స్నేహితుడికి పెళ్లి గిఫ్ట్ ఇస్తూ గుండెపోటుతో యువకుడు మృతి | Amazon Employee Dies On Stage While Handing Over Gift At Friend Wedding | Sakshi
Sakshi News home page

పచ్చని పందిట్లో..స్నేహితుడికి పెళ్లి గిఫ్ట్ ఇస్తూ గుండెపోటుతో యువకుడు మృతి

Published Thu, Nov 21 2024 10:03 PM | Last Updated on Thu, Nov 21 2024 10:04 PM

Amazon Employee Dies On Stage While Handing Over Gift At Friend Wedding

సాక్షి,కర్నూల్‌ : పచ్చని పందిట్లో విషాదం చోటు చేసుకుంది. అప్పటి వరకు స్నేహితుడి పెళ్లిలో సంతోషంగా గడిపిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. స్నేహితుడికి పెళ్లి గిఫ్ట్‌ ఇస్తుండగా గుండె పోటుతో ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరు అమెజాన్‌ కంపెనీలో పనిచేస్తున్న వంశీ .. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం పెనుమడ గ్రామంలో తన  స్నేహితుడి పెళ్లికి వచ్చాడు. స్నేహితుడి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి అనంతరం వధూవరులకు కానుక ఇచ్చేందుకు పెళ్లి వేదికపైకి ఎక్కాడు. తన స్నేహితులతో కలిసి ఓ గిఫ్ట్‌ను వధూవరులకు అందించి పక్కనే నిలబడ్డాడు. స్నేహితుడు ఇచ్చిన ఆ గిఫ్ట్‌ ప్యాక్‌ను వధూవరులు ఓపెన్‌ చేస్తుండగా..వంశీ అస్వస్థతకు గురయ్యాడు.

వెంటనే అతన్ని పక్కకి తీసుకెళ్లే లోపే స్టేజిపైనే కుప్పకూలాడు.దీంతో అప్రమత్తమైన తోటి స్నేహితులు అత్యవసర చికిత్స నిమిత్తం  డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వంశీని పరీక్షించిన వైద్యులు అతడి అప్పటికే ప్రాణాలు విడిచినట్లు తెలిపారు. దీంతో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement