rachabanda program
-
షర్మిలను నిలదీసిన సామాన్యుడు
-
‘రచ్చబండ’కు నేను పోను: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం ఉన్న ఎర్రవెల్లి గ్రామంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సోమవారం చేపట్టిన ‘రచ్చబండ’కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన ఈ కార్యక్రమం గురించి ఆ జిల్లాలో ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేనైన తనతో చర్చించకుండానే రేవంత్ ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించడానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నానని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘గతంలో ఇలాంటి విషయాలు మీడియా ముందు మాట్లాడొద్దని చెప్పేవారు. కానీ ఇలాంటి కార్యక్రమాల గురించి అందరితో చర్చించి నిర్ణయం తీసుకోకుంటే పార్టీకి నష్టం జరుగుతుంది. అందుకే నేను మీడియా ముందు ప్రకటన చేయాల్సి వచ్చింది’అన్నారు. ‘నాకు తెలియకుండా ప్రకటించిన రచ్చబండలో నేను కనపడకపోతే నా పట్ల రాంగ్ సిగ్నల్ పోతుంది. ఈ హక్కు రేవంత్‌కు ఎవరిచ్చారు’అని ప్రశ్నించారు. పీసీసీ అంటే అందరినీ విడదీసే పోస్టు కాదు పీసీసీ అంటే అందరినీ కలుపుకొనిపోయే పోస్టని, విడదీసే పోస్టు కాదని జగ్గారెడ్డి విమర్శించారు. ఇలాంటి కార్యక్రమాలు పీఏసీ మీటింగ్‌లో చర్చించకుండానే ప్రకటిస్తున్నాడని రేవంత్‌పై మండిపడ్డారు. ‘నిలదీస్తే అందరేమో బాధపడుతున్నారు. అంతర్గతంగానేమో ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి’అన్నారు. పార్టీ అంతర్గత విషయాలు మీడియా ముందు ఇలా ప్రకటించడానికి చాలా బాధగా ఉందని చెప్పారు. ఇలాంటి నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తూ రేపు అధిష్టానానికి లేఖ రాస్తున్నట్టు వెల్లడించారు. తాను ఇన్చార్జిగా ఉన్న కరీంనగర్, వరంగల్, ఖమ్మం, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని నాయకులతో మాట్లాడి ఎక్కడైనా మిగిలిన వరి ధాన్యాల కుప్పలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. -
రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తాం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు తగ్గగానే గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. రచ్చబండ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పర్యటిస్తానని చెప్పారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టా అందాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. 'ప్రజలు పెట్టుకునే అర్జీలు నిర్ణీత సమయంలో పరిష్కారమవుతున్నాయా లేదా అన్నదాని పై కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలి. కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టాక రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ప్రజల సమస్యలు, పథకాలు అమలవుతున్న తీరును స్వయంగా పరిశీలించేందుకు గ్రామాల్లో పర్యటిస్తాను' అంటూ ఓ ట్వీట్ కూడా చేశారు. “ప్రజలు పెట్టుకునే అర్జీలు నిర్ణీత సమయంలో పరిష్కారమవుతున్నాయా లేదా అన్నదాని పై కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలి. కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టాక రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ప్రజల సమస్యలు, పథకాలు అమలవుతున్న తీరును స్వయంగా పరిశీలించేందుకు గ్రామాల్లో పర్యటిస్తాను.” pic.twitter.com/0bTULipwd7 — YS Jagan Mohan Reddy (@ysjagan) July 28, 2020 కరోనా నియంత్రణ చర్యలు, తదితర అంశాలపై మంగళవారం రోజున కలెక్టర్లు, ఎస్పీలతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'మహిళల పేరుపై 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. మానవత్వం ఉన్నవారు ఎవరైనా ఇలాంటి కార్యక్రమానికి మద్దతు పలుకుతారు. పట్టాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తి చేయాలి. హౌసింగ్ లేఔట్స్‌లో ప్లాంటేషన్ చేపడుతున్నాం. అన్ని లేఔట్స్‌లో కచ్చితంగా చెట్లు నాటే కార్యక్రమాలు చేపట్టాలి. ఆర్డర్ చేసిన 72 గంటల్లో ఇసుక అందాలి. అవకాశం ఉన్న చోట ఇంకా ఇసుక తవ్వి నిల్వ చేయాలి. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం స్థలాల గుర్తింపును వెంటనే పూర్తి చేయాలి. సెప్టెంబర్ 5న స్కూళ్లు ప్రారంభం అవుతున్నాయి. స్కూళ్లల్లో నాడు-నేడు పనులు ఆగస్టు 31 నాటికి పూర్తికావాలి. కౌలు రైతులకు రుణాలు అందేలా చూడాలి. కౌలు రైతుల కోసం తీసుకొచ్చిన సాగు ఒప్పందం అమలు చేయాలి. జిల్లాస్థాయి, మండలస్థాయి అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీలు పెట్టాం. ఏ పంటలు వేయాలి? మార్కెటింగ్ అవకాశాలు ఏంటి? తదితర అంశాలపై చర్చించాలి. పంటలకు వచ్చే వ్యాధులపట్ల, తెగుళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పంటల సాగులో వచ్చే కష్టనష్టాలపై తగిన సలహాలు ఇవ్వడానికి టోల్ ఫ్రీ నంబర్ 155251 ఏర్పాటు చేసి, 20 మంది సైంటిస్టులను కాల్ సెంటర్లలో పెట్టాము. రైతు భరోసా కేంద్రాల్లో ఎలాంటి సమస్య వచ్చినా 1902కు నివేదించవచ్చు అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. (‘రోగి ఆరోగ్యాన్ని బట్టి అరగంటలో బెడ్ కేటాయించాలి’) -
రేషన్‌షాపుల ద్వారా శానిటరీ నేప్కిన్స్ విక్రయం
లక్కవరపుకోట(శృంగవరపుకోట) : రేషన్ డిపోల ద్వారా త్వరలో మహిళలకోసం శానిటరీ నేప్కిన్స్ అమ్మకాలు చేపట్టనున్నామనీ... ఇందుకోసం రూ. 120కోట్లు కేటాయిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. నవనిర్మాణ దీక్షలో భాగంగా లక్కవరపుకోట మండలం జమ్మాదేవిపేట గ్రామంలో సోమవారం గ్రామదర్శిని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన వీధుల్లో పర్యటించి పింఛన్, రేషన్ సక్రమంగా అందుతున్నదీ లేనిదీ అడిగితెలుసుకున్నారు. తూనికల్లో తేడాలుంటున్నాయా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో రావి, వేప మొక్కలను నాటారు. అనంతరం అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రచ్చబండపై నిర్వహించిన గ్రామసభలో మాట్లాడుతూ రేషన్ షాపుల ద్వారా త్వరలో ఆడవారికి సంబంధించిన నేప్కిన్స్ అందజేస్తాం అమ్మకాలు చేస్తావా అంటూ డీలర్‌ను ప్రశ్నించారు. చంద్రన్నబీమా, సాధికార మిత్ర, ఉపాధిహామీ పథకాల వివరాలపై చర్ఛించారు. సాధికార మిత్రలు ప్రభుత్వ పథకాలపై గ్రామంలో మరింతగా ప్రచారం చేయాలని సూచించారు. జమ్మాదేవిపేటకు వరాలు గ్రామంలో గల రామాలయం పునర్నిర్మాణానికి రూ. 50లక్షలు, కల్యాణ మండపానికి రూ. 50లక్షలు, దళిత వాడలో అంబేడ్కర్ భవనానికి రూ. 15లక్షలు, బీసీ కాలనీలో సామాజిక భవనానికి రూ. 10లక్షలు, నంది కళ్లాలవద్ద సామాజిక భవనం నిర్మాణానికి రూ. 10లక్షలు, రంగాపురం–జమ్మాదేవిపేట గ్రామాల అనుసంధానానికి బీటీ రోడ్డు, ఇంటింటికి తాగునీటి కుళాయిలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దళిత సర్పంచ్‌పై చిన్నచూపు కాగా ముఖ్యమంత్రి కార్యక్రమం మొత్తం వైస్ సర్పంచ్ కొట్యాడ ఈశ్వరరావు అధ్యక్షతనే నిర్వహించారు. వాస్తవానికి దళిత కులానికి చెందిన మెయ్యి కన్నయ్య సర్పంచ్ అయినా ఆయన్ను సీఎం పట్టించుకోలేదు. గ్రామ సభలోకి కూడా ఆహ్వానించలేదు. ఇక సీఎం గ్రామ సందర్శనలో అన్ని వీధుల్లోనూ పర్యటించి చివరిలో దళిత వాడలో మాత్రం పర్యటించలేదు. దీనిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరి జవహర్లాల్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ శోభ స్వాతిరాణి, ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, విజయనగరం ఎంపీ ఆశోక్‌గజపతిరాజు, మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి తదితరులు పాల్గొన్నారు. -
శ్రీదేవి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం
సాక్షి, కర్నూలు : వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చెరుకులపాడు శ్రీదేవి ఆధ్వర్యంలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాన్ని కర్నూలు జిల్లా వెల్దుర్థి మండలం, శ్రీరంగాపురంలో నిర్వహించనున్నారు. వచ్చే ఎన్నికల్లో పత్తికొండ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా దివంగత చెరుకులపాడు నారాయణ రెడ్డి భార్య చెరుకులపాడు శ్రీదేవి పోటీచేయనున్న విషయం విధితమే. -
400 మంది వైఎస్సార్ సీపీలో చేరిక
గొల్లప్రోలు (పిఠాపురం): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చోబ్రోలులో నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమంలో శనివారం 400 మంది పార్టీలో చేరారు. పార్టీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పార్టీ కండువాలు కప్పి వారందరినీ పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు, మాజీ మంత్రి కొప్పన మోహనరావు తొలుత స్థానిక శ్రీ సీతారామస్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా నూకాలమ్మ గుడి వద్ద రావు రవిబాబు ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన సుమారు వందమంది పార్టీలో చేరారు. మెయిన్‌రోడ్డులో ఓరుగంటి స్వామి ఆధ్వర్యంలో 50మంది యూత్ సభ్యులు పార్టీ కండువా కప్పుకున్నారు. అలాగే స్థానిక యాదవుల రామాలయం వద్ద మట్ల సత్తిబాబు ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన 50మంది కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు. స్థానిక వంటర్ల రామాలయం వద్ద బీజేపీ మండల అధ్యక్షుడు లోకారెడ్డి గణేష్‌తో పాటు మరో 50మంది పార్టీలో చేరారు. ఎస్సీ పేటలోని అంబేడ్కర్ సెంటర్లో వంద మంది మహిళలు, యువకులు పార్టీలో చేరారు. రథంబాట వీధిలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు కర్రి రాంబాబు ఆధ్వర్యంలో 50 మంది పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీ గ్రామ అధ్యక్షుడు పుప్పాల బాబులు, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
ప్రజా సంక్షేమమే జగన్ ధ్యేయం
గుమ్మలక్ష్మీపురం: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకొచ్చారని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అన్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం మండలంలోని ఎల్విన్‌పేట పంచాయతీ రేగులపాడు గ్రామంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా రేగులపాడు గ్రామంలో వైఎస్సార్ సీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఎన్నో రకాల హామీలిచ్చి అధికారం చేపట్టిన చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. అధికారంలో లేకపోయినా ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకొని వైఎస్సార్ నాటి సంక్షేమ పాలన అందించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర చేస్తూ నవరత్నాలు వంటి ప్రజా సంక్షేమ పథకాలు తీసుకువస్తున్నారన్నారు. అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీలకు ఉచిత విధ్యుత్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులైజేషన్, 45 ఏళ్లకే వృధ్యాఫ్యఫింఛన్లు, ఉచిత విద్య వంటి సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి తీసుకువస్తారన్నారు. అనంతరం అరకు పార్లమెంటరీ అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు మాట్లాడుతూ నమ్మించి మోసం చేయడం చంద్రబాబు నైజమైతే ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలనైనా భరించేందుకు జగన్మోహన్ రెడ్డి ముందుకొస్తున్నారన్నారు. అనంతరం ఎమ్మెల్యే గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను లిఖిత పూర్వకంగా స్వీకరించి, పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కుంబురుక దీనమయ్య, వైస్ ఎంపీపీ బిడ్డిక చంద్రమ్మ, జిల్లా కార్యవర్గ సభ్యుడు గోరిశెట్టి గిరిబాబు, జిల్లా అధికార ప్రతినిధి నిమ్మక వెంటకరావు, నాయకులు కె.నాగేశ్వరరావు, మాధవరావు, వైస్ సర్పంచ్ బిడ్డిక రాడిమ్మి తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు వింటూ.. భరోసా ఇస్తూ
అయ్యా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క పనీ కాలేదు. సమస్యలు చెబుదామన్నా అధికారపార్టీ నాయకులు పట్టించుకోవడం లేదు’ అంటూ తమ సమస్యలను వైఎస్సార్ సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తల దృష్టికి ఆయా గ్రామాల ప్రజలు తీసుకొస్తున్నారు. క్షేత్ర స్థాయికెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్యర్యంలో ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వెలగపల్లి వరప్రసాద్‌రావు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు రచ్చబండ, పల్లెనిద్ర పేరుతో రెండో రోజు ఆదివారం జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రజలతో మమేకం అవుతూ సమస్యలు తెలుసుకున్నారు. నెల్లూరు(సెంట్రల్): వైఎస్సార్ సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ఆదివారం నిర్వహించిన రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాల్లో జిల్లాలోని ఆయా గ్రామాల్లోని దళితవాడల్లో పరిస్థితి ఏమిటి? ఏ విధంగా వారి జీవన విధానం ఉందనే విషయంపై దృష్టి పెట్టారు. ప్రధానంగా వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పింఛన్లు, పక్కాగృహాల మంజూరు తదితర సమస్యలను ప్రజలు నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. టీడీపీ అ«ధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ప్రజలు నాయకులు దృష్టికి తీసుకొస్తున్నారు. దీనికి వైఎస్సార్ సీపీ నాయకులు స్పందిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి మీ అందరి ఆశీస్సులతో అధికారంలోకి రాగానే మీ సమస్యలు పూర్తిగా పరిష్కరించే బాధ్యత తమదేనని భరోసా ఇచ్చారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని తడ మండలం కారూరు గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. తాగునీటి సమస్యలు ఉన్నాయని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.కోవూరు నియోజకవర్గంలోని కోవూరు మండలం పోతిరెడ్డిపాడులో వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పల్లెనిద్ర, రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యలు ప్రసన్నకుమార్‌రెడ్డి దృష్టికి స్థానిక ప్రజలు తీసుకొచ్చారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 12వ డివిజన్ ముస్లింపాళెంలో స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పల్లెనిద్ర, రచ్చబండ కార్యక్రమాలను నిర్వహించారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని ఏఎస్‌పేట మండలం అక్బరాబాద్‌లో స్థానిక ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. తాగునీటి సమస్యతో పాటు అంతర్గత రోడ్లు సమస్యను తీర్చాలని స్థానికులు కోరారు. ఉదయగరి నియోజకవర్గంలోని సీతారామపురం మండలం మారంరెడ్డిపల్లెలో నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో పల్లెనిద్ర, రచ్చబండ కార్యక్రమాలను నిర్వహించారు. తాగునీటి కష్టాలతో పాటు జన్మభూమి కమిటీలతో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు ఏమీ అందడం లేదనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూరు మండలం తెగచెర్లలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాన్ని జెడ్పీ చైర్మన్, నియోజకవర్గ సమన్వయకర్త బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి నిర్వహించారు. తాగు, సాగునీటికి ప్రజలు కష్టాలు పడుతున్నట్లు బొమ్మిరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. గూడూరు నియోజకవర్గంలోని కోట మండలం కొక్కుపాడులో స్థానిక సమన్వయకర్త మేరిగ మురళీధర్ ఆధ్వర్యంలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు. విద్యుత్ సమస్యతో పాటు, పింఛన్లు అందడం లేదని స్థానికులు తెలిపారు. -
హోరెత్తిన ప్రజాసమస్యలు
సాక్షి, నెట్వర్క్ : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ప్రజా సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకోవడం కోసం ఆ పార్టీ నేతలు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా రచ్చబండ–పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. తమ గ్రామాలకు వచ్చిన విపక్ష నేతలకు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాలకు హాజరైన ప్రజలు గ్రామాల్లో తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. తొలుత రచ్చబండ నిర్వహించిన నేతలు.. తర్వాత పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తలు, స్థానిక నేతలు పాల్గొని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రోడ్లు, తాగునీటి సమస్య, కరెంటు కోతలు, రేషన్ కార్డులు, పింఛన్ కష్టాలు, గృహనిర్మాణాలు తదితర సమస్యలను ప్రజలు విపక్ష నేతలకు వివరించారు. టీడీపీ నేతల దౌర్జన్యాలు, జన్మభూమి కమిటీల అరాచకాలు ప్రతిపక్ష నేతల దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలు నమ్మి తామెలా మోసపోయింది కూడా వారు వివరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రజలకు వైఎస్సార్సీపీ నేతలు హామీ ఇచ్చారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ అండగా ఉంటూ, పోరాటం చేస్తామని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా దళిత వాడల్లోని ప్రజలతో మమేకం అయ్యారు. అక్కడే భోజనం చేసి ఆ కాలనీల్లోనే నిద్రించారు. (పాఠశాలలో పల్లెనిద్ర చేస్తున్న కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి, జెడ్పీటీసీ శెట్టి పద్మావతి) -
జనం మధ్యలో జగన్ దళం
శ్రీకాకుళం నియోజకవర్గం పరిధి గార మండలం వాడాడ పంచాయతీ కొత్తూరు–కొన్నిపేట గ్రామంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో రచ్చబండ ,పల్లెనిద్ర కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం హామీలిచ్చి నాలుగేళ్లు పూర్తయినా వాటిని నెరవేర్చలేదని, దీనిపై ప్రజలు ఆలోచించి ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు ప్రశ్నించాలన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, పార్టీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు గొండు రఘురాం, సర్పంచ్ బి.సావిత్రమ్మ పాల్గొన్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలోని సరుబుజ్జిలి మండలం కొండ్రగూడ గ్రామంలో పార్టీ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పూర్తిగా ప్రజలను గాలికొదిలేసి అవినీతిలో కూరుకుపోయిందన్నారు. పల్లెల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోవడంలో విఫలమైందని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వం పూర్తిగా భ్రష్టుపట్టిందని, అవినీతి, ఆశ్రితపక్షపాతం, బంధుప్రీతితో ఊరేగుతోందని ధ్వజమెత్తారు. ఎంపీపీ కేవీపీ సత్యనారాయణ, జెడ్పీటీసీ ఎస్.నాగేశ్వరరావు పాల్గొన్నారు. శ్రీకాకుళం అర్బన్: జనం మధ్యలోకి జగన్ దళం మరింత చొచ్చుకుపోయింది. ప్రజా సమస్యలు తెలుసుకొని.. వాటి పరిష్కారం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాలకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లోని ఎస్సీ, ఎస్టీ కాలనీలను పార్టీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ప్రజలు ఆయా ప్రాంతంలోని సమస్యలను పార్టీ నేతల ముందు ఏకరువు పెట్టారు. రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయడం లేదని, సంక్షేమ పథకాలు కూడా సక్రమంగా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఆయా ప్రాంత ప్రజలకు తామున్నామంటూ భరోసా ఇచ్చారు ♦ఎచ్చెర్ల నియోజకవర్గానికి సంబంధించి రచ్చబండ, పల్లెనింద్ర కార్యక్రమాలు రణస్థలం మండలం బంటుపల్లి గ్రామంలో సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్‌నిర్వహించారు. ప్రజల సమస్యలు తెలుసుకొని, దళితవాడలో రాత్రి నిద్రించారు. రణస్థలం జెడ్పీటీసీ సభ్యుడు గొర్లె రాజగోపాల్ పాల్గొన్నారు. ♦ నరసన్నపేట మండలం నడగాం గ్రామంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమం జరిగింది. రచ్చబండ కార్యక్రమంలో గ్రామస్తుల సమస్యలు తెలుసుకొని వైఎస్ జగన్ పాదయాత్రలో ఇస్తున్న హామీలను రైతులకు వివరించారు. ఎస్సీ కాలనీలో పల్లెనిద్ర నిర్వహించారు. ♦టెక్కలి నియోజకవర్గం నందిగాం మండలం సవరనీలాపురం గ్రామంలో నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ ఆధ్వర్యంలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమం జరిగింది. ♦ ఇచ్ఛాపురం మండలం డొంకూరు మత్స్యకార గ్రామంలో నియోజకవర్గ సమన్వయకర్త నర్తు రామారావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. గ్రామంలో పాదయాత్ర చేసి రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడారు. అక్కడి నుంచి బైక్‌లపై సన్యాసిపుట్టుగ దళితవాడకు చేరుకున్నారు. ♦ రాజాం నియోజకవర్గం పరిధి రేగిడి మండలం సంకిలి గ్రామంలో ఎమ్మెల్యే కంబాల జోగులు రచ్చబండ,కార్యక్రమం నిర్వహించారు. పల్లెనిద్ర చేశారు. ఈ సందర్భంగా జోగులు మాట్లాడుతూ రచ్చబండ అనేది మహత్తర కార్యక్రమమని, ప్రజల కష్టసుఖాలు తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రచ్చబండ కార్యక్రమానికి ఎందుకు శ్రీకారం చుట్టారో ఇప్పుడు తెలుస్తుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు వీలుంటుందనన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలవలస విక్రాంత్ పాల్గొన్నారు. ♦ పాలకొండ నియోజకవర్గం పరిధి సీతంపేట మండలం కడగండి పంచాయతీ రోలుగుడ్డి గ్రామంలో సర్పంచ్ ఎస్.రాము అధ్యక్షతన జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి పాల్గొన్నారు. గిరిజన సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రానున్న రోజుల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే ప్రజలకు అందే సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. అనంతరం పలు గిరిజన గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించారు. రాత్రి పంచాయతీ కేంద్రం కడగండిలో పల్లెనిద్ర చేశారు. ఈమె వెంట పార్టీ మండల కన్వీనర్ జి. సుమిత్రరావు పాల్గొన్నారు. -
పల్లెబాటకు శ్రీకారం
జనం దగ్గరికి వెళ్లి .. సమస్యలు తెలుసుకొని ప్రజా మెనిఫెస్టోను రూపొందిస్తానని వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి చేపట్టిన పాదయాత్ర స్ఫూర్తితో జిల్లాలో రచ్చబండ–పల్లె నిద్రలకు ఆ పార్టీ నేతలు శ్రీకారం చుట్టారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో తొలుత రచ్చబండను ఏర్పాటు చేసి స్థానికుల కష్టనష్టాలను తెలుసుకున్న అనంతరం అక్కడే బసచేసి వారితో మమేకమయ్యారు. జగన్ సేనకు సమస్యలు స్వాగతం పలికాయి. సాక్షి ప్రతినిధి, కాకినాడ : ప్రజల యోగ క్షేమాలను తెలుసుకునేందుకు వైఎస్సార్ సీపీ మరో ప్రజా కార్యక్రమాన్ని తలపెట్టింది. ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చేందుకు వినూత్న ప్రయత్నం చేస్తోంది. ‘రచ్చబండ – పల్లె నిద్ర’ పేరుతో పార్టీ నేతలు శనివారం శ్రీకారం చుట్టారు. ప్రజా సంకల్ప యాత్రతో ఇప్పటికే పాదయాత్ర చేస్తున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా పార్టీ శ్రేణులు తమవంతుగా క్షేత్రస్థాయిలో పర్యటనలకు సమాయత్తమయ్యారు. ప్రజా సమస్యలే అజెండాగా మున్ముందుకు... ప్రజల పక్షాన జిల్లాలో వైఎస్సార్ సీపీ నిరంతరం పోరాటం చేస్తోంది. ఇప్పటికే అనేక సమస్యలపై ప్రజల తరఫున ఉద్యమించింది. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేలా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. మొండి వైఖరిని అవలంబిస్తున్న సర్కార్ పెద్దల తీరుకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేసింది. అలుపెరగకుండా నిరంతరం ప్రజల కోసం పరితపిస్తున్న పార్టీగా చరిత్ర కెక్కింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఎడతెరిపిలేకుండా ప్రజా వ్యతిరేక పాలనపై పోరాడుతూనే ఉంది. ఇందులో భాగంగానే ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు, వారి కష్టనష్టాలను కళ్లారా చూసేందుకు ‘రచ్చబండ– పల్లెనిద్ర’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో సూక్ష్మ సమస్యలు సైతం గుర్తించి, అధినేత దృష్టికి తీసుకెళ్లి తగు పరిష్కారానికి కృషి చేయనున్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో రూపొందించనున్న మేనిఫెస్టోలో కూడా వీటిని ప్రస్తావంచనున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టో రూపొందిస్తామని ఇప్పటికే అధినేత జగన్ మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆ మార్గంలోనే రచ్చబండ– పల్లెనిద్ర కార్యక్రమానికి జిల్లాలో నేతలు శ్రీకారం చుట్టారు. సందడిగా ప్రారంభం... కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడి హాజరవగా, అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం కోడూరుపాడులో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి, సమన్వయకర్త పినిపే విశ్వరూప్, సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి పాల్గొన్నారు. పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం పొట్టిలంకలో జరిగిన కార్యక్రమంలో సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి, రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహనరావు, సమన్వయకర్త కొండేటి చిట్టిబాబు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి, అనపర్తి నియోజకవర్గ పరిధిలోని దుప్పలపూడిలో జరిగిన కార్యక్రమంలో సమన్వయకర్త సత్తి సూర్యనారాయణరెడ్డి, రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో జరిగిన కార్యక్రమంలో సమన్వయకర్త బొంతు రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం నగర నియోజకవర్గ పరిధిలోని 13వ డివిజన్లో జరిగిన కార్యక్రమంలో సమన్వయకర్త రౌతు సూర్యప్రకాశరావు, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ పరిధిలోని కడియం మండలం మురమండ ఎస్సీ కాలనీలో జరిగిన కార్యక్రమంలో సమన్వయకర్త ఆకుల వీర్రాజు, అదేæ నియోజకవర్గ పరిధిలోని ధవళేశ్వరంలో జరిగిన కార్యక్రమంలో గిరిజాల వీర్రాజు (బాబు), పెద్దాపురం నియోజకవర్గం పరిధిలో ఉలిమేశ్వరం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో సమన్వయకర్త తోట సుబ్బారావునాయుడు, ముమ్మిడివరం నియోజకవర్గం అనాతవరం ఎస్సీ కాలనీలో జరిగిన కార్యక్రమంలో సమన్వయకర్త పితాని బాలకృష్ణ తదితరులు హాజరయ్యారు. ఉదయం రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని రాత్రి పల్లెనిద్ర చేశారు. -
రచ్చబండ, పల్లెనిద్ర
ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో శనివారం పలు నియోజకవర్గాలలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. సాక్షి ప్రతినిధి, ఏలూరు : పోలవరం మండలం కోండ్రు కోట గ్రామంలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్టీసెల్ అధ్యక్షుడు తెల్లం బాలరాజు పాల్గొన్నారు. చాగల్లు మండలం ఊనగట్ల గ్రామంలో మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత రచ్చబండ కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామంలో శనివారం పల్లెనిద్ర కార్యక్రమాన్ని నియోజకవర్గ కన్వీనర్ పుప్పాల వాసుబాబు ప్రారంభించారు. దివంగత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి పాదయాత్రతో చేబ్రోలులోని పిట్టవారి వీధిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. దెందులూరు మండలం కొమరేపల్లిలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమంలో కన్వీనర్ కొఠారు రామచంద్రరావు పాల్గొన్నారు. గోపాలపురం మండలం హుకుంపేటలో పల్లెనిద్ర కార్యక్రమంలో కన్వీనర్ తలారి వెంకట్రావు, మండల కన్వీనర్ పడమటి సుభాష్‌చంద్రబోస్ పాల్గొన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుని పల్లె నిద్ర చేపట్టారు. ఉండి నియోజకవర్గ సమన్వయకర్త పీవీఎల్ నర్సింహరాజు నేతృత్వంలో ఆకివీడు మండలంలో పెదకాపవరం వరకు మోటారుసైకిల్ ర్యాలీ నిర్వహించారు. పెదకాపవరంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. పల్లెనిద్ర నిర్వహించారు. -
గుంటూరులో రచ్చబండ, నగర నిద్ర
-
నేటి నుంచి ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో పల్లెనిద్ర..
-
నేటి నుంచి రచ్చబండ, పల్లెనిద్ర
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అధికారం పక్షం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు.. మూడున్నరేళ్ల పాలనలో ఏ మేరకు అమలు చేశారు? ఏ అంశంలో వైఫల్యం చెందారు? అని నేరుగా ప్రజల వద్దకు వెళ్లి తెలుసుకునేందుకు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. రచ్చబండ, పల్లెనిద్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లి వారితో మమేకమై సమస్యలు తెలుసుకోవాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపునకు ఆ పార్టీ నేతలు నేటి నుంచి పల్లెబాట పట్టనున్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఎన్నికలకు ముందు పాదయాత్రలో చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలలో ఈ మూడున్నరేళ్ల కాలంలో వీటి అమలు తీరును రచ్చబండలో తెలుసుకోనున్నారు. ఆయా గ్రామాల్లో రచ్చబండ నిర్వహించి వ్యక్తుల వారీగా రుణమాఫీ ఏ మేరకు అమలైంది? పింఛన్లు అందాయా? అర్హులకు అన్యాయం జరుగుతోందా? ఉపాధిహామీ పథకం పరిస్థితి ఏంటి? డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేశారా? ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరుతో రెండు రూపాయలకే మంచినీళ్లు సరఫరా చేస్తున్నారా? ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ సకాలంలో అందుతుందా?.. ఇలా ప్రతి అంశాన్నీ ప్రజలతో చర్చించనున్నారు. అభిప్రాయాలను రికార్డు చేసుకుని వాటిని నియోజకవర్గాల వారీగా క్రోడీకరించి అధిష్టానానికి పంపనున్నారు. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. అలాగే సమస్యల పరిష్కారానికి భరోసా ఇవ్వనున్నారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం 35–40 గ్రామాల్లో చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. 11, 12 తేదీల్లో నియోజకవర్గ సమన్వయకార్తలు ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో నిద్ర చేయనున్నారు. ఎన్నికల హామీలతో పాటు.. అసెంబ్లీ హామీలు నెరవేరలేదు చంద్రబాబునాయుడు 2014 జూన్‌లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రాజధాని ప్రకటన సమయంలో ‘అనంత’ అభివృద్ధికి తనదీ భరోసా అంటూ హామీలు గుప్పించారు. అయితే చంద్రబాబు చెప్పిన హామీలలో ఐదెకరాలున్న వారికే పింఛన్ అనే నిబంధనను, జిల్లాలో మాత్రం పదెకరాలకు సడలించారు. ఇది మినహా తక్కిన ఏ హామీని నెరవేర్చలేకపోయారు. హంద్రీనీవాను పూర్తిచేసి 2015 ఖరీఫ్‌కు నీళ్లిస్తామన్నారు. ఇప్పటి వరకు ఆ ఊసే కరువయింది. పైగా కుప్పం వరకూ ప్రధాన కాల్వ పూర్తయ్యే వరకూ డిస్ట్రిబ్యూటరీ పనులు చేయొద్దని 2015 ఫిబ్రవరిలో జీఓ 22 జారీ చేసి ‘అనంత’ రైతుల ఆశలపై నీళ్లు చల్లారు. ‘ అనంత’ను స్మార్ట్‌సిటీ చేస్తామన్నా.. ఇప్పటి దాకా ఎలాంటి ప్రణాళికా రచించలేదు. సెంట్రల్ యూనివర్సిటీ, ఎయిమ్స్‌కు అనుబంధ కేంద్రం, టైక్స్‌టైల్ పార్క్, ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్ క్లస్టర్ ఏర్పాటు చేస్తామన్నారు. వీటికి సంబంధించి నిధుల కేటాయింపు పక్కన పెడితే భూసేకరణకు కూడా అధికారులు ఉపక్రమించలేదు. ఈ హామీలపై ప్రజలతో చర్చించన్నారు. దీంతో పాటు ప్రత్యేకహాదా, చావశ్యకతపైనా చర్చించనున్నారు. కాలేజీ విద్యార్థులు, యువకులతో కూడా మమేకం కానున్నారు. ప్రజలే నిర్ణేతలు చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లయింది. ఎన్నికలకు ముందు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీతో పాటు అనేక హామీలు గుప్పించారు. ఒక్కటీ అమలు కాలేదు. పైగా పాలన ఏకపక్షంగా సాగిస్తున్నారు. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రైతురథం పథకం ద్వారా ట్రాక్టర్లు ఎప్పుడిస్తారో తెలీదు. పైగా టీడీపీ నేతలకు మినహా మరెవ్వరికీ ఇచ్చే పరిస్థితి లేదు. ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ సకాలంలో ఇవ్వలేదు. అతివృష్టి, అనావృష్టితో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అసెంబ్లీలో సమస్యలు లేవనెత్తితే ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారు. ప్రజలను మోసం చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలులో వైఫల్యం చెందింది. అందుకే ప్రజల ముందుకు వెళుతున్నాం. – అనంత వెంకట్రామిరెడ్డి, అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు ప్రజల సమస్యలు ప్రభుత్వ దృష్టికి రచ్చబండ, పల్లెనిద్రను అన్ని నియోజకవర్గాల్లో నిర్వహిస్తాం. ప్రజలు చెప్పిన సమస్యలను నమోదు చేసుకుని నియోజకవర్గాల వారీగా క్రోడీకరిస్తాం. పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళతాం. సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పోరాడతాం. ఎన్నికల హామీలతో పాటు అసెంబ్లీలో ఇచ్చిన హామీలు, ప్రత్యేక హోదాపైనా చర్చిస్తాం. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో పల్లె నిద్ర చేసి వారి సమస్యలనూ స్వయంగా తెలుసుకుంటాం. ఈ కార్యక్రమాన్ని కార్యకర్తలు విజయవంతం చేయాలి. – శంకర్‌నారాయణ, హిందూపురం పార్లమెంట్ అధ్యక్షులు -
శాశ్వత కార్డుల కోసం..
కలెక్టరేట్ : శాశ్వత తెలుపు రేషన్‌కార్డులు జిల్లావాసులకు అందని ద్రాక్షగా మారాయి. శాశ్వతకార్డుల కోసం గత ప్ర భుత్వం మూడు విడతలుగా నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాల్లో లబ్ధిదారులు దరఖాస్తులు ఇచ్చినా ఫలితం లేదు. నాలుగేళ్లుగా దరఖాస్తులు సమర్పించినా ప్రభుత్వం నుంచి ఒక్క శాశ్వత రేషన్‌కార్డు మంజూరు కాకపోవడం గమనార్హం. మొదటి, రెండు విడతల దరఖాస్తులకు కలిపి మూడో విడత రచ్చబండలో 52,402 కూపన్లు మంజూరు చేశారు. కొన్ని రోజులకే బోగస్ పేర కొన్ని కూపన్లు తొలగించారు. అయితే ప్రస్తుతం 43,015 కూపన్లు ఉన్నాయి. ఆరు నెలలకు సరిపడా కూపన్లు జి ల్లాకు పంపిణీ అయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలో కి వచ్చిన ఏడాదికే కొత్త రేషన్‌కార్డులకు శ్రీకారం చుట్టా రు. అర్హులు గల లబ్ధిదారులకు కొత్త రేషన్‌కార్డులు అందజేశారు. ప్రస్తుతం ఇప్పుడు కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో లబ్ధిదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. శాశ్వత రేషన్‌కార్డులు అందజేయాలని కోరుతున్నారు. జిల్లాలో 1.50 లక్షలకుపైగా దరఖాస్తులు జిల్లాలో 7,05,429 రేషన్‌కార్డులు ఉన్నాయి. ఇందులో 43,015 తాత్కాలిక కార్డులు ఉన్నాయి. జిల్లాలోని 1,716 చౌకధరల దుకాణాల ద్వారా తొమ్మిది రకాల ని త్యావసర సరుకులు అందుతున్నాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నెలకు 10,579.635 మెట్రిక్ టన్నుల బియ్యంతోపాటు తొమ్మిది రకాల నిత్యావసర సరుకులు సరఫరా అవుతున్నాయి. జూన్ మాసానికి సంబంధించి న సరుకులు కూపన్‌దారులకు అందజేయాలని జిల్లా పౌరసరఫరాల అధికారులు డీలర్లకు సూచించారు. జిల్లాలో మూడు విడతలుగా నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాల్లో రేషన్‌కార్డుల కోసం సుమారు 1,50,887 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం మొదటి విడతలో 46,652 లబ్ధిదారులను, రెండో విడతలో 40,440 లబ్ధిదారులను మొత్తం 87,092 మందిని అర్హులుగా గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. అయితే ప్రభుత్వం మూడో విడత రచ్చబండలో 52,402 తాత్కాలిక కూపన్లు ప్రజా పంపిణీ కింద సరుకులు పొందేందుకు మంజూరు చేసింది. ఇందులోంచి బోగస్‌గా 9,387 కార్డులను బోగస్ పేర తొలగించారు. కొత్త ప్రభుత్వంపై ఆశలు రాష్ట్రంలో ఎనిమిదేళ్లుగా ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ చేపట్టకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బం దులకు గురవుతున్నారు. రచ్చబండ పేరిట కూపన్లు జా రీ చేసిన లబ్ధిదారులు ఎక్కువ.. కూపన్లు తక్కువగా ఉం డడంతో అర్హులకు అందలేదు. ప్రస్తుతం కొత్త రాష్ట్రం ఏర్పడటం.. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో లబ్ధిదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం రేషన్‌కార్డులు జారీ చేపట్టినట్లయితే అర్హులకు ఇబ్బందు లు తప్పుతాయి. శాశ్వత రేషన్‌కార్డులు లేకపోవడంతో ప్రభుత్వం నుంచి పొందే సంక్షేమ పథకాలకు అందకుం డా పోతున్నాయి. ఈ విషయమై తాత్కాలిక కూపన్లను శాశ్వతకార్డులుగా గుర్తించవచ్చని, కొత్త రాష్ట్రం, కొత్త ప్ర భుత్వంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేపట్టే అవకాశాలు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. -
‘రచ్చబండ’.. ఏదీ అండ?
గజ్వేల్, న్యూస్‌లైన్: ‘రచ్చబండ’ ద్వారా ప్రజలకు అండగా ఉంటామని ఊదరగొట్టిన ప్రభుత్వం.. ఆచరణలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. నాలుగు నెలల క్రితం ‘రచ్చబండ’ ద్వారా పంపిణీ చేసిన రేషన్ కార్డుదారులకు మార్చి నెల కోటాను నిలిపివేస్తూ షాక్‌నిచ్చింది. ఏళ్ల తరబడి నిరీక్షణ అనంతరం కార్డులు పొందిన పేదలకు ఈ పరిణామం శాపంగా పరిణమించింది. కుటుంబ సభ్యుల ఫొటోలను సమర్పించలేదనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లావ్యాప్తంగా డిసెంబర్ నెలలో 15వేల మందికి ‘రచ్చబండ’ ద్వారా రేషన్ కార్డుల కింద తాత్కాలిక కూపన్లను అందించారు. వీరికి 2వేల క్వింటాళ్లకుపైగా బియ్యం ఇతర వస్తువులు సరఫరా చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఈ కార్డులను పొందిన పేదలు సంతోషంలో మునిగిపోయారు. కానీ కుటుంబ సభ్యుల ఫొటోలను సమర్పించలేదనే కారణంతో ప్రభుత్వం కార్డుదారులకు ఎలాంటి సమాచారం లేకుండా మార్చినెల కోటాను నిలిపి వేశారు. ఈ మేరకు గ్రామాల్లోని రేషన్ డీలర్లకు వీరి కోటాను తగ్గించి సరుకులను పంపారు. ఈ పరిణామంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. ‘రచ్చబండ’ ద్వారా తమ కుటుంబానికి అండ లభిస్తుందనుకుంటే ఈ విధమైన చర్యలతో తమ ఆశలు నీరుగారుస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. ఈ వ్యవహారంపై డీఎస్ఓ (జిల్లా సరఫరా అధికారి) ఏసురత్నంను వివరణ కోరగా కుటుంబ సభ్యుల ఫొటోలను సమర్పించని కారణంగా ‘రచ్చబండ’ వినియోగదారులకు కోటా నిలిపివేసిన మాట వాస్తవమేనన్నారు. ఫొటోలు సమర్పించగానే కోటాను పునరుద్ధరించనున్నట్లు వెల్లడించారు. -
ఔను.. వాళ్లిద్దరూ దోస్త్ అయ్యారు!
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: కొంతకాలంగా ఎడమొఖం పెడమొఖంగా ఉంటున్న డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి ఎట్టకేలకు దోస్త్ అయ్యారు. సమైక్య, ప్రత్యేకవాదాలతో ఇద్దరి మధ్య ఏడాది కాలంగా వివాదాలు తలెత్తిన విషయం తెలిసిందే. దీంతో ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలతోపాటు దిష్టిబొమ్మలు సైతం దహనమయ్యాయి. తాజాగా ఆదివారం సంగారెడ్డిలోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఇద్దరు ఒక్కటై మాట్లాడు కోవడంతో సర్వత్రా చర్చకు దారితీసింది. ‘సీఎం పర్యటనను అడ్డుకుంటాం.. ఎలా అడ్డుకుంటారో చూస్తానంటూ సవాలు, ప్రతి సవాలు విసురుకున్న వీరు కలిసిపోవడంతో చర్చనీయాంశమైంది. ఇటీవల ఎన్నికల పరిశీలకుడిగా వచ్చిన ఏఐసీసీ ప్రతినిధుల సమక్షంలో సైతం వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డిపై పోటీలో నిలిపేందుకు దామోదర సతీమణి పద్మిని దామోదరను తెరపైకి తీసుకువచ్చారు. దీంతో పాటు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిప్యూటీ సీఎం ప్రకటనలు చేస్తుంటే.. మరోవైపు జగ్గారెడ్డి సమైక్యవాదాన్ని వినిపిస్తూ సీఎంకు మద్దతుగా నిలిచారు. గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రచ్చ బండ కార్యక్రమంలో భాగంగా సదాశివపేట మండలం వెల్టూరుకు ముఖ్యమంత్రిని తీసుకు వచ్చేందుకు జగ్గారెడ్డి ప్రయత్నించగా ప్రత్యేక రాష్ట్రాన్ని అడ్డుకుంటున్న సీఎంను జిల్లాలో తిరగనివ్వబోమని ఉప ముఖ్యమంత్రితో పాటు జిల్లా మంత్రులు, డీసీసీ అధ్యక్షుడు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. చివరి క్షణంలో అధిష్టానం సూచన మేరకు ముఖ్యమంత్రి పర్యటన రద్దయిన సంగతి విదితమే. కొం తకాలంగా దూరంగా ఉన్న వీరు ఒక్కటవడంలో మతలబు ఏమిటనేప్రశ్న అందరిలో నెలకొంది. కాగా సంగారెడ్డిలో జరిగిన విందులో దామోదరకు జగ్గారెడ్డి కొసరికొసరి వడ్డించడం కొసమెరుపు. -
రచ్చబండలో రచ్చ..రచ్చ..
మునిపల్లి, న్యూస్‌లైన్: మండలకేంద్రమైన మునిపల్లిలో మంగళవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం రసాభాసగా మారింది.రచ్చబండ కార్యక్రమంలో సర్పంచ్‌లకు కుర్చీలు వేయకపోవడంపై టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా పింఛన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ గృహల మంజూరీ పత్రాలను సర్పంచ్ల చేత లబ్ధిదారులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. మునిపల్లి గ్రామ సర్పంచ్ఒక్కరితోనే గ్రామానికి చెందిన లబ్ధిదారులకు పింఛన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ గృహ మంజూరు పత్రాలు పంపిణీ చేయడం ఎంత వరకు సమంజసమని టీడీపీ నాయకులు వీరన్న, వెంకట్రాములు ఇన్చార్జి ఎంపీడీఓ వామన్‌రావును నిలదీశారు. మునిపల్లి ఒక్క గ్రామానికే మంజూరు పత్రాలు పంపిణీ చేయిస్తే మండలంలోని 24 గ్రామ పంచాయతీల నుంచి లబ్ధిదారులను ఎందుకు పిలిపించారని ఎంపీడీఓపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్‌ను అధికారులు పాటించకపోవడంపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. రాయికోడ్, మునిపల్లి మండలాల మార్కెట్ కమిటీ చెర్మైన్ తాటిపల్లి రాంరెడ్డి జోక్యం చేసుకొని లబ్ధిదారులకు ఆయా గ్రామాల సర్పంచ్‌లతో పింఛన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ మంజూరు పత్రాలను పంపిణీ చేయించారు. లబ్ధిదారులకు భోజన వసతి కల్పించినా కొందరికే సరిపోవడంతో మిగిలిన వారు నిలదీశారు. సీఎం ఫొటోతో ఉన్న బ్యానర్‌ను కొందరు తొలగించడంతో స్థానిక కాంగ్రెస్ నేతలు డిప్యూటీ సీఎం ఫొటోతో ఉన్న బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. -
రచ్చబండలో తెలంగాణవాదుల నిరసన
హుజూర్నగర్, న్యూస్‌లైన్: పట్టణంలోని స్వర్ణవేదిక ఫంక్షన్హాల్లో ఆదివారం జరిగిన మూడో విడత రచ్చబండ కార్యక్రమంలో తెలంగాణ వాదులు నిరసన తెలిపారు. కార్యక్రమం వేదికపై ముఖ్యమంత్రి ఫొటోతో అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించాలని జేఏసీ కన్వీనర్ కెఎల్ఎన్.రావు, సీపీఐ మండల కార్యదర్శి పాలకూరి బాబు, టీఆర్ఎస్ పట్టణ, మండల అధ్యక్షులు దొడ్డానర్సింహా రావు, చిలకరాజు అజయ్‌కుమార్, బీ జేపీ నాయకులు ఉమామహేశ్వరరావు, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు మేకల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. అయినా అధికారులు వినకపోవడంతో తెలంగాణ వాదులు వేదికపైకి చేరుకొని ఫ్లెక్సీని తొలగించారు. ఈ సందర్భంగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని రచ్చబండ హాల్ నుంచి బయటకు పంపించివేశారు. అయినప్పటికీ తెలంగాణ వాదులు జై తెలంగాణ నినాదాలు చేస్తూ ముందుకు దూసుకు వచ్చారు. దీంతో చేసేది లేక అధికారులు ముఖ్యమంత్రి ఫొటోకు తెల్ల కాగితాన్ని అంటించి రచ్చబండ ఫ్లెక్సీని తిరిగి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుకు ప్రథమ శత్రువుగా ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫొటోను రచ్చబండ కార్యక్రమంలో ఏర్పాటు చేయవద్దన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రచ్చబండ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే ధ్యేయంగా ముందుకు పోతున్నట్లు చెప్పారు. అనంతరం * 85లక్షలతో నిర్మించనున్న ఎస్సీ బాలుర హాస్టల్ శంకుస్థాపన శిలాఫలకా న్ని మంత్రి సభలోనే ప్రార ంభించారు. పథకాలు వినియోగించుకోవాలి ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చిరంజీవులు కోరారు. అనంతరం వివి ధ పథకాల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను కలెక్టర్, మంత్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శరత్‌బాబు, ఈఈ చంద్రశేఖర్, స్పెషల్ ఆఫీసర్ వీరారెడ్డి, తహసీల్దార్ దామోదర్‌రావు, ఎంపీడీఓ వెంకటరెడ్డి, నగరపంచాయతీ కమిషనర్ రాంరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ డీఈ వెంకటరెడ్డి, ఏపీఎస్ఐడీసీ డెరైక్టర్ సాములశివారెడ్డి, రచ్చబండ నిర్వాహణ కమిటీ సభ్యులు, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
మంత్రి లేకుండానే...
ఉట్నూర్, న్యూస్‌లైన్ : జిల్లా ఇన్చార్జి మంత్రి బస్వరాజు సారయ్య ఆదివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయాల్సి ఉండగా అదేం చేయకుండా హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. దీంతో ఆయన స్థానంలో అధికారులు, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే ఈ తతంగాన్ని పూర్తి చేశారు. ఇదీ సంగతి మంత్రి బస్వరాజు సారయ్య శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు జిల్లాలో అధికారికంగా పర్యటన చేపట్టేందుకు శనివారం జిల్లాకు వచ్చారు. తన పర్యటనలో మొదటి రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాత్రి ఉట్నూర్‌లో బస చేశారు. ఆదివారం ఆయన ఉట్నూర్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయాల్సి ఉండగా శనివారం రాత్రే ఉట్నూర్ నుంచి వెళ్లిపోవడంతో సంబంధిత పనులుకు అధికారులు, ఎంపీ, ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేయాల్సి వచ్చింది. ఆదివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జునియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ అహ్మద్‌బాబు, ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, ఎంపీ రాథోడ్మ్రేశ్, స్థానిక ఎమ్మెల్యే సుమన్ రాథోడ్ హాజరయ్యారు. రూ.4 కోట్ల 60 లక్షల 95 వేల విలువ గల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. పథకాలందేలా చర్యలు కలెక్టర్ అహ్మద్‌బాబు మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు ఏజెన్సీ గ్రామాల ప్రజలకు అందేలా తగు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఏజెన్సీలో గిరిజన బాలికల కోసం ఉట్నూర్‌లో మూడు రూ.కోట్లతో సమీకృత వసతి గృహ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లోని పలు గిరిజన గ్రామాల్లో మౌళిక వసతుల కల్పనకు రూ.80.95 లక్షలు, ఉట్నూర్‌లో వివిధ పనులకు రూ.33.75 లక్షలు, జూనియర్ కళాశాలకు రూ.46.25 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసినట్లు వివరించారు. గిరిజన గ్రామాలకు సురక్షిత నీరు అందించేందుకు కొమురం భీమ్ ప్రాజెక్టు వద్ద చేపట్టిన మొదటి దశ పనులు జనవరిలోగా పూర్తి చేసి తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 2012-13 ఏజెన్సీ డీఎస్సీ రాసిన గిరిజన అభ్యర్థులకు పోస్టింగ్ ఉత్తర్వులు అందించేందుకు ఇప్పటికి ఆరుసార్లు అవకాశం కల్పించామని, అయినా అభ్యర్థులు వారి ఏజెన్సీ ధ్రువీకరణ పత్రాలు అందజేయలేదని పేర్కొన్నారు. ఉపాధ్యాయులను నియమించాలి అనంతరం ఎంపీ రాథోడ్ రమేశ్, ఎమ్మెల్యే సుమన్‌రాథోడ్ మాట్లాడుతూ, ప్రభుత్వం కోట్లాది రూపాయలతో మౌళిక వసతులు కల్పిస్తున్నా నాణ్యమైన బోధన అందించేందుకు ఉపాధ్యాయుల కొరత ఉందని అన్నారు. ప్రభుత్వం గిరిజన విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేందుకు ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలన్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయాల్సిన మంత్రి చేయకుండానే వెళ్లిపోవడం సరికాదని అన్నారు. మంత్రి ఏజెన్సీ గిరిజన సమస్యలపై పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆర్డీవో రాంచంద్రయ్య, ఈఈటీడబ్ల్యూ శంకరయ్య, తహశీల్దార్ చిత్రు, ఇన్చార్జి ఎంపీడీవో రమాకాంత్‌రావు, ఉట్నూర్, లక్కారం, వాడ్గాం సర్పంచులు బొంత ఆశారెడ్డి, మర్సకోల తిరుపతి, గాంధారి, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు చంద్రయ్య, నియోజకవర్గ ఇన్చార్జి హరినాయక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ షేక్ హైమద్, టీడీపీ మండల అధ్యక్షుడు సాడిగె రాజేశ్వర్, నాయకులు తుకారం, చంద్రయ్య, రవి, పూజారి శివాజీ పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికే రచ్చబండ
కెరమెరి, న్యూస్‌లైన్ : ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమమే రచ్చబండ అని జిల్లా ఇన్చార్జి మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. శనివారం కెరమెరి ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో నిర్వహించిన రచ్చబండకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల వరకే పార్టీలు కానీ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన పథకాలు శాశ్వతంగా ఉంటాయని అన్నారు. ప్రజలు ఆ పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. వివిధ రకాల కార్యక్రమాల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.923 కోట్లు ఖర్చు చేసిందన్నారు. రాష్ట్రంలో 25లక్షల మంది విద్యార్థులకు ఉచిత విద్య, స్కాలర్షిప్లు అందించామని తెలిపారు. పలు మండలాల తాగునీటి కోసం రూ.78లక్షలతో చేపట్టిన పథకాలను త్వరలో ప్రారంభిస్తామని అన్నారు. కలెక్టర్ అహ్మద్ బాబు చురుగ్గా పనిచేస్తున్నారంటూ ప్రశంసల జల్లు కురిపించారు. అనార్పల్లి రోడ్డు మరమ్మతుకు రూ.50లక్షలు మంజూరయ్యాయని చెప్పారు. రచ్చబండలో వచ్చిన దరఖాస్తులను క్రోడీకరించి సత్వర న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించబోతోందని అన్నారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల విద్యుత్ బకాయిలను ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు. సబ్‌ప్లాన్‌లో భాగంగా మండలంలోని గ్రామ పంచాయతీలకు రూ.5లక్షల చొప్పున రోడ్డు పనులకు మంజూరైనట్లు తెలిపారు. పరందోళి, అంతాపూర్ గ్రామ పంచాయతీల్లో ఇందిరమ్మ ఇళ్ల వ్యవహారంలో అవినీతిపరులు జైలుపాలైనప్పటికీ అర్హులకు గృహాలు అందలేదన్నారు. ఉర్దూ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని అన్నారు. కెరమెరి నుంచి నార్నూర్ వరకు రోడ్డు పనులు చేపట్టాలని కరంజివాడ సర్పంచు రాథోడ్ శంకర్ కోరారు. ధ్వంసమైన రోడ్డు ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలను సభలో చూపించారు. అర్హులకు బంగారుతల్లి, పింఛన్, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, డ్వామా పీడీ వినయ్‌కృష్ణారెడ్డి, ఆర్డీవో రామచంద్రయ్య, ఏపీడీ జాదవ్ గణేశ్, తహశీల్దార్ రవిచంద్రారెడ్డి, ఎంపీడీవో శశికల, ఎంఈవో మల్లయ్య, నాయకులు మునీర్‌అహ్మద్ బాపురావు, సర్పంచులు రాథోడ్ శంకర్, జలపతిరావు, లింబారవు, సుంగుబాయి, పరమేశ్వర్, భీంరావు పాల్గొన్నారు. -
పేదల కోసమే రచ్చబండ
తాడ్వాయి న్యూస్‌లైన్ : గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ అన్నారు. శనివారం తాడ్వాయి మండల కేంద్రలోని ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందజేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు.అనంతరం లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, రేషన్ కార్డులు, బంగారుతల్లి, తదితర పథకాల బాండ్లను అందజేశారు. మండల సమాఖ్యకు బ్యాంకు లింకేజీ కింద *1,28 కోట్ల రుణాల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏను గు రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ... గతంలో నిర్వహిం చిన రచ్చబండల్లో పలు సమస్యల కోసం దరఖాస్తులు చేకున్న ప్రజలకు ఇప్పటివరకు మంజూరు కాలేదన్నా రు. ఈ రచ్చబండ కార్యక్రమంలోనైనా అధికారులు చొ రవ తీసుకొని అర్హులైన వారందరికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు జనార్ధన్‌గౌడ్, నేరెళ్ల ఆంజనేయులు, గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు పులుగం సాయిరెడ్డి, పీడీలు వెంకటేశ్వర్లు, చైతన్య కుమార్, ప్రేమ్‌కుమార్, ఈవోపీఆర్డీ నారాయణ, డిప్యూటీ తహశీల్దార్ ఈశ్వర్, ఏపీ వో విఠల్, ఏపీఎం విఠల్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
చేవెళ్లలో రచ్చరచ్చ
చేవెళ్ల/ చేవెళ్ల రూరల్, న్యూస్‌లైన్: ‘బట్టలూడదీసి కొడతా.. మీ సంగతి చూస్తా..’ అంటూ కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి ఎమ్మెల్యే కె.ఎస్.రత్నం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో శనివారం చేవెళ్లలో నిర్వహించిన రచ్చబండ రసాభాసగా మారింది. ఎమెల్యే చేవెళ్లకు ఎలా వస్తారో చూస్తామని హెచ్చరించిన కాంగ్రెస్ నాయకులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. తమపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలంటూ రచ్చరచ్చ చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే రత్నం, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, ఆర్డీఓ చంద్రశేఖర్‌రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ పి.కృష్ణారెడ్డి, పలు గ్రామాల సర్పంచ్‌లు హాజరయ్యారు. సభ ప్రారంభించబోతుండగా ఎంపీడీఓ చేతులోనుంచి మైకును మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు వీరేందర్ రెడ్డి తీసుకున్నారు. శంకర్‌పల్లిలో గురువారం నిర్వహించిన రచ్చబండలో కాంగ్రెస్ నాయకులను పరుష పదజాలంతో దూషిం చినందుకు ఎమ్మెల్యే రత్నం క్షమాపణ చెప్పాలని, అప్పటివరకూ కార్యక్రమం జరగనిచ్చేది లేదన్నారు. అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా వేదిక వద్దకు దూసుకొచ్చారు. ‘కాంగ్రెస్ నాయకులను దుర్భాషలాడతావా.. ఎమ్మెల్యే హోదాకు తగునా...కులాల మధ్య చిచ్చు పెడతావా... బట్టలూడదీసి కొట్టు చూద్దాం’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. దీంతో టీడీపీ నాయకులు ఎమ్మెల్యేకు మద్దతుగా వేదిక వద్దకు చేరుకున్నారు. కోపోద్రిక్తులైన కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా టీడీపీ నేతల వైపు దూసుకెళ్లారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను వేదికకు దూరంగా తీసుకెళ్లారు. నేనెవరి జోలికీ పోను.. నా జోలికి వస్తే ఊర్కోను : ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులు ఆందోళన కొనసాగి స్తుండగానే ఎమ్మెల్యే రత్నం వివరణ ఇచ్చారు. శంకర్‌పల్లిలో తనను అవమానిం చడానికి, విమర్శించడానికి ప్రయత్నించిన వారిని ఉద్దేశించే అలా అన్నాను తప్ప కాంగ్రెస్ నాయకులందర్నీ అనలేదన్నారు. అసభ్య పదజాలంతో దూషించలేదన్నారు. తాను ఎవరి జోలికీ పోనని, తన జోలికి ఎవరైనా వస్తే ఎలా ఊరుకుంటానని అన్నారు. పరిస్థితులను బట్టి అలా అనాల్సి వచ్చింది తప్ప, కావాలని అనలేదని వివరించారు. దీంతో ఇరువర్గాలు శాంతించడంతో కార్యక్రమాన్ని కొనసాగించారు. కొనసాగుతున్న సీఎం ఫొటో లొల్లి ‘రచ్చబండ’లో ఏర్పాటుచేస్తున్న ఫ్లెక్సీలో సీఎం ఫొటో వివాదం కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి ఫొటో ఫ్లెక్సీల్లో కనిపించకూడదంటూ రచ్చబండ వేదికవద్ద తెలంగాణవాదులు, కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. కార్యాక్రమానికి ముందే నాయకులు ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం బొమ్మ కనిపించకూడదంటూ అధికారులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రాష్ట్ర ఎస్సీసెల్ కన్వీనర్ పి.వెంకటస్వామి, డీసీసీబీ డెరైక్టర్ ఎస్.బల్వంత్‌రెడ్డి, మార్కె ట్ కమిటీ చైర్మన్ ఎం.వెంకటేశంగుప్తా, వైస్‌చైర్మన్ పి.గోపాల్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఎం.బాల్‌రాజ్ తదితరులు ఫ్లెక్సీని తొలగిం చడానికి ప్రయత్నించగా అడ్డుకున్నారు. అంతలోనే తెలంగాణ విద్యార్థి జేఏసీ నాయకులు శ్రీనివాస్, అంజయ్య తదితరులు వేదికమీదకు దూసుకువచ్చి ఫ్లెక్సీని చించివేసే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అరెస్టుచేశారు. చివరికి బ్యానర్లో ఉన్న సీఎం బొమ్మను కనిపించకుండా మలి చివేయడంతో వివాదం సద్దుమణిగింది. -
నిరసన గళం... గందరగోళం...
ఇల్లెందు, న్యూస్‌లైన్ : ఇల్లెందులో శుక్రవారం మూడోవిడత రచ్చబండ సభ వివిధ పార్టీల ఆందోళనలతో ఆద్యంతం రసాభాసగా మారింది. పలుమార్లు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. స్థానిక ఫారెస్ట్ గ్రౌండ్లో ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య అధ్యక్షతన సభ ప్రారంభమైంది. ఈ సభలో ఒకటి తరువాత ఒకటిగా వరుస ఘటనలు ఇలా జరిగాయి... వేదిక పైకి ఎమ్మెల్యే రాగానే.. బ్యానర్ నుంచి సీమాంధ్ర సీఎం ఫొటో తొలగించాలని టీఆర్ఎస్ నాయకులు పట్టుబట్టారు. వారికి డీఎస్పీ కె.కృష్ణ నచ్చచెబుతుండగా... కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దాస్యం ప్రమోద్ కుమార్ తదితరులు వేదిక పైకి వెళ్లి సీఎం ఫొటో తొలగించారు. రచ్చబండ కార్యక్రమ రూపకర్తయిన దివంగత సీఎం వైఎస్సార్ ఫొటో ఎందుకు పెట్టలేదంటూ వైఎస్ఆర్ సీపీ మండల కన్వీనర్ పులి సైదులు, నాయకులు దొడ్డా డానియేల్, కోండ్రు భద్రయ్య తదితరులు ఆందోళనకు దిగారు. వీరిని పోలీసులు అడ్డుకుని అక్కడి నుంచి తొలగించారు. బయ్యారంలో ఉక్కు, మామిడిగుండాలలో ల్యాటరైట్ పరిశ్రమ నెలకొల్పాలని; తుపాను బాధిత రైతులను ఆదుకోవాలని, ఇల్లెందులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని, మార్కెట్‌ను తెరిపించాలని, గత రెండు రచ్చబండల్లో ప్రజలు ఇచ్చిన దరఖాస్తుల్లో ఎన్నింటిని పరిష్కరించారో లెక్క చెప్పాలని తదితర డిమాండ్లతో న్యూడెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి ఎన్.రాజు, పట్టణ కార్యదర్శి టి.నాగేశ్వరరావు తదితరుల ఆధ్వర్యంలో కార్యకర్తలు చేపట్టిన ఆందోళ న ఉద్రిక్తంగా మారింది. నాయకులపై ఒకానొక దశలో పోలీసులు చేయి చేసుకున్నారు. దీనిని నిరసిస్తూ సభావేదిక ముందు న్యూడెమోక్రసీ నాయకులు బైఠాయించారు. వారిని తొలగించేందుకు పోలీసులు యత్నించారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో నాయకులు తూలి కింద పడిపోయారు. కౌంటర్లలో ఇచ్చిన అర్జీలకు రసీదులు ఇవ్వాలంటూ టీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. వారిని పోలీసలు అడ్డుకున్నారు. ఇల్లెందు సింగరేణి 21 ఏరియా కాలనీ సమస్యలు పరిష్కరించాలంటూ సర్పంచ్ ఎస్.పార్వతి, ఉప సర్పంచ్ రెంటాల లక్ష్మి, పీఏసీఎస్ అధ్యక్షుడు ఆవుల కిరణ్ ఆధ్వర్యంలో స్థానికులు సభావేదిక ముందు బైఠాయించారు. సమస్యలపై కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌తో చర్చిద్దాంటూ వారిని ఎమ్మెలే ఊకె అబ్బయ్య శాంతింపచేశారు. తుపానుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, అర్హులైన పోడు భూములకు పట్టాలివ్వాలని, మామిడిగుండాలలో ల్యాటరైట్ పరిశ్రమను ప్రభుత్వం నెలకొల్పాలని, ఇల్లెందుకు బస్ డిపో మంజూరు చేయాలని, ప్యాసింజర్ రైలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం డివిజన్ కార్యదర్శి మెరుగు సత్యనారాయణ, నాయకులు దేవులపల్లి యాకయ్య, నబీ తదితరులు ఆందోళనకు దిగారు. మున్నూరు కాపు కులస్తులకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఆ సంఘం నాయకులు పులి సైదులు, పోషం వెంకటేశ్వర్లు, పాలెపు ఆనంద్, సతీష్ తదితరులు ఆందోళన నిర్వహించారు. వారిని పోలీసులు తొలగించారు. చివరిగా, ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య మాట్లాడుతూ.. బస్ డిపో ఏర్పాటు, మామిడిగుండాల సీలింగ్ భూములు, పోడు భూములకు హక్కులు, ల్యాటరైట్ ఖనిజ పరిశ్రమ ఏర్పాటు తదితరాంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నట్టు చెప్పారు. భద్రాచలం తెలంగాణలో భాగమేనంటూ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. -
రచ్చబండ రసాభాస
కొత్తగూడెం, న్యూస్‌లైన్: కొత్తగూడెం మున్సిపల్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం రసాభాసగా మారింది. కాంగ్రెస్, సీపీఐ కార్యకర్తల మధ్య బాహాబాహీకి వేదికగా మారింది. మండల ప్రత్యేకాధికారి రత్నకుమార్ అధ్యక్షతన సభ ప్రారంభం కాగానే భద్రాచలాన్ని తెలంగాణలోనే ఉంచాలని, ఇటీవలి వరదలతో నష్టపోయిన పంటల సర్వే నిర్వహించాలని సీపీఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీనిపై తీర్మానం చేస్తామని రత్నకుమార్ హామీ ఇచ్చారు. అయితే వర్షం వచ్చి రెండు నెలలు కావస్తున్నా.. నేటికీ సర్వే చేయలేదని, ఇప్పుడు చేస్తే తడిసి మొలకెత్తిన మొక్కలు ఎలా కనిపిస్తాయని ఆందోళనకారులు ప్రశ్నిం చారు. దీంతో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఏజెన్సీలో కరెంట్ మీటర్లకు అనుమతి ఇవ్వాలని వైఎస్సార్ సీపీ నిరసన.. ఏజెన్సీలో ఇళ్లు కట్టుకున్న గిరిజనేతరులకు కరెంట్ మీటర్లు ఇవ్వడం లేదని, వెంటనే మీటర్లకు అనుమతి ఇవ్వాలని వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు తాండ్ర నాగబాబు, లీగల్‌సెల్ రా ష్ట్ర కమిటీ సభ్యులు సాదిక్‌పాషా ఆధ్వర్యంలో ప్లకార్డులు ప్రదర్శించారు. ఏజెన్సీలోని గిరిజనేతరులకు ఎలాంటి నిబంధనలు లేకుండా ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. భవనం పైనుంచి దూకిన టీఆర్ఎస్వీ కార్యకర్తలు... భద్రాచలాన్ని తెలంగాణలోనే ఉంచాలని, సమైక్యవాది సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఫ్లెక్సీలను తొలగించాలని టీఆర్ఎస్వీ కార్యకర్తలు రాజశేఖర్, మరో ఇద్దరు మున్సిపల్ కార్యాలయ భవనం పెకైక్కి నినాదాలు చేశారు. సీపీఐ కార్యకర్తలు వారికి మద్దతుగా నిలవడంతో రచ్చబండ వేదిక మరోమారు ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో భవనం పెకైక్కిన రాజశేఖర్ అక్కడి నుంచి కిందకు దూకగా, పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఫ్లెక్సీని తొలగించాలని సీపీఐ కార్యకర్తలు నినాదాలు చేయగా, అన్ని పార్టీల వారు దీనికి మద్దతు పలికారు. ఈ క్రమంలో నవతన్ అనే సీపీఐ కార్యకర్త బారికేడ్లను దోసుకుని వేదిక వద్దకు వెళ్లి సీఎం ఫ్లెక్సీని తొలగించాడు. దీంతో పోలీ సులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. రౌడీషీటర్‌ను దించాలని సీపీఎం ఆందోళన.. రచ్చబండ వేదికపై ఉన్న రచ్చబండ కమిటీ సభ్యుడు, కాంగ్రెస్ నాయకుడు అయిన బత్తుల వీరయ్య రౌడీషీటర్ అని, అతనిని వెంటనే కిందకు దించాలని సీపీఎం రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య ఆధ్వర్యంలో కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో వీరయ్య తనను రౌడీషీటర్ అంటున్నా ఎందుకు స్పందించడం లేదని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును ప్రశ్నించారు. దీనికి ఆగ్రహించిన ఎమ్మెల్యే ‘నన్ను ప్రశ్నించే వాడివా నువ్వు..’అంటూ వీరయ్యపై విరుచుకుపడ్డారు. ఆ తర్వాత సీపీఎం, సీపీఐ కార్యకర్తలు వీరయ్యను కిందకు దించాలని బారికేడ్లను విరగ్గొట్టి వేదిక వద్దకు దూసుకొచ్చేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని లోనికి రాకుండా అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన కార్యకర్తలు కుర్చీలను విసిరివేయడంతో సభా ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే వారించినా వారు వినకుండా సుమారు గంటపాటు కుర్చీలను విసిరేస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలో ఓ కుర్చీ తగిలి టూటౌన్ ఎస్సై రవీందర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. బారికేడ్లు విరగ్గొట్టడంతో కొందరు పోలీసులకు, ఆందోళనకారులకు కూడా గాయాలయ్యాయి. కాంగ్రెస్, సీపీఐ కార్యకర్తల వాగ్వాదం... సభలో ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ రచ్చబండ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంగా మారిందని, కొంత మందితో కమిటీ వేసి వేదిక పైకి ఎక్కించడం దారుణమని అన్నారు. అయితే ఈ విషయం గురించి తర్వాత ఆలోచిద్దామని, ముందుగా ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్యే ప్రసంగం ముగియగానే సీపీఐ కార్యకర్తలు వీరయ్యపై మరోసారి సవాల్ విసరడంతో కాంగ్రెస్ నాయకులు ప్రతిసవాళ్లకు దిగారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ రచ్చబండ కార్యక్రమాన్ని ముగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయినా ఇరువర్గాల వాగ్వాదం సద్గుమణగకపోవడంతో పోలీసులు ఎమ్మెల్యేను, ఇతర అధికారులను లోనికి పంపించి స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు. అయినా కొద్దిసేపు ఇరువర్గాల వారు రెండువైపులా మోహరించడంతో పోలీసులు మున్సిపల్ కార్యాలయం ప్రధాన గేటును మూసివేసి వారిని అక్కడే నిలిపివేశారు. -
బాలరాజుకు సీఎం కిరణ్ ఫోన్
సాక్షి, హైదరాబాద్: సొంత నియోజకవర్గంలో జరిగే రచ్చబండ కార్యక్రమం గురించి తనకు సమాచారం ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి బాలరాజుతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం ఫోన్లో మాట్లాడారు. ఇటీవల విశాఖపట్నం జిల్లాలో తాను పాల్గొన్న రచ్చబండ కార్యక్రమ నేపథ్యంలో జరిగిన కొన్ని పరిణామాలపట్ల ముఖ్యమంత్రి విచారం వ్యక్తంచేశారు. సీఎం కార్యక్రమంపై సమాచారం,.. ఆ జిల్లా మంత్రి అయిన బాలరాజుకు తెలియకపోవడం, దీనితో మంత్రి మనస్తాపం చెందడం, తనను అవమానాలకు గురిచేశారంటూ ముఖ్యమంత్రి తీరును ఆయన తప్పుబట్టడం తెలిసిందే. తాజాగా, కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం స్వయంగా బాలరాజుకు ఫోన్‌చేశారు. జరిగిన ఘటనలపై మంత్రికి సర్దిచెప్పారు. తన కార్యక్రమంపై అధికారులు సమాచారమిచ్చారనే తాను భావించానన్నారు. ప్రస్తుతం ఎక్కడ ఉన్నారని బాలరాజును సీఎం ప్రశ్నించగా, తన నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమంలో ఉన్నానని బాలరాజు జవాబు చెప్పారు. తాను కూడా చిత్తూరు జిల్లాలో రచ్చబండలో ఉన్నానని, శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చి తనను కలుసుకోవాలని బాలరాజుకు సీఎం సూచించారు. -
ఫ్లెక్సీపై సీఎం ఫొటో తొలగింపు
మందమర్రి రూర ల్/ నిర్మల్ (మామడ ), న్యూస్‌లైన్ : స్థానిక తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో బుధవారం నిర్వహించిన 3వ విడత రచ్చబండకు తెలంగాణ సెగ తగిలింది. కార్యక్రమ ప్రారంభానికి ముందే చెన్నూర్ నియోజకవర్గ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు గుడ్ల రమేశ్, కార్యదర్శి నూకల రమేశ్, నాయకులు సంగి సదానందం వేదికపై ఏర్పాటు చేసిన బ్యానర్లో సీఎం కిరణ్‌కుమార్ బొమ్మ ఉన్న ఫ్లెక్సీని తొలంగించారు. ఓ కాంగ్రెస్ కార్యకర్త వేదికపైనున్న ఫ్లెక్సీని ఎవ్వరికి అందకుండా పట్టుకొని పరుగులు తీశాడు. చివరకు పోలీసులు ఆయన్ని వెంబడించి బ్యానర్‌ను వేదిక వద్దకు తీసుకువచ్చారు. దీంతో గొడవ ముదరడంతో ఫ్లెక్సీని చుట్ట చుట్టి పక్కన పెట్టారు. ఫ్లెక్సీలో ఉప ముఖ్యమంత్రి దామోదర నర్సింహ ఫొటో ఉండాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. కిరణ్‌కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం బొమ్మ ఉన్న బ్యానర్‌ను తొలగించి వారు ప్రత్యేకంగా తయారు చేయించిన రచ్చబండ బ్యానర్‌ను వేదికపై తగిలించారు. తెలంగాణ ద్రోహి కిరణ్ కుమార్ రెడ్డి బొమ్మ ఈ ప్రాంతంలో కనిపించవద్దని గుడ్ల రమేశ్ పేర్కొన్నారు. మామడలోనూ సీఎం ఫొటో తొలగింపు.. మామడలో బుధవారం నిర్వహించిన రచ్చబండ ఫ్లెక్సీలో సీఎం ఫొటో ఉండడంతో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి దానిని తొలగించాలని సూచించారు. దీంతో అక్కడున్న వారు ఫ్లెక్సీ తొలగించి, జిల్లా ఇన్చార్జి మంత్రి బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి ఉన్న ఫ్లెక్సీని పెట్టారు. -
ఆందోళనల నడుమ సాగిన రచ్చబండ
కొత్తగూడెం, న్యూస్‌లైన్: కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం రచ్చరచ్చగా మారింది. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం కాంగ్రెస్, సీపీఐ నాయకుల ఆధిపత్య పోరుకు వేదికగా నిలిచింది. దీనికి తోడు సమస్యలు పరిష్కరించాలని వివిధ పార్టీల నాయకులు పట్టుబట్టడంతో అధికారులు హడావుడిగా కార్యక్రమాన్ని ముగించారు. మున్సిపల్ కమిషనర్ గుర్రం రవి అధ్యక్షతన జరిగిన ఈ సభ ప్రారంభంలోనే సీపీఐ నాయకుల నినాదాలు మిన్నంటాయి. భద్రాచలాన్ని తెలంగాణలోనే ఉంచాలని తీర్మానం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు కమిషనర్ హామీ ఇవ్వడంతో శాంతించారు. అయితే ఆ తర్వాత సమైక్యాంధ్రకు మద్దతు పలుకుతున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఫొటో తొలగించాలని మళ్లీ పట్టుబట్టారు. ఇలా సీపీఐ, టీడీపీ నాయకులు వేదిక వద్దకు దూసుకురావడంతో కాసేపు గందరగోళం నెలకొంది. సీపీఐ, కాంగ్రెస్ నాయకుల వాగ్వాదం... రచ్చబండ సభ ఆద్యంతం సీపీఐ, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదాలతోనే సాగింది. రచ్చబండ కమిటీ సభ్యులైన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాసుల ఉమారాణి, కాంగ్రెస్ మాజీ ఫ్లోర్ లీడర్ ఎం.ఎ.రజాక్ మాట్లాడుతున్నంత సేపు సీపీఐ కార్యకర్తలు నినాదాలు చేయడంతో అసహనం వ్యక్తం చేసిన రజాక్ తన ప్రసంగం అడ్డుకోవడాన్ని నిరసిస్తూ వేదికపైనే బైఠాయించారు. దీంతో సీపీఐ నాయకులు కూడా వేదిక వైపు దూసుకొచ్చారు. ఇలా సీపీఐ, కాంగ్రెస్ నాయకులు పరస్పరం నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు సీపీఐ కార్యకర్తలను వేదికపైనుంచి లాగి బయటపడేయగా, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు జోక్యం చేసుకుని కాసేపు నిశ్శబ్దంగా ఉండాలని కార్యకర్తలను సముదాయించారు. అనంతరం రజాక్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను కొందరు సొమ్ము చేసుకుంటున్నారని, దీనిపై అధికారులు దృష్టి సారించాలని కోరారు. క్రమబద్ధీకరణ పట్టాల కోసం ఆందోళన.. పట్టణంలో క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. గతంలో ఇందిరమ్మ ఫేస్ -1, 2 ద్వారా మంజూరైన ఇళ్లు కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన వార్డులలోనే ఇచ్చారని, మిగిలిన వార్డులకు ఇవ్వడం లేదని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.కె.సాబీర్‌పాషా, నాయకులు బండి భాస్కర్, సలిగంటి శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ నాయకులు తాండ్ర నాగబాబు, లీగల్ సెల్ రాష్ట్ర కమిటీ సభ్యులు సాధిక్పాష, టీడీపీ మాజీ కౌన్సిలర్ రావి రాంబాబు ఆందోళన చేశారు. కాంగ్రెస్ వేదికగానే రచ్చబండ కార్యక్రమం రూపొందిందని ఆరోపించారు. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. అయితే దీనిపై అధికారుల నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో వేదిక ప్రాంగణం వద్దకు దూసుకురాగా, పోలీసులు వారిని బయటకు తీసుకెళ్లారు. ఇళ్ల స్థలాల కోసం సీపీఎం ఆందోళన... పాత కొత్తగూడెంలో ప్రభుత్వం కొనుగోలు చేసిన స్థలం లో వెంటనే పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఇలా అన్ని పార్టీలకు చెందిన ఆందోళనకారులతోనే వేదిక నిండిపోయింది. వెంటనే స్పందించిన కొత్తగూడెం ఆర్డీవో డి.అమయ్‌కుమార్ ఇళ్ల స్థలాలు ఇచ్చేలా కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మరోవైపు దరఖాస్తులు ఇచ్చేందుకు ప్రజలు భారీగా రావడంతో ఆ ప్రాంగణమంతా గందరగోళం గా మారింది. అనంతరం దరఖాస్తులు తీసుకున్న అధికారులు ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, బంగారుతల్లి పథ కం లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించారు. భారీ పోలీసు బందోబస్తు... రచ్చబండను సజావుగా నిర్వహించేందుకు పోలీసు లు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వేదిక చుట్టూ రోప్‌పార్టీ బృందాలు పహరా కాశాయి. ట్రైనీ డీఎస్పీ రావిలాల వెంకటేశ్వర్లు, వన్‌టౌన్, టూటౌన్, త్రీటౌన్ సీఐలు ఎ.నరేష్కుమార్, వెంకటస్వామి, సాయిసుధాకర్ బందోబస్తును పర్యవేక్షించారు. -
‘రచ్చ’న పడేశారు!
సాక్షి ప్రతినిధి, కర్నూలు : కల్లూరు మండల పరిధిలోని 21, 22, 23 వార్డులకు సంబంధించి నగరంలోని మాధవనగర్‌లో రచ్చబండ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణమూర్తి తదితరులు హాజరయ్యారు. విషయం తెలిసి స్థానికులురేషన్కార్డులు, వృద్ధాప్య, వికలాంగ, వితంతు పింఛన్లు, పక్కా ఇళ్లు, ఇంటి స్థలాలు, బంగారుతల్లి పథకం కోసం పెద్ద ఎత్తున వినతి పత్రాలు సమర్పించారు. పనులన్నీ వదులుకుని క్యూలో నిల్చొని ఎమ్మెల్యే, అధికారులకు అర్జీలు అందించారు. వీటన్నింటినీ ఓ మూట కట్టి.. ఆ తర్వాత అక్కడే ఓ మూలన పడేసి ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. ఈ మూటను గుర్తించిన స్థానికులు పత్రికల కార్యాలయాలకు సమాచారం చేరవేశారు. ఆ తర్వాత మూటను విప్పి చూడగా రచ్చబండ దరఖాస్తులు బయటపడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. తమ వినతులకు ఇచ్చే విలువ ఇదేనా అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా జిల్లాలో ఇప్పటి వరకు 46 చోట్ల రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించినా.. వినతుల స్వీకరణలో అధికారులు అయిష్టత చూపుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటున్న ఈ కార్యక్రమాలకు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు. సమస్యలపై నోరు విప్పడమే తరువాయి.. పోలీసులు వారిని అక్కడి నుంచి తరిమేస్తున్నారు. ఫలితంగా కార్యక్రమాలు నామమాత్రం అవుతున్నాయి. విషయం తెలిసి చాలా మంది ప్రజలు దూరంగానే ఉండిపోతున్నారు. మొదటి, రెండు విడతలను పరిశీలిస్తే ఈ విడతలో దరఖాస్తులు తగ్గేందుకు నాయకులు, అధికారుల తీరే కారణంగా తెలుస్తోంది. గ్రామాల్లో కాకుండా మండల కేంద్రాలకే రచ్చబండను పరిమితం చేయడంతో గ్రామీణులు తమ సమస్యలను చెప్పుకునేందుకు వచ్చి నిరాశతో వెనుదిరుగుతున్నారు. నాయకులు సైతం మొక్కుబడిగానే కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. మొత్తంగా ఈ కార్యక్రమం రాజకీయ పార్టీ సమావేశాన్ని తలపిస్తుండటం గమనార్హం. -
రచ్చబండ రసాభాస
ఏలేశ్వరం, న్యూస్‌లైన్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏ ఆశయంతో రచ్చబండ ప్రవేశపెట్టా రో దానిని కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడవడంతో అది రచ్చరచ్చగా మారుతోంది. కాం గ్రెస్ నాయకులు తమ స్వార్థప్రయోజనాలకు వాడుకుంటూ మోసం చేయడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏలేశ్వరంలో నిర్వహించిన రచ్చబండను అడుగడుగునా అడ్డుకుంటూ తమ నిరసనలు వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు అధ్యక్షతన నిర్విహ ంచిన రచ్చబండ కు మండలంలోని పలు గ్రామాల నుంచి వందలాదిగా ప్రజలు తరలివచ్చారు. సభపై ఎమ్మెల్యేతో పాటు మరో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీశివకుమారి, మాజీ ప్రజాప్రతినిధులు వరుపుల తమ్మయ్యబాబు, బొదిరెడ్డి గోపాలకృష్ణ, మాజీ సర్పంచ్‌లు పైలసత్యనారాయణ, గారా చంద్రలీలావతి, రచ్చబండ కమిటీ సభ్యులంటూ కాంగ్రెస్ పార్టీ వారిని కూర్చోబెట్టడంతో రభస మొదలైంది. వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు శిడగం వెంకటేశ్వరరావు సభ వద్దకు చేరుకుని ప్రోట్‌కాల్ పాటించడం లేదని అధికారులను నిల దీశారు. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు, సహకార సంఘ అధ్యక్షుడిని సభపైకి పిలవకపోవడంపై అధికారులను నిలదీశారు. వైఎస్సార్ సీపీ నేత అలమండ చలమయ్య మాట్లాడు తూ గతంలో ఇచ్చిన దరఖాస్తులకు ఇంతవరకు న్యాయం జరగలేదని, ప్రస్తుతం ఈ రచ్చబండలోనైనా అర్హులకు న్యాయం చేయాలని కోరారు. సభకు వచ్చిన అర్జీదారులు లేచి నిల బడడంతో కొద్దిసేపు తొక్కిసలాట జరిగింది. వైఎస్సార్ సీపీ నేతలు గొల్లపల్లి బుజ్జి, రాం దాసు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. అధికారులకు విన్నవించినా ఫలితం లేదని, అర్జీదారులు తమ అర్జీలను దహనం చేశారు. అనంతరం లబ్ధిదారులకు అనుమతి పత్రాలు ఇచ్చి ముగించారు. తహశీల్దార్ కె.ప్రకాశ్‌బాబు, ఎంపీడీఓ వి.రామకృష్ణ పాల్గొన్నారు. -
ఇదేమి రచ్చబండ
సాక్షి, గుంటూరు :‘రచ్చబండ’ పేరుతో నిర్వహిస్తున్న ప్రభుత్వ కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా నిర్వహిస్తూ పూర్తయిందనిపిస్తున్నారు.తాత్కాలిక రేషన్ కార్డులు, పెన్షన్ల పంపిణీకి నేతలు,అధికారులు పరిమితమవుతున్నారు. రైతులను, వారి సమస్యలను పూర్తి స్థాయిలో విస్మరిస్తున్నారు. తెనాలి నియోజకవర్గంలోని తెనాలి పట్టణం, కొలకలూరు పంచాయతీలో గురువారం నిర్వహించిన రచ్చబండకు నియోజకవర్గ ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ ప్రజాస్పందన లేకుండానే రచ్చబండను మమ అనిపించారు. అదేవిధంగా బాపట్ల నియోజకవర్గం పిట్టలవానిపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి పాల్గొని కొందరు లబ్ధిదారులకు తాత్కాలిక రేషన్‌కార్డులు పంపిణీ చేసి ముగించారు. అంతకు ముందు ప్రసంగిస్తూ తాను సమైక్యవాదినంటూ, రాష్ట్ర సమైక్యతకు పోరాడుతున్నానంటూ చెప్పుకున్నారు. ఆయా నియోజకవర్గాల్లో జరిగిన రచ్చబండ కార్యక్రమాల్లో అధికార పార్టీ నేతలు రైతులను ఏమాత్రం పట్టించుకోలేదు. కనీసం, ఇటీవల అధికవర్షాలకు పంటనష్టపోయిన విషయాన్ని కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. వినుకొండ రూరల్ మండలంలో స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు రేషన్ సరకుల సమస్యపై అధికారులను చుట్టుముట్టారు. కార్డులు వున్నా రేషన్ ఇవ్వడంలేదని వివరించారు. దీనికి స్పందించిన అధికారులు సర్వర్‌లో కార్డుల డేటా మాయమైందని, హైదరాబాద్ నుంచి ఇంజినీర్లను పిలిపించి సమస్యను పరిష్కరిస్తామని సమాధానమిచ్చారు. పెదకూరపాడు, నరసరావుపేట నియోజకవర్గాల్లో శుక్రవారం జరగాల్సిన రచ్చబండను పలు కారణాల నేపథ్యంలో వాయిదా వేశారు. -
రచ్చబండ రచ్చ రచ్చ