munipalli
-
రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
మునిపల్లి : రైతుల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బాబూమోహన్ అన్నారు. మంగళవారం మండలంలోని కంకోల్ గ్రామానికి చెందిన శ్రీశైలం స్వామిని రాయికోడ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా ఎంపిక చేసినందుకు ఎమ్మెల్యే బాబూమోహన్‌కు కృతజ్ఞతలు చెప్పడానికి హైదరాబాద్‌కు వెళ్లారు. బాబూమోహన్ వైస్ చైర్మన్ కంకోల్ శ్రీశైలం స్వామికి స్వీటు తినిపించారు. ఈ సందర్భంగా బాబూమోహన్ మాట్లాడుతూ రైతులు తమ పంటలను అమ్ముకునేందుకు దగ్గరలో మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పార్టీలకతీతంగా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఈ నెల 18వ తేదీన జోగిపేటలో క్రిస్మస్ పండుగ సందర్భంగా మునిపల్లి మండలంలోని ఆయా గ్రామాల క్రిస్టియన్లు 2 వేల మందికి బట్టలు పంపిణీ చేయాలని టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పెద్దలోడి బస్వరాజ్ పాటీల్ ఎమ్మెల్యే బాబూమోహన్‌ను కోరారు. బాబూమోహన్ సానుకులంగా స్పందించినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, తాటిపల్లి సర్పంచ్ అల్లం నవాజ్‌రెడ్డి, కంకోల్ మాజీ సర్పంచ్ నిర్మాల షెట్టి పాల్గొన్నారు. -
అధికారుల తీరుపై సభ్యుల ఆగ్రహం
9 నెలలైనా బిల్లులు ఇవ్వరా? అధికార పార్టీ ప్రజాప్రతినిధులకే బిల్లులు ఇస్తారా? దివంగత సీఎం జయలలితకు నివాళి మునిపల్లి : మండలంలోని ఆయా శాఖల అధికారుల తీరుపై ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఎంపీపీ ఈశ్వరమ్మ ఆధ్వర్యంలో మునిపల్లి మండల సర్వసభ్య సమావేశం జరిగింది. సభ ప్రారంభం కాగానే తమిళనాడు దివంగత సీఎం జయలలితకు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. గ్రామాల్లో వాటర్ ట్యాంకుల నిర్మాణంలో నాసిరకం ఇసుక వాడుతున్నారని ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేసినా పట్టించుకోరా? అని ఎంపీపీ ఉపాధ్యక్షుడు ఖమ్మంపల్లి మల్లేశంగౌడ్, మక్తక్యాసారం ఎంపీటీసీ సభ్యుడు శివచంద్రకుమార పాటిల్ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అంగద్‌పై మండిపడ్డారు. ప్రజాప్రతినిధులు పోన్ చేసినా స్పందించడం లేదని ఆరోపించారు. గ్రామాల్లో వాటర్ ట్యాంకర్లతో నీటి సరఫరా చేసిన బిల్లులు మంజూరు చేయమంటే 9 నెలలైనా ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వడం లేదని అన్నారు. ఎమ్మెల్మే ఫోన్ చేయగానే ఓ ప్రజాప్రతినిధికి మొత్తం బిల్లులు ఇచ్చారని, మిగతా ప్రజాప్రతినిధులకు బిల్లులు ఇవ్వొద్దని ఎవ్వరైనా చెప్పారా? అని ప్రశ్నించారు. వాటర్ ట్యాంకర్ యజమానులకు ప్రజాప్రతినిధులు బయట అప్పులు తెచ్చి ఇచ్చారని చెప్పారు. ప్రైవేటు పాఠశాలలు ఎన్నింటికి అనుమతి ఉంది..? ఎన్నింటికి అనుమతి లేదనే వివరాలను పూర్తి స్థారుులో ఇవ్వాలని జూలేలో కోరితే ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని ఇన్చార్జి ఎంఈఓ దశరథ్ను ఎంపీపీ మల్లేశంగౌడ్, మక్తక్యసారం ఎంపీటీసీ సభ్యుడు శివచంద్రకుమార్ పాటిల్ నిలదీశారు. పాఠశాలలకు సక్రమంగా ఉపాధ్యాయులు రావడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులంటే అధికారులకు లెక్కలేకుండా పోరుుందని, ఏది చెప్పినా పట్టించుకోవడం లేదని అన్నారు. ఇంటిపన్నును ముక్కుపిండి వసూలు చేసే పంచాయతీ కార్యదర్శులు మేళసంగంలో శివారులో పత్తి కంపెనీ నిర్మాణం కోసం పన్ను (ట్యాక్స్) కడతానని అనుమతి తీసుకున్నారని, పన్ను కట్టకుండా పనులు నిర్వహించి ఏకంగా పత్తి కొనుగోలు చేస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని ఇన్చార్జి ఈఓపీఆర్డీ నాగలక్ష్మిని నిలదీశారు. ‘మాకు సంబంధం లేదు. పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌కే తెలుసు’ అని ఆమె దాటవేశారు. శ్రీనివాస్ వివరణ ఇస్తూ పన్ను కట్టాలని డిమాండ్ నోటీసు ఇచ్చామన్నారు. రూ.1,502 పన్ను కట్టినట్లు రశీదు ఇచ్చారని సభదృష్టికి తెచ్చారు. ఇంటి యజమానుల నుంచి వేలలో పన్ను వసూలు చేస్తున్న అధికారులు పత్తి కంపెనీ నుంచి ఇంత తక్కువ పన్ను ఏ లెక్కన తీసుకుంటున్నారని పంచాయతీ కార్యర్శి శ్రీనివాస్‌ను నిలదీశారు. 65వ నంబర్ జాతీయ రహదారి సమీపంలో గల గుట్టలను ఎల్అండ్టీ సంస్థ జేసీబీలతో తవ్వి అక్రమంగా మొరం తరలిస్తున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని తహసీల్దార్ పద్మావతిపై మండిపడ్డారు. కంకోల్, పెద్దగోపులారం, బుదేరా శివారులోని గుట్టల నుంచి అక్రమంగా మొరం తవ్వి తీసుకెళ్తున్నా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి ఇప్పటి వరకు ఎల్అండ్టీ సంస్థ ఎలాంటి అనుమతి తీసుకోలేదని తహసీల్దార్ పద్మావతి సభదృష్టికి తెచ్చారు. ప్రతి నెలా అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసి సమీక్ష సమావేశంలో పాల్గొని రిజిష్టర్‌లో సంతకాలు చేయాలని సీడీపీఓ రేణుక ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులను కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అసద్‌పటేల్, ఎంపీటీసీ సభ్యలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
తల్లి మందలించిందని కుమార్తె ఆత్మహత్య
మునిపల్లి (నిడదవోలు) : సెల్ఫో¯ŒSలో ఎక్కువ సమయం మాట్లాడుతోందని తల్లి మందలించటంతో ఓ యువతి ఫ్యా¯ŒSకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని మునిపల్లిలో పీతల శాంతి(22) తణుకులోని ఓ హెర్బల్ షాపులో హెల్పర్‌గా పనిచేస్తోంది. ఆదివారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వచ్చింది. సెల్ ఫో¯ŒSలో చాలా సేపటి నుంచి మాట్లాడటం గమనించిన తల్లి ఆమెను మందలించింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె తన గదిలోకి వెళ్లి గడియపెట్టుకుంది. ఆమె నిద్రపోవటానికి వెళ్లిందని భావించిన తల్లిదండ్రులు కుమార్తెను పట్టించుకోలేదు. సోమవారం ఉదయం 6 గంటలకు కూడా శాంతి తన గది తలుపులు తెరవలేదు. దీంతో కుంటుంబ సభ్యులు కిటికీలోంచి చూడగా ఆమె గదిలో దూలానికి ఉరేసుకుని కనిపించింది. యువతి తండ్రి ఆగమనరావు ఫిర్యాదు మేరకు నిడదవోలు రూరల్ ఎస్సై కె.నరేంద్ర కేసు నమోదు చేశారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
సిద్దిపేట రూరల్/పటాన్చెరు/మునిపల్లి : జిల్లాలోని వేర్వేరు ప్రాంతల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్ద రు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట పట్టణంలోని భారత్ నగర్‌కు చెందిన లక్ష్మినారాయణ (50) బుధవారం రాత్రి ఎన్సాన్పల్లి రోడ్డులో నిల్చున్నాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని ట్రాక్టర్ వెనకాల వచ్చి ఢీ కొట్టింది. దీంతో లక్ష్మినారాయణను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించగా వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. బైక్, లారీ ఢీ.. పటాన్చెరు : జాతీయ రహదారిపై బైక్‌ను లారీ ఢీకొట్టిన సంఘటనలో ఒకరు మృతి చెందాడు. పటాన్చెరు సీఐ కృష్ణయ్య కథనం మేరకు.. నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్ మండలం ఖాజాపూర్ గ్రామానికి చెందిన సీహెచ్ నరసింహులు ద్విచక్రవాహనంపై హైదరాబాద్ హైదర్‌నగర్‌లో ఉంటున్న అత్తారింటికి బయలుదేరాడు. అయితే పటాన్చెరు మండల పరిధిలోని ఇస్మాయిల్‌ఖాన్‌పేట ైబె పాస్ రోడ్డు చౌరస్తాకు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీ (ఏపీ 21ఎన్ 7270) ఢీ కొంది. ప్రమాదంలో బైక్‌ను నడుపుతున్న నరసింహు లు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ఆస్పత్రికి తరలించినట్లు సీఐ తెలిపారు. మృతుడికి భార్య నలుగురు పిల్లలు ఉన్నారు. రెండు బైకులు ఢీ.. పటాన్చెరు : జాతీయ రహదారిపై రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని లక్డారం గ్రామ శివారులో జాతీయ రహదారిపై బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటేశం కథనం మేరకు.. లక్డారం గ్రామానికి చెందిన ఉప్పరి దేవేందర్ తన ఇంటి నుంచి పటాన్చెరు వైపునకు బైక్‌పై వస్తున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనం దేవేందర్ ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో దేవేందర్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానికులు అతడిని స్థానిక ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశం తెలిపారు. లారీ, జీపు ఢీ : ఒకరికి గాయాలు మునిపల్లి : మండలంలోని బుదేరా శివారు 65 నంబర్ జాతీయ రహదారిలో గురువారం తెల్లవారుజామున ఎదురెదురుగా లారీ, మహీంద్రా జీపు ఢీకొనడంతో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి జహీరాబాద్ వైపు ట్రావెల్ లారీ వెళుతుండగా.. జహీరాబాద్ నుంచి హైదరాబాద్ వైపు మహీంద్రా జీపు వస్తోంది. అయితే ఈ వాహనాలు బుదేరా శివారులోకి రాగానే లారీ మహీంద్రా జీపును ఢీకొంది. ఈ సంఘటనలో జీపు నుజ్జు నుజ్జు కాగా అందులో డ్రైవర్‌గా పనిచేస్తున్న కోహీర్ మండలం కొత్తూరు గ్రామానికి చెందిన మల్లికార్జున్ గాయపడ్డాడు. స్థానికులు 108లో మల్లిఖార్జున్‌ను సదాశివపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
సమస్యల పరిష్కారానికి కృషి
మునిపల్లి: పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని జిల్లా పరిషత్ చైర్పర్సన్ రాజమణి పేర్కొన్నారు. శనివారం ఆమె ఎంపీ బీబీ పాటిల్ తదితరులతో కలిసి మండలంలోని అంతారం జీవన్ముక్త మహరాజ్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు అంతారం సర్పంచ్ సిద్దన్న పాటిల్ అధ్వర్యంలో జీవన్ముక్త మహరాజ్, పాండురంగ విఠలేశ్వర, రుక్మాబాయి దేవతామూర్తుల విగ్రహాలకు పూజలు నిర్వహించారు. అంతకు ముందు టీఆర్ఎస్ కార్యకర్తలు కంకోల్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా వస్తున్న జెడ్పీ చైర్పర్సన్, ఎంపీ బీబీ పాటిల్‌ను అంతారం గ్రామానికి చెందిన కొందరు దళిత నేతలు అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. ‘మీ సమస్యలేమిటో చెప్పండి పరిష్కరించేదుకు కృషి చేస్తా’నని ఎంపీ చెప్పినా వారు పట్టించుకోలేదు. సమస్య ఎదైనా ఉంటే చెబితే సీఎంతో చర్చించి పరిష్కరిస్తానని ఆయన హమీ ఇచ్చారు. అంతారంలో భూమి లేని దళితులందరికి భూమి పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులతో మాట్లాడి భూమి లేని నిరుపేదలకు భూమి ఇప్పించేందుకు కృషి చేస్తానని ఎంపీ నచ్చజెప్పడంతో వారు శాంతించారు. జీవన్ముక్త సంస్థానంలో దైవ దర్శనం చేసుకున్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ రాజమణి, ఎంపీ బీబీ పాటిల్‌కు జీవన్ముక్త సంస్థాన పీఠాధిపతి బాల్‌రాజ్ జ్ఞానేశ్వర్ మహరాజ్ ఘనంగా సన్మానం చేశారు. సంస్థానం అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీని జ్ఞానేశ్వర్ మహరాజ్ కోరారు. ఈ సందర్భంగా రాజమణి మాట్లాడుతూ అరుహలందరికీ సంక్షేమ పథకాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సమస్యలను పరిష్కరించేందుకు సీఎం అధికారులతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారని ఎంపీ బీబీ పాటిల్ పేర్కొన్నారు. కళ్యాణలక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సిద్దన్న పాటిల్, ఎంపీటీసీ సభ్యురాలు నాట్కారి రాచమ్మ టీఆర్ఎస్ నేతలు సాయికుమార్, పార్టీ మండల అధ్యక్షుడు చంద్రయ్యతో పాటు మండలంలోని వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు. -
తెలంగాణ ఆగదు
మునిపల్లి, న్యూస్‌లైన్: సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ రావడం ఖాయమని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అన్నారు. సీమాంధ్ర నేతలు ఆడుతున్న నాటకాలను కేంద్రం గమనిస్తోందని తెలిపారు. మునిపల్లి మండలంలో ఆదివారం పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజనర్సింహ మాట్లాడుతూ ఆత్మగౌరవంతో కూడిన తెలంగాణ కోసం వెయ్యి మందికిపైగా యువకులు ఆత్మ బలిదానాలకు పాల్పడ్డారని గుర్తుచేశారు. సమానత్వంతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్టాన్ని ప్రకటించారని చెప్పారు. ప్రజల మనోభావాలను గుర్తించే రాష్ట్ర ఏర్పాటుకు సిద్ధమయ్యారని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 2004-09 కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నప్పుడు ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయని సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు ప్రస్తుతం అడ్డు తగలడం తగదన్నారు. సీమాంధ్ర పాలనలో అన్ని రంగాల్లో తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తేనే ప్రజలు సుఖ, సంతోషాలతో ఉంటారని అన్నారు. జిల్లా అభివృద్ధికి తాను ఎల్లవేళలా పాటుపడుతున్నానని తెలిపారు. అందోల్ నియోజకవర్గంలో రూ.300 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్టు ప్రకటించారు. నియోజకవర్గంలో 40 వేల ఎకరాలకు సాగునీరందించనున్నట్టు వెల్లడించారు. రైతుల సంక్షేమం కోసం అధిక నిధుల మంజూరుకు కృషి చేసినట్లు తెలిపారు. అక్షరాస్యత పెంపుతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, అందరూ విద్యావంతులు కావాలన్నారు. కాగా మునిపల్లి మండలంలో రూ. 19 కోట్లతో పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీ సురేష్‌షెట్కార్, కలెక్టర్ స్మితా సబర్వాల్, రాయికోడ్, మునిపల్లి మండలాల మార్కెట్ కమిటీ చైర్మన్ రాంరెడ్డి, మాజీ ఎంపీపీలు అంజయ్య, రాజేశ్వర్‌రావు, టీడీపీ మాజీ అధ్యక్షుడు బాబూ పాటిల్, వీరన్న తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా డిప్యూటీ సీఎం సమక్షంలో టీడీపీకి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
రచ్చబండలో రచ్చ..రచ్చ..
మునిపల్లి, న్యూస్‌లైన్: మండలకేంద్రమైన మునిపల్లిలో మంగళవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం రసాభాసగా మారింది.రచ్చబండ కార్యక్రమంలో సర్పంచ్‌లకు కుర్చీలు వేయకపోవడంపై టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా పింఛన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ గృహల మంజూరీ పత్రాలను సర్పంచ్ల చేత లబ్ధిదారులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. మునిపల్లి గ్రామ సర్పంచ్ఒక్కరితోనే గ్రామానికి చెందిన లబ్ధిదారులకు పింఛన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ గృహ మంజూరు పత్రాలు పంపిణీ చేయడం ఎంత వరకు సమంజసమని టీడీపీ నాయకులు వీరన్న, వెంకట్రాములు ఇన్చార్జి ఎంపీడీఓ వామన్‌రావును నిలదీశారు. మునిపల్లి ఒక్క గ్రామానికే మంజూరు పత్రాలు పంపిణీ చేయిస్తే మండలంలోని 24 గ్రామ పంచాయతీల నుంచి లబ్ధిదారులను ఎందుకు పిలిపించారని ఎంపీడీఓపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్‌ను అధికారులు పాటించకపోవడంపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. రాయికోడ్, మునిపల్లి మండలాల మార్కెట్ కమిటీ చెర్మైన్ తాటిపల్లి రాంరెడ్డి జోక్యం చేసుకొని లబ్ధిదారులకు ఆయా గ్రామాల సర్పంచ్‌లతో పింఛన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ మంజూరు పత్రాలను పంపిణీ చేయించారు. లబ్ధిదారులకు భోజన వసతి కల్పించినా కొందరికే సరిపోవడంతో మిగిలిన వారు నిలదీశారు. సీఎం ఫొటోతో ఉన్న బ్యానర్‌ను కొందరు తొలగించడంతో స్థానిక కాంగ్రెస్ నేతలు డిప్యూటీ సీఎం ఫొటోతో ఉన్న బ్యానర్‌ను ఏర్పాటు చేశారు.