Polavaram Project
-
టీడీపీ ఎంపీలు మూగబోయినా మేం పోరాడుతూనే ఉంటాం
న్యూఢిల్లీ, సాక్షి: ఒకవైపు ఏపీకి తీరని అన్యాయం జరుగుతుంటే.. మరోవైపు ఏ ఒక్క అంశంపైనా టీడీపీ ఎంపీలు(TDP MPs) నోరు విప్పడం లేదని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. అయితే.. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారాయన. ఫైనాన్స్ బిల్లుపై చర్చ సందర్భంగా సోమవారం వైఎస్సార్సీపీ తరఫున ఆయన చర్చలో పాల్గొన్నారు. పోలవరం అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తే దమ్ము టీడీపీ ఎంపీలకు లేదు. ప్రాజెక్టు ఎత్తు(Polavaram Hight)పై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. పోలవరం ఎత్తును 45 . 72 నుంచి 41.15 తగ్గించడం అన్యాయం. దాదాపు 194 టీఎంసీల కెపాసిటీతో దీనిని డిజైన్ చేశారు. కానీ, ఎత్తు తగ్గించడం వల్ల స్టోరేజ్ కెపాసిటీ 115 టీఎంసీలకు పడిపోతుంది. అలాగే.. రూ.60 వేల కోట్ల వ్యయం అవుతుండగా కేవలం 30 వేల కోట్ల రూపాయలకి కేంద్ర ప్రభుత్వం పరిమితం అవుతోంది. పార్లమెంటులో ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకోకపోవడం అన్యాయం. 👉టీడీపీ ఎంపీలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ (Vizag Steel Plant Privatization) అంశాన్ని ప్రస్తావించలేకపోతున్నారు. ఓవైపు ప్రైవేటీకరణ చేస్తామని, మరోవైపు మద్దతిస్తామని విరుద్ధ ప్రకటన చేస్తున్నారు. ప్రైవేటీకరణే జరిగితే ఉద్యోగులకు, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది.👉ఏపీలో రూ.2,000 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తవుతుంది. కానీ, ప్రస్తుత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు నిర్మాణాన్ని నిలిపివేసింది. మంజూరైన సీట్లను సైతం తాము కాలేజీని నడపలేమని ప్రభుత్వం చేతులెత్తేసింది. మెడికల్ కాలేజీలను ప్రైవేటు వారికి అమ్మివేయాలని చూస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని మెడికల్ కాలేజీలను నడిపేలా చర్యలు తీసుకోవాలి. 👉ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా ఉన్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కేంద్రం విస్మరించింది. విభజన చట్టంలోని హామీలను మరిపోయింది. ఒక కిలోమీటర్ నేషనల్ హైవే నిర్మించడానికి 20 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. కానీ, అమరావతిలో మాత్రం 40 నుంచి 50 కోట్ల రూపాయలకు పెంచారు. ఇది ప్రజాధనం దుర్వినియోగం చేయడమే. ఇందులో పెద్ద ఎత్తున దుర్వినియోగం జరుగుతోంది. ఈ గణాంకాల పైన అధికారిని నియమించి దర్యాప్తు చేయాలి. 👉వైఎస్సార్ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రవేశపెట్టారు. కానీ, గడిచిన 11 నెలల నుంచి ఏపీలోని కూటమి రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చేయడం లేదు. విద్యార్థులు డబ్బు చెల్లిస్తే తప్ప హాల్ టికెట్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడ్డాయి. ఆరోగ్యశ్రీ పథకం కింద చెల్లించాల్సిన బకాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం లేదు. ఫలితంగా రోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఏపీలో గత ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాత్మక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ‘‘మేము రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కేసులకు భయపడేది లేదు.. ప్రశ్నిస్తూనే ఉంటాం ఏపీకి న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తుంటాం’’ అని మిథున్ రెడ్డి అన్నారు. -
పోలవరం ఎత్తును తగ్గించవద్దు: లోక్‌సభలో వైఎస్సార్సీపీ
ఢిల్లీః ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించేందుకు జరుగుతున్న ప్రయత్నాన్ని లోక్‌సభ వేదికగా వైఎస్సార్సీపీ మరోసారి ఖండించింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించవద్దని, ఒరిజినల్ ఎత్తు ప్రకారమే పోలవరం ప్రాజెక్టు నిర్మించాలని వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. లోక్‌సభలో జలశక్తి శాఖ పద్దులపై చర్చ సందర్భంగా వైఎస్సార్సీపీ తరఫున చర్చలో అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీకి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు అంశంతో పాటు పలు ప్రాజెక్టుల అంశాలను కూడా అవినాష్ లేవనెత్తారు.‘ ఇటీవల రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు కేంద్రం ఈసీని తిరస్కరించింది. రాయలసీమ ప్రాజెక్టుపై చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం. ఈ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులకోసం బాబు ప్రభుత్వం తగిన ఒత్తిడి చేయలేదు. వైఎస్ జగన్ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాజెక్టు మెజారిటీ పనులు పూర్తయ్యాయి. రాయలసీమ ఎత్తిపోతలతో 800 అడుగుల వద్ద రోజు మూడు టిఎంసిల నీరు తీసుకునే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. లేదంటే రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతుంది. ఓవైపు శ్రీశైలంలో 798 అడుగుల వద్ద తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. 800 అడుగుల వద్ద పాలమూరు- రంగారెడ్డి , డిండి ప్రాజెక్టులకు నీరు తరలిస్తున్నారుఈ పరిస్థితుల్లో 880 అడుగుల వరకు నీరు ఎప్పుడు వస్తుంది...రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లెప్పుడు వస్తాయి. గుండ్రేవుల ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలి. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల రిపేర్లు చేపట్టాలి. ఏపీకి జలజీవన్ మిషన్ కింద నిధులను పెంచాలి. నంద్యాల - కల్వకుర్తి మధ్య రివర్ ఓవర్ బ్రిడ్జితోపాటు ఆనకట్ట నిర్మించాలి’ అని అవినాష్ రెడ్డి కోరారు. -
బట్రెస్ డ్యామ్ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యామ్ సీపేజీ నియంత్రణకు దాని దిగువన బట్రెస్ డ్యామ్ నిర్మించేందుకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) శుక్రవారం అనుమతి ఇచ్చింది. ఎగువ కాఫర్ డ్యామ్‌కు దిగువన టోయ్(అడుగు భాగం)లో దీనిని నిర్మించేలా అంతర్జాతీయ నిపుణుల కమిటీ (పీవోఈ) ఖరారు చేసిన డిజైన్‌ను సీడబ్ల్యూసీ ఆమోదించింది. ఎగువ కాఫర్ డ్యామ్ దిగువన దానికి సమాంతరంగా 2,454 మీటర్ల పొడవున 8 మీటర్ల ఎత్తుతో రీయిన్‌ఫోర్స్‌డ్ సిమెంట్ కాంక్రీట్‌తో బట్రెస్ డ్యామ్ నిర్మాణ పనులు చేపట్టాలని పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) ప్రాజెక్ట్ అధికారులను ఆదేశించింది. జూలైలోగా బట్రెస్ డ్యామ్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని నిర్దేశించింది. 2016–18 మధ్య ఎగువ కాఫర్ డ్యామ్ పునాది (జెట్ గ్రౌటింగ్ వాల్) నిర్మాణంలో నాటి టీడీపీ సర్కార్ తప్పిదం వల్ల సీపేజీ అధికంగా ఉందని పీవోఈ తేల్చింది. గోదావరి వరదల్లోనూ ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో డయాఫ్రం వాల్ పనులు కొనసాగించాలంటే ఎగువ కాఫర్ డ్యామ్ సీపేజీని నియంత్రించాలని.. అందుకు ఎగువ కాఫర్ డ్యామ్ దిగువన బట్రెస్ డ్యామ్‌ను నిర్మించాలని సూచించింది. దాంతో బట్రెస్ డ్యామ్ డిజైన్‌ను రూపొందించాలని కాంట్రాక్టు సంస్థను సీడబ్ల్యూసీ ఆదేశించింది. కాంట్రాక్టు సంస్థ రూపొందించిన డిజైన్‌పై ఈనెల 4న పీవోఈతో సీడబ్ల్యూసీ సీఈ విజయ్ శరణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ సమావేశంలో పీవోఈ చేసిన సూచనల మేరకు డిజైన్‌లో మార్పులు చేర్పులు చేసి పంపాలని కాంట్రాక్టు సంస్థను సీడబ్ల్యూసీ ఆదేశించింది. ఆ మేరకు రూపొందించిన బట్రెస్ డ్యామ్ డిజైన్‌ను సీడబ్ల్యూసీ ఆమోదించింది.ఏమిటీ బట్రెస్ డ్యామ్కాంక్రీట్ ఆనకట్ట, కాఫర్ డ్యామ్ సీపేజీ (లీకేజీ) నీటిని నియంత్రించడానికి దాని దిగువన రీయిన్‌ఫోర్స్‌మెంట్ కాంక్రీట్‌తో నిర్మించేదే బట్రెస్ డ్యామ్. ఎగువ కాఫర్ డ్యామ్ పునాదిలో లోపాల వల్ల సీపేజీ అధికంగా ఉంది. దాన్ని నియంత్రించాలంటే దానికి పొడవునా దిగువ భాగంలో మరో చిన్న సైజు (బట్రెస్) డ్యామ్ నిర్మించాలని పీవోఈ సూచించింది. పునాది స్థాయి నుంచి ఇనుప కడ్డీలు, సిమెంట్ కాంక్రీట్‌తో భూఉపరితలానికి 8 మీటర్ల ఎత్తు వరకూ బట్రెస్ డ్యామ్‌ను నిర్మిస్తారు. బంకమట్టి ప్రాంతంలోనూ డీ–వాల్‌కు లైన్ క్లియర్ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో బంకమట్టి నేల ఉన్న ప్రాంతంలోనూ డయాఫ్రం వాల్ (డీ–వాల్) నిర్మాణానికి సీడబ్ల్యూసీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. బంకమట్టి నేల ఉన్న ప్రాంతంలో నిర్మిస్తున్న డీ వాల్‌కు ఇరువైపులా 25 మీటర్ల పొడవున వైబ్రో కాంపాక్షన్ చేసి.. ఇసుక సాంద్రతను పెంచి.. నేలను పటిష్టం చేయాలని పీవోఈ సూచించింది. ఆ తర్వాత డీ–వాల్ పనులు చేపట్టాలని సీడబ్ల్యూసీ ఆదేశించింది. దాంతో బంకమట్టి నేల ఉన్న ప్రాంతంలో నిర్మించనున్న డీ–వాల్‌కు ఇరువైపులా 25 మీటర్ల పొడవున వైబ్రో కాంపాక్షన్ పనులను కాంట్రాక్టు సంస్థ శుక్రవారం ప్రారంభించింది. -
సంతృప్తికర సమాధానాలిస్తేనే.. పోలవరానికి నిధులు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అడిగిన సాంకేతిక ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సంతృప్తికర సమాధానాలు ఇస్తేనే పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులు కేటాయిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆమె గురువారం సాయంత్రం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ విభజన సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని, సాంకేతిక సమస్యల వల్లే నిర్మాణం ఆలస్యమవుతోందని తెలిపారు. విశాఖపట్నం మెట్రో ప్రాజెక్ట్ డీపీఆర్ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని, దానికి ఆమోదం తెలిపిన తర్వాతే నిధుల మంజూరు సాధ్యమవుతుందని చెప్పారు. విశాఖ స్టీల్ ఫ్లాంట్ అభివృద్ధికి రూ.11వేల కోట్ల ఆర్థిక సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందుతుందన్నారు. కేంద్రం, రాష్ట్రం కలిసి చేస్తున్న అన్ని ప్రాజెక్టులకు లోటు లేకుండా కేటాయింపులు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇచ్చామని, సేవా రంగంలో నిర్దిష్టమైన ఆదాయం వస్తుందని చెప్పారు. నూతన పద్ధతుల ద్వారా ఆదాయ పన్ను చెల్లింపు విధానాన్ని సులభతరం చేశామని తెలిపారు. తొమ్మిది కోట్ల మంది రిటర్న్స్ ఫైల్ చేస్తే, మూడు కోట్ల మంది మాత్రమే పన్ను చెల్లిస్తున్నారని, కొత్తగా పన్ను వెసులుబాటు ద్వారా ఈ సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే ఆదాయ వనరులు పెంచుకోవాలన్నారు. సుంకాలపై అమెరికా ప్రభావం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో సుంకాలు పెరిగే అవకాశం ఉందని నిర్మలా సీతారామన్ చెప్పారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో ప్రత్యేక బృందం అమెరికా వెళ్లి సుంకాల పెంపుపై అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. అమెరికా సుంకాల పెంపు ప్రభావం మన దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుందని వ్యాఖ్యానించారు. తాను పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో నివసించానని, అక్కడ నీటి కష్టాలు అనుభవించానని ఆమె తెలిపారు. జల్ జీవన్ మిషన్ ద్వారా నేరుగా ఇంటికే మంచినీరు ఇచ్చే బృహత్తర ప్రాజెక్టును చేపడుతున్నామని చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా లాంటి కార్యక్రమాలు చేపట్టకపోతే వినాయక చవితికి విగ్రహం తయారుచేసే మట్టిని కూడా ఇతర దేశాల నుంచి తెచ్చుకోవాల్సిన దారుణ పరిస్థితులు దాపురించేవని ఆమె వ్యాఖ్యానించారు. విశాఖ సమీపంలో ఫార్మా రంగం అభివృద్ధికి బల్క్ డ్రగ్ పరిశ్రమలను విస్తృతం చేసినట్లు తెలిపారు. పోస్ట్ బడ్జెట్ సమావేశంలో ఆర్థిక మంత్రి వివిధ వ్యాపార వర్గాలు, పారిశ్రామిక, ఐటీ సంఘాల ప్రతినిధులతో గురువారం సాయంత్రం విశాఖలోని ఓ హోటల్లో నిర్వహించిన పోస్ట్ బడ్జెట్ ముఖాముఖి కార్యక్రమంలో ఆర్థిక మంత్రి సీతారామన్‌తోపాటు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పాల్గొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ)ల కోసం ‘కొత్త క్రెడిట్ అసెస్మెంట్ మోడల్’ను నిర్మలా సీతారామన్ ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చలు నిర్వహిస్తున్నామని చెప్పారు. తొలుత ముంబయిలో జరిగిందని, రెండో చర్చ విశాఖలో నిర్వహిస్తున్నామని తెలిపారు. కొత్త క్రెడిట్ అసెస్మెంట్ మోడల్ ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులు... ఎంఎస్ఎంఈలకు రుణాలు మంజూరు చేసేందుకు థర్డ్ పార్టీ మదింపులపై ఆధారపడకుండా, అంతర్గత మదింపు సామర్థ్యాన్ని పెంచుకుంటాయన్నారు. అధికారిక అకౌంటింగ్ వ్యవస్థ లేని ఎంఎస్ఎంఈలకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. విశాఖలో వివిధ వర్గాల ప్రజలను కలసి బడ్జెట్‌పై వారి సలహాలు, సూచనలు తీసుకున్నామని నిర్మలా సీతారామన్ చెప్పారు. -
పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారా? లేదా : బొత్స
-
పోలవరానికి రూ. 2,700 కోట్లు అడ్వాన్స్!
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాపాల ఫలితంగా పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిపోయి, కేవలం 41.15 మీటర్లేనని మరోసారి తేలిపోయింది. ఈ ఎత్తుతో ప్రాజెక్టు వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, కేవలం ఓ బ్యారేజిగా మారిపోతుందని నిపుణులు చెబుతున్నా, దానిని ప్రతిపాదిత ఎత్తు 45.72 మీటర్లకు పెంపునకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలేమీ లేవు. దీంతో కేంద్రం కూడా 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా నిధులిస్తోంది. ఆ ఎత్తు వరకు నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం మరో రూ. 2,700 కోట్లు ఏపీ ప్రభుత్వానికి అడ్వాన్సుగా విడుదల చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఆర్థిక శాఖకు సిఫారసు చేశారు. దీంతో ప్రాజెక్టు ఎత్తు పెరగదన్న విషయం మరోసారి స్పష్టమైంది. కేంద్రం 2024–25 సవరించిన బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు రూ.5,512.50 కోట్లు కేటాయించింది. ఇందులో గతేడాది అక్టోబర్ 9న రూ.2,807.69 కోట్లు (రీయింబర్స్మెంట్ రూపంలో రూ.459.69 కోట్లు, అడ్వాన్సుగా రూ.2,348 కోట్లు) విడుదల చేసింది. ఈ నిధుల్లో 75 శాతం ఖర్చు చేసి, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), కేంద్ర జల్ శక్తి శాఖ ద్వారా యూసీలు (వినియోగ ధ్రువీకరణపత్రాలు) పంపితే మిగతా రూ.2,704.81 కోట్లు విడుదల చేస్తామని చెప్పింది. కేంద్రం రీయింబర్స్ చేసిన రూ.459.69 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం యూసీలు పంపింది. అడ్వాన్సుకు యూసీలు పంపలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో 36 రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో మిగతా నిధుల విడుదలకు జల్ శక్తి శాఖ సిఫారసు చేసింది. ప్రాజెక్టును 2026 మార్చికి పూర్తి చేయడానికి నిధుల సమస్య లేకుండా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ప్రాజెక్టును 41.15 మీటర్లకే పరిమితం చేస్తే 119.40 టీంఎసీలు మాత్రమే నిల్వ చేయొచ్చు. దీనివల్ల వరద ఉన్నప్పుడు కుడి, ఎడమ కాలువల కింద 2.98 లక్షల ఎకరాలకు నీళ్లందించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అంటే.. మిగతా 4.22 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదు. ఇక కృష్ణా డెల్టా స్థిరీకరణ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి గోదావరి జలాల సరఫరా కష్టమే అవుతుంది. -
పోలవరం ఎత్తు తగ్గింపుతో రాష్ట్రానికి విఘాతం
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్ణీత ఎత్తును తగ్గించాలన్న నిర్ణయం రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతమని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. సోమవారం ఆయన రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి వంటిది. దాని నిల్వ సామర్థ్యాన్ని ఏమాత్రం తగ్గించినా అది రాష్ట్ర దీర్ఘకాల ప్రయోజనాలకు విఘాతమే. పోలవరం ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్ల ఎత్తు నుంచి 41.15 మీటర్లకు తగ్గిస్తే దాని నిల్వ ఏకంగా 194 టీఎంసీల నుంచి 115 టీఎంసీలకు పడిపోతుంది.ఈ ప్రాజెక్టు కింద మొత్తంగా 7.5 లక్షల ఎకరాలకు నీరివ్వాలి. తాగునీటి అవసరాలు తీర్చాల్సి ఉంది. ఈ ఏడాది బడ్జెట్లో కేవలం రూ.5,936 కోట్లు మాత్రమే కేటాయించారు. ప్రాజెక్టును 2026లోగా పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని ఇది దెబ్బతీస్తుంది. ముందస్తు వరదలు, కోవిడ్ వల్ల వచ్చిన అవాంతరాలతో కొంత ప్రతికూలత ఉన్నా.. సీఎం జగన్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు పనుల్లో గణనీయ పురోగతి జరిగింది. స్పిల్‌వే, స్పిల్ చానల్, కాఫర్ డ్యామ్ నిర్మాణాలు ఎలాంటి అవాంతరాలు లేకుండా పూర్తయ్యాయి. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టును ప్రాధాన్యతాంశంగా తీసుకుని పూర్తిచేసేందుకు కృషిచేయాలి’ అని కోరారు. రాష్ట్రంలో 21,054 ఎంఎస్ఎంఈలురాష్ట్రంలో 21,054 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ) రిజిస్టర్ అయినట్లు ఆ శాఖ సహాయ మంత్రి శోభ కరంద్లాజే తెలిపారు. ఈ మేరకు రాజ్యసభ ప్రశ్నోత్తరాల్లో వైఎస్సార్సీపీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ⇒ రాష్ట్రంలో లక్షా 90 వేల 777 జల వనరులున్నట్లు కేంద్ర జలశక్తి సహాయ మంత్రి రాజ్‌భూషణ్ చౌదరి.. వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. మొదటి గణన నివేదిక ప్రకారం 3,920 జల వనరులు ఆక్రమణకు గురైనట్టు తెలిపారు. ⇒ విమాన ప్రయాణికులకు సరసమైన ధరలో భోజనాన్ని అందించేందుకు కలకత్తా విమానాశ్రయంలో ‘ఉడాన్ యాత్రి కేఫ్’ను ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) ఏర్పాటు చేసినట్టు కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్మోహల్ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ నిరంజన్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.⇒ రాష్ట్రంలో 99.72శాతం మంది తమ తమ ఇళ్లలో మరుగుదొడ్లను ఏర్పాటు చేసుకున్నట్టు కేంద్ర జల్‌శక్తి సహాయ మంత్రి వి.సోమన్న తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యుడు గొల్ల బాబురావు అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. -
పోలవరం గడువులోగా పూర్తి చేయాలి
సాక్షి, అమరావతి: కేంద్ర మంత్రివర్గం నిర్దేశించిన గడువులోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని పోలవరం ప్రాజెక్టు(Polavaram Project) అథారిటీ(పీపీఏ), రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులను కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ(Debashree Mukherjee) ఆదేశించారు. 2026, మార్చి నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని.. వరదలు వంటి సమస్యలు ఉత్పన్నమైతే మరో ఏడాది గడువు పొడిగిస్తామని.. ఎట్టిపరిస్థితుల్లోనూ 2027, మార్చి నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్దేశించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.ఆ మేరకు ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రిమావిరా సాఫ్ట్‌వేర్‌తో కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని, నెల వారీ లక్ష్యాలు నిర్దేశించుకుని పనులు చేయాలని దిశానిర్దేశం చేశారు. పనుల పురోగతిపై ప్రతి నెలా తాను సమీక్షిస్తానని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సోమవారం ఢిల్లీలోని తన కార్యాలయంలో దేబశ్రీ ముఖర్జీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్..పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై పీపీఏ సీఈవో అతుల్ జైన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి వివరించారు. ప్రధాన(ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యాం గ్యాప్–2లో కొత్తగా నిర్మిస్తున్న డయాఫ్రం వాల్ పనులపై దేబశ్రీ ముఖర్జీ సమగ్రంగా సమీక్షించారు. 1396.6 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల మందంతో చేపట్టిన డయాఫ్రం వాల్ నిర్మాణంలో జనవరి 18 నుంచి ఇప్పటిదాకా ఐదు ప్యానెళ్లు దించారని పీపీఏ సీఈవో అతుల్‌జైన్ వివరించారు.ప్రస్తుత రెండు కట్టర్లతో పనులు చేస్తున్నారని.. వచ్చే నెలలో మూడో కట్టర్ వస్తుందని.. 2025, డిసెంబర్ నాటికి డయాఫ్రం వాల్‌ను పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. ఆలోగా డయాఫ్రం వాల్‌ను పూర్తి చేయడానికి రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో చర్చించి నెల వారీ లక్ష్యాలను నిర్దేశించుకుని తనకు నివేదిక ఇవ్వాలని పీపీఏ సీఈవోను దేబశ్రీ ముఖర్జీ ఆదేశించారు.డిజైన్ల ఆమోదంపై సత్వరమే నిర్ణయంపోలవరం ప్రాజెక్టు పనులు చేపట్టడానికి అత్యంత కీలకమైన డిజైన్ల రూపకల్పన, ఆమోదం ప్రక్రియపై కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ సమీక్షించారు. బంకమట్టి ఉన్న ప్రాంతంలో డయాఫ్రం వాల్ పనులు చేపట్టడానికి సంబంధించిన డిజైన్‌ను సీడబ్ల్యూసీకి పంపామని ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు చెప్పారు. అంతర్జాతీయ నిపుణుల కమిటీతో చర్చించి.. ఆ డిజైన్‌ను వీలైనంత తొందరగా ఆమోదించాలని సీడబ్ల్యూసీ చైర్మన్ ముకేష్‌కుమార్ సిన్హాను ఆదేశించారు.ప్రధాన డ్యాం గ్యాప్–3లో కాంక్రీట్ డ్యాంను ఇప్పటికే పూర్తి చేశామని.. గ్యాప్–1, గ్యాప్–2లలో ఈసీఆర్ఎఫ్ డ్యాంను నిర్మించాలని.. అందుకు సంబంధించిన డిజైన్లను రూపొందిస్తున్నామని సీఈ కె.నరసింహమూర్తి వివరించారు. డిజైన్లను ఆమోదించడంలో జాప్యం జరగకుండా చూడాలని సీడబ్ల్యూసీ చైర్మన్‌ను దేబశ్రీ ముఖర్జీ ఆదేశించారు. ప్రధాన డ్యాం గ్యాప్–1, గ్యాప్–2లలో ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు చేపట్టడానికి మెటీరియల్(మట్టి, రాళ్లు) ఏ మేరకు అవసరం.. ఏ మేరకు అందుబాటులో ఉంది.. ఇంకా అవసరమైన మెటీరియల్‌ను ఎక్కడి నుంచి సమకూర్చుకుంటారు అన్న అంశాలపై నివేదిక ఇవ్వాలని సూచించారు.రూ.2,700 కోట్ల అడ్వాన్సుకు రాష్ట్ర జలవనరుల శాఖ విజ్ఞప్తిప్రాజెక్టు పనులకు రీయింబర్స్‌మెంట్‌గా రూ.459.69 కోట్లు, అడ్వాన్సుగా రూ.2,348 కోట్లు అక్టోబర్ 10న విడుదల చేశారని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ వివరించారు. ఇందులో రూ.459.69 కోట్లకు సంబంధించి యూసీలను ఇప్పటికే కేంద్ర జల్ శక్తి శాఖకు పంపామని గుర్తు చేశారు. అడ్వాన్సుగా ఇచ్చిన రూ.2,348 కోట్ల వ్యయానికి సంబంధించిన బిల్లులను పీపీఏ ద్వారా పంపామని తెలిపారు. అడ్వాన్సుగా మరో రూ.2,700 కోట్లు విడుదల చేయాలని కోరారు. దీనిపై కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ స్పందిస్తూ వీలైనంత తొందరగా అడ్వాన్సుగా నిధులు ఇస్తామని చెప్పారు.నాణ్యతకు మూడంచెల విధానం..ప్రాజెక్టు పనుల్లో నాణ్యతపై ఏమాత్రం రాజీపడే ప్రశ్నే లేదని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. పనుల్లో నాణ్యతను ఎప్పటికప్పుడు తనిఖీ చేయడానికి వ్యాప్కోస్, సీఎస్ఎంఆర్ఎస్ (సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్), రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ల్యాబ్‌లను ఏర్పాటు చేసుకోవా లని ఆదేశించారు. మూడు ల్యాబ్‌లలో ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తూ పనుల నాణ్యతను నిర్ధారించాలని స్పష్టం చేశారు. -
పోలవరం ప్రాజెక్ట్ ను నాశనం చేశారు: వైఎస్ జగన్
-
వరదల్లోనూ డయాఫ్రం వాల్ నిర్మాణం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం గ్యాప్–2లో కొత్తగా నిర్మిస్తున్న డయాఫ్రం వాల్ పనులకు గోదావరి వరదల సమయంలో ఆటంకం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని జల వనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులకు అంతర్జాతీయ నిపుణుల కమిటీ దిశా నిర్దేశం చేసింది. ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో నీటి మట్టం 17 మీటర్ల (సముద్ర మట్టానికి) ఎత్తులోపే ఉండేలా గ్రావిటీ ద్వారా, ఎత్తిపోతల ద్వారా సీపేజీ నీటిని ఎప్పటికప్పుడు తోడేయాలని సూచించింది. ఇందుకు మరిన్ని పంపులు ఏర్పాటు చేయాలని చెప్పింది. గియాన్ ఫ్రాన్కో డి సిస్కో, డేవిడ్ బి పాల్‌తో కూడిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) డైరెక్టర్ (డ్యాం సేఫ్టీ రిహాబిలిటేషన్) సరబ్జీత్ సింగ్ బక్షి తదితరులతో కలిసి శనివారం డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను పరిశీలించింది. ఆది, సోమవారాల్లో డయా ఫ్రం వాల్ నిర్మాణ విధానంపై చర్చించింది. గోదావరి వరదల సమయంలో డయా ఫ్రం వాల్ నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంగళవారం సుదీర్ఘంగా చర్చించింది. ఎగువ కాఫర్ డ్యాం సీపేజీని నియంత్రించేందుకు డ్యాం పొడవునా.. అంటే 2,458 మీటర్ల పొడవుతో బట్రెస్ డ్యాంను నిరి్మంచాలన్న గతంలో సూచనపై కూడా చర్చించింది. ఎగువ కాఫర్ డ్యాం దిగువన, ఆ డ్యాం గర్భం వద్ద బట్రెస్ డ్యాంను నిర్మించడం వల్ల సీపేజీ నీటిని సమర్థవంతంగా నియంత్రించ వచ్చని నిపుణులు స్పష్టం చేశారు. బట్రెస్ డ్యాం డిజైన్‌లో మార్పులు చేర్పులపై సుదీర్ఘంగా చర్చించి.. తగిన సూచనలు చేశారు. ఆ మేరకు డిజైన్ పంపితే ఆమోదిస్తామని సీడబ్ల్యూసీ అధికారులు చెప్పారు. గోదావరి వరదల సమయంలో ప్రధాన డ్యాం గ్యాప్–2లో డయాఫ్రం వాల్ నిర్మాణానికి ఏర్పాటు చేసిన ప్లాట్‌ఫాం సీపేజీ నీటితో ముంపునకు గురికాకుండా ఎప్పటికప్పుడు ఎత్తిపోసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రధాన డ్యాం గ్యాప్–1, గ్యాప్–2 డిజైన్లపై కూడా చర్చించారు. అంతర్జాతీయ నిపుణుల కమిటీ సభ్యులు, సీడబ్ల్యూసీ అధికారులు బుధవారం ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. -
పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం
-
ఈ అన్యాయాన్ని ఆంధ్రా ప్రజలు క్షమించరు: ఎంపీ మిథున్ రెడ్డి
న్యూఢిల్లీ, సాక్షి: పోలవరం విషయంలో అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని, అవసరమైతే పార్టీలకతీతంగా ఎంపీలతో కలిసి పోరాడేందుకు సిద్ధమని లోక్‌సభలో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ప్రకటించారు. మంగళవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తీర్మానంపై చర్చలో ఆయన ఏపీకి సంబంధించిన పలు అంశాలపై మాట్లాడారు. ‘‘పోలవరం ప్రాజెక్టు కెపాసిటీని తగ్గించవద్దు. ఒరిజినల్‌గా పోలవరం ప్రాజెక్టు సామర్థ్యం 194 టీఎంసీలు. ఏడున్నర లక్షల ఎకరాలకు నీరు అందేలా దీన్ని డిజైన్ చేశారు. ఇరిగేషన్ తో పాటు తాగునీటి కోసం ఉపయోగించాలనేది ఉద్దేశం. కానీ, 41.15 మీటర్లకు ప్రాజెక్టును తగ్గిస్తూ బడ్జెట్లో ప్రతిపాదనలు పెట్టారు. దీనివల్ల పోలవరం కెపాసిటీ 194 నుంచి 115 టీఎంసీలకు పడిపోతుంది. ఈ తగ్గించడం వల్ల కేవలం 3.2 లక్షల ఎకరాలకి నీరు అందుతుంది. ఇది రైతులకు, రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినట్లే. ఈ అన్యాయం ఎదిరించేందుకు టిడిపి ఎంపీలతో కలిసి పోరాటానికి సిద్ధం. లేకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్షమించరు’’ అని అన్నారాయన. ‘‘ఇప్పటికే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఇప్పుడు పోలవరం కెపాసిటీని తగ్గించారు. విభజన చట్టం మేరకు ఒరిజినల్ గా ఉన్న పోలవరం సామర్ధ్యాన్ని కొనసాగించాలి. కెపాసిటీ తగ్గించిన తర్వాత బనకచర్లకు నీరు ఎలా అందుతుంది?. రాయలసీమకు నీరేలా ఇస్తారు? అని ప్రశ్నించారాయన. ఇంకా ఆయన ఏమన్నారంటే.. 👉ఏపీ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని మెల్లగా రద్దు చేస్తున్నారు. ఇంగ్లీష్ చదివితేనే విదేశాల్లో కార్పొరేట్ కంపెనీలలో ఉద్యోగాలు దొరికే పరిస్థితి ఉంది. ఇంగ్లీష్ మీడియం తో పాటు తెలుగు కొనసాగించాలి. 👉ఆర్బీఐ నిబంధనల విరుద్ధంగా మార్గదర్శి సంస్థ రూ. 2,600 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడింది. ప్రజల డబ్బును ఇతర కంపెనీలకు మళ్ళించారు. సహారా, శారద కుంభకోణం కంటే మార్గదర్శక కుంభకోణం పెద్దది. మార్గదర్శిపై రూ. 1,000 కోట్ల రూపాయల జరిమానా విధించారు. డిపాజిటర్ల డబ్బు తిరిగి చెల్లించకుండా వాటిని రెన్యువల్ చేస్తున్నారు. మార్గదర్శి కుంభకోణం పై దర్యాప్తు జరపాలి. ఈ అంశంపై ప్రధాని జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలి👉విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయవద్దు. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో జిందాల్ గ్రూపును పిలిచి మాట్లాడాలి. 👉విద్యార్థులు డ్రగ్స్ కు బానిసలు అవుతున్నారు. డ్రగ్స్ నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి -
ఆంధ్రుల జీవనాడి పోలవరాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర: చలసాని
-
బాబు నిర్వాకం.. పోలవరం ఎత్తు 41.15 మీటర్లే
-
టీ–16 ప్లాస్టిక్ కాంక్రీట్ సమ్మేళనమే బెస్ట్
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో టీ–16 రకం ప్లాస్టిక్ కాంక్రీట్ సమ్మేళనంతోనే కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలని అంతర్జాతీయ నిపుణుల కమిటీ స్పష్టం చేయడంతో ఆ కాంక్రీట్ సమ్మేళనం సాంకేతికత, దాని తయారీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పాత డయాఫ్రం వాల్ నిర్మాణంలో వినియోగించిన టీ–5 రకం కాకుండా టీ–16 రకం కాంక్రీట్ సమ్మేళనం వైపే నిపుణులు ఎందుకు మొగ్గు చూపుతున్నారనే అంశంపై ఆసక్తి పెరిగింది. గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేశాకే ప్రధాన డ్యామ్ పునాది డయాఫ్రం వాల్ పనులు చేపట్టాలి. కానీ.. గోదావరి వరదను మళ్లించే పనులు చేపట్టకుండానే 2016 డిసెంబర్ నుంచి 2018 జూన్ మధ్య వరద ప్రవాహం లేని రోజుల్లో ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో 1396.6 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల మందంతో డయాఫ్రం వాల్‌ను నిర్మించారు. 2017, 2018 సీజన్లలో గోదావరి వరద డయాఫ్రం వాల్ మీదుగా ప్రవహించడంతో వరద ఉద్ధతికి డయాఫ్రం వాల్ కోతకు గురై దెబ్బతింది. ఆ తరువాత 2019–21 మధ్య వరదను మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను నిర్మించి గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా ప్రభుత్వం మళ్లించింది. ప్రధాన డ్యామ్ గ్యాప్–1లో డయాఫ్రం వాల్ నిర్మించింది. గ్యాప్–2లో దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు మరమ్మతులు చేయాలా? కొత్తది నిర్మించాలా? అన్నది తేల్చడంలో తొలుత ఎన్‌హెచ్‌పీసీ (నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్) నిపుణుల సహకారం తీసుకున్న సీడబ్ల్యూసీ ఆ తర్వాత అంతర్జాతీయ నిపుణుల కమిటీతో అధ్యయనం చేసింది. చివరకు ఈ ఏడాది జూన్‌లో కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలని సూచించింది. త్వరగా గట్టిపడి గోడలా మారుతుంది ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు నిర్మించిన నేపథ్యంలో ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతానికి ఎగువన, దిగువన నీరు నిల్వ ఉంటుంది. దీనివల్ల ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో భూగర్భ జలమట్టం పెరిగింది. డయాఫ్రం వాల్ నిర్మాణానికి ట్రెంచ్ కట్టర్, గ్రాబర్ల ద్వారా భూమిని తవ్వుతూ పోతే.. భూగర్భ జలాలు పైకి ఎగదన్నుతాయి. రాతి పొర తగిలేవరకూ భూమిని తవి్వ.. ఖాళీ ప్రదేశంలోకి తొలుత బెంటనైట్ మిశ్రమాన్ని, ఆ తరువాత కాంక్రీట్ మిశ్రమాన్ని పంపాలి. టీ–5 రకం కాంక్రీట్ మిశ్రమంలో సిమెంటు పాళ్లు తక్కువగా ఉండటం వల్ల అది త్వరగా గట్టిపడదు. అందువల్ల భూగర్బ జలాల ఒత్తిడికి అది తట్టుకుని నిలబడలేదు. అదే టీ–16 రకం కాంక్రీట్ మిశ్రమంతో సిమెంటు పాళ్లు అ«దికంగా ఉండటం వల్ల కాంక్రీట్ మిశ్రమం అధిక ఒత్తిడితో పోసిన వెంటనే బెంటనైట్ మిశ్రమం బయటకు వస్తుంది. కొంత బెంటనైట్ మిశ్రమంతో కలిసి వెంటనే టీ–16 రకం కాంక్రీట్ మిశ్రమం గట్టిపడి గోడగా మారుతుంది. తద్వారా భూగర్భ జలాల ఒత్తిడిని అణచివేస్తుంది. టీ–5 కంటే టీ–16 రకం కాంక్రీట్ మిశ్రమం అత్యంత పటిష్టవంతమైనదని ఐఐటీ (తిరుపతి) ప్రొఫెసర్లు నిర్వహించిన పరీక్షల్లో తేలింది. అందుకే కొత్త డయాఫ్రం వాల్లో టీ–16 రకం కాంక్రీట్ మిశ్రమాన్ని వినియోగించాలని అంతర్జాతీయ నిపుణుల కమిటీ సూచించింది. -
నీటి నిల్వ 41.15 మీటర్లే
సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టులో నీరు నిల్వ చేసే ఎత్తు 41.15 మీటర్లే అని తాజా బడ్జెట్ సాక్షిగా మరోమారు స్పష్టమైంది. తద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని 194.6 టీఎంసీల నుంచి 119.4 టీఎంసీలకు తగ్గించారనేది బట్టబయలైంది. పోలవరం ప్రాజెక్టుకు నిర్దేశించిన గడువు 2026 మార్చి నాటికి పూర్తి చేయడానికి వీలుగా కేంద్రం 2025–26 బడ్జెట్లో రూ.5,936 కోట్లు, పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సిబ్బంది జీత భత్యాలు, నిర్వహణకు రూ.55 కోట్లు కేటాయించింది. గతేడాది జూలై 23న ప్రవేశపెట్టిన 2024–25 పూర్తి బడ్జెట్లో పోలవరానికి నిధులు కేటాయించలేదు. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు అనుమతి ఇచ్చిన మేరకు పోలవరం ప్రాజెక్టును గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్ల ఎత్తుతో 194.6 టీఎంసీలు నిల్వ చేసేలా స్పిల్ వేను 2021 జూన్ 11 నాటికి గత ప్రభుత్వం పూర్తి చేసింది. కానీ.. పోలవరంలో నీటి నిల్వ చేసే ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేసి, నీటి నిల్వ సామర్థ్యాన్ని 119.4 టీఎంసీలకు తగ్గించి.. ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన రూ.12,157.53 కోట్లు మంజూరు చేస్తూ గతేడాది ఆగస్టు 28న కేంద్ర మంత్రివర్గం తీర్మానం చేసింది. పోలవరం రిజర్వాయర్‌ను బ్యారేజ్‌గా మార్చేసినా.. ఆ మంత్రివర్గ సమావేశంలో ఉన్న టీడీపీకి చెందిన కె.రామ్మోహన్నాయుడు అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీన్నిబట్టి రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం పోలవరంలో నీటి నిల్వ చేసే ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేసేందుకు అంగీకరించిందన్నది స్పష్టమవుతోంది. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పోలవరాన్ని 2026 మార్చి నాటికి పూర్తి చేయాలన్న కేంద్ర కేబినెట్.. నిర్మాణంలో ఏవైనా సమస్యలు తలెత్తితే పూర్తి చేసేందుకు నిర్దేశించిన గడువును మరో ఏడాది పొడిగించింది. ఈ మేరకు 2024–25 సవరించిన బడ్జెట్లో రూ.5,512.50 కోట్లను కేంద్ర జల్ శక్తి శాఖ కేటాయించింది. ఇందులో రీయింబర్స్మెంట్ రూపంలో రూ.459.69 కోట్లు, అడ్వాన్సుగా రూ.2,348 కోట్లు వెరసి రూ.2,807.69 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది. ఈ నిధుల్లో 75 శాతం వ్యయం చేసి.. యూసీల (వినియోగ ధ్రువీకరణ పత్రాలు)ను పీపీఏ ద్వారా పంపితే మిగతా నిధులు విడుదల చేస్తామని చెప్పింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా 58 రోజులు ఉంది. రాష్ట్ర ప్రభుత్వం యూసీలు పంపితే సవరించిన బడ్జెట్లో కేటాయించిన వాటిలో మిగతా నిధులను కేంద్రం విడుదల చేసే అవకాశం ఉంది. గతేడాది సవరించిన బడ్జెట్లో కేటాయించిన దాని కంటే ప్రస్తుత బడ్జెట్లో రూ.423.50 కోట్లను కేంద్రం అధికంగా కేటాయించింది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటే గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయొచ్చని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.బాబు నిర్వాకం వల్లే నీటి నిల్వ తగ్గింపు» విభజన నేపథ్యంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం.. కమీషన్ల కోసం అప్పటి సీఎం చంద్రబాబు ఒత్తిడితో నిర్మాణ బాధ్యతలను 2016 సెప్టెంబరు 7న కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించింది. » ఇందుకోసం 2013–14 ధరల ప్రకారం.. 2014 ఏప్రిల్ 1 నాటికి నీటి పారుదల విభాగంలో మిగిలిన పనులకు అయ్యే వ్యయాన్ని మాత్రమే నాబార్డు నుంచి రుణం తీసుకుని రీయింబర్స్ చేస్తామన్న కేంద్రం షరతుకు సీఎం చంద్రబాబు అంగీకరించారు. గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేసి.. ప్రధాన డ్యాం నిర్మాణ పనులను చేపట్టాల్సిన చంద్రబాబు.. దానికి భిన్నంగా కమీషన్లు వచ్చే పనులనే చేపట్టి పోలవరంలో విధ్వంసం సృష్టించారు. దీంతో కమీషన్ల కోసం పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని అప్పట్లో ప్రధాని మోదీ వ్యాఖ్యానించడం తెలిసిందే.» వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, చంద్రబాబు చేసిన తప్పులను వైఎస్ జగన్ సరిదిద్దుతూ పనులను వేగవంతం చేశారు. 2017–18 ధరల ప్రకారం రూ.55,656 కోట్ల అంచనా వ్యయాన్ని ఆమోదించి, ఆ మేరకు రీయింబర్స్ కాకుండా అడ్వాన్సుగా నిధులు ఇచ్చేలా కేంద్రాన్ని ఒప్పించారు. » అయితే, 2024 ఎన్నికల్లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలే అధికారంలోకి వచ్చాక, పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసే ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేసి, మిగతా పనుల పూర్తికి రూ.12,157.53 కోట్లు మాత్రమే ఇచ్చేలా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు అంగీకరించడం ద్వారా పోలవరాన్ని మరోసారి ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారు. తద్వారా వరద ఉన్నప్పుడు మాత్రమే కుడి, ఎడమ కాలువల కింద 2.98 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లందించే అవకాశం ఉంటుంది. మిగతా 4.22 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదు. కృష్ణా డెల్టా స్థిరీకరణ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి గోదావరి జలాల సరఫరా కష్టమే. -
పోలవరం ఎత్తు 41.15 మీటర్లకే ఎందుకు పరిమితమైంది?: బుగ్గన
కర్నూలు (టౌన్): పోలవరం ప్రాజెక్టుకు తీరని నష్టం చేకూరడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వాకం కాదా అని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. గతంలోనూ ఆయన చేతగానితనం, పొరపాట్ల కారణంగా ఈ ప్రాజెక్టుకు ఎంతో నష్టం జరిగిందని.. ఇప్పుడు మళ్లీ ఆయన నిర్లక్ష్యంతో ప్రాజెక్టుకు పెనుముప్పు ఏర్పడుతోందన్నది నిజం కాదా అని నిలదీశారు. 2025–26 కేంద్ర బడ్జెట్‌ను శనివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నేపథ్యంలో బుగ్గన కర్నూలులో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ అనేక ప్రశ్నలు సంధించారు. ఆయన ఏమన్నారంటే.. పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల ఎత్తుతోనే పూర్తిచేసేందుకు రూ.5,936 కోట్లు ఇస్తామని కేంద్ర బడ్జెట్లో చెప్పారు. వాస్తవానికి.. పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మిoచాల్సి ఉంది. ఆ విధంగా నిరి్మస్తేనే పోలవరం ద్వారా 200 టీఎంసీల నీరు లభిస్తుంది. దీనివల్ల కృష్ణా, గోదావరి జిల్లాల్లోని లక్షలాది ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, కొత్త ఆయకట్టుకు నీరు లభిస్తుంది. అలాగే, 960 మెగావాట్ల విద్యుదుత్పత్తి, విశాఖ నగరానికి, 600 గ్రామాలకు తాగునీరు అందుతుంది. ఈ ప్రయోజనాలు చేకూరాలంటే 150 అడుగుల మేర నిర్మిస్తేనే సాధ్యపడుతుంది. అయితే, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకే ఎందుకు పరిమితం చేస్తున్నారు. దీనిని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి తెలీకుండానే కేంద్రం పోలవరం ఎత్తును 41.15 అడుగులకు ఖరారు చేస్తుందా? నిజానికి.. 2017–18లో చంద్రబాబు ప్రభుత్వం అలాంటి పొరపాటే చేస్తే దానిని సరిదిద్దుకునేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి నాలుగేళ్లు పట్టిన విషయం నిజం కాదా? ఇక రూ.12,500 కోట్లు సాధించామని చంద్రబాబు చెబుతున్నారు. ఇది మా ప్రభుత్వం సాధించింది కాదా!? ఆనాడు కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా పోలవరం ఎత్తుపై వివరణ ఇచ్చాం. తొలి ఏడాది 41.15 మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేపట్టి నీటిని నిల్వచేస్తామని చెప్పాం కదా.. తర్వాత రెండేళ్లలో నీటినిల్వ పెరుగుతున్న కొద్దీ ముంపు ప్రాంతాల్లో భూసేకరణ చేపట్టి ప్రాజెక్టు ఎత్తున 45.72 మీటర్లకు పెంచుతామని చెప్పాం. ఇది ప్రాజెక్టు మాన్యువల్‌లోనూ ఉందా లేదా!? కానీ, ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం అవేమీ లేకుండానే పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల ఎత్తుతోనే పూర్తిచేస్తామని బడ్జెట్లో రాయించుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? తక్షణం దీనిపై కేంద్రానికి క్లారిటీ ఇవ్వకపోతే పోలవరం ప్రాజెక్టుకు, రాష్ట్ర ప్రజలకు తీరని నష్టం జరుగుతుంది. ఇదిలా ఉంటే.. బడ్జెట్ కాపీలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి.. ‘నిర్మాణం’ అన్న పదానికి బదులు ప్రాజెక్టు పూర్తి (కంప్లీషన్)కి అని ఎందుకు పేర్కొన్నారు? దీని వెనకున్న మతలబు ఏంటి? ఇకపోతే.. రాష్ట్రంలో నాలుగు పోర్టులు నిర్మాణంలో ఉన్నాయి. వాటికీ ఎందుకు నిధులు కోరలేదు? 16 మంది టీడీపీ ఎంపీలున్నా బాబు ఎందుకు విఫలమయ్యారు? ఇక ఎన్డీఏ కూటమిలో 16 మంది టీడీపీ ఎంపీలున్నా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో.. నిధులు రాబట్టడంలో సీఎం చంద్రబాబు ఎందుకు ఘోరంగా విఫలమయ్యారు? ఈ విషయంలో ఆయన ఏమాత్రం చొరవ చూపలేదన్నది నిజం కాదా? వాస్తవానికి.. టీడీపీ మద్దతుతో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తోంది. ఆ పార్టీకి 16 మంది ఎంపీలూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలోనూ టీడీపీ కొనసాగుతోంది కదా! అయినా కేంద్ర బడ్జెట్ నుంచి ఏపీకి చంద్రబాబు ఎందుకు నిధులు సాధించలేకపోయారు? రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడంలో చంద్రబాబు అసమర్థుడిగా నిలిచారా లేదా? ఇక గతంలో వైఎస్సార్సీపీకి 23 మంది ఎంపీలున్నారని, కేంద్రం నుంచి ఎక్కువ నిధులు దక్కించుకోవడంలో విఫలమవుతున్నారంటూ చంద్రబాబు పదేపదే విమర్శించారు కదా! నిజానికి.. అప్పుడు కేంద్రానికి వైఎస్సార్సీపీ మద్దతు అవసరంలేదు. కానీ, ప్రస్తుతం టీడీపీ మద్దతుపై కేంద్రం ఆధారపడి ఉంది. దీనిని వినియోగించుకుని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పెద్దఎత్తున నిధులు తెచ్చుకునే స్థితిలో చంద్రబాబు ఉన్నా ఇప్పుడాయన ఎందుకు విఫలమయ్యారు? అదే కేవలం 12 మంది ఎంపీలతోనే బిహార్ రాష్ట్రం ఎక్కువ నిధులు సాధించి బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యత ఎలా దక్కించుకుంది? ఇటీవల నీతి ఆయోగ్ నివేదికపై మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. తలసరి ఆదాయంపై ఆయన విశ్లేషణను చూసి ఒక ఎన్ఆర్ఐ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. సీఎం లెక్కల్లోని తప్పులను ఎత్తిచూపారు. 2018–19లో ఏపీలో తలసరి ఆదాయం రూ.1.54 లక్షలు ఉంటే 2022–23లో రూ.2.20 లక్షలకు చేరింది. చంద్రబాబు హయాం కంటే జగన్ హయాంలో తలసరి ఆదాయం పెరిగింది నిజమా కాదా? సీఎంగా ఉన్న వ్యక్తే తప్పుడు లెక్కలు చెబితే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారా? వైఎస్సార్సీపీ విధానాలే కేంద్రంలోనూఇక వైఎస్ జగన్ హయాంలో అమలుచేసిన విద్యా ప్రమాణాల పెంపు విధానాలనే నేడు కేంద్రం అనుసరిస్తోంది. సెకండరీ, ప్రైమరీ పాఠశాలలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ రాబోతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ స్కూళ్లలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ఏర్పాటుచేసి బ్రాడ్‌బాండ్ సర్విస్ అందించాం. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేశాం. టీడీపీ, ఎల్లో మీడియా దీనిని తీవ్రంగా వ్యతిరేకించాయి. రాబోయే ఐదేళ్లలో దేశంలో 75 వేల మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తున్నట్లు బడ్జెట్లో కేంద్రం ప్రకటించింది కదా.. అందులో భాగంగా ఈ ఏడాది 10 వేల సీట్లు ఇవ్వాలని నిర్ణయించారు కదా.. ఆనాడు మెడికల్ సీట్ల ఆవశ్యకతను మాజీ సీఎం జగన్ గుర్తించి రాష్ట్రంలో ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలుపెట్టి గత ఏడాది ఐదింటిని ప్రారంభించారు. దీనివల్ల 750 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయా లేదా? అన్ని కళాశాలలు పూర్తయితే 2,450 సీట్లు దక్కేవి. కానీ, చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ సీట్ల సాధనలో ఎందుకు చొరవ చూపట్లేదు? రాష్ట్ర విద్యార్థులకు ఎందుకు ఇంతలా నష్టం చేకూరుస్తున్నారు?. -
రూ.990 కోట్లతో డయాఫ్రం వాల్ నిర్మాణం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో ప్రధాన(ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యాం గ్యాప్–2లో రూ.990 కోట్లతో డయాఫ్రం వాల్ నిర్మాణానికి పరిపాలనా పరమైన అనుమతి ఇస్తూ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్యాప్–2లో తొలుత ప్రతిపాదించిన డయాఫ్రం వాల్‌ను 29,585 చదరపు మీటర్ల పరిధిలో నిర్మించారు. ఆ పనులకు రూ.393.32 కోట్ల వ్యయం అవుతుందని పోలవరం సీఈ లెక్కగట్టారు. గ్యాప్–2లో సవరించిన ప్రతిపాదన ప్రకారం 63,656 చదరపు మీటర్ల పరిధిలో డయాఫ్రం వాల్‌ను నిర్మించాల్సి ఉందని.. ఇందుకు రూ.990 కోట్ల వ్యయం అవుతుందని 2024 అక్టోబర్ 30న పోలవరం సీఈ పంపిన నివేదికపై ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఆ మేరకు పనులు చేపట్టడానికి ఐదు షరతులతో అనుమతిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆ షరతులు ఇవీ..⇒ తొలి టెండర్ ఒప్పందంలోని నిబంధనల ప్రకారమే ధరల సర్దుబాటును వర్తింపజేయాలి.⇒ ఎల్ఎస్(లంప్సమ్) విధానంలో నిబంధనల ప్రకారం స్టాండర్డ్ డేటా ఆధారంగా అంచనా వ్యయాన్ని ఖరారు చేశాకే పనులకు సాంకేతిక అనుమతి ఇవ్వాలి.⇒ డిజైన్లు, డ్రాయింగ్లను అధీకృత సంస్థ ఆమోదించాకే పనులకు సాంకేతిక అనుమతి ఇవ్వడం ద్వారా పనుల్లో తేడాలు లేకుండా చూడాలి. ⇒ సవరించిన ప్రతిపాదనను.. సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలో పొందుపరిచి కేంద్ర ప్రభుత్వంతో రూ.990 కోట్లను రీయింబర్స్మెంట్ చేయించాలి.⇒ టెండర్ ఒప్పందంలోని నిబంధనలకు లోబడే ధరల సర్దుబాటు విభాగం కింద చెల్లింపులు చేయాలి. 1న అంతర్జాతీయ నిపుణుల కమిటీ రాకపోలవరం ప్రాజెక్టు పనులను గియాన్ ఫ్రాన్కో డి సిస్కో, డేవిడ్ బి పాల్‌తో కూడిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఫిబ్రవరి ఒకటి నుంచి నాలుగో తేదీ వరకు క్షేత్ర స్థాయిలో పరిశీలించనుంది. అధికారులు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించి డయాఫ్రం వాల్‌తో సహా నిర్మాణాల డిజైన్లు, పనుల నాణ్యతపై తీసుకోవాల్సిన చర్యలను సూచించనుంది.డయాఫ్రం వాల్ నిర్మాణ విధానంపై ఈనెల 9, 15, 17 తేదీల్లో అంతర్జాతీయ నిపుణుల కమిటీ సభ్యులతో కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) సభ్యుడు భోపాల్ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభిప్రాయం తీసుకున్నారు. గ్యాప్–2లో డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను ఈనెల 18న కాంట్రాక్ట్ సంస్థలు మేఘా, బావర్లు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని కమిటీకి సీడబ్ల్యూసీ సభ్యుడు భోపాల్‌సింగ్ సూచించారు. -
డయాఫ్రం వాల్ నాణ్యత బాధ్యత ఏపీ ప్రభుత్వానిదే
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ప్రధాన (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యామ్ గ్యాప్–2లో కొత్తగా నిర్మిస్తున్న డయాఫ్రం వాల్ నాణ్యత బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తేల్చిచెప్పింది. తాము ఆమోదించిన విధానం, నిర్దేశించిన లక్ష్యాల ప్రకారం డయాఫ్రం వాల్ నిర్మిస్తున్నారా? లేదా? అన్నది నిర్ధారించాల్సిన బాధ్యత పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ)దేనని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, పీపీఏకు బుధవారం సీడబ్ల్యూసీ డైరెక్టర్ రాకేశ్ టొతేజా లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు 6 మీటర్ల ఎగువన 1.5 మీటర్ల మందం, 1,396.6 మీటర్ల పొడవుతో కొత్త డయాఫ్రం వాల్ డిజైన్.. నిర్మించే విధానంపై డిసెంబర్ 26న సీడబ్ల్యూసీకి పోలవరం ప్రాజెక్టు సీఈ నివేదిక ఇచ్చారు. దీనిపై అంతర్జాతీయ నిపుణుల కమిటీ(పీవోఈ)తో సీడబ్ల్యూసీ డిజైన్స్ సీఈ విజయ్‌శరణ్ ఈ నెల 9న ఒకసారి.. 15న రెండోసారి.. 17న మూడోసారి సమీక్షించారు. ఈ సమీక్షల్లో వెల్లడైన అంశాల ఆధారంగా డయాఫ్రం వాల్ నిర్మించే విధానంలో లోపాలు ఎత్తిచూపుతూ.. వాటిని అధిగమించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది వివరిస్తూ నివేదిక ఇవ్వాలని పోలవరం సీఈని ఆదేశించారు. సీడబ్ల్యూసీ లేఖలో ప్రధానాంశాలివీ ⇒ డయాఫ్రం వాల్ నిర్మాణంలో వినియోగించే టీ–16 కాంక్రీట్ మిశ్రమం ఆమోదించిన ప్రమాణాల ప్రకారం బలంగా, ధృడంగా, సీపేజీని సమర్థవంతంగా అడ్డుకుంటుందా లేదా అన్నది నిర్ధారించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారో నివేదికలో పేర్కొనాలి. ప్లాసిŠట్క్ కాంక్రీట్ నాణ్యతను నిర్ధారించడానికి మూడంచెల నాణ్యత నియంత్రణ విధానం ఉండాలి. ఆ విధానాన్ని ఎలా ఏర్పాటు చేస్తారనే అంశంపై నివేదిక ఇవ్వాలి. ⇒ డయాఫ్రం వాల్ నిర్మాణం కోసం ట్రెంచ్ కట్టర్, గ్రాబర్‌తో భూమిని తవ్వుతూ.. ఖాళీ ప్రదేశంలోకి బెంటనైట్ మిశ్రమాన్ని నింపుతూ రాతిపొర తగిలే వరకూ ప్యానల్‌ను దించుతూ పోతారు. రాతి పొర తగిలాక.. కఠిన శిల(హార్డ్ రాక్)లోకి ఎగువ మొన నుంచి ఏకీకృత రీతిలో రెండు మీటర్ల లోతు వరకూ ప్యానల్‌ను దించాలి. ఆ తర్వాత ఎలాంటి అవాంతరాలు లేకుండా 12 గంటల్లోగా ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమాన్ని పోయాలి. ⇒ కఠిన శిల ఫర్మియబులిటీ, సీపేజీపై పరీక్షలు నిర్వహించాలి. పరిమితి కంటే ఎక్కువ సీపేజీ ఉన్నట్టు ఆ పరీక్షల్లో వెల్లడైతే.. దాన్ని అరికట్టడానికి గ్రౌటింగ్ (అధిక ఒత్తిడితో సిమెంట్‌ను రాతి పొరల్లోకి పంపడం) చేసే విధానాన్ని ఖరారు చేయాలి. ⇒ డయాఫ్రం వాల్ నిర్మాణంలో ఒక ప్యానల్‌కూ మరో ప్యానల్ మధ్య జాయింట్లు సక్రమంగా ఉన్నాయా.. లేదా.. అన్నది నిర్ధారించాలి. ⇒ పాత డయాఫ్రం వాల్ నిర్మించే సమయంలో అధిక ఒత్తిడితో ప్లాసిŠట్క్ కాంక్రీట్ మిశ్రమాన్ని పంపినప్పుడు విచలనం, భ్రమణానికి గురవడం వల్ల డయాఫ్రం వాల్ మందం 0.3 శాతం అంటే 4.5 సెంటీమీటర్లు తగ్గింది. ఇప్పుడు నిర్మిస్తున్న డయాఫ్రం వాల్ మందం 0.5 శాతం అంటే 7.5 సెంటీమీటర్లు తగ్గుతుందని నివేదికలో పేర్కొన్నారు. అప్పటికీ.. ఇప్పటికీ మందం తగ్గడానికి కారణాలు ఏమిటన్నది సవివరంగా నివేదిక ఇవ్వాలి. ⇒ డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తయ్యాక.. ప్రధాన డ్యామ్ నిర్మాణ సమయంలో ఎగువ భాగం కొంత తొలగిస్తారు. అలా తొలగించే సమయంలో డయాఫ్రం వాల్ దెబ్బతినకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది నివేదికలో స్పష్టం చేయాలి. ⇒ ప్రాజెక్టు పనులను రోజూవారీ, నెలవారీ సమీక్షిస్తూ.. నిర్దేశించిన లక్ష్యాల మేరకు పనులు చేస్తున్నారా? లేదా అన్నది పీపీఏ నివేదిక ఇవ్వాలి. -
పక్కా.. అది బ్యారేజే!
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసే ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెబుతున్న మాటల్లో వీసమెత్తు నిజం లేదన్నది స్పష్టమైంది. కేంద్ర జల్ శక్తి శాఖ శనివారం పీఐబీ (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) ద్వారా విడుదల చేసిన 2024 వార్షిక సమీక్ష సాక్షిగా అది బహిర్గతమైంది. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు ఊపిరి తీసేసిన కూటమి ప్రభుత్వ నిర్వాకం బయట పడింది. నీటిని నిల్వ చేసే ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేయడం ద్వారా పోలవరం ప్రాజెక్టుకు ఉరేసి, ఆ ప్రాజెక్టు ఊపిరి తీయడాన్ని సాక్ష్యాధారాలతో అక్టోబర్ 30న ‘పోలవరానికి ఉరి’ శీర్షికన ‘సాక్షి’ ప్రత్యేక కథనం ద్వారా బహిర్గతం చేసింది. ఈ కథనంలో పేర్కొన్న అంశాలు అవాస్తవమని, పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసే ఎత్తును 41.15 మీటర్లకు పరిమితం చేయలేదని సీఎం చంద్రబాబు, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఖండించారు. కానీ.. ‘సాక్షి’ ప్రచురించిన కథనం అక్షర సత్యమని కేంద్ర జల్ శక్తి శాఖ విడుదల చేసిన 2024 వార్షిక సమీక్ష స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసే ఎత్తు 41.15 మీటర్లకే పరిమితమని కేంద్ర జల్ శక్తి శాఖ స్పష్టం చేసింది. ఆ మేరకు ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.30,436.95 కోట్లకు గతేడాది ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొంది. మిగిలిన పనుల పూర్తికి రూ.12,157.53 కోట్లు విడుదల చేసేందుకు అంగీకరించిందని వెల్లడించింది. ప్రాజెక్టు పనులకు నవంబరు 30 వరకు 18,348.84 కోట్లు ఖర్చు చేసినట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపిందని పేర్కొంది. ఇందులో ఇప్పటిదాకా రూ.15,605.96 కోట్లు రీయింబర్స్ చేశామని, అక్టోబర్ 9న రూ.2,348 కోట్లను అడ్వాన్సుగా ఇచ్చామని వెల్లడించింది. ఈ మేరకు శనివారం 2024 వార్షిక సమీక్షను విడుదల చేసింది.ఎత్తు తగ్గిస్తున్నా నోరెత్తని టీడీపీఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ద్వారా పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించిందని కేంద్ర జల్ శక్తి శాఖ గుర్తు చేసింది. 2467.50 మీటర్ల పొడవున ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం, 1121.20 మీటర్ల పొడవున స్పిల్తో కూడిన ఈ ప్రాజెక్టు ద్వారా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో 2.91 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీళ్లందించాలన్నది లక్ష్యమని వెల్లడించింది. ఈ ప్రాజెక్టులో 2014 ఏప్రిల్ 1 నాటికి నీటి పారుదల విభాగంలో మిగిలిన పనులకు అయ్యే వ్యయాన్ని వంద శాతం కేంద్రం రీయింబర్స్ చేస్తుందని పేర్కొంది. కేంద్రం తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టును నిర్మిస్తోందని తెలిపింది. పోలవరం ప్రాజెక్టును గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్లతో నిర్మించడానికి అంచనా వ్యయం 2013–14 ధరల ప్రకారం రూ.29,027.95 కోట్లు, 2017–18 ధరల ప్రకారం రూ.47,725.74 కోట్లుగా ఆర్సీసీ (రివైజ్డ్ కాస్ట్ కమిటీ) ఆమోదించడాన్ని సమీక్షలో ప్రస్తావించింది. కానీ.. ప్రాజెక్టులో 45.72 మీటర్ల ఎత్తుతో కాకుండా 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వను పరిమితం చేస్తూ, ఆ మేరకు మిగిలిన పనుల పూర్తికి అవసమైన నిధులు విడుదల చేసేందుకు ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కె.రామ్మోహన్నాయుడు ఆ సమావేశంలో పాల్గొన్నప్పటికీ ఏ అభ్యంతరం చెప్పలేదు. దీన్ని బట్టి.. పోలవరంలో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వను పరిమితం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించినట్లు స్పష్టమవుతోంది. -
పోలవరం, అమరావతికి నిధులు కేటాయించండి
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణానికి పెద్దఎత్తున నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కోరారు. వచ్చేనెలలో జరగనున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రం తరఫున ఆయన పలు విజ్ఞప్తులు చేశారు. రాష్ట్రాభివృద్ధికి సహకారం అందించాలన్నారు. దావోస్ పర్యటన ముగించుకుని గురువారం అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు.. శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. అనంతరం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తోనూ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. బడ్జెట్లో నిధులు కేటాయించండి..ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రంలో పోలవరం, అమరావతి నిర్మాణాలకు పెద్దఎత్తున నిధులు కేటాయించాలని నిర్మలా సీతారామన్‌ను చంద్రబాబు కోరారు. రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సుమారు 45 నిమిషాల పాటు కొనసాగిన ఈ భేటీలో రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన ఆర్థిక సహకారంపై చంద్రబాబు చర్చించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి రూ.11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించినందుకు నిర్మలా సీతారామన్‌కు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీమాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఆయన నివాసంలో చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బాబు వెంటకేంద్ర ఉక్కు, పరిశ్రమ శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ ఉన్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఇండోనేషియా ఆరోగ్య శాఖమంత్రి బుది జి సాదికిన్‌తో భేటీ అయినట్లు చంద్రబాబు ‘ఎక్స్’లో తెలిపారు. పరిటాల రవి 20 వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించినట్లు కూడా పేర్కొన్నారు. అలాగే.. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని ఆడపిల్లల భద్రత, భవిష్యత్తు తమ ప్రధాన ప్రాధాన్యతలని పోస్ట్ చేశారు. త్వరలో దిగ్గజ సంస్థల సీఈవోలు వస్తారు దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పెట్టుబడులపై జరిగిన చర్చలకు కొనసాగింపుగా పలు దేశాల ప్రతినిధులు, దిగ్గజ సంస్థల సీఈవోలు, ప్రతినిధులు త్వరలో రాష్ట్రానికి వస్తారని సీఎం చంద్రబాబు తెలిపారు.దావోస్ పర్యటన ముగించుకుని సీఎం చంద్రబాబు శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. సీఎస్ విజయానంద్, సీఎంవో అధికారులతో తన నివాసంలోనే సమావేశమై దావోస్ పర్యటనపై చర్చించారు. దిగ్గజ కంపెనీల ప్రతినిధులు రాష్ట్ర పర్యటనకు వచ్చే నాటికి తగిన ప్రతిపాదనలతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. -
పోలవరానికి ఉరేసి.. బనకచర్లకు గోదారెలా?
సాక్షి, అమరావతి: గోదావరి ట్రిబ్యునల్ పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో 194.6 టీఎంసీలు నిల్వ చేసేలా నిర్మించుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఆ మేరకే ప్రాజెక్టులో గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేసేలా 55 మీటర్ల ఎత్తుతో స్పిల్ వేను 2021 జూన్ 11 నాటికే ప్రభుత్వం పూర్తి చేసింది. కానీ.. కేంద్ర కేబినెట్ గతేడాది ఆగస్టులో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వకు ఆమోదం తెలిపింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించలేదు. అంటే.. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేందుకు అంగీకరించిందన్న మాట. అయితే.. ప్రాజెక్టులో 42 మీటర్ల స్థాయి నుంచి గోదావరి జలాలను బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌కు తరలించేలా గోదావరి–బనకచర్ల అనుసంధానం చేపడతామని కేంద్ర జల్ శక్తి శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపింది. ఇదెలా సాధ్యమని నీటిపారుదల రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులో 41.15 మీటర్ల వరకే నీటిని నిల్వ చేస్తే.. 42 మీటర్ల నుంచి జలాలను తరలించడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. ప్రాజెక్టులో 45.72 మీటర్ల ఎత్తు వరకూ నీటిని నిల్వ చేయగలిగితేనే.. జలాలను గరిష్టంగా ఒడిసిపట్టి, ఇటు గోదావరి–బనకచర్ల, అటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయవచ్చునని చెబుతున్నారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించి, జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు ఉరేసి జీవం తీసి.. బనకచర్లకు తరలిస్తామనడం చూస్తే ఆ అనుసంధానంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి లేదని అర్థం చేసుకోవచ్చని నిపుణులు దెప్పిపొడుస్తున్నారు.కుడి కాలువ ఆయకట్టు, కృష్ణా డెల్టాకే చాలవు..పోలవరం ప్రాజెక్టు కనీస నీటి మట్టం 41.15 మీటర్లు. ఆ స్థాయిలో 119.4 టీఎంసీలనే నిల్వ చేయవచ్చు. పోలవరం కుడి కాలువకు 35.5 మీటర్ల నుంచి 40.23 మీటర్ల వరకూ నీటిని తరలించవచ్చు. ప్రాజెక్టులో 41.15 మీటర్ల వరకే నీటిని నిల్వ చేస్తే.. కుడి కాలువ కింద 3 లక్షల ఎకరాలు, కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాలకు నీళ్లందించడానికే సరిపోవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇక ప్రాజెక్టులో 42 మీటర్ల ఎత్తులో నీటిని ఎలా నిల్వ చేస్తారని, బనకచర్లకు నీటి తరలింపు ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. బనకచర్లకు గోదావరి ఇలా..గోదావరి నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున 200 టీఎంసీలను కృష్ణా నది, నాగార్జునసార్ కుడి కాలువ, కొత్తగా నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయర్, నల్లమల అభయారణ్యంలో 26.8 కిలీమీటర్ల టన్నెల్ ద్వారా బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌కు తరలిస్తామని కేంద్ర జల్ శక్తి శాఖకు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. తద్వారా 80 లక్షల మందికి తాగునీరు, కొత్తగా 3 లక్షల హెక్టార్లకు సాగునీటిని అందిస్తామని, నాగార్జున సాగర్ కుడి కాలువ, వెలిగొండ, ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి, కేసీ కెనాల్ కింద 9.14 లక్షల హెక్టార్ల ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు 20 టీఎంసీలను పారిశ్రామిక అవసరాల కోసం సరఫరా చేస్తామని తెలిపింది. ఈ ప్రాజెక్టుకు ప్రాథమికంగా రూ.80,112 కోట్ల వ్యయం అవుతుందని, ఇంట్రా స్టేట్ లింక్ (రాష్ట్ర పరిధిలో అనుసంధానం) ప్రాజెక్టు కింద నిధులివ్వాలని కోరింది. ఆ నివేదికలో పేర్కొన్న మేరకు గోదావరి–బనకచర్ల అనుసంధానం ఇలా..తొలి దశ..– పోలవరం ప్రాజెక్టులో 42 మీటర్ల ఎత్తు నుంచి రోజుకు 38 వేల క్యూసెక్కులు తరలిస్తారు. ఇందుకు వీలుగా ఈ–శాడిల్ డ్యాం, ఎఫ్–శ్యాడిల్ డ్యాం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచుతారు. కుడి కాలువ సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్కుల నుంచి 38 వేల క్యూసెక్కులకు పెంచుతారు.– తాడిపూడి ఎత్తిపోతల సామర్థ్యం 1400 నుంచి 10 వేల క్యూసెక్కులకు పెంచుతారు. తాడిపూడి కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 10 వేల క్యూసెక్కులకు పెంచి, 178 కిలోమీటర్ల వరకూ పొడగిస్తారు. ఇందులో 5 వేల క్యూసెక్కులను ఆయకట్టుకు, మిగతా 5 వేల క్యూసెక్కులను భలేరావు చెరువులోకి తరలిస్తారు. – బుడమేరు డైవర్షన్ ఛానల్ ద్వారా నీటి తరలింపులో సమస్యలను నివారించడానికి బుడమేరులో పులివాగు కలిసే ప్రాంతం నుంచి కొత్తగా మళ్లింపు కాలువ తవ్వి కృష్ణా నదిలోకి తరలిస్తారు.– తొలి దశ పనులకు 560 హెక్టార్ల ప్రైవేటు, 32 హెక్టార్ల అటవీ భూమి సేకరించాలి. ఈ పనులకు రూ.13,511 కోట్లు వ్యయం అవుతుంది.రెండో దశ– కృష్ణా నదిలో 12.5 మీటర్లు (సముద్ర మట్టానికి) ఎత్తు నుంచి 144.5 మీటర్ల ఎత్తుకు ఐదు దశల్లో రోజూ 2 టీఎంసీలను లిఫ్ట్ చేసి.. నాగార్జున సాగర్ కుడి కాలువలో 80వ కిలోమీటర్ వద్ద కలుపుతారు. ఈ కాలువను 80 కిలోమీటర్ల నుంచి 96.5 కిలోమీటర్ల వరకూ సామర్థ్యాన్ని పెంచి గోదావరి జలాలను తరలిస్తారు. – సాగర్ కుడి కాలువలో 96.5 కిలోమీటర్ల ప్రాంతం నుంచి జలాలను 142 మీటర్ల నుంచి 221 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేసి, పల్నాడులో బొల్లాపల్లి వద్ద కొండల్లో నిర్మించే రిజర్వాయర్‌లోకి తరలిస్తారు. ఆ రిజర్వాయర్ నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తే 150 టీఎంసీల నుంచి 400 టీఎంసీల వరకూ నిల్వ చేసుకోవచ్చు. ఈ రిజర్వాయర్‌లో ప్రస్తుతానికి 150 టీఎంసీలు నిల్వ చేయాలంటే బొల్లాపల్లి మండలంలో 15 గ్రామాలకు పునరావాసం కల్పించాలి.– రెండో దశ పనులకు 28,560 కోట్లు వ్యయం అవుతుంది.మూడో దశ:– బొల్లాపల్లి రిజర్వాయర్‌లో 172 మీటర్ల నుంచి మూడు దశల్లో 300.4 మీటర్లకు ఎత్తిపోసి.. నల్లమలలో తవ్వే సొరంగం ద్వారా తరలించి, అక్కడి నుంచి 118.21 కిలోమీటర్ల పొడవున కాలువ ద్వారా బనకచర్ల రెగ్యులేటర్‌కు తరలిస్తారు. మూడో దశ పనులకు 38,041 కోట్లు వ్యయం అవుతుంది.– ఈ ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోయడానికి 4,125 మెగావాట్ల విద్యుత్ అవసరం. బొల్లాపల్లి రిజర్వాయర్, కాలువల తవ్వకానికి 40,500 ఎకరాల భూమి సేకరించాలి. ఇందులో 17 వేల ఎకరాలు అటవీ భూమి. -
కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టు ప్రధాన (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యాం గ్యాప్–2లో 2016–19 మధ్య నాటి చంద్రబాబు ప్రభుత్వం చారిత్రక తప్పిదం వల్ల దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు 6 మీటర్ల ఎగువన సమాంతరంగా కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1.5 మీటర్ల మందంతో నిర్మించేందుకు రాష్ట్ర జల వనరులశాఖ, ప్రధాన కాంట్రాక్టు సంస్థ మేఘా, సబ్ కాంట్రాక్టు సంస్థ బావర్ రూపొందించిన డిజైన్‌పై ఆమోద ముద్ర వేసింది. నిర్మాణంలో టీ–16 రకంతో పోల్చితే టీ–5 రకం కాంక్రీట్ మిశ్రమాన్ని వినియోగించడమే శ్రేయస్కరమని సీఎస్ఎంఆర్ఎస్ (సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్) చేసిన ప్రతిపాదన వైపు సీడబ్ల్యూసీ మొగ్గు చూపింది. అయితే డయాఫ్రం వాల్ నిర్మాణంలో వినియోగించే కాంక్రీట్ మిశ్రమంపై.. ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమం పటిష్టతపై 28 రోజుల పరీక్ష నివేదికల ఆధారంగా అంతర్జాతీయ నిపుణుల కమిటీ (పీవోఈ) సూచన తీసుకోవాలని మెలిక పెట్టింది. నిర్మాణ పనుల్లో ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే వాటికి రాష్ట్ర జల వనరుల శాఖ, మేఘా, బావర్ సంస్థలే బాధ్యత వహించాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి గురువారం సీడబ్ల్యూసీ డైరెక్టర్ రాకేశ్ టొతేజా లేఖ రాశారు. కాంక్రీట్ మిశ్రమంపై అంతర్జాతీయ నిపుణుల కమిటీ అభిప్రాయం తీసుకుని ఒకట్రెండు రోజుల్లో పనులు చేపట్టడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం ఇలా.. » ప్రధాన డ్యాం గ్యాప్–2లో దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు సమాంతరంగా 6 మీటర్ల ఎగువన 89.09 మీటర్ల నుంచి 1,485.69 మీటర్ల మధ్య 1,396.6 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల మందంతో కొత్త డయాఫ్రం వాల్ నిర్మిస్తారు.» కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం కోసం భారీ గ్రాబర్లు, ట్రెంచ్ కట్టర్ యంత్రాలతో భూమిని తవ్వుతూ ప్యానళ్లను దించుతూపోతారు. రాతి పొర తగిలే(కనిష్టంగా పది మీటర్లు.. గరిష్టంగా 93.5 మీటర్లు) వరకూ ప్యానళ్లను దించి.. ఆ ప్రదేశంలోకి బెంటనైట్ మిశ్రమాన్ని పంపుతారు. ఆ తర్వాత కాంక్రీట్ మిశ్రమాన్ని అధిక ఒత్తిడితో పంపుతారు. అప్పుడు బెంటనైట్ మిశ్రమం బయటకు వస్తుంది. కాంక్రీట్ మిశ్రమంతో కొంత బెంటనైట్ మిశ్రమం కలిసి ప్లాస్టిక్ కాంక్రీట్ గోడగా ఏర్పడుతుంది. అదే డయాఫ్రం వాల్. » డయాఫ్రం వాల్‌కు లీకేజీ (సీపేజీ) ఫర్మియబులిటీ (తీవ్రత) ఒక లీజీయన్ లోపు ఉండాలి(ఫర్మియబులిటీని లీజీయన్ లలో కొలుస్తారు). అప్పుడే ఆ డయా ఫ్రం వాల్ నాణ్యంగా ఉన్నట్లు లెక్క. గ్యాప్–1లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మించిన డయాఫ్రం వాల్లో లీకేజీ ఫర్మియబులిటీ ఒక లీజీయన్ లోపే ఉండటం గమనార్హం. -
సాగర్‌కు ‘బొల్లపల్లి’ గండి!
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి వరద జలాలను కుడికాల్వ ద్వారా తరలించి గుంటూరు జిల్లాలో నిర్మించబోయే బొల్లపల్లి రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తామని తాజాగా ఏపీ ప్రతిపాదించింది. ఇందుకోసం కుడికాల్వ(జవహర్ కాల్వ)ను 96.5 కి.మీ.ల వరకు వెడల్పు పెంచి అక్కడి నుంచి వరద జలాలను లిఫ్ట్ చేస్తామని ఏపీ చెప్పడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. తక్షణమే తమ వ్యతిరేకతను తెలపడంతోపాటు ఈ ప్రాజెక్టు చేపట్టే ఆలోచనను విరమించుకోవాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, గోదావరి, కృష్ణా బోర్డులకు తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి లేఖలు రాయనున్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను అందజేయాలని గోదావరి బోర్డుకు ఇప్పటికే ప్రభుత్వం లేఖ రాసింది. కుడికాల్వ హెడ్ రెగ్యులేటర్ ద్వారా తరలింపు నాగార్జునసాగర్ కుడికాల్వ కింద ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 11.18 లక్షల ఎకరాలు, ఎడమ కాల్వ కింద ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో 10.39 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కుడికాల్వ హెడ్ రెగ్యులేటర్‌కు 9 స్లూయిస్ గేట్లు ఉండగా, గేట్లన్నింటినీ 520 అడుగుల మేర పైకి లేపితే గరిష్టంగా 33,147 క్యూసెక్కుల నీటిని విడుదల చేసుకోవచ్చు. ప్రస్తుతం కుడి కాల్వ సామర్థ్యం 11 వేల క్యూసెక్కులు మాత్రమే ఉంది. హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యం పెంచకుండానే కుడికాల్వ సామర్థ్యాన్ని 33 వేల క్యూసెక్కులకు పెంచుకున్నా, 11 వేల క్యూసెక్కులను యథాతథంగా ఆయకట్టుకు సరఫరా చేసి మిగిలిన 22 వేల క్యూసెక్కులను బొల్లపల్లి రిజర్వాయర్‌కు తరలించవచ్చని ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. 2019 నుంచి 2024 వరకు గడిచిన ఆరేళ్లలో ఏకంగా ఐదేళ్లు కృష్ణానదిలో మిగులు జలాల లభ్యత ఉందని, ప్రకాశం బరాజ్ నుంచి సముద్రంలోకి నీరు వృథాగా పోయిందని కేంద్రానికి తెలిపింది. పోలవరం ప్రాజెక్టు నుంచి బొల్లపల్లి రిజర్వాయర్‌కు నీటి తరలింపుతో పోల్చితే నాగార్జునసాగర్ నుంచి తరలిస్తేనే తక్కువ వ్యయం అవుతుందని స్పష్టం చేసింది. నీటి లభ్యత బాగా ఉన్న సమయాల్లో సాగర్ నుంచి (తమ వాటా) జలాలను తరలించి బొల్లపల్లి రిజర్వాయర్‌లో నిల్వ చేసుకుంటే వర్షాభావ సీజన్లలో క్యారీ ఓవర్ జలాలుగా వాడుకోగలమని తెలిపింది. కృష్ణా, గోదావరి పరీవాహకంలో చిట్టచివరి రాష్ట్రం కావడంతో తమకు రెండింటి మిగులు జలాలను వాడుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది. రెండు నదుల మిగులు జలాలను నిల్వ చేసే సామర్థ్యం ఈ ప్రాజెక్టుకు ఉంటుందని తెలియజేసింది. నికర జలాల తరలింపునకే ! వరదల సమయంలో నాగార్జునసాగర్ నుంచి మిగులు జలాలను బొల్లపల్లి రిజర్వాయర్‌కు తరలించడానికి మాత్రమే ఈ ప్రాజెక్టును ప్రతిపాదించినట్టు ఏపీ పేర్కొంటున్నా, నికర జలాలను సైతం తరలించుకుంటుందని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. భవిష్యత్‌లో సాగర్ కుడికాల్వ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నాలు జరగొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తోంది. నాగార్జునసాగర్ నిర్వహణ తెలంగాణ పరిధిలో ఉండగా, ఏడాది కింద ఏపీ సగం ప్రాజెక్టును తన అధీనంలోకి తీసుకోవడంతో రెండు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తోంది. గోదావరి–కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా సాగర్‌ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా వాడుకుంటామని కేంద్రం ప్రతిపాదించగా, తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది. మళ్లీ తాజాగా సాగర్‌ను బొల్లపల్లి రిజర్వాయర్‌తో అనుసంధానం చేయాలని ఏపీ ప్రతిపాదించడంతో భవిష్యత్‌లో సాగర్ కింద ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని 8.1 లక్షల ఎకరాల ఆయకట్టు ప్రమాదంలో పడుతుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కృష్ణా, గోదావరి నుంచి ఏకకాలంలో తరలింపు గోదావరి–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును మూడు విభాగాల్లో (సెగ్మెంట్స్) వి భజించి ఏపీ ప్రతిపాదించింది. తొలి విభా గం కింద పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాల్వ సామర్థ్యాన్ని 17,500 నుంచి 38,000 క్యూసెక్కులకు, తాడిçపూడి ఎత్తిపోతల పథకం కాల్వ సామర్థ్యాన్ని 1,400 నుంచి 10,000 క్యూసెక్కులకు పెంచనుంది. అనంతరం పోలవరం ప్రాజెక్టు నుంచి ఈ రెండు కాల్వల ద్వారా నీటిని సమాంతరంగా తరలించి బుడమేరు డైవర్షన్ కెనాల్లోకి వేసి అక్కడి నుంచి కృష్ణా నదిలోకి విడుదల చేస్తామని ఏపీ తెలిపింది.రెండో సెగ్మెంట్ కింద కృష్ణాన ది నుంచి 28,000 క్యూసెక్కులను ఆరు దశల్లో మొత్తం 127 మీటర్లు లిప్ట్ చేసి బొల్లపల్లి రిజర్వాయర్‌కు తరలించనుంది. ఇందుకోసం 150 టీఎంసీల భారీ సామర్థ్యంతో బొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని ఏపీ ప్రతిపాదించింది. భవిష్యత్ అవసరాల ను తీర్చడానికి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 400 టీఎంసీలకు పెంచే వీలుందని తెలిపింది. ఈ ప్రాజెక్టుకు అనుబంధంగా నా గార్జునసాగర్ కుడికాల్వ నుంచి బొల్లపల్లి రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తామని మరో లింక్‌ను ప్రతిపాదించింది. ఇక మూడో సెగ్మెంట్ కింద బొల్లపల్లి రిజర్వాయర్ నుంచి 3 దశల్లో లిఫ్ట్ చేసి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌కు తరలిస్తామని పేర్కొంది.ప్రాజెక్టు వ్యయం రూ.80 వేల కోట్లురోజుకు 2 టీఎంసీల చొప్పున 100 రోజుల్లో 200 టీఎంసీలను తరలించడానికి ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 40,500 ఎకరాల భూసేకరణ, 17,000 ఎకరాల అటవీ భూములు కావాలి. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.80,112 కోట్లు కాగా, లిఫ్టుల నిర్వహణకు 4,125 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుంది. -
పోలవరం ముంపుపై అధ్యయనం
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టులో 150 అడుగుల గరిష్ట నీటిమట్టం (ఎఫ్ఆర్ఎల్) మేరకు నీళ్లను నిల్వ చేస్తే తెలంగాణ భూభాగంలో ఏర్పడనున్న ముంపు ప్రభావంపై అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఐఐటీ హైదరాబాద్ నిపుణుల బృందంతో సర్వే చేయించి నెల రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. పోలవరం ముంపు అంశంపై శనివారం సీఎం రేవంత్ సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి సమీక్షించారు. గోదావరికి 2022లో 27 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు భద్రాచలం ముంపునకు గురైందని అధికారులు సీఎంకు వివరించారు. పోలవరం వల్ల భద్రాచలం ఆలయానికి ఏర్పడే ముప్పుపైనా అధ్యయనం నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ఏపీ ప్రభుత్వం కేంద్ర అనుమతుల్లేకుండానే కొత్తగా గోదావరి–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును చేపట్టిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ఏపీ సీఎస్‌కు అభ్యంతరం తెలపాని సీఎం రేవంత్ ఆదేశించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే గోదావరి బోర్డుతోపాటు కేంద్ర జలశక్తి శాఖకు సైతం లేఖలు రాయాలని కోరారు. సమావేశంలో నీటిపారుదల శాఖ సలహాదారులు ఆదిత్యనాథ్‌దాస్, కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ(జనరల్) జి.అనీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. పరిమితంగానే ఉమ్మడి సర్వే అంటున్న ఏపీ పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణలో 950 ఎకరాలు ముంపునకు గురవుతాయని, దీనిపై సైతం జాయింట్ సర్వే చేయాల్సిందేనని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. కిన్నెరసాని, ముర్రెడువాగులతో పాటే మరో ఐదు వాగులకు ఉండనున్న ప్రభావంపై సైతం సర్వే నిర్వహించాలని కోరుతుండగా ఏపీ అంగీకరించడం లేదు. ఎన్జీటీ ఆదేశాల మేరకు ముర్రెడువాగు, కిన్నెరసానిలకే సర్వేను పరిమితం చేస్తామని ఏపీ అంటోంది. ఏపీ వాదనను తెలంగాణ అంగీకరించి కేవలం రెండు వాగులకే జాయింట్ సర్వే నిర్వహిస్తే మిగిలిన 5 వాగులకు ఉండనున్న ముంపుతో తెలంగాణ నష్టపోవాల్సి వస్తుందని విమర్శలు వచ్చాయి. సీఎం రేవంత్ శనివారం అధికారులతో సమీక్షలో ఈ అంశంపై వివరణ కోరినట్లు తెలిసింది. ప్రస్తుతం రెండు వాగులకు ముంపుపై సర్వే నిర్వహించాలని, మిగిలిన వాగులకు ముంపుపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని కేంద్ర జల సంఘం గతేడాది సాంకేతిక కమిటీ సమావేశంలో ఇరు రాష్ట్రాలను చెప్పిందని అధికారులు సీఎంకు వివరించినట్లు తెలిసింది. 18 తర్వాత ఉమ్మడి సర్వేకు సిద్ధం పోలవరంలో గరిష్ట నీటిమట్టం దాకా నీటిని నిల్వ చేస్తే కిన్నెరసాని, ముర్రేడువాగులు ఉప్పొంగి తెలంగాణ భూభాగంలో ముంపునకు గురికానున్న ప్రాంతాలను గుర్తించి డీమార్కింగ్ చేసేందుకు వీలుగా ఈ నెల 18 తర్వాత ఉమ్మడి సర్వేకు ఏపీ ప్రభుత్వం సంసిద్ధత తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖకు లేఖ రాసింది. ఎన్జీటీ ఆదేశాల మేరకు ఇప్పటికే ఉమ్మడి సర్వే నిర్వహించగా తదుపరి క్షేత్రస్థాయిలో ముంపు ప్రాంతాన్ని గుర్తిస్తూ డీమార్కింగ్ చేయాల్సి ఉంది. -
కాంక్రీట్ మిశ్రమ పరీక్షలు నేటితో పూర్తి
సాక్షి, అమరావతి : అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఖరారు చేసే కాంక్రీట్ మిశ్రమం ఆధారంగా పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ డిజైన్‌ను సీడబ్ల్యూసీ ఖరారు చేయనుంది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యాం గ్యాప్–2లో కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణంలో వినియోగించే మూడు తరహాల కాంక్రీట్ సమ్మేళనాలపై ఐఐటీ(తిరుపతి) ప్రొఫెసర్లు పరీక్షలు చేశారు. ఆ పరీక్షల ఫలితాలను పోలవరం ప్రాజెక్టు అధికారుల ద్వారా పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ), కేంద్ర జల సంఘాని(సీడబ్ల్యూసీ)కి పంపారు. నాలుగో తరహా కాంక్రీట్ సమ్మేళనంపై నిర్వహించిన పరీక్ష ఫలితాలకు సంబంధించి పోలవరం ప్రాజెక్టు అధికారులకు నివేదిక ఇవ్వనున్నారు. దీనిని కూడా పోలవరం అధికారులు పీపీఏ, సీడబ్ల్యూసీకి పంపనున్నారు. నాలుగు తరహాల కాంక్రీట్ సమ్మేళనాలపై నిర్వహించిన పరీక్షల ఫలితాలపై సోమవారం తర్వాత అంతర్జాతీయ నిపుణుల కమిటీ సభ్యుల అందుబాటును బట్టి.. సీడబ్ల్యూసీ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు అధికారులతోపాటు పీపీఏ, సీఎస్ఎంఆర్ఎస్(సెంట్రల్ సాయిల్ అండ్ మెటరీయల్ రీసెర్చ్ స్టేషన్), వ్యాప్కోస్ అధికారులు పాల్గొననున్నారు. గ్యాప్–2లో కొత్తగా నిర్మించే డయాఫ్రం వాల్ డిజైన్‌ను ఇప్పటికే సీడబ్ల్యూసీ సూత్రప్రాయంగా ఆమోదించింది. అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఖరారు చేసే కాంక్రీట్ మిశ్రమం ఆధారంగా డయాఫ్రం వాల్ డిజైన్‌ను సీడబ్ల్యూసీ ఖరారు చేయనుంది. ఆ తర్వాత డయాఫ్రం వాల్ పనులను కాంట్రాక్టు సంస్థ చేపట్టనుంది. పోలవరం ప్రాజెక్టు వద్ద నవంబర్ 6–10 మధ్య వర్క్ షాప్ నిర్వహించిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ.. డయాఫ్రం వాల్ నిర్మాణంలో వినియోగించాల్సిన కాంక్రీట్ మిశ్రమాలపై పరీక్షలు చేయాలని సూచించింది. టీ–10 తరహా కాంక్రీట్ సమ్మేళనం ఆధారంగా రూపొందించిన మిశ్రమం పటిష్టతపై అంతర్జాతీయ నిపుణుల కమిటీ అనుమానాలు వ్యక్తం చేసింది. టీ–11, టీ–12 తరహా కాంక్రీట్ సమ్మేళనాల ఆధారంగా రూపొందించిన నాలుగు రకాల కాంక్రీట్ మిశ్రమాల పటిష్టతపై 14 రోజుల పరీక్ష చేసి, నివేదిక ఇవ్వాలని సూచించింది. ఈ పరీక్షలు నిర్వహించే బాధ్యతను ఐఐటీ (తిరుపతి) ప్రొఫెసర్లకు సీడబ్ల్యూసీ అప్పగించింది. టీ–11, టీ–12 కాంక్రీట్ సమ్మేళనాల ఆధారంగా రూపొందించిన మూడు రకాల మిశ్రమాన్ని ట్యూబ్లలో పోసి.. 14 రోజుల తర్వాత ఐఐటీ ప్రొఫెసర్లు పరీక్షలు చేసి, వాటి ఫలితాలపై ఇప్పటికే నివేదిక ఇచ్చారు. నాలుగో తరహా కాంక్రీట్ మిశ్రమంపై 14 రోజుల పరీక్ష ఆదివారంతో పూర్తి కానుంది. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం ఇలా..n ప్రధాన డ్యాం గ్యాప్–2లో 89.09 మీటర్ల నుంచి 1,485.69 మీటర్ల మధ్య 1,396.6 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల వెడల్పు.. కనిష్టంగా 6 మీటర్లు, గరిష్టంగా 93.5 మీటర్ల లోతున ప్లాస్టిక్ కాంక్రీట్‌తో కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలి.n కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం కోసం గైడ్ వాల్స్‌పై ఏర్పాటు చేసే ప్లాట్‌ఫామ్ మీద నుంచి గ్రాబర్లు, కట్టర్లతో రాతి పొర తగిలే వరకు భూగర్భాన్ని తవ్వుతూ ప్యానళ్లను దించుతూపోతారు. తవ్వి తీసిన మట్టి స్థానంలో బెంటనైట్ మిశ్రమాన్ని నింపుతారు. రాతి పొర తగిలాక... అధిక ఒత్తిడితో కాంక్రీట్ మిశ్రమాన్ని పంపుతారు. అప్పుడు బెంటనైట్ మిశ్రమం బయటకు వస్తుంది. కాంక్రీట్ మిశ్రమంతో కొంత బెంటనైట్ మిశ్రమం కలిసి ప్లాస్టిక్ కాంక్రీట్‌గా మారి గోడలా తయారవుతుంది. n్ఙ్ఙడయాఫ్రం వాల్‌కు లీకేజీ (సీపేజీ) ఫర్మియబులిటీ (తీవ్రత) ఒక లీజీయన్ లోపు ఉండాలి. ప్రధాన గ్యాప్–1లో గత ప్రభుత్వం నిర్మించిన డయా ఫ్రం వాల్లో లీకేజీ ఫర్మియబులిటీ ఒక లీజీయన్ లోపే ఉండటం గమనార్హం. -
పోలవరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో తెలంగాణపై పడే ప్రభావంపై ఐఐటీ హైదరాబాద్ టీంతో నివేదిక తయారు చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. శనివారం.. సీఎంతో నీటిపారుదల శాఖ అధికారులు భేటీ కాగా, నెల రోజుల్లో సమగ్ర నివేదిక తయారు చేయాలని తెలిపారు. పోలవరం నిర్మాణంతో భద్రాచలం ఆలయానికి ఏర్పడే ముప్పుపై సమగ్ర అధ్యయనం చేయాలంటూ సీఎం రేవంత్ ఆదేశించారు.2022లో 27 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినప్పుడు భద్రాచలం ముంపునకు గురైనట్లు సీఎంకి అధికారులు వివరించారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్‌ను సీఎం రేవంత్ దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. ఆ ప్రాజెక్టుకు అనుమతులు లేవని తెలిపారు.వరద జలాల ఆధారంగా నిర్మిస్తున్న ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్‌పైన ఇటీవల ఏపీ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందని అధికారులు వివరణ ఇచ్చారు. తమ అభ్యంతరాలను ఏపీ సీఎస్‌కు తెలియజేయాలన్న రేవంత్.. అవసరమైతే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుతో పాటు కేంద్ర జల్‌శక్తి శాఖకు లేఖలు రాయాలంటూ ఆదేశించారు.ఇదీ చదవండి: చిట్టినాయుడు కేసులకు భయపడం: కేటీఆర్ -
పోలవరం అనుమతీ చెల్లదు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని సీతారామ– సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చే అంశంపై నిర్వహించనున్న టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ (టీఏసీ) సమావేశానికి తమను పిలవలేదని, సీడబ్ల్యూసీ అంతర్గతంగా తీసుకునే నిర్ణయాలకు తాము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనను తెలంగాణ ప్రభుత్వం తిప్పికొట్టింది. అలా అయితే, గోదావరి పరీవాహక ప్రాంతంలోని మిగతా రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలను ఆహ్వానించకుండానే.. 2009లో టీఏసీ నిర్వహించి పోలవరం ప్రాజెక్టుకు ఇచి్చన అనుమతులూ చెల్లుబాటు కావు అని స్పష్టం చేసింది. సీతారామ ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీలోని టీఏసీ అనుమతులకు సిఫార్సు చేస్తూ గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) సమావేశంలో చేసిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ బోర్డుకు ఇటీవల ఏపీ లేఖ రాసింది. ‘ప్రస్తుతం 2017 మార్గదర్శకాలు అమల్లో ఉండగా, 1996 మార్గదర్శకాల ప్రకారం తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులివ్వడం సరికాదు’అని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ జి.అనిల్‌కుమార్ సోమవారం గోదావరి బోర్డుకు లేఖ రాశారు. ‘పోలవరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ 2009, 2011లో అనుమతులను 1996 మార్గదర్శకాల ప్రకారమే ఇచి్చంది. వీటి ఆధారంగానే తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో వ్యవహరిస్తోంది’అని బదులిచ్చారు. న్యాయస్థానానికి వెళ్లక తప్పని పరిస్థితి కల్పించారని ఏపీ పేర్కొనగా, తప్పుడు ఉద్దేశాలతో కేసులేసినా నిలబడవని తెలంగాణ కౌంటర్ ఇచి్చంది. గోదావరి ట్రిబ్యునల్ అవసరం లేదు అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టంలోని సెక్షన్ 3 కింద ఏపీ, తెలంగాణ మధ్య గోదావరి జలాల పంపకానికి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని ఏపీ కోరగా, అది ఏమాత్రం అవసరం లేదని తెలంగాణ స్పష్టం చేసింది. తాము 531.908 టీఎంసీల గోదావరి జలాల వినియోగం కలిగి ఉన్నట్టు సీడబ్ల్యూసీ నిర్ణయించడం ఏకపక్షమన్న ఏపీ వాదనను కూడా తెలంగాణ తోసిపుచ్చింది. ‘రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా ఉమ్మడి ఏపీకి ఉన్న 1,486 టీఎంసీల నీటి వాటా నుంచి తెలంగాణకు 967.94 టీఎంసీలు, ఏపీకి 518.215 టీఎంసీలను కేటాయిస్తూ ఉమ్మడి రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ 2014 జనవరి 2న రాష్ట్ర ప్రణాళిక సంఘం కార్యదర్శికి లేఖ రాశారు. దానినే నాటి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. వరద జలాలు/మిగులు జలాల ఆధారంగా చేపట్టిన పురుషోత్తపట్నం లిఫ్టు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, చింతలపూడి లిఫ్టు, గోదావరి–పెన్నా అనుసంధానం తదిత ర ప్రాజెక్టులకు నీటి హక్కులు సాధించుకునేందుకే ఏపీ తప్పుడు ఉద్దేశాలతో ట్రిబ్యునల్ ఏర్పాటును కోరుకుంటోంది. ఈ ప్రాజెక్టులకు నేటికీ సీడబ్ల్యూసీ నుంచి టెక్నో ఎకనామికల్ క్లియరెన్స్, టీఏసీ అనుమతి లేదు. దీంతో వీటిని రాష్ట్ర విభజన తర్వాత చేపట్టిన కొత్త ప్రాజెక్టులుగానే పరిగణించాల్సి ఉంటుంది. గోదావరి జలాల్లో ఏపీకి 531.908 టీఎంసీల న్యాయబద్ధమైన వినియోగం ఉన్నట్టు నిరూపించడంలో ఆ రాష్ట్రం విఫలమైంది’అని తెలంగాణ స్పష్టం చేసింది. ఏపీ అభ్యంతరాలను సీడబ్ల్యూసీ పరిగణనలోకి తీసుకుంది సీతారామ ప్రాజెక్టు వల్ల ఏపీ హక్కులకు ఎలాంటి నష్టం ఉండదని సీడబ్ల్యూసీ చెప్పడం సరికాదని ఆ రాష్ట్రం పేర్కొనగా.. ఏపీ అభ్యంతరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే సీడబ్ల్యూసీ ఈ మేరకు తేల్చిందని తెలంగాణ వివరణ ఇచి్చంది. ఇచ్చంపల్లి ప్రాజెక్టు ద్వారా 85 టీఎంసీల వినియోగంపై గోదావరి ట్రిబ్యునల్ విధించిన ఆంక్షలు ఆ ప్రాజెక్టుకే పరిమితమని, సీతారామ ప్రాజెక్టుకు వర్తించవని తెలిపింది. 35 టీఎంసీలతో దేవాదుల, 195 టీఎంసీలతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టడంతో ఆ 85 టీఎంసీలను తెలంగాణ వాడుకున్నట్టేనని, దీంతో సీతారామ ప్రాజెక్టుకు నీటి లభ్యత లేదన్న ఏపీ వాదనను తోసిపుచి్చంది. ట్రిబ్యునల్ మార్గదర్శకాలకు కట్టుబడే దేవాదుల, కాళేశ్వరంతో పాటు పోలవరం ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీ అనుమతిలిచి్చందని తెలిపింది.పోలవరం ప్రాజెక్టుపై ప్రభావం ఉండదు‘పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చే సమయంలో అక్కడ 991 టీఎంసీల నీటి లభ్యత ఉందని వ్యాప్కోస్ నిర్ధారించగా, 861 టీఎంసీలేనని సీడబ్ల్యూసీ కుదించింది. 2018 నాటి సీతారామ ప్రాజెక్టు డీపీఆర్ ప్రకారం పోలవరం వద్ద నీటి లభ్యత 460.7 టీఎంసీలకు తగ్గింది. సీతారామ డీపీఆర్ ప్రకారం అక్కడ నికర లోటు 13.64 టీఎంసీల నుంచి 151 టీఎంసీలకు పెరి గింది. గోదావరిలో మిగులు జలాల లభ్యత లేదని న దుల అనుసంధానం సందర్భంగా సీడబ్ల్యూసీ తేల్చింది. ఎగువ నుంచి ప్రవాహాలు తగ్గిన నేపథ్యంలో పోలవరం వద్ద నీటి లభ్యతపై తాజా అధ్యయనం జరపాలి’అని ఏపీ కోరింది. సీడబ్ల్యూసీలోని హైడ్రాలజీ డైరెక్టరేట్ పరీ వాహకంలోని అన్ని రాష్ట్రాల ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకుని పోలవరం ప్రాజెక్టుపై ఎలాంటి ప్రభా వం ఉండదని నిర్ధారించిందని తెలంగాణ బదులిచ్చింది. -
పోలవరం సర్వనాశనం.. ఎత్తు తగ్గించేశారు
-
పోలవరం ఇక బ్యారేజ్!
అనుకున్నంతా అయ్యింది.. ఏది జరగకూడదని ఇన్నాళ్లూ అనుకున్నామో అదే జరిగింది.. పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిస్తున్నారంటే.. అబ్బే కాదు కాదని బుకాయించిన చంద్రబాబు సర్కారు ఇప్పుడు ఏం సమాధానం చెబుతుంది? ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగిందని స్పష్టమవుతోంది. నాడు–నేడు చంద్రబాబు తీరే ఈ ప్రాజెక్టుకు శాపంగా పరిణమించిందని తేటతెల్లమవుతోంది. భారీ బహుళార్థ సాధక ప్రాజెక్టు కాస్తా బ్యారేజ్‌గా మారిపోనుందన్న నిజాన్ని నీటి పారుదల రంగ నిపుణులు, రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు.సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ 41.15 మీటర్ల ఎత్తుకే పరిమితమని కేంద్రం తేల్చి చెప్పింది. ఆ మేరకు నీరు నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేయడానికి సవరించిన అంచనా వ్యయం రూ.30,436.95 కోట్లకు ఆమోదం తెలిపామని స్పష్టం చేసింది. ఈ మేరకు రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్ శక్తి శాఖ సహాయ మంత్రి రాజ్‌భూషణ్ చౌదరి రాత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు మేరకు పోలవరం ప్రాజెక్టును గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తున్నామని.. ఎత్తును తగ్గించలేదని చెప్పారు. కానీ.. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. తద్వారా అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు పోలవరం రిజర్వాయర్‌ను బ్యారేజ్‌గా మార్చేశాయని నీటి పారుదల రంగ నిపుణులు, అధికార వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీని వల్ల పుష్కర, తాడిపూడి ఎత్తిపోతల పథకాల కింద నీళ్లందిస్తున్న 1.53 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడానికి మాత్రమే పోలవరం బహుళార్థ సాధక జాతీయ ప్రాజెక్టు అక్కరకు వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆయకట్టుకు కూడా గోదావరికి వరద వచ్చే రోజుల్లో మాత్రమే నీళ్లందించడానికి సాధ్యమవుతుందని చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు కింద మిగతా 5.67 ఎకరాలతోపాటు కృష్ణా డెల్టాలో 13.06 లక్షలు, గోదావరి డెల్టాలో 10.50 లక్షల ఎకరాల స్థిరీకరణ.. 540 గ్రామాల్లోని 28.50 లక్షల మందికి తాగునీళ్లు అందించడం సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. విశాఖపట్నం పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు 23.44 టీఎంసీలు అందించడం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం కింద 8 లక్షల ఎకరాలకు నీళ్లందించడం అసాధ్యమని తేల్చి చెబుతున్నారు. ఇక ప్రాజెక్టులో అంతర్భాగంగా నిరి్మస్తున్న 960 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తికి వీలుండదని.. గోదావరి సిగలో కలికితురాయిగా వెలుగులీనాల్సిన ఆ కేంద్రం ఒట్టి దిష్టి»ొమ్మగా మారుతుందని విద్యుత్ రంగ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నోరు మెదపని టీడీపీ కేంద్ర మంత్రి పోలవరం ప్రాజెక్టులో 45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వ చేయడానికి నిధులు మంజూరు చేయాలని.. తొలి దశలో కనీస నీటి మట్టం 41.15 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వ చేయడానికి నిధులు విడుదల చేయాలని ఈ ఏడాది ఫిబ్రవరి 27న పీఐబీ (పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు) కేంద్రానికి ప్రతిపాదించింది. 41.15 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేస్తే 1.53 లక్షల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే నీళ్లందించవచ్చని, 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేస్తేనే ప్రాజెక్టు కింద 7.20 లక్షల ఎకరాలకు నీళ్లందించడంతో పాటు గోదావరి, కృష్ణా డెల్టా ఆయకట్టును స్థిరీకరించడం, విశాఖకు నీటి సరఫరా చేయొచ్చని ఆ ప్రతిపాదనలో పీఐబీ స్పష్టం చేసింది. అయితే అప్పటికే ఎన్డీఏలో చేరిన చంద్రబాబు.. ఆ ప్రతిపాదనపై ఆమోద ముద్ర వేస్తే వైఎస్సార్సీపీకి ప్రయోజనం చేకూరుతుందని బీజేపీ పెద్దల చెవిలో వేశారు. దాంతో అప్పట్లో పీఐబీ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ పక్కన పెట్టింది. కానీ.. ఆగస్టు 28న పీఐబీ ప్రతిపాదించిన దానికి భిన్నంగా.. 41.15 మీటర్ల ఎత్తుకే నీటి నిల్వను పరిమితం చేస్తూ పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ ముందుకు కేంద్ర ఆర్థిక శాఖ పంపింది.ఈ ప్రతిపాదనపై ఆ సమావేశంలో ఉన్న టీడీపీకి చెందిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్నాయుడు అభ్యంతరం చెప్పలేదు. అంటే.. అటు కేంద్రంతోపాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేయడానికి అంగీకరించాయన్నది స్పష్టమవుతోంది. నాడూ.. నేడూ పోలవరానికి ‘చంద్ర’ ద్రోహం రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్రం పూర్తి చేయాల్సిన ఈ ప్రాజెక్టును అప్పట్లో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు కమీషన్ల కక్కుర్తితో నిర్మాణ బాధ్యతలను తీసుకున్నారు. ఈ క్రమంలో 2013–14 ధరల ప్రకారం తాగునీటి విభాగం, జల విద్యుత్ విభాగానికి అయ్యే వ్యయం కాకుండా కేవలం నీటి పారుదల విభాగానికి అయ్యే వ్యయం రూ.20,398.61 కోట్లు ఇస్తే చాలని చెప్పారు. భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం సంగతి గాలికొదిలేశారు. కమీషన్లు వచ్చే మట్టి పనులనే 2016–19 మధ్య చేపట్టి, ఆ ప్రాజెక్టులో విధ్వంసం సృష్టించారు. తద్వారా డయా ఫ్రం వాల్ దెబ్బ తినడానికి, ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతం కోతకు గురవ్వడానికి వరద మళ్లింపు పనులు పూర్తి చేయక పోవడమేనని అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఇటీవల తేల్చి చెప్పింది. అప్పట్లో విధ్వంసం సృష్టించి.. ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి.. పోలవరానికి ద్రోహం చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు కూడా అదే బాటలో పయనిస్తుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు దశల్లో పోలవరం.. ప్రతిపాదించింది కేంద్రమే » నీటి పారుదల, తాగు నీటి విభాగాలు వేర్వేరు కాదని, రెండూ ఒకటేనని, తాగునీటి విభాగానికి అయ్యే రూ.4,068 కోట్లను ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ప్రధాని మోదీ.. ఆ ప్రతిపాదనను కేంద్ర జల్ శక్తి శాఖకు పంపారు. ఈ అంశంపై 2021 జూలై 29న కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి అధ్యక్షతన జరిగిన సమావేశంలో.. సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రతిపాదనతో సీడబ్ల్యూసీ నాటి ఛైర్మన్ హెచ్‌కే హల్దర్ ఏకీభవించారు. » ఆ సమావేశంలో 1986 మార్చి 13న సీడబ్ల్యూసీ జారీ చేసిన మార్గదర్శకాల మేరకు.. ప్రాజెక్టు పూర్తయిన తొలి ఏడాది కనీస నీటి మట్టం స్థాయిలో నీటిని నిల్వ చేయాలని.. ఆ తర్వాత దశల వారీగా ప్రాజెక్టులో గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేయాలని హల్దర్ సూచించారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాల ఆధారంగా పోలవరంలో 35.44, 35.50, 41.15, 45.72 మీటర్ల స్థాయిలో నీటిని నిల్వ చేస్తే ఏం ప్రయోజనాలు కలుగుతాయో తెలపాలంటూ పీపీఏ సీఈవోకు కేంద్ర జల్ శక్తి శాఖ అప్పటి సీనియర్ జాయింట్ కమిషనర్ అనూప్ కుమార్ శ్రీవాత్సవ 2021 అక్టోబర్ 27న లేఖ రాశారు. ఇదే లేఖను ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి పంపిన పీపీఏ.. ఆ వివరాలు ఇవ్వాలని కోరింది. » 35.44, 35.50 మీటర్లలో నీటిని నిల్వ చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని.. కనీస నీటి మట్టం 41.15 మీటర్లలో నిల్వ చేస్తే పుష్కర, తాడిపూడి ఎత్తిపోతల కింద ఉన్న 1.53 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చని.. 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేస్తేనే ప్రాజెక్టు కింద 7.20 లక్షల ఎకరాలకు నీళ్లందించడంతోపాటు గోదావరి, కృష్ణా డెల్టాల ఆయకట్టును స్థిరీకరించడం, 28.50 లక్షల మందికి తాగు నీరు, విశాఖకు 23.44 టీఎంసీలు సరఫరా చేయవచ్చునని వివరించారు. » ఇదే వివరాలను కేంద్ర జల్ శక్తి కార్యదర్శికి వివరిస్తూ 2021 నవంబర్ 20న పీపీఏ అప్పటి సభ్య కార్యదర్శి ఎంకే శ్రీనివాస్ లేఖ రాశారు. ఈ లేఖ ఆధారంగానే పోలవరాన్ని రెండు దశల్లో.. తొలి దశలో 41.15 మీటర్లలో 115.44 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా, రెండో దశలో 45.72 మీటర్ల ఎత్తులో 194.6 టీఎంసీలను నిల్వ చేసేలా పనులు చేçపట్టడానికి నిధులు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. » పోలవరం ప్రాజెక్టులో 45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వ చేయాలంటే భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ.23,622.35 కోట్లు అవసరం. పోలవరం ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేయడం ద్వారా ఆ నిధులు మిగుల్చుకోవచ్చన్నది కేంద్రం ఆలోచన. పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల తమ రాష్ట్రాల్లో ముంపు ప్రభావం ఉంటుందంటూ ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీంతో ఆ సమస్య నుంచి తప్పించుకోవచ్చనే కేంద్రం ఇలా చేసిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. జీవనాడిగా మార్చిన వైఎస్ జగన్ » రాష్ట్రంలో 2019 మే 30న సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు చేసిన తప్పులను సరిదిద్దుతూ గాడిలో పెట్టారు. జీవచ్ఛవాన్ని జీవనాడిగా మార్చారు. రెండేళ్లు కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ 48 గేట్లతో సహా స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ చానల్, పైలట్ చానల్, ఎగువ కాఫర్ డ్యాంను పూర్తి చేసి 2021 జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించారు. » చంద్రబాబు చారిత్రక తప్పిదం వల్ల కోతకు గురైన దిగువ కాఫర్ డ్యాంను సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం) మార్గదర్శకాల మేరకు పూర్తి చేశారు. కుడి, ఎడమ కాలువలను అనుసంధానం చేసే సొరంగాలు, ప్రధాన డ్యాం గ్యాప్–3లో కాంక్రీట్ డ్యాం, గ్యాప్–1లో డయాఫ్రం వాల్ వేశారు. గ్యాప్–2లో దెబ్బ తిన్న డయాఫ్రం వాల్ భవితవ్యం తేల్చితే ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తామని కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. » ప్రాజెక్టుకు తాజా ధరల మేరకు నిధులు ఇచ్చి సత్వరమే పూర్తి చేయడానికి సహకరించాలని ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక, జల్ శక్తి శాఖ మంత్రులకు విజ్ఞప్తులు చేస్తూ వచ్చారు. తాగు నీటి విభాగం, నీటి పారుదల విభాగం వేర్వేరు కాదని.. రెండు ఒకటేనని, అందుకయ్యే వ్యయాన్ని కూడా ఇవ్వాలని కోరారు. ఇందుకు ప్రధాని మోదీ అంగీకరించారు. రెండు దశల్లో ప్రాజెక్టును పూర్తి చేద్దామని.. తొలి దశలో ప్రాజెక్టును పూర్తి చేయడానికి రూ.12,911 కోట్లు ఇచ్చేందుకు అంగీకరిస్తూ గతేడాది జూన్ 5న కేంద్ర ఆరి్థక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నోట్ జారీ చేశారు. -
పోలవరంపై బాబు కుట్ర
-
కాఫర్ డ్యాం పనులు పూర్తికాకుండానే మెయిన్ డ్యాం పనులు మొదలు పెట్టారు
-
పోలవరంపై చారిత్రాత్మక తప్పిదం
-
2027లోగా పోలవరం పూర్తి
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును 2027లోగా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తున్నారనే వాదనలో వాస్తవం లేదని.. 45.72 మీటర్ల ఎత్తుకు ఎన్డీయే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నాయన్నారు. శాసనసభలో మంగళవారం పోలవరం, సాగునీటి ప్రాజెక్టులపై స్వల్పకాలిక చర్చ జరిగింది. 13 మంది ఎమ్మెల్యేలు ఈ అంశంపై మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. జనవరి నుంచి పోలవరం కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం ప్రారంభిస్తామని, రూ.70 వేల కోట్లతో గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం చేసి ప్రతి ఎకరాకూ నీళ్లిస్తామని చెప్పారు. తీరంలో పోర్టులు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.పోలవరం ప్రాజెక్టు ఇప్పటిది కాదని.. 1941లోనే ప్రతిపాదన వచి్చందన్నారు. రామపాద సాగర్ పేరుతో భూమిని ఎంపిక చేశారన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక పోలవరం ప్రాజెక్టును అస్తవ్యస్థం చేశారని చంద్రబాబు ఆరోపించారు. తెలంగాణలో ఉన్న 7 ముంపు మండలాలను ఏపీలో కలపకపోతే తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనని పట్టుబట్టడం వల్లే కేంద్రం వాటిని ఏపీలో కలిపిందని చెప్పారు. అలా కలపకపోయి ఉంటే.. తెలంగాణ ఒప్పుకోకపోతే పోలవరం ఎప్పటికీ సాధ్యమయ్యేది కాదన్నారు. గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో కాంట్రాక్టర్‌ను మార్చిందని, 15 నెలల పాటు పోలవరం ప్రాజెక్టు పనులు నిలిపివేసిందన్నారు. 2020లో వరదలకు డయాఫ్రం వాల్ దెబ్బతింటే దానిని వెంటనే గుర్తించలేకపోయారన్నారు.కొత్త వాల్ నిర్మాణానికి రూ.990 కోట్లు ఖర్చవుతుందని వెల్లడించారు. ఆలస్యం వల్ల ప్రాజెక్టు వ్యయం పెరిగిందన్నారు. 2019 నాటికి 71.93 శాతం ప్రాజెక్టును తన హయాంలో పూర్తి చేస్తే గత ప్రభుత్వం హయాంలో 3.84 శాతం మాత్రమే పూర్తయ్యిందన్నారు. పర్సంటా, హాఫ్ పర్సంటా అని గత ప్రభుత్వంలో ఓ మంత్రి అవగాహన రాహిత్యంతో అవహేళన చేశారని, ఆయన పోయి మరో మంత్రి వచ్చారని, ఆయనకు టీఎంసీకి, క్యూసెక్కుకి తేడా తెలియదన్నారు. గత ప్రభుత్వం నీటిపారుదల రంగాన్ని నిర్వీర్యం చేసిందని.. అంతకుముందు సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. కనీస నిర్వహణ లేక గత ప్రభుత్వంలో 1,040 ఎత్తిపోతల పథకాల్లో 450 మూతపడ్డాయన్నారు. నీటి వనరుల నుంచి లబ్ధి పొందే రైతులపైనా ఆయా సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ భారం వేయాలని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సలహా ఇచ్చారు. -
బీజేపీ కోసం ఏపీ ప్రయోజనాలు పణం?
ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టుకు ఏదో శాపం ఉన్నట్లుంది. దేశంలో ఇంతలా జాప్యం జరిగిన ప్రాజెక్టు ఇంకోటి ఉండదేమో. ఇన్నేళ్ల తరువాతైనా ఈ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు ముహూర్తం దగ్గరపడిందని అనుకుంటూ ఉండగానే పిడుగులాంటి వార్త ఇంకోటి వచ్చిపడింది. ప్రాజెక్టు ఎత్తును నాలుగున్నర మీటర్ల మేర తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు చెబుతున్న ఈ వార్త ఆందోళన కలిగించేదే. తొలిదశలో నీటిని నిలబెట్టడానికి నిర్దేశించిన ఎత్తునే పూర్తి స్థాయి మట్టంగా కేంద్రం నిర్ణయిస్తే, ఈ ప్రాజెక్టు నుంచి ఆశించిన ఫలితం ఉండదన్న భయం ఏర్పడుతోంది. అలాగే.. డీపీఆర్‌లోని తప్పుల కారణంగా కుడి, ఎడమ కాల్వల ప్రవాహ సామర్థ్యం కూడా ప్రశ్నార్థకమైంది. ముందుగా ఈ రెండు కాల్వల ద్వారా 17500 క్యూసెక్కుల సామర్థ్యంతో నీరు ప్రవహించాలని అనుకున్నారు. కానీ 2017లో డీపీఆర్ తయారీ సమయంలో జరిగిన తప్పుల కారణంగా కుడి కాల్వలో 11 వేల క్యూసెక్కులు, ఎడమ కాల్వలో ఎనిమిది వేల క్యూసెక్కుల వరకు పారేందుకు అయ్యే నిర్మాణ ఖర్చును మాత్రమే కేంద్రం ఇస్తానందట. దీంతో ఇప్పుడు కాలువల సామర్థ్యం తగ్గించుకోవడం లేదంటే.. రూ.4500 కోట్ల అదనపు భారాన్ని భరిస్తూ రాష్ట్ర ప్రభుత్వమే కాల్వలను ముందనుకున్న ఆలోచనల ప్రకారం కట్టుకోవాల్సి ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు ఆలోచన ఇప్పటిది కాదు. వందేళ్ల క్రితమే బ్రిటిష్ పాలనలోనే ఆరంభమైంది. పలుమార్లు శంకుస్థాపనలు జరిగాయి. ఎన్.టి.రామారావు, టంగుటూరి, అంజయ్య వంటివారు ఈ ప్రాజక్టు పురోగతికి ప్రయత్నించారు. కానీ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఇది వేగంగా ముందుకెళ్లిందనేది వాస్తవం. నిర్వివాదాంశం. ప్రాజెక్టుకు అవసరమైన అనుమతుల సాధన, ముంపు ప్రాంతాల్లో భూ సేకరణ, కుడి, ఎడమ కాల్వల నిర్మాణాల్లో ఆయన చూపిన చొరవ మర్చిపోలేనిది. అప్పట్లో ప్రాజెక్టు పూర్తయితే భూ సేకరణ కష్టమవుతుందన్న అంచనాతో ఉభయ గోదావరి, కృష్ణ జిల్లాలలో భూ సేకరణ చేస్తుంటే ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ తెలుగుదేశం దీన్ని అడ్డుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. భూ సేకరణకు వ్యతిరేకంగా కృష్ణా జిల్లాలో తెలుగుదేశం వారితో కోర్టుల్లో వ్యాజ్యాలు వేయించారు. ప్రాజెక్టు లేకుండా కాల్వలు ఏమిటని ఎద్దేవ చేసేవారు. అయినా వైఎస్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. దాదాపు అన్ని అనుమతులు వచ్చి, ప్రాజెక్టు నిర్మాణం మొదలయ్యే టైమ్‌కు ఆయన మరణించడం ఆంధ్రప్రజల దురదృష్టం. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కాంట్రాక్ట్ ఫైనలైజ్ చేయడానికే ఐదేళ్లు తీసుకున్నాయి. అంతలో రాష్ట్ర విభజన సమస్య ముందుకు వచ్చింది. ఆ టైమ్ లో ఆంధ్ర ప్రజలలో ఏర్పడిన అసంతృప్తిని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. అంటే దాని అర్థం మొత్తం ప్రాజెక్టు నిర్మాణంతోపాటు, భూ సేకరణ చేసి, నిర్వాసితులకు పూర్తి స్థాయి పరిహారం ఇచ్చి వారికి ప్రత్యామ్నాయ వసతులు సమకూర్చి పూర్తి చేయడం అన్నమాట. కానీ 2014లో విభజిత ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ప్రాజెక్టు బాధ్యతలను తమ చేతుల్లోకి తీసుకున్నారు. దాంతో మరింత గందరగోళం ఏర్పడింది. అంతకు ముందు ఎంపికైన కాంట్రాక్టర్‌ను మార్చడం, తమకు కావల్సిన వారితో పనులు చేయించడం, అవి కాస్తా అవినీతి అభియోగాలకు గురి కావడం తదితర పరిణామాలు సంభవించాయి. దేశ ప్రధాని నరేంద్ర మోడీనే ఏపీకి వచ్చి పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎమ్ మాదిరి మారిపోయిందని వ్యాఖ్యానించడం ఇక్కడ మనం గుర్తుకు చేసుకోవాలి. నిజానికి చంద్రబాబుకు భారీ ప్రాజెక్టులపై నమ్మకం లేదు. అవి సకాలంలో పూర్తి కావని, ఎన్నికల సమయానికి ఉపయోగపడవన్నది ఆయన అభిప్రాయం. దానికి తగ్గట్లుగానే ఆయన మైనర్ ఇరిగేషన్, ఇంకుడు గుంతలు వంటివాటికి ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే భారీ ప్రాజెక్టులు చేపట్టకపోతే ప్రజలలో అప్రతిష్టపాలు అవుతామని భావించి, వారిని నమ్మించడానికి ఎన్నికలకు కొద్దికాలం ముందు కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసేవారు.ఆ తర్వాత వాటిని వదలి వేశారు.1999 ఎన్నికలకు ముందు ఇలా ఆయన శంకుస్థాపన చేసి, అధికారంలోకి వచ్చాక పక్కనపెట్టిన ప్రాజెక్టుల శిలాఫలకాల వద్ద అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పూలు పెట్టి వచ్చిన ఘట్టాలు కూడా జరిగాయి. 2014 లో మరోసారి సీఎం. అయిన తర్వాత సోమవారం పోలవారం అంటూ కథ నడిపారు. ఈ ప్రాజెక్టు తన కల అని ప్రచారం చేసుకునే వారు. జయము, జయము చంద్రన్న అంటూ పాటలు పాడించడం, వేలాది మందిని ప్రాజెక్టు సందర్శనకు తీసుకు వచ్చామని చెబుతూ కోట్ల రూపాయల బిల్లులను మాత్రం చెల్లించడం ప్రత్యేకతగా తీసుకోవాలి. స్పిల్ వే పూర్తి కాకుండా, ఒక గేట్ మాత్రం అమర్చి, అప్పర్, లోయర్ కాఫర్ డామ్ ల నిర్మాణం కంప్లీట్ చేయకుండా, డయాఫ్రం వాల్ నిర్మించి కొత్త సమస్యలు తీసుకొచ్చారు. కీలకమైన డామ్ ,రిజర్వాయిర్ మాత్రం పూర్తి కాలేదు. అలాంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన జగన్ రివర్స్ టెండరింగ్ పద్ధతిలో సుమారు రూ.800 కోట్ల మేర ఆదా చేసి పనులు కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించారు. స్పిల్ వేని పూర్తి చేసి, 48 గేట్లను అమర్చేందుకు చర్యలు తీసుకున్నారు. అంతలో భారీ ఎత్తున వరదలు రావడంతో చంద్రబాబు టైమ్‌లో కాపర్ డామ్ కోసం వదలిపెట్టిన గ్యాప్‌ల గుండా నీరు ప్రవహించి, డయాఫ్రం వాల్ ను దెబ్బ తీసింది. దానిపై కేంద్ర సంస్థలు కొత్త వాల్ కట్టాలా? లేక పాతదాన్ని పునరుద్దరించాలా అన్న దానిపై తేల్చడానికి ఏళ్ల సమయం పట్టింది. కాఫర్ డామ్ పూర్తిగా కడితే, వెనుక ఉన్న అనేక గ్రామాలు మునిగిపోతాయి. వారికి పరిహారం చెల్లించలేదు. నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణం జరగలేదు. దాంతో చంద్రబాబు ప్రభుత్వం గాప్ లను వదలి పెద్ద తప్పు చేసిందని నిపుణులు తేల్చారు. కానీ ఈ మొత్తం నెపాన్ని జగన్ ప్రభుత్వంపై నెట్టడానికి చంద్రబాబు, ఆయనకు మద్దతు ఇచ్చే మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ప్రయత్నించాయి. జగన్ టైమ్ లో తొలిదశలో 41.15 మీటర్ల వద్ద నీరు నిలిపి ప్రాజెక్టును ఒక దశకు తీసుకు రావాలని తలపెడితే, చంద్రబాబు, ఎల్లో మీడియా నానా రచ్చ చేశాయి. ఏపీకి జగన్ అన్యాయం చేస్తున్నారని దుష్ప్రచారం చేశారు. నిర్వాసితులను వేరే ప్రదేశాలకు తరలించడం, వారిని ఆర్థికంగా ఆదుకోవడం వంటివి చేశాక 45.72 మీటర్ల వద్ద నీటిని నిల్వచేసే విధంగా రిజర్వాయిర్ పనులు సంకల్పించారు. అదే టైమ్‌లో జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులు కూడా వేగంగా సాగాయి. కరోనా రెండేళ్ల కాలంలో కూడా పోలవరం పనులు జరిగేలా కృషి చేశారు. అయినా డయాఫ్రం వాల్ కారణంగా జాప్యం అయింది. ఈ లోగా మళ్లీ ప్రభుత్వం మారింది. అదే టైమ్ లో ఒడిషా, చత్తీస్గడ్ లలో బీజేపీ ప్రభుత్వాలు వచ్చాయి.తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. కేంద్రంలో ఎటూ బిజెపినే అధికారంలో ఉంది. ఆ కూటమిలో టీడీపీ, జనసేన కూడా భాగస్వాములు అయ్యాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం నిర్మాణం జరిగితే ఒడిషా, చత్తీస్ గడ్, తెలంగాణలలోని కొన్ని భూ భాగాలు ముంపునకు గురి అవుతాయి. అక్కడ వారికి కూడా పరిహారం ఇవ్వడానికి గతంలోనే అంగీకారం కుదిరింది. చత్తీస్ గడ్ ప్రాంతంలో ముంపు బారిన పడకుండా గోడలు నిర్మించాలని కూడా ప్రతిపాదించారు.అయినా పూర్తి మట్టం ఒప్పుకుంటే రాజకీయంగా ఆ రాష్ట్రాలలో విపక్షాలు విమర్శలు చేస్తాయని, ఏపీకి సహకరిస్తే రాజకీయంగా తమకు నష్టమని భావించాయి. తెలంగాణలో కూడా దీనిపై కొంత రాజకీయం నడుస్తోంది.ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన కూటమిలోని టీడీపీ, జనసేనలను లోబరుచుకుని 41.15 మీటర్లకే ప్రాజెక్టును పరిమితం చేయడానికి ఒప్పించాయని భావిస్తున్నారు. అందువల్లే కేంద్ర క్యాబినెట్ ఎత్తు తగ్గించడంపై ఆగస్టు 28 నే తీర్మానం చేసినా, అందులో టీడీపీ క్యాబినెట్ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు సభ్యుడుగా ఉన్నా, ఆయన నోరు మెదపలేదట. దీనిని టీడీపీ,బీజేపీలు అత్యంత రహస్యంగా ఉంచాయి. ఎలాగైతేనేం అక్టోబర్ ఆఖరు నాటికి ఈ విషయం బయటకు వచ్చింది. దానిపై సమాధానం ఇవ్వడానికి మంత్రి నిమ్మల రామానాయుడు నీళ్లు నమిలారు. మామూలుగా అయితే సుదీర్ఘంగా ఉపన్యాసాలు, మీడియా సమావేశాలు పెట్టే చంద్రబాబు ఈ అంశం జోలికి వెళ్లినట్లు లేరు. దీనిని బట్టే ఎంత గుట్టుగా ఈ వ్యహారాన్ని సాగించాలని అనుకున్నది అర్ధం చేసుకోవచ్చు. ఇలా ఎత్తు తగ్గించడం వల్ల వరద వస్తేనే ఈ ప్రాజెక్టు నీటిని విశాఖ వరకు తీసుకు వెళ్లడం కష్టసాధ్యం అవుతుందని చెబుతున్నారు. 195 టీఎంసీల బదులు 115 టీఎంసీల నీటి నిల్వకే అవకాశం ఉంటుంది. కేవలం ఒక రిజర్వాయిర్ గానే ఇది మిగిలిపోతుందని భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ దీనిపై వ్యాఖ్యానిస్తూ ఏపీ ప్రజలకు చంద్రబాబు ద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టు లక్ష్యమే దెబ్బతింటుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా స్పందించే సీఎం కాని, మంత్రులు కాని, దీనిపై నోరు మెదపడం లేదు. ఓవరాల్ గా చూస్తే ఏపీకి సుమారు పాతిక వేల కోట్ల మేర కేంద్రం ఎగవేయడానికి ప్రయత్నం జరుగుతున్నట్లు సందేహాలు వస్తున్నాయి. దానికి తోడు పోలవరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రం అంతటికి మేలు జరగాలన్న లక్ష్యం నెరవేరడం కష్టం కావచ్చు. ఇదంతా చూస్తే బీజేపీకి పొరుగు రాష్ట్రాలలో ఇబ్బంది లేకుండా చూడడానికి తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ ప్రయోజనాలను పణంగా పెడుతున్నారన్న విమర్శలకు ఆస్తారం ఇస్తున్నారనిపిస్తుంది. కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
పోలవరానికి మరో ద్రోహం చేసిన సీఎం చంద్రబాబు
-
కుడి ఎడమల దగా!
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి జీవనాడిగా అభివర్ణిస్తున్న పోలవరం జాతీయ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ద్రోహం చేసింది. ఇప్పటికే నీటి నిల్వ మట్టాన్ని 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గిస్తూ ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రప్రభుత్వం అంగీకరించడం ద్వారా పోలవరం రిజర్వాయర్‌ను బ్యారేజ్‌గా మార్చేసింది. తాజాగా కుడి కాలువ సామర్థ్యం 11 వేల క్యూసెక్కులు, ఎడమ కాలువ సామర్థ్యం 8 వేల క్యూసెక్కులతో చేపట్టిన పనులకే బిల్లులు ఇస్తామని కేంద్ర జల్ శక్తి శాఖ తేల్చి చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపక పోవడం విస్తుగొలుపుతోంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు 8 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా 17,580 క్యూసెక్కుల సామర్థ్యంతో పోలవరం ఎడమ కాలువను, కృష్ణా డెల్టాకు నీటి కరువన్నదే లేకుండా చేసేందుకు 17,560 క్యూసెక్కుల సామర్థ్యంతో కుడి కాలువను 2004లో చేపట్టారు. విభజన నేపథ్యంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం.. తాజా ధరల మేరకు సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు 2017 ఆగస్టు 17న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిన రెండో సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదన(డీపీఆర్–2)లో కుడి కాలువ సామర్థ్యాన్ని 11 వేలు, ఎడమ కాలువ సామర్థ్యాన్ని 8 వేల క్యూసెక్కులుగా తప్పుగా పేర్కొంది. దాని ఫలితంగానే కేంద్ర జల్ శక్తి శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.4,753.93 కోట్ల భారం పడుతుందని జల వనరుల శాఖ అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.చిరకాల స్వప్నం సాకారమైన వేళ.. గోదావరిపై పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రతిపాదన 1941లో చేసినా, 2004 వరకు ఆ ప్రాజెక్టు పనులు చేపట్టే సాహసం ఏ ముఖ్యమంత్రి చేయలేదు. అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టును సాకారం చేస్తూ నిర్మాణ పనులు చేపట్టారు. కొత్తగా 3.2 లక్షల ఎకరాలకు నీళ్లందించడంతోపాటు 80 టీఎంసీలను మళ్లించి కృష్ణా డెల్టాలో 13.06 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేలా 17,560 క్యూసెక్కుల సామర్థ్యంతో కుడి కాలువను చేపట్టారు. కొత్తగా 4 లక్షల ఎకరాలకు నీళ్లందించడం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 63.2 టీఎంసీను మళ్లించి 8 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా 17,580 క్యూసెక్కుల సామర్థ్యంతో ఎడమ కాలువను చేపట్టారు. గోదావరి ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చిన మేరకు 45.72 మీటర్లు (150 అడుగులు) గరిష్ట నీటి మట్టంతో 194.6 టీఎంసీల నీటి నిల్వ.. 960 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్కేంద్రం.. 449.78 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి డెల్టాలో 10.5 లక్షల ఎకరాలను స్థిరీకరించడంతోపాటు విశాఖపట్నం పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు 23.44 టీఎంసీలు.. కుడి, ఎడమ కాలువల సమీపంలోని 540 గ్రామాల్లోని 28.50 లక్షల మంది దాహార్తి తీర్చేలా ఈ ప్రాజెక్టును చేపట్టారు.డీపీఆర్–2లో తప్పుల పర్యవసానమే.. విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం.. అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించడంతోపాటు అన్ని రకాల అనుమతులు తీసుకుని, వంద శాతం వ్యయంతో తామే నిర్మించి ఇస్తామని రాష్ట్రానికి హామీ ఇచ్చింది. ఆ మేరకు విభజన చట్టంలో సెక్షన్–90లో స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టడం కోసం పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ)ని 2014 మే 28న ఏర్పాటు చేసింది. 2015 మార్చి 12న నిర్వహించిన తొలి సర్వసభ్య సమావేశంలోనే.. తాజా ధరల మేరకు పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలు ఇవ్వాలని అప్పటి పీపీఏ సీఈవో దినేష్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కానీ.. సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనను సమర్పించడంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసింది. ఎట్టికేలకు 2017 ఆగస్టు 17న రెండో సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను పీపీఏకు సమర్పించింది. ఆ ప్రతిపాదనల్లో కుడి, ఎడమ కాలువ సామర్థ్యాన్ని తప్పుగా పేర్కొంది. ఇదే అంశాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎత్తిచూపి.. తాజా పరిమాణాల ఆధారంగా ప్రాజెక్టు పనులకు అయ్యే వ్యయాన్ని, విభాగాల వారీగా విధించిన పరిమితులను ఎత్తేసి రీయింబర్స్ చేయాలని చేసిన విజ్ఞప్తికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అంగీకరించారు. ఆ మేరకు నిధులు ఇస్తామని స్పష్టం చేస్తూ 2023 జూన్ 5న నోట్ జారీ చేశారు. కానీ.. ఇప్పుడు కుడి కాలువ సామర్థ్యం 11 వేలు, ఎడమ కాలువ సామర్థ్యం 8 వేల క్యూసెక్కులతో చేపట్టిన పనులకే బిల్లులు ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది.కళ్ల ముందు కరిగిపోతున్న స్వప్నం నీటి నిల్వ చేసే ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించడం వల్ల పోలవరం రిజర్వాయర్ బ్యారేజ్‌గా మారిపోయింది. గోదావరికి వరద వచ్చే రోజుల్లో మాత్రమే కుడి, ఎడమ కాలువలు.. పుష్కర, తాడిపూడి ఎత్తిపోతల కింద ఉన్న 1.58 లక్షల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే నీళ్లందించడానికి అవకాశం ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు కింద మిగతా 5.62 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదు. కృష్ణా డెల్టాలో 13.06 లక్షల ఎకరాలు, గోదావరి డెల్టాలో 10.50 లక్షల ఎకరాల స్థిరీకరణ అసాధ్యమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం, విశాఖ పారిశ్రామిక, తాగు నీటి అవసరాలకు నీళ్లందించడం వీలు కాదని స్పష్టం చేస్తున్నారు. జల విద్యుదుత్పత్తి పూర్తి స్థాయిలో చేపట్టడమూ అసాధ్యమే. అంటే కళ్ల ముందే చిరకాల స్వప్నం కరిగి పోతుండటంతో రైతులు, సాగు నీటి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ఎత్తును తగ్గించడం ద్వారా భూసేకరణ, పునరావాసం వ్యయం రూపంలో ఇప్పటికే రూ.23,622 కోట్లను కేంద్రం మిగుల్చుకుంది. తాజాగా కుడి, ఎడమ కాలువ పనుల పరిమాణాన్ని తగ్గించడం ద్వారా మరో రూ.4,753.98 కోట్లనూ మిగుల్చుకుందని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. -
డయాఫ్రం వాల్‌కు సమాంతరంగా ప్రధాన డ్యాం పనులు
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ పనులకు సమాంతరంగా ప్రధాన (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యాం నిర్మాణ పనులు చేపడతామని రాష్ట్ర జలవనరుల శాఖ ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, పోలవరం సీఈ కె.నరసింహమూర్తి ప్రతిపాదించారు. అప్పుడే కేంద్రం నిర్దేశించిన షెడ్యూలులోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని వివరించారు. ప్రాజెక్టు నిర్మాణ షెడ్యూలుపై శనివారం చర్చించి, నిర్ణయం తీసుకుందామని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అధికారులు, అంతర్జాతీయ నిపుణులు నిర్ణయానికొచ్చారు.పోలవరం ప్రాజెక్టుపై సీడబ్ల్యూసీ సీఈ విజయ్‌శరణ్ అధ్యక్షతన వర్క్ షాప్ మూడో రోజూ శుక్రవారం కొనసాగింది. అంతర్జాతీయ నిపుణులు డేవిడ్ బి.పాల్, రిచర్డ్ డొన్నెల్లీ, గియాస్ ఫ్రాంక్ డి సిస్కో, సీస్ హించ్‌బెర్గర్, పీపీఏ సీఈవో అతుల్ జైన్, సభ్య కార్యదర్శి రఘురాం, కాంట్రాక్టు సంస్థ మేఘా, ఆ సంస్థ తరఫున డిజైనర్ ఆఫ్రి, బావర్ సంస్థల ప్రతినిధులు ఈ వర్క్ షాప్‌లో పాల్గొన్నారు. ప్రధాన డ్యాం గ్యాప్–2లో దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు 6 మీటర్ల ఎగువన కొత్తగా నిర్మించే డయాఫ్రం వాల్ పనుల నాణ్యతను ఎప్పటికప్పుడు తేల్చేందుకు నిర్వహించాల్సిన పరీక్షలపై తొలుత చర్చించారు.ఆ తర్వాత ప్రధాన డ్యాం డిజైన్లపై ఆఫ్రి ప్రతినిధులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రధాన డ్యాం గ్యాప్–3లో ఇప్పటికే 140 మీటర్ల పొడవుతో కాంక్రీట్ డ్యాంను పూర్తి చేశామని చెప్పారు. ప్రధాన డ్యాం గ్యాప్–1లో 564 మీటర్లు పొడవున 50 మీటర్ల ఎత్తుతో.. గ్యాప్–2లో 1,750 మీటర్ల పొడవున 50 మీటర్ల ఎత్తుతో నిర్మించేలా రూపొందించిన డిజైన్‌లో సాంకేతిక అంశాలను వివరించారు. గ్యాప్–1లో డ్యాం నిర్మాణానికి 16.6 లక్షల క్యూబిక్ మీటర్లు.. గ్యాప్–2లో 95.85 లక్షల క్యూబిక్ మీటర్లు పనిచేయాల్సి ఉంటుందన్నారు. కాగా, ప్రధాన డ్యాం డిజైన్లపై అంతర్జాతీయ నిపుణులు సంతృప్తి వ్యక్తం చేశారు.జనవరి నుంచి డయాఫ్రం వాల్ పనులుప్రధాన డ్యాం డిజైన్లపై చర్చించిన తర్వాత వర్క్‌షాప్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీడబ్ల్యూసీ చైర్మన్ రాకేశ్‌కుమార్ వర్మ పాల్గొన్నారు. బుధ, గురు, శుక్రవారం వర్క్ షాప్‌లో చర్చించిన అంశాలను సీడబ్ల్యూసీ సీఈ విజయ్‌శరణ్ వివరించారు. ప్రాజెక్టును షెడ్యూలు ప్రకారం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని రాకేశ్‌కుమార్ వర్మ ప్రశ్నించగా.. జనవరి నుంచి ప్రధాన డ్యాం గ్యాప్–2లో కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు వివరించారు. అంతర్జాతీయ నిపుణుల సూచనల మేరకు డయాఫ్రం వాల్ డిజైన్‌లో మార్పులు చేసి.. వాటితోపాటు ప్రధాన డ్యాం డిజైన్లను ఎంత తొందరగా పంపితే అంత తొందరగా వాటిని ఆమోదించే ప్రక్రియను పూర్తి చేస్తామని రాకేశ్‌కుమార్ వర్మ చెప్పారు.పోలవరం జలవిద్యుత్ కేంద్రంలో కీలక పనులు ప్రారంభంపోలవరం రూరల్/దేవీపట్నం (అల్లూరి సీతారామరాజు జిల్లా): పోలవరం జలవిద్యుత్ కేంద్రంలో టర్బైన్ల ఏర్పాటులో కీలకమైన స్టేరింగ్ల అమరిక పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. వీటిని అమర్చేందుకు 320 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన క్రాలర్ క్రేన్ వినియోగిస్తున్నారు. ప్రాజెక్టులో ఈ స్టేరింగ్ కీలక పాత్ర పోషిస్తాయి. ఒక్కో స్టేరింగ్ నాలుగు విభాగాలుగా ఉంటుంది. దీని బరువు 136 మెట్రిక్ టన్నులు. విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే కప్లాన్ టర్బైన్లు సమర్థవంతంగా పనిచేయడంలో ఈ స్టేరింగ్లు కీలక పాత్ర పోషిస్తాయి. -
డయాఫ్రం వాల్ 9 నెలల్లో పూర్తి చేయలేరా!
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం గ్యాప్–2లో 1,396.6 మీటర్ల పొడవున కనిష్టంగా 10 మీటర్లు.. గరిష్టంగా 93.5 మీటర్ల లోతు, 1.5 మీటర్ల వెడల్పుతో డయాఫ్రం వాల్ (పునాది) పూర్తి చేయడానికి 15 నెలల సమయం పడుతుందని బావర్ సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు పూర్తయిన నేపథ్యంలో.. గోదావరి వరదల్లోనూ పనులు చేయవచ్చని అంతర్జాతీయ నిపుణులు, సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) అధికారులు తేల్చారు. 9 నెలల్లో డయాఫ్రం వాల్‌ను పూర్తి చేయలేరా అని బావర్ సంస్థ ప్రతినిధులను ప్రశ్నించారు.దాంతో.. వీలైనంత తొందరగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామని బావర్ ప్రతినిధులు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు వద్ద వర్క్‌షాప్ రెండో రోజూ గురువారం కూడా కొనసాగింది. వర్క్‌షాప్ ప్రారంభంలో డయాఫ్రం వాల్ నిర్మాణానికి ఇప్పటికే సిద్ధం చేసిన ప్లాట్‌ఫాం, ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతాన్ని వైబ్రో కాంపాక్షన్ చేసి యథాస్థితికి తెచ్చిన పనులపై చర్చించారు. ఆ తర్వాత గ్యాప్–2లో దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు ఎగువన సమాంతరంగా కొత్తగా నిరి్మంచే డయాఫ్రం వాల్ డిజైన్‌ను మేఘా సంస్థ తరఫున డిజైనర్‌గా వ్యవహరిస్తున్న ఆఫ్రి సంస్థ ప్రతినిధులు ప్రజెంటేషన్ ఇచ్చారు.డిజైన్‌పై అంతర్జాతీయ నిపుణులు, సీడబ్ల్యూసీ అధికారులు లేవనెత్తిన సాంకేతిక అంశాలను ఆఫ్రి సంస్థ ప్రతినిధులు నివృత్తి చేశారు. అంతర్జాతీయ నిపుణులు సూచించిన మేరకు డిజైన్‌లో మార్పులు చేసి పంపాలని సీడబ్ల్యూసీ అధికారులు ఆదేశించారు. డయాఫ్రం వాల్ నిర్మాణానికి మూడు ట్రెంచ్ కట్టర్లు, గడ్డర్లు, 605 ప్యానళ్లు వినియోగిస్తున్నామని.. జనవరిలో పనులు ప్రారంభించి 2026 మార్చి నాటికి పూర్తి చేస్తామని బావర్ ప్రతినిధులు చెప్పారు. యంత్రాలు ఎక్కువగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో డయాఫ్రం వాల్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీడబ్ల్యూసీ, అంతర్జాతీయ నిపుణులు సూచించారు. కాగా.. శుక్రవారం గ్యాప్–1లో 564 మీటర్లు, గాయ్ప్–2లో 1,750 మీటర్ల పొడవున నిర్మించాల్సిన ప్రధాన డ్యాం డిజైన్, నిర్మాణంపై చర్చించనున్నారు. -
పోలవరం నుంచి 80 టీఎంసీలు వస్తే.. ఆ మేరకు కృష్ణా జలాలు కట్!
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల నికర జలాలు లభ్యతలోకి వస్తే నాగార్జునసార్, శ్రీశైలం నుంచి కృష్ణా డెల్టాకు ఆ మేరకు నీటి సరఫరా తగ్గిపోతుందని జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2 ముందు ఏపీ ప్రభుత్వ సాక్షి అనిల్‌కుమార్ గోయల్ వాంగ్మూలం ఇచ్చారు. బుధవారం ఢిల్లీలో ట్రిబ్యునల్ నిర్వ హించిన క్రాస్ ఎగ్జామినేషన్‌లో పాల్గొన్న ఆయన.. తెలంగాణ న్యాయవాదుల ప్రశ్నల కు సమాధానాలిచ్చారు. 1978 ఆగస్టు 4న జరిగిన అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం పోలవరం నుంచి 80 టీఎంసీల గోదావరి జలాల ను విజయవాడ ఆనకట్టకు తరలిస్తే, శ్రీశైలం, సాగర్ నుంచి వచ్చే జలాలపై కృష్ణా డెల్టా ఆధారపడదనే వాదనను అంగీకరిస్తారా? అని ప్రశ్నించగా అవునని ఆయన బదులిచ్చారు. కృష్ణా ట్రిబ్యునల్–1, 2లు గంపగుత్తగా నీటి కేటాయింపులు జరిపినా, రెండు రాష్ట్రాల్లోని వివిధ ప్రాజెక్టులకు రక్షణ కల్పించాయని, వాటి ఆధారంగా పలు ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు జరిగాయని చెప్పారు. కేంద్ర జల సంఘం డైరెక్టర్ (హైడ్రాలజీ)గా పదవీ విరమణ పొందిన అనిల్‌కుమార్.. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల ఆపరేషన్ ప్రొటోకాల్స్‌ను ప్రతిపాదించారు. ఆ ప్రొటోకాల్స్‌కు స్వల్ప మార్పులే.. ట్రిబ్యునల్‌కు కేంద్రం జారీ చేసిన కొత్త టరŠమ్స్ ఆఫ్ రిఫరెన్స్ (సూచనలతో కూడిన నిబంధనలు) ఆధారంగా ప్రాజెక్టుల వారీగా రెండు రాష్ట్రాలకు సమ కేటాయింపులు చేస్తే ప్రతిపాదిత ఆపరేషన్ ప్రొటోకాల్స్ పూర్తిగా అసంబద్ధంగా మారిపోతాయని ప్రశ్నించగా, వాటికి స్వల్ప మార్పులే చేయాల్సిరావొచ్చని అనిల్‌కుమార్ బదులిచ్చారు. ఏపీ, తెలంగాణ మధ్య ఏ ట్రిబ్యునల్ నీటి పంపకాలు జరపలేదని, ఉమ్మడి ఏపీ ప్రభుత్వం చేసిన పరిపాలనపర ఏర్పాట్లనే కేటాయింపులుగా చూపుతున్నారంటూ తెలంగాణ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే రక్షిత ప్రాజెక్టులు, అదనపు ప్రాజెక్టుల ఆధారంగా ఉమ్మడి ఏపీకి కేటాయింపులు జరిగాయని, ఈ ప్రాజెక్టులకు కేటాయింపులు గత 48 ఏళ్లుగా కొనసాగుతున్నాయని గోయల్ బదులిచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఈ కేటాయింపులకు పలు అంతర్రాష్ట్ర సమావేశాల్లో సమ్మతి తెలిపారన్నారు. 2015 జూన్ 18, 19న అపెక్స్ కౌన్సిల్లో ఏపీ, తెలంగాణ మధ్య జరిగిన ఒప్పందమే దీనికి ఆధారమన్నారు. ఆ తర్వాతి కాలంలో తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించి 50:50 నిష్పత్తిలో కేటాయింపులు జరపాలని కోరిన విషయం తెలియదా? అని తెలంగాణ న్యాయవాది ప్రశ్నించగా, లేదని బదులిచ్చారు. జూరాల నుంచి మిగులు జలాలే వాడాలి కృష్ణా ట్రిబ్యునల్–1, 2లతో పాటు పునర్విభజన చట్టంలో రక్షణ కల్పించకపోవడంతోనే కోయిల్‌సాగర్, ఒకచెట్టివాగు ప్రాజెక్టులకు జూరాల నుంచి నీటి తరలింపును పరిగణనలోకి తీసుకోలేదని గోయల్ చెప్పారు. షెడ్యూల్–11లో పేర్కొన్న ఏపీ, తెలంగాణ ప్రాజెక్టులకు నికర జలాలు కాకుండా మిగులు జలాలనే సరఫరా చేయాల్సి ఉంటుందని, అందుకే నెట్టెంపాడు ప్రాజెక్టును సైతం పరిగణనలోకి తీసుకోలేదన్నారు. జూరాల నుంచి దిగువకు 342 టీఎంసీలను విడుదల చేసిన తర్వాతే మిగులు జలాలను వాడుకోవాల్సి ఉంటుందన్నారు. 2015–16 నుంచి ఏపీ ప్రభుత్వం తాత్కాలికంగా పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు తరలిస్తున్న గోదావరి నీళ్లను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని, అవి నికర జలాలు కావని చెప్పారు. పోలవరం ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తే ప్రత్యామ్నాయంగా నాగార్జునసాగర్ ఎగువన 80 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకోవాలని గతంలో ఒప్పందం జరిగిందని, ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్రలు 35 టీఎంసీలు వాడుకోగా, మిగిలిన 45 టీఎంసీలను ఏపీలోని కృష్ణా డెల్టాకు వాడుకోవాల్సి ఉంటుందని గోయల్ పేర్కొన్నారు. సాగర్‌కి దిగువన వాడినా ఎగువ ప్రాంతంలో వాడినట్టు లెక్కించాల్సి ఉంటుందన్నారు. -
పోలవరాన్ని వేగంగా పూర్తి చేయండి
సాక్షి, అమరావతి: కేంద్ర జలసంఘంతో చర్చించి డయాఫ్రం వాల్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యాం పనులను సమాంతరంగా చేపట్టడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని జలవనరుల శాఖ ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. పోలవరం ప్రాజెక్ట్, చింతలపూడి, వెలిగొండ, గోదావరి–పెన్నా అనుసంధానం ప్రాజెక్టులపై మంగళవారం సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. జనవరిలో డయాఫ్రం వాల్ పనులు ప్రారంభిస్తే పూర్తి కావడానికి సరిగ్గా ఏడాది పడుతుందని.. ఆ తరువాత ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు చేపట్టి, పూర్తి చేయడానికి 24 నెలలు పడుతుందని వివరించారు. డయాఫ్రం వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు సమాంతరంగా చేపడితే 2027 జూలై నాటికి.. విడివిడిగా పనులు చేపడితే 2028 మార్చి నాటికి పనులు పూర్తి చేయవచ్చన్నారు. అధికారులు మాట్లాడుతూ.. ఈసీఆర్ఎఫ్ డ్యాం గ్యాప్–2 నిర్మాణ ప్రాంతంలో 0.40 టీఎంసీల నీటిని ఎత్తిపోశామని.. ప్రస్తుతం సముద్ర మట్టానికి 15.9 మీటర్ల స్థాయిలో నీటి నిల్వ తగ్గిందని వివరించారు. భూసేకరణకు రూ.7,213 కోట్లు అవసరంపోలవరం ప్రాజెక్టు తొలి దశలో భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ పనులకు రూ.7,213 కోట్లు అవసరమని.. ఇంకా 16,440 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉందని అధికారులు సీఎంకు చెప్పారు. 2025 ఏప్రిల్‌కి భూసేకరణ, 2026 ఏప్రిల్ నాటికి ఆర్ అండ్ ఆర్ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పోలవరం కుడి కాలువ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు తీసుకువెళ్లాలనే అంశంపైనా సమీక్షలో చర్చించారు. కొత్తగా మరో కాలువ నిర్మించడమా లేదా ఉన్న కాలువను విస్తరించడమా అనే అంశంపై చర్చిస్తున్నామని అధికారులు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుతోపాటు అప్పట్లో అనుకున్న విధంగా ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం కూడా చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. జలవిద్యుత్ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలన్నారు. ఈ నెలలో పోలవరం ప్రాజెక్టును పరిశీలించి.. పనులపై ప్రణాళిక విడుదల చేస్తానని చెప్పారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం కింద 3 లక్షల ఎకరాలకు నీళ్లందించేందుకు రూ.2,463 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని అధికారులు వివరించగా ఆ పనులు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.పోలవరంలో నేటి నుంచి వర్క్షాప్అంతర్జాతీయ నిపుణులతో డయాఫ్రం వాల్, ప్రధాన డ్యాం డిజైన్లు, నిర్మాణంపై చర్చ సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడంపై ప్రాజెక్టు వద్దే బుధవారం నుంచి 4రోజులపాటు కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) మేధోమథనం చేయనుంది. డ్యాంల నిర్మాణం, భద్రత, భూ¿ౌగోళిక సాంకేతికత(జియో టెక్నికల్) తదితర అంశాలపై అపార అనుభవం ఉన్న డేవిడ్ బి.పాల్, రిచర్డ్ డొన్నెల్లీ, గియాస్ ఫ్రాంక్ డి సిస్కో, సీస్ హించ్‌బెర్గర్‌లతో కూడిన అంతర్జాతీయ నిపుణుల బృందం ప్రాజెక్టును పరిశీలించి.. నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), సీడబ్ల్యూసీలకు నివేదిక ఇచ్చింది. వర్షాకాలం ముగియగానే పనులు ప్రారంభించే ముందు నవంబర్ మొదటి వారంలో పోలవరం వద్ద వర్క్‌షాప్ నిర్వహించి.. డిజైన్లు, నిర్మాణంపై చర్చిద్దామని అంతర్జాతీయ నిపుణుల కమిటీ సూచించింది. ఆ మేరకు సీడబ్ల్యూసీ వర్క్‌షాప్ నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొనేందుకు అంతర్జాతీయ నిపుణుల బృందం మంగళవారం రాత్రికి రాజమహేంద్రవరం చేరుకుంది. 4 రోజులపాటు ప్రాజెక్టు వద్దే అంతర్జాతీయ నిపుణుల బృందం ఉంటుంది. వర్క్‌షాప్‌లో అంతర్జాతీయ నిపుణులు, పీపీఏ, సీడబ్ల్యూసీ, డ్యాం డిజైన్ రివ్యూ ప్యానల్(డీడీఆరీ్ప), సీఎస్ఎంఆర్ఎస్ (సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్), వ్యాప్కోస్ ప్రతినిధులు పాల్గొంటారు. ప్రాజెక్టు ప్రధాన కాంట్రాక్ట్ సంస్థ మేఘా తరఫున డిజైన్లు రూపొందిస్తున్న ఆఫ్రి, బావర్ ప్రతిని«దులు, రాష్ట్ర జలవనరుల శాఖ తరఫున ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, పోలవరం సీఈ నరసింహమూర్తి ఈ వర్క్‌షాప్‌లో పాల్గొననున్నారు. -
మీ డబ్జా మీరు కొట్టుకోవడం కాదు: Buggana
-
కోవిడ్ టైంలో కూడా పోలవరం ఆగలేదు..
-
పోలవరంపై ఇంకెన్ని అబద్దాలు చెప్తావ్ బాబూ..
-
పోలవరం ఎత్తు తగ్గిస్తుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారు?: బుగ్గన
హైదరాబాద్, సాక్షి: పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘‘పోలవరం ఎత్తు తగ్గిస్తుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారు?. 2005లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు తీసుకున్నారు. వైఎస్సార్ హయాంలో ప్రాజెక్టుకు అనుమతులు తీసుకున్నారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా కేంద్రం పోలవరం బాధ్యతలు తీసుకుంది. పోలవరం పూర్తైతే గ్రావిటీ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు వస్తుంది. పోలవరం ఆపేసి చంద్రబాబు పట్టిసీమ ఎందుకు కట్టారు?. ..ఆనాడు కేంద్రంతో టీడీపీ చేసుకున్న ఒప్పందంతో ఎన్నో ఇబ్బందులున్నాయి. 2013 భూసేకరణ చట్టాన్ని చంద్రబాబు పట్టించుకోలేదు. మా ప్రభుత్వ హయాంలో పోలవరం ముఖ్యమైన పనులు పూర్తిచేశాం. వైఎస్సార్సీపీ హయాంలో కోవిడ్ కాలంలోనూ పోలవలం పనులు చేశాం. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు చారిత్రక తప్పిదం చేశారు. ..పోలవరం ఎత్తు తగ్గింపు మా హయాంలోనే జరిగిందని టీడీపీ తప్పడు ప్రచారం చేస్తోంది. ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రాయానాయుడు తప్పడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు సర్కార్ చేసిన తప్పిదాలును వైఎస్సార్సీపీ ప్రభుత్వం సరిదిద్దింది. కోవిడ్ సంక్షోభం లేకుంటే మిగిలిన పనలు పూర్తి చేసేవాళ్లం. స్పిల్ వే కట్టిన తర్వాత అప్పర్ కాఫర్, లోయర్ కాఫర్ డ్యాం కట్టాలి. ఇవన్నీ పూర్తి చేసిన తర్వాతే డయాఫ్రంవాల్ కట్టాలి. ప్రతీ సోమవారం పోలవరం అని చంద్రబాబు భ్రష్టుపట్టించారు’’ అని అన్నారు.హోంమంత్రి అనితపై పవన్ చేసిన వ్యాఖ్యలపై బుగ్గన రియాక్షన్..‘‘డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎవరిని ప్రశ్నిస్తున్నారు?. పవన్ కూడా ప్రభుత్వంలోనే ఉన్నారు కదా?. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలైనా ఇంకా ప్రశ్నించడమేనా? మీరు ఉపముఖ్య మంత్రి కూడా. మీరు కూటమికి కారణం కూడా. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నారు. ఈరోజు మళ్లీ హోమ్ మినిస్టర్‌ను ప్రశ్నిస్తున్నారు. మరి మీరు ఎవరిని ప్రశ్నిస్తున్నట్లు మిమ్మల్ని మీరే ప్రశ్నిచుకుంటున్నారా?. మీ ప్రభుత్వం వచ్చాక క్రైం జరుగుతున్నా.. మీరు ఎవరిని ప్రశ్నిస్తున్నారో అర్ధం కావట్లేదు. మీరు అధికారంలో ఉండికూడా ప్రశ్నిచడం ఏమిటి?. సమాధానం చెప్పాల్సిన మీరు హోమ్ మినిస్టర్‌ను ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌కు పాలనాపైన ఓరియెంటేషన్ అవసరం ఉంది. అదృశ్యమైన 30 వేల మంది ఆడపిల్లల జాడేదీ?. ’’అని అన్నారు. -
దిష్టిబొమ్మగా పోలవరం.. బాబు సర్కార్ కుట్రలు
-
పోలవరం విద్యుత్ కేంద్రం.. ఓ దిష్టిబొమ్మే!
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లకే కూటమి ప్రభుత్వం కుదించడంతో 960 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రం ప్రశ్నార్ధకంగా మారింది. ఏడాది పొడవునా కారు చౌకగా విద్యుత్తునందించే ఈ కేంద్రం ఇప్పుడు దిష్టిబొమ్మలా మారనుంది. దీనివల్ల ప్రజలు చౌక విద్యుత్‌ను కోల్పోయి, ఈమేరకు విద్యుత్‌ను బయట కొనుగోలు చేస్తే ప్రజలపై చార్జీల భారం పడుతుందని, పారిశ్రామికాభివృద్ధికి విఘాతం కలిగి, ఉపాధి అవకాశాలూ దెబ్బ తింటాయని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. గోదావరి ట్రిబ్యునల్ ఆమోదించిన డిజైన్ ప్రకారం 45.72 మీటర్ల ఎత్తులో పోలవరం ప్రాజెక్టు నిర్మించి, 194.6 టీఎంసీల నీటిని నిల్వ చేస్తే హిమాలయ నదులపై ఉన్న విద్యుత్ కేంద్రాల తరహాలో ఇక్కడి జల విద్యుత్ కేంద్రంలోనూ కరెంటు ఉత్పత్తి చేయవచ్చని నిపుణులు అంచనా వేశారు. రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టు ఎత్తును కేవలం 41.15 మీటర్లకే కుదించడం ద్వారా చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రాజెక్టు లక్ష్యాలన్నింటికీ గండి కొట్టేసింది. కేవలం ఓ బ్యారేజ్‌గా మార్చేస్తోంది. దీనివల్ల ‘హెడ్’ తగ్గిపోయి జల విద్యుదుత్పత్తికి విఘాతం కలుగుతుందని నిపుణులు తేల్చిచెబుతున్నారు. గోదావరికి భారీగా వరద వచ్చే రోజుల్లో మాత్రమే అదీ.. అరకొరగా విద్యుదుత్పత్తికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. బాబు కమీషన్ల కక్కుర్తితో ఖజానాపై రూ.4,124.64 కోట్ల భారంవిభజన నేపథ్యంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించింది. 960 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రంతో సహా పోలవరం ప్రాజెక్టును పూర్తిగా తామే నిర్మించి ఇస్తామని విభజన చట్టం ద్వారా కేంద్రం హామీ ఇచ్చింది. ఇందులో పోలవరం జల విద్యుత్ కేంద్రం అంచనా వ్యయం రూ.4,124.64 కోట్లు. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కారు.. కమీషన్ల కక్కుర్తితో 2016, సెప్టెంబరు 7న ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టి పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకుంది. దీంతో పోలవరం జల విద్యుత్కేంద్రం నిర్మాణ వ్యయాన్ని ఇవ్వబోమని కేంద్రం చెబితే.. దానికీ చంద్రబాబు అంగీకరించారు. తద్వారా రాష్ట్ర ఖజానాపై రూ.4,124.64 కోట్ల భారాన్ని చంద్రబాబు మోపారు.రివర్స్ టెండరింగ్‌తో రూ.560 కోట్లు ఆదాపోలవరం జల విద్యుత్ కేంద్రం టెండర్లను ‘ఈనాడు’ రామోజీరావు వియ్యంకుడికి చెందిన నవయుగకు 4.8 శాతం అధిక ధరకు 2018లో చంద్రబాబు ప్రభుత్వం కట్టబెట్టింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అక్రమంగా కట్టబెట్టిన ఆ కాంట్రాక్టును రద్దు చేశారు.టీడీపీ సర్కారు నిర్ణయించిన కాంట్రాక్టు విలువనే రూ.3216.11 కోట్లు అంచనా వ్యయంగా నిర్ధారించి 2019లో అప్పటి సీఎం వైఎస్ జగన్ రివర్స్ టెండర్ నిర్వహించారు. దీని ద్వారా 12.6 శాతం తక్కువ ధరకు పనులు చేసేందుకు మేఘా సంస్థ ముందుకొచ్చింది. దాంతో ఖజానాకు రూ.550 కోట్లు ఆదా అయ్యాయి. ఆ తర్వాత పోలవరం జలవిద్యుత్ కేంద్రం పనులను పరుగులెత్తించారు. ప్రెజర్ టన్నెళ్లతో సహా కీలకమైన పనులు 2024 మే నాటికే పూర్తయ్యాయి.గోదావరి సిగలో కలికితురాయిని దిష్టిబొమ్మగా మార్చేశారుపోలవరం ప్రధాన డ్యాంకు ఎడమ వైపున ఒక్కోటి 80 మెగావాట్ల చొప్పున 12 యూనిట్లతో మొత్తం 960 మెగావాట్ల సామర్థ్యంతో జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రాజెక్టులో 35.52 మీటర్ల స్థాయి నుంచి విద్యుదుత్పత్తి చేసేలా టర్బైన్లను అమర్చుతారు. 12 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తికి 1,40,291.04 క్యూసెక్కులు అవసరం. ప్రాజెక్టులో గరిష్ట స్థాయిలో అంటే 45.72 మీటర్ల స్థాయిలో 194.6 టీఎంసీల నీరు నిల్వ ఉంటేనే హెడ్ పెరుగుతుంది. అప్పుడే ఏడాది పొడవునా విద్యుదుత్పత్తి చేయవచ్చు. అందుకే ఈ విద్యుత్ కేంద్రాన్ని గోదావరి సిగలో కలికితురాయిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం పోలవరం ఎత్తును 41.15 మీటర్లకు కుదించడం వల్ల విద్యుదుత్పత్తి జరగదని, ఈ విద్యుత్ కేంద్రాన్ని దిష్టిబొమ్మగా మార్చేశారని విద్యుత్ రంగ నిపుణులు మండిపడుతున్నారు. -
చంద్రబాబు స్వార్థానికి పోలవరం ప్రాజెక్టు బలి
-
బాబు ప్యాకేజీ కోసం పోలవరం సర్వనాశనం
-
పోలవరం ఇక ఉత్త బ్యారేజే
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దానిని ఉత్త బ్యారేజిగ మార్చేశాయని నీటి పారుదల రంగ నిపుణులు, అధికారులు తేల్చి చెబుతున్నారు. ఈ ఎత్తులో ప్రాజెక్టు కింద కొత్తగా 7.20 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదని, గోదావరి, కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరణ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం, గోదావరి–పెన్నా అనుసంధానం ప్రశ్నార్థకమవుతాయని చెబుతున్నారు.రాష్ట్రం సమగ్రాభివృద్ధికి ఆ ప్రాజెక్టు చుక్కాని అయిన పోలవరం ప్రాజెక్టు డిజైన్ ప్రకారం 45.72 మీటర్ల ఎత్తులో నిర్మించి, 194.6 టీఎంసీల నీటిని నిల్వ చేయాలి. ఈ డిజైన్ ప్రకారమే స్పిల్ వేను 55 మీటర్ల ఎత్తుతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తి చేసింది. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యాంను పూర్తి స్థాయిలో నిర్మించి, నిర్వాసితులకు పునరావాసం కల్పించి 194.6 టీఎంసీలను నిల్వ చేయాలి.కానీ.. ప్రాజెక్టు నీటిని నిల్వ చేసే మట్టాన్ని 41.15 మీటర్లకే తగ్గిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంతో కేవలం 115.44 టీఎంసీలను మాత్రమే నిల్వ చేయడానికి సాధ్యమవుతుంది. ఇప్పుడిది ధవళేశ్వరం బ్యారేజి తరహాలోనే మారిపోతుంది. ధవళేశ్వరం బ్యారేజ్ నీటి నిల్వ సామర్థ్యం 2.93 టీఎంసీలు. గోదావరిలో ప్రవాహం ఉంటేనే గోదావరి డెల్టా ఆయకట్టుకు ఈ బ్యారేజ్ ద్వారా నీటిని మళ్లిస్తారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టులోనూ ఇదే పరిస్థితి తలెత్తుతుంది.ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కలే..పోలవరం ఎడమ కాలువలో 162.409 కిలోమీటర్ల నుంచి 63.20 టీఎంసీలను తరలించి ఉత్తరాంధ్రలో 8 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి 2008లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రూపకల్పన చేశారు. అందుకే పోలవరం ఎడమ కాలువను 17,580 క్యూసెక్కుల సామర్థ్యంతో చేపట్టారు. కానీ.. పోలవరం ప్రాజెక్టును కుదించడం వల్ల ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి నీళ్లందించడం కూటమి ప్రభుత్వం కలగా మార్చేసిందని నిపుణులు మండిపడుతున్నారు. గోదావరి–పెన్నా అనుసంధానం ప్రశ్నార్థకంపోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి–పెన్నా అనుసంధానాన్ని చేపట్టాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే కుడి కాలువ సామర్థ్యాన్ని 40 వేల క్యూసెక్కులకు పెంచే పనులకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా పోలవరం జలాశయాన్ని కుడి కాలువతో అనుసంధానం చేసే జంట సొరంగాల సామర్థ్యాన్ని 20 వేల క్యూసెక్కుల నుంచి 40 వేల క్యూసెక్కులకు పెంచేందుకు అనుమతి కోరుతూ 2022, మే 4న కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సమర్పించింది. కుడి కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజ్‌కు తరలించే గోదావరి జలాల్లో రెండు టీఎంసీలను ప్రకాశం బ్యారేజ్ నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్, నల్లమల సాగర్ (వెలిగొండ) మీదుగా బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌లోకి ఎత్తిపోసి, అక్కడి నుంచి తెలుగుగంగ కాలువ ద్వారా సోమశిల, కండలేరు జలాశయాలకు తరలించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ నీటిని సోమశిల మీదుగా కావేరికి తరలించాలని కేంద్రానికి ప్రతిపాదించింది. కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించడంతో గోదావరి–పెన్నా–కావేరి అనుసంధానం కూడా ప్రశ్నార్థకమైంది. తాగు నీటికి, పారిశ్రామిక అవసరాలకు ఇబ్బందేకమీషన్ల కక్కుర్తితో కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను దక్కించుకునే క్రమంలో.. నీటి పారుదల విభాగానికి అయ్యే నిధులిస్తే చాలని 2016 సెప్టెంబరు 7న అప్పటి సీఎం చంద్రబాబు అంగీకరించారు. దాంతో తాగునీటి విభాగానికి అయ్యే ఖర్చును ఇవ్వబోమని కేంద్రం తేల్చిచెప్పింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. సాగు నీటితోపాటే తాగునీటినీ తీసుకెళ్తాం కాబట్టి తాగు నీటి విభాగానికి అయ్యే నిధులను ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. ఇందుకు కేంద్రం అంగీకరించింది. పోలవరం కుడి, ఎడమ కాలువల కింద 28.50 లక్షల మంది దాహార్తి తీర్చడంతోపాటు విశాఖపట్నం తాగు, పారిశ్రామిక అవసరాలకు 23.44 టీఎంసీల సరఫరాకు అయ్యే వ్యయాన్ని భరించేందుకు కేంద్రం అంగీకరించింది. ఇప్పుడు ప్రాజెక్టు ఎత్తు కుదించడంతో తాగు, పారిశ్రామిక అవసరాలకు నీటిని సరఫరా చేయలేని దుస్థితి నెలకొందని నీటి పారుదల రంగ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.నీరుగారిపోనున్న ప్రాజెక్టు లక్ష్యాలుపోలవరం ప్రాజెక్టు ఎత్తు కుదించడం ద్వారా 41.15 మీటర్లలో 115.44 టీఎంసీలు నీరే నిల్వ ఉంటుంది. దీనివల్ల ప్రాజెక్టు లక్ష్యాలే నీరుగారిపోతాయి.» నీటి మట్టం 41.15 మీటర్లకంటే ఎగువన ఉంటేనే కుడి, ఎడమ కాలువ ద్వారా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించడానికి సాధ్యమవుతుంది. ఇప్పుడు ఈ రెండు కాలువల ద్వారా నీరందక 7.20 లక్షల ఎకరాలకు నీరందని దుస్థితి.» కుడి కాలువ కింద 3.20 లక్షల ఎకరాలకు నీళ్లందించాలి. ఇందుకు 80.09 టీఎంసీలు అవసరం. ఇదే కాలువ ద్వారా కృష్ణా డెల్టాలో 13.18 లక్షల ఎకరాల స్థిరీకరణకు 84.70 టీఎంసీలు మళ్లించాలి. అంటే.. కుడి కాలువ ద్వారానే 164.79 టీఎంసీలు మళ్లించాలి. ఎడమ కాలువ కింద 4 లక్షల ఎకరాలకు నీళ్లందించడానికి 84.80 టీఎంసీలు అవసరం. విశాఖపట్నం పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు 23.44 టీఎంసీలు మళ్లించాలి. అంటే ఎడమ కాలువకు 108.24 టీఎంసీలు అవసరం. » కుడి, ఎడమ కాలువల ద్వారా పుష్కర, తాడిపూడి ఎత్తిపోతల ద్వారా నీళ్లందిస్తున్న 2.98 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చు. అంటే.. ప్రాజెక్టు కింద నిర్దేశించిన మిగతా 4.22 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదు. కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టు, గోదావరి డెల్టాలో రెండో పంటకు 10.13 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కూడా అసాధ్యం. » పోలవరానికి ఎగువన తెలంగాణలో కాళేశ్వరం, దేవాదుల, సీతారామ ఎత్తిపోతల ద్వారా ఎప్పటికప్పుడు నీటిని ఎత్తిపోస్తారు. గోదావరి ఉప నదులపై ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్రలో ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలవరానికి వరద వచ్చే రోజులు కూడా తగ్గనున్నాయి. పోలవరంలో నీటిని నిల్వ చేసే ఎత్తును తగ్గించడంతో ఆయకట్టుకు నీళ్లందించం సవాలే అని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
LIVE : YSRCP అంబటి రాంబాబు ప్రెస్ మీట్
-
కూటమి కుట్రకు పోలవరం ప్రాజెక్టు బలి: అంబటి విమర్శలు
సాక్షి, గుంటూరు: ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదాను సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు అని వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం కుట్రకు పోలవరం ప్రాజెక్టు బలికాబోతుందన్నారు. చంద్రబాబు ఇలాంటి విషయాల్లో చాలా దిట్ట అని, ప్రభుత్వ కుట్రలతో ఈ ప్రాజెక్టు బ్యారేజీ స్థాయికి పడిపోయిందన్నారు.పోలవరం ప్రాజెక్టుపై మంత్రి నిమ్మలరామానాయుడు అసలు కన్నా కొసరు ఎక్కువ మాట్లాడారని అంబటి మండిపడ్డారు. రెండు దశలు ఉండవంటూ నిమ్మల చేసిన వ్యాఖ్యలు వింటుంటే.. ఆయనకు పోలవరం ప్రాజెక్టుపై పూర్తి అవగాహన లేనట్టుందని విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టు ఏదైనా దశలవారీగా పూర్తిచేస్తారని తెలిపారుప్రాజెక్టు మొదటి దశలో 115.5 టీఎంసీల నిల్వకు పనికొస్తుందని.. చివరగా 194.6 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తేనే ప్రాజెక్టు పూర్తి ఫలితాలు అందుతాయని వివరించారు. అయితే 41.15 అడుగుల ఎత్తుకే నిర్మించడానికి కూటమీ ప్రభుత్వం సిద్ధమైందని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏం జరిగినా.. తప్పు వైఎస్సార్సీపీపై నెట్టివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.చదవండి: బాబూ.. అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు అవసరమా?: వడ్డే శోభనాద్రీశ్వరరావు‘చంద్రబాబు తప్పిదాలు చేస్తే వైఎస్జగన్ వచ్చాక వాటిని సరిచేశారు. బాబు తప్పిదాల వల్లే ప్రాజెక్టు సరైన సమయంలో పూర్తికాలేదు. పోలవరం ప్రాజెక్టుపై వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు తెలియాలి. చంద్రబాబు వచ్చాక పోలవరం ప్రాజెక్టుకు తీవ్రమైన విఘాతం ఏర్పడింది. ప్రాజెక్టుకు ఆయన ఉరి వేస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై చంద్రబాబు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఈ ప్రాజెక్టును ఆనాడు వైఎస్సార్ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. బాబు స్వార్థం వల్ల ప్రాజెక్టు కుంటుపడింది. నేను చెప్పిన ప్రతి అంశం సత్య శోధనకు నిలబడింది. డయాఫ్రం వాల్ నిర్మాణం చంద్రబాబు చేసిన తప్పిదమే. కూటమి ప్రభుత్వం పోలవరానికి అన్యాయం చేస్తోంది. ప్రాజెక్టును పూర్తిచేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వమే లాలూచీ పడింది. ఇంత ఘోరం జరుగుతుంటే గొంతెత్తి మాట్లాడాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీపై ఉంది. రాష్ట్ర ప్రజలు దీనిపై ఆలోచించాల్సిన అవసరం ఉంది.పోలవరం సెకండ్ ఫేజ్‌ను నాశనం చేయడానికి చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. డబ్బు కాజేయాలనే దురుద్దేశంతోనే ప్రాజెక్టును మీరు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను ఏం చేశారు? పోలవరం కోసం ఇచ్చిన డబ్బునుడైవర్ట్ చేశారు. ఆ నింద వైఎస్సార్సీపీపై వేసే ప్రయత్నం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న పని వల్ల జీవనాడికి తీవ్ర అన్యాయం. పోలవరంపై జరుగుతున్న కుట్రలపై ప్రజలను చైతన్యవంతం చేస్తాం. ఇప్పటికైనా చేసిన తప్పులను చంద్రబాబు సరిచేసుకోవాలి. తెలుగుజాతికి ద్రోహం చేయొద్దు.’ అని అంబటి పేర్కొన్నారు. -
చంద్రబాబు రైతు ద్రోహి
-
పోలవరం ఎత్తు తగ్గించడంపై మార్గాని భరత్ స్ట్రాంగ్ రియాక్షన్
-
చంద్రబాబుది ఎప్పుడూ దుర్బుద్ధే: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి,అమరావతి : చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్‌ను ఏటీఎంలా వినియోగిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. అధికారంలోకి రావడం ఆలస్యం పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించి రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్ట్ నిధులను దారి మళ్లించడమే కాక ప్రాజెక్ట్‌కు చంద్ర గ్రహణం పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తును తగ్గిస్తే తాగు,సాగు నీటి అవసరాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబు దుర్భుద్ధిని గ్రహించి తగిన గుణపాఠం చెప్పాలని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. చంద్రబాబు ఏటీఎంగా పోలవరం ప్రాజెక్టు. అధికారంలోకి రావడం ఆలస్యం-పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించి రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నాడు చంద్రబాబు. ప్రాజెక్టు నిధులను దారిమళ్లించడమే కాక ప్రాజెక్టుకు చంద్ర గ్రహణం పట్టిస్తున్నాడు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తే తాగు, సాగు నీటి…— Vijayasai Reddy V (@VSReddy_MP) October 31, 2024 -
కేంద్రం నిర్ణయంపై బాబు మౌనం! పోలవరం ప్రాజెక్టుపై జగన్ కీలక వ్యాఖ్యలు
-
రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తారా బాబూ..?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘చంద్రబాబూ.. రాష్ట్రానికి ఇంతటి తీరని అన్యాయం చేస్తారా?. పోలవరం ప్రాజెక్టు ఎత్తును పరిమితం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నా మీరు ఎందుకు నోరు మెదపడం లేదు’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. ఈ మేరకు బుధవారం తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే..1. చంద్రబాబు గారూ.. రాష్ట్రానికి ఇంతటి తీరని అన్యాయం చేస్తారా?పోలవరం ప్రాజెక్టు ఎత్తును పరిమితం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నా మీరు ఎందుకు నోరు మెదపడంలేదు? సవరించిన అంచనాలను ఆ మేరకే పరిమితం చేయడం రాష్ట్రానికి తీరని అన్యాయం కాదా? దీనివల్ల ప్రాజెక్టు లక్ష్యాలనే దెబ్బతీస్తున్నారు కదా? దేనికి లాలూచీపడి మీరు ఈ పనికి ఒడిగట్టారు? ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి, కేంద్ర మంత్రివర్గంలో మీ పార్టీ ఎంపీలు కూడా ఉండి ఎందుకు ఈ అంశంపై అభ్యంతరం చెప్పలేదు? చంద్రబాబు గారూ.. ఎప్పుడు ప్రజలు మీకు అధికారాన్ని అప్పగించినా రాష్ట్ర భవిష్యత్‌ను, ప్రజల భవిష్యత్‌ను తాకట్టు పెడతారని, మీ స్వార్థ రాజకీయాలకు, ఆర్థిక, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను నట్టేటా ముంచేస్తారని మరోసారి నిరూపిస్తున్నారు కదా?2. పోలవరం గరిష్ట ఎత్తు 45.72 మీటర్లు అయితే, 41.15 మీటర్లకే మీరు ఎందుకు పరిమితంచేస్తున్నారు? తద్వారా 194.6 టీఎంసీలు ఉండాల్సిన నీటినిల్వ 115 టీంఎసీలకే పడిపోతుందని తెలిసికూడా మీరు ఎందుకు అభ్యంతరం చెప్పడం లేదు? ఈ కారణంగా వరద వస్తే తప్ప కుడి, ఎడమ కాల్వలకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయలేని దుస్థితి నెలకొంటుంది. గోదావరి డెల్టా ప్రాంతంలో పంటలకు స్థిరంగా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. సరిగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయలేం. శరవేగంగా విస్తరిస్తున్న విశాఖపట్నం మహానగరానికి తాగునీరు, పారిశ్రామిక అవసరాలను తీర్చలేం. అన్నికంటే సుజల స్రవంతి ప్రాజెక్టుపై ఉన్నో ఆశలు పెట్టుకున్న ఉత్తరాంధ్రకు అన్యాయమే జరుగుతుంది. మీ మద్దతు మీదే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉందన్న వాస్తవ పరిస్థితుల మధ్య రాష్ట్ర భవిష్యత్‌కు అత్యంత కీలమైన పోలవరం ఎత్తు తగ్గింపు విషయంలో మీరు ఎందుకు చేతులెత్తేస్తున్నారు? ఎందుకు బేలతనం చూపుతున్నారు? దీనివెనుక మీ స్వార్థం ఏంటి చంద్రబాబు గారూ..!3. పోలవరం ప్రాజెక్టు విషయంలో అప్పుడైనా, ఇప్పుడైనా మీరు చేసిన, చేస్తున్న దుర్మార్గాలకు అంతులేకుండా పోతోంది. మొదటనుంచీ మీరు స్వప్రయోజనాలే చూసుకున్నారు. మీ బంధువులకు, మీ పార్టీ నాయకులకు కాంట్రాక్టులు ఇచ్చి డబ్బులు సంపాదించుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన ప్రాజెక్టును మీ చేతిలోకి తీసుకున్నారు. ప్రత్యేక ప్యాకేజీ డ్రామాతో రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. నామినేషన్ల పద్ధతిలో కాంట్రాక్టులు కట్టబెట్టి పెద్దమొత్తంలో ప్రజాధనాన్ని లూటీ చేశారు. చంద్రబాబుకు పోలవరం ప్రాజెక్టు ఏటీఎం మాదిరి డబ్బులు గుంజుకునే యంత్రంలా మారిందని సాక్షాత్తూ ఆనాడు ప్రధానమంత్రి ప్రజల సాక్షిగా అన్న మాటలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. నాడు ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రాన్ని తీవ్రంగా దెబ్బకొట్టిన మీరు మళ్లీ రాష్ట్రానికి జీవనాడి, పోలవరం విషయంలో అంతే నష్టం చేస్తున్నారు.4. చంద్రబాబు గారూ.. గతంలో మీరు మీ స్వార్థం కోసం ప్రాజెక్టు నిర్మాణాన్ని అస్తవ్యస్తం చేశారు. ఒక పద్ధతి, ఒక వ్యూహం, ఒక ప్రణాళిక లేకుండా డబ్బులు వచ్చే పనులు మాత్రమే చేశారు. స్పిల్‌వేను పూర్తిచేయకుండా కాపర్ డ్యాంలు మొదలుపెట్టారు. వీటిని పూర్తి చేయకుండానే ఖాళీలు వదిలేసి డయాఫ్రం వాల్ కట్టారు. ఆ నిర్మాణాల్లో కూడా లోపాలే. కాఫర్ డ్యాంలో సీపేజీకి కారకులు మీరు. మీ అసమర్థత కారణంగా కాఫర్ డ్యాంలు పూర్తిచేయకుండా ఖాళీలు విడిచిపెట్టారు. ఆ ఖాళీలుగుండా వరదనీరు ఉధృతంగా ప్రవహించి డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడానికి మీ నిర్వాకాలే కారణమని సాక్షాత్తూ అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఇటీవలే తన నివేదికలో కుండబద్దలు కొట్టి చెప్పింది. చివరకు స్పిల్వేలలో పిల్లర్లు కూడా పూర్తిచేయకుండా గేట్లు పెట్టామంటూ ఫొటోలకు ఫోజులిచ్చిన చరిత్ర మీది. అయినా తప్పులు అంగీకరించడానికి, చేసిన వాటిని సరిదిద్దుకోవడానికి మీకు మనసు రాదు. మీ చేతిలో ఉన్న మీడియాతో నిరంతరం అబద్ధాలు, తప్పుడు ప్రచారాలు చేసి ఆ తప్పుల నుంచి బయటపడడానికి నిరంతరం ప్రయత్నిస్తారు తప్ప, పోలవరం పట్ల మీలో ఇసుమంతైనా నిజాయితీ లేదు.5. మీరు చేసిన తప్పులన్నింటినీ సరిదిద్ది, ప్రతి ఏడాదీ వరుసగా వరదలు వచ్చినా, కోవిడ్‌లాంటి సంక్షోభం వచ్చినా కీలకమైన పనులన్నీ వైయస్సార్సీపీ హయాంలో చేశాం. స్పిల్‌వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, ఎగువ కాఫర్‌డ్యాం, దిగువ కాఫర్ డ్యాం ఇలా కీలకమైన పనులన్నీ పూర్తిచేశాం. 2022లో గోదావరి మహోగ్రంగా ఉప్పొంగినా ప్రాజెక్టు ఎక్కడా చెక్కుచెదరలేదు. అంతేకాదు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన నిరంతర ప్రయత్నాల వల్ల పోలవరం ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరలో అందుబాటులోకి తీసుకురావడానికి రూ.12,157 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. కానీ.. చంద్రబాబు గారూ.. మీరు ఎప్పటిలానే దుర్భుద్ధిని చూపించి, ఎన్డీయేతో పొత్తు ఖరారైన తర్వాత, ఎన్నికలకు ముందు రావాల్సిన ఆ డబ్బును రానీయకుండా, అడ్డుకున్నారు. ఇప్పుడు ఆ డబ్బును విడుదల చేస్తున్నట్టు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.6. చంద్రబాబు గారూ.. ఇక ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా కొట్టుకుపోయిన ఆ డయాఫ్రం వాల్‌ను పూర్తిచేసి, ఎర్త్ కం రాక్‌ఫిల్ డ్యాంను కట్టడంతోపాటు ఈలోగా మిగిలిన నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి. ఇవన్నీ పూర్తిచేస్తామంటూ మీరు, మీ కూటమి పార్టీలు ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు తెచ్చుకుని, అధికారంలోకి వచ్చారు. వచ్చీరాగానే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడానికి సరే అంటున్నారు, ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుంది? వెంటనే ఈ అంశంపై కేంద్రం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి దాన్ని సరిదిద్దండి. పోలవరం ప్రాజెక్టు గరిష్ట ఎత్తు 45.72 మీటర్లకే సవరించిన అంచనాలకు ఒప్పించి, నిర్వాసితులందరికీ న్యాయంచేసి పూర్తిచేయండి. లేకపోతే ప్రజలే మీపై తిరుగుబాటు చేస్తారు. -
పోలవరానికి మళ్లీ ‘చంద్ర’గ్రహణం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును ‘చంద్ర’గ్రహణం వీడటంలేదు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నప్పటి నుంచి దానిని ఛిద్రం చేస్తూనే ఉన్నారు. మధ్యలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రాజెక్టును గాడిలో పెట్టి, పూర్తిస్థాయిలో నిర్మాణానికి కేంద్రాన్ని ఒప్పించినప్పటికీ, ఈ ఏడాది ఎన్డీఏలో చేరిన చంద్రబాబు దానికీ మోకాలడ్డారు. పూర్తిస్థాయిలో 45.72 మీటర్ల నిర్మాణానికి కేంద్రం నిధులిస్తే వైఎస్సార్సీపీకి రాజకీయంగా ప్రయోజనం కలుగుతుందంటూ కేంద్రంతో 41.15 మీటర్లకే ప్రాజెక్తును పరిమితం చేయించి, రాష్ట్ర ప్రయోజనాలకు గండి కొట్టేశారు. జల శక్తి శాఖ ప్రతిపాదనలను అడ్డుకొని పోలవరం తొలి దశలో 41.15 మీటర్లు, రెండో దశలో 45.72 మీటర్ల ఎత్తు వరకు నిర్మించేలా అంచనా వ్యయాన్ని సవరిస్తూ ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ బోర్డు (పీఐబీ) ఈ ఏడాది ఫిబ్రవరి 27న మెమొరాండంను ఆమోదించింది. దాని ఆధారంగా నిధులు మంజూరు చేసేందుకు 2017 మార్చి 15న ఆమోదించిన తీర్మానాన్ని సవరించాలంటూ కేంద్ర కేబినెట్‌కు మార్చి 6న కేంద్ర జల్ శక్తి శాఖ ప్రతిపాదన పంపింది. అప్పటికే ఎన్డీఏలో చేరిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. పోలవరానికి నిధులిస్తే ఎన్నికల్లో రాజకీయంగా వైఎస్సార్సీపీకి ప్రయోజనం చేకూరుతుందని బీజేపీ పెద్దల చెవిలో ఊదారు.దాంతో ఆ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ పక్కన పెట్టింది. ప్రాజెక్టును 41.15 మీటర్లకే పరిమితం చేస్తూ సవరించిన అంచనా వ్యయం రూ.30,436.95 కోట్లకు ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఇప్పటిదాకా చేసిన ఖర్చు పోను మిగిలిన రూ.12,157.53 కోట్లు ఇస్తామని చెప్పింది. దీనిని కేంద్ర మంత్రివర్గంలోని టీడీపీ మంత్రి కె.రామ్మోహన్నాయుడు వ్యతిరేకించలేదు. అంటే.. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ఎత్తు తగ్గింపునకు అంగీకరించినట్లు స్పష్టమవుతోంది. 41.15 మీటర్ల ఎత్తుతో నిష్ఫలమే పోలవరం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్లు (150 అడుగులు). గరిష్ట నీటి నిల్వ 194.6 టీఎంసీలు. ప్రాజెక్టు కనీస నీటి మట్టం 41.15 మీటర్లు. ఈ స్థాయిలో కేవలం 115.44 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంటాయి. 41.15 మీటర్లకంటే ఎగువన నీటి నిల్వ ఉన్నప్పుడే కుడి, ఎడమ కాలువల ద్వారా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించవచ్చు. ఇప్పుడు ప్రాజెక్టును 41.15 మీటర్లకే తగ్గించడం వల్ల కాలువలకు పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించడం సాధ్యం కాదు.ప్రాజెక్టు ఆయకట్టు 7.20 లక్షల ఎకరాలతోపాటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఆయకట్టు 8 లక్షల ఎకరాలు, గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరణ కూడా అసాధ్యం. 960 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తీ ప్రశ్నార్థకమవుతుంది. మహానగరంగా మారుతున్న విశాఖపట్నం పారిశ్రామిక, తాగునీటి అవసరాలు తీర్చడమూ కష్టమే. అంటే.. ప్రాజెక్టు లక్ష్యాలకే గండి కొట్టేశారని నిపుణులు చెబుతున్నారు. జాతీయ ప్రాజెక్టును రాష్ట్ర ప్రాజెక్టుగా మార్చేసిన వైనం 2005లో అన్ని అనుమతులు సాధించి అప్పటి సీఎం వైఎస్సార్ పోలవరం నిర్మాణాన్ని చేపట్టారు. ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం తీవ్ర స్థాయిలో పోరాడారు. జాతీయ హోదా ప్రతిపాదన తుది దశలో ఉండగా ఆయన హఠాన్మరణం చెందారు. చివరకు విభజన చట్టం ద్వారా పోలవరానికి జాతీయ హోదా కల్పించారు. వంద శాతం వ్యయంతో పోలవరాన్ని పూర్తి చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం కమీషన్ల కక్కుర్తితో ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ పోలవరం బాధ్యతలను 2016 సెపె్టంబరు 7న దక్కించుకుంది. ఈ క్రమంలో 2013–14 ధరల ప్రకారం నీటి పారుదల విభాగానికి అయ్యే వ్యయం రూ.20,398.61 కోట్లతోనే ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అంగీకరించారు. కానీ, భూసేకరణ, నిర్వాసితుల పునరావాసానికే రూ.33,168.24 కోట్లు అవసరం. అలాంటిది రూ.20,398.61 కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేస్తానని అంగీకరించడం ద్వారా ప్రాజెక్టును ఆరి్థక సంక్షోభంలోకి నెట్టేశారు.‘చంద్ర’గ్రహణం నుంచి విముక్తి చేసిన వైఎస్ జగన్ చంద్రబాబు కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ మ్యాన్యువల్‌ను తుంగలో తొక్కారు. గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, కాఫర్ డ్యాంలను కట్టకుండానే ప్రధాన డ్యాం గ్యాప్–2లో డయాఫ్రం వాల్ కట్టేశారు. 2019 ఫిబ్రవరి నాటికి కాఫర్ డ్యాంలకు ఇరువైపులా ఖాళీలు వదిలేసి చేతులెత్తేశారు. దీంతో 2018, 2019లో వచి్చన గోదావరి వరదలకు డయాఫ్రం వాల్ దెబ్బతింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక.. చంద్రబాబు తప్పిదాలను సరిదిద్దుతూ ప్రణాళికాబద్ధంగా పోలవరాన్ని చేపట్టారు.కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్లను పూర్తి చేసి 2021 జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించారు. గ్యాప్–3లో కాంక్రీట్ డ్యాం, గ్యాప్–1లో ప్రధాన డ్యాం డయాఫ్రం వాల్, దిగువ కాఫర్ డ్యాంను పూర్తి చేశారు. విద్యుత్ కేంద్రం పనులను కొలిక్కి తెచ్చారు. కుడి, ఎడమ కాలువలను జలాశయంతో అనుసంధానం పనులను దాదాపుగా పూర్తి చేశారు. దెబ్బతిన్న డయాఫ్రం వాల్ భవితవ్యాన్ని తేలి్చతే.. శరవేగంగా ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులతో సమావేశమైన ప్రతిసారీ తాజా ధరల మేరకు ప్రాజెక్టుకు నిధులివ్వాలని కోరారు.ఇందుకు అంగీకరించిన ప్రధాని నరేంద్ర మోదీ.. తొలి దశలో 41.15 మీటర్ల వరకూ నీటిని నిల్వ చేసి, ఆ తర్వాత నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ 45.72 మీటర్లకు పెంచాలని ప్రతిపాదించారు. ఇందుకు వైఎస్ జగన్ అంగీకరించారు. దీంతో తొలి దశ పనులు పూర్తి చేసేందుకు రూ.12,911.15 కోట్లు ఇచ్చేందుకు అంగీకరిస్తూ 2023 జూన్ 5న కేంద్ర ఆరి్థక శాఖ మంత్రి నోట్ జారీ చేశారు. ఇలా పోలవరానికి పట్టిన ‘చంద్ర’గ్రహణాన్ని వైఎస్ జగన్ విడిపించారు. కానీ, ఇప్పుడు మళ్లీ చంద్రబాబు రంగప్రవేశంతో ప్రాజెక్టుకు మరోసారి గ్రహణం పట్టింది. -
తాకట్టు నాయుడు.. దమ్ముంటే ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పు
-
జయము జయము చంద్రన్న పాటకు 23కోట్ల 11 లక్షలు.. విస్తుపోయే నిజాలు
-
పోలవరంపై రహస్య' రాజకీయం.. బయటపడ్డ తాకట్టు నాయుడు గుట్టు
-
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు.. ఎవరు ఊహించని ప్రమాదం!
-
పోలవరాన్ని జీవచ్చవంలా మార్చే చంద్రబాబు నీచ కుట్ర
-
పోలవరంపై మరో కుట్ర..
-
పోలవరం జోలికొస్తే బాబు సర్కార్‌కు నూకలు చెల్లినట్టే: సీపీఐ రామకృష్ణ
సాక్షి, అనంతపురం: పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు వల్ల రైతులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. అలాగే, పోలవరం జోలికి వస్తే చంద్రబాబు ప్రభుత్వానికి నూకలు చల్లినట్లేనని హెచ్చరించారు.సీపీఐ రామకృష్ణ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు దుర్మార్గం. చంద్రబాబు ఎన్డీయేలో భాగస్వామి. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపునకు చంద్రబాబే నైతిక బాధ్యత వహించాలి. 45.72 అడుగుల ప్రాజెక్టును 41 అడుగులకు కుదిస్తే ఎలా?. పునరావస ప్యాకేజీ ఎగ్గొట్టేందుకే కేంద్రం కుట్రలు చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారు?.పోలవరం జోలికి వస్తే చంద్రబాబు ప్రభుత్వానికి నూకలు చెల్లినట్లే. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు వల్ల రైతులకు తీరని అన్యాయం జరుగుతుంది. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు దారుణం. నవంబర్ ఏడో తేదీన విద్యుత్ ఛార్జీల పెంపుపై విజయవాడలో వామపక్షాల సమావేశం ఉంది. విద్యుత్ ఛార్జీల పెంపు పోరాటం చేస్తాం అని చంద్రబాబు సర్కార్‌ను హెచ్చరించారు. ఇది కూడా చదవండి: పోలవరానికి చంద్రబాబు కూటమి ఉరి.. -
పోలవరంపై మరో కుట్ర.. బాబు మార్క్ ‘రహస్య’ రాజకీయం!
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అప్పులు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోకముందే చంద్రబాబు ఇప్పటికే భారీ మొత్తంలో అప్పులు తెచ్చారు. మరోవైపు.. పోలవరంపై కూడా చంద్రగ్రహణం పట్టుకుంది. బాబు పాలనలో పోలవరంపై మరో కుట్ర జరిగింది.పోలవరం ప్రాజెక్టు ఎత్తును కుదించారు. 41.15 మీటర్లకే పరిమితం చేస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పోలవరం ఎత్తు 45.72 మీటర్ల నుండి 41.15 మీటర్ల ఎత్తుకి కుదింపు జరిగింది. కాగా, పోలవరం ఎత్తు తగ్గించినప్పటికీ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కేబినెట్లో అభ్యంతరం తెలుపలేదు. అయితే, ఆగస్టు 28వ తేదీన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని చంద్రబాబు ప్రభుత్వం రహస్యంగా ఉంచింది.పోలవరం ప్రాజెక్ట్ ఎత్తును 41.15 మీటర్లకే తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపలేదు. ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడం గమనార్హం. ప్రాజెక్ట్ ఎత్తు కుదింపుతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోనుంది. 194.6 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో పోలవరం ప్రాజెక్టును వైఎస్సార్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రాజెక్ట్ ఎత్తు కుదించడంతో 115.4 టీఎంసీలకు నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోనుంది. పోలవరంపై చంద్రబాబు ప్రభుత్వం మోసపూరిత వైఖరిపై రైతుల్లో ఆందోళన నెలకొంది.ఇదిలా ఉండగా.. ఎన్నికల సమయంలో సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు నేడు అప్పులు తేచ్చే ప్రక్రియలో బిజీ అయిపోయారు. తాజాగా చంద్రబాబు.. మరో మూడు వేల కోట్ల అప్పు తెచ్చారు. నిన్న 7.17 శాతం వడ్డీకి మూడు వేల కోట్లను ఏపీ ప్రభుత్వం అప్పు తెచ్చింది. రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీల వేలం ద్వారా కూటమి ప్రభుత్వం రుణం సమీకరించింది. ఇక, ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల కాలంలోనే 59వేల కోట్లను చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేసింది. మరోవైపు.. కార్పొరేషన్ల ద్వారా మరో ఎనిమిది వేల కోట్లు అప్పులు తీసుకుంది. కాగా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండానే చంద్రబాబు ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోంది. -
కూటమి కుట్ర.. పోలవరానికి "చంద్ర"గ్రహణం..!
-
పోలవరం నిర్వాసితుల నోట్లో మట్టి
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితల సొమ్ముకు సీఎం చంద్రబాబు ఎసరు పెట్టారు. వారికి వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రకటించిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రూ.10 లక్షలు కాదని, ఎనిమిదేళ్ల క్రితం అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రకటించిన ప్యాజీనే అమలు చేసే యోచనలో బాబు ప్రభుత్వం ఉంది. ఈమేరకు అధికారులు బిల్లులు సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీని ప్రకారం ఇప్పుడు ప్రతి నిర్వాసితుడికి దాదాపు రూ.3.5 లక్షల కోత పడుతుంది. దీనిపై నిర్వాసితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. – వేలేరుపాడు2017లో ప్యాకేజీ ఇలా.. ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 41.15 కాంటూర్ పరిధిలో ఎనిమిది మండలాల్లో 90 రెవెన్యూ గ్రామాల్లో 38,060 మంది పోలవరం నిర్వాసితులున్నారు. ఇందులో ఏడు మండలాలు తెలంగాణ నుంచి కలుపుకున్నవి కాగా మరో మండలం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది. 2017లో 2013 భూసేకరణ చట్టం ప్రకారం గిరిజనేతరులకు రూ.6.36 లక్షలు ప్యాకేజీ ప్రకటించారు. ఇందులో వారి æజీవితాంతం ఉపాధికి రూ.5 లక్షలు, అలవెన్స్ రూ.36,000, రవాణా చార్జీలకు రూ.50 వేలు, పునరావాస అలవెన్స్‌గా రూ.50 వేలు ఉన్నాయి. ఎస్టీలు, ఎస్సీలకు రూ.50 వేలు అదనంగా ఇచి ప్యాకేజీ రూ.6.86 లక్షలుగా నిర్ణయించారు. లబ్ధిదారులు, ప్యాకేజీని పెంచిన జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నిర్వాసితులు అందరినీ ప్యాకేజీలోకి తీసుకొచ్చారు. ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు, కుక్కునూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో చింతూరు, వీఆర్‌పురం, కూనవరం మండలాల్లోని 36 గ్రామాలకు చెందిన మరో 13,937 మంది నిర్వాసితులను లబి్ధదారులుగా చేర్చారు. దీంతో మొత్తం నిర్వాసితుల సంఖ్య 44,797కు పెరిగింది. నిర్వాసితుల కష్టాలు కళ్లారా చూసి, వారి ఆరి్థక స్థితిగతులను పరిగణనలోకి తీసుకొన్న వైఎస్ జగన్ పెరిగిన ధరలకనుగుణంగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి మరో రూ.3.64 లక్షలు కలిపి రూ.10 లక్షలకు పెంచారు. అదనంగా రూ.550 కోట్లు కూడా కేటాయించారు. వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రి అయి ఉంటే నిర్వాసితులకు పెరిగిన ప్యాకేజీ లభించేది. నిర్వాసితుల త్యాగాలకు అర్థం ఉండేది.నిర్వాసితులకు అన్యాయం చేస్తున్న బాబుఏ ప్రభుత్వమైనా ఓ ప్రాజెక్టు కోసం భూములిచ్చి త్యాగం చేసిన వారికి న్యాయం చేయాలి. కానీ, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం పోలవరం నిర్వాసితులకు తీరని అన్యాయానికి ఒడిగట్టింది. వాస్తవంగా ప్రస్తుత ద్రవ్యోల్బణానికి అనుగుణంగా నిర్వాసితలకు ప్యాకేజీని సవరిస్తే రూ.13 లక్షల వరకు ఇవ్వాల్సి ఉంది. ఈమేరకు పెంచకపోగా, గత ప్రభుత్వం పెంచిన ప్యాకేజీని కాదని 2017లో ప్రకటించన మేరకే ఇచ్చి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తోంది. నిర్వాసితులకు ఇవ్వాల్సిన రూ.550 కోట్లకు ఎసరు పెడుతోంది.నిర్వాసితుల త్యాగాలను గుర్తించిన జగన్ పోలవరం నిర్వాసితుల త్యాగాలను గుర్తించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి జారీ చేసిన రూ.10 లక్షల జీవోను ప్రస్తుత సీఎం చంద్రబాబు అమలు చేయాలి. పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకొని, పార్టీలకతీతంగా నిర్వాసితులకు న్యాయం చేయాలి.రూ.13 లక్షలు ఇవ్వాలి పెరిగిన ధరలకు అనుగుణంగా ఆర్ అండ్ ఆర్ వ్యక్తిగత ప్యాకేజీ రూ.13 లక్షలు ఇవ్వాలి. ప్రాజెకు నిర్మాణ వ్యయాన్ని ఏటా పెంచుతున్నారు. నిర్వాసితులకు మాత్రం 2017లో ప్రకటించిన పాత ప్యాకేజీ ఇస్తామంటున్నారు. ఇదెక్కడి న్యాయం? – కుంజం మురళి, ఎంపీపీ, దేవీపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లా మా త్యాగాలకు విలువ లేదా? నిర్వాసితులు త్యాగమూర్తులంటూ వేదికలపై సీఎం చంద్రబాబు చెబతారు. ప్యాకేజీ విషయానికొస్తే ఉపాధి కూలీలకు ఇచ్చే రోజువారీ వేతనమంత కూడా లేదు. ఉపాధి కూలీలకు 2017లో రోజువారీ వేతనం రూ.150 ఉంటే ప్రస్తుతం రూ.300కు పెరిగింది. మాకు మాత్రం ఎనిమిదేళ్ల క్రితం ప్యాకేజీ ఇవ్వడం అన్యాయం. మా త్యాగాలకు గుర్తింపు ఇదేనా? – గుజ్జా విజయ, జెడ్పీటీసీ సభ్యురాలు, కూనవరం మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా -
పోలవరానికి 'చంద్రబాబు కూటమి' ఉరి!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వమే ఉరి వేసి.. ఊపిరి తీసేసిందా? ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గిస్తామని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు అంగీకరించిందా? 41.15 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అంచనా వ్యయాన్ని సవరిస్తూ గత ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసినప్పుడు.. ఆ సమావేశంలో పాల్గొన్న టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు అభ్యంతరం చెప్పనిది అందుకేనా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి కేంద్ర, రాష్ట్ర అధికారవర్గాలు! సాధారణంగా కేంద్ర కేబినెట్ తీసుకునే నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి అదే రోజు మీడియాకు వెల్లడిస్తారు. కానీ.. 41.15 మీటర్ల వరకూ పోలవరం పూర్తి చేయడానికి రూ.12,157.53 కోట్లు ఇచ్చేందుకు ఆమోదముద్ర వేస్తూ ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి అశ్విని వైష్ణవ్ ఆ రోజు మీడియాకు వెల్లడించలేదు. ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు అంశం బహిర్గతమవుతుందనే పోలవరానికి నిధులు మంజూరు చేసిన అంశాన్ని మంత్రి ఆ రోజు ప్రస్తావించలేదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదాలతోపాటు ఎత్తు తగ్గించడం వల్ల ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యం నీరుగారిపోయిందని నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చుక్కాని..⇒ పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల (150 అడుగులు) గరిష్ట నీటి మట్టంతో.. 194.6 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో.. 322 టీఎంసీలు వినియోగించుకునేలా నిర్మించుకోవడానికి గోదావరి ట్రిబ్యునల్ 1980లో అనుమతి ఇచ్చింది.⇒ అయితే దాదాపు 25 ఏళ్లపాటు ప్రాజెక్టు నిర్మాణంపై ఏ ముఖ్యమంత్రీ కనీసం ఆలోచన చేసిన పాపాన పోలేదు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా 2005లో అన్ని అనుమతులు సాధించి పోలవరం నిర్మాణాన్ని ప్రారంభించారు.⇒ పోలవరం కుడి, ఎడమ కాలువల ద్వారా 7.20 లక్షల ఎకరాలు.. కృష్ణా, గోదావరి డెల్టాల్లో 23.31 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా 8 లక్షల ఎకరాలు వెరసి 38.51 లక్షల ఎకరాలకు నీళ్లందించవచ్చు. విశాఖ పారిశ్రామిక, తాగునీటి అవసరాల కోసం 23.44 టీఎంసీలను సరఫరా చేయవచ్చు. అంతేకాకుండా 960 మెగావాట్ల జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు.⇒ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పోలవరం చుక్కానిలా నిలుస్తుంది. అందుకే ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్ర ముఖచిత్రమే మారిపోతుందని నీటిపారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తూ వస్తున్నారు.జీవనాడి కాదు జీవచ్ఛవమే..!⇒ పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు 35.5 మీటర్ల నుంచి నీటిని సరఫరా చేయవచ్చు. ఎడమ కాలువ పూర్తి సామర్థ్యం 17,580 క్యూసెక్కులు కాగా కుడి కాలువ పూర్తి సామర్థ్యం 17,560 క్యూసెక్కులు.⇒ పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్లకు తగ్గించడం వల్ల జలాశయంలో గరిష్టంగా 115.44 టీఎంసీలు మాత్రమే ఉంటాయి. గోదావరికి గరిష్టంగా వరద వచ్చే రోజుల్లో ఆయకట్టుకు నీటిని సరఫరా చేయగలిగినా.. వరద లేని రోజుల్లో ఆయకట్టుకు నీళ్లందించడం సాధ్యం కాదని అధికారవర్గాలు చెబుతున్నాయి.⇒ కాలువల ద్వారా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించాలంటే ప్రాజెక్టులో 41.15 మీటర్ల కంటే ఎగువన నీటి మట్టం ఉండాలి. అప్పుడే ఎడమ కాలువ కింద 4 లక్షలు.. కుడి కాలువ కింద 3.20 లక్షల ఎకరాలకు నీళ్లందించడడంతోపాటు కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలను మళ్లించడానికి అవకాశం ఉంటుంది.⇒ పోలవరం ఆయకట్టు 7.20 లక్షల ఎకరాలతోపాటు కృష్ణా, గోదావరి డెల్టాల ఆయకట్టు స్థిరీకరణ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, విశాఖకు పారిశ్రామిక, తాగునీటి అవసరాలు తీర్చడం అసాధ్యమని స్పష్టం చేస్తున్నారు. 960 మెగావాట్ల జలవిద్యుత్ కూడా ఉత్పత్తి చేయడం సాధ్యం కాదని తేల్చిచెబుతున్నారు.⇒ ఎత్తు తగ్గించడం వల్ల జీవనాడి పోలవరం ప్రాజెక్టును జీవచ్ఛవంగా మార్చేశారని నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.తగ్గించేందుకు తలూపడం వల్లే..పోలవరం ప్రాజెక్టును కనీస నీటిమట్టం 41.15 మీటర్ల వరకూ పూర్తి చేసేందుకు అంచనా వ్యయాన్ని రూ.30,436.95 కోట్లకు సవరిస్తూ ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసిందని.. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా చేసిన వ్యయం పోనూ మిగతా రూ.12,157.53 కోట్లు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జల్ శక్తి శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ దీపక్ చంద్ర భట్ లేఖ రాశారు. ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని... ఈ క్రమంలో 2024–25లో ఏ మేరకు నిధులు కావాలో ప్రతిపాదనలు పంపాలని ఆ లేఖలో కోరారు. ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేస్తున్నట్లు ఈ లేఖలో కేంద్రం స్పష్టం చేసినా రాష్ట్ర ప్రభుత్వం నోరుమెదపలేదు. అంటే.. ప్రాజెక్టు ఎత్తును తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందన్నది స్పష్టమవుతోంది. ప్రాజెక్టుకు రూ.2,348 కోట్లను అడ్వాన్సుగా విడుదల చేస్తూ ఈనెల 9న రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలోనూ దీపక్ చంద్ర భట్ అదే అంశాన్ని పునరుద్ఘాటించారు. ప్రాజెక్టును పూర్తి చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదించిన సవరించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని.. ఆ మేరకు ఎంవోయూ కుదుర్చుకుందని ఆ లేఖలో పేర్కొన్నారు.కేంద్రానికి రూ.23,622 కోట్లకుపైగా మిగులు..కేంద్ర జలసంఘం టీఏసీ ఆమోదించిన ప్రకారం పోలవరం అంచనా వ్యయం 2017–18 ధరల ప్రకారం రూ.55,656.87 కోట్లు. రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఖరారు చేసిన దాని ప్రకారం రూ.47,725.74 కోట్లుగా ఉంది. పోలవరానికి ఇప్పటివరకూ కేంద్రం రూ.15,146.28 కోట్లను రీయింబర్స్ చేసింది. 2014 ఏప్రిల్ 1కి ముందు ప్రాజెక్టుకు రూ.4,730.71 కోట్లు ఖర్చు చేశారు. అంటే.. ఇప్పటిదాకా ప్రాజెక్టు కోసం రూ.19,876.99 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్క. సీడబ్ల్యూసీ టీఏసీ ఆమోదించిన అంచనా వ్యయం ప్రకారం చూస్తే పోలవరానికి ఇంకా రూ.35,779.88 కోట్లు రావాలి. ప్రస్తుతం రూ.12,157.53 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. అంటే ఇంకా రూ.23,622.35 కోట్లు విభజన చట్టం ప్రకారం కేంద్రం ఇవ్వాలి. ఆ నిధులు ఇస్తేనే 41.15 మీటర్ల కాంటూరు నుంచి 45.72 మీటర్ల వరకూ నీటిని నిల్వ చేయడానికి అవసరమైన ముంపు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించవచ్చు. భూమిని సేకరించవచ్చు. కానీ.. పోలవరం ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేయడంతో కేంద్రానికి రూ.23,622.35 కోట్లు మిగిలినట్లైంది. -
పోలవరానికి నిధుల విడుదలపై కేంద్రం కసరత్తు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు 41.15 మీటర్ల కాంటూర్ వరకూ మిగిలిన పనుల పూర్తికి గతేడాది జూన్ 5నే నిధులు మంజూరు చేసిన కేంద్రం.. ఇప్పుడు ఆ నిధుల విడుదలకు కసరత్తు చేస్తోంది. రెండేళ్ల గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టే పనులకు రూ.2,800 కోట్లు ఇవ్వాలని కోరుతూ జల్ శక్తి శాఖ వారం కిందట కేంద్ర ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపింది. వాటిని కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదించి పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఖాతాలో జమ చేయనుంది. 41.15 మీటర్ల వరకు ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయాన్ని రూ.30,436.95 కోట్లుగా ఖరారు చేసిన కేంద్ర కేబినెట్.. ఇప్పటిదాకా విడుదల చేసిన నిధులుపోనూ మిగతా రూ.12,157.53 కోట్లు ఇచ్చేందుకు ఇటీవల ఆమోదం తెలిపింది. ఇందులో ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టే పనులకు రూ.2,800 కోట్లు ఇవ్వాలని కోరుతూ జల్ శక్తి శాఖ ప్రతిపాదనలు పంపింది. -
2026 మార్చి నాటికి పోలవరం పూర్తి చేయాలని రాష్ట్రానికి చెప్పిన కేంద్రం
-
కొలిక్కివస్తున్న పోలవరం డిస్ట్రిబ్యూటరీల వ్యయ ఆమోదం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల కింద 7.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని సరఫరా చేసేందుకు బ్రాంచ్ కాలువలు, పిల్ల కాలువల (డిస్ట్రిబ్యూటరీలు) తవ్వడానికి రూ.5,338.9 కోట్లు వ్యయం అవుతుందని జలవనరుల శాఖ అధికారవర్గాలు తేల్చాయి. జలాశయం పనులు పూర్తయ్యేలోగా కాలువలతోపాటు స్ట్రిబ్యూటరీలను కూడా పూర్తి చేసి సత్వరమే ఆయకట్టుకు నీళ్లందించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రణాళిక రచించింది. దీని ప్రకారం కుడి కాలువ కింద 3.20 లక్షల ఎకరాలకు స్ట్రిబ్యూటరీ వ్యవస్థ ఏర్పాటుకు రూ.2,248.89 కోట్లు, ఎడమ కాలువ కింద 4 లక్షల ఎకరాలకు స్ట్రిబ్యూటరీ వ్యవస్థ ఏర్పాటుకు రూ.3,090.01 కోట్లు ఖర్చవుతుందని లెక్క కట్టారు. ఆ మేరకు నిధులు కోరుతూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ద్వారా కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), కేంద్ర జల్ శక్తి శాఖకు 8 నెలల క్రితం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. వాటిపై సీడబ్ల్యూసీ అధికారులు పలు మార్లు లేవనెత్తిన సందేహాలను రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులు నివృత్తి చేశారు. దీంతో స్ట్రిబ్యూటరీల అంచనా వ్యయాన్ని ఆమోదించే ప్రక్రియను కొలిక్కి తెచ్చారు. ఆ ప్రక్రియను పూర్తి చేసి, స్ట్రిబ్యూటరీలకు భూసేకరణ చేసి, పనులకు టెండర్లు పిలవాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడే జలాశయం నిర్మాణం పూర్తయ్యేలోగా స్ట్రిబ్యూటరీలను పూర్తి చేసేందుకు ఆస్కారం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే జలాశయం పనులు కొలిక్కి.. గోదావరి వరదను మళ్లించేలా స్పిల్ వేను పూర్తి చేయకుండానే అప్పటి చంద్రబాబు సర్కారు ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్ నిర్మించడం ద్వారా చేసిన చారిత్రక తప్పిదం పోలవరం ప్రాజెక్టులో విధ్వంసానికి కారణమైంది. వైఎస్ జగన్ ప్రభుత్వం చంద్రబాబు సర్కారు చేసిన తప్పులను సరిదిద్దుతూ.. స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేసి 2021 జూన్ 11నే గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా 6.1 కిలోమీటర్ల పొడవున మళ్లించింది. కుడి కాలువలో మిగిలిన పనులతో పాటు ఎడమ కాలువలలో కీలకమైన నిర్మాణాలు, జలాశయంతో కాలువల అనుసంధానం పనులు పూర్తి చేసింది. దెబ్బతిన్న డయాఫ్రం వాల్ భవితవ్యాన్ని తేల్చితే శరవేగంగా ప్రాజెక్టును పూర్తి చేస్తామని 2022 డిసెంబర్ నుంచి కేంద్రాన్ని కోరుతూ వచ్చింది. అంతర్జాతీయ నిపుణుల సహకారం తీసుకుని డయాఫ్రమ్ వాల్ భవితవ్యాన్ని తేలి్చ, ప్రాజెక్టును పూర్తి చేసే విధానాన్ని ఖరారు చేస్తామని అప్పట్లో కేంద్రం చెప్పింది. ఇటీవల పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అంతర్జాతీయ నిపుణుల బృందం.. డయాఫ్రం వాల్ దెబ్బతిందని, సమాంతరంగా కొత్తది నిర్మించాలని చెప్పింది. ఇప్పటికే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు పూర్తయిన నేపథ్యంలో వరదల్లోనూ డయాఫ్రం వాల్ పనులు చేపట్టి, ఈసీఆర్ఎఫ్ డ్యాంను పూర్తి చేయడానికి అవకాశం ఏర్పడిందని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు.» పోలవరం ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ 194.6 టీఎంసీలు» కుడి కాలువ పొడవు 178.812 కిలోమీటర్లు.. » ఎడమ కాలువ పొడవు 212.32 కిలోమీటర్లు.. » పూర్తయిన కుడికాలువ పనులు » 100 శాతం ప్రాజెక్టు ద్వారా వినియోగించుకొనే జలాలు 322 టీఎంసీలు » ప్రవాహ సామర్థ్యం 17,560 క్యూసెక్కులు » పూర్తయిన ఎడమ కాలువ పనులు 73.07 శాతం -
20న పోలవరంపై వర్క్ షాప్
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ నిపుణుల కమిటీ సూచన మేరకు పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డిజైన్లు, నిర్మాణ పనులపై చర్చించడానికి 20న ప్రాజెక్టు వద్ద కేంద్ర జలసంఘం వర్క్ షాపు నిర్వహించనుంది.ప్రధాన డ్యాం గ్యాప్–2 పునాది డయాఫ్రం వాల్, ఎగువ కాఫర్ డ్యాంలో సీపేజీకి అడ్డుకట్ట వేయడంతోసహా కీలకమైన డిజైన్లు, పనులు చేపట్టడంపై ఈ వర్క్ షాప్‌లో చర్చించనున్నారు. అంతర్జాతీయ నిపుణులతోపాటు రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు. డిజైన్లతోపాటు ఈ సీజన్ అంటే నవంబర్ నుంచి 2025, జూలై వరకూ చేపట్టాల్సిన పనులు.. వాటిని పూర్తి చేయాల్సిన షెడ్యూలును ఖరారు చేయనున్నారు. -
చంద్రబాబు తప్పిదం వల్లే.. జీవనాడి.. జీవచ్ఛవం!
-
పాత పద్ధతిలోనే కొత్త డయాఫ్రం వాల్
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం గ్యాప్–2లో దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు ఎగువన సమాంతరంగా కొత్తగా పాత పద్ధతిలోనే డయాఫ్రం వాల్ నిర్మించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)కి అంతర్జాతీయ నిపుణుల కమిటీ మరోసారి స్పష్టం చేసింది. పాత డయాఫ్రం వాల్‌ను 15 నెలల్లో నిర్మించారని గుర్తు చేస్తూ.. కొత్త డయాఫ్రం వాల్‌ను ఈ ఏడాది నవంబర్ నుంచి 2025 జూలైలోగా పూర్తి చేయాలని పేర్కొంది.ఒకే సీజన్లో ఆ పనులు చేసేందుకు అదనంగా గ్రాబర్లు, కట్టర్లు, అనుబంధ యంత్ర పరికరాలు, నిపుణులైన సిబ్బందిని సమకూర్చుకోవాలని సూచించింది. డయాఫ్రం వాల్ డిజైన్, నిర్మాణంపై చర్చించేందుకు తక్షణమే వర్క్ షాప్ నిర్వహించాలని పేర్కొంది. ఈ మేరకు సీడబ్ల్యూసీ, పీపీఏలకు ఈనెల 20న అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. అందులో కమిటీ సిఫార్సులు ఇవీ.. ⇒ ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు పటిష్టంగా ఉన్నాయి. వాటి భద్రతకు ఎలాంటి ముప్పు లేదు. ఎగువ కాఫర్ డ్యాంలో సీపేజీకి అడ్డుకట్ట వేయడానికి టోయ్ (అడుగు భాగం)లో ఫిల్టర్లు వేయాలి. ⇒ ఎగువ, దిగువ కాఫర్ డ్యాం మధ్య సముద్ర మట్టానికి 3 మీటర్ల లోపు ఎత్తు ఉండేలా సీపేజీ నీటిని గ్రావిటీతో పంపడంతోపాటు పంపులతో ఎత్తిపోయాలి. ⇒ ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో గోదావరి నదీ గర్భం సముద్ర మట్టానికి సగటున 13 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దానిపై ఇసుకతో నింపి వైబ్రో కాంపాక్షన్ చేసి కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి వీలుగా ప్లాంట్ఫామ్ సిద్ధం చేయాలి. పూర్తిగా పొడి వాతావరణంలోనే డయాఫ్రం వాల్‌ను నిర్మించాలి. ⇒ కొత్త డయాఫ్రం వాల్‌ను పాత పద్ధతిలోనే నిర్మించాలి. గ్రాబర్లు, కట్టర్లతో రాతి పొర తగిలే వరకూ నదీ గర్భాన్ని తవ్వుతూ వాటిలో బెంటనైట్ మిశ్రమాన్ని పంపాలి. ఆ తర్వాత కాంక్రీట్ మిశ్రమాన్ని అధిక ఒత్తిడితో పంపితే బెంటనైట్ మిశ్రమం బయటకు వస్తుంది. కాంక్రీట్, ఒకింత బెంటనైట్ మిశ్రమం కలిసి ప్లాస్టిక్ కాంక్రీట్‌గా మారుతుంది. అదే డయాఫ్రం వాల్. గత 40 ఏళ్లుగా డయాఫ్రం వాల్ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. ఈ వాల్ ఎక్కడా విఫలమైన దాఖలాలు లేవు. -
మమ్మల్ని ఆడిపోసుకోవడం తప్ప.. ప్రభుత్వం చేసిందేంటి?
సాక్షి, హైదరాబాద్: వంద రోజుల పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ఏపీలోని కూటమి ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ నిలదీశారు. గత ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడానికే సమయాన్ని వృథా చేశారని మండిపడ్డారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం బుగ్గన మీడియాతో మాట్లాడుతూ.. కనీసం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని దీనస్థితిలో ఏపీ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, సూపర్ సిక్స్ అమలు గురించి మహిళలు, వృద్ధులు ప్రశ్నిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం గ్రామాల్లో పారీ్టల పేరుతో దాడులు చేయడానికే సమయాన్ని వృథా చేసిందన్నారు. పచ్చ మీడియా పక్షపాతం ఏపీ అప్పుల విషయంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి పక్షపాత కథనాలు ఇస్తున్నాయని బుగ్గన ధ్వజమెత్తారు. వంద రోజుల్లో చేసిన అప్పులను ఎందుకు రాయడం లేదని ప్రశి్నంచారు. పోలవరానికి రూ.12,500 కోట్ల అదనపు నిధులు రావడానికి వైఎస్ జగన్ ప్రభుత్వమే అనేక విధాల కృషి చేసిందని, ఈ ఫలితాలను కూటమి ప్రభుత్వం తమకు అనుకూలంగా చెప్పుకోవడం అన్యాయమని పేర్కొన్నారు. చంద్రబాబు ఈ ప్రాజెక్టును 2016 వరకూ నిర్మాణం చేపట్టలేదని గుర్తు చేశారు. 2014 నాటి ధరలకు ఒప్పుకున్నారని, కొత్త భూసేకరణ చట్టాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని, పునరావాసం గురించే ఆలోచించలేదని, కేవలం సాగు, తాగునీటి కోసం లెక్కలు వేసి, కేంద్రంతో ఒప్పందం చేసుకోవడం వల్లే పోలవరం నిర్మాణానికి ఇబ్బందులు వచ్చాయని బుగ్గన తెలిపారు. రూ.55 వేల కోట్ల అవసరం ఉంటే.. రూ.20 వేల కోట్లకే పోలవరం చేపడతామని కేంద్రంతో అప్పటి చంద్రబాబు సర్కార్ ఒప్పందం చేసుకుందన్నారు. పోలవరం కోసం వైఎస్ జగన్ హయాంలో జరిగిన కృషిని బుగ్గన ఈ దిగువ విధంగా వివరించారు.వైఎస్ జగన్ పోలవరానికి చేసింది ఇదీ⇒ పోలవరం ప్రాజెక్టుకు ముందు రాష్ట్రం డబ్బులు పెడితే, కేంద్రం తిరిగి చెల్లిస్తుంది. టీడీపీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు.. ఈ లెక్కలు పోలవరం అధారిటీకి వెళ్లేవి. అథారిటీ పరిశీలించి, జలశక్తికి పంపాలి. అక్కడి నుంచి ఆరి్థక శాఖకు, ఆర్బీఐకి వెళ్లి.. తిరిగి రాష్ట్రానికి నిధులు రావడానికి కొన్ని నెలలు పట్టేది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక కేంద్రంతో మాట్లాడిన తర్వాత స్పెషల్ అసిస్టెంట్ ద్వారా నేరుగా నిధులు రావడానికి వైఎస్ జగన్ కృషి చేశారు. ⇒ పోలవరానికి సాగు, తాగునీరు రెండు కాంపొనెంట్లు ఇవ్వాలని 12–6–2021, 16–7–2021, 20–7–2021 తేదీల్లో కేంద్రానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం లేఖలు రాసింది. ఈ కారణంగానే రూ.7 వేల కోట్లు కేంద్రం ఇవ్వబోతోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఒత్తిడివల్లే పోలవరం అనుమతులు, అదనపు ఖర్చులు వస్తున్నాయి. ఇది కూటమి ప్రభుత్వ గొప్పతనమేమీ కాదు. ⇒ 11.5.2022లోనే సీడబ్ల్యూసీ అనుమతులు వచ్చాయి. 10–4–2023 జలశక్తిలోనే పోలవరం అదనపు ఖర్చు గురించి వివరాలు ఇవ్వమని కోరింది. 36 గ్రామాల పునరావాస వివరాలను 4–5–2023న జగన్ సర్కారు పంపింది. వరద వల్ల జరిగిన నష్టంతోపాటు అదనంగా కావల్సిన రూ.12,911 కోట్లకు కేబినెట్ నోట్ పంపమని కేంద్రం 5–6–2023లోనే జగన్ ప్రభుత్వాన్ని కోరింది. ఎన్నికల వల్ల ఆగిపోయిన కేబినెట్ నోట్ ఇప్పుడు అమలులోకి వస్తే ఈ ఘనత తమదేనని చంద్రబాబు ప్రభుత్వం చెప్పుకోవడం విడ్డూరం. -
నిలకడగా గోదావరి
పోలవరం రూరల్/ధవళేశ్వరం/విజయపురిసౌత్: గోదావరి నది ప్రవాహం శనివారం నిలకడగా సాగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటిమట్టం 31.790 మీటర్లకు చేరుకుంది. స్పిల్‌వే 48 గేట్ల నుంచి 8.15 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాటన్ బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. బ్యారేజ్ నుంచి డెల్టా కాలువలకు 12,700 క్యూసెక్కులు విడుదల చేస్తూ, మిగిలిన 7,81,839 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. నాగార్జునసాగర్ నుంచి కృష్ణాజలాల విడుదలశ్రీశైలం నుంచి వచ్చే కృష్ణాజలాలు పెరగటంతో శనివారం నాగార్జునసాగర్ ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తి కృష్ణానదిలోకి 32,400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయానికి 77,496 క్యూసెక్కుల నీరు వస్తోంది. సాగర్ కుడికాలువ ద్వారా 10 వేల క్యూసెక్కులు, ఎడమకాలువ ద్వారా 3,667, ప్రధాన విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా 29,029, ఎస్ఎల్బీసీకి 1,800 క్యూసెక్కులు, వరదకాల్వకు 600 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. -
Polavaram Project: ఫలించిన వైఎస్ జగన్ కృషి..
-
జాయింట్ సర్వే !
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టులో 150 అడుగుల గరిష్ట నీటిమట్టం (ఎఫ్ఆర్ఎల్) మేరకు నీళ్లను నిల్వ చేస్తే తెలంగాణ భూభాగంలో ఏర్పడనున్న ముంపు ప్రభావంపై పోలవరం ప్రాజెక్టు ఆథారిటీ (పీపీఏ) ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో తక్షణమే జాయింట్ సర్వే నిర్వహించాలని కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) చైర్మన్ కుస్విందర్ సింగ్ వోరా ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టుతో కిన్నెరసాని, ముర్రెడువాగులకు ఏర్పడనున్న ముంపుపై ఎన్జీటీ ఆదేశాల మేరకు ఇప్పటికే జాయింట్ సర్వే నిర్వహించగా, తదుపరిగా క్షేత్ర స్థాయిలో ముంపు ప్రాంతాన్ని గుర్తిస్తూ డీమార్కింగ్ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల తో తక్షణమే జాయింట్ సర్వే నిర్వహించి డీమార్కింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని వోరా ఆదేశించారు.పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావాని కి సంబంధించి తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, రాష్ట్ర ప్రభుత్వాల అభ్యంతరాలపై బుధవారం ఢిల్లీలోని సీడబ్ల్యూసీ కార్యాలయంలో వోరా అధ్యక్షతన సాంకేతిక కమిటీ సమావేశం జరిగింది. కమిటీ సభ్యులై న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రా ష్ట్రాల నీటిపారుదల శాఖ ఇంజనీర్లు పాల్గొన్నారు. ఎప్పటికైనా సర్వే చేయాల్సిందే: వోరా పోలవరం ప్రాజెక్టు ఎఫ్ఆర్ఎల్ ఎప్పటికైనా 150 అడుగులే ఉంటుందని, దీనివల్ల తెలంగాణలో ఉండనున్న ముంపు ప్రభావంపై ఎప్పుడైనా సర్వే చేసి నివారణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సీడబ్ల్యూసీ చైర్మన్ వోరా స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సర్వే జరగకపోవచ్చని, ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో తెలంగాణ కోరిన మేరకు జాయింట్ సర్వే చేయాల్సిందేనని సూచించారు. జాయింట్ సర్వేను సమన్వయం చేయాలని పీపీఏ ను ఆదేశించారు. 150 అడుగుల నిల్వతో ఏర్పడే ముంపుతో పాటు ప్రాజెక్టు కారణంగా ముర్రెడువాగు, కిన్నెరసాని వాగులకు ఉండే ముంపును గుర్తించి నివేదిక సమర్పిస్తే, ముంపు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ, తెలంగాణతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తెలంగాణ కోరి న మేరకు.. పోలవరం ప్రాజెక్టుతో మిగిలిన 5 వాగులకు ఉండనున్న ముంపుపై జాయింట్ సర్వే విషయంలో మళ్లీ సమావేశమై నిర్ణయం తీసుకుందా మని చెప్పారు. కాగా పోలవరం ప్రాజెక్టుతో సీడబ్ల్యూసీ సర్వేలో తేలిన దానికి మించి తమ రాష్ట్రంలో ముంపు ప్రభావం ఉందని ఒడిశా నీటిపారుదల శాఖ సీఈ అశుతోష్ దాస్ పేర్కొన్నారు. ఐఐటీ రూ ర్కెలా అధ్యయన నివేదికలో ఇది తేలిందన్నారు. ఈ నివేదికపై అధ్యయనం చేసి తదుపరి సమావేశంలో చర్చిస్తామని సీడబ్ల్యూసీ చైర్మన్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈ మోహన్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్ సుబ్రమణ్యం, పీపీఏ సీఈఓ అతుల్ జైన్, సీఈ రఘురామ్ తదితరులు పాల్గొన్నారు.ఎలాంటి పురోగతి లేదు: తెలంగాణ గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల మేరకు జాయింట్ సర్వేకు ఏపీ ప్రభుత్వం ముందుకు రావడం లేదని తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ (ఓ అండ్ ఎం) బి.నాగేందర్రావు తెలియజేశారు. గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఎలాంటి పురోగతి లేదని, కాగితాలకే పరిమితమయ్యాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. 150 అడుగుల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో తెలంగాణలో 950 ఎకరాలు ముంపునకు గురవుతాయని, దీనిపై జాయింట్ సర్వే చేయాల్సిందేనని ఆయన కోరారు. మరోవైపు జాయింట్ సర్వేకు తెలంగాణ సహకరించడం లేదని, సర్వే రెండు వాగులకే పరిమితం చేయాల్సి ఉండగా, ఏడు వాగులు సర్వే చేయాలని కోరుతోందని ఏపీ అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈ శ్రీనివాసరావు చెప్పారు. అయితే ముర్రెడువాగు, కిన్నెరసాని వాగుల జాయింట్ సర్వేకు పూర్తిగా సహకరించిన విషయాన్ని తెలంగాణ ఈఎన్సీ గుర్తు చేశారు. -
వైఎస్సార్సీపీని వీడి బాగుపడిన వాళ్లెవరూ లేరు: అంబటి
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి వల్లే పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిధులు వచ్చాయని, కానీ సీఎం చంద్రబాబు ఆ క్రెడిట్ తనదే అన్నట్లు ప్రసంగాలు ఇస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘పోలవంపై చంద్రబాబు మళ్లీ అబద్ధాలు చెబుతున్నారు. కడుపు తరుక్కుపోతోందంటూ మాట్లాడుతున్నారు. ఆ మాటలు చూస్తుంటే.. ‘చంద్రబాబు నాకన్నా మహానటుడు’ అని ఎన్టీఆర్ చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. వైఎస్ జగన్‌కు మంచి పేరు వస్తుందనే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. జగన్ హయాంలోనే పోలవరం పనులు వేగంగా జరిగాయి. ఇప్పుడు ప్రాజెక్టు ఫేజ్-1కు నిధులు వచ్చాయి. .. నిధుల కోసం జగన్ అనేకసార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిసి వచ్చారు. జల్‌శక్తి మంత్రితో పలుమార్లు భేటీ అయ్యారు. నాడు కేంద్ర కేబినెట్ మీటింగ్‌లో పెట్టకుండా ఎన్డీయేలో భాగమైన బాబు అడ్డుకున్నారు. రూ.12,157 కోట్ల నిధుల విడుదలలో జగన్ కృషి ఉంది... తాను చేసిన తప్పులన్నీ జగన్‌పై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని పనులు ఒకేసారి మొదలుపెట్టడమే పోలవరానికి పట్టిన శని. 2016లో పోలవరం కడతామని చంద్రబాబే కేంద్రాన్ని ఒప్పించారు. కమీషన్ల కోసమే ఆ నిర్ణయం తీసుకున్నారు. 2013-14లో ఉన్న రేట్ల ప్రకారం పూర్తి చేస్తామని ఒప్పుకున్నారు. ఎవరి కోసం నాటి రేట్లకు ప్రాజెక్టు నిర్మాణం ఒప్పుకున్నారు?. చంద్రబాబు అబద్ధాలను మేధావులు, ప్రజలు గుర్తించాలి. ప్రతీ సోమవారం పోలవారం అంటూ చంద్రబాబు ఏం చేశారు?. 2018లోనే వచ్చిన వరదలతోనే డయాఫ్రం వాల్ దెబ్బతింది. చంద్రబాబు ఇన్ని సంవత్సరాలు సీఎంగా ఉండి కూడా.. ఏనాడూ జీవనాడి అయిన పోలవరం గురించి ఏనాడూ ఆలోచించలేదు. పోలవరం గురించి వైఎస్సార్ కలలు గన్నారు. ప్రాజెక్టు పూర్తి చేయాలనే చిత్తశుద్ధితో పని చేశాం. 50 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా తట్టుకునేలా నిర్మాణాలు చేశాం. కానీ, అసత్యాలతో చంద్రబాబు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు అని అంబటి అన్నారు. వలసలపై అంబటి రియాక్షన్..వలసలపై టీడీపీ అనుకూల మీడియాలో జరుగుతున్న ప్రచారంపై అంబటి స్పందించారు. మోపిదేవి జగన్ కు సన్నిహితుడు. ఆయన ఓడిపోయిన ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చారు తర్వాత రాజ్యసభకు పంపారు. ఆయన పార్టీని వీడతారని అనుకోవటం లేదు. మోపిదేవి పార్టీ మారతారని నేను అనుకోవటం లేదు ఒకవేళ అలాంటి ఆలోచన ఉన్న వెనుక్కు తీసుకోవాలని నేను చెప్తున్నా. ఎదుటివాడి దొడ్లో ఉన్న వ్యక్తుల్ని ఎత్తుకు పోవటమే చంద్రబాబు రాజకీయం. పక్కపార్టీలో వారిని ఆశచూపించో, మభ్య పెట్టో తీసుకెళ్లడం చంద్రబాబుకి బాగా తెలుసు. అధికార పార్టీలో చేరడం ద్వారా వారి క్యారెక్టర్ కోల్పోవడమే. 2014లో ఓడినప్పుడు కూడా కొందరు పార్టీ మారారు?. వాళ్లంతా ఇప్పుడు ఎక్కడున్నారు?. క్యారెక్టర్ పొగొట్టుకున్నారు. కానీ ఎవరూ బాగుపడలేదు. చంద్రబాబు రాజకీయ జీవితం అందరికి తెలిసిందే. అధికారం శాశ్వతం కాదు. పార్టీలు మారడం మంచి పద్దతి కాదు అని అంబటి అన్నారు. -
ఫలించిన వైఎస్ జగన్ కృషి.. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు
సాక్షి, ఢిల్లీ: మాజీ సీఎం వైఎస్ జగన్ కృషి ఫలించింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కృషితో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు దక్కాయి. మార్చి 6నే పోలవరం ప్రాజెక్ట్‌కు 12,157 కోట్ల రూపాయల నిధులకు ఆమోదం తెలిపిన కేంద్ర శక్తి శాఖ.. కేబినెట్ ఆమోదం కోసం పంపించింది. అప్పుడే ఎన్డీఏలోకి చేరిన టీడీపీ అడ్డుకోవడానికి ప్రయత్నించింది. ఆ నిధులకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేస్తే వైఎస్సార్సీపీకి ఆ క్రెడిట్ దక్కుతుందని చంద్రబాబు కుట్రకు తెరలేపారు. దీంతో పోలవరం నిధులను కేబినెట్ ఎజెండా నుంచి టీడీపీ తప్పించింది.నిధుల కోసం పోరాటం చేస్తున్నట్లు కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌కు చంద్రబాబు వినతిపత్రం ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేయాలని వైఎస్ జగన్ ప్రతిపాదనకు ప్రధాని నరేంద్ర మోదీ అంగీకారం తెలిపారు. తొలిదశలో 41.15 మీటర్లు, రెండవ దశలో 45.72 మీటర్ల మీటర్లు పూర్తి చేయాలని ప్రతిపాదించారు. తాజా ధరల ప్రకారమే నిర్మాణానికి వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. నాడే వైఎస్ జగన్ విజ్ఞప్తిని ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరించారు. ఇప్పుడు అవ్వే నిధులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. -
‘చంద్రబాబు అనాలోచిత నిర్ణయాల వల్లే ప్రజలకు కష్టాలు’
తూర్పుగోదావరి, సాక్షి: పోలవరంలో లాభాలు సంపాదించాలని మాత్రమే చంద్రబాబు ఆలోచించారని, దాని వల్లే రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి వేణుగోపాల కృష్ణ అన్నారు. దీనికి తోడు తన అనాలోచిత నిర్ణయాల వల్ల మరింత నష్టం తెచ్చిపెట్టారని చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో వేణుగోపాలకృష్ణ సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రభుత్వాలు జాగ్రత్తగా పని చేయాలి. కానీ, కూటమి ప్రభుత్వం ప్రజల దృష్టిని మరల్చటానికి తనకున్న మీడియా బలాన్ని ఉపయోగిస్తోంది. దీనివల్ల ఇబ్బంది పడేది ప్రజలే. 2014లో రాష్ట్రం కోల్పోయిన ఆదాయం పోలవరం పూర్తి అయితే వస్తుందని ఆశించాం. కానీ, అలా జరగలేదు. బీజేపీ, కాంగ్రెస్ లు రాష్ట్రాన్ని విడదీసేది సమయంలో పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు. టీడీపీకి సహాయంగా ఉన్న జనసేన కూడా కేంద్రంలో భాగస్వాములుగా ఉన్నారు. పోలవరాన్ని కేంద్ర ప్రభుత్వమే పూర్తి నిధులు ఇచ్చి పూర్తి చేయాలి’’ అని అన్నారాయన. చంద్రబాబుపై ఫైర్.. 2016 మే 2 న పోలవరం పనులు ప్రారంభించిన సమయంలో చంద్రబాబు ఈ ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్రమే చేపడుతుందని ప్రకటించారు. పోలవరంలో లాభాలు సంపాదించాలని మాత్రమే చంద్రబాబు ఆలోచించారు. ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజ్ తీసుకున్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రజలు ఎంతో నష్ట పోయారు. పోలవరం ప్రాజెక్టులో ప్రధానంగా ఆర్ అండ్ ఆర్ గురించి కూడా ఆలోచించాలి. కాపర్ డ్యామ్ చేపట్టే నాటికే స్పిల్ వే పూర్తయి ఉండాలి. కానీ, కాపర్ డ్యామ్ పూర్తి కాకుండానే డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టు ను చంద్రబాబు ఏటీఎంలా వాడుకుంటున్నారని ప్రధాని మోదీ నేరుగా ఆరోపించారు. చంద్రబాబు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రం భారీగా ప్రజాధనాన్ని నష్టపోయింది. చంద్రబాబు ఈ ప్రాజెక్టులో వచ్చే ఆదాయాన్ని గురించి మాత్రమే ఆలోచించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. స్పిల్ వే పూర్తి చేయకుండా చంద్రబాబు అనాలోచితంగా తీసుకున్న చర్యల వల్లే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది అని వేణుగోపాల్ విమర్శలు గుప్పించారు. -
పోలవరం డాక్యుమెంట్ల వెనక చంద్రబాబు కుట్ర..!
-
పోలవరాన్ని నిండా ముంచింది చంద్రబాబేనన్న అంతర్జాతీయ నిపుణుల కమిటీ
-
కూటమి సర్కార్ చీప్ ట్రిక్స్.. వైఎస్సార్సీపీ ఫైర్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడిన నాటి నుంచి తప్పుడు ప్రచారాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తూ లేనిపోని ఆరోపణలు చేస్తోంది. ఇక, తాజాగా పోలవరం ఫైల్స్ దగ్దం అంటూ మరో ఫేక్ ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో, సర్కార్ చీప్ ట్రిక్స్పై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.పోలవరం ఫైల్స్ ఘటనపై వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా..‘తెలుగుదేశం పార్టీ మీ దరిద్రపు బతుకులు ఎప్పుడూ ఇంతే. విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ చేస్తారు. ప్రభుత్వంలోకి వచ్చి దాదాపు మూడు నెలలు కావొస్తోంది. ప్రజలకు ఉపయోగపడే విషయాలపై దృష్టి పెట్టడం మాని బురదజల్లుడు పనులే చేస్తున్నారు. .@JaiTDP మీ దరిద్రపు బతుకులు ఎప్పుడూ ఇంతే విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ చేస్తారు. ప్రభుత్వంలోకి వచ్చి దాదాపు 3 నెలలు కావొస్తోంది. ప్రజలకు ఉపయోగపడే విషయాలపై దృష్టి పెట్టడం మాని బురదజల్లుడు పనులే చేస్తున్నారు. @ncbn వల్లే పోలవరం డయా ఫ్రం వాల్ కొట్టుకుపోయిందని… pic.twitter.com/Gi8mhtEBYN— YSR Congress Party (@YSRCParty) August 17, 2024చంద్రబాబు వల్లే పోలవరం డయా ఫ్రం వాల్ కొట్టుకుపోయిందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ తేల్చిన నేపథ్యంలో ఇలాంటి చెత్త ప్రచారాలకు దిగారు. అవి పనికిమాలిన కాగితాలని మీ అధికారులే తేల్చారు. అయినా ఇంకా ఏదో ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. భూ సేకరణ చేసే అధీకృత అధికారి కలెక్టర్. ఆ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతీ పత్రం ఉంటుంది. ఇకనైనా సిగ్గు మాలిన ప్రచారాలు మాని ప్రజలకు మేలు చేసే పనులపై దృష్టి పెట్టండి అంటూ హితవు పలికింది. pic.twitter.com/b7Rk2BnObp— Ambati Rambabu (@AmbatiRambabu) August 17, 2024 ఇదీ చదవండి: ఎల్లో మీడియా డ్రామా.. తుస్సుమనిపించిన అధికారులు -
పోలవరం పూర్తి కాకపోవడానికి ప్రధాన కారణం ఇదే!
-
పోలవరం పాపం బాబుదే.. చర్చకు సిద్ధమా?: అంబటి సవాల్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ హయాంలో పోలవరం ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరిగాయన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇక, టీడీపీ హయాంలో చంద్రబాబు తప్పిదంతో డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడం వల్లే పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యమైందని ఆయన చెప్పుకొచ్చారు.కాగా, మాజీ మంత్రి అంబటి శనివారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి. దివంగత మహానేత వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరాన్ని ప్రారంభించారు. ఎంతో కృషి చేసి అనుమతులు తీసుకువచ్చారు. వైఎస్సార్ మరణం తర్వాత కేంద్రామే పోలవరం ప్రాజెక్ట్‌ను తీసుకుంది. లేదు.. మేమే పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రాజెక్ట్‌ను తీసుకున్నారు.ఇక, వైఎస్సార్సీపీ హయాంలో పోలవరం ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరిగాయి. టీడీపీ హయాంలో చంద్రబాబు తప్పిదంతో డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడం వల్లే పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యమైంది. దీనిపై చంద్రబాబు గోబెల్స్ ప్రచారం చేశారు. బాబు నిర్ణయాలు సరిగా లేకపోవడం వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతింది. తిరిగి మాపైనే ఎల్లో మీడియాతో బుదరజల్లే ప్రయత్నం చేశారు. చంద్రబాబు హయాంలోనే ప్రొటోకాల్ లేకుండా నిర్మాణాలు జరిగాయి. ఇదే విషయాన్ని అంతర్జాతీయ నిపుణుల బృందం కూడా చెప్పింది. 450 మీటర్ల వరకు డయాఫ్రం వాల్ దెబ్బ తిన్నది. దానిమీద జగన్ కేంద్ర ప్రభుత్వంతో అనేకసార్లు మాట్లాడారు. దేశంలో నిపుణులు లేనందున ఇతర దేశాల నిపుణులను పిలిపించి విచారణ జరిపించాం. అంతర్జాతీయ కమిటీతో విచారణ జరిపించాం. వారు మొన్న 12న ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు. నదిని డైవర్ట్ చేయకుండా డయాఫ్రం వాల్ నిర్మాణం వద్దని మేము కూడా చెప్పాం. 2016 డిసెంబర్ నుండి ప్రాజెక్టును పట్టించుకోలేదనీ, వరదనీరు స్పిల్ వే మీదకు వెళ్లకుముందే కాపర్ డ్యాం చేపట్టడం వలన నష్టం వచ్చిందని కమిటీ చెప్పింది.2018లో వరద వచ్చినప్పుడు సరైన చర్యలు తీసుకోనందనే ప్రాజెక్టు దెబ్బతిన్నది. గ్యాప్-2లో డయాఫ్రం వాల్ బాగా దెబ్బతిన్నదని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. మా ప్రభుత్వం వచ్చాకే ప్రధాన డ్యాం దెబ్బతినకుండా చర్యలు చేపట్టిందని కూడా కమిటీ చెప్పింది. మా హయాంలో రెండు కాఫర్ డ్యాంల నిర్మాణం చేపట్టడంపై కమిటీ మెచ్చుకుంది. పోలవరం ప్రాజెక్టు పనుల మీద చర్చకు రాగలరా?. మీడియా సమక్షంలో చర్చకు మేము సిద్దమే. మంత్రి రామానాయుడు వచ్చినా చర్చకు సిద్దమే. 12వేల కోట్లు కేంద్ర నిధులను రానీకుండా చంద్రబాబు అప్పట్లో అడ్డుకున్నారు. ఇప్పుడు కేంద్రంతో కూటమిలో ఉన్నందున ఇప్పుడైనా ఆ నిధులు తేవాలి. ప్రాజెక్టులో పాపం చంద్రబాబుదే. ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. ఎల్లోమీడియా వాస్తవాలను రాయాలి. ఇది ముసాయిదా రిపోర్టు అయితే ఫైనల్ రిపోర్టులో మేనేజ్ చేయాలనుకుంటున్నారా?. చంద్రబాబు ధనార్జన వలనే ప్రాజెక్టు నష్టపోయింది. నదిని డైవర్ట్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు నిర్మాణాలు చేపట్టారు. చంద్రబాబు సరైన ప్రమాణాలు పాటించకపోవడం వల్లే పోలవరం ఆలస్యమైంది. 2016 డిసెంబర్ నుంచి ప్రాజెక్ట్‌ను పట్టించుకోలేదని, కనీసం ప్రోటోకాల్‌ను కూడా పాటించలేదని నిపుణుల కమిటీ తేల్చింది. పోలవరం ప్రాజెక్ట్‌ను చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని ప్రధాని మోదీనే చెప్పారు. డబ్బులు దోచుకోవడానికి పోలవరం ప్రాజెక్ట్‌ను చంద్రబాబు వాడుకున్నారు. బాబు లోపాలను ఎత్తి చూపితే ఆయనకు కోపం వస్తుంది. కాఫర్ డ్యామ్ లేకుండానే ప్రాజెక్ట్ చేయవచ్చని బాబు అంటున్నారు.చట్ట విరుద్ధంగా పనిచేసే వారిని రెడ్ బుక్‌లో రాసుకున్నానని లోకేష్ అన్నారు. ప్రతీ ఎమ్మెల్యేని బట్టలు ఊడదీసి నిలపెడతా అన్నారు. ఒక రాజకీయ నాయకుడు అనాల్సిన మాటలేనా ఇవి?. రాష్ట్రంలో కావాలనే విధ్వంసం చేస్తున్నారు. అంబేద్కర్ విగ్రహం మీద చేసిన వారి మీద కనీసం కేసు ఎందుకు నమోదు చేయలేదు?. ఇంతకంటే దుర్మార్గమైన చర్య ఇంకేమైనా ఉందా?. చంద్రబాబు చేసిన దుర్మార్గాలను వైఎస్ జగన్‌పై వేయాలని చూస్తున్నారు. -
బాబు కొత్త స్లోగన్.. సోమవారం.. పోలవరం.. అదే మన కలెక్షన్ల వరం..
-
చంద్రబాబు తప్పిదం వల్లనే డయాఫ్రమ్ వాల్ ఢమాల్
-
100% చంద్రబాబు చేసిన తప్పే..
-
డయాఫ్రమ్ వాల్‌కు మళ్లీ నిధులు ఇవ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం నిధులు ఇవ్వాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌కు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. మొదటి దశకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు ఆమోదం తెలపడంతోపాటు డయా ఫ్రమ్ వాల్ నిర్మాణానికి మళ్లీ నిధులు ఇవ్వాలని కోరారు. సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలన్నారు. పునరావాసం.. పరిహారం తదితర అంశాలపైనా చర్చించారు.రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు శుక్రవారం రాత్రి కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, ఇతరత్రా అంశాలపై సుమారు 45 నిమిషాలు చర్చించారు. ఈ భేటీలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, సహాయ మంత్రులు చంద్రశేఖర్, శ్రీనివాసవర్మ, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్రావు, సీడబ్ల్యూసీ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, మంత్రిత్వ శాఖ అధికారులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు.2019లో టీడీపీ ప్రభుత్వం కొనసాగి ఉంటే 2021 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండేదని అభిప్రాయపడ్డారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత అధికారుల బదిలీతోపాటు 2020 వరదల వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందన్నారు. ఇది గత ప్రభుత్వ తప్పిదమే అని చెప్పారు. ప్రస్తుతం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు ఇప్పటికే రెండుసార్లు జలశక్తి మంత్రితో భేటీ అయ్యారన్నారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై చర్చ జరిగిందని, నిర్మాణ బాధ్యతను 2022లో ముందుకొచ్చిన ఏజెన్సీకే అప్పగించాలని నిర్ణయించామని తెలిపారు. స్పిల్‌వేకు రక్షణగాఉండే గైడ్ బండ్ కూడా కుంగిపోయిందని చెప్పారు. సీడబ్ల్యూసీ డిజైన్ల మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. నేడు ప్రధానితో బాబు భేటీ ఢిల్లీ పర్యటనలో భాగంగా శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. పోలవరం నిధులతో పాటు రాష్ట్రానికి మరిన్ని నిధులు మంజూరు చేయాలని కోరనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోం మంత్రి అమిత్ షా లతోనూ భేటీ కానున్నారు. -
చంద్రబాబు తప్పిదం వల్లే.. వాల్ ఢమాల్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు సర్కారు అనాలోచిత నిర్ణయాలు, అవగాహనా రాహిత్యం, అస్తవ్యస్థ పనులు మరోసారి బహిర్గతమయ్యాయి. పోలవరం డయాఫ్రమ్ వాల్ ధ్వంసం కావడానికి, ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో విధ్వంసం చోటు చేసుకోవడానికి ముమ్మాటికీ చంద్రబాబు ప్రభుత్వం తప్పిదాలే కారణమని అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక సాక్షిగా నిర్ధారణ అయింది. గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేయకుండానే.. ప్రధాన డ్యామ్ పునాది డయాఫ్రమ్‌వాల్‌ను పూర్తి చేసి చారిత్రక తప్పిదం చేశారని ఆక్షేపించింది. గోదావరికి అడ్డంగా 2016 డిసెంబర్ నుంచి 2017 జూలై వరకు 1,006 మీటర్లు.. 2017 డిసెంబర్ నుంచి 2018 జూన్ వరకూ 390.6 మీటర్ల పొడవున మొత్తం 1,396.6 మీటర్ల మేర ప్రధాన (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ గ్యాప్–2లో డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించారని పేర్కొంది. అయితే నదీ ప్రవాహాన్ని పూర్తి స్థాయిలో మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేయకపోవడంతో 2017, 2018లో గోదావరి ప్రవాహం డయాఫ్రమ్ వాల్ మీదుగా ప్రవహించిందని గుర్తు చేసింది. ఆ ప్రభావం డయాఫ్రమ్‌వాల్‌పై పడకుండా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో వరద ఉద్ధృతికి డయాఫ్రమ్ వాల్లో ఐదు చోట్ల 693 మీటర్ల పొడవున కోతకు గురై దెబ్బ తిందని స్పష్టం చేస్తూ ఈనెల 12న కేంద్ర జల సంఘానికి (సీడబ్ల్యూసీ) అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక అందచేసింది. గతేడాది ఎన్‌హెచ్‌పీసీ (నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్) నిర్వహించిన అధ్యయనంలో నాలుగు చోట్ల 485 మీటర్ల పొడవున డయాఫ్రమ్‌వాల్ దెబ్బ తిన్నట్లు తేల్చగా తాజాగా అంతర్జాతీయ నిపుణుల కమిటీ మరో 208 మీటర్ల మేర అధికంగా దెబ్బ తిన్నట్లు తేల్చడం గమనార్హం. పోలవరం నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు సలహాలు, సూచనలు అందించేందుకు డేవిడ్ బి.పాల్, గియాస్ ఫ్రాంకో డి సిస్కో(యూఎస్ఏ), రిచర్డ్ డొన్నెళ్లీ, సీస్ హించ్‌బెర్గర్ (కెనడా)లతో కూడిన అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ), సీడబ్ల్యూసీ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. జూన్ 29–జూలై 4 మధ్య పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి జలవనరుల శాఖ, సీడబ్ల్యూసీ అధికారులతో చర్చించిన ఈ బృందం గత నెల 7న ప్రాథమిక నివేదిక అందచేసింది. పూర్తి నివేదికను ఈనెల 12న సీడబ్ల్యూసీకి సమర్పించింది. అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదికలో ప్రధానాంశాలు ఇవీ..క్రమబద్ధంగా పనులు» గాడి తప్పిన పోలవరం పనులను 2019 తర్వాత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చక్కదిద్దింది. 2020లో ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, డయాఫ్రమ్ వాల్‌పై వరద ప్రభావం పడకుండా పూర్తి స్థాయిలో రక్షణాత్మక చర్యలు చేపట్టింది. గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేసింది. స్పిల్‌వే, స్పిల్ ఛానల్ పనుల నాణ్యత ప్రమాణాల మేరకు ఉంది. » ఎగువ కాఫర్ డ్యామ్‌ను 42.5 మీటర్ల ఎత్తుతో పూర్తి చేసి 2021 జూన్‌లోనే గోదావరి ప్రవాహాన్ని స్పిల్‌వే మీదుగా మళ్లించింది.» దిగువ కాఫర్ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని జియో బ్యాగ్‌లలో ఇసుక నింపి పూడ్చింది. 2023 ఫిబ్రవరి నాటికి దిగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేసింది. » ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు పటిష్టంగా ఉన్నాయి. 2018లో జెట్ గ్రౌటింగ్ వాల్ సామర్థ్యాన్ని పరీక్షించకుండా ఎగువ కాఫర్ డ్యామ్ పనులు చేపట్టడం వల్లే సీపేజీ (లీకేజీ) అధికంగా ఉంది.వాస్తవాలకు దర్పణంప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా ప్రాజెక్టు కట్టాలంటే తొలుత నదీ ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేస్తారు. ఆ తర్వాత కాఫర్ డ్యామ్‌లు నిర్మించి నదీ ప్రవాహాన్ని స్పిల్ మీదుగా మళ్లిస్తారు. అప్పుడు ప్రధాన డ్యామ్ నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకాలు ఉండవు. తద్వారా వరదల్లోనూ పనులు కొనసాగించి ప్రధాన డ్యామ్ పనులను పూర్తి చేస్తారు. కానీ.. పోలవరం ప్రాజెక్టులో మాత్రం చంద్రబాబు అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేయకుండానే.. ప్రధాన డ్యామ్ పునాది డయాఫ్రమ్‌వాల్‌ను పూర్తి చేసి చారిత్రక తప్పిదం చేశారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనులు ప్రారంభించి వాటిని పూర్తి చేయలేక చేతులెత్తేశారు. కాఫర్ డ్యామ్‌లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేశారు. వాటి గుండా గోదావరి కుచించుకుపోయి ప్రవహించాల్సి రావడంతో ఉద్ధృతి పెరిగి డయాఫ్రమ్‌వాల్ కోతకు గురై దెబ్బతింది.ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై విధ్వంసం చోటుచేసుకుంది. ఈ పాపం చంద్రబాబుదేనని సాగునీటిరంగ నిపుణులు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే స్పష్టం చేయగా తాజాగా అంతర్జాతీయ నిపుణుల కమిటీ కూడా అదే అంశాన్ని పునరుద్ఘాటించడం గమనార్హం. ప్రణాళికారాహిత్యం వల్లే..» పోలవరం జలాశయం పనులను 2016 డిసెంబర్లో ప్రారంభించారు. స్పిల్‌వే, స్పిల్ ఛానల్ పనుల కోసం కొండ తవ్వకం పనులకు సమాంతరంగా ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో డయాఫ్రమ్‌వాల్ పనులు ప్రారంభించారు. 2017 జూలైలో వరదలు ప్రారంభమయ్యే సమయానికి ఎడమ వైపు నుంచి 1,006 మీటర్ల పొడవున డయాఫ్రమ్ వాల్‌ను పూర్తి చేశారు. 2017 జూలై తర్వాత వచ్చిన వరద డయాఫ్రమ్‌వాల్ మీదుగానే ప్రవహించింది. 2017 డిసెంబర్ నుంచి 2018 జూన్ నాటికి మిగిలిన 390.6 మీటర్ల పొడవున గ్యాప్–2లో డయాఫ్రమ్‌వాల్‌ను పూర్తి చేశారు. 2018లోనూ వరద ప్రవాహం డయాఫ్రమ్‌వాల్ మీదుగానే ప్రవహించింది. ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్ల 2018 నాటికే డయాఫ్రమ్‌వాల్ దెబ్బతింది.» 2017లో వరద ప్రవాహం ముగిశాక ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల పునాది జెట్ గ్రౌటింగ్ వాల్లను 2018 జూన్ నాటికి పూర్తి చేశారు. కానీ ప్రవాహ ప్రభావం పడకుండా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో 2018లో గోదావరి వరదలకు ఎగువ కాఫర్ డ్యామ్ జెట్ గ్రౌటింగ్ వాల్ 200 నుంచి 260 మీటర్ల మధ్య దెబ్బతింది. 20 మీటర్ల లోతుతో నిర్మించిన జెట్ గ్రౌటింగ్ వాల్ పటిష్టంగా ఉందో లేదో తెలుసుకోకుండానే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల పనులను 2018 డిసెంబర్లో ప్రారంభించి.. 2019 మార్చి నాటికి పూర్తి చేయలేక ఇరు వైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేశారు. » ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్య ఖాళీ ప్రదేశాలను వదిలేయడం వల్ల గోదావరి కుచించుకుపోయి వాటి మధ్య ప్రవహించాల్సి ఉంటుంది. దీనివల్ల వరద ఉద్ధృతి పెరుగుతుంది. ఆ ప్రభావం ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంపై పడకుండా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోలేదు. దాంతో 2019లో గోదావరి ఎగువ కాఫర్ డ్యామ్ ఖాళీ ప్రదేశాల గుండా అధిక ఉద్ధృతితో ప్రవహించడంతో ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో 30 మీటర్ల లోతు వరకూ ఇసుక తిన్నెలు కోతకు గురై విధ్వంసం చోటు చేసుకుంది. డయాఫ్రమ్‌వాల్ పూర్తిగా దెబ్బతింది. దిగువ కాఫర్ డ్యామ్ కూడా కోతకు గురైంది. జగన్ సర్కారు పనులపై కమిటీ సంతృప్తి» పోలవరం పనులను 2019 నుంచి గాడిలో పెట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం» వరదను మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్ శరవేగంగా పూర్తి» ఎగువ కాఫర్ డ్యామ్ పూర్తి చేసి 2021 జూన్ 11న గోదావరి ప్రవాహం స్పిల్‌వే మీదుగా మళ్లింపు» దిగువ కాఫర్ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతంలో జియో బ్యాగ్‌లు ఇసుకతో నింపి పూడ్చివేత» 2023 ఫిబ్రవరికి దిగువ కాఫర్ డ్యామ్ పూర్తి» స్పిల్‌వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు పటిష్టంగా ఉన్నట్లు నిపుణుల కమిటీ సంతృప్తి » గతంలో జెట్ గ్రౌటింగ్ గోడలో లోపాల వల్లే ఎగువ కాఫర్ డ్యామ్‌లో లీకేజీ ఒకే సీజన్లో.. కొత్త డయాఫ్రమ్‌వాల్ » 2024 నవంబర్ 1 నుంచి 2025 జూలై 31లోగా పూర్తి చేయాలి » పాత డయాఫ్రమ్వాల్కి ఎగువన సమాంతరంగా కొత్తది నిర్మించాలి » కేంద్ర జలసంఘానికి అంతర్జాతీయ నిపుణుల నివేదిక సాక్షి, అమరావతి: పోలవరం పనుల్లో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడంపై కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)కి అంతర్జాతీయ నిపుణుల కమిటీ కీలక సిఫార్సులు చేసింది. ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో దెబ్బతిన్న డయాఫ్రమ్వాల్కి ఎగువన కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని ప్రతిపాదించింది. డయాఫ్రమ్ వాల్ పనులను వరదలు తగ్గాక అంటే 2024 నవంబర్ 1న ప్రారంభించి 2025 జూలై 31లోగా పూర్తి చేసేలా నిరంతరాయంగా చేయాలని స్పష్టం చేసింది. ఒకే సీజన్లో డయాఫ్రమ్‌వాల్‌ను పూర్తి చేయాలని తేల్చి చెప్పింది. నిపుణుల కమిటీ కీలక సిఫార్సులివీ...»గోదావరి వరదల ఉద్ధృతికి గ్యాప్–2లో డయాఫ్రమ్‌వాల్ 693 మీటర్ల పొడవున దెబ్బతింది. మరమ్మతులు చేసినా అది పూర్తి సామర్థ్యం మేరకు పని చేస్తుందో లేదో చెప్పలేం. ప్రాజెక్టు భద్రత దృష్ట్యా కొత్త డయాఫ్రమ్వాల్ని నిర్మించడమే శ్రేయస్కరం.» ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు పటిష్టంగా ఉన్నాయి. పునాది జెట్ గ్రౌటింగ్ వాల్లో లోపాల వల్లే ఎగువ కాఫర్ డ్యామ్‌లో సీపేజీ అధికంగా ఉంది. దీన్ని అరికట్టడానికి ఎగువ కాఫర్ డ్యామ్‌కు ఎగువన నది మధ్యలో ఫిల్టర్లు ఏర్పాటు చేయాలి. » ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్యన సీపేజీ నీటి మట్టం సముద్ర మట్టానికి 3 మీటర్ల లోపే ఉండాలి. ఆ మేరకు దిగువ కాఫర్ డ్యామ్‌లో ఏర్పాటు చేసిన గ్రావిటీ స్లూయిజ్‌ల ద్వారా సీపేజీ నీటిని బయటకు పంపాలి. గ్రావిటీ ద్వారా పంపడానికి సాధ్యం కాని నీటిని ఎత్తిపోయాలి. ఈ పనులను తక్షణమే ప్రారంభించాలి.» నవంబర్ 1 నుంచి డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభించడానికి వీలుగా ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన ఇసుక తిన్నెలను యధాస్థితికి తెచ్చేలా వైబ్రో కాంపాక్షన్ పనులను పూర్తి చేయాలి. సముద్ర మట్టానికి 3 మీటర్ల ఎత్తు వరకూ ఈ పనులను అక్టోబర్‌లోగా పూర్తి చేయాలి. » కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం.. గ్యాప్–1, గ్యాప్–2లలో ప్రధాన డ్యామ్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు, పనులు చేపట్టడంపై వర్క్ షాప్ నిర్వహించాలి.» 2024లో వరదలు తగ్గి పనులు ప్రారంభించడానికి ముందే పోలవరం ప్రాజెక్టు వద్ద ఈ వర్క్ షాప్ నిర్వహించాలి. సీడబ్ల్యూïÜ, పీపీఏ, జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతిని«దులు పాల్గొనే ఈ వర్క్ షాప్‌నకు అంతర్జాతీయ నిపుణులు కూడా హాజరవుతారు. -
లోక్‌సభలో వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి ప్రైవేట్ మెంబర్ బిల్లు
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభలో వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు. పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనాలు రూ.55 వేల కోట్లకు ఆమోదం తెలపాలని బిల్లులో ప్రతిపాదించారు. ఏపీ విభజన చట్టంపై సెక్షన్ 90ఏ చేర్చాలని బిల్లులో పేర్కొన్నారు.కాగా, లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టే ముందు ముస్లిం అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. అలాగే, ఈ బిల్లుపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ లేవనెత్తిన అభిప్రాయాలతో తాము ఏకీభవిస్తున్నామని వెల్లడించారు. -
పారిస్ ఒలింపిక్స్‌లో పసిడి పోరుకు.. భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్!
-
పోలవరం తొలిదశ సవరించిన అంచనా వ్యయం రూ.30,437 కోట్లు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు తొలి దశ సవరించిన అంచనా వ్యయం తాజా (2023, మార్చి) ధరల ప్రకారం రూ.30,436.95 కోట్లు అని రివైజ్డ్ కాస్ట్ కమిటీ (ఆర్సీసీ) 2023 అక్టోబర్ 19న తేల్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లోక్‌సభలో చెప్పారు. గోదావరి వరదల ఉద్ధృతికి ప్రధాన (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యామ్ గ్యాప్–2లో కోతకు గురై దెబ్బతిన్న డయాఫ్రమ్‌వాల్ పునరుద్ధరణ, డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురవడం వల్ల ఏర్పడిన అగాధాలను పూడ్చి యథాస్థితికి తెచ్చే పనులకు రూ.2,620.24 కోట్లు ఖర్చువుతుందని ఆర్సీసీ అంచనా వేసిందని మంగళవారం టీడీపీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. తాజా ధరల ప్రకారం నిధులిచ్చేలా అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్రాన్ని ఒప్పించడం ద్వారా పోలవరం ప్రాజెక్టుకు నిధుల సమస్య లేకుండా చేశారని, ఇది ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయడానికి దోహదపడుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. నిధుల సంక్షోభంలోకి నెట్టిన చంద్రబాబువిభజన చట్టం ప్రకారం పోలవరం జాతీయ ప్రాజెక్టును కేంద్రమే నిర్మించాలి. కానీ.. కమీషన్ల కోసం అప్పటి సీఎం చంద్రబాబు.. 2016 సెప్టెంబరు 7న ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టి మరీ పోలవరం నిర్మాణ బాధ్యతలను తీసుకున్నారు. 2013–14 నాటి ధరల ప్రకారం ప్రాజెక్టు పూర్తి చేస్తామని కేంద్రంతో ఒప్పందం చేసుకున్నారు. దాని ప్రకారం 2014 ఏప్రిల్ 1 నాటికి ప్రాజెక్టు పనులకు చేసిన వ్యయం రూ.4,730.71 కోట్లు పోను మిగతా రూ.15,667.90 కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం చెబితే దానికీ తలూపారు. నిజానికి 2017–18 ధరల ప్రకారం భూసేకరణ, నిర్వాసితుల పునరావాస వ్యయమే రూ.33,168.24 కోట్లు. కానీ.. ప్రాజెక్టు మొత్తాన్ని రూ.15,667.90 కోట్లతోనే పూర్తి చేస్తానని చంద్రబాబు అంగీకరించడంలో ఆంతర్యం కమీషన్లే. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని 2019లో సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలే ఇందుకు నిదర్శనం.సంక్షోభం నుంచి తప్పించిన వైఎస్ జగన్వైఎస్ జగన్ సీఎం అయ్యాక చంద్రబాబు చేసిన తప్పులను సరిదిద్దుతూ పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తూ వచ్చారు. తాజా ధరల ప్రకారం నిధులిచ్చి, ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీని అనేకమార్లు కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ప్రధాని.. ప్రాజెక్టును రెండో దశల్లో పూర్తి చేద్దామని, తొలి దశలో 41.15 మీటర్ల కాంటూర్ వరకు, ఆ తర్వాత 45.72 మీటర్ల కాంటూర్ వరకు పూర్తి చేద్దామని చెప్పారు. ఆ మేరకు తొలి దశ పనుల పూర్తికి (డయాఫ్రం వాల్ పునరుద్ధరణ, మరమ్మతులతో కలిపి) తాజా ధరల ప్రకారం రూ.31,625.37 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం పంపిన సవరించిన అంచనాలకు 2023 జూలైలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదముద్ర వేసి, ఆర్సీసీకి నివేదించింది. వాటిని పరిశీలించిన ఆర్సీసీ.. తొలి దశ సవరించిన అంచనా వ్యయం రూ.30,436.95 కోట్లుగా నిర్ధారించింది. నాడు మోకాలడ్డి.. నేడు వినతులుపోలవరం తొలి దశలో ఇప్పటివరకూ అయిన పనులకు చేసిన వ్యయం, కేంద్రం రీయింబర్స్ చేసిన మొత్తంపోనూ మిగిలిన పనుల పూర్తికి రూ.12,157.53 కోట్లు మంజూరు చేయాలని గత మార్చి 6న కేంద్ర కేబినెట్‌కు కేంద్ర జల్ శక్తి శాఖ ప్రతిపాదన పంపింది. అప్పటికే ఎన్డీఏలో చేరిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. ఆ ప్రతిపాదనపై ఆమోద ముద్ర వేస్తే రాజకీయంగా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో అప్పట్లో ఆ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ అజెండా నుంచి తప్పించింది. ఇలా ఆ నిధులకు మోకాలడ్డిన చంద్రబాబే.. ఈ నెల 27న ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిసి పోలవరం తొలి దశకు ఇవ్వాల్సిన రూ.12,157.53 కోట్లు మంజూరు చేయాలని, ఆ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్లో ప్రవేశపెట్టి, ఆమోదించాలని విజ్ఞప్తి చేయడం గమనార్హం. -
పోలవరం ప్రాజెక్టుకు భారీగా వచ్చి చేరుతున్న వరద
-
కొత్త డయాఫ్రమ్ వాల్
సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టు ప్రధాన (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యామ్ గ్యాప్–2లో దెబ్బతిన్న డయా ఫ్రమ్ వాల్‌కు సమాంతరంగా కొత్తగా డయా ఫ్రమ్ వాల్ నిర్మించాలని అంతర్జాతీయ నిపుణుల కమిటీ చేసిన ప్రతిపాదనను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. కొత్త డయా ఫ్రమ్ వాల్‌ను నిర్మించాలని కేంద్ర జల్ శక్తి శాఖను కోరుతూ తీర్మానం చేసింది. విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయడానికి సంపూర్ణ సహకారం ఇస్తామని బడ్జెట్ ప్రసంగంలో హామీ ఇచ్చినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపింది. ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించింది. వీటిని కేంద్ర జల్ శక్తి శాఖకు పంపాలని నిర్ణయించింది. గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో మంత్రివర్గం సమావేశమైంది. పోలవరం ప్రాజెక్టు పనులను జూన్ 30 నుంచి జూలై 3 వరకు అంతర్జాతీయ నిపుణుల కమిటీ క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. సీడబ్ల్యూసీ ఛైర్మన్ కుశ్వీందర్ వోరా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో గోదావరి వరదల ఉధృతికి గ్యాప్–2లో డయా ఫ్రమ్ వాల్ దెబ్బతిందని, దానికి మరమ్మతులు చేసినా పూర్తి సామర్థ్యం మేరకు పని చేస్తుందని చెప్పలేమని తేల్చి చెప్పారు. ప్రాజెక్టు భద్రత దృష్ట్యా దెబ్బ తిన్న డయా ఫ్రమ్ వాల్‌కు సమాంతరంగా కొత్తగా డయా ఫ్రమ్ వాల్ నిర్మించాలని సూచించారు. ఈ నేపథ్యంలో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం అంతర్జాతీయ నిపుణుల కమిటీ చేసిన సూచనకు ఆమోదం తెలిపింది.2023 జూన్ 5నే నిధులు మంజూరు » కేంద్రమే కట్టాల్సిన పోలవరం నిర్మాణ బాధ్యతలను కమీషన్ల కక్కుర్తితో దక్కించుకున్న సీఎం చంద్రబాబు.. ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ ప్రోటోకాల్‌ను తుంగలో తొక్కి.. గోదావరి వరదను మళ్లించేలా స్పిల్ వేను పూర్తి చేయకుండానే ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో పునాది డయా ఫ్రమ్ వాల్‌ను పూర్తి చేసి చారిత్రక తప్పిదం చేశారు.» 2019, 2020లలో గోదావరికి వచ్చిన భారీ వరదలు.. ఎగువ కాఫర్ డ్యామ్ ఖాళీ ప్రదేశాల గుండా అధిక ఉధృతితో ప్రవహించడంతో డయా ఫ్రమ్ వాల్ కోతకు గురై దెబ్బతింది. ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై గరిష్టంగా 36 మీటర్లు.. కనిష్టంగా 26 మీటర్ల లోతుతో భారీ అగాధాలు ఏర్పడ్డాయి.» వెఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక.. ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ ప్రోటోకాల్ ప్రకారం స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేసి 2021 జూన్ 11నే గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా 6.1 కి.మీల పొడవున మళ్లించారు. ఆ తర్వాత దిగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేశారు. కోతకు గురై దెబ్బ తిన్న డయా ఫ్రమ్ వాల్ భవితవ్యాన్ని తేల్చితే ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేస్తామని వైఎస్ జగన్ చేసిన ప్రతిపాదన మేరకు.. 2022 మార్చి 4న అప్పటి కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. » చంద్రబాబు చారిత్రక తప్పిదం వల్ల దెబ్బ తిన్న డయా ఫ్రమ్ వాల్ పునరుద్దరణ, ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే పనులకు అయ్యే వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో దెబ్బ తిన్న డయా ఫ్రమ్ వాల్‌కు సమాంతరంగా కొత్తగా డయా ఫ్రమ్ వాల్ నిర్మించాలని అప్పట్లోనే ప్రతిపాదించారు. » వాటిని పరిగణనలోకి తీసుకుని.. రెండు దశల్లో పోలవరాన్ని పూర్తి చేయాలని నిర్ణయించిన కేంద్రం.. వైఎస్ జగన్ జగన్ విజ్ఞప్తి మేరకు తొలి దశ పూర్తి చేయడానికి రూ.10,911.15 కోట్లు, డయా ఫ్రమ్ వాల్ పునరుద్ధరణ, మరమ్మతులకు రూ.2 వేల కోట్లు వెరసి రూ.12,911.15 కోట్లు ఇచ్చేందుకు అంగీకరిస్తూ 2023 జూన్ 5న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నోట్ జారీ చేశారు.నాడు వద్దంటూ.. నేడు నిధుల విడుదలకు ప్రతిపాదన» గత ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి మేరకు పోలవరం ప్రాజెక్టు తొలి దశ పూర్తికి అవసరమైనన్ని నిధులు విడుదల చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖను ప్రధాని నరేంద్ర మోదీ అప్పట్లో ఆదేశించారు. కేంద్ర జల సంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు పలుమార్లు రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులతో సమావేశమై.. కొత్త డయా ఫ్రమ్ వాల్ నిర్మాణంతోపాటు తొలి దశ పూర్తికి రూ.12,157.52 కోట్లు విడుదల చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖకు ప్రతిపాదించారు. » ఆ నిధులు విడుదల చేయాలంటే కేంద్ర కేబినెట్ ఆమోదం తప్పనిసరి. ఎందుకంటే.. 2016 సెప్టెంబర్ 6న పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకునే క్రమంలో 2013–14 ధరలతోనే ప్రాజెక్టును పూర్తి చేస్తానని చంద్రబాబు కేంద్రంతో ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం 2014 ఏప్రిల్ 1 నాటికి నీటి పారుదల విభాగంలో మిగిలిన పనులకు అయ్యే వ్యయం అంటే రూ.15,667.90 కోట్లు ఇవ్వాలని 2017 మార్చి 15న కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. » ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.15,146.28 కోట్లు విడుదల చేసింది. దీనికితోడు రూ.12,157.52 కోట్లు విడుదల చేయాలంటే 2017 మార్చి 15న తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర కేబినెట్ మారుస్తూ తీర్మానం చేయాలి. ఆ మేరకు తీర్మానం చేసి.. నిధులు మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర జల్ శక్తి శాఖ ఈ ఏడాది మార్చి 6న కేంద్ర కేబినెట్‌కు ప్రతిపాదన పంపింది. » అయితే అప్పటికే ఎన్డీఏలో చేరిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆ నిధులు ఇస్తే రాజకీయంగా తమకు ఇబ్బందులు వస్తాయని కేంద్ర ప్రభుత్వ పెద్దల చెవిలో ఊదారు. దాంతో అప్పట్లో ఆ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ పక్కన పెట్టింది. ఇప్పుడు మళ్లీ ఆ ప్రతిపాదనపై ఆమోద ముద్ర వేసి.. నిధులు విడుదల చేయాలని రాష్ట్ర మంత్రివర్గంతో సీఎం చంద్రబాబు తీర్మానం చేయించడం గమనార్హం. -
‘పోలవరం’ వ్యయంపై బాబు శ్వేతపత్రం బోగస్
సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టుపై వైఎస్ జగన్ సర్కారు చేసిన ఖర్చు విషయంలో సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం బోగస్ అని తేలిపోయింది. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ గురువారం పార్లమెంట్ సాక్షిగా ఈ విషయాన్ని పరోక్షంగా చెప్పేశారు. గత మూడేళ్లుగా పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన వ్యయం తెలియజేయాల్సిందిగా టీడీపీ ఎంపీలు కృష్ణదేవరాయలు, హరీష్ బాలయోగి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బదులిచ్చారు. గత మూడేళ్లలో (2020–21, 2022–23, 2023–24) సంవత్సరాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టుపై రూ.8,044.31 కోట్లు వ్యయం చేసినట్లు మంత్రి చెప్పారు. ఇందులో రూ.4,227.52 కోట్లను కేంద్రం రీయింబర్స్ చేసిందని.. రూ.3,816.79 కోట్లు ఇంకా రీయింబర్స్ చేయాల్సి ఉందన్నారు. అయితే, చంద్రబాబునాయుడు గత నెల 28న విడుదల చేసిన శ్వేతపత్రంలో గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.4,167 కోట్లే వ్యయం చేసిందని అవాస్తవాలను వల్లెవేశారు. బాబు అబద్ధాలను పటాపంచలు చేస్తూ టీడీపీ ఎంపీలకు కేంద్రమంత్రి వాస్తవ అంకెలను వివరించారు. కేంద్ర నిధులు మళ్లించినట్లు కూడా చంద్రబాబు తన శ్వేతపత్రం ద్వారా చెప్పగా కేంద్రమంత్రి ఎక్కడా నిధుల మళ్లింపు ఊసెత్తలేదు. ఇక గత మూడేళ్లలో హెడ్వర్క్తో పాటు కాంక్రీట్ పనులు, కుడికాలువకు లైనింగ్ పనులు, ఎడమ కాలువ ఎర్త్‌వర్క్ లైనింగ్‌తో పాటు స్ట్రక్చర్ పనులు, భూసేకరణ, సహాయ పునరావాసానికి వ్యయం చేసినట్లు కేంద్రమంత్రి స్పష్టంచేశారు. -
పులస.. వలస..ప్రయాణమిక కులాసా
పుస్తెలు అమ్మి అయినా పులస తినాలనేది గోదావరి జిల్లాల్లో నానుడి. రుచిలోఅత్యంత మేటైన పులస చేపల ప్రవర్తన కూడా అంతే ప్రత్యేకమైనది. సముద్రం నుంచి గోదావరి నదిలోకి ఎదురీదుకుంటూ వచ్చే పులసల కోసం బంగాళాఖాతం నుంచి భద్రాచలం వరకూ స్వేచ్ఛగా విహరించేలా పోలవరం ప్రాజెక్టులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.సాక్షి, అమరావతి: గోదావరిలోకి ఎర్రనీరు పోటెత్తగానే సముద్రం నుంచి గోదావరిలోకి ఎదురీది వచ్చే పులసల ప్రయాణానికి ఇబ్బంది లేకుండా పోలవరం స్పిల్‌వే రెండో బ్లాక్‌లో ఫిష్ ల్యాడర్ నిర్మాణం పూర్తయ్యింది. జలాశయంలో డెడ్ స్టోరేజి 25.72 మీటర్ల స్థాయి నుంచి గరిష్ట మట్టం 45.72 అడుగుల వరకూ ఏ స్థాయిలో నీరు నిల్వ ఉన్నా పోలవరం ప్రాజెక్టు నుంచి ఎగువకు దిగువకు పులసలు రాకపోకలు సాగించేలా ఫిష్ ల్యాడర్ నిర్మించారు.గోదావరిలో వరద పెరుగుతుండటం.. ధవళేశ్వరం బ్యారేజి నుంచి వరద ప్రవాహం బంగాళాఖాతంలో కలుస్తుండటంతో సముద్రం నుంచి విలస ఎదురీదుతూ ఫిష్ ల్యాడర్ మీదుగా అఖండ గోదావరిలో విహరిస్తోంది. దేశంలో పులస, ఇతర చేపల స్వేచ్ఛా విహారానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసిన ఏకైక ప్రాజెక్టు పోలవరమేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచంలో చేపల స్వేచ్ఛా విహారానికి ప్రత్యేక ఏర్పాట్లు ఉన్న అతి పెద్ద జలాశయం పోలవరం ప్రాజెక్టే కావడం గమనార్హం. ప్రపంచంలో ఒక చేప జాతి సైకాలజీపై అధ్యయనం చేసి.. ఆ చేప జాతి స్వేచ్ఛకు విఘాతం కలి్పంచకుండా నిరి్మస్తున్న ఏకైక ప్రాజెక్టు కూడా పోలవరమేనని పర్యావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నదుల్లోకి ఎదురీదే అరుదైన జాతి గోదావరిలో ఏడాది పొడవునా పులసలు దొరకవు. నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల వర్షాలు కురిసి.. గోదావరి వరద ప్రవాహం (ఎర్రనీరు) సముద్రంలో కలిసే సమయంలో (జూన్ 4వ వారం నుంచి జూౖలె, ఆగస్టు మధ్యన సముద్రంలో జీవించే విలస రకం చేపలు నదిలోకి ఎదురీదుతాయి. సముద్రపు జలాల నుంచి విలస గోదావరి నీటిలోకి చేరాక పులసగా రూపాంతరం చెందుతుంది. పులస సంతానోత్పత్తి కోసం గోదావరిలోకి ఎదురీదుతుంది. వరదల సమయంలో ధవళేశ్వరం బ్యారేజీ గేట్లను ఎత్తి ఉంచడం వల్ల గోదావరి సముద్రంలో కలిసే అంతర్వేది నుంచి దాదాపుగా భద్రాచలం వరకూ నదిలో ఎదురీదుతుంది. విలస గోదావరి నీటిలోకి ప్రవేశించాక.. దాని శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకోవడం వల్ల పులసగా మారి అద్భుతమైన రుచినిస్తుంది. సంతానోత్పత్తి చేశాక తిరిగి సముద్రంలోకి చేరి.. విలసగా రూపాంతరం చెందుతుంది. పోలవరం నుంచి స్వేచ్ఛా విహారం పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తే అత్యంత అరుదైన పులస చేపల స్వేచ్ఛకు విఘాతం కలుగుతుందని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమానాలు వ్యక్తం చేసింది. పులస స్వేచ్ఛకు భంగం వాటిల్లకుండా పోలవరం ప్రాజెక్టు మీదుగా ఎగువకు.. దిగువకు స్వేచ్ఛగా విహరించేలా ఏర్పాట్లు చేస్తేనే ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి ఇస్తామని షరతు విధించింది. ఆ షరతుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంతో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చింది.సైకాలజీపై ప్రత్యేక అధ్యయనం సముద్రంలో ఉండే విలస.. గోదావరిలోకి చేరి పులసగా రూపాంతరం చెందాక.. అది ప్రవర్తించే తీరు(సైకాలజీ)పై అధ్యయనం చేసి.. దాని స్వేచ్ఛకు భంగం వాటిల్లకుండా ఎగువకు దిగువకు రాకపోకలు సాగించేలా పోలవరం ప్రాజెక్టుకు ఫిష్ ల్యాడర్ గేట్ల డిజైన్ రూపొందించే బాధ్యతను కోల్‌కతాలోని ప్రఖ్యాత సీఐఎఫ్ఆర్ఐ (సెంట్రల్ ఇన్‌ల్యాండ్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్)కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. సుమారు ఐదేళ్లపాటు అధ్యయనం చేసిన సీఐఎఫ్ఆర్ఐ పులస స్వేచ్ఛా విహారానికి వీలుగా పోలవరం స్పిల్‌వే రెండో బ్లాక్‌లో అమర్చే ఫిష్ ల్యాడర్ గేట్లను డిజైన్ చేసింది. ఈ డిజైన్‌ను సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) ఆమోదించింది.ఇంజనీరింగ్ అద్భుతం.. ఫిష్ ల్యాడర్సీడబ్ల్యూసీ ఆమోదించిన మేరకు ఫిష్ ల్యాడర్ నిర్మాణాన్ని 2022లో పూర్తి చేసిన ప్రభుత్వం వాటికి గేట్లను కూడా అమర్చింది. గోదావరి నదిలో వరద ప్రవాహం ఏ స్థాయిలో ఉన్నా పులసలు స్వేచ్ఛగా విహరించేలా పోలవరం స్పిల్‌వే రెండో పియర్‌కు మూడుచోట్ల ఫిష్ ల్యాడర్ గేట్లను అమర్చింది. ఫిష్ ల్యాడర్ 252 మీటర్ల పొడవు ఉంటుంది. దీన్ని పోలవరం స్పిల్‌వే రెండో బ్లాక్‌లో నాలుగు అరలుగా నిరి్మంచారు. ఒక్కో అరకు ఒక్కో గేటు చొప్పున నాలుగు గేట్లను అమర్చారు. క్రస్ట్ లెవల్లో అంటే 25.72 మీటర్ల స్థాయిలో ఫిష్ ల్యాడర్ అరకు ఒకటి, 30.5 మీటర్ల స్థాయిలో అరకు రెండో గేటు అమర్చారు. 34 మీటర్ల స్థాయిలో అరకు మూడో గేటు, 41 మీటర్ల స్థాయిలో నాలుగో గేటు అమర్చారు. పోలవరం ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 45.72 మీటర్లు, కనిష్ట నీటిమట్టం 25.72 మీటర్లు. అంటే.. గోదావరిలో నీటిమట్టం గరిష్టంగా ఉన్నా.. సాధారణంగా ఉన్నా.. కనిష్టంగా ఉన్నా పులసలు ఎగువకు, దిగువకు రాకపోకలు సాగించేలా పోలవరం ప్రాజెక్టుకు ఫిష్ ల్యాడర్ గేట్లు అనుకూలంగా ఉంటాయి. పోలవరం స్పిల్‌వే మీదుగా పులస స్వేచ్ఛగా విహరిస్తుండటంతో ఫిష్ ల్యాడర్‌ను ఇంజనీరింగ్ అద్భుతంగా పర్యావరణ నిపుణులు అభివరి్ణస్తున్నారు. -
అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే ‘రివర్స్’ ఆరోపణలు
సాక్షి, అమరావతి: స్వలాభం కోసం కేంద్రం నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును తాను తీసుకొని, కాసుల కోసం అస్తవ్యస్తంగా నిర్మాణాన్ని చేపట్టి, మొత్తం ప్రాజెక్టునే ధ్వంసం చేసింది సీఎం చంద్రబాబే. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా, ఆ తప్పులను హుందాగా ఒప్పుకొని, సరిదిద్దుకొనే నైజం లేని ఆయన.. వాటిని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నెట్టేస్తున్నారు.కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఆదేశాలను బేఖాతరు చేస్తూ పోలవరంలో తాను అడ్డగోలుగా చేసిన పనుల వల్ల జరిగిన విధ్వంసం.. పర్యవసానంగా పనుల్లో జాప్యం, జరిగిన రూ.వేల కోట్ల నష్టాన్ని వైఎస్ జగన్‌పైకి నెట్టేందుకు సీఎం చంద్రబాబు చేస్తున్న దుస్సాహసానికి ఎల్లో మీడియా యధావిధిగా వంతపాడుతోంది. అభూత కల్పనలతో కథనాలు ప్రచురిస్తోంది. సోమవారమూ ఇలాంటి కథనాలు ప్రచురించింది. విభజన చట్టం ప్రకారం కేంద్రమే కట్టాల్సిన పోలవరం నిర్మాణ బాధ్యతలను కమీషన్లకు ఆశపడి 2016 సెపె్టంబరు 7న అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకొని అర్ధరాత్రి చారిత్రక తప్పిదం చేశారు. ఆ పనులనూ ప్రణాళికాబద్ధంగా చేపట్టకుండా, స్వలాభం కోసం అస్తవ్యస్తంగా చేపట్టారు. గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించే స్పివ్ వేను పూర్తి చేయకుండా, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ గ్యాప్–2లో పునాది డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించి మరో చారిత్రక తప్పిదం చేశారు.ఇది చాలదన్నట్టు.. 2019 ఎన్నికలకు ముందు హడావుడిగా ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనులు చేపట్టారు. వాటినీ పూర్తి చేయలేక 2019 ఫిబ్రవరిలో మధ్యలోనే పనులు ఆపేసి చేతులెత్తేశారు. పోలవరం వద్ద 2,400 మీటర్ల వెడల్పుతో ప్రవహించే గోదావరికి ఎగువ కాఫర్ డ్యామ్ అడ్డంకిగా మారింది. దానికి ఇరువైపులా ఉన్న ఖాళీ ప్రదేశం 800 మీటర్లకు కుచించుకుపోయింది. 2019, 2020లలో వచి్చన వరదలకు ఈ ప్రదేశంలో ఉధృతి మరింత పెరిగిపోయింది. ఎగువ కాఫర్ డ్యామ్ ఖాళీ ప్రదేశాల గుండా అధిక ఉద్ధృతితో నీరు ప్రవహించడంతో గ్యాప్–2లో డయాఫ్రమ్ వాల్ కోతకు గురై దెబ్బతింది.ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై గరిష్ఠంగా 36 మీటర్ల నుంచి కనిష్టంగా 26 మీటర్ల లోతుతో నాలుగు చోట్ల భారీ అగాధాలు ఏర్పడ్డాయి. ఈ భారీ నష్టానికి చంద్రబాబు సర్కారు చేసిన చారిత్రక తప్పిదమే కారణమని నీతి అయోగ్ నియమించిన ఐఐటీ(హైదరాబాద్) నిపుణుల కమిటీ తేలి్చచెప్పింది. లోక్‌సభ, రాజ్యసభలో టీడీపీ సభ్యులు అనేక సార్లు అడిగిన ప్రశ్నలకు అప్పటి కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కూడా చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదం వల్లే పోలవరంలో విధ్వంసం జరిగిందని స్పష్టంగా చెప్పారు. అయినా ఆ తప్పిదాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్‌పై నెట్టేందుకు చంద్రబాబు, ఎల్లో మీడియా ప్రయత్నం చేస్తున్నాయి. అక్రమాల గుట్టు రట్టవడంతోనే.. పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్‌లో రూ.2,917 కోట్ల విలువైన పనులను ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్ట్రాయ్ నుంచి తప్పించి మరో కాంట్రాక్టర్‌కు అప్పగించడానికి 2018లో అప్పటి సీఎం చంద్రబాబు ప్రయతి్నంచారు. కాంట్రాక్టర్‌ను మార్చితే సమస్యలు వస్తాయని, వాటికి బాధ్యత ఎవరు వహిస్తారంటూ సీడబ్ల్యూసీ, పీపీఏ అభ్యంతరం తెలిపినా చంద్రబాబు లెక్క చేయలేదు. పాత ధరలకే అంటే 2010–11 ధరల ప్రకారం పనులు చేయడానికి నవయుగ ముందుకొచ్చిందని చెబుతూ.. 2015–16 ధరల ప్రకారం మొత్తం రూ.2,917 కోట్ల పనులను కేవలం నామినేషన్ పద్ధతిలో అప్పగించారు.ఇంత భారీ విలువైన పనులను కేవలం నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టిన దాఖలాలు దేశ చరిత్రలోనే లేవంటూ అప్పట్లో అధికారవర్గాలు నివ్వెరపోయాయి. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు సర్వత్రా వచ్చాయి. పోలవరంను కమీషన్ల కోసం చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీనే అప్పట్లో వ్యాఖ్యానించడం గమనార్హం. వైఎస్ జగన్ ప్రభుత్వం వచి్చన తర్వాత చంద్రబాబు అక్రమ పద్ధతిలో నవయుగకు కట్టబెట్టిన హెడ్ వర్క్స్, జల విద్యుత్ కేంద్రం పనులను రద్దు చేసింది. 2019లో రివర్స్ టెండరింగ్ నిర్వహించింది. ఈ టెండర్లలో నవయుగకు అప్పగించిన పనుల వ్యయంకంటే.. రూ.783.44 కోట్లకు తక్కువకే పనులు చేయడానికి మేఘా సంస్థ ముందుకొచి్చంది. దాంతో చంద్రబాబు సర్కారు అక్రమాలు రట్టయ్యాయి. దీన్ని కప్పిపుచ్చుకోవడానికే సీడబ్ల్యూసీ, పీపీఏ అభ్యంతరం చెప్పినా నవయుగను మార్చి మేఘాకు పనులు అప్పగించడం వల్లే పోలవరంలో విధ్వంసం జరిగిందని చంద్రబాబు, ఎల్లో మీడియా ప్రచారం ప్రారంభించారు.రివర్స్ టెండర్లతోనే శరవేగంగా పనులుమహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2005లో పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించినప్పటి నుంచి 2019 వరకూ పూర్తయిన పనులు 24.85 శాతం. వైఎస్ జగన్ సర్కారు రివర్స్ టెండరింగ్‌తో పనులు మేఘాకు అప్పగించారు. చంద్రబాబు చేసి తప్పులను సరిదిద్దుతూ ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టు పనులను శరవేగంగా చేపట్టారు. 2019 నవంబర్‌లో పనులు ప్రారంభించిన మేఘా.. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ రికార్డు సమయంలో స్పిల్ వేను 48 గేట్లతో సహా పూర్తి చేసింది. సిల్ప్ ఛానల్, అప్రోప్ ఛానల్, పైలట్ చానల్లను పూర్తి చేసింది.ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేసింది. 2021 జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా 6.1 కిలోమీటర్ల పొడవున మళ్లించి వైఎస్ జగన్ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. పోలవరం ప్రాజెక్టు భద్రత కోసం సీడబ్ల్యూసీ, పీపీఏ మంజూరు చేసిన రూ.689.47 కోట్ల పనులు ఒకసారి, రూ.1,615.75 కోట్ల పనులను రెండోసారి వరుసగా 1.98 శాతం, 1.02 శాతం తక్కువ ధరకు మేఘాకు అప్పగించింది. చంద్రబాబు చారిత్రక తప్పిదం వల్ల ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాధాలను 1.0584 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుకతో పూడ్చి, వైబ్రో కాంపాక్షన్ చేసి యధాస్థితికి తెచ్చింది. డ్యామ్ గ్యాప్–3లో కాంక్రీట్ డ్యామ్, గ్యాప్–1లో డయాఫ్రమ్ వాల్ పూర్తి చేసింది. జలవిద్యుత్ కేంద్రంలో సొరంగాలు, పవర్ స్టేషన్ పనులను కొలిక్కి తెచి్చంది. జలాశయాన్ని కుడి, ఎడమ కాలువలతో అనుసంధానం చేసే హెడ్ రెగ్యులేటర్లు, సొరంగాల నిర్మాణం పూర్తి చేసింది. 2019 మే 30 నుంచి 2024 జూన్ 11 వరకూ 24.94 శాతం పనులు పూర్తి చేశారు. అంటే 2005 నుంచి ఇప్పటిదాకా పూర్తయిన ప్రాజెక్టు పనులు 49.79 శాతమే. అంటే సగమే. కానీ.. చంద్రబాబు హయాంలోనే పోలవరం పనులు 72 శాతం పూర్తయినట్లు ఎల్లో మీడియా కట్టుకథలు అల్లడం గమనార్హం. -
మరో డయాఫ్రమ్ వాల్ కట్టాల్సిందే
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ గ్యాప్–2లో గోదవరి వరదల ఉధృతికి దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌కు సమాంతరంగా కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని అంతర్జాతీయ నిపుణుల బృందం కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కి సూచించింది. ప్రస్తుతం ఉన్న డయాఫ్రమ్ వాల్‌కు మరమ్మతులు చేసినా, దెబ్బతిన్న ప్రాంతాల్లో ‘యూ’ ఆకారంలో నిర్మించి అనుసంధానం చేసినా పూర్తి సామర్థ్యం మేరకు పనిచేస్తుందని చెప్పలేమని తేల్చిచెప్పింది. ఇప్పటికే గోదావరి వరదలను మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్‌తోపాటు ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను ప్రభుత్వం పూర్తి చేసినందున కొత్త డయాఫ్రమ్ వాల్‌ను సులభంగా నిర్మించవచ్చని నిపుణుల బృందం అభిప్రాయపడింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) నియమించిన యూఎస్ఏకు చెందిన డేవిడ్ బి.పాల్, గియాస్ ఫ్రాంకో డి సిస్కో, కెనడాకు చెందిన రిచర్డ్ డొన్నెళ్లీ, సీస్ హించ్‌బెర్గర్, కాంట్రాక్టు సంస్థ మేఘా నియమించిన అంతర్జాతీయ కన్సల్టెంట్ యాఫ్రి సంస్థ (స్వీడన్) ప్రతినిధులు నాలుగు రోజులపాటు ప్రాజెక్టును పరిశీలించి, అధికారులతో సమీక్షించారు. బుధవారం మరోసారి సమీక్షించిన అనంతరం నిపుణుల బృందంతో సీడబ్ల్యూసీ చైర్మన్ వోరా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. గతంలో వరదను మళ్లించేలా స్పిల్ వే పూర్తి చేయకుండా, ఎగువ కాఫర్ డ్యామ్‌ను చేపట్టి ఇరు వైపులా ఖాళీ వదిలేయడం వల్లే వరద ఉద్ధృతి మరింత పెరిగి డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని అంతర్జాతీయ నిపుణులు సీడబ్ల్యూసీ చైర్మన్‌కు తేల్చి చెప్పారు. గ్యాప్–2లో 1396 మీటర్ల పొడవున డయాఫ్రమ్ వాల్ నాలుగు చోట్ల కోతకు గురై 485 మీటర్ల మేర దెబ్బతిందని నేషనల్ హైడ్రోపవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) ఇచ్చిన నివేదికతో ఈ బృందం ఏకీభవించింది. ప్రాజెక్టు భద్రత దృష్ట్యా డయాఫ్రమ్ వాల్‌కు సమాంతరంగా కొత్తది నిర్మించడం శ్రేయస్కరమని సూచించింది.జెట్ గ్రౌటింగ్‌లో లోపం వల్లే లీకేజీలుఎగువ కాఫర్ డ్యామ్ నిర్మాణానికి ముందు జెట్ గ్రౌటింగ్ చేసేటప్పుడు ఆ ప్రదేశంలో ఇసుక సాంద్రతను తప్పుగా అంచనా వేశారని ఈ బృందం తెలిపింది. అందువల్లే తక్కువ లోతు నుంచి స్టోన్ కాలమ్స్ వేసి, జెట్ గ్రౌటింగ్ చేశారని, దీనివల్లే లీకేజీలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. లీకేజీలకు కారణాలు కనుక్కోవడానికి కాఫర్ డ్యామ్ పైనుంచి 100 నుంచి 150 మీటర్లకు ఒక చోట మొత్తం 17 చోట్ల బోర్ హోల్స్ వేసి పరీక్షలు చేయాలని సూచించామని తెలిపింది. యాఫ్రి సంస్థ ఇప్పటికే నాలుగు చోట్ల పరీక్షలు చేసిందని వివరించింది. ఆ పరీక్షల ఫలితాలను విశ్లేషిస్తే.. లీకేజీలను పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయలేమని, కొంతవరకు అడ్డుకోవచ్చని అభిప్రాయపడింది. కొంతవరకు లీకేజీలు ఉన్నప్పటికీ కొత్త డయాఫ్రమ్‌వాల్ నిర్మాణానికి, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని వివరించింది.ముగిసిన అంతర్జాతీయ నిపుణుల పర్యటనఅంతర్జాతీయ నిపుణుల నాలుగు రోజుల పోలవరం పర్యటన బుధవారం ముగిసింది. వారు బుధవారం విజయవాడ చేరుకున్నారు. గురువారం ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి చేరుకుని, అక్కడి నుంచి వారి దేశాలకు వెళ్తారు. రెండు వారాల్లో మధ్యంతర నివేదికపోలవరం ప్రాజెక్టు పరిశీలన, అధికారులతో సమీక్షలో వెల్లడైన అంశాల ఆధారంగా సవాళ్లను అధిగమించడం, నిర్మాణాల డిజైన్లపై రెండు వారాల్లోగా మధ్యంతర నివేదిక ఇస్తామని నిపుణుల బృందం తెలిపింది. ఆ నివేదిక ఆధారంగా కాంట్రాక్టు సంస్థ అంతర్జాతీయ కన్సల్టెంట్ యాఫ్రి సంస్థ సవాళ్లను అధిగమించడానికి చేపట్టాల్సిన నిర్మాణాల డిజైన్లను రూపొందించి తమకు పంపితే.. తాము పరిశీలించి మార్పులుంటే సూచిస్తామని చెప్పింది. యాఫ్రి, తాము ఏకాభిప్రాయంతో నిర్ణయించిన డిజైన్‌ను సీడబ్ల్యూసీకి పంపుతామని తెలిపింది. ఆ డిజైన్‌ను సీడబ్ల్యూసీ క్షుణ్ణంగా పరిశీలించి, ఆమోదించాకే దాని ప్రకారం పనులు చేపట్టాలని సూచించింది. ఇందుకు సీడబ్ల్యూసీ చైర్మన్ వోరా అంగీకరించారు. నిపుణల బృందం మధ్యంతర నివేదిక ఇచ్చాక ఢిల్లీలో మరోసారి రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు, అంతర్జాతీయ నిపుణులతో సమావేశం నిర్వహిస్తామని వోరా చెప్పారు. -
రెండోరోజూ పోలవరం ప్రాజెక్టు పరిశీలన
పోలవరం రూరల్ : పోలవరం ప్రాజెక్టులో అంతర్జాతీయ నిపుణుల బృందం రెండోరోజైన సోమవారం కూడా పనులను క్షుణ్ణంగా పరిశీలించింది. డేవిడ్ వి.పాల్, గియాస్ ఫ్రాంకో డి. సిస్కో, రిచర్డ్ డొన్నెళ్లి, సీస్ హించ్ బెర్గర్లతో కూడిన బృందం సభ్యులు ఉ.10 గంటలకు రాజమహేంద్రవరం నుంచి పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్నారు. గోదావరి వరదల ఉధృతికి దెబ్బతిన్న డయాఫ్రం వాల్ ప్రాంతాన్ని, క్షేత్రస్థాయిలో ప్రతి కట్టడం నిర్మాణాన్ని పరిశీలించారు.బృందం సభ్యులకు కేంద్ర జలసంఘం సీడబ్ల్యూసీ డైరెక్టర్ అశ్వినీకుమార్, జలవనరుల శాఖ సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు, ఈఎన్సీ పి. నారాయణరెడ్డి, సీఈ నరసింహమూర్తిలు ప్రాజెక్టు నిర్మాణ పనుల తీరును వివరించారు. డయాఫ్రం వాల్ నిర్మాణానికి ముందు చేసిన పనులు, తదుపరి చేసిన వివరాలను తెలుసుకుంటూ ప్రస్తుత పరిస్థితిని అధ్యయనం చేశారు. డయాఫ్రం వాల్ ప్రాంతంలో వరద ఉధృతికి ఏర్పడ్డ అగాధాల పరిస్థితిపైనా ఆరా తీశారు. అగాధాలు పడిన ప్రాంతంలో శాండ్ ఫిల్లింగ్, జెట్ గ్రౌటింగ్ పనులను పరిశీలించి జల వనరుల శాఖాధికారుల నుంచి పనులు జరుగుతున్న తీరుతెన్నులను ప్రశ్నించారు.డయాఫ్రం వాల్ ప్రాంతంలో ఏర్పాటుచేసిన ఫొటో గ్యాలరీని పరిశీలించి గతంలో పరిస్థితి, ప్రస్తుత పరిస్థితి.. దీనిపై ఏవిధమైన నిర్ణయాలు తీసుకోవాలనే అంశాలపై చర్చించారు. డయాఫ్రం వాల్ కట్టడం, పనితీరు తదితర అంశాలను ఇంజనీరింగ్ అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. అలాగే, ఎగువ కాఫర్ డ్యాం నుంచి సీపేజ్ (ఊట నీరు) వస్తున్న ప్రాంతాన్ని పరిశీలించి, మట్టి నాణ్యతా ప్రమాణాలపై ఆరా తీశారు. ఎగువ కాఫర్ డ్యాంపై జరుగుతున్న జియో టెక్నికల్ కోర్ ఇన్వెస్టిగేషన్ పనులు, అక్కడ సేకరించిన మట్టి నమూనాలను బృందం సభ్యులు పరిశీలించారు. అలాగే, ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతం, డయాఫ్రం వాల్ దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించి, భూ భౌతిక పరిస్థితుల మార్పునకు చేస్తున్న ప్రయత్నాలు తదితర అంశాలపై నిపుణుల బృందం ఎక్కువ దృష్టిపెట్టింది.నేడు, రేపు కూడా సమీక్ష..ఇలా సుమారు మూడు గంటలపాటు డయాఫ్రం వాల్ మొత్తం పరిశీలించారు. పోలవరంలో ప్రధాన సమస్యలు ఇక్కడే ఉండటంతో, ప్రధాన డ్యాం నిర్మించాల్సిన మొదటి గ్యాప్ ప్రాంతాన్ని పరిశీలించి, ఇంజనీరింగ్ అధికా>రులతో ఎప్పటికప్పుడు చర్చించారు. ఈ పరిశీలనలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ముఖ్యులు, కేంద్ర జల సంఘం నిపుణులు, సీఎస్ఎంఆర్ఎస్ సంస్థ ప్రతినిధులు, వాప్కోస్, బావర్, కెప్లర్, మేఘా కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. అంతర్జాతీయ డిజైన్ సంస్థ ఆఫ్రి ప్రతినిధులు కూడా ఉన్నారు. ముందుగా ప్రాజెక్టు వద్ద అధికారులు, ఏజెన్సీ ప్రతినిధుల భేటీ అనంతరం ప్రాజెక్టు వివరాలు తెలుసుకున్నారు. ఇక మంగళ, బుధవారాల్లో కూడా బృందం సభ్యులు, జలవనరుల శాఖాధికారులు, ఏజెన్సీ ప్రతినిధులు, ప్రాజెక్టు నిర్మాణం, పురోగతిపై తీసుకోవాల్సిన నిర్ణయాలు, జాగ్రత్తలు, చేయాల్సిన పనులపై సమీక్షిస్తారు. -
పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అంతర్జాతీయ జలవనరుల నిపుణుల బృందం
-
పోలవరానికి ‘చంద్ర’శాపం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2014–19 మధ్య టీడీపీ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు సీఎం చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదాల వల్లే పోలవరంలో పెను విధ్వంసం చోటు చేసుకుంది. ఆ తప్పిదాలే పోలవరానికి శాపంగా మారాయి. ప్రాజెక్టు పనుల్లో తీవ్ర జాప్యానికి.. రూ.వేల కోట్ల నష్టానికి దారితీశాయి. కమీషన్లకు ఆశ పడి తాను చేసిన తప్పిదాల వల్ల ప్రాజెక్టులో జరిగిన విధ్వంసం.. ఫలితంగా పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వంపై నెడుతూ నిస్సిగ్గుగా సీఎం చంద్రబాబు పదే పదే అబద్ధాలు వల్లిస్తున్నారు.ఈనెల 17న పోలవరం పర్యటనలోనూ.. శుక్రవారం శ్వేతపత్రం విడుదల చేస్తున్నప్పుడూ వైఎస్ జగన్‌పై వ్యక్తిగత దూషణలు చేస్తూ.. నిరాధారమైన అసత్య ఆరోపణలు చేస్తూ.. పచ్చి అబద్ధాలతో కట్టుకథలు అల్లుతూ చంద్రబాబు చిందులు తొక్కారు. రాజకీయాల్లో ఉండటానికి అర్హత లేని వ్యక్తులకు అధికారం ఇస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని ఆక్రోశం వెళ్లగక్కారు. చివరకు పోలవరాన్ని ఎప్పుడు పూర్తి చేస్తామనేది చెప్పలేక చేతులెత్తేశారు. సీఎం చంద్రబాబు చెప్పినట్టుగా రాజకీయాల్లో ఉండటానికి అర్హత లేని వారు ఎవరు.. అర్హత ఉన్న వారు ఎవరో చూద్దాం..నిర్మాణ బాధ్యతల కోసం 30 నెలలు వృథా రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును వంద శాతం వ్యయంతో తామే పూర్తి చేస్తామని ఏపీ పునర్విభజన చట్టం–2014 ద్వారా కేంద్రం హామీ ఇచ్చింది. కమీషన్లకు ఆశపడిన నాటి సీఎం చంద్రబాబు.. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకుని చారిత్రక తప్పిదానికి పాల్పడ్డారు. ద్రవ్యోల్బణం వల్ల ధరలు పెరిగి అంచనా వ్యయం పెరుగుతుందని తెలిసినా, 2013–14 ధరలతోనే పోలవరాన్ని పూర్తి చేస్తానని 2016 సెప్టెంబరు 7న కేంద్రంతో ఒప్పందం చేసుకున్నారు. ఇది పోలవరానికి నిధుల సమస్యకు ప్రధాన కారణమైంది. ఆ మరుసటి రోజే.. జలాశయం పనుల అంచనా వ్యయాన్ని 2015–16 ధరల ప్రకారం పెంచి రూ.1,481.41 కోట్ల మేర కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చారు. 2014 జూన్ 8 నుంచి 2016 డిసెంబర్ 30 వరకు ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి పనులు చేపట్టకుండా 30 నెలలు వృథా చేశారు.ప్రణాళికాయుతంగా వడివడిగా పనులు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–3లో 162 మీటర్ల పొడవున కాంక్రీట్ డ్యామ్ నిర్మాణాన్ని వైఎస్ జగన్ పూర్తి చేశారు. గ్యాప్–1లో 543 మీటర్ల పొడవున పునాది డయాఫ్రమ్ వాల్ నిర్మించారు. కుడి కాలువతోపాటు ఎడమ కాలువలో అత్యంత సంక్లిష్టమైన వరహ నదిపై అతి పొడవైన అక్విడెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి దాదాపుగా కొలిక్కి తెచ్చారు. జలాశయంతో కుడి, ఎడమ కాలువలను అనుసంధానం చేసే కనెక్టివిటీస్(హెడ్ రెగ్యులేటర్, సొరంగాలు)ను పూర్తి చేశారు.చంద్రబాబు చారిత్రక తప్పిదం వల్ల ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన భారీ అగాధాలను సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు ఇసుకతో నింపి, వైబ్రో కాంపాక్షన్ చేస్తూ యథాస్థితికి తెచ్చారు. గ్యాప్–2లో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌కు సమాంతరంగా కొత్తది నిర్మించాలా? లేదంటే దెబ్బతిన్న చోట్ల ‘యూ’ ఆకారంలో డయాఫ్రమ్ వాల్ నిర్మించి.. పాత దానితో అనుసంధానం చేయాలా? అన్నది తేల్చి.. డిజైన్లను ఖరారు చేస్తే 18 నెలల్లోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామంటూ 2022 డిసెంబర్ నుంచి వైఎస్ జగన్ ప్రభుత్వం కేంద్ర జల్ శక్తి శాఖ, సీడబ్ల్యూసీ, పీపీఏలను కోరుతూ వచ్చింది.అంతర్జాతీయ నిపుణుల సహకారం తీసుకుని డిజైన్లను ఖరారు చేద్దామని సీడబ్ల్యూసీ ఛైర్మన్ కుశ్వీందర్‌సింగ్ వోరా ప్రతిపాదించారు. ఆ మేరకు కాంట్రాక్టు సంస్థ స్వీడన్‌కు చెందిన యాఫ్రిని అంతర్జాతీయ కన్సల్టెంట్‌గా నియమించుకుంది. ఫిబ్రవరిలో యూఎస్ఏకు చెందిన ఇద్దరు, కెనడాకు చెందిన మరో ఇద్దరు నిపుణులను పీపీఏ ఎంపిక చేసింది. యాఫ్రి, అంతర్జాతీయ నిపుణులు ఏకాభిప్రాయం వ్యక్తం చేసిన డిజైన్లతో సవాళ్లను అధిగమిస్తూ.. పనులు చేపట్టేలా ప్రణాళిక రూపొందించారు. చంద్రబాబు చారిత్రక తప్పిదానికి పాల్పడకపోయి ఉంటే.. 2022 నాటికే వైఎస్ జగన్ పోలవరాన్ని పూర్తి చేసి ఉండేవారని సాగు నీటి రంగ నిపుణులు చెబుతున్నారు.కరోనా వేళ రికార్డు సమయంలో స్పిల్ వే పూర్తి వైఎస్ జగన్ సీఎంగా 2019 మే 30న బాధ్యతలు స్వీకరించారు. 2019 జూన్ రెండో వారంలోనే గోదావరి వరద ప్రారంభమైంది. నవంబర్‌కు తగ్గుముఖం పట్టింది. ఆ వెంటనే ప్రోటోకాల్ ప్రకారం.. నదీ ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 2020 మార్చిలో కరోనా మహమ్మారి విజృంభించి.. 2021 ఆఖరు వరకు అతలాకుతలం చేసింది. అయినప్పటికీ స్పిల్ వే నిర్మాణాన్ని పరుగులెత్తించారు.స్పిల్ వే ఫియర్స్‌ను 53.32 మీటర్ల ఎత్తుతో పూర్తి చేసి.. వాటికి 25.72 మీటర్ల నుంచి 45.72 మీటర్ల మధ్య 20 మీటర్ల ఎత్తు, 16 మీటర్ల వెడల్పుతో ప్రపంచంలోనే అతి పెద్ద గేట్లను బిగించారు. వరద వచ్చినప్పుడు దిగువకు విడుదల చేయడానికి వీలుగా గేట్లను ఎత్తడానికి, దించడానికి జర్మనీ, జపాన్ల నుంచి హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్లను దిగుమతి చేసుకుని వాటికి అమర్చారు. స్పిల్ వేపై రాకపోకలకు వీలుగా 1,118 మీటర్ల పొడవున స్పిల్ వే బ్రిడ్జిని పూర్తి చేశారు.నదీ ప్రవాహాన్ని స్పిల్ వే వైపునకు మళ్లించేందుకు వెయ్యి మీటర్ల వెడల్పు.. 2,100 మీటర్ల పొడవుతో అప్రోచ్ ఛానల్ తవ్వారు. స్పిల్ వే నుంచి దిగువకు వదలిన వరద ప్రవాహాన్ని తిరిగి నదిలోకి కలపడం కోసం 2,920 మీటర్ల పొడవున స్పిల్ ఛానల్, వెయ్యి మీటర్ల పొడవున పైలట్ ఛానల్లను పూర్తి చేశారు. ఆలోగా ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేశారు. దాంతో 2021 జూన్ 11న గోదావరి వరద ప్రవాహాన్ని అప్రోచ్ ఛానల్, స్పిల్ వే, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్ మీదుగా 6.1 కి.మీల పొడవున గోదావరి ప్రవాహాన్ని మళ్లించి రికార్డు సృష్టించారు.కాఫర్ డ్యామ్‌ల లీకేజీల పాపం బాబు సర్కార్‌దే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల పనులను చేపట్టడానికి వీలుగా లీకేజీలకు అడ్డుకట్ట వేయడానికి జెట్ గ్రౌటింగ్ చేయాలి. అయితే నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవడం కోసం గోదావరి నదిలో ఇసుక ఫర్మియబులిటీ విలువను 2018లో అప్పటి కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ట్రాయ్ తప్పుగా మదింపు చేసింది. దాన్నే పరిగణనలోకి తీసుకుని 30 నుంచి 35 మీటర్ల లోతు వరకూ స్టోన్ కాలమ్స్ వేసి జెట్ గ్రౌటింగ్ చేయకుండా కేవలం 20 మీటర్ల లోతు వరకూ జెట్ గ్రౌటింగ్ చేసేలా డిజైన్లు రూపొందించింది.నవయుగ సంస్థ ఆ మేరకే జెట్ గ్రౌటింగ్ చేసి కాఫర్ డ్యామ్‌ల నిర్మాణం చేపట్టింది. జెట్ గ్రౌటింగ్ నిబంధనల మేరకు చేసి ఉంటే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లలో లీకేజీ సమస్య ఉత్పన్నమయ్యేది కాదని సాగు నీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తన హయాంలో జరిగిన ఈ తప్పిదాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వంపై నెట్టేందుకు సీఎం చంద్రబాబు యత్నించడం గమనార్హం.చారిత్రక తప్పిదంతో విధ్వంసం⇒ ఏదైనా నదిపై ఒక ప్రాజెక్టును కట్టాలంటే.. తొలుత నదీ ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వేను పూర్తి చేయాలి. ఆ తర్వాత ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతానికి ఎగువన, దిగువన నదికి అడ్డంగా కాఫర్ డ్యామ్‌లు నిర్మించాలి. దీని వల్ల నదీ ప్రవాహం స్పిల్ వే మీదుగా మళ్లుతుంది. అప్పుడు ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రధాన డ్యామ్ పనులు చేపట్టి, పూర్తి చేయవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలోనైనా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఇదే ప్రోటోకాల్ పాటిస్తారు. ⇒ కానీ.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మాత్రం నాటి సీఎం చంద్రబాబు ప్రోటోకాల్‌ను తుంగలో తొక్కారు. నదీ ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వేను పూర్తి చేయకుండా పునాది స్థాయిలోనే వదిలేశారు. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ గ్యాప్–2లో నది గర్భంలో 1,396 మీటర్ల పొడవున పునాది డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని 2018 జూన్ 11 నాటికే పూర్తి చేశారు. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణానికి ప్రాంతానికి ఎగువన, దిగువన నదికి అడ్డంగా కాఫర్ డ్యామ్‌ల నిర్మాణాన్ని 2018 నవంబర్‌లో ప్రారంభించి పూర్తి చేయలేక 2019 ఫిబ్రవరిలో చేతులెత్తేశారు. ⇒ స్పిల్ వే, స్పిల్ ఛానల్ పూర్తి చేయకపోవడం వల్ల నదీ ప్రవాహాన్ని మళ్లించడం సాధ్యం కాదు. అప్పుడు కాఫర్ డ్యామ్‌ల మీదుగా వరద ప్రవాహిస్తే కొట్టుకుపోతాయనే నెపంతో.. కాఫర్ డ్యామ్‌లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేశారు. పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద గోదావరి నది వెడల్పు 2,400 మీటర్లు. 2019, 2020లలో గోదావరికి వచ్చిన భారీ వరద 2,400 మీటర్ల వెడల్పుతో ప్రవహించాల్సిందిపోయి..ఎగువ కాఫర్ డ్యామ్ ఖాళీగా వదిలిన 800 మీటర్లకు కుంచించుకుపోయి ప్రవహించాల్సి రావడంతో వరద ఉద్ధృతి మరింత అధికమవడం వల్ల ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై విధ్వంసం చోటుచేసుకుంది. గరిష్టంగా 36.5 మీటర్లు.. కనిష్టంగా 26 మీటర్ల లోతుతో నాలుగు చోట్ల భారీ అగాధాలు ఏర్పడ్డాయి. గ్యాప్–2లో 1396 మీటర్ల పొడవుతో నిర్మించిన డయాఫ్రమ్ వాల్ నాలుగు చోట్ల కోతకు గురై 485 మీటర్ల పొడవున దెబ్బతింది. ఇదే పనుల్లో జాప్యానికి, రూ.వేల కోట్ల నష్టానికి కారణమైంది. ఐఐటీ (హైదరాబాద్), ఎన్‌హెచ్‌పీసీ (నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్) నిపుణులు ఇదే విషయాన్ని తేల్చి చెబుతూ నివేదిక ఇచ్చాయి.రూ.12,157.53 కోట్లకు మోకాలడ్డుపోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకునే క్రమంలో 2013–14 ధరల ప్రకారం ప్రాజెక్టును పూర్తి చేస్తానని 2016 సెప్టెంబరు 7న చంద్రబాబు కేంద్రానికి హామీ ఇచ్చారు. ఆ మేరకు ఒప్పందం చేసుకున్నారు. 2013–14 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లే. ఇందులో 2014 ఏప్రిల్ 1 వరకూ చేసిన వ్యయం రూ.4,730.71 కోట్లుపోనూ మిగతా రూ.15,667.9 కోట్లే ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది.అయితే 2017–18 ధరల ప్రకారం పునరావాసం, భూసేకరణ వ్యయమే రూ.33,168.23 కోట్లు. అందువల్ల రూ.20,398.61 కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్యమని, తాజా ధరల మేరకు నిధులిచ్చి ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకరించాలని 2019 మే 30 నుంచి పలుదఫాలు ప్రధాని మోదీని అప్పటి సీఎం వైఎస్ జగన్ కోరుతూ వచ్చారు. దానికి ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. ప్రధాని ఆదేశాల మేరకు తొలి దశ పూర్తికి రూ.12,157.53 కోట్లు అవసరమని కేంద్ర జల్ శక్తి శాఖ తేల్చింది. ఆ మేరకు నిధులు విడుదల చేయాలని మార్చి 6న కేంద్ర కేబినెట్‌కు ప్రతిపాదన పంపింది.అప్పటికే బీజేపీతో పొత్తు కుదరడంతో పోలవరానికి నిధుల విడుదల ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ ముందు పెట్టవద్దని, తమకు రాజకీయంగా ఇబ్బందులు వస్తాయంటూ చంద్రబాబు అడ్డుపుల్ల వేశారు. ప్రస్తుతం ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నందున, ఆ ప్రతిపాదనపై కేంద్ర కేబినెట్‌తో ఆమోద ముద్ర వేయిస్తే నిధుల సమస్య తీరుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సాంకేతిక సమస్యల పరిష్కారానికి గత ప్రభుత్వం సీడబ్ల్యూసీ ద్వారా ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. ఆ ప్రణాళికను అమలు చేయడం ద్వారా ప్రాజెక్టు పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని సాగు నీటి రంగ నిపుణులు సూచిస్తున్నారు. -
నేడు పోలవరానికి అంతర్జాతీయ నిపుణులు
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఎంపిక చేసిన అంతర్జాతీయ నిపుణులు యూఎస్ఏకు చెందిన డేవిడ్ బి.పాల్, గియాస్ ఫ్రాంకో డి సిస్కో, కెనడాకు చెందిన రిచర్డ్ డొన్నెళ్లీ, సీస్ హించ్‌బెర్గర్, కాంట్రాక్టు సంస్థ మేఘా నియమించిన యాఫ్రి (స్వీడన్) ప్రతినిధులు ఆదివారం పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. నాలుగు రోజులపాటు వారు అక్కడే మకాం వేసి, ప్రాజెక్టుపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు. ఆదివారం, సోమవారం ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతాన్ని, డ్యామ్ గ్యాప్–1, గ్యాప్–2 డయాఫ్రమ్ వాల్, గైడ్ బండ్, స్పిల్ వే, స్పిల్ ఛానల్లను పరిశీలిస్తారు. మంగళవారం, బుధవారం డయాఫ్రమ్‌వాల్ పనులు చేసిన బావర్, జెట్ గ్రౌటింగ్ పనులు చేసిన కెల్లర్, ప్రాజెక్టు పనుల నాణ్యతను పర్యవేక్షించే సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్స్) నిపుణులు, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, పీపీఏ సీఈవోతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. క్షేత్ర స్థాయి పరిశీలన, సమీక్షలో వెల్లడైన అంశాల ఆధారంగా ప్రాజెక్టులో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించే విధానాన్ని ఖరారు చేస్తారు. నిర్మాణాలకు డిజైన్లపై కసరత్తు చేస్తారు. నలుగురు అంతర్జాతీయ నిపుణులు, యాఫ్రి సంస్థ ప్రతినిధులతో సీడబ్ల్యూసీ సభ్యులు (డిజైన్ అండ్ రీసెర్చ్ వింగ్) ఎస్కే సిబల్ శనివారం ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. అంతర్జాతీయ నిపుణులకు పోలవరం ప్రాజెక్టు పనులపై అవగాహన కల్పించేందుకు పీపీఏ సీఈవో అతుల్‌జైన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.ప్రాజెక్టును పరిశీలించిన ట్రైనీ ఐఏఎస్లుపోలవరం ప్రాజెక్టు పనులను ట్రైనీ ఐఏఎస్‌ల బృందం శనివారం పరిశీలించింది. ప్రాజెక్టు వ్యూ పాయింట్ నుంచి పనులను వీక్షించారు. ప్రాజెక్టు ఈఈ వెంకటరమణ పనులు జరుగుతున్న తీరును వివరించారు. ఈ బృందంలో 2023 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ట్రైనీలు సీహెచ్ కళ్యాణి, దామెర హిమ వంశీ, స్వప్నిల్ జగన్నాథ్, బొల్లిపల్లి వినూత్న, హెచ్ఎస్ భావన, శుభమ్ నోక్వాల్ ఉన్నారు. అనంతరం వీరు పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. -
పోలవరంపై చంద్రబాబు కట్టుకథలు..శ్వేతపత్రం పేరుతో డ్రామా...
-
పోలవరంపై బహిరంగ చర్చకు సిద్ధం: మార్గాని భరత్
సాక్షి, తూర్పుగోదావరి: పోలవరం ప్రాజెక్ట్‌లో జాప్యం జరగడానికి చంద్రబాబే కారణమన్నారు వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్. అలాగే, పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పారు. ఇదే సమయంలో పరిపాలనలో, అభివృద్ధిలో మాతో పోటీపడండి.. గూండాగిరిలో టీడీపీతో పోటీ పడలేమని చురకలంటించారు.కాగా, మార్గాని భరత్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పోలవరంపై బహిరంగ చర్చకు సిద్ధం. టీడీపీ హయాంలో ఏం జరిగిందో.. వైఎస్సార్సీపీ హయాంలో ఏం జరిగిందో చర్చిద్దాం రండి. జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని కేంద్రానికే విడిచిపెట్టి ఉంటే ఈపాటికి పూర్తి అయ్యేది. గతంలో టీడీపీ ప్రభుత్వం పోలవరం విషయంలో ఇష్టారీతిన పనులు చేసింది. ఒక క్రమ పద్దతిలో పనులు చేయకపోవడం వల్లే భారీ వరద వచ్చినప్పుడు డయాఫ్రం వాల్ తీవ్రంగా దెబ్బతింది.స్పిల్ వే, స్పిల్ ఛానల్, హైడ్రాలిక్ గేట్స్, లోవర్, అప్పర్ డ్యామ్‌లు వైఎస్సార్సీపీ హయాంలోనే పూర్తి అయ్యాయి. కాపర్ డ్యామ్ జీవితకాలం మూడేళ్లు మాత్రమే.. ఇప్పుడు నూతన డయాఫ్రం వాల్ నిర్మిస్తారో లేదో స్పష్టంగా చెప్పాలి. జగనన్న అధికారంలోకి వచ్చాక పోలవరం సవరించిన అంచనాలు 55,000 కోట్ల రూపాయలకు ఆమోదించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకు ఎకరం భూమి వెయ్యి రూపాయలు నామమాత్రపు లీజుకు తీసుకున్న మాట వాస్తవం కాదా?. మీ పార్టీ కార్యాలయాలు ఎప్పుడైనా కూలగొట్టే ప్రయత్నం చేశామా?. పార్టీ కార్యాలయం కోసం హైదరాబాద్‌లో భూమి తీసుకుని ఎన్టీఆర్ ట్రస్ట్‌కు మార్చి వేశారు ఇది నిజం కాదా?. సాక్షి టీవీ, ఎన్టీవీ, టీవీ-9 ప్రసారాలు నిలిపి వేయించి మీడియాపై జులుం చూపిస్తున్నారు. రాజమండ్రిలో పలు అభివృద్ధి పనులకు సంబంధించి గతంలోనే శంకుస్థాపన చేశాం. పనులు ప్రోగ్రెస్‌లో ఉన్నాయి. అప్పటి శిలాఫలకాలు ధ్వంసం చేసి రెండోసారి శంకుస్థాపన చేయటం ఎంతవరకు సమంజసం?.పరిపాలనలో, అభివృద్ధిలో మాతో పోటీ పడండి. గుండాగిరిలో మీతో మేము పోటీ పడలేము. నా కార్యాలయం వద్ద ఉన్న వాహనం కాల్చివేతపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలి. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న రాజమండ్రి నగరాన్ని విధ్వంసం చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ నేతలు రెండోసారి శంకుస్థాపన చేయటం దారుణం. మా పార్టీ నేతల ఇళ్లపై దొమ్మీలకు పాల్పడుతున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పార్లమెంటులో పోలవరంపై చర్చ
-
పోలవరం విషయంలో మేం ఎలాంటి తప్పిదాలు చేయలేదు
-
గోదాట్లో ముంచేసి ’తెల్ల’ మొహం!
సాక్షి, అమరావతి: పోలవరం పనులను ఈనెల 17న క్షేత్రస్థాయిలో పరిశీలించిన సమయంలో వ్యవహరించిన రీతిలోనే శ్వేతపత్రం పేరుతో శుక్రవారం సీఎం చంద్రబాబు మరోసారి పచ్చి అబద్ధాలను కళ్లార్పకుండా చెప్పేశారు! నిజాలను నిస్సిగ్గుగా గోదాట్లో కలిపేశారు! 2014 జూన్ 8 నుంచి 2019 మే 29 మధ్య గతంలో తాను అధికారంలో ఉన్నప్పుడు కమీషన్ల దాహంతో చేసిన చారిత్రక తప్పిదాల వల్ల ప్రాజెక్టులో జరిగిన విధ్వంసం.. ఫలితంగా పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్‌పై నెడుతూ నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు వల్లించారు. వైఎస్ జగన్‌పై వ్యక్తిగత దూషణలకు దిగి తన ఉక్రోషాన్ని వెళ్లగక్కారు. ప్రాజెక్టును ఎప్పటిలోగా పూర్తి చేస్తారన్నది మాత్రం చెప్పలేకపోయారు. చంద్రబాబు సర్కార్ 2014–19 మధ్య చేసిన చారిత్రక తప్పిదాలను 2019 మే 30న సీఎంగా బాధ్యతలు చేపట్టగానే సరిదిద్దుతూ కరోనా లాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ రికార్డు సమయంలో స్పిల్‌వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను వైఎస్ జగన్ పూర్తి చేశారు. 2021 జూన్ 11న గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్‌వే మీదుగా 6.1 కి.మీ. పొడవున మళ్లించారు. కుడి కాలువతోపాటు ఎడమ కాలువలో అత్యంత కీలకమైన వరాహ నదిపై అక్విడెక్టు లాంటి కీలక నిర్మాణాలతోపాటు కుడి, ఎడమ కాలువలను జలాశయంతో అనుసంధానం చేసే కనెక్టివిటీస్ను పూర్తి చేశారు. 960 మెగావాట్ల జలవిద్యుత్కేంద్రం పనులను కొలిక్కితెచ్చారు. చంద్రబాబు సర్కార్ చారిత్రక తప్పిదాలకు పాల్పడకపోయి ఉంటే 2022 జూన్ నాటికే జగన్ పోలవరాన్ని పూర్తి చేసి ఉండేవారని సాగునీటిరంగ నిపుణులు తేల్చిచెబుతున్నారు. పోలవరం పనుల్లో జాప్యం వల్ల జరుగుతున్న నష్టానికి చంద్రబాబుదే పూర్తి బాధ్యతని స్పష్టం చేస్తున్నాయి. పోలవరాన్ని కమీషన్ల కోసం చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని 2019లో ప్రధాని మోదీ చేసిన ఆరోపణలే నాడు టీడీపీ సర్కార్ అవినీతికి నిదర్శనమని గుర్తు చేస్తున్నారు.బాబు చేస్తే ఒప్పు.. జగన్ చేస్తే తప్పా?పోలవరం హెడ్ వర్క్స్ పనుల నుంచి ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్‌ట్రాయ్‌ని 2018లో తప్పించి రూ.2,917 కోట్ల విలువైన వాటిని నామినేషన్ పద్ధతిలో నవయుగకు నాడు చంద్రబాబు అప్పగించడాన్ని పీపీఏ తప్పుబట్టింది. దేశ చరిత్రలో నామినేషన్ పద్ధతిలో ఇంత పెద్ద ఎత్తున పనులు కట్టబెట్టిన దాఖలాలు ఎక్కడా లేవు. కాంట్రాక్టర్‌ను మార్చితే పనుల్లో ఏదైనా సమస్య తలెత్తితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ అప్పటి కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి అమర్జీత్సింగ్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక చంద్రబాబు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టిన పనులను 2019 ఆగస్టులో రద్దు చేసి, వాటికి జలవిద్యుత్కేంద్రం పనులను జత చేసి రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. దీని ద్వారా ఖజానాకు రూ.784 కోట్లు ఆదా అయ్యాయి. రివర్స్ టెండరింగ్‌తో తన అక్రమాలు బయటపడటాన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు కాంట్రాక్టర్‌ను మార్చడం వల్లే పోలవరం పనుల్లో విధ్వంసం చోటుచేసుకుందని తాజాగా సూత్రీకరించడం గమనార్హం. రివర్స్ టెండరింగ్‌లో పనులు దక్కించుకున్న మేఘా సంస్థ గోదావరి వరద తగ్గాక 2019 నవంబర్‌లో పనులు ప్రారంభించింది. 2020 మార్చి నుంచి 2021 ఆఖరు వరకూ కరోనా విజృంభించినా పనులను కొనసాగించింది. చంద్రబాబు సర్కార్ పునాది స్థాయిలోనే వదిలేసిన స్పిల్‌వేను 48 గేట్లతో సహా రికార్డు సమయంలో పూర్తి చేసింది వైఎస్ జగన్ ప్రభుత్వమే. స్పిల్‌వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేసి 2021 జూన్ 11న గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్‌వే మీదుగా 6.1 కి.మీ. పొడవున మళ్లించారు. వాస్తవాలు ఇలా ఉండగా 2021 వరకూ కాంట్రాక్టర్ లేకపోవడం వల్ల పనులు ఆగిపోయినట్లు సీఎం చంద్రబాబు చెప్పడంపై అధికార వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.పోలవరం వైఎస్సార్ స్వప్నం..పోలవరం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 194.6 టీఎంసీలు కాగా కుడి, ఎడమ కాలువల కింద 7.20 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కృష్ణా, గోదావరి డెల్టాల్లో 23.5 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా 8 లక్షల ఎకరాలకు నీళ్లందించవచ్చు. విశాఖ తాగు, పారిశ్రామిక అవసరాలతోపాటు 28.5 లక్షల మంది దాహార్తిని తీర్చవచ్చు. 960 మెగావాట్ల జలవిద్యుత్ కూడా అందుబాటులోకి వస్తుంది. అందుకే పోలవరాన్ని ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా అభివర్ణిస్తారు. 1941లోనే ఈ ప్రాజెక్టును నిర్మించాలని ప్రతిపాదించినా 2005 వరకూ ఏ ఒక్క సీఎం కూడా కన్నెత్తి చూడటానికి కూడా సాహసించలేకపోయారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ 2005లో పోలవరం పనులను ప్రారంభించారు. కుడి, ఎడమ కాలువలలో అధిక భాగం పనులు చేయించారు. జలాశయం పనులకు అవసరమైన భూమిలో అధిక భాగం సేకరించారు.జలాశయం పనులను కొలిక్కి తెచ్చే క్రమంలోనే మహానేత అమరుడయ్యారు. వైఎస్సార్‌కు ముందు 1995 నుంచి 2004 మధ్య ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్న చంద్రబాబు ఏ రోజూ పోలవరం పనులు చేపట్టాలని ఆలోచన చేసిన పాపాన పోలేదు. ఇప్పుడు పోలవరాన్ని తన కలగా చంద్రబాబు అభివర్ణించడం గమనార్హం.చారిత్రక తప్పిదం వల్లే విధ్వంసం» విభజన నేపథ్యంలో 2014లో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం వంద శాతం వ్యయాన్ని తామే భరించి పూర్తి చేస్తామని విభజన చట్టంలో హామీ ఇచ్చింది. ఆ మేరకు పనులు చేపట్టేందుకు పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ)ని ఏర్పాటు చేసింది. 2014 జూన్ 8న సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు పీపీఏతో ఒప్పందం చేసుకోకుండా పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికి అప్పగించాలని కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. ఈ క్రమంలో ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టేందుకు సిద్ధమవడంతో 2016 సెప్టెంబరు 7న అర్ధరాత్రి పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికి కేంద్రం అప్పగించింది. నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే 2013–14 ధరల మేరకు ఇస్తామని కేంద్రం పెట్టిన మెలికకు చంద్రబాబు అంగీకరించారు. ఆ మరుసటి రోజే అంటే 2016 సెప్టెంబరు 8న హెడ్‌వర్క్స్ (జలాశయం) పనుల అంచనా వ్యయాన్ని రూ.1,481 కోట్లు పెంచేశారు. » ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ ప్రోటోకాల్‌ను తుంగలో తొక్కిన చంద్రబాబు కమీషన్ల దాహంతో ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్‌ట్రాయ్‌ని అడ్డుపెట్టుకుని పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించారు. గోదావరి వరదను మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ చానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల పనులను పూర్తి చేయకుండానే.. 2017 నవంబర్‌లో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–2లో 1,396 మీటర్ల పొడవున పునాది డయాఫ్రమ్ వాల్ పనులు చేపట్టి 2018 జూన్ 11 నాటికి పూర్తి చేశారు. » స్పిల్‌వే పునాది స్థాయిలో ఉండగానే.. 2018 నవంబర్‌లో 35 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామని పీపీఏ, సీడబ్ల్యూసీకి హామీ ఇచ్చి ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను చంద్రబాబు ప్రారంభించారు. వాటిని ప్రధాన ప్రాజెక్టుగా భ్రమింపజేసి 2019 ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నది ఆయన ఎత్తుగడ. కానీ 2019 ఫిబ్రవరి నాటికి కూడా నిర్వాసితులకు పునరావాసం కల్పించలేదు. నిర్వాసితులకు పునరావాసం కల్పించలేక.. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసి చివరకు చేతులెత్తేశారు.» 2019 మే 30న సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. 2019 జూన్ రెండో వారంలోనే గోదావరికి వరద ప్రారంభమైంది. ఆ ఏడాది వచ్చిన భారీ వరద ప్రవాహం ఎగువ కాఫర్ డ్యామ్ ఖాళీ ప్రదేశాల గుండా అధిక ఉద్ధృతితో ప్రవహించడంతో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై సగటున 26 నుంచి 36.5 మీటర్ల లోతుతో భారీ అగాధాలు ఏర్పడ్డాయి. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–2లో డయాఫ్రమ్‌వాల్ కోతకు గురై నాలుగు చోట్ల 485 మీటర్ల మేర దెబ్బతింది. » ఎగువ కాఫర్ డ్యామ్ ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేయడం వల్లే గోదావరి వరద అధిక ఉద్ధృతితో ప్రవహించి ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో కోతకు గురై విధ్వంసం చోటు చేసుకుందని, డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని, ఇది పూర్తిగా మానవ తప్పిదం వల్లే జరిగిందని ఐఐటీ–హైదరాబాద్, ఎన్‌హెచ్‌పీసీ (నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్) నిపుణులు స్పష్టంగా తేల్చిచెప్పారు. తద్వారా చంద్రబాబు నిర్వాకాలను నిర్థారించారు. 2019 మే 30న వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించగా అదే ఏడాది జూన్ రెండో వారంలో వరద ప్రారంభమైంది. అలాంటప్పుడు 12 రోజుల్లో కాఫర్ డ్యామ్‌ల ఖాళీలను పూర్తి చేసి, నిర్వాసితులకు పునరావాసం కల్పించడం అసాధ్యం. దీన్నిబట్టి నాడు చంద్రబాబు సర్కార్ తప్పిదం వల్లే ఈ విధ్వంసం చోటుచేసుకుందని ఐఐటీ–హైదరాబాద్, ఎన్‌హెచ్‌పీసీలు తేల్చిచెప్పినట్లు స్పష్టమవుతోంది. తాను చేసిన ఈ చారిత్రక తప్పిదాన్ని వైఎస్ జగన్‌పై నెట్టేందుకు చంద్రబాబు పదేపదే యత్నిస్తుండటాన్ని నిపుణులు తప్పుబడుతున్నారు. 14 ఏళ్లలో... 24.85% ఐదేళ్లలోనే... 24.94%పోలవరం పనులను 2014–19 మధ్య తాను 72 శాతం చేస్తే.. 2019–24 మధ్య వైఎస్ జగన్ అరకొరగా చేశారంటూ సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. కానీ.. పోలవరం పనులు ఇప్పటికి పూర్తయింది 49.79 శాతమే. ఇందులో 2005 నుంచి 2019 మధ్య జరిగిన పనులు 24.85 శాతం కాగా మిగతా 24.94 శాతం పనులు 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో పూర్తి కావడం గమనార్హం. 2005–14 మధ్య దివంగత వైఎస్సార్ హయాంలో రూ.4,730.71 కోట్ల విలువైన పనులు జరిగాయి.2014–19 మధ్య చంద్రబాబు రూ.10,649.39 కోట్లు వ్యయం చేశారు. 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రూ.8,629 కోట్లు వ్యయం చేశారు. వాస్తవం ఇలా ఉంటే.. 2014–19 మధ్య తాను రూ.11,762.47 కోట్లు వ్యయం చేశానని.. 2019–24 మధ్య కేవలం రూ.4,167 కోట్లను మాత్రమే జగన్ సర్కార్ ఖర్చు చేశారని చంద్రబాబు చెప్పడం విస్మయం కలిగిస్తోంది. ఇక పోలవరం పనులకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి వెచ్చించిన రూ.3,385.58 కోట్లను కేంద్రం రీయింబర్స్ చేసింది. అంటే.. ఆ డబ్బు రాష్ట్ర ఖజానాలోకి చేరింది. కానీ.. దాన్ని వైఎస్ జగన్ సర్కార్ దారి మళ్లించినట్లుగా చంద్రబాబు చిత్రీకరించడాన్ని ఆర్థిక నిపుణులు తప్పుబడుతున్నారు.కొసమెరుపు‘గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించేలా ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను కట్టాలి. కట్టాక ఎర్త్ కమ్ ర్యాక్ ఫిల్ డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్ వేయాలి’ అని అన్యాపదేశంగా తాజాగా సీఎం చంద్రబాబు అంగీకరించడం కొసమెరుపు. కాఫర్ డ్యామ్‌ల జీవితకాలం మూడు నాలుగేళ్లకు మించి ఉండదని అధికారులకు చెబుతున్న సమయంలో అన్యాపదేశంగా తాను చేసిన చారిత్రక తప్పిదాన్ని అంగీకరించారు. 45.72 మీటర్లకు ఒక్క ఇంచ్ కూడా తగ్గదుపోలవరం ఎత్తును 41.15 మీటర్లకు తగ్గిస్తున్నారంటూ 2021 నుంచి పాడుతున్న పాటనే చంద్రబాబు తాజాగా మరోసారి పాడారు. అయితే ప్రాజెక్టు స్పిల్‌వేను ఇప్పటికే నిర్మించామని.. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పూర్తయ్యాక టేపు తీసుకుని వెళ్లి కొలుచుకోవాలని.. 45.72 మీటర్ల కంటే ఒక్క ఇంచ్ కూడా తగ్గదని 2021 నుంచి 2024 దాకా వైఎస్ జగన్ చెబుతూనే ఉన్నారు. అప్పటి కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కూడా ఇదే అంశాన్ని లోక్‌సభ, రాజ్యసభలో రాతపూర్వకంగా తేల్చి చెప్పారు. ఏదైనా ప్రాజెక్టు పూర్తయ్యాక డ్యామ్ భద్రత దృష్ట్యా ఒకేసారి గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేయరు. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు ప్రాజెక్టు పూర్తయిన మొదటి ఏడాది నీటి నిల్వ సామర్థ్యంలో 1/3వ వంతు.. ఆ తర్వాత నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ 2/3వ వంతు.. డ్యామ్ భద్రతను పరిశీలిస్తూ, నిర్వాసితులకు పునరావాసం కల్పించి మూడో ఏడాది పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తారు. ఈ మార్గదర్శకాల మేరకే పోలవరంలో తొలి ఏడాది 41.15 మీటర్ల ఎత్తులతో నీటిని నిల్వ చేస్తారు. దాన్నే ప్రాజెక్టు ఎత్తుగా చంద్రబాబు చిత్రీకరించటాన్ని అధికారవర్గాలే తప్పుబడుతున్నాయి.సవాళ్లను అధిగమిస్తూ వడివడిగా..» చంద్రబాబు చారిత్రక తప్పిదాల వల్ల పోలవరంలో చోటుచేసుకున్న విధ్వంసాన్ని చక్కదిద్దుతూ పనులను వైఎస్ జగన్ ప్రణాళికాబద్ధంగా పరుగులెత్తించారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల పనులను ప్రారంభించడానికి ముందు అంటే 2018 నవంబర్‌కు ముందు.. నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవడం కోసం గోదావరిలో ఇసుక సాంద్రతను ట్రాన్స్ట్రాయ్ తప్పుగా లెక్కించింది. ఆ తప్పుడు లెక్క ప్రకారమే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లకు పునాదిగా 20 మీటర్ల లోతు నుంచి స్టోన్ కాలమ్స్ వేసి జెట్ గ్రౌటింగ్ చేసింది. కానీ.. గోదావరి ఇసుక సాంద్రతను పరిగణలోకి తీసుకుంటే 30 నుంచి 35 మీటర్ల లోతు నుంచి స్టోన్ కాలమ్స్ వేసి జెట్ గ్రౌటింగ్ చేయాలి. కానీ 20 మీటర్ల లోతులోనే స్టోన్ కాలమ్స్ వేసి జెట్ గ్రౌటింగ్ వేయడం వల్ల ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లలో లీకేజీలు అధికంగా ఉన్నాయి. ఆ లీకేజీలను అధిగమిస్తూ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన భారీ అగాధాలను సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు ఇసుకతో పూడ్చి వైబ్రో కాంపాక్షన్ చేస్తూ యధాస్థితికి తెచ్చారు. » దెబ్బతిన్న డయాఫ్రమ్‌వాల్ స్థానంలో సమాంతరంగా కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా? లేదంటే దెబ్బతిన్న చోట్ల ‘యూ’ ఆకారంలో కొత్త డయాఫ్రమ్‌వాల్ నిర్మించి పాత దానితో అనుసంధానం చేయాలా? అనే విషయంపై తేల్చి చెబితే 18 నెలలల్లోగా ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని 2022 డిసెంబర్ నుంచి వైఎస్ జగన్ కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. అంతర్జాతీయ నిపుణుల సహకారం తీసుకుని వారు సూచించిన డిజైన్ల మేరకు పనులు చేపడదామని పీపీఏ, సీడబ్ల్యూసీ పేర్కొన్నాయి. ఆ మేరకు ఫిబ్రవరిలో అంతర్జాతీయ నిపుణులను ఖరారు చేశాయి. » 2013–14 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయం రూ.20,396 కోట్లుగా ఉంది. అయితే 2017–18 ధరల ప్రకారం నిర్వాసితుల పునరావాసం, భూసేకరణకే రూ.33 వేల కోట్లు అవసరం. ఈ నేపథ్యంలో పాత ధరలతో ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్యమని, తాజా ధరల మేరకు నిధులిచ్చి పోలవరం పూర్తి చేసేందుకు సహకరించాలని ప్రధాని మోదీని నాడు వైఎస్ జగన్ పలుదఫాలు కోరారు. దీనిపై ఎట్టకేలకు సానుకూలంగా స్పందించిన ప్రధాని మోదీ ఆ మేరకు నిధులు విడుదల చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖను ఆదేశించారు. ఈ నేపథ్యంలో తొలిదశ పూర్తికి రూ.12,157.53 కోట్లు విడుదల చేయాలని సూచిస్తూ మార్చి 6న కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ కేంద్ర కేబినెట్‌కు ప్రతిపాదనలు పంపారు. అయితే అప్పటికే బీజేపీతో టీడీపీకి పొత్తు కుదరడంతో నిధులు ఇచ్చే ఫైలుపై ఆమోదముద్ర వేస్తే రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని భావించిన చంద్రబాబు తెరచాటున బీజేపీ పెద్దలతో మంత్రాంగం నడిపారు. దీంతో ఆ ఫైలును కేంద్ర కేబినెట్ పక్కన పెట్టింది. లేదంటే మార్చి ఆఖరులోనే రూ.12,157.53 కోట్లు పోలవరానికి విడుదలయ్యేవి. -
పోలవరం కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు.. మరి మీరు ఎందుకు తీసుకున్నారు?
తాడేపల్లి: పోలవరం ప్రాజెక్టు విషయంలో తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. అబద్ధాలు, అసత్యాలతో పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయడాన్ని తూర్పారబట్టారు అంబటి రాంబాబు.ఈ మేరకు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రచారంపై ఆధారాలతో సహా మీడియాకు వివరించారు అంబటి.అసలు స్పిల్‌వే చానల్ పూర్తి కాకుండా, అప్రోచ్ చానల్ పూర్తి కాకుండా, నది డైవర్షన్ పూర్తి కాకుండా కాపర్ డ్యామ్‌ను ప్రారంభించి డయా ఫ్రం వాల్‌ను నిర్మించడం గత చంద్రబాబు ప్రభుత్వంలో చేసిన చారిత్రాత్మక తప్పిదమన్నారు. దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రాజెక్టుని మీరు ఎందుకు వారి దగ్గర్నుంచి తీసుకున్నారని అంబటి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సిన ప్రాజెక్టుకు నిధులను ముందు రాష్ట్ర ప్రభుత్వం పెడుతుందని, ఆపై మీరు ఇవ్వమని 2013-14 రేట్లతో 2016వ సంవత్సరంలో అంగీకరించడం ద్రోహం, చారిత్రాత్మక తప్పిదం కాదా? అని నిలదీశారు. 2018 సంవత్సరానికే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి చంద్రబాబు అపరభగీరథుడు అనిపించుకునే ప్రయత్నం చేసి.. ఇప్పుడు ఆ తప్పులను మా మీద రుద్దే యత్నం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మాపై మీరు చేస్తున్న విమర్శలు చూస్తుంటే ఆ ప్రాజెక్టును మీరు పూర్తి చేసేటట్లు లేరనే విషయం అర్థం అవుతుందని, మళ్లీ జగనే దాన్ని పూర్తి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.అంబటి రాంబాబు ఏమన్నారంటే...మా ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు విషయంలో చిన్న తప్పుకూడా జరగలేదువైఎస్సార్సీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి తప్పు చేయలేదుకరోనా సమయంలో కూడా పోలవరం ప్రాజెక్టు పనులు ఆగలేదుజగన్ అంటే భయం కాబట్టే చంద్రబాబు దూషిస్తున్నారుముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబుకు అహం పెరిగిందిపోలవరంపై చంద్రబాబుకు శ్రద్ధ లేదుపోలవరం ప్రాజెక్టు విషయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కృషి వెలకట్టలేనిదిఆయన హయాంలోనే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అనేక అనుమతులొచ్చాయివైఎస్సార్ ఎన్నో అనుమతులు తీసుకొచ్చారువైఎస్సార్ హయాంలోనే పోలవరం ప్రాజెక్టు ప్రారంభమైందిపోలవరం ప్రాజెక్టు అంత తేలికగా అర్థం కాదు కాబట్టే చాలా స్టడీ చేసి నిర్ణయానికి వచ్చాంపదేపదే జగన్‌ను దూషించాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారుఇచ్చిన వాగ్దాలను నిలబెట్టుకోవాలని జగన్ అంటే బాబుకు భయంమీరు చేసిన తప్పిదాల వల్లే పోలవరం సర్వనాశనం అయ్యిందనే విషయాన్ని కచ్చితంగా నిరూపించగలందీనికి సంబంధించి నిపుణులను కనుక్కోండివాస్తవం ఏంటో చెప్పండి అని అడగండిడయా ఫ్రమ్ వాల్ ఎందుకు కొట్టుకుపోయిందో అడగండిమీకు చెప్పడానికి వారు భయపడతారు కూడా.. ఎందుకంటే మీరు నాల్గోసారి ముఖ్యమంత్రి కాబట్టిబాబు హయాంలోనే డయా ఫ్రం వాల్ కొట్టుకుపోయిందిపదే పదే దూషిస్తూ జగన్‌పై నింద వేసే ప్రయత్నం చేస్తున్నారువైఎస్సార్ కలలుగన్న ప్రాజెక్టు కాబట్టే పూర్తి తపనతో పని చేశాంచంద్రబాబు చేసిన తప్పులు వల్లే పోలవరం ప్రాజెక్ట్ నాశనంప్రోటోకాల్ పాటించకపోవడం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యంపోలవరం జాతీయ ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుందిఅసలు కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేపట్టింది..దీనికి సమాధానం చెప్పండిఈ ప్రాజెక్టు మీరు తీసుకోవడానికి గల కారణాలేంటి?కమీషన్లు కొట్టేయడానికే తీసుకున్నారువేల కోట్ల ప్రాజెక్టు కాబట్టే కేంద్ర ప్రభుత్వం నుంచి చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంది.జాతీయ ప్రాజెక్టు అయినటువంటి పోలవరాన్ని నీ కరప్షన్ కోసం తీసుకోవడం జరిగిందనే విషయం అందరికీ తెలుసుకాంట్రాక్టర్లకు ఎక్కువ సొమ్ముకు ప్రాజెక్టును ఇచ్చావంటే దాంట్లో అర్థమేంటిఅందులో కమీషన్లు కొట్టేదామనే కదా చంద్రబాబుఇది ఏ కాంట్రాక్టర్కైనా అర్థమవుతుందిడబ్బులు కాజేయడం కోసం పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తీసుకున్నాడని ఆనాటి ప్రధాని, ఇప్పటి ప్రధాని, మీ సహచరుడు నరేంద్ర మోదీనే చెప్పారుపోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని మోదీనే వ్యాఖ్యానించారంటే అందులో అర్థమేంటి? -
జగన్ పై నింద మోపే ప్రయత్నం... అబద్ధాలు, అర్ధసత్యాలతో పోలవరంపై చంద్రబాబు శ్వేతపత్రం
-
అబద్ధాలు, అర్ధసత్యాలు.. పోలవరంపై చంద్రబాబు శ్వేతపత్రం
సాక్షి, విజయవాడ: అబద్ధాలు, అర్ధ సత్యాలతో పోలవరంపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు సీఎం చంద్రబాబు. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు చాలానే అవస్థలు పడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ఆరోపణలతోనే తొలి శ్వేతపత్రాన్ని విడుదల చేసిన చంద్రబాబు.. ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తారో మాత్రం చెప్పలేదు.చంద్రబాబు ప్రభుత్వ ప్రణాళిక లోపంతోనే డయాఫ్రం వాల్ కొట్టుకుపోగా, నాడు చంద్రబాబు పునాది స్థాయిలో వదిలేసిన స్పిల్‌ను 48 గేట్లతో సహా వైఎస్ జగన్ ప్రభుత్వం పూర్తి చేసింది. డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి ముమ్మాటికి చంద్రబాబు ప్రభుత్వమే కారణం. ఇదే అంశాన్ని ఐఐటీ హైదరాబాద్, ఎన్‌హెచ్‌పీసీ నివేదికలు స్పష్టం చేశాయి. రెండేళ్ల కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ పోలవరం పనులను వైఎస్ జగన్ ప్రభుత్వం పరుగులు పెట్టించింది. సీడబ్ల్యూసీ డిజైన్ కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నా.. వైఎస్ జగన్‌పై నిందమోపే ప్రయత్నం చేశారు చంద్రబాబు.భజన చట్టం ప్రకారం కేంద్రమే నిర్మించాల్సిన పోలవరాన్ని కమీషన్లకు ఆశ పడి దక్కించుకున్న చంద్రబాబు సర్కార్ ప్రాజెక్టు నిర్మాణ ప్రణాళికను తుంగలో తొక్కింది. సులభంగా చేయగలిగి, కాంట్రాక్టర్లకు అధికంగా లాభాలు వచ్చే పనులకే ప్రాధాన్యత ఇచ్చింది. ప్రపంచంలో ఎక్కడైనా వరదను మళ్లించేలా స్పిల్‌వే, కాఫర్ డ్యామ్‌లు కట్టాకే ప్రధాన డ్యామ్ పనులు చేపడతారు. 2014–19 మధ్య పోలవరంలో చంద్రబాబు సర్కార్ అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది.గోదావరి వరదను మళ్లించే స్పిల్‌వే పునాది స్థాయి కూడా దాటలేదు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను ప్రారంభించనే లేదు. కానీ.. డ్యామ్ గ్యాప్–2లో పునాది డయాఫ్రమ్‌వాల్ పనులను 2017లో ప్రారంభించి 2018 జూన్ 11 నాటికి పూర్తి చేశారు. 35 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పింస్తామంటు హామీ ఇచ్చి 2018 నవంబర్‌లో ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనులను ప్రారంభించారు. ఇదే ప్రధాన డ్యామ్‌గా చిత్రీకరించి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నించారు.2019 ఫిబ్రవరి నాటికి కూడా నిర్వాసితులకు పునరావాసం కల్పింంచకపోవడంతో పోలవరం ప్రాజెక్టు అథారిటీ, సీడబ్ల్యూసీ ఇదే అంశాన్ని ప్రస్తావిస్త⇒ నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ కాఫర్ డ్యామ్‌ల పనులు చేయాలని ఆదేశించింది. అయితే పునరావాసం కల్పింంచలేక ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసి పనులు ఆపేశారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడంతో అదే ఏడాది మే 30న సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టారు. జూన్ రెండో వారంలోనే గోదావరికి వరద ప్రారంభమైంది. అంటే.. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి, గోదావరి వరద ప్రారంభం కావడానికి మధ్య కేవలం 10 నుంచి 12 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ వ్యవధిలో కాఫర్ డ్యామ్‌లలో ఖాళీ ప్రదేశాలను భర్తీ చేయడం ఎలా సాధ్యమన్నది చంద్రబాబే చెప్పాలి.గోదావరికి 2019లో భారీగా వరదలు వచ్చాయి. పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద 2.4 కి.మీ. వెడల్పుతో ప్రవహించాల్సిన గోదావరి వరద.. కాఫర్ డ్యామ్‌లు వదిలిన 800 మీటర్ల ఖాళీ ప్రదేశానికి కుచించుకుపోయి ప్రవహించాల్సి రావడంతో వరద ఉద్ధృతి పెరిగి డయాఫ్రమ్‌వాల్‌లో నాలుగు చోట్ల కోతకు గురై 485 మీటర్ల పొడవున దెబ్బతింది. ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై గ్యాప్–1లో 35 మీటర్ల లోతు, గ్యాప్–2లో 26 నుంచి 36.50 మీటర్ల లోతుతో కూడిన అగాధాలు ఏర్పడ్డాయి.వీటిన్నింటినీ అధ్యయనం చేసిన ఐఐటీ–హైదరాబాద్, నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ సంస్థలు మానవ తప్పిదం వల్లే పోలవరంలో విధ్వంసం చోటుచేసుకుందని తేల్చి చెప్పాయి. అంటే ఆ తప్పిదం చేసింది చంద్రబాబేనని తేల్చాయని సాగునీటిరంగ నిపుణులు పేర్కొంటున్నారు. -
పోలవరంపై రివర్స్ గేర్ ఏం చెబుతుందంటే..
ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర నిరుత్సాహాన్ని కలిగించాయి. కారణాలు ఏవైనా, ఈ ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తి కాదన్న సమాచారం బాధ కలిగిస్తుంది. చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించింది కేవలం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్డ్డిను విమర్శించడానికి, పోలవరం జాప్యం నెపం మొత్తాన్ని ఆయనపై నెట్టడానికే అన్నట్లు పర్యటన సాగించారు.2014 నుంచి ఐదేళ్లపాటు చేసిన పాలనలో ఈ ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశానని చెప్పుకుంటే చెప్పుకోనివ్వండి. అందులో వాస్తవం ఉందా? లేదా? అనేది వేరే విషయం. నిజంగా అంత పని పూర్తి అయిపోయి ఉంటే కీలకమైన డయాఫ్రం వాల్ వరదలలో కొట్టుకుని పోయేది కాదు కదా అనే లాజిక్కు సమాధానం దొరకదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్మాణ సంస్థను మార్చిందని చంద్రబాబు అంటున్నారు. దానివల్ల జాప్యం అయిందని చెబుతున్నారు. ఒకవేళ అది నిజమే అనుకుంటే చంద్రబాబు తాను అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్‌ను ఎందుకు మార్చారో చెప్పాలి కదా! నామినేషన్ పద్దతిన నవయుగ సంస్థకు ఎందుకు ఇచ్చారో వివరించాలి కదా! డయాఫ్రం వాల్‌తో సహా ఆయా పనులు నామినేటెడ్ పద్దతిన కొన్ని కంపెనీలకు ఎందుకు కేటాయించారన్నది వివరించాలి కదా!2014 టరమ్‌లో కేంద్రంలో పొత్తులో భాగంగా ఉన్న తెలుగుదేశం పార్టీ పోలవరం ప్రాజెక్టును కేంద్రమే చేపట్టి సత్వరమే పూర్తి చేయించేలా ఒత్తిడి తేవడం మాని, రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుందని ఎందుకు కోరినట్లు? ఆ ప్రాజెక్టు కాంట్రాక్టును తనకు కావల్సినవారికే ఇచ్చుకునేందుకే అన్న విమర్శలకు ఎందుకు తావిచ్చారు. స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ 2019 ఎన్నికల ప్రచారంలో పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎమ్ అయిందని ఎందుకు విమర్శించారు. దానికి చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పలేదు! మళ్లీ పొత్తు కుదిరింది కనుక మోడీ కూడా ఆ పాయింట్ మర్చిపోయినట్లు నటిస్తుండవచ్చు. అది వేరే విషయం. పోనీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్మించదలచినప్పుడు వ్యయ అంచనాలపై కేంద్రంతో ఎందుకు సరైన అవగాహనకు రాలేదు?కేవలం ప్రాజెక్టు నిర్మాణమే కాకుండా, ప్రాజెక్టువల్ల ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను అక్కడనుంచి తరలించడం, వారికి పునరావాసం కల్పించడానికి అయ్యే వ్యయం గురించి ఎందుకు కేంద్రంతో ఒప్పందం కాలేదు? కేంద్ర ప్రభుత్వం తాము ప్రాజెక్టు కడతాము కానీ, నిర్వాసితుల సమస్య రాష్ట్రమే చూసుకోవాలని చెప్పినప్పుడు ఎందుకు ప్రతిఘటించలేదు? అలాంటప్పుడు మొత్తం ప్రాజెక్టును కట్టి, రాష్ట్రానికి అప్పగించాలని ఎందుకు కోరలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పిల్ వే, గేట్ల అమరిక తదితర పనులను పూర్తి చేసింది నిజం కాదా? ఇవన్నీ అవ్వకుండానే పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశామని చంద్రబాబు చెబితే అది నిజమే అవుతుందా?2018 నాటికే ప్రాజెక్టును పూర్తి చేస్తామని శాసనసభలోనే టీడీపీ ప్రభుత్వం ప్రకటించిందా? లేదా? అయినా ఎందుకు పూర్తి కాలేదు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్ ద్వారా నిధులు ఆదాచేసే ప్రయత్నం చేసింది. పోలవరం ప్రాజెక్టులో కూడా సుమారు 850 కోట్ల మేర తక్కువ వ్యయానికి మెఘా సంస్థ టెండర్ పొందింది. దీనిని తప్పు పడుతున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ ప్రాజెక్టు కాంట్రాక్టర్‌ను కొనసాగించదలిచారా? లేదా? పోలవరం ప్రాజెక్టు వ్యయం పెంపుదల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని ఒప్పించారా? లేదా?బీజేపీతో పొత్తు కుదిరిన తర్వాత ఆ మొత్తం గురించి కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోకుండా టీడీపీ నాయకత్వమే ఆపుచేయించిందన్న విమర్శల గురించి ఏమి చెబుతారు? బీజేపీతో పొత్తు పెట్టుకునే క్రమంలో ప్రత్యేక హోదాతో పాటు పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితుల వ్యయం కేంద్రం పూర్తిగా భరించి సహకరించాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఎందుకు కోరలేకపోయారు? చంద్రబాబు తన హయాంలో ఆయా కీలక పనుల ప్రాధాన్యతలను మార్చి పనులు చేయించడంవల్లే ఈ సమస్య వచ్యిందన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాదన. దీనిని ఆయన గత అసెంబ్లీలో వివరణాత్మకంగా వివరించారు.కాఫర్ డామ్ పూర్తి కాకుండానే, గ్యాప్‌లు ఉంచి డయాఫ్రం వాల్ నిర్మాణం తలపెట్టింది చంద్రబాబు ప్రభుత్వమా? కాదా? డయాఫ్రం వాల్ నిర్మాణం వరద కారణంగా దెబ్బతిన్నదంటే అది నాణ్యతాలోపమా? లేక మరేదైనా కారణమా? దీనిపై కేంద్ర జల కమిషన్ ఎందుకు ఒక నిర్ణయం తీసుకోవడానికి తాత్సారం చేస్తోంది? కేంద్రంలో ఇప్పుడు కూడా టీడీపీ భాగస్వామి కనుక ఈ ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయడానికి ఏమి చర్యలు తీసుకుంటుందో చెప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిందలు వేస్తే ఏమి ప్రయోజనం. తాను పూర్తి చేసి చూపిస్తే ఆయనకే పేరు వస్తుంది కదా! ఇన్ని రాజకీయాలు ఎందుకు!మొత్తం ప్రాజెక్టును కేంద్రానికి అప్పగిస్తే పూర్తి చేయిస్తామని బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి గతంలో అన్నారు కదా? ఆ ప్రకారం ముందుకు వెళ్లే ఆలోచన చేస్తారా? కీలకమైన ఢయాప్రం వాల్ నిర్మాణం, సీపేజీ నీరు రాకుండా అడ్డుకోవడం వంటి వాటిపై దృష్టి పెట్టి, డామ్ నిర్మాణం పూర్తి చేయడానికి నాలుగు సీజన్లు అంటే నాలుగేళ్లు పడుతుందని నిపుణులు చెబుతున్నారని చంద్రబాబు తెలిపారు. దానిని ఎంత వీలైతే అంత తగ్గించడానికి ప్రయత్నించాలి కదా! కేవలం సాంకేతిక నిర్ణయం చేయడంలో కేంద్రం చేస్తున్న జాప్యాన్ని ఎందుకు చంద్రబాబు ప్రశ్నించడం లేదు?పోలవరం ప్రాజెక్టుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత వ్యయం చేసింది? అందులో ఎంత మొత్తాన్ని కేంద్రం తిరిగి చెల్లించింది?మొదలైన వివరాలను చంద్రబాబు ఎందుకు వెల్లడించలేదు? ఇప్పుడు సమస్య రాష్ట్రం పరిధిలో లేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థ చేతిలో ఉంది. వెంటనే ఆ దిశగా ప్రయత్నాలు చేయకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డిను తప్పు పట్టడానికే అయితే చంద్రబాబు సోమవారం.. పోలవరం కార్యక్రమం చేపట్టినా ప్రయోజనం ఉండదు.వైఎస్ జగన్మోహన్ రెడ్డిను రాజకీయంగా విమర్శిస్తే విమర్శించండి. తద్వారా రాజకీయ లబ్ది పొందడానికి యత్నిస్తే యత్నించండి. ప్రాజెక్టు విషయంలో ఎవరు ఎలా ప్రవర్తించారు. ఎవరు ఏ మేరకు కృషి చేశారు? ఎవరు ద్రోహం చేశారు? ఎవరు మేలు చేశారు? అనే అంశాలు చరిత్రలో నిక్షిప్తమై ఉంటాయి. ప్రస్తుతం వాటి జోలికి వెళ్లడం ముఖ్యం కాదు. ప్రాజెక్టును పూర్తి చేసిన రోజున చంద్రబాబు కాలర్ ఎగురవేసుకుని ఏమి చెప్పినా వినవచ్చు. అలాకాకుండా కుంటి సాకులు చెబుతూ కాలక్షేపం చేస్తే మాత్రం రాష్ట్రానికి ద్రోహం చేసినట్లు అవుతుంది.ప్రాజెక్టులో తొలిదశలో నీటిని నిల్వ ఉంచే విషయంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై అప్పట్లో చంద్రబాబు, టీడీపీ నేతలు విమర్శలు చేసేవారు. మరి ఇప్పుడు పూర్తి స్థాయిలో 194 టీఎమ్సీల నీటిని నిల్వ ఉంచాలంటే నిర్వాసితులకు ఇవ్వవలసిన పరిహారం సుమారు ముప్పైవేల కోట్లను కూడా కేంద్రం నుంచి ఎంత తొందరగా రాబట్టుకోగలిగితే అంత మంచిది. ఈ ప్రాజెక్టు ఆంధ్రుల దశాబ్దాల కల. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఏపీలో చాలా వరకు నీటి సమస్య లేకుండా పోయే అవకాశం ఉంటుంది.2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ఈ ప్రాజెక్టు ఒక రూపానికి వచ్చింది. రాజశేఖరరెడ్డి కేంద్రం నుంచి అనుమతులు తేవడంలో చాలా కృషి చేశారు. అలాగే ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణకు కూడా చొరవ తీసుకున్నారు. దురదృష్టవశాత్తు ఆయన అనూహ్య మరణంతో ఉమ్మడి ఏపీ గతి మారిపోయింది. ఆయన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టుపై చూపవలసినంత శ్రద్ద చూపలేదు. కాంట్రాక్టర్ ఎంపికే పెద్ద వివాదంగా మారుతూ వచ్చింది. ఇంతలో రాష్ట్ర విభజన జరగడం, విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును కేంద్రం చేపడుతుందని పేర్కొనడంతో మళ్లీ ఆశలు చివురించాయి.వైఎస్ రాజశేఖరరెడ్డి పోలవరం పనులపై ఎంతో శ్రద్దపెట్టి అనుమతులు తేకపోతే, విభజన సమయంలో ఈ ప్రాజెక్టు చట్టంలోకి కూడా వచ్చేది కాదేమో! విభజన వల్ల నష్టపోయిన ఏపీకి ఈ ప్రాజెక్టు ఒక వరం అవుతుందని అంతా భావించారు. ఈ తరుణంలో 2014లో చంద్రబాబు ప్రభుత్వం వెంటనే ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టకుండా పట్టిసీమ ప్రాజెక్టును తెరపైకి తెచ్యింది. తదుపరి కేంద్రం బదులు తామే నిర్మిస్తామని తీసుకోవడంతో అనేక కొత్త సమస్యలు వచ్చాయి.తర్వాత వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొన్ని పనులు పూర్తి చేసినప్పటికీ, కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లేకపోవడం, వరదలు, కరోనా వంటి సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. ఇంతలో డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది. దాంతో ప్రాజెక్టు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. కేంద్రంలో టీడీపీపై ఆధారపడిన ప్రభుత్వం వచ్చింది కనుక బీజేపీపై ఒత్తిడి పెంచి సకాలంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే ఏపీకి మేలు జరుగుతుంది. మరి ఆ విధంగా చంద్రబాబు చేయగలుగుతారా? లేక జగన్మోహన్ రెడ్డిను నిందించడానికే ప్రాధాన్యత ఇస్తారా?– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
జీవనాడిపై దాడి!
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు మన రాష్ట్రానికి జీవనాడి. గరిష్టంగా 194.6 టీఎంసీల సామర్థ్యంతో గోదావరిపై నిర్మిస్తున్న అతి పెద్ద జలాశయం ఇదే. కుడి, ఎడమ కాలువ ద్వారా 7.2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతో గోదావరి, కృష్ణా డెల్టాల్లో 23.5 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చు. ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా 8 లక్షల ఎకరాలకు నీళ్లందించ వచ్చు. విశాఖ నగరం పారిశ్రామిక, తాగునీటి అవసరాలను తీర్చవచ్చు. ప్రాజెక్టులో నిర్మించే జలవిద్యుత్కేంద్రంలో 960 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయవచ్చు. పోలవరం పూర్తయితే రాష్ట్రం రూపురేఖలు సమూలంగా మారిపోవడం ఖాయం. దేశంలో ఈ స్థాయిలో సాగునీరు, తాగునీరు, విద్యుత్తు అవసరాలను తీర్చే బహుళార్థ సాధక ప్రాజెక్టు మరొకటి లేదు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 2005లో ప్రారంభించిన పోలవరాన్ని విభజన నేపథ్యంలో 2014లో కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. తామే వంద శాతం ఖర్చుతో పూర్తి చేస్తామని హామీ ఇచి్చంది. విభజన చట్టం ప్రకారం కేంద్రమే పూర్తి చేయాల్సిన పోలవరం నిర్మాణ బాధ్యతలను కేంద్రానికి ప్రత్యేక హోదా తాకట్టు పెట్టి మరీ 2016 సెప్టెంబరు 7న అధికారంలో ఉండగా చంద్రబాబు దక్కించుకున్నారు. 2013–14 ధరల ప్రకారం రూ.20,946 కోట్లతోనే ప్రాజెక్టును పూర్తి చేస్తానని నమ్మబలికి కేంద్రానికి హామీ ఇచ్చారు. 2014 ఏప్రిల్ 1 వరకూ ఖర్చు చేసిన రూ.4,730.71 కోట్లు పోనూ మిగతా రూ.15,667 కోట్లే ఇస్తామని కేంద్రం తెగేసి చెబితే దానికీ చంద్రబాబు తలూపారు. సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) ఖరారు చేసిన ప్రాజెక్టు నిర్మాణ ప్రణాళికను కమీషన్ల దాహంతో తుంగలో తొక్కి పనులు చేపట్టారు. వరదను మళ్లించేలా స్పిల్‌వే, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేయకుండానే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పునాది డయాఫ్రమ్‌వాల్‌ను నిర్మించారు. చివరకు ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేయలేక ఇరువైఫులా ఖాళీ ప్రదేశాలను వదిలేసి 2019 ఫిబ్రవరిలో చేతులెత్తేశారు. ఈ నిర్వాకాల కారణంగా 2019 జూన్ తర్వాత గోదావరిలో పోటెత్తిన భారీ వరద కాఫర్ డ్యామ్‌ల ఖాళీల మీదుగా అధిక ఉద్ధృతితో ప్రవహించడంతో డయాఫ్రమ్‌వాల్ దెబ్బతింది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై భారీ అగాధాలు ఏర్పడ్డాయి. ఇదే పోలవరం పనులను అత్యంత సంక్లిష్టంగా మార్చింది. స్పిల్‌వే, కాఫర్ డ్యామ్‌ల పనులను చంద్రబాబు గాలికొదిలేసి డయాఫ్రమ్‌వాల్‌ను నిర్మించడమే ఈ క్లిష్ట పరిస్థితికి మూల కారణం. జీవం తీసిన వారే బురద జల్లుతున్నారు తాజాగా పోలవరాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు జీవనాడి లాంటి ప్రాజెక్టును వైఎస్ జగన్ విధ్వంసం చేశారంటూ నిస్సిగ్గుగా బుకాయించారు. కమీషన్లకు ఆశపడి పోలవరం జీవం తీసిన చంద్రబాబు దీన్ని కప్పిపుచ్చి జీవం పోసిన వైఎస్ జగన్‌పై బురద జల్లే యత్నం చేయడాన్ని సాగునీటిరంగ నిపుణులు తప్పుబడుతున్నారు.అక్రమాలు అరికట్టి కీలక పనులు పూర్తి.. 2019 మే 30న వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి టీడీపీ సర్కార్ చేసిన చారిత్రక తప్పిదాలను సరిచేస్తూ ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టు పనులు చేపట్టారు. పీపీఏ, సీడబ్ల్యూసీ అభ్యంతరాలను బేఖాతర్ చేస్తూ రూ.2,917 కోట్ల విలువైన పనులను నవయుగకు నాడు చంద్రబాబు సర్కార్ నామినేషన్‌పై కట్టబెట్టింది. వీటితోపాటు జలవిద్యుత్కేంద్రం పనుల కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసి రివర్స్ టెండరింగ్ నిర్వహించడం ద్వారా రూ.783 కోట్లను ఖజానాకు వైఎస్ జగన్ ఆదా చేశారు. రాత్రిపూట కాఫర్ డ్యామ్ పనులు చేస్తున్న దృశ్యం (ఫైల్) నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ స్పిల్‌వే, స్పిల్ చానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేసి 2021 జూన్ 11నే గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా 6.1 కి.మీ. పొడవున మళ్లించారు. కుడి, ఎడమ కాలువలను జలాశయంతో అనుసంధానించే కనెక్టివిటీస్ను పూర్తి చేశారు. ఎడమ కాలువలో వరాహ నదిపై అత్యంత పొడవైన అక్విడెక్టుతోసహా కీలకమైన పనులను విజయవంతంగా పూర్తి చేశారు. జలవిద్యుత్కేంద్రం పనులను సైతం కొలిక్కి తెచ్చారు. ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో అగాధాలను సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు ఇసుకతో పూడ్చి వైబ్రో కాంపాక్షన్ చేస్తూ యథాస్థితికి తెచ్చారు. ఇక డయాఫ్రమ్‌వాల్ భవితవ్యాన్ని తేల్చితే 18 నెలల్లోగా ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని 2022 డిసెంబర్ నుంచి వైఎస్ జగన్ కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. అయితే అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల సహకారం తీసుకుని డిజైన్లు ఖరారు చేసి పనులు చేపట్టేలా సీడబ్ల్యూసీ ప్రణాళిక రచించింది. 2017–18 ధరల ప్రకారం భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం వ్యయమే రూ.33,168.23 కోట్లని, అందువల్ల 2013–14 ధరల ప్రకారం రూ.20,946 కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్యమని ప్రధాని మోదీకి నాడు సీఎం హోదాలో వైఎస్ జగన్ అనేక సార్లు విన్నవించారు. ఈ క్రమంలో తాజా ధరల మేరకు నిధులిచ్చి పోలవరం పూర్తికి సహకరించాలన్న వైఎస్ జగన్ వినతిపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. ప్రధాని ఆదేశాల మేరకు పోలవరం తొలి దశ పూర్తికి రూ.12,157.53 కోట్లు విడుదల చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖ మార్చి 6న కేంద్ర కేబినెట్‌కు ప్రతిపాదన పంపింది. అయితే అప్పటికే బీజేపీతో టీడీపీ–జనసేనకు పొత్తు కుదిరింది. ఈ నేపథ్యంలో పోలవరానికి నిధులు మంజూరు చేస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపితే అది ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి అనుకూలంగా మారుతుందని, అందువల్ల దాన్ని ఆపేయాలని బీజేపీ అధిష్టానంపై చంద్రబాబు ఒత్తిడి తెచ్చారు. ఇలా అడ్డుపుల్ల వేయడంతో నిధుల విడుదల ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ పక్కన పెట్టింది. జలవిద్యుత్కేంద్రంపోలవరం ఈసీఆర్ఎఫ్ డ్యామ్‌కు ఎడమ వైపున 960 మెగావాట్ల సామర్థ్యంతో జలవిద్యుత్కేంద్రాన్ని నిర్మించాలి. ఎడమ వైపు ఉన్న కొండను తొలిచి 12 ప్రెజర్ టన్నెల్స్ తవ్వి టర్బైన్లను అమర్చి విద్యుత్కేంద్రాన్ని పూర్తి చేయాలి.2014–19: టీడీపీ హయాంలోజలవిద్యుత్కేంద్రం నిర్మాణ పనుల్లో కొండను తొలిచే పనుల్లో కేవలం 25 శాతం మాత్రమే చేసి టీడీపీ సర్కార్ చేతులు దులుపుకొంది.2019–24: వైఎస్సార్ సీపీ పాలనలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జలవిద్యుత్కేంద్రం పనులు శరవేగంగా సాగాయి. కొండను తొలిచే పనులను యుద్ధప్రాతిపదిక పూర్తి చేసి 12 ప్రెజర్ టన్నెల్స్‌ను పూర్తి చేసింది. టర్బైన్లను అమర్చడానికి అవసరమైన అన్ని పనులు పూర్తి చేసింది. టర్బైన్ల తయారీ బాధ్యతను బీహెచ్ఈఎల్కు అప్పగించింది. జలవిద్యుత్కేంద్రం పనులను దాదాపుగా కొలిక్కి తెచి్చంది. పోలవరం జలాశయం పనులు పూర్తయ్యేలోగా విద్యుదుత్పత్తి ప్రారంభించే విధంగా జలవిద్యుత్కేంద్రం పనులను వేగవంతం చేసింది. 2014–19: టీడీపీ హయాంలో ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను నిర్మించకముందే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–2లో పునాది డయాఫ్రమ్‌వాల్‌ను 1,396 మీటర్ల పొడవున పూర్తి చేసిన చంద్రబాబు 2018 జూన్ 11న జాతికి అంకితం చేశారు. ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మించాలంటే 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలో ముంపునకు గురయ్యే 54 గ్రామాల్లోని 20,946 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. ఈమేరకు సీడబ్ల్యూసీ, పీపీఏకు హామీ ఇచ్చిన చంద్రబాబు సర్కార్ 2018 నవంబర్‌లో ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల పనులు ప్రారంభించింది. అయితే రూ.484 కోట్లు ఖర్చు చేసి కేవలం 3,110 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించారు. మిగతా నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా, కాఫర్ డ్యామ్‌లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాన్ని వదిలేసిన చంద్రబాబు సర్కార్ ఆ పనులను పూర్తి చేయలేక చేతులెత్తేసింది. 2019 జూన్‌లో ప్రారంభమైన గోదావరి వరద ప్రవాహానికి ఎగువ కాఫర్ డ్యామ్ అడ్డంకిగా మారింది. దాంతో కాఫర్ డ్యామ్ ఖాళీ ప్రదేశాల గుండా అధిక ఉద్ధృతితో ప్రవహించడంతో గ్యాప్–2లో డయాఫ్రమ్‌వాల్ నాలుగు చోట్ల కోతకు గురై 485 మీటర్ల పొడవున దెబ్బతింది. ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో సగటున 26 మీటర్ల నుంచి 36.5 మీటర్ల లోతు వరకు భారీ అగాధాలు ఏర్పడ్డాయి.2019–24: వైఎస్సార్ సీపీ పాలనలో ఎగువ కాఫర్ డ్యామ్ ప్రభావం వల్ల ముంపునకు గురయ్యే 8,446 కుటుంబాలకు రూ.1,670 కోట్లతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పునరావాసం కల్పించింది. ఆ తర్వాత ఎగువ కాఫర్ డ్యామ్‌ను 43 మీటర్ల ఎత్తుతో, దిగువ కాఫర్ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు 31.5 మీటర్ల ఎత్తుతో పూర్తి చేసింది. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లతోపాటు 2.1 కి.మీ. పొడవున అప్రోచ్ ఛానల్, 2.92 కి.మీ. పొడవున స్పిల్ ఛానల్, వెయ్యి మీటర్ల పొడవున పైలట్ ఛానల్‌ను పూర్తి చేసి 2021 జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని మళ్లించింది.స్పిల్ వేగోదావరికి 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా స్పిల్‌వేను నిర్మించాలి. ప్రాజెక్టు పనుల్లో తొలుత పూర్తి చేయాల్సింది స్పిల్ వేనే. 1,118 మీటర్ల పొడవు, 53.32 మీటర్ల ఎత్తుతో నిర్మించే స్పిల్ వేకు 25.72 మీటర్ల నుంచి 45.72 మీటర్ల వరకూ 20 మీటర్ల ఎత్తు, 16 మీటర్ల వెడల్పుతో గేట్లు అమర్చాలి. వరద వచి్చనప్పుడు దిగువకు విడుదల చేయడానికి వీలుగా అత్యాధునిక హైడ్రాలిక్ హాయిస్ట్‌లను గేట్లకు అమర్చాలి. ప్రపంచంలో గరిష్టంగా వరద జలాలను దిగువకు విడుదల చేసే అతి పెద్ద స్పిల్ వే పోలవరంలోనే ఉంది.2014–19: టీడీపీ హయాంలో 2014 జూన్ 8న సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు 2016 డిసెంబర్ 30న స్పిల్ వే పనులను ప్రారంభించారు. టీడీపీ అధికారం కోల్పోయే నాటికి అంటే 2019 మే 29 నాటికి స్పిల్ వే పనులు పునాది స్థాయిని కూడా దాటలేదు. స్పిల్ వేలో కేవలం రెండు (39, 40) పియర్స్‌ను 30 మీటర్ల వరకూ చేసి వాటి మధ్య ఒక ఇనుప రేకు పెట్టి గేట్ అమర్చినట్లు 2018 డిసెంబర్ 24న చంద్రబాబు ఘనంగా ప్రకటించుకున్నారు.2019–2024: వైఎస్సార్సీపీ పాలనలో2019 మే 30న సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. అదే ఏడాది జూన్‌లో ప్రారంభమైన వరద ప్రవాహం నవంబర్ వరకూ కొనసాగింది. 2020 మార్చి నుంచి 2021 వరకూ కరోనా మహమ్మారి విరుచుకు పడింది. అయితే గోదావరి వరదలు, కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ వైఎస్ జగన్ రికార్డు సమయంలో స్పిల్ వేను పూర్తి చేశారు. లాక్‌డౌన్‌లోనూ జర్మనీ, జపాన్ నుంచి హైడాల్రిక్ హాయిస్ట్ సిలిండర్లను దిగుమతి చేసుకుని స్పిల్ వేకు 48 గేట్లను బిగించారు. 2021 జూన్ 11న గోదావరి వరదను స్పిల్ వే మీదుగా విజయవంతంగా మళ్లించారు. -
పోలవరం.. దాచేస్తే దాగని నిజాలు
-
పోలవరం ప్రాజెక్టుపై ఎవరికీ తెలియని విషయాలు బయటపెట్టిన అంబటి
-
‘పోలవరం’ పనుల్లో సంక్షోభం.. బాబు తప్పిదం వల్లే..: అంబటి రాంబాబు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2014–19 మధ్య అధి కారంలో ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదంవల్లే పోలవరం ప్రాజెక్టులో విధ్వంసం చోటుచేసుకుందని.. పనుల జాప్యానికి ఆయనే కారణమని మాజీమంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులపై సోమ వారం సీఎం చంద్రబాబు చెప్పిన మాటలన్నీ పూర్తి అవాస్తవాలు, పచ్చి అబద్ధాలన్నారు. పోలవరం పర్యటన సందర్భంగా ఆయన చేసిన తప్పులను గుర్తుచేసుకోకుండా.. వైఎస్ జగన్‌పై బురదజల్లేందుకు చంద్రబాబు ప్రయత్నించారని మండిపడ్డారు. ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తిచేయడానికి 2019–24 మధ్య వైఎస్ జగన్ చిత్తశుద్ధితో కృషిచేశారని.. స్పిల్ వే, అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు పూర్తిచేసి గోదావరి వరద ప్రవాహాన్ని 6.1 కిమీల పొడవున మళ్లించారని గుర్తుచేశారు. 2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను ఒప్పుకుని చిత్తశుద్ధితో ప్రాజెక్టును పూర్తిచేయడంపై దృష్టిపెట్టాలని అంబటి చంద్రబాబుకు హితవు పలికారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..వాస్తవాలు అవాస్తవాలు అవుతాయా..?ప్రమాణ స్వీకారం చేసిన ఐదు రోజులకే సోమవారం చంద్రబాబు పోలవరాన్ని సందర్శించారు. అధికారంలోకి వచ్చిన ఉత్సాహంలో ఆయనచేసిన తప్పులన్నీ వైఎస్ జగన్‌పై నెట్టేందుకు యత్నించారు. కానీ, పోలవరం పూర్తిచేయాలంటే ఇంకా నాలుగేళ్లు పడుతుందని అధికారులు చెబుతున్నారంటూ బాబు వెల్లడించారు. పోలవరంలో విధ్వంసానికి వైఎస్ జగనే కారణమని ఆయన పదే పదే చెప్పే ప్రయత్నం చేశారు. నిజానికి.. 2019కి ముందు చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదాలే పోలవరం విషయంలో సంక్షోభం వచ్చింది. ప్రాజెక్టు నిర్మాణంలో బాబు వ్యూహాత్మక, చారిత్రక తప్పిదాలే ఈ పరిస్థితికి దారితీశాయి. ముందుగా గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వే, తర్వాత ఎగువ కాఫర్ డ్యాం, దిగువ కాఫర్ డ్యాం పూర్తిచేయకుండా డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని చంద్రబాబు చేపట్టడమే దీనికి ప్రధాన కారణం. డయాఫ్రం వాల్‌తో పాటు ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్ పనులు సమాంతరంగా చేపట్టారు. జర్మనీకి చెందిన బావర్ సంస్థ డయాఫ్రమ్ వాల్‌ను పూర్తిచేసి రూ.460 కోట్లు బిల్లులు తీసుకుంది. చివరకు కాఫర్ డ్యాంల మధ్య ఖాళీలు ఉంచేయడంతో వరదలకు డయాఫ్రం వాల్ పూర్తిగా దెబ్బతింది. ఇదీ వాస్తవం. దీన్ని దాచిపెట్టి, కాంట్రాక్టర్‌ను మార్చడంవల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిందన్నట్లుగా చంద్రబాబు అవాస్తవాలు చెబుతున్నారు. అంతేకాక.. ఇటు స్పిల్ వే, కాఫర్ డ్యాం పూర్తిచేయకపోడం, గోదావరి నదిని డైవర్షన్ చేయకపోవడంవల్ల 54 గ్రామాలు ముంపు సమస్యను ఎదుర్కొన్నాయనే వాస్తవాన్ని దాచిపెడుతున్నారు. వీటికి సమాధానం చెప్పకుండా మీరు చేసిన తప్పులను వైఎస్ జగన్ పైకి నెట్టేసి పబ్బం గడుపుకుందామనుకుంటున్నారా చంద్రబాబూ? పోలవరంలో జరిగిన అంశాలు ఏమిటనే విషయాన్ని ప్రజలు, మేధావులు, ఇరిగేషన్ మీద అవగాహన ఉన్న వాళ్లు అర్థంచేసుకోవాలి.ఐదేళ్లలో పూర్తిచేస్తామని చెప్పలేకపోతున్నారు..నిజానికి.. చంద్రబాబువల్లే ఈ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగింది. జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఆలస్యానికి చంద్రబాబే కారణం. చివరకు.. ఇప్పుడు ప్రజలు అధికారం ఇచ్చినా సరే ఐదేళ్లలో పూర్తిచేస్తామనే మాట చంద్రబాబు చెప్పలేకపోతున్నారు. 2019కి ముందు చంద్రబాబు అశాస్త్రీయంగా ఆలోచించడంవల్లే ఈ పరిస్థితి దాపురించింది.. అప్పట్లో సొంత తెలివితేటలు ఉపయోగించడంవల్ల ఆయన అనేక తప్పులు చేశారు. ఇవాళ వైఎస్ జగన్ మీద విరుచుకుపడడం అన్యాయం.శరవేగంగా పనులు చేసింది వైఎస్ జగనే..ఇక దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ను ఏం చేయాలన్న దానిపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఇప్పటికీ నిర్ధిష్టమైన నిర్ణయానికి రాలేదు. ప్రాజెక్టులో 72 శాతం పూర్తిచేశామని చంద్రబాబు చెబుతుండటం విడ్డూరం. ఎందుకంటే..– మేం కట్టిన పోలవరం స్పిల్‌వే మీద చంద్రబాబు ప్రయాణించారని తెలుసుకోవాలి. మేమే రెండు కాఫర్ డ్యాంలు పూర్తిచేశాం. – అలాగే, గోదావరి నదిని పూర్తిగా స్పిల్‌వే మీదుగా డైవర్షన్ చేశాం. – స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్ కూడా పూర్తిచేశాం. – ఇవికాక క్రిటికల్ నిర్మాణాలు పూర్తిచేసి, గేట్లన్నీ పెట్టి ప్రస్తుతం ఎంత వరద వచ్చినా ఆపరేట్ చేసే పరిస్థితికి ప్రాజెక్టును తీసుకెళ్లాం. – కానీ, చంద్రబాబు మసిపూసి మారేడు కాయచేసే ప్రయత్నం చేస్తున్నాడు.జగన్ ఏ తప్పూ చేయలేదు..మరోవైపు.. చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం వెళ్తానంటున్నారు. వైఎస్ జగన్‌ను దూషించడమే పనిగా పెట్టుకోబోతున్నారు. కాబట్టి దీన్ని కూలంకషంగా ప్రజలు అర్థంచేసుకోవాలి. నేను మళ్లీ మళ్లీ చెబుతున్నా.. పోలవరం పనుల్లో జగన్ ఎలాంటి తప్పుచేయలేదు. శరవేగంగా ప్రాజెక్టును పూర్తిచేయడానికి చిత్తశుద్ధితో కృషిచేశారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పిదాలవల్లే పోలవరానికి ఈ దుస్థితి పట్టింది. నాలుగేళ్లకు పూర్తవుతుందా? ఐదేళ్లకు పూర్తవుతుందా? అనే అంశాన్ని అపర మేధావినని, చక్రం తిప్పానని చెప్పుకుంటున్న చంద్రబాబు కూడా చెప్పలేని దుస్థితికి రావడానికి కారణం.. ఆయన ప్రభుత్వం చేసిన తప్పిదం తప్ప మరొకటి కాదు. బాబు హయాంలో జరిగిన విధ్వంసంవల్ల ప్రతి తెలుగువాడూ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎలాంటి తప్పూ చేయలేదు. చంద్రబాబు తన తప్పులను ఒప్పుకోవాలి.‘హోదా’ తీసుకురాకపోతే ద్రోహిగా మిగిలిపోతారు..చంద్రబాబుకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. భగవంతుడు, ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. కూటమిని గెలిపించారు. టీడీపీకి 16 ఎంపీ సీట్లు ఇచ్చారు. కేంద్రంలో ప్రధాని మోదీ చంద్రబాబు మీద ఆధారపడే పరిస్థితి ఇప్పుడు నెలకొంది. చంద్రబాబు చాలా లక్కీ. ఆంధ్రప్రదేశ్‌కు కూడా లక్కీయే. ఇలాంటి పరిస్థితి రావాలని వైఎస్ జగన్ చాలాసార్లు కోరుకున్నారు. ఆయనకు రాని అవకాశం టీడీపీకి వచ్చింది. ఇప్పుడు ధర్మపోరాట దీక్షలు అవసరంలేదు. మీ చేతిలో పరిస్థితి ఉంది. ప్రత్యేక హోదాను తీసుకురావాలి. ఆంధ్ర రాష్ట్రానికి ప్రాణం పోయండని చంద్రబాబును రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీన్ని ఉపయోగించుకోలేకపోతే రాష్ట్రానికి చంద్రబాబులాంటి ద్రోహి ఎవరూ ఉండరని మనవి చేస్తున్నా. ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం వంటివన్నీ వదిలేసి వైఎస్ జగన్‌ను రోజూ తిట్టుకుంటూ ఉంటే మిమ్మల్ని ఎవరు నమ్ముతారు బాబూ? -
మీ హయాంలో పోలవరం దుస్థితి ఇది మీ కారు వెళ్లిన స్పిల్‌వే మేము కట్టిందే
-
చంద్రబాబు తప్పిదం వల్లే పోలవరం ఆలస్యం: అంబటి
సాక్షి, గుంటూరు: గతంలో చంద్రబాబు చేసిన తప్పిదం వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అయ్యిందని ఏపీ మాజీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సీఎం చంద్రబాబు తాజాగా పొలవరంలో పర్యటించడం.. ప్రెస్‌మీట్ నిర్వహించి గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంతో అంబటి స్పందించారు. తాడేపల్లిలో అంబటి మీడియాతో మాట్లాడుతూ.. 2018లోపే పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. పోలవరానికి జగన్ ద్రోహం చేశారని ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోంది. వైఎస్ జగన్‌పై బురద చల్లాలని ప్రభుత్వం ప్రయతిస్తోంది. కానీ, చంద్రబాబే నిజమైన పోలవరం ద్రోహి. వైఎస్ జగన్ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరిగాయి. మా పాలనలో పోలవరం పనుల్లో ఎలాంటి తప్పిదాలు జరగలేదు. చంద్రబాబు ఇప్పటికైనా తాను చేసిన తప్పుల్ని గుర్తించాలి అని అంబటి హితవు పలికారు.‘‘చంద్రబాబు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక తప్పిదం. పోలవరాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు డబ్బులు సంపాదించాలని చూశారు. ఇప్పటికైనా చంద్రబాబు చేసిన తప్పిదాలను గుర్తించాలి’’ అని అంబటి రాంబాబు అన్నార‘‘ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. జగన్ హయాంలో ఎలాంటి తప్పులు జరగలేదు. త్వరగా నిర్మాణం చేశాం. ప్రపంచంలోనే అరుదైన ప్రాజెక్ట్ పోలవరం. ఇందులో డయాఫ్రం వాల్ నిర్మాణం కీలకమైనది. కాపర్ డ్యామ్‌లు పూర్తయ్యాకే డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టాలి. కానీ అందుకు భిన్నంగా చేయడం వల్లే ప్రాజెక్టుకు నష్టం జరిగింది. ఐదేళ్లలో పోలవరం పూర్తి చేయలేమని చంద్రబాబు చేతులెత్తేశారు. జగన్ హయాంలోనే కాపర్ డ్యామ్‌లు, స్పిల్ వే నిర్మాణం చేశాం. చంద్రబాబుకు ప్రజలు చాలా గొప్ప అవకాశం ఇచ్చారు. గతంలో ప్రత్యేక హోదా అని ధర్మ పోరాటాలు చేసిన చంద్రబాబుకు ఇప్పుడు మంచి అవకాశం దక్కింది. అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రత్యేక హోదా తీసుకురావాలి. లేకపోతే రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేసినట్టే’’ అని అంబటి పేర్కొన్నారు.‘‘రాజధాని, పోలవరం పూర్తిచేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈవీఎంలపై ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరగాలి’’ అని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. -
చంద్రబాబు తప్పిదాల వల్లే పోలవరం పనుల్లో జాప్యం
-
పోల‘వరం’ మరో నాలుగేళ్లకే
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పోలవరం పూర్తి కావాలంటే మరో నాలుగు సీజన్లు అంటే నాలుగు సంవత్సరాలు పడుతుందని అధికారులు చెబుతున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అది కూడా అన్నీ సవ్యంగా జరిగితేనే నాలుగేళ్లు పడుతుందని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన అనేక తప్పిదాలు ప్రాజెక్టుకు శాపాలుగా మారాయని ఆరోపించారు. సోమవారం పోలవరం ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం చంద్రబాబు ఎంపిక చేసిన మీడియాతో మాట్లాడారు. తొలుత స్పిల్‌వే బ్లాక్–26 వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. గైడ్ బండ్, గ్యాప్ 1, 2, 3, డీఎస్ఈడీ పవర్ హౌస్ డౌన్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్‌లో జరుగుతున్న పనులను పరిశీలించి ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నా దూరదృష్టితో ముంపు మండలాల విలీనంపోలవరాన్ని చూస్తే బాధ, ఆవేదన కలుగుతోందని.. ప్రాజెక్టును ఏపీకి జీవనాడిగా భావించామని చంద్రబాబు చెప్పారు. తాను 2014లో గెలిచిన తరువాత దూరదృష్టితో తెలంగాణకు చెందిన ఏడు ముంపు మండలాలను కేంద్ర ఆర్డినెన్స్ ద్వారా ఏపీలో విలీనం చేయగలిగినట్లు తెలిపారు. అప్పటికే పోలవరం చాలా సంక్షోభాల్లో ఉందన్నారు. 2005లో వైఎస్సార్ ప్రారంభించిన ప్రాజెక్టు పనుల్లో అనేక ఆరోపణలు వచ్చాయన్నారు. రాష్ట్ర విభజన అనంతరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారన్నారు. ప్రాజెక్టు 45.72 మీటర్ల ఎత్తుతో ఉంటే 194 టీఎంసీల నీరు నిల్వ ఉంటుందని, అయితే ఆ ఎత్తు తగ్గించడానికి ప్రయతి్నంచారని ఆరోపించారు.స్పిల్‌వే ద్వారా 50 లక్షల క్యూసెక్కులు వెళ్లేలా డిజైన్ చేశామన్నారు. బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని గత ప్రభుత్వం సర్వనాశనం చేసిందని ధ్వజమెత్తారు. చైనాలోని త్రీ గోర్జెస్ కన్నా అధిక స్థాయిలో నీటి విడుదల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టు ఇదేనన్నారు. 194 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం, 320 టీఎంసీల వరకు వరద నీటిని వినియోగించుకోగలిగిన అవకాశం ఈ ప్రాజెక్టుకు ఉందన్నారు. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు పోలవరం పనులను తాను వేగవంతం చేశానని, ప్రాజెక్టుపై 100కి పైగా సమీక్షలు, 31 సార్లు క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించినట్లు చెప్పారు. పోలవరంతో తనకు ఎంతో అనుబంధం ఉందని, ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో ఎక్కడా కరువు కనపడదన్నారు. రివర్స్ టెండరింగ్‌తో ఆగిపోయిందిగతంలోనే తమ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.13,683 కోట్లు ఖర్చు చేసి 72 శాతానికి పైగా పూర్తి చేసిందని, అదే వేగంతో పనులు కొనసాగి ఉంటే 2020 చివరి నాటికే పూర్తయ్యేదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌తో ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపివేసిందన్నారు. ఇరిగేషన్ కేటాయింపులు రూ.7,100 కోట్లకు తగ్గించి అది కూడా కాంట్రాక్టర్లకు అడ్వాన్సులుగా చెల్లించారన్నారు. తమ హయాంలో రూ.446 కోట్లతో డయాఫ్రమ్ వాల్ నిరి్మంచామని చెప్పారు. గత ప్రభుత్వం అధికారంలోకి రాగానే పనులు పూర్తి చేయనివ్వకుండా కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ సిబ్బందిని మార్చడం లాంటి చర్యలకు పాల్పడిందన్నారు.కేంద్ర జలసంఘం అధికారులు వారించినా పెడచెవిన పెట్టిందన్నారు. 2019, 2020లో అధిక వర్షాల కారణంగా డయాఫ్రమ్ వాల్‌కు నాలుగు చోట్ల నష్టం వాటిల్లడంతో 35 శాతం దెబ్బతిందని చెప్పారు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌కు మరమ్మతులు చేయాలంటే రూ.447 కోట్లు ఖర్చవుతుందని, దానికి సమాంతరంగా మళ్లీ కొత్తగా నిరి్మంచాలంటే రూ.996 కోట్ల వ్యయం అవుతుందని చెప్పారు. రెండు కాఫర్ డ్యాంలు రూ.550 కోట్లతో నిర్మించారని, కొంతమేర కాఫర్ డ్యామ్ కట్టకపోవడం వల్ల వరద తాకిడికి డయా ఫ్రమ్ వాల్ దెబ్బతిందని చంద్రబాబు పేర్కొన్నారు. కాఫర్ డ్యామ్ గ్యాప్ నిర్మాణానికి రూ.2 వేల కోట్లు ఖర్చవుతుందన్నారు. కాఫర్ డ్యామ్‌కు సీపేజ్‌లు ఉన్నాయని, వరదలు వస్తే మరింత నష్టం కలుగుతుందని చెప్పారు. రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని గత ప్రభుత్వం వృథా చేసిందని ఆరోపించారు. ఇది క్షమించరాని నేరంరాజకీయాలకు పనికిరాని వ్యక్తి పాలించడం రాష్ట్రానికి ఎలా శాపంగా మారుతుందో చెప్పేందుకు గత ముఖ్యమంత్రి ఒక ఉదాహరణగా మిగులుతారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. క్షమించరాని ఇన్ని తప్పిదాలు చేసిన గత ప్రభుత్వంపై ఏ చర్యలు తీసుకోవాలో ప్రజలే తెలియజేయాలన్నారు. పోలవరం పనులను ఎంత సంక్లిష్టం చేయాలో అంతా చేసి ప్రాజెక్ట్‌ను పనికిరాకుండా చేశారని విమర్శించారు. ఇది క్షమించరాని నేరమన్నారు. అప్పుడే ప్రాజెక్టు చేపడితే తక్కువ ఖర్చుతో పూర్తయ్యేదన్నారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, ఇరిగేషన్ శాఖ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, కలెక్టర్ వె.ప్రసన్న వెంకటే‹Ù, ఐజీ జీవీజీ అశోక్‌కుమార్, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘సాక్షి’కి నో ఎంట్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం వద్ద అధికారికంగా నిర్వహించిన విలేకరుల సమావేశానికి ‘సాక్షి’తో పాటు మరో మూడు ఛానళ్లకు అనుమతి లేదని ఐ అండ్ పీఆర్ అధికారి స్పష్టం చేశారు. ఈ మేరకు ఉన్నత స్థాయి నుంచి తమకు ఆదేశాలు అందాయని, జాబితా ప్రకారం సాక్షి మీడియా, 10 టీవీ, ఎన్ టీవీ, టీవీ 9లకు అనుమతులు లేవని చెప్పారు. కాగా, యూట్యూబ్ ఛానళ్లకు, స్థానిక పత్రికలకు పాస్‌లు ఇచ్చినప్పటికీ వారిని కూడా అనుమతించలేదు. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు దఫాలు పోలవరంలో పర్యటించగా అధికారిక కార్యక్రమాలకు ప్రతి పత్రిక, ఛానల్‌ను అనుమతించారు. -
Polavaram: పోలవరం వద్ద సీఎం చంద్రబాబు
అమరావతి/ఏలూరు, సాక్షి: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పోలవరం వద్దకు చేరుకున్నారు. ప్రాజెక్టు వద్ద పనుల్ని గురించి అధికారుల్ని అడిగి తెలుసుకున్నారాయన.ఆపై ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో ప్రత్యేకంగా ఆయన సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం విలేకర్లతో మాట్లాడతారని తెలుస్తోంది. గతంలో.. 2014-19 మధ్య మూడో సోమవారాన్ని పోలవారంగా పిలుస్తూ క్రమం తప్పకుండా ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిని పర్యవేక్షించారు. అదే తరహాలో ఇప్పుడూ సోమవారం రోజునే ప్రాజెక్టు సందర్శనకు శ్రీకారం చుట్టారు. -
పోలవరంను సందర్శించనున్న చంద్రబాబు
-
Fact Check: చంద్రబాబుకోసమే... రామోజీ నేలబారు రాతలు!
అసలింతకీ రామోజీరావుకు ఏం కావాలి? పోలవరం ప్రాజెక్టు పూర్తికావటమా... లేక ఎక్కడికక్కడ పనులు ఆగిపోవటమా? దీనికి ఆగిపోవటమే ఆయనకు కావాలన్న సమాధానం తేలిగ్గానే వచ్చేస్తుంది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచి్చన దగ్గర్నుంచీ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రామోజీరావు ‘ఈనాడు’లో అచ్చోసిన దుర్మార్గపు కథనాలు అన్నీఇన్నీ కావు. ఇంకేముంది ప్రాజెక్టు ఒక్క అడుగు కూడా ముందుకు పడే అవకాశం లేదని కొన్నాళ్లు...కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇచ్చే అవకాశం లేదని కొన్నాళ్లు... ఎత్తు తగ్గించి కట్టేస్తున్నారని కొన్నాళ్లు... ఇలా పదేపదే విషాన్ని చిమ్ముతూనే వస్తున్నారు.చిత్రమేంటంటే... రామోజీ అంచనాలకు భిన్నంగా పోలవరం వేగంగా ముందుకెళుతోంది. చంద్రబాబు వీసమెత్తయినా పట్టించుకోని పునరావాసాన్ని కూడా వైఎస్ జగన్ భుజాలకెత్తుకుని ప్రాజెక్టును నడిపిస్తున్నారు. కేంద్రాన్ని పదేపదే అభ్యఆర్థికస్తూ... రావాల్సిన నిధుల్ని రాబట్టుకుంటున్నారు. ఇదిగో... ఇదే ‘ఈనాడు’ కడుపు మంటను పెంచేస్తోంది. కాంట్రాక్టరుగా తన వియ్యంకుడిని తప్పించేసి మరీ ప్రాజెక్టును పూర్తి చేస్తుండటాన్ని రామోజీరావు జీరి్ణంచుకోలేకపోతున్నారు. ‘పోలవరం నిధుల కోసం... జగన్ నేల చూపులు– బేల మాటలు’ అంటూ సోమవారం ప్రచురించిన కథనం కూడా ఇలాంటిదే!!. మరి దీన్లో నిజానిజాలెంత? ఏది నిజం?ఏది నిజం..?ఈనాడు ఆరోపణ: పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చేది ఇక రూ.12,911.15 కోట్లనేనని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. కేంద్ర కేబినెట్లో 2017లో ఆమోదించిన మొత్తానికి అదనంగా... రూ.12,911.15 కోట్లే ఇస్తామని పేర్కొంది. దీనికన్నా పైసా ఎక్కువరాదు.వాస్తవం: వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర జల్ శక్తి, ఆఆర్థికక శాఖ మంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, నిర్మలాసీతారామన్‌లను కలుస్తూనే ఉన్నారు. కలిసిన ప్రతి సందర్భంలోనూ పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం కేంద్ర జలసంఘం ఆమోదించిన సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను ఆమోదించి.. ఆ మేరకు నిధులు ఇవ్వాలని కోరుతున్నారు.ఈ క్రమంలోనే గతేదాది జనవరి 3న ప్రధాని మోదీతో సమావేశమైనపుడు... ప్రాజెక్టు తొలి దశను సత్వరమే పూర్తి చేసి, రైతులకు ముందస్తు ఫలాలు అందించడానికి తాత్కాలికంగా రూ.10 వేల కోట్లు విడుదల చేయాలని కోరారు. దీనికి మోదీ సానుకూలంగా స్పందించి... జల్ శక్తి, ఆర్థిక శాఖలకు తగు ఆదేశాలిచ్చారు. కేంద్ర జల్ శక్తి శాఖ సూచన మేరకు తొలి దశ పూర్తికి రూ.10,911.15 కోట్లు అవసరమని పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది.వాటిని జల్ శక్తి శాఖ ఆమోదించింది. అయితే చంద్రబాబు ఘోర తప్పిదం వల్ల దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌ను సరిదిద్దడానికి, ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాధాలను పూడ్చటానికి రూ.2 వేల కోట్లు ఖర్చవుతుందని గత మార్చి 5న కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తేల్చింది. దాంతో తొలి దశ పూర్తికి రూ.12,911.15 కోట్లు (10,911 ప్లస్ 2వేలు) విడుదల చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖ పంపిన ప్రతిపాదనకు కేంద్ర ఆఆర్థికక శాఖ జూన్ 5న అంగీకరించింది. అదీ కథ.వాస్తవానికి పోలవరం ప్రాజెక్టుకు 2013–14 ధరల ప్రకారం.. 2014, ఏప్రిల్ 1 నాటికి ఇరిగేషన్ కాంపొనెంట్ ఖర్చులో మిగిలిన మొత్తం అంటే రూ.15,667.9 కోట్లకు మించి ఇచ్చేది లేదని, ఆ తర్వాత పడే అదనపు భారంతో కేంద్రానికి సంబంధం లేదని 2017 మార్చి 15న కేంద్రం ఒక తీర్మానాన్ని ప్రతిపాదించగా... దాన్ని కేబినెట్ ఆమోదించింది కూడా.జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.16,128.78 కోట్లు ఖర్చు చేయగా.. కేంద్రం రూ.14,418.39 కోట్లు రీయింబర్స్ చేసింది. అంటే 2017, మార్చి 15న కేంద్ర కేబినెట్ ఆమోదించిన ప్రకారం పోలవరానికి ఇక విడుదల చేయాల్సింది రూ.1249.51 కోట్లే. ఈ నేపథ్యంలో... తొలి దశ పూర్తిచేయడానికి అవసరమైన రూ.12,911.15 కోట్లు విడుదల చేయాలంటే.. 2017, మార్చి 15 నాటి కేబినెట్ తీర్మానాన్ని సవరించాలి.ఆ మేరకు ప్రతిపాదన పంపాలని కేంద్ర జల్ శక్తి శాఖకు కేంద్ర ఆఆర్థికక శాఖ సూచించిందే తప్ప ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఇవ్వబోమని గానీ.. ఇచ్చేది ఇక ఇంతేననిగానీ ఆర్థిక శాఖ నోట్లో ఎక్కడా లేదు. రామోజీరావు మాత్రం ఇచ్చేది ఇక ఇంతేనని కేంద్ర ఆఆర్థికక శాఖ నోట్లో పేర్కొన్నట్లు తప్పుడురాతలు రాసేశారు. చంద్రబాబులా రామోజీది కూడా చంద్రబాబు తరహా బ్రీఫ్డ్ మీ ఇంగ్లీషే అయితే.. ట్యూషన్ పెట్టించుకోవాలి గానీ తనకు అర్థమైనదే వాస్తవమన్న రీతిలో రాసేస్తే ఎలా? అజా్ఞనంతో తప్పుడురాతలు అచ్చేస్తే ఎలా?ఈనాడు ఆరోపణ: పోలవరం ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నిధులివ్వబోమని కేంద్రం చెప్పినా సీఎం వైఎస్ జగన్ నోరెత్తడం లేదు. లోక్‌సభలో బీజేపీకి కావాల్సినంత బలం ఉన్నా రాజ్యసభలో లేదు. రాజ్యసభలో ఉన్న రాజకీయ బలాన్ని పోలవరం నిధులు, ప్రత్యేక హోదా సాధనకు సీఎం వైఎస్ జగన్ ఎందుకు ఉపయోగించుకోలేకపోయారు?వాస్తవం: విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని కేంద్రమే నిరి్మంచాలి. కానీ.. పోలవరం ప్రాజెక్టు పనుల్లో కమీషన్ల కోసం రాష్ట్రానికి హక్కుగా దక్కిన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ... దాని నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని 2014, జూన్ నుంచి 2016, సెపె్టంబరు 6 వరకూ నాటి సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. చివరకు కేంద్రం మంజూరు చేశాక యనమల రామకృష్ణుడు బావమరిదికి, రామోజీరావు వియ్యంకుడికి ఈ కాంట్రాక్టు పనులు నామినేషన్‌పై కట్టబెట్టేశారు. భారీగా కమీషన్లు దండుకున్నారు.రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకున్న క్రమంలో చంద్రబాబు చేసిన ఇంకో ఘోరమైన తప్పిదమేంటంటే... 2013–14 నాటి ధరల ప్రకారం నిధులిస్తే చాలని 2016, సెపె్టంబరు 7న అంగీకరించడం. మరి ఆ మూడేళ్లలో ధరలు పెరిగి ఉండవా? ఆ మాత్రం ఇంగితజ్ఞానం లేకుంటే ఎలా?2016, సెపె్టంబరు 26న పోలవరానికి నాబార్డు నుంచి రూ.1981.54 కోట్ల రుణాన్ని విడుదల చేస్తూ.. ఇకపై బడ్జెట్ ద్వారా కాకుండా నాబార్డు రుణం రూపంలోనే నిధులు విడుదల చేస్తామని.. 2018, డిసెంబర్‌లోగా ప్రాజెక్టును పూర్తి చేయలేకపోతే.. విడుదల చేసిన నిధులను రుణంగా పరిగణిస్తామంటూ కేంద్రం పెట్టిన మెలికకు సైతం చంద్రబాబు తల ఊపేశారు.2016, సెప్టెంబరు 30న కేంద్ర ఆఆర్థికక శాఖ.. కేంద్ర జలశక్తి శాఖకు పంపిన మెమొరాండంలో 2014, ఏప్రిల్ 1 నాటికి నాటికి పోలవరం ప్రాజెక్టులో మిగిలిపోయిన నీటిపారుదల విభాగం పనులకు అయ్యే (ఇరిగేషన్ కాంపొనెంట్) వంద శాతం వ్యయాన్ని మాత్రమే ఇస్తామని పునరుద్ఘాటించింది.ఆ తర్వాత ఐదున్నర నెలలకు 2017, మార్చి 15న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో.. 2014, ఏప్రిల్ 1 నాటికి పోలవరం ప్రాజెక్టు పనుల్లో మిగిలిపోయిన నీటిపారుదల విభాగం పనులకయ్యే వంద శాతం వ్యయాన్ని మాత్రమే ఇస్తామని.. అది ఎంతన్నది పోలవరం ప్రాజెక్టు అథారిటీ మదింపు చేస్తుందని.. ఆ ప్రకారమే నిధులిస్తామని స్పష్టం చేసింది. ఆ సమావేశంలో ఉన్న టీడీపీకి చెందిన మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి నోరు మెదపలేదు.2014, ఏప్రిల్ 1 నాటికి నీటిపారుదల విభాగం వ్యయంలో మిగిలిన మొత్తాన్ని మాత్రమే రీయింబర్స్ చేస్తామని.. అంతకంటే అంచనా వ్యయం పెరిగితే .. దాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని 2017, మే 8న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జల్ శక్తి శాఖ లేఖ రాసినా సరే... చంద్రబాబు స్పందించలేదు.2016, సెపె్టంబరు 30న కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన మెమొరాండం ప్రకారం... 2014, ఏప్రిల్ 1 నాటి ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను సీడబ్ల్యూసీకి పంపామని.. వాటిని ఆమోదించి.. నిధులిస్తే ప్రాజెక్టును పూర్తి చేస్తామని 2018, జనవరి 12న నాటి సీఎం చంద్రబాబు ప్రధానికి లేఖ రాశారు.2013–14 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ ఆమోదించిన నీటిపారుదల విభాగం వ్యయం రూ.20,398.61 కోట్లు. ఇందులో ఏప్రిల్ 1, 2014 నాటికి చేసిన వ్యయం రూ.4,730.71 కోట్లను మినహాయిస్తే కేవలం రూ.15,667.9 కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం స్పష్టం చేసినా.. చంద్రబాబు దానికి అంగీకరించారు. 2017–18 ధరల ప్రకారం భూసేకరణ, నిర్వాసితుల పునరావాస వ్యయమే రూ. 33,168.23 కోట్లు. అలాంటిది కేవలం రూ.15,667.9 కోట్లు ఇస్తే పోలవరాన్ని పూర్తి చేస్తామని చంద్రబాబు ఎలా అంగీకరించారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.నిజానికి ఎలాంటి ప్రాజెక్టు అయినా... ఎంత ప్రతిష్టాత్మకమైనది అయినా కాలం గడుస్తున్న కొద్దీ ముందుగా వేసిన అంచనా వ్యయం పెరుగుతుంది. అది నాగార్జున సాగర్‌కైనా.. శ్రీశైలానికైనా కూడా!!. పోలవరానికైనా అంతే. 2013–14లో ఉన్న ధరలు ఇప్పుడెందుకు ఉంటాయి? అన్నిరకాల సామగ్రి, లేబర్ చార్జీలు అప్పటితో పోలిస్తే రెట్టింపుకన్నా ఎక్కువే పెరిగాయి. కానీ చంద్రబాబు నాయుడు నాటి ధరల ప్రకారం నిధులిస్తే చాలని ఏకంగా లేఖ రాసేయటంతో... ఇప్పుడు తాజా ధరల ప్రకారం నిధులడిగిన ప్రతిసారీ కేంద్రం సవాలక్ష కొర్రీలు పెడుతోంది. అసలు చంద్రబాబు ఇలా ఎందుకు చేశారంటే... ఆయనకు కమీషన్లు వస్తే చాలనుకున్నారు కనక.చంద్రబాబు నిర్వాకం వల్ల పోలవరం ప్రాజెక్టుకు తీవ్ర నిధుల కొరత ఎదురవుతోందన్నది నిజం. ç2017–18 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ టీఏసీ ఆమోదించిన సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చి.. నిధులు విడుదల చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ, జల్ శక్తి శాఖ మంత్రులను సీఎం వైఎస్ జగన్ కోరుతూ వస్తున్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రధాని మోదీ.. పోలవరం ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్‌తోపాటు సీఎం వైఎస్ జగన్ లేవనెత్తిన అంశాలను పరిష్కరించడానికి కేంద్ర కేబినెట్ కార్యదర్శి, కేంద్ర ఆర్థిక, జల్ శక్తి శాఖ అధికారులతో కమిటీ వేశారు. ఆ కమిటీ చర్చల వల్ల 2014–15 నాటి రెవెన్యూ లోటు రూ.10,421 కోట్లను ఇటీవల కేంద్రం విడుదల చేసింది. పోలవరం తొలి దశ పూర్తికి అవసరమైన రూ.12,911.15 కోట్లను విడుదల చేయడానికి అంగీకరించింది. ప్రత్యేక హోదాను ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలకు సీఎం వైఎస్ జగన్ పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే అంశంపై అటు లోక్‌సభ, ఇటు రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీలు పోరాటం చేస్తున్నారు. ఇవేవీ కని్పంచడం లేదా రామోజీ?ఈనాడు ఆరోపణ: రెండో దశ పునరావాసానికి రాష్ట్రం ఏమీ చేయలేదని సీఎం స్వయంగా ప్రకటించారు. రాష్ట్రం నిధులు ఇచ్చే పరిస్థితుల్లో లేదని చెప్పారు.వాస్తవం: కొత్తగా నిర్మించే ఏ ప్రాజెక్టులోనైనా నీటిని నిల్వ చేయాలంటే.. ఐఎస్(ఇండియన్ స్టాండర్డ్) ఆపరేషన్ ఆఫ్ రిజర్వాయర్స్ గైడ్ లైన్స్, కేంద్ర జలసంఘం నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ప్రాజెక్టు భద్రతను దృష్టిలో ఉంచుకుని ఒకేసారి గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేయకుండా.. మూడు దఫాలుగా నిల్వ చేసుకుంటూ పోవాలి. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక తొలి ఏడాది 41.15 మీటర్ల వరకూ నీటిని నింపి.. ప్రాజెక్టులో అన్ని భాగాలను పరిశీలిస్తారు. ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుతారు.ఆ తర్వాత 44 మీటర్ల కాంటూర్ వరకూ నీటిని నింపి, లోటుపాట్లు ఏవైనా ఉత్పన్నమైతే వాటిని సరిదిద్దుతారు. ఆనక 45.72 మీటర్లలో అంటే గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేస్తారు. ఇదే అంశాన్ని సీఎం వైఎస్ జగన్ పలు మార్లు శాసనసభ వేదికగా స్పష్టం చేశారు. తొలుత 41.15 మీటర్ల వరకూ నిర్వాసితులకు పునరావాసం కలి్పస్తామని.. ఆ తర్వాత దశలవారీగా పునరావాసం కల్పించి 45.72 మీటర్ల వరకూ నీటిని నిల్వ చేస్తామని ఉద్ఘాటించారు.ప్రాజెక్టు ఎత్తు ఏమాత్రం తగ్గదని.. కావాలంటే పూర్తయ్యాక టేపు తెచ్చుకుని కొలుచుకోవాలని చంద్రబాబు, రామోజీరావు ఎల్లో మీడియాకు సవాల్ విసిరారు. ఇదే అంశంపై అటు లోక్‌సభ, ఇటు రాజ్యసభలో కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పందిస్తూ.. పోలవరం ఎత్తు 45.72 మీటర్ల నుంచి ఒక్క ఇంచు కూడా తగ్గదని, నిర్వాసితులు అందరికీ పునరావాసం కల్పించే బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు.ఇటీవల నిర్వహించిన లైడార్ సర్వేలో పోలవరం ప్రాజెక్టు 41.15 కాంటూర్ పరిధిలో అదనంగా 36 గ్రామాలు ముంపునకు గురవుతాయని తేలటంతో ఆ గ్రామాల ప్రజలకూ పునరావాసం కల్పించడానికి రూ.5,122 కోట్ల నిధులివ్వాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు అభ్యఆర్థికంచారు. దీనికీ కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి షెకావత్ సానుకూలంగా స్పందించారు. దీన్ని బట్టి చూస్తే ప్రాజెక్టు, భూసేకరణ, నిర్వాసితుల పునరావాసానికయ్యే పూర్తి వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందని స్పష్టమవుతుంది. అయినా సరే.. రామోజీరావు పదే పదే విషం చిమ్ముతున్నారు.ఇదే అంశాన్ని నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ శాసనసభలో పలు మార్లు ఎత్తిచూపుతూ.. భూసేకరణ చట్టం 2013 ప్రకారం పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ.33,168.23 కోట్లని.. అలాంటిది కేంద్రం ఇస్తామన్న రూ.15,667.9 కోట్లతో ఎలా పూర్తి చేస్తారని నిలదీస్తే.. నాటి సీఎం చంద్రబాబు వాటిని తోసిపుచ్చుతూ వచ్చారు. అంటే చంద్రబాబుకు కావాల్సింది కమీషన్లు తప్ప ప్రాజెక్టు పూర్తవటం కాదు.అందుకే రాష్ట్రమే చేపట్టేలా ఆదేశాలివ్వాలని కోరుతూ... ప్రత్యేక హోదా అడగబోమని తాకట్టుపెట్టేశారు. అంచనా వ్యయాన్ని సవరించకున్నా నోరు మెదపలేదు. ఆఖరికి పునరావాసం ఊసెత్తకుండా కేవలం ఇరిగేషన్ కాంపొనెంట్ మాత్రమే ఇస్తామన్నా... సై అనేశారు.అసలు పునరావాసం లేకుంటే ప్రాజెక్టు ఉంటుందా? ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే పేదలకు సురక్షిత ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించి, వారికి తగిన పరిహారం ఇవ్వకుంటే వారు అక్కడి నుంచి వెళతారా? వారు వెళ్లకపోతే ప్రాజెక్టు పూర్తి చేసినా నీటిని నిల్వ చేయగలరా? నీటిని నిల్వ చేసే పరిస్థితి లేనపుడు ఎంత ఎత్తు కడితే లాభమేంటి? మరి పునరావాస నిధుల ఊసెత్తకుండా చంద్రబాబు ఎందుకు నోరుమూసుకున్నారు? -
ప్రధాని పదవికి విలువ లేకుండా చేశారు
సాక్షి, విశాఖపట్నం: దేశంలో బీజేపీదే అతి పెద్ద అవినీతి చరిత్ర అని, ఆ పార్టీ చేస్తున్న అవినీతి దేశంలో ఏ పార్టీ చెయ్యలేదని మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ప్రధాని పదవికి మోదీ విలువ లేకుండా చేశారని మండిపడ్డారు. బొత్స మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మోదీకి తోడు దొంగ అయిన చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టునే సోమవారం సభల్లో చదివారని చెప్పారు. తోడు దొంగల కూటమి ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆది చదివేయడమేనా, నిజాలు పరిశీలించొద్దా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల అవసరాలు, స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. మోదీ అదే నోటితో పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా మార్చుకున్నాడని చెప్పిన విషయాన్ని మర్చిపోయారా! అని అన్నారు. ప్రధాన మంత్రి మాటలంటే వాటికి పవిత్రత ఉండాలని చెప్పారు. ఇంతలా దిగజారిపోయి మాట్లాడే ప్రధానిని ఎప్పుడూ చూడలేదని అన్నారు. పోలవరంపై విచారణ చేసుకోండి పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని భావిస్తే విచారణ జరిపించుకోవచ్చు కదా అని అన్నారు. రూ.15 వేల కోట్లకు ఈసీలు ఇవ్వకుండానే ప్రధాని నిధులు విడుదల చేశారా అని ప్రశ్నించారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంత నిరాధారపూరితంగా మాట్లాడకూడదని చెప్పారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరానికి కేంద్రం సహకారం ఉంటే తప్పకుండా పూర్తవుతుందన్నారు. చంద్రబాబు హయాంలో పునరావాసం సొమ్మును ఫ్రీజ్ చేశారని షెకావత్ చెప్పారన్నారు. అప్పట్లో చూపిన లబ్దిదారులు సరైనవాళ్లు కాదని వాస్తవ లబ్దిదారులు ఆరోపిస్తున్నారని అన్నారు. నిర్వాసితులకు డబ్బు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనన్నారు. చంద్రబాబు నిర్వాకం వల్ల డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందన్నారు. చంద్రబాబు తప్పులను కూడా తాము సరిచేస్తున్నామని చెప్పారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మంచి కార్యక్రమమని బీజేపీ వాళ్లు చెప్తుంటే.. చంద్రబాబు, పవన్ మాత్రం ప్రజల్ని మోసం చేసేలా మాట్లాడుతున్నారన్నారు. వాళ్లిద్దరికీ సుద్దులు చెప్పాల్సిన మోదీ.. తమకు చెప్తున్నారని మండిపడ్డారు.నీచంగా మానవత్వం లేకుండా కూటమి చర్యలుటీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వ పథకాలకు మోకాలడ్డుతూ నీచంగా, మానవత్వం లేకుండా పేదల కడుపు కొడుతున్నాయని బొత్స ధ్వజమెత్తారు. వలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీని అడ్డుకొని, రెండు నెలల్లో 40 మంది అవ్వా తాతలను పొట్టన పెట్టుకున్నారని తెలిపారు. సుమారు 79 లక్షల మంది లబ్దిదారులున్న వైఎస్సార్ ఆసరా పథకంలో చివరి విడతలో ఇంకా రూ.1,839 కోట్లు చెల్లించకుండా అడ్డుకొన్నారని చెప్పారు. విద్యాదీవెన పథకంలో కూడా 28 లక్షల మంది లబి్ధదారులకు రూ.703 కోట్లు ఇవ్వకుండా అడ్డుపడ్డారన్నారు. తుపాను, కరవు వల్ల నష్టపోయిన 13.60 లక్షల మంది రైతులకు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ రూ.1,294.58 కోట్లు బ్యాంకుల్లో ఉన్నా లబ్ధిదారుల ఖాతాల్లో వేయకుండా అడ్డుకున్నారన్నారు. వైఎస్సార్ చేయూత నాలుగో విడత కింద 33 లక్షల మందికి రూ.565 కోట్లు విడుదల చేయడానికీ ఒప్పుకోలేదన్నారు. ఈబీసీ నేస్తం కింద 4.20 లక్షల మందికి రూ.629 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. ఇవన్నీ అమలులో ఉన్న పథకాలే అని, సాధారణంగా జరగాల్సినవేనని, అందుకే ఎన్నికల సంఘాన్ని గత నెలలోనే అనుమతి కోరామని, అయినా అనుమతివ్వలేదని చెప్పారు. 2019లో పసుపు కుంకుమ కార్యక్రమం ఎన్నికల నోటిఫికేషన్ తరవాత ఇచ్చారని, తాము దానికి అడ్డుపడ్డామా అని ప్రశ్నించారు. దీనికి తోడు సీఎం వైఎస్ జగన్‌పై చంద్రబాబు కారు కూతలు కూస్తున్నారని, 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడవచ్చా! అని ప్రశ్నించారు. చంద్రబాబు పేరెత్తడానికే అసహ్యంగా ఉందన్నారు. తమకూ అలాంటి మాటలు వచ్చని, అయితే తమకు సభ్యత సంస్కారం ఉన్నాయని చెప్పారు. ప్రజలు 15 రోజులు ఓపిక పడితే మళ్లీ మన ప్రభుత్వం వస్తుందని, అప్పుడు ఏ కూటమి దయాదాక్షిణ్యాలు అక్కర్లేదని అన్నారు.ఈసీ వాస్తవాలు పరిశీలించాలి.. కూటమికి ఎన్నికల సంఘం వత్తాసు పలుకుతూ ఏ ఫిర్యాదు చేసినా వెంటనే స్పందించడం సరికాదని అన్నారు. ఎన్నికల నిబంధనలకు, రాజ్యాంగానికి తాము వ్యతిరేకం కాదని, కానీ ఈసీ విజ్ఞతతో వాస్తవాలు పరిశీలించాలని కోరారు. కూటమి ఫిర్యాదు వల్ల వ్యక్తులకు, వ్యవస్థకు నష్టమా అనేది ఆలోచించకుండా వృద్ధుల చావుకు కారణం అవ్వడం భావ్యమా అని అన్నారు. చంద్రబాబు నీచమైన భాషపై ఈసీ తీసుకున్న చర్యలేమిటని ప్రశ్నించారు. వృద్ధుల చావులకు కారణమైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అన్నారు. ఇన్పుట్ సబ్సిడీ అందక రైతులకు జరిగే నష్టానికి, ఫీజులందక విద్యార్థులను పరీక్షలు రాయనివ్వకపోవడం, టీసీలు ఇవ్వకపోవడం జరిగితే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో టీడీపీ కార్యక్రమాలకు ఈసీ ఓకే చెప్పిందన్నారు. అందుకే నిన్న సీఎం వైఎస్ జగన్ సజావుగా ఎన్నికలు జరుగుతాయా! అన్న అనుమానం వ్యక్తం చేశారని తెలిపారు. -
సుజలాంధ్ర.. సుఫలాంధ్ర..
లక్ష్యాన్ని సాధించలేని వారే సాకులు వెతుక్కుంటారు. కార్యసాధకులకు సాకులు అడ్డురావు. అవకాశాలను అన్వేషించి మరీ లక్ష్యాలను సాధిస్తారు. ఇందులో మొదటి తరహా వ్యక్తి చంద్రబాబు అయితే రెండో తరహా నేత సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి. పద్నాలుగేళ్లు సీఎంగా పని చేశానని గొప్పలు చెప్పుకుంటూ.. తన కుప్పం నియోజకవర్గానికే నీటిని తెచ్చుకోలేని దౌర్భాగ్యం చంద్రబాబుది. ఐదేళ్ల పాలనలో మూడేళ్లలోనే ఆరుప్రాజెక్టులు పూర్తి చేసి, మరో ఆరు ప్రాజెక్టులను దాదాపుగా పూర్తి చేసిన జల రుషి సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి. చంద్రబాబు పాలనంతా కరవు మయం. ఏటా కరవు మండలాల ప్రకటన. ప్రభుత్వ సాయం అందక రైతుల హాహాకారాలు. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే కరోనా విపత్తు రెండేళ్ల పాటు కర్కశంగా ఆర్థిక స్థితిని కుదేలు చేసినప్పటికీ, జగన్ ప్రభుత్వం సాకులు వెతుక్కోలేదు. జన సంక్షేమమేపరమావధి అనుకున్నారు. మూడేళ్ల వ్యవధిలోనే ప్రాజెక్టుల్లో నీటి ఉరవడిని మడుల్లోకి మళ్లించిన ఖ్యాతి జగన్‌కు మాత్రమే దక్కుతుంది. - ఆలమూరు రాంగోపాల్‌రెడ్డి, సాక్షి, అమరావతి:సాక్షి, అమరావతి: రాష్ట్ర సాగునీటిరంగంలో నవచరిత్రను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లిఖించారు. కరోనా మహమ్మారి ప్రభావం.. లాక్ డౌన్ల దెబ్బతో దాదాపు రెండేళ్లపాటు దేశంలో ఎక్కడా ప్రాజెక్టుల పనులు చేయలేని పరిస్థితి. ప్రపంచంలో అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను కరోనా మహమ్మారి దెబ్బతీసింది. ఆర్థిక ఇబ్బందుల్లోనూ సాగునీటి ప్రాజెక్టుల పనులను సీఎం వైఎస్ జగన్ పరుగులెత్తించారు. కేవలం మూడేళ్లలోనే ఆరు ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేశారు. మరో ఆరు ప్రాజెక్టులను దాదాపుగా పూర్తి చేశారు. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడం ద్వారా.. బ్రహ్మంసాగర్ మట్టికట్టలకు డయాఫ్రమ్ వాల్ వేసి లీకేజీలకు అడ్డుకట్ట వేయడం ద్వారా మొత్తం 6 రిజర్వాయర్లలో పూర్తి స్థాయి నీటిని నిల్వ చేశారు. యాజమాన్య పద్ధతుల ద్వారా ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి ఏటా కోటి ఎకరాలకు నీళ్లందించడం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారు. చరిత్రలో మహోజ్వల ఘట్టం వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక.. సాగునీటి ప్రాజెక్టులను ప్రణాళికాయుతంగా చేపట్టి, పూర్తి చేస్తున్నారు. 2019, మే 30 నుంచి ఇప్పటి వరకూ పోలవరంతోపాటు సాగునీటి ప్రాజెక్టుల పనులకు రూ.35,268.05 కోట్లు ఖర్చు చేశారు. ప్రాజెక్టులపై పెట్టిన ప్రతి పైసాను సది్వనియోగమయ్యేలా జాగ్రత్తలు తీసుకుని.. రైతులకు అందించారు. పెన్నా డెల్టా సుభిక్షం జల యజ్ఞంలో భాగంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పెన్నా డెల్టాకు జీవనాడులైన సంగం, నెల్లూరు బ్యారేజ్‌లలో మిగిలిన పనులను సీఎం వైఎస్ జగన్ రూ.216.88 కోట్లు వెచ్చిచి పూర్తి చేసి.. 2022, సెపె్టంబరు 6న జాతికి అంకితం చేశారు. తండ్రి ప్రారంభించిన బ్యారేజ్‌ల పనులను తనయుడు పూర్తి చేసి, జాతికి అంకితం చేయడాన్ని సాగునీటిరంగ చరిత్రలో మహోజ్వలఘట్టంగా అధికారవర్గాలు అభివరి్ణస్తున్నాయి. పెన్నా డెల్టాలో 4.83 లక్షల ఎకరాలకు సమర్థంగా నీళ్లందించడమే కాకుండా ఆ రెండు బ్యారేజ్ కమ్ బ్రిడ్జిల ద్వారా రవాణా సౌకర్యాలను మెరుగుపర్చారు. పెన్నా నదీ పరివాహక ప్రాంత ప్రజలను వరద ముప్పు నుంచి తప్పించారు. నెల్లూరు నగరంతోపాటు పెన్నా డెల్టా ప్రజల తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారు. జలాశయాల్లో పూర్తి స్థాయిలో నీటి నిల్వ గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, సోమశిల, కండలేరులలో నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్ల వాటిలోనూ పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయలేని దుస్థితి. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక గండికోట నిర్వాసితులకు రూ.వెయ్యి కోట్లతో, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్వాసితులకు రూ.250 కోట్లతో పునరావాసం కల్పించారు. ఆ తర్వాత గండికోటలో 26.85 టీఎంసీలు, చిత్రావతిలో పది టీఎంసీలు నిల్వ చేస్తున్నారు.తెలుగుగంగ ప్రధాన కాలువ, లింక్ కెనాల్‌కు రూ.580 కోట్లతో లైనింగ్ చేయడం ద్వారా సకాలంలో వెలిగోడు, బ్రహ్మంసాగర్‌ను నింపడానికి సీఎం వైఎస్ జగన్ మార్గం సుగమం చేశారు. బ్రహ్మంసాగర్ మట్టికట్టకు లీకేజీల వల్ల 2019 వరకూ కేవలం నాలుగైదు టీఎంసీల నీటినైనా నిల్వ చేయలేని దుస్థితి. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక బ్రహ్మంసాగర్ మట్టికట్టకు డయాఫ్రమ్‌వాల్ నిర్మించి.. లీకేజీలకు అడ్డుకట్ట వేసి.. పూర్తి స్థాయిలో అంటే 17.74 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. దశాబ్దాల కల సాకారం ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల ప్రజల దశాబ్దాల కల వెలిగొండ. ఆ ప్రాజెక్టును 2005లో మహానేత వైఎస్ చేపట్టి పనులు పరుగులు పెట్టించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ అవినీతికి పాల్పడటంతో వెలిగొండ పనులు పడకేశాయి. జగన్ అధికారంలోకి వచ్చాక వెలిగొండ ప్రాజెక్టులో మొదటి సొరంగంలో మిగిలిన 2.833 కి.మీ. పనులను 2021, జనవరి 13 నాటికే పూర్తి చేశారు.రెండో సొరంగంలో మిగిలిన 7.698 కి.మీ. పనులను పూర్తి చేసి.. రెండు సొరంగాలను మార్చి 6న జాతికి అంకితం చేశారు. ఇప్పటికే ఫీడర్ చానల్, నల్లమలసాగర్ పూర్తయ్యాయి. శ్రీశైలానికి వరద వచ్చిన వెంటనే సొరంగాల ద్వారా నల్లమలసాగర్‌కు నీటిని తరలించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 15.25 లక్షల మందికి తాగునీరు అందించనున్నారు. వెలిగొండతో ప్రకాశం జిల్లా రూపురేఖలు సమూలంగా మారిపోనున్నాయి. బాబు జమానా అవినీతి ఖజానా కడలిపాలవుతోన్న నదీ జలాలను బంజరు భూములకు మళ్లించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం చేపట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒకే సారి రూ.లక్ష కోట్ల వ్యయంతో 84 ప్రాజెక్టులను చేపట్టారు. అప్పట్లోనే 23 ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేశారు. మిగతా 40 ప్రాజెక్టుల్లో(పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి) మిగిలిన పనులను కేవలం రూ.17,368 కోట్లతో పూర్తి చేస్తానని 2014, జూలై 28న విడుదల చేసిన శ్వేతపత్రంలో అప్పటి సీఎం చంద్రబాబు ప్రకటించారు. జూన్ 8, 2014 నుంచి మే 29, 2019 వరకూ సాగునీటి ప్రాజెక్టులకు రూ.68,293.94 కోట్లను ఖర్చు చేశారు. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పట్టిసీమ, పురుషోత్తపట్నం మినహా మిగతా 40 జలయజ్ఞం ప్రాజెక్టులకు రూ.41,833.12 కోట్లు ఖర్చు చేశారు. శ్వేతపత్రంలో చెప్పిన దానికంటే రూ.24,465.12 కోట్లు అధికంగా ఖర్చు చేసినా ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారు. దీన్ని బట్టి చూస్తే.. సాగునీటి ప్రాజెక్టుల్లో చంద్రబాబు ఏ స్థాయిలో దోపిడీ చేశారన్నది అర్థం చేసుకోవచ్చు. నీటిపారుదల రంగ చరిత్రలో రికార్డు కృష్ణా డెల్టా వరదాయిని పులిచింతల ప్రాజెక్టును మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్మించారు. గత ప్రభుత్వం నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్ల 2019 వరకూ పూర్తి నీటి నిల్వ 45.77 టీఎంసీలను నిల్వ చేయలేని దుస్థితి. జగన్ అధికారంలోకి వచ్చాక కొద్ది రోజుల్లోనే నిర్వాసితులకు పునరావాసం కల్పించి 2019 ఆగస్టులోనే పులిచింతలలో 45.77 టీఎంసీలను నిల్వ చేసి.. కృష్ణా డెల్టాలో రెండో పంటకూ నీళ్లందించడానికి మార్గం సుగమం చేశారు. కోటి ఎకరాలకు జలధారలు విభజన తర్వాత 2014 నుంచి 2019 మధ్య ఐదేళ్లూ దుర్భిక్షంతో రాష్ట్ర రైతులు, ప్రజలు తల్లడిల్లిపోయారు. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళి, ఏలేరు తదితర నదులలో నీటి లభ్యత పెరిగింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ప్రతి ఏటా ఖరీఫ్, రబీలలో కలిపి ఏటా కోటి ఎకరాలకు జగన్ నీళ్లందించారు. ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లందించడంతో భారీ ఎత్తున రైతులు పంటలు సాగుచేశారు.రికార్డు స్థాయిలో ధాన్యపు దిగుబడులు సాధించి రాష్ట్రాన్ని మళ్లీ దేశ ధాన్యాగారం (రైస్ బౌల్ ఆఫ్ ఇండియా)గా సీఎం వైఎస్ జగన్ నిలిపారు. వాతావరణ మార్పుల వల్ల కృష్ణా నదికి వరద రోజులు తగ్గిన నేపథ్యంలో.. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వచ్చే రోజుల్లో దానిపై ఆధారపడ్డ రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రాజెక్టులను నింపేలా కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని పెంచే పనులను సీఎం వైఎస్ జగన్ చేపట్టారు. ఆ పనులు శరవేగంగా సాగుతున్నాయి. శరవేగంగా పోలవరం రాష్ట్ర ప్రజల దశాబ్దాల స్వప్నం పోలవరాన్ని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సాకారం చేస్తూ జలయజ్ఞంలో భాగంగా చేపట్టి.. ప్రాజెక్టు పనులను పరుగులెత్తించారు. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కమీషన్ల కక్కుర్తితో పోలవరంలో విధ్వంసం సృష్టించారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక.. అప్రోచ్ చానల్, స్పిల్ వే, స్పిల్ చానల్, పైలట్ చానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేసి 2021, జూన్ 11నే గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా 6.1 కి.మీ. పొడవునా మళ్లించారు. చంద్రబాబు అవినీతితో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాధాలను పూడ్చి యథాస్థితికి తెచ్చే పనులను వేగవంతం చేశారు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌పై కేంద్ర జలసంఘం స్పష్టత ఇచ్చాక.. ఆ పనులు పూర్తి చేసి.. ఆ తర్వాత ఈసీఆర్ఎఫ్ డ్యామ్‌ను పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసి.. ఆయకట్టుకు నీళ్లందించి.. జాతికి అంకితం చేయనున్నారు.గండికోటలోకి బిరబిరా కృష్ణమ్మ గాలేరు–నగరిలో అంతర్భాగంగా అవుకు వద్ద రెండు సొరంగాలను చేపట్టారు. ఇందులో ఒక సొరంగం దివంగత సీఎం వైఎస్ హయాంలోనే పూర్తయింది. రెండో సొరంగాన్ని సీఎం వైఎస్ జగన్ పూర్తి చేశారు. రెండు సొరంగాలను రూ.567.94 కోట్లతో పూర్తి చేసి.. నవంబర్ 30, 2023న సీఎం వైఎస్ జగన్ జాతికి అంకితం చేశారు. ప్రస్తుత డిజైన్ మేరకు గాలేరు–నగరి కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులను విడుదల చేశారు. శ్రీశైలానికి కనిష్టంగా వరద వచ్చే రోజుల్లోనే గాలేరు–నగరిపై ఆధారపడ్డ ప్రాజెక్టులను నింపేలా వరద కాలువ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు పెంచడంతో పాటు అవుకు వద్ద మూడో సొరంగం పనులను చేపట్టారు. ఈ పనులకు ఇప్పటికే రూ.934 కోట్లు ఖర్చు చేశారు. మూడో సొరంగమూ దాదాపు పూర్తయింది. దాంతో శ్రీశైలానికి కనిష్టంగా వరద వచ్చే రోజుల్లోనే వరద కాలువ ద్వారా 30 వేల క్యూసెక్కులు తరలించి.. గండికోట, పైడిపాలెం, వామికొండ, సర్వారాయసాగర్, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను నింపడానికి మార్గం సుగమం చేశారు. తద్వారా 2.60 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరందించనున్నారు. తద్వారా 1.31 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతో పాటు 20 లక్షల మందికి తాగునీరందించనున్నారు. కుప్పానికి కృష్ణా జలాలు..: హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంలోని పుంగనూరు బ్రాంచ్ కెనాల్లో అంతర్భాగంగా కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను రూ.560.29 కోట్లతో సీఎం వైఎస్ జగన్ పూర్తి చేసి, ఫిబ్రవరి 26న జాతికి అంకితం చేశారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 110 చెరువులు నింపి, 6,300 ఎకరాలకు సాగునీరు, 4.02 లక్షల మందికి తాగునీరందించనున్నారు. కుప్పం నియోజకవర్గానికి 1989 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు అవినీతికి పాల్పడటం వల్ల కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను పూర్తి చేయలేక చేతులెత్తేస్తే.. జగన్ పూర్తి చేయడం అబ్బురం...అపూర్వం.వలసలకు అడ్డుకట్ట హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి లక్కవరం ఎత్తిపోతల ద్వారా నీటిని ఎత్తిపోసి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పశ్చిమ మండలాల్లో 77 చెరువులను నింపడం ద్వారా పది వేల ఎకరాలను సస్యశ్యామలం చేసే లక్కవరం ఎత్తిపోతల పథకాన్ని రూ.224.31 కోట్లు వెచ్చిచి సీఎం వైఎస్ జగన్ పూర్తి చేసి సెప్టెంబరు 18, 2023న జాతికి అంకితం చేశారు. సాగు, తాగునీటి సమస్యను పరిష్కరించడం ద్వారా నంద్యాల, కర్నూలు జిల్లాల్లోని పశ్చిమ మండలాల్లో వలసలకు అడ్డుకట్ట వేశారు. కోనసీమలా రెండు పంటలు బ్రహ్మంసాగర్ మట్టికట్టకు లీకేజీల వల్ల గతంలో ఎన్నడూ మూడు నాలుగు టీఎంసీలు కూడా నిల్వ చేసిన దాఖాలాలు లేవు. తెలుగుగంగ ఆయకట్టుకు సాగునీటి మాట దేవుడెరుగు కనీసం తాగడానికి కూడా నీళ్లు దొరికేవి కావు. బ్రహ్మంసాగర్ ఉన్నా ఏం ప్రయోజనం లేదని బాధపడేవాళ్లం. వైఎస్ జగన్ సీఎం అయ్యాక బ్రహ్మంసాగర్ లీకేజీలకు డయాఫ్రమ్ వాల్ వేసి అడ్డుకట్ట వేసి.. పూర్తి సామర్థ్యం మేరకు 17.85 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. దాంతో కోనసీమ తరహాలో ఆయకట్టులో రెండు పంటలకు సమృద్ధిగా నీళ్లందుతున్నాయి. తెలుగుగంగ ప్రాజెక్టు ఫలాలు నిజంగా రైతులకు అందుతున్నది ఇప్పుడే. – పోచంరెడ్డి రఘురాంరెడ్డి, సోమిరెడ్డిపల్లి, బ్రహ్మంగారిమఠం మండలం, వైఎస్సార్ జిల్లా. సంగం బ్యారేజ్‌తో కష్టాలు తీరాయి బ్రిటీష్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన సంగం ఆనకట్ట శిథిలమవడంతో ఆయకట్టుకు సక్రమంగా నీళ్లందేవి కావు. పెన్నా డెల్టాను సస్యశ్యామలం చేసేందుకు 2004లో మహానేత వైఎస్ నాడు సంగం బ్యారేజ్ పనులు చేపట్టారు. 2009 వరకూ పనులు శరవేగంగా సాగాయి. మహానేత వైఎస్ మరణించాక బ్యారేజ్ పనులు పడకేశాయి. వైఎస్ జగన్ సీఎం అయ్యాక పనులు పూర్తి చేసి సమృద్ధిగా నీళ్లందిస్తున్నారు. దాంతో నాకున్న 13 ఎకరాలతోపాటు 40 ఎకరాలను కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నాను. – మల్లవరం రామకృష్ణ, పడుగుపాడు, కోవూరు మండలం -
నిర్వాసితులకు వారున్న కాలనీల్లోనే ఓటుహక్కు
రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా): పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలైన దేవీపట్నం, తొయ్యేరు నిర్వాసితులకు వారు నివాసం ఉండే ఆర్అండ్ ఆర్ కాలనీలోనే ఓటు హక్కు కల్పించినా తట్టుకోలేని ‘ఈనాడు’ అబద్ధాలు, అసత్యాలతో కూడిన కథనాన్ని బుధవారం అచ్చేసింది. అధికారులు ఎన్నికల సంఘ నిబంధనల ప్రకారమే ఓట్లు మార్పు చేస్తే ఏదో మహా పాపం జరిగిపోయినట్టు పతాక శీర్షికలో ‘ఈ అరాచకం అనంతం’ అంటూ తప్పుడు కథనాన్ని ప్రచురించింది. ఈ కథనాన్ని రంపచోడవరం సబ్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ తీవ్రంగా ఖండించారు. పోలవరం ప్రాజెక్టు వల్ల నిర్వాసితులైన దేవీపట్నం మండలంలోని గోదావరి తీరంలో ఉన్న గిరిజనేతరులకు గోకవరం మండలంలో పునరావాసం కల్పించినట్లు తెలిపారు. దేవీపట్నం, తొయ్యేరు నిర్వాసితులకు కృష్ణునిపాలెం సమీపంలో రెండేళ్ల క్రితం ఆర్అండ్ఆర్ కాలనీ నిర్మించి 1,282 కుటుంబాలకు పునరావాసం కల్పించామని గుర్తు చేశారు. ఈనాడు కథనం పూర్తి వాస్తవ విరుద్ధంగా ఉందన్నారు. అంతా ఎన్నికల సంఘం నిబంధనల మేరకే.. కృష్ణునిపాలెం ఆర్అండ్ఆర్ కాలనీలో నివసిస్తున్న 2,475 మంది ఓటర్లను జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో చేర్చినట్లు సబ్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ తెలిపారు. తొయ్యేరులోని 237, 238, 239 పోలింగ్ బూత్‌లకు చెందిన ఈ ఓటర్లందరినీ రెండేళ్ల క్రితం ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జగ్గంపేట నియోజకవర్గంలో ఓటర్లుగా నమోదు చేసేందుకు అప్పటి దేవీపట్నం తహసీల్దార్ సిఫారసు చేశారన్నారు. ఎన్నికల సంఘం ఆమోదం కూడా తెలిపిందన్నారు. ఓట్లను మార్చే ముందు అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను కూడా తీసుకున్నామని తెలిపారు. నాటి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ అనుమతితోనే ఓట్లు మార్పు జరిగిందని వివరించారు. మండల స్థాయి నుంచి జిల్లా కలెక్టర్‌కు, అక్కడ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి వెళ్లి.. తిరిగి జిల్లా కలెక్టర్‌కు అనుమతులు వచ్చాకే ఓట్ల మార్పు సాధ్యపడుతుందని వివరించారు. నిబంధనల ప్రకారమే.. రెండేళ్ల క్రితమే నిర్వాసితుల ఓట్లు మార్చితే ఇప్పుడు ఈనాడు పత్రిక అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు. నిర్వాసితులకు వారు ఉండే ప్రాంతంలోనే ఓటు హక్కు కల్పించామన్నారు. దొంగ ఓట్లు, వేరే రాష్ట్రాల వారి ఓట్లేమీ చేర్చలేదు కదా అని నిలదీశారు. ఓటు మార్చడంలో తప్పేముంది?పోలవరం ముంపులో తొయ్యేరు గ్రామం మునిగిపోయింది. కృష్ణునిపాలెం ఆర్అండ్ఆర్ కాలనీలో ఇళ్లు నిర్మించారు. శాశ్వతంగా ఎప్పటికీ ఇక్కడే నివాసం ఉండాలి. ఈ నేపథ్యంలో ఓటును ఇక్కడకు మార్చడంలో తప్పేముంది? కాలనీలోనే పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. –నండూరి సీతారామ్, కృష్ణునిపాలెం ఆర్అండ్ఆర్ కాలనీ ఓటు మార్పు వల్ల ఇబ్బందేమీ లేదు.. కాలనీకి వచ్చాక 18 ఏళ్లు నిండిన వారు కొత్త ఓట్లు నమోదు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం మేమున్న కృష్ణునిపాలెం ఆర్అండ్ఆర్ కాలనీలోనే ఓటు హక్కు కల్పించారు. ఓట్లు మార్చడం వల్ల ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడే స్వేచ్ఛగా మా ఓటు హక్కును వినియోగించుకుంటాం. –దేవరపల్లి వీరబాబు, కృష్ణునిపాలెం ఆర్అండ్ ఆర్ కాలనీ -
పోలవరంపై చంద్రబాబు అంతులేని నిర్లక్ష్యం
సాక్షి, రాజమహేంద్రవరం: టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై అంతులేని నిర్లక్ష్యం నెలకొందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ప్రజలను బస్సుల్లో తీసుకు వెళ్లి మరీ భజనలు చేయించడం పైనే చంద్రబాబు దృష్టి పెట్టారు తప్ప.. చేసిందేమీ లేదని విమర్శించారు. రాజమహేంద్రవరంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు 70:30 నిష్పత్తిలో నిర్మించాల్సి ఉన్నప్పటికీ కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొంది, నేటికి పదేళ్లు పూర్తయిందన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందిన వ్యవహారం పూర్తిగా అప్రజాస్వామికమన్నారు. బిల్లు ఆమోదం విషయంలో లోక్‌సభ ప్రచురించిన డాక్యుమెంట్ ఆధారంగా తాను కోర్టును ఆశ్రయించానని చెప్పారు. బిల్లు ఆమోదం తప్పని తనకు మద్దతుగా సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిందని అన్నారు. ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని అప్పటి మన్మోహన్సింగ్ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తుచేశారు. 2015 డిసెంబర్ నాటికి నీతిఆయోగ్ తయారు చేసిన నివేదిక ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు రామచంద్రరావు కోరినప్పటికీ కేంద్రం నిరాకరించిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.17 వేల కోట్లు అడిగితే రూ. 4 వేల కోట్లు తగ్గించి ఇచ్చిందని, ట్యాక్స్ ఇన్సెంటివ్‌లు కూడా ఇవ్వలేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు 89 ఆస్తులను 58:42 నిష్పత్తిలో పంచుకోవాల్సిందిగా తొమ్మిదో షెడ్యూల్లో పెట్టారని, దీనిపై ఇంతవరకూ ఎటువంటి సమాధానమూ ఇవ్వలేదని అన్నారు. కొట్టుకు చావండని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం వదిలేసిందని దుయ్యబట్టారు. ఏ ఇన్స్టిట్యూట్ కట్టాలన్నా కేంద్రం నిధులు మంజూరు చేయడం లేదన్నారు. తెలంగాణ, ఆంధ్రా మధ్య తేలాల్సిన ఆస్తుల విలువ రూ. 1.46 లక్షల కోట్లు ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విభజన రాజ్యాంగబద్ధమా, కాదా అనే విషయంపై పార్లమెంటులో చర్చ జరగాలన్నారు. రాష్ట్రపునర్విభజనపై సుప్రీంకోర్టులో వేసిన కేసును అడ్వాన్స్ చేయిస్తే కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా అఫిడవిట్ ఫైల్ చేయాల్సి ఉంటుందని ఉండవల్లి చెప్పారు. -
‘పోలవరం’ ఆలస్యానికి చంద్రబాబే కారణం!
డా.బీ.ఆర్ అంబేద్కర్ కోనసీమ: పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ నిర్మాణంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పుల కారణంగా ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైందని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వాల నుంచి ఇప్పటివరకూ జరిగిన విషయాలను తెలియజేస్తూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కొవ్వూరి త్రినాథ్‌రెడ్డి రూపొందించిన డాక్యుమెంటరీ సీడీలను రామచంద్రపురంలోని ప్రసన్న విఘ్నేశ్వర ఫంక్షన్ హాల్లో బుధవారం నాగిరెడ్డి, ఎంపీ బోస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ పోలవరం రాష్ట్ర ప్రజల దశాబ్దాల కల అన్నారు. ఎంతో మంది ముఖ్యమంత్రుల తరువాత పోలవరాన్ని నిర్మించాలని తలచి రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే మొదలు పెట్టింది దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు ప్రభుత్వంలో డయాఫ్రం వాల్‌ను ముందుగా మొదలు పెట్టి, దానికి కావాల్సి నిర్మాణాలు లేకుండానే పనులు చేయడం కారణంగానే డయాఫ్రం దెబ్బతిందని నాగిరెడ్డి స్పష్టం చేశారు. దీనివల్ల ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవుతుందనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా తెలియజేసిందన్నారు. అయితే చంద్రబాబు మాత్రం తన ప్రభుత్వంలోనే డ్యామ్ మొత్తం పూర్తయ్యిందని ఎంతో ఆర్భాటంగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పటి వరకూ అన్ని పనులను శరవేగంగా చేసుకుంటూ ప్రస్తుతం డ్యామ్‌ను పూర్తి చేశారన్నారు. ఈసీఆర్ఎం డ్యామ్ పూర్తయిన వెంటనే లెఫ్ట్, రైట్ కెనాల్స్‌కు నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుందని వివరించారు. దివంగత రాజశేఖర్‌రెడ్డి మొదలు పెట్టిన పోలవరం ప్రాజెక్టును ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి పూర్తి చేసి గోదావరి పరివాహక ప్రాంత రైతులకు నీరు ఇవ్వబోతున్నారని స్పష్టం చేశారు. ఎంపీ బోస్ మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వమే 78 శాతం పనులను పూర్తి చేసిందని చంద్రబాబు చెప్పుకోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పుల కారణంగా నేడు పోలవరం ప్రాజెక్టు ఆలస్యమైందన్నారు. ఈ పనుల్లో కమీషన్లు పొందాలనే ఏకైక సంకల్పంతో చంద్రబాబు పని చేశారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన మూడు అథారిటీల ద్వారా టీడీపీ హయాంలోనే ప్రాజెక్టు 78 శాతం పూర్తయ్యిందని చెప్పిస్తే, తామే ఒప్పుకుంటామని బోస్ అన్నారు. డాక్యుమెంటరీని తయారు చేసిన త్రినాథ్‌రెడ్డి మాట్లాడుతూ పోలవరం చరిత్ర, దాని నిర్మాణం ఎవరి హయాంలో ఏవిధంగా జరిగిందనే విషయాలను డాక్యుమెంటరీ ద్వారా తెలియజేశామన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి సత్తి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: ఎన్నికలకు యంత్రాంగం సన్నద్ధం! -
పోలవరానికి సహకరించండి..
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రాణాధారమైన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ అంశాలు, విభజన సమస్యలపై చర్చించేందుకు గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం ఉదయం పార్లమెంట్‌లోని కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో పలు అంశాలపై ప్రధానికి వినతిపత్రం అందజేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో చర్చిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలవరంలో కాంపొనెంట్ వారీగా సీలింగ్ ఎత్తివేతతోపాటు ప్రాజెక్టు తొలివిడతను సత్వరమే పూర్తి చేసేందుకు రూ.12,911 కోట్ల నిధుల విడుదలకు కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించిందని సీఎం జగన్ గుర్తు చేశారు. ఈ రెండు అంశాలు కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం ఎదురు చూస్తున్న దృష్ట్యా తక్షణమే దీనిపై దృష్టి పెట్టాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. పోలవరం మొదటి విడత పూర్తికి దాదాపు రూ.17,144 కోట్లు ఖర్చు అవుతాయని, దీనికి సంబంధించిన ప్రతిపాదన ఇప్పటికే జలశక్తి శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నందున సత్వరమే పరిశీలించి ఆమోదం తెలపాలని అభ్యర్థించారు. పార్టీ పార్లమెంటరీ నేత వి.విజయసాయిరెడ్డి, ఎంపీలు మిథున్‌రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, మార్గాని భరత్, రెడ్డప్ప, గోరంట్ల మాధవ్, వంగా గీత, గురుమూర్తి, సత్యవతి, మాధవి, చింతా అనురాధ, ఆదాల ప్రభాకర్‌రెడ్డి తదితరులు వెంటరాగా ప్రధాని కార్యాలయంలోకి వెళ్లిన సీఎం జగన్ సుమారు గంట పాటు సమావేశమయ్యారు. పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయం నుంచి బయటకు వస్తున్న సీఎం వైఎస్ జగన్, ఎంపీలు ప్రధాని దృష్టికి తెచ్చిన ఇతర అంశాలివీ.. ♦ ఏపీకి ప్రత్యేక హోదా సహా ఇతర విభజన హామీలన్నీ అమలు చేయాలి. రాష్ట్ర ఆరి్థక పురోగతికి ప్రత్యేక హోదా చాలా అవసరం. పెట్టుబడులు రావడమే కాకుండా మెరుగైన ఉపాధి అవకాశాలు దక్కేందుకు ప్రత్యేక హోదా కీలకం. ♦ రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించాం. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండేలా కొత్తగా 17 వైద్య కళాశాలలు నిర్మిస్తున్నాం. ఇప్పటికే కొన్ని కొత్త వైద్య కాలేజీల్లో తరగతులు కూడా ప్రారంభం అయ్యాయి. మిగతా కాలేజీల ఏర్పాటుకు తగిన సహాయ సహకారాలు అందించాలి. ♦ విశాఖ నగరాన్ని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుతో అనుసంధానిస్తూ భోగాపురం, భీమిలి, రుషికొండ, విశాఖ పోర్టులను కలిపే 55 కిలోమీటర్ల పొడవైన 6 లేన్ల రహదారి నిర్మాణానికి సహాయ సహకారాలు అందించాలి. ♦ విభజన చట్టంలో పొందుపరచిన విశాఖ– కర్నూలు హైస్పీడ్ కారిడార్‌ను వయా కడప మీదుగా బెంగళూరు వరకూ పొడిగించాలి. పరిశీలన పూర్తి చేసిన ఈ ప్రాజెక్టు సాకారమయ్యేలా చూడాలి. కడప–పులివెందుల–ముదిగుబ్బ– సత్యసాయి ప్రశాంతి నిలయం–హిందూపూర్ కొత్త రైల్వేలైన్‌ను దీంట్లో భాగంగా చేపట్టాలి. ఈ ప్రాజెక్టు వల్ల వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతానికి చక్కటి కనెక్టివిటీ ఏర్పడుతుంది. ♦ విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు త్వరగా ఆమోదం తెలపాలి. ♦ 2014 జూన్ నుంచి మూడేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి ఏపీ జెన్కో విద్యుత్ సరఫరా చేసింది. దీనికి సంబంధించి రూ.7,230 కోట్ల బకాయిలు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం వీటిని వెంటనే చెల్లించేలా చూడాలి. సీతారామన్‌తో సీఎం సమావేశం రాష్ట్రాభివృద్ధికి చేయూత అందిస్తూ నిధులు త్వరితగతిన విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను సీఎం జగన్ కోరారు. శుక్రవారం ప్రధాని మోదీతో భేటీ అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం సమావేశమయ్యారు. నిధులు, పెండింగ్ అంశాలపై అరగంటకు పైగా చర్చించారు. ప్రధానికి నివేదించిన అంశాలను ఆర్థిక మంత్రి దృష్టికి తెచ్చారు. పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం, బకాయిల విడుదలకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
Fact Check: కమీషన్లు కాజేశాక చేతులెత్తేసింది మీ బాబే
సాక్షి, అమరావతి: పోలవరం పనుల్లో కమీషన్లు కాజేసి, పంచుకుతిన్నాక.. దానిని పూర్తి చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు పాపాలను సీఎం వైఎస్ జగన్‌పై నెట్టేందుకు ‘ఈనాడు’లో పచ్చి అబద్ధాలను పాడిందే పాడుతున్నారు రామోజీరావు. కమీషన్ల కోసం పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని ప్రధాని మోదీ ఆరోపిస్తే.. ట్రాన్స్ట్రాయ్ అధినేత రాయపాటి రంగారావు తాజాగా ఆ బాగోతాన్ని రట్టు చేశారు. సోమవారం పోలవారం పేరుతో ఎంతలా వసూళ్లు చేసిందీ బట్టబయలు చేశారు. అక్రమార్జన కోసం జీవనాడి పోలవరం జీవం తీస్తూ చంద్రబాబు చేసిన తప్పులను సీఎం జగన్ సరిదిద్దుతూ ప్రణాళికాయుతంగా ప్రాజెక్టును పూర్తి చేస్తున్నారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆర్థిక ఇబ్బందుల్లోనూ స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేసి 2021 జూన్ 11నే గోదావరి ప్రవాహాన్ని 6.1 కిమీల పొడవున స్పిల్ వే మీదుగా మళ్లించి రికార్డు సృష్టించారు. పోలవరంను కేంద్రం తరఫున రాష్ట్రం నిర్మిస్తోంది. చంద్రబాబు పాపాల వల్ల దెబ్బతిన్న డయాఫ్రమ్‌వాల్‌పై తుది నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే. ఆ నిర్ణయం ఆధారంగా డయాఫ్రమ్‌వాల్‌ను నిర్మించి.. ప్రధాన (ఈసీఆర్ఎఫ్) డ్యామ్‌ను పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందించి పోలవరం ఫలాలను రైతులకు అందించేలా అడుగులు వేస్తున్న సీఎం జగన్‌పై ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ కర్షకుల్లో ఆదరణ మరింతగా పెరుగుతోంది. ఇది టీడీపీ ఉనికినే దెబ్బతీస్తుందనే ఆందోళనతో రామోజీరావు విషం చిమ్ముతూ తప్పుడు కథనాలు అచ్చేస్తున్నారు. ఆ క్రమంలోనే ‘చేయలేక చేతులెత్తేశారు’ శీర్షికన బుధవారం ‘ఈనాడు’లో కథనాన్ని అచ్చేశారు. ఆ కథనంలో సీఎం జగన్‌పై రామోజీరావుకు ఉన్న అక్కసు, అసూయ వ్యక్తం చేశారే తప్ప వీసమెత్తు నిజం లేదు. ఇవీ వాస్తవాలు.. ఈనాడు ఆరోపణ: పోలవరం ప్రాజెక్టు డీపీఆర్–2కు ఇంతవరకూ సీఎం జగన్ పెట్టుబడి అనుమతి సాధించలేదు. వాస్తవం: విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టును కేంద్రమే నిర్మించాలి. చంద్రబాబు సీఎంగా ఉండగా కమీషన్ల కక్కుర్తితో దానిని రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి తీసుకున్నారు. 2013–14 ధరల ప్రకారమే పూర్తిచేస్తామని 2016 సెప్టెంబరు 7న నాటి సీఎం చంద్రబాబు అంగీకరించి పనులను దక్కించుకున్నారు. అప్పటి ధరల ప్రకారం పోలవరం వ్యయం రూ.20,398.61 కోట్లు ఇచ్చేందుకు అప్పట్లో కేంద్ర మంత్రివర్గం అంగీకరించింది. ఇందులో 2014 ఏప్రిల్ 1 నాటికి చేసిన వ్యయం రూ.4,730.71 కోట్లు మినహాయించి మిగతాది అంటే రూ.15,667.91 కోట్లు ఇస్తామని తేల్చింది. 2014 ఏప్రిల్ 1 నుంచి ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.15,146.27 కోట్లు కేంద్రం విడుదల చేసింది. మిగిలింది రూ.521.63 కోట్లు మాత్రమే. కానీ.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ, నిర్వాసితుల పునారావాసానికే రూ.33,168.23 కోట్లు అవసరం. ఇదే అంశాన్ని సీఎం వైఎస్ జగన్ గుర్తుచేస్తూ.. 2017–18 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ ఖరారు చేసిన సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను ఆమోదించి, నిధులు విడుదల చేసి, ప్రాజెక్టు పూర్తికి సహకరించాలని ప్రధాని మోదీతో సమావేశమైన ప్రతిసారీ కోరుతున్నారు. ఇందుకు ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. ప్రధాని ఆదేశాల మేరకు తొలిదశ పూర్తికి రూ.12,911.15 కోట్లు విడుదల చేసేందుకు జూన్ 5న కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించింది. విభాగాల వారీగా విధించిన పరిమితులను ఎత్తేసేందుకు సమ్మతి తెలిపింది. 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని 36 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించడానికి సూత్రప్రాయంగా కూడా అంగీకరించింది. ఆ గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించడానికి అదనంగా రూ.2,749.85 కోట్లు అవసరమని సీడబ్ల్యూసీ లెక్కగట్టింది. మొత్తం రూ.15,661 కోట్లను విడుదల చేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖకు శుక్రవారం సిఫార్సు చేసింది. దీన్ని ఖరారు చేసేందుకు కేంద్ర జల్ శక్తి శాఖ ఏర్పాటుచేసిన ఆర్సీసీ (రివైజ్డ్ కాస్ట్ కమిటీ) దాన్ని ఆమోదించింది. నివేదిక ఇవ్వడం లాంఛనమే. ఆ నివేదికను చూసి కేంద్ర కేబినెట్‌కు జల్‌శక్తి, ఆర్థిక శాఖలు ప్రతిపాదన పంపనున్నాయి. దీనిపై కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేస్తే పోలవరం తొలిదశ పూర్తికి అవసరమైన నిధుల విడుదలకు మార్గం సుగమం అవుతుంది. ఈనాడు ఆరోపణ: 2020 వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఈ సమస్య పరిష్కారానికి సీఎం జగన్ చొరవ చూపలేదు. వాస్తవం: గోదావరి వరదను మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు పూర్తి చేశాక ప్రధాన డ్యామ్ పునాది డయాఫ్రమ్‌వాల్ నిర్మించాలి. కానీ.. నాటి సీఎం చంద్రబాబు కమీషన్ల కక్కుర్తితో వరద మళ్లింపు పనులు పూర్తి చేయకుండానే డయాఫ్రమ్‌వాల్ పనులను ఎల్ అండ్ టీ, బావర్ సంస్థలకు నామినేషన్‌పై సబ్ కాంట్రాక్టుకు అప్పగించారు. పనులు చేసిన ఆ సంస్థలకు రూ.400 కోట్లు బిల్లులు చెల్లించి.. కమీషన్లు వసూలు చేసుకున్నారు. ఆ తర్వాత రూ.2,917 కోట్ల విలువైన పనులను ఈనాడు రామోజీరావు వియ్యంకుడికి చెందిన నవయుగకు నామినేషన్‌పై కట్టబెట్టారు. 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించి కాఫర్ డ్యామ్‌లు పూర్తి చేయాలని కేంద్రం నిర్దేశించింది. పునరావాసం కల్పించే పనుల్లో కమీషన్లు రావనే నెపంతో కాఫర్ డ్యామ్‌లలో ఖాళీలు పెట్టి, ఆ తర్వాత చేతులెత్తేశారు. ఇదంతా చంద్రబాబు నిర్వాకమే. 2019, 2020లలో గోదావరి వరద కాఫర్ డ్యామ్ ఖాళీ ప్రదేశాలగుండా అధిక ఒత్తిడితో ప్రవహించడం వల్ల డయాఫ్రమ్‌వాల్ దెబ్బతింది. దీనికి చంద్రబాబు తప్పిదమే కారణమని హైదరాబాద్ ఐఐటీ నివేదిక ఇచ్చింది. డయాఫ్రమ్‌వాల్ భవితవ్యాన్ని తేల్చాలని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి షెకావత్‌ను అనేక సార్లు సీఎం జగన్ కోరారు. వాటికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి షెకావత్.. డయాఫ్రమ్‌వాల్ భవితవ్యాన్ని తొందరగా తేల్చాలని ఆ శాఖ సలహాదారు వెదిరె శ్రీరాంను ఆదేశించారు. కేంద్రం తీసుకునే నిర్ణయాల ఆధారంగా డయాఫ్రమ్‌వాల్‌పై ముందుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈనాడు ఆరోపణ: ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల నిర్మాణం ఆలస్యమైంది. సీపేజీ అధికమైంది. ఫలితంగా వాటిని నిర్మించిన ఉద్దేశమే దెబ్బతింది. వాస్తవం: ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల నిర్మాణంలో జాప్యానికి చంద్రబాబే కారణం. 2018లో ఈ డ్యామ్‌ల పనులు ప్రారంభించి.. 2019 ఫిబ్రవరిలో చేతులెత్తేశారు. సీఎం జగన్ 2019 మే 30న అధికారం చేపట్టారు. 2019 జూన్‌లో గోదావరికి వరదలు వచ్చాయి. నవంబర్ వరకూ గోదావరి వరదెత్తింది. వరదలు తగ్గాక ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను సీఎం జగన్ పూర్తి చేశారు. కాఫర్ డ్యామ్‌లలో సీపేజీ సాధారణమే. సీపేజీ నీటిని దిగువకు తరలిస్తూ ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో దెబ్బతిన్న ఇసుక నేలను యధాస్థితికి తెచ్చే పనులను ప్రభుత్వం చేపట్టింది. డయాఫ్రమ్‌వాల్‌పై కేంద్రం నిర్ణయం తీసుకోగానే.. దాని ఆధారంగా ప్రధాన డ్యామ్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. ఈనాడు ఆరోపణ: అంతర్జాతీయ నిపుణుల ఏజెన్సీ కోసం ఇప్పటిదాకా టెండర్లే పిలవలేదు. ఆ నిపుణులు వచ్చి నిర్ణయాలు తీసుకుంటే తప్ప పనులు ముందుకు సాగవు. వాస్తవం: పోలవరం పనుల్లో సమస్యలు పరిష్కరించాలంటే అంతర్జాతీయ నిపుణుల ఏజెన్సీ సహకారం అవసరమని సీడబ్ల్యూసీ పేర్కొంది. ఆ ఏజెన్సీ కోసం టెండర్లు పిలుస్తామని పోలవరం ప్రాజెక్టు అథారిటీ డిసెంబర్ 5న నిర్వహించిన సమావేశంలో పేర్కొంది. ఆ ప్రక్రియ పూర్తయితే ఏజెన్సీ అందుబాటులోకి వస్తుంది. ఆ ఏజెన్సీ నిర్ణయాల ఆధారంగా పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. -
గోదావరి–కావేరి అనుసంధానం.. ఇచ్చంపల్లి నుంచైతే కష్టమే!
సాక్షి, అమరావతి: ఇచ్చంపల్లి నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేయాలని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) చేసిన ప్రతిపాదన ఆచరణ సాధ్యంకాదని న్యాయ, సాగునీటిరంగ నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి మధ్యప్రదేశ్, మహారాష్ట్రల మధ్య 1975, డిసెంబర్ 19న కుదిరిన ఒప్పందం ప్రకారం ఇచ్చంపల్లి నుంచి 85 టీఎంసీలకు మించి ఉమ్మడి రాష్ట్రం వాడుకోవడానికి వీల్లేదు. ఇదే అంశాన్ని గోదావరి ట్రిబ్యునల్ అవార్డు స్పష్టంచేసింది. గోదావరి–కావేరి అనుసంధానం తొలిదశలో ఇచ్చంపల్లి నుంచి 141.3 టీఎంసీలు తరలించేలా ఎన్‌డబ్ల్యూడీఏ చేసిన ప్రతిపాదనను అమలుచేస్తే మూడు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందం, గోదావరి ట్రిబ్యునల్ అవార్డును ఉల్లంఘించినట్లవుతుందని న్యాయ నిపుణులు స్పష్టంచేస్తున్నారు. మధ్యప్రదేశ్ నుంచి విడిపోయి ఏర్పాటైన ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తుండడాన్ని వారు గుర్తుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించిన మేరకు పోలవరం నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపడితే న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని.. తక్కువ వ్యయంతో పనులు పూర్తిచేయవచ్చునని సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు. ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదన ఇదీ.. ఇంద్రావతి బేసిన్లో ఛత్తీస్‌గఢ్ (అప్పటి మధ్యప్రదేశ్)కు గోదావరి ట్రిబ్యునల్ కేటాయించిన నీటిలో వాడుకోని 141.3 టీఎంసీలకు 106 టీఎంసీల వరద జలాలను జతచేసి.. ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్ (కృష్ణా), సోమశిల (పెన్నా), గ్రాండ్ ఆనకట్ట (కావేరి) వరకూ నీటిని తరలించడం ద్వారా గోదావరి–కావేరి అనుసంధానం చేయాలని ఎన్‌డబ్ల్యూడీఏ తొలుత ప్రతిపాదించింది. దీనిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు అభ్యంతరం చెప్పాయి. గోదావరి నికర జలాల్లో మిగులులేదని.. నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చాకే అనుసంధానం చేపట్టాలని డిమాండ్ చేశాయి. దీంతో ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 141.3 టీఎంసీలను గోదావరి–కావేరి అనుసంధానం తొలిదశలో భాగంగా ఇచ్చంపల్లి నుంచి తరలించేలా ఎన్‌డబ్ల్యూడీఏ మళ్లీ ప్రతిపాదించింది. ఆవిరి ప్రవాహ నష్టాలుపోనూ ఆంధ్రప్రదేశ్‌కు 41.8, తెలంగాణకు 42.6, తమిళనాడుకు 38.6, పుదుచ్చేరికి 2.2, కర్ణాటకకు 9.8 టీఎంసీలను అందించాలని ప్రతిపాదించింది. దీనిపై ఛత్తీస్‌గఢ్ సర్కార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. మా కోటాలో నీటిని తరలిస్తే న్యాయపోరాటం చేస్తామని తేల్చి చెప్పింది. గోదావరి, ఉప నదులలోని నికర జలాల్లో ఎగువ రాష్ట్రాలకు కేటాయించగా మిగిలిన నీరు, వరద జలాలపై పూర్తి హక్కును దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు ట్రిబ్యునల్ ఇచ్చింది. ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ.. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేలా గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలని ఎన్‌డబ్ల్యూడీఏకు పలుమార్లు కోరింది. పోలవరం నుంచైతేనే కావేరికి గోదావరి.. గోదావరి బేసిన్లో దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపడితే ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఏ రాష్ట్రం హక్కులకు విఘాతం కలగదు. ఇదే అంశాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రస్తావిస్తూ.. పోలవరం నుంచి గోదావరి–కావేరి అనుసంధానాన్ని చేపట్టాలని సూచించారు. పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్‌కు చేరిన గోదావరి జలాలను కృష్ణా నదీ ప్రవాహానికి వ్యతిరేక దిశలో పులిచింతల, నాగార్జునసాగర్, శ్రీశైలంలోకి ఎత్తిపోసి.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా సోమశిలకు అక్కడి నుంచి కావేరి గ్రాండ్ ఆనకట్టకు తరలించేలా పనులు చేపట్టాలని సూచిస్తున్నారు. దీనివల్ల భూసేకరణ, నిర్వాసితుల సమస్య తప్పుతుందని.. తక్కువ వ్యయంతో గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టవచ్చునన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను న్యాయ, సాగునీటిరంగ నిపుణులు బలపరుస్తున్నారు. మూడు రాష్ట్రాల మధ్య ఒప్పందం ఇదీ.. గోదావరిపై ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మాణం కోసం 1975, డిసెంబర్ 19న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల మధ్య ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం మేరకు ఇచ్చంపల్లి నుంచి 85 టీఎంసీలను మాత్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వినియోగించుకోవచ్చు. రిజర్వాయర్ నుంచి 3 టీఎంసీలు మధ్యప్రదేశ్, 4 టీఎంసీలు మహారాష్ట్ర, 5 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ ఎత్తిపోతల ద్వారా వినియోగించుకోవచ్చు. మిగతా నీటిని విద్యుదుత్పత్తికి వినియోగించాలి. ఉత్పత్తయ్యే విద్యుత్‌లో మధ్యప్రదేశ్ 38 శాతం, మహారాష్ట్ర 35 శాతం, ఆంధ్రప్రదేశ్ 27 శాతం వాడుకోవాలి. ఈ ప్రాజెక్టుకు అయ్యే వ్యయంలో 78.10 శాతం ఆంధ్రప్రదేశ్, 10.50 శాతం మహారాష్ట్ర, 11.40 శాతం మధ్యప్రదేశ్ భరించాలి. ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే నిర్వహించాలి. -
సాంకేతిక నిపుణుల సూచనలతో పోలవరం పనులు
సాక్షి, అమరావతి: జాతీయ, అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల సూచనలు, సలహాలు తీసుకుని పోలవరం ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులకు కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ దిశానిర్దేశం చేశారు. తొలి దశ సవరించిన అంచనా వ్యయాన్ని పది రోజుల్లోగా ఖరారు చేసి, పనులకు నిధుల సమస్య లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించి, గడువులోగా పూర్తి చేయడానికి ఈ సీజన్లో చేపట్టాల్సిన పనులను ఖరారు చేసేందుకు మంగళవారం ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యాలయంలో ఆమె ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. డ్యామ్ డిజైర్ రివ్యూ ప్యానల్ (డీడీర్పి) చైర్మన్ ఏబీ పాండ్య, సీడబ్ల్యూసీ చైర్మన్ కుశీ్వందర్ సింగ్ వోరా, పీపీఏ చైర్మన్ శివ్‌నందన్‌కుమార్, సభ్య కార్యదర్శి రఘురాంతో పాటు రాష్ట్ర జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పీపీఏ సభ్య కార్యదర్శి రఘురాం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని వివరించారు. నిపుణుల కమిటీ కోసం పీపీఏ టెండర్లు ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్య గోదావరి వరదల ఉద్ధృతికి కోతకు గురైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ నిర్మాణ ప్రాంతాన్ని యధాస్థితికి తెచ్చేందుకు చేస్తున్న పనులను వివరించారు. ఒక స్టోన్ కాలమ్ 45 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉండగా 2.30 గంటలు పడుతోందని, దీని వల్ల పనుల్లో జాప్యం జరుగుతోందని తెలిపారు. స్టోన్ కాలమ్స్ వేయడంలో సహకరించేందుకు, డిజైన్లను రూపొందించేందుకు వేస్తామన్న నిపుణుల కమిటీని ఇప్పటిదాకా నియమించలేదని రాష్ట్ర అధికారులు చెప్పారు. డయాఫ్రమ్ వాల్లో జాయింట్లను అతికించడంలో కూడా నిపుణుల సలహాలు, సూచనలు అవసరమన్నారు. డయాఫ్రమ్ వాల్, స్టోన్ కాలమ్స్ వేయడంలో దేశంలో నిపుణుల కొరత ఉన్నందున, టెండర్ నోటిఫికేషన్ జారీ చేశామని పీపీఏ ఛైర్మన్ చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ నిపుణులు కమిటీగా ఏర్పడి ఈ టెండర్లో పాల్గొంటారన్నారు. ఆ టెండర్‌ను ఖరారు చేసి నిపుణుల కమిటీని అందుబాటులోకి తెస్తామన్నారు. ఆలోగా డయాఫ్రమ్ వాల్, స్టోన్ కాలమ్స్, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం సహా హెడ్ వర్క్స్‌లో చేయాల్సిన పరీక్షలను జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో చేయించి, నివేదిక సిద్ధంగా ఉంచాలని సీడబ్ల్యూసీ చైర్మన్ వోరా ఆదేశించారు. ఆ పరీక్షల కోసం స్వీడన్‌కు చెందిన ఆఫ్రిన్ అనే సంస్థతో కాంట్రాక్టు సంస్థ మేఘా ఇప్పటికే ఒప్పందం చేసుకుందని అధికారులు వివరించారు. నిపుణుల కమిటీ సలహాతోనే డయాఫ్రమ్ వాల్ ఆఫ్రిన్ సంస్థ పరీక్షల నివేదిక ఆధారంగా పీపీఏ ఖరారు చేసే నిపుణుల కమిటీ స్టోన్ కాలమ్స్‌ను వేగంగా వేయడంపై సలహాలు ఇస్తుంది. ఆ పరీక్షల నివేదిక ఆధారంగా దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌ను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, దానికే మరమ్మతలు చేయాలా లేదంటే సమాంతరంగా కొత్త వాల్ నిర్మించాలా అనే అంశంపై సూచనలు చేయనుంది. వాటి ఆధారంగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై సీడబ్ల్యూసీ తుది నిర్ణయం తీసుకోనుంది. సీడబ్ల్యూసీ నిర్ణయం ఆధారంగా డయాఫ్రమ్ వాల్ డిజైన్లను నిపుణుల కమిటీ రూపొందిస్తుంది. -
పోలవరం తొలి దశ సవరించిన అంచనా వ్యయం రూ.31,625.36 కోట్లు
సాక్షి, అమరావతి: పోలవరం జాతీయ ప్రాజెక్టు తొలి దశ సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదించే ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. తొలి దశ సవరించిన అంచనా వ్యయం రూ.31,625.36 కోట్లుగా ఖరారు చేస్తూ కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పంపిన ప్రతిపాదనను మదింపు చేసి సోమవారం కేంద్ర జల్ శక్తి శాఖకు నివేదిక ఇస్తామని రివైజ్డ్ కాస్ట్ కమిటీ (ఆర్సీసీ) చైర్మన్ ఏఎస్ గోయల్ మంగళవారం తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఏర్పాటైన ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు (పీఐబీ)కి కేంద్ర జల్ శక్తి శాఖ ప్రతిపాదన పంపుతుంది. పీఐబీ ఆమోద ముద్ర వేస్తే సవరించిన అంచనా వ్యయం మేరకు పోలవరం తొలి దశ పనులకు తాజా ధరల మేరకు కేంద్రం నిధులు మంజూరు చేస్తుంది. మూడో సారి సమావేశమైన ఆర్సీసీ తొలి దశ అంచనా వ్యయంపై సీడబ్ల్యూసీ ప్రతిపాదనను మదింపు చేసేందుకు ఆర్సీసీ ఇప్పటికే రెండుసార్లు సమావేశమైంది. మంగళవారం ఢిల్లీలో మూడోసారి సమావేశమైంది. ఆర్సీసీ చైర్మన్, కేంద్ర జల్ శక్తి శాఖ కమిషనర్ (ఎస్పీర్) ఏఎస్ గోయల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిటీ సభ్యులైన సీడబ్ల్యూసీ(పీపీవో) పుష్కర్‌సింగ్ కుతియాల్, కేంద్ర ఆర్థిక శాఖ (వ్యయ విభాగం) ప్రధాన సలహాదారు రిచా మిశ్రా, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సభ్య కార్యదర్శి రఘురాం, సీడబ్ల్యూసీ సీఈ (పీఏవో) యోగేష్ పైతంకర్ పాల్గొన్నారు. పోలవరం సీఈ సుధాకర్‌బాబు ప్రత్యేక ఆహా్వనితుడిగా పాల్గొన్నారు. సీడబ్ల్యూసీ ఆమోదించిన ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ సవరించిన అంచనా వ్యయం రూ.31,625.36 కోట్లని, ఇందులో రూ.16,119.56 కోట్ల పనులు ఇప్పటికే పూర్తయ్యాయని రఘురాం వివరించారు. ఇంకా రూ.15,505.80 కోట్ల విలువైన పనులు మిగిలాయని తెలిపారు. తొలి దశ పనులకు రూ.12,911.15 కోట్లు మంజూరు చేసేందుకు జూన్ 5న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అంగీకరించారని ఆ శాఖ ప్రధాన సలహాదారు రిచా మిశ్రా గుర్తు చేశారు. తొలి దశ పనుల పూర్తికి మంత్రి ఆమోదించిన వ్యయంకంటే అదనంగా రూ.2,594.65 కోట్లు అవసరమని సీడబ్ల్యూసీ తేల్చిందన్నారు. తొలి దశ పనులకు 2013–14 ధరల ప్రకారం ఎంత అవసరం, 2017–18 ధరల ప్రకారం ఎంత అవసరమన్నది మరింత విపులంగా శుక్రవారంలోగా నివేదిక ఇవ్వాలని సీడబ్ల్యూసీని కోరారు. -
పోలవరంపై 20న ఢిల్లీలో కీలక భేటీ
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును గడువులోగా పూర్తిచేయడానికి ప్రస్తుత సీజన్ (2023–24)లో చేపట్టాల్సిన పనులకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక (యాక్షన్ ప్లాన్), సవరించిన అంచనా వ్యయం (తొలిదశ పూర్తి) ఖరారే అజెండాగా ఈనెల 20న ఢిల్లీలో కేంద్రం కీలక సమావేశం నిర్వహిస్తోంది. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ కుశ్వీందర్‌సింగ్ వోరా, జల్‌శక్తి శాఖ సలహాదారు శ్రీరాం వెదిరె, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో శివ్‌నందన్‌కుమార్, సభ్య కార్యదర్శి రఘురాం, రాష్ట్ర జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు పాల్గొంటారు. ప్రాజెక్టు పనుల పురోగతిని పీపీఏ సభ్య కార్యదర్శి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల సీపేజీకి అడ్డుకట్ట వేయడం, దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ స్థానంలో కొత్తది నిర్మించాలా? పాతదానికే మరమ్మతు చేయాలా? వంటి అంశాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. గడువులోగా ప్రాజెక్టును పూర్తిచేయడానికి వీలుగా ప్రస్తుత సీజన్లో చేపట్టాల్సిన పనులను, అందుకు కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయనున్నారు. పోలవరం ప్రాజెక్టు తొలిదశ సవరించిన అంచనా వ్యయాన్ని రూ.31,625.38 కోట్లుగా సీడబ్ల్యూసీ ఖరారు చేసింది. ఇందులో ఇప్పటికే రూ.16,119.57 కోట్ల పనులు పూర్తయ్యాయి. మిగతా పనులకు రూ.15,505.81 కోట్లు అవసరమని కేంద్ర జల్‌శక్తి శాఖకు నివేదిక ఇచ్చింది. సవరించిన అంచనా వ్యయాన్ని ఖరారు చేసేందుకు కేంద్ర ఆర్థికశాఖ రివైజ్డ్ కాస్ట్ కమిటీ (ఆర్సీసీ)ని నియమించింది. ఆ కమిటీ అడిగిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పంపింది. ఈనెల 20న జరిగే సమావేశంలో తొలిదశ సవరించిన అంచనా వ్యయంపై చర్చించనున్నారు. -
స్వయంగా దగ్గరుండి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి అంబటి
-
పోలవరం పనులను పరిశీలించిన మంత్రి అంబటి
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: పోలవరంలో రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు పర్యటించారు. ప్రాజెక్టులో దిగువ కాఫర్ డ్యాం వద్ద జరుగుతున్న డి వాటరింగ్ పనులను ఆయన పరిశీలించారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల మధ్య ఉన్న సీ ఫేజ్ నీటి మళ్లింపు పనులను స్వయంగా ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిని పరిశీలించామని.. లోయర్, అప్పర్ కాఫర్ డ్యాంల మధ్య ఏరియాలో డీ వాటర్ వర్క్స్ జరుగుతున్నాయన్నారు. డీ వాటర్ వర్క్ అనంతరం వైబ్రో కాంపాక్ట్ పనులు మొదలవుతాయన్నారు. లోయర్ అప్పర్ కాఫర్ డ్యాంల మధ్య.. సీఫేస్ ఎక్కువ ఉండటంతో పనులకు ఆటంకం కలుగుతుందన్నారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది, దానికి సమాంతరంగా కొత్తది కట్టే అంశంలో కేంద్ర జలశక్తి శాఖ ఇంకా నిర్ణయం తీసుకోలేదని మంత్రి అంబటి తెలిపారు. ‘‘నిర్వాసితుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. 41.15 కాంటూరు వరకు టీడీపీ హయాంలో వేసిన అంచనాకు నేటికి ఖర్చు పెరిగింది. 41.15 వరకు రూ.31,625 కోట్లతో సీడబ్ల్యూసీ రివైజ్డ్ కాస్ట్ కమిటీకి బిల్లు పంపాం. 45.72 కాంటూరు వరకు మరో రూ.16 వేలు కోట్లు ఖర్చు పెట్టాలి. 41.15 వరకు పూర్తియ్యాక మిగిలిన వాటి గురించి చర్యలు తీసుకుంటాం. కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయాలని ప్రధాని మోదీని సీఎం జగన్ కలిశారు’’ అని మంత్రి తెలిపారు. -
‘పోలవరం’పై మరో ముందడుగు
సాక్షి, అమరావతి: పోలవరం జాతీయ ప్రాజెక్టు తొలిదశ సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదించే ప్రక్రియలో కేంద్రం మరో అడుగు ముందుకేసింది. ఈ వ్యయాన్ని రూ.31,625.38 కోట్లుగా ఖరారుచేస్తూ కేంద్ర జలసంఘం (సీడబ్యూసీ) పంపిన ప్రతిపాదనను మదింపు చేసేందుకు ఆర్సీసీ (రివైజ్డ్ కాస్ట్ కమిటీ–సవరించిన వ్యయ కమిటీ)ని ఏర్పాటుచేస్తూ గురువారం కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఉత్తర్వులు జారీచేశారు. కేంద్ర జల్‌శక్తి శాఖ కమిషనర్ (ఎస్పీర్) ఏఎస్ గోయల్ అధ్యక్షతన సీడబ్ల్యూసీ (పీపీఓ) పుష్కర్‌సింగ్ కుతియాల్, కేంద్ర ఆర్థిక శాఖ (వ్యయ విభాగం) ప్రధాన సలహాదారు రిచామిశ్రా, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సభ్య కార్యదర్శి రఘురాం సభ్యులుగా ఏర్పాటైన ఆర్సీసీకి సీడబ్ల్యూసీ సీఈ (పీఏఓ) యోగేష్ పైతంకర్ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. సీడబ్ల్యూసీ ఖరారుచేసిన సవరించిన అంచనా వ్యయాన్ని మదింపు చేసి రెండు వారాల్లోగా అంటే నవంబర్ 2లోగా నివేదిక ఇవ్వాలని ఆర్‌సీసీని ఆదేశించారు. ఈ నివేదికను ప్రధాని మోదీ అధ్యక్షతన ఏర్పాటైన ప్రాజెక్టు ఇన్వెస్ట్మెంట్ బోర్డు (పీఐబీ)కి కేంద్ర జల్‌శక్తి శాఖ పంపనుంది. పీఐబీ ఆమోదముద్ర వేస్తే సవరించిన అంచనా వ్యయం మేరకు పోలవరం తొలిదశ పనులకు కేంద్రం నిధులు మంజూరు చేస్తుంది. కమీషన్ల కక్కుర్తితో పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకునే క్రమంలో 2016, సెప్టెంబరు 7 అర్ధరాత్రి 2013–14 ధరల ప్రకారం కేవలం రూ.20,398.61 కోట్లతోనే ప్రాజెక్టును పూర్తిచేస్తానని అప్పటి సీఎం చంద్రబాబు అంగీకరించారు. కానీ, 2013, భూసేకరణ చట్టం ప్రకారం ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ.33,168.23 కోట్లు అవసరం. అలాంటిది.. కేవలం రూ.20,398.61 కోట్లకే ప్రాజెక్టును పూర్తిచేస్తానని చంద్రబాబు అంగీకరించడంలో ఆంతర్యం కమీషన్లు దండుకోవడమే. 2016, సెప్టెంబరు 7 నుంచి 2019, మే 29 వరకూ చంద్రబాబు అదే చేశారు. ఇదే అంశాన్ని ప్రధానికి సీఎం వైఎస్ జగన్ వివరించి.. తాజా ధరల మేరకు నిధులిచ్చి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు ప్రధాని సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలోనే పోలవరం తొలిదశ సవరించిన వ్యయాన్ని రూ.31,625.38 కోట్లుగా సీడబ్ల్యూసీ ఖరారుచేస్తూ ఈనెల 13న కేంద్ర జల్‌శక్తి శాఖకు ప్రతిపాదన పంపింది. జాతీయ ప్రాజెక్టుల సవరించిన అంచనా వ్యయాన్ని మదింపు చేసి, పీఐబీకి నివేదిక ఇచ్చేందుకు ఆర్థిక శాఖ, సంబంధిత ప్రాజెక్టును ప్రతిపాదించే శాఖ అధికారులతో ఆర్‌సీసీని ఏర్పాటుచేయాలని 2016, సెప్టెంబరు 5న కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఆర్సీసీ ఇచ్చే నివేదికే అత్యంత కీలకం. దీనిని యథాతథంగా పీఐబీ ఆమోదించనుంది. తొలిదశ పూర్తికాగానే రెండో దశ.. పోలవరం ప్రాజెక్టు కనీస నీటి మట్టం 41.15 మీటర్లు (119.4 టీఎంసీలు) స్థాయిలో నీటిని నిల్వచేయాలంటే.. ఇటీవల లైడార్ సర్వేలో వెల్లడైన అంశాలను పరిగణలోకి తీసుకుంటే 90 గ్రామాల పరిధిలోని 171 ఆవాసాల్లోని 37,568 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. ఇందులో ఇప్పటికే 12,658 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించారు. మరో 24,910 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. తొలిదశ సవరించిన అంచనా వ్యయం మేరకు కేంద్రం నిధులు ఇవ్వగానే ఆ కుటుంబాలకు పునరావాసం కల్పిస్తారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 45.72 మీటర్లు (194.6 టీఎంసీలు). పూర్తిస్థాయిలో నీటిని నిల్వచేయాలంటే 137గ్రామాల పరిధిలోని 200 ఆవాసాల్లో 64,155 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. తొలిదశలో, రెండో దశలో నీటిని నిల్వచేయాలంటే ముంపునకు గురయ్యే 1,10,879 హెకార్ల భూమిని సేకరించాలి. మరోవైపు.. తొలిదశలో 41.15 మీటర్లలో నీటిని నిల్వచేశాక.. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకే ఏవైనా లోపాలుంటే సరిదిద్దుతూ నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ 45.72 మీటర్ల వరకూ 194.6 టీఎంసీలను రాష్ట్ర ప్రభుత్వం నిల్వచేయనుంది. రెండో దశలో 45.72 మీటర్ల వరకు నీటిని నిల్వ చేయడానికి సవరించిన అంచనా వ్యయాన్ని తొలిదశ పనులు పూర్తయ్యే నాటికి కేంద్రం ఆమోదించనుంది. -
అంచనా ఓకే
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చూపిస్తున్న చొరవ.. చేస్తున్న కృషి సత్ఫలితాలిస్తోంది. గత టీడీపీ హయాంలో జరిగిన తప్పిదాలను.. కమీషన్ల వేటలో నాటి సీఎం చంద్రబాబు ప్రాజెక్టు నిర్మాణంలో అవలంబించిన అస్తవ్యస్త విధానాలను ఒక్కోటి సరిదిద్దుతూ ప్రస్తుత ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధపట్ల సాగునీటి రంగ నిపుణులు సైతం ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే.. ఈ ప్రాజెక్టు తొలిదశ సవరించిన అంచనా వ్యయాన్ని రూ.31,625.38 కోట్లుగా కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజాగా తేల్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను సీడబ్ల్యూసీ ఛైర్మన్ కుశ్వీందర్‌సింగ్ వోరా ఆమోదించి దాన్ని కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి శుక్రవారం రాత్రి పంపారు. ఈ ప్రతిపాదనను లాంఛనంగా ఆమోదించి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్‌కు ఆమె పంపనున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదించాక దానిని కేంద్ర కేబినెట్‌కు నివేదిస్తారు. అంతకుముందు.. తాజా ధరలను పరిగణలోకి తీసుకుని పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేయడానికి నిధులిచ్చి సహకరించాలని సీఎం వైఎస్ జగన్ చేసిన విజ్ఞప్తికి ప్రధాని నరేంద్ర మోదీ సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలో.. సవరించిన అంచనాలకు కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం దాదాపు ఖాయం. దీంతో పోలవరానికి నిధుల సమస్య తీరడంతోపాటు ప్రాజెక్టు సత్వర పూర్తికి మార్గం సుగమం అవుతుంది. కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు చేసిన పాపాలను ప్రక్షాళన చేస్తూ పోలవరాన్ని పూర్తిచేయడానికి సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారనడానికి ఇది మరో నిదర్శనమని అధికార వర్గాలు కొనియాడుతున్నాయి. కేంద్ర జల్‌శక్తి శాఖ మార్గదర్శకాల మేరకు తొలిదశ పనులు పూర్తయ్యాక రెండో దశ పనుల సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం సీడబ్ల్యూసీకి పంపుతుంది. రూ.15,505.81 కోట్ల పనులు మిగులు.. పోలవరం ప్రాజెక్టు తొలిదశలో ఇప్పటికే పూర్తయిన పనులకు చేసిన వ్యయం.. కాంట్రాక్టర్లకు అప్పగించిన పనుల్లో మిగిలిన పనుల వ్యయం.. చంద్రబాబు నిర్వాకంవల్ల దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ పునర్నిర్మాణం వంటి అదనంగా చేపట్టాల్సిన పనులు.. లైడార్ సర్వేలో 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోకి వచ్చే 36 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించడానికి అయ్యే వ్యయాలను పరిగణలోకి తీసుకుని సవరించిన అంచనా వ్యయాన్ని సీడబ్ల్యూసీ ఆమోదించింది. దీని ప్రకారం.. పోలవరం ప్రాజెక్టు తొలిదశ సవరించిన అంచనా వ్యయం రూ.31,625.38 కోట్లు. ఇందులో రూ.16,119.57 కోట్ల పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. రూ.15,505.81 కోట్ల పనులు మిగిలాయి. కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేస్తే నిధుల సమస్య పరిష్కారమవుతుంది. ‘రెండో దశ’ సవరించిన అంచనా వ్యయానికీ ఓకే.. పోలవరం ప్రాజెక్టు కనీస నీటి మట్టం 41.15 మీటర్టు (119.4 టీఎంసీలు) కాగా.. గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్లు (194.6 టీఎంసీలు). సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు ప్రాజెక్టు పూర్తయ్యాక మొదటి ఏడాది నిల్వ సామర్థ్యంలో 1/3వ వంతు నీటిని నిల్వచేస్తారు. ఆ మరుసటి ఏడాది 2/3వ వంతు.. ఆ తరువాత పూర్తిస్థాయిలో నీటినిల్వ చేయాలి. నీటి నిల్వచేసే సమయంలో ఏవైనా లీకేజీలుంటే వాటికి అడ్డుకట్ట వేసి ప్రాజెక్టుకు భద్రత చేకూర్చాలన్న ఉద్దేశంతోనే సీడబ్ల్యూసీ ఈ మార్గదర్శకాలను రూపొందించింది. వీటి ప్రకారం పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక తొలిఏడాది 41.15 మీటర్లలో నీటినిల్వ చేస్తారు. ఆ తరువాత దశల వారీగా నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ గరిష్ట నీటి మట్టం 45.74 మీటర్లలో నీటినిల్వ చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇక రెండో దశలో 45.72 మీటర్ల వరకూ అంటే.. పూర్తిస్థాయిలో నీటి నిల్వకు నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి, మిగిలిన పనులకు సంబంధించి సవరించిన వ్యయ ప్రతిపాదనను తొలిదశ పనులు పూర్తయ్యే దశలో పంపాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. పోలవరానికి చంద్రబాబు చేసిన ద్రోహం ఇదీ.. ► నిజానికి.. విభజన చట్టం ప్రకారం కేంద్రమే కట్టాల్సిన పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలంటూ 2014, జూన్ 8 నుంచి కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు ఒత్తిడి తెస్తూ వచ్చారు. ఈ క్రమంలో ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టేందుకు సిద్ధమవడంతో పోలవరం నిర్మాణ బాధ్యతలను అప్పగించేందుకు కేంద్రం అంగీకరించింది. ► పోలవరం నిర్మాణ బాధ్యతలను అప్పగిస్తూనే 2016, సెప్టెంబరు 7న అర్థరాత్రి నాటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ చేసిన ప్రకటనలో.. 2013–14 ధరల ప్రకారం నీటిపారుదల విభాగంలో మిగిలిన వ్యయాన్ని మాత్రమే భరిస్తామని మెలికపెట్టారు. దీనికీ చంద్రబాబు అప్పట్లో తలఊపారు. ► ఆ తర్వాత.. 2016, సెప్టెంబరు 26న పోలవరానికి నాబార్డు నుంచి రూ.1,981.54 కోట్ల రుణాన్ని విడుదల చేస్తూ.. ఇకపై బడ్జెట్ ద్వారా కాకుండా నాబార్డు రుణం రూపంలోనే నిధులు విడుదల చేస్తామని కేంద్రం పెట్టిన మెలికకు చంద్రబాబు సరేనన్నారు. ► అనంతరం.. 2016, సెప్టెంబరు 30న కేంద్ర ఆర్థిక శాఖ కేంద్ర జలశక్తి శాఖకు పంపిన మెమొరాండంలో 2014, ఏప్రిల్ 1 నాటికి పోలవరం ప్రాజెక్టులో మిగిలిపోయిన నీటిపారుదల విభాగం పనులకు అయ్యే వ్యయాన్ని మాత్రమే ఇస్తామని పునరుద్ఘాటించింది. ► ఆ తర్వాత ఐదున్నర నెలలకు 2017, మార్చి 15న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో.. 2014, ఏప్రిల్ 1 నాటికి పోలవరం ప్రాజెక్టు పనుల్లో మిగిలిపోయిన నీటిపారుదల విభాగం పనులకయ్యే వంద శాతం వ్యయాన్ని మాత్రమే ఇస్తామని.. అది ఎంతన్నది పోలవరం ప్రాజెక్టు అథారిటీ మదింపు చేస్తుందని.. ఆ ప్రకారమే నిధులిస్తామని స్పష్టంచేసింది. ఆ సమావేశంలో ఉన్న టీడీపీకి చెందిన మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరి నోరుమెదపలేదు. ► అలాగే, 2014, ఏప్రిల్ 1 నాటికి నీటిపారుదల విభాగం వ్యయంలో మిగిలిన మొత్తాన్ని మాత్రమే రీయింబర్స్ చేస్తామని.. అంతకంటే అంచనా వ్యయం పెరిగితే.. దాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని 2017, మే 8న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జల్‌శక్తి శాఖ లేఖ రాసినా చంద్రబాబు స్పందించలేదు. ► ఇక 2016, సెప్టెంబరు 30న కేంద్ర ఆర్థిక శాఖ జారీచేసిన మెమొరాండం ప్రకారం 2014, ఏప్రిల్ 1 నాటి ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను సీడబ్ల్యూసీకి పంపామని.. వాటిని ఆమోదించి నిధులు (రూ.20,398.61 కోట్లు) ఇవ్వాలంటూ 2018, జనవరి 12న చంద్రబాబు ప్రధానికి లేఖ రాశారు. నిజానికి.. భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ.33,168.23 కోట్లు అవసరం. అలాంటిది మొత్తం ప్రాజెక్టును రూ.20,398.61 కోట్లకే పూర్తిచేస్తానని చంద్రబాబు అంగీకరించడంలో ఆంతర్యమేమిటన్నది బహిరంగ రహస్యమే. ► నిర్మాణ బాధ్యతలు దక్కించుకున్నాక.. తొలుత అప్పటి టీడీపీ ఎంపీ రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ని అడ్డుపెట్టుకుని పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించి.. ఆ తర్వాత రామోజీరావు సమీప బంధువుకు చెందిన నవయుగ, యనమల వియ్యంకుడు సుధాకర్ యాదవ్‌లకు నామినేషన్‌పై పనులు కట్టబెట్టారు. మొత్తం మీద.. సులభంగా చేయగలిగి, అధికంగా లాభాలు వచ్చే పనులు చేసి, కాంట్రాక్టర్లకు దోచిపెట్టి కమీషన్లు వసూలుచేసుకున్న చంద్రబాబు పోలవరాన్ని అస్తవ్యస్తం చేశారు. సీఎం జగన్ కృషి ఫలితమిది.. పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకున్న సమయంలో 2013–14 ధరల ప్రకారం పనులు చేస్తామని 2016, సెప్టెంబరు 7న రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. దాని ప్రకారం పోలవరం వ్యయం రూ.20,398.61 కోట్లే. కానీ.. భూసేకరణ, పునరావాసం కల్పనకే రూ.33,168.23 కోట్లు అవసరం. ఈ నేపథ్యంలో.. 2013–14 ధరల ప్రకారం ప్రాజెక్టును పూర్తిచేయడం అసాధ్యం. ఇదే అంశాన్ని ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ పలుమార్లు వివరించారు. తాజా ధరల మేరకు నిధులు సకాలంలో ఇచ్చి పోలవరం ప్రాజెక్టు పూర్తికి సహకరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తికి ప్రధాని సానుకూలంగా స్పందించారు. ఫలితంగానే పోలవరం తొలిదశ సవరించిన అంచనా వ్యయాన్ని సీడబ్ల్యూసీ ఆమోదించింది. – శశిభూషణ్‌కుమార్, ముఖ్య కార్యదర్శి, జలవనరుల శాఖ. -
నాడు ‘పోలవరం’పై టీడీపీ తప్పు చేసింది: రఘువీరారెడ్డి
సాక్షి, మడకశిర: జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరం నిర్మాణ బాధ్యతను టీడీపీ ప్రభుత్వం నెత్తినెత్తుకుని తప్పు చేసిందని సీడబ్ల్యూసీ సభ్యుడు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. ఆయన శనివారం శ్రీసత్యసాయి జిల్లా నీలకంఠాపురంలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్ కృషితోనే పోలవరం ప్రాజెక్టు రూపుదిద్దుకుందనేది జగమెరిగిన సత్యమన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండేళ్లలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో మతతత్వ బీజేపీ ఓడిపోతేనే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం దేశానికి ‘ఇండియా’ కూటమి అవసరం చాలా ఉందని చెప్పారు. ఈ నెల 9న ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశం జరుగుతుందని తెలిపారు. చదవండి: స్కిల్ కార్పొరేషన్‌కు, టీడీపీకి ఒకరే ఆడిటర్ -
పోలవరం ఫలాలు త్వరగా అందాలి
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలకు వెంటనే ఆమోదం తెలపాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా ప్రాజెక్టు పూర్తి చేసి, ఫలితాలు అందించడానికి కేంద్రం సహకరించాలని కోరారు. గురువారం సాయంత్రం సీఎం జగన్.. కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. ప్రజలకు ప్రాజెక్టు ఫలితాలు అందించడానికి సహకరించాలని కోరారు. పూర్తి నిర్మాణ వ్యయంపై తాజా అంచనాలకు ఆమోదం తెలపాలన్నారు. 2017–18 ధరల సూచీ ప్రకారం పోలవరం ప్రాజెక్టు వ్యయం రూ.55,548.87 కోట్లుగా ఇప్పటికే సాంకేతిక సలహా కమిటీ ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. దీనికి ఆర్థిక శాఖ ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు అడహాక్‌గా నిధులు విడుదల చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రూ.12,911.15 కోట్ల విడుదలకు ఆమోదం లభించడం సంతోషకరమని, అయితే దీన్ని పునఃపరిశీలించి తాజాగా అంచనాలను రూపొందించామని తెలిపారు. లైడార్ సర్వే ప్రకారం అదనంగా 36 ఆవాసాల్లో ముంపు కుటుంబాలను రక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉందని, 2022 జూలైలో వచి్చన భారీ వరదల వల్ల తలెత్తిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తొలి దశ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చేయాల్సిన పనులపై ఈ అంచనాలు రూపొందించామని చెప్పారు. పోలవరం తొలి దశను పూర్తి చేయడానికి ఇంకా రూ.17,144.06 కోట్లు అవసరమవుతాయని, ఆ మేరకు నిధులు విడుదలచేయాలని కోరారు. రూ.1,355 కోట్లు రీయింబర్స్ చేయాలి ప్రాజెక్టు నిర్మాణం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధుల నుంచి ఖర్చు చేసిన రూ.1,355 కోట్లను రీయింబర్స్ చేయాలని సీఎం జగన్ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. రూ.7,359 కోట్లను తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ బకాయిల రూపంలో చెల్లించాల్సి ఉందన్నారు. 2014 జూన్ నుంచి 2017 జూన్‌న్‌వరకు సరఫరా చేసిన విద్యుత్‌కు ఇప్పటి వరకు ఛార్జీలు చెల్లించలేదని, తొమ్మిదేళ్లుగా ఈ సమస్య పెండింగులో ఉందని గుర్తు చేశారు. ఏపీ జెన్కోకు, డిస్కంలకు ఇది తీవ్ర గుదిబండగా మారిందని తెలిపారు. తద్వారా వివిధ సంస్థలకు చెల్లింపులు చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. తెలంగాణ నుంచి సొమ్ము వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సొమ్ము ఇప్పించాలంటూ ఏపీ ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తులు చేసిన తర్వాత 30 రోజుల్లోగా ఏపీకి బకాయిలు చెల్లించాలంటూ 2022 ఆగస్టు 29న కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం హైకోర్టును ఆశ్రయించిందని, దీంతో ఈ అంశంలో కోర్టు పరిధిలోకి వెళ్లిందని తెలిపారు. ఏపీ విద్యుత్ సంస్థలకు ఆ సొమ్ము వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్ రంగానికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు. ఏపీలో విద్యుత్ రంగం బాగుంది అనంతరం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ మీడియాతో మాట్లాడారు. ఏపీలో విద్యుత్ రంగం అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో చర్చించానన్నారు. ఏపీలో విద్యుత్ రంగం పనితీరుపై కేంద్రం సంతృప్తిగా ఉందని స్పష్టం చేశారు. రీ వ్యాంప్డ్ డి్రస్టిబ్యూషన్ సెక్టార్ స్కీం (ఆర్డీఎస్ఎస్)కు ఏపీ క్వాలిఫై అయిందని తెలిపారు. తెలంగాణ విద్యుత్ బకాయిలపై మీడియా ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు. -
కంటి తుడుపుగానే ముంపు నివారణ!
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌తో తెలంగాణ భూభాగం ముంపునకు గురికావడాన్ని నివారించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు పూర్తిగా కంటి తుడుపు చర్యలుగానే ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం విమర్శించింది. ముంపు పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ఈ నెల 1న సుప్రీంకోర్టులో కేంద్రం సమర్పించిన అఫిడవిట్.. క్షేత్ర స్థాయిలోని వాస్తవ పరిస్థితులకు పూర్తి విరుద్ధంగా ఉందని ఆక్షేపించింది. ఉమ్మడి సర్వే జరపడానికి ఏపీ, తెలంగాణలు సమ్మతించాయని, సర్వే ఫలితాల ఆధారంగా ఏపీ ప్రభుత్వం, పోలవరం ప్రాజెక్టు ఆథారిటీ (పీపీఏ)లు చర్యలు తీసుకుంటాయని సుప్రీంకోర్టుకు కేంద్రం హామీ ఇవ్వడం కంటితుడుపు చర్యేనని ఆరోపించింది. ఇకనైనా పోలవరం వల్ల జరిగే ముంపు నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ మంగళవారం కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్‌కు లేఖ రాశారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు సీడబ్ల్యూసీ, కేంద్ర జలశక్తి శాఖకు ఎన్నో లేఖలు రాసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. లేఖలో ఇంకా ఏముందంటే .. ఉమ్మడి సర్వేకు అంగీకరించినా.. పోలవరం ప్రాజెక్టులో గరిష్ట నీటిమట్టం (ఎఫ్ఆర్ఎల్) 150 అడుగుల మేరకు నీటిని నిల్వ చేసినప్పుడు ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తిస్తూ ఏర్పాటు చేసిన సర్వే రాళ్ల వద్ద నుంచి ఉమ్మడి సర్వేను ప్రారంభించాలని సీడబ్ల్యూసీ/పీపీఏ/ఏపీ ప్రభుత్వం అంగీకరించినా ఆ తర్వాత మిన్నకుండిపోయాయి. తెలంగాణలో 954 ఎకరాలు ముంపునకు గురి అవుతున్నట్టు ఏపీ సమర్పించిన మ్యాపులే బయటపెట్టాయి. సీడబ్ల్యూసీ చైర్మన్ సూచన మేరకు పోలవరం బ్యాక్‌వాటర్‌తో తెలంగాణలోని 7 వాగులు, భద్రాచలం, మణుగూరు భార జల ప్లాంట్ వద్ద ఉండనున్న ముంపు/నీటి స్థాయిలపై ఉమ్మడి సర్వే జరిపేందుకు ఏపీ, పీపీఏలు ముందుకు రావడం లేదు. నదిలో పూడికపై సర్వే జరపాలి భద్రాచలం వద్ద 8 ఔట్‌ఫాల్ స్లూయిస్ల వద్ద పూడిక పేరుకుపోవడంతో బ్యాక్‌వాటర్ ప్రభావం పెరిగి తెలంగాణలోని 37 వాగులు ముంపునకు గురి అవుతున్నాయి. ఎన్జీటీ ఆదేశాల మేరకు కిన్నెరవాగు, ముర్రేడువాగులకు ఉన్న ముంపుపై ఇంకా ఉమ్మడి సర్వే జరపలేదు. నదిలో పూడికపై సీడబ్ల్యూసీ, లైడార్ సర్వేల నివేదికల మధ్య తీవ్ర వ్యత్యాసాలున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో మళ్లీ సర్వే జరపాలి. వరద లెక్కల్లో లోపాలు సవరించాలి ఇటీవల వచ్చిన భారీ వరదల సందర్భంగా నమోదు చేసిన వరద లెక్కల్లో తీవ్ర లోపాలున్నాయి. వీటిని సీడబ్ల్యూసీ పరిశీలించి సవరించాలి. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే, కాఫర్ డ్యామ్ నిర్మించిన తర్వాత తెలంగాణ ముంపు ప్రభావం భారీగా పెరిగింది. దుమ్ముగూడెం అనకట్ట నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు ఉమ్మడి సర్వే జరిపి ముఖ్య కట్టడాలు, ప్రాంతాలకు ఉండనున్న ముంపు ప్రభావంపై పరిశీలన జరపాలి. పోలవరం ముంపుపై తెలంగాణలో మళ్లీ బహిరంగ విచారణ జరపాలి. పోలవరం బ్యాక్‌వాటర్‌తో ముంపునకు గురి అవుతున్న ప్రాంతాలకు రక్షణగా వరద గోడలను నిర్మించాలి. -
పోలవరం పనుల్లో మరో కీలక ఘట్టం పనులు పూర్తి
-
పోలవరంలో మరో కీలక ఘట్టం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల్లో మరో కీలక ఘట్టం పూర్తయింది. జలాశయాన్ని ఎడమ కాలువతో అనుసంధానం చేసే సొరంగం (టన్నెల్) తవ్వకం పనులు పూర్తయ్యాయి. 919 మీటర్ల పొడవుతో 18 మీటర్ల వ్యాసంతో 20 వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో ఈ సొరంగం తవ్వకం పనులను పూర్తిచేశామని.. లైనింగ్ పనులను ప్రారంభించామని పోలవరం ప్రాజెక్టు సీఈ సుధాకర్‌బాబు ‘సాక్షి’కి వెల్లడించారు. ఎన్నికలకు ముందు ఈ పనుల అంచనా వ్యయాన్ని పెంచేసిన అప్పటి సీఎం చంద్రబాబు.. రూ.292.09 కోట్లకు కాంట్రాక్టు సంస్థకు అప్పగించి, కమీషన్లు వసూలుచేసుకున్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు ఆ కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దుచేసి.. రూ.292.09 కోట్లనే కాంట్రాక్టు విలువగా నిర్ణయించి.. రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. టీడీపీ సర్కార్ హయాంలో కాంట్రాక్టును దక్కించుకున్న సంస్థే.. ఆ పనులను రూ.231.47 కోట్లకే చేయడానికి 2019, సెపె్టంబరు 19న ముందుకొచ్చింది. దీంతో ఖజానాకు రూ.60.62 కోట్లు ఆదా అయ్యాయి. దీనిద్వారా చంద్రబాబు కమీషన్ల బాగోతాన్ని సీఎం జగన్ రట్టుచేశారు. తక్కువ ఖర్చుతోనే సొరంగాన్ని పూర్తిచేయడం ద్వారా ప్రణాళికాబద్ధంగా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడంలో సీఎం మరో అడుగు ముందుకేశారని అధికార వర్గాలు చెబుతున్నాయి. అనుసంధానాల పనులు కొలిక్కి.. పోలవరం జలాశయం గరిష్ట నీటిమట్టం 45.72 మీటర్లు (194.6 టీఎంసీలు). కనిష్ట నీటిమట్టం 41.15 మీటర్లు (119.4 టీఎంసీలు). కుడి కాలువను 174 కిమీల పొడవున 17,633 క్యూసెక్కులు (1.52 టీఎంసీ) సామర్థ్యంతో తవ్వారు. ఈ కాలువ కింద మూడు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందిస్తారు. ఈ కాలువను జలాశయంతో అనుసంధానం చేసేలా జంట సొరంగాలు (ఒక్కొక్కటి పది వేల క్యూసెక్కుల సామర్థ్యంతో), హెడ్ రెగ్యులేటర్‌ను 2020లో సీఎం జగన్ పూర్తిచేశారు. పోలవరం (గోదావరి)–ప్రకాశం బ్యారేజ్ (కృష్ణా)–బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ (బీఆర్సీ) ద్వారా పెన్నాను అనుసంధానం చేసే పనుల్లో భాగంగా జంట సొరంగాల సామర్థ్యాన్ని 20 వేల నుంచి 40 వేల క్యూసెక్కులకు పెంచే పనులకు శ్రీకారం చుట్టారు. తాజాగా.. ఎడమ కాలువను అనుసంధానం చేసే సొరంగం తవ్వకం పనులు పూర్తిచేశారు. ఎడమ కాలువను 181.50 కిమీల పొడవున 17,561 క్యూసెక్కుల సామర్థ్యం (1.51 టీఎంసీ)తో చేపట్టారు. ఈ పనుల్లో ఇప్పటికే 91% పూర్తయ్యాయి. ఎడమ కాలువ కింద 4 లక్షల ఎకరాలకు నీళ్లందించాలి. పోలవరం ప్రాజెక్టులో నీటి మట్టం 40.54 మీటర్ల స్థాయిలో ఉంటే ఎడమ కాలువ.. 40.23 మీటర్ల స్థాయిలో ఉంటే కుడి కాలువ ద్వారా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించవచ్చు. ఎడమ కాలువను అనుసంధానం చేసే సొరంగం పనులు తాజాగా పూర్తయ్యాయి. వరద తగ్గగానే హెడ్ రెగ్యులేటర్ పనులు ప్రారంభించి పూర్తిచేయనున్నారు. ప్రణాళికాబద్ధంగా పూర్తిచేసే దిశగా.. ఇక కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టు పనులను అప్పటి సీఎం చంద్రబాబు అస్తవ్యస్తంగా మార్చితే.. సీఎం జగన్ వాటిని గాడిలో పెట్టి ప్రణాళికాబద్ధంగా చేపట్టి వడివడిగా పూర్తిచేసే దిశగా అడుగులు వేస్తున్నారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ స్పిల్ వే, అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తిచేసి 2021, జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని 6.1 కిమీల పొడవున మళ్లించారు. అలాగే, కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు చేపట్టిన పనులవల్ల గోదావరి వరదల ఉధృతికి దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యామ్ నిర్మాణ ప్రాంతాన్ని సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు చక్కదిద్దే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ మేరకు వాటిని పూర్తిచేసి.. ఆ తర్వాత ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు చేపట్టి ప్రాజెక్టు ఫలాలను శరవేగంగా రైతులకు అందించే దిశగా చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారు. -
ప్రశాంతంగా ‘మండలి’ కార్యక్రమాలు
సాక్షి, అమరావతి : ఉదయం కొద్దిసేపు టీడీపీ ఎమ్మెల్సీలు చైర్మన్ పోడియం వద్ద ఈలలు, నినాదాలతో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేయడం, ఈ క్రమంలో ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్ తప్పితే శుక్రవారం శాసన మండలి కార్యక్రమాలు ప్రశాంతంగా సాగాయి. దాదాపు గంటన్నర పాటు ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరిగింది. ప్రశ్నోత్తరాలలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, గిరిజనుల సంక్షేమం, ధాన్యం కొనుగోళ్లు తదితర ప్రశ్నలపై చర్చలో పలువురు అధికార పార్టీ సభ్యులతోపాటు ప్రతిపక్ష పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు, ఇళ్ల వెంకటేశ్వరరావు, షేక్ సాబ్జీ తదితరులు పాల్గొన్నారు. వివిధ ప్రజా సంబంధ అంశాలపై పలువురు ఎమ్మెల్సీలు ‘స్పెషల్ మెన్షన్’ కింద మండలి చైర్మన్ మోషేన్‌రాజుకు విజ్ఞాపన పత్రాలు అందించారు. ‘రాష్ట్రంలో వ్యవసాయ రంగం పురోగతి – రాష్ట్ర ప్రభుత్వ చర్యలు’ అంశంపై రెండు గంటలపాటు స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చలో వివిధ పార్టీల సభ్యుల ప్రసంగాల అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సమాధానమిచ్చారు. వారంతట వారుగా సభ నుంచి వెళ్లిపోయిన టీడీపీ ఎమ్మెల్సీలు చంద్రబాబుపై పెట్టిన కేసులపై చర్చించాలంటూ టీడీపీ, ‘జాబ్‌క్యాలెండర్’పై చర్చ కోరుతూ పీడీఎఫ్ సభ్యులు రెండు వాయిదా తీర్మానాల నోటీసులు ఇచ్చారు. సభ ప్రారంభం కాగానే ఆ రెండింటినీ తిరస్కరిస్తున్నట్టు మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు. ఆ వెంటనే ప్రశ్నోత్తరాల కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ సమయంలో టీడీపీ ఎమ్మెల్సీలు చైర్మన్ పోడియం వద్దకు వచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. టీడీపీ ఎమ్మెల్సీలు కోరుతున్న అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, మండలి కార్యక్రమాల అజెండాలోనూ ఉందని చైర్మన్ వారికి నచ్చ జెప్పే ప్రయత్నం చేశారు. ఇదే అంశంపై చర్చించాలని బీఏసీలోనూ నిర్ణయించినందున టీడీపీ ఎమ్మెల్సీలు ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి అంబటి రాంబాబు కూడా సూచించారు. అయినా టీడీపీ ఎమ్మెల్సీలు వినకపోవడంతో సభను కొద్దిసేపు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమయ్యాక టీడీపీ ఎమ్మెల్సీలు మరోసారి పోడియం పైకి వచ్చేందుకు ప్రయత్నించారు. మండలి చైర్మన్ మోషేన్‌రాజు మార్షల్స్‌ను పిలిపించి వారు పోడియం వద్దకు రాకుండా నిలువరించారు. టీడీపీ సభ్యులు మార్షల్స్‌ను నెడుతూ, విజిల్స్ వేస్తూ అల్లరి చేశారు. దీంతో మంత్రి సురేష్ చేసిన ప్రతిపాదన మేరకు టీడీపీ సభ్యులు కంచర్ల శ్రీకాంత్‌ను ఈ సమావేశాలు జరిగే అన్ని రోజులు, బీటీ నాయుడు, పంచుమర్తి అనురాధను శుక్రవారం ఒక్క రోజు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు చైర్మన్ ప్రకటించారు. వారిని మార్షల్స్ బయటకు తరలించారు. అనంతరం మిగిలిన టీడీపీ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేసే ప్రయత్నం చేశారు. వారి నుంచి ప్లకార్డులు స్వా«దీనం చేసుకోవాలని చైర్మన్ మార్షల్స్‌ను ఆదేశించారు. దీంతో ఆ టీడీపీ ఎమ్మెల్సీలు కూడా వారంతట వారే సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. కొత్తగా వచ్చారు.. రౌడీయిజంతో ప్రవర్తించడం వల్లే..– మండలి చైర్మన్ ఈ సభ చరిత్రలోనే ఎప్పడూ లేని విధంగా సభ్యులను సస్పెండ్ చేయాల్సి రావడం తీవ్ర విచారకర సంఘటన అని చైర్మన్ మోషేన్‌రాజు అన్నారు. సస్పెండ్ అయిన సభ్యులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ‘చాలా దురదృష్టకరం. మీరు కొత్తగా వచ్చిన సభ్యులు. సభా సంప్రదాయాలను తెలుసుకోవాలి. చైర్మన్ స్థానానికి, ఇతర సభ్యులకు గౌరవం ఇవ్వాలి. అది తెలుసుకోకుండా ఏదో రౌడీయిజంగా ప్రవర్తించడం చాలా విచారించదగ్గ అంశం’ అని మోషేన్‌రాజు వ్యాఖ్యానించారు. -
‘సాగునీటి’లోనూ అక్రమాల ప్రవాహం
సాక్షి, అమరావతి : సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసే ముసుగులో చంద్రబాబునాయుడు ప్రభుత్వ ఖజానాను అడ్డగోలుగా దోచేశారు. ఐదేళ్లలో రూ.68,293.94 కోట్లు ఖర్చుచేసినా ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేయలేకపోయారు. ఇంత ఖర్చుచేసినా కొత్త, పాత కలిపి కేవలం 3.4 లక్షల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే నీళ్లందించగలిగారు. వీటిని పరిశీలిస్తే.. సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో చంద్రబాబు ఏ స్థాయిలో దోపిడీ చేశారో అర్థంచేసుకోవచ్చు. టీడీపీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి రాగానే.. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మినహా జలయజ్ఞం కింద చేపట్టి, పూర్తికాని 40 ప్రాజెక్టుల్లో మిగిలిన పనులను పూర్తిచేయడానికి కేవలం రూ.17,368 కోట్లు మాత్రమే అవసరమని 2014, జూలై 28న నాటి సీఎం చంద్రబాబు శ్వేతపత్రంలో ప్రకటించారు. ఈ ప్రాజెక్టుల కోసం 2014, జూన్ 8 నుంచి 2019, మే 29 వరకూ రూ.68,293.94 కోట్లను ఖర్చుచేసినట్లు చంద్రబాబు ఘనంగా ప్రకటించుకుంటున్నారు. ఇందులో పోలవరంపై ఖర్చుపెట్టిన రూ.10,860.67 కోట్లు, నీరు–చెట్టు పేరుతో కాజేసిన రూ.12,400.23 కోట్లు.. కమీషన్ల కోసం చేపట్టిన పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతలపై వ్యయం చేసిన రూ.3,199.92 వెరసి.. రూ.26,460.82 కోట్లను మినహాయిస్తే.. జలయజ్ఞం కింద చేపట్టిన 40 ప్రాజెక్టులకు రూ.41,833.12 కోట్లు వ్యయం చేసినట్లు స్పష్టమవుతోంది. అంటే.. చంద్రబాబు చెప్పిన ప్రకారం ఆ ప్రాజెక్టులను పూర్తిచేయడానికి అవసరమైన దానికంటే రూ.24,465.12 కోట్లను అధికంగా వ్యయం చేశారు. పోనీ.. ఒక్క ప్రాజెక్టునైనా పూర్తిచేశారా అంటే అదీ లేదు. దీన్నిబట్టి చూస్తే.. కేవలం జలయజ్ఞం ప్రాజెక్టుల్లో మాత్రమే కాంట్రాక్టర్లకు ప్రభుత్వ ఖజానా నుంచి రూ.24 వేల కోట్లను దోచిపెట్టి.. అందులో చాలావరకూ ముడుపుల రూపంలో చంద్రబాబు రాబట్టుకున్నారన్నది బహిరంగ రహస్యం. ‘పోలవరం’తో కేంద్ర ఖజానాను సైతం.. ఇక కేంద్రమే నిరి్మంచాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను చంద్రబాబు దక్కించుకుని.. కేంద్ర ప్రభుత్వ ఖజానాను దోచేశారు. దేశ చరిత్రలో ఎక్కడాలేని రీతిలో పోలవరం హెడ్‌వర్క్స్‌లో రూ.2,917 కోట్ల విలువైన పనులను రామోజీరావు వియ్యంకుడికి చెందిన నవయుగకు.. ఎడమ కాలువలో ఐదో ప్యాకేజీలో రూ.142 కోట్ల విలువైన పనులను అప్పటి ఆర్థికమంత్రి యనమల వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్‌కు కట్టబెట్టి అక్రమాల్లో రికార్డు నెలకొల్పారు. అందుకే చంద్రబాబు కమీషన్ల కోసం పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారని ప్రధాని మోదీ సైతం ఆరోపించారు. -
Fact Check: అక్షరం అక్షరంలో అక్కసు..
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు చేసిన తప్పులను సీఎం వైఎస్ జగన్‌కు ఆపాదించడం.. వాస్తవాలను వక్రీకరించి ప్రభుత్వంపై బురదజల్లుతూ నీతిమాలిన రోత రాతలను అచ్చేయడంలో తనకు అలుపే లేదని రామోజీరావు ఎప్పటికప్పుడు చాటిచెప్పుకుంటున్నారు. కుక్క తోకలా తన బుద్ధీ ఎప్పటికీ వంకరేనని చాటుకోవడానికి ఆయనకు ఆయనే తెగ పోటీపడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రోత రాతలను అచ్చేయడాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. దీనికి నిదర్శనమే ‘పోలవరంలో ఇదేం దారుణం?’ శీర్షికన ‘ఈనాడు’లో తాజాగా ప్రచురించిన కథనం. ఆ కథనంలోని ప్రతి అక్షరంలో కాంట్రాక్టర్‌గా తన కొడుకు వియ్యంకుడిని తప్పించారనే కోపం.. డీపీటీ (దోచుకో పంచుకో తినుకో)కి అడ్డుకట్టపడిందనే అక్కసు.. చంద్రబాబు పాపాలను ప్రక్షాళన చేస్తూ సీఎం వైఎస్ జగన్ పోలవరాన్ని ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తుండటంపై అసూయ కన్పించింది తప్ప అందులో వీసమెత్తు నిజంలేదు. అసలు నిజాలు ఇవీ.. ఈనాడు ఆరోపణ: రెండు కాఫర్ డ్యామ్‌ల మధ్య సీపేజీ (ఊట నీరు) అంచనాలకు మించి 30 రెట్లు అధికంగా వచ్చింది.. వాస్తవం: కమీషన్లకోసం కక్కుర్తి పడి పోలవరం నిర్మాణ బాధ్యతలు దక్కించుకున్న చంద్రబాబు.. రూ.2,917 కోట్ల విలువైన పనులను రామోజీరావు కొడుకు వియ్యంకుడికి చెందిన నవయుగకు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టేశారు. ప్రాజెక్టు ప్రోటోకాల్‌కు విరుద్ధంగా.. సులభంగా చేయగలిగి, అధికంగా లాభాలొచ్చే పనులు చేపట్టి, కమీషన్లు వసూలుచేసుకుని డీపీటీ విధానంలో పంచుకుతిన్నారు. ఈ క్రమంలోనే గోదావరి వరదను మళ్లించేలా అప్రోచ్ ఛానల్, స్పిల్ వే, స్పిల్ ఛానల్, పైలెట్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తిచేయకుండానే ప్రధాన (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించి చంద్రబాబు సర్కార్ చారిత్రక తప్పిదం చేసింది. ఇందులో మరో ఘోరం ఏమిటంటే.. కమీషన్లు రావనే నెపంతో నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా, ఎగువ కాఫర్ డ్యామ్‌ను పాక్షికంగా నిర్మించి, ఇరువైపులా 650 మీటర్ల ఖాళీ ప్రదేశం.. దిగువ కాఫర్ డ్యామ్‌ను పాక్షికంగా నిర్మించి, రెండు వైపులా 480 మీటర్ల ఖాళీ ప్రదేశం ఉంచింది. కాఫర్ డ్యామ్‌లు అనేవి తాత్కాలిక కట్టడాలు మాత్రమే. వాటి పునాదుల గుండా సీపేజీ రాకుండా సాధారణంగా జెట్ గ్రౌటింగ్ విధానాన్ని ఎంచుకుంటారు. ఈ పద్ధతిలో ఎగువ కాపర్ డ్యామ్ పునాదిని పటిష్టపరిచారు. 2019–20లో గోదావరికి వచ్చిన భారీ వరదలకు ఎగువ కాఫర్ డ్యామ్ అడ్డంకిగా మారింది. టీడీపీ సర్కార్ ఎగువ కాఫర్ డ్యామ్‌లో వదిలేసిన ఖాళీ ప్రదేశాల గూండా 13.5 మీటర్లు/సెకను అంటే గంటకు దాదాపు 40 కిమీల వేగంతో ఆ వరద ప్రవహించడంవల్ల జెట్ గ్రౌటింగ్ బలహీనపడి సీపేజీ అనుకున్న దానికంటే ఎన్నో రెట్లు పెరిగింది. దానివల్లే రెండు కాఫర్ డ్యామ్‌ల మధ్యలోకి సీపేజీ నీరు చేరుతోంది. దీనికి పూర్తి బాధ్యత టీడీపీ సర్కార్‌దే. కానీ, మీ దోపిడీని కప్పిçపుచ్చుకునే క్రమంలో ఆ చారిత్రక తప్పును వైఎస్ జగన్ ప్రభుత్వంపై నెట్టేస్తే ఎలా రామోజీ? ఈనాడు ఆరోపణ: రెండు కాఫర్ డ్యామ్‌ల మధ్య చేరిన సీపేజీ నీటిని బయటకు పంపేందుకు డిప్లీటింగ్ స్లూయిస్ నిర్మాణాన్ని తమ అనుమతిలేకుండానే రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని.. ఇది చెయొద్దని చెప్పినా వినడంలేదని నాలుగు రోజుల క్రితం జరిగిన అంతర్గత సమావేశంలో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దృష్టికి పీపీఏ అధికారులు తీసుకెళ్లారు. దీనికి ఆయన విస్తుపోయారు.. వాస్తవం: రామోజీరావు జర్నలిజం విలువల పతనానికి ఇది పరాకాష్ట. కేంద్ర జల్‌శక్తి శాఖ అంతర్గత సమావేశాలు నిర్వహించడం సాధారణమే. ఆ క్రమంలోనే గతనెల 29న ఓ సమావేశాన్ని నిర్వహించింది. అందులో రాష్ట్ర ప్రభుత్వం తమ మాట వినడంలేదని.. అనుమతులు తీసుకోకుండానే రెండు కాఫర్ డ్యామ్‌ల మధ్య చేరిన సీపేజీ నీటిని బయటకు పంపేందుకు దిగువ కాఫర్ డ్యామ్ కుడి గట్టున బటర్‌ఫ్లై తూము నిర్మిస్తున్నారని పీపీఏ అధికారులు ఫిర్యాదు చేసినట్లు.. దీనికి కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి విస్తుపోయినట్లుగా అవాస్తవాలను రామోజీరావు చిత్రీకరించారు. ఆ సమావేశంలో ఏ బల్ల కింద నక్కి విన్నావ్ రామోజీ? అసలు జరిగిన విషయం ఏమిటంటే.. రెండు కాఫర్ డ్యామ్‌ల మధ్యన చేరిన సీపేజీ నీటిని బయటకు పంపే పద్ధతిని సాంకేతికంగా మదింపు చేసి.. నిపుణులతో చర్చించి ఆర్థికంగా తక్కువ భారమయ్యేలా ఓ ప్రతిపాదనను పీపీఏకు రాష్ట్ర జలవనరుల శాఖ సమర్పించింది. దిగువ కాఫర్ డ్యామ్‌కు ఆనుకుని కుడి వైపున ఉన్న తిప్పకు అంచులో పైపు తూములు నిర్మించి.. వాటికి నాన్–రిటర్న్ వాల్వులు అమర్చి.. వాటి ద్వారా సముద్ర మట్టానికి 18 మీటర్ల ఎత్తు వరకు ఉన్న నీటిని గ్రావిటీపై బయటకు పంపి, మిగిలి ఉన్న నీటిని పంపుల ద్వారా తోడిపోసే విధానాన్ని సూచించింది. ఆ ప్రతిపాదనకు అనుమతి వచ్చేలోగా విలువైన సమయాన్ని ఆదా చేయాలనే లక్ష్యంతో పీపీఏకు సమాచారమిచ్చే సన్నాహక పనులనే జలవనరుల శాఖ చేపట్టింది. ఇదీ వాస్తవం. ఈనాడు ఆరోపణ: ఎగువ కాఫర్ డ్యామ్ సీపేజీపై తప్పుడు ఫార్ములాతో తప్పిన అంచనాలు.. వాస్తవం: ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మాణానికి ముందే సీపేజీపై ఐఐటీ నిపుణులు అంచనా వేసినప్పుడు.. పునాదిని జెట్ గ్రౌటింగ్‌తో పటిష్టవంతం చేస్తే సీపేజీ పరిమితికి లోబడే ఉంటుందని లెక్కించారు. కానీ, టీడీపీ సర్కారు కమీషన్ల కోసం ప్రాజెక్టును పణంగా పెట్టింది. ప్రాజెక్టు ప్రోటోకాల్‌కు విరుద్ధంగా ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు చేపట్టి.. వాటిని పూర్తిచేయలేక ఖాళీ ప్రదేశాలను వదిలేయడం వల్ల 2019–20లో వచ్చిన వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై భారీ అగాధాలు ఏర్పడ్డాయి. ఎగువ కాఫర్ డ్యామ్ జెట్ గ్రౌటింగ్ కూడా దెబ్బతింది. దీనివల్లే సీపేజీ అధికంగా ఉంది. చంద్రబాబు సర్కార్ తప్పిదాలను వైఎస్ జగన్ ప్రభుత్వంపై నెట్టేసేందుకే అభూత కల్పనలతో కథనాన్ని వండివార్చావన్నది వాస్తవం కాదా రామోజీ? -
ఈనాడుపై పరువు నష్టం దావాకు ఏపీ ప్రభుత్వం ఆదేశం
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈనాడు పత్రికపై ప్రాసిక్యూషన్ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్ట్‌పై తప్పుడు రాతలు రాసినందుకు పరువు నష్టం దావా వేయాలని ఆదేశించింది. అయితే, మే 12వ తేదీన పోలవరంపై ఈనాడు పత్రిక తప్పుడు కథనాలు రాసుకొచ్చింది. ఈనాడు కథనాలపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి ఈనాడు ఎండీ, జర్నలిస్టుల క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఆఫ్ డిఫమేషన్ చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. ఇక, పోలవరంపై ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పటికీ ఈనాడు తప్పుడు కథనాలు సృష్టించడం పట్ల ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇది కూడా చదవండి: పోలవరంపై కేంద్ర జలశక్తి శాఖ హైలెవల్ మీటింగ్ -
2025 జూన్‌కు పోలవరం తొలి దశ పూర్తి
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు తొలి దశను 2025 జూన్‌కి పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదన అమలుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)లకు కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ చెప్పారు. ఆయన మంగళవారం ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం, సీడబ్ల్యూసీ చైర్మన్ కుశ్వీందర్‌సింగ్ వోరా, కేంద్ర జల్ శక్తి శాఖ ప్రత్యేక కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ తదితరులతో పోలవరం పనులపై సమీక్షించారు. డయాఫ్రమ్ వాల్, గైడ్ బండ్ దెబ్బతినడానికి దారితీసిన పరిస్థితులు, కారణాలపై మరింత లోతుగా అధ్యయనం చేసి భవిష్యత్తులో అలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాఫర్ డ్యామ్‌లలో లీకేజీలకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయడానికి, వాటిని మరింత పటిష్టం చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్ఎస్) నిపుణులతో అధ్యయనం చేయించాలని సూచించారు. డిజైన్ల ప్రతిపాదన, ఆమోదం నుంచి పనులు చేపట్టడం వరకూ పీపీఏ పాత్ర మరింత పెరగాలన్నారు. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–2లో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌కు సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా? లేదంటే దెబ్బతిన్న చోట్ల మాత్రమే కొత్తగా డయాఫ్రమ్ వేస్తే సరిపోతుందా? అనే అంశంపై ఏం నిర్ణయం తీసుకున్నారని సీడబ్ల్యూసీని ప్రశ్నించారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికే మొగ్గుచూపుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపిందని, దానిపై మరింత లోతుగా అధ్యయనం చేసి నివేదిక ఇస్తామని సీడబ్ల్యూసీ చైర్మన్ కుశ్వీందర్ వోరా చెప్పారు. కాఫర్ డ్యామ్‌లను మరింత పటిష్టం చేయడం, డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై సీడబ్ల్యూసీ, పీపీఏ, రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులతో చర్చించి నాలుగైదు రోజుల్లో నివేదిక ఇవ్వాలని కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాంకు పంకజ్‌కుమార్ సూచించారు. ఈ నివేదికల ఆధారంగా మరో సారి సమావేశమై కాఫర్ డ్యామ్‌ల పటిష్టత, డయాఫ్రమ్ వాల్‌పై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గోదావరిలో వరదలు తగ్గేలోగా వాటిపై తుది నిర్ణయం తీసుకంటే ఈ సీజన్లో పూర్తి స్థాయిలో పనులు చేపట్టవచ్చని, తద్వారా గడువులోగా ప్రాజెక్టు తొలి దశ పూర్తి చేయడానికి ఆస్కారం ఉంటుందని వివరించారు. ఇదీ చదవండి: దోచుకునే బుద్ధి మీది రామోజీ!