లఖ్‌నవూ: అప్పటి వరకు అందిరితో సంతోషంగా గడిపిన వ్యక్తులు ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణాలు విడుస్తోన్న సంఘటనలు ఇటీవల పెరిగిపోయాయి. అలాంటి సంఘటనే ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో వెలుగు చూసింది. ఓ పెళ్లి వేడుకలో 40 ఏళ్ల వ్యక్తి నృత్యం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గుండె పోటుతో ప్రాణాలు విడిచాడు. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన ఆ వ్యక్తి వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
బాధితుడు మనోజ్ విశ్వకర్మగా గుర్తించారు. పిల్పాని కాత్రా ప్రాంతంలో వివాహ వేడుకలో పాల్గొన్నాడు మనోజ్. తన కుటుంబ సభ్యులతో కలిసి నృత్యం చేస్తుండగా గుండెపోటు వచ్చింది. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఏం జరుగుతుందో తెలిసేలోపే ప్రాణాలు విడిచాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించటంతో పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది.
मातम में बदलीं खुशियां!
— Chandani Sahu (@Chandanijk) November 29, 2022
डांस करते हुए अचानक शख्स गिर पड़ा। हार्ट अटैक से मौत हो गई।
पिछले कुछ समय से अक्सर अचानक हार्ट अटैक की वजह से मौत की खबरें देखने को मिल रही हैं।#viralvideo #Kashi #Varanasi pic.twitter.com/u2pgatY2mc
ఇదీ చదవండి: వర్క్ ఫ్రం హోమ్ తెచ్చిన తంటా!..ఆఖరికి పెళ్లి పీటలపై కూడా
Comments
Please login to add a commentAdd a comment