
డెంగీతో యువతి మృతి
పరిసరాల పరిశుభ్రతపై కుటుంబ సభ్యుల ఫ్లెక్సీ
మోపాల్ (నిజామాబాద్ రూరల్): ‘మా కుటుంబం తరపున అందరికీ ఒక విన్నపం.. ప్లీజ్.. మా చెల్లికి జరిగినట్లు ఇంకెవ్వరికీ జరగకుండా చూడాలని ఆ దేవుడిని వేడుకుంటున్నాం. దయచేసి మీ ఇంట్లో వారికి ఏ చిన్న జ్వరం వచ్చినా ఒక్కసారి ఆలోచించండి. మీ ఇంటి చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకోండి దయచేసి..’అంటూ నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నర్సింగ్‌పల్లి గ్రామంలో ఒక కుటుంబం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆలోచింపజేస్తున్నాయి.
వివరాలివి. నర్సింగ్‌పల్లికి చెందిన ఎల్లుల్ల స్ఫూర్తి (21)తోపాటు ఆమె తల్లి స్వప్న ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. వారిని కుటుంబ సభ్యులు నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. స్వప్న కోలుకుంది. స్ఫూర్తికి మాత్రం డెంగీ కారణంగా రోజురోజుకూ ప్లేట్‌లెట్స్ పడిపోయి పరిస్థితి విషమించింది. దీంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకువెళ్లినా ప్రయోజనం లేకపోయింది. స్ఫూర్తి శనివారం కన్నుమూసింది. తమ కుటుంబానికి కలిగిన విషాదం ఇంకెవ్వరికీ రావొద్దని కోరుతూ.. స్ఫూర్తి కుటుంబ సభ్యులు గ్రామంలో పలుచోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment