Mysura Reddy
-
అప్పుడు నిద్రపోయారా.. మైసూరా!
ఒంగోలు: టీడీపీ హయాంలో నదీ జలాలను తెలంగాణ ప్రభుత్వం తరలించుకుపోతే ఎంవీ మైసూరారెడ్డి నిద్రపోయారా అని జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్‌రెడ్డి నిలదీశారు. ఒంగోలులో గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సర్కారు ఏపీకి అన్యాయం చేస్తున్న రోజుల్లో మౌనం దాల్చిన మాజీ మంత్రి మైసూరా ఇప్పుడు న్యాయం చేస్తున్న ప్రభుత్వంపై రాళ్లు వేయడం దుర్మార్గమన్నారు. 2014–19 మధ్య శ్రీశైలం జలాశయం వద్ద 800 అడుగుల్లోపే నీటిమట్టం ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాలను తరలించేందుకు శ్రీకారం చుట్టిందన్నారు. ఆ అంశంపై చంద్రబాబు ఐదేళ్ల పాలనలో మైసూరారెడ్డి నోరు విప్పకపోవడం రాయలసీమపై ఆయనకున్న ప్రేమకు అతి పెద్ద సాక్ష్యమని పేర్కొన్నారు. ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన చంద్రబాబు.. అక్రమ ప్రాజెక్టులు కడుతున్నా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోయారని గుర్తు చేశారు. సొంత ప్రయోజనాల కోసం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను, ప్రత్యేకించి రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెడుతుంటే నోరెత్తని మైసూరా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై నోటికొచ్చినట్టు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రాయలసీమకు అన్యాయం చేసిన చంద్రబాబును 2019 ఎన్నికలకు ముందు మైసూరా ఎందుకు కలిశారో, ఏం మంతనాలు జరిపారో బహిరంగ రహస్యమే అన్నారు. చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడుతుంటే.. చంద్రబాబుకు మైసూరా అనుకూలంగా మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణలో ఇతర పార్టీల నాయకులు సైతం అక్కడ కడుతున్న అక్రమ ప్రాజెక్టులను సక్రమమే అని చెబుతుంటే.. మన దౌర్భాగ్యం కొద్దీ ఒక బాబు, ఒక మైసూరా, ఒక రఘురామరాజుతోపాటు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ–5 రాష్ట్రానికి శనిలా దాపురించాయని ఎద్దేవా చేశారు. అభివృద్ధి, సంక్షేమం కోసం చర్చలు పెట్టాలి టీవీ చానళ్లలో చర్చలను ప్రజల్ని రెచ్చగొట్టేందుకు కాకుండా.. అభివృద్ధి, సంక్షేమం కోసం నిర్వహించాలని సుధీర్‌రెడ్డి సూచించారు. ఏబీఎన్ రాధాకృష్ణ, మైసూరారెడ్డి మధ్య జరిగిన చర్చా కార్యక్రమంలో ఏది పడితే అది మాట్లాడారని మండిపడ్డారు. నదీ జలాల పంపిణీ అనేది సీఎంలు కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారమయ్యే సమస్య కాదన్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాల బోర్డులు చేయాల్సి ఉంటుందన్నారు. కరోనా సమయంలో ప్రభుత్వ పథకాల ద్వారా పేదలను ఆదుకున్నా కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. -
‘పట్టిసీమ వల్ల సీమకు ఉపయోగం లేదు’
సాక్షి, కడప: గోదావరి జలాలను కృష్ణా నదికి తరలించే ప్రతిపాదనలపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన చర్చలను స్వాగతిస్తున్నామని మాజీ ఎంపీ మైసూరా రెడ్డి అన్నారు. త్వరలోనే గ్రేటర్ రాయలసీమ అభివృద్ధి సంఘం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యే కొట్రికె మధుసూదనగుప్తాలతో కలిసి మైసూరా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాయలసీమలోని 7 ప్రాజెక్ట్‌లకు నీటిని తరలించాలని ఏపీ విభజన చట్టంలో ఉందన్నారు. రాయలసీమకు 150 టీఎంసీల నీటిని కేటాయించి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. పట్టిసీమ ప్రాజెక్ట్ వల్ల సీమకు ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు మైసూరా రెడ్డి. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వల్ల జరుగుతున్న అన్యాయంపై ఏపీ-తెలంగాణ ప్రభుత్వాలు చర్చించాలని కోరారు. హంద్రీనీవా, గాలేరు-నగరి, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్ట్‌లకు పుష్కలంగా నీరు చేరాలంటే కృష్ణా నదిపై సిద్ధేశ్వరం అలుగును త్వరగా పూర్తి చేయాలని కోరారు. శ్రీశైలంలో 885 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడే విద్యుత్ ఉత్పత్తి చేపట్టాలన్న అంశంలో ఇరు రాష్ట్రాలు ఒప్పందం చేసుకోవాలని సూచించారు. -
క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా..
సాక్షి, కడప : క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు మాజీ మంత్రి మైసూరారెడ్డి వెల్లడించారు. ఆయన ఆదివారం ఇక్కడ రాయలసీమ హక్కుల సాధనపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మైసూరారెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ ప్రాంతం కోసమే పని చేస్తానని, రాజకీయేతర ఉద్యమం చేస్తానని తెలిపారు. ఉద్యమం పార్టీగా మారితే క్రియాశీలక పాత్ర పోషిస్తానని ఆయన పేర్కొన్నారు. సీమ సమస్యల పరిష్కారానికి అజయ్ కల్లం నేతృత్వంలో ఓ కమిటీ వేయనున్నట్లు మైసూరారెడ్డి ప్రకటించారు. రాయలసీమ హక్కుల సాధనకు మహాసభ నిర్వహించాలని నిర్ణయించామని, ఎన్నికల తర్వాత సభ ఏర్పాటు చేస్తామన్నారు. కాగా చాలాకాలంగా మైసూరారెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయం విదితమే. -
రాయలసీమలో కరువు విలయతాండవం
సాక్షి, హైదరాబాద్: రాయలసీమలో రెండు, మూడేళ్లుగా వర్షాభావ పరిస్థితుల నెలకొన్నాయని, కరువు విలయతాండవం చేస్తోందని, ప్రజల పరిస్థితి దారుణంగా మారిందని మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ వడ్డమాను శివరామకృష్ణారావు, డాక్టర్ మదన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. వారు బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. రాయలసీమ దుర్భిక్ష పరిస్థితులు, నీటి వనరుల కేటాయింపులపై ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి వేర్వేరుగా రాసిన లేఖలను విడుదల చేశారు. కరువు వల్ల పంటల నష్టం జరిగినా బాధిత రైతాంగానికి వ్యవసాయ బీమా సౌకర్యం లభించలేదని బాబుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని వాపోయారు. -
‘సీమకు మళ్లీ అన్యాయమే జరిగింది’
సాక్షి, హైదరాబాద్ : కరువుతో అల్లాడుతున్న రాయలసీమను నిర్లక్ష్యం చేస్తున్నారని సీమ నేతలు గళమెత్తారు. నీటి పంపకాల విషయంలో రాయలసీమకు అన్యాయం జరిగిందని నిరసిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాజీమంత్రి మైసూరారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శివరామకృష్ణ, మదన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. విభజనతో ఎక్కువగా నష్టపోయింది రాయలసీమనేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ రాజధాని, హైకోర్టు రెండూ ఒకే ప్రాంతంలో నిర్మించి సీమకు మరోమారు అన్యాయం చేశారని మైసూరారెడ్డి మండిపడ్డారు. పట్టిసీమతో రాయలసీమకు నీళ్లిస్తున్నామన్న మాటలో నిజం లేదన్నారు. సీమకు కేటాయిస్తామన్న నీటికి చట్టబద్ధత కల్పించాలని అన్నారు. హైకోర్టును సీమలో ఏర్పాటు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. -
వైఎస్సార్సీపీలో చేరిన మైసురా తనయుడు
సాక్షి, వైఎస్సార్ జిల్లా : వైఎస్సార్ జిల్లాలో సీనియర్ రాజకీయనేత ఎంవీ మైసూరారెడ్డి కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి వైఎస్సార్ సీపీలో చేరారు. ఆయనతో పాటు నియోజక వర్గంలోని పలువురు నాయకులు, నేతలు, మరో వంద కుటుంబాలు వైఎస్సార్ సీపీలో చేరాయి. ఎర్రగుంట్ల సమన్వయ కర్త సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ గొప్పనాయకుడని పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. చంద్రబాబు పరిపాలనలో జరిగిన అవినీతిపై విసుగెత్తి ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పదని చెప్పారు. పార్టీలో చేరిన అనంతరం రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ విగ్రహానికి పూల దండలు వేసి నివాళులు అర్పించారు. -
బురదజల్లుడుకు తాయిలం
- మైసూరా సిమెంటు ఫ్యాక్టరీకి భూమి కేటాయింపు - అధికారపార్టీలో చేరనున్న మైసూరా సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీని వదిలివెళ్తూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విమర్శల బురదచల్లిన మాజీ మంత్రి మైసూరారెడ్డికి తగిన ప్రతిఫలం దక్కింది. ఆయన కుటుంబ సభ్యుల నేతృత్వంలో స్థాపించనున్న ‘తేజ సిమెంటు ఫ్యాక్టరీ’కి ఎర్రగుంట్ల మండలంలో 140 ఎకరాల ప్రభుత్వభూమి కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎర్రగుంట్ల మున్సిపాలిటీకి సమీపంలో ఉన్న ఈ భూమి మార్కెట్ విలువ రూ.25 లక్షలకు పైగా ఉండగా.. ప్రభుత్వం ఎకరా రూ.2.5 లక్షలకు కేటాయిస్తూ అనుమతి ఇచ్చింది. పరిశ్రమ నెలకొల్పేందుకు ప్రభుత్వ భూమి దక్కడం, ఇదివరకే ప్రైవేటు భూములను కొనుగోలు చేసిన నేపథ్యంలో తేజ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సెప్టెంబర్‌లో శంకుస్థాపన చేయనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు స్వయంగా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈలోపే ఆగస్టులో టీడీపీలో చేరేందుకు మైసూరా రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తేజ సిమెంటు ఫ్యాక్టరీ ప్రమోటర్‌గా మాజీమంత్రి మైసూరారెడ్డి సోదరుడు శ్రీనివాసులరెడ్డి, షేర్‌హోల్డర్లుగా మరికొంతమంది మైసూరా బంధువులు ఉన్నట్లు సమాచారం. స్థానిక రెవెన్యూ అధికారులు అభ్యంతరం చెప్పినప్పటికీ మైసూరాకు మేలు చేసేందుకే.. ప్రభుత్వం ఆ అభ్యంతరాలను పట్టించుకోలేదని సమాచారం. అంతేకాదు ఈ భూమిలో ఓ వాగు ఉన్నప్పటికీ ఎలాంటి ఆక్షేపణ లేకుండా భూమి కేటాయించేందుకు తీర్మానించింది. తాను ఆశించినట్లు తమ ఫ్యాక్టరీకి ప్రభుత్వం భూమి కేటాయించడంతో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మైసూరా టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. -
టీడీపీ స్క్రిప్టు ప్రకారమే మైసూరా లేఖ
♦ వైఎస్సార్సీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శ ♦ మైనింగ్ లీజు కోసమే బాబు పంచన మైసూరా చేరుతున్నారు న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తెలుగుదేశం స్క్రిప్టు ప్రకారమే మైసూరారెడ్డి లేఖ ఉందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. బుధవారం ఢిల్లీలో విలేకరులతో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల ముందు ఒక వ్యూహం ప్రకారం జగన్మోహన్రెడ్డిపై జరిగిన దుష్ర్పచారానికి అనుగుణంగా ఈ లేఖ ఉందన్నారు. పెద్దలకు జగన్ విలువివ్వరని, ప్రతినమస్కారం చేయరని, మంచి సంబోధనతో మాట్లాడరంటూ ఎన్నికలముందు టీడీపీ దుష్ర్పచారం చేసిందని, అవే అంశాల్ని ప్రస్తావిస్తూ మైసూరా లేఖ సాగిందన్నారు. టీడీపీ ప్రోద్భలంతోనే లేఖ రాసినట్టు ఉందన్నారు. ‘చంద్రబాబు.. అవినీతి చక్రవర్తి’ పుస్తకాన్ని జగన్ విడుదల చేసిన నేపథ్యంలో మైసూరాతో రాజీనామా లేఖ రాయించినట్టుగా ఉందన్నారు. జగన్ నివాసానికి టిఫిన్‌కు వెళ్లి తప్పనిసరి పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ కండువా వేసుకోవాల్సివచ్చిందని మైసూరా చెప్పడం హాస్యాస్పదమన్నారు. కుటుంబంలోనూ చిచ్చుపెట్టారని మైసూరా విమర్శించడంలో అర్థం లేదన్నారు. మైసూరానే అపరిచితుడు కాంగ్రెస్ నుంచి టీడీపీకి, అక్కడినుంచి వైఎస్సార్సీపీకి, మళ్లీ టీడీపీకి.. ఇలా పార్టీలు మారుతున్న మైసూరానే అపరిచితుడని పెద్దిరెడ్డి విమర్శించారు. పెద్దల్ని జగన్ గౌరవించరనే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. టీడీపీ చెబుతున్న విషయాల్నే లేఖలో ప్రస్తావించడాన్నిబట్టి చూస్తే.. మైసూరా టీడీపీలో చేరనున్నారని స్పష్టమవుతోందన్నారు. డబ్బు సాయం చేయమని మిమ్మల్ని అడిగారా? ‘‘జగన్‌కు డబ్బు ధ్యాస ఉందని లేఖలో రాశారు. జగన్ ఏనాడైనా డబ్బు సాయం చేయమని మిమ్మల్ని అడిగారా? డబ్బు ధ్యాస మీకుంది కాబట్టే.. సిమెంట్ కంపెనీ లెసైన్సు ఉన్నందువల్ల దానికి మైనింగ్‌లీజు, బ్యాంకులనుంచి రుణాలు తెచ్చుకోవడానికే చంద్రబాబు పంచన చేరుతున్నారు’’ అని పెద్దిరెడ్డి విమర్శించారు. అవినీతి బాబుకు అర్హత ఉంటుందా? కేంద్ర హోంమంత్రిని కలిసే అర్హత జగన్‌కు లేదన్న టీడీపీ విమర్శలపై పెద్దిరెడ్డి స్పందిస్తూ.. రూ.1.34 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన చంద్రబాబుకు హోంమంత్రిని కలిసే అర్హత ఉండదు తప్ప జగన్‌కు ఎందుకుండదని ప్రశ్నించారు. చంద్రబాబుపై విచారణ జరిగితే బండారం బయటపడుతుందన్నారు. విచారణ జరగకుండా స్టేలు తెచ్చుకోకపోతే అసలు విషయం తెలిసిపోయేదన్నారు. ఇప్పటికైనా సీబీఐ విచారణను తనంతటతాను కోరుకుని ఎలాంటి మతలబులు చేయకుంటే బాబు సచ్ఛీలతను అంగీకరిస్తామన్నారు. జగన్‌పై ఆరోపణలొచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి సీబీఐ విచారణకు ఆదేశించడాన్ని గుర్తుచేశారు. బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. రాష్ట్రానికి ఎన్ని నిధులు సాధించిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. -
వైఎస్ జగన్‌కు అండగా ఉంటాం: సుధీర్‌రెడ్డి
- మైసూరా సోదరుడి కుమారుడు సుధీర్‌రెడ్డి యర్రగుంట్ల (కడప): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అండగా ఉంటామని జమ్మలమడుగు పార్టీ ఇన్చార్జి సుధీర్ రెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ సీపీకి మైసూరారెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన బుధవారం రాత్రి ఆయన సోదరుడు కుమారుడు సుధీర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఈ సంద్భరంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. తమ కుటుంబం వైఎస్ఆర్ సీపీకి, వైఎస్ జగన్‌కు ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. తన పెదనాన్న మైసూరారెడ్డి పార్టీకి రాజీనామా చేయడం దురదృష్టకరమన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు సుధీర్ రెడ్డి తెలిపారు. పెదనాన్నతో ఇప్పటికీ నాలుగు సార్లు మాట్లాడానని, త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని సుధీర్‌రెడ్డి చెప్పారు. వైఎస్ జగన్ ...మైసూరారెడ్డికి మర్యాద ఇవ్వకపోవడం అనేది అవాస్తవమని అన్నారు. తమ కుటుంబం అంతా చివరి వరకు వైఎస్ జగన్ వెంటే నడుస్తామని చెప్పారు. వైఎస్ జగన్ చేసే ప్రజా పోరాటాలు తమకు బాగా నచ్చాయని తెలిపారు. ఎన్ని కష్టాలు వచ్చినా జగన్ నాయకత్వం వీడేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికీ మైసూరా రెడ్డి వైఎస్ఆర్ సీపీలోనే కొనసాగాలని కోరుకుంటున్నామని సుధీర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. -
'టీడీపీలో చేరమంటూ ఎమ్మెల్యేలకు మైసూరారెడ్డి ఫోన్లు'
న్యూఢిల్లీ : యాదృచ్ఛికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరానంటూ మైసూరారెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ ఓ పద్ధతి ప్రకారమే ఆయనతో లేఖ రాయించినట్లు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. బుధవారం పెద్దిరెడ్డి ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మైసూరారెడ్డి లేఖలో చెప్పుకోవాల్సింది ఏమీలేదన్నారు. చంద్రబాబు అవినీతిపై వైఎస్ జగన్ పుస్తకం విడుదల చేసిన నేపథ్యంలో ఈ లేఖను రాయించారు. చాలామంది నాయకులు, ఆహ్వానాల మేరకు విందులకు, బ్రేక్ ఫాస్ట్‌కు వెళ్తారని, అలా చెప్పగానే కండువా కప్పుకుని పార్టీ మారిపోతారా? అని ఆయన ప్రశ్నించారు. 'రాయలసీమ పరిరక్షణ ఉద్యమానికి మేం మద్దతు ఇవ్వడం లేదనడం దారుణం. రాయలసీమకు అన్యాయం గురించి ఎన్నోసార్లు మేం అసెంబ్లీలో మాట్లాడాం. రాయలసీమ ఉద్యమంపై మైసూరారెడ్డి మూడుసార్లు తేదీలు వాయిదా వేశారు. ఎందుకు వాయిదా వేశారో ఎవ్వరికీ చెప్పలేదు. జమ్మలమడుగులో మైసూరారెడ్డి సోదరుడి కుమారుడిని సమన్వయకర్తగా నియమించాం. దీన్ని నెపంగా పెట్టుకుని ఏవేవో లేఖలో రాశారు. కాంగ్రెస్ పదవులు అనుభవించి టీడీపీలోకి వెళ్లారు. వైఎస్ జగన్ సీఎం అవుతారని అక్కడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అపరిచితుడు మైసూరానే, మరెవ్వరో కాదు. ఆ వ్యాఖ్యలు మైసూరారెడ్డికే వర్తిస్తుంది. మాలాంటి సీనియర్ ఎమ్మెల్యేలను వైఎస్ జగన్ ఎంతో గౌరవంగా చూస్తారో, మాకు తెలుసు. మైసూరారెడ్డి రాజకీయ ధ్యాసతో వెళ్లారా? మరో కారణంతో వెళ్లారో చూస్తాంగా. వైఎస్ జగన్ అధికారంలో లేరు, ప్రతిపక్షంలో ఉన్నారు. మరి డబ్బు ధ్యాస అనే మాట ఎక్కడ నుంచి వస్తుంది. మైసూరారెడ్డిని వైఎస్ జగన్ ఎప్పుడైనా డబ్బులు ఇవ్వమని అడిగారా? గత ఆరు నెలల నుంచి మైసూరారెడ్డి పార్టీకి దూరంగా ఉన్నారు. ఆయన ఏ కార్యక్రమాల్లో పాల్గొలేదు. టీడీపీ అనుకూలంగా వ్యవహరించమని ఎమ్మెల్యేలకు మైసూరా చెప్పలేదా? వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలతో ఆయన ఫోన్లో మాట్లాడలేదా? అధికార పార్టీకి అనుకూలంగా ఉండాలంటూ మైసూరారెడ్డి చేసిన సంభాషణలు పార్టీ కార్యకర్తలకు కూడా తెలుసు. పార్టీ ఎమ్మెల్యేలను కూడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, పార్టీకి రాజీనామాలు చేయించేలా వ్యవహరిస్తున్నారని అందరికీ తెలుసు. పార్టీలు మారడం వారి అభిమతం, కానీ వెళ్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదు. మా పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చేందుకు ఆరు నెలలుగా మైసూరారెడ్డి అందరికీ ఫోన్లు చేశారు. మైసూరారెడ్డికి చెందిన సిమెంట్ కంపెనీకి మైనింగ్ లీజులు, బ్యాంక్ గ్యారంటీలిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినందుకే ఆయన ఇదంతా చేస్తున్నారని నేను వ్యక్తిగతంగా అంటున్నా. హైటెక్ సిటీ పేరుతో చంద్రబాబు తన అనుచరులకు ఎలా లబ్ధి చేకూర్చారో అందరికీ తెలుసు. రాజధాని పేరుతో అమరావతిలోనూ అలానే చేస్తున్నారు. చంద్రబాబు సచ్ఛీలుడు అయితే సీబీఐ విచారణకు అంగీకరించాలి.' అని పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు. -
'దురుద్దేశంతో ప్రారంభించే ప్రాజెక్టులకు వ్యతిరేకం'
-
'దురుద్దేశంతో ప్రారంభించే ప్రాజెక్టులకు వ్యతిరేకం'
హైదరాబాద్:రాజకీయ దురుద్దేశంతో ప్రారంభించే ప్రాజెక్టులకు వైఎస్సార్ సీపీ వ్యతిరేకమని ఆ పార్టీ పీఏసీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిన పట్టిసీమ ప్రాజెక్టు రాజకీయ దురుద్దేశంతోనే చేపడుతున్నదేనని విమర్శించారు.శుక్రవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన మైసూరా.. విభజన చట్టాన్ని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయన్నారు. రాష్ట్ర విభజన చట్ట ప్రకారం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కృష్ణా రివర్ బోర్డు, సీడబ్యూసీ అనుమతి తీసుకోవాలన్నారు. విభజన చట్టాన్ని ఉల్లఘించటం రాజ్యాంగ విరుద్ధమన్నారు. పట్టిసీమ విషయంలో ఏపీ ప్రభుత్వం సీడబ్యూసీ అనుమతి తీసుకుంటే బాగుంటేదని మైసూరా తెలిపారు. అయితే చంద్రబాబు నాయుడు ఆ అనుమతులు తీసుకోకుండా చేపట్టారన్నారు. రెండు రాష్ట్రాలను రెచ్చగొట్టే విధంగా ఇద్దరు సీఎంలు వ్యవహరించడం తగదన్నారు. అనుమతుల్లేని ప్రాజెక్టు నిర్మాణాలపై కేంద్ర జలవనరుల శాఖ, సీడబ్యూసీకి తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాస్తారన్నారు. చట్టాలను రెండు రాష్ట్రాల సీఎంలు గౌరవించాలన్నారు. -
సింగపూర్ ప్రభుత్వం మన మేనమామ కాదు..
వైఎస్సార్సీపీ నేత మైసూరారెడ్డి సాక్షి, హైదరాబాద్ : రాజధాని మాస్టర్ ప్లాన్ ఫ్రీగా గీసీవ్వడానికి సింగపూర్ ప్రభుత్వమేమీ మన మేనమామ కాదని వైఎస్సార్సీపీ సీనియర్ నేత ఎంవీ మైసూరారెడ్డి అన్నారు. సింగపూర్ సంస్థలు అందజేసిన రెండో విడత మాస్టర్ ప్లాన్‌పై ‘సాక్షి’ టీవీ నిర్వహించిన చర్చాగోష్టిలో ఆయన పాల్గొన్నారు. ఇలాంటి ప్రణాళికలను ఎవరూ ఉచితంగా గీయరని మైసూరారెడ్డి చెప్పారు. సింగపూర్ ప్రభుత్వం గుణం మంచిది కాదని తెలిపారు. కాంట్రాక్ట్ పొలిటికల్ సిస్టమని చెప్పి చైనీయులు సింగపూర్‌ను తరిమేశారన్నారు. ఏపీ రాజధాని నిర్మాణానికి సింగపూర్ రూపొందించిన మాస్టర్ ప్లాన్ అంతగా గొప్పగా లేదని చెప్పారు. ఈ ప్లాన్ గీయడానికి డబ్బులు, టెక్నాలజీ, ప్రభుత్వం అవసరం లేదన్నారు. ఇదే ప్లాన్‌ను పార్టీ తరపున కూడా గీయవచ్చని చెప్పారు. రాజధాని ప్రభుత్వం చేతుల్లో ఉండాలని, ప్రైవేటు చేతుల్లో పెట్టకూడదని చెప్పారు. బ్లూ ప్రింట్, మాస్టర్ ప్లాన్ అమలుకు అసలు సమస్య డబ్బని చెప్పారు.సచివాలయం, హైకోర్టు నిర్మాణానికి నిధులిస్తామని విభజన బిల్లులో పొందుపచారని గుర్తు చేశారు. రాజధాని కోసం సమీకరించిన రైతుల భూములకు ప్రభుత్వం డెవలపర్ కాదని, కేవలం మధ్యవర్తిత్వం వహిస్తుందన్నారు. దీనిని పారిశ్రామిక అవసరాలకు తీసుకునే దాంతో పోల్చలేమన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని తెలిపారు. దోచుకోవడానికే ‘మాస్టర్ ప్లాన్’: వాసిరెడ్డి పద్మ రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న పది వేల ఎకరాల భూమిని సింగపూర్ సంస్థలకు ధారాదత్తం చేసేందుకే రాజధాని మాస్టర్ ప్లాన్‌ను వారి నుంచి రూపొందింప జేశారని, తెలుగువారికి ఇదో దుర్దినమని వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, సింగపూర్ సంస్థల కుటుంబీకులు, చంద్రబాబు కుటుంబ సభ్యులు, ఆయన బినామీలు పరస్పరం దండుకునేందుకే ఈ మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారని ధ్వజమెత్తారు. పరస్పరం ఇది ఓ ఎక్స్ఛేంజ్ ఆఫర్ లాంటిదన్నారు. తెలుగు వారి సంసృ్కతీ సంప్రదాయాలు, తెలుగుదనం ఉట్టిపడేలా నిర్మించాల్సిన రాజధాని మాస్టర్ ప్లాన్‌ను రూపొందించడానికి తెలుగు వారిలో నిపుణులే కరవయ్యారా? అని ఆమె ప్రశ్నించారు.పది వేల ఎకరాలు సింగపూర్ సంస్థలకు అప్పగిస్తున్నారని ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తలపై ఇప్పటి వరకూ చంద్రబాబు నోరు విప్పలేదని, అసలు విషయం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, ఆయన కుటుంబీకుల పర్యటనల వివరాలు బయట పెడితే ఆ దేశంలో వారికున్న ఆస్తులేంటో, వారికి అనుబంధం ఉన్న కంపెనీల వివరాలేంటో బయట పడతాయని ఆమె అన్నారు. -
'ప్రత్యేకం'పై పిల్లిమొగ్గలెందుకు?
హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం పిల్లి మొగ్గలు వేస్తూ కుంటి సాకులు చెప్పడం ఎంతమాత్రం సరికాదని, అసలు ప్రత్యేక హోదా ఇస్తారో ఇవ్వరో తేల్చి చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెనుకా ముందూ చూడకుండా మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. ‘ప్రత్యేక హోదా ఇవ్వగానే రాష్ట్రానికి పరిశ్రమలు పరిగెత్తుకుంటూ వస్తాయా?’ అని మంత్రి అనడం శోచనీయమన్నారు. విభజన వల్ల ఏపీకి నష్టం జరిగిందనీ ప్రత్యేక హోదాతోనైనా పారిశ్రామికాభివృద్ధి జరిగి ఆర్థిక పుష్టి కలుగుతుందని అందువల్ల ఆ షరతును విధించే తాము రాజ్యసభలో విభజన బిల్లుకు మద్దతు నిస్తున్నామని నాడు బీజేపీ జాతీయనేతలంతా చెప్పారని మైసూరా గుర్తుచేశారు. బీహార్ , బెంగాల్ ఎన్నికలున్నాయి కనుక ప్రత్యేక హోదా ఇచ్చే విషయం కుదరడం లేదని, తమిళనాడు వ్యతిరేకిస్తుందనే మాటలు ఆనాడు రాజ్యసభలో విభజన బిల్లుకు మద్దతు ఇచ్చేటపుడు బీజేపీకి గుర్తుకురాలేదా? అని మైసూరా ప్రశ్నించారు. ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ అసలు ప్రత్యేక హోదా కోరుతోందా? లేక ప్రత్యేక ప్యాకేజీ చాలనుకుంటోందా? చెప్పాలని డిమాండ్ చేశారు. -
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే: మైసూరా రెడ్డి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై టీడీపీ, బీజేపీలు తమ వైఖరిని స్పష్టం చేయాలంటూ వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేత మైసూరా రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కేంద్ర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన బాధ్యత బీజేపీపై ఉందని చెప్పారు. బీజేపీ కుంటిసాకులు, పిల్లిమొగ్గలు వేయకుండా స్పష్టమైన వైఖరి చెప్పాలన్నారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని చెప్పారు. కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత టీడీపీపై ఉందని తెలిపారు. ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని పిలిస్తే తామంతా కలిసి వస్తామని ఆయన చెప్పారు. పార్లమెంట్లో ప్రత్యేక హోదా అంశాన్ని వైఎస్ఆర్సీపీ ఎంపీలు లేవనెత్తుతారని మైసూరా తెలిపారు. టీడీపీ ఎంపీలు తమకు మద్దతు ఇవ్వండి లేదా ఈ అంశాన్ని లేవనెత్తితే వారికి తమ మద్దతు తెలుపుతామని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో తీర్మానం చేసినా తాము మద్దతు ఇస్తామని మైసూరా రెడ్డి స్పష్టం చేశారు. -
'ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన భాధ్యత బిజెపీదే'
-
'పోలవరం ప్రశ్నార్థకం అవుతుందనే మా భయం'
హైదరాబాద్:పట్టిసీమ ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వైఎస్సార్ సీపీ నేత మైసూరా రెడ్డి మండిపడ్డారు. సోమవారం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాయలసీమకు నీరిచ్చేందుకు పట్టిసీమ అని కల్లబొల్లి మాటలు చెబుతున్నారని మైసూరా విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వానికి రాయలసీమపై శీత కన్ను ఎందుకని ప్రశ్నించారు. రాయలసీమకు నీరిచ్చేందుకు పట్టిసీమ అని మాయమాటలు చెబుతున్న బాబు సర్కార్.. అసలు ఆ ప్రాజెక్టు నుంచి రాయలసీమకు నీళ్లు తరలిస్తామని జీవోలో పేర్కొనకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇంతకంటే మోసం.. దగా మరొకటి ఉంటుందా?అని మైసూరా అడిగారు. పట్టిసీమ ప్రాజెక్టుతో పోలవరం ప్రాజెక్టు ప్రశ్నార్థకం అవుతుందనే తమ భయమన్నారు. పట్టిసీమ ప్రాజెక్టుపై ఖర్చు పెట్టే వంద కోట్లను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో తెలుగు గంగా ప్రాజెక్ట్ కు నిధులెన్ని ఖర్చు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. మద్రాస్ కు నీటిని తరలించాలనే ధ్యాసతో సీమను ఎడారి చేసే ప్రయత్నం చేశారని మైసూరా ఎద్దేవా చేశారు. -
'పోలవరం ప్రశ్నార్థకం అవుతుందనే మా భయం'
-
పోలీసులే కొట్టుకోవడం సిగ్గుచేటు: మైసూరా రెడ్డి
హైదరాబాద్: శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులే కొట్టుకోవడం సిగ్గుచేటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎం.వీ. మైసూరా రెడ్డి విమర్శించారు. దీనికి ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు పూర్తి బాధ్యత వహించాలని ఆయన అన్నారు. ఈ గొడవలు చూస్తుంటే తెలుగు ప్రజల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుగానే మాట్లాడుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదని ఆయన హితవు పలికారు. ఇద్దరు ముఖ్యమంత్రులూ సమస్య పరిష్కారానికి గవర్నర్ వద్దకు వెళ్లడం సిగ్గుచేటన్నారు. ఇద్దరు సీఎంలూ రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తున్నారని మైసూరా రెడ్డి దుయ్యబట్టారు. ఈ పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఇద్దరు ముఖ్యమంత్రులూ సవాళ్లు, ప్రతి సవాళ్లు మానుకొని సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషిచేయాలని హితవు పలికారు. -
'విద్యుత్ ఛార్జీల పెంపు వెనక అవినీతి'
హైదరాబాద్: ఏపీ విద్యుత్ ఛార్జీల పెంపు వెనుక పెద్ద అవినీతి జరుగుతోందని వైఎస్ఆర్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు మైసూరా రెడ్డి ఆరోపించారు. అధిక ధరకు విద్యుత్ కొనుగోళ్లపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బొగ్గు దిగుమతుల్లో కూడా భారీ అవకతవకలు జరిగాయంటూ మైసూరా రెడ్డి విమర్శించారు. విద్యుత్ ఛార్జీల పెంపుభారం ప్రజలపై పెట్టడం దుర్మార్గమంటూ దుయ్యబట్టారు. ఏపీ సర్కార్ బాధ్యతా రహితంగా వ్యవహరిస్తోందంటూ ధ్వజమెత్తారు. విద్యుత్ లోటు కేవలం అంకెల గారడి తప్ప నిజమైన భారం కాదన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపును వైఎస్ఆర్ సీపీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని చెప్పారు. అవినీతి, దుబార, స్వలాభం కోసమే విద్యుత్ కొనగోళ్లు జరుగుతున్నాయని మైసూరా రెడ్డి అన్నారు. -
విద్యుత్ ఛార్జీల పెంపు వెనుక అవినీతి: మైసూరా
-
''విచ్చలవిడిగా ప్రజల డబ్బు ఖర్చు''
-
''రెండు ప్రభుత్వాలు కలిసి సీమకు అన్యాయం''
-
రెండు రాష్ట్రాలలో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాలు
-
రెండు రాష్ట్రాలలో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాలు
హైదరాబాద్: దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్ 2న సేవా కార్యక్రమాలు, విగ్రహాల వద్ద నివాళులు అర్పించే కార్యక్రమాలు నిర్వహించాలని వైఎఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఆ పార్టీ నేత మైసూరా రెడ్డి పిలుపు ఇచ్చారు. వైఎస్ఆర్ సేవలు స్మరించుకునేలా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఆ మహానేత ఉండి ఉంటే రాష్ట్రానికి ఈ గతిపట్టి ఉండేది కాదన్నారు. ఆయన మరణించిన తరువాత రాజకీయ లబ్ది కోసం రాష్ట్రాన్ని రెండుగా విభజించారన్నారు. ఏదిఏమైనా జరిగింది జరిగిపోయిందన్నారు. తెలుగువారు ఐకమత్యంగా ఉండాలని, రెండు రాష్ట్రాల అభివృద్ధిని వైఎస్ఆర్ సిపి కాంక్షిస్తుందని చెప్పారు.వర్ధంతి రోజున చేపట్టే కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలవాలని మైసూరా రెడ్డి అన్నారు. -
గ్రీన్‌ఫీల్డ్ సిటీగా రాజధాని
హైదరాబాద్: మౌళిక సదుపాయాలతో 40-50 వేల ఎకరాల్లో గ్రీన్‌ఫీల్డ్ సిటీగా రాజధానిని నిర్మించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్(సిడబ్ల్యూసి) సభ్యుడు మైసూరా రెడ్డి కోరారు. ప్రభుత్వం అఖిలపక్షంతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలన్నారు. న్యాయపరంగా కర్నూలును ఏపీ రాజధానిగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజధాని విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. టీడీపీ వైఖరిపై భవిష్యత్తులో మళ్లీ ఉద్యమాలు వచ్చే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. -
'ప్రభుత్వం విఫలం - రాష్ట్రపతిపాలనకు డిమాండ్'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజాస్వామ్య పరిక్షరణలో ఘోరంగా విఫలమైందని, రాష్ట్రపతి పాలన విధించాలని వైఎస్ఆర్ సిపి సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు మైసూరా రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా పరిషత్ అధ్యక్షుని ఎన్నిక సందర్భంగా ఒంగోలులో ఓటర్లు కానివారు కూడా ఎన్నికల హాలులోకి ఎలా వెళ్లారు? అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం శాంతి భద్రతలు కాపాడలేకపోతోందన్నారు. టీడీపీ సర్కారు అధికారంలో కొనసాగే అర్హత కోల్పోయిందని చెప్పారు. ఈ ప్రభుత్వాన్ని తక్షణం బర్తరఫ్ చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతిని కోరతామని చెప్పారు. నెల్లూరు, ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలను ఈ రోజే నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రపతిని కలుస్తామని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం వ్యవహార తీరు సిగ్గుతో తలదించుకునేలా ఉందన్నారు. అధికార దుర్వినియోగం స్పష్టంగా కనిపిస్తోందని, ప్రజాస్వామ్యమంటే ఇదేనా? అని ప్రశ్నించారు. నెల్లూరు, ప్రకాశం, కర్నూలు ఘటనలపై డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు మైసూరారెడ్డి తెలిపారు. -
వైసీపీ జారీ చేసే విప్ చెల్లుతుంది: మైసురారెడ్డి
-
ఓటమిపై లోతైన విశ్లేషణ: మైసూరా
-
పవన్ కళ్యాణ్‌వి అర్థం లేని విమర్శలు: మైసురా
-
కేర్ హాస్పిటల్ కు పలు నాయకులు
-
పవన్ కళ్యాణ్ సమాజ సేవ చేశారా?
హైదరాబాద్: సర్వే పేరుతో సీఎన్ఎన్-ఐబీఎన్ ప్రజలను ఏప్రిల్ ఫూల్ చేసిందని వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేత మైసూరారెడ్డి విమర్శించారు. ప్రజల చెవిలో పూలు పెట్టే ప్రయత్నం చేసిందన్నారు. ఇంత మోసపూరిత సర్వే తానెప్పుడూ చూడలేదన్నారు. ఇదంతా కుట్ర పూరిత సర్వే అని మండిపడ్డారు. అంకెల గారడీ తప్ప ఇందులో వాస్తవాలు లేవన్నారు. సీఎన్ఎన్-ఐబీఎన్, ఈనాడులో పెట్టుబడిదారులెవరో అందరికీ తెలుసునని చెప్పారు. పతనావస్థలో ఉన్న టీడీపీని భూతద్దంలో చూపేందుకు సీఎన్ఎన్-ఐబీఎన్ సర్వే ప్రయత్నం చేసిందన్నారు. ఈ సర్వే తప్పుల తడకని ఆ ఛానెల్ చర్చలో పాల్గొన్నవారే చెప్పారని వెల్లడించారు. సీఎన్ఎన్-ఐబీఎన్ సర్వేలు ఎప్పుడూ వాస్తవాలకు దగ్గరగా రాలేదని గుర్తు చేశారు. నీల్సన్ సర్వే వాస్తవానికి దగ్గరగా ఉంటే టీడీపీ నేతలు ఆ సర్వేపై బురద జల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీల్సన్ మార్గ్ 50 వేల శాంపిల్స్‌తో సర్వే చేస్తే, సీఎన్ఎన్-ఐబీఎన్ కేవలం1300 మందితో మాత్రమే సర్వే నిర్వహించిందన్నారు. పవన్ కళ్యాణ్ మాటలకు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. పవన్ సినిమాల్లో నటించడమే తప్ప.. ఏ రోజైనా సమాజ సేవ చేశారా అని మైసూరారెడ్డి సూటిగా ప్రశ్నించారు. -
''పతనావస్థ టిడిపిని నిలబెట్టెయత్నం IBN సర్వే''
-
రాష్ట్రపతి పాలన దురదృష్టకరం: మైసూరా
-
అవిశ్వాసం ఎవరు పెట్టినా మద్దతిస్తాం: మైసూరారెడ్డి
వైఎస్సార్ సీపీ నేత మైసూరారెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: అవిశ్వాసం ఎవరు పెట్టినా వైఎస్సార్ సీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ నేత ఎంవీ మైసూరారెడ్డి చెప్పారు. బుధవారం ఢిల్లీలో పార్లమెంటు వెలుపల వైఎస్సార్ సీపీ నేత బాలశౌరితో కలిసి మైసూరారెడ్డి విలేకరులతో మాట్లాడారు. ‘‘అవిశ్వాసంపై ఒక్క సభ్యుడు నోటీసు ఇచ్చినా సరిపోతుంది. గత పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ సభ్యులు అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. అధికార పార్టీలోనే అసంతృప్తి ఉందని దేశ, రాష్ట్ర ప్రజానీకానికి తెలియచేయడానికి మా మద్దతు తెలుపుతూ వరుసగా ఏడు రోజులు వారితో పాటే నోటీసులిచ్చాం. అయితే, అవిశ్వాసాన్ని సభలో ప్రవేశపెట్టడానికి50 మంది సభ్యుల మద్దతు సేకరించడంలో విఫలమయ్యారు. మద్దతు సేకరించకుండా ఇప్పుడు కూడా నోటీసు ఇచ్చినా ప్రయోజనం ఉండదు’’ అని చెప్పారు. టీడీపీ అధినేత జాతీయ పార్టీల నేతలను ఎందుకు కలుస్తున్నారో ఆయనే చెప్పాలని అన్నారు. తెలంగాణ టీడీపీ నేతలు తెలంగాణ గురించి, ఆంధ్ర నేతలు ఆంధ్ర గురించి మాట్లాడుతున్నారని, దానికి వారే జవాబు చెప్పాలని అన్నారు. -
అవిశ్వాసానికి మద్దతిస్తున్నాం: మైసూరా
న్యూఢిల్లీ : అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతు ఇస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మైసూరారెడ్డి స్పష్టం చేశారు. గత సమావేశాల్లోనూ నేరుగా తాము అవిశ్వాస తీర్మానం పెట్టామని ఆయన బుధవామిక్కడ తెలిపారు. స్పీకర్ అనుమతి కోరే సమయంలో తాము లేచి మద్దతు తెలుపుతామన్నారు. అడ్డగోలు విభజనను వ్యతిరేకిస్తూ రాష్ట్ర సమైక్యతను కాంక్షిస్తూ దేశమంతా పర్యటించి అన్ని పార్టీల నేతలను కలిశామన్నారు. అసెంబ్లీ కూడా తెలంగాణ బిల్లును తిరస్కరించిందని మైసూరారెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ రోజు సాయంత్రం జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి తెలంగాణ ముసాయిదా బిల్లును పార్లమెంట్‌కు పంపొద్దని విజ్ఞప్తి చేస్తామన్నారు. -
అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకోలేదు
-
ఆ 18 అంశాలపై చర్చకు బాబు సిద్ధమేనా?
-
ఆ 18 అంశాలపై చర్చకు బాబు సిద్ధమేనా?
హైదరాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అవినీతికి సంబంధించి 18 అంశాలపై వైఎస్ఆర్ సిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కోర్టులో పిటిషన్ వేశారని, ఆ అంశాలపై చర్చకు బాబు సిద్ధమేనా? అని వైఎస్ఆర్ సిపి సీనియర్ నేత ఎంవి మైసూరా రెడ్డి ప్రశ్నించారు. పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అధ్యక్షతన జరిగిన పీఏసీ సమావేశంలో నిర్ణయాలను ఆయన మీడియాకు వివరించారు. చంద్రబాబు బహిరంగ చర్చకు వస్తే అన్ని బయటకు వస్తాయన్నారు. చంద్రబాబు మరొకరిమీద అవినీతి ఆరోపణలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. ఒక వేలు చూపిస్తే నాలుగు వేళ్లు తనవైపు చూపిస్తాయన్న విషయం చంద్రబాబు తెలుసుకుంటే మంచిందని సలహా ఇచ్చారు. రాష్ట్ర విభజన బిల్లు రాజ్యాంగ స్పూర్తిని ఎగతాళి చేసేలా ఉందన్నారు. రాష్ట్రపతి విభజన బిల్లు పంపిన విధానం, దానిపై అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలకు నిరసనగా ఈ నెల 3న తమ పార్టీ బంద్‌కు పిలుపు ఇచ్చినట్లు తెలిపారు. 4న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మోటారు బైక్ ర్యాలీలు, 6న మానవహారాలు, 7 నుంచి 10 వరకు రిలేదీక్షలు చేస్తామని వివరించారు. శాసనసభలో జరిగే పరిణామాలను బట్టి తమ పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని తెలిపారు. తెలంగాణ బిల్లుకు తమ పార్టీ వ్యతిరేకమని తెలిపారు. శాసనసభలో సమైక్యతీర్మానం కోసం పట్టుబడతామని చెప్పారు. ఇప్పటికైనా అసెంబ్లీలో సమైక్య తీర్మానం ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలే విభజనకు బాధ్యులని ఆయన అన్నారు. తకు సీఎం కిరణ్ పాఠాలు నేర్పాల్సిన అవసరం లేదని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తాము అనుసరించాల్సిన వ్యూహం తమకు ఉందని మైసూరారెడ్డి తెలిపారు. -
బాబు లేఖ ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదు: మైసురా
-
'వెళ్లను వెళ్లారు...రానూ వచ్చారు'
హైదరాబాద్ : కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై అఖిలపక్ష సమావేశంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలు దురదృష్టకరమని వైఎస్ఆర్ సీపీ నేత వైవీ మైసూరారెడ్డి అన్నారు. ఆయన శనివారం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ అఖిలపక్ష సమావేశమంతా అయోమయంగా ఉందని ఎందుకు వెళ్లారో... ఏం చెప్పారో చెప్పాలన్నారు. రాష్ట్ర హక్కుల్ని కాపాడేందుకు ప్రధాని ముందుకు రాకపోవటం శోచనీయమని మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 262 ప్రకారం పార్లమెంటే సుప్రీం అనే విషయం ప్రధానికి తెలియదా అన్నారు. ప్రధానమంత్రి ఇచ్చే ఉచిత సలహా కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్లటం అవసరమా అని మైసూరారెడ్డి సూటిగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అరచేతిలో వైకుంఠం చూపిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు సమైక్యమన్న పార్టీలను మాత్రమే అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానిస్తే బాగుండేదని మైసూరారెడ్డి అన్నారు. విభజనకు అనుకూలంగా ఉండే పార్టీలకు వేదిక కల్పించేందుకు ఆయన యత్నిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజన కోరుకునే పార్టీలతో తాము వేదిక పంచుకోవటం అర్థం లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్, టీడీపీ వైఖరి ఏమైనా మారిందా అని అశోక్ బాబు ప్రశ్నించారు. -
బాబు ఇంతవరకూ సమైక్యం అనలేదు
-
ఆ పార్టీలతో వేదిక పంచుకోం: మైసూరారెడ్డి
హైదరాబాద్: సమైక్య పరిరక్షణ వేదిక ఈ నెల 21న ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. ఈ మేరకు ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబుకు వైఎస్ఆర్ సీపీ నేత మైసూరారెడ్డి లేఖ రాశారు. అఖిలపక్ష సమావేశానికి తమ పార్టీని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. విలువలు, విశ్వసనీయత కలిగిన రాజకీయాలను అనుసరించే పార్టీగా... తమ పార్టీ రెండు పడవల మీద ప్రయాణాన్ని వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. అసెంబ్లీలో, పార్లమెంట్లో ప్రాంతాలవారీగా సభ్యుల్ని ఎగదోస్తున్న కాంగ్రెస్, టీడీపీలను చూస్తూనే ఉన్నామని తెలిపారు. సమైక్యవాదానికి కట్టుబడని ఆ పార్టీలతో తాము వేదిక పంచుకోబోమని స్పష్టం చేశారు. ప్రజలు కూడా ఇలాంటి సమావేశాలను హర్షించరని లేఖలో పేర్కొన్నారు. -
అవిశ్వాసానికి పట్టుబడితే వాయిదావేశారు : మైసూరా
న్యూఢిల్లీ: తమ పార్టీ సభ్యులు అవిశ్వాస తీర్మానంపై పట్టుబడితే లోక్‌సభను వాయిదావేశారని వైఎస్ఆర్ సిపి సిజిసి సభ్యుడు ఎంవి మైసూరా రెడ్డి చెప్పారు. లోక్బిల్లుకు ఆమోదం తెలిపిన తరువాత వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జగన్మోహన రెడ్డితోపాటు ఆ పార్టీ సభ్యులు సమైక్యనినాదాలు చేశారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. అవిశ్వాసానికి నోటీసు ఇచ్చారు. సమైక్య నినాదాల హోరులో సభ జరిగే అవకాశం లేకపోవడంతో స్పీకర్ నిరవధికంగా వాయిదా వేశారు. అనంతరం మైసూరా రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాలను మొక్కుబడిగా నడిపించారని విమర్శించారు. లోక్‌పాల్ బిల్లుకు మద్దతిస్తూ స్పీకర్‌కు తాము లేఖ ఇచ్చినట్లు తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 సవరణపై చర్చజరిగాలని వాయిదా తీర్మానం ఇచ్చామన్నారు. ప్రభుత్వానికి సమస్యలపై చర్చించే చిత్తశుద్ధిలేదన్నారు. ఓట్లు, సీట్ల కోసమే రాష్ట్రాన్ని విభజిస్తున్నారని మండిపడ్డారు. లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందిన తరువాత అవిశ్వాస తీర్మానంపై చర్చకు పట్టుబడితే సభను వాయిదా వేశారని మైసూరా రెడ్డి చెప్పారు. -
సభ అభిప్రాయం అంటే ఓటింగే: మైసూరారెడ్డి
-
సభ అభిప్రాయం అంటే ఓటింగే: మైసూరారెడ్డి
హైదరాబాద్: తెలంగాణ బిల్లు లేక రాష్ట్రపతి నోట్‌పై శాసనసభ అభిప్రాయం తెలియజేయడం అంటే ఓటింగేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు ఎం.వి.మైసూరా రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడారు. నిబంధనల ప్రకారం చిత్తశుద్ధితో రాష్ట్రపతి సూచనల మేరకు బిల్లుపై సభ్యుల అభిప్రాయంతోపాటు శాసనసభ అభిప్రాయం ఓటింగ్ ద్వారా తెలియజేయాలని శాసనసభాపతిని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు-2013 (తెలంగాణ బిల్లు) విషయంలో కేంద్ర ప్రభుత్వం వంకరటింకరగా వ్యవహరిస్తోందన్నారు. సాంప్రదాయబద్దంగా వ్యవహరించాలని ఆయన కోరారు. ఇది చరిత్రాత్మకమైన బిల్లు అని, దీనిపై చర్చించడానికి తగిన సమయం కావాలన్నారు. అందువల్ల శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, బిల్లుపై చర్చించాలని ఆయన కోరారు. సభ అభిప్రాయం అంటే ఓటింగేనని చెప్పారు. అభిప్రాయాలు చెప్పడం కోసం విప్ జారీ చేయవలసిన అవసరంలేదన్నారు. ప్రతి సభ్యుడి అభిప్రాయం అవసరం అన్నారు. సభ్యులు పార్టీలకు అతీతంగా అభిప్రాయాలు చెప్పాలని కోరారు. తెలంగాణ బిల్లు ఒక శాఖ నుంచి మరో శాఖకు పంపే తీరును, అందుకు అనుసరించే పద్దతులను మైసూరా రెడ్డి తప్పుపట్టారు. యుద్ద విమానంలో యుద్ధప్రాతిపదికన బిల్లును ఇక్కడకు పంపించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దానిని పరిశీలించి ముఖ్యమంత్రికి పంపారు. ముఖ్యమంత్రి సంతకం చేసి గవర్నర్‌కు పంపారు. గవర్నర్ మళ్లీ దానిని ముఖ్యమంత్రికి పంపారు. ఆయన మళ్లీ దానిపై సంతకం చేసి శాసనసభ స్పీకర్‌కు పంపారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు శాసనసభకు చేరింది. ఈ బిల్లు లేక రాష్ట్రపతి నోట్ నాలుగు చోట్లకు వెళ్లడం చెకచెకా జరిగిపోయింది. నిద్రపోయే సమయం తీసివేస్తే పది గంటల్లోనే ఇదంతా జరిగింది. సాదారణ పరిస్థితులలో అయితే ఇందుకు కనీసం నాలుగు రోజులు పడుతుంది. నిబంధనలకు విరుద్ధంగా సచివాలయంలో రాత్రి కూడా పని చేసి ఈ తతంగం పూర్తి చేశారు. ఇది ఫెడరల్ స్పూర్తికి విరుద్దం అని చెప్పారు. సమైక్యవాద ఛాంపియన్ అని చెప్పుకునే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ బిల్లు ఏ విధంగా ఈ నాలుగు చోట్లకు నడిచిందో తెలియజెప్పాలని మైసూరా రెడ్డి డిమాండ్ చేశారు. దీపం గాలిలోపెట్టి ఆరిపోకుండా చూడమని అందరికి చెప్పినట్లు సీఎం తీరు ఉందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ మీ మెడమీద కత్తి పెట్టినందున మీరు దీనిని ఇంత త్వరగా స్పీకర్‌కు పంపారా? అని ప్రశ్నించారు. మీరు సమైక్యవాదానికి కట్టుబడి ఉంటే ఇటువంటి పని చేస్తారా? అని ఆయన అడిగారు. -
ట్రిబ్యునల్ తీర్పు రాష్ట్రానికి గొడ్డలి పెట్టు
-
మొదటి ముద్దాయి టీడీపీనే!
బాబు హయాంలో ప్రాజెక్టులు పూర్తి అయి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ది పక్షపాత ధోరణి మైసూరారెడ్డి ధ్వజం కడప, న్యూస్‌లైన్: రాష్ట్రంలో మిగులు జలాలపై ఆధారపడి నిర్మించిన ప్రాజెక్టులకు బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు జరపకపోవడానికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీయేనని వైఎస్ఆర్సీపీ రాజకీయ వ్యవ హారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి ఆరోపించారు. 2004 కన్నా ముందు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం అప్పుడే ప్రాజెక్టులు నిర్మించి ఉంటే ఇప్పుడు ట్రిబ్యునల్‌లో నీటి కేటాయింపులు జరిగేవన్నారు. కర్ణాటక, మహారాష్ట్రలు అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆపలేకపోయిందని విమర్శించారు. ఇప్పుడు ఆ రాష్ట్రాలు నిర్మించిన ఆల్మట్టి సహా 12 అక్రమ ప్రాజెక్టులకు ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు జరిపి వాటిని రెగ్యులరైజ్ చేసిందని మైసూరారెడ్డి పేర్కొన్నారు. కడపలోని వైఎస్ గెస్ట్‌హౌస్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఆంధ్రప్రదేశ్‌కు గొడ్డలి పెట్టని, ముఖ్యంగా రాయలసీమ, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు శాశ్వతంగా అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం 70 శాతం పూర్తయిన ప్రాజెక్టులకే నీటి కేటాయింపులు జరిపారని, దాంతో మన ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులపై ఇప్పటివరకు ఖర్చు పెట్టిన రూ.40 వేల కోట్లు నిరర్థకమయ్యాయన్నారు. మధ్యంతర తీర్పు అనంతరం ట్రిబ్యునల్ పక్షపాత వైఖరిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతో రాష్ట్రప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. దీనిపై బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన తెలుగుదేశం పార్టీ కూడా తమ తప్పులు కప్పిపుచ్చుకుంటూ ఇతరులపై బురద జల్లుతోందని మండిపడ్డారు. టీడీపీ తొమ్మిదేళ్ల పాలనలో గాలేరు-నగరికి రూ.17 కోట్లు, హంద్రీ-నీవాకు రూ.13 కోట్లు, వెలిగొండకు రూ. 13 కోట్లు, కల్వకుర్తికి రూ.12 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, నెట్టెంపాడుకు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదన్నారు. కానీ, వైఎస్ హయాంలో 2004 నుంచి 2009 వరకు గాలేరు-నగరికి రూ. 4 వేల కోట్లు, హంద్రీ-నీవాకు రూ.4 వేల కోట్లు, వెలిగొండకు రూ. 1443 కోట్లు, నెట్టెంపాడుకు రూ. 1124 కోట్లు, కల్వకుర్తికి రూ. 1930 కోట్లు ఖర్చు చేశారని వివరించారు. గాలేరు-నగరి ప్రాజెక్టు గ్రావిటీ ప్రకారం ప్రవహించే ప్రాజెక్టు అని, 1994లో ఆ ప్రాజెక్టుకు టెండర్లు పిలిచి పనులు అప్పగించినా ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఆ టెండర్లను రద్దు చేసిందని గుర్తుచేశారు. ట్రిబ్యునల్ తీర్పుపై ప్రభుత్వమే సుప్రీం కోర్టుకు వెళ్లాల్సి ఉందని, లేనిపక్షంలో రాష్ట్ర ప్రాజెక్టులు స్మారక చిహ్నాలుగా మిగిలిపోతాయన్నారు. సమావేశంలో వైఎస్సార్సీసీ జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు, డీసీసీబీ చైర్మన్ ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి, కడప సమన్వయకర్త అంజాద్‌బాషా, కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, హఫీజుల్లా పాల్గొన్నారు. చంద్రబాబు వైఖరి వల్లనే: సీఎంగా పనిచేసినప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అనుసరించిన వైఖరి వల్లనే జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు మన రాష్ట్రానికి ప్రతికూలంగా వచ్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు వాసిరెడ్డి పద్మ, గట్టు రామచంద్రరావులు విమర్శించారు. వ్యవసాయం దండగ అంటూ చంద్రబాబు తన హయాంలో ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించకపోవడం వల్లే కృష్ణా మిగులు జలాల విషయంలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం వారు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిపై బురదజల్లేందుకు ప్రయత్నించడం ఆయన కుసంస్కారాన్ని తెలియజేస్తోందన్నారు. వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యులుగా ముగ్గురి నియామకం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలిలో సభ్యులుగా కొత్తగా ఒ.వి.రమణ (తిరుపతి), పాపకన్ను రాజశేఖరరెడ్డి(వెంకటగిరి), బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి(ఆత్మకూరు)ని నియమించారు. ఈ విషయాన్ని పార్టీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. -
ట్రిబ్యునల్ తీర్పుతో ఏపీకి చాలా నష్టం
-
కృష్ణా జలాలపై సుప్రీంకోర్టుకు వెళ్లండి: మైసూరా
హైదరాబాద్ : కృష్ణా జలాల పంపిణీపై బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుతో ఆంధ్రప్రదేశ్‌కు చాలా నష్టం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మైసూరారెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొనాలని..... తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవాలని సూచించారు. ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం తేటతెల్లమైందన్నారు. ట్రిబ్యునల్ తీర్పును సవరించకుంటే రాష్ట్రానికి అన్యాయమే జరుగుతుందన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ విఫలమైందని మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలోనే అక్రమ నిర్మాణాలు జరిగాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కృష్ణా డెల్టా ప్రాంతంలో రైతులకు మెట్ట పంటల వైపు మళ్లించాలని ఆనాడే చంద్రబాబు అన్నారని మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. కాగా మిగులు జలాల పంపిణీ, ఆలమట్టి ఎత్తు పెంపుపై రాష్ట్రం ట్రిబ్యునల్ ఎదుట తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికి..వాటిని పరిగణలోకి తీసుకోకుండా కృష్ణ జలలాపై ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది. -
వైఎస్ఆర్ సీపీ సమైక్యానికి సానుకూల స్పందన
హైదరాబాద్ : రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే మూడు ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్ష అని ఆపార్టీ సీనియర్ నేత మైసూరారెడ్డి తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు జాతీయ స్థాయిలో వైఎఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కృషికి సానుకూల స్పందన వచ్చిందని ఆయన అన్నారు. మైసూరారెడ్డి మంగళవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ అసెంబ్లీ తీర్మానం లేకుండా ఆర్టికల్ 3 ప్రకారం విభజన సమంజసం కాదన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్, కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ ఇప్పటివరకూ అనేక జాతీయ, ప్రాంతీయ పార్టీలను కలిశామన్నారు. తమ వాదనతో పలు పార్టీల నేతలు ఏకీభవించారని మైసూరారెడ్డి తెలిపారు. కొన్ని పార్టీల నేతలు అంతర్గతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారన్నారు. తమ వాదన విని కొంతమంది నేతలు విస్మయం చెందారని మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఇంతగా దిగజారి వ్యవహరిస్తుందని అనుకోలేదని కొందరు నేతలు తమతో చెప్పారని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న విషయం అందరికి చెప్పామన్నారు. రాష్ట్రపతిని కలిసినప్పుడు కూడా అదే అంశం చెప్పామని... మిగిలిన రాజకీయ పార్టీలను కూడా త్వరలోనే కలుస్తామని మైసూరారెడ్డి తెలిపారు. -
ఏకపక్షంగా రాష్ట్ర విభజన జరుగుతోంది
-
విభజనకు ఆంధ్రప్రదేశ్నే ఎందుకు ఎంచుకున్నారు?
హైదరాబాద్: వైఎస్ జగన్ రేపు(శనివారం) ఉదయం సీపీఐ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డితో సమావేశమవుతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు నేత మైసూరా రెడ్డి తెలిపారు. ఆ తర్వాత సీపీఎం కార్యదర్శి కారత్‌తో జగన్ భేటీ అవుతారని వెల్లడించారు. ఎల్లుండి సాయంత్రం బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌ను జగన్ కలుస్తారని చెప్పారు. ఇతర రాజకీయ పార్టీల నేతలనూ కలుస్తామన్నారు. కోర్టు అనుమతి వచ్చాక ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఆయా పార్టీల నేతలను జగన్ కలుస్తారని అన్నారు. ఎవరు ఏంచెప్పినా కేంద్రం పెడచెవిన పెడుతోందని విమర్శించారు. విభజన విషయంలో రాజ్యాంగబద్ధంగా నడుచుకోవడం లేదని ఆరోపించారు. విభజన కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రం ఎందుకు ఎంపిక చేసుకుందని ఆయన ప్రశ్నించారు. కేంద్రం అధికార దుర్వినియోగమే పాల్పడుతోందని దుయ్యబట్టారు. -
ఆర్టికల్ 3 దుర్వినియోగం చేస్తున్నారు:మైసురా
-
ఎపినే ఎందుకు విడదీస్తున్నారు -మైసూరా
-
రాష్ట్ర విభజన చాలా క్లిష్టమైనది
న్యూఢిల్లీ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని జీవోఎంను కోరతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మైసూరారెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన మంత్రుల బృందం నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భేటీ కానుంది. ఈ సందర్భంగా మైసూరారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన చాలా క్లిష్టమైనదన్నారు. మొదటి ఎస్సార్సీ ఆధారంగా రెండు అసెంబ్లీల తీర్మానంతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు. విభజన వల్ల రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు ఇబ్బంది పడతాయన్నారు. ఓట్లు, సీట్ల కోసమే రాష్ట్ర విభజన చేస్తున్నారని మైసూరారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ డబుల్ గేమ్ ఆడుతూ ప్రజల్ని మభ్యపెడుతోందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేకత నుంచి బయటపడేందుకే విభజన అంశాన్ని తెరమీదక తెచ్చారని మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. ఎప్పుడైనా ఎక్కడైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విధానం సమైక్య రాష్ట్రమేనని ఆ పార్టీ నేత మైసూరారెడ్డి మరోసారి స్పష్టం చేశారు. కేంద్రమంత్రుల బృందం చెబుతున్న విధానాలు రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను విడగొట్టడానికి తప్ప సమైక్యంగా ఉంచడానికి కావని మైసూరా మండిపడ్డారు. జల వివాదాలకు సంబంధించి కేంద్ర జల వనరుల మంత్రి చైర్మెన్ గా ఇరు ప్రాంతాల సీఎంలు, కార్యదర్శలతో కమిటీ ఏర్పాటు చేసి పరిష్కరిస్తారనడం వెర్రి ఆలోచన అన్నారు. జీవోఎంతో చర్చల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంవి.మైసూరారెడ్డి, గట్టు రామచంద్రరావు పాల్గొననున్నారు. సీపీఎం కూడా జీవోఎంతో భేటీ కానుంది. -
సమైక్య రాష్ట్రమే వైఎస్సార్సీపీ విధానం:మైసూరా
-
'అఖిలపక్ష భేటీ కేవలం కంటితుడుపు చర్య'
-
'అఖిలపక్ష భేటీ కేవలం కంటితుడుపు చర్య'
హైదరాబాద్ : అఖిలపక్ష సమావేశం కేవలం కంటి తుడుపు చర్య అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎంవీ మైసూరారెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనపై ఏర్పాటు చేసిన జీవోఎంతో భేటీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మైసూరారెడ్డి, గట్టు రామచంద్రరావు మంగళవారం ఢిల్లీ బయల్దేరారు. ఈ సందర్భంగా మైసూరారెడ్డి మాట్లాడుతూ విభజన అంశం కాంగ్రెస్ సొంతింటి వ్యవహారంగా భావిస్తుందన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని జీవోఎంలో స్పష్టం చేస్తామని మైసూరారెడ్డి తెలిపారు. సోనియా ఆదేశాలు అమలు చేయడమే జీవోఎం అజెండా అని ఆయన అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంతమంది వెళ్లినా ....ఎక్కడకి వెళ్లినా సమైక్యమే తన నినాదమని మైసూరారెడ్డి స్పష్టం చేశారు. -
రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలన్నాం
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని రాజ్‌భవన్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీలోని సీనియర్ నాయకులు కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని రాష్ట్రపతికి వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కూడా విన్నపం చేశారు. రాష్ట్ర విభజనకు ఆధారం ఉండాలని, గతంలో ఆచరించిన విధానాన్నైనా అనుసరించాలని కోరామని, తమ విన్నపాన్ని రాష్ట్రపతి సావధానంగా విన్నారని, వినతిని పరిశీలిస్తామని హామీ ఇచ్చారుని పార్టీ సీనియర్ నేత ఎంవీ మైసూరారెడ్డి తెలిపారు. రాష్ట్రపతికి రెండు వినతిపత్రాలు ఇచ్చామని, విభజన నిర్ణయం సరైంది కాదని రాష్ట్రపతికి విన్నవించామని, ఎలాంటి కమిటీల ప్రతిపాదనలు లేకుండానే విభజన చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మైసూరారెడ్డి, సోమయాజులు మీడియాతో మాట్లాడుతూ అన్నారు. రాజ్యాంగబద్ధ నిర్ణయం తీసుకోవాల్సిందిగా రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశామన్నారు. ఇక.. రాష్ట్ర విభజన ఆగాలంటే రాష్ట్రపతే దిక్కు అని లక్ష్మీపార్వతి అన్నారు. రాష్ట్రాన్ని అడ్డంగా ఉరేసే నిర్ణయం జరిగిందని, అందువల్ల ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశానని ఆమె తెలిపారు. -
ప్రధాని, జీవోఎంకు 8067 ఈ-మెయిల్స్
-
జిఓఎంను వ్యతిరేకిస్తున్నాం : వైఎస్ఆర్ సిపి
హైదరాబాద్: రాష్ట్ర విభజన కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం(జిఓఎం)ను వ్యతిరేకిస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆ పార్టీ రాజకీయవ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణతాల రామకృష్ణ, మైసూరా రెడ్డి ఈరోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అన్ని పార్టీలు కూడా జిఓఎంను వ్యతిరేకించి సమైక్య ఉద్యమం కోసం కలసిరావాలని పిలుపు ఇచ్చారు. జిఓఎం తరపున కేంద్ర హొం శాఖ అఖిలపక్ష సమావేశానికి హాజరుకావాలని తమ పార్టీకి లేఖ రాసినట్లు తెలిపారు. ఆ లేఖ అందిన తరువాత తమ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో చర్చించి జిఓఎంను వ్యతిరేకించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విభజనకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ తమ పార్టీ తరపున కేంద్రానికి లేఖ రాసినట్లు చెప్పారు. ఆ లేఖను మీడియాకు చూపించారు. జీఓఎం తమకు సమ్మతి కాదని చెప్పారు. జీఓఎం విభజనకు ముందడుగు మాత్రమేనని వారు అన్నారు. విభజన కోసం వేసే ఏ అడుగుకు తాము సహకరించం అని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నది మాత్రమే తమ డిమాండ్ అన్నారు. విభజనకు వ్యతిరేకంగా 8067 ఈ మెయిల్స్ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా 8067 పంచాయతీలు ఇమెయిల్స్ పంపినట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న ప్రభుత్వం ఈ ఇమెయిల్స్‌కు స్పందిస్తుందని అనుకుంటున్నట్లు చెప్పారు. అలా స్పందించకపోతే ఆ ప్రభుత్వం కళ్లు మూసుకొని నిర్ణయాలు తీసుకుంటుందని భావించాలన్నారు. విభజనకు వ్యతిరేకంగా 75 శాతం జనాభా రోడ్డుపై పోరాటం చేస్తుంటే పట్టనట్లుగా కేంద్ర వ్యవహరిస్తోందన్నారు. తాము ఎక్కడకు వెళ్లినా సమైక్యవాదాన్నే కోరుకుంటామని చెప్పారు. రాష్ట్ర సమైక్యతకు ప్రజలు కృషిచేయాలని కోరారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చర్యలు రాష్ట్రాన్ని విభజించేలా ఉన్నాయని విమర్శించారు. ముఖ్యమంత్రి ఆఖరి రాష్ట్ర అవతరణ దినోత్సవం అని నిరాశ నిస్పృహలు వ్యక్తం చేయడం చూస్తుంటే, ఆయన రాష్ట్ర విభజనకు స్పష్టమవుతోందన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడుల చర్యలు రాష్ట్రాన్ని విభజించే విధంగా ఉన్నాయని విమర్శించారు. పార్టీ తరపున రాష్ట్రపతి, ప్రధాన మంత్రి అపాయింట్మెంట్ కోరినట్లు తెలిపారు. తుపాను వల్ల రాష్ట్ర ప్రజలకు జరిగిన నష్టాన్ని వారికి తెలియజేస్తామని చెప్పారు. బాధితులకు తగిన సహాయం చేయమని విజ్ఞప్తి చేస్తామన్నారు. నల్లొండ జిల్లాలో వైఎస్ విజయమ్మను ప్రజలు అడ్డుకోలేదని, అది ప్రభుత్వ ప్రోత్సాహంతో జరిగిందన్నారు. రక్షణ కల్పించవలసిన ప్రభుత్వం విజయమ్మను వెనక్కి పంపిచండం ఏమిటని వారు ప్రశ్నించారు. -
జిఓఎంను బహిష్కరిస్తున్నాం : వైఎస్ఆర్ సిపి
-
విభజనపై నేడు నిరసన: మైసూరారెడ్డి
విభజన నరకాసురుల దిష్టిబొమ్మలు తగులబెట్టాలని వైఎస్సార్సీపీ పిలుపు 1వ తేదీ ఉదయం సమైక్య తీర్మానాలు చేయాలి ఆ మేరకు ప్రధానికి ఈమెయిల్స్ పంపాలి 6, 7 తేదీల్లో 48 గంటలపాటురహదారుల దిగ్బంధం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవమైన నవంబర్ 1న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగనున్నాయి. మెజారిటీ ప్రజల అభీష్టానికి నిలువెత్తు పాతర వేస్తూ అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజిస్తున్నందుకు నిరసనగా శుక్రవారం రాత్రి విభజన నరకాసురుల దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని పార్టీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఒక బలమైన రాష్ట్రాన్ని నిరంకుశంగా విడగొట్టాలని చూస్తున్న సోనియాగాంధీ, విభజనకు లేఖనిచ్చి సహకరిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, పదవిని పట్టుకుని వేలాడుతూ డ్రామాలాడుతున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, విభజనకు ఆజ్యం పోసిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావుల దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ఉదయం గ్రామసభలు ఏర్పాటు చేసి అందులో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానాలు చేయాలని కూడా పార్టీ కోరింది. ఆ తీర్మానాలను ప్రధానమంత్రికి ఈమెయిల్స్ ద్వారా పంపాలని సూచించింది. అదేరోజు రాత్రి 7 గంటల తరువాత నరక చతుర్ధశి రోజున నరకాసురుని వధించిన విధంగా విభజన నరకాసురులను కూడా బాణసంచాతో కూడిన దిష్టిబొమ్మలతో దగ్ధం చేయాలని పార్టీ కోరింది. ఈ నిరసన కార్యక్రమాలు ఊరూరా, వాడవాడలా చేసి కేంద్రానికి సమైక్యవాదాన్ని చాటిచెప్పాలని మైసూరా కోరారు. కాగా విభజనపై చర్చించడానికి నవంబర్ 7న కేంద్ర మంత్రుల బృందం(జీవోఎం) నిర్వహిస్తున్న సమావేశానికి నిరసనగా 6, 7 తేదీల్లో 48 గంటలపాటు రహదారుల దిగ్బంధం చేయాలని కూడా పార్టీ పిలుపునిచ్చింది. మహిళలు క్రియాశీలంగా పాల్గొనాలి నరకాసురునితో యుద్ధం చేసింది శ్రీకృష్ణుడే అయినప్పటికీ రాక్షసుడిని వధించడంలో కీలక పాత్ర వహించింది సత్యభామే కనుక ఈ దిష్టిబొమ్మల దగ్ధం కార్యక్రమంలో మహిళలే చురుగ్గా పాల్గొనాలని వైఎస్సార్ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలకుమారి కోరారు. సమైక్య దినంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవమైన నవంబర్ 1వ తేదీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్య దినంగా పాటించనుంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగే ఈ ఉత్సవంలో అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొంటారు. ఉదయం 8.30 గంటలకు ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. -
బలహీన ప్రభుత్వం ఎలా విభజిస్తుంది?: మైసూరా
హైదరాబాద్: తుమ్మితే ఊడే ముక్కులా ఉన్న యుపిఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎలా విభజిస్తుంది? అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు మైసూరా రెడ్డి ప్రశ్నించారు. విభజనను కాంగ్రెస్ తన సొంత వ్యవహారంగా నిర్వహిస్తోందని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర విభజనపై అసెంబ్లీలో తీర్మానం ఎందుకు ప్రవేశపెట్టరు? అని ప్రశ్నించారు. తెలంగాణపై ఏర్పాటు చేసి జీఓఎం టైమ్‌పాస్ సమావేశాలు నిర్వహిస్తోందని విమర్శించారు. జీఓఎం భేటీలు అన్నీ టీ, బిస్కెట్లతో ముగుస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ ఒంటెత్తు పోకడకు, ఏకపక్ష విభజనకు నిరసనగా వైఎస్ఆర్ సిపి పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. నవంబర్ 1ని సమైక్య దినోత్సవంగా ప్రకటించారు. ఆ రోజు సమైక్యవాదాన్ని బలంగా వినిపించాలన్నారు. గ్రామసభల ద్వారా సమైక్యతీర్మానాలు చేయాలన్నారు. ఈమొయిల్ రూపంలో ప్రధానికి తీర్మానాలు పంపాలని చెప్పారు. పట్టణాల్లో మానవహారాలు ఏర్పాటు చేస్తామన్నారు. నవంబర్ 1 రాత్రి విభజనకు కారకులైన వారి దిష్టిబొమ్మలతో నరకచతుర్దశి జరుపుతామని చెప్పారు. నవంబర్ 7 మంత్రుల బృందం సమావేశం సందర్భంగా 6, 7 తేదీల్లో రహదారుల దిగ్బంధం చేస్తామన్నారు. సమైక్యం కోరుకునే వారంతా ఈ కార్యక్రమాలలో పాల్గొనాలని మైసూరా రెడ్డి పిలుపు ఇచ్చారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీని సమావేశపర్చాలన్నారు. అసెంబ్లీలో సమైక్యతకు అనుకూలంగా తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. విభజన విషయంలో నైతిక విలువలు కూడా పాటించడం లేదని బాధపడ్డారు. అసెంబ్లీ నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు. -
రాజ్యాంగ స్పూర్తికి విరుద్దంగా రాష్ట్ర విభజన
-
న్యాయస్థానంలో న్యాయమే గెలిచింది: మైసూరారెడ్డి
-
సిఎం కిరణ్, పోలీసులపై మండిపడ్డ వైయస్సార్సీపీ
-
సీఎం సమైక్యవాదా? సోనియా ఏజెంటా?: మైసూరారెడ్డి
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాదా? లేక ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ విభజన అజెండాను అమలు చేయడానికి పని చేస్తున్న ఏజెంటా? అని వైఎస్ఆర్ సిపి కేంద్ర పాలకమండలి సభ్యుడు మైసూరా రెడ్డి ప్రశ్నించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రజలకు తమ అభిప్రాయం చెప్పడం కోసం సమైక్య శంఖారావం సభను ఏర్పాటు చేసుకోదలచినట్లు ఆయన తెలిపారు. ఈ సభకు అనుమతి ఇవ్వకపోవడం భావప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడమే అన్నారు. హైదరాబాద్‌లో ఎవరైనా తమ అభిప్రాయాలు తెలుపుకోవచ్చు. అందరి భావాలు ఒక రకంగా ఉండవు. భావాలు వేరుగా ఉండవచ్చు. భావాలు చెప్పుకోవడానికి సభ ఏర్పాటు చేసుకుంటుంటే విచ్ఛిన్నకర శక్తులు, విధ్వంసకారులు చొరబడతారని సాకులు చెప్పడం చాలా తప్పు అన్నారు. సమైక్యవాదిగా చెప్పుకునే ముఖ్యమంత్రికి ఇది తగునా? అని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీది మొదటి నుంచి ఒకటే అభిప్రాయం అని చెప్పారు. అందరి అభిప్రాయాలు తెలుసుకొని అందరికి ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలని కోరుతున్నట్లు చెప్పారు. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ ఉద్దేశం అన్నారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా మూడు ప్రాంతాల అభివృద్ధికి కృషి చేశారని చెప్పారు. రాష్ట్ర ప్రజలు ఐకమత్యంగా ఉంటేనే రాష్ట్రం కూడా బలంగా ఉంటుందని చెప్పారు. తెలంగాణపై సిడబ్ల్యూసీ తీర్మానం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినదన్నారు. అది పార్టీకి చెందిన ఒక వైఖరి మాత్రమేనని చెప్పారు. ఇటువంటి వైఖరితో తమ జీవితాలతో చలగాటం ఆడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
సీఎం సమైక్యవాదా? సోనియా ఏజెంటా?: మైసూరారెడ్డి
-
చంద్రబాబుకు జగన్ ఫోబియా పట్టుకుంది
-
'ప్రాజెక్టుల జాతకాలు తేల్చిన తర్వాతనే....'
హైదరాబాద్ : మిగులు జలాల మీద ఆధారపడి నిర్మిస్తున్న ప్రాజెక్టుల జాతకాలు తేల్చిన తరువాతనే..రాష్ట్ర విభజన గురించి మాట్లాడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఎం.వి.మైసూరా రెడ్డి చెప్పారు. ప్రపంచంలో మిగులు జలాల మీద ఆధారపడి నిర్మిస్తున్న ప్రాజెక్టులు ఎక్కడా లేవన్నారు. రాష్ట్ర విభజనపై జాతీయ పత్రిక హిందూ నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన...రాష్ట్ర విభజన ప్రక్రియపై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గాదె వెంకటరెడ్డి, టీఆర్ఎస్ నుంచి కేటీఆర్, సీపీఎం నుంచి బీవీ రాఘవులు, సీపీఐ నుంచి నారాయణ, లోక్ సత్తా నుంచి జయప్రకాష్ నారాయణ్ పాల్గొని రాష్ట్ర విభజనపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. టీడీపీని ఆహ్వానించినప్పటికీ..ఆ పార్టీకి చెందిన వారెవ్వరూ ఈ సమావేశానికి హాజరు కాలేదు. -
సమైక్యానికి కట్టుబడితే లేఖ వెనక్కు తీసుకోండి: మైసూరారెడ్డి
టీడీపీకి మైసూరారెడ్డి డిమాండ్ కాంగ్రెస్ నేతలు పదవులకు రాజీనామా చేయాలి అధిష్టానాన్ని ఒత్తిడి చేయకుండా డ్రామాలెందుకు? దాడులు అమానుషం, తీవ్రంగా ఖండిస్తున్నాం సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నట్టయితే రాష్ట్రాన్ని విభజించాలని, ఆ పార్టీ ఇచ్చిన లేఖ వెనక్కి తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకున్నప్పుడే ఆ పార్టీ తన చిత్తశుద్ధిని చాటుకున్నట్టవుతుందని చెప్పారు. రాష్ట్ర విభజనపై టీడీపీ ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకుంటుందా? లేక అదే విధానానికి కట్టుబడి ఉంటుందా? ఏదో ఒకటి ప్రజలకు తెలియజేసి తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. అలాగే కాంగ్రెస్ మంత్రులు, ఇతర నేతలు తమ పదవులకు రాజీనామాలు చేసి విభజనపై సీడబ్ల్యూసీ తీర్మానాన్ని ఉపసంహరించుకునేలా తమ అధిష్టానవర్గంపై ఒత్తిడి తెచ్చి తమ విజ్ఞతను చాటుకోవాలని సూచించారు. ఏపీఎన్జీవోలు నిర్వహించిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభలో పాల్గొని తిరిగి వెళుతున్న సందర్భంలో హైదరాబాద్ శివారు ప్రాంతంలో జరిగిన దాడిలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి, కాకినాడకు చెందిన కట్టా సత్యనారాయణ గాయపడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. మైసూరారెడ్డితోపాటు పార్టీ నేతలు బి.గురునాథరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఏవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, మేరుగ నాగార్జున మంగళవారం ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులను కలిసి ఆరోగ్య పరిస్థితి గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మైసూరారెడ్డి అక్కడ మీడియాతో మాట్లాడారు. విభజనపై నీ అభిప్రాయం చెప్పు బాబూ... టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడికో వెళ్లి సింహగర్జనలు చేసే బదులు విభజనపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాలని మైసూరారెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు కేంద్రం వద్ద ఒక రకంగా చెప్పి, ప్రజల్లోకి వెళ్లి మరోరకంగా మాట్లాడటం రెండు నాల్కల ధోరణి అవుతుందే తప్ప మరొకటి కాదని విమర్శించారు. బాబు తన లేఖను వెనక్కి తీసుకోకుండా, కాంగ్రెస్ మంత్రులు అధిష్టానంపై ఒత్తిడి చేయకుండా ఉంటే... వాళ్లు కుమ్మక్కయి డ్రామాలు ఆడుతున్నారనేది స్పష్టం అవుతుందని చెప్పారు. ఈ రెండు పార్టీలూ ఇలాగే వ్యవహరిస్తే ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలు మరింత రగిలి దుష్పరిణామాలకు దారి తీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ సందర్భంగా తలెత్తిన హింసాత్మక ఘటనలకు మూలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా సమావేశాలు జరుపుకుని తమ అభిప్రాయాలు చెప్పుకోవచ్చని, కానీ ఇలాంటి దాడులనేవి అమానుషమని, ఈ దాడిని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. ఒంటెత్తు పోకడలతో ఏకపక్షంగా సీట్ల కోసం, ఓట్ల కోసం నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితులే నెలకొంటాయన్నారు. ఇప్పటివరకూ ఓ రకంగా మాట్లాడుతూ వచ్చిన మంత్రులు, ఇపుడు ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజీనామాలు చేసి అధిష్టానంపై ఒత్తిడి తేకుండా అసెంబ్లీలో తీర్మానం వచ్చినపుడు ఓడించడానికే సభ్యులుగా కొనసాగుతామని మంత్రులు చెప్పడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టికల్-3 ప్రకారం భారత రాష్ట్రపతి కోరే తీర్మానం కేవలం శాసనసభ వైఖరి తెలుసుకోవడానికేనని, ఉత్తరప్రదేశ్ మాదిరిగా అసెంబ్లీ తీర్మానం పెట్టి కేంద్రానికి తమ అభిప్రాయం తెలియజేయడానికి ఇపుడున్న అడ్డంకులు ఏమీ లేవని మైసూరా స్పష్టం చేశారు. ఎల్బీ స్టేడియం సభలో పోలీసు కానిస్టేబుల్‌పై దౌర్జన్యం జరిగిందనే విషయాన్ని ప్రస్తావించగా... శాంతి భద్రతలు పరిరక్షించే విధుల్లో ఉన్న వ్యక్తి ఆ విధంగా నినాదాలు చేయడం సబబేనా? అని ప్రశ్నించారు. అది ఆయన విజ్ఞతకు, ఆయనకు మద్దతునిస్తున్న వారి విజ్ఞతకే వదిలి వేస్తున్నామన్నారు. సభ సందర్భంగా ఉద్యోగులు రెచ్చగొట్టారనే ఆరోపణలపై ప్రశ్నించగా... ఎవరు ఎవరిని రెచ్చగొట్టారు? ఒకరు సభ జరుపుకునేటపుడు మరొకరు అంతరాయాలు కలిగించడం సరికాదు కదా? అని ఆయన బదులిచ్చారు. -
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి: మైసూరారెడ్డి
-
రాజకీయ శూన్యత ఊహించలేదు: మైసూరా
వైఎస్ రాజశేఖర రెడ్డితో తనకు మూడు దశాబ్దాల బంధముందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు మైసూరారెడ్డి తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం వైఎస్ఆర్ నిరంతరం పరితపించేవారని గుర్తు చేసుకున్నారు. గొప్పనాయకుడు వీడి వెళ్లినపుడు రాజకీయ శూన్యత ఏర్పడుతుందన్నారు. వైఎస్ఆర్ మరణంతో రాజకీయ శూన్యత ఉంటుందని భావించినా ఈ స్థాయిలో ఉంటుందని ఊహించలేకపోయామని చెప్పారు. అలాంటి సమర్ధుడైన నేతను కోల్పోవడం మన దురదృష్టమని మైసూరా రెడ్డి అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి నాలుగో వర్థంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మహానేతకు మైసూరారెడ్డి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ఆర్ మరణం తర్వాత రాష్ట్రం ముక్కచెక్కలయ్యే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా వైఎస్ఆర్ వర్థంతి రోజున ఆయన తనయ షర్మిల సమైక్య శంఖారావం యాత్ర మొదలుపెట్టడాన్ని ఆయన ప్రశంసించారు. -
జంతర్‌మంతర్ వద్ద మైసూరా రెడ్డి ప్రసంగం
-
రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని కోరాం
-
షిండే అలా మాట్లాడటం దౌర్భాగ్యం: మైసూరారెడ్డి
రాష్ట్ర విభజనకు తాము అనుకూలంగా లేఖ ఇచ్చి, తర్వాత మాట మార్చామంటూ బురద చల్లుతున్నారని, ఈ విషయంలో కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెబుతున్న మాటలు పూర్తిగా అసత్యమైనవని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు మైసూరారెడ్డి అన్నారు. గుంటూరులో పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించేందుకు వచ్చిన ఆయన.. విలేకరులతో మాట్లాడారు. అన్ని సమస్యలను పరిగణనలోకి తీసుకొని ఒక తండ్రిలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని తాము షిండేకు చెప్పామని, కానీ దాన్ని పక్కన పెట్టి, కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఒక సీనియర్ రాజకీయ నాయకుడు ఈవిధంగా మాట్లాడటం దౌర్భాగ్యమని మైసూరారెడ్డి మండిపడ్డారు. తెలంగాణపై కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పార్టీ తరఫున తాము చెప్పిన విషయాలన్నింటినీ షిండే పూర్తిగా పక్కనపెట్టి, తన నోటికి వచ్చినది చెప్పేస్తున్నారన్నారు. -
సమన్యాయం లేదు కాబట్టే సమైక్యం కోరుతున్నాం
సాక్షి, కడప: ‘రాష్ట్ర విభజన విషయంలో రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయమన్నాం. కేంద్రం చేయలేకపోయింది. అందుకే సమైక్యంగా ఉంచాలంటున్నాం. ఈ విషయంలో స్పష్టమైన వైఖరితో ఉద్యమం చేస్తున్న ఏకైక రాజకీయపార్టీ వైఎస్సార్ కాంగ్రెస్. తక్కిన పార్టీలు పార్టీలో ఒకలా, ప్రజలతో మరోలా డ్రామాలు ఆడుతున్నాయి. వీటిని కట్టిపెట్టి నిష్కల్మషంగా ఉద్యమిస్తే సోనియా దిగివస్తుంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచగలం’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి అన్నారు. పోలీసులు దీక్ష భగ్నం చేయడానికి ముందు ఆదివారం మధ్యాహ్నం కడపలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మేయర్ రవీంద్రనాథ రెడ్డిలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇటలీ నుంచి వచ్చిన సోనియా విభజన నిర్ణయాన్ని ప్రకటించడంతో పాటు హైదరాబాద్‌లో పదేళ్లు ఉండండి అని సీమాంధ్రులకు సలహా ఇస్తోందని? అసలు అలా చెప్పడానికి సోనియా ఎవరని మండిపడ్డారు. అన్నిప్రాంతాల సమష్టి కృషితో రాష్ట్రంతో పాటు రాజధాని అభివృద్ధి అయిం దని, ఇప్పుడు వెళ్లిపోవాలంటే రాజధానిలో ఉన్నవాళ్లు అభద్ర తకు లోనవుతున్నారన్నారు. రాష్ట్రం విడగొడితే తమకేమీ అభ్యంతరం లేదని చంద్రబాబు కేంద్రానికి లేఖరాశారని, ఇప్పుడేమో ఆపార్టీ నేతలు పార్లమెంట్లో డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. రాజంపేటలో ఆకేపాటి, రైల్వేకోడూరులో కొరముట్ల చేస్తున్న ఆమరణ దీక్ష శిబిరాలను కూడా మైసూరారెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. -
‘చిత్తశుద్ధి ఉంటే దీక్షలో కూర్చోండి’
హైదరాబాద్: పార్టీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టే దీక్షలో కూర్చోవాలని ఆ పార్టీ నేత మైసూరారెడ్డి సూచించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన రేపు విజయమ్మ చేపట్టబోయే దీక్షను ఉద్దేశించి మాట్లాడారు. ‘మా నాయకురాలు చిత్తశుద్దితో దీక్షకు పూనుకున్నారని, మిగతా పార్టీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే దీక్షలో కూర్చోవాలని’ మైసూరా తెలిపారు. రాష్ట్ర విభజనకు అంశంపై నాయకులు స్పందిస్తే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎందుకు దిగిరాదో చూద్దామని సవాల్ విసిరారు. ముప్పైకు పైగా సీట్లను ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సోనియా విభజించాలని చూస్తోందన్నారు. కేవలం 10 సీట్లు కోసమే విభజన చేస్తున్నామని తెలుగు ప్రజలను అడుక్కుంటే.. ఆ సీట్లను తెలుగు ప్రజలు ఇచ్చే వారని మైసూరా విమర్శించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రూ.4లక్షల కోట్లు ఇవ్వాలంటూ చెబుతున్నారని, మిగులు జలాల గురించి ఆయన ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. -
‘రాహుల్‌ను మెదక్‌లో పోటీ చేయించేందుకు సోనియా యత్నం’
-
‘రాహుల్‌ను మెదక్‌లో పోటీ చేయించేందుకు సోనియా యత్నం’
కడప: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సొంత ఊర్లో గెలవలేమని ఆమె కుమారుడు రాహుల్ గాంధీ చేత మెదక్‌లో పోటీ చేయించేందుకు యత్నిస్తోందని వైఎస్సార్సీపీ నేత మైసూరారెడ్డి విమర్శించారు. రైల్వే కోడూరులో కొరముట్ల శ్రీనివాసుల దీక్షకు సంఘీభావం తెలిపిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేవలం పది సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించిన ఘనత సోనియా గాంధీనని మైసూరా మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం చేతిలో ఉందని ఎస్మా ప్రయోగిస్తే భయపడేవారేవరూ లేరన్నారు. ఓట్ల కోసం-సీట్ల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే ఊరుకునేది లేదని మైసూరా హెచ్చరించారు. సమైక్యాంధ్ర ప్రకటన వచ్చే వరకూ వైఎస్సార్సీపీ పోరాటాలు ఆగవని మరోమారు స్పష్టం చేశారు.కాగా, రాజంపేటలో దీక్ష చేస్తున్న వైఎస్సార్సీపీ నేత అమర్నాథ్ రెడ్డికి మైసూరా సంఘీభావం ప్రకటించారు. -
‘వందేళ్ల చరిత్ర ఉన్న పార్టీకి ఇంగిత జ్ఞానం లేదు’
హైదరాబాద్: వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇంగిత జ్ఞానం కూడా లేకపోవడం దారుణమని వైఎస్సార్సీపీ రాజీకీయ వ్యవహారాల పార్టీ కమిటీ సభ్యడు మైసూరారెడ్డి విమర్శించారు. రాష్ట్ర విభజనపై ఏకపక్ష నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీని జాతీయ పార్టీ అని పిలవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ రాష్ట్ర విభజనకు సంబంధించి బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్‌పై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నిరంకుశ వైఖరికి, హేతుబద్దత లేకపోవడానికి ఇదొక ఉదాహరణని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సమావేశం.. ఆ పార్టీకే పరిమితమైనపుడు మిగతా పార్టీలు ఎలా మాట్లాడతాయన్నారు. జాతీయహోదా కల్గిన కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీల కన్నా దారుణంగా వ్యవహరిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రస్తుతం అవలంభిస్తున్న తీరు రాజకీయ లబ్ధి కోసమే అని మైసూరా అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నేతలు పార్లమెంట్లో హడావుడి చేసే కంటే.. గవర్నర్ వద్దకు వెళ్తే మంచిదని ఆయన సూచించారు. టీడీపీ నేతలు పార్లమెంట్లో ఎందుకు ఆందోళన చేస్తున్నారని మైసూరా ప్రశ్నించారు. ప్రభుత్వం కూలిపోయే యోచనే వారి కుంటే గవర్నర్ వద్ద వెళితే సరిపోతుందన్నారు. పీసీసీ చీఫ్ అనుమతితో ఆంటోని కమిటీ ముందు తమ వాదనలు వినిపించాలనడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ సలహాదారు దిగ్విజయ్ సింగ్ రాజ్యాంగ పరిధిని మించి మాట్లాడుతున్నారని విమర్శించారు. గతంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు అసెంబ్లీ తీర్మానం అవసరమైందన్న విషయాన్ని ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న దిగ్విజయ్ మరిచిపోయినట్లున్నారన్నారు. ప్రజలకు అవసరమైన నదీ జలాల పంపకం, రాజధాని తదితర విషయాలపై చర్చించకుండానే ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటు అంశాన్ని ప్రకటించడాన్ని ఏ రకంగా అర్ధం చేసుకోవాలని ప్రశ్నించారు. సహజ వనరులు, మిగతా విషయాలపై చర్చించడానికి ఏ కమిటీ తమను కలవలేదన్న విషయాన్ని మైసూరా గుర్తు చేశారు. -
రాజకీయ లభ్దికోసమే సీఎం వివరం:మైసూరా
-
నాడు నోరెత్తలేదేం? : మైసూరారెడ్డి
ముఖ్యమంత్రిపై ధ్వజమెత్తిన మైసూరారెడ్డి సీడబ్ల్యూసీ ముందు సమస్యలన్నింటినీ వివరించారా? మీరు చెప్పినా కాంగ్రెస్ అధిష్టానం పెడచెవిన పెట్టి నిర్ణయం తీసుకుందా? మీ మాటల్ని ఖాతరు చేయకపోతే మీరెందుకు రాజీనామా చేయలేదు? రాష్ట్రాన్ని విభజిస్తే రాజధాని, నీటిపంపకాలు, విద్యుత్, ఉద్యోగుల సమస్యలున్నాయంటున్నారు ఈ సమస్యలన్నీ కొద్దిరోజులుగా వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ చెబుతున్నవే విభజన ప్రకటన వెలువడిన తొమ్మిది రోజుల తర్వాత మాట్లాడటంలో అర్థమేముంది? ఇతర పార్టీలవి దొంగనాటకాలంటున్నారు... అసలు మీ నాటకమేమిటి? రాష్ట్రాన్ని విభజిస్తే చాలా ప్రాజెక్టులు స్మారక చిహ్నాలుగా మిగిలిపోతాయి.. రాష్ట్ర విభజన నెపాన్ని వైఎస్‌పై నెట్టడం తగదు రాష్ట్రాన్ని విభజిస్తే రాజధాని, నీటి పంపకాలు, విద్యుత్, ఉద్యోగుల సమస్యలున్నాయని మీకు తెలుసుకదా? మీరు చెప్పినా అధిష్టానం పెడచెవిన పెట్టి నిర్ణయం తీసుకుందా?.. అయితే మీరెందుకు రాజీనామా చేయలేదు? విభజన ప్రకటన వెలువడిన తొమ్మిది రోజుల తర్వాత మాట్లాడటంలో అర్థమేముంది? రాష్ట్రాన్ని విభజిస్తే రాజధాని, నీటి పంపకాలు, విద్యుత్ సమస్యలు, ఉద్యోగులు, తదితర అంశాలపై సమస్యలున్నాయని చెప్తున్న ముఖ్యమంత్రి సీడబ్ల్యూసీ ముందు నోరెందుకు ఎత్తలేదని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి ధ్వజమెత్తారు. గురువారం రాత్రి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మీడియా సమావేశానంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘‘రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు అన్ని విషయాలపై పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. రాష్ట్రాన్ని విభజిస్తే వచ్చే సమస్యలేమిటో తెలిసే ఉంటుంది. విభజన ప్రకటనకు ముందు జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో మీరూ పాల్గొన్నారు. అప్పుడు ఈ సమస్యలన్నింటినీ ప్రస్తావించారా? మీరు చెప్పినా కాంగ్రెస్ అధిష్టానం పెడచెవిన పెట్టి నిర్ణయం తీసుకుందా? అలా చేసుంటే మీరు వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసుండాల్సింది. కానీ అలా చేయకుండా విభజన ప్రకటన వెలువడిన తొమ్మిది రోజుల తర్వాత మాట్లాడటంలో అర్థమేముంది?’’ అని నిలదీశారు. ఇతర పార్టీలవి దొంగ నాటకాలంటున్న కిరణ్... ఆయన ఆడుతున్న నాటకమేదో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇది తాను మంచివాడినని చెప్పుకోవడం కోసమో లేదా ప్రజల ఆగ్రహావేశాలనుంచి పార్టీని కాపాడేందుకో సీఎం కిరణ్ మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టడానికే ఆ కమిటీ.. ఆంటోనీ నేతృత్వంలో వేసిన హైలెవెల్ కమిటీకి సమస్యలు చెప్పుకోవాలని ముఖ్యమంత్రి సూచించడాన్ని మైసూరా తప్పుబట్టారు. ‘‘కాంగ్రెస్ పార్టీలో సీడబ్ల్యూసీ అత్యున్నత కమిటీ. ఆ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని ఈ సబ్ కమిటీ ఎలా సవరించగలుగుతుంది. యజమాని చేసిన నిర్ణయంపై గుమాస్తా పంచాయతీ చేయగలడా? ఒక పార్టీ వేసుకున్న కమిటీకి మిగతా పార్టీలు అభిప్రాయాలెందుకు చెప్తాయి? ఒకవేళ చెప్పినా చెవికెక్కుతుందా? ఎవరెన్ని చెప్పినా ఆఖరికి వారి అధినేత్రి సోనియా చెప్పిన విషయాలనే రిపోర్టులో పొందుపరుస్తారు’’ అని విమర్శించారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య లక్ష్మణరేఖ ఉంటుంది. దాన్ని విస్మరించినట్లు కాంగ్రెస్‌పార్టీ ప్రవర్తిస్తోందని దుయ్యబట్టారు. చట్టబద్ధంగా నియమించిన శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికనే తుంగలో తొక్కేసిన వారు ఎలాంటి అధికారాలు లేని ఆంటోనీ కమిటీ సూచనలను పాటిస్తారని ఎలా నమ్మాలని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధమైన కమిటీని నియమిస్తేనే అన్ని పార్టీలు, అన్ని వర్గాల ప్రజలు తమ అభిప్రాయాలు వినిపిస్తారని చెప్పారు. రాష్ట్రాన్ని విభజిస్తే నీటి సమస్యనెలా పరిష్కరిస్తారో చెప్పాలని వైఎస్సార్సీపీ చాలాకాలంగా ప్రశ్నిస్తోందని మైసూరా గుర్తుచేశారు. సాక్షాత్తు ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కావేరీ, ఆల్మట్టి జల వివాదాలు ఇప్పటికీ పరిష్కారం కావడంలేదు. ఈ సమస్యను హైపవర్ కమిటీ ఎలా పరిష్కరిస్తుందని నిలదీశారు. కాంగ్రెస్‌కు పది తలలుంటాయి... కాంగ్రెస్ పార్టీ పది తలల రావణాసురుడులాంటిదని, అందులో ఒక్కో తల ఒక్కొక్క మాట చెబుతోందని మైసూరా ధ్వజమెత్తారు. ‘‘రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై నాలుగేళ్లుగా కాంగ్రెస్ తన వైఖరి చెప్పకుండా రాజకీయ దుష్టచింతనతో ప్రవర్తించింది. హోంమంత్రి షిండేతో జరిగిన అఖిలపక్ష సమావేశంలో కూడా రెండు ప్రాంతాల ప్రతినిధులు రెండు రకాలు చెప్పారు. పార్టీ వాదన చెప్పాలని తాము నిలదీస్తే... అధిష్టానం చెప్పేదే అంతిమ నిర్ణయమని షిండే చెప్పారు. కేవలం ఓట్లు, సీట్ల కోసమే సీడబ్ల్యూసీ ఇప్పుడు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చింది. దాన్ని చల్లార్చేందుకే కమిటీలంటూ నాటకాలాడుతోంది. తాజాగా సీఎం కిరణ్ మాట్లాడుతూ... విభజన పార్టీకే పరిమితం తప్ప, కేంద్రం నిర్ణయం కాదంటూ ఇరుప్రాంతాల్లో సమస్యను మరింత జఠిలం చేశారు. వారి వాలకం చూస్తుంటే ఎలాంటి నిర్ణయమైనా ముందు, వెన క్కి తీసుకునే సౌలభ్యాన్ని చేతిలో పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కేవలం ఓట్లు, సీట్ల కోసమే ఎన్నికల ముందు ఎత్తులు వేస్తున్నారు’’ అని మైసూరా విమర్శించారు. ఇది రాజకీయ లబ్ధికోసం తీసుకున్న అనాలోచిత నిర్ణయమని ముఖ్యమంత్రి చెప్పకనే చెప్పారని తెలిపారు. మాది ఒకే మాట... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఒకే మాటకు కట్టుబడి ఉందని మైసూరా చెప్పారు. ప్లీనరీ నుంచి షిండే ఏర్పాటు చేసిన అఖిలపక్షం వరకు ఒకే మాట చెప్పామని, ఒక తండ్రిలా సమస్యను పరిష్కరించాలని కోరామని వివరించారు. అవేవీ చేయకుండా ఇతరులపై బురద చల్లడం సరైంది కాదన్నారు. నీటి పంపకాలు, రాజధాని, ఉద్యోగులు తదితర అంశాలపై తాము వారం రోజులుగా అనునిత్యం మీడియా సమావేశంలో చెబుతున్న వాటినే సీఎం ప్రస్తావించారని చెప్పారు. రాష్ట్ర విభజన నెపాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై నెట్టడాన్ని మైసూరా తప్పుపట్టారు. ‘‘ఆనాడు ఎమ్మెల్యేలందరూ వెళ్లి సోనియాగాంధీని కలిసినప్పుడు సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేశారు. రెండోఎస్సార్సీ ఏర్పాటు చేయాలని సమావేశం తీర్మానించింది. అప్పుడు అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వానికి అదే తీర్మానాన్ని అందజేసింది తప్ప అంతకుమించి మరేమీ జరగలేదు’’ అని మైసూరారెడ్డి వివరించారు. -
నిర్ణయానికి ముందు సిఎం ఏంచేశారు?: మైసూరా
-
నిర్ణయానికి ముందు సిఎం ఏంచేశారు?: మైసూరా
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకునే ముందు మీరేం చేశారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు మైసూరా రెడ్డి ప్రశ్నించారు. సీఎం వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తన నివాసం నుంచి సాక్షిటివితో మాట్లాడారు. నీటి సమస్య భయాందోళన కలిగిస్తుందని చెప్పారు. భౌగోళిక, జల సమస్యలు ఉన్నాయని ముఖ్యమంత్రి కూడా అంగీకరించారు. పార్టీ నిర్ణయం తీసుకునే సమయంలో ఎందుకు మాట్లడలేదు? అని అడిగారు. సీఎం ఇతర పార్టీలు దొంగ నాటకాలు ఆడుతున్నారని అంటున్నారు. కాంగ్రెస్ ఏం నాటకాలు ఆడుతోందో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ పది తలల రావణాసురుడు లాంటిది, ఒక్కో తల ఒక్కో మాట మాట్లాడుతుందని చెప్పారు. రాష్ట్ర విభజనకు చాలా చిక్కు సమస్యలు ఉన్నాయి. ఆ విషయాలను కోర్ కమిటీలో ఎందుకు చర్చించలేదని ఆయన సిఎంను ప్రశ్నించారు. రాష్ట్రానికి చెందిన అందరితో మాట్లాడాలని తాము ముందు నుంచి చెబుతున్నామన్నారు. ఎప్పుడో ఇచ్చిన లేఖలను ఇప్పుడు రాజకీయం చేస్తారా? అని ప్రశ్నించారు. ఆంటోనీ కమిటీలో మంత్రులు ఉన్నప్పటికీ ఆ కమిటీని కాంగ్రెస్ పార్టీ కమిటీగానే పరిగణిస్తారన్నారు. అధిష్టానం చెప్పిన ప్రకారమే ఆ కమిటీ నివేదిక ఇస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. -
అది ఓ పవర్‌లెస్ కమిటీ: మైసూరారెడ్డి
-
అది ఓ పవర్‌లెస్ కమిటీ: మైసూరారెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించిన హైలెవల్ కమిటీ వల్ల వరిగేదేమీలేదని, అది పవర్‌లెస్ కమిటీ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు మైసూరా రెడ్డి చెప్పారు. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన వెంటనే సీమాంధ్రలో ఉవ్వెత్తున లేచిన ఉద్యమం నేపధ్యంలో నలుగురు సభ్యులతో హైలెవల్ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. అది పరమ చెత్త కమిటీగా మైసూరా రెడ్డి అభివర్ణించారు. ఉద్యమంలో చీలిక తెచ్చేందుకే ఈ కమిటీని ఏర్పాటు చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన విషయాన్ని సొంతింటి వ్యవహరంలా భావించి ఏక పక్ష నిర్ణయాలు తీసుకుంటుందని విమర్శించారు. ఇదంతా రాజకీయ లబ్దికోసమేనన్నారు. ఇక్కడ ప్రజల ప్రయోజనం గురించి ఆలోచించడంలేదన్నారు. పార్లమెంటులో ఎంపిల ప్రదర్శన ఓ డ్రామా అన్నారు. నిర్ణయం తీసుకున్న నాయకురాలికి నచ్చజెప్పి నిర్ణయం మార్చుచేయడానికి ప్రయత్నించాలని సలహా ఇచ్చారు. పార్లమెంటులో ఆందోళనలు ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే పనికి వస్తుందని పేర్కొన్నారు. చిత్తశుద్ధి ఉంటే రాజీనామాలు చేయాలన్నారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయం మార్చుకోవడం కుదరదని చెబుతుంటే, ఆ పార్టీ ఎంపిలు పార్లమెంటులో ఆందోళన చేసి ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. విభజనకు సంబంధించి నిర్ధిష్టప్రాతిపదిక లేదన్నారు. జిల్లాల విభజన ప్రధాన సమస్యగా పేర్కొన్నారు. నీటి సమస్య ఎలా పరిష్కరిస్తారని మైసూరా ప్రశ్నించారు. -
రాజకీయ లబ్దికోసమే విభజన చేశారు
-
మైసూరారెడ్డి మీడియా సమావేశం
-
తొలి విడతలో మేమే నెంబర్‌వన్: మైసూరారెడ్డి
-
ఏకగ్రీవంగా ఎన్నికైనవారికి మైసూరా శుభాకాంక్షలు
-
వైఎస్ఆర్సిపి అభ్యర్థులను బెదిరిస్తున్నారు:మైసూరా
-
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం వాయిదా
-
వరద బాధితులకు వైఎస్ఆర్సీపీ నేతల పరామర్శ