Kurnool
-
ప్రభుత్వ స్కూల్లో టీచర్ కు దేహశుద్ధి చేసిన గ్రామస్థులు
-
‘టీజీ’కో టీఎంసీ!
తుంగభద్ర ఒడ్డున ఫ్యాక్టరీలు..! రూ.వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం! చేతిలో మంత్రి పదవి..! ఏకంగా పరిశ్రమలశాఖ! ఇంకేముంది..? దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే చందంగా అధికారంలో ఉండగానే తన ఫ్యాక్టరీల నీటి అవసరాల కోసం చెక్‌డ్యాం నిర్మాణానికి మంత్రి టీజీ భరత్ ఉపక్రమించారు. ఆయన తండ్రి టీజీ వెంకటేశ్ మంత్రిగా ఉన్న సమయంలో చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టడంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీజీ భరత్‌ను మంత్రి పదవి వరించడంతో కర్నూలు ప్రజల తాగునీటి అవసరాల పేరుతో తుంగభద్ర నదిపై చెక్‌డ్యాం నిర్మించి నది ఒడ్డున ఉన్న తమ ఫ్యాక్టరీల నీటి అవసరాలను తీర్చుకునే ఎత్తుగడ వేశారు. అధికార పార్టీ! పైగా మంత్రి పదవిలో ఉండటంతో అధికారులు ‘జీ హుజూర్’ అంటూ ఆగమేఘాలపై ఫైళ్లు కదుపుతున్నారు.– సాక్షి ప్రతినిధి కర్నూలు కర్నూలు ఎమ్మెల్యే, మంత్రి టీజీ భరత్ కుటుంబానికి తుంగభద్ర నది సమీపంలో రెండు ఆల్కలీస్ ఫ్యాక్టరీలున్నాయి. వీటికి వేసవిలో నీటి సమస్య ఉత్పన్నమవుతోంది. ఫిబ్రవరి–జూన్ మధ్య ఫ్యాక్టరీకి నీటి సరఫరా ఇబ్బందిగా మారింది. ఏళ్ల తరబడి ఈ సమస్య ఉంది. దీంతో టీజీ వెంకటేశ్ తన ఫ్యాక్టరీకి సమీపంలో తుంగభద్రపై చెక్‌డ్యాం నిర్మించాలని భావించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో టీజీ మంత్రిగా ఉన్న సమయంలో తుంగభద్రపై చెక్‌డ్యాం నిర్మించేందుకు 2013 జూన్ 18న జీవో 56 జారీ చేయించారు. రూ.64.89 కోట్లతో చెక్‌డ్యాం నిర్మించి 0.50 టీఎంసీలు నిల్వ చేసేలా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ శిలా ఫలకాన్ని కూడా కిరణ్‌కుమార్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర విభజన పరిణామాలతో జీవో కార్యరూపం దాల్చలేదు. ఆపై టీడీపీ ప్రభుత్వం కొలువుదీరడంతో 2017లో మరోసారి అధికారులు రూ.177 కోట్లతో డీపీఆర్ రివైజ్ చేసి పరిపాలన అనుమతుల కోసం పంపారు. అయితే సీడబ్ల్యూసీ అనుమతి, నీటి కేటాయింపుల సమస్య, చెక్‌డ్యాం నిర్మిస్తే ఉత్పన్నమయ్యే ఇబ్బందులతో ఉన్నతాధికారులు ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. కూటమి రాగానే మరోసారి ప్రతిపాదనలుప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, టీజీ భరత్ మంత్రి పదవిలో ఉండటంతో చెక్ డ్యాం నిర్మాణం అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు గత నెల 21న ఇరిగేషన్ ఎస్ఈకి ఓ లేఖ రాశారు. నగర భవిష్యత్తు తాగునీటి అవసరాల కోసం తుంగభద్ర, హంద్రీపై చెక్‌డ్యాం నిర్మించేందుకు సాంకేతిక అనుమతులు ఇవ్వాలని, 12 నెలల్లో దీన్ని పూర్తి చేస్తామని ప్రతిపాదించారు. దీనిపై అదే నెల 27న ఇరిగేషన్ ఎస్ఈ తిరిగి కార్పొరేషన్ ఎస్ఈకి లేఖ రాశారు.చెక్‌డ్యాం నిర్మాణానికి టెక్నికల్ కమిటీ, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, ఇంజనీరింగ్ రీసెర్చ్ లాబొరేటరీ ఆఫ్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ నుంచి అనుకూలతలు, ప్రతికూలతలతోపాటు సమీపంలో రైల్వే బ్రిడ్జి ఉన్నందున ఆ శాఖ నుంచి అభ్యంతరాలు తదితర అంశాలన్నీ పరిశీలించి ఫీజుబులిటి నివేదిక ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే అభ్యంతరాలను అధిగమించి ప్రభుత్వం నుంచి జీవో జారీ చేయించే పనిలో మంత్రి భరత్ ఉన్నట్లు అధికారులు చర్చించుకుంటున్నారు. ఇప్పటి అధికారుల ప్రతిపాదన ఇదీ.. కర్నూలు కార్పొరేషన్ పరిధిలో తాగునీటి అవసరాల కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రత్యేక చర్యలు తీసుకుంది. శివారు కాలనీలకు తాగునీటి సమస్య ఉండటంతో మునగాలపాడు వద్ద రూ.15 కోట్లతో మరో నీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించారు. దీంతో పాటు అమృత్ ద్వారా హంద్రీ–నీవా నుంచి నీటిని సరఫరా చేసేందుకు రూ.130 కోట్లు మంజూరు చేశారు. ఈ పథకానికి అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన కూడా చేశారు. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్టును రద్దు చేసి చెక్‌డ్యాం నిర్మించాలని కార్పొరేషన్ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి లెక్కల ప్రకారం చెక్‌డ్యాం నిర్మించేందుకు రూ.300 కోట్లకు పైగా ఖర్చవుతుందని తెలుస్తోంది. అమృత్ పథకం కింద మంజూరైన రూ.130 కోట్లు కాకుండా తక్కిన మొత్తాన్ని మంజూరు చేయించుకుని చెక్‌డ్యాం నిర్మించాలని భావిస్తున్నారు. చెక్‌డ్యాం నిర్మిస్తే 0.50 టీఎంసీలు నీరు నిల్వ ఉంటుందని, అందులో 0.30 టీఎంసీలు కర్నూలు తాగునీటి అవసరాలకు, తక్కిన 0.20 టీఎంసీలు తన పరిశ్రమలకు వినియోగించుకునేలా జీవో మంజూరు చేసేలా మంత్రి టీజీ భరత్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. రివర్స్ పంపింగ్ చేస్తారా? కర్నూలు తాగునీటి అవసరాల కోసం ఇప్పటికే హంద్రీ–నీవా నుంచి ప్రతిపాదనలు ఉన్నపుడు దాన్ని పూర్తి చేయకుండా చెక్‌డ్యాంను తెరపైకి తేవడంపై అధికార వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. కేవలం టీజీ ఫ్యాక్టరీల కోసమే మంత్రి చెప్పినట్లు నడుచుకుంటున్నారని పేర్కొంటున్నారు. ఒకవేళ చెక్‌డ్యాం నిర్మించాల్సి వస్తే మునగాలపాడు సమీపంలో నిర్మిస్తే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు దగ్గరవుతుంది. అలా కాకుండా రాఘవేంద్ర మఠం సమీపంలో చెక్‌డ్యాం నిర్మించి తిరిగి రివర్స్ పంపింగ్ చేయాలని అంటున్నారు.పైగా కర్నూలు మురుగునీరు మొత్తం అందులో నిల్వ ఉంటుందని, తుంగభద్రలో నీటి ప్రవాహం లేనపుడు కేవలం మురుగునీటి మడుగుగా మారే అవకాశం ఉందని, ఆ నీటిని తాగునీటికి ఎలా వినియోగిస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ నీటితో కేవలం టీజీ ఫ్యాక్టరీల అవసరాలు మాత్రమే తీరుతాయని చర్చించుకుంటున్నారు. -
స్నేహితుడికి పెళ్లి గిఫ్ట్ ఇస్తూ గుండెపోటుతో యువకుడు మృతి
సాక్షి,కర్నూల్ : పచ్చని పందిట్లో విషాదం చోటు చేసుకుంది. అప్పటి వరకు స్నేహితుడి పెళ్లిలో సంతోషంగా గడిపిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. స్నేహితుడికి పెళ్లి గిఫ్ట్ ఇస్తుండగా గుండె పోటుతో ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరు అమెజాన్ కంపెనీలో పనిచేస్తున్న వంశీ .. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం పెనుమడ గ్రామంలో తన స్నేహితుడి పెళ్లికి వచ్చాడు. స్నేహితుడి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి అనంతరం వధూవరులకు కానుక ఇచ్చేందుకు పెళ్లి వేదికపైకి ఎక్కాడు. తన స్నేహితులతో కలిసి ఓ గిఫ్ట్‌ను వధూవరులకు అందించి పక్కనే నిలబడ్డాడు. స్నేహితుడు ఇచ్చిన ఆ గిఫ్ట్ ప్యాక్‌ను వధూవరులు ఓపెన్ చేస్తుండగా..వంశీ అస్వస్థతకు గురయ్యాడు.వెంటనే అతన్ని పక్కకి తీసుకెళ్లే లోపే స్టేజిపైనే కుప్పకూలాడు.దీంతో అప్రమత్తమైన తోటి స్నేహితులు అత్యవసర చికిత్స నిమిత్తం డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వంశీని పరీక్షించిన వైద్యులు అతడి అప్పటికే ప్రాణాలు విడిచినట్లు తెలిపారు. దీంతో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. స్నేహితుడి వివాహా వేడుకలో గుండెపోటుతో యువకుడు మృతికర్నూల్ జిల్లా కృష్ణగిరి మండలం పెనుమడ గ్రామంలో స్నేహితుడి వివాహ వేడుకలో గిఫ్ట్ ఇస్తూ స్టేజ్ పైనే గుండెపోటుకు గురైన వంశీ అనే యువకుడు.వంశీని డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తోటి స్నేహితులు.. కానీ అప్పటికే గుండెపోటుతో… pic.twitter.com/Ve1Epmf1fI— Telugu Scribe (@TeluguScribe) November 21, 2024 -
కర్నూలులో టీ షాప్ ప్రారంభించిన టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మనందం (ఫొటోలు)
-
యురేనియం తవ్వకాలపై ఆందోళనలు
-
కర్నూలులో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
సాక్షి,కర్నూలుజిల్లా: కర్నూలు జిల్లాలోని నందవరం మండలం ధర్మపురం గ్రామం వద్ద ఎన్‌హెచ్-167పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం(నవంబర్ 2) ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. అతివేగంతో వెళుతున్న కారు ఆటోను ఢీకొట్టింది.ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వీర నాగమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరిని కర్నూల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో ప్రాణాలు విడిచారు. ప్రమాదంలో ఇద్దరికి గాయలవగా గాయపడినవారిలో చాన్నిరి రిజియా పరిస్థితి విషమంగా ఉంది. ఇదీ చదవండి: కోదాడ వద్ద ఢీకొన్న బస్సులు.. 30 మందికి గాయాలు -
దేవర గట్టు కర్రల సమరం.. పగిలిన తలలు
సాక్షి, కర్నూలు: దేవరగట్టు ఉత్సవాల్లో మరోసారి తలలు పగిలాయి. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం అర్ధరాత్రి అర్ధరాత్రి 12 గంటలకు మాళమల్లేశ్వర స్వామి కల్యాణం నిర్వహించారు. అయితే ఉత్సవ మూర్తుల్ని దక్కించుకునేందుకు వందలాది భక్తులు పోటీ పడ్డారు. కర్రల సమయంలో 100మందికి పైగా గాయాలయ్యాయి. 100మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఐదుగురి పరిస్థితి విషమంగా మారింది. నిప్పు రవ్వలు పడి మరికొందరు గాయపడ్డారు. గాయపడ్డ భక్తుల్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ‘బన్ని’ ఉత్సవం ప్రత్యేకత ఇదే..గట్టుపై కొలువైన మాత మాళమ్మ, మల్లేశ్వరుని కల్యాణోత్సవం అనంతరం ‘బన్ని’ ఉత్సవంగా జరిగే కార్యక్రమానికి ఎంతో ప్రత్యేకత ఉంది. దేవరగట్టు ఆలయ నిర్వాహణ బాధ్యత మోస్తున్న పరిసర గ్రామాలైన నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు భారీ సంఖ్యలో దేవరగట్టుకు చేరుకుంటారు. అక్కడ చెరువుకట్ట (డొళ్లిన బండే) వద్దకు చేరి కక్షలు, కార్పణ్యాలు లేకుండా కలిసికట్టుగా ఉత్సవాన్ని జరుపుకుందామని పాలబాస తీసుకుంటారు. అనంతరం గ్రామపెద్దలు పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్న కంట్రోల్ రూం వద్దకు వచ్చి కొండపై జరిగే కల్యాణోత్సవానికి వస్తున్నట్లు సూచనగా వారికి బండారాన్ని ఇచ్చి వెళ్తారు.అనంతరం బాణసంచా పేల్చి ఇనుప తొడుగులు తొడిగిన రింగు కర్రలు, అగ్గి కాగడాలు చేతపట్టి డోలు, మేళతాళాలతో కాడప్ప మఠంలో అప్పటికే అక్కడ ఉంచిన మల్లేశ్వరుని ఉత్సవ విగ్రహాన్ని కొండపైకి తీసుకెళ్తారు. ఆలయంలో ఉన్న మాళమ్మ ఉత్సవ విగ్రహంతో వేదపండితుల భక్తులు జయ జయ ధ్వానాల మధ్య అర్ధరాత్రి వేళ కల్యాణోత్సవం జరిపిస్తారు.అనంతరం ఉత్సవమూర్తులను తీసుకుని జైత్రయాత్రను సాగించడానికి కొండ దిగే వేళ కర్రలు గాలిలోకి లేస్తాయి. దివిటీలు భగ్గుమంటాయి. ఈ సమయంలో కర్రలు భక్తుల తలలకు తగిలి గాయపడతారు. నిట్రవట్టి, బిలేహాల్, విరుపాపురం, ఎల్లార్తి, సుళువాయి, అరికెర, అరికెరతాండా, కురుకుంద, లింగంపల్లి తదితర గ్రామాల భక్తులు కల్యాణోత్సవం అనంతరం జరిగే ఈ మొగలాయిలో పాల్గొంటారు. మొగలాయిలో భక్తులు చేతుల్లో ఉన్న కర్రలు తగిలి చాలా మంది గాయపడతారు.ఈ సమయంలోనే చాలా మందిపై దివిటీలు మీద పడటం, భక్తుల తోపులాటలో కిందపడటంతో తీవ్రంగా గాయపడి గతంలో కొందరు మృత్యవాత పడ్డారు. ఉత్సవాల్లో గాయపడిన భక్తులకు స్వామివారికి చల్లే పసుపు (బండారం) అంటిస్తారు. అనంతరం జైత్రయాత్ర స్వామి వారి ఊరేగింపుతో ముల్లబండ, పాదాలగట్టు, రక్షపడికి చేరుకుంటుంది. ఉత్సవ వివరాలు ఇలా..12న శనివారం రాత్రి మాంగల్యధారణ–కల్యాణోత్సవం (బన్ని), అనంతరం జైత్రయాత్ర మొదలై రక్షపడి (రక్త తర్పణం చేయుట) మీదుగా శమీ వృక్షం చేరుతుంది 13న ఉదయం నెరణికి గ్రామ ఆలయ పూజారి భవిష్యవాణి (కార్ణీకం) వినిపిస్తాడు 14న నెరణికి గ్రామ పురోహితుల చేత స్వామి వారికి పంచామృతం, రథోత్సవం15న గొరవయ్యల ఆటలు, గొలుసు తెంపుట, దేవదాసీల క్రీడోత్సవం, సాయంత్రం వసంతోత్సవం, కంకణ విసర్జన 16న మాళమల్లేశ్వర స్వామి విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయి -
వంద రోజుల ’వంచన’ పాలన.. ఇదేనా మంచి ప్రభుత్వం’
సాక్షి, కర్నూలు: సూపర్ సిక్స్ హామీల్లో ఏ ఒక్కటీ చంద్రబాబు అమలు చేయలేదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి మండిపడ్డారు. హామీలు నిలబెట్టుకోకుండా మంచి ప్రభుత్వం అంటూ కూటమి నేతలు ఎలా ప్రచారం చేస్తున్నారంటూ నిలదీశారు. 100 రోజుల పాలనలో వైఫల్యాలను డైవర్ట్ చేయడానికి ‘తిరుపతి లడ్డూ’ని తెరపైకి తెచ్చారని దుయ్యబట్టారు.ఎన్నికల ముందు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అడ్డుకుంటామని చెప్పి ఇప్పుడు టీడీపీ నేతలు మౌనంగా ఉన్నారని ఎస్వీ మోహన్‌రెడ్డి మండిపడ్డారు. తిరుపతి లడ్డూ అంశంలో ఆలయ అధికారులు చెప్పిన మాటలకు, సీఎం చంద్రబాబు చెప్పే మాటలకు పొంతన లేదు. జులై 12 తేదీన ట్యాంకర్లు వచ్చాయని అంటున్నారు.. జులై 12న ఉన్నది సీఎం చంద్రబాబు కాదా..?. లడ్డూలో కల్తీ జరగడానికి, వైఎస్ జగన్‌కు ఎలాంటి సంబంధం లేదని ఎస్వీ మోహన్‌రెడ్డి తేల్చి చెప్పారు.ఇదీ చదవండి: తిరుమల ‘లడ్డూ’ కుట్ర.. చంద్రబాబు తప్పులు ఒక్కోక్కటిగా బట్టబయలు‘‘రాజకీయంగా జగన్‌పై బురద చల్లడానికి సీఎం చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మా నాయకుడు వైఎస్ జగన్ తప్పు చేయలేదు కాబట్టే.. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. టీటీడీని టీడీపీ నేతలు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు. దీనిపై తమ నాయకులు ప్రమాణాలు చేశారు. సుప్రీంకోర్టును ఆశ్రయించాము. మంచి ప్రభుత్వం అంటూనే చంద్రబాబు.. అమ్మ ఒడి, నిరుద్యోగ భృతి, మహిళలకు మూడు సిలిండర్లు, 15 వేల రూపాయలు ఎగ్గొట్టారు. తిరుపతి లడ్డూపై నిజ నిజాలు తేల్చేందుకు సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేపట్టాలి’’ అని ఎస్వీ మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
కర్నూలులో హైకోర్టు బెంచ్
సాక్షి, అమరావతి: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేసి ప్రతిపాదనలను కేంద్రానికి పంపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం న్యాయశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. అమరావతిలో 100 ఎకరాల విస్తీర్ణంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ద్వారా ఇంటర్నేషన్ లా స్కూల్ ఏర్పాటును ముందుకు తీసుకువెళ్లాలని అధికారులకు సీఎం సూచించారు. జూనియర్ న్యాయవాదులకు నెలకు గౌరవ వేతనం రూ.10 వేలు చెల్లించే ప్రక్రియను ప్రారంభించాలని చెప్పారు. జూనియర్ న్యాయవాదులకు శిక్షణ కోసం అకాడమీ ఏర్పాటుపైనా కసరత్తు చేయాలని సూచించారు. అనంతరం ప్రాసిక్యూషన్ విభాగంపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. నమోదైన కేసులు, రుజువైన నేరాల అంశంలో శిక్షపడే శాతం పెరగాలని, దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేసే పద్ధతులను అవలంబించాలని సీఎం సూచించారు. తప్పు చేసిన వారికి శిక్ష పడుతుందనే నమ్మకం కలిగేలా ప్రాసిక్యూషన్ ఉండాలన్నారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడే విషయంలో లిటిగేషన్లు పెట్టాలే కానీ, అనవసర వివాదాలు తెచ్చేలా లిటిగేషన్లు ప్రభుత్వం నుంచి ఉండకూడదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. న్యాయశాఖపై మరింత సమగ్రంగా సమీక్ష చేయాల్సి ఉందని పేర్కొన్న ఆయన... మరిన్ని వివరాలతో రావాలని అధికారులను ఆదేశించారు. పింఛన్ల జాబితా నుంచి అనర్హులను తొలగించండిగ్రామ సభలు నిర్వహించి అర్హులకు పింఛన్లు ఇవ్వడంతోపాటు అనర్హులను జాబితా నుంచి తొలగించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దీనిపై కార్యాచరణ సిద్ధం చేయాలని కోరారు. విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమంపై రాష్ట్ర సచివాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగుల పేరిట పొందే పింఛన్లపై అధికారులు దృష్టి సారించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వైద్యుల నుంచి కొందరు తప్పుడు సరి్టఫికెట్లు పొంది దివ్యాంగుల పేరిట పింఛన్లు తీసుకోవడాన్ని అరికట్టాలన్నారు. దివ్యాంగుల కోసం స్పోర్ట్స్ సెంటర్ ఏర్పాటుకు విశాఖలో 30 ఎకరాలు కేటాయించాలని ఆదేశించారు. కేంద్రం రూ.200 కోట్లతో ఈ సెంటర్ మంజూరు చేసిందన్నారు. ఒంటరిగా ఉండే ట్రాన్స్జెండర్లకు రేషన్ కార్డులు ఇవ్వాలన్నారు. చేనేత జౌళి శాఖపై సమీక్ష జౌళి శాఖపై సమీక్ష సందర్భంగా చేనేత ఉత్పత్తులపై కేంద్రం జీఎస్టీని రద్దు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే రీయింబర్స్ చేస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో 35 చేనేత, 36 హస్తకళల క్లస్టర్ల అభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు. త్వరలో కొత్త టెక్స్టైల్ పాలసీ తీసుకొస్తామన్నారు. పీఎం సూర్యఘర్ పథకం అమలు చేసి చేనేత మగ్గాలున్న వారికి 200 యూనిట్లు, మరమగ్గాలు ఉన్నవారికి 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. నేత కారి్మకులకు ఆరోగ్య బీమా పథకం త్వరలో అందుబాటులోకి తెస్తామన్నారు. మైనార్టీల పథకాలను పునర్ వ్యవస్థీకరించండి మైనార్టీ సంక్షేమంపై సీఎం చంద్రబాబు సమీక్షిస్తూ.. మైనార్టీలకు అందే పథకాలను పునర్ వ్యవస్థీకరించాలని ఆదేశించారు. ప్రధానమంత్రి జన్‌వికాస్ కార్యక్రమం కింద మంజూరైన రూ.447 కోట్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయాలన్నారు. ప్రారంభంకాని పనులను రద్దు చేసి పునఃసమీక్ష చేయాలన్నారు. నూర్‌బాషా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇమామ్‌లకు రూ.10 వేలు, మౌజన్లకు రూ.5 వేల చొప్పున ఇచ్చేలాచర్యలు చేపట్టాలన్నారు. సమీక్షలో మంత్రి ఎన్ఎండీ ఫరూక్, అధికారులు పాల్గొన్నారు. -
నంద్యాల పర్యటన.. దారిపొడవునా జననేతకు ఘన స్వాగతం (ఫొటోలు)
-
అన్నమో చంద్రబాబూ!
కర్నూలు(సెంట్రల్): ప్రతిష్టాత్మక కర్నూ లు సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల విద్యార్థులు అన్నం కోసం రోడ్డెక్కారు. కళాశాల హాస్టళ్లలో పెడుతున్న పురుగుల అన్నం, నీళ్ల సాంబారు తినలేక కడుపులు కాల్చుకుంటున్నామని కలెక్టరేట్ ఎదుట ఖాళీ ప్లేట్లతో ధర్నాకు దిగారు. తమకు కలెక్టర్ వచ్చి న్యాయం చేసే వరకు కదిలేదిలేదని బీష్మించారు. చివరకు డీఆర్వో వచ్చి హామీ ఇవ్వడంతో కలెక్టరేట్ వద్ద ధర్నాను నిలిపివేశారు. విద్యార్థులు అక్కడి నుంచి వెళ్లి ప్రిన్సిపాల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ కళాశాలలో ఘోరమైన పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. తాగేందుకు, స్నానం చేసేందుకు కూడా నీళ్లు లేవన్నారు. మరుగుదొడ్లను శుభ్రంచేసే వారు లేకపోవడంతో తామే ఆ పనిచేయాల్సి వస్తోందన్నారు. కళాశాలలో చదవే ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థుల మెస్ చార్జీలను క్లస్టర్ యూనివర్సిటీ వసూలు చేసుకుని నిర్వహణకు ముందుకురాకపోవడంతోనే ఇబ్బందులు తలెత్తాయన్నారు. విద్యార్థులు చెల్లించే మెస్ చార్జీల్లో అధిక భాగం బియ్యం కొనుగోలుకే సరిపోతుండటంతో గతం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మానవత్వంతో సిల్వర్ జూబ్లీ కళాశాలకు అవసరమయ్యే బియ్యాన్ని కేజీ రూపాయికే ఇచ్చేలా జీవో ఇచ్చిందని వివరించారు.అయితే, టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ జీవోను అమలు చేయడంలేదన్నారు. దీంతో ప్రస్తుతం కేజీ బియ్యం కోసం కళాశాల రూ.41 చెల్లిస్తోందన్నారు. గత ప్రభుత్వం జారీ చేసిన జీవో అమలైతే కేజీ బియ్యం రూపాయికే వస్తాయని, మిగిలిన రూ.40లతో వంటకు అవసరైన కూరగాయలు, నూనెలు, ఇతర అన్ని రకాల సరుకులు కొనుగోలు చేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. ప్రభుత్వం స్పందించి సిల్వర్ జూబ్లీ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. -
కర్నూల్ జిల్లాలో YSR విగ్రహాలు, శిలాఫలకాలు ధ్వంసం
-
నేనే మంత్రి..!?
సార్వత్రిక పోరు ముగిసింది. కూటమి అధికారంలోకి వచ్చింది. త్వరలోనే కూటమి నేతగా నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు మంత్రివర్గంలో ఎవరికి చోటు లభిస్తుందనే చర్చ కర్నూలు, నంద్యాల జిల్లాలో మొదలైంది. 2004 తర్వాత అత్యధిక స్థానాల్లో తెలుగుదేశంపార్టీ విజయం సాధించడంతో మంత్రి పదవి ఆశించేవారి సంఖ్య కూడా పెరిగింది.నంద్యాల జిల్లా కొత్తగా ఏర్పడిన తర్వాత టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. దీంతో కొత్త జిల్లాల ప్రాతిపదికన జిల్లాకో మంత్రి పదవి ఇస్తారా? లేదా ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ఒకే మంత్రి పదవి ఇస్తారా? అనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. సీనియర్ నేతలకు మంత్రి పదవి దక్కుతుందని అధిక శాతం నేతలు భావిస్తున్నా, సామాజిక సమీకరణల నేపథ్యంలో తమకూ అవకాశం దక్కుతుందని తొలిసారి అసెంబ్లీకి వెళ్లే నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.సాక్షి ప్రతినిధి కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలోని రెండు ఎంపీలతో పాటు 12 అసెంబ్లీలు కూటమి అభ్యర్థులు గెలుపొందారు. ఆదోనిలో బీజేపీ అభ్యర్థి పార్థసారథి ఎమ్మెల్యేగా గెలుపొందితే, తక్కిన 11 చోట్ల టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఆలూరు, మంత్రాలయంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలుగా విరూపాక్షి, బాలనాగిరెడ్డి గెలుపొందారు. టీడీపీ అభ్యర్థుల్లో మంత్రి వర్గంలో కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి ముందు వరుసలో ఉన్నారు.సార్వత్రిక పోరులో ప్రకాశ్‌రెడ్డితో పాటు ఆయన సతీమణి సుజాతమ్మ టిక్కెట్లు ఆశించారు. అయితే ఆమెకు టిక్కెట్ ఇవ్వలేమని, డోన్ అసెంబ్లీ నుంచి బరిలోకి దిగాలని.. గెలిస్తే మంత్రివర్గంలోకి తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారనే చర్చ కోట్ల వర్గంలో నడుస్తోంది. దీంతో ప్రకాశ్‌రెడ్డికి కచ్చితంగా మంత్రివర్గంలో చోటు లభిస్తుందనే ఆశాభావం ఆయన వర్గీయుల్లో కనిపిస్తోంది. కోట్ల అసెంబ్లీకి వెళ్లడం ఇదే తొలిసారి. గతంలో ఆదోని నుంచి పోటీ చేసి మీనాక్షినాయుడు చేతిలో ఓడిపోయారు. అయితే కర్నూలు ఎంపీగా ఆయన పలుసార్లు ప్రాతినిథ్యం వహించారు. కేంద్రమంత్రిగా కూడా పని చేశారు.నంద్యాల జిల్లా నుంచి రేసులో ముగ్గురు..నంద్యాల జిల్లా బనగానపల్లి ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డి కూడా మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్నారు. 2014లో తొలిసారి అసెంబ్లీకి వెళ్లిన బీసీ, 2019లో ఓటమి చెందారు. తిరిగి 2024లో విజయం సాధించారు. నంద్యాల జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న బీసీ కూడా కేబినెట్ బెర్త్‌పై ఆశపెట్టుకున్నారు. ఇదే జిల్లాలో భూమా అఖిలప్రియ కూడా మంత్రివర్గంలో చోటుపై ధీమాగా ఉన్నారు. 2014లో వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన అఖిలప్రియ ఆపై తన తండ్రి భూమా నాగిరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు.నాగిరెడ్డి మృతి తర్వాత అఖిలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. పర్యాటక శాఖ మంత్రిగా చేసిన అఖిల ఈ దఫా కూడా మహిళల కోటాలో తనకు అవకాశం వస్తుందనే ధీమాతో ఉన్నారు. అలాగే నంద్యాల ఎమ్మెల్యే ఫరూక్ కూడా మంత్రి వర్గంలో చోటుపై ఆశలపల్లకిలో ఉన్నారు. 1999లో మంత్రిగా పని చేసిన అనుభవం కూడా ఉంది. మైనార్టీ నేత కావడం, రాయలసీమలో మదనపల్లి, నంద్యాల మాత్రమే మైనారీ్టలకు టిక్కెట్లు ఇచ్చారు. ఇద్దరూ గెలుపొందినా వీరిలో ఫరూక్ సీనియర్ కావడంతో మైనార్టీ కోటాలో కచ్చితంగా చోటు దక్కుతుందనే ఆశతో ఉన్నారు.పార్థసారథిని అదృష్టం వరించేనా? కర్నూలు జిల్లాలో తొలిసారి బీజేపీ ఎమ్మెల్యేగా ఆదోని నుంచి పార్థసారథి గెలుపొందారు. వాల్మీకి సామాజికవర్గానికి చెందిన ఈయనకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలున్నాయి. కర్నూలు, అనంతపురంలో బలమైన సామాజికవర్గంగా వాల్మీకులు, కురబలు ఉన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం, గుంతకల్లులో కాలవ శ్రీనివాసులు, గుమ్మనూరు జయరాం ఉన్నారు. వీరిద్దరికీ మంత్రి పదవుల అనుభవం ఉంది. అయితే అనంతపురం జిల్లాలో పోటీ ఎక్కువగా ఉంది.కురబ, వాల్మీకులకు చెరో మంత్రి పదవి ఇవ్వాలని భావిస్తే సత్యసాయి జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే సవితకు చోటు దక్కే అవకాశం ఉంది. ఈ క్రమంలో కాలవ, గుమ్మనూరు, పార్థసారథిలో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. ఒక బీసీకి అనంతపురంలో ఇస్తే, మరో బీసీకి ఇచ్చే అవకాశం తక్కువగా ఉండొచ్చు. ఈక్రమంలో వాల్మీకి వర్గం నుంచి పార్థసారథిని మంత్రి పదవి వరించే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది.పైగా ఇతను బీజేపీ నేత కావడంతో.. ఆ పారీ్టకి కూడా కనీసం 2 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉండటంతో పార్థసారథికి అదృష్టం వరించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదేమైనా కర్నూలు, నంద్యాల జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న కూటమి అభ్యర్థుల్లో దాదాపు సగం మంది మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. వీరిలో ఎవరికి అమాత్యయోగం ఉందో వేచిచూడాలి.టీజీ, కేఈలు కూడా మంత్రివర్గంపై ఆశలు..సీనియర్ నేతలతో పాటు తొలిసారి అసెంబ్లీకి వెళ్తున్న కర్నూలు, పత్తికొండ ఎమ్మెల్యేలు టీజీ భరత్, కేఈ శ్యాంబాబు కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. టీజీ భరత్ ఆర్యవైశ్యుల కోటాలో తనకు తప్పకుండా మంత్రి పదవి దక్కుతుందనే ధీమాతో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా తనను గెలిపించాలని, ఈ దఫా తాను మంత్రిని కాబోతున్నానని పలువురు ప్రముఖులతో బాహాటంగానే చెప్పారు.భరత్ గెలుపొందిన తర్వాత టీజీ వర్గం కూడా కేబినెట్ బెర్త్ దక్కుతుందని చర్చించుకుంటున్నారు. అలాగే కేఈ శ్యాంబాబు కూడా కేబినెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతీ కేబినెట్లోనూ కేఈ కుటుంబం ఉంది. కేఈ ప్రభాకర్, కేఈ కృష్ణమూర్తి మంత్రులుగా చేశారు. 2014లో డిప్యూటీ సీఎంగా కూడా కేఈ కృష్ణమూర్తి కొనసాగారు. బీసీ కోటాలో తనకు చోటు దక్కుతుందని శ్యాంబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఇవి చదవండి: ఏపీ కొత్త సీఎస్‌గా నీరబ్‌కుమార్ ప్రసాద్ -
కర్నూలులో నాట్స్ మెగా ఉచిత వైద్య శిబిరం!
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తెలుగు రాష్ట్రాల్లో ముమ్మరంగా సేవా కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగా కర్నూలు నగరంలోని ఓల్డ్ సిటీలో నాట్స్ మెగా ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసింది. పేదరికం కారణంగా ఎవరూ వైద్యానికి దూరం కాకుడదనే సంకల్పంతో నాట్స్ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తుందని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉచిత వైద్య శిబిరాలు, దివ్యాంగులకు చేయూత, విద్యార్ధులకు ఉపకారవేతనాలు ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. సుశీల నేత్రాలయం, మైత్రి హాస్పిటల్స్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరంలో దాదాపు 1000 మందికి పైగా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు ఉచితంగా అందించారు. ఈ శిబిరంలో నాట్స్ సభ్యులతో పాటు స్థానికులు సుబ్బారావు దాసరి, ఎస్ చౌదరి, నారాయణ, బాలకాశి పాల్గొని దీనిని విజయవంతం చేశారు. నాట్స్ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన వైద్యులకు, సభ్యులకు నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: సింగపూర్‌లో భారత సంతతి వ్యక్తి మృతి..వాటర్ ట్యాంక్‌ని క్లీన్ చేస్తుండగా..) -
కర్నూలులో వజ్రాల వేట
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దుల్లో వజ్రాల నిక్షేపాలు ఉన్నాయనే విషయాన్ని జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) గుర్తించింది. కర్నూలు జిల్లా తుగ్గలి, మద్దికెర మండలాల్లోని తుగ్గలి, జొన్నగిరి, పగిడిరాయి, కొత్తపల్లి, పెరవలి, అగ్రహారం, హంప, యడవలి, మద్దికెరతోపాటు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలోని గంజికుంట, తట్రకల్లు, రాగులపాడు, పొట్టిపాడు, కమలపాడు, గూళపాళ్యం, ఎన్ఎంపీ తండా గ్రామాల్లో తరచూ వజ్రాలు లభ్యమవుతున్నాయి. ఈ ప్రాంతంలోని భూమి పొరల్లో కింబర్లైట్ పైప్‌లైన్ ఉందని గనులు భూగర్భ శాఖ నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే తొలకరి జల్లులు కురిసే జూన్‌లో తుగ్గలి, మద్దికెర మండలాల్లో వజ్రాల అన్వేషణ కొన్నేళ్లుగా ముమ్మరంగా సాగుతోంది. ఈ ఏడాది మే మొదటి వారంలోనే వర్షాలు కురిశాయి. ఆ వెంటనే వజ్రాన్వేషణ మొదలైంది. ఈ ప్రాంతంలోని పొలాలన్నీ జనంతోనే నిండిపోయాయి. కర్నూలు, నంద్యాలతో పాటు అనంతపురం, కడప, చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి వజ్రాన్వేషకులు తరలివచ్చారు. ఒక్కొక్కరు వారం, పది, పదిహేను రోజులపాటు ఇక్కడే మకాం వేస్తున్నారు. ఓ వైపు వజ్రాల కోసం జనాలు పొలాల్లో తిరుగుతుంటే.. వజ్రాన్వేషకులు తిరగడం వల్ల పొలం గట్టిబారి వ్యవసాయానికి ఇబ్బందిగా ఉంటోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు తమ పొలాల్లోకి ఎవరూ రావొద్దని విజ్ఞప్తి బోర్డులు తగిలిస్తున్నారు.ఇతర దేశాలతో పోలిస్తే నాణ్యమైన వజ్రాలువజ్రాల మైనింగ్ కోసం వజ్రకరూర్‌లో వజ్రాల ప్రక్రమణ కేంద్రాన్ని 1969లో ఏర్పాటు చేశారు. వజ్రాన్వేషణపై ఇది పెద్దగా దృష్టి సారించలేదు. ఆ తర్వాత ఓ ఆస్ట్రేలియన్ కంపెనీ వచ్చి కొద్దికాలం పాటు సర్వే చేసి తిరిగి వెళ్లింది. ఆఫ్రికాతో పాటు చాలా దేశాలతో పోలిస్తే ఇక్కడి వజ్రాలు చాలా నాణ్యమైనవి, విలువైనవి. అందుకే వీటి వెలికితీతపై ప్రత్యేక దృష్టి సారిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని పలువురు కోరుతున్నారు.వజ్రాలు ఎలా లభ్యమవుతాయంటే..మన దేశంలో డైమండ్ మైనింగ్ మధ్యప్రదేశ్‌లోని పన్నాలో ఉంది. అక్కడ భూమిలోని రాళ్లను తవ్వితీసి వజ్రాల తయారీ ప్రక్రియ చేపడతారు. వజ్రకరూర్, తుగ్గలి, జొన్నగిరి ప్రాంతాల్లోని భూగర్భంలో 150 మీటర్ల లోతున వజ్రాలు ఉంటాయి. భూమిలో వాతావరణ మార్పులు జరిగినప్పుడు అవి బయటకు వస్తాయి. ఆ తర్వాత వెదరింగ్ (వికోశీకరణ) వల్ల అంటే ఎండకు ఎండి, వర్షానికి తడిసి పగిలిపోతాయి. వర్షాలు, వరదలు వచ్చినపుడు ఆ రాళ్ల ముక్కలు పొలాల్లో అక్కడక్కడా దొరుకుతుంటాయి. వాగులు, వంకల ద్వారా కూడా వజ్రాలు నీటిలో కొట్టుకుని ఇతర ప్రాంతాలకు చేరతాయి. అలా చెల్లాచెదురైన వజ్రాలే ఇప్పుడు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో లభిస్తున్నాయి.‘సీమ’లో ఏజెంట్ల తిష్టవర్షాకాలం వస్తే జనాలు ఎలా తరలివస్తారో.. వజ్రాల వ్యాపారులు కూడా గుత్తి, గుంతకల్లు, జొన్నగిరి, పెరవలిలో మకాం వేసి వజ్రాల కొనుగోలుకు ప్రయత్నిస్తారు. ఇందుకోసం వజ్రాలు లభ్యమయ్యే గ్రామాల్లో ఏజెంట్లను సైతం నియమించుకుంటున్నారు. వజ్రం దొరికిందనే సమాచారం వస్తే ఏజెంట్లు వాలిపోతారు. వజ్రం దొరికిన వారిని వ్యాపారుల వద్దకు తీసుకెళ్లి రేటు కుదురుస్తారు. వజ్రం విలువైనదైతే వ్యాపారులే వారి వద్దకు వెళ్తారు. వ్యాపారుల మధ్య పోటీ పెరిగితే బహిరంగ వేలం వేస్తారు. వజ్రం నాణ్యత (క్యారెట్)ను బట్టి రూ.20 వేల నుంచి రూ.20 లక్షల వరకు కొనుగోలు చేస్తారు. జిల్లా చరిత్రలో 2022లో లభించిన 30 క్యారెట్ల వజ్రమే అత్యంత విలువైంది. ఈ ఏడాది ఇప్పటికే 9 వజ్రాలు లభ్యమయ్యాయి. గతేడాది సరైన వర్షాలు లేవు. అయినప్పటికీ 18 వజ్రాలు దొరికాయి. ఇక్కడ వజ్రాలను స్థానిక వ్యాపారులకే విక్రయిస్తారు. ఇక్కడి వ్యాపారులు అంత నమ్మకం సాధించారు. చెప్పిన ధర చెప్పినట్టు ఇస్తారు. అదే ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇస్తే దానిని స్వాధీనం చేసుకుని పైసా కూడా ఇవ్వరనే అభిప్రాయంతో వారు అధికారులకు చెప్పకుండా విక్రయిస్తారు.విదేశాల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలుఆఫ్రికా, అంగోలా, కాంగోతో పాటు చాలా దేశాల్లో ఇదే తరహాలో వజ్రాలు లభిస్తాయి. వాటిని అల్యూవియల్ డైమండ్స్ అంటారు. అక్కడ ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. వజ్రాలు లభించిన వారు నేరుగా ఆ కేంద్రానికి వచ్చి చూపిస్తారు. వజ్రాల నాణ్యత ఆధారంగా కొంత మొత్తం చెల్లిస్తారు. వజ్రాలను లీగల్‌గా ప్రభుత్వం ప్రక్రియను పూర్తి చేసి విక్రయిస్తుంది. కర్నూలు జిల్లాలో ఏటా సగటున 50–60 వజ్రాలు లభిస్తున్నాయి. అలాగే వజ్రకరూరు ప్రాంతంలో కూడా ఏటా 30–40 వజ్రాలు లభిస్తాయి. అంటే ఈ రెండు జిల్లాల్లో ఏటా వంద వజ్రాలు లభిస్తున్నాయి. మైనింగ్ చేస్తే రూ.వందల కోట్ల విలువైన సంపద ప్రభుత్వానికి లభించే అవకాశం ఉంది.ఈ ఏడాది లభ్యమైన వజ్రాల వివరాలు👉 ఈ నెల 8న చెన్నంపల్లిలో రూ.3.96 లక్షల విలువ చేసే వజ్రం లభించింది.👉 మే 20న రామాపురంలో రూ.50 వేల విలువైప వజ్రం దొరికింది.👉 మే 21న మద్దికెర మండలం మదనంతపురంలో రూ.6.50 లక్షల విలువైన వజ్రం లభ్యమైంది.👉 మే 22న ఇదే గ్రామంలో దొరికిన వజ్రాన్ని రూ.18 లక్షలు, 10 తులాల బంగారం చెల్లించి వ్యాపారి కొనుగోలు చేశారు.👉 మే 23న జొన్నగిరిలో రూ.15 వేలు, పగిడిరాయిలో రూ.12 వేల విలువ చేసే వజ్రాలు లభించాయి. 👉 మే 24న జొన్నగిరిలో దొరికిన వజ్రాన్ని రూ.6.20 లక్షలు నగదు, 5 తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేశారు.👉 మే 25న జొన్నగిరిలో దొరికిన వజ్రాన్ని రూ.1.20 లక్షల నగదు, జత కమ్మలు ఇచ్చి కొనుగోలు చేశారు.👉 తాజాగా తుగ్గలి మండలం గుండాలతండాకు చెందిన వ్యక్తికి మంగళవారం ఓ వజ్రం లభ్యమైంది. స్థానిక వజ్రాల వ్యాపారి రూ.లక్ష నగదు, అర తులం బంగారం ఇచ్చి దానిని కొనుగోలు చేశారు.ఐదోసారి వచ్చావానొస్తే మా ఊరోళ్లంతా రైలెక్కి గుత్తిలో దిగి జొన్నగిరికి వస్తాం. నేను ఇక్కడికి ఐదేళ్ల నుంచి వస్తున్నా. వచ్చి వారమైంది. ఐదేళ్లలో ఒక్క వజ్రం కూడా దొరకలేదు. తిండీ తిప్పలకు ఇబ్బందిగా ఉంది. మాతో పాటు వచ్చిన కొంతమందికి వజ్రాలు దొరుకుతున్నాయి. మాకు ఆశ చావక వెతుకుతున్నాం.– ఈరయ్య, రామాపురం, వినుకొండ, పల్నాడు జిల్లా వజ్రాన్ని గుర్తు పడతాంమాది కలికిరి. హైదరాబాద్‌లోని స్నేహితుడు, నేను కలిసి మూడు రోజుల క్రితం ఇక్కడికి వచ్చాం. దొరికితే వజ్రం. లేదంటే కాలక్షేపంగా ఉంటుందని వచ్చాం. మేం బంగారం నగలు తయారు చేస్తాం. వజ్రం ఎలా ఉంటుందో సులువుగా గుర్తుపడతాం.– రామాంజులాచారి, కలికిరి, అన్నమయ్య జిల్లాఒక చిన్న వజ్రం దొరికినా చాలుమా ఊళ్లో పనుల్లేవు. వజ్రాలు దొరికాయని పేపర్లు, టీవీల్లో వచ్చింది. ఖాళీగా ఉండలేక ఇక్కడికి వచ్చాం. నాతో పాటు మా ఊరోళ్లు పదిమంది వచ్చారు. వజ్రాలు వెతుకుతున్నాం. కొన్ని రాళ్లు మెరుస్తున్నాయి. అవి వజ్రాలు కాదంటున్నారు. కొద్దిరోజులు చూస్తాం. చిన్న వజ్రం దొరికినా కష్టం తీరకపోతుందా అనే ఆశతో చూస్తున్నాం.– లక్ష్మక్క, గార్లదిన్నె మండలం, అనంతపురం జిల్లా -
కర్నూలు.. ఫ్యాన్ జోరు!
సాక్షి ప్రతినిధి కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలో సార్వత్రిక పోరు ఏకపక్షంగా కానుందా? 2019 ఫలితాలే పునరావృతం కాను న్నాయా? 2 ఎంపీలతో పాటు 14 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ చేయనుందా? అంటే జిల్లాలోని రాజకీయ పరిస్థితులు, పారీ్టల బలాబలాలు విశ్లేíÙస్తే అవుననే తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ పట్ల ప్రజల్లో విశ్వసనీయత, ఇటీవల సీఎం జగన్ చేపట్టిన బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టడం, ఆచరణ సాధ్యమయ్యే హామీలతో విడుదల చేసిన మేనిఫెస్టోకు ప్రజల మద్దతు రావడం వంటి అంశాలతో వైఎస్సార్సీపీ జోష్‌లో ఉంటే, చంద్రబాబు సభలకు సరైన స్పందన లేకపోవడం, చాలా నియోజకవర్గాల్లో నాయకత్వలేమి, వర్గ విభేదాలతో టీడీపీ ఈ దఫా కూడా బోణీ కొట్టడం కష్టమేననే భావన విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి అత్యంత బలంగా ఉంది. ఈ ఐదేళ్లలో ప్రతి ఇంటికీ చేయని సంక్షేమ ఫలాలు అందాయి. ప్రతీ గ్రా మంలో అభివృద్ధి జరిగింది. దీనికి తోడు తమ నాయకు డిని మరోసారి సీఎంగా చూడాలనే ఆ కాంక్ష ఆ పార్టీ శ్రేణుల్లో బలంగా ఉంది.కర్నూలులో గెలుపు గ్యారంటీ..రాష్ట్రంలోనే మైనార్టీ ఓట్లు అత్యధికంగా (1.15లక్షలు) ఉండే నియోజకవర్గం కర్నూలు. ఇక్కడ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్‌ను వైఎస్సార్సీపీ బరిలోకి దింపింది.ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డితో పాటు పార్టీ మొత్తం ఇంతియాజ్ గెలుపు కోసం పని చేస్తోంది. మైనారీ్టలంతా వైఎస్సార్సీపీ వైపు నిలబడ్డారు. మరోవైపు టీజీ వెంకటేశ్ బీజేపీలో, భరత్ టీడీపీలో కొనసాగుతూ ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారు. రాజకీయాన్ని కూడా ‘బిజినెస్’గా చూసే టీజీ కుటుంబాన్ని గత రెండు దఫాలు ప్రజలు ఓడించారు. మైనార్టీ ఓట్లు దూరమవుతాయనే భావనతో బీజేపీని టీజీ భరత్ దగ్గరకు రానీయడం లేదు. దీంతో బీజేపీ నేతలు కూడా టీజీపై గుర్రుగా ఉన్నారు. కోడుమూరులో సునాయాసమే..కోడుమూరు(ఎస్సీ) టీడీపీలో గ్రూపు తగాదాలతో ఎన్నికలు ఏకపక్షంగా జరిగే అవకాశం ఉంది. తనకు కాకుండా బొగ్గుల దస్తగిరికి టికెట్ ఇచ్చారని ఇన్చార్జ్ ఆకేపోగు ప్రభాకర్ ఏకంగా ఆత్మహత్యకు యత్నించారు. తన ప్రమేయం లేకుండా ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి సూచించిన అభ్యరి్థకి టికెట్ ఇవ్వడంతో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి వర్గం దస్తగిరికి సహకరించడం లేదు. ఇటీవల సయోధ్య కుదిరినట్లు చెబుతున్నా సహకారం లేదు. మరోవైపు కోట్ల హరిచక్రపాణిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి ఇటీవలే వైఎస్సార్సీపీలో చేరారు. దీంతో వైఎస్సార్సీపీ బలం మరింత పెరిగింది.ఈ దఫా కూడా వైఎస్సార్సీపీకే అనుకూలంగా ఉంది. ‘ఆలూరు’లో పెరిగిన వైఎస్సార్సీపీ బలంఆలూరులో చిప్పగిరి జెడ్పీటీసీ వాలీ్మకి నేత విరూపాక్షి వైఎస్సార్సీపీ తరపున బరిలో ఉన్నారు. ఐదేళ్లు మంత్రి పదవి అనుభవించి పార్టీని వీడి వెళ్లిపోయిన గుమ్మనూరు జయరాం సిఫార్సుతో ఇక్కడ వీరభద్రగౌడ్‌కు టికెట్ ఇచ్చింది. దీంతో ఇక్కడ వాలీ్మకులంతా ఏకమయ్యారు. దీనికి తోడు టీడీపీ నుంచి వైకుంఠం మల్లిఖార్జున చౌదరి, మాజీ ఎమ్మెల్సీ మసాల పద్మజ, కురబ వర్గానికి చెందిన శశికళ వైఎస్సార్సీపీలో చేరారు. కోట్ల హరిచక్రపాణిరెడ్డి కోడుమూరుతో పాటు ఆలూరుపై పట్టున్న నాయకుడు. ఇక్కడ కురబ, బోయ వర్గాలు వైఎస్సార్‌సీపీతోనే ఉన్నాయి. దీంతో కచి్చతంగా గెలుస్తామనే భావనలో వైఎస్సార్సీపీ ఉంది. శ్రీశైలంలో శివతాండవమే..శ్రీశైలంలో శిల్పా చక్రపాణిరెడ్డి వైఎస్సార్సీపీ తరఫున బరిలో ఉన్నారు. నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు. టీడీపీ నేత బుడ్డా రాజశేఖరరెడ్డి నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వివాదాల్లో ఉంటున్నారు. ఓటమి భయంతోనే బుడ్డా ఇలా వ్యవహరిస్తున్నారనే చర్చ నడుస్తోంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా గెలిచి, టీడీపీలోకి వెళ్లి ప్రజల్లో బుడ్డా విశ్వసనీయత కోల్పోయారు. దీంతో టీడీపీ నేతలు కూడా ఇతని కోసం గట్టిగా పని చేసే పరిస్థితులు లేవు. ఏరాసు ప్రతాప్‌రెడ్డి కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. ‘పోచా’దే నంద్యాల!నంద్యాల ఎంపీ అభ్యరి్థగా పోచా బ్రహ్మానందరెడ్డి బరిలో ఉన్నారు. సిట్టింగ్ ఎంపీ. ఐదేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడటంతో పాటు ఇటు పార్టీ నేతలతో అటు పార్లమెంట్ పరిధిలోని ప్రజలతో మంచిగా ఉన్నారు. మరోవైపు టీడీపీ వేండ్ర శివానందరెడ్డిని కాదని, చివరి నిమిషంలో బీజేపీ నేత బైరెడ్డి శబరికి ‘పచ్చ కండువా వేయించి ఎంపీగా పోటీ చేయిస్తోంది. బైరెడ్డి రాజశేఖరరెడ్డి 2014లోనే ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. పైగా బైరెడ్డిని టీడీపీ నేతలే స్వాగతించడం లేదు. పార్లమెంట్‌లోని అన్ని స్థానాల్లో వైఎస్సార్సీపీ హవానే ఉంది. అసెంబ్లీలు స్వీప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నంద్యాల మరోసారి పోచా వశం కానుంది. పత్తికొండలో టీడీపీ పరాభవం తథ్యం!పత్తికొండలో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి నిత్యం జనంతో మమేకం అవుతున్నారు. మరోవైపు మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాంబాబు ఐదేళ్లపాటు పారీ్టకి అందుబాటులో లేరు. మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ కూడా వీరికి దూరంగా ఉన్నారు. ఇక్కడ టీడీపీ గెలుపు అవకాశాలు స్వల్పమే.ఎమ్మిగనూరు.. ఏకపక్షం!ఎమ్మిగనూరులో చేనేత వర్గానికి చెందిన మాజీ ఎంపీ బుట్టా రేణుక వైఎస్సార్సీపీ తరఫున బరిలో ఉన్నారు. బీసీలకు టికెట్ ఇవ్వాలని సీనియర్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని పక్కనపెట్టారు. దీంతో ఇక్కడ చేనేతలు, బీసీలు రేణుక కోసం ఏకమయ్యారు. చెన్నకేశవరెడ్డి కూడా రేణుక గెలుపు కోసం శ్రమిస్తున్నారు. మరోవైపు జయనాగేశ్వరరెడ్డికి కోట్ల వర్గం నుంచి కూడా మద్దతు లేదు. ఇక్కడ కూడా ‘బుట్టా’కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.మంత్రాలయం, ఆదోనిలో మురిపిస్తున్న ఫ్యాన్..మంత్రాలయం నియోజకవర్గ ఆవిర్భావం నుంచి బాలనాగిరెడ్డికి ఓటమి లేదు. నిత్యం ప్రజల్లో ఉండే రాజకీయనేత. మరోవైపు తిక్కారెడ్డిని కాదని, బోయ వర్గానికి చెందిన రాఘవేంద్రకు టీడీపీ టికెట్ ఇచి్చంది. దీనిపై తిక్కారెడ్డి ప్రత్యక్షంగా నిరసన చేశారు. దీంతో జిల్లా అధ్యక్షపదవి ఇతనికి కట్టబెట్టింది. అయినా రాఘవేంద్రకు సహకరించడం లేదు. మరోవైపు తన అధ్యక్ష పదవిని తీయడంపై బీటీ నాయుడు గుర్రుగా ఉన్నారు. ఆదోనిలో టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న మీనాక్షి నాయుడును కాదని పొత్తులో భాగంగా బీజేపీకి టికెట్ ఇచ్చారు. ఇక్కడ టీడీపీ, బీజేపీ రెండూ బలహీనంగా ఉన్నాయి. దీంతో బీజేపీ కనీసం పోటీ ఇవ్వలేని పరిస్థితి.గెలుపు బాటలో ‘రామయ్య’ కర్నూలు వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థిగా బీవై రామయ్య పోటీ చేస్తున్నారు. పేద వ్యక్తి. పార్లమెంట్లో బలమైన ‘వాల్మీకి’ వర్గానికి చెందిన నేత. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పని చేసిన అనుభవంతో పార్లమెంట్లో విస్తృత పరిచయాలున్నాయి. రామయ్య తెలియని వ్యక్తి లేరు. అజాత శత్రువైన రామయ్యకు ‘వాలీ్మకుల’తో పాటు అన్ని వర్గాల నుంచి మద్దతు ఉంది. 7 అసెంబ్లీలలో ‘ఫ్యాన్’ గాలి వీస్తోంది. మరోవైపు టీడీపీకి అభ్యర్థులు లేక పంచలింగాల నాగరాజు అనే రియల్టర్‌ను చివరి నిమిషంలో తీసుకొచ్చారు. ఆయనెవరో కూడా జిల్లా ప్రజలకు తెలీదు. వైఎస్సార్సీపీ పార్లమెంట్లో అత్యంత బలంగా ఉండటం, బలమైన సామాజిక వర్గం, మంచితనం వెరసి రామయ్య గెలుపు నల్లేరుపై నడకే అనే చర్చ సర్వత్రా నడుస్తోంది.డోన్, పాణ్యంలో దూకుడు!డోన్‌లో టీడీపీ అభ్యర్థిగా ధర్మవరం సుబ్బారెడ్డిని చంద్రబాబు రెండేళ్ల కిందటే ప్రకటించారు. అయితే సుబ్బారెడ్డి ఓడిపోతాడని సర్వేలో తేలడంతో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డిని బరిలోకి దించారు. యూరోపియన్ మోడల్ విద్యాసంస్థలతో పాటు అన్ని రకాలుగా మంత్రి బుగ్గన డోన్‌ను అభివృద్ధి చేశారు. 2009 ఓటమి తర్వాత కోట్ల కుటుంబం డోన్‌ను వదిలేసింది. ఇప్పుడు ప్రకాశ్‌రెడ్డిని పంపింది. ఇష్టం లేకపోయినా డోన్‌కు వెళుతున్నారని ప్రకాశ్‌రెడ్డి కోడుమూరు కార్యకర్తల సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక్కడ బుగ్గన గెలుపు లాంఛనమే అని విశ్లేషకులు చెబుతున్నారు. పాణ్యంలో కాటసాని రాంభూపాల్‌రెడ్డి వైఎస్సార్సీపీ తరఫున, గౌరు చరిత టీడీపీ అభ్యరి్థగా బరిలోకి దిగుతున్నారు. జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే కాటసాని. నిత్యం ప్రజల్లో ఉంటారు. బైరెడ్డి, గౌరు ఏకం కావడం గౌరు వర్గీయులు కూడా జీరి్ణంచుకోలేకపోతున్నారు. ఇక్కడ ఈ దఫా కూడా కాటసానికే అనుకూలంగా ఉంది. నంద్యాలలో గెలుపు నల్లేరుపై నడకే..నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవి సౌమ్యుడు. రవితోపాటు ఆయన తండ్రి ఎప్పుడూ ప్రజల్ని ఇబ్బంది పెట్టలేదు. ఎవరు వెళ్లినా స్పందించే గుణం వారి సొంతం. మరో వైపు భూమా బ్రహ్మానందరెడ్డిని కాదని ఫరూక్‌కు టీడీపీ టికెట్ ఇచి్చంది. దీంతో బ్రహ్మం పూర్తి దూరంగా ఉన్నారు. నంద్యాలపై పట్టున్న అఖిలప్రియ కూడా ఫరూక్‌కు సహకరించలేదు. ఈ దఫా ఫరూక్ ఓడిపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ తన తమ్ముడు జగత్ విఖ్యాత్‌కు ఇప్పించాలనేది అఖిల వ్యూహం. దీంతో వర్గవిభేదాలతో టీడీపీ నలిగిపోతోంది. బనగానపల్లిలో బోనస్ మార్కులే..బనగానపల్లిలో కాటసాని రామిరెడ్డి బలంగా ఉన్నారు. ఇక్క డ టీడీపీ అభ్యర్థి బీసీ జనార్ధన్‌రెడ్డి నియోజకవర్గం కంటే హైదరాబాద్‌లో ఎక్కువగా ఉంటారు. దీనికి తోడు డోన్, నంద్యాలలో తన వర్గానికి టికెట్లు ఇప్పించుకునే క్రమంలో కోట్ల, భూమాకు ప్రత్య ర్థిగా మారారు. ఈ ఎన్నికల్లో వీరు ఇతని ఓటమి కోసం పని చేసే అవకాశం ఉంది. బీసీపై భూమా బ్రహా్మనందరెడ్డి ఏకంగా చంద్రబాబుకే ఫిర్యాదు చేశారు. ఇక్కడ కాటసానికి గెలుపు అవకాశాలు ఎక్కువ. నందికొట్కూరులో తిరుగులేని ఫ్యాన్!నందికొట్కూరులో వైఎస్సార్సీపీ తరఫున సు«దీర్ పోటీ చేస్తున్నారు. ఆయన గెలుపు కోసం బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి శ్రమిస్తున్నారు. టీడీపీ తరఫున గిత్తా జయసూర్య పోటీ చేస్తున్నారు. ఇక్కడ మాండ్రను కాదని నంద్యాల ఎంపీ బైరెడ్డి రాజశేఖరరెడ్డి కుమారై శబరికి ఇచ్చారు. మాండ్ర హైదరాబాద్‌లో ఉంటున్నారు. దీంతో జయసూర్య ఒంటరైపోయాడు. దశాబ్దాలుగా ఫ్యాక్షన్ నడిపిన గౌరు, బైరెడ్డి వర్గాలు ఏకం కావడం కూడా నందికొట్కూరులో జీరి్ణంచుకోలేని అంశం. దీంతో అంతా వైఎస్సార్సీపీ వైపు నిలబడ్డారు. ఆళ్లగడ్డలో అఖిలకు ఎదురుగాలి..ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ తరచూ వివాదాలలో చిక్కు కుంటోంది. కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా దూరమయ్యారు. ‘భూమా’ ప్రధాన అనుచరుడు ఏవీ సుబ్బారెడ్డి అఖిల ఓటమే లక్ష్యంగా పని చేస్తున్నారు. గంగుల బ్రిజేంద్రారెడ్డి, గంగుల ప్రభా కర్ రెడ్డి ఇద్దరూ ఆళ్లగడ్డలో ‘ఫ్యాక్షన్ ’ వాతావరణాన్ని తీసేసి ప్ర శాంతంగా మార్చారు. ఇదే వీరికి ఈ ఎన్నికల్లో బలంగా మారింది. -
కర్నూలు జిల్లా: స్త్రీ వేషధారణలతో రథి మన్మథులకు పురుషుల పూజలు (ఫోటోలు)
-
గుంటూరు, కర్నూలు జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (గురువారం) గుంటూరు, కర్నూలు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 7.30 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి గుంటూరు జిల్లా మంగళగిరికి చేరుకుంటారు. అక్కడ సీకే కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న పేర్నాటి శ్యామ్‌ప్రసాద్ రెడ్డి సోదరుడు పేర్నాటి రామలింగారెడ్డి కుమారుడు కౌశిక్ పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించనున్నారు. అనంతరం అక్కడ నుంచి గన్నవరం చేరుకుని.. కర్నూలు జిల్లాకు బయలుదేరుతారు. పత్తికొండలోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీషు మీడియం స్కూల్లో ఏర్పాటు చేసిన బహిరంగసభా వేదికపై ప్రసంగించనున్నారు. అనంతరం, వరుసగా ఐదో ఏడాది తొలివిడత వైయస్సార్ రైతుభరోసా- పీఎం కిసాన్ పథకం లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేసే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. సభ అనంతరం మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. చదవండి:ఏపీ: బడి గంట రోజే ‘కానుక’ -
రాయలసీమ ప్రజల ఆదరణ మరువలేనిది: గోపీచంద్
కర్నూలు(టౌన్): రాయలసీమ ప్రజల ఆదరణ మరువలేనిదని సినీ హీరో గోపీచంద్ అన్నారు. కర్నూలు స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో శుక్రవారం రాత్రి రామబాణం సినిమాలోని ‘దరువెయ్యరా’ పాట లాంచింగ్ ఆడియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోపీచంద్ మాట్లాడుతూ తన 30వ సినిమాగా రామబాణం విడుదల కానుందన్నారు. హీరోయిన్ డింపుల్ హయతి మాట్లాడుతూ ఈ సినిమాలో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. దర్శకుడు శ్రీవాస్, నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, వివేక, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. -
పట్టన ప్రాంతాల్లో ఎండ దెబ్బకు రోడ్లపై పందిర్లు
-
NBK107: కర్నూల్ కొండారెడ్డి బురుజు వద్ద బాలయ్య సందడి!
అఖండ సినిమాతో సంచలన విజయం సాధించిన బాలయ్య తదుపరి చిత్రాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే.. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికి టైటిల్ ఖరారు చేయని ఈ మూవీ ఎన్బీకే107(NBK107) అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే టర్కీలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుతం కర్నూల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ‘‘నేటి నుంచి అక్కడి కొండారెడ్డి బురుజు, మౌర్య హోటల్ సెంటర్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. సోమవారం కర్నూలులోని కొండారెడ్డి బురుజు, మౌర్య హోటల్ సెంటర్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో బాలయ్య సరసన శ్రుతి హాసన్ నటిస్తోంది. కన్నడ స్టార్ దునియా విజయ్ ఈ సినిమాతో విలన్‌గా నటిస్తుండగా వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఈ సినిమాకుసంగీతం అందిస్తున్నారు. -
నెలలు నిండని శిశువును కాపాడిన కిమ్స్ వైద్యులు
సాక్షి, కర్నూలు : నెలలు నిండకుండానే పుట్టిన శిశువును అతికష్టం మీద శస్ర్తచికిత్స చేసి కాపాడారు కిమ్స్ వైద్యులు. కేవలం 950 గ్రాముల అతి తక్కువ బరువు ఉండటంతో పాటు పేగుల్లో ఇన్ఫెక్షన్ కూడా ఉండటంతో శిశువును కాపాడటం వైద్యులకు కత్తిమీద సాములా మారింది. అయినప్పటికీ శిశువు ప్రాణాలు కాపాడి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించిన అరుదైన ఘటన కిమ్స్ ఆసుపత్రి వైద్యులకే దక్కింది. కడప జిల్లాకు చెందిన గీత అనే మహిళ 15 ఏళ్ల వైవాహిక జీవితంలో రెండోసారి గర్భం దాల్చారు. అయితే ఆరున్నర నెలలకే ఉమ్మనీరు మొత్తం పోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీయాల్సి వచ్చింది. అయితే శిశువు రక్తంలో ఇన్ఫెక్షన్ ఉండటంతో పాటు ప్తేగుల్లో తీవ్రమైన ఇన్ఫెక్షన్ ( నెక్రోటైజింగ్ ఎంటెరోకొలైటిస్ ) ఉన్నట్లు తేలింది. వీటితో పాటు ప్లేగులకు రంధ్రం కూడా ఉన్నట్లు పరీక్షలో వెల్లడైంది. దీంతో పీడియాట్రిక్ నిపుణులైన డా. శ్రీకాంత్ బాబు సంరక్షణలో శిశువును ఐసీయూలో పెట్టి అత్యాధునిక లైఫ్ సపోర్ట్ వ్యవస్థలపై ఉంచారు. ఇలియోస్టమీ (మలవిసర్జనకు ప్రత్యేక మార్గం ) ఏర్పాటు చేసి శిశువును కొన్ని రోజులపాటు వెంటిలేటర్‌పై ఉంచి క్రమంగా తీసేశారు. అతి చిన్న వయసులోనే శిశువుకు ఇన్ఫెక్షన్ రావడంతో 3 వారాలపాటు యాంటీ బయాటిక్స్ ఇచ్చారు. దాంతో పాటు రెండుసార్లు రక్తం ఎక్కించి 5సార్లు ప్లేట్లెట్లు ఎక్కించారు. తర్వాత కొద్దికొద్దిగా తల్లిపాలు అలవాటు చేసి కంగారూ మదర్ కేర్ అందించారు. దాదాపు నెల రోజుల అనంతరం వైద్యుల సంరక్షణ అనంతరం ప్రస్తుతం పాప పూర్తిగా కోలుకుంది. ('అక్కడ ఎనిమిదో వింత ఉన్నట్లుగా ఫీలవుతున్నారు' ) -
కరకట్ట నుంచి ఖాళీ చేయండి : మంత్రి అనిల్
సాక్షి, కర్నూలు : కృష్ణానదికి ప్రమాదకర స్థాయిలో వరద వస్తున్న నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కరకట్టపై నిర్మించిన అక్రమ నివాసాన్ని వదిలివెళ్లాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కోరారు. అక్రమంగా కరకట మీద ఇళ్ళు కట్టుకుని, ప్రభుత్వం ఏలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించడం సరైనది కాదని అన్నారు. వరదలు, వర్షాలపై ఈ ప్రభుత్వంలో అప్రమత్తంగా పని చేస్తోందని స్పష్టం చేశారు. లోకేష్, చంద్రబాబు, పర్యాటకుల మాదిరిగా రాష్ట్రానికి వస్తూ పోతున్నారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో ఎప్పుడు కూడా వర్షాలు కురవలేదని, ఆయన పాలనలో కరువు తాండవించిందని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో తుఫాన్లు వచ్చి రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారని గుర్తుచేశారు. (ప్రజలు సహాయక చర్యల్లో సహకరించాలి) శుక్రవారం కర్నూలులో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి అనిల్ మాట్లాడారు. ‘చంద్రబాబు పాలనలో శ్రీశైలం పవర్ ప్రాజెక్టును వరద నీటితో ముంచేశారు. చంద్రబాబు తప్పిదాల కారణంగా హైదరాబాద్‌లో కూడా వరదలు వచ్చాయి. బాబు, లోకేష్ ఎప్పుడూ అబద్దాలు, అసత్య ఆరోపణలు చేస్తున్నారు. 23 ఎమ్మెల్యేలను కూడా కాపాడుకోలేకపోతున్నారు. వరదల నివారణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. తమది రైతు పక్షపాతి ప్రభుత్వం కాబట్టి దేవుడు కూడా సహకరిస్తున్నారు. తుంగభద్ర పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాం. 210 కోట్ల రూపాయల నిధులను తుంగభద్ర పుష్కరాలకు విడుదల చేశాం. కోవిడ్ నిబంధనల ప్రకారం తుంగభద్ర పుష్కరాలను నిర్వహిస్తాం. రాయలసీమ అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి రెడ్డి కృషి చేశారు. అదే రీతిలో ముందుకు సాగుతున్నారు. 40 వేల కోట్ల రూపాయల నిధులను రాయలసీమ ప్రాజెక్టులకు ప్రణాళికలను సిద్ధం చేశాం’ అని పేర్కొన్నారు. -
కర్నూలులో బంగారు నిక్షేపాల వెలికితీత
తుగ్గలి: బంగారు నిక్షేపాల వెలికితీతలో భాగంగా కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని పగిడిరాయి–జొన్నగిరి గ్రామాల మధ్య డ్రిల్లింగ్ పనులను మంగళవారం జియో మైసూర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రారంభించింది. తుగ్గలి మండలంలోని పగిడిరాయి, బొల్లవానిపల్లి, జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో 40 ఏళ్లుగా వివిధ కంపెనీలు సర్వేలు చేసి, బంగారం నిక్షేపాలున్నాయని గుర్తించాయి. దాదాపు 15 ఏళ్లుగా సర్వే చేస్తున్న జియో మైసూర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నిక్షేపాల వెలికితీతకు సిద్ధమై.. 2013లోనే ప్రభుత్వ అనుమతులు పొందింది. నిక్షేపాల వెలికితీతపై కొందరు కోర్టుకు వెళ్లడంతో పనుల్లో జాప్యమైంది. గతేడాది ఎకరా రూ.12 లక్షలు చొప్పున 300 ఎకరాలు కొనుగోలు చేసి ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, భూములు కోల్పోయే రైతులకు డబ్బులు చెల్లించడంలో జాప్యం జరగడం, కొన్నాళ్ల పాటు కంపెనీ ప్రతినిధులు మొహం చాటేయడంతో మైనింగ్ ప్రాజెక్టు కలగా మిగిలింది. ఎట్టకేలకు రెండు రోజుల క్రితం కంపెనీ ప్రతినిధులు వచ్చి రైతులతో మాట్లాడి ఏడాది కౌలు చెల్లించి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. సోమవారం డ్రిల్లింగ్ పనులు మొదలు పెట్టారు. -
ఆ బెంజ్ కారు నా కుమారుడిది కాదు: మంత్రి
సాక్షి, కర్నూలు : ఈఎస్ఐ స్కాంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంకు ప్రమేయం ఉందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలను మంత్రి తీవ్రంగా ఖండించారు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్నపాత్రుడు చెబుతున్నట్లు తన కుమారుడి పక్కనున్న బెంజ్ కారు తమది కాదని, కారు పక్కన కేవలం ఫోటో మాత్రమే దిగాడని వివరించారు. హెలికాఫ్టర్, ట్రైన్ పక్కన ఫోటోలు తీసుకుంటే మనదే అవుతుందా అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. కారు మాదే అని రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాలు విసిరారు. శుక్రవారం ఆలూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి జయరాం మాట్లాడారు. టీడీపీ నాయకులకు మతి భ్రమించి మాట్లాడుతున్నారని, గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ఎందుకు స్పందించడంలేదని నిలదీశారు. (మాకెలాంటి సంబంధం లేదు: మంత్రి జయరాం) చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఏమైనా పదవులు ఇచ్చారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేశారని గుర్తుచేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాయల ఫకీర్ లాంటివారని అన్నారు. ఎవరిని ఏఏ శాఖలో నియమించుకోవాలో అక్కడ తన వారిని నియమించుకొని వాటాలు వసూలు చేశారని మండిపడ్డారు. కాగా, ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రిఅచ్చెన్నాయుడు ఇదివరకే అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. ఈఎస్ఐ స్కాంపై విచారణ కొనసాగుతోంది. -
నెరవేరిన ఆరు దశాబ్దాల కల
సాక్షి, కర్నూలు : మూడు రాజధానులు బిల్లుకు గవర్నర్ బిశ్వభూషన హరిచందన్ ఆమోదం తెలపడంపై రాష్ట్ర వ్యాప్తంగా పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యాయ రాజధాని కర్నూలు ప్రజలు, ప్రజాప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బిల్లుకు ఆమోదం తెలిపిన సందర్భంగా కర్నూలు నడిబొడ్డున గల కొండారెడ్డి బురుజు వద్ద సంబరాలు జరపుకున్నారు. ఎన్నో ఏళ్లుగా చేస్తున్న పారాటానికి నేడు ప్రతిఫలం లభించిందని ఆ జిల్లా ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. సీఆర్డీఏ-2014 రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ శుక్రవారం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై స్థానిక ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ.. కర్నూలును న్యాయ రాజధానిగా ఎంపిక చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే సీఎం జగన్ లక్ష్యమన్నారు. కర్నూలులో న్యాయ రాజధానిని స్వాగతిస్తున్నామన్నారు. న్యాయ రాజధాని కర్నూలుకు రావాలన్నది మా కలఅని, 6 దశాబ్దాల మా కల ఇన్నాళ్లకు నెరవేరిందని పేర్కొన్నారు. మా కలను నెరవేర్చిన సీఎం జగన్‌కు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ కృతజ్ఞతలు తెలిపారు. (మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం) హైకోర్టు ఏర్పాటు వల్ల సీమకు న్యాయం మూడు రాజధానుల బిల్లుకు ఆమోదం తెలిపిన గవర్నర్ నిర్ణయంపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు ఆలూరు రామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాయలసీమలో జ్యూడిషియల్ క్యాపిటల్ స్వాగతిస్తున్నామన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు వల్ల రాయలసీమకు న్యాయం జరుగుతుందని, మూడు రాజధానుల వల్ల ప్రాంతీయ అసమానతలు ఉండవని అభిప్రాయపడ్డారు. ఈరోజు చారిత్రాత్మకమైన రోజుని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. పాలనా వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. చంద్రబాబు కుట్రలన్నీ విఫలమయ్యాయి. రియల్ ఎస్టేట్ కోసం చంద్రబాబు కుట్రలు పన్నితే... అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం సీఎం జగన్ ఆలోచన చేశారు’ అని అన్నారు. -
అఖిలప్రియ సోదరుడి దౌర్జన్యం
సాక్షి, ఆళ్లగడ్డ : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ నాయకులు పోలీస్ స్టేషన్లో ఉన్న నిందితుడిని దౌర్జన్యంగా తీసుకెళ్లిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. ఆళ్లగడ్డ సమీపంలో పడకండ్ల గ్రామంలో కొన్ని రోజులుగా రెండు వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆదివారం టీడీపీకి చెందిన మాజీ కౌన్సిలర్ శూలం నరసింహుడు ప్రత్యర్థులపై దాడి చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్‌రెడ్డి తన అనుచరులతో కలిసి పట్టణ పోలీస్ స్టేషన్లోకెళ్లి అడ్డొచ్చిన పోలీసులను తోసేసి నిందితుడిని తీసుకెళ్లాడు. (అఖిలప్రియపై సంచలన ఆరోపణలు) ఈ విషయాన్ని స్టేషన్ సిబ్బంది పోలీస్ ఉన్నతాధికారులకు తెలియజేయడంతో వారు అఖిలప్రియ ఇంటి వద్దకెళ్లి మళ్లీ నిందితుడిని స్టేషన్ తీసుకెళ్లారు. దీంతో భూమా విఖ్యాత్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 353, 224, 225, 212 సెక్షన్ల కింది కేసు ఫైల్ చేశారు. -
అఖిలప్రియపై సంచలన ఆరోపణలు
సాక్షి, కర్నూలు : మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ రాముడుపై టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వారిద్దరు తనను చప్పేందుకు కుట్రపన్నారని ఆరోపించారు. వారి అనుచరులు రవిచంద్రారెడ్డి, రాంరెడ్డి, సంజోరెడ్డితో చేతులు కలిపి తనను హతమార్చాలని చూస్తున్నారని అన్నారు. అంతే కాకుండా తనను చంప్పేందుకు రూ.50 లక్షలు సుపారీ కూడా మాట్లాడుకున్నారని ఊహించని రీతిలో బాంబు పేల్చారు. దీనిపై కడప పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారి కుట్రను భగ్నం చేసి తనను కాపాడారని తెలిపారు. అనంతరం పోలీసులు విచారణలో నిందితులు పలు నిజాలను వెల్లడించారు. భూమా అఖిలప్రియ అనుచరుడు శ్రీను తమకు డబ్బులు ఇచ్చాడని నిందితులు చెప్పారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనను చంపాలని చూస్తున్నారని, భూమా అఖిలప్రియ, భార్గవ రాముడిని వెంటనే అరెస్ట్ చేయాలని ఏవీ సుబ్బారెడ్డి పోలీసులను వేడుకున్నారు. తాజా ఆరోపణలు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. కాగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో అఖిలప్రియ భర్తపై ఇప్పటికే ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయిన విషయం తెలిసిందే. (అఖిలప్రియ భర్తపై మరో కేసు) -
చిచ్చుపెడుతున్న టీడీపీ నేతలు
కర్నూలు : జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదుకావడం దురదృష్టకరమని ఎమ్యెల్యే హఫీజ్‌ఖాన్ అన్నారు. కరోనా కట్టడికి జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా పనిచేస్తుందని, అయితే టీడీపీ నేతలు మాత్రం కరోనాను కూడా రాజకీయాల కోసం వాడుకోవడం దుర్మార్గమన్నారు. ఎల్లో మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మతాల మధ్య చిచ్చుపెట్టేలా టీడీపీ నేతలు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల ముస్లిం పెద్దలకు చికిత్స అందిస్తున్న నర్సును అవమానిస్తూ టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా నిజాలు తెలుసుకొని మాట్లాడాలని కోరారు. ప్రపంచం మొత్తం కరోనాపై పోరాడుతుంటే టీడీపీ నేతల మాత్రం కులాలు, మతాల మధ్య విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇకనైనా ఇలాంటి నీచ రాజకీయాలు మానుకోవాలని హఫీజ్‌ఖాన్ హితవు పలికారు. హాఫీజ్ ఖాన్‌పై దుష్ప్రచారం.. వాస్తవం ఇది . -
మూడోదశ వైఎస్ఆర్ కంటి వెలుగు
-
మూడు రాజధానులు ముమ్మాటికీ అవసరమే
కేంద్రీకృత రాజధాని సిద్ధాం తం నుండి వికేంద్రీకరణతో కూడిన మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం అభివృద్ధి వైపు, మార్పుదిశగా ప్రస్తుత ప్రభుత్వం తొలి అడుగని భావించవచ్చు. కానీ ఈ మార్పు మంచిది కాదని, అవసరం లేదని, ప్రతిబంధకమని ప్రతిపక్ష రాజకీయ నాయకుల వాదన. ఈ మార్పు ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక, సామాజిక ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా ఉపయుక్తంగా ఉంటుందన్నది ప్రభుత్వ వాదనగా కనిపిస్తోంది. మూడు రాజధానుల ఏర్పాటు పాలనా వికేంద్రీకరణ ప్రక్రియ ఆధారంగా అన్ని ప్రాంతాలకు సమన్యాయం, అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళేందుకు ఉపకరిస్తాయని మేధావి వర్గం అభిప్రాయంగా చెప్పవచ్చును. ముఖ్యంగా వికేంద్రీకరణ వల్ల పర్యావరణ పరిరక్షణ అంశాన్ని కాపాడుకోవచ్చన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం. ప్రస్తుతం మన రాష్ట్రంలో భౌగోళిక పరంగా, సహజంగానే మూడు ప్రాంతాలుగా కనిపిస్తున్న కళింగాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో విభిన్న సాంఘిక, సాంస్కృతిక, ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. దీని దృష్ట్యా, వికేంద్రీకరణ పాలన అనుకూలమైన నిర్ణయంగా భావించాలి. కళింగాంధ్ర వెనుకబాటుతనం నిర్మూలన, కోస్తాంధ్ర ప్రాంతంలో వరద నివారణ, వ్యవసాయాభివృద్ధి, మత్స్య పరిశ్రమాభివృద్ధి, రాయలసీమ ప్రాంతంలో కరువు నివారణకై సాగునీటి సమగ్రాభివృద్ధి ముఖ్యాంశాలుగా గుర్తించి పరిపాలన పరంగా అభివృద్ధి చేస్తే వేగవంతమైన అభివృద్ధి సాధించేం దుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లో జరిగిన కేంద్రీకృత అభివృద్ధి వల్ల మిగిలిన ప్రాంతాల్లో వెనుకబాటు తనం వల్ల జరిగిన నష్టాల నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సి ఉంది. కొన్ని దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని పట్టణాలు, మరియు కొన్ని జిల్లాలు మాత్రమే ఆర్థికాభివృద్ధి మిగతా ప్రాంతాలకంటే ఎక్కువ ఆర్థికాభివృద్ధి సాధించాయి. ప్రస్తుత ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం అధికార వికేంద్రీకరణ దిశగా ఉంటుంది. అధికార వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ, తద్వారా సమతుల్య అభివృద్ధి జరుగుతుందని మేధావుల అభిప్రాయం. అమరావతి ఒక్కచోటే అభివృద్ధి జరగడం వలన అధికార కేంద్రీకరణ, అభివృద్ధి కేంద్రీకరణ తద్వారా ఒక ప్రాంతానికి కొంతమందికే ప్రయోజనంగా ఉంటుందని చెప్పక తప్పదు. తక్కువ ప్రయత్నం వలన ఎక్కువ ప్రయోజనం పొందటం ఆర్థికశాస్త్రం యొక్క ఒక ముఖ్య సిద్ధాంతం. అంతేకాకుండా స్వల్ప కాలంలోనే ఆర్థికాభివృద్ధి సాధించాల్సిన అవసరముందని, దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి ప్రణాళికల రచన అంత ప్రయోజనం కాదని కీన్స్ అనే ఆర్థిక శాస్త్రవేత్త చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటు, అధికార వికేంద్రీకరణ ద్వారా అందరికీ అభివృద్ధి ఫలాలు అందేలా ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తోంది. అమరావతి అభివృద్ధి సాధించడానికి కనీసం 40 లేదా యాభైఏళ్లు పడుతుందని మేధావుల అంచనా. ఆ కాల వ్యవధిలో రాజకీయం, ఆర్థిక, సాంకేతిక మార్పులు విపరీతంగా జరిగే అవకాశం ఉంది. ఆర్థికశాస్త్రం యొక్క ఛాయిస్ ఆఫ్ సైన్స్ అనే సిద్ధాంతానికి కేంద్రబిందువుగా ఉన్న అభిప్రాయానికి ప్రతిరూపంగా ప్రస్తుత ప్రభుత్వం స్వల్ప కాలంలో అధిక ప్రయోజనం కలిగించే విధానాలను ఎంచుకొని, మూడు రాజధానుల సిద్ధాంతం అధిక ప్రజల అభివృద్ధికి దోహదం చేస్తుందని గట్టి నమ్మకం. మూడు రాజధానుల వలన అన్ని ప్రాంతాలను అభివృద్ధిలో భాగ స్వామ్యం చేయవచ్చు. రాజధాని వికేంద్రీకరణ వలన అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం లభిస్తుంది. వాణి జ్యాభివృద్ధిలో వేగం పెరుగుతుంది. ఆర్థిక శాస్త్రం ప్రకారం కొనుగోలు శక్తి పెరగాలంటే ఆర్థికాభివృద్ధి పెరగాలి. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితేనే ఆర్థికాభివృద్ధి జరుగుతుంది. అన్నిప్రాంతాల ఆర్థికాభివృద్ధి వలన అన్ని వర్గాల ప్రజల కొనుగోలు శక్తి పెరు గుతుంది. దాని వలన వాణిజ్యం పెరిగి, రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి సత్వర ఆదాయ వనరుల అభివృద్ధి ఎంతైనా అవ సరం. మూడు రాజధాని నగరాలను సాంస్కృతిక పరంగా, చారిత్రక పరంగా, వాణిజ్య పరంగా, ఆర్థిక పరంగా అనుకూలం ఉంటేనే భవిష్యత్తులో అభివృద్ధి సాధిస్తాయి. మూడు రాజధాని నగరాలకు సమాన నిధులిచ్చి, సాంస్కృతిక, సామాజిక అంశాలకు అనుగుణంగా వివిధ ప్రణాళికలను రచించి, వాటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాసకర్త పూర్వ ఉపకులపతి, ఎస్కేయూ, అనంతపురం ‘ 94408 88066 ఆచార్య కాడా రామకృష్ణారెడ్డి -
జేసీకి ఎమ్మెల్యే సవాల్ : మాట్లాడదాం రా!
సాక్షి, కర్నూలు : పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్ రెడ్డిపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్ధర్ మండిపడ్డారు. దమ్ము, ధైర్యం ఉంటే ఆ మాట ఇంకోసారి మాట్లాడాలని సవాల్ విసిరారు. పోలీసులు లేకుండా బయటకు వెళ్లనేని నువ్వు, బూట్లు నాకిస్తానంటావా? అక్కడే ఉన్న చంద్రబాబు నవ్వుతూ పోలీసులను కించపరుస్తాడా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రిలో జేసీ ఆటలు ఇంక సాగవు అంటూ హెచ్చరించారు. ‘పోలీసుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదు. మాజీ పోలీస్ అధికారిగా పోలీసులకు నేను సపోర్ట్ చేస్తున్న. అనంతపురంలో జేసీ, చంద్రబాబులపై వెంటనే కేసు నమోదు చేయాలి. జేసీ, నేను మాజీ పోలీస్‌గా సవాల్ చేస్తున్నా. రా ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం. పోలీసుల బూట్లు అంటే యుద్ధంలో ఆయుధాలు. వాటిని ముద్దాడుతాం. అహర్నిశలు చెమటోడ్చి సమాజం కోసం పనిచేస్తున్నది పోలీసులు మాత్రమే’ అని వ్యాఖ్యానించారు. -
‘ఆ పని చేయమని లోకేష్‌ను కోరుతున్నా’
సాక్షి, కర్నూలు : నగరాన్ని జ్యుడీషియల్ క్యాపిటల్‌గా ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి బుధవారం కృతజ్ఞతలు తెలిపారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారమే కర్నూలుకు న్యాయం జరిగిందని ఆయన వెల్లడించారు. దశాబ్దాల క్రితం జరిగిన అన్యాయాన్ని ఇప్పుడు సవరించారని ఆనందం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల వల్ల వికేంద్రీకరణ జరిగి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలో అమరావతిలో పథకం ప్రకారం ఇన్సైడర్ ట్రేడింగ్ జరిపి బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేశారని మండిపడ్డారు. శివరామకృష్ణ కమిటీ నివేదికను తుంగలో తొక్కి ఏర్పాటు చేసిన అమరావతిలో 40 సంవత్సరాలు అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని నిలదీశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అభివృద్దిపథంలో దూసుకుపోతున్న జగన్‌ను చూసి చంద్రబాబు కడుపు రగిలిపోతోందనీ, ఎమ్మెల్యేలు ఎక్కడ జారిపోతారోనని భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. బాబుకు మతిభ్రమించి అసెంబ్లీలో అవాస్తవాలు మాట్లాడుతున్నారని, ఆయనను వెంటనే ఆసుపత్రిలో చూపించాలని లోకేష్‌బాబును కోరారు. మరోవైపు సర్పంచ్‌కు కూడా అర్హత లేని జనసేన అధినేత గురించి మాట్లాడుకోవడం వృథా అని తేల్చి చెప్పారు. -
సైలెంట్ రాకెట్
ఆమెకు స్పష్టమైన వాక్కు లేదు.. అయినా తనకున్న ప్రతిభతో లోకం అవాక్కు అయ్యేటట్లు చేసింది. ధ్వని తరంగాలు ఆమె చెవిని తాకలేవు.. కానీ ఆమె మోగించిన విజయదుందుభి ప్రపంచమంతా ప్రతిధ్వనించింది. బధిరుల విభాగంలో టెన్నిస్ ఆటలో భారతదేశంలోనే నంబర్ వన్ ర్యాంకర్‌గా, ప్రపంచంలో 12వ ర్యాంకర్‌గా నిలిచిన షేక్ జాఫ్రీన్ విజయగాధ ఇది. షేక్ జాఫ్రీన్‌కు పుట్టకతోనే చెవుడు. ఏమాత్రం వినిపించదు. ఇతరులు మాట్లాడితే ఆర్థం చేసుకోగలరు. అయితే సత్తా చాటేందుకు ఈవేమీ ఆమెకు అడ్డుకాలేదు. లెక్కలేనన్ని పతకాలు, ట్రోఫీలు, సర్టిఫికెట్లు సాధించారు. వాస్తవానికి కర్నూలులో టెన్నిస్ క్రీడకు వసతులు, సౌకర్యాలు లేవు. కోచ్ లేరు. అయినా కేవలం ఆ క్రీడ పట్ల ఆమెకు ఉన్న ఆసక్తి అంతర్జాతీయ స్థాయిలో పేరు సాధించిపెట్టింది. జాఫ్రీన్ క్రీడను మెచ్చి ప్రముఖ అంతర్జాతీయ క్రీడాకారిణి సానియా మీర్జా తన ఆకాడమీలో ఉచితంగా శిక్షణ పొందే అవకాశం కల్పించారు. జాఫ్రీన్ తండ్రి షేక్ జాకీర్ అహ్మద్ కర్నూలులో న్యాయవాది. ఆమె తల్లి షేక్ మైమున్ రిహాన. బి క్యాంపు ఏరియాలో నివాసం. ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమారుడు జావీద్ అహ్మద్ బీటెక్ పూర్తి చేశాడు. కుమార్తె షేక్ జాఫ్రీన్ స్థానిక పాఠశాలలో చదివి, ఆరవ తరగతి నుంచి శ్రీలక్ష్మీ ఇంగ్లీషు మీడియం స్కూలులో చేరి, టెన్త్‌లో ‘ఏ’ గ్రేడ్‌తో పాసై ప్రతిభ అవార్డు సాధించింది. ఇంటర్ ప్రైవేటు కళాశాలలో, డిగ్రీ (బీఏ) ఉస్మానియా మహిళల డిగ్రీ కళాశాలలో పూర్తి చేసింది. ప్రస్తుతం ఆమె హైదరాబాదులోని మెహిదీపట్నం సెయింట్ ఆన్ ఉమెన్స్ కళాశాలలో ఎంసీఏ చేస్తున్నారు. జాఫ్రీన్ తండ్రి జిల్లా, రాష్ట్ర స్థాయిలో క్రికెట్ ఆడేవారు. ప్రతిరోజు కూతుర్ని స్టేడియంకు తీసుకెళ్లేవారు. అలా.. పక్కనే ఉన్న టెన్నిస్ క్లబ్ వైపు వెళ్లి ఆ ఆటపై మక్కువ పెంచుకుంది పద్నాలుగేళ్ల క్రితమే చిన్న వయసులో ర్యాకెట్ జాఫ్రీన్. అప్పటి నుండి టెన్సిస్‌లో మెరుపులు మెరిపిస్తోంది. జాఫ్రీన్ ఫోర్ హ్యాండ్ షాట్లో ఆరితేరారు. బలమైన షాట్లతో ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టడంలో దిట్ట. ఎలాంటి శిక్షణ, మౌలిక సదుపాయాలు లేకున్నా.. దాతల సహకారంతో ఆడి తనకున్న లక్ష్యంతో రాకెట్లా దూసుకు పోతున్నారు. ఊహించని వరం హైదరాబాదులోని ముర్తుజా గూడలో ఉన్న సానియా టెన్నిస్ అకాడమీలో శిక్షణ పొందే అవకాశం రావడం అంత సులువేమికాదు. దేశవ్యాప్తంగా పోటీ ఉంటుంది. లక్షల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. అయినా సీటు వస్తుందన్న గ్యారెంటీ లేదు. పదునైన షాట్లతో టెన్నిస్ క్రీడలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న జాఫ్రీన్ ఆట తీరును చూసి సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా నేరుగా జాఫ్రీన్ తండ్రి జాకీర్‌కు ఫోన్ చేసి తన అకాడమీలో ఉచితంగా శిక్షణ అందిస్తామని పిలిచారు. ఆ అకాడమీలో జాఫ్రీన్‌కు ఉచితంగా సీటు లభించడం అమె ప్రతిభకు దక్కిన గుర్తింపే. అలాగే ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో బెంగళూరులోని జీషాన్ టెన్నిస్ అకాడమీలో జాఫ్రీన్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. 2021 వరకు ఈ శిక్షణ ఉంటుంది. ఒలింపిక్స్ లక్ష్యంగా సాధన ఈ ఏడాది అక్టోబరు 12 నుంచి 19 వరకు టర్కీలోని అంతలియా సిటీలో జరిగే వరల్డ్ ఛాంపియన్షిప్, నవంబరు 1 నుంచి 12 వరకు హాంకాంగ్‌లో జరిగే ఏషియన్ పసిఫిక్ డెఫ్ గేమ్స్‌కు జాఫ్రీన్ ఎంపికయ్యారు. 2021లో దుబాయిలో జరిగే ఒలింపిక్స్ డెఫ్ విభాగంలో బంగారు పతకం సాధించడమే ముందున్న లక్ష్యంగా శిక్షణ తీసుకుంటున్నారు. టర్కీ, ఏషియన్ ఆటలతోపాటు ఒలింపిక్స్‌లోనూ ఆమె బంగారు పతకం సాధించి, భారతదేశం పేరును ప్రపంచానికి చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. – ఎస్.పి. యూసుఫ్, సాక్షి, కర్నూలు వరుస విజయాలు.. పతకాలు 2012లో న్యూఢిల్లీలో జరిగిన 20వ జాతీయ స్థాయి డెఫ్ (బదిర) క్రీడాపోటీల్లో మహిళల సింగిల్స్, డబుల్స్ పోటీల్లో బంగారు పతకం. 2013లో న్యూఢిల్లీ స్పోర్ట్సు అథారిటి ఆఫ్ ఇండియా తరపున బల్గేరియా లోని సోఫియా సిటీలో జరిగిన డెఫ్ ఒలింపిక్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం. జపాన్‌లో జరిగిన మొదటి రౌండ్లో, రెండవ రౌండ్లో టర్కీపై విజయం. 2014లో జర్మనీలోని హంబర్గ్ రాష్ట్రంలో నిర్వహించిన 2వ ఓపెన్ డెఫ్ యూత్ టెన్నిస్ కప్ క్రీడ పోటీల్లో సింగిల్స్, డబుల్స్ విభాగంలో రెండు వెండి పతకాలు. 2015లో తైవాన్‌లోని తయూనా సిటీలో జరిగిన 8వ ఆసియా పసిఫిక్ డెఫ్ క్రీడల్లో రజత పతకం. 2016లో స్లోవేనియాలోని పోర్టురోజ్ రాష్ట్రంలో జరిగిన స్లోవెనీయా డెఫ్ టెన్నిస్ ఓపెన్ డబుల్స్ విభాగంలో బంగారు పతకం, సింగిల్స్ విభాగంలో రజత పతకం. 2017లో టర్కీలో జరిగిన మిక్స్డ్ డబుల్ ఒలింపిక్‌లో కాంస్య పతకం. అదే ఏడాది జరిగిన స్లోవేనియా డెఫ్ టెన్సిస్ ఓపెన్స్‌లో రజిత పతకం. 2018లో టర్కీలో జరిగిన ప్రపంచ డెఫ్ టెన్నిస్ టీమ్ ఛాంపియన్‌షిప్‌లో 8వ స్థానం. 2019 జనవరి 27 నుంచి 31 వరకు చెన్నైలో జరిగిన సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో 23వ జాతీయ ఆటల్లో బంగారు çపతకం. -
ప్రతి ఒక్కరినీ గుర్తుపెట్టుకుంటా: బుగ్గన
సాక్షి, కర్నూలు: కులమతాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఈ బృహత్తర కార్యక్రమంలో తాను కూడా భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు సంక్షేమానికి పెద్ద పీట వేశామని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామని వెల్లడించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం గత శుక్రవారం తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనిపై అన్ని వర్గాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా బడ్జెట్‌ను రూపొందించామని తెలిపారు. అక్షరాస్యతను పెంచడానికి దేశంలో మొట్టమొదటి సారిగా ముఖ్యమంత్రి ఆదేశాలు మేరకు ప్రతి తల్లిఖాతాలో ఏడాదికి 15 వేలు జమ చేయబోతున్నామని అన్నారు. తన రాజకీయ ప్రస్థానంలో ప్రయాణించిన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటానని మంత్రి బుగ్గన డోన్ నియోజకవర్గ ప్రజలకు భరోసా ఇచ్చారు. -
ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అరెస్ట్‌పై హైకోర్టు స్టే
సాక్షి, కర్నూలు: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కుటుంబానికి హైకోర్టులో ఊరట లభించింది. మంత్రాలయం నియోజకవర్గంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తిక్కారెడ్డి ఫిర్యాదుతో నాగిరెడ్డిపై మాదవరం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో తన తప్పేమీ లేకున్నా పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేశారంటూ నాగిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అతని పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం నాగిరెడ్డిని అరెస్ట్ చేయ్యవద్దంటూ ఉత్తర్వులు జారీ చేసింది. (మంత్రాలయంలో ‘‘తిక్క’’ చేష్టలు) ప్రచారంలో భాగంగా మంత్రాలయం మండలం కగ్గల్లలో తిక్కారెడ్డిని గ్రామస్తులు అడ్డుకుంటారనే అనుమానంతో ఆయన గన్‌మెన్ గాల్లోకి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే . దాదాపు 10 రౌండ్ల కాల్పులు జరిపినట్టుగా స్థానికుల సమాచారం. గన్‌మెన్ జరిపిన కాల్పుల్లో తిక్కారెడ్డితోపాటు, అక్కడే ఉన్న ఏఎస్సై గాయపడ్డారు. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి కుట్ర పూరితంగా వ్యవహరించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని బాలనాగిరెడ్డి అన్నారు. -
మంత్రి అఖిల ప్రియకు షాక్..!
సాక్షి, కర్నూలు: సార్వత్రిక ఎన్నికల ముందు మంత్రి భూమా అఖిల ప్రియకు భారీ షాక్ తగిలింది. ఆమె సొంత మేనమామ, టీడీపీ నేత ఎస్వీ జగన్ రెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు. ఆళ్లగడ్డకు చెందిన ఎస్వీ జగన్ శనివారం లోటస్‌పాండ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. గత కొంతకాలంగా పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఎస్వీ టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీ గూటికి చేరారు. మంత్రికి ఝలక్... వైఎస్ఆర్సీపీలోకి సింగం కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్సీపీలోకి వలసలు జోరందుకున్నాయి. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా కుటుంబానికి దశబ్దాల కాలంగా అండగా ఉన్న కుటుంబాలతో పాటు వారి దగ్గరి బంధువులు సైతం టీడీపీ వీడుతున్నారు. గత వారం రోజుల నుంచి వరుసగా ఆపార్టీ నాయకులు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకుంటుండటంతో మంత్రి అఖిలప్రియ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వలసలను ఆపేందుకు స్వయంగా ఫోను చేసి మాట్లాడటంతో పాటు వారి ఇళ్ల దగ్గరకు వెళ్లి బుజ్జగిస్తున్నారు. కాగా గతంలో వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరిన ఎంపీ బుట్టా రేణుక కూడా తిరిగి సొంత గూటికి చేరుకున్న విషయం తెలిసిందే. -
సీఎం మీటింగ్‌కి సిట్టింగ్ ఎంపీ డుమ్మా
సాక్షి, కర్నూలు: గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి కర్నూలు ఎంపీగా గెలుపొంది, ఆ తరువాత టీడీపీ గూటికి చేరిన బుట్టా రేణుక పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. టికెట్ హామీతో టీడీపీలో చేరిన బుట్టాకు తాజాగా కేంద్ర మాజీమంత్రి కోట్లా సూర్యప్రకాశ్ రెడ్డి చేరికతో రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సీట్ల పంపిణీలో తనకు తగుస్థానం కల్పించడంలేదంటూ గతకొంత కాలంగా ఆమె పార్టీ కార్యాకలపాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. (నా పరిస్థితేంటి?!) ఈ నేపథ్యంలో శనివారం కర్నూలు జిల్లాలోని కోడుమూరులో జరిగిన సీఎం చంద్రబాబు సభకు బుట్టా డుమ్మా కొట్టారు. దీంతో బుట్టా రేణుకా పార్టీ మారుతారనే ఊహాగానాలు జిల్లాలో బలంగా వినిపిస్తున్నాయి. నిజానికి వచ్చే ఎన్నికల్లో ఆమె కర్నూలు లోక్‌సభ స్థానుంచి తిరిగి పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ సూర్య ప్రకాష్ ఎంట్రీతో రేణుకను పక్కనబెట్టాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. టీడీపీ టికెట్ ఇవ్వకపోతే పరిస్థితి ఎంటా అని ఆమె సతమవుతున్నారు. మరోవైపు కర్నూలులో కేయి, కోట్ల వర్గీయుల విభేదాలు భయపడపడుతున్న విషయం తెలిసిందే. -
‘అక్షయ గోల్డ్ బాధితుల పక్షాన పోరాడుతాం’
సాక్షి, కర్నూలు: అగ్రిగోల్డ్ బాధితులు పక్షాన పోరాడిన విధంగానే అక్షయ గోల్డ్ బాధితుల తరఫున కూడా వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. అక్షయ గోల్డ్ బాధితుల పక్షాన ప్రత్యేక అధ్యయన కమిటీ వేసి వారికి అండగా నిలుస్తామని ఆయన హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లాలో ఆదివారం జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీని బలోపేతం చేసేందుకు పార్టీ శ్రేణులంతా కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కర్నూల్ జిల్లా రీజినల్ కోఆర్డినేటర్‌గా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు. సమావేశంలో వేమిరెడ్డి మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో కర్నూలు జిల్లాల్లోని రెండు లోక్‌సభ స్థానాలతోపాటు 14 అసెంబ్లీ సీట్లను కూడా సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను పార్టీ కార్యకర్తలు, నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రజలతో పార్టీని సమన్వయ పరిచి ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపుకు కృషిచేయాలని పేర్కొన్నారు. జిల్లాలో మరిన్ని స్థానాలకు గెలిపించి వైఎస్ జగన్‌కు బహుమతిగా ఇస్తామని నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. -
‘నవరత్నలు చూసి ఓర్వలేకపోతున్నారు’
సాక్షి, కర్నూలు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాలుగున్నరేళ్లుగా బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నారని వైఎస్సార్సీపీ కర్నూల్ పార్లమెంట్ అధ్యక్షుడు బీ.వై రామయ్య విమర్శించారు. బీసీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. సోమవారం ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. మరోసారి బీసీలకు మోసం చేసేందుకే జయహో బీసీ కార్యక్రమం చేపట్టారని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ బీసీలకు చట్టసభల్లో తగిన స్థానం కల్పిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తారు. జగన్ ప్రకటించిన నవరత్నాలు చూసి చంద్రబాబు ఓర్వలేక పోతున్నారని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వంలో బీసీలపై జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఈ నెల 20న జిల్లాలో పెద్ద ర్యాలీని నిర్వహించి కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తున్నట్లు ప్రకటించారు. -
బ్యాంక్ ఉద్యోగిపై దారిదోపిడి దోంగలు దాడి
-
శ్రీశైలం ప్రాజెక్టుకి భారీ వరద
సాక్షి, కర్నూలు : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతికి కొనసాగుతోంది. ప్రాజెక్టు నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 883.40 అడుగులకు చేరింది. 2,17,627 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో వస్తుండగా.. 2,14,642 క్కూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 215 టీఎంసీలకు గాను, ప్రస్తుతం నీటి నిల్వ 207 టీఎంసీలకు చేరింది. మరో కొన్ని గంటల పాటు ఇదే వరద కొనసాగితే ప్రాజెక్టు నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుతుందని అధికారులు తెలిపారు. ప్రవాహం ఎక్కువగా ఉండడంతో బుధవారం అధికారులు నాలుగు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో దిగువన ఉన్న సాగర్‌కు నీటి ప్రవాహం చేరుతోంది. అటు గోదావరి పరివాహాక ప్రాంతాల్లోను కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ప్రాజెక్టులు నిండుకుండలా మారిన విషయం తెలిసిందే. దీంతో ఖరీఫ్ పంటకు నీటి కొరత ఉండదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
శ్రీశైలం ప్రాజెక్టుకి భారీ వరద
సాక్షి, కర్నూలు : శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలకు 3,36,503 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి ఇన్‌ఫ్లోగా వస్తుండగా, 1,03,792 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 874 అడుగులకు చేరింది. జలాశయం సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుత నిల్వ 180.28 టీఎంసీలకు చేరింది. మరికొన్ని గంటల పాటు ఇదే వరద కొనసాగితే ప్రాజెక్టు నీటి మట్టం పూర్తి స్థాయికి చేరే అవకాశం ఉందని అధికారుల తెలిపారు. -
‘వారికి మంత్రి పదవులు ఇవ్వడం సిగ్గుచేటు’
సాక్షి, తిరుపతి : అధికారుల అవినీతి కారణంగానే కర్నూలు క్వారీ ఘటనలో పదిమంది మరణించారని ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు పాలన అవినీతి మయంగా మారిందని మండిపడ్డారు. ఆయన సోమవారం తిరుపతిలో ఓ సమావేశంలో మాట్లాడుతూ.. అవినీతి సొమ్ముతో ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేశారని రామకృష్ణ మండిపడ్డారు. పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. -
మహిళ కోసం స్నేహితుడి హత్య
డోన్ టౌన్ : చెడు వ్యసనాలే అతడి ప్రాణం తీశాయి. పర స్త్రీ వ్యామోహంలో పడిన అతడు చివరకు స్నేహితుడి చేతిలోనే హతమయ్యాడు. బేతంచర్ల మండలం ఆర్ ఎస్ రంగాపురంలో ఆరు నెలల క్రితం జరిగిన హత్యకేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. డీఎస్పీ బాబాఫకృద్దీన్ బుధవారం తన కార్యాలయంలో కేసు వివరాలను వెల్లడించారు. గ్రామానికి చెందిన డేగల శేషు ప్రవర్తన సరిగా లేకపోవడంతో భార్య వదిలేసింది. దీంతో అతడు తల్లిదండ్రులతో కలిసి ఉండేవాడు. అదే గ్రామానికి చెందిన బోయసుదేపల్లె మధుతో స్నేహంగా మెలిగేవాడు. ఇద్దరు తాగుడుతోపాటు చెడు తిరుగుళ్లు తిరిగేవారు. ఈ క్రమంలో ఓ మహిళ విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో మధు శేషును ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం తన బంధువులు వెంకటేశ్వర్లు, సాంబశివుడుతో కలిసి హత్యకు ప్రణాళిక రూపొందించాడు. గతేడాది ఆగస్టు 17న శేషు తన ఇంటి సమీపంలోని ప్రభుత్వ పాఠశాల భవనంపై నిద్రిస్తుండగా ముగ్గురూ గొంతునులిమి ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో మధునే హత్య చేసినట్లు తేలింది. ఈ మేరకు నిందితులను మంగళవారం సాయంత్రం రంగాపురం పొలిమేరల్లో అరెస్లు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ కంబగిరిరాముడు, ఎస్ఐ తిరుపాల్ పాల్గొన్నారు. -
ఒక కోట వంద ప్రశ్నలు
-
జొన్నగిరి చేరుకున్న వైఎస్ జగన్ పాదయాత్ర
-
జనపథం - కర్నూలు జిల్లా
-
కర్నూలులో ఎమ్మెల్సీ పోలింగ్ ప్రారంభం
-
కర్నూలులో భారీ అగ్ని ప్రమాదం
-
సాక్షి చైతన్యపథం - కర్నూలు
-
తక్కువ ధరకు వజ్రం..
అయిజ: అసలే ఇది ఆఫర్ల కాలం. కస్టమర్లను ఆకట్టుకునే క్రమంలో వేలకొద్దీ కంపెనీలు లక్షల రకాల ఆఫర్లిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రూ. 50 లక్షల విలువైన వజ్రం రూ.15 లక్షలకే లభిస్తుందని ఓ వ్యాపారికి ఆఫర్ వచ్చింది. ఎంతో ఆశగా అడ్వాన్స్ సైతం చెల్లించిన ఆయన.. చివరికి ఎలా మోసపోయాడో మహబూబ్ నగర్ పోలీసులు వెల్లడించారు. కర్నూలు జిల్లా డోన్ కు చెందిన బాబన్న రియల్టర్. గత అక్టోబర్ 20న బాబన్న డ్రైవర్ గా పనిచేస్తున్న తిరుపతికి ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. రూ. 50 లక్షల విలువైన వజ్రాన్ని అమ్మాలనుకుంటున్నట్లు, రూ. 15 లక్షలకైనాసరే ఇచ్చేస్తామని ఫోన్ సారాంశం. ఇదే విషయాన్ని డ్రైవర్ తిరుపతి.. బాబన్నకు చెప్పాడు. అదేరోజు డీల్ కుదుర్చుకునేందుకు ఐదుగురు వ్యక్తులు డోన్ కు వచ్చారు. మొదట 5 లక్షలు అడ్వాన్స్ చెల్లిస్తే, వజ్రం ఇచ్చేలా డీల్ కుదిరింది. ఈ నెల 29న అడ్వాన్స్ మొత్తం అందుకున్న డైమండ్ గ్యాంగ్ పత్తాలేకుండా పారిపోయిన తర్వాతగానీ మోసపోయామని గ్రహించిన బాబన్న పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసుకు సంబంధించి మధ్యప్రదేశ్ కు చెందిన ఆకాశింగ్, పాపింగ్, శోకింగ్, శాంచర్, కమతిసింగ్, పెనుకుమార్, కసాత్సింగ్ అనే ఏడుగురిని శనివారం గద్వాల రైల్వే స్టేషన్ లో అరెస్ట్ చేసినట్లు గద్వాల డీఎస్సీ బాలకోటి తెలిపారు. -
పోలీసుల తనీఖీల్లో దొరికిన పేలుడు సామాగ్రి
-
పసికందు నరబలి!
కర్నూలు: మానవుడు సాంకేతికంగా ఎంత పురోగమిస్తున్నా.. సమాజంలో అట్టడుగున ఉన్న మూఢనమ్మకాలు ఏమాత్రం మారడం లేదు. తాజాగా ఈ అంధవిశ్వాసాలకు అభంశుభం తెలియని తొమ్మిది నెలల పసికందు బలైంది. కర్నూలు జిల్లా పత్తికొండలో క్షద్రపూజల పేరిట తొమ్మిది నెలల శిశువును నరబలి ఇచ్చిన ఘటన వెలుగుచూసింది. హంద్రీనీవ కాల్వ వద్ద చిన్నారి తల, మొండెం లభ్యమయ్యాయి. అంధవిశ్వాసాలకు చిన్నారిని బలి ఇవ్వడంపై స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతున్నది. -
జైళ్లను తలపిస్తున్న కార్పోరేట్ కాలేజీలు.
-
చెట్టును డీకొన్న వ్యాను, ఏడుగురికి గాయాలు
కర్నూలు: జిల్లాలోని ఎమ్మిగనూరు మండలం చెన్నాపురం వద్ద గురువారం టాటా మ్యాజిక్ వ్యాను అదుపు తప్పి చెట్టును డీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న ఏడుగురి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం అస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషయంగా ఉంది. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
టికెట్ల తొక్కిసలాటలో ఓ వ్యక్తి మృతి!
ఎమ్మిగనూరు: కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో విషాదం నెలకొంది. స్థానిక శివ థియేటర్ లో టికెట్ల కోసం తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఊపిరాడక ఒక వ్యక్తి మృతి చెందాడు. భారీ సంఖ్యలో అభిమానులు వస్తారని తెలిసినా.. థియేటర్ యాజమాన్యం తగిన ఏర్పాట్లు చేయడంలో నిర్లక్ష్యం వహించారని మృతుడి బంధువులు ఆరోపించారు. ప్రేక్షకులకు సరియైన ఏర్పాటు చేయడంలో విఫలం కావడం వల్లనే ఓ వ్యక్తి మరణానికి కారణమైందని పలువురు విమర్శిస్తున్నారు. థియేటర్ యాజమాన్య వైఖరి నిరసిస్తూ మృతదేహంలో బంధువు ఆందోళన చేపట్టారు. -
గ్రీన్‌ఫీల్డ్ సిటీగా రాజధాని
హైదరాబాద్: మౌళిక సదుపాయాలతో 40-50 వేల ఎకరాల్లో గ్రీన్‌ఫీల్డ్ సిటీగా రాజధానిని నిర్మించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్(సిడబ్ల్యూసి) సభ్యుడు మైసూరా రెడ్డి కోరారు. ప్రభుత్వం అఖిలపక్షంతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలన్నారు. న్యాయపరంగా కర్నూలును ఏపీ రాజధానిగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజధాని విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. టీడీపీ వైఖరిపై భవిష్యత్తులో మళ్లీ ఉద్యమాలు వచ్చే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. -
పేదరిక నిర్మూలనే లక్ష్యం: చంద్రబాబు
కర్నూలులో స్వాతంత్య్ర దిన వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర విభజన హేతుబద్ధంగా చేయలేదు. దీంతో చాలా సమస్యలొచ్చాయి. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలపై చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. విద్వేషాలు పెంచుకోవడం తెలుగు జాతికి మంచిది కాదు. హైదరాబాద్ ప్రతిష్టను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీదా ఉంది. తెలంగాణతో సహా పొరుగు రాష్ట్రాలతో సుహృద్భావ సంబంధాలకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నాం ఆర్థిక అసమానతలు లేని, ఆరోగ్యకరమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేస్తాం.. ఏటా ఒక్కో జిల్లాలో స్వాతంత్య్ర వేడుకలు నిర్వహిస్తాం మెగా సిటీలుగా విశాఖ, తిరుపతి, విజయవాడ.. జిల్లాకొకటి చొప్పున 13 స్మార్ట్ సిటీలు రాష్ట్రంలో 14 విమానాశ్రయాలు, 14 పోర్టుల అభివృద్ధి అక్టోబర్ 2 నుంచి సంక్షేమ పథకాల అమలు ‘ఎన్టీఆర్ ఆరోగ్య సేవ’గా ఆరోగ్యశ్రీ.. చికిత్స గరిష్ట పరిమితి రూ. 2 లక్షల నుంచి రూ. 2.5 లక్షలకు పెంపు ఎన్టీఆర్ సుజల పేరిట 2 రూపాయలకే 20 లీటర్ల నీరు వచ్చే నెల నుంచి ఉద్యోగులు, పాత్రికేయులకు హెల్త్‌కార్డులు.. చికిత్స గరిష్ట పరిమితి రూ. 2 లక్షలు ఆర్బీఐ అడ్డంకులు సృష్టించినా రుణాలు మాఫీ చేస్తాం ఒక్కో సంఘానికి రూ. లక్ష చొప్పున డ్వాక్రా రుణాల మాఫీ.. ఎస్సీ, ఎస్టీల ఇతర రుణాలూ మాఫీ కర్నూలు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: పేదరిక నిర్మూలనే లక్ష్యమని, ఆర్థిక అసమానతలు లేని, ఆరోగ్యకరమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో స్వాతంత్య్ర దిన తొలి వేడుకలను శుక్రవారం కర్నూలులోని ఏపీఎస్పీ పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీఎం చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వివిధ దళాల (కంటింజెంట్ల) నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ ఉత్సవాల్లో శాసన మండలి చైర్మన్ చక్రపాణి, డిప్యూటీ సీఎం కె.ఇ.కృష్ణమూర్తి, మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, గంటా శ్రీనివాసరావు, ఎంపీలు బుట్టా రేణుక, ఎస్పీవై రెడ్డి, సి.ఎం.రమేష్, ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, గౌరు చరిత, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బుడ్డా రాజశేఖరరెడ్డి, ఐజయ్య, బీసీ జనార్థన్‌రెడ్డి, జయనాగేశ్వరరెడ్డి, మాజీ మంత్రులు శిల్పామోహన్‌రెడ్డి, టి.జి.వెంకటేశ్, ఏరాసు ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో గవర్నర్ పాల్గొనలేదు. సీఎస్ ఐ.వై.ఆర్.కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడు సీఎంతోపాటు వేదిక మీద ఉన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. రాజధానిని రాష్ట్రానికి మధ్యలోనే ఏర్పాటు చేసినా, స్వాతంత్య్ర వేడుకలను ఏటా ఒక్కో జిల్లాలో నిర్వహిస్తాం జిల్లాకొక పర్యాటక ప్రాజెక్టు రూపొందిస్తాం. ప్రముఖ పుణ్యక్షేత్రాలను కలుపుతూ కొత్త టూరిజం సర్క్యూట్స్ ఏర్పాటు చేస్తాం విశాఖ, తిరుపతి, విజయవాడలను మిగతా 2వ పేజీలో ఠ మెగాసిటీలుగా, జిల్లాకొకటి చొప్పున 13 స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేస్తాం - 14 విమానాశ్రయాలు, 14 పోర్టులు అభివృద్ధి చేస్తాం. తద్వారా మన రాష్ట్రం నుంచి పెద్దఎత్తున ఎగుమతులు, దిగుమతులు చేయొచ్చు - అన్ని గ్రామాలకు రోడ్లు, అన్ని ఇళ్లకు కేబుల్, విద్యుత్, గ్యాస్ కనెక్షన్లు ఉండేలా చూస్తాం. పైప్‌లైన్ ద్వారా ఇళ్లకు గ్యాస్ ఇస్తాం - రాష్ట్రాన్ని సిలికాన్ ఆంధ్రప్రదేశ్‌గా మారుస్తాం. ప్రపంచంలోనే తొలి డిజిటల్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. జిల్లాకొక హైదరాబాద్, సైబరాబాద్‌ను అభివృద్ధి చేస్తాం. వచ్చే 5 సంవత్సరాల్లో 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం - రాజధాని పేరతో 13 జిల్లాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం జరుగుతోంది - అక్టోబర్ 2 నుంచి సంక్షేమ పథకాలను అమలు చేస్తాం - ఆరోగ్యశ్రీ పేరును ‘ఎన్టీఆర్ ఆరోగ్య సేవ’గా మారుస్తాం. చికిత్స గరిష్ట పరిమితిని రూ. 2 లక్షల నుంచి రూ. 2.5 లక్షలకు పెంచుతాం - ఎన్టీఆర్ సుజల పేరిట 2 రూపాయలకే 20 లీటర్ల నీటిని సరఫరా చేస్తాం - వ్యవసాయ ఉచిత విద్యుత్‌ను 7 గంటల విద్యుత్ 9 గంటలకు పెంచుతాం. అక్టోబర్ 2 నుంచి ఇళ్లకు, పరిశ్రమలకు నిరంతర విద్యుత సరఫరాను అమలు చేస్తాం - అసంపూర్తిగా ఉన్న సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం - వృద్ధాప్య పింఛన్లను రూ. 1,000కు, వికలాంగుల పింఛన్లను రూ. 1,500కు పెంచి అక్టోబర్ 2 నుంచి అమలు చేస్తాం. ఎన్టీఆర్ కేంటీన్లు కూడా అదే రోజున ప్రారంభిస్తాం. ఈ పథకం కింద రూ. 5కే భోజనం అందిస్తాం. తొలుత మూడు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసి తర్వాత మిగతా జిల్లాలకు విస్తరిస్తాం - ధరలను నియంత్రిస్తాం. ఇందుకోసం సీఎస్ అధ్యక్షతన పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేశాం - ఎన్టీఆర్ ప్రజా పంపిణీ పథకం ద్వారా పేదలకు చౌకగా నిత్యావసర సరకులు అందిస్తాం. ధరలు పెరిగితే ప్రభుత్వం జోక్యం చేసుకొని వాటిని తగ్గించడానికి చర్యలు చేపడుతుంది - ప్రభుత్వ ఉద్యోగులు, పాత్రికేయులకు హెల్త్ కార్డులు ఇస్తాం. చికిత్స గరిష్ట పరిమితి రూ. 2లక్షలుగా నిర్ధారించాం. వచ్చే నెల 1 నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది - రైతుల రుణాలు ఒక్కో కుటుంబానికి రూ. 1.5 లక్షల వరకు మాఫీ చేస్తాం. ఆర్బీఐ అడ్డంకలు సృష్టించినా రుణ మాఫీపై వెనక్కి తగ్గం. డ్వాక్రా రుణాలు సంఘానికి రూ. లక్ష చొప్పున మాఫీ చేస్తాం. ఎస్సీ, ఎస్టీలు తీసుకున్న ఇతర రుణాలనూ మాఫీ చేస్తాం. - ప్రతి ఇంట్లో కనీసం ఒక డ్వాక్రా గ్రూపు సభ్యురాలు ఉండేలా చర్యలు చేపడతాం. ఇసుక మైనింగ్‌ను డ్వాక్రా సంఘాలకే ఇవ్వనున్నాం - పింఛన్లు, రేషన్, స్కాలర్షిప్లు, పక్కా ఇళ్లతోపాటు అన్ని సంక్షేమ పథకాలూ ఆన్లైన్లోనే అమలుచేస్తాం. ఆధార్ ఎన్రోల్మెంట్ కూడా రాష్ట్రంలో దాదాపు నూరు శాతం పూర్తయింది - పేదలకు ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్లు మంజూరు చేస్తాం. ఒక కుటుంబం ఆనందంగా జీవించడానికి అనుకూలంగా పక్కా ఇంటిని మెరుగుపరుస్తాం - వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడంవల్ల కూలీల ఖర్చు తగ్గిస్తాం. భూసార పరీక్షలు చేసి, వ్యవసాయ దిగుబడులు భారీగా పెరిగేలా చర్యలు చేపడతాం - పోలవరం ప్రాజెక్టును నాలుగైదు సంవత్సరాల్లో పూర్తి చేస్తే రాష్ట్రంలో కరువు లేకుండా చేయవచ్చు - రాయలసీమను విత్తన రాజధానిగా, పరిశ్రమల హబ్‌గా మారుస్తాం. సీమలో జాతీయ, రాష్ట్ర రహదారులు నిర్మించి సమీపంలోని ఓడరేవులతో అనుసంధానం చేసి 4 జిల్లాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం. కర్నూలు - ప్యాపిలి - పోరుమామిళ్ల - కృష్ణపట్నం, కర్నూలు - నంద్యాల - గిద్దలూరు - గుంటూరు మధ్య 6 లేన్ల రోడ్లు నిర్మిస్తాం - పరిశ్రమలు, పెట్టుబడులే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తాయి. ఇందుకోసం ప్రభుత్వం అన్ని ప్రోత్సాహకాలను అందిస్తుంది - పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. మధ్యాహ్న భోజన పథకంలో లోపాలను సవరించి మరింత మెరుగ్గా అమలు చేస్తాం. - త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం. ఇకపై ఏటా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తాం - బీసీల సంక్షేమానికి సబ్ ప్లాన్ అమలు చేస్తాం. కాపులు, బలిజలను బీసీల్లో చేర్చే అంశాన్ని పరిశీలించడానికి బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తాం. అగ్రవర్ణాల్లో పేదలనూ ఆదుకుంటాం - శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడం. అరాచక శక్తులను, శాండ్, లాండ్, మైన్, వైన్ మాఫియాలను అణచివేస్తాం. బెల్టు షాపుల నిర్మూలనకు చర్యలు చేపట్టాం. మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నాం - సమైక్య ఉద్యమంలో పాల్గొన్నవారి మీద పెట్టిన కేసులు దశలవారీగా ఎత్తేస్తాం - రూ. 15 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. కొత్త రాష్ట్రంలో పునాదుల నుంచి నిర్మాణం మొదలుపెట్టాలి. మనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో అంతకు మించిన వనరులూ ఉన్నాయి. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తాం. అన్ని వనరులు, అవకాశాలను వాడుకొని స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మిద్దా. ఇందులో ప్రజల సహకారం చాలా అవసరం. మీ అండదండలు నాకు ఇవ్వండి - దేశ విదేశాల్లో ఉన్న రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్తలు, వృత్తి నిపుణులూ (ఎన్నారైలు) మాతృభూమికి రండి. ప్రపంచాన్ని అబ్బురపరిచే విధంగా రాష్టాన్ని నిర్మించుకుందాం -
శ్రీశైలం డ్యాంను ముట్టడించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 69 రద్దు చేయాలనే డిమాండ్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శ్రీశైలం డ్యామ్‌ను ముట్టడించారు. రైతుల శ్రేయస్సు కోసం, కర్నూలు జిల్లాకు తాగునీరు అందించేందుకు ఎంతకైనా పోరాటం కొనసాగిస్తామని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. శ్రీశైలం నీటిమట్టం 854 అడుగులు ఉండేలా చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు విజ్క్షప్తి చేశారు. కృష్ణా వాటర్ బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
రాజధానిపై రోజుకో ప్రకటన వెనుక కారణాలు?
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మించే ప్రదేశం ఎక్కడన్న దానిపై ప్రభుత్వంలో ఉన్నవారే రోజుకోరకంగా మాట్లాడటం, తేపకో లీక్ ఇవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని నిర్మించే ప్రాంతాన్ని సూచించడానికి కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఓ పక్క రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఆ కమిటీ నివేదిక ఇవ్వడానికి ఇంకా సమయం ఉంది. మరో పక్క రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం సలహాలు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ అధ్యక్షతన ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ సభ్యులు రాజధాని నిర్మాణానికి సంబంధించి అధ్యయనం చేయడానికి సింగపూర్, మలేషియా వెళ్లనున్నారు. ఈ ప్రక్రియ ఓ పక్క జరుగుతుండగా ప్రభుత్వంలో ఉన్నవారు, అధికార పార్టీ సీనియర్ నేతలు తలా ఒక రకంగా మాట్లాడుతున్నారు. గుంటూరు-విజయవాడ మధ్య - కృష్ణా జిల్లా నూజివీడు - ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతం - అంతర్జాతీయ స్థాయిలో రాజధాని నిర్మాణం - అందరికి అందుబాటులో ఉండే ప్రదేశం - అన్ని వసతులు ఒకే చోట ... అని రకరకాలుగా చెబుతున్నారు. ఎక్కువగా విజిటిఎం(విజయవాడ-తెనాలి-గుంటూరు-మంగళగిరి) ప్రాంతం పేరు వినవస్తోంది. ప్రభుత్వంలో ముఖ్య నేతలు కూడా ఈ ప్రాంతం పేరునే చెబుతున్నారు. అయితే ఈ ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి తగినంత భూమి లేదు. ఎక్కవగా భూమిని ప్రైవేటు వ్యక్తుల వద్ద నుంచి సేకరించవలసి ఉంది. ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతం, రాయలసీమలలో ప్రభుత్వ భూములు తగినంత ఉన్నాయి. అయితే ఆ ప్రాంతాలలో ఇతర మౌలిక వసతులు తగిన స్థాయిలో లేవన్న అభిప్రాయం ఉంది. మరో పక్క శ్రీభాగ్ ఒప్పందాల ప్రకారం ఆంధ్రరాష్ట్ర రాజధాని కర్నూలుని రాజధాని చేయాలని రాయలసీమ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ ఉద్యమరూపం కూడా దాల్చుతోంది. ఇంకోపక్క రాజధాని నిర్మాణానికి ప్రభుత్వ భూములు ఉన్న ప్రదేశమైతే మేలని కొందరు సూచిస్తున్నారు. ఈ పరిస్థితుల నేపధ్యంలో తలా ఒక రకంగా చెప్పడంతో ఒక స్పష్టతరాలేదు. దాంతో ప్రజలు అయోమయంలో పడుతున్నారు. అధికారంలో ఉన్న ముఖ్యులే రోజుకో ప్రదేశం పేరు చెప్పడంతో ఆయా ప్రాంతాలలో భూముల ధరలకు రెక్కలొచ్చేశాయి. రాజకీయ నేతలు, వ్యాపారులు అవకాశం ఉన్నమేరకు ఆయా ప్రాంతాలలో భూములు కొనిపెట్టుకున్నారు. బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు దండిగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికే బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు భారీగా లాభపడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభాలు వచ్చే విధంగా మంత్రులు ప్రకటనలు చేస్తున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. కొందరు నేతలు తమ భూములు అమ్ముకోవడానికి ఈ ప్రాంతంలోనే రాజధాని ఏర్పడబోతుందని ప్రచారం చేస్తున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. మరోవైపు పరిశీలిస్తే ఇప్పుడు ప్రచారం జరుగుతున్న ప్రాంతాలలో భూముల అమ్మకాలు కొనుగోలులు విపరీతంగా జరుగుతున్నాయి. అక్కడ ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయించిన ధరలు ఎకరం రెండు లక్షలు, మూడు లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఎకరం 50 లక్షల రూపాయల నుంచి మూడు కోట్ల రూపాయల వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. అయినా ప్రభుత్వ ధరల ప్రకారమే రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లిస్తున్నారు. ఆ విధంగా ప్రభుత్వానికి రావలసిన రాబడులు కూడా రావడంలేదు. రాజధాని నిర్మించే ప్రదేశాన్ని అధికారికంగా ప్రకటించేవరకు మంత్రులు తమ ఇష్టం వచ్చిన రీతిలో ప్రజలను అయోమయంలో పడవేసే విధంగా మాట్లాడకుండా ఉంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుంతోంది. - శిసూర్య -
డీఎస్పీ ఆఫీస్ లో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
కర్నూలు: వీఆర్‌కు పంపడంపై మనస్తాపం చెందిన మహిళా హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన కర్నూలులోని డీఎస్పీ కార్యాలయంలోని చోటు చేసుకుంది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన లలితమ్మ పరిస్థితి విషమంగా మారడంతో చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కర్నూలులో పోలీస్ కానిస్టేబుళ్లను మూకుమ్మడిగా అధికారులు వీఆర్‌కు పంపడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. -
ఓటర్ల షాక్ తో 'కోట్ల'వారు సేద్యానికి ఓటేశారు!
రాష్ట్ర విభజన అంశం గత ఎన్నికల్లో ప్రజలిచ్చిన షాక్ తో కాంగ్రెస్ పార్టీ నేతల జాతకాలు తారమారయ్యాయి. కేంద్ర ప్రభుత్వంలో కీలక శాఖతోపాటు కర్నూలు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి తాజా ఎన్నికల్లో దారుణమైన పరాజయం ఎదురవ్వడంతో ప్రస్తుతం వ్యవసాయం చేసుకుంటూ ఉపశమనం పొందుతున్నారు. కర్నూలు రాజకీయ చరిత్రలో కోట్ల కుటుంబానికి ఊహించని ఓటమి ఎదుర్వడంతో దేశరాజధానిలోని అధికార నివాసాన్ని ఖాళీ చేశారు. ఢిల్లీలో తన స్నేహితులకు భారీ విందును కూడా ఏర్పాటు చేశారు. ఈ విందుకు సుమారు ఓ 500 మందిని ఆహ్వానించారు కూడా. ఓటమి తర్వాత ఢిల్లీ నుంచి మకాం మార్చి కర్నూలులోని లద్దగిరికి సమీపంలో వెల్దుర్తిలో వ్యవసాయ పనుల్లో బిజీగా గడుపుతున్నట్టు తెలుస్తోంది. పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా బాధ్యతల్ని చేపట్టిన వ్యవసాయాన్ని వదులుకోలేదని ఓ ఆంగ్ల దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాను 50 ఎకరాల్లో మామిడి తోటలో సేద్యం చేస్తున్నానని, 25 రకాల మామిడి పండ్లను పండిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఆయన గతంలో రెండు ఆవులను కొన్నామని.. ప్రస్తుతం ఫామ్ హౌజ్ లో కనీసం 100 ఆవులన్నాయని తెలిపారు. అయితే రాజకీయంగా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్న కోట్ల కుటుంబం.. ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తాయనే ఆశతో ఎదురు చూస్తున్నారు. గత ఎన్నికల్లో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సతీమణి భార్య సుజాతమ్మ కూడా ఓటమి పాలయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సీమాంధ్రలో పార్టీని కాంగ్రెస్ పణం పెట్టిందని.. అయితే తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ లాభపడకపోవడం ఆయన ఆశ్యర్యం వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పరిస్థితులు మారుతాయని కోట్ల అభిప్రాయం వ్యక్తం చేశారు. -
గంగుల ప్రభాకరరెడ్డిపై కేసు నమోదు
కర్నూలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతపై దాడి కేసులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి గంగుల ప్రభాకర్ రెడ్డిపై ఆళ్లగడ్డ పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం జరిగిన పోలింగ్ సందర్భంగా ఆళ్లగడ్డలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత కుమార్ రెడ్డిపై గంగుల ప్రభాకరరెడ్డితోపాటు ఆయన అనుచరులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈకేసులో గుంగుల ప్రభాకరరెడ్డితోపాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. టీడీపీ నేతలు విజయేంద్రానాథ్రెడ్డి, సుభాష్‌రెడ్డి, గంగులా విజయసింహారెడ్డిలతోపాటు మరో ఇద్దరి పేర్లను ఈ కేసులో చేర్చారు. కుమార్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఆళ్లగడ్డ పోలీసులు తెలిపారు. -
మాజీ ఎమ్మెల్యే మసాల ఈరన్న కన్నుమూత
ఆలూరు, మాజీ ఎమ్మెల్యే, ైవైఎస్సార్సీపీ నేత మసాల ఈరన్న(78) కర్నూలుజిల్లా ఆలూరులో గురువారం ఉదయం కన్నుమూశారు. దీర్ఘకాలంగా ఆయన ఆయాసం, దగ్గుతో బాధపడుతున్నారు. తన స్వగృహం నుంచి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుని తిరిగొచ్చిన కొద్ది సేపటికే స్పృహ తప్పి పడిపోయారు. అయితే, మొదట నిద్రపోతున్నాడని భావించిన ఆయన భార్య.. తర్వాత ఎంతసేపటికీ లేవకపోవడంతో ఇరుగుపొరుగువారిని పిలవగా వారు వచ్చి చనిపోయినట్లు నిర్ధారించారు. ఈరన్న ఆలూరు ఎస్సీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రెండుసార్లు(1978, 1985) టీడీపీ తరఫున (1994) ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1987లో జిల్లాపరిషత్ చైర్మన్‌గా గెలుపొంది 1992 వరకు పనిచేశారు. తిరిగి 1999 ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. 2007లో కాంగ్రెస్‌లోకి వచ్చి ఆలూరు మండలం జెడ్పీటీసీ సభ్యునిగా గెలుపొందారు. అయితే ఆయనకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి దక్కకపోవడంతో జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఈయన వైఎస్సార్సీపీలో కొనసాగుతున్నారు. చంద్రబాబు సంతాపం: మసాల ఈరన్న మృతికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్ ైచైర్మన్‌గా ప్రజాసేవలో అంకితమయ్యారని కొనియాడారు. మసాల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. -
రాయలసీమ రాజకీయ ‘శోభ’
నిజానికి ఆమె సేవలు నేడు రాష్ట్రానికి ఎంతో అవసరం. ప్రత్యేకంగా రాయసీమలో, విభజన నేపథ్యంలో సమర్థులైన నేతల అవసరం ఎంతో ఉందన్న మాట కాదనలేనిది. కానీ శోభానాగిరెడ్డి అలాంటి సేవలు అందించకుండానే చిన్నతనంలోనే సీమను విడిచి వెళ్లిపోయారు. శోభా నాగిరెడ్డి అంటే..చిరునవ్వుకు, సమర్ధతకు, పట్టుదలకు, విశ్వసనీయతకు మారుపేరు. సహజ సిద్ధమైన శాంత స్వభావంతో కూడిన సీమ అంత ః సౌందర్యం శోభా నాగిరెడ్డిని చూసినప్పుడు తలపునకు వచ్చేది. ఫ్యాక్షన్ నేపథ్యమున్న కర్నూలు జిల్లాలో, అతి సున్నితమైన ఆళ్లగడ్డ, డోన్, పత్తికొండ, కర్నూలు ప్రాంతాలలో పుట్టినింటికీ, మెట్టినింటికీ వన్నె తేవడం శోభా నాగిరెడ్డిలో గమనించగలం. సీమలో ఫ్యాక్షనిజం తప్ప ఇంకేమీ లేదనీ, సీమవాసులంటే క్రూరులు, దయాదాక్షిణ్యాలు లేనివారనీ, బాంబు సంసృ్కతి తప్ప వేరొకటి తెలియనివారనీ హత్యలు, ద్వేషాలు మినహా వేరేవీ అక్కడ లేవనే అపోహలూ, భావనలూ శోభా నాగిరెడ్డి వ్యక్తిత్వం ముందు తలొంచాయి. శోభా నాగిరెడ్డి నాయకత్వ లక్షణాలు గమనించిన వారికి అవన్నీ ఎంత దారుణమైన కల్పనలో అవగతమవుతుంది. రాయలసీమ నాయకులలో ఇంత చక్కటి వాగ్ధాటి, సరళమైన వ్యక్తీకరణ, తెలుగుదనం, కృష్ణమ్మ పరవళ్ల లాగా, గోదావరి గలగల లాగా, కోనసీమ పచ్చదనం లాగా శోభాయమనంగా కన్పించే అరుదైన వ్యక్తిత్వం శోభానాగిరెడ్డిది. ఆమె పెద్ద చదువులు చదవలేదు. కానీ సామాన్యంగా కన్పిస్తూ వైవిధ్య, వైరుధ్య వ్యక్తిత్వం గల భిన్నమైన రాజకీయ వ్యవస్థల మధ్య తనకు నచ్చిన పార్టీకి మాత్రమే సన్నిహితంగా కొనసాగుతూనే పార్టీలకు, వర్గాలకూ అతీతంగా అందరి మన్నన పొందిన అరుదైన నేత ఆమె. పార్టీ ఏదైనా -తెలుగుదేశం, ప్రజారాజ్యం, వైఎస్సార్సీపీ- నాయకత్వం అప్పచెప్పిన బాధ్యతలను సమర్థవంతంగా నేరవేర్చిన నేర్పరి శోభ. ఆర్టీసీ ఛైర్మన్‌గా పనిచేసి కడు సమర్థవంతంగా నెగ్గుకొచ్చారు. తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీల తరఫున శాసనసభ్యురాలిగా పనిచేసి, చివరిగా వైఎస్సార్సీపీలో తన ప్రయాణం సాగిస్తూ, కర్తవ్య నిర్వహణలోనే కన్నుమూశారు. వైఎస్ మరణానంతరం ప్రజారాజ్యం పార్టీని వీడి జగన్మోహన్రెడ్డి స్థాపించిన వైఎస్సార్సీపీలో చేరి, క్రమశిక్షణ కలిగిన నేతగా వ్యవహరించారు. పార్టీలో ముఖ్యనేతగా ఎదిగి శాసన సభ్యుత్వం వదులుకుని, తిరిగి గెలిచి జగన్ కుటుంబం ఆదరణకు నోచుకున్నారు. వైఎస్ కుటుంబాన్ని అభిమానించే ప్రతి కుటుంబం ఓ అక్కను, ఓ ఆడపడుచునుపొగొట్టుకున్నామన్నట్టు బాధపడడం కనిపిస్తున్నది. ఒక రాజకీయ నేత మరణం ఇంతగా కదిలించడం అరు దు. ఏ పార్టీకి చెందినవారైనా ఆమె మరణం పట్ల ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో మహిళల ప్రాతినిద్యం రాజకీయాల్లో పెరుగుతున్నది. ఇది ఆహ్వానిం చదగిన పరిణామం. రాజకీయ వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెరగాలి. అలాగే రాజకీయ వ్యవస్థలోకి వచ్చిన మహిళలు శక్తిసామర్థ్యల్లో పురుషులకు తీసిపోమని కూడా నిరూపించుకోవాలి. ప్రస్తుత పురుషాధిక్య సమాజంలో అధికార రాజకీయాల్లో మహిళలు వ్యక్తిత్వం నిలుపుకోవడం అంత సులభం కాదు. ఇలాంటి గహనమైన సమస్యను శోభానాగిరెడ్డి ఎలా అధిగమించారో నేడు రాజకీయాలలోకి వస్తున్న మహిళలందరూ గమనించాలి. నిజానికి ఆమె సేవలు నేడు రాష్ట్రానికి ఎంతో అవసరం. ప్రత్యేకంగా రాయసీమలో, విభజన నేపథ్యంలో సమర్థులైన నేతల అవసరం ఎంతో ఉందన్న మాట కాదనలేనిది. కానీ శోభానాగిరెడ్డి అలాంటి సేవలు అందించకుండానే చిన్నతనంలోనే సీమవాసులను విడిచి వెళ్లిపోయారు. శోభానాగిరెడ్డి శక్తియుక్తులు ఎన్నో సందర్భాలలో రుజువైనాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గత 3 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కొనడంలో అగ్రభాగాన నిలిచి వైఎస్ కుటుంబాన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనీ, జగన్మోహన్రెడ్డినీ సమర్థించి నిలిచిన నేత శోభానాగిరెడ్డి. ఇవాళ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు శరవేగంతో మారిపోతున్నాయి. ప్రజలు జగన్‌రెడ్డికీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి హారతి పడుతున్నారు. దీనిని చూడలేని ప్రత్యర్థులు కూడా హద్దు మీరుతున్నారు. కానీ, ఈ విపరిణామాలను ఎదిరించి నిలిచేందుకు సన్నద్ధమైన ఒక యోధురాలు నిన్న ప్రమాదంలో మరణించింది. అదే విషాదం. ఏ ఆశయం కోసమైయితే శోభానాగిరెడ్డి చివరి నిమిషం వరకు పోరాడారో ఆ పోరాటం మనందరికీ స్పూర్తి కావాలి. వైఎయస్సార్సీపీ అధికారంలోకి రావాలని ఆమె కలగన్నారు. అది నెరవేరాలి. ఆ కలను సార్థకం చేయడమే శోభానాగిరెడ్డికి అర్పించే నిజమైన నివాళి. ఇమామ్ (వ్యాసకర్త ‘కదలిక’ ఎడిటర్) -
చిరునవ్వు ఆమెకో వరం
శోభా నాగిరెడ్డి నా కోడలు. శోభా నాగి రెడ్డితో నాకున్న అనుబంధం ఇప్పటిది కాదు. శోభ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. నేను 1983లో టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన సమ యంలో శోభ తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డి కర్నూలు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్. ఆయనే ‘మీ అత్త’ అంటూ నన్ను శోభకు పరి చయం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ నేను ఎక్కడ కనిపించినా అత్తయ్యా బాగున్నారా అని ఆత్మీయంగా పలకరించేది. నా భర్త గురించి అడిగేది. సుబ్బారెడ్డి 1989లో కాం గ్రెస్‌లో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అపుడు నేను కూడా ఎమ్మెల్యేనే. శోభ భర్త భూమా నాగిరెడ్డి, బావ వీర శేఖరరెడ్డి కూడా నాతో పాటు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. దీంతో శోభతో సాన్నిహిత్యం మరింత పెరి గింది. ఆ తరువాత నేను టీడీపీలో చేరాను. అప్పటి నుంచి మరింత సన్నిహితంగా మెలిగే వాళ్లం. శోభ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ చైర్‌పర్సన్‌గా కూడా పనిచేశారు. నేను తెలు గుమహిళ అధ్యక్షురాలిగా పనిచేశాను. ఈ సమయంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చేపట్టాల్సిన ఆందోళన కార్యక్ర మాలు, ప్రభుత్వ పరంగా మహిళల సంక్షే మం కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చిం చుకునే వాళ్లం. శోభా నాగిరెడ్డి అక్క కుమార్తె, ప్రస్తుతం గుంటూరు జిల్లా వినుకొండ అసెం బ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నా కుమార్తె నన్నపనేని సుధ బెంగళూరు వైద్య కళాశాలలో సహధ్యాయులు. ఈ విధంగా కూడా మా మధ్య సాన్నిహిత్యం ఎక్కువగా ఉండేది. నేను నిర్వహించే ప్రతి ఎగ్జిబిషన్‌కు శోభ హాజర య్యేది. రాజకీయాల్లోకి మహి ళలు రావటం తక్కువ. వచ్చినా రాణించిన వారు ఇంకా తక్కువ. ఇక రాయలసీమలో మహిళలు రాజకీయాల్లో రాణించటమంటే కత్తిమీద సామే. అలాంటిది శోభ బాగా రాణించింది. ఆమెది కష్టపడే తత్వం. మంచి వక్తగా పేరు తెచ్చుకుంది. ఎపుడూ నవ్వుతూ, సంప్రదాయబద్ధంగా కనపడేది. చిరునవ్వే శోభకు వరం. స్నేహానికి ప్రాణమిచ్చేది. శోభ మరణం బాధాకరం. (వ్యాసకర్త ఎమ్మెల్సీ) -
ఆఖరి క్షణం వరకూ జనం కోసం... జనం నడుమ
-
చివరి శ్వాస వరకు ప్రజల కోసమే...
రాష్ట్ర రాజకీయాల్లో తనదైన సేవా మార్గంతో ప్రజలను ఆకట్టుకున్న శోభానాగిరెడ్డి చివరి శ్వాస వరకు ప్రజాసేవకే అంకితమయ్యారు. కర్నూలు జిల్లా రాజకీయాలతో, ప్రజలతో శోభనాగిరెడ్డికి ఎనలేని అనుబంధం ఉంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా షర్మిలతో కలిసి బుధవారం అర్ధరాత్రి వరకు శోభానాగిరెడ్డి ప్రజలతో మమేకమయ్యారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి 1996 లో అడుగుపెట్టిన శోభానాగిరెడ్డి ప్రజాసమస్యలపై అలుపెరగని పోరాటం చేశారు. తెలుగుదేశం పార్టీ తరపున 1997లో ఆళ్లగడ్డకు జరిగిన ఉపఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో మరోదఫా టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆతర్వాత చోటు చేసుకున్న పరిణామాల మధ్య తెలుగుదేశం పార్టీ వీడి చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ప్రజారాజ్యం పార్టీ తరఫున రాయలసీమలో గెలిచిన ఏకైక మహిళా ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి కావడం విశేషం. పార్టీ, చిరంజీవి ప్రభావం వల్ల కాకుండా, వ్యక్తిగత పరపతి కారణంగానే ఎన్నికల్లో విజయం సాధించారు. వేదిక ఏదైనా కాని.. రైతుల సమస్యలు, విద్యార్ధుల స్కాలర్ షిప్, ప్రజా ఆరోగ్యం, ఇంకా ఏ అంశమైనా శోభానాగిరెడ్డి ముందుడి తన గళాన్ని వినిపించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బాసటగా నిలిచారు. వైఎస్ జగన్ ఆలోచన విధానాన్ని, పార్టీ మార్గదర్శకాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలోనూ శోభానాగిరెడ్డి కృషి ఎనలేనిది. ప్రజా వ్యతిరేక విధానాలపై, ప్రతిపక్ష పార్టీల వ్యవహారతీరును, అధికార పక్ష విధానాలను ఎండకట్టడంలో తనదైన దూకుడును ఆమె ప్రదర్శించారు. రాజకీయం అనూహ్యం ఎదుగుతున్న మహిళానేతగా పేరు తెచ్చకుంటున్న తరుణంలో అతి చిన్న వయస్సులో ప్రజలకు, పార్టీకి, కుటుంబానికి భౌతికంగా దూరమయ్యారు. అయితే ఆమె గళం మూగపోవచ్చు.. వినిపించకపోవచ్చుకాని.. భవిష్యత్ రాజకీయాలకు శోభానాగిరెడ్డి స్పూర్తిగా నిలుస్తుందనేది ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని ఆళ్లగడ్డకు బయలుదేరిన శోభానాగిరెడ్డి దురదృస్టవశాత్తూ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన శోభానాగిరెడ్డిని కేర్ ఆస్పత్రికి తరలించగా.. గురువారం ఉదయం 11.05 మరణించారు. -
విషాదంలో కర్నూలు జిల్లా వాసులు!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శోభానాగిరెడ్డి మరణవార్తతో కర్నూలు జిల్లా వాసులు విషాదంలో మునిగిపోయారు. సన్నిహితులు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. చివరి శ్వాస వరకు శోభానాగిరెడ్డి ప్రజల కోసం సేవలందించారు. బుధవారం రాత్రి వరకు కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఉన్నారు. నిన్న షర్మిలతో కలిసి ర్యాలీలో పాల్గోన్న శోభానాగిరెడ్డి లేరనే వార్తను ఆళ్లగడ్డ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. 1997 లో ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి శోభానాగిరెడ్డి ప్రజాసేవకు అంకితమయ్యారు. నిత్యం జనం కోసం తపించే శోభానాగిరెడ్డి భౌతికంగా దూరమయ్యారనే వార్త వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులను శోక సముద్రంలో మునిగిపోయారు. బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శోభానాగిరెడ్డి తీవ్రంగా గాయపడటంతో హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. గురువారం ఉదయం 11.05 గంటకు మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. -
రాష్ట్రంలో మండుతున్న ఎండలు
హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటింది. అనంతపురంలో 41 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండగా, హైదరాబాద్‌లో 39.1 డిగ్రీలు ఉంది. రాష్ట్రంలో ఇతర నగరాలు, పట్టణాలలో ఉష్ణోగ్రత ఈ దిగువ తెలిపిన విధంగా ఉంది. కాకినాడ - 36.5 డిగ్రీల సెంటీగ్రేడ్ కర్నూలు - 41.7 నెల్లూరు - 40.6 నిజామాబాద్ - 40.1 రామగుండం - 41 తిరుపతి - 41.8 విజయవాడ - 39.8 విశాఖపట్నం - 32.4 -
రక్తమోడిన దేవరగట్టు
దసరా సందర్భంగా కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టులో సోమవారం అర్ధరాత్రి నిర్వహించిన బన్ని ఉత్సవాలు రక్తమోడాయి. వెయ్యిమంది పోలీసులు బందోబస్తు నిర్వహించినా కర్రల సమరం యథేచ్ఛగా నిర్వహించారు. బన్ని సమరంలో 34 మందికిపైగా భక్తులు గాయపడగా వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సమరాన్ని అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపైనా కొందరు కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. దీంతో 15 మంది పోలీసులు గాయపడ్డారు. జిల్లా ఎస్పీ అక్కడే మకాంవేసి బందోబస్తు నిర్వహించినా లాభం లేకపోయింది. దేవరగట్టుపై కొలువైన మాత మాళమ్మ, మల్లేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని సోమవారం అర్ధరాత్రి ఘనంగా నిర్వహించారు. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా భక్తులు వచ్చారు. కల్యాణోత్సవం తర్వాత మాత, స్వామి వారి ఉత్సవ విగ్రహాలతో పల్లకోత్సవం గట్టు దిగువకు చేరింది. అంతలోనే వేలాదిమంది భక్తులు ఇనుప రింగులు తొడిగిన వెదురు కర్రలు, భగభగ మండే దివిటీలతో కేకలు వేస్తూ ఒక్కసారిగా ప్రత్యక్షమై పల్లకోత్సవం చుట్టూ చేరారు. తమ ఇలవేల్పుకు రక్షణ కల్పించే సంప్రదాయంలో భాగంగా కర్రలతో పరస్పరం కొట్టుకున్నారు. -
ఉల్లిని వీడని ధరల ‘తెగులు’
తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ : ఉల్లిలొల్లి తగ్గడం లేదు. ధరలు దిగిరాకుండా ఏదో ఒక ప్రతికూలత ఎదురవుతోంది. తగ్గుముఖం పట్టాల్సిన తరుణంలో ఉల్లిధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రాష్ట్ర ప్రజల అవసరాలను అధికంగా తీర్చే కర్నూలు ఉల్లికి వైరస్ సోకడంతో సరుకు మార్కెట్‌కు వచ్చినా కొనుగోలు చేసే పరిస్థితి లేదు. మంచిగా ఉన్న కొద్దిపాటి సరుకుకు డిమాండ్ ఏర్పడడంతో ధరలు తగ్గుముఖం పట్టడం లేదు. కర్నూలు ఉల్లికి ప్రధాన మార్కెట్ తాడేపల్లిగూడెం. కర్నూలులో మార్కెట్ ఉన్నప్పటికీ ఆ జిల్లా రైతులు తమ పంటను తాడేపల్లిగూడెం మార్కెట్‌కు తీసుకువచ్చే విక్రయిస్తూఉంటారు. 15 రోజుల క్రితం వరకు కర్నూలు ఉల్లికి మంచి ధర లభించడంతో రైతుల కళ్లల్లో ఆనందం తొణికిసలాడింది. వరుసగా వచ్చిన అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాల కారణంగా కురుస్తున్న భారీ వర్షాలు వారి ఆనందంపై నీళ్లు చల్లాయి. వర్షాలు ప్రారంభమైన రెండురోజులపాటు మార్కెట్‌కు తడిసిన ఉల్లి వచ్చినా మంచి ధరకు వెంటనే అమ్ముడయింది. వర్షాలు కురుస్తున్న కారణంగా వైరస్ సోకి ఉల్లి ఎక్కువ కాలం నిల్వ ఉండడం లేదు. రెండు మూడు రోజులకే కుళ్లిపోతుండడంతో వ్యాపారులు కొనుగోలు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో కర్నూలు నుంచి సరుకులు వచ్చినా రైతుకు ఆశించిన మేరకు ధర రావడం లేదు. గత ఆదివారం తాడేపల్లిగూడెం మార్కెట్‌కు 200 లారీల సరుకు రాగా, రూ.40 ధర పలికింది. ఈ ఆదివారం 70 లారీలు మాత్రమే రావడంతో రిటైల్ మార్కెట్‌కు ధర రూ.55కు చేరుకుంది. ఈ ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆప్ఘనిస్థాన్ నుంచి దిగుమతి తాడేపల్లిగూడెం మార్కెట్లో మహారాష్ర్ట ఉల్లి జాడే కన్పించడం లేదు. అక్కడి మార్కెట్లోనే ఉల్లికి క్వింటాల్ ధర రూ.5,500 పలుకుతోంది. ఇక్కడకు తీసుకురావాలంటే రవాణా ఖర్చుల భారం మరో 500 పడుతుండడంతో రైతులు అక్కడే విక్రయిస్తున్నారు. గుత్త మార్కెట్లోనే క్వింటాలు రూ. 6 వేలు కావడంతో, రిటైల్ మార్కెట్లో కిలో రూ.70 అమ్మితేగానీ గిట్టుబాటు కాని పరిస్థితి ఉంది. దీంతో మహారాష్ట్ర ఉల్లిని మార్కెట్‌కు తీసుకురావడం లేదు. ఉల్లి అవసరాలను తీర్చుకోడానికి చైనా, పాకిస్తాన్, ఆప్ఘనిస్థాన్ దేశాల నుంచి దిగుమతికి ఇక్కడి వ్యాపారులు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ప్రస్తుతం ఆప్ఘనిస్థాన్ నుంచి ఉల్లిని దిగుమతి చేసుకుంటున్నట్టు పట్టణానికి చెందిన నాఫెడ్‌లో సభ్యత్వం కలిగిన వ్యాపారి ఒకరు తెలిపారు. దేశంలోని మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాలు మినహా మిగిలిన రాష్ట్రాల మార్కెట్లలో ఉల్లి ధర మండిపోతోంది. హిమాచల్‌ప్రదేశ్‌లో అధికంగా క్వింటాలు ఉల్లి ధర రూ.8 వేల వరకు ఉండగా, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, గుజరాత్, నాగాలాండ్, జార్ఖండ్, కర్ణాటక రాష్ట్రాల్లో క్వింటాలు రూ.3,500 నుంచి రూ.7,500 వరకు పలుకుతోంది. కొత్త సరుకు మార్కెట్‌కు వచ్చే వరకు ఉల్లి లొల్లి తగ్గేలా కన్పించడం లేదు. -
తులసి రెడ్డిపై న్యాయవాదుల దాడి
కర్నూలు: 20 సూత్రాల అమలు పథకం చైర్మన్ ఎన్.తులసిరెడ్డికి కర్నూలులో చేదు అనుభవం ఎదురైంది. సమైక్యాంధ్రవాదులైన న్యాయవాదులు అతనిపై దాడి చేశారు. అతని వాహనం ధ్వంసం చేశారు. జెఎసి న్యాయవాదులపై తులసి రెడ్డి అనుచరులు ఎదురు దాడికి దిగారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కాటసాని రాంభూపాల్ రెడ్డి దీక్షా శిబిరం వద్దకు తులసిరెడ్డి వెళ్లారు. ఆ సమయంలో సీమాంధ్ర న్యాయవాదుల జెఎసి నేతలు పదవికి రాజీనామా చేయాలని తులసి రెడ్డిపై దాడికి దిగారు. ఈ సందర్భంగా న్యాయవాదులు, తులసిరెడ్డి పరస్పరం దూషించుకున్నారు. -
విభజనకు నిరసనగా కర్నూలులో ‘లక్ష గళ ఘోష’
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ శుక్రవారం కర్నూలు నగరం మారుమోగనుంది. ఒకేసారి లక్ష మంది రోడ్లపైకి వచ్చి సమైక్యనినాదాలతో హోరెత్తించనున్నారు. ‘లక్ష గళ ఘోష’ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా విద్యాసంస్థల కార్యాచరణ సమితి భారీ ఏర్పాట్లు చేపట్టింది. నగరంలోని అన్ని విద్యాసంస్థల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, వారి కుటుంబసభ్యులు ఇందులో పాల్పంచుకోవాలని జేఏసీ ఆహ్వనించింది. శుక్రవారం ఉదయం 9 గంటలకు కోట్ల సర్కిల్ వద్ద సాంస్కృతిక కార్యక్రమాలతో కార్యక్రమం ప్రారంభమై.. 10 గంటలకు నగరంలోని అన్ని వైపుల నుంచి ర్యాలీలు ఈ ప్రాంతానికి చేరుకునేటట్లు ప్రణాళిక రూపొందించారు. రాష్ట్ర విభజన వల్ల జరిగే నష్టాలు, సమైక్యంగా ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలపై వక్తలు ప్రసంగించనున్నారు. లక్ష గళ ఘోష కార్యక్రమాన్ని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షులు సుబ్రహ్మణ్యం కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సైతం పాల్పంచుకోవాలని ఉపాధ్యాయ సంఘాల జేఏసీ కన్వీనర్ హెచ్.తిమ్మన్న గురువారం ఒక ప్రకటనలో కోరారు. -
రాయల తెలంగాణకే కర్నూలు జిల్లా నేతలు సై!
సాక్షి, న్యూఢిల్లీ: రాయల తెలంగాణ దిశగా కర్నూలు జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ముఖ్యంగా తమ జిల్లాను తెలంగాణలోనే కలపాలంటూ గళమెత్తేందుకు సిద్ధమవుతున్నారు. అందుకు తగిన కారణాలను కూడా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి కూడా ఈ మేరకు వారు విజ్ఞప్తి చేయనున్నారు. కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి నేతృత్వంలో కర్నూలు జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మంగళవారం ఆమెతో సమావేశం కానున్నారు. ‘రాయల తెలంగాణపై అభిప్రాయం చెప్పేందుకు’ వారిప్పటికే అధినేత్రి అపాయింట్మెంట్ కోరినట్టు, ఆమె కార్యాలయం సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది! దిగ్విజయ్‌తో కర్నూలు నేతల భేటీ సోమవారం రాత్రి కర్నూలు జిల్లా నేతలు దిగ్విజయ్‌సింగ్‌తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి నేతత్వంలో ఎంపీ ఎస్పీవై రెడ్డి, రాష్ట్ర మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్యేలు లబ్బి వెంకటస్వామి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కాటసాని రాంరెడ్డి, మురళీకృష్ణ వీరిలో ఉన్నారు. విభజనపై వ్యక్తమవుతున్న నిరసనలు, నేతల రాజీనామాలు, నదీ జలాల అంశం వీరి మధ్య ప్రధానంగా చర్చకు వచ్చినట్లు చెబుతున్నా... విభజనకు తమ ప్రాంత ప్రజలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారని, విభజన అనంతరం సీమ మరింత వెనుకబడుతుందన్న అభిప్రాయం అక్కడి ప్రజల్లో బలంగా ఉందని నేతలు వివరించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఏర్పాటు జరిగితే తమ ప్రాంతంలో నదీ జలాల వివాదం తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వివరించారు. ఇప్పటికే తుంగభద్ర నీటి కేటాయింపుల విషయంలో సరిహద్దున ఉన్న మహబూబ్‌నగర్‌తో నిత్య పోరాటం చేస్తున్నామని, రాజోలిబండ వాటర్ స్కీం కింద సైతం వివాదాలు తలెత్తుతున్నాయని తెలిపారు. ఇక శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు వస్తుందని, అక్కడ నీటి ప్రవాహాలకు అడ్డుకట్ట వేస్తే తమ జిల్లాకు చుక్క నీరందదని, తమ ప్రాంతం అంతా ఎడారిగా మారుతుందని తెలిపారు. అందువల్ల తమ ప్రాంతాన్ని తెలంగాణలో కలపాలని, అప్పుడే న్యాయం జరుగుతుందని వారు కోరినట్లు సమాచారం. రాజకీయ కోణంలో కూడా కర్నూలును తెలంగాణలో కలిపితేనే మంచిదన్న అభిప్రాయాన్ని కొందరు నేతలు వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. మూడుగా విభజించాల్సిందే: కోట్ల రాష్ట్రం సమైక్యంగా ఉండటానికే తాము మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని, అలా కుదరని పక్షంలో రాష్ట్రాన్ని మూడుగా విభజించాలని కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి అన్నారు. లేనిపక్షంలో ప్రకాశం, నెల్లూరు జిల్లాలను కలిపి గ్రేటర్ రాయలసీమ ఏర్పాటు చేయాలని దిగ్విజయ్‌తో భేటీ అనంతరం ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్‌ను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునేది లేదని, హైదరాబాద్‌తోనే తాము కలిసుంటామని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. నేడు సోనియాతో భేటీ.. కర్నూలు జిల్లా కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు మంగళవారం తమ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలువనున్నారు. కోట్ల ఇప్పటికే అపాయింట్మెంట్ కోరారని, సోనియా కార్యాలయం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.