Rama Krishna
-
పోలవరం జోలికొస్తే బాబు సర్కార్‌కు నూకలు చెల్లినట్టే: సీపీఐ రామకృష్ణ
సాక్షి, అనంతపురం: పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు వల్ల రైతులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. అలాగే, పోలవరం జోలికి వస్తే చంద్రబాబు ప్రభుత్వానికి నూకలు చల్లినట్లేనని హెచ్చరించారు.సీపీఐ రామకృష్ణ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు దుర్మార్గం. చంద్రబాబు ఎన్డీయేలో భాగస్వామి. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపునకు చంద్రబాబే నైతిక బాధ్యత వహించాలి. 45.72 అడుగుల ప్రాజెక్టును 41 అడుగులకు కుదిస్తే ఎలా?. పునరావస ప్యాకేజీ ఎగ్గొట్టేందుకే కేంద్రం కుట్రలు చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారు?.పోలవరం జోలికి వస్తే చంద్రబాబు ప్రభుత్వానికి నూకలు చెల్లినట్లే. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు వల్ల రైతులకు తీరని అన్యాయం జరుగుతుంది. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు దారుణం. నవంబర్ ఏడో తేదీన విద్యుత్ ఛార్జీల పెంపుపై విజయవాడలో వామపక్షాల సమావేశం ఉంది. విద్యుత్ ఛార్జీల పెంపు పోరాటం చేస్తాం అని చంద్రబాబు సర్కార్‌ను హెచ్చరించారు. ఇది కూడా చదవండి: పోలవరానికి చంద్రబాబు కూటమి ఉరి.. -
ఏపీ అప్పులపై గందరగోళం సృష్టిస్తున్నారు: సీపీఐ రామకృష్ణ
సాక్షి, అనంతపురం: ఏపీలో ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన హామీలపై సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. సూపర్-6 హామీల అమలు బాధత్య చంద్రబాబుదే అని చెప్పుకొచ్చారు.కాగా, సీపీఐ రామకృష్ణ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సూపర్ సిక్స్ అమలు బాధ్యత చంద్రబాబుదే. ఇప్పుడు సూపర్ సిక్స్ అంటే భయమేస్తుందని అనడం కరెక్టేనా?. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసే చంద్రబాబు హామీలు ప్రకటించారు. ఏపీలో సంపద సృష్టించి హామీలు నెరవేరుస్తానని, అమలు చేస్తానని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు అప్పులపై గందరగోళం సృష్టిస్తున్నారు. కేంద్రం ఒకటి చెబితే రాష్ట్రంలో మరొకటి చెబుతున్నారు. అమరావతికి రూ.15వేల కోట్ల అప్పు కాదు. గ్రాంట్ తేవాలి. ఏపీ అప్పులపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. ఏపీకి ప్యాకేజీ కాదు. ప్రత్యేక హోదా కావాలి అని డిమాండ్ చేశారు.ఇక, అంతకుముందు చంద్రబాబుపై రామకృష్ణ సీరియస్ అయ్యారు. నీతిఆయోగ్‌లో చంద్రబాబు ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీని ఎందుకు అంతగా చంద్రబాబు పొగిడారని ప్రశ్నించారు. మోదీ హయాంలో ఫలానా సమస్య పరిష్కారమైందని చంద్రబాబు చెప్పగలరా?. నరేంద్రమోదీ పదేళ్ల పాలనలో అవినీతి ఏమైనా తగ్గిందా?. బ్యాంకులను ముంచేసి విదేశాలకు పారిపోయిన వారి నుంచి ఏమైనా రికవరీ చేశారా?. మోదీ పదేళ్ల పాలనలో రైతులు అప్పుల పాలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కూటమిలో క్రోధాగ్ని నిరసనల భగభగలు
సాక్షి, రాజమహేంద్రవరం/నూజివీడు/కాళ్ల: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో కుమ్ములాటల పర్వం కొనసాగుతోంది. తెలుగు సంవత్సరాది వేళా నిరసనల సెగ చల్లారలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి స్వపక్ష శ్రేణుల్లోనే విభేదాల అగ్గి రాజేస్తోంది. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలోని ద్వారకామాయి ఫంక్షన్ హాలులో సోమవారం రాత్రి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సమన్వయ సమావేశం రసాభాసగా మారింది. రాజమహేంద్రవరం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఎంపికైన తరువాత తొలిసారి ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పురందేశ్వరి పాల్గొన్నారు. సభా వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, పురందేశ్వరి, కూటమి రాజానగరం నియోజకవర్గ అభ్యర్థి, జనసేన నేత బత్తుల బలరామకృష్ణ ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీనిలో టీడీపీ రాజానగరం నియోజకవర్గ ఇన్చార్జి బొడ్డు వెంకట రమణ చౌదరి ఫొటో లేకపోవడంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ కోసం సీటు త్యాగం చేసిన నేత ఫొటో ఎందుకు పెట్టలేదని పురందేశ్వరిని నిలదీస్తూ ఆ ఫ్లెక్సీని చించి పారేశారు. ఫ్లెక్సీలో ఉన్న మోదీ ఫొటోనూ చించివేస్తున్నా వారిని వారించేందుకు పురందేశ్వరి కనీసం యత్నించకపోగా, చిరునవ్వులు చిందిస్తూ అలాగే వేదికపై కూర్చోవడం విమర్శలకు దారి తీసింది. ఆమె తీరుపై బీజేపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ శ్రేణుల నిరసనల నేపథ్యంలో ఫంక్షన్ హాలు నుంచి ఆమె మెల్లగా జారుకున్నారు. సాధారణంగా పార్టీ అగ్రనేతల ఫొటోలు, ఫ్లెక్సీలను ఎవరైనా చించితే నాయకులు, కార్యకర్తలు సహించలేరు. కానీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వైఖరి ఇందుకు భిన్నంగా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ► పశ్చిమగోదావరి జిల్లా ఉండి సీటు మార్చే యోచనలో టీడీపీ అధిష్టానం ఉండటంతో ఎమ్మెల్యే మంతెన రామరాజు భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. కాళ్ల మండలం పెదఅమిరం నిర్మలాదేవి ఫంక్షన్ హాలులో మంగళవారం నిర్వహించిన టీడీపీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. సమావేశంలో టీడీపీ నాయకులు స్పందిస్తూ.. ఉండి అభ్యర్థిని మారిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాజీనామాలకూ వెనుకాడబోమని స్పష్టం చేశారు. సమావేశానికి పార్టీ పరిశీలకుడిగా వచ్చిన ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు సమక్షంలోనే వారు ఈ విషయాన్ని తేల్చిచెప్పడం గమనార్హం. ఎమ్మెల్యే మంతెన రామరాజు మాట్లాడుతూ.. తన సీటును వదులుకోవడానికి సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. ఏ తప్పూ చేయకుండా త్యాగానికి సిద్ధం కావాలనడం న్యాయం కాదని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్నీ విధిగా చేయడం తన తప్పా అని ప్రశ్నించారు. కార్యకర్తల నిర్ణయమే తనకు శిరో«దార్యమని, వేరే వ్యక్తికి సీటు కేటాయిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. పార్టీ నేతల అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళతానని గన్ని వీరాంజనేయులు చెప్పారు. తొలి నుంచీ పురందేశ్వరికి చుక్కెదురు వాస్తవానికి ఎంపీ అభ్యర్థిగా ఎంపికైన పురందేశ్వరికి మొదటి నుంచీ ఇక్కడ చుక్కెదురవుతూనే ఉంది. రాజమహేంద్రవరం వచ్చిన వెంటనే ఆమె స్థానిక బీజేపీ నాయకులను కలుపుకొని వెళ్లాల్సింది పోయి.. వేరుకుంపటి పెట్టారు. పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజును పూర్తిగా పక్కన పెట్టారు. ఈ పరిణామం సోము వర్గంతోపాటు పార్టీ శ్రేణులను దూరం చేసింది. దీంతో సభలు, సమావేశాల్లో ఆమెకు నిరసనల సెగ ఎదురవుతూనే ఉంది. అనపర్తి ఎమ్మెల్యే టికెట్‌ను తొలుత టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి కేటాయించి.. పొత్తు అనంతరం బీజేపీకి ఇవ్వడంపైనా టీడీపీ వర్గాల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది. అక్కడ ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి, స్థానిక బీజేపీ నాయకులను వ్యతిరేకిస్తూ రామకృష్ణారెడ్డి స్వతంత్రంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయినా పురందేశ్వరి పెదవి విప్పకపోవడంపై ఆమె టీడీపీకి లాభం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఫ్లెక్సీలో ప్రధాని మోదీ ఫొటో చించుతున్నా స్పందించకపోవడం ఈ వాదనకు బలం చేకూరుస్తోందని బీజేపీ శ్రేణులు అంటున్నాయి. -
అమిత్ షాకు సజ్జల కౌంటర్
-
తెలుగు రాష్ట్రాల్లో బీసీలంటే గుర్తొచ్చేది ఆర్ కృష్ణయ్య పేరే
-
టీడీపీ దుష్ట పన్నాగం.. సభలో అడుగడుగునా అడ్డంకులు
సాక్షి, అమరావతి: టీడీపీ సభ్యులు గురువారం శాసనసభలో దుష్టçపన్నాగానికి తెరతీశారు. ఆర్థికమంత్రి బుగ్గన గురువారం బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఉపక్రమించగానే సభలోకి వచ్చిన టీడీపీ సభ్యులు నినాదాలు అరుపులతో బడ్జెట్ ప్రసంగం వినపడనీయకుండా గందరగోళం సృష్టించారు. టీడీపీ సభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు పెద్దగా నినాదాలు చేస్తుంటే, మరో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు చిత్తు కాగితాల ముక్కలను స్పీకర్‌పైకి, గాలిలోకి విసిరారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టకుండా అడ్డుపడటం మంచిది కాదని, ఏమైనా అభ్యంతరాలుంటే బడ్జెట్ చర్చలో తెలపవచ్చని మంత్రులు, స్పీకర్ చెప్పినా వారు వెనక్కు తగ్గకపోగా మరింత రెచ్చిపోయారు. సీఎం జగన్ జోక్యం చేసుకుని టీడీపీ తీరును తప్పుబట్టారు. వార్షిక బడ్జెట్‌ను ప్రజలంతా ఆసక్తిగా చూస్తారని, అలాంటి బడ్జెట్ ప్రసంగానికి అడ్డుపడుతున్న ప్రతిపక్ష సభ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా స్పీకర్‌ను కోరారు. బడ్జెట్ ప్రసంగం ప్రజలకు వినపడకూడదనే కుతంత్రంతోనే వారు గందరగోళం సృష్టిస్తున్నారని సీఎం మండిపడ్డారు. సభ సజావుగా జరిగేలా, ప్రజలకు బడ్జెట్ ప్రసంగం వివరంగా అర్థమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ..ప్రజల ఆకాంక్షలను అడ్డుకోవడం సరికాదని, ఇష్టం లేకపోతే వాకౌట్ చేసి వెళ్లిపోవాల్సిందిగా కోరారు. టీడీపీ సభ్యుల తీరులో మార్పు లేనందున తప్పని పరిస్థితుల్లో కఠిన నిర్ణయం తీసుకుంటున్నానంటూ టీడీపీకి చెందిన 14 మంది సభ్యులను ఒకరోజు పాటు సమావేశాల నుంచి సస్పెండ్ చేశాకే, బుగ్గన ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. సస్పెండ్ అయిన తర్వాత కూడా సభ్యులు వెళ్లకుండా గొడవ చేస్తుండటంతో మార్షల్స్ వారిని బయటకు పంపించారు. -
జీవో నెం.1పై తాత్కాలిక స్టే విధించిన హైకోర్టు
సాక్షి, అమరావతి: సీపీఐ నేత రామకృష్ణ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 23 వరకు జీవో నెం.1పై హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. కాగా, హైకోర్టులో విచారణలో భాగంగా ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరాం వాదనలు వినిపించారు. పిల్‌పై ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేదన్నారు. నిబంధనల ప్రకారం ఈ కేసు రోస్టర్‌లో రావడానికి ఆస్కారం లేదు. వెకేషన్ బెంచ్ విధాన నిర్ణయాల కేసులను విచారించకూడదు. జడ్జీలను ఎంపిక చేసుకోవడంలో భాగంగా ఒక రాజకీయ పార్టీ దీన్ని ఉపయోగించుకుంటోంది అని స్పష్టం చేశారు. -
పరువు హత్యలు.. నాడు నరేశ్, ప్రణయ్.. నేడు రామకృష్ణ
సాక్షి, యాదగిరిగుట్ట/వలిగొండ : ఉమ్మడి జిల్లాలో మరో పరువు హత్య తీవ్ర కలకలం రేపింది. నాడు నరేశ్, ప్రణయ్‌లు పరువుకు బలి కాగా అదే తరహాలో నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎరుకల రామకృష్ణను దారుణంగా మట్టుబెట్టారు. ఆరేళ్ల కాలంలో ఉమ్మడి జిల్లాలో ముగ్గురు యువకులు హత్యకు గురికావడం చర్చనీయాంశంగా మారింది. అమ్మమ్మ ఇంటి వద్ద చదువుకుని.. సిద్దిపేట జిల్లా లకుడారంలో పరువు హత్య కాబడిన రామకృష్ణ వలిగొండ మండలం లిగంరాజుపల్లిలోని అమ్మమ్మ ఇంటి వద్ద నివాసముండేవాడు. ఇతడి స్వస్థలం హుజూర్నగర్. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో రామకృష్ణ కుటుంబ సభ్యులు అమ్మమ్మ ఊరైన లింగరాజుపల్లికి వచ్చి ఇక్కడే స్థిరపడిపోయారు.రామకృష్ణకు తల్లి కలమ్మ, చెల్లి నాగలక్ష్మి, తమ్ముడు రమేష్ ఉన్నారు. రామకృష్ణ ఇంటర్ వరకు వలిగొండలో చదువుకున్నాడు. 2016వ సంవత్సరంలో హోంగార్డుగా ఉద్యోగం సాధించి కొంతకాలం వలిగొండలోనే విధులు నిర్వహించారు. 2019లో యాదగిరిగుట్టకు బదిలీ అయ్యాడు. ఎవరీ వెంకటేశ్ యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లికి చెందిన వెంకటేష్ ప్రస్తుతం రాజాపేట మండలం కాల్వపల్లి వీఆర్ఓగా విధులు నిర్వహిస్తున్నాడు. మొదటగా పల్లెపాటి వెంకటేష్ సొంత గ్రామమైన గౌరాయపల్లిలో మస్కూరిగా విధులు నిర్వహించాడు. వెంకటేష్ 10వ తరగతి పూర్తి కాకపోవడంతో గ్రామంలోనే వీఆర్ఏగా పని చేశాడు. ఈ సమయంలోనే 10వ తరగతి పరీక్షలు రాసి వీఆర్ఓగా ఉద్యోగం సాధించాడు. అనంతరం రాజాపేట తహసీల్దార్ కార్యాలయంలో కాల్వపల్లిలో విధులు నిర్వహిస్తున్నాడు. అక్కడ విధులు నిర్వహిస్తూనే.. సొంత గ్రామమైన గౌరాయపల్లి నుంచి యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీరాంనగర్‌కు వచ్చి ఇల్లు నిర్మించుకున్నాడు. ఐదేళ్లుగా వెంకటేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరిగుట్టలోని సొంత ఇంట్లో ఉంటున్నాడు. వెంకటేష్‌కు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె భార్గవి ఉన్నారు. భార్గవి 2020లో ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత వెంకటేష్, ఆయన భార్య, కుమారులు గుట్టలో ఉంటున్నారు. వెంకటేష్ వీఆర్ఓ ఉద్యోగంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. గుప్త నిధుల తవ్వకాల్లో.. యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా ఉంటూ పోలీస్ వాహనం నడుపుతున్న సమయంలో రామకృష్ణకు తుర్కపల్లి మండలంలోని ఓ గ్రామంలో గుప్త నిధులు తవ్వకాల సమయంలో కాల్వపల్లి వీఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న వెంకటేష్‌తో పరిచయం ఏర్పడింది. ఈ సమయంలో గుప్త నిధులు తవ్వకాలు జరిగే బృందంలో హోంగార్డు రామకృష్ణపై కేసు నమోదు కాగా.. ఆ కేసులో ని«ంధితుడుగా ఉన్న వీఆర్ఓ వెంకటేష్‌ను ఆ కేసులో నుంచి అప్పట్లో పోలీసులు తప్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గుప్త నిధుల కేసులోనే రామకృష్ణను హోంగార్డు ఉద్యోగం నుంచి తొలగించారు. ఇంటర్ నుంచే.. యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న రామకృష్ణకు భార్గవి ఇంటర్ మొద టి సంవత్సరం చదువుతున్న క్రమంలో పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది. ఈ వ్యవహారం నడుస్తున్న సమయంలో రామకృష్ణ స్థానికంగా ఉండే పోలీస్ క్వాటర్స్‌లో ఉండే వాడు. ఆ తర్వాత పోలీస్ క్వాటర్స్‌లో గదిని ఖాళీ చేసిన రామకృష్ణ ప్రేమించిన భార్గవితో మరింత దగ్గర అయ్యేందుకు శ్రీరాంనగర్‌లో భార్గవి తండ్రి వీఆర్ఓ వెంకటేష్ నిర్మించుకున్న ఇంటికి ముందు ఉన్న ఓ ఇంట్లో అద్దెకు తీసుకొని ఉన్నాడు. ఈ తరుణంలోనే వెంకటేష్, రామకృష్ణలు ఇ ద్దరు తుర్కపల్లి మండలంలోని ఓ గ్రామంలో జరిగిన గుప్త నిధుల తవ్వకాల్లో పరిచయం ఏర్పడినట్లు తెలిసింది. ఒప్పుకోకున్నా.. రామకృష్ణ, భార్గవిల వివాహం 2020 ఆగస్టు 16న చెర్వుగట్టులో జరిగింది. అంతకు నెల రోజుల ముందే భార్గవి, రామకృష్ణల ప్రేమ వ్యవహారం వెంకటేష్‌తో పాటు కుటుంబ సభ్యులు తెలిసింది. దీంతో వెంకటేష్ తన కూతురు భార్గవిని మందలించాడు. ఈ సమయంలో తనకు రామకృష్ణ అంటే ఇష్టమని తండ్రి వెంకటేష్‌తో భార్గవి చెప్పింది. కళాశాలకు వెళ్లనివ్వకుండా వెంకటేష్ కుమార్తె భార్గవిని ఇంట్లోనే ఉండమన్నాడు. రామకృష్ణపై ఉన్న ప్రేమతో భార్గవి 2020 ఆగస్టు 16న చెర్వుగట్టులో వివాహం చేసుకున్నారు. 10రోజుల క్రితం గుట్టలోనే.. రామకృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ భువనగిరితో పాటు యాదగిరిగుట్టలో భూములు అమ్మకా లు, కొనుగోలు చేసేందుకు వచ్చేవాడని స్థానికులు పేర్కొంటున్నారు. 10రోజుల క్రితం ఎకరం భూమి కావాలని ఓ వ్యక్తితో యాదగిరిగుట్టకు వచ్చాడని తెలిసింది. అంతే కాకుండా రెండు, మూడు రోజుల క్రితం పట్టణంలోని గాయత్రి హోటల్లో భోజనం చేసినట్లు స్థానికులు తెలిపారు. ఐదేళ్లుగా హోంగార్డుగా యాదగిరిగుట్టలోనే విధులు నిర్వహించిన రామకృష్ణకు స్థానికులతో మంచి పరిచయాలు ఉన్నాయి. సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య మిర్యాలగూడ అర్బన్: 2018 సెప్టంబర్ 14న మిర్యాలగూడలో దారుణ హత్యకు గురైన ప్రణయ్ కేసు అప్పట్లో దేశంలోనే సంచలనం సృష్టించింది. తిరునగరు మారుతీరావు కూతురు అమృత మిర్యాలగూడ పట్టణం ముత్తిరెడ్డి కుంటకు చెందిన పెరుమాళ్ల ప్రణయ్ స్కూల్లో విద్యనబ్యసించే నుంచి ప్రేమించకున్నారు. ఇద్దరూ ఒక్కటై కులాంతర వివాహం చేసుకున్నారు. ఈ విషయం నచ్చని అమృత తండ్రి మారుతీరావు పరువు పోయిందని భావించి అప్పటినుంచి అదును కోసం వేచి చూశాడు. అమృత ఐదు నెలల గర్భవతి కావడంతో పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి భర్త, అత్తతో కలిసి వచ్చింది. వైద్య పరీక్షలు ముగించుకుని ఆస్పత్రి నుంచి బయటికి వస్తున్న క్రమంలో వెనుకనుంచి వచ్చిన సుపారీ కిల్లర్ పదునైన కత్తితో ప్రణయ్‌ను దారుణంగా నరకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న తిరునగరు మారుతీరావు కొద్ది రోజుల తర్వాత హైదరాబాద్‌లోని ఆర్యసమాజ మందిరంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. నమ్మించి.. మట్టుబెట్టి.. ఆత్మకూరు(ఎం) : యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్(ఎం) మండలం పల్లెర్లలో రజక కులానికి చెందిన అంబోజు నరేష్, లింగరాజుపల్లిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన తుమ్మల స్వాతి ప్రేమించుకున్నారు. పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో భయపడి తలదాచుకోవడానికి 2016లో ముంబాయికి వెళ్లారు. కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేస్తామని అమ్మాయి తల్లిదండ్రులు నమ్మించి ఇద్దరినీ స్వగ్రామానికి రప్పించారు. వారం రోజులకు స్వాతి తన ఇంట్లోని బాత్రూంలో ఉరేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన జరిగిన ఐదారు రోజుల్లో అంబోజు నరేష్ అదృశ్యం అయ్యాడు. దీంతో నరేష్ తల్లిదండ్రులు భువనగిరి రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్వాతి కుటుంబంపై అనుమానం ఉండడంతో అప్పటి హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఫిర్యాదు చేయడంతో పాటు ప్రజాసంఘాల కలిసి హెచ్ఆర్సీని ఆశ్రయించారు. మానవ హక్కుల కమిషన్ సీరియస్‌గా స్పందించడంతో పోలీసులు విచారణ చేపట్టారు. కాగా నరేష్‌ను అదే ఏడాది మే నెలలో కిడ్నాప్ చేసి లింగరాజుపల్లి శివారులో వ్యవసాయ బావి వద్ద హత్య చేసి దహనం చేసినట్లు స్వాతి తండ్రి అంగీకరించారు. పోలీసులు ఆ కోణంలో తిరిగి విచారణ చేపట్టారు. ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో కేసు నిలబడలేదు. -
వనమా రాఘవ రిమాండ్ పొడిగింపు
పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచకు చెందిన మండిగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఖమ్మం జైలులో ఉన్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు కుమారుడు వనమా రాఘవ రిమాండ్‌ను పొడిగించారు. ఈ కేసులో రాఘవను 8వ తేదీన అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించిన విషయం విదితమే. ఆయన రిమాండ్ గడువు శుక్రవారంతో ముగియగా శనివారం ఆన్లైన్ విధానంలో కోర్టుకు హాజరుపరిచారు. ఈ సందర్భంగా మరో 14రోజుల పాటు అంటే.. వచ్చేనెల 4వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ కొత్తగూడెం రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ముద్దసాని నీలిమ ఆదేశాలు వెలువరించారు. కాగా, ఇప్పటికే రాఘవ తరఫున బెయిల్ కోసం పిటిషన్ వేయగా తిరస్కరణకు గురైంది. అలాగే, ఇదే కేసులో నిందితులుగా ఉన్న రామకృష్ణ తల్లి సూర్యావతి, సోదరి మాధవి కూడా బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా శుక్రవారం తిరస్కరించారు. దీంతో వీరు హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిసింది. ఇక రాఘవను విచారణ కోసం ఈసారైనా పోలీసులు కస్టడీకి కోరతారా, లేదా అన్నది త్వరలోనే తేలనుంది. జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ పట్టణ పోలీసుస్టేషన్లలో మరో రెండు కేసులకు సంబంధించి పోలీసులు పిటీ (ప్రిజనల్ ట్రాన్స్ఫర్) వారెంట్లు దాఖలు చేయడం కూడా రిమాండ్‌ను పొడిగించేందుకు దోహదపడినట్లు తెలుస్తోంది. -
భద్రాచలం సబ్ జైలులో వనమా రాఘవ
-
ఆర్కే జీవిత చరిత్రపై పుస్తకాల ముద్రణ
అంబర్‌పేట (హైదరాబాద్): మావోయిస్టు దివంగత అగ్ర నేత రామకృష్ణ (ఆర్కే) పేరుతో పుస్తకం ముద్రిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు సదరు ప్రింటింగ్ ప్రెస్పై దాడి చేసి పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన శుక్రవారం అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అంబర్‌పేట అలీకేఫ్ చౌరస్తా ప్రాంతంలో రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి నవ్య ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రింటింగ్ ప్రెస్‌లో రామకృష్ణ జీవితంపై పుస్తకం ముద్రిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేసి పుస్తకాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ పుస్తకాల్లో మావోయిస్టు భావజాలం ఉందని డీసీపీ వెల్లడించారు. పుస్తకాలు, ప్రింటింగ్ ప్లేట్లు, పెన్‌డ్రైవ్‌లను తీసుకెళ్లారు. ప్రింటింగ్ ప్రెస్ యజమాని రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, రామకృష్ణారెడ్డి పీవోడబ్ల్యూ నేత సంధ్య భర్త కావడం గమనార్హం. భర్త జ్ఞాపకాలతో పుస్తకం వేసుకుంటే తప్పా? ‘నా భర్త, కొడుకు ఇద్దరు చనిపోయారు. వారి జ్ఞాపకాలను ఒక పుస్తకం రూపంలో తెద్దాం అనుకున్నా. ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకొచ్చా. ఈనెల 14న సుందరయ్య విజ్ఞానకేంద్రంలో రామకృష్ణ సంస్మరణ సభ ఉంది. భర్త, కొడుకు జ్ఞాపకాలను పుస్తక రూపంలో తీసుకొస్తే తప్పేముంది. వీరి జ్ఞాపకాలు చాలా పత్రికల్లో వచ్చాయి కూడా. వాటినే పుస్తక రూపంలో తీసుకొస్తే దాన్ని తప్పుబట్టి పోలీసులు సీజ్ చేయడం దారుణం’అని ఆర్కే భార్య శిరీష వాపోయారు. -
లాక్డౌన్ : ఉద్యోగులను తొలగించకండి
సాక్షి, అమరావతి : లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలోని పరిశ్రమల్లో 15 శాతానికి మించి ఉత్పత్తి జరగడం లేదని సీఐఐ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ రామకృష్ణ అన్నారు. మంగళవారం విజయవాడలో నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లాక్డౌన్ కారణంగా పరిశ్రమల్లో పెద్ద ఎత్తున ఉత్పత్తి నిలిచిపోయిందన్నారు. అనుమతించిన పరిశ్రమల్లో ఉద్యోగులు లేక, మార్కెట్ లేక ఉత్పత్తి ఎక్కువగా జరగడం లేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో పరిశ్రమల్లో ఉద్యోగులను తొలగించవద్దని సీఐఐ తరఫున కోరుతున్నట్లు చెప్పారు. ఉద్యోగులను తొలగిస్తే ఆయా పరిశ్రమలకు భవిష్యత్‌లో నష్టాలు వచ్చే అవకాశం ఉందని రామకృష్ణ అభిప్రాయపడ్డారు. వారికి మళ్ళీ కాపాబుల్ లేబర్ దొరకడం కష్టమన్నారు. పరిశ్రమల్లో ఆర్థిక ఇబ్బందులుంటే ఎక్కువ వేతనం పొందే వారికి కోత విధించి.. చిన్న కార్మికులకు మాత్రం పూర్తి జీతాలు ఇవ్వాలని పరిశ్రమల నిర్వహకులకు సూచించారు. కరోనా వైరస్ వలన ప్రజల అవసరాల్లో పెద్ద ఎత్తున మార్పులు వచ్చాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక కొన్ని పరిశ్రమలు మూతపడ్డాయని, వాటికి ప్రభుత్వ సహకారం అవసరమని తెలిపారు. -
‘ప్రిన్సిపాల్ సంతకం లేకున్నా పరీక్ష హాల్లోకి అనుమతి’
సాక్షి, విజయవాడ : రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తొలిసారిగా ఇంటర్ బోర్డు విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిందని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ రామకృష్ణ తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసేవిధంగా క్షేత్రస్థాయిలో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. చివరి నిమిషంలో కళాశాల యాజమాన్యాలు వేధించకుండా, హాల్ టికెట్ జాప్యం చేయకుండా, ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకునే విధానాన్నిఇంటర్ బోర్డు తీసుకొచ్చిందన్నారు. ఇంటర్ పరీక్షలకు 10.65 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారని వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అరగంట ముందుగా పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నట్లు, హాల్ టికెట్‌పై కళాశాల ప్రిన్సిపాల్ సంతకం లేకుండానే పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారు. దీంతో గతంలో ఫీజులు చెల్లించని విద్యార్థులకు హాల్ టికెట్స్ ఇవ్వకుండా వేధింపులకు గురిచేసే యాజమాన్యాలు తీరుకు చెక్ పెట్టనున్నారు. క్యూఆర్ కోడ్‌తో హాల్ టికెట్స్ నేరుగా డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉందని, ‘యువర్ సీట్’ పేరుతో ప్రత్యేక యాప్ రూపొందించినట్లు వెల్లడించారు. పరీక్ష కేంద్రాలు, ఇంటర్ బోర్డ్ తొలిసారిగా పరీక్షలు రాసే గది వివరాలు తెలిపే విధానాన్ని ప్రవేశ పెట్టిందని, ఈ రోజు(మంగళవారం) రాత్రి 8 గంటలు నుంచి "నో యువర్ సీట్" సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, సమస్యాత్మక పరీక్ష కేంద్రాల్లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పర్యవేక్షించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1411 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి.. టోల్ ఫ్రీ నంబర్ 0866 2974130, 18002749868 వాట్సాప్ నంబర్ 9391282578 ఏర్పాటు చేశారు. -
ర్యాంకు రెండు.. అయినా ఉద్యోగం రాలేదు
దోమ: దివ్యాంగ కోటాలో జిల్లాలో రెండో ర్యాంకు సాధించాడు.. ఇక ఉద్యోగంలో చేరడమే తరువాయి అనుకున్న ఓ దివ్యాంగుడికి ఇప్పటివరకు ఉద్యోగం లభించలేదు. వివరాలు.. వికారాబాద్ జిల్లా దోమ మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామకృష్ణ ముదిరాజ్ టీఆర్టీ–2017 పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. దివ్యాంగ కోటాలో జిల్లాలోనే మెరిట్ ప్రకారం రెండో ర్యాంకులో నిలిచాడు. రెండు నెలల కిందట టీఎస్పీఎస్సీ ఎంపిక చేసిన టీఆర్టీ జాబితాలో తన పేరు లేకపోవడంతో రామకృష్ణ మనోవేదనకు గురయ్యాడు. తనను ఎందుకు ఎంపిక చేయలేదని బోర్డును ప్రశ్నించగా.. ‘ఒక కన్ను చూపు లేదని దివ్యాంగ ధ్రువపత్రం సమర్పించావు. అది తప్పు అని తేలింది. చూపు బాగానే ఉందని హైదరాబాద్‌లోని సరోజిని ఆస్పత్రి వైద్యులు మాకు నివేదిక ఇచ్చారు’అని బోర్డు వివరణ ఇచ్చిందన్నాడు. ఉద్యోగానికి ఎంపిక చేయలేమని బోర్డు తెలపడంతో సరోజిని ఆస్పత్రిని రామకృష్ణ సంప్రదించగా.. దివ్యాంగుడే అని నివేదిక ఇచ్చామని ఆస్పత్రి వర్గాలు చెప్పాయన్నాడు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక జరిగిన ఘటనను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు విన్నవిస్తూ వీడియో తీసి శుక్రవారం సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. -
‘ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వమే కారణం’
సాక్షి, విజయవాడ : పోలవరం, అమరావతి యాత్ర, నవ నిర్మాణ దీక్షల పేరుతో ఆర్టీసి బస్సులను వినియోగించుకున్న ప్రభుత్వం.. ఆ సంస్థను నష్టాల్లోకి నెట్టిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఆయన ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సులను వాడుకుని 750కోట్ల బకాయిలు చెల్లించలేదని తెలిపారు. ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వమే కారణమని అన్నారు. ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు నిర్లక్ష్యమే కార్మికుల సమ్మెకు కారణమని పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో కార్పోరేట్ కంపెనీలు వేలకోట్లు కట్టబెట్టాయని విమర్శించారు. బీజేపీకి కార్పోరేట్ బాండ్ల ద్వారా 2256 కోట్లుజమ చేశారని ఆరోపించారు. కార్పోరేట్ కంపెనీ నిధులు ఇచ్చినా.. వారి పేర్లు వెల్లడించాలని కోర్టు ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. ఏపీపై ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. ఎన్నికల్లో జేసీ దివాకర్‌రెడ్డి 50కోట్లు ఖర్చుపెట్టామని చెప్పినా చర్యల్లేవని మండిపడ్డారు. డబ్బులు పంచిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డబ్బు పంపిణీపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
‘ఏపీలో అవినీతి రాజ్యమేలుతోంది’
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి రాజ్యమేలుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. విశాఖపట్నంలో రామకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీలో ధృతరాష్ట్ర పాలన సాగుతోందన్నారు. ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, విభజన హామీల అమలుపై జనవరి 3, 4 తేదీల్లో ఢిల్లీలో మిలిటెంట్ తరహా పోరాటం చేపడుతున్నామని తెలిపారు. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగితే కనీసం చంద్రబాబు ఫోన్ ద్వారానైనా పరామర్శించలేదంటే ఎలాంటి రాజకీయాలు ఏపీలో నడుస్తున్నాయో ప్రజలు గ్రహించాలన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలపై జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో చర్చ చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో చంద్రబాబు జ్ఞానభేరి పేరిట కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు..ఎవరికి జ్ఞానం అందించడానికి చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏడు యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లే లేరని వెల్లడించారు. -
‘వారి చేతుల్లో టీడీపీ ఓటమి ఖాయం’
సాక్షి, విజయవాడ : హాయ్‌ల్యాండ్‌ను పోలీస్‌లతో అడ్డుకుని.. అరెస్టులు చేయడం అప్రజాస్వామికం.. అగ్రిగోల్డ్ బాధితులే టీడీపీని ఒడిస్తారంటూ సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. బుధవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో నూతన రాజకీయ ప్రత్యామ్నయాన్ని ముందుకు తీసుకు రావడానికి విపక్ష పార్టీలు కార్యాచరణ రూపొందించాయని తెలిపారు. వచ్చే నెల 20న ఎంబీ విజ్ఞాన కేంద్రంలో వామపక్ష పార్టీలు, ఇతర కలిసి వచ్చే పార్టీలతో సదస్సు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం కరువు నివారణ చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. హాయల్యాండ్ అంశంలో ప్రభుత్వంపై వచ్చే ఆరోపణలను కనీసం ఖండిచడం లేదని ధ్వజమెత్తారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారానికై చిత్త శుద్ధితో పని చేయడం లేదంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. వెయ్యి కోట్లు కేటాయించి చిన్న మొత్తాల డిపాజిట్‌దారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే అగ్రిగోల్డ్ బాధితులే టీడీపీని ఒడిస్తారంటూ హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాలపై విద్యార్థి యువజన సంఘాలు చేపట్టబోయే కార్యక్రమానికి తమ పార్టీ తరపున సంఘీభావం తెలిపారు. 2019 ఎన్నికల్లో రాష్ట్ర విభజన హామీలే తమ ప్రధాన అజెండా అంటూ రామకృష్ణ ప్రకటించారు. కరువుపై ఆందోళన కార్యక్రమాలు : మధు తమతో కలిసి వచ్చే పార్టీలను కలుపుకుని ముందకు వెళ్తామని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు తెలిపారు. ఉపాధి హామీ బకాయిలు చెల్లించలేదని ఆరోపించారు. కరువుతో రైతులు వలస వెళ్తున్నారని విచారం వ్యక్తం చేశారు. రాయలసీమ కరువుపై ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదాపై రాబోయే పార్లమెంట్లో ప్రతిఘటన కార్యక్రమాలు చేపడతామన్నారు. -
జగన్ కేసు.. వివరాలు ఎందుకు చెప్పట్లేదు: సీపీఐ
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న ఎయిర్‌పోర్టులో కత్తితో దాడి చేస్తే వివరాలు ఎందుకు చెప్పలేకపోతున్నారని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. విలేకరులతో రామకృష్ణ మాట్లాడుతూ..పోలీసు వ్యవస్థ నిద్రపోతుందా అని ఎద్దేవా చేశారు. తల్లీ, చెల్లీ చేశారని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ నిస్సిగ్గుగా మాట్లాడటం దారుణమన్నారు. మోదీ కంటే సీనియర్ని అంటావు..కనీసం జగన్‌కు ఫోన్ చేసి పరామర్శించావా అని అడిగారు. పరామర్శించిన వారిది తప్పు అంటూ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. చింతమనేని నాలుగేళ్లుగా దాడులు చేస్తూనే ఉన్నారు..ఆయన్ని చంద్రబాబు సమర్దిస్తూనే ఉన్నాడని తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబూ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివా లేక పచ్చ చొక్కాల వారికే ముఖ్యమంత్రివా అనే అనుమానం కలుగుతోందన్నారు. పచ్చ చొక్కాలకే అయితే మేము నిన్ను ఎందుకు గౌరవించాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యానికి చంద్రబాబే కారణమన్నారు. మళ్లీ ఈయన దేశంలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రాయలసీమ కరువుపై త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కేంద్రం ఏమీ చేయలేదు..ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ రైల్వే జోన్ ఎక్కడో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో ఉండే వరవరరావు మోదీని ఎలా చంపుతారో వాళ్లే చెప్పాలని ప్రశ్నించారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ రాజ్యాంగ సంస్థల్లో జోక్యం చేసుకుంటున్నారని, దాన్ని ఆసరాగా చేసుకుని చంద్రబాబు కూడా ఇలా చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగదేమో.. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగదేమో అనే అనుమానం కలుగుతోందన్నారు. హాయిలాండ్తో మాకు సంబంధం లేదు అనడం అన్యామని చెప్పారు. నాలుగేళ్లుగా చంద్రబాబు ఒకే పాటు పాడుతున్నారని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ బాధితులు ఆమరణ దీక్ష చేపడుతున్నారు..సీపీఐ వారికి సంపూర్ణ మద్దతు తెలుపుతుందని చెప్పారు. -
బాబు ఎందుకు భయపడుతున్నారో: సీపీఐ
సాక్షి, అమరావతి: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) అంటే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎందుకు భయపడుతున్నారో అర్ధం కావడం లేదని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ తెలిపారు. శుక్రవారం రామకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ..సీబీఐ రాష్ట్రంలోనికి రావద్దు అని అనడానికి చంద్రబాబుకు ఏం అధికారం ఉన్నదని ప్రశ్నించారు. సీబీఐ అనేది దేశ వ్యవస్థలో ఒక అంతర్భాగమన్నారు. విశాఖ మహా నగరంలో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాడి చేసినా ఇంత వరకు దానిపై అతీగతి లేకుండా, సమగ్ర విచారణ జరపకుండా సీఎం చంద్రబాబు మెతక వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రలు పూర్తిగా క్షీణించాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి ఉన్నారని విమర్శించారు. పార్టీ ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు అదుపులో లేరని, చింతమనేని ప్రభాకర్ వ్యవహారమే ఇందుకు నిదర్శనమన్నారు. చింతమనేని ఇటీవల దళితులు, జర్నలిస్టులు, మహిళలపై దాడులు చేసినా ఇప్పటి వరకు చంద్రబాబు పట్టించుకోకపోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. డిసెంబర్ 18 నుంచి 21 వరకు సీపీఐ జాతీయ సమితి సమావేశాలు మహారాష్ట్ర మండలిలో జరుగుతాయని అన్నారు. విజయవాడలో ఈ నెల 20న రాష్ట్ర కార్యవర్గ సమావేశం భేటీ కానుందని, ఆ సమావేశంలో 2019 ఎన్నికలకు గానూ దిశా నిర్దేశం చేయనున్నట్లు తెలిపారు. ప్రత్యేక హోదా కోసం ప్రచార కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. -
వైఎస్ జగన్‌పై హత్యయత్నం కుట్రలో కొత్త కోణం
-
‘కరువును ఎదుర్కోవడంలో చంద్రబాబు విఫలమయ్యారు’
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో కరువును ఎదుర్కోవడంలో చంద్రబాబు విఫలమయ్యారని, కర్నూల్ జిల్లాలో రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలనే కాదు.. అంతర్జాతీయ సభల్లో కూడా మోసపూరితమైన మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ దండగా అని చెప్పిన విషయం మర్చిపోయినట్టున్నారని అన్నారు. హామీలను అమలుచేయకుండా ప్రజలను మోసం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విజయవంతమైందని ఎద్దేవాచేశారు. కరువు సమస్యపై వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని ప్రకటించారు. నిరుద్యోగ భృతి కనీసం ఐదు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
మొన్న స్కూటర్ల మీద.. నేడు ఆడి కార్లలో..
విజయవాడ: నగరాన్ని అభివృద్ధి చేయడం అంటే కార్పొరేటర్లకు కోట్ల రూపాయలు దోచిపెట్టడం కాదంటూ ఏపీ ప్రభుత్వ తీరుపై సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. మొన్నటిదాకా స్కూటర్లలో తిరిగిన కార్పొరేటర్లు ఇప్పుడు ఆడికార్లలో తిరుగుతున్నారని విమర్శించారు. రూ.లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పిన చంద్రబాబు.. పరిశ్రమలు ఎక్కడ పెట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి మోదీ నాలుగేళ్లుగా అన్యాయం చేస్తుంటే నోరుమెదపని సీఎం చంద్రబాబు, ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మోదీని విమర్శిస్తూ, ధర్మపోరాటాలంటూ కొత్తనాటకాలకు తెరతీశారని విమర్శించారు. జనసేన కొత్త పార్టీ కాబట్టే ఉభయ కమ్యునిస్టు పార్టీలు కలిసి పని చేస్తున్నాయని చెప్పారు. -
బాబుకు అధికారం..ప్రజల ప్రాణాలు గాల్లో
విజయవాడ: టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ..కర్నూలు జిల్లా క్వారీ ఘటనాస్థలానికి చంద్రబాబు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ఎక్స్‌గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకున్నారు..కానీ ఒక్కరి పై కూడా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కర్నూలు జిల్లా క్వారీ ప్రమాద ఘటనపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు వెంటనే రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కోరారు. రాష్ర్ట మంత్రి అచ్చెన్నాయుడు ఆర్టీసీ కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని విమర్శించారు. మంత్రి పదవికి రాజీనామా చేసి ఆర్టీసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాలని హితవు పలికారు. ఉత్తరాంధ్ర సమస్యలపై మేధావులు, ప్రజా సంఘాలతో ఆగస్టు 10న చర్చిస్తామని, రాయలసీమ సమస్యలపై ఆగస్టు 26న చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. నాలుగు సంవత్సరాలు బీజేపీ కలిసి కాపురం చేసిన టీడీపీ ఇప్పుడు పార్లమెంటు వేదికగా చేస్తున్న డ్రామాలు, వేషాలు ఆపాలని సూచించారు. రూ.53 వేల కోట్ల పీడీ అకౌంట్ల కుంభకోణంపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. -
1,000 యాప్స్ ఒకేసారి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 1,000 యాప్స్. అదీ ఒకే సమయంలో ఆవిష్కరణ. తద్వారా ప్రపంచ రికార్డు సృష్టించేందుకు ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) రెడీ అవుతోంది. దక్షిణాసియాలో రెండవ అతిపెద్ద డిజిటల్ టెక్నాలజీ సదస్సు, ప్రదర్శన న్యూఢిల్లీలో అక్టోబర్ 25–27 తేదీల్లో జరగనుంది. కేంద్ర టెలికం శాఖ, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్(సీవోఏఐ) సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా 1,000 యాప్స్ ఆవిష్కరణ జరుగుతుందని సీవోఏఐ ప్రిన్సిపల్ అడ్వైజర్, ఐఎంసీ సీఈవో పి.రామకృష్ణ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ప్రత్యేక టన్నెల్లో యాప్స్‌ను ప్రదర్శిస్తామని చెప్పారు. ఫోకస్ 5జీ పైనే.. ఐఎంసీ ప్రదర్శనలో 300కుపైగా కంపెనీలు స్టాళ్లను ఏర్పాటు చేయనున్నాయి. చైనా కంపెనీలు దీనికి అదనం. ‘90 శాతం కంపెనీలు విదేశాలకు చెందినవే. 5,000 మంది అంతర్జాతీయ వక్తలు పాల్గొంటున్నారు. ఒక లక్ష మంది సందర్శిస్తారని అంచనా. నూతన ఉపకరణాలు, బ్రాండ్ ఆవిష్కరణలు ఉంటాయి. గతేడాది జరిగిన మొదటి సదస్సు 4జీపై ఫోకస్ చేసింది. ఈసారి 5జీ టెక్నాలజీ లక్ష్యంగా కార్యక్రమం జరుగుతుంది. ఆసియాన్, బిమ్స్టెక్ దేశాల టెలికం మంత్రులతో సమ్మిట్ ఉంటుంది. దిగ్గజ సంస్థల గ్లోబల్ సీఈవోల శిఖరాగ్ర సదస్సు కార్యక్రమానికి హైలైట్ కానుంది’ అని వివరించారు. -
22న ఏపీలో హైవేల దిగ్బంధనం
-
22న ఏపీలో హైవేల దిగ్బంధనం
సాక్షి, విజయవాడ: ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ.. ఈ నెల 22న చేపట్టబోయే జాతీయ రహదారుల దిగ్బంధానికి టీడీపీ, బీజేపీ మినహా అన్ని పార్టీలు మద్దతు తెలిపినట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి 22 ప్రజాసంఘాలు సంఘీభావం ప్రకటించాయని, విద్యార్థుల పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఉదయం పది నుంచి పన్నెండు గంటల వరకు జాతీయ రహదారుల దిగ్బంధం చేస్తున్నట్టు తెలిపారు. అయితే ఈ కార్యక్రమాన్ని టీడీపీ అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని, టీడీపీకి చిత్తశుద్ధి వుంటే ఈ కార్యక్రమానికి సహకరించాలంటూ పిలుపునిచ్చారు. టీడీపీ ఎటువంటి ఆటంకాలు కల్పించినా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పార్లమెంటులో అవిశ్వాసం ఎదుర్కొనే ధైర్యం బీజేపీకి లేదని అన్నారు. సరళీకరణ విధానాలను అవలంభిస్తున్న బీజేపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం ఇష్టం లేదని, అందుకే అవిశ్వాసంపై చర్చ జరిగితే తమ బండారం ఎక్కడ బయటపడతుందోనని భయపడుతోందని ఆరోపించారు. ఇదే విషయమై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ స్పందిస్తూ.. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై చర్చకు స్పీకర్ అనుమతించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని, తెలంగాణ ముఖ్యమంత్రి సైంధవ పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. బీజేపీతో కలిసి టీఆర్ఎస్ లాలుచీ పడిందని ఆరోపించారు. చిత్తశుద్ధి ఉంటే టీఆర్ఎస్, అన్నాడీఎంకేలు చర్చకు సహకరించాలని కోరారు. రాష్ట్రానికి రైల్వేజోన్ ఇవ్వకపోగా, ఉన్న రైళ్లను రద్దు చేస్తారా అని ప్రశ్నించారు. సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను ఎలా రద్దు చేస్తారంటూ నిలదీశారు. రేపు ఉదయం కనకదుర్గమ్మ వారధి వద్ద జాతీయ రహదారి నిర్బంధం చేస్తున్నట్టు తెలిపారు. కేంద్రానికి స్పష్టమైన సంకేతాలు ఇవ్వడాని అన్ని పార్టీలు ఇందులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. -
నాకు తెలిసిన నందనవనం
విద్య, సామాజిక సేవ ఒక ఎత్తయితే, రమణయ్య సాహిత్యానికీ, పుస్తక ప్రచురణకీ చేసిన సేవ మరొక ఎత్తు. ఇది తెలుగు భాషకు, అభ్యుదయ భావాలకు చేసిన సేవగా భావిస్తాను. ఎన్వీ వెలువరించిన పుస్తకాలు ఆయన అభిరుచికి గీటురాళ్లు. ‘లలితగారు పోయిన సంగతి తెలిసి, మీ అందరినీ ఒకసారి పలకరించాలని నాన్నగారు చాలా వాపోతున్నారు. కానీ కదలపలేని స్థితి’ అంటూ ఆ మధ్య నందనవనం వెంకటరమణయ్య కూతురు ఫోన్లో చెప్పి, ఆమె కూడా కన్నీటి పర్యంతమైంది. ఇప్పుడు ఆయనే మా అందరినీ విడిచి వెళ్లిపోయారు. రమణయ్య కుటుంబానికీ, నా కుటుంబానికీ; అంతకు మించి మా ఆశయాలకీ, విశ్వాసాలకీ మధ్య మంచి అనుబంధం ఉంది. రమణయ్యతో నా పరిచయం దాదాపు ఆరున్నర దశాబ్దాల నాటిది. మా ఇద్దరిదీ సింగరాయకొండ ఫిర్కాయే. మాది పాకల. అక్కడికి సమీపంలోనే ఉన్న∙మరో సముద్రతీర గ్రామం బింగినపల్లి రమణయ్యగారి స్వస్థలం. 1952–53 నాటి మాట. నిజానికి అది చాలా గొప్ప కాలం. అప్పుడే ఆయన పరి చయం. సింగరాయకొండలోనే యువజన సభలు, విద్యార్థి సభలు నిర్వహించినవాళ్లలో మేం కూడా ఉన్నాం. అవే మా సాన్నిహిత్యాన్ని పటిష్టం చేశాయి. మేమిద్దరం ఒక ఉన్నత పాఠశాల విద్యార్థులం కూడా కాదు. నేను సింగరాయకొండలో చదివాను. ఆయన వేరే చోట చదివేవారు. నేను కావలిలో చదువుకున్నాను. కానీ మా ఇద్దరికీ ప్రేరణ ప్రొఫెసర్ ఎన్. బాలకృష్ణారెడ్డి గారు. అప్పుడు ఆయన ఉపాధ్యాయుడు. తరువాత తిరుపతి విశ్వవిద్యాలయంలో ఆచార్యుడి స్థాయికి ఎదిగారు. అప్పుడు చాలామంది ఆలోచించినట్టే మేం కూడా విద్యార్థులను కూడగట్టాలనీ, యువజనోద్యమంతో సమాజంలో మార్పులు తీసుకురావాలనీ కోరుకునేవాళ్లం. నేను వామపక్షానికి అనుబంధంగా ఉన్న స్టూడెంట్స్ ఫెడరేషన్లో ఉండేవాడిని, రమణయ్య సోషలిస్టు పార్టీ అనుబంధ సంస్థ డెమాక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్‌లో చురుకుగా ఉండేవాడు. ఇంటర్ తరువాత నేను కావలి కళాశాలలోనే చేరాను. రమణయ్య మాత్రం విజయనగరం మహారాజా కళాశాలలో బి.ఎ.లో చేరాడు. విజయనగరంలో పురి పండా అప్పలస్వామిగారు రమణయ్యకి గురువు. తరువాత నేను ఆంధ్ర విశ్వకళాపరిషత్‌లో ఎం.ఎ.లో చేరాను. నాది చరిత్ర శాఖ. రమణయ్య మధ్యప్రదేశ్‌లోని సాగర్ విశ్వవిద్యాలయంలో రాజనీతిశాస్త్ర శాఖలో చేరాడు. పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత నేను కావలి కళాశాలలో చేరాను. ఇదే 1964లో జవహర్ భారతి అయింది. రమణయ్య కూడా ఎంఏ పూర్తి చేసుకుని కావలి వచ్చాడు. ఆయనలో సమాజ సేవ ఒక తృష్ణలా ఉండేది. అలాంటి దశలోనే కావలి కళాశాల రెక్టర్ దొడ్ల రామచంద్రారెడ్డిగారు రమణయ్యని రాజనీతిశాఖలో అధ్యాపకునిగా నియమించారు. సాహిత్య విమర్శకుడు, వామపక్ష సిద్ధాంతవేత్త కె. వి. రమణారెడ్డి, నా భార్య లలిత కూడా ఆ శాఖలోనే ఉండేవారు. రమణయ్యని అలుపెరుగని సేవకుడని నేను ఊరికే అనలేదు. 1978 నాటి తుపాను బీభత్సం, తరువాత కావలి పట్టణంలో సర్వనాశనమైన పేదలకు ఆయన అందించిన సేవ, ఆఖరికి మా అందిరికీ కూడా అభయ హస్తంలా నిలిచాడు కాబట్టే అలా చెప్పాను. ఆ దృశ్యాలు నాకు ఇప్పటికీ గుర్తే. నాకు ఎప్పటికీ మరపురాని ఘటన– 1981లో జవహర్ భారతి ప్రిన్సిపాల్ పదవి నేను చేపట్టాలని ఆయన పడిన తపన. ఆ సందర్భం అలాంటిది. నిజానికి ఆ తపనలో ఉన్నది కళాశాల గౌరవ ప్రతిష్టలను కాపాడాలన్న సదాశయం ఒక్కటే. ఇలాంటి విద్య, సామాజిక సేవ ఒక ఎత్తయితే, రమణయ్య సాహిత్యానికీ, పుస్తక ప్రచురణకీ చేసిన సేవ మరొక ఎత్తు. ఇది తెలుగు భాషకు, అభ్యుదయ భావాలకు ఆయన చేసిన సేవగా నేను భావిస్తాను. ఆయన వెలువరించిన పుస్తకాలని ఆయన అభిరుచికి గీటురాళ్లుగా గౌరవిస్తాను కూడా. ప్రపంచ స్థాయి జ్ఞాన వీచికలని తెలుగునాట వీచేటట్టు చేయడానికి ఆయన పడిన శ్రమ వృథా కాలేదు కూడా. కావలిలోనే మేం ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు శతజయంతి వేడుకలు నిర్వహించాం. మళ్లీ ఈ బాధ్యత నెత్తికెత్తుకున్నవాడు రమణయ్యే. ‘ఉన్నవ రచనలు కొన్ని’ పేరుతో ఒక పుస్తకం వెలువరించాం. మాలపల్లి నవలకు ఏఆర్ కృష్ణ బృందం నాటక రూపం ఇచ్చింది. ఆ బృందంతో కావలిలో ప్రదర్శన ఏర్పాటు చేశాం. సొసైటీ ఫర్ సోషల్ చేంజ్ అనే ఒక వేదిక ఉండేది. దాని ద్వారా కొంత సేవ జరిగింది. దాదాపు పదిహేనేళ్లు కష్టపడి ఒక తపస్సులా ఆయన కొన్ని ప్రత్యేక సంకలనాలను వెలురించాడు. దొడ్ల రామచంద్రారెడ్డి(జవహర్ భారతి వ్యవస్థాపకులు) గారు విద్యారంగానికి చేసిన సేవ విశేషమైనది. ఆయన పేరుతో రమణయ్య ఒక ప్రత్యేక సంచికను 2005లో వెలువరించారు. ‘అక్షర’పేరుతో వచ్చిన ఈ అభినందన సంచికలో 200 వ్యాసాలకు చోటు కల్పించారు. మళ్లీ 2008లోనే ‘ఇయర్స్ ఆఫ్ విజన్ – పద్మభూషణ్ పీఆర్ రావు ఫెస్టస్బ్రిఫ్ట్’ సంచికను 299 వ్యాసాలతో ప్రచురించారు. ‘మధు మురళి–షెనాలియర్, పద్మభూషణ్ బాలమురళి అభినందన, (61 వ్యాసాలు, 2010); ‘శంకరన్’, (146 వ్యాసాలు 2012); ‘పరిశోధన– సామల సదాశివ స్మృతి సంచిక’, (244 వ్యాసాలు, 2014). ఏ మనిషికైనా దేహయాత్ర ఒక చోట ఆగిపోతుంది. గొప్ప ఆశయాలు కలిగిన వాళ్లు, నిస్వార్థపరులు మిగిల్చి వెళ్లిన ధోరణి అనంతంగా సాగుతూనే ఉండాలని కోరుకుందాం. అదే అలాంటి వారికి మనమిచ్చే నివాళి. రమణయ్యగారి సేవా దృక్పథం, అభిరుచి మన సమాజ హితం కోసం అలా కొనసాగడం అవసరం. ప్రొ. వకుళాభరణం రామకృష్ణ వ్యాసకర్త హెచ్‌సీయూ విశ్రాంత ఆచార్యులు -
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మురళీ రామకృష్ణ
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గంటా మురళీ రామకృష్ణ, దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా కొఠారు అబ్బయ్య చౌదరి నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నేతలను ఈ పదవుల్లో నియమించినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. -
సస్పెన్స్ థ్రిల్లర్
రామకృష్ణ, అంకిత జంటగా సస్పెన్స్, థ్రిల్లర్ కథతో తెరకెక్కిన చిత్రం ‘ఉందా..లేదా?’. వెంకట శివప్రసాద్ దర్శకత్వంలో జయకమల్ ఆర్ట్ బ్యానర్‌పై అమనిగంటి అయితం ఎస్.కమల్ నిర్మించారు. శ్రీ మురళి స్వరపరిచిన ఈ చిత్రంలోని రెండు పాటలను దర్శకుడు మారుతి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ–‘‘టైటిల్ క్యాచీగా, టీజర్ ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ చిత్రంలోని ‘ఉందా లేదా..’ టైటిల్ సాంగ్ నాకు బాగా నచ్చింది. ఈ సినిమా హిట్ సాధించి, యూనిట్‌కు మంచి పేరు తీసుకొస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ–‘‘ సస్పెన్స్ , థ్రిల్లర్ నేపథ్యంలో మా చిత్రం తెరకెక్కింది. ఇందులో సన్నివేశాలు ప్రేక్షకులకు ఆసక్తి కలిగిస్తాయి. టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మారుతిగారు పాటలు విడుదల చేయడం హ్యాపీ. అన్నివర్గాల ప్రేక్షకులు మెచ్చే వాణిజ్య హంగులున్న చిత్రమిది’’ అన్నారు. ఎస్.కమల్, రామకృష్ణ, అంకిత, శ్రీమురళి, హాస్యనటుడు సాయి పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్ కె. బంగారి. -
పోలవరం నిర్వాసితుల సమస్యలపై పోరాటం
26న అఖిపక్ష సమావేశం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పోలవరం రూరల్ : పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై పోరాటం చేపడతామని సీపీఐ రాష్ట్ర క్యాదర్శి కె.రామకృష్ణ చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలోని ఆర్థికవేత్త డాక్టర్ పెంటపాటి పుల్లారావు నివాసం వద్ద ఆదివారం ఉభయగోదావరి జిల్లాల నిర్వాసితులు, రైతుల సమావేశం జరిగింది. సమావేశంలో నిర్వాసితుల తమ సమస్యలు, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అమలు తీరుపై వివరించారు. ముఖ్యఅతిథిగా రామకృష్ణ మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం జరిగేంతవరకూ పోరాడతామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.40వేల కోట్లు ఖర్చుచేస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మరో రూ.2 కోట్లు వెచ్చించి నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్లకు లబ్ధిచేకూర్చేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొగ్గుచూపిస్తున్నారని విమర్శించారు. 2013 కొత్త భూసేకరణ కొత్త చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి నిర్వాసితుల సమస్యలను వివరిస్తామని చెప్పారు. ఈ నెల 26న విజయవాడలో అన్ని రాజకీయపార్టీల నాయకులు, రైతు సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహిస్తామని, ఆ సమావేశానికి ప్రతి మండలం నుంచి నలుగురు నిర్వాసితులు తరలి రావాలని కోరారు. కార్యక్రమంలో అఖిల భారత కిసాన్ సంఘ్ ఉపాధ్యక్షులు ఆర్.వెంకయ్య పాల్గొన్నారు. -
‘కిలా’కు చేరుకున్న మంత్రి జూపల్లి బృందం
నేడు, రేపు కేరళ పంచాయతీరాజ్ వ్యవస్థపై అధ్యయనం సాక్షి, హైదరాబాద్: రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం కేరళకు బయల్దేరి వెళ్లిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు త్రిశూర్ జిల్లాలోని కేరళ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్(కిలా)కు చేరుకున్నారు. అంతకు ముందు కొచ్చి విమానాశ్రయంలో మంత్రికి శ్రీమూల నగర పంచాయతీ పాలకవర్గం ఘనంగా స్వాగతం పలికింది. ఎయిర్ పోర్టు పరిధిలోని తమ గ్రామాన్ని సందర్శించాలని పంచాయతీ ప్రెసిడెంట్ ఆల్ఫోన్సా వర్గీస్, వైస్ ప్రెసిడెంట్ కేసీ మార్టిన్, సభ్యులు వీవీ సెబాస్టియన్, మంజు తదితరులు మంత్రి జూపల్లి కృష్ణారావును ఆహ్వానించారు. కేరళలో పంచాయతీరాజ్ వ్యవస్థ పనితీరుపై ఎరుుర్ పోర్టు లాంజ్‌లోనే కొంతసేపు గ్రామ పంచాయతీ ప్రతినిధులతో మంత్రి చర్చించారు. తమ గ్రామంలో దాదాపు 25 వేల జనాభా ఉంటుందని, ప్రతి ఇంటికి ఓపెన్ వెల్స్ ద్వారానే మంచినీటిని సరఫరా చేస్తున్నామని వారు వివరించారు. ప్రతి ఇంటికీ వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించినట్లు మంత్రికి తెలిపారు. ఎయిర్ పోర్టులో మంత్రి జూపల్లి నేతృత్వంలో వచ్చిన తెలంగాణ అధికారుల బృందానికి ‘కిలా’ప్రొఫెసర్ రామకృష్ణ సాదర స్వాగతం పలికారు. రాత్రికి త్రిసూర్‌లోని కేరళ ఇనిస్టిట్యూట్లోనే బసచేసిన అధికారుల బృందం.. శుక్రవారం ఉదయం కిలా డెరైక్టర్, ఇతర ప్రతినిధులతో భేటి కానుంది. అనంతరం వెంకిటంగు గ్రామ పంచాయతీని జూపల్లి కృష్ణారావు, పంచాయతీరాజ్ కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెస్లీ, శేషాద్రి సందర్శించనున్నారు. శనివారం ఎర్నాకులం జిల్లా పంచాయతీ, ఒట్టపాలం బ్లాక్ పంచాయతీలను బృందం పరిశీలించనుంది. -
ఇంతకీ ఆర్కే ఎక్కడ ?
-
'రెయిన్ గన్ పేరుతో బాబు హడావిడి'
అనంతపురం: పంటలు ఎండిపోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమని సీపీఐ నేత రామకృష్ణ మండిపడ్డారు. ఓ పక్క పంటలు ఎండిపోతుంటే అధికారులకు పుష్కరాల పనులు అప్పగించారని ఆయన విమర్శించారు. పుష్కరాల సమయంలో పంటలు ఎండిపోతోంటే ఏ ఒక్కరూ పట్టించుకోకుండా.. ఇప్పుడు రెయిన్ గన్ పేరుతో చంద్రబాబు హడావిడి చేస్తున్నారన్నారు. సెప్టెంబర్ 2న జరిగే కార్మిక సమ్మెకు మద్దతిస్తామని రామకృష్ణ వెల్లడించారు. -
పార్టీ ఫిరాయించేవారు రాజకీయ మగవేశ్యలు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఘాటు వ్యాఖ్యలు విజయనగరం క్రైం/ అల్లిపురం(విశాఖ): ఒకపార్టీ గుర్తుతో గెలిచి మరో పార్టీలో చేరి ఫిరాంపులకు పాల్పడటం రాజకీయ మగ వేశ్యల లక్షణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వ్యాఖ్యానించారు. శనివారం విజయనగరం కోట జంక్షన్ వద్ద జరిగిన ఓ కార్యక్రమంలోనూ, విశాఖలో విలేకరుల సమావేశంలోనూ ఆయన మాట్లాడారు. తాము చేస్తున్న అభివృద్ధిని చూసే పార్టీలోకి చేరుతున్నారని బాబు చెబుతున్నారని.. అసలు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని నిలదీ శారు. టీడీపీలోకి వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు రూ.5కోట్లు, రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు, ఎన్నికల ఖర్చు భరిస్తామని చెప్పడంతోనే వారు చేరుతున్నారని పేర్కొన్నారు. -
రైలు నుంచి జారిపడి విద్యార్థి మృతి
ఖమ్మం రైల్వేస్టేషన్లో ఆదివారం ఉదయం రైలు దిగుతూ జారి పడి రామకృష్ణ(23) అనే విద్యార్థి మృతిచెందాడు. కోచింగ్ నిమిత్తం హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రామకృష్ణది చింతూరు మండలం ఎర్రసీతనపల్లి గ్రామం. రైల్వే పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. -
'ఆర్థిక అరాచకాలకు విజయవాడ అడ్డాగా మారింది'
విజయవాడ: కాల్‌మనీ వ్యవహారంలో విచారణ జరుపుతున్న పోలీసులపై అధికార పార్టీ ఒత్తిడి ఉందని ఆదివారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఆర్థిక అరాచకాలకు విజయవాడ అడ్డాగా మారిందన్న ఆయన.. కాల్‌మనీ వ్యవహారంలో నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో మహిళలకు న్యాయం జరగకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తామని రామకృష్ణ హెచ్చరించారు. -
ప్రత్యేక హోదా ప్రకటన రాకుంటే జైల్ భరో
ప్రత్యేక హోదాపై రాజధాని శంకుస్థాపనకు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జైల్ బరో కార్యక్రమానికి పిలుపునిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కోసం నిరంతర పోరాట కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించిట్లు రామకృష్ణ తెలిపారు. అక్టోబర్ రెండో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు, ఎనిమిదో తేదీ నుంచి పాదయాత్ర కార్యక్రమం ద్వారా ప్రజలను చైతన్యవంతం చేస్తామని వివరించారు. రాజధాని శంకుస్థాపనకు వస్తున్న ప్రధానికి ప్రత్యేక హోదా కోసం సామూహిక రాయబారం చేయనున్నామని తెలిపారు. -
రైలు కింద పడి వ్యక్తి మృతి
అనంతపురం : అనంతపురం నగరంలోని స్థానిక పీటీసీ సమీపంలో ఓవర్ బ్రిడ్జి వద్ద గురువారం ఓ వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు... పాతూరులోని ఐలమ్మ కాలనీకి చెందిన చాకలి రామకృష్ణ (49) మునిసిపల్ కాంప్లెక్స్‌లో ఉన్న ఓ డ్రైక్లీనింగ్ దుకాణంలో పని చేస్తుండేవాడు. ఈయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ నెల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బుధవారం తిరిగి వచ్చాడు. పని చేసే దుకాణానికి వెళ్లి డబ్బులు ఇప్పించుకుని మద్యం సేవించాడు. తర్వాత ఎక్కడికి పోయాడో తెలీదు. గురువారం రైలు పట్టాలపై శవమై కనిపించాడు. ఇదే చోట రెండు పందులు కూడా మృతి చెందాయి. ఏమైనా పందుల పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెంది ఉంటాడా ? అనే కోణంలో విచారిస్తున్నారు. ఆత్మహత్య చేసుకుంటే శవాన్ని రైలు లాక్కెల్లే అవకాశాలు తక్కువగా ఉంటాయని, అయితే రామకృష్ణ మృతదేహం సుమారు పది అడుగుల మేరకు లాక్కెళ్లిన ఆనవాళ్లు పోలీసులు గుర్తించారు. దీంతో ప్రమాదవశాత్తూ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న రైల్వే ఎస్ఐ ఇస్మాయిల్ ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
చంద్రబాబు ప్రజాద్రోహి
ఏపీకి ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలమై ప్రజా ద్రోహిగా మిగిలారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ విమర్శించారు. బుధవారం అనంతపురంలో కేంద్రప్రభుత్వ కార్యాలయాల ముట్టడి చేపట్టిన తమ నాయకులపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేవరకు తమ పోరాటాలు ఆపమన్నారు. అంద రిని కలుపుకుని ఉద్యమిస్తామన్నారు. బుక్కరాయసముద్రం: రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు తీవ్ర అన్యాయం చేసి ప్రజాద్రోహిగా ముద్ద వేసుకున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ విమర్శించారు. రిమాండ్‌లో ఉన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ, జిల్లా కార్యదర్శి జగదీష్, ఇతర నాయకులను ములాఖత్ ద్వారా శుక్రవారం ఆయన జిల్లా జైలులో కలిశారు. అనంతరం ఆయన మీడియా వారితో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పనలో చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలమయ్యారన్నారు. కేంద్ర మంతి వెంకటయ్య నాయుడు 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పిన మాట ఎందుకు నిలబెట్టుకోలేక పోయారన్నారు. రాష్ట్రాన్ని బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు నట్టేట ముంచాయన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో పొందు పరచిన హామీలు అప్పటిలో కేంద్ర కేబినెట్, పార్లమెంట్ ఆమోదం తెలిపాయన్నారు. ఈ విషయంపై కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిలదీయ లేక పోతోందన్నారు. తెలుగు ప్రజల హక్కులు సాధించేం దుకు రాజకీయ పోరాటం చేస్తారా? లేదా భిక్షాందేహి అంటూ భిక్ష పాత్ర పట్టుకుని ఢిల్లీలో అడుక్కు తింటారా? తేల్చుకోండని చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇంత అన్యాయం జరుగుతున్నా కేంద్ర మంత్రి పదవులలో ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. వెంటనే బీజేపీతో తెగతెంపులు చేసుకునే దమ్ము ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. సీఎంకు, మంత్రులకు ఏమాత్రం చిత్త శుద్ధి ఉన్నా మంత్రి పదవులను త్యజించి పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. లేదంటే ప్రజా ద్రోహులుగా నిలిచి పోతారన్నారు. అనంతపురం నుంచి పోరాటాలకు నాంది మాత్రమేనన్నారు. ఏప్రిల్ నుంచి రాష్ట్రమంతటా రాజకీయ నాయకుల మద్దతు కూడగట్టుకుని పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు. సీపీఐ నేతలను బేషరతుగా వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ విషయంలో ముఖ్య మంత్రి చంద్రబాబు జోక్యం చేసుకోవాలన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణతో సహా ఏడుగురిపై నాన్‌బె యిల బుల్ కేసులు నమోదు చేయడాన్ని నారాయణ తీవ్రంగా ఖండించారు. సీపీఐ నేతలు రాజారెడ్డి, జాఫర్, రమణ, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. -
మనం..మనం..ఒకే గణం
సాక్షి ప్రతినిధి, గుంటూరు : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కుల సమీకరణలు, ఎత్తుకు పైఎత్తులు ప్రారంభమయ్యాయి. యూటీఎఫ్ మద్దతుతో ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు, టీడీపీ మద్దతుతో ఏఎస్ రామకృష్ణ పోటీ చేస్తున్నారు. మూడోసారి పోటీ చేస్తున్న లక్ష్మణరావుకు ఉపాధ్యాయ సంఘాల నుంచి మద్దతు లభిస్తుండటంతో, గెలుపే ధ్యేయంగా టీడీపీ ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది. వివిధ సామాజిక వర్గాల్లో పేరు ప్రతిష్టలు కలిగిన ఆ పార్టీ నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. వాటికి అదే సామాజిక వర్గానికి చెందిన ఉపాధ్యాయులను ఆహ్వానించి పార్టీ మద్దతు పలికిన ఏఎస్ రామకృష్ణకు ఓట్లు వేసి గెలిపించాలని కోరుతోంది. ఆదివారం గుంటూరులోని గ్రాండ్ నాగార్జున హోటల్లో యాదవ సామాజిక వర్గానికి చెందిన ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమావేశం జరిగింది. దీనికి టీడీపీ అర్బన్ అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాసయాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ బలపరిచిన అభ్యర్థి ఏఎస్ రామకృష్ణకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. టీడీపీ యాదవ సామాజిక వర్గానికి మొదటి నుంచి ప్రాధాన్యం ఇస్తోందని, యాదవ సామాజిక వర్గానికి చెందిన అనేక మంది కార్యకర్తలు ఇప్పుడు పార్టీలో, ప్రభుత్వంలో ముఖ్య బాధ్యతలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇదే విధంగా టీడీపీలో ఇతర సామాజిక వర్గాల నేతలు ఆ సామాజిక వర్గానికి చెందిన ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించే ఏర్పాట్లు చేస్తోంది. ఇదిలావుంటే, ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి చేసిన సేవలే తనను గెలిపిస్తాయనే భావనతో ఎమ్మెల్సీ లక్ష్మణరావు ప్రచారంలో దూసుకువెళుతున్నారు. బీసీ వర్గాల నుంచి మూడో అభ్యర్థి .. ఈ సారి జరగనున్న ఎన్నికల్లో త్రిముఖ పోటీ అనివార్యం కానున్నది. తాజాగా దళిత, గిరిజన, బీసీ సంఘాల నుంచి అభ్యర్థిని బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి మొత్తం 18,006 మంది ఓటర్లు ఉండగా, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన ఓట్లు 10 వేల వరకు ఉన్నాయి. తమ వర్గాల నుంచి అభ్యర్థిని బరిలోకి దింపితే కనీసం ఆరు వేల ఓట్లు పడినా గెలుస్తాడనే భావనలో ఈ సంఘాలు ఉన్నాయి. ఈ వర్గాల నుంచి దీటైన అభ్యర్థిని నిలిపే బాధ్యతను న్యాయవాది వైకేకు అప్పగించారు. అభ్యర్థి ఎంపికపై ఈ వర్గాలు ఇప్పటికే ఒకటికి రెండుసార్లు సమావేశమయ్యారు. ఆదివారం ఉదయం జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థి ఎంపికపై ఏకాభిప్రాయానికి వస్తామని వైకే ఈ సందర్భంగా ‘సాక్షి ప్రతినిధి’కి వివరించారు. -
అక్రమాలపై కృష్ణ చక్రం
సాక్షి, గుంటూరు: బియ్యం, ఇసుక, కిరోసిన్ అక్రమ రవాణాపై గుంటూరు రూరల్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ సీరియస్‌గా దృష్టి సారించారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలోనే ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసి ఇసుక అక్రమ వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు.ఇసుక అక్రమ రవాణాకు సహకరిస్తున్న సీఐలు, ఎస్ఐలపై సస్పెన్షన్ వేటు వేశారు. మరి కొందరిని వీఆర్‌కు పంపారు. గతంతో పోలిస్తే ఇసుక అక్రమ రవాణా ఇప్పుడు తగ్గింది. అయితే రాత్రిళ్లు వారి కార్యకలాపాలు అధికమయ్యాయని అందిన ఫిర్యాదుల మేరకు రాత్రి గస్తీని ముమ్మరం చేశారు. జిల్లాలో చౌకధరల దుకాణాల ద్వారా పేదలకు అందాల్సిన రేషన్ సరుకులు బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్న విషయం అందరికీ తెలిసిందే. గతంలో విజిలెన్స్ అధికారులు హడావుడి చేసినప్పుడల్లా మిన్నకుండే అక్రమ వ్యాపారులు ఆ తరువాత ఎప్పటిలా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం దాచేపల్లి, నాగార్జునసాగర్ వద్ద రెండు సరిహద్దు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడంతో అక్రమ రవాణాకు చెక్ పడినట్లేనని అంతా భావించారు. అయితే అక్రమార్కులు అక్కడి ఉద్యోగులను సైతం మేనేజ్ చేసి తమ వ్యాపారాన్ని యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. జిల్లాలో బెల్ట్‌షాపులు రద్దు చేసినప్పటికీ అర్ధరాత్రి వరకూ తెరిచి ఉంచి మద్యం అమ్మకాలు సాగిస్తున్నారని తీవ్ర స్థాయిలో ఫిర్యాదులు అందడంతో రూరల్ ఎస్పీ సీరియస్‌గా ఉన్నారు. రహస్య టీమ్‌ల ఏర్పాటు ... జిల్లాలో అక్రమ వ్యాపారాలు, రవాణాలపై అందుతున్న ఫిర్యాదుల మేరకు గుంటూరు రూరల్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ రహస్యంగా తనకు నమ్మకంగా ఉండే అధికారులతో ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. రాత్రి వేళ తనకు వచ్చే సమాచారాన్ని ఈ టీమ్‌లకు అందించి వారి ద్వారా దాడులు నిర్వహిస్తున్నారు. ఈ విధానంలో నాలుగురోజుల్లోనే సుమారు 10 లారీల బియ్యాన్ని పట్టుకున్నారు. దాడులు చేస్తున్నట్లు ఆ ప్రాంతంలోని పోలీస్ అధికారులకు సైతం సమాచారం అందించడం లేదు. వరస దాడులు చేస్తూ అక్రమంగా బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకున్నచోట స్థానిక అధికారులపై ఎస్పీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. బియ్యంతోపాటు ఇసుక, బెల్టుషాపులపై కూడా ఎస్పీ నియమించిన రహస్య టీమ్ దాడులు చేస్తుండటంతో పోలీస్ అధికారులు హడలిపోతున్నారు. ఇటీవల బియ్యం మాఫియాకు సహకరిస్తున్నారనే కారణంతో దాచేపల్లి ఎస్ఐ కోటేశ్వరరావును వీఆర్‌కు పంపారు. దీంతో అప్రమత్తమైన గురజాల డీఎస్పీ పూజ మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లోని రేషన్ డీలర్లతో సమావేశం ఏర్పాటు చేసి హెచ్చరికలు జారీ చేశారు.దీనికితోడు ఇటీవల జరిగిన బదిలీల్లో రాజకీయంగా ఒత్తిడి తెచ్చి పోస్టింగ్‌లు వేయించుకున్న పలువురు సీఐల పనితీరుపైఎస్పీ ప్రత్యేక నిఘా ఉంచినట్లు సమాచారం. -
సింగపూర్ వాసులను కేబినెట్ లో చేర్చుకుంటారేమో!
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. రుణమాఫీ విషయంలో చంద్రబాబు వ్యవహారం కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందని విమర్శించారు. రైతులను దొంగలుగా చిత్రీకరించడం ఆయనకు తగదని రామకృష్ణ సూచించారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లుగా రుణాలన్నీ మాఫీ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఒక పైసా మాఫీ చేయకుండానే చంద్రబాబు సన్మానాలు చేయించుకుంటున్నారని రామకృష్ణ చురకలంటించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారన్నారు. రాజ్యాంగం అనుమతిస్తే సింగపూర్ వాసులను చంద్రబాబు మంత్రి వర్గంలో చేర్చుకుంటారేమోనని రామకృష్ణ ఎద్దేవా చేశారు. -
'చంద్రబాబు నరకం చూపిస్తున్నాడు'
అనంతపురం: రాష్ట్రంలోని రైతులు, మహిళలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నరకం చూపిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. శనివారం అనంతపురం వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... రుణమాఫీ అంటూ ఓట్లేయించుకున్న చంద్రబాబు ... సీఎం పదవి చేపట్టి రెండు నెలలు అయిన రుణాలు మాఫీ చేయలేదని ఎద్దేవా చేశారు. బ్యాంకర్లు రైతులకు నోటీసులు ఇస్తున్న బాబు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రుణాలు మాఫీ చేయకపోతే ఏడాదిలో చంద్రబాబు ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని రామకృష్ణ జోస్యం చెప్పారు. -
ఎర్రచందనం స్మగ్లింగ్ నియంత్రణకు చర్యలు : డీజీపీ
నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్: నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను నియంత్రించేందకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని డీజీపీ బి.ప్రసాదరావు తెలిపారు. డీజీపీ తిరుపతి నుంచి రోడ్డుమార్గాన శనివారం సా యంత్రం 5.45 గంటలకు నెల్లూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గుం టూర్ రేంజ్ ఐజీ పీవీ సునీల్‌కుమార్, ఎస్పీ పీవీఎస్ రామకృష్ణ, విజిలెన్స్ అధికారులు, పలువురు పోలీసు సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం పోలీసు కవాతుమైదానంలో ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అధికారులతో ఆయన నేరసమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో నేరాల తీరు, తీసుకుంటున్న చర్యలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తిలకించారు. సిబ్బందికి పలు సూచనలిచ్చారు. రాబోయే ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పక్కాప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 175 కిలోమీటర్ల మేర జాతీయరహదారి విస్తరించి ఉందన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలు అధికమయ్యాయన్నారు. వాటిని నియంత్రించేందుకు హైవేపై పెట్రోలింగ్ ముమ్మరం చేస్తామన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి ఇప్పటికే పోలీసు సిబ్బంది విసృ్తత తనిఖీలు, దాడులు నిర్వహించి స్మగ్లర్ల భరతం పడుతున్నారన్నారు. పూర్తిస్థాయిలో స్మగ్లింగ్‌ను కట్టడి చేస్తామన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులు, లైంగిక వేధింపులపై ఫిర్యాదులు స్వీకరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా యూనిక్ నంబర్‌ను త్వరలోనే ప్రవేశపెడుతున్నామని చెప్పారు. రిటైర్డ్ సిబ్బందిని పర్యవేక్షణ అధికారులుగా నియమించి వారి సమస్యలు వెంటనే పరిష్కారమయ్యేలా చూస్తామన్నారు.సివిల్ వివాదాల్లో తలదూర్చరాదని, అలాంటి సమస్యలు వస్తే లోక్‌అదాలత్‌కు పంపాలని అధికారులను ఆదేశించామన్నారు. వైట్‌కాలర్ నేరాలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. పెరుగుతున్న జనాభాకు సరిపడా సిబ్బంది లేరన్న విషయాన్ని విలేకరులు ప్రశ్నించగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 35 వేల మంది సిబ్బందిని నియమించామన్నారు. జిల్లా తీర ప్రాంతాల్లో చొరబాటుదారులు చొచ్చుకుని వచ్చే ప్రమాదముందన్న సంకేతాల నేపథ్యంలో తీర ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశామన్నారు. అందులో భాగంగానే ఇస్కపల్లి, దుగ్గరజాపట్నం, శ్రీహరికోటల్లో మెరైన్ పోలీసుస్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులు త్వరితగతిన పరిష్కారమయ్యేలా చూడాలని సిబ్బందిని ఆదేశించామన్నారు. క్యాప్ సందర్శన డీజీపీ బి.ప్రసాద్‌రావు తన సతీమణి బి.సౌమిణితో కలిసి కొండాయపాళెం గేటు సమీపంలోని పోలీసు అండ్ ైచె ల్డ్ ప్రాజెక్ట్(క్యాప్)ను శనివారం రాత్రి సందర్శించారు. పోలీసు హాస్టల్లోని విద్యార్థులకు కంప్యూటర్లు, మంచాలు, దుస్తులు, పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూర్ రేంజ్ ఐజీ పీవీ సునీల్‌కుమార్, నగర, రూరల్ శాసనసభ్యులు ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, ఆనం వివేకానందరెడ్డి, ఎస్పీ రామకృష్ణ పాల్గొన్నారు. -
ఎన్నికల బదిలీలు
నెల్లూరు(నవాబుపేట), న్యూస్‌లైన్: పోలీస్‌శాఖలో బదిలీల జాతరకు తెర లేచింది. జిల్లాలో ఒకేసారి 48 మంది ఎస్ఐలను బదిలీ చేశారు. ఎస్పీగా పీవీఎస్ రామకృష్ణ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఎస్ఐల బదిలీలపై కసరత్తు జరుగుతోంది. అయితే ఎన్నడూ లేనంతగా ఒకేసారి ఇంత మందిని బదిలీ చేసి రికార్డు సృష్టించారు. 48 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ ఆదివారం ఉత్తర్వులిచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బదిలీల్లో రాజకీయ, పైరవీల మార్క్ స్పష్టంగా కన్పించింది. కొత్తగా శిక్షణ పూర్తి చేసుకున్న 35 మంది ఎస్ఐలకు పోస్టింగులు ఇవ్వడంతో పాటు రెండేళ్ల పాటు ఒకేచోట పని చేసిన వారిని బదిలీ చేశారు. పనితీరు బాగున్నా ప్రాధాన్యం కల్పించలేదని పలువురు ఎస్ఐలు ఆవేదన వ్యక్తం చేశారు. శిక్షణ పూర్తి చేసుకుని పోస్టింగ్‌లు పొందిన ఎస్సైలకు రానున్న ఎన్నికలు పెద్దసవాల్ కానున్నాయి. గూడూరు ఒకటో పట్టణ, నె ల్లూరు రూరల్, నెల్లూరు ఐదో నగరం, సీసీఎస్, నాల్గో నగరం, ఒకటో నగరం, మహిళా, సౌత్‌ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల ఎస్సైలను రేంజ్, జిల్లా వీఆర్లకు బదిలీ చేశారు. వీరి స్థానంలో ఎవరినీ నియమించలేదు. దీంతో మరోమారు బదిలీలు జరిగే అవకాశాలున్నట్టు సమాచారం. త్వరలో ఎన్నికలు జరగనున్నా దృష్ట్యా తమకు అనుకూలమైన అధికారులకు పోస్టింగ్ ఇప్పించుకునేందుకు రాజకీయ నేతలు పెద్ద ఎత్తున ఒత్తిళ్లు తెస్తున్నట్టు తెలిసింది. -
స్ట్రక్చరల్ డిజైనింగ్‌లో మేటి
కొవ్వూరు, న్యూస్‌లైన్:అనుమోలు రామకృష్ణ కొవ్వూరులోనే పుట్టారు. గోదావరి గట్టువెంబడి తిరిగారు. ఇక్కడే చదివారు. దేశం గర్వించే వ్యక్తిగా ఎదిగారు. 1939 డిసెంబర్ 20న జన్మించిన రామకృష్ణ ఇంటర్మీడియెట్ వరకూ కొవ్వూరులో విద్యనభ్యసించారు. ఆంధ్రా యూనివర్శిటీలో ఇంజనీరింగ్ చేసిన అనంతరం తూర్పు జర్మనీ వెళ్లారు. అక్కడ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్‌లో రాణించారు. నిర్మాణ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థలను ముందుండి నడిపించారు. సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో రామకృష్ణ అందించిన సేవలను గుర్తిం చిన కేంద్ర ప్రభుత్వం ఆయన మరణానంతరం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. ఆయన గత ఏడాది ఆగస్టు 20న పరమపదించారు. రామకృష్ణ తండ్రి వెంకటప్పయ్య ఉద్యోగరీత్యా కృష్ణాజిల్లా నుంచి వచ్చి కొవ్వూరులో స్థిరపడ్డారు. ఇక్కడి ప్రభుత్వ పాఠశాలలో 34 ఏళ్లపాటు ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశారు. వెంకటప్పయ్య దంపతులకు ఇద్దరు కుమారులు కాగా, రామకృష్ణ మొదటి వారు. రెండో కుమారుడు సత్యనారాయణ ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైరయ్యూరు. రామకృష్ణ కుటుంబం చెన్నయ్‌లో స్థిరపడింది. తండ్రి జ్ఞాపకార్థం సేవలు రామకృష్ణ తండ్రి వెంకటప్పయ్య జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులంతా కలసి 2009లో వెంకటప్పయ్య చారిటబుల్ ట్రస్టును నెలకొల్పారు. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు నాలుగేళ్ల నుంచి స్కాల ర్షిప్లు అందిస్తున్నారు. ఉపాధ్యాయులను పురస్కారాలతో సత్కరిస్తున్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు విద్యార్థులకు పుస్తకాలు, ఫీజులు వంటివి చెల్లిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాతోపాటు కృష్ణాజిల్లాలోనూ ట్రస్టు ద్వారా సేవలందిస్తున్నారు. కొవ్వూరు వాసికి అరుదైన గౌరవం దక్కడంతో పట్టణ ప్రజలు ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు. -
నడిపించే ‘అభయ’ హస్తం!
పదేళ్ల చౌడేశ్వరి ఊరెళ్లాలనే ఉత్సాహంలో ప్లాట్‌ఫారమ్ అంచుకొచ్చింది... రైలు వేగానికి పట్టుతప్పి పడిపోయింది. మరో అమ్మాయి వాటర్ ట్యాంకు నిండిందేమోనని చూస్తూ జారి కరెంట్ వైర్ మీద పడిపోయింది. ఇస్త్రీ చేసుకుని బతికే యువకుడు పక్కనే ఉన్న కరెంట్ వైర్ షాక్‌తో అవిటివాడయ్యాడు... వీళ్లంతా ఇప్పుడు నడుస్తున్నారు... విధి వక్రించిన వీళ్లను వేలు పట్టి నడిపించిన మేనమామ చేవూరి రామకృష్ణ! చేవూరి రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ వికలాంగుల కార్పొరేషన్లో ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా రిటైర్ అయ్యారు. తన రిటైర్మెంట్ ఉద్యోగానికే కానీ ప్రవృత్తికి కాదంటారాయన. పద్మారావునగర్‌లోని వీరి ఇంట్లో అడుగుపెడితే ‘అభయ వాలంటరీ ఆర్గనైజేషన్’ ఆధ్వర్యంలో వీరు చేస్తున్న సేవకు నిదర్శనంగా వికలాంగులకు అమర్చే కాలిపర్లు, కృత్రిమ కాళ్లు కనిపిస్తాయి. ‘‘ఆంధ్రప్రదేశ్ వికలాంగుల కార్పొరేషన్ యూనిట్ నిమ్స్ హాస్పిటల్లో ఉంది. నా ఉద్యోగం అక్కడే. ఓ నాలుగయిదేళ్ల క్రితం శివసాయి అనే ఏడాదిన్నర పాప గురించి సాక్షి పేపర్లో చదివాను. ఆ పాపకు లివర్ వ్యాధి. ఆ తల్లిదండ్రులు ఖర్చును భరించే స్థితిలో లేరు. వారికి ప్రభుత్వ వైద్యం అందడం లేదని తెలిసి బాధనిపించింది. ‘భగవంతుని దయవల్ల నాకు మంచి జీతం వస్తోంది. పిల్లలు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ప్రభుత్వ సహాయం అందని వాళ్లను చూసి బాధపడి ఊరుకోవడం కంటే ఆ పని నేనే ఎందుకు చేయకూడదు’ అనుకున్నాను. అదే విషయం ఇంట్లో చెప్తే మా ఆవిడ కూడా సరేనన్నది. మా పెద్దబ్బాయి అప్పటికప్పుడు పదివేలిచ్చాడు. ఆ పాపకు ఆమె తల్లి లివర్‌లోని కొంతభాగాన్ని తీసి ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. అలా మొదలైన మా సేవలో ప్రయోజనం పొందిన వాళ్లు ఇప్పటికి మూడువందల మందికి పైగా ఉన్నారు’’ అని చెప్పారు రామకృష్ణ. స్వచ్ఛంద విరాళాలతో... ‘‘శివసాయి ఆపరేషన్ తర్వాత నా ఆలోచనలకు, మానసిక సంఘర్షణకు ఒక రూపం వచ్చినట్లయింది. పుట్టువికలాంగులు, పోలియో వంటి వ్యాధులతో వికలాంగులైన వాళ్లు, ప్రమాదవశాత్తూ కాళ్లు, చేతులు పోగొట్టుకున్న వారు ఎంతోమంది మా దగ్గరకు వచ్చేవాళ్లు. వారిలో వైద్యానికయ్యే ఖర్చును భరించే స్థితిలో లేని వారందరికీ సహాయం చేయడం మొదలుపెట్టాం. మా కాలనీలో వాకర్స్ అసోసియేషన్ వారు ఈ సర్వీస్‌లో భాగస్వాములయ్యారు. మా కోడలు, చిన్నబ్బాయి ఫేస్బుక్ ద్వారా వారి ఫ్రెండ్స్‌ను చైతన్యం చేస్తుంటారు. ఇప్పటికి మా సేవలకు ఆరులక్షలకు పైగా ఖర్చయింది. అందులో ఎక్కువ మొత్తం దాతల విరాళాలే. పేషెంట్లకి కృత్రిమ అవయవాలను దాతల చేతనే ఇప్పిస్తున్నాం. నేను చేస్తున్న సేవాకార్యం గురించి తెలిసి ఎన్. రామకృష్ణ (రిటైర్డ్ డిఫెన్స్ ఉద్యోగి)ఉత్సాహం చూపించారు. వృద్ధాశ్రమాలకు వెళ్లి వైద్యం చేస్తుంటారు. అభయ ఆర్గనైజేషన్ రూపుదాల్చడానికి కారకులు కూడా ఈయనే ’’అన్నారు చేవూరి. ‘అభయ’ హస్తమే! ‘‘పుట్టుకతో వికలాంగులకంటే ప్రమాదాల్లో కాళ్లు, చేతులు పోగొట్టుకున్న వాళ్లు త్వరగా బేలగా మారుతుంటారు. వాళ్లకు వైద్యం కంటే ముందు ధైర్యం చెప్పాలి’’ అన్నారు ఎన్. రామకృష్ణ. మాటే మాకు ప్రచారం! ‘‘డాక్టర్లను కలిసి ‘మీ దగ్గరకు వచ్చిన పేషెంట్లలో వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న వారికి మేము సహాయం చేస్తాం. మాకు ఒక్క ఫోన్ చేస్తే చాలు’ అని చెప్పాం. మా సేవలు అలా నోటి మాటతోనే విస్తరించాయి. మూడేళ్ల పిల్లాడికి హియరింగ్ ఎయిడ్ అమర్చిన తర్వాత మాట్లాడాడు. ఆ తల్లిదండ్రులు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇన్నేళ్లలో అలాంటి ఆనందాలెన్నో చూశాం’’ అన్నారు చేవూరి. - వాకా మంజులారెడ్డి ప్రభుత్వసేవలో కొన్నిసార్లు నిబంధనలే ప్రతిబంధకాలవుతుంటాయి. ప్రభుత్వ వైద్యం అందాలంటే తెల్ల రేషన్ కార్డు ఉండాలి. ఆ కార్డు ఉంటే చలువ దుస్తులు వేసుకున్న వారికి కూడా ఉచితవైద్యం చేయాలి. చిరిగిన దుస్తులతో కాళ్లు విరిగి వచ్చిన వారికి తెల్లకార్డు లేకపోతే ప్రభుత్వవైద్యం అందదు. ఇలాంటి సంఘటన ఎదురైన ప్రతిసారీ ఇదేం న్యాయం అని రామకృష్ణ మనసు రోదించేది. ఆ ఆవేదన నుంచి రూపొందినదే ‘అభయ వాలంటరీ ఆర్గనైజేషన్’. కలాం కల... తేలిక కాలు! అబ్దుల్ కలామ్ మదిలో మెదిలిన ఆలోచనే ఈ ఫ్లోర్ రియాక్షన్ ఆర్థోసిస్. జైపూర్ కాలు మూడున్నర కేజీల బరువు ఉంటుంది. కలాం ప్రయోగంతో 350 గ్రాముల కాలిపర్ తయారైంది. ఆ ప్రాజెక్టులో నేను కూడా పని చేశాను. ఆ అనుభవం వల్ల పేషెంటుకి సరిపోయే టైలర్‌మేడ్ కాలిపర్ని చేయించగలుగుతున్నాను. - చేవూరి రామకృష్ణ, అభయ ఆర్గనైజేషన్ సెక్రటరీ -
అల్లుడా.. మజాకా..!
= మామను బురిడీ కొట్టించిన అల్లుడు = కోట్లు వస్తాయని రూ.35.43 లక్షలు కాజేశాడు అనంతపురం క్రైం, న్యూస్‌లైన్: జామాతా దశమ గ్రహం అన్న నానుడి ఓ యువకుడు నిజం చేశాడు. కాళ్లు కడిగి, కన్యాదానం చేసిన మామను మోసగించి లక్షలాది రూపాయలు కాజేశాడు. ఇందుకు సంబంధించి టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని ఆదర్శనగర్‌లో సహకార శాఖలో పని చేసి రిటైరైన రామకృష్ణ కుటుంబం నివాసముంటోంది. రెండేళ్ల క్రితం తన కూతురికి ఆమె ప్రేమించిన యువకుడు శ్రవణ్‌తో వివాహం చేశాడు. పెళ్లైన కొన్ని రోజులకే మామ ఆస్తిపై కన్నేసిన శ్రవణ్ దాన్ని కాజేసేందుకు వ్యూహం రచించాడు. కామన్ వెల్ఫేర్ సొసైటీ పేరుతో మామ సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటున్న విషయాన్ని ఆధారంగా చేసుకున్నాడు. ఇందులో భాగంగా తాను హైదరాబాద్‌లోని క్రిస్టియన్ ఫోక్ అసోసియేషన్‌కు డెరైక్టర్‌గా పని చేస్తున్నానని, ఇప్పటికే ఆ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికే 21 సొసైటీలు పని చేస్తున్నాయని, మీ సొసైటీని కూడా చేరిస్తే భారీగా విరాళాలు అందుతాయని మామను నమ్మించాడు. ఇందుకోసం స్టాండర్డ్ బ్యాంకులో ఖాతా తెరవాలని, అందులో రూ.2 లక్షలు డిపాజిట్ చేసి, డోనర్స్‌కు ఆ ఖాతా నెంబరు ఇస్తే, వారు అందులో నగదు డిపాజిట్ చేస్తారని తెలిపాడు. ఆ బ్యాంకు సంబంధించిన వివరాలేవీ తనకు తెలియదని రామకృష్ణ చెప్పగా, రూ. రెండు లక్షలు ఇస్తే గంట వ్యవధిలో తన మిత్రులు హైదరాబాదులోని బ్రాంచిలో ఖాతా తెరుస్తాడని చెప్పాడు. మామను పక్కనే పెట్టుకుని ఆన్లైన్లో ఖాతా తెరచినట్లు సెల్‌కు వచ్చిన మెసేజ్ పంపించాడు. మరుసటి రోజే ఆ ఖాతాలో రూ.25 కోట్లు జమ అయినట్లు మరో మెసేజ్ పంపాడు. అంత డబ్బు ఒక్కసారిగా తన ఖాతాలో పడినట్లు తెలియడంతో ఉబ్బితబ్బిబ్బైన రామకృష్ణ ఖాతాలో నిజంగానే అంత డబ్బు జమ అయిందో? లేదో? చూసి రావాలని అల్లుడిని పురమాయించాడు. మరుసటి రోజు వచ్చిన అల్లుడు ఆ రోజు మరో రూ.10 కోట్లు జమ అయిందని చెప్పాడు. అయితే, ఈ మొత్తాన్ని ఆరు నెలల వరకూ వాడుకోడానికి వీలుండదని, అప్పటి వరకూ డిపాజిట్‌గానే ఉంచాలని చెప్పాడు. ఈ మేరకు తన స్నేహితుడైన వర్మ అనే వ్యక్తితో ఫోన్ చేయించి విదేశీయునిలా ఆంగ్లంలో మాట్లాడించాడు. క్రిస్టియన్‌గా మారి సేవలు చేయాలని.. విశ్రాంత జీవితం సుఖ సంతోషాలతో గడపాలంటే క్రిస్టియన్‌గా మారాలని, అలా చేస్తే మీ పేరు మీద చర్చి కట్టిస్తామని, అందుకు కొంత మొత్తం ముందస్తుగా చెల్లిస్తే, పనులు చేపట్టేందుకు త్వరలో తమ దేశం నుంచి సహకరిస్తామని విదేశీయుడిలా తానే ఫోన్ చేసి తెలిపాడు. అది కూడా నిజమని నమ్మిన రామకృష్ణ అల్లుడి చేతికి డబ్బు అందజేశాడు. ఈ క్రమంలో ఆర్థికంగా చితికి పోయాడు. లెక్కలు చూసుకుంటే అల్లునికి అప్పగించిన సొమ్ము రూ. 35.43 లక్షలుగా తేలింది. అల్లుని వైఖరిలో వచ్చిన మార్పులను గమనించిన ఆయన తాను డిపాజిట్ చేసిన సొమ్మునైనా వాపసు తీసుకుందామని అల్లుడికి తెలియకుండా హైదరాబాదుకు వెళ్లి స్టాండర్డ్ బ్యాంకు మేనేజర్‌ను కలిశాడు. ఆ ఖాతా నకిలీదని అతను చెప్పడంతో, విదేశీయుల పేరుతో తనకు వచ్చిన కాల్స్‌పై ఆరా తీశాడు. అలా నాటకమాడింది తన అల్లుని అసిస్టెంట్ వర్మగా గుర్తించాడు. ఈ విషయంపై అల్లుడిని నిలదీయగా అతను ఇష్టం వచ్చిన చోట చెప్పుకోమని సమాధానమిచ్చాడు. దీంతో ఆయన తన అల్లుడిపై హైదరాబాదులోని ఓ డీఎస్పీకి ఫిర్యాదు చేశాడు. అయితే, అక్కడి పోలీసులు ఫిర్యాదుపై చర్య తీసుకోకపోగా, సమాచారాన్ని అల్లుడికి అందించారు. దిక్కుతోచని స్థితిలో అనంతపురం చేరుకున్న ఆయన సోమవారం ఉదయం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
ఆపన్నహస్తం అందించరూ...
రాపూరు, న్యూస్‌లైన్ : ఏడాది చిన్నారి శివనారాయణప్రసాద్ బ్లడ్ క్యాన్సర్‌తో మృత్యువుతో పోరాడుతున్నాడు. వెంకటాచలం మండలం గొలగమూడికి చెందిన రామకృష్ణ, శ్రీవల్లి నిరుపేద దంపతులకు పెళ్లయిన నాలుగేళ్లకు ఆ చిన్నారి జన్మించాడు. పెంచలకోన క్షేత్రంలో శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ తమ ఆవేదన వెల్లబోసుకున్నారు. పెనుశిల నరసింహస్వామి వరప్రసాదమైన తమ బిడ్డకు బ్లడ్‌క్యాన్సర్ ఉన్నట్లు చెన్నై క్యాన్సర్ వైద్యశాలలో నిర్ధారించారన్నారు. బిడ్డ ఆపరేషన్‌కు సుమారు రూ.8 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. తాను క్యాటరింగ్లో రోజువారీ కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నానని, ఎలాంటి ఆస్తిపాస్తులు లేవని పసిబిడ్డ తండ్రి రామకృష్ణ చెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.3 లక్షలు ఇచ్చారన్నారు. మరో రూ.5 లక్షలు అవసరమని, దాతలు దయతలిస్తే తమ బిడ్డ ప్రాణాలు నిలబడతాయని వారు వేడుకున్నారు. దాతలు సాయం చేయాలనుకుంటే 9490315539,9603341909 లలో సంప్రదించాలని వారు విన్నవించారు. కాగా పెంచలకోన దేవస్థాన సిబ్బంది,అర్చకులు స్పందించి రూ.25 వేలు విరాళంగా అందజేశారు. ఇంకా సాయం చేస్తాం : ఆలయ ఈఓ క్యాన్సర్‌తో బాధపడుతున్న శివనారాయణ ప్రసాద్‌కు తమ శక్తి మేరకు సాయం చేస్తామని పెంచలకోన దేవస్థాన ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. రామకృష్ణ, శ్రీవల్లి నరసింహస్వామి భక్తులు కావడంతో తామంతా స్పందిస్తున్నామన్నారు. ఆలయ పాలక వర్గ అధ్యక్షునితో చర్చించి మరింత చేయూతనిస్తామన్నారు.