ఒకే !
-
ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్ల రాక్షస పాలనపై రణభేరి.. రాష్ట్రవ్యాప్తంగా కదంతొక్కిన వైఎస్సార్సీపీ శ్రేణులు
-
రాక్షస పాలనపై రణభేరి
సాక్షి, అమరావతి/సాక్షిప్రతినిధి కర్నూలు/సాక్షి,నెట్వర్క్: చంద్రబాబు రెండేళ్ల రాక్షసపాలనపై వైఎస్సార్సీపీ సమరభేరి మోగించింది. సర్కారు వైఫల్యాలపై గళమెత్తి గర్జించింది. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో గురువారం నుంచి 12 తేదీ వరకు మహోద్యమానికి శ్రీకారం చుట్టింది. తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. దగాకోరు సర్కారుకు వ్యతిరేకంగా కదంతొక్కింది. పోలీసు ఆంక్షలు, అణచివేతలను ధిక్కరించి రణన్నినాదం మోగించింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు తూట్లు పొడిచి వెన్నుపోటే తన నైజమని బాబు మరోమారు నిరూపించుకున్నారని నిప్పులు చెరిగింది. పిల్లనిచ్చిన మామ నందమూరి తారకరామారావు నుంచి నేడు రాష్ట్ర ప్రజల వరకు అందరూ బాబు బాధితులేనని, ఈ దుష్ట పాలన రాష్ట్రానికి హానికరమని దుయ్యబట్టింది. ‘చంద్రబాబు రెండేళ్ల పాలనలో ప్రజలను వెన్నుపోటు పొడవడం మినహా చేసింది ఏమీ లేదు. సూపర్‌సిక్స్ హామీల్లోని ఆడబిడ్డనిధి, నిరుద్యోగ భృతిని గాలికొదిలేశారు. వలంటీర్లకు రూ.10వేల వేతనం ఇస్తామని చెప్పి దగా చేశారు. దగాకోరు బాబు నుంచి ప్రజలను కాపాడేందుకు అలుపెరగని పోరాటం చేస్తాం. మహోద్యమానికి ఉద్యుక్తులమవుతాం. నారాసురుడిని గద్దె దించే వరకు విశ్రమించం’’ అంటూ వైఎస్సార్సీపీ నేతలు ప్రతినబూనారు. మండుటెండలను సైతం లెక్కచేయకుండా రాష్ట్రవ్యాప్తంగా సాగిన ఈ ఆందోళన కార్యక్రమాల్లో ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్ని జిల్లాల్లో ఎగిసిన ఆగ్రహజ్వాలలుగుంటూరు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలు నిరసనలు చేపట్టారు. గుంటూరు గుజ్జనగుండ్ల, చుట్టుగుంట సెంటర్లలో టీడీపీ మేనిఫెస్టో ప్రతులు దహనం చేశారు. వైఎస్సార్సీపీ నేతలను రెచ్చగొట్టేందుకు టీడీపీ నేతలు వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్నవైఎస్సార్‌సీపీ శిబిరం వద్దకు వచ్చి రెచ్చగొట్టే నినాదాలుచేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు మండలం పేరేచర్లలో వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. అయినా పోలీసుల అడ్డంకులను అధిగమించి నేతలు ప్రదర్శనను జయప్రదం చేశారు. పల్నాడు జిల్లాలో నరసరావుపేట, రొంపిచర్లలో నిరసన కార్యక్రమం జరిగింది. పెదకూరపాడులో సూపర్‌సిక్స్ హామీల ప్రతులను దహనం చేశారు. వినుకొండలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై సీఐ ప్రభాకర్‌రావు జులుం ప్రదర్శించారు. దీంతో వైఎస్సార్సీపీ శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. మాచర్ల, సత్తెనపల్లి, గురజాలల్లో వైఎస్సార్సీపీ నేతలు నిరసనలు చేపట్టారు. అనంతపురం అంబేడ్కర్ సర్కిల్లో వైఎస్సార్సీపీ నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఉమ్మడి అనంతపురం వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు సాగాయి. కర్నూలు జిల్లా వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. నంద్యాల కల్లూరులోని చెన్నమ్మ సర్కిల్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. శ్రీశైలంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించారు. టీడీపీ మేనిఫెస్టో ప్రతులను, ప్రజలకు ఇచ్చిన హామీల బాండ్లను దహనం చేశారు. గుంటూరులో ర్యాలీగా వస్తున్న మాజీ మంత్రి అంబటి, ప్రజలు పోలీసులు అడ్డుకున్నా...శ్రీకాకుళం జిల్లాలో నిరసన ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. పోలీసులు అడుగడుగునా అడ్డుకునే యత్నం చేసినా వైఎస్సార్సీపీ నేతలు వెనుకడుగు వేయలేదు. పలాస నియోజకవర్గం మందసలో మానవహారం నిర్వహించారు. నరసన్నపేటలో మానవహారం చేపట్టి టీడీపీ మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. తిరుపతి, వెంకటగిరి, సూళ్లూరుపేటల్లో నిరసన ప్రదర్శనలు చేశారు. రైల్వేకోడూరు, శ్రీకాళహస్తి, సత్యవేడు, చంద్రగిరి నియోజకవర్గాల్లోనూ నిరసన కార్యక్రమాలు జరిగాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో మండుటెండనూ లెక్క చేయకుండా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కారక్రమాలు చేపట్టారు. టీడీపీ మేనిఫెస్టో, సూపర్‌సిక్స్ హామీల బాండ్ ప్రతులను దహనం చేశారు. విశాఖలోని అక్కయ్యపాలెం హైవేపై మానవహారం నిర్వహించేందుకు పోలీసులు అనుమతించలేదు. దీంతో వైఎస్సార్సీపీ నేతలు, పోలీసులకు వాగ్వాదం జరిగింది. పెందుర్తి, గాజువాకలో మానవహారం నిర్వహించి ఫ్లకార్డులు ప్రదర్శించి టీడీపీ మేనిఫెస్టోలను దహనం చేశారు. ఏలూరు, నూజివీడు, పోలవరంల్లో నిరసనలు చేపట్టారు. చిత్తూరు జిల్లాలో నిరసనలు జరిగాయి. వైఎస్సార్సీపీ నేతలు టీడీపీ మేనిఫెస్టో ప్రతులను దహనం చేస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. నగరి, కార్వేటినగరం, పూతలపట్టు, బంగారుపాళ్యంలలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. బాపట్ల జిల్లా వేమూరు, రేపల్లెల్లో చంద్రబాబు దిష్టి»ొమ్మను వైఎస్సార్సీపీ నేతలు దహనం చేశారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో నిరసన ప్రదర్శనలు దిగ్విజయంగా సాగాయి. రాజమహేంద్రవరం, కాకినాడ జిల్లాల వ్యాప్తంగా నిరసనలు చేసి టీడీపీ మేనిఫెస్టోలు దహనం చేశారు. వైఎస్సార్ కడప జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు కదంతొక్కారు. అల్లూరి జిల్లా పాడేరులో భారీ ర్యాలీ నిర్వహించారు.ఉమ్మడి విజయనగరం జిల్లావ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు హోరెత్తాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగానూ నిరసనల ప్రదర్శనలు జరిగాయి. కొన్నిచోట్ల టీడీపీ మేనిఫెస్టో ప్రతులను వైఎస్సార్సీపీ నేతలు చించివేశారు. కొన్ని చొట్ల దహనం చేశారు. ఈ దహనం కార్యక్రమాలను పోలీసులు అడ్డుకున్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళనలు నిర్వహించాయి. -
బీచ్‌లలో బీరు.. బారు
ఇన్నాళ్లూ.. బీచ్ అంటే షికార్లు.. సరదాలు.. పిల్లలు, కుటుంబంతో సేదతీరే ప్రాంతం! ఇకపై.. బీచ్‌లంటే బీరు, బారు.. మందూ, చిందూ.. ఆకతాయిలు, అసాంఘిక శక్తుల కోలాహలం!! రాష్ట్రంలో ప్రశాంతంగా ఉన్న బీచ్‌లను అసాంఘిక శక్తుల అడ్డాగా మారుస్తూ ‘బీచ్ షాక్స్’ పేరుతో మద్యం ప్రవాహానికి చంద్రబాబు సర్కారు తలుపులు బార్లా తెరిచింది! గురువారం మంత్రి మండలి సమావేశంలో అందుకు ఆమోదముద్ర వేసింది. టీడీపీ మద్యం సిండికేట్ మరింత బరి తెగించి దోపిడీకి పాల్పడేలా పచ్చజెండా ఊపింది! కూటమి సర్కారు నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బీచ్ షాక్స్ అంటే.. మినీ బార్లే బీచ్‌లలో మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వడం కోసం చంద్రబాబు ప్రభుత్వం సరికొత్త ఎత్తుగడ వేసింది. బీచ్ షాక్స్ ఏర్పాటుకు అనుమతి ఇస్తున్నట్లు తాజాగా మంత్రి మండలి సమావేశంలో తీర్మానించింది. ఇంతకీ బీచ్ షాక్స్ ఏమిటంటే... బీచ్‌లలో చిన్న సైజు బార్లే. వెదురు గానీ చెక్కతోగానీ కుటీరం ఆకారంలో వాటిని ఏర్పాటు చేస్తారు. వాటిలో మద్యం, బీరు, ఇతర పానీయాలు, ఆహార పదార్ధాలు విక్రయిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే అవి మినీ బార్లే. పర్యాటక రంగానికి ప్రోత్సాహం ముసుగులో బీచ్‌లలో మద్యం ప్రవాహానికి చంద్రబాబు ప్రభుత్వం గేట్లు ఎత్తింది. మొదటగా విశాఖపట్నం, సూర్యలంక బీచ్‌లలో బీచ్ షాక్స్ ఏర్పాటుకు అనుమతినిచ్చింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బీచ్ షాక్స్ నిర్వహించవచ్చని ప్రకటించింది. అంటే బీచ్‌లలో రోజంతా మద్యం ఏరులై పారనుందని స్పష్టం చేసింది. టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీకి పచ్చజెండా వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా దశలవారీ మద్యం నియంత్రణ లక్ష్యంగా ప్రైవేట్ మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. పారదర్శకంగా ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసింది. మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించడమే కాకుండా మద్యం విక్రయ వేళలను కుదించింది. 2014–19 మధ్య టీడీపీ హయాంలో ఏర్పాటు చేసిన పరి్మట్ రూమ్‌లను రద్దు చేసింది. 48 వేల బెల్ట్ దుకాణాలను తొలగించింది.కానీ 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరిగి టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీకి పచ్చజెండా ఊపింది. మద్యం విధానం ముసుగులో దోపిడీకి తెరతీసింది. ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. విచ్చలవిడిగా ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుమతినిచి్చ.. మొత్తం 4,346 మద్యం దుకాణాలను టీడీపీ సిండికేట్‌కు ఏకపక్షంగా కట్టబెట్టింది. ఎల్లో సిండికేట్ రాష్ట్రంలో ఏకంగా 75 వేల బెల్ట్ దుకాణాలను ఏర్పాటు చేసి మద్యాన్ని ఏరులై పారిస్తోంది. ఎంఆర్పీ కంటే 20 శాతం అధిక ధరలతో విక్రయిస్తూ దోపిడీకి పాల్పడుతోంది. తీరప్రాంతం ధారాదత్తం.. అయినా చంద్రబాబు ప్రభుత్వం సంతృప్తి చెందలేదు. టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీ కోసం రాష్ట్రంలో 974 కి.మీ. తీరప్రాంతాన్ని కూడా కట్టబెట్టాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే బీచ్ షాక్స్ పేరుతో బీచ్‌లలో బార్లకు అనుమతినిచ్చింది. విశాఖపట్నం, సూర్యలంక బీచ్‌లలో పైలట్ ప్రాజెక్టుగా మినీ బార్ల ఏర్పాటుకు పచ్చ జెండా ఊపింది. అనంతరం రాష్ట్రంలోని ఇతర బీచ్‌లలో కూడా వాటిని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో బీచ్‌లలో కూడా మినీ బార్లు ఏర్పాటుకు ఇప్పటికే ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. త్వరలోనే వాటికి కూడా అనుమతి ఇవ్వనుందని ఎక్సైజ్‌శాఖ వర్గాలు తెలిపాయి. మినీ బార్లను కూడా టీడీపీ సిండికేట్‌కే ఏకపక్షంగా కట్టబెట్టనుందన్నది సుస్పష్టం.ఇక బీచ్‌కు వెళ్లాలంటే భయం భయం..!చంద్రబాబు సర్కారు నిర్వాకాలతో రాష్ట్రంలో బీచ్‌లు అసాంఘిక శక్తులకు అడ్డాగా మారుతాయని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. బీచ్‌లకు ఉదయం, సాయంత్రం సమయంలో అధికంగా ప్రజలు వస్తుంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులతో రద్దీగా ఉంటాయి. ఆ సమయంలోనే బీచ్‌లలో మినీ బార్ల నిర్వహణకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దాంతో ఆకతాయిలు, అసాంఘిక శక్తులకు మినీ బార్లు కేంద్ర బిందువుగా మారే అవకాశాలున్నాయి.ఆహ్లాదం, ప్రశాంతత కోసం బీచ్‌కు వచ్చే మహిళలు, బాలికలపై వేధింపులకు పాల్పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే గంజాయి బ్యాచ్‌లు రాష్ట్రంలో చెలరేగిపోతున్నాయి. ఇక బీచ్‌లలో కూడా మందు బాబులు, గంజాయి బ్యాచ్‌లు మహిళలపై విరుచుకుపడే ప్రమాదం ముంచుకొస్తోంది. రాష్ట్రంలో బీచ్‌లలో పోలీసు భద్రత కూడా లేదు. మరోవైపు విశాఖపట్నం, సూర్యలంక బీచ్‌లలో ఎందరో యువకులు ఈతకు వెళ్లి దుర్మరణం పాలవుతున్నారు. ఇప్పుడు బీచ్‌లలో మినీ బార్లు ఏర్పాటుతో మద్యం మత్తులో సముద్ర స్నానాలు, ఈతకు దిగి ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.బికినీ ఫెస్టివల్ నుంచి బీచ్ షాక్స్ దాకా.. 2014–19 మధ్య టీడీపీ హయాంలో బీచ్‌లలో బార్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందుకోసం 2016లో జీవో నంబర్ 470 కూడా జారీ చేశారు. దాంతోపాటు బీచ్‌లలో బికినీ ఫెస్టివల్ నిర్వహించాలని కూడా సన్నాహాలు చేశారు. అప్పట్లో దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తింది. ప్రధానంగా మహిళా సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాయి. దాంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అనంతరం 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి బీచ్‌లలో బార్ల ఏర్పాటు దిశగా అడుగులు వేసింది. మినీ బార్ల ముసుగులో బీచ్‌లలో మద్యం ప్రవాహానికి తలుపులు తెరచింది. – సాక్షి, అమరావతి -
దేశంలోనే రిచెస్ట్ CM ఎవరో తెలుసా..! ఆస్తులు తెలిస్తే షాక్ అవుతారు
-
రెడీగా ఉండండి... జగనన్న ఫుల్ సినిమా చూపించడం ఖాయం
-
నా చర్మం వలిచి అయినా సరే... రాచమల్లు గూస్ బంప్స్ స్పీచ్
-
రెండేళ్ల రాక్షస పాలనపై కదం తొక్కిన వైఎస్సార్సీపీ
-
మా ఉద్యోగాలు అనర్హులకు ఇచ్చేశారు.. మా జీవితాలను రోడ్డున పడేశారు
-
అనితకు బిగ్ షాక్.. APకి కొత్త హోంమంత్రి!
-
మా భవిష్యత్తు మట్టి కొట్టుకుపోయింది.. మెరిట్‌తో సర్కారు ‘ఆటలు’!
సాక్షి, అమరావతి: ‘‘మంత్రి నిర్వాకంతో మా భవిష్యత్తు మట్టి కొట్టుకుపోయింది. తమ వారికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఇష్టానుసారంగా నియమాలు మార్చారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టుల భర్తీలో అంతులేని అక్రమాలు చేశారు..! ఎన్నిసార్లు లోకేశ్‌ను కలవాలని ప్రయత్నించినా ఇంటి దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు..! 1998, 2008 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేసినట్లు మాకు న్యాయం చేయండి...! మెగా డీఎస్సీ మెరిట్ లిస్టులో నా పేరొచ్చింది. 1:1 రేషియోలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా పూర్తయింది. తీరా సెలక్షన్ లిస్టులో నా పేరు లేదు. కారణం అడిగితే.. ఆ పోస్టు స్పోర్ట్స్ కేటగిరీలో ఇచ్చామని.. హారిజాంటల్ రిజర్వేషన్ వల్ల పోస్టు మిస్సయ్యిందని చాలా తేలిగ్గా సమాధానం చెబుతున్నారు. వెరిఫికేషన్‌కి వచ్చినంత మాత్రాన జాబ్ ఇస్తామన్నట్లు కాదని అంటున్నారు..! కోర్టు ఆర్డర్ కాపీ పట్టుకుని తిరుగుతున్నా లెక్క చేయడం లేదు..! నేషనల్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించినా నాకు పోస్టు ఇవ్వలేదు.. రజతం, కాంస్య పతకం ఉన్నవారికి మాత్రం ఉద్యోగాలిచ్చారు.. సర్టిఫికెట్లు పరిశీలించకుండా పోస్టులు ఇచ్చేశారు...! అసలు ఏ పరీక్షా రాయని వారికి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం ఇచ్చి మెరిట్లో ఉన్న మాకు అన్యాయం చేశారు..! మెరిట్ లిస్టులో వచ్చిన వారికి రిజర్వేషన్ కేటగిరీలో ఉద్యోగం ఇవ్వడంతో నాకు రావాల్సిన ఉద్యోగం రాకుండా పోయింది...! కటాఫ్ మార్కులు ప్రకటించకపోవడం వల్ల చాలా గందరగోళంగా ఉంది...! ఉన్నది 3 పోస్టులు... ముగ్గురమే ఉన్నాం... కానీ ఫైనల్ జాబితాలో నా పేరు లేదు. కారణం అడిగితే స్పోర్ట్స్ కోటాలో ఆ జాబ్ ఇవ్వాల్సి వచ్చిందని చెబుతున్నారు..! నిబంధనలకు విరుద్ధంగా టీచర్ పోస్టులను భర్తీ చేశారని మా బాధ ఎవరికి చెప్పుకున్నా పట్టించుకోవడం లేదు..! ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగదు.. మాకు మీరు మాత్రమే న్యాయం చేయగలరు..!!’’ ఇదీ మెగా డీఎస్సీ 2025 వేలాది మంది బాధిత అభ్యర్థుల ఆక్రందన!! మెరిట్లో ఉండి అన్యాయానికి గురైన అభ్యర్థులు బుధవారం పెద్ద ఎత్తున తరలివచ్చి తాడేపల్లిలో మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తమ గోడు చెప్పుకున్నారు. డీఎస్సీ నిర్వహణ, టీచర్ పోస్టుల ఎంపికలో జరిగిన అనేక అక్రమాలను ఆయనకు వివరించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వారంతా కలిసి మీడియాతో మాట్లాడారు.తమకు జరిగిన అన్యాయాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డికి వివరిస్తున్న డీఎస్సీ–2025 బాధిత అభ్యర్థులు నేషనల్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్‌ను పక్కనబెట్టారు నేను నేషనల్ గేమ్స్‌లో బంగారు పతకం విజేతను. మా జిల్లా నుంచి 6 పోస్టులు ఉంటే రజతం, కాంస్య పతక విజేతలకు ఉద్యోగాలు ఇచ్చి నాకు బంగారు పతకం ఉన్నా ఉద్యోగం ఇవ్వకుండా అన్యాయం చేశారు. దీనిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. – అనిగి దుర్గయ్య, పోలవరం మండలం, ఏలూరు జిల్లా లోకేశ్ వద్దకు వెళితే.. మెగా డీఎస్సీలో ర్యాంక్ తెచ్చుకుని సర్టిఫికెట్ల పరిశీలనకు కూడా హాజరయ్యా. ఎస్జీటీ ఉర్దూ మీడియంలో పరీక్ష రాసింది నలుగురం మాత్రమే. అందులో ముగ్గురిని సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు. ఎస్టీ వర్గానికి చెందిన నా పేరు తుది జాబితాలో లేదు. రోస్టర్ నంబర్లు అటూ ఇటూ చేసి నన్ను కాదని ఒక మహిళకు ఇచ్చారు. క్యారీ ఫార్వర్డ్ పోస్టు కాబట్టి నాకు కచ్చితంగా రావాలి. నాకు జాబ్ ఎందుకు రాలేదో వివరాలు చెప్పమని అప్లికేషన్ రాసిస్తే పక్కన పడేశారు. దానిపై స్టాంప్ వేసి ఇస్తే కోర్టుకు వెళ్తారని, అందుకే ఆ పని చేయబోమని అధికారులు చెప్పారు. మంత్రి నారా లోకేశ్‌ను కలవడానికి ఛాంబర్‌కు వెళ్తే అనుమతి లేదంటూ ఓఎస్డీ నా అప్లికేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ శాఖకు పంపించారు. చివరకు ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించినా ప్రయోజనం లేకపోయింది.– ఎం.జగదీష్ నాయక్, వైఎస్సార్ కడప జిల్లాఇష్టారీతిన నియమాలు మార్చారు నేను ఉర్దూ మీడియంలో చదువుకున్నా. పదో తరగతి వరకు ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూ కాగా సెకండ్ లాంగ్వేజ్ తెలుగు. ఇంటర్ నుంచి ఇంగ్లిష్ మీడియం. సర్టిఫికెట్ వెరిఫికేషన్ సందర్భంగా ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉండాలన్నారు. ఈ డీఎస్సీలో గతంలో లేని విధంగా నియమాలు మార్చారు. – ఎండీ షాబుద్దీన్, విశాఖ జిల్లాచాలా అన్యాయం.. నేను ఎస్సీని. సర్టిఫికెట్ వెరిఫికేషన్ చక్కగా జరిగింది. నాకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత డీఈవో ఆఫీస్ నుంచి ఫోన్ చేసి మళ్లీ కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ అడిగితే పంపా. మాకు 3 పోస్టులు ఉన్నాయి. మేము ముగ్గురమే ఉన్నాం. కానీ ఫైనల్ జాబితాలో మాత్రం నా పేరు లేదు. కారణం అడిగితే స్పోర్ట్స్ కోటాలో ఆ జాబ్ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు. నాకు చాలా అన్యాయం జరిగింది. – ఇందిర, కృష్ణా జిల్లాఅన్నీ బాగున్నా జాబ్ రాలేదు.. నేను కరాటే బ్లాక్‌బెల్ట్ ఛాంపియన్‌ను. మా ఊరిలో 37 మంది డీఎస్సీ రాస్తే నేను ఒక్కదాన్నే పాస్ అయ్యా. నేను ఓపెన్ కేటగిరీలో ఉన్నా రిజర్వేషన్ కేటగిరీలో పిలిచారు. నా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ బాగా జరిగింది. కానీ ఉద్యోగం మాత్రం రాలేదు. కారణం అడిగితే అప్పటికే అన్ని పోస్టులు భర్తీ అయ్యాయని చెప్పారు. గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది. నాది బీసీ–డీ అయితే నన్ను ‘బీసీ–సి’గా చూపారు. కోర్టుకు వెళ్లినా ఎలాంటి విచారణ జరిపించడం లేదు. మరి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఎందుకు చేశారంటే సమాధానం చెప్పలేదు. – నాగలక్ష్మి, గుంటూరు జిల్లాఇవన్నీ చంద్రబాబుకు తెలియదా? బీసీ–ఈ వర్గానికి చెందిన నేను సెకండ్ ప్లేస్‌లో ఉన్నా. ఎస్ఏ పోస్టు సర్టిఫికెట్ల పరిశీలనకు వెళ్లా. అధికారులు కంగ్రాట్స్ కూడా చెప్పారు. కానీ సెలక్షన్ లిస్టులో నా పేరు లేదు. కారణాలు చెప్పలేదు. ఎన్నిసార్లు లోకేశ్‌ను కలవాలని ప్రయత్నించినా ఇంటి దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు. 1:1 నిష్పత్తిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిల్చినప్పుడు ఉద్యోగం రావాలి కదా? ఇవన్నీ చంద్రబాబుకు తెలియదా? వెరిఫికేషన్ చేసినంత మాత్రాన జాబ్ ఇవ్వాలా? అని మాట్లాడారు. మెగా డీఎస్సీలో జరిగిన అన్యాయానికి న్యాయం చేయగలిగేది మీరు ఒక్కరు మాత్రమే. మీపై ఎంతో విశ్వాసం ఉంది. – షర్మిల, మదనపల్లె. అన్నమయ్య జిల్లాజీవో 77 ప్రకారం ఓపెన్ కేటగిరీలో మెరిట్ ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయాలి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు రిజర్వేషన్ ప్రకారం పోస్టులు భర్తీ చేయాలి. హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం మహిళలు, పీహెచ్సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, స్పోర్ట్స్‌కోటా పోస్టులు భర్తీ చేయాలి. అయితే ప్రభుత్వం అలా చేయలేదు స్పోర్ట్స్ కోటాలో ఇచ్చారట.. నాకు డీఎస్సీలో 75 మార్కులు వచ్చాయి. తొలి జాబితాలోనే నా పేరు వచ్చింది. సర్టిఫికెట్ల పరిశీలన కూడా బాగా జరిగింది. కానీ ఉద్యోగం రాలేదు. ఎందుకు అని అడిగితే.. మీ కులంలో స్పోర్ట్స్ కోటాలో ఇంకొకరికి ఇవ్వాల్సి వచ్చిందన్నారు. మరి ముందే అతడు ఉన్నాడని తెలిసీ నన్ను ఎందుకు పిలిచారు? 1998, 2008 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేసినట్లు ఇప్పుడు కూడా న్యాయం చేయండి. – బాలకృష్ణ, కాకినాడ, జిల్లాఅవకాశం ఉన్నా పోస్టు ఇవ్వలేదు డీఎస్సీ మెరిట్లో నాకంటే ముందు ఒక అమ్మాయి ఉంది. ఆమె కానిస్టేబుల్. ఆమెది ఫేక్ సర్టిఫికెట్. మేం ఫిర్యాదు చేస్తే ఆమెను క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత నేను ఉన్నా నాకు అవకాశం ఇవ్వలేదు. విజయనగరానికి చెందిన అమ్మాయికి జాబ్ ఇచ్చారు. ఒక పోస్టు క్యాన్సిల్ అయితే తర్వాత అభ్యర్థికి ఇవ్వబోమని, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తామని చెప్పారు. – దుర్గామల్లిక, అమలాపురం, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లామా గోడు చెబుతుంటే ‘ఫేక్’ అంటున్నారు.. మాది పేద మత్స్యకార కుటుంబం. కోచింగ్‌కు వెళ్లలేదు. కష్టపడి చదివా. ఫిజికల్ సైన్స్ బీసీ–సీలో నాది మూడో ర్యాంక్. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది. ఓవరాల్ మెరిట్లో నాది 53వ ర్యాంక్. 10వ ర్యాంక్ వచ్చిన అభ్యర్థికి ఓపెన్‌లో కాకుండా బీసీ–సీ కేటగిరీలో పోస్టు ఇచ్చారు. అతడిని ఓపెన్‌లో పంపించి ఉంటే నాకు మా కేటగిరీలో జాబ్ వచ్చి ఉండేది. నాకు జాబ్ ఎందుకు రాలేదని అధికారులను అడిగితే ఒక అమ్మాయి స్పోర్ట్స్ సర్టిఫికెట్తో వచ్చిందని చెప్పారు. మా గోడు ‘సాక్షి’లో ప్రచురిస్తే మమ్మల్ని ఫేక్ అని ప్రచారం చేస్తున్నారు. – శ్రావణ్‌కుమార్, రాంబిల్లి మండలం, అనకాపల్లి జిల్లాతీరని అన్యాయం.. నాది బీసీ–ఏ. ఇందులో ఒకటే పోస్టు ఉంది. నేను ఒక్కదాన్నే ఉన్నా. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయినా చివరకు ఉద్యోగం రాలేదు. మహిళా రిజర్వేషన్లో ఒక పోస్టు ఉంది. అక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నా. ఫిజికల్ సైన్స్‌లో మాకు అర్హత ఉంది. ఎమ్మెస్సీ చదివా. నాకు స్పోర్ట్ సర్టిఫికెట్ ఉన్నా జనరల్ కేటగిరీలో దరఖాస్తు చేశా. కానీ నాకు తీరని అన్యాయం చేశారు. – లక్ష్మీపార్వతి, వైఎస్సార్ కడప జిల్లా మెరిట్లో ఉన్నా అన్యాయం.. నాది జనరల్ కేటగిరిలో 76వ ర్యాంక్. ఓహెచ్‌లో ఫస్ట్ ర్యాంక్. జిల్లాలో ఫస్ట్ వచ్చా. కానీ నాకు మొదటి విడతలో కాకుండా రెండో దశలో కాల్ లెటర్ పంపారు. మెడికల్ టెస్టు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా జరిగింది. కానీ జాబ్ రాలేదు. రోస్టర్‌లో మరొకరు ముందు ఉన్నారని చెప్పారు. 137వ ర్యాంక్ వచ్చిన ఆమెకు జాబ్ ఇచ్చారు. మెరిట్లో ఉన్నా నాకు ఇవ్వకుండా అన్యాయం చేశారు. – నరసింహారావు, ప్రకాశం జిల్లాఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిటోరియస్ క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 3 శాతం హారిజాంటల్ రిజర్వేషన్ కల్పిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 4 ఈ ప్రభుత్వంలో న్యాయం జరగదు నేను ఎస్ఏ సోషల్‌లో డీఎస్సీ రాశా. మా బీసీ–డీ కేటగిరీలో 7 పోస్టులు ఉంటే 5 పోస్టులు జనరల్‌లో మిగిలిన రెండు మా కేటగిరీలో ఉన్నాయి. నన్ను సర్టిఫికెట్ పరిశీలనకు పిలిచినా జాబ్ ఇవ్వలేదు. నా పోస్టు హారిజాంటల్ రిజర్వేషన్లో మరొకరికి ఇవ్వాల్సి వచ్చిందన్నారు. డీఈవో ఆఫీస్‌లో అడిగితే తమకేమీ తెలియదని విజయవాడ వెళ్లమన్నారు. అక్కడకు వెళ్తే తమకు సంబంధం లేదంటున్నారు. ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగదు. మాకు మీరు మాత్రమే న్యాయం చేయగలరు. – ఏకాంబరం, మాదిరెడ్డిపల్లి, చిత్తూరు జిల్లా జీరో ర్యాంకు వారికి ఉద్యోగం ఇచ్చారు నా సర్టిఫికెట్ వెరిఫికేషన్ బాగా జరిగింది. నాది బీసీ–బీలో మూడో పోస్టు. కానీ జాబ్ రాలేదు. నాకు ఇవ్వకుండా స్పోర్ట్స్ కేటగిరీలో ఇచ్చామని చెప్పారు. నాపేరు రిజెక్ట్ లిస్ట్‌లో కూడా లేదు. అదేమని అడిగితే సమాధానం చెప్పడం లేదు. నాకు అన్యాయం చేసి జీరో ర్యాంక్ ఉన్న వ్యక్తికి స్పోర్ట్స్ కోటా కింద జాబ్ ఇచ్చారు. – రాణి, కృష్ణా జిల్లాడిగ్రీ లేకున్నా పోస్టు ఇచ్చారు మాకు (మహిళలకు) ఓపెన్ కేటగిరీలో 30 పోస్టులు ఉన్నాయి. స్పోర్ట్స్ కోటా కింద అందులోకి ఒకరిని తీసుకొచ్చి ఉద్యోగం ఇచ్చారు. ఆ తర్వాత ఆమెకు డిగ్రీ లేదు కాబట్టి అది పూర్తి చేసుకోవడానికి మూడేళ్ల సమయం ఇచ్చారు. అంటే.. అర్హత లేకున్నా ఉద్యోగం ఇచ్చి, ఆ తర్వాత చదువుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఆమెది ఓసీ. ఆమెను తీసుకొచ్చి మా కేటగిరీలో వేశారు. దాంతో నా ఛాన్స్ పోయింది. – వీరవేణి, తూర్పు గోదావరి జిల్లా కోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదు నాకు అన్ని అర్హతలు ఉన్నాయి. నాకంటే ముందు ఒకరికి ఉద్యోగం ఇచ్చారు. అతడిది ఫేక్ సర్టిఫికెట్ అని తేలడంతో పోస్టింగ్ ఆపారు. జాబితాలో ఆ తర్వాత ఉన్న నాకు ఉద్యోగం ఇవ్వకుండా క్యారీ ఫార్వర్డ్ చేశామని చెప్పారు. ఇక్కడ అన్ని అర్హతలున్న నేను ఉన్నా, నాకు జాబ్ ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. – సతీష్, పశ్చిమ గోదావరి జిల్లాఅన్నీ సరిగా ఉన్నా ఉద్యోగం ఇవ్వలేదు ఎస్సీ వర్గానికి చెందిన నాకన్నా తక్కువ మార్కులు వచ్చిన ముగ్గురిని ఓపెన్‌లో చూపారు. గ్రీవెన్స్ సెల్లో దరఖాస్తు చేస్తే నావన్నీ కరెక్టుగా ఉన్నాయని, జాబ్ ఎక్కడివ్వాలో తెలియడం లేదని సమాధానం చెప్పారు. ఆశ్చర్యం ఏమిటంటే నాకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారిని మా కేటగిరీలో చూపారు. నాకంటే తక్కువ మార్కులు వచ్చిన ముగ్గురిని ఓపెన్‌లో చూపారు. ఎవరిని కలిసినా చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. – కె.శరత్‌బాబు, కాకినాడ, తూ.గో జిల్లా స్పోర్ట్స్ కోటాలో ఆయా శాఖలు నిర్వహించే అర్హత పరీక్షల్లో కచ్చితంగా ఉత్తీర్ణత సాధించాలని సవరించిన జీవో వైకల్యం సర్టిఫికెట్ ‘రిజెక్ట్’.. గెరివి అంజనప్పకు ఒక కన్ను పూర్తిగా లేదు. మరో కంటికి రక్త సరఫరా లేదు. ఆయనకు కంటి చూపు లేదని ధ్రువీకరిస్తూ మెడికల్ బోర్డు (అనంతపురం జీజీహెచ్) 40 శాతం వైకల్యంతో సర్టిఫికెట్ ఇచ్చినా పట్టించుకోకుండా రిజెక్ట్ చేశారు. విజయవాడ వచ్చి కమిషనరేట్‌లో కలిసినా తామేమీ చేయలేమంటున్నారు. – హెచ్.వసంత్‌కుమార్, అనంతపురం జిల్లా (అభ్యర్థి గెరివి అంజనప్ప తరపున మాట్లాడారు)ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది... నిబంధనలకు విరుద్ధంగా అడుగడుగునా అవినీతి, అక్రమాలతో డీఎస్సీ –2025 ద్వారా టీచర్ పోస్టులను భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది. 1 : 1 పద్ధతిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కి హాజరై ఉద్యోగం వస్తుందన్న భరోసాతో ఇంటికెళ్లిన వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. స్పోర్ట్స్ కేటగిరీ పేరుతో అర్హులైన అభ్యర్థుల పొట్టగొట్టారు. అర్హులకు అన్యాయం చేసి పోస్టులను అమ్ముకోవడంపై సీబీఐతో విచారించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. – ఎ.రవిచంద్ర, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ -
సభలో చంద్రబాబు పరువు తీసిన ప్రజలు
-
మా భూములివ్వం.. బాబు ప్రభుత్వం మమ్మల్ని వేధిస్తోంది
సాక్షి, అమరావతి: రాజధాని పేరుతో ఇప్పటికే 50 వేల ఎకరాలు తీసుకున్న చంద్రబాబు సర్కారు.. మరో 50 వేల ఎకరాలు కావాలంటూ తమను వేధిస్తోందని, మూడు పంటలు పండే పచ్చటి భూములను ఇచ్చేదే లేదని ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, ఎర్రపాలెం, కురగల్లు గ్రామాల రైతులు స్పష్టం చేశారు. తమ ప్రమేయం లేకుండానే లే అవుట్లు, ప్లాట్లు వేస్తోందని.. రిజిస్ట్రేషన్లు సైతం చేసేస్తోందని మండిపడ్డారు. తరతరాలుగా భూమిని నమ్ముకుని బతుకుతున్న తమకు భవిష్యత్తు లేకుండా చేస్తోందని నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తమ గోడు ఏమాత్రం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో ఏం చేయాలో దిక్కుతోచక వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తమ కష్టాన్ని వివరించామని తెలిపారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి నేతృత్వంలో ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, ఎర్రపాలెం, కురగల్లు గ్రామాలకు చెందిన రైతులు వైఎస్ జగన్‌ను కలిసి తమ కష్టాలను వివరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు ఒప్పందం ప్రకారం డెవలప్ చేసిన ప్లాట్లు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని చెప్పారు. భూములు ఇవ్వడానికి నిరాకరించిన రైతుల పట్ల మరింత దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. రెండో విడత భూసేకరణ పేరుతో రైతులను భయపెడుతున్నారని, ఉన్న అరెకరం పొలం ఇచ్చి తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భూములు ఇవ్వడానికి నిరాకరించిన రైతుల పట్ల నిర్దయగా వ్యవహరిస్తుండటం దుర్మార్గమన్నారు. పెనుమాకలో మినీ రిజర్వాయర్ పేరుతో పనులు మొదలుపెట్టిన ప్రభుత్వం.. రైతుల పొలాలను అడ్డగోలుగా తవ్వేసిందని చెప్పారు. పక్కనే భూ సేకరణకు భూములివ్వని రైతుల పొలాలను 20 అడుగుల లోతు వరకు చెరువుల్లా తవ్వేసి.. వ్యవసాయానికి పనికి రాకుండా చేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షంతో ఆ పొలాలన్నీ చెరువుల్లా మారిపోయాయని చెప్పారు. తామంతా (రైతులు) ఆవేదనతో అల్లాడిపోతుంటే కూటమి నాయకులు మాత్రం పొలాల్లో తవ్వేసిన మట్టి, ఇసుక అమ్ముకుని జేబులు నింపుకుంటున్నారని చెప్పారు. ఇప్పటికే రాజధాని కోసం ఇళ్లు, పొలాలను ఇచ్చేసిన రైతులకు ప్రభుత్వం వాగుల్లో ప్లాట్లు కేటాయించడం అత్యంత దారుణమని మండిపడ్డారు.ఎంత మంది రైతులను చంపేద్దామనుకున్నారు?రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు ఒప్పందం ప్రకారం డెవలప్ చేసిన ప్లాట్లు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. భూములు ఇవ్వడానికి నిరాకరించిన రైతుల పట్ల మరింత దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. ఉన్న అరెకరం పొలం ఇచ్చి కుటుంబాలను ఎలా పోషించుకోవాలన్న రైతుల ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు. అనుమతి లేకుండా రైతుల పొలాలను అడ్డగోలుగా తవ్వేయడం దుర్మార్గం కాదా? భూసేకరణకు భూములివ్వని రైతుల పొలాల్లో 20 అడుగుల లోతున చెరువుల్లా తవ్వేశారు. ఇటీవల కురిసిన వర్షంతో ఆ పొలాలన్నీ చెరువుల్లా మారాయి. డ్రెడ్జింగ్ చేసి ఇసుకను పక్కనే కుప్పలుగా పోశారు. రైతులు ఆవేదనతో అల్లాడిపోతుంటే కూటమి నాయకులు మాత్రం రైతుల పొలాల్లో మట్టి, ఇసుక అమ్ముకుని జేబులు నింపుకుంటున్నారు. మంచి ప్లాట్లు నేతలు తీసుకుని, రైతులకు వాగుల్లో ప్లాట్లు కేటాయించడం చూసి ఎంతో మంది బోరున విలపిస్తున్నారు. ఇలా అధికారులకు తన గోడు చెప్పుకుంటూనే ఓ రైతు గుండె పగిలి చనిపోయాడు. ఇప్పుడు రైతుల పొలాలను తవ్వేసి, ఇంకెంత మంది రైతులను ఇలా చంపేద్దామనుకుంటున్నారు? కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్ల కోసం రైతుల జీవితాలను మట్టిపాలు చేయాలనుకోవడం చాలా తప్పు. బలవంతపు భూసేకరణ పేరుతో రైతులను వేధించడం ఇకనైనా ఆపాలి. – దొంతిరెడ్డి వేమారెడ్డి, వైఎస్సార్సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్తవైఎస్ జగన్ హామీతో ధైర్యం వచ్చిందిచంద్రబాబు ప్రభుత్వ తీరుతో తామంతా నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నామని, ఈ ప్రభుత్వం తమ పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేస్తోందని రాజధాని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ బాధలను సీఆర్డీఏ కమిషనర్, మంత్రి లోకేశ్.. ఉండవల్లిలోనే ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం వినలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నామని తెలిపారు. ఉన్న అరకొర భూములు ప్రభుత్వానికి ఇచ్చేస్తే తరతరాలుగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న తమ కుటుంబాల భవిష్యత్తు అంధకారం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశామన్నారు. తమ బాధలను సావధానంగా విన్న వైఎస్ జగన్.. అండగా ఉంటామని తమకు హామీ ఇచ్చినట్టు రైతులు తెలిపారు. ఈ అన్యాయంపై రైతుల పక్షాన నిలబడి న్యాయస్థానాల్లో పోరాడతామని హామీ ఇచ్చారన్నారు. జగన్ హామీతో తమకు ధైర్యం కలుగుతోందన్నారు. ప్రభుత్వమే దగ్గరుండి రైతుల పొలాలను తవ్వేయడం, భూములు ఇవ్వని రైతుల పొలాల్లో వారి అనుమతి లేకుండా లే అవుట్లు వేసి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని తెలుసుకుని వైఎస్ జగన్ మండిపడ్డారని తెలిపారు.చంద్రబాబు, లోకేశ్ మా గోడు వినలేదునాకు ఉన్నదే కొంచెం భూమి. అందులో కొంత కృష్ణా నదిలో కొట్టుకుపోయింది. మిగిలింది సీడ్ యాక్సిస్ రోడ్ అంటున్నారు. దాని పక్కనే బఫర్ జోన్ అంటున్నారు. ల్యాండ్ పూలింగ్‌కి ఇవ్వని భూమిలో కూడా లేఅవుట్ వేశారు. నాకు భూమి మిగిలే పరిస్థితి కనిపించడం లేదు. సీఆర్డీఏ కమిషనర్ మా మొర ఆలకించడం లేదు. మా ఎమ్మెల్యే లోకేశ్ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోనే ఉంటారు. మా రైతులను పిలిచి మా గోడు వినాలి. పచ్చని పంటలు పండే భూములు ఇవ్వడానికి మేం సిద్ధంగా లేము. ప్రభుత్వం స్పందించక పోవడంతో న్యాయం చేయాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశాం. వైఎస్సార్సీపీ లీగల్‌గా అండగా ఉంటుందని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. – శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి రైతుభూములివ్వడం ఇష్టం లేదుతరతరాలుగా మేము అనుభవిస్తున్న భూమిని ల్యాండ్ పూలింగ్‌కు ఇవ్వడానికి నేను సిద్ధంగా లేను. 12 ఏళ్లుగా ఇదే మాట మీదే ఉన్నా. ఈ భూమిని నమ్ముకునే నా కుటుంబాన్ని పోషించుకుంటున్నా. పిల్లలను చదివించుకుంటున్నా. అన్నం పెట్టే పొలాన్ని ఇవ్వడం మాకిష్టం లేదు. – శంకర్రావు, ఎర్రపాలెం రైతుప్రభుత్వం తీరుతో నిద్ర కరువు చంద్రబాబు నాయుడి ప్రభుత్వం కారణంగా మేం రోజూ నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తోంది. ల్యాండ్ పూలింగ్‌కు భూములు ఇవ్వడం ఇష్టం లేదని మొత్తుకుంటున్నా నోటీసులు, నోటిఫికేషన్ల పేరుతో మమ్మల్ని అధికారులు వేధిస్తున్నారు. వైఎస్ జగన్ హామీతో మాకు ధైర్యమొచ్చింది. – అశోక్ రెడ్డి, ఉండవల్లి రైతుమా పొలాన్ని పనికి రాకుండా చేశారుమా గ్రామ రైతులు ఏడాదంతా పూల తోటలు సాగు చేస్తారు. ఎకరం పొలంలో ఏడాదికి రూ.3–4 లక్షలు సంపాదిస్తాం. రెండెకరాలున్న రైతులు ఏ ఆర్థిక ఇబ్బందులు లేకుండా తరతరాలుగా బతుకుతున్నారు. మొదటి విడత భూసేకరణకు పోను మా గ్రామంలో 450 ఎకరాల భూమి మాత్రమే మిగిలి ఉంది. మా సమ్మతి లేకుండానే ఆ భూముల్లో కూడా ప్లాట్లు వేసి రిజిస్ట్రేషన్లు చేశారు. ప్రభుత్వమే చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. మా పొలాల చుట్టూ మెరక తోలేస్తున్నారు. వర్షాలు కురిస్తే నీరు నిలబడిపోయి ఆ పొలం వ్యవసాయానికి పనికి రాకుండా పోతుంది. ఇలాగైతే మేం ఏం తిని బతకాలి? – శివరామ్, రైతు, నిడమర్రు -
అయ్యా మీరే దిక్కు ఉండవల్లి రైతులు ఆవేదన
-
చంద్రబాబుకి షాకిచ్చిన రాజధాని రైతులు
సాక్షి, తాడేపల్లి: అమరావతి రాజధాని భూముల అంశం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో వేడి రాజేసింది. భూసేకరణను వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కలిసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ సమయంలోనే ఉన్నపళంగా ఆ గ్రామాల్లో సీఆర్డీఏ గ్రామసభ నిర్వహించడం తీవ్ర దుమారం రేపింది. ఇది “కుట్ర రాజకీయాలే”నని చెబుతూ.. చంద్రబాబు సర్కార్‌కు రైతులు షాకిచ్చారు. గ్రామసభల్ని బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాజధాని ప్రాంత రైతులు మరోసారి తమ సమస్యలతో రోడ్డెక్కారు. పెనుమాక, ఉండవల్లి ప్రాంత రైతులు తమ భూములపై కొనసాగుతున్న వివాదాలు, నోటిఫికేషన్లు, నోటీసులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు తెలియకుండానే భూసేకరణ నోటిఫికేషన్లు జారీ చేశారని, భూములు ఇవ్వాల్సిందేంటూ అధికారులు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు.తమ సమస్యలను నేరుగా మాజీ సీఎం వైఎస్ జగన్‌కు చెప్పుకోవడానికి రైతులు సిద్ధమవుతున్న తరుణంలోనే హఠాత్తుగా పెనుమాకలో సీఆర్డీఏ అధికారులు గ్రామసభ నిర్వహించడం మరింత చర్చనీయాంశంగా మారింది. “రాజధానికి భూమి ఇవ్వాలి” అనే పేరుతో సమావేశాలు పెట్టి తమపై ఒత్తిడి తెస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.జగన్‌తో సమావేశం ఉన్న రోజే గ్రామసభ నిర్వహించడాన్ని రైతులు అనుమానాస్పదంగా చూస్తున్నారు. తమ గొంతు నొక్కే ప్రయత్నంగా ఇది మారిందని, ప్రభుత్వ వైఖరి వేధింపులుగా ఉందని వారు మండిపడుతున్నారు. అంతేకాదు.. గ్రామసభకు టీడీపీ నేతలను పిలవడంపైనా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రైతుల నిలదీతతో అధికారులు నీళ్లు నమిలారు. ఆపై చేసేది లేక టీడీపీ నేతలు, అధికారులు గ్రామసభ నిర్వహించకుండానే వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ అంశంలో న్యాయం చేయాలని కోరుతూ రైతులు వైఎస్ జగన్‌ను కలవబోతున్నారు. మరోవైపు భూసేకరణ ప్రక్రియలో భాగంగా నోటీసులు ఇచ్చారని అధికారులు చెబుతున్నప్పటికీ, రైతులు మాత్రం “తొలి విడతలోనే భూములు ఇచ్చాం… మళ్లీ భూములు ఎలా ఇవ్వాలి?” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములు లేకపోతే ఎలా బతికేదని ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామాల మధ్య తమ బాధలను నేరుగా జగన్ దృష్టికి తీసుకెళ్లేందుకు రైతులు ముందుకు రావడం, మరోవైపు అదే సమయంలో గ్రామసభ నిర్వహణకు ముందుకు రావడం.. ఆ సభను రైతులు బహిష్కరించడం.. రాజధాని రాజకీయాల్లో కొత్త దుమారానికి దారి తీసింది. -
చంద్రబాబు సర్కారుపై 'సమరభేరి'
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై సమరభేరి మోగింది. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సోమవారం యువతరం కదంతొక్కింది. చంద్రబాబు సర్కారుపై గళమెత్తి గర్జించింది. వినూత్న నిరసనలు, ప్రదర్శనలతో రణన్నినాదమై రగిలింది. డీఎస్సీ పేపర్ లీక్, అడుగడుగునా చోటుచేసుకున్న అవకతవకలు స్పోర్ట్స్ కోటా పోస్టుల అమ్మకంపై దుమ్మెత్తిపోసింది. మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. తక్షణం అర్హులకు న్యాయం చేయాలని, లేకుంటే మెగా డీఎస్సీ పేరుతో దగా చేసిన చంద్రబాబు సర్కారుకు ఘోరీ ఖాయమని ధ్వజమెత్తింది. ప్రతిభకు పాతరేయడం, రిజర్వేషన్లకు గండికొట్టడంపై భగ్గుమంది. కాసులిచ్చిన వారికే పోస్టులు దక్కడంపై మండిపడింది. తక్షణం సీబీఐ విచారణ జరపాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని నినదించింది. ఈ సందర్భంగా విద్యార్థి, యువజన సంఘాల నేతలు, వైఎస్సార్ సీపీ నాయకులు కలెక్టర్లు, ఆర్డీవోలకు వినతిపత్రాలు సమర్పించారు. సీఎం చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టారని గుర్తుచేశారు. ముందే మెరిట్ లిస్టు ప్రకటించి అర్హులకు వైఎస్ జగన్ ఉద్యోగాలిచ్చారని ప్రశంసించారు. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అనకాపల్లిలో మానవహారం చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ, కృష్ణాజిల్లా మచిలీపట్నంలోనూ యువత ఆందోళన చేశారు. కలెక్టర్లకు వినతిపత్రాలిచ్చారు. బందరులో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. గుంటూరు, పల్నాడు జిల్లా నరసరావుపేట, బాపట్లలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో యువత కదంతొక్కారు. కలెక్టరేట్ల వద్ద దర్నాలు నిర్వహించారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు. ప్రకాశం జిల్లాల్లోనూ ఆందోళనలు జరిగాయి. నెల్లూరులో పోలీసులు కలెక్టరేట్‌కు తాళాలు వేశారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోనూ యువకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ యువకులు ర్యాలీలు నిర్వహించారు. పోలీసులు అడ్డుకోవడంతో వైఎస్సార్సీపీ నేతలు రోడ్డుపై బైఠాయించారు. నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ ఆందోళనలు సాగాయి. చిత్తూరు కలెక్టరేట్ వద్ద యువకులు మెడకు ఉరితాళ్లు బిగించుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లా కలెక్టరేట్లను యువకులు ముట్టడించారు. వైఎస్సార్ కడప జిల్లాలో యువత బైక్ ర్యాలీలు నిర్వహించారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లా కలెక్టరేట్ల వద్ద కూడా యువత కదంతొక్కింది. డీఎస్సీ అక్రమాల బాధ్యుల్ని శిక్షించాల్సిందే: జక్కంపూడి రాజాసాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకొంటున్న మెగా డీఎస్సీ అడుగడుగునా అక్రమాలు, అవకతవకలతో దగా డీఎస్సీగా మారిందని వైఎస్సార్సీపీ ధ్వజమెత్తింది. డీఎస్సీ పరీక్షల నిర్వహణ, ఫలితాల్లో జరిగిన భారీ కుంభకోణానికి పూర్తి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేశ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. డీఎస్సీ బాధితులకు న్యాయం చేయాలంటూ వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు భారీ నిరసన ప్రదర్శనలు చేశారు. ఈ సందర్భంగా విశాఖ కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా చేసి, అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం విశాఖ మద్దిలపాలెంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన అత్యంత పారదర్శకమైన డీఎస్సీ నోటిఫికేషన్‌ను అడ్డగోలుగా రద్దుచేసి, ధనార్జనే ధ్యేయంగా చంద్రబాబు ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ ఇచ్చిందని విమర్శించారు. ‘అర్హులకు కాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో బేరాలు కుదుర్చుకున్న వారికే కాల్ లెటర్లు ఇచ్చారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత స్పోర్ట్స్ కోటా జీవోలను ఇష్టారాజ్యంగా మార్చి తాడాట, బొంగరం ఆటలు ఆడేవారికి ఉద్యోగాలిచ్చి అర్హులైన ప్రతిభావంతులను ముంచేశారు. లోకేశ్‌ను వెంటనే కేబినెట్ నుంచి తప్పించి, ఈ వ్యవహారంలో ఆయన్ని ఏ–1గా చేర్చి అరెస్టు చేయాలి’ అని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు మాట్లాడుతూ డీఎస్సీ కుంభకోణంపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోతే తమ పార్టీ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. -
అర్హులను తొక్కేసి.. అడ్డగోలు డ్రామాలు!
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ –2025లో అక్రమాలను కప్పిపుచ్చేందుకు చంద్రబాబు సర్కారు పడరాని పాట్లు పడుతోంది! అడ్డదారిలో ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా అవన్నీ సక్రమమే అంటూ అడ్డగోలుగా అబద్ధాలు చెబుతోంది. ఓ అభ్యర్థి గతంలో తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలతో (రెండు వేర్వేరు పుట్టిన తేదీలు) సంపాదించిన క్రీడల సర్టిఫికెట్తో ఉద్యోగానికి దరఖాస్తు చేస్తే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పోస్టల్ శాఖ నిర్ద్వందంగా తిరస్కరించింది. అలాంటి అభ్యర్థికి ఈ డీఎస్సీలో ఏకంగా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టు కట్టబెట్టేసి ఎలాంటి తప్పులేదంటూ రాష్ట్ర ప్రభుత్వం సమర్థించుకోవడం విస్తుగొలుపుతోంది.సోమవారం సచివాలయంలో పర్యాటక, యుజవన సర్వీసుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్, శాప్ ఎండీ భరణిని ముందుపెట్టి ప్రభుత్వం తన తప్పులను ఒప్పులుగా చిత్రీకరించేందుకు యత్నించి భంగపడింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మభ్యపెట్టే యత్నం చేసింది. క్రీడా సర్టిఫికెట్లు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిది, శాప్ అధికారులది కాదని.. క్రీడా సంఘాలు మాత్రమే ఇస్తాయంటూ అర్థంలేని వాదన వినిపించింది. డీఎస్సీ క్రీడా కోటాలో ఎంపికైన అభ్యర్థుల మెరిట్ జాబితాను వెబ్సైట్లో, బహిరంగంగా ప్రదర్శించకుండా దాచిపెట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు ‘క్రిడయ్’ యాప్‌లో పెట్టామంటూ సమర్థించుకోవడం దుర్నీతిని బట్టబయలు చేస్తోంది.కోర్టు కేసులను ఎదుర్కొని పారదర్శకంగా నియామకాలు చేపట్టినట్లు స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్ గొప్పగా ప్రకటించారు. అయితే, అంతర్ జిల్లా స్థాయిలో సర్టిఫికెట్లు తెచ్చుకున్న క్రీడాకారులకు యథేచ్ఛగా టీచర్ ఉద్యోగాలు ఇచ్చేసిన ప్రభుత్వం.. అంతర్జాతీయ క్రీడాకారులకు మాత్రం పోస్టులు ఇచ్చేందుకు ఎందుకు నిరాకరించిందో మాత్రం చెప్పడం లేదు. ఆయా అంతర్జాతీయ క్రీడాకారులు హైకోర్టును ఆశ్రయించగా అధికారుల తీరును తప్పుబట్టి అక్షింతలు వేసిన తరువాతే డీఎస్సీలో ఉద్యోగం ఇచ్చారు.మరి పారదర్శకత ఎక్కడ పాటించారు? హైకోర్టు ఆదేశాలతో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ఫిర్యాదులను పరిష్కరించామని చెప్పుకొచ్చారు. మరి నియామకాల సమయంలోనే తప్పుడు పత్రాలతో ఉద్యోగాలు పొందుతున్న వారి వివరాలతో సహా అర్హులైన అభ్యర్థులు శాప్‌కు ఫిర్యాదు చేస్తే ఎందుకు పట్టించుకోలేదో చెప్పలేక నీళ్లు నమిలారు. ఇక ఈ డీఎస్సీ తర్వాత క్రీడా కోటాలో రాత పరీక్షను తప్పనిసరి చేస్తూ జీవోను సవరించడంపై అధికారులు వివరణ ఇస్తూ.. ప్రభుత్వ పాలసీ పర్మినెంట్‌గా ఉండదని సమర్థించుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.ప్రభుత్వానికి పాలసీ పర్మినెంట్‌గా ఉండదట!మీడియా: డీఎస్సీ ముగిసిన తర్వాత స్పోర్ట్స్ కోటా 3 శాతం హారిజాంటల్ రిజర్వేషన్ జీవోను ఎందుకు సవరించారు? మళ్లీ రాత పరీక్షను ఎందుకు తప్పనిసరి చేశారు? క్రీడా సర్టిఫికెట్లు, డిగ్రీల జెన్యూనుటీని ఎలా పరిశీలించారు?స్పెషల్ సీఎస్, శాప్ ఎండీ: ప్రభుత్వానికి పాలసీలు పర్మినెంట్‌గా ఉండవు. క్రీడా పాలసీ కూడా అంతే. క్షేత్రస్థాయి ఫీడ్ బ్యాక్‌ను బట్టి పాలసీ మారిపోతుంది. అప్పటి పాలసీ ప్రకారం రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇచ్చాం. కొన్నిసార్లు చట్టాలకు అనుగుణంగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. శాప్‌లో ప్రత్యేక స్రూ్కటినీ బృందాలను పెట్టి ఆ తర్వాత స్క్రీనింగ్ కమిటీ ద్వారా 1 : 5 నిష్పత్తిలో జాబితా తయారు చేశాం. వాటిని వారం రోజులు వెబ్సైట్లో పెట్టి అభ్యంతరాలు స్వీకరించి తర్వాత తుది జాబితాను సిద్ధం చేశాం. 421 పోస్టులకుగాను 382 పోస్టులు భర్తీ చేశాం. క్రీడా సంఘాలు, ఫెడరేషన్ల నుంచి జెన్యూనుటీ సర్టిఫికెట్లు తీసుకొచ్చాం. స్రూ్కటినీ కమిటీలో ఆయా వర్సిటీల అధికారులు పరిశీలించి ఓకే చేశారు.ఇదీ వాస్తవం: ప్రభుత్వం చెబుతున్నట్లుగా క్రీడా సంఘాలు, ఫెడరేషన్ల నుంచి క్రీడాకారుల జెన్యూనుటీ సర్టిఫికెట్లను తీసుకుంటే ఒక్కటి కూడా మీడియాకు చూపించలేదు. వాస్తవానికి ధ్రువపత్రాల పరిశీలన సమయంలో క్రీడా సంఘాల ప్రతినిధులకు భాగస్వామ్యం కల్పించాలి. జాతీయ స్థాయిలో అయితే ఫెడరేషన్ సభ్యులు ప్రభుత్వ నియామకాల్లో కచ్చితంగా పాల్గొంటారు. గత ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగాల భర్తీ సమయంలో తొలుత జిల్లా స్థాయిలో ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో వడపోత చేపట్టారు. పైగా అçప్పుడు రాత పరీక్షల్లో అర్హత సాధిస్తే ఉద్యోగం కల్పించారు. డీఎస్సీ మాదిరిగా క్రీడా సర్టిఫికెట్ చూసి ఉద్యోగం ఇవ్వలేదు. 1.34 లక్షల మందితో సచివాలయాల ఉద్యోగాల భర్తీ నిర్వహించినప్పుడు రాని ఆరోపణలు ఇప్పుడు 2025 డీఎస్సీలో మాత్రమే ఎందుకు వస్తున్నాయో ఈ ప్రభుత్వం చెప్పలేకపోతోంది. పైగా ఇతర రాష్ట్రాల్లో చదివిన ఉద్యోగార్థుల వివరాలను ఆయా వర్సిటీల్లో పరిశీలించకుండానే చేసేసినట్టు చెబుతోంది.శాప్.. పూటకో మాట!డీఎస్సీ ఉద్యోగార్థుల క్రీడా సర్టిఫికెట్లను పారదర్శకంగా స్రూ్కటీని చేసినట్లు స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ బల్లగుద్ది చెప్పారు. సర్టిఫికెట్ల పరిశీలనలో ‘శాప్’ పారదర్శకత ఏపాటిదో చెప్పేందుకు ఈ ఉదంతమే ఓ నిదర్శనం. 2024 సెప్టెంబర్‌లో న్యాయస్థానాల్లో ఉద్యోగాల భర్తీ సందర్భంగా ప్రకాశం జిల్లాకు చెందిన ఓ క్రీడాకారుడు ‘ప్రాసెస్ సర్వర్ పోస్టు’ కోసం క్రీడా కోటాలో దరఖాస్తు చేసుకున్నారు. 2021 డిసెంబర్ 24–28 వరకు అనంతపురంలో జరిగిన సాఫ్ట్‌బాల్ నేషనల్ మీట్లో పాల్గొని తన టీమ్ రజత పతకం సాధించినట్లు అతడు పేర్కొన్నారు.ఈ క్రీడా సర్టిఫికెట్లు శాప్ పరిశీలనకు రావడంతో ‘మాస్టర్‌మైండ్’ తన వాటా కింద రూ.3 లక్షలు వసూలు చేసి అంతా సక్రమమేనంటూ అధికారులతో చెప్పించడంతో సదరు క్రీడాకారుడికి ఉద్యోగం వచ్చేసింది. అయితే దీనిపై ఓ అభ్యర్థి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉద్యోగానికి ఎంపికైన సదరు క్రీడాకారుడు ఆ సమయంలో సాఫ్ట్‌బాల్ నేషనల్ మీట్లో పాల్గొనలేదని, ఆ సమయంలో అతడు ఓ కళాశాలలో బీపీఈడీ కోర్సు చదువుతున్నట్లు ఆధారాలు సమర్పించారు.దీనిపై సింగిల్ బెంచ్ ధర్మాసనం ఆదేశాల మేరకు మరోసారి సర్టిఫికెట్లను పరిశీలించిన శాప్ అధికారులు అవి సరైనవి కాదని తేల్చారు. దీనిపై సదరు క్రీడాకారుడు డివిజనల్ బెంచ్‌ను ఆశ్రయించగా శాప్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. తాము ఆ క్రీడాకారుడికి నోటీసులు ఇచ్చినప్పటికీ ఫిజికల్ టెస్టుకు హాజరు కాలేదని, ఆటలో నైపుణ్యం లేదని పేర్కొంది. దీనిపై తాజాగా హైకోర్టు శాప్ అధికారులతో ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ నేపథ్యంలో స్పెషల్ సీఎస్ చెబుతున్నట్లుగా శాప్ నిజంగానే అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తుంటే కోర్టు ఉద్యోగాల భర్తీకి సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలనపై పూటకో మాట ఎందుకు చెబుతోంది? ఏ రాజకీయ శక్తి చేతుల్లో శాప్ బందీగా మారిపోయింది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.తొలుత సదరు సాఫ్ట్‌బాల్ క్రీడాకారుడి సర్టిఫికెట్ సరైనదే అంటూ ధ్రువీకరించిన శాప్.. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో మరోసారి ఆ సర్టిఫికెట్లు నిజమైనవి కావంటూ మాట మార్చినట్లు స్పష్టం చేస్తున్న హైకోర్టు ఆర్డర్ సర్వీసు రూల్స్‌కు ముందు జీవో సవరణ?కూటమి ప్రభుత్వం తన తప్పులను సమర్థించుకునే క్రమంలో అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. డీఎస్సీ 2025 ముగియడమే ఆలస్యం.. స్పోర్ట్స్ కోటాలో రాత పరీక్షలు లేకుండా ఉద్యోగాలు ఇవ్వటాన్ని ఎత్తివేసింది. తొలుత డీఎస్సీకి ముందు ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసు రూల్స్‌ను సవరిస్తూ 19–04–2025న అప్పటి సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. దాని ప్రకారం డీఎస్సీలో పరీక్ష లేకుండా క్రీడా కోటాలో ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించారు.డీఎస్సీ ముగిసిన తర్వాత ఈ ఏడాది మే 15న ఏపీ సబార్డినేట్ అండ్ సర్వీసు రూల్స్‌ను మళ్లీ సవరిస్తూ సీఎస్ సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కచ్చితంగా డిపార్ట్మెంట్ పెట్టే రాత పరీక్షలో అర్హత సాధించాలని పేర్కొన్నారు. విచిత్రం ఏమిటంటే.. ఈ ఏడాది మే 15న సబార్డినేట్ అండ్ సర్వీసు రూల్స్ సవరణ కంటే ముందే.. మే 14 క్రీడా శాఖలో జీవోను సవరిస్తూ స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్ ఉత్తర్వులు ఇవ్వడం!నేషనల్ గేమ్స్‌కు ప్రాధాన్యమా?క్రీడా పాలసీ 2024–29 రూపకల్పనలో కూటమి ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరించింది. ‘మాస్టర్‌మైండ్’ చెప్పినట్టే పాలసీ పురుడు పోసుకుంది. డీఎస్సీలో అక్రమాలకు మార్గం సుగమం అయింది. పాలసీ రూపకల్పన సమయంలోనే క్రీడా సంఘాలను ప్రభుత్వం సంప్రదించి ఉంటే.. సీనియర్ నేషనల్స్‌కు ప్రాధాన్యం దక్కాల్సిన చోట నేషనల్ గేమ్స్ పెట్టడంపై క్రీడా సంఘాలు ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తాయి? పదేపదే జీవోలను సవరించామని ఎందుకు డిమాండ్ చేస్తాయి? వీటికి ప్రభుత్వం దగ్గర సరైన సమాధానం లేదు.గొప్పగా 65 క్రీడలకు అవకాశం కల్పించాలని చెబుతున్న ప్రభుత్వం.. ఏపీలో అంతగా ప్రాచుర్యంలో లేని క్రీడలను ఎందుకు చేర్చింది? ఫెడరేషన్లలో గుర్తింపు పొందిన ఏపీ క్రీడా సంఘాలకు కచ్చితంగా శాప్ గుర్తింపు ఇవ్వాల్సి ఉండగా వాటిని ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తోంది? మాస్టర్‌మైండ్ మాట వింటేనే క్రీడా సంఘాలు మనుగడ సాగించే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవన్నీ డీఎస్సీ స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ఇవన్నీ పరిశీలిస్తుంటే అర్హులకు పోస్టులు ఇవ్వకుండా అన్యాయం చేసినట్లు స్పష్టమవుతోంది.పోస్టల్ శాఖలో రిజెక్ట్.. డీఎస్సీలో పోస్టింగ్మీడియా: విజయనగరం జిల్లాలో వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి ఒకరు తప్పుడు డేట్ ఆఫ్ బర్త్‌లతో ఉద్యోగం పొందారని ప్రభుత్వానికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే ఏం చేశారు? గతంలో పోస్టల్ శాఖ ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించింది కదా? పోలీసులు సైతం ఆమె తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలతో మోసం చేసినట్టు ధ్రువీకరించారు?స్పెషల్ సీఎస్, శాప్ ఎండీ: విజయనగరం జిల్లా వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణిపై ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ఆ జిల్లా ఎస్పీ సైతం దీన్ని ధ్రువీకరిస్తూ పత్రం ఇచ్చారు. సదరు క్రీడాకారిణి నేషనల్ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించారు. ఆమె 20–5–1992 డేట్ ఆఫ్ బర్త్‌తో క్రీడల్లో పాల్గొంది. ఆమె స్కూల్లో డేట్ ఆఫ్ బర్త్ కూడా అదే. మేం క్రీడా సంఘాలు, ఫెడరేషన్ నుంచి సైతం జెన్యూనుటి తీసుకున్నాం.ఇదీ వాస్తవం: విజయనగరం జిల్లాకు చెందిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి రెండు పుట్టిన తేదీలతో చలామణి అయినట్లు జిల్లా ఎస్పీకి 08–4–2016న స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ నివేదిక సమర్పించారు. ఎస్వీఆర్ మూర్తి అనే వ్యక్తి సదరు క్రీడాకారిణిపై విశాఖ రేంజ్ డీఐజీకి ఆధారాలతో సహా 19–02–2016లో ఫిర్యాదు చేశారు. దీనిపై డీఐజీ ఆదేశాలతో విజయనగరం ఎస్పీ విచారణ చేపట్టారు. విచారణ చేసిన స్పెషల్ బ్రాంచ్ అధికారులు 08–04–2016న సదరు క్రీడాకారిణి 20–05–1992, 10–05–1993 డేట్ ఆఫ్ బర్త్‌లతో చలామణి అయినట్టు ధ్రువీకరిస్తూ నివేదిక సమర్పించారు.తొలుత 10–05–1993 పుట్టిన తేదీతో (10–11–2010న) పాస్‌పోర్టు పొందగా, తర్వాత 06–08–2015న రూ.ఐదు వేలు జరిమానా చెల్లించి పుట్టిన తేదీ 20–05–1992తో కొత్త పాస్‌పోర్టు పొందినట్టు వెల్లడించారు. అయితే 10–05–1993 (తప్పుడు పుట్టిన తేదీ)తోనే ఆమె 2012లో కామన్వెల్త్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో 53 కిలోల మహిళల విభాగంలో ప్రాతినిధ్యం వహించింది. ఇలా అండర్ ఏజ్‌లో తప్పుడు డేట్ ఆఫ్ బర్త్‌తో జాతీయ పోటీల్లోనూ పాల్గొంది. ఇక 2015 సమయంలో 20–05–1992 పుట్టిన తేదీతో నేషనల్ గేమ్స్‌లో పాల్గొని పతకం సాధించింది.డీఎస్సీ నోటిఫికేషన్‌కు ముందు సదరు క్రీడాకారిణి పోస్టల్ శాఖలో ‘పోస్టల్ అసిస్టెంట్’ (రిజిస్టర్ నం, ఎస్పీ3ఈ153ఏ149బీఈ5ఎఫ్) ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంది. తప్పుడు ధ్రువీకరణ పత్రాలపై ఫిర్యాదులు అందడంతో పోస్టల్ శాఖ విచారించి ఆమెను ఉద్యోగానికి ఎంపిక చేయకుండా తిరస్కరించింది. అలా పోస్టల్ శాఖ సదరు అభ్యర్థి మోసాన్ని గుర్తించి ఎంపికకు నిరాకరిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నేషనల్ గేమ్స్‌లో 20–05–1992 తేదీతో ఆడారని, ఎటువంటి పోలీసు కేసులు లేవని చెబుతూ తన తప్పిదాన్ని సమర్థించుకుంటోంది.ఈ ఏడాది ఏప్రిల్ 24న ‘డీఎస్సీ డీల్స్’ కథనంలో సదరు క్రీడాకారిణి నియామకంపై ఆధారాలతో ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. అప్పటి నుంచి ఆమె క్రీడా సర్టిఫికెట్ జెన్యూనుటీ నిజమైనదేనని చెప్పాలంటూ క్రీడా సంఘాలపై ప్రభుత్వం ఒత్తిడి చేయడం వాస్తవం కాదా? 2025 ఆగస్టు 11న ఓ క్రీడాకారుడు ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే అప్పుడు పట్టించుకోని ప్రభుత్వం.. ఇప్పుడు తప్పును దాచేందుకు మల్లగుల్లాలు పడుతోంది. 2016లో విజయనగరం జిల్లాకు చెందిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి వేర్వేరు పుట్టిన తేదీలతో చలామణి అయినట్టు ధ్రువీకరించిన నివేదిక -
పేకాటలో ఫస్ట్ వస్తే టీచర్ ఉద్యోగం, సొల్లు కబుర్లు చెప్పడం కాదు
-
రెండేళ్ల పాలన నచ్చితే చప్పట్లు కొట్టండి.. తుని ప్రజల రియాక్షన్
-
బైజూస్ పేరుతో పచ్చ పైత్యం!
సాక్షి, అమరావతి: రెండేళ్ల పాలనలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకోలేక ఎల్లో మీడియా ద్వారా గత ప్రభుత్వ పాలనపై విషం కక్కుతోంది. ఈ క్రమంలో పేదింటి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడిన ట్యాబ్‌ల పంపిణీని తీవ్రంగా తప్పుపట్టింది. పేదింటి విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను ఉచితంగా అందించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వంలో తీసుకొచ్చిన బైజూస్ కంటెంట్‌పై ఏడుపుగొట్టు రాతలు రాస్తోంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సాంకేతిక పరికరాలను రూపొందించే శాంసంగ్ సంస్థ ట్యాబ్‌లలో ఉచితంగా బైజూస్ కంటెంట్‌ను అందిచడాన్ని జీర్ణించుకోలేక దుష్ప్రచారం చేస్తోంది.వాస్తవానికి శాంసంగ్ సంస్థ 8.7 అంగుళాల స్క్రీన్‌తో ట్యాబ్‌లను రూపొందిస్తోంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఒకే ప్రమాణాలతో తయారు చేస్తోంది. అలాంటి పేరెన్నిక కలిగిన ట్యాబ్‌లను చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసింది. పైగా అందులో అత్యంత ఖరీదైన గ్లోబల్ కంటెంట్‌ను (బైజూస్) నిక్షిప్తం చేసి మరీ అందించింది. ఇంతటి విప్లవాత్మక చర్య విద్యా వ్యవస్థలో ఎన్నడూ జరగలేదు. దీన్ని ఓర్వలేని చంద్రబాబు అండ్ కో గతంలోనూ పిల్లలు ట్యాబ్ వాడి చెడిపోతున్నారంటూ తప్పులు రాతలు రాయించి పేదింటి విద్యార్థులను తీవ్రంగా అవమానించింది. ప్రజా వ్యతిరేకత పెరగడంతో ఇప్పుడు మరోసారి అక్కసు వెళ్లగక్కింది. 9 అంగుళాల స్కీన్ర్ పెడితే?చంద్రబాబు ఎల్లో మీడియా 8.7 అంగుళాక స్క్రీన్ నిబంధన కేవలం ఒక కంపెనీకే లబ్ధి చేకూర్చేందుకు పెట్టారని వింత వాదన తెరపైకి తెచ్చింది. అదే, 9 అంగుళాలు స్క్రీన్ పెట్టినా ఇలాంటి తప్పుడు వాదనే వినిపిస్తుంది. వాస్తవానికి చంద్రబాబు అండ్‌కోకు పేదింటి బిడ్డలు ఉన్నత ప్రమాణాలతో విద్యను నేర్చుకోవడం నచ్చదు. పేదలు అక్షర జ్ఞానానికి చేరువ అవుతున్న ప్రతిసారీ ‘ఆంగ్లం వద్దు.. తెలుగు ముద్దు’ అంటూ పుక్కిట ఉపన్యాసాలు గుప్పించి వ్యవస్థలను కలుషితం చేసింది. అందుకే జగన్ ప్రవేశపెట్టిన ఆంగ్ల మాధ్యమంపైనా బురదజల్లింది.అధికారంలోకి వచ్చిన తర్వాత ట్యాబ్‌ల పంపిణీని ఎత్తేసింది. రెండో ఏడాదికే విద్యార్థి కిట్లు (సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర) పంపిణీ చేయలేమంటూ ఎక్కడో జరుగుతున్న యుద్ధంపైకి నెపాన్ని నెట్టేసి తప్పించుకుంది. డీఎస్సీ నియామకాల అక్రమాలపై నిరుద్యోగ యువత రగలిపోతుంటే కనీసం స్పందించని చంద్రబాబు, ఎల్లో మీడియా.. ఉన్నట్లుండి బైజూస్‌కు దోచిపెట్టారంటూ అడ్డగోలు కథనం అచ్చేయడం విస్తుగొలుపుతోంది. -
దొంగ ఎత్తులు.. నక్కజిత్తులు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం తీరు దొంగే దొంగా.. దొంగా.. అని అరిచినట్లుంది. నక్కజిత్తులతో ప్రజలను మాయ చేయాలని చూస్తోంది. ఉచిత ఇసుక ముసుగులో రాష్ట్రంలో యథేచ్ఛగా జరుగుతున్న దోపిడీని కప్పిపుచ్చుకునేందుకు ఎప్పటిలాగే తప్పుడు ప్రచారానికి దిగింది. తానే ఇసుక దందా నడుపుతూ గతంలో అక్రమాలు జరిగాయని విష ప్రచారం చేస్తోంది. ఇందుకు ‘ఈనాడు’ తందానా అంటోంది. ఈ క్రమంలో జగన్ హయాంలో ఇసుక దోపిడీ జరిగిందని, దానికి భారీగా జరిమానాలు విధిస్తున్నారంటూ అడ్డగోలు కథనం అచ్చేసింది. ప్రస్తుత చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో, 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలో ఇసుక అక్రమ తవ్వకాలు ఇష్టానుసారం సాగాయి. సాక్షాత్తు సీఎం చంద్రబాబు ఇంటి వెనుక కూత వేటు దూరంలోనే ఇసుక మాఫియా కృష్ణా నదిని కొల్లగొట్టడంపై 2019 ఏప్రిల్ 4వ తేదీన ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అక్రమాలకు కళ్లెం వేస్తూ అప్పటి చంద్రబాబు ప్రభుత్వానికి రూ.100 కోట్ల జరిమానా సైతం విధించింది. రాష్ట్రంలో ఇసుక అక్రమాలపై గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన సిట్ కూడా కేసు నమోదు చేసింది. ఇప్పుడు కూడా అదే ప్రాంతంలో ఇసుక తవ్వకాలు ఇష్టానుసారం జరుగుతున్నా చంద్రబాబు పట్టించుకున్న పాపాన పోలేదు. అప్పట్లో ప్రభుత్వానికి ఆదాయం వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో పారదర్శక ఇసుక విధానం అమలైంది. 2019 వరకు ఇసుకపై ఒక్క రూపాయి ఆదాయం రాని పరిస్థితుల్లో పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ నిర్వహించి, ఏడాదికి రూ.750 కోట్ల ఆదాయం వచ్చేలా చేసింది. ఐదేళ్లలో ఇసుక ద్వారా ప్రభుత్వానికి రూ.3,750 కోట్ల ఆదాయం లభించింది. ఆదాయం రావడమే కాకుండా, ఇసుక తవ్వకాలు క్రమబద్ధంగా జరిగి ప్రజలకు సులభతరంగా ఇసుక అందుబాటులోకి వచ్చింది. ధరలు కూడా టీడీపీ ప్రభుత్వం కంటే బాగా తగ్గాయి. బాబు రాగానే అక్రమాలు మొదలు2024లో చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ ఇసుక దందా మొదలైంది. ఎన్నికల ఫలితాలు వచ్చీ రావడంతోనే.. జగన్ ప్రభుత్వం వర్షాకాలంలో ఇసుక కొరత రాకుండా చూసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 70కిపైగా రీచ్‌ల్లో నిల్వ చేసిన 80 లక్షల టన్నుల ఇసుకపై టీడీపీ నేతల కన్ను పడింది. నేతలు ఎక్కడికక్కడ ఆ ఇసుక యార్డులను స్వాధీనంలోకి తీసుకుని యథేచ్ఛగా అమ్మేసుకున్నారు. సగానికి పైగా ఇసుక అమ్మేసుకున్నాక.. యార్డుల్లో పెద్దగా నిల్వలు లేవంటూ మిగిలిన కొద్దిపాటి ఇసుకను ప్రజలకు విక్రయించారు. అనంతరం ఉచిత ఇసుక విధానం అని చెప్పి రీచ్‌లు, స్టాక్ యార్డుల్లో ధరల పట్టిక పెట్టి మరీ ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. తవ్వకం చార్జీలు, లోడింగ్ చార్జీలు, రవాణా చార్జీలు అన్నీ కలిపి టన్ను ఇసుక రూ.1000 నుంచి రూ.2 వేల వరకు విక్రయిస్తున్నారు. అన్ని జిల్లాల్లో ఇసుక రీచ్‌లు, డీ సిల్టింగ్ పాయింట్లను టెండర్ల విధానంలోనే టీడీపీ నేతలకు కట్టబెట్టి అధికారికంగానే ఇసుకను అమ్ముతున్నారు. తవ్విన ఇసుకలో కొంత స్థానికంగా అమ్ముతూ, మిగిలిన ఇసుకను హైదరాబాద్, బెంగళూరు, చెన్నయ్ వంటి పెద్ద నగరాలకు తరలిస్తున్నారు.ప్రస్తుతం యథేచ్ఛగా⇒ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉచితం ముసుగులో ఇసుక అక్రమాల పర్వం యథేచ్ఛగా కొనసాగుతోంది. కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు.. నదులు, వాగులు, వంకలే కాకుండా పొలాలను కూడా వదలకుండా ఇష్టం వచ్చినట్లు ఇసుక తవ్వి, అక్రమంగా తరలించి అమ్ముకుంటున్నారు. గోదావరి, కృష్ణ, పెన్నా, చిత్రావతి, నాగావళి సహా అన్ని నదుల నుంచి ఇసుక అక్రమ రవాణా సాగుతోంది.⇒ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను పట్టించుకోకుండా, సుప్రీంకోర్టు సూచనలను సైతం లెక్క చేయకుండా.. అనుమతి లేని రీచ్‌లలో ఇసుకను తోడేస్తున్నారు. కార్మికులతోనే తవ్వకాలు చేయాల్సివుండగా, ప్రతిచోటా పొక్లెయిన్లు, జేసీబీలు, హిటాచీల వంటి భారీ యంత్రాలతో తవ్వకాలు జరుగుతున్నాయి. ఉచితం అంటూనే 18 టన్నుల లారీ ఇసుకను రూ.30-60 వేల వరకు అమ్ముతున్నారు.⇒ ఎన్టీఆర్ జిల్లా సరిహద్దుల నుంచి హైదరాబాద్‌కు, అనంతపురం సరిహద్దుల నుంచి కర్ణాటకకు, చిత్తూరు సరిహద్దు నుంచి కర్ణాటక, తమిళనాడుకు భారీ ఎత్తున ఇసుక అక్రమంగా తరలిపోతోంది. అన్నిచోట్లా కూటమి ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే అక్రమాలు జరుగుతున్నాయి. వారి ఆధ్వర్యంలోనే అక్రమ తవ్వకాలు జరుగుతుండగా.. చినబాబుకు ఆ మేరకు కమీషన్లు ఠంచనుగా చేరిపోతున్నాయి.⇒ చినబాబుకు కప్పం చెల్లిస్తూ ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు.. నదులు, వాగులను కొల్లగొడుతూ వేల కోట్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందాను దాచి పెట్టేందుకు గతంలో అక్రమాలు జరిగాయని, ఆ అక్రమాలకు జరిమా నాలు విధిస్తున్నారని ఎల్లోమీడియా అండతో చంద్రబాబు అండ్ కో దుష్ప్రచారం చేస్తోంది. -
అంతులేని నిర్లక్ష్యం.. అర్హులకు అన్యాయం!
సాక్షి, అమరావతి: పేద, దిగువ మధ్య తరగతి వర్గాలకు చెందిన నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు టీచర్ పోస్టులపై ఎంతో ఆరాటంతో అహోరాత్రులు డీఎస్సీ–2025 కోసం శ్రమిస్తే చంద్రబాబు సర్కారు అక్రమాలతో నింపేసిందని నిప్పులు చెరుగుతున్నారు. మెరిట్.. వెర్టికల్.. హారిజాంటాల్ రిజర్వేషన్ ప్రకారం పోస్టులు భర్తీ చేశామని ప్రభుత్వం చెబుతున్నా ఎక్కడా ఆ దాఖలాలు కనిపించడం లేదని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా సర్టిఫికెట్ల పరిశీలనకు ఒక పోస్టుకు ఒక్కరినే పిలవడం, ధ్రువపత్రాల్లో లోపాలుంటే సరిచేసుకునే అవకాశం ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేశారని అభ్యర్థులు వాపోతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కీలక పాత్ర పోషిస్తుంది. పోస్టుల భర్తీ విధివిధానాలను అత్యంత జాగరూకతతో రూపొందిస్తుంది. ఆ విధానాలను మెగా డీఎస్సీ 2025లో ఒక్కటీ అమలు చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయ అభ్యర్థులకు తీరని నష్టం వాటిల్లిందని పేర్కొంటున్నారు. జిల్లా ఎంపిక కమిటీలు చేయాల్సిన పనిని కేంద్ర కార్యాలయమే చక్కబెట్టడం.. తాము ఇచ్చిన జాబితాలోని అభ్యర్థులనే సర్టిఫికెట్ల పరిశీలనకు పిలవటాన్ని చూస్తుంటే గూడుపుఠాణి బోధపడుతోందని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘నేను 25 ఏళ్లుగా విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్నా. ఎన్నో డీఎస్సీలు నిర్వహించినా ఈ తరహా ప్రక్రియ ఎన్నడూ చూడలేదు. ఏం జరిగిందో చెప్పలేని పరిస్థితి..’ అని విద్యాశాఖ కీలక అధికారి ఒకరు వ్యాఖ్యానించడం మెగా డీఎస్సీ నిర్వహణలో లొసుగులకు అద్దం పడుతోంది. అవకాశం ఇవ్వకుండా అక్కడికక్కడి రిజెక్ట్..! ఏపీపీఎస్సీ ప్రస్తుతం వివిధ ఉద్యోగాల భర్తీకి 1:1 నిష్పత్తిలో ఫలితాలు విడుదల చేస్తోంది. పరీక్షల అనంతరం సర్టిఫికెట్ల పరిశీలనకు ముందు అభ్యర్థుల మెరిట్, రిజర్వేషన్లు, వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ పరిశీలించిన తర్వాతనే 1:1 నిష్పత్తిలో ఫలితాలను ప్రకటిస్తోంది. సర్టిఫికెట్ల పరిశీలనకు ఏవి తేవాలో ప్రచురిస్తుంది. విడుదల చేసిన ఫలితాల్లో హాల్‌టికెట్ నంబర్ ఉన్నవారు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరవుతారు. నిర్ణీత సర్టిఫికెట్లు లేకుంటే సమర్పించేందుకు అవసరాన్ని బట్టి 3 రోజుల వరకు గడువునిస్తారు. ఈలోగా సదరు అభ్యర్థి పరిస్థితిపై ప్రత్యేక ఫైల్ అంతర్గతంగా సిద్ధం చేస్తారు. ఎలాంటి సర్టిఫికెట్లు లేవు..? ఎన్ని రోజులు గడువు ఇచ్చారు..? ఒకవేళ సర్టిఫికెట్లు తేలేకపోతే తర్వాత మెరిట్ అభ్యర్థి ఎవరు..? అనేది అందులో ఉంటుంది. ఇచ్చిన గడువులోగా బోర్డు సంతృప్తి చెందితే ఎంపిక చేస్తారు. లేదంటే రెండో స్థానంలో ఉన్న అభ్యర్థిని పిలుస్తారు. కానీ మెగా డీఎస్సీ–2025లో అంతా తారుమారుగా చేశారు. 1:1 నిష్పత్తిలో అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపినా మెరిట్ కమ్ రిజర్వేషన్ (వర్టికల్/హారిజాంటాల్) ప్రకారం చేయలేదని తేటతెల్లమవుతోంది. ఇలా చేస్తే అన్ని విధాలుగా అర్హులైన వారికి మాత్రమే కాల్ లెటర్లు వెళతాయి. అన్నీ సక్రమంగా ఉన్న అభ్యర్థులకు తప్పనిసరిగా ఉద్యోగం వస్తుంది. కానీ డీఎస్సీ 2025 కాల్ లెటర్ల విడుదలకు ముందు ఎలాంటి రిజర్వేషన్లను పరిశీలించిన దాఖలాలు లేవు. నిర్ణీత తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన డీఎస్సీ అభ్యర్థుల పత్రాలకు సంబంధించి చిన్న లోపం కనిపించినా ఒక్కరోజు కూడా గడువు ఇవ్వకుండా అక్కడే తిరస్కరించినట్లు చెబుతున్నారు. ఇదేం రిజర్వేషన్ లెక్కో? 1:1 నిష్పత్తి ప్రకారం జోన్ ఆఫ్ కన్సిరడేషన్, పోస్ట్ పరిధిలోకి వచ్చిన వారికి మాత్రమే కాల్ లెటర్లు పంపి సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచినట్లు విద్యాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. హారిజాంటాల్ రిజర్వేషన్ ప్రకారం ఒక కేటగిరీలో 10 పోస్టులు ఉంటే అందులో 7 పోస్టులు మెరిట్ ద్వారా, 3 పోస్టులు హారిజాంటాల్ ద్వారా (ఉమెన్/ స్పోర్ట్సు/ఎక్స్ సర్వీస్‌మెన్/ పీడబ్లు్యడీ (ప్రత్యేక అవసరాలు) భర్తీ చేయాలని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన బాధిత అభ్యర్థి ఏకాంబరం (బీసీ–డీ) వివరాలను ఉదహరించారు. చిత్తూరు జిల్లాలో బీసీ–డీ కేటగిరిలో 7 పోస్టులు ఉండగా ఒకటి హారిజాంటాల్లో ఉమెన్‌కు కేటాయిస్తూ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. భర్తీ ప్రక్రియలో 5 పోస్టులను మెరిట్ ప్రకారం, 2 పోస్టులను హారిజాంటల్‌లో భర్తీ చేసినట్లు అధికారులు చెప్పారు. మెరిట్లో చివరి ర్యాంకర్ 114కి ఇచ్చామని (వాస్తవానికి 114వ ర్యాంకు అభ్యర్థి ఎస్టీ అయినా బీసీ–డీలో చూపించారు), కానీ ఏకాంబరం ర్యాంకు 125 కాబట్టి అతడికి పోస్టు వచ్చే అవకాశం లేదని చెప్పారు. మెరిట్లో ఉమెన్ లేకపోతే హారిజాంటాల్ ప్రకారం కింద ర్యాంకు ఎంత ఉన్నా పైకి తెచ్చి భర్తీ చేయాలని పేర్కొన్నారు. అర్హత ఉన్నా ఏకాంబరానికి అన్యాయం! వాస్తవానికి మెరిట్లో భర్తీ చేసిన ఐదు పోస్టుల్లో చివరి అభ్యర్థి ఉమెన్. ఆమె ఓవరాల్ ర్యాంకు 116. దీంతో హారిజాంటల్ పోస్టు భర్తీ అయిపోయింది. ఇక మిగిలిన రెండు పోస్టులను మెరిట్లో భర్తీ చేయాలి. 116వ ర్యాంకు అభ్యర్థి తర్వాత... ఆరో స్థానంతో 125వ ర్యాంకు సాధించిన ఎం.ఏకాంబరం ఉన్నారు. అతడికి ఒక పోస్టు ఇస్తే, మరో పోస్టును 133వ ర్యాంకులో ఉన్న మరో అభ్యర్థికి (బీసీ–డీలో 7వ ర్యాంకు) ఇవ్వాలి. కానీ చివరి రెండు పోస్టులను పీహెచ్ అభ్యర్థులతో నింపారు. వాస్తవానికి జిల్లాలో ఎస్ఏ సోషల్‌కు 113 పోస్టులు ఉన్నాయి. వీటిని అన్ని కేటగిరీల (బీసీ, ఎస్సీ,ఎస్టీ, ఓసీ) అభ్యర్థులకు వర్టికల్ రిజర్వేషన్లో చూపించారు. అయితే స్పోర్ట్సు, ఎక్స్ సర్వీస్‌మెన్, పీడబ్లు్యడీ వారికి వర్టికల్ రిజర్వేషన్లో కాకుండా హారిజాంటల్‌లో చూపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీల్లో ఏ కేటగిరీలో ఎవరిని భర్తీ చేస్తారో నోటిఫికేషన్లో చెప్పకుండా బీసీ–డీ కేటగిరీలోని రెండు పోస్టులను పీడబ్లు్యడీ అభ్యర్థులకు ఇచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే మొత్తం అన్ని పోస్టులోనూ హారిజాంటల్‌లో పీడబ్లు్యడీ అభ్యర్థులకు నాలుగు పోస్టులు కేటాయిస్తే.. వాటిలో రెండు బీసీ–డీలోనే భర్తీ చేయడంతో ఆ వర్గంలో మిగతా అభ్యర్థులకు అన్యాయం జరిగింది. దీంతో అర్హుడైనప్పటికీ ఏకాంబరం పోస్టు కోల్పోవాల్సి వచ్చింది. డిలీట్.. అప్లోడ్.. డిలీట్! వెబ్సైట్లో డీఎస్సీ జాబితాపై దాగుడుమూతలు మెగా డీఎస్సీ 2025లో తప్పులు జరిగాయనేందుకు ఇది మరో ఉదాహరణ. డీఎస్సీ ప్రక్రియ ముగియగానే వాస్తవాలను దాచి పెట్టేందుకు వెబ్సైట్ నుంచి మొత్తం డేటా తొలగించిన అధికారులు.. తాజాగా డేటాను మళ్లీ అప్లోడ్ చేశారు. శనివారం మీడియాతో సమావేశం నిర్వహణకు కొద్ది గంటల ముందు వివరాలను హడావుడిగా అప్లోడ్ చేసి అంతా సక్రమంగానే చేశామని చెప్పుకునేందుకు యత్నించారు. ఈసారి కొత్తగా ఎంపిక జాబితాలను సైతం అప్లోడ్ చేసి మళ్లీ వాటిని తొలగించడం కొసమెరుపు. డీఎస్సీలో అక్రమాలను ‘సాక్షి’ సాక్ష్యాధారాలతో సహా వెలుగులోకి తెస్తున్న విషయం తెలిసిందే. దీంతో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తోంది. డీఎస్సీ డేటాతో పాటు అభ్యర్థుల ఎంపిక జాబితాలను పలువురు శనివారం డౌన్లోడ్ చేసుకున్నారు. అయితే ఆదివారం రోజు తుది ఎంపిక జాబితాలను అధికారులు మళ్లీ తొలగించారు. -
ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంట్ పోయి వ్యక్తి మృతి! నాలుక గీసుకోడానికా మీరు మంత్రులు అయింది..
-
భారీగా పెరగనున్న ఆర్టీసీ ఛార్జీలు..?
-
డీఎస్సీలో తప్పుల మీద తప్పులు.. బాబు సర్కార్ ఉక్కిరిబిక్కిరి
-
మోత మోగిపోద్ది.. ఇక ఆర్టీసీ చార్జీల బాదుడు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై మరో బాదుడుకు సిద్ధమవుతోంది. ఆర్టీసీ చార్జీల రూపంలో రాష్ట్ర ప్రజలపై ఏడాదికి ఏకంగా రూ.300 కోట్ల అదనపు భారం మోపేందుకు సన్నద్ధమవుతోంది. ప్రభుత్వ ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ ఆర్టీసీ) ఈ మేరకు ప్రతిపాదనల్ని సమర్పించింది. సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షా సమావేశంలో చార్జీల పెంపుపై రెండు ప్రతిపాదనలను సమర్పించింది. ఆర్టీసీని సక్రమంగా నిర్వహించేందుకు అదనపు నిధులు కేటాయించేది లేదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. చార్జీలు పెంచుకోవాలని సూచించడంతో ప్రయాణికులపై ఆర్థికభారం అనివార్యం కానుంది. నిధులివ్వలేం.. చార్జీలు బాదేయండిఆర్టీసీని సక్రమంగా నిర్వహించేందుకు ఏటా రూ.220 కోట్లు మంజూరు చేయాలని ఆర్టీసీ అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. స్త్రీ శక్తి పథకం కింద ఆర్టీసీ ప్రతినెలా కోల్పోతున్న రాబడికి ప్రభుత్వం దశల వారీగా నిధులు విడుదల చేస్తోంది. కానీ.. ఇతర నిర్వహణ వ్యయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆర్టీసీని నిర్వీర్యం చేస్తోందని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి. ఆర్టీసీని ప్రైవేటీకరించే పన్నాగంతోనే ఈ విధంగా వ్యవహరిస్తోందని దుయ్యబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఏటా రూ.220 కోట్లు అదనంగా కేటాయించాలని కోరారు. కానీ.. ఆ ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించింది. ఆర్టీసీకి ఏమాత్రం నిధులు కేటాయించలేమని తేల్చి చెప్పింది. చార్జీలు పెంచుకుని నష్టాలను పూడ్చుకోవాలని సూచించింది. దాంతో చార్జీల పెంపుదలకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సమర్పించారు.ఏటా రూ.300 కోట్ల బాదుడేప్రయాణికుల నుంచి చార్జీల ద్వారా ఏటా రూ.300 కోట్లు అదనపు రాబడి సాధించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రస్తుతం ఆర్టీసీకి ప్రయాణికుల నుంచి టికెట్ చార్జీల రూపంలో ఏటా రూ.6,551.69 కోట్ల రాబడి వస్తోంది. కాగా నిర్వహణ వ్యయం పెరుగుదలను సాకుగా చూపిస్తూ చార్జీల పెంపునకు రెండు ప్రతిపాదనలను ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు.ప్రతిపాదన 1: – కిలోమీటరుకు 4.15 పైసలు చొప్పున పెంచుతారు. ఆ ప్రకారం కిలోమీటరుకు ప్రస్తుతం సగటు ప్రాథమిక చార్జీ 124.85 పైసలుగా ఉంది. ఆ చార్జీని 129 పైసలకు పెంచుతారు. దాంతో ప్రయాణికులపై ఏటా రూ.217.64కోట్ల అదనపు భారం పడుతుంది.ప్రతిపాదన 2: ఆర్టీసీ ఏటా రూ.300 కోట్ల అదనపు రాబడి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే రెండో ప్రతిపాదనను సమర్పించింది. ఆ ప్రకారం చార్జీలు కిలోమీటరుకు 5.72 పైసల చొప్పున పెంచుతారు. దాంతో ప్రయాణికులపై ఏటా రూ.300 కోట్ల అదనపు భారం పడుతుంది. ఆర్టీసీ చార్జీల పెంపుపై సీఎం చంద్రబాబు శుక్రవారం సమీక్షించారు. ప్రభుత్వం పచ్చజెండా ఊపగానే చార్జీల మోత మోగనుంది. -
తప్పుపై తప్పు.. స్పోర్ట్స్ డీఎస్సీ మాకు తెలీదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మెగా డీఎస్సీ–2025లో అవకతవకలకు పాల్పడి ఉక్కిరి బిక్కిరి అవుతున్న చంద్రబాబు ప్రభుత్వం కొత్త కథలు చెబుతూ తప్పుపై తప్పు చేస్తూ దొరికిపోతోంది. ఈ కుంభకోణంపై ఎట్టకేలకు ఆలస్యంగా స్పందించింది. పోస్టుల భర్తీలో తీవ్ర అవకతవకలకు పాల్పడటాన్ని ‘సాక్షి’ ఆధారాలతో సహా వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. చేసిన స్కామ్‌లో అడ్డంగా దొరికిపోయిన ప్రభుత్వం ఎనిమిది రోజుల తర్వాత ఈ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది. శనివారం విద్యాశాఖ అధికారులను ముందుకు నెట్టి, తూతూ మంత్రంగా వివరణ ఇప్పించే ప్రయత్నం చేసి.. అందులోనూ అడ్డంగా బుక్కయింది. శనివారం సాయంత్రం విద్యాభవన్‌లో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు పొంతన లేని జవాబులిస్తూ.. కొన్నింటికి సమాధానం దాటవేశారు. స్పోర్ట్స్ డీఎస్సీ గురించి తనకు తెలియదని చెప్పడం కుంభకోణం జరిగిందనడానికి మరింత బలం చేకూరుస్తోంది. ఈ సమావేశంలో మెగా డీఎస్సీ–2025ను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ చెప్పుకొచ్చారు. డీఎస్సీ నిర్వహణకు సంబంధించి 241 కేసులు నమోదైనప్పటికీ, రికార్డు సమయం 148 రోజుల్లో మొత్తం ప్రక్రియను పూర్తి చేశామన్నారు. మెగా డీఎస్సీ–2025 నిర్వహణ ప్రక్రియను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఎస్సీఈఆర్టీ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్ ర్యాంకుపై పొంతన లేని సమాధానాలు చెప్పారు. అలాగే, స్పోర్ట్సు కోటా ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో జరిగిన తప్పులపై తనకు తెలియదని, అది తన పరిధికాదన్నట్టు జవాబు దాటవేశారు. నవీన్ విషయంలో 3 సమాధానాలుమీడియా: మెగా డీఎస్సీలో ఎస్సీఈఆర్టీ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి, కంప్యూటర్ ఆపరేటర్ నవీన్ కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్ టాపర్‌గా, టీజీటీలో ఆరో ర్యాంకు సాధించారు. టాప్ ర్యాంక్ సాధించిన అతనికి పోస్టు ఎందుకు నిలిపివేశారు? ఎలాంటి తప్పు జరక్కుంటే ఇలా ఎందుకు చేశారు. అసలు ఆయనకు టాప్ ర్యాంకు ఎలా వచ్చింది?కార్యదర్శి: శాఖలో పనిచేసే ఏ ఉద్యోగి అయినా పరీక్ష రాయాలన్నా, కోర్సులు చదవాలన్నా ఆ శాఖ అనుమతి తప్పనిసరి. నవీన్ ముందస్తు అనుమతి తీసుకోలేదు. అందుకే అతడి పోస్టును నిలిపివేశాం. నవీన్ రెండు పరీక్షలు రాశారు. పరీక్ష రాసేంత వరకు ఇక్కడ పనిచేశాడు. ఓ దాంట్లో 1వ ర్యాంక్, రెండో దాంట్లో 6వ ర్యాంక్ వచ్చింది. అతను సెలెక్షన్ లిస్టులో ఉన్నారు. కానీ వెరిఫికేషన్ కోసం రాలేదు. దీంతో నిబంధన ప్రకారం అతన్ని రిక్రూట్మెంట్ చేయలేకపోయాం. నవీన్ కోర్టుకు వెళ్లాడు. కోర్టుల్లో మా వాదనలు వినిపించాం. అతను వెరిఫికేషన్ ప్రక్రియకు ఎందుకు రాలేదో అతనికే తెలియాలి. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు రాకపోవడంతో అతని పోస్టు పక్కన పెట్టాం. వాస్తవం: నవీన్ రెండు పోస్టులకు ఉత్తమ ర్యాంకులు సాధించాక అతనితో తన కాంట్రాక్టు ఉద్యోగానికి రాజీనామా చేయించారు. అనంతరం అతడి డీఎస్సీ లాగిన్ ఐడీని బ్లాక్ చేశారు. అతను కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకునేందుకు ఆస్కారం లేకుండా పోయింది. దీంతో అతను హైకోర్టును ఆశ్రయించారు. 1:1 పద్ధతిలో సర్టిఫికెట్ల పరిశీలన కార్యదర్శి: గత అనుభవాల దృష్ట్యా వెయిటింగ్ లిస్టు కాకుండా 1ః1 పద్దతిలో సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచాం. వెరిఫికేషన్‌లో ఎవరైనా ఫెయిల్ అయితే ఆ తర్వాత వారిని వెరిఫికేషన్‌కు పిలిచాం. హారిజాంటల్ రిజర్వేషన్లు స్పోర్ట్స్, మహిళ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు ఇవ్వాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రస్తుతం పేపర్లలో వస్తున్న కథనాలన్నీ హారిజాంటల్ రిజర్వేషన్లకు సంబంధించినవే. వాస్తవం: 1:1 పద్దతిలో సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిస్తే.. కాల్ లెటర్లు వచ్చిన వారంతా మెరిట్ లేదా హారిజాంటల్ రిజర్వేషన్లో ఉన్నవారే. వీరందరికీ ఉద్యోగం రావాలి. సర్టిఫికెట్లు సరిగా లేకపోతే వారిని రిజెక్ట్ చేసి, రెండో స్థానంలో ఉన్న వారికి అవకాశం ఇవ్వాలి. ఇక్కడ కాల్ లెటర్లు వచ్చిన వారంతా మెరిట్ లేదా హారిజాంటాల్ రిజర్వేషన్లో ఉన్నవారే. అలాంటి వారికి పోస్టింగ్ ఇవ్వలేదు. స్పోర్ట్సు కోటా వారిచ్చిందే చేశాం కార్యదర్శి: డీఎస్సీ స్పోర్ట్సు కోటా అంశంలో శాప్ ఇచ్చిన అంశాలనే పరిగణనలోకి తీసుకున్నాం. అక్కడేం జరిగిందో మాకు తెలియదు. పరీక్ష లేకుండా పోస్టులు ఇవ్వాలన్నది డీఎస్సీ భర్తీ నాటి పాలసీ. ప్రభుత్వంలో పాలసీలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు పాలసీ మారితే మాకు సంబంధం లేదు. జీఏడీ ఇచ్చిన జీవో ప్రకారం మేం చేశాం. స్పోర్ట్స్ సెపరేట్‌గా హ్యాండిల్ చేద్దాం. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు దక్కించుకున్న వారు కూడా కష్టపడి ఉద్యోగాన్ని సాధించారు. వాస్తవం: డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో రెండు విధానాలు అనుసరించారు. ఒకటి రెగ్యులర్ డీఎస్సీలో స్పోర్ట్స్ సర్టిఫికెట్లకు క్రీడల ప్రాధాన్యం ప్రకారం వెయిటేజీ ఇచ్చి పోస్టులు భర్తీ చేస్తారు. కానీ, ఈ ప్రభుత్వం కొత్తగా రెండో విధానం ఈ డీఎస్సీ వరకు అమలు చేసింది. ప్రత్యేకంగా క్రీడా పాలసీ–2024–29ను డీఎస్సీకి ముందు తీసుకొచ్చింది. ఇందులో ఎటువంటి రాత పరీక్ష (టెట్/డీఎస్సీ) లేకుండా క్రీడా సర్టిఫికెట్ల ఆధారంగా ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చేసింది. భర్తీ ప్రక్రియ పూర్తయ్యాక మళ్లీ పాలసీని సవరించి, రాత పరీక్ష తప్పనిసరి చేసింది. ఒక్క ఫిర్యాదు కూడా చేయలేదుకార్యదర్శి: డీఎస్సీలో లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తే ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదు. తప్పు పట్టలేదు.వాస్తవం: డీఎస్సీ నిర్వహణలో 33,830 గ్రీవెన్సెస్ వచ్చాయి. ఈ విషయాన్ని అధికారులు రాత పూర్వంగా ప్రకటించారు. జిల్లా, జోనల్ స్థాయిలో తమకు సంబంధం లేదు.. రాష్ట్ర కార్యాలయంలో తేల్చుకోండి అని, మరికొందరికి నిర్లక్ష్యంగా సమాధానం పంపించారు. మరి ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని చెప్పడంలో అర్థం లేదు. కాపీయింగ్, లీకేజీకి ఆస్కారం లేదుకార్యదర్శి: డీఎస్సీలో కాపీయింగ్, లీకేజీకి ఆస్కారం లేదు. అంతా ఆన్లైన్ విధానంలో జరుగుతుంది. వాస్తవం: తూర్పు గోదావరి జిల్లాలో ఓ సెంటర్లో మాస్ కాపీయింగ్ చేశారని 11 మంది డీఎస్సీ అభ్యర్థులను అధికారులే స్వయంగా అనర్హులుగా ప్రకటించారు. వారంతా కోర్టుకు పోగా అధికారులు నేరం రుజువు చేయలేకపోయారు. దాంతో వారందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. (కాపీయింగ్‌పై మరోసారి ప్రశ్నించగా అలా అనలేదని సమాధానం చెప్పారు)వాస్తవాలు దాచి సమాధానం దాటవేతడీఎస్సీ అక్రమాలలో కీలకమైన ఆరోపణలపై విద్యా శాఖ సమాధానం దాటవేసింది. ఎస్సీఈఆర్టీలో పనిచేసే నవీన్‌కు టాప్ ర్యాంక్ రావడంపై కార్యదర్శి కోన శశిధర్ మూడు రకాలుగా సమాధానం చెప్పారు. అనుమతి తీసుకోలేదు కాబట్టి పక్కనపెట్టామని ఒకసారి.. కౌన్సిలింగ్‌కు రాలేదు కాబట్టి పక్కన పెట్టామని మరోసారి చెప్పారు. వాస్తవానికి నవీన్‌కు కాల్ లెటర్ వెళ్లకుండా అభ్యర్థి డీఎస్సీ లాగిన్ ఐడీని అధికారులు బ్లాక్ చేశారు. ఆ విషయం బాధిత నవీన్ హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో పేర్కొన్నాడు. పైగా కాంట్రాక్టు ఉద్యోగి పరీక్ష రాసేందుకు ముందస్తు అనుమతి తప్పనిసరి అనే అంశంపై సమాధానం దాటవేశారు. అలాగే, అతను ఎస్సీఈఆర్టీలో పనిచేస్తూ టాప్ ర్యాంకులు సాధించడం యాదృచ్ఛికమా లేక ఏమైనా తప్పు జరిగిందా అనే అంశంపైనా సరైన సమాధానం ఇవ్వలేదు.గ్రీవెన్స్‌లోనూ తప్పులేకాల్ లెటర్లు అందుకుని సర్టిఫికెట్ల పరిశీలనకు వెళ్లిన తర్వాత అన్నీ సక్రమంగానే జరిగాయని చెప్పిన అధికారులు ఎంపిక లిస్టులో అభ్యర్థుల పేర్లను గల్లంతు చేశారు. ఈ విషయమై బాధిత అభ్యర్థులు విద్యా శాఖ ఏర్పాటు చేసిన గ్రీవెన్సెస్ రిడ్రెసెల్ సెల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో చాలా మంది అభ్యర్థులకు సరైన సమాధానం లభించలేదని వాపోయారు. మరికొందరికి రాత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో అధికారుల నిర్లక్ష్యం కనిపించింది.దొంగ సర్టిఫికెట్లతో టీచర్ ఉద్యోగం!డీఎస్సీ స్పోర్ట్స్ కోటా డైరెక్టు నియామకాలే కాదు.. రాత పరీక్షల్లో స్పోర్ట్స్ సర్టిఫికెట్ వెయిటేజీల్లోనూ అక్రమాలు జరిగాయి. అసలు ఆటే రాని వ్యక్తులు దొంగ సర్టిఫికెట్లు పెట్టి పోస్టులు కొట్టేశారు. ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ఏరియాలో ఓ మహిళకు స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది. రాత పరీక్షకు తోడు స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్ జత చేయడంతో పోస్టు కట్టబెట్టారు. అయితే సదరు మహిళ ఎన్నడూ క్రీడా మైదానంలో కాలు పెట్టింది గానీ, జిల్లా, రాష్ట్ర, స్థాయిలో ఆడింది గానీ లేకుండా ఏకంగా జాతీయ స్థాయి సర్టిఫికెట్ పుట్టించి మరీ పోస్టు కొట్టేశారు. సదరు వ్యక్తి భర్త పీఈటీ కావడంతో మాస్టర్ మైండ్ ఏజెంట్లతో కలిసి ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి పోస్టు తెచ్చుకున్నారు. దీనిపై పలువురు అభ్యర్థులు శాప్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పాటు ఆర్టీఐ ద్వారా సమాచారం కోరితే ఉద్దేశ పూర్వకంగా జాప్యం చేస్తూ పిటిషనర్లను బెదిరించడం గమనార్హం.ఇదో అవినీతి క్రీడ⇒ విజయనగరం జిల్లాకు చెందిన ఓ వెయిట్ లిఫ్టర్‌ను కేంద్ర ప్రభుత్వ సంస్థ పోస్టల్ శాఖ క్రీడా కోటా ఉద్యోగానికి అనర్హురాలిగా ప్రకటించింది. అనూహ్యంగా ఆమెకు ఏపీ డీఎస్సీ క్రీడా కోటాలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పోస్టు ఇచ్చారు. తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలతో పోస్టల్ శాఖను మోసగించే ప్రయత్నం చేయడంతో ఆమెపై గతంలో అనర్హత వేటు వేశారు. అలాంటి ఈమెకు ఏపీలో ఎలా ఉద్యోగం ఇచ్చారు? ఆమె రెండు వేర్వేరు ఏజ్ గ్రూప్స్‌లో ఆడినట్టు విజయనగరం జిల్లా పోలీసులు ధ్రువీకరించారు. ఈ ఆధారాలతో గతేడాది ఆగస్టులోనే శాప్‌కు ఫిర్యాదులు చేశారు. అప్పుడు ఆ ఫిర్యాదును పట్టించుకోలేదు. నెల క్రితం ‘సాక్షి’లో కథనం వచ్చాక విచారణ చేస్తామని శాప్ అధికారులు ప్రకటించారు. కానీ ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, ఆమె ఉద్యోగంలో కొనసాగుతున్నారు. ⇒ విజయనగరానికి చెందిన మరో క్రీడాకారుడు జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభ చూపించి పతకాలు పొందారు. ఏపీ డీఎస్సీలో క్రీడా కోటా ఉద్యోగానికి దరఖాస్తు చేస్తే అతన్ని నిర్ద్వందంగా తిరస్కరించారు. ఆ తర్వాత అతను కేంద్ర ప్రభుత్వ పోస్టల్ శాఖలో ఇదే క్రీడా కోటాలోనే ఉద్యోగం పొందారు. ఇక్కడ పోస్టల్ శాఖ అనర్హులుగా తేల్చిన వ్యక్తికి ఏపీలో ఉద్యోగం ఇస్తే.. ఏపీలో తిరస్కరించిన వ్యక్తికి పోస్టల్ శాఖలోనే ఉద్యోగం వచ్చింది. ఇలాంటి ఘటనలే డీఎస్సీ క్రీడా కోటాలో ఎంపికల పారదర్శకతను ప్రశ్నిస్తున్నాయి.⇒ కర్నూలు జిల్లాలో స్థానికంగా మెరిట్ అభ్యర్థులను పక్కన పెట్టి నాన్–లోకల్ కోటాలో వేరే జిల్లా వ్యక్తికి ఉద్యోగం ఇచ్చారు. ఇక్కడ నాన్–లోకల్లోకి వచ్చేవారు స్థానికుల కంటే మెరిట్ జాబితాలో అగ్రస్థానంలో ఉండాలి. కానీ, సదరు ఉద్యోగి స్థానికుల కంటే రెండు స్థానాలకు దిగువన ఉన్నా నాన్‌లోకల్ కోటాలో అక్కడ పోస్టును భర్తీ చేశారు. పాఠశాల విద్యా శాఖ ఉన్నతాధికారులకు ఇది తప్పు అని తెలిసినా పట్టించుకోలేదు. అసలు ఓపెన్ కేటగిరీలో ఓ పోస్టు భర్తీ చేశాక, నాన్ లోకల్లో మరో పోస్టును ఎలా భర్తీ చేస్తారు? -
రాజధాని రైతులపై సర్కారు అరాచకం
సాక్షి ప్రతినిధి, గుంటూరు/తాడేపల్లి రూరల్: ల్యాండ్ పూలింగ్‌కు భూములు ఇవ్వలేదని చంద్రబాబు ప్రభుత్వం రైతులను ఎన్ని విధాలుగా వేధించాలో అన్ని విధాలుగా వేధిస్తోంది. భూములు ఇవ్వలేదన్న ఆగ్రహంతో పలు రైతుల పొలాల చుట్టూ మూడువైపులా రిజర్వాయర్ తవ్వకాలు జరిపారు. దీంతో గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక రైతులు పంట పండించుకునే పరిస్థితి లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు.తాజాగా ఎటువంటి వరద రాకపోయినా కొండవీటి వాగు గట్లకు గండికొట్టి ఆ నీటిని రిజర్వాయర్‌లోకి వదిలేశారు. దీంతో ఈ నీరు రిజర్వాయర్‌లో ప్రవహించి ల్యాండ్ పూలింగ్‌కు ఇవ్వని రైతుల భూముల చుట్టూ చేరాయి. 15 అడుగుల లోతు ఉన్న రిజర్వాయర్ నిండిపోవడంతో పంట పొలాల నేల కోతకు గురై రిజర్వాయర్‌లో కలిసిపోతోంది. పలువురి రైతుల పొలాలు కూడా రిజర్వాయర్‌లో కలిసిపోయే పరిస్థితి ఏర్పడింది. రైతులను భయభ్రాంతులకు గురిచేసి, తన లక్ష్యాన్ని సాధించాలని ప్రభుత్వం భావిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మూడు నెలల నుంచి ఇదే పరిస్థితి..⇒ కొండవీటి వాగు రిజర్వాయర్ కోసం పంటపొలాలు ఇవ్వని రైతులను ప్రభుత్వం, అధికారులు మూడు నెలలుగా ఇదేవిధంగా వేధిస్తున్నారు. వాటిలో కొన్ని దారుణాలను చూస్తే...⇒ మొదట లారీలతో పంటపొలాల్లో వున్న కరెంటు స్తంభాలను గుద్దించి, వైర్లు తెంచేశారు. మూడు నెలల నుండి విద్యుత్‌ను పునరుద్ధరించాలంటూ ఆ శాఖ అధికారుల చుట్టూ తిరిగినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు.⇒ రైతులు పంట పొలాలకు విద్యుత్ మోటార్లు బదులు ఆయిల్ మోటార్లు తీసుకువచ్చినా.. వాటినీ చోరీ చేశారు.⇒ పంటపొలాల్లో ఉన్న విద్యుత్ బోర్లకు భూమిలోపల ఉన్న పైపులను పీకివేశారు. ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే లేడు.⇒ విద్యుత్ సరఫరా లేకపోవడంతో నీరురాక మునగ, అరటి తోటలు ఎండిపోయాయి.⇒ పంటపొలాలకు దారులు లేకుండా చేయడం, ఉన్న దారులను తవ్వడం, 15 అడుగుల లోతులో పంట పొలాలకు ఆనించి గోతులు తీయడంతో మట్టి పెళ్లలు విరిగి ఆ పొలాల్లో పడడం వంటి చర్యలు రైతులను ఆవేదనకు గురిచేస్తున్నాయి.⇒ పెనుమాక గ్రామంలో వెయ్యి కుటుంబాలకు తాగునీటి సరఫరాను అందజేసేందుకు పైపులైను ఏర్పాటు చేశారు. ఆ పైపులైన్లపై కూడా తరచూ మట్టిపెళ్లలు విరిగి పగిలిపోతున్నాయి. నెలకి కనీసం 15 రోజులు తాగునీరు అందక గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.పొలాలను పరిశీలించిన దొంతిరెడ్డిసీఎం చంద్రబాబు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చాననే విషయాన్ని మర్చిపోయి భూ దాహంతో రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదని వైఎస్సార్సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి (డీవీఆర్) అన్నారు. రాజధాని గ్రామమైన పెనుమాకలో రిజర్వాయర్ గండ్లు తెంపివేయడంతో పూలింగ్‌కు ఇవ్వని పంటపొలాలను నీరు ముంచెత్తింది. ఈ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు.ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.దురుద్దేశంతో ప్రభుత్వం ప్రభుత్వం దురుద్దేశంతో పనిచేస్తోంది. నిజంగా కొండవీటి వాగుకు గండిపడి రిజర్వాయర్‌లోకి నీళ్లువస్తే.. కృష్ణానది నుంచి కొండవీటి వాగుకు గేట్లు ఎత్తి నీళ్లు ఎందుకు వదిలారు. ఒకవైపు గండిపడితే రెండోవైపు గండి పెట్టాల్సిన అవసరం ఏముంది? – కళ్లం శ్రీకాంత్ రెడ్డి భూమి ఇచ్చినా.. ప్రయోజనం ఏముంది? భూములు ఇచ్చేంత వరకు నా ఇంటి చుట్టూ తిరిగారు. సీఆర్డీఏ అధికారులే మా ఇంటికి వచ్చి ఒప్పంద పత్రాన్ని తీసుకున్నారు. నెల రోజుల తర్వాత నా 2 ఎకరాలకు ప్లాట్లు కేటాయిస్తామన్నారు. వారు చెప్పి ఆరు నెలలు అవుతోంది. ఎన్నిసార్లు ఆఫీస్ చుట్టూ తిరిగినా ఫలితం లేదు. పైగా నా పొలంలో పంట పండించుకుంటుంటే రాత్రికి రాత్రి బోర్లు దొంగిలించారు. దానివల్ల పంట పూర్తిగా ఎండిపోయింది. – బండి వెంకట రెడ్డిపంటలు ఎండిపోయాయి...ఎకరంన్నర పొలంలో మునగతోట వేశాను. మరో ఎకరం 30 సెంట్లలో అరటి పంట వేశాను. రిజర్వాయర్‌ను పొలానికి ఆనించి తీయడంతో బోర్లు రావడం లేదు. కొండవీటి వాగు నుంచి నీళ్లు తీసుకుందామంటే పొలం చుట్టూ తవ్వేశారు. విద్యుత్ సరఫరా లేదు. చివరకు చేతికి వచ్చిన పంట ఎండిపోయి రూ.లక్షా50 వేలు నష్టం వచ్చింది. రైతులను నష్టపరిస్తే వారే భూములు ఇస్తారని ప్రభుత్వం ఆలోచిస్తోంది. మేమైతే ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వం. – పోలిశెట్టి శ్రీనివాసరావుప్రభుత్వ పెద్దలు చెప్పడం వల్లే...మూడు నెలల కిందట లారీ డ్రైవర్లు విద్యుత్ స్తంభాలను ఢీకొట్టడంతో ఒకేరోజు 10 స్తంభాలు పడిపోయాయి. విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించి పంట పొలాలకు విద్యుత్ సరఫరా ఇవ్వడం లేదు. ప్రభుత్వ పెద్దలు చెప్పబట్టే ఇలా చేస్తున్నారు. – పోలిశెట్టి రామ్మోహన్ -
ఖరీఫ్‌లోనూ కర్షకుడికి కష్టాలే!
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ అసమర్థతతో ఖరీఫ్‌లో సాగుపై అన్నదాతల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. జూన్ 1వ తేదీ వస్తున్నా విత్తనాలు, ఎరువుల సరఫరాలో ప్రభుత్వం విఫలమైంది. అదునుకు వేరుశనగ విత్తనమే కాదు.. కనీసం పచ్చిరొట్ట విత్తనం కూడా సరఫరా చేయలేక చేతులెత్తేస్తోంది. ఎరువులను యాప్ ద్వారా పంపిణీ చేసేందుకు సిద్ధపడడంతో ఈసారి కూడా యూరియా, డీఏపీ కోసం యూరియా, డీఏపీ కోసం రైతులకు అగచాట్లు తప్పేటట్టు కన్పించడం లేదు. సీజన్‌కు ముందుగా పెట్టుబడి సాయం లేదు. ఇన్‌పుట్‌సబ్సిడీ ఎలాగూ లేదు. ఉచిత పంటల బీమా అసలే లేదు. కనీసం స్వచ్ఛంద పంటల బీమాను కూడా రైతులకు దూరం చేశారు. ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వర్షాధార ప్రాంతాల్లోనే కాదు, సాగునీటి వనరులున్న ప్రాంతాల్లోనూ రైతులు ఖరీఫ్ సాగుకు ముందుకెళ్లలేకపోతున్నారు.అదునుకు విత్తనమేది?ఖరీఫ్‌లో రాష్ట్రంలో సాధారణ విస్తీర్ణం 77.12 లక్షల ఎకరాలు కాగా, ఖరీఫ్–2026లో 81.50 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా 37.85 లక్షల ఎకరాల్లో వరి, 9.89 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 12.87 లక్షల ఎకరాల్లో ప్రత్తి, 8 లక్షల ఎకరాల్లో అపరాలు, తదితర పంటల సాగును లక్ష్యంగా పెట్టారు. ఈసారి ముందస్తుగా సాగునీటి విడుదలకు షెడ్యూల్ ప్రకటించామని చంద్రబాబు ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది.కోతల వేళ వైపరీత్యాల బారిన పడకుండా పంటలను కాపాడుకోవచ్చంటూ మే 4 నుంచి పెన్నా డెల్టాకు, జూన్ 1 నుంచి గోదావరి డెల్టాకు జూలై 1 నుంచి కృష్ణా డెల్టా ఆయకట్టుకు, అలాగే, మిగిలిన ఆయకట్టులకు సాగునీటి షెడ్యూల్‌ను విడుదల చేసింది. కానీ అందుకు తగినట్టుగా విత్తన సరఫరా చేయలేకపోతోంది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఏటా రెండు సీజన్లు కలిపి కనీసం 400 కోట్లతో సబ్సిడీ విత్తనాన్ని సరఫరా చేసేవారు. గడిచిన రెండేళ్లుగా సబ్సిడీ విత్తన పంపిణీలో చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా కోతలు పెడుతుండడంతో రైతులు అదునుకు సబ్సిడీ విత్తనం దొరక్క దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.బకాయిలతో ముందుకురాని కంపెనీలు2026–27 వ్యవసాయ సీజన్లో ఖరీఫ్‌లో రూ.179 కోట్లతో 4.82 లక్షల క్వింటాళ్ల విత్తనం సరఫరా చేయాలని జిల్లా వ్యవసాయ శాఖాధికారులు ప్రతిపాదించారు. 2.20 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, 1.62 లక్షల క్వింటాళ్ల వరి, 92 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాల సరఫరాకు టెండర్లు ఖరారయ్యాయి.అయితే గడిచిన రెండేళ్లకు చెందిన రూ.187 కోట్ల విత్తన సబ్సిడీ బకాయిల చెల్లింపులో చంద్రబాబు ప్రభుత్వ ఎగవేత ధోరణికి నిరసనగా విత్తన సరఫరాకు కంపెనీలు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ఏపీ సీడ్స్ వద్ద అందుబాటులో ఉన్న పచ్చిరొట్ట విత్తనాలను అరకొరగా పొజిషన్ చేయగా, వేరుశనగ ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారో చెప్పలేని దుస్థితి. దీంతో రాయలసీమ రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఎల్‌నినో పరిస్థితులున్నప్పటికీ సీమ జిల్లాల్లో ప్రస్తుతం ఆశాజనకంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ సమయంలో అదునుకు విత్తనం సరఫరా చేసి ఉంటే రైతులకు ఎంతగానో మేలు జరిగేది. కానీ ప్రభుత్వం ఆ దిశగా అడుగు వేయలేదు.అందని పెట్టుబడి సాయం.. అటకెక్కిన పంటల బీమాఅధికారంలోకి రాగానే ప్రతీ రైతుకు రూ.20వేల చొప్పున పెట్టుబడి సాయం ఇస్తామన్న చంద్రబాబు తొలి ఏడాది నిస్సిగ్గుగా రూ.10,716 కోట్లు ఎగ్గొట్టారు. రెండో ఏడాది ఏడు లక్షల మందికి కోత పెట్టి రూ.14వేలతో సరిపెట్టారు. ఈ ఏడాది అయినా సీజన్‌కు ముందుగా పెట్టుబడి సాయం అందిస్తారేమో అని ఆశపడిన రైతులకు నిరాశే ఎదురైంది. కానీ మరో రెండ్రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్నా పెట్టుబడి సాయం ఊసెత్తడం లేదు.రెండేళ్లుగా పైసా పెట్టుబడి సాయం అందించకపోవడంతో కౌలు రైతులుగగ్గోలు పెడుతున్నారు. 2024 జూన్‌లో కంపెనీలకు చెల్లించాల్సిన ప్రీమియం బకాయిలు ఎగ్గొట్టడంతో 2023–24 సీజన్‌కు సంబంధించి దాదాపు రూ.1385 కోట్ల బీమా పరిహారం రైతులకు అందలేదు. 2024–25, 2025–26 వ్యవసాయ సీజన్లలో ప్రభుత్వం బీమా ప్రీమియం బకాయిలు రూ.1095.11 కోట్లు ఎగ్గొట్టడంతో కంపెనీలు ఏపీని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేశాయి. మరోవైపు కరువు బకాయిలు రూ.327 కోట్లతో పాటు 2024–25 సీజన్లో రూ.650 కోట్లకుపైగా పంట నష్టపరిహారం నేటికీ జమ చేయలేదు. రూ.500 కోట్ల మేర సున్నా వడ్డీ రాయితీ రెండేళ్లుగా చెల్లించకుండా చంద్రబాబు ప్రభుత్వం ఎగనామం పెట్టింది. దీంతో ఖరీఫ్ సాగు వేళ రైతుల చేతిలో చిల్లిగవ్వ లేక అప్పుల కోసం తిప్పలు పడుతున్నారు.యాప్ ద్వారా ఎరువులు.. ఆందోళనలో రైతులుఎరువుల కొరతేమీ లేదంటూ పదేపదే ప్రకటనలు ఇస్తున్న టీడీపీ ప్రభుత్వం ఈసారి యాప్ ద్వారా పంపిణీ అంటూ మెలిక పెట్టి, ఆంక్షలు విధిస్తుండడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు 2025–26 వ్యవసాయ సీజన్‌కు సంబంధించి జాతీయ స్థాయిలో 39.054 మిలియన్ టన్నుల ఎరువులు అవసరం కాగా, ప్రస్తుతం 20.012 మిలియన్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. దీంతో ఈ సారి రాష్ట్రానికి జరిపిన కేటాయింపుల మేరకు ఎరువులు సరఫరా జరిగే అవకాశాల్లేవని తెలుస్తోంది.రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌కు 18.09 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా, ప్రస్తుతం 8.20 లక్షల టన్నులు మాత్రమే అందుబాటులో ఉన్నాయంటున్నారు. రాష్ట్రంలో యూరియా ఏ స్థాయిలో దారిమళ్లుతోందో రెండేళ్లుగా చూస్తూనే ఉన్నాం. ఎలాంటి పంటలు సాగులేని ఏప్రిల్, మే నెలల్లో ఇప్పటికే 2 లక్షల టన్నుల ఎరువుల అమ్మకాలు జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు 75 వేల టన్నుల యూరియా, 30 వేల టన్నుల డీఏపీ అమ్మకాలు జరిగాయంటే ఏ స్థాయిలో పక్కదారి పడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చంద్రబాబు ప్రభుత్వం మొక్కుబడి సమీక్షలతో సరిపెడుతుందే తప్ప వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించలేకపోతోందన్న విమర్శలు విన్పిస్తున్నాయి.⇒ రాష్ట్రంలో ఖరీఫ్‌లో సాధారణ విస్తీర్ణం: 77.12 లక్షల ఎకరాలు⇒ ఖరీఫ్ 2026 సాగు లక్ష్యం: 81.50 లక్షల ఎకరాలు⇒ వరి: 37.85 లక్షల ఎకరాలు⇒ వేరుశనగ: 9.89 లక్షల ఎకరాలు⇒ పత్తి: 12.87 లక్షల ఎకరాలు⇒ అపరాలు తదితర పంటలు: 8 లక్షల ఎకరాలు -
సర్కారు ఉక్కిరిబిక్కిరి!
తిరుపతి టాస్క్‌ఫోర్స్: డీఎస్సీ–2025లో అవకతవకలు బట్టబయలు కావడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం.. దాన్నుంచి బయట పడేందుకు కొత్తగా ఉపాధ్యాయులైన వారిని పావులుగా వాడుకునేందుకు స్కెచ్ వేసింది. మెరిట్ కలిగి ఉండీ, ఉద్యోగం రాని బాధితుల తరఫున పోరాడుతున్న వైఎస్సార్సీపీ పైకి వారిని ఉసిగొల్పేందుకు శక్తి వంచన లేకుండా కుట్ర పూరితంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో తిరుపతి వేదికగా బాలాజీ కాలనీలోని లక్ష్మీనారాయణ కళ్యాణ మండపంలో ‘నిరుద్యోగులపై గొడ్డలి వేటు’ అంటూ సమావేశం నిర్వహించేందుకు ప్రణాళిక రచించింది.స్వచ్ఛందంగా ఉపాధ్యాయులు ఈ సమావేశానికి వచ్చే పరిస్థితి ఉండదని భావించి డీఈవోను అడ్డం పెట్టుకుని మార్గ నిర్దేశం చేసింది. దీంతో డీఈవో కాస్తా టీడీపీ నేతగా పరకాయ ప్రవేశం చేశారు. ప్రభుత్వ పెద్దల సూచన మేరకు.. శనివారం మీటింగ్ ఉందని డీఎస్సీ–2025లో పోస్టింగ్ పొందిన ప్రతి ఉపాధ్యాయుడు మీటింగ్‌కు హాజరు కావాలని డీఈవో కేవీఎన్ కుమార్ తన సిబ్బందితో ఫోన్లు చేయించారు. ఓ దశలో వచ్చి తీరాల్సిందేనని బెదిరించారు. తీరా ఆ సమావేశానికి హాజరైన ఉపాధ్యాయులు.. అక్కడ టీడీపీ నేతలు ఉండటం చూసి బిత్తర పోయారు.డీఎస్సీ కుంభకోణంపై గళమెత్తిన వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సమావేశానికి తమను మభ్యపెట్టి రప్పించడం తగదని అసహనం వ్యక్తం చేశారు. అధికారిక సమావేశం అని చెప్పి ప్రతిపక్ష పార్టీలను విమర్శించమని నిర్దేశించడం తగదని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో వారికి ఎదురు చెబితే దాడులు చేస్తారని జడిసి మిన్నకుండిపోయారు. ఈ సమావేశంలో శాప్ చైర్మన్ రవి నాయుడు, టీడీపీ ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, రాంభూపాల్‌రెడ్డి 2 గంటల పాటు టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా, వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు.టీడీపీ కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కాగా, పార్టీ సమావేశాన్ని తలపించేలా రాజకీయ నేతలు ఉపన్యాసాలు ఇవ్వడం ఏమిటని ఉపాధ్యాయులు తలలు పట్టుకున్నారు. తుదకు తమను పార్టీ కార్యకర్తలుగా చేశారని వాపోయారు. ‘ప్రభుత్వం ఇలా చేయడం తగదు. మమ్మల్ని ఇలా పిలిపించడం ఏమాత్రం సరికాదు. తప్పు జరిగింది కాబట్టే ప్రభుత్వం ఇంతగా భయపడుతోందని అర్థమవుతోంది.లేకుంటే ఇంత దొంగచాటుగా సమావేశం నిర్వహించడం ఏమిటి? పొరపాట్లు జరిగి ఉంటే హూందాగా ఒప్పుకుని సరిచేయాలి. అర్హత ఉన్న వారికి ఉద్యోగం రాకపోవడం నిజంగా నేరమే’ అని ఈ సమావేశానికి హాజరైన పలువురు ఉపాధ్యాయులు వ్యాఖ్యానించారు. ఈ విషయమై మీడియా ప్రతినిధులు డీఈవోను సంప్రదిస్తే.. ఆ సమావేశంతో తనకు సంబంధం లేదని విచిత్ర సమాధానం చెప్పడం కొసమెరుపు. అసలు ఏ అధికారంతో శాప్ చైర్మన్ రవి నాయుడు ఈ సమావేశం నిర్వహించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని బాధిత డీఎస్సీ అభ్యర్థులు డిమాండ్ చేశారు.సీన్ 1 : ‘డీఎస్సీ కుంభకోణంతో మన పరువుపోతోంది. మనమేమో గొప్పగా నిర్వహించామని ఇన్నాళ్లూ చెప్పుకున్నాం.. ఇలాగే సైలెంట్‌గా ఉంటే మన గ్రాఫ్ తగ్గిపోతుంది.. ఏదో ఒకటి చేయాలి.. లేదంటే ప్రజల్లో పలుచనైపోతాం.. చేసేదేదో త్వరగా చేయండి’ అని ప్రభుత్వ పెద్దలు తీవ్ర ఆందోళనతో దిశా నిర్దేశం చేశారు.సీన్ 2 : డీఎస్సీ కుంభకోణాన్ని అంతా తానై నడిపించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న శాప్ చైర్మన్ రవి నాయుడు రంగంలోకి దిగారు. తిరుపతి డీఈవోపై ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వ పరువు కాపాడటం కోసం తమకు సహకరించాలని, ఇది ‘పెద్దల’ నిర్ణయం అని చెప్పారు.సీన్ 3 : ‘హలో.. మేము డీఈవో కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాం. 2025 డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి శనివారం తిరుపతిలో డీఈవోతో సమావేశం ఉంది. ఉదయం 10 గంటలకు బాలాజీ కాలనీలోని లక్ష్మీనారాయణ కళ్యాణ మండపం వద్దకు కచ్చితంగా చేరుకోవాలి. ఎట్టిపరిస్థితిలో మిస్ కాకూడదు. మీటింగ్‌కు హాజరుకాని వారిపై కఠిన చర్యలు ఉంటాయి’ అని ఫోన్ ద్వారా హుకుం జారీ.సీన్ 4 : అఫీషియల్ సమావేశం అని చెప్పడంతో కొత్త ఉపాధ్యాయులంతా పనులు మానుకుని శనివారం హుటాహుటిన తిరుపతి చేరుకున్నారు. సమావేశం ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలోకి వెళ్లగానే అక్కడి వాతావరణం చూసి భయపడ్డారు. ఏమైనా మాట్లాడితే స్టేజి పైనున్న టీడీపీ నేతల అనుచరులు తన్నేలా ఉన్నారని నోరు మూసుకుని కూర్చున్నారు. ఈ గోలంతా తనకెందుకని అనుకున్న డీఈవో గైర్హాజరయ్యారు.సీన్ 5 : ‘మీరంతా కష్టపడి టీచర్ ఉద్యోగాలు సంపాదించారు. కానీ ప్రతిపక్ష వైఎస్సార్సీపీ కాదంటోంది. వారికి తగిన విధంగా మీరు సమాధానం ఇవ్వాలి. లేదంటే మీకు ఉద్యోగాలు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంపై మరక పడుతుంది’ అని శాప్ చైర్మన్ రవినాయుడు దిశానిర్దేశం చేశారు. ఇందుకు ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, రాంభూపాల్‌రెడ్డి వంత పాడారు. రాజకీయ సభకు ఉపాధ్యాయులా!?విద్యాభివృద్ధి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన డీఈవో, అధికార పార్టీ రాజకీయ కార్యక్రమాలకు ఉపాధ్యాయులను సమీకరించే పనిలో నిమగ్నం కావడం దారుణం. డీఎస్సీలో జరిగిన అవకతవకలు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు అధికార పార్టీ కొత్తగా నియమితులైన టీచర్లతో రాజకీయ సభ నిర్వహించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఆ సభకు డీఈవో కార్యాలయం నుంచి టీచర్లకు ఫోన్లు చేసి రప్పించడం ఇంకా దారుణం. విద్యా కార్యక్రమమని భావించి హాజరైన ఉపాధ్యాయులకు రాజకీయ ఉపన్యాసం వినిపించడం ఏమాత్రం సబబు కాదు. ఈ అంశంపై కలెక్టర్ వెంటనే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. – వందవాసి నాగరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి, తిరుపతిటీడీపీ అడ్డాగా డీఈవో ఆఫీస్జిల్లా విద్యా శాఖ అధికారి అధికార పార్టీకి ఏజెంట్‌గా వ్యవహరిస్తూ తన పదవికి మచ్చ తెచ్చారు. ఈయన్ను తక్షణం విధుల నుంచి తొలగించాలి. జిల్లా విద్యా శాఖ కార్యాలయం అధికార పార్టీకి అడ్డాగా మారింది. అధికార పార్టీ ఏర్పాటు చేసే సభలకు కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులను సమీకరించే సాధనంగా డీఈఓ కార్యాలయాన్ని ఉపయోగించడం దారుణం. అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టే ఉద్దేశంతో డీఈవో ఉపాధ్యాయులకు ఫోన్లు చేసి సభకు హాజరు కావాలని ఆదేశించడం దుర్మార్గం. ఆయన ఆ పదవికి అనర్హుడు. తక్షణం తొలగించాలి. లేని పక్షంలో ఉద్యమిస్తాం. – అక్బర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, తిరుపతిడీఈఓను సస్పెండ్ చేయాలిడీఈవో స్థాయి అధికారి ఓ పార్టీకి కొమ్ము కాయడం దారుణం. పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడటం సహించరాని విషయం. డీఎస్సీలో జరిగిన అవినీతిపై వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసనలకు భయపడి ఉపాధ్యాయులను ఉసిగొల్పాలనుకోవడం దారుణం. అధికారిక మీటింగ్ అని చెప్పి, ఉపాధ్యాయులను మభ్యపెట్టి పార్టీ మీటింగ్‌లకు హాజరు కావాలని హుకుం జారీ చేసిన డీఈఓను తక్షణం సస్పెండ్ చేయాలి. – డాక్టర్ ఓబుల్‌రెడ్డి, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తిరుపతిఎవరు చెబితే ఇలా చేశారు?డీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డీఈవో తీరు విమర్శలకు తావిస్తోంది. విద్యా వ్యవస్థను రాజకీయాలకు ముడిపెట్టి పబ్బం గడుపుకుంటున్నారు. జిల్లా విద్యాశాఖలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్న తరుణంలో, వాటిపై దృష్టి సారించకుండా పార్టీ మీటింగ్‌లకు ఉపాధ్యాయులను పంపే కార్యక్రమంలో ఉండటం దారుణం. ఇలాంటి వ్యక్తులు ఆ పదవికి అనర్హులు. ఇలాంటి వ్యవహారాలతోనే ‘పది’ ఫలితాలపై ప్రభావం పడుతోంది. ఇంతకూ ఎవరు చెబితే డీఈవో ఈ సమావేశం నిర్వహించారో వెల్లడించాలి. – సుందరరాజు, ఎన్ఎల్ఎస్ఏ జాతీయ అధ్యక్షుడుఅబ్బే.. మేం పిలవలేదు..డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులకు తిరుపతిలో శనివారం మీటింగ్‌కు హాజరు కావాలని మేము ఎవరికీ చెప్పలేదు. డీఈవో ఆఫీస్ నుంచి తాను చెప్పినట్లు ఎవరూ కాల్స్ చేయలేదు. కొత్తగా ఎంపికైన టీచర్లను మీటింగ్ పేరుతో పిలిపించి.. టీడీపీ వాళ్లు నిర్వహించిన మీటింగ్‌కు హాజరు కావాలని మేము చెప్పలేదు. నాకు ఈ అంశంతో సంబంధం లేదు. పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా శనివారం నేను పిచ్చాటూరు, సత్యవేడు ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాల పరిశీలనలో ఉన్నాను. నా పేరు చెప్పి, డీఈవో ఆఫీస్ నుంచి ఎవరైనా ఫోన్లు చేసి ఉపాధ్యాయులను పిలిపించారేమో విచారిస్తాను. – కేవీఎన్ కుమార్, జిల్లా విద్యాశాఖాధికారి -
గెట్ అవుట్! చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పిన అమిత్ షా?
-
ఖర్జూరనాయుడు లేదా చంద్రబాబులా ఉండాలి! బాగా ప్లాన్ చేశావ్ బాబు..
-
ప్రజలు లేరని ప్రభుత్వ ఉద్యోగులను తరలిస్తావా? చంద్రబాబు అసలు బాగోతం
-
చంద్రబాబుకు కొత్త టెన్షన్.. బయటపడ్డ లోకేష్ స్కాముల చిట్టా..


