CPI
-
సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిగా నల్లగొండ జిల్లా పార్టీ కార్యదర్శి నెల్లికంటి సత్యం పేరు ఖరారైంది. ఈ మేరకు ఆదివారం రాత్రి జరిగిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయం తీసుకున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం ఎల్గలగూడెంకు చెందిన నెల్లికంటి సత్యం యాదవ సామాజిక వర్గానికి చెందినవారు. 1969 జూన్ 6న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు పార్వతమ్మ, పెద్దయ్య, భార్య అన్నపూర్ణ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివారు. విస్తృతంగా చర్చించి ఎంపిక.. పొత్తులో భాగంగా సీపీఐకి ఒక ఎమ్మెల్సీ స్థా నం కేటాయిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఆదివా రం సాయంత్రం ప్రకటించింది. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యవర్గం హిమాయత్‌నగర్‌లోని మగ్దూం భవన్లో సమావేశమై చర్చించింది. మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డితోపాటు మరి కొందరు నేతలు ఎమ్మెల్సీ స్థానం కోసం ఆసక్తి చూపినా.. సామాజిక సమీకరణాలు, పార్టీ పట్ల విధేయత, ప్రజా పోరాటాల్లో పాల్గొన్న తీరు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని నెల్లికంటి సత్యం పేరును ఖరారు చేసినట్టు తెలిసింది. తెలంగాణ శాసనమండలిలో కమ్యూనిస్టులకు ప్రాతినిధ్యం లభించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాంగ్రెస్‌కు సీపీఐ ధన్యవాదాలు స్నేహధర్మాన్ని పాటిస్తూ ఎమ్మెల్సీ స్థానాన్ని సీపీఐకి కేటాయించడం పట్ల ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేతలు సోనియాగాందీ, రాహుల్‌గాందీ, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, మంత్రి ఉత్తమ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. -
ఏపీ బడ్జెట్.. ఓన్లీ కోతల బడ్జెట్: బీవీ రాఘవులు
-
రెండు జాతీయ పార్టీలకు నోటా కంటే తక్కువ ఓట్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల డేటా విశ్లేషణలో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఢిల్లీ ఓటర్లు గుర్తింపు పొందిన జాతీయ పార్టీలైన బీఎస్పీ, సీపీఎం కంటే నోటా (నాన్ ఆఫ్ ది ఎబవ్)ఆప్షన్ వైపే ఎక్కువగా మొగ్గు చూపారని తేలింది. మొత్తం పోలైన ఓట్లలో నోటా ఆప్షన్‌కు 0.57 శాతం ఓట్లు పడగా బీఎస్పీకి 0.55 శాతం, సీపీఎంకు 0.01శాతం మంది మాత్రమే ఓటేయడం గమనార్హం. ఈ రెండు పార్టీలకు దక్కిన ఓట్ల కంటే నోటా ఓట్ల శాతమే ఎక్కువ. ఈ ఎన్నికల్లో సీపీఐకి 0.01, జేడీయూకు 0.53 శాతం ఓట్లు పడ్డాయి. -
‘వంద మంది అమిత్ షాలు వచ్చినా ఉద్యమాలు ఆగవు’
సాక్షి, హన్మకొండ: ఎన్కౌంటర్ల ద్వారా మావోయిస్టులను అంతం చేయలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ నాయకుడు చాడా వెంకట్‌రెడ్డి. ప్రజాకవి గద్దర్‌పై చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో కమ్యూనిజం అంతం చేయడం ఎవరితరమూ కాదని చెప్పుకొచ్చారు.చాడా వెంకట్‌రెడ్డి తాజాగా హన్మకొండలో మీడియాతో మాట్లాడుతూ.. మావోయిస్టులను అణచివేయాలని చూస్తున్నారు. ఎన్కౌంటర్ల ద్వారా మావోయిస్టులను అంతం చేయలేరు. కమ్యూనిజం అంతం చేయడం ఎవరితరం కాదు. నక్సలిజాన్ని సామాజిక, ఆర్థిక సమస్యగా చూడాలి. మావోయిస్టులు కూడా ఆయుధాలు వీడాలి.గద్దర్‌కు అవార్డు ఇవ్వడం తప్పు అనేది సరైంది కాదు. గద్దర్‌పై చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి. దేశాన్ని రాచరికం ఏలుతున్న రోజుల్లో కమ్యూనిజం పుట్టింది. భారత సంపూర్ణ స్వాతంత్య్రానికి పిలుపునిచ్చింది సీపీఐ పార్టీనే. ఎన్నో నిర్భంధాలను కమ్యూనిస్ట్ పార్టీ ఎదుర్కొంది. నవాళి కళ్యాణానికి బీజం వేసింది భారత కమ్యూనిస్టు పార్టీ. దీన్ని అంతం చేస్తామని కొందరు చెబుతున్నారు. కమ్యూనిజం అంతం చేయడం ఎవరితరమూ కాదు అంటూ కామెంట్స్ చేశారు.మరోవైపు.. తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మావోయిస్టులపై వరుస ఎన్కౌంటర్ల విషయమై స్పందించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ..‘వంద మంది అమిత్ షాలు వచ్చినా ఉద్యమాలు ఆగవు. ఎన్కౌంటర్ల వల్ల ఉద్యమాలకు చెక్ పెట్టే పరిస్థితి లేదు. ఇలాంటి ఎన్కౌంటర్లు గతంలో చాలా జరిగాయి.. ఉద్యమాలు మళ్ళీ మొదలు అయ్యాయి. ఎన్కౌంటర్ల వల్ల కొంతమంది మరణం మాత్రమే జరుగుతుంది. కొంత మందిని మాత్రమే చంపగలరు. ఉద్యమాన్ని ఆపలేరు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు.. CPI నేతలు సీరియస్ వార్నింగ్
-
విద్యుత్ చార్జీల భారంపై వామపక్షాలు వినూత్న నిరసన
-
కావాలంటే బయట మార్పుకోసం ఎంతయినా శ్రమిద్దాం! మనలో మార్పంటే అసాధ్యం కామ్రేడ్!
-
ఫార్మా విలేజ్ కాదు.. పారిశ్రామిక పార్క్: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: వికారాబాద్ జిల్లా లగచర్లలో ఏర్పాటు చేయబోయేది ఫార్మా విలేజ్ కాదని.. పారిశ్రామిక పార్క్ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. అక్కడ కాలుష్య రహిత పరిశ్రమలనే ఏర్పాటు చేస్తామని తెలిపారు. శనివారం సచివాలయంలో సీఎంను సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావుతోపాటు సీపీఐ(ఎంఎల్) ప్రతినిధులు కలిశారు. ఇటీవల లగచర్లలో పర్యటించిన వీరు.. అధికారులపై దాడి ఘటన తర్వాత అక్కడి పరిస్థితులపై రూపొందించిన నిజనిర్దారణ నివేదికను సీఎంకు అందజేశారు. పలు అంశాలతో కూడిన వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. ఈ సందర్భంగా లగచర్లలో ఏర్పాటుచేయబోయే పరిశ్రమల గురించి వారికి సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. లగచర్లలో కాలుష్య రహిత పరిశ్రమలనే ఏర్పాటు చేస్తామని తెలిపారు. భూసేకరణ పరిహారం పెంచే విషయాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. నా ప్రజలను నేను ఇబ్బంది పెడతానా? తన నియోజకవర్గంలోని యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించేందుకు పరిశ్రమలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేయడం తన బాధ్యత అని వామపక్ష పార్టీల నేతలతో సీఎం అన్నారు. ‘నా సొంత నియోజకవర్గ ప్రజలను నేనే ఎందుకు ఇబ్బంది పెడుతా?’అని ప్రశ్నించారు. అయితే, లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్, అధికారులపై దాడి చేసిన వారిని, అందుకు కుట్ర చేసినవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలేది లేదని స్పష్టంచేశారు. అమాయక రైతులపై కేసులు పెట్టిన అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యామ్నాయంపై సమాలోచన కాలుష్య కారక పరిశ్రమల కోసం రెండు పంటలు పండే భూములను తీసుకోవడం సరికాదని సీఎంకు సూచించినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. లగచర్లలో కాకుండా కొడంగల్‌లో మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డికి చెందిన 1,156 ఎకరాలకు పైగా ఉన్న సీలింగ్ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే మంచిదని తెలిపినట్లు ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. అయితే ఆ భూములు కోర్టు వివాదాల్లో ఉన్నందున ఆలస్యం జరుగుతోందని సీఎం అన్నారని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ భూములుంటే సూచించాలని సీఎం అడిగారని, దీనిపై రెండుమూడుసార్లు సమావేశాలు నిర్వహించిన తరువాత నిర్ణయం తీసుకుందామని చెప్పారని తమ్మినేని వెల్లడించారు. కాగా, లగచర్లలో వరి కోతలకు అధికారులు యంత్రాలను అనుమతించడం లేదని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని, పోలీసు క్యాంపులతో నిర్భందం కొనసాగుతున్నదని సీఎం దృష్టికి తీసుకెళ్లగానే.. ఆయన వెంటనే కలెక్టర్‌కు ఫోన్ చేసి వరికోత యంత్రాలను అనుమతించాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, పోలీసు క్యాంపులను వెంటనే తొలగించాలని ఆదేశించినట్లు వివరించారు. గిరిజనులపై కేసులు ఎత్తేయండి: కూనంనేని లగచర్ల ఘటనలో గిరిజనులపై పెట్టిన కేసులను ఎత్తేయాలని సీఎంను కోరినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. అందుకు సీఎం సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. పరిశ్రమలను ప్రభుత్వ భూముల్లో ఏర్పాటు చేయాలని, రైతుల భూములు సేకరించి జనావాసాల మధ్య ఫార్మా పరిశ్రమలను ఏర్పాటు చేస్తామంటే వామపక్షాలు అంగీకరించబోవని సీఎంకు స్పష్టంగా చెప్పినట్లు వెల్లడించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే.. అదికూడా రైతులను ఒప్పించి, పూర్తి నష్టపరిహారం అందించిన తరువాతే వారి భూములను సేకరించాలని సూచించినట్లు తెలిపారు. సీఎంను కలిసినవారిలో సీపీఐ రాష్ట కార్యదర్శివర్గ సభ్యులు పశ్య పద్మ, సీపీఐ (ఎం.ఎల్) మాస్‌లైన్ నాయకులు రమ, ఎస్.ఎల్. పద్మ, ఆర్ఎస్పీ నాయకడు జానకిరాములు, ఎంసీపీఐ నాయకుడు గాదగోని రవి తదితరు ఉన్నారు. -
సీఎం రేవంత్ రెడ్డితో సీపీఐ సీపీఎం నేతల కీలక భేటీ
-
సీఎం చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ పై స్పందించిన సీపీఐ రామకృష్ణ
-
చంద్రబాబు కరెంట్ చార్జీలు పెంచబోమని చెప్పి మాట తప్పారు: CPI రామకృష్ణ
-
సీపీఐ నుంచి ఆహార ద్రవ్యోల్బణం మినహాయింపు?
వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం నుంచి ఆహార ద్రవ్యోల్బణాన్ని మినహాయించాలనే వాదనలు పెరుగుతున్నాయి. ఇటీవల ఆర్బీఐ విడుదల చేసిన నివేదికలో సీపీఐ ద్రవ్యోల్బణం 14 ఏళ్ల గరిష్ఠానికి చేరి ఏకంగా 6.1 శాతంగా నమోదైంది. అయితే అందుకు ప్రధాన కారణం ఆహార ద్రవ్యోల్బణం పెరగడమేనని ఆర్బీఐ తెలిపింది. సీపీఐ ద్రవ్యోల్బణం నుంచి ఆహార ద్రవ్యోల్బణాన్ని మినహాయిస్తే మెరుగైన గణాంకాలు కనిపించే వీలుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఆహార ద్రవ్యోల్బణం తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి దీన్ని సీపీఐలో కొనసాగించాల్సిందేనని ఇంకొందరు చెబుతున్నారు.తగ్గుతున్న పంటల సాగుదేశవ్యాప్తంగా చాలాచోట్ల విభిన్న వాతావరణ మార్పుల వల్ల ఆశించినమేర వ్యవసాయ దిగుబడి రావడంలేదు. దాంతో ఆహార పదార్థాల సప్లై-చెయిన్‌లో సమస్యలు ఎదురవుతున్నాయి. దానికితోడు ఉల్లి ఎగుమతులపై కేంద్రం ఇటీవల ఆంక్షలు ఎత్తివేసింది. దాంతో దళారులు కృత్రిమకొరతను సృష్టించి ధరల పెరుగుదలకు కారణం అవుతున్నారు. వర్షాభావం కారణంగా మహారాష్ట్ర వంటి అధికంగా ఉల్లి పండించే రాష్ట్రాల్లో పంటసాగు వెనకబడుతుంది. వంట నూనెలకు సంబంధించి ముడిఆయిల్ దిగుమతులపై ప్రభుత్వం ఇటీవల సుంకాన్ని పెంచింది. దాంతో నూనె ధరలు అమాంతం పెరిగాయి. పాతస్టాక్‌ను 45 రోజుల్లో క్లియర్ చేసి కొత్త సరుకుకు ధరలు పెంచేలా నిబంధనలున్నాయి. కానీ ప్రభుత్వ నిర్ణయం వెలువడిన వెంటనే కంపెనీలు ధరల పెరుగుదలను అమలు చేశాయి.ప్రకృతి విపత్తుల వల్ల తీవ్ర నష్టంభౌగోళిక స్వరూపం ప్రకారం భారత్‌లో మొత్తం సుమారు 70 రకాల పంటలు పండించవచ్చని గతంలో పలు సర్వేలు తెలియజేశాయి. కానీ గరిష్ఠంగా దాదాపు 20 రకాల పంటలనే ఎక్కువగా పండిస్తున్నారు. అందులోనూ కొన్ని ప్రాంతాల్లో కొన్ని పంటలే అధికంగా పండుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో వర్షాలు, తుపానులు వంటి ప్రకృతి విపత్తులు సంభవిస్తే పంట తీవ్రంగా దెబ్బతింటుంది. ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తులపై ధరల ప్రభావం పడుతుంది.ఇదీ చదవండి: దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీ నిర్వహణకు రంగం సిద్ధంఆహార ద్రవ్యోల్బణం కీలకంఆర్థికసర్వే సూచనల ప్రకారం ప్రభుత్వం ఆహార ద్రవ్యోల్బణాన్ని సీపీఐ నుంచి తొలగించే ఆలోచన చేయకుండా దాన్ని తగ్గించేందుకు అవసరమయ్యే మార్గాలను అన్వేషించాలని నిపుణులు కోరుతున్నారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఆహార ద్రవ్యోల్బణాన్ని పెద్దగా పరిగణించరు. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలకు అది కీలకం కానుందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ప్రియాంక ప్రత్యర్థి సత్యన్ మొకెరి
తిరువనంతపురం: వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీపై పోటీకి వామపక్ష ఎల్డీఎఫ్ సత్యన్ మొకెరిని ఎంపిక చేసింది. సీపీఐకి చెందిన మొకెరి కొజికోడ్ జిల్లాలోని నాదపురం మాజీ ఎమ్మెల్యే. వ్యవసాయ రంగానికి చెందిన సమస్యలపై పనిచేసిన వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉంది. వయనాడ్‌లో సత్యన్ మొకెరి ఎల్డీఎఫ్ అభ్యర్థిగా ఉంటారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బినోయ్ విశ్వమ్ గురువారం ప్రకటించారు. మొకెరి 2014 వయనాడ్ నుంచి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి ఎం.ఐ.షానవాజ్ చేతిలో దాదాపు 20 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. రాహుల్ గాంధీ సార్వత్రిక ఎన్నికల్లో రెండు చోట్ల గెలిచి రాయ్‌బరేలి ఎంపీగా కొనసాగుతూ వయనాడ్‌కు రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచి్చన విషయం తెలిసిందే. నవంబరు 13న వయనాడ్‌లో పోలింగ్ జరగనుంది. -
పవన్ కి CPI రామకృష్ణ స్ట్రాంగ్ కౌంటర్
-
సనాతన ధర్మం గురించి పవన్ కు తెలుసా?
-
బీహార్‌లో సీపీఐ నేత దారుణ హత్య
అర్వాల్: బీహార్‌లోని అర్వాల్ జిల్లాలో సీపీఐ(ఎంఎల్) నేత సునీల్ చంద్రవంశీపై దుండగులు కాల్పులు జరిపారు. ఆయన మార్కెట్ నుండి తన ఇంటికి వెళుతుండగా, బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని దుండగులు అతన్ని అడ్డుకుని, తుపాకీతో కాల్చిచంపారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, సునీల్ చంద్రవంశీని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.ఈ ఘటన అర్వాల్ జిల్లాలోని కింజర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చక్కన్ బిఘా గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్పీ రాజేంద్ర కుమార్ భిల్ మాట్లాడుతూ ఈ ఘటనకు పాతకక్షలే కారణమై ఉంటాయని అన్నారు. నేరస్తులను పట్టుకునేందుకు పోలీసు బృందం గాలింపు చర్యలు చేపట్టిందన్నారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
హైడ్రా కూల్చివేతలను స్వాగతిస్తున్నాం: సీపీఐ నారాయణ
సాక్షి హైదరాబాద్: హైడ్రా కూల్చివేతలను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్వాగతించారు. ఈ కూల్చివేతలు ఇలాగే కొనసాగాలన్నారు. ఆదివారం ఆయన ఎన్ కన్వెన్షన్ కూల్చిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెరువులో కాలేజీలు నిర్మించారని వారి అక్రమ కట్టడాలను కూల్చివేయాలని డిమాండ్ చేశారు.చెరువులు, నాలాలు కబ్జాకు గురైతే గ్రామాలు మునిగిపోతాయని నారాయణ అన్నారు. ఆరంభ శూరత్వంగా మిగిలిపోకూడదు.. ఎక్కడ కబ్జా జరిగినా ఖాళీ చేయించాలన్నారు. కబ్జాలు పాల్పడిన వారి ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు. ఎవరు ఆక్రమించినా వారిపై హైడ్రా కూల్చివేతలు జరపాలన్నారు. ఎంఐఎం నేతలవి కూడా తొలగించాలన్న నారాయణ.. మేం మొదటి నుంచి భూ సమస్యలపై పోరాటం చేస్తూనే ఉన్నామన్నారు. -
బురద నీళ్లతో స్నానం..
-
భయమేస్తోందంటే మేం ఒప్పుకోం సూపర్ సిక్స్ అమలు చేయాల్సిందే
-
వామపక్షాలకు నూతనోత్తేజం!
పార్లమెంటు ఎన్నికలలో సీపీఐ (ఎమ్ఎల్) లిబరేషన్ గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చింది. రెండు సీట్లు గెలుపొంది వామపక్ష శ్రేణులకు నూతనోత్తేజాన్ని కలిగించింది. బిహార్‌లోని అరా, కరాకట్ లోక్‌సభ స్థానాల నుండి లిబరేషన్ అభ్యర్థులు సుధామ ప్రసాద్, రాజారామ్ సింగ్‌లు విజయ బావుటా ఎగురవేశారు. భారత గడ్డపై ఫాసిస్టు శక్తుల పెరుగుదల అత్యంత ప్రమాదకరంగా పరిణమించిన నేపథ్యంలో ప్రతిపక్షాలను ఒకతాటిపైకి తెచ్చేందుకు లిబరేషన్ తన వంతు కృషి చేస్తూ ‘ఇండియా’ కూటమిలో భాగస్వామిగా మారింది.అరా, కరాకట్, నలందా, కొడర్మ సీట్లలో బరిలో నిలిచింది. నలందా నియోజకవర్గంలో గట్టి పోటీ ఇచ్చిన ప్రస్తుత ఎమ్మెల్యే సందీప్ సౌరభ్ రెండో స్థానంలో నిలిచారు. జార్ఖండ్‌లో కొడెర్మలో వినోద్ సింగ్ (బాగోదర్ ఎమ్మెల్యే) రెండో స్థానంలో నిలిచారు. బిహార్‌లో అజియాన్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగగా దానిని లిబరేషన్ నిలబెట్టుకుంది. ఇక్కడ శివ్ ప్రకాష్ రంజన్ విజయం సాధించారు.మొదట సాయుధ మార్గాన్ని అనుసరించిన లిబరేషన్ పార్టీ కాలక్రమంలో తన పంథాను మార్చుకుంది. ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్ (ఐపీఎఫ్)ను ఏర్పాటు చేసి 1985 ఎన్నికల్లో తొలిసారిగా ఎన్నికల్లో పాల్గొంది. 1989 పార్లమెంటు, 1990 అసెంబ్లీ ఎన్నికలలో బరిలో నిలిచి ఆశ్చర్యకరమైన ఫలితాలు సాధించింది. 1989లో తొలిసారిగా రామేశ్వర ప్రసాద్‌ను అరా నియోజకవర్గం నుంచి పార్లమెంటుకి పంపింది. ఆ తర్వాత జయంతా రోంగ్పి అస్సాంలోని కర్బీ అంగ్లాంగ్ నుంచి పలుమార్లు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. సుదీర్ఘకాలం తర్వాత మళ్లీ ఇద్దరు ఎంపీలను బిహార్ నుంచి పార్లమెంట్‌కు పంపింది.1995 అసెంబ్లీ ఎన్నికల నాటి నుండి సీపీఐ (ఎమ్ఎల్) లిబరేషన్ పేరుతో పోటీ చేస్తోంది. 2010 ఎన్నికల్లో తప్ప మినహా ఆ పార్టీ ప్రతినిధులు మిగిలిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తమ గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. గతంలో ఒంటరిగా పోటీ చేసి పదకొండు మంది సభ్యులను అసెంబ్లీకి పంపిన చరిత్ర లిబరేషన్‌కు ఉంది. జైలులో ఉండి శాసన సభకు గెలిచిన చరిత్రా ఉంది. 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లిబరేషన్ అపూర్వ విజయాల్ని సొంతం చేసుకుంది.19 స్థానాల్లో పోటీ చేసి 12 చోట్ల గెలిచింది. ఒక మహిళా ఎమ్మెల్సీ శాసన మండలిలో ప్రాతినిధ్యం కలిగి ఉంది. సీట్ల సంఖ్యలో తరుగుదల, పెరుగుదల ఉన్నప్పటికీ నికరమైన, స్థిరమైన ఓటు బ్యాంకు, బలమైన ప్రజా పునాది కలిగి ఉండటం విశేషం. జార్ఖండ్ రాష్ట్రంలోనూ ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం సుదీర్ఘ కాలంగా ఉంది. గతంలో అస్సాం, పంజాబ్ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించారు. 25 రాష్ట్రాలలో పార్టీ, ప్రజా సంఘాల నిర్మాణం కలిగి ఉంది.‘రణవీర్ సేన’ లాంటి ప్రైవేటు సైన్యాలను ఎదుర్కొన్న వీరోచిత చరిత్ర లిబరేషన్ది. అణచివేతలపైనా, సామాజిక న్యాయం కోసం దశాబ్దాల తరబడి పోరాటాలు కొనసాగిస్తూ వస్తోంది. విద్య, వైద్యం, భూమిలేని పేదల కోసం, రైతుల హక్కుల కోసం, ప్రాజెక్టుల కోసం ఉద్యమాలు నడిపింది. నిరంతరం పేదల కోసం పోరాడిన సుధామ ప్రసాద్, రాజారామ్ సింగ్‌లు పేదల హక్కుల్ని కాపాడడం కోసం పార్లమెంట్లో తమ గళాన్ని బలంగా వినిపించబోతున్నారు. – మామిండ్ల రమేష్ రాజా, సీపీఐ (ఎమ్ఎల్) లిబరేషన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, 78932 30218. -
బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
సాక్షి, హైదరాబాద్: శ్రీ రాముడు బీజేపీ ఖైదీగా ఉన్నాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఎవరు విముక్తి చేస్తారా అని ఆ రాముడు ఎదు రుచూస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (టీయూడబ్య్లూజే) మంగళవారం కూనంనేని సాంబశివరావుతో మీట్ ది ప్రెస్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి టీయూ డబ్య్లూజే ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ అధ్యక్షత వహించగా, సీనియర్ జర్నలిస్టు మల్లయ్య మోడరేటర్‌గా వ్యవహరించారు.కూనంనేని మాట్లా డుతూ పేద హిందువులకు మోదీ ఏం చేశారని నిలదీశారు. మతం పేరుతో దేశాన్ని విచ్ఛినం చేస్తు న్నారని, రాజ్యాంగాన్ని మార్చబోనని చెబుతున్న బీజేపీ, ముస్లిం రిజర్వేషన్లను ఎలా రద్దు చేస్తుందని ప్రశ్నించారు. మత విద్వేషాలను రెచ్చగొడుతున్న వారిని ముందు జైలులో పెట్టాలని డిమాండ్ చేశారు. నీతిమంతుల పార్టీగా చెప్పుకునే బీజేపీకి ఎన్నికల్లో పెద్ద మొత్తంలో ఖర్చుపెడుతు న్న డబ్బులు ఎక్కడి నుంచి వ స్తున్నాయని ప్రశ్నించారు. ప్రధా ని మోదీ దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని, అధి కారం కోసం ఆయన ఏమైనా చేస్తా రని కూనంనేని విమర్శించారు. ఇక దేశంలోనే అత్యంత అవినీతి పార్టీ బీజేపీయేనని, అందుకే ఆ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధిక స్థానాల్లో గెలుస్తుందని, బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదని ఆయన అంచనా వేశారు. కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని, ఉద్య మకారుల గొంతు నొక్కారని, ఢిల్లీలో మోదీ కూడా అలాగే వ్యవహారిస్తున్నారని విమర్శించారు.మా మద్దతు లేకుండా కాంగ్రెస్ గెలవదు...లోక్ సభ ఎన్నికల్లో ఖమ్మం, మహబూబాబాద్, నల్లగొండ, భువనగిరి, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్ నియోజకవర్గాల్లో కమ్యూనిస్టు పార్టీ మద్దతు లేకుండా కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదని కూనంనేని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గౌరవ ప్రదమైన స్థానాలు తమకిస్తేనే పొత్తు ఉంటుందని, లేదంటే పోటీ ఉంటుందని స్పష్టం చేశారు. -
శ్రామిక వర్గ మహోపాధ్యాయుడు
ప్రపంచాన్ని మలుపుతిప్పిన ఘటనల్లో ఒకటి కమ్యూనిస్ట్ సిద్ధాంతకర్త కారల్ మార్క్స్ జననం. జర్మనీ (ప్రష్యా)లో పుట్టిన ఆయన విద్యాభ్యాసం అనంతరం పాత్రికేయ వృత్తిని ఎంచుకున్నారు. కొంతకాలం తర్వాత ఫ్రాన్స్ వెళ్ళారు. అక్కడే ఆయన జీవితకాల ఉద్యమ సిద్ధాంత మిత్రుడు ఫ్రెడరిక్ ఏంగిల్స్ను కలుసు కున్నారు. ఫ్రాన్స్ ఆయన్ని దేశం నుంచి బహిష్కరించడంతో ముందు బెల్జియం ఆ తర్వాత ఇంగ్లండ్ (లండన్) వెళ్లి మిగిలిన జీవితమంతా తన భార్యాబిడ్డలతో అక్కడే గడిపారు. మార్క్స్ తన జీవితకాల మిత్రుడు, సహచరుడు, సిద్ధాంతకర్త అయిన ఫ్రెడరిక్ ఏంగిల్స్‌తో కలిసి ‘కమ్యూ నిస్టు లీగు’ ఏర్పాటు చేసి 1848లో ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ను ఏంగిల్స్‌తో కలిసి రాశారు. 1867లో ‘దాస్ క్యాపి టల్’ మొదటి వాల్యూమ్‌ను ప్రచురించారు.మానవ సమాజ సమూహ సంబంధాలు అన్నిటినీ కార్ల్ మార్క్స్ ‘ఫ్రెడరిక్ ఏంగిల్స్‌లు శాస్త్రీయంగా నిరూ పించారు. ఆదిమ కమ్యూనిస్టు సమాజం నుండి బానిస సమాజం, బానిస సమాజం నుండి ఫ్యూడల్ సమాజం, ఫ్యూడల్ భూస్వామ్య సమాజం నుండి పెట్టుబడిదారీ సమాజం, పెట్టుబడిదారీ సమాజం నుండి సోషలిస్టు సమాజానికి మానవ సమాజం ఎలా పరిణామం చెందు తుందో... సోషలిస్టు సమాజం నుండి అంతిమంగా కమ్యూనిస్టు సమాజం వైపు వర్గహిత సమాజం వైపు ఎలా మానవ సమాజం ప్రయాణిస్తుందో శాస్త్రీయంగా మార్క్స్–ఏంగెల్స్‌లు నిరూపించారు, సిద్ధాంతీకరించారు. మానవ సమాజ పరిణామ క్రమంలో శ్రమ పాత్రనూ, శ్రమ ఔన్నత్యాన్నీ, సర్వసంపదలకు శ్రమే మూలం అన్న విషయాన్నీ మొట్టమొదటిసారిగా ప్రపంచంలో సిద్ధాంతీకరించిన తత్వవేత్తలు కారల్ మార్క్స్, ఏంగెల్స్‌లు. కార్మికుని అదనపు శ్రమే ‘పెట్టుబడి’ అనే విషయాన్ని బహుముఖ కోణాల నుంచి పరిశోధన చేసి ‘దాస్ క్యాపిటల్’ను ప్రపంచానికి అందించారు. గతి తర్కాన్ని, చారిత్రిక భౌతిక వాదాన్నీ, తలకిందులుగా ఉన్న హెగెల్ తత్వ శాస్త్రాన్నీ, అందులోని భావవాదాన్నీ సరిదిద్ది భౌతిక వాదం తన కాళ్ళ మీద తను నిలబడే టట్లుగా రూపొందించారు మార్క్స్. అభివృద్ధి నిరోధకమైన పాత వ్యవస్థ, అభివృద్ధి కరమైనటువంటి కొత్త వ్యవస్థను అనుమతించదు. అందుచే బల ప్రయోగం ద్వారా పాత అభివృద్ధి నిరోధక వ్యవస్థను నెట్టివేయాలనీ, కూలదోయాలనీ మార్క్స్ శాస్త్రీయంగా వివరించారు. మార్క్స్ తదనంతరం పెట్టుబడిదారీ వ్యవస్థ సామ్రాజ్యవాద రూపం తీసుకున్నది. పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నత రూపమే సామ్రాజ్యవాదం అని లెనిన్ సిద్ధాంతీకరించారు. మార్క్సిజాన్ని రష్యా పరిస్థితులకు అన్వయించి కార్మిక వర్గ నాయకత్వాన, కర్షకవర్గం మైత్రితో లెనిన్ సోషలిస్ట్ విప్లవాన్ని విజయవంతం చేశారు.– మన్నవ హరిప్రసాద్, సీపీఐ (ఎమ్ఎల్) రెడ్ స్టార్ పాలిట్ బ్యూరో సభ్యుడు(నేడు కారల్ మార్క్స్ జయంతి) -
మొన్న స్కూటర్ల మీద.. నేడు ఆడి కార్లలో..
విజయవాడ: నగరాన్ని అభివృద్ధి చేయడం అంటే కార్పొరేటర్లకు కోట్ల రూపాయలు దోచిపెట్టడం కాదంటూ ఏపీ ప్రభుత్వ తీరుపై సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. మొన్నటిదాకా స్కూటర్లలో తిరిగిన కార్పొరేటర్లు ఇప్పుడు ఆడికార్లలో తిరుగుతున్నారని విమర్శించారు. రూ.లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పిన చంద్రబాబు.. పరిశ్రమలు ఎక్కడ పెట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి మోదీ నాలుగేళ్లుగా అన్యాయం చేస్తుంటే నోరుమెదపని సీఎం చంద్రబాబు, ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మోదీని విమర్శిస్తూ, ధర్మపోరాటాలంటూ కొత్తనాటకాలకు తెరతీశారని విమర్శించారు. జనసేన కొత్త పార్టీ కాబట్టే ఉభయ కమ్యునిస్టు పార్టీలు కలిసి పని చేస్తున్నాయని చెప్పారు. -
హామీల వైఫల్య సభ నిర్వహించండి: చాడ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, సాధించిందేమీ లేకుండానే ప్రగతి నివేదన సభ నిర్వహిస్తుండటం హాస్యాస్పదమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. శనివారం మఖ్దూంభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలకిచ్చిన హామీల అమలులో వైఫల్యంపై సభ నిర్వహిస్తే బాగుంటుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లించలేదని, పథకంలో అక్రమార్కుల ఏరివేత గాలికొదిలేశారని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పత్తా లేవని, ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి నిధి ఖర్చు అరకొరగానే ఉందన్నారు. నీటి పారుదల ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తికాలేదని, వ్యయాన్ని రెట్టింపు చేస్తూ జేబులు నింపుకుంటున్నారన్నారు. ఉద్యోగాల ఊసే లేదని, నిరుద్యోగులంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై ప్రజల్లో చైతన్య కార్యక్రమాలు, అక్టోబర్ 1 నుంచి 10వరకు మోదీ హటావో–దేశ్ బచావో, రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామ న్నారు. అక్టోబర్ 10న భద్రాద్రి కొత్తగూడెంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. -
వరద సాయంలోనూ రాజకీయాలేనా?
సాక్షి, హైదరాబాద్: కేరళలో వరద బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యతను విస్మరించి, సాయం చేయడంలోనూ బీజేపీ రాజకీయాలు చేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్‌కుమార్ అంజాన్ మండిపడ్డారు. నగరంలోని మగ్దుంభవన్‌లో 2 రోజుల పాటు సాగే రాష్ట్ర సమితి సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అతుల్‌కుమార్ మాట్లాడుతూ.. కేరళ రాష్ట్రం 60 శాతం వరదలతో నష్టపోయిందన్నారు. కేరళకు సహాయం చేయడంలోనూ కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ప్రధాని మోదీ సంకుచిత భావాలతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వాజ్‌పేయి కలశయాత్రల పేరిట ఓట్ల కోసం మోదీ శవ రాజకీయాలకు దిగజారుతున్నారని విమర్శించారు. నిజంగా మోదీకి ఎస్సీల మీద ప్రేమ ఉంటే మేధోమధన కమిటీతో ఎందుకు నాలుగేళ్లుగా సమావేశాలు పెట్టలేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళల దేహాలతో వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నారని చెప్పారు. టీఆర్ఎస్ సభ పెట్టుకుని ప్రగతి నివేదిక ఏమని ఇస్తారని ప్రశ్నించారు. పౌరహక్కుల రక్షణ, ప్రజాస్వామిక పాలన జరగాలంటే మరోసారి టీఆర్ఎస్ను గెలిపించొద్దన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి కోసం భావ సారూప్యత గల పార్టీలతో పొత్తు ఉంటుందన్నారు. -
యూఏఈ ఆఫర్ తిరస్కరణ: రూ.2600 కోట్లు ఇవ్వండి
హైదరాబాద్ : భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన కేరళను ఆదుకునేందుకు రూ.700 కోట్ల ఆర్థిక సహాయంతో ముందుకొచ్చిన యూఏఈ ఆఫర్‌ను కేంద్రం తిరస్కరించడంపై పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు కేంద్రం రూ.700 కోట్ల యూఏఈ ఆఫర్‌ను తిరస్కరించడంతో, తాత్కాలిక సహాయం కింద వెనువెంటనే కేరళకు రూ.2600 కోట్లను ప్రకటించాలని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ) డిమాండ్ చేసింది. ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో విదేశీ సాయం విషయంలో కేంద్రం తప్పుడు ప్రతిష్టపై నిలబడి ఈ ఆఫర్‌ను తిరస్కరిస్తుందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఆరోపించారు. నిజంగా దేశ ప్రతిష్టను నిలబెట్టుకోవాలని మోదీ ప్రభుత్వం కోరుకుంటే ఎమిరేట్స్ కన్నా ఎక్కువగా, కేరళ కోరినంత రూ.2600 కోట్ల ఆర్థిక సహాయాన్ని స్వయంగా ప్రకటించాలని కోరారు. ఒక దేశం ప్రకృతి విపత్తు భారీన పడినప్పుడు, ఇతర దేశాలు సహాయం చేయడం సర్వసాధారణమని.. భారత్ కూడా గతంలో ఇలాంటి సమయాల్లో నేపాల్, బంగ్లాదేశ్‌లకు సహకరించిందని పేర్కొన్నారు. భూకంపం వచ్చినప్పుడు దాయాది దేశం పాకిస్తాన్‌కు కూడా భారత్ సాయం చేసిందని చెప్పారు. అలాంటి సమయాల్లో యూఎన్ఓ, యూఏఈల ఆఫర్లను మనం అంగీకరించవచ్చని.. ఎలాంటి షరతులు లేకుండా యూఏఈ రూ.700 కోట్లను ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని.. దీన్ని మనం అంగీకరించవచ్చని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో విదేశాల నుంచే వచ్చే సహాయం విషయంలో.. ముందటి యూపీఏ ప్రభుత్వ పాలసీనే కేంద్రం అనుసరిస్తుందని అనధికారికంగా ఎన్డీఏ ప్రభుత్వం చెప్పేసిందని చెప్పారు. యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా లాంటి చాలా మంచి నిర్ణయాలను కూడా తీసుకుంది.. మరిదాన్ని కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదని సురవరం సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. కనీసం కేరళ ప్రభుత్వం అడిగిన మేర సాయం చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని విమర్శించారు. వరదల్లో నష్టపోయిన రూ.20 వేల కోట్ల మొత్తాన్ని కేరళ అడగడం లేదని.. కేవలం రూ.2600 కోట్ల సాయాన్ని మాత్రమే ఆర్థిస్తుందని చెప్పారు. యూఏఈ ఆఫర్‌ను తిరస్కరిస్తే.. కేరళకు కచ్చితంగా రూ.2600 కోట్లు ఇవ్వాల్సిందేనని.. భారత్ మాత్రమే ఈ సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని చెప్పాలని డిమాండ్ చేశారు. -
పతనమవుతున్న టీఆర్ఎస్ గ్రాఫ్: చాడ
హుస్నాబాద్ రూరల్: తెలంగాణలో టీఆర్ఎస్ గ్రాఫ్ పతన దశకు చేరుతోందని, అందుకే సీఎం కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. బుధవారం హుస్నాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ, ప్రజా సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించడం వల్లే టీఆర్ఎస్ను ప్రజలు ద్వేషిస్తున్నారని పేర్కొన్నారు. సెప్టెంబర్‌లో అసెంబ్లీ రద్దు చేసి ప్రగతి నివేదిక పేరుతో అదే నెలలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. అసెంబ్లీని రద్దు చేయడం, ఎన్నికలపై చర్చించేందుకు బుధవారం మంత్రులతో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సీపీఐ సిద్ధంగా ఉందని చెప్పారు. హుస్నాబాద్‌లో సీపీఐ ఆధ్వర్యంలో కేరళ బాధితులకు రూ.10 లక్షలకు పైగా విరాళాలు సేకరించి పంపినట్టు తెలిపారు. -
ఇందిరమ్మ ఇళ్లకు సీఎం ఎసరు: చాడ
చిగురుమామిడి (హుస్నాబాద్): కేసీఆర్ ఇందిరమ్మ ఇళ్లకు ఎసరుపెట్టారని, రాష్ట్రవ్యాప్తంగా 4.66 లక్షల ఇళ్ల నిర్మాణాలను నిలిపివేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచలో విలేకరులతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయని భావించిన ప్రభుత్వం.. సీబీసీఐడీతో విచారణ జరిపించి ఎందుకు మరుగున పెట్టిందని ప్రశ్నించారు. డబుల్‌బెడ్ రూం ఇళ్లు ఎక్కడా నిర్మించడం లేదన్నారు. రామచంద్రం, హుస్నాబాద్ ఎమ్మె ల్యే వొడితెల సతీష్‌కుమార్ పదినెలల క్రితం డబుల్బెడ్రూం ఇళ్లకు శంకుస్థాపన చేశారని, ఇంకా ప్రారంభంకాలేదని పేర్కొన్నారు. -
ఓటమి భయంతోనే ముందస్తు: చాడ
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముందస్తు ఎన్నికలకు సంకేతాన్ని ఇస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. బీజేపీతో చేసుకున్న లోపాయికారీ ఒప్పందం వల్లే సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ మఖ్దూంభవన్‌లో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్ఎస్ను, కేసీఆర్‌ను గద్దె దించుతామని ప్రకటించారు. టీఆర్ఎస్ ఎన్నికల హామీలను కేసీఆర్ గాలికి వదిలి బర్రెలు, గొర్రెలు, చేపలు అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ప్రజల్ని మభ్యపెట్టేవిధంగా ప్రకటనలు ఇస్తున్నారని ఆరోపించారు. మహిళలు లేని మంత్రివర్గాన్ని ఏర్పాటుచేసిన రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనన్నారు. అపాయింట్మెంట్ కూడా ఇవ్వరా? పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల హామీని అమలుచేయాలని అడిగేందుకు కేసీఆర్ అపాయింట్మెంటు కూడా ఇవ్వడం లేదని.. ప్రగతిభవన్‌కు వెళ్తే అరెస్టు చేశారని చాడ వెల్లడించారు. ముఖ్యమంత్రికి కనీసం పిలిచి మాట్లాడే సంస్కారం కూడా లేదా అని ప్రశ్నించారు. ఇలాంటి నిర్బంధాలకోసమేనా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ను అప్రజాస్వామికంగా సస్పెండ్ చేసి, కొత్తరకమైన కుట్రలకు తెరలేపారన్నారు. వివిధ పార్టీల నేతలను బెదిరించి, టీఆర్ఎస్లోకి ఫిరాయించుకుంటున్నారని ఆరోపించారు. సామాజిక తెలంగాణ సమగ్రాభివృద్ధి నినాదంతో వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులు అన్నింటితో కలిపి టీఆర్ఎస్ను గద్దె దించుతామన్నారు. నియోజకవర్గాల్లో పార్టీ కమిటీలు వేశామని, భావ సారూప్య పార్టీలతో పొత్తు ఉంటుందని వెల్లడించారు. -
కేసీఆర్ హటావో..తెలంగాణ బచావో: చాడ
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలలో ప్రజలకిచ్చిన హామీని అమలుపరచని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె దింపడానికి ‘కేసీఆర్ హటావో..తెలంగాణ బచావో’అనే నినాదంతో పోరాటాలు ఉధృతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ సోమవారం సీపీఐ కార్యకర్తలతో కలసి ప్రగతి భవనం ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ..ప్రభుత్వం దళితులకు మూడెకరాల భూమి, కేజీ నుంచి పీజీ ఉచిత విద్య, డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చి విఫలమైందని విమర్శించారు. హామీలను అమలుపర్చమని అడిగితే అరెస్టులు చేస్తారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వరని, ధర్నాలు చేసుకునేందుకు వీలు లేకుండా ధర్నాచౌక్‌లు ఎత్తివేస్తారన్నారు. నియంతల పద్ధతులతో, ప్రజల గొంతు నొక్కుతూ పాలన చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి నియంత్రుత్వ పోకడలు మానకుంటే ప్రజాస్వామ్య, లౌకిక శక్తులతో కలసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. -
‘కరుణానిధికి భారతరత్న ఇవ్వాలి’
-
‘మేము ఎప్పటికీ డీఎంకేతోనే ఉంటాం’
సాక్షి, చెన్నై : డీఎంకే అధినేత దివంగత కరుణానిధికి సీపీఐ ఘన నివాళులర్పించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, జాతీయ కార్యదర్శి నారాయణ సోమవారం చెన్నైలోని గోపాలపురం నివాసంలో కరుణానిధి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా సురవరం సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కరుణానిధి పెద్ద హేతువాది అయినా కూడా తమిళ ప్రజల సంక్షేమానికి శ్రమించిన మహానాయకుడని గుర్తు చేశారు. ఆయన మృతి తమిళనాడుకు తీరనిలోటన్నారు. సీపీఐ ఎప్పుడూ డీఎంకేతోనే కొనసాగుతుందని స్పష్టం చేశారు. కరుణానిధికి భారతరత్న ఇవ్వాలనే డీఎంకే డిమాండ్ న్యాయబద్దమైనదేనని తెలిపారు. ఈ డిమాండ్‌కు సీపీఐ పూర్తి మద్దతిస్తుందని సురవరం తెలిపారు. కరుణానిధి 80 ఏళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగారు. ఐదుసార్లు ముఖ్యమంత్రిగా, 14 మంది ప్రధానులను చూసిన రాజకీయ నేతగా కరుణానిధి దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయవేత్త అని కొనియాడారు. -
స్థాయి మరిచిన అచ్చెన్నాయుడు
అల్లిపురం (విశాఖ): ఆర్టీసీ ఎన్నికల్లో నేషనల్ మజ్దూర్ యూనియన్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రవాణా శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రాజీనామా చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇక్కడి సీపీఐ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు ఒక యూనియన్ నాయకుడిగా ప్రచారం చేశారని, మంత్రి ప్రచారం చేసినా ఎన్ఎంయూ ఓడిపోయినందున నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలన్నారు. లేకుంటే ముఖ్యమంత్రే ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. విశాఖ నగరం చుట్టుపక్కల విలువైన ప్రభుత్వ భూములు కబ్జాలకు గురయ్యాయని, ప్రభుత్వం వాటిని కాపాడి ప్రజా అవసరాలకు వినియోగించాలని సీపీఐతో పాటు ప్రతిపక్ష పార్టీలు అనేక పోరాటాలు నిర్వహించడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసిందన్నారు. సిట్ నివేదిక అందజేసి మూడు నెలలు కావస్తున్నా దర్యాప్తు వివరాలు బయటపెట్టలేదని, అందుకు కారణం అధికార పార్టీ మంత్రులు, శాసనసభ్యులకు సంబంధాలు ఉండడమేనని చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆ నివేదకను బయటపెట్టాలని, కబ్జాదారులు ఎంతటి వారైనా వారిపై పీడీ యాక్ట్ పెట్టి నగర బహిష్కరణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వారికి సహకరించిన రెవెన్యూ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సీపీఐ పరిశీలనలో వెల్లడైన కబ్జాదారుల వివరాలను ఆయన వెల్లడించారు. ♦ కొమ్మాది సర్వే నంబరు 28/8లో 10.18 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాతంత్ర సమరయోధుడు దాకవరపు రాములు పేరిట ఉంది. ఆ భూమి కె.శ్రీనివాసరెడ్డి ఆక్రమణలో ఉంది. ♦ సర్వేనంబర్ 161/1లో 10 ఎకరాలు ప్రభుత్వ భూమి బుద్ద మహాలక్ష్మీ, వై.పార్వతిల అధీనంలో ఉంది. ♦ 7 పార్టులో 10 ఎకరాలు ప్రభుత్వ భూమి మాజీ సైనికుడు కె.రామారావు పేరిట ఉంది. ♦ సర్వే నంబరు 154/35లో 5 ఎకరాల భూమిని మంత్రి గంటా శ్రీనివాసరావు శాడో ఎమ్మెల్యే పరుచూరి భాస్కరరావు ఆక్రమించారు. ♦ సర్వే నంబరు 7లో 50 ఎకరాల ప్రభుత్వ భూమి మైటాస్ సంస్థ ఆధీనంలో ఉంది. ♦ పీఎంపాలెం పరిధిలో సర్వే నంబరు 20/4లో 2.82 ఎకరాల ప్రభుత్వ భూమి తిరుమల రాణి పేరిట ఆక్రమణలో ఉంది. ♦ గాజువాక సర్వేనంబరు 87లో వెయ్యి గజాల ప్రభుత్వ భూమి మాజీ శాసనసభ్యులు పల్లా సింహాచలం కుటుంబీకులు స్వాధీనంలో ఉంది. -
మోదీది దళిత వ్యతిరేక ప్రభుత్వం: సురవరం
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ చట్ట పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలోని పార్లమెంటు సమీపంలో సింహగర్జన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు పలు పార్టీల నేతలు సహా, రాష్ట్రాల నుంచి దళిత సంఘా ల నేతలు హాజరయ్యారు. దీక్షలో పాల్గొన్న సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని, అంటరానితనాన్ని బలపరుస్తోందని మండిపడ్డారు. గోరక్ష పేరు తో హింసను ప్రేరేపిస్తున్న బీజేపీ, దళితుల సంక్షేమా న్ని పట్టించుకోవడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చి పరిరక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. దీక్షలో పాల్గొన్న తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరాం మాట్లాడుతూ..ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని షెడ్యూ ల్ 9లో చేర్చాలని చేస్తున్న డిమాండ్‌కు తమ మద్దతు ఉంటుందన్నారు. దీక్షను గురువారం కూడా నిర్వహించనున్నట్టు సమితి చైర్మన్ మందకృష్ణ తెలిపారు. సమితి కన్వీనర్లు అద్దంకి దయాకర్, జె.బి.రాజు, జి. చెన్నయ్య, బెల్లయ్య నాయక్ తదితరులు దీక్షలో పాల్గొన్నారు. -
వామపక్షాల దారి ఎటు?
తెలుగుదేశం ప్రభుత్వం అవినీతి, అశ్రిత పక్షపాతం, అహంకార ధోరణులపై నేడు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. అందుకే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా పడే ఓట్లు చీలిపోవాలని బాబు కోరుకుంటున్నారు. బీజేపీ వ్యతిరేక, కాంగ్రెసేతర ప్రత్యామ్నాయం మాటలతో గందరగోళ పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ పార్టీలు చిక్కుకుని చివరికి తమతో చేతులు కలుపుతారేమోనన్న ఆశ బాబులో ఉందంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. గతంలో అవసరం తీరాక మిత్రపక్షాలతో టీడీపీ వ్యవహరించిన తీరును గుర్తుచేసుకుని వామపక్షాలు సహా అన్ని ప్రతిపక్షాలు ఏపీలో చంద్రబాబును మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడానికి చేతులు కలపాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభు త్వాన్ని ఓడించడమే ప్రధాన కర్తవ్యంగా వామపక్షాలు భావిస్తున్నాయి. ఆ కర్తవ్య నిర్వహణకు కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న ఏ కూట మిలోనూ ఎన్నికల ముందు చేరడానికి తాము సిద్ధంగా లేమని సీపీఎం స్పష్టం చేసింది. ఎన్నికల తర్వాతే వివిధ రాష్ట్రాల్లో అక్కడి ప్రత్యేక పరిస్థితులను బట్టి ఏర్పడే వివిధ పార్టీలకు వచ్చే సీట్లను బట్టి ప్రభుత్వాన్ని ఎవరితో కలసి ఏర్పాటు చేయాలో నిర్ణ యిస్తామని ఈ పార్టీ తెలిపింది. కాంగ్రెస్‌ను, బీజేపీని ఒకే గాటిన కట్టేందుకు సీపీఐ సిద్ధంగా లేదు. తమ వ్యూహానికి అనుగుణంగా ఎన్నికల పొత్తులు నిర్ణ యించుకునే స్వేచ్ఛను పార్టీ శాఖలకు సీపీఎం ఇచ్చింది. జలంధర్‌లో 1978లో జరిగిన పదో జాతీయ మహాసభల సందర్భంగా సీపీఎం వ్యవ స్థాపక ప్రధాన కార్యదర్శి పుచ్చలపల్లి సుందరయ్య కూడా ఇలాంటి సూచన చేశారు. ఆయన ప్రతిపాదన అప్పట్లో వీగిపోయింది. నాటి సుందరయ్య సూచన ఆచరణాత్మక రూపం దాల్చేందుకు నేటి సీపీఎం వైఖరి కొంతవరకు దోహదం పడుతోందని ఆశిం చవచ్చు. ఈ నేపథ్యంలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు ఏం చేయాన్న ప్రశ్న తలెత్తుతుంది. తెలంగాణలో సీపీఎం ఓ చరిత్రాత్మక ప్రయో గానికి రెండు సంవత్సరాల ముందే స్వీకారం చుట్టింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ఉధృతంగా సాగుతున్నప్పుడు పార్టీ కేంద్ర నాయకత్వం సూచిం చిన సమైక్య విధానంతో తెలంగాణ ప్రజల మనోభా వాలకు భిన్నంగా వ్యవహరించింది. అంతవరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతంలోనే కొంత బలం కలిగిన పార్టీగా ఉన్న∙సీపీఎం ప్రజలకు దూరమైంది. తిరిగి తెలంగాణ ప్రజలతో మమేక మయ్యే అవకాశం కోసం ఎంతగానో ప్రయత్నిం చింది. ఇందులో భాగంగా ‘బహుజన వామపక్ష సంఘటన’ ఆవిర్భావంలో ప్రధాన పాత్ర వహిం చింది. హైదరాబాద్‌లో ‘లాల్–నీల్’ ఐక్యత నినాదం మొదటిసారి సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హైదరాబాద్‌లో ప్రకటించారు. నిజానికి ఎన్నికల్లో కూడా బహుజన, వామపక్ష సంఘటన పేరుతో పాల్గొనాలని నిర్ణయించింది. దళిత, ఆది వాసీ, నేత, గీత తదితర వృత్తుల వారికి తగినన్ని స్థానాలను సైతం కేటాయిస్తామని ప్రకటించింది. సీపీఎం కృషి అభినందనీయమే కాక అనుసరణీయం కూడా. దేశంలో మార్కిజాన్ని అనుసరించాలంటే శ్రామికవర్గ పోరాట మార్గమే సరిపోదు. పార్టీ నేతలు పుట్టుకతో వచ్చిన వర్గ దృక్పథాన్ని వదిలించుకోవ డమే కాదు, ఆధిపత్య కుల అహంకారాన్ని విడి చిపెట్టడం కూడా అవసరం. బాబు పాలనకు ముగింపే ప్రధాన కర్తవ్యం నేటి ఆంధ్రప్రదేశ్ బీజేపీ పరిస్థితి తెలంగాణలో కంటే మరీ అధ్వానంగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో, ప్రత్యేకించి ఆంధ్రలో బీజేపీని ఓడించడమన్నది అంత ముఖ్యమైన అంశం కాదు. సీఎం బాబు నాయ కత్వంలోని టీడీపీ పాలన నేడు ఆంధ్రప్రదేశ్ ప్రజల పురోగతి, శాంతి సౌభాగ్యాలకు ప్రధమ శత్రువు. కనుక వామపక్షాల కర్తవ్యం తెలుగుదేశం పార్టీని ఓడించడమే. పైగా ఇప్పుడు కేంద్రంలో బీజేపీ పాల నను వ్యతిరేకిస్తున్నట్టు చంద్రబాబు చెబుతున్నారు. నరేంద్ర మోదీకి నాలుగేళ్లు సాగిలపడిన తెలుగుదేశం బూటకాన్ని తెలుగు ప్రజలు గ్రహిస్తూనే ఉన్నారు. అలాగే పెద్ద నోట్లరద్దు, జీఎస్టీ అమలు వంటి మోదీ ప్రజా వ్యతిరేక చర్యలను వేనోళ్ల పొగిడింది చంద్ర బాబు అన్న సంగతి కూడా ప్రజలకు గుర్తుంది. ఇప్పుడు మోదీపై లాలూచీ కుస్తీకి చంద్రబాబు తెర తీశారు. ఈ పరిస్థితుల్లో బాబు టీడీపీ పాలనకు చర మగీతం పాడటం రాష్ట్ర ప్రజల ముందున్న ప్రధాన తక్షణ కర్తవ్యం. ఇదే నేడు ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూ నిస్టులు గుర్తించాల్సిన వాస్తవం. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు– ఇదీ చంద్ర బాబు నైజం. తెలుగు ప్రజలకు ఆత్మ గౌరవ నినాదం అందించి, అంతవరకు ఓటమెరుగని కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించిన ఎన్టీఆర్ చంద్రబాబుకు పిల్లనిచ్చి, రాజకీయ పునర్జన్మ కూడా ప్రసాదించారు. పదవీ వ్యామోహంతో బాబు ఎన్టీఆర్‌నే పదవీచ్యుతుడ్ని చేసిన విషయం మరచిపోలేము. ఆ విషయం నేటి తరం యువతకు కూడా నిరంతరం గుర్తు చేయాలి. గెలుపుపై ధీమా లేకనే బీజేపీతో బాబు పొత్తు! 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీపై తెలుగుదేశం ఒంట రిగా పోటీచేసి విజయం సాధించగలదనే నమ్మకం లేకనే చంద్రబాబు అప్పటికే వీస్తున్న మోదీ హవాను వాడుకోవాలనుకున్నారు. వెంటనే బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. అంతకు ముందు 1999, 2004లో కూడా ఏబీ వాజ్పాయ్ ప్రధానిగా ఉండగా బీజేపీతో చేతులు కలిపారు. 2004లో పరాజయంతో ఇక ఎన్న టికీ బీజేపీతో పొత్తుపెట్టుకునే ప్రశ్నే లేదని ప్రకటిం చారు. కాని ఒట్టు తీసి గట్టున పెట్టి 2014లో ప్రధాన మంత్రి పదవికి బీజేపీ అభ్యర్థి మోదీ అండతోనే ఎన్ని కల్లో పాల్గొన్నారు. అయినా ఆంధ్రలో బీజేపీ బలం సరిపోదని భావించి, సినీ హీరో పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి మరీ తనకు మద్దతు ఇవ్వమని అర్థిం చారు. అయితే అందుకు బదులు జనసేనకు రాజ్య సభ సీటు ఇస్తానని చంద్రబాబు వాగ్దానం చేశారు. ఈ విషయం ఇటీవలే పవన్ కల్యాణ్ స్వయంగా ప్రక టించారు. ఇలా మాట తప్పడం, తప్పుడు వాగ్దా నాలతో ‘పోయేదేముంది మాటే కదా.. వచ్చేది పదవి కదా’ అనే ధోరణి చంద్రబాబుది. అప్పటికి తెలుగు దేశం అధినేత నైజం తెలియని పవన్ ఎన్నికల్లో తెలు గుదేశం పార్టీకి సహకరించారు. నిజానికి నాడు తెలుగుదేశం పార్టీకి ఈ సహకారమే లేకపోతే ఆ ఎన్నికల్లో ఓడిపోయేది. ఇక చంద్రబాబు మోసానికి బలైన పార్టీల్లో వామపక్ష పార్టీలూ ఉన్నాయి. 1995లో ఎన్టీఆర్‌ను పదవీచ్యుడ్ని చేసిన చంద్రబాబు దొడ్డిదారిన ముఖ్యమంత్రి కావడానికి ఆయనకు వామపక్షాలు అండగా ఉన్నాయి. ఆ తర్వాత కొంత కాలానికి ఇదే ముఖ్యమంత్రి కమ్యూనిస్టు పార్టీలకు కాలంచెల్లిందని హేళన చేశారు. అయినా 2009లో మళ్లీ ఆ కమ్యూనిస్టుల వద్దకే వెళ్లి మహా కూటమిలో చేరాలని చంద్రబాబు అభ్యర్థించారు. అందుకు రెండు కమ్యూనిస్ట్ పార్టీలూ అంగీకరించి మహాకూట మిలో చేరినా ఫలం దక్కలేదు. ఎంతో అనుభవ మున్న కమ్యూనిస్టులు ఎలా చంద్రబాబు బుట్టలో పడ్డారో తెలియదు. 2014లో చంద్రబాబు మళ్లీ బీజేపీతో చేతులు కలిపి అధికారం సంపాదించారు. ఇలాంటి చంద్రబాబుతో గతంలో పొత్తు పెట్టుకో వడం, ఎన్నికల్లో చేతులు కలపడం పొరపాటని కమ్యూనిస్ట్ పార్టీలు ఇంతవరకు బహిరంగ ఆత్మ విమర్శ చేసుకోలేదు. కాపులకు ద్రోహం చేసింది ఎవరు? వామపక్షాలు పవన్ కళ్యాణ్‌తో చేతులు కలిపి, తృతీ యఫ్రంట్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని సీపీఎం నేత బీబీ రాఘవులు చెప్పారు. చంద్రబాబు మాది రిగా ఓట్ల కోసం వైఎస్ఆర్సీపీ ప్రజలను వంచిం చడం లేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాతో పాటు విభజన హామీల అమలుకు కేంద్రంలో ఏ పార్టీ కృషి చేస్తుందో ఆ పార్టీకి తమ మద్దతు ఇస్తామని ఈ పార్టీ గతంలోనే స్పష్టం చేసింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదనే సుప్రీంకోర్టు తీర్పు కార ణంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున తాము అంతకు మించి ప్రస్తుత రిజర్వేషన్ల అమలు చేయడం సాధ్యం కాదు కనుక చంద్రబాబులా ఓట్ల కోసం రిజర్వేషన్లు వచ్చేలా చూస్తామని చెప్పలేనని వైఎస్ఆర్సీపీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టంచేశారు. అంటే కాపు లను గాలికొదిలేశారని కాదు. వారికి తమ పరిధిలో ఎంత ఎక్కువ మేలు చేయగలనో అంత ఎక్కువగా చేస్తానని, కాపు కార్పొరేషన్‌కు నిధులు రెట్టింపు చేసి, కాపుల సంక్షేమానికి కృషిచేస్తానని కూడా చెప్పారు. నాలుగేళ్ల పాటు తానిచ్చిన కాపు రిజర్వేషన్ హామీని తుంగలో తొక్కిన తెలుగుదేశం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. ఇలాంటి స్వభావం వైఎస్ఆర్సీపీది కాదు. అమలు చేయగలిగితేనే హామీ ఇవ్వాలి. వాగ్దానం చేశాక నిలబెట్టుకోవాలి. కాపు లకు మేలు జరిగే పోరాటానికి తన అండదండలు ఎప్పుడూ ఉంటాయని వైఎస్ఆర్సీపీ హామీ ఇస్తూనే ఉంది. 2014లో చంద్రబాబు అవకాశవాద రాజకీయా లను మరోసారి ఆచరణలో అమలు చేసి విజయం సాధించారు. బీజేపీతో పొత్తుపెట్టుకుని, జనసేన మద్దతు తీసుకుని అధికారంలోకి వచ్చారు. ఈసారి ఈ తరహా రాజకీయ ఎత్తుగడలు చంద్రబాబుకు సాధ్యపడకపోవచ్చు. తెలుగుదేశం ప్రభుత్వం అవి నీతి, అశ్రిత పక్షపాతం, అహంకార, ఆధిపత్య ధోర ణులపై నేడు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. పైగా బాబుది మాటల గారడీయేగాని ఆయన కార్య శూరుడు కాదన్న భావన కూడా ఈ నాలుగేళ్లలో బలపడింది. అందుకే తెలుగుదేశం పార్టీకి వ్యతి రేకంగా పడే ఓట్లు చీలిపోవాలని చంద్రబాబు కోరు కుంటున్నారు. కిందటి ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ లకు ఆంధ్రప్రదేశ్‌లో సీట్లేమీ రాని మాట నిజమే. అయితే, ఇంకా వామపక్షాలకు ప్రజల్లో ఎంత లేదన్నా ఇంగువ కట్టిన గుడ్డ మాదిరిగా పేరు ప్రతిష్ట లున్నాయి. బీజేపీ వ్యతిరేక, కాంగ్రెసేతర ప్రత్యా మ్నాయం మాటలతో గందరగోళ పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ పార్టీలు చిక్కుకుని చివరికి తమతో చేతులు కలుపుతారేమోనన్న ఆశ చంద్రబాబులో ఉందంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అది జరగని పక్షంలో ఎన్నో కూటములు, పార్టీలు ఎన్ని కల్లో పోటీ చేస్తే తన వ్యతిరేక ఓట్లు చీలిపోయి తెలు గుదేశం విజయం సాధిస్తుందని ఆయన భావిస్తు న్నారు. ఏదో దింపుడు కళ్లెం ఆశ చంద్రబాబులో ఉన్నట్టు కనిపిస్తోంది. గతంలో అవసరం తీరాక మిత్ర పక్షాలతో తెలుగుదేశం వ్యవహరించిన తీరును గుర్తుచేసుకుని వామపక్షాలు సహా అన్ని ప్రతిపక్షాలు ఏపీలో చంద్రబాబును మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడానికి చేతులు కలపాల్సిన సమయం ఆస న్నమైంది. వ్యాసకర్త: డాక్టర్ ఏపీ విఠల్, మార్క్సిస్టు విశ్లేషకులు మొబైల్ : 98480 69720 -
బాబుకు అధికారం..ప్రజల ప్రాణాలు గాల్లో
విజయవాడ: టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ..కర్నూలు జిల్లా క్వారీ ఘటనాస్థలానికి చంద్రబాబు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ఎక్స్‌గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకున్నారు..కానీ ఒక్కరి పై కూడా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కర్నూలు జిల్లా క్వారీ ప్రమాద ఘటనపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు వెంటనే రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కోరారు. రాష్ర్ట మంత్రి అచ్చెన్నాయుడు ఆర్టీసీ కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని విమర్శించారు. మంత్రి పదవికి రాజీనామా చేసి ఆర్టీసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాలని హితవు పలికారు. ఉత్తరాంధ్ర సమస్యలపై మేధావులు, ప్రజా సంఘాలతో ఆగస్టు 10న చర్చిస్తామని, రాయలసీమ సమస్యలపై ఆగస్టు 26న చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. నాలుగు సంవత్సరాలు బీజేపీ కలిసి కాపురం చేసిన టీడీపీ ఇప్పుడు పార్లమెంటు వేదికగా చేస్తున్న డ్రామాలు, వేషాలు ఆపాలని సూచించారు. రూ.53 వేల కోట్ల పీడీ అకౌంట్ల కుంభకోణంపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. -
‘వారికి మంత్రి పదవులు ఇవ్వడం సిగ్గుచేటు’
సాక్షి, తిరుపతి : అధికారుల అవినీతి కారణంగానే కర్నూలు క్వారీ ఘటనలో పదిమంది మరణించారని ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు పాలన అవినీతి మయంగా మారిందని మండిపడ్డారు. ఆయన సోమవారం తిరుపతిలో ఓ సమావేశంలో మాట్లాడుతూ.. అవినీతి సొమ్ముతో ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేశారని రామకృష్ణ మండిపడ్డారు. పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. -
క్వారీ వద్ద పోలీసుల అత్యుత్సాహం
కర్నూలు జిల్లా: హత్తిబెళగల్ క్వారీ ప్రమాద ఘటనాస్థలి వద్ద పోలీసులు అతి ఉత్సాహం ప్రదర్శించారు. సంఘటనాస్థలాన్ని సందర్శించడానికి వచ్చిన బీజేపీ, వామపక్షాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నాయకులు, పోలీసుల తీరును తప్పుపట్టారు. టీడీపీ నాయకుడు శ్రీనివాసుల చౌదరీకి సంబంధించిన క్వారీ కాబట్టే వారిని తప్పించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని బీజేపీ ఆరోపించింది. ఘటనకు కారకులైన టీడీపీ నాయకులతో పాటు సంబంధిత అధికారులు కూడా బాధ్యత వహించాలన్నారు. కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెళగల్ క్వారీ ప్రమాదాన్ని నిరసిస్తూ విజయవాడలో సీఐటీయూ ధర్నా నిర్వహించింది. ప్రభుత్వ అండతోనే యధేచ్ఛగా అక్రమంగా క్వారీలు తవ్వుకుంటున్నారని సీఐటీయూ నాయకులు ఆరోపించారు. బాధితులకు ప్రభుత్వం తక్షణమే ఆర్ధికసాయం అందజేయాలని డిమాండ్ చేశారు. -
అందుకే సిట్ నివేదిక బయటపెట్టడం లేదు
విజయనగరం: విశాఖపట్నం జిల్లాలో రూ.2500 కోట్ల భూ కుంభకోణం జరిగిందని పోరాటాలు చేస్తే సిట్ దర్యాప్తు చేసి సీఎం నారా చంద్రబాబు నాయుడికి ఇచ్చిందని, మరి ఆ నివేదిక ఎందుకు బయటపెట్టలేదో సీఎం సమాధానం చెప్పాలని ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. సిట్ ఇచ్చిన నివేదికలో అధికార పార్టీ నేతలు ఉన్నారని..అందుకే నివేదిక బయటపెట్టడం లేదని వ్యాఖ్యానించారు. ఈ నెల 10వ తేదీ లోపు విశాఖ భూకుంభకోణంపై సిట్ నివేదిక బయటపెట్టాలని లేకపోతే అదే రోజు 4 గంటలకు కబ్జాదార్ల పేర్లు బయటపెడతామని హెచ్చరించారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం బలిఘట్టం గ్రామంలో శుక్రవారం రామకృష్ణ వివాదాస్పద భూములను పరిశీలించారు. బలిఘట్టం గ్రామంలో రూ.500 కోట్ల విలువైన 91 ఎకరాల భూమి ఆక్రమణలకు గురైందని వాఖ్యానించారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిథులు కలిసి ఈ భూ కుంభకోణంలో భాగాస్వాములుగా ఉన్నారని చెప్పారు. 2008లో ప్రభుత్వ భూమిని ట్యాంపరింగ్ చేసింది అప్పటి జాయింట్ కలెక్టర్ జగన్మోహన్నేని చెప్పారు. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. -
జలీల్ ఖాన్ మరో గ’లీజు’
-
జలీల్ ఖాన్‌కి వ్యతిరేకంగా ముస్లింల ఆందోళన
విజయవాడ: నగరంలోని వన్ టౌన్ జుమ్మామసీద్ సెంటర్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వందకోట్ల విలువైన మసీదు స్థలాన్ని అన్యాక్రాంతం చేసేందుకు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ జలీల్ ఖాన్ యత్నం చేశారు. జలీల్ ఖాన్ నిర్ణయానికి వ్యతిరేకంగా మసీద్ స్థలం వద్ద సీపీఐతో పాటు ముస్లిం సంఘాలు ఆందోళనకు దిగారు. జలీల్ ఖాన్ ముస్లీంల ద్రోహి అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో భారీగా పోలీసులు మోహరించారు. జుమ్మామసీద్ వద్ద ఆందోళన చేస్తున్న సీపీఐ, ప్రజాసంఘాలు, ముస్లీం మైనారిటీలను అరెస్ట్ చేశారు. బలవంతంగా పోలీస్ వాహనాల్లో ఎక్కించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థలాన్ని అక్రమంగా తక్కువ ధరకు కట్టబెట్టడం..ముస్లిం సంఘాల నుంచి పెద్ద ఎత్తున నిరసన రావడంతో జుమ్మా మసీద్ స్థలం లీజుపై వక్ఫ్ బోర్డ్ చైర్మన్ జలీల్ ఖాన్ వెనక్కు తగ్గారు. ప్రభుత్వం నుంచి ఒత్తిడి రావడంతో జలీల్ ఖాన్ హుటాహుటిన మీడియా సమావేశం ఏర్పాటు చేసి జుమ్మామసీద్ స్థలం లీజు టెండర్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. -
నియోజకవర్గాలన్నింటికీ కమిటీలు: చాడ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలన్నింటికీ ఆగస్టు నెలాఖరులోగా కమిటీలను వేసి వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 1 నుంచి 14 వరకు సభలు, సమావేశాలు, సెమినార్ల ద్వారా విస్తృత ప్రచారం చేస్తామన్నారు. టీఆర్ఎస్ ఎన్నికల హామీలను అమలుచేయాల ని కోరుతూ ఆగస్టు 13న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పార్టీ శ్రేణులతో కలసి ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని చాడ ప్రకటించారు. అన్ని జిల్లాల్లోనూ కలెక్టరేట్లను అదే రోజున ముట్టడించాలని పిలుపునిచ్చారు. -
ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే
లబ్బీపేట (విజయవాడ తూర్పు)/సాక్షి ప్రతినిధి, విజయనగరం/ కాశీబుగ్గ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం యవత కదం తొక్కింది. రాష్ట్రంలో విద్యార్థి, యువజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు పలు చోట్ల పెద్ద ఎత్తున మానవహారాలు చేపట్టారు. బుధవారం విజయవాడ మహాత్మా గాంధీ రోడ్డులో వందలాది మంది విద్యార్థులు మానవహారంగా ఏర్పడి, ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేత మల్లాది విష్ణు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ఆమ్ ఆద్మీ, అనుబంధ విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. విభజన హామీలన్నీ అమలు చేస్తున్నామని బీజేపీ పార్లమెంటులో చెప్పడం సిగ్గుచేటన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ.. విద్యార్థులు తలచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయని హెచ్చరించారు. సీపీఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సమయంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్సింగ్ ఇచ్చిన హామీలను అమలు చేసి తీరాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విభజన హామీల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు, పీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ గంగాధర్‌తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ బస్‌స్టాండ్ వద్ద వందలాది మంది బుధవారం మానవహారం చేపట్టారు. అలాగే విజయనగరం జిల్లాలో, పార్వతీపురంలో విద్యార్థులు ఆందోళన చేశారు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్, రాష్ట్రంలో జాతీయ విద్యా సంస్థలను, జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ నాయకుడు, పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి మద్దిల వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ నేతల అరెస్టు సాక్షి, గుంటూరు: ప్రత్యేక హోదాను కాంక్షిస్తూ గుంటూరు జిల్లా పొన్నూరు ఐలాండ్ సెంటర్లో మానవహారం నిర్వహించిన ఎస్ఎఫ్ఐ నేతలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. వారిని అరెస్టు చేసి చెంపలపై కొట్టడం వివాదానికి దారితీసింది. వివరాల్లోకెళ్తే.. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పలు పాఠశాలల విద్యార్థులు పొన్నూరులో మానవహారం నిర్వహించారు. పోలీసులు వచ్చి మానవహారాన్ని విరమించాలని కోరడంతో ఎస్ఎఫ్ఐ నేతలు ఎస్.కె.జాఫర్‌ఖాన్, ఎం.కిరణ్, తిరుమలరెడ్డి విద్యార్థులను పంపివేశారు. ఇదే తరుణంలో అక్కడకు వచ్చిన పొన్నూరు పోలీసులు ముగ్గురిని బలవంతంగా తమ వాహనంలో ఎక్కించుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సీఐ వీరిని అసభ్యపదజాలంతో దూషిస్తూ చెంపలపై తీవ్రంగా కొట్టడమే కాకుండా ఒంటిపై ఉన్న బట్టలన్నీ తీయించి లాకప్‌లో పడేశారు. ఎస్ఎఫ్ఐ నేతలపై పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు భగవాన్‌దాస్‌తోపాటు మరికొందరు గుంటూరు రూరల్ జిల్లా ఏఎస్పీ వరదరాజులును కలిసి ఫిర్యాదు చేశారు. పోలీసులు కొట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య, సీపీఎం తూర్పు జిల్లా కార్యదర్శి పాశం రామారావు తదితరులు ఖండించారు. -
ఎన్నికల హామీలు నెరవేర్చాలని ధర్నా
పాన్‌గల్: ఎన్నికల సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీల అమలు చేయడంలో విఫలమయ్యాయని, ఇందుకు నిరసనగా సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. మహబూబ్‌నగర్ జిల్లా కార్యవర్గ సభ్యురాలు కళావతమ్మ, శ్రీరామ్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం, జీఎస్టీ విధించడం, పెద్దనోట్లు రద్దు వంటి వాటితో ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూపంపిణీ, కేజీ టూ పీజీ ఉచిత విద్య, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ అమలు తదితర హామీలు నెరవేర్చలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగానే ఈ ధర్నాలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిప్రతాన్ని తహసీల్దార్ అలెగ్జాండర్‌కు అందజేశారు. నాయకులు గోపాల్, శివకుమార్, రమణ, పెంటయ్య, నరసింహ్మ, బాలపీరు, కుర్మయ్య, తిరుపతయ్య, చెన్నమ్మ పాల్గొన్నారు. -
హోదా కోసం ఉద్యమిస్తే అరెస్టులా?
సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా కోరుతూ జరిగే ఆందోళనను అణగదొక్కడం అంటే పరోక్షంగా ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరుగార్చడమేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పేర్కొన్నారు. కేంద్రం చేసిన విద్రోహానికి నిరసనగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బంద్‌పై రాష్ట్ర ప్రభుత్వం నిర్భంధాన్ని ప్రయోగించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. బంద్ చేస్తున్న ఉద్యమకారుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ మంగళవారం వారు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. నాలుగు సంవత్సరాల పాటు బీజేపీతో అంటకాగిన టీడీపీ రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ ఇప్పుడు గగ్గోలు పెడుతోందని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కావాలంటూ దీక్షలు చేసిన తెలుగుదేశం ప్రభుత్వం.. బంద్‌ను విఫలం చేయడానికి నిర్బంధాన్ని ప్రయోగించడం ఆక్షేపణీయమని తప్పుబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యమాన్ని అణచివేసే చర్యలు విడనాడాలని వారు హితవు పలికారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం విద్యార్థి, యువజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా బుధవారం జరిగే ‘మానవహారం’ను జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. విజయవాడ దాసరి భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కోటి మందితో మానవహారం నిర్వహించాలని జేఏసీ నిర్ణయించిందన్నారు. -
ఏపీకి నష్టం జరిగింది..హోదా ఇవ్వాల్సిందే
-
ఆందోళనలో చంద్రబాబు: సురవరం
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైఎస్సార్సీపీ చేపట్టిన బంద్‌లో పాల్గొంటున్న ఆ పార్టీ శ్రేణులను టీడీపీ ప్రభుత్వం పోలీసుల చేత అరెస్ట్ చేయించడాన్ని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తప్పుపట్టారు. ఢిల్లీలో సాక్షి టీవీతో మాట్లాడుతూ.. గతంలోనూ ప్రత్యేక హోదాపై నిర్వహించిన బంద్‌లను టీడీపీ వ్యతిరేకించిందని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ ఇచ్చిన బంద్‌లను అడ్డుకుంటోందని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బంద్‌ను అణచివేయకూడదని, అరెస్ట్‌లు చేయకూడదన్నారు. గతంలో ప్రత్యేక ప్యాకేజీ వస్తే చాలని చంద్రబాబు రాష్ట్ర ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేశారని, కానీ ఎన్నికలు వస్తున్నాయని గ్రహించి ప్రత్యేక హోదాపై ప్రజల్లో ఉన్న తీవ్రమైన డిమాండ్‌ను చూసి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదాపై వైఎస్సార్ కాంగ్రెస్, వామపక్షాల నిరంతర ఆందోళనతో ప్రజా మద్ధతు పెరుగుతోందని.. దీంతో చంద్రబాబు ఆందోళనలో పడ్డారని అన్నారు. రాజీనామాలు ఆయా పార్టీల సొంత నిర్ణయమని వ్యాఖ్యానించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చలో వైఎస్సార్ సీపీ ఉంటే మరింత బాగుండేదన్నారు. ప్రధానమంత్రి జవాబు అసంతృప్తికరంగా ఉందని, ఏపీపై సానుకూలత ఆయన ప్రసంగంలో వ్యక్తం కాలేదని.. అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. రాష్ట్ర విభజన మోదీకి ఇష్టం లేనట్లు తెలుస్తోందని, విభజనలో ఆంధ్రప్రదేశ్‌కు నష్టం జరిగింది.. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. పార్లమెంటులో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాలన్నారు. ప్రతిపక్షాల మద్దుతు కూడగట్టి పోరాటం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని వివరించారు. ఏపీలో నూటికి 90 మంది ప్రత్యేక కోరుకుంటున్నారని వెల్లడించారు. చంద్రబాబు ఎన్నికల్లో ఓట్ల కోసం ఇప్పుడు మళ్లీ ప్రత్యేక హోదా అంటున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా సంజీవని కాదన్నదీ బాబే.. హోదాపై యూటర్న్ తీసుకున్నదీ బాబేనని చెప్పారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని ప్రధాని మోదీ లోక్‌సభలో అన్న మాట నిజమేనని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరుగార్చింది చంద్రబాబే కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరినీ కలుపుకుని పోరాటం చేయాలని చంద్రబాబుకు సూచించారు. -
ఏపీలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉందా?
విజయవాడ: ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ ఇచ్చిన రాష్ట్ర బంద్‌పై పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ మండిపడ్డారు. విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ..బంద్‌కు సహకరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉండగా..మధ్యలో పోలీసుల జోక్యం ఏమిటని ప్రశ్నించారు. ఏపీలో ఏమైనా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉందా? అని సందేహం వ్యక్తం చేశారు. గృహ నిర్బంధాలు, పోలీసు కేసులను ఖండిస్తున్నామని, అరెస్ట్ చేసిన వారిని తక్షణమే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. అవిశ్వాసం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏపీకి సంబంధించి సానుకూలంగా మాట్లాడలేదని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ అహంకార ధోరణితో మాట్లాడారని ఆరోపించారు. అమరావతిలో రైల్వే డబుల్ లైన్‌కు గతంతో రూ.2679 కోట్లు కేటాయించి..ఇప్పుడు దానిని రూ.1732 కోట్లకు కుదించారని చెప్పారు. కేంద్రం మరింత నిరంకుశంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. -
ప్రత్యేక హోదా కోసం సీపీఐ ధర్నా
నెల్లూరు రూరల్: విభజన హామీలను అమలు చేసి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ డిమాండ్ చేశారు. గాంధీబొమ్మ సెంటర్లో ఆ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కోసం సోమవారం నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. సీపీఐ ఆధ్వర్యంలో అనంతపురంలో ధర్నా చేస్తే పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను అరెస్ట్ చేసి 14 రోజులు జైల్లో పెట్టిన టీడీపీ సర్కార్ ఇప్పుడు హోదా ఉద్యమం చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఇప్పటికైనా తెలుగు ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని ప్రత్యేక హోదా ఇవ్వాలని, లేనిపక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీపీఐ నగర కార్యదర్శి మునీర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు శీనయ్య, నగర సమితి సభ్యులు సిరాజ్, షానవాజ్, అన్వర్, అహ్మద్, అజీజ్, షబ్బీర్, నాసిర్, శీనయ్య, గఫూర్, సర్తాజ్, తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల హామీలు నెరవేర్చాలి
కొత్తపట్నం (ప్రకాశం): టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మండల సీపీఎం, సీపీఐ కార్యదర్శిలు సూరిని స్వామిరెడ్డి, పురిణి గోపీ డిమాండ్ చేశారు. మండలంలో జీపు జాతాలో భాగంగా సీపీఎం, సీపీఐ ఆధ్యర్యంలో కొత్తపట్నం బస్టాండ్ కూడలీలో శుక్రవారం జీపు జాతా నిర్వహించారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ టీడీపీ, బీజేపీ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలైన హామీలు అమలుకు చిత్తశుద్ధితో కృషి చేయలేదని విమర్శించారు. ఇతర దేశాలు నుంచి నల్ల డబ్బు తీసికొస్తానని చెప్పి ఒక్క పైసా తీసురాలేదని దుయ్యబట్టారు. ఒంగోలు స్మార్ట్ సిటీగా మార్చడం, అర్హులైన పేదలందరికి పక్కా ఇళ్ళు నిర్మించలేదని ధ్వజమెత్తారు. రిమ్స్‌లో ఖాళీగా ఉన్న 300 పోస్టులు భర్తీ చేయకపోవడం సిగ్గుచేటున్నారు. రిమ్స్ హాస్పిటల్లో కావల్సిన మౌలిక వసుతలు కరువయ్యాని విమర్శించారు. స్వామిరెడ్డి మాట్లాడుతూ మండలంలో నాలుగు సంవత్సరాల నుంచి పంటలు పండక కరువుతో ప్రజలు అల్లాడుతుంటే ప్రభుత్వం పాలకలు పటించుకున్న పాపాన పోలేదన్నారు. పంటలు పండటానికి సాగర్, గుండ్లకమ్మ నుంచి కాలువ తీసికొచ్చి పాదర్తి చెరువుకు, అల్లూరులో ఉన్న చాపాయి, చక్రాయి చెరువుకు కలిపితే పంటలు పండుతాయన్నారు. కొత్తపట్నం బీచ్‌ను పర్యటరంగంగా ఏర్పాటు చేయాలనిన తీర పాంత ప్రజలకు ఫిషింగ్ హార్బర్ నిర్మించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కిష్టం పిచ్చయ్య, మల్లికార్జున, పట్టపు ప్రకాశం, ఏడుకొండలు పాల్గొన్నారు. -
నేనెరిగిన రాజ్‌బహదూర్ గౌర్
హైదరాబాద్ సంస్థానంలో కమ్యూనిస్టు ఉద్యమం నిర్మాత, తొలి తరం కమ్యూనిస్టుల్లో ఒకరు డాక్టర్ రాజ్‌బహదూర్ గౌర్. తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషించిన యోధుడు. 1952లో రాజ్యసభ ఏర్పడినప్పుడు తొలిసభలోనే రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. తొలినాళ్ళలో హైదరాబాద్ రాజకీయాలు, ట్రేడ్యూనియన్లతో ఆయన జీవితం పెనవేసుకుంది. అలాంటి రాజ్‌బహదూర్ గౌర్ గారిని మొదటిసారిగా 1978లో హైదరాబాద్‌లో కలిశాను. ఆయన కేవలం రాజకీయ నాయకుడే కాకుండా మంచి కవి, రచయిత. ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో పాండిత్యం కలిగిన వ్యక్తి. హైదరాబాద్‌లోని విద్యావంతుల కుటుం బంలో డాక్టర్ రాజ్‌బహదూర్ గౌర్ 1918 జూలై 21న జన్మించారు. చిన్నప్పటి నుండి చురుకైన వ్యక్తిగా ఉండేవారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఉర్దూలో డాక్టర్ కోర్సు చదివారు. చదుకునే రోజుల్లోనే కామ్రేడ్స్ అసోసియేషన్, కమ్యూనిస్టు పార్టీ రాజకీయాలతో బిజీగా ఉండేవారు. కానీ తన చదువులో 2 లేదా 3 ర్యాంకులోనే ఉండేవారు. రాజ్‌బహదూర్ తొలితరం పార్లమెంటేరియన్. అంతకుముందు సాయుధ పోరాటంలో అనేకమార్లు అరెస్టయ్యారు. రాచకొండ గుట్టల్లో ఆయుధంతో సహా పట్టుబడటంతో ఆయనను జైళ్ళో వేశారు. ఇంతలోనే సాయుధపోరాట విరమణ జరిగిపోయి, 1952లో ఎన్నికలొచ్చాయి. సాధారణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన జైలు నుండి నామినేషన్ వేసినప్పటికీ తిరస్కరణకు గురైంది. అప్పుడు జైలు నుండి విడుదల చేసేందుకు మొదటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జోక్యం చేసుకున్నారు. గౌర్ని విడుదల చేసేందుకు నాటి కేంద్ర మంత్రి గోపాలస్వామి అయ్యంగార్ ససేమిరా అన్నాడు. ఆయన ఆయుధంతో అడవిలో పట్టుబడిన ప్రమాదకర వ్యక్తి అన్నారు. అయితే, సర్వేపల్లి ఆయన సంగతి నీకు తెలియదని చెప్పి విడుదల చేయిం చారు. దీంతో 1952లో రాజ్యసభ ఏర్పడినప్పుడు తొలి సభ్యుల్లో ఒకరిగా హైదరాబాద్ స్టేట్ నుండి ఎన్నికయ్యారు. ఆ తరువాత రెండవసారి కూడా పెద్దల సభకు ఎన్నికయ్యారు. హైదరాబాద్ సంస్థానంలో ట్రేడ్ యూనియన్లలో రాజ్‌బహదూర్ గౌర్ పేరు మారుమ్రోగేది. నిజాం హయాంలోనే ఆయన అనేక కార్మిక సంఘాలను ఏర్పాటు చేశారు. నిజాం రైల్వే, ఆర్టీసీ, సింగరేణి, బ్యాంకింగ్ యూనియన్లలో ఆయన కీలక పాత్ర పోషించారు. మెడికల్ శాఖలో ఆసుపత్రుల్లో పని చేస్తున్న కాంపౌండర్లు, ఏఎన్ఎం, నర్సులు తదితరులకు మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ స్థాపించారు. తెలంగాణలోని ప్రముఖ పరిశ్రమలు, డీబీఆర్, ఆజాం జాహీ మిల్స్ వంటి అనేక చోట్ల సంఘాలు పెట్టించారు. హైదరాబాద్‌లో ఉంటున్న నిరుపేదలకు నివాస స్థలాల కొరకు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేయించారు. తన పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది ఆయన మాట ల్లోని చమత్కారం. 70 ఏళ్లు పూర్తికాగానే పార్టీ పదవుల నుంచి స్వచ్ఛం దంగా వైదొలగి, శేషజీవితమంతా పార్టీ శ్రేయోభిలాషిగా కొనసాగి, అందరి అభిమానాన్ని, మన్ననలు పొందారు. మరణానంతరం ఆయన కోరిక మేరకు నేత్రాలను, శరీరాన్ని తాను చదువుకున్న ఉస్మానియా మెడికల్ కాలేజీకి అప్పజెప్పటం ఉత్తమ మానవతా వాదానికి నిదర్శనం. అలాంటి వ్యక్తుల ఆదర్శాలను, జీవిత విశేషాలను ఈనాటి తరానికి తెలియజెప్పడానికే డా‘‘ గౌర్ శతజయంతి ఉత్సవాలను సంవత్సరం పొడవునా నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర సమితి నిర్ణయించింది. సంవత్సరం పాటు చర్చాగోష్టులు, సెమినార్లు, సభలు సమావేశాలు నిర్వహించడం ద్వారా గౌర్ ఆదర్శాలను ఈనాటి సమాజానికి తెలియపర్చాల్సిన గురుతరమైన నైతిక బాధ్యత కమ్యూనిస్టు పార్టీ, ట్రేడ్‌యూనియన్ నాయకులపై ఉందని భావిస్తున్నాం.(నేడు రాజ్‌బహదూర్ గౌర్ శత జయంతి) చాడ వెంకటరెడ్డి, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి -
స్వామి అగ్నివేశ్‌పై దాడి అమానుషం
హిమాయత్‌నగర్ : గోరక్షణ పేరుతో అమాయక ప్రజలపై మూకుమ్మడి దాడులు పెరుగుతున్నాయని, హిందూత్వ మత మౌఢ్యాన్ని వ్యతిరేకించేవారిపై దాడులు చేయడాన్ని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పిలుపునిచ్చారు. కులం, మతం ఆధారంగా ఓట్లు అడుగుతున్న పరిస్థితి ప్రస్తుత ప్రధాన రాజకీయ పార్టీల్లో కొనసాగుతోందని ఆయన మండిపడ్డారు. స్వామి అగ్నివేష్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ గురువారం హిమాయత్‌నగర్‌లోని మఖ్దూం భవన్లో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. వేదిక అధ్యక్షులు లక్ష్మణరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో నారాయణ మాట్లాడుతూ.. ఏపీలో తటస్తుల పేరుతో నారా చంద్రబాబు నాయుడు కోటీశ్వరులను ఎన్నికల బరిలోకి దించి ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యంగా మారుస్తున్నారని మండిపడ్డారు. హిందూత్వ అరాచక పాలనను, స్వామి అగ్నివేష్‌పై అమానుష దాడిని అందరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ‘సాక్షి’ ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. 2018లో హిందూ మతమౌఢ్యులు 16మందిని చంపారన్నారు. భావ వ్యక్తీకరణను, ప్రశ్నించడాన్ని సహించలేకపోతున్నారని మండిపడ్డారు. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తేనే లౌకికతత్వం నిలుస్తుందని పేర్కొన్నారు. సభకు అధ్యక్షత వహించిన వి.లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ.. స్వామి అగ్నివేష్ 1939లో ఏపీలో జన్మించి, హరియాణాలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేయడం గొప్ప విషయమన్నారు. ఐదేళ్లు వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, మద్య నిషేధం అమలు కోసం, గిరిజనులు, దళితుల అభ్యున్నతి కోసం, సామాజిక న్యాయం కోసం ఉద్యమిస్తున్న పోరాటయోధుడన్నారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన 79 ఏళ్ల ఉద్యమకారునిపై.. ఆరెస్సెస్, బీజేపీ యువమోర్చాకు చెందిన అరాచక శక్తులు భౌతిక దాడులు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఆయనపై జరిగిన దాడికి ప్రధాని మోదీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఐజేయూ గౌరవ సలహాదారులు కె.శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రశ్నించేతత్వాన్ని పెంపొందిస్తేనే సమాజం ముందుకెళ్తుందన్నారు. తాత్విక చింతనను ప్రోత్సహించాలన్నారు. సీపీఎం కార్యదర్శి వర్గసభ్యులు డి.జి.నరసింగరావు ప్రసంగిస్తూ.. స్వామి అగ్నివేష్‌పై దాడి మనువాద మూర్ఖుల దాడేనన్నారు. సీనియర్ జర్నలిస్ట్ కె.అమర్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నేత కె.గోవర్ధన్, ప్రముఖ మహిళా నేత రమా మెల్కొటే, సీనియర్ పాత్రికేయులు తెలకపల్లి రవి, ప్రగతిశీల మహిళ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు జి.ఝాన్సీ, శ్రామిక మహిళా నేత పావని, ఎంవీ ఫౌండేషన్ నేత ప్రకాష్, అప్సా కోఆర్డినేటర్ శివరాణి, జన చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి సలీం మాలిక్, ప్రముఖ హేతువాది కె.వి.రెడ్డి, ప్రముఖ విశ్లేషకులు దేవి తదితరులు పాల్గొన్నారు. స్వామి అగ్నివేష్‌పై జరిగిన దాడిని ఖండించారు. -
జేసీ ఇంటి ముట్టడికి సిపీఐ నేతలు యత్నం
-
ప్రభుత్వాల మెడలు వంచాలంటే.. యువత ముందుకు రావాలి
రైల్వేకోడూరు అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి ప్రత్యేకహోదా, కడప జిల్లాకు ఉక్కుపరిశ్రమ సాధించాలంటే యువత పోరాటాలను ఉధృతం చేయాలని అఖిలపక్షం నాయకులు పిలుపునిచ్చారు. ఈనెల 25న ఆయా నియోజకవర్గాల్లో చేపట్టిన మానవహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ బుధవారం జీపుజాతాను ప్రారంభించారు. రాష్ట్రానికి విభజన హామీలు, ప్రత్యేకహోదా, కడపకు ఉక్కు పరిశ్రమ సాధనకు ఏపీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జీపుజాతా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య మాట్లాడుతూ విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేకహోదా, పరిశ్రమలు, విద్యాసంస్థలు, నిధులు ఇవ్వకుండా నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేసిందన్నారు. అలాగే చంద్రబాబు ఇంటికో జాబు అని ప్రజలను మోసం చేసి బామ్మర్దికి ఎమ్మెల్యే, కొడుకుకు మంత్రి ఉద్యోగాలు ఇప్పించారని విమర్శించారు. కేంద్రం నాడు కడపలో ఉక్కుపరిశ్రమ నెలకొల్పుతామని హామీ ఇచ్చి నేడు కుదరదని చెప్పడం దారుణమన్నారు. తిరుపతిలో వెంకన్న సాక్షిగా ప్రత్యేకహోదా 15 ఏళ్లు ఇస్తామని చెప్పి నేడు నయవంచన చేస్తే ప్రజలు సహించరని పేర్కొన్నారు. అలాంటి పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారని విద్యార్ధులు తెలి పారు. విభజన సమయంలో కేంద్రం పార్లమెంటులో ఇచ్చిన హామీలను రాబట్టుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమై, నేడు రాజకీయ లబ్ధి కోసం ఎన్నికల ముందు బయటకు వచ్చి పోరా టాలు, దీక్షలంటూ నాటకాలు ఆడుతోందని విమర్శించారు. అనంతరం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.సీపీఐ నాయకులు రాధాకృష్ణ, జయచంద్ర, చెన్నయ్య, సీపీఏం రాష్ట్ర నాయకులు బీ నారాయణ, సీఐటీయూ జిల్లా కార్యవర్గ సభ్యుడు సీహెచ్ చంద్రశేఖర్, వైఎస్సార్సీపీ నాయకులు గుంటిమడుగు సుధాకర్‌రాజు, సీహెచ్ రమేష్, మందల నాగేంద్ర, తల్లెం భరత్‌కుమార్‌రెడ్డి, నందాబాల, సులోచన, సుదర్శనరాజు, చల్లా రాజశేఖర్, తుమ్మల అనిల్‌రెడ్డి, కాజా అహ్మతుల్లా, రమనాథరెడ్డి, కిషోర్,జనసేన నాయకులు తాతంశెట్టి నాగేంద్ర, ముత్యాల కిషోర్, కాంగ్రెస్ నాయకులు జయప్రకాష్ నారాయన వర్మ, జైబీమ్ తుమ్మల సురేష్, విద్యార్ధి నాయకులు రాజశేఖర్, బండారు మల్లి, పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రాణహిత ప్రాణం తీసిన ప్రభుత్వం
దహెగాం(సిర్పూర్): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పుట్టిన ప్రాణహిత ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించకుండా వార్ధానదికి తరలించి ప్రాణహిత ప్రాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసిందని సీపీఐ బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ , జల సాధన సమితి అధ్యక్షుడు నైనాల గోవర్ధన్ అన్నారు. మంగళవారం మండలకేంద్రంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా మండల కేంద్రం సమీపంలో అసంపూర్తిగా ఉన్న ప్రాణహిత కాలువను సందర్శించారు. అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రాణహిత వద్ద ప్రాజెక్టు నిర్మించకుండా వార్ధా నదికి మార్చడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి, ఉమ్మడి జిల్లాకు కేసీఆర్ తీరని ద్రోహం చేయడమే అన్నారు. ప్రాణహిత తుమ్మిడిహెట్టి 148 మీటర్ల, మైలారం 138, గోదావరి సుందిళ్ల 132 మీటర్లకు అనుసంధానం చేసే సంపూర్ణ గ్రావిటీ కాలువకు కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న వార్ధానదికి ప్రాజెక్టు మార్చే నిర్ణయం గొడ్డలి పెట్టులాంటిదన్నారు. ప్రాణహిత ప్రాజెక్టుకు వైఎస్సార్ హయాంలో అంబేద్కర్ సుజల స్రవంతిగా నామకరణం చేశారని నేడు అంబేద్కర్ పేరును లేకుండానే ఈ ప్రభుత్వం చేస్తోందన్నారు. కమీషన్ల కోసమే కాళేశ్వరానికి ఈ ప్రాజెక్టును తరలించారన్నారు. జిల్లాలో ఉన్న ప్రాజెక్టులను ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. ప్రాణహిత ప్రాజెక్టును 148 మీటర్ల ఎత్తుకు సీఎం కేసీఆర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రితో కలిసి ఒప్పందం కుదుర్చుకొని ఒంటెలపై ఊరేగింపు చేసుకున్న సీఎం.. చారిత్రక ద్రోహం చేశారన్నారు. అనంతరం సిర్పూర్ నియోజకవర్గం నాయకుడు పాల్వాయి హరీశ్‌బాబు మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో సిర్పూర్ ఎమ్మెల్యే కోనప్ప ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం ఇక్కడే జరగడానికి ప్రాణహితకు అడ్డంగా పడుకొని నియోజకవర్గానికి సాగునీటికోసం నీళ్లు ఇప్పిస్తామన్న చెప్పిన ఎమ్మెల్యే నేడు ప్రాజెక్టు తరలిపోతున్నా ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. మన చుట్టూ నీళ్లు ఉన్నా మన పొలాలకు సాగు నీరు అందక పోవడం పాలకుల కుట్రలో భాగమే అన్నారు. అఖిలపక్షం నాయకులు బద్రి సత్యనారాయణ, చాంద్‌పాషా, లాల్‌కుమార్, అంబాల ఓదెలు, వెంకట నారాయణ, నాగుల తిరుపతి, కోండ్ర రాజా గౌడ్, చిలువేరు కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. -
జేసీ దివాకర్‌రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలి
-
ప్రాణహిత ప్రాణం తీసిన కేసీఆర్
కౌటాల: ప్రాణహిత ప్రాజెక్ట్‌ను నిర్మించకుండా ప్రాణం తీసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుండా మల్లేష్ ఆరోపించారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత ప్రాజెక్ట్‌పై అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఆదివారం మండలంలోని తుమ్మిడిహెట్టి గ్రామ సమీపంలోని ప్రాణహిత నదిలో ప్రాణహిత పరిరక్షణ ఐక్య కార్యాచరణ సమితి ఆధర్యంలో పిండప్రదానం చేశారు. అంతకుముందు డాక్టర్ బీఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం కౌటాల మండల కేంద్రంలోని ఆరే సంక్షేమ సంఘం భవనంలో అఖిలపక్ష ఐక్య పోరాట వేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ప్రాణహిత ప్రాజెక్ట్ నిర్మించి కుమురం భీం, మంచిర్యాల జిల్లాల్లోని ఐదు నియోజకవర్గాలలో ఐదు లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని డిమాండ్ చేశారు. గుండా మల్లేష్ మాట్లాడుతూ తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత బ్యారేజీ నిర్మించవద్దని కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్ట్‌కు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును తొలగించి మహనీయుడిని అవమానించిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. కేసీఆర్ నీళ్ల దోపిడీ చేస్తున్నారు : నైనాల గోవర్ధన్ సీఎం కేసీఆర్ నీళ్ల దోపిడీ చేస్తున్నారని తెలంగాణ జలసాధన సమితి రాష్ట్ర నాయకుడు నైనాల గోవర్దన్ అన్నారు. కేసీఆర్ తన సొంత జిల్లా అభివృద్ధి కోసం లక్ష కోట్ల నిధులతో కాళేశ్వరం వద్ద ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారన్నారు. ప్రాణహితను తుంగలో తొక్కిన కేసీఆర్ : కేవీ ప్రతాప్ ప్రాణహిత ప్రాజెక్టుతో రెండున్నర లక్షల ఎకరాలకు నీరందిస్తామని ప్రజలకు హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ దానిని తుంగలో తొక్కారని ప్రాణహిత ప్రాజెక్టు పరిరక్షణ వేదిక కన్వీనర్ కేవీ. ప్రతాప్ విమర్శించారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ వద్ద నాలుగేళ్లలో తట్టెడు మట్టి తీయలేదన్నారు. ప్రాణహిత ప్రాజెక్ట్‌ను వెంటనే నిర్మించి ఐదు నియోజకవర్గాలకు తాగు, సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. రైతుల నోట్లో మట్టికొట్టిన సర్కారు : పాల్వాయి హరీశ్‌బాబు ప్రాణహిత ప్రాజెక్ట్‌ను నిర్మించకుండా రైతుల నోట్లో మట్టికొట్టిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని నియోజకవర్గ నాయకులు పాల్వా యి హరీష్‌బాబు అన్నారు. కాలువలో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం న్యాయమైన పరిహారం చెల్లించారన్నారు. అనంతరం ప్రాజెక్ట్‌ను వెంటనే నిర్మించాలని ఆయా సంఘాల నాయకులు ప్రతిజ్ణ చేశారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు టీ.శ్రీనివాస్, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎండీ.చాంద్‌పాషా, జిల్లా నాయకులు మేకల రామన్న, ఎ.లాల్‌కుమార్, అంబాల ఓదెలు, మండల నాయకులు బండి రాజేందర్‌గౌడ్, దుర్గం మోతిరాం, విఠల్, బావూజీ, శ్రీనివాస్, ప్రశాంత్, తిరుపతిరావు, తిరుపతి, చందు, సుధాకర్, రైతులు పాల్గొన్నారు. ప్రాణహిత నదిలో ప్రభుత్వానికి పిండ ప్రదానం చేస్తున్న అఖిలపక్ష నాయకులు -
‘అడవి నుంచి ఆదివాసీలను వెళ్లగొట్టే కుట్ర’
హైదరాబాద్: అడవిపై ఆదివాసులకు చట్టపరమైన హక్కులున్నా అడవి నుంచి వెళ్లగొట్టేందుకు పాలకులు కుట్ర చేస్తున్నారని విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ(ఎం.ఎల్) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఇక్కడ బాగ్‌లింగంపల్లిలోని ఓంకార్ భవనంలో రాష్ట్ర సదస్సు జరిగింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి భూతం.వీరన్న అధ్యక్షతన జరిగిన సదస్సులో వరవరరావు మాట్లాడుతూ ఓపెన్‌కాస్టులు, గనుల పేరుతో బహుళజాతి, కార్పొరేట్ సంస్థలకు పేదల పంట, అటవీ భూములను కట్టబెట్టుతూ అదివాసీ జీవితాలను నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో ప్రజలకు మంచిరోజులు తెస్తామంటూ నమ్మించి గద్దెనెక్కిన మోదీ, కేసీఆర్ నాలుగేళ్ల పాలనలో ప్రజలకు చెడ్డరోజులే మిగిల్చారని అన్నారు. ప్రజాఉద్యమాలు, ప్రజాస్వామిక హక్కులను నిరంకుశత్వంతో అణచివేస్తూ ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజల పార్టీ అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ కోట్ల రూపాయల కార్పొరేట్ కంపెనీల అప్పులను రద్దు చేస్తున్న పాలకులు రైతులచేతికి బేడీలు వేస్తున్నారని, జైలు పాలు చేస్తున్నారని, ఇదేమి న్యాయమని ప్రశ్నించారు. భూతం వీరన్న మాట్లాడుతూ బయ్యారం ఉక్కు తెలంగాణ ఆదివాసుల హక్కు అని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాలమల్లేశ్, సీపీఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసీ నాయకురాలు రమ, ఎంసీపీఐ(యు) నాయకులు ఉపేందర్‌రెడ్డి, నాయకులు రాజేశ్, సత్తార్, సోమిశేట్టి దశర«థ్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేకహోదా సాధించే వరకు పోరాటం
అనంతపురం అర్బన్: ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన హామీలు, రాయలసీమకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ సాధించే వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తామని సీపీఎం, సీపీఐ, జనసేన నాయకులు అన్నారు. విభజన హామీలు అమలు చేయలని డిమాండ్ ఆ పార్టీల అధ్వర్యంలో శనివారం స్థానిక టవర్‌క్లాక్ వద్ద నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం ఉత్తర ప్రాంత జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్, సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్, జనసేన నాయకుడు బాబురావు మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని హామీలను అమలు చేయకపోగా ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదం టూ సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడివిటీ దాఖలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విభజన చట్టంలోని హామీల్లో ఒకటి రెండు మినహా అన్ని అమలు చేశామంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ప్రకటించడం సిగ్గుచేట్టన్నారు. ధైర్యం ఉంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన హామీలపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. హామీలు అమలు చేసి ఉంటే రాయలసీమకు బుం దేల్ ఖండ్ తరహా ప్యాకేజీ కింద రూ.40 వేల కోట్లు డబ్బులు వచ్చేవన్నారు. కేవలం రూ.100 కోట్లు జిల్లాకు ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. బెల్, నాసన్, ఎనర్జీ విండ్ యూనివర్సిటీ, ఐటీ కారిడార్, ఇలా ఏ ఒక్కటీ అమలు కాలేదన్నారు. కేంద్ర మంత్రులు స్వయంగా వచ్చి భూ మి పూజ చేసి వెళ్లారే తప్ప వాటిని పూర్తి చేయలేదన్నారు. నాలుగేళ్లపాటు కేంద్ర ప్రభుత్వానికి మిత్రపోంగా ఉండి టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేస్తే, బీజేపీ ప్రభుత్వం ద్రోహం చేసిందన్నారు. -
జమిలి ఎన్నికలు.. వివిధ పార్టీల అభిప్రాయం ఇదే!
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కేంద్రంలోని లోక్‌సభకు, రాష్ట్రాల్లోని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రాతిపదనపై లా కమిషన్ శనివారం వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపింది. జమిలీ ఎన్నికలపై పార్టీలు భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. మెజారిటీ పార్టీలు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు సాధ్యపడబోవని అభిప్రాయపడ్డాయి. లా కమిషన్‌తో సమావేశమైన తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, గోవా ఫార్వర్డ్ పార్టీల నేతలు జమిలి ఎన్నికల ప్రతిపాదనను వ్యతిరేకించారు. జమిలి ఎన్నికలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని, ప్రజాస్వామ్యానికి విఘాతమని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. జమిలి ఎన్నికలు సాధ్యం కావు అని, రాజ్యాంగపరంగా ఇది వీలు కాదని టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బేనర్జీ అభిప్రాయపడ్డారు. జమిలీ ఎన్నికలు ఆచరణ సాధ్యం కాదని గోవా ఫార్వర్డ్ పార్టీ నేత విజయ్ సర్దేశాయ్ పేర్కొన్నారు. ఇక, తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే జమిలి ఎన్నికలపై ఒకింత భిన్నంగా స్పందించింది. జమిలి ఎన్నికలు 2019లో సాధ్యం కావని, అదే 2024లో జమిలి ఎన్నికలు నిర్వహిస్తే.. అందుకు తాము సిద్ధమని పేర్కొంది. -
మెడికల్ కౌన్సిలింగ్ నిలిపివేత: సీపీఐ ఆగ్రహం
సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ ప్రక్రియ నిలిపివేతపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి పూర్తి రీకౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. మొదటి విడత కౌన్సిలింగ్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్ధులకు అన్యాయం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత కౌన్సిలింగ్ రద్దు చేయడం సరికాదని, మొత్తం ఎంబీబీఎస్ ప్రవేశాల కౌన్సిలింగ్ రద్దు చేసి రీకౌన్సిలింగ్ జరపాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 550 ప్రకారం, స్లయిడింగ్ విధానం అమలు చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్ధులకు న్యాయం చేయాల్నారు. కాగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ ప్రక్రియ నిలిపివేస్తున్నట్టు మంత్రి అచ్చెన్నాయుడు శనివారం ప్రకటించారు. బీసీ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై వర్సిటీ వీసీతో చర్చించామన్నారు. త్వరలో మళ్లీ కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి తెలిపారు. -
కేంద్ర ప్రభుత్వ దుష్టవైఖరి మరోసారి బహిర్గతమైంది
రాజంపేట రూరల్: ఏపీకి ప్రత్యేక హోదా పై అఫిడవిట్ దాఖలు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వ దుష్టవైఖరి మరొకసారి బహిర్గతమైందని సీపీఐ, సీపీఎం ఏరియా కార్యదర్శులు పి.మహేష్, సి.రవికుమార్ ధ్వజమెత్తారు. శుక్రవారం స్థానిక బైపాస్ రహదారిలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద కేంద్ర వైఖరిని నిరసిస్తూ మెడకు ఉరితాళ్లను వేసుకొని వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగేళ్లుగా మోదీ ప్రభుత్వం ఏపీని మోసం చేస్తూనే ఉందన్నారు. విభజన హామీలన్ని అమలు చేశామని బూటకపు అఫిడవిట్ దాఖలు చేసిందని విమర్శంచారు. రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. సీపీఐ నాయకులు ఎంఎస్ రాయుడు, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు మహేష్, ఏఐఎస్ఎఫ్ ఏరియా కార్యదర్శి ఈ.సికిందర్, గురుసాయి, ఏఐటీయూసీ నాయకులు ఎస్ఎస్ షరీఫ్, సుబ్రమణ్యంరాజు, వెంకటేష్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు
ఆస్పరి: ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం మాట తప్పిందని సీపీఎం, సీపీఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆస్పరిలో సీపీఐ, సీపీఎం నాయకులు శుక్రవారం వేర్వేరుగా ఆందోళన చేపట్టారు. సీపీఐ నాయకులు స్థానిక బస్టాండ్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. సీపీఎం నాయకులు అంబేడ్కర్ సర్కిల్లో రాస్తారోకో చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సమితి సభ్యుడు నాగేంద్రయ్య, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు హనుమంతు మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సి ఉందన్నారు. ఎన్నికల సమయంలో 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన మోదీ తర్వాత పట్టించుకోలేదన్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు కూడా ప్రజలను మోసం చేశాడన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కారుమంచి, సీపీఐ, సీపీఎం, విరుపాక్షి, మాణిక్యప్ప, రామాంజినేయులు, నవీన్, రంగస్వామి, బ్రహ్మయ్య, రాజ్‌కుమార్, అంజినయ్య, రాజశేఖర్, ఉరుకుందప్ప, తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు. దేవనకొండ: ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, సాధించుకునేందుకు ఎందాకైనా పోరాటాలు నిర్వహిస్తామని సీపీఎం డివిజన్ నాయకులు వీరశేఖర్ అన్నారు. శుక్రవారం దేవనకొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట జనసేన పార్టీ నాయకులతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఏపీకి హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదికలో తెలియజేయడం సరికాదన్నారు. ఎన్నికల సమయంలో హామీలు గుప్పించి, ఇప్పుడు చేతులెత్తేయడం ఏంటని ప్రశ్నించారు. -
బీజేపీ మతోన్మాదాన్ని పెంచుతోంది
సాక్షి, నల్లగొండ: కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మతోన్మాదాన్ని పెంచి పోషిస్తోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. గుజరాత్లో నరేంద్రమోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మైనార్టీలపై విపరీతమైన దాడులు, ఊచకోతలు జరిగాయని, ప్రస్తుతం గో రక్షణ పేరుతో దళితులపై, ముస్లింలపై దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. దేవరకొండ నియోజకవర్గ సీపీఐ జనరల్ బాడీ సమావేశంలో సురవరం సుధాకరరెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఆరెస్సెస్, సంఘ్ పరివార్ ఆగడాలు ఎక్కువయ్యాయని, దళిత, మైనార్టీలపై దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకొచ్చాక పెట్రోలు, డీజిల్ ధరలు 17 సార్లు ధరలు పెంచారని దుయ్యబట్టారు. పెద్దనోట్లను రద్దుచేసి ప్రజలకు ఇబ్బందులకు గురిచేశారని అన్నారు. నోట్ల రద్దుతో చిల్లర వ్యాపారాలు కనుమారుగయ్యాయన్నారు. గ్రామ పంచాయతీ స్థాయి నుంచి సీపీఐని బలోపేతం దిశగా పయనించి, ప్రజాపోరాటాలు చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. వామపక్ష పార్టీలు కలిసి ఐక్య ఉద్యమాలు, వర్గ పోరాటాలు చెయ్యాలన్నారు. సీపీఐ గ్రామస్థాయి నుంచి పుంజుకుంటోందని, వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో సీపీఐని అధికారంలోకి తేవడానికి కృషి చేస్తామని తెలిపారు. -
బాబు పరిపాలన చేతకాని అసమర్ధుడు
-
నాలుగేళ్ల పాలనలో ఎన్డీఏ విఫలం
అనంతపురం న్యూసిటీ: కేంద్రంలో నాలుగేళ్ల పాలనలో ఆర్థిక, సాంఘిక తదితర అన్ని రంగాల్లో బీజేపీ ఘోరంగా విఫలమైందని ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు విరుచుకుపడ్డారు. సోమవారం అనంతపురంలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీతారాం ఏచూరి మాట్లాడుతూ దేశ ప్రగతి కోసం ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని దించడానికే వచ్చే ఎన్నికల్లో అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. తాము అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా చెప్పి కూడా అమలు చేయడంలో బీజేపీ విఫలమైందన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా తామే ప్రభుత్వం నడపాలని బీజేపీ యత్నిస్తోందని, అందుకు గోవా, మణిపూర్ ఎన్నికల్లే నిదర్శనమన్నారు. ఈ అనైతిక విధానాన్ని తిప్పికొట్టేందుకు కర్ణాటక ఎన్నికల అనంతరం బీజేపీయేతర పార్టీలు ఒకే వేదికపై కలిశాయన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ పాలనలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలు ఎన్నడూలేని విధంగా దెబ్బతిన్నాయన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రభావం చూపాయన్నారు. నల్లధనం విదేశాల్లో నుంచి తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి రూ.15 లక్షలు ఇస్తామన్న ప్రధాని మోదీ పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఇటీవల స్విస్ బ్యాంకులో రూ.7 వేల కోట్ల భారతీయుల సంపద జమయ్యిందని, ఈ డబ్బు బ్యాంకుల్లో వేసుకోవడానికి రిజర్వ్ బ్యాంకు ఏవిధంగా అనుమతిచ్చిందో చెప్పాలన్నారు. నాలుగేళ్ల ఎన్డీఏ దుష్పరిపాలనపై ఆగస్టు 1 నుంచి 14 వరకు దేశ వ్యాప్త ప్రచారానికి సీపీఐ శ్రీకారం చుట్టనుందన్నారు. బీజేపీ ముందస్తు ఎన్నికలు చేపట్టాలని ప్రచారం చేస్తోందని, ఇది ప్రజాస్వామ్య హక్కులకు నష్టం అని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం జిల్లా కార్యదర్శి జగదీష్, సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ తదితరులు పాల్గొన్నారు. -
పాలనపై చంద్రబాబుకు పట్టు లేదు
ఒంగోలు టౌన్: రాష్ట్రంలోని ప్రభుత్వ యంత్రాంగంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టు కోల్పోయారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకుని పోస్టింగ్‌లు ఇస్తున్నారని, దాంతో అధికారులు ఇష్టారీతిన అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. శనివారం ఇక్కడి మల్లయ్య లింగం భవన్లో నిర్వహించిన సీపీఐ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో, అంతకు ముందు విలేకర్ల సమావేశంలో పార్టీ విధానాలను వెల్లడించారు. రాష్ట్ర రాజకీయాలను ఒక మలుపు తిప్పుతామని, పవన్‌కల్యాణ్‌తోపాటు ఇతర సామాజిక శక్తులను కలుపుకొని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ముందుకు వెళ్తాయన్నారు. తమ పార్టీలు మూడు అంశాల్లో భావసారూప్యత కలిగి ఉన్నాయన్నారు. సామాజిక న్యాయం అమలు కాకపోవడం, ప్రాంతీయ అసమానతలు పెరిగిపోవడం, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై ప్రజల్లోకి వెళ్లనున్నట్లు స్పష్టం చేశారు.రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వం రాజ్యమేలుతోందని ధ్వజమెత్తారు. నెల్లూరులో ఒక అటెండర్‌ను ఏసీబీ వాళ్లు పట్టుకుంటే రూ.100 కోట్లు, విజయవాడలో ఒక టీపీఓని పట్టుకుంటే రూ.500 కోట్ల అక్రమాస్తులు బయటపడ్డాయంటే అవినీతి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. జిల్లా వెనుకబాటుపై 22న ఒంగోలులో భారీ సదస్సు ప్రకాశం జిల్లా వెనుకబాటుతనంపై సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన ఒంగోలులో భారీ సదస్సు నిర్వహించనున్నట్లు రామకృష్ణ వెల్లడించారు. సదస్సు తీర్మానాలకు అనుగుణంగా రాబోయే రోజుల్లో పెద్దఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. కార్మికుల సమస్యలపై విశాఖపట్నంలో, చేతివృత్తిదారుల సమస్యలపై ఏలూరులో, దళితుల సమస్యలపై రాజమండ్రిలో, అర్బన్ సమస్యలపై విజయవాడలో, రైతుల సమస్యలపై గుంటూరులో, విద్యార్ధి – యువజన సమస్యలపై తిరుపతిలో, మహిళల సమస్యలపై అనంతపురంలో, మైనార్టీల సమస్యలపై కర్నూలులో, వ్యవసాయ కార్మికుల సమస్యలపై నెల్లూరులో, వెనుకబడిన ఉత్తరాంధ్ర సమస్యలపై శ్రీకాకుళంలో, వెనుకబడిన రాయలసీమ సమస్యలపై కడపలో సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 15వ తేదీ విజయవాడలో భారీ ర్యాలీ, సదస్సు నిర్వహించనున్నట్లు చెప్పారు. 90 లక్షల మంది రోడ్డుపాలు కేంద్రంలో అధికారంలోకి రాగానే ఏడాదికి రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానని ప్రకటించిన ప్రధాని నరేంద్రమోదీ 2.64 లక్షల కంపెనీలు మూసివేయించి 90 లక్షల మందిని రోడ్డుపాలు చేశారని ధ్వజమెత్తారు. విదేశీ బ్యాంకుల్లో 70 లక్షల కోట్ల రూపాయల నల్లధనం ఉంటే దానిని ఇంతవరకు బయటకు తేలేదన్నారు. దేశంలో 73 శాతం సంపద కేవలం ఒక్క శాతం వ్యక్తుల చేతుల్లో ఉందని, మిగిలిన 27 శాతాన్ని కూడా వారికి కట్టబెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర నాయకుడు పీజే చంద్రశేఖరరావు, జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, నాయకుడు ఆర్.వెంకట్రావు పాల్గొన్నారు. -
వైఎస్సార్ జిల్లాలో...‘ఉక్కు’పిడికిలి!
సాక్షి, కడప/కడప వైఎస్సార్ సర్కిల్/కోటిరెడ్డి సర్కిల్: వైఎస్సార్ జిల్లాలో ఉక్కు పరిశ్రమ సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అఖిలపక్షం ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన జిల్లా బంద్ సంపూర్ణంగా విజయవంతమైంది. విద్యా సంస్థలు, వాణిజ్య, వ్యాపార సంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతబడ్డాయి. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితయ్యాయి. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా రోడ్డెక్కి ఉక్కు పరిశ్రమ ఆందోళనకు సంఘీభావం తెలియజేశారు. అఖిలపక్షం నేతల పిలుపు మేరకు గత పది రోజులుగా గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించడం, సంతకాల సేకరణ, ర్యాలీలు, ముఖాముఖి, రిలే నిరాహార దీక్షలు, మానవహారాలతో వరుసగా పది రోజులపాటు ఆందోళన చేసిన నేతలు శుక్రవారం బంద్‌ను విజయవంతం చేశారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో.. ఇదిలా ఉంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఉక్కు పరిశ్రమ కోసం ఆందోళనలు మిన్నంటాయి. పులివెందులలో కడప తాజా మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి నేతృత్వంలో తెల్లవారుజామున 4 గంటలకే పులివెందుల ఆర్టీసీ డిపోకు చేరుకుని బంద్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కడపలో ఎమ్మెల్యే అంజద్‌బాషా, కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు ఆధ్వర్యంలో తెల్లవారుజామున 4 గంటలకే ఆర్టీసీ బస్టాండు వద్ద ఆందోళన చేశారు. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, మైదుకూరులో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. రాయచోటిలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, రాజంపేటలో పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి ఆధ్వర్యంలో రాజంపేటలో జరుగుతున్న బంద్‌లో ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి పాల్గొని మద్దతు తెలిపారు. అలాగే, రైల్వేకోడూరు పరిధిలోని కుక్కలదొడ్డి వద్ద ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. జమ్మలమడుగు, బద్వేలులో పార్టీ సమన్వయకర్తలు డాక్టర్ సుధీర్‌రెడ్డి, డాక్టర్ వెంకటసుబ్బయ్య బంద్‌ను పర్యవేక్షించారు. కడప ఉక్కు బంద్‌లో వామపక్ష నేతలు వైఎస్సార్ జిల్లాలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం చేపట్టిన బంద్ సందర్భంగా సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సి.రామచంద్రయ్యతోపాటు పలువురు ఆమ్ ఆద్మీ, జనసేన పార్టీల నేతలు పాల్గొని ర్యాలీలు నిర్వహించారు. సీపీఐ, సీపీఎం కార్యాలయాల నుంచి ఆర్టీసీ బస్టాండు వరకు బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం అంబేడ్కర్ సర్కిల్ వద్ద మానవహారంలో పాల్గొన్నారు. బంద్‌కు దూరంగా టీడీపీ జిల్లాలో ఉక్కు పేరుతో దీక్షలు చేస్తున్నా బంద్‌కు మాత్రం తెలుగుదేశం పార్టీ దూరంగా ఉండడం చర్చకు దారితీసింది. ఉక్కు పరిశ్రమ కోసమే దీక్ష చేస్తున్నట్లయితే అఖిలపక్ష నేతలు పిలుపునిచ్చిన బంద్‌లో పాల్గొనకపోవడం విస్మయానికి గురిచేస్తోందని అఖిలపక్షం నేతలు వ్యాఖ్యానించారు. జిల్లాలో ఎక్కడా కూడా ఆ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు బంద్‌లో పాల్గొనలేదు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటయ్యే వరకు ఉద్యమం కాగా, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుచేసేందుకు బీజేపీ, తెలుగుదేశం పార్టీ మెడలు వంచి తీరుతామని అఖిలపక్ష నేతలు స్పష్టంచేశారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చిన విధంగా వైఎస్సార్ జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటుచేసే వరకూ ఉద్యమం నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఈ సందర్భంగా బంద్‌లో పాల్గొన్న సీపీఎం జాతీయ పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, మాజీమంత్రి సీ రామచంద్రయ్య వేర్వేరుగా మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కు పరిశ్రమపై వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఫీజుబిలిటీ లేదని కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతుంటే చంద్రబాబు నాలుగేళ్లు మాట్లాడకుండా నేడు దీక్షలు చేయించడం హాస్యాస్పదమన్నారు. బంద్ సందర్భంగా కడపలో ర్యాలీ చేస్తున్నవైఎస్సార్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్‌బాబు, ఎమ్మెల్యే అంజద్ బాషా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఇతర అఖిల పక్ష, ప్రజాసంఘాల నేతలు -
‘ఆయన మాటలు బీజేపీకి వినిపించడం లేదా’
సాక్షి, విశాఖ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదేమో కానీ, అప్పులమయం చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. 94 వేల కోట్లు ఉన్న అప్పును రెండు లక్షలకు తీసుకెళ్లడం అభివృద్దా అని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణమన్నారు. ఉక్కు కర్మాగారం కోసం వామపక్షాలు పోరాడితే అరెస్టులు చేయించారని, కానీ ఇప్పుడు దొంగ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. ఈ 29న కడప బంద్‌కు పిలుపునిచ్చామని.. అందరు సహకరించాలన్నారు. విశాఖలో భూకుంభకోణంపై సిట్ దర్యాప్తు ఎప్పటివరకు చేస్తారన్నారు. ఈ కుంభకోణాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నారనే బయపెట్టడం లేదా అని ప్రశ్నించారు. వారం రోజులు గడువిస్తున్నామని.. ఒకవేళ నివేదిక బయటపెట్టకపోతే ఉద్యమిస్తామన్నారు. కార్మికుల, గిరిజన, విద్యార్ది ఉద్యోగల సమస్యపై ఉభయ కమ్యూనిస్టు పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి సిద్దమవుతున్నాయన్నారు. అన్ని వర్గాలతో విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. జూలై 8 విశాఖలో కార్మికులు సమస్యలపై సభ ఉంటుందన్నారు. రాష్ట్రంలో అవినీతి పాలన జరుగుతోంది.. ఇసుక మాఫియా పెరిగిపోయింది.. అధికార పార్టీ నాయకులే భూదందాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అదే విధంగా జూలై 2న నీలం రాజశేఖర్ రెడ్డి శత జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అనంతపురంలో ప్రారంభమయ్యే ఈ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాయన్నారు. రాష్ట్ర ప్రజలను కేంద్రప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఫ్యుజుబులిటీ ఉన్నా రైల్వే జోన్ అంశం విభజన చట్టంలో పరిశీలించమని ఉందనడం దారుణమన్నారు. కడప ఉక్క పరిశ్రమ వస్తుందని బీజేపీ మాటలాడుతోందని.. పీయూష్ గోయల్ అన్నమాటలు బీజేపీ వాళ్లకి వినిపించడం లేదా ప్రశ్నించారు. -
మిలిటెంట్ ఉద్యమాలు చేపడుతాం : చాడ
సాక్షి, కరీంనగర్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మండిపడ్డారు. శుక్రవారం కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీకి, రాష్ట్రంలోని టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. స్వార్ధ రాజకీయాలతో ఆ రెండు పార్టీలు ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించాయని ఆరోపించారు. కేసీఆర్ హామీలు అమలుకు నోచుకోని వైనంపై మిలిటెంట్ ఉద్యమం చేపడతామన్నారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య అని చెప్పిన కేసీఆర్ ప్రైవేటు విద్యాసంస్థల నియంత్రణలో విఫలమయ్యారని విమర్శించారు. జూలై, ఆగస్టులలో ప్రజా సమస్యలపై సీపీఐ పోరాడుతుందని తెలిపారు. ప్రభుత్వ భూములు ప్రజల అవసరాలకు వినియోగించాలే తప్ప స్వార్ధ రాజకీయాలతో ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే సహించబోమని చాడ హెచ్చరించారు. -
మండుటెండను సైతం లెక్కచేయకుండా...
విజయనగరం పూల్‌భాగ్: సాక్షరభారత్ కార్యక్రమాన్ని ఎత్తివేస్తూ విడుదల చేసిన జీఓను ఉపసంహరించుకోవాలని సాక్షరభారత్ సమన్వయకర్తలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీపీఐ నేతృత్వంలో సుమారు వెయ్యి మంది సమన్వయకర్తలు బుధవారం స్థానిక మెసానిక్ టెంపుల్ నుంచి జిల్లా పరిషత్ వరకు ర్యాలీగా వెళ్లారు. ఒక్కసారిగా జెడ్పీ గేట్ వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుమారు రెండు గంటల పాటు మండుటెండను సైతం లెక్కచేయకుండా సమన్వయకర్తలంతా రోడ్డుపైన కూర్చున్నారు. ఒక వైపు జిల్లా పరిషత్ జనరల్ బాడీ సమావేశం జరుగుతుండడంతో జెడ్పీలోకి ప్రవేశించేందుకు అధికారులు, రాజకీయనాయకులు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన ఎమ్మెల్యే పుష్పశ్రీవాణికి సమన్వయకర్తలు తమ సమస్యలు విన్నవించారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణిని అడ్డుకుని వినతిపత్రం అందజేశారు. దీనికి ఆమె స్పందిస్తూ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ మాట్లాడుతూ, సాక్షరభారత్ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా సుమారు 1800 మంది సమన్వయకర్తలు పనిచేస్తున్నారన్నారు. వీరంతా ప్రత్యేక కమిటీల ద్వారా నియమించబడి గ్రామీణ ప్రాంతాల్లో వయోజనులైన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయడంతో పాటు విద్యాకేంద్రాలను నిర్వహిస్తున్నారని చెప్పారు. దీంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న స్వచ్ఛభారత్, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, జన్‌ధన్ ఖాతాలు ప్రారంభం, గ్యాస్ సబ్సిడీపై అవగాహన, ఎన్టిఆర్ భరోసా పింఛన్ల పంపిణీ, బడి పిలుస్తోంది, వనం–మనం, ఓటర్ల నమోదు కార్యక్రమాలతో పాటు వివిధ సర్వేల నిర్వహణలో క్రియాశీలక పాత్ర పోషించే సమన్వయకర్తలను అకస్మాత్తుగా తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయంతో వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సాక్షరభారత్ కేంద్రాల ఎత్తివేత విషయంలో పునరాలోచించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంఘ నాయకులు ఎం. రమేష్, లక్ష్మణరావు, శ్రీనివాస్, గుర్ల శ్రీను, జిల్లా నలుమూలల నుంచి సమన్వయకర్తలు పాల్గొన్నారు. -
బాబూ నీ పాపాలు ఎవరు కడుగుతారు?
సాక్షి, అమరావతి / మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నాలుగేళ్లు బీజేపీతో అంటకాగిన సీఎం చంద్రబాబు ఇప్పుడు నీతులు చెబుతున్నారని, ఆ నాలుగేళ్ల పాపాలు ఎవరు కడుగుతారని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో జరిగిన ద్రోహంలో బీజేపీతోపాటు టీడీపీకి వాటా ఉందని ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు నిప్పులు చెరిగారు. సీపీఎం, సీపీఐ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో బుధవారం రాజకీయ సదస్సు నిర్వహించారు. సదస్సులో సీపీఐ, సీపీఎంల జాతీయ, రాష్ట్ర నేతలు మాట్లాడుతూ టీడీపీ, బీజేపీలపై ధ్వజమెత్తారు. సీపీఐ జాతీయ కార్యదర్శి, ఎంపీ డి.రాజా మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదాపైనా, దేశంలోని ఆదివాసీ, రైతులు, ప్రజా సమస్యలపై చర్చకు అవకాశం లేకుండా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించారని అన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో పాలిస్తున్న బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మాట్లాడుతూ నాలుగేళ్లపాటు బీజేపీ కాళ్లు పిసికిన చంద్రబాబు ఇప్పుడు అవే కాళ్లు పట్టుకుని లాగుతానంటే ప్రజలు ఎందుకు నమ్ముతారని ప్రశ్నించారు. రాష్ట్రంలోని చంద్రబాబు పాలనలో అవినీతి పెచ్చుమీరిందనే విషయం ఏసీబీ దాడుల్లో తేటతెల్లమవుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. రూ.2,620 కోట్ల ప్రజాధనాన్ని చంద్రబాబు దుబారా చేశారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మండిపడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీ, వైఎస్సార్సీపీ, బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా రాజకీయ కూటమి ఏర్పాటు అవసరమని మధు రాజకీయ తీర్మానం ప్రవేశ పెట్టారు. కాగా, ఈ ఏడాది జూలై, ఆగష్టు మాసాల్లో ప్రజా రంగాల వారీగా సమస్యలపై రాష్ట్ర సదస్సులు నిర్వహించనున్నారు. జూలై 22న మూడు వెనుకబడిన ప్రాంతాలకు చెందిన కడపలో రాయలసీమ, శ్రీకాకుళంలో ఉత్తరాంధ్ర, ఒంగోలులో ప్రకాశం జిల్లా సదస్సులు ఏర్పాటు చేస్తారు. ఆగస్టులో మండల స్థాయి పాదయాత్రలు నిర్వహించి సమస్యలను గుర్తించి వాటిపై మండల కేంద్రాల వద్ద ధర్నాలు, పికెటింగ్‌లు నిర్వహిస్తారు. ఆగష్టు 25 నుంచి సెప్టెంబర్ 10 వరకు రాష్ట్ర స్థాయి బస్సు యాత్రల్లో రాష్ట్ర నాయకులు పాల్గొని ప్రజలను కలుస్తారు. సెప్టెంబర్ 15న ఛలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టి మహార్యాలీ నిర్వహించాలని సదస్సు తీర్మానించింది. కాగా సదస్సును కవర్ చేయడానికి వచ్చిన ఓ టీవీ చానల్‌కు చెందిన ఓబీ వ్యాన్ డ్రైవర్ ప్రవీణ్ సభ ప్రారంభమైన కొద్ది సేపటికే గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు. -
బీజేపీ, టీడీపీలవి అవకాశవాద రాజకీయాలు
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా మండిపడ్డారు. బుధవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్లో ప్రతిపక్షాలు ప్రత్యేక హోదా గురించి అడిగితే మోదీ ప్రభుత్వం సభను నడవనివ్వటం లేదని రాజా విమర్శించారు. పార్లమెంట్ అంటే మోదీకి గౌరవంలేదన్నారు. ఉభయసభలను సక్రమంగా నడపాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా? అని ప్రశ్నించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌కు కనీస గౌరవం లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఇవ్వక పోవటంపై మండిపడ్డారు. బీజేపీ హటావో దేశ్‌కి బచావో స్లోగన్‌తో.. అందరం ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. ఆరెస్సెస్ ఎజెండాతో బీజేపీ పాలన కొనసాగిస్తొందన్నారు. అధికార పార్టీ జాతీయ ప్రయోజనాలను పక్కన పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీఏ పాలనలో దళితులు, ఆదివాసులపై హత్యాచారాలు పెరిగాయని, రాజ్యాంగ పరంగా పౌరులకు లభించాల్సిన హక్కులను మోదీ ప్రభుత్వం హరిస్తోందన్నారు. అంబేద్కర్, గాంధీజీ, భగత్ సింగ్ భావాలను బీజేపీ కాలరాస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహామహుల ప్రాణత్యాగాల ఫలితంగా స్వతంత్రం వచ్చిందని, బ్రిటీష్ వారిపై చేసిన పోరాటం ఇప్పుడు బీజేపీపై చేయవల్సిన పరిస్థితి ఏర్పడిందని రాజా వివరించారు. -
ప్రజాస్వామ్య విలువలకు కాంగ్రెస్ మద్దతుగా నిలవాలి
సాక్షి, న్యూఢిల్లీ : ప్రజాస్వామ్య విలువలకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలవాలని సీపీఐ సీనియర్ నేత డి. రాజా వ్యాఖ్యానించారు. గత వారం రోజులుగా ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్, కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేతలకు రాజా మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆప్ నేత సత్యేంద్ర జైన్‌ను ఆయన పరామర్శించారు. ప్రధాని మోదీ, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ చర్యలను ఆయన ఖండించారు. తమ పోరాటానికి మద్దతు తెలిపిన రాజాకు కేజ్రీవాల్ ట్విటర్లో కృతజ్ఞతలు తెలిపారు. ‘ధన్యావాదాలు కామ్రేడ్ రాజా’ అంటూ ట్వీట్ చేశారు. కాగా దేశ రాజధానిలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఇంట్లో ముఖ్యమంత్రి కూర్చుని ధర్నా చేయడమేంటని ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కేజ్రీవాల్‌పై పలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. -
మోదీ ఎడమచెయ్యి ఇస్తేనే.. ఎగిరి గంతులు!!
సాక్షి, గుంటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటన తుస్సుమన్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. మోదీ ఎడమ చెయ్యి ఇస్తేనే చంద్రబాబు ఎగిరి గంతులేశారని, అదే పొరపాటున కుడి చెయ్యి ఇస్తే ఆయన కింద నిల్చేవాడే కాదని ఎద్దేవా చేశారు. గుంటూరులో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు పర్యటనతో భూగోళం బద్దలవుబోతున్నట్టు ఎల్లో మీడియా ప్రచారం చేసిందని,చివరికీ ఏం జరిగిందో అందరూ చూశారని ఆయన వ్యాఖ్యానించారు. ఇకనైనా చంద్రబాబు మోసపూరిత మాటలు, మోసపూరిత పర్యటనలు మానుకోవాలని హితవు పలికారు. -
సామాన్య ప్రజలను ఓట్ల కోసమే మోసం..
సాక్షి, పశ్చిమ గోదావరి : కొల్లేరు మూడో కాంటూరు కుదింపుకి సీపీఐ పార్టీ వ్యతిరేమని సీపీఐ జిల్లా జనరల్ సెక్రటరీ డేగా ప్రభాకర్ తెలిపారు. ఏలూరులో ఆదివారం భారతీయ కమ్యూనిస్టు పార్టీ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదో కాంటూరు నుంచి మూడో కాంటూరు కుదించడం అడ్డుకొని తీరుతామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజలను ఓట్ల కోసం మోసం చేసి రాజకీయాలు చేస్తోందన్నారు. పర్యావరణాన్ని కాపాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేయడాన్ని సీపీఐ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 120 జీవో తప్పకుండా అమలు చేయాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు. కాంటూరు కుదింపు జరిగితే కొల్లేరు చుట్టు ఉన్న జనావాస ప్రాంతాలు గతంలో చెన్నై తరహాలో ముంపుకు గురవటం ఖాయమని ఆయన పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం సుప్రీం కోర్టుకు కూడా వెళతామని డేగా ప్రభాకర్ తెలిపారు. -
మధురవాడ భూములపై సిట్ నివేదికను బయట పెట్టండి
-
‘చంద్రబాబు, కేసీఆర్ దద్దమ్మలు’
-
‘చంద్రబాబు, కేసీఆర్ దద్దమ్మలు’
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్, తెలంగాణల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కె.చంద్రశేఖరరావులు తమ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలు తీసుకురావడంలో విఫలమై దద్దమ్మలయ్యారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. బీజేపీకి అనుకూల, వ్యతిరేఖ వర్గాలైన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పుడు ఢిల్లీబాట పట్టారని చెప్పారు. ప్రధాన నరేంద్ర మోదీకి ఊడిగం చేసేందుకే థర్డ్ ఫ్రంట్ అని అభిప్రాయపడ్డారు. విశాఖలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అయినవారికీ ఆకులు, కానివారికి కంచాలు ఉండేవి అనే సామెతను గుర్తు చేశారు. నేడు అయినవారికీ కంచాలు, లేనివారికి ఆకులు అన్నట్లుగా నీతి ఆయోగ్ పరిస్థితి ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లో నల్లధనం వెలికి తీస్తాను, లేదా నన్ను కాల్చండి అన్న మోదీ.. 48 నెలలు గడుస్తున్నా ఎందుకు ఆ పని చేయలేకపోయారని ప్రశ్నించారు. స్వయంగా మోదీ చెప్పిన ప్రకారమే అయితే ఆ లెక్కన వందసార్లు ఆయనను కాల్చాల్సి ఉందన్నారు. ప్రధాని మోదీ, ఉర్జిత్ పటేల్ నోట్ల వ్యవహారంలో నాటకాలాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేంద్రానికి నెంబర్ వన్ బ్రోకర్‌గా వ్యవహరిస్తున్నాడంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల కమిషన్, సీబీఐలు ప్రధాని మోదీకి అనుకూల రీతిలో పనిచేస్తున్నాయని చెప్పారు. మోదీకి పెంపుడు కుక్కలా సీబీఐ తయారైందన్నారు. ఆరెస్సెస్ కార్యకర్తలు అచ్చోసిన ఆబోతుల్లా తయారయ్యారని వ్యాఖ్యానించారు. సీపీఐకి టీడీపీతో కలవాల్సిన అవసరం లేదని, తమకు కొత్త ఫ్రెండ్ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దొరికాడని పేర్కొన్నారు. దేశాన్ని రక్షిద్దాం, రాజ్యాంగాన్ని కాపాడుదాం అనే నినాదంతో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో తాము కొన్ని కార్యక్రమాలు చేపట్టనున్నామని నారాయణ వివరించారు. -
పూర్వ వైభవం కోసం సినీ నటి సహకారం..
సాక్షి, నిజామాబాద్ : బీజేపీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ పతనం ప్రారంభమయిందని జోష్యం చెప్పారు. ఇందుకు నిదర్శనం ఇటీవల జరిగిన ఎన్నికలే అని ఆయన పేర్కొన్నారు. బీజేపీకి మిత్ర పక్షాలు దూరమవుతున్నాయని తెలిపారు. ‘పూర్వ వైభవం కోసం సినీ నటి మాధురీదీక్షిత్ లాంటి వారి సహకారాన్ని కోరడం ద్వారా రానున్న ఎన్నికల్లో ఓటమి తథ్యమని నిరూపించుకున్నారు. ఆర్ఎస్ఎస్ సమావేశానికి చివరి నిమిషంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వెళ్లడం అవకాశవాదమే. ప్రభుత్వం వల్లే ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడుతోంది. బీజేపీకి వ్యతిరేకంగా లౌకిక శక్తులన్నింటిని సీపీఐ ఏకం చేస్తుంద’ని నారాయణ తెలిపారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శిఖండి పాత్ర పోషిస్తున్నారని నారాయణ ధ్వజమెత్తారు. ‘ఫెడరల్ ఫ్రంట్ అనేది ఎన్డీయేకు బీ ఫ్రంట్. బీజేపీ, టీఆర్ఎస్లకు వ్యతిరేకంగా అందర్నీ సమీకరిస్తున్నాం. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని కేంద్రం చెబుతుంది. దీనిపై కేంద్రం మీద కేసీఆర్ ఎందుకు ఒత్తిడి చేయడం లేదు. కేసీఆర్‌కు దమ్ముంటే కేంద్రంపై పోరాడాలి. బాంచెన్ దొర అంటూ కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాళ్ల వద్ద మోకరిల్లుతున్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని రైతులను ఆదుకోవాలి. కాళేశ్వరం పేరు చెప్పి ఓట్లు పొందుదామనుకోవడం భ్రమే. తెలంగాణలో టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుంది. తెలంగాణను వ్యతిరేకించిన వారు క్యాబినెట్లో ఉన్నార’ని నారాయణ ధ్వజమెత్తారు. -
నాలుగు నెలల గరిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ : రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు నెలల గరిష్టానికి పెరిగింది. మే నెలలో ఈ ద్రవ్యోల్బణం 4.87 శాతంగా నమోదైనట్టు ప్రభుత్వ డేటాలో వెల్లడైంది. ఆహార ఉత్పత్తులు, ఇంధన ధరలకు అనుగుణంగా ఏప్రిల్‌లో 4.58 శాతంగా ఉన్న ఈ ద్రవ్యోల్బణం, మే నెలకు వచ్చే సరికి 4.87 శాతంగా నమోదైంది. వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) ఆధారంగా ఈ రిటైల్ ద్రవ్యోల్బణాన్ని గణిస్తారు. గతేడాది ఇదే నెలలో ఈ ద్రవ్యోల్బణం 2.18 శాతానికి పడిపోయిన సంగతి తెలిసిందే. ధరల విషయంలో సీపీఐను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రధాన అంశంగా తీసుకుంటుంది. ద్రవ్యోల్బణం పెరుగుతుందనే అంచనాలతోనే మానిటరీ పాలసీ కమిటీ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. గ్లోబల్ మార్కెట్లో ఇంధన ధరలు పెరుగుతుండటంతో ద్రవ్యోల్బణ అంచనాలను ఇది పెంచింది. అంతేకాక 2018-19కు చెందిన సీపీఐ ద్రవ్యోల్బణ అంచనాలను సైతం ఆర్బీఐ సమీక్షించింది. ఏప్రిల్-సెప్టెంబర్‌లో 1.8 శాతం నుంచి 4.9 శాతంగా ఈ ద్రవ్యోల్బణం నమోదవుతుందని ఆర్బీఐ అంచనావేస్తోంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో 4.7 శాతంగా ఉంటుందని తెలిపింది. ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలలో కూరగాయల ధరలు 8.04 శాతానికి పెరిగాయని, ఇంధన ధరలు 5.80 శాతానికి పెరిగినట్టు ప్రభుత్వ డేటా తెలిపింది. -
ప్రగతి భవన్‌ను ముట్టడిస్తాం: చాడ
సాక్షి, నిజామాబాద్ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన పెద్దనోట్ల రద్దు సామాన్యుడి నడ్డి విరిచిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వెంకటరెడ్డి అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో వేలమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని విమర్శించారు. మంగళవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వకపోతే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ విషయంలో హైకోర్టు తీర్పును కూడా రాష్ట్ర ప్రభుత్వం ధిక్కరిస్తోందని, రాష్ట్రంలో నవాబ్ పాలన కొనసాగుతోందని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర మంత్రుల్లో చాలామంది తెలంగాణ ద్రోహులేనని విమర్శించారు. ప్రభుత్వం చేపట్టిన భూ ప్రక్షాళన తప్పుల తడకగా సాగిందని అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలను గద్దె దించెందుకు అన్ని శక్తులు ఏకమవుతున్నాయని పేర్కొన్నారు. -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించండి
మంత్రాలయం రూరల్ : పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ మంత్రాలమం మండల కేంద్రంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి భాస్కర్‌యాదవ్, సీపీఎం మండల నాయకులు జయరాజు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు దాదాపు 18 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం జరిగిందని మండిపడ్డారు. అంతే కాకుండా వంట గ్యాస్ ధరలు కూడాపెరగడంతో సామాన్యులు ఇళ్లల్లో వంట చేసుకోలేని దుస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా ధరలు తగ్గించపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో నాయకులు అనిల్, నూరమ్మ, భీమన్న, అనిల్, నర్సయ్య, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. కౌతాళం : దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్న పెట్రల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ మండల కార్యదర్శి ఈరన్న అన్నారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా శనివారం మండల కేంద్రమైన కౌతాళంలో రస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా బిస్మిల్లా సర్కిల్లో కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. అనంతరం ఈరన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో అధికారం చేపట్టిన వెంటనే ఇంధన ధరలపై నియంత్రణ చేపడుతామని హామీ ఇచ్చిందని, తీరా అధికారం చేపట్టాక లెక్కలేనన్ని సార్లు ధరలు పెంచిందని విమర్శించారు. దేశంలో ఇందన ధరలు జీఎస్టీ పరిధిలోకి వస్తే లీటర్ పెట్రోల్ కేవలం రూ.40కు లభిస్తుందన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు అక్రం, నాగరాజు, వలీ పాల్గొన్నారు. -
హోదా ఉద్యమంలో కలిసి రాని వారిని ఆంధ్రా ద్రోహులు
-
రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన
కామేపల్లి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాయని సీపీఐ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు అన్నారు. శుక్రవారం ప్రజా చైతన్యయాత్రలో భాగంగా మండల పరిధిలోని ఊట్కూర్, కామేపల్లి, తాళ్లగూడెం గ్రామాల్లో పర్యటించి కార్యకర్తలను కలిశారు. అనంతరం తాళ్లగూడెంలో మండల కార్యదర్శి పుచ్చకాయల వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దాలను అమలు చేయడంలో విఫలమయ్యాయన్నారు. అవినీతిని అంతమొందిస్తామని, అవినీతి సొమ్మును బయటకు తీస్తామని చెప్పి మోదీ ఇంత వరకు ఎందుకు బయటకు తీయలేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ మద్దతు ధర అడిగిన రైతుల చేతులకు సంకెళ్లు వేయించి జైల్లో పెట్టారని, ఎన్నికల్లో లబ్ది పొందాలనే రైతుబంధు పథకాన్ని ప్రవేశ పెట్టారన్నారు. రైతు బంధు భూ స్వాములకే ప్రయోజనం... రైతు బంధు పథకం భూస్వాములకే ప్రయోజనకరమన్నారు. పోడు భూములను సాగు చేసుకుంటూ పట్టా కలిగి ఉన్న రైతులకు కూడా పెట్టుబడి చెక్కులు అందించడంలో ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కౌలు రైతులు, పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులందరికీ రైతుబంధు పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుందని, సీఎం కేసీఆర్ మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. స్థానిక, అసెంబ్లీ ఎన్నికల్లో తమతో కలిసొచ్చే పార్టీలతో పని చేస్తామని, అన్ని స్థానాల్లో బరిలోకి దిగి గెలుపొందేందుకు కృషి చేస్తామన్నారు. కార్యకర్తలు పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు శతకోటి సత్యనారాయణ, పుచ్చకాయల యర్రబాబు, లాల్‌సింగ్, బండి శ్రీను, కన్నమాల వెంటేశ్వర్లు, గండమాల రాములు, పుచ్చకాయల వెంకటకృష్ణ, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
వామపక్షాల చెరో కూటమి
సాక్షి, హైదరాబాద్: వామపక్షాల్లోని రెండు ప్రధాన పార్టీలు రాష్ట్రంలో చెరో కూటమి ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. వామపక్షాల ఐక్యత కోసం కృషి చేస్తున్నామని బహిరంగంగా మాట్లాడుతున్నప్పటికీ సీపీఎం, సీపీఐ చెరో దారిలోనే పయనిస్తున్నాయి. వివిధ సామాజిక, ప్రజా సంఘాలతో కలసి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్)ను సీపీఎం ఏర్పాటు చేయగా తెలంగాణ జన సమితి(టీజేఎస్), టీడీపీ, న్యూ డెమోక్రసీ, ఎమ్మార్పీఎస్ వంటి వాటితో మరో వేదికను ఏర్పాటు చేసేందుకు సీపీఐ నిర్ణయించింది. నియోజకవర్గ సమావేశాల్లో బీఎల్ఎఫ్... టీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా బీఎల్ఎఫ్ను బలోపేతం చేయడానికి సీపీఎం కార్యాచరణకు దిగుతోంది. ప్రజాసమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో ప్రధాన సమస్యలను గుర్తించి, వాటిపై పెద్దఎత్తున కార్యాచరణ చేపట్టాలని బీఎల్ఎఫ్ నిర్ణయం తీసుకుంది. ఆ దిశలోనే రాష్ట్రస్థాయిలో పలు సమావేశాలు, సదస్సులను ఇప్పటికే పూర్తి చేసింది. నియో జకవర్గ స్థాయిలో బీఎల్ఎఫ్ నిర్మాణాలను చేసుకుంటోంది. జూన్, జూలై, ఆగస్టులలో బీఎల్‌ఎఫ్‌కు నియోజకవర్గస్థాయి నిర్మాణాలను పూర్తి చేయనున్నారు. దీనికి సమాంతరంగానే మండల, గ్రామ స్థాయిలోనూ బీఎల్ఎఫ్ కమిటీల నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నారు. నిర్మాణాలు పూర్తి చేసుకున్న నియోజకవర్గాల్లో ఇప్పటికే గుర్తించిన వివిధ ప్రజా సమస్యల పరిష్కారం కోసం జిల్లా, రెవెన్యూ, మండల స్థాయి ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పించనున్నారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి వంటి ప్రధాన సమస్యలపై క్షేత్రస్థాయి కార్యాచరణకు దిగాలని బీఎల్ఎఫ్ భావిస్తోంది. గ్రామ, మండల, నియోజకవర్గస్థాయి నిర్మాణాలు పూర్తయిన తర్వాత బహిరంగ సభలను నిర్వహించాలని నిర్ణయించింది. నియోజకవర్గ బీఎల్ఎఫ్ కమిటీ సారథ్యంలో ఆగస్టు నెలాఖరులోగా నియోజకవర్గ కేంద్రాలు లేదా మరో ముఖ్య కేంద్రాల్లో బహిరంగ సభలను నిర్వహించనుంది. ద్విముఖ వ్యూహంలో సీపీఐ సీపీఎంకు దీటుగా నియోజకవర్గాల్లో బలోపేతం కావాలని సీపీఐ ఏర్పాట్లు చేసుకుంటోంది. సొం తంగా పార్టీ నిర్మాణాన్ని పూర్తి చేయడం, కార్యాచరణకు దిగడం ఒక వ్యూహమైతే... వివిధ పార్టీలు, సామాజిక సంఘాలతో కలసి ఐక్య కార్యాచరణకు దిగాలనే రెండో వ్యూహంతో సీపీఐ పనిచేస్తోంది. ముందుగా పార్టీకి ఎక్కువ బలం ఉన్న నియోజకవర్గాలపై దృష్టి పెట్టింది. గత ఎన్నికల సందర్భంగా 25 వేల వరకు ఓట్లు వచ్చిన దాదాపు 15 నియోజకవర్గాల్లో కమిటీలను ఏర్పాటు చేయనుంది. తమకు 10 వేల ఓట్ల చొప్పున బలం ఉన్న సుమారు 25 నియోజవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపగల సత్తా ఉందని సీపీఐ భావిస్తోంది. ఎక్కువ బలమున్న 15 నియోజకవర్గాల్లో వెంటనే కమిటీలు వేసి ఆ తర్వాత రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ కమిటీలను పూర్తి చేయనుంది. పార్టీపరంగా సొంత నిర్మాణం పూర్తి చేసుకుంటూనే మిగిలిన పార్టీలతో కలసి ఐక్య కార్యాచరణకూ నేతృత్వం వహించడానికి చర్చలు జరుపుతోంది. ఇప్పటికే టీజేఎస్, టీటీడీపీతో చర్చలను పూర్తి చేసింది. వేర్వేరుగా కార్యాచరణకు దిగుతున్న నేపథ్యంలో వామపక్షాలతో ఐక్య కూటమి సాధ్యమేనా అని ఇరు పార్టీల నేతలు అనుమానిస్తున్నారు. -
ఆ భూములపై విచారణ జరిపించండి: చాడ
సాక్షి, హైదరాబాద్: శామీర్‌పేట మండలం అంతాయిపల్లిలో 29, 108 సర్వే నెంబర్లో ఉన్న 185 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందని దీనిపై తక్షణమే ప్రభుత్వం విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలో సీఎస్ ఎస్కే జోషిని చాడ బృందం కలిసి విన్నవించింది. నెంబర్ 87లో ఉన్న 52 ఎకరాల భూమిని యజమానుల నుంచి తీసుకుని ప్రభుత్వం కలెక్టర్ కార్యాల యం నిర్మిస్తోందని పేర్కొన్నారు. భూ యజమానులకు నష్ట పరిహారం, భూమి ఇవ్వాలని కోరారు. -
‘ముందు మీ పరిధిలో ఉన్న ఎన్నికలు నిర్వహించండి’
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్సీపీ ఎంపీలు ఎన్నికలకు రావాలని సవాల్ విసురుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుగా ఆయన పార్టీలో చేర్చుకున్న 23 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలు నిర్వహించాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి హితవుపలికారు. ఆయన ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ నుంచి పార్టీ ఫిరాయించి టీడీపీ లో చేరిన ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఉన్నా అది చేయకుండా వైఎస్సార్ సీపీ ఎంపీలు ఎన్నికలకు రావాలని సవాల్ విసరడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఆ ఎమ్మెల్యేలతో ఇప్పటిదాకా రాజీనామాలు ఎందుకు చేయించలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ బీజేపీకి మేలు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ కేంద్రంలోని బీజేపీకి బి టీం లాంటిదని సురవరం విమర్శించారు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటవుతున్న ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీసేందుకే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. -
టీజేఎస్‌తో కలసి పనిచేస్తాం: చాడ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం తెలంగాణ జనసమితి (టీజేఎస్)తో కలసి పనిచేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఆహ్వానం మేరకు వెంకట్‌రెడ్డితోపాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి తదితరులు మంగళవారం ఆ పార్టీ కార్యాలయాన్ని సందర్శించి.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతున్న తరుణంలో సమస్యల పరిష్కారం, ఉద్యమ ఆకాంక్షల సాధనకు కలసి పనిచేస్తామని కోదండరాం అన్నారు. -
‘కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ దానికోసమే’
సాక్షి, న్యూఢిల్లీ : ‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’ నినాదంతో ఊదరగొట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాలుగేళ్ల పాలనలో కార్పొరేట్ శక్తులు మాత్రమే వికాసం చెందాయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) నాలుగు సంవత్సరాల దుష్టపాలనలో రైతులు తీవ్ర అన్యాయానికి గురయ్యారని అన్నారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ వాసులందరికీ మంచి రోజులు (అచ్చేదిన్) తెస్తామని చెప్పి గద్దెనెక్కిన మోదీ పాలనలో.. వ్యాపార వర్గాలకు మాత్రమే అచ్చేదిన్ వచ్చాయని ధ్వజమెత్తారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు విపరీతంగా పెంచి సామాన్యులను ముంచుతున్నారని మండిపడ్డారు. ఇంధన ధరల పెంపునకు వ్యతిరేకంగా సీపీఐ నేతృత్వంలో ఈ నెల 20న దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామన్నారు. మోదీ నాలుగేళ్ల దుష్ట పరిపాలనపై ఆగస్టు 1 నుంచి 14 వరకు దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేసిన రాజీనామాలు స్పీకర్ ఎందుకు ఆమోదించడం లేదో అర్థం కావడం లేదన్నారు. వైఎస్సార్ సీసీ ఎంపీల రాజీనామాలను ప్రశ్నించే చంద్రబాబు, తొలుత ఆ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలతో ఎందుకు రాజీనామా చేయించలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. షరతులు లేకుండా వస్తే వైఎస్సార్ సీపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమేనని ప్రకటించారు. కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్‌కు దేశ వ్యాప్త ప్రచారం లభించడం లేదన్నారు. మోదీకి వ్యతిరేకంగా ఏర్పాటవుతున్న ప్రతిపక్షాల కూటమిని దెబ్బ కొట్టడానికే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ భావన తెచ్చారని ఆరోపించారు. -
చంద్రబాబు అప్పుడే నీకు సవాల్ చేసే అర్హత..
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ సొమ్ముతో సభలు పెట్టి ఎన్నికల సవాల్ విసురుతున్నారని, ముందుగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామా చేయించినపుడే సవాల్ చేయడానికి అర్హత ఉంటుందని సీపీఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. సోమవారం ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్(మొన్కొంబు సాంబశివన్) స్వామినాథన్ కమీషన్ సిఫార్సులు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు నవనిర్మాణ దీక్ష పేరుతో ఉపన్యాసాలు దంచుతున్నారని అన్నారు. ప్రభుత్వ డబ్బుతో సభలు పెట్టి ప్రతిపక్షాలపై దాడి చేస్తున్నారని, అవి నవ నిర్మాణ దీక్షలు కావని ఎన్నికల సభలని ఎద్దేవా చేశారు. కేంద్రం సహకరించకుంటే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షాలను కలుపుకుని పోరాటం చేయాలని సూచించారు. మోడీ ప్రభుత్వం ఊడిగం చేస్తోంది.. చాడ వెంకట్ రెడ్డి కార్పొరేట్ కంపెనీలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఊడిగం చేస్తోందని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో దేశ వ్యాప్తంగా సేవ్ కానిస్టిట్యూషన్, సేవ్ ది నేషన్ పేరుతో ప్రచార జాతరలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. -
కేసీఆర్ మోదీతో కుమ్మక్కయ్యారు..
సాక్షి, ఢిల్లీ : ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రజలను మోసం చేస్తున్నారని సీసీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. ఆయన శనివారం మాట్లాడుతూ.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కేసీఆర్‌ను పొగుడుతున్నారని గుర్తు చేశారు. ఫెడరల్ ఫ్రంట్‌తో అందర్నీ చీల్చు అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లున్నారు. కేసీఆర్ మోదీతో కుమ్మక్కయ్యారని ఆయన ధ్వజమెత్తారు. ఫెడరల్ ఫ్రంట్ పేరు మీద కేసీఆర్ ...మోదీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ని ప్రజల నమ్మరని నారాయణ పేర్కొన్నారు. ‘తెలంగాణ ఏర్పడి నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. మొదటి దశగా నిరుద్యోగులకు 25 వేలు ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పుడు 50 వేలు ఉద్యోగాలు ప్రకటించాము అంటున్నారు. మరీ ఇచ్చిన హామీలలో ఇంటికి ఒక ఉద్యోగం హామీ ఏమైంది? కేసీఆర్‌కు చిత్తశుద్ది ఉంటే స్వామినాథన్ కమిషన్ని ఏర్పాటు చేయాలని’ నారాయణ డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన రూ. 4000 రైతులకు ఉపయోగపడిందా అని ఆయన ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. రూ. 4000 రైతులకు ఇచ్చి, పరమానందయ్య శిష్యులు మొద్దుకి సూది పొడిచినట్లు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రజల సొమ్ము వాడుకుంటున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. పెట్రోల్, డీజల్‌లను జీఎస్టీలలో కలపాలన్నారు. జీఎస్టీలో కలపడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి రూ. 4 లక్షల కోట్ల భారం తగ్గుతుందని నారాయణ సూచించారు. -
‘ఆయన దోపిడీ ప్రభుత్వానికి నాయకుడు’
సాక్షి, న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వంపై భారత కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి, సెంట్రల్ పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్ విరుచుకు పడ్డారు. నూతన అభివృద్ధి భారతాన్ని చూపుతామన్న మోదీ.. ఈ నాలుగేళ్లలో అసత్యాలు, దోపిడీల ప్రభుత్వాన్ని చూపిస్తున్నారని విమర్శల వర్షం గుప్పించారు. సీపీఐ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. మంచి రోజులు తెస్తామన్న మోదీ పాలనలో ప్రజల జీవితాలు దుర్భరంగా మారాయని ఏచూరి ఆరోపించారు. వ్యవసాయంలో సంక్షోభం నెలకొనడంతో రైతు ఆత్మహత్యలు పెరిగాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోదీ యువతను మోసం చేశారని ధ్వజమెత్తారు. కేవలం 2.05 లక్షల ఉద్యోగాలిచ్చి చేతులు దులుపుకున్నారని ఆయన మండిపడ్డారు. నోట్లరద్దు, జీఎస్టీతో అసంఘటిత రంగం కుదేలయిందని, ఈ సంస్కరణల వల్ల జీడీపీలో సగ భాగమైన చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడ్డాయని అన్నారు. నిత్యావసర వస్తువులు, ముఖ్యంగా పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగాయనీ.. ప్రపంచంలో పెట్రోల్‌కు ఎక్కడా లేనంత అధిక ధర భారత దేశంలో ఉందన్నారు. మోదీ పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని.. అందుకే ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓట్ల శాతం తగ్గిందని అభిప్రాయపడ్డారు. దాడులు పెరిగాయి.. దళితులు, ఆదివాసీల అభివృద్ధికి పాటుపడతామని గొప్పలు చెప్పిన దేశ ప్రధాని చేసింది శూన్యమని బృందా కారత్ అన్నారు. ఎన్డీయే నాలుగేళ్ల పాలనలో వారిపై దాడులు పెరిగాయని ఆమె తెలిపారు. రిజర్వేషన్లను నీరుగార్చడంతో ఉన్నత విద్యాసంస్థల్లో దళిత, ఆదివాసీలు ఉద్యోగాలు పొందలేకపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాలలో వనరుల దోపిడీకి కార్పొరేట్లకు అన్ని అనుమతులు ఇస్తున్నారని బృందా కారత్ ఆరోపించారు. -
మహానాడులో భోజనాలు తప్ప ఇంకేమీ లేదు!
సాక్షి, విజయవాడ : చంద్రబాబు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 18న తహశీల్దార్ల కార్యాలయాల దగ్గర నిరసన ప్రదర్శనలు చేపట్టబోతున్నట్టు సీపీఐ కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. టీడీపీ మహానాడులో భోజనాలు బాగా జరిగాయి తప్ప ఇంకేం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తనను ప్రధానమంత్రి అని పొగిడించుకున్నారని, అది పొగడ్తల మహానాడు అని విమర్శించారు. చంద్రబాబు స్వర్ణాంధ్రప్రదేశ్ డబ్బున్న వాళ్ళ కోసమే కానీ, పేదల కోసం కాదని, బాబు పాలనలో పేదల సమస్యలు పరిష్కారం కాలేదని ఆయన అన్నారు. చంద్రబాబు 20 లక్షల మందికి ఇళ్లు ఇస్తామన్నారు కానీ ఎక్కడా ఒక్క ఇల్లు కట్టలేదని విమర్శించారు. 13 జిల్లాల్లో ఒక్క ఎకర కూడా భూమి పంపిణీ సీఎం చంద్రబాబు చెయ్యలేదన్నారు. అందుకే ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికి 18న నిరసన చేపట్టబోతున్నట్టు ఆయన తెలిపారు. వెయ్యి రూపాయల భృతి నిరుద్యోగులకు ఏం సరిపోతుందని ఆయన అన్నారు. నెలకు రూ. 3600 ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. పదో తరగతి పాస్ అయినవారికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి విషయంలో 10 లక్షల మంది వరకు అంటూ కటాఫ్ పెట్టడం సమంజసం కాదన్నారు. -
అవి కేంద్ర ప్రభుత్వం చేసిన హత్యలే
చెన్నై: తూత్తుకూడి ఘటన కేంద్ర ప్రభుత్వం చేసిన హత్యలేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ..రేపు(శుక్రవారం) తమిళనాడు బంద్‌కు వామపక్షాలు మద్ధతు ఉంటుందని వ్యాఖ్యానించారు.కేంద్రమే దీనికి బాధ్యత వహించాలని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పతనానికి కర్ణాటక తొలిమెట్టు అవుతుందన్నారు. గవర్నర్ల వ్యవస్థ పనికి మాలిందని అన్నారు. కేంద్రానికి, రాష్ట్రాల నడుమ గవర్నర్లు బ్రోకర్లుగా పనిచేస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. టీటీడీ విషయంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై వస్తోన్న ఆరోపణలు ఆయనే నిరూపించుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు వైఖరి చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం, టీటీడీని కూడా తమ ఆధీనంలోనికి తీసుకునేలా కనపడుతోందని వ్యాఖ్యానించారు. -
బీజేపీ పాలనలో గవర్నర్ వ్యవస్థ బ్రోకర్లా మారింది
సాక్షి, గుంటూరు : బీజేపీ పాలనలో గవర్నర్ వ్యవస్థ బ్రోకర్లా మారిందని సీపీఐ నేత నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ... కర్ణాటకలో గవర్నర్ కళ్ళున్న కబోదిలా మారారని ఆరోపించారు. నేటి సుప్రీంకోర్టు తీర్పుతో న్యాయ వ్యవస్థ ఇంకా బ్రతికే ఉందనే భరోసా కలిగిందని అన్నారు. బీజేపీకి అనుకులంగా వ్యవహరించిన గవర్నర్‌ను వెంటనే భర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
మెజారీటి లేకుండా బలం ఎలా నిరూపించుకుంటారు?
-
ఆర్టీసీ కార్మికులపై ప్రతాపమా?: చాడ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు పెంచాలనే న్యాయమైన కోరికను తప్పుబట్టడ మేంటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు. ఆర్టీసీని నడిపించబోమంటూ పరో క్షంగా సీఎం కేసీఆర్ బెదిరింపులకు దిగడం సరికాదని బుధవారం ఓ ప్రకటనలో విమర్శించారు. కార్మికులను బెదిరించే విధంగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. వేతనాలు పెంచాలని అడిగినందుకు సంస్థనే మూసేస్తామ ని బెదిరించడం కేసీఆర్ అహంకారానికి నిదర్శ నమని విమర్శించారు. ఆర్టీసీ నష్టాలకు కార్మికులను కారణంగా చూపించి ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకుంటోందని ఆరోపించారు. గత్యంతరం లేకే ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీసును ఇచ్చారని తెలిపారు. పంతానికి పోకుండా కార్మికులతో చర్చలు జరిపి, శాంతియుతంగా సమస్యను పరిష్కరించాలని చాడ హితవు పలికారు. -
ఒకే పతాకం కిందకు వస్తారా?
హైదరాబాద్ మహాసభలకు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో ‘విలీనం అంశం’ ఈ సభల ఎజెండాలో లేదని ప్రకటించడం విచారకరం. ఇలాంటి మాటలు, ప్రకటనలు ఏవీ వ్యక్తిగతాలు కావు. కానీ ‘ప్రపంచ కార్మికులారా, ఏకంకండి!’ అన్న మార్క్స్ ప్రధాన నినాదాన్ని సీపీఎం ఎందుకు గుర్తించడం లేదు? ‘ప్రపంచ పీడితులారా, ఏకంకండి’ అన్న లెనిన్ నినాదాన్ని మరిచిపోయినట్టు ఎందుకు వ్యవహరిస్తున్నది? వీటి గురించి హైదరాబాద్ సభలలో కనీస చర్చ జరిగిందా? అయితే ఆ దిశగా అసలు కదలికే లేదని కాదు. కానీ శత్రువు సునామీ వలె దూసుకువస్తున్న నేటి సమయంలో ఈ నత్తనడకలు ఏం సాధించగలవు? హైదరాబాద్‌లో జరిగిన సీపీఎం 22వ అఖిల భారత మహాసభలు కార్యకర్తలలో, అభిమానులలో కొత్త ఆశలను చిగురింపచేశాయి. ఏ మహాసభ అయినా విజయవంతమైనదా, లేదా అని తేల్చుకోవడానికి పాల్గొన్న ప్రతినిధులు, చర్చల స్థాయి, చర్చించుకున్న అంశాల ప్రాముఖ్యం, తీసుకున్న నిర్ణయాలు, వాటి ప్రభావం, తదుపరి మహాసభల వరకు ప్రధాన కార్యదర్శి సహా వివిధ స్థాయిలలో ఎన్నికైన కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో, వాటి పొందిక వంటి అంశాలను గమనిస్తాం. చివరిరోజు బహిరంగ సభ, అది ఇచ్చిన ఉత్సాహం, ప్రదర్శన తీరుతెన్నులు సామాన్య ప్రజానీకంలో, అభిమానులలో ఆత్మ విశ్వాసాన్ని పెంచుతాయి. ఆ విధంగా చూస్తే హైదరాబాద్ సభలు నిర్ణయాత్మకమైనవే. ఇందుకు తెలంగాణ నాయకత్వాన్ని అభినందించాలి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తీసుకున్న ‘సమైక్య’ నినాదం సీపీఎంను ప్రజలకు దూరం చేసింది. ఫలితం ఏదైనా, సిద్ధాంతపరంగా పార్టీ వ్యవహరించిందని నాయకత్వం జబ్బులు చరుచుకోవచ్చు. కానీ ఆపరేషన్ విజయవంతమైనా, రోగి దక్కలేదన్న చందంగా తెలంగాణలో పార్టీ పరిస్థితి తయారైంది. కానీ పార్టీ ఆ∙నినాదానికైనా కట్టుబడి ఆంధ్రలో, హైదరాబాద్ పరిసరాలలో జన సమీకరణ కూడా చేయలేదు. ఒక నినాదం ఇచ్చి ఆపై ఇంత నిష్క్రియాత్వంతో పార్టీ వ్యవహరించడం ఇదే మొదటిసారి. పైగా సుందరయ్యగారి ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’నినాదాన్ని సమైక్య ఆంధ్ర వాదనకు పునాదిగా చూపడం మరీ చిత్రం. సుందరయ్యగారిది అప్పటి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ (1946) వైఖరి. తెలుగు ప్రజలంతా కలసి నూతన ప్రజాస్వామిక (ప్రజా) రాజ్యం ఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు. సుందరయ్యగారి చివరిదశలో వెంట ఉండి కొన్ని అంశాలను నేరుగా వారి నుంచే గ్రహించే అవకాశం నాకు దక్కింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం తరువాత, ఇచ్చిన వాగ్దానాల మేరకు తెలంగాణకు మేలు జరగలేదు. ప్రాజెక్టులు, ఉపాధి, పరిశ్రమల అభివృద్ధి వంటి అంశాలలో ఆ ప్రాంతం వెనుకబడిపోవడం ఆయనను బాధించింది. మద్రాస్ అపోలో ఆస్పత్రిలో ఉండగా కలుసుకోవడానికి వచ్చిన తెలంగాణ నేతలతో ఆ ప్రాంత వెనుకబాటు తనం మీద పోరాడాలని సూచించారు. అంతటి దయనీయ స్థితి నుంచి అక్కడి సీపీఎం శాఖ కోలుకోవడమే కాదు, కమ్యూనిస్టు ఉద్యమం పునరుజ్జీవం పొందగలదన్న విశ్వాసం కూడా మహా సభల ద్వారా కల్పించారు. ఇందుకు పార్టీ విభాగం, కార్యదర్శి వీరభద్రం, కార్యదర్శి వర్గ సభ్యులు చేసిన కృషి ప్రశంసనీయమైనది. మనం చెప్పేది నాయకత్వం వినిపించుకోదని భావిస్తూ పార్టీ పట్ల నిరాశా నిస్పృహలతో ఉన్న మేధావులను కలసి చర్చించారు. త్యాగనిరతిలో, ప్రజలకు రక్షణగా కార్యకర్తలు ఎలా ఉండాలో మీకు తెలుసు. లోపాలు ఉంటే చెప్పండి. పొరపాట్లు ఉంటే చెప్పండి. సాధ్యమైనంతవరకు సరిదిద్దుకుందాం అని చెప్పారు. ఆ పార్టీ నేత చేపట్టిన విస్తృత మహాజన పాదయాత్ర ఫలితంగా ప్రస్తుతం టీమాస్ (తెలంగాణ ప్రజాసంఘాల వేదిక), బీఎల్ఎఫ్ (బహుజన లెఫ్ట్ ఫ్రంట్) వంటి రాజకీయ నిర్మాణాల ద్వారా ప్రజలను సంఘటితం చేసే ప్రయత్నం జరుగుతున్నది. ఇది కమ్యూనిస్టుల జైత్రయాత్రకు బాటలు వేస్తుందనీ, పార్టీని మళ్లీ ప్రజల వద్దకి చేరుస్తుందనీ విశ్వసిద్దాం. లాల్–నీల్ నినాదం వేళ్లూనుకుంటుందని ఆశిద్దాం. మీడియాలో వచ్చిన మేరకు మహాసభల చర్చల ధోరణి ఇలా ఉంది. లాల్–నీల్ ఐక్యత ఆవశ్యకత గురించి ప్రతినిధుల మధ్య కొంత చర్చ జరిగింది. అంతకంటే ప్రధానంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో ఒప్పందం చేసుకోవచ్చునా, చేసుకోకూడదా? లేదా ఈ రెండు పార్టీల విధానాలకు ప్రత్యామ్నాయంగా మరొక సంఘటనను ప్రజాస్వామిక, లౌకిక శక్తులతో కలసి ఏర్పాటు చేయాలా? లేదా? అనే అంశంపైనే చర్చ జరిగింది. ఈ అంశం మీదే ప్రస్తుత, మాజీ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, ప్రకాశ్ కారత్‌ల మధ్య పోటీ వచ్చిందనీ, బలాబలాలు గత ఆరుమాసాలుగా మారుతున్నాయనీ మీడియా ప్రచారం చేసింది. ఓటింగ్ జరుగుతుందని, ప్రధాన కార్యదర్శి మార్పు కూడా ఉండవచ్చునని కూడా కథనాలు వెలువడినాయి. మీడియాకు ఇలాంటి అంశాల మీద ఉన్న దృష్టి వాస్తవికతపై ఉండకపోవచ్చు. నిజానికి ఇలాంటి ప్రశ్న నాలుగు దశాబ్దాల క్రితమే తలెత్తింది. అత్యవసర పరిస్థితిని విధించి, నియంతృత్వంతో పాలించిన ఇందిరా గాంధీనీ, ఆమె పార్టీనీ ఓడిం చేందుకు అనుసరించవలసిన విధానం గురించి సీపీఎం అఖిల భారత వ్యవస్థాపక కార్యదర్శి పుచ్చలపల్లి సుందరయ్య చొరవ, దూరదృష్టి కారణంగా జలం ధర్ మహాసభలో తీవ్ర చర్చ జరిగింది. మతతత్వ బీజేపీతో ఎన్నికల అవగాహనకు కూడా రావాలని మిగిలిన పొలిట్‌బ్యూరో భావించింది. చివరకు ఏకీకృత ప్రతిపాదన ద్వారా అవగాహనకు వచ్చి పదో మహాసభ పార్టీ ఐక్యతను కాపాడుకుంది. నాలుగు దశాబ్దాల తరువాత కూడా ఈ 22వ మహాసభలు చర్చ తీవ్ర స్థాయిలోనే జరిగి, తుదకు మతతత్వం, నేటి మోదీ–షా దుష్టపాలనను అంతం చేయడమే అత్యంత కీలకమన్న విషయంలో ప్రతి నిధుల విజ్ఞత పుణ్యమా అని ఏకీకృత అంగీకారానికి నాయకత్వం రాగలిగింది. అలాగే ఎన్నికలలో అనుసరించవలసిన విధానం గురించి కూడా. కాంగ్రెస్‌తో అవగాహన, వివిధ రాష్ట్రాల ప్రత్యేక పరిస్థితులను గమనించుకుంటూ కీలక కర్తవ్యాన్ని నిర్వహించి ఎన్నికల తదుపరి నిర్ణయం తీసుకునేందుకు అంగీకారం కుదిరింది. ఇది కూడా అభినందనీయమే. నేడు దేశంలో దాదాపు మూడు డజన్లుగా చీలి పోయిన కమ్యూనిస్టు ఉద్యమ సంస్థల గురించి మహాసభలు లోతుగా చర్చించి ఉండవలసింది. కమ్యూనిస్టుల ఐక్యత ఎందుకు సాధ్యం కావడం లేదో, కనీసం పార్లమెంటరీయేతర పోరాటాలను సమన్వయం చేసుకుని పురోగమించాలన్న అవగాహనతో విభేదాలు అంతగా లేని సీపీఐ, సీపీఎంలు విలీనం దిశగా ఎందుకు ముందడుగు వేయలేక పోతున్నాయో వామపక్ష మేధావులకు సైతం అంతుపట్టడం లేదు. దశాబ్దం క్రితమే నల్లగొండలో నాటి సీపీఐ రాష్ట్ర మహాసభలలో సౌహార్ద్ర సందేశం ఇచ్చిన నేటి సీపీఎం కార్యదర్శి బీవీ రాఘవులు ‘సీపీఎం, సీపీఐలు విడివిడిగా జరుపుకునే మహాసభలు ఇవే. వచ్చే రాష్ట్ర మహాసభలు ఒకే మహాసభగా జరుగుతాయ’ని ప్రతినిధుల కరతాళధ్వనుల మధ్య ప్రకటించినట్టు గుర్తు. కానీ హైదరాబాద్ మహాసభలకు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో ‘విలీనం అంశం’ ఈ సభల ఎజెండాలో లేదని ప్రకటించడం విచారకరం. ఇలాంటి మాటలు, ప్రకటనలు ఏవీ వ్యక్తిగతాలు కావు. కానీ ‘ప్రపంచ కార్మికులారా, ఏకంకండి!’ అన్న మార్క్స్ ప్రధాన నినాదాన్ని సీపీఎం ఎందుకు గుర్తించడం లేదు? ‘ప్రపంచ పీడితులారా, ఏకంకండి’అన్న లెనిన్ నినాదాన్ని మరిచిపోయినట్టు ఎందుకు వ్యవహరిస్తున్నది? వీటి గురించి హైదరాబాద్ సభలలో కనీస చర్చ జరిగిందా? అయితే ఆ దిశగా అసలు కదలికే లేదని కాదు. కానీ శత్రువు సునామీ వలె దూసుకువస్తున్న నేటి సమయంలో ఈ నత్తనడకలు ఏం సాధించగలవు? మరొక ప్రధాన అంశం ప్రస్తావించడం కూడా అవసరం. సుందరయ్యగారు కార్యదర్శిగా ఉండగా నాటి కార్యదర్శి వర్గ సభ్యులు లావు బాలగంగాధరరావును సహాయ కార్యదర్శిగా నియమించాలని ఒక సూచన వచ్చింది. అది అనవసరమని, సుందరయ్య కార్యదర్శిగా ఉండగా కార్యదర్శివర్గంలోని వారంతా సహకరించగలరని ఉద్దరాజు రామం వాదించారు. కానీ సుందరయ్యగారే, సహాయ కార్యదర్శి అని పేరు పెట్టడంలో తదుపరి కార్యదర్శి ఆయనే అనీ కాదు. ఆయననే కార్యదర్శిగా చేయకూడదని కూడా కాదు అని చెప్పారు. ఎల్బీజీ తరువాత కార్యదర్శి అయ్యారు (అప్పటికి సుందరయ్య కన్నుమూశారు). ఆ తరువాత అఖిల భారత మహాసభ సందర్భంగా పొలిట్‌బ్యూరోలోకి ఎల్బీజీనే తీసుకున్నారు. ఎల్బీజీ కంటే మోటూరి హనుమంతరావు అన్ని విధాలా అర్హుడనీ, ఆయనను కాదని ఎల్బీజీని ఎందుకు తీసుకున్నారని నేను పొలిట్‌బ్యూరోకి లేఖ రాశాను. ‘ఎల్బీజీ రాష్ట్ర పార్టీ కార్యదర్శి. పొలిట్‌బ్యూరో సాధికారితకోసం తీసుకున్నాం’అని నాకు సమాధానం వచ్చింది. 22వ మహాసభల అనంతరం కూడా సీపీఎంను అలాగే అడగవలసి ఉంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో సభలు దిగ్విజయంగా జరిగాయి. అలాంటి విభాగానికి పొలిట్‌బ్యూరోలో సాధికారతకు సభ్యత్వం ఇచ్చి ఉంటే బాగుం డేది. బీవీ రాఘవులు ఆంధ్రప్రదేశ్ తరఫున పొలిట్‌బ్యూరోలో ఉన్నంత మాత్రాన తెలంగాణ రాష్ట్ర సాధికార ప్రతినిధి కాలేడు కదా! పైగా వీరభద్రం కూడా అందుకు అర్హుడే! పార్టీ నిర్మాణం, కార్యక్రమాల సక్రమ నిర్వహణ సాఫీగా సాగేందుకు ఇలాంటి సున్నిత అంశాలను కూడా పార్టీ దృష్టిలో ఉంచుకోవడం అవసరం. డాక్టర్ ఏపీ విఠల్ వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు మొబైల్ : 98480 69720 -
బోటింగ్ రంగంలోనూ మాఫియా..
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా జరుగుతున్న బోటు ప్రమాదాలు విచారకరం...వీటిని అరికట్టడంలో ప్రభుత్వం వైపల్యం చెందిందని...బోటింగ్ రంగంలో కూడా మాఫియా ఉందని సీపీఐ కేంద్ర కమిటీ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఈ ఘటనపై సీనియర్ ఐఏఎస్ అధికారితో కమిటీ వేసి విచారణ జరిపించాలని, అంతేకాక బాధిత కుంటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండు చేశారు. ఈ సందర్భంగా నారాయణ బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న బోటు ప్రమదాలు, అత్యాచార సంఘటనలపై ఆందోళన వ్యక్తం చేశారు. అత్యాచారాల పోటీ పెడితే ఆంధ్రప్రదేశ్ ప్రధమ స్థానంలో నిలుస్తుందన్నారు. అత్యాచారాల నిరోధానికి కేంద్ర ప్రభుత్వం జీవోలు జారీ చేస్తుంది...కానీ జమ్ము కాశ్మీర్లో జరిగిన ‘కథువా అత్యాచార’ ఘటనలో స్వయంగా ఆ పార్టీకి చెందిన ఉప ముఖ్యమంత్రే నిందితుడుగా ఉన్నాడని తెలిపారు. బీజేపీ కర్ణాటకలో గెలిచిన తర్వాత ఇక తమకు దక్షిణాదిలో కూడా తిరుగులేదని భావిస్తుందని, కానీ కర్ణాటకలో బీజేపీ నైతికంగా ఓడిపోయిందని విమర్శించారు. అంతేకాక కర్ణాటక గవర్నర్ ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించకుండా వాయిదా వేయడం విచారకరమని, గవర్నర్లు పాలకపక్షానికి మేలు చేసే విధంగా ప్రవర్తిస్తున్నరని అన్నారు. వెంటనే గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ వద్ద ఉన్న నల్ల ధనాన్ని తెల్లగా మార్చుకోవడం కోసమే బీజేపీ నోట్ల రద్దును తీసుకువచ్చిందని, కేంద్రం ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడ్డానికి సీపీఐ పార్టీ సిద్దమవుతుందని తెలిపారు. ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కేంద్రం 75 శాతం విభజన హమీలను నెరవేర్చిందన్న కన్నా లక్ష్మీనారాయణ వాఖ్యలను ఖండిస్తూ, అధ్యక్షుడు కాకముందే ఇన్ని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు, ఇక ఇప్పుడు అధ్యక్షడు అయ్యారు...ఇంకా ఎన్ని అబద్దాలు ప్రచారం చేస్తారో అని విమర్శించారు. కన్నా ప్రచారం చేసే అసత్యాలు చూసే బీజేపీ పార్టీ ఆయనకు అధ్యక్ష పదవి ఇచ్చి ఉంటుందన్నారు. కాగా ప్రముఖ సీపీఐ నాయకుడు చండ్ర రాజేశ్వర్‌రావు భవన నిర్మాణానికి గాను అమరావతిలో 3 ఎకరాల భూమిని కేటాయించినందుకు గాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడుకు నారాయణ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. -
‘ఎర్ర’ పొత్తు పొడిచేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సీపీఎం, సీపీఐ మధ్య సయోధ్యపై ఇరుపార్టీల ముఖ్య నేతల్లో తర్జనభర్జన జరుగుతోంది. పార్టీల రాజకీయ తీర్మానాల్లో సారూప్యత ఉన్నా.. నాయకులు చెరోదారిలో నడుస్తుండటంతో కలసి పని చేయడంపై సందేహం వ్యక్తమవుతోంది. టీఆర్ఎస్ను ఎదుర్కోడానికి వామపక్ష పార్టీలతోపాటు సర్కారుకు వ్యతిరేకంగా ఉన్న పార్టీ లను సమీకరించాలని, కానీ రెండు పార్టీల మధ్యే ఐక్యత కొరవడిందంటూ నేతలు వాపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో రెండు ఎర్రజెండాలు పరస్పరం పోటీపడతాయేమోనని ఆందోళన చెందుతున్నారు. ‘ఎర్ర’పార్టీల మధ్య సయోధ్య కుదరకపోవడానికి సీపీఎం కారణమంటూ సీపీఐ నేతలు, సీపీఐ నేతల వ్యవహారశైలే కారణమని సీపీఎం నేతలు ఒకరిపైఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. బీఎల్ఎఫ్ వేదికగా సమావేశాలు.. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) పేరుతో వివిధ పార్టీలు, సామాజిక ఉద్యమ సంఘాలను సీపీఎం ఏకం చేస్తోంది. సీపీఐ లేకుండానే ఏర్పాటైన ఈ ఫ్రంట్.. వివిధ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తోంది. మరోవైపు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇటీవల పాదయాత్ర నిర్వహించి పార్టీలో కదలిక తీసుకొచ్చారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీగా క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులను అధిగమించడానికి పాదయాత్ర ఉపయోగపడిందని నేతలంటున్నారు. ప్రజల సమస్యలపై పోరాడటానికి అగ్రభాగంలో ఉంటామనే సందేశాన్నీ ఇవ్వగలిగామని చెబుతున్నారు. పాదయాత్రకే పరిమితం కాకుండా బీఎల్ఎఫ్ నిర్మాణానికి సీపీఎం ప్రణాళిక రచిస్తోంది. 3 నెలలపాటు నిర్మాణం, కార్యాచరణపై దృష్టి పెడతామని చెబుతోంది. మండల, నియోజకవర్గ స్థాయిలో నిర్మాణాన్ని నెలలో పూర్తి చేసుకోవాలని ఇటీవల జరిగిన బీఎల్ఎఫ్ విస్తృత స్థాయి సమావేశంలో నిర్ణయించారు. ఆ తర్వాత బీఎల్ఎఫ్ వేదిక ద్వారానే నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. సీపీఐ లేకుండానే సీపీఎం కార్యాచరణకు దిగడం, 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటించడంతో రెండు పార్టీల మధ్య ఐక్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ, జనసమితితో సీపీఐ చర్చలు టీఆర్ఎస్ను ఓడించాలన్న లక్ష్యం ఉన్నప్పుడు ప్రతిపక్షాల మధ్య ఓట్ల చీలిక నివారించాలని సీపీఐ వాదిస్తోంది. కానీ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పేరుతో సీపీఎం ఏకపక్షంగా పోతూ ప్రతిపక్ష పార్టీల మధ్య ఐక్యతకు గండికొడుతోందని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికలకు ఏడాది సమయం ఉన్నందున తొందరపడకుండా అన్ని పార్టీలను ఏకం చేయాలంటున్నారు. ఇందులో భాగంగా కోదండరాం నేతృత్వంలోని జనసమితి (టీజేఎస్)తో సీపీఐ నేతలు చర్చలు జరుపుతున్నారు. టీడీపీతోనూ తెలంగాణలో కలసి పనిచేయాలనే ప్రయత్నంలో పార్టీ నేతలున్నారు. సీపీఐ, జనసమితి, టీడీపీ వంటి పార్టీల్లేకుండా బీఎల్‌ఎఫ్‌తో టీఆర్ఎస్ను ఓడించడం సాధ్యమేనా అని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సీపీఎం లేకుండా పనిచేస్తే ప్రజల్లోకి సరైన సంకేతాలు కూడా వెళ్లవేమోనని సందేహం వ్యక్తం చేస్తున్నారు. -
కేంద్రం దిగ్గొచ్చే వరకు పోరాటం..
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై కేంద్రం దిగ్గొచ్చేవరకు తమ పోరాటం కొనసాగుతుందని హోదా సాధన సమితి ప్రకటించింది. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై చర్చించడానికి హోదా సాధన సమితి ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సినీ నటుడు రాంకీ, ప్రొఫెసర్ సదాశివరెడ్డితో పాటు 13 జిల్లాల నుంచి ఉద్యమ ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం హోదా సాధన సమితి సభ్యులు ఉద్యమ కార్యచరణను ప్రకటించారు. మే 22న అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో దీక్ష శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గ్రామ పంచాయితీ స్థాయి నుంచి హోదాకు అనుకూలంగా తీర్మానం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపాలని నిర్ణయించామని.. ఇందుకు అనుకూలంగా తీర్మానాలు చేయని వారిని ఉద్యమ ద్రోహులుగా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. హిందూపురం నుంచి ఇచ్ఛాపురం వరకు జూన్‌లో గానీ, జూలైలో గానీ బస్సు యాత్ర చేపట్టడంతోపాటు.. బహిరంగ సభలు కూడా నిర్వహిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం దిగ్గొచ్చేలా ఒక మెరుపు నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అంతిమ పోరాటానికి సిద్ధం కావాలి : రామకృష్ణ ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రజలు అంతిమ పోరాటానికి సిద్ధం కావాలని సీపీఐ రామకృష్ణ పిలుపునిచ్చారు. రౌండ్ టేబుల్ సమావేశ అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఏపీకి బీజేపీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా నేరవేర్చలేదు. ఉత్తరాంధ్ర ప్యాకేజీ నిధుల సంగతి ఇప్పటి వరకు తేలలేదు. జూన్‌లో విద్యాసంస్థలు ప్రారంభమయ్యాక విధ్యార్థులు రోడ్డెక్కె పరిస్థితి నెలకొంది. ఉద్యోగులు, విద్యార్థులు, కార్మిక సంఘాలు హోదా సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించాలి. అలా చేస్తేనే ఉద్యమం మరింత ఉధృతం అవుతుంది. 20 వ తేదీ నుంచి ప్రతి గ్రామంలో హోదా దీక్షలు ప్రారంభమవుతాయి.. ఆగస్టు 15లోపు శుభవార్త వినాలంటే.. హోదా ఉద్యమాన్ని ఇప్పటినుంచే మరింత తీవ్రతరం చేయాలి’ అని అన్నారు. ఏపీకి నష్టం కలిగిస్తే చూస్తూ ఊరుకోం : చలసాని బీజేపీ నేతలు రాజకీయ వ్యాఖ్యలు చేస్తే ఇబ్బంది లేదు కానీ.. ఏపీకి నష్టం కలిగిస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ అన్నారు. ఆయన మాట్లాడుతూ..‘త్వరలోనే రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ప్రత్యేక హోదా కోసం దీక్షలు చేయబోతున్నాం. హోదా అంశాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే దానిపై సలహాలు, సూచనలు స్వీకరించడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశాం. అందరు కలిసి ఉద్యమించాల్సిన సమయం వచ్చింది. ఏపీ పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో ఉద్యమం చేస్తే బాగుంటుంది. ప్రజాభిష్టానికి తలవంచే సీఎం చంద్రబాబు నాయుడు ఉద్యమ బాట పట్టారు’ అని తెలిపారు. -
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రామకృష్ణ ఫైర్
సాక్షి, విజయవాడ : కొద్ది రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు వంద రూపాయలకు వెళ్లడం ఖాయమని సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. నియంతృత్వ పాలకుడు మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్రలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 2019లో బీజీపీని ఓడించడమే తమ లక్ష్యం అని ప్రకటించారు. రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వం నడుస్తుందని అన్నారు. ప్రతి శాఖలో అవినీతి, లంచగొండితనం రాజ్యమేలుతొందని తెలిపారు. నీరు చెట్టు కార్యక్రమంలో ఇంజనీర్లు 19 శాతం, కార్యకర్తలు 50 శాతం లంచం తీసుకుంటున్నారని ఆరోపించారు. అందుకే టీడీపీ ప్రభుత్వం నీరు చెట్టు ప్రాజెక్టు బాగుందని డప్పు కొట్టుకుంటుందని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు తమ స్థాయిని దిగజార్చి మరి పోస్టింగ్‌లలో డబ్బులు దండుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి, విభజన హామిలు అమలుకాకపోవడానికి వెంకయ్యనాయుడు, చంద్రబాబే కారణమని ఆరోపించారు. అవినీతి ప్రభుత్వం పోవాలని, ప్రజానుకూల పాలన అందించే ప్రభుత్వం రావాలని అన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు మంగళవారం విజయవాడలో జరగబోయే సమావేశంలో చర్చించి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. వామపక్ష పార్టీలు విడిపోవడం వల్ల కమ్యునిస్టు ఉద్యమాలకు తీవ్ర నష్టం కలుగుతుందని అన్నారు. వామపక్ష పార్టీలన్ని ఏకం కావాలని మేధావులంతా చర్చిస్తున్నారని తెలిపారు. 9న జరగబోయే వామపక్షాల సమావేశంలో టీడీపీ ప్రభుత్వ అవినీతిపై చర్చించి ప్రజల్లోకి తీసుకెళ్లి టీడీపీ ప్రభుత్వ అవినీతిని ఎండగడ్తాం అన్నారు. ధర్మ దీక్ష పేరిట చంద్రబాబు చేసిన దీక్ష ఒక హైటెక్ దీక్ష అని ఎద్దేవా చేశారు. తమకు సలహాలిచ్చే చంద్రబాబు ఢిల్లీలో ఎందుకు దీక్షలు చేయ్యట్లేదని ప్రశ్నించారు. ఆయన చేసిన పాపాలకు ప్రాయిశ్చిత్తం చేసుకోవడానికి తప్ప వాటి వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. -
పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలను ఏర్పాటు చేయాలని, అప్పుడే అధికార వికేంద్రీకరణ జరిగి అభివృద్ధికి అవకాశం ఉంటుందని వక్తలు అభిప్రాయపడ్డారు. కేంద్ర–రాష్ట్ర సంబంధాలపై ‘ఇండియా నెక్ట్స్’సదస్సు శనివారం ఢిల్లీలో జరిగింది. ఈ సదస్సులో రాజ్యాంగ నిపుణులు, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభాష్ కశ్యప్ మాట్లాడుతూ.. ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలన్నారు. దేశంలో ఐక్యతను చాటే కొన్ని రాజ్యాంగ సంస్థలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పంజరంలో చిలకలుగా మారాయని సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్రాలకు అధికారాలు కల్పించే విషయాన్ని కేంద్రంలోని ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని, గతంలో సీఎంలుగా పని చేసేటప్పుడు చేసిన డిమాండ్లను నేడు ప్రధానులుగా తిరస్కరిస్తున్న పరిస్థితులు ఉన్నాయన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు నరేంద్ర మోదీ అధికారాల వికేంద్రకరణపై చేసిన డిమాండ్లను ఇప్పుడు ప్రధానిగా ఆయనే తిరస్కరిస్తున్నారని తప్పుపట్టారు. కేంద్రంలో అధికారంలోకి వస్తున్న పార్టీలు రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తి విధానాలను దెబ్బతీస్తూ, కొత్త విధానాలను తమకు నచ్చినట్టుగా పొందుపరుస్తున్నాయని మండిపడ్డారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా... సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వాలు అధికారాలన్నింటినీ తమ చేతుల్లో పెట్టుకోవాలని చూస్తున్నాయని జయప్రకాశ్ నారాయణ అన్నారు. గవర్నర్ల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ సొంత మనుషులను రాష్ట్రాలకు గవర్నర్లుగా నియమించి పెత్తనం చెలాయించాలని చూస్తున్నారని విమర్శించారు. ఇప్పటికీ కూడా కొన్ని అనుమతులకు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం చుట్టూ తిరగాల్సి వస్తోందని, ఈ పరిస్థితిని మార్చి రాష్ట్రాలకు, జిల్లాలకు, స్థానిక సంస్థలకు నేరుగా అధికారాల వికేంద్రీకరణ చేయాలని ఆయన సూచించారు. జీఎస్టీతో దేశంలో ఒకే పన్ను అమల్లోకి రావడం వల్ల రాష్ట్రాలకు కొంత మేలు జరుగుతోందని, గతంలో కేంద్రం నుంచి రాష్ట్రాలకు 32 శాతం వచ్చే నిధులు ఇప్పుడు 42 శాతానికి పెరిగాయని పద్మశ్రీ అవార్డు గ్రహీత సూర్యారావు పేర్కొన్నారు. రాష్ట్రాలకు ప్రయోజనం కలిగించే ఇలాంటి సంస్కరణలు ఇంకా రావాల్సి ఉందన్నారు. సదస్సులో ‘ఇండియా నెక్ట్స్’సంస్థ అధ్యక్షుడు జె.వెంకటేశ్వర్లు, కార్యదర్శి ఎం.అమరేంద్ర పాల్గొన్నారు. -
‘రఘురామ కృష్ణంరాజు నాలుక చీరేస్తాం’
సాక్షి, విజయవాడ: కారల్ మార్క్స్ 200వ జయంతి సందర్భంగా వామపక్ష నేతలు విజయవాడలో నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ సీపీఎం, సీపీఐ కార్యదర్శులు మధు, రామకృష్ణ కారల్ మార్క్స్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ పాలనలో రాష్ట్రంలో మహిళలు, దళితులకు రక్షణ లేకుండా పోయిందని సీపీఎం కార్యదర్శి మధు మండిపడ్డారు. ప్రతి రోజు రాష్ట్రంలో మహిళలపై ఏదో ఒకచోట అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల రక్షణకు ఎన్ని చట్టాలు వచ్చినా పరిస్థితులు మారడం లేదని అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొంత మంది శిక్షల నుంచి తప్పించుకుంటున్నారని మధు టీడీపీ నాయకులను ఉద్దేశించి అన్నారు. వామపక్ష పార్టీలతో కలసి అత్యాచారాలకు వ్యతిరేకంగా త్వరలోనే ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. లాలూచీ రాయకీయాలు చేస్తే సహించం.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మట్లాడుతూ ప్రత్యేక హోదా అంశంపై చేపట్టాల్సిన కార్యాచరణ రూపొందించేందుకు ఈ నెల 8న అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. నరేంద్రమోదీ ఆంద్రప్రదేశ్‌కి అన్యాయం చేశారని విమర్శించారు. రాష్ట్రానికి అన్యాయం జరగడంలో బీజేపీకి ఎంత పాత్ర ఉందో టీడీపీకి అంతే ఉందని రామకృష్ణ ఆరోపించారు. శుక్రవారం టీడీపీ తీర్థం పుచ్చుకున్న రఘురామకృష్ణంరాజు లాలూచీ రాయకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. స్వాతంత్ర్య సమరయోధులతో చంద్రబాబు నాయుడిని పోల్చినందుకు రఘురామకృష్ణంరాజు నాలుక చీరేస్తామని హెచ్చరించారు. స్వాతంత్ర్య సమరయోధుల కాలి గోటికి కూడా చంద్రబాబు సరిపోరనీ.. ఇలా అవాకులు చెవాకులు పేలుతూ స్వాతంత్ర్య సమరయోధులను అవమానిస్తే ఊరుకునేది లేదని రామకృష్ణ అన్నారు. -
అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న సుమారు 3 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల రౌండ్‌టేబుల్ సమావేశం హైదరాబాద్‌లోని మగ్దూంభవన్‌లో శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 3లక్షల మందికి దాదాపు రూ.440 కోట్లు అగ్రిగోల్డ్ నుంచి రావాల్సి ఉందన్నారు. వారిని ఆదుకునే దిక్కులేక ఆర్తనాదాలు చేస్తున్నారని అన్నారు. ఆర్థిక ఒత్తిళ్లను తట్టుకోలేక బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే ఉన్నతాధికారులతో ఒక కమిటీని వేయాలని, బాధితులకు న్యాయం చేసే విధంగా చర్యలను తీసుకోవాలని చాడ వెంకటరెడ్డి కోరారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు నాగేశ్వర్రావు, అధ్యక్షుడు విశ్వనాథరెడ్డి, నేతలు వెంకటరెడ్డి, తిరుపతిరావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ యాజమాన్యం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టి, బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఉందన్నారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం పేరుతోపాటు, వారి బినామీలపై ఉన్న ఆస్తులను జప్తుచేసి, బాధితులకు ఇవ్వాలని కోరారు. -
ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక వర్సిటీలు
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా సాంఘిక సంక్షేమ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి బుధవారం లేఖ రాశారు. సాంఘిక సంక్షే మ శాఖ రెసిడెన్షియల్ స్కూళ్లలో ప్రమాణాలు పెరిగాయని, వీటిలో చదివి దేశవ్యాప్తంగా విద్యార్థులు పోటీపడగలుగుతున్నారని పేర్కొన్నారు. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎస్సీ, ఎస్టీల విద్యా ప్రమాణాలను పెంచడానికి, మరింత అభివృద్ధి చెందడానికి ప్రత్యేకంగా యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని కోరారు. -
119 స్థానాల్లో పోటీ చేస్తాం: బీఎల్ఎఫ్
సాక్షి, హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేస్తా మని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ కన్వీనర్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. బుధవారం బీఎల్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. వివరాలను తమ్మినేని మీడియాకు వివరించారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టుగా చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు కమిటీలను నియమించినట్టు చెప్పారు. మూడునెలల్లో బీఎల్ఎఫ్ కార్యాచరణపై చర్చించామని తెలిపారు. జూలై, ఆగస్టుల్లో నియోజకవర్గస్థాయి బహిరంగసభలను నిర్వహిస్తామన్నారు. సామాజికన్యాయం లక్ష్యంతో పనిచేస్తున్న సీపీఐ కూడా కలసి రావాలని, ఆ పార్టీ ప్రధాన కార్య దర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, నేతలను కోరామని తమ్మినేని వెల్లడించారు. మంద కృష్ణమాదిగ, ఆర్.కృష్ణయ్య, జస్టిస్ చంద్రకుమార్, చెరుకు సుధాకర్, కోదండరాం వంటివారితోనూ చర్చలు జరుపుతున్నట్టు తమ్మినేని చెప్పారు. బీఎల్ఎఫ్ ఉపాధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ సామాజిక న్యాయమంటే బర్రెలు, గొర్రెలు, చీరలు పంచడం కాదన్నారు. బీఎల్ఎఫ్ ఓసీలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. -
కార్మిక వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించాలి
నెహ్రూసెంటర్(మహబూబాబాద్) : కార్మిక వ్యతిరేక కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి అన్నారు. మంగళవారం మానుకోట జిల్లా కేంద్రంలో సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికుల దినోత్సవమైన మే డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు కాలనీల్లో ఎర్రజెండాలను ఎగురవేశారు. ఎర్ర చొక్కాలు, చీరలు ధరించిన వందలాది మందితో పట్టణంలోని గాంధీపార్కు నుంచి పట్టణ ప్రధాన వీధుల్లో కార్మికులు, మహిళలు నృత్యాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించి సీపీఐ పార్టీ కార్యాలయం వరకు చేరుకున్నారు. అనంతరం ఏఐటీయూసీ నిర్వహించిన ఉమ్మడి సభ సీపీఐ పట్టణ అధ్యక్షుడు పెరుగు కుమార్, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి రేషపల్లి నవీన్ అధ్యక్షతన జరిగింది. ఈ సభకు ముఖ్యఅతిథిగా బి.విజయసారథి పాల్గొని మాట్లాడుతూ చికాగో నగరంలో కార్మికులకు పనిగంటలు తగ్గించాలని, పనికి తగ్గ వేతనం ఇవ్వాలని జరిగిన పోరాటంలో అనేక మంది కార్మికులు అమరులయ్యారని తెలిపారు. అదే స్ఫూర్తి నుంచి నేటి వరకు అనేక పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. కార్మికుల హక్కులు సాధించుకునేందుకు చేసే పోరాటాలే మేడే అని అన్నారు. కార్మికులు హక్కులను హరిస్తూ, దేశవ్యాప్తంగా ప్రజలపై దాడులు నిర్వహిస్తూ ప్రజలకు రక్షణ కల్పించటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.అజయ్, జిల్లా కార్యవర్గ సభ్యులు కట్లోజు పాండురంగాచారి, చింతకుంట్ల వెంకన్న, మామిండ్ల సాంబలక్ష్మి, నాయకులు చింతకుంట్ల యాకాంబ్రం, నర్రా శావణ్, వెలుగు శ్రావణ్, కేసుదాసు రమేష్, దాస్యం రామ్మూర్తి, ఎండీ.ఫాతిమా, మంద శంకర్, జక్కరయ్య, హల్య, సోమయ్య, భావాని, శ్రీను, శంకర్, కిష్టయ్య, పాల్, మహిమూద్, విజయలక్ష్మి, సుధాకర్, శ్రీను పాల్గొన్నారు. -
ప్రభుత్వాన్నీ ‘ప్రైవేటు’ చేస్తారేమో
సాక్షి, హైదరాబాద్: రానున్న రోజు ల్లో ప్రభుత్వాన్ని నడిపే హక్కును కూడా ప్రైవేటుపరం చేస్తారేమోనని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డితో కలసి మంగళవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. పార్టీ ప్రధాన కార్యదర్శి గా మరోసారి ఎన్నికైన సందర్భంగా మాట్లా డుతూ.. ఎర్రకోట నిర్వహణ బాధ్యతలను ప్రైవేటుపరం చేయడం సిగ్గుచేటన్నారు. దేశం లోని వారసత్వ సంపదను కాపాడుకోలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఈ పరిస్థితులను చూ స్తుంటే ప్రభుత్వ నిర్వహణను ప్రైవేటుకు కట్టబెట్టినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. కేరళలో జరిగిన జాతీయ మహాసభలు విజయవంతమయ్యాయన్నారు. రాబోయే రాజకీయాల్లో వామపక్షాలను బలోపేతం చేసి, ప్రజల ముందు ఓ ప్రత్యామ్నాయాన్ని పెట్టాల ని నిర్ణయించుకున్నట్టుగా వెల్లడించారు. విశాలమైన వామపక్ష, లౌకిక ఐక్యవేదిక అవసరమని తీర్మానించినట్టుగా చెప్పారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ మతోన్మాద శక్తులు, వారి కార్పొరేట్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడతామన్నారు. బీజేపీ ని ఓడించే లక్ష్యంతో పొత్తులుండాలని పార్టీ నిర్ణయించిందని వివరించారు. బీజేపీ, టీఆర్ఎస్లకు వ్యతిరేకంగా విశాల వేదిక ఏర్పాటు చేయడానికి చర్చలు చేస్తున్నామని, దీని కోసం అన్ని పార్టీలు, శక్తులతో సంప్రదింపులు జరుగుతున్నాయని చెప్పారు. టీజేఎస్‌తో పనిచేసే అవకాశం.. రాజకీయ విధానంపై టీఆర్ఎస్తో సీపీఐకి పూర్తిగా రాజకీయ విభేదాలు ఉన్నాయని సురవరం చెప్పారు. బీజేపీని ఓడించడానికి జాతీ య స్థాయిలో అవగాహన కష్టమని, రాష్ట్రాల వారీగానే పొత్తులుంటాయని స్పష్టం చేశారు. టీజేఎస్‌తో సీపీఐకి సత్సంబంధాలు ఉన్నాయని, కలసి పనిచేసే అవకాశముందని చెప్పారు. సీపీఎం, సీపీఐ రాజకీయ తీర్మానాల్లో తేడా ఏమీ లేదన్నారు. కేసీఆర్ ఫ్రంట్ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుందని సురవరం ఆరోపించారు. ప్రతిపక్షాల ఓట్లు చీల్చడం ద్వారా బీజేపీకి ఉపయోగపడే లక్ష్యంగానే కేసీఆర్ పనిచేస్తున్నారని విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర విభజన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం, వాటిని సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యాయని ఆరోపించారు. -
రాజకీయ పునరేకీకరణే మా విధానం!
హైదరాబాద్: కమ్యునిస్టుల రాజకీయ పునరేకీకరణే తమ విధానమని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ..సీపీఐ-సీపీఎం రాజకీయ తీర్మానాల్లో తేడా లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సహా సెక్యూలర్ పార్టీలను కలుపుకుని పోరాటం చేయాలని తీర్మానం చేశామని వెల్లడించారు. మే 24న అన్ని వామపక్ష పార్టీల ప్రదర్శనకు మా మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. తెలంగాణలో మరికొంత కాలం వేచి చూడాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బీజేపీ, టీఆరెస్కి వ్యతిరేకంగా రానున్న రోజుల్లో ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఇంకా మొదలు కాలేదని, కేసీఆర్ ఫ్రంట్ అనేది బీజేపీకి అనుకూలంగా ఉందని, కేవలం ప్రతిపక్షాల ఓట్లు చీల్చడానికే ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు. కర్నాటకలో వామపక్షాలు ఏకం అయ్యాయని తెలిపారు. తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాంతో సీపీఐకి మంచి సంబంధాలు ఉన్నాయని, ఆయన కలిసి పనిచేసే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు. రాష్ట్ర స్థాయిలోనే ఎన్నికల అవగాహన, ఎన్నికల ఎత్తుగడలు అవలంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు. బీజేపీని ఎదుర్కొనేందుకు వామపక్షాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వ పెద్దలు పెట్టుబడీదారీ విధానాన్ని పెంపొందిస్తున్నారని, దేశ సంపదను ఒక శాతం ధనికుల చేతిలో బీజేపీ పెడుతున్నదని వ్యాఖ్యానించారు. పురాతన వారసత్వ సంపదను కాపాడలేక పోతూ..ఎర్రకోట, తాజ్ మహాల్ వంటి ప్రసిద్ధ కట్టడాల్ని దాల్మియా కంపెనీలకు అప్పగించడాన్ని సురవరం ఖండించారు. తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ..కేంద్రం తెలంగాణాకు మొండిచేయి చూయించిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు. కేంద్రం విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం అయిందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకోవడంలో కూడా విఫలం అయ్యాయని దుయ్యబట్టారు. -
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులుగా ‘చాడ’
మంకమ్మతోట(కరీంనగర్) : సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులుగా జిల్లాకు చెందిన చాడ వెంకటరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేరళ రాష్ట్రం కొల్లంలో జరుగుతున్న పార్టీ జాతీయ మహాసభల్లో ఆయనను ఎన్నుకున్నారు. ఈనెల 25 నుంచి 29వరకు సీపీఐ జాతీయ మహాసభలు నిర్వహించిన విషయం తెల్సిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీపీఐ ప్రథమ మహాసభలను 2015 మార్చిలో ఖమ్మంలో ఏర్పాటు చేసింది. ఆ సమయంలో రాష్ట్ర కార్యదర్శిగా మొదటిసారిగా ప్రతినిధుల సమక్షంలో ఏకగ్రీవమయ్యారు. అలాగే 2016 నవంబర్‌లో వరంగల్‌లో జరిగిన పార్టీ రాష్ట్ర నిర్మాణ మహాసభలో చాడను ఏకగ్రీవంగానే ఎన్నుకున్నారు. 2018 ఏప్రిల్ 1 నుంచి 4 వరకు హైదరాబాద్‌లో జరిగిన పార్టీ రెండో రాష్ట్ర మహాసభల్లో రెండోసారి కూడా రాష్ట్ర కార్యదర్శిగా చాడను ఏకగ్రీవంగానే ఎన్నుకున్నారు. రాజకీయ ప్రస్థానం.. చాడ వెంకటరెడ్డి స్వగ్రామం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి జిల్లాలోని రేకొండ. 40 ఏళ్లుగా ఆయన రాజకీయంలో కొనసాగుతున్నారు. 1981లో రేకొండ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 1987 నుంచి వరుసగా మూడుసార్లు చిగురుమామిడి మండల పరిషత్ అధ్యక్షుడిగా పనిచేశారు. అదేమండలం నుంచి ఒక్కసారి జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. సీపీఐ తాలుకా కార్యదర్శి నుంచి జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇందుర్తి అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పార్టీ తరఫున శాసనసభపక్ష నేతగా వ్యవహరించారు. ప్రస్తుతం.. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూనే.. జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. చాడ ఎన్నికపట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. -
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా చాడ
హుస్నాబాద్ (సిద్దిపేట): సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా చాడ వెంకట్‌రెడ్డి మరోసారి ఎన్నికయ్యారు. కేరళ రాష్ట్రంలోని కొల్లంలో సీపీఐ 23వ జాతీయ మహాసభలు ఈ నెల 25 నుంచి 29 వరకు నిర్వహించారు. ఈ మహాసభల్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డిని జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నుకున్నారు. ఆయన జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నిక కావడం ఇది రెండోసారి. 2014లో మొదటిసారిగా చాడ వెంకట్‌రెడ్డిని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకున్నారు. 2018 ఏప్రిల్ 1 నుంచి 4 వరకు హైదరాబాద్‌లో జరిగిన సీపీఐ మహాసభల్లో తిరిగి రెండోసారి సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకున్నారు. చాడ వెంకట్‌రెడ్డి ఎన్నికపై సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గడిపె మల్లేశ్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు బద్దిపడిగ రాజిరెడ్డి, గురాల హన్మిరెడ్డి, ఎనగందుల లక్ష్మీనారాయణ, నాయకులు దుర్గేశం, పొదిల కుమారస్వామి, మాడిశెట్టి శ్రీధర్, సంజీవరెడ్డి, రాంరెడ్డి, మల్లారెడ్డి, రాజ్‌కుమార్, కర్ణకంటి నరేష్‌లు హర్షం వ్యక్తం చేశారు. -
సురవరం హ్యాట్రిక్
కొల్లాం: సీపీఐ సీనియర్ నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి(76) ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవి చేపట్టడం ఇది వరసగా మూడోసారి. కేరళలోని కొల్లాంలో ఆదివారం ముగిసిన పార్టీ 23వ ప్లీనరీ సమావేశాల్లో ప్రధాన కార్యదర్శితో పాటు 126 మంది సభ్యుల జాతీయ మండలి, 11 మందితో కూడిన సెక్రటేరియట్, 11 మంది సభ్యులుగా గల కంట్రోల్ మిషన్‌ను కూడా ఎన్నుకున్నారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం మాజీ నాయకుడు కన్హయ్య కుమార్‌కు జాతీయ మండలిలో చోటు దక్కింది. ఆ తరువాత సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆరెస్సెస్–బీజేపీని ఎదుర్కోవాలంటే లౌకిక, ప్రజాస్వామ్య, లెఫ్ట్ పార్టీల మధ్య ఐక్యత అవసరమని నొక్కి చెప్పారు. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పోరులో కాంగ్రెస్‌తో కలసి పనిచేస్తామని చెప్పారు. కేరళలో మాత్రం తాము భాగస్వామిగా ఉన్న ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రత్యర్థే అని పేర్కొన్నారు. జాతీయ మండలికి ఎన్నిక కాలేకపోయిన సీనియర్ నాయకుడు, కేరళ మాజీ మంత్రి సి.దివాకరన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 2012లో తొలిసారి.. తెలంగాణలోని నల్గొండ నియోజక వర్గం నుంచి రెండు సార్లు(1998–99, 2004–09) లోక్‌సభ సభ్యుడిగా పనిచేసిన సుధాకర్ రెడ్డి 2012లో తొలిసారి సీపీఐ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. పార్లమెంట్ కార్మిక స్థాయీ సంఘానికి చైర్మన్‌గా వ్యవహరించారు. 1942లో మహబూబ్‌నగర్‌లో జన్మించిన సుధాకర్ రెడ్డి 1967లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బీ పూర్తిచేశారు. -
హోదా కోరుతూ చేసిన బిజిలీ బంద్ విజయవంతం
-
ప్రత్యేక హోదా సాధన పోరు ఉద్ధృతం
పత్తికొండ టౌన్ : ఏపీకి ప్రత్యేక హోదా సాధన పోరు మరింత ఉద్ధృతం చేద్దామని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.నబీరసూల్, సీపీఎం మండల కార్యదర్శి ఎం.దస్తగిరి అన్నారు. ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపు మేరకు మంగళవారం రాత్రి పత్తికొండలో విపక్షాలు బిజిలీ బంద్ నిర్వహించాయి. సాయంత్రం 7 నుంచి 7.30 గంటల వరకు విద్యుత్ లైట్లు ఆర్పివేసి, బ్లాక్‌డేగా పాటించారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా లైట్లు ఆర్పివేసి, బంద్‌కు మద్దతు తెలిపారు. వైఎస్సార్సీపీ, సీపీఐ, సీపీఎం నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వచ్చి, నాలుగు స్తంభాల మంటపం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ, టీడీపీ రెండూ రాష్ట్ర ప్రజలను మోసం చేశాయన్నారు. సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని, ఎప్పటికప్పుడు మాటలు మారుస్తూ రాజకీయ డ్రామాలు ఆడుతున్నాడన్నారు. హోదా ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. ప్రజలు చైతన్యమై, విపక్షాల పోరాటానికి మద్దతు పలకాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి శ్రీరంగడు, మండల కన్వీనర్ జూటూరు బజారప్ప, నాయకులు నజీర్, భరత్‌రెడ్డి, లక్ష్మన్న, సీపీఐ నాయకులు సురేంద్ర, రాజాసాహెబ్, నెట్టికంటయ్య, సీపీఎం నాయకులు రంగారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
బిజిలీ బంద్ విజయవంతం
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ మంగళవారం రాత్రి ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన బిజిలీ బంద్ విజయవంతమైంది. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు సీపీఎం, సీపీఐ, జనసేన, ప్రజా సంఘాలు బిజిలీ బంద్ నిర్వహించాయి. ఇందులో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని ప్రత్యేక హోదా కోసం నినదించారు. జగన్ సంఘీభావం గన్నవరం నియోజకవర్గంలోని దావాజీగూడెం సమీపంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్ర శిబిరం వద్ద మంగళవారం రాత్రి 7.30 గంటల వరకు విద్యుత్ దీపాలను ఆర్పివేసి బిజిలీ బంద్‌కు సంఘీభావం తెలిపారు. -
సీఎంలిద్దరూ ‘భరత్ అనే నేను’ చూడాలి
సాక్షి, హైదరాబాద్: కమ్యూనిస్టులపై బీజేపీ అసత్యప్రచారం చేస్తోందని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు. యూపీఏ ప్రభుత్వంలో స్కామ్‌లను కూడా కమ్యూనిస్టులకు అంటకడుతూ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. తాము యూపీఏ1కు మాత్రమే మద్దతు తెలిపామని, యూపీఏ 2 ప్రభుత్వానికి కాదని గుర్తుచేశారు. యూపీఏ 2 హయాంలో జరిగిన కుంభకోణాలపై బీజేపీతో పాటు తాము కూడా పోరాటం చేశామని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే మొత్తం అవినీతిని బయట పెడతామని, విదేశాల నుంచి డబ్బు తెస్తామని ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీ హామీయిచ్చారని కానీ అధికారంలోకి వచ్చి చేసిందేంటని రామకృష్ణ ప్రశ్నించారు. 2జీ స్పెక్ట్రం కేసులో జైలుకు వెళ్లిన కనిమొళి, రాజా.. మోదీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఎక్కడున్నారన్నారు. యూపీఏ హయాంలో జైళ్లలో ఉన్న గాలిజనార్ధన్ రెడ్డి ఇప్పుడు బీజేపీ తరపున కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేస్తూ తన అనుచరులు 9 మందికి, తన తమ్ముడికి టికెట్ ఇప్పించుకున్నారని తెలిపారు. అవినీతిపరులకు టికెట్లు ఇచ్చారని, జైళ్లో ఉండాల్సిన యడ్యూరప్పను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ అవినీతి గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ‘బాబు, కేసీఆర్ భరత్ అనే నేను సినిమా చూడాలి’ ‘భరత్ అనే నేను’ సినిమాను చంద్రబాబు, కేసీఆర్ జనంలో కూర్చోని చూడాలని, ముఖ్యంగా ఏపీ సీఎం చూడాలని రామకృష్ణ సూచించారు. ‘కాలేజీలు, స్కూళ్లు, ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టారు. బాబు ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తోంది. అమరావతిలో రైతుల నుంచి లాక్కున్న భూములు 7 ప్రైవేట్ కాలేజీలకు దోచిపెట్టారు. స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ, ఎన్నికలు పెట్టడంలేద’ని మండిపడ్డారు. కేసీఆర్ టీఆర్ఎస్ వాళ్లకు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వరు.. బాబు సూటు బూటు ఉంటేనే కలుస్తారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాలన చేస్తున్నారా లేక రాచరికం చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఇవాళ ఏపీ వ్యాప్తంగా కేంద్రానికి నిరసనగా రాత్రి 7 గంటలకు అరగంట పాటు బ్లాక్ డే పాటిస్తున్నామన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు నెరవేర్చాలని అరగంట లైట్లు బంద్ చేసి నిరసన తెలుపుతామని పేర్కొన్నారు. అందరూ బ్లాక్ డేకు సహకరించి స్వచ్చందంగా నిరసన తెలపాలని కోరారు. -
హోదాపై నిరసనగా నేడు బిజిలీ బంద్
-
నేడు బిజిలీ బంద్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా మంగళవారం ‘బ్లాక్ డే (బిజిలీ బంద్)’గా పాటించాలని ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. ఆరోజు రాత్రి 7 నుంచి 7.30 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా లైట్లు ఆర్పివేసి నిరసన తెలపాలని రాష్ట్ర ప్రజలకు సోమవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఏపీకి పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను, చేసిన చట్టాలను అమలు చేయాలని 4 ఏళ్లుగా కోరుతున్నా ఈ ప్రభుత్వాలు పట్టించుకోనందుకు నిరసనగా బ్లాక్ డేకు పిలుపునిచ్చినట్టు తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఇబ్బడి ముబ్బడిగా నిధులు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం ఏపీ పట్ల నియంతలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. బీజేపీ మినహా రాష్ట్రంలోని అన్ని పక్షాలు ప్రత్యేక హోదా కోసం నినదిస్తున్నా... మోదీకి అది చెవిటివాని ముందు శంఖం ఊదినట్టే ఉందని పేర్కొన్నారు. నేడు బ్లాక్ డేకు సహకరించండిపార్టీ శ్రేణులకు వైఎస్సార్సీపీ పిలుపు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకు మంగళవారం నిర్వహించనున్న బ్లాక్ డేకు సహకరించాలని పార్టీ శ్రేణులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన అఖిలపక్ష సమావేశంలో మంగళవారం రాత్రి 7 నుంచి 7.30 గంటల వరకు విద్యుత్ దీపాలను ఆర్పి బ్లాక్ డేగా పాటించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హోదా సాధన సమితి, సీపీఎం, సీపీఐ నాయకులు పార్టీ నేతలను సంప్రదిస్తే వారికి సహకరించాలని వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం సోమవారం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలను ఆదేశించింది. స్థానిక వర్తక, వాణిజ్య సంఘాలను సంప్రదించడంతో పాటు ప్రజల్లోకి నేరుగా వెళ్లి బ్లాక్ డే కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మనవంతు పాత్ర పోషించాలని సూచించింది. -
గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయండి
సాక్షి, హైదరాబాద్ : అధికారంలో ఉన్నవారికి గవర్నర్లు బ్రోకర్ల మాదిరిగా వ్యవహరిస్తున్నారని, తక్షణమే ఆ వ్యవస్థను రద్దు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సోమవారం డిమాండ్ చేశారు. ఆదివారం ఏపీ సీఎం చంద్రబాబును రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఎందుకు అంత హడావుడిగా కలవాల్సి వచ్చిందో ప్రజలకు చెప్పాలన్నారు. ప్రధాని మోదీ, చంద్రబాబుకు మధ్య రాజీ కుదర్చడానికే నరసింహన్ సమావేశమైనట్టుగా అర్థం చేసుకోవాలా అని నారాయణ ప్రశ్నించారు. ఇలాంటి గవర్నర్లతో ప్రజాధనం వృథా మినహా ఎటువంటి ప్రయోజనం లేదని ఎద్దేవా చేశారు. కావేరి జలాల సమస్య పరిష్కారానికి కేంద్రం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు. సీపీఐ 23వ జాతీయ మహాసభలు కేరళలో జరుగుతాయని ఆయన వెల్లడించారు. -
‘లౌకిక ప్రజాస్వామ్యకూటమే లక్ష్యం’
సాక్షి, కరీంనగర్ : లౌకిక ప్రజాస్వామ్యకూటమే లక్ష్యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం బద్దం ఎల్లారెడ్డి భవన్లో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేస్తున్నాయని.. వాటి నిర్వాకంతో చట్ట సభలు, న్యాయ వ్యవస్థ గందరగోళంలో పడ్డాయన్నారు. ప్రజాభీష్టానికి భిన్నంగా వ్యవహరిస్తూ రాజ్యాంగ హక్కులకు తిలోదకాలిçస్తున్నాయని ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా న్యాయస్థానాల్లో సైతం విపరీత జోక్యం పెరిగి న్యాయమూర్తులే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని, చట్టసభల్లో సభ్యులు, పార్టీలు మారుతున్నా చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తూ ఫిరాయింపు ఎమ్మెల్యేలను ప్రోత్సహిస్తున్న వైనం బాధాకరమన్నారు. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిందిపోయి అన్నింటా జోక్యం చేసుకుంటూ ప్రజాస్వామ్యానికి తలవంపులు తెస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసనసభ సభ్యత్వాలను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం సబబు కాదని.. హైకోర్టు ప్రభుత్వానికి చీవాట్లు పెట్టడం దేశంలోనే మొదటిసారన్నారు. రానున్న రోజుల్లో ఇరుపార్టీలకు గుణపాఠం కలిగే విధంగా వ్యవహరించడంలో ముందుంటుందన్నారు. జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, సహాయకార్యదర్శులు పొనగంటి కేదారి, అందె స్వామి, నాయకులు కాల్వ నర్సయ్యయాదవ్, కూన శోభారాణి, రాజు, టేకుమల్ల సమ్మయ్య, న్యాలపట్ల రాజు, కసిరెడ్డి మణికంఠరెడ్డి పాల్గొన్నారు. -
ప్రత్యామ్నాయం అంటే కాంగ్రెస్ అనుకూల కూటమేనా?
సందర్భం ప్రజానుకూల విధానాలు అనుసరించని పార్టీలు, కాంగ్రెస్‌తో సహా లేదా కాంగ్రెస్ మినహా పలు ప్రాంతీయ పార్టీలతో సీపీఐ, సీపీఎంలు ఏర్పాటు చేయాలనుకునేది ప్రజానుకూలమైన విధానాల ప్రాతిపదికగా రూపొందే కూటమి కాదు. ఒక సందర్భంలో ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ చెప్పిన ‘‘ప్రజలకు కావలసింది, ఒక ప్రత్యామ్నాయ విధానాల సమూహమే కానీ, ఒక ప్రత్యామ్నాయ తలకాయల గుంపు కాదు.’’ అన్నసూక్తిని గుర్తుకు తెచ్చుకోవాలి. జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయం ఏమిటి? అనే చర్చ ఇప్పుడు బలంగా సాగుతోంది. ఇందుకు 2019 ఎన్నికలు సమీపిస్తూండటం ఒక కారణం కాగా, బీజేపీ బలహీనపడుతూండటం కూడా మరొక కారణం. గత నాలుగేళ్ళుగా బీజేపీ, ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాలను అమలు జరపకపోగా, ప్రజా వ్యతిరేక పాలననే కొనసాగించింది. అంతేగాక, మేధావులపైనా, ప్రజాస్వామికవాదులపైనా, దళి తులు, మైనార్టీలపైనా హత్యలు, దాడులు బీజేపీ పాలనలో పెచ్చు పెరిగిపోయాయి. పాలకవర్గాల్లో అసహనం, ప్రజల్లో అభద్రత పెరిగాయి. కనుక రాజకీయ ప్రత్యామ్నాయం అవసరం మరింతగా పెరిగింది. అయితే, ఏది ప్రత్యామ్నాయం, అనేదే కీలకమైన ప్రశ్న. ఈ నేపథ్యంలో రెండు కమ్యూనిస్టు పార్టీల జాతీయస్థాయి మహాసభలకు ప్రాముఖ్యత ఏర్పడింది. రెండు పార్టీల ప్రధాన లక్ష్యం బీజేపీని ఓడించడం. కాంగ్రెస్‌తో సహా బీజేపీయేతర పార్టీలన్నిటితో కలిపి కూటమి ఏర్పడాలనే విధానం సీపీఐలో ఇప్పటికే స్పష్టంగానే వుంది. అంటే, కాంగ్రెస్‌ను కూడా కలుపుకోవాలనేది ఆ పార్టీ నిర్ణయ సారాంశం. అయితే సీపీఎం విధానం అంత సూటిగా లేదు. ఎందుకంటే, ఆ పార్టీ విధానం అటూ ఇటూ మారుతూ వస్తోంది. 1964 నాటి పార్టీ చీలికకు ఆనాటి సీపీఐ నాయకత్వం చేపట్టిన కాంగ్రెస్ అనుకూల పోకడే ప్రధాన కారణం అని సీపీయం నాయకత్వం ఆనాడు స్పష్టంగానే ప్రకటించింది. అయితే కాంగ్రెస్, టీడీపీల మధ్య ఏ ప్రజాస్వామిక, ఆర్థిక, సామాజిక విధానాలపరమైన వ్యత్యాసాల కారణంగా 2004, 2009 ఎన్నికల్లో ఒకసారి కాంగ్రెస్‌ను, మరోసారి టీడీపీని బలపరిచిందో, ఆ పార్టీ నాయకత్వమే చెప్పాలి. ప్రస్తుతం ప్రతిపాదిస్తోన్న బీజేపి వ్యతిరేక కూటమిలో కాంగ్రెస్ స్థానం ఏమిటి, అన్నది ముఖ్యమైన అంశంగా సీపీఎంలో చర్చ జరుగుతూండటం బహిరంగ రహస్యమే. వాస్తవానికి 1964 నాటి చీలిక ప్రకారం రెండు పార్టీలు, సీపీఐ, సీపీఎంలుగా కొనసాగాలంటే కాంగ్రెస్ అనుకూల, ప్రతికూల విధానాల ప్రాతిపదిక ఉండితీరాలి. ఆ ప్రాతిపదికే లేకపోతే అప్పుడు పార్టీని చీల్చడమే తప్పు; ఇప్పుడు రెండు పార్టీలుగా కొనసాగడం అంతకన్నా తప్పు. నేటి ఈ వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని ఉండబట్టేనేమో, సీపీఐ నాయకత్వం రెండు పార్టీల విలీనాన్ని పదేపదే బలంగా ప్రతిపాదిస్తూ వస్తోంది. ఆ ప్రతిపాదనను సీపీయం నాయకత్వం అదేపనిగా తిరస్కరిస్తూ వస్తోంది. ఈ తిరస్కరణకు సీపీఎం నాయకత్వం మనస్సులో ఏ కారణాలు పని చేస్తున్నాయో ప్రజలకైతే అర్థం కావడం లేదు. కాంగ్రెస్ పరిపాలన ఎంతటి జుగుప్సాకరంగా, అవినీతిమయంగా, ప్రజా వ్యతిరేకంగా సాగుతుందో చెప్పటానికి ప్రబలమైన ప్రత్యక్ష సాక్ష్యం, 2014 ఎన్నికల్లో ప్రజలు పచ్చి మతోన్మాద బీజేపీని ఎన్నుకుని అధికారంలో కూర్చోబెట్టటమే. గతంలో వాజ్‌పేయి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం, పదేళ్ల కాంగ్రెస్ యుపిఎ పరిపాలన అనంతరం నాలుగేళ్ల కిందట తిరిగి బిజెపి బహు పెద్ద మెజారిటీతో అధికార పీఠానికి ఎగబాకడం చూసిన తరువాత కూడా, మళ్ళీ కాంగ్రెస్‌తో కలిసిన ప్రత్యామ్నాయాల గురించి సీపీఐ, సీపీఎంలు ఆలోచించటం ఎంతటి ఆత్మవంచన? ఎంతటి ఆత్మహత్యా సదృశ్యం? అసలు ప్రత్యామ్నాయం అంటే ఏమిటి? అది రాజకీయ విధాన ప్రత్యామ్నాయంగా వుండాలి. ఆ రాజకీయ విధానం అభివృద్ధికరమైన, మార్పు దిశగా నడిచే సామాజిక, ఆర్థిక, సాంస్కృతికపరమైన స్వభావంతో కూడుకుని ఉండాలి. కాంగ్రెస్ పార్టీ విధానాలుగానీ, సీపీఐ, సీపీఎంలు ప్రతిపాదిస్తోన్న కూటమిలోని భాగస్వామ్య ప్రాంతీయ రాజకీయ పార్టీలు అనుసరిస్తోన్న విధానాలు గానీ, ప్రజానుకూలంగా వున్నాయా? కనీసం ఆ సీపీఐ, సీపీఎంలు సమర్థించేవిగానైనా వున్నాయా? ప్రజానుకూల విధానాలు అనుసరిం చని పార్టీలు, కాంగ్రెస్‌తో సహా లేదా కాంగ్రెస్‌ను మినహాయించి పలు ప్రాంతీయ పార్టీలతో సీపీఐ, సీపీఎంలు ఏర్పాటు చేయాలనుకునేది ప్రజానుకూలమైన విధానాల ప్రాతిపదికగా రూపొందే కూటమి కాదు. ఒక సందర్భంలో ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ చెప్పిన ‘‘ప్రజలకు కావలసింది, ఒక ప్రత్యామ్నాయ విధానాల సమూహమే కానీ, ఒక ప్రత్యామ్నాయ తలకాయల గుంపు కాదు.’’ అన్నసూక్తిని గుర్తుకు తెచ్చుకోవాలి. బీజేపీ ఉగ్రవాద హిందుత్వ పార్టీకాగా, కాంగ్రెస్ తదితర పార్టీల్లో హెచ్చు భాగం ఉదారవాద హిందుత్వ పార్టీలే. తరతమ తేడాలేతప్ప స్వభావం మాత్రం ఒక్కటే. మరో ప్రత్యేకత ఏమిటంటే, దేశంలోని దాదాపు అన్ని ప్రాంతీయ రాజకీయ పార్టీలూ, ఏదో ఒక దశలో మతోన్మాద బీజేపీతో చెలిమి చేసినట్టివే. ఏవో తమ సొంత కారణాల వల్ల ఆ పార్టీకి ఈ పార్టీలు ప్రస్తుతం దూరంగా వుండవచ్చు. అంతమాత్రాన బీజేపీతో జతకట్టగలిగిన ఆ పార్టీల అలనాటి స్వభావం మారిందనుకోలేం. మారినట్లుగా దాఖలాలూ లేవు. ఇప్పుడు తాము ప్రతిపాదిస్తున్న బీజేపీ వ్యతిరేక కూటమిలో చేర్చదలచుకుంటోన్న ఒక్కొక్క పార్టీ గత చరిత్రను సీపీఐ., సీపీఎం.లు బహిరంగంగా ప్రకటించాలి. ఈ పార్టీలు బీజేపీ దగ్గరకు జరిగినా, లేక, దూరంగా వెళ్ళిపోయినా అవి తమ అప్పటి అవసరాల కోసం, అవకాశవాదంతో ఏర్పరచుకొన్న వైఖరే తప్ప, విధానపరమైన నిర్ణయాలు కావు. ఇలాంటి శక్తులతో కలసి నిజమైన బిజెపి వ్యతిరేక కూటమిని సీపీఐ, సీపీఎంలు నిర్మించడం సాధ్యమేనా? సామాజిక న్యాయం, కుల వివక్షలను గురించి మాటల్లో చెప్పడం కాదు. అది చేతల్లో కనపడాలి. ముఖ్యంగా కీలకమైన రాజకీయ రంగంలో స్పష్టంగా ప్రతిబింబించాలి. దినదినం క్షీణించిపోతున్న తమ ఉనికిని నిలబెట్టుకొని, బలపడి.. సామాజిక కులవర్గ దృక్పధంతో ప్రత్యామ్నాయాన్ని గురించి ఆలోచించి కమ్యూనిస్టు పార్టీల మçహాసభలు సరైన నిర్ణయాలు తీసుకోవాలి. కనుక, సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేసుకొనడంపైనే ఆ పార్టీల భవిష్యత్తు ఆధారపడి వుంటుంది. నిజమైన కమ్యూనిస్టులుగా, నిజమైన సామాజిక రాజకీయ శక్తులతో కలిసి, నిజమైన ప్రత్యామ్నాయ, రాజకీయ శిబిరాన్ని నిర్మించడమా? లేక, బూటకపు లౌకిక శక్తులు, బూటకపు ప్రజాతంత్ర శక్తులతో జతకట్టి, బూట కపు ప్రత్యామ్నాయాన్ని నిర్మించడమా? ఇవే, సీపీఐ, సీపీఎం మహాసభల ముందున్న నిజమైన ప్రత్యామ్నాయాలు. కొసమెరుపు: బీజేపీ వ్యతిరేక కూటమిలో భాగంగా కాంగ్రెస్‌తో ఫ్రంట్‌కు సీపీఎం అంగీకరించనున్నట్లు తాజా వార్తలు. - వై. కోటేశ్వరరావు వ్యాసకర్త సీనియర్ న్యాయవాది, సామాజిక విశ్లేషకులు ‘ 98498 56568 -
రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ దీక్షలు
కోడుమూరు రూరల్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ధర్మపోరాట దీక్ష కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీరాములు గౌడ్ విమర్శించారు. శుక్రవారం స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్, ఎమ్మార్పీఎస్ నాయకులు సమావేశం నిర్వహించారు. ప్రత్యేక హోదా అంటే జైలుకేనంటూ దీక్షలు చేసిన వారందరిపై కేసులు పెట్టి వేధించిన టీడీపీ ప్రభుత్వం నేడు హోదా ఇవ్వాలంటూ దీక్షలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ నాయకులు చేస్తున్న దొంగ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఏఐఎస్ఎఫ్, ఎమ్మార్పీఎస్ నాయకులు నాగేష్, మహేష్‌నాయుడు, మధు, సురేంద్ర, లక్ష్మన్న, రవి, రాజు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
బాబు దీక్షపై పలు రాజకీయ నేతల స్పందన
-
వయసైపోయాక పెళ్లిలా ఉంది
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా కోసం పోరాటమంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన దీక్షపై సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ మండిపడ్డారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. వయసైపోయాక పెళ్లి చేసుకున్న చందంగా చంద్రబాబు దీక్ష ఉందని ఎద్దేవా చేశారు. ‘ఇంతకాలం మోదీతో చంద్రబాబు కలసి ఉన్నారు. ఇప్పుడు దీక్షలు అంటున్నారు. ఇది వయసైపోయాక పెళ్లి చేసుకున్నట్టుంది. దీని వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. వయసులో ఉండగా చంద్రబాబు మోదీతో గడిపారు. ఇప్పుడు బయటకొచ్చి దీక్ష చేస్తున్నారు’ అంటూ నారాయణ ఎద్దేవా చేశారు. -
ప్రత్యేక హోదా కోసం ఏపీ గర్జిస్తోంది
-
ఆ ఇద్దరికీ అపూర్వ సన్మానం
సాక్షి, హైదరాబాద్: సీపీఎం 22వ జాతీయ మహాసభల ప్రాంగణం అరుదైన ఘటనకు వేదికైంది. అవిభక్త కమ్యూనిస్టు పార్టీ నుంచి సీపీఎం ఆవిర్భావం కోసం అప్పటి సీపీఐతో విభేదించి బయటకు వచ్చిన ఇద్దరు కమ్యూనిస్టు యోధులను ఘనంగా సన్మానించారు. ఆ ఇద్దరు.. పార్టీ తొలి కేంద్ర కమిటీ సభ్యులైన కేరళ మాజీ సీఎం వీఎస్ అచ్యుతానందన్ (95), తమిళనాడుకు చెందిన పార్టీ నేత శంకరన్ (96). పార్టీ మహాసభలకు వీరిని అతిథులుగా ఆహ్వానించిన సీపీఎం నేతలు మహాసభల వేదికపై సత్కరించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వారి మెడలో దండలు వేశారు. పార్టీ మూలస్తంభాలైన ఈ ఇద్దరు నేతల కృషి మరువలేనిదని కొనియాడారు. అచ్యుతానందన్, శంకరన్‌లు కనీసం నడవలేని స్థితిలో ఉన్నా.. సహాయకులను వెంటబెట్టుకుని సభలకు హాజరవడం విశేషం. ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం మాణిక్ సర్కార్ సాక్షి, హైదరాబాద్: దేశాన్ని ప్రజావ్యతిరేక ప్రభుత్వం పాలిస్తోందని త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ఆరోపించారు. బుధవారం ప్రారంభమైన పార్టీ జాతీయ మహాసభల్లో ఆయన అధ్యక్షోపన్యాసం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. మతతత్వ విధానాలతో నేరుగా ప్రజాస్వామ్యంపై దాడికి బీజేపీ, సంఘ్ పరివార్లు తెగబడుతున్నాయని ఆరోపించారు. వామపక్ష, ప్రజాతంత్ర కూటమి మాత్రమే దేశ ప్రజల నిజమైన కూటమి అని అన్నారు. మార్క్సిస్టు యోధులకు సంతాపం మహాసభల్లో తొలిరోజు పలువురు మార్క్సిస్టు యోధులకు నివాళి అర్పించారు. త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ప్రవేశపెట్టిన ఈ సంతాప తీర్మానంలో ఖగేన్‌దాస్, పుకుమోల్‌సేన్, నూరుల్‌హుడా, సుబో«ధ్ మెహతాలతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పులువురు నేతలకు సంతాపం ప్రకటించారు. తెలంగాణ నుంచి మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి, ట్రేడ్ యూనియన్ నేతలు పర్సా సత్యనారాయణ, తిరందాసు గోపిలకు కూడా మహాసభ నివాళి అర్పించింది. బెంగాల్, త్రిపుర, బిహార్, మహారాష్ట్రల్లో హత్యలకు గురైన పార్టీ నేతలను సంస్మరించుకున్నారు. -
ప్రతీ ఏటీఎం ముందు నో క్యాష్ బోర్డులే
సాక్షి, హైదరాబాద్: ప్రతీ ఏటీఎం ముందు నో క్యాష్ బోర్డులే ఉన్నాయని, ఖాతాదారులకు బ్యాంకు అధికారులు నగదు లేదని చెప్తున్నారని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట రెడ్డి పేర్కొన్నారు. పెద్దనోట్లు రద్దు చేసి పద్దెనిమిది నెలలు గడుస్తున్నా ఇప్పటికీ నోట్లు అందుబాటులోకి రాకపోవడంతో సామాన్య ప్రజల కష్టాలు పెరిగిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నోట్లను రద్దు చేసి మురిసిపోయిన మోడీ నేడు ముఖం చాటేయడం దారుణమన్నారు. నగదు లావాదేవీలను పెంచడానికి తక్షణ చర్యలు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సీపీఐ డిమాండ్ చేస్తుందని బుధవారం తెలిపారు. -
కమ్యూనిస్ట్ రోడ్‌మ్యాప్
-
‘దళితులు, ముస్లింలను టార్గెట్ చేశారు’
సాక్షి, హైదరాబాద్: దేశంలో రోజురోజుకు మతోన్మాదం పెరిగి పోతుందని, అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) 22వ జాతీయ మహాసభలలో పాల్గొన్న సీతారాం ఏచూరి మీడియాతో మాట్లాడారు. వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకి ఉపాధి అవకాశాలు దొరకడం లేదన్నారు. లక్షల కోట్లను కార్పొరేట్లకు దోచిపెడుతూ.. దళితులు, ముస్లింలను టార్గెట్ చేశారని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. దేశ ఐక్యతకు ఇది పెద్ద దెబ్బ అన్నారు. మతోన్మాద శక్తులను అరికట్టి, వాటిని అడ్డుకునే శక్తి వామపక్షాలకే ఉందని అభిప్రాయపడ్డారు. ప్రత్యామ్నాయ విధానాలు తెచ్చే సత్తా వామపక్ష పార్టీలకు ఉందన్నారు. బీజేపీని ఓడించేందుకు వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఐక్య ఉద్యమాలకు 22వ జాతీయ మహాసభలు దిశా నిర్దేశం చేస్తాయని సీతారాం ఏచూరి వివరించారు. దేశంలో 73 శాతం సంపద కేవలం ఒక శాతం కుటుంబాల చేతుల్లోనే ఉందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. దేశంలో మేధావులు, ప్రొఫెసర్లు, జర్నలిస్ట్‌లు సహా సామాన్యులు హత్యకు గురవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) 22వ జాతీయ మహాసభలు నేడు నగరంలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో పాల్గొన్న సురవరం సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆరెస్సెస్, బీజేపీలు.. రాజ్‌భవన్‌లని అధికార కేంద్రాలుగా వాడుకుంటుందని, గోవా, మణిపూర్లలో ఇదే నిరూపన అయిందన్నారు. ప్రస్తుత సమయంలో వామపక్ష పార్టీల ఐక్యత ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో కమ్యూనిస్ట్ పార్టీ నేతలు, కార్యకర్తల మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయని గుర్తుచేశారు. ఉమ్మడి పోరాటాలకు తమ మద్దతు ఎప్పుడు ఉంటుందని సురవరం సుధాకర్ రెడ్డి తెలిపారు. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) 22వ జాతీయ మహాసభలు ప్రారంభం కాగా.. 19, 20, 21 తేదీల్లో ప్రతినిధుల సభలో పార్టీ రాజకీయ విధానంతో పాటు తీర్మానాలపై చర్చిస్తారు. 22న కొత్త కమిటీని ఎన్నుకోనున్నారు. ఈ నెల 22 సాయంత్రం సరూర్‌నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. -
చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి
-
హోదా ద్రోహులు ఇకనైనా కళ్లు తెరవాలి: చలసాని
సాక్షి, విజయవాడ : ఐదు కోట్ల ఆంధ్రుల హక్కు అయిన ప్రత్యేక హోదా కోసం పోరాడకుండా ఉన్న ద్రోహులు ఇకనైనా కళ్లు తెరవాలని ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ హితవు పలికారు. హోదా కోసం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బంద్ విజయవంతమైందని ఆయన విజయవాడలో మీడియాకు తెలియచేశారు. ఇకనైన హోదా ద్రోహులు ప్రత్యేక హోదా సాధనకు సహకరించాలంటూ చురకలంటిచారు. రాష్ట్రానికి హోదా సాధనకై తమ పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పిన ఆయన, ఈ నెల 24న బ్లాక్‌డే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ రోజు రాత్రి 7 గంటల నుంచి 7.30 గంటల వరకూ విద్యుత్ దీపాలు ఆపేసి చీకటి దినంగా పాటించాలని ప్రజలను కోరారు. తదుపరి కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల ముందు నిరసన కార్యక్రమాలు చేపడతామని, 24 గంటలపాటు జాతీయ రహదారులను దిగ్బంధిస్తామని చలసాని తెలియచేశారు. బాబుది రెండు నాల్కల ధోరణి హదో విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది రెండు నాల్కల ధోరణి అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విమర్శించారు. జపాన్ తరహా ఉద్యమాలు చేయాలని చంద్రబాబు చెబుతున్నారని, అవి ఎలా చేయాలో తమకు తెలియదని ఎద్దేవా చేశారు. గతంలో ఢిల్లీ వెళ్లి ధర్నాలు చేయాలన్న చంద్రబాబు, ఇప్పుడు విజయవాడలో ఎందుకు దీక్ష చేస్తున్నారంటూ నిలదీశారు. చంద్రబాబుకు ఏమాత్రం దమ్ము ధైర్యం ఉన్నా జంతర్‌మంతర్ వద్ద గానీ, ప్రధాని నివాసం ముందుకానీ దీక్ష చేయాలని సూచించారు. ప్రత్యేకహోదా కావాలన్న బాబు, అంతలోనే మాటమార్చి ప్యాకేజీకి అంగీకరించి సన్మానాలు చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. ఏప్రిల్ 20న ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో రాజమండ్రిలో భారీ ర్యాలీ, సభ నిర్వహించనున్నట్లు రామకృష్ణ తెలిపారు. మోదీ రాష్ట్రాన్ని నిలువునా ముంచారు ఆంధ్రప్రదేశ్‌ను, ప్రజలను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నిలువునా ముంచారని సీపీఎం నేత బాబురావు మండిపడ్డారు. హోదా ద్రోహులకు ఏపీ ప్రజలు సమాధి కడతారని, విభజన సమయంలో కాంగ్రెస్‌కు పట్టిన గతే రాష్ట్ర బీజేపీకి పడుతుందని అన్నారు. హోదా కోసం పిలుపునిచ్చిన బంద్‌కు అన్ని రాజకీయ పక్షాలు సహకరించాయని, కానీ అధికార టీడీపీ మాత్రం పాల్గొనలేదని తెలియచేశారు. దీన్ని బట్టే చంద్రబాబుకు ప్రత్యేకహోదాపై ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తుందంటూ వ్యాఖ్యానించారు. ఆందోళనలు, ఉద్యమాలు చంద్రబాబు చెప్పినట్లే చేయాలంటున్నారని మండిపడ్డారు. హోదా ఉద్యమంలో పాల్గొన్నవారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని, బెదిరించి ఉద్యమంలో పాల్గొనకుండా కుట్రలు చేస్తున్నారని బాబురావు ఆరోపించారు. -
విశాఖలో బంద్ స్వచ్చందంగా కోనసాగుతోంది
-
ఏపీ బంద్‌కు జర్నలిస్టుల మద్ధతు
-
కర్నూలు స్వచ్ఛందంగా బంద్
-
ఏపీ బంద్‌కు న్యాయవాదుల మద్దతు
-
గుంటూరు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్
-
తిరుపతిలో ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్
-
విజయవాడలో స్వచ్చందంగా బంద్
-
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్
-
ఆంధ్రావని బంద్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ సోమవారం చేపట్టిన బంద్ రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణంగా కొనసాగుతోంది. రాష్ట్ర బంద్‌కు ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే. ఈ బంద్‌కు టీడీపీ, బీజేపీ దూరంగా ఉన్నాయి. వైఎస్సార్సీపీ, వామపక్షాలతో పాటు మిగతా పార్టీలు బంద్‌కు సంపూర్ణ మద్ధతు ప్రకటించాయి. బంద్ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రజాసంకల్పయాత్రకు విరామం ప్రకటించారు. వైఎస్ జగన్ పిలుపు మేరకు బంద్‌ను విజయవంతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి. ఉదయం 5 గంటల నుంచే ఆర్టీసీ డిపోల ముందు భైఠాయించి బస్సులను బయటికి రాకుండా అడ్డుకున్నారు. ఇక బంద్‌కు తమ పార్టీ దూరంగా ఉంటుందని స్వయంగా సీఎం చంద్రబాబు ప్రకటించిన సంగతి తెల్సిందే. మరోవైపు బంద్ విచ్ఛిన్నానికి కూడా ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోంది. నిరసనల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవంటూ నోటీసుల ద్వారా విపక్షాల నేతలు, కార్యకర్తలను బెదిరించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బంద్ నేపథ్యంలో రాష్ట్రంలో సోమవారం జరిగే అన్ని పరీక్షలను వాయిదా వేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఏపీలో స్వచ్చందంగా బంద్ పాటిస్తున్న ప్రజలు
-
ఏపిలో రేపటి బంద్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం
-
‘స్టీరింగ్’ తిప్పేదెవరు..!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సమితి 17వ ప్లీనరీకి సమయం ఆసన్నమైంది. రెండేళ్ల కోసం గతేడాది సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి చేసినా.. కమిటీల ప్రక్రియ మాత్రం పూర్తి కాలేదు. జిల్లాల పునర్విభజన తర్వాత టీఆర్ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు జిల్లా కమిటీలు వేశాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇదివరకటి పూర్వ జిల్లా అధ్యక్షుడు కటకం మృత్యుంజయంను కొనసాగిస్తోంది. సీపీఐ, సీపీఎం రెండు పర్యాయాలు కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేసి కమిటీలను వేసుకున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఈద శంకర్‌రెడ్డి వ్యవహరించగా, జిల్లాల విభజన తర్వాత 20 నెలల క్రితం కొత్త కమిటీల ఏర్పాటు పేరిట ఉన్న కమిటీలను రద్దు చేశారు. పాత పద్ధతిలోనే జిల్లా కమిటీలు వేస్తారన్న చర్చ ఒకవైపు జరిగితే.. ఎమ్మెల్యేలు కన్వీనర్లుగా నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీలతో సరిపెడతారన్న ప్రచారం కూడా జరిగింది. రెండు పద్ధతుల్లో ఏదీ కూడా అమల్లోకి రాకపోగా, మొక్కుబడిగా గ్రామ, కమిటీలతో సరిపెట్టారన్న చర్చ ఉంది. కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లు, జగిత్యాల, మెట్పల్లి, సిరిసిల్ల, కోరుట్ల తదితర మున్సిపాలిటీల్లో చాలా వరకు వార్డు కమిటీలకు కూడా మోక్షం కలగలేదు. కాగా.. ఈనెల 27న టీఆర్ఎస్ 17వ ప్లీనరీని హైదరాబాద్‌లో జరపబోతున్నారన్న సమాచారం కార్యకర్తలకు చేరింది. అయితే.. ప్లీనరీలోపే అన్ని స్థాయిల్లో కమిటీలు వేయాలన్న ఆదేశాలు కూడా ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అసలు కమిటీలు వేస్తారా? పాత పద్ధతిలోనే జిల్లా కమిటీలు వేస్తారా? మధ్యలో ప్రకటించిన విధంగా నియోజకవర్గం కమిటీలతో సరిపెడతారా? ఇవేమీ చేయకుండానే ప్లీనరీకి వెళ్తారా? అన్న అంశాలు పార్టీ కేడర్‌లో చర్చనీయాంశాలుగా మారాయి. కేసీఆర్ వరకు వెళ్లి.. నిలిచిపోయిన జిల్లా కమిటీల ప్రకటన.. జిల్లా కమిటీలపై అన్ని రకాలుగా కసరత్తు చేసి ప్రకటనే తరువాయిగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి జిల్లాల వారీగా కమిటీలను రూపొందించారు. పార్టీ జిల్లా కమిటీలకు అధ్యక్షునితో కలిపి 25 మంది, అనుబంధ సంఘాలకు 15 మంది చొప్పున ఉండేలా పార్టీ మార్గదర్శకాలు, సామాజిక వర్గాల సమతూకం ఆధారంగా కమిటీలను రూపొందించి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అప్పగించారు. ఈ మేరకు మంత్రులు రాజేందర్, కేటీఆర్‌లు పలు దఫాలు ఆయా జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకుల ద్వారా సేకరించిన విషయం తెలిసిందే. కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఏడుగురి పేర్లు వినిపించినా.. సీనియర్ టీఆర్ఎస్ నేత, మానకొండూరుకు చెందిన జీవీ రామకష్ణారావు (ఇటీవలే ‘సుడా’ చైర్మన్‌గా నియమితులయ్యారు) పేరు ఖరారు చేశారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన కోరుకంటి చందర్, రఘువీర్‌సింగ్, వెంకటరమణారెడ్డి, మనోహర్‌రెడ్డి పేర్లు వినిపించినా.. వెంకటరమణారెడ్డి పేరు ఓకే చేశారని అప్పట్లో ప్రచారం. రాజన్న సిరిసిల్ల నుంచి కల్వకుంట్ల గోపాల్‌రావు, మోహన్‌రెడ్డి, ప్రవీణ్, ఆగయ్యల పేర్లు వినిపించినా.. మాజీ జెడ్పీటీసీ తోట ఆగయ్య పేరు ఫైనల్ అయినట్లు వెల్లడించారు కూడా. జగిత్యాల నుంచి డాక్టర్ ఎం.సంజయ్‌కుమార్, జువ్వాడి నర్సింగరావు, రాజేశం గౌడ్, బాదినేని రాజేందర్ పేర్లు ప్రతిపాదనకు రాగా.. ధర్మపురి జెడ్పీటీసీ భర్త, మాజీ ఎంపీపీ బాదినేని రాజేందర్ పేరును అధినేతకు కమిటీ సిఫారసు చేసింది. ఈ కమిటీలపై ఇక సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటనే తరువాయి అనుకున్న తరుణంలో వాయిదా పడటం.. అప్పటి నుంచి ఆ కమిటీల ఊసెత్తకపోవడం పార్టీ కేడర్‌లో సాగుతున్న సస్పెన్స్‌కు తెరపడటం లేదు. ఇదే సమయంలో అటు జిల్లా కమిటీలు వేయకుండా, ఇటు నియోజకవర్గం కమిటీల ఊసులేక కేడర్‌లో అసంతృప్తి నెలకొంది. ప్రయోజనం లేని ‘పరిశీలకుల’ ప్రక్రియ.. నియోజకవర్గాల్లో అడుగుపెట్టని వైనం..గతంలో ఒక్కో జిల్లా కమిటీలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతోపాటు 60 నుంచి 80 మందికి ప్రాతినిధ్యం ఉండేది. అదేవిధంగా మండల కమిటీలలోనూ పార్టీ కేడర్‌కు సంస్థాగత పదవులు దక్కేవి. కొత్తగా ఈసారి పార్టీ అధినేత కేసీఆర్ స్థానిక ఎమ్మెల్యేల అధ్యక్షతన నియోజకవర్గం కమిటీలను కూడా వేయనున్నట్లు ప్రకటించగా, అందులోనూ చాలా మందికి పదవులు దక్కుతాయని అందరూ భావించారు. అయితే.. ఇవేమీ చేయకుండా 2017 అక్టోబర్ 26న పార్టీ రాష్ట్ర కమిటీలో కార్యదర్శి, సహాయ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి హోదాలలో ఉన్న పలువురు సీనియర్లు ఒక్కొక్కరికి మూడు నుంచి నాలుగు నియోజకవర్గాలకు ఇన్‌చార్జీలుగా బాధ్యతలు అప్పగించారు. పాత జిల్లాలను లెక్కలోకి తీసుకుని ఈ జిల్లాకు చెందిన వారిని పొరుగు జిల్లాకు, పొరుగు జిల్లా నేతలను ఈ జిల్లాకు నియమించారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బస్వరాజు సారయ్యను పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి జనరల్ సెక్రెటరీగా నియమించారు. అదేవిధంగా హుజూరాబాద్‌తోపాటు హుస్నాబాద్, మానకొండూరు నియోజకవర్గాల ఇన్చార్జి బాధ్యతలను పోలీసు హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తకు అప్పగించారు. ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాద్‌రావుకు సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, కోరుట్లలు, సిరిసిల్ల అర్బన్ బ్యాంకు మాజీ అధ్యక్షుడు గూడూరి ప్రవీణ్‌కు కరీంనగర్, చొప్పదండి, ధర్మపురి, కర్ర శ్రీహరిని పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాల ఇన్‌చార్జీలుగా నియమించారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలోని సీనియర్ నాయకులను సిద్దిపేట, నిజామాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో మూడు, నాలుగు నియోజకవర్గాలకు ఒక్కరిని నియమించారు. కాగా.. జిల్లా ఇన్చార్జి జనరల్ సెక్రెటరీగా నియమించాక కరీంనగర్ బైపాస్ రోడ్డులోని ‘వి–కన్వెన్షన్’లో ఓ సమావేశం ఏర్పాటు చేయడం మినహా ఇప్పటికీ జిల్లాల్లో పార్టీ కార్యక్రమాలు ఆ స్థాయిలో జరిగిన సందర్భాలు లేవు. ఇదే సమయంలో కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో నియోజకవర్గాల పరిశీలకులుగా నియమితులైన నేతలు ఇప్పటికీ ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన దాఖలాలు లేవు. -
ఐక్యత ఇంకెంత దూరం?
చంద్రబాబు పాలనను అంతం చేయడమే వామపక్షాల ప్రథమ కర్తవ్యం. ఇందులో వైఎస్సార్సీపీ నిర్వహించగలిగిన ప్రత్యేక పాత్ర ఉంది. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకునే వైఎస్సార్సీపీ ఎంపీలు ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు ఏచూరి, రాజా సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలో కూడా కమ్యూనిస్టు పార్టీలు ఇదే వైఖరిని అవలంబించాలి. మొదటి నుంచీ ప్రత్యేక హోదా విషయంలో ఒకే వైఖరితో ఉన్న వైఎస్సార్సీపీని విమర్శిస్తూ, తెలుగు ప్రజలను దగా చేసినవారు చంద్రబాబు. వామపక్షాలు ఎంతగా బలహీనపడినా, వారి ప్రాతినిధ్యం ఎంతగా తగ్గిపోయినా, బెంగాల్, త్రిపుర రాష్ట్రాలలో ప్రాభవానికి గండి పడినా భారత రాజకీయాలలో ఆ పార్టీల ప్రాముఖ్యాన్ని కాదనలేం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఓటింగ్ శాతం ఒక అంకెకు మించకపోవచ్చు. కానీ ప్రజా పోరాట క్షేత్రంలో, ప్రజా ఉద్యమాలలో సాపేక్షంగా కమ్యూనిస్టు పార్టీల పాత్ర గణనీయమైనది. ఈనాడు కమ్యూనిస్టు పార్టీలు ముప్పయ్‌కి పైగా ఉన్నాయి. వివిధ ప్రాంతాలలో వివిధ స్థాయిలలో శక్తి మేరకు పీడత ప్రజానీకం తరఫున ఉద్యమిస్తూనే ఉన్నాయి. కమ్యూనిస్టు (మార్క్సిస్టు) భావజాలాన్ని పరిగణనలోనికి తీసుకోకుండా మన దేశ ఆర్థిక రాజకీయ సాంస్కృతిక వాస్తవికతను నిర్ధారించుకోవడం నేటికీ అసాధ్యమే. కమ్యూనిస్టు అభిమానులు, ఆ పార్టీ ఉద్యమ ప్రభావం ఉన్న ప్రాంతాలలోని సాధారణ ప్రజలు కమ్యూనిస్టుల పట్ల సానుభూతితోనే ‘వీళ్లు చీలికలైపోయారు’ అని భావించడం సత్యదూరం కాదు. సాయుధ పోరాటమే, అదీ మావో జెడాంగ్ ప్రతిపాదించిన రీతిలో తప్ప మరో మార్గం లేదు అనిపించే మావోయిస్టులు తప్ప నాకు తెలిసిన మిగిలిన కమ్యూనిస్టు గ్రూపులలో అందునా, ప్రధానమైన సీపీఎం, సీపీఐ మధ్య వ్యూహం విషయంలో గుణాత్మకమైన విభేదాలు లేవు. సాధించవలసింది జనతా ప్రజాస్వామ్యమా, జాతీయ ప్రజాస్వామ్యమా లేక నూతన ప్రజాస్వామ్యమా వంటి పడికట్టు పదాలతో తమ తమ వ్యూహాలను బంధించుకున్న తీరు తప్ప, ఆచరణాత్మకంగా ఛేదిం చుకోలేని ప్రతిబంధకాలేమీ లేవు. సరైన దృష్టితో చూడాలి ఈ సందర్భంగా తొలితరం భారత కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ రథసారథి, దక్షిణ భారతావనిలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, ఆదర్శ కమ్యూనిస్టు పుచ్చలపల్లి సుందరయ్య జీవిత చరమాంకంలో రాసిన (తన మరణానంతరం ప్రచురించమని కోరారు) ఆత్మకథలో కనిపించే ఒక విలువైన విషయం మీ ముందుంచుతాను. దీనిని ‘విప్లవ పథంలో నా పయనం’ పేరుతో (తెలుగు) ప్రజాశక్తి బుక్‌హౌస్ ప్రచురించింది. ‘నేడు దేశంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీలు అన్నింటిలోకి అత్యంత విప్లవకరమైన పార్టీ అని మన సీపీఎంను గురించి మనం భావిస్తాం. కానీ అది ఇంకా నిరూపించుకోవలసి ఉన్నది. ఎందుకు అంటున్నానంటే ఇంకా మనం (పార్టీ) విప్లవం సాధించలేదు కనుక!’ అని అందులో సుందరయ్య చెప్పారు. కానీ ఈ వాక్యాన్ని సీపీఎంకు వ్యతిరేకంగా ఉపయోగించదలుచుకుంటే అంతకంటే అల్పత్వం ఉండదు. ఆ కొలమానం ప్రకారం సుందరయ్య అభిప్రాయం అన్ని కమ్యూనిస్టు పార్టీలకు వర్తిస్తుంది. ఎందుకంటే ఏ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం వల్ల కూడా భారతదేశంలో విప్లవం సాధ్యం కాదు. కానీ ఆ వాక్యంలో ఉన్న ప్రధాన అంశం ఏమిటంటే, తమదే నిజమైన విప్లవ పార్టీ, మిగిలినవి వివిధ రూపాలలో తరతమ భేదాలతో రివిజనిస్టు లేదా అతివాద దుందుడుకు పార్టీలు అని ముద్ర వేసి, గిరి గీసుకుని కనిపిస్తున్న వామపక్షాలు ‘ప్రపంచ కార్మికులారా! ఏకంకండి!’ అన్న మార్క్స్ మహత్తర సందేశానికి భిన్నంగా వ్యవహరించరాదనే ఆ వాక్యం సందేశం. కనుక ఇప్పుడు కావలసింది భారత కమ్యూనిస్టు పార్టీల మధ్య ఐక్యత. ఇంకా, ప్రధానంగా ఉన్న రెండు కమ్యూనిస్టు పార్టీల విలీనం వీలైనంత త్వరగా సాధించి దేశ ప్రజల నేటి భౌతిక వాస్తవ పరిస్థితికి అనువైన రీతిలో విప్లవాన్ని సాధించాలని కూడా ఆ వాక్యం అంతరార్థం. కమ్యూనిస్టు ఉద్యమం ఐక్యం కాకుండా, చీలికలు పేలికలుగా కార్మిక వర్గ ఐక్యతకు విఘాతం కలిగించే రీతిలో వ్యవహరిస్తున్నంత వరకు ప్రజలకు కమ్యూనిస్టులు న్యాయం చేయలేరు. సీపీఐ, సీపీఎం పార్టీల అఖిల భారత సభలు త్వరలో జరుగుతున్న నేపథ్యంలో రాస్తున్నదే తప్ప, ఏ ఒక్క పార్టీనో విమర్శించేందుకు, కించపరిచేందుకు ఇది రాయడం లేదు. అదే సమయంలో ఐక్యత దిశగా మెల్లమెల్లగా కొన్ని అడుగులు పడుతున్న సంగతి కూడా గమనార్హమే. ప్రజాశత్రువులైన పాలకులు ఏ పేర్లు పెట్టుకున్నా ప్రజా వ్యతిరేక, స్వార్థ సంకుచిత మతతత్వ విధానాలతో ఒక సునామీ మాదిరిగా ప్రమాదం ముంచుకు వస్తున్న దశలో నత్త నడక సరికాదు. బీజేపీ నినాదం పరమార్థం వేరు కమ్యూనిస్టు పార్టీలు అఖిల భారత స్థాయిలో గుర్తించవలసిన అంశం మరొకటి ఉంది. భారతదేశం మొత్తానికి ఒకే విధమైన ఎన్నికల ఎత్తుగడలు అసాధ్యం. అటు ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల, సామ్రాజ్యవాద ఆశ్రిత ఆర్థిక విధానాలతో పాటు మత తత్వాన్ని కూడా తీవ్ర స్థాయికి తీసుకుÐð ళ్లాలని ప్రయత్నిస్తున్న నరేంద్ర మోదీ, అమిత్‌షాల ఆధిపత్యంలో బీజేపీ అఖండ హిందూ (భారత్) రాజ్యం స్థాపించాలని చూస్తున్నది. ఈ విధమైన మతతత్వంలో మోదీ, షాల ప్రభుత్వానికి పొరుగున ఉన్న ముస్లిం మతతత్వ రాజ్యం పాకిస్తాన్ ఆదర్శం. దీనికితోడు ఒకే జాతి, ఒకే పన్నుల విధానం, ఒకే భాష చివరికి ఒకే మతం అన్న స్థితి కానవస్తున్నది. వివిధ జాతులు గల సుందర భారత వైవిధ్యాన్ని తుడిచివేసి ఏకశిలా సదృశమైన అఖండ భారతం పేరిట సమాఖ్య స్వరూపాన్నే సమాధి చేయాలని చూస్తున్న మోదీ, షాల ఆగడాలు పెరిగిపోతున్నాయి. రోహిత్ వేముల ఆత్మహత్య మొదలు ఈ పాలకుల సామాజిక అణచివేతకు గురి అవుతున్న వ్యవస్థలో అట్టడుగు వర్గాల మీద, మైనారిటీల మీద, మహిళలపైన, ఆదివాసీల మీద ఆగడాలు పెరిగిపోవడం గమనార్హం. కాంగ్రెస్ ముక్త భారత్ మాత్రమే వారి నినాదం కాదు. అన్యమత, అన్య రాజకీయ పార్టీల, ప్రజాస్వామిక, లౌకిక వ్యవస్థ, సమాఖ్య స్వరూపాల ముక్త భారత్‌ను కూడా వారు కోరుతున్నారు. రానున్న ఎన్నికలలో మళ్లీ దేశవ్యాప్తంగా అవకాశవాద రాజకీయ పార్టీలతో, నేతలతో జత కట్టి రాజ్యాధికారం సాధించి తన పంజా విస్తరించాలన్నది బీజేపీ సంకల్పం. భారతతో పాటే కొన్ని ఇతర దేశాలు స్వాతంత్య్రం సాధించాయి. కానీ ఆ రాజ్యాల మాదిరిగా భారత్ నియంతృత్వ రాజ్యంగా, మత రాజ్యంగా తయారు కాకుండా, ప్రజాస్వామ్య లౌకికరాజ్యంగా తీర్చిదిద్దిన ఘనత తమదేనని కాంగ్రెస్ చెప్పుకున్నది. ఆ పార్టీ మళ్లీ అధికారం చేపట్టాలని అర్రులు చాస్తున్నది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసుకుంటున్న ప్రచారం ఎంత వరకు నిజమో తెలియదు కానీ, దేశాన్ని ఆ పార్టీ అవినీతి మయం చేసిందన్న మాట మాత్రం పూర్తిగా నిజం. అంతేకాదు, బీజేపీ చేయదలిచిన, చేస్తున్న తప్పిదాలకు అవకాశం కల్పించిన పార్టీ కూడా అదే. కాంగ్రెస్ పాలన పట్ల విసిగిపోయిన ప్రజలు గత్యంతరం లేదని భావించిన దశలో బీజేపీకి పట్టంగట్టారు. ఒకవిధంగా కాంగ్రెస్ పరిచిన బాటలోనే బీజేపీ అధికారంలోకి Ðð ళ్లింది. అందుకే కాంగ్రెస్ హయాంలోని ఆర్థిక విధానాలను మరింత విస్తృతంగా, మూర్ఖంగా అనుసరిస్తున్నది. దేశ సమాఖ్య స్వరూపాన్ని భగ్నం చేయడంలో కాంగ్రెస్ కూడా తన వంతు ప్రయత్నం చేసింది. బాబ్రీమసీదు తాళాలు తెరి పించడంలోను, షాబాను కేసులోను ఆ పార్టీ వ్యవహరించిన తీరు చాలా దుష్పరిణామాలకు దారి తీసింది. బాబ్రీ మసీదు కూల్చివేతను కాంగ్రెస్ ఆపలేకపోయింది. మతతత్వవాదులను సంతృప్తిపరిచే విధంగా వ్యవహరించింది. రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఒక వేది కను నిర్మించాలన్న సీపీఎం అఖిల భారత స్థాయిలో ముసాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించింది. కాంగ్రెస్, బీజేపీలను ఒకే గాట కట్టడం సరికాదనీ, బీజేపీని ఒంటరిని చేసి ఓడించడం, తక్షణ కర్తవ్యమనీ కొందరు కమ్యూనిస్టు నేతలు, ఇతరులు కూడా వాదించడంలో వాస్తవికత లేదని అనడం సరికాదు. నిజానికి అలాంటి ప్రత్యామ్నాయ విధాన రూపకల్పనలో వామపక్షాలు దాన్ని తమ పాలనలో సైతం అక్కడైనా ఆచరణాత్మకం చేయకపోవడం కమ్యూనిస్టుల వైఫల్యానికి పెద్ద కారణం. అది గుర్తించడం ఎంత ముఖ్యమో, ఆ వ్యూహాన్ని అమలు పరచాలంటే సమయం సందర్భం, తగిన ఎత్తుగడను రూపొందించుకోవడం అంతే ముఖ్యం. ఉదాహరణకు దానిని అమలు చేయడమనే కారణంతో దేశం మొత్తానికి ఒకే విధమైన పంథా తగదు కూడా. దేశ వైవిధ్యంతో పాటు, వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు, వాటి ప్రభావం ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలు తమ వ్యూహాన్ని అమలు చేసుకునే దిశగా ఎన్నికల ఎత్తుగడలను అనుసరించే స్వేచ్ఛ ఇవ్వాలి. వైఎస్సార్సీపీ వైఖరి సమర్థనీయం ముందు కమ్యూనిస్టు పార్టీలలో డెమొక్రాటిక్ సెంట్రలిజం పేరుతో సెంట్రలిజం (కేంద్రీకృత ప్రజాస్వామ్యం స్థానంలో కేంద్రీకృతమే) సాగడం సరి కాదు. ఉదాహరణ: ఆంధ్రప్రదేశ్. రాష్ట్రాన్ని అవినీతి మయం చేసి శుష్క వాగ్దానాలతో అధికారం దక్కించుకుని, అవకాశవాదంతో అందలం ఎక్కి అలాగే కొనసాగాలనుకుంటున్న నారా చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీని ఓడించడం ప్రథమ ప్రాధాన్యం అవుతుంది. చంద్రబాబు వ్యతిరేక ఓటును చీల్చి పరోక్షంగా చంద్రబాబుకే మేలు చేసే తృతీయ ఫ్రంట్ రూపొం దించడంలో వామపక్షాలు పాలు పంచుకోవడం కూడని పని. ప్రధాన ప్రతి పక్షం, జగన్ నాయకత్వంలోని వైఎస్సార్సీపీతో యోచించి, పరస్పరం పోటీ నివారణ స్వతంత్ర వేదికల వంటి ఏర్పాటుతో వామపక్షాలు వ్యవహరించడం సముచితం. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ బలమైన శక్తులు కావు. కాబట్టి ఆ రెండింటికీ ప్రత్యామ్నాయ ఫ్రంట్ అనే ప్రశ్నే ఉదయించదు. చంద్రబాబు పాలనను అంతం చేయడమే వామపక్షాల ప్రథమ కర్తవ్యం. ఇందులో వైఎస్సార్సీపీ నిర్వహించగలిగిన ప్రత్యేక పాత్ర ఉంది. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకునే వైఎస్సార్సీపీ ఎంపీలు ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు ఏచూరి, రాజా సంఘీభావం తెలి పారు. రాష్ట్రంలో కూడా కమ్యూనిస్టు పార్టీలు ఇదే వైఖరిని అవలంబించాలి. ఇక తెలంగాణలో సీపీఎం బహుజన వామపక్ష సంఘటన కోసం కృషి ఆరం భించింది. అయితే ఇందుకు సీపీఐ కలసి రాకపోవడం శోచనీయం. మొదటి నుంచీ ప్రత్యేక హోదా విషయంలో ఒకే వైఖరితో ఉన్న వైఎస్సార్సీపీని విమర్శిస్తూ, తెలుగు ప్రజలను దగా చేసినవారు చంద్రబాబు. ఆయనకు నిన్నటిదాకా అండగా ఉన్నవారు పవన్ కల్యాణ్. అయితే ఇప్పుడు పవన్ కల్యాణ్‌తో జత కట్టడం వామపక్షాల పట్ల నివారింపదగిన అపోహలకు ఆస్కారం ఇవ్వడమే. విస్తృతమైన ప్రజా ఉద్యమంలో వైఎస్సార్సీపీతో మాత్రమే కాకుండా, హోదా కోసం పోరాడుతున్న సాధన సమితి వంటి ఇతర పౌర సంఘాలను కూడా కలుపుకుని వెళ్లాలి. బీజేపీ, తెలుగుదేశం పాలనలకు వ్యతిరేకంగా పోరాడడం ద్వారా కమ్యూనిస్టు పార్టీలు తమ పునాదిని, ప్రజా సంబంధాలను విస్తృతం చేసుకోవడానికి అవకాశాలను పెంచుకోవాలి. వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు డాక్టర్ ఏపీ విఠల్ మొబైల్ : 98480 69720 -
అయిదు నెలల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం
సాక్షి, న్యూఢిల్లీ: మార్చి నెలలో భారత వార్షిక రిటైల్ ద్రవ్యోల్బణం 4.28 శాతానికి దిగి వచ్చింది. వార్షిక ప్రాతిపదికన సిపిఐ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మార్చి నెలలో 4.28 శాతం వద్ద అయిదు నెలల కనిష్టాన్ని నమోదు చేసింది. అంతకు ముందు నెలలో 5.07 శాతంగా ఉంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రధానంగా ఆహార ధరలు తగ్గడం ఇందుకు దోహదపడ్డాయి. అయితే ఫిబ్రవరి నెలలో పారిశ్రామిక ఉత్పాదకత 7.1 శాతానికి తగ్గింది. సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (సిఎస్ఓ) వృద్ధిని సాధించింది. సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (సిఎస్ఓ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం కూరగాయల విభాగంలో ద్రవ్యోల్బణం మార్చి నెలలో 11.7 శాతానికి తగ్గింది. అంతకు ముందు నెలలో ఇది 17.57 శాతంగా ఉంది. గుడ్లు, పాలు, ఇతర ఉత్పత్తుల వంటి ప్రోటీన్ వస్తువుల ధరల పెరుగుదల రేటు గత నెలలో మార్చి నెలలో చాలా మోడరేట్ చేసింది. మొత్తం ఆహార ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 3.26 శాతానికి పడిపోయి 2.81 శాతంగా ఉంది. ఇంధన, లైట్ విభాగంలో కూడా మంత్ ఆన్ మంత్ ద్రవ్యోల్బణం 5.73 శాతంగా నమోదైంది. -
చంద్రబాబు వల్లే బీజేపీపై దాడులు
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్దతు తెలపడం వల్లే తమ పార్టీపై దాడులు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు ఆరోపించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... బీజేపీ పార్టీపై సీపీఐ చేసిన దాడిని హరిబాబు ఖండించారు. బీజేపీపై జరిగిన దాడి అప్రజాస్వామికమని, కమ్యూనిస్ట్‌ల ఫాసిస్ట్ ఆలోచనలకు నిదర్శనమన్నారు. ఒక రాజకీయ పార్టీ మరో రాజకీయ పార్టీ కార్యక్రమంపై దాడి చేయడం విశాఖలో కొత్త విధానం, సంస్కృతిగా మారిందన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా బీజేపీపై చేసిన దాడులకు మద్దతు ఉందని ప్రకటించారని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు మద్దతు కమ్యూనిస్టులకు నైతిక బలమిచ్చి ఉంటుందని అభిప్రాయపడ్డారు. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని పేర్కొన్నారు. 2013లో సమైక్యాంధ్ర ఉద్యమంలో ఏ నిర్వీర్యమైన ప్రభుత్వముందో, రాబోయే రోజుల్లోనూ అలాంటి నిర్వీర్యమైన ప్రభుత్వమే వస్తుందన్నారు. -
విశాఖలో విభజన హామీల సాధన సమితి దీక్షలు
-
మోదీది అహంకారపూరిత ధోరణి
సాక్షి, న్యూఢిల్లీ: నియంతృత్వ పోకడలతో కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రధాని మోదీది అహంకారపూరిత ధోరణి అని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని ఏపీ భవన్లో వైఎస్సార్సీపీ ఎంపీలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు బుధవారం సురవరంతోపాటు ఆయన సతీమణి విజయలక్ష్మి సంఘీభావం తెలిపారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి ఆయన నివాళులు అర్పించారు. హోదా కోసం పోరాడుతున్న వైఎస్సార్సీపీకి తమ మద్దతు ఉంటుందని చెప్పారు. హోదా సాధన కోసం ఎంపీలు పదవులకు రాజీనామాలు చేసి ఆమరణ నిరాహార దీక్షకు దిగడం అభినందనీయమన్నారు. వైఎస్సార్సీపీ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడితే అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయన్నారు. టీడీపీ కూడా మొదట వైఎస్సార్సీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటించిందన్నారు. అయితే అవిశ్వాస తీర్మానాలపై చర్చ జరపకుండా కేంద్రం పారిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రధాని సమాధానం చెప్పాలి.. అవిశ్వాసం సహా ఇతర అంశాలపై చర్చ జరగకుండా ప్రతిపక్షాలే సభను అడ్డుకున్నాయని చెబుతూ ప్రధాని మోదీ దీక్షకు దిగనుండడం దేనికి సంకేతమని సురవరం ప్రశ్నించారు. ఇచ్చిన హామీని అమలు చేయని కేంద్రం వైఖరికి నిరసనగా పదవులకు రాజీనామాలు చేసి వైఎస్సార్సీపీ ఎంపీలు ఆమరణ నిరాహార దీక్షకు దిగితే ప్రధాని స్పందించరా అని నిలదీశారు. దీనిపై మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంపీలు దీక్షకు దిగి ఐసీయూలో చేరితే కనీసం కేంద్ర మంత్రులైనా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారని, ఇది రాజకీయ ప్రకటన కాదని.. పార్లమెంటులో ప్రధాని చేసింది ప్రభుత్వ ప్రకటన అని, దాన్ని అమలు చేయాలన్నారు. ఏపీకి హోదా విషయంలో రాష్ట్రం ఒకవైపు ఉంటే.. బీజేపీ మరో వైపుందన్నారు. ప్రత్యేక హోదాకు ప్యాకేజీ ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదన్నారు. ప్యాకేజీని అంగీకరించిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ హోదా కోరుతున్నారన్నారు.