Gyanvapi mosque
-
వారణాసిలో జ్ఞానవాపీ విశ్వనాథ ఆలయం
గోరఖ్‌పూర్: వారణాసిలోని జ్ఞానవాపీని మసీదు అని పిలుస్తుండడం దురదృష్టకరమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అది మసీదు కాదని చెప్పారు. జ్ఞానవాపీ ప్రాంగణమంతా విశ్వనాథుడి ఆలయమని స్పష్టంచేశారు. ఆ విషయం విశ్వనాథుడే స్వయంగా చెప్పాడని తెలిపారు. శనివారం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గోరఖ్‌పూర్ యూనివర్సిటీలో ‘సామరస్య సమాజ నిర్మాణంలో నాథ్‌పంత్ పాత్ర’ అనే అంశంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. జ్ఞానవాపీని మసీదుగా కొందరు పరిగణిస్తుండడం సరైంది కాదని పేర్కొన్నారు. పురాణాల ప్రకారం చూస్తే ఆది శంకరుడికి, కాశీ విశ్వనాథుడికి మధ్య సంవాదం జరిగిందని తెలిపారు. జ్ఞానవాపీ తన ప్రాంగణమేనని ఆది శంకరుడితో విశ్వనాథుడు చెప్పినట్లు వెల్లడించారు. జ్ఞానవాపీ వ్యవహారంపై హిందువులు, ముస్లింల మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
జ్ఞానవాపి మసీదు వివాదం.. సెల్లార్లో పూజలకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వివాదంపై సుప్రీంకోర్టు సోమవారం(ఏప్రిల్ 1) కీలక తీర్పు ఇచ్చింది. మసీదు దక్షిణం వైపు ఉన్న సెల్లార్లో హిందువులు ప్రార్థనలకు అనుమతి నిరాకరించాలన్న మసీదు కమిటీ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే మసీదు ఆవరణలో హిందువులు పూజలు చేసుకునే అంశంలో మాత్రం ప్రస్తుతానికి యథాతథ స్థితి కొనసాగించాలని స్పష్టం చేసింది. మసీదు సెల్లార్లో హిందువులు పూజలు చేసేందుకు అనుమతి నిరాకరించాలన్న మసీదు కమిటీ పిటిషన్‌ను ఫైనల్‌గా జులైలో విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. కాగా,మసీదు సెల్లార్లో హిందువులు పూజలు చేసుకోవచ్చని గతంలో వారణాసి జిల్లా కోర్టు తీర్పునివ్వగా ఈ తీర్పును అలహాబాద్ హైకోర్టు కూడా ధృవీకరించింది. ఇదీ చదవండి.. రామ్‌లల్లా దర్శనానికి మూడు రాష్ట్రాల గవర్నర్లు -
జ్ఞానవాపి మసీదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు
లక్నో: జ్ఞానవాపి మసీదు వివాదంపై అలహాబాద్ హైకోర్టు సోమవారం ఉదయం సంచలన తీర్పు ఇచ్చింది. జ్ఞానవాపి మసీదు సెల్లార్‌లోని వ్యాస్ కా తేకానాలో హిందువుల పూజలకు అనుమతిస్తూ ఇటీవల వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును హై కోర్టు సమర్థించింది. వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ(ఏఐఎంసీ) పిటిషన్‌ను జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ బెంచ్ కొట్టివేసింది. నాలుగు రోజుల పాటు పిటిషన్‌పై వాదనలు విన్న తర్వాత తీర్పును ఈ నెల 15న కోర్టు రిజర్వ్ చేసింది. మసీదు సెల్లార్లో హిందువుల పూజలకు అనుమతిస్తూ వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుపై మసీదు కమిటీ సుప్రీంకోర్టుకు వెళ్లగా పిటిషన్ విచారించేందుకు నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకే వెళ్లాలని సూచించింది. ఇదీ చదవండి.. యోగి బాటలో థామి సర్కారు -
Up: బరేలీలో ఉద్రిక్తత.. జ్ఞానవాపిపై జైల్‌భరోకు పిలుపు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జ్ఞానవాపి మసీదుకు సంబంధించి ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో పాటు దేశంలో ముస్లింలపై అణిచివేతకు నిరసనగా బరేలిలో ముస్లిం మతపెద్ద తఖీర్ రజా శుక్రవారం జైల్ భరో పిలుపునిచ్చారు. తన అభిమానులంతా బరేలీలోని వీధుల్లోకి వచ్చి అరెస్టవ్వాలని కోరారు. దీంతో వేలాది సంఖ్యలో రజా అభిమానులు బరేలీలోని ఇస్లామియా మైదానంలో గుమిగూడారు. శుక్రవారం నమాజ్‌కు కొద్దిసేపటి ముందే రజా జైల్ భరో పిలుపునివ్వడంతో ఆయన అభిమానుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. దీంతో బరేలీ పోలీసులు అప్రమత్తమయ్యారు. రజా అభిమానులు గుమిగూడిన ఇస్లామియా కాలేజ్ మైదానాన్ని పోలీసులు చుట్టుముట్టారు. బరేలీలోని మసీదుల వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. జైల్ భరో పిలుపు కారణంగా రజాను పోలీసులు అరెస్టు చేసి కొద్దిసేపటి తర్వాత విడుదల చేశారు. ప్రస్తుతం బరేలీలో పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు తెలిపారు. కాగా, బరేలీకి ఆనుకుని ఉన్న ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో చెలరేగిన హింసపైనా రజా స్పందించారు. దేశంలో బుల్డోజర్ల దాడిని ఇక ఎంత మాత్రం సహించేది లేదన్నారు. సుప్రీం కోర్టే తమను పట్టించుకోకపోతే ఇక తమను తామే కాపాడుకుంటామని స్పష్టం చేశారు. ఇదీ చదవండి.. ఉత్తరాఖండ్‌లో హింస.. ఐదుగురి మృతి -
Gyanvapi: మిగిలిన సెల్లార్లలో కూడా ఏఎస్ఐ సర్వే చేపట్టాలి
లక్నో: జ్ఞానవాపి కాంప్లెక్స్‌లో మిగిలిన సెల్లార్లను సర్వే చేసేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)కి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హిందూ పిటిషనర్ వారణాసిలోని ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. కాంప్లెక్స్ మతపరమైన స్వభావాన్ని నిర్ధారించడానికి ఈ సెల్లార్లను సర్వే చేయడం చాలా కీలకమని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రవేశానికి అనుమతి లేని మిగిలిన సెల్లార్లలో సర్వే చేపట్టవలసిందిగా పిటిషనర్ ఏఎస్ఐని అభ్యర్థించారు. వీటితోపాటు జ్ఞానవాపి ఆవరణలో ఇటీవలి సర్వే సమయంలో దర్యాప్తు చేయని సెల్లార్ల సర్వేలను నిర్వహించాలని ఏఎస్ఐని కోరారు. ఏ సర్వే నిర్వహించినా నిర్మాణానికి నష్టం జరగకుండా చూడాలని పిటిషన్లో పేర్కొన్నారు. కొన్ని ఇటుకలు, రాళ్లతో ఉన్న అడ్డంకుల కారణంగా ఏఎస్ఐ సర్వే కొన్నిసెల్లార్లలో పూర్తి కాలేదని పిటిషనర్ పేర్కొన్నారు. నిర్మాణానికి హాని కలిగించకుండా ఈ అడ్డంకులను సురక్షితంగా తొలగించడానికి అవసరమైన నైపుణ్యాలను ఏఎస్ఐ నిపుణులు కలిగి ఉన్నారని స్పష్టం చేశారు. అవసరమైతే ఈ అడ్డంకుల తొలగింపుపై ఏఎస్ఐ నివేదిక పొందాలని అభ్యర్థించారు. జ్ఞానవాపి మసీదులో ఏఎస్ఐ సర్వేను పూర్తి చేసి నివేదికను కూడా బహిర్గతం చేసింది. మసీదు ప్రాంగణంలో భారీ హిందూ దేవాలయ ఆనవాళ్లు ఉన్నాయని ఏఎస్ఐ స్పష్టం చేసింది. హిందూ దేవాలయ చిహ్నాలు శంఖం, చక్రం సహా పలు ఆధారాలు లభించాయని స్పష్టం చేసింది. అయితే.. ఈ సర్వే తర్వాత జ్ఞానవాపి కాంప్లెక్స్ సెల్లార్లో పూజలు చేసుకోవడానికి హిందూ పక్షంవారికి అనుమతినిస్తూ వారణాసి కోర్టు తీర్పునిచ్చింది. ఇదీ చదవండి: Varanasi: మాఘ పౌర్ణమి వేళ.. వారణాసికి మోదీ -
జ్ఞానవాపి, రామ జన్మభూమి వివాదాల వెనక ములాయం సింగ్ పాత్ర ఏంటి?
లక్నో: అయోధ్యలో రాముని ప్రాణప్రతిష్ట జరిగిన కొద్ది రోజులకే జ్ఞానవాపి మసీదు సెల్లార్లో హిందువులు పూజలు చేసుకోవడానికి అనుమతినిస్తూ వారణాసి కోర్టు తీర్పునిచ్చింది. అయితే.. అయోధ్య, జ్ఞానవాపి మసీదు వివాదాల వెనక ఒక కామన్ పేరు వినిపిస్తోంది. ఆయనే దివంగత నేత ములాయం సింగ్ యాదవ్. ఈ వివాదాల వెనక ములాయం సింగ్ యాదవ్ పాత్ర ఏంటంటే..? కరసేవకులపై కాల్పులు.. 1990 అక్టోబర్‌లో ములాయం సింగ్ యాదవ్ సీఎంగా ఉన్నప్పుడు అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టాలని విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) కరసేవ నిర్వహించింది. దీనికి వ్యతిరేకంగా కరసేవకులపై ములాయం ప్రభుత్వం 28,000 మంది పోలీసు సిబ్బందిని మోహరించింది. అయినప్పటికీ బారికేడ్లను దాటి కరసేవకులు బాబ్రీ మసీదు ప్రదేశానికి చేరుకున్నారు. మసీదుపై కాశాయ జెండాలను ఎగురవేశారు. ఈ ఘటనలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 20 మంది మరణించినట్లు అధికారికంగా చెబుతున్నప్పటికీ ఆ సంఖ్య ఎక్కువగా ఉంటుందని ప్రత్యక్ష సాక్షుల కథనాలు వెలువడ్డాయి. బాబ్రి మసీదు కూల్చివేత.. అయోధ్యలో కరసేవకుల ఘటన తర్వాత 1991లో యూపీలో ఎన్నికలు జరిగాయి. బీజేపీకి చెందిన కళ్యాణ్ సింగ్ అధికారంలోకి వచ్చారు. మరుసటి ఏడాది 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చి వేత ఘటన జరిగింది. ఈ పరిణామాల తర్వాత యూపీలో బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్రంలో ఉన్న పీవీ నరసింహరావు ప్రభుత్వం రద్దు చేసింది. తర్వాత యూపీలో రాష్ట్రపతి పాలన కొనసాగింది. మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో ములాయం మళ్లీ అధికారంలోకి వచ్చారు. ఈ పాలనా కాలంలోనే జ్ఞానవాపి సెల్లార్లో హిందువుల పూజలను ములాయం ప్రభుత్వం నిలిపివేసింది. జ్ఞానవాపిలో పూజలు నిలిపివేత.. ఉత్తరప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదు సెల్లార్ (వ్యాస్జీ కా తెహ్ఖానా)లో 1993 వరకు పూజాలు జరిగాయి. సెల్లార్లో 200 ఏళ్లకు పైగా వ్యాస్ కుటుంబం పూజలు చేశారు. వారి కుటుంబ పేరుమీదుగానే ఆ సెల్లార్‌కు వ్యాస్జీ కా తెహ్ఖానా అని పేరు వచ్చింది. అయితే.. 1993 డిసెంబర్లో ములాయం సింగ్ ప్రభుత్వం జ్ఞానవాపి మసీదులో పూజలను నిలిపివేసింది. లా అండ్ ఆర్డర్ సమస్యను కారణంగా చూపుతూ ఈ చర్యను ప్రభుత్వం సమర్థించుకుంది. ఎలాంటి న్యాయ ఉత్తర్వులు లేకుండానే ఉక్కు కంచెను నిర్మించిందని శైలేంద్ర వ్యాస్ కోర్టు పిటిషన్లో పేర్కొన్నారు. మసీదు ప్రాంతంలో దేవాలయం.. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో హిందూ దేవాలయం ఉన్నట్లు ఏఎస్ఐ సర్వే తెలిపిందని హిందూ తరుపు న్యాయవాది విష్ణశంకర్ జైన్ వెల్లడించారు. 800 ఏళ్ల చరిత్ర ఉన్న దేవాలయం.. కాలక్రమంలో అనేక యుద్ధాలు, విధ్వంసం తర్వాత పునర్నిర్మాణాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. దక్షిణాసియా అధ్యయనాలలో నైపుణ్యం కలిగిన పండితుడు యుగేశ్వర్ కౌశల్ ప్రకారం.. మహారాజా జయచంద్ర తన పట్టాభిషేకం తర్వాత సుమారు 1170-89 ADలో ఈ ప్రదేశంలో ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించాడు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు 1669లో కాశీ విశ్వేశ్వర్ ఆలయాన్ని ధ్వంసం చేసి, ఆ శిథిలాల పైన ప్రస్తుత జ్ఞానవాపి మసీదును నిర్మించాడని విశ్వసిస్తారు. ఇదీ చదవండి: జ్ఞానవాపి మసీదులో పూజలు ప్రారంభం -
జ్ఞానవాపి మసీదులో పూజలు ప్రారంభం
వారణాసి: కాశీలోని జ్ఞానవాపి మసీదు సెల్లార్లో బుధవారం అర్ధరాత్రి పూజలు ప్రారంభమయ్యాయి. ఇక్కడున్న హిందూ దేవతల విగ్రహాలకు అర్చకులు హారతులు ఇచ్చారు. ఈ మసీదులో హిందూ దేవతలకు పూజలు జరగడం 31 సంవత్సరాల తర్వాత మొదటిసారి అని కాశీ విశ్వనాథ్ ఆలయ ట్రస్టు అధ్యక్షుడు నరేంద్ర పాండే చెప్పారు. పూజల కోసం వ్యాసుడి సెల్లార్ 31 ఏళ్ల తర్వాత తెరుచుకుందని అన్నారు. దక్షిణ సెల్లార్‌ను బుధవారం రాత్రి 10.30 గంటలకు తెరిచినట్లు వెల్లడించారు. అనంతరం కోర్టు ఉత్తర్వులను పాటిస్తూ పూజలు నిర్వహించామని, ఇందుకోసం జిల్లా అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలోనే ఉన్న జ్ఞానవాపీ మసీదు భూగర్భ గృహంలో హిందూ దేవతలకు పూజలు చేసుకోవడానికి వారణాసి జిల్లా కోర్టు బుధవారం అంగీకరించిన సంగతి తెలిసిందే. కోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడిన కొన్ని గంటల వ్యవధిలోనే పూజలు ప్రారంభం కావడం గమనార్హం. పూజల విషయంలో కోర్టు ఉత్తర్వుల ప్రకారమే నడుచుకున్నామని వారణాసి జిల్లా మేజి్రస్టేట్ ఎస్.రాజలింగం చెప్పారు. మసీదు ప్రాంగణంలోని సెల్లార్‌ను శుభ్రం చేసిన తర్వాత లక్ష్మీదేవికి, వినాయకుడికి హారతి ఇచి్చనట్లు స్థానికులు చెప్పారు. -
Gyanvapi: జ్ఞానవాపిలో 30 ఏళ్ల తర్వాత మొదలైన పూజలు
-
జ్ఞానవాపి: 30 ఏళ్ల తర్వాత పూజలు
యూపీలోని వారణాసిలో గల జ్ఞానవాపి మసీదులోని సెల్లార్లో సుమారు 30 ఏళ్ల తర్వాత పూజలు ప్రారంభమయ్యాయి. వారణాసి కోర్టు తీర్పు వెలువరించిన మరుసటి రోజే పూజలు జరగడం గమనార్హం. వ్యాస్ కా తెహఖానా(వ్యాసుని నేలమాళిగ) సెల్లార్లో ఉదయం 3గం.కే విగ్రహాలకు తొలి పూజ ప్రారంభమైంది. వారం లోపు పూజలు ప్రారంభిస్తామని కాశీ విశ్వనాథుడి ట్రస్ట్ ప్రకటించినప్పటికీ.. సత్వరమే ఆ ఏర్పాట్లను పూర్తి చేసి పూజలు మొదలుపెట్టింది. కాశీ విశ్వనాథుడి ఆలయానికి ఆనుకుని ఉన్న ఈ మసీదులో వేకువ ఝామున 3 గంటలకే పూజలు ప్రారంభం అయ్యాయి. విశ్వనాథుడి ఆలయ పూజారి మంగళహారుతులు ఇచ్చారు. రాష్ట్రీయ హిందూ దళ్ సభ్యులు మసీద్ సమీపంలో మందిర్(ఆలయం) అనే బోర్డును అంటించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి భద్రతా ఏర్పాటు చేశారు. #WATCH | Varanasi: After the District Court granting permission for conducting 'Pooja' in the 'Vyas Ka Tehkhana' in Gyanvapi mosque, Chairman of Kashi Vishwanath Trust Nagendra Pandey says, "Court has ordered the opening and subsequent worship at the 'tehkhana' which was closed… pic.twitter.com/KhN0cMTjPC — ANI (@ANI) February 1, 2024 బాబ్రీ విధ్వంసం తర్వాత అప్పటి ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఇక్కడి ప్రాంతాన్ని సీజ్ చేయించారు. హిందువులు ఇక్కడ పూజలు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతీ ఒక్కరికీ ఇక్కడ పూజలు చేసే హక్కు ఉంది అని హిందు పక్షం తరఫున కోర్టులో వాదనలు వినిపించిన విష్ణు శంకర్ జైన్ చెబుతున్నారు. ఇక ఈ తీర్పు ప్రతి హిందువు హృదయంలో సంతోషాన్ని నింపిందని విశ్వహిందూ పరిషత్ పేర్కొంది. విశ్వహిందూ పరిషత్ (విహెచ్పి) అధ్యక్షుడు అలోక్ కుమార్ మాట్లాడుతూ కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. ఇదిలా ఉంటే.. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కోర్టు ఈ ఉత్తర్వును స్వాగతించారు. దీనిపై ‘ఎక్స్’లో స్పందిస్తూ 'శివ భక్తులకు న్యాయం జరిగింది. విశ్వనాథుని ఆలయ సముదాయంలోగల వ్యాసుని నేలమాళిగలో పూజలు చేసుకునే హక్కును మంజూరు చేస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని’ అన్నారు. #WATCH | Gyanvapi case | After the court grants permission for puja in the 'Vyas Ka Tekhana', advocate Sohan Lal Arya says, "We are feeling very proud today. The court's decision yesterday was unprecedented...The arrangements have been made but it (Vyas Ka Tekhana) has not been… pic.twitter.com/21R8jzcxQe — ANI (@ANI) February 1, 2024 జ్ఞానవాపి మసీదులోని ‘వ్యాస్ కా తహఖానా’లో పూజలు చేయడానికి జిల్లా కోర్టు అనుమతి ఇవ్వడంపై కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ అధ్యక్షుడు నాగేంద్ర పాండే హర్షం వ్యక్తం చేశారు. ఇకపై ఏ పక్షానికి ఎలాంటి సమస్య ఉండదన్నారు. "Arrangements have been made but...": Advocate Sohan Lal Arya over Varanasi Court's order on Gyanvapi Mosque Read @ANI Story |https://t.co/uTQ5eTNesb#GyanvapiMosque #VaranasiCourt #GyanvapiMosque pic.twitter.com/uVIFbRSRNO — ANI Digital (@ani_digital) February 1, 2024 -
జ్ఞానవాపిలో మరిన్ని నేలమాళిగలు.. ఏఎస్ఐ సర్వేలో వెల్లడి!
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోగల జ్ఞానవాపి ప్రార్థనా మందిరంలో వ్యాస మహర్షి నేలమాళిగతో పాటు, పలు నేలమాళిగలున్నాయని, వీటిలో నాలుగు నేలమాళిగలను మూసివేశారని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) తన సర్వే నివేదికలో వెల్లడించింది. గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) టెక్నాలజీని ఉపయోగించి ఏఎస్ఐ జరిపిన పరిశోధనలో ప్లాట్‌ఫారమ్ కింద, ప్లాట్‌ఫారమ్ ప్రాంతంలో అనేక బేస్మెంట్లు ఉన్నాయని తేలింది. వాటి ఎగువ భాగం తెరిచి ఉండగా, దిగువ భాగమంతా చెత్తతో నిండి ఉంది. వీటిని మూసివేశారు. ప్లాట్‌ఫారమ్‌కు నైరుతి భాగంలో చెత్తతో నిండిన మూడు మీటర్ల వెడల్పుగల నేలమాళిగలు ఉన్నాయి. ఒక మీటరు మందపాటి గోడలతో తొమ్మిది చదరపు మీటర్ల పరిమాణంలో ఈ నేల మాళిగలు ఉన్నాయి. ఈ పెద్ద సెల్లార్లు దక్షిణ గోడ వైపు ప్రవేశద్వారాలను కలిగి ఉన్నాయి అవి ఇప్పుడు మూసివేసివున్నాయి. నేలమాళిగకు ఉత్తరం వైపున ఓపెన్ ఫంక్షనల్ తలుపులు ఉన్నాయి. తూర్పు వైపున రెండు మీటర్ల వెడల్పుతో మూడు నుండి నాలుగు నేలమాళిగలు ఉన్నాయి. తూర్పు గోడ మందంలో అనేక మార్పులు ఉన్నాయి. కారిడార్ ప్రాంతానికి ఆనుకుని, ప్లాట్‌ఫారమ్‌కు పశ్చిమ భాగంలో మూడు నుండి నాలుగు మీటర్ల వెడల్పు గల రెండు సెల్లార్ల రెండు వరుసలు ఉన్నాయి. నేలమాళిగలో దాగి ఉన్న బావి రెండు మీటర్ల వెడల్పు కలిగివుంది. దక్షిణ భాగంలో మరో బావి జాడలు కనిపించాయి. బేస్మెంట్ గోడల జీపీఆర్ స్కానింగ్‌లో మూసివున్న బావులు, కారిడార్లు కూడా ఉన్నట్లు తేలిందని నివేదిక పేర్కొంది. దక్షిణ నేలమాళిగ గోడతో కప్పినట్లు ఉందని జీపీఆర్ చూపించింది. ఏఎస్ఐ తన సర్వే సమయంలో పలు సున్నితమైన వస్తువులను శుభ్రపరచడం, లేబులింగ్ చేయడం, వర్గీకరించడం, పలు పరీక్షలను నిర్వహించడం మొదలైన పనులు చేసింది. ఇందుకోసం అదే ప్రాంగణంలో ప్రాంతీయ ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. ఇది మెటల్‌తో సహా ఇతర పదార్థాలను పరిశీలించడంలో సహాయపడుతుంది. -
జ్ఞానవాపి మసీదు సెల్లార్లో పూజలు చేసుకోండి
వారణాసి: వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని ఆనుకుని ఉన్న వివాదాస్పద జ్ఞానవాపి మసీదు కేసు బుధవారం అత్యంత కీలక మలుపు తీసుకుంది. మసీదు ప్రాంగణంలో భారత పురావస్తు శాఖ చేసిన శాస్త్రీయ సర్వే నివేదిక ప్రకారం మసీదు కింద ఒకప్పుడు ఆలయం ఉండేదని బయటపడిన నేపథ్యంలో హిందువుల అనుకూలంగా వారణాసి కోర్టు నుంచి తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి. మసీదు సెల్లార్‌లోని హిందూ దేవతలను ఆరాధించేందుకు, పూజా కార్యక్రమాలు చేసుకునేందుకు ఒక పూజారికి అనుమతినిస్తూ వారణాసి జిల్లా కోర్టు బుధవారం ఉత్తర్వులిచి్చంది. మసీదు ప్రాంగణంపై యాజమాన్య హక్కుల కేసులో పిటిషనర్ అయిన శైలేంద్ర కుమార్ పాఠక్‌కు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయని ఆయన తరఫు న్యాయవాది మదన్ మోహన్ యాదవ్ చెప్పారు. ‘‘ ఏడు రోజుల్లోగా ఆ మసీదు సెల్లార్లో పూజకు అనువుగా ఏర్పాటు చేయాలని జిల్లా మేజిస్ట్రేట్‌ను వారణాసి జిల్లా కోర్టు జడ్జి ఏకే విశ్వేశ ఆదేశించారని లాయర్ మదన్ వెల్లడించారు. ప్రపంచ ప్రఖ్యాత కాశీ విశ్వనాథ ఆలయ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న కాశీ విశ్వనాథ్ ట్రస్టుకు ఈ పూజల బాధ్యతలు అప్పగించింది. పిటిషనర్ శైలేంద్ర తాత,పూజారి సోమ్‌నాథ్ వ్యాస్ గతంలో ఈ సెల్లార్లోనే 1993 డిసెంబర్‌దాకా పూజలు చేసేవారు. ఆ క్రమంలోనే ఇక్కడ పూజలు చేసుకునే హక్కులు తమకు దక్కుతాయంటూ ఆయన కోర్టు ఆశ్రయించారు. మసీదులో చిన్న కొలను వజూఖానా ముందున్న నంది విగ్రహం వద్ద ∙బ్యారీకేడ్లను తొలగించాలని, పూజలకు మార్గంసుగమం చేయాలని జడ్జి ఆదేశించారు. -
జ్ఞానవాపి కేసులో హిందువులకు అతిపెద్ద విజయం
-
జ్ఞానవాపి కేసులో కీలక మలుపు
ఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. మసీదులో పూజలు చేసేందుకు హిందువులకు అనుమతి లభించింది. ఈ మేరకు వారంలోగా పూజలకు ఏర్పాటు చేయాలని వారణాసికి కోర్టు బుధవారం అనుమతులు జారీ చేసింది. దీంతో హిందు శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. కోర్టు ఉత్తర్వులను హిందువుల భారీ విజయంగా కాశీవిశ్వనాథ్ ట్రస్ట్ అభివర్ణిస్తోంది. కోర్టు ఉత్తర్వులతో.. సీల్ చేసిన మసీదు బేస్మెంట్ ప్రాంతంలోని హిందూ దేవతల విగ్రహాలకు వారంలోగా పూజలు ప్రారంభిస్తామని ట్రస్ట్ ప్రకటించింది. 'జ్ఞానవాపి మసీదు సెల్లార్లో పూజలు చేసేందుకు హిందు పక్షం వారికి కోర్టు అనుమతి ఇచ్చింది. జిల్లా యంత్రాంగా ఏడు రోజుల్లో ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. ఈ తీర్పు చరిత్రాత్మకమైనది. 1983లో అయోధ్య రామాలయ తాళాలు తెరవాలని జస్టిస్ కృష్ణ మోహన్ పాండ్ ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం జ్ఞానవాపిలోను నేలమాళిగ తాళాలు తెరవాలని కోర్టు ఆదేశించింది.' అని హిందువుల తరుపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాలు.. ఏఎస్ఐ సర్వే నేపథ్యంతో మసీద్ బేస్మెంట్కు సీల్ వేశారు. అయితే తాజా కోర్టు ఆదేశాలతో ఆ బారికేడ్లను తొలగించనున్నారు. అంతేకాదు విశ్వనాథ్ ఆలయ పూజారులు ఈ పూజలు నిర్వహించవచ్చని కోర్టు స్పష్టం చేసింది. జ్ఞానవాపి మసీదు అంతకుముందున్న హిందూ ఆలయ నిర్మాణంపైనే నిర్మితమయిందా అన్న విషయం తేల్చేందుకు గత ఏడాది వారణాసి కోర్టు అక్కడ ఏఎస్ఐ సర్వే జరపాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ స్థానంలో భారీ హిందూ ఆలయ నిర్మాణం ఉండేదని భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) ఇటీవల నివేదిక ఇచ్చింది. ప్రస్తుత నిర్మాణం అంతకుముందున్న నిర్మాణంపైన కట్టిందేనని సర్వేలో తేలింది. దీంతో హిందూ పక్షం వారు పూజలు చేసుకోవడానికి వారణాసి కోర్టు అనుమతి ఇవ్వడం గమనార్హం. ఇదీ చదవండి: Indian Army: ఆర్మీలో ‘జై శ్రీరామ్’, ‘జై బజరంగబలి’ నినాదాలు ఎందుకు? -
హిందువులకు అప్పగించండి: వీహెచ్‌పీ
న్యూఢిల్లీ: వారణాసిలోని జ్ఞానవాపి మసీదును అంతకుముందున్న ఆలయాన్ని ధ్వంసం చేసి నిర్మించినట్లు ఏఎస్ఐ సర్వే మరోసారి రూఢీ చేసినందున ఆ ప్రాంతాన్ని హిందువులకు అప్పగించాలని విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) కోరింది. శివలింగం లభించిన వజూ ఖానాగా చెబుతున్న చోట హిందువులకు పూజలకు అనుమతులివ్వాలని డిమాండ్ చేసింది. మసీదును హిందూ ఆలయంగా ప్రకటించాలని వీహెచ్‌పీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ ఒక ప్రకటనలో కోరారు. -
Archaeological Survey Of India: జ్ఞానవాపి మసీదులో దేవతా విగ్రహాలు
వారణాసి: ఉత్తరప్రదేశ్‌లో వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కింద పురాతన హిందూ ఆలయ అవశేషాలున్నాయంటూ కోర్టుకు భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) సమర్పించిన సర్వే నివేదికలో మరి కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. శివలింగం భాగాలు, హిందూ దేవతల ధ్వంసమైన విగ్రహాలు మసీదులో ఉన్నాయి. వాటి ఫొటోలు తాజాగా జాతీయ మీడియాకు లభించాయి. హనుమాన్, గణేష, నంది విగ్రహాల ఫొటోలు, కొన్ని పానవట్టాలు, కిందిభాగం లేని శివలింగం వాటిలో ఉన్నాయి. శతాబ్దాల నాటి నాణేలు, పర్షియన్ లిపి సున్నపురాయి శాసనం, రోలు ఉన్నాయి. మసీదు కింద భారీ ఆలయముండేదని నివేదిక నిరూపిస్తోందని హిందువుల తరఫు న్యాయవాది విష్ణుశంకర్ జైన్ చెప్పారు. ఆలయ రాతిస్తంభాలనే కాస్త మార్చి మసీదు నిర్మాణంలో వాడారని నివేదికలో ఉందన్నారు. ‘‘17వ శతాబ్దంలో ఔరంగజేబు ఇక్కడి ఆదివిశ్వేశ్వర ఆలయాన్ని కూల్చేసినట్లు నివేదికలోని ఆధారాలు బలంగా చాటుతున్నాయి. దీన్ని బట్టి ఇక్కడ ఒక ఆలయం ఉండేదని స్పష్టమవుతోంది’’ అని ఆయన చెప్పారు. దీనితో అంజుమన్ అంజామియా మసీదు కమిటీ ప్రతినిధి అఖ్లాఖ్ అహ్మద్ విభేదించారు. ‘‘ఇందులో కొత్తేమీ లేదు. గతంలోనూ అవి ఉన్నాయని ఏఎస్ఐ తెలిపింది. తాజా నివేదికలో వాటి కొలతలను స్పష్టంగా పేర్కొంది. అవి పురాతనమైనవని చెప్పే ఆధారాలను ఏఎస్ఐ ప్రస్తావించలేదు. ఆ రాళ్ల వయసు ఎంత అనే అంశాలపై ఏఎస్ఐ ఇంకా ఎలాంటి నిర్ధారణకు రాలేదు. సర్వేలో ఉన్నవన్నీ ఏఎస్ఐ అభిప్రాయాలు మాత్రమే. అవి నిపుణుల అభిప్రాయాలు కాదు’’ అని ఆయన వాదించారు. గత ఏడాది జిల్లా కోర్టు ఆదేశాల మేరకు ఏఎస్ఐ మసీదు కాంప్లెక్స్‌లో శాస్త్రీయసర్వే చేపట్టి గత ఏడాది డిసెంబర్ 18వ తేదీన సీల్డ్ కవర్లో సర్వే నివేదికను సమర్పించింది. తాజాగా కోర్టు వాటిని కేసులో భాగమైన ఇరుపక్షాల ప్రతినిధులు, న్యాయవాదులకు అందజేశారు. దీంతో నివేదికలోని అంశాలు బహిర్గతమయ్యాయి. -
జ్ఞానవాపి అడుగున భారీ ఆలయం ఆనవాళ్లు!
వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ స్థానంలో భారీ హిందూ ఆలయ నిర్మాణం ఉండేదని భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) నివేదిక పేర్కొంది. హిందూ పక్షం న్యాయవాది విష్ణు శంకర్ జైన్ గురువారం ఇక్కడ జరిగిన మీడియా సమావేశంలో నివేదికలోని అంశాలను చదివి వినిపించారు. గ్రౌండ్ పెన్‌ట్రేటింగ్ రాడార్(జీపీఆర్) సర్వేలో వెల్లడైన అంశాలు కూడా ఈ నివేదికలో ఉన్నాయి. ప్రస్తుత నిర్మాణం అంతకుముందున్న నిర్మాణంపైన కట్టిందేనని కూడా సర్వేలో తేలింది. ‘మసీదులో చేసిన మార్పులను ఈ సర్వే గుర్తించింది. పూర్వమున్న స్లంభాలను, ప్లాస్టర్‌ను చిన్నచిన్న మార్పులతో తిరిగి ఉపయోగించినట్లు కనిపిస్తున్నాయి. హిందూ ఆలయం నుంచి తీసుకున్న కొన్ని స్తంభాలను కొద్దిగా మార్చివేసి కొత్త నిర్మాణంలో ఉపయోగించారు. స్తంభాలపై ఉన్న చెక్కడాలను తొలగించే ప్రయత్నం చేశారు’అని ఏఎస్ఐ నివేదిక పేర్కొన్నట్లు జైన్ వివరించారు. దేవనాగరి, తెలుగు, కన్నడ, ఇతర లిపిలలో రాయబడిన పురాతన హిందూ దేవాలయానికి చెందిన మొత్తం 34 శాసనాలు ప్రస్తుత, పూర్వపు నిర్మాణాలపై ఉన్నాయని జైన్ పేర్కొన్నారు. ‘ఇవి వాస్తవానికి పూర్వం ఉన్న హిందూ దేవాలయంలో ఉన్న శాసనాలు. ఇవి ప్రస్తుతం ఉన్న నిర్మాణంలోనూ మరమ్మత్తు సమయంలో ఇవి ఉపయోగించబడ్డాయి. దీనిని బట్టి పూర్వం అక్కడ ఉన్న హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసి, దానికి సంబంధించిన భాగాలను తిరిగి వాడినట్లుగా రుజువవుతోంది. ఈ శాసనాల్లో జనార్థన, రుద్ర, ఉమేశ్వర వంటి దేవతల పేర్లు కూడా ఉన్నాయి’అని నివేదికలో ఉన్నట్లు జైన్ చెప్పారు. కాశీ విశ్వనాథుని ఆలయాన్ని ఆనుకుని ఉన్న జ్ఞానవాసి మసీదు సముదాయాన్ని హిందూ, ముస్లిం పక్షాలకు ఇవ్వాలంటూ వారణాసి కోర్టు బుధవారం తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఈ నివేదిక వెలుగులోకి రావ డం గమనార్హం. జ్ఞానవాపి మసీదు అంతకుముందున్న హిందూ ఆలయ నిర్మాణంపైనే నిర్మితమయిందా అన్న విషయం తేల్చేందుకు గత ఏడాది వారణాసి కోర్టు అక్కడ ఏఎస్ఐ సర్వే జరపాలంటూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. -
జ్ఞానవాపి కేసు: ముస్లిం సంఘాలకు చుక్కెదురు
ఢిల్లీ: వారణాసిలోని జ్ఞానవాపి మసీదు, కాశీ విశ్వనాథ్ టెంపుల్‌పై దాఖలైన పిటిషన్‌కు సంబంధించి ముస్లిం సంఘాలకు చుక్కెదురైంది. సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు, అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు మంగళవారం అలహాబాద్ హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఇక ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతున్న సివిల్ పిటిషన్లకు హైకోర్టు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది. ఈ కేసుకు సంబంధించిన విచారణను ఆరు నెలల్లో పూర్తి చేయాలని వారణాసి కోర్టును ఆదేశించింది. మొఘల్ కాలంలో హిందూ ఆలయ స్థానంలో జ్ఞానవాపి మసీదు నిర్మించారని ఈ విషయాన్ని సర్వే చేసి తేల్చాలని కోరుతూ నలుగురు హిందూ మహిళలు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వాటిపై విచారణ జరిపిన వారణాసి కోర్టు.. మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీల్ చేసిన వజూఖానా ప్రాంతాన్ని మినహాయించి మసీదు ప్రాంగణం మొత్తం కార్బన్ డేటింగ్, ఇతర విధానాల ద్వారా శాస్త్రీయ సర్వే నిర్వహించాలని భారత పురావస్తు విభాగాన్ని(ASI) ఆదేశించింది. మసీదు ప్రాంగణంలో ఆలయాన్ని పునరుద్ధరిచాలంటూ దాఖలు చేసిన పిటిషన్లను ఉత్తర్‌ప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు, అంజుమన్ ఇంతెజామియా కమిటీ అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. -
Gyanvapi: కోర్టుకు చేరిన జ్ఞానవాపి సర్వే నివేదిక
వారణాసి: వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో చేపట్టిన శాస్త్రీయ సర్వే నివేదికను సోమవారం ఏఎస్ఐ(ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) అధికారులు సీల్డు కవర్లో వారణాసి జిల్లా కోర్టుకు సమర్పించారు. దీనిపై ఈ నెల 21న విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. వారణాసిలోని ప్రఖ్యాత కాశీ విశ్వేశ్వరుని ఆలయాన్ని ఆనుకుని ఉన్న 17వ శతాబ్ధం నాటి మసీదును అప్పట్లో ఉన్న ఆలయంపైనే నిర్మించారంటూ అందిన పలు పిటిషన్లపై కోర్టు సర్వే చేపట్టాలని జూలైలో ఆదేశించిన విషయం తెలిసిందే. సర్వే నివేదిక ప్రతులను ముస్లిం పక్షం వారికి కూడా ఏఎస్ఐ అధికారులు అందజేసినట్లు హిందూ పిటిషనర్ల తరఫున న్యాయవాది మదన్ మోహన్ యాదవ్ వెల్లడించారు. తదుపరి విచారణ 21న ఉంటుందని కోర్టు పేర్కొందని తెలిపారు. సర్వే నివేదిక వివరాలను బహిర్గతం చేయరాదంటూ ముస్లిం పక్షం కోర్టులో వేసిన పిటిషన్‌ను తాము సవాల్ చేస్తామన్నారు. మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతల శిల్పాల వద్ద పూజలు చేసేందుకు అనుమతించాలంటూ కొందరు మహిళలు వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జూలై 21న జిల్లా కోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత నిర్మాణాలకు ఎటువంటి నష్టం కలగని రీతిలో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకుని శాస్త్రీయంగా సర్వే చేపట్టాలని ఏఎస్ఐకి పురమాయించింది. ‘మసీదు గోపురాలు, సెల్లార్లు, పశ్చిమ దిక్కు గోడ కింద సర్వే చేయాలి. పిల్లర్ల వయస్సును నిర్ధారించాలి. భవనం రీతిని విశ్లేషించాలి’అని సూచించింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించగా చుక్కెదురైంది. ఏఎస్ఐ అధికారులు సకాలంలో సర్వేను పూర్తి చేయలేకపోవడంతో కోర్టు ఆరు పర్యాయాలు గడువును పొడిగించింది. కృష్ణ జన్మభూమి–షాహీ ఈద్గా కేసు విచారణ వాయిదా ప్రయాగ్‌రాజ్: మథురలోని కృష్ణ జన్మభూమి ఆలయాన్ని ఆనుకుని ఉన్న షాహీ ఈద్గా మసీదు ఆవరణలో సర్వే చేపట్టాలన్న అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను ముస్లిం పక్షం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై వచ్చే జనవరి 9వ తేదీన విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించిందని ముస్లిం పక్షం అలహాబాద్ హైకోర్టుకు తెలిపింది. దీంతో, సర్వే కమిషన్ విధివిధానాలు, కూర్పుపై సోమవారం జరగాల్సిన విచారణను హైకోర్టు వాయిదా వేసింది. హిందూ ఆలయంపైనే మసీదును నిర్మించినట్లు ఆనవాళ్లు ఉన్నాయంటూ కొందరు వేసిన పిటిషన్‌పై గురువారం విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు.. మసీదు సర్వేను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా అధికారిని నియమించేందుకు అంగీకరించింది. -
Gyanvapi case: జ్ఞానవాపి నివేదికకు మరో 10 రోజుల గడువు
వారణాసి(యూపీ): జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) శాస్త్రీయ సర్వే నిర్వహించి నివేదిక సమర్పించేందుకు మరో 10 రోజుల గడువును వారణాసి జిల్లా కోర్టు మంజూరుచేసింది. నవంబర్ 17(శుక్రవారం)లోగా సర్వే వివరాలను నివేదించాలని గతంలో ఆదేశించగా మరో 15 రోజుల గడువుకావాలంటూ శుక్రవారం కోర్టును ఏఎస్ఐ తరఫు లాయర్లు అభ్యర్థించారు. టెక్నికల్ రిపోర్ట్ ఇంకా అందుబాటులో లేని కారణంగా గడువును పెంచాలని ఏఎస్ఐ కోరడంతో జిల్లా జడ్జి ఏకే విశ్వేశ్ నవంబర్ 28 వరకు గడువు ఇచ్చారని హిందువుల తరఫు న్యాయవాది మదన్ మోహన్ యాదవ్ వెల్లడించారు. ఆలయ పురాతన పునాదులపైనే 17వ శతాబ్దంలో మసీదు నిర్మించారంటూ దాఖలైన పిటిషన్ విచారణలో భాగంగా కోర్టు ఆదేశాల మేరకు ఏఎస్ఐ సర్వే చేపట్టిన విషయం తెల్సిందే. ఆగస్టు నాలుగో తేదీన నివేదిక సమర్పించాలని మొట్టమొదటిసారిగా కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత కేసు విచారణల సందర్భంగా గడువు పొడిగిస్తూ వచ్చారు. తాజాగా గడువును జిల్లా కోర్టు నవంబర్ 28గా నిర్దేశించింది. ‘న్యాయం జరగాలంటే సర్వే జరగాల్సిందే’ అంటూ వారణాసి కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను అలహాబాద్ హైకోర్టు సమర్థించడంతో ఈ సర్వే ప్రక్రియకు తొలి అడుగు పడింది. -
జ్ఞానవాపి మసీదులో ఏఎస్ఐ సర్వే పూర్తి
లక్నో: వారణాసి జ్ఞానవాపి మసీదులో భారత పురావస్తు సర్వే(ఏఎస్ఐ Archaeological Survey of India) చేపట్టిన సర్వే పూర్తైంది. అయితే.. నివేదికను సమర్పించేందుకు ఏఎస్ఐ గడువు కోరడంతో నవంబర్ 17వ తేదీదాకా వారణాసి కోర్టు సమయం ఇచ్చింది. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే పూర్తి చేసి, నివేదిక ఇవ్వడానికి భారత పురావస్తు సర్వే (ఏఎస్ఐ)కు వారణాసి కోర్టు మరింత గడువిచ్చింది. ఈ నెల 17 వరకు సమయమిస్తూ జిల్లా న్యాయమూర్తి కే విశ్వేష్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సర్వేకు ఉపయోగించిన పరికరాల వివరాలతో పాటు సర్వే నివేదికను పూర్తిస్థాయిలో సిద్దం చేసేందుకు టైం కోరిందని, అందుకు కోర్టు అంగీకరించిందని ప్రభుత్వ న్యాయవాది అమిత్ శ్రీవాస్తవ మీడియాకు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. అక్టోబర్ 5వ తేదీన జ్ఞానవాపి సర్వే కోసం నాలుగు వారాల గడువు ఇచ్చిన వారణాసి కోర్టు.. తర్వాత ఎలాంటి గడువు ఉండబోదని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: జ్ఞానవాపి కేసులో తొందరపాటు వద్దు.. సైంటిఫిక్ సర్వేపై సుప్రీం కోర్టు -
కోర్టు ఆవల రాజీ ఒప్పందం కుదుర్చుకోండి
వారణాసి(యూపీ): వారణాసిలోని జ్ఞానవాపి మసీదును గతంలో ఆలయం ఉన్న ప్రదేశంపై నిర్మించారా? అన్న దానిని తేల్చే విషయంలో న్యాయస్థానంలో నలుగుతున్న అంశాన్ని కోర్టు ఆవల రాజీమార్గంలో పరిష్కరించుకోవాలని విశ్వ వేదిక్ సనాతన్ సంఘ్ పిలుపునిచ్చింది. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో పురావస్తు శాఖ సర్వే కొనసాగుతున్న ఈ తరుణంలో సనాతన సంఘ్ చీఫ్ జితేంద్ర ఇలా బహిరంగ లేఖ రాయడం గమనార్హం. ఈ లేఖ తమకు అందిందని దీనిపై అంతర్గత సమావేశంలో చర్చిస్తామని ఇంతెజామియా మస్జిద్ కమిటీ సంయుక్త కార్యదర్శి మొహమ్మద్ యాసిన్ చెప్పారు. -
జ్ఞానవాపి మసీదులో రెండోరోజూ సర్వే
వారణాసి: వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో పురావస్తు శాఖ(ఏఎస్ఐ) అధికారుల సర్వే రెండో రోజూ కొనసాగింది. హిందూ ఆలయ నిర్మాణంపైనే 17వ శతాబ్దంలో ఈ మసీదును నిర్మించారనే పిటిషన్‌పై వారణాసి కోర్టు శాస్త్రీయ సర్వేకు ఆదేశించిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్వే పనులు సాగాయి. ఏఎస్ఐ అధికారులతోపాటు ప్రభుత్వ న్యాయవాది రాజేశ్ మిశ్రా, ఐఐటీ కాన్పూర్ నిపుణులు, అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ సభ్యులు అక్కడున్నారు. ఆదివారం కూడా సర్వే కొనసాగుతుందని అధికారులు తెలిపారు. సర్వేకు పూర్తిగా సహకరిస్తున్నట్లు మసీదు కమిటీ తెలిపింది. మసీదులో శాస్త్రీయ సర్వే జరపాలంటూ వారణాసి జిల్లా కోర్టు ఇచి్చన ఆదేశాలను అలహాబాద్ హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు సమరి్థంచడం తెలిసిందే. సెప్టెంబర్ 4 లోగా సర్వే పూర్తి చేయాలని శుక్రవారం వారణాసి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
జ్ఞానవాపి ముస్లిం కమిటీకి సుప్రీంలో చుక్కెదురు
ఢిల్లీ: జ్ఞానవాపి మసీదులో భారత పురావస్తు శాఖ సర్వేకు సుప్రీం కోర్టు సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సర్వే కొనసాగించాలంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేయాలంటూ సుప్రీంను ఆశ్రయించింది జ్ఞానవాపి మసీదు కమిటీ. ఒకవైపు సర్వే ఇవాళ మొదలుకాగా.. మరోవైపు మసీద్ కమిటీకి సుప్రీంలో చుక్కెదురుకావడం గమనార్హం. అయితే శుక్రవారం ఈ అభ్యర్థనపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ సర్వే ద్వారా చరిత్ర పునరావృతం అవుతుందని.. గాయాలు తిరిగి తెరపైకి వస్తాయని అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ వాదనలు వినిపించింది. అయితే.. ఈ వాదనలో చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఏకీభవించలేదు. మనం ఇప్పుడు గతంలోకి వెళ్లొద్దు అంటూ బెంచ్ వ్యాఖ్యానించింది. ASI Survey నిలుపుదల చేసేలా ఆదేశాలు ఇవ్వలేమంటూ పిటిషనర్‌కు తేల్చి చెప్పింది. అయితే అదే సమయంలో జ్ఞానవాపిలో చేసే సర్వే నాన్-ఇన్వాసివ్ మెథడ్(పరికరాల్లాంటివేం ఉపయోగించకుండా) చేయాలని, ఎలాంటి డ్యామేజ్ జరగొద్దంటూ పురావస్తు శాఖను ఆదేశించింది సుప్రీం. అందుకు ప్రభుత్వం తరపున సోలిసిటర్ జనరల్ అంగీకరించారు. జ్ఞానవాపి మసీదులో సర్వే నిర్వహించి.. ఆ నివేదికను నాలుగు వారాల్లోగా అందజేయాలంటూ జులై 21వ తేదీన వారణాసి(యూపీ) జిల్లా కోర్టు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ASI)ను ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను సుప్రీంకోర్టు జూలై 24న తాత్కాలికంగా నిలిపేసింది. దీనిపై విచారణ జరిపి, తగిన తీర్పు వెల్లడించాలని అలహాబాద్ హైకోర్టును ఆదేశించింది. హైకోర్టు గురువారం తీర్పు చెప్తూ, సైంటిఫిక్ సర్వేను నిర్వహించాలని ఆదేశించింది. న్యాయం కోసం ఇక్కడ సైంటిఫిక్ సర్వే నిర్వహించడం అవసరమని, దీనివల్ల ఇరు పక్షాలకు ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడింది. ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో సైంటిఫిక్ సర్వేను ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (Archaeological Survey of India-ASI) శుక్రవారం ఉదయం ప్రారంభించింది. 17వ శతాబ్దంనాటి ఈ మసీదును అంతకన్నా ముందే నిర్మించిన హిందూ దేవాలయంపైన నిర్మించారా? అనే అంశాన్ని నిర్ధారించేందుకు ఈ సర్వే జరుగుతోంది. సర్వే కోసం ఏఎస్ఐకి నాలుగు వారాల సమయం మాత్రమే ఉంది. -
జ్ఞానవాపీ మసీదులో సర్వేకు ఓకే
ప్రయాగ్‌రాజ్/వారణాసి: వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వే జరపాలంటూ పురావస్తు శాఖ(ఏఎస్ఐ)కు దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. శాస్త్రీయ సర్వేకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపింది. జిల్లా కోర్టు ఉత్తర్వు సముచితమేనని, ఈ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని పేర్కొంది. వారణాసిలోని కాశీ విశ్వనాథుని ఆలయాన్ని ఆనుకునే ఉన్న జ్ఞానవాపీ మసీదు ఆలయంపైనే నిర్మించిందా లేదా తేల్చేందుకు ఏఎస్ఐ శాస్త్రీయ సర్వే జరపాలంటూ వారణాసి జిల్లా కోర్టు జూలై 21న అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలపై అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మసీదు కమిటీకి అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించాలంటూ ఏఎస్ఐ సర్వేపై జూలై 26 సాయంత్రం 5వరకు స్టే ఇచ్చింది. ఈ మేరకు మసీదు కమిటీ సర్వేను ఆపాలంటూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై అలహాబాద్ హైకోర్టు సీజే ధర్మాసనం జూలై 27 వరకు హిందు, మసీదు కమిటీ వర్గాల వాదనలు విని, తీర్పు రిజర్వు చేసింది. మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మసీదు ఆవరణలో ఏఎస్ఐ అధికారులు తక్షణమే తమ పనులు ప్రారంభించవచ్చని, సర్వేలో భాగంగా ఆ ప్రాంతంలో ఎలాంటి తవ్వకాలు జరపరాదని స్పష్టం చేసింది. ఏఎస్ఐ అధికారులు సర్వేను శుక్రవారం నుంచి ప్రారంభించనున్నారు. ఇందుకు సహకరించాలంటూ ఏఎస్ఐ తమను కోరిందని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ ఎస్.రాజలింగం తెలిపారు.జ్ఞానవాపి మసీదులో ఏఎస్ఐ సర్వేకు అనుమతిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సర్వే నిలుపుదల కోరుతూ స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. -
జ్ఞానవాపి మసీదు కేసులో కీలక మలుపు
అలహాబాద్: వారణాసి జ్ఞానవాపి మసీదు కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మసీదులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) సర్వేకు అలహాబాద్ హైకోర్టు గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వేను వెంటనే ప్రారంభించవచ్చని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేకు అనుమతిస్తూ గత నెలలో వారణాసి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలంటూ మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. న్యాయ ప్రయోజనాల దృష్ట్యా ఏఎస్ఐ సర్వే అవసరమని, కొన్ని షరతులలో దీన్ని నిర్వహించాల్సిన అవసరం ఉందని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు వారణాసి కోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్ధిస్తూ.. అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. కాగా కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలోని జ్ఞానవాపి మసీదును పురాతన హిందూ దేవాలయంపై నిర్మించారా లేదా అనేది తెలుసుకునేందుకు మసీదు ప్రాంగణాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో శాస్త్రీయ సర్వే చేయించడానికి వారణాసి కోర్టు జూలై 21న అనుమతినిచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీల్ చేసిన వాజూఖానా ప్రాంతాన్ని మినహాయించి మసీదు ప్రాంగణమంతా శాస్త్రీయ సర్వే నిర్వహించాలని భారత పురావస్తు విభాగాన్నిఆదేశించింది. ఆగష్టు 4లోగా నివేదికను సమర్పించాలని తెలిపింది. దీంతో భారత పురావస్తు విభాగ అధికారుల బృందం జూలై 24న సర్వే చేపట్టింది. దీన్ని వ్యతిరేకిస్తూ మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సెషన్స్ కోర్టు ఆదేశాలను సవాలు చేసేందుకు సమయం ఇవ్వాలని కోరింది. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం సర్వేపై రెండు రోజుల పాటు స్టే విధిస్తూ.. వారణాసి కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళ్లవచ్చని మసీదు కమిటీకి సూచించింది. సుప్రీం ఆదేశాలతోప్రారంభమైన కొన్ని గంటల్లోనే సర్వే నిలిచిపోయింది. వారణాసి కోర్టు తీర్పును సవాల్ చేస్తూ మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జూలై 27న విచారణ చేపట్టగా.. ఆగస్టు 3న తీర్పు వెల్లడించే వరకు సర్వే చేపట్టరాదని స్టే విధించింది. తాజాగా మసీదు కమిటీ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. తక్షణమే సర్వే ప్రారంభించేందుకు ఏఎస్ఐకి అనుమతినిచ్చింది. చదవండి: ‘100 కుటుంబాల్లో 15 మందే మిగిలాం.. కాపాడండి’.. వలస కార్మికుడి కన్నీటి పర్యంతం #WATCH | Allahabad HC has said that ASI survey of Gyanvapi mosque complex to start. Sessions court order upheld by HC: Vishnu Shankar Jain, representing the Hindu side in Gyanvapi survey case pic.twitter.com/mnQJrTzS09 — ANI (@ANI) August 3, 2023 -
ఙ్ఞానవాపిలో సర్వేకు అలహాబాద్ హైకోర్టు అనుమతి
-
జ్ఞానవాపిపై సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు
లక్నో/ఢిల్లీ: జ్ఞానవాపి మసీదు అంశంపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లిం వర్గాలు చారిత్రక తప్పిదానికి పాల్పడ్డాయని.. సరిదిద్దుకునే అవకాశం ఇప్పటికీ వారికి ఉందంటూ వ్యాఖ్యానించారాయన. సోమవారం ఉదయం ఓ జాతీయ మీడియా పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆయన జ్ఞానవాపిపై స్పందించారు. ‘‘జ్ఞానవాపిలో జ్యోతిర్లింగం ఉంది. దానిని మేమేవరం ఉంచలేదు. విగ్రహాలు అక్కడ ఉన్నాయి. ఇప్పటికైనా చారిత్రక తప్పిదం సరిదిద్దుకుంటామనే ప్రతిపాదన ముస్లింల నుంచి రావాలి. జ్ఞానవాపిని మసీదు అని పిలిస్తేనే అది వివాదం అయినట్లు లెక్క. అక్కడి ప్రజలు ఆలోచించాలి. అసలు అక్కడ త్రిశూలానికి ఏం పని? అని ఆ పాడ్‌కాస్ట్‌లో ప్రసంగించారు. ఈ సాయంత్రం ఆ పాడ్‌కాస్ట్‌కు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. ज्ञानवापी को मस्जिद कहेंगे तो होगा विवाद, वहां त्रिशूल क्या कर रहा है? सीएम योगी का बड़ा बयान#YogiAdityanath#Gyanvapi pic.twitter.com/tI8qnT23Cy — Manish Pandey MP (@joinmanishpande) July 31, 2023 ఒవైసీ అభ్యంతరం.. జ్ఞానవాపిపై సీఎం యోగి వ్యాఖ్యలను ఏఐఎంఐఎం తీవ్రంగా పరిగణించింది. ‘‘90వ దశకంలోకి మేం వెళ్లాలనుకోవట్లేదు. చట్టం ప్రకారం.. మా హక్కుల ప్రకారమే మేం అక్కడ ప్రార్థనలు చేయాలనుకుంటున్నాం. కేసు కోర్టులో ఉండగా.. అలాంటి ప్రకటనలు ఎలా చేస్తారు? అని ఎంఐఎం నేత వారిస్ పథా తప్పుబట్టారు. ఇదిలా ఉంటే.. మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సైతం ఈ అంశంపై స్పందించారు. ‘‘అలహాబాద్ హైకోర్టులో ఏఎస్ఐ సర్వేను ముస్లిం వైపు వ్యతిరేకించారని, మరికొద్ది రోజుల్లో తీర్పు వెలువడుతుందని సీఎం యోగికి తెలుసు. అయినప్పటికీ అతను అలాంటి వివాదాస్పద ప్రకటన ఇచ్చాడు. ఇది న్యాయపరిధిని ఉల్లంఘించడమే అని తెలిపారు. #WATCH | On UP CM Yogi Adityanath’s Gyanvapi statement, AIMIM MP Asaduddin Owaisi says "CM Yogi knows that the Muslim side has opposed ASI survey in Allahabad High Court and the judgement will be given in a few days, still he gave such a controversial statement, this is judicial… pic.twitter.com/IuBSqMHepv — ANI (@ANI) July 31, 2023 -
జ్ఞానవాపి మసీదులో పురావస్తుశాఖ సర్వేపై సుప్రీం స్టే
-
ఉత్తరప్రదేశ్ లోని వారణాసి జ్ఞానవాపి మసీదు వ్యవహారం
-
జ్ఞానవాపిలో పురావస్తు సర్వేకు బ్రేక్.. సుప్రీం కీలక ఆదేశాలు
ఢిల్లీ/లక్నో: వారణాసి జ్ఞానవాపి మసీద్‌లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(భారత పురాతత్వ సర్వేక్షణ) సర్వేపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రెండు రోజులపాటు (బుధవారం సాయంత్రం ఐదు గంటల దాకా) సర్వేను నిలిపివేయాలని ఏఎస్ఐను ఆదేశించింది. సోమవారం ఉదయం ఈ సర్వే జరగనుందని వారణాసి జిల్లా మెజిస్ట్రేట్(కలెక్టర్) ఇంతకు ముందే స్పష్టం చేశారు. దీంతో పోలీసుల బృందం ముందుగా లోనికి ప్రవేశించగా.. 40 మంది ఏఎస్ఐ అధికారులు వాళ్లను అనుసరిస్తూ లోనికి వెళ్లారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు.. సీల్ వేసిన ప్రాంతాన్ని మాత్రం సర్వే నుంచి మినహాయించారు. ఒకవైపు సర్వే జరగుతున్న సమయంలోనే.. మసీదు నిర్వాహణ కమిటీ వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. సర్వేను తాత్కాలికంగా ఆపేయాలని ఏఎస్ఐను ఆపేయాలని ఆదేశించింది. వాజుఖానాలో ఆకారం బయటపడడం.. అది శివలింగమని హిందూ సంఘాలు, నీటి కొలను నిర్మాణమని మసీదు కమిటీ పరస్పరం వాదించుకుంటున్నాయి. ఈ క్రమంలో స్థానిక కోర్టు సర్వే చేపట్టాలంటూ పురావస్తు శాఖను శుక్రవారం ఆదేశించింది. దీంతో.. సర్వే త్వరగతిన పూర్తి చేసిన ఆగష్టు 4వ తేదీన జిల్లా న్యాయస్థానానికి ఏఎస్ఐ తన నివేదికను అందించాల్సి ఉంది. #WATCH | Varanasi, UP: Police team enters Gyanvapi mosque complex, ASI survey begins pic.twitter.com/kAY9CwN0Eq — ANI UP/Uttarakhand (@ANINewsUP) July 24, 2023 ► మే 16, 2022న జ్ఞాన్వాపి మసీదు కాంప్లెక్స్‌లోని వాజుఖానాలో ఆ ఆకారం బయటపడింది. ► జ్ఞానవాపి మసీదు కూడా కాశీ విశ్వనాథ్ ఆలయ కాంప్లెక్స్‌లో భాగమేనని.. ఆ మసీదు గోడలపై హిందూ దేవతా మూర్తుల విగ్రహాలు ఉన్నాయని.. తమకు పూజ చేసుకునే అవకాశం కల్పించాలని కోర్టును ఐదుగురు మహిళలు కోరడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. అయితే ఈ వాదనను మసీదు కమిటీ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది. ► ప్రశ్నార్థకమైన ఆ నిర్మాణాన్ని శివలింగం అని హిందూ వర్గాలు వాదిస్తుండగా.. ముస్లిం పక్షం ఈ వస్తువు 'వజూఖానా' రిజర్వాయర్ వద్ద వాటర్ ఫౌంటెన్ మెకానిజంలో భాగమని చెబుతోంది. ► ఇప్పటికే ఈ ఆకారంపై వీడియో రికార్డింగ్ సర్వే నిర్వహించారు. ► ప్రార్థనా స్థలాల చట్టం-1991ని జ్ఞానవాపి మసీదు విషయంలో వర్తింప చేయాలని మసీదు కమిటీ కోరింది. కానీ, గత నెల విచారణ సందర్భంగా జ్ఞానవాపి మసీదుకు ఈ చట్టం వర్తించదని న్యాయస్థానం తీర్పు చెప్పింది. ► శివలింగం లాంటి నిర్మాణంపై శాస్త్రీయ పరిశోధన నిర్వహించాలని హిందూ ఆరాధకుల అభ్యర్థనను వారణాసి కోర్టు గత సంవత్సరం తిరస్కరించింది. కానీ, అలహాబాద్ హైకోర్టు కార్బన్ డేటింగ్‌కు అనుమతించింది. ► అయితే ఈ ఏడాది మే 19వ తేదీన.. జ్ఞానవాపి కేసులో సుప్రీం కోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో చాలా జాగ్రత్తగా నడుచుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. కార్బన్ డేటింగ్ పద్దతి సహా సైంటిఫిక్ సర్వేను నిర్వహించేందుకు అనుమతిస్తూ అలహాబాద్ హైకోర్టు తాజాగా(మే 12వ తేదీన) ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. తొందరపాటు వద్దని, సైంటిఫిక్ సర్వేను వాయిదా వేయాలని ఆదేశించింది. ► మసీదును పురాతన హిందూ దేవాలయంపై నిర్మించారా? లేదా? కనుగొనాలని కోర్టును నలుగురు మహిళలు వారణాసి జిల్లా కోర్టును ఆశ్రయించారు. హిందూ మహిళల పిటిషన్ ఆధారంగా.. జులై 21వ తేదీన జ్ఞానవాపి మసీదు ప్రాంగణాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ)తో శాస్త్రీయ సర్వే చేయించడానికి అనుమతినిచ్చింది. ఆగష్టు 4లోగా నివేదికను సమర్పించాలని ఏఎస్ఐని ఆదేశించింది. అయితే.. సుప్రీంకోర్టు సీలింగ్ విధించిన వజుఖానా ప్రాంతాన్ని మాత్రం ఇందుకు మినహాయించింది. ► తాజాగా.. జ్ఞానవాపి మసీదుకు సంబంధించిన అన్ని ఉత్తర్వులపై వెంటనే స్టే ఇవ్వాలని మసీదు కమిటీ కోరుతోంది. జూలై మొదటి వారంలోనే ఈ పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది. అయితే, విశ్వనాథుని ఆలయాన్ని ఆనుకుని ఉన్న జ్ఞానవాపి మసీదు ఆవరణలో సర్వే చేపట్టాలంటూ వారణాసి కోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో మసీదు కమిటీ సత్వర విచారణ కోరుతోంది. దీంతో ఇవాళ్టి సుప్రీం విచారణపైనా ఉత్కంఠ నెలకొంది. ► సుప్రీంకోర్టులో ముస్లిం పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ముస్లింల పిటిషన్‌పై సీజేఐ ధర్మాసనం అత్యవసరంగా విచారణ చేపట్టింది. ► సుప్రీంకోర్టులో విచారణ సందర్బంగా మసీదు కమిటీ వాదనలు వినిపిస్తూ.. 1500వ సంవత్సరం నుంచి అక్కడ మసీదు ఉంది. ఈ విషయంలో అంత తొందర ఎందుకు?. దీనిపై స్టేటస్ కో ఆర్ఢర్ ఉండాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించినట్టు తెలిపారు. దీనికి జూలై 26న విచారణ జరుగునున్నట్టు కోర్టుకు తెలిపారు. అప్పటి వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని కోరారు. Gyanvapi case | Supreme Court says no ASI survey of Gyanvapi mosque complex till 5 pm, July 26th. High Court order shall not be enforced till 26th July. In the meantime, the mosque committee shall move High Court. pic.twitter.com/MMm9Xw1W3Q — ANI (@ANI) July 24, 2023 ► ఈ సందర్భంగా ధర్మాసనం.. జూలై 28వ తేదీ శుక్రవారం వరకు యథాతథ స్థితి ఉంటుందని స్టేట్‌కో ఇవ్వగలరా అని సొలిసిటర్ జనరల్‌ను ప్రశ్నించింది. ఇక, యూపీ ప్రభుత్వం హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ప్రస్తుతానికి అక్కడ ఎటువంటి తవ్వకాలు లేదా ఆక్రమణ జరగడం లేదన్నారు. ఈ క్రమంలో జూలై 26 వరకు అక్కడ ఎలాంటి సర్వేలు నిర్వహించరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. బుధవారం సాయంత్రం 5గంటల వరకు సర్వే ఆపాలని ఆదేశించింది. -
ఏఎస్ఐ సర్వేపై సుప్రీంకోర్టుకు జ్ఞానవాపి మసీదు కమిటీ
న్యూఢిల్లీ: యూపీలోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు ఆవరణలో శాస్త్రీయ సర్వే చేపట్టాలన్న వారణాసి కోర్టు ఉత్తర్వులపై మసీదు నిర్వహణ కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమ పిటిషన్‌పై సత్వరమే విచారణ చేపట్టాలని కోరింది. ఈ పిటిషన్ సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ముందుకు రానుంది. జ్ఞానవాపి మసీదుకు సంబంధించిన అన్ని ఉత్తర్వులపై వెంటనే స్టే ఇవ్వాలని మసీదు కమిటీ కోరుతోంది. ఇప్పటికే జూలై మొదటి వారంలోనే ఈ పిటిషన్ వేసింది. అయితే, విశ్వనాథుని ఆలయాన్ని ఆనుకుని ఉన్న జ్ఞానవాపి మసీదు ఆవరణలో సర్వే చేపట్టాలంటూ వారణాసి కోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో మసీదు కమిటీ సత్వర విచారణ కోరుతోంది. -
జ్ఞాణవాపి మసీదులో సర్వేకి కోర్టు అనుమతి.. కానీ..
ఢిల్లీ: జ్ఞాణవాపి మసీదు ప్రాంగణాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ)తో శాస్త్రీయ సర్వే చేయించడానికి వారాణాసి జిల్లా కోర్టు అనుమతినిచ్చింది. ఆగష్టు 4లోగా నివేదికను సమర్పించాలని ఏఎస్ఐని ఆదేశించింది. అయితే.. సుప్రీంకోర్టు సీలింగ్ విధించిన వజుఖానా ప్రాంతాన్ని మాత్రం ఇందుకు మినహాయించింది. మసీదును పురాతన హిందూ దేవాలయంపై నిర్మించారా? లేదా? కనుగొనాలని కోర్టును నలుగురు మహిళలు ఆశ్రయించారు. అయితే.. వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పును ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేసే అవకాశం ఉంది. కాశీ విశ్వనాథునికి ఎదురుగా ఉన్న జ్ఞాణవాపి మసీదు పురాతన హిందూ దేవాలయం ఆనవాళ్లను కలిగి ఉందని నలుగురు మహిళలు ఈ ఏడాది మే నెలలో కోర్టు మెట్లెక్కారు. మసీదు ప్రాంగణంలో స్వయంభు జ్యోతిర్లింగం ఉండేదని, ముస్లిం పాలకుల దండయాత్రలో ధ్వంసమైందని వారి పిటిషన్‌దారులు పేర్కొన్నారు. అయితే.. మసీదు కమిటీ వీరి వాదనలను ఖండించింది. ఏఎస్ఐ సర్వే మసీదు నిర్మాణాలను దెబ్బతీస్తుందని అన్నారు. గత ఏడాది నిర్వహించిన వీడియోగ్రఫిక్ సర్వేలో కనుగొన్నామని చెబుతున్న శివలింగానికి కార్బన్ డేటింగ్ ప్రక్రియను సుప్రీంకోర్టు నిషేధించింది. అంతేకాకుండా సైంటిఫిక్ సర్వేని విభేదించింది. వజుఖానాని సీలింగ్ చేయాలని ఆదేశించింది. ఇదీ చదవండి: మణిపూర్ అంశంపై తెరమీదకు రూల్ నెం.176 Vs 267.. అసలేంటివి? -
హిందూ సమాజం ద్వేషిస్తోంది.. చావడానికి అనుమతించండి!
వారణాసి జ్ఞానవాపి మసీదు కేసులో పిటిషన్‌ను ఉపసంహరించుకున్న రాఖీ సింగ్.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మకు బహిరంగ లేఖ రాశారు. అనాయాస మరణానికి(euthanasia) తనను అనుమతించాలని ఆమె రాష్ట్రపతికి విజ్క్షప్తి చేశౠరు. జ్క్షానవాపి విషయంలో తనతో పాటు పిటిషన్లు వేసిన వాళ్లే తనను వేధిస్తున్నారని, అందుకే తాను చావాలనుకుంటున్నానని అందులో పేర్కొన్నారామె. మీ బదులు కోసం జూన్ 9వ తేదీ ఉదయం 9 గంటల వరకు ఎదురు చూస్తా. మీ నుంచి స్పందన లేకుంటే.. తర్వాత తీసుకోబోయే నిర్ణయానికి నాదే పూర్తి బాధ్యత అంటూ ఆమె లేఖను రాష్ట్రపతి భవన్‌కు పంపారు. పిటిషన్‌ను ఉపసంహరించుకున్నప్పటి నుంచి హిందూ సమాజంలో తనను బద్నాం చేసే కుట్ర జరుగుతోందని అంటున్నారామె. అందుకు తనతో పాటు జ్ఞానవాపి పిటిషన్ వేసిన నలుగురే కారణమంటూ చెబుతున్నారు. పిటిషన్ వెనక్కు తీసుకోవడం విషయంలో తన మీద తప్పుడు ప్రచారం చేశారని, దాని వల్ల తన పరువు పోయిందని, హిందూ సమాజం.. ఆఖరికి తన కుటుంబం కూడా తనను ఇప్పుడు ద్వేషిస్తోందని లేఖలో వాపోయారామె. ఈ మానసిక క్షోభ నుంచి బయటపడేందుకు తనకు అనాయాస మరణానికి అనుమతించాలని ఆమె లేఖ ద్వారా రాష్ట్రపతి ముర్ముకు విజ్క్షప్తి చేశారు. అయితే.. రాఖీ బంధువు జితేంద్ర సింగ్ విసేన్ తమ ఆర్థిక పరిస్థితి వల్లే పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్లు చెప్పారు. కోర్టుల చుట్టూ తిరగడానికి మాకెవరూ స్పాన్సర్లు లేరు. మా జేబులోంచి ఖర్చు పెట్టుకునేంత స్తోమత లేదు. అందుకే మా కుటుంబం జ్క్షానవాపి విషయంలో దాఖలు చేసిన అన్ని పిటిషన్లను ఉపసంహరించుకుంది అని ఆయన స్పష్టత ఇచ్చారు. నేను, నా కుటుంబం(రాఖీ సింగ్‌తో సహా) అన్ని పిటిషన్లను ఉపసంహరించుకున్నాం. మా ఆర్థిక పరిస్థితితో పాటు దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం. ధర్మం కోసం సోరాడడానికి మా దగ్గర వనరులు లేవు. మేం జీవితంలో చేసిన తప్పు.. ఈ పిటిషన్‌ను వేయడం అంటూ ఆయన మీడియాకు చెబుతున్నారు. జ్ఞానవాపి మసీదులో పూజలకు అనుమతించాలంటూ ఐదుగురు మహిళలు పిటిషన్లు వేయగా.. అందులో రాఖీసింగ్ కూడా ఉన్నారు. అయితే ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగానే ఉందంటూ ఆమె తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. -
Gyanvapi Case: వారణాసిలోనే జ్ఞానవాపి కేసు..ఆ వ్యాజ్యం చెల్లుతుంది.!
జ్ఞానవాపి కేసులో ముస్లీం కమిటికి చుక్కెదురైంది. మసీదు కమిటీ హిందూ మహిళలు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేయాలని కోరుతూ చేసిన అభ్యర్థనను బుధవారం అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో హిందూ మహిళలు వేసిన వ్యాజ్యం చెల్లుబాటవుతుందని అనూహ్యమైన తీర్పు ఇచ్చింది కోర్టు. అలాగే స్థానిక వారణాసిలోనే కేసు కొనసాగేలా అనుమతిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో హిందు మహిళల బృందానికి భారీ ఊరట లభించినట్లయ్యింది. వారణాసిలో జ్ఙానవాపి మసీదులో పూజలు చేసుకునే హక్కును కోరుతూ హిందూ మహిళల బృందం లక్ష్మీ దేవి, రేఖా పాఠక్, సీతా సాహు, మంజు వ్యాస్ అలహాబాద్ హైకోర్టుని ఆశ్రయించడంతో ఈ కేసు తెరపైకి వచ్చి గణనీయమైన వివాదాస్పదానికి దారితీసింది. ఈ వివాదం ఏప్రిల్ 2021 నుంచి కోర్టులోనే ఉంది. వారణాసి జిల్లా న్యాయమూర్తి ఈ కేసు నిర్వహణను సమర్థించారు. ఇదిలా ఉండగా, అంజుమన్ ఇంతేజామియా మసీదు(ఏఐఎం) కమిటీ, ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డ్ 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం, 1995 సెంట్రల్ వక్ఫ్ చట్టం ప్రకారం ఈ కేసును నిర్వహించడం సాధ్యం కాదని వాదిస్తూ కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వాదనలు విన్న అలహాబాద్ హైకోర్టు డిసెంబర్ 23, 2022న తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. కాగా, హిందూ మహిళల పిటిషన్‌పై వారణాసి కోర్టు మసీదు సముదాయంపై సమగ్ర సర్వే నిర్వహించాలని పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా (ASI)ని ఆదేశించింది కూడా. (చదవండి: Gyanvapi Case: జ్ఞానవాపి కేసులో తొందరపాటు వద్దు.. సైంటిఫిక్ సర్వేపై సుప్రీం కోర్టు స్టే)) -
జ్ఞానవాపి కేసులో తొందరపాటు వద్దు: సుప్రీం కోర్టు
సాక్షి, ఢిల్లీ: జ్ఞానవాపి కేసులో సుప్రీం కోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. శాస్త్రీయ సర్వే అంశాన్ని పక్కనపెట్టి.. ఈ వ్యవహారంలో చాలా జాగ్రత్తగా నడుచుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు కార్బన్ డేటింగ్ పద్దతి సహా సైంటిఫిక్ సర్వేను నిర్వహించేందుకు అనుమతిస్తూ అలహాబాద్ హైకోర్టు తాజాగా(మే 12వ తేదీన) ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. జ్ఞాన్వాపి మసీదు కాంప్లెక్స్‌లో కనుగొనబడిన ఆకారం ‘శివలింగం’ అని పేర్కొంటూ హిందూ ఆరాధకులు, శాస్త్రీయ సర్వే నిర్వహించేందుకు అనుమతించాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో.. కార్బన్ డేటింగ్(వయసు నిర్ధారణ కోసం) సహా సైంటిఫిక్‌సర్వేకు పురావస్తు శాఖకు హైకోర్టు అనుమతినిచ్చింది. ఆ సమయంలో ‘శివలింగం’గా పేర్కొంటున్న ఆకారానికి ఎలాంటి నష్టం జరగకూడదని స్పష్టం చేసింది. అయితే.. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై జ్ఞానవాపి మసీద్ ప్యానెల్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్.. హైకోర్టు తీర్పుతో విభేదించింది. ‘‘ఈ విషయంలో మనం జాగ్రత్తగా నడుచుకోవాలి. తొందరపాటు వద్దు. కాబట్టి శాస్త్రీయ సర్వేను వాయిదా వేద్దాం’’ అని మధ్యంతర స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఈ ఆదేశాలు అమలు అవుతాయని స్పష్టం చేసింది. ► మే 16, 2022న జ్ఞాన్వాపి మసీదు కాంప్లెక్స్‌లో ఆ ఆకారం బయటపడింది. ► జ్ఞానవాపి మసీదు కూడా కాశీ విశ్వనాథ్ ఆలయ కాంప్లెక్స్‌లో భాగమేనని.. ఆ మసీదు గోడలపై హిందూ దేవతా మూర్తుల విగ్రహాలు ఉన్నాయని.. తమకు పూజ చేసుకునే అవకాశం కల్పించాలని కోర్టును ఐదుగురు మహిళలు కోరడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. అయితే ఈ వాదనను మసీదు కమిటీ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది. ► ప్రశ్నార్థకమైన ఆ నిర్మాణాన్ని శివలింగం అని హిందూ వర్గాలు వాదిస్తుండగా.. ముస్లిం పక్షం ఈ వస్తువు 'వజూఖానా' రిజర్వాయర్ వద్ద వాటర్ ఫౌంటెన్ మెకానిజంలో భాగమని చెబుతోంది. ► ఇప్పటికే ఈ ఆకారంపై వీడియో రికార్డింగ్ సర్వే నిర్వహించారు. ► ప్రార్థనా స్థలాల చట్టం-1991ని జ్ఞానవాపి మసీదు విషయంలో వర్తింప చేయాలని మసీదు కమిటీ కోరింది. కానీ, గత నెల విచారణ సందర్భంగా జ్ఞానవాపి మసీదుకు ఈ చట్టం వర్తించదని న్యాయస్థానం తీర్పు చెప్పింది. ► శివలింగం లాంటి నిర్మాణంపై శాస్త్రీయ పరిశోధన నిర్వహించాలని హిందూ ఆరాధకుల అభ్యర్థనను వారణాసి కోర్టు గత సంవత్సరం తిరస్కరించింది. కానీ, అలహాబాద్ హైకోర్టు కార్బన్ డేటింగ్‌కు అనుమతించింది. ఇక ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం మాత్రం తొందరపాటు వద్దని, సైంటిఫిక్ సర్వేను వాయిదా వేయాలని ఆదేశించింది. ఇదీ చదవండి: థ్యాంక్యూ ఇండియా.. సాయంపై చైనా మెసేజ్ -
జ్ఞానవాపీ కేసులో మధ్యంతర ఉత్తర్వులను పొడిగించిన సుప్రీంకోర్టు
-
Gyanavapi Case: శివలింగం బయటపడిన ప్రాంతాన్ని పరిరక్షించాలి: సుప్రీం
న్యూఢిల్లీ: వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదులో వెలుగుచూసిన శివలింగాన్ని పరిరక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని సుప్రీంకోర్టు తెలిపింది. సర్వే సందర్భంగా జ్ఞానవాపి మసీదులో బయటపడిన శివలింగం రక్షణ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం మే17న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మసీదులో శివలింగాన్ని గుర్తించిన వాఘూఖానా ప్రాంతాన్ని సీజ్ చేయాలని, ముస్లింల ప్రార్థనలకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని ఆదేశాలిచ్చింది. ఈ మధ్యంతర ఉత్తర్వుల గడువు రేపటితో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ సుప్రీం ధర్మాసనం ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను నవంబర్ 28కి వాయిదా వేసింది. చదవండి: (Delhi MCD Election: పది కీలక హామీలు ప్రకటించిన కేజ్రీవాల్) -
Gyanvapi: వాయిదాతో కొనసాగనున్న ఉత్కంఠ!
వారణాసి: ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఉత్తర ప్రదేశ్ వారణాసి జ్ఞానవాపి కేసులో ఇవాళ(నవంబర్ 8, మంగళవారం) కీలక తీర్పు వెలువడాల్సి ఉంది. అయితే ఈ పిటిషన్లపై తదుపురి విచారణను నవంబర్ 14 తేదీకి వాయిదా వేసింది వారణాసి కోర్టు. మసీదు ప్రాంగణంలో ఉన్న శివలింగాన్ని పూజించేలా అనుమతి ఇవ్వాలని, హిందువులకు ఆ ప్రాంగణం అప్పగించాలని, అలాగే ముస్లింల ప్రవేశాన్ని నిషేధించేలా ఆదేశాలు ఇవ్వాలని.. మొత్తం మూడు డిమాండ్లతో కూడిన హిందువుల పక్షాన దాఖలైన పిటిషన్‌పై తీర్పు వెలువడాల్సి ఉంది. ఈ మేరకు సివిల్ జడ్జి(సీనియర్ డివిజన్) మహేంద్ర పాండే తీర్పును అక్టోబర్ 27న రిజర్వ్ చేసి ఉంచారు. ముందుగా నవంబర్ 8వ తేదీన తీర్పు వెలువడాల్సి ఉంది. అయితే జడ్జి అనివార్య కారణాల వల్ల అందుబాటులో లేకపోవడంతో నవంబర్ 14వ తేదీకి వాయిదా పడింది. ప్రస్తుతానికి ముస్లిం వర్గాలకు అక్కడ నమాజ్‌కు అనుమతి ఇస్తున్నారు. ఇక.. గత విచారణ సందర్భంగా వాజుఖానాలో ఉన్న శివలింగం అంశంపై సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్‌కు అనుమతించాలని, కార్బన్ డేటింగ్ చేయించాలనే అభ్యర్థనను వారణాసి కోర్టు తోసిపుచ్చింది. ఇక ఆ ఆకారం శివలింగం కాదని, ఫౌంటెన్ భాగమని ముస్లిం వర్గాలు వాదిస్తున్నాయి. మసీదు నిర్వహణను చూసుకుంటున్న ఏఐఎంసీ.. హిందు సంఘాల తరపున పిటిషన్ వేసిన వీవీఎస్ఎస్ వాదనను తోసిచ్చుతోంది. ఇదీ చదవండి: కర్మ అంటే ఇదేనేమో.. దెబ్బకు తిక్క కుదిరింది! -
శివలింగంపై శాస్త్రీయ పరిశోధనకు కోర్టు నిరాకరణ
-
జ్ఞానవాపీ మసీదు కేసులో శివలింగంపై కోర్టు కీలక తీర్పు
లక్నో: జ్ఞాన్వాపీ కేసులో హిందువుల పిటిషన్‌ను తిరస్కరించింది వారణాసి జిల్లా కోర్టు. మసీదు ప్రాంగణంలో లభించిన శివలింగానికి కార్బన్ డేటింగ్ నిర్వహించేందుకు అనుమతి నిరాకరించింది. అలా చేస్తే శివలింగం దెబ్బతింటుందని ఈమేరకు శుక్రవారం తీర్పు వెలువరించింది. శివలింగానికి కార్బన్ డేటింగ్ నిర్వహించి అది ఏ కాలం నాటిదో తేల్చాలని హిందువులు పిటిషన్ దాఖలు చేయగా.. ముస్లింలు దీన్ని వ్యతిరేకిస్తూ కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనలను విన్న న్యాయస్థానం హిందువుల పిటిషన్‌ను తిరస్కరించింది. జ్ఞాన్వాపీ మసీదు ఆవరణలో శ్రీనగర్ గౌరి మాతను పూజించేందుకు అనుమతించాలని ఐదుగురు హిందూ మహిళలు 2021 ఆగస్టులో కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణలో భాగంగా మసీదు ప్రాంగణంలో వీడియో సర్వే నిర్వహించగా.. శివలింగం కూడా ఉన్నట్లు తేలింది. దీంతో దానికి కార్బన్ డేటింగ్ నిర్వహించాలని హిందువులు పిటషన్ దాఖలు చేయగా.. కోర్టు తిరస్కరించింది. చదవండి: ప్రొఫెసర్ సాయిబాబాకు భారీ ఊరట -
‘జ్ఞానవాపి’ కేసు విచారణ వాయిదా
వారణాసి: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో బయటపడిన శివలింగ ఆకృతికి కార్బన్–డేటింగ్ పరీక్ష నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్‌పై తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై లిఖితపూర్వకంగా స్పందించాలని అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీకి సూచించింది. మసీదు కాంప్లెక్స్‌లోని వజూఖానాలో ఈ ఏడాది మే 16న నిర్వహించిన సర్వేలో శివలింగం బయటపడిందని, ఇది ఎప్పటిదో నిర్ధారించేందుకు పరీక్ష నిర్వహించాలని విన్నవిస్తూ హిందూ మహిళ ఒకరు వారణాసి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టింది. సివిల్ ప్రొసీజర్ కోడ్(సీపీసీ) ఆర్డర్ 26 రూల్ 10 కింద ఈ శివలింగంపై శాస్త్రీయ పరిశోధన చేయడానికి ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోర్టును కోరామని పిటిషనర్ తరపు న్యాయవాది విష్ణుశంకర్ జైన్ చెప్పారు. చదవండి: థాక్రే వర్గానికి ఎన్నికల సంఘం డెడ్‌లైన్ -
జ్ఞానవాపి ‘శివలింగం’ వయసు నిర్ధారణకు ఓకే
వారణాసి: వారణాసిలో కాశీ విశ్వనాథ్ ప్రధానాలయం పక్కన ఉన్న జ్ఞానవాపి మసీదు ఆవరణలో లభించిన శివలింగాకృతి శిల వయసు నిర్ధారణకు వారణాసి జిల్లా కోర్టు అనుమతిని ఇచ్చింది. జ్ఞానవాపి మసీదు ప్రధాన కట్టడం వెనకవైపు గోడకు ఉన్న దేవతా విగ్రహాల నిత్య ఆరాధనకు అనుమతించాలంటూ మహిళా భక్తులు వేసిన పిటిషన్‌ను గురువారం వారణాసి జిల్లా కోర్టు విచారించింది. శిల కార్భన్–డేటింగ్ ప్రక్రియకు అనుమతించాలని భక్తుల తరఫున హాజరైన న్యాయవాది విష్ణు .. జడ్జి విశేష్ను కోరారు. అందుకు అంగీకరిస్తూ జడ్జి ఉత్తర్వులిచ్చారు. తదుపరి విచారణ తేదీ 29కల్లా అభ్యంతరాలు ఉంటే తెలపాలని మసీదు మేనేజ్మెంట్కు సూచించారు. కేసులో భాగస్వామ్య పక్షాలుగా చేరుతామంటూ 15 మంది కోర్టు ముందుకొచ్చారు. -
Gyanvapi Masjid Case: కదిలిన తేనెతుట్టె!
చిన్నగా మొదలైన కొన్ని అంశాలే కాలగతిలో పెను పరిణామాలకు దారితీస్తాయి. ఇది చరిత్రలోని చిత్రమైన లక్షణం. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వ్యవహారానికి సంబంధించి అక్కడి జిల్లా న్యాయస్థానం సోమవారం ఇచ్చిన 26 పేజీల ఆదేశం సరిగ్గా అలాంటిదే. మసీదు ప్రాంగణంలోని హిందూ దేవతామూర్తులను పూజించేందుకు అనుమతించాలంటూ అయిదుగురు హిందూ మహిళలు వేసిన పిటిషన్ విచారణార్హమైనదే అని కోర్టు నిర్ణయించడం కీలక పరిణామం. 17వ శతాబ్దికి చెందిన ఈ మసీదులో పూజలకు అనుమతించడానికి ఇప్పుడున్న మూడు చట్టాల ప్రకారం కుదరదంటూ మసీదును నిర్వహిస్తున్న అంజుమన్ ఇంతెజామియా మస్జిద్ కమిటీ వాదించింది. ప్రార్థనా స్థలాల (ప్రత్యేక ఏర్పాట్ల) చట్టం – 1991, వక్ఫ్ చట్టం – 1995, యూపీ శ్రీకాశీ విశ్వనాథ్ ఆలయ చట్టం –1983... ఈ మూడింటినీ కమిటీ ప్రస్తావించింది. కానీ, జడ్జి విశ్వేశ ఆ వాదనను తోసిపుచ్చారు. ఈ 22న విచారణకు నిర్ణయించారు. జిల్లా కోర్ట్ ఆదేశంపై మస్జిద్ కమిటీ హైకోర్ట్ గుమ్మం తొక్కనుంది. వెరసి, సుదీర్ఘంగా సాగిన అయోధ్యలోని వివాదాస్పద బాబ్రీ మసీదు – రామజన్మభూమి వ్యవహారంలా ఇక ఇప్పుడు కాశీలో జ్ఞానవాపి కథ మొదలు కానుంది. కొద్దినెలల విరామం తర్వాత జ్ఞానవాపి మసీదు వివాదంలో మొదలైన ఈ కొత్త అంకం అనేక పర్యవసానాలకు దారితీయడం ఖాయం. కొద్ది నెలల క్రితం మసీదు ప్రాంగణాన్ని సర్వే చేసి, వీడియో తీసినప్పుడు బయటపడ్డ శివలింగం తరహా నిర్మాణం గురించి కోర్టులో చర్చకు రానుంది. అయోధ్య, కాశీ, మథురల్లోని మసీదులు నిజానికి హిందువుల భూభూగాలేననే వాదన దీర్ఘకాలంగా ఉంది. చాలా ఏళ్ళుగా బీజేపీ, సంఘ్ పరివార్లు దాన్ని తమ రాజకీయ అజెండాగా మార్చుకున్నాయి. దీనిపై ఇటు వీధుల్లోనూ, అటు కోర్టుల్లోనూ పోరు సాగిస్తూనే ఉన్నాయి. రామజన్మభూమి ఉద్యమం తీవ్రంగా సాగుతున్న వేళ ఆ స్థాయి వివాదాలు ఇతర ప్రార్థనా స్థలాలపై తలెత్తకూడదనే ఉద్దేశంతో 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టాన్ని అప్పటి కేంద్రప్రభుత్వం చేసింది. 1947 ఆగస్టు 15 నాటికి ఉన్న స్థితినే కొనసాగించాలనీ, ఏ వివాదాస్పద ప్రార్థనా స్థల స్వరూప స్వభావాలనూ మార్చ రాదనీ సదరు చట్టం నిర్దేశిస్తోంది. తీరా 1992లో బాబ్రీ మసీదు కూల్చివేతతో ప్రార్థనాస్థల రాజకీయాలు పతాకస్థాయికి చేరాయి. మళ్ళీ ఇప్పుడు జ్ఞానవాపిపై కోర్టు ఆదేశంతో ఒకప్పటి బాబ్రీ మసీదు వివాదంలా సమాజంలోని రెండు వర్గాల మధ్య సామరస్యం దెబ్బతిని, సుస్థిరత దెబ్బతినే ప్రమాదం ఉంది. 1991 నాటి చట్టం సైతం నిష్ప్రయోజనం కావచ్చని ముస్లిమ్ వర్గం ఆందోళన. అయితే, 1947కూ, 1993కూ మధ్య జ్ఞానవాపి ప్రాంగణంలో హిందువుల ప్రార్థనలను అనుమతించారు. 1993 తర్వాతా ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఏటా ఒకసారి అక్కడ దేవతామూర్తుల ప్రార్థనకు వీలు కల్పిస్తున్నారు. హిందూ మహిళల పిటిషన్‌ను అనుమతించిన జిల్లా కోర్ట్ ఆ సంగతులే గుర్తు చేసింది. ప్రార్థనాస్థల ధార్మిక స్వరూప స్వభావాలను మార్చే ప్రయత్నమేదీ ఇందులో లేదనీ, అక్కడ పూజలు చేసుకొనే హక్కు మాత్రమే అడుగుతున్నారనీ వ్యాఖ్యానించింది. కానీ, కథ అంతటితో ఆగుతుందా అన్నది ప్రశ్న. నిజానికి, జ్ఞానవాపి ప్రాంగణంపై హక్కులకు సంబంధించి హైకోర్ట్‌లో ఇప్పటికే అనేక కేసులు విచారణలో ఉన్నాయి. ప్రాంగణంలో భారత సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ)తో సర్వేకు అనుమతిస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశం పైనా హైకోర్ట్ విచారిస్తోంది. ఇలా జ్ఞానవాపిపై ఒక వర్గం ఒకే రకమైన పలు కేసులు దాఖలు చేయడం ఒక వ్యూహం ప్రకారం జరుగుతోందని రెండో వర్గం అనుమానం. పూజల కోసం భక్తులు వేసిన పిటిషన్‌ను ముందుగా జిల్లా కోర్టు వినాలని ఆ మధ్య సుప్రీం కోర్టే చెప్పింది. వారణాసి కోర్ట్ తాజా నిర్ణయంతో వివాదం పైకోర్టులకు పాకుతుంది. నిజానికి, దశాబ్దాల తరబడి సాగిన రామజన్మభూమి వివాదంపై 2019లో అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు నిచ్చింది. బాబ్రీ మసీదు ఒకప్పుడున్న స్థలంలో రామాలయ నిర్మాణానికి అడ్డంకులు తొలగిస్తూనే, 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టాన్ని భారత రాజ్యాంగ లౌకికవాద లక్షణాలను కాపాడేందుకు తీర్చి దిద్దిన చట్టపరమైన పరికరంగా అభివర్ణించింది. తీరా తాజా నిర్ణయంతో వారణాసి కోర్ట్ ఆ మాట లను ప్రశ్నార్థకం చేసి, వివాదాల తేనెతుట్టెను కదిలించింది. పైకి కోర్టు కేసులుగా కనిపిస్తున్నా, వీటిలో రాజకీయాలూ పుష్కలం. బాబ్రీ మసీదు వివాదంతో ఇప్పటికే దేశంలో ఒక వర్గాన్ని బయటి వ్యక్తులుగా చూసే ధోరణి ప్రబలింది. జాతీయవాదం, హైందవ ఆత్మగౌరవం లాంటి పదబంధా లకు ప్రాచుర్యం పెరిగింది. మరోపక్క మథుర, ఆగ్రాల్లోనూ ఇలాంటి కేసులే కోర్టుల్లో ఉన్నాయి. అసలు ‘ప్రార్థనాస్థలాల చట్టం–1991’ రాజ్యాంగబద్ధత పైనా సుప్రీమ్‌లో కేసు పెండింగ్‌లో ఉంది. ఆ అంశంపై సుప్రీమ్ తీర్పు కోసం నిరీక్షించకుండా, జిల్లా కోర్ట్ అత్యుత్సాహం చూపింది. ఈ పరిస్థితుల్లో ఈ వివాదాలన్నిటికీ కీలకం కానున్న 1991 నాటి చట్టానికి సంబంధించి అత్యున్నత న్యాయస్థానం ఎంత త్వరగా తన తీర్పునిస్తే అంత మంచిది. కింది కోర్టులకు అది మార్గదర్శకమవుతుంది. సమస్యలు మరింత జటిలం కాకుండా అడ్డుకుంటుంది. ఎందుకంటే, ధార్మిక విశ్వాసాలు నిప్పు లాంటివి. వాటితో చెలగాటమాడితే చేతులు కాలక తప్పదు. ఏమరుపాటుగా ఉంటే సమాజాన్నీ, విభిన్న వర్గాల సామరస్యాన్నీ ఆ అగ్ని దహించకా తప్పదు. న్యాయస్థానాల మొదలు ప్రభుత్వాల దాకా అందరూ అప్రమత్తంగా ఉండాల్సింది అందుకే! -
జ్ఞానవాపి మసీదుపై వారణాసి కోర్టు కీలక నిర్ణయం
లక్నో: జ్ఞానవాపి కేసుపై వారణాసి కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అంజుమన్ ఇంతజామియా కమిటీ పిటిషన్‌ను తిరస్కరించింది. మసీదు ఆవరణలోని శృంగార గౌరి ప్రతిమకు పూజలు చేసేందుకు అనుమతించాలని హిందూ సంఘాలు వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. ఈనెల 22 నుంచి హిందూ సంఘాల పిటిషన్లపై విచారణ చేపడతామని స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని అంజుమన్ ఇంతజామియా కమిటీ తెలిపింది. మరోవైపు వారణాసి కోర్టు తీర్పును హిందూ సంఘాలు స్వాగతించాయి. ఇదీ కేసు.. జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లోని తటాకంలో శివలింగాకారం బయటపడిందని, హిందూ నేపథ్యం ఉన్న కారణంగా అక్కడ పూజలకు అనుమతించాలంటూ ఐదుగురు మహిళలు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో... కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక కమిటీ అక్కడ వీడియో సర్వే నిర్వహించింది కూడా. అయితే.. అది శివలింగం కాదంటూ మసీద్ కమిటీ వాదిస్తోంది. ఆపై సుప్రీం కోర్టుకు చేరిన ఈ వ్యవహారం.. తిరిగి వారణాసి కోర్టుకే చేరింది. కమిటీ రిపోర్ట్ సీల్డ్ కవర్లో వారణాసి కోర్టుకు చేరగా.. అదీ, వీడియో రికార్డింగ్‌కు సంబంధించిన ఫుటేజీలు బయటకు రావడంతో కలకలం రేగింది. చదవండి: ఎట్టకేలకు.. సోనాలి ఫోగట్ కేసులో కీలక పరిణామం -
జ్ఞానవాపి మసీదు: కీలక తీర్పుపై ఉత్కంఠ
వారణాసి: ఉత్తర ప్రదేశ్‌లోని ప్రసిద్ధ శృంగర్ గౌరీ జ్ఞానవాపి మసీదు కేసుకు సంబంధించి వారణాసి జిల్లా కోర్టు ఇవాళ(సెప్టెంబర్ 12) కీలక తీర్పును వెలువరించనుంది. మసీదుకాంప్లెక్స్లో హిందూ దేవతలను పూజించేందుకు అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్‌పైనే ఇవాళ కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ తరుణంలో అక్కడ ఉత్కంఠ వాతావరణం నెలకొంది. కీలక తీర్పు నేపథ్యంలో పోలీసులు వారణాసిలో 144 సెక్షన్ విధించి.. హైఅలర్ట్ ప్రకటించారు. సోమవారం కావడంతో.. కాశీ విశ్వనాథ్ ఆలయం వద్ద భద్రతను భారీగా పెంచారు. ఈ పిటిషన్-అభ్యంతరాలపై ఇప్పటికే వాదనలు విన్న జిల్లా న్యాయమూర్తి అజయ్ కృష్ణ.. ఆగష్టు 24వ తేదీనే తీర్పును సిద్ధం చేసి వాయిదా వేశారు. అయితే.. ఇవాళ ఆ తీర్పును ప్రకటించనున్నారు. మసీదు కాంప్లెక్స్‌లోని తటాకంలో శివలింగాకారం బయటపడిందని, హిందూ నేపథ్యం ఉన్న కారణంగా అక్కడ పూజలకు అనుమతించాలంటూ ఐదుగురు మహిళలు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో... కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక కమిటీ అక్కడ వీడియో సర్వే నిర్వహించింది కూడా. అయితే.. అది శివలింగం కాదంటూ మసీద్ కమిటీ వాదిస్తోంది. ఆపై సుప్రీం కోర్టుకు చేరిన ఈ వ్యవహారం.. తిరిగి వారణాసి కోర్టుకే చేరింది. కమిటీ రిపోర్ట్ సీల్డ్ కవర్లో వారణాసి కోర్టుకు చేరగా.. అదీ, వీడియో రికార్డింగ్‌కు సంబంధించిన ఫుటేజీలు బయటకు రావడంతో కలకలం రేగింది. ఈ నేపథ్యంలో.. ఇవాళ్టి తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ తీర్పు గనుక వ్యతిరేకంగా వస్తే అలహాబాద్ హైకోర్టు, సుప్రీం కోర్టుకు వెళ్తామని పిటిషనర్లు చెప్తున్నారు. ఇదీ చదవండి: ద్వారకా పీఠాధిపతి స్వామి స్వరూపానంద శివైక్యం -
జ్ఞానవాపి వివాదం: ఆరెస్సెస్ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
యూపీ వారణాసి జ్ఞానవాసి మసీదు కాంప్లెక్స్‌లో శివలింగం వెలుగు చూసిందన్న వ్యవహారం.. ప్రస్తుతం కోర్టులో ఉంది. అప్పటి నుంచి వరుసపెట్టి మసీద్-మందిర్ కామెంట్లు నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతీ మసీదులో శివలింగం గురించి వెతకడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు ఆయన. గురువారం సాయంత్రం నాగ్‌పూర్(మహారాష్ట్ర)లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని మోహన్ భగవత్ ప్రసంగిస్తూ.. వివాదాన్ని ఎందుకు పెంచాలి? సమిష్టి నిర్ణయంతో జ్ఞానవాపి వివాదానికి ముగింపు పలకవచ్చు కదా! ఆయన వ్యాఖ్యానించారు. ‘‘కొన్ని ప్రాంతాల పట్ల ప్రత్యేక భక్తిని కలిగి ఉంటాం. వాటి గురించి ప్రత్యేకంగా మాట్లాడతాం కూడా. కానీ, ప్రతిరోజూ కొత్త విషయంతో వివాదం రాజేయడం ఎందుకు?.. జ్ఞానవాపి విషయం మనకు భక్తి ఉండొచ్చు. అలాగని ప్రతీ మసీదుల్లో శివలింగం వెతకడం ఎంత వరకు సమంజసం? అని హిందూ సంఘాలను ప్రశ్నించారాయన. జ్ఞానవాపి అంశం ఈనాటిది కాదు. ఇప్పుడున్న హిందువులో, ముస్లింలో దానిని సృష్టించింది కాదు. ఆ సమయానికి అది అలా జరిగిపోయింది. బయటి దేశాల నుంచి వచ్చిన కొందరు.. దేవస్థానాలను నాశనం చేశారు. అలాగని ముస్లింలు అందరినీ అలా చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న ముస్లింలలో కొందరి పూర్వీకులు కూడా హిందువులే!.సమిష్టిగా సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేయాలి. అందుకు ఒక మార్గం కనిపెట్టాలి. కుదరనప్పుడు కోర్టులకు చేరాలి. అక్కడ ఎలాంటి నిర్ణయం ఇచ్చినా అంగీకరించి తీరాలి. ఆరెస్సెస్.. ఏ మత ప్రార్థనా విధానాలకో వ్యతిరేకం కాదు. అందరినీ అంగీకరిస్తుంది. అందరినీ పవిత్రంగానే భావిస్తుంది. మతాలకతీతంగా మనమంతా మన పూర్వీకుల వారసులమే అని గుర్తించాలి అని తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. కాశీ విశ్వనాథ్ ఆలయానికి ఆనుకుని ఉన్న జ్ఞానవాపి-శృంగేరీ కాంప్లెక్స్‌లో పూజలకు అనుమతించాలంటూ ఐదుగురు హిందూ మహిళలు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ఆధారంగానే ప్రత్యేక కోర్టు కమిటీతో వీడియో సర్వే చేయించింది వారణాసి న్యాయస్థానం. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మసీదు కమిటీ సుప్రీంను ఆశ్రయించగా.. ఆ పిటిషన్‌నూ వారణాసి కోర్టుకే బదిలీ చేసింది అత్యున్నత న్యాయస్థానం. ఈ లోపు వీడియో సర్వే రిపోర్టు వారణాసి జిల్లా న్యాయస్థానాకి చేరింది. కోర్టు ‘జ్ఞానవాపి’ పిటిషన్‌పై వాదనలు జులై 4న విననుంది. జ్ఞానవాపి వ్యవహారం కోర్టులో ఉండగానే.. తాజ్‌మహల్‌లో మూసిన గదుల్లో ఆలయానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయంటూ అలహాబాద్ కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. అయితే ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఆపై ఢిల్లీ కోర్టులో కుతుమ్ మినార్ కాంప్లెక్స్‌లో హిందూ, జైన్ల పూజలకు అనుమతించాలంటూ ఓ పిటిషన్ దాఖలైంది. ఈ వ్యవహారంపై జూన్ 9న కోర్టు ఆదేశాలు ఇవ్వనుంది. అయితే ఆర్కియాలజీ విభాగం మాత్రం.. ప్రపంచ వారసత్వ సంపద అయిన కుతుబ్ మినార్ వద్ద ఏ మతం ప్రార్థనలు జరగడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కర్ణాటకలోనూ ఓ మసీదు పునర్నిర్మాణ పనుల్లో హిందూ ఆలయ ఆనవాలు కనిపించాయంటూ.. ఆ పనుల్ని నిలిపివేయించాయి హిందూ సంఘాలు. చదవండి: మసీదులు అంతకుముందు ఆలయాలే! తాఖీర్ రజా వ్యాఖ్యలు -
జ్ఞానవాపి మసీదు కేసు: విచారణ సోమవారానికి వాయిదా
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన జ్ఞానవాపి మసీదు కేసు విచారణను వారాణాసి జిల్లా కోర్టు సోమవారానికి(మే30) వాయిదా వేసింది. కాశీ విశ్వనాథ్- జ్ఞానవాపి కాంప్లెక్స్‌లో శిృంగార్ గౌరి కాంప్లెక్స్‌లోని దేవతామూర్తులకు నిత్య పూజలకు అనుమతి ఇవ్వడంతోపాటు శివలింగాన్ని సంబంధించిన సర్వే కొనసాగించాలంటూ హిందూ వర్గం నుంచి రెండు పిటిషన్లు దాఖలు చేశాయి. దీనిపై అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కేసు మెయింటెనబుల్‌గా లేదని చెబుతూ సివిల్ ప్రొసీజర్ కోడ్ ఆర్డర్ 7 రూల్ 11 ప్రకారం హిందువుల తరపు పిటిషన్‌ను కొట్టివేయాలని మసీదు కమిటీ తరఫు న్యాయవాది అభయ్ నాథ్ యాదవ్ వాదనలు వినిపించారు. 1991 ప్రార్థనాస్థలాల చట్టం ప్రకారం జ్ఞానవాపి మసీదుపై దాఖలైన పిటిషన్లను కొట్టేయాలని కోరారు. ప్రజల మనోభావాలను దెబ్బతిసేందుకే శివలింగం పేరుతో పుకార్లు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన విచారణ దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది. విచారణ సందర్భంగా పిటిషనర్లు, లాయర్లు, ప్రతివాదులను మాత్రమే కోర్టు లోపలికి అనుమతించారు. రెండురోజులపాటు ఇరుపక్షాల వాదనలు విన్న వారణాసి జిల్లా జడ్జి అజయ్‌కృష్ణ విశ్వేశ్.. విచారణను సోమవారానికి వాయిదా వేశారు. చదవండి: మహిళా ఎంపీపై బీజేపీ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు -
సమస్యలను పక్కదారి పట్టించడానికే వైషమ్యాలు
మోదీ ప్రభుత్వం తన విధానాలతో దేశ ప్రజలను ఎనిమిదేళ్లుగా నానా తిప్పలు పెడుతోంది. ‘అచ్ఛే దిన్’ అంటూ అధికారంలోకి వచ్చారు. తమ పాలనతో ‘బురే దిన్’ చేశారు. నిత్యావసర ధరలు వంద శాతం పెరిగాయి. ఈ సమస్యలను పక్కదారి పట్టించడానికి మైజారిటీ, మైనారిటీ వర్గాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు. ‘‘ఎక్కువ తక్కువలు, కులమత భేదాలుండటం మానవజాతికి అవమానకరం’’ – మహాత్మా గాంధీ నేడు దేశాన్ని పాలిస్తున్నవారు జాతిపిత గాంధీజీ చెప్పిన మాటలకు పూర్తి భిన్నంగా వ్యవహరి స్తున్నారు. కుల, మత భేదాలు సృష్టించి దేశాన్ని విభజించే కుట్ర చేస్తున్నారు. దేశాభివృద్ధిని కోరు కుంటున్న ఏ ప్రభుత్వమైనా ప్రజలందరినీ సమాన దృష్టితో చూస్తుంది. కానీ దేశాన్ని ప్రస్తుతం పాలిస్తున్నవారి ఎజెండానే వేరు. ప్రజల మధ్య ఎంత వైషమ్యాలు పెరిగితే అది అంతగా తమకు లాభమనేది వారి ఆలోచన! ఇదేదో గాలికి చేస్తున్న విమర్శ కాదు. దేశంలో కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇదే అర్థమవుతుంది. ఓ వర్గం లక్ష్యంగా ఎప్పుడూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే జాతీయ పార్టీ నాయ కులు, వారికి తగ్గట్టు... ‘80 శాతం ఉన్న మనం’ అంటూ రాష్ట్రంలో యువత మెదళ్లలో మతతత్వపు పురుగును చొప్పిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి నెలకో ఇష్యూ చొప్పున తెరపైకి తెస్తున్నారు. జనవరిలో కర్ణాటకలో ‘హిజాబ్’ ఇష్యూతో దుమారం రేగింది. ఆ వివాదం నడుస్తుండగానే ‘హలాల్ మాంసం’ తినొద్దనీ, ముస్లింల షాపుల్లో వస్తువులు కొనొద్దనీ బీజేపీ పాలిత కర్ణాటకలో తీర్మానాలు చేశారు. అది సద్దుమణిగే లోపే ఫిబ్రవరిలో ‘కశ్మీరీ ఫైల్స్’ సినిమాతో మరో అగ్గి రాజేశారు. కశ్మీర్లో పండిట్లు, ఇతర వర్గాల మధ్య ఓ స్పష్టమైన విభజన రేఖను సృష్టించారు. ఈ సినిమాకు ప్రధానమంత్రి, హోంమంత్రి, కేంద్ర మంత్రులు ప్రచారకర్తలయ్యారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలు ఉచితంగా సినిమా షోలు నడిపించాయి. దీనిని బట్టి... బీజేపీది విభజన వాదమనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఏప్రిల్‌లో మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా, లౌడ్ స్పీకర్లు అంటూ కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. మే నెలలో ఢిల్లీ షాహీన్ బాగ్ కూల్చి వేతలు మొదలు, తాజ్ మహల్, జ్ఞానవాపి మసీదు ఇష్యూ... వరకు అన్నీ ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తున్న అంశాలే! ఎందుకీ రాద్ధాంతం? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ), నోట్ల రద్దు, కార్పొరేట్ల అనుకూల విధానాలు వంటివాటితో గత ఎనిమిదేళ్లలో ఘనత వహించిన మోదీ ప్రభుత్వం చేసిందేం లేదు. 8 ఏళ్ల క్రితం ‘అచ్ఛే దిన్’ (మంచిరోజులు) అంటూ అధికారంలోకి వచ్చారు. ఈ కాలంలో... ఉన్న అచ్చే దిన్ కాస్తా ‘బురే దిన్’ (చెడ్డ దినాలు) అయ్యాయి. పేదవాడు ఓ పూట బుక్కెడు బువ్వ తినాలంటే ఆస్తులు తాకట్టు పెట్టాల్సిన దుస్థితి దాపురించింది. నిత్యావసరాల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. మోదీ ప్రధాని అయినప్పటి నుంచీ ఇప్పటివరకు చూసుకుంటే వంట నూనె, పెట్రోల్, డీజిల్ ధరలు వంద శాతం పెరిగాయి. రూపాయి విలువ దిగజారిపోయింది. వంట గ్యాస్ సిలిండర్ ధర 2014లో రూ. 414 గా ఉంటే... ఇప్పుడు రూ. 1,052కు పెరిగింది. లీటర్ పెట్రోల్ ధర 2014లో రూ. 71 ఉంటే ఇప్పుడు రూ. 120కి పెరిగింది. లీటర్ డీజిల్ ధర 2014లో రూ. 55 ఉంటే ఇప్పుడు రూ.105కు పెరిగింది. ఇటీవల నామ్ కే వాస్తే కొంత తగ్గించారు. ద్రవ్యోల్బణం 30 ఏళ్ల గరిష్ఠానికి చేరింది. 42 ఏళ్లలో దేశ ఆర్థికవ్యవస్థ ఎన్నడూ లేనంత అత్యంత దారుణమైన పరిస్థితికి పడి పోయింది. నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్ఠానికి పెరిగింది. కరోనా కాలంలో ఇచ్చిన ఉచిత రేషన్ తప్ప... కేంద్రం నుంచి పేదవాడికి వచ్చింది ఏమీ లేదు. రాష్ట్రాల నుంచి పన్నుల రూపంలో వస్తున్న ధనమంతా ఎక్కడపోతోంది? దాదాపు 25 ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మేశారు. మొత్తం 36 ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉప సంహరణ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం తలమునకలై ఉంది. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఆ ఆమ్దానీ అంతా ఎటు పోయింది? ఇప్పుడు దేశ ప్రజలు అడుగుతున్న ఈ ప్రశ్నలకు మోదీ సర్కారు దగ్గర సమాధానం లేదు. జవాబు చెప్పలేనప్పుడు... జవాబు చెబితే పదవి పోయే పరిస్థితి అయినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మోదీ సర్కారు చేస్తున్న పనే చేయాలి. అసలు విషయాన్ని పక్కదారి పట్టించాలి. కొత్తగా బలమైన అంశాన్ని తెరపైకి తీసుకురావాలి. అది కూడా మెజార్టీ ప్రజలకు సంబంధించిన అంశమై ఉండాలి. సున్నితమైన అంశమైతే పాత విషయం మరిచిపోవడమే కాదు... మైలేజీ పెరుగుతుంది. ఇప్పుడు మోదీ సర్కారు నూటికి నూరు శాతం చేస్తున్నది ఇదే. (👉🏾చదవండి: ఇవాళ మనకు కావాల్సింది ఇదీ!) బీజేపీ చేస్తున్న ఈ మతరాజకీయాన్ని ఆదిలోనే తుంచేయకుంటే దేశ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. భరతమాతకు మతం పేరుతో బీజేపీ వేస్తున్న సంకెళ్లను తెంచడం మనందరి బాధ్యత. (👉🏾చదవండి: కోటి ఎకరాల మాగాణి కల నిజమౌతుంది!) - వై. సతీష్ రెడ్డి తెరాస రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ -
Gyanvapi Mosque Case: విచారణ 26కు వాయిదా
-
జ్ఞానవాపి మసీద్ కేసు: విచారణ 26కు వాయిదా
సాక్షి, హైదరాబాద్: జ్ఞానవాపి మసీద్ కేసులో విచారణ గురువారానికి వాయిదా పడింది. ఈ నెల 26వ తేదీన విచారణ చేపట్టనున్నట్టు వారణాసి జిల్లా కోర్టు మంగళవారం జరిగిన విచారణలో భాగంగా స్పష్టం చేసింది. కాగా, సర్వే నివేదికలో ఏవైనా అభ్యంతరాలుంటే వారం రోజుల్లో వెల్లడించాలని హిందూ, ముస్లిం పక్షాలను కోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండగా.. జ్ఞాన్వాపి మసీదు కేసుపై భిన్న వాదనలు కొనసాగుతున్నాయి. ఈ కేసును కొట్టివేయాలంటూ ముస్లిం పక్షం కోరుతుండగా.. మసీదులో శివలింగం కనిపించిదన్ని దీంతో అక్కడ ప్రతీ రోజు పూజలకు అనుమతించాలని హిందూ వర్గం కోరుతోంది. ఇక, ముస్లిం పక్షం చేసిన ఆర్డర్ 7 11 CPC దరఖాస్తుపై వారణాసి కోర్టు మే 26న విచారణ చేపట్టనుంది. అప్పటిదాకా యథాతథ స్థితిని కొనసాగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇది కూడా చదవండి: కుతుబ్ మినార్‌లో ఆలయ పునరుద్ధరణ సాధ్యం కాదు.. -
కాశీ, మథురలను హిందువులకు అప్పగించాలి
కాశీ విశ్వనాథ్ మందిరం – జ్ఞానవాపి మసీదు అంశం మళ్లీ తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఇస్లాం నిజంగానే శాంతి కాముక మతమని నిరూపించుకునేందుకు కాశీ, మథురలను హిందువులకు అప్పగించాలి. అయితే కొత్తగా మరి ఏ ఇతర ప్రార్థనా స్థలాలపై హక్కులు కోరబోమన్న భరోసాను ముస్లింలకు హిందువులు కూడా కల్పించాలి. బాబ్రీ మసీదు విధ్వంసా నికి దాదాపు ఏడాదిన్నర ముందే వివాద పరిష్కారం కోసం ఓ ప్రత్యామ్నా యాన్ని ప్రతిపాదించారు ఇద్దరు ముస్లిం ఆలోచనాపరులు. ఈ ఇద్దరిలో ఒకరైన ప్రముఖ పరిశో ధకులు సంఘ సంస్కర్త యాసిన్ దలాల్ 1991లో ‘బిజినెస్ అండ్ పొలిటికల్ అబ్జర్వర్’లో ‘ముస్లిమ్స్ షుడ్ జాయిన్ మెయిన్ స్ట్రీమ్’ పేరుతో రాసిన ఓ కథనంలో ‘‘తగిన సమయంలో బాబ్రీ మసీదును ఇంకో చోటికి తరలించడం ద్వారా బాబ్రీ కమిటీ వీహెచ్‌పీ–బీజేపీ ప్రాబల్యాన్ని ఆశ్చర్యకరంగా తగ్గించి ఉండ వచ్చు. ఈ చర్య రామ జన్మభూమి మద్దతుదారులకు అశనిపాతంలా మారి ఉండేది. కానీ దీనికి బదులుగా అటు ప్రభుత్వమూ, ఇటు ముస్లిం నేతలిద్దరూ మొండి పట్టుదలకు పోయారు. తద్వారా తమకు తెలియకుండానే బీజేపీ గెలుపునకు దోహదపడ్డార’’ని రాశారు. యాసిన్ దలాల్ మాత్రమే కాదు... సీనియర్ జర్నలిస్ట్ ఎల్.హెచ్. నఖ్వీ కూడా బీజేపీకి మద్దతివ్వడం ద్వారా ముస్లింలు దిక్కుమాలిన రాజకీయం తీరుతెన్నులను మార్చేయాలని అప్పట్లో పిలుపునిచ్చారు. ‘మంథన్’ 1991 జూన్ సంచికలో ఆయన ఒక కథనం రాస్తూ... ‘‘కాంగ్రెస్ మైనార్టీ వర్గాల్లో ఒక అభద్రతా భావాన్ని పెంచి పోషించిందని ఆరో పించారు. అందుకే ఇప్పుడు ముస్లింలు బీజేపీకి మద్దతిస్తే తప్పేంటి?’’ అని వ్యాఖ్యా నించారు. ముందుగా చెప్పినట్లు ఈ రెండు వ్యాసాలూ రాసింది బీజేపీకి బద్ధ వ్యతిరేకులైన ఇద్దరు ముస్లిం ఆలోచనాపరులు. ఇద్దరి ఉద్దేశాలూ శాంతిస్థాపనే. తర్కయుతమైన ఆలోచనలే. ముస్లిం నేతలు ఇలాంటి వారి మాటలు విని ఉంటే అపార ప్రాణ నష్టం నివారించేందుకు అవకాశం ఉండేది. ప్రఖ్యాత ఆర్కియాలజిస్ట్ కె.కె. ముహమ్మద్ వాంగ్మూలం ద్వారా ఇప్పుడు మనకు ఇంకో విషయం కూడా తెలుసు. మార్క్సిస్ట్ చరిత్ర కారులు అస్తవ్యస్తతకు పాల్పడి ఉండకపోతే ముస్లింలు రామజన్మభూమి స్థలాన్ని ఎప్పుడో అప్పగించి ఉండేవారని ఆయన అన్నారు. కాశీ విశ్వనాథ్ మందిరం, జ్ఞానవాపి మసీదు అంశం మళ్లీ తెరపైకి వచ్చిన నేపథ్యంలో సహజంగానే కొన్ని ప్రశ్నలు అడగాల్సి వస్తుంది. –ఇస్లాం నిజంగానే శాంతి కాముక మతమని నిరూపించుకునేందుకు కాశీ, జ్ఞానవాపీ దేవాలయాల సముదాయాన్ని తిరిగి తమకి ఇచ్చేయాలన్న హిందువుల డిమాండ్‌ను నేరవేర్చడం అనేది ప్రస్తుత ముస్లిం నేతలకు మంచి అవకాశం. మరి వారు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటారా? – జ్ఞానవాపి మాదిరిగానే దేశంలో అనేక ఇతర డిమాండ్లు పుట్టుకొచ్చాయి. వీటన్నింటికీ ఫుల్స్టాప్ పడేది ఎలా? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంది. ముస్లిమేతరుల దేవాలయాలను ధ్వంసం చేయడం... ఇస్లామిక్ ప్రార్థన స్థలాలను నిర్మించడం ఇతర మతస్థులందరిపై జరిపిన దాడి, దుందుడుకు చర్య. వారిని దాస్యులుగా చేసుకునేందుకు చేసిన ప్రయత్నం. అప్పటివరకూ ఉన్న ‘‘తప్పులతో కూడిన విశ్వాసాలు, అజ్ఞాన యుగాన్ని అంతరింపజేసి’’ ప్రత్యామ్నాయంగా ఇస్లాంను స్థాపించడం ప్రాథమికమైన లక్ష్యం. ఇప్పటికీ ఇదే రకమైన భావజాలాన్ని అనుసరించే శక్తిమంతమైన ఇస్లామిక్ రాజకీయం నడుస్తూనే ఉంది. వేదాంతంలో వైవిధ్యాన్ని వీరు సహించ లేరు. అదే సమయంలో వీటిని తమ రాజకీయాలకు వాడుకునే ప్రయత్నమూ చేస్తారు. హిందువులు నివసించే భూభాగంలో కాశీ, మథుర, అయోధ్యలు మూడు పుణ్యక్షేత్రాలు. ప్రపంచంలో ఉండే హిందువులందరూ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ ప్రాంతాలను సందర్శించాలని కోరుకుంటారు. మరి.. అటువంటి వాళ్లు ఇక్కడికొస్తే కనిపించేదేమిటి? అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో మసీదులు కనిపిస్తాయి. ఇది వారిని బాధిస్తుంది. హేళన చేసినట్టుగానూ ఉంటుంది. వారి మనసులకయ్యే గాయాలు ఎంతో కాలంగా అలా పచ్చిగానే ఉన్నాయి. ఈ దేశ సామరస్యాన్ని దెబ్బతీయగల టైమ్ బాంబులు ఈ మానని గాయాలు! భారీయుద్ధం, జన నష్టం తరువాత అయోధ్య సమస్య కొంత సమసిపోయింది. మరి కాశీ, మథురల పరిస్థితి ఏమిటి? కార్యాచరణ ఏమైనప్పటికీ శివుడి దర్శనం కోసం ఓ నంది, తన జన్మస్థానాన్ని పొందేందుకు కృష్ణుడు మరి కొంత కాలం వేచి ఉండాల్సిందే. ఒకవేళ న్యాయ, రాజకీయ యుద్ధాల్లో హిందువులు బలవంతంగా పాల్గొనాల్సిన పరిస్థితి వస్తే... హిందువులను కించపరిచే బుద్ధి ఇంకా కొనసాగుతూనే ఉందని అనుకోవాలి. అదే జరిగితే ఇస్లాం చొరబాటుదారులు ధ్వంసం చేసిన, బలవంతంగా ఆక్రమించిన ప్రతి దేవాలయంపై హక్కులు కోరడంలో తప్పేమీ ఉండదు. దీనికి బదులుగా ముస్లిం నేతలు కాశీ, మథురలను తమంతట తాముగా అప్పగిస్తే హిందువులు దాన్ని అంగీకరించాలి. ఆ తరువాత హిందూ ధర్మాచార్యులు కొత్తగా ఎలాంటి ప్రార్థనా స్థలాలపై హక్కులు కోరబోమన్న భరోసాను ముస్లింలకు కల్పించాలి. (👉🏾చదవండి: ఈ సర్వేల ‘న్యాయం’ ఎన్నాళ్లు?) - అరవిందన్ నీలకంఠన్ కంట్రిబ్యూటింగ్ ఎడిటర్, ‘స్వరాజ్య’ -
ఈ సర్వేల ‘న్యాయం’ ఎన్నాళ్లు?
జ్ఞాన్ వాపి మసీదును వివాదాస్పద స్థలంగా మార్చడానికి గతంలోనూ ప్రయత్నించారు. 1991వ సంవత్సరం నుంచి మత స్థలాల ప్రతిపత్తికి చెందిన విస్పష్టమైన చట్టం అమలులో ఉన్నప్పటికీ ముస్లింల చేతుల్లోంచి మసీదును లాక్కోవాలనే డిమాండుకు హేతువును జొప్పించడానికి నిర్విరామంగా ప్రయత్నిస్తున్నారు. వారణాసిలో జ్ఞాన్ వాపి మసీదులో సర్వేని కొనసా గించడానికి అనుమతించడం ద్వారా భారత అత్యున్నత న్యాయస్థానం కొన్ని విమర్శలకు తావిచ్చింది. జ్ఞాన్ వాపి మసీదులో సర్వే జరపాలని వారణాసి కోర్టు ఇచ్చిన ఆదేశంతో అక్కడ ఒక సంక్షోభం ఏర్పడింది. మసీదులో ఒక భాగాన్ని మూసివేయాలనీ, అక్కడికి ఎవరినీ అనుమతించవద్దనీ ఆదేశించడం ద్వారా న్యాయస్థానం మసీదు స్వరూపాన్నే మార్చి పడేసింది. ఈ అంశంలో కోర్టు ఎంత వేగంగా స్పందించిందంటే, మన న్యాయ స్థానాలు నిదానంగా వ్యవహరించే తీరుకు పూర్తి భిన్నంగా కనిపించింది. ఇది జరిగిన 3 రోజులకు అంటే మే 20 నాటికి కోర్టుకు సీల్డ్ కవర్లో పంపించిన వీడియో సర్వే వివరాలు దేశం మొత్తానికీ తెలిసిపోయాయనుకోండి! జ్ఞాన్ వాపి మసీదును వివాదాస్పద స్థలంగా మార్చడానికి గతంలోనూ అనేక ప్రయత్నాలు జరిగాయి. అయితే అలాంటి ప్రతి సందర్భంలోనూ అలహాబాద్ హైకోర్టు ఆ ప్రయత్నాలను నిలువరించింది. 1991 నుంచి మత స్థలాల ప్రతిపత్తికి చెందిన విస్పష్టమైన చట్టం అమలులో ఉన్నప్పటికీ ముస్లింల చేతుల్లోంచి మసీదును లాక్కోవాలనే డిమాండుకు హేతువును జొప్పించడానికి నిర్విరామంగా ప్రయత్నిస్తున్నారు. 1947 ఆగస్టు 15 నాటికి ఉనికిలో ఉంటున్న మతస్థలాల ప్రతిపత్తిని ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చకూడదని ఆ చట్టం స్పష్టంగా పేర్కొంది. ఇలాంటి ప్రక్రియను అను మతించినట్లయితే అది తప్పకుండా ఏదో ఒక మతానికి సంబంధించిన రూపాన్ని లేక లక్షణాన్నైనా మార్చివేయడానికే దారితీస్తుందని ఆ చట్టం సూచిస్తోంది. బాబ్రీ మసీదును ఈ ప్రార్థనా స్థలాల చట్టం పరిధిలోకి తేలేదు. కాబట్టే దాన్ని ధ్వంసం చేశారు, ఆ భూమిని కూడా (న్యాయబద్ధంగా) లాక్కు న్నారు. అయితే ఆ ప్రయత్నంలో కూడా, మత స్థలాల ప్రతిపత్తికి సంబంధించి 1991 చట్టం చెప్పినదాన్ని కచ్చితంగా పాటించాలని సుప్రీం కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. దీనర్థం ఏమి టంటే, మతస్థలం స్వరూపాన్ని ప్రశ్నించే ఏ చర్యనూ ప్రోత్సహించకూడదనే! హిందూ సెంటి మెంట్లను ఈ దేశంలో ఏ కోర్టూ నిర్లక్ష్యం చేయదు. కాబట్టే తాము పూజించే దేవతల విగ్రహాలు మసీదు ఆవరణలో ఉన్నందున వాటిని పూజించే హక్కు తమకుందని భక్తులు వాదిస్తే కోర్టులు వారి వాదనను తప్పక వింటాయి. వెంటనే ఇదే అంశంపై అలహాబాద్ హైకోర్టు సమన్వయ బెంచ్ ఇచ్చిన స్టే ఆర్డర్లను కూడా సుప్రీంకోర్టు పక్కన పెట్టేసింది. అంతే కాకుండా మసీదు రూపం ఎలా ఉందో నిర్ధారించుకోవడానికి మసీదు సర్వేపై ఆదే శాలు జారీ చేసింది. ఈ క్రమంలో మసీదు స్వరూపమే వివాదాస్పదంగా మారిపోయింది. హిందూ సభ్యులతో కూడిన ఆ సర్వే టీమ్ మసీదులోని వజూఖానాలో ఒక శివ లింగాన్ని కనుక్కుంది. ముస్లింలు అది లింగం కాదు ఫౌంటైన్ అని ప్రకటించారు. ఇదే మరింత ఆమోద నీయంగా కనిపిస్తోంది. తాము ప్రార్థనలు జరిపే ముందు కాళ్లూ చేతులు కడుక్కునే స్థలమే అదని ముస్లింలు మొత్తుకుంటున్నా, భూమి ఉపరితలం పైన శివలింగాన్ని తాము చూశామని చెబు తున్న హిందువులతో ఎవరు విభేదించగలరు? మసీదు లోపల శిలకు ఎరుపురంగు రాసింది చూశామనీ, ఆ ఇమేజ్ ‘హనుమాన్’ అనీ సర్వే టీమ్ ప్రకటిం చింది. ఈ వార్త వెల్లడయ్యాక సర్వే టీమ్ లేదా దాని హిందూ సభ్యులు కోర్టుకు పరుగెత్తారు. బీజేపీ శ్రేణులకు ఇది అమితానందం కలిగించే విషయమే. 1949లో కాళరాత్రి వేళ అతి రహస్యంగా జరిపిన చర్యలో విగ్రహాలను బాబ్రీ మసీదులోకి తరలించారు. సుప్రీంకోర్టు ఆనాడే దాన్ని నేరపూరిత చర్య అని పిలిచింది. 73 ఏళ్ల తర్వాత మరో నేరపూరిత చర్య జరిగింది. పట్ట పగలు న్యాయవ్యవస్థ పర్యవేక్షణలో ఆ నేరం జరిగిపోయింది. అలహాబాద్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ గోవింద్ మాధుర్ ఒక వ్యాసంలో, ఈ ప్రార్థనా స్థలాల ప్రతి పత్తిపై చట్టం ఉద్దేశం... మరో బాబ్రీమసీదు తరహా విధ్వంస చర్య, ఆక్రమణ చర్య జరగకూడ దనేదేనని చెప్పారు. కానీ ఇప్పుడు జరిగిందేమిటి? ఉద్దేశపూర్వకంగా, తెలిసి తెలిసీ ఘర్షణకు దారితీసే ప్రక్రియను ప్రారంభించడమే కదా! సుప్రీంకోర్టు వారణాసి కోర్టు నిర్ణయాన్ని తోసి పుచ్చి 2022 మే 16కి ముందున్న యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించిన ట్లయితే అలాంటి హింసాత్మక పరిణామం జరగకుండా ఇప్పటికైనా నిలిపి వేయవచ్చు. (చదవండి: ఇది ఎదురుకాల్పుల కనికట్టు కథ!) అయితే 1991 నాటి చట్టాన్ని సవాలు చేస్తున్న పిటిషన్‌ని విచారించడానికి సుప్రీకోర్టు సంసిద్ధత తెలపడంవల్ల మనకు ఒక విషయం బోధపడుతుంది. అదేమిటంటే, ఈ దేశంలో ముస్లింల శాంతి, సామరస్యం, న్యాయం, గౌరవం వంటి వన్నీ ఏదో ఒక విస్తృతమైన లక్ష్యం కోసం ఎల్లప్పుడు త్యాగం చేయాల్సి ఉంటుంది. ఆ లక్ష్యం ఏమిటో ఊహించడం ఇప్పుడు ఏమంత కష్టమైన పని కాదు. (చదవండి: మతం, మార్కెట్ కలిసిన రాజకీయం) - అపూర్వానంద్ హిందీ అధ్యాపకుడు, ఢిల్లీ విశ్వవిద్యాలయం -
జ్ఞానవాపి మసీదు కేసు: వారణాసి కోర్టులో విచారణ పూర్తి, తీర్పు రిజర్వ్
లక్నో: జ్ఞానవాపి మసీదు వ్యవహారంపై వారణాసి జిల్లా కోర్టులో విచారణ పూర్తి అయ్యింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రేపటికి (మంగళవారం) రిజర్వ్ చేసింది. హిందూ వర్గం దాఖలుచేసిన రెండు పిటిషన్లతోపాటు ముస్లిం కమిటీ వేసిన ఒక పిటిషన్‌ను జిల్లా జడ్జ్ అజయ్‌కృష్ణ విశ్వేష విచారించారు. విచారణ సందర్భంగా కోర్టు హాలులోకి 23 మందిని మాత్రమే అనుమతించారు. వీరిలో 19 మంది లాయర్లు కాగా, నలుగురు పిటిషనర్లు. జ్ఞాన్వాపి ప్రాంగణంలోని శృంగార గౌరి కాంప్లెక్స్‌లో నిత్యపూజలకు, వజుఖానాలో వెలుగుచూసిన శివలింగాన్ని ఆరాధించేందుకు అనుమతి ఇవ్వడంతోపాటు శివలింగం లోతు ఎత్తు తెలుసుకునేందుకు సర్వే కొనసాగించాలని హిందూవర్గం కోరుతోంది. వజుఖానా మూసేయవద్దని ముస్లిం కమిటీ డిమాండ్ చేస్తోంది. అలాగే 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కింద జ్ఞానవాపి సర్వేను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతోంది. చదవండి: Vismaya Case: నాన్నా! భయమేస్తోంది.. వచ్చేయాలనుంది -
‘ఆజాదీ’ అంతరంగం!
మన ‘ఆజాదీ’కి ఇది అమృతోత్సవ సంవత్సరం. స్వాతంత్య్రం సిద్ధించిన అమృత ఘడియల్లోనే హాలాహలం కూడా పుట్టింది. మన ప్రజాస్వామ్య పరమశివుడు దాన్ని తన కంఠంలో బంధించలేకపోయాడు. డెబ్బౖయెదేళ్లు గడిచినా ఆ విష ప్రభావం తగ్గలేదు. ఇంకా బొట్లుబొట్లుగా రాలుతూనే ఉన్నది. అమృతోత్సవాలు వర్షించవలసిన సమయంలో హాలహలపు జడివాన మొదలైంది. బాక్సింగ్ ప్రపంచకప్ బరిలో హైదరాబాద్ యువతి నిఖత్ జరీన్ మన జాతీయ పతకాన్ని సమున్నతంగా ఎగరేస్తున్న సమయానికి మన జాతీయ న్యూస్ చానళ్లన్నీ జ్ఞానవాపీ మసీదు – మందిర సమస్యలో మునిగి తేలుతున్నాయి. ఈ డిబేట్ ఫలితంగా దేశంలోని ఒక వర్గం మరింత అభద్రతా భావంలోకి జారుకుంటున్నది. అంతర్జాతీయ వేదికలపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన జాఫర్ ఇక్బాల్ (హాకీ), అబ్దుల్ రహీమ్ (ఫుట్‌బాల్), అజారుద్దీన్ (క్రికెట్), సానియా మీర్జా (టెన్నిస్), అబ్దుల్ బాసిత్ (వాలీబాల్), నిఖత్ జరీన్ (బాక్సింగ్) వగైరాలు పుట్టిన వర్గం అది. అయోధ్య ధారావాహికకు కొనసాగింపే – జ్ఞానవాపీ మసీదు ఎపిసోడ్. అయోధ్య వివాదం నేపథ్యంలో మన దేశ పార్లమెంట్ ఒక చట్టాన్ని చేసింది. ‘ప్రార్థనా స్థలాల చట్టం – 1991’గా దాన్ని పిలుచుకుంటున్నాము. దేశంలో ఉన్న ఆరాధనా స్థలాల్లో 1947 ఆగస్టు 15వ తేదీ నాటికి ఏ మతానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు అమలులో ఉన్నాయో ఇక ముందు కూడా అవే కొనసాగుతాయనీ ఆ చట్టం నిర్దేశించింది. చరిత్ర గమనంలో ఒక మతానికి చెందిన ప్రార్థనాలయాలను మరొక మతం వారు ధ్వంసం చేసి తమ మతానికి చెందిన ప్రార్థనా స్థలాలుగా మార్చుకున్నారని కోకొల్లలుగా ఆరోపణ లున్నాయి. ఇటువంటి ఆరోపణలున్న ప్రతి ఆలయ స్వభావాన్ని ఇప్పుడు మార్చుకుంటూ పోతే ఇక దానికి అంతే ఉండదు. నిరంకుశ పరిపాలకులు రాజ్యమేలిన కాలంలో జరిపిన చర్యలకు లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతీకార చర్యలు అసమంజస మనే స్ఫూర్తితో 1991 చట్టాన్ని తయారు చేశారు. చట్టాల్లో లొసుగులు వెతకడం ఎంతసేపు? అయోధ్య పరిణామాలిచ్చిన ఊపుతో ఉన్న ఆరెస్సెస్ అనుబంధ సంస్థలకూ, హిందూ సంస్థలకూ ఈ చట్టం ఒక ప్రతిబంధకమనిపించలేదు. 1958 పురాతన కట్టడాల చట్టం పరిధిలోకి వచ్చే ప్రదేశాలకు, అప్పటికే చర్చల ద్వారా పరిష్కారమైన ప్రదేశాలకు 1991 చట్టం మినహాయింపునిచ్చింది. ఈ మినహాయింపు ఆసరాతో హిందూ సంస్థలు కింది కోర్టుల్లో వ్యాజ్యాలు నడిపి, అనుకూల తీర్పులు పొందగలుగుతున్నాయి. ఒక ప్రార్థనా స్థలపు మతస్వభావాన్ని నిర్ధారించే పరిశీలన 1991 చట్టం ప్రకారం కూడా నిషేధం కాదు కనుక కాశీలోని జ్ఞానవాపీ మసీదు సర్వే చేసుకోవచ్చని సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హిందూ సంస్థలకు ఇదొక బూస్టర్‡డోస్. జ్ఞానవాపీ సర్వేలో హిందూ ఆలయ ఆనవాళ్లు బయట పడుతున్నాయని వార్తలు వస్తున్నాయి. మథురలోని ‘శ్రీకృష్ణ జన్మస్థానం – షాహీ ఈద్గా’ వివాదంపై విచారణకు కూడా జిల్లా కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని వెంటనే కుతుబ్ మినార్ కూడా లైన్లో ఉన్నదట! ఈ సర్వేల్లో కూడా వాటి పునాదుల్లో హిందూ ఆనవాళ్లు కనిపిస్తే కనిపించవచ్చు. మధ్యయుగాలనాటి ముస్లిం రాజుల పాలనలో, ముఖ్యంగా మొఘల్ కాలంలో వేలాది హిందూ దేవాలయాలను మసీదులుగా మార్పు చేశారని ఆరెస్సెస్ అనుబంధ సంస్థలూ, హిందూ సంస్థలూ చాలా కాలంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ సంఖ్య అతిశయోక్తితో కూడినదని నిష్పాక్షిక పరిశోధకులు, పరిశీలకులు చెబుతున్నారు. అయితే సుమారు వంద వరకు ఆలయాలు ఈ కాలంలో మార్పులకు గురై ఉండవచ్చని కూడా అంగీకరిస్తున్నారు. మధ్యయుగానికి పూర్వం కూడా ఆరాధనా మందిరాలను ధ్వంసం చేసి మరో మతానికి చెందిన ఆలయాలుగా విస్తారంగా మార్పులు చేశారని చరిత్రకారులు చెబుతున్నారు. ప్రాచీన కాలంలో భరతఖండం నలుమూలలా బౌద్ధం పరిఢవిల్లిందని మనకు తెలుసు. ఆ కాలంలో వెలసిన వేలాది బౌద్ధారామాలు, చైత్యాలయాలు, విహారాలు, స్తూపాలను ధ్వంసం చేసి వాటి పునాదుల మీద హిందూ దేవాలయాలు నిర్మించారన్న ఆరోపణ లున్నాయి. ప్రసిద్ధికెక్కిన పూరీ, పండరీపూర్, తిరుపతి ఆలయాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. పూరీ, ఖజురహో పునాదుల్లో బౌద్ధ చైత్యాలయాలున్నాయని పురాతత్వ వేత్తలు కూడా విశ్వసిస్తున్నారు. గుప్త వంశ రాజులు పాలిస్తున్న ఐదో శతాబ్దంలో భారతదేశంలో పర్యటించిన చైనా యాత్రికుడు ఫాహియాన్ ఈ పరిణామాలకు ఒక సాక్షి. గౌతమ బుద్ధుడు కొంతకాలం నివసించిన శ్రావస్తిలో కూడా కుషానుల కాలం నాటి బౌద్ధారామాన్ని మార్చి హిందూ ఆలయంగా నిర్మించారని ఆయన రాశారు. ఏడో శతాబ్దంలో భారత యాత్ర చేసిన బౌద్ధ యాత్రికుడు సూన్ సాంగ్ ఈ విధ్వంసాన్ని మరింత వివరంగా గ్రంథస్థం చేశాడు. బుద్ధుడు మోక్ష జ్ఞానం పొందిన సమయంలో ఆయనకు నీడనిచ్చిన బోధి వృక్షాన్ని గౌడ శశాంకుడు నరికించాడనీ, ఆ కాలంలో వందలాది బౌద్ధారామాలను ధ్వంసం చేశారనీ సూన్సాంగ్ పేర్కొన్నాడు. ఈ ప్రదేశాలన్నింటి మీద కూడా ఇప్పుడు సర్వే జరగాలని కోరడం ఏ మేరకు సమంజసమవుతుంది? అట్లాగే మధ్య యుగాలనాటి మార్పులపైనే అధ్యయనం చేసి, ప్రాచీన చరిత్రలోని మార్పు లను వదిలేయాలనడం మాత్రం ఎంతమేరకు హేతు బద్ధమవుతుంది? కనుక 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టాన్నీ, దాని వెనుకనున్న స్ఫూర్తినీ యథాతథంగా గౌరవించడమేమన లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థ పరిపుష్టికి దోహదపడు తుందని భావించాలి. ఆలయాల పునరుద్ధరణ డిమాండ్ ఒక మతపరమైన వ్యవహారంగానే మిగిలిపోతే పెద్ద నష్టం ఉండకపోవచ్చు. కానీ అదొక రాజకీయ ఎజెండాగా, బలమైన రాజకీయ శక్తుల చేతిలో ఆయుధంగా మారడం మాత్రం లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమైన అంశమే. ఎన్నికల్లో ఓట్ల కోసం మతాన్ని వాడుకోవలసినంత అవసరం, అగత్యం ఇప్పుడున్న పరిస్థితుల్లో పాలక బీజేపీకి ఉన్నదా? అసలట్లా వాడుకోవడం సరైనదేనా అనే ప్రశ్నను కాస్సేపు పక్కన పెడదాం. బీజేపీ రామబాణాన్ని ప్రయోగించకపోయినా దానితో పోరాడగల శక్తి ప్రధాన ప్రతిపక్షానికుంటుందని ఈ దేశంలో ఎవరూ భావించడం లేదు. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఒక విఫల ప్రయోగం గానే మిగిలిపోయే సూచనలు ఇంకా కనబడుతున్నాయి. తాను నాయకత్వం స్వీకరించడు. ఇంకొకరికి అప్పగించడు. బరువు తాను మోయడు, మరొకరిని నమ్మడు. ఇటువంటి బాధ్యతా రాహిత్యాన్ని దేశ ప్రజలు హర్షించలేరు. ఈ కారణం వల్లనే ప్రధాని అభ్యర్థి రేటింగ్స్‌లో నరేంద్ర మోదీ సమీపంలోకి కూడా రాహుల్ రాలేకపోతున్నారు. మసీదులను మార్చే కార్యక్రమం ఒక్కటే కాదు, ముస్లిం మత ఆచార వ్యవహారాలపై కూడా దాడి జరుగుతున్నది. వారి ఇళ్ళ మీదకు బుల్డోజర్లు దండెత్తుతున్నాయి. అలహాబాద్ పేరు మారిపోయింది. లక్నవూ ఇక లక్ష్మణపురం కాబోతున్నదట. యువతుల వస్త్రధారణ మీద కూడా ఆంక్షలు పెడుతున్నారు. వీధి వ్యాపారుల దగ్గర పండ్లు, కూరగాయలు, మాంసం వగైరా కొనుగోలు చేయొద్దని కర్ణాటకలో పిలుపును కూడా ఇచ్చారు. ‘లవ్ జీహాద్’ వంటి పదజాలం వాడుక పెరిగింది. దేశంలో ఎనభై శాతం జనాభా ఉన్న వర్గానికి కేవలం 15 శాతం మాత్రమే ఉన్న ప్రధాన మైనారిటీని ఒక బూచిగా చూపించవలసిన అవసరం నిజంగా ఉన్నదా? వారిని బూచిగా చూపెడితేనే ఓట్లు రాలతాయా? ఈ దేశ ప్రగతికి ఆ పదిహేను శాతం జనాభా ఆటంకంగా ఉన్నదా?... ఇటువంటి ప్రశ్నలు నిరర్థకమైనవి. వరసగా రెండు ఎన్నికల్లో బీజేపీకి సొంతంగానే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం లభించింది. నరేంద్ర మోదీ హ్యాట్రిక్ గెలుపు మీద కూడా పెద్దగా సందేహాలు లేవు. తన కోర్ ఐడియాలజీని ఆచరణలో పెట్టేందుకు ఇదే అనువైన సమయమని సంఘ్ పరివార్ భావిస్తున్నదా? అందుకే హిందీ భాషను దేశం మొత్తం మీద రుద్దే ప్రయత్నాలను ప్రారం భించారా? హిందూ రాష్ట్రం దిశగా అడుగులు పడుతున్నాయా? ఫెడరల్ వ్యవస్థ స్థానే యూనిటరీ రాజకీయ వ్యవస్థను నిర్మించే ఆలోచనలు చేస్తున్నారా? రాష్ట్ర్రాల అధికారాలపై వేస్తున్న కత్తెర అందులో భాగమేనా? ఇటువంటి భయ సందేహాలు ప్రతి పక్షాల్లో వ్యక్తమవుతున్నాయి. సంపూర్ణ స్థాయిలో అధికారం దక్కినప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా తన ఎజెండాను అమలుచేయడానికే ప్రయత్ని స్తుంది. అది రహస్య ఎజెండా అయినా సరే! ఎందుకంటే అదే దాని లక్ష్యం, గమ్యం కనుక! ఇప్పుడు బీజేపీ ఆ పరిస్థితిలో ఉన్నది. అయితే ఈ ఎజెండా అమలుచేయడం వలన మన దేశం బలపడుతుందా? బలహీనపడుతుందా అనేది చర్చించవలసిన అంశం. మతాల పేరుతో, కులాల పేరుతో విడిపోయిన సమాజం కంటే, సమతా ధర్మంపై ఏకోన్ముఖమైన సమాజమే ఎల్లప్పుడూ బలంగా ఉంటుంది. సామాజిక విభజన వల్ల ఇప్పటికే భారతదేశం భారీ మూల్యం చెల్లించింది. గణితం, భౌతికశాస్త్రం, వైద్యం – ఇత్యాది విజ్ఞాన రంగాల్లో ఐరోపా వికసించడానికి వెయ్యేళ్ల ముందుగానే భారతదేశంలో విప్లవాత్మక ఆవిష్కరణలు జరిగాయి. ఆర్యభట్ట, భాస్కరాచార్య, కణాదుడు, వరాహమిహిరుడు, ఆచార్య నాగార్జున, సుశ్రుతుడు, చరకుడు మొదలైన వాళ్లంతా గెలీలియో, న్యూటన్, కెప్లర్, మేడమ్ క్యూరీ, డార్విన్, కోపర్నికస్ వగైరాలకు తాతల ముత్తాతల తాతల వంటివారు. కానీ మనది నిచ్చెనమెట్ల సామాజిక విభజన కనుక విజ్ఞానం కింది మెట్లకు చేరలేదు. విభజిత సమాజం కనుక ఏకోన్ముఖమై విదేశీ దాడులను ఎదుర్కొనలేదు. ఫలితంగా పరాధీనమైంది. సమాజం ఒక్కటిగా ఉన్నట్లయితే, విజ్ఞానం అన్ని వర్గాల్లోకి ప్రసరించి ఉన్నట్లయితే – ఐరోపా కంటే వందేళ్లో... అంతకంటే ముందుగానో భారతదేశంలో పారిశ్రామిక విప్లవం వచ్చి ఉండేదన్న అభిప్రాయం ఒకటి బలంగా ఉన్నది. అదే జరిగి ఉన్నట్లయితే ఈనాడు సకల సంపదలతో తులతూగే అగ్రరాజ్యంగా భారత్ నిలబడి ఉండేది. దేశభక్తి, జాతీయత అనే పదాలు తమ పేటెంట్లుగా భావించే బీజేపీ పెద్దలు గడిచిన చరిత్ర నుంచి పాఠాలు నేర్వాలి. కులాల పునాదుల మీద ఒక జాతిని నిర్మించలేమన్నారు డాక్టర్ అంబేడ్కర్. విద్యాకుసుమాలు అన్ని కులాల్లో వికసించినప్పుడే పటిష్ఠమెన జాతి నిర్మాణం జరుగుతుంది. మతాల పేరుతో విడిపోయిన దేశం అభివృద్ధి సాధించలేదు. అభివృద్ధిని విస్మరించే దేశభక్తి అసలు దేశభక్తే కాదు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
జ్ఞానవాపి మసీదుపై వివాదాస్పద వ్యాఖ్యలు.. హిస్టరీ ప్రొఫెసర్ అరెస్ట్
వారణాసిలోని జ్ఞానవాపి మసీదుపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. జ్ఞాన్వాపి మసీదు వీడియోగ్రాఫి సర్వే అభ్యంతర పిటిషన్‌పై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ వాడివేడీగా సాగిన విషయం తెలిసిందే. ఈ కేసు పరిణామాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని, జోక్యం చేసుకోబోమని బెంచ్.. జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ శివలింగాన్ని సంరక్షించడంతో పాటు నమాజ్ కొనసాగించుకోవచ్చన్న మధ్యంతర ఆదేశాలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది. అంతేకాదు.. ట్రయల్ జడ్జి కంటే అనుభవం ఉన్న జిల్లా జడ్జి సమక్షంలోనే వాదనలు జరగడం మంచిదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు పిటిషన్‌ను వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ తరుణంలో జ్ఞాన్వాపి మసీదు విషయంపై ఢిల్లీ యూనివర్సిటీలోని హిందూ కాలేజీ హిస్టరీ సబ్జెక్ట్ అసోసియేట్ ప్రొఫెసర్ రతన్ లాల్ సోషల్ మీడియాలో వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో..‘‘దేశంలో మీరు దేని గురించి మాట్లాడినా.. అది మరొకరి సెంటిమెంట్‌ను దెబ్బతిస్తుంది. ఇది కొత్తేమీ కాదు. నేను చరిత్రకారుడిని, అనేక పరిశీలనలు చేశాను. నా పరిశీలనలో నేను అన్వేషించిన వాటి గురించి రాశాను. నన్ను నేను రక్షించుకుంటాను’’ అని వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై ఢిల్లీ లాయర్ వినీత్ జిందాల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు లాల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ 153ఏ, 295ఏ కింద ప్రొఫెసర్‌ను అరెస్టు చేసినట్లు ఢిల్లీ సైబర్ పోలీసులు తెలిపారు. ప్రొఫెసర్ చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టేవిధంగా ఉన్నట్లు లాయర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. జ్ఞాన్వాపి మసీదు సమస్యపై తాను కామెంట్స్ చేసిన తర్వాత తన 20 ఏళ్ల కుమారుడికి ఫేస్బుక్ మెసెంజర్లో బెదిరింపులు వస్తున్నాయని రతన్ లాల్ తెలిపారు. లాల్ తన టీచింగ్ ఉద్యోగంతో పాటు, దళిత సమస్యలపై దృష్టి సారించే ‘అంబేద్కర్నామా’ అనే న్యూస్ పోర్టల్ వ్యవస్థాపకుడు, ఎడిటర్-ఇన్-చీఫ్‌గా కొనసాగుతున్నారు. మరోవైపు.. రతన్ లాల్ అరెస్ట్‌ను కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఖండించారు. ట్విట్టర్ వేదికగా.. ‘‘ప్రొఫెసర్ రతన్ లాల్ అరెస్టును నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజ్యాంగబద్ధమైన అభిప్రాయం, భావ వ్యక్తీకరణ హక్కు ఆయనకు ఉంది.’’ అంటూ దిగ్విజయ్ కామెంట్స్ చేశారు. I strongly condemn Prof Ratn Lal’s arrest. He has the Constitutional Right of opinion and expression. @INCIndia https://t.co/gupumAwuXr — digvijaya singh (@digvijaya_28) May 21, 2022 ఇది కూడా చదవండి: జ్ఞానవాపి మసీదు పిటిషన్: వీడిన సస్పెన్స్.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు -
జ్ఞానవాపి మసీదు కేసు: సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: జ్ఞాన్వాపి మసీదు వీడియోగ్రాఫి సర్వే అభ్యంతర పిటిషన్‌పై సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణ వాడివేడీగా సాగింది. ఈ తరుణంలో కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో అనే సస్పెన్స్ వీడింది. జిల్లా కోర్టులోనే విచారణకు మొగ్గు చూపిన సుప్రీం త్రిసభ్య ధర్మాసనం.. ఇదొక సంక్లిష్టమైన, సున్నితమైన అంశమని పేర్కొంది. జిల్లా కోర్టు నిర్ణయం, విచారణపై స్టే విధించాలంటూ పిటిషనర్(అంజుమాన్ ఇంతెజమీయా మసీద్ కమిటీ) తరపు న్యాయవాది బెంచ్‌ను కోరారు. అయితే ఈ కేసు పరిణామాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని, జోక్యం చేసుకోబోమని బెంచ్.. జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ శివలింగాన్ని సంరక్షించడంతో పాటు నమాజ్ కొనసాగించుకోవచ్చన్న మధ్యంతర ఆదేశాలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది. అంతేకాదు.. ట్రయల్ జడ్జి కంటే అనుభవం ఉన్న జిల్లా జడ్జి సమక్షంలోనే వాదనలు జరగడం మంచిదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు పిటిషన్‌ను వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు అడ్వొకేట్ కమిషన్ రూపొందించిన రిపోర్ట్.. బయటకు పొక్కడంపై సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. ప్రత్యేకించి కొన్ని లీకులు మీడియాకు చేరుతున్నాయి. అది కోర్టుకు సమర్పించే అంశం. కోర్టులో జడ్జే కదా దానిని తెరవాల్సింది అని జస్టిస్ డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. కమ్యూనిటీల మధ్య సౌభ్రాతృత్వం కోసం, శాంతి అవసరం నెలకొల్పాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. దీంతో.. మే 23న వారణాసి కోర్టు మసీద్ సర్వే పిటిషన్‌పై వాదనలు వినేందుకు మార్గం సుగమమైంది. ఇదిలా ఉంటే.. జ్ఞానవాపి మసీద్ సర్వేపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అంజుమాన్ ఇంతెజమీయా మసీద్ కమిటీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అదే సమయంలో.. జ్ఞానవాపి– శ్రింగార్ గౌరీ కాంప్లెక్సులో వారణాసి కోర్టు నియమించిన అడ్వొకేట్ కమిషన్ సర్వే పూర్తి చేసి నివేదికను సీల్డ్ కవర్లో.. కోర్టుకే సమర్పించింది. అయితే ఈ వ్యవహారంలో తమ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఎలాంటి విచారణ చేపట్టొద్దని వారణాసి కోర్టును గురువారం ఆదేశించింది సుప్రీం కోర్టు. దీంతో కమిటీ సమర్పించిన సీల్డ్ కవర్ తీసుకోవడం వరకు మాత్రమే పరిమితం అయ్యింది వారణాసి కోర్టు. ఆపై మే 23వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ తరుణంలో ఇప్పుడు సుప్రీం కోర్టు బెంచ్ ఆదేశాలు వారాణాసి కోర్టు ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు కమిటీ రూపొందించిన రిపోర్ట్‌లోని వివరాలు బయటకు పొక్కడం కలకలం రేపుతోంది. చదవండి: మసీదులన్నీ అంతకుముందు ఆలయాలే! -
Gyanvapi Mosque: జ్ఞానవాపి సర్వే పూర్తి
వారణాసి: జ్ఞానవాపి– శ్రింగార్ గౌరీ కాంప్లెక్సులో కోర్టు నియమించిన అధికారుల సర్వే పూర్తయింది. ఈ సర్వే నివేదికను కమిషనర్ల బృందం గురువారం జిల్లా కోర్టుకు సమర్పించింది. ఈ మేరకు సర్వే చేసిన వీడియోలు, ఫొటోలు, డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించామని స్పెషల్ అడ్వకేట్ కమిషనర్ విశాల్ సింగ్ చెప్పారు. సర్వే నివేదికలో ఏముందో చెప్పడానికి ఆయన నిరాకరించారు. కేసు విచారణను శుక్రవారం తర్వాత చేపట్టాలని దిగువ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో కేసులో తదుపరి విచారణను ఈనెల 23న చేపడతామని వారణాసి సివిల్ కోర్టు వెల్లడించింది. గురువారం ఈ కేసు విచారణ సందర్భంగా సివిల్ కోర్టులో ఇరు పార్టీల మధ్య వాదోపవాదాలు జరిగాయి. నిర్మాణంలోని కొన్ని గోడలను పగలగొట్టే పని కొనసాగించాలని వాది పక్షం కోర్టును కోరిందని, దీన్ని తాము వ్యతిరేకించామని ముస్లిం పక్ష న్యాయవాది అభయ్ చెప్పారు. అక్కడ కొలనులోని చేపలను వేరేచోటికి మార్చాలని ప్రభుత్వ న్యాయవాది కోరారని, దీన్ని తాము వ్యతిరేకించామని చెప్పారు. శివలింగం కనుగొన్నట్లు చెబుతున్న ప్రాంతానికి తూర్పున ఒక బేస్మెంట్ ఉందని పిటిషనర్లు మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ బేస్మెంట్ను రాళ్లు, ఇసుకతో మూసివేశారని, నంది విగ్రహానికి ముందు ఒక బేస్మెంట్, ఒక గోడ ఉన్నాయని, గోడ తొలగింపు, బేస్మెంట్లో సర్వేకు అనుమతివ్వాలని కోరారు. పశ్చిమం గోడకున్న తలుపును తెరవాలని, లోపల సర్వే చేపట్టాలని వీరు తమ పిటిషన్లో కోరారు. పిటిషన్‌ను అంగీకరించిన కోర్టు బుధవారం దీనిపై విచారణ జరపాలని నిర్ణయించినా ఆ రోజు లాయర్ల సమ్మె జరగడంతో గురువారం విచారణ చేపట్టింది. అప్పటివరకు ఆపండి జ్ఞానవాపి మసీదు కమిటీ దాఖలు చేసిన కేసులో ప్రతివాది తరఫు న్యాయవాది అనారోగ్యంతో ఉన్నందున తదుపరి విచారణను శుక్రవారం చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది. అంతవరకు జ్ఞానవాపి కేసులో విచారణ నిలిపివేయాలని దిగువ కోర్టుకు సూచించింది. హిందూ భక్తుల తరఫు ప్రధాన న్యాయవాది హరిశంకర్జైన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినా పూర్తిగా కోలుకోలేదని న్యాయవాది విష్ణు శంకర్ జైన్ కోర్టు దృష్టికి తెచ్చారు. దేశవ్యాప్తంగా పలు మసీదులను సీలు వేయాలంటూ కేసులు నమోదవుతున్నాయని ముస్లింల తరఫు న్యాయవాది హుజెఫా అహ్మదీ తెలిపారు. జ్ఞానవాపి మసీదులో వజుఖానా చుట్టూ ఉన్న గోడను కూల్చేందుకు అనుమతి కోరుతూ దిగువ కోర్టులో పిటిషన్ దాఖలైందన్నారు. ప్రతివాదుల తరఫు న్యాయవాది హాజరు కానందున తదుపరి విచారణ జరిపే వరకు దిగువ కోర్టులో ప్రొసీడింగ్స్ నిలిపివేయాలని కోరారు. దీంతో ఈ కేసును మే 20 మధ్యాహ్నం లిస్టింగ్‌కు తీసుకురావాలని జస్టిస్ చంద్రచూడ్ తదితరుల బెంచ్ ఆదేశించింది. త్రిశూలం, ఢమరుకం.. జ్ఞానవాపి సర్వేలో శేషనాగుతో పాటు దేవతల పగిలిన విగ్రహాలు, త్రిశూలం, ఢమరుకం కనిపించాయని మాజీ కమిషనర్ అజయ్ మిశ్రా ఇండియాటుడే ఇంటర్వ్యూలో చెప్పారు. సర్వే ప్రాంతంలో దేవాలయ పగిలిన ఇటుకలతో ఏర్పడిన రాళ్లగుట్టల పోగులు కనిపించిందని చెప్పారు. శిథిలాల్లో శేషనాగుడి పడగ ప్రతిమ ఉందన్నారు. రాళ్ల గుట్టలకు 600 ఏళ్ల వయసుంటుందన్నారు. శివలింగాకారం ఉండడం నిజమేనని, తన నివేదికలో దీనిని పేర్కొనలేదని తెలిపారు. సనాతన సంస్కృతికి చెందిన తామర, ఢమరుకం, త్రిశూలం లాంటి ఆనవాళ్లు కనిపించాయన్నారు. మథుర కేసు విచారణకు కోర్టు అంగీకారం మథుర: కత్రా కేశవ్ దేవ్ మందిర కాంప్లెక్స్‌లోని షాహీ ఈద్గా మసీదును తొలగించాలనే పిటిషన్‌కు విచారణార్హత ఉందని మథుర జిల్లా కోర్టు అభిప్రాయపడింది. దీంతో ఈ పిటిషన్‌ను గతంలో నిరాకరించిన సివిల్ సీనియర్ డివిజన్ జడ్జి కోర్టు తాజాగా దీన్ని విచారించాల్సిఉంది. 2020 సెప్టెంబర్25న లక్నోకు చెందిన రంజన అగ్నిహోత్రితో పాటు మరో ఆరుగురు భగవాన్ శ్రీకృష్ణ విరాజమాన్ సన్నిహితులుగా పేర్కొంటూ సివిల్ సీనియర్ కోర్టులో పిటిషన్ వేశారు. శ్రీకృష్ణ జన్మభూమిట్రస్ట్కు చెందిన 13.37 ఎకరాల్లో షాహీ ఈద్గా మసీదు నిర్మాణం జరిగిందని వారు పేర్కొన్నారు. ఈ మసీదును తొలగించి సదరు భూమిని ట్రస్టుకు అప్పగించాలని వారు కోరారు. అయితే ఈ పిటీషన్‌ను సెప్టెంబర్ 30, 2020లో సివిల్ సీనియర్ జడ్జి తోసిపుచ్చారు. షాహీ ఈద్గా మసీదులో హిందూ గుడి ఆనవాళ్లున్నాయా, లేదా పరిశీలించేందుకు పురాతత్వ శాఖ బృందాన్ని పంపాలని సీనియర్ సివిల్ కోర్టులో ఒక పిటీషన్ దాఖలైంది. అదేవిధంగా మసీదులోపలి గుడి ఆనవాళ్లను రక్షించేందుకు అందులో సీసీటీవీలు ఏర్పాటు చేయాలని, బయటివారు మసీదులో ప్రవేశించకుండా నిషేధించానలి కోరుతూ మరో పిటీషన్ దాఖలైంది. -
Gyanvapi Masjid: జ్ఞానవాపి మసీదు సర్వే నివేదిక లీక్!!
లక్నో: దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చేస్తున్న జ్ఞానవాపి మసీదు సర్వే నివేదిక.. వారణాసి కోర్టుకి చేరింది. ఒకవైపు ఈ వ్యవహారంలో తమ దగ్గర వాదనలు పూర్తయ్యే వరకు ఎలాంటి చర్యలకు ఉపక్రమించొద్దంటూ సుప్రీం కోర్టు గురువారం వారణాసి కోర్టును ఆదేశించింది. అయినప్పటికీ ముందుగా విధించిన గడువు కావడంతో.. సర్వే చేపట్టిన అడ్వొకేట్ కమిటీ ఇవాళే నివేదికను వారణాసి కోర్టులో సమర్పించింది. ఇదిలా ఉంటే.. గురువారం అడ్వొకేట్ కమిషన్ జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో చేపట్టిన సర్వే నివేదికను వారణాసి కోర్టులో సమర్పించింది. అయితే సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించిన నివేదిక కాపీ సమాచారం.. బయటకు పొక్కిందనే ప్రచారం కలకలం రేపుతోంది. కోర్టుకు సమర్పించిన గంటల వ్యవధిలోనే పిటిషనర్ల(ఐదుగురు హిందూ మహిళలు) తరపు న్యాయవాదుల చేతుల్లోకి కాపీ వెళ్లిందని, అక్కడి నుంచి లీకుల పర్వం మొదలైందని ప్రచారం నడుస్తోంది. ఈ మేరకు పలు జాతీయ మీడియా చానెల్స్‌లో కథనాలు వస్తుండడం గమనార్హం. బహిర్గతం అయిన ఆ నివేదికలో.. హిందూ విగ్రహాలు, చిహ్నాలు ఉన్నాయని... పిటిషనర్లు వాళ్ల వాదనలను సమర్థిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇదిలా ఉంటే.. సర్వే పూర్తయ్యే తరుణంలోనే.. శివలింగం బయటపడిందంటూ కొన్ని ఫొటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై సీరియస్ అయిన కోర్టు.. అడ్వొకేట్ కమిషనర్ అయిన అజయ్ మిశ్రాను తప్పించింది. బయటకు పొక్కిన నివేదిక వివరాలు.. మసీదు పిల్లర్ల బేస్మెంట్లో.. కలశం, పువ్వుల నగిషీలు, ప్రాచీన హిందీ భాషలో చెక్కిన అక్షరాలు బేస్మెంట్ గోడలో త్రిశూల ఆకారం మసీదు పశ్చిమం వైపు గోడ మీద కమాను, రెండు పెద్ద పిల్లర్లు ఆలయానికి సంబంధించిన గుర్తులేనని పిటిషనర్ల వాదన. మసీదు మధ్య డోమ్ కింద.. శంఖాకార నిర్మాణం మూడో డోమ్ కింద.. తామర పువ్వులను పోలిన నగిషీలు మసీదు వాజుఖానాలో బయటపడ్డ రెండున్నర అడుగుల ఎత్తున్న ఆకారం(శివలింగం) అని పిటిషనర్లు.. కాదు ఫౌంటెన్ నిర్మాణమని మసీదు నిర్వాహకుల వాదన. మసీదు ప్రాంగణాన్ని ఆనుకుని ఉన్న గోడ కోర్టుకు మాత్రమే పరిమితం కావాల్సిన నివేదిక.. సున్నితమైన అంశానికి సంబంధించిన చాలా గోప్యమైన నివేదిక బయటకు పొక్కడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. లీక్ అయిన ఈ నివేదికపై మసీదు కమిటీ కూడా ఇప్పటిదాకా స్పందించలేదు. ఒకవేళ ప్రచారంలో ఉన్న నివేదికే నిజమైతే మాత్రం.. కోర్టు ఈ విషయంపై ఎలా స్పందిస్తుందో చూడాలి. ► వారణాసి కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలో ఉన్న.. జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో మూడు రోజులపాటు.. భారీ భద్రత నడుమ అడ్వొకేట్ కమిటీ సమక్షంలో వీడియోగ్రఫీ సర్వే జరిగింది. 14 నుంచి 16వ తేదీల మధ్య ఈ సర్వే పూర్తైంది. ఈ సర్వే సమయంలోనే అడ్వొకేట్ కమిషనర్ అజయ్ మిశ్రా లీకుల ద్వారా మసీదు వజుఖానాలో ‘శివలింగం’ బయటపడిందనే కథనాలు బయటకు వచ్చాయి. దీంతో శివలింగాన్ని సంరక్షిస్తూనే.. నమాజ్‌లకు ఆటంకాలకు కలిగించవద్దంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు ఉద్రిక్తలు చోటు చేసుకోకుండా ఆ ప్రాంతంలో భద్రతను ఏర్పాటు చేశారు. ► మరోవైపు సర్వే పూర్తి నివేదికను అడ్వొకేట్ కమిషనర్ విశాల్ సింగ్(లీక్ నేపథ్యంలో అజయ్ మిశ్రాను తొలగించి..) ఆధ్వర్యంలో వారణాసికి కోర్టుకు సమర్పించారు. మూడు సీల్డ్ బాక్సుల్లో, వందలాది ఫొటోలు, వీడియోలతో కూడిన ఒక చిప్‌ను సమర్పించారు. ఈ లోపే లీక్ కథనాలు కలకలం సృష్టిస్తున్నాయి. సుప్రీం కోర్టులో దాఖలైన వీడియోగ్రఫీ సర్వే అభ్యంతర పిటిషన్‌పై శుక్రవారం వాదనలు జరగనున్నాయి. అటుపై పరిస్థితిని బట్టి.. సోమవారం ఈ కేసులో తదుపరి వాదనలు వారణాసి కోర్టులో జరగనున్నాయి. చదవండి: మసీదులు అంతకుముందు ఆలయాలే! తాఖీర్ రజా వ్యాఖ్యల దుమారం -
జ్ఞానవాపి మసీదు వివాదం: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూడిల్లీ: జ్ఞానవాపి మసీదు వివాదంపై వారణాసి జిల్లా కోర్టు విచారణను సుప్రీంకోర్టు నిలుపుదల చేసింది. ఈ వ్యవహారంపై తామే విచారణ చేపడతామని తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు ముగ్గురు సభ్యుల ధర్మాసనం.. దీనిపై విచారణ చేపట్టనుంది. వారణాసి విచారణపై స్టే ఇచ్చిన సర్వోన్నత న్యాయస్థానం.. సర్వే నివేదికలోని అంశాలను బయటపెట్టొద్దని స్పష్టంచేసింది. ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకూ జ్ఞానవాపి మసీదులో సర్వే జరిగింది. సర్వే సందర్భంగా మసీదులో శివలింగం బయటపడినట్టు హిందూవర్గం ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అయితే ముస్లిం వర్గం మాత్రం అది శివలింగం కాదు ఫౌంటెన్ అని వాదిస్తోంది. ఈ క్రమంలో శివలింగం గుర్తించినట్టు చెబుతున్న ప్రాంతాన్ని కోర్టు ఆదేశాల మేరకు వారణాసి జిల్లా అధికారులు సీజ్ చేశారు. మరోవైపు జ్ఞానవాపి మసీదు సర్వేకు సంబంధించిన నివేదిక వారణాసి కోర్టుకు చేరింది. దీనికి సంబంధించిన నివేదిక, వీడియో చిప్‌ను సీల్డ్ కవర్లో కోర్టు అసిస్టెంట్ కమిషనర్లు విశాల్ సింగ్, అజయ్‌ప్రతాప్ సింగ్ న్యాయస్థానానికి సమర్పించారు .నివేదిక 10 నుంచి 15 పేజీలు ఉన్నట్టు వెల్లడించారు. చదవండి: జ్ఞానవాపి మసీదు సర్వే.. తాఖీర్ రజా వ్యాఖ్యలపై దుమారం కాగా మసీదు సర్వేలో వెలుగు చూసిందంటున్న శివలింగం పక్కనున్న గోడను, దాంతోపాటు అక్కడి బేస్మెంట్ను మూసేందుకు నింపిన ఇటుకలు, సిమెంటు, ఇసుక తదితరాలను తొలగించాలంటూ హిందూ పక్షం, దానిపై తమ అభ్యంతరాల దాఖలుకు రెండు రోజుల సమయం కోరుతూ ముస్లింలు వారణాసి జిల్లా సివిల్ జడ్జి కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. జ్ఞానవాపి మసీదు కేసుకు సంబంధించిన పలు పిటిషన్లపై వారణాసి జిల్లా సివిల్‌జడ్జి కోర్టులో బుధవారం జరగాల్సిన విచారణ లాయర్ల సమ్మెతో వాయిదా పడింది. -
జ్ఞానవాపి మసీదు సర్వే.. తాఖీర్ రజా వ్యాఖ్యలపై దుమారం
లక్నో: వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో సర్వే వ్యవహారం న్యాయస్థానాలకు చేరిన వేళ.. యూపీలోని ఇత్తెహాద్ మిల్లత్ కౌన్సిల్ చీఫ్ తాఖీర్ రజా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దేశంలోని ఆలయాలను కూల్చి వేసి మసీదులను కట్టలేదని.. పెద్ద సంఖ్యలో జనం ఇస్లాంలోకి మారి ఆలయాలను మసీదులుగా మార్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే.. అలాంటి మసీదులను ప్రభుత్వాలు ముట్టుకోరాదని హెచ్చరించారు. జ్ఞానవాపి మసీదులో శివలింగం దొరికిందన్న ప్రచారం.. హిందూయిజాన్ని అపహాస్యం చేయడమే!. దేశంలోని చాలా మసీదులు కట్టడానికి ముందు.. అక్కడ ఆలయాలే ఉండేవని పేర్కొన్నారు. అయితే, ఆ ఆలయాలను కూల్చలేదని చెప్పారు. వాటిని కేవలం మసీదులుగా మార్చారన్నారు. వాటిని ముట్టుకోవద్దని, కాదని ప్రభుత్వం బలవంతపు చర్యలకు పూనుకుంటే మాత్రం ముస్లింలు వ్యతిరేకిస్తారని స్పష్టం చేశాడు. ముస్లింలు ఎవరూ న్యాయ పోరాటానికి సిద్ధమవ్వాల్సిన అవసరం లేదని, బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఎలాంటి తీర్పు వచ్చిందో తెలిసిందేనని అన్నారు. జ్ఞానవాపి మసీదుపై ఇప్పుడు ఏ కోర్టుల్లోనూ అప్పీలు చేయబోమన్నాడు. విద్వేషవాదులు.. తలచుకుంటే దేశంలో ఏదైనా జరుగుతుందన్నాడు. దేశంలో శాంతి సామరస్యాలను కాపాడేందుకు ముస్లింలు శాంతంగా ఉంటున్నారన్నాడు. తాఖీర్ రజా వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో దుమారం చెలరేగుతోంది. -
తప్పు చేయలేదు.. నన్ను మోసం చేశారు: అజయ్ మిశ్రా
లక్నో: ఉత్తర ప్రదేశ్ వారణాసి ‘జ్ఞానవాపి మసీదు సర్వే’లో వేటుకు గురైన అడ్వొకేట్ కమిషనర్ అజయ్ మిశ్రా స్పందించారు. తానేం తప్పు చేయలేదని, తనని మోసం చేశారని అంటున్నారాయన. ‘‘నేనేం తప్పు చేయలేదు. విశాల్ సింగ్ నన్ను మోసం చేశారు. ఇతరులను నమ్మే నా స్వభావం నా కొంప ముంచింది. అర్ధరాత్రి 12 దాకా మేం నివేదికను రూపొందించాం. విశాల్ చేసే కుట్రను కనిపెట్టలేకపోయా. చాలా బాధగా అనిపించింది. సర్వే గురించి ఎలాంటి సమాచారం నేను బయటపెట్టలేదు’’ అని అడ్వొకేట్ అజయ్ మిశ్రా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. కమిటీ సర్వే కొనసాగుతున్న టైంలోనే లీకులు అందించారంటూ వారణాసి కోర్టు మంగళవారం అర్ధాంతరంగా అజయ్ మిశ్రాను తప్పించి.. ఆ స్థానంలో విశాల్ సింగ్‌ను కొత్త అడ్వొకేట్ కమిషనర్‌గా నియమించింది. అజయ్ మిశ్రా మీద ఫిర్యాదు చేసిందే విశాల్ సింగ్ కావడం విశేషం. ‘‘అజయ్ మిశ్రా ప్రవర్తన మీద పిటిషన్ దాఖలు చేశా. ఆయన ఓ వీడియోగ్రాఫర్ నియమించుకుని.. అతనితో మీడియాకు లీకులు ఇచ్చారు. పుకార్లు ప్రచారం చేశారు. నేను నా బాధ్యతగా నా నివేదిక సమర్పించా’’ అని పేర్కొన్నారు విశాల్ సింగ్. ఇదిలా ఉంటే.. వీడియోగ్రాఫర్ చేసిన తప్పిదానికి తానేం చేయగలనుంటున్నాడు అజయ్ మిశ్రా. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శివలింగం బయటపడిందని హిందూ వర్గం, కాదు.. అది కొలనుకు సంబంధించిన భాగం అని మసీద్ నిర్వాహక కమిటీ వాదిస్తున్నారు. ఇక సర్వే కమిటీ మరో రెండురోజుల్లో వారణాసి కోర్టులో తన నివేదికను సమర్పించనుంది. Gyanvapi Mosque Case: లీకులు చేసినందుకే అడ్వొకేట్ కమిషనర్ తొలగింపు! -
శివలింగాన్ని రక్షించండి.. నమాజ్‌కు అనుమతించండి
న్యూఢిల్లీ/వారణాసి: కాశీలోని జ్ఞానవాపి– శ్రింగార్ గౌరీ కాంప్లెక్స్‌లో సర్వే సమయంలో కనుగొన్నట్లు చెబుతున్న శివలింగం ఉన్న ప్రాంతానికి రక్షణ కల్పించాలని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్‌ను సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. అందులో ముస్లింలు నమాజ్ కొనసాగించుకునేందుకు అనుమతినిచ్చింది. న్యాయ సమతుల్యతలో భాగంగా ఈ ఆదేశాలిస్తున్నామని జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ నరసింహతో కూడిన బెంచ్ తెలిపింది. 20 మందిని మాత్రమే నమాజుకు అనుమతించాలన్న కింద కోర్టు ఉత్తర్వులను తోసిపుచ్చింది. మసీదు కమిటీ కోరినట్లు సర్వే తదితర ప్రక్రియలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. శివలింగం బయటపడిన ప్రాంతంలో ముస్లింలు వజు చేసుకుంటారని యూపీ ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. అక్కడ ఎలాంటి విధ్వంసం జరిగినా శాంతిభద్రతల సమస్య వస్తుందని చెప్పారు. కావాలంటే ముస్లింలు వజు వేరే చోట చేసుకోవచ్చన్నారు. కానీ వజూ లేకుండా నమాజ్‌కు అర్థం లేదని మసీదు కమిటీ తరఫు న్యాయవాది హుజెఫా అహ్మదీ వాదించారు. హృద్రోగంతో ఆస్పత్రిలో చేరిన దిగువ కోర్టులో వాది తరఫు న్యాయవాది కోలుకొనే దాకా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తున్నట్లు కోర్టు తెలిపింది. రాజ్యాంగ విరుద్ధం వారణాసి కోర్టు ఆదేశాలన్నీ రాజ్యాంగ విరుద్ధమని అంతకుముందు అహ్మదీ వాదించారు. జైన్ దరఖాస్తుకు స్పందించి శివలింగం దొరికిన ప్రాంతానికి సీలు వేయాలన్న తాజా ఆదేశం సరికాదన్నారు. ఇంతవరకు సర్వే పూర్తయి నివేదిక రాకముందే ఇలాంటి ఆదేశం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ‘‘మసీదులో ప్రార్ధనలకు అనుమతించాలన్న అభ్యర్థనే అసంబద్ధం. ఇవన్నీ పట్టించుకోకుండా కింద కోర్టు సర్వే జరిపిస్తోంది. మేం హైకోర్టును ఆశ్రయించినప్పుడు కమిషనర్ నియామకానికే అనుమతిస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. కానీ సర్వేకు కూడా కింద కోర్టు ఆదేశించింది. సర్వే జరుగుతుండగా అకస్మాత్తుగా శివలింగం కనిపించిందని దరఖాస్తు పెట్టుకోగానే, అది ఫౌంటెన్ అని మసీదు కమిటీ చెబుతున్నా పట్టించుకోకుండా ఆ ప్రాంత రక్షణకు హడావుడిగా ఆదేశాలిచ్చింది’’ అని వాదించారు. కేసు సుప్రీంలో ఉన్నందున స్థానిక కోర్టు విచారణపై స్టే విధించాలని కోరారు. అందుకు ధర్మాసనం తిరస్కరించింది. హిందూ భక్తుల పార్టీలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను మే 19కి వాయిదా వేసింది. సర్వే పూర్తి కాలేదు జ్ఞానవాపి మసీదులో సర్వేకు నియమించిన కమిషన్ తమ పని ఇంకా పూర్తి కాలేదని పేర్కొంది. మరికొంత గడువు కావాలని అసిస్టెంట్ అడ్వకేట్ కమిషనర్ అజయ్ ప్రతాప్‌సింగ్ కోర్టును కోరారు. నివేదికలో 50 శాతం పూర్తయిందన్నారు. సర్వేలో భూగర్భ గదులను పరిశీలించామని, కొన్నింటి తాళం చెవులు లభించకపోతే జిల్లా యంత్రాంగం తాళాలు పగలగొట్టడంతో వాటిని కూడా వీడియో తీశామని చెప్పారు. ‘‘వజూ ఖానాలో శివలింగం అంశంపై నేను మాట్లాడను. అక్కడ ఏదో దొరకడం మాత్రం నిజం. దాని ఆధారంగానే కోర్టు ఆదేశాలిచ్చింది’’ అని తెలిపారు. సింగ్ అభ్యర్థన విన్న వారణాసి సివిల్ కోర్టు సర్వే పూర్తి చేయడానికి మరో రెండు రోజుల గడువిచ్చింది. సర్వే కమిషనర్ అజయ్ మిశ్రాను తొలగిస్తున్నట్లు వెల్లడించింది. సర్వే సమయంలో మిశ్రా సొంతంగా ప్రైవేట్ ఫొటోగ్రాఫర్‌ను తెచ్చుకున్నారని మరో కమిషనర్ విశాల్ సింగ్ కోర్టుకు తెలిపారు. సదరు ఫొటోగ్రాఫర్ మీడియాకు తప్పుడు సమాచారమిస్తున్నారన్నారు. అయితే ఆ ఫొటోగ్రాఫర్ తనను మోసం చేశారని మిశ్రా వాపోయారు. ఆ గోడను తొలగించండి! కాశీ విశ్వనాథ ఆలయంలో నంది విగ్రహానికి ఎదురుగా ఉన్న తాత్కాలిక గోడను తొలగించాలని ఐదుగురు హిందూ మహిళలు వారణాసి కోర్టులో మరో పిటీషన్ వేశారు. గోడను తొలగిస్తే బయటపడిన శివలింగం వద్దకు వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుందని వీరు పేర్కొన్నారు. మసీదు తూర్పు ప్రాంతంలో నంది విగ్రహం వైపు కూడా సర్వే జరపాలని కోరారు. ఈ విషయంపై బుధవారం వాదనలు వింటామని కోర్టు తెలిపింది. అలాగే మసీదు బావిలో చేపల సంరక్షణ గురించి కూడా బుధవారం కోర్టు విచారిస్తుందని అసిస్టెంట్ అడ్వకేట్ కమిషనర్ అజయ్ చెప్పారు. మథుర మసీదులో నమాజ్ నిలిపివేతకు పిటిషన్ మథుర: నగరంలోని షాహీ ఈద్గా మసీదులో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించకుండా నిరోధించాలని కోరుతూ కొందరు న్యాయవాదులు, న్యాయవిద్యార్థులు స్థానిక కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ ప్రాంతం శ్రీకృష్ణ జన్మస్థలి అని అందువల్ల ఇక్కడ నమాజ్‌ను నిషేధించాలని వీరు కోరారు. ఇప్పటికే ఈ అంశంపై పది పిటీషన్లు మథుర కోర్టులో ఉన్నాయి. 13.37 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కత్రాకేశవ్ దేవ్ మందిరంలో ఈ మసీదు ఉంది. మసీదు ఉన్న చోటే కృష్ణుడు జన్మించాడని మెజార్టీ హిందువుల భావన అని తాజా పిటీషన్లో పేర్కొన్నారు. మసీదును హిందూ దేవాలయ శిథిలాలపై నిర్మించినందున దీనికి మసీదు హోదా రాదన్నారు. అందువల్ల ఇక్కడ నమాజు చేయకుండా శాశ్వత నిరోధ ఉత్తర్వులివ్వాలని కోరారు. ఇతర మత చిహ్నాలు లేని, వివాదంలో లేని ప్రాంతంలోనే మసీదు నిర్మించాలని ఖురాన్ చెబుతోందన్నారు. దీనిపై విచారణ మే 25న జరుగుతుందని జిల్లాప్రభుత్వ న్యాయవాది చెప్పారు. -
జ్ఞానవాపి మసీదు కేసులో సుప్రీం కోర్టులో విచారణ
-
జ్ఞానవాపి మసీద్ సర్వే: అనూహ్య పరిణామం
లక్నో: ఉత్తర ప్రదేశ్ వారణాసి ‘జ్ఞానవాపి మసీదు సర్వే’ అభ్యంతర పిటిషన్‌పై సుప్రీం కోర్టులో వాదనలు కొనసాగుతున్న వేళ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మూడు రోజులపాటు అడ్వొకేట్ కమిటీ నేతృత్వంలో మసీదు ప్రాంగణంలో వీడియోగ్రాఫిక్ సర్వే జరిగిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. సర్వేకు నేతృత్వం వహించిన అడ్వొకేట్ కమిషనర్ అజయ్ కుమార్ మిశ్రాను తొలగిస్తున్నట్లు వారణాసి కోర్టు తెలిపింది. సర్వే రిపోర్ట్ పూర్తికాకుండానే బయటపెట్టినందుకు ఆయన్ని తొలగించినట్లు తెలుస్తోంది. అజయ్ మిశ్రా సన్నిహితుడు.. మీడియాకు రిపోర్ట్ లీక్ చేసినట్లు కోర్టు గుర్తించింది. అంతేకాదు.. ప్యానెల్ తన నివేదికను సమర్పించడానికి రెండు రోజుల గడువు ఇస్తున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి ఈ కమిటీ ఇవాళే (మంగళవారం) వారణాసి కోర్టులో నివేదిక సమర్పించాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో నివేదిక ఆలస్యంగా సమర్పిస్తామని అజయ్ కుమార్ మిశ్రా కోర్టుకు వెల్లడించారు. ఈలోపే ఆయన్ని తొలగిస్తున్నట్లు ప్రకటన వెలువడడం విశేషం. సుప్రీంలో.. ఇదిలా ఉంటే.. వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయం సమీపంలో ఉన్న జ్ఞానవాపి మసీద్ కాంప్లెక్స్‌లో వీడియోగ్రాఫిక్ సర్వేకు వారణాసి కోర్టు ఆదేశించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. అంజుమాన్ ఇంతెజమీయా మసీద్ కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో మంగళవారం వాదనలు జరుగుతున్నాయి. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది హుఫేజా అహ్మది వాదనలు వినిపించారు. మసీదు కమిటీ తరపు సీనియర్ న్యాయవాది అహ్మదీ మాట్లాడుతూ, కమిషనర్ నియామకంతో సహా ట్రయల్ కోర్టు యొక్క అన్ని ఉత్తర్వులపై స్టేను కోరుతున్నట్లు తెలిపారు. వారణాసి కోర్టు ఇచ్చిన సర్వే ఉత్తర్వులు చట్టవిరుద్ధంగా, పార్లమెంటుకు విరుద్ధంగా ఉన్నందున ‘స్టేటస్ కో’కు ఆదేశించాలని కోరారు. అంతేకాదు పిటిషనర్ల ఉద్దేశం మసీదును మాయ చేసే కుట్రగా స్పష్టం అవుతోందంటూ కోర్టుకు తెలిపారు. -
బాబ్రీని పొగొట్టుకున్నాం.. చాలు!: అసదుద్దీన్ ఒవైసీ
లక్నో: జ్ఞానవాపి మసీద్ వ్యవహారంలో వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పుపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. మసీదు ప్రాంగణంలోని వుజు ఖానా(కొలను)లో శివలింగం బయట పడడం, ఆ ప్రాంతాన్ని సీజ్ చేసి ఎవరినీ అనుమతించకూడదంటూ స్థానిక కోర్టు అధికారులను, భద్రతా సిబ్బందిని ఆదేశించడం లాంటి పరిణామాలు వారణాసిలో వేడిని పుట్టించాయి. ఈ క్రమంలో ఒవైసీ స్పందిస్తూ.. ముస్లింలు ఇప్పటికే బాబ్రీ మసీదును కోల్పోయారని, మరో మసీదును పోగొట్టుకోబోమని అన్నారు. ఈ సందర్భంగా వారణాసి కోర్టు తీర్పుపై ఆయన స్పందించారు. మసీదులో వీడియోగ్రఫీ సర్వే.. ప్రార్థనామందిరాల ప్రత్యేక చట్టం 1991ను ఉల్లంఘించడమే కాదు.. బాబ్రీ మసీద్ వివాదంలో సుప్రీం కోర్టు తీర్పును సైతం తప్పుబట్టినట్లు అవుతుంది. అగష్టు 15, 1947 సమయంలో అక్కడ ఏ ప్రార్థనా స్థలం ఉంటే.. అదే కొనసాగాలని చట్టం చెబుతోంది. ఇప్పటికే ఓ మసీదును కోల్పోయాం. మరొకటి కోల్పోయేందుకు సిద్ధంగా లేం అంటూ వ్యాఖ్యానించారు ఒవైసీ. జ్ఞానవాపి ఒక మసీదుగానే ఎప్పటికీ ఉంటుందంటూ పేర్కొన్నారాయన. ఒవైసీ కంటే ముందు జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సైతం బీజేపీ నేతృత్వంలోని కేంద్రంపై మండిపడ్డారు. వాళ్లంతా మసీదుల వెంటే పడుతున్నారంటూ ఆగ్రహం వెలిబుచ్చారు ఆమె. సంయమనం పాటించండి కోర్టు తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో.. కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి స్పందించారు. చరిత్రను ఒకసారి తిరగేయండి. శాంతి, సోదరభావాన్ని పాటించండి. కోర్టులో ఈ వ్యవహారం ఉన్నందున.. జోక్యం చేసుకుని పరిస్థితిని మరోలా మార్చకండంటూ లేఖి విజ్ఞప్తి చేశారు. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఉన్న శృంగర్ గౌరీ ఆలయంలో నిత్యం పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఐదుగురు మహిళలు వారణాసి కోర్టును ఆశ్రయించడంతో ఈ వ్యవహారం మొదలైంది. దీనిపై మూడు రోజులు పాటు కోర్టు ఆదేశానుసారం వీడియోగ్రఫీ సర్వే జరిగింది. సోమవారం సర్వే ముగియగా.. మసీదులో ఉన్న కొలను నుంచి శివలింగం బయటపడడంతో.. కోర్టు మళ్లీ జోక్యం చేసుకుని ఆ ప్రాంతాన్ని సీల్ చేయమని తెలిపింది. ఇదిలా ఉంటే.. ఈ ప్రాంగణం మొత్తం కాశీ విశ్వనాథ్ ఆలయానికి చెందినదే అని.. మసీదు అందులో ఓ భాగం మాత్రమే అని దాఖలైన ఓ పిటిషన్ 1991 నుంచి కోర్టులో పెండింగ్‌లో ఉండడం విశేషం. -
Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదులో శివలింగం!
వారణాసి/న్యూఢిల్లీ: ప్రసిద్ధ కాశీ విశ్వనాథుని ఆలయ ప్రాంగణంలోని జ్ఞానవాపి మసీదులో మూడు రోజులుగా కొనసాగుతున్న వీడియోగ్రఫీ సర్వే సోమవారం ముగిసింది. ఈ సందర్భంగా మందిరం–మసీదు వివాదం మరింత రాజేసే పరిణామాలు జరిగాయి. సర్వేలో మసీదులోని వజూఖానాలో శివలింగం కనిపించిందని హిందూ పిటిషనర్లు పేర్కొన్నారు. దానికి రక్షణ కల్పించాలంటూ సోమవారం వారణాసి కోర్ట్ ఆఫ్ సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) రవి కుమార్ దివాకర్ ను ఆశ్రయించారు. దాంతో ఆ ప్రాంతాన్ని సీల్ చేయాలని యంత్రాంగాన్ని కోర్టు ఆదేశించింది. ఎవరూ అందులోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కమిటీ పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరపనుంది. జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కేసును విచారిస్తుందని పేర్కొంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సర్వే సంతృప్తికరం: మేజిస్ట్రేట్ శర్మ సర్వేపై అన్ని వర్గాలు సంతృప్తి వ్యక్తం చేశాయని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ కౌశల్ రాజ్ శర్మ మీడియాతో అన్నారు. సర్వే నివేదిక అందాక తదుపరి చర్యలను మంగళవారం కోర్టు నిర్ణయిస్తుందని తెలిపారు. సర్వే సమయంలో మసీదులో ఏం దొరికిందనేది అప్పటిదాకా ఎవరూ వెల్లడించరాదన్నారు. అది ఫౌంటేన్ భాగం: మసీదు కమిటీ సర్వే బృందానికి కనిపించినది ఫౌంటెయిన్‌కు చెందిన ఒక భాగమే తప్ప శివలింగం కాదని మసీదు కమిటీ పేర్కొంది. తమ వాదనలు పూర్తి కాకుండానే ఆ ప్రాంతాన్ని సీల్ చేయాలంటూ కోర్టు ఆదేశించిందని ఆరోపించింది. మరో మసీదును కోల్పోలేం తాజా పరిణామాలపై మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. ‘బాబ్రీ’ తర్వాత మరో మసీదును కోల్పోయేందుకు ముస్లింలు సిద్ధంగా లేరన్నారు. అటువంటి యత్నాలను తిప్పికొట్టాని పిలుపునిచ్చారు. ‘‘బాబ్రీ మసీదులో 1949లో అకస్మాత్తుగా హిందూ దేవతా విగ్రహాలు ప్రత్యక్షమయ్యాయి. అలాంటి కుట్ర పునరావృతం కాకుండా ముస్లింలు ప్రతినబూనాలి’ అంటూ ట్వీట్ చేశారు. దుష్టశక్తులు ముస్లిం సంస్కృతిని హరించాలని చూస్తున్నాయని ఆరోపించారు. నిజం తేలాల్సిందే: యూపీ డిప్యూటీ సీఎం సర్వే ఫలితంపై యూపీ డిప్యూటీ సీఎం కేశవ్‌ప్రసాద్ మౌర్య సంతృప్తి వ్యక్తం చేశారు. నిజం ఎప్పుడో ఒకప్పుడు వెలుగులోకి రాకతప్పదన్నారు. ఆ ప్రాంతంలో ఆలయం ఉండేదన్న వాదన తాజా ఘటనతో రుజువైందని వీహెచ్‌పీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ పేర్కొన్నారు. ఈ ఆధారాలను దేశ ప్రజలంతా గౌరవిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. కోర్టు తీర్పును బట్టి తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తామన్నారు. జ్ఞానవాపి మసీదు వెలుపలి గోడలపై ఉన్న విగ్రహాలకు నిత్య పూజలకు అనుమతి కోరుతూ కొందరు మహిళలు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. చదవండి: ఇళ్లు తగలబెట్టే హిందూత్వ కాదు.. సీఎం ఫైర్ -
పదిరోజుల్లో జ్ఞానవాపి మసీదు సర్వే
చారిత్రక స్థలాల్లో వివాదం మెజార్టీ ప్రజల్లో జాతీయవాదాన్ని ప్రేరేపిస్తుందని గుర్తించిన బీజేపీ అందుకు తగినట్లు పావులు కదుపుతోంది. బీజేపీ ప్రణాళికలో భాగంగా అయోధ్యతో ఆరంభమైన అడుగులు తాజాగా వారణాసి వైపు మరలాయి. స్థానిక కాశీ విశ్వనా«థ మందిరం– జ్ఞానవాపి మసీదు వివాదంలో మరో సంచలన తీర్పునకు రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. మసీదు కమిటీ అభ్యంతరాలను పక్కనబెట్టిన స్థానిక కోర్టు మసీదులో సర్వే పదిరోజుల్లో పూర్తి చేయాలని ఆదే శించింది. ఇక తదుపరి న్యాయపోరాటం మధుర శ్రీకృష్ణ జన్మస్థలంపై జరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇదే సమయంలో తాజ్‌మహల్‌లో సర్వేకు అయోధ్య బీజేపీ చేసిన విజ్ఞప్తిని అలహాబాద్ హైకోర్టు తిరస్కరించడం గమనార్హం. వారణాసి: జ్ఞానవాపి మసీదులో సర్వే, వీడియోగ్రఫీని నిర్వహించేందుకు నియమించిన అడ్వొకేట్ కమిషనర్‌ను తొలగించాలన్న విజ్ఞప్తిని స్థానిక కోర్టు తోసిపుచ్చింది. జ్ఞానవాపి– శ్రీంగార్ గౌరీ కాంప్లెక్స్‌లో సర్వేను పదిరోజుల్లో ముగించాలని ఆదేశించింది. ఈ పని కోసం ఇప్పటికే నియమించిన అడ్వొకేట్ కమిషనర్‌కు సాయంగా మరో ఇద్దరు లాయర్లను జిల్లా కోర్టు నియమించింది. ఈ మొత్తం ప్రక్రియను ఎవరు అడ్డుకున్నా ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. గత ఆదేశాలకు అనుగుణంగా సర్వే పూర్తి చేయాల్సి ఉండగా మసీదు కమిటీ ఈ పనిని అడ్డుకుంది. మసీదులో సర్వే, వీడియో తీయడాన్ని వ్యతిరేకించింది. కోర్టు నియమించిన కమిషనర్ పక్షపాతం చూపుతున్నాడని మసీదు కమిటీ కోర్టులో అభ్యంతరాలు తెలిపింది. దీంతో సర్వే పనులు ఇటీవల నిలిచిపోయాయి. దీనిపై విచారణ జరిపిన జిల్లా కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవికుమార్ దివాకర్ సదరు అభ్యంతరాలను కొట్టివేశారు. బేస్మెంట్లలో కూడా సర్వే: ఇప్పటికే నియమించిన అడ్వొకేట్ కమిషనర్ అజిత్ కుమార్ మిశ్రాకు సాయంగా విశాల్ సింగ్‌ను స్పెషల్ కమిషనర్‌గా, అజయ్ ప్రతాప్ సింగ్‌ను సహాయ కమిషనర్‌గా కోర్టు నియమించింది. మిశ్రాను తొలగించాలన్న పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ ముగ్గురూ కలిసి సర్వేపనులు పూర్తి చేయాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. జ్ఞానవాపి మసీదు అంతర్భాగంలో వీడియో తీయాలని కోర్టు ఆదేశించినట్లు హిందూ పిటిషనర్ల న్యాయవాది మదన్ మోహన్ యాదవ్ తెలిపారు. మసీదుకు చెందిన రెండు బేస్మెంట్లకు తాళాలున్నాయని మసీదు మేనేజ్మెంట్ కోర్టుకు తెలియజేసింది. వీటిలో వీడియో తీయడానికి అభ్యంతరం చెప్పింది. అయితే తాళాలు లేకపోతే పగలకొట్టి సర్వే పూర్తి చేయాలని కోర్టు ఆదేశించిందని మదన్ మోహన్ చెప్పారు. ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షించి అడ్డంకులు కలిగించినవాళ్లను అదుపులోకి తీసుకోవాలని జిల్లా మెజిస్ట్రేట్, పోలీసు కమిషనర్‌ను కోర్టు ఆదేశించిందన్నారు. దీంతో ఇకపై ప్రతిరోజూ ఉదయం 8– 12 మధ్య ఈ సర్వేను పూర్తయ్యేవరకు నిర్వహిస్తారు. మంగళవారం సర్వే ఎంతవరకు జరిగిందని కోర్టుకు నివేదిక సమర్పిస్తారు. కోర్టు తీర్పు అన్యాయమని, అప్పీలుకు వెళ్తామని మసీదు కమిటీ తెలిపింది. ఇలా మొదలైంది.. మసీదు గోడ వద్ద ఉన్న గౌరి, గణేశ్, హనుమాన్, నంది విగ్రహాలకు రోజూ పూజలు చేసుకునేందుకు అనుమతించాలని, వీటిని ధ్వంసం చేయకుండా అడ్డుకోవాలని రాకీసింగ్తో పాటు నలుగురు మహిళలు 2021లో స్థానిక కోర్టునాశ్రయించారు. ఇప్పటివరకు సంవత్సరంలో ఒక రోజు మాత్రమే ఈ పూజలకు అనుమతిస్తున్నారు. వీరి పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు వీడియో సర్వేకు గతనెల ఆదేశాలిచ్చింది. ఈ తీర్పుపై మసీదు కమిటీ హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు మే 6న వీడియో సర్వే ఆరంభించారు. అయితే సర్వే కోసం నియమించిన మిశ్రాను తొలగించాలని మసీదు కమిటీ కోర్టును ఆశ్రయించింది. అదేవిధంగా మసీదులోపల వీడియో తీయమని కోర్టు ఆదేశించలేదని, కేవలం ఛబుత్రా ప్రాంతానికే వీడియో సర్వే పరిమితమని అడ్డుకుంది. శుక్రవారం మిశ్రా ఈప్రాంతంలో ఒక సర్వే నిర్వహించారు. ఈ సమయంలో ఇరుపక్షాల నుంచి పెద్ద ఎత్తున గుమికూడి నినాదాలిచ్చారు. ప్రార్థనా స్థలాల చట్టం వర్తిస్తుందా? ప్రార్థనా స్థలాల చట్టం– 1991 ప్రకారం 1947 తర్వాత ఏ స్థలంలో ఏ ప్రార్థనాస్థలం ఉంటే అదే కొనసాగుతుందని, సుప్రీంకోర్టు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ వాదిస్తోంది. జ్ఞానవాపి మసీదులో కోర్టు తీర్పుపై సుప్రీంకు వెళ్తామని తెలిపింది. రామజన్మభూమి తీర్పు తర్వాత ఏ ప్రార్థనాస్థలంలోనైనా మార్పులకు కోర్టులు ఆదేశిస్తే, సుప్రీంకోర్టు రామజన్మభూమి తీర్పును అతిక్రమించినట్లేనని పేర్కొంది. అయితే సదరు స్థలం మసీదు లేదా దేవాలయం అని తేలిన తర్వాతే ఆ స్థలానికి ప్రార్థనా స్థలాల చట్టం వర్తిస్తుందని హిందువుల తరఫు న్యాయవాదులు చెప్పారు. 1936 నుంచి ఈ స్థలంపై ఇరుపక్షాల మధ్య కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. 1991 కేసులో సైతం సదరు చట్టం గురించి ప్రస్తావన వచ్చింది. ఇక్కడ మసీదును గుడిపై కట్టినందున సదరు చట్టం వర్తించదని అప్పట్లో హిందువుల తరఫు న్యాయవాదులు వాదించారు. అనంతరం ఈ కేసు హైకోర్టుకు చేరి నిలిచిపోయింది. భద్రతపై ఆందోళన ‘‘చిన్న సివిల్ కేసును అసాధారణ కేసుగా మార్చారు. దీంతో అంతటా భయోత్పాత వాతావరణం నెలకొంది. చివరకు నా భద్రతపై నా కుటుంబసభ్యులు, వారి భద్రతపై నేను ఆందోళనపడుతున్నాము. ఇంటి నుంచి బయటకు వస్తే నాకేం జరుగుతుందోనని నా భార్య భయపడుతోంది’’ – జస్టిస్ రవి కుమార్ దివాకర్ తాజ్‌పై పిల్ కొట్టివేత సాక్షి, న్యూఢిల్లీ: తాజ్‌మహల్ చరిత్రపై నిజ నిర్థారణ జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. తాజ్ ఆవరణలోని మూసి ఉన్న 22 గదుల కారణంగా తన చట్టబద్ధ హక్కులకు భంగం ఎలా వాటిల్లుతోందో వివరించడంలో పిటిషనర్ విఫలమయ్యారని పేర్కొంది. పిటిషన్‌దారు చెబుతున్నట్లుగా ఆర్టికల్–226 ఈ అంశంలో వర్తించదని స్పష్టం చేసింది. శివాలయం ఉన్న తేజో మహాలయను తాజ్‌మహల్‌గా మార్చారని, దాంట్లోని 22 గదుల సమాచారం తెలపాలని ఆదేశాలివ్వాలంటూ బీజేపీ అయోధ్య విభాగం మీడియా ఇన్‌ఛార్జి డాక్టర్ రజ్నీష్ సింగ్ వేసిన పిల్‌ను గురువారం జస్టిస్ డీకే ఉపాధ్యాయ, జస్టిస్ సుభాష్ విద్యార్థిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ విషయమై ఆగ్రా జిల్లా కోర్టులో ఇప్పటికే ఓ పిటిషన్ ఉందని, తాజా పిల్ ఈ కోర్టు పరిధిలోని కాదని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ధర్మాసనం జోక్యం చేసుకొని ‘‘తాజ్‌ను షాజహాన్ నిర్మించలేదని అంటారా? ఎవరు కట్టారు? వయసెంత? అని తీర్పు ఇవ్వడానికి మేమున్నామా.. మీరు నమ్మే చారిత్రక వాస్తవాల్లోకి మమ్మల్ని తీసుకెళ్లొద్దు. నిజాలు తెలుసుకోవాలంటే వెళ్లి పరిశోధన చేయండి.. ఎంఏ, పీహెచ్డీ చేయండి.. ఏదైనా సంస్థ/వర్సిటీ నిరాకరిస్తే అపుడు కోర్టుకు రావొచ్చు’’అని వ్యాఖ్యానించింది. పిల్కున్న ఉద్దేశాన్ని అపహాస్యం చేయొద్దని పేర్కొంది. పిల్‌ను వెనక్కి తీసుకుని, మరో పిటిషన్ వేస్తామంటూ చేసిన వినతిని కూడా న్యాయస్థానం తోసిపుచ్చింది. -
హైకోర్టుకు ‘మందిర్–మసీదు’ వివాదం
అలహాబాద్: చాలా ఏళ్ల నాటి కాశీ విశ్వనాథుడి ఆలయం–జ్ఞాన్వాపి మసీదు వివాదం అలహాబాద్ హైకోర్టుకు చేరింది. ఇందుకు సంబంధించిన రెండు పిటిషన్లను ప్రత్యేక బెంచ్‌కు పంపాలని కోర్టు బుధవారం తమ రిజిస్ట్రీని కోరింది. వారణాసిలోని అంజుమాన్ ఇంటాజామియా మసీదు, లక్నోలోని యూపీ సున్నీ వక్ఫ్ కేంద్ర బోర్డు రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేయడంతో న్యాయవాది జస్టిస్ సంగీత చంద్ర ఈ ఆదేశాలు జారీచేశారు. 1997, 1998లో వారణాసి అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జీ(ఏడీజే) జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ అంజూమన్ మసీదు కోర్టును ఆశ్రయించింది. కాశీ విశ్వనాథుడి ఆలయ ట్రస్టు దాఖలు చేసిన సివిల్ వ్యాజ్యాన్ని సవాలు చేస్తూ అంజూమన్ వేసిన పిటిషన్‌ను ఏడీజే కొట్టివేశారు. మసీదు వెలిసిన ఆ స్థలంలో మహారాజా విక్రమాదిత్యుడు 2 వేల ఏళ్లకు పూర్వమే ఆలయాన్ని నిర్మించారని ట్రస్ట్ 1991లో దాఖలు చేసిన తన పిటిషన్లో పేర్కొంది. 1664లో మొఘల్ పాలకుడు ఔరంగజేబు ఆలయాన్ని కూల్చివేసి, అక్కడ మసీదును నిర్మించారని ఆరోపించింది. మసీదును అక్కడి నుంచి తొలగించి ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరింది. అయితే ‘మందిర్–మసీదు’ వివాదాన్ని సివిల్ కోర్టు పరిష్కచడం చట్టం ప్రకారం సాధ్యం కాదని, కాబట్టి ట్రస్ట్ పిటిషన్‌ను తిరస్కరించాలని ఇంటాజామియా మసీదు ఏడీజేని ఆశ్రయించినా నిరాశే ఎదురరైంది. ట్రస్ట్ దాఖలు చేసిన పౌర వ్యాజ్యంలో తమనూ కక్షిదారులను చేయాలన్న విజ్ఞప్తిని ఏడీజే తోసిపుచ్చడంతో సున్నీ వక్ఫ్ బోర్డు కోర్టు గడప తొక్కింది.