varanasi
-
స్నేహితులతో కలిసి పుణ్యక్షేత్రాల్లో రచయిత చంద్రబోస్ (ఫోటోలు)
-
మహిళ బర్త్‌డే కేక్ కటింగ్.. దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు
ఓ మోడల్ తన పుట్టిన రోజు సందర్భంగా బర్త్‌డే కేక్ కట్ చేయడం విమర్శలకు దారి తీసింది.ఎందుకంటారా?ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కాలభైరవ దేవాలయం ఉంది. తన పుట్టిన రోజు సందర్భంగా దేవాలయానికి మోడల్ మమతా రాయ్ వచ్చింది. అయితే, దైవదర్శనం అనంతరం తన వెంట తెచ్చుకున్న బర్త్‌డే కేకును కాలభైరవ విగ్రహం ఎదుట కట్ చేసి తన పుట్టిన రోజు వేడుకల్ని జరుపుకుంది.శక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాలభైరవ ఎదుట మమతా రాయ్ బర్త్‌డే కేక్ కట్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పవిత్రమైన దేవాయంలో ఆమె కేక్ కట్ చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. పుట్టిన రోజు దైవదర్శనం చేసుకోవడం మంచిదే. ఇలా కేక్ కట్ చేయమని ఎవరు? చెప్పారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, వారణాసిలోని కాశీ విద్వాత్ పరిషత్ అనే సంస్థ దేవాలయంలో జరిగిన ఘటనపై ఆగ్రహం చేసింది. మమతారాయ్ బర్త్‌డే కేక్ కట్ చేస్తున్నా ఆలయ నిర్వహాకులు స్పందించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైంది. चंद पैसों के लिए पंडा-पुजारियों ने हमारे आस्था के केंद्रों को मजाक बना रखा है, आप भी जेब ढीली करिये और गर्भगृह में बर्थडे व एनिवर्सरी सेलिब्रेट कर सकते हैं, काल भैरव मन्दिर में केक काटने का है ये वीडियो #varanasi pic.twitter.com/joznhamSrF— Dr Raghawendra Mishra (@RaghwendraMedia) November 29, 2024 -
ఇంట్లో నుంచే ‘దేవ్ దిపావళి’ని చూడండిలా..
వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో నవంబర్ 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవ్ దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఆరోజు దశాశ్వమేధ ఘాట్‌లో అత్యంత వైభవంగా జరిగే గంగా హారతిని చూసేందుకు దేశవిదేశాల నుంచి లక్షలాదిమంది తరలిరానున్నారు.ఈసారి దేవ్ దీపావళికి కాశీకి వెళ్లలేనివారు ఇంట్లో కూర్చొని గంగాహారతిని, దేవ్ దీపావళి వేడుకలను వీక్షించవచ్చు. తొలిసారిగా దేవ్ దీపావళి నాడు జరిగే గంగా హారతి వేడుకలు ‘గంగా సేవా నిధి’ వెబ్సైట్లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ కూడా ఢిల్లీ నుంచి ఈ వేడుకలను వీక్షించనున్నారు.గంగా సేవా నిధి వెబ్‌సైట్‌ను నవంబర్ 15న ప్రారంభిస్తున్నామని గంగా సేవా నిధి అధ్యక్షుడు సుశాంత్ మిశ్రా తెలిపారు. విదేశాలలోని వారు కూడా gangasevanidhi.in వెబ్సైట్ ద్వారా దేవ్ దీపావళి వేడుకలను వీక్షించవచ్చు. గంగా హారతి సందర్భంగా ‘ఏక్ సంకల్ప్ గంగా కినారే’ పేరుతో కార్యక్రమానికి హాజరయ్యే లక్షలాది తాము గంగా నదిని పరిశుభ్రంగా ఉంచుతామని, పర్యావరణాన్ని పరిరక్షిస్తామని ప్రమాణం చేయనున్నారు.నవంబర్ 15న దశాశ్వమేధ ఘాట్‌లో 21 మంది పండితులు వైదిక ఆచారాల ప్రకారం భగవతీ దేవికి పూజలు నిర్వహిస్తారు. దేవ్ దీపావళి వేళ వారణాసిలోని 84 ఘాట్లను దీపాలతో అందంగా అలంకరించనున్నారు. పురాణాల ప్రకారం త్రిపురాసురుని దౌర్జన్యాల నుంచి దేవతలు విముక్తి పొందిన సందర్భంలో, వారు శివుని నివాసమైన కాశీ నగరానికి వచ్చి దీపాల పండుగను జరుపుకున్నారు. నాటి నుంచి ప్రతియేటా ఇక్కడ దేవ్ దీపావళి వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నారు.ఇది కూడా చదవండి: ఘనంగా శంకర నేత్రాలయ మ్యూజికల్ కాన్సర్ట్ -
బెయిల్‌పై బయటకొచ్చి.. భార్య, ముగ్గురు పిల్లలపై కాల్పులు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. హత్య కేసులో బెయిల్ బయటకు వచ్చిన ఓ వ్యక్తి.. తన భార్య, ముగ్గురు పిల్లలను అతి కిరాతకంగా కాల్చి చంపాడు. ఈ ఘోరం వారణాసిలోని భైదానీ ప్రాంతంలో సోమవారం అర్థరాత్రి వెలుగుచూసింది.పోలీసుల వివరాల ప్రకారం.. రాజేంద్ర గుప్తా అనే వ్యక్తి 1997కు సంబంధించి ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యాయడు. సోమవారం రాత్రి తన ఇంట్లోకి ప్రవేశించి గాఢ నిద్రలో ఉన్న భార్య నీతూ గుప్తా(45), కుమారులు నవేంద్ర(25), సుబేంద్ర(15), కూతురు గౌరంగి(16)పై కాల్పులు జరిపాడు. వారు మరణించారని ధృవవీకరించుకున్న తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు.కుటుంబం హత్యపై సమాచారం అందుకున్న వారణాసి పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే నిందితుడు సైతం వారణాసిలోని రోహనియా ప్రాంతంలో శవమై కనపించాడు. తన భార్య, పిల్లలను చంపిన తర్వాత నిందితుడు హత్య చేసుకొని మరణించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాగా కొన్ని రోజులుగా బార్యభర్తల మధ్య వివాదాలు జరుగుతున్నాయని రాజేంద్ర గుప్తా తల్లి పోలీసులకు తెలిపారు.ఈ సంఘటనపై వారణాసి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌరవ్ బన్స్వాల్ మాట్లాడుతూ. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని కాల్చి చంపినట్లు తమకు సమాచారం అందిందని చెప్పారు. కుటుంబ కలహాలు, చేతబడి వంటి అనేక కోణాల్లో మేము కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రాజేంద్ర గుప్తా మృతదేహాన్ని కూడా వారణాసి నుంచి స్వాధీనం చేసుకున్నామని, అతను హత్యకు గురయ్యాడా లేదా ఆత్మహత్య చేసుకొని మరణించాడా అని తెలుసుకునేందుకు దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు. -
బంధుప్రీతి, బుజ్జగింపు విపక్షాలపై మోదీ ధ్వజం
వారణాసి/కోల్‌కతా: బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలే ప్రతిపక్షాల విధానమని ప్రధాని మోదీ మండిపడ్డారు. తన సొంత లోక్‌సభ నియోజవర్గమైన వారణాసిలో ఆదివారం రూ.6,700 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారణాసి శివారులోని సీగ్రాలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. దేశంలో పదేళ్ల క్రితం వరకు వందల కోట్ల రూపాయల కుంభకోణాల గురించి పత్రికల్లో నిత్యం వార్తలు వస్తుండేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో వారణాసిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. తాము అధికారంలోకి వచి్చన తర్వాత అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టలకు బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలు తప్ప అభివృద్ధి అంటే ఏమిటో తెలియదని ఎద్దేవా చేశారు. వారణాసి అభివృద్ధిని అవి పూర్తిగా విస్మరించాయని ఆరోపించారు. ‘సబ్కా వికాస్’ సిద్ధాంతంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక గత 125 రోజులవ్యవధిలోనే దేశవ్యాప్తంగా రూ.15 లక్షల కోట్ల విలువైన పనులు ప్రారంభించామని చెప్పారు. అభివృద్ధి ప్రాజెక్టుల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కలి్పంచడం తమ లక్ష్యమని ప్రకటించారు. ఎయిర్‌పోర్టు విస్తరణ పనులకు శంకుస్థాపన పశి్చమ బెంగాల్ రాష్ట్రం సిలిగురి సమీపంలోని బాగ్డోగ్రా ఎయిర్‌పోర్టు విస్తరణ పనులకు ప్రధాని మోదీ ఆదివారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. రూ.1,550 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఈ ఏడాది ఆగస్టులో ఆమోదం తెలిపింది. శంకర కంటి ఆసుపత్రి ప్రారంభం వారణాసిలో కంచి మఠం ఆధ్వర్యంలో నిర్మించిన ఆర్జే శంకర కంటి ఆసుపత్రిని మోదీ ప్రారంభించారు. ఈ ఆస్పత్రిలో ఏటా 30 వేల కంటి శస్త్రచికిత్సలు ఉచితంగా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు మఠం వర్గాలు తెలిపాయి. వారణాసికి రావడం ఆశీర్వచనంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా మోదీ అన్నారు. మత విశ్వాసాలకు, ఆధ్యాతి్మకతకు కేంద్రమైన వారణాసి నగరం ఆరోగ్య కేంద్రంగానూ అభివృద్ధి చెందుతుండడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. మోదీపై కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామి ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్డీఏ అంటే ‘నరేంద్ర దామోదర్ దాస్ కా అనుశాసన్’ అని అభివర్ణించారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా మోదీ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని కితాబిచ్చారు. ఇది ప్రపంచంలోనే ఆదర్శవంతమైన ప్రభుత్వమని కొనియాడారు. -
వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్‌లో గంగా మహా హారతి (ఫొటోలు)
-
పురాతన శైలపుత్రి ఆలయానికి భక్తుల క్యూ
వారణాసి: దేశవ్యాప్తంగా దసరా శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ రోజుల్లో అమ్మవారి తొమ్మిది రూపాలకు పూజలు నిర్వహిస్తారు. నవరాత్రులలో తొలి రోజున శైలపుత్రి రూపాన్ని పూజిస్తారు.శివుని నగరంగా పేర్కొనే వారణాసిలో శైలపుత్రి అమ్మవారి పురాతన ఆలయం ఉంది. నవరాత్రుల తొలిరోజున ఈ ఆలయంలో ఎంతో ఘనంగా పూజలు జరుగుతాయి. ఈ నేపధ్యంలో నేటి తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఈ పురాతన ఆలయం వారణాసి సిటీ స్టేషన్‌కు కొద్ది దూరంలో ఉంది. ఈ శైలపుత్రి ఆలయాన్ని ఎవరు నిర్మించారనేది ఇప్పటికీ స్పష్టం కాలేదు.ఆలయ పూజారి మీడియాకు ఈ ఆలయానికి సంబంధించిన పురాణ కథను తెలిపారు. శైలపుత్రి అమ్మవారు శైలరాజు ఇంట్లో జన్మించారు. ఆ సమయంలో నారదుడు అక్కడికి వచ్చి, శైలపుత్రి ఎంతో ప్రతిభావంతురాలవుతుందని తెలిపారట. శైలపుత్రికి చిన్నప్పటి నుంచే మహాశివునిపై ఇష్టం ఏర్పడింది. ఆమె పెరిగి పెద్దయ్యాక కాశీకి చేరుకుని, శివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు తపస్సు చేసింది. కుమార్తె కోసం వెదుకుతూ కాశీ చేరుకున్న శైలరాజు కూడా తపస్సు ప్రారంభించాడని చెబుతారు. అనంతర కాలంలో ఈ ప్రాంతంలో శైలపుత్రితో పాటు ఆమె తండ్రి శైలరాజు ఆలయాలు నిర్మితమయ్యాయి. శైలపుత్రి ఆలయంలో మహాశివుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు.ఇది కూడా చదవండి: శోభాయమానంగా ఇంద్రకీలాద్రి -
31నే దీపావళి.. తేల్చిచెప్పిన కాశీ పండితులు
వారణాసి: ఈ ఏడాది దీపావళి తిధిపై ఉన్న సందేహాలను తొలగిస్తూ, కాశీ విద్వత్ కర్మకాండ పరిషత్‌కు చెందిన పండితులు స్పష్టతనిచ్చారు. పరిషత్ జాతీయ అధ్యక్షుడు ఆచార్య అశోక్ ద్వివేది మీడియాతో మాట్లాడుతూ దీపావళి తేదీపై వివిధ పంచాంగాలు గందరగోళం సృష్టించాయని, పలువురు రెండు తేదీలు సూచిస్తున్నారని అన్నారు. కాశీ పండితులు దీపావళి తేదీపై స్పష్టతనిచ్చారని అన్నారు.అక్టోబరు 31న దేశవ్యాప్తంగా దీపావళి ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం అమావాస్య తిథి అక్టోబర్ 31న మధ్యాహ్నం 3:52 గంటలకు ప్రారంభమవుతుంది. నవంబర్ ఒకటిన సాయంత్రం 5:13 వరకు ఉంటుంది. అక్టోబర్ 31వ తేదీన రాత్రి అమావాస్య ఉంటుంది.ధర్మసింధు, నిర్మాణ సింధుల ప్రకారం రాత్రి అమావాస్య ఉన్నరోజున అంటే అక్టోబర్ 31 రాత్రి లక్ష్మీపూజ, కాళీపూజలు చేసుకోవాలి. అలాగే దీపోత్సవాన్ని నిర్వహించుకోవాలి. అక్టోబరు 29న ధన్తేరస్, నరక చతుర్దశిని అక్టోబర్ 30 న చేసుకోవాలని అశోక్ ద్వివేది తెలిపారు. కాశీకి చెందిన అన్ని పంచాంగాల ప్రకారం దేశవ్యాప్తంగా అక్టోబర్ 31న దీపావళి వేడుకలు చేసుకోవాలి.ఇది కూడా చదవండి: ఫీల్ గుడ్.. స్ట్రీట్ ఫుడ్! -
నింద భోజనం
కొన్ని నైతిక బోధలు అన్నిచోట్లా కనబడతాయి. అబద్ధము ఆడరాదు. జీవహింస చేయరాదు... ఇలా! కానీ, వారణాసిలోని కబీర్ జన్మస్థలైన కబీర్ మఠ్‌కు వెళ్లినప్పుడు అక్కడ కనిపించే మొదటి నైతిక బోధ ‘నిందలు వేయరాదు’ అని! కబీర్ దాస్ తన ప్రబోధాలలో ఎక్కువగా అప్రమత్తం చేసింది నిందలు వేసే వారి గురించే!! ‘వేయిమంది పాపులను కలిసినా ఫరవాలేదు నిందలు వేసే ఒక్కణ్ణి తప్ప. నిందలు వేసే వాని శిరము వేయి పాపాల పుట్ట’ అన్నాడాయన. సిసలైన వేటగాడు ఉత్త చేతులతో ఇంటికొచ్చి నింద అడవి మీద వేయడు. ఆహార సేకరణ కాలంలో అనునిత్యం చెమటోడ్చి, రక్తం చిందించి ఆహారం సేకరించుకోవాల్సి వచ్చినప్పుడు ప్రతి బలహీన పురుషుడు నోటికి నేర్చిన మాట నింద. వేటే దొరకలేదు... నది పొంగింది... తేనెటీగలు తరుముకున్నాయి... బాణం దిగినా సరే పారిపోయింది. తర్వాతి కాలంలో సకల చేతగానితనాలకీ, అగణిత అప్రయోకత్వాలకీ చవటలు వెతుక్కునే అన్ని నిందలకూ కనిపెట్టుకున్న అడ్రస్ ఒకటి ఉంది. దాని పేరు ఖర్మ. నింద ఖర్మ మీద వేస్తే ఆ తర్వాత మన దేశంలో వేరే ఏమీ చేయనక్కర్లేదు. ‘ఏం చేస్తామండీ ఖర్మ’ అని తడవకోసారి అంటూ ఉంటే చాలు. సాఫల్య కర్మల కోసం కాదా కర్మ?అప్రయోజకత్వం అక్కసుకు సింహద్వారం. వైఫల్యం అహంకారానికి గొడ్డుకారం. కళ్లెదుట కష్టపడి పని చేసేవాడు, భార్యాపిల్లలను చక్కగా చూసుకునేవాడు, డబ్బు జాగ్రత్త చేసుకునేవాడు, తెలివిగా మసలుకునేవాడు, వ్యసనాలకు దూరంగా ఉండేవాడు, వచ్చిన విద్యను అంటిపెట్టుకుని ఉండేవాడు, తెగించి కొత్తదారులు కనిపెట్టేవాడు... వీళ్లంతా ముందుకు వెళుతుంటే విజేతలై అధిగమిస్తుంటే ఇవన్నీ చేయలేని, చేయరాని, చేసేందుకు కనీసం ప్రయత్నించి చూడని ప్రతి గాడిదకూ చేతికి అందే మారణాయుధం నింద. గెలిచినవాడిని ఓడించేందుకు ధర్మబద్ధమైన ఏ ఆయుధమూ లేని పరాజితుడు అంతిమంగా ప్రయోగించే పాశుపతాస్త్రం నింద. ఇది టీకా లేని క్రిమి. నాల్కల ద్వారా వ్యాపించే మహమ్మారి.పాఠశాల విద్య తద్వారా తెలుగు భాష ముందుకు సాగడానికి చిన్నయ సూరి ఆవిష్కృతం చేసిన అతి ముఖ్యమైన కృషి ‘బాల వ్యాకరణం’ వేలాదిగా అమ్ముడుపోవడం మొదలుపెట్టాక ఆయన మీద పడ్డ నింద– అది కాపీ రచన అని... అది వేరెవరో పండితుడు రాశాడు అని. చిన్నయ సూరి ఈ గండం నుంచి గట్టెక్కడానికి గురు సమానులైనవారి వైపు ఆశగా చూస్తే వారూ చేసిన పని ‘అవును.. కాపీయే’ అని నిందించడం. ఐదారేళ్లు చిన్నయ సూరి నిందను మోశాక నింద ఓడిపోయింది. చిన్నయ సూరి మిగిలాడు. ఒక వేశ్య రచన చేయుటయా... ఆస్థానాలలో ఆడే దేవదాసి కవిత్వం చెప్పుటయా అని నాటి పెద్దలకు ముద్దు పళని మీద ఆగ్రహం వచ్చింది. ‘లోపల ఏముందో తర్వాత.. ముందు అశ్లీలం అని నింద వేయండి’ అన్నారు. ఆ నిందను జయించి తెలుగు సారస్వతంలో తన స్థానం దక్కించుకోవడానికి ‘రాధికా సాంత్వనం’ ఎంత సాంత్వనం కోల్పోయిందని?తప్పులు, పొరపాట్లు చేయడం మానవ సహజం. పురాణాలూ ఈ సందర్భాలను ఎత్తి చూపాయి. రాముణ్ణి మాయలేడి వెంట పంపి సీత తప్పు చేసింది. ఆ తప్పు వల్ల ఆమెలో ఆందోళన జనించింది. ఆ ఆందోళన ఇంగితం కోల్పోయేలా చేసింది. ఎంతకూ రాని రాముని గురించి పరితపిస్తూ, రక్షణకు వెళ్లమని, ‘నా మీద కన్నేసి నువ్వు కదలడం లేదు కదూ’ అని లక్ష్మణుడి మీద నింద వేసే సరికి అతడు హతాశుడయ్యాడు. తర్వాతి కాలంలో ఈ సీతమ్మే ఘోర నిందను ఎదుర్కొంది. అగ్నిపునీతగా నిలిస్తే తప్ప నింద వదల్లేదు. సకల లీలా మాధవుండైన శ్రీకృష్ణుడు కూడా నిందచేసే లీలకు చకితుడయ్యి జాంబవంతుడితో యుద్ధానికి దిగాడు శమంతకమణి కోసం! ఆ మాటకొస్తే ఆడిన మాట తప్పాడన్న నింద వస్తుందన్న భయం లేకపోతే హరిశ్చంద్రుడు పడేవాడా అన్ని కష్టాలు? దేనికీ జడవనివాణ్ణి జడిసేలా చేయగలదు నింద.నిందలు ఎందుకు వేస్తారు అంటే అది చాలా సులభమైన పని కనుక అంటారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. గుచ్చుకుంటున్న స్వీయ వైఫల్యాలకు కాసింత మలాము రాసుకోవడానికి ఎదుటివారికి మలం పూస్తారు ఇట్టివారు. అక్కసును, ద్వేషాన్నీ గెలుపుగా మార్చుకునేందుకు దేశాలపై, జాతులపై, మతాలపై, కులాలపై, వ్యక్తులపై, సార్థకులపై నిందలు వేస్తారు. నిందకు దండన అనుమతి ఉంది. చేతబడి చేస్తున్నారన్న నింద వేశాక ఊరంతా కలిసి వారిని చంపుతుంటారు. నింద బలిగోరుతుంది. విడిపోయి తమ దారి తాము చూసుకుందామనుకునే తోబుట్టువులు ఇవాళ సుపారీ ఇస్తున్నది నిందకే. నిందలు వేసేవారు పదేపదే నెగెటివ్ ఆలోచనల్లో చిక్కుకుని ఏమీ సాధించలేక చరిత్రహీనులుగా మిగులుతారనడానికి ఆధారాలున్నాయి. నేటి సోషల్ మీడియా అంతా నిందలు వేసే మందబుద్ధు లతో ఎంతగా నిండి ఉందంటే రోజూ వేల కొలది పోస్టుల పాపపుకూడు ఉడికి వడ్డనవుతున్నది. ఈ భోజనానికి ఎగబడుతున్న అమాయకులు ఎందరో. కవులు, రచయితలు ఎప్పుడైనా ఈ దారి తొక్కుతున్నారా ప్రయివేటు సంభాషణలను నిందలతో నింపుతున్నారా, చెక్ చేసుకోవాలి. మొదట నింద వేసినవారు సచ్ఛీలురు అయిపోవడం నింద సమకూర్చే అతి పెద్ద లాభం. అంత మాత్రం చేత నింద వేసిన వారు గెలిచినట్టు కాదు. మోసినవారు ఓడినట్టు కాదు. సదుద్దేశంతో సద్విమర్శ చేసేవారిని ఇంటిలో నాటే చెట్టంత దగ్గరగా ఉంచుకోమన్నాడు కబీర్ దాస్. సమాజం సద్విమర్శతో నిర్మితమవుతుంది. నిందతో కాదు. నింద నిందపడి పాడుగానూ! -
వారణాసిలో జ్ఞానవాపీ విశ్వనాథ ఆలయం
గోరఖ్‌పూర్: వారణాసిలోని జ్ఞానవాపీని మసీదు అని పిలుస్తుండడం దురదృష్టకరమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అది మసీదు కాదని చెప్పారు. జ్ఞానవాపీ ప్రాంగణమంతా విశ్వనాథుడి ఆలయమని స్పష్టంచేశారు. ఆ విషయం విశ్వనాథుడే స్వయంగా చెప్పాడని తెలిపారు. శనివారం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గోరఖ్‌పూర్ యూనివర్సిటీలో ‘సామరస్య సమాజ నిర్మాణంలో నాథ్‌పంత్ పాత్ర’ అనే అంశంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. జ్ఞానవాపీని మసీదుగా కొందరు పరిగణిస్తుండడం సరైంది కాదని పేర్కొన్నారు. పురాణాల ప్రకారం చూస్తే ఆది శంకరుడికి, కాశీ విశ్వనాథుడికి మధ్య సంవాదం జరిగిందని తెలిపారు. జ్ఞానవాపీ తన ప్రాంగణమేనని ఆది శంకరుడితో విశ్వనాథుడు చెప్పినట్లు వెల్లడించారు. జ్ఞానవాపీ వ్యవహారంపై హిందువులు, ముస్లింల మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
Video: వందే భారత్ రైలులో సాంకేతిక లోపం.. లాక్కెళ్లిన మరో ఇంజిన్
లక్నో: భారత రైల్వే తీసుకొచ్చిన సెమీ స్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. అంతే స్పీడ్‌తో పలు రూట్లలో పరుగులు పెడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన ఈ రైళ్లపై అంతే విమర్శలు కూడా వినిపిస్తుంటాయి . గతంలో ఎన్నోసార్లు రైళ్లపై రాళ్లు రువ్వడం, గేదేలు వంటివి ఢీకొని రైళ్లు ధ్వంసమైన ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి.తాజాగా ఓక వందే భారత్ రైలు ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో మార్గ మధ్యలో ఆగిన ఆ రైలు అక్కడి నుంచి ముందుకు కదలలేదు. చివరకు మరో రైలు ఇంజిన్ ద్వారా వందే భారత్ రైలును సమీపంలోని స్టేషన్ వరకు లాక్కెళ్లారు. ఈ ఘటన న్యూఢిల్లీ- వారణాసి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో చోటుచేసుకుంది. రైలు ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో సోమవారం ఉదయం 9.15 గంటల సమయంలో ఉత్తరప్రదేశ్ ఇటావా జిల్లాలోని భర్తానా రైల్వే స్టేషన్ సమీపంలో అది ఆగిపోయింది. సమాచారం రైల్వే టెక్నికల్ బృందం సంఘటనా స్థలానికి చేరుకొని వందే భారత్ రైలు ఇంజిన్‌లోని సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించింది. అయితే వారి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆ మార్గంలో వెళ్లాల్సిన పలు రైళ్లు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. చివరకు మూడు గంటల తర్వాత మరో రైలు ఇంజిన్‌ను రప్పించారు. దాని ద్వారా వందే భారత్ రైలును భర్తానా రైల్వే స్టేషన్ వరకు లాక్కెళ్లారు.What a sight.The old engine comes to rescue the famed Vande Bharat which ran into technical glitch and got stranded in Etawah, UP. Happened to the Varanasi bound Vande Bharat adversely affecting operations of other trains on the route. pic.twitter.com/rvOwbkDz4K— Piyush Rai (@Benarasiyaa) September 9, 2024మరోవైపు ఈ సంఘటన వల్ల వందే భారత్ ట్రైన్‌లోని ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కంపార్ట్‌మెంట్స్‌లోని ఏసీలు పని చేయకపోవడంతో ఉక్కపోతతో అల్లాడిపోయారు. చివరకు వందే భారత్ ట్రైన్‌లోని సుమారు 750 మంది ప్రయాణికులను ఇతర రైళ్లలో వారి గమ్యస్థానాలకు చేర్చారు. కాగా, వందే భారత్ ట్రైన్‌ను మరో రైలు ఇంజిన్ ద్వారా లాక్కెళ్లిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో రైల్వేతోపాటు కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. -
పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్
కాన్పూర్/న్యూఢిల్లీ: వారణాసి– అహ్మదాబాద్ మధ్య నడిచే సబర్మతి ఎక్స్‌ప్రెస్ శనివారం యూపీలో పట్టాలు తప్పింది. పట్టాలపైనున్న ఒక వస్తువు రైలింజిన్‌ను బలంగా తాకడంతో 20 బోగీలు పట్టాలు తప్పాయి. కాన్పూర్–భీమ్సేన్ రైల్వే స్టేషన్ల మధ్య తెల్లవారు జామున 2.35 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెద్ద శబ్దంతో బోగీలు ఊగుతూ, రైలు నిలిచిపోవడంతో నిద్రలో ఉన్న ప్రయాణికులంతా ఉలిక్కిపడి లేచారు. ఘటనలో ఎవరికీ ఎటువంటి అపాయం వాటిల్లలేదని రైల్వే అధికారులు తెలిపారు. ఘటన అనంతరం ప్రయాణికులందరినీ బస్సుల్లో కాన్పూర్ రైల్వే స్టేషన్‌కు, అక్కడికి నుంచి వేరే రైళ్లలో గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఏర్పాట్లు చేశారు. కుట్ర కోణంలో దర్యాప్తు‘రైలు పట్టాలపైనున్న ఓ వస్తువు ఇంజిన్‌ను తాకినట్లు ఆనవాళ్లున్నాయి. అన్ని ఆధారాలను అధికారులు సేకరిస్తున్నారు. యూపీ పోలీసులతోపాటు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు దర్యాప్తు చేపట్టారు’అని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ‘బండరాయి వంటిదేదో గట్టిగా గుద్దుకోవడంతో ఇంజిన్ ముందు భాగం తీవ్రంగా దెబ్బతిని, వంగిపోయినట్లు లోకో పైలట్ చెబుతున్నారు. 16వ బోగీ సమీపంలో మాకు దొరికిన వస్తువే ఇంజిన్ దెబ్బతినేందుకు కారణమై ఉండొచ్చు. ఇది సంఘ వ్యతిరేక శక్తుల పని’గా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
Independence Day: త్రివర్ణ అలంకరణలో కాశీ విశ్వేశ్వరుడు
నేడు (పంద్రాగస్టు)దేశమంతటా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా త్రివర్ణ పతాకాలను ఎగురవేశారు. వారణాసిలో కొలువైన విశ్వేశ్వరుడు కూడా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మునిగితేలాడు.శ్రావణమాస శోభతో వెలిగిపోతున్న కాశీ విశ్వేశ్వరుని ముంగిట నేడు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. స్వామివారి దర్బారును అందంగా అలంకరించారు. ఇందుకోసం జాతీయ పతాకంలో కనిపించే కాషాయం, తెలుపు, ఆకుపచ్చల రంగులు కలిగిన పూలను వినియోగించారు. ఆలయానికి వచ్చిన భక్తులు హరహర మహాదేవ్‌తో పాటు జై భారత్ మాతాకీ అంటూ నినాదాలు చేశారు. తెల్లవారు జామునే త్రివర్ణాలతో అలంకృతుడైన మహాశివుణ్ణి చూసి భక్తులు ఉప్పొంగిపోయారు. तिरंगे के रंग में बाबा विश्वनाथ का श्रृंगार किया गया. भारत माता की जय के नारों से गूंजा बाबा का दरबार. #IndependenceDayIndia pic.twitter.com/eisPF0alJi— Prashant rai (@prashantrai280) August 15, 2024 -
వారణాసిలో తొలి హైడ్రోజన్ క్రూయిజ్
ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో దేశంలోనే తొలి హైడ్రోజన్ క్రూయిజ్‌ను నడపనున్నారు. ఈ క్రూయిజ్ ఆదివారం అర్థరాత్రి వారణాసికి చేరుకుంది. మొదట ఈ హైడ్రోజన్ క్రూయిజ్‌ను నమో ఘాట్‌కు తీసుకువచ్చి, తరువాత రామ్‌నగర్‌లోని మల్టీమోడల్ టెర్మినల్‌కు తరలించారు. ఈ క్రూయిజ్ కొచ్చిలోని షిప్‌యార్డ్‌లో అనేక సౌకర్యాలతో నిర్మితమయ్యింది.ఈ క్రూయిజ్‌లో 50 మంది ప్రయాణికులు కూర్చునేందుకు అవకాశం ఉంది. కాలుష్యాన్ని ఉత్పత్తి చేయకుండా గంగానదిలో నడిచే తొలి క్రూయిజ్ ఇది. ఈ క్రూయిజ్ వారణాసి- చునార్ మధ్య నడుస్తుంది. దీనిని పర్యాటక శాఖ పర్యవేక్షించనుంది.ఈ క్రూయిజ్ నిర్వహణ కోసం వారణాసిలోని రామ్‌నగర్ మల్టీ మోడల్ టెర్మినల్‌లో తాత్కాలిక హైడ్రోజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. హైడ్రోజన్ శక్తితో నడిచే ఈ క్రూయిజ్‌లో ఎలక్ట్రిక్ ఇంజన్ కూడా అమర్చారు. తద్వారా హైడ్రోజన్ ఇంధనం తగ్గినప్పుడు, క్రూయిజ్‌ను ఎలక్ట్రిక్ ఇంజిన్‌తో నడపవచ్చు. వారణాసి తర్వాత అయోధ్య, మథురలలో కూడా ఈ క్రూయిజ్‌ను నడపాలని ప్రభుత్వం యోచిస్తోంది. -
గ్రాండ్ వెడ్డింగ్ : పవిత్ర కాశీ నగరంపై నీతా అంబానీ ప్రత్యేక వీడియో, వైరల్
లవ్‌బర్డ్స్ అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం సందర్భంగా అనంత్ తల్లి, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ పవిత్ర వారణాసి నగర గొప్పదనాన్ని తన అభిమానులతో పంచుకున్నారు. దేశీయ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచంతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఎన్ఎంఏసీసీని స్థాపించిన తమ దార్శనికతకు అనుగుణంగా, తమ కుటుంబంలోని వివాహ వేడుకలకు ముందు పవిత్ర నగరమైన వారణాసికి నివాళులర్పిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా అద్భుతమైన వీడియోను షేర్ చేశారు. నీతా అంబానీ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన అరుదైన రంగత్ స్వదేశీ బనారసీ చీరలో హుందాగా కనిపించారు.~ Auspicious Beginnings: An Ode to Kashi ~ pic.twitter.com/GXVcIXIeBh— Nita Mukesh Ambani Cultural Centre (@nmacc_india) July 12, 2024కాగా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వివాహ వేడుకల్లో భాగంగా వరుడి తల్లి, నీతా అంబానీ వారణాసిని సందర్శించి వివాహ తొలి ఆహ్వానాన్ని కాశీ విశ్వేశ్వరుడి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే.. -
నీతా అంబానీ కొనుగోలు చేసిన లక్క బుటీ బనారసీ చీరలు! ప్రత్యేకత ఏంటంటే.
రిలయన్స్ దిగ్గజం ముఖేశ్ అంబానీ నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ రాధికాల వివాహం వచ్చే నెల జూలై 12న ఘనంగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నీతా అంబానీ మొదటి ఆహ్వాన లేఖను కాశీ విశ్వేశ్వరునికి అందించి, అక్కడే కొద్దిసేపు గడిపారు. అక్కడ తనకు ఇష్టమైన వారణాసి చాట్ ఆస్వాదించి తర్వాత అక్కడ పేరుగాంచిన లక్క బుటీ బనారసీ చీరలను భారీగా కొనుగోలు చేశారు. వారణాసి ఈ చీరలకు పెట్టింది పేరు కూడా. అక్కడ చేనేత కార్మకుల చేతి నుంచి జాలువారే ఈ చీరల ప్రత్యేకత ఏంటో తెలుసుకుందామా..!నీతా రామ్‌నగర్ జిల్లాలోని విజయ్ మౌర్య ఇంటిని సందర్శించి ..అక్కడ మరీ కొందరూ బనారసీ కళాకారులను తన హోటల్‌కి ఆహ్వానించారు. అంతేగాదు తమ వద్ద పెద్ద సంఖ్యలో చీరలు కొనుగోలు చేసినట్లు వస్త్రాల్లో పీహెచ్డీ చేసిన బనారసీ చీరల తయారుదారు అంజికా కుష్వాహా వెల్లడించారు. ఈ చీర ప్రత్యేకత ఏంటంటే..లక్క బుటీ బనారసీ చీరల చరిత్ర అనేక శతాబ్దాల నాటిది. ఇది వారణాసి సాంస్కృతిక వారసత్వంలో లోతుగా ముడిపడి ఉన్న చేనేత చీర. ఇక్కడ ఉపయోగించే నేత సాంకేతికత తరతరాల నైపుణ్యం కలిగిన కళాకారుల ద్వారా అందిపుచ్చుకున్న కళా నైపుణ్యం. ఈ చీరలు సాంప్రదాయకంగా స్వచ్ఛమైన పట్టు దారాలను ఉపయోగించి చేతిలో నేసినవి. దీనిపైన ఉండే డిజైన్లు జరీతో రూపొందించినవి. ఈ చీరలోని లక్కబుటి అనే పదం అర్థం ఏంటంటే..చిన్నవైన సున్నితమైన అంశాలను పొందుపరిచేలా ఈ చీరను తీర్చిదిద్దుతారు. బట్టలో చిక్కగా అల్లినవి, మొఘల్ డిజైన్లతో ఆకృతులు రూపొందిస్తారు. ఈ డిజైన్లు కంటికి చాలా ఆహ్లాదకరంగా ఉండే క్లిష్టమైన పూల నమూనా, ఆకులను కలిగి ఉంటాయి. కాలక్రమేణ బనారసీ చీరలు అభివృద్ధి చెందాయి. ఇప్పుడవి వివిధ డిజైన్ అంశాలను కలిగి ఉన్నాయి. ఎక్కువగా బ్రోకేడ్ వర్క్, ఎబ్రాయిడరీ వంటి రకరకాల స్టైల్స్‌లో అందుబాటులో ఉన్నాయి.अनंत की शादी से पहले नीता अंबानी ने की बनारसी साड़ियों की शॉपिंग◆ नीता अंबानी ने कई साड़ियां पसंद कीं#NitaAmbani #AnantAmbani #ViralVideo pic.twitter.com/rSHYHSWmQI— News24 (@news24tvchannel) June 27, 2024 (చదవండి: నీతా అంబానీ మనసు దోచుకున్న చాట్...వైరల్వీడియో) -
నీతా అంబానీ మనసు దోచుకున్న చాట్...వైరల్వీడియో
రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ , బిలియనీర్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి పురస్కరించుకొని ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న ప్రసిద్ధ కాశీ విశ్వనాథ్ ఆలయంలో ప్రార్థనలు చేశారు. అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ వివాహ తొలి ఆహ్వానాన్ని శివుని పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కాశీ లేదా బనారస్ నగరంలో చాట్‌ను ఆస్వాదించిన వీడియో వైరల్ అయింది. అంతేకాదు భర్త ముఖేష్ అంబానీకి చాట్లు అంటే చాలా ఇష్టమని ప్రస్తావించారు. ఇపుడు ముఖేష్ ఉండి ఉంటే దీన్ని ఇష్టపడి ఉండేవారని వ్యాఖ్యానించారు. అంబానీ ముంబైలోని స్వాతి స్నాక్స్ ఫుడ్ అంటే చాలా ఇష్టమట ఒకసారి ఆహారాన్ని ఆర్డర్ చేసేవాడని చెబుతారు.After temple visit and the sacred Ganga Aarti, Smt. Nita Ambani savored a variety of dishes at the famous Kashi Chat Bhandaar in Varanasi today#KasiViswanathan #Varanasi #RelianceFoundation #AnantRadhikaWedding #KashiVishwanathTemple #HarHarMahadev #NitaAmbani pic.twitter.com/RzZ8uHWNV1— AkashMAmbani (@AkashMAmbani) June 25, 2024 కాశీలో నీతా అంబానీ మనసు దోచుకున్న స్నాక్ బనారస్ టమాటా చాట్. పాపులర్ కాశీ చాట్ భండార్‌లో చాట్‌ను ఆస్వాదించారు. అలాగే స్థానిక సంస్కృతి , సంప్రదాయాల గురించి ముచ్చటించడం విశేషంగా నిలిచింది. పనిలో పనిగా చాట్ రెసిపీని కూడా దుకాణదారుడిని కూడా అడిగి తెలుసుకున్నారు. బనారస్‌లో ఇది పాపులర్. దేశ విదేశాలనుంచి వచ్చేవారు కచ్చితంగా దీన్ని టేస్ట్ చేస్తారట. దాదాపు పదేళ్ల తర్వాత కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకున్నానంటూ నీతా ఉద్వేగానికి లోనయ్యారు. "గంగా హారతి సందర్భంగా ఇక్కడికి రావడం నా అదృష్టం. చాలా బాగుంది.. ఇక్కడ గొప్ప శక్తి ఉంది’’ అన్నారామె.కాగా అనంత్- రాధిక పెళ్లి బాజాలు జూలై 12న మోగనున్నాయి. ముంబైలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ సెంటర్లో మూడు రోజుల పాటు వీరి వివాహ వేడుకలు జరగనున్నాయి -
ఎయిర్పోర్ట్ విస్తరణకు రూ.2,869 కోట్లు
వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణకు కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపింది.భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభ నియోజకవర్గం అయిన వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి ఎయిర్పోర్ట్ విస్తరణ కోసం రూ.2,869.65 కోట్లు వెచ్చించేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిధులతో కొత్త టెర్మినల్ బిల్డింగ్, ఆప్రాన్(విమానాలను పార్క్ చేయడానికి వీలుగా ఉండే ప్రాంత్రం), రన్‌వే విస్తరణ, ట్యాక్సీ ట్రాక్ నిర్మాణంతోపాటు ఇతర అనుబంధ పనులు చేస్తారని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ప్రతిపాదన ప్రకారంగానే రూ.2,869.65 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఏటా 39 లక్షల మంది ప్రయాణికులు ఈ విమానాశ్రయం ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. భవిష్యత్తులో ఈ సంఖ్య 99 లక్షలకు చేరేలా లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం తాజా నిధులు ఎంతో ఉపయోగపడుతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
కాశీ కారిడార్‌లో సరికొత్త రికార్డు.. 16 కోట్లు దాటిన భక్తులు
ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసి దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతోంది. గడచిన 30 నెలల్లో మహాశివుని భక్తులు కాశీ కారిడార్‌లో సరికొత్త రికార్డు సృష్టించారు. డిసెంబర్ 2021లో ఈ కారిడార్ ప్రారంభమైన తరువాత నాటి నుంచి ఇప్పటివరకు 16 కోట్ల 46 లక్షల మంది భక్తులు కాశీ విశ్వేశ్వరుణ్ణి సందర్శించుకున్నారు. ఇది మాత్రమే కాదు 2023తో పోలిస్తే 2024 ఆరు నెలల కాలంలో అధికంగా 48 శాతం మంది భక్తులు కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకున్నారు.రికార్డు స్థాయిలో శివభక్తులు కాశీకి తరలివస్తున్న కారణంగా ఇక్కడి పర్యాటక పరిశ్రమకు ఎంతో ప్రయోజనం చేకూరుతోంది. ఇక్కడి హోటళ్లకు మంచి గిరాకీ వస్తుండగా, బనారసీ చీరలు, హస్తకళా వస్తువులు విరివిగా విక్రయమవుతున్నాయి. స్థానిక వ్యాపారులు కారిడార్ నిర్మాణం తరువాత మంచి లాభాలను అందుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిరకూ రెండు కోట్ల 86 లక్షల 57 వేల 473 మంది భక్తులు కాశీ విశ్వనాథ ధామానికి తరలివచ్చారు. రికార్డు స్థాయిలో భక్తుల రాకతో థామ్ ఆదాయం 33 శాతం మేరకు పెరిగింది. -
గంగమ్మ దత్తత తీసుకుంది
వారణాసి: గంగా మాత తనను దత్తత తీసుకున్నట్లే కనపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా ఎన్నికయ్యాక మోదీ తొలిసారిగా మంగళవారం వారణాసిలో పర్యటించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 17వ విడత రూ.20,000 కోట్లను 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో జమచేశారు. మెహందీగంజ్‌లో పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్‌లో మాట్లాడుతూ ‘వారణాసి ప్రజలు మూడోసారి నన్ను ఎంపీగానే కాదు ప్రధానిగానూ ఎన్నుకున్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఇదివరకెప్పుడూ చూడని తీర్పునిచ్చారు.చరిత్ర సృష్టించారు’ అని మోదీ పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వ తొలి నిర్ణయం రైతులకు, పేదలకు సంబంధించినదని అన్నారు. వికసిత్ భారత్‌కు.. రైతులు, మహిళలు, యువత, పేదలు గట్టి మూలస్తంభాలుగా తాను పరిగణిస్తానన్నారు. ’విశ్వనాథుడు, గంగా మాత ఆశీస్సులు, కాశీ ప్రజల ఆపార ప్రేమతో మూడోసారి దేశానికి ప్రధాన సేవకుడిని అయ్యే భాగ్యం నాకు దక్కింది. వరుసగా మూడోసారి నన్ను తమ ప్రతినిధిగా ఎన్నుకొని కాశీ ప్రజలు నన్ను ఆశీర్వదించారు.ఇప్పుడు గంగా మాత కూడా నన్ను దత్తత తీసుకున్నట్లే కనపడుతోంది. నేనిక్కడి వాడిని అయిపోయాను’ అని మోదీ అన్నారు. ప్రజాస్వామ్య దేశాల్లో ప్రభుత్వాలు వరుసగా మూడోసారి ఎన్నికకావడం అరుదని, భారత్ ప్రజలు దీన్ని చేసి చూపించారని ప్రధాని అన్నారు. భారత్‌లో 60 ఏళ్ల తర్వాత తమ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించిందన్నారు. ‘యువత ఆకాంక్షలు, ప్రజల కలలు ఎక్కువగా ఉన్న భారత్ లాంటి దేశంలో 10 ఏళ్ల పాలన తర్వాత కూడా మరో అవకాశం రావడం ఘన విజయం. ప్రజల విశ్వాసానికి ప్రతీక’ అని మోదీ అన్నారు.ప్రతి డైనింగ్ టేబుల్‌పై మన ఆహార ఉత్పత్తులు ఉండాలి ప్రపంచవ్యాప్తంగా ప్రతి డైనింగ్ టేబుల్‌పై మన ఆహార ఉత్పత్తులు ఉండాలని తాను కోరుకుంటున్నట్లు ప్రధాని మోదీ రైతులనుద్దేశించి అన్నారు. ‘ప్రపంచ మార్కెట్ గురించి ఆలోచించాలి. పప్పులు, నూనె గింజల ఉత్పత్తిలో స్వయంసమృద్ధిని సాధించాలి. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిలో అగ్రగామిగా ఎదగాలి. బనారస్ లంగ్డా మామిడి, జౌన్పూర్ రాడిష్ రకం, గాజిపూర్ లేడీ ఫింగర్ రకం.. తదితరాలు నేడు విదేశీ మార్కెట్లకు చేరుతున్నాయి. ఒక జిల్లా.. ఒక ఉత్పత్తి చొరవతో, జిల్లా స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తుల హబ్‌ల ఏర్పాటుతో ఎగుమతులు పెరుగుతున్నాయి. ప్రపంచ ప్యాకేజ్డ్ ఫుడ్ మార్కెట్లో భారత్‌ను మనమిప్పుడు కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలి’ అని మోదీ పేర్కొన్నారు. -
రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల
వారణాసి: పీఎం కిసాన్ సమ్మాన్ 17వ విడత నిధులు విడుదలయ్యాయి. మూడో సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తొలి సంతకం పీఎం కిసాన్ నిధులపై చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉత్తరప్రదేశ్‌లో పర్యటించిన ప్రధాని.. వారణాసి కేంద్రంగా ఈ హామీని అమలు చేశారు.ఏడాదికి మూడు దశల్లో రూ.6 వేల మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఈసారి 17వ విడత నిధులను ప్రధాని నరేంద్రమోదీ వారణాసిలో విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న చిన్న రైతులకు రూ.2వేల చొప్పున మొత్తం రూ.20 వేల కోట్ల సాయం ఈ పథకం ద్వారా అందనుంది.ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సహా పలువురు రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. -
18న పీఎం కిసాన్ నిధుల విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా అందజేసే పీఎం కిసాన్ పథకం నిధులు ఈ నెల 18న విడుదల కానున్నాయి.ప్రధాని మోదీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో జరిగే కార్యక్రమంలో ఆన్లైన్లో నిధులను విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా 9.26 కోట్ల రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ.20 వేల కోట్లు జమ కానున్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ శనివారం ఈ విషయం వెల్లడించారు. -
ప్రియాంక పోటీచేస్తే ప్రధాని ఓడేవారు
రాయ్‌బరేలీ: ప్రధాని మోదీ పోటీచేసిన వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ పోటీచేస్తే ఆమె రెండు, మూడు లక్షల ఓట్ల మెజారిటీతో నెగ్గేవారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రాయ్‌బరేలీలో తనను, అమేథీలో కిశోరీలాల్ శర్మను గెలిపించినందుకు గుర్తుగా మంగళవారం రాయ్‌బరేలీలో ఏర్పాటుచేసిన ‘కృతజ్ఞత కార్యక్రమం’లో అమేథీ, రాయ్‌బరేలీ ఓటర్లనుద్దేశించి రాహుల్ కొద్దిసేపు ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో ప్రియాంక, అమేథీ ఎంపీ కిశోరీలాల్ శర్మ పాల్గొన్నారు. ‘‘ పార్లమెంట్లో ఎన్డీఏ బలాన్ని తగ్గించేందుకే రాయ్‌బరేలీ, అమేథీ సహా దేశవ్యాప్తంగా నియోజకవర్గాల్లో విపక్షాల ‘ఇండియా’ కూటమి పార్టీలు ఉమ్మడి గా పోరాడాయి. ‘‘ బీజేపీ నాయకుల గెలుపు అహంకారాన్ని మేం పట్టించుకోం. మా ఆలోచనంతా ప్రజా సమస్యల గురించే.అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ఠ, ఇతరత్రా కార్యక్రమాల్లో బడా పారిశ్రామికవేత్తలకు అతి విలువ ఇచ్చి సాధారణ జనాలను మోదీ గాలికొదిలేశారు. వారి సమస్యలను పట్టించుకోలేదు. అందుకే ఏకంగా అయోధ్యలోనూ బీజేపీకి ఓటమి రుచి చూపించి ఓటర్లు బుద్ధి చెప్పారు’’ అని అన్నారు. అవధ్ గొప్ప సందేశమిచ్చింది: ప్రియాంకఅమేథీ, రాయ్‌బరేలీలో బీజేపీని ఓడించి ఇక్కడి అవధ్ ప్రాంతం ఉత్తరప్రదేశ్కేకాదు యావత్భారతానికి చక్కటి సందేశం ఇచ్చిదని, మనకు వాస్తవికమైన స్వచ్ఛమైన రాజకీయాల అవసరం ఉందని ప్రియాంకా అన్నారు. -
వారణాసిలో ప్రియాంక పోటీ చేసి ఉంటే.. రాహుల్ సంచలన కామెంట్స్
లక్నో: లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సంచలన కామెంట్స్ చేశారు.చెల్లి ప్రియాంక గాంధీ గనుక తన మాట విని వారణాసిలో ప్రధానిమోదీపై పోటీ చేసి ఉంటే భారీ మెజార్టీతో గెలిచి ఉండేదన్నారు.ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలిలో మంగళవారం(జూన్11) నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘వారణాసిలో ప్రధానమంత్రికి చావుతప్పి కన్నులొట్టబోయింది. నా చెల్లి ప్రియాంక నా మాట విని ఉంటే ఆమె చేతిలో వారణాసిలో మోదీ 2నుంచి3 లక్షల మెజార్టీతో ఓడిపోయేవారు.బీజేపీతో ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ముప్పు ఉందని ప్రజలు తెలుసుకోవడం వల్లే ఈ ఎన్నికల్లో బీజేపీకి దెబ్బ పడింది.’అని రాహుల్ అన్నారు. ఈ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త కాంగ్రెస్‌కు సహకారం అందించాడని చెప్పారు. గతంలోలా పొత్తుల్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఎన్నికలను ఎదుర్కొన్నామని చెప్పారు. -
ఈనెల 18న వారణాసికి మోదీ.. రైతుల సదస్సుకు హాజరు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 18న ఉత్తరప్రదేశ్‌లోని తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించనున్నారు. అక్కడ జరగబోయే 'కిసాన్ సమ్మేళన్'లో (రైతుల సదస్సు) మోదీ ప్రసంగించనున్నారు. అయితే మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మోదీ.. వారణాసికి వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం.మోదీ పర్యటనపై స్థానిక బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. వారణాసిలోని రొహనియా లేదా సేవాపురి అసెంబ్లీ నియోజకవర్గంలో రైతుల సదస్సుకు వేదిక ఉండనున్నట్లు తెలిపారు. ఈ మేరకు గులాబ్‌బాగ్‌లోని పార్టీ కార్యాలయంలో మహానగర, జిల్లా అధికారుల సమావేశం నిర్వహించారు.వారణాసిలో ఒకరోజు పర్యటన సందర్భంగా దశాశ్వమేధ ఘాట్‌లో గంగా హారతిలో ప్రధాని మోదీ పాల్గొంటారని, అందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయని కాశీకి చెందిన బీజేపీ అధికారి దిలీప్ పటేల్ తెలిపారు. వారణాసిలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధం కావాలని బీజేపీ కార్యకర్తలందరికి పిలుపునిచ్చారు. రైతు సదస్సుకు పార్టీ కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించే ప్రక్రియ కూడా ప్రారంభమైందని తెలిపారు.కాగా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ వారణాసి నుంచి వరుసగా మూడోసారి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్ధి అజయ్ రాయ్‌పై 1.5 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు.