nizamabad district
-
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెగడపల్లిలో విషాదం
-
నిజామాబాద్: కుటుంబాన్ని బలిగొన్న కరెంట్
నిజామాబాద్, సాక్షి: బోధన్ మండలం పెగడపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కరెంట్ తీగలు తగిలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. షాటాపూర్‌కి చెందిన గంగారాంకి పెగడపల్లిలో కొంత వ్యవసాయ భూమి ఉంది. అయితే అడవి పందుల బారి నుంచి పంటను రక్షించుకునేందుకు కరెంట్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో.. భార్య, కొడుకుతో కలిసి పొలానికి వెళ్లాడు. ఈ టైంలో బోర్ మోటార్ కరెంట్ వైర్లు బయటకు వచ్చి.. ఆ కుటుంబ సభ్యులకు తగిలింది. దీంతో ఆ ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. -
నిజామాబాద్ మార్కెట్ యార్డులో ఉద్రిక్తత..
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ మార్కెట్ యార్డులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సెక్యూరిటీ అధికారి శ్రీనివాస్‌పై కార్మికుల దాడి చేశారు. పోలీస్ వాహనాన్ని అడ్డుకుని మరి దాడికి పాల్పడ్డ కార్మికులు.. పసుపు దొంగతనం ఆరోపణలు నిరసిస్తూ పసుపు కాంటాలు నిలిపివేశారు. ఆందోళనకు దిగిన కార్మికులు.. మార్కెట్ ఛైర్మన్‌ను నిలదీశారు. పసుపు మార్కెట్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు భారీగా మోహరించారు.నిజామాబాద్ పసుపు మార్కెట్ యార్డులో కార్మికులు సమ్మెకు దిగారు. ర్యాలీగా వచ్చిన కార్మిక సంఘాలు.. చైర్మన్ కార్యాలయాన్ని ముట్టడించాయి. తమపై పసుపు దొంగతనం ఆరోపణలు చేస్తున్నారంటూ కార్మికులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కార్మికుల సమ్మెతో క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. దీంతో రైతులు ఆందోళన పడుతున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించి క్రయవిక్రయాలు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. -
నగరాన్ని తలదన్నేలా మునిపల్లి..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నగరాలు, పెద్ద పట్టణాల్లో గేటెడ్ కమ్యూనిటీ సంస్కృతి ఎక్కువగా కనిపిస్తోంది. కానీ నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్ పల్లి మండలం (Jakranpally Mandal) మునిపల్లి (Munipally) గ్రామం గేటెడ్ కమ్యూనిటీ వాతావరణాన్ని తలపిస్తోంది. గ్రామంలోని ప్రధానమైన ప్రాంతంలో వెళ్తున్నప్పుడు.. నగరంలో ఉన్నామన్న భావన కలుగుతుంది. ఇక్కడ ప్రతి వీధికి నంబర్లు కేటాయించి బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రధాన, అంతర్గత రోడ్లన్నీ తారురోడ్లుగా వేశారు. రోడ్లన్నిటినీ పరిశుభ్రంగా ఉంచుతున్నారు. మొక్కలు, చెట్ల పెంపకం, నిర్వహణ ఆకట్టుకుంటోంది. గ్రామంలో భవనాలను నగరాల మాదిరిగా మంచి ఆర్కిటెక్చర్‌తో నిర్మించడం విశేషం. చాలా ఇళ్లకు సౌర విద్యుత్ (Solar Power) కంచెను ఏర్పాటు చేసుకు న్నారు. రైతులు సొంతంగా తమ సంఘం కోసం భారీ భవనం నిర్మించుకున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో షాపింగ్ కాంప్లెక్స్ (Shopping Complex) నిర్మించి అద్దెలకు ఇచ్చారు. గ్రామంలో అన్నీ రైతు కుటుంబాలే అయినప్పటికీ.. పిల్లలను ఉన్నత విద్య చదివిస్తున్నారు. ప్రధాన రహదారి నుంచి బాగా లోపలికి ఉన్న ఈ గ్రామం ఆద్యంతం గేటెడ్ కమ్యూనిటీని తలపిస్తూ ఆకట్టుకుంటోంది. -
హిట్ అండ్ రన్ కేసులో సినీహీరో హర్షవర్ధన్ అరెస్ట్
బంజారాహిల్స్: హిట్ అండ్ రన్ కేసులో సినీ హీరో సాధుల హర్షవర్ధన్‌తో పాటు అతడి స్నేహితుడు మాడే సాంకేత్ శ్రీనివాస్ అలియాస్ తేజను బంజారాహిల్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్‌లోని బసవతారకం కేన్సర్ ఆస్పత్రి సమీపంలో శనివారం తెల్లవారుజామున అతి వేగంగా వచి్చన కారు ఫుట్‌పాత్ పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అక్కడ నిద్రిస్తున్న గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..నిజామాబాద్ అర్బన్‌కు చెందిన హర్షవర్దన్ సినిమా హీరోగా నటిస్తూ బంజారాహిల్స్ రోడ్డునెంబర్–13లోని ఓ అపార్ట్మెంట్లో తన స్నేహితులు మాడే సాంకేత్ శ్రీనివాస్ అలియాస్ తేజ, వంశీ, రాకేష్‌తో కలిసి ఉంటున్నాడు. శనివారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో మద్యం తాగిన రాకేష్ తనను పికప్ చేసుకోవాలని ఫోన్ చేయడంతో హర్షవర్ధన్‌కు చెందిన కారులో బయలుదేరిన తేజ, కార్తీక్ బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12 మీదుగా వేగంగా దూసుకెళ్తూ హిట్ అండ్ రన్‌కు పాల్పడ్డారు. తేజ కారు నడుపుతుండగా, కార్తీక్ పక్కన కూర్చున్నాడు. ఈ ఘటనతో భయాందోళనకు లోనైన తేజ, కార్తీక్‌తో పాటు గదిలో ఉన్న హర్షవర్ధన్, వంశీ తదితరులు కూడా పరారయ్యారు. పక్కా సమాచారంతో పోలీసులు వీరందరినీ అదుపులోకి తీసుకుని విచారించగా మిస్టరీ వీడింది. కారు హర్షవర్దన్ది కాగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా తేజ కారు నడిపి ఈ ప్రమాదానికి కారకుడయ్యాడు. ఈ నేపథ్యంలో కారు ఇచి్చన హర్షవర్ధన్‌తో పాటు నడిపిన తేజపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ కేఎం రాఘవేంద్ర కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నిజామాబాద్ లో పసుపు బోర్డును స్వాగతిస్తున్నాం: ఎమ్మెల్సీ కవిత
-
‘పసుపు బోర్డు సాధిస్తాననే ధైర్యంతోనే బాండ్ పేపర్ రాశా’
ఢిల్లీ: పసుపు బోర్డు(Turmeric Board) సాధిస్తాననే ధైర్యంతోనే బాండ్ పేపర్ రాసిచ్చానని తెలంగాణ ఎంపీ ధర్మపురి అరవింద్( Dharmapuri Arvind) స్పష్టం చేశారు. పట్టువదలకుండా కేంద్రం చుట్టూ తిరిగి దీన్ని సాధించగలిగానన్నారు. ఈ అంశానికి సంబంధించి సాక్షి టీవీతో మాట్లాడారు. ‘పసుపు బోర్డు సాధనతో నాకు ఎంతో సంతృప్తి కల్గింది. బోర్డుతో పసుపు రైతుల జీవితాల్లో మార్పులు కనిపిస్తాయి. బోర్డు తీసుకొచ్చామని చెప్పే బిఆర్ఎస్ , కాంగ్రెస్ నేతలవి చిల్లర మాటలు. దమ్ముంటే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెరుకు ఫ్యాక్టరీలు తెరిపించాలి. నిజామాబాద్ లో పెద్ద ఎత్తున పారిశ్రామిక అభివృద్ధి జరగబోతోంది. పవర్లోకి తీసుకొచ్చే వారికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలి అని చెప్పడంలో తప్పేంలేదు. మా పార్టీలో అధ్యక్ష రేసులేదు. అధ్యక్షుడు ఎవరనేది నరేంద్ర మోదీ నిర్ణయిస్తారు. పవర్లోకి రావడం ఏ పార్టీకైనా ఒక ఆశయంగా ఉంటుంది. నా తదుపరి టార్గెట్ నిజామాబాద్‌లో స్కిల్ సెంటర్ ఏర్పాటు చేయడమే’ అని పేర్కొన్నారు.ఇందూరు ప్రజల చిరకాల కల నెరవేరిన వేళ..కాగా, రైతుల పండుగ సంక్రాంతి(Makara Sankranti) నాడే ఇందూరు ప్రజల చిరకాల కల నెరవేరింది. నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభమైంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్‌గా పసుపు బోర్డు ప్రారంభించారు. ఆయన వెంట నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కుమార్ ఉన్నారు.కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ‘‘మోదీ ఆశీర్వాదంతో పసుపు బోర్డు నిజామాబాద్‌లో ఏర్పాటైంది. పసుపు రైతులకు అలాగే తొలి పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి కి అభినందనలు. ప్రపంచ వ్యాప్తంగా రైతుల ఉత్పత్తులు ఇతర అనేక ఉత్పత్తులు గతంలో ఎక్కువగా ఎగుమతి అయ్యేవి కాదు. ప్రధాని మోదీ కృషితో ఆ పరిస్థితి మారింది..అనేక దేశాలు భారత్ ఉత్పత్తులు తీసుకునే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ ఆంధ్రాలో నాణ్యమైన పసుపు పండిస్తారు. అందుకే నిజామాబాద్ లో కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు చేసింది. నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఎంపీ ధర్మపురి అరవింద్ కృషి చాలా ఉంది. పసుపు సాగు నాణ్యత మరింత పెంచాల్సిన అవసరం ఉంది. పసుపు ప్రాధాన్యం కరోనా సమయంలో అందరికీ తెలిసింది. ప్రపంచ వ్యాప్తంగా మార్కెటింగ్ ఎగుమతి రవాణా అన్నింటిపై కేంద్రం ఆధ్వర్యంలో పసుపు బోర్డు దృష్టి సారిస్తుంది’’ అని అన్నారు.సాకారమైన రైతుల పోరాటంపసుపు బోర్డు సమస్య 2019 లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో ప్రధాన అంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వ దృష్టిని ఆకర్షించాలన్న ఉద్దేశంతో ఏకంగా 176 మంది రైతులు నామినేషన్లు వేశారు. ఆ ఎన్నికల్లో ఒక్కో బూత్‌లో 12 ఈవీఎంలు వాడాల్సి వచ్చింది. అదే టైంలో.. ఇందూరుకు చెందిన 30 మంది పసుపు రైతులు.. ప్రధాని నరేంద్ర మోదీ పోటీచేసిన వారణాసిలోనూ నామినేషన్లు వేశారు. ఈ అంశం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది కూడా. అయితే..నిజామాబాద్‌లో తాను గెలిస్తే 100 రోజుల్లోపు పసుపు బోర్డు తీసుకొస్తానంటూ బాండ్ పేపర్‌పై రాసిచ్చారు ధర్మపురి అర్వింద్. ఎన్నికల్లో గెలుపొందినా.. బోర్డు ఏర్పాటులో జాప్యం కావడంతో ఆయనపై విమర్శలొచ్చాయి. చివరకు.. ఎట్టకేలకు నిజామాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేయడంతో అటు రైతుల పోరాటం సాకారమైంది. -
నిర్మల్ : అట్టహాసంగా నిర్మల్ ఉత్సవాలు..భారీగా ప్రజలు (ఫొటోలు)
-
వెంకి మామతో ‘రాములమ్మ’ఫ్యామిలీ.. లంగా ఓణిలో మరింత అందంగా మెరిసిపోతున్న శ్రీముఖి (ఫోటోలు)
-
నిజామాబాద్‌లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నిజామాబాద్ జిల్లాలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు
-
బీరు సీసాలో కప్ప.. వీడియో వైరల్
సాక్షి, నిజామాబాద్: బీరు కొనుగోలు చేయడానికి వైన్ షాపునకు వెళ్లిన ఓ వ్యక్తి షాకయ్యాడు. బీరు సీసాలో కప్ప అవశేషాలు దర్శనమిచ్చిన ఘటన ఆర్మూర్ డివిజన్లోని డొంకేశ్వర్ మండల కేంద్రంలోని ఓ వైన్ షాపులో చోటు చేసుకుంది. దీంతో వైన్ షాపు నిర్వాహకుడిని ఆ వ్యక్తి నిలదీశాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆ కస్టమర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారింది. -
త్వరలోనే DSPగా బాధ్యతలు చేపడతా: నిఖత్ జరీన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి భారత బాక్సర్ నిఖత్ జరీన్ ధన్యవాదాలు తెలిపింది. తన ప్రతిభను గుర్తించి డిప్యూటీ సూపరింటెండెట్ ఆఫ్ పోలీస్(డీఎస్పీ) పోస్ట్ ఇవ్వడం పట్ల కృతజ్ఞతాభావం చాటుకుంది. క్రీడాకారులను ప్రభుత్వం ఇలా ప్రోత్సహిస్తే తనలాగే మరికొంత మంది కూడా ముందుకు వస్తారని పేర్కొంది.కాగా తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్ వరల్డ్ చాంపియన్‌గా ఎదిగింది. ఒలింపిక్ పతకమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అయితే, ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భాగంగా తొలిసారి విశ్వక్రీడల బరిలో దిగిన నిఖత్‌కు నిరాశే ఎదురైంది. మహిళల 50 కేజీల విభాగంలో పోటీపడిన ఆమె.. ప్రాథమిక దశలోనే వెనుదిరిగింది. చైనాకు చెందిన వూ యు చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది.సీఎం సానుకూలంగా స్పందించారుఅయితే, ప్రపంచ వేదికలపై సత్తా చాటిన నిఖత్ జరీన్‌ను తెలంగాణ ప్రభుత్వం అభినందించడంతో పాటు డీఎస్పీగా పోస్టు ఇచ్చింది. ఈ విషయంపై స్పందించిన నిఖత్ సాక్షి టీవీతో మాట్లాడుతూ.. హర్షం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపడంతో పాటు.. తెలంగాణ రాష్ట్రంలో బాక్సింగ్ అకాడమీ లేకపోవడం బాధాకరమని పేర్కొంది. ఈ విషయం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లానన్న నిఖత్.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపింది.సిరాజ్‌కు కూడా‘‘తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అన్ని సహాయ సహకారాలు అందిస్తోంది. త్వరలోనే డీఎస్పీ ట్రైనింగ్ తీసుకుంటాను. డీజీపీ జితేందర్ గారు ట్రైనింగ్ సమాచారం ఇస్తామని చెప్పారు’’ అని నిఖత్ తెలిపింది. ఇక ప్యారిస్‌లో ఓడిపోవడం బాధ కలిగించిందన్న నిఖత్ జరీన్ వచ్చే ఒలింపిక్స్‌లో కచ్చితంగా మెడల్ సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది. కాగా నిఖత్‌తో పాటు టీ20 ప్రపంచకప్-2024 సాధించిన భారత క్రికెట్ జట్టులో సభ్యుడైన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు సైతం ప్రభుత్వం డీఎస్పీ పోస్ట్ ఇచ్చింది. చదవండి: ఆమె నిజాయితీని అమ్ముకుంది.. మండిపడ్డ బబిత.. వినేశ్ స్పందన ఇదే -
ఆమె ఒడి... అనాథల బడి
‘మా అమ్మాయి బాగా చదువుకోవాలి. పెద్ద ఉద్యోగం చేయాలి’ అనే కల తల్లిదండ్రులు అందరికీ ఉంటుంది. మరి అనాథపిల్లల గురించి ఎవరు కల కంటారు? సమాధానం వెదుక్కోవాల్సి ఉంటుంది. ఎవరో ఎందుకు కల కనాలి? ఆ పిల్లలే బాగా చదువుకుంటే బాగుంటుంది కదా! అయితే, అనిపించవచ్చు. ‘పేరుకే చదువు’ అనుకునే పరిస్థితుల్లో... నాణ్యమైన విద్య అనేది అందని పండు అనుకునే పరిస్థితుల్లో ఆ పిల్లల చదువు ముందుకు సాగకపోవచ్చు. కల కనడం అసాధ్యం కావచ్చు. ఈ పరిస్థితిని గమనించిన న్యాయమూర్తి సునీత కుంచాల అనాథపిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి ఒక వేదికను ఏర్పాటు చేశారు.న్యాయసేవాధికార సంస్థ తరఫున అనాథ బాలల వసతి గృహాలను సందర్శిస్తూ ఉంటుంది నిజామాబాద్ జిల్లా న్యాయమూర్తి సునీత కుంచాల. అలా వెళుతున్న క్రమంలో బాలికల సదన్‌లో పిల్లలు చదువుకుంటున్న తీరు ఆమెకు బాధగా అనిపించేది. ‘నేను మాత్రం ఏంచేయగలను!’ అనే నిట్టూర్పుకు పరిమితం కాలేదు.‘ఏదైనా చేయాల్సిందే’ అని గట్టిగా అనుకున్నారు. ఆనుకున్నదే ఆలస్యం అక్కడ ఉన్న 30 మంది బాలికలకు నాణ్యమైన విద్య అందించే లక్ష్యంతో ముందడుగు వేశారు.ఒక మంచిపనికి పూనుకున్నప్పుడు, ‘మీ సహకారం కావాలి’ అని అడిగితే ఎవరు మాత్రం ముందుకు రారు! సునీత అడగగానే హైకోర్టు న్యాయవాది సరళ మహేందర్‌రెడ్డి 23 మంది బాలికలకు తమ పాఠశాల ‘రవి పబ్లిక్ స్కూల్’లో పదవ తరగతి వరకు ఉచితంగా చదువు అందించేందుకు ముందుకు వచ్చారు. సరళ మహేందర్ రెడ్డి స్ఫూర్తితో మరో రెండు పాఠశాలల వారు తమ వంతు సహకరిస్తామని ముందుకు వచ్చారు. దీంతో నిజామాబాద్ ‘బాలసదన్’లోని 30 మంది అనాథ బాలికలకు నాణ్యమైన విద్య అందుతోంది.సునీత కుంచాలకు సహాయం అందించడానికి ఐపీఎస్ అధికారులు రోహిణి ప్రియదర్శిని (సెవెన్త్ బెటాలియన్ కమాండెంట్), కల్మేశ్వర్ శింగనవార్ (నిజామాబాద్ పోలీసు కమిషనర్), ఐఏఎస్ అధికారి రాజీవ్‌గాంధీ హనుమంతు(నిజామాబాద్ కలెక్టర్) ముందుకు వచ్చారు. విద్యార్థులకు పుస్తకాలు, స్కూల్ డ్రెస్... ఇతర అవసరాలకు అయ్యే ఖర్చులను అందించేందుకు సునీతతో పాటు పోలీసు కమిషనర్ కల్మేశ్వర్ శింగనవార్, బెటాలియన్ కమాండెంట్ రోహిణి ప్రియదర్శిని సిద్ధమయ్యారు. వీరంతా కలిసి తమ బ్యాచ్‌మేట్స్ సహకారంతో కొంత మొత్తాన్ని సమకూర్చారు. బాలికలను తమ స్కూల్స్‌కు వెళ్లివచ్చేందుకు వీలుగా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ పోలీసు వాహనాన్ని సమకూర్చారు. తాము బదిలీ అయ్యాక కూడా ఈ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగేందుకు వీలుగా ‘భవిష్య జ్యోతి’ పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేశారు.ఐసీఐసీఐ బ్యాంకు ఖాతా తెరిచి వాట్సాప్ గ్రూపు ద్వారా ప్రతి లావాదేవీని పారదర్శకంగా కనిపించేలా చేశారు. ‘విద్య అనే పునాది గట్టిగా ఉంటేనే కలలు నిలుస్తాయి. సాకారం అవుతాయి’ అంటున్న సునీత కుంచాల ఇతర జిల్లాల్లోనూ అధికారుల సహకారం తీసుకొని ఇలాంటి ట్రస్ట్‌లను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. భవిష్యత్తుకు భరోసా!ఒక జిల్లా న్యాయమూర్తిగా లైంగిక వేధింపులకు గురైన బాధిత అమ్మాయిలను చూశాను. తల్లిదండ్రులు లేని ఆ పిల్లలకు ప్రభుత్వం వసతి సదుపాయాల వరకు కల్పిస్తుంది. అయితే చదువుకోకపోతే వారి భవిష్యత్తు ఏంటి అనిపించేది. ఆ ఆలోచనలో భాగంగా ఆ పిల్లలున్న హాస్టల్‌కు వెళ్లాం. వారితో మాట్లాడుతున్నప్పుడు వారి చదువు అంతంత మాత్రంగానే ఉందని అర్థమైంది. వారికి మంచి చదువు ఇప్పించాలనుకున్నాం. సాధారణంగా ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లలో 25 శాతం నిరుపేద పిల్లలకు ఉచితవిద్యను అందించాలి. స్థానికంగా ఉన్న ప్రైవేట్ స్కూల్స్ వాళ్లను పిలిచి, ఈ పిల్లల చదువు గురించి అడిగాం. ఫీజు లేకుండా పిల్లలకు చదువు చెప్పడానికి మూడు స్కూళ్లు ముందుకు వచ్చాయి. అయితే బుక్స్, స్కూల్ డ్రెస్‌ల సమస్య వచ్చింది. ఒక్క ఏడాదితో ఈ సమస్య తీరదు. పిల్లల చదువు పూర్తయ్యేంతవరకు వారికి సాయం అందాలి. దీంతో పిల్లల కోసం ఓ ట్రస్ట్ ఏర్పాటు చే స్తే మంచిదనే ఆలోచన వచ్చింది. మా నాన్న గారైన గురువులు గారి స్ఫూర్తితో ట్రస్ట్ ఏర్పాటు అయింది. దీనిద్వారా దాతలు స్పందించి, పిల్లల చదువుకు సాయం అందిస్తున్నారు. ప్రతి జిల్లాల్లోనూ ఇలాంటి పిల్లలకు నాణ్యమైన విద్యావకాశాలు కల్పించి, వారి జీవితాల్లో వెలుగులు నింపితే బాగుంటుంది. – సునీత కుంచాల, జిల్లా న్యాయమూర్తి, నిజామాబాద్ – తుమాటి భద్రారెడ్డి, సాక్షి, నిజామాబాద్ -
ఇరాన్ దాడుల నేపథ్యంలో తెలుగు వారి ఆందోళన
-
ఆర్మూర్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం
సాక్షి, నిజామాబాద్ జిల్లా: ఆర్మూర్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం జరిగింది. గర్భస్థ శిశువు మృతి చెందిన కానీ మూడు రోజులైనా బాధితులకు విషయం చెప్పకుండా వైద్యాధికారిణి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సిరికొండ మండలం రూప తండాకు చెందిన మంజుల రెండో కాన్పు కోసం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది.డెలివరీ తేదీ ఖరారు కావడంతో ఆర్మూర్‌లోని ఓ ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లో తీసిన స్కానింగ్ రిపోర్టులను వైద్యాధికారిణికి బాధితురాలు అందజేసింది. శిశువు గుండె చప్పుడు తక్కువగా ఉందని బాధితురాలికి వైద్యురాలు సూచించింది. బాధితులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లగా గర్భస్థ శిశువు మృతి చెందినట్లు వైద్యురాలు తెలిపింది.గర్భస్థ శిశువు మృతి చెంది మూడు రోజులైనా విషయాన్ని తెలపకపోవడం పట్ల వైద్యులపై బంధువులు తీవ్రంగా మండిపడుతున్నారు. బాధితురాలి బంధువులను సముదాయించి గర్భస్థ మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించి శస్త్ర చికిత్స నిర్వహిస్తామని ఉన్నతాధికారులు వెల్లడించారు.ఇదీ చదవండి: కాలేజీలా.. మురికి కూపాలా? -
కలిసి బతకలేమని.. ప్రేమ ప్రయాణం విషాదాంతం
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడం స్థానికులను ఆవేదనకు గురిచేసింది. తమ ప్రేమకు పెద్దలు ఒప్పుకోకపోవడంతోనే ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. దోమకొండ మండలం అంబర్పేట్ గ్రామానికి చెందిన వీణ(23), కోనాపూర్ గ్రామానికి చెందిన సాయి(24) కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ గురించి చెప్పి.. ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ భావించారు. కానీ, వీరి ప్రేమను పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో, మనస్థాపానికి గురయ్యారు.ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం కోనాపూర్‌లో చెట్టుకు ఉరివేసుకుని సాయికుమార్, అంబర్‌పేట్‌లోని తన ఇంట్లో దూలానికి ఉరేసుకుని వీణా ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో, ఇరు కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఆత్మహత్యల సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్టుమార్టం కోసం మృతదేహాలను స్థానిక కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్ని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: జానీ భార్య అయేషా అరెస్ట్‌కు రంగం సిద్ధం! -
బాలగణపతి భళా
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్‌నగర్ పంచముఖాంజనేయ స్వామి ఆలయం వద్ద హైందవసేన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాలగణపతి విగ్రహం ఆకట్టుకుంటోంది. మట్టితో తయారు చేసి, పర్యావరణహిత రంగులు పూసిన ఈ 15 అడుగుల విగ్రహాన్ని చూసేందుకు చుట్టుపక్కల జిల్లాల వారు సైతం భారీగా వస్తున్నారు. ఇక్కడ ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పెడుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన పలు ఉత్సవ సమితులు సైతం ఈ విగ్రహం గురించి అడిగి తెలుసుకుంటున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో తయారీ.. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌కు సమీపంలో మిలాన్ చక్రవర్తి అనే విగ్రహాల తయారీదారు ఈ బాలగణపతి విగ్రహాలను తయారు చేస్తున్నాడు. నిజామాబాద్‌కు చెందిన హైందవ సేన ఉత్సవ సమితి సభ్యులు ఇన్‌స్ట్రాగామ్‌లో ఈ విగ్రహాన్ని చూసి జనవరిలో ఆర్డర్ ఇచ్చారు. పూర్తిగా ఎండు గడ్డి, బంక మట్టితో తయారు చేసిన ఈ విగ్రహం లంబోదర ఆకృతిలో ఉంది. రాయ్‌పూర్ నుంచి 600 కిలోమీటర్ల దూరంలోని నిజామాబాద్‌కు ఈ విగ్రహాన్ని తరలించేందుకు 5 రోజుల సమయం పట్టింది. ఈ విగ్రహానికి ఇన్‌స్ట్రాగామ్‌లో 22 లక్షల వ్యూస్ వచి్చనట్లు హైందవ సేన ఉత్సవ సమితి సభ్యులు చెబుతున్నారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే.. ఇప్పటివరకు కొందరు వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు మట్టి విగ్రహాలను పంచిపెడుతూ వస్తున్నాయి. కానీ అవి చిన్న విగ్రహాలే. భారీ విగ్రహాలు మాత్రం 95 శాతం ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసినవే. ఈ క్రమంలో మట్టి విగ్రహాల తయారీని ప్రభుత్వం ప్రోత్సహించాలని పర్యావరణ ప్రేమికులు విజ్ఞప్తి చేస్తున్నారు. మట్టి విగ్రహాల తయారీ కష్టంతో కూడుకున్నది కావడంతో.. ఆ మేరకు తయారీదారులు, ఉత్సవాలు నిర్వహించేవారికి ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేసినట్లుగా ఉంటుందని పేర్కొంటున్నారు. -
డాక్టరమ్మ శిక్షణ చక్ దే..!
చక్‌దే ఇండియాలో మహిళా హాకీ జట్టును తీర్చిదిద్దుతాడు షారుక్ ఖాన్ . నిజామాబాద్‌లో ఫుట్‌బాల్‌లో బాలికలను మెరికల్లా తీర్చిదిద్దుతున్నారు డాక్టర్ కవితారెడ్డి. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఇక్కడి నుంచి సెలెక్ట్ అవుతున్న బాలికలు ఇంటర్నేషనల్ స్థాయిలో తెలంగాణ పేరును నిలబెట్టేలా చేయడమే లక్ష్యం అంటున్నారామె. కవితారెడ్డి ఈ క్రీడా శిక్షణ ఎందుకు ప్రారంభించారో తెలిపే కథనం.‘సహాయం చేసే వ్యక్తులు మన జీవితాల్లో ఉంటే సహాయం చేయడం మనక్కూడా అలవడుతుంది’ అంటారు డాక్టర్ శీలం కవితా రెడ్డి. నిజామాబాద్‌లో గైనకాలజిస్ట్‌గా పేరొందిన ఈ డాక్టర్ తన సేవా కార్యక్రమాలతో కూడా అంతే గౌరవాన్ని పొందుతున్నారు. ‘మా తాతగారిది నల్లగొండ. పేదవాళ్లకు ఆయన సహాయం చేయడం, వాళ్లకు ఫీజులు కట్టి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో చదివించడం నేను బాల్యం నుంచి గమనించేదాన్ని. సాయం చేయడంలో సంతృప్తి నాకు అర్థమైంది. నేను డాక్టర్‌గా స్థిరపడ్డాక ‘డాక్టర్ కవితా రెడ్డి ఫౌండేషన్’ స్థాపించి స్త్రీల, బాలికల ఆరోగ్యం కోసం పని చేయాలని నిశ్చయించుకున్నాను. పేద మహిళల ఆరోగ్య సమస్యలను పట్టించుకోవడం అవసరం అనే భావనతో ఈ పని మొదలుపెట్టాను’ అన్నారామె.ఫుట్‌బాల్ మేచ్ చూసి...‘నిజామాబాద్ పట్టణంలో ఒకసారి బాలికల ఫుట్‌బాల్ టోర్నమెంట్ జరుగుతుంటే నన్ను అతిథిగా ఆహ్వానించారు. అక్కడ ΄ాల్గొన్న అమ్మాయిల క్రీడానైపుణ్యం చూసి ఆశ్చర్య΄ోయాను. ఎంతటి పేదరికంలో ఉన్నా సరైన ΄ోషణ, డ్రస్, షూస్ లేక΄ోయినా వారు గ్రౌండ్లో చిరుతల్లా పరిగెడుతూ ఆడారు. అలాంటి పిల్లలకు సరైన శిక్షణ ఇస్తే మరింతగా దూసుకు΄ోతారని భావించి 2019లో డాక్టర్ కవితారెడ్డి ఫుట్‌బాల్ అకాడెమీ స్థాపించాను. నిజామాబాద్ జిల్లాలోని గ్రామీణప్రాంతం బాలికలకు హాస్టల్ ఏర్పాటు చేసి ఫుట్‌బాల్‌లో శిక్షణ ఇప్పిస్తున్నాను. పట్టణంలో ఉన్న బాలికలు రోజూ వచ్చి ఉచిత శిక్షణ పొందితే బయటి ఊళ్ల అమ్మాయిలు హాస్టల్లో ఉంటూ శిక్షణ పొందుతున్నారు’ అని తెలి΄ారామె.అదే ప్రత్యేకం...కవితారెడ్డి తన అకాడెమీని ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్, తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్‌కు అనుబంధంగా రిజిస్టర్ చేశారు. తెలంగాణ లో మొత్తం 8 ఫుట్‌బాల్ క్లబ్బులు ఉండగా మహిళా కార్యదర్శి ఉన్న క్లబ్ మాత్రం ఇదొక్కటే కావడం గమనార్హం. ప్రస్తుతం డాక్టర్ కవితారెడ్డి ఫుట్‌బాల్ అకాడమీలోని 41 మంది బాలికలు కోచ్ గొట్టి΄ాటి నాగరాజు ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నారు. గతంలో నాగరాజు శిక్షణలోనే అంతర్జాతీయ క్రీడాకారిణి సౌమ్య తయారైంది. శిక్షణ పొందుతున్న బాలికల్లో వివిధ జిల్లాలకు చెందిన ఇంటర్, డిగ్రీ చదువుతున్న గ్రామీణప్రాంతాల వారున్నారు. వీరందరికీ కవితారెడ్డి తన సొంత ఖర్చుతోనే వసతి, ఆహారం, డ్రెస్సులు, వైద్య సౌకర్యం కల్పిస్తున్నారు. ఇతరప్రాంతాల్లో టోర్నమెంట్లకు వెళ్లాల్సి వస్తే అవసరమైన సామగ్రి, ప్రయాణ ఖర్చులన్నీ డాక్టరమ్మే భరిస్తున్నారు. ఈ అకాడమీ నుంచి ఇప్పటివరకు 9 మంది బాలికలు పశ్చిమబెంగాల్, కర్ణాటక, జార్ఖండ్ రాష్ట్రాల్లో నేషనల్స్ ఆడారు. మరో ఐదుగురు ఇతర రాష్ట్రాల క్లబ్‌లకు ఆడారు. ఖేలో ఇండియా కార్యక్రమం కింద అండర్–13, అండర్–15లో 14మంది ఆడారు. ఇక తెలంగాణ ఉమెన్స్ లీగ్‌కు 22 మంది ఈ అకాడమీ బాలికలు ఆడనున్నారు. మిషన్ 2027లో భారత జట్టుకు ఎంపికై అంతర్జాతీయ ΄ోటీలకు వెళ్లేలా బాలికలు శిక్షణ పొందుతున్నారు. మరోవైపు బాక్సింగ్ క్రీడాకారులకు సైతం ఇప్పటివరకు అవసరమైనప్పుడల్లా కిట్లు కొనిస్తున్నారు.హెల్త్ కార్డ్లుడాక్టర్ కవితారెడ్డి తన హెల్త్ ఫౌండేషన్ ద్వారా 2017 నుంచి పేద గర్భిణులకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తూ వస్తున్నారు. నాలుగు వేల మందికి హెల్త్ కార్డులు ఇచ్చారు. ఈ కార్డ్ ఉన్నవారికి తన ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ΄ాఠశాలల్లో 8, 9, 10 తరగతుల విద్యార్ధినులకు అనీమియా వైద్యపరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. సేవాకార్యక్రమాల విషయంలో తనను భర్త రవీందర్‌రెడ్డి, కుమారుడు డాక్టర్ పరీక్షిత్ సాయినాథ్‌రెడ్డి అన్నిరకాలుగా ్ర΄ోత్సహిస్తున్నారని కవితారెడ్డి చెబుతున్నారు.– తుమాటి భద్రారెడ్డి, సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ -
నిజామాబాద్ ఊర పండగకు సర్వం సిద్ధం..
-
TG: షాకింగ్ ఘటన.. పసుపు లోడు లారీ హైజాక్
సాక్షి, నిజామాబాద్: జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద అర్ధరాత్రి పసుపు లోడు లారీని హైజాక్ చేశారు. ఆర్టీఏ అధికారులమంటూ లారీని ఆపిన కేటుగాళ్లు.. డ్రైవర్‌పై మత్తు మందు చల్లి జన్నేపల్లి వైపు పసుపు లారీని తీసుకెళ్లారు.అక్కడ నుంచి పసుపు లోడును వేరే వాహనాల్లోకి తరలించే యత్నం చేశారు. పోలీసుల ఎంట్రీతో దుండగులు పారిపోయారు. పసుపు విలువ సుమారు రూ. 50 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. నిజామాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
విషాదం: రైలు కిందపడి యువదంపతుల ఆత్మహత్య
సాక్షి,నిజామాబాద్ జిల్లా: రైలు కిందపడి యువ దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో నిజామాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. నవీపేట మండలం ఫకీరాబాద్ మిట్టాపూర్ మధ్య రైలు కింద పడి యువ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు పోతంగల్ మండలం హెగ్డోలి వాసులు అనిల్ (28), శైలజ (24)గా పోలీసులు గుర్తించారు. బంధువుల దుష్ప్రచారం భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చనిపోయే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో తెలిపారు. వీరికి ఏడాదిన్నర క్రితం పెళ్లయింది.ఈ వీడియోను ఆత్మహత్యకు ముందు కోటగిరి ఎస్.ఐ సందీప్‌కి పంపారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా మిట్టాపుర్ శివారులో రైల్వే ట్రాక్‌పై దంపుతులిద్దరి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంటర్వ్యూ ఉందని ఇంట్లో చెప్పి బయటికొచ్చిన యువ దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
ఇక సెలవు.. ముగిసిన డీఎస్ అంత్యక్రియలు
సాక్షి, నిజామాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్, కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. నిజామాబాద్‌లోని ఆయన స్వగృహంలో సందర్శనార్థం పార్థీవ దేహాన్ని ఉంచారు. ప్రముఖులు నాయలు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్‌లో డీఎస్ ఇంటికి వెళ్లి భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులు సంజయ్ అరవింద్‌లను పరామర్శించారు. రేవంత్‌తో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో డీఎస్ కీలక భూమిక పోషించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆయన ప్రత్యేక చొరవతోనే 2004లో సోనియా తెలంగాణ ఏర్పాటు ఆమోదించారని అన్నారు.కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో డీఎస్‌కు మంచి అనుబంధం ఉందని, బడుగు, బలహీన వర్గాల నేతలను ప్రోత్సాహించారని ప్రశంసించారు. డీఎస్ భౌతికకాయం మీద కాంగ్రెస్ జెండా ఉండాలన్నది ఆయన చివరి కోరిక అని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం అంతియ యాత్ర మొదలు కాగా, పలువురు కాంగ్రెస్ నేతలు, చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ తండ్రి పాడెను మోశారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సీనియర్ నేతలు కార్యకర్తలు అభిమానులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. -
చెల్లిని కాపాడబోయి నీట మునిగిన అక్క మృతి
కమ్మర్పల్లి (నిజామాబాద్): వరద కాలువలో చెల్లెల్ని కాపాడబోయి అక్క నీట మునిగి మృతి చెందింది. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలోని గాం«దీనగర్‌లో శనివారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గాం«దీనగర్‌కు చెందిన చిత్తారి రాజు, మంజుల దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం కాలనీకి చెందిన పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. ఈ పంచాయితీకి కామారెడ్డి నుంచి మంజుల తండ్రితోపాటు ఆమె సోదరి పానేటి శ్యామల కూడా వచ్చారు.పంచాయితీ జరుగుతున్న సమయంలో మంజుల ‘నేను చనిపోతా’అంటూ పరుగెత్తికెళ్లి కాలనీకి పక్కనే గల కాలువ వద్దకు వెళ్లి అందులో దూకింది. చెల్లెల్ని కాపాడేందుకు శ్యామల, కాలనీ వాసులు కూడా కాలువ వద్దకు వెళ్లారు. శ్యామల ధైర్యం చేసి కాలువలోకి దూకింది. కాలనీ వాసులు చీరను విసరగా మంజుల దాన్ని పట్టుకొని పైకి వచ్చింది. కానీ శ్యామల ప్రమాదవశాత్తు కాలువలో మునిగిపోయి మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, శ్యామల మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
నిజామాబాద్‌లో ధర్మపురి అర్వింద్ విజయం
నిజామాబాద్: నిజామాబాద్‌లో బీజేపీ విజయం సాధించించింది. బీజేపీ తన సిట్టింగ్ స్థానాన్ని తిరిగి నిలుపుకుంది. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ 1,25,369 వేల ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన టీ. జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి బాజీరెడ్డి గోవర్థన్ ఓటమిపాలయ్యారు. -
గాలి వాన బీభత్సం
కైలాస్‌నగర్/నిజామాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాల్లో బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన బీభత్సం సృష్టించింది. సాయంత్రం 4 గంటల వరకు ఎండ దంచికొట్టగా.. అనంతరం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రెండు జిల్లాల పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల ధాటికి వాంకిడి సమీపంలో గల జాతీయ రహదారిపై భారీ వృక్షాలు నేలకొరగడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.తాంసిలో ఓ ఇంటి ఆవరణలో గల కొబ్బరిచెట్లు విరిగి పడ టంతో ఇంటి పైకప్పు కూలిపోయింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కొనుగోలు కేంద్రంలో విక్రయించేందుకు తెచి్చన జొన్నలు తడిసిపోయాయి. పంటను కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందు లు పడ్డారు. తలమడుగు మండలం ఉండం గ్రామ సమీపంలోని 33 కేవీ వి ద్యుత్ స్తంభం విరిగిపడటంతో తాంసి, తలమడుగు మండలాల్లోని పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తలమడుగు మండలంలోని పూనగూడ, పల్సి–బి, పల్సి–కే గ్రామాలలో ఈదురుగాలుల దెబ్బ కు పలు ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. బోథ్ మండలం మర్లవాయిలో ఇంటి పైకప్పుపై ఉన్న రేకులు ఎగిరిపోయి విద్యుత్‌వైర్లపై పడ్డాయి. -
రేవంత్ కాంగ్రెస్‌లో ఉండటమే పెద్ద తప్పు: ఎంపీ అర్వింద్
సాక్షి, నిజామాబాద్: వందరోజుల్లో అమలు కాని కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు.. ఆగస్టు తర్వాత ఎలా సాధ్యమవుతాయని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ అర్వింద్. లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారనున్నాయన్నారు. హస్తం పార్టీకి ఇవే చివరి ఎన్నికలని అన్నారు. ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి సీటుకే గ్యారంటీ లేదని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ రోజురోజుకీ ఎదుగుతుందన్నారు. ఇతర పార్టీలతో లాలూచీ పడే అవసరం బీజేపీకి లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీకి 12 సీట్లు వస్తాయని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారన్నారు. వారు చెప్పినట్లు బీజేపీ 12 సీట్లు వస్తే సీఎం రేవంత్‌ను దేవుడే కాపాడాలని పెటైర్లు వేశారు. నిజామాబాద్ నగరంలో ఇంటింటి ప్రచారం ప్రారంభించిన బీజేపీ అభ్యర్థి, ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్ధుడే కానీ.. ఆయన కాంగ్రెస్‌లో ఉండటమే పెద్ద తప్పని అన్నారు. కాంగ్రెస్ నేతలు రేవంత్‌ను పనిచేయకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌లో ఉంటే ఎవరికైనా రాజకీయ భవిష్యత్తు ఉండదని అన్నారు. ఎంపీ అర్వింద్ కామెంట్స్ కాంగ్రెస్ 100 రోజుల్లో ఏ గ్యారెంటీ నెరవేర్చలేదు. ఇప్పుడు ఆగస్టులో రుణమాఫీ అని మరోసారి మోసానికి తెరలేపింది. అవినీతి చేసిన వారికి శిక్ష తప్పదు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇప్పట్లో బెయిల్ వచ్చే పరిస్థితి లేదు. ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే షుగర్ ఫ్యాక్టరీలు నెల రోజుల్లో పనిచేసే ప్రక్రియను ప్రారంభిస్తాం. నిజామాబాదు పార్లమెంటు పరిధిలో ఆధ్యాత్మిక, టూరిజం కారిడార్‌ను ఏర్పాటు చేస్తాం మా ఏకైక గ్యారెంటీ మోదీనే. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని మోడీ ప్రభుత్వం నెరవేర్చుతుంది. మోదీ మూడో టర్మ్‌లో కామన్ సివిల్ కోడ్ అమలు చేస్తాం. రైల్వే విభాగంలో కొత్త విప్లవం రాబోతుంది. రానున్న రోజుల్లో 25 వేల కి.మీ.ల కొత్త రైల్వే లైన్లు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ హిందు వ్యతిరేక పార్టీ. -
MLC Kavitha: కవితకు బిగ్ షాక్.. ఈడీ మరో సంచలన నిర్ణయం!
సాక్షి, నిజామాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులో ఈడీ స్పీడ్ పెంచింది. ఈ క్రమంలోనే ఈడీ అధికారులు నిజామాబాద్‌పై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. కవిత ఆస్తులపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన కవితను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో కవిత భర్త, బంధువులపై కూడా నిఘా పెట్టారు. వారికి సంబంధించిన ఆస్తుల వివరాలను సేకరిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈడీ అధికారులు నిజామాబాద్‌కు వెళ్లనున్నట్టు సమాచారం. ఇక, కవిత ఆస్తుల వ్యవహారాలపై సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే, ఆమె భర్త అనిల్ వ్యాపార లావాదేవీలు, కవితకు సన్నిహితంగా ఉండే వారి వివరాలను సేకరిస్తున్నారు. ఇదే సమయంలో కవిత ఆస్తులకు బినామీలు ఎవరైనా ఉన్నారా? అనే కోణంలోనూ విచారణ చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్నప్పుడు పనిచేసి బదిలీ అయిన కీలక అధికారితో పాటు ఓ రెవెన్యూ ఉద్యోగిపైనా ఈడీ అధికారులు ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఇలాంటి అన్ని వివరాల సేకరణ తర్వాత ఈడీ అధికారులు నిజామాబాద్‌కు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మేనల్లుడు మేక శరణ్ పేరును ఈడీ రౌస్ అవెన్యూ కోర్టులో సమర్పించిన అఫిడవిట్లో ప్రస్తావించింది. కవిత ఇంట్లో జరిపిన సోదాల్లో మేక శరణ్ ఫోన్ లభించిందని, రెండు సార్లు పిలిచినా శరణ్ విచారణకు రాలేదని కోర్టుకు ఈడీ తెలియజేసింది. సౌత్ లాబీ డబ్బు లావాదేవీల్లో శరణ్ దే కీలక పాత్ర ఉన్నదని మేక శరణ్ కవితకు అత్యంత సన్నిహితుడని, కవిత అరెస్ట్ సమయంలో శరణ్ ఇంట్లోనే ఉన్నారని ఈడీ తన అఫిడవిట్లో పేర్కొంది. అరెస్ట్ సమయంలో శరణ్ ఫోన్‌ను సీజ్ చేసి పరిశీలించగా అందులో సౌత్ లాబీకి సంబంధించిన లావాదేవీల సమాచారం గుర్తించినట్లు తెలిపింది. దీంతో ఈడీ అతడిపై దృష్టి సారించింది. ప్రస్తుతం మేక శరణ్ అందుబాటులో లేరని తెలుస్తోంది. -
శ్రీరాంసాగర్ జలాశయంలో ముగ్గురు యువకులు గల్లంతు
సాక్షి, నిజామాబాద్: మహాశివరాత్రి పండుగపూట నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శ్రీరాంసాగర్ జలాశయంలో పడి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. ఈ ఘటన ముప్కాల్ మండలంలోని ఎస్సారెస్సీ లక్ష్మీ కాలువ హెడ్‌రెగ్యులేటర్ వద్ద శుక్రవారం జరిగింది. గల్లంతైన యువకులను సాయినాథ్, లోకేష్, మున్నాగా గుర్తించారు. వీరంతా జక్రాన్‌పల్లి మండలం గున్యా తండా వాసులుగా గుర్తించారు యువకులు మునిగిపోవడాన్ని గమనించిన స్థానికులు పోలీసులు, అధికారులకు సమాచారమిచ్చారు. స్థానికులు, పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. . పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: మహాశివరాత్రి నాడు విషాదం.. కరెంట్ షాక్‌తో 14 మంది చిన్నారులకు గాయాలు -
లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన సెక్యూరిటీ గార్డు
-
నిజామాబాద్ ఎంపీ సీటు ఈసారి బీఆర్ఎస్దే: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అత్యధిక ఓట్లు వచ్చాయని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. సోమవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన నిజామాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ఈ సారి త్రిముఖ పోరు జరగనుందని అన్నారు. నిజామాబాద్ ఎంపీ సీటు ఈసారి బీఆర్ఎస్ దేనని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని కార్యకర్తలు కోరుతున్నారని తెలిపారు. కార్యకర్తల కోరిక మేరకు పార్టీలో మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు పై కాంగ్రెస్ ప్రభుత్వం దాటవేసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత, ప్రశాంత్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులు, ఇతర నియోజకవర్గాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. చదవండి: బీఆర్ఎస్కు షాక్.. నల్గొండ మున్సిపల్ ఛైర్మన్ పీఠం ‘హస్త’గతం -
నిజామాబాద్ జిల్లాలో దోపిడీ దొంగల బీభత్సం
-
నిజామాబాద్ జిల్లాలో కొకైన్, డ్రగ్స్ కలకలం
-
నల్లిబొక్క కోసం లొల్లి.. పెళ్లి క్యాన్సిల్.. ‘బలగం’ సీన్ రిపీట్
పెళ్లంటే జీవితాంతం గుర్తుండిపోయే ఘట్టం. ప్రతి ఒక్కరు తమ వివాహాన్ని ఎంతో ఆర్భాటంగా చేసుకోవాలని అనుకుంటారు. అలాంటి అందమైన ఈ వేడుకను కొంతమంది చిన్న చిన్న విషయాలతో ముడిపెట్టి.. పెళ్లిని రద్దు చేసుకునే వరకు వెళ్తున్నారు. అమ్మాయి వాళ్లు మర్యాదలు సరిగా చేయలేదని, కట్నం ఎక్కువ ఇవ్వలేదని పెళ్లి క్యాన్సిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇలా వింత వింత కారణాలతో ఏకంగా పీటల మీద కూడా పెళ్లిళ్లు ఆపేస్తున్నారు. అచ్చం అలాంటి ఘటనే తెలంగాణలో జరిగింది. జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. నిశ్చితార్థం రోజు మటన్‌లో నల్లి బొక్క వడ్డించలేదని ఆగ్రహం చెందిన వరుడి కుటుంబ సభ్యులు చివరికి పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారు. నిజామాబాద్‌కు చెందిన వధువుకి, జగిత్యాలకు చెందిన వరుడితో వివాహం నిశ్చయమైంది. గత నెల నవంబర్‌లో వధువు ఇంటి వద్ద నిశ్చితార్థం వేడుక నిర్వహించారు. నిశ్చితార్థం రోజున అమ్మాయి తరపున కుటుంబ సభ్యులు భోజనాలను ఘనంగా ఏర్పాటు చేశారు. వివాహానికి వచ్చిన అతిథులందరికీ నాన్ వెజ్ వంటలు వండించారు. అయితే నిశ్చితార్థం అనంతరం తమకు మటన్‌లో మూలుగ బొక్క వడ్డించలేదని అబ్బాయి బంధువులు చెప్పడంతో గొడవకు దారితీసింది. దీనిపై స్పందించిన వధువు కుటుంబ సభ్యులు మూలుగు బొక్క వంటకాలలో చేయించలేదని చెప్పడంతో గొడవ కాస్తా పెద్దదిగా మారింది. ఈ వివాదం కాస్తా చివరికి పోలీసుల వరకు చేరుకోవడంతో.. అబ్బాయి కుటుంబ సభ్యులను నచ్చజెప్ప ప్రయత్నం చేశారు. కానీ వారు ససేమిరా అంటూ తమను అవమానించారని అన్నారు. అంతేగాక నల్లి బొక్క మెనూలో లేదన్న విషయాన్ని వధువు కుటుంబసభ్యులు ఉద్దేశపూర్వకంగా తమకు తెలియకుండా దాచిపెట్టారని వాదించారు. చివరికి ఈ పెళ్లి వద్దంటూ వరుడి కుటుంబం తెగేసి చెప్పడంతో వివాహం రద్దు చేసుకున్నారు. అయితే ఈ ఘటన అచ్చం ఇటీవల టాలీవుడ్లో వచ్చిన ‘బలగం’ సినిమాలోని కథను గుర్తు చేసింది. మార్చిలో విడుదలైన ఈ సినిమాలో.. మూలుగ బొక్క కోసం బావ బామ్మర్ధుల మధ్య గొడవ జరిగి విడిపోతారు. ఇక్కడ కూడా అలాగే మూలుగ బొక్క కోసం గొడవ పడి చివరకు పెళ్లి సంబంధం రద్దయింది. -
ఒకే కుటుంబం.. 6 హత్యలు.. ఎలా చేశారంటే..!
-
‘ప్రసాద్ తల్లిని కూడా హత్య చేయాలనుకున్నారు’
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో ఒకే ఇంట్లో ఆరుగురు హత్య కేసులో ప్రధాన నిందితుడు ప్రశాంత్‌తో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ తెలిపారు. ఆమె మంగళవారం కేసు సంబంధించిన విషయాలను మీడియాకు వెల్లడించారు. ఒక్కొక్కరినీ ఒక్కో ప్రాంతానికి తీసకువెళ్లి హత్య చేశారని తెలిపారు. ఆయా ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్లలో కేసు నమోదైనట్లు తెలిపారు. ప్రశాంత్‌తో పాటు గుగులోతు విష్ణు, బానోతు వంశీ, వడ్డమ్మ, మరో మైనర్ బాలుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నవంబర్ 29 రోజు ప్రసాద్‌ను రాళ్లతో కొట్టి చంపి పూడ్చిపెట్టారని నిందితులను విచారిస్తే తెలిసిందన్నారు. ఈ హత్యలు చేయడానికి వాడిన టాటా ఆల్ట్రోజ్ కారు, భూమి పత్రాలు, రూ.30 వేలు, ఐదు సెల్ ఫోన్లు దొరికినట్లు చెప్పారు. ఆ ఫొన్లు కూడా మృతి చెందినవారివిగా గుర్తించామని అన్నారు. వారి ప్రణాళిక ప్రకారం ప్రసాద్ వాళ్ల అమ్మను కూడా హత్య చేయాలనుకున్నారని తెలిపారు. ఈ ఆరుగురి హత్యల్లో నిందితుడు ప్రశాంత్ తల్లి పాత్ర కూడా ఉన్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. పలు అనుమానాల ఆధారంగా ఇది కేవలం ప్రథమిక విచారణ అన్నారు. ఈ కేసులో అన్నివైపుల నుంచి లోతుగా తదుపరి దర్యాప్తు కొనస్తామని తెలిపారు. చదవండి: ఇంటిపై కన్నేసి ఇంటిల్లిపాదినీ బలిగొన్న స్నేహితుడు -
నిజామాబాద్ జిల్లాలో ఒకే ఇంట్లో ఆరుగురి హత్య కేసు విచారణ
-
నిజామాబాద్: ఒకే ఇంట్లో ఆరుగురు హత్య.. స్నేహితుడే కారణం!
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణ హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపుతోంది. వారం వ్యవధిలోనే ఒక్కొక్కరిని ఓ నిందితుడు హతమార్చారు. అయితే, వీరి హత్యకు ఆస్తి తగదాలే కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి వివరాల ప్రకారం.. డిచ్పల్లి మండలంలోని మాక్లుర్‌కు చెందిన ప్రసాద్ కుటుంబం గతంలో ఆ గ్రామాన్ని వదిలేసి మాచారెడ్డికి వెళ్ళిపోయి స్థిరపడింది. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. ప్రసాద్‌కు మాక్లుర్‌లో ఓ ఇల్లు ఉంది. ప్రసాద్ స్నేహితుడు ప్రశాంత్ ఆ ఇంటిపైన కన్నేశాడు. లోన్ ఇప్పిస్తానని చెప్పి అతని పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. తీరా లోన్ రాకపోగా ఇల్లును తిరిగి తన పేరున రిజిస్ట్రేషన్ చేయాలని ప్రశాంత్‌పై ప్రసాద్ ఒత్తిడి తెచ్చాడు. ఈ క్రమంలో ఎలాగైనా ఆ ఇంటిని ప్రశాంత్ తన సొంతం చేసుకోవాలనుకున్నాడు. దీంతో, ప్లాన్ ప్రకారం ప్రసాద్‌ను బయటకు తీసుకెళ్ళి నిజామాబాద్–కామారెడ్డి జాతీయ రహదారి అటవీ ప్రాంతంలో హత్య చేశాడు. మరుసటి రోజు ప్రసాద్ ఇంటికి వెళ్ళి మీ భర్తను పోలీసులు అరెస్టు చేశారని నమ్మించి ఆమెను బయటకు తీసుకెళ్ళాడు. ఆమెను కూడా హతమార్చి బాసర నదిలో వదిలేశాడు. ఆ తర్వాత ప్రసాద్ పెద్ద సోదరిని హత్య చేశాడు. అనంతరం.. ఇద్దరు పిల్లలను సోన్ బ్రిడ్జి సమీపంలో, ప్రసాద్ చిన్న సోదరిని మాచారెడ్డి సమీపంలో హత్య చేసినట్లు సమాచారం. అయితే, మాక్లుర్‌కు చెందిన నిందితుడు ప్రశాంత్ వయసు 20 ఏళ్లు. మొదటి మూడు హత్యలు ఒక్కడే చేశాడని.. మిగిలిన మూడు హత్యల్లో మరో ముగ్గురి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హత్య కాబడిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఎక్కడా కూడా మిస్సింగ్ కేసు నమోదు కాలేదు. కాగా, నమ్మిన స్నేహితుడే ఇలా వారిని హత్య చేయడంతో స్థానికులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ ఘటనలో నిందితులకు తగిన శిక్ష విధించాలని కోరుతున్నారు. మరోవైపు.. వీరి హత్యలకు సంబంధించి పోలీసుల అదుపులో నలుగురు నిందితులు ఉన్నట్లు సమాచారం. -
పోచారం రికార్డు బ్రేక్ విక్టరీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్పీకర్, బీఆర్ఎస్ బాన్సువాడ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చరిత్రను తిరగరాశారు. పోచారం తన సమీప అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డిపై విజయం సాధించారు. అయితే తెలుగు రాష్ట్రాల ఎన్నికల చరిత్రలో గౌరవప్రదమైన అసెంబ్లీ స్పీకర్‌గా పని చేసి అనంతరం సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం సాధించారనే సెంటిమెంట్ ఉండేది. ఆ సెంటిమెంట్‌ను పోచారం విజయం సాధించి తొలిసారి తిరగరాశారు. దీంతో చాలా ఏళ్లుగా ఉన్న స్పీకర్‌గా పని చేసి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలవుతారన్న అనవాయితీని గెలిచి బ్రేక్ చేశారు. అదే విధంగా తెలంగాణ ఏర్పాటు అనంతరం.. సిరికొండ మధుసూధనాచారి 2014 అసెంబ్లీ ఎన్నికలలో భూపాలపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి 2014 నుంచి 2018 వరకు తెలంగాణ శాసనసభ తొలి స్పీకర్‌గా పని చేశారు. ఆయన 2018 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. 1991 నుంచి పోటీ చేసిన స్పీకర్లలో ఒక్కరు కూడా గెలవలేదు. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్ సైతం స్పీకర్‌గా చేసిన అనంతర ఎన్నికల్లో ఓడిపోయిన విషయం తెలిసిందే. -
నిజామాబాద్ లో అర్బన్ బారులు తీరిన ఓటర్లు
-
నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ కు ఏర్పాట్లు
-
ఆ 32 నియోజకవర్గాల్లో.. గల్ఫ్ కార్మికులు, చెరకు రైతులది కీలకం
చెరకు సాగు.. నిజాం షుగర్స్ సాక్షి, నిజామాబాద్: అసెంబ్లీ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుతోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు బోర్డు అంశం ఫలితాన్ని తారుమారు చేసిన సంగతి తెలిసిందే. పసుపు బోర్డు తీసుకొస్తానని హామీ ఇచ్చిన ధర్మపురి అర్వింద్ రైతులకు బాండ్ రాసిచ్చిన నేపథ్యంలో ఎంపీగా ప్రజలు పట్టం కట్టారు. ఈ శాసనసభ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలనే లక్ష్యంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రధాని మోదీ ద్వారా పసుపు బోర్డు ప్రకటన చేయించింది. అయితే ప్రస్తుత ఎన్నికల్లో ఈ అంశం అనుకున్నంత స్థాయిలో ప్రభావం చూపడం లేదనే చెప్పాలి. ఇప్పుడు గల్ఫ్ కార్మికుల సంక్షేమం, నిజాం షుగర్స్ అంశాలే ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్, వరంగల్ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో (మొత్తం 32 నియోజకవర్గాలు) సుమారు 15 లక్షల మంది గల్ఫ్ కార్మికులు ఉన్నారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు అంతగా లేకపోవడంతో గల్ఫ్‌కు వలస వెళ్లారు. ఈ కార్మిక కుటుంబాలు తమ సంక్షేమం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. ప్రత్యేకంగా గల్ఫ్ ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత ఎన్నికల్లో గల్ఫ్ జేఏసీ ఆధ్వర్యంలో సిరిసిల్ల నుంచి దొనికెన కృష్ణ(స్వతంత్ర), వేములవాడ నుంచి గుగ్గిల్ల రవిగౌడ్, నిర్మల్ నుంచి స్వదేశ్ పరికిపండ్ల, ధర్మపురి నుంచి భూత్కూరి కాంత, కోరుట్ల నుంచి చెన్నమనేని శ్రీనివాసరావు ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరుపున బరిలో ఉన్నారు. గల్ఫ్ జేఏసీ నాయకులు గల్ఫ్ దేశాల్లో పర్యటించి వలస కార్మికులతో సమావేశమై ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేసేలా ప్రచారం చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. కాగా గల్ఫ్యేతర దేశాల్లో మరణించిన వారి మృతదేహాలను రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చుతో తెప్పిస్తోంది. గల్ఫ్ మృతుల విషయంలో మాత్రం వివక్ష కనిపిస్తోందన్న విమర్శ ఉంది. గల్ఫ్ బోర్డు ఏర్పడితే ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదని ఆ కార్మికులు చెబుతున్నారు. నిజాం షుగర్స్ అంశాన్ని సైతం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాయి. తాము గెలిస్తే నిజాం షుగర్స్ యూనిట్లను తెరిపిస్తామని హామీ ఇస్తున్నాయి. తద్వారా ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లోని 12 నియోజకవర్గాల్లో చెరకు రైతులను ఆకట్టుకునేందుకు ప్రచారం చేస్తున్నాయి. చెరకు పంట విస్తీర్ణం పెంపు విషయమై రెండు జాతీయ పార్టీలు మాట్లాడుతున్నాయి. బోధన్ (ఉమ్మడి నిజామాబాద్), మంబోజిపల్లి (ఉమ్మడి మెదక్), ముత్యంపేట (ఉమ్మడి కరీంగనర్) జిల్లాల్లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తాము రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తెరిపిస్తామని ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ సైతం ప్రకటించారు. గల్ఫ్ బోర్డు ద్వారానే సమస్యలు పరిష్కారం.. గల్ఫ్ బోర్డు ద్వారానే వలస కార్మికుల సమస్యలు పరిష్కారమవుతాయి. వలస కార్మికుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీని ఏర్పాటు చేయాలి. గల్ఫ్ ప్రవాసులను నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించక తప్పదు. గల్ఫ్ ప్రవాసుల ద్వారా ప్రతి ఏటా సంవత్సరానికి వేల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వాలకు లభిస్తోంది. – మంద భీమ్‌రెడ్డి, గల్ఫ్ వ్యవహారాల విశ్లేషకుడు చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధ్దరించాలి.. ఏళ్ల తరబడి చెరకు పంట పండిస్తున్నాం. మా ప్రాంత భూములు చెరకు పంటకు అనుకూలమైనవి. ఈ సీజన్లోనూ 5 ఎకరాల్లో చెరకు పండిస్తున్నాను. బోధన్ నిజాం షుగర్స్‌ను మూసేయడంతో ఇబ్బందులు పడుతున్నాం. బోధన్ ఫ్యాక్టరీని మూసినప్పటి నుంచి కామారెడ్డి జిల్లాలోని గాయత్రి షుగర్స్‌కు తరలించి అమ్ముతున్నాం. బోధన్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తే మాకు మేలు కలుగుతుంది. కొత్త ప్రభుత్వం నిజాం షుగర్స్‌నూ పునరుద్ధరించాలని ఆకాంక్షిస్తున్నాం. – పల్లె గంగారాం, రైతు, హున్స గ్రామం, సాలూర మండలం -
కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి సవాల్.. 80 సీట్లకు తక్కువ వస్తే దేనికైనా సిద్ధం
సాక్షి, నిజామాబాద్/ నారాయణ్‌ఖేడ్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పించారు. నిజామాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి యాత్రలో రేవంత్ మాట్లాడుతూ.. ఎంపీగా కవితను ఓడించారని కేసీఆర్ నిజామాబాద్‌పై పగ పట్టారని అన్నారు. నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు తీసుకువస్తానని చెప్పి గెలిచిన ఎంపీ జాడ లేకుండా పోయాడని ధర్మపురి అర్వింద్‌ను ఉద్ధేశించి విమర్శించారు. కేసీఆర్ కుటుంబం లక్షల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసిందని రేవంత్ మండిపడ్డారు. పదవి పోతుందన్న భయంతో సీఎం అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని, కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లు కూడా రావని కేసీఆర్ చెబుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. 80కి పైగా సీట్లలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న రేవంత్.. 80 సీట్లకు తక్కువ వస్తే కేసీఆర్ వేసే శిక్షకు నేను సిద్ధమని సవాల్ విసిరారు. వంద రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని సీఎం కేసీఆర్ చెప్పి పదేళ్లు గడిచిందని.. ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పటివరకూ చక్కెర పరిశ్రమను ఎందుకు తెరిపించలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో మద్దతు ధర అడిగిన ఎర్రజొన్న రైతులపై పోలీసు కేసులు పెట్టారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులను వేధించారని అన్నారు. రైతుల భూములు మింగేందుకు ప్రయత్నించారు. ఎన్నికలు రాగానే కేసీఆర్ బక్కపలుచని వ్యక్తి అంటూ ప్రచారం చేస్తున్నాడని, వందల కోట్లు, వేల ఎకరాలు దోచుకునేటప్పుడు, కేసీఆర్, కేటీఆర్‌లు పోటీ పడతారని విమర్శించారు. చదవండి: రేవంత్ రెడ్డి పెద్ద దొంగ.. నీతి నియమం లేని వ్యక్తి: కేసీఆర్ నారాయణ్‌ఖేడ్ గడ్డపై కాంగ్రెస్ గెలుపు ఖాయం: రేవంత్ ‘మీ ఉత్సాహం చూస్తోంటే నారాయణ్ ఖేడ్ గడ్డపై సంజీవ రెడ్డి 50 వేల మెజారిటీతో గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. నాడు అప్పారావు షెట్కార్, శివరాజ్ షెట్కార్. స్వాతంత్ర్యం కోసం నినదించిన కుటుంబం షెట్కాట్ కుటుంబం. అలాంటి కుటుంబానికి చెందిన సురేష్ షెట్కార్‌ను పార్లమెంటు సభ్యుడిగా గెలుపించుకునే బాధ్యత మాది. ఇందిరమ్మ రాజ్యంలో నారాయణ్ ఖేడ్‌ను అభివృద్ధి చేసే బాధ్యత మాది. అబద్దాలు చెప్పి మోసం చేయడంలో కేసీఆర్‌తో ప్రపంచంలోనే ఎవరూ పోటీ పడలేరు. బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టులను ఏడాదిలో పూర్తి చేస్తామని కేసీఆర్ చెప్పిండు. కుర్చీ వేసుకుని కూర్చుని ప్రాజెక్టులు కడతమన్న కేసీఆర్.. మందేసి ఫామ్ హౌస్‌లో పడుకున్నావా? నల్లవాగు పూర్తి చేసి రైతులను ఆదుకుంటామని కేసీఆర్ మాట తప్పిండు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే ప్రత్యేక నిధులతో ఇక్కడి తండాలను అభివృద్ధి చేస్తాం. సర్పంచులకు బిల్లులు రావాలంటే నియోజకవర్గంలో భూపాల్ రెడ్డిని బండకేసి కొట్టాలి. కేసీఆర్ తాత దిగొచ్చినా.. నారాయణ్ ఖేడ్, జహీరాబాద్ పార్లమెంటు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం’ అని రేవంత్ పేర్కొన్నారు. -
ఇందూరుకు ఇవి కావాలి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఉత్తర తెలంగాణలో కీలకమైన నిజామాబాద్ నగరంలో 4,70,152 మంది జనాభా ఉన్నారు. ఇందులో 2,86,766 మంది ఓటర్లు ఉన్నారు. నగరం వేగంగా విస్తరిస్తున్నా ఆ మేరకు సౌకర్యాల కల్పన మాత్రం జరగడం లేదన్న వాదనలున్నాయి. ఇక్కడ దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న భూగర్భ డ్రైనేజీ, ముంపు సమస్యల పరిష్కారంతో పాటు ప్రజల డిమాండ్లు ఇలా ఉన్నాయి. బస్తీ దవాఖానాల సేవలు అంతంతే.. నిజామాబాద్‌లో బస్తీ దవాఖానాలు సేవలు నామమాత్రమే. నగరంలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఉన్నప్పటికీ సేవలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. సేవలను మెరుగుపరచాలి. భూగర్భ డ్రైనేజీ పనులకు మోక్షం ఎప్పుడు నగరంలో భూగర్భ డ్రైనేజీ పనులు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మొదలుపెట్టారు. ఇటీవల పనులు పూర్తయినా, మురుగునీరు ఇళ్ల నుంచి వెళ్లడానికి కనెక్షన్లు ఇవ్వలేదు. నగరం విస్తరించిన నేపథ్యంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ఇతర ప్రాంతాలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ‘నుడా’ పరిధిలో డ్రైపోర్టు ఏర్పాటు చేయాలి నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా) పరిధిలోని డిచ్పల్లి రైల్వేస్టేషన్ వద్ద లేదా జానకంపేట రైల్వేస్టేషన్ వద్ద 50 ఎకరాల్లో డ్రైపోర్టు ఏర్పాటు చేసేందుకు కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంసిద్ధత వ్యక్తం చేసింది. డ్రైపోర్టు ఏర్పాటైతే ఇక్కడి నుంచి వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా ఎగుమతి చేయవచ్చని, తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఛాంబర్ ఆప్ కామర్స్ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఎకానమీ సైతం పెరుగుతుందంటున్నారు. ముంపు సమస్య నివారించాలి నగరం మధ్యలో ప్రవహిస్తున్న పులాంగ్ వాగు ఆక్రమణల కారణంగా ముంపు సమస్య ఉత్పన్నమవుతోంది. రామర్తి చెరువు 70 శాతం ఆక్రమణకు గురైంది. దీంతో బోధన్ రోడ్డుకు ఇరువైపులా వర్షాకాలంలో ముంపు తప్పడం లేదు. న్యాల్కల్ రోడ్డు లోని రోటరీనగర్ ముంపునకు గురవుతోంది. నగరం విస్తరించిన నేపథ్యంలో భూగర్భ డ్రైనేజీ విస్తరించాలని ప్రజలు కోరుతున్నారు. ముంపు నివారణకు శాశ్వత పరిష్కారం కోరుతున్నారు. అంతర్గత రోడ్లు అధ్వానం.. కార్పొరేషన్ పరిధిలో ప్రధాన రోడ్లు మాత్రమే బాగున్నాయి. అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఈ రోడ్లను నిర్మించాలన్న డిమాండ్లున్నాయి. ఒక్క సర్కారీ ఇంజనీరింగ్ కళాశాల కూడా లేదు నగరంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల లేదు. ఇక నగరానికి సమీపంలో తెలంగాణ వర్సిటీ ఉన్నా, దీని పరిధిలోనూ ఇంజనీరింగ్ కళాశాల లేదు. తెలంగాణ వర్సిటీలో కోర్సులు పెంచాలన్న డిమాండ్లు ఉన్నాయి. -
Nizamabad: అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్దేశించేదీ వీరే..
సాక్షి, నిజామాబాద్: రాబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్దేశించే స్థాయికి మహిళలు చేరుకున్నారు. జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్ల శాతం ఎక్కువగా ఉండటంతో గెలిచే అభ్యర్థి ఎవరు, తర్వాతి స్థానంలో నిలిచే వారు ఎవరని నిర్ణయించే శక్తి మహిళా ఓటర్లకే ఉందని స్పష్టమవుతోంది. జిల్లాలో బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్ నియోజకవర్గాలతో పాటు బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాలున్నాయి. ఆరు నియోజకవర్గాల ఓటర్ల సంఖ్య అందులో నమోదైన మహిళా ఓటర్ల లెక్కను పరిశీలిస్తే వారి ఓట్ల సంఖ్యనే ఎక్కువగా ఉందని తేలింది. పురుషుల ఓటర్లలో అనేక మంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలతో పాటు, పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు ఉన్నారు. ఈ లెక్కన మహిళలు వేసే ఓట్లే అభ్యర్థుల గెలుపునకు కీలం కానున్నాయి. అత్యధికంగా రూరల్ నియోజకవర్గంలోనే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండగా తర్వాత బాల్కొండ నియోజకవర్గంలో మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే ఎక్కువగా ఉంది. మహిళా ఓటర్ల కోసం గాలం.. అన్ని నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వారిని ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు ఇప్పటి నుంచి ప్రయత్నాలు మొదలు పెట్టారు. అధికార పార్టీ అభ్యర్థులు మొదట ఖరారు కావడంతో వారు దసరా, బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మహిళలకు బహుమతులను పంచిపెడుతున్నారు. చీరలు, కుక్కర్లు, గ్రైండర్లు, ఇతరత్రా గృహోపకరణాలు, అందిస్తూ మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. మహిళలు తమవైపు ఉంటే విజయం వరిస్తుందనే ధీమాతో అభ్యర్థులు మహిళా ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. మహిళా ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సి ఉంది. ఆరు నియోజకవర్గాల్లో ఓట్ల వివరాలు నియోజకవర్గం బాల్కొండ ఆర్మూర్ అర్బన్ రూరల్ బోధన్ బాన్సువాడ మహిళా ఓటర్లు 1,15,898 1,09,933 1,47,571 1,32,212 1,12,381 1,00,608 పురుష ఓటర్లు 99,728 96,404 1,39,163 99,728 1,03,577 92,225 ఎక్కువున్న మహిళలు 16,170 13,529 8,408 32,484 8,804 -
కేసీఆర్ లూటీ చేసిందంతా తిరిగి ఇస్తాం: రాహుల్ గాంధీ
సాక్షి, నిజామాబాద్: సామాజిక తెలంగాణ కోరుకొని సోనియాగాంధీ రాష్ట్రాన్ని ఇచ్చారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. సోనియా మద్దతు ఇవ్వకపోతే తెలంగాణ వచ్చేది కాదని అన్నారు. కానీ తెలంగాణ ఒకే కుటుంబం చేతిలో బందీ అయ్యిందని విమర్శించారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కార్నర్ మీటింగ్‌లో రాహుల్ మాట్లాడారు. ప్రధాని మాటలకు విలువ లేదని అన్నారు. ఆర్మూర్ ప్రాంతంలో పసుపు విషయంలో ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు అబద్ధపు హామీ ఇచ్చారని మండిపడ్డారు. నాలుగున్నరెళ్ళ కిందట పసుపు బోర్డు ఇస్తామని చెప్పి కాలయాపన చేశారని ధ్వజమెత్తారు. పసుపు పంటకు రూ. 12 నుంచి 15 వేలు మద్దతు ధర ఇస్తామని తెలిపారు. పసుపు రైతులతో పాటు అన్ని పంటలకు ఎమ్ఎస్పీతో పాటు రూ. 500 బోనస్ ఇస్తామని రాహుల్ పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటే తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటేనని విమర్శించారు. తెలంగాణ బీఆర్ఎస్ బీజేపీ.. కేంద్రంలో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు పలుకుతుందని దుయ్యబటారు. తన మీద 24 కేసులు ఉన్నాయన్న రాహుల్.. కేసీఆర్ మీద ఎన్ని కేసులు ఉన్నాయని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ మీద సీబీఐ, ఈడీ, ఐటీ కేసులు, చర్యలు ఉండవని అన్నారు. దేశంలోనే అవినీతి సీఎం కేసీఆరేనని మండిపడ్డారు. కాంగ్రెస్ గెలుపు పక్కా కాంగ్రెస్‌ను ఓడించేందుకుచ బీజేపీని గెలిపించేందుకు ఎంఐఎం రాష్ట్రాల్లో తమ అభ్యర్థులను నిలబెడతారని రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేయాలని చెబితే అక్కడ ఎంఐఎం ఉంటుందని మండిపడ్డారు. తెలంగాణ సహా ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్ గెలుస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. చదవండి: సింగరేణి కార్మికులకు దసరా బోనస్.. ఒక్కొక్కరికి ఎంతంటే! ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ నాకు ఇల్లు లేదు. దేశమే నా ఇల్లు. మా కుటుంబానికి ఏ అవసరం వచ్చినా తెలంగాణ ప్రజలు అండగా ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ. 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తాం. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తాం. పెన్షన్ రూ. 4 వేలు ఇస్తాం. రైతు కూలీలకు ఏడాదికి రూ. 12 వేలు ఇస్తాం. కేసీఆర్ ఎంత లూటీ చేస్తున్నారో అంతా తిరిగి ఇస్తాం’ అంటూ రాహుల్ కేసీఆర్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. రోడ్డు మార్గాన హైదరాబాద్‌కు.. సభ అనంతరం ఆర్మూర్ నుంచి రోడ్డు మార్గంలోనే రాహుల్ హైదరాబాద్ బయల్దేరారు. హైలికాప్టర్ రద్దు కావడంతో రోడ్డు మార్గంలో నేరుగా శంషాబాద్ వెళ్తున్నారు. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. దీంతో తెలంగాణలో రాహుల్ గాంధీ విజయభేరీ తొలి విడత బస్ యాత్ర ముగిసింది. ఈనెల 18న రామప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి రాహుల్, ప్రియాంక యాత్ర ప్రారంభించారు. ములుగు నియోజక వర్గం నుంచి ఆర్మూర్ వరకుమూడు రోజుల యాత్ర సాగింది. ములుగు, భూపాలపల్లి, మంథని, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, చొప్పదండి, ఆర్మూర్ నియోజక వర్గాలలో కొనసాగింది. కాంగ్రెస్‌లో చేరిన రేఖా నాయక్ ఆర్మూర్ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్‌లో చేరారు. సిట్టింగ్‌ను కాదని ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్‌ను జాన్సన్ నాయక్ కేటాయించడంతో అసంతృప్తి చెందిన ఎమ్మెల్యే రేఖా నాయక్ ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. -
TS Election 2023: పసుపు.. చక్కెర
తుమాటి భద్రారెడ్డి: రైతు ఉద్యమాల వేదికగా పేరున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అధికార బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు శాసనసభ ఎన్నికలకు సకల అస్త్రాలతో సన్నద్ధమవుతున్నాయి. ఈ ఉమ్మడి జిల్లాలో మొత్తం 9 శాసనసభ స్థానాలు ఉండగా 2014లో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. 2018లో ఎల్లారెడ్డి మినహా మిగిలిన 8 సీట్లు గెలిచింది. అయితే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ బీఆర్ఎస్లోకి ఫిరాయించారు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం పసుపు బోర్డు హామీతో బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ రైతుల ఆసరాతో అనూహ్యంగా కేసీఆర్ కుమార్తె కవితపై విజయం సాధించారు. ఇక ఇప్పుడు నిజాం షుగర్స్ అంశం ప్రధాన ఎజెండాగా రైతుల ఓట్లు మరోసారి కొల్లగొట్టే లక్ష్యంతో బీజేపీ ప్రణాళిక రూపొందించుకుంటోంది. కాంగ్రెస్ సైతం నిజాం షుగర్స్, మంచిప్ప రిజర్వాయర్ ముంపు, పోడు భూముల అంశం, ధరణి సమస్యలు, ఆరు హామీలతో ఉత్సాహంగా బరిలోకి దిగుతోంది. అలాగే దళితబంధులో కమీషన్ల వసూళ్లు, డబుల్ ఇళ్ల నిర్మాణంలో విఫలం, కామారెడ్డి జిల్లాలో సాగునీటి సమస్య తదితరాలపైనా ప్రచారం చేస్తోంది. ఇక సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని, పైగా ఉమ్మడి జిల్లాలోని కామారెడ్డిలో సీఎం కేసీఆర్ బరిలోకి దిగుతుండడంతో ఆ ప్రభావం చుట్టుపక్కల నియోజకవర్గాలపై ప్రభావం చూపుతుందని బీఆర్ఎస్ అభ్యర్థులు ధీమాగా ఉన్నారు. ప్రస్తుతానికి మూడు పార్టీల మధ్య త్రిముఖ పోరు ఉన్నప్పటికీ కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ప్రకటన తర్వాత సమీకరణాలు మారనున్నాయి. – సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ బాల్కొండ బరిలో ముక్కోణపు పోటీ వరుసగా రెండుసార్లు గెలుపొందిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి తాను చేసిన అభివృద్ధి గెలిపిస్తుందని ధీమాగా ఉన్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్‌రెడ్డికి టికెట్ వచ్చింది. ఈయనకు గత ఎన్నికల్లో బీఎస్పీ తరపున 42వేల ఓట్లు దక్కడం గమనార్హం. ఇక బీజేపీ తరపున ఏలేటి మల్లికార్జున్‌రెడ్డి బదులు మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మను బరిలోకి దించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. దీంతో త్రిముఖ పోటీ తప్పని పరిస్థితి. బోధన్ బాస్ ఎవరో?.. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఈ నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి గెలిచేందుకు బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ టికెట్ ఆశిస్తున్న మేడపాటి ప్రకాశ్‌రెడ్డి, వడ్డి మోహన్‌రెడ్డి ఎవరి ప్రచారం వారు చేస్తున్నారు. కాంగ్రెస్ తరపున మాజీ మంత్రి సుదర్శన్రెడ్డికే టికెట్ ఇచ్చారు. షకీల్‌ను ఓడించాలనే లక్ష్యంతో శరత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటుండడం గమనార్హం. ఆర్మూర్ ఆషామాషీ కాదు ఇప్పటికే రెండుసార్లు గెలవడంతో ఈసారి గెలిస్తే మంత్రి పదవి వస్తుందని బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి ప్రచారం చేస్తున్నారు. అయితే జీవన్‌రెడ్డి వ్యవహార శైలిపై బీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తితో ఉండడంతో గడ్డు పరిస్థితి తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి పొద్దు టూరి వినయ్‌రెడ్డికి టికెట్ ఖరారు అయ్యింది. బీజేపీ నుంచి పైడి రాకేశ్‌రెడ్డి బరిలో ఉన్నట్లు చెబుతున్నప్పటికీ పార్టీ ఆదేశిస్తే చివరి నిమిషంలో ఎంపీ అర్వింద్ బరిలో ఉండే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అర్వింద్ బరిలో ఉంటే గెలుపు సులువని పార్టీ శ్రేణులు, వివిధ వర్గాలు భావిస్తున్నాయి. నిజామాబాద్‌లో నిలిచేది ఎవరు? ముచ్చటగా మూడోసారి గెలిచేందుకు బిగాల గణేశ్‌గుప్తా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బలంగా ఉన్నాయి. బీజేపీ నుంచి ధన్పాల్ సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ టికెట్ కోసం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఢిల్లీ స్థాయిలో గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడి పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను బట్టి పోటీ రసవత్తరంగా మారనున్నట్లు తెలుస్తోంది. కామారెడ్డిలో కింగ్‌కి పోటీ ఇచ్చేనా? బీఆర్ఎస్ నుంచి సీఎం కేసీఆర్ బరిలోకి దిగుతున్నప్పటికీ కాంగ్రెస్ నుంచి షబ్బీర్‌అలీ, బీజేపీ నుంచి∙వెంకటరమణారెడ్డి పోటీలో నిలిచే అవకాశాలు ఉన్నాయి. షబ్బీర్‌అలీ గతంలో తాను చేసిన అభివృద్ధి గురించి చెబుతున్నారు. కామారెడ్డి మాస్టర్‌ప్లాన్, అక్రమ వెంచర్లు, ధరణి అక్రమాలు, పావలా వడ్డీ బకాయిల ఉద్యమాల్లో పాల్గొన్న వెంకటరమణారెడ్డి గెలుస్తాననే ధీమాతో ఉన్నారు. నిజామాబాద్ రూరల్‌లో సీన్ మారుతుందా? వరుసగా మూడోసారి, మొత్తంగా ఐదోసారి గెలిచి కేబినెట్లో స్థానం సంపాదించేందుకు బాజిరెడ్డి గోవర్దన్ లెక్కలు వేసుకుంటున్నారు. బీజేపీ నుంచి కులాచారి దినేష్‌కు టికెట్ దక్కనుందనే ప్రచారం నడుస్తోంది. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, నగేష్‌రెడ్డి టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారు. మంచిప్ప జలాశయం ముంపు అంశం, ధరణి, పోడు భూముల అంశాలు కాంగ్రెస్ ప్రధాన ప్రచార అ్రస్తాలుగా వాడుతోంది. బాన్సువాడ బరిలో గెలుపెవరిది? రాష్ట్రంలోనే అత్యధికంగా డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గెలుపుపై ధీమాగా ఉన్నారు. తాను చేసిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయనే నమ్మకంతో బరిలో మరోమారు దిగుతున్నారు. కాంగ్రెస్ నుంచి మదన్మోహన్ నిలబడితే గెలుపు అవకాశాలుంటాయనే చర్చ నడుస్తోంది. బీజేపీ నుంచి మాల్యాద్రిరెడ్డి టికెట్ రేసులో ఉన్నారు. ఎల్లారెడ్డి.. ఏలేదెవరో? గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచిన జాజాల సురేందర్ బీఆర్ఎస్లోకి వెళ్లారు. కేసీఆర్ పక్క నియోజకవర్గంలో పోటీ చేస్తుండడంతో గెలుపుపై ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి మదన్మోహన్, సుభాష్ రెడ్డి మధ్య టికెట్ పోటీ ఉంది. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ద్విముఖ పోటీ నడుస్తోంది. జుక్కల్ ఎవరిపరం? సిట్టింగ్ ఎమ్మెల్యే హన్మంత్‌సింధే మూడోసారి గెలుస్తాననే ధీమాతో ఉన్నారు. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే అరుణతార, బుచ్చన్న టికెట్ రేసులో ఉన్నారు. కాంగ్రెస్ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాం, గడుగు గంగాధర్ మధ్య పోటీ నెలకొనగా మరో ఎన్ఆర్ఐకి టికెట్ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
వేల్పూర్‌కు సీఎం కేసీఆర్.. మంత్రి ప్రశాంత్‌రెడ్డికి పరామర్శ
సాక్షి, వేల్పూర్/హైదరాబాద్: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి వేముల మంజులమ్మ(77) హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఆమె చాలారోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. పరిస్థితి విషమించి ఆమె మరణించడంతో నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రశాంత్‌రెడ్డి నివాసంలో విషాదం నెలకొంది. బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్‌లో మంజులమ్మ అంత్యక్రియలు నేడు (శుక్రవారం) జరగనున్నాయి. మంత్రి తల్లి అంత్యక్రియలకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. కాగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే షకిల్ పరామర్శించారు. వేముల మాతృమూర్తి మృతిపై సీఎం కె.చంద్రశేఖర్‌రావుతో పాటు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ తదితరులు సంతాపం ప్రకటించారు. చదవండి: నేటి నుంచి తెలంగాణలో బడులకు దసరా సెలవులు -
సిక్కిం వరదల్లో నిజామాబాద్ ఆర్మీ జవాన్ మృతి
సాక్షి, నిజాబాద్: సిక్కింలో మంగళవారం అర్ధరాత్రి సంభవించిన వరదల్లో చిక్కుకొని చనిపోయిన ఆర్మీ జవాన్లలో నిజామాబాద్ జిల్లా సాలూర మండలం కుమ్మన్‌పల్లికి చెందిన నీరడి గంగాప్రసాద్ ఉన్నట్టు కుటుంబసభ్యులకు సమాచారం వచ్చింది. గురువారం మృతదేహం లభ్యం కాగా, పోస్టుమార్టం కోసం పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్గిరి జిల్లా ఆస్పత్రికి ఆర్మీ అధికారులు తరలించారు. శుక్రవారం స్వగ్రామానికి మృతదేహం చేరుకునే అవకాశాలున్నా యి. ఎమ్మెల్యే షకీల్ సమకూర్చిన విమానంలో మృతుడి తమ్ముడు సుధాకర్, మరో బంధువు దిలీప్ బయలుదేరి వెళ్లి ఘటనాస్థలానికి చేరుకున్నారు. పశ్చి మబెంగాల్లోని బినాగుడి ఆర్మీ హెడ్ క్వార్టర్లో విధులు నిర్వహిస్తున్న గంగాప్రసాద్ శిక్షణలో భాగంగా 20 రోజుల క్రితం సిక్కింలోని జులుక్ ప్రాంతానికి వెళ్లి తీస్తా నది వరదల్లో గల్లంతయ్యారు. గంగాప్రసాద్‌ది నిరు పేద దళిత కుటుంబం. గంగాప్రసాద్‌కు భార్య శిరీష, ఇద్దరు కుమారులు హర్ష(6), ఆదిత్య(3) ఉన్నారు. -
కేసీఆర్ సర్కార్ పాలనకు చరమగీతం పాడాలి
నిజామాబాద్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించాలని, సీఎం కేసీఆర్ సర్కార్ పాలనకు చరమగీతం పాడాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం నిజామాబాద్‌లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో అవినీతి, కుటుంబ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు బుద్ధి చెప్పే అవకాశం ప్రజలకు లభిస్తోందని చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేసేలా ప్రజ లు ముందుకు రావాలని కోరారు. కల్వకుంట్ల కుటుంబానికి ముందుంది ముసళ్ల పండుగ అని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. అసలైన కథ ఇప్పుడే మొదలైందన్నారు. కేసీఆర్‌ను మించిన అబద్ధాలకోరు రాష్ట్రంలో మరొకరు లేరని బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ విమర్శించారు. పసుపు బోర్డు ఇస్తే అభ్యర్థి ని పెట్టబోనని చెప్పిన బీఆర్ఎస్ ఏం ముఖం పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తుందో చెప్పాలన్నారు. పసుపు రైతుల దశాబ్దాల కల ప్రధాని మోదీ నెరవేర్చారని బీజేపీ జాతీయ ఉ పాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. కేసీఆర్ కుటుంబ రాజకీయాలను సమాధి చేయాలని బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్చార్జి మురళీధర్‌రావు పిలుపునిచ్చారు. పసుపు బోర్డు వచ్చినందుకు రైతులందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఎంపీ సోయం బాపూరావు, ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి, పార్టీ నేతలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, ఎం.రవీంద్రనాయక్, జి.విజయ రామారావు, రమేశ్ రాథోడ్, గరికపాటి మోహన్‌రావు, బూర నర్సయ్యగౌడ్, డి.ప్రదీప్‌రావు తదితరులు పాల్గొన్నారు. అరుణతార వందన సమర్పణ చేశారు. సభ ముగిశాక వేదికపైనే బండి సంజయ్, ఈటల రాజేందర్, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డిని ప్రధాని భుజం తట్టి అభినందించారు. కొన్నేళ్లుగా చెప్పులు కూడా ధరించకుండా పోరాడుతున్న పసుపు బోర్డు ఉద్యమ నాయకుడు మనోహర్‌రెడ్డి గురించి సంజయ్‌ని అడిగి తెలుసుకున్నారు. బీజేపీలో జోష్ మోదీ బహిరంగసభ విజయవంతం కావడంతో కాషాయదళంలో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. అంచనాలకు మించి భారీగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు హాజరుకావడం, ప్రధాని ప్రసంగానికి జనాల్లో బాగా స్పందన కనిపించడంపై పార్టీ నేతలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్, అవినీతి అంశాలను మోదీ ప్రస్తావించినప్పుడల్లా కేకలు, ఈలలు, చప్పట్లతో సభికు లు మద్దతు ప్రకటించారు. తెలుగులో నా కుటుంబ సభ్యులారా.. అని అనగానే హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ప్రసంగం మధ్యలో మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. -
పని పూర్తి చేసే సంస్కృతి మాది
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: శంకుస్థాపన చేస్తే ఆ పనిని కచ్చితంగా పూర్తి చేయాలనే సంస్కృతిని తమ ప్రభుత్వం పాటిస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. మంగళవారం నిజామాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని రూ.8 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే విద్యుత్ కీలకమని.. ఉత్పత్తి, సరఫరా నిరంతరాయంగా ఉంటే పరిశ్రమల వృద్ధికి ఆలంబన అవుతుందని చెప్పారు. రామగుండం ఎన్టీపీసీలో 800 మెగావాట్ల యూనిట్‌ను ప్రస్తుతం ప్రారంభించుకున్నామని, త్వరలో రెండో యూనిట్ సైతం ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కేంద్రంలో ఉత్పత్తయ్యే విద్యుత్‌లో అధిక భాగం తెలంగాణ ప్రజలకు దక్కుతుందన్నారు. ధర్మాబాద్– మనోహరాబాద్– మహబూబ్‌నగర్– కర్నూల్ మధ్య రైల్వే విద్యుదీకరణతో రైళ్ల సరాసరి వేగం, రాష్ట్రంలో కనెక్టివిటీ మరింత పెరుగుతాయని చెప్పారు. మనోహరాబాద్– సిద్దిపేట మధ్య కొత్త రైల్వేలైన్‌తో పరిశ్రమలు, వ్యాపారానికి తోడ్పాటు అందుతుందన్నారు. ఇక ప్రతి జిల్లాలో వైద్య సదుపాయాల నాణ్యత కోసం పీఎం ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ తీసుకొచ్చామని.. తెలంగాణలోని 20 జిల్లాల్లో క్రిటికల్ కేర్ బ్లాకులు ఏర్పాటు చేస్తున్నామని ప్రధాని వివరించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో తెలంగాణలో 50 పెద్ద ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని, ప్రజల ప్రాణాలను కాపాడటంలో అవి కీలక పాత్ర పోషించాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, కె.లక్ష్మణ్, ధర్మపురి అరి్వంద్, సోయం బాపూరావు తదితరులు పాల్గొన్నారు. ప్రధాని మోదీకి పసుపు రైతుల సన్మానం పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటన నేపథ్యంలో పసుపు రైతులు నిజామాబాద్ సభా వేదికపై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ సన్మానం చేశారు. పసుపు కొమ్ములతో తయారు చేసిన ప్రత్యేక దండ వేసి, పసుపు మొక్కలను అందించారు. మోదీ ఆ మొక్కలను పైకెత్తి ప్రదర్శించారు. తెలుగులో ప్రారంభించి.. ప్రధాని మోదీ నిజామాబాద్ సభలో తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పలుమార్లు ‘నా కుటుంబ సభ్యులారా..’అని ప్రస్తావిస్తూ మాట్లాడారు. ఆయన ప్రసంగిస్తున్నంత సేపు మోదీ.. మోదీ.. అంటూ బీజేపీ కార్యకర్తలు, అభిమానులు నినాదాలు చేస్తూ కనిపించారు. ఓ చిన్నారి భరతమాత వేషధారణలో వచ్చిన విషయాన్ని చూసి.. ‘‘ఓ చిన్ని తల్లి రూపంలో భారతమాత ఇక్కడికి వచ్చింది. ఆ చిన్నారికి నా తరఫున అభినందనలు..’’అని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ఇవీ.. ప్రధాని మోదీ నిజామాబాద్‌లోని సభా స్థలిలో విడిగా ఏర్పాటు చేసిన వేదికపై నుంచి రూ.8 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేశారు. అనంతరం సమీపంలో ఏర్పాటు చేసిన మరో వేదికపై సభను ఉద్దేశిస్తూ రాజకీయ ప్రసంగం చేశారు. తొలి వేదికపై ప్రధాని అభివృద్ధి కార్యక్రమాలివీ.. రామగుండం ఎన్టీపీసీ ప్లాంట్‌లో 800 మెగావాట్ల యూనిట్ జాతికి అంకితం. ఆయుష్మాన్ భారత్ కింద రాష్ట్రంలోని 20 జిల్లా ఆస్పత్రుల్లో క్రిటికల్ కేర్ బ్లాక్‌లకు శంకుస్థాపన. ∙మనోహరాబాద్ – సిద్దిపేట మధ్య కొత్త రైల్వే లైన్ ప్రారంభం.. సిద్దిపేట–సికింద్రాబాద్ రైలు సర్వీస్‌కు పచ్చజెండా.. ధర్మాబాద్ – మనోహరాబాద్ – మహబూబ్‌నగర్ – కర్నూల్ మధ్య రైల్వే విద్యుదీకరణ పనుల ప్రారంభం -
ఓ మంచి డాక్టరమ్మ -మిసెస్ తెలంగాణ
సేవకు అందమైన మాధ్యమం మిసెస్ తెలంగాణ తెచ్చిన సెలబ్రిటీ గుర్తింపుతో ఒక డాక్టర్‌గా, ఒక మహిళగా నా వంతు సామాజిక బాధ్యత అని నేను చేపట్టిన అనేక కార్యక్రమాలను ఇంకా వేగంగా తీసుకువెళ్లగలుగుతాను. వయలెన్స్ అగైనెస్ట్ ఉమెన్. జెండర్ ఈక్వాలిటీ కోసం పని చేస్తున్నాను. భ్రూణ హత్యలకు కారణం అమ్మాయంటే ఇష్టం లేక కాదు. సమాజంలో అఘాయిత్యాలు పెచ్చుమీరిన ఈ రోజుల్లో అమ్మాయిని భద్రంగా పెంచగలమా లేదా అనే భయమే ప్రధాన కారణమని అనేక మంది మహిళల మాటల ద్వారా తెలిసింది. కొన్ని ఎన్జీవోలతో కలిసి తొమ్మిదవ తరగతి నుంచి పన్నెండవ తరగతి చదివే ఆడపిల్లల్లో అవేర్నెస్ తీసుకురావడం, అబ్బాయిలను సెన్సిటైజ్ చేస్తున్నాను. ఇక ఇలాంటి కార్యక్రమాలను వేగవంతం చేయగలుగుతాను. – డాక్టర్ స్రవంతి గాదిరాజు, అసోసియేట్ ప్రోఫెసర్, లాప్రోస్కోపిక్, రోబోటిక్ సర్జన్, గైనిక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ స్రవంతి గాదిరాజు... తెలంగాణ, నిజామాబాద్‌లో డాక్టర్. యూఎస్‌లో గైనిక్ ఆంకాలజీ చేసి తెలుగు రాష్ట్రాల్లోని ఆదివాసీ మహిళల్లో ఎదురవుతున్న సర్వైకల్ క్యాన్సర్ నిర్మూలన కోసం పని చేస్తున్నారు. ‘డాక్టర్ తన ఉద్యోగం హాస్పిటల్లోనే అనుకుంటే సమాజం సంపూర్ణ ఆరోగ్యవంతం కాలేదు. పేషెంట్లను వెతుక్కుంటూ వైద్యులు వెళ్లగలగాలి. అప్పుడే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలం. అందుకోసమే ఆదివాసీలు ఎక్కువగా నివసించే, ఆరోగ్యం పట్ల కనీస అవగాహన లేని వారి ఇళ్ల ముందుకు వెళ్తున్నాను. ఆరోగ్య పరిరక్షణ అవసరాన్ని తెలియచేస్తున్నాను. నాలోని ఈ గుణమే నన్ను మిసెస్ తెలంగాణ పోటీల్లో విజేతగా నిలిపింది. నేను బ్యూటీ కాంటెస్ట్‌ల వైపు అడుగులు వేయడం సెలబ్రిటీ గుర్తింపు కోసం కాదు. ఒకవేళ సెలబ్రిటీ గుర్తింపు వస్తే... ఆ గుర్తింపుతో సమాజంలో నేను కోరుకున్న మార్పు కోసం పని చేయడం సులువవుతుంది. బ్యూటీ పజంట్గా ఇప్పుడు నేను సమాజానికి చేస్తున్న వైద్యసేవలను మరింత త్వరగా విస్తరించగలుగుతాను’ అన్నారు ‘సాక్షి’తో డాక్టర్ స్రవంతి. పేషెంట్ల దగ్గరకు వెళ్లాలి! ఈ రోజు మీకు కనిపిస్తున్న ఈ విజేత గుర్తింపు అన్నది నేను సాధించిన ఘనత అని అనుకోను. మా అమ్మానాన్నలు తీర్చిదిద్దిన కూతుర్ని. అమ్మ గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్ నర్స్. నాన్న విజయ డైరీలో మేనేజర్. అమ్మ తన డ్యూటీ విషయంలో ఎంత కచ్చితంగా ఉండేదో, తన సలహా సూచనల కోసం వచ్చిన వారిని ఎంత ఆప్యాయంగా చూసుకునేదో దగ్గరగా చూశాను. ప్రభావతక్క అని అందరూ ఆమెని సొంత అక్కలా అభిమానించేవారు. అమ్మతోపాటు హాస్పిటల్‌కి వెళ్లినప్పుడు డాక్టర్ కనిపించగానే పేషెంట్లు సంతోషంగా కృతజ్ఞత వ్యక్తం చేయడం చూసి అమ్మను అడిగితే, డాక్టర్‌ను దేవుడిలా చూస్తారని చెప్పింది. అంతే! ఇది అత్యుత్తమమైన వృత్తి అనే అభి్రపాయం స్థిరపడిపోయింది. అమ్మకు నైట్ షిఫ్ట్లుండేవి. అప్పుడు నాకు జడలు వేయడం నుంచి బాక్స్‌లు పెట్టడం వరకు మా నాన్నే చేశారు. మా అన్నయ్యను, నన్ను పెంచడం, చక్కగా తీర్చిదిద్దడం కోసమే వాళ్ల జీవితాలను అంకితం చేశారు. నేను సిక్త్స్ క్లాస్ వరకు విజయవాడలో చదివాను. ఉద్యోగాల్లో బదిలీలతో గుంటూరు, రాజమండ్రి, వైజాగ్ అన్నీ చూశాం. నెల్లూరులోని కస్తూరిదేవి విద్యాలయం నాకు బాగా గుర్తున్న స్కూలు. ఎమ్సెట్ తొలి ప్రయత్నంలో మంచి ర్యాంకు రాలేదు. అప్పుడు అమ్మ ‘మనది మధ్యతరగతి కుటుంబం. డొనేషన్ సీట్లతో చదివించలేం. బీఎస్సీలో చేరి మళ్లీ ప్రయత్నం చెయ్యి. అప్పుడూ రాకపోతే డిగ్రీ పూర్తి చెయ్యి’ అని కరాకండిగా చెప్పి డిగ్రీలో చేర్చింది. ఆ ఉక్రోషంతో చేసిన రెండవ ప్రయత్నంలో తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజ్‌లో ఫ్రీ సీటు వచ్చింది. తొలి పోస్టింగ్ అనంతపురం జిల్లా రాకట్ల డిస్పెన్సరీలో. అప్పుడు కూడా మార్గదర్శనం చేసింది అమ్మే. ప్రైవేట్ డాక్టర్ క్రేజ్ ఉండేది నాకు. గవర్నమెంట్ ఉద్యోగం విలువ తెలుసుకోమని గట్టిగా చెప్పింది. గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టే ఉద్యోగం చేస్తూ మధ్యలో సెలవు పెట్టుకుని యూఎస్‌లో కోర్సులు చేయడం సాధ్యమైంది. అంతేకాదు. గవర్నమెంట్ ఉద్యోగం వల్ల మారుమూల ప్రదేశాలను దగ్గరగా చూడడం, అక్కడి ఆరోగ్య సమస్యలను తెలుసుకోవడం వల్ల, ఉద్యోగ పరిధి దాటి బయటకు వచ్చి మరింత ఎక్కువగా సర్వీస్ చేయాల్సిన అవసరం తెలిసి వచ్చింది. కరీంనగర్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని ఆదివాసీ గ్రామాలకు వెళ్లి మహిళలకు మెన్స్ట్రువల్ హైజీన్, సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలను గుర్తించడానికి పాప్‌స్మియర్ పరీక్షలు చేయడం, బ్రెస్ట్ క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించడంలో బిజీ అయిపోయాను. నేను రోబోటిక్ గైనిక్ ఆంకాలజిస్ట్‌ని. సర్వైకల్ క్యాన్సర్‌ను రూపుమాపాలనేది నా లక్ష్యం. ఈ నెల బెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ సందర్భంగా శిల్పకళావేదికలో బ్యూటీ పజంట్స్ అందరం అవేర్నెస్ ర్యాంప్ వాక్ చేస్తున్నాం. సావిత్రినయ్యాను! ఇక బ్యూటీ పజంట్ విషయానికి వస్తే... నాకు చిన్నప్పటి నుంచి స్కూలు, కాలేజ్ పోటీల్లో అన్నింటిలో పార్టిసిపేట్ చేయడం ఇష్టం. డాన్స్, పెయింటింగ్‌తోపాటు కాలేజ్‌లో ర్యాంప్ వాక్ కూడా చేశాను. మిసెస్ ఇండియా పోటీల గురించి చాలా ఏళ్లుగా పేపర్లో చూడడమే కానీ పెద్దగా ఆసక్తి కలగలేదు. కానీ మమతా త్రివేది నిర్వహిస్తున్న కాంటెస్ట్ గురించి తెలిసి గత ఏడాది నవంబర్‌లో నా ఎంట్రీ పంపించాను. కొత్తతరం పిల్లలు చాలా స్మార్ట్‌గా ఉంటున్నారు. మా పెద్దమ్మాయి ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తోంది. తను నన్ను ఈ పోటీలకు సిద్ధం చేసింది. మా హజ్బెండ్ నా క్లాస్మేట్, దూరపు బంధువు కూడా. ఎమ్ఎన్జేలో డాక్టర్. నాకు మంచి సపోర్ట్ ఇస్తారు. మొత్తం ఇరవై రౌండ్లు కొన్ని ఆన్లైన్, కొన్ని ఆఫ్‌లైన్‌లో జరిగాయి. ఆహార్యం రౌండ్లో మహానటి సావిత్రిని తలపించాలని టాస్క్ ఇచ్చారు. సావిత్రి పాత్రలో మెప్పించడమే నన్ను విజేతను చేసింది. మా తోటి పీజంట్లు నన్ను సావిత్రి అనే పిలుస్తున్నారిప్పుడు. నా స్మైల్‌కి కూడా ఈ పోటీల్లో మంచి గుర్తింపు వచ్చింది. విజేతలను ప్రకటించేటప్పుడు మాత్రం నర్వస్ అయ్యాను. నా ముఖంలో నవ్వు విరిసే తీర్పు వచ్చింది’’ అని చక్కగా నవ్వారు సోషల్ హెల్త్ యాక్టివిస్ట్, మిసెస్ తెలంగాణ విజేత డాక్టర్ స్రవంతి. రాబోయే డిసెంబర్లో జరిగే ‘మిసెస్ ఇండియా’ పోటీల్లో ఆమె తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తారు. ‘మిసెస్ ఇండియా’ కిరీటం ఆమె కోసం ఎదురు చూస్తోందేమో!. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : మోహనాచారి -
ప్రధాని మోదీ నిజామాబాద్ టూర్ షెడ్యూల్
-
తెలంగాణలో మొత్తం అధికారం ఒక కుటుంబం దగ్గరే ఉంది: ప్రధాని మోదీ
PM Narendra Modi Nizamabad Tour Updates 5:02PM ఇందూరు జనగర్జన సభా ప్రాంగణం వద్ద ప్రధాని మోదీ ప్రసంగం ►ఇవాళ నేను వంద శాతం వాస్తవం చెప్పేందుకు వచ్చా ►తాను కూడా ఎన్డీఏలో చేరతానని కేసీఆర్ అడిగాడు ►ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్తో కలిసే ప్రసక్తే లేదని చెప్పాం ►నేను అలసిపోయాను.. కేటీఆర్ బాధ్యతలు అప్పగిస్తానని చెప్పారు ►మీరు ఏమైనా రాజులా.. యువరాజుని సీఎం చేయడానికి అని అడిగా ►ప్రజాస్వామ్యంలో ఇది సరైంది కాదని చెప్పా ►ఎవరు అధికారంలో ఉండాలో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పాను ►కేసీఆర్ అవినీతి బాగోతాన్ని చెప్పాను ►అదే ఆఖరి రోజు.. నా కళ్లలోకి చూసే ధైర్యం కేసీఆర్‌కు లేదు ►కర్ణాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలే కాంగ్రెస్‌కు డబ్బులు అందజేశారు ►జీహెచ్ఎంసీ ఎన్నికల కంటే ముందు కేసీఆర్ నా కోసం పెద్ద పెద్ద పూలమాలలు తీసుకొచ్చేవారు ►జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు కేసీఆర్ నాకు స్వాగతం పలికారు ►జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఢిల్లీ వచ్చారు.. నాపై ప్రేమ కురిపించారు ►జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లు గెలిచింది ►జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత సీన్ మారిపోయింది ►జీహెచ్ఎంసీలో తమకు మద్దతు ఇవ్వమని కేసీఆర్ కోరాడు ►మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు సలామ్ ►సర్దార్ పటేల్ తెలంగాణకు నిజాం పాలన నుండి విముక్తి కల్పించారు ►గుజరాతీ అయిన పటేల్ తెలంగాణకు నిజాం పాలన నుండి విముక్తి కల్పించారు. ►ఇప్పుడు మరో గుజరాతీ తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ►ప్రజాస్వామ్యాన్ని లూటీ స్వామ్యంగా మార్చేశారు ►భారత్ లాంటి దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రాముఖ్యత ఉండాలి ►కుటుంబ పాలన ప్రాముఖ్యత కాదు.. ►తెలంగాణలో మొత్తం అధికారం ఒక కుటుంబం దగ్గరే ఉంది ►కుటుంబ పాలన వల్ల నష్టపోయేది యువతే ►తెలంగాణ వల్ల కేసీఆర్, కేసీఆర్ కొడుకు, కేసీఆర్ కూతురు, కేసీఆర్ అల్లుడు మాత్రమే లబ్ధిపొందుతున్నారు. ►మీ ఉత్సాహం చూస్తుంటే మనసు ఉప్పొంగి పోతుంది ►తెలంగాణలో ఎక్కడ చూసినా టాలెంట్ ఉంది ►కరోనా కష్టకాలంలో తెలంగాణకే దేశానికి వ్యాక్సిన్ ఇచ్చింది ►నేను శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును నేనే ప్రారంభించాను ►ఎన్టీపీసీ వల్ల తెలంగాణకే ఎక్కువ ప్రయోజనం ►రూ. 8 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులను ప్రారంభించాను ►ఇండియా కూటమి, కాంగ్రెస్ మహిళా బిల్లు పాస్ కాకుండా కుట్ర చేశారు ►మహిళా బిల్లుకు మద్దతు అని చెబుతూ లోపల కుట్రలు చేశారు ►గత్యంతరం లేకే విపక్షాలు మహిళా బిల్లుకు మద్దతిచ్చాయి ►దేశ మహిళలు ఇచ్చిన శక్తి వల్లే నేను మహిళా బిల్లును పాస్ చేయగలిగాను ►నిజామాబాద్ మహిళలు పెద్ద ఎత్తున వచ్చి నాకు స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు 4:52PM ఇందూరు జనగర్జన సభా ప్రాంగణం వద్ద కిషన్‌రెడ్డి ప్రసంగం ►బీఆర్ఎస్, కాంగ్రెస్‌ను ప్రజలు కోరుకోవటం లేదు ►ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బీజేపీని ప్రజలు కోరుకుంటున్నారు ►త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ.. ఒక కుటుంబం పాలైంది ►కాంగ్రెస్‌కు ఓటేస్తే.. బీఆర్ఎస్కు ఓటేసినట్లే ►చాలు కేసీఆర్.. సెలవు కేసీఆర్ ►తెలంగాణలో కాషాయ జెండా ఎగరాలను ప్రజలు కోరుకుంటున్నారు. ► గతంలో పసుపు బోర్డును ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు ►పసుపు బోర్డు కోసం అనేక పోరాటాలు చేశారు ►ఇవాళ రూ. 8 వేల కోట్ల అభివృద్ధి పనుల్ని ప్రారంభించాం 4:36PM ►నిజామాబాద్‌లో ప్రధాని మోదీ రోడ్ షో ►మోదీ.. మోదీ అంటూ మార్మోగుతున్న నిజామాబాద్ ►మోదీపై పూల వర్షం కురిపిస్తున్న ప్రజలు ►ఓపెన్ టాప్ జీపులో ఇందూరు జనగర్జన సభకు మోదీ ►పూల వర్షం కురిపించిన మహిళలు పసుపు రైతులు ►మోదీ నినాదాలతో దద్దరిల్లిన సభా ప్రాంగణం 4:25PM ప్రధాని మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ►నా కుటుంబ సభ్యులారా అంటూ ప్రసంగం ప్రారంభించిన మోదీ ►మా ప్రభుత్వం శంకుస్థాపనలే కాదు.. వాటిని పూర్తి చేస్తుంది ►ఇది మా వర్క్ కల్చర్ ►తెలంగాణ ప్రజల విద్యుత్ అవసరాలు తీర్చేందుకు మేము కృషి చేస్తున్నాం ►మెరుగైన విద్యుత్ సరఫరా అభివృద్ధికి ద్వారాలు తెరుస్తుంది ►త్వరలో భారతీయ రైల్వే 100 శాతం ఎలక్ట్రిఫికేషన్ అవుతుంది ►బీబీ నగర్లో నిర్మిస్తున్న ఎయిమ్స్ భవనాన్ని మీరు చూస్తున్నారు 4:15PM ►మొత్తం రూ.8,021 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ► 20 జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లో నిర్మించనున్న 50 పడకల క్రిటికల్ కేర్ విభాగాలకు శంకుస్థాపన ►సిద్దిపేట–సికింద్రాబాద్ వరకు తొలి రైలు సర్వీసును వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ ►సిద్దిపేట–మనోహరాబాద్ రైల్వేలైన్‌ను ప్రారంభించిన మోదీ ►(ధర్మాబాద్ మహారాష్ట్ర)–మనోహరాబాద్–మహబూబ్‌నగర్–కర్నూల్(ఏపీ)’ రైల్వేలైన్‌లో రూ.305 కోట్లతో 348 కిలోమీటర్ల మేర చేపట్టిన విద్యుదీకరణ పనులను జాతికి అంకితం ►పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించిన అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ ప్లాంట్‌లో 800 మెగావాట్ల తొలి యూనిట్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ 4:10PM ► కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం: కిషన్ రెడ్డి ► పసుపు బోర్డు ప్రకటించినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన కిషన్‌రెడ్డి 03:53PM ►ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిజామాబాద్‌కు చేరుకున్నారు. మూడు రోజుల వ్యవధిలో రెండోసారి తెలంగాణలో పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి గవర్నర్ తమిళసై, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డిలు స్వాగతం పలికారు. ►కర్ణాటక రాష్ట్రం బీదర్ నుంచి నిజామాబాద్ జిల్లాకు రాక. ►ప్రధాని మోదీ. జిల్లాలో రూ.8 వేల కోట్ల విలువైన పనులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ►అనంతరం జరిగే బహిరంగ సభలో రాజకీయ ప్రసంగం చేయనున్న మోదీ. ► కేవలం మూడు రోజుల వ్యవధిలోనే తెలంగాణలో మోదీ రెండోసారి పర్యటిస్తున్నారు. ఈ నెల 1న మహబూబ్‌నగర్‌లో రూ.13,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపిన ప్రధాని.. మంగళవారం నిజామాబాద్‌లో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. తర్వాత ఇక్కడి గిరిరాజ్ కాలేజీ మైదానంలో నిర్వహించే బీజేపీ బహిరంగ సభలో రాజకీయ ప్రసంగం చేయనున్నారు. పాలమూరు పర్యటనలో బీఆర్ఎస్, ఎంఐఎంలపై విమర్శలు గుప్పించిన ప్రధాని మోదీ.. నిజామాబాద్‌లో ఏం మాట్లాడుతారు, ఎలాంటి విమర్శలు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ► ఇప్పటికే ఇందూరుకు ప్రధాని పసుపు బోర్డు ప్రకటించిన నేపథ్యంలో నిజామాబాద్ సభకు హాజరై కృతజ్ఞతలు చెప్తామని పసుపు రైతులు చెబుతున్నారు. దీనికి నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాల నుంచి పసుపు రైతులు భారీగా తరలిరానున్నారు. చదవండి: రాష్ట్రంలో కారు జోరు.. 9 నుంచి 11 లోక్‌సభ స్థానాలు బీఆర్ఎస్కే.. -
నిజామాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన
-
నేడు నిజామాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన.. మూడు రోజుల్లో రెండోసారి తెలంగాణకు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
మూడు రోజుల్లో రెండో సారి..
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, న్యూఢిల్లీ/ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ కేవలం మూడు రోజుల వ్యవధిలోనే తెలంగాణలో రెండోసారి పర్యటిస్తున్నారు. ఈ నెల 1న మహబూబ్‌నగర్‌లో రూ.13,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపిన ప్రధాని.. మంగళవారం నిజామాబాద్‌లో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. విద్యుత్, రైల్వే, ప్రజారోగ్యానికి సంబంధించి రూ.8,021 కోట్ల విలువైన ప్రాజెక్టులకు వర్చువల్ విధానంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. తర్వాత ఇక్కడి గిరిరాజ్ కాలేజీ మైదానంలో నిర్వహించే బీజేపీ బహిరంగ సభలో రాజకీయ ప్రసంగం చేయనున్నారు. పాలమూరు పర్యటనలో బీఆర్ఎస్, ఎంఐఎంలపై విమర్శలు గుప్పించిన ప్రధాని మోదీ.. నిజామాబాద్‌లో ఏం మాట్లాడుతారు, ఎలాంటి విమర్శలు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పాలమూరులో శంఖారావంతో.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పాలమూరు ప్రజాగర్జన సభలో బీజేపీ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించింది. ప్రధాని మోదీ ఈ సభలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అందిస్తున్న సాయాన్ని వివరించారు. రూ.13,500 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దీనితోపాటు రాష్ట్రంలోని అధికార పార్టీపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. మంగళవారం నిజామాబాద్ సభలోనూ అటు అభివృద్ధి కార్యక్రమాలు, ఇటు రాజకీయ విమర్శలతో ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయనున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో 3 ఎంపీ స్థానాలు గెలుచుకు న్న బీజేపీ ఈసారి మరింత పట్టుపెంచుకునే దిశ గా నిజామాబాద్‌లో సభ, ప్రధానితో వరాల ప్రక టన చేపట్టినట్టు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్‌పైనా విమర్శల దాడి: పాలమూరు సభలో అధికార బీఆర్ఎస్పై, కేసీఆర్ సర్కార్ తీరుపై, బీఆర్ఎస్, ఎంఐఎం కుటుంబ రాజకీయాలను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. అయితే ఈ ఏడాది చివరలో తెలంగాణతోపాటు మరో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండటం, అందులో రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కావడం, తెలంగాణలోనూ ఆ పార్టీలో జోష్ కనిపిస్తుండటంతో..ఈసారి కాంగ్రెస్ పార్టీపైనా మోదీ విరుచుకుపడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రధాని ప్రకటించిన నేపథ్యంలో.. నిజామాబాద్ సభకు హాజరై కృతజ్ఞతలు చెప్తామని పసుపు రైతులు ప్రకటించారు. దీనికి నిజామాబా ద్, జగిత్యాల, నిర్మల్ జిల్లా ల నుంచి పసుపు రైతులు భారీగా తరలిరానున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ఇవీ.. నిజామాబాద్ పర్యటనలో మొత్తం రూ.8,021 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అందులో ప్రాజెక్టులు, పథకాలు ఇవీ.. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించిన అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ ప్లాంట్‌లో 800 మెగావాట్ల తొలి యూనిట్‌ను జాతికి అంకితం చేస్తారు. ‘ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్’ కింద రూ.516.5 కోట్లతో తెలంగాణలోని 20 జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లో నిర్మించనున్న 50 పడకల క్రిటికల్ కేర్ విభాగాలకు శంకుస్థాపన చేస్తారు. రూ.1,200 కోట్లతో 76 కిలోమీటర్ల పొడవునా నిర్మించిన సిద్దిపేట–మనోహరాబాద్ రైల్వేలైన్‌ను.. సిద్దిపేట–సికింద్రాబాద్ వరకు తొలి రైలు సర్వీసును ప్రారంభిస్తారు. ‘ధర్మాబాద్ మహారాష్ట్ర)–మనోహరాబాద్– మహబూ బ్‌నగర్–కర్నూల్ (ఏపీ)’ రైల్వే లైన్లో రూ.305 కోట్లతో 348 కిలోమీటర్ల మేర చేపట్టిన విద్యుదీకరణ పనులను జాతికి అంకితం చేస్తారు. ఇదీ ప్రధాని మోదీ షెడ్యూల్ మంగళవారం మధ్యాహ్నం 2.55 గంటలకు ఎంఐ–17 సైనిక హెలికాప్టర్లో నిజామాబాద్‌కు చేరుకుంటారు. æ 3 గంటలకు ఇక్కడి గిరిరాజ్ ప్రభుత్వ కాలేజీ గ్రౌండ్స్‌లో తొలి వేదిక వద్దకు చేరుకుంటారు 3.35 గంటలదాకా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. 3.45 గంటలకు పక్కనే ఉన్న బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకుంటారు 4.45 గంటల దాకా సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 5 గంటలకు నిజామాబాద్ నుంచి హెలికాప్టర్లో తిరుగుప్రయాణం అవుతారు. -
పసుపు బోర్డు వచ్చింది.. కాలికి చెప్పులొచ్చాయ్..
సాక్షి, నిజామాబాద్: రాష్ట్రానికి పసుపు బోర్డు వచ్చే వరకు చెప్పులు వేసుకోబోనని ప్రతిజ్ఞ చేసిన ఓ రైతు 12 ఏళ్ల తర్వాత నిన్న చెప్పులు ధరించాడు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి చెందిన రైతు ముత్యాల మనోహర్‌రెడ్డి పన్నెండేళ్లుగా పసుపు ఉద్యమంలో పాల్గొంటున్నారు. స్థానికంగా పసుపు బోర్డు ఏర్పాటయ్యే వరకు చెప్పులు వేసుకోబోనని ప్రతినబూనిన ఆయన 2011 నవంబర్ 4 నుంచి చెప్పులు వేసుకోవడం లేదు. 2013లో పసుపు బోర్డు కోసం డిమాండ్ చేస్తూ కాలికి చెప్పుల్లేకుండానే తిరుపతికి పాదయాత్ర చేశారు. పసుపు బోర్డు సాధన పోరాటంలో భాగంగా ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద అనేక సార్లు రైతులతో కలిసి ఆందోళనల్లో పాల్గొన్నారు. తాజాగా ప్రధాని మోదీ పసుపు బోర్డు ఏర్పాటు విషయాన్ని ప్రకటించడంతో మనోహర్‌రెడ్డి ఆదివారం చెప్పులు వేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు పసుపు రైతులు ఆయనను ఘనంగా సన్మానించారు. రాష్ట్రానికి పసుపు బోర్డు వచ్చే వరకు చెప్పులు వేసుకోబోనని ప్రతిజ్ఞ చేసిన ఓ రైతు 9 సంవత్సరాల తర్వాత నిన్న చెప్పులు ధరించాడు. నిజామాబాద్‌లో పుసుపు బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ దశాబ్దాలుగా ఉంది. బోర్డు కోసం పలుమార్లు ఉద్యమాలు కూడా జరిగాయి. తాజాగా మహబూబ్‌నగర్‌లో పర్యటించిన మోదీ పసుపు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడంతో జిల్లా రైతులు ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు. -
పసుపు బోర్డుతో ప్రయోజనాలెన్నో!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఇందూరు జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయనున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. సుగంధ ద్రవ్యాల బోర్డు కింద ఉన్న పసుపు పంటను విడదీసి, ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటుకు కేంద్రం నిర్ణయించడం, ఇది దేశంలోనే తొలిసారి కావడం విశేషం. దీనిపై నిజామాబాద్ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మంగళవారం మోదీ పాల్గొనే జనగర్జన సభను రైతులు కృతజ్ఞత సభగా మార్చారు. బోర్డు విధివిధానాలు ప్రకటించనున్న ప్రధాని కేంద్ర ప్రభుత్వ ఆ«దీనంలోని వాణిజ్య, వ్యవసాయ, ఉద్యాన శాఖల కార్యదర్శులు, ఆర్థిక శాఖ సలహాదారు సంయుక్త ఆధ్వర్యంలో నడుస్తున్న సుగంధ ద్రవ్యాల బోర్డు చైర్మన్ పరిధిలో పసుపు బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. పసుపు బోర్డుకు ప్రత్యేకంగా సీఈవోని నియమించనున్నారు. మరో 11 మందిని పసుపుబోర్డుకు సభ్యులుగా నియమించనున్నారు. ప్రత్యేకంగా అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను ఇందూరు సభలో ప్రధానమంత్రి ప్రకటించనున్నారు. విత్తనం నుంచి మార్కెటింగ్ వరకు.. పసుపు బోర్డు ఏర్పాటైతే రైతులకు కొత్త వంగడాల అభివృద్ధి నుంచి పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ వరకు లబ్ధి కలుగుతుంది. రైతులకు పసుపు తవ్వకం, ఆరబెట్టడం, ఉడకబెట్టడం, డ్రై చేయడం, పాలిష్ చేయడానికి అవసరమైన యంత్రాలను రాయితీపై అందిస్తారు. కొత్త వంగడాల అభివృద్ధితో పాటు పసుపు పంట విత్తిన తరువాత అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు. తద్వారా కర్క్యుమిన్ శాతం, నాణ్యత, దిగుబడి పెంచేలా రైతులకు సహకారం అందుతుంది. ఇక పసుపు పంట మార్కెటింగ్ కోసం అంతర్జాతీయ కంపెనీలను తీసుకువచ్చే బాధ్యత సైతం బోర్డు తీసుకుంటుంది. ఈ క్రమంలో జిల్లాకు పసుపు శుద్ధి కర్మాగారాలు తరలివస్తాయని ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం తదుపరి దశలో ఇక్కడ పసుపు శుద్ధికర్మాగారం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ మార్కెట్‌కు 7.49 లక్షల క్వింటాళ్లు తెలంగాణ వ్యాప్తంగా గత సీజన్లో సుమారు 8.80 లక్షల క్వింటాళ్ల పసుపు దిగుబడి వచ్చింది. ఇందులో అత్యధికంగా నిజామాబాద్ మార్కెట్‌కు 7.49 లక్షల క్వింటాళ్లు వచ్చింది. రాష్ట్రంలో మొత్తం పసుపు సాగులో 40% ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే కావడం గమనార్హం. తరువాతి స్థానాల్లో జగిత్యాల, నిర్మల్, వికారాబాద్, మహబూబాబాద్ జిల్లాలు ఉన్నాయి. 2020లో ఎంపీ అర్వింద్ చొరవతో నిజామాబాద్‌లో ‘సుగంధ ద్రవ్యాల బోర్డు’రీజినల్ ఆఫీస్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి రూ.30 కోట్ల బడ్జెట్ కేటాయించారు. తరువాత కర్క్యుమిన్ అధారిత పసుపు మార్కెటింగ్ కోసం దేశంలోనే మొదటిసారిగా నిజామాబాద్ మార్కెట్లో 2021లో నాంది పలికారు. పసుపు బోర్డు వచ్చింది.. కాలికి చెప్పులొచ్చాయ్.. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి చెందిన రైతు ముత్యాల మనోహర్‌రెడ్డి పన్నెండేళ్లుగా పసుపు ఉద్యమంలో పాల్గొంటున్నారు. స్థానికంగా పసుపు బోర్డు ఏర్పాటయ్యే వరకు చెప్పులు వేసుకోబోనని ప్రతినబూనిన ఆయన 2011 నవంబర్ 4 నుంచి చెప్పులు వేసుకోవడం లేదు. 2013లో పసుపు బోర్డు కోసం డిమాండ్ చేస్తూ కాలికి చెప్పుల్లేకుండానే తిరుపతికి పాదయాత్ర చేశారు. పసుపు బోర్డు సాధన పోరాటంలో భాగంగా ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద అనేక సార్లు రైతులతో కలిసి ఆందోళనల్లో పాల్గొన్నారు. తాజాగా ప్రధాని మోదీ పసుపు బోర్డు ఏర్పాటు విషయాన్ని ప్రకటించడంతో మనోహర్‌రెడ్డి ఆదివారం చెప్పులు వేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు పసుపు రైతులు ఆయనను ఘనంగా సన్మానించారు. -
కేటీఆర్ షాడో సీఎం
సుభాష్ నగర్ (నిజామాబాద్): మంత్రి కేటీఆర్ షాడో సీఎంగా వ్యవహరిస్తున్నారని... తండ్రిని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించారు. వచ్చే నెల 3న ప్రధాని మోదీ పాల్గొనే బహిరంగ సభ కోసం నిజామాబాద్‌లోని ప్రభుత్వ గిరిరాజ్ కళాశాల మైదానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ అక్టోబర్ 1న పాలమూరులో, 3న ఇందూరులో నిర్వహించే బహిరంగ సభలలో ప్రధాని పాల్గొంటారన్నారు. ఇందూరు సభలో ప్రధాని మోదీ రామగుండం ఎన్టీపీసీలోని 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును వర్చువల్‌గా ప్రారంభించి జాతికి అంకితం చేస్తారని చెప్పారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదేం? ప్రధాని రాష్ట్రానికి వచ్చే ముందు తెలంగాణకు ఏం మేలు చేశారో చెప్పాలంటూ మంత్రి కేటీఆర్ ప్రశ్నించడాన్ని విలేకరులు కిషన్‌రెడ్డి వద్ద ప్రస్తావించగా ఆయన ఘాటుగా స్పందించారు. తెలంగాణ కేటీఆర్ జాగీరు కాదంటూ విమర్శించారు. ప్రభుత్వం 17 సార్లు టీఎస్‌పీఎస్‌స్సీ పరీక్షలు నిర్వహించినా యువతకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయిందన్నారు. అలాగే దళిత సీఎం హామీతోపాటు దళితులకు మూడెకరాల చొప్పున భూపంపిణీ హామీని సైతం అటకెక్కించారని... రాష్ట్రానికి సీఎం కేసీఆర్ ఏం మేలు చేశారో చెప్పాలని ప్రతిగా కేటీఆర్‌ను ప్రశ్నించారు. పసుపు బోర్డు ఏర్పాటు విషయమై విలేకరులు ప్రశ్నించగా ప్రభుత్వంతో మాట్లాడి చెప్తానంటూ దాటవేశారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య ఉన్నారు. మోదీ సభకు లక్ష మందితో జనసమీకరణ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వచ్చే నెల 3న జరిగే ప్రధాని మోదీ బహిరంగ సభను జయప్రదం చేసేలా ప్రతి కార్యకర్త పని చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సూచించారు. మంగళవారం నిజామాబాద్‌లోని బస్వా గార్డెన్లో ఉమ్మడి నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాల పదాధికారుల సమావేశాన్ని నిర్వహించారు. సభకు లక్ష మందికిపైగా ప్రజలను సమీకరించాలన్నారు. మజ్లిస్ ప్రోద్బలంతోనే లవ్‌జిహాదీలు ఖలీల్‌వాడి: తెలంగాణ రాష్ట్రంలో మజ్లిస్ ప్రోద్బలంతోనే లవ్‌జిహాదీలు జరుగుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్‌పల్లిలో మరో వర్గం యువకుడి దాడిలో గాయపడిన యువతి, వారి కుటుంబసభ్యులను మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కిషన్‌రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో మజ్లిస్‌ను బుజ్జగింపుల నేపథ్యంలోనే లవ్‌జిహాద్‌తో హిందూ, క్రిస్టియన్ యువతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ప్రేమ పేరుతో వలలో వేసుకోవడానికి కొన్ని సంస్థలు ఆర్థిక సహాయం చేస్తున్నాయని ఆరోపించారు. -
నిజామాబాద్ అర్బన్‌లో.. 'బిగాల గణేష్‌గుప్త'కే అవకాశం ఎక్కువ..
సాక్షి, నిజామాబాద్: ప్రతి ఎన్నికల్లో కాలనీల్లో మౌలిక సదుపాయలు, రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి వసతి , పెన్షన్ల కేటాయింపు ఈ అంశాలు ముఖ్యంగా ప్రభావితం అవుతాయి.. ఈ పనులతో పాటు ప్రజాప్రతినిధులు అభ్యర్థులు కాలనీ వాసులతో అందుబాటులో ఉండే వారి పట్ల ప్రజలు మొగ్గుచూపుతారు. మరోవైపు కులాల వారిగా ఓటర్లు ప్రధానంగా ప్రభావం చూపుతారు. అర్బన్‌లో ముస్లీంలు, మున్నూరు కాపులు, పద్మశాలిలు వరుసగా అత్యధిక ఓటర్లు కలిగి ఉన్నారు. ఇక్కడ కులాల వారిగా ఏదైనా అభ్యర్థికి మద్దతు ఇవ్వడంలోనూ ముందుకు వస్తే రాజకీయ సమీకరణలు తీవ్రంగా ఉంటాయి. కులాల వారు మద్ధతు తెలిపితే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మైనార్టీలు మాత్రం గత కొన్ని సంవత్సరాలుగా ఏకపక్షంగా ఎంఐఎంకు, మైనార్టీ నాయకులకు ఎక్కువ మద్దతు పలుకుతున్నారు. వీరి ఓట్లను సాధించిన వారు అనుకూలంగా మలుచుకున్నవారు గెలిచే అవకాశాలు ఎక్కువ. ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ.. నిజామాబాద్ అర్బన్‌లో ప్రస్తుతం బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త మళ్లీ పోటీచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతన్ని కాదని మరొకరికి టికెట్ ఇస్తే ఇతర నాయకులు బలంగా లేరని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు బిగాల గణేష్‌గుప్త తమ్ముడు మహేష్గుప్తకు టికెట్ ఇప్పించాలని ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత అర్బన్‌లో టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో అభ్యర్థుల సంఖ్య ఎక్కువగానే ఉంది. టీపీసీసీ రాష్ట్ర నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ మరోసారి తనకే టికెట్ కావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ టికెట్ తనకే వస్తుందని ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించారు. మరో వైపు సీనియర్ నాయకుడు కేశవేణు , తాహెర్బిన్హుందాన్లు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు ఎన్ఆర్ఐ నరాల కళ్యాణ్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీలో మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ మరోసారి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పార్టీలో ఉంటూ సేవ కార్యక్రమాలు కొనసాగిస్తున్న ధన్పాల్ సూర్యనారాయణ సైతం టికెట్ కోసం ఈసారి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంఐఎం తరపున భైంసా మున్సిపల్ చైర్మన్ జుబేర్‌తో పాటు మాజీ డిప్యూటీ మేయర్ ఫయూమ్లు, మాజీ కార్పొరేటర్ రఫత్ఖాన్లు టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్ల సంఖ్య.. అర్బన్ నియోజక వర్గంలో ముస్లీం ఓటర్లు అధికంగా ఉంటారు. వీరు 48వేల వరకు ఉండగా, మున్నూరుకాపు ఓటర్లు 44 వేల వరకు ఉంటారు. పద్మశాలిలు 41 వేల వరకు ఉంటారు. వీరే అర్బన్‌లో రాజకీయాలకు కీలకంగా మారారు. భౌగోళిక పరిస్థితుల పరంగా.. నిజామాబాద్ అర్బన్ నియోజక వర్గంలో భౌగోళిక పరిస్థితుల పరంగా పెద్దగా గుర్తింపు బడిన అంశాలు లేవు. ఖిల్లా రామాలయం, నీల కంఠేశ్వరాలయం, శంభునిగుడి, జెండాగుడిలు ఉన్నాయి. ఇందులో శుంభుని గుడి రాజకీయ పరంగా తరచుగా వివాదం అవుతుంది. ఈ గుడికి అనుకొని ఉన్న ముస్లిం దుకాణాలను తొలగించాలని వివాదాలు జరుగుతాయి.. టికెట్ల కేటాయింపులో ఆసక్తికరం.. అర్బన్ నియోజక వర్గంలో కులాల వారిగా ఓటర్లు కీలకంగా ఉండగా అభ్యర్థుల టికెట్ల కేటాయింపులో ఆసక్తికరంగా ఉంటుంది. సీనియర్ రాజకీయ నాయకులు వారి కుటుంబ సభ్యులకు టికెట్లు కేటాయించుకోవడం ఎక్కువగా కొనసాగుతుంది. సామాన్య, తక్కువ స్థాయి లీడర్లకు పోటీచేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.. డి. శ్రీనివాస్ కుటుంబం మూడు పార్టీల్లో కొనసాగింది.. ఆ తరవాత డి. శ్రీనివాస్ బీఆర్ఎస్ కు దూరం కావడంతో ప్రస్తుతం ఆ సంఖ్య రెండుకు చేరింది.. ఆయన పెద్దకొడుకు సంజయ్ ప్రస్తుతం కాంగ్రెస్ గూటికి మళ్లీ చేరిపోగా చిన్న కొడుకు అరవింద్ బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు. వర్గాల వారిగా.. అర్బన్ నియోజక వర్గంలో హిందూ, ముస్లీం వర్గాలకు సంబంధించి తరచుగా వివాదాలు నెలకొనడం జరుగుతుంది. ఇక్కడ రాజకీయ పరిస్థితులు అలాగే ఉన్నాయి. రెండు వర్గాల వల్ల ఓటర్లు కూడా హిందూ, ముస్లీం వారిగా ఓట్లు వేసే అవకాశాలు ఉన్నాయి. ఇందులో భాగంగానే గతంలో ఇక్కడ బీజీపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలువడం, మున్సిపల్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ, సాధారణ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులు రెండవ స్థానంలో నిలువడం ఆసక్తికరంగా మారింది. -
నిజామాబాద్‌లో అమానవీయ ఘటన.. కూతురు బతికుండగానే పెద్దకర్మ
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. బతికున్న కూతురికి కన్నతండ్రి పెద్దకర్మ చేశాడు. పెళ్లి చేసిన అల్లుడికి బోన్ క్యాన్సర్ ఉండటంతో వివాహిత నందిని తల్లిగారింటికి వచ్చి జీవిస్తోంది. ఈక్రమంలో ప్రేమించిన ఓ వ్యక్తితో ఆమె పారిపోయింది. దీంతో కూతురిపై ఆగ్రహంతో తండ్రి మహేష్ ఆమె చనిపోయిందంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కూతురు బతికి ఉండగానే ‘మరణం 10 - 09 - 2023’ అంటూ గురువారం పెద్ద కర్మ చేశాడు. -
అసలైన టీచరమ్మ! అభాగ్యులకు ఆమె " పెద్దమ్మ"! రిటైరై కూడా..
టీచర్ అనే పదమే ఎంతో గౌరవనీయమైంది. ఇక ఆ వృత్తి చేసేవాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బహుశా ఆ వృత్తే వారిని తెలియకుండా సేవ వైపుకి మళ్లీస్తుందో లేక వారి ఆలోచన స్థాయిలు అలా ఉంటాయో!. అచ్చం అలానే పదవివిరమణ చేసిన ఓ టీచరమ్మ విశ్రాంతి తీసుకోకుండా ఎందరో అభాగ్యులకు పెద్దమ్మగా, యువతకు ఓ గైడ్‌గా ఎన్నో సేవలు చేస్తూ అందరిచే మన్నలను అందుకుంటోంది. ఆమే గుర్రాల సరోజనమ్మ. ఇవరామె? ఏం చేసిందంటే.. గుర్రాల సరోజనమ్మది నిజామాబాద్ జిల్లా బోధన్. ఆమె ఉపాధ్యాయ వృత్తిలో ఉంటే.. ఆమె భర్త వెంకట్రావు నిజాం షుగర్స్‌లో ఉద్యోగి. ఆర్థికంగా ఏ ఇబ్బందీ లేకున్నా మాకు పిల్లలు లేని లోటు ఉండేది. దత్తత ప్రయత్నాలు చేసినా అవేమీ సాధ్యపడలేదు. పాతికేళ్ల క్రితమే రిటైర్ అయ్యింది. ఆ వచ్చిన డబ్బుతో ఓ ఇల్లు కొనుగోలు చేసింది. పింఛన్ వస్తోంది కాబట్టి హాయిగా విశ్రాంతి తీసుకుంటుంటుగా విధికి కన్నుకుట్టి భర్తను తీసుకుపోయింది. ఒంటరిగా మిగిలిపోయిన సరోజనమ్మ తోబుట్టువుల పిల్లలే తన పిల్లలు అన్యమనస్కంగా జీవిస్తోంది. వాళ్లొచ్చినప్పుడు తెగ సంబరపడేది. వాళ్లూ కూడా ప్రేమగానే ఉండేవారు ఆమెతో. కానీ ఆ ప్రేమలన్నీ.. నా ఆస్తి చుట్టూ తిరగడం నచ్చలేదు. ఇవన్నీ చూసి విసిగిపోయి.. ఇంటిని ఏదైనా సంస్థకు విరాళంగా ఇవ్వాలనుకున్నా. ఇలా ఆలోచిస్తుండగా మా ఉపాధ్యాయులు పడుతున్న బాధలే ఆమెను కదిలించాయి. విశ్రాంత ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకి సొంత భవనం లేదని తెలుసుకుంది. అందుకోసం.. ఆ సంఘానికి ఇంటిని రాసిస్తే మున్ముందు ఎందరికో సేవలు అందుతాయని విశ్వసించి మరీ ఆ ఇల్లు తన తర్వాత ఆ ఇల్లు సంఘానికి చెందేలా ఏడాదిన్నర కిందటే రిజిస్ట్రేషన్ చేయించింది. ఇప్పుడూ ఆ ఇంటి విలువ ప్రస్తుతం రెండు కోట్ల రూపాయలు. ఇది తెలిశాక బంధువులు ఆమె దగ్గరకి రావడమే మానేశారు. ఆ రెండు ఘటనలకు పరిష్కారమే ధర్మస్థల్ ఓసారి దగ్గరి బంధువొకరు చనిపోతే అంత్యక్రియలకు వెళ్లింది. ఇంటికి కాస్త దూరంగా శవాన్ని ఉంచారు. ఏంటని ఆరా తీయగా.. ఆ ఇంటి యజమాని అనుమతించలేదని తెలిసింది. ఇంకోసారి పరిచయస్థులొకరు చనిపోతే.. వారుండే ఇంటికి దూరంలో అంత్యక్రియలకు కావాల్సిన పనులు చేస్తున్నారు. అద్దె ఇళ్లలో ఉన్నవారికి ఈ బాధలు తప్పడం లేదని అర్థమైంది సరోజనమ్మకు. ఈ పరిస్థితి అయినవాళ్లని బాధపెడుతుంది కదా! ఈ రెండు ఘటనలూ సరోజనమ్మను ఆలోచింప చేశాయి. ఇందుకు పరిష్కారంగా వెలిసిందే.. ‘ధర్మస్థల్’. ఇందులో చనిపోయినవారి మృతదేహాన్ని అంత్యక్రియలు జరిగేవరకు భద్రపర్చుకోవచ్చు. ఫ్రీజర్ సహా అన్ని సదుపాయాలనూ ఇక్కడ ఉచితంగా అందిస్తారు. ఈ నిర్మాణం ఇప్పుడు తుదిదశకు చేరుకుంది. ఇందుకోసం రూ.20 లక్షలు వెచ్చించింది. చనిపోయాక మాట అటుంచితే... బతికున్న వాళ్ల ఆరోగ్యానికి భరోసా ఎవరు? అందుకే జిల్లా కేంద్రంలో మల్లు స్వరాజ్యం ట్రస్టు సభ్యులు ప్రారంభించిన జెనరిక్ మందుల దుకాణానికి ఆమె వంతుగా రూ. 2 లక్షలు విరాళమందించింది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా.. అసలు ధరకే మందుల్ని అందివ్వడం ఈ ట్రస్టు ఉద్దేశం. దీనివల్ల మధ్యతరగతి, పేదవారికి ఎంతో ప్రయోజనం. రెంజల్‌లోని కందకుర్తి గోదావరి ఒడ్డున గోశాల నిర్మాణానికీ కూడా విరాళం ఇచ్చింది యువతకోసం నా వంతుగా.. ఒక టీచర్‌గా యువతని మంచి బాట పట్టించాలనే సదుద్దేశంతో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువత కోసం ప్రభుత్వ గ్రంథాలయంలో రూ.20 వేల విలువైన పుస్తకాలను అందించింది. ఏడాదికోసారి చింతకుంట వృద్ధాశ్రమానికి వెళ్తుంంది. అక్కడున్న వృద్థులకు నిత్యావసరాల్ని, దుస్తుల్ని అందిస్తుంది. వీలుదొరికినప్పుడల్లా అవయవదానంపై ప్రచారం చేస్తుంది. తన మరణానంతరం దేహాన్ని ప్రయోగాలకు వినియోగించాలని ఆమోదపత్రం కూడా రాసిచ్చింది. మొదట్లో తనకెవరూ లేరునుకుని బాధపడేది. ఇప్పుడు ఈసేవ కార్యక్రమాలు ఎంతోమంది ఆప్తులను ఆమెకు దొరికేలా చేసింది. పైగా వారిచేత ‘పెద్దమ్మ’ అని ఆప్యాయంగా పిలిపించుకుంటుంది. నిజంగా ఆమె చాలా గ్రేట్. భర్త పోయి విశ్రాంతిగా ఉండాల్సినీ ఈ వయసులో ఎంతో చలాకీగా ఇలా సేవాకార్యక్రమాలు చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది సరోజనమ్మ!. (చదవండి: బీర్ వ్యర్థాలతో..బిస్కెట్లు, చిక్కిలు, లడ్డులా..) -
కస్తూర్బా విద్యార్థినులకు ఫుడ్‌పాయిజన్
ఖలీల్‌వాడి(నిజామాబాద్): నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ పట్టణంలోని కస్తూర్బా పాఠశాలలో 120 మంది విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ అయింది. సోమవారం రాత్రి స్కూల్లో అన్నం, పప్పు, వంకాయకూర వంట చేశారు. రాత్రి భోజనం చేసిన తర్వాత 11.30 గంటలకు విద్యార్థినులకు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి ప్రారంభమైంది. దీంతో పాఠశాల సిబ్బంది పిల్లలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే 84 మంది విద్యార్థినుల పరిస్థితి విషమించడంతో అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. కాగా, భీమ్‌గల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 36 మందిలో 16 మంది విద్యార్థినుల పరిస్థితి అలాగే ఉండటంతో వారిని మంగళవారం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భీమ్‌గల్ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి 20 మంది విద్యార్థినులను మంగళవారం మధ్యాహ్నం డిశ్చార్జి చేశారు. నిజామాబాద్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థినులను జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాందీ హన్మంతు పరామర్శించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, విద్యాశాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటన పై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సీరియస్ అయ్యారు. ఫుడ్ పాయిజన్ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కలెక్టర్ ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ బృందం వంట సిబ్బంది నుంచి వివరాలు అడిగి తెలుసుకుంది. రాత్రి చేసిన వంటకాల షాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు. -
TS: స్కూల్లో 90 మంది విద్యార్థినిలకు అస్వస్థత.. మంత్రి సీరియస్
సాక్షి, భీంగల్: ఫుడ్ పాయిజన్ కారణంగా కస్తూర్భా పాఠశాలలో దాదాపు 90 మంది విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు. తీవ్రమైన కడుపునొప్పితో పాటుగా వాంతులు చేసుకున్నారు. దీంతో, వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఇక, ఈ ఘటనపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా భీంగల్‌లోని కస్తూర్భా పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి భోజనం చేసిన తర్వాత పుఢ్ పాయిజన్‌తో 90 విద్యార్థినులకు కడుపునొప్పితో పాటు వాంతులు అయ్యాయి. దీంతో సిబ్బంది అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పాఠశాల ఇన్ఛార్జ్ ప్రత్యేకాధికారి శోభ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం అస్వస్థతకు గురైన విద్యార్థులందర్నీ నిజామాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన సమాచారం తెలిసిన వెంటనే మంత్రి వేముల ప్రశాంత్ సీరియస్ అయ్యారు. దీనికి కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంత్‌కు ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయాలని మంత్రి వేముల.. కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రస్తుతం విద్యార్థినిల ఆరోగ్య పరిస్థితిపై మంత్రి ఆరాతీశారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్‌తో మంత్రి మాట్లాడి.. విద్యార్థినిలకు మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. ఇది కూడా చదవండి: డీఎస్‌కు తీవ్ర అస్వస్థత.. పరిస్థితి విషమం: ఆసుపత్రి వర్గాలు -
నిజామాబాద్: భీంగల్ కస్తూర్భా పాఠశాలలో ఫుడ్ పాయిజన్
-
నిజామాబాద్ జిల్లా మిట్టపల్లి గోకులాష్టమి వేడుకల్లో అపశృతి
-
ఇద్దరు చిన్నారులను మింగిన పిల్లర్ గుంత
బాల్కొండ: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం ఇత్వార్‌పేట్ గ్రామంలో గురువారం భవన నిర్మాణం కోసం తవ్విన పిల్లర్ గుంతలో పడి వేర్వేరు కుటుంబాలకు చెందిన ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. గ్రామానికి చెందిన మెట్టు నాస్తిక్ (4), నిషాంత్ చరణ్ (4) ఆడుకో వడానికి ఉదయం ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఇటీవల గ్రామంలో వీడీసీ భవన నిర్మాణం కోసం పనులు ప్రారంభించారు. ఈ క్రమంలో పిల్లర్ల కోసం గుంతలను తవ్వారు. వారం రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో గుంతల్లో నీరు నిలిచింది. ఆడుకుంటూ అటువైపు వెళ్లిన చిన్నారులు గుంత పక్కనున్న మట్టి కుప్పపైకి చేరుకున్నారు. అక్కడి నుంచి జారి గుంతలో పడిపోయారు. మధ్యాహ్నం దాటినా పిల్లలు ఇంటికి రాకపోవడం, ఎక్కడా కనిపించకపోవడంతో వారి తల్లిదండ్రులు సమీపంలో ఉన్న చెరువు వైపు, గ్రామంలోనూ వెతికారు. మధ్యాహ్నం దాటా క భవన నిర్మాణం పక్కనుంచి వెళ్తున్న ఓ వ్యక్తికి గుంతలో ఓ చిన్నారి వీపు భాగం కనిపించడంతో గ్రామస్తులకు సమాచారం అందించాడు. దీంతో గ్రామస్తులు కర్ర సాయంతో ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. ఎస్సై గోపి సిబ్బందితో కలసి ఘటనాస్థలిని పరిశీలించారు. కాంట్రాక్టర్ పిల్లర్లు తవ్వి రక్షణ చర్యలు చేపట్టకుండా వదిలేయడం వల్లే ఈ ఘోరం జరిగిందని, అతనిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. వలస వచ్చి రెండు నెలలు.. మృతుల్లో నిషాంత్ చరణ్ తల్లిదండ్రులు గ్రామానికి బతుకుదెరువు కోసం చిట్టాపూర్ నుంచి వలస వచ్చారు. చరణ్ తండ్రి శ్రీకాంత్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బతుకు దెరువు కోసం వస్తే బతుకునే కాటేసిందని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. మరోవైపు చిన్నారి నాస్తిక్ తండ్రి దేవాదాస్ 2 నెలల క్రితం ఉపాధి కోసం మాల్దీ వులకు వెళ్లాడు. వారికి కూమార్తె, కుమారుడు ఉండగా అందులో నాస్తిక్ మృతిచెందాడు. కాగా, మృతుల కుటుంబాలకు మంత్రి ప్రశాంత్‌రెడ్డి రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. -
తెలంగాణలో కుండపోత వర్షాలు.. అక్కడ స్కూళ్లకు సెలవులు
సాక్షి, నిజామాబాద్: రాష్ట్రంలో వర్షాలు మళ్లీ ఊపందుకున్నాయి. సోమవారం ఉదయం నుంచి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తుండగా, ఉమ్మడి నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో కుండపోతగా వర్షం కురుస్తున్నది. రాజధానిలో ఆకాశం మేఘావృతమై ఉంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, మెహదీపట్నం, నాంపల్లిలో జల్లులు పడుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. గత రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు జిల్లా విద్యాధికారి దుర్గాప్రసాద్ నేడు సెలవు ప్రకటించారు. భారీ వానలతో పలుచోట్ల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అత్యధికంగా మోపాల్ మండలంలో 15.7 సెంటీమీటర్లు, ఇందల్వాయిలో 14.8, డిచ్పల్లి మండలం గన్నారంలో 14 సెంటీమీటర్ల వర్షం పడింది. 10 మండలాల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. సిరికొండ మండలం తుంపల్లిలో 6 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. చీమన్ పల్లి, గన్నారం, దర్పల్లి, కమ్మర్ పల్లి, మెండోరా , మోర్తాడ్ లో 5 సెంటిమీటర్ల వర్ష పాతం నమోదైంది. ఇక జిల్లాలో కురుస్తున్న కుండపోత వానలతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పెరిగింది. దీంతో నాలుగు గేట్లు ఎత్తి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. మరో రెండు రోజులపాటు వర్షం కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది కామారెడ్డి జిల్లాలోనూ వర్షాలు పడుతున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు తాడ్వాయి, బిక్కనూరు, మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట, రాజంపేట సదాశివనగర్ మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. వర్షాల ధాటికి పలు మండలాల్లో వరి పంట నీట మునిగింది. జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వర్షపు నీరు చెరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చదవండి: మధుయాష్కీకి వ్యతిరేకంగా గాంధీభవన్‌లో పోస్టర్లు తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామ శివారులో వాగు పొంగిపొర్లుతోంది. వాగు ప్రవహించడంతో టేక్రియాల్, బ్రాహ్మణపల్లి, సంగోజి వాడి, కాలోజివాడి, చందాపూర్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అంతేగాక తాడ్వాయి మండలం సంతయిపేట గ్రామ శివారులోని భీమేశ్వర వాగు, పాల్వంచ మండలం వాగు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షం కురుస్తున్నది. సంగారెడ్డి జిల్లా కంగ్టిలో అత్యధికంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. మెదక్ జిల్లా కౌడిపల్లిలో 8.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అయిదు రోజులు వర్షాలు అల్పపీడన ప్రభావంతో వచ్చే అయిదు రోజులపాటు తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు వర్షాలు కురిసే అవకాశముందని హైదాబాద్ వాతావరణశాఖ తెలిపింది. నేడు, రేపు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్, నారాయణపేట, నిజామాబాద్,పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది.అదిలాబాద్, హనుమకొండ, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, గద్వాల్,కొమరం భీం, మహబూబబాద్,మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూలు, నల్గొండ, నిర్మల్, రంగా రెడ్డి, సిద్దిపేట, సూర్యా పేట, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి ఎల్లో అలెర్ట్ ఇచ్చింది. హైదరాబాద్ నగరంలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. -
‘గీతా’ సంకల్పం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సంకల్పం ఉంటే..సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. ఎన్ని అవాంతరాలు..ఎన్ని అడ్డుంకులు ఎదురైనా సరే ముందుకు సాగి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. ప్రతి ఇంటా భగవద్గీత ఉండాలన్నదే లక్ష్యంగా నిజామాబాద్‌కు చెందిన జ్ఞానేందర్‌గుప్తా సంకల్పించారు. ఐదేళ్లుగా ఉచితంగా భగవద్గీత గ్రంథాన్ని పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివరకు 4,618 భగవద్గీత గ్రంథాలను అందజేశారు. తన తుదిశ్వాస ఉన్నంతవరకు భగవద్గీత గ్రంథాలు పంచుతూనే ఉంటానని జ్ఞానేందర్‌గుప్తా చెబుతున్నారు. పదకొండేళ్లుగా తన తండ్రి మంచాల శంకరయ్య గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, గవర్నర్లు, సుప్రీం, హైకోర్టుల న్యాయమూర్తులు, వైద్యులు, వ్యాపారులు మొదలు... సాధారణ వ్యక్తులు వరకు భగవద్గీత చేరేలా నిత్యం పరితపిస్తూనే ఉన్నాడు. భగవద్గీతతోపాటు రామకోటి పుస్తకాలు కూడా పంచుతున్నారు. పదుల సంఖ్యలో రామాయణం, మహాభారతం, భాగవతం పుస్తకాలు పంపిణీ చేశారు. 4 భాషల్లో ‘గీతా జయంతి’పేరిట ప్రపంచంలో పుట్టినరోజు జరుపుకునే ఒకే ఒక్క గ్రంథం ‘భగవద్గీత’. ఈ గ్రంథానికి ఉన్న గుర్తింపు ప్రపంచంలో ఏ గ్రంథానికీ లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో మహానుభావులు, అత్యున్నతస్థాయి వ్యక్తులు భగవద్గీత నుంచి స్ఫూర్తి పొందినవారే. జ్ఞానేందర్‌గుప్తా గోరఖ్‌పూర్‌లోని గీతాప్రెస్ నుంచి ఆర్డర్‌పై భగవద్గీత గ్రంథాలు తెప్పిస్తున్నారు. ఈ గ్రంథం 880 పేజీల్లో 18 అధ్యాయాలు, 745 శ్లోకాలతో సవివరంగా ఉంది. తెలుగు, హిందీ, ఇంగ్లి‹Ù, మరాఠీ భాషల్లో ముద్రించిన గ్రంథాలను పంపిణీ చేస్తున్నారు. గీతాసారం అన్ని భాషల్లో ఉన్న వారికి అర్థమయ్యేలా చేర్చాలన్న సంకల్పంతో ఇలా చేస్తున్నారు. ఇటీవల దక్షిణకొరియా ఒకరు అడగ్గా కొరియర్లో భగవద్గీత పంపాడు, యూఎస్‌కు అయితే రెగ్యులర్‌గా ఆయనే కొరియర్ ద్వారా చేరవేస్తున్నారు. మరికొన్ని సేవా కార్యక్రమాల్లో... నిజామాబాద్, బోధన్, బాన్సువాడ, హైదరాబాద్, సికింద్రాబాద్, సిరిసిల్ల, వేములవాడ, సొంతూరైన సిరిసిల్ల జిల్లా కనగర్తిలలో స్వర్గ రథాలు సేవలు అందుబాటులో ఉన్నాయి. రెండునెలల్లో కాశీలోనూ స్వర్గరథం ఏర్పాటు చేస్తానని చెప్పారు. నిజామాబాద్‌లో మృతదేహాలను పెట్టేందుకు 8 ఏళ్ల నుంచి 10 ఫ్రీజర్లు ఉచితంగా అందుబాటులో ఉంచారు. అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తులకు ‘అమర్నాథ్ అన్నదాన సేవాసమితి, సిద్దిపేట ట్రస్ట్ ఆధ్వర్యంలో 2011 ప్రతి ఏటా 60 రోజులు అన్నదానం, ఇతర సేవలు అందజేస్తున్నారు. ఎండాకాలంలో పిచ్చుకలు, పక్షులు నీటికోసం అలమటిస్తాయి. వాటి దాహార్తి తీర్చేందుకు రెండేళ్లలో 2,500 పైగా ‘బర్డ్ ఫీడర్ బాక్సులు’ఉచితంగా అందజేశారు. -
ఎకో ఫ్రెండీ వినాయకుడినే చూశారు.. మట్టితో ఈసారి రాఖీ చేసుకుందామా?
ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని చేశాం. ఎకో ఫ్రెండ్లీ ఆభరణాలను చూశాం. ప్రకృతి– పర్యావరణాల బంధానికి... ఇకపై... ఎకో ఫ్రెండ్లీ రక్షాబంధనం. బంధాల అల్లిక రాఖీ పండుగకు... అనుబంధాల లతలల్లింది శ్రీలత. నిజామాబాద్‌కు చెందిన శ్రీలత సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లమో చేశారు. పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతల వల్ల ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. గృహిణిగా ఇంటి నాలుగ్గోడలే జీవితం అనుకోలేదామె. నాలుగు గోడలను సృజనాత్మకతతో తీర్చిదిద్దారు. శ్రీలత తన ఇంట్లో సోఫాలో కూర్చుని ఏ గోడను చూసుకున్నా తాను చేసిన ఫ్లవర్ వాజ్, కార్నర్ స్టాండ్, తలమీద కుండలు పేర్చుకుని భవనంలోకి అడుగుపెడుతున్న ఎంబ్రాయిడరీ గొల్లభామ, రాధాకృష్ణుల వాల్ హ్యాంగింగ్‌లు కనిపిస్తాయి. తలెత్తి చూస్తే షాండ్లియర్ కనువిందు చేస్తుంది. బీరువా తెరిస్తే తాను పెయింటింగ్ చేసుకున్న చీరలు. ఏక్తార మీటుతున్న భక్త మీరాబాయి ఆమె కుంచెలో ఒదిగిపోయి చీర కొంగులో జాలువారి ఉంది. మెడలో ధరించిన టెర్రకోట ఆభరణంలో రాధాకృష్ణులు వయ్యారాలొలికిస్తుంటారు. మరోదిక్కున వర్లి జానపద మహిళలు కొలువుదీరిన మినీ టేబుల్ స్టాండ్. డాబా మీదకెళ్తే మొక్కల పచ్చదనం, చుట్టూ ఎర్రటి పిట్టగోడల మీద తెల్లటి చుక్కల ముగ్గులు... ఖాళీ సమయాన్ని ఇంత ఉపయుక్తంగా మార్చుకోవచ్చా... అన్న విస్మయం, అందరికీ రోజుకు ఇరవై నాలుగ్గంటలే కదా ఉంటాయి... ఇన్ని రకాలెలా సాధ్యం అనే ఆశ్చర్యం ఏకకాలంలో కలుగుతాయి. ఇప్పుడామె రాబోతున్న రాఖీ పండుగకు పర్యావరణహితమైన టెర్రకోట రాఖీల తయారీకి సిద్ధమయ్యారు. తన కళాభిరుచిని సాక్షితో పంచుకున్నారు శ్రీలత. రంగు... బ్రష్ ఉంటే చాలు! ‘‘మా సొంతూరు దోమకొండ. మా చిన్నప్పుడే నిజామాబాద్‌కి వచ్చేశాం. అత్తగారిల్లు బాన్సువాడ, కానీ మావారి వ్యాపారరీత్యా నిజామాబాద్‌లోనే స్థిరపడ్డాం. అత్తగారిల్లు ఉమ్మడి కుటుంబం, ఇంటి బాధ్యతల కోసం పూర్తి సమయం కేటాయించాల్సిన అవసరం ఉండేది. దాంతో ఉద్యోగం మానేయక తప్పలేదు. అయితే నిజామాబాద్‌కి వచ్చిన తర్వాత ఖాళీ సమయం ఎక్కువగా ఉంటోంది. పిల్లలు ముగ్గురూ స్కూళ్లకు, కాలేజ్‌కి, మా వారు బయటకు వెళ్లిన తర్వాత రోజంతా ఖాళీనే. టీవీ చూస్తూ గడిపేయడం నాకు నచ్చేది కాదు. చిన్నప్పుడు మా అమ్మ చేస్తూ ఉంటే చూసి నేర్చుకున్న కళలన్నీ గుర్తుకు వచ్చాయి. నా క్రియేటివ్ జర్నీ అలా మొదలైంది. వీటన్నింటినీ చేయడానికి ముడిసరుకు కోసం మార్కెట్కెళ్లే పనే ఉండదు. ఇంటికి వచ్చిన పెళ్లి పత్రిక, చాక్లెట్ బాక్సులు, కేక్ కట్ చేసిన తర్వాత మిగిలిన అట్టముక్క... దేనినీ వదలను. రంగులు, బ్రష్‌లు కొంటే చాలు ఇక నాకు చేతినిండా పని. నా మెదడు చివరికి ఎంతగా ట్యూన్ అయిపోయిందంటే... ఉపయోగంలో లేని ఏ వస్తువును చూసినా దాంతో ఏమి చేయవచ్చు... అనే ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి. ఆలోచనలకు ఒక రూపం వచ్చిందంటే పని మొదలు పెట్టడమే. వచ్చిన ఐడియాని మర్చిపోతానేమోనని ఒక్కోసారి ఒకటి పూర్తికాకముందే మరొకటి మొదలు పెడతాను. మట్టితో రాఖీ! కోవిడ్ లాక్డౌన్ సమయం నాకు బాగా కలిసి వచ్చింది. ఒక్కరోజు కూడా బోరు కొట్టలేదు. అప్పటివరకు ఇంటి అలంకరణ వస్తువులు, ఆభరణాలు మాత్రమే చేసిన నేను రాఖీల తయారీ కూడా మొదలు పెట్టాను. మొక్కల కోసం తెప్పించుకునే ఎర్రమట్టిని రాఖీలు, ఆభరణాలకు అనుగుణంగా సిద్ధం చేసుకుంటాను. మట్టిని నీటిలో నానబెట్టి కరిగిన తరవాత సన్నని చిల్లులున్న జల్లెడలో వేసి బకెట్లోకి వడపోయాలి. రాళ్లు, నలకలు, పుల్లల వంటివి జల్లెడ పైన ఉండిపోతాయి. ఓ గంట సేపటికి బకెట్లో నీరు పైకి తేలుతుంది. అడుగుకు చేరిన మట్టిని తీసి ఎండబెట్టాలి. తేమ ఆరిపోతూ ముద్దగా ఉన్నప్పుడు ఆభరణాలు తయారుచేసి ఎండబెట్టాలి. ఎండిన తర్వాత కొబ్బరిపీచు, వరిపొట్టులో వేసి కాల్చాలి. ఇటుకలు కాల్చినట్లేనన్నమాట. వేడి చల్లారిన తర్వాత రంగులు వేసి, దారాలు చుడితే రాఖీ రెడీ. లాకెట్లు, చెవుల జూకాలు కూడా ఇలాగే చేస్తాను. మొక్క నాటుతాం! రాఖీలను మొదట్లో మా ఇంట్లో వరకే చేశాను. ఇప్పుడు నా రాఖీలు కావాలని బంధువులు, స్నేహితులు అడుగుతున్నారు. ఓ వంద రాఖీలు అవసరమవుతున్నాయి. అందుకే ఈ ఏడాది ఆగస్టు మొదటివారం నుంచే పని మొదలుపెట్టాను. పర్యావరణ పరిరక్షణ పట్ల ఆసక్తి కలిగినప్పటి నుంచి మట్టి వినాయకుడి బొమ్మనే తెచ్చుకుంటున్నాం. పండుగ తరవాత గణపతిని పూలకుండీలో పెట్టి నీరు పోసి కరిగిన తరవాత మొక్క నాటుతాను. మరో విషయం... మా ఇంట్లో ఏటా పుట్టినరోజులు, పెళ్లిరోజుకు కొత్త మొక్కను నాటుతాం’’ అని చెప్తూ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియచేశారు శ్రీలత. – వాకామంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
కుల, మతాలకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అందించాం: ఎమ్మెల్సీ కవిత
-
KTR Opens IT Tower In Nizamabad: నిజామాబాద్‌లో ఐటీ టవర్స్, న్యాక్ భవనం ప్రారంభించిన కేటీఆర్ (ఫొటోలు)
-
రేవంత్, బీజేపీపై కేటీఆర్ సంచలన కామెంట్స్
సాక్షి, నిజామాబాద్: తెలంగాణలో రాజకీయాలు ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. ఎన్నికల ఏడాది వేళ పార్టీల నేతలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇక, తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో కూడా సీఎం కేసీఆర్.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై సంచలన కామెంట్స్ చేశారు. తాజాగా మంత్రి కేటీఆర్ కూడా ప్రతిపక్ష పార్టీల నేతలపై విరుచుకుపడ్డారు. కాగా, మంత్రి కేటీఆర్ బుధవారం నిజామాబాద్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. నిజామాబాద్‌లో అనుకోకుండా ఎంపీగా గెలిచిన వ్యక్తి కూడా రెండుసార్లు సీఎం అయిన కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్నాడు. కేసీఆర్‌పై అనవసరపు వ్యాఖ్యలు మానకోవాలి. జిల్లాలో ఐటీ టవర్ న్యాక్ సెంటర్, ట్యాంక్ బండ్, మున్సిపల్ నూతన భవనం, వైకుంఠధామాలు అభివృద్ధి కాదా?. దీనికి బీజేపీ ఎంపీ అర్వింద్ సమాధానం చెప్పాలి. మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప బీజేపీ చేసిందేమీ లేదు. మణిపూర్‌లో ఏం జరుగుతుందో చూడాలన్నారు. బీజేపీ సర్కారు హయాంలోనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు అన్ని పెరిగాయి. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ధర 400 ఉంటే 400 తిట్లు తిట్టారు బీజేపీ నేతలు. ఇప్పుడు ఇదే విషయమై మోదీకి ఓట్ల ద్వారా సమాధానం చెప్పాలన్నారు. ఢిల్లీ వాళ్లకు గల్లీ వాళ్లకు తేడా ఉంటుంది చూడండి. ఏం చేయాలన్నా బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లాలి. ఈ రెండు పార్టీల బాసులు ఢిల్లీలో ఉంటారు. మాకు తెలంగాణ ప్రజలే బాసులు. మరోసారి ఢిల్లీ వాళ్లకు అవకాశం ఇస్తే ఏం జరుగుతోందో అర్థం చేసుకోండి. వచ్చే ఎన్నికల్లో ఢిల్లీ బానిసలు, తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్యే పోటీ ఉంటుంది. పౌరుషం ఉన్న తెలంగాణ బిడ్డలు ఢిల్లీ గద్దలను తరిమికొట్టాలి. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు మళ్లీ అడుగుతున్నారు. వారికి 10 సార్లు అవకాశం ఇవ్వలేదా?. రైతులకు కరెంట్ కష్టాలు కాంగ్రెస్ హయాంలోనే కదా. తెలంగాణ రైతులు ఇప్పుడిప్పుడే కష్టాల నుంచి బయట పడుతున్నారు. ఇదే సమయంలో కేటీఆర్.. టీపీసీసీ చీఫ్ రేవంత్‌పై సంచలన కామెంట్స్ చేశారు. రేవంత్ ఓట్ల కోసం కోట్లు ఇచ్చి దొరికిన దొంగ. రేవంత్ తెలంగాణవాది కాదు.. తెలంగాణకు పట్టిన వ్యాధి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: పక్కా ప్లాన్‌తో అసెంబ్లీలో కేసీఆర్ స్పీచ్.. టార్గెట్ ఫిక్స్, ఇక సమరమే! -
రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా దిల్‌రాజు కామెంట్స్
దిల్ రాజు.. సినిమాల నిర్మాణంలో సక్సెస్ అయిన నిర్మాత.. నిజామాబాద్ జిల్లా నర్సింగ్ పల్లి గ్రామంలో జన్మించిన ఆయన సినిమాలపై మక్కువతో ఫిలిం ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.. అనేక సూపర్ హిట్ చిత్రాలు నిర్మించి సత్తా చాటారు.. సక్సెస్ ఫుల్ నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గా నిలిచి వెనుదిరిగి చూడలేదు.. తొలి సినిమా దిల్ ఆయన ఇంటి పేరుగా మారిపోయింది.. అంచలంచెలుగా ఎదిగి ఇప్పుడు తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.. ఈ సందర్బంగా ఆయన చేసిన పొలిటికల్ వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.. పొలిటికల్ ఎంట్రీపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ప్రస్తుతం ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవికే ప్రాధాన్యత ఇస్తున్నానని అన్న ఆయన తాను పోటీ చేస్తే ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా గెలుస్తానని చెప్పుకొచ్చారు.. ఆ వ్యాఖ్యలే ఇప్పుడు రాజకీయ పార్టీల్లో అలాగే ఆయన సొంత జిల్లా నిజామాబాద్ లో హాట్ టాపిక్ అయ్యాయి.. వాస్తవానికి దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని చాలా కాలంగా చర్చ జరుగుతోంది.. ఇప్పుడు మరోసారి అదే చర్చకు దిల్ రాజే ఆజ్యం పోసినట్టు అయ్యింది.. పొలిటికల్ ఎంట్రీ ఇప్పుడే కాదంటూనే.. ఎంపీగా ఎమ్మెల్యేగా గెలుస్తానని చెప్పడం వెనుక ఆంతర్యం పొలిటికల్ ఇంట్రెస్ట్ ఏ కదా అని వివిధ రాజకీయ పార్టీల్లోని నాయకులు విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.. అందులో భాగంగానే ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవికి పోటీ చేశారు.. ఆ పదవిని రెండో మెట్టుగా మలచుకోవడం అందులో భాగమే అని చర్చ స్టార్ట్ అయ్యింది.. దిల్ రాజు వాస్తవానికి చాలాకాలంగా brs కాంగ్రెస్ పార్టీల నేతలతో టచ్ లో ఉంటున్నట్టు టాక్.. నిజామాబాద్ పార్లమెంటు నుంచి లేదా సొంత నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేయడం ఆయనకు ఇష్టం.. అందుకే ఏ పార్టీలో తనకు బెర్త్ దొరుకుతుంది.. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది.. జిల్లా రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నాయి.. అనే అనేక అంశాలపై దిల్ రాజు ఫోకస్ చేశారు.. కొంతకాలంగా రాజకీయాలను నిశితంగా గమనిస్తున్నారు.. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి brs నుంచి గత రెండు సార్లు సీఎం కేసీఆర్ కూతురు కవిత పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి మధు యాష్కీ బరిలో ఉన్నారు.. ఈసారి రెండు పార్టీల అభ్యర్థులను బట్టి అక్కడ బరిలోకి దిగాలనే ప్లాన్ లో దిల్ రాజు ఉన్నట్టు తెలుస్తోంది.. ఒకవేళ అది సాధ్యం కాకపోతే తన సొంత నియోకవర్గమైన నిజామాబాద్ రూరల్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసే ఆల్టర్ నేట్ ప్లాన్ B కూడా ఉందట.. అక్కడ brs నుంచి ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి ఉన్నారు.. కాంగ్రెస్ నుంచి డాక్టర్ భూపతి రెడ్డి, అరికెల నర్సారెడ్డి అలాగే నగేష్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు.. నగేష్ రెడ్డి హీరో నితిన్ మేన మామ.. పైగా నగేష్ రెడ్డి నితిన్ లు దిల్ రాజుకు అత్యంత సన్నిహితులు.. ఇలాంటి పరిస్థితులు కూడా దిల్ రాజు పొలిటికల్ గాసిప్స్ కు బలం చేకూరుస్తున్నాయి.. మరోవైపు దిల్ రాజుకు brs కాంగ్రెస్‌లు చాలా కాలంగా గాలం వేస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది.. మరీ ఏ పార్టీ వైపు వెళ్తారో బరిలో నిలిచేది పార్లమెంట్‌కా లేక అసెంబ్లీకా అది కూడా నిజామాబాద్ జిల్లా నుంచేనా లేక ఇంకా మరో ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుందా అనేది తెలంగాణలో ఎన్నికల వాతావరణం వేడెక్కే సమయానికి తేలిపోనుంది. చదవండి: ‘టికెట్ నాదే.. గెలుపు నాదే.. నో డౌట్’ -
SRSP: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద.. 26 గేట్లు ఎత్తివేత
సాక్షి, నిజామాబాద్: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీటిపారుదల ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వస్తుంది. దీంతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు వరప్రదాయినిగా ఉన్న నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి భారీ వరద నీరుపోటెత్తుతోంది. ప్రాజెక్టులో సుమారు 2,22,216 క్యూసెక్కుల నీరు వస్తుండడంతో డ్యాం అధికారులు ముందు జాగ్రత్తగా 26 గేట్లను ఎత్తి లక్షా 50వేల క్యూసెక్కుల నీటిని దిగువన గోదావరిలోకి వదులుతున్నారు. శ్రీరాంప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 90 టీఎంసీలు( 1091 అడుగులు నీటిమట్టం) కాగా.. ప్రస్తుతం 75 వేల టీఎంసీల ( 1087.7 అడుగుల నీటిమట్టం) నీరు ఉంది. ప్రాజెక్టులోకి వరద పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ ఎస్ఈ శ్రీనివాస్ తెలిపారు. గేట్లను ఎత్తివేయడంతో ముందస్తుగా దిగువన పరీవాహక ప్రాంతాల ప్రజలను అలెర్ట్ చేసినట్లు తెలిపారు. రెవెన్యూ, పోలీసులు ఇందుకనుగుణంగా భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలెవ్వరూ కూడా పరీవాహక ప్రాంతాలకు రావద్దని, మత్స్యకార్మికులు, పశువుల కాపరులు, రైతులు గోదావరిని దాటే ప్రయత్నం చేయవద్దని అప్రమత్తం చేశారు. -
హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉద్రిక్తత
-
వణికిన నిజామాబాద్.. ఓరుగల్లులో జడివాన
సాక్షి నెట్వర్క్: సోమవారం రాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వానలు పడినా.. ఉమ్మడి నిజామాబాద్, వరంగల్ జిల్లాలు మాత్రం కుండపోత వర్షంతో వణికిపోయాయి. పలుచోట్ల అయితే కొంత దూరంలో ఉన్నవేవీ కనబడనంతగా అతి భారీ వర్షం పడింది. నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో సోమవారం రాత్రి 10 గంటల నుంచి మంగళవారం తెల్లవారుజామున 4 గంటల వరకు ఆరు గంటల్లోనే ఏకంగా 46.4 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వాన పడింది. చాలా ప్రాంతాల్లో 15 సెంటీమీటర్లకుపైనే వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో జిల్లాలో 73 ఇళ్లు దెబ్బతిన్నాయి. వేల్పూర్‌లో చెరువు కట్ట తెగిపోయి నీరంతా రోడ్డుపై ప్రవహిస్తూనే ఉంది. ఇక్కడి తహసీల్దార్ కార్యాలయం, పోలీస్‌స్టేషన్ నీటమునిగాయి. ఇదే మండలంలోని పచ్చలనడ్కుడ వద్ద చెరువు కట్ట తెగిపోవడంతో భీంగల్ వైపు రాకపోకలు నిలిచిపోయాయి. లక్కోర, ఆర్మూర్ మండలం చేపూర్ వద్ద 63వ నంబర్ జాతీయ రహదారి కోతకు గురైంది. జక్రాన్‌పల్లి మండలం మనోహరాబాద్–తొర్లికొండ మధ్య రోడ్డు తెగిపోయింది. ♦ ఉమ్మడి వరంగల్ జిల్లానూ వాన ముంచెత్తింది. వరంగల్ నగరంలో 31 కాలనీలు నీట మునిగాయి. ఇళ్లు, గుడిసెల్లోకి వరద నీరు చేరి నిత్యాసవరాలు, సామగ్రి తడిసిపోయాయి. 700 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని ధర్మసాగర్, ఆత్మకూర్, గీసుకొండ, రేగొండ, మల్హర్రావు మండలాల్లో అతిభారీ వర్షపాతం నమోదైంది. ♦ మెదక్ ఉమ్మడి జిల్లా పరిధిలోని హుస్నాబాద్‌లో చెరువులు మత్తడి దూకుతున్నాయి. పట్టణంలో చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. పోలీస్‌స్టేషన్ చుట్టూ జలమయం అయింది. కూడెల్లి, మోయతుమ్మెద వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. బస్వాపూర్ వద్ద సిద్దిపేట–హనుమకొండ ప్రధాన రహదారిపై వరద పోటెత్తడంతో వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. ♦ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల పరిధిలో భారీ వర్షాలు కురిశాయి. మిడ్‌మానేరు, లోయర్ మానేరు రిజర్వాయర్లకు గణనీయంగా ప్రవాహాలు వస్తున్నాయి. ♦ ఖమ్మం ఉమ్మడి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో వాగులు వంకలు ఉప్పొంగాయి. రహదారులపై వరద ప్రవహించడంతో రాకపోకలకు ఇబ్బంది ఎదురైంది. పాలేరు, కిన్నెరసాని రిజర్వాయర్లు గరిష్ట స్థాయికి చేరాయి. ♦ రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వానలతో కాగ్నా, మూసీ, ఈసీ, బెల్కటూర్, రాస్నం వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కోట్‌పల్లి, లఖ్నాపూర్, జుంటుపల్లి ప్రాజెక్టులు అలుగు పారుతున్నాయి. పలుచోట్ల పొలాలు నీట మునిగాయి. ♦ ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో ఓ మోస్తరు వానలు పడ్డాయి. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీ, భవానీ నగర్ ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలంలో బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పత్తి చేన్లు నీట మునిగాయి. బొమ్మలరామారం మండలంలో మూడు ఇళ్లు కూలిపోయాయి. వాగులో కొట్టుకుపోయి ఇద్దరు యువతులు మృతి మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం కొండేడ్కు చెందిన పడకంటి కేశవులుకు దుందుభి వాగు అవతల వ్యవసాయ భూమి ఉంది. ఇటీవలే అందులో పత్తి సాగు చేపట్టారు. మంగళవారం కేశవులు కుమార్తె స్వాతి (18), వరుసకు సోదరి అయ్యే అనూష (19) కలసి పత్తి చేనులో మందు చల్లేందుకు వెళ్లారు. కానీ దుందుభి వాగు దాటే క్రమంలో వరదలో కొట్టుకుపోయారు. కొంతసేపటికి స్వాతి తల్లి నాగమ్మ, మరికొందరు కూలీలు చేనుకు వెళ్లేందుకు వాగు దగ్గరికిరాగా.. నీళ్ల బిందె, టిఫిన్ బాక్సు కనిపించాయి. గ్రామస్తులు గాలింపు చేపట్టగా రెండు గంటల తర్వాత కిలోమీటర్ దూరంలోని చిన్న ఆదిరాల శివారులో స్వాతి, అనూషల మృతదేహాలు కనిపించాయి. దీంతో వారి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. బడి చుట్టూ చెరువులా.. భారీ వర్షాల కారణంగా పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్‌లోని జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణ చెరువులా మారిన దృశ్యమిది. మోకాలి లోతు నీరు నిలవడంతో తరగతి గదులకు చేరుకునేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇక పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయం, ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో నీరు నిలిచింది. కొట్టుకుపోయిన డైవర్షన్ రోడ్లు సాక్షి, హైదరాబాద్: వరుసవర్షాల ధాటికి డైవర్షన్ రోడ్లు దెబ్బతిన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 26 ప్రాంతాల్లో వంతెనల వద్ద ఏర్పాటు చేసిన మళ్లింపు రోడ్లు కొట్టుకుపోయాయి. ఆయా ప్రాంతాల్లో వాగులు పొంగి, మళ్లింపు రోడ్ల ఆనవాళ్లే లేకుండా పోవడంతో రాకపోకలు కష్టతరమవుతున్నాయి. ♦ ఆదిలాబాద్ జిల్లాలో ఇచ్చోడ, బో«ధ్, నేరేడుగొండ, బదహత్నూరు ప్రాంతాల్లో మళ్లింపు రోడ్లు కొట్టుకుపోయాయి. జైనథ్బేలా ప్రధాన రోడ్డు కూడా దెబ్బతింది. ఒక్క ఆదిలాబాద్‌లోనే 9 కి.మీ. మేర ప్రధాన రోడ్లకు నష్టం వాటిల్లింది. ♦ కామారెడ్డి జిల్లాలో ఐదు ప్రాంతాల్లో రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. మిగతా ప్రాంతాల్లో జిలా్లకు ఒకటి రెండు చోట్ల వాటికి నష్టం వాటిల్లింది. ♦ రాజీవ్ రహదారిలో శామీర్‌పేట నుంచి ప్రజ్ఞాపూర్ మధ్య దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డు గుంతలమయంగా మారింది. ♦ డైవర్షన్ రోడ్లు దెబ్బతిన్న కారణంగా 20 చోట్ల ఎగువ ప్రాంతాలతో అనుసంధానం లేకుండాపోయింది.దాదాపు రూ.100 కోట్లతోపునరుద్ధరణ చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా మళ్లింపుదారులు పూర్తిగా కొట్టుకుపోయిన చోట వెంటనే తాత్కాలిక రోడ్లు ఏర్పాటు చేసే పనులు ప్రారంభించారు. రాజీవ్ రహదారిపై ప్యాచ్ వర్క్ మొదలుపెట్టారు. వానాకాలం వస్తే వణుకే.. గూడూరు: వానాకాలం వచ్చిందంటే ఆ గ్రామ ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతకాల్సిందే. సరైన రోడ్డు, వాగులపై వంతెనలు లేక.. ఏటా రెండు, మూడు నెలలు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండాల్సిందే. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని మట్టెవాడ జీపీ పరిధిలో దొరవారి తిమ్మాపురం గ్రామం దుస్థితి ఇది. అడవిలో ఉన్న ఈ గ్రామం మట్టెవాడ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. అందులో ఎనిమిది కిలోమీటర్ల మేర మట్టి దారే. పైగా మధ్యలో వాగులు, వంకలు. సోమవారం రాత్రి కురిసిన వానకు గుండ్లమడుగు వాగు పోటెత్తడంతో ఈ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. కావాల్సిన సరుకులు ముందే తెచ్చిపెట్టుకుంటున్నామని, కానీ ఏదైనా ఆపద వస్తే ప్రాణాలు కాపాడుకోవడం కష్టమేనని గ్రామస్తులు వాపోతున్నారు. తమ గ్రామానికి రోడ్డును, వంతెనను నిర్మించాలని కోరుతున్నారు. -
తమాషాలొద్దు.. ఎంపీ అరవింద్‌కు ఎమ్మెల్సీ కవిత వార్నింగ్
సాక్షి, నిజామాబాద్: బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. 24 గంటల్లో అరవింద్ చేసిన ఆరోపణలు నిరూపించాలని, లేదంటే పులంగ్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని కవిత సవాల్ విసిరారు. పిచ్చిపిచ్చిగా ఆరోపణలు చేస్తే ప్రజలే బుద్ధి చెప్తారని, తప్పుడు ఆరోపణలతో తమాషాలు చేస్తే బాగుండదని ఆమె హెచ్చరించారు. ‘‘ధరణిని రద్దుచేసి దళారీలను ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ భావిస్తుంది. మా విధానం ధరణి... కాంగ్రెస్ విధానం దళారి. మేము ఎన్డీఏ కాదు, ఇండియా కూటమి కాదు.. మేము ప్రజల వైపు’’ అని కవిత అన్నారు. చదవండి: ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేయడం మానుకోండి: బండి సంజయ్ కాగా, తెలంగాణ ప్రజల సొమ్మును ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాళ్ల దగ్గర మంత్రి ప్రశాంత్ రెడ్డి దారబోస్తున్నారంటూ అరవింద్ ఆరోపించిన సంగతి తెలిసిందే. బాల్కొండ నియోజకవర్గంలో కట్టిన ప్రతీ బిడ్జిపై ఎమ్మెల్సీ కవితకు కమీషన్ వెళ్తోంది. ఒకే పనికి డబుల్ బిల్లింగ్ చేస్తున్నారు. రోడ్ కార్పోరేషన్ డెవలప్మెంట్ నుంచి కట్టినట్టు శిలాఫలకం వేశారు. కేంద్రం ద్వారా నిధులు పొందినట్టు కేంద్రానికి యుటిలైజేషన్ సర్టిఫికెట్ ఇచ్చారు. 50 ఏళ్లు వడ్డీలేని రుణం ద్వారా నిర్మించినట్టు వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా రూ.5వేల కోట్లకు పైగా స్కామ్ జరిగింది’’ అంటూ అరవింద్ ఆరోపణలు చేశారు. -
ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త..
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల ఆర్ధిక భారం తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ‘పల్లెవెలుగు టౌన్ బస్ పాస్‌కు శ్రీకారం చుట్టింది. మొదటగా కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సుల్లో ఈ పాస్‌ను అమలు చేయాలని సంస్థ నిర్ణయించింది. ఈ టౌన్ పాస్‌లో ప్రయాణికులు కరీంనగర్, మహబూబ్‌నగర్‌లో 10 కిలో మీటర్లు, నిజామాబాద్, నల్లగొండలో 5 కిలోమీటర్ల పరిధిలో అపరిమిత ప్రయాణం చేయొచ్చు. 10 కిలోమీటర్ల పరిధికి నెలకు రూ.800, 5 కిలోమీటర్ల పరిధికి రూ.500గా ‘పల్లె వెలుగు టౌన్ బస్ పాస్’ ధరను సంస్థ ఖరారు చేసింది. ఇప్పటికే హైదరాబాద్, వరంగల్‌లో జనరల్ బస్ పాస్ అందుబాటులో ఉంది. ఆ బస్ పాస్‌ను జిల్లా కేంద్రాల్లోనూ అమలు చేయాలని ప్రయాణికుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు కొత్తగా ‘పల్లెవెలుగు టౌన్ బస్ పాస్’ను సంస్థ తెచ్చింది. హైదరాబాద్‌లోని బస్ భవన్లో సోమవారం ‘పల్లె వెలుగు టౌన్ బస్ పాస్’ పోస్టర్లను సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ఆవిష్కరించారు. ఈ కొత్త టౌన్ పాస్ ఈ నెల 18 (మంగళవారం) నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు. ‘జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులు, చిరువ్యాపారులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారు. వారి ఆర్థిక భారం తగ్గించేందుకు ‘పల్లె వెలుగు టౌన్ బస్ పాస్’ను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం అందుబాటులోకి తీసుకువచ్చింది. మొదటగా కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో ఈ పాస్‌ను అమలు చేస్తున్నాం. ప్రయాణికుల ఫీడ్ బ్యాక్‌ను బట్టి మరిన్ని ప్రాంతాలకు పల్లె వెలుగు టౌన్ బస్ పాస్‌ను విస్తరిస్తాం. వాస్తవానికి 10 కిలోమీటర్ల పరిధికి రూ.1200, 5 కిలోమీటర్ల పరిధికి రూ.800 ధర ఉండగా.. ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించాలని ఆ బస్ పాస్‌లకు సంస్థ రాయితీ కల్పించింది. 10 కిలోమీటర్ల పరిధికి రూ.800, 5 కిలో మీటర్ల పరిధికి రూ.500గా పాస్ ధరను నిర్ణయించింది. కొత్తగా తీసుకువచ్చిన ఈ పాస్‌ను హైదరాబాద్, వరంగల్‌లో మాదిరిగానే ప్రయాణికులు ఆదరించి.. సంస్థను ప్రోత్సహించాలి’ అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ కోరారు. ఈ బస్ పాస్‌కు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీవోవో డాక్టర్ రవిందర్, జాయింట్ డైరెక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఈడీలు మునిశేఖర్, కృష్ణకాంత్, పురుషోత్తం, వినోద్ కుమార్, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. చదవండి: హైదరాబాద్‌కు అతిభారీ వర్ష సూచన!