
సాక్షి, హైదరాబాద్: జ్ఞానవాపి మసీద్ కేసులో విచారణ గురువారానికి వాయిదా పడింది. ఈ నెల 26వ తేదీన విచారణ చేపట్టనున్నట్టు వారణాసి జిల్లా కోర్టు మంగళవారం జరిగిన విచారణలో భాగంగా స్పష్టం చేసింది. కాగా, సర్వే నివేదికలో ఏవైనా అభ్యంతరాలుంటే వారం రోజుల్లో వెల్లడించాలని హిందూ, ముస్లిం పక్షాలను కోర్టు ఆదేశించింది.
ఇదిలా ఉండగా.. జ్ఞాన్‌వాపి మసీదు కేసుపై భిన్న వాదనలు కొనసాగుతున్నాయి. ఈ కేసును కొట్టివేయాలంటూ ముస్లిం పక్షం కోరుతుండగా.. మసీదులో శివలింగం కనిపించిదన్ని దీంతో అక్కడ ప్రతీ రోజు పూజలకు అనుమతించాలని హిందూ వర్గం కోరుతోంది. ఇక, ముస్లిం పక్షం చేసిన ఆర్డర్ 7 11 CPC దరఖాస్తుపై వారణాసి కోర్టు మే 26న విచారణ చేపట్టనుంది. అప్పటిదాకా యథాతథ స్థితిని కొనసాగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: కుతుబ్ మినార్‌లో ఆలయ పునరుద్ధరణ సాధ్యం కాదు..
Comments
Please login to add a commentAdd a comment