దాన్ని మసీదు అనడం దురదృష్టకరం: యోగి ఆదిత్యనాథ్
గోరఖ్‌పూర్: వారణాసిలోని జ్ఞానవాపీని మసీదు అని పిలుస్తుండడం దురదృష్టకరమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అది మసీదు కాదని చెప్పారు. జ్ఞానవాపీ ప్రాంగణమంతా విశ్వనాథుడి ఆలయమని స్పష్టంచేశారు. ఆ విషయం విశ్వనాథుడే స్వయంగా చెప్పాడని తెలిపారు.
శనివారం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గోరఖ్‌పూర్ యూనివర్సిటీలో ‘సామరస్య సమాజ నిర్మాణంలో నాథ్‌పంత్ పాత్ర’ అనే అంశంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. జ్ఞానవాపీని మసీదుగా కొందరు పరిగణిస్తుండడం సరైంది కాదని పేర్కొన్నారు. పురాణాల ప్రకారం చూస్తే ఆది శంకరుడికి, కాశీ విశ్వనాథుడికి మధ్య సంవాదం జరిగిందని తెలిపారు. జ్ఞానవాపీ తన ప్రాంగణమేనని ఆది శంకరుడితో విశ్వనాథుడు చెప్పినట్లు వెల్లడించారు. జ్ఞానవాపీ వ్యవహారంపై హిందువులు, ముస్లింల మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment