
గవర్నర్ అధికారాలపై లొల్లి
పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 8లో పేర్కొన్న విధంగా ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో పాలనా వ్యవహారాలపై గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యతలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రజల భద్రత, స్వేచ్ఛ, ఆస్తుల పరిరక్షణ అంశాలను గవర్నర్ పర్యవేక్షిస్తారని చట్టంలో పేర్కొన్నారు.
ఈ విధుల విషయంలో తెలంగాణ మంత్రిమండలిని సంప్రదించి గవర్నర్ నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం లేవనెత్తింది. శాంతి భద్రతల అంశం తమ పరిధిలోకే వస్తుందని తేల్చిచెప్పడంతో వివాదం తలెత్తింది.