కర్నూలు జిల్లా: హత్తిబెళగల్ క్వారీ ప్రమాద ఘటనాస్థలి వద్ద పోలీసులు అతి ఉత్సాహం ప్రదర్శించారు. సంఘటనాస్థలాన్ని సందర్శించడానికి వచ్చిన బీజేపీ, వామపక్షాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నాయకులు, పోలీసుల తీరును తప్పుపట్టారు. టీడీపీ నాయకుడు శ్రీనివాసుల చౌదరీకి సంబంధించిన క్వారీ కాబట్టే వారిని తప్పించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని బీజేపీ ఆరోపించింది. ఘటనకు కారకులైన టీడీపీ నాయకులతో పాటు సంబంధిత అధికారులు కూడా బాధ్యత వహించాలన్నారు. కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెళగల్ క్వారీ ప్రమాదాన్ని నిరసిస్తూ విజయవాడలో సీఐటీయూ ధర్నా నిర్వహించింది. ప్రభుత్వ అండతోనే యధేచ్ఛగా అక్రమంగా క్వారీలు తవ్వుకుంటున్నారని సీఐటీయూ నాయకులు ఆరోపించారు. బాధితులకు ప్రభుత్వం తక్షణమే ఆర్ధికసాయం అందజేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment