సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఘాటు వ్యాఖ్యలు
విజయనగరం క్రైం/ అల్లిపురం(విశాఖ): ఒకపార్టీ గుర్తుతో గెలిచి మరో పార్టీలో చేరి ఫిరాంపులకు పాల్పడటం రాజకీయ మగ వేశ్యల లక్షణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వ్యాఖ్యానించారు. శనివారం విజయనగరం కోట జంక్షన్ వద్ద జరిగిన ఓ కార్యక్రమంలోనూ, విశాఖలో విలేకరుల సమావేశంలోనూ ఆయన మాట్లాడారు.
తాము చేస్తున్న అభివృద్ధిని చూసే పార్టీలోకి చేరుతున్నారని బాబు చెబుతున్నారని.. అసలు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని నిలదీ శారు. టీడీపీలోకి వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు రూ.5కోట్లు, రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు, ఎన్నికల ఖర్చు భరిస్తామని చెప్పడంతోనే వారు చేరుతున్నారని పేర్కొన్నారు.
పార్టీ ఫిరాయించేవారు రాజకీయ మగవేశ్యలు
Published Sun, May 22 2016 2:58 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement
Advertisement