reorganisation act
-
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంలో విచారణ పూర్తి.. తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దు చేయడంపై, జమ్మూ కశ్మీర్ పునవ్యవస్థీకరణ చట్టంపైనా వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ నమోదైన అనేక పిటిషన్లపైనా ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం చేపట్టిన విచారణ ముగియగా తీర్పును రిజర్వ్‌లో ఉంచింది సుప్రీం కోర్టు. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించడం అనేది అత్యంత సున్నితమైన, సమస్యాత్మక అంశమని చెబుతూ విచారణ నిమిత్తం ప్రత్యేకంగా రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారధ్యంలోని అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్లను 16 రోజులపాటు ఏకథాటిగా విచారించింది. డీవై చంద్రచూడ్ తోపాటు సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ లతో కూడిన ఈ ధర్మాసనం సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, గోపాల్ సుబ్రమణ్యం, రాజీవ్ ధావన్, జఫర్ షా, దుష్యంత్ దవే సహా మరికొంతమంది పిటిషనర్ల తరపు న్యాయవాదుల వాదనలు ఆలకించింది. పిటిషనర్ల తరపున ఎవరైనా న్యాయవాదులు తమ వాదనలను ధర్మాసనానికి వినిపించాలనుకుంటే వారు లిఖితపూర్వకంగా రాబోయే మూడు రోజుల్లో అర్జీ పెట్టుకోవచ్చని తెలిపింది. ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, రాకేష్ ద్వివేది, వి.గిరి తదితరులు తమ వాదనలను అత్యున్నత న్యాయస్థానానికి వినిపించారు. 16 రోజుల విచారణలో 2019, ఆగస్టు 5న కేంద్రం తీసుకున్ననిర్ణయం యొక్క రాజ్యాంగ చెల్లుబాటు, జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించే పునర్వ్యవస్థీకరణ చట్టం చెల్లుబాటు, జూన్ 20, 2018న విధించిన గవర్నర్ పరిపాలన సహా అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. 2020లో కూడా సుమారు 23 పిటీషన్లు పిటీషన్లు కూడా దాఖలయ్యాయి కానీ అవి లిస్టింగ్ కానీ కారణంగా వాటిపై విచారణ చేపట్టడానికి సుప్రీంకోర్టు పెద్దగా ఆసక్తి చూపలేదు. మిగతా అన్ని అంశాలపై పూర్తిస్థాయి విచారణ పూర్తయిన తర్వాత సుప్రీం కోర్టు తీర్పును మాత్రం రిజర్వ్‌లో ఉంచింది. #BREAKING | Article 370 Abrogation arguments conclude: Supreme Court reserves order. #SC #Article370 #Article370hearing WATCH #LIVE here- https://t.co/6CjsNJaatY pic.twitter.com/RzoDCEjru0 — Republic (@republic) September 5, 2023 ఇది కూడా చదవండి : G20 Summit - జీ20 అతిధులకు బుక్లెట్లు -
పునర్విభజనలో దక్షిణాది స్థానమేంటి?
పార్లమెంటులో ఆర్టికల్ 370ని రద్దు చేసి, 2019 ఆగస్టులో జమ్మూ కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని తొలగించిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ని ఏర్పర్చడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మానవ నైపుణ్యాలకు సంబంధించి అత్యుత్తమ ప్రగతి సాధిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటులో మరింత మెరుగైన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిర్ణయాలు తీసుకోవడంలో మెరుగ్గా ఉండే దక్షిణాది ప్రాతినిధ్యం వల్ల యావద్దేశం మంచి ఫలితాలను సాధించే అవకాశం ఉంటుందనడంలో సందేహమే లేదు. ఇప్పటికే రాష్ట్రాల మధ్య భౌగోళిక, రాజకీయ, ఆర్థిక శక్తుల మధ్య ఘర్షణ వాతావరణం పొడసూపుతుండటం మనకు తెలుసు. ఈ నేపథ్యంలో అనేక అంశాలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను అత్యంత సున్నితంగా చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. పార్లమెంటరీ నియోజకవర్గాల హద్దులను మార్చే ప్రక్రియే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ. ఈ ప్రక్రియకు సుదీర్ఘంగా అయిదేళ్ల సమయం పడుతుంది. సాధారణంగా జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను చేపడ తారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటర్లు దాదాపు సమాన సంఖ్యలో ఉండేలా చేయడమే దీని లక్ష్యం. భారతదేశం తదుపరి జగగణనకు సిద్ధమవుతున్నందువల్ల, నియోజకవర్గాల పునర్విభజన క్రమం పలుచోట్ల నిరసనలకు కారణమవుతోంది. దేశంలోని ప్రాంతా లమధ్య వ్యత్యాసాలు ప్రబలుతున్న నేపథ్యంలో దీనిపై చర్చకు ఇదే సరైన సమయంగా పరిగణించాల్సి ఉంది. పునర్విభజన ప్రక్రియ ఉత్తరాదికే అనుకూలం జనాభా నమూనాలపై ఆధారపడి, పార్లమెంటరీ నియోజకవర్గాలను రాష్ట్రాల వారీగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. కానీ ప్రస్తుత విధానం ఉత్తరప్రదేశ్ వంటి అధిక జనాభా ఉన్న రాష్ట్రాలకు అత్యంత అనుకూలంగా ఉంటోందన్నది వాస్తవం. ఉత్తరప్రదేశ్‌లో 80 లోక్‌సభా స్థానాలు ఉండగా, బిహార్‌లో 40 ఎంపీ స్థానాలు, తమిళనాడులో 39 స్థానాలున్నాయి. ఇక విభజనానంతరం ఆంధ్రప్రదేశ్‌కు 25 ఎంపీ స్థానాలు దక్కాయి. కర్ణాటకలో 28 పార్లమెంటు స్థానాలుంటున్నాయి. తాజాగా నియోజక వర్గాల పునర్విభజన జరిగిన పక్షంలో, ఉత్తర భారతదేశంతో పోలిస్తే దక్షిణ భారతదేశం ఎక్కువగా నష్టపోయే అవ కాశాలున్నాయి. ఎందుకంటే అభివృద్ధి పథంలో దూసుకెళుతున్న దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పురోగతి కాస్తా తగ్గుముఖం పడుతోంది. దీంతో ఈ రాష్ట్రాల్లో ఇపుడున్న పార్లమెంటరీ స్థానాలు మరింతగా తగ్గిపోయే అవకాశముంది. అదే సమయంలో జనాభా సంఖ్య అధిక మవుతున్న ఉత్తరాది రాష్ట్రాలు ఎంపీ సీట్ల విషయంలో ఇంకా పైచేయి సాధించే అవకాశం ఉంది. కాబట్టి ఓటర్ల ప్రాతినిధ్యానికి ప్రజల సంఖ్య మాత్రమే గీటురాయిగా ఉండాలా లేదా వారి నాణ్యతకు కూడా ప్రాధా న్యత ఉండాలా అనేది ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. వాస్తవానికి 2000 సంవత్సరం తర్వాత ఇటీవలి కాలంలో దక్షిణాది రాష్ట్రాలు ఆర్థికపరంగా నాటకీయ స్థాయిలో ఎంతగానో పురోగమించాయని మనందరికీ తెలుసు. ఆదాయం, పేదరికం వంటి అనేక ప్రమాణాల్లో ఉత్తరాది రాష్ట్రాలు 1960ల ప్రారంభంలో దక్షిణాది రాష్ట్రాల కంటే ఎంతో మెరుగైన స్థానంలో ఉండేవి. అయితే 1990ల ప్రారంభంలో ఆర్థిక సంస్కరణలు మొదలైన తర్వాత ఇటీవలి కాలంలో దక్షిణ భారత రాష్ట్రాలు బాగా పుంజుకున్నాయి. పురోగతిలో దక్షిణాది విజృంభణ కర్ణాటక, కేరళ, తమిళనాడు మూడు రాష్ట్రాల స్థూలదేశీయ ఉత్పత్తిని కలిపి చూస్తే 13 తూర్పు రాష్ట్రాల ఆదాయం కంటే ఎక్కువగా ఉంటోం దని ఇటీవలే ఒక కథనం వెల్లడించింది. ఆదాయపరంగా ఈ విభజ నకు... ఇటీవలి కాలంలో దక్షిణ భారతదేశం ఎంతో మెరుగ్గా పురోగతి సాధించడం కూడా తోడైంది. మానవ సామర్థ్యాలు, నైపుణ్యాలు, జాగ రూకత వంటి అనేక అంశాలు దక్షిణాదిని ముందువరసలోకి నెట్టాయి. ఇప్పుడు మనం రాష్ట్రాల జనాభా, వాటి మానవ సామర్థ్యాలు, నైపుణ్యాలు, జాగరూకత, విద్య, ఆరోగ్యం వంటి అంశాలపై దృష్టి సారిద్దాం. నియోజకవర్గాల పునర్విభజనపై చర్చకు ఇవి ఎంతగానో దోహదపడతాయి. విద్యా ఫలితాలు, పాఠశాలలకు హాజరవుతున్న పిల్లల శాతం, పలు గ్రేడ్లకు సంబంధించి వీరిలోని గ్రహణ శక్తి సామర్థ్యాలను పరిశీలించి చూస్తే దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాది కంటే ఎంతో మెరుగ్గా ఉంటున్నాయని గత కొంతకాలంగా వెలువడుతున్న వార్షిక విద్యా స్థితిగతుల నివేదికలు పదేపదే చెబుతున్నాయి. అయితే తరగతి గదిలో మౌలిక సౌకర్యాలు, ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ, యూనిఫాం వంటి అంశాలపై పెడుతున్న ఖర్చు విషయంలో ఉత్తరాది రాష్ట్రాలు గతంలో దక్షిణాది కంటే ఎంతో మెరుగ్గా ఉండేవి. దక్షిణాది రాష్ట్రాల్లో పట్టభద్రుల అధిక నిష్పత్తి అనేది, నిర్ణయాలు వేగంగా తీసుకోవడానికి అవసరమైన ప్రత్యేక నైపుణ్యాల విషయంలో ఎంతో ముందంజ సాధించింది. ఉదాహరణకు, 2011లో ఉత్తరప్రదేశ్ జనాభాలో 5 శాతం మాత్రమే పట్టభద్రులుండేవారు. తమిళనాడులో మాత్రం 8 శాతం మంది పట్టభద్రులు నమోదయ్యారు. నిర్ణయాలు తీసుకునే క్రమంలో చక్కటి ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో కోవిడ్–19 మహమ్మారి ప్రపంచం ముందు చక్కగా ప్రదర్శించింది. కరోనా మహమ్మారి వివిధ దశల్లో విజృంభి స్తున్న సమయంలో దక్షిణాది రాష్ట్రాలు వైరస్ పరీక్షలో ముందు వరసలో నిలిచాయి. 2021 డిసెంబర్ నాటికి తమిళనాడులో 7 కోట్ల 80 లక్షల మంది జనాభాకు గానూ 314 కరోనా వైరస్ పరీక్షా కేంద్రా లను నెలకొల్పారు. కానీ 23 కోట్లకు పైగా జనాభా ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో 305 కోవిడ్ పరీక్షా కేంద్రాలు మాత్రమే ఉండటం గమనార్హం. ఆ రాష్ట్ర అవసరాలకు ఇవి ఏమాత్రం సరిపోవు. నిస్సందేహంగా, ఆరోగ్య సౌకర్యాలు, సాధిస్తున్న ఉత్తమ ఫలితాల విషయంలో దక్షిణాది రాష్ట్రాల ప్రజానీకం ఎంతో మెరుగైన స్థానంలో ఉన్నారు. కోవిడ్–19 వల్ల ఆయుర్దాయం కాస్త తగ్గిపోయి నప్పటికీ, 2021లో దక్షిణాదిలో ప్రతి మనిషీ సగటున 73.2 సంవత్స రాలు జీవిస్తుండగా (1971లో ఇది 51.6 సంవత్సరాలు మాత్రమే), ఉత్తరాదిలో సగటు ఆయుర్దాయం 69 సంవత్సరాలకే పరిమితమైంది (1971లో ఇది 47 సంవత్సరాలుగా ఉండేది). సమర్థ పాలన దక్షిణాది రాష్ట్రాలు విద్యా, ఆరోగ్య ఫలితాల్లో మెరుగ్గా ఉంటున్నా యంటే... విషయ గ్రహణలో, నిర్ణయాలను తీసుకోవడంలో నాణ్యత ప్రదర్శించడంతో ఈ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని అర్థం. దక్షి ణాదిలో విద్యావంతులైన పౌరులు తమకు అవసరమైన మెరుగైన సౌకర్యాల విషయంలో ఎక్కువ అంచనాలు పెట్టుకుంటారు. పౌరుల చైతన్యం, కార్యాచరణ ఈ రీజియన్‌లో చాలా ఎక్కువ. అందుకనే దక్షిణాది రాష్ట్రాల్లోని ఓటర్లు ఉత్తరాది ఓటర్లతో పోలిస్తే మెరుగైన పాలనను అందించే ప్రభుత్వాలనే ఎన్నుకుంటూ ఉంటారు. 1960 లలో ఇలాంటి పోలికకు తావుండేది కాదు. కానీ 1970ల తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల పదవీ కాలం ఉత్తరాదితో పోలిస్తే దీర్ఘకాలం కొనసాగడాన్ని మనం స్పష్టంగా చూడవచ్చు. విద్య, ఆరోగ్యం, మెరుగైన నిర్ణయాలు తీసుకోవడం, అధిక ఆర్థిక పురోగతి వంటి అంశాల్లో ఓటర్ల నాణ్యతను నియోజకవర్గాల పునర్వి భజనలో పరిగణనలోకి తీసుకోరా? నియోజక వర్గాల పునర్విభజన సమయంలో ఉత్తరాది రాష్ట్రాల రాజకీయాధికారానికీ, దక్షిణాది రాష్ట్రా లలోని ఆర్థిక బలసంపన్నతకూ మధ్య వైరుధ్యం ప్రబలం కానుంది. అంతిమంగా దక్షిణాది రాష్ట్రాలు సాధించిన ఆర్థిక పురోగతి శక్తి ఉత్త రాది రాష్ట్రాల రాజకీయ బలాన్ని తోసి రాజనవచ్చు కూడా. కాబట్టి దక్షిణాది రాష్ట్రాల్లోని మానవ నైపుణ్యాలు, సామర్థ్యాల రీత్యా వారికి పార్లమెంటులో మెరుగైన ప్రాతినిధ్యం కల్పిస్తారా లేదా అనేది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే నిర్ణయాలు తీసుకోవడంలో మెరుగ్గా ఉండే దక్షి ణాది ప్రాతినిధ్యం వల్ల యావద్దేశం మంచి ఫలితాలను సాధించే అవకాశం ఉంటుందనడంలో సందేహమే లేదు. ఉత్తర భారతదేశం కూడా ఆర్థికంగా పురోగతి సాధించినట్లయితే, అప్పుడు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో దక్షిణాదికి పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇప్పటికే రాష్ట్రాల మధ్య భౌగోళిక, రాజకీయ, ఆర్థిక శక్తుల మధ్య ఘర్షణ వాతావరణం పొడసూపుతుండటం మనకు తెలుసు. ఫైనాన్స్ కమిషన్ కేటాయింపులకు సంబంధించి ఇప్పటికే ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అనేక అంశాలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను అత్యంత సున్నితంగా చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. – కళా సీతారాం శ్రీధర్ ప్రొఫెసర్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ ఎకనమిక్ ఛేంజ్ -
కొత్త థర్మల్ ప్లాంట్లపై వెనక్కి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం విషయంగా ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 4,000 మెగావాట్ల యాదాద్రి, 1,600 మెగావాట్ల ఎన్టీపీసీ సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ తొలిదశ పూర్తయితే.. రాష్ట్ర అవసరాలుపోగా విద్యుత్ మిగులు కూడా ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో కొత్త థర్మల్ ప్లాంట్ల నిర్మాణాన్ని విరమించుకోవాలనే భావనకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్టు తెలిసింది. సింగరేణి సంస్థ రాష్ట్రంలో ఇప్పటికే 1,200 మెగావాట్ల థర్మల్ ప్లాంట్‌ను నిర్మించింది. విస్తరణలో భాగంగా మరో 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణానికి 2019 డిసెంబర్ 18న కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు పొందింది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో ఇంకా నిర్మాణ పనులు మొదలుపెట్టలేదు. ఇక ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు.. తెలంగాణలో 4 వేల మెగావాట్ల ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. అందులో తొలిదశ కింద 1,600 మెగావాట్ల ప్లాంట్‌ను రామగుండంలో చేపట్టారు. రెండో దశ కింద 2,400 మెగావాట్ల ప్లాంట్ కట్టాల్సి ఉంది. ఎన్టీపీసీ దీనికి పర్యావరణ అనుమతుల కోసం ఇప్పటివరకు దరఖాస్తే చేసుకోలేదు. రెండోదశ ప్లాంట్‌కు సంబంధించి ఇంతవరకు కేంద్రం నుంచి అనుమతి రాలేదని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా విజ్ఞప్తులు లేవని ఎన్టీపీసీ అధికారవర్గాలు తెలిపాయి. 800 మెగావాట్ల సింగరేణి, 2,400 మెగావాట్ల ఎన్టీపీసీ ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రస్తుతానికి పక్కనబెట్టినట్టు కనిపిస్తున్నా.. కొద్దిరోజులుగా విద్యుత్ రంగంలో జరుగుతున్న పరిణామాలను బట్టి భవిష్యత్తులోనూ వాటిని చేపట్టే అవకాశాలు తక్కువని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. భారీగా అందుబాటులోకి.. ప్రస్తుతం రాష్ట్రంలో.. 3,772.5 మెగావాట్ల తెలంగాణ జెన్కో, 1,200 మెగావాట్ల సింగరేణి, 2,645 మెగావాట్ల కేంద్ర ప్లాంట్లు, 839 మెగావాట్ల సెమ్‌కాబ్ (ప్రైవేటు) కలిపి మొత్తం 8,456 మెగావాట్ల థర్మల్ విద్యుత్ అందుబాటులో ఉంది. ఇక నిర్మాణంలో ఉన్న 270 మెగావాట్ల భద్రాద్రి, 4 వేల మెగావాట్ల యాదాద్రి, 1,600 మెగావాట్ల ఎన్టీపీసీ తొలిదశ పూర్తయితే.. రాష్ట్ర థర్మల్ విద్యుత్ సరఫరా సామర్థ్యం 14,326.5 మెగావాట్లకు పెరుగుతుంది. దీనికి అదనంగా 2,531.76 మెగావాట్ల జెన్కో జలవిద్యుత్ కేంద్రాలు, 3,472 మెగావాట్ల సౌర, 128 మెగావాట్ల పవన విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. మొత్తంగా థర్మల్, హైడల్, సోలార్, విండ్ ప్లాంట్లు అన్నీ కలిపి దాదాపు 25 వేల మెగావాట్ల స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం సమకూరనుంది. పెట్టుబడి గిట్టుబాటు కాదు.. కాళేశ్వరం, పాలమూరు వంటి కొత్త ఎత్తిపోతల పథకాల వల్ల రాష్ట్రంలో 8వేల మెగావాట్ల మేర విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసుకుంది. 2022–23 నాటికి పూర్తికానున్న యాదాద్రి, ఎన్టీపీసీ ప్లాంట్లతో ఈ డిమాండ్ తీరిపోయి, ఇంకా మిగులు విద్యుత్ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో ఆశించిన మేర విద్యుత్ డిమాండ్ పెరగకపోతే.. కొత్త థర్మల్ ప్లాంట్లపై పెట్టే వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు నష్టం కలుగుతుందని పేర్కొంటున్నారు. అందువల్ల కొత్త థర్మల్ ప్లాంట్లు చేపట్టకపోవడమే మేలు అని చెప్తున్నారు. -
కశ్మీర్‌కు రాష్ట్ర హోదా: అమిత్ షా కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ పునర్వవ్యస్థీకరణ సవరణ బిల్లుకు శనివారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. బిల్లుపై జరిగిన చర్చకు హోంమంత్రి అమిత్ షా సమాధానం ఇచ్చారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించే అంశంపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్‌కు సరైన సమయంలో రాష్ట్ర హోదా ఇస్తామని ప్రకటించారు. పునర్వవ్యస్థీకరణ బిల్లు తేవడమంటే రాష్ట్ర హోదా ఇవ్వబోమని కాదన్నారు. పైగా బిల్లులో జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇవ్వబోమని ఎక్కడా లేదని.. దీనిపై విపక్షాలు వక్రభాష్యం చెబుతున్నాయని మండి పడ్డారు. జమ్మూకశ్మీర్ అంశంలో గత 70 ఏళ్లుగా కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించారు. గతంలోలా హింస, అశాంతితో కూడిన రోజులు ఇప్పుడు జమ్మూకశ్మీర్‌లో లేవు.. తిరిగి రావని స్పష్టం చేశారు. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే మోదీ సర్కార్ ధ్యేయమని అమిత్ షా తెలిపారు. పునర్వవస్థీకరణ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా కొందరు సభ్యులు ఈ ప్రాంతం తిరిగి రాష్ట్ర హోదా పొందుతుందన్న విశ్వాసం తమకు లేదంటూ చేసిన వ్యాఖ్యలకు అమిత్ షా సమాధానమిచ్చారు. తగిన సమయంలో రాష్ట్ర హోదా కల్పిస్తామని వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్‌లో అధికార పంపిణీ, అధికార వికేంద్రీకరణ జరిగిందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో 51శాతానికి పైగా పోలింగ్ జరగడాన్ని ఆయన ప్రస్తావించారు. తమ ప్రత్యర్థులు కూడా ఎత్తిచూపని విధంగా ఎన్నికలు శాంతియుతంగా జరిగాయని తెలిపారు. 25వేల ప్రభుత్వ ఉద్యోగాలు! ఈ ప్రాంతంలో రెండు ఎయిమ్స్ పనులు ప్రారంభమయ్యాయని, కశ్మీర్ వ్యాలీకి 2022 కల్లా రైలు మార్గం ఏర్పాటవుతుందని చెప్పారు. అక్కడి ప్రజలెవరికీ భూములు కోల్పోతామన్న ఆందోళన అవసరం లేదన్నారు అమిత్ షా. అభివృద్ధి పనులకు అవసరమైన భూమి ప్రభుత్వం వద్ద ఉందని చెప్పారు. 2022 నాటికి జమ్మూకశ్మీర్‌లో 25వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. అనంతరం జమ్మూకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ (సవరణ) బిల్లును లోక్‌సభ ఆమోదించింది. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టులో రద్దు చేసిన విషయం తెలిసిందే. అనంతరం జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసింది కేంద్రం. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాజ్యసభలో ఆమోదం పొందిన జమ్మూకశ్మీర్ పునర్వవ్యస్థీకరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చదవండి: దారుణం.. ప్రాణం తీసిన జలుబు కెడిసేథి; ఒక తరం సైద్ధాంతిక స్వరం -
'విభజన చట్టం ప్రకారమే సంస్థల విభజన'
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ విభజన చట్టం పదో షెడ్యూల్లో ఉన్న సంస్థలను చట్ట ప్రకారమే విభజిస్తామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. పదో షెడ్యూల్లో 142 ప్రభుత్వ రంగ సంస్థల విభజనలో తెలంగాణకు న్యాయం చేయాలని రాజ్‌నాథ్ సింగ్‌ను టీఆర్ఎస్ ఎంపీలు కోరారు. ఈ మేరకు పార్టీ లోకసభా పక్షనేత జితేందర్‌రెడ్డి ఆధ్వర్యం లో ఎంపీలు కె.కవిత, బూర నర్సయ్యగౌడ్, బీబీ పాటిల్ సోమవారం రాజ్‌నాథ్‌ను పార్లమెంటులో కలసి విజ్ఞప్తి చేశారు. ఏపీ విభజన చట్ట ప్రకారమే సంస్థల విభజన జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. -
అమలు కాని హామీల వివరాలివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల్లో ఇంకా అమలు కాని వాటికి సంబంధించిన వివరాలను పంపాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావును కోరారు. అవసరమైతే మంత్రుల స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి హామీలను అమలు చేస్తామని చెప్పారు. గురువారమిక్కడ అరుణ్ జైట్లీతో సమావేశమైన కేటీఆర్.. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల అమలుపై చర్చించారు. దీనిపై జైట్లీ స్పందిస్తూ.. ఇప్పటికి వరకు అమలు కాని హామీల వివరాలివ్వాలని కోరారు. తెలంగాణలో వెనుకబడిన జిల్లాలకు కేంద్రం ప్రకటించిన నిధుల విడుదలలో జరుగుతున్న జాప్యాన్ని కూడా కేటీఆర్ ఈ సందర్భంగా వివరించారు. ఈ నిధులను త్వరలోనే విడుదల చేస్తామని జైట్లీ హామీ ఇచ్చారు. 12 చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేయండి కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఏర్పాటు చేసిన రాష్ట్రాల చేనేత మంత్రుల సమావేశంలో కూడా కేటీఆర్ పాల్గొన్నారు. జాతీయ టెక్స్టైల్ పాలసీ ఎలా ఉండాలన్నదానిపై తెలంగాణ తరఫున పలు సూచనలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా 1,500 ఎకరాల్లో వరంగల్‌లో మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయనుందని వివరించారు. కాటన్ నుంచి ఫ్యాబ్రిక్ దాకా ఒకే చోట తయారు చేసుకొనేందుకు వీలుగా ఈ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. పార్క్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.613 కోట్లతో సమగ్ర ప్రతిపాదనలను కేంద్రానికి పంపినట్టు వివరించారు. ‘‘వరంగల్ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు కేంద్రం తరఫున 80 శాతం నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రికి వినతిపత్రాన్ని సమర్పించాం. 2018 ఏప్రిల్ లో ఉత్పత్తి ప్రారంభించడమే లక్ష్యంగా రెండో విడత పార్క్ ఏర్పాటుపై త్వరలోనే నివేదిక పంపుతామని చెప్పాం. పార్క్ ఏర్పాటుకు ఇప్పటికే 1,200 ఎకరాల భూమిని రైతుల ఆమోదంతోనే సేకరించాం. అలాగే రాష్ట్రంలో 12 చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేయాలని స్మృతి ఇరానీని కోరాం. హస్తకళల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హస్తకళల అభివృద్ధి కార్పొరేష¯ŒSకు సాయం చేయాలని విజ్ఞప్తి చేశాం. చేనేత క్లస్టర్ల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇదివర కే పంపిన ప్రతిపాదనలను ఆమోదించాలని కోరాం’’ అని కేటీఆర్ మీడియాకు తెలిపారు. హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థను ఏర్పాటు చేయండి... రాష్ట్ర విద్యార్థులు హ్యండ్లూమ్ టెక్నాలజీలో విద్యనభ్యసించడానికి ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడడంతో తెలంగాణలో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హ్యండ్లూమ్ టెక్నాలజీని ఏర్పాటు చేయాలని స్మృతి ఇరానీని కోరినట్లు మంత్రి కేటీఆర్ వివరించారు. తెలంగాణ హస్తకళలను మరింత ప్రోత్సహించడానికి ఢిల్లీలో ‘గోల్కొండ చేనేత కళల ఎంపోరియం’ ఏర్పాటుకు 5 వేల గజాల స్థలాన్ని కేటాయించాలని, అలాగే రాజీవ్ గాంధీ భవన్‌ను లీజ్‌కు ఇవ్వాలని కోరినట్లు పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించండి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారా మన్తోనూ కేటీఆర్ సమావేశమ య్యారు. సులభతర వాణిజ్య వ్యాపారంలో తెలంగా ణకు మొదటి ర్యాంకు రావడంతో.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనలు, సలహాలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలగాణలో పెట్టుబడులు పెట్టడానికి ప్రపం చవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు ముందుకొ స్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించత లపెట్టిన హైదరాబాద్ ఫార్మాసిటీ, వైద్య పరికరాల ఉత్పత్తి ప్లాంట్, వరంగల్ టెక్స్టై ల్ పార్క్, హైదరాబాద్–నాగ్‌పూర్ ఇండస్ట్రి యల్ కారిడార్, లెదర్ పార్క్, డ్రైపోర్టుల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపా యాలను కల్పించాలని సీతారామన్‌ను కోరి నట్టు కేటీఆర్ తెలిపారు. సచివాలయం కూల్చివేతపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలపై కేటీఆర్ స్పందిస్తూ.. ‘కాంగ్రెస్ ను దేశ, రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు. సచివాలయం కూల్చివేతపై వారు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. వాటిని పట్టించుకో వాల్సిన అవసరం లేదు’ అని అన్నారు. -
నీకోసం రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెడతావా?
కేంద్రంపై పోరాడాల్సింది పోయి.. బిచ్చమేస్తే తీసుకుంటావా? : అంబటి సాక్షి, హైదరాబాద్ : పునర్విభజన చట్టం కల్పించిన హక్కుల సాధనకు పోరాడాల్సిందిపోయి.. కేంద్రం భిక్షం వేస్తోంటే ఆంధ్రప్రదేశ్ బిచ్చగాళ్ల సంఘం అధ్యక్షుడిలా సీఎం చంద్రబాబు తీసుకోవడం ఏమిటని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. కేంద్రమిచ్చిన నిధుల్ని సక్రమంగా వినియోగించట్లేదంటూ వినియోగ ధ్రువీకరణ పత్రాల(యూసీలు)పై నీతిఆయోగ్ అనుమానం వ్యక్తపరుస్తూ.. తనపై అవినీతిపరుడిగా ముద్రవేసినా చంద్రబాబు నోరెందుకు పెగలట్లేదని ప్రశ్నిం చారు. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలకోసం.. రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టడం రాష్ట్రప్రజల గుండెల్ని తొలచివేస్తోందన్నారు. విభజన చట్టంలోని హక్కులకోసం సీఎం చంద్రబాబు పోరాడితే వైఎస్సార్సీపీ మద్దతిస్తుందన్నారు. ఆయన శుక్రవారం పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్రం రూ.1,976 కోట్ల సాయం ప్రకటించిందని.. ఇదిచూసి ఆనందపడాలో, బాధపడాలో అర్థమవని పరిస్థితి నెలకొందన్నారు.బాబులా స్వప్రయోజనాలకోసం రాష్ట్రప్రజల ప్రయోజనాల్ని తాకట్టుపెట్టే సంస్కృతి వైఎస్సార్సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికుంటే.. ఆయన జైలుకెళ్లి ఉండేవారే కాదన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం 2014-15లో రూ.1,500 కోట్లు, 2015-16లో రూ.550 కోట్లు, ప్రస్తుతం రూ.450 కోట్లు.. వెరసి రూ.2,500 కోట్లే ఇచ్చిందన్నారు. రెవెన్యూలోటు భర్తీకింద రూ.3,979 కోట్లే ఇచ్చిందన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలో ఇచ్చిన హామీమేరకు ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం, రాజధాని నిర్మాణానికి నిధులివ్వాలంటూ ఆదినుంచీ వైఎస్సార్సీపీ పోరాడుతోందని అంబటి గుర్తుచేశారు. -
'విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాలు పెంచాలి'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై పార్లమెంట్ చేసిన విభజన హామీ చట్టాలను బీజేపీ అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తోందని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు ధ్వజమెత్తారు. పునర్విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాలను పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం విజయవాడలో బోండా ఉమ విలేకరులతో మాట్లాడారు. నాడు పార్లమెంట్లో ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా కావాలన్న కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, అరుణ్‌జైట్లీ ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వేజోన్ ఇస్తామని బీజేపీ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ముష్టి వేసినట్టు రాష్ట్రానికి రూ.2,500 కోట్లు ఇచ్చారని విమర్శించారు. తమ సహనానికి ఓ హద్దు ఉందనీ, రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము బీజేపీతో పొత్తు పెట్టుకున్నామనీ, సమయం వచ్చినప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటామని బోండా ఉమ తెలిపారు. -
ఏకపక్ష నిర్ణయాలు మానుకోండి
వర్సిటీలపై ఏపీ, తెలంగాణకుహైకోర్టు హితవు సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర పునర్విభజన చట్టంలోని పదో షెడ్యూల్లో ఉన్న విశ్వవిద్యాలయాల విభజనపై కేంద్రం నిర్ణయం తీసుకునేంత వరకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కూడా ఆయా వర్సిటీల విషయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మానేయాలని హైకోర్టు తేల్చి చెప్పింది.సేవల విషయంలో తమతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోలేదన్న కారణంతో విశాఖపట్నంలో ని వరాహ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ అఫిలియేషన్‌ను రద్దు చేస్తూ జేఎన్ఏఎఫ్ఏయూ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు తప్పుపట్టింది. ఒప్పందం చేసుకోలేదన్న కారణంతో ఒక రాష్ట్రానికి అందిస్తున్న సేవలను అర్ధంతరంగా నిలిపేయడం సరికాదంది. వరాహ కాలేజీ అఫిలియేషన్‌ను రద్దు చేస్తూ జేఎన్ఏఎఫ్ఏయూ తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేసింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు నోటీసులు జారీచేస్తూ కౌంట ర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈమే రకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకటశేషసాయితో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులిచ్చిం ది. తమ కళాశాల అఫిలియేషన్ రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ వరాహ కాలేజ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పునర్విభజన చట్టం నిబంధనలకు విరుద్ధంగా జేఎన్ఏఎఫ్ఏయూ నిర్ణయం తీసుకుందని పిటిషనర్ తరఫు న్యాయవాది శివరాజు శ్రీనివాస్ కోర్టుకు తెలిపారు. ఈ చట్ట ప్రకారం ఏపీ ప్రభుత్వం తమ సేవలు పొందాలంటే తమ రాష్ట్రం(తెలంగాణ)తో ఒప్పందం చేసుకోవాలని, ఇప్పటిదాకా అలాంటిదేమీలేదని వర్సిటీ తరుపు న్యాయ వాది తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ... ఈ కారణంతో ఎవరి ఇష్టానుసారం వాళ్లు వ్యవహరిస్తామంటే ఎలా అని ప్రశ్నించింది. మీరెలా నోటిఫికేషన్ ఇస్తారు? వర్సిటీ వీసీ నిమాయకానికి తెలంగాణ నోటిఫికేషన్ ఇచ్చిన విషయాన్ని శ్రీనివాస్ కోర్టుకు తెలుపగా... రెండు రాష్ట్రాలకు సేవ లందిస్తున్న వర్సిటీకి తెలంగాణ ఎలా నోటిఫికేషన్ ఇస్తుందని కోర్టు ప్రశ్నించింది. -
‘బయ్యారం’పై వచ్చే ఏడాది స్పష్టత
- సాక్షి, హైదరాబాద్ : ఖమ్మం జిల్లా బయ్యారంలో ప్రతిపాదిత ఉక్కు కర్మాగార నిర్మాణం ఇప్పట్లో సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ముడి ఇనుప ఖనిజం లభ్యతపై స్పష్టత వస్తేనే కర్మాగారం నిర్మిస్తామని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) స్పష్టం చేసింది. దీనిపై సర్వే చేస్తున్న జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) నివేదిక సమర్పణకు గడువు కోరుతోంది. వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకు తుది నివేదికను సమర్పిస్తామని చెబుతోంది. 20 కోట్ల టన్నులు ఉంటేనే... రాష్ట్ర పునర్విభజన చట్టం-2014లో పేర్కొన్న ప్రకారం బయ్యారంలో ఉక్కు కర్మాగారం స్థాపనకు సుముఖత వ్యక్తం అయింది. ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవసరమైన మౌలిక సౌకర్యాల కల్పన, ప్రోత్సాహకాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సుముఖత వ్యక్తం చేసింది. అయితే 20 కోట్ల టన్నుల ముడి ఇనుప ఖనిజం నిక్షేపాలు ఉంటేనే కర్మాగారం ఏర్పాటు సాధ్యమవుతుందని సెయిల్ తెలిపింది. మరోవైపు ఉక్కు కర్మాగారం నిర్మాణం సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసం ఏర్పాటైన జాయింట్ టాస్క్‌ఫోర్స్ కమిటీ బయ్యారంలో 20 కోట్ల టన్నుల ముడి ఇనుప ఖనిజం లభించడం అసాధ్యమని నివేదికలో పేర్కొంది. అయితే ఈ సమాచారం అసంపూర్తిగా ఉందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మైనింగ్ అధికారులు అభిప్రాయపడ్డారు. ఒకట్రెండు ప్రాంతాల్లో నమూనాలు తీసుకుని ముడి ఇనుము లభ్యతపై అంచనాకు రావడం శాస్త్రీయంగా లేదని, ముడి ఖనిజం లభ్యతపై లోతుగా అధ్యయనం చేయాలని నిర్ణయించారు. నత్తనడకన జీఎస్ఐ సర్వే రాష్ట్రంలోని ఐదు జిల్లాల పరిధిలో ముడి ఇనుప ఖనిజం లభ్యతపై జీఎస్ఐ ఆధ్వర్యంలో వివిధ సంస్థల ద్వారా సంయుక్త సర్వేకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నవంబర్‌లో అనుమతి ఇచ్చింది. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల పరిధిలోని 13 బ్లాకుల పరిధిలో 340 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ముడి ఖనిజం ఉందని మైనింగ్ విభాగం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో 240.85 చదరపు కిలోమీటర్ల పరిధిలో ముడి ఇనుప ఖనిజం అన్వేషణకు సరిహద్దులు నిర్ణయిస్తూ సర్వేకు అనుమతి ఇచ్చింది. నిర్దేశిత విస్తీర్ణంలో కోర్టుల్లో వివాదంలో ఉన్న భూములు, ఇనుప ఖనిజం వెలికితీతకు ఇప్పటికే అనుమతులు పొందిన సంస్థలకు సంబంధించిన భూములను సర్వే నుంచి మినహాయించాలని సూచించింది. మొత్తం 13 బ్లాకులుగా ముడి ఇనుప ఖనిజం లభ్యత కలిగిన ప్రాంతాలను విభజించి బయ్యారంలోని రెండు బ్లాకుల్లో జీఎస్ఐ క్షేత్రస్థాయి సర్వే పూర్తి చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రెండు బ్లాకులకు సంబంధించిన సమగ్ర నివేదిక ఇస్తామని జీఎస్ఐ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు మిగతా 11 బ్లాకుల్లో సర్వే పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. డ్రిల్లింగ్ పనుల్లో జాప్యమే అందుకు కారణం. ఈ ఏడాది మార్చి నాటికే సర్వే పూర్తి చేయాల్సి ఉండగా తుది నివేదిక వచ్చే ఏడాది 2017 మార్చి నెలాఖరుకు అందే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర అధికారులు చెబుతున్నారు. -
రాష్ట్రానికి ‘కేంద్ర’ విద్యుత్ 85 శాతమే
- పునర్విభజన చట్టంలోని ‘4 వేల మెగావాట్ల’ హామీకి చిల్లు - రామగుండం విద్యుత్‌పై ఈఆర్సీ బహిరంగ విచారణలో ఎన్టీపీసీ స్పష్టత సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు’ నుంచి రాష్ట్రానికి 85 శాతం(3400మెగావాట్ల) విద్యుత్ కేటాయింపులే ఉన్నాయని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) వెల్లడించింది. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా రామగుండంలో 4000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మిగిలిన 15 శాతం విద్యుత్‌ను ఎవరికి కేటాయించాలన్న అంశంపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని, ఎవరికీ కేటాయించని పక్షంలో అది రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉం దని పేర్కొంది. తొలిదశలో నిర్మిస్తున్న 1600(2‘800) మెగావాట్ల విద్యుత్ కేంద్రానికి సంబంధించి ఎన్టీపీసీ, తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల మధ్య కుదిరిన విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పీపీఏ)పై తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) సోమవారం ఇక్కడ బహిరంగ విచారణ నిర్వహించింది. విచారణలో పాల్గొన్న ఎన్టీపీసీ ఈ మేరకు స్పష్టత ఇచ్చింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నందున పూర్తిగా 4వేల మెగావాట్లను రాష్ట్రానికే కేటాయించాలని ఈఆర్సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్ కోరగా ఎన్టీపీసీ తరఫున ఏజీఎం సుదర్శన్ పైవిధంగా బదులిచ్చారు. పెరుగుతున్న ఎన్టీపీసీ విద్యుత్ ధరలపై ఈఆర్సీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టు విద్యుత్ ధరలను సూచనాప్రాయంగానైనా తెలిపే అవకాశం ఉందా అని ఎన్టీపీసీని ప్రశ్నించింది. ఎన్టీపీసీ విద్యుత్ ధరలను సీఈఆర్సీ నిర్ణయిస్తుందని ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు తెలిపారు. ఇదిలా ఉండగా డిస్కంలు విద్యుత్ కొనుగోలు చేయడంలో విఫలమైతే వర్తింపజేసే పెనాల్టీని విద్యుత్‌ను సరఫరా చేయడంలో ఎన్టీపీసీ విఫలమైనా వర్తింపజేయాలని ఈఆర్సీ విజ్ఞప్తి చేసింది. పీపీఏకు సవరణలు తప్పనిసరి.. బహిరంగ విచారణలో చర్చకు వచ్చిన అంశాలపై పీపీఏకు సవరణలు చేయాల్సిందేనని ఈఆర్సీ చైర్మన్ స్పష్టం చేశారు. మార్పులను సూచిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని, నాలుగు వారాల్లో ఆ మేర సవరణలు పూర్తి చేయాలన్నారు. బై-అవుట్ నిబంధన పెట్టాలి ‘ఒప్పంద కాలం 25 ఏళ్లలో పెట్టుబడి వ్యయం కంటే కొన్ని రేట్లు అధిక రాబడిని ఎన్టీపీసీ సంపాదించనుంది. ఆ తర్వాత ఈ ప్రాజెక్టును తెలంగాణ డిస్కంలు బై-అవుట్ చేసుకునేలా పీపీఏలో నిబంధన పెట్టాల’ని సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ ఎం.వేణుగోపాల్ రావు సూచించారు. -
ఎన్టీపీసీ ‘విద్యుత్’పై కేంద్రానిదే నిర్ణయం !
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రం తొలిదశలో భాగంగా నిర్మిస్తున్న 1,600(25800) మెగావాట్ల విద్యుత్ కేంద్రం నుంచి తెలంగాణకు విద్యుత్ కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోనుంది. ఈ నిబంధన మేరకు ‘ఎన్టీపీసీ’, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) మధ్య గత జనవరి 18న కుదిరిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని(పీపీఏ) మంగళవారం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీఎస్ఈఆర్సీ) బహిర్గతం చేసింది. ఈ ఒప్పందంపై అభ్యంతరాలు, సలహాలను వచ్చే నెల 18లోగా తెలియజేయాలని ప్రకటన జారీ చేసింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో 4,000 మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని పునర్విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చింది. 1,600 మెగావాట్ల తొలి దశ ప్రాజెక్టుపై పీపీఏలో రాష్ట్ర పునర్విభజన చట్టం హామీ ఊసే లేదు. కేంద్రం హామీ మేరకు 100 శాతం విద్యుత్ రాష్ట్రానికి రావాల్సి ఉండగా.. దీనికి భిన్నంగా రాష్ట్రానికి కేటాయించే విద్యుత్‌ను కేంద్రమే నిర్ణయిస్తుందని ఒప్పందంలో రాసుకున్నారు. పీపీఏలో పెట్టుబడి వ్యయాన్ని పేర్కొనకపోవడం గమనార్హం. విద్యుత్ కేంద్రం వాణిజ్య ఉత్పత్తి ప్రారంభ తేదీ(సీవోడీ) నుంచి 25 ఏళ్లపాటు ఈ ఒప్పందం మనుగడలోకి ఉంటుందని పేర్కొన్నారు. అయితే, సీవోడీ కానీ, ప్రాజెక్టు నిర్మాణ కాల వ్యవధి వివరాలు మాత్రం లేవు. -
దొడ్డిదారిలో ‘విద్యుత్’ దోపిడీ!
* విద్యుత్‌ను అధిక ధరకు తెలంగాణకు విక్రయించేందుకు ఏపీ యత్నం * మిగులు విద్యుత్‌ను పక్క రాష్ట్రానికి ఇవ్వాలంటున్న పునర్విభజన చట్టం * మిగులు విద్యుత్ విక్రయానికి పీటీసీతో ఆంధ్రప్రదేశ్ ఒప్పందం * అదే విద్యుత్‌ను తెలంగాణకు అధిక ధరకు అమ్మేందుకు పీటీసీ ప్రయత్నాలు * యూనిట్‌కు రూ.5.35 లెక్కన 500 ఎంవీ విక్రయానికి టెండర్లు దాఖలు సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కొనుగోళ్ల కోసం తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఇటీవల ఆహ్వానించిన టెండర్లలో ‘సరికొత్త’ పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర పునర్విభజన చట్టం చెప్పినా తెలంగాణకు విద్యుత్ వాటా ఇచ్చేందుకు ససేమిరా అన్న ఏపీ ప్రభుత్వం... అధిక ధర దండుకునేందుకు అదే విద్యుత్‌ను దొడ్డిదారిన అంటగట్టే ప్రయత్నం చేస్తోంది. విభజన చట్టంలోని ‘రైట్ ఆఫ్ రెఫ్యూజల్’ నిబంధనలను కాదని ‘మరో మార్గం’లో తెలంగాణకు విద్యుత్‌ను విక్రయించేందుకు పోటీపడుతోంది. మొత్తంగా ఈ ఉదంతం తెలంగాణ పట్ల ఏపీ పాలకుల వైఖరికి అద్దం పడుతోంది. పీటీసీని అడ్డుపెట్టుకుని.. తెలంగాణ డిస్కంలు ప్రైవేటు కంపెనీల నుంచి 2,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్ల కోసం గతంలో కుదుర్చుకున్న తాత్కాలిక ఒప్పందాలు మే నెలతో ముగియబోతున్నాయి. ఈ లోటును పూడ్చుకోవడానికి 2016 మే 27 నుంచి 2017 మే 25 వరకు ఏడాది కాలానికి 2,000 మెగావాట్ల తాత్కాలిక విద్యుత్ కొనుగోళ్ల కోసం గత నెలలో డిస్కంలు టెండర్లను ఆహ్వానించాయి. దీంతో దక్షిణాది రాష్ట్రాల నుంచి మొత్తం 2,500 మెగావాట్లకు టెండర్లు దాఖలయ్యాయి. అందులో యూనిట్‌కు రూ.5.35 చొప్పున 500 మెగావాట్ల ‘ఏపీ జెన్కో’విద్యుత్‌ను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ (పీటీసీ) సైతం టెండర్ వేసింది. దీనిపై తెలంగాణ అధికారులు లోతుగా పరిశీలన జరపగా... విద్యుత్ పంపకాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోమారు రాష్ట్ర పునర్విభజన చట్టానికి తూట్లు పొడిచినట్లు బయటపడింది. పునర్విభజన చట్టంలోని 12వ షెడ్యూల్ ప్రకారం... తెలంగాణ, ఏపీల్లో ఏ రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉన్నా రెండో రాష్ట్రానికి కేటాయించడానికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. ఒకవేళ ఆ రాష్ట్రం తిరస్కరిస్తేనే మరెవరికైనా అమ్ముకోవచ్చు. అయితే ఈ నిబంధనలను బేఖాతరు చేస్తూ ఏపీ జెన్కో 500 మెగావాట్ల మిగులు విద్యుత్‌ను పీటీసీకి విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అదే విద్యుత్‌ను తెలంగాణకు విక్రయించేందుకు పీటీసీ టెండర్లు దాఖలు చేసింది. ఏటా రూ. 200 కోట్ల భారం..! వాస్తవానికి ఏపీలో 1,000 మెగావాట్ల మిగులు విద్యుత్ ఉందని... యూనిట్‌కు రూ.4.90 చొప్పున దానిని విక్రయిస్తామని ఆ రాష్ట్ర డిస్కంలు ఇటీవల ఏపీఈఆర్సీలో దాఖలు చేసిన ఏఆర్‌ఆర్‌లో పేర్కొన్నాయి. అంటే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ‘రైట్ ఆఫ్ రెఫ్యూజల్’ నిబంధనల ప్రకారం... ఏపీలో ఉన్న ఈ మిగులు విద్యుత్ యూనిట్‌కు రూ.4.90 లెక్కన తెలంగాణకు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇప్పుడు పీటీసీ ద్వారా యూనిట్‌కు రూ.5.35 ధరతో 500 మెగావాట్లను తెలంగాణ డిస్కంలు కొనుగోలు చేస్తే... రాష్ట్రంపై ఏటా రూ.200 కోట్ల అదనపు భారం పడనుంది. ఈ నేపథ్యంలో ‘రైట్ ఆఫ్ రిఫ్యూజల్’ నిబంధనలు అమలు చేసే విధంగా ఏపీపై ఒత్తిడి పెంచాలని విద్యుత్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. -
హోదాపై కేంద్రం కుప్పిగంతులు!
రాజ్యసభలో ఇచ్చిన వాగ్దానం మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలనే ప్రతిపాదనకు మార్చి 2014లోనే కేంద్ర మంత్రి మండలి ఆమోదముద్ర వేసి, ప్రణాళికా సంఘానికి కూడా పంపింది. మోదీ అధికార పగ్గాలు చేపట్టి ప్రణాళికా సంఘాన్నే రద్దు చేసి, నీతి ఆయోగ్ సంస్థను ఏర్పాటు చేశారు. ప్రణాళికా సంఘం, నీతి ఆయోగ్, ఆర్థిక సంఘానికి, ప్రత్యేక తరగతి హోదా కల్పించే అంశానికి లంకె పెట్టడం అసంబద్ధం. అలాగే పునర్విభజన చట్టంలో పేర్కొనలేదని బుకాయించడం అర్థరహితమైనది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక తరగతి హోదాతో ఒరిగేదేమీ లేదని, అదే సంజీవని కాదని ఎన్నో డొంక తిరుగుడు మాటలు కేంద్ర ప్రభుత్వ పెద్దలు, అధికార పక్షాల నాయకులు ఇప్పుడు మాట్లాడుతున్నారు. హోదా కంటే మెరు గైనప్యాకేజీ ఇచ్చే ఆలోచనలో కేంద్రం ఉన్నదని, హోదాకు 14వ ఆర్థిక సం ఘం సిఫారసులు అడ్డంకిగా మారాయని అంటున్నారు. తెలుగుజాతిని రెండు ముక్కలు చేసి, పదమూడు జిల్లాలతో ఏర్పరచిన నేటి ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన రాజకీయ పార్టీలకు రాష్ర్ట ప్రజల భవిష్యత్తుతో ఆట లాడుకొనే హక్కు ఎవరిచ్చారు? ఇది ప్రజాస్వామ్యమేనా? ఈ విభజన ఐదు కోట్ల ప్రజలపైరుద్దిన చర్య. లోక్‌సభలో విపక్షాల నోళ్లు నొక్కి విభజన బిల్లుకు ఆమోదముద్ర వేశారు. బిల్లు రాజ్యసభకు వెళ్లినపుడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక తరగతి హోదా (స్పెషల్ కేటగిరి స్టేటస్) కల్పిస్తామని నాటి ప్రధాని డా॥మన్మోహన్సింగ్ వాగ్దానం చేశారు. నాటి ప్రతిపక్షం బీజేపీయేనేటి పాలకపక్షం. నాటి అధికారపక్షం కాంగ్రెస్ నేటి విపక్షం. ఈ రెండు పార్టీలే రాష్ట్రాన్ని ముక్కలు చేశాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకో వలసిన నైతిక బాధ్యత విభజన పాపంలో పాలు పంచుకొన్న రాజకీయ పక్షా లన్నింటి మీదా ఉన్నది. ఈ పూర్వరంగంలో చిత్తశుద్ధి, అంకితభావం, రాజ కీయ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక తరగతి హోదాను హక్కుగా సాధించుకోవడానికి రాజకీయాలకు అతీతంగా ఉద్యమించాలి. ఐదేళ్లు కాదు, పదేళ్లపాటు హోదా ఇస్తే తప్ప పారిశ్రామిక వర్గాలు ముం దుకొచ్చి పారిశ్రామికాభివృద్ధికి చర్యలు చేపట్టలేవని వెంకయ్యనాయుడు నాడు అన్నారు. ఆయన అవగాహనారాహిత్యంతో మాట్లాడారా? ప్రత్యేక హోదాకు, ప్రత్యేక తరగతి హోదాకు తేడా ఉన్నది. పార్లమెంటులో 3/4 వంతు మెజారిటీతో ఆమోదించి ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కశ్మీర్‌కు ప్రసా దించినది ‘ప్రత్యేక హోదా’. ఆ రాష్ర్ట స్వయం ప్రతిపత్తి దాని ఫలితమే. జాతీయ అభివృద్ధి మండలి నిర్ణయం మేరకు కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక తర గతి హోదా ఇచ్చారు. గాడ్గిల్ సూత్రం ప్రకారం కేంద్ర ప్రణాళికా నిధులను రాష్ట్రాలకు పంపిణీ చేసే విధానంలో భాగంగా కొన్ని కొలబద్దల ప్రాతిపదికన 1969లో మూడు రాష్ట్రాలకు ప్రత్యేక తరగతి హోదా కల్పించారు. ఆ సౌక ర్యాన్ని దశల వారీగా 11 రాష్ట్రాలకు విస్తరించారు. సమాఖ్య వ్యవస్థ క్రియాశీలతను పరిగణనలోకి తీసుకొని ఈ విధానాన్ని పునర్నిర్వచించాలని 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన మాట వాస్తవం. ఆ సిఫారసులకు పార్లమెంటు ఆమోదముద్ర వేసినా, ప్రత్యేక తరగతి హోదాను కొన్ని రాష్ట్రాలకు కల్పించే విధానాన్ని కొనసాగించాలా! లేదా పునర్ వ్యవస్థీకరించాలా! ఒకవేళ పునర్ వ్యవస్థీకరించాలనే నిర్ణయానికి వస్తే ఏ రూపంలో చేయాలి అన్న అంశాలపై కేంద్రం మొదట తేల్చుకోవాలి. అంత వరకు నేడు ఉన్న విధానమే కొనసాగుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక తరగతి హోదా కల్పించడానికి అడ్డంకులేమిటి? బీజేపీ, మిత్రపక్షాలు, ప్రతి పక్ష కాంగ్రెస్ అంగీకరించిన తరువాత జాతీయ అభివృద్ధి మండలి ఆమోదం పొందడం ఎంత పని? కాబట్టి హోదాపై దాటవేత వైఖరితో చెప్పే మాటలన్నీ ప్రజలను వంచించడానికే. రాజ్యసభలో ఇచ్చిన వాగ్దానం మేరకు ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలనే ప్రతిపాదనకు మార్చి 2014లోనే కేంద్ర మంత్రి మండలి ఆమోదముద్ర వేసి, ప్రణాళికా సంఘానికి కూడా పంపింది. మోదీ అధికార పగ్గాలు చేపట్టి ప్రణాళికా సంఘాన్నే రద్దు చేసి, నీతి ఆయోగ్ సంస్థను ఏర్పాటు చేశారు. ప్రణాళికా సంఘం, నీతి ఆయోగ్, ఆర్థిక సంఘా నికి, ప్రత్యేక తరగతి హోదా కల్పించే అంశానికి లంకె పెట్టడం అసంబద్ధం. అలాగే పునర్విభజన చట్టంలో పేర్కొనలేదని బుకాయించడం అర్థరహిత మైనది. హోదా వల్ల ప్రయోజనాలు ప్రత్యేక తరగతి హోదా ఇచ్చిన రాష్ట్రాలకు వివిధ రూపాలలో లబ్ధి చేకూరు తుంది. గాడ్గిల్- ముఖర్జీ నియమావళి ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రణాళికా నిధులలో 30% ప్రత్యేక తరగతి హోదా ఉన్న రాష్ట్రాలకు, 70% మిగిలిన రాష్ట్రాలకు మంజూరు చేయాలి. కేంద్రం చేసే ఆర్థిక సహాయంలో ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు సాధారణ కేంద్ర సహాయం(యన్.సి.ఎ.) పద్దు కింద మంజూరు చేసే నిధులలో 90% గ్రాంటు, 10% రుణంగా (మిగిలిన రాష్ట్రా లకు 30% గ్రాంటు, 70% రుణం) అందుతుంది. కేంద్ర ప్రాయోజిత పథ కాలు (సి.యస్.యస్.) ఉదా: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం, ఆహార భద్రతా చట్టం, విద్యా హక్కు చట్టం, వైగరా పథకాల అమ లుకు, ప్రత్యేక ప్రణాళికా సాయం(యస్.పి.ఎ.-ప్రాజెక్టుల కోసం) 90% గ్రాంటు, 10% రుణంగాను నిధులు అందుతాయి. ప్రత్యేక కేంద్ర సాయం (ప్రాజెక్టులతో ముడిపడని) 100% గ్రాంటు కింద నిధులు లభిస్తాయి. విదేశీ ఆర్థిక సహాయంతో చేపట్టే పథకాలకు (ఉదా: కృష్ణా డెల్టా, సాగర్ కుడి కాలువ, పెన్నార్ డెల్టా వైగైరా ఆధునీకరణ పథకాలు) కేంద్రం అదనపు సహా యం(ఎ.సి.ఉ.-ఇ.ఎ.పి.) పద్దు కింద 90% గ్రాంటు, 10% రుణంగా అం దుతుంది. మిగిలిన రాష్ట్రాలకు సంబంధించి విదేశీ ఆర్థిక సహాయంతో చేపట్టే పథకాలకు మొత్తం రుణంగానే అందుతుంది. ప్రత్యేక హోదా కల్పించిన రాష్ట్రాల ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధికి దోహదపడడానికి కేంద్ర పన్నులలో (ఎక్సైజ్ డ్యూటీ, ఆదాయపు పన్ను) రాయితీలు ఇవ్వాలి. అర్హతలేమిటి? 1. పర్వత ప్రాంతం, సంక్లిష్ట భూభాగం. 2. జనసాంద్రత తక్కువగా ఉండ డం, జనాభాలో గిరిజనులు గణనీయంగా ఉండడం. 3. సరిహద్దుల వెంబడి వ్యూహాత్మక ప్రదేశంగా ఉండడం. 4. ఆర్థికంగా, మౌలిక సదుపాయాల పరంగా వెనుకబడి ఉండడం. 5. తలసరి ఆదాయం కాస్తా ఎక్కువగా ఉన్నా అభివృద్ధికి అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చగలిగిన స్థితిలో లేక పోవడం. వీటిలో చాలా అర్హతలు ఆంధ్రప్రదేశ్‌కు ఉన్నాయి. 960 కి.మీ. సముద్ర తీరం ఉన్నది. హిందూ మహాసముద్రంలోని డిగోగార్షియాను అమె రికా సైనిక స్థావరంగా మార్చివేసింది. బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమానికి భారత్ మద్దతు పలికిందని, దాడి చేయాలనే తలంపుతో అమెరికా సప్తమ నౌకాదళం హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించలేదా? అంతర్జాతీయ ఉగ్ర వాద శక్తులు దేశంలో ప్రవేశించడానికి సముద్ర జలమార్గాలను ఎంచుకొన్న తాజా అనుభవాలు ఉన్నాయి. వీటన్నింటికీ మించి రాజధాని కూడా లేదు. ప్రత్యేక తరగతి హోదాకు ఇంతకంటే అర్హత కావాలా? ఏడాది అనుభవం ఏం చెబుతున్నది? విభజన జరిగి ఏడాది గడిచింది. మోదీ ప్రభుత్వం రెండు వార్షిక బడ్జెట్లను ప్రవేశపెట్టింది. మొదటిది పూర్తిస్థాయి బడ్జెట్ కాదని సరిపుచ్చుకొన్నా, 2015-16 వార్షిక బడ్జెట్లో కేటాయింపులు చూశాక ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకొనే విషయంలో కేంద్ర నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్త్తున్నదన్న భావన నెలకొన్నది. ‘అపాయింటెడ్ డేట్’ తరువాత, మొదటి రాష్ర్ట వార్షిక బడ్జెట్ రెవెన్యూ లోటును పూర్తిగా కేంద్రమే భర్తీ చేస్తుందని చట్టంలోనే పేర్కొన్నారు. దాదాపు రూ.14,500 కోట్ల రెవెన్యూ లోటు ఉన్నదని కాగ్ నివేదిక ఇస్తే, కేంద్రం ఇచ్చింది ముష్టి రూ.2,300 కోట్లని అంటున్నారు. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తామని చట్టంలో పేర్కొన్నారు. ఆ మేరకు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, ముంపు ప్రాంతాలను ఆంధ్రప్ర దేశ్‌లో అంతర్భాగం చేయడం వరకు బాధ్యతగానే వ్యవహరించారు. కానీ ప్రాజెక్టు నిర్మాణాన్ని 2018 నాటికి పూర్తి చేస్తామని శుష్క ప్రకటనలు చేస్తు న్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారమే రూ.16,500 కోట్లకు పైగా వ్యయ మయ్యే ఆ ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటి వరకు ఖర్చు చేసిన రూ.4,000 కోట్లు పోగా, ఇంకా రూ.12,500 కోట్లు అవసరం. కానీ ఇందుకు బడ్జెట్లో కేటాయిం చింది రూ.100 కోట్లు. నిరసన వెల్లువెత్తడంతో కేటాయింపును రూ.250 కోట్లకు పెంచారు. ఇలా అయితే ఆ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో కేం ద్రమే సెలవియ్యాలి. అత్యంత వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి బుందేల్‌ఖండ్, కోరాపుట్- బోలాంగిర్-కాలహండి (కె.బి.కె.) తరహాలో అభివృద్ధి ప్యాకేజీలు అమలు చేస్త్తామని చట్టంలో పేర్కొన్నారు. ఆచరణలో చేసిం దేమిటి? ఈ ప్రాంతాలలో కొత్తగా పరిశ్రమలను నెలకొల్పే సంస్థలు పెట్టే పెట్టుబడుల మీద 15%, నూతన యంత్రాల తరుగుదలకు అదనంగా 15% రాయితీ కల్పిస్తున్నట్టు, ఈ రెండు ప్రాంతాలలో ఉన్న ఏడు జిల్లాలలో అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం జిల్లాకు రూ.50 కోట్ల వంతున, మొత్తం రూ.350 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసి, చేతులు దులుపుకుంది. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ నెలకొలుపుతామని పేర్కొ న్నారు. ఎలాంటి కదలికా లేదు. ఇదేనా అభివృద్ధి ప్యాకేజీ? ఈ అంశాలతో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి ప్యాకేజీని రూపొందించి, అమలుచేసి, సమగ్రాభి వృద్ధికి సంపూర్ణ సహకారం అందించాలి. వ్యాసకర్త: నీలం రాజశేఖరరెడ్డి పరిశోధనా కేంద్రం పూర్వ సంచాలకులు, మొబైల్: 9490952221 -
‘పునర్విభజన’ కేసులన్నీ ఇకపై ధర్మాసనానికి..
* రిట్ నిబంధనలకు హైకోర్టు సవరణ * గెజిట్ నోటిఫికేషన్ జారీ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట పరిధిలోకి వచ్చే కేసులన్నింటినీ హైకోర్టు తాజాగా ధర్మాసనం పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ మేరకు రిట్ నిబంధనలను సవరించింది. గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ అయింది. దీని ప్రకారం ఇకపై పునర్విభజన చట్ట పరిధిలోకి వచ్చే అన్ని కేసులను ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన హైకోర్టు ధర్మాసనం విచారించనుంది. ఇప్పటివరకు ఏ చట్టానికి సంబంధించిన నిబంధనలనైనా సరే సవాలు చేస్తూ దాఖలయ్యే వ్యాజ్యాలను, విభజన చట్టానికి సంబంధించి దాఖలయ్యే పిల్లను మాత్రమే ధర్మాసనం విచారిస్తూ వస్తోంది. అయితే పునర్విభజన చట్టానికి సంబంధించిన ఏ అంశంపైనైనా దాఖలయ్యే వ్యాజ్యాలను సింగిల్ జడ్జిలే విచారిస్తూ వస్తున్నారు. ఇలా సింగిల్ జడ్జిలు విచారించి తీర్పులివ్వడం, ఆ తీర్పులపై ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు కావడం, ధర్మాసనం తీర్పులివ్వడం వంటి ప్రక్రియ అంతటికి సమయం పడుతోంది. పునర్విభజన చట్టం విషయంలో ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు ముడిపడి ఉండటంతో.. ఈ పరిస్థితిని నివారించేందుకు వీలుగా పునర్విభజన చట్ట సంబంధిత వ్యాజ్యాలన్నింటినీ ధర్మాసనమే విచారించాలనే అభ్యర్థనలు న్యాయవాదుల నుంచి వచ్చాయి. ఈ నేపథ్యంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బి.బొసాలే నేతృత్వంలోని పరిపాలన కమిటీ సానుకూలంగా స్పందించింది. ఆ మేరకు హైకోర్టు రిట్ ప్రొసీడింగ్ రూల్స్ 1977 రూల్ 14(ఏ), (4)కు బుధవారం సవరణలు చేసింది. విద్యుత్ ఉద్యోగుల విభజన కేసు ధర్మాసనానికి? విద్యుత్ ఉద్యోగుల విభజనకు సంబంధించిన మార్గదర్శకాలకు ఆమోద ముద్ర వేస్తూ తెలంగాణ విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వులను, ఆ ఉత్తర్వులకు అనుగుణంగా టీఎస్ ట్రాన్స్‌కో చైర్మన్ రూపొందించిన తుది జాబితా అమలును సవాలు చేస్తూ.. ఉద్యోగులు (ఏపీ స్థానికత కలిగినవారిగా తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నవారు) దాఖలు చేసిన పిటిషన్లు కూడా ధర్మాసనానికి బదిలీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వ్యాజ్యాలు బుధవారం న్యాయమూర్తి రెడ్డి కాంతారావు ముందు విచారణకు వచ్చాయి. టీ విద్యుత్ సంస్థల తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి రిట్ రూల్స్‌కు హైకోర్టు చేసిన సవరణలను న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సవరణల ప్రకారం ఈ వ్యాజ్యాలను ధర్మాసనానికి నివేదించాల్సి ఉంటుందన్నారు. దీనిపై ఉద్యోగుల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన డాక్టర్ లక్ష్మీనర్సింహ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. టీ ట్రాన్స్‌కో జారీ చేసిన ఉత్తర్వులను తాము సవాలు చేశామే తప్ప, పునర్విభజన చట్ట నిబంధనలను సవాలు చేయలేదని, అందువల్ల తమ వ్యాజ్యాలు పునర్విభజన చట్ట పరిధిలోకి రావని తెలిపారు. ఈ వాదనతో జస్టిస్ కాంతారావు ఏకీభవించలేదు. ఈ వ్యాజ్యాలు పునర్విభజన చట్ట పరిధిలోకి వస్తాయి కాబట్టి వాటిని ధర్మాసనానికి నివేదిస్తానని చెప్పారు. ఈ సమయంలో పిటిషనర్ల తరఫు మరో న్యాయవాది ఎస్.శ్రీరాంరెడ్డి జోక్యం చేసుకుని విచారణను గురువారానికి వాయిదా వేస్తే తమ అభ్యంతరాలను తెలియచేస్తామని చెప్పడంతో న్యాయమూర్తి అందుకు అంగీకరించారు. -
మాటల గారడీతో మోసం చేయొద్దు: బొత్స
-
మాటల గారడీతో మోసం చేయొద్దు: బొత్స
హైదరాబాద్: విభజన చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచే ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో సెక్షన్ 8 అమల్లో ఉందని వైఎస్సార్ సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. సెక్షన్ 8 అమలు చేయాల్సిన బాధ్యత గవర్నర్ దేనని స్పష్టం చేశారు. బుధవారం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సెక్షన్ 8 అంశంపై రాష్ట్రపతితో ఏపీ సీఎం చంద్రబాబు చర్చించారా అని ప్రశ్నించారు. ఈ అంశంపై రాష్ట్రపతితో చంద్రబాబు మాట్లాడినట్టు లేదని అన్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ లో అందుబాటులో ఉన్నందున ఆయనతో చర్చలు జరపాలని సూచించారు. మాటల గారడీతో జనాన్ని చంద్రబాబు మోసం చేస్తున్నారని బొత్స విమర్శించారు. బాధ్యతాయుతంగా మెలగాలని హితవు పలికారు. -
'జీవితాలతో ఆడుకుంటున్నారు'
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తమ ప్రాంత విద్యార్థుల సమస్యల పట్ల దారుణంగా వ్యవహరిస్తోందని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షల్లో తెలంగాణ విద్యార్థుల ఫలితాలు మాత్రమే ఇచ్చిందని తెలిపారు. పరీక్ష అందరికీ నిర్వహించి ఫలితాల్లో వివక్ష చూపడం దారుణమని, దీనిపై కోర్టును ఆశ్రయిస్తామన్నారు. గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళ్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం భారత దేశంలో అంతర్భాగంలా వ్యవహరించడం లేదని విమర్శించారు. లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని, విభజన చట్టాన్ని పాటించడంలేదని ధ్వజమెత్తారు. ఇంటర్ విద్యార్థుల రికార్డులు అప్పగిస్తామని మంత్రి చెప్పినా అధికారులు రికార్డులు ఇవ్వలేదని తెలిపారు. దీనిపై కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు. జూలై 9 నుంచి ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్, 24 నుంచి పీజీ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని మంత్రి గంటా తెలిపారు. -
‘ఓటుకు కోట్లు’ కేసు.. గవర్నర్ చేతికి!
* విభజన చట్టంలోని సెక్షన్-8ను వినియోగించుకోవచ్చు * నరసింహన్‌కు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సలహా * ‘ఓటుకు కోట్లు’ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయొచ్చు * వివాదం తలెత్తకుండా పర్యవేక్షించవచ్చని సూచన * ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలపై అధికారం ఉంటుంది * న్యాయ సలహాలో అటార్నీ జనరల్ వెల్లడించినట్లు సమాచారం * గవర్నర్ ఎలా స్పందిస్తారనేదానిపై ఉత్కంఠ * తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదంటున్న న్యాయ నిపుణులు సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్-8 ప్రకారం ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలపై గవర్నర్‌కు అధికారాలు ఉంటాయని.. దాని ప్రకారం ‘ఓటుకు కోట్లు’ కేసును గవర్నర్ పర్యవేక్షించవచ్చని భారత అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ న్యాయ సలహా ఇచ్చినట్లు సమాచారం. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం మరింత ముందుకు వెళితే, దానికి ప్రతిగా ఏపీ కేసులు నమోదు చేసి, శాంతిభద్రతలకు ఇబ్బంది కలిగే అవకాశమున్న నేపథ్యంలో... ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ద్వారా దర్యాప్తు చేయించవచ్చని సూచించినట్లు తెలుస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ‘ఓటుకు కోట్లు’ కేసు దాదాపు మూడు వారాలుగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై నివేదిక ఇచ్చేందుకు 10 రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన గవర్నర్ నరసింహన్... ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్ తదితరులను కలిశారు. ఏపీ సీఎంపై వచ్చిన ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, అయితే ఆ కేసులో తెలంగాణ ప్రభుత్వం మరింత ముందుకు వెళితే ఏపీ ప్రభుత్వం కూడా పలు కేసులు పెట్టే పరిస్థితి ఉందని వివరించినట్లు సమాచారం. ఆ పరి స్థితి వస్తే భావోద్వేగాలు రేగి శాంతిభద్రతలు అదుపు తప్పకుండా ఉండేందుకు ఏం చేయాలనే దానిపై చర్చించినట్టు తెలుస్తోంది. దాంతో సెక్షన్-8పై అటార్నీ జనరల్ న్యాయ సలహా తీసుకుని ఆ ప్రకారం ముందుకెళ్లాలని వారు గవర్నర్‌కు సూచించారు. ఈమేరకు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీని గవర్నర్ న్యాయ సలహా కోరినట్టుగా ఓ న్యాయవాది జాతీయ మీడియా ప్రతినిధి ఒకరి వద్ద ప్రస్తావించినట్టు తెలిసింది. సెక్షన్-8ను అమలు చేయడం ద్వారా శాంతిభద్రతలపై వచ్చే ప్రత్యేక అధికారంతో సిట్ ఏర్పాటు చేసి ‘ఓటుకు కోట్లు’ కేసును దర్యాప్తు చేయించవచ్చని అటార్నీ జనరల్ సలహా ఇచ్చినట్టు సమాచారం. అలాగే ఉమ్మడి రాజధానిగా ఉన్నం దున హైదరాబాద్‌లో ఏపీ ప్రభుత్వం తమ పోలీ సుల సేవలను విని యోగించుకోవచ్చని తెలిపినట్లు తెలుస్తోంది. అయితే ఈ సలహాను గవర్నర్ స్వీకరిస్తారా, సెక్షన్-8 ద్వారా సంక్రమించే అధికారాలు, బాధ్యతల ద్వారా ‘ఓటుకు కోట్లు’ కేసుపై సిట్ వేస్తారా, దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? వంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ సలహాను పాటించాల్సిందేనా? అటార్నీ జనరల్ (ఏజీ) ఇచ్చి న న్యాయ సలహాను కేంద్రం, గవర్నర్ పాటించాల్సిందేనా? అంటే.. తప్పనిసరి కాదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల సన్ టీవీ నెట్‌వర్క్‌కు సెక్యూరిటీ క్లియరెన్స్ విషయంలో అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ ఇచ్చిన సలహాను కేంద్రం పట్టించుకోలేదు. ‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 76 ప్రకారం కేంద్రానికి న్యాయ సలహా ఇవ్వడం ఏజీ బాధ్యత. ఈ న్యాయ సలహాను పరిగణనలోకి తీసుకోవాల్సిన ముఖ్యమైన సలహాగా భావిస్తారు. కానీ దానికి కేంద్రం కట్టుబడాలని లేదు. అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని మంత్రిత్వ శాఖలు అంతర్గతంగా చర్చించేందుకు పెడతాయి..’’ అని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. సెక్షన్-8 ఏం చెబుతోందంటే.. సెక్షన్-8: ఉమ్మడి రాజధానివాసుల రక్షణకు గవర్నర్‌కు గల బాధ్యత 1. అమలు తేదీ నుంచి ఉమ్మడి రాజధాని ప్రాంత పరిపాలనా ప్రయోజనాల కోసం ఆ ప్రాంతంలో నివసించే ప్రజలందరి ప్రాణ రక్షణ, స్వేచ్ఛ, ఆస్తుల పరిరక్షణ కోసం గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యత ఉంటుంది. 2. ప్రత్యేకించి శాంతిభద్రతలు, అంతర్గత రక్షణ, ప్రాధాన్యమున్న నిర్మాణాల రక్షణ, ఉమ్మడి రాజధానిలో ప్రభుత్వ భవనాల కేటాయింపు, రక్షణ పై బాధ్యత ఉంది. 3. గవర్నర్ తన విధులు నిర్వహించడంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలిని సంప్రదించి, ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయమై అంతిమంగా తన నిర్ణయాన్ని అమలు జరుపుతారు. 4. కేంద్ర ప్రభుత్వం నియమించే ఇద్దరు సలహాదారులు గవర్నర్‌కు సహాయంగా ఉంటారు. -
గంగిరెద్దులా తలూపడం వల్లే సమస్య
గవర్నర్‌పై మంత్రి అచ్చెన్నాయుడి మండిపాటు ⇒ సెక్షన్ 8 అమలు చేయమంటే కుంటిసాకులు చెబుతారా ⇒ హైదరాబాద్‌లో ఏపీ పోలీస్స్టేషన్లు ఏర్పాటుచేస్తాం ⇒ కేసీఆర్‌పై నమోదైన కేసుల దర్యాప్తునకు సిట్ సాక్షి, హైదరాబాద్: ‘పునర్విభజన చట్టంలో సెక్షన్ 8ను అమలు చేయాలని కోరితే.. కేంద్రం మార్గదర్శకాలు జారీ చేయలేదంటూ కుంటిసాకులు చెబుతారా? విభజన చట్టంలోన్ని 34 సెక్షన్లలో ఏ సెక్షన్ అమలుకైనా కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసిందా? తెలంగాణ ప్రభుత్వం చెప్పినట్టల్లా గంగిరెద్దులా గవర్నర్ తలూపడం వల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. రాజ్యాంగ పరిరక్షణకు ఉద్దేశించిన గవర్నర్ పదవికి అప్రతిష్ట తెచ్చేలా వ్యవహరించొద్దు’ అంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌పై కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ స్పందించకపోవడం వల్లే రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయంటూ మంత్రులు ప్రతిపాటి పుల్లారావు, రావెల కిశోర్‌బాబు చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గం సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘ఫోన్ ట్యాపింగ్ చేశామని తెలంగాణ హోం మంత్రి నాయిని చెప్పారు. ఆ రాష్ట్ర ఏసీబీ డీజీ ఏకే ఖాన్ మాత్రం ట్యాపింగ్ చేయలేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయలేదని రాత పూర్వకంగా హామీ ఇవ్వగలరా అని సవాల్ విసిరితే స్పందించలేదు. అంటే.. చంద్రబాబుసహా 120 మంది ఏపీ మంత్రులు, అధికారుల ఫోన్లను తెలంగాణ సర్కారు ట్యాప్ చేసినట్లే కదా?’ అని ప్రశ్నించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం ఎన్నికల సంఘం అధీనంలోకి వెళుతుందని, అలాంటప్పుడు ఓటుకు నోటు వ్యవహారంలో కేసు నమోదు చేసే అధికారం ఏసీబీకి లేదన్నారు. మా పోలీసులతో మాపైనే కేసులా ఉమ్మడి రాజధానిలో తమ ప్రభుత్వం జీతాలు చెల్లిస్తున్న 45 బెటాలియన్ల పోలీసు బలగాలు విధులు నిర్వహిస్తున్నాయన్నారు. ‘మా ప్రభుత్వంవద్ద జీతాలు తీసుకుంటున్న పోలీసులతోనే మాపై కేసులు పెట్టిస్తారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఏపీ పోలీసుస్టేషన్లను ఏర్పాటుచేసి తీరతామన్నారు. తెలంగాణ సర్కారుకు నోటీసులు తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ముత్తయ్య ఇచ్చిన ఫిర్యాదుతో సహా 87 కేసులు ఏపీలో నమోదయ్యాయన్నారు. ఆ కేసులపై విచారణకోసం సిట్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. సీఎం చంద్రబాబుతోసహా 120 మంది మంత్రులు, అధికారుల ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందనడానికి ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. కేసీఆర్‌పై నమోదైన కేసులతోపాటూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనూ బుధవారం నుంచి చట్టం తన పని తాను చేస్తుందని, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ సర్కారు కూడా కుప్పకూలడం ఖాయమన్నారు. దాటవేత ధోరణి ఓటుకు నోటు కేసును ఐదు కోట్ల ఆంధ్రుల సమస్యగా చిత్రీకరించి రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి కేసును పక్కదోవ పట్టించాలని చూస్తున్నారా అని విలేకరులు ప్రశ్నించగా మంత్రులు అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావులు సమాధానం దాటవేశారు. తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందనడానికి ఆధారాలు ఉంటే ఎందుకు బహిర్గతం చేయడం లేదన్న ప్రశ్నకు మంత్రి పుల్లారావు స్పందిస్తూ.. సమయమొచ్చినప్పుడు బయటపెడతామన్నారు. -
గవర్నర్ అధికారాలపై లొల్లి
పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 8లో పేర్కొన్న విధంగా ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో పాలనా వ్యవహారాలపై గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యతలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రజల భద్రత, స్వేచ్ఛ, ఆస్తుల పరిరక్షణ అంశాలను గవర్నర్ పర్యవేక్షిస్తారని చట్టంలో పేర్కొన్నారు. ఈ విధుల విషయంలో తెలంగాణ మంత్రిమండలిని సంప్రదించి గవర్నర్ నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం లేవనెత్తింది. శాంతి భద్రతల అంశం తమ పరిధిలోకే వస్తుందని తేల్చిచెప్పడంతో వివాదం తలెత్తింది. -
సొంత ఎజెండా పక్కన పెట్టండి: పొంగులేటి
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత ఎజెండాను పక్కన పెట్టి, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి సూచించారు. మంగళవారం ఏపీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ఢిల్లీ పర్యటనతో సాధించిందేదీ లేదని ఎద్దేవా చేశారు. పోలవరం ముంపు మండలాల అంశాన్ని ప్రధాని వద్ద కనీసం ప్రస్తావించలేకపోయారని విమర్శించారు. త్వరలో పునర్వ్యవస్థీకరణ చట్టంలో చేసే సవరణల్లో ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాల అంశాన్ని అందులో చేర్చేలా కేసీఆర్ కృషి చేయాలని సూచించారు.