దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన జ్ఞానవాపి మసీదు కేసు విచారణను వారాణాసి జిల్లా కోర్టు సోమవారానికి(మే30) వాయిదా వేసింది. కాశీ విశ్వనాథ్- జ్ఞానవాపి కాంప్లెక్స్‌లో శిృంగార్ గౌరి కాంప్లెక్స్‌లోని దేవతామూర్తులకు నిత్య పూజలకు అనుమతి ఇవ్వడంతోపాటు శివలింగాన్ని సంబంధించిన సర్వే కొనసాగించాలంటూ హిందూ వర్గం నుంచి రెండు పిటిషన్లు దాఖలు చేశాయి. దీనిపై అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
కేసు మెయింటెనబుల్‌గా లేదని చెబుతూ సివిల్ ప్రొసీజర్ కోడ్ ఆర్డర్ 7 రూల్ 11 ప్రకారం హిందువుల తరపు పిటిషన్‌ను కొట్టివేయాలని మసీదు కమిటీ తరఫు న్యాయవాది అభయ్ నాథ్ యాదవ్ వాదనలు వినిపించారు. 1991 ప్రార్థనాస్థలాల చట్టం ప్రకారం జ్ఞానవాపి మసీదుపై దాఖలైన పిటిషన్లను కొట్టేయాలని కోరారు. ప్రజల మనోభావాలను దెబ్బతిసేందుకే శివలింగం పేరుతో పుకార్లు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన విచారణ దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది. విచారణ సందర్భంగా పిటిషనర్లు, లాయర్లు, ప్రతివాదులను మాత్రమే కోర్టు లోపలికి అనుమతించారు. రెండురోజులపాటు ఇరుపక్షాల వాదనలు విన్న వారణాసి జిల్లా జడ్జి అజయ్‌కృష్ణ విశ్వేశ్.. విచారణను సోమవారానికి వాయిదా వేశారు.
చదవండి: మహిళా ఎంపీపై బీజేపీ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment