మునిపల్లి, న్యూస్‌లైన్: మండలకేంద్రమైన మునిపల్లిలో మంగళవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం రసాభాసగా మారింది.రచ్చబండ కార్యక్రమంలో సర్పంచ్‌లకు కుర్చీలు వేయకపోవడంపై టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా పింఛన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ గృహల మంజూరీ పత్రాలను సర్పంచ్‌ల చేత లబ్ధిదారులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. మునిపల్లి గ్రామ సర్పంచ్‌ఒక్కరితోనే గ్రామానికి చెందిన లబ్ధిదారులకు పింఛన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ గృహ మంజూరు పత్రాలు పంపిణీ చేయడం ఎంత వరకు సమంజసమని టీడీపీ నాయకులు వీరన్న, వెంకట్‌రాములు ఇన్‌చార్జి ఎంపీడీఓ వామన్‌రావును నిలదీశారు.
మునిపల్లి ఒక్క గ్రామానికే మంజూరు పత్రాలు పంపిణీ చేయిస్తే మండలంలోని 24 గ్రామ పంచాయతీల నుంచి లబ్ధిదారులను ఎందుకు పిలిపించారని ఎంపీడీఓపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్‌ను అధికారులు పాటించకపోవడంపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. రాయికోడ్, మునిపల్లి మండలాల మార్కెట్ కమిటీ చెర్మైన్ తాటిపల్లి రాంరెడ్డి జోక్యం చేసుకొని లబ్ధిదారులకు ఆయా గ్రామాల సర్పంచ్‌లతో పింఛన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ మంజూరు పత్రాలను పంపిణీ చేయించారు. లబ్ధిదారులకు భోజన వసతి కల్పించినా కొందరికే సరిపోవడంతో మిగిలిన వారు నిలదీశారు. సీఎం ఫొటోతో ఉన్న బ్యానర్‌ను కొందరు తొలగించడంతో స్థానిక కాంగ్రెస్ నేతలు డిప్యూటీ సీఎం ఫొటోతో ఉన్న బ్యానర్‌ను ఏర్పాటు చేశారు.
రచ్చబండలో రచ్చ..రచ్చ..
Published Tue, Nov 26 2013 11:29 PM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM
Advertisement