Aluru
-
గుమ్మనూరు జయరాంకు ఎమ్మెల్యే విరుపాక్షి కౌంటర్
-
దివ్యాంగులను ఆదుకుంటున్న వైఎస్ జగన్ ప్రభుత్వం
-
కలిసికట్టుగా పనిచేస్తే మళ్లీ ఘన విజయం
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో అధికారంలో ఉన్న మనమంతా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వివిధ బాధ్యతలను నిర్వహిస్తున్నాం. మనమంతా కలిసికట్టుగా పని చేస్తే మళ్లీ ఘన విజయం సాధిస్తాం’ అని కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కార్యకర్తలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశా నిర్దేశం చేశారు. గురువారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన వారితో సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తలతో మాట్లాడటానికే ఈ కార్యక్రమం చేపట్టామని, ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. మరో 18–19 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయని.. వాటికి ఈ రోజు నుంచే సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మూడేళ్లలోనే సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) రూపంలో ఒక్క ఆలూరు నియోజకవర్గంలోని లబ్ధిదారులకు రూ.1,050 కోట్లు జమ చేశామని వివరించారు. చేసిన మంచి కార్యక్రమాలను వివరించి.. ప్రజల ఆశీర్వాదం తీసుకోవడం కోసమే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వారంలో రెండు రోజులు.. ప్రతి రోజూ కనీసం రెండు గంటల పాటు ఎమ్మెల్యే ప్రజల మధ్య గడుపుతున్నారని చెప్పారు. ప్రాధాన్యత పనుల కోసం రూ.20 లక్షలు ప్రతి ఇంటికీ వెళ్లి.. ఆ కుటుంబానికి సంక్షేమ పథకాల ద్వారా జరిగిన మేలును వివరించి.. మేలు జరిగిందా? లేదా? అని విచారిస్తూ వారి ఆశీస్సులు తీసుకుంటున్నామని సీఎం కార్యకర్తలకు వివరించారు. ఎక్కడైనా పొరపాట్లు జరిగి ఉంటే.. వాటిని తక్షణమే సరిదిద్దుతున్నామని తెలిపారు. ప్రజల సాధక బాధకాలు తెలుసుకుని.. వాటిని పరిష్కరించే ప్రయత్నం ఈ కార్యక్రమం ద్వారా కొనసాగుతోందన్నారు. దేవుడి దయవల్ల ఈ కార్యక్రమం బాగా సాగుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వచ్చిన వినతుల్లో ప్రాధాన్యత పనుల కోసం రూ.20 లక్షలు కేటాయించి.. వాటిని పూర్తి చేస్తున్నామని వివరించారు. ప్రతి ఎమ్మెల్యే ప్రతి కార్యకర్తకూ అందుబాటులో ఉండాలని మార్గ నిర్దేశం చేశారు. వీలైనప్పుడల్లా తాను ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసంగా 100 మంది కార్యకర్తలను కలుస్తున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరాం తదితరులు పాల్గొన్నారు. వరద బాధితులకు అండగా నిలవండి సాక్షి, అమరావతి: అనంతపురంలో భారీ వ ర్షాలు, వరద బాధితులందరికీ అండగా నిల వాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికా ర యంత్రాంగాన్ని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు రూ.రెండువేల చొప్పున తక్షణ సహాయం అందించాలని చెప్పారు. ఉచితం గా 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, లీటర్ పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, కేజీ ఆలుగడ్డలు చేరవేయాలన్నారు. వర్షాలు, వరదలు తగ్గుముఖం పట్టగానే ఆస్తి, పంటనష్టం పై అంచనాలు తయారుచేసి, నిర్ణీత సమ యంలోగా వారికి పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంత పురంలో భారీవర్షాలు, అనంతర పరిస్థితు లపై గురువారం ఆయన తన క్యాంపు కార్యా లయంలో సమీక్షించారు. అనంతపురంలో వర్షం.. ప్రస్తుత పరిస్థితులు, సహాయక చర్య లు, బాధితులను ఆదుకునే కార్యక్రమాల గురించి అధికారులు సీఎంకు వివరించారు. తక్షణ సాయం కోసం రూ.93 లక్షలు అనంతపురంలో వరద బాధితులను తక్షణం ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.93 లక్షలు విడుదల చేసింది. ఈ మొత్తాన్ని జిల్లా కలెక్టర్‌కు విడుదల చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నిత్యావసరాల పంపిణీ, సహాయక శిబిరాల నుంచి కుటుంబాలు తిరిగి ఇళ్లకు వెళ్లేటప్పుడు రూ.2 వేల చొప్పున సాయం చేసేందుకు సంబంధించి మరో రెండు జీవోలు విడుదల చేశారు. వరద బాధితుల ఖాతాలకు నేరుగా నగదు బదిలీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో కలెక్టర్‌కు సూచించారు. కలెక్టర్‌తో స మన్వయం చేసుకుంటూ వరద బాధితులకు నిత్యావసరాలను సరఫరా చేయాలని పౌరస రఫరాలశాఖ కమిషనర్‌ను ఆదేశించారు. -
ఎన్నికలకు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కార్యకర్తలతో తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఆలూరు నుంచి వచ్చిన కార్యకర్తలను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గంలోని కార్యకర్తలను కలుసుకోవాలన్నదే ఈ కార్యక్రమం ఉద్దేశం. ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. చదవండి: ఇలాంటి వక్రీకరణల వెనుక ఉద్దేశం ఏంటి?: సీఎం జగన్ ‘‘గడపగడపకూ కార్యక్రమాన్ని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో చేపడుతున్నాం. ఎమ్మెల్యేలు సంబంధిత నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. గ్రామంలో ప్రతి ఇంటికీ వెళ్తున్నారు. ఈ మూడేళ్ల కాలంలో మనం చేసిన మంచి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్తున్నాం, ఆ కుటుంబానికి జరిగిన మేలును వివరిస్తున్నాం. ఆ మేలు జరిగిందా? లేదా? అనే విచారణ చేస్తున్నాం. వారి ఆశీస్సులు తీసుకుంటున్నాం. ప్రభుత్వంలో ఉన్న మనం అంతా.. గ్రామస్థాయిల్లో కూడా వివిధ బాధ్యతలను నిర్వహిస్తున్నామని’’ సీఎం అన్నారు. ‘‘మనం అంతా కలిసికట్టుగా ఒక్కటి కావాలి. అప్పుడే మంచి విజయాలు నమోదు చేస్తాం. అలాగే ప్రతి సచివాలయానికీ రూ.20లక్షల రూపాయలు ప్రాధాన్యతా పనులకోసం కేటాయిస్తున్నాం. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా గ్రామంలో 2 రోజులపాటు కచ్చితంగా ఎమ్మెల్యే గడపుతున్నారు. రోజూ 6 గంటలపాటు సమయం గడుపుతున్నారు. సీఎంగా నేను ప్రతి కార్యకర్తకూ అందుబాటులో ఉండలేకపోవచ్చు. సాధ్యం కాదుకూడా. కాకపోతే ప్రతి ఎమ్మెల్యే కార్యకర్తకూ అందుబాటులో ఉండాలి. ఎమ్మెల్యేలు మాత్రం ప్రతి గ్రామంలో తిరగాలి.. రెండురోజులపాటు తిరగాలి. రోజుకు 6 గంటలు గడపాలి. సాధకబాధకాలు తెలుసుకుని.. వాటిని పరిష్కరించే ప్రయత్నం గడపగడపకూ కార్యక్రమం ద్వారా కొనసాగుతుంది’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. దేవుడి దయవల్ల గడపగడపకూ కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. ఈ మధ్యలో వీలైనప్పుడు నేను ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసంగా 100 మంది కార్యకర్తలను కలుస్తున్నాను. ఒక్క ఆలూరు నియోజకవర్గానికే వివిధ పథకాల ద్వారా ఈ మూడు ఏళ్ల కాలంలో రూ.1050 కోట్లు నేరుగా లబ్ధిదారుల ప్రత్యక్ష నగదు బదిలీద్వారా నేరుగా వారి ఖాతాల్లో వేయడం జరిగింది’’ అని సీఎం జగన్ అన్నారు. -
మృత్యువులోనూ వీడని స్నేహం
ఆలూరు: వారిద్దరూ స్నేహితులు. కలిసిమెలిసి తిరిగేవారు. వ్యక్తిగత పని నిమిత్తం దేవనకొండకు వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటన శనివారం రాత్రి దేవనకొండ మండలం కరిడికొండ సమీపంలో చోటుచేసుకుంది. కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన బోయ సుధాకర్ (36) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఈయనతో అదే గ్రామానికి చెందిన తెలుగు వెంకటేష్ (38) స్నేహం చేసేవాడు. ఇద్దరూ కలసి శనివారం సాయంత్రం వ్యక్తిగత పనినిమిత్తం మోటారు సైకిల్‌పై దేవనకొండకు వెళ్లారు. పని ముగించుకుని తిరిగి వస్తుండగా రాత్రి 8:30 గంటల సమయంలో కరిడికొండ గ్రామ సమీపాన కర్నూలు వైపు నుంచి ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం బలంగా మోటార్ సైకిల్‌ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకుని ఎస్ఐ శ్రీనివాసులుకు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బోయ సుధాకర్‌కు భార్య, కుమారుడు, కుమార్తె, తెలుగు వెంకటేష్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. స్నేహితులు ఇద్దరూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో కప్పట్రాళ్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
Nizamabad: ఆలూరు, డొంకేశ్వర్ మండలాల ఏర్పాటు అంతేనా..!
సాక్షి, నిజామాబాద్: రాష్ట్రంలో 2016లో పాలన మరింతగా వికేంద్రీకరించేందుకు కొత్త జిల్లా లు, కొత్త మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదేవిధంగా కొత్తగా గ్రామ పంచాయతీలను సైతం ఏర్పాటు చేసింది. అయితే జిల్లాలోని కీలకమైన ఆర్మూర్ నియోజకవర్గంలో మాత్రం అత్యంత ఆవశ్యకత ఉన్నప్పటికీ కొత్త మండలాల ఏర్పాటు మాత్రం జరగలేదు. దీంతో వీటిని ఆశిస్తున్న ఆయా గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రజలకు ఎదురుచూపులే మిగులుతున్నాయి. ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూర్ మండలం నుంచి నిజామాబాద్ నగరపాలక సంస్థలో కలిపిన కొన్ని గ్రామాలు, ఆర్మూర్ పురపాలక సంఘం మినహాయించినప్పటికీ, కేవలం మూడు మండలాలైన మాక్లూర్, నందిపేట, ఆర్మూర్ మండలాల్లో కలిపి 81 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జిల్లాలోనే ఎక్కువ పంచాయ తీలు ఉన్న మండలాల్లో మొదటి వరుసలో ఉన్నా యి. ప్రస్తుతం ఆర్మూర్ మండలంలో 18 పంచాయతీలు, నందిపేట మండలంలో 33 పంచాయతీలు, మాక్లూర్ మండలంలో 30 పంచాయతీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మండలాల్లోని కొన్ని పంచాయతీలను విడదీసి కొత్తగా రెండు మండలాలు చేసేందుకు ప్రతిపాదించారు. ఇందులో భా గంగా నందిపేట మండలం నుంచి కొత్తగా డొంకేశ్వర్ మండలం ఏర్పాటుకు నిర్ణయించారు. ఇందులో 13 పంచాయతీలు నందిపేట మండలం నుంచి కొత్త మండలంలో కలిపేలా నిర్ణయించారు. అదేవిధంగా మరోవైపు ఆర్మూర్ మండలం నుంచి కొత్తగా ఆలూ రు పేరిట మండలాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతి పాదించారు. ఆలూరు మండలం పరిధిలోని ఆర్మూర్‌లోని కొన్ని పంచాయతీలతో పాటు, నందిపేట మండలం నుంచి వెల్మల్, సిద్ధాపూర్, వన్నెల్(కె) పంచాయతీలను, మాక్లూర్ మండలం నుంచి రాంచంద్రపల్లి, కల్లెడ, గుత్ప పంచాయతీలను కలిపేందుకు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ప్రక్రి య పూర్తి చేయడంతో పాటు కొత్త మండలాల కోసం అవసరమైన కార్యాలయాల కోసం భవనాలను సైతం చూసి వాటికి రంగులు వేసి మరీ సిద్ధం చేశారు. అయితే చివరి నిమిషంలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో, అప్పటి కలెక్టర్ యోగితారాణాకు ఉన్న విభేదాల కారణంగా కొత్త మండలాల ఏర్పాటు ప్రక్రియకు ఫుల్స్టాప్ పడినట్లు పలువురు చెబుతున్నారు. అప్పటి నుంచి కొత్త మండలాలను ఆశిస్తున్న ప్రజలకు ఎదురుచూపులు తప్పడం లేదు. డిమాండ్లను పట్టించుకోని సర్కారు ఆర్మూర్ నియోజకవర్గంలో భారీగా గ్రామ పంచాయతీలు ఉన్న మండలాల్లో నుంచి కొత్తగా మండలాలు ఏర్పాటు చేయాలని డిమాండ్లు ఉన్నప్పటికీ అది సాకారం కాలేదు. మరోవైపు జిల్లాలో మూడు నుంచి నాలుగు గ్రామ పంచాయతీలతో కొన్ని మండలాలు ఏర్పాటు కావ డం గమనార్హం. బాల్కొండ నియోజకవర్గంలో ని బాల్కొండ మండలాన్ని మూడు మండలాలుగా విభజించారు. బాల్కొండ, మోప్కాల్, మెండోరా మండలాలు ఏర్పాటు చేశారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో ఈ మండలాలు ఏర్పాటయ్యాయి. అదేవిధంగా బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండలం నుంచి మొదటగా రుద్రూరు మండలాన్ని విభజించారు. అయితే మండలాల విభజన ప్రక్రియ ముగిసిపోయినప్పటికీ ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ల నేపథ్యంలో శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తరువాత కాలంలో కొ త్తగా చందూరు, మోస్రా మండలాలను ఏర్పా టు చేయించారు. దీంతో వర్ని మండలాన్ని నా లుగు మండలాలుగా విభజించినట్లైంది. ఈ నే పథ్యంలో ఆర్మూర్ నియోజకవర్గంలో కొత్త మండలాల ఏర్పాటు అంశం వెనక్కి వెళ్లడంతో ప్రజలకు ఎదురుచూపులే మిగిలాయి. -
ఆ పేద తల్లిదండ్రుల కలలు ఆవిరయ్యాయి..
సాక్షి, ఆలూరు (కర్నూలు): రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. విషయం ఇంట్లో పెద్దలకు తెలియడంతో ఇద్దరిని దూరంగా ఉంచారు. దీంతో మనస్తాపం చెందిన ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన ఆలూరులో చోటు చేసుకుంది. పట్టణంలోని స్థానిక గోవర్ధన్ టాకీస్ సమీపంలో నివాసం ఉంటున్న నాగేంద్ర, అనిత దంపతుల కుమారుడు విజయ్ కుమార్ (18), అదే కాలనీలో నివాసం ఉండే రమణ, అనిత దంపతుల కుమార్తె మధుప్రియ(18) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విజయ్ కుమార్ ఇంటర్ పూర్తి చేసి ప్రస్తుతం ఆలూరు ఐటీఐ కళాశాలలో డీజల్ మెకానికల్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. మధుప్రియ ఆలూరులోని మోడల్ స్కూల్లో ఇంటర్ వరకు చదివి పులివెందుల ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇంటర్ చదివే సమయంలో వీరి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలియడంతో మధుప్రియను వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల కళాశాలలో బీటెక్ చేర్పించారు. అప్పుడప్పుడు సెల్ ఫోన్లో ఇద్దరూ మాట్లాడుకునే వారని తెలిసింది. అయితే వారి మధ్య ఏమి జరిగిందో తెలియదు కాని శుక్రవారం రాత్రి 7.30 గంటలకు విజయ్ కుమార్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చదవండి: (ప్రియుడిని కలవడానికి భర్త అడ్డు.. ఏం చేయాలా అని ఆలోచించి..) ఈ విషయం మధుప్రియకు తెలిసి అదే రోజు హాస్టల్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు హాస్టల్ నిర్వాహకులు కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. దీంతో విద్యార్థినిని అనంతపురం జిల్లా కదిరిలో ఉంటున్న పెదనాన్న ఇంటికి తీసుకొచ్చారు. విజయ్ మరణాన్ని జీర్ణించుకోలేక మధుప్రియ శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బంధువుల ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు కడుపునొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు నమోదు చేశారు. విద్యార్థిని మృతదేహాన్ని ఆదివారం గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు చేశారు. తమ పిల్లలు ఉన్నతంగా చదివి ప్రయోజకులవుతారని ఆశించిన పేద తల్లిదండ్రుల కలలు ఆవిరయ్యాయి. ప్రేమికుల ఆత్మహత్యతో ఆలూరులో విషాదం అలుముకుంది. చదవండి: (భర్త పుణెలో సాఫ్ట్వేర్ ఉద్యోగం.. నవ్య అనారోగ్యంతో గుంటూరులో..) -
ఎంత పని చేశావు తల్లీ?!
‘బంగారం’ లాంటి బిడ్డలు. ఎంతో భవిష్యత్ ఉన్న వారు. వారి గురించి ‘ఒక్క క్షణం’ ఆలోచించి ఉన్నా ఈ ఘోరం తప్పేదేమే! కానీ నీతో పాటు ‘ఆశా దీపాల’ను ఆర్పేసి అందరి నింద మోసుకెళ్లావు కదా తల్లీ?! కష్టాలు, కన్నీళ్లు ఎప్పుడూ ఉంటాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కోవడమే జీవితం. ఎంతో విలువైన జీవితానికి ఇంత బేలగా ముగింపు పలకడం విషాదం. సాక్షి, కర్నులు : హాలహర్వి మండలం గూళ్యం గ్రామంలో శనివారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. సవిత(35) అనే మహిళ తన ఇద్దరు పిల్లలు నిశ్చల కుమార్(12), వేంకటసాయి (7)ని ఉరి వేసి చంపి..తనూ ఆత్మహత్య చేసుకుంది. వేరు కాపురం పెట్టడానికి భర్త అంగీకరించకపోవడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. వారి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గూళ్యం గ్రామానికి చెందిన ప్రహ్లాద్ శెట్టి, సుభద్రమ్మలకు ఐదుగురు కుమారులు. నాల్గవ కుమారుడైన సతీష్ గుప్తా కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి జిల్లా సండూరు గ్రామానికి చెందిన కుమారస్వామి, నాగమణిల కుమార్తె సవితను 14 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి నిశ్చల కుమార్, వేంకటసాయి సంతానం. నిశ్చలకుమార్ ఆరోతరగతి, వేంకటసాయి ఒకటో తరగతి చదువుతున్నారు. కాగా.. సవిత, ఆమె భర్త, పిల్లలు ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉంటున్నారు. సవిత కొన్ని రోజుల నుంచి వేరే కాపురం పెట్టాలని భర్తతో చెబుతూ వచ్చింది. ఇందుకు అతను అంగీకరించలేదు. దీంతో ఆమె వారం క్రితం అలిగి పుట్టింటికి వెళ్లింది. అక్కడ తల్లి సర్దిచెప్పి శుక్రవారం గూళ్యం గ్రామానికి తిరిగి పంపించింది. అయితే అదే రోజు రాత్రి ఆమె వేరే కాపురం విషయమై భర్తతో మరోసారి గొడవ పడింది. అయినా అతను వినిపించుకోకపోవడంతో మనస్తాపానికి గురైంది. శనివారం ఉదయం ఏడు గంటల సమయంలో బెడ్రూంలో తన పిల్లలకు ఉరి వేసి చంపి.. తరువాత తనూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆలూరు సీఐ భాస్కర్, హాలహర్వి ఎస్ఐ నరేంద్ర సంఘటన స్థలాన్ని పరిశీలించి.. ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆలూరు ప్రభుతాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. వేధింపులే కారణమా? ఇద్దరు పిల్లలను చంపి.. తల్లి ఆత్మహత్య చేసుకోవడంపై గ్రామస్తులు మాత్రం మరోవిధంగా చర్చించుకుంటున్నారు. వారం క్రితం ఇంట్లో పది తులాల బంగారం పోవడంతో దానికి కారణం నీవేనంటూ తోడి కోడళ్లు, బావలు, ఇతర కుటుంబ సభ్యులు సవితను వేధించినట్లు తెలుస్తోంది. ఇందుకు భర్త కూడా అడ్డు చెప్పలేదని సమాచారం. వేధింపులు భరించలేక వారం క్రితం పుట్టింటికి వెళ్లడం.. అక్కడ తల్లి సర్దిచెప్పి తిరిగి పంపించడం, అదే రోజు రాత్రి కుటుంబ సభ్యులు మరోసారి దొంగిలించిన బంగారాన్ని తీసుకు రావాలని వేధించడంతో ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. -
విషాదం..సంతోషం..అంతలోనే ఆవిరి
సాక్షి, హొళగుంద: మృతి చెందిన వాడు మళ్లీ జీవం పోసుకొని కదిలితే..లోకాన్ని విడిచి వెళ్లిన బాలుడి నాడి కొట్టుకుంటూ ఉంటే..రోదిస్తున్న కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆశలను బతికించుకునేందుకు వారు పడే ఆరాటం అంతా ఇంతా కాదు. కర్నూలు జిల్లా హొళగుంద మండలం సుళువాయి గ్రామంలో ఇలాంటి ఘటనే మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పింజరి పీరుసాబ్, శేఖన్‌బీకి కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడైన రహిబ్‌అలి (5) స్థానిక ప్రైవేటు పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. ఈ నెల 27న రహిబ్ అలి అనారోగ్యంతో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో తల్లిదండ్రులు, బంధువులు బళ్లారిలో ఓ ఆస్పత్రిలో చేర్పించారు. మంగళవారం ఉదయం బాలుడు కోలుకోలేక మృతి చెందినట్లు అక్కడి వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు సుళువాయి గ్రామానికి మృతదేహాన్ని తీసుకొచ్చారు. సాయంత్రం ముస్లిం ఆచారం ప్రకారంగా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేపట్టారు. ఈ సమయంలో బాలుడి కాళ్లు కదిలాయని, శ్వాస కొద్దిగా ఆడుతుందని కొందరు గమనించి చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు ఆశతో బాలుడిని ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. గ్రామస్తులు కూడా వారితోపాటు ఆస్పత్రికి వెళ్లారు. అయితే అక్కడి వైద్యలు పరీక్షించి బాలుడు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. దీంతో చేసేదేమి లేక మృతదేహాన్ని తిరిగి స్వగ్రామానికి తీసుకొచ్చారు. బతుకుతాడనుకున్న కుమారుడు మృతి చెందినట్లు తేలడంతో కుటుంబ సభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. -
కౌంటింగ్‌కు కట్టుదిట్ట భద్రత
సాక్షి ప్రతినిధి, ఏలూరు, ఏలూరు టౌన్: ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాతీర్పును ప్రతీ ఒక్కరూ శిరస్సా వహించాల్సిందే. జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను ఏవో రెండు, మూడు ఘటనలు మినహా మొత్తంగా ప్రశాంతంగా నిర్వహించాం. ఇక ఓట్ల కౌంటింగ్ ప్రక్రియను అత్యంత పగడ్బందీగా చేపడతాం. కేంద్రాల వద్ద మూడంచెల భద్రత పెట్టాం. కౌంటింగ్‌కు పటిష్ట చర్యలు చేపట్టాం. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు వ్యవస్థను సిద్ధం చేశాం. ఎన్నికల కమిషన్ నిబంధనలు తూ.చ తప్పకుండా పాటిస్తూ కౌంటింగ్‌ను సక్రమంగా నిర్వహించటమే మా ముందున్న ప్రధాన లక్ష్యం అని ఎస్పీ ఎం.రవిప్రకాష్ చెప్పారు. ఆయన శుక్రవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా కాసేపు ముచ్చటించారు. ప్రశ్న: జిల్లాలో ఎన్ని కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ? ఎస్పీ : జిల్లాలో 15 అసెంబ్లీ, ఏలూరు, నరసాపురం లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఓట్ల లెక్కింపునకు ఏలూరు, భీమవరంలో నాలుగు కళాశాలల్లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఏలూరులో సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాల, రామచంద్ర ఇంజినీరింగ్ కళాశాల, భీమవరంలో విష్ణు విద్యా సంస్థలు, సీతా పాలిటెక్నిక్ కళాశాలల్లో కౌంటింగ్ కేంద్రాలను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. భీమవరంలో 7, ఏలూరులో 8 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాగుతుంది. ప్రశ్న: సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తు చర్యలు? ఎస్పీ : జిల్లా వ్యాప్తంగా 96 సమస్యాత్మక గ్రామాలను ఇప్పటికే గుర్తించాం. ఓట్ల లెక్కింపు అనంతరం గత ఎన్నికల్లోనూ చాలా చోట్ల గొడవలు జరిగిన దాఖలాలు ఉన్నాయి. అందుకే సమస్యాత్మక గ్రామాల్లో ముందుస్తుగానే పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ఏలూరు, దెందులూరు, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాం. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందుస్తు భద్రతా చర్యలు చేపడుతున్నాం. ప్రశ్న: కౌంటింగ్ కేంద్రాల్లో నిబంధనలు ఏమిటి ? ఎస్పీ : ప్రధానంగా కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎవ్వరూ సెల్‌ఫోన్ తీసుకురాకుండా చర్యలు చేపట్టాం. కౌంటింగ్ కేంద్రాల్లోకి వెళ్ళే కానిస్టేబుల్ నుంచి జిల్లా అధికారి వరకూ ఎవరూ సెల్‌ఫోన్స్ తీసుకువెళ్లేందుకు అనుమతి లేదు. ఎన్నికల అబ్జర్వర్లు మాత్రమే సెల్‌ఫోన్ కలిగి ఉండేందుకు అనుమతి ఉంటుంది. ఇక సెల్ఫోన్లకు టోకెన్ సిస్టంకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసే విషయమై పరిశీలిస్తున్నాం. పోలీసు అధికారులు నిర్దేశించిన ట్రాఫిక్ నిబంధనలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని విధిగా పాటించాల్సి ఉంటుంది. ప్రశ్న: కౌంటింగ్ ఏజెంట్లలో క్రిమినల్స్ ఏవరైనా ఉన్నారా ? ఎస్పీ : జిల్లా వ్యాప్తంగా ఎన్నికల అధికారుల నుంచి కౌంటింగ్ ఏజెంట్ల జాబితాను తీసుకుని వారిపై ఎమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా అని పరిశీలించాం. ఒక నియోజకవర్గంలో రౌడీషీటర్ ఉన్నట్లు గుర్తించి వెంటనే అధికారులకు నివేదించాం. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి జిల్లాలో 7 వేల మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశాం. వీరిలో 26 మందిపై రౌడీషీట్లు ఓపెన్ చేశాం. ఇటువంటి వారిపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశాం. ప్రశ్న: ఏ విధమైన భద్రతా చర్యలు చేపట్టారు ? ఎస్పీ : ఏలూరు కౌంటింగ్ కేంద్రాల వద్ద జిల్లా అదనపు ఎస్పీ ఈశ్వరరావు, నరసాపురం కేంద్రాల వద్ద ఏఆర్ ఏఎస్పీ మహేష్‌కుమార్‌ను ప్రత్యేకంగా నియమించాం. జిల్లా వ్యాప్తంగా 67మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లతో పెట్రోలింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకున్నాం. ఇక పోలీస్ సబ్‌డివిజన్ అధికారులతో ప్రత్యేకంగా స్ట్రైకింగ్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడైనా గొడవలు జరిగితే వెంటనే ఆయా ప్రాంతాలకు వెళ్ళి పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు నిర్ణయించాం. ఇక జిల్లాలో 3,500మంది పోలీసు అధికారులు, సిబ్బందితోపాటు, ఒక కంపెనీ ఏపీఎస్పీ బలగాలనూ మోహరించేందుకు చర్యలు చేపట్టాం. ప్రశ్న: ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భద్రత చర్యలు ? ఎస్పీ : జిల్లాలో ఏలూరు, భీమవరం ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నాం. కౌంటింగ్ కేంద్రాల్లోకి వెళ్ళే ప్రతీ ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తాం. దీనికోసం మెటల్ డిటెక్టర్లు, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశాం. ఎన్నికల కమిషన్ మంజూరు చేసిన గుర్తింపు కార్డులు ఉన్నవారు మాత్రమే తనిఖీలు అనంతరం లోనికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కౌంటింగ్ కేంద్రం లోపల సైతం ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు మాత్రమే మఫ్టీలో పోలీసు అధికారులను భద్రత కోసం నియమించేందుకు ఏర్పాట్లు చేశాం. ప్రశ్న: వాహనాలు పార్కింగ్‌కు ఏవిధమైన చర్యలు తీసుకున్నారు ? ఎస్పీ : ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. అధికారులకు ఒక ప్రాంతంలోనూ, వీఐపీలు, సీని యర్ అధికారులు, ఆర్ఓలకు ప్రత్యేకంగానూ, ఏజెంట్లు, ఇతర వ్యక్తులకు మరోచోట వాహన పార్కింగ్‌కు స్థలాలను నిర్ణయించాం. ఏలూరులో రామచంద్ర ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో ట్రాఫిక్ డీఎస్పీ అధికారితో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం. భీమవరంలో విష్ణు కళాశాల వద్ద ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా ట్రాఫిక్ మళ్ళింపుకు చర్యలు తీసుకున్నాం. ప్రశ్న: యువత, విద్యార్థులకు మీరిచ్చే సందేశం ? ఎస్పీ : ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిఒక్కరూ ప్రజా తీర్పును గౌరవించాలి. అభ్యర్థుల ఓటమి, గెలుపులపై యువత, విద్యార్థులు, అభిమానులు సంయమనం పాటించాల్సి ఉంది. అనవసరంగా గొడవలు, కొట్లాటలకు దిగటం ద్వారా భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తాయి. రాజకీయ పార్టీల అభ్యర్థులకు ఇప్పటికే సూచనలు చేయటం జరిగింది. వారంతా నిబంధనలకు అనుగుణంగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇక కౌంటింగ్ పూర్తి అయిన మూడు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. గెలిచిన అభ్యర్థులు సైతం నిబంధనల మేరకు విజయోత్సవ ర్యాలీలకు అనుమతులు తీసుకుని మాత్రమే ర్యాలీలు, కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. -
టీడీపీ తలకిందులే.. ‘పశ్చిమ’లో మారిన రాజకీయం
సాక్షి, పశ్చిమ గోదావరి : తూర్పు చాళుక్యులు ఏలిన ప్రాంతం. వేంగి రాజుల రాజధాని నగరం. శాంతిని చాటే గుంటుపల్లి బౌద్ధ గుహలు. ఆధ్యాత్మిక సౌరభాలు విరాజిల్లే క్షీరారామం, సోమారామం.. ద్వారకా తిరుమల, మావుళ్లమ్మ క్షేత్రాలకు ఆలవాలం. తెలుగు వాడి పౌరుషాగ్నికి ప్రతీక అల్లూరి సీతారామరాజుకు జన్మనిచ్చిన గడ్డ. ‘లేపాక్షి బసవయ్య లేచి రావయ్యా’ అంటూ స్వాతంత్రోద్యమానికి ఊపిరిలూదిన అడవి బాపిరాజు, టెట్రాసైక్లిన్ లాంటి మందులెన్నో కనుగొని విశ్వ మానవాళి ప్రాణాలు నిలిపిన యల్లాప్రగడ సుబ్బారావు లాంటి మహానుభావులెందరికో పురిటి గడ్డ. క్విట్ ఇండియా ఉద్యమంలో ‘రెండో బార్డోలీ’గా గాంధీజీచే కీర్తించబడిన గడ్డ. ఆక్వా రాజధానిగా.. జిల్లాకు ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న భీమవరం.. వాణిజ్య కేంద్రం తాడేపల్లిగూడెం.. అగరు ధూప పరిమళాలను వెదజల్లే చారిత్రక నగరం ఏలూరు.. స్వచ్ఛతకు మారుపేరైన గిరిపుత్రులను గన్న బుట్టాయగూడెం, పోలవరం అటవీ ప్రాంతం.. సినీ పరిశ్రమను ఏలుతున్న మేటి నటులు, దర్శకులకు జన్మనిచ్చిన ప్రాంతం. ఇదీ పైరుపచ్చలు పొదిగిన పశ్చిమ గోదావరి జిల్లా ముఖచిత్రం. భీమవరం భీమవరంలో త్రిముఖ పోరు ఉంది. పవన్‌కల్యాణ్ చివరి నిమిషంలో ఇక్కడి నుంచి బరిలోకి దిగడంతో ఆసక్తి నెలకొంది. ప్రచారంలో వెనుకబడటం, గాజువాకపైనే దృష్టి పెట్టడం, స్థానికంగా ఉండరని ప్రజలు నమ్ముతుండటం పవన్‌కు మైనస్. హాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) ఎదురీదుతున్నారు. భీమవరం టౌన్షిప్లో పేదల గృహ రుణాలు మాఫీ చేస్తానన్న చంద్రబాబు హామీ నెరవేర్చకపోవడం, యనమదుర్రు డ్రెయిన్ ప్రక్షాళన చేపట్టకపోవడంతో ప్రజలు టీడీపీపై విశ్వాసం కోల్పోయారు. సమస్యలపై పోరుడుతూ నిత్యం ప్రజల మధ్య ఉండటం, సానుభూతి, రీల్ హీరో పవన్‌తో తలపడుతున్న రియల్ హీరోగా ఆదరణ, క్షత్రియ సామాజికవర్గంతోపాటు ఇతర వర్గాలు గ్రంధి శ్రీనివాస్ పక్షాన నిలవడం ఈసారి విజయానికి కలిసి వస్తుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఉండి వైఎస్సార్ సీపీ, టీడీపీ అభ్యర్థులిద్దరూ తొలిసారి ఎమ్మెల్యే పదవికి పోటీపడుతున్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పీవీఎల్ నరసింహరాజు బరిలో ఉన్నారు. సొసైటీ అధ్యక్షునిగా రైతులకు చేసిన సేవలకు గాను జాతీయ స్థాయిలో అవార్డు పొందిన నరసింహరాజుకు రైతు పక్షపాతిగా మంచి పట్టు ఉంది. టీడీపీ అభ్యర్థి మంతెన రామరాజు సిట్టింగ్ ఎమ్మెల్యే కలవపూడి శివకు బినామీ అని పేరుపడ్డారు. సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ ఎంపీ అభ్యర్థిగా నరసాపురం నుంచి పోటీకి పెట్టారు. వేల ఎకరాల్లో అక్రమంగా చెరువుల తవ్వకాలు, అవినీతి, అక్రమార్జనల్లో ఎమ్మెల్యేకు బినామీ రామరాజు అనే ముద్ర ఉంది. డబ్బుతో అంతా మార్చేస్తామనే ధీమాతో టీడీపీ ఉంది. జనసేన తన మిత్రపక్షమైన సీపీఎం నుంచి బి.బలరామ్‌ను పోటీకి పెట్టడం టీడీపీ ఓటు బ్యాంక్‌కు గండిపడుతుందని విశ్లేషిస్తున్నారు. పాలకొల్లు సౌమ్యుడు, మంచి వైద్యుడు, నిజాయితీపరుడిగా పేరున్న డాక్టర్ త్సవటపల్లి సత్యనారాయణ (బాబ్జి) వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కులాలకు అతీతంగా అన్నివర్గాల్లో ఆయనకు మంచి పట్టు ఉండటం, సొంత సామాజికవర్గం నుంచి జనసేనవైపు మళ్లిన వారు మన డాక్టర్ కోసమంటూ వైఎస్సార్సీపీలోకి తిరిగొస్తుండటం ఆయనను విజయం వైపు నడిపిస్తోంది. డాక్టర్ బాబ్జి ముందు నిలవటం సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకు కత్తిమీద సామే. అభివృద్ధి కంటే కమీషన్ల కక్కుర్తే శాపమై తమను దెబ్బతీసేలా ఉందని టీడీపీ అంతర్మథనం చెందుతోంది. వివాదాస్పద దూకుడు స్వభావం జనసేన అభ్యర్థి గుణ్ణం నాగబాబుకు మైనస్ అయి పరిమిత ఓటు బ్యాంక్‌తో సరి అంటున్నారు. నరసాపురం నరసాపురంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజుకు అన్నివిధాలా కలిసివస్తోందని టీడీపీ వర్గాలే అభిప్రాయపడటం విశేషం. రాజకీయ ఎత్తుగడల్లో చేయితిరిగిన ప్రసాదరాజుకు డెల్టాలో పట్టున్న మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు అండగా నిలవటంతో వైఎస్సార్ సీపీ మరింత బలం పుంజుకుంది. నరసాపురం పట్టణ టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు, చెప్పుకోదగ్గ పనులు చేయకపోవటం, చిన్నచిన్న పనుల్లోనూ కమీషన్లకు కక్కుర్తి పడటం వంటి పరిస్థితుల నడుమ ఆ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఎదురీదుతున్నారు. జనసేన మత్స్యకార వర్గం నుంచి బొమ్మిడి నాయకర్ను బరిలోకి దింపింది. ఆ సామాజిక వర్గంలో ప్రసాదరాజుకు మొదటి నుంచీ మంచి పట్టు ఉండటంతో జనసేన పోటీ నామమాత్రమే. తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెంలో ప్రధాన పోరు వైఎస్సార్ సీపీ, టీడీపీ మధ్యనే కనిపిస్తోంది. వైఎస్ హయాంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వైఎస్సార్ సీపీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ రెండో ఫ్లైఓవర్ (ఆర్వోబీ), వెంకట్రామన్నగూడెంలో ఉద్యాన విశ్వవిద్యాలయం, వెటర్నరీ పాలిటెక్నిక్, ఏయూ పీజీ క్యాంపస్, నిరుపేదలకు రాజీవ్ గృహకల్ప వంటి ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు. గత ఎన్నికల్లో టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ నుంచి పైడికొండల మాణిక్యాలరావు మంత్రిగా ఉండటంతో టీడీపీ కేడర్‌లో నిస్తేజం నెలకొంది. సీటు ఆశించి భంగపడ్డ జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వర్గం అంతర్గతంగా దెబ్బతీసే ప్రయత్నాలు టీడీపీ అభ్యర్థి ఈలి నానికి ప్రతికూలాంశాలుగా మారాయి. టీడీపీలో వర్గం కలిగిన మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగడంతో ఆ మేరకు టీడీపీ ఓటు బ్యాంక్‌కు గండిపడి కొట్టు సత్యనారాయణకు లాభిస్తుంది. ఏలూరు వైఎస్సార్ సీపీ నుంచి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) రంగంలో ఉన్నారు. ఏలూరు మున్సిపాలిటీని కార్పొరేషన్ స్థాయికి పెంచటం, వర్షాకాలంలో ఏలూరు వరద ముంపునకు శాశ్వత పరిష్కారంగా తమ్మిలేరుకు కాంక్రీట్ వాల్, నగర ప్రజలందరికీ రెండు పూటలా మంచినీరు అందించటం వంటి కార్యక్రమాలు నాని చేపట్టారు. ముస్లిం, మైనార్టీ వర్గానికి చెందిన మేయర్ షేక్ నూర్జహాన్, భర్త, కో–అప్షన్ సభ్యుడు ఎస్ఎంఆర్ పెదబాబు టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలో చేరడంతో పార్టీ మరింత బలపడింది. టీడీపీ నుంచి బరిలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే బడేటి బుజ్జి అవినీతి, అక్రమాల చిట్టాలో టాప్–3లో ఉన్నారు. భూ ఆక్రమణలు, ఏలూరు మార్కెట్లో కబ్జాలు, సెటిల్మెంట్లు టీడీపీకి నష్టాన్ని కలిగించనున్నాయి. జనసేన నుంచి బరిలో దిగిన రెడ్డి అప్పలనాయుడు పోటీ నామమాత్రమే. ఉంగుటూరు వైఎస్సార్సీపీకి ఈసారి సానుకూల పవనాలు వీస్తున్న నియోజకవర్గం. పుప్పాల వాసుబాబు వైఎస్సార్సీపీ తరఫున రంగంలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఓటమితో వచ్చిన సానుభూతి, ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ సమస్యలపై పోరాటాలు చేస్తుండటం వాసుబాబుకు కలిసివచ్చే అంశం. టీడీపీ నుంచి బరిలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఇసుక దోపిడీ మొదలు అంగన్వాడీ, ఆశ వర్కర్లు, సబ్స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ల నియామకం వరకూ పెచ్చుమీరిన అవినీతి టీడీపీకి శాపాలుగా మారాయి. గత ఎన్నికల్లో లక్షలు పెట్టుబడులు పెట్టి ఆయన విజయం కోసం పనిచేసిన నేతల నుంచి కూడా కమీషన్లు వసూలు చేయడంతో వారంతా ఈ ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేయడం టీడీపీని దెబ్బతీయనున్నాయి. నౌడు వెంకటరమణ జనసేన నుంచి బరిలోకి దిగినా పెద్దగా ప్రభావం కనిపించడం లేదు. ఆచంట రాజకీయ వ్యూహకర్త, ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో దిట్టగా పేరొందిన చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఇక్కడ రంగంలో ఉన్నారు. బలహీన వర్గాల విద్యార్థులకు స్కూల్ బస్సుల ఏర్పాటు, సొంత సొమ్ముతో ప్రజలకు ఉచితంగా శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయడం వంటి సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యారు. టీడీపీ నుంచి బరిలోకి దిగిన మంత్రి పితాని సత్యనారాయణకు చెరుకువాడ గట్టి పోటీ ఇస్తూ చుక్కలు చూపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కూనపురెడ్డి చినబాబు వైఎస్సార్ సీపీలో చేరడంతో బలం పుంజుకుంది. గత ఎన్నికల్లో వెన్నంటి నిలిచిన సొంత సామాజిక వర్గం నుంచి పితాని వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. మంత్రి సామాజిక వర్గం ఈ సారి టీడీపీ నుంచి బయటకు వచ్చి చెరుకువాడకు పనిచేస్తుండటం వైఎస్సార్ సీపీకి సానుకూల అంశంగా మారింది. నిడదవోలు టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు పోటీగా పీసీసీ మాజీ అధ్యక్షుడు జీఎస్ రావు కుమారుడు గెడ్డం శ్రీనివాసనాయుడు బరిలో నిలిచారు. తండ్రి జీఎస్ రావుకు నియోజకవర్గంలో వివిధ వర్గాల్లో పట్టుంది. నాయుడు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రచారంలో ముందున్నారు. ఎమ్మెల్యే శేషారావు ఇసుక మాఫియాను పెంచి పోషించారు. ఐదేళ్లయినా రైల్వేఫ్లైఓవర్ నిర్మించలేకపోయారు. చివరి వరకు టికెట్టు కోసం పట్టుపట్టి భంగపడ్డ శేషారావు సోదరుడు గోపాలకృష్ణ, మరో కీలక నేత కుందుల సత్యనారాయణ వర్గం శేషారావుకు వ్యతిరేకంగా ఉండటం టీడీపీకి గడ్డుకాలమేనంటున్నారు. జనసేన అభ్యర్థి ఎ.రమ్యశ్రీ ప్రభావం కొద్దోగొప్పో పెరవలి మండలానికే పరిమితం. దెందులూరు వివాదాస్పదుడు, అవినీతి, అక్రమాలు, సెటిల్మెంట్ దందాలతో నిత్యం పత్రికల పతాక శీర్షికల్లో నిలిచే ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ టీడీపీ తరఫున బరిలో ఉన్నారు. అన్నీ తానై ఇసుక, గ్రావెల్, మట్టి మాఫియాను నడిపించి రూ.కోట్లు కొల్లగొట్టడం, ఇసుక మాఫియాను అడ్డుకున్న మహిళా తహసీల్దార్‌పై దౌర్జన్యానికి దిగడం వంటి దురాగతాలతో ఈసారి టీడీపీకి భారీ షాక్ తప్పదంటున్నారు. కృష్ణా డెల్టా నుంచి సాగునీరు తీసుకువస్తానన్న మాట నిలబెట్టుకోలేకపోవడంతో, కొల్లేరు మత్స్యకారుల మధ్య విభేదాలు సృష్టించడం వంటి పరిణామాలతో టీడీపీ ఎదురీదుతోంది. ఉన్నత విద్యనభ్యసించి ఉద్యోగం, రూ.లక్షల వేతనాన్ని వదులుకుని వచ్చి వైఎస్సార్ సీపీ నుంచి బరిలోకి దిగిన కొఠారు అబ్బయ్యచౌదరి వీటిని సానుకూలంగా మలుచుకోవడంలో సఫలీకృతులయ్యారు. చింతమనేని ఓటమే లక్ష్యంగా అన్నివర్గాలు ఏకం కావడం వైఎస్సార్ సీపీకి కలిసి వచ్చే అంశం. జనసేన నుంచి ఘంటశాల వెంకటలక్ష్మి పోటీ పెద్దగా ప్రభావం చూపించే పరిస్థితి లేదు. పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు వైఎస్సార్ సీపీ నుంచి రంగంలో నిలిచారు. పోలవరం నిర్వాసితులకు చంద్రబాబు సర్కార్ అన్యాయం చేయడంపై నిత్యం వారి తరఫున పోరాడటంతో గిరిజనుల్లో ఆదరణ పెరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్‌ను కాదని టీడీపీ బి.శ్రీనివాసులును బరిలోకి దింపింది. పోలవరం నిర్వాసితులకు పరిహారం పంపిణీలో టీడీపీ నేతల అవినీతిని గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. ముందస్తుగా భూములు ఇచ్చిన నిర్వాసితులకు రూ.5 లక్షలు అదనపు పరిహారం ఇస్తామని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ప్రకటించడం గిరిజనుల్లో ఆశలు చిగురించి వారంతా వైఎస్సార్ సీపీకి మద్దతుగా ఉన్నారు. జనసేన అభ్యర్థిగా చిర్రి బాలరాజు పోటీ ఇక్కడ నామమాత్రమే. కొవ్వూరు వైఎస్సార్ సీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత బరిలో నిలిచారు. ఇక్కడ సిట్టింగ్ మంత్రి కేఎస్ జవహర్‌ను తిరువూరుకు సాగనంపి.. పాయకరావుపేట నుంచి వంగలపూడి అనితను టీడీపీ దిగుమతి చేసింది. ఆమె స్థానికురాలు కాకపోవటం, మంత్రి జవహర్ వర్గం కలిసి రాకపోవడం, పాయకరావుపేటలో అనిత అవినీతి అక్రమాలతో టీడీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. వనిత నిత్యం ప్రజల్లో ఉంటూ ఇసుక, మద్యం మాఫియాకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేయడంతో ప్రజల్లో వైఎస్సార్ సీపీకి సానుకూల వాతావరణం కనిపిస్తోంది. గోపాలపురం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు బరిలో ఉన్నారు. వైఎస్సార్ సీపీ నుంచి తలారి వెంకట్రావు రంగంలోకి దిగారు. గత ఎన్నికల్లో ఓటమి చెందినా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని నిత్యం ప్రజలతో మమేకం కావడం, ఆర్థికంగా దెబ్బతిన్నా.. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు చేయడంతో వెంకట్రావుకు సానుభూతి ఉంది. నిజాయితీపరుడనే పేరు, అన్నివర్గాల ఆదరణ వైఎస్సార్ సీపీకి సానుకూలంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి చెప్పుకోదగ్గ స్థాయిలో ముప్పిడి ఏమీ చేయకపోవడం, పనుల కాంట్రాక్ట్‌లను ఒకరిద్దరికి మాత్రమే కట్టబెట్టడంతో సొంత పార్టీలోనే వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. చింతలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పీతల సుజాతను తప్పించి టీడీపీ అభ్యర్థిగా కర్రా రాజారావును బరిలోకి దింపింది. ఏలూరు ఎంపీ మాగంటి బాబు వర్గంగా రాజారావు పోటీ చేస్తుండటంతో పీతల వర్గం అతనికి సహకరించడం లేదు. పరిహారం పెంచాలని చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్వాసిత రైతులు నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నా చంద్రబాబు పెడచెవిన పెట్టారు. తమ ప్రభుత్వం రాగానే పరిహారం అందించి న్యాయం చేస్తానని జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీతో ఆయకట్టు రైతులు వైఎస్సార్ సీపీకి సానుకూలంగా మారడం కలిసి వస్తోంది. తణుకు కారుమూరి నాగేశ్వరరావు వైఎస్సార్ సీపీ నుంచి రంగంలో ఉన్నారు. నియోజకవర్గాన్ని రూ.700 కోట్లతో అభివృద్ధి చేయడం, గోదావరి జలాలను తీసుకురావడం వంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందారు. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణను బరిలోకి దింపింది. తణుకు దివాణం నుంచి వైటీ రాజా సీటు ఆశించినా దక్కలేదు. దీంతో ఆయన వర్గం టీడీపీకి సహాయ నిరాకరణ చేస్తోంది. కాంట్రాక్ట్‌లన్నీ తన బినామీలకే కట్టబెట్టడం సొంత పార్టీలోనే వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. వేల్పూరులో 1,008 మంది నిరుపేదలకు ఇళ్లు కట్టిస్తామని 2015లో చంద్రబాబుతో శంకుస్థాపన చేయించగా, శిలాఫలకానికే పరిమితమైంది. వేసవిలో గోదావరి జలాల కోసం సమ్మర్‌స్టోరేజీ ట్యాంక్ నిర్మాణానికి 60 ఎకరాలు కూడా సేకరించలేక చేతులెత్తేశారు. ఇవన్నీ టీడీపీకి మైనస్‌గా ఉన్నాయి. జనసేన నుంచి పసుపులేటి రామారావు పోటీలో ఉన్నారు. – లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి, అమరావతి -
వల్లకాదన్నా వినరే..
సాక్షి, ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అంధులకు, వికలాంగులకు, గర్భిణులకు, 6 నెలల్లో పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు ఎన్నికల విధులు వేయకూడదు. వీరితో పాటు చంటి పిల్లల తల్లులకు, ప్రమాదాల్లో గాయపడిన వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలి. అన్నీ తెలిసినా రిటర్నింగ్ అధికారులు మాత్రం వివిధ కారణాలతో మినహాయింపు లభించే ఉద్యోగులకు కూడా ఎన్నికల విధులు వేసేశారు. ప్రాథమిక పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండవనే విషయం కూడా తెలియని పరిస్థితిలో అధికారులున్నారని, స్పెషల్ గ్రేడ్ టీచర్లుగా పనిచేస్తున్న వారిని స్కూల్ అసిస్టెంట్లుగా పేర్కొంటూ వారికి కూడా పోలింగ్ అధికారిగా విధులు కేటాయించడం అధికారుల అనుభవరాహిత్యానికి నిదర్శనమని ఉపాధ్యాయ సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. మినహాయింపు లభించే ఉద్యోగులు తమకు ఏ అంశం ప్రకారం మినహాయిం పు లభిస్తుందో తెలుపుతూ సంబంధిత అధికారులకు రాత పూర్వకంగా వినతిపత్రాలు సమర్పించినా అధికారులు మాత్రం వాటిని బుట్టదాఖలు చేసి విధుల్లో నియమించారు. సుదూర ప్రాంతాల్లో విధులు అధికారులు ఉద్యోగులను సుదూర ప్రాంతాల్లో విధుల్లో నియమించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శలు ఎదురౌతున్నాయి. దెందులూరులో పనిచేసే ఒక ఉద్యోగికి పోలవరంలో, ద్వారకాతిరుమల మండలంలో పనిచేసే ఉద్యోగికి పాలకొల్లులో విధులు కేటాయిం చారు. కామవరపుకోట మండలం కళ్ళచెరువు జిల్లా పరిషత్ హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఒక మహిళా ఉపాధ్యాయినిని నరసాపురంలో పోలింగ్ కేంద్రానికి అధికారిగా వేశారు. ఆయా ఉద్యోగులు తమకు కేటాయించిన కేంద్రాలకు వెళ్ళాలంటే తాము పనిచేస్తున్న ప్రాంతం నుంచి సుమారు 3 గంటలు ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఉదయం 7 గంటల నుంచి విధుల్లో చేరాల్సి ఉండగా వారు పనిచేసే ప్రాంతం నుంచి తెల్లవారు జామునే ప్రయాణ సౌకర్యం ఉండే పరిస్థితి లేకపోవడంతో విధులకు సకాలంలో హాజరు కాలేకపోయే ప్రమాదముంది. శిక్షణకు రమ్మంటున్నారు వచ్చే ఆగష్టులో నేను పదవీ విరమణ చేయబోతున్నాను. ఆరునెలలలోపు పదవీ విరమణ చేయనున్న వారికి ఎన్నికల విధుల్లో మినహాయింపు ఉంటుంది. ఇదే విషయాన్ని జిల్లా రెవెన్యూ అధికారికి చెప్పుకున్నాను. అయినా మినహాయింపు లభించలేదు. పాలకొల్లులో ఈ నెల 31వ తేదీన జరిగే శిక్షణ కార్యక్రమానికి రావాలని పిలుపు వచ్చింది. – ఎంవీ రంగాచార్యులు, ప్రధానోపాధ్యాయుడు స్కూల్ అసిస్టెంట్‌ని చేసేశారు నేను మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో స్పెషల్ గ్రేడ్ టీచర్‌గా పనిచేస్తున్నాను. మండల పరిషత్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్లు ఉండరనే విషయం కూడా తెలియకుండా నేను స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నానని పేర్కొంటూ నాకు ఎన్నికల అధికారిగా విధులు వేశారు. అది కూడా నేను పనిచేసే మండలానికి బాగా దూర ప్రాంతానికి వేయడంతో ఇబ్బందిగా ఉంది. – కొల్లి కృపావతి, ఉపాధ్యాయిని -
ఏలూరును ఏలేదెవరో..!
సాక్షి, ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) : పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గం రాజకీయంగా ప్రత్యేకత కలిగి ఉన్న సెగ్మెంట్. రెండు జిల్లాల పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాలను కలిగి ఉండటంతోపాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు దీని పరిధిలోనే ఉంటాయి. అటవీ ప్రాంతం, కొండలు, గోదావరి పరవళ్ళు, కొల్లేరు పక్షుల కిలకిలా రావాలు, పచ్చిక బయళ్ళు, చేపలు, రొయ్యల చెరువులు, మామిడి, సపోటా తోటలు, వరి, పామాయిల్, మొక్కజొన్న, పాపికొండల అందాలు ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ ప్రత్యేకతలు. జిల్లా ప్రజల చిరకాల స్వప్నం, దివంగత మహానేత మానసపుత్రి పోలవరం ప్రాజెక్టు ఉన్నది ఇక్కడే. కృష్ణా, గోదావరి జిల్లాల కలయిక పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, పోలవరం, చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గాలుండగా, కృష్ణాజిల్లాలోని నూజివీడు, కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గాలకు స్థానం లభించింది. ఇప్పటి వరకూ 16 సార్లు ఎన్నికలు జరగ్గా తొమ్మిది సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, 5సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. మరో రెండు సార్లు సీపీఐ అభ్యర్థులు విజయం సాధించారు. కొమ్మారెడ్డి సూర్యనారాయణ 3 సార్లు, మాగంటి బాబు 2 పర్యాయాలు గెలుపొందారు. తెలంగాణ సంస్కృతి.. రాష్ట్ర విభజనతో ఈ నియోజకవర్గంలోకి కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు వచ్చి చేరడంతో అటు తెలంగాణ సంస్కృతి కూడా ఈ నియోజకవర్గానికి ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. స్థానికేతరులకూ మద్దతు నియోజకవర్గంతో సంబంధంలేని బోళ్ళ బుల్లిరామయ్య (తణుకు) నాలుగు సార్లు, కావూరి సాంబశివరావును రెండు సార్లు, సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న ఘట్టమనేని కృష్ణ, తణుకుకు చెందిన చిట్టూరి సుబ్బారావు చౌదరి ఇక్కడి నుంచి గెలుపొందారు. 57 ఏళ్ళుగా కమ్మ సామాజిక వర్గాల వారే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కనిపించని అభివృద్ధి విభజన అనంతరం రాష్ట్ర రాజధానికి ఈ నియోజకవర్గం వేదికవుతుందని విస్తృత ప్రచారం జరిగింది. తొలుత నూజివీడు ప్రాంతంలో రాజధాని ఏర్పాటుకు పరిశీలన జరుగుతుందని వచ్చిన వార్తలతో ఈ నియోజకవర్గ ప్రజలు తమ జీవితాలు బాగుపడబోతున్నాయని ఆశించారు.అయితే రాజధాని కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్యకు తరలిపోవడంతో ప్రజలు నిరాశపడ్డారు. ఏలూరు సమీపంలో నిట్ ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించినా ఆ విద్యా సంస్థను ఇక్కడకు రాకుండా మోకాలడ్డారు. ఏలూరు సమీపంలోని వట్లూరులో విమాన విడిభాగాల తయారీ పరిశ్రమకు శంకుస్థాపన చేయడంతో ఇక్కడ భారీ పరిశ్రమ వస్తుంది, ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు వస్తాయి అని ఆశించగా అది శంకుస్థాపనకే పరిమితమైంది. శ్రీధర్ విజయం నల్లేరుపై నడకే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోటగిరి శ్రీధర్ విజయం నల్లేరుపై నడకే అని విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన తండ్రి దివంగత కోటగిరి విద్యాధరరావు రాష్ట్ర మంత్రిగా రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్రవేసి లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. శ్రీధర్ రాజకీయాల్లో ప్రవేశించి, వైసీపీలో చేరిన నాటి నుంచి ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 శాసన సభ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ అన్ని ప్రాంతాల్లో నాయకులను కలుపుకొని వెళుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, స్వయంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు. మాగుంట చేసింది శూన్యం టీడీపీ అభ్యర్థి మాగుంట వెంకటేశ్వరరావు (బాబు) గత ఐదేళ్లలో చేసిందేమి లేదు. కాంటూరు కుదింపు అంశం గాని, పోలవరం నిర్వాసితుల సమస్యలపై గాని స్పందించిన దాఖలాలు లేవు. కైకలూరులోని తన కార్యాలయంలోనే పేకాట డెన్ నిర్వహించడం ఆధారాలతో మీడియాలో వచ్చింది. తన మాట వినని రిజర్వుడ్ స్థానాల ఎమ్మెల్యేలను పని చేయనివ్వలేదన్న అపవాదు ఉంది. అభ్యర్థులు వీరే.. వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ తరపున కోటగిరి శ్రీధర్, టీడీపీ తరపున మాగంటి బాబు, జనసేన అభ్యర్థిగా పెంటపాటి పుల్లారావు, బీజేపీ అభ్యర్థిగా చిన్నం రామకోటయ్య, కాంగ్రెస్ అభ్యర్థిగా జెట్టి గుర్నాథరావు పోటీలో ఉన్నారు. – సీహెచ్ రామకృష్ణంరాజు, ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) -
తండ్రి ఆశయాల సాధనే లక్ష్యం
దిగ్గజ నేత కోటగిరి విద్యాధరరావు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన కోటగిరి శ్రీధర్ వైఎస్సార్సీపీ తరఫున ఏలూరు లోక్‌సభా స్థానం అభ్యర్థిగా తొలిసారి పోటీ చేస్తున్నారు. బీబీఎం చదివి అమెరికాలోని ఓ కంపెనీలో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి ప్రజా సేవ చేయాలనే ఆకాంక్షతో వచ్చిన ఆయన మనోగతం .. ప్రశ్న : వ్యక్తిగత వివరాలు? శ్రీధర్ : కృష్ణాజిల్లా నూజివీడులో 1973లో జన్మించా. మా తండ్రి స్వర్గీయ కోటగిరి విద్యాధరరావు అందరికీ సుపరిచితులే. ఆయన చనిపోయే నాటికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. నా భార్య కె.సరిత యూఎస్‌లో సాఫ్ట్వేర్ నిపుణురాలు. మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రజా సేవ కోసం వచ్చా. ప్రశ్న : రాజకీయ రంగ ప్రవేశం ఎలా ? శ్రీధర్ : మా తండ్రి రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రచార బాధ్యతలు తీసుకునే వాడిని. 2006 స్థానిక సంస్థల ఎన్నికల్లో పరోక్షంగా పనిచేశా. అత్యధిక ఎంపీటీసీ స్థానాలు గెలవడంలో కీలక భూమిక పోషించా. మా తండ్రి స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చాను. ప్రశ్న : మీరు వైఎస్సార్సీపీలోకి ఎలా వచ్చారు ? శ్రీధర్ : మా నాన్న విధ్యాధరరావు టీడీపీ నేత. ఆయన ఆ పార్టీలో మాత్రం చేరవద్దని నాతో చెప్పారు. అక్కడ ఒక సామాజికవర్గానికే ప్రాధాన్యం ఇవ్వడం నచ్చలేదు. దీనికితోడు పేదల పక్షాన నిరంతరం పోరాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి అయితేనే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని నిర్ణయించుకున్నా. దివంగత వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలు నన్ను ఆకర్షించాయి. ప్రశ్న : ఎంపీగా గెలిస్తే మీ ప్రాధాన్యతలు? శ్రీధర్ : మెట్ట ప్రాంతంలో ఆయిల్‌పామ్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలనేది నా కోరిక. పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలి. కైకలూరు, నూజివీడు నియోజకవర్గాల్లో సాగునీటి కష్టాలు దూరం చేయాలి. కొల్లేరు గ్రామాలకు న్యాయం చేస్తాం. కాంటూరు పరిధిని రీసర్వే చేయిస్తాం. ఉప్పుటేరుతో ఉత్పన్నమయ్యే సమస్యలు పరిష్కరిస్తాం. గ్రామాల్లో మౌలిక సదుపాయలు కల్పిస్తాం. ఏలూరును మరింత అభివృద్ధిచేస్తాం. ప్రశ్న : ప్రజలకు ఏం చెప్పాలనుంది? శ్రీధర్ : ఐదేళ్లపాటు టీడీపీ రాక్షస పాలన చూశారు. ఈ సారి వైఎస్సార్సీపీకి అవకాశం ఇవ్వండి. ప్రజలు శభాష్ అనేలా పనిచేస్తాం. అభివృద్ధిచేసి చూపిస్తాం. -
ఏలూరులో సీఎం రోడ్ షో, ఫెయిల్యూర్
సాక్షి, ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): తమ్ముళ్ళు ఎవరికి ఓటేస్తారు అని అడుగుతూ.. వారు వేరే పార్టీ పేరేమైనా చెబుతారేమోనని భయపడి తెలుగుదేశానికి అని చెప్పండి అని అడిగి మరీ చెప్పించుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత చంద్రబాబు తొలిసారిగా నిర్వహించిన రోడ్‌షో పూర్తిగా విఫలమైంది. జిల్లాలోని దాదాపు అందరు అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థులు వచ్చినా ప్రజలు మాత్రం రాలేదు. టీడీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన రోడ్ షోలో కేవలం టీడీపీ నాయకులు బెదిరించి తీసుకువచ్చిన డ్వాక్రా మహిళలు తప్ప ఎవరూ కనిపించలేదు. బహిరంగ సభ ప్రాంతమైన పన్నెండు పంపుల సెంటర్ వరకూ కూడా ఇదే పరిస్థితి కనిపించింది. బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా రూ.45 వేల కోట్లతో పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తున్నామన్నారు. నదులను అనుసంధానం చేసి రాయలసీమకు కూడా నీళ్ళిచ్చి అభివృద్ధి చేశామన్నారు. అభ్యర్థులతో ప్రమాణం.. ముందుగా నూజివీడులో ప్రచారం ముగించుకుని హెలికాప్టర్ నుంచి స్థానిక ఇండోర్ స్టేడియంలోని హెలీప్యాడ్ వద్ద దిగిన ముఖ్యమంత్రి అక్కడి నుంచి నేరుగా టీడీపీ జిల్లా కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు, జిల్లా నాయకులతో, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నాయకులతో లైవ్‌లో ప్రమాణం చేయించారు. అభ్యర్థులకు పార్టీ బి–ఫారాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమయం తక్కువగా ఉన్నందున అభ్యర్థులు ప్రచారం స్పీడ్ పెంచాలని సూచించారు. సామాజిక న్యాయం, నాయకుల రేటింగ్, క్షేత్ర స్థాయిలో ప్రజల అభిప్రాయాలు తీసుకుని అభ్యర్థులకు సీట్లు కేటాయించామని చంద్రబాబు చెప్పారు. -
‘దేశం’ కోటలకు బీటలు.. పశ్చిమగోదావరిలో అవినీతి రాజ్యం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రశాంతతకు రాజకీయ చైతన్యానికి ప్రతీక.. పల్లెసీమలకు నిలయం.. అదే పశ్చిమగోదావరి జిల్లా.. అయితే జిల్లాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇక్కడ మెజారిటీ సీట్లు సాధించే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న నానుడి ఉంది. గత ఎన్నికల్లో జిల్లాలోని మొత్తం సీట్లన్నీ గెలిచినా టీడీపీకి ఈసారి ఎదురుగాలి వీస్తోంది. అన్ని స్థానాలలో విజయం సాధించి ఎన్నికల ఫలితాలను రివర్స్ చేసేలావైఎస్సార్ సీపీ దూసుకుపోతోంది. రాష్ట్రంలో టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత జిల్లాలో ఇసుక దోపిడీతో మొదలైన పాలన ఇప్పుడు అన్ని రంగాలకు విస్తరించింది. ప్రతి పనీ తమ వాళ్లకు అప్పగించి కమీషన్లు తీసుకోవడంపైనే అధికార పక్ష ప్రజా ప్రతినిధులు దృష్టి పెట్టారు. ప్రశాంతతకు మారుపేరైన పశ్చిమగోదావరి జిల్లాను ఒక రౌడీ రాజ్యంగా మార్చేశారు. ఈ ఐదేళ్ల పాలనలో జిల్లాకు ఉపయోగపడే పని ఒక్కటి కూడా సాగలేదు. పోలవరం అయినా పూర్తి చేసిందా అంటే అదీ లేదు. జిల్లాకు కొత్తగా ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. పట్టిసీమ పేరుతో నీరు ఇష్టారాజ్యంగా తరలించి డెల్టాను ప్రమాదంలో పడేసింది. వ్యవసాయంగిట్టుబాటవ్వక రైతాంగం ఆక్వావైపు చూస్తోంది. ఏడు లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే ఇప్పటికే మూడు లక్షల ఎకరాల ఆయకట్టు చెరువులుగా మారిపోయింది. కాలువలు, వాగులనూ, ఆఖరికి పోలవరం కుడికాల్వ గట్టుని కూడా వదలకుండా తవ్వేసి గోదావరికి గుండెకోత మిగిల్చారు. గోదావరి కాకుండా తమ్మిలేరు, జల్లేరు వాగులతోపాటు ఎర్రకాలువ, బైనేరు, తూర్పు, పడమర కాలువలను సైతం విడిచిపెట్టకుండా కోట్లు కూడబెట్టుకున్నారు. జిల్లాలో ఏలూరు, నర్సాపురం, రాజమండ్రి పార్లమెంట్ స్థానాల పరిధిలో 15 నియోజకవర్గాలు ఉన్నాయి. ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఏలూరు, దెందులూరు, చింతలపూడి, ఉంగుటూరు, పోలవరం నియోజకవర్గాలు వస్తాయి. నర్సాపురం నియోజకవర్గం పరిధిలోకి నర్సాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం,పాలకొల్లు, ఆచంట వస్తాయి . రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోకి నిడదవోలు, కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాలు వస్తాయి. గత ఎన్నికల్లో ఏలూరు, రాజమండ్రి నుంచి తెలుగుదేశం అభ్యర్ధులు గెలవగా, నర్సాపురం మిత్రపక్షాల పొత్తులో భాగంగా బీజేపీ గెలుచుకుంది. ... ఆచంట మాజీ ఎమ్మెల్యే శ్రీరంగనాథరాజు ఆచంట వైఎస్సార్ సీపీ సమన్వయకర్తగా ఉన్నారు. ఏడాదికాలంగా ప్రజల మద్య ఉంటూ వారి అవసరాలను సొంత డబ్బు తో నెరవేరుస్తున్నారు. తెలుగుదేశం తరపున పితాని సత్యనారాయణ రెండుసార్లు గెలిచి మంత్రిగా పనిచేస్తున్నారు. రెండుసార్లు గెలిచినా ప్రజలకు ఏం చేయలేకపోవడంతో ఆయనపై వ్యతిరేకత ఉంది. ... నర్సాపురం కాపుల ఆధిపత్యం ఉన్న నియోజకవర్గం అయిన నర్సాపురంలో టీడీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ప్రస్తుతం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మరోసారి సీటు తనదే అని చెబుతుండగా, కాపు కార్పొరేషన్ ఛైర్మన్, కొత్తపల్లి సుబ్బారాయుడు తాను కూడా లైన్లోనే ఉన్నానంటున్నారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ప్రజాక్షేత్రంలో ఉన్నారు. చిరంజీవి స్వగ్రామం మొగల్తూరు ఈ నియోజకవర్గంలోనే ఉండటంతో జనసేన కూడా ఆశలు పెట్టుకుంది. ... చింతలపూడి వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా ఐఆర్ఎస్ అధికారిగా పనిచేసి స్వచ్ఛంద విరమణ చేసిన వీఆర్ ఎలీజా ఉన్నారు. ప్రతి నిత్యం ప్రజలకు అండగా ఉంటున్నారు. టీడీపీ మూడు గ్రూపులు, ఆరు వర్గాలుగా చీలిపోయి ఉంది. ప్రస్తుత ఎమ్మెల్యే పీతల సుజాతను తప్పించి కర్రా రాజారావుకు టీడీపీ టికెట్ ఇచ్చారు. ... దెందులూరు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న తహసీల్దార్ వనజాక్షిని జుట్టుపట్టుకుని ఈడ్చిన దగ్గర నుంచి దళితులను కించపరిచేవిధంగా వ్యాఖ్యలు చేయడం వరకూ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రతినిత్యం వార్తల్లో నిలిచారు. చింతమనేనిని ఢీకొట్టడానికి ఎన్ఆర్ఐ, యువకుడు అయిన కొఠారు అబ్బయ్య చౌదరిని వైఎస్సార్ సీపీ రంగంలోకి దింపింది. ఈసారి ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కారణంగా చింతమనేని ఓటమి ఖాయమే అవుతుంది. ... భీమవరం రెండు పర్యాయాలుగా ఎమ్మెల్యేగా ఉన్న పులపర్తి ఆంజనేయులు పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఈ సీటు తన కుమారుడికి ఇప్పించుకోవడానికి టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి ప్రయత్నించినా చంద్రబాబు ఒప్పుకోకపోవడంతో ఆ వర్గం అసంతృప్తిగా ఉంది. వైఎస్సార్ సీపీ తరపున మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఈసారి ఎలాగైనా భీమవరం సీటు దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నారు. ... ఏలూరు ప్రశాంతంగా ఉండే ఏలూరు గత ఐదేళ్లలో రౌడీరాజ్యంగా మారిపోయింది. ప్రస్తుత ఎమ్మెల్యే బడేటి బుజ్జి అరాచక శక్తులను పెంచిపోషిస్తుండటంతో ప్రజలు ఆ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్సీ ఆళ్ల నానిని వైఎస్సార్సీపీ రంగంలోకి దింపింది. ఏలూరు మేయర్ నూర్జహాన్, అమె భర్త కో–ఆప్షన్ సభ్యుడు ఎస్ఎంఆర్ పెదబాబు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరడం బలంగా మారింది. ... గోపాలపురం టీడీపీ కంచుకోటగా ఉన్న ఈ రిజర్వ్డ్ నియోజకవర్గం ఈసారి మార్పునకు సిద్ధమవుతోంది. గత ఎన్నికల్లో గెలిచిన ముప్పిడి వెంకటేశ్వరరావుపై ఉన్న వ్యతిరేకత.. ఆయనకు సీటు ఇవ్వద్దంటూ ప్రత్యర్ధి వర్గం గొడవలతో ఈసారి ఇక్కడ వైఎస్సార్సీపీ జెండా ఎగరడం ఖాయంగా కనపడుతోంది. ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేస్తున్న తలారి వెంకట్రావు ఇక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్థ్ధిగా ఉన్నారు. ... తాడేపల్లిగూడెం 2014లో ఎన్నికల్లో బీజెపీ ఎమ్మెల్యే మాణిక్యాలరావు గెలిచారు. ఈ సీటుపై ఆశలు పెట్టుకున్న ముళ్లపూడి బాపిరాజు మాణిక్యాలరావుకు ప్రతి నిమిషం అడ్డుపడుతూనే వచ్చారు. సీఎం చంద్రబాబు బాపిరాజుకు చెయ్యిచ్చి ఈలి నానిని అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన తిరుగుబావుటా ఎగరవేయగా, మున్సిపల్ ఛైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన తీర్ధం పుచ్చుకుని పోటీకి సిద్ధమయ్యారు.ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ఉన్నారు. ... కొవ్వూరు ఉపాధ్యాయుడిగా ప్రస్థానం ప్రారంభించి కోట్లకు పడగలెత్తిన మంత్రి జవహర్‌పై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమైంది. అతనిని మార్చాల్సిందేనని పార్టీలోని మెజారిటీ నాయకులు పట్టుబట్టారు. దాంతో పాయకరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు టికెట్ ఇచ్చారు. వైఎస్సార్ సీపీ అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత తెలుగుదేశం పార్టీ చేస్తున్న అక్రమాలపై ఉద్యమిస్తూ ఈసారి టీడీపీ కోటను బద్దలుకొట్టేందుకు సన్నద్ధం అవుతున్నారు. ... ఉండి టీడీపీ ఎమ్మెల్యే శివరామరాజు తీరు పట్ల సొంత పార్టీలో వ్యతిరేకత ఉంది. తనకు ఎదురుతిరిగిన వారిపై పోలీసులను ఉసిగొల్పి వేధిస్తారన్న పేరుంది. ౖవైఎస్సార్‌సీపీ నుంచి పీవీఎల్ నరసింహరాజు రంగంలో ఉన్నారు. పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న రఘురామకృష్ణంరాజుది కూడా ఈ నియోజకవర్గమే. ... నిడదవోలు ఇసుకను అడ్డం పెట్టుకుని వందల కోట్లు దోచేసిన ఘనత ఇక్కడ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకే దక్కుతుంది. ఇక్కడ ఎవరిని బరిలోకి దింపేది చంద్రబాబునాయుడు ఇంకా నిర్ణయించలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్ధిగా మాజీ పీసీసీ అధ్యక్షుడు జీఎస్ రావు కుమారుడు శ్రీనివాసనాయుడు రంగంలో ఉన్నారు. ... పాలకొల్లు పాలకొల్లులో రెండురోజుల క్రితమే మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాబ్జీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకోవడంతో ఇక్కడ వైఎస్సార్ సీపీ గెలుపు ఖాయమైంది. ఇక్కడ ప్రతి పనికి కమీషన్లు వసూలు చేస్తారని పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడికి చంద్రబాబు సీటు ఖరారు చేశారు. ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్న అంగర రామమోహనరావుకు నిమ్మలకు విబేధాలు పార్టీ విజయంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ... పోలవరం పోలవరం భూసేకరణ పేరుతో జరిగిన అవినీతి, గిరిజనులను అడ్డం పెట్టుకుని అధికార పార్టీ నేతలు సాగించిన అకృత్యాలతో ఆ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీలోని వారే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ వైఎస్సార్ సీపీ అభ్యర్ధిగా మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తెల్లం బాలరాజు రంగంలో ఉన్నారు. ... తణుకు తన మాట వినలేదని సాక్షాత్తు సబ్ ఇన్‌స్పెక్టర్‌నే కింద కూర్చొపెట్టిన ఘనత ఉన్న తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక్కడ మాజీ జెడ్పీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ... ఉంగుటూరు ఇక్కడ వైఎస్సార్ సీపీ సమన్వయకర్తగా ఉన్న పుప్పాల వాసుబాబు గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయారు. అప్పటి నుంచి నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజల సమస్యలపై నిరంతర ఉద్యమాలు చేశారు. ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన గన్ని వీరాంజనేయులు పేకాట క్లబ్లుల నిర్వహణ, అక్రమ ఆక్వా చెరువులు, కొల్లేరు ఆక్రమణలతో ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకున్నారు. -
టికెట్ లేదనడంతో టీడీపీ నేత కన్నీటి పర్యంతం..!
సాక్షి, కర్నూలు : టికెట్లు ఆశించి భంగపడ్డ టీడీపీ నాయకుడొకరు కన్నీటి పర్యంతమయ్యారు. ఆలూరు ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న వీరభద్రగౌడ్ బీసీ నాయకులను చంద్రబాబు పట్టించుకోవడంలేదని వాపోయారు. ఆలూరు టికెట్‌ను కోట్ల సుజాతమ్మకు కేటాయించడంతో ఆయన తీవ్ర మనస్తాపం చెందారు. ఉన్నపళంగా తనకు టికెట్ లేదని చెప్పడంతో ఆయన కలత చెందారు. తన వర్గీయుల ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. బాబు ఇంత మోసం చేస్తాడనుకోలేదని వాపోయారు.కర్నూలు పార్లమెంట్ పరిధిలో అత్యంత కీలకైన బీసీ నాయకులను చంద్రబాబు కంటతడి పెట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేస్తున్న బీసీల కష్టాన్ని లెక్కచేయకుండా వలస నేతలకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. బీసీలే నా దేవుళ్లు అని చెప్పుకునే చంద్రబాబు బీసీల రాజకీయ భవితవ్యానికి సమాధి కడుతున్నారని విమర్శించారు. -
అక్రమాల వీరుడు.. మా వీరభద్రుడు
సాక్షి ప్రతినిధి, కర్నూలు : ఆలూరు.. ఏటా కరువు పలకరించే ప్రాంతం. జిల్లాకు సరిహద్దు నియోజకవర్గం. ఏళ్లనాటి సమస్యలు.. తడారిన గొంతులు.. ఎండిన భూములు.. నిత్యం వలసలు. ఇక్కడ టీడీపీ ఇన్చార్జ్ వీరభద్రగౌడ్ రాష్ట్ర ప్రభుత్వ అండతో పెత్తనం చెలాయిస్తున్నారు. వెనుకబడిన ప్రాంతం అభివృద్ధికి చర్యలు తీసుకోకుండా.. తన స్వార్థ ప్రయోజనాలే లక్ష్యంగా అక్రమాల వీరుడిగా అవతారమెత్తి.. అక్రమార్జనను భద్రంగా దాచుకుంటున్నారు. సంక్షేమ పథకం ఏదైనా తనకు పర్సెంటేజీలు ఇవ్వాల్సిందే అంటారు. ప్రకృతి వనరులను కొల్లగొడుతూ.. కల్తీ మద్యంతో పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ.. మరుగుదొడ్లు నిధులు మింగేస్తూ.. బ్యాంకులకు టోకరా వేస్తూ.. ఉద్యోగాలు అమ్ముకుంటూ.. ఇలా ఎన్నో దందాలు చేస్తున్న వీరభద్రగౌడ్ అవినీతి బాగోతంపై ‘సాక్షి’ ఫోకస్. ఆయన కేవలం టీడీపీ ఇన్చార్జ్. అధికారులను గుప్పిట్లో పెట్టుకుని అవినీతి దందాకు తెరలేపారు. అభివృద్ధి నిధులు మింగేస్తూ.. సంక్షేమ పథకాలను ఆరగిస్తూ అక్రమ ఆదాయార్జనే ధ్యేయంగా వీరభద్రగౌడ్ సాగిపోతున్నారు. నీరు–చెట్టు పనుల కోసం వాగులు, వంకలు తిరిగిన అధికార పార్టీ నేతలు... కనీసం ఆ వాగులు, వంకల్లో నీళ్లు నిలిపేందుకు మాత్రం ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. ఉపాధి అవకాశాలు లేక చివరకు అంగన్వాడీ పోస్టుల కోసం వందల మంది పోటీ పడితే.... ఈ పోటీని ఆసరాగా చేసుకుని పోస్టులను అంగట్లో అమ్ముకున్న చరిత్ర ఆయనది. ఆలూరు టీడీపీ ఇన్చార్జ్ వీరభద్ర గౌడ్‌కు చెందిన జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ ఫ్యాక్టరీ కర్ణాటకకు సరిహద్దున ఉన్న నియోజకవర్గం కావడంతో అక్కడికి రూ.20 కోట్ల విలువైన ఇసుకను అక్రమంగా తరలించి... అక్కడి నుంచి కల్తీ మద్యాన్ని దిగుమతి చేసుకుంటున్నారు. వెనుకబడిన ప్రాంతం కావడంతో అమాయక జనానికి కల్తీ మద్యాన్ని అలవాటు చేసి ఆరోగ్యాలతో అధికారపార్టీ నేతలు ఆటలాడుకుంటున్నారు. బ్యాంకుల నుంచి భారీగా రుణం తీసుకుని అధికారం అండతో చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నారు. మొత్తంగా అధికార పార్టీలో ఉండి ఇన్చార్జ్గా అధికారాలు చెలాయించిన వీరభద్రగౌడ్ నియోజకవర్గానికి ఒక్క మంచి పనీ చేయలేదని జనం ముక్త కంఠంతో చెబుతున్నారు. అవినీతి ‘మేటలు’ విఘ్నేశ్వర క్వారీలో కొండను తొలిచేసిన దృశ్యం (ఫైల్) రాష్ట్ర సరిహద్దులో ఉన్న నియోజకవర్గం కావడంతో సులభంగా రాత్రి సమయాల్లో ఇసుకను పక్క రాష్ట్రమైన కర్ణాటకకు తరలిస్తున్నారు. ఈ మొత్తం ఇసుక దందాను అధికారపార్టీ నేతలే నిర్వహిస్తున్నారు. వీరికి అటు రెవెన్యూ, ఇటు పోలీసు అధికారులు వంత పాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పక్క రాష్ట్రానికి ఇసుక తరలిపోతున్నప్పటికీ పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రధానంగా హొళగుంద మండలం మార్లమడికి, గూళ్యం వేదావతి నది నుంచి ఇసుకను తవ్వి కర్ణాటక ప్రాంతమైన బెంగళూరు, బళ్లారి జిల్లాలకు తరలించారు. ఈ విధంగా మొత్తం రూ.20 కోట్ల విలువైన ఇసుకను అక్రమంగా తరలించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో అధికారపార్టీ నేతలకు రూ.6 కోట్ల మేర అందినట్టు విమర్శలు ఉన్నాయి. అంతటా కమిషన్ల పర్వం - పవన విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆలూరు నియోజకవర్గం అనువైన ప్రాంతంగా ఉంది. గాలి వీచే తీవ్రత ఎక్కువగా ఉండటంతో పవన విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పేందుకు అనేక ప్రైవేటు కంపెనీలు ముందుకు వచ్చాయి. అయితే, ఇక్కడ పనులు చేసుకోవాలంటే తమకు పర్సెంటేజీలతో పాటు పనుల్లో సబ్ కాంట్రాక్టు కూడా ఇవ్వాలని అధికారపార్టీ నేతలు ఒత్తిళ్లు తెచ్చారు. - పవన విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో భారీగా బెడ్డు వేసేందుకు ఇసుక అవసరం అవుతుంది. ఈ ఇసుక సరఫరా కాంట్రాక్టును కూడా అధికారపార్టీ నేతలే తీసుకున్నారు. అనుమతి లేకుండా చెరువులు, వంకల నుంచి ఇసుకను తరలించి సొమ్ము చేసుకున్నారు. - పవన విద్యుత్ ప్లాంటు నెలకొల్పాలని ముందుకు వచ్చిన ప్రైవేటు విద్యుత్ నిర్మాణ సంస్థల నుంచి పనులు చేసుకునేందుకు భారీగా మాముళ్లు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. - ఆయా కంపెనీలు భూములను కొనుగోలు చేసే సమయంలో కూడా అధికారపార్టీ నేతలే మధ్యవర్తిగా ఉండి.... రైతులకు తక్కువ ధర చెప్పి కంపెనీ నుంచి అధిక ధర తీసుకుని భారీగా ఆదాయం ఆర్జించినట్టు తెలుస్తోంది. - రూర్బన్ పథకం కింద మంజూరైన రూ.117 కోట్ల పనులన్నీ పాత పనులనే కొత్తగా చేసినట్టు చూపుతూ నిధులను కాజేస్తున్నారు. - వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం వచ్చిన రూ.6 కోట్ల పనుల్లోనూ చేతివాటం ప్రదర్శించారు. - వాటర్ గ్రిడ్ కింద మంజూరైన రూ. 14 కోట్ల పనులను కూడా కమీషన్ పుచ్చుకొని అప్పగించినట్టు తెలుస్తోంది. - అంగన్వాడీ పోస్టులను సైతం వదలకుండా అమ్ముకున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దాదాపు 40 అంగన్వాడీ కార్యకర్త పోస్టులకుగానూ ఒక్కో పోస్టుకు రూ. 3 లక్షల వరకు తీసుకున్నారు. అంటే రూ. 1.20 కోట్ల మేర అంగన్వాడీ పోస్టులకే సంపాదించారన్న మాట. ఇక అంగన్వాడీ ఆయా పోస్టులు 50 మందికి గాను రూ. 50 వేల రూపాయల చొప్పున రూ.25 లక్షలు ఆర్జించారు. ఊరూరా గౌడు గారి బెల్ట్‌షాప్‌లు ఆలూరు అధికారపార్టీ ముఖ్యనేత తన పేరుతో కాకుండా బినామీ పేరుతో మద్యం దుకాణం నిర్వహిస్తున్నారు. ఇక్క డ నుంచి గ్రామాల్లో బెల్టు షాపునకు సరఫరా చేస్తున్నారు. ఇందంతా ఎక్సైజ్ శాఖ కనుసన్నుల్లో నడుస్తోంది. దేవరలకు, జాతర్ల సమయంలో ఇక్కడి నుంచి బెల్టు షాపులకు మద్యం సరఫరా అవ్వాలని నిబంధనలు పెట్టి అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. అంతేకాకుండా కర్ణాటక నుంచి కల్తీ మద్యం తెచ్చి మరీ ఇక్కడ అధిక ధరలకు విక్రయిస్తూ... ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. సీసీఐ అధికారులను లొంగతీసుకొని మొదటి సారిగా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. గడిచిన రెండేళ్ల నుంచి ఇక్కడ పత్తి కొనుగోలు విక్రయాలు లేవని చెప్పడంతో వివిధ గ్రామాలలోని రైతులు వ్యయప్రయాసలకు గురవుతూ ఆదోని యార్డుకు తరలిస్తున్నారు. ఇందులోనూ తమకు సంబంధించిన అంగళ్లకు మాత్రమే పత్తిని విక్రయించేలా జాగ్రత్తలు చేపట్టారు. తుంగభద్ర ఎగువ, దిగువ కాల్వల టెండర్ల పనులకు తమ సమీప బంధువులను పంపిస్తున్నారు. పనులు దక్కకపోతే కాల్వపై పర్యవేక్షణ చేసి పనుల్లో నాణ్యత లేదని ఆరోపణలు చేస్తారు. ఈ పనులలో కోట్లాది రూపాయలు దండుకోవడం కొనసాగింది. గుంతకల్లు సబ్ డివిజన్ పరిధిలో జరిగే రైల్వే పనుల్లో సిండికేట్ కొనసాగుతోంది. నీరు చెట్టు... పనులన్నీ తీసికట్టు! హెబ్బటం వంకలో నీరు చెట్టు పనులు (ఫైల్) ఆలూరు నియోజకవర్గంలో నీరు–చెట్టు పథకం కింద రూ.50 కోట్ల మేర నిధులు మంజూరు చేయించుకున్నారు. ఈ పనులను కాంట్రాక్టరుతో పాటు అధికారపార్టీ నేతలకు అప్పగించారు. సుమారు 18 నుంచి 20 శాతం వరకూ కమీషన్ తీసుకుని పనులు అప్పగించారనే విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గంలో ఎక్కడో మూలనున్న వాగులు, వంకలను సైతం గుర్తించి నీరు–చెట్టు పథకం కింద నిధులు మంజూరు చేయించుకున్నారు. అయితే, గతంలో ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులను సైతం తాజాగా ఈ పథకం కింద చేసినట్టు చూపించారనే ఆరోపణలు ఉన్నాయి. అంతే కాకుండా భారీగా కమీషన్ దండుకోవడంతో పనులు జరిగాయా? లేదా అన్నది కూడా పరిశీలించిన దాఖలాలు లేవు. ఇక చెక్‌డ్యామ్‌లు నాసిరకంగా నిర్మించి నిధులు మింగేశారు. పైపైగా సిమెంటు పూత పూసి... మొత్తం ఇసుక బస్తాలతో నింపివేశారు. పనులను పరిశీలించాల్సిన అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూసిన పరిస్థితి లేదు. మరికొందరు అధికారపార్టీ నేతలు ముందడుగు వేసి... పాత చెక్‌డ్యాంలకు పైపై మెరుగులు దిద్ది నిధులు దిగమింగారు. ఇక నీరు–చెట్టు కింద పనులు చేసిన సమయంలో తీసిన మట్టిని... ఆ చెరువుల చుట్టూ ఆనకట్ట పదిలంగా ఉండేటట్లు తరలించాల్సి ఉంటుంది. అయితే, పూడిక మట్టిని సైతం ట్రాక్టర్‌కు కొంత మొత్తం చొప్పున దండుకున్నారు. ప్రధానంగా హాలహర్వి మండలం చింతకుంట, బిలేహాలు, కామినేహాలు, మెదేహాలు, ఆస్పరి మండలంలో వెంగళాయదొడ్డి, నగరూరు, ఆలూరు మండలంలోని మొలగవల్లి, హత్తిబెళగల్, ఆలూరు గ్రామాల చెరువులో మట్టిని అక్రమంగా తరలిస్తూ ప్రతి రోజు వేలాది రూపాయలు ఆర్జించారనే ఆరోపణలు ఉన్నాయి. దేవాలయ భూములు అన్యాక్రాంతం ఆలయాల్లో దీప ధూప నైవేద్యం కోసం ఏర్పాటు చేసిన మాన్యం భూములు సైతం ఆక్రమించుకొని కౌలు లీజు పేరుతో కొన్నేళ్లుగా భోంచేస్తున్నారు. నిరుపేదలకు (మంగలి, చాకలి) దక్కాల్సిన మాన్యం భూములు దక్కకుండా కాజేసిన వైనం హొళగుంద మండలం హొన్నూరు క్యాంపులో కొనసాగుతుంది. 22 సర్వే నెంబరులో 54.57 ఎకరాల భూమిని వివిధ తూర్పు జిల్లాలకు చెందిన వేణుగోపాల్, బాబు, కృష్టా తదితరులు ఆక్రమించుకొని సాగు చేస్తున్నారు. సారవంతమైన భూములు గతంలో బావి మరమ్మతులు, మంగలి, చాకలి ఇనాంలకు ఉంచిన వాటిని లీజుపేరుతో దగా చేస్తున్నారు. ఇదంతా పచ్చనేత అండతోనే జరుగుతోంది. హాలహర్వి మండలం చింత కుంట గ్రామంలో 336ఏ సర్వే నెంబరులో 14.80 ఎకరాల రాఘవేంద్ర స్వామి మఠానికి చెందిన భూమి కూడా ఆ గ్రామ అధికారపార్టీ నేతల స్వాధీనంలోనే ఉంది. మరుగుదొడ్లలోనూ అవినీతి కంపు.. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డిని నిర్మించాలనే లక్ష్యంతో నియోజకవర్గంలో సుమారు 15 వేల వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరయ్యాయి. ఈ మరుగుదొడ్ల పనులను థర్డ్ పార్టీలకు అప్పజెప్పి నిధులు కాజేశారు. హొళగుంద మండలం వృద్ధాశ్రమం పేరున కోట్లాది రూపాయలు మరుగుదొడ్లు నిర్మించకుండానే బిల్లులు స్వాహా చేశారు. అలాగే నిట్రవట్టి గ్రామంలో 300 వ్యక్తి గత మరుగుదొడ్లు నిర్మించకుండానే వీరభద్రగౌడ్ అనుచరుడు ఆ గ్రామ మాజీ సర్పంచ్ బసప్ప దాదాపు రూ. 30 లక్షలు లబ్ధిదారుల తెలియకుండానే నిధులు స్వాహా చేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా మరుగుదొడ్లు మంజూరైన లబ్ధిదారులు కూడా అధికారపార్టీ నేతలకు రూ.2 వేల నుంచి రూ.3 వేలు సమర్పించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విధంగా మరుగుదొడ్లలోనూ అమ్యామ్యాలు తీసుకుంటూ అవినీతి కంపు లేపారనే ఆరోపణలు ఉన్నాయి. బ్యాంకులకు టోకరా...! ఆదోనిలో వీరభద్రగౌడ్ కుటుంబానికి పత్తి మిల్లు ఉంది. ఈ మిల్లు కోసం కెనరా బ్యాంకు నుంచి భారీగా రుణం తీసుకున్నారు. అయితే, ఈ రుణం చెల్లించకుండా బ్యాంకు అధికారులను ముప్పుతిప్పలు పెట్టారు. అధికారపార్టీలో ఉన్నామనే అహంకారంతో బ్యాంకులకు రుణం చెల్లించకుండా దబాయించడమూ చేశారు. అయితే, ఉన్నతాధికారుల ఒత్తిళ్లతో సుమారు రూ.150 కోట్ల మేర రుణం చెల్లించకపోతే.... తనాఖాగా ఉంచిన ఆస్తిని వేలం వేస్తామని ప్రకటించారు. దీంతో అప్పటికప్పుడు బ్యాంకు ఉన్నతాధికారులతో మాట్లాడి... వేలం వేయకుండా తాత్కాలికంగా కొంచెం రుణం చెల్లించి పరువు నిలుపుకునే ప్రయత్నం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. చేయి తడిపితేనే గృహం.. అనర్హులకే రుణం.. - షెడ్యూల్డ్ కులాల, తెగల, వెనుకబడిన, ముస్లిం మైనార్టీ, కాపు రుణాలకు ఆ నేత సూచించిన వారే ఎంపికవుతారు. లేదంటే ఆ రుణం ఖరారు కాకుండా తెరవెనుక బ్యాంకు అధికారులపై ఒత్తిడి తీసుకోరావడంతో చాలా మంది అర్హులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. - సన్నకారు రైతులకు రైతు నేస్తం పథకం ద్వారా 90 ట్రాక్టర్లు మంజూరు చేస్తే వాటిని వారి కనుసన్నల్లో పనిచేసే వారికి సెంటు వ్యవసాయ భూమి లేనివారికి మంజూరు చేయించారు. - గృహనిర్మాణ పథకం కింద లబ్ధిదారుల నుంచి ఒక్కో గృహానికి రూ. 10 వేల చొప్పున మామూళ్లు దండుకొని గృహాన్ని మంజూరు చేస్తున్నారు. ఇందుకు అన్ని మండలాల్లో దళారులను పెట్టుకొని అధికారుల నుంచి చోటా నాయకులు వసూళ్లు చేస్తున్నారు. - వ్యవసాయ శాఖలో సన్న, చిన్న కారు రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రాలు మంజూరులో కూడా ఇదే తంతు కొనసాగుతోంది. ఇక శ్మశాన వాటికల ప్రహరీలు, నీటి సౌకర్యం కల్పించే పనులన్నీ నాసిరకంగా చేసి వాటిని సైతం వదలకుండా నిధులు కాజేశారు. - సర్వశిక్షాభియాన్ కింద అంగన్వాడీ కేంద్రాలకు మరుగుదొడ్ల నిర్మాణం కోసం ఒక్కో అంగన్వాడీ కేంద్రానికి రూ. 30 వేలు మంజూరు కాగా.. అప్పటికే ఉన్న ప్రహరీలకు ఆనుకుని మరీ మరుగుదొడ్లు నిర్మించి... గోడ నిర్మాణ ఖర్చులను మిగిలించుకున్నారు. ముద్దనగేరి, కరిడిగుడ్డం గ్రామాల్లోని అంగన్వాడీలే ఇందుకు నిదర్శనం. - ఇటుకల తయారీ కోసం ఇటుకల బట్టీ వారికి వత్తాసుగా చెరువులోని నల్లమట్టిని తరలించి ఒక్క ట్రాక్టర్‌కు రూ. 300– 500 వరకు బడా నాయకుల పేర్లు చెప్పి చోటా నాయకులు వసూళ్లు చేస్తున్నారు. -
కోట్ల కుటుంబం రహస్య మంతనాలు
సాక్షి, కర్నూలు : ఆలూరు నియోజకవర్గ అధికార పార్టీలో చిచ్చు కొనసాగుతోంది మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మకు ఆలూరు టికెట్ కేటాయిస్తారని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ అనుచరులు మండిపడుతున్నారు. బీసీ నేతను కాదని కోట్ల సుజాతమ్మకు టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ ఆమెకు టికెట్ కేటాయిస్తే తాము ఓటు వేసే ప్రసక్తే లేదని చెబుతున్నారు. బీసీ వర్గానికి చెందిన వీరభద్ర గౌడ్‌ను కాదని కోట్ల సుజాతమ్మకు నియోజకవర్గ టికెట్ ఎలా కేటాయిస్తారని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే బీసీ నేతలంతా కోట్ల సుజాతమ్మకు టికెట్ ఇవ్వొద్దంటూ నిరసన ర్యాలీ కూడా చేపట్టారు. మరోవైపు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్న సందర్భంగా టీడీపీ అసమ్మతి నేతలతో కోట్ల కుటుంబం రహస్యంగా మంతనాలు జరుపుతోంది. అసమ్మతి నేతలను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నా... టీడీపీ శ్రేణులు మాత్రం ససేమిరా అంటున్నాయి. కాగా జిల్లాలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. దీంతో కోట్ల రాకను కేఈ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. -
‘బలహీన వర్గాలకు మేలు చేసే విధంగా’..
సాక్షి, పశ్చిమ గోదావరి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం ప్రకటించబోయే బీసీ డిక్లరేషన్ బలహీన వర్గాలకు మేలు చేసే విధంగా ఉండబోతోందని వైఎస్సార్ సీపీ బీసీ నేతలు వ్యాఖ్యానించారు. శనివారం ఏలూరు బీసీ గర్జన ప్రాంగణం వద్ద వైఎస్సార్ సీపీ బీసీ నేతలు పార్థసారధి, జంగా కృష్ణమూర్తి, కారుమూరి నాగేశ్వర రావు, మేకా శేషుబాబు, నరేశ్ గౌడ్లు మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీసీల జీవన స్థితిగతులను అధ్యయనం చేయడానికి దేశంలోనే తొలిసారిగా వైఎస్సార్ సీపీ కమిటీని నియమించిందని తెలిపారు. సంవత్సరంన్నర ముందుగానే కమిటీ బీసీల జీవన స్ధితిగతులను తెలుసుకునే ప్రయత్నం చేసిందన్నారు. సంచార జాతులకి కూడా మేలు చేసే విధంగా వైఎస్సార్ సీపీ నిర్ణయాలు ఉంటాయన్నారు. బీసీలకు మేలు చేయడానికి వైఎస్ జగన్ కృతనిశ్చయంతో ఉన్నారని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకున్నారని మండిపడ్డారు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా బీసీలకు ఏం చేశారంటూ ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చాయి కాబట్టి చంద్రబాబు బీసీలకు అరకొర తాయిలాలు ప్రకటించి మళ్లీ మోసం చేస్తున్నారని అన్నారు. 14 బీసీ కులాలకు కార్పోరేషన్లు ఏర్పాటు చేసినా సరైన విధానాలు లేవని చెప్పారు. చంద్రబాబు మళ్లీ బీసీలను మోసగించడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. బీసీల సమస్యలను పరిష్కరించాలనే చిత్తశుద్దితో వైఎస్ జగన్ ఉన్నారన్నారు. బీసీల అభ్యున్నతికి వైఎస్సార్ సీపీ కృతనిశ్చయంతో ఉందని వెల్లడించారు. ఆదివారం జరగబోయే బహిరంగ సభలో వైఎస్ జగన్ బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తారని తెలిపారు. చంద్రబాబుకు బీసీలపై ప్రేమ లేదన్నారు. బీసీలు ఎవరు కలిసి ఏమీ అడిగినా చంద్రబాబు తోక కత్తిరిస్తానంటూ బెదిరిస్తున్నారని తెలిపారు. వారు తమ ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. బీసీలు మాకు వెన్నెముక అంటూ ప్రతీ ఎన్నికలలో చంద్రబాబు మాయ చేస్తున్నారు. చంద్రబాబు మాయలను ఈసారి బీసీలు నమ్మే పరిస్ధితి లేదు. వైఎస్సార్ సీపీ బీసీ గర్జన సభను పరిశీలన చేయాలని రాష్ట్రంలోని బీసీలకు సూచన. ఎన్నికలు వచ్చాయి కాబట్టి రాజమండ్రిలో జయహో బీసీ అంటూ చంద్రబాబు మరో మోసానికి తెరలేపారు. బీసీలను అవమానించింది చంద్రబాబు కాదా. నాయీ బ్రాహ్మణులతో పాటు బీసీ కులాలను తోలు తీస్తా అన్నది చంద్రబాబు కాదా. ‘ఎస్సీలలో ఎవరు పుట్టాలని కోరుకుంటారు’ అని చంద్రబాబు అవమానించలేదా. రాష్ట్రంలో ఇసుక సంపదను దోచుకున్నారు. వైఎస్ జగన్ ద్వారా బీసీల భవిష్యత్ మారబోతోంది. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పరిపాలనలో బీసీలకు సంక్షేమ పధకాలు అందాయి. బీసీలకు మేలు చేయాలన్న వైఎస్సార్ ఆలోచనల మాదిరే నేడు వైఎస్ జగన్ ఆలోచనలున్నాయి. రాజకీయంగా, సామాజికంగా , ఆర్ధికంగా బలహీన వర్గాలను ప్రోత్సహించాలనే ఆలోచన వైఎస్సార్ సీపీది. రాబోయే కాలంలో బీసీలకు వైఎస్ జగన్ అండగా ఉంటారు. బీసీ కుల వృత్తులను కూడా కార్పోరేట్లకు తాకట్టు పెడుతున్న వ్యక్తి చంద్రబాబ’ని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
-
ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృతి
సాక్షి, కర్నూలు: జిల్లాలోని ఆలూరు మండలం పెద్దహోతురు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు నుంచి ఎలార్తి దర్గాకు వెళ్తున్న టాటా ఏస్ వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో టాటా ఏస్‌లో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మరో ఎనిమిది మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ముగ్గురు యువకులు, ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ ఉన్నారు. వీరిని కర్నూలుకు చెందిన వారిగా గుర్తించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 21 మంది ఉన్నట్టుగా సమాచారం. వైఎస్ జగన్ సంతాపం పెద్దహోతూరు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. -
అరకొర రుణమాఫీతో దంపతుల బలవన్మరణం
-
రుణమాఫీ కాలేదని దంపతుల ఆత్మహత్య
-
రుణమాఫీ కాలేదని భార్యాభర్తల బలవన్మరణం
ఆలూరు: కర్నూలు జిల్లా ఆలూరు మండలం తుమ్మలబీడులో దారుణం చోటుచేసుకుంది. రుణమాఫీ కాలేదని గ్రామానికి చెందిన రామయ్య దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రభుత్వం చేస్తానన్న రుణమాఫీ కాకపోవడంతో పాటు తీసుకున్న అప్పుకు బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేయడంతో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. అప్పుతీర్చడానికి మరో మార్గం లేకపోవడంతో మనస్తాపం చెందిన ఆ వృద్ధ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. గతంలో ఆ దంపతులు వ్యవసాయం కోసం ఆంధ్రా ప్రగతి గ్రామీణ బ్యాంకు నుంచి రూ. 1.46 లక్షల రుణం తీసుకున్నారు. అయితే 2016లో రుణ విమోచన పత్రాన్ని సైతం బ్యాంకు అధికారులు రామయ్యకు ఇచ్చారు. దాంతో ఏపీ ప్రభుత్వం చేస్తానన్న రుణమాఫీపై కొండంత ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ రుణమాఫీ కాకపోవడంతో పాటు పంటలు కూడా సరిగా పండకపోవడంతో ఆ రుణం వారికి భారంగా మారింది. మరొకవైపు బ్యాంకు అధికారుల నుంచి ఒత్తిడికి కూడా పెరిగిపోయింది. రుణం తీర్చాలంటూ బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేయడంతో ఆ వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మరొకవైపు నోటీసు ఫీజు రూ. 290 కూడా కట్టాలంటూ బ్యాంకు అధికారులు పేర్కొనడం కూడా వారిని తీవ్ర మనస్తాపానికి గురి చేసింది. దాంతో కలత చెందిన రామయ్య దంపతులు బ్రతకడాన్ని భారంగా భావించి ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వం వైఫల్యం వల్లే.. రుణమాఫీ కాకపోవడంతోనే రామయ్య దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారని వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి పేర్కొన్నారు. రుణమాఫీ చేయడంలో ప్రభుత్వం విఫలమవడం వల్లే.. ఆత్మాభిమానం చంపుకోలేక వృద్ధులు ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. రైతులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందనీ, దయచేసి రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.