
చంద్రబాబు-మైసూరారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : కరువుతో అల్లాడుతున్న రాయలసీమను నిర్లక్ష్యం చేస్తున్నారని సీమ నేతలు గళమెత్తారు. నీటి పంపకాల విషయంలో రాయలసీమకు అన్యాయం జరిగిందని నిరసిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాజీమంత్రి మైసూరారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శివరామకృష్ణ, మదన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. విభజనతో ఎక్కువగా నష్టపోయింది రాయలసీమనేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ రాజధాని, హైకోర్టు రెండూ ఒకే ప్రాంతంలో నిర్మించి సీమకు మరోమారు అన్యాయం చేశారని మైసూరారెడ్డి మండిపడ్డారు. పట్టిసీమతో రాయలసీమకు నీళ్లిస్తున్నామన్న మాటలో నిజం లేదన్నారు. సీమకు కేటాయిస్తామన్న నీటికి చట్టబద్ధత కల్పించాలని అన్నారు. హైకోర్టును సీమలో ఏర్పాటు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment