![Village like gated community in Nizamabad](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/14/nzb.jpg.webp?itok=OwdP-Ewz)
గేటెడ్ కమ్యూనిటీలా పల్లెటూరు
శుభ్రమైన రోడ్లు, పచ్చదనం, వీధులకు నంబర్లు .. ఆకట్టుకునే భవనాల నిర్మాణం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నగరాలు, పెద్ద పట్టణాల్లో గేటెడ్ కమ్యూనిటీ సంస్కృతి ఎక్కువగా కనిపిస్తోంది. కానీ నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్ పల్లి మండలం (Jakranpally Mandal) మునిపల్లి (Munipally) గ్రామం గేటెడ్ కమ్యూనిటీ వాతావరణాన్ని తలపిస్తోంది. గ్రామంలోని ప్రధానమైన ప్రాంతంలో వెళ్తున్నప్పుడు.. నగరంలో ఉన్నామన్న భావన కలుగుతుంది. ఇక్కడ ప్రతి వీధికి నంబర్లు కేటాయించి బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రధాన, అంతర్గత రోడ్లన్నీ తారురోడ్లుగా వేశారు. రోడ్లన్నిటినీ పరిశుభ్రంగా ఉంచుతున్నారు.
మొక్కలు, చెట్ల పెంపకం, నిర్వహణ ఆకట్టుకుంటోంది. గ్రామంలో భవనాలను నగరాల మాదిరిగా మంచి ఆర్కిటెక్చర్‌తో నిర్మించడం విశేషం. చాలా ఇళ్లకు సౌర విద్యుత్ (Solar Power) కంచెను ఏర్పాటు చేసుకు న్నారు. రైతులు సొంతంగా తమ సంఘం కోసం భారీ భవనం నిర్మించుకున్నారు.
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో షాపింగ్ కాంప్లెక్స్ (Shopping Complex) నిర్మించి అద్దెలకు ఇచ్చారు. గ్రామంలో అన్నీ రైతు కుటుంబాలే అయినప్పటికీ.. పిల్లలను ఉన్నత విద్య చదివిస్తున్నారు. ప్రధాన రహదారి నుంచి బాగా లోపలికి ఉన్న ఈ గ్రామం ఆద్యంతం గేటెడ్ కమ్యూనిటీని తలపిస్తూ ఆకట్టుకుంటోంది.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/image_469.png)
Comments
Please login to add a commentAdd a comment