died heart attack
-
పంట చేనులో అయ్యప్ప మాలధారుడి మృతి
భైంసాటౌన్(నిర్మల్): పంట చేనులో పనిచేస్తుండగా ఓ అయ్యప్ప మాల ధరించిన వ్యక్తి అనుకోకుండా అనారోగ్యానికి గురై అకస్మాత్తుగా కుప్పకూలాడు. అక్కడికక్కడే మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పల్సి గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబీకుల కథనం ప్రకారం.. సాయినాథ్ (38) అనే వ్యక్తి ఇటీవల అయ్యప్ప మాల వేయగా, శనివారం గ్రామంలోని పంట చేనులో పనిచేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా చేనులోనే కుప్పకూలాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా పరిశీలించిన వైద్యులు మృతిచెందినట్టు డాక్టర్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గుండెపోటుతో టెన్త్ విద్యార్థి మృతి
వనపర్తి: జిల్లావ్యాప్తంగా శనివారం ప్రారంభమైన గ్రా మస్థాయి సీఎం క్రీడా పోటీల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. పెద్దమందడి మండలం బలిజపల్లి గ్రామ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో నిర్వహించిన సీఎం కప్ పోటీల్లో పాల్గొన్న పదవ తరగతి విద్యార్థి వాలీబాల్ ఆడుతూ కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పామిరెడ్డిపల్లి ముందరితండాకు చెందిన సాయి పునీత్ (15) బలిజపల్లి జెడ్పీ హైసూ్కల్లో చదువుతున్నాడు. తోటి విద్యార్థులతో కలిసి ఉదయం నుంచి క్రీడాపోటీల్లో పాల్గొన్నాడు.పాఠశాల ఆవరణలో ఉదయం ఒకసారి కళ్లుతిరిగి పడిపోగా.. నిర్వాహకులు తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో తల్లి నీలమ్మ అక్కడికి చేరుకుంది. అయితే తనకు ఏమీ కాలేదని.. తల్లిని ఇంటికి వెళ్లమని పునీత్ చెప్పటంతో ఆమె ఇంటికి వెళ్లిపోయింది. మళ్లీ క్రీడల్లో పాల్గొన్న పునీత్ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.నిర్వాహకులు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండెపోటుతో మృతి చెందినట్లు తెలిపారు. కాగా.. విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలని విద్యార్థి సంఘాలు, కుల సంఘాల నాయకులు జిల్లా కేంద్రంతో పాటు బలిజపల్లి గ్రామంలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని ఎమ్మెల్యే మేఘారెడ్డి హామీ ఇచ్చారు. -
స్నేహితుడికి పెళ్లి గిఫ్ట్ ఇస్తూ గుండెపోటుతో యువకుడు మృతి
సాక్షి,కర్నూల్ : పచ్చని పందిట్లో విషాదం చోటు చేసుకుంది. అప్పటి వరకు స్నేహితుడి పెళ్లిలో సంతోషంగా గడిపిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. స్నేహితుడికి పెళ్లి గిఫ్ట్ ఇస్తుండగా గుండె పోటుతో ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరు అమెజాన్ కంపెనీలో పనిచేస్తున్న వంశీ .. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం పెనుమడ గ్రామంలో తన స్నేహితుడి పెళ్లికి వచ్చాడు. స్నేహితుడి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి అనంతరం వధూవరులకు కానుక ఇచ్చేందుకు పెళ్లి వేదికపైకి ఎక్కాడు. తన స్నేహితులతో కలిసి ఓ గిఫ్ట్‌ను వధూవరులకు అందించి పక్కనే నిలబడ్డాడు. స్నేహితుడు ఇచ్చిన ఆ గిఫ్ట్ ప్యాక్‌ను వధూవరులు ఓపెన్ చేస్తుండగా..వంశీ అస్వస్థతకు గురయ్యాడు.వెంటనే అతన్ని పక్కకి తీసుకెళ్లే లోపే స్టేజిపైనే కుప్పకూలాడు.దీంతో అప్రమత్తమైన తోటి స్నేహితులు అత్యవసర చికిత్స నిమిత్తం డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వంశీని పరీక్షించిన వైద్యులు అతడి అప్పటికే ప్రాణాలు విడిచినట్లు తెలిపారు. దీంతో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. స్నేహితుడి వివాహా వేడుకలో గుండెపోటుతో యువకుడు మృతికర్నూల్ జిల్లా కృష్ణగిరి మండలం పెనుమడ గ్రామంలో స్నేహితుడి వివాహ వేడుకలో గిఫ్ట్ ఇస్తూ స్టేజ్ పైనే గుండెపోటుకు గురైన వంశీ అనే యువకుడు.వంశీని డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తోటి స్నేహితులు.. కానీ అప్పటికే గుండెపోటుతో… pic.twitter.com/Ve1Epmf1fI— Telugu Scribe (@TeluguScribe) November 21, 2024 -
ఆడే వయసులో ఆగిన గుండె
చెన్నూర్: ఆడుతూ పాడుతూ తిరుగుతున్న ఆ బాలికను అకస్మాత్తుగా మృత్యువు కబళించింది. గుండెపోటు రూపంలో ఆ కుటుంబంలో విషాదం మిగిల్చింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని పద్మనగర్ కాలనీలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పద్మనగర్ కాలనీకి చెందిన కస్తూరి శ్రీనివాస్, రమాదేవి దంపతులకు ఓ కూతురు, కుమారుడు. కూతురు నివృతి (12) పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. శుక్రవారం కార్తీక పౌర్ణమి కావడంతో కుటుంబ సభ్యులు ఆ సందడిలో ఉన్నారు. నివృతి ఆలయానికి వెళ్లేందుకు సి ద్ధం అవుతోన్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. కుటుంబ సభ్యులు గమనించి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి గుండెపోటుతో మృతిచెందినట్లు ధ్రువీకరించారు. ‘కార్తీక దీపాలు వెలిగించే ఇంట్లో దీపం లేకుండా చేశావా తల్లీ’ అంటూ తల్లిదండ్రులు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. -
గుండెపోటుతో కుంభకర్ణ పాత్రధారి మృతి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దసరా వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ నేపధ్యంలో అక్కడక్కడా విషాదకర ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.దేశ రాజధానిలోని చిరాగ్ ఢిల్లీ ప్రాంతంలో వేదికపై రామలీలను ప్రదర్శిస్తుండగా విషాదం చోటుచేసుకుంది. రావణుని సోదరుడు కుంభకర్ణుని పాత్రను పోషిస్తున్న 60 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. ఈ విషయాన్ని పోలీసులు మీడియాకు తెలిపారు.ఢిల్లీలోని పశ్చిమ్ విహార్ నివాసి విక్రమ్ తనేజా రామ్‌లీలలో కుంభకర్ణుడి పాత్రను పోషిస్తున్నాడు. వేదికపై ఆయన తన పాత్ర పోషిస్తుండగా ఆయనకు ఛాతీలో నొప్పి వచ్చింది. వెంటనే అతనిని పీఎస్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తనేజా మృతి చెందినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.ఇది కూడా చదవండి: మహారాష్ట్ర మాజీ మంత్రి సిద్ధిఖీపై కాల్పులు.. చికిత్స పొందుతూ మృతి -
వేదికపై గుండెపోటుతో ‘రామలీల’ రాముడు మృతి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా శరన్నవరాత్రులు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఉత్తరాదిన నవరాత్రి వేడుకల్లో ‘రామలీల’ను ప్రదర్శిస్తుంటారు. రాజధాని ఢిల్లీలోని ఒక ప్రాంతంలో ‘రామలీల’ ప్రదర్శిస్తుండగా వేదికపై విషాదం చోటుచేసుకుంది.ఢిల్లీలోని షహదారా ప్రాంతంలోని విశ్వకర్మ నగర్లో వేదికపై రామలీల ప్రదర్శిస్తుండగా రాముడి పాత్ర పోషిస్తున్న ఓ కళాకారుడు గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. రాముని పాత్ర పోషిస్తున్న నటుని పేరు సుశీల్ కౌశిక్(45) ఆయన స్టేజ్‌పై రాముని పాత్రలో డైలాగులు చెప్పడం వీడియోలో కనిపిస్తుంది. ఈ సమయంలో, అతనితో పాటు ఇతర కళాకారులు కూడా వేదికపై ఉండటాన్ని చూడవచ్చు. ఇంతలో అకస్మాత్తుగా సుశీల్ తన గుండెపై చేయి వేసుకుని స్టేజి వెనుక వైపు వెళ్లడం కనిపిస్తుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వేదికపై రాముని పాత్రధారి సుశీల్‌కు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ సుశీల్ మృతిచెందాడు. సుశీల్ కౌశిక్ వృత్తిరీత్యా ప్రాపర్టీ డీలర్ అని తెలుస్తోంది. दिल्ली: शाहदरा में रामलीला में राम का किरदार निभाने वाले शख्स की हार्ट अटैक से मौत । सुशील कुमार रामलीला में राम का किरदार निभा रहे थे, प्रोग्राम के दौरान ही हार्ट अटैक आया और मौत हो गई। उनकी उम्र करीब 45 साल है।सुशील कौशिक एक प्रॉपर्टी डीलर थे#HeartAttack @hyderabaddoctor pic.twitter.com/nQIwBXkAF9— Shalu Awasthi شالو اوستھی (@Shalu_official) October 6, 2024ఇది కూడా చదవండి: నవరాత్రులు..ఇవాళ లలితా త్రిపుర సుందరిగా అలంకారం..! -
ఆఫీసుల్లోనే ఆగిపోతున్న గుండెలు.. మరో టెకీ మృతి
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని ప్రముఖ ఐటీ కంపెనీ కార్యాలయంలోని వాష్‌రూమ్‌లో ఓ ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం జరిగిందని, మృతుడిని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సీనియర్ అనలిస్ట్ నితిన్ ఎడ్విన్ మైఖేల్ (40) గా గుర్తించామని పోలీసులు తెలిపారు.శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో కార్యాలయంలోని వాష్‌రూమ్‌కి వెళ్లిన మైఖేల్ ఎంతకీ బయటకు రాలేదని, సోనెగావ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన అధికారి తెలిపారు. అతని సహచరులు వెంటనే అతనిని నాగ్‌పూర్‌లోని ఎయిమ్స్‌కు తరలించగా పరశీలించిన వైద్యులు అతను మృతిచెందినట్లు ప్రకటించారు.సోనేగావ్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేశారు. ప్రాథమిక శవపరీక్షలో ఆ వ్యక్తి గుండెపోటుతో మరణించినట్లు తేలిందని పోలీసు అధికారి తెలిపారు. మైఖేల్‌కు భార్య, ఆరేళ్ల కుమారుడు ఉన్నట్లు తెలిసింది.ఇటీవల కార్పొరేట్ ఉద్యోగులు కార్యాలయాల్లోనే మృత్యువాత పడుతున్నారు. లక్నోలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో సదాఫ్ ఫాతిమా అనే మహిళా ఉద్యోగి బ్యాంకులోనే కుప్పకూలి మరణించారు. అంతకుముందు పుణేలోని ఈవై కంపెనీ కార్యాలయంలో కేరళకు చెందిన ఛార్టర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ పెరయిల్ మృతిచెందారు. అధిక పనిభారం, విషపూరితమైన పని సంస్కృతే ఉద్యోగుల మరణాలకు కారణమవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
వక్ఫ్ బోర్డును రద్దు చేయాలంటూ ర్యాలీ
హమీర్పూర్: హిమాచల్ ప్రదేశ్‌లోని సంజౌలీలో అక్రమంగా నిర్మిస్తున్న మసీదును కూల్చివేయాలని కోరుతూ దేవభూమి సంఘర్ష్ సమితి హమీర్‌పూర్‌లో నిరసన ర్యాలీ చేపట్టింది. దీనిలో పాల్గొన్న 46 ఏళ్ల విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) సభ్యుడొకరు గుండెపోటుతో కన్నుమూశారు. వక్ఫ్ బోర్డును రద్దు చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. దేవభూమి సంఘర్ష్ సమితి పిలుపు మేరకు సిమ్లా, హమీర్పూర్, మండీ, చంబా, నహాన్ జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. హమీర్‌పూర్‌లో ఆందోళనకారులు అధికారులకు మెమోరాండం సమర్పించడానికి వెళ్తుండగా, వీహెచ్‌పీ కార్యకర్త వరిందర్ పర్మార్ స్పృహతప్పి పడిపోయాడు. అతన్ని వెంటనే పోలీసు వాహనంలో హమీర్పూర్ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు అతను మృతిచెందాడని తెలిపారు.నిరసన ప్రదర్శనలో పాల్గొన్న దేవభూమి సంఘర్ష్ సమితి కమిటీ కో-కన్వీనర్ మదన్ ఠాకూర్ మాట్లాడుతూ, వివాదాస్పద మసీదుపై అక్టోబర్ ఐదు వరకూ కోర్టు నిర్ణయం కోసం వేచి చూస్తామని, ఆ తరువాత భవిష్యత్ వ్యూహాన్ని నిర్ణయించుకుంటామన్నారు. అక్టోబర్ ఐదు తర్వాత జైల్ భరో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. తమపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని, ప్రజల మనోభావాలను రెచ్చగొట్టిన ఏఐఎంఐఎం నేత షోయబ్ జమైపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు.ఇది కూడా చదవండి: రోడ్డు ప్రమాదం.. తొమ్మిదిమంది మృతి -
గుండెపోటుతో డిగ్రీ విద్యార్థిని మృతి
ఉత్తరప్రదేశ్ లక్నోలో విషాదం చోటు చేసుకుంది. గుండె పోటుతో 19 ఏళ్ల విద్యార్థిని మరణించింది. అనికా రస్తోగి రామ్ మనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్సిటీ విద్యార్థిని. హాస్టల్లో ఉండి చదువుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి హాస్టల్ రూమ్‌లో గుండెపోటుతో మరణించారు. ఆదివారం ఉదయం హాస్టల్ రూంలో నిద్రిస్తున్న అనికాతో మాట్లాడేందుకు ఆమె స్నేహితురాలు వెళ్లింది. అయితే ఆపస్మారక స్థితిలో ఉండడం గమనించింది. హుటాహుటీనా ఆస్పత్రికి తరలించింది. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆమె అప్పటికే మృతి చెందినట్లు పోటీసులు ప్రకటించారు.మూడవ సంవత్సరం బీఏ ఎల్ఎల్బీ చదువుతున్న రస్తోగి తండ్రి మహారాష్ట్ర కేడర్‌కు చెందిన 1998 ఐపీఎస్ అధికారి సంజయ్ రస్తోగి. ప్రస్తుతం ఢిల్లీలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)లో ఇన్స్పెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. కుమార్తె మరణించినట్లు సంజయ్ రస్తోగికి పోలీసులు సమాచారం అందించారు. -
గుండెపోటుతో బ్యాంక్‌లోనే కుప్పకూలిన ఉద్యోగి.. సీసీటీవీ దృశ్యాలు వైరల్
ఇటీవల గుండెపోటు మరణాలు ఎక్కువవుతున్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు సడెన్ హార్ట్ ఎటాక్‌లు ఆందోళన కలిగిస్తున్నాయి. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి గుండెపోటుతో ప్రాణాలు విడుస్తున్నారు. ఈ మరణాలు యువతలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా మరో 30 ఏళ్ల యువకుడు ఆకస్మిక గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో వెలుగుచూసింది.మహోబాలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో 30 ఏళ్ల అగి జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ తన ల్యాప్ టాప్‌లో పనిచేస్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా తన కుర్చీపై కుప్పకూలిపోయాడు. పక్కన కూర్చున్న అతని సహచరులు ఇతరులను అప్రమత్తం చేసి, అతన్ని అతని డెస్క్ నుండి బహిరంగ ప్రదేశంలోకి మార్చారు. వారు అతని ముఖం మీద నీరు చల్లి, మేల్కొలిపే ప్రయత్నం చేశారు. యువకుడికి సీపీఆర్ ఇచ్చేందుకు సైతం యత్నించారు. కానీ ఫలితం లేకపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే యువకుడు బ్యాంక్‌లో కుప్పకూలిన వీడియో అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.खौफनाक...लैपटॉप पर काम करते करते कुर्सी पर ही HDFC Bank मैनेजर की मौत हो गई।38 साल उम्र थी। कुछ सेकंड पहले तक कीबोर्ड पर हाथ चला रहे थे। अगले पल कुर्सी पर ही जान निकल गई।यूपी के महोबा ब्रांच में थे।#mahoba#covidvaccines #covid #heartattack #hdfc #uttarpradesh pic.twitter.com/xXuw9Ndhnu— Sunil Yadav B+ (@sunilyadav21) June 26, 2024 -
చోటా షకీల్ బంధువు ఆరిఫ్ షేక్ మృతి
అండర్ వరల్డ్ డాన్ ఛోటా షకీల్ బంధువు ఆరిఫ్ షేక్ అలియాస్ ఆరిఫ్ భాయిజాన్ ముంబైలో గుండెపోటుతో మృతి చెందాడు. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో అరెస్టయిన ఆరిఫ్ షేక్.. ఛోటా షకీల్‌కు బావ వరుస అవుతాడు.ప్రస్తుతం ఆరిఫ్ ఆర్థర్ రోడ్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతనికి అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి రావడంతో పోలీసులు చికిత్స నిమిత్తం ముంబైలోని జెజె ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరీఫ్ మృతి చెందాడు.అండర్ వరల్డ్ డాన్, గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం, అతని సహచరుడు ఛోటా షకీల్‌కు ఆరిఫ్ సహాయం అందించాడనే ఆరోపణలున్నాయి. 61 ఏళ్ల ఆరిఫ్ షేక్‌ను 2022 మేలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. గత రెండేళ్లుగా ఆర్థర్ రోడ్ జైలులో ఆరిఫ్ శిక్ష అనుభవిస్తున్నాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి కారణంగా ఆరిఫ్ షేక్‌ను జూన్ 21న ఆస్పత్రికి తరలించారు. ఆరీఫ్‌కు ఇద్దరు సంతానం అని తెలుస్తోంది. -
ప్రముఖుల దిగ్భ్రాంతి
రామోజీరావు మరణంతో దేశం మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగానికి చెందిన దిగ్గజాన్ని కోల్పోయింది. ఆయన ఈనాడు దినపత్రిక, ఈటీవీ న్యూస్ నెట్వర్క్, ఫిల్మ్ సిటీ సహా అనేక సంస్థలను నెలకొల్పిన వినూత్న వ్యాపారవేత్త. సమాజ హితంపై ఆయనకు ఉన్న దృష్టి కారణంగా పద్మ విభూషణ్ వరించింది. ఆయన కుటుంబ సభ్యులకు నా సానుభూతి ప్రకటిస్తున్నాను. – ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి⇒ రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. భారతీయ మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు. పాత్రికేయ, సినీరంగంపై రామోజీరావు చెరగని ముద్ర వేశారు. మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంలో రామోజీ సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారు. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. రామోజీరావు కుటుంబానికి, అభిమానులకు ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి. –నరేంద్ర మోదీ, ప్రధాని⇒ భారతీయ మీడియా పరిశ్రమలో అగ్రగామిగా నిలిచిన పద్మవిభూషణ్ రామోజీరావు మృతికి నా సంతాపం. జర్నలిజం, సినిమా, వినోదానికి ఆయన చేసిన కృషి మీడియా ల్యాండ్‌స్కేప్‌ను మార్చింది. – రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత⇒ మీడియా, వినోద రంగాల్లో ఆయన బహుముఖ ప్రజ్ఞ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సమయంలో వారి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను. –ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్ ⇒ భారతీయ మీడియా, సినీ రంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిన దిగ్గజం రామోజీరావు. తెలుగు జర్నలిజంలో ఉన్నత ప్రమాణాలు, నిజాయితీని పెంపొందించారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. – రాష్ట్ర ఇన్చార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్తీరని లోటు: రేవంత్‌రెడ్డి ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు పత్రికా, మీడియా, వ్యాపార రంగాలకు తీరని లోటని అన్నారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయతను, తెలుగు మీడియా రంగానికి కొత్త పంథాను నేర్పిన ఘనత రామోజీరావుకి దక్కుతుందని పేర్కొన్నారు. ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావుతో జరిగిన సమావేశాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.తెలుగు వారి కీర్తిని చాటిన వ్యక్తి: చంద్రబాబురామోజీ మరణవార్త తెలిసిన వెంటనే ఢిల్లీలో ఉన్న చంద్రబాబు హైదరాబాద్ తిరిగి వచ్చారు. భార్య భువనేశ్వరితో కలిసి ఫిలింసిటీకి వెళ్లి రామోజీ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. అనంతరం మీడియాతో బాబు మాట్లాడుతూ, రామోజీరావును యుగపురుషుడిగా అభివర్ణించారు. నిత్యం సమాజహితం కోసం, తెలుగుజాతి కోసం పనిచేసిన వ్యక్తి రామోజీ అని, సాధారణ కుటుంబంలో పుట్టి, అసాధారణ వ్యక్తిగా ఎదిగారని, తెలుగువారి కీర్తిని దశదిశలా చాటారని అన్నారు. కేసీఆర్ సంతాపం...రామోజీ రావు మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. పలు రంగాల్లో వ్యాపారవేత్తగా, మీడియా సంస్థల వ్యవస్థాపకుడిగా వారందించిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. రామోజీ కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాగా, రామోజీరావు మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆయన ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సుధీర్‌రెడ్డిలతో కలిసి ఫిలింసిటీలో రామోజీరావు పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.⇒ రామోజీరావులో అందరూ గంభీరమైన వ్యక్తిని చూసుంటారు. నేను మాత్రం ఆయనలో చిన్న పిల్లాడిని చూశాను. ఆయనకు పెన్నులంటే ఇష్టం. ప్రజారాజ్యం పార్టీ నడుపుతున్న సమయంలో ఒక పెన్ను బహూకరిస్తే దాన్ని చూసి ఆయన మురిసిపోయారు. – చిరంజీవి⇒ ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి ఆయన్ను కలుద్దామనుకున్నా. కానీ, ఇంతలోనే దురదృష్టవశాత్తూ కన్నుమూశారు. ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు అండగా ఉండాలి. – పవన్ కళ్యాణ్ప్రముఖుల సంతాపం..రామోజీకి నివాళులు అర్పించిన వారిలో బీజేపీ అగ్రనేతలు రాజ్‌నాథ్‌సింగ్, అమిత్‌షా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్, మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీతక్క, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మాజీ మంత్రులు హరీశ్‌రావు, కడియం శ్రీహరి, పువ్వాడ అజయ్ కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వరరెడ్డి, సినీనటులు నాగార్జున, వెంకటేశ్, మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్, కళ్యాణ్‌రామ్, నరేష్, కె.రాఘవేంద్రరావు, అశ్వనీదత్, బోయపాటి శ్రీను, రాజమౌళి, కీరవాణి, ఎస్.వి.కృష్ణారెడ్డి, ఇళయరాజా, మంచు విష్ణు, విజయేంద్రప్రసాద్ తదితరులు ఉన్నారు. – సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్ -
పెదపారుపూడి టు ఫిలింసిటీ
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రామోజీరావు.. పరస్పరం భిన్నమైన రంగాల్లో వ్యాపారాలను ప్రారంభించి విజయం సాధించారు. యాడ్ ఏజెన్సీలో పనిచేయడం మొదలుపెట్టి.. ఎరువుల వ్యాపారం, చిట్‌ఫండ్స్, పచ్చళ్లు, మీడియా వంటి ఎన్నో రంగాలకు విస్తరించారు. రామోజీరావు ఏపీలోని కృష్ణా జిల్లా పెదపారుపూడి గ్రామంలో 1936 నవంబరు 16న జని్మంచారు. ఆయన తండ్రి వెంకట సుబ్బారావు రైతు. తల్లి వెంకట సుబ్బమ్మ గృహిణి. పెదపారుపూడి, గుడివాడలలో పాఠశాల విద్య, ఇంటర్, డిగ్రీ (బీఎస్సీ) గుడివాడలోనే పూర్తి చేశారు. 1961 ఆగస్టు 19న పెనమలూరుకు చెందిన తాతినేని వెంకట సుబ్బయ్య, వాణీదేవిల రెండో కుమార్తె రమాదేవితో రామోజీరావుకు వివాహం జరిగింది. మొదట యాడ్ ఏజెన్సీలో చేరి..: బీఎస్సీ పూర్తిచేసిన రామోజీరావు.. తన కుటుంబం చేసే వ్యవసాయానికే పరిమితం కాకుండా వ్యాపార రంగంలోకి రావాలని నిర్ణయించుకున్నారు. అడ్వర్టైజింగ్ రంగం వైపు ఆసక్తి కలగడంతో.. ఢిల్లీ వెళ్లి ఓ అడ్వరై్టజింగ్ ఏజెన్సీలో చేరారు. అక్కడ మూడేళ్లు పనిచేశాక హైదరాబాద్‌కు వచ్చారు. 1962 అక్టోబర్‌లో హైదరాబాద్‌లో మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థను, 1965లో కిరణ్ యాడ్స్ పేరిట అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీని ప్రారంభించారు. తర్వాత ఇతర వ్యాపారాలవైపు దృష్టి సారించారు. 1967–1969 మధ్య వసుంధర ఫెర్టిలైజర్స్ పేరిట ఎరువుల వ్యాపారం చేశారు. ఆ సమయంలోనే వ్యవసాయ సమాచారంతో కూడిన అన్నదాత పత్రికను ప్రారంభించారు.1970లో ఇమేజెస్ ఔట్‌డోర్ యాడ్ ఏజెన్సీని, విశాఖలో డాలి్ఫన్ హోటల్‌ను ప్రారంభించారు. అప్పటికే పత్రికారంగంపై ఆసక్తి ఉన్న ఆయన.. విశాఖపట్నం కేంద్రంగా ఈనాడు పత్రికకు శ్రీకారం చుట్టారు. స్థానిక వార్తలకు ప్రాధాన్యమివ్వటం, గ్రామాల్లోనూ ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవడం, వేగంగా పంపిణీ చేయడం ద్వారా పత్రికను పాఠకులకు చేరువ చేశారు. ఎల్రక్టానిక్ మీడియాతోనూ..: పాత్రికేయ రంగంలో మార్పులను ముందుగానే గుర్తించిన రామోజీరావు.. మొదట్లో వినోదం ప్రధానాంశంగా ఈటీవీ చానల్‌ను ప్రారంభించారు. తర్వాత పూర్తి న్యూస్ చానల్ ఈటీవీ2ను ప్రారంభించారు. రాష్ట్రం విడిపోయినప్పుడు ఏపీ, తెలంగాణలకు విడివిడి న్యూస్ చానళ్లను ఏర్పాటు చేశారు. ఇక ‘ప్రియ’పేరిట రామోజీ ప్రారంభించిన పచ్చళ్ల వ్యాపారం కూడా సక్సెస్ అయింది. వివిధ రంగాల్లో రామోజీ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2016లో పద్మవిభూషణ్‌తో సత్కరించింది. రామయ్య నుంచి రామోజీగా మార్చుకుని..: రామోజీరావు తాత పేరు రామయ్య. ఆయన వ్యవసాయం చేసేవారు. రామోజీ జని్మంచడానికి కొన్నిరోజుల ముందు రామయ్య మరణించారు. దీంతో తాత పేరే మనవడికి పెట్టారు. కానీ రామయ్య అనే పేరు పాతదిగా అనిపించడంతో.. ఆయన తన పేరును రామోజీగా మార్చుకున్నారని చెబుతారు. తెల్ల వ్రస్తాలంటే మక్కువ..: రామోజీరావు ఎప్పుడు చూసినా తెలుపు రంగు వస్త్రధారణతోనే కనిపిస్తారు. ఆయనకు తెలుపు రంగు వ్రస్తాలంటే ప్రత్యేక మక్కువే దీనికి కారణమని చెబుతారు. వదులుగా ఉండే తెలుపు రంగు హాఫ్‌హ్యాండ్స్ షర్టు, అదే రంగు ప్యాంటు, మ్యాచింగ్‌గా తెలుపు రంగు షూస్ ధరించేవారు. ఎప్పుడైనా ప్రత్యేక సందర్భాల్లో తప్ప ఎప్పుడూ తెలుపు వస్త్రధారణతో ఉండేవారు.పత్రికారంగానికి ఎనలేని సేవలందించారురామోజీరావు మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందివైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్సాక్షి, అమరావతి: రామోజీరావు మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ‘తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూన్నాను. రామోజీరావు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని వైఎస్ జగన్ సామాజిక మాధ్యమం ఎక్స్(ట్విట్టర్)లో శనివారం పోస్టు చేశారు. -
రామోజీ కన్నుమూత
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రముఖ వ్యాపారవేత్త, రామోజీ గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (88) కన్నుమూశారు. ఈ నెల 5న గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురైన రామోజీని కుటుంబ సభ్యులు నానక్‌రాంగూడలోని స్టార్ ఆస్పత్రికి తరలించారు. గుండె పనితీరు దెబ్బతిన్నదని, బీపీ పడిపోయిందని గుర్తించిన వైద్యులు.. ఆయనకు వెంటిలేటర్ అమర్చారు. యాంజియోగ్రామ్ చేసి గుండె నాళాల్లో స్టంట్ వేశారు. అయినా ఆయన కోలుకోలేదు.శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఆరోగ్యం మరింతగా క్షీణించి.. శనివారం తెల్లవారుజామున 4.51గంట లకు తుదిశ్వాస విడిచారు. ఆస్పత్రి నుంచి ఆయన భౌతిక కాయాన్ని ఉదయం 7.45 గంటలకు రామోజీ ఫిలింసిటీకి తెచ్చారు. రామోజీ మరణ వార్త తెలిసి రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. ఫిలింసిటీలో రామోజీ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అరి్పంచారు. రామోజీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నేడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ఆదివారం ఉదయం 10 గంటలకు ఫిలింసిటీలోని నాగన్‌పల్లి–అనాజ్‌పూర్ గ్రామాల మధ్యలో ప్రత్యేకంగా నిర్మించిన స్మృతివనంలో రామోజీరావు భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాల కోసం ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో ఫోన్లో మాట్లాడి ఈ మేరకు సూచనలు చేశారు. దీంతో ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, రాచకొండ పోలీస్ కమిషనర్లను సీఎస్ ఆదేశించారు. బతికుండగానే రామోజీ స్మృతివనం ఇబ్రహీంపట్నం రూరల్: రామోజీరావు తాను బతికి ఉండగానే ఇబ్రహీంపట్నం మండలం నాగన్‌పల్లి–అనాజ్‌పూర్ మధ్యలో ప్రత్యేక స్మృతి వనాన్ని నిర్మించుకున్నారు. ఇప్పుడు ఆయన అంత్యక్రియలను ఈ స్మృతివనంలోనే నిర్వహించనున్నారు. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్‌రెడ్డి శనివారం స్మృతి వనాన్ని పరిశీలించి.. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించేందుకు ఏర్పాట్లు చేయించారు. -
వైఎస్సార్సీపీ ఓటమిని తట్టుకోలేక ఆగిన మరో గుండె
ఎస్.రాయవరం (అనకాపల్లి జిల్లా): వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఓటమిని తట్టుకోలేక అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం వెంకటాపురానికి చెందిన ఆ పార్టీ కార్యకర్త గుండెపోటుతో మృతి చెందాడు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి రమణ(49) మనస్తాపంతో నిద్రాహారాలు మానివేశాడు.అప్పటి నుంచి దిగాలుగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇంటివద్ద గుండెపోటుతో ప్రాణాలు విడిచినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. ఆయన మృతదేహాన్ని స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. -
క్రికెట్ ఆడుతూ.. యువకుడి విషాదం!
నిజామాబాద్: క్రికెట్ ఆడేందుకు వెళ్లిన ఓ యువకుడు ఆట మధ్యలోనే గుండెపోటుతో కుప్పకూలిన ఘటన నగరంలోని వినాయక్‌నగర్‌లో ఉన్న అమ్మవెంచర్లో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.నగరంలోని గౌతమ్నగర్కు చెందిన విజయ్(30) తన స్నేహితులతో కలిసి అమ్మవెంచర్లో ఉన్న క్రికెట్ మైదానానికి వచ్చాడు. అక్కడ క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలాడు. గమనించిన స్నేహితులు వెంటనే జీజీహెచ్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు.విజయ్ మృతితో కుటుంబీకులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాలనీలో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ విషయమై నాలుగో టౌన్ ఎస్సై సంజీవ్‌కు వివరణ కోరగా ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.ఇవి చదవండి: Low blood pressure : ఈ చిట్కాలను పాటిస్తే మేలు! -
మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి కన్నుమూత
కైకలూరు: మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి (74) సోమవారం కన్నుమూశారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఆమె సోమవారం గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు. ఏలూరు జిల్లా కలిదిండి మండలం కొండూరు ఆమె స్వగ్రామం. ముదినేపల్లి నియోజకవర్గం నుంచి 1983లో టీడీపీ తరఫున పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ఉద్దండుడిగా పేరొందిన పిన్నమనేని కోటేశ్వరరావుపై పోటీ చేసి ఓటమి చెందారు. తిరిగి ముదినేపల్లి నుంచి 1985లో కోనేరు రంగారావుపై విజయం సాధించారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 19 89లో ప్రాథమిక, ఉన్నత, సాంకేతిక విద్యా శాఖ మంత్రిగా ఆమెకు అవకాశం కల్పించారు.ఆ సమయంలో పరీక్ష పేపర్ లీక్ అంశం వివాదాస్పదమైంది. యెర్నేని సీతాదేవి మంత్రిగా ఉన్నప్పుడే మొదటిసారి ఇన్స్టెంట్, బెటర్మెంట్ పరీక్షలు ప్రవేశపెట్టారు. 1994లో పిన్నమనేని కోటేశ్వరరావు కుమారుడు వెంకటేశ్వరరావుపై పోటీ చేసి విజయం సాధించారు. 1999, 2004 ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. 2004 తర్వాత జిల్లా ల పునరి్వభజనలో భాగంగా ముదినేపల్లి నియోజకవర్గం రద్దయి.. కైకలూరు నియోజకవర్గంలో కలి సింది.సీతాదేవి టీటీడీ బోర్డు సభ్యురాలుగా పనిచేశారు. 2013లో బీజేపీలో చేరారు. బీజేపీలో మహి ళా మోర్చా నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలిగా బా ధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం విజయ మిల్క్ డెయిరీ డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్నారు. సీతాదేవి భర్త యెర్నేని నాగేంద్రనాథ్ (చిట్టిబాబు) రైతాంగ సమాఖ్య, కొల్లేరు పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన గతేడాది అనారోగ్యంతో మరణించారు. సీతాదేవి పార్థివదేహాన్ని సొంతూ రు కొండూరుకు తీసుకొచ్చారు.పలువురు నేతలు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులరి్పంచారు. -
బీజేపీ ఎంపీ మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ బీజేపీ ఎంపీ రాజ్వీర్ డైలర్ బుధవారం(ఏప్రిల్24)గుండె పోటుతో మరణించారు. డైలర్కు ఈ ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఇవ్వలేదు.2017లో ఎమ్మెల్యేగా గెలిచిన డైలర్ తర్వాత 2019లో ఎంపీగా గెలిచి పార్లమెంట్‌కు వెళ్లారు. డైలర్ మృతి పట్ల ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. -
శాంతి స్వరూప్ కన్నుమూత
రామంతాపూర్, సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ప్రచార సాధనమైన దూర దర్శన్ చానల్లో తొలి తెలుగు యాంకర్‌గా ప్రసి ద్ధులు, తెలుగు ప్రజలకు తన కంచు కంఠంతో వార్తలు చెప్పిన జయంత్ శాంతి స్వరూప్ (74) కన్నుమూశారు. శుక్రవా రం ఉదయం ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతిచెందారు. హైదరాబాద్ చిక్కడపల్లిలో పుట్టి పెరిగిన శాంతి స్వరూప్ దూరదర్శన్ సీనియర్ యాంకర్ రోజా రాణిని వివాహమాడారు. ఆమె కొన్ని సంవత్స రాల క్రితమే చనిపోయారు. శాంతి స్వరూప్‌కు ఇద్దరు కుమారులు మేగాన్‡్ష, అగ్నేయ. 1978లో దూరదర్శన్ కేంద్రంలో యాంకర్‌గా చేరిన ఆయన 1983 నుంచి తెలుగులో వార్తలు చదవ డం మొదలుపెట్టారు. 2011లో పదవీ విరమణ చేశారు. టెలిప్రాంప్టర్ర్ లేని రోజుల్లోనే వార్తలను ముందుగానే మననం చేసుకుని తెర ముందు పొల్లు పోకుండా తప్పులు లేకుండా అనర్గళంగా చదివి తెలుగు ప్రజలకు వార్తలు అందించారు. శాంతి స్వరూప్‌కు లైఫ్ టైం అచీవ్మెంట్ అవా ర్డుతో పాటు పలు సంస్థలు ఎన్నో అవార్డులతో సత్కరించాయి. భూపాల్ గ్యాస్ దుర్ఘటన కవ రేజ్‌ను వీక్షకులకు కళ్ళకు కట్టినట్లుగా అందించిన ఆయన రాతి మేఘం, క్రికెట్ మీద క్రేజ్, అర్ధాగ్ని అనే నవలలు కూడా రాశారు. ఆయన పార్ధివ దేహాన్ని రామంతాపూర్ టీవీ కాలనీలోని స్వగృహానికి తరలించి అక్కడి నుంచి అంబర్పేట్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. కంచుకంఠం మూగబోయిందనీ, తొలితరం న్యూస్ రీడర్‌గా అందరికీ సుపరిచితులైన శాంతి స్వరూప్ మృతి బాధాకరమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంతాపాన్ని ప్రకటించారు. శాంతి స్వరూప్ సేవలు చిరస్మరణీయం తెలుగులో వార్తలు చదివిన తొలి తరం న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మరణం పట్ల ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సంతాపం ప్రకటించా రు. ఆయన అందించిన సేవలు తెలుగు మీడి యా రంగంలో చిరస్మరణీయమని సీఎం గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరా లని ప్రార్థించారు. శాంతి స్వరూప్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. న్యూస్‌రీడర్‌గా తనదైన ముద్ర శాంతి స్వరూప్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. టీవీలో వార్త లను చదివే తొలితరం న్యూస్ రీడర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందిన శాంతి స్వరూప్ మీడియా రంగంలో తనదైన ముద్ర వేశారని గుర్తు చేసుకున్నారు. శోక తప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వర్రావు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: జస్టిస్ ఎ.రామలింగేశ్వర్రావు గుండె పోటు తో కన్ను మూశారు. జర్మనీలో ఉన్న కూతురును చూడడానికి వెళ్లగా శుక్రవారం ఉదయం ఒక్కసారిగా రామలింగేశ్వర్‌రావుకు ఛాతీలో నొప్పి వచ్చింది. వెంటనే ఆస్ప త్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 1956, మే 21న ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఆయన జన్మించారు. ఉస్మానియా నుంచి ఎల్ఎల్ఎం పూర్తి చేసిన ఆయన 1982లో న్యాయవాదిగా నమోదు చేసుకు న్నారు. 1984లో జస్టిస్ ఏ.వెంకట్రామిరెడ్డి వద్ద జూనియర్‌గా చేరి 1987లో స్వతంత్ర న్యాయ వాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. న్యాయవాదిగా కొనసాగుతూనే ఉస్మానియాలో పార్ట్‌టైమ్ లెక్చరర్‌గా పీజీ విద్యార్థులకు ఇంటర్నేషనల్ లా పాఠాలు చెప్పారు. 2013లో న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే వరకు సామాజిక న్యాయం, పర్యావరణంతోపాటు పలు విభాగాల్లో సమర్థవంతమైన న్యాయవాదిగా వాదనలు వినిపించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని అడవుల రక్షణకు వాదించిన కేసు దేశమంతటా ‘సమత’ కేసుగా ప్రసిద్ధి చెందింది. ప్రభుత్వ న్యాయవాదిగా, టీటీడీ, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ తదితరాలకు న్యాయవాదిగా పనిచేశారు. సాహిత్యం, కళలపై ఆయనకు మక్కువ ఎక్కువ. విపరీతంగా పుస్తకాలు చదవడంతో పాటు రాయడం అలవాటు. న్యాయమూర్తిగా దాదాపు 13 వేల తీర్పులు ఇచ్చారు. వీటిలో 100కు పైగా లా జర్నల్‌లో ప్రచురితం కావడం విశేషం. 2018లో న్యాయమూర్తిగా పదవీ విరమణ పొందారు. అనంతరం ఏపీ ప్రభుత్వం ఆయన్ను స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చైర్మన్‌గా నియమించింది. -
PAK: 26/11 దాడులు.. ప్రధాన సూత్రధారి మృతి
ఇస్లామాబాద్: భారత్‌కు పీడకలగా మిగిలిపోయిన 2008 ముంబై దాడుల(26/11) ప్రధాన సూత్రధారి, లష్కర్ ఏ తాయిబా సీనియర్ కమాండర్ అజమ్ ఛీమా గుండెపోటుతో మృతి చెందినట్లు సమాచారం. పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్‌లో ఛీమా మరణించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలకు విశ్వసనీయ సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఇతడి అంత్యక్రియలు ఫైసలాబాద్‌లోని మల్కన్‌వాలాలో పూర్తయ్యాయి. కేవలం 26/11 దాడులే కాకుండా 2006లో ముంబైలోనే 188 మంది మృతికి కారణమైన రైళ్లలో బాంబు పేలుళ్ల వెనుక ప్రధాన కుట్రదారుడు ఛీమాయేనని అప్పట్లో తేల్చారు. ఈ పేలుళ్లలో 800 మంది దాకా గాయపడ్డారు. అజమ్ ఛీమా అమెరికా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలోనూ ఉన్నాడు. కాగా, 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఉగ్ర దాడుల్లో మొత్తం 10 మంది పాకిస్థాన్ టెర్రరిస్టులు పాల్గొన్నారు. వీరు సముద్ర మార్గం ద్వారా అక్రమంగా దక్షిణ ముంబైలోకి ప్రవేశించి తాజజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌తో పాటు నగరంలోని పలు రద్దీ ప్రాంతాల్లో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 18 మంది పోలీసులతో పాటు మొత్తం 166 మంది గాయపడ్డారు. మృతి చెందిన వారిలో ఆరుగురు అమెరికన్లు ఉండటంతో ఛీమా పేరను అమెరికా తన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో చేర్చింది. ఇదీ చదవండి.. అమెరికాలో మరో భారతీయుడి దారుణ హత్య -
Russia: జైలులోనే మృతి చెందిన పుతిన్ ప్రత్యర్థి
మాస్కో: పుతిన్‌ను తీవ్రంగా విమర్శించే ప్రతిపక్ష నేతగా పేరున్న జైలులో ఉన్న రష్యా ప్రతిపక్ష పార్టీ నేత అలెక్సీ నావల్నీ(47) జైలులోనే మృతి చెందారు. ఈ విషయాన్ని యమాలో నెనెట్స్ ప్రాంత జైలు సర్వీసు డిపార్ట్మెంట్ వెల్లడించింది. నావల్నీ పలు రాజకీయ ప్రేరేపిత కేసుల్లో దోషిగా తేలడంతో 2021 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. నావల్ని గతంలో రష్యా ఇన్ ద ఫ్యూచర్ ప్రతిపక్ష పార్టీని లీడ్ చేయడంంతో పాటు పుతిన్ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై పోరాడేందుకు యాంటీ కరప్షన్ ఫౌండేషన్ స్థాపించారు. నావాల్ని మరణంపై పుతిన్‌కు సమాచారమందినట్లు రష్యా మీడియా కథనాలు ప్రచురించింది. త్వరలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నావల్ని మరణం వివాదాస్పదమవుతోంది. ‘ఫిబ్రవరి 16న కరక్షనల్ కాలనీ(జైలు) నెంబర్ 3లో కొంత సేపు నడక తర్వాత నావాల్ని కాస్త ఇబ్బందిగా ఫీలయ్యారు. ఆ వెంటనే ఆయన స్పృహ కోల్పోయారు. తర్వాత వైద్యులు వచ్చి నావల్నీకి అత్యవసర చికిత్స అందించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అనంతరం డాక్టర్లు నావల్నీ మృతి చెందినట్లు ధృవీకరించారు’ అని ఫెడరల్ ప్రిజన్ సర్వీస్ కార్యాలయం వెల్లడించింది. ఇదీ చదవండి.. భారతీయుల వరుస హత్యలు.. స్పందించిన అమెరికా -
Mumbai Airport: వీల్ చైర్ లేక గుండెపోటుతో వృద్ధుడి మృతి
ముంబై : నగరంలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో రద్దీ కారణంగా చోటు చేసుకున్న అత్యంత హృదయ విదారక ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ముంబై వచ్చిన ఓ వృద్ధుడు ఎయిర్‌లైన్స్ సిబ్బందిని ఓ వీల్‌చైర్ అడిగాడు. వీల్చైర్లకు భారీ డిమాండ్ ఉన్న కారణంగా ఆ వృద్ధుడిని కొద్దిసేపు వేచి ఉండాలని ఎయిర్‌లైన్స్ సిబ్బంది కోరారు. దీంతో ఆలస్యమవుతుందని భావించిన ఆ వృద్ధుడు నడుస్తూ వెళ్లి ఇమిగ్రేషన్ చెక్ వద్ద గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఫిబ్రవరి 12న జరిగిన ఈ ఘటనపై ఎయిర్ ఇండియా సంస్థ స్పందించింది. ‘వీల్ చైర్లకు డిమాండ్ ఎక్కువగా ఉన్నందున అవి అందుబాటులో లేవు. ఇందుకే 80 ఏళ్ల వృద్ధుడిని కొద్దిసేపే వేచి ఉండాలని మేం కోరాం. అయినా అతడు ఆయన భార్యతో కలిసి నడిచి వెళ్లాడు. దురదృష్టవశాత్తూ అతడు ఇమిగ్రేషన్ చెక్ వద్ద గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించాం. అప్పటికే అతడు మరణించినట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. ముందుగా బుక్ చేసుకున్న వారికి మాత్రమే వీల్ చైర్ ఇవ్వాలని మా సంస్థకు ఒక పాలసీ ఉంది’ అని ఎయిర్‌లైన్స్ కంపెనీ ఎయిర్ ఇండియా తెలిపింది. ఇదీ చదవండి.. 11 మంది సజీవ దహనం -
పొలంలో వరినాట్లు వేస్తుండగా హఠాత్తుగా..
రాజన్న, సిరిసిల్ల: తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన సుద్దాల వెంకటేశంగౌడ్ (40) ఆదివారం గుండెపోటుతో మృతిచెందాడు. ఉదయం హఠాత్తుగా గుండెపోటు రావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. వెంకటేశంకు భార్య స్రవంతి, ఇద్దరు కూతుళ్లు ఉండగా కొన్నేళ్లుగా అతడికి దూరంగా ఉంటున్నారు. మృతుడికి తల్లిదండ్రులు బాలయ్య, బాలలక్ష్మి, అక్క, తమ్ముడు ఉన్నారు. పొలంవద్దే ఆగిన రైతు గుండె.. పొలం పనులు చేస్తుండగా గుండెపోటుతో రైతు మృతిచెందిన ఘటన ఆదివారం రుద్రంగి మండల కేంద్రంలో జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రానికి చెందిన నంద్యాడపు బుచ్చి మల్లయ్య (68) పొలంలో వరినాట్లు వేయిస్తున్నాడు. హఠాత్తుగా గుండెపోటు రావడంతో హఠాన్మరణం చెందాడు. అప్పటి వరకు పొలం పనులు చేస్తూ కళ్లేదుటే బుచ్చిమల్లయ్య మృతిచెదండంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడికి భార్య నర్సవ్వ, కొడుకు తిరుపతి, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇవి చదవండి: తల్లీకూతుళ్లు రోడ్డు దాటుతుండగా.. దూసుకొచ్చిన మృత్యువు! -
గుండెపోటుతో వేదికపైనే కుప్పకూలిన ఐఐటీ ప్రొఫెసర్
లక్నో: పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ వేదికపైనే కుప్పకూలారు. వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. గుండెపోటుతో ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఐఐటీ కాన్పూర్‌కు చెందిన పూర్వ విద్యార్థులు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి విద్యార్థి వ్యవహారాల డీన్‌గా, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతిగా ఉన్న సమీర్ ఖండేకర్(53)ని ఆహ్వానించారు. ఈ వేడుకలో ప్రసంగించే క్రమంలోనే ఆయన వేదికపై కుప్పకూలారని ఇన్స్టిట్యూట్ అధికారులు తెలిపారు. అత్యుత్తమ పరిశోధకుడిగా పేరుగాంచిన సమీర్ ఖండేకర్ ఆకస్మిక మరణం పట్ల ఐఐటి కాన్పూర్ మాజీ డైరెక్టర్ అభయ్ కరాండికర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఖండేకర్‌కు ఐదు సంవత్సరాల క్రితం అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని ఒక ప్రొఫెసర్ చెప్పారు. యూనివర్సిటీ హెల్త్ సెంటర్ ప్రాంగణంలోనే ఆయన మృతదేహాన్ని ఉంచినట్లు పేర్కొన్నారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుతున్న ఖండేకర్ ఏకైక కుమారుడు ప్రవాహ ఖండేకర్ వచ్చిన తర్వాతే అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఇదీ చదవండి: దేశంలో కొవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్.1 విజృంభణ