సాక్షి, అనంతపురం: పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు వల్ల రైతులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. అలాగే, పోలవరం జోలికి వస్తే చంద్రబాబు ప్రభుత్వానికి నూకలు చల్లినట్లేనని హెచ్చరించారు.
సీపీఐ రామకృష్ణ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు దుర్మార్గం. చంద్రబాబు ఎన్డీయేలో భాగస్వామి. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపునకు చంద్రబాబే నైతిక బాధ్యత వహించాలి. 45.72 అడుగుల ప్రాజెక్టును 41 అడుగులకు కుదిస్తే ఎలా?. పునరావస ప్యాకేజీ ఎగ్గొట్టేందుకే కేంద్రం కుట్రలు చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారు?.
పోలవరం జోలికి వస్తే చంద్రబాబు ప్రభుత్వానికి నూకలు చెల్లినట్లే. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు వల్ల రైతులకు తీరని అన్యాయం జరుగుతుంది. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు దారుణం. నవంబర్ ఏడో తేదీన విద్యుత్ ఛార్జీల పెంపుపై విజయవాడలో వామపక్షాల సమావేశం ఉంది. విద్యుత్ ఛార్జీల పెంపు పోరాటం చేస్తాం అని చంద్రబాబు సర్కార్‌ను హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: పోలవరానికి చంద్రబాబు కూటమి ఉరి..
Comments
Please login to add a commentAdd a comment