Hearing
-
కేపీహెచ్బీలో ప్లాట్ల వేలంపై హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్: కేపీహెచ్బీలో ప్లాట్ల వేలంపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. లేఅవుట్లో 54.29 ఎకరాల స్థలంలో ఉందన్న న్యాయమూర్తి.. అందులో 10 శాతం గ్రీనరీ కోసం వదిలేయాలి కదా అని ప్రశ్నించారు. గ్రీనరీ కోసం కేటాయించిన స్థలాన్ని ప్లాట్లుగా విక్రయిస్తున్నారా అని న్యాయమూర్తి ప్రశ్నించగా, 10 శాతం ఖాళీ స్థలాన్ని ఇప్పటికే జీహెచ్ఎంసీకి అప్పగించామని ఏజీ సమాధానమిచ్చారు.ఆసియాలోనే అతిపెద్ద, పాతదైన లేఅవుట్ కేపీహెచ్‌బీ కదా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. వేలం పాటలో ప్లాట్లు దక్కించుకున్న వాళ్లకు కేటాయింపులు చేయొద్దన్న హైకోర్టు.. లేఅవుట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే గురువారానికి వాయిదా వేసింది. -
సుప్రీంకోర్టులో నేడు ఆర్జీకర్ కేసు విచారణ
సాక్షి,ఢిల్లీ:కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసుపై బుధవారం(జనవరి22)సుప్రీంకోర్టు,కోల్‌కతా హైకోర్టుల్లో విచారణ జరగనుంది. కేసులో సీబీఐ దర్యాప్తు సరిగా లేదని ఈ కేసులో సమగ్ర దర్యాప్తు చేయాలని భాధితురాలి తల్లిదండ్రులు వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.ఈ పిటిషన్‌ను జస్టిస్ సంజీవ్ కన్నా,జస్టిస్ సంజయ్ కుమార్,జస్టిస్ కె వి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారించనుంది. ఈ కేసులో దోషి సంజయ్ రాయ్‌కి యావజ్జీవ కారాగార శిక్ష,50 వేల జరిమానా విధిస్తూ కోల్‌కతా కోర్టు జనవరి20వ తేదీన తీర్పిచ్చింది.సంజయ్‌రాయ్‌కి యావజ్జీవ కారాగర శిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ కోల్‌కతా హైకోర్టులో బెంగాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్‌ను కోల్‌కతా హైకోర్టు విచారించనుంది. జస్టిస్ దేబాంగ్షు బసక్, జస్టిస్ షబ్బర్ రష్దీలతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరపనుంది. కాగా, మహిళా ట్రైనీ డాక్టర్‌పై పాశవికంగా అత్యాచారం చేసి చంపినందుకుగాను దోషి సంజయ్‌రాయ్‌కి కోర్టు ఖచ్చితంగా మరణశిక్ష విధిస్తుందని అంతా భావించారు. అయితే అనూహ్యంగా అతడికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్షవిధించింది. దీంతో ఇటు హత్యాచారానికి గురైన ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులు, మెడికోలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సంజయ్‌కి మరణశిక్ష విధించాల్సిందేనని కోల్‌కతాలో మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. -
ఇవాల్టీ నుంచి కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ప్రారంభం
-
జగన్ కేసులతో మీకేం పని?
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసులతో మీకేం పనంటూ మాజీ ఎంపీ, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు సుప్రీం కోర్టు అక్షింతలు వేసింది. ఈ కేసుల విచారణను వేరే రాష్ట్రానికి బదలాయించాలన్న ఆయన అభ్యర్థనను తిరస్కరించింది. ఆ కేసులను మరో రాష్ట్రానికి బదలాయించే ప్రసక్తే లేదని, మహా అయితే ఈ కేసుల్లో విచారణను వేగవంతం చేయాలని కింది కోర్టుకు చెప్పగలమని స్పష్టం చేసింది.అంతే తప్ప ఎలా పడితే అలా ఆదేశాలు ఇవ్వలేమంది. జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణరాజు కోరుతున్న నేపథ్యంలో, అసలు ఆ కేసులతో మీకేం సంబంధమని ఆయన్ని నిలదీసింది. వాదనలు వినిపించేందుకు సీఐడీ గడువు కోరడంతో విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీ‹Ùచంద్ర శర్మ ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రఘురామకృష్ణరాజుకు ప్రత్యేక కోర్టు, హైకోర్టుల్లో చుక్కెదురు.. జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి సీఐడీ, ఈడీ పలువురిపై కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లో జగన్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జగన్‌పై నమోదైన కేసుల్లో సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ కొనసాగిస్తోంది. ఇదిలా ఉండగా, జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ రఘురామకృష్ణరాజు సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని ఆ కోర్టు కొట్టేసింది. ఆ తరువాత హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టులో సైతం రఘురామకృష్ణరాజుకు చుక్కెదురైంది. దీంతో జగన్ బెయిల్‌ను రద్దు చేయడంతో పాటు, ఆయనపై నమోదైన కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ ఆయన 2023లో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు పలుమార్లు విచారణ జరిపింది. తాజాగా సోమవారం ఈ వ్యాజ్యంపై జస్టిస్ నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. అసలు జగన్ కేసులతో మీకేం సంబంధమంటూ రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేసే ప్రసక్తేలేదని తేల్చి చెప్పింది.రాజకీయ విద్వేషంతోనే పిటిషన్ అనంతరం జగన్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. రాజకీయపరమైన విద్వేషంతోనే రఘురామకృష్ణరాజు ఈ పిటిషన్ దాఖలు చేశారన్నారు. సీఐబీ, ఈడీ నమోదు చేసిన కేసులపై సీబీఐ ప్రత్యేక కోర్టులో జరుగుతున్న విచారణను హైకోర్టు పర్యవేక్షిస్తోందని తెలిపారు. ప్రత్యేక కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. సీబీఐ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. కేసుల వివరాలు, వాటి ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేశామని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. సీబీఐ తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) మరో కేసులో వాదనలు వినిపిస్తున్నారని, అందువల్ల ఈ వ్యాజ్యంలో వాదనలు వినిపించేందుకు కొంత సమయం కావాలని సీబీఐ తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. -
రఘురామ కృష్ణంరాజు లాయర్‌కు సుప్రీంకోర్టు అక్షింతలు
సాక్షి, ఢిల్లీ: వైఎస్ జగన్ కేసుల విచారణ బదిలీ చేయాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం విచారణ జరిపింది. కేసుల విచారణ వేరే రాష్ట్రానికి బదిలీ చేయలేమని జస్టిస్ బీవీ నాగరత్న స్పష్టం చేశారు. ఈ కేసులను హైకోర్టు చూసుకుంటుందన్నారు. త్వరగా విచారణ జరపాలని కోరుతామని వెల్లడించారు.ఈ కేసుతో మీకు సంబంధం ఏంటని రఘురామ కృష్ణంరాజు తరఫు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సీబీఐ తరఫు న్యాయవాది ఈ కేసులో వాదనలకు సమయం కోరారు. దాంతో విచారణను వచ్చే సోమవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. కేసులు విచారణను హైకోర్టు పర్యవేక్షిస్తుందని సీనియర్ న్యాయవాది ముకుల్.. కోర్టుకు తెలిపారు. ట్రయల్ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని ముకుల్ తెలిపారు. రాజకీయపరమైన పిటిషన్‌గా ముకుల్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: తనది రాక్షసపాలనే అని చెప్పడమే బాబు ఆంతర్యమా? -
ఈడీది బాధ్యతారాహిత్యం
న్యూఢిల్లీ: దర్యాప్తు సంస్థల పనితీరును కొన్నిసార్లు కోర్టులు తప్పుబట్టడం పరిపాటే. కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వంటి ప్రఖ్యాత దర్యాప్తు సంస్థ తీరును కేంద్ర ప్రభుత్వమే తప్పుబట్టిన అసాధారణ ఘటనకు సాక్షాత్తూ సుప్రీంకోర్టే వేదికైంది! ఛత్తీస్‌గఢ్ మద్యం కుంభకోణంలో తనకు బెయిల్ ఇవ్వకపోవడాన్ని అరుణ్‌పతి తివారీ అనే ఇండియన్ టెలికాం సరీ్వసెస్ ఆఫీసర్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ కేసు శుక్రవారం న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం ముందు విచారణకు వచి్చంది. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు వాదనలు వినిపించారు. అయితే ఈ కేసులో తామెవరితోనూ సరైన సంప్రదింపులు చేయకుండా ఈడీ పూర్తి అసమగ్రంగా అఫిడవిట్ దాఖలు చేసిందంటూ ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. దాంతో ఇది చాలా సీరియస్ అంశమంటూ ధర్మాసనం కూడా అసహనం వెలిబుచ్చింది. ‘‘ఈడీ జవాబుదారీతనంపైనే ఈ ఉదంతం ప్రశ్నలు లేవనెత్తుతోంది. అన్నివిధాలా సరిచూసుకున్న మీదట కౌంటర్ సమగ్రంగా దాఖలు చేయాల్సిన బాధ్యత ఈడీ అడ్వకేట్ ఆన్ రికార్డ్ (ఏఓఆర్)దే కదా’’ అని వ్యాఖ్యానించింది. ఈ తప్పిదానికి ఏఓఆర్ను బాధ్యున్ని చేయలేమని ఏఎస్జీ బదులివ్వడంతో అయిష్టంగానే విచారణను చేపట్టింది. కానీ ‘‘దీన్ని మేమింతటితో వదిలేయదలచుకోలేదు. మీ వ్యాఖ్యల నేపథ్యంలో, ఈడీ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్‌తో మీకేమీ సంబంధం లేదని చెప్పదలచుకున్నారా?’’ అని ఏఎస్జీని ప్రశ్నించింది. దాంతో అలాంటిదేమీ లేదని ఆయన బదులిచ్చారు. అఫిడవిట్‌ను ఓసారి సరిచూసుకోవాల్సి ఉందని చెప్పడమే తన ఉద్దేశమని వివరించారు. ‘‘ఇది కేవలం సమాచార లోపమే. అయితే ఈడీ వంటి దర్యాప్తు సంస్థలో ఇటువంటి తప్పిదం జరగకుండా ఉండాల్సింది. దీనిపై శాఖాపరమైన విచారణ జరిపి బాధ్యుడైన అధికారిని ధర్మాసనం ముందు నిలబెట్టాల్సిందిగా ఈడీ డైరెక్టర్‌ను ఇప్పటికే వ్యక్తిగతంగా కోరాను. దయచేసి విచారణ కొనసాగించండి’’ అని అభ్యరి్థంచారు. ధర్మాసనం మాత్రం విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది. ఇదీ చదవండి: ‘ఆప్’ సర్కార్‌కు ‘సుప్రీం’లో ఊరట -
నేడు సుప్రీంకోర్టులో అమరావతి కేసు విచారణ
ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో అమరావతి రాజధాని కేసు విచారణకు రానుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి ఏకైక రాజధాని అని ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం మూడేళ్లలో అమరావతి రాజధాని నిర్మాణం చేస్తామని తెలిపింది. కేసు విచారణను ముగించాలని ఏపీ ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొంది. చదవండి : ఆంధ్రప్రదేశ్‌కు 3 రాజధానులు! -
నేడు సుప్రీంకోర్టులో మాజీ ఎంపీ నందిగం సురేష్ బెయిల్ పిటిషన్ పై విచారణ
-
ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్‌పై విచారణ వాయిదా
హైదరాబాద్, సాక్షి: ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత అంశంపై అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. గురువారం మరోసారి ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఈ కేసుపై విచారణ చేపట్టింది. తొలుత కడియం శ్రీహరి తరఫున న్యాయవాది మయూర్‌రెడ్డి వాదనలు వినిపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫున న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపించారు.అసలు ఈ అప్పీల్లు దాఖలు చేసే అర్హత అసెంబ్లీ కార్యదర్శికి లేదని సీజే ధర్మాసనం తెలిపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్లను స్పీకర్ ముందు ఉంచాలని సింగిల్ జడ్జి ఆదేశించారు. ఆ తర్వాత స్పీకర్ సూచన మేరకు షెడ్యూల్‌ను రిజిస్ట్రీ ముందు ఉంచాలని అన్నారు. స్పీకర్ ముందు ఉంచనని చెప్పే అధికారం కార్యదర్శికి లేదని కోర్టు తెలిపింది. అసెంబ్లీ కార్యదర్శి ప్రభుత్వం నుంచి వేతనం పొందుతున్నారు. ఆయన కోర్టు ఉత్తర్వులు పాటించాల్సిందే. అధికారాలను ఎంజాయ్ చేస్తా.. విధులను మాత్రం నిర్వహించనని అంటే సరికాదని పేర్కొంది.అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ మెయింటనబుల్ కాదని అందుకే కొట్టివేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది గండ్ర మోహన్ రావు కోర్టుకు తెలిపారు. పార్టీ ఫిరాయించిన ఓ ఎమ్మెల్యే ఏకంగా ఎంపీగా పోటీ చేశారని చెప్పారు. వాదనల అనంతరం.. తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. అంతకుముందు సింగిల్ జడ్జి తీర్పును సీజే ధర్మాసనంలో అసెంబ్లీ కార్యదర్శి సవాల్ చేశారు. స్పీకర్ నిర్ణయాల్లో హైకోర్టు జోక్యం చేసుకోకూడదని పిటిషన్లో పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి తీర్పు వెలువరించారు.చదవండి: ‘ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు'.. 4 వారాలు గడువు -
ఢిల్లీ లిక్కర్ కేసు: విచారణ నవంబర్ 8కి వాయిదా
ఢిల్లీ, సాక్షి: ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. లిక్కర్ కేసు సీబీఐ ఛార్జ్ షీట్ జరిగిన విచారణకు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనిష్ సిసోడియా , ఎమ్మెల్సీ కవిత, ఇతర లిక్కర్ కేసు నిందితులు వర్చువల్ హాజయ్యారు. శనివారం సీబీఐ ఛార్జ్ షీట్‌పై విచారణ జరిపిన స్పెషల్ కోర్టు జడ్జ్ కావేరి భవేజా.. అనంతరం కేసును వాయిదా వేశారు. తదుపరి కేసు విచారణ నవంబర్ 8వ తేదీన చేపట్టనున్నట్లు కోర్టు పేర్కొంది.చదవండి: టమాటాలకు పోలీసు బందోబస్తు -
ఇకపై సుప్రీంకోర్టులో విచారణలు ప్రత్యక్ష ప్రసారం
-
సుప్రీంకోర్టులో అన్ని విచారణలు త్వరలో లైవ్
న్యూఢిల్లీ: పారదర్శకత విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు త్వరలో కొత్త చరిత్ర లిఖించనుంది. ఇకపై కోర్టులో జరిగే అన్ని కేసుల విచారణను ప్రత్యక్షప్రసారం(లైవ్ స్ట్రీమింగ్) చేసేందుకు చర్యలు ప్రారంభించింది. కేసుల ప్రత్యక్ష ప్రసారాల కోసం రూపొందించిన యాప్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. యాప్‌లో ఏమైనా మార్పులు అవసరమైతే చేసి త్వరలో అన్ని కేసుల విచారణను ప్రత్యక్షంగా ప్రసారం చేయనున్నారు. సుప్రీంకోర్టులో రెండేళ్ల నుంచి రాజ్యాంగ ధర్మాసనం ముందు జరుగుతున్న కేసుల విచారణను యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తురన్నారు.మహారాష్ట్ర శివసేన పార్టీ చీలిక కేసు విచారణను తొలిసారి ప్రత్యక్ష ప్రసారం చేశారు. అన్ని కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు 2018లోనే నిర్ణయించినప్పటికీ పలు కారణాల వల్ల అమలు ఆలస్యమైంది.ఇదీ చదవండి: ఈషా ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట -
TG: ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
హైదరాబాద్, సాక్షి: ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా పడింది. బుధవారం విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు తదుపరి విచారణను నవంబర్ 14వ తేదీకి వాయిదా వేసింది. జడ్జీ లీవ్‌లో ఉండటంతో కోర్టు కేసును వాయిదా వేసింది. ఇవాళ.. విచారణకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డి సహా ఇతర నిందితులను గత నెల 24న కోర్టు ఆదేశించింది. గత నెల 24న విచారణకు మత్తయ్య హాజరుకాగా, మిగతా నిందితులు గైర్హాజరు అయ్యారు. నేటి విచారణకు సీఎం రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా, వేం కృష్ణ కీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్లు హాజరు కావాల్సి ఉండగా.. కేవలం సండ్ర వెంకట వీరయ్య మాత్రమే హాజరయ్యారు. మరోవైపు.. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కోర్టుకు హాజరు కాకపోతే.. కోర్టు ముందు నిరాహార దీక్ష చేస్తానని మంగళవారం మత్తయ్య మీడియాతో అన్నారు.ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఈ కేసు దర్యాప్తు అయ్యే అవకాశం ఉందని, కాబట్టి కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌పై ఇటీవల సుప్రీం కోర్టు కీలకత తీర్పు వెల్లడించింది. ‘‘కేవలం అనుమానం పైనే పిటిషన్ వేశారు. అందుకే ఈ పిటిషన్లో మేం జోక్యం చేసుకోలేం. భవిష్యత్తులో సీఎం గనుక జోక్యం చేసుకుంటే మళ్ళీ కోర్టును ఆశ్రయించండి’’ అని స్పష్టం చేసింది.చదవండి: బాబు, రేవంత్ మరోసారి కుమ్మక్కయ్యారు: ఎమ్మెల్యే ఆర్కే -
తిరుమల లడ్డూ వివాదంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ
ఢిల్లీ: తిరుమల శ్రీవారీ లడ్డూ వివాదంపై దాఖలైన పిటిషన్లపై సోమవారం (సెప్టెంబర్30) సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది.తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో కల్తీ నెయ్యి వాడారన్న సీఎం చంద్రబాబు ఆరోపణలపై నిజా నిజాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ వివాదంలో వాస్తవాలు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి కూడా పిటిషన్ దాఖలు చేయగా.. ఈ రెండు పిటిషన్లను రేపు ఒకేసారి సుప్రీంకోర్టు విచారించనుంది. -
గ్రూప్–1పై తెలంగాణ హైకోర్టులో విచారణ
సాక్షి,హైదరాబాద్ : గ్రూప్–1పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో తెలంగాణ ప్రభుత్వం రెండోసారి గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది.పిటిషనర్ తరఫున జొన్నలగడ్డ సుధీర్ వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా..హైకోర్టు ప్రిలిమ్స్ మాత్రమే రద్దు చేసి తిరిగి పరీక్ష నిర్వహించాలని పిటీషనర్ వాదించారు. ఎస్టీ రిజర్వేషన్లు 6 నుంచి 10కి పెంచడానికి వీలులేదని తెలిపారు.అనంతరం, టీఎస్పీఎస్సీకి అన్ని అధికారలుంటాయని స్పెషల్ జీపీ (గవర్నమెంట్ ప్లీడర్)..చట్ట బద్ధంగా ఏర్పాటైన సంస్థ నియాకాల కోసం నిర్ణయం తీసుకోవచ్చని వెల్లడించారు. ఇరుపక్ష వాదనల విన్న కోర్టు తదుపరి విచారణ సోమవారానికి (అక్టోబర్1కి) వాయిదా వేసింది. -
బాధితురాలి ఫొటో, పేరు తొలగించండి: సుప్రీం కోర్టు
ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీ కర్ ఆసుపత్రి డాక్టర్ హత్యాచారం కేసును సుప్రీం కోర్టు విచారించింది. మంగళవారం సుప్రీం కోర్టు చేపట్టిన విచారణ సందర్భంగా.. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ నిద్ర పోవట్లేదు, నిజాన్ని వెలికితీసేందుకు కొంత సమయం ఇవ్వాలని పేర్కొంది. నేరానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీ సహా ఆధారాలను సీబీఐ ధ్వంసం చేసిందని ఎవరూ చెప్పలేరని తెలిపింది. బాధితురాలి ఫొటో, పేరును వీకిపీడియా నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సుప్రీం కోర్టు ఆదేశించింది. బాధితురాలి గౌరవాన్ని కాపాడే దృష్ట్యా, బాధితురాలిపై గుర్తింపును బహిర్గతం చేయరాదని పేర్కొంది. సీసీటీవీ ఫుటేజీ సహా నేరానికి సంబంధిచిన ఆధారాలన్నీ సీబీఐకి అప్పగించామని తెలిపిన పశ్చిమ బెంగాల్ పోలీసులు కోర్టుకు తెలిపారు.గత ఆదేశాల మేరకు ఈ కేసుకు సంబంధించిస్టేటస్ రిపోర్ట్‌ను సీబీఐ సుప్రీం కోర్టుకు సమర్పించింది. తాజా రిపోర్టుపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.కేసుకు సంబంధించి ఇప్పటివరకు గుర్తించిన వివరాలను బయటపెట్టడం వల్ల దర్యాప్తుపై ప్రభావం పడుతుందని తెలిపింది. ఇక.. ఇప్పటికే ప్రిన్సిపల్, స్టేషన్ హౌస్ ఆఫీసర్లను అరెస్టు చేశారు. దర్యాప్తు పూర్తయ్యేవరకు వేచి చూద్దామని పేర్కొంది.హాస్పిటల్స్‌లో టాయిలెట్స్, సీసీటీవీలు, బయోమెట్రిక్ ఏర్పాటుకు చేసేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సీనియర్, జూనియర్ డాక్టర్ల ప్రతినిధులను సంప్రదించాలని ఆదేశించింది. మహిళా డాక్టర్లు రాత్రిపూట పని చేయకూడదనే షరతు వారి కెరీర్‌పై ప్రభావం చూపుతుందని, డ్యూటీ టైమింగ్స్ డాక్టర్లందరికీ సహేతుకంగా ఉండాలని తెలిపింది. అయితే.. ఆ షరతును పభుత్వం తొలగిస్తుందని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీం కోర్టుకు తెలియజేశారు. మహిళల నైట్ డ్యూటీలకు నిషేధిస్తూ వారు 12 గంటల షిఫ్టుకు మించి పని చేయరాదని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌పై సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ నోటిఫికేషన్‌ను పరిశీలించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి చూచించింది. ఈ నొటిఫికేషన్ తాత్కాలికమేనని మరో నోటిఫికేషన్‌ను తీసుకువస్తుందని బెంగాల్ ప్రభుత్వం తరఫు న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీం కోర్టుకు తెలిపారు.చదవండి: అబద్ధాల పుట్ట సందీప్ ఘోష్.. అభయ కేసు దర్యాప్తుపై సీబీఐ అధికారులుమరోవైపు.. సోమవారం సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లు, ప్రభుత్వం మధ్య రెండున్నర గంటల పాటు జరిగిన సమావేశం జరిగింది. అనంతరం.. జూనియర్ డాక్టర్ల ఐదు డిమాండ్లలో సీఎం మమతా బెనర్జీ మూడింటిని ఆమోదించారు. వైద్య విద్య డైరెక్టర్, ఆరోగ్య సేవల డైరెక్టర్లను తొలగించడానికి అంగీకరించారు. వైద్యురాలి తల్లిదండ్రులకు డబ్బు ఇవ్వజూపారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కోల్‌కతా పోలీసు కమిషనర్ వినీత్ గోయల్ పైనా వేటు వేశారు. ఇక.. ఇవాళ కొత్త కమిషనర్‌ను నియమిస్తామని సీఎం మమత ప్రకటించారు.జూనియర్ల డాక్టర్ల ఇతర డిమాండ్లను పరిశీలించడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. ఐదింటిలో మూడు డిమాండ్లను అంగీకరించినందుకు సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని జూనియర్ డాక్టర్లను కోరినట్లు మమత వెల్లడించారు. జూడాలపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు ఉండవని ప్రకటించారు. ఇక.. సమ్మె విషయంపై చర్చించుకొని తమ నిర్ణయం చెబుతామని జూనియర్ డాక్టర్లు తెలిపారని సీఎం మమత వెల్లడించారు. -
‘కొంచెం గొంతు తగ్గించి మాట్లాడండి’: న్యాయవాదిపై సీజేఐ ఆగ్రహం
కోల్‌కతా: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఆర్జీకర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో జరిగిన జూనియర్ వైద్యురాలి హత్యాచారం కేసుపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా న్యాయవాదిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. బీజేపీ నేత, న్యాయవాది కౌస్తవ్ బాగ్చి మాట్లాడుతున్న సందర్భంలో జోక్యం చేసుకున్న సీజేఐ.. న్యాయవాదిని గొంతు తగ్గించి మాట్లాడాలని హెచ్చరించారు.ఈసలేం జరిగిందంటే.. కోల్‌కతా ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా బెంగాల్ ప్రభుత్వం తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ.. ఆగష్టు 9న ప్రభుత్వ ఆధీనంలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో జరిగిన సంఘటనపై నిరసనలు చేస్తున్న వారిపై న్యాయవాది కౌస్తవ్ బాగ్చి రాళ్లు రువ్వుతున్నట్లు నిరూపించేందుకు తన వద్ద వీడియోలు, ఫోటోలు ఉన్నాయని పేర్కొన్నారు. కాగా కౌస్తవ్ బాగ్చి బీజేపీ నేత.. ఈ ఏడాదిఫిబ్రవరిలో ఆయన కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. కపిల్ సిబల్ ఆరోపణలపై.. న్యాయవాది కౌస్తవ్ స్పందిస్తూ.. ఒక సీనియర్ న్యాయవాది కోర్టులో అలాంటి ప్రకటనలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలో సీజేఐ కల్పించుకొని.. మీ ముందు ముగ్గురు న్యాయమూర్తులు ఉన్నారు. ముందు గొంతు తగ్గించుకొని మాట్లాడండి’ అంటూ హెచ్చరించారు.‘గత రెండు గంటలుగా మీ ప్రవర్తనను గమనిస్తున్నాను. మీ మీ పిచ్‌ని ముందు తగ్గించడండి. మీరు న్యాయమూర్తులను ఉద్ధేశించి మాట్లాడుతున్నారు. కోర్టు వెలుపల ఉన్న గ్యాలరీని ఉద్దేశించి కాదు.’ అంటూ మండిపడ్డారు. దీంతో న్యాయవాది కౌస్తవ్ త్రిసభ్య ధర్మాసనానికి క్షమాపణలు తెలియజేశారు.ఇక చీఫ్ జస్టిస్ బాగ్చీని మందలించడంపై తృణమూల్ కాంగ్రెస్ స్పందించింది. ‘పార్ట్‌టైమ్ న్యాయవాది, ఫుల్‌టైం బీజేపీ కార్యకర్త అయిన కౌస్తవ్ బాగ్చి నుంచి ఇంకా ఏం ఆశించగలమని మండిపడింది. తమ(బీజేపీ) పాలనలో ఉన్న రాష్ట్రాల్లో మాదిరి కోర్టు గదిని బుల్డోజ్ చేయవచ్చని భావించే వీరి నుంచి ఇలాంటి ప్రవర్దనే ఉంటుందని విమర్శలు గుప్పించింది. నేడు సీజేఐ అతన్ని సరిగ్గా మందలించింది అంటూ తెలిపిందిఇదిలా ఉండగా మంగళవారం నాటికి నిరసనలు చేస్తున్న వైద్యులు వెంటనే విధుల్లో చేరాలని సీజేఐ డీవే చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. మంగళవారం సాయంత్రం 5 గంటల్లోపు ఆందోళనలు చేస్తున్న డాక్టర్లు విధుల్లో చేరితే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, ఒక వేళ విధుల్లోకి రాకపోతే వారిపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని తెలిపింది.అలాగే బాధితురాలికి సంబంధించిన ఫొటోలు, దృశ్యాలు అన్నీ సోషల్ మీడియా వేదికల నుంచి వెంటనే తొలగించాలని ఆదేశించింది. ఇక ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐని విచారణపై కొత్త నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఇందుకు సెప్టెంబర 17 వరకు గడువిచ్చింది. ఈ కేసు విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది -
సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
న్యూఢిల్లీ,సాక్షి: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా డాక్టర్ హత్యాచార ఘటనపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా హత్యాచార ఘటన, కేసు దర్యాప్తు, ఆస్పత్రిలో దాడిపై కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ ఘటన చోటు చేసుకున్న ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తీరుపై మండిపడింది. ఈ ఘటనపై సుప్రీం కోర్టు సీజేఐ డీ.వై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్‌లు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాల ధర్మాసనం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధితురాలి వీడియోలు, ఫోటోలు బయటకు రావటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. డాక్టర్ల రక్షణకు తాము చర్యలు తీసుకుంటామని తెలిపింది.డాక్టర్ హత్యాచారం కేసు నమోదులో జాప్యంపై కోర్టు ఆగ్రహించింది. మృతదేహానికి ఆ రోజు రాత్రి 8.30 గంటలకు అంత్యక్రియలు జరిగాయ. మహిళా డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రిన్సిపాల్ చిత్రీకరించారు. దుండగులను కట్టడి చేయటంతో బెంగాల్ ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. మృతురాలి తల్లిదండ్రులను 3 గంటల పాటు ఎందుకు వేచిచూసేలా చేశారని ప్రశ్నించింది. ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారని, ఆయన్ను తొలిగించి, మళ్లీ ఎందుకు నియమించారని ప్రశ్నించింది. ఈ నెల 22లోగా స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని సీబీఐకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.డాక్టర్ల రక్షణకు నేషనల్ టాస్క్ ఫోర్స్..డాక్టర్ల రక్షణకు పది మంది ప్రముఖ డాక్టర్లతో జాతీయ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామని సుప్రీం కోర్టు వెల్లడించింది. ఇందులో హైదరాబాద్‌కు చెందిన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ గ్యాస్ట్రాలజీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్తి శరిన్, ఎయిమ్స్ ఢిల్లీ డైరెక్టర్ ఎం. శ్రీనివాస్ తదితరులు సభ్యులుగా ఉంటారని తెలిపింది. అదేవిధంగా అన్ని వర్గాలను టాస్క్ ఫోర్స్ సంప్రదించి రిపోర్టు తయారు చేయాలి. అన్ని ఆస్పత్రుల్లో సురక్షిత పరిస్థితులను కల్పించాలి. మూడు వారాల్లోగా మధ్యంతర నివేదికను, రెండు నెలల్లో పూర్తి నివేదికను సమర్పించాలని జాతీయ టాస్క్ ఫోర్స్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. మరోవైపు.. ఈనెల 22 లోపు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.శాంతియుత నిరసనలను అడ్డుకోవద్దుహత్యాచార ఘటనపై శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసేవారిపై అధికారం చెలాయించవద్దని బెంగాల్ ప్రభుత్వానికి సీజేఐ ఆదేశించారు. డాక్టర్లు, విద్యార్థులు, పౌరసమాజాన్ని అడ్డుకోవద్దని సూచించారు.ఆర్జీ కర్ ఆస్పత్రిలో హత్యాచార ఘటన తర్వాత.. అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. అక్కడ పని చేసే డాక్టర్లు, వైద్య సిబ్బందిపై ఆందోళనకారుల పేరిట కొందరు భౌతిక దాడులకు దిగారు. పోలీసుల రక్షణ కల్పించినప్పటికీ.. వాళ్లంతా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అయితే వాళ్ల ఆవేదనను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఓ యువలాయర్. ప్రొటెక్ట్ ది వారియర్స్ తరఫున అపరాజిత అనే న్యాయవాది ఈ విషయాన్ని సీజేఐ ధర్మాసనం వద్ద ప్రస్తావించారు. ఓ సీల్డ్ కవర్లో ఇందుకు సంబంధించిన వివరాల్ని ఆమె అందజేశారు. ఆ నివేదికను పరిశీలించిన సీజేఐ .. ఆస్పత్రిలో పరిస్థితి తీవ్రంగానే ఉందన్న అభిప్రాయంతో ఏకీభవించారు.కేసు వివరాలు..ఆగస్టు 9న వెలుగులోకి వచ్చిన కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కళాశాలలో డాక్టర్ హత్యాచార ఘటనలో సంజయ్ రాయ్‌ను ప్రధాన నిందితుడిగా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు పోలీసులకు అనుబంధ వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత కాలేజీ ప్రిన్సిపల్‌గా ఉన్న డాక్టర్ సందీప్ ఘోష్ రాజీనామా చేశారు. ఆ తర్వాత కొద్ది గంటల వ్యవధిలోనే కలకత్తా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు ప్రిన్సిపల్‌గా నియమితులయ్యారు. ఈ నియామకం వివాదాస్పదం కావడంతో కలకత్తా హైకోర్టు స్పందించింది. సందీప్ ఘోష్ సుదీర్ఘ సెలవులో ఉండాలని ఆదేశించింది. మృతురాలి తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేట్టిన కోల్‌కతా హైకోర్టు ఈ కేసు విచారణను సీబీఐకి బదిలీ చేసింది.ఘటన జరిగిన సమయంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌గా ఉన్న సందీప్ ఘోష్‌ను కొద్దిరోజులుగా సీబీఐ విచారిస్తోంది. ఆయనపై సీబీఐ పలు ప్రశ్నల సంధించింది. వాటిలో కొన్ని ప్రశ్నలు జాతీయ మీడియాలో దర్శనం ఇచ్చాయి. ‘హాస్పిటల్లో చోటుచేసుకున్న మృతిని ఆత్మహత్యగా ప్రకటించాల్సిన తొందరేమొచ్చింది?. ఎవరి సలహా మేరకు ఘటన సమాచారం కుటుంబ సభ్యులకు ఇచ్చారు? అందులో వాస్తవాలను ఎందుకు ప్రస్తావించలేదు?. నేరం జరిగిన ప్రాంతాన్ని భద్రంగా ఉంచడం ముఖ్యమని మీకు అనిపించలేదా?. క్రైమ్‌సీన్‌లో సాక్ష్యాలను తారుమారు చేయడం నేరమని మీకు తెలుసు. మరి విచారణ పూర్తి అయ్యేవరకు ఎందుకు భద్రంగా ఉంచలేదు?. బాధితురాలి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంలో ఎందుకు ఆలస్యం జరిగింది..? మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు చూపించటంలో ఎందుకు ఆలస్యం చేశారు?’ అని సీబీఐ ప్రశ్నల వర్షం కురిపించింది. -
సుప్రీంకోర్టుపై హైకోర్టు జడ్జి విమర్శలు.. నేడు విచారించనున్న సీజేఐ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు విచిత్ర పరిస్థితిని ఎదుర్కోనుంది. తనకు సంబంధించిన కేసును తానే విచారించనుంది. పంజాబ్ హర్యానా హైకోర్టు జడ్జి జస్టిస్ షెరావత్ తమపై చేసిన విమర్శలను చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం బుధవారం(ఆగస్టు7) విచారించనుంది. హైకోర్టు జడ్జి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఎలా స్పందించనుందనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. ఓ కోర్టు ధిక్కార కేసులో తానిచ్చిన ఆదేశాలపై సుప్రీం స్టే ఇవ్వడంపై పంజాబ్ హర్యానా హైకోర్టు జడ్జి షెరావత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సుప్రీం కోర్టు తనను కాస్త ఎక్కువ ఊహించుకుంటోందని, అదే సమయంలో హైకోర్టును కాస్త తక్కువ అనుకుంటోందని వ్యాఖ్యానించారు.సుప్రీంకోర్టుకు రాజ్యాంగంలో ప్రత్యేక స్థాయి ఉందని, ఎప్పుడు పడితే ఎలా పడితే అలా ఆదేశాలిచ్చేందుకు వీలు లేదని అన్నారు. పంజాబ్ హర్యానా హైకోర్టు జడ్జి జస్టిస్ షెరావత్ చేసిన ఈ వ్యాఖ్యల అంశాన్ని సుప్రీంకోర్టు మంగళవారమే సుమోటోగా విచారణకు స్వీకరించింది. -
నీట్ ప్రశ్నకు ఒకే ఆన్సర్.. సుప్రీంకు నిపుణుల కమిటీ రిపోర్టు
ఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ పిటిషన్లపై మంగళవారం సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జిస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం విచారణ జరుపుతోంది. కోర్టు ఆదేశాల మేరకు నీట్ పరీక్షలో వచ్చిన ఓ ప్రశ్నపై ఐఐటీ ఢిల్లీ నిపుణుల కమిటీ ఇవాళ నివేదిక అందించింది. ఆ ప్రశ్నకు రెండు సమాధానాలు కాదని, ఒక్కటే ఉందని వెల్లడించింది. ఫిజిక్స్‌కు సంబంధించిన ఓ ప్రశ్నకు రెండు సమాధాలనాలు ఇచ్చి.. మార్కులు మాత్రం ఒక్క దానికే వేశారని పిటిషనర్లు సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. ఇక.. నీట్ యూజీ పరీక్షను రద్దుచేసి మళ్లీ నిర్వహించాలని దాదాపు 40 పిటిషన్లు దాఖలైన పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది.పరీక్ష రద్దు చేయాలంటూ, రద్దు చేయొద్దంటూ దాఖలు చేసిన వారి వాదనలు సుప్రీంకోర్టులో పూర్తయ్యాయి. ఇక కేంద్రం తరఫు వాదనలు మిగిలి ఉన్నాయి. అయితే ఇవాళ కేంద్రం వాదనలు పూర్తయితే త్వరగా తీర్పు వెలువరించే అవకాశాలున్నాయి. సోమవారం విచారణలో ఒక ప్రశ్నపై తీవ్రమైన చర్చ జరిగింది. ఒక ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్లలో రెండు సరైన సమాధానాలు ఉన్నాయని, వీటిల్లో ఒకటి ఎంచుకున్న అభ్యర్థులకు మార్కులేసి రెండోది ఎంచుకున్న అభ్యర్థులకు మార్కులు వేయలేదని దీనిపై తేల్చాలని కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. రెండింటిలో సరైన సమాధానం ఏది? అనే దానిపై స్పష్టత వస్తే అభ్యర్థుల తుది జాబితా మెరిట్ లిస్ట్‌లో మార్పులు చేసుకునే అవకాశం ఉంది. ఈ అంశంపై తొలుత పిటిషన్ల తరఫు న్యాయవాది వాదించారు. ‘‘ఈ ప్రశ్నకు సమాధానం రాసేందుకు ప్రయత్నించిన అభ్యర్థుల్ని మూడురకాలుగా విడగొట్టాలి.ఎందుకంటే రెండు ‘సరైన’ సమాధానాల్లో ఒకదానికి ఎంచుకున్న వాళ్లకు నెగిటివ్ మార్కింగ్ కారణంగా ఐదు మార్కులు పోయాయి. రెండో సమాధానం ఎంచుకున్న వాళ్లకు నాలుగు మార్కులు పడ్డాయి. రెండింటిలో ఏది కరెక్టో తేల్చుకోలేక, నెగిటివ్ మార్కింగ్ వల్ల మార్కులు పోతాయన్న భయంతో సమాధానం రాయకుండా వదిలేసిన వాళ్లూ ఉన్నారు’’అని న్యాయవాది వివరించారు. దీంతో ధర్మాసనం స్పందించింది. ‘‘ఫిజిక్స్ విభాగంలో అణువుకు సంబంధించిన ప్రశ్నలో నాలుగు ఆప్షన్లలో రెండు సరైన సమాధానాలు ఉన్నాయన్న వాదనల నడుమ అసలైన సమాధానాన్ని తేల్చాల్సిన సమయమొచి్చంది. అందుకోసం ముగ్గురు విషయ నిపుణులతో కూడిన బృందాన్ని ఏర్పాటుచేయండి. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలలోపు మాకు సరైన సమాధానమేంటో నివేదించండి’’ అని ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్‌ను కోర్టు ఆదేశించింది. -
నీట్ రద్దు పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ రేపటికి వాయిదా
ఢిల్లీ: నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని, రద్దు చేసి తిరిగి నిర్వహించాలని దాఖలైన పదుల సంఖ్యలో పిటిష్లున్లపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్‌లు జేబీ పార్ధివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా పరీక్ష సెంటర్ల వారీగా విడుదల చేసిన ఫలితాల్లో కూడా గందరగోళం ఉందన్న పిటిషనర్ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థి గుజరాత్ నుంచి బెల్గావి వెళ్లి పరీక్ష రాస్తే.. 700పైగా మార్కులు వచ్చాయని చెప్పారు. ఎన్టీఏ నుంచి బ్యాంక్ లాకర్లకు పేపర్లు చేరడానికి మధ్యలో ఏదో జరిగిందని తెలిపారు.విచారణ సందర్భంగా.. ఫిజిక్స్ పేపర్లోని 19వ ప్రశ్నకు రెండు ఆప్షన్లు సరైనవిగా ఎన్సీఈఆర్టీ పేర్కొందని, కొత్త ఎన్సీఈఆర్టీ ఎడిషన్ ప్రకారం, ఆప్షన్ 4 సరైన సమాధానం అని ఉంటే, మునుపటి ఎడిషన్ల ప్రకారం ఆప్షన్ 2 సరైనదిగా పేర్కొన్న విద్యార్థులకు కూడా షనల్ టెస్టింగ్ ఏజెన్సీ గ్రేస్ మార్కులు కలిపిందని పిటిషనర్ తన న్యాయవాది ద్వారాకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.దీనికిసీజేఐ బదులిస్తూ.. తాజా ఎన్సీఈఆర్టీ ఎడిషన్‌లోని సూచనలే పరిగణలోకి తీసుకోవాలని, అయితే ఆప్షన్‌కు సమాధానం ఇచ్చిన వారికి పూర్తి మార్కులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. ఎందుకు ఎన్టీయే అలా చేసిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించారు. అయితే రెండూ సాధ్యమయ్యే సమాధానాలేనని ఎస్జీ బదులిచ్చారు.అయితే ఇది సరైనది కాదని, ఏదైనా ఒక ఆప్షన్‌ను మాత్రమే ఎంపిక చేయాలని, రెండూ సరైన సమాధానాలు కాలేవని సీజేఐ పేర్కొన్నారుఈ సమస్యను పరిష్కరించేందుకు ఢిల్లీ ఐఐటీ నుంచి నిపుణుల అభిప్రాయం తీసుకోవాలని డీవై చంద్రచూడ్ తెలిపారు. "సంబంధిత సబ్జెక్టుకు సంబంధించి ముగ్గురు నిపుణులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేయవలసిందిగా ఐఐటీT ఢిల్లీ డైరెక్టర్‌ను కోరారు. ఈ నిపుణుల బృందం సరైన ఆప్షన్‌పై అభిప్రాయాన్ని రూపొందించి, రేపు మధ్యాహ్నం 12 గంటలలోపు రిజిస్ట్రార్‌కు తెలియజేయవలసిందిగా ఆదేశించారు. మరోవైపు.. నీట్ పరీక్ష తిరిగి నిర్వహించాల్సిన అవసరం లేదన్న కేంద్రం పేర్కొంది. ఇరు వర్గాల సుధీర్ఘ వాదనల అనంతరం తదుపరి విచారణను సర్వోన్నత న్యాయ స్థానం రేపటికి(మంగళావారం) వాయిదా వేసింది.ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పరీక్ష కేంద్రాల వారీగా నీట్ పరీక్ష ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ( ఎన్టీఏ) విడుదల చేసిన విషయం తెలిసిందే. పరీక్ష రద్దు కోరుతూ 38 పిటిషన్లు దాఖలు కాగా.. అదేవిధంగా పలు రాష్ట్రాలోని హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లు సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కోరిన ఎన్టీఏ రెండు పిటిషన్లపైనా సుప్రీం విచారణ జరపుతోంది. -
ఎన్నికల బాండ్లలో క్విడ్ ప్రో కో..? నేడు సుప్రీంలో విచారణ
న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్లపై సుప్రీంకోర్టులో శుక్రవారం(జులై 19) కీలక విచారణ జరగనుంది. ఎన్నికల బాండ్ల వెనుక జరిగిన వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేసి న్యాయవ్యవస్థ పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.బడా కార్పొరేట్ కంపెనీల నుంచి కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు ఎన్నికల బాండ్ల రూపంలో భారీగా నిధులు పొందాయని పిటిషనర్లు తెలిపారు. ఇందుకు ప్రతిఫలంగా ఆయా కంపెనీలను సీబీఐ, ఈడీ వంటి ఏజెన్సీల విచారణ నుంచి తప్పించడం లేదంటే పాలసీల్లో మార్పులు చేసి వాణిజ్యపరంగా వాటికి భారీ లబ్ధి చేకూర్చడం వంటి క్విడ్ ప్రో కో జరిగిందని పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు కీలకంగా మారనుంది. కాగా, ఇప్పటికే ఎన్నికల బాండ్ల స్కీమ్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. -
‘నీట్’ పేపర్ లీకేజీపై నేడు సుప్రీంలో విచారణ
ఢిల్లీ: ఇవాళ సుప్రీం కోర్టులో నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీ, అవతకవకలపై విచారణ జరగనుంది. సుప్రీం కోర్టు సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది.చివరి సారిగా ‘జులై 8న అత్యున్నత న్యాయ స్థానంలో నీట్ లీకేజీపై వ్యవహారంపై విచారణ జరిగింది. ఆ సమయంలో ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) , కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పేపర్ లీకేజీపై తమ స్పందనలు తెలియజేస్తూ అఫిడవిట్లను దాఖలు చేశాయి. ఆ అఫిడవిట్లు అందరు పిటిషన్‌దారులకు ఇంకా చేరలేదు. వాటిని పరిశీలించేందుకు వీలుగా సమయమిస్తూ తదుపరి విచారణ జులై 18కి వాయిదా వేస్తున్నాం’ అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారుసీల్డ్ కవర్లో సీబీఐ దర్యాప్తు నివేదికవిచారణ సందర్భంగా నీట్ పరీక్షలో మాల్ ప్రాక్టీస్ కే పరిమితమని అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది. ఐఐటి మద్రాస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా అసాధారణ మార్కులు ఏ అభ్యర్థులకు రాలేదని స్పష్టం చేయగా.. నీట్ లీక్‌పై సీబీఐ తన దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు అందించింది. ఈ వరుస పరిణామల నేపథ్యంలో ఇవాళ నీట్‌పై సుప్రీం కోర్టులో కీలక విచారణ జరగనుంది. నీట్లో పేపర్ లీకేజీపై వరుస అరెస్ట్లుమరోవైపు నీట్ పేపర్ లీకేజీ నిందితులను అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి. కేంద్రం ఆదేశాలతో దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు ఈ కేసులో ఇప్పటి వరకు 14మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. తాజాగా ఈ వారంలో.. కీలక నిందితుడు పంకజ్ కుమార్ అలియాస్ ఆదిత్య, అతని సహాయకుడు రాజుసింస్‌ను అదుపులోకి తీసుకున్నారు. సీబీఐ అధికారుల విచారణలో పంకజ్ కుమార్ హజారీబాగ్‌లోని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి నీట్ ప్రశ్నపత్రం తస్కరించినట్లు అధికారులు తెలిపారు. నిందితుల్లో మొత్తం ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. -
‘విద్యుత్’ విచారణలో దాపరికం లేదు: తెలంగాణ సర్కార్ వాదనలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. దీంతో హైకోర్టును తీర్పును రిజర్వ్ చేసింది. గత బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయంటూ తెలంగాణ ప్రభుత్వం వేసిన జ్యూడిషియల్ కమిషన్‌ను రద్దు చేయాలని కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. గురువారం సైతం ఈ పిటిషన్‌పై విచారణ జరగ్గా.. ఇవాళ సైతం వాదనలు కొనసాగాయి. విద్యుత్ కొనుగోళ్లలో ఎక్కడా అవకతవకలు జరగలేదని.. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటైందని కేసీఆర్ తరఫు న్యాయవాది ఆదిత్య సోందీ వాదించారు. ఇవాళ ప్రభుత్వం తరుపున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘‘కమిషన్ ఏర్పాటు విషయంలో కోర్టులు కలుగజేసుకోలేవు. 15 మంది సాక్ష్యులను ఇప్పటి వరకు కమిషన్ విచారించింది. అందులో ట్రాన్స్‌కో, జెన్కో అధికారులున్నారు. ప్రభాకర్‌రావును సైతం విచారించింది. కేసీఆర్‌కు కమిషన్ ఏప్రిల్‌లో నోటీసులు జారీ చేసింది. పార్లమెంట్ ఎన్నికల కారణంగా జూలై వరకు రావడం కుదరదని చెప్పారు. జూన్ 30 వరకు కమిషన్ గడువు ముగుస్తున్నందున జూన్ 15న రావాలని కోరాం.వివరాలు ఎవరి ద్వారా అయినా పంపినా ఓకే.. లేదా కేసీఆర్ స్వయంగా వస్తానంటే ఆ మేరకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తామని కమిషన్ అత్యంత మర్యాదపూర్వకంగా లేఖలో కోరింది. గతంలోనూ కమిషన్లు మీడియాకు వివరాలు వెల్లడించాయి. ఇది బహిరంగ కమిషన్. విచారణలో దాపరికం ఏమీ లేదు. జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి ఎక్కడా పక్షపాత ధోరణితో మాట్లాడలేదు. విచారణకు రావాల్సిన వారికి 8బీ నోటీసులు జారీ చేసే అధికారం కమిషన్లకు ఉంటుంది. బీఆర్ఎస్ కూడా సభలో పలు విషయాలపై కమిషన్ ఏర్పాటు చేస్తామని గతంలో పేర్కొంది అని వాదించారు. ఈ క్రమంలో కేసీఆర్ పిటిషన్ విచారణ స్వీకరించవద్దని ఏజీ కోరగా.. పిటిషన్‌ను విచారణకు అనుమతించడంపైనే వాదనలు వినిపించాలని, మెరిట్స్‌లోకి వెళ్లవద్దని ఏజీకి ధర్మాసనం సూచించింది. మరోవైపు.. ఏజీ వాదనలపై కేసీఆర్ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో కమిషన్ సభ్యులు పక్షపాత వ్యాఖ్యలు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జ్యుడిషియల్ విచారణగా నోటిఫికేషన్లో పేర్కొన్నప్పుడు.. నివేదిక ఇవ్వాలే తప్ప మీడియాకు వివరాలు వెల్లడించకూడదని, విద్యుత్ రంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందని ముందే చెప్పి.. కారకులెవరో తేల్చమన్నారని, ఇది అసలు సరికాదని కేసీఆర్ తరఫు న్యాయవాది ఆదిత్య సోందీ వాదించారు. ఈ క్రమంలో ఇరువైపులా వాదనలు పూర్తి కావడంతో.. తీర్పును రిజర్వ్ చేసింది ధర్మాసనం. ఇవాళ లేదంటే సోమవారం తీర్పు వెల్లడిస్తామని జడ్జి తెలిపారు. -
కవిత లిక్కర్ కేసు: నేడు ఈడీ, సీబీఐ కౌంటర్ వాదనలు
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ఇవాళ( మంగళవారం) ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. కవిత బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారించనున్నారు. నిన్న(సోమావారం) కవిత తరపున ముగిసిన వాదనలు ముగిశాయి. ఇవాళ ఈడీ, సీబీఐ వాదనలు వినిపించనున్నారు. ఈడీ, సీబీఐ వాదనల అనంతరం తీర్పు రిజర్వ్ చేస్తామని న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. సీబీఐ, ఈడీ దర్యాప్తుకు సహకరించిన నేపథ్యంలో కవితకు బెయిల్ ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ‘‘కవిత అరెస్టు చట్టబద్ధంగా జరగలేదు. తనకు మైనారిటీ తీరని పిల్లలు ఉన్నారు. మహిళా అనే కోణంలో బెయిల్ ఇవ్వాలి. తనకు వ్యతిరేకంగా వాంగ్మూలం వచ్చిన మాగుంట ఎన్డీఏ తరఫున అభ్యర్థిగా పోటీ చేశారు. బీజేపీకి రూ. 50 కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్స్ ఇచ్చారు. 2022లో కేసు నమోదు అయితే 2024లో కవిత అరెస్టు జరిగింది. రాజకీయ కక్ష సాధింపుతో కవితపై కేసు పెట్టారు’’ అని ఢిల్లీ కోర్టులో కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి సోమవారం వాదనలు వినిపించించారు. ఇది వరకే ఈడి, సీబీఐ కేసుల్లో కవితకు బెయిల్ ఇచ్చేందుకు ట్రయల్ కోర్లు తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో కవిత ఢిల్లీ హైకోర్టులో ఆశ్రయించారు. లిక్కర్ కేసులో అరెస్టయి రెండు నెలలకుపైగా కవిత తిహార్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. కవిత తరఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వినిపించిన వాదనలు..కవితను అరెస్ట్ చేయమని ఈడీ సుప్రీం కోర్టుకు చెప్పిందిసుప్రీంకోర్టులో ఈడీ కోర్టు ధిక్కరణకు పాల్పడిందిరాజకీయ కారణాలతో పక్షపాత ధోరణితో ఈడీ అధికారులు వ్యవహరించారుమా వాదన వినకుండానే సీబీఐ ఇంటరాగేషన్‌కు ప్రత్యేక న్యాయస్థానం అనుమతి ఇచ్చిందిసమాచారం ఇవ్వకుండానే సీబీఐ నన్ను అరెస్టు చేసింది: బెయిల్ రిక్వెస్ట్‌లో కవితఈ అంశాలపై ఎలాంటి కోర్టు ఉత్తర్వులు అప్ లోడ్ చేయలేదుపూర్తి రహస్యం పాటించడం ఎందుకు ?సీబీఐ విచారణ, అరెస్టు లో చట్టపరమైన ప్రక్రియ పాటించలేదుఈడీ కేసులో ఇప్పటివరకు ఏడు చార్జిషీట్ లు దాఖలు చేసిందిమహిళను విచారణ కోసం కార్యాలయానికి పిలవకూడదుకేసు నమోదు చేసినప్పుడు కవిత పేరే లేదుఈ విచారణలో సమీర్, బుచ్చిబాబు, మాగుంట నా పేరు చెప్పారుబెయిల్ కి ఉన్న గ్రౌండ్స్ ఏమిటి అని అడిగిన జడ్జికేసు గురించి అన్ని విషయాలు తెలుసన్న జడ్జికవితని అరెస్టు చేయాల్సిన అవసరం లేదు, దాని వల్ల ఈడి కి వచ్చి లాభం ఏమిటి ? అని కవిత తరపు న్యాయవాది వాదనలునేను గత మార్చి లో వరుసగా మూడు రోజులు విచారణకు వచ్చాసూర్యాస్తమయం తర్వాత కూడా నన్ను విచారించారునా మొబైల్ ఫోన్ ను కూడా ఇచ్చానుమహిళ ఫోన్లోకి తొంగి చూశారురైట్ టు ప్రైవసికి భంగం కలిగించారుకొత్త మోడల్ ఫోన్ లు రావడంతో పాత ఫోన్లు పని మనుషులకు ఇచ్చానుఆ ఫోన్లు పని మనుషులు ఫార్మాట్ చేశారు.. నాకేం సంబంధం లేదుకస్టడీ లో ఉన్న నిందితులతో కలిపి నన్ను ఈడి విచారణ జరపలేదుఎన్నో చార్జిషీట్లు దాఖలు చేసినా నా పేరు ఎక్కడ ప్రస్తావించలేదుమాగుంట శ్రీనివాసులురెడ్డి నాకు వ్యతిరేకంగా 164 స్టేట్మెంట్ ఇచ్చారుఆ తర్వాత రూ.50 కోట్లు బీజేపీకి ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారుఎన్‌డీఏ అభ్యర్థిగా పోటీ చేశారుఅరెస్టు చేయమని సుప్రీం కోర్టు కి చెప్పి ఆ తర్వాత మాట తప్పి, కవితని అరెస్టు చేశారుసీబీఐ సమన్లు అన్నింటికీ నేను సహకరించా: బెయిల్ రిక్వెస్ట్‌లో కవితమహిళను, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, అందులో ఒకరు మైనర్: బెయిల్ రిక్వెస్ట్‌లో కవితనేను ఒక రాజకీయ నాయకురాల్ని: బెయిల్ రిక్వెస్ట్‌లో కవితబెయిల్ కు ఎలాంటి షరతులు పెట్టినా ఓకే: బెయిల్ రిక్వెస్ట్‌లో కవిత -
నేడు విచారణకు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్
-
సుప్రీం ప్రమాణాలతో సుదృఢ ప్రస్థానం
సాక్షి, న్యూఢిల్లీ: అత్యున్నత న్యాయస్థానం తన సుదీర్ఘ ప్రస్థానంలో ఉన్నత ప్రమాణాలను నెలకొలి్పందంటూ ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. తద్వారా దేశ ప్రజాస్వామ్య యాత్రను మరింతగా బలోపేతం చేసిందన్నారు. సుప్రీంకోర్టులో తొలి విచారణ జరిగి ఆదివారంతో 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన వజ్రోత్సవ కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో పాటు బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్ దేశాల ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాతలు కలలుగన్న స్వేచ్ఛ, సమానత్వం, న్యాయసూత్రాల పరిరక్షణకు నిరంతరం పాటుపడుతోందని కితాబిచ్చారు. వ్యక్తిగత హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛ వంటి కీలకాంశాలపై సుప్రీంకోర్టు ఇచి్చన చరిత్రాత్మక తీర్పులు ఇతర దేశాలకు కూడా కరదీపికలని అభిప్రాయపడ్డారు. దేశ సామాజిక, రాజకీయ ప్రస్థానాన్ని అవి మేలిమలుపు తిప్పాయన్నారు. వికసిత భారత్ లక్ష్య సాధనకు సాధికార న్యాయవ్యవస్థ అత్యంత కీలకమని ప్రధాని అభిప్రాయపడ్డారు. ‘‘శరవేగంగా మారుతున్న అవసరాలకు అనుగుణంగా చట్టాలను కూడా హౠ ప్రభుత్వం ఆధునీకరిస్తోంది. ఈ నూతన చట్టాలు భవిష్యత్ భారతాన్ని మరింతగా బలోపేతం చేస్తాయి. సులభ, సత్వర న్యాయం దేశ పౌరులందరి హక్కు. అందుకే ఈ–కోర్టు మిషన్ ప్రాజెక్టు–3కి నిధులు పెంచాం. కోర్టుల్లో మౌలిక సదుపాయాల పెంపుకు నిబద్ధతతో పని చేస్తున్నాం’’ అని చెప్పారు. న్యాయవ్యవస్థ విశ్వసనీయతను ఇతోధికంగా పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ఈ లక్ష్యంతోనే తాజాగా జన్ విశ్వాస్ బిల్లును తీసుకొచి్చనట్టు చెప్పారు. మున్ముందు న్యాయవ్యవస్థపై అనవసర భారాన్ని అది తగ్గిస్తుందని వివరించారు. అలాగే వివాదాలకు ప్రత్యామ్నాయ పరిష్కారాలు చూపేందుకు ఉద్దేశించిన మధ్యవర్తిత్వ చట్టం కూడా కోర్టు పనిభారాన్ని బాగా తగ్గించగలదని ఆశాభావం వెలిబుచ్చారు. వాయిదా సంస్కృతికి తెర పడాలి: సీజేఐ కోర్టుల్లో పేరుకుపోతున్న కేసులు, కాలం చెల్లిన విధానాలు, కేసుల వాయిదా సంస్కృతి వంటి సమస్యలు న్యాయ వ్యవస్థను బాగా ప్రభావితం చేస్తున్నాయని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ఆవేదన వెలిబుచ్చారు. వీటిని నిర్మాణాత్మక రీతిలో పరిష్కరించడం తక్షణావసరమని అభిప్రాయపడ్డారు. అందుకే వీటిపై అర్థవంతమైన చర్చ జరగాల్సి ఉందన్నారు. సమర్థంగా సకాలం న్యాయం అందించాలంటే కోర్టుల్లో వాయిదా సంస్కృతి నుంచి వృత్తిపరమైన సంస్కృతికి మారాలని ఉద్బోధించారు. కేసుల పరిష్కారంలో అంతులేని జాప్యానికి కారణమవుతున్న సుదీర్ఘ వాదనలకు చెక్ పెట్టాల్సి ఉందన్నారు. ‘‘న్యాయ వృత్తి ఒకప్పుడు ఉన్నత వర్గాల పురుషులకే పరిమితమైందిగా ఉండేది. కానీ పరిస్థితులు మారుతున్నాయి. జిల్లా స్థాయి న్యాయ వ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యం 36 శాతానికి పెరగడం స్వాగతించదగ్గ పరిణామం. అలాగే తాజాగా ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో జూనియర్ సివిల్ జడ్జి పరీక్షల్లో ఎంపికైన వారిలో 50 శాతానికి పైగా మహిళలే కావడం హర్షణీయం. న్యాయ వృత్తిలోకి కొత్తవారిని ప్రోత్సహించడంలో లింగ భేదం, నేపథ్యాలతో నిమిత్తం లేకుండా సమానావకాశాలు కలి్పంచాలి. అలాగే జడ్జిల్లోనూ, లాయర్లలోనూ ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గ ప్రాతినిధ్యం ఎంతగానో పెరగాల్సి ఉంది’’ అన్నారు. ‘‘కోర్టులకు సుదీర్ఘ సెలవులపైనా చర్చ జరగాల్సి ఉంది. ఇందుకోసం న్యాయవాదులు, న్యాయమూర్తులకు ‘ఫ్లెక్సీ టైం’ వంటి ప్రత్యామ్నాయాల సాధ్యాసాధ్యాలనూ ఆలోచించాలి. కోర్టుల లోపల, వెలుపల రాజ్యాంగ నిర్దేశిత నిబద్ధతతో నడుచుకుంటున్నామా, లేదా అని అందరూ ఆత్మపరిశీలన చేసుకోవాలి. సర్వోన్నత న్యాయస్థాన వజ్రోత్సవ వేడుకలు ఇందుకు సరైన సందర్భం’’ అని సీజేఐ పిలుపునిచ్చారు. ఈ–కోర్టుల పురోగతిని వివరించారు. దేశ న్యాయ వ్యవస్థను సమర్థంగా, పర్యావరణహితంగా సాంకేతికతతో కూడిందిగా మార్చడానికి కృషి చేస్తున్నట్టు వివరించారు. ప్రజల కోర్టు: సీజేఐ సుప్రీంకోర్టు వజ్రోత్సవాల సందర్భంగా ఆదివారం లాంఛనంగా ఏర్పాటైన ధర్మాసనానికి సీజేఐ జస్డిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యం వహించారు. 75 ఏళ్ల క్రితం 1950 జనవరి 28న భారత సుప్రీంకోర్టు తొలి విచారణ జరిగిన తీరు, అప్పుడు పాటించిన స్వతంత్ర విలువలు నేటికీ అనుసరణీయమేనన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులకు విధి నిర్వహణలో పూర్తి స్వేచ్ఛా స్వాతంత్య్రాలు న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తికి గీటురాళ్లని అభిప్రాయపడ్డారు. వారు సామాజిక, రాజకీయ ఒత్తిళ్లకు మానవ సహజమైన మొగ్గుదలలకు అతీతంగా తీర్పులు వెలువరించాలని పేర్కొన్నారు. ఈ దిశగా జడ్జిల సామర్థ్యాలను మరింతగా పెంచే ప్రయత్నాలు ఇప్పటికే జరుగుతున్నాయని గుర్తు చేశారు. ‘‘సుప్రీంకోర్టు తొలి విచారణ పార్లమెంటులోని ప్రిన్సెస్ చాంబర్లో సాదాసీదాగా జరిగింది. నాటినుంచి సుదీర్ఘ ప్రస్థానంలో కోర్టు పనితీరు నానాటికీ మెరుగవుతూనే వస్తోంది. ప్రజల కోర్టుగా రూపుదిద్దుకుంటోంది. ప్రజల నుంచి ఏటా ఏకంగా లక్షకు పైగా అందుతున్న లెటర్ పిటిషన్లు అత్యున్నత న్యాయస్థానంపై వారి విశ్వాసానికి అద్దం పడుతున్నాయి’’ అన్నారు. -
నేడు చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ
-
చీకటిమయంగా ఉన్న కూతురి జీవితాన్ని 'ప్రేరణ' ఇచ్చే శక్తిగా..!
భవిష్యత్తుకు ప్రేరణ ‘మీ కూతురు ఇక నడవలేదు. వినలేదు’ అంటూ వైద్యుడి నోటి నుంచి వచ్చిన మాట విన్న తరువాత ఉజ్వల, ఆమె భర్త తమ జీవితాలను అర్ధంతరంగా చాలించాలనుకున్నారు. నిరాశే తప్ప ఆశ కనిపించని ఆ కఠిన సమయంలో హెలెన్ కెల్లర్ ఆత్మకథ చదివిన ఉజ్వల ఆత్మస్థైర్యం తెచ్చుకొని, జీవితాన్ని వెలుగుమయం చేసుకుంది. కూతురికి ఉజ్వల భవిష్యత్ ఇచ్చింది... ఆ రోజులు ఎలాంటివి అంటే... పాప నవ్విన ప్రతిక్షణం ఆ దంపతులకు పండగే. అలాంటి ఆనందమయ రోజుల్లో ఆరు నెలల పాప ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. ఈ ప్రమాదం వల్ల పాప పక్షవాతానికి గురైంది. వినికిడి శక్తి కోల్పోయింది. ‘పాప ఇక ఎప్పటికీ నడవలేదు’ అన్నట్లుగా చెప్పాడు డాక్టర్. ఆ ఇల్లు ఒక్కసారిగా చీకటిలోకి వెళ్లిపోయింది. ‘ఆత్మహత్య తప్ప మన జీవితానికి మరో పరిష్కారం లేదు’ అనుకున్నారు ఉజ్వల, ఆమె భర్త. ఆ సమయంలో ఒకరోజు తన సోదరి దగ్గర మనసులోని బాధను బయట పెట్టింది ఉజ్వల. సోదరి ఏం మాట్లాకుండా హెలెన్ కెల్లర్ ఆత్మకథ పుస్తకం ‘ది స్టోరీ ఆఫ్ మై లైఫ్’ చేతిలో పెట్టి ‘ఇది ఒకసారి చదువు... ఇంతకుమించి ఏమీ చెప్పను’ అన్నది. ‘ప్రతి నిమిషం నిరాశే’ లాంటి ఆ రోజుల్లో ఒకరోజు ఉజ్వల హెలెన్ కెల్లర్ ఆత్మకథ చదవడం మొదలుపెట్టింది. ఎన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ ‘గుడ్ ఇంగ్లీష్’పై హెలెన్ పట్టుసాధించిన విధానం నుంచి జీవితంలోని నిరాశామయ సమయాల్లోనూ ధైర్యంగా ముందుకు వెళ్లడం వరకు ‘ది స్టోరీ ఆఫ్ మై లైఫ్’ నుంచి ఎన్నో విషయాలు తెలుసుకుంది. నయాగరా జలపాతం దగ్గర ఉన్నప్పుడు ఆ జలపాతం అందాలను హెలెన్ మనోనేత్రంతోనే చూసిన విధానం అపురూపంగా అనిపించింది. ఆ పుస్తకం చదవడం పూర్తిచేసిన తరువాత తన మనసులో కమ్మిన నిరాశ మేఘాలు దూదిపింజల్లా ఎగిరిపోయాయి. ‘నా బిడ్డ కనీసం చూడగలుగుతుంది కదా’ అనుకుంది ఉజ్వల. తనలో సానుకూల శక్తికి అక్కడే బీజం పడింది. ‘ప్రియాంక’గా ఉన్న పాప పేరును ‘ప్రేరణ’ గా మార్చింది. మార్పు మొదలైంది. అది ఆశావహమైన మార్పు. మరోవైపు... నడవడం కష్టం అనుకున్న పాప వైద్యం, వ్యాయామాల వల్ల నడవడం ప్రారంభించింది. అయితే వినికిడి లోపం మాత్రం పోలేదు. ప్రేరణను స్పీచ్ అండ్ హియరింగ్–ఇంపేర్డ్ స్కూలులో చేర్పించింది. ప్రేరణకు శాస్త్రీయ నృత్యంపై ఉన్న ఆసక్తిని గమనించి పుణెలోని ‘సాధన నృత్యాలయ’లో చేర్పించింది ఉజ్వల. ‘నృత్యాలయలో చేర్పించిన మాటేగానీ ప్రేరణ ఎలా డ్యాన్స్ చేయగలుగుతుంది? గురూజీ చెప్పే ముద్రలను ఎలా అర్థం చేసుకోగలదు... ఇలాంటి సందేహాలెన్నో నాలో ఉండేవి. అయితే గురూజీ షమిత మహాజన్లో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ప్రేరణను ఎలాగైనా మంచి నృత్యకారిణిగా తయారు చేయాలనే పట్టుదల ఆమె కళ్లలో కనిపించింది’ అంటుంది ఉజ్వల. శమిత మహాజన్ దగ్గర నృత్యంలో పాఠాలు నేర్చుకోవడం మొదలు పెట్టింది ప్రేరణ. మొదటి రెండు సంవత్సరాలు బాగానే కష్టపడాల్సి వచ్చింది ప్రేరణ. ‘మాటల ద్వారా ప్రేరణకు నాట్యానికి సంబంధించిన ముద్రలను నేర్పించడం కష్టం. చాలా ఓపిక ఉండాలి. గురూజీ ఎప్పుడూ ఓపిక కోల్పోలేదు. గురూజీ చెప్పేదాన్ని లిప్–రీడింగ్ ద్వారా అర్థం చేసుకోవడం మొదలు పెట్టింది ప్రేరణ’ అని గతాన్ని గుర్తు చేసుకుంటుంది ఉజ్వల. ఎంతోమంది సీనియర్ డ్యాన్సర్ల ముందు ప్రేరణ ఆరంగేట్రం ఇచ్చింది. సింగిల్ మిస్టేక్ కూడా చేయలేదు. ‘నాట్యకారిణిగా నీకు ఉజ్వల భవిష్యత్ ఉంది’ అని పెద్దలు ప్రేరణను ఆశీర్పదించారు.‘చీకటిగా ఉన్న నా ఆత్మగదుల్లోకి ఒక కాంతికిరణం ప్రసరిస్తే ఎలా ఉంటుంది?’ అని తన ఆత్మకథ చివరిలో ప్రశ్నిస్తుంది హెలెన్ కెల్లర్. అది అచ్చంగా ఆత్మస్థైర్యంతో తెచ్చుకున్న అపూర్వ విజయంలా ఉంటుంది. అందుకు ఉదాహరణ ప్రేరణ. ఒక ద్వారం మన కోసం... బాధ, ఆవేశంలో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు ప్రమాదకరంగా ఉంటాయి. ప్రశాంతమైన హృదయంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మన కోసం ఎక్కడో ఒక చోట ఒక ద్వారం తెరుచుకొనే ఉంటుంది. ఆవేదన, ఆవేశాలతో ఆ ద్వారం దగ్గరకు చేరలేము. – ఉజ్వల సహానే (చదవండి: ప్లాస్టిక్‌పై కొత్త ఉద్యమం బర్తన్ బ్యాంక్ !) -
బాబు సాక్షులను బెదిరిస్తున్నాడు..బెయిల్ ఇవ్వొద్దు..
-
మూడోరోజు ఏసీబీ కోర్టులో ఇరుపక్షాల వాదనలు
-
భారీ జరిమానాలు విధించిన ‘రెరా’
సాక్షి, హైదరాబాద్: నిబంధనల ఉల్లంఘన..షోకాజ్ నోటీసులకు స్పందించకపోవడం.. హియరింగ్‌కు హాజరుకాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ‘రియల్’ సంస్థలపై ‘రెరా’ చర్యలు చేపట్టింది. సాహితీ గ్రూప్‌నకు చెందిన సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ‘రెరా’ రిజిస్ట్రేషన్ లేకుండా ‘సాహితీ సితార్ కమర్షియల్’ పేరుతో రంగారెడ్డిజిల్లా గచ్చిబౌలిలో కమర్షియల్, రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కోసం కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ప్రకటనలు ఇచ్చి విక్రయాలు చేపట్టగా, సాహితీతో పాటు కేశినేని డెవలపర్స్‌కు అపరాధ రుసుం విధించింది. ఇదే సంస్థ ‘సిసా ఆబోడ్‘ పేరుతో మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లిలో సరైన డాక్యుమెంట్లు సమర్పించకుండా రెరా’ రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసింది. డాక్యుమెంట్లు సమర్పించాలని పలుసార్లు మెయిల్స్ పంపినా స్పందించలేదు. ప్రకటనల ద్వారా మార్కెటింగ్ చేస్తున్న కారణంగా ’రెరా’ నోటీసులు జారీ చేసింది. ఇదే సంస్థ సాహితీ సార్వానీ ఎలైట్ పేరుతో సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో అపార్ట్మెంట్స్ నిర్మాణం చేపట్టి సరైన డాక్యుమెంట్లు లేకుండా రెరా రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసింది. పైగా మార్కెటింగ్ కార్యకలాపాల ద్వారా ప్లాట్స్ విక్రయించింది.ఈ ప్రాజెక్టులన్నింటికి కలిపి రూ.10.74 కోట్లు 15 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది. మంత్రి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో షేక్‌పేటలో ప్రాజెక్ట్ చేపట్టి ఫారం– ’బి’లో తప్పుడు సమాచారం పొందుపరిచి, వార్షిక, త్రైమాసిక నివేదిక సమర్పించలేదు. దీంతో ఈ సంస్థకు రూ.6.50 కోట్ల అపరాధ రుసుము విధించింది. సాయిసూర్య డెవలపర్స్ సంస్థ నేచర్‌కౌంటీ పేరుతో శేరిలింగంపల్లి మండల మనసానపల్లి గ్రామంలో రెరా రిజిస్ట్రేషన్ లేకుండా ప్లాట్ల అభివృద్ధి పేరుతో ప్రాజెక్టు చేపట్టింది. దీనిపై ఫిర్యాదు రాగా, షోకాజ్ నోటీసు జారీ చేసి రూ.25లక్షలు అపరాధ రుసుం విధించింది. -
A1 గా చంద్రబాబు ఈరోజు హైకోర్టులో విచారణ
-
Babu Case : గవర్నర్ అనుమతి చుట్టే బాబు లాయర్ల పట్టు
సాక్షి, గుంటూరు: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టైన చంద్రబాబు నాయుడు.. క్వాష్ పిటిషన్‌కు అనర్హుడని సీఐడీ తరపు న్యాయవాదులు మంగళవారం ఏపీ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఎఫ్ఐఆర్ చేసిన వెంటనే చంద్రబాబును అరెస్ట్ చేయలేదని.. రెండేళ్లు అన్ని సాక్ష్యాలు సేకరించాకే అరెస్ట్ చేశారని తెలిపారు న్యాయవాదులు. కేవలం ఎఫ్ఐఆర్ ఆధారంగానే చంద్రబాబు అరెస్ట్ జరగలేదు. సెక్షన్ 319 ప్రకారం ఎన్ని ఛార్జిషీట్లు అయినా వేయొచ్చు.. ఎంత మంది సాక్ష్యులను అయినా చేర్చొచ్చు. ఈ కేసు ప్రారంభ దశలోనే ఉంది. బెయిల్ దరఖాస్తు చేసుకున్న దరిమిలా.. 10 రోజుల్లో దర్యాప్తు పూర్తి కాదు. కేసు దర్యాప్తు దశలోనే ఉంది. ఐటీ శాఖ దర్యాప్తు చేస్తోంది. ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ దశలో నిందితుడికి అనుకూలంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకూడదని హైకోర్టును కోరారు. ► 2018 జూన్ 5వ తేదీనే ప్రాథమిక విచారణ ప్రారంభమైంది.ఐపీసీ ప్రకారం నేరం కనిపిస్తున్నప్పుడు.. గవర్నర్ నుంచి ఎలాంటి అనుమతి అవసరం లేదని ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి అన్నారు. అంటే 2018లో సెక్షన్ 17A సవరణకు ముందే ఇది పూర్తయింది. 2015లోనే ఈ స్కాంకు సంబంధించి ప్రశ్నలు తలెత్తాయి. ఒక సెక్షన్‌కు సంబంధించిన సవరణ కోసం దర్యాప్తు ఆగదు అని హైకోర్టు ముందు వాదించారాయన. ► పథకం ప్రకారం కుంభకోణం జరిగింది. ఎంవోయూలో సబ్ కాంట్రాక్ట్ ప్రస్తావనే లేదు. ఎలాంటి సేవలు అందించకుండానే షెల్ కంపెనీలకు నిధులు వెళ్లాయి. షెల్ కంపెనీల కోసమే డబ్బు విడుదల చేశారు. ఎంవోయూలో సబ్‌కాంట్రాక్టుల అంశం ప్రస్తావనే లేదు. చంద్రబాబు నాయకత్వంలో నెమ్మదిగా మానిప్యులేషన్ చేశారు. ఆరు షెల్ కంపెనీలకు డబ్బు తరలించారు. ప్రభుత్వం ముందుగా డబ్బు ఇవ్వడం ఎప్పుడూ ఉండదు. మొదటి నుంచి కూడా ఇదొక బొమ్మ మాదిరిగా జరిగింది. కక్ష సాధింపు అనుకుంటే చంద్రబాబును ఏనాడో అరెస్ట్ చేసేవారు.ఏపీ ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరిస్తోంది. ► షెల్ కంపెనీల జాడ తీస్తున్నాం. అన్ని బోగస్ కంపెనీలు కలిపి ప్రజాధనాన్ని లూటీ చేశాయి. . ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా నిధుల దుర్వినియోగం జరిగింది. ఈ డీల్‌కు కేబినెట్ ఆమోదం లేదు. చంద్రబాబు పథకం ప్రకారమే తన అనుచరులతో కలిసి బోగస్ కంపెనీల పేరుతో రూ.371 కోట్ల ప్రజాధనం దోచుకున్నారు. రూ. 3 వేల కోట్లు ఎక్కడికి వెళ్లాయో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. మార్గదర్శకాలను కూడా కోర్టు అనుసరించాలి. విచారణ పూర్తయ్యే దాకా ఆగాలి. దర్యాప్తు సంస్థను నివేదిక సమర్పించేదాకా వేచి చూడాలి. ► విచారణ పూర్తై అధికారులు నివేదిక సమర్పించిన తరువాతే కోర్టు జోక్యం చేసుకోవాలి. మెరిట్స్‌లోకి వెళ్లాల్సిన అవసరం లేదు ఇక్కడ. నేను సీఎంను(మాజీ) కాబట్టే.. అనే అంశం ప్రస్తావిస్తున్నారు కాబట్టి ఇది రాజకీయమైంది. దర్యాప్తు బృందంపై రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులపైనే నిందలు మోపుతున్నారు. కానీ, వీళ్లంతా శిక్షణ పొందిన అధికారులు. ఆరోపించేవాళ్లు ముందు ఈ విషయం గుర్తించాలి. ► 2021కు ముందు చంద్రబాబుపై ఎలాంటి ఆరోపణలు చేయలేదు. పూర్తి ఆధారాలతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టకుండానే కంపెనీలకు రూ.300 కోట్లు విడుదల చేశారు. అవినీతి చేసిన వారు సెక్షన్ 17ఏ పేరుతో తప్పించుకోలేరు. సెక్షన్ 17A ప్రజా ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకున్న అమాయక సేవకులను (innocent servants) రక్షించడం కోసం మాత్రమే. కాబట్టి.. పోలీసులకు పూర్తి స్వేచ్చను ఇచ్చి.. క్వాష్ పిటిషన్‌ను కొట్టివేయాలి. సెక్షన్ CrPC 482 ప్రకారం దర్యాప్తు అధికారులను విచారణ పూర్తి చేసుకోనివ్వాలి అని సీఐడీ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. -
అంగళ్ళు విధ్వంసం కేసులో బెయిల్ కోసం చంద్రబాబు ప్రయత్నాలు
-
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంలో విచారణ పూర్తి.. తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దు చేయడంపై, జమ్మూ కశ్మీర్ పునవ్యవస్థీకరణ చట్టంపైనా వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ నమోదైన అనేక పిటిషన్లపైనా ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం చేపట్టిన విచారణ ముగియగా తీర్పును రిజర్వ్‌లో ఉంచింది సుప్రీం కోర్టు. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించడం అనేది అత్యంత సున్నితమైన, సమస్యాత్మక అంశమని చెబుతూ విచారణ నిమిత్తం ప్రత్యేకంగా రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారధ్యంలోని అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్లను 16 రోజులపాటు ఏకథాటిగా విచారించింది. డీవై చంద్రచూడ్ తోపాటు సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ లతో కూడిన ఈ ధర్మాసనం సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, గోపాల్ సుబ్రమణ్యం, రాజీవ్ ధావన్, జఫర్ షా, దుష్యంత్ దవే సహా మరికొంతమంది పిటిషనర్ల తరపు న్యాయవాదుల వాదనలు ఆలకించింది. పిటిషనర్ల తరపున ఎవరైనా న్యాయవాదులు తమ వాదనలను ధర్మాసనానికి వినిపించాలనుకుంటే వారు లిఖితపూర్వకంగా రాబోయే మూడు రోజుల్లో అర్జీ పెట్టుకోవచ్చని తెలిపింది. ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, రాకేష్ ద్వివేది, వి.గిరి తదితరులు తమ వాదనలను అత్యున్నత న్యాయస్థానానికి వినిపించారు. 16 రోజుల విచారణలో 2019, ఆగస్టు 5న కేంద్రం తీసుకున్ననిర్ణయం యొక్క రాజ్యాంగ చెల్లుబాటు, జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించే పునర్వ్యవస్థీకరణ చట్టం చెల్లుబాటు, జూన్ 20, 2018న విధించిన గవర్నర్ పరిపాలన సహా అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. 2020లో కూడా సుమారు 23 పిటీషన్లు పిటీషన్లు కూడా దాఖలయ్యాయి కానీ అవి లిస్టింగ్ కానీ కారణంగా వాటిపై విచారణ చేపట్టడానికి సుప్రీంకోర్టు పెద్దగా ఆసక్తి చూపలేదు. మిగతా అన్ని అంశాలపై పూర్తిస్థాయి విచారణ పూర్తయిన తర్వాత సుప్రీం కోర్టు తీర్పును మాత్రం రిజర్వ్‌లో ఉంచింది. #BREAKING | Article 370 Abrogation arguments conclude: Supreme Court reserves order. #SC #Article370 #Article370hearing WATCH #LIVE here- https://t.co/6CjsNJaatY pic.twitter.com/RzoDCEjru0 — Republic (@republic) September 5, 2023 ఇది కూడా చదవండి : G20 Summit - జీ20 అతిధులకు బుక్లెట్లు -
దళితబంధు అర్హుల ఎంపిక ఎలా?
సాక్షి, హైదరాబాద్: ఆర్థికంగా వెనుకబడిన దళితులకు ఇచ్చే దళితబంధు పథకం కింద అర్హులను ఎలా ఎంపిక చేస్తున్నారో...ఆ వివరాలు వెల్లడించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎమ్మెల్యేలు, అధికారులే వీరిని ఎంపిక చేస్తున్నారా? లేదా ఇతర ప్రక్రియ ఏదైనా పాటిస్తున్నారా? చెప్పాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. విచారణ వాయిదా వేసింది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 1,100 మందిని దళితబంధుకు అర్హులుగా గుర్తించాలని జూన్ 24న ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి గతంలోనే ఇచ్చి ఉండటంతో దానికి మినహాయింపు ఇచ్చారు. అయితే స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కలసి వీరిని ఎంపిక చేయాలని పేర్కొన్నారు. ఇలా అయితే నియోజకవర్గాల్లో అర్హులకు కాకుండా, ఎమ్మెల్యేలు చెప్పిన వారికే రూ.10 లక్షలు ఇచ్చే అవకాశం ఉందని పేర్కొంటూ హైదరాబాద్‌కు చెందిన కేతినీడి అఖిల్‌శ్రీ గురుతేజ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఈ మేరకు ప్రభుత్వం జారీచేసిన జీఓ నంబర్ 8ని రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై ప్రధానన్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా అర్హులకు లబ్ధి చేకూరదని చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు లాటరీ విధానం ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారని, ఇదే పద్ధతిని దళితబంధుకు అనుసరించేలా ఆదేశించాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ, విచారణ వాయిదా వేసింది. -
సమాచార కమిషనర్ల నియామకంపై తెలంగాణ హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్: సమాచార కమిషనర్ల నియామకంలో జాప్యంపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పిల్ పై సీజే జస్టిస్ అలోక్ అరాధే ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రధాన, రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చామన్న ప్రభుత్వం.. ప్రధాన సమాచార కమిషనర్ కోసం 40 దరఖాస్తులు వచ్చాయని పేర్కొంది. రాష్ట్ర సమాచార కమిషనర్ పోస్టుల కోసం 273 దరఖాస్తులు వచ్చాయని, సమాచార కమిషనర్ల నియామకం కోసం ఎంపిక కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. సమాచార కమిషనర్ల ఎంపిక కోసం నాలుగు వారాల గడువును ఉన్నత న్యాయస్థానాన్ని ప్రభుత్వం కోరింది. దీంతో సమాచార కమిషనర్ల నియామకంపై విచారణ నాలుగు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. చదవండి: తెలంగాణ ప్రజా ప్రతినిధుల కోర్టు జడ్జిపై ససెన్షన్ వేటు -
హైకోర్టు విచారణలు ప్రత్యక్ష ప్రసారం
సాక్షి, హైదరాబాద్: హైకోర్టులోని 29 కోర్టు హాళ్లలో విచారణల ప్రత్యక్ష ప్రసారాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే సోమవారం ప్రారంభించారు. ఉదయం 10.15 గంటలకు హైకోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రత్యక్ష ప్రసార సేవలను ప్రారంభించి.. న్యాయవాదులకు, ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఆ తర్వాత 10.30 గంటల నుంచి కోర్టుల విచారణలు ప్రత్యక్ష ప్రసారమయ్యాయి. ప్రత్యక్ష ప్రసారాలతో న్యాయ వ్యవస్థ ప్రజలకు మరింత చేరువవుతుందని సీజే ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. లింక్ క్లిక్ చేస్తే... హైకోర్టు అధికారిక వెబ్సైట్లో ప్రత్యక్ష ప్రసారాలకు సంబంధించిన లింక్ ఇచ్చారు. ఈ లింక్ ద్వారా కోర్టును ఎంపిక చేసుకుని ప్రత్యక్ష ప్రసారాలు వీక్షించవచ్చు. ఫస్ట్ కోర్టు విచారణ ప్రత్యక్ష ప్రసారం ఇప్పటికే అందుబాటులో ఉంది. కరోనా సమయంలో ప్రత్యక్ష ప్రసారాలు కొనసాగగా, ఆ తర్వాత హైబ్రిడ్ విధానంలో విచారణ చేపడుతున్నారు. 2020లో ప్రత్యక్ష ప్రసారాలను అందుబాటులోకి తెచ్చిన గుజరాత్ హైకోర్టు, ఆ తర్వాత యూట్యూబ్ చానెల్‌ను ప్రారంభించింది. కర్ణాటక, ఒడిశా, మధ్యప్రదేశ్, కోల్‌కతా, ఛత్తీస్గడ్ హైకోర్టులు కూడా ప్రత్యక్ష ప్రసారాలు, యూట్యూబ్ చానల్‌ను అందుబాటులోకి తెచ్చాయి. ప్రత్యక్ష ప్రసారాలతో పారదర్శకత పెరుగుతుందని న్యాయ నిపుణులు పలుమార్లు పేర్కొన్న విషయం తెలిసిందే. ఇదిలాఉండగా, హైకోర్టు, కిందికోర్టుల విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేసేలా చర్యలు చేపట్టాలని కోరుతూ 2022లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) కూడా దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన నాటి సీజే ధర్మాసనం.. సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ప్రత్యక్ష ప్రసారాలకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులోభాగంగా ప్రసారాలకు కావాల్సిన మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వం కలి్పంచింది. -
'ఇదేం నివేదిక..?' వరదలపై ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు..
హైదరాబాద్: వరదలపై నివేదికను సమర్పించిన ప్రభుత్వంపై న్యాయస్థానం మొట్టికాయలు వేసింది. ఈ అంశంపై విచారణ జరిపిన న్యాయస్థానం.. రూ.500 కోట్ల పరిహారంలో ఎవరికి ఎంత సహాయం చేశారో వివరాలు సరిగా లేవని తెలిపింది. రూ.500 కోట్లు ఎలా ఖర్చు చేశారో పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వరదలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను పేర్కొంటూ నివేదికను న్యాయస్థానానికి ప్రభుత్వం తరపు న్యాయవాది సమర్పించారు. నేడు దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే.. రూ.500 కోట్లు రూపాయలు పునరావాసం కోసం కేటాయించినట్లు ప్రభుత్వం రిపోర్ట్ లో పేర్కొంది. వరదల ప్రభావంతో 49 మంది మృతి చెందినట్లు కోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. అయితే.. రెండో సారి ప్రభుత్వం దాఖలు చేసిన నివేదిక కూడా అసంపూర్తిగా ఉందని వాదనలు వినిపించిన పిటిషనర్ తరుపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్.. వరద ప్రభావం , నష్టంపై మరో నివేదిక మెమోను న్యాయస్థానానికి సమర్పించారు. అంటువ్యాధులతో భాదపడుతున్న వారి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదికలో తెలపాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. చనిపోయిన 49 మందికి ఎంత నష్ట పరిహారం చెల్లించారో సమగ్ర నివేదిక సమర్పించాలని పేర్కొంది. తదుపరి విచారణ వచ్చే గురువారానికి వాయిదా వేసింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరద నివారణ, బాధితులకు సహాయం, పరిహారం అందజేత లాంటి వివరాలపై శాశ్వత నివారణ చర్యలు ఏం చేపట్టారో వేర్వేరుగా అఫిడవిట్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఇటీవల ఆదేశించింది. రాష్ట్రంలో జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంలేదంటూ డాక్టర్ చెరుకు సుధాకర్ 2020లో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. తాజా వర్షాలు, వరదల నేపథ్యంలో దీనికి సంబంధించి ఓ మధ్యంతర అప్లికేషన్ (ఐఏ) దాఖలైంది. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం.. హైకోర్టుకు ఓ నివేదికను సమర్పించింది. దీనిలో రూ.500 కోట్లను నష్టపరిహారంగా బాధితులకు పంచినట్లు స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలకు 240 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. 6,443 ఇళ్లకు పాక్షిక నష్టం వాటిల్లింది. 1,59,960 ఎకరాల్లో పంటలు వరద బారిన పడ్డాయని తెలిపింది. ఈ మేరకు తాజాగా పూర్తి నివేదిక న్యాయస్థానం ముందు పెట్టింది. ఇదీ చదవండి: Telangana Floods: సహాయక చర్యలేం చేపట్టారు..? -
ఇదేనా మీ విచారణ.. మణిపూర్ డీజీపీకి సుప్రీం కోర్టు సమన్లు
సాక్షి, ఢిల్లీ: మణిపూర్ హింసపై విచారణ జరుపుతున్న సుప్రీం కోర్టు ఇవాళ(మంగళవారం) మణిపూర్ పోలీస్ శాఖపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. వేలకొద్ది ఎఫ్ఐఆర్లు నమోదు అయినప్పటికీ.. అరెస్ట్‌లు జరగలేదని, విచారణలోనూ నిర్లక్ష్యం కనిపించిందని వ్యాఖ్యానించింది. అసలు ఎఫ్ఐఆర్లు ఇలాగేనా? నమోదు చేసేదని మణిపూర్ పోలీస్ శాఖపై మండిపడింది. వ్యక్తిగతంగా తమ ఎదుట హాజరు కావాలంటూ మణిపూర్ డీజీపీని సమన్లు జారీ చేసింది. మణిపూర్‌లో శాంతి భద్రతల అనే మాటే లేదు. రాష్ట్ర యంత్రాగం పూర్తిగా విఫలమైంది. హింస చెలరేగి మూడు నెలలైనా ఎఫ్ఐఆర్లు నమోదు చేయలేదు. అరెస్టులు జరగలేదు. విచారణలో అడుగడుగునా నిర్లక్ష్యం, నిర్లిప్తత కనిపిస్తోందంటూ మణిపూర్ పోలీస్ శాఖపై ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు. సీజేఐ చంద్రచూడ్ కామెంట్లు.. ► మే నుండి జులై చివరి వరకు రాజ్యాంగ యంత్రాంగం పూర్తిగా విచ్ఛిన్నమైంది ► జూలై 25, 2023 నాటికి 6496 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని మణిపూర్ తరపున దాఖలు చేసిన నివేదిక పేర్కొంది. అధికారిక నివేదికల ప్రకారం 150 మరణాలు సంభవించాయని, 502 మంది గాయపడ్డారని, 5,101 కేసులు ఉన్నాయని స్టేటస్ రిపోర్ట్ పేర్కొన్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. కాల్పులు మరియు 6,523 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఎఫ్ఐఆర్లలో 252 మందిని అరెస్టు చేయగా, నివారణ చర్యల కోసం 1,247 మందిని అరెస్టు చేశారు. 11 ఎఫ్ఐఆర్లకు సంబంధించి 7 మందిని అరెస్టు చేసినట్లు స్టేటస్ నివేదిక పేర్కొంది. ► 11 ఎఫ్‌ఆఐర్‌లు మహిళలపై జరిగిన వేధింపుల ఘటనకు సంబంధించినవి పేర్కొన్నారు. అసలు వీటిలో ఎన్ని జీరో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి? ఎఫ్ఐఆర్ల నమోదులో గణనీయమైన లోపం కనిపిస్తోంది. కాబట్టి.. మణిపూర్ డీజీపీ శుక్రవారం(ఆగష్టు 4వ తేదీ) మధ్యాహ్నం 2 గంటలకు ఈ కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలి. కోర్టుకు ఆయన సమాధానం చెప్పే స్థితిలో ఉండాలి అని తెలిపింది. ఆ సమయంలో ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్ జనరల్ విజ్ఞప్తి చేయడంతో.. సోమవారం(ఆగష్టు 7వ తేదీకి) మధ్యాహ్నానికి డీజీపీ హాజరు కావాలని ఆదేశాలు సవరించింది ధర్మాసనం. సమగ్ర నివేదికతో తమ ముందుకు రావాలని ఆదేశించారు సీజేఐ డీవై చంద్రచూడ్. ఎవరు బాధితుడు.. ఎవరు నేరస్తుడు అనేదాంతో సంబంధం లేదు. ఎవరు నేరం చేసినా కోర్టు తీరు ఇలాగే ఉంటుందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ► ఘటన జరిగిన తేదీ, జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తేదీ, సాధారణ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తేదీ, సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేయబడిన తేదీ, సెక్షన్ 164 సిఆర్పిసి కింద స్టేట్మెంట్లు నమోదు చేయబడిన తేదీ, అరెస్టుల తేదీ.. మొత్తం అన్నింటితో స్టేట్మెంట్ రూపొందించాలని తెలిపారు. ► రాష్ట్ర పోలీసులు విచారణ చేపట్టే పరిస్థితుల్లో మనం లేం. కాబట్టి.. ఒక యంత్రాంగం అవసరం. 6,500 ఎఫ్ఐఆర్ల దర్యాప్తును సీబీఐకి అప్పగించడం అసాధ్యమన్న విషయంపై మాకు స్పష్టత ఉంది. అదే సమయంలో.. రాష్ట్ర పోలీసులకు అప్పగించబడదు. అందుకే.. ► ప్రభుత్వ పనితీరును పరిశీలించడం, పరిహారం, పునరుద్దరణ పనులు, దర్యాప్తు స్వతంత్ర్యంగా జరిగేలా చూడడం, స్టేట్మెంట్లు నమోదు చేయడం.. ఇలా అన్ని వ్యవహారాలను చూసుకునేందుకు మాజీ న్యాయమూర్తుల కమిటీ ఏర్పాటును పరిశీలించాలని సొలిసిటర్ జనరల్‌కు సుప్రీంకోర్టు సూచించింది. Supreme Court says government shall prepare a statement setting out date of occurrence, date of registration of zero FIR, date of registration of regular FIR, date on which witness statements have been recorded, date on which statements under section 164 CrPC have been recorded,… pic.twitter.com/exn7hAaI2B — ANI (@ANI) August 1, 2023 -
మణిపూర్ వీడియోపై నేడు సుమోటో విచారణ
మణిపూర్ అల్లర్ల విషయంలో కేంద్రం సీరియస్‌గానే ఉంది. మరీ ముఖ్యంగా మహిళలపై జరిగిన అఘాయిత్యాలను మరింత తీవ్రంగా పరిగణిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరినీ ఉపేక్షించబోం. కేసు సీబీఐకి బదిలీ అయ్యింది. ఇక విచారణనే మణిపూర్ వెలుపలా.. అదీ కాలపరిమితిలో పూర్తయ్యేలా ఆదేశించండి: కేంద్రం హోం శాఖ ఢిల్లీ: మణిపూర్‌లో ఇద్దరు మహిళల నగ్న ఊరేగింపు వీడియో ఘటనను సుమోటోsuo motoగా స్వీకరించిన సుప్రీం కోర్టు.. ఇవాళ(శుక్రవారం) విచారణ చేపట్టాల్సి ఉంది. ఈ తరుణంలో ఒక్కరోజు ముందు అంటే.. నిన్న గురువారం మణిపూర్ హింసపై సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి బదిలీ చేసినట్లు సర్వోన్నత న్యాయస్థానానికి వెల్లడించిన కేంద్రం హోం శాఖ.. మరోవైపు ఈ కేసు ట్రయల్ కాలపరిమితితో(ఆరు నెలల గడువు) జరగాలని.. అదీ మణిపూర్ వెలుపలే జరగాలని అఫిడవిట్లో సుప్రీంను కోరింది. సీబీఐకి దర్యాప్తు బదిలీ అయ్యింది. కేంద్రం మాత్రం దర్యాప్తు వీలైనంత త్వరగా పూర్తవుతుందని నమ్ముతోంది. అయితే విచారణ మాత్రం కాలపరిమితితో పూర్తి కావాలని, ఆ విచారణ మణిపూర్ వెలుపలే జరిగేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీం కోర్టును కేంద్ర హోం శాఖ కోరింది. శాంతి భద్రతల అంశం ఆ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే అయినా.. కేంద్రం తమ వంతుగా న్యాయం చేసేందుకు కృషి చేస్తోందని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా సదరు అఫిడవిట్లో స్పష్టం చేశారు. లైంగిక దాడికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చాక.. కేంద్రం ఎప్పటికప్పుడు కేసు పురోగతిని పర్యవేక్షిస్తోందని తెలియజేసింది. దీంతో నేటి విచారణలో కేంద్రం అఫిడవిట్‌పై సుప్రీం ధర్మాసనం ఎలా స్పందిస్తుందనే ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో.. మీడియా ద్వారా మణిపూర్ వైరల్ వీడియోను సుమోటోగా స్వీకరించింది సుప్రీం కోర్టు. జులై 20వ తేదీన భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ధర్మాసనం తీవ్ర స్థాయిలో కేంద్రం, మణిపూర్ ప్రభుత్వాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాలను ఉద్దేశిస్తూ.. ‘‘యావత్ దేశమే కాదు.. ఈ న్యాయస్థానాన్ని ఆ వీడియో బాధించింది. మహిళలపై హింస దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేయడం రాజ్యాంగ విరుద్ధం. ఈ వీడియోతో ప్రజలు తీవ్ర ఆవేదనకు గురయయారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది. నేరస్తులను శిక్షించే విషయంలో ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయలేకపోయాయి. ప్రభుత్వాలు గనుక చర్యలు చేపట్టకపోతే మేమే రంగంలోకి దిగుతామ’’ని తీవ్ర వ్యాఖ్యలే చేసింది. ఈ క్రమంలో ఎలాంటి చర్యలు చేపట్టారో తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ.. జులై 28(నేటికి) విచారణ వాయిదా వేసింది. -
మార్గదర్శి కేసు.. నేరం ఏపీలోనే జరిగింది!
సాక్షి, ఢిల్లీ: మార్గదర్శి చిట్ ఫండ్ నిధుల మళ్లింపు కేసు విచారణ వాయిదా పడింది. మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ కేసులో హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసిన సంగతి విదితమే. అయితే ఈ కేసు విచారణను ఆగస్టు 4వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ సిటీ రవికుమార్ , జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం సోమవారం తెలిపింది. ఇవాళ్టి వాదనల సందర్భంగా.. చిట్ ఫండ్ పేరుతో నిధులను సేకరించి దారి మళ్ళించారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఏపీ ప్రభుత్వ న్యాయవాది. అలాగే.. ఆంధ్రప్రదేశ్ లోనే నేరం జరిగిందని, కాబట్టి.. కేసులన్నింటినీ ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని వాదించారు. అయితే.. చిట్ ఫండ్ నిధులను హైదరాబాదు నుంచి మ్యూచువల్ ఫండ్ లోకి తరలించారని వాదించారు మార్గదర్శి తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి. కాజ్ ఆఫ్ యాక్షన్ హైదరాబాద్ లోనే ఉంది కనుక తెలంగాణలోనే విచారణ జరపాలని వాదించారు. దీంతో.. ట్రాన్స్ఫర్ పిటిషన్లతో కలిపి ఈ కేసు విచారణ చేస్తామని పేర్కొన్న ధర్మాసనం, ఆగష్టు 4వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసింది. -
విడాకుల కేసు.. అమెరికా నుంచి రావాల్సిందే
సాక్షి, బెంగళూరు: ఒక విడాకుల కేసులో అమెరికాలో ఉన్న భర్తను భారతదేశానికి రప్పించేందుకు ఒక భార్య చేసిన న్యాయ పోరాటంలో అనుకూల తీర్పు వచ్చింది. వివరాలు.. అమెరికాలో ఉన్న భర్త, బెంగళూరులో ఉన్న భార్యతో విడాకుల కోసం బెంగళూరు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ విచారణకు భర్త నేరుగా హాజరు కావాలని, వీడియో కాన్ఫరెన్స్ విచారణ సరికాదని కోర్టుకు భార్య విన్నవించింది. అయితే ఆయన అమెరికా నుంచి రావడానికి అయ్యే రూ.1.60 లక్షల ఖర్చును మీరే భరించాలని కోర్టు ఆమెకు సూచించింది. ఈ తీర్పుతో కంగుతిన్న మహిళ ఆ తీర్పును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించింది. భార్య కోరినట్లు అతడు భౌతికంగా హాజరవ్వడంలో ఎలాంటి తప్పు లేదని హైకోర్టు పేర్కొంది. భర్త పేదవాడు కూడా కాకపోవడంతో ఆ ప్రయాణ ఖర్చులను అతడే భరించుకోవాలని, విచారణకు రావాలని ఆదేశించింది. -
‘మార్గదర్శి’ నిధుల దారి మళ్లింపు కేసుపై సుప్రీంలో విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: మార్గదర్శి చిట్ ఫండ్స్ నిధుల దారి మళ్లింపు కేసుపై సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో సంస్థ యజమానులు, ఉద్యోగులకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న తెలంగాణ హై కోర్డు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ రాజేష్ బిందాల్ విచారణ జరిపారు. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలన్న అభ్యర్థనను పరిశీలన చేస్తామన్న సుప్రీంకోర్టు.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ సహా ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 18కి వాయిదా వేసింది. ‘‘తెలంగాణ హైకోర్డు ఇచ్చిన స్టే పోలీసుల దర్యాప్తునకు ఆటంకం కలిగిస్తోంది. దర్యాప్తునకు ఎలాంటి ఆటంకాలు కల్పించవద్దన్నది న్యాయసూత్రం. ఏపీలోనే అత్యధిక చిట్ ఫండ్ డిపాజిట్ దారులు ఉన్నారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ హెడ్ ఆఫీసు హైదరాబాద్‌లో ఉన్న కారణంతో తెలంగాణ హై కోర్టు స్టే ఉత్తర్వులు ఇవ్వడం సరికాదు’’ అని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. బ్రాంచ్ ఆఫీస్ డబ్బు హెడ్ ఆఫీస్‌కు తరలించి స్వాహా చేశారని. సంపూర్ణ న్యాయం కోసం హై కోర్టులో ఏ పిటిషన్ అయినా ట్రాన్స్ ఫర్ చేసే అధికారం 139-ఏ కింద సుప్రీం కోర్టుకు ఉందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. చదవండి: ఎల్లో మీడియాకు హైకోర్టు దిమ్మదిరిగే గుణపాఠం.. ఆ కుట్రకు గండి పడిందా? -
అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
-
గో ఫస్ట్‌కు ఎన్సీఎల్టీ ఊరట
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న విమానయాన సంస్థ గో ఫస్ట్‌కు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) కాస్త ఊరటనిచ్చింది. కంపెనీ స్వచ్ఛందంగా దాఖలు చేసిన దివాలా పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. అలాగే ఆర్థిక వ్యవహారాలు, చెల్లింపులకు సంబంధించి మారటోరియం విధించింది. మే 4న ఉత్తర్వులను రిజర్వ్ చేసిన ఎన్సీఎల్టీ దాదాపు వారం రోజుల ఉత్కంఠకు తెరదించుతూ తాజాగా బుధవారం నాడు ఆదేశాలను వెలువరించింది. మధ్యంతర పరిష్కార నిపుణుడిగా (ఐఆర్పీ) అభిలాష్ లాల్‌ను నియమించడంతో పాటు ఏ ఉద్యోగినీ తీసివేయకూడదని ఆదేశించింది. అలాగే, రద్దయిన మేనేజ్మెంటు.. తక్షణ ఖర్చుల కోసం రూ. 5 కోట్ల మొత్తాన్ని ఐఆర్పీ వద్ద డిపాజిట్ చేయాలని సూచించింది. తమ విజ్ఞప్తులను కూడా తెలుసుకున్న తర్వాతే గో ఫస్ట్ దివాలా పిటీషన్‌పై తగు నిర్ణయం తీసుకోవాలంటూ సంస్థకు విమానాలను లీజుకిచ్చిన కంపెనీల అభ్యంతరాలను ఎన్సీఎల్టీ తోసిపుచ్చింది. గో ఫస్ట్ తాను బాకీల విషయంలో డిఫాల్ట్ అయ్యానని, రుణదాతల నుంచి వచ్చిన డిమాండ్ నోటీసులను కూడా సమర్పించిందని, లీజు సంస్థలు కూడా దీన్ని ఖండించడం లేదని ద్విసభ్య ఎన్సీఎల్టీ బెంచ్ పేర్కొంది. ఈ నేపథ్యంలో దివాలా చట్టంలోని సెక్షన్ 10 కింద కంపెనీ పిటిషన్‌ను విచారణకు స్వీకరించడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని తెలిపింది. దీనితో దివాలా విచారణ పూర్తయ్యే వరకూ ఇతరత్రా దావాల నుంచి గో ఫస్ట్‌కు రక్షణ లభించనుంది. సంస్థ ఆస్తులను బదిలీ చేయడానికి గానీ రుణ దాతలు రికవరీ చేసుకోవడానికి గానీ ఉండదు. గో ఫస్ట్‌కు రూ. 11,463 కోట్ల ఆర్థిక భారం ఉండగా, 7,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. -
మే 7న జరగాల్సిన WFI ఎన్నికలు వాయిదా
-
తెలంగాణ గవర్నర్ పెండింగ్ బిల్లుల కేసుపై సుప్రీంలో పూర్తయిన విచారణ
-
రిమాండ్‌ను సవాల్ చేస్తూ బండి సంజయ్ పిటిషన్
-
24న కాదు 27న కవిత పిటిషన్ విచారణ!
సాక్షి, ఢిల్లీ: సుప్రీం కోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 27వ తేదీన విచారణ జరగనుంది. తొలుత 24వ తేదీన(రేపు) విచారణ జరుపుతామని చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషనర్‌కు తెలిపింది. అయితే.. లిక్కర్ స్కాంలో ఈడీ తీరును తప్పుబడుతూ ఆమె సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పిటిషన్ విచారణ తేదీలో మార్పు చోటుచేసుకుంది. జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన బెంచ్ కవిత పిటిషన్‌పై విచారణ జరపనుంది. ఐటెం నెంబర్ 36 గా లిస్ట్ అయ్యింది ఆమె పిటిషన్. లిక్కర్ స్కాంలో ఈడీ జారీ చేసిన సమన్లు రద్దు చేయాలని, మహిళలను ఇంటి వద్దే విచారణ చేయాలని, తనకు వ్యతిరేకంగా ఎలాంటి (అరెస్ట్) చర్యలు తీసుకోవద్దని సుప్రీం కోర్టులో కవిత పిటిషన్ వేశారు. -
TS: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై హైకోర్టు కీలక ఆదేశాలు..
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు దర్యాప్తుకు సంబంధించిన స్టేటస్ రిపోర్టు (స్థాయి నివేదిక)ను సమరి్పంచాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇందుకు 3 వారాల సమయం ఇస్తున్నట్లు తెలిపింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలుకు కూడా ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 11కు వాయిదా వేసింది. పేపర్ లీకేజీ కేసును సిట్ పారదర్శకంగా దర్యాప్తు చేయడం లేదని, సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌తో పాటు మరో ఇద్దరు నిరుద్యోగులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వివేక్ థన్కా వాదనలు వినిపించారు. ఇద్దరే ఉన్నారని మంత్రి ఎలా చెబుతారు.. ‘టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసును ప్రభుత్వం సిట్‌కు అప్పగించింది. దర్యాప్తు ప్రారంభం దశలోనే ఈ కేసులో ఇద్దరే నిందితులు అని మంత్రి కేటీఆర్ ప్రెస్మీట్లో చెప్పారు. ప్రభుత్వ అత్యున్నత పదవిలో ఉన్న మంత్రి వ్యాఖ్యలు దర్యాప్తును ప్రభావితం చేస్తాయనడంలో సందేహం లేదు. ఉద్దేశపూర్వకంగానే ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. ఇద్దరే ఉన్నారని ఆయనకు ఎలా తెలుసు? ఆయన నియోజకవర్గంలో 20 మందికి అత్యధిక మార్కులు వచ్చాయి. ఇది కూడా అనుమానాలకు తావిస్తోంది. మంత్రి వ్యాఖ్యలు, లీకేజీలో ఆయన పీఏ పాత్ర ఉన్నట్లుగా ఆరోపణల నేపథ్యంలో సిట్ స్వేచ్ఛగా దర్యాప్తు చేయలేదు. సీబీఐకి లేదా స్వతంత్ర దర్యాప్తు బృందానికి కేసును బదిలీ చేయాలి. పారదర్శక, నిష్పక్షపాత దర్యాప్తు జరగాలన్నదే మా విజ్ఞప్తి..’అని థన్కా తెలిపారు. సిట్ 9 మందిని అరెస్టు చేసింది.. ‘కేసు ప్రారంభ దశలోనే వెంకట్, ఓయూ విద్యార్థులు కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ వేసే అర్హత (లోకస్ స్టాండీ) వారికి లేదు. దర్యాప్తు అడ్డుకోవాలన్న ఉద్దేశంతోనే వారు పిటిషన్ వేశారు. ఇద్దరే ఉన్నారని మంత్రి చెప్పారని, అది సిట్ దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని వారు చెబుతున్నారు. కానీ సిట్ ఇప్పటి వరకు 9 మందిని అరెస్టు చేసింది. ఈ పిటిషన్ కేవలం రాజకీయ దురుద్దేశంతోనే వేశారు. ఈ కేసును సిట్ సమగ్రంగా దర్యాప్తు చేస్తోంది. ఈ కేసు విషయంలో ప్రభుత్వం కూడా సీరియస్‌గా ఉంది. లీకేజీ గురించి తెలియగానే టీఎస్పీఎస్సీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రభుత్వం కూడా కేసును సిట్‌కు అప్పగించింది. కాబట్టి ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు. సీబీఐ విచారణ అవసరం లేదు. పిటిషన్‌ను కొట్టివేయాలి..’అని ఏజీ అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదించారు. కాగా పిటిషనర్లలో ఇద్దరు టీఎస్పీఎస్సీ పరీక్షలకు హాజరైన అభ్యర్థులేనని థన్కా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. చదవండి: ఈడీ అధికారులకు కవిత సంచలన లేఖ.. -
ఎంపీ అవినాష్ రెడ్డి పిటిషన్ పై హైకోర్టులో విచారణ
-
ఏపీ రాజధాని కేసు విచారణ తేదీ ఇచ్చిన సుప్రీం కోర్టు
-
మోదీ బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై సుప్రీంకోర్టులో విచారణ..
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ 2002లో గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన గోద్రా అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీ రూపొందించిన విషయం తెలిసిందే. ఇది పూర్తి దురుద్దేశంతో ఉందని కేంద్రం ఇందుకు సంబంధించిన రెండు వీడియోలను బ్యాన్ చేసింది. యూట్యూబ్, ట్విట్టర్లో వీడియో లింకులను బ్లాక్ చేసింది. తాజాగా కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించడం రాజ్యాంగ విరుద్ధమని, ఏకపక్ష నిర్ణయమని సీనియర్ న్యాయవాదులు ఎంఎల్ శర్మ, సీయూ సింగ్ తమ పిటిషన్లలో పేర్కొన్నారు. వీటిని అత్యవసరంగా విచారించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. సీనియర్ జర్నలిస్ట్ ఎన్ రామ్, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా బీబీసీ వీడియోలను కేంద్రం బ్లాక్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ జేబీ పార్దీవాలాతో కూడిన బెంచ్ వీటిని పరిశీలించింది. వీటన్నింటిపై ఫిబ్రవరి 6న విచారణ చేపడతామని చెప్పింది. చదవండి: చావనైనా చస్తా.. కానీ బీజేపీతో మాత్రం చేతులు కలపను.. -
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై నేడు హైకోర్టులో విచారణ
-
సుప్రీంకోర్టులో నేడు అమరావతి కేసుల విచారణ
-
‘బీబీ పాటిల్ ఎన్నిక’ పిటిషన్ పునఃవిచారించండి
సాక్షి, న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా బీబీ పాటిల్ గెలుపును సవాల్ చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్ దాఖలు చేసిన పిటిషన్‌ను పునః విచారించాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. హైకోర్టు ఆదేశాలు సవాల్ చేస్తూ మదన్మోహన్ దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం విచారించింది. చదవండి: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. లాభాల బోనస్ ప్రకటన హైకోర్టు జూన్ 15న మౌఖికంగానే తీర్పు చెప్పిందని పూర్తి తీర్పు ప్రతులు బహిర్గతం చేయకపోవడంతో విచారణ, వాదనలు వినడం వృథా అని ధర్మాసనం స్పష్టంచేసింది. కోర్టు తీర్పునకు వేచి ఉండాలని ఆదేశించలే మని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును పక్కనపెట్టి పునఃవిచారించాలని పేర్కొంది. కేసుపై హైకోర్టు సీజే తగిన ఉత్తర్వులు జారీ చేయాలని, అక్టోబర్ 10న అన్ని పార్టీలు హైకోర్టు ముందు హాజరు కావాలని పేర్కొంది. ఎన్నికల్లో గెలిచిన పాటిల్ తన అఫిడవిట్లో క్రిమి నల్ కేసుల వివరాలు పొందపరచలేదని మదన్మోహన్ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. -
వినియోగదారుల ఫిర్యాదుల విచారణ.. ఇక ఆన్లైన్లో!
సాక్షి, న్యూఢిల్లీ: వినియోగదారుల ఫిర్యాదులపై విచారణను ఇకపై ఆన్లైన్ ద్వారా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ఆరంభించింది. ఇది అమల్లోకి వస్తే ఫిర్యాదుదారులు భౌతికంగా కేసుల విచారణకు హాజరయ్యే అవసరం గణనీయంగా తగ్గనుంది. పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించేందుకు, కేసులను సత్వరమే పరిష్కరించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్‌కుమార్ సింగ్ ప్రకటించారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఉండే అన్ని వినియోగదారుల కమిషన్లలో త్వరలోనే ఈ ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదంలో సరబ్జిత్ సింగ్ భార్య కన్నుమూత -
ఉచితాలు అంశంపై లోతైన చర్చ అవసరం: సీజేఐ
-
భూమన నేతృత్వంలో పెగాసస్ పై నేడు హౌస్ కమిటీ విచారణ
-
Gyanvapi Mosque Case: విచారణ 26కు వాయిదా
-
జ్ఞానవాపి మసీద్ కేసు: విచారణ 26కు వాయిదా
సాక్షి, హైదరాబాద్: జ్ఞానవాపి మసీద్ కేసులో విచారణ గురువారానికి వాయిదా పడింది. ఈ నెల 26వ తేదీన విచారణ చేపట్టనున్నట్టు వారణాసి జిల్లా కోర్టు మంగళవారం జరిగిన విచారణలో భాగంగా స్పష్టం చేసింది. కాగా, సర్వే నివేదికలో ఏవైనా అభ్యంతరాలుంటే వారం రోజుల్లో వెల్లడించాలని హిందూ, ముస్లిం పక్షాలను కోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండగా.. జ్ఞాన్వాపి మసీదు కేసుపై భిన్న వాదనలు కొనసాగుతున్నాయి. ఈ కేసును కొట్టివేయాలంటూ ముస్లిం పక్షం కోరుతుండగా.. మసీదులో శివలింగం కనిపించిదన్ని దీంతో అక్కడ ప్రతీ రోజు పూజలకు అనుమతించాలని హిందూ వర్గం కోరుతోంది. ఇక, ముస్లిం పక్షం చేసిన ఆర్డర్ 7 11 CPC దరఖాస్తుపై వారణాసి కోర్టు మే 26న విచారణ చేపట్టనుంది. అప్పటిదాకా యథాతథ స్థితిని కొనసాగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇది కూడా చదవండి: కుతుబ్ మినార్‌లో ఆలయ పునరుద్ధరణ సాధ్యం కాదు.. -
ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టులో విచారణ
-
మహిళలకు అధికారమిస్తే ఆందోళన ఎందుకు?
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులను ‘మహిళా పోలీసులు’గా పోలీసుశాఖలో అంతర్భాగంగా పరిగణిస్తూ ఈ ఏడాది జూన్‌లో జారీచేసిన జీవో 59పై హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, ఏపీపీఎస్సీ చైర్మన్, పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ తదితరులకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను నవంబర్ 24కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకటశేషసాయిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. జీవో 59 ఏపీ పోలీసు చట్ట నిబంధనలకు, రాజ్యాంగానికి విరుద్ధమంటూ ప్రకటించి ఆ జీవోను రద్దు చేయాలని కోరుతూ విశాఖపట్నం పెదవాల్తేరుకు చెందిన నిరుద్యోగి ఆరేటి ఉమామహేశ్వరరావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ న్యాయవాది వై.బాలాజీ వాదనలు వినిపిస్తూ.. మహిళా సంరక్షణ కార్యదర్శులను పోలీసులుగా పరిగణించడంతోపాటు వారికి పోలీసు యూనిఫాం ఇవ్వడంతోపాటు కానిస్టేబుల్‌కు ఉండే అధికారాలు, బాధ్యతలు కట్టబెట్డడం చట్టవిరుద్ధమని చెప్పారు. పోలీసు నియామక బోర్డు ద్వారానే పోలీసు నియామకాలు జరగాల్సి ఉంటుందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. మహిళలకు అధికారం ఇస్తే తప్పేముందని ప్రశ్నించింది. మహిళలకు అధికారం ఇస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదంది. ప్రజలకు సేవ చేయడానికే కదా ప్రభుత్వం మహిళలను పోలీసులుగా గుర్తిస్తోందంటూ వ్యాఖ్యానించింది. మహిళలకు అధికారం ఇవ్వడాన్ని తాము తప్పుపట్టడం లేదని, నిబంధనలకు విరుద్ధంగా చేయడాన్నే తప్పుపడుతున్నామని బాలాజీ చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను నవంబర్ 24కి వాయిదా వేసింది. -
Uttarpradesh: లఖీంపూర్ ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరీ ఘటనపై బుధవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో యూపీ ప్రభుత్వం తరపున హరీష్ సాల్వే.. ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. కాగా, ఘటన తర్వాత తీసుకున్న చర్యలపై సుప్రీం ధర్మాసనం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎంత మందిని అరెస్ట్ చేశారని సుప్రీంకోర్టు హరిష్ సాల్వేని ప్రశ్నించింది. దీనికి సమాధానంగా.. నలుగురిని అరెస్ట్ చేశామని యూపీ అడ్వకేట్ జనరల్ హరీష్ సాల్వే తెలిపారు. ఘటనకు సంబంధించిన దర్యాప్తు నివేదికను సీల్డుకవర్లో ధర్మాసనం ముందు ఉంచామని హరిష్ సాల్వే తెలిపారు. మరికొన్ని వీడియోలున్నాయని, అవి దర్యాప్తునకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ సూర్యకాంత్.. నివేదికను సీల్డుకవర్లో ఇవ్వాలని తాము కోరలేదని స్పష్టం చేశారు. నిన్న రాత్రి 1 గంట వరకు ఎలాంటి నివేదిక అందలేదని సుప్రీంకోర్టు జస్టిస్ రమణ తెలిపారు. కాగా, తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదావేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. చదవండి: Jammu Kashmir: జమ్మూలో కాల్పులు.. ఇద్దరు ఉగ్రవాదుల మృతి -
కోర్టులు భౌతికంగా పనిచేయక తప్పదు: సుప్రీం
న్యూఢిల్లీ: హైబ్రిడ్ విధానంలో కేసుల విచారణ సవ్యంగా సాగడం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. వర్చువల్ విచారణ ఇక తప్పనిసరి కాదని తెలిపింది. కోవిడ్ మహమ్మారి ముందు మాదిరిగా న్యాయస్థానాలు ఇకపై భౌతిక విచారణలు జరపాలని సూచించింది. ‘కోర్టుల్లో కూర్చుని, స్క్రీన్ల వైపు చూస్తూ విచారణలను నిర్వహించడం మాకు సంతృప్తికరంగా లేదు’ అని జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ బీఆర్ గవాయ్‌ల ధర్మాసనం శుక్రవారం పేర్కొంది. కోర్టులు తిరిగి యథావిధిగా పనిచేయాలనీ, పౌరులందరికీ న్యాయం అందించేందుకు కృషి చేయాలని కోరింది. వర్చువల్ విచారణను పిటిషనర్ల ప్రాథమిక హక్కుగా ప్రకటించాలంటూ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ సొసైటీస్ ఫర్ ఫాస్ట్ జస్టిస్ అనే ఎన్జీవో వేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. ఈ అంశంపై ఎలా ముందుకెళ్లాలనే విషయమై తగు సూచనలు ఇవ్వాల్సిందిగా పిటిషనర్లయిన కేంద్ర సమాచార హక్కు మాజీ కమిషనర్ శైలేష్ ఆర్ గాంధీ, ముంబై మాజీ పోలీస్ కమిషనర్ జూలియో రిబీరో తదితరులకు నోటీసులిచ్చింది. -
నేటి నుంచే ప్రారంభం
-
Telangana: జీవో 111 పై హైకోర్టులో విచారణ
హైదరాబాద్: జీవో నంబర్ 111 అంశానికి సంబంధించి ప్రభుత్వ పనితీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. విచారణ చేపట్టి నాలుగేళ్లయినా ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ఎందుకు ఇవ్వడం లేదని హైకోర్టు నిలదీసింది. ఈ జీవోపై గురువారం విచారణ సందర్భంగా.. అసలు నివేదిక జాప్యం వెనక రహస్య అజెండా ఏంటని సీజే జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ వి.విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. కాగా, దీనిపై ప్రభుత్వ అదనపు ఏజీ రామచంద్రరావవు.. కరోనా, తదితర కారణాల వల్ల ఆలస్యమైందని వివరణ ఇచ్చారు. దీనిపై సంతృప్తి చెందని ధర్మాసనం.. ఉన్నత స్థాయి కమిటీ నివేదికను సెప్టెంబర్ 13 లోగా ఇవ్వాలని సూచించింది. ఒకవేళ నివేదిక సమర్పించకపోతే ఆ రోజుతో కమిటీ రద్దు చేస్తామని స్పష్టం చేసింది. ఈపీటీఆర్ఐ నివేదికపై కూడా అభిప్రాయాలను తెలపాలని కమిటీకి ఆదేశించింది. నివేదికను వెబ్సైట్లో పెట్టాలని కమిటీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను అక్టోబరు 4కి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. చదవండి: Work From Home: జనవరి వరకు ఊరట.. ఇప్పుడు ఎంప్లాయిస్ మరో మాట! -
పెగాసస్‌పై సుప్రీం విచారణ వాయిదా
సాక్షి,ఢిల్లీ: పార్లమెంటులో ప్రకంపనలు రేపుతున్న పెగాసస్ స్నూపింగ్ కుంభకోణంపై సుప్రీంకోర్టులో మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. పెగాసస్‌పై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ సుప్రీంలో దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణను ఆగస్టు 16వ తేదీకి వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ, జస్టిస్ వినీత్ శరణ్ , జస్టిస్ సూర్య కాంత్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశించింది. ఈ సందర్భంగా సుప్రీం మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకవైపు కోర్టులో కేసు వాదనలు జరుగుతుండగానే, పిటీషనర్లు సోషల్ మీడియాలో సమాంతర చర్చలు ఎందుకు చేపడుతున్నారని ప్రశ్నించింది. ఏదైనా చెప్పాలనుకుంటే, కోర్టులోనే చెప్పాలని సీజే పేర్కొన్నారు. ఒకసారి కోర్టులను ఆశ్రయించిన తరువాత కోర్టులపై విశ్వాసముంచాలని ఆయన సూచించారు. దీనిపై స్పందించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కేసు విచారణలో ఉన్న విషయాన్ని బయట చర్చించకూడని తామూ అంగీకరిస్తున్నామన్నారు. పిటిషన్లు అందాయని కోర్టుకు తెలిపిన సొలిసిటర్ జనరల్(ఎస్జీ) తుషార్ మెహతా ప్రభుత్వం నుంచి తమకు సమాచారం రావాల్సి ఉందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వ సూచనలు, సలహాల నిమిత్తం శుక్రవారం వరకు సమయం కావాలని కోరారు. దీనిని వ్యతిరేకించిన పిటిషనర్ల తరపు న్యాయవాది కబిల్ సిబల్ తక్షణమే కేంద్రానికి నోటీసులు జారీ చేయాలని కోరారు. కానీ సోమవారం వరకు సీజేకు గడువు ఇచ్చిన సుప్రీం, తదుపరి విచారణను వాయిదా వేసింది. కాగా ఇప్పటికే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఆరోపణలు నిజమైతే ఇవిచాలా తీవ్రమైనవని ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. రాజకీయ, న్యాయ, రక్షణ రంగ ప్రముఖులు, జర్నలిస్టులు సహా 300మందికి పైగా ప్రముఖుల ఫోన్ నంబర్ల హ్యాంకింగ్ వ్యవహారం దుమారాన్ని రాజేసింది. అయితే భారత్‌లో నిఘా లేదంటూ కేంద్రం ఇప్పటికే పార్లమెంట్లో ప్రకటించింది. -
ఏపీ: అమరారెడ్డినగర్ కాలనీ వాసుల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
సాక్షి, అమరావతి: తాడేపల్లి అమరారెడ్డినగర్ కాలనీ వాసుల పిటిషన్‌పై ఏపీ హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. 245 మందికి స్థలాలు కేటాయించామని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. లబ్ధిదారులకు నష్ట పరిహారం కూడా చెల్లించామని ప్రభుత్వం పేర్కొంది. ఇళ్లు ఖాళీ చేసేందుకు పిటిషనర్లు రెండు నెలలు సమయం కోరగా, వారి అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. రెండు వారాల్లో ఇళ్లు ఖాళీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. -
మాజీ ఏజీ దమ్మాలపాటి కేసుపై సుప్రీంకోర్టులో విచారణ
సాక్షి, ఢిల్లీ: మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి కేసుపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ తన వాదనలు వినిపించారు. దర్యాప్తును సీబీఐ లేదా రిటైర్డ్ జడ్జి లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ కేసును లోతైన విచారణ జరిపేందుకు హైకోర్టుకు పంపాలని రాజీవ్ ధావన్ కోరారు. వాదనలు విన్న కోర్టు.. తదుపరి విచారణను ఈనెల 22కి వాయిదా వేసింది. -
Telangana High Court: సహజ న్యాయసూత్రాలను కాలరాస్తారా?
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు చెందిన జమున హ్యాచరీస్‌లో అసైన్డ్ భూముల పేరుతో మెదక్ కలెక్టర్ హడావుడిగా చేసిన విచారణను హైకోర్టు తప్పుబట్టింది. ఎటువంటి నోటీసులు జారీ చేయకుండానే ఆగమేఘాలపై విచారణ చేపట్టడం ఏమిటని నిలదీసింది. రాజ్యాంగం ప్రాథమిక హక్కులు కల్పించిన ఆర్టికల్ 14, 19, 21ని ఉల్లంఘించే అధికారం కలెక్టర్‌కు ఉందా? అని ప్రశ్నించింది. ఈ నెల 1న కలెక్టర్ ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకోరాదని, దానితో ప్రభావితం కావొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. జమున హ్యాచరీస్ యాజమాన్యానికి తాజాగా నోటీసులు జారీచేయాలని, వివరణ ఇచ్చేందుకు నిర్దిష్టమైన సమయం ఇవ్వాలని.. ఆ తర్వాత తప్పు జరిగినట్టు నిర్ధారణ అయితే చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని తేల్చిచెప్పింది. అప్పటివరకు బలవంతంగా ఎటువంటి చర్యలు చేపట్టరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి.వినోద్‌కుమార్ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులి చ్చారు. తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మెదక్ కలెక్టర్ తమ కంపెనీలో విచారణ చేపట్టడాన్ని సవాల్ చేస్తూ.. జమున హ్యాచరీస్ తరఫున ఈటల రాజేందర్ కుమారుడు నితిన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి హౌస్ మోషన్ రూపంలో అత్యవసరంగా విచారించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. కనీస నిబంధనలు పాటించరా? ఏప్రిల్ 30న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విచారణ చేయాలని కలెక్టర్‌ను ఆదేశించడం, వెంటనే విచారణ జరిపి తర్వాతి రోజే నివేదిక సమర్పించడం జరిగిపోయిందని.. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఏ నిబంధన ప్రకారం జమునా హ్యాచరీస్ భూముల్లోకి కలెక్టర్ ప్రవేశించారని అడ్వకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్‌ను న్యాయమూర్తి ప్రశ్నించారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ విచారణను భోజన విరామం తర్వాతకు వాయిదా వేశారు. కలెక్టర్ చేపట్టింది ప్రాథమిక విచారణ మాత్రమేనని, రెవెన్యూ అధికారి విచారణ కోసం ఎవరి భూమిలోకి అయినా వెళ్లొచ్చని ఏజీ వివరణ ఇవ్వడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ప్రాథమిక హక్కులను, చట్ట నిబంధనలను కలెక్టర్ ఉల్లంఘిస్తున్నా చూస్తూ ఊరుకోవాలా? విచారణ చేసి ఎన్ని గంటల్లో నివేదిక ఇచ్చారు? ప్రతివాదిగా ఉన్న వ్యక్తికి నోటీసు ఇవ్వకుండా ఎలా విచారణ చేస్తారు? ఈ విషయంలో కనీస ప్రొటోకాల్ పాటించలేదు. సెక్షన్ 149, 151 ప్రకారం.. సదరు కంపెనీ యజమానికి సమాచారం ఇవ్వాలి. వారి సమక్షంలోనే విచారణ చేయాలి. కలెక్టర్ నోటీసులు జారీచేసి ఉంటే ఈ అపవాదు వచ్చేదికాదుగా. సచివాలయంలోకి ఎవరైనా ప్రవేశించాలంటే ఎటువంటి ప్రొటోకాల్ పాటించాలో.. అలాగే విచారణ జరిపే సమయంలోనూ నిబంధనల మేరకు వ్యవహరించాలి. బ్యాక్ డోర్ నుంచి కాకుండా రాజమార్గంలో వెళ్లాలి. అధికారులు ముందస్తు ప్రణాళిక ప్రకారం కారులో కూర్చొని నివేదిక రూపొందించినట్లుగా ఉంది’’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. మొక్కుబడి నోటీసులు వద్దు సేల్స్ ట్యాక్స్ అధికారుల తరహాలో మొక్కుబడిగా నోటీసులు జారీచేసి చర్య తీసుకుంటామంటే కుదరదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. సేల్స్ ట్యాక్స్ అధికారులు మూడు వేర్వేరు తేదీల్లో నోటీసులు జారీ చేసినట్లు చూపించి, తర్వాత చర్య తీసుకున్నామని చెప్తుంటారు. నోటీసులు ఎవరికి ఇచ్చారనేది చెప్పరు. ఈ కేసులో అలా వ్యవహరించడానికి వీల్లేదు. శుక్రవారం నోటీసులిచ్చి సోమవారానికల్లా వివరణ ఇవ్వాలంటే కుదరదు. కనీసం వారం రోజుల సమయం ఇవ్వాలి. వివరణ తీసుకున్న, విచారణ జరిపి తప్పు జరిగినట్టు నిర్ధారణ అయితే చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చు’’ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మెదక్ కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్‌తోపాటు డీజీపీ, ఏసీబీ, విజిలెన్స్ డైరెక్టర్ జనరల్, మెదక్ ఎస్పీలను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. విచారణను జూలై 6కు వాయిదా వేశారు. ఎవరి వాదన ఏంటి? అవి అసైన్డ్ భూములే.. కలెక్టర్ వెళ్లొచ్చు: ఏజీ ‘‘జమున హ్యాచరీస్‌లో అసైన్డ్ భూములు ఉన్నాయంటూ వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే విచారణ జరిపాం. ఆ భూములను ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టారు. రెవెన్యూ చట్టం సెక్షన్ 156 ప్రకారం వాస్తవాలు తెలుసుకునేందుకు రెవెన్యూ అధికారికి ఎవరి భూమిలోకైనా ప్రవేశించే అధికారం ఉంటుంది. విచారణ సమయంలో హేచరీస్ జనరల్ మేనేజర్ అక్కడే ఉన్నారు. అయినా ముందు జాగ్రత్తగా ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదు. కలెక్టర్ చేసినది ప్రాథమిక విచారణ మాత్రమే.. చర్యలు చట్టబద్ధంగానే ఉంటాయి. ప్రాథమిక విచారణ చట్టబద్ధమేనని పేర్కొంటూ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తాం’’ అని హైకోర్టులో అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదన వినిపించారు. కానీ దీనిని న్యాయమూర్తి తోసిపుచ్చారు. నోటీసు జారీచేయకుండా విచారణ చేయవచ్చనేందుకు ఏజీ ఎటువంటి నిబంధనలను చూపించలేకపోయారని స్పష్టం చేశారు. అప్పటికప్పుడే ప్రభుత్వ భూములంటూ బోర్డు: పిటిషనర్ ‘‘అడ్వొకేట్ జనరల్ ఇది ప్రాథమిక విచారణ మాత్రమే అని చెప్తున్నారు. ఏకపక్షంగా విచారణ చేసి.. అప్పటికప్పుడే కేవలం హ్యాచరీస్ ఎదుట ఇవి ప్రభుత్వ భూములంటూ బోర్డు పెట్టారు. హ్యాచరీస్ కంపెనీ రైతులకు చెందిన 60 ఎకరాల పట్టా భూములను కొనుగోలు చేసింది. ఈ భూముల వివరాలు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో కూడా ఉన్నాయి. కలెక్టర్ సర్వే చేసే ముందు కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించారు. పెద్ద ఎత్తున పోలీసులు, రెవెన్యూ అధికారులు హ్యాచరీస్ ఆవరణలోకి అక్రమంగా ప్రవేశించారు. ఇలా చట్టవిరుద్ధంగా వ్యవహరించడం ఆర్టికల్ 300 (ఎ) ప్రకారం రాజ్యాంగబద్ధ హక్కులను హరించడమే. విచారణ పేరుతో కలెక్టర్ ఇచ్చిన నివేదికను కూడా మాకు అందజేయలేదు. ప్రస్తుతం హ్యాచరీలో 1.60 లక్షల కోళ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ నివేదికను చట్టవిరుద్ధంగా ప్రకటించండి. బలవంతపు చర్యలు తీసుకోకుండా, చట్టబద్ధంగా వ్యవహరించేలా ఆదేశించండి’’ అని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. చదవండి: హైకోర్టును ఆశ్రయించిన జమున హ్యాచరీస్ ఇవన్నీ పనికి రావు.. సంపూర్ణ లాక్‌డౌనే ఏకైక మార్గం -
8 నుంచి ‘ఓటుకు కోట్లు’ తుది విచారణ
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు తుది విచారణ ఈ నెల 8 నుంచి ప్రారంభం కానుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేయాలంటూ 2015లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించినటువంటి ఆధారాలను ఏసీబీ సోమవారం ప్రత్యేక కోర్టుకు సమర్పించింది. ఇందులో రికార్డయిన వీడియోతోపాటు నిందితులకు సంబంధించిన ఫోన్ రికార్డింగ్స్ తో కూడిన 1 టీబీ హార్డ్‌డిస్క్‌లు రెండు, ఒక డీవీడీఆర్ ఉన్నాయి. ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న స్టీఫెన్సన్ను ఈనెల 8న హాజరై వాంగ్మూలం ఇవ్వాలని -
సుజనా చౌదరికి ఈడీ నోటీసులు
న్యూఢిల్లీ: బ్యాంకుల వద్ద రుణాలను తీసుకుని చెల్లించకుండా మోసం చేసిన కేసులో కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ సుజనా చౌదరికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 12వ తేదీన విచారణకు హాజరుకావాలని సుజనాకు ఈడీ నోటీసులు అందించింది. డొల్ల కంపెనీలతో సుజనా రూ.కోట్లు కొల్లగొట్టినట్టు అభియోగాలు నమోదైన విషయం తెలిసిందే. రూ.5,700 కోట్ల మేర బ్యాంకులను మోసం చేశారనే అభియోగాలపై ఈడీ కేసులు నమోదు చేసింది. కేంద్రమంత్రిగా ఉన్న సమయంలోనే సుజనా అక్రమాలకు పాల్పడినట్లు అభియోగాలు వచ్చాయి. ఇప్పటికే ఆయనపై మూడు ఎఫ్ఐఆర్లు సీబీఐ నమోదు చేసింది. వీటి ఆధారంగా 2018లో సుజనాపై ఈడీ సోదాలు జరిపింది. 126 షెల్ కంపెనీలు సృష్టించి సుజనా రూ.కోట్లు కొల్లగొట్టినట్టు ఆధారాలు సేకరించింది. వాటిలో సెంట్రల్ బ్యాంకును రూ.133 కోట్లు, ఆంధ్రా బ్యాంకును రూ.71 కోట్లు, కార్పొరేషన్ బ్యాంకుకు రూ.159 కోట్లు సుజనా మోసం చేసినట్టు అభియోగాలు నమోదయ్యాయి. దీనిపై విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఈనెల 12వ తేదీన విచారణకు హాజరుకావాలని ఈడీ కేసులు విచారిస్తున్న చెన్నెలోని సెషన్స్ కోర్టు నోటీసులు పంపించింది. -
సుప్రీంకోర్టులో త్వరలో ప్రత్యక్ష విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ విస్తరణ కారణంగా నిలిపివేసిన కేసుల ఫిజికల్ హియరింగ్ (వీడియోలో కాకుండా కోర్టురూములో న్యాయమూర్తులు, న్యాయవాదుల సమక్షంలో దావా జరపడం) ప్రక్రియను త్వరలో హైబ్రిడ్ పద్ధతిలో ఆరంభిస్తామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డె చెప్పినట్లు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. కరోనా సంక్షోభం సమసిపోతున్నందున ఫిజికల్ హియరింగ్స్ ఆరంభించాలని పలువురు న్యాయవాదులు డిమాండ చేస్తున్న తరుణంలో బార్ కౌన్సిల్ సభ్యులతో చీఫ్ జస్టిస్, సొలిసిటర్ జనరల్ సమావేశమై ఈ అంశాన్ని చర్చించారు. గత మార్చి నుంచి సుప్రీంకోర్టులో వీడియోకాన్ఫరెన్స్ ద్వారానే కేసుల హియరింగ్ నిర్వహిస్తున్నారు. అయితే ఫిజికల్ హియరింగ్‌కు డిమాండ్ పెరుగుతుండడంతో త్వరలో ఈ ప్రక్రియను హైబ్రిడ్ పద్ధతిలో(కొన్ని కేసులు వీడియో కాన్ఫరెన్సు ద్వారా, కొన్నింటిని భౌతికంగా) నిర్వహించేందుకు చీఫ్ జస్టిస్ చెప్పారని బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ చెప్పారు. అయితే అంతకుముందు మెడికల్, టెక్నికల్ సమస్యలపై రిజిస్ట్రీతో చర్చించి నిర్ణయం తీసుకుంటారన్నారు. సాంకేతిక సమస్యలను పరిశీలించి నిర్ణయం చెప్పాలని సెక్రటరీ జనరల్‌ను చీఫ్ జస్టిస్ ఆదేశించారని, కుదిరితే మార్చి మొదటివారం నుంచి ఫిజికల్ హియరింగ్‌లు నిర్వహించ వచ్చని తెలిపారు. కరోనా సమస్య పూర్తిగా అంతమయ్యేవరకు హైబ్రిడ్ పద్ధతిలో హియరింగ్స్ జరపుతారని, ఢిల్లీలో ఉన్న లాయర్లకు మాత్రమే వీడియో హియరింగ్ సౌకర్యం కల్పిస్తారని తెలిపారు. మరోవైపు తక్షణమే ఫిజికల్ హియరింగ్స్ ఆరంభించాలని కొందరు న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రాంగణంలో నిరసన చేపట్టారు. న్యాయవాదుల సంఘాల కోరిక మేరకు లాయర్స్ ఛాంబర్‌ను ఉదయం 9 నుంచి సాయంత్రం 7 వరకు తెరిచిఉంచేందుకు చీఫ్ జస్టిస్ అంగీకరించారు. 6 నుంచి తెరచుకోనున్న రాష్ట్రపతి భవన్ కోవిడ్-19 కారణంగా గత 11 నెలలుగా మూసివేతకు గురైన రాష్ట్రపతి భవన్ ఈ నెల 6 నుంచి తెరచుకోనుందని అధికారులు సోమవారం తెలిపారు. ప్రభుత్వ సెలవుదినాలు కాకుండా శనివారం, ఆదివారం రోజుల్లో రాష్టపతి భవన్ తెరచే ఉంటుందని స్టేట్మెంట్ ద్వారా చెప్పారు. భౌతిక దూరాన్ని పాటించేందుకుగానూ గరిష్టంగా స్లాట్‌కు 25 మంది చొప్పున మూడు స్లాట్లలో (ఉదయం 10:30, మధ్యాహ్నం 12:30, 2:30) పర్యాటకు లను అనుమతించనున్నట్లు చెప్పింది. లోపలికి అనుమతించేందుకు ఒక్కొక్కరికి రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది. 8 నుంచి తెరచుకోనున్న జేఎన్‌యూ కరోనా కారణంగా మూతబడిన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఈ నెల 8 నుంచి తెరచుకోనుందని జేఎన్‌యూ సోమవారం ప్రకటించింది. 4వ సెమిస్టర్ చదువుతున్న ఎంఫిల్, ఎంటెక్ విద్యార్థులు, ఎంబీఏ చివరి సెమిస్టర్‌విద్యార్థులు ఈ నెల 8 నుంచి కాలేజీకి, హాస్టల్‌కు రావచ్చని ప్రకటించింది. జూన్ 30లోగా థీసిస్‌ను సమర్పించాలని చెప్పింది. -
ఆ కేసును సీబీఐకి అప్పగించడం ఉత్తమం
సాక్షి, అమరావతి : ఇటీవల వివిధ సందర్భాల్లో హైకోర్టు తీర్పులిచ్చినప్పుడు సామాజిక మాధ్యమాల్లో న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై వచ్చిన పోస్టులపై స్వతంత్ర సంస్థ దర్యాప్తునకు ఆదేశించడం ఉత్తమమని హైకోర్టు గురువారం అభిప్రాయపడింది. స్వతంత్ర సంస్థ పరిధి విస్తృతమైనది కావడం.. దానికి దేశవ్యాప్తంగా శాఖలు ఉండటం.. తదితర కారణాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు హైకోర్టు తెలిపింది. ఈ పరిణామం ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న సీఐడీకి కూడా మేలు చేస్తుందని, దానిని ఎవరూ వేలెత్తి చూపే అవకాశం ఉండదని హైకోర్టు తెలిపింది. అలాగే, సీఐడీపై తమ ఉత్తర్వుల్లో ఎలాంటి దురుద్దేశాలను, నిందలను మోపబోమని హైకోర్టు స్పష్టంచేసింది. దీంతో, ఆ పోస్టులపై స్వతంత్ర సంస్థ దర్యాప్తునకు ఆదేశించడంపై తమకెలాంటి అభ్యంతరంలేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్, సీఐడీ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధంలేదని, అలాంటి వాటిని ప్రభుత్వం ఎన్నడూ ప్రోత్సహించదని శ్రీరామ్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో హైకోర్టు, ఈ వ్యవహారంపై తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్‌కుమార్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ వ్యాజ్యంపై గురువారం జస్టిస్ రాకేశ్‌కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై వ్యాఖ్యలు, పోస్టులు చేసిన వారి వివరాలతో రిజిస్ట్రార్ జనరల్ దాఖలు చేసిన సవరణ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. టీడీపీ ఇంప్లీడ్ పిటిషన్‌కు నో అనంతరం.. ఈ వ్యాజ్యంలో తనను ప్రతివాదిగా చేర్చుకోవాలంటూ టీడీపీ నేత ఎం.శివానందరెడ్డి తరఫున న్యాయవాది ఉన్నం మురళీధరరావు ఇంప్లీడ్ పిటిషన్‌ను అనుమతించబోమని ధర్మాసనం స్పష్టంచేసింది. కేసు దర్యాప్తును సీఐడీ కొనసాగించేలా ఆదేశాలివ్వడమా? లేక దర్యాప్తును స్వతంత్ర సంస్థకు అప్పగించడమా? అన్నదే తమ ముందున్న ప్రధాన ప్రశ్న అని.. దీనిపైనే తాము తేలుస్తామని ధర్మాసనం స్పష్టంచేసింది. నాకెలాంటి పరిమితుల్లేవు : ఏజీ ఈ సమయంలో ఏజీ శ్రీరామ్.. ఉన్నం మురళీధరరావు వాదనలపై అభ్యంతరం వ్యక్తంచేశారు. టీడీపీ నేతలు హైకోర్టును ఓ వేదికగా చేసుకుంటున్నారని ఏజీ చెప్పగా, అడ్వొకేట్ జనరల్‌గా మీకు కొన్ని పరిమితులున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కోర్టుకు సహకరించే విషయంలో తనకెలాంటి పరిమితులు లేవని శ్రీరామ్ తేల్చిచెప్పారు. ఎవ్వరూ కూడా గొంతెత్తడానికి వీల్లేదు : ధర్మాసనం రిజిస్ట్రార్ జనరల్ తరఫున ఎన్.అశ్వినీకుమార్ వాదనలు వినిపిస్తూ.. కోర్టుల నుంచే పాలన సాగిస్తారా? అంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలను చదివి వినిపించారు. ఈ వ్యాఖ్యలు కోర్టు ధిక్కారమేనని ధర్మాసనం స్పష్టంచేసింది. ఎవరూ వీధుల్లో గొంతెత్తడానికి వీల్లేదని జస్టిస్ రాకేశ్‌కుమార్ వ్యాఖ్యానించారు. అవి సీఐడీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయి : నిరంజన్‌రెడ్డి ఆ తర్వాత.. సీఐడీ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఈ కేసులో సీఐడీ సక్రమంగా దర్యాప్తు చేయడంలేదన్న అభిప్రాయానికి రావొద్దని ధర్మాసనాన్ని కోరారు. సీఐడీ సమర్థతను శంకించవద్దని వివరించారు. ధర్మాసనం స్పందిస్తూ.. సీబీఐ పరిధి విస్తృతమని స్పష్టంచేస్తూ పలు ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీనిపై నిరంజన్‌రెడ్డి అభ్యంతరం తెలిపారు. ఈ వ్యాఖ్యలు పత్రికల్లో పతాక శీర్షికల్లో వస్తాయని, అవన్నీ సీఐడీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయని తెలిపారు. పోలీసులు దర్యాప్తు సక్రమంగా చేయలేదని భావిస్తే, సంబంధిత మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించాలే తప్ప, అధికరణ 226 కింద హైకోర్టును ఆశ్రయించడానికి వీల్లేదని.. సుప్రీంకోర్టు సైతం ఇదే విషయాన్ని చెప్పిందన్నారు. హైకోర్టుకూ ఈ తీర్పు వర్తిస్తుందని వివరించారు. ధర్మాసనం స్పందిస్తూ.. సీబీఐకి అప్పగిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపింది. న్యాయమూర్తులూ మానవమాత్రులేనని, తప్పులు చేయడం సహజమేనని.. తీర్పు తప్పని భావిస్తే పైకోర్టుకు వెళ్లాలే తప్ప జడ్జీలను దూషించడం సరికాదని వ్యాఖ్యానించింది. దీంతో.. దర్యాప్తును ఏ సంస్థకు అప్పగించినా తమకు ఇబ్బందిలేదని.. సీఐడీ సమర్థతను శంకించే రీతిలో ఉత్తర్వులు ఉండకూడదన్నదే తన అభిప్రాయమని నిరంజన్‌రెడ్డి తెలిపారు. సీఐడీపై ఎలాంటి దురుద్దేశాలను, నిందలను మోపబోమని ధర్మాసనం స్పష్టంచేసింది. ఒక వ్యవస్థ మరో వ్యవస్థను గౌరవించాలి : ఏజీ ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ, ప్రతీ వ్యవస్థా వారి వారి పరిధిలో పనిచేయాలని, ఒక వ్యవస్థను మరో వ్యవస్థ గౌరవించాలని రాజ్యాంగం చెబుతోందని శ్రీరామ్ తెలిపారు. పిటిషనర్ న్యాయవాది 151 ఎమ్మెల్యేల సీట్ల గురించి మాట్లాడాల్సిన అవసరంలేదన్నారు. కేసు దర్యాప్తును సీబీఐకి ఇచ్చినా తమకు అభ్యంతరంలేదని, ప్రభుత్వానికీ ఉండదన్నారు. ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. విజయవాడలోనే సీబీఐ ఆఫీసు తెరవాల్సి ఉంటుంది: హైకోర్టు రాష్ట్రంలో పోలీసుల చర్యలపై దర్యాప్తులకు ఆదేశించాలంటే విజయవాడలోనే సీబీఐ ఆఫీసును తెరవాల్సి ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. సీబీఐ డైరెక్టర్‌ను పిలిచి సీబీఐ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయాలని కోరేలా రాష్ట్రంలో పరిస్థితులున్నాయంది. పోలీసులు తమ సంబందీకులను అక్రమంగా నిర్బంధించారంటూ దాఖలైన పలు హెబియస్ కార్పస్ పిటిషన్లపై జస్టిస్ రాకేశ్‌కుమార్, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. పోలీసుల తరఫున సత్యనారాయణ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. టీడీపీకి చెందిన మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మనుమడు రెడ్డి గౌతమ్, ఆయన భార్యపై నిరుద్యోగులను మోసం చేసిన ఆరోపణలున్నాయన్నారు. వీరిపై బహుళ ఎఫ్ఐఆర్లు నమోదై ఉన్నాయని, ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. వీరిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ సీనియర్ సివిల్ జడ్జి నివేదిక చాలా స్పష్టంగా ఉందని, పోలీసులు చేసిన అన్ని పనులను అందులో వివరించారని తెలిపింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. -
రియా బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు, డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయని అభియోగాలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తికి మరోసారి చుక్కెదురైంది. ఆమె బెయిల్ పిటిషన్ విచారణను ముంబై హైకోర్టు బుధవారం వాయిదా వేసింది. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో బాంబే హైకోర్టు సెలవులో ఉంది. దీంతో రేపు(గురువారం) బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్నట్లు హైకోర్టు పేర్కొంది. నేడు రియా బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసినట్లు బాంబే హైకోర్టు తెలిపింది. ముంబై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత 24గంటల్లో 173 మి.మీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు నాయరో కోవిడ్-19 ఆస్పత్రి నీట మునిగింది. వర్షం కారణంగా ముంబైలో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు మూతపడ్డాయి. రైల్వే ట్రాక్‌పై వర్షపు నీరు నిలవడంతో పలు రైలు సర్వీసులు రద్దయ్యాయి. చదవండి: (రియాకు అర్హత లేదు.. డీజీపీ రాజీనామా) -
లాకప్ డెత్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్: మంథిని శీలం రంగయ్య లాకప్ డెత్ అంటూ దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు గురువారం విచారించింది. గతంలో ఈ కేసులో స్పెషల్ అధికారిగా హైదరాబాద్ సీపీ అంజనీకుమార్‌ను నియమించిన సంగతి తెలిసిందే. శీలం రంగయ్య డెత్‌కు సంబంధించిన రిపోర్ట్‌ను సీపీ అంజనీకుమార్ కోర్టుకు సమర్పించారు. రామగుండం సీపీ కాల్ డేటా హైకోర్టుకు అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆరు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. సీపీ సమర్పించిన అఫిడవిట్‌పై కౌంటర్ దాఖలు చేస్తామని పిటిషనర్ నాగమణి పేర్కొన్నారు. తదుపరి విచారణ ఆరు వారాల పాటు హైకోర్టు వాయిదా వేసింది. -
పదేళ్ల నుంచి ఏం చేస్తున్నారు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విద్యాహక్కు చట్టం అమలుపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. 2010 నుంచి పెండింగ్‌లో ఉన్న పలు పిల్స్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. పూర్తి వివరాలతో సోమవారం కౌంటర్ దాఖలు చేస్తామని కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలుపగా, 10 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. విద్యా హక్కు చట్టం అమలవుతుందా? లేదా? అని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది (చదవండి: రోజు పది మందే చనిపోతున్నారా?: హైకోర్టు) నిధులు, ఖర్చుల వాటాలపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదని, హైకోర్టు ఆదేశించినప్పటికీ కేంద్రం తన వైఖరి వెల్లడించలేదని రాష్ట్రప్రభుత్వం పేర్కొంది. బడ్జెట్ వివాదాలను ఈనెల 17లోగా పరిష్కరించుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. మరో వాయిదా ఇచ్చేది లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోర్టు స్పష్టం చేసింది. ఈనెల 18న తుది విచారణ చేపడతామని హైకోర్టు వెల్లడించింది. (చదవండి: అది రాజ్యాంగ విరుద్ధం)