న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దు చేయడంపై, జమ్మూ కశ్మీర్ పునవ్యవస్థీకరణ చట్టంపైనా వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ నమోదైన అనేక పిటిషన్లపైనా ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం చేపట్టిన విచారణ ముగియగా తీర్పును రిజర్వ్‌లో ఉంచింది సుప్రీం కోర్టు.
ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించడం అనేది అత్యంత సున్నితమైన, సమస్యాత్మక అంశమని చెబుతూ విచారణ నిమిత్తం ప్రత్యేకంగా రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారధ్యంలోని అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్లను 16 రోజులపాటు ఏకథాటిగా విచారించింది.
డీవై చంద్రచూడ్ తోపాటు సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ లతో కూడిన ఈ ధర్మాసనం సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, గోపాల్ సుబ్రమణ్యం, రాజీవ్ ధావన్, జఫర్ షా, దుష్యంత్ దవే సహా మరికొంతమంది పిటిషనర్ల తరపు న్యాయవాదుల వాదనలు ఆలకించింది. పిటిషనర్ల తరపున ఎవరైనా న్యాయవాదులు తమ వాదనలను ధర్మాసనానికి వినిపించాలనుకుంటే వారు లిఖితపూర్వకంగా రాబోయే మూడు రోజుల్లో అర్జీ పెట్టుకోవచ్చని తెలిపింది.
ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, రాకేష్ ద్వివేది, వి.గిరి తదితరులు తమ వాదనలను అత్యున్నత న్యాయస్థానానికి వినిపించారు. 16 రోజుల విచారణలో 2019, ఆగస్టు 5న కేంద్రం తీసుకున్ననిర్ణయం యొక్క రాజ్యాంగ చెల్లుబాటు, జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించే పునర్వ్యవస్థీకరణ చట్టం చెల్లుబాటు, జూన్ 20, 2018న విధించిన గవర్నర్ పరిపాలన సహా అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.
2020లో కూడా సుమారు 23 పిటీషన్లు పిటీషన్లు కూడా దాఖలయ్యాయి కానీ అవి లిస్టింగ్ కానీ కారణంగా వాటిపై విచారణ చేపట్టడానికి సుప్రీంకోర్టు పెద్దగా ఆసక్తి చూపలేదు. మిగతా అన్ని అంశాలపై పూర్తిస్థాయి విచారణ పూర్తయిన తర్వాత సుప్రీం కోర్టు తీర్పును మాత్రం రిజర్వ్‌లో ఉంచింది.
#BREAKING | Article 370 Abrogation arguments conclude: Supreme Court reserves order. #SC #Article370 #Article370hearing
— Republic (@republic) September 5, 2023
WATCH #LIVE here- https://t.co/6CjsNJaatY pic.twitter.com/RzoDCEjru0
ఇది కూడా చదవండి : G20 Summit - జీ20 అతిధులకు బుక్‌లెట్‌లు
Comments
Please login to add a commentAdd a comment