
సొంత ఎజెండా పక్కన పెట్టండి: పొంగులేటి
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత ఎజెండాను పక్కన పెట్టి, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి సూచించారు. మంగళవారం ఏపీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ఢిల్లీ పర్యటనతో సాధించిందేదీ లేదని ఎద్దేవా చేశారు. పోలవరం ముంపు మండలాల అంశాన్ని ప్రధాని వద్ద కనీసం ప్రస్తావించలేకపోయారని విమర్శించారు. త్వరలో పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో చేసే సవరణల్లో ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాల అంశాన్ని అందులో చేర్చేలా కేసీఆర్ కృషి చేయాలని సూచించారు.