
సాక్షి, నిజామాబాద్ : జనమంతా పండుగ వేడుకలో ఆనందిస్తున్నవేళ.. ఇంటి పైకప్పు ఒక్కసారిగా కూలి ఇద్దరు మరణించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం ఆలూరులో శుక్రవారం ఈ విషాద సంఘటన జరిగింది.
దసరాకు ఒక రోజు ముందు గడీ మైసమ్మకు మొక్కు తీర్చడం ఆలూరులో ఆనవాయితీ. గ్రామస్తులంతా ఒక్కచోట చేరి వేడుక చేసుకున్నారు. కొందరు.. ఓ ఇంటి పైకెక్కి డప్పు విన్యాసాలను తిలకిస్తుండగా.. ఇంటి శ్లాబ్ ఒక్కసారిగా కూలి, కిందున్నవాళ్లపై పడిపోయింది.
ఈ ఘటనలో యశోద అనే యువతి, హారిక అనే చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో గర్భిణికి తీవ్రగాయాలు, ఇంకొ 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడే నిల్చున్న గ్రామస్తొడరు ప్రమాదాన్ని వీడియో తీశాడు.