గ్రీన్ఫీల్డ్ సిటీగా రాజధాని
హైదరాబాద్: మౌళిక సదుపాయాలతో 40-50 వేల ఎకరాల్లో గ్రీన్‌ఫీల్డ్ సిటీగా రాజధానిని నిర్మించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్(సిడబ్ల్యూసి) సభ్యుడు మైసూరా రెడ్డి కోరారు. ప్రభుత్వం అఖిలపక్షంతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలన్నారు.
న్యాయపరంగా కర్నూలును ఏపీ రాజధానిగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజధాని విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. టీడీపీ వైఖరిపై భవిష్యత్తులో మళ్లీ ఉద్యమాలు వచ్చే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.